సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్టలో డ్రగ్స్ కలకలం రేపాయి. మండలంలోని రామాజీపేట యాదాద్రి లైఫ్ సైన్సెస్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీగా డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా భువనగిరి మండలం గూడూరు టోల్ గేట్ వద్ద పోలీసులకు డ్రగ్స్ ముఠా సభ్యులు పట్టుబడ్డారు. గతకొంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా ఎఫిడ్రవిన్ తయారీ చేస్తున్నట్లు సమాచారం. యాదగిరిగుట్ట కేంద్రంగా తయారు చేస్తున్న ఈ డ్రగ్స్‌ను హైదరాబాద్, ముంబై తరలిస్తున్నారు
రూ.24 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం: డీసీపీ
రూ.24 కోట్ల విలువ చేసే 120 కేజీల నిషేధిత ఎఫిడ్రవిన్ మెఫెడ్రోన్ సింథటిక్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ రాజేష్ చంద్ర వెల్లడించారు. కొంతకాలంగా మూతపడిన యాదాద్రి లైఫ్ సైన్స్ కెమికల్ పరిశ్రమ అడ్డాగా చేసుకుని ముఠా డ్రగ్స్‌ను తయారు చేస్తుందని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు.
నేతి కృష్ణారెడ్డి, ఫైజాన్ అహ్మద్ (ముంబై), చెపురి సునీల్ (డైవర్)లను అరెస్ట్ చేశామని మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. రెండు కార్లు, నాలుగు మొబైల్స్ సీజ్ చేసినట్లు డీసీపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment