yadagirigutta
-
టీటీడీ తరహాలో యాదగిరిగుట్టకు పాలక మండలి
సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట దేవాలయానికి తిరుమల తిరుపతి దేవస్థానాల తరహాలో పాలక మండలిని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమైంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ ధార్మిక హిందూ మత సంస్థల, ధర్మాదాయాల చట్టం–1987 సవరణ బిల్లుకు శాసనసభ మంగళవారం ఆమోదం తెలిపింది. సాలీనా రూ.100 కోట్లకుపైగా ఆదాయం ఉన్న ఆలయాలకు పాలకమండళ్లను నియమించేందుకు ఇది వీలు కల్పించనుంది. 18 మందితో బోర్డు.. యాదగిరిగుట్ట ఆలయానికి ఏర్పాటు చేయబోయే బోర్డు చైర్మన్‌ను ప్రభుత్వం నియమిస్తుంది. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్ సభ్యులుగా, దేవాలయ కార్యనిర్వహణాధికారి సభ్య కార్యదర్శిగా, యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ (వైటీడీఏ) వైస్ చైర్మన్, వ్యవస్థాపక ధర్మకర్త (ఓటు వేయు హక్కు కలిగి ఉంటారు) తదితరులు సభ్యులుగా ఉంటారు. వీరే కాకుండా మరో 9 మందితో కలిపి మొత్తం 18 మందిని ప్రభుత్వం నియమిస్తుంది.ఇందులో ఒకరు శాసనమండలి సభ్యులు, ఒక ఎస్సీ, ఒక బీసీ వర్గాలకు చెందిన వారు, కనీసం ఒక మహిళ ఉండాల్సి ఉంటుంది. ఆలయ స్థానాచార్యులు కూడా బోర్డు సభ్యుడిగా కొనసాగుతారు. బోర్డుకు సహాయ సహకారాలు అందించేందుకు తొలి రెండేళ్ల పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. మొదటి ఐదేళ్ల కాలానికి యాదాద్రి భువనగిరి కలెక్టర్ కూడా సభ్యులుగా కొనసాగుతారు. దేవాలయ పాలనపరమైన నిర్ణయాలన్నీ ఈ బోర్డే తీసుకుంటుంది. వైటీడీ పేరుపై అభ్యంతరం! యాదగిరిగుట్ట దేవస్థానాన్ని వైటీడీ అని ప్రభుత్వం బిల్లులో ప్రస్తావించింది. బిల్లుపై చర్చలో పలువురు సభ్యులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానాలు అని.. వైటీడీ అంటే యాదగిరిగుట్ట టెంపుల్ దేవాలయమా? అని బీజేపీ సభ్యుడు హరీశ్‌బాబు ప్రశ్నించారు. టీటీడీ తరహాలో ధ్వనించేలా పోటీగా ఆ పేరు పెట్టినట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. కాగా యాదగిరిగుట్ట అభివృద్ధి అథారిటీ మనుగడ ఉండనందున.. దేవస్థానం పేరును వైజీడీ (యాదగిరిగుట్ట దేవస్థానం)గా మార్చాలని కాంగ్రెస్ సభ్యుడు రాజగోపాల్‌రెడ్డి సూచించారు.కేసీఆర్ పేరు చిరస్థాయిలో ఉంటుంది.. యాదగిరిగుట్ట బోర్డులో ఎమ్మెల్సీ సభ్యుడు/సభ్యురాలు ఉండనున్నట్టు బిల్లులో ఉందని.. ఓ ఎమ్మెల్యేకు కూడా సభ్యత్వం కల్పించాలని బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్‌రావు కోరారు. యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం చేపట్టిన మాజీ సీఎం కేసీఆర్ పేరును మంత్రి ప్రస్తావించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే కేసీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోతుందని, తెలంగాణ ఇచ్చిన వ్యక్తిగా సోనియా పేరు చిరస్థాయి అయినట్టు, యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం విషయంలో కేసీఆర్ పేరు ఉంటుందని మంత్రి కొండా సురేఖ సమాధానంగా చెప్పారు.ఇక ఉమ్మడి నల్గొండలో ఎస్టీల జనాభా అధికంగా ఉన్నందున.. బోర్డులో ఓ ఎస్టీ కూడా ఉండేలా చూడాలని హరీశ్‌రావుతోపాటు బీజేపీ సభ్యుడు హరీశ్‌బాబు విజ్ఞప్తి చేశారు. వేములవాడ, భద్రాచలం, బాసర, కొండగట్టు దేవాలయాలకు కూడా ట్రస్టుబోర్డులను ఏర్పాటు చేయాలని సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ సభ్యుడు ఆది శ్రీనివాస్, బీజేపీ సభ్యుడు హరీశ్‌బాబు తదితరులు కోరారు.యాదగిరిగుట్ట వేద పాఠశాలను విశ్వవిద్యాలయం స్థాయికి పెంచాలని, హిందూ ధర్మ ప్రచార పరిషత్ నిధులను కోటి నుంచి రూ.5 కోట్లను పెంచాలని బీఆర్ఎస్ సభ్యుడు వేముల ప్రశాంత్‌రెడ్డి కోరారు. ఈ బిల్లుకు మద్దతు తెలుపుతున్నామని.. నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ రూ.82 వేల నగదు, ముఖరంజా భార్య ఇజ్రా రూ.8 లక్షల విలువైన ఆభరణాలను యాదగిరిగుట్ట దేవాలయానికి గతంలో సమరి్పంచారని మజ్లిస్ సభ్యుడు కౌసర్ మొహియుద్దీన్ పేర్కొన్నారు.‘గుట్ట’ వార్షికాదాయం రూ.224 కోట్లు.. యాదగిరిగుట్టలో కనీస వసతులు కూడా లేకపోవటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న తీరు చూసి.. గత 15 నెలల్లో పలు వసతులు కల్పించామని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి వల్ల కూడా దేవాలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగిందన్నారు. ప్రస్తుతం ఆలయ వార్షికాదాయం రూ.224 కోట్లకు చేరిందని వెల్లడించారు.దళితవాడల్లో యాదగిరీశుడి కల్యాణోత్సవాల నిర్వహణపై దృష్టి సారిస్తామని తెలిపారు. రూ.42 కోట్ల నిధులతో బాసర ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని.. గోదావరి, సరస్వతీ పుష్కరాలకు ఏర్పాట్లు ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. బ్రాహ్మణ పరిషత్తును బలోపేతం చేస్తామని, ధూపదీప నైవేద్య పథకం చెల్లింపుల్లో పెండింగ్ లేకుండా చూస్తామని చెప్పారు. -
తెలంగాణలో పర్యాటక ప్రాంతాలు ఇవే.. ఫుల్ లిస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం కొత్త పాలసీని తెచ్చిన ప్రభుత్వం.. కొన్ని కీలక విధానాలను అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ టూరిజం ఏరియా (ఎస్టీఏ)లను గుర్తించి వాటి ప్రత్యేకతల ఆధారంగా ఆయా ప్రాంతాలకు పర్యాటకులు వచ్చేలా ప్రత్యేక పర్యాటక షెడ్యూల్ రూపొందించనున్నట్టు పేర్కొంది. తొలిదశలో అలాంటి 27 కేంద్రాలను గుర్తించారు. వీటిల్లో ఆధ్యాత్మిక, వారసత్వ, ఎకో–వెల్నెస్, హస్తకళలు, జలపాతాలు, బుద్ధిస్ట్ ప్రాంతాలు ఉన్నాయి.. అదే సమయంలో అవసరమైన మౌలిక సదుపాయాలనూ నిర్ధారించింది.స్పెషల్ టూరిజం ఏరియాలు.. యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట దేవాలయం, భువనగిరి కోట, బస్వాపూర్, కొలనుపాక, మహదేవపురం. భద్రాచలం: భద్రచాలం ఆలయం, పర్ణశాల, కిన్నెరసాని డ్యాం, అభయారణ్యం, కనకగిరి హిల్స్. బాసర: జ్ఞాన సరస్వతి దేవాలయం, వ్యాస మహర్షి దేవాలయం, పరిసర ప్రాంతాలు వేములవాడ: వేములవాడ దేవాలయం, కొండగట్టు దేవాలయం, కోటిలింగాల, ధర్మపురి అలంపూర్– సోమశిల: అలంపూర్ శక్తిపీఠం, బీచుపల్లి, జటప్రోలు, కొల్లాపూర్, సోమశిల రామప్ప: రామప్ప దేవాలయం, చెరువు, లక్నవరం సరస్సు, మేడారం, బొగత జలపాతం, ఏటూరునాగారం అభయారణ్యం, పాండవుల గుట్ట, ఘన్పూర్ దేవాలయ సమూహం. కాళేశ్వరం: కాళేశ్వరం దేవాలయం, గాంధారి కోట, శివరామ్ అభయారణ్యం మెదక్: మెదక్ చర్చి, కోట, పోచారం రిజర్వాయర్, వైల్డ్‌లైఫ్, ఏడుపాయల దేవాలయం, నర్సాపూర్ అటవీ ప్రాంతం, మంజీరా అభయారణ్యం, సింగూరు డ్యాం. వరంగల్: వరంగల్ కోట, పరిసరాల్లోని దేవాలయాలు, పాకాల సరస్సు, గూడూరు అభయారణ్యం. నల్లగొండ: పానగల్ దేవాలయ సమూహం, దేవరకొండ కోట పాలకుర్తి: పాలకుర్తి దేవాలయం, బమ్మెర పోతన గ్రామం, పెంబర్తి హస్తకళలు, చేర్యాల పెయింటింగ్స్, వల్మిడి, జఫర్గడ్ కరీంనగర్: ఎలగందుల కోట, ఫిలిగ్రి, మంథని దేవాలయాలు, రామగిరి కోట. చార్మినార్ క్లస్టర్: చార్మినార్, మక్కా మసీదు, లాడ్ బజార్, సాలార్జంగ్ మ్యూజియం, నిజాం మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్ హైదరాబాద్ – రంగారెడ్డి – మేడ్చల్ క్లస్టర్: గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ సమాధులు, తారామతి బారాదరి, కీసరగుట్ట, నెట్ జీరో సిటీ–ఎకోపార్కు, షామీర్పేట సరస్సు, అర్బన్ ఫారెస్ట్ పార్కులు సిద్దిపేట: రంగనాయకసాగర్, గొల్లభామ హస్తకళలు, వర్గల్ రాక్ ఆర్ట్స్, అన్నపూర్ణ రిజర్వాయర్ నల్లమల సర్క్యూట్: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, ఫర్హాబాద్, సలేశ్వరం, మల్లెల తీర్థం, మన్ననూరు, ఉమామహేశ్వరం, మాధవస్వామి ఆలయం, బేడి ఆంజనేయ ఆలయం. శ్రీరాంసాగర్: శ్రీరాంసాగర్ రిజర్వాయర్ బ్యాక్ వాటర్ ప్రాంతం. జన్నారం: కడెం, కవ్వాల్ టైగర్ రిజర్వ్, సప్తగుండాల జలపాతం. ట్రైబల్ క్లస్టర్: జోడేఘాట్, ఉట్నూరు, కాగజ్‌నగర్ టైగర్ రిజర్వ్. నాగార్జునసాగర్: బుద్ధిస్ట్ హెరిటేజ్, బ్యాక్‌వాటర్ ప్రాంతం. వికారాబాద్: వికారాబాద్, అనంతగిరి హిల్స్, అనంత పద్మనాభస్వామి దేవాలయం, కోట్‌పల్లి, పరిగి దామగుండం. మహబూబ్‌నగర్: కోయిల్‌సాగర్, పిల్లలమర్రి, మన్యంకొండ. పోచంపల్లి, నారాయణపేట, గద్వాల్ కొత్తకోట వస్త్ర పరిశ్రమ. కోరటికల్, కుంతాల, పొచ్చెర, గాయత్రి జలపాతాలు. కొండాపూర్, ధూళికట్ట, కోరుకొండ, నేలకొండపల్లి, బుద్ధవనం, ఫణిగిరి, గాజులబండ బౌద్ధక్షేత్రాలు.టూరిజం మౌలిక వసతులు ఇలా.. → శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేవలం ఒకటి–రెండు గంటల్లో చేరుకునేలా ప్రత్యేక పర్యాటక గమ్యాలను ఏర్పాటు చేయాలి. → బిజినెస్ టూరిజం అభివృద్ధి చెందాలంటే.. రీజినల్ రింగురోడ్డు చుట్టూ డ్రైపోర్టులు ఏర్పాటు చేయాలి. బందరు పోర్టుతో అనుసంధానించే ప్రత్యేక గ్రీన్‌ఫీల్డ్ కారిడార్‌తో వీటిని అనుసంధానించాలి. తద్వారా కావాల్సిన సరుకును సముద్రయానం ద్వారా సులభంగా తరలించే ఏర్పాటు ఉందన్న నమ్మకం పెట్టుబడిదారుల్లో కల్పించాలి. → రీజినల్ రింగురోడ్డు చుట్టూ ప్రపంచస్థాయి షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయాలి. → ఔటర్ రింగురోడ్డు చుట్టూ మెగా రిటైల్మాల్స్ను పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేయాలి. → గోదావరి, కృష్ణా నదుల్లో పర్యాటక పురోగతికి ఉపయోగపడే ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలి. రివర్ ఫెస్టివల్స్, బోట్ ఫెస్టివల్, హౌస్‌బోట్స్, వాటర్ స్పోర్ట్స్, జెట్టీలు, లాంచ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలి. → పట్టణాల్లో జలాశయాల వద్ద పర్యాటక విడిది కేంద్రాలు ఏర్పాటు చేయాలి. → హెలిప్యాడ్లను అందుబాటులోకి తెచ్చి ప్రధాన పర్యాటక ప్రాంతాలను వాయు మార్గాలతో అనుసంధానించాలి. → గోల్ఫ్ టూరిజంను విస్తృతం చేయాలి. → బుద్ధవనం, నాగార్జున సాగర్లను ఆసరా చేసుకుని వెల్నెస్, మెడిటేషన్ కేంద్రాల ఏర్పాటుతో బౌద్ధ పర్యాటకులను ఆకర్షించే చర్యలు చేపట్టాలి. → కార్పొరేట్ సంస్థలు కొన్ని పర్యాటక ప్రాంతాలను దత్తత తీసుకోవటం ద్వారా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు జరిగేలా చూడాలి. → పర్యాటక ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి, పార్కింగ్ ఏరియా, రెస్టారెంట్లు, కేఫ్‌లు, కియోస్క్‌లు, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్లు, ప్రాథమిక చికిత్స కేంద్రాలు, వేసైడ్ ఎమినిటీస్ ఉండాలి. →దివ్యాంగులకు అనుకూల ఏర్పాట్లు ఉండాలి. →స్పెషల్ టూరిజం ఏరియా(ఎస్టీఏ)ల పరిధిలో కనీసం 5 వేల గదులు అందుబాటులో ఉండాలి. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో కనీసం 10 వేల గదులు పర్యాటకులకు అందుబాటులో ఉండాలి.పెట్టుబడులను బట్టి ప్రాజెక్టుల కేటగిరీ ఇలా.. ప్రత్యేక ప్రాజెక్టులు: రూ.500 కోట్లు అంతకంటే ఎక్కువ పెట్టుబడి, 2 వేల మంది కంటే ఎక్కువ మందికి ప్రత్యక్ష ఉపాధి మెగా ప్రాజెక్టులు: రూ.100 కోట్లు– రూ.500 కోట్లు మధ్య పెట్టుబడి, 500 నుంచి రెండు వేల మంది వరకు ప్రత్యక్ష ఉపాధి పెద్ద ప్రాజెక్టులు: రూ.50 కోట్లు– రూ.100 కోట్లు మధ్య పెట్టుబడి మధ్యస్థ ప్రాజెక్టులు: రూ.10 కోట్లు– రూ.50 కోట్ల మధ్య పెట్టుబడి సూక్ష్మ,చిన్న ప్రాజెక్టులు: రూ.10 కోట్ల వరకు పెట్టుబడి తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్: హైదరాబాద్ నగరం–ఔటర్ రింగురోడ్డు మధ్య పరిధి తెలంగాణ సెమీ అర్బన్ రీజియన్: ఔటర్ రింగురోడ్డు–రీజినల్ రింగురోడ్డు మధ్య ప్రాంతం గ్రామీణ తెలంగాణ రీజియన్: ఆర్ఆర్ఆర్ వెలుపలి ప్రాంతం -
యాదగిరీశుడి బ్రహ్మోత్సవాల్లో గవర్నర్
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో కొనసాగుతున్న శ్రీస్వామి అమ్మవార్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం పాల్గొన్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్టా అలంకారమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.శ్రీస్వామిని దర్శించుకున్న గవర్నర్‌కు ముఖ మండపంలో ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, ఈఓ భాస్కర్‌రావు.. శ్రీస్వామి వారి లడ్డూ ప్రసాదంతో పాటు శ్రీనృసింహస్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం శ్రీస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉత్తర మాడవీధిలోని యాగశాలలో నిర్వహించిన మహా పూర్ణాహుతిలో పాల్గొన్నారు. ఆయన వెంట కలెక్టర్ హనుమంతరావు, ఆర్డీఓ కృష్ణారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి తదితరులున్నారు. యాదగిరి క్షేత్రంలో వైభవంగా శ్రీచక్ర తీర్థంయాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు పాంచరాత్ర ఆగమానుసారం కొనసాగుతున్నాయి. ఆలయంలో సోమవారం ఉదయం నిత్యపూజలు చేసిన ఆచార్యులు ప్రథమ ప్రాకారంలోని ఉత్తర దిశలో ఏర్పాటు చేసిన యాగశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం శ్రీచక్ర ఆళ్వారుడికి, ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి, ఆలయ మాడ వీధుల్లో ఊరేగించి విష్ణు పుష్కరిణిలో శ్రీచక్ర తీర్థ స్నానం చేపట్టారు.ఈ సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పునీతులయ్యారు. రాత్రి ఆలయంలో శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవాలను ఆగమశాస్త్రం ప్రకారం జరిపించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయంలో ఉదయం అష్టిత్తర శతఘటాభిõÙకం రాత్రి శృంగార డోలోత్సవం నిర్వహిస్తారు. శృంగార డోలోత్సవంతో 11 రోజుల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. -
యాదగిరిగుట్టలో వైభవంగా శ్రీలక్ష్మీనరసింహుడి కల్యాణం (ఫొటోలు)
-
వైభవంగా యాదగిరిగుట్ట నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
మత్స్యావతారంలో యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి
-
రేపటి నుంచి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్ట: మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరిగే యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఆలయ ఈవో భాస్కర్‌రావు ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలసి ప్రత్యేక ఆహ్వాన పత్రికతో పాటు శ్రీస్వామివారి లడ్డూ ప్రసాదం అందజేశారు. కాగా, బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో భాస్కర్‌రావు తెలిపారు. కొండపైన గల తన కార్యాలయంలో ఆయన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై విలేకరుల సమావేశం నిర్వహించారు.మార్చి 1న విష్వక్సేన ఆరాధన, స్వస్తివాచనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. 7వ తేదీన ఎదుర్కోలు మహోత్సవం, 8న శ్రీస్వామి వారి తిరు కల్యాణ మహోత్సవం, 9న రథోత్సవం, 10న చక్రతీర్థ స్నాన వేడుకలు ఉంటాయన్నారు. 11వ తేదీన రాత్రి డోలోత్సవంతో వేడుకలు ముగుస్తాయని వివరించారు. 3వ తేదీ నుంచి శ్రీస్వామి వారి అలంకార, వాహన సేవలు ప్రారంభం అవుతాయని తెలిపారు. కాగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు భక్తుల వాహనాలను కొండపైకి టోల్‌చార్జీ వసూలు చేయకుండా ఉచితంగా పంపించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆయన చెప్పారు. -
యాదాద్రిలో స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి (ఫోటోలు)
-
యాదాద్రిలో స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరించిన సీఎం రేవంత్
సాక్షి, యాదాద్రి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా పంచతుల బంగారు విమాన గోపురాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. అనంతరం, ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దివ్య విమాన స్వర్ణ గోపుర ఆవిష్కరణకు సంబంధించి ‘పంచ కుండాత్మక మహా కుంభాభిషేక సంప్రోక్షణ’ మహోత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు.. మహాపూర్ణాహుతిలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో రేవంత్ దంపతులకు వేదపండితులు ఆశ్వీరాదం ఇచ్చారు. ఉదయం ప్రత్యేక హెలికాప్టర్లో యాదగిరిగుట్టకు వెళ్లిన సీఎం.. మొదటగా గుట్టపైన ఉన్న యాగశాలకు చేరుకున్నారు. ఆలయ ఈవో, అధికారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ఆలయ పరిసరాలు, అభివృద్ధి పనులు పర్యవేక్షించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
Watch Live: యాదగిరిగుట్టలో మహా కుంభాభిషేకం సంప్రోక్షణ
-
నేడు మహాకుంభాభిషేక సంప్రోక్షణ
సాక్షి, యాదాద్రి/యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ దివ్య స్వర్ణ విమాన గోపుర కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవానికి యాదగిరిగుట్ట క్షేత్రం ముస్తాబైంది. ఆదివారం జరిగే స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. వానమామలై మఠం పీఠాధిపతి మధుర కవి రామానుజ జీయర్‌స్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగనుంది. గుట్టలో ఈ నెల 19 నుంచి నిర్వహిస్తున్న పంచకుండాత్మక నారసింహ యాగం పూర్ణాహుతి అనంతరం ఆదివారం ఉదయం 11.54 గంటలకు దివ్య స్వర్ణ విమాన గోపురం కుంభాభిషేక కార్యక్రమం జరుగుతుంది.68 కిలోల బంగారంతో తాపడం.. యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపురం దేశంలోనే ఎత్తయినదని చెపుతున్నారు. పంచతల రాజగోపురానికి సుమారు 68 కిలోల బంగారంతో తాపడం చేయించారు. రూ.5.10 కోట్ల ఖర్చుతో భక్తులు, దాతలు ఇచి్చన బంగారం, నగదుతోపాటు, దేవస్థానం హుండీలో భక్తులు వేసిన కానుకలతో స్వర్ణ తాపడం చేపట్టారు. గోపురంపై సింహ, గరుడ విగ్రహాలు, నారసింహ రూపాలు చెక్కారు. దాతల కోటాలో కేసీఆర్‌కు ఆహ్వానం స్వర్ణ తాపడం కోసం బంగారం విరాళం ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్, త్రిదండి చినజీయర్స్వామిలను దాతల కేటగిరీలో దేవస్థానం అధికారులు ఈ మహోత్సవానికి ఆహ్వానించారు. మహా కుంభ సంప్రోక్షణ, పంచకుండాత్మక నారసింహ యాగం జరుగుతున్న తీరును కేసీఆర్ ఆరా తీశారని సమాచారం. త్వరలో ఆయన యాదాద్రీశుని దర్శనానికి వస్తానని చెప్పినట్లు తెలిసింది. హాజరుకానున్న మంత్రులు యాదగిరిగుట్ట ఆలయ దివ్య విమాన స్వర్ణ గోపురం మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి సీఎంతో పాటు మంత్రులు కొండా సురేఖ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, వేముల వీరేశం, మందుల సామేల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హాజరుకానున్నారు.ఆర్జిత సేవలు రద్దు: మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో భాగంగా ఆదివారం ఆలయంలో నిత్య కల్యాణం, పుష్పార్చనతో పాటు ఆయా ఆర్జిత సేవలను రద్దుచేశారు. అంతే కాకుండా ఉదయం, సాయంత్రం ఆలయంలో బ్రేక్ దర్శనాలను సైతం నిలిపివేశారు. ఉదయం 10 గంటల నుంచి ఉచిత, వీఐపీ, ఇతర టికెట్ దర్శనాలను రద్దు చేశారు. ఉదయం సమయంలో స్వామి వారి దర్శనాలకు వచ్చే భక్తులు ఆర్టీసీ బస్సుల్లో రావాలని ఆలయ ఈవో భాస్కర్‌రావు పేర్కొన్నారు.నేడు పంచకుండాత్మక యాగం ముగింపుయాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వర్ణ విమాన గోపురానికి కుంభాభిõÙకం, సంప్రోక్షణ మహోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న పంచకుండాత్మక యాగం ఆదివారంతో ముగియనుంది. శనివారం ఉదయం ప్రధాన ఆలయంలో నిత్య పూజలు నిర్వహించిన అనంతరం, యాగశాలలో చతుస్థానార్చన, విమాన అధిష్టాన పరివార విశేష హోమాన్ని రుత్వికులు నిర్వహించారు. తర్వాత ఏకాశీతి కలశ స్నపనము, చాతుమరై నిర్వహించి నిత్య పూర్ణాహుతి చేశారు. సాయంత్రం శ్రీవిష్ణు సహస్రనామ పారాయణాన్ని పఠించారు. ఆయా వేడుకల్లో వానమామలై మఠం మధుర కవి రామానుజ జీయర్ స్వామి, భువనగిరి కలెక్టర్ హనుమంతరావు, ఈవో భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ప్రధానార్చకులు, ఇతర అర్చకులు, ఆలయాధికారులు పాల్గొన్నారు. -
రేపు యాదగిరి క్షేత్రానికి సీఎం రేవంత్‌రెడ్డి
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీలక్ష్మీనరసింహస్వామి(Sri Lakshmi Narasimha Swamy temple) ఆలయానికి ఈనెల 23న సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) వెళ్లనున్నారు. ఈ మేరకు ఆలయ ఈవో భాస్కర్‌రావు శుక్రవారం వెల్లడించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రప్రభుత్వం చేపట్టిన యాదగిరీశుడి స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని సీఎం ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.బంగారు తాపడంతో తయారు చేసిన శ్రీనృసింహ అవతారాలు, కేశవ నారాయణమూర్తులు, గరుడమూర్తులు, తదితర దేవతామూర్తుల విగ్రహాలకు వానమామలై మఠం 31వ పీఠాధిపతులు శ్రీమధుర కవి రామానుజ జీయర్ స్వామీజీ ఆధ్వర్యంలో ఉదయం 11.54 గంటలకు మహా కుంభాభిషిక సంప్రోక్షణ పూజలు జరిపిస్తారని చెప్పారు.అనంతరం రామానుజ జీయర్ స్వామిజీతో కలిసి ముఖ్యమంత్రి ఆలయ స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని ఆవిష్కరించి శ్రీస్వామి వారికి అంకితమిస్తారని వెల్లడించారు. సీఎం 23న ఉదయం 10.30 గంటలకు హెలికాప్టర్ ద్వారా యాదగిరిగుట్టకు చేరుకుంటారని, అక్కడి నుంచి కొండపైన వీఐపీ గెస్ట్‌హౌస్‌లోకి వెళ్లి, సంప్రదాయ దుస్తులతో యాగశాలలో నిర్వహించే మహా పూర్ణాహుతి వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. తర్వాత ఉత్తర ద్వారం నుంచి ఆలయ విమాన గోపురం వద్దకు వెళ్లనున్నట్లు అధికారులు వెల్లడించారు. -
యాదగిరిగుట్ట క్షేత్రంలో వైభవంగా గిరిప్రదక్షిణ.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
తుదిదశకు స్వర్ణ తాపడం పనులు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ విమానగోపురానికి చేపట్టిన స్వర్ణతాపడం పనులు పూర్తికావొచ్చాయి. ఈ నెల 23న కుంభాభిషేకం కార్యక్రమానికి దేవాదాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. దాతలు ఇచ్చిన సొమ్ముతోపాటు దేవస్థానం నిధులు రూ.21 కోట్లతో సుమారు 60 కిలోలకు పైగా బంగారంతో స్వర్ణతాపడం పనులు చేపట్టారు. సీసీ కెమెరాల నిఘాలో పనులు రాత్రింబవళ్లు జరుగుతున్నాయి. అయితే, భక్తుల మనోభావాలకు అనుగుణంగా క్షేత్ర ప్రాశస్థ్యం పెంచే చర్యలు తీసుకోవడంతోపాటు భక్తులకు మరిన్ని వసతులు కల్పించాల్సిన అవసరముంది. ఆలయ ఉద్ఘాటన జరిగిన రెండు సంవత్సరాలు కావొస్తున్నా నిధుల లేమితో వసతుల పనులు ఇంకా పూర్తికాలేదు. మార్చిలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల నాటికి పెండింగ్ పనులు పూర్తయ్యే పరిస్థితి లేదు. – సాక్షి, యాదాద్రిసీఎం సమీక్షించినాయాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మార్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. దేవస్థానంలో పనులు పూర్తి చేయడానికి నిధులు విడుదల చేయడం లేదు. ఇప్పటివరకు జరిగిన పనులకు చెల్లించాల్సిన బిల్లులు రూ.70 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నవంబర్ 8న యాదగిరిగుట్టకు వచ్చిన సీఎం.. అభివృద్ధి పనుల ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. ఆ మేరకు అధికారులు కొండ ప్రాశస్త్యం, భక్తుల వసతులకు పనుల ప్రతిపాదనలు పంపించారు. ప్రధానంగా కొండపైన రాత్రి నిద్ర చేయడానికి డార్మెటరీ హాల్, కల్యాణ మండపం, కళాభవన్, కల్యాణకట్ట, క్యూలైన్లలో మరిన్ని వసతుల కోసం పంపిన ప్రతిపాదనలకు సంబందించిన ఫైల్ ముఖ్యమంత్రి కార్యాలయంలో పెండింగ్‌లో ఉంది. ఇవీ చేపట్టిన పనులుగత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనుల్లో ప్రధానమైనవి కొండపైన కృష్ణ శిలలతో ఆలయ గోపురాలు, మాడవీధులు, చుట్టూ ప్రాకారాలు, గర్భగుడి, ధ్వజస్తంభం, శివాలయం, క్యూలైన్లు, ప్రసాదాల వంటశాల, కొండపైన విష్ణుపుష్కరిణి, కొండకింద లక్ష్మి పుష్కరిణి, స్వామి తెప్పోత్సవం కోసం గండి చెరువు, నిత్యాన్నదాన సత్రం, సత్యనారాయణస్వామి వ్రత మండపం, కొండపైన బస్బే, దీక్షాపరుల మండపం, గిరిప్రదర్శన రింగ్‌రోడ్డు, పెద్దగుట్టపైన టెంపుల్ సిటీ, గుట్ట చుట్టూ రింగ్‌రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్, దేవస్థానం బస్టాండ్, ప్లైఓవర్ల నిర్మాణం చేపట్టారు.ఈ పనులు పూర్తికాలేదు » బాలాలయం స్థానంలో రంగ మండపం (కళాభవన్) నిర్మించాలని నిర్ణయించారు. కల్యాణోత్సవాలు, భక్తుల రాత్రి నిద్ర చేయడం, సాంస్కృతిక కార్యక్రమాలు జరిపించొచ్చని భావించారు. పనులు ఇంకా ప్రారంభం కాలేదు. » స్వచ్చంద సంస్థ వెగ్నేష్ రూ.11 కోట్లతో నిర్మించిన అన్నదాన సత్రం ఇంకా భక్తులకు అందుబాటులోకి రాలేదు. ఇది అందుబాటులోకి వస్తే రోజు సుమారు రెండు వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించొచ్చు. ప్రస్తుతం దీక్షాపరుల మండపంలో భక్తులకు రోజు అన్నప్రసాదం అందిస్తున్నారు. » దేవస్థానం బస్టాండ్ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. » కొండ పైన దుకాణాలు కోల్పోయిన వ్యాపారులకు కొండ కింద 122 దుకాణాల కోసం మడిగెలు నిర్మిస్తున్నారు. ఇందులో పుష్కరిణి వద్ద కొందరికి దుకాణాలు కేటాయించారు. మిగతావి ఇంకా పూర్తి కాలేదు. » గోదావరి జలాలతో నింపిన గండి చెరువులో తెప్పోత్సవం పనులు పూర్తి కాలేదు. గ్రీనరీ, బెంచీలు ఏర్పాటు వరకే నిలిచిపోయాయి. » కొండపైకి చేపట్టిన ఘాట్‌రోడ్డు పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఒకే రోడ్డు ఉండడంతో వాహనాలకు ఇబ్బందిగా మారింది. » పెద్దగుట్టపైన వైటీడీఏ అభివృద్ధి చేసిన టెంపుల్ సిటీలో దాతల సాయంతో నిర్మించతలపెట్టిన వసతిగదుల నిర్మాణం ప్రారంభం కాలేదు. -
యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు ఆర్డినెన్స్?
సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు (వైటీడీబీ) ఏర్పాటుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తేనుంది. గత నెల సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైటీడీబీ ఏర్పాటుపై చర్చించారు. ఈ నెల 12వ తేదీలోగా వైటీడీబీని ఏర్పాటు చేస్తూ ప్రభు త్వం ఆర్డినెన్స్ తేవాల్సి ఉండగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ (Election Code) అమలులోకి వచ్చింది. దీంతో కోడ్ ముగిసిన తర్వాత ఆర్డినెన్స్‌ను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆర్డినెన్స్‌ను ఆరు నెలల్లోపు ఆమోదించాల్సి ఉంటుంది కాబట్టి ఈ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించే అవకాశం ఉంది.చైర్మన్, పాలకవర్గం నియామకం యాదగిరిగుట్ట (yadagirigutta) దేవస్థానం బోర్డుకు చైర్మన్‌తోపాటు పాలకవర్గం సభ్యులు 11 మందిని నామినేట్ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. వీరికి తోడు ఆరుగురు ఎక్స్అఫీషియో సభ్యులను నియమిస్తారు. ప్రస్తుతం ఉన్న వంశపారంపర్య ధర్మకర్త దేవస్థానం పాలకవర్గంలో సభ్యుడిగా ఉంటారు. కాగా, సీఎం చైర్మన్‌గా గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ(వైటీడీఏ) మొత్తం నూతనంగా వచ్చే వైటీడీబీ పరిధిలోకి రానుంది. దేవస్థానం పరిపాలన వ్యవహారాలు, ఉద్యోగుల బదిలీలు, భక్తుల వసతులు, దేవస్థానం అభివృద్ధి పనులను వైటీడీబీ పర్యవేక్షణలోకి తేనున్నారు. స్వాగత తోరణానికి రంగులు యాదగిరిగుట్ట దేవస్థానం స్వాగత తోరణానికి రంగులు వేయాలని సీఎం రేవంత్‌రెడ్డి దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. కొండపైన భక్తులకు స్వాగతం పలికే తోరణాన్ని సిమెంట్‌తో నిర్మించారు. నవంబర్‌లో సీఎం యాదగిరిగుట్టకు వచ్చిన సమయంలో తోరణం నిర్మాణ శైలి వివరాలను తెలుసుకున్నారు. గత నెలలో జరిగిన సమీక్షా సమావేశంలో స్వాగత తోరణానికి ఆకర్షణీయమైన రంగులు వేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు పనులు ప్రారంభించారు.చదవండి: అయ్యో దేవుడా.. ఎందుకు ఇలా చేశావ్? యాగశాల ఏర్పాటుకు మార్కింగ్యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 23న నిర్వహించనున్న మహాకుంభ సంప్రోక్షణకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా యాగశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. సోమవారం ఆలయ ఉత్తర మాడ వీధిలో మార్కింగ్ చేశారు. 32 ఫీట్ల వెడల్పు, 32 ఫీట్ల పొడవుతో యాగశాలను నిర్మాణం చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
10లోగా పర్యాటక పాలసీ: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి సంబంధించి సమగ్ర పర్యాటక విధానాన్ని ఫిబ్రవరి పదో తేదీలోగా సిద్ధం చేయాలని పర్యాటక శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలు, అభయారణ్యాలు, ఆలయాలను ప్రాతిపదికగా చేసుకొని పాలసీని రూపొందించాలని సూచించారు. బుధవారం రాత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం ఈ అంశంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వివిధ రాష్ట్రాలు, దేశాల్లో అనుసరిస్తున్న పర్యాటక పాలసీలపై అధ్యయనం చేసి, అనుసరించదగ్గ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రానికి దేశీ, విదేశీ పర్యాటకులు వచ్చేలా చూడాలన్నారు. పర్యాటక రంగంలో బహుళ జాతి కంపెనీల పెట్టుబడులను ఆకర్షించేలా పాలసీ ఉండాలని, దీనితో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వసతులు ఏర్పడి, పర్యాటకులను ఆకట్టుకోవటానికి వీలవుతుందని స్పష్టం చేశారు. పర్యాటక ఆదాయం పెరగాలి కవ్వాల్, అమ్రాబాద్ పులుల అభయారణ్యాలను సఫారీ టూరిజానికి అనువుగా తీర్చిదిద్దాలని అధికారులను సీఎం ఆదేశించారు. ‘‘మేడారం, రామప్ప దేవాలయం, లక్నవరాలను సర్క్యూట్‌గా తీర్చిదిద్దాలి. నాగార్జునసాగర్, శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో కేరళ తరహాలో బోట్హౌస్లతో పర్యాటకుల సంఖ్య పెరిగేలా చూడాలి. రాష్ట్రంలోని బౌద్ధ పర్యాటక ప్రదేశాలను కలుపుతూ బౌద్ధ సర్క్యూట్ ఏర్పాటు చేయాలి. సమ్మక్క–సారలమ్మ జాతరకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులు సమీపంలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించేలా ప్రణాళికలు రూపొందించాలి..’’అని సూచించారు. హైదరాబాద్ నగరంలోని ఎనీ్టఆర్ గార్డెన్, సంజీవయ్య పార్క్, ఇందిరా పార్క్‌లను కలుపుతూ స్కైవాక్, సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాలన్నారు. అనంతగిరితోపాటు ఇతర పర్యాటక ప్రాంతాల్లో వసతులు మెరుగుపర్చాలని చెప్పారు. పరిశ్రమలు, ఇతర రంగాల నుంచి వచ్చే ఆదాయమే కాకుండా పర్యాటక రంగం నుంచీ ఆదాయం పెరిగితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరో దశకు చేరుకుంటుందని స్పష్టం చేశారు. సమీక్షలో మంత్రి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డును సత్వరం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని దేవాదాయశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ధర్మకర్తల మండలి ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాలో పలు మార్పులను సూచించారు. యాదగిరిగుట్ట ఆలయం సమీపంలో రాజకీయాలకు తావులేకుండా, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. దీనితోపాటు ఆలయం తరఫున చేపట్టాల్సిన పలు ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలపై పలు సూచనలు చేశారు. -
చరిత్రకు సజీవ సాక్ష్యం.. రాజకోట
యాదగిరిగుట్ట: నిజాం ప్రభువులకు లక్షలాది రూపాయల కప్పం కట్టిన సంపన్న సంస్థానం.. ఒకప్పుడు అద్భుతమైన కట్టడంగా భాసిల్లిన కోట నిర్మాణం.. అదే.. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధి చెందిన రాజకోట. 250 ఏళ్ల చరిత్ర కలిగిన రాతి కట్టడాల నిలయంగా.. రాచరికపు మహోన్నత వైభవానికి.. చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచింది రాజాపేటలోని (Rajapeta) రాజావారి కోట. హైదరాబాద్‌కు (Hyderabad) 90 కిలోమీటర్లు.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు (Aler) నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిజాం రాజ్యంలోని అన్ని సంస్థానాల కన్నా ఎక్కువ రాబడి ఈ సంస్థానం నుంచే వచ్చేదని చరిత్రకారులు చెబుతారు. అంతేకాదు.. గొప్ప కట్టడాలున్న సంస్థానంగా కూడా పేరు ఉండేది. ఇక్కడ చిన్న చిన్న షూటింగ్‌లు, ఫొటో షూట్లు సైతం జరుగుతుంటాయి. కోటలోని అద్భుత శిల్ప కళా సంపద అప్పటి శిల్పుల గొప్పతనాన్ని చాటుతుంది. కోట చరిత్ర రాజాపేట గ్రామానికి పడమటి భాగంలో గోపాలపురం (Gopalapuram) అనే గ్రామం ఉండేది. గ్రామం పైభాగంలో చెరువు ఉండేది. ఆ చెరువు వరద ముంపునకు గురైన గోపాలపురం గ్రామం కాలగర్భంలో కలిసిపోయింది. అనంతరం రాజ రాయన్న అనే రాజు 1775లో కోటను నిర్మించి గ్రామాన్ని ఏర్పాటు చేశాడు. రాజ రాయన్న పాలన సాగించిన కోటనే నేడు రాజాపేటగా పిలుస్తున్నారు. రాజాపేట గ్రామం చుట్టూ కందకం తవ్వారు. కోట గోడ ప్రాకారం, ఎత్తయిన రాతి గోడలతో చుట్టూ శత్రు దుర్భేద్యంగా నిర్మించారు. గ్రామం మధ్యలో ఉండేలా.. మూడు ప్రధాన ద్వారాలు ఏర్పాటు చేశారు. ఎగువ పడమటి వైపున్న గోపాల చెరువు నుంచి కందకంలో నీరు పారేలా ఏర్పాట్లు చేసి.. శత్రువులు చొరబడకుండా మొసళ్లను పెంచేవారు. గ్రామం లోపలి ప్రధాన ద్వారం దాటితే రాజ నివాసం, అంతఃపురం, అద్దాల మేడ, అతిథి గృహం, నీటి కొలను, గిరిగిరి మాల్, ఏనుగుల మోట, ఖైదీల కారాగారం, సైనికుల శిక్షణ స్థలం వంటివి కనిపిస్తాయి. శత్రువుల నుంచి కోటను రక్షించేందుకు చుట్టూ నిర్మించిన ఎత్తయిన బురుజులు పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తాయి. వారి ప్రాణాలను రక్షించుకునేందుకు కోట నుంచి బయటికెళ్లేందుకు సొరంగ మార్గాలున్నాయి. పర్యాటకుల తాకిడి.. సినిమా షూటింగ్‌లు.. రాజకోటలో బురుజులు, అంతఃపురం, నీటి కొలను, సైనిక ప్రాంగణం, ఏనుగుల మోట, గిరిగిరిమాల్ తదితర అద్భుత నిర్మాణాలు.. సినిమా షూటింగ్‌లు, ఫొటోషూట్‌కు అనుకూలంగా ఉన్నాయి. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రానికి 20 కిలోమీటర్ల దూరంలో, సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న, కొండపోచమ్మ ఆలయాలకు వెళ్లే మార్గాల్లో ఈ కోట ఉండటంతో పర్యాటకులు సందర్శించేందుకు వీలుంది. ఇప్పటికే షార్ట్ ఫిలిమ్స్‌తో పాటు పలువురు ప్రీ వెడ్డింగ్ (Pre Wedding) షూట్లు ఇక్కడ తీస్తున్నారు. అభివృద్ధికి నోచుకోని గడికోట రాజకోట రాజవంశీకులు ఈ కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని గతంలో నిర్ణయించారు. దీంతో పర్యాటక శాఖాధికారులు రాజకోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2019 అక్టోబర్ 29న పర్యాటక శాఖాధికారులు గడిని సందర్శించారు. అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం, తుర్కపల్లి మండలం గంధమల్ల చెరువు, రాజాపేట గడికోట, కొలనుపాకలోని జైన్ మందిర్, సోమేశ్వర ఆలయాలను కలుపుతూ టూరిజం హబ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. చదవండి: తిరుమలలో చాగంటి కోటేశ్వరరావుకు అవమానంభావితరాలకు అందించాలి రాజకోటను తిలకించేందుకు పర్యాటకులు, సినీ నటులు తరచూ వస్తున్నారు. కోటలో ఇప్పటికే పలు సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్, ప్రీ వెడ్డింగ్ షూట్లు జరిగాయి. 250 ఏళ్ల చరిత్ర కలిగిన రాజకోటను భావితరాలకు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి, టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దాలి. – కొత్తకొండ భాస్కర్, రాజాపేట గ్రామస్తుడురాజకోటను పరిరక్షించాలి మా కాలంలో ఈ కోట ఎంతో అద్భుతంగా ఉండేది. కానీ ఇప్పుడు నిరాదరణకు గురైంది. ఎంతో చరిత్ర కలిగిన రాజాపేటలోని రాజకోటను అభివృద్ధి చేయాలి. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలి. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన యాదగిరిగుట్ట, కొమురవెల్లి ఆలయాలకు అతి సమీపంలోని ఈ కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. – పుల్లంగారి సిద్ధయ్య, రాజాపేట -
యాదగిరిగుట్ట ఆలయం దర్శన క్యూలైన్ గ్రిల్ లో ఇరుక్కుపోయిన బాలుడి తల
-
యాదాద్రి బ్రహ్మోత్సవాలకు వేళాయె..
సాక్షి, యాదాద్రి: వచ్చే ఏడాది మార్చిలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు దేవస్థానం ఏర్పాట్లు ప్రారంభించింది. మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో దేశ విదేశాలతో పాటు స్థానిక భక్తులను మమేకం చేయనున్నారు. బ్రహ్మోత్సవాలకు తలమానికంగా ఉండేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. స్వస్తివచనంతో ప్రారంభం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి వార్షిక బ్రహ్సోత్సవాలు మార్చి 1న స్వస్తి వచనంతో ప్రారంభమై.. డోలోత్సవంతో ముగుస్తాయి. ఈ సందర్భంగా సాహితీ, సాంస్కృతిక, ధార్మిక సభా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. 7న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎదుర్కోలు, 8న స్వామి అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం, 9న దివ్యవిమాన రథోత్సవం, 10న పూర్ణాహుతి, చక్రతీర్థం, దోపు ఉత్సవం, 11న శతఘటాభిõÙకం, డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. గ్రామోత్సవం పేరుతో రథోత్సవం యాదగిరిగుట్ట, పరిసర ప్రాంత భక్తుల కోసం గ్రామోత్సవం పేరుతో కొండ కింద ప్రత్యేక రథోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా కొండపైన జరిగే రథోత్సవం అనంతరం కొండ కింద భక్తుల కోసం ప్రత్యేక రథోత్సవం నిర్వహించడానికి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. సాంస్కృతిక కార్యక్రమాలు బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులను అలరించేలా సాంస్కృతిక, సాహితీ, సంగీత, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. ఈ విషయంలో దేవస్థానం ఈవో ఎ.భాస్కర్‌రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మూడు రోజుల పాటు మహాసహస్ర అవధాని పద్మశ్రీ గరికపాటి నర్సింహారావు ప్రవచనాలు వినిపించనున్నారు. మార్చి 6న సంగీత దర్శకుడు మాధవపెద్డి సురేశ్ సంగీత విభావరి ఏర్పాటు చేశారు. ఆయనతోపాటు తిరుపతి తిరుమల దేవస్థానంలో అన్నమాచార్య కీర్తనలు ఆలపించే ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌తో ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. అంజన్న చరిత్ర గాయని, కరీంనగర్‌కు చెందిన తేలు విజయతో ఒకరోజు, లిటిల్ మ్యూజీషియన్ నిర్వాహకుడు రామాచారితో ప్రత్యేక విభావరి కార్యక్రమాలు ఉంటాయి. వేగంగా స్వర్ణ కవచం పనులు ఆలయ విమాన గోపురం స్వర్ణకవచం పనులు వేగం పుంజుకున్నాయి. ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి చేయాలన్న సంకల్పంతో దేవస్థానం ఉంది. ఈ మేరకు 60 కిలోల బంగారాన్ని వినియోగిస్తున్నారు. భక్తులు ఇచ్చిన విరాళాలు, దేవస్థానం వద్ద ఉన్న బంగారం, వెండితో స్వర్ణతాపడం పనులు కొనసాగుతున్నాయి. 10,500 చదరపు అడుగుల మేరకు చేయాల్సిన స్వర్ణ తాపడం పనులు సగం వరకు పూర్తి కావొచ్చాయి.కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు శ్రీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలుకనీవిని ఎరుగని రీతిలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రధానంగా లబ్ధప్రతిష్టులైన కళాకారులతో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక అలంకారంగా ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నాం. ఇప్పటికే గరికపాటి, మాధవపెద్ది సురేశ్ తదితర ప్రముఖుల సహాయాన్ని తీసుకున్నాం. మరికొందరు ప్రముఖులతో కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. – ఎ.భాస్కర్‌రావు, ఈవో యాదగిరిగుట్ట దేవస్థానం -
ఉపాధికి అడ్డ.. భువనగిరి గడ్డ
సాక్షి, యాదాద్రి: ఒకప్పుడు వలసలకు కేంద్రమైన యాదాద్రి భువనగిరి జిల్లా ఇప్పుడు వలస కార్మికులకు ఉపాధి అడ్డాగా మారింది. ఉపాధి లేక ముంబై, భివండీ, సోలాపూర్, బెంగళూరు, ఆంధ్ర, సూరత్ వంటి పట్టణాలకు జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి నిరంతరం వలసలు సాగేవి. కానీ ఇప్పుడు వ్యవసాయం, పరిశ్రమలు, గృహనిర్మాణ రంగాలు పుంజుకోవడంతో వివిధ రకాల పనులు ఊపందుకున్నాయి. దీంతో కూలీల కొరత నెలకొనడంతో జిల్లాకు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి కార్మికులు వలసవచ్చి ఉపాధి పొందుతున్నారు.30 వేల మందికి పైగా.. ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, అసోం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు చెందిన వేలమంది జిల్లాలో ఉపాధి పొందుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి యాదాద్రి జిల్లాకు రైళ్లు, బస్సులు అందుబాటులో ఉండటంతో కార్మికులు నేరుగా చేరుకుంటున్నారు. జిల్లాలోని 17 మండలాలు, 6 మున్సిపాలిటీల్లో 30 వేలకు పైగా ఇతర రాష్ట్రాల కార్మికులు పలు రకాల పనులు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ రైస్ మిల్లులు, హోటళ్లు, భవన నిర్మాణం, ఇటుక బట్టీలు, టైల్స్, పీవోపీ, పౌల్ట్రీ, ఎయిమ్స్, కంపెనీలు, వ్యవసాయ కార్మికులుగా పనిచేస్తున్నారు. చౌటుప్పల్, బీబీనగర్ పారిశ్రామిక వాడల్లో వీరు ఎక్కువగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా రైస్‌మిల్లులు, భవన నిర్మాణ పనులు, వ్యవసాయంలో నాట్లువేయడం, పత్తి ఏరడం తదితర పనులు చేస్తున్నారు. బార్బర్ పని, హోటళ్లలో మాస్టర్లు, వెయిటర్లు, ఇలా ఒకటేమిటి అన్ని రకాల పనులు చేస్తున్నారు. ఒక్కో రాష్ట్రం కార్మికులది ఒక్కో ప్రత్యేకత బిహార్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వలస వచ్చిన వారు జిల్లాలోని రైస్ మిల్లులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలీ పనులు చేస్తుండగా.. ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన వారు భవన నిర్మాణంలో తాపీ మేస్త్రీలుగా, పార కూలీలుగా.. రాజస్తాన్ నుంచి వచ్చిన వారు హోటళ్లు, పీవోపీ, హార్డ్‌వేర్ దుకాణాల్లో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వారు పత్తి ఏరడం, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన వారు పొలంలో నాట్లు వేయడం లాంటి పనులు చేసి జీవనోపాధి పొందుతున్నారు.అధికంగా రైస్ మిల్లుల్లో.. ఒక్కో రైస్ మిల్లులో 20 నుంచి 30 మంది కార్మికులు పనిచేస్తారు. ఒక గుంపునకు ఒక ముఠామేస్త్రి కార్మికులను సూపర్వైజ్ చేస్తారు. అందరికంటే ముఠామేస్త్రికి కాస్త కూలి ఎక్కువగా ఉంటుంది .రైస్ మిల్లుల్లో మిల్లు డ్రైవర్, ప్లాంటు డ్రైవర్, హమాలీలుగా పని చేస్తారు. మిల్లు ప్లాంటు, డ్రైవర్లకు రోజుకు సుమారు రూ.800 కూలి పడుతుంది. మిల్లుకు వచ్చే లారీల ధాన్యం లోడింగ్, అన్లోడింగ్, హమాలీ కార్మికులు చేస్తారు. వీరికి రోజుకు సుమారు రూ.500 కూలి పడుతుంది. మిల్లు యజమానులు వీరికి భోజనం, వసతి కల్పిస్తారు. అడ్వాన్స్‌లు చెల్లించి మరీ.. పలు గ్రామాల్లో గల ఇటుక బట్టీల్లో సుమారు 6,000కుపైగా ఒడిశా కార్మికులు పనిచేస్తున్నారు. నాలుగు నెలల పనుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ.50 వేల అడ్వాన్స్ చెల్లించి ఇటుక బట్టీ యజమానులు పనులకు తీసుకువస్తారు. ఒక్కో వ్యక్తికి వారానికి రూ.వెయ్యి చొప్పున కిరాణా సరుకుల కోసం ఖర్చులు ఇవ్వడంతో పాటు వారు చేసిన పనులను బట్టి రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు అడ్వాన్స్‌లో కటింగ్ చేస్తారు. ఒడిశా కూలీలు తాము తీసుకున్న అడ్వాన్స్‌కు సరిపోను ఈ నాలుగు నెలల కాలంలో పనులు చేస్తారు.చదవండి: రియల్ఎస్టేట్ పడిపోతే పోయేదేం లేదు.. ఎమ్మెల్యే కాటిపల్లిబెంగాల్ నుంచి వచ్చాను మాది పశ్చిమబెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లా గొసాబా. మా రాష్ట్రంలో పనులు లేవు. ఉపాధికోసం భువనగిరికి వచ్చాం. తిండి, వసతి ఖర్చులు లేకుండా పనిచేసే గ్రామాల్లోనే షెల్టర్ వెతుక్కుంటున్నాం. ఒక్కొక్కరం రోజుకు రూ.1,000 దాకా సంపాదిస్తాం. దాదాపుగా రెండు నెలల పాటు పనులు చేసి తిరిగివెళ్తాం. కుటుంబ పోషణ చూసుకుని మరో సారి వస్తాం. ఇలా సంవత్సరానికి రెండు మూడుసార్లు వస్తాం. ఇక్కడ పనులకు కొరతలేదు. – దాలీమ్షేక్, పశ్చిమబెంగాల్మూడు నెలలు ఇక్కడే మా రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లో సరైన ఉపాధి అవకాశాలు లేవు. ఏడాదిలో ఒక సీజన్లో కూడా పని దొరకదు. సాగు అంతంత మాత్రమే. అందుకే మేమంతా తెలంగాణకు వస్తున్నాం. ఇక్కడ మాకు కూలి గిట్టుబాటు అవుతుంది. ఏడాదిలో మూడు నెలలు ఇక్కడే ఉంటాం ధాన్యం ఎత్తడం, దించడం వంటి హమాలీ కూలి పని చేస్తాం. ఉప్పరి మేస్త్రీ పనికి వెళ్తాం. – మహబూబ్ ఆలమ్, ఛత్తీస్గఢ్ఇక్కడ ఉపాధికి కొదవలేదు ఇక్కడ ఉపాధికి కొదవ లేదు. మహారాష్ట్ర నుంచి వచ్చాం. రెండు నెలలు ఇక్కడ పని చేసుకుంటాం. రోజుకు ఖర్చులు పోను రూ.500 సంపాదిస్తాం. హమాలీ, మేస్త్రీ, ఇతర పనులు చేస్తాం. పనులు పూర్తి అయిన తర్వాత వెళ్లిపోతాం. మాకు భోజనానికి బియ్యం, ఉండటానికి ఇళ్లు, తాగునీరు, వైద్య సౌకర్యం, వసతులు పని ఇచ్చే వారే చూసుకుంటారు. ఉమ్మడి స్నేహితులతో కలిసి వస్తాం పనిచేసి డబ్బు సంపాదించుకుంటాం. – అన్వర్, మహారాష్ట్రరోజుకు రూ.1,000 సంపాదిస్తున్న జీవనోపాధి కోసం ఒడిశా నుంచి యాదగిరిగుట్టకు వచ్చాం. దాదాపు సంవత్సరం అవుతోంది. ఇక్కడ బిర్యానీ హోటల్లో పనిచేస్తూ బతుకుతున్నాను. రోజుకి రూ.1,000 సంపాదిస్తున్నాను. ప్రస్తుతం అయితే డబ్బుల కోసం కష్టపడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను.– జాకీర్, ఒడిశాఇక్కడే ఆరు నెలలు ఉపాధి మా రాష్ట్రంలో పనులు దొరకవు. తెలంగాణలో పంటలు బాగా పండుతున్నాయి. జిల్లాకు ఏటా వచ్చి రైసు మిల్లులో పనిచేస్తా. ఆరేడు నెలలపాటు ఇక్కడే ఉంటా. వారానికోసారి సేటు పైసలు ఇస్తరు. నా ఖర్చులకు ఉంచుకొని మిగిలినవి ఇంటికి పంపిస్తాను. ఇక్కడా బాగా వుంది. – బాబులాల్, బిహార్ -
యాదగిరి క్షేత్రానికి పెరిగిన భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో జంట నగరాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో వస్తున్నారు.దీంతో శ్రీ స్వామివారి ధర్మ దర్శనానికి రెండున్నర గంటలు పడుతుండగా.. రూ. 150 టిక్కెటగ విఐపి దర్శనానికి 45 నిమిషాల మేర టైం పడుతున్నట్లు భక్తులు చెబుతున్నారు. భక్తులు అధికంగా శ్రీ స్వామివారి సుదర్శన నారసింహ హోమం, నిత్య కళ్యాణం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో పాల్గొంటున్నారు. కొండపైనే ఉన్న శ్రీ పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. -
యాదగిరిగుట్టలో డ్రగ్స్ కలకలం
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్టలో డ్రగ్స్ కలకలం రేపాయి. మండలంలోని రామాజీపేట యాదాద్రి లైఫ్ సైన్సెస్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీగా డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా భువనగిరి మండలం గూడూరు టోల్ గేట్ వద్ద పోలీసులకు డ్రగ్స్ ముఠా సభ్యులు పట్టుబడ్డారు. గతకొంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా ఎఫిడ్రవిన్ తయారీ చేస్తున్నట్లు సమాచారం. యాదగిరిగుట్ట కేంద్రంగా తయారు చేస్తున్న ఈ డ్రగ్స్‌ను హైదరాబాద్, ముంబై తరలిస్తున్నారురూ.24 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం: డీసీపీరూ.24 కోట్ల విలువ చేసే 120 కేజీల నిషేధిత ఎఫిడ్రవిన్ మెఫెడ్రోన్ సింథటిక్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ రాజేష్ చంద్ర వెల్లడించారు. కొంతకాలంగా మూతపడిన యాదాద్రి లైఫ్ సైన్స్ కెమికల్ పరిశ్రమ అడ్డాగా చేసుకుని ముఠా డ్రగ్స్‌ను తయారు చేస్తుందని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు.నేతి కృష్ణారెడ్డి, ఫైజాన్ అహ్మద్ (ముంబై), చెపురి సునీల్ (డైవర్)లను అరెస్ట్ చేశామని మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. రెండు కార్లు, నాలుగు మొబైల్స్ సీజ్ చేసినట్లు డీసీపీ తెలిపారు. -
తెలంగాణ అన్నవరం.. యాదగిరిగుట్ట
సత్యనారాయణస్వామి వ్రతాలకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం.. తెలంగాణ అన్నవరంగా ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం క్షేత్రం తర్వాత.. ఆ స్థాయిలో యాదగిరిగుట్టలోనే వ్రతాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏటా లక్షకు పైనే వ్రతాలు నిర్వహిస్తుండటం విశేషం. కార్తీకమాసం, శ్రావణమాసంలో వ్రతాలు ఆచరించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వ్రత పూజల కోసం కొండ దిగువన అధునాతన మండపం నిర్మించారు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా దేవస్థానం సౌకర్యాలు కల్పిస్తుండడంతో ఏటేటా వ్రతాల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ మంచే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు పలు రాష్ట్రాల భక్తులు వచ్చి వ్రత పూజలు చేస్తున్నారు. – సాక్షి, యాదాద్రిరోజూ అయిదు బ్యాచ్‌లుగా వ్రతాలుయాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులు సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించుకునేందుకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కొండ దిగువన వ్రత మండపంలో శ్రీస్వామి ఫొటోతో కూడిన పీటలు ఏర్పాటు చేశారు. టికెట్‌పై భక్తులకు పూజా సామగ్రిని దేవస్థానం అందజేస్తుంది. రోజూ ఐదు బ్యాచ్‌ల్లో వ్రతాలు జరుగుతున్నాయి. కార్తీకపౌర్ణమి వంటి ప్రత్యేక రోజుల్లో 700 జంటలు వ్రతాలు ఆచరించేలా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. వ్రత సమయాలను వివరిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. వ్రతాలు జరుగుతున్న సమ యంలో భక్తుల కుటుంబసభ్యులు.. మండపం బయట నీడలో కూర్చునేందుకు ప్రత్యేకంగా జర్మనీ టెంట్ ఏర్పాటు చేశారు. వ్రతాల అనంతరం కొండపై ప్రసాదాల కొనుగోలుకు ఇబ్బంది కలగకుండా.. వ్రత మండపం పక్కనే ప్రత్యేక ప్రసాదం కౌంటర్ ఏర్పాటు చేశారు. కార్తీక దీపాలు వెలిగించేందుకు ఏర్పాట్లు చేశారు. వ్రతాలు పూర్తికాగానే వ్రత మండపం హాళ్లను పారిశుధ్య సిబ్బందితో శుభ్రం చేయిస్తున్నారు. భక్తుల వాహనాలకు హెలిపాడ్ స్థలంలో పార్కింగ్ సౌకర్యం కల్పించారు.ప్రత్యేక ప్రసాదాల కౌంటర్కార్తీకమాసంలో యాదగిరిగుట్ట క్షేత్రంలో పెద్ద సంఖ్యలో వ్రతాలు జరుగుతాయి. భక్తు లకు ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేశాం. ఈసారి కార్తీకమాసం మొదలైనప్పటి నుంచి ఆదివారం వరకు 16 వేల వ్రతాలు జరిగాయి. కార్తీక మాసం చివరి వరకు భక్తులు వస్తూ వ్రతాలు ఆచరిస్తుంటారు. భక్తులు ఇబ్బంది పడకుండా వ్రత మండపం వద్ద ప్రత్యేకంగా ప్రసాదం కౌంటర్ ఏర్పాటు చేశాం. – భాస్కర్‌రావు, ఈవో, యాదగిరిగుట్ట దేవస్థానం సకల శుభాలు కలుగుతాయిశ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం వల్ల సకల శుభాలు కలుగుతాయి. కొన్ని వందల సంవత్సరాల నుంచి శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో భక్తులు వ్రతాలు చేస్తున్నారు. కార్తీకమాసంలో వ్రతాలు చేసేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఇక్కడ శివకేశవులు కొలువై ఉన్నారు. కార్తీకమాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనది. – నర్సింహమూర్తి, దేవస్థానం అర్చకుడువ్రతం చేయిస్తే పుణ్యం నా తల్లిదండ్రులతో కలి సి వ్రత పూజకు వస్తాను. ప్రతి కార్తీక మాసంలో, వీలైనప్పుడు యాద గిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆ లయంలో వ్రతం చేయించి మొక్కులు తీర్చుకుంటాం. ఈసారి కూడా కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి వ్రతం చేశాం. – స్వర్ణలత, బాలానగర్పదేళ్లుగా వ్రతం చేస్తున్నాంయాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి అలయంలో వ్రత పూజ చేస్తే మంచి జరుగుతుందని భావించి ప్రతి కార్తీక మాసంలో ఆలయానికి వస్తాం. కార్తీక మాసంలోనే మా వివాహ వార్షికోత్సవం కావడంతో కలిసి వస్తోంది. వ్రత పూజ చేసిన తరువాత శివుడిని, లక్ష్మీనరసింహస్వామి వారిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకుంటాం. – వందనపు కరుణశ్రీ, సంస్థాన్ నారాయణపురం. -
యాదగిరిగుట్టపై రాత్రి నిద్ర
సాక్షి, యాదాద్రి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాదిరిగానే యాదగిరిగుట్ట దేవాలయా నికి బోర్డును ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఆగమశాస్త్రా న్ని అనుసరిస్తూనే, భక్తుల మనోభావాలు దెబ్బతి నకుండా ప్రతిపాదనలతో సమగ్ర నివేదిక రూపొందించాలని సూచించారు. ముఖ్యంగా యాదగిరి గుట్టపై ఒకరోజు నిద్ర చేయాలనే భక్తులకు ఆచారా నికి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం తన పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని పూజలు చేశారు.అనంతరం యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధిపై యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వైటీడీఏ) అధికారులు, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్అండ్బీ, దేవాదాయ, ఇంజనీరింగ్ శాఖల సీనియర్ అధికారులు, భువనగిరి జిల్లా కలెక్టర్‌తో ప్రెసిడెన్షియల్ సూట్లో సమీక్షించారు. ఆలయానికి సంబంధించి చేపట్టిన పనులు, ఇంకా పెండింగ్‌లో ఉన్న పనులు, చెల్లింపులు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.ఆలయ పనుల్లో లోపాలుంటే సరిదిద్దండి..యాదగిరిగుట్టకు తిరుపతి తరహాలో ఒక బోర్డును ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. యాదగిరి గుట్టకు సంబంధించిన టెంపుల్ కమిటీ, ఇతర కమిటీలను పునర్నిర్మించాలన్నారు. ఈ నెల 15లో గా ఆలయానికి సంబంధించిన మరికొన్ని అంశాలతో సమీక్షకు రావాలని అధికారులకు సూచించారు. ఆలయ మాడ వీధులు తరచూ పగుళ్లు రావ డం, కుంగడానికి కారణమేమిటని ఆరా తీశారు. కోతులు ఆయా చోట్ల బండలను తొలగిస్తున్నాయని అధికారులు వివరించారు. దీనితో ఆర్అండ్బీ, దేవాదాయ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్‌లు వెంటనే ఆల యాన్ని తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు.తాను మరోసారి ఆలయాన్ని తనిఖీ చేస్తానని, ఎక్కడైనా లోపాలు ఉంటే సరిచేయాలని సూచించారు. ఆలయ భూసేకరణకు సంబంధించి అన్ని కేసులను క్లియర్ చేయాలని.. రైతుల నుంచి వైటీడీఏ సేకరించిన భూములను ఎవరికీ తిరిగిచ్చే ది లేదని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న 101 ఎక రాలకు సంబంధించిన సుమారు రూ.70 కోట్ల పరి హారాన్ని చెల్లించేయాలని ఆర్థిక శాఖ కార్యద ర్శిని ఆదేశించారు. గోసంరక్షణకు పాలసీని ప్రత్యేకంగా రూపొందించాలని.. బెస్ట్ మోడల్ గోశాలగా అభి వృద్ధి చేయాలని అధికారులకు సీఎం సూచించారు.పలు అంశాలపై ప్రజెంటేషన్లు..ఆలయ దివ్యవిమాన గోపురం బంగారు తాపడం పనుల్లో భాగంగా.. చెన్నై స్మార్ట్ క్రియేషన్స్ సంస్థ తయారు చేసిన బంగారు తాపడం శాంపిల్ రేకు లను సీఎం రేవంత్ పరిశీలించి బాగున్నాయన్నారు. ఇక వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధికి చేపట్టిన పనులు, పెండింగ్‌లో ఉన్నవి, వ్యయం, భవిష్యత్ ప్రణాళికలు, తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.విమాన గోపురానికి బంగారు తాపడం, వేద పాఠశాల నిర్మాణం వంటి అంశాలపై దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఇక జిల్లా మెడికల్ కళాశాలకు మరికొంత స్థలం కావాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ఆ మెడికల్ కాలేజీని దేవాలయ పరిధిలోకి తీసుకొచ్చేలా ప్రణాళిక రూపొందించాలని, దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.యాదాద్రికి బదులు యాదగిరిగుట్టనే..ఆలయానికి సంబంధించిన అన్ని అంశాల్లో యాదాద్రి స్థానంలో యాదగిరిగుట్ట అని కనిపించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇక నుంచి ఆన్లైన్, ఆఫ్‌లైన్ ఉత్తర ప్రత్యుత్తరాలు, ఆలయానికి సంబంధించిన టికెట్లు, మిగతా అన్నింటిపై యాదగిరి గుట్ట అనే పదాన్ని వాడాలన్నారు. కాటేజీల నిర్మాణానికి దాతల సహకారం తీసుకోవాలని సూచించారు. -
యాదాద్రి పేరు మార్పు..రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
-
యాదాద్రిలో కార్తీక మాసోత్సవాలు.. ప్రతిరోజూ సత్యనారాయణస్వామి వ్రతాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో వచ్చే నెల 2వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో భాస్కర్‌రావు తెలిపారు. మంగళవారం యాదాద్రి ఆలయ సన్నిధిలోని తన చాంబర్లో ఆయన మాట్లాడారు. కార్తీక మాసం సందర్భంగా యాదాద్రి క్షేత్రానికి భక్తులు అధికంగా రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. శ్రీస్వామిని దర్శించుకోవడంతో పాటు ఆలయంలో శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందని, ఈమేరకు కొండ కింద వ్రత మండపంలో డిసెంబర్ 1వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆరు బ్యాచ్‌లుగా వ్రతాల నిర్వహణ ఉంటుందన్నారు.వచ్చే నెల 15వ తేదీన ఉదయం 5.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 8 బ్యాచ్‌లుగా వ్రతాలు నిర్వహిస్తామని చెప్పారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలో నెల రోజులపాటు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 5 బ్యాచ్‌లు, కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు 6 బ్యాచ్‌లుగా వ్రతాలు జరుగుతాయన్నారు. అదేవిధంగా 15వ తేదీన ప్రధానాలయం, శివాలయంలో రాత్రి 6.30 గంటలకు ఆకాశ దీపారాధన ఉంటుందని తెలిపారు. చదవండి: పోటెత్తిన రద్దీ.. దీపావళికి సొంతూరి బాటలో జనంఈ నెల 31న దీపావళిని పురస్కరించుకుని ఆలయ నిత్య కైంకర్య వేళల్లో మార్పులు చేశామని చెప్పారు. వేకువజామున 3.30 గంటలకు సుప్రభాతం ప్రారంభమవుతుందన్నారు. 4.15 గంటల నుంచి 4.45 వరకు శ్రీస్వామి అమ్మవార్లకు మంగళహారతుల పూజ జరుగుతుందని, ఉదయం 8.15 గంటల నుంచి సర్వ దర్శనాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. -
రూ.6,66,66,666.66 తో అమ్మవారికి అలంకరణ.. చూపు తిప్పుకోలేరు!
స్టేషన్ మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం బ్రాహ్మణవాడి శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారిని మహాలక్ష్మి దేవి రూపంలో అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారిని రూ.6,66,66,666.66 కరెన్సీ నోట్లతో అలంకరించి పూజలు చేశారు. తమిళనాడు నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణులు అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు.మహాలక్ష్మి దేవి రూపంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆరు కోట్ల రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించిన అమ్మవారిని, పూజా మండపాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి విచ్చేశారు.యాదగిరిగుట్ట కిటకిటయాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు కావడంతో వివిధ ప్రాంతాల భక్తులు శ్రీస్వామిని దర్శించుకునేందుకు అధికంగా తరలి వచ్చారు. ధర్మ దర్శనానికి సుమారు 3 గంటలు, వీఐపీ దర్శనానికి గంటకు పైగా సమయం పట్టిందని భక్తులు తెలిపారు. శ్రీస్వామి వారిని సుమారు 35 వేల మందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో శ్రీవారికి నిత్యాదాయం రూ.32,50,448 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. -
యాదాద్రి రాజగోపురానికి బంగారు తాపడం
సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ రాజగోపురం బంగారు తాపడం పనులకు మోక్షం కలగనుంది. సుమారు 60 కేజీల బంగారంతో తాపడం పనులను చేపట్టనున్నారు. వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాలని సంకల్పించారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, దేవాదాయ శాఖమంత్రి కొండా సురేఖ, ఉన్నతస్థాయి అధికారులు జరిపిన సమీక్షా సమావేశాల్లో యాదాద్రి ఆలయ రాజగోపురానికి బంగారు తాపడంపై చర్చించిన విషయం తెలిసిందే. బంగారు తాపడం పనులను దాతలు ఇచ్చిన విరాళాలు, దేవస్థానం నిధులతో చేయనున్నారు. ఇప్పటికే దాతలు ఇచ్చిన నగదు సుమారు రూ.25 కోట్లు నగదు, 11 కిలోల బంగారం దేవస్థానం వద్ద ఉంది. దేవస్థానం హుండీలో భక్తులు సమర్పించిన బంగారం, వెండిని మింట్‌కు పంపించి ప్యూర్ గోల్డ్ (24 క్యారెట్లు)గా మార్చనున్నారు.అయితే భక్తులు సమర్పించిన మిశ్రమ బంగారాన్ని ప్యూర్ గోల్డ్‌గా మార్చడం, వెండి ఆభరణాలను కరిగించి అందుకు సమానమైన సుమారు 25 కిలోల బంగారాన్ని మింట్ ద్వారా తీసుకోనున్నారు. రాజగోపురానికి 10,500 చదరపు అడుగుల మేరకు బంగారు తాపడం పనులకు అంచనా వేశారు. పనులు చేయడానికి రూ.6 కోట్లు మేకింగ్ చార్జీలు అవసరం అవుతాయని అంచనా వేశారు. గ్లోబల్ టెండర్ల ద్వారా బంగారు తాపడం తయారు పనులను అప్పగించనున్నారు. సీఎం ఆమోదం పొందగానే పనులు: ఆలయ ఈవో భాస్కర్‌రావు బంగారు తాపడం పనుల ఆమోదం ఫైలు సీఎంవోలో ఉంది. దేవాదాయ శాఖ నుంచి సీఎంకు ఫైల్ పంపించారు. సీఎం ఆమోదం లభించగానే పనులు ప్రారంభిస్తాం. స్వర్ణ తాపడం పనుల కోసం అవసరమైన ఖర్చును దేవస్థానం భరిస్తుంది. -
గుడిలో ప్రశాంతంగా అనసూయ..(ఫొటోలు)
-
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు యువతి దుర్మరణం
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ యువతి మృతిచెందింది. ఈ ఘటన న్యూయార్క్ నగరంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మృతురాలిని యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట సమీపంలోని యాదగిరిపల్లెకు చెందిన గుంటిపల్లి సౌమ్యగా(25) గుర్తించారు.గుంటిపల్లి సౌమ్య ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. అక్కడ అట్లాంటిక్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతోంది. చదువుతోపాటు పార్ట్‌టైమ్ జాబ్ కూడా చేస్తోంది. ఈ క్రంమలో ఆదివారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా అతివేగంగా వచ్చిన కారు ఆమెను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సౌమ్య మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో యాదగిరిపల్లి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
నేను ఎవరికీ తలవంచేవాణ్ణి కాదు
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి ఆశీస్సులతో సాధించిన పేదల ఇళ్ల విషయంలో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆశీర్వచనం తీసుకోవడంలో భాగంగా కావాలనే తాను కింద కూర్చున్నానని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. పేదల ఇళ్ల కల నిజం కావడంతో ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం కోసమే తాను ఆలయంలో చిన్న పీట మీద కూర్చున్నట్టు వెల్లడించారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆయన మంగళవారం హైదరాబాద్‌లోని ఎంబీటీ నగర్లో సింగరేణి అతిథి గృహం నిర్మాణానికి శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ యాదగిరిగుట్ట ఆలయంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక పూజల్లో తాను కింద కూర్చొ ని ఉండగా, సీఎం, ఇతర మంత్రులు కుర్చిల్లో కూర్చుని ఉండటంపై చెలరేగిన వివాదంపై వివరణ ఇచ్చారు. తమ కోరికలను మన్నించి ఆశీర్వదించి అవకాశం ఇచ్చిన నరసింహ స్వామికి మొక్కు చెల్లించుకుంటూ నిండు మనసుతో తమను ఆశీర్వదించాలని కోరుకున్నట్టు చెప్పారు. దురదృష్టవశాత్తు కొందరు ఆ ఫొటో తీసుకుని ట్రోల్ చేశారన్నారు. ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తున్నానని, ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ, ప్రణాళిక శాఖలను నిర్వహిస్తూ రాష్ట్రంలో తీసుకునే అనేక ప్రణాళికలు, విధానపరమైన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నానని వెల్లడించారు. ‘నేను ఎవరికో తలవంచే వాడిని కాదు. ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునేవాడిని అంతకన్నా కాదు. ఆత్మగౌరవాన్ని చంపుకునే వ్యక్తిని కాదు. మిత్రులు ఎవరైనా మానసిక క్షోభకు గురైతే అర్థం చేసుకోవాలి’అని అన్నారు. పాదయాత్రలోనే గుట్టలో మొక్కుకున్నా... ‘నేను పాదయాద్ర చేసినప్పుడు మార్గమాధ్యంలో యాదగిరిగుట్టలో స్వామి వారిని దర్శించుకున్నా. రాష్ట్రంలో ప్రజలు అనేక బాధలు పడుతూ ఉన్నారు. ఇళ్లు లేని పేదలు, ఉద్యోగాలు లేని యువతీయువకులు.. వారాందరి బాధలు విన్న తర్వాత ఏదో ఒక విధంగా ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చేలా ఆశీర్వదించి పంపించు అని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకున్నా..’అని భట్టి తెలిపారు. దుర్మార్గపు ప్రభుత్వాన్ని వదిలించుకుని, ఇళ్లు ఇచ్చే ఇందిరమ్మ రాజ్యాన్ని తేవాలని ప్రజలు తనను కోరారన్నారు. అందుకే అప్పట్లో స్వామి వారిని మొక్కు కోరుకున్నట్టు తెలిపారు. సింగరేణి ఏరియాలో జీవో 76 ప్రకారం 2006లో దాదాపు 23 వేల మందికి ఇళ్ల స్థలాలను ఇచ్చామని, వాటిలో కట్టుకున్న ఇళ్లను క్రమబద్ధీకరిస్తామని ప్రకటించారు. సింగరేణి, జెన్కోలో స్థలాల్లోని ఇళ్లను క్రమబద్ధీకరిస్తామన్నారు. మరో 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలు సింగరేణి సంస్థలో ఇప్పటికే 489 కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయగా, మరో 1,352 కొలువుల భర్తీకి త్వరలో ప్రకటన వస్తుందని భట్టి విక్రమార్క ప్రకటించారు. సింగరేణి పరిధిలోని నాలుగు ఉమ్మడి జిల్లాల అభ్యర్థుల స్థానికత విషయంలో వచ్చిన సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పారు. సింగరేణి ఆధ్వర్యంలో జైపూర్‌లో 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలుండగా, కొత్తగా అక్కడ 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ను సంస్థ నిర్మిస్తుందన్నారు. కాలం చెల్లిన 62.5 మెగావాట్ల రామగుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం స్థానంలో మరో 800 థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నామని, ఈ స్థలాన్ని జెన్కో నుంచి సింగరేణికి బదిలీ చేస్తామని తెలిపారు. -
లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న రేవంత్
సాక్షి, యాదాద్రి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. సీఎం హోదాలో తొలిసారి యాదగిరిగుట్టకు వచ్చిన ఆయన.. సోమవారం నారసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో సతీమణి గీతారెడ్డితో కలసి తొలిపూజలో పాల్గొన్నా రు. తొలుత తూర్పు త్రితల రాజగోపురం వద్ద సీఎం, ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దీపజ్యోతి వద్ద సీఎం జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీస్వామి, అమ్మవార్లకు పట్టువ్రస్తాలను సమర్పించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు. సీఎం వెంట పూజల్లో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్, వేముల వీరేశం, మందుల సామెలు తదితరులు పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో యాదగిరిగుట్టకు వచ్చిన సీఎం.. 12 గంటలకు భద్రాచలం వెళ్లారు. స్వర్ణ తాపడం పూర్తి చేయించండి యాదగిరిగుట్టకు వచ్చిన సీఎం రేవంత్‌ను ప్రధానాలయ దివ్య విమాన గోపురానికి స్వర్ణ తాపడం పనులు పూర్తి చేయించాలని ఆలయ ఈవో రామకృష్ణారావు కోరారు. కొంత బంగారంతో ధ్వజస్తంభం బంగారు తాపడం చేయించామని తెలిపారు. నారసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం యాదగిరిగుట్ట ఆలయంలో బ్రహ్మోత్సవాలు సోమ వారం పంచరాత్ర ఆగమం ప్రకారం ప్రారంభమయ్యాయి. తొలిరోజున ఉదయం నిత్యారాధనల అనంతరం శ్రీవిష్వక్సేన ఆరాధనతో ఉత్సవాలను మొదలుపెట్టారు. స్వస్తి వచనం, రక్షాబంధన కార్యక్రమాలు, పారాయణలు నిర్వహించారు. ప్రొటోకాల్ వివాదం సీఎం పర్యటన సందర్భంగా ప్రొటోకాల్ వివాదం తలెత్తింది. దేవస్థానం అధికారులు సీఎంకు ఆశీర్వచనం ఇచ్చే సమయంలో డిప్యూటీ సీఎంకు.. మంత్రులకు వేసిన పీటల కంటే చిన్నపీట వేయడం వివాదాస్పదమైంది. సీఎం పక్కన ఆయన సతీమణి గీతారెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ సమానమైన ఎత్తు పీటలపై కూర్చున్నారు. దేవాదాయ మంత్రి కొండా సురేఖను ఆశీర్వచనం ఇస్తున్న అర్చకుల వెనుక కూర్చోబెట్టారు. దీనిపై ఆలయ ఈవో రామకృష్ణారావు స్పందిస్తూ, సీఎంతో పాటు మంత్రులందరికీ పీటలు వేశామని, ఇందులో ప్రొటోకాల్ వివాదమేమీ లేదన్నారు. -
గుట్టపైనే అన్ని సేవలు..!
సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్టపైనే అన్ని సేవలు పునరుద్ధరించాలని భక్తజనులు కోరుతున్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా భక్తుల నుంచి వినిపిస్తోంది. గత ప్రభుత్వంలో జరిగిన ఆలయ విస్తరణ, అభివృద్ధితో భక్తులు కోరుకునే మహిమాన్విత పవిత్ర సేవలను కొండపైనుంచి కిందికి తరలించారు. దీంతో పుణ్యక్షేత్రంలో ప్రాశస్త్యం లోపిస్తుందని భక్తులు అంటున్నారు. దీనికి తోడు కొండపైన వసతుల లేమి భక్తులకు ఇబ్బందిగా మారింది. అన్నీ గుట్ట కిందనే...: కొండపైన ఆలయ విస్తరణ, అభివృద్ధికి ముందు యాదగిరిగుట్టలో భక్తులకు అన్ని వసతులు కొండపైనే ఉండేవి. వేలాది మంది భక్తులు ఎంతో దూరం నుంచి వచ్చి అన్ని రకాల సేవలను కొండపైనే పొందేవారు. రాత్రి నిద్ర గుట్టపైనే చేసేవారు. ప్రధానంగా కల్యాణకట్ట(తలనీలాలు సమరి్పంచడం), సత్యనారాయణస్వామి వ్రతాలు, విష్ణుపుష్కరిణి (స్నాన గుండం), రాత్రి నిద్ర చేయడం, అన్నప్రసాద వితరణ సేవలను కొండకిందకు మార్చారు. దీంతో కొండపైన సేవలందకపోవడంతో భక్తి భావం కొరవడిందంటున్నారు. డార్మెటరీ హాల్ నిర్మాణం: కొండపైన గతంలో బాలాలయం ఉన్నచోట డార్మెటరీ హాల్ నిర్మిస్తే రాత్రి నిద్ర చేయవచ్చని భక్తులు కోరుతున్నారు. కొండపైన నిర్మించిన రెండు భవనాల్లో అన్నదానం, సత్యనారాయణస్వామి వ్రతాలు కొనసాగించవచ్చు. కొండపైన మరో చోట కల్యాణ కట్ట ఏర్పాటు చేసి ఎంతో విశి ష్టత కలిగిన విష్ణు పుష్కరిణిలో భక్తుల స్నానాలు చేసేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. యాదాద్రి క్షేత్రంపై అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం భక్తుల మనోభావాలను గౌరవించాలని కోరుతున్నారు. భక్తుల వసతులకు ప్రాధాన్యం ప్రభుత్వం భక్తుల మనోభావాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది. కొండపైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు అధికారులతో సమీక్ష నిర్వహించాం. రూ.20 కోట్లతో డార్మెటరీ భవనం నిర్మించాలని నిర్ణయించాం. కొండపైన వసతులు కల్పిస్తాం. ఆలయ ప్రాశస్త్యం కొనసాగిస్తాం. – బీర్ల అయిలయ్య, ఆలేరు ఎమ్మెల్యే తలనీలాల సమర్పణ కొండపైనే ఉండాలి యాదాద్రి పునరి్నర్మాణం తర్వాత మొదటిసారిగా దర్శించుకున్నాం. పాతగుడి ఉన్నప్పుడు ఒకసారి వచ్చాం, అప్పుడు తలనీలాలు గుడిపైనే తీసేవారు. ఇప్పుడు మాత్రం తలనీలాలను కొండ కింద తీస్తున్నారు. తలనీలాలు అర్పించి కొండపైకి దర్శనానికి రావడానికి ఇబ్బందికరంగా ఉంది. దేవుని కొండపైన తలనీలాలను ఏర్పాటు చేస్తేనే స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఇక్కడ భక్తులకు కావాల్సిన కనీస వసతులు కనబడడం లేదు. బాత్రూమ్లు కూడా సరిగ్గా లేవు. – మేతరి దశరథ, భక్తుడు, నిజామాబాద్ ప్రాంగణంలో నిద్రిస్తే ప్రశాంతత ఉండేది లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి ప్రతి సంవత్సరం వస్తాం. గతంలో దర్శనానికి వచ్చినప్పుడు నారసింహుడి సన్నిధిలో కొండపైన రాత్రి వేళల్లో నిద్రపోయే వాళ్లం. మాకు ఆధ్యాతి్మక భావన కలిగేది. ఇప్పుడు కొత్త గుడి కట్టాక అన్ని వసతులు మార్చేశారు. అసలు కొండపైన నిద్రపోవడానికి అనుమతి లేకుండా పోయింది. కిందనే నిద్రించి పైకి రావడానికి అవస్థలు పడుతున్నాం. అసలే నడవలేని స్థితిలో ఉన్న నాలాంటి వారు కింద బస చేసి, మళ్లీ పైకి రావాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. – ఎస్.బుచ్చమ్మ, భక్తురాలు, హైదరాబాద్ కొండపైనే పుష్కరిణి ఉండాలి గుట్టలో రాత్రి బస చేశాం. ఉదయం ఆలయానికి బస్సులో పోమ్మని చె ప్పారు. బస్సెక్కాక మమ్మల్ని ఆల య బస్టాప్ దగ్గర దింపి గుండంకిందనే ఉంటుందని, అక్కడే స్నానం చేయాలని సూచించారు. దీంతో గుండం వద్దకి వెళ్లి స్నా నాలు చేసి అనంతరం కొండపైకి వెళ్లి దర్శనాలు పూర్తిచేసుకున్నాం. పుష్కరిణి కింద ఉండటంతో చాలా అవస్థలు పడ్డాం. గతంలో మాదిరిగా కొండపైనే పుష్కరిణి ఉంటే అక్కడే స్నానం చేసి, దైవ దర్శనానికి వెళ్తే పుణ్యం దక్కుతుంది. – సత్యనారాయణ. భక్తుడు, శంషాబాద్ -
Yadagirigutta : వైభవంగా సాగుతున్న యాదాద్రి బ్రహ్మోత్సవాలు (ఫోటోలు)
-
Yadagirigutta : జగన్మోహిని అవతారంలో నారసింహుడు (ఫొటోలు)
-
నృసింహస్వామి పెండ్లికొడుకాయెనే..
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం రాత్రి శ్రీస్వామి వారి ఎదుర్కోలు మహోత్సవాన్ని ఆలయ ఆచార్యులు పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించారు. ఉదయం ప్రధానాలయ మాఢ వీధుల్లో శ్రీస్వామివారు జగన్మోహిని అలంకార సేవలో..సాయంత్రం అశ్వవాహనంపై పెండ్లి కొడుకుగా భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీపై అమ్మవారిని ఆలయ మాఢవీధిలో ఊరేగించారు. గజవాహనంపై కల్యాణోత్సవానికి... శ్రీనృసింహస్వామికి లక్ష్మీదేవితో వివాహం చేసేందుకు మూహుర్తాన్ని ఆచార్యులు నిర్ణయించారు. మంగళవారం రాత్రి తుల లగ్నం ముహుర్తంలో 9.30గంటలకు బ్రహ్మోత్సవ మండపంలో శ్రీస్వామి వారు అమ్మవారికి మాంగళ్యధారణ చేయనున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీస్వా మి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. రాష్ట్ర మంత్రులు జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. -
యాదాద్రీశుడికి నిజాం తరపున బంగారు హారం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీస్వామి వారికి నిజాం కుటుంబం తరపున ప్రిన్సెస్ బేగం సాహిబా ఎస్రా బిర్గెన్ బంగారు హారాన్ని వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు ద్వారా అందజేశారు. ఈ హారాన్ని ఆదివారం కిషన్‌రావు ఆలయ ఈవో గీతారెడ్డికి అందజేశారు. శ్రీస్వామి వారి ప్రధానాలయం ప్రారంభమైన తరువాత తొలిసారి జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా రూ.4లక్షల విలువైన 67 గ్రాముల బంగారు హారాన్ని నిజాం కుటుంబం తరపున పంపించారని ఆలయాధికారులు వెల్లడించారు. -
గోవర్ధనగిరిధారిగా శ్రీలక్ష్మీనరసింహస్వామి
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం శ్రీస్వామి వారు గోవర్ధనగిరిధారి అలంకార సేవలో, సాయంత్రం సింహ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధానార్చకుడు నల్లంధీఘల్ లక్ష్మీనరసింహచార్యులు ఆధ్వర్యంలో అర్చక బృందం, పారాయణికులు, రుత్వికులు వేదపారాయణం పఠించారు. -
శ్రీకృష్ణుడి అలంకార సేవలో శ్రీలక్ష్మీనరసింహుడు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం శ్రీస్వామి వారు మురళి చేతబట్టి శ్రీకృష్ణుడి అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం.. పొన్న వాహన సేవలో తిరు మాడ వీధుల్లో ఊరేగారు. ఆచార్యులు తిరు మాడ వీధుల్లో స్వామిని ఊరేగించి, పడమటి రాజగోపురం ముందున్న వేంచేపు మండపంలో అధిష్టించి అలంకార సేవల విశిష్టతలను వివరించారు. సాయంత్రం ఆలయ మాడ వీధిలో వైటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. -
మత్స్యావతారంలో యాదగిరీశుడు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన గురువారం ఉదయం అలంకార సేవలకు శ్రీకారం చుట్టారు. ఆలయంలో ఉదయం నిత్య పూజలు, నిత్య పూర్ణాహుతి, ఆరాధనలు పూర్తయ్యాక.. 9గంటలకు మత్స్యావతార అలంకారంలో సేవోత్సవం నిర్వహించారు. ప్రధానాలయం తిరు మాడ వీధుల్లో ఊరేగించారు. పడమటి రాజగోపురం ముందున్న వేంచేపు మండపం వద్ద శ్రీస్వామి వారి మత్స్యావతార సేవను ప్రారంభించారు. రాత్రి ఆలయంలో నిత్యారాధనలు ముగిశాక 7గంటలకు శేష వాహనంపై శ్రీనారసింహస్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. మత్సా్యవతార, శేష వాహన సేవల విశిష్టతను ఆలయ ప్రధానార్చకుడు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు భక్తులకు వివరించారు. -
యాదాద్రి : మత్స్య అవతారంలో దర్శనమిచ్చిన నరసింహస్వామి (ఫొటోలు)
-
21 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ నెల 21వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు నిర్వహించనున్నారు. యాదాద్రి ప్రధానాలయం ఉద్ఘాటన జరిగిన తరువాత జరుగుతున్న మొదటి బ్రహ్మోత్సవాలు కావడంతో అధికారులు మరింత ఘనంగా నిర్వహించేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికలకు ఆలయ ఆచార్యులతో అధికారులు సోమవారం పూజలు చేయించారు. బ్రహ్మోత్సవాలలో జరిగే పూజా కార్యక్రమాలు ఇవీ.. ►21వ తేదీ ఉదయం 10గంటలకు విష్వక్సేన ఆరాధన, స్వస్తీవాచనం, రక్షాబంధనం, సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోహన జరిపిస్తారు. ►22న ఉదయం 8గంటలకు అగ్నిప్రతిష్ఠ, 11గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 6.30గంటలకు భేరీపూజ, దేవతాహ్వానం, హవనం. ►23న ఉదయం అలంకార, వాహన సేవలకు శ్రీకా రం చుడతారు. ఉదయం 9గంటలకు మత్సా్యవతార అలంకార సేవ, వేదపారాయణం. రాత్రి 7గంటలకు శేష వాహన సేవ ఉంటుంది. ►24న ఉదయం 9గంటలకు వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి 7గంటలకు హంస వాహన సేవ. ►25న ఉదయం 9గంటలకు శ్రీకృష్ణాలంకార సేవ. రాత్రి 7గంటలకు పొన్న వాహన సేవ. ►26న ఉదయం 9గంటలకు గోవర్ధనగిరిధారి అలంకార సేవ, రాత్రి 7గంటలకు సింహ వాహన సేవ. ►27న ఉదయం 9గంటలకు జగన్మోహిని అలంకా ర సేవ. రాత్రి 7గంటలకు అశ్వవాహన సేవ, అ నంతరం శ్రీస్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం. ►28న ఉదయం 9గంటలకు శ్రీరామ అలంకార (హనుమంత వాహనం) సేవ. రాత్రి 8గంటల నుంచి గజవాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం. ►మార్చి 1వ తేదీన ఉదయం 9గంటలకు గరుడ వాహన సేవ. రాత్రి 7గంటల నుంచి దివ్య విమాన రథోత్సవం. ►2వ తేదీన ఉదయం 10.30గంటలకు మహా పూర్ణాహుతి, చక్రతీర్థం. సాయంత్రం 6గంటలకు శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన. ►3వ తేదీన ఉదయం 10గంటలకు శ్రీస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9గంటలకు శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు సమాప్తి అవుతాయి. ఉత్తర మాడవీధిలో కల్యాణం.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ప్రధానాలయ ఉత్తర మాడవీధిలో తిరు కల్యాణ వేడుకను నిర్వహించనున్నట్లు అధికారులు ఆహ్వాన పత్రికలో తెలియజేశారు. ఈ కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు రూ.3,000 చెల్లించి శ్రీస్వామి వారి ఆశీస్సులు పొందాలని అధికారులు కోరుతున్నారు. కల్యాణానికి సీఎం వచ్చే అవకాశం బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 28వ తేదీన రాత్రి శ్రీ స్వామి అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం జరగనుంది. ఈ కల్యాణ వేడుకకు ప్రభుత్వం నుంచి పట్టువస్త్రాలు సమర్పించేందుకు ఆ రోజు ఉదయం సీఎం కేసీఆర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే ఆలయ అధికారులు, అర్చకులు సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక ఇవ్వనున్నారు. -
ఘనంగా నృసింహుడి ఎదుర్కోలు
యాదగిరిగుట్ట: పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీస్వామి, అమ్మవార్లకు గురువారం ఉదయం సింహ వాహనసేవ, రాత్రి ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. ఆలయంలో ఉదయం హవన పూజలు, మూలమంత్ర, మూర్తిమంత్ర అనుష్టానాలు, పారాయణికులతో వేద పారాయణాలు జరిపించిన అనంతరం శ్రీస్వామి, అమ్మవార్లను సింహవాహనం సేవపై తిరువీధుల్లో ఊరేగించారు. సాయంత్రం జరిగిన ఉత్సవంలో శ్రీస్వామి వారిని అశ్వవాహనంపై మేళతాళాలతో ఊరేగించి ఆలయ ముఖ మండపంలో ఎదుర్కోలు వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం శ్రీస్వామి అమ్మవార్ల తిరు కల్యాణ ఉత్సవాన్ని నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. -
యాదాద్రిలో ఘనంగా రథసప్తమి
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం రథసప్తమి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీస్వామి, అమ్మవార్లను సూర్యప్రభ వాహనంపై, సాయంత్రం స్వర్ణ రథంపై ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. యాదాద్రి క్షేత్రంలో రథసప్తమి సందర్భంగా సూర్యప్రభ వాహన సేవను నిర్వహించడం ఇదే తొలిసారి. వేడుకల్లో ఈవో గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ప్రధానార్చకులు లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు, అధికారులు పాల్గొన్నారు. -
కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
యాదగిరిగుట్ట: రాజ్యాంగంపట్ల, కోర్టుల పట్ల గౌరవం లేకుండా జాతీయ జెండాను అవమా నిస్తున్న సీఎం కేసీఆర్ వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట పట్ట ణంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 15 ఆగస్టు, 26 జనవరిని గొప్పగా జరుపుకోవాల్సిన సందర్భంలో కరోనా సాకుతో దూరం పెట్టడం బాధాకరమన్నారు. హైకోర్టు చెప్పిన తరువాత కూడా పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఎగురవేసేందుకు సీఎం కేసీఆర్‌కు మనసు రాకపోవడం దారుణమన్నారు. వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమా వేశాల్లో.. రైతుల ఆత్మహత్యలు, ప్రజా సమస్యలు లేవనెత్తుతానని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలను అరికట్టలేని సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఆత్మహత్యలను అరిక డుతామని, వారికి డబ్బులు ఇచ్చి వస్తున్నారని విమర్శించారు. వీఆర్ఏల సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడాలని కోరుతూ స్థానిక వీఆర్ఏలు ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు వినతిపత్రం అందజేశారు. -
యాదాద్రిలో రథసప్తమి వేడుకలు
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం మొదటిసారిగా రథసప్తమి వేడుకలకు సిద్ధమైంది. ప్రధానా లయం పునఃప్రారంభమైన తర్వాత.. శనివారం రథ సప్తమి రోజు శ్రీస్వామి వారిని ఉదయం సూర్యప్రభ వాహనంలో భక్తుల మధ్య ఊరేగించనున్నట్లు ప్రధానార్చకుడు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు వెల్లడించారు. తొలిసారి నిర్వహిస్తున్న రథ సప్తమి వేడుకకు ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. -
యాదాద్రిలో హైకోర్టు జడ్జి మాధవిదేవి
యాదగిరిగుట్ట: రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ మాధవిదేవి శనివారం కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అర్చకులు, అధికారులు ఆమెకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆమె గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులను దర్శించుకున్నారు. ముఖ మండపంలో ఉత్సవమూర్తుల వద్ద అష్టోత్తరం, సువర్ణ పుష్పార్చన తదితర పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. జస్టిస్ మాధవిదేవికి ఆచార్యులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. -
హైకోర్టు తీర్పు మేరకు ఉద్యోగాలివ్వండి
యాదగిరిగుట్ట: 2008లో డీఎస్సీకి హాజరై ఉద్యోగాల కోసం 13 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నామని డీఎస్సీ 2008 బీఈడీ మెరిట్ క్యాండిడేట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉమామహేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన అభ్యర్ధులకు ఉద్యోగా లు ఇచ్చి న్యాయం చేస్తామని సీఎం కేసీఆర్ గతంలో వరంగల్‌లో జరిగిన సభలో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు వెలువరించినా ప్రభుత్వం సాను కూలంగా నిర్ణయం ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. ప్ర భుత్వం తమను ఆదుకోవాలని కోరుతూ 2008 డీఎస్సీ అభ్య ర్థులు యాదగిరిగుట్ట పట్టణంలో శుక్రవారం ప్రదర్శన, మానవ హారం నిర్వహించారు. అనంతరం మోకా ళ్ళపై యాదాద్రీశుడి ఆలయ మెట్లు ఎక్కి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉమా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పు ను అనుసరించి డీఎస్సీ–2008లో నష్టపోయిన అభ్యర్థులకు శాశ్వత ఉద్యోగాలు ఇచ్చేలా ప్రతి పాదనలు సిద్ధం చేసిందన్నా రు. ఇప్పటికైనా కేసీఆర్ స్పందించాలని విజ్ఞప్తి చేశారు. మానవహారం నిర్వహిస్తున్న డీఎస్సీ అభ్యర్థులు -
యాదాద్రికి భక్తుల తాకిడి
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వరుస సెలవులు రావడంతో జంట నగరాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, లక్ష్మీ పుష్కరిణి, కల్యాణకట్ట, రింగ్ రోడ్డు ప్రాంతాలు కిటకిటలాడాయి. శ్రీస్వామి వారి ధర్మదర్శనానికి మూడున్నర గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. శ్రీస్వామి వారిని 40వేల మంది భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక వివిధ పూజలతో రూ.64,50,178 నిత్యాదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. -
యాదాద్రిలో హైకోర్టు జడ్జి పూజలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని హైకోర్టు జడ్జి వెంకటేశ్వరరెడ్డి, కుటుంబ సభ్యులు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ఆచార్యులు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వా గతం పలికారు. గర్భాలయంలో స్వయంభూ, ప్రతి ష్టా అలంకార మూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రథమ ప్రాకారంలో జరిపించిన శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం తదితర పూజల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. జడ్జికి ఆచార్యులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ ఈవో గీతారెడ్డి లడ్డూ ప్రసాదం అందజేశారు. -
16 నుంచి యాదాద్రిలో ధనుర్మాస ఉత్సవాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో 16వ తేదీ నుంచి వచ్చే నెల 15 వరకు ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ గీతారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల రోజులపాటు రోజూ ఉదయం 4.30 గంటల నుంచి 5.15 గంటల వరకు ఆలయ ముఖ మండపంపైన ఉత్తర భాగంలోని హాల్లో అమ్మవారిని వేంచేపు చేసి తిరుప్పావై కార్యక్రమం జరిపిస్తామని పేర్కొన్నారు. ఉత్సవాల్లో భాగంగా జనవరి 14న రాత్రి 7 గంటలకు గోదా కల్యాణం, 15న ఉదయం 11.30 గంటలకు ఒడి బియ్యం సమర్పణ నిర్వహించనున్నట్లు వివరించారు. -
పున్నమి భవనానికి ఆధ్యాత్మిక హంగులు
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి దేవస్థానంలోని పున్నమి భవనం (హరిత హోటల్) ఆధ్యాత్మిక సొబగులతో త్వరలోనే భక్తులను ఆకర్షించనుంది. దేవస్థానం పునర్నిర్మాణంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు, సూచనల మేరకు ‘రీ ఎలివేషన్’పనులు ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 2001 ఫిబ్రవరి 4న అప్పటి టూరిజం శాఖ మంత్రి పెద్దిరెడ్డి.. పున్నమి గెస్ట్‌హౌజ్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం యాదాద్రీశుడి హుండీ లెక్కింపునకు దీనినే వినియోగిస్తున్నారు. ప్రధానాలయం అభివృద్ధి పనులపై సీఎం కేసీఆర్ పలుమార్లు ఈ హోటల్లోనే సమీక్ష సమావేశాలు నిర్వహించారు. హోటల్‌ను సైతం ఆధ్యాత్మిక రూపాలతో తీర్చిదిద్దాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో గతనెల 18న యాదాద్రి పర్యటనకు వచ్చిన సీఎంఓ ముఖ్య కార్యదర్శి భూపాల్‌రెడ్డి ఇందుకు సంబంధించిన నమూనాలను వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, కలెక్టర్ పమేలా సత్పతి, వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. పలు నమూనాలను సీఎం వద్దకు తీసుకెళ్లారు. సీఎం కేసీఆర్ ఫైనల్ చేసిన నేపథ్యంలో ఈఓ గీతారెడ్డి ఆధ్వర్యంలో ఆచార్యులు, అధికారులు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించి ‘రీ ఎలివేషన్’పనులకు శ్రీకారం చుట్టారు. దీంతోపాటు ఆహ్లాదపరిచే గ్రీనరీ, ల్యాండ్ స్కేపింగ్ గార్డెన్లు, వాటర్ ఫౌంటెయిన్లు ఏర్పాటు చేయనున్నారు. -
యాదాద్రికి పెద్ద ఎత్తున భక్తులు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో పాటు ఏకాదశి కలసి రావడంతో హైదరాబాద్, ఇతర ప్రాంతాలనుంచి భక్తులు స్వామిని దర్శించుకునేందుకు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామి వారి ధర్మదర్శనానికి 4 గంటలు, వీఐపీ దర్శనానికి గంటకుపైగా సమయం పట్టిందని భక్తులు వెల్లడించారు. కాగా, వివిధ పూజల ద్వారా యాదాద్రి దేవస్థానానికి రూ.59,04,585 నిత్య ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. -
50 రోజులు.. 5 వేల కిలోమీటర్లు
యాదగిరిగుట్ట: ఆస్ట్రియా దేశానికి చెందిన ఇంజినీర్ హెన్స్‌పీటర్ ఢిల్లీ నుంచి యాదాద్రి వరకు చేపట్టిన సైకిల్‌యాత్ర ఆదివారం యాదగిరిగుట్ట పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా హెన్స్‌పీటర్ శ్రీభోదనందగిరి గో ఆశ్రమ పీఠాధిపతి బోదనందగిరి స్వామిజీని కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, వంటలు అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. వివిధ ప్రాంతాల ప్రజలను కలిసి వారిగురించి తెలుసుకునేందుకు ఆస్ట్రియా నుంచి సైకిల్ యాత్ర చేపట్టానని వివరించారు. పాకిస్తాన్ సరిహద్దు దగ్గర పరిస్థితులు అనుకూలించకపోవడంతో విమానంలో దుబాయ్ చేరుకొని, అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చినట్లు వెల్లడించారు. ఢిల్లీ నుంచి యాదాద్రికి తిరిగి సైకిల్ యాత్ర ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 50 రోజుల్లో 5 వేల కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించినట్లు వివరించారు. యాదాద్రి క్షేత్రాన్ని మంగళవారం సందర్శించనున్నట్టు తెలిపారు. -
భక్త జన యాదాద్రి
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. కార్తీక మాసంతో పాటు ఆదివారం సెలవు రోజు కావడంతో తెలంగాణలోని నలుమూలల నుంచి, వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి శ్రీస్వామిని దర్శించుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. వీఐపీ దర్శనం కోసం రూ.150 టికెట్ కొనుగోలు చేసిన భక్తులు తూర్పు రాజగోపురం నుంచి పడమటి రాజగోపురం వరకు క్యూకట్టారు. ఈ టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు 2 గంటల సమయం పట్టింది. ఇక ధర్మదర్శనం కోసం మూడు కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి వీరికి 5 గంటలకు పైగా సమయం పట్టింది. శ్రీస్వామి వారిని 50వేల మంది వరకు భక్తులు దర్శించుకున్నారు. ప్రసాదం కొనుగోలు చేయడానికి భక్తులు అధికంగా ఆసక్తి చూపారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరగడంతో పాటు నిత్యాదాయం సైతం రికార్డు స్థాయిలో వచ్చింది. గతంలో ఎన్నడూలేని విధంగా ఒక్క రోజే శ్రీస్వామి వారికి నిత్యాదాయం రూ.1,09,82,446 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. -
యాదాద్రి ఆలయం బంద్
యాదగిరిగుట్ట: సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను మంగళవారం ఉదయం 8.15 నుంచి రాత్రి 8గంటలకు వరకు మూసివేయనున్నారు. మధ్యాహ్నం 2.37 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.19 గంటల వరకు సంపూర్ణ చంద్ర గ్రహణం ఉన్నందున ఆలయ వేళల్లో మార్పులు చేశారు. మంగళవారం వేకువజామున 3 గంటలకు ఆలయాన్ని తెరిచి, సుప్రభాతం తదితర సేవల అనంతరం 6.15 నుంచి 7.30 వరకు ఉభయ దర్శనాలు కల్పించనున్నారు. అనంతరం ద్వార బంధనం చేస్తారు. చంద్రగ్రహణం పూర్తయిన తరువాత రాత్రి 8గంటలకు ఆలయాన్ని తెరచి సంప్రోక్షణ, ప్రాయశ్చిత్త హోమం, నవకలశాభిషేకం, ఆరాధన, అర్చన, నివేదన, చాత్మర చేపట్టి, రాత్రి 10 గంటలకు శయనోత్సవం నిర్వహించి, ద్వార బంధనం చేస్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీస్వామి వారికి అన్నకూటోత్సవాన్ని లాంఛనంగా నిర్వహిస్తారు. చంద్రగ్రహణం సందర్భంగా నిత్య, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం, ఊరేగింపు సేవలు రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే, స్వామి వారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలు, వాహన పూజలు సైతం ఉండవని వెల్లడించారు. ఈ పూజలన్నీ 9వ తేదీన యథావిధిగా కొనసాగుతాయన్నారు. -
యాదాద్రిలో బ్రేక్ దర్శనాలు ప్రారంభం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం ఉదయం 9కి బ్రేక్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. కొండపైన రిసెప్షన్ కార్యాలయంలో ఉద యం 8.30 నుంచే భక్తులు బ్రేక్ దర్శనం కోసం రూ.300 టిక్కెట్‌ను కొనుగోలు చేసి ఉత్తర రాజగోపురం నుంచి ఉత్తర ప్రథమ ప్రాకార మండపంలోకి చేరుకున్నారు. 9గంటల సమయంలో భక్తులను తూర్పు త్రితల రాజగోపురం నుంచి స్వామివారి దర్శనానికి అధికారులు అనుమతిచ్చారు. బ్రేక్ దర్శనాలతో రూ.87,600 ఆదాయం సమకూరింది. 8న ఆలయం మూసివేత నవంబర్ 8న సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదాద్రి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను ఉదయం 8.15 నుంచి రాత్రి 8 వరకు మూసివేయనున్నట్లు ఈఓ గీతారెడ్డి తెలిపారు. రాత్రి 8.గంటలకు ఆలయాన్ని తీసి సంప్రోక్షణ, ప్రాయశ్చిత్త హోమం, నవకలశాభిషేకం, ఆరాధన, అర్చన, నివేదన చేపడతారని వివరించారు. 10 గంటలకు శయనోత్సవం నిర్వహించి, ద్వార బంధనం చేస్తారన్నారు. కార్తీక పౌర్ణ మి సందర్భంగా స్వామి వారికి నిర్వహించే అన్నకూటోత్సవం లాంఛనంగా నిర్వహిస్తా మని తెలిపారు. కాగా చంద్రగ్రహణం సందర్భంగా యాదాద్రీశుడి ఆలయంలో భక్తులచే జరిపించే వివిధ సేవలతో పాటు శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలు, వాహన పూజలు రద్దు చేసినట్లు ఈఓ తెలిపారు. -
31 నుంచి యాదాద్రిలో బ్రేక్ దర్శనాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు, వీఐపీ, వీవీఐపీలకు తిరుపతి తరహాలో దర్శనాలు కల్పించేలా ఆలయ అధికా రులు చర్యలు చేపట్టారు. ఈ నెల 31 నుంచి బ్రేక్ దర్శనాలను అమలు చేయనున్నట్లు ఈవో గీతారెడ్డి శనివారం వెల్లడించారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు బ్రేక్ దర్శనాలు కల్పించనున్నారు. బ్రేక్ దర్శనానికి ఒక్కొక్కరికీ టికెట్ ధర రూ.300గా నిర్ణయించారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు మొదటి దశలో 200, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కొనసాగే బ్రేక్ దర్శనాలకు 200 టికెట్లు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఈ బ్రేక్ దర్శనం టికెట్ కొనుగోలు చేసి ఆయా సమయాల్లో వచ్చిన భక్తులను ఉత్తర రాజగోపురం నుంచి శ్రీస్వామి వారి దర్శనాలకు పంపించనున్నారు. ధర్మ దర్శనం, ప్రత్యేక దర్శనాల నిలుపుదల.. బ్రేక్ దర్శనాలు ఉన్న ఆయా సమయాల్లో ధర్మదర్శ నాలు, ప్రత్యేక దర్శనాలను నిలిపివేయనున్నారు. బ్రేక్ దర్శనాల కోసం సిఫారసు లేఖలు తీసుకువచ్చే భక్తులు కొండపైన రిసెప్షన్ కార్యాలయం (పీఆర్వో)లో ఇచ్చి, అక్కడే రూ.300 టికెట్ కొనుగోలు చేసి ఉత్తర రాజగోపురం వద్దకు రావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. -
25న యాదాద్రి ఆలయం మూసివేత
యాదగిరిగుట్ట: ఈ నెల 25న సూర్యగ్రహణం ఉన్నందున యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ ఈవో గీతారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిత్య కైంకర్యాలు, నివేదన ఉదయం 8.50 గంటల్లోపు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. సాయంత్రం 4.59 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6.28 గంటలకు సమాప్తం అవుతుందని తెలిపారు. దీంతో ఆ రోజు ఉదయం 8.50 గంటల నుంచి 26వ తేదీ 8 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు వెల్లడించారు. తిరిగి మర్నాడు ఉదయం 8 గంటలకు ఆలయాన్ని తెరచి.. సంప్రోక్షణ అనంతరం 10 గంటల నుంచి భక్తులను దైవ దర్శనాలకు అనుమతించనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా నిత్యపూజలు రద్దు చేసినట్టు చెప్పారు. -
యాదగిరి నర్సన్నకు బంగారు సింహాసనం.. విలువెంత?
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మరో బంగారు సింహాసనం వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన భక్తుడు దీన్ని బహూకరించాడు. ముఖ మండపంలోని ఉత్సవమూర్తుల కోసం ఇప్పటికే ఒక బంగారు సింహాసనాన్ని ఓ భక్తుడు అందజేశారు. తాజాగా మరో సింహాసనాన్ని దాత ఇచ్చాడు. ఈ సింహాసనం విలువ ఎంత ఉంటుంది, ఎంత బంగారం పట్టిందనే అంశాలను అధికారులు తెలియనివ్వడం లేదు. ప్రస్తుతం ఈ సింహాసనాన్ని ఆలయ ముఖ మండపంలో భద్రపరిచారు. -
యాదాద్రీశుడి దర్శనానికి 3 గంటలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. దసరా సెలవులు ముగుస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, ప్రసాదం కౌంటర్, క్యూలైన్లు, ఘాట్ రోడ్డు.. ఇలా ఆలయ పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయాయి. ధర్మదర్శనానికి 3 గంటలు, వీఐపీ దర్శనానికి గంటన్నర సమయం పట్టిందని భక్తులు తెలిపారు. రూ.150 టికెట్ దర్శనం క్యూలైన్ సరిగ్గా లేకపోవడంతో భక్తులు అష్టభుజి ప్రాకార మండపంలో బారులు దీరారు. టికెట్ కొనుగోలు కోసం పోటీ పడ్డారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. స్వామి వారిని 22,776 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వివిధ విభాగాల నుంచి నిత్యాదాయం రూ.40,29,719 వచ్చినట్లు వెల్లడించారు. భక్తులు భారీగా తరలిరావడంతో రింగ్‌రోడ్డు, కొండపైన ఘాట్ రోడ్డు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కొండపైన పార్కింగ్ స్థలం కిక్కిరిసిపోవడంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొండ కింద ఏడు ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన పార్కింగ్ పూర్తిగా వాహనాలతో నిండిపోయింది. -
Yadagirigutta: యాదాద్రి ఆలయంలో భక్తుల కోలాహలం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల కోలాహలం నెలకొంది. ఆదివారం కావడంతో జంట నగరాలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కొండ కింద కల్యాణ కట్ట, శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం, లక్ష్మీ పుష్కరిణి ప్రాంతాలతో పాటు కొండపై ప్రసాదం కాంప్లెక్స్, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, ఆలయ పరిసరాల్లో భక్తులు కిటకిటలాడారు. స్వామి వారి ధర్మ దర్శనానికి రెండున్నర గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు వెల్లడించారు. కొండ కింద రింగ్ రోడ్డులో బస్సుల కోసం భక్తులు వేచి చూడాల్సి వచ్చింది. బస్సులు సరైన సమయానికి రాకపోవడంతో పాటు నిండుగా రావడంతో పుష్కరిణి నుంచి కొండ పైకి వెళ్లాల్సిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. మి వారిని 25,219 మంది భక్తులు దర్శించుకోగా, వివిధ పూజలతో రూ.39,44,918 నిత్య ఆదాయం వచ్చింది. ప్రధాన బుకింగ్‌తో రూ.2,78,250, వీఐపీ దర్శనాలతో రూ.4,65,000, ప్రసాద విక్రయంతో రూ.18,04,830, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.5,00,000, సువర్ణ పుష్పర్చనతో రూ.1,91,748, ఇతర పూజలతో రూ.2,87,340 ఆదాయం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. (క్లిక్ చేయండి: వాడిన పూలే.. సువాసనలు వెదజల్లునే..) వాహనాద్రి! యాదాద్రి క్షేత్రానికి ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. తమ వాహనాలను యాదాద్రి కొండకు దిగువన పార్కింగ్ చేశారు. పార్కింగ్ స్థలం పూర్తిగా వాహనాలతో నిండిపోయింది. వీటిని చూస్తే.. ఏదైనా భారీ సభకు వచ్చిన వారి వాహనాల్లా అనిపించింది. – సాక్షి ఫొటోగ్రా ఫర్ యాదాద్రి భువనగిరి -
వాడిన పూలే.. సువాసనలు వెదజల్లునే..
యాదగిరిగుట్ట: తిరుమలలో మాదిరిగానే యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోనూ స్వామి, అమ్మవారికి వినియోగించిన పూలతో అగరుబత్తులను తయారు చేయనున్నారు. ఈ మేరకు యాదగిరిగుట్టలో పరిశ్రమ ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పరిశ్రమ ఏర్పాటుకు లక్నోలోని సెంటర్ ఫర్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ (సీమ్యాప్), సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్స్ కౌన్సిల్(సీఎస్ఐఆర్) సంస్థల సహకారం తీసుకోనున్నారు. ఇటీవల యాదాద్రి ఆలయ అధికారులతో రాష్ట్ర మున్సిపల్ శాఖ, యాదగిరిగుట్ట మున్సిపల్ అధికారులు చర్చించారు. యాదగిరిగుట్ట, ధర్మపురి, వేములవాడలో ఈ తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించి యాదగిరిగుట్టను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. అగరుబత్తుల తయారీకి ఇప్పటికే స్వయం సహాయక సంఘాల సభ్యులకు, సిబ్బందికి శిక్షణనిచ్చారు. యాదగిరిగుట్టలో ప్రస్తుతం శాంపిల్‌గా చేతులతో అగరుబత్తులను తయారు చేస్తున్నారు. తయారీ విధానమిదే.. రోజూ ఆలయంలో వాడిన పూలను మున్సిపల్ సిబ్బంది మహిళా సంఘాల సభ్యులకు అందజేస్తారు. ఈ పూలను వేరుచేసి నీడలో ఆరబెడతారు. అనంతరం ఒక్కోరకం పువ్వులను వేర్వేరుగా యంత్రంలో వేసి పౌడర్ తయారు చేస్తారు. పువ్వు పౌడర్, జిగట్ పౌడర్‌ను కలుపుతారు. దాన్ని సన్నని స్టిక్స్‌కు పెట్టి రోల్ చేస్తారు. ఆరబెట్టాక సువాసన వెదజల్లేలా తులసీపత్రాల నూనెను అగరుబత్తులకు అద్దుతారు. కిలోపువ్వుల పౌడర్‌తో 2,500 అగరుబత్తులు తయారవుతాయి. ప్రస్తుతం ఆలయం నుంచి రోజూ 6 నుంచి 8 కిలోల వరకు పూలు వస్తున్నాయి. పట్టణంలో 2,700 మంది మహిళాస్వయం సహాయక సంఘాల సభ్యులున్నారు. వీరితో అగరుబత్తులు తయారు చేయించి, వారినే సొంతంగా మార్కెటింగ్ చేసుకునేలా వీలు కల్పించనున్నారు. మహిళల ఉపాధికి శిక్షణ వాడిన పూలతో అగరుబత్తుల తయారీకి మహిళాసంఘాల సభ్యులకు మొదటి విడత శిక్షణ పూర్తయింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఈ బాధ్యత తీసుకుంది. – శ్రవణ్ కుమార్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ యాదాద్రి బ్రాండ్ పేరిట అమ్మకాలు పూలతో తయారు చేసిన అగరుబత్తులను భక్తులు స్థానిక దుకాణాల్లో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం. యాదాద్రి బ్రాండ్ పేరుతో అమ్మకాలు చేపడతాం. – ఎరుకల సుధాహేమేందర్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ -
సూర్యాపేట ఎస్పీని సస్పెండ్ చేయాలి
యాదగిరిగుట్ట: సూర్యాపేట బహిరంగసభలో ఆ జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ మంత్రి జగదీశ్‌రెడ్డిని బాహుబలితో పోల్చడంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. ఎస్పీ హోదాలో ఉన్న ఐపీఎస్ అధికారి...జయహో జగదీశ్‌రెడ్డి అనడం సిగ్గుచేటన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో శనివారం విలేకరుల సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ...పోలీస్ దుస్తులకు బదులు గులాబీ చొక్కా వేసుకుని ఆ వ్యాఖ్యలు చేసుంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ఇసుక మాఫియా నడిపిస్తున్నారని, మూడు హత్యానేరం కేసులున్న వ్యక్తిని జయహో అని సంబోధిస్తారా అని మండిపడ్డారు. డీజీపీకి ఏమాత్రం ధైర్యం ఉన్నా ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 48 మంది అదనపు డీజీపీ క్యాడర్ కలిగిన ఐజీలు రిపోర్టింగ్ చేసి డీజీపీ కార్యాలయంలో పోస్టింగ్ లేకుండా ఉన్నారని, వారందరికీ వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నానని కోమటిరెడ్డి అన్నారు. సమైక్యతా వజ్రోత్సవాలకు సైతం మహిళలను రూ.300 ఇచ్చి తరలించారని విమర్శించారు. -
యాదాద్రిలో లడ్డూ ప్రసాదం కోసం తోపులాట..
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తులకు లడ్డూ ప్రసాదం సరిగ్గా అందక ఇబ్బందులు పడ్డారు. ఆదివారం సెలవురోజు కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో స్వామిని దర్శించుకునేందుకు వచ్చారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రసాద కౌంటర్ల వద్ద లడ్డూలు అయిపోవడంతో భక్తులు ఒక్కసారిగా ప్రసాద విక్రయశాలలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. సిబ్బంది తలుపులు మూసేయడంతో అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపైన లడ్డూ తయారీ మెషీన్లో సాంకేతిక లోపం ఏర్పడటంతో పాతగుట్టలో లడ్డూ తయారు చేయిస్తున్నామని.. అక్కడి నుంచి మూడవ ఘాట్ రోడ్డు మీదుగా లడ్డూ ప్రసాదం తీసుకురావడానికి సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. భక్తులు అధికంగా రావడం, భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు చెప్పారు. కాగా, యాదాద్రి కొండపై, ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. చాల మంది కాలినడకన కొండపైకి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. పెద్ద సంఖ్యలో వచ్చిన వాహనాలను సరిగా పార్కింగ్ చేయకపోవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. యాదాద్రికి పోటెత్తిన భక్తులు: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. 40వేల మందికిపైగా భక్తులు స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. స్వామి దర్మదర్శనా నికి 4గంటల సమయం పట్టగా, వీఐపీ దర్శనానికి 2గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. -
యాదాద్రిలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో పాటు శ్రావణమాసం ముగుస్తుండటంతో జంట నగరాలతో పాటు వివిధ రాష్ట్రాలు, జిల్లాల ప్రజలు క్షేత్రానికి అధిక సంఖ్యలో తరలి వ చ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీస్వామి వారి ధర్మదర్శనానికి సుమారు మూడున్నర గంటల సమయం, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. శ్రీస్వామిని 35 వేల మందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. దీంతో వివిధ పూజల ద్వారా శ్రీస్వామి వారికి నిత్య ఆదాయం రూ.47,19,965 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. -
యాదాద్రి నిజాభిషేకంలో హైకోర్టు న్యాయమూర్తి
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ మాసాన్ని పుర స్కరించుకుని ఆదివారం వేకువజామునే ఆలయంలో స్వయంభూ మూర్తులకు నిర్వహించిన నిజాభి షేకంలో పాల్గొన్నారు. అనంతరం గర్భాలయంలోని పంచనారసింహులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జస్టిస్ నందాకు అద్దాల మండపం వద్ద ఆచార్యులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. -
యాదాద్రి మూడో ఘాట్ రోడ్డులో రాకపోకలు
యాదగిరిగుట్ట: యాదాద్రి కొండపైకి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డును మరమ్మతుల కోసం మూసివేయడంతో.. అధికారులు ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలను మూడో ఘా ట్‌రోడ్డు నుంచి మళ్లిస్తున్నారు. కొండపైకి వెళ్లే రోడ్డు మధ్యలో ట్రాఫిక్ పోలీసులు సూచిక బో ర్డులను ఏర్పాటు చేశారు. రెండో ఘాట్ రోడ్డు ను కూడా మరమ్మతుల కోసం ఇప్పటికే మూ సివేశారు. దీంతో ఒకే మార్గంలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. -
యాదాద్రిలో రూ.150 టికెట్‌కు ప్రత్యేక క్యూలైన్లు
యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల్లో అధికంగా రూ.150 ప్రత్యేక టికెట్ దర్శనం ద్వారా వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ప్రత్యేక దర్శనం టికెట్‌పై వెళ్లే భక్తులు అష్టభుజి ప్రాకార మండపం వద్దకు రాగానే టికెట్లు తీసుకుని వెళ్లాల్సి వస్తోంది. ఇదే సమయంలో ధర్మ దర్శనానికి వెళ్లే భక్తులు, ప్రత్యేక దర్శనానికి వెళ్లే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు సోమవారం క్యూలైన్లు, అష్టభుజి ప్రాకార మండపం వద్ద పరిశీలించారు. ప్రత్యేక దర్శనం భక్తులకు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. (క్లిక్: నరసింహుడికి బంగారు సింహాసనం) -
నరసింహుడికి బంగారు సింహాసనం
యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య కల్యాణంలో వినియోగిం చేందుకు బంగారు పూతతో తయారు చేసిన సింహాసనాన్ని న్యూయార్క్‌కు చెందిన దాతలు సామల ఆర్ స్వామి, వీరమణి స్వామి ఆదివారం బహూకరిం చారు. ఈ సందర్భంగా బంగారు పూతతో ఉన్న ఈ సింహాసనానికి ఆలయ ముఖ మండపంలో ఈవో గీతారెడ్డి, ఆలయ ఆచార్యులు పూజలు నిర్వ హించారు. అనంతరం ఉత్సవ మూర్తులను అధిష్టించి పూజించారు. సింహాసనం విలువ రూ.18 లక్షలు ఉంటుందని దాతలు వెల్లడించారు. -
భక్త జనసంద్రంగా యాదగిరిగుట్ట ఆలయం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం భక్త జనసంద్రంగా మారింది. వేసవి సెలవులు పూర్తి అవుతుండటంతో పాటు ఆదివారం సెలవు రోజు కావడంతో జంట నగరాలతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు వివిధ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో శ్రీస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారి ధర్మ దర్శనానికి నాలుగున్నర గంటల సమయం, శీఘ్ర, అతి శీఘ్రదర్శనాలకు సుమారు రెండు గంటల సమయం పట్టింది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని 40 వేలకు పైగా భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రికార్డు స్థాయిలో ఆదాయం.. ప్రధానాలయం ప్రారంభమైన నాటి నుంచి ఆదివా రం రికార్డు స్థాయిలో పూజలతో రూ.50,89,482 ఆ దాయం లభించినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో ప్రధాన బుకింగ్ ద్వారా రూ.4,77,700, వీఐపీ దర్శనం ద్వారా రూ.6,90,000, యాదరుషి నిలయం ద్వారా రూ.1,20,680, ప్రసాద విక్రయం ద్వారా రూ.18,27,900, కొండపైకి వాహనాల ప్రవే శంతో రూ.4,50,000, సువర్ణ పుష్పార్చనతో రూ.1,66,800, పాతగుట్ట ఆలయంతో రూ.75,500, కల్యాణ కట్టతో రూ.76,600, శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలతో రూ.2,00,000 వచ్చినట్లు వివరించారు. -
యాదగిరిగుట్టలో భారీ వర్షం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయమంతా భానుడు తన ప్రతాపాన్ని చూపెట్టడంతో పట్టణ ప్రజలతో పాటు యాదాద్రి క్షేత్రానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం.. ఒక్కసారిగా చల్లబడి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో సుమారు 15 నిమిషాల పాటు భారీ వర్షం కురిసింది. దీంతో యాదాద్రి రింగ్‌రోడ్డులో ఉన్న మొక్కలు నెలకొరిగాయి. కొండపైన క్యూకాంప్లెక్స్‌లోని ఎక్సలేటర్ సమీపంలో స్లాబ్ సీలింగ్ పైనుంచి వర్షం నీళ్ళు లీక్ అవుతున్నాయి. మొదటి ఘాట్ రోడ్డును కలిపేందుకు ఏర్పాటు చేస్తున్న ఫ్లై ఓవర్ వద్ద మట్టి కొట్టుకు పోయింది. మొదటి ఘాట్ రోడ్డు వద్ద వాహనాలు పైకి వెళ్లే దారి సమీపంలో వర్షం నీరు నిలిచిపోవడంతో అక్కడ మరమ్మతులు చేశారు. -
యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఇంటర్, పదోతరగతి పరీక్షలు పూర్తి కావడంతో భక్తులు ఒక్క సారిగా పెరిగారు. 40వేలకు పైగా భక్తులు స్వామి, అమ్మవారిని దర్శించుకోవడంతో ధర్మ దర్శనానికే 4 గంటల సమయం పట్టిం దని భక్తులు తెలిపారు. వివిధ పూజల ద్వారా స్వామి వారికి రూ.45,50,079 ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు వెల్లడించారు. మరోవైపు స్వామివారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి మాధవి దేవి కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం దర్శిం చుకున్నారు. -
యాదాద్రి సన్నిధిలో సుప్రీం న్యాయమూర్తి
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ సతీసమేతంగా శనివారం దర్శించుకున్నారు. తూర్పు రాజగోపురం వద్ద ఆచార్యులు సంప్రదాయబద్ధంగా ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం పంచ నారసింహులను దర్శించుకొని పూజలు జరిపించారు. శ్రీస్వామి వారిని దర్శించుకున్న జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ దంపతులకు ముఖ మండపంలో ఆచార్యులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ ఇన్చార్జి ఈవో రామకృష్ణారావు లడ్డూ ప్రసాదం అందజేశారు. ఆయన వెంట తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ ఉజ్జల్ భూయన్, అశోక్ కుమార్ జైన్ తదితరులు ఉన్నారు. -
దర్శనానికి మూడు గంటల సమయం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో హైదరాబాద్‌తో పాటు వివిధ రాష్ట్రాల ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఉదయం నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. సుమారు 30 వేల మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ధర్మ దర్శనానికి 3 గంటలు, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనాలకు గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. వివిధ పూజల ద్వారా రూ.33,81,486 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. -
యాదాద్రి ఆలయం అద్భుతం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయం అద్భుతంగా ఉందని కంచి కామకోటి మఠం పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. ఆయన గురువారం సాయంత్రం పంచనారసింహుల క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ఆచార్యులు శంకర విజయేంద్ర సరస్వ తి స్వామీజీకి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వయంభువులు, బంగారు ప్రతిష్ట మూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముఖ మండపంలో ఆలయ ఆచార్యులతో పండిత గోష్టి నిర్వహించారు. అధికారులు, సిబ్బందితో ఆలయ నిర్మాణ విశేషాలపై చర్చించారు. -
యాదాద్రిలో కొనసాగుతున్న దిద్దుబాటు పనులు
యాదగిరిగుట్ట: ఇటీవల కురిసిన భారీ వర్షానికి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ పరిసరాలు, క్యూలైన్లు చెల్లాచెదురైన విషయం తెలిసిందే. క్యూలైన్లోని గ్రౌండ్ ఫ్లోర్లో వర్షం నీటితోపాటు చెత్తాచెదారం చేరింది. ప్రత్యేక సిబ్బందితో చెత్తాచెదారం తొలగించడంతోపాటు మట్టిని తీసి పక్కన పోస్తున్నారు. వర్షపునీరు లీకవుతున్న ప్రధానాలయం మండపాలకు మరమ్మతులు చేస్తున్నారు. శిల్పులు వాటర్ క్యూరింగ్ పనులను చేపట్టారు. ఆలయ సన్నిధిలో కుంగిపోయిన స్టోన్ ఫ్లోరింగ్‌ను అధికారులు పరిశీలించి, వాటిని బాగుచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. కొండపైనే గల విష్ణు పుష్కరిణి వద్ద మట్టి అంతా ఒకేచోటకు చేరడంతో దానిని కూడా తొలగిస్తున్నారు. కూలిపోయిన చలువ పందిళ్లను పునరుద్ధరిస్తున్నారు. కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి, రింగ్ రోడ్డు వంటి ప్రాంతాల్లో మరమ్మతులు చేయాల్సిన చోట్లను ఆర్అండ్ బీ అధికారులు పరిశీలిస్తున్నారు. -
యాదగిరిగుట్టలో కుప్పకూలిన భవనం.. నలుగురు మృతి
యాదగిరిగుట్ట: ఓ భవనం బాల్కనీ కుప్పకూలడంతో నలుగురు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు కలసి చదువుకున్న స్నేహితులు కాగా.. మరొకరు ఇంటి యజమాని. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. యాదగిరిగుట్ట పట్టణం శ్రీరాంనగర్‌లోని ఆంధ్రా బ్యాంక్ పక్కన గుండ్లపల్లి దశరథ గౌడ్ (70)కు రెండంతస్తుల భవనం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో సుంచు శ్రీనివాస్ (40) బట్టల దుకాణం, గిరి బ్యాటరీ దుకాణం నిర్వహిస్తున్నారు. సాయంత్రం సుమారు 6.34గంటల సమయంలో దశరథ, గిరి, సుంచు శ్రీనివాస్ చల్ల గాలికి బయట కూర్చున్నారు. ఇదే సమయంలో శ్రీనివాస్ స్నేహితులు సుంగి ఉపేందర్ (40), తంగళపల్లి శ్రీనాథ్ (40) అక్కడికి వచ్చారు. అంతా సరదాగా మాట్లాడుకుంటుండగా ఒక్కసారిగా భవనం మొదటి అంతస్తు బాల్కనీ కుప్పకూలి కిందకూర్చున్న వారిపై పడింది. దశరథగౌడ్, శ్రీనివాస్, శ్రీనాథ్, ఉపేందర్‌లు అక్కడికక్కడే మృతి చెం దగా.. గిరికి తీవ్ర గాయాలయ్యాయి. ఉలిక్కిపడిన ‘గుట్ట’వాసులు బాల్కనీ కుప్పకూలడంతో భారీ శబ్దం వచ్చిం ది. దీంతో చుట్టుపక్కల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఆ సమయంలోనే కరెంట్ పోవడంతో ఏం జరిగిందో తెలుసుకునేందుకు అక్కడ పెద్ద సంఖ్యలో గుమిగూడారు. పోలీసులు కూడా హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. శిథి లాల కింద ఉన్న ఐదుగుర్నీ గమనించారు. అప్పటికే నలుగురు మరణించగా..తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న గిరిని అంబులెన్స్‌లో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద ఉన్న మృతదేహాలను తీసేందుకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్థానిక ప్రజలు జేసీబీ సహాయంతో గంటసేపు తీవ్రంగా శ్రమించారు. 35 ఏళ్ల కిందటి భవనం.. గుండ్లపల్లి దశరథకు చెందిన ఈ భవనం సుమారు 35 ఏళ్ల నాటిదని స్థానికులు చెబుతున్నారు. ఈ భవనానికి మొదట్లో బాల్కనీ లేదు. పదేళ్ల క్రితమే ఏర్పాటు చేయించి, దానిపై పూజ గదిని కూడా నిర్మించారు. అయితే పిల్లర్లు, బీమ్‌లు లేకుండా బాల్కనీ నిర్మించడం వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగే సమయానికి 15 నిమిషాల ముందే దశరథ గౌడ్ భార్య కౌసల్య అక్కడనుంచి బయటకు వెళ్లారు. ఇప్పుడే వస్తానంటూ వెళ్లానని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని కౌసల్య రోదిస్తూ తెలిపారు మరణంలోనూ కలిసే.. శ్రీనివాస్, ఉపేందర్, శ్రీనా«థ్లు కలిసి చదువుకున్నారు. స్థానికంగా ఉంటూ ఎప్పుడూ కలసిమెలసి ఉండేవారు. ఏదైనా సమస్య వచ్చినా కలసి చర్చించుకునే వాళ్లని వారి తోటి స్నేహితులు కన్నీటిపర్యంతమయ్యారు. ప్రమాద స్థలాన్ని ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి పరిశీలించారు. సీఐ జానకిరెడ్డి, ఎస్సై సుధాకర్‌రావులు సహాయక చర్యలు పర్యవేక్షించారు. గవర్నర్ దిగ్భ్రాంతి సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్టలో భవనం బాల్కనీ కుప్పకూలడంపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలిసి తీవ్ర ఆందోళనకు గురుయ్యానని ఒక ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కాగా మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఒక్కో కుటుం బానికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించా లని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. v -
యాదాద్రి ఆలయ ఈవోను తొలగించాలి
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట ప్రధానాలయం పునఃప్రారంభం నుంచి కొండపైకి ఆటోలను అనుమతించకపోవడంతో ఆలయ ఈవోను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం వైకుంఠద్వారం వద్ద ఆటోకార్మికులు కుటుంబాలతో కలసి రాస్తారోకో నిర్వహించారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించిపోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి ఆందోళన విరమించాలని చెప్పగా కార్మికులు అందుకు నిరాకరించారు. ఫైనాన్స్, అప్పులు చేసి ఆటోలు కొనుగోలు చేశామని, ఆటోలను అనుమతించకపోతే సుమారు 300 కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పొట్టమీద కొడుతున్న ఈవోను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ దశలో పోలీసులకు ఆటోకార్మికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుని తోపులాట జరిగింది. దీంతో భక్తులు కొద్దిసేపు ఇబ్బందులకు గురయ్యారు. కొద్దిసేపటి తర్వాత ఆటోకార్మికులు స్వచ్ఛందంగా ఆందోళన విరమించారు. -
రికార్డు స్థాయిలో యాదాద్రీశుడి ఆదాయం
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ప్రధానాలయం మార్చి 28న ప్రారంభమైనప్పటికీ 29వ తేదీ నుంచి భక్తులకు శ్రీస్వామి వారి దర్శనం కల్పించారు. అదే రోజు ఆలయంలో హుండీలను ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు హుండీల్లో సమర్పించుకున్న నగదు, నగలను మంగళవారం ప్రధానాలయంలోని ప్రథమ ప్రాకారంలో ఈవో గీతారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అధికారులు, సిబ్బంది లెక్కించారు. ఈ లెక్కింపులో రూ.1,87,17,937 నగదు సమకూరింది. ఇక మిశ్రమ బంగారం 62 గ్రాములు, మిశ్రమ వెండి 3కిలోల 550 గ్రాములు వచ్చింది. వీటితో పాటు విదేశీ కరెన్సీ డాలర్లు, రియాల్స్ వచ్చాయి. ఇందులో ఆస్ట్రేలియాకు చెందిన 150 డాలర్లు, అమెరికాకు చెందిన 903 డాలర్లు, సౌదీ అరేబియాకు చెందిన 102 రియాల్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చెందిన 10 దీర్హమ్స్, ఖతార్‌కు చెందిన ఒక రియాల్, కెనడాకు చెందిన 25 డాలర్లు, ఇంగ్లాండ్‌కు చెందిన 50 పౌండ్లు వచ్చినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. -
యాదాద్రిలో దర్శనానికి 2 గంటలు
యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో పంచనారసింహులను దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చారు. కొండపైన క్యూ కాంప్లెక్స్ భక్తులతో నిండిపోయింది. దీంతో స్వామి వారి దర్శనానికి సుమారు రెండు గంటలకు పైగా సమయం పట్టింది. 30 వేల మందికి పైగా భక్తులు రావడంతో క్యూలైన్లు నిండుగా కనిపించాయి. -
యాదాద్రి సమాచారం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయాన్ని సోమవారం ఉదయం 4 గంటలకు తెరుస్తారు. విశేష పూజలు: తెల్లవారుజామున 4 గంటల నుంచి వివిధ పూజాధికాలు.. ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మధ్యాహ్న రాజభోగం (ఆరగింపు). మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 వరకు ఆలయం మూసివేత. రాత్రి 7 నుంచి 7.45 వరకు తిరువారాధన. రాత్రి 7.45 నుంచి 8.15 వరకు సహస్రనామార్చన, కుంకుమార్చన. రాత్రి 9–9.30 రాత్రి నివేదన. 9.30–9.45 శయనోత్సవం. ద్వార బంధనం. సర్వ దర్శనాలు: ఉదయం 6–7.30. మళ్లీ 10–11.45. మధ్యాహ్నం 12.30 –3. సాయంత్రం 5–7. రాత్రి 8.15–9. వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉదయం 9 నుంచి 10 వరకు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు. శని, ఆదివారాల్లో బ్రేక్ దర్శనాలు రద్దు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో వీఐపీలకు ఉదయం, సాయంత్రం కల్పించే బ్రేక్ దర్శనాలను శని, ఆదివారాలతో పాటు ప్రభుత్వ సెలవు దినాల్లో రద్దుచేసినట్లు ఈఓ గీతారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సెలవు రోజుల్లో, శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. యాదాద్రికి పోటెత్తిన భక్తులు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ప్రధానాలయంలో స్వయంభూ పంచనారసింహులను ఆదివారం 35 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. ప్రధానాలయం ఉద్ఘాటన జరిగిన తర్వాత వచ్చిన తొలి ఆదివారం కావడంతో భక్తులు ఆలయానికి పోటెత్తారు. పట్టణంలోని బస్టాండ్, శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం, కల్యాణ కట్ట, లక్ష్మీ పుష్కరిణి వద్ద భక్తులు భారీగా కనిపించారు. కొండపైన గల క్యూ కాం ప్లెక్స్, క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. తాగునీరు, మరుగుదొడ్ల వసతులు లేకపోవడంతో భక్తు లు ఇబ్బంది పడ్డారు. స్వామివారి దర్శనానికి సుమారు మూడున్నర గంటలకు పైగా సమయం పట్టింది. -
యాదాద్రిలో స్వల్ప ఉద్రిక్తత
యాదగిరిగుట్ట: యాదాద్రీశుడి ఆలయంలో శనివారం భక్తులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఒకేసారి భక్తుల రద్దీ పెరిగిపోవడంతో ఆలయంలోని వివిధ విభాగాల్లో ఇబ్బందులు తలెత్తాయి. ప్రసాదం కౌంటర్ల వద్ద పురుషులకు, మహిళలకు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులకు, అధికారులకు మధ్య స్వల్ప గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన భక్తులు ప్రసాదం కౌంటర్ల అద్దాలను ధ్వంసం చేశారు. లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేయడానికి వెళ్తే అక్కడ దుస్తులు మార్చుకోవడానికి సరైన ఏర్పాట్లు లేవని భక్తులు ఆవేదన చెందారు. పనిచేయని కంప్యూటర్లు.. భక్తులు ఉచిత దర్శనం టికెట్ పొందేందుకు కొండ కింద కల్యాణ కట్ట వద్ద సీఆర్వో కార్యాలయం వద్దకు వెళ్లగా అక్కడ జియో ట్యాగింగ్ చేయడానికి కంప్యూటర్ మిషన్లు పనిచేయలేదు. భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు వచ్చి జియో ట్యాగింగ్, ఉచిత టికెట్లు లేకుండానే భక్తులను కొండపైకి తరలించారు. స్వామివారి ఆరగింపు సమయంలో, గవర్నర్ వచ్చిన సమయంలో సుమారు 2 గంటల పాటు సాధారణ భక్తుల దర్శనాలను నిలిపివేశారు. క్యూకాంప్లెక్స్‌లో ఏసీలు, ఫ్యాన్లు సరిగ్గా పని చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఉక్కపోతకు గురయ్యారు. దర్శనానికి రెండు గంటల సమయం దైవ దర్శనానికి 20 వేల మంది భక్తులు తరలిరాగా ప్రధానాలయంలో స్వయంభూల దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. శనివారం ఒక్కరోజే యాదాద్రీశుడిని 20వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. కాగా.. వివిధ పూజలతో శ్రీస్వామి వారి ఆలయానికి రూ.14,43,390 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. ఇక ఉదయం నుంచి రాత్రి వరకు శ్రీస్వామి వారికి నిత్య పూజలు విశేషంగా కొనసాగాయి. -
కళ్లారా చూసుకోవద్దా..
సాక్షి, యాదాద్రి: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన భక్తులకు యాదగిరీశుని కనులారా దర్శించుకునే భాగ్యం లేకుండా పోయింది. అంగరంగ వైభవంగా జరిగిన ఉద్ఘాటన అనంతరం యాదాద్రీశుని సంపూర్ణ దర్శనం లభించడం లేదు. తిరుమల తరహాలో బంగారు వాకిలి నుంచే శ్రీ స్వామివారి దర్శనానికి అధికారులు అవకాశం ఇస్తున్నారు. దీంతో ఆరేళ్ల తర్వాత గర్భాలయంలోని స్తంభోద్భవుని దర్శనం కోసం తపిస్తున్న భక్తులు ఇక్కడికి రాగానే నిరాశగా వెనుదిరుగుతున్నారు. గతంలో భక్తులను గర్భాలయంలోకి అనుమతించి దగ్గర నుంచి స్వామి దర్శనం కల్పించే సంప్రదాయం ఉండేది. ఇప్పుడు కూడా గతంలో మాదిరిగానే గర్భాలయంలో స్వామివారిని దర్శించుకునే భాగ్యం కల్పించాలని భక్తులు కోరుతున్నారు. ఆనవాయితీకి విరుద్ధంగా..: యాదగిరిగుట్టలో స్వయంభూ దర్శనం గర్భాలయంలోనే కల్పించడం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ. ఆలయ పునర్నిర్మాణం నేపథ్యంలో ఆరేళ్ల నుంచి బాలాలయంలోనే భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఈనెల 28న మహాకుంభ సంప్రోక్షణతో గర్భాలయం తెరిచిన విషయం తెలిసిందే. ఆలయ పునరుద్ధరణలో భాగంగా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా గర్భాలయం ద్వారాలను కూడా వెడల్పు చేశారు. దీంతో మరింత సులువుగా స్వామివారి దర్శనం లభించే అవకాశం ఉన్నా భక్తులను వాకిలి (గర్భాలయం గడప వద్ద ) నుంచే పంపేస్తున్నారు. భక్తులు ఆలయ నిర్మాణ శైలిని చూసి ఆనందపడుతున్నా.. స్వామి దర్శనం విషయంలో మాత్రం సంతృప్తి చెందడం లేదు. బుధవారం నుంచి ప్రారంభించిన సువర్ణ పుష్పార్చన ముఖ మండపంలోనే ప్రారంభించారు. వృద్ధులు, వికలాంగుల ఇబ్బందులు ప్రధానాలయంలోకి వచ్చే వృద్ధులు, వికలాంగులు, గర్భిణులు, బాలింతలు మెట్లు ఎక్కలేక ఇబ్బందులు పడుతున్నారు. తూర్పు రాజగోపురం నుంచి ఆలయంలోకి మెట్లమార్గాన దిగి దర్శనం అనంతరం పడమర రాజగోపురం వైపు మళ్లీ మెట్లెక్కి వెళ్లడం ఇబ్బందిగా మారింది. అలాగే క్యూలైన్లలో నిలబడేందుకు వసతి లేక ఇబ్బంది పడుతున్నారు. గర్భగుడిలోకి అనుమతించాలి స్వామివారిని దర్శించుకోవడానికి 30 ఏళ్లుగా క్రమం తప్పకుండా వస్తున్నా. అలాగే కొత్త గుడి కట్టిన తర్వాత దర్శనానికి వచ్చా. కానీ అధికారులు బయటి నుంచే పంపించారు. భక్తులను గర్భాలయంలోకి పంపించి స్వామి నిజ దర్శనం కల్పించాలి. ఈ విషయంలో సీఎం మరోసారి ఆలోచించాలి. – మహాలక్ష్మి భక్తురాలు, హైదరాబాద్ త్వరలో అనుమతిస్తాం వేలాదిగా వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం బంగారు వాకిలి నుంచే దర్శనం కల్పిస్తున్నాం. వీలైనంత త్వరలో గర్భగుడిలోకి భక్తులను అనుమతిస్తాం. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులకు అన్ని వసతులు కల్పిస్తాం. – గజ్వెల్లి రమేష్ బాబు, ఆలయ ఏఈఓ -
విద్యుద్దీపాల వెలుగులతో యాదాద్రి క్షేత్రం.. (ఫొటోలు)
-
వైభవంగా పంచ కుండాత్మక యాగం
సాక్షి, యాదాద్రి: భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అద్భుత ఘడియలు రానే వచ్చాయి. యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటన ఘట్టానికి సోమవారం అంకురా ర్పణ జరిగింది. యాదాద్రి ప్రధానాలయ మహా కుంభ సంప్రోక్షణలో భాగంగా వారం రోజుల పాటు జరిగే సప్తాహ్నిక పంచ కుం డాత్మక యాగానికి ఆలయ ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు, మో హనాచార్యులు ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. తొలిరోజు సోమవారం శ్రీస్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం పురస్కరించుకొని పంచారాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం పంచ కుండాత్మక యాగానికి ఉదయం స్వస్తి వాచనం, రాత్రి అంకురార్పణ నిర్వహించి ఆధ్యాత్మిక పర్వాలను ప్రారంభించారు. ప్రధాన ఆలయంలో భగవత్ ఆజ్ఞ తీసుకున్న అనంతరం బాలాలయంలో స్వస్తి వాచనం, విష్వక్సేన పూజ, పుకాహశించనం, రక్షాబంధనం, పంచగవ్య ప్రాశన, ఋట్విగ్వరణం, అఖండ జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు. పంచ కుండాత్మక యాగం పూజలు నిర్వహిస్తున్న ఆచార్యులు గోదావరి జలాలతో స్వామి పాదాలకు అభిషేకం ప్రధానాలయంలో శ్రీపంచారాత్ర ఆగమ శాస్త్రానుసారం ఆలయ ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం పారాయణీకులు అత్యంత వైభవంగా వాస్తుపూజ నిర్వహించారు. అలాగే మల్లన్న సాగర్ నుంచి కాలువ ద్వారా జంగంపల్లికి వచ్చిన గోదావరి జలాలతో శ్రీలక్ష్మీనరసింహస్వామి పాదాలను అభిషేకించారు. ఆటంకాలు కలుగకుండా విష్వక్సేన పూజ బాలాలయంలో నిత్యారాధనల అనంతరం శ్రీస్వామి వారి సప్తాహ్నిక పంచ కుండాత్మక మహా కుంభాభిషేక మహోత్సవములలో భాగంగా సాయంత్రం 6 గంటలకు మృ త్సంగ్రహణం, అంకురారోపణం, యాగశాల ప్రవేశం, కుంభస్థాపన వేడుకలు నిర్వహించారు. మహా కుంభ సంప్రోక్షణ సందర్భంగా ఎలాంటి అటంకాలు కలుగకుండా ఉండేందుకు విష్వక్సేన పూజ నిర్వహిస్తారు. ఉత్సవాలు నిర్విఘ్నంగా, సంపూర్ణంగా కొనసాగేందుకు శ్రీ విష్వక్సేన పూజ శ్రీపంచారాత్రాగమ శాస్త్రానుసారం నిర్వహించారు. లోకకల్యాణం కోసం స్వస్తి వాచనం ఆగమ శాస్త్రానుసారంగా స్వస్తి వాచన మంత్రాలతో వైదిక కార్యక్రమాలు ప్రారంభించారు. విశ్వశాంతి, లోకకల్యాణం కోసం, ఎలాంటి బాధలు లేకుండా ప్రాణ కోటి సుఖసంతోషాలతో జీవించే విధంగా ఆశీర్వదించమని భగవంతుని వేడుకొనే స్వస్తి వాచన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఆలయ ఈవో గీతారెడ్డి, సహాయ కార్య నిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది పాల్గొన్నారు. కాగా ఆలయంలో ఈ కార్యక్రమాల సందర్భంగా అధికారులు మీడియాను లోపలికి అనుమతించలేదు. కొండపైన, యాదగిరిగుట్టలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు శాంతి పాఠం..అగ్నిమథనం యాదాద్రి ఆలయంలో సప్తాహ్నిక పంచకుం డాత్మక యాగం, మహా కుంభ సంప్రోక్షణలో భాగంగా మంగళవారం ఉదయం శాంతి పాఠం, అవధారలు, యాగశాలలో చతుస్థానార్చనలు, ద్వారతోరణ ధ్వజకుం భారాధనలు, అగ్నిమథనం, అగ్ని ప్రతిష్ట, యజ్ఞ ప్రారంభం చేస్తారు. అనంతరం విశేష యజ్ఞ హవనములు, మూలమంత్ర హవనములు, నిత్య లఘు పూర్ణాహుతి జరిపిస్తారు. సాయంత్రం సామూహిక విష్ణుసహస్రనామ పారాయణం, నిత్య విశేష హోమములు, బింబ పరీక్ష, మన్నోమాన శాంతి హోమం, నవకలశ స్నపనం, నిత్య లఘుపూర్ణాహుతి నిర్వహిస్తారు. -
సువర్ణ శోభిత యాదాద్రి
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం పసిడి వర్ణంలో కనువిందు చేయనుంది. ఈ మేరకు వైటీడీఏ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయంలో గర్భాలయ ద్వారం, ఆళ్వార్ మండపంలో ధ్వజస్తంభానికి బంగారు తొడుగులు అమర్చారు. త్రితల, పంచతల, సప్త తల రాజగోపురాలపై స్వర్ణ కల శాలను బిగించారు. ఇక రాత్రి సమయంలో ఆలయమంతా బంగారు వర్ణంలో ధగధగ మెరిసేలా దీపాలు ఏర్పాటు చేశారు. 16 కిలోల బంగారంతో ఆగమశాస్త్రం ప్రకారం అద్భుతంగా గర్భాలయ ద్వారాలను తీర్చిదిద్దారు. 36 రేకుల కమలాలు, 8 తామర పువ్వులను ఈ ద్వారంలో అమర్చారు. దీనికి రెండు వైపులా 14 నృసింహస్వామి ఆకృతులున్నాయి. మధ్యలో గంటలు, పైభాగంలో శంకు, చక్ర, నామాలను సైతం బంగారంతో తీర్చిదిద్దారు. బంగారు తొడుగులతో చేసిన ఈ డిజైన్ ఆలయంలో ఉండే స్థలాన్ని శక్తివంతం చేస్తుందని స్తపతులు, ఆచార్యులు పేర్కొన్నారు. శ్రీచక్ర యంత్రం వలే విశ్వశక్తిని సూచిస్తుందన్నారు. రూ.9 కోట్లతో పనులు నల్లని కృష్ణశిలకు అనుగుణంగా విద్యుత్ దీపాలు ఉండాలనే యోచనతో రూ.9 కోట్లతో పనులు చేస్తున్నారు. ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి, ఆలయ ఈఈ రామారావు ఆధ్వర్యంలో రష్యా, జర్మనీ కంపెనీల సహకారంతో బెంగళూరుకు చెందిన లైటింగ్ టెక్నాలజీ ఏజెన్సీ లైటింగ్ పనులు చేపట్టింది. ఆలయం లోపల, బయట గంటలు, తామరపువ్వు, బోలాడ్, ట్రైప్యాడ్స్, ఫ్లడ్ లైట్లను బిగించారు. ఇవి రాత్రి సమయంలో బంగారు వర్ణంలో కనువిందు చేస్తాయి. భక్తులు వెళ్లే క్యూలైన్లు సైతం స్వర్ణమయంగా ఉంటాయి. ఇండోర్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన అల్యూమినియం, ఇత్తడి మిశ్రమంతో చేసిన ఈ క్యూలైన్లను తూర్పు రాజగోపురం ముందు భాగంలో ఏర్పాటు చేశారు. -
ప్రతీ భక్తుడికి జియో ట్యాగింగ్
యాదగిరిగుట్ట: యాదాద్రీశుడికి ఈనెల 28న ఉదయం 11.55 గంటలకు మహా కుంభసంప్రోక్షణ జరుగుతుందని, ఆ రోజు మధ్యాహ్నం 2గంటల తరువాతే భక్తులకు స్వయంభూ దర్శనాలు కల్పిస్తామని యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి చెప్పారు. ‘ఉదయం సమయంలో భక్తులు వచ్చి ఇబ్బందులు పడొద్దు.. పూజా కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఎవరినీ ఆలయంలోకి అనుమతించడం కుదరదు. పూజలన్నీ పూర్తయ్యాక మధ్యాహ్నం 2గంటల తర్వాతే స్వయంభూ దర్శనాలు ప్రారంభమవుతాయి’అని ఆమె వెల్లడించారు. శుక్రవారం కొండపైన తన కార్యాలయంలో ఈఓ గీతారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ‘భక్తులు క్యూకాంప్లెక్స్లోకి వెళ్లే క్రమంలో ఆన్లైన్ టికెటింగ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఉచిత దర్శనమైనా, వేరే ఏ దర్శనమైనా అక్కడ భక్తులు పేరు నమోదు చేసుకుంటారు. కొండపైకి ఎంత మంది వచ్చారు, క్యూలైన్లో ఎంత మంది ఉన్నారో పరిశీలించేందుకు జియో ట్యాగింగ్ చేస్తున్నాం. ఒక్కసారి ట్యాగింగ్ చేసిన వ్యక్తి కొండ దిగారా లేదా ఎక్కడ ఉన్నారు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. 28న ఉచిత దర్శనాలే ఉంటాయి కాబట్టి 29వ తేదీ నుంచి ఆన్లైన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది’ అని చెప్పారు. కొండపైకి భక్తులు వచ్చేందుకు 75 బస్సులు సిద్ధంగా ఉన్నాయన్నారు. 27 వరకు బాలాలయంలో దర్శనాలు ఈ నెల 21న అంకురార్పణతో బాలాలయంలో ప్రారంభమయ్యే పంచకుండాత్మక కార్యక్రమాలు 28 వరకు జరుగుతాయి. 28న ఉదయం పూర్ణాహుతి పూర్తయిన అనంతరం మహా కుంభ సంప్రోక్షణ ఉంటుంది. పంచకుండాత్మక యాగానికి సంబంధించిన పనులన్నీ శనివారం పూర్తవుతాయి. ‘బాలాలయంలో 27వ తేదీ వరకు స్వామి వారి దర్శనాలు ఉంటాయి. 21 నుంచి వచ్చే భక్తులంతా స్వామి వారిని, యాగాన్ని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. 28న ఉదయం పూర్ణాహుతి, యాగ ఫలం సమర్పించిన అనంతరం బాలాలయంలో ఉన్న సువర్ణ మూర్తులను శోభయాత్రతో ప్రధానాలయానికి తీసుకెళ్తారు. ఆ సమయంలో భక్తులకు దర్శనం ఉండదు’అని ఆమె తెలిపారు. యాగశాల, మహా కుంభసంప్రోక్షణకు అవసరమైన వేద పారాయణీకులు, ఇతర ఆలయాల్లో ఉన్న అర్చక సిబ్బంది డిప్యూటేషన్‌పై యాదాద్రికి వస్తారన్నారు. సౌకర్యాలన్నీ 28న ప్రారంభం ‘మండల దీక్ష భవనం, కల్యాణ కట్ట, లక్ష్మీ పుష్కరిణిని 28న ప్రారంభిస్తాం. శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం సైతం భక్తులకు అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. వీలైనంత వరకు అదే రోజు ప్రారంభిస్తాం. కొండపైన క్యూకాంప్లెక్స్ సిద్ధంగా ఉంది. కొండ కింద బస్టాండ్, కొండపైన బస్బే రెడీ అవుతున్నాయి. 21 నుంచి 28 వరకు ఎంత మంది వస్తే అంత మంది భక్తులకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు అన్న ప్రసాదం అందిస్తాం’అని గీతారెడ్డి చెప్పారు. 28వ తేదీ నుంచి మూడు రోజులపాటు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తర్వాత ప్రతి శనివారం, ఆదివారం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరపాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు శ్రీస్వామి వారి కల్యాణ మండపం కింద ప్రత్యేక వేదిక నిర్మించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం చెంతనే గల శ్రీపర్వత వర్ధిని రామలింగేశ్వరస్వామి ప్రధానాలయం ఉద్ఘాటన ఏప్రిల్ 25న ఉంటుందన్నారు. అందరూ ఆహ్వానితులే.. ‘శ్రీస్వామి వారి ప్రధానాలయ ఉద్ఘాటనకు శ్రీత్రిదండి చినజీయర్ స్వామి వచ్చే అంశాన్ని సీఎం కేసీఆర్ చూసుకుంటారు. మేము ఎవరికీ ప్రత్యేకంగా ఆహ్వానం ఇవ్వలేదు. సీఎం కేసీఆర్ మాత్రం 28వ తేదీన ఉదయం జరిగే మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొంటారు. దేవుడికి ప్రత్యేకంగా చేస్తున్న కార్యక్రమం కాబట్టి అందరూ ఆహ్వానితులే. యాగం జరిగే సమయంలో ఎవరైనా, ఏ సమయంలోనైనా వచ్చి వెళ్లవచ్చు. వచ్చిన వారికి ఆలయ పరంగా మర్యాదలు చేస్తాం’ అని గీతారెడ్డి చెప్పారు. -
యాదాద్రి విల్లాకు రూ.7.5 కోట్ల విరాళం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా కొండకు దిగువన యాదగిరిపల్లి సమీపంలో నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్, విల్లాలకు దాతలు సహకారాన్ని అందించారు. ఇటీవల సీఎం కేసీఆర్ ప్రెసిడెన్షియల్ సూట్‌తో పాటు 14 విల్లాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఒక వీవీఐపీ విల్లాకు హైదరాబాద్‌కు చెందిన కాటూరి వైద్య కళాశాల చైర్మన్ కాటూరి సుబ్బారావు రూ.7.5 కోట్ల విరాళం అందించారు. వీవీఐపీ విల్లా తాళాలను వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఈవో గీతారెడ్డిలు దాత కాటూరి సుబ్బారావుకు అందజేశారు. గత నెల 12న ప్రెసిడెన్షియల్ సూట్‌తోపాటు 13 విల్లాలను దాతలకు అధికారులు కేటాయించారు. -
యాదాద్రీశుడికి పట్టువస్త్రాలు
సాక్షి, యాదాద్రి/యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణానికి సీఎం కేసీఆర్ సతీసమేతంగా శుక్రవారం హాజరుకానున్నారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 11 గంటలకు బాలాలయంలో నిర్వహించే తిరు కల్యాణోత్సవానికి స్వామివారికి ప్రభుత్వం తరఫున కేసీఆర్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం ఉదయం బేగంపేట నుంచి హెలికాప్టర్లో యాదాద్రికి చేరుకోనున్నారు. 2016లో బాలాలయంలో జరిగిన తిరు కల్యాణోత్సవానికి సీఎం దంపతులు తొలిసారి హాజరై ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. 28 నుంచి స్వయంభూల దర్శనం ప్రధానాలయం ఉద్ఘాటన ఉత్సవాలు ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. 28న ప్రధానాలయం ప్రారంభించి భక్తులకు స్వయంభూల దర్శనం కల్పించనున్నారు. ప్రధానాలయం పనులు దాదాపు పూర్తయ్యాయి. దివ్యవిమానం బంగారు తాపడం పనులు ప్రారంభించాల్సి ఉంది. ఉద్ఘాటన ఉత్సవాలతోపాటు ఇంకా జరగాల్సిన పనులపై సీఎం అధికారులతో సమీక్షించనున్నారు. 21 నుంచి మహాకుంభసంప్రోక్షణ కార్యక్రమ నిర్వహణపై అధికారులతో చర్చించనున్నారు. అలాగే కొండపై ఆర్చీ, బస్బే, కమాండ్ కంట్రోల్ రూమ్, బాలాలయం చుట్టుపక్కలా చదును చేయడం, సుందరీకరణ పనులు, ఘాట్ రోడ్డు వెడల్పు పనులు పర్యవేక్షించనున్నారు. దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కూడా రానున్నారు. కాగా, కొండ కింద భక్తులకు వసతులు కల్పించే పనులను వేగంగా పూర్తి చేయాలని ఇప్పటికే సీఎంవో కార్య దర్శి భూపాల్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పంచతల రాజగోపురానికి పసిడి కలశాలు యాదాద్రి ప్రధానాలయ రాజగోపురాలు పసిడి కలశాలతో ధగధగలాడనున్నాయి. ప్రధానాలయ ఉద్ఘాటన సమయానికి సప్త, పంచ, త్రితల రాజగోపురాలకు పసిడి కలశాలను బిగించే ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గురువారం పంచతల రాజగోపురంపై తొమ్మిది బంగారు కలశాలను ప్రత్యేక శిల్పులు బిగించారు. ఇప్పటికే ఆలయ అష్టభుజి శిఖర మండపాలపై రాగి కలశాలను బిగించారు. పంచతల రాజగోపురానికి బిగించిన పసిడి కలశాలు సిద్ధమవుతున్న స్వర్ణ రథం బాలాలయంలో స్వర్ణ రథం సిద్ధమవుతోంది. దాతల సహకారంతో చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్‌లో బంగారు తాపడం పూర్తి చేయించి, విడి భాగాలను ఇటీవల క్షేత్రానికి తెచ్చారు. వీటికి అధికారులు, ఆచార్యులు పూజలు నిర్వహించారు. రాత్రి నుంచి రథానికి బంగారు కవచాలు తొడిగే పనులను ప్రారంభించారు. -
యాదాద్రికి శాంతా బయోటెక్నిక్స్ రూ.1.08 కోట్ల విరాళం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిర్వహించే అన్న ప్రసాదం కార్యక్రమం కోసం హైదరాబాద్‌కు చెందిన శాంతా బయోటెక్నిక్స్ సీఈవో డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి రూ.1.08 కోట్ల చెక్కును ఆలయ ఈవో గీతారెడ్డికి అందజేశారు. స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని బాలాల యంలో చెక్కు ఇచ్చారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అద్భుతంగా సాగుతోందని, భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు తనవంతుగా విరాళం ఇచ్చినట్లు వరప్రసాద్‌రెడ్డి చెప్పారు. అనంతరం దాత డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి, కుటుంబ సభ్యులకు ఆలయ ఆచార్యులు ఆశీర్వచనం చేయగా, ఈవో గీతారెడ్డి లడ్డూ ప్రసాదం అందజేశారు. కాగా, వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం స్వామి శ్రీకృష్ణాలంకారంలో హంస వాహనంపై ఊరేగారు. -
యాదాద్రి ఆన్లైన్ టికెట్ బుకింగ్‌కు ట్రయల్‌రన్
యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో భక్తులకు దర్శనం కల్పించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఈసీఐఎల్ కంపెనీ ప్రతినిధుల బృందం ఆన్లైన్లో టికెట్ బుకింగ్ ప్రక్రియపై ట్రయల్ రన్ నిర్వహించారు. ఆన్లైన్లో టికెట్ బుకింగ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ దర్శనం టికెట్ దేవస్థానం అధికారులు నిర్ణయించిన ధరతో వస్తుంది. ఇందులో దర్శనానికి సంబంధించి రిపోర్టింగ్ తేదీ, సమయం, ఏ గేట్ వద్ద రిపోర్ట్ చేయాలి, బుకింగ్ నంబర్, బుకింగ్ డేట్, చెల్లించిన నగదు, ఆలయసేవలు, ఆలయానికి సంబంధించిన ఫోన్ నంబర్, ఆధార్, పేరు క్యూర్ కోడ్‌తో ఉండనున్నాయి. ప్రధానాలయం ప్రారంభం అయిన తర్వాత ఎన్ని రోజులకు ఈ టికెట్ బుకింగ్ విధానం ప్రవేశపెడతారు, ఏ వెబ్సైట్లో వీటిని వినియోగించాలనే అంశాలను అధికారులు నిర్ణయించాల్సి ఉంది. -
యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
సాక్షి, యాదాద్రి/యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం స్వస్తివాచనంతో ప్రారంభమయ్యాయి. బాలాలయాన్ని వివిధ రకాల పూలతో అలంకరించారు. ముందుగా గర్భాలయ ఆవరణలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, నవకలశాభిషేకం, రక్షాబంధనం కార్యక్రమాలను నిర్వహించారు. ధాన్యరాశిలో సత్యం, జ్ఞానం, ధర్మం అనే ముగ్గురు దేవతలను ఆవాహన చేసి ఆ కలశాలలో శుద్ధ గంగాజలాన్ని పోసి వాటికి ప్రత్యేక పూజలు చేశారు. మొదట దేవస్థాన అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి యజ్ఞాచార్యులకు, ఆ తర్వాత ఆలయ అర్చకులకు రక్షాబంధనం చేశారు. అనంతరం అర్చకులు దేవస్థాన ఈఓ గీతారెడ్డి, చైర్మన్ బి.నర్సింహమూర్తిలకు రక్షాబంధనం చేశారు. ఈ ఉత్సవాల్లో పంచనారసింహుల శక్తిని పెంచడానికి కఠోర నియమాలతో దీక్ష తీసుకోవడమే రక్షాబంధనం. అనంతరం పోచంపల్లి పద్మశాలి మహాజన సంఘం ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు పట్టు చీరలు, ధోవతి, కండువా, తలంబ్రాలు సమర్పించారు. స్వామివారి కల్యాణానికి అవసరమయ్యే పుట్టమన్ను తెచ్చి కల్యాణ మండపంలో స్వామివారిని అధిష్టింపచేశారు. పుట్టమన్నును 12 పాత్రలలో వేసి 12 రకాలైన ధాన్యాలను వేసి 12 రకాల దేవతలతో ఆవాహన చేసి ప్రత్యేక పూజలతో అంకురార్పణ చేశారు. ధ్వజస్తంభానికి బంగారు తొడుగు ఈనెల 28న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన నేపథ్యంలో అళ్వార్ మండపంలో ఏర్పాటు చేసిన ధ్వజస్తంభానికి చేపట్టిన బంగారు తొడుగుల పనులు తుది దశకు చేరాయి. ధ్వజస్తంభం 34 అడుగుల ఎత్తు ఉంది. ఇక గోపురాలు, విమాన శిఖరాలపై బిగించేందుకు బంగారు కలశాలు సిద్ధం చేస్తున్నారు. కలశాలు 8 నుంచి 10అడుగుల ఎత్తు ఉన్నాయి. -
ప్రారంభమైన అఖండ జ్యోతి యాత్ర
యాదగిరిగుట్ట: ఈ నెల 4నుంచి ప్రారంభం కానున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని బర్కత్‌పురలో సిద్ధమైన స్వామి వారి అఖండజ్యోతి యాత్ర యాదగిరిభవన్ నుంచి మంగళవారం ప్రారంభమైంది. అఖండజ్యోతి యాత్రను వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి, అఖండజ్యోతియాత్ర చైర్మన్ ఎంఎస్ నాగరాజు, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు ప్రారంభించారు. యాత్ర మొదటిరోజు ఉప్పల్ చౌరస్తాకు చేరుకుంది. బుధవారం ఉప్పల్ నుంచి బయల్దేరి శుక్రవారం ఉదయానికి భువనగిరికి, అక్కడి నుంచి రాత్రి యాదగిరిగుట్టకు చేరనుంది. యాదాద్రిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అధికారులకు అఖండజ్యోతిని అప్పగిస్తామని అఖండజ్యోతి చైర్మన్ నాగరాజు వెల్లడించారు. మరోవైపు ఈనెల 4నుంచి ప్రారంభం కానున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
మార్చి 28నే మహా కుంభ సంప్రోక్షణ
యాదగిరిగుట్ట: యాదాద్రిలో మార్చి 28న నిర్వహించాలనుకున్న మహా కుంభ సంప్రోక్షణ యథా విధిగా ఉంటుందని దేవస్థానం ఈఓ గీతారెడ్డి స్పష్టంచేశారు. ప్రధానాలయంలో స్వయంభు దర్శనం సందర్భంగా మహా కుంభ సంప్రోక్షణతోపాటు శ్రీసుదర్శన నారసింహ మహా యాగాన్ని నిర్వహించాలని తొలుత అనుకున్నామని.. అయితే, యాగశాలలో పనులు పెండింగ్‌లో ఉండడంతో యాగం వాయిదా వేశామని చెప్పారు. సోమవారం ఆమె తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మార్చి 28 వరకు శ్రీస్వామి వారి బాలాలయం ఉం టుందని, ఆ రోజున మహా కుంభ సంప్రోక్షణ జరిపిన తరువాత బాలాలయం ఉండదన్నారు. భక్తులకు ప్రధానాలయంలోనే శ్రీస్వామి వారి దర్శనం ఉంటుందని స్పష్టంచేశారు. ‘మార్చి 28 నుంచే భక్తులకు దర్శనం కల్పించాలా.. లేక వారం రోజుల తరువాత కల్పించాలా అనే అంశంపై కలెక్టర్, పోలీసులతో చర్చలు జరుగుతున్నాయి. ప్రధానాలయం గోపురాలపై అమర్చే కలశాలకు పూజలు జరిపించాం, త్వరలోనే వాటిని ఏర్పాటుచేస్తాం. ప్రస్తుతం గోపురాలకు పరంజా బిగించే పనులు జరుగుతున్నాయి. గోపురాలన్నింటిపై 126 బం గారు కలశాలు రానున్నాయి. మార్చి 28న మహా కుంభ సంప్రోక్షణతోపాటు కలశాల సంప్రోక్షణ జరిపిస్తాం’అని ఆమె చెప్పారు. భక్తులకు క్యూలైన్ల ద్వారా స్వామి వారి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కొండపైన బస్బే, ఆర్చ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఆలయం ప్రారంభం నాటికి పూర్తి అవుతాయన్నారు. 4 నుంచి బ్రహ్మోత్సవాలు యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 4 నుంచి 14 వరకు బాలాలయంలోనే జరిపిస్తామని ఈఓ గీతారెడ్డి తెలిపారు. 10న ఎదుర్కోలు మహోత్సవం, 11న తిరు కల్యాణం, 12న దివ్య విమాన రథోత్సవం ఉంటాయన్నారు. బాలాలయం ఏర్పడిన నాటి నుంచి కొండపైన తిరు కల్యాణం, కొండ కింద వైభవోత్సవ కల్యాణం నిర్వహిస్తున్నామని, ఈసారి కొండ కింద వైభవోత్సవ కల్యాణం లేదన్నారు. బాలాలయంలో ఆంతరంగికంగానే నిర్వహిస్తామని చెప్పారు. -
CM KCR : యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటన (ఫొటోలు)
-
యాదాద్రికి రూ.1.16 కోట్ల విరాళం
సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట అభివృద్ధి పనులకు తనవంతు విరాళంగా అయ్యప్ప ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవి వర్మ రూ.1.16 కోట్ల విరాళం అందజేశారు. విరాళానికి సంబంధించిన చెక్కును ఆదివారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీ రామారావును కలిసి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సమక్షంలో రవివర్మ అందజేశారు. -
స్వర్ణ తాపడానికి రూ.50లక్షల విరాళం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమాన గోపుర స్వర్ణ తాపడానికి దాతల విరాళాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని కార్వాన్కు చెందిన బండారి బ్రదర్స్ సోమవారం తమ కుటుంబం తరఫున రూ.50లక్షల విలువైన డీడీలను ఈఓ గీతారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ఆలయ ఆచార్యులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం వారు ప్రధానాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బండారి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ తల్లిదండ్రులు, సోదరుల తరపున ఈ విరాళం అందించామని తెలిపారు. -
యాదాద్రి ప్రసాదానికి యంత్రాంగం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని సందర్శిం చే భక్తులందరికీ దేశంలోనే తొలిసారిగా ఆధునిక యంత్రాలతో మానవప్రమేయం లేకుండా తయారు చేసే లడ్డూ, పులిహోర ప్రసాదం అందనుంది. మార్చి 28న లక్ష్మీనరసింహసింహ స్వామి దర్శనమివ్వనున్న నేపథ్యంలో ప్రసాదం తయారీకి అవసరమైన ఆధునిక యంత్రాల బిగింపు ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. రోజుకు 70వేలకు పైగా లడ్డూలు, రోజుకు నాలుగుసార్లు ఒకేసారి 1,000 కిలోల పులిహోర తయారు చేసేలా రూ.13.08 కోట్ల వ్యయంతో ఈ ఆధునిక యంత్రాలను బిగించారు.పులిహోరను ప్యాకింగ్ చేసేందుకు సుమారు రూ.5కోట్ల వ్యయంతో ఆధునిక యంత్రాలను తీసుకువచ్చారు. ప్రత్యేక మెషీన్లు..: ప్రసాదం కాంప్లెక్స్‌లో మూడు అంతస్తుల్లో మిషన్ల ద్వారానే ప్రసాదం తయారు చేసి లిఫ్టులు, మెషీన్ ద్వారానే కౌంటర్ల దగ్గరకు తీసుకొచ్చే విధంగా పనులు పూర్తిచేస్తున్నారు. ప్రసాదం తీసుకువచ్చే ట్రేలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసే విధంగా భారీ మెషీన్‌ను బిగించారు. అక్కడి నుంచి ప్రసాదాన్ని ట్రేలలో వేసుకుని కౌంటర్ల వద్దకు తీసుకెళ్లేందుకు ఎస్కలేటర్ మాదిరిగా 12 మోటర్లతో బెల్ట్‌ను బిగించారు. ట్రేలలో ప్రసాదం అయిపోయిన వెంటనే తిరిగి ట్రేలను శుభ్రం చేసే మెషీన్ వద్దకు తీసుకువెళ్లేందుకు బెల్ట్‌ను బిగించారు. భక్తులకు ప్రసాదం కొనుగోలులో ఇబ్బందులు తలెత్తకుండా 13 కౌంటర్లను ఏర్పాట్లు చేశారు. యాదాద్రీశుడి ప్రసాదాన్ని అధికారులు హరేకృష్ణ మూమెంట్ ప్రతినిధులకు అప్పగించగా..గతేడాది సెప్టెంబర్, డిసెంబర్ నెలల్లో ప్రసాదం నాణ్యత,రుచిని పరిశీలించారు. మంగళవారం మూడోసారి ట్రయల్ రన్ చేశారు. ప్రస్తుతం దేవస్థానానికి చెందిన ఉద్యోగులకు ప్రసాదం తయారీలో శిక్షణనిస్తున్నారు. -
యాదాద్రి స్వర్ణ తాపడానికి రూ.3 కోట్ల విరాళం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ప్రధానాలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం హెటిరో డ్రగ్స్, హెటిరో ల్యాబ్స్, హానర్ ల్యాబ్ ప్రతినిధులు బండి పార్థసారథిరెడ్డి, దేవరకొండ దామోదర్‌రావు రూ.3 కోట్లు విరాళంగా ఇచ్చారు. రూ.2.5 కోట్లకు సంబంధించి ఆలయ ఈవో గీతారెడ్డికి చెక్కుల రూపంలో ఇచ్చారు. మరో రూ.50 లక్షలను ఆన్లైన్ ద్వారా అందజేశారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. అంతకుముందు బాలాలయంలో స్వామి, అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధిలో తాము కూడా భాగస్వాములం కావాలని విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం రూ.3 కోట్లు ఇచ్చినట్లు వారు వెల్లడించారు. స్వర్ణతాపడానికి బంగారం అందజేత యాదాద్రి ప్రధానాలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ తన ఒంటిపై ఉన్న 12 తులాల బంగారం (బంగారు గొలుసు, గాజులు, ఉంగరాలు, చెవికమ్మలు) స్వామికి సమర్పించారు. కుటుంబసభ్యులతో కలిసి ఆమె ఆదివారం స్వామిని దర్శించుకున్నారు. త్వరలోనే కుటుంబసభ్యులు, నియోజకవర్గంలోని అనుచరుల ద్వారా స్వర్ణతాపడానికి బంగారం, డబ్బులు విరాళంగా అంద జేయనున్నట్లు మంత్రి చెప్పారు. -
యాదాద్రీశుడి దర్శనానికి 3 గంటలు
యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో రెండు రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం, ఆదివారం సెలవు రోజులు కలసి రావడంతో హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆలయ వీధులు, క్యూలైన్లు, బాలాలయం, ఉత్సవ, మహా మండపాలు, శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం, ప్రసాద విక్ర య కేంద్రం పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. రద్దీ ఎక్కువగా ఉండడంతో ధర్మ దర్శనానికి సుమారు మూడు గంటలు, అతి శీఘ్ర దర్శనానికి సుమారు గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ఆదివారం 30 వేలకు పైగా భక్తులు స్వామిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో కొండపైకి భక్తుల వాహనాలు వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. పాతగుట్టపై కూడా భక్తుల రద్దీ కొనసాగింది. -
Yadagirigutta: భారీగా పెరిగిన యాదాద్రి రాబడి
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కైంకర్యాల ధరలు పెంచిన తొలి రోజైన శుక్రవారం వివిధ పూజలతో నిత్య రాబడి రూ.18,93,248 సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. టిక్కెట్ ధరలు పెరిగిన తొలి రోజు భక్తులు కాస్త ఇబ్బంది పడినట్లు కనిపించారు. శాశ్వత పూజలతో రూ.9,12,120 లడ్డూ, పులిహోర, వడ వంటి ప్రసాదం విక్రయాలతో రూ.4,21,460 సువర్ణ పుష్పార్చనతో రూ.1,02,720తో పాటు ప్రధాన బుకింగ్‌తో రూ.1,37,198 దర్శనం రూ.100 టిక్కెట్‌తో రూ.40,000 కైంకర్యాలతో రూ.2,600 ప్రచార శాఖతో రూ.8,300 క్యారీ బ్యాగులతో రూ.7,700 శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలతో రూ.85,500 కల్యాణ కట్టతో రూ.18,800 వాహన పూజలతో రూ.10,800 టోల్ గేట్‌తో రూ.1,340 అన్నదాన విరాళంతో రూ.13,358 వేద ఆశీర్వచనంతో రూ.5,232 యాదరుషి నిలయంతో రూ.58,180 పాతగుట్ట ఆలయంతో రూ.30,920 గో పూజతో రూ.500 ఇతర పూజలతో రూ.35,720 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. (చదవండి: ‘యాదాద్రి’లో కైంకర్యాల ధరలు పెంపు) -
‘యాదాద్రి’లో కైంకర్యాల ధరలు పెంపు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తులు జరిపించే శ్రీస్వామి వారి కైంకర్యాలు, శాశ్వత పూజలు, భోగాలతో పాటు ప్రసాదం ధరలను పెంచుతున్నట్లు ఈవో గీతారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. యాదాద్రి దేవస్థానంతో కొండపైన గల శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి, అనుబంధ పూర్వగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సైతం ధరలు పెంచినట్లు తెలిపారు. పెంచిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. యాదాద్రిలో పెంచిన ధరలివి నిజాభిషేకం (ఇద్దరికి) గతంలో రూ.500 ఉండగా ప్రస్తుతం రూ.800 చేశారు. ఒక్కరికి రూ.250 ఉంటే ప్రస్తుతం రూ.400లకు పెంచారు. సహస్ర నామార్చనకు రూ.216 ఉంటే రూ.300, సుదర్శన నారసింహ హోమానికి రూ.1,116 ఉంటే రూ.1,250, నిత్య కల్యాణోత్సవానికి రూ.1,250 ఉంటే రూ,1,500, స్వాతి నక్షత్రం రోజున నిర్వహించే శత ఘటాభిషేకానికి (ఇద్దరికి) రూ.750 ఉంటే రూ.1,000, లక్ష పుష్పార్చనకు రూ.2,116 ఉంటే రూ.2,500, వెండి మొక్కు జోడు సేవలకు రూ.500 ఉంటే రూ.700, సువర్ణ పుష్పార్చనకు రూ.516 ఉంటే రూ.600, వేదాశీర్వచనం రూ.516 ఉంటే రూ.600, ఆండాల్ అమ్మవారి ఊంజల్ సేవకు రూ.750 ఉంటే రూ.1000, సత్యనారాయణస్వామి వ్రతాలు (సామగ్రితో కలిపి) రూ.500 ఉంటే రూ.800, గో పూజకు రూ.50 ఉంటే రూ.100, శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలకు వీఐపీల కోసం ప్రత్యేకంగా రూ.1,500, ఉపనయనం రూ.50 ఉంటే రూ.500, అక్షరాభ్యాసం రూ.51 ఉంటే రూ.200, అష్టోత్తర పూజకు రూ.100 ఉంటే రూ.200, అన్నప్రాశన (ఐదుగురికి) రూ.500 ఉంటే రూ.1000కి పెంచారు. ప్రసాదం ధరల వివరాలివి స్వామివారి లడ్డూ ప్రసాదం ధరలను సైతం అధికారులు పెంచారు. వంద గ్రాముల లడ్డూ గతంలో రూ.20 ఉంటే రూ.30కి పెంచారు. 500 గ్రాముల లడ్డూ రూ.100 ఉంటే రూ.150, 250 గ్రాముల పులిహోర రూ.15 ఉంటే రూ.20, 250 గ్రాముల వడ రూ.15 ఉంటే రూ.20కి పెంచారు. శివాలయంలో, పాతగుట్ట ఆలయంలోనూ పూజల ధరలను పెంచారు. శాశ్వత పూజల ధరలు కూడా పెరిగాయి. -
యాదాద్రి గోపురానికి 2 కిలోల బంగారం విరాళం
యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమాన గోపురానికి బంగారం తాపడానికి సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి స్పందించారు. శుక్రవారం ఆయన 2 కేజీల బంగారాన్ని ఆలయ ఈఓ గీతారెడ్డికి విరాళంగా అందజేశారు. యాదాద్రీశుడి బాలాలయంలో స్వామి, అమ్మవార్లకు జనార్దన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు. అంతకుముందు బంగారం నాణేలకు ప్రతిష్టామూర్తుల వద్ద ప్రత్యేక పూజలు చేయించారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన పి.మధుబాబు అనే భక్తుడు బంగారం తాపడం కోసం రూ.1,72,000ను విరాళంగా గీతారెడ్డికి అందజేశారు. నాడు భక్త రామదాసు.. నేడు సీఎం కేసీఆర్ భదాద్రి రామచంద్రస్వామి ఆలయాన్ని నాడు భక్త రామదాసు నిర్మిస్తే.. నేడు సీఎం కేసీఆర్ ప్రపంచ అధ్యాత్మిక క్షేత్రంగా యాదాద్రిని పునర్నిర్మాణం చేస్తు న్నారని జనార్దన్‌రెడ్డి కొనియాడారు. విమాన గోపురానికి బంగారం తాపడంలో తమ కుటుంబం పాత్ర ఉండాలని బంగారాన్ని అందజేశానని, టెంపుల్ సిటీపై నిర్మిస్తున్న కాటేజీలకూ రూ.2 కోట్లను జేసీ బ్రదర్స్ కంపెనీ తరఫున ఇస్తున్నట్లు వెల్లడించారు. -
యాదాద్రికి మల్లారెడ్డి రెండో విడత విరాళం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమాన గోపురం బంగారు తాపడం పనులకు కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి రూ. 3 కోట్ల 64 వేలు అందించారు. రెండవ విడతగా మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు, దాతల సహకారంతో మొత్తం రూ.84,29,880 నగదు, రూ.2,16,35,042 విలువ చేసే చెక్కులు, 200 గ్రాముల బంగారాన్ని బాలాలయంలో ఆలయ ఈవో గీతారెడ్డికి సోమవారం అందజేశారు. మొదటి విడతగా గత నెల 28వ తేదీన రూ.1.83 కోట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. మరో వారం, పది రోజు ల్లో 11 కిలోల బంగారానికి అవసరమయ్యే నగదును అందజేస్తామని వెల్లడించారు. -
అసభ్యకర ప్రవర్తన: యాదగిరిగుట్ట రూరల్ సీఐ సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో మరొక పోలీస్ అధికారిపై వేటు పడింది. ఈనెల 21న అవినీతి ఆరోపణలపై సరూర్‌నగర్ సబ్ ఇన్స్పెక్టర్ సైదులును సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా.. భువనగిరి డివిజన్ పరిధిలోని యాదగిరిగుట్ట రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) జీ నర్సయ్య సస్పెండ్ అయ్యారు. స్టేషన్‌లోని ఓ మహిళా పోలీస్తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఈ చర్యలు తీసుకున్నామని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. చదవండి: తనిఖీల వీడియో వైరల్: క్లారిటీ ఇచ్చిన సీపీ అంజనీ కుమార్ నర్సయ్య ప్రవర్తనపై సదరు మహిళ పోలీస్ పైఅధికారుల దృష్టికి తీసుకు వచ్చిందని తెలిసింది. దీంతో విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నర్సయ్య స్థానంలో ఎల్బీనగర్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అటాచ్గా ఉన్న ఇన్స్పెక్టర్ బీ నవీన్ రెడ్డిని యాదగిరిగుట్ట రూరల్ సీఐగా బదిలీ అయ్యారు. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ ఎం భగవత్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: ఇదేమి చోద్యం? మూతికి ఉండాల్సిన మాస్క్ నంబర్ ప్లేటుకు .. -
‘గుట్ట’ సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో ముగిసిన సోదాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ నివాసంలో ఏసీబీ అధికారుల సోదాలు శుక్రవారం ముగిశాయి. మూడు ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి రూ.20 వేలు డిమాండ్ చేసిన సబ్ రిజిస్ట్రార్ దేవానంద్.. స్థానిక డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్‌ను మధ్యవర్తిగా పెట్టి లంచం తీసుకున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు గురువారం పట్టుకున్న విషయం విదితమే. కాగా, దేవానంద్ ఇంట్లో రూ.76 లక్షలకుపైగా నగదు, 27 తులాల బంగారు ఆభరణాలు, 7.9 ఎకరాల పొలం, 200 గజాల ప్లాట్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు, తొమ్మిది విదేశీమద్యం బాటిళ్లు, పలు ఇతర కీలక డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేవానంద్, ప్రభాకర్‌లను ఏసీబీ జిల్లా ఇన్చార్జి డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్, మెదక్ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో విచారించారు. వారిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు అధికారులు తెలిపారు. -
యాదాద్రి ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండ చరియలు
యాదగిరిగుట్ట: భారీ వర్షాల కారణంగా గురువారం ఉదయం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లే ఘాట్‌రోడ్డులోని రెండో మూలమలుపు వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ మార్గంలో వాహనాలు వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు. వర్షానికి మరిన్ని బండరాళ్లు పడే అవకాశం ఉందని వాహనాలను మొదటి ఘాట్ రోడ్డు గుండా మళ్లించారు. తర్వాత ఆర్అండ్బీ అధికారులు రోడ్డుపై ఉన్న బండరాళ్లను జేసీబీతో తొలగించారు. ఇదిలా ఉండగా వర్షం కారణంగా బాలాలయ ఆవరణలో గతంలో వేసిన చలువ పందిళ్లు కూలిపోయాయి. కొండపై నూతనంగా నిర్మించిన క్యూలైన్లల్లోకి వర్షపు నీరు చేరింది. కాగా, కొండపై జరుగుతున్న అభివృద్ధి పనులు వర్షం కారణంగా నిలిచిపోయాయి. -
Photo Feature: పాపం ఏనుగు.. వర్షంలో పాట్లు
గోతిలో పడిన ఏనుగును అటవీ శాఖ అధికారులు, స్థానికులు కలిసి కాపాడారు. కేరళలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో లక్ష్మీ నర్సింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చుట్టూ పరుచుకున్న పచ్చదనంతో యాదాద్రి హరిత శోభను సంతరించుకుంది. మరోవైపు దేశవ్యాప్తంగా కోవిడ్ టీకా కార్యక్రమం కొనసాగుతోంది. భారీ వర్షాలతో ముంబైకర్ల పాట్లు రెట్టింపయ్యాయి. -
Photo Feature: యాదాద్రి వైభవం.. తాజ్ పునఃప్రారంభం
తెలంగాణలోని యాదాద్రి పుణ్యక్షేత్రంలో చేపట్టిన పునర్నిర్మాణ పనులు అద్భుతంగా ఉన్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసించారు. ప్రభుత్వ భూముల అమ్మకాలను నిలిపి వేయాలని తెలంగాణ సర్కారును డిమాండ్ చేస్తూ వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. తాజ్‌మహల్‌ను సందర్శించేందుకు పర్యాటకులను బుధవారం నుంచి అనుమతిస్తున్నారు. -
యాదాద్రి: అర్చకుడు సహా 30 మందికి పాజిటివ్
సాక్షి, యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో కరోనా కలకలం రేపుతోంది. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న పలువురు అర్చకులు, అధికారి, సిబ్బందికి పాజిటివ్ రావడంతో ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల జరిగిన శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాజిటివ్ వచ్చిన అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. దీంతో ఒక్కొక్కరుగా ఆస్పత్రికి క్యూ కట్టి పరీక్షలు చేయించుకుంటున్నారు. కేసులు ఇలా.. యాదగిరిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈనెల 25వ తేదీన నిర్వహించిన కరోనా పరీక్షల్లో యాదాద్రి ఆలయానికి చెందిన ఓ అర్చకుడికి పాజిటివ్ వచ్చినట్లు తేలింది. 26న మరికొందరు పరీక్షలు చేయించుకోగా నలుగురు యాదాద్రి అర్చకులు, సిబ్బంది, మరో ఇద్దరు హయగ్రీవ స్వామి ఆలయ అర్చకులకు (వీరు బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు) పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. ఇక శనివారం చేసిన పరీక్షల్లో 30 మందికి కరోనా సోకినట్లు తేలింది. వీరిలో అర్చకులు, అధికారులు, సిబ్బంది ఉన్నారు. భౌతిక దూరం విడిచి.. మాస్క్‌లు మరిచి ఓ వైపు కరోనా వ్యాప్తి చెందుతున్నా యాదాద్రి క్షేత్రంలో కోవిడ్ – 19 నిబంధనలు గాలికొదిలేస్తున్నారు. లాక్డౌన్ నిబంధనల అనంతరం ఆలయంలో కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టారు. కానీ, క్రమేణా వాటిని మరిచారు. ఆలయానికి వచ్చే భక్తులు నిబంధనలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మాస్కులు ధరించకుండానే ఆలయ పరిసరాల్లో తిరుగుతున్నారు. కనీసం భౌతికదూరం కూడా పాటించడం లేదు. అన్‌లాక్ కావడంతో యాదాద్రి క్షేత్రానికి హైదరాబాద్ జంటనగరాలతో పా టు వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ నెల 15నుంచి 25వ తేదీ వరకు జరిగిన బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులు అలంకార సేవలు, తిరుకల్యాణం, రథోత్సవం, శ్రీ చక్ర స్నానం వేడుకల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో గుంపులుగా కూర్చోవడం, మాస్కులు ధరించకపోవడంతో ఆలయంలో అర్చకులు, అధికారులు, సిబ్బందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం శ్రీస్వామి క్షేత్రంలో విధులు నిర్వహించే పలువురు అర్చకులు, అధికారులు, సిబ్బంది కరోనా బారిన పడడంతో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యా రు. ఆలయంతో పాటు ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ఈఓ, వివిధ సెక్షన్ల కార్యాలయాల్లో శానిటైజేషన్ చేశారు. క్యూలైన్లలో శానిటేషన్ డబ్బాలు ఏర్పాటు చేస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బందితో ఆలయ పరిసరాలను శుభ్రం చేయిస్తున్నారు. మూడు రోజులు ఆర్జిత సేవలు బంద్ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ఆలయంలో శ్రీస్వామి వారికి నిర్వహించే ఆర్జిత సేవలను మూడు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు ఈఓ గీతారెడ్డి ప్రకటించారు. ఆదివారం నుంచి మంగళవారం వరకు ఆర్జీత సేవలు నిలిపివేశామన్నారు. నిత్య పూజలన్నీ అంతరంగికంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఘాట్ రోడ్డులోని జీయర్ కుటీర్‌లో రోజూ నిర్వహించే అన్నదానం సైతం మూడు రోజుల పాటు బంద్ చేసినట్లు చెప్పారు. కేవలం భక్తులకు లఘు దర్శనం మాత్రమే కల్పించనున్నట్లు ఈఓ వెల్లడించారు. క్షేత్రానికి వచ్చే భక్తులు విధిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని కోరారు. చదవండి: సూర్యపేట గ్యాలరీ స్టాండ్ ప్రమాదం: ప్రధాన కారణం ఇదే! -
యాదాద్రి క్షేత్రం.. సొబగుల సోయగం
అద్భుత శిల్పకళా నైపుణ్యంతో యాదాద్రిలో పంచనారసింహ క్షేత్రం రూపుదిద్దుకుంటోంది. ఆధారశిల నుంచి రాజగోపురం వరకు నల్లరాతి కృష్ణ శిలలతో నిర్మాణం అవుతున్న ఏకైక ఆలయంగా చరిత్రలో నిలిచిపోనుంది. ఇప్పటికే ప్రధాన ఆలయ పనులన్నీ పూర్తి చేసుకున్న స్వయం భూక్షేత్రం.. త్వరలోనే భక్తులకు పునః దర్శనం కల్పించే దిశగా తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఈ ఆలయం భక్తులకు పురాణ ప్రాశస్త్య శోభను కలిగించనుంది. కృష్ణశిలలతో ఇప్పటికే ఆలయాన్ని అంతా నిర్మించారు. ఆలయానికి నలు వైపులా భక్తులను ఆకర్షించే విధంగా రాతి విగ్రహాలను ఏర్పాటు చేశారు. నలు దిక్కులా రాతి విగ్రహాలు లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃనిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రధానాలయాన్ని పురాణ ప్రాశస్త్యమైన రాతి శిలా సౌరభాలను అద్దుతున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు అడుగడుగునా ఆధ్యాత్మిక చింతన కలిగే విధంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగానే ప్రధానాలయ మండపానికి నలుదిక్కులా విమానాలు, ప్రాకార మండపాలపై దేవదేవుడు నృసింహుడి ఇష్టవాహనమైన గరుత్మంతుడి విగ్రహాలను, ఆ విగ్రహాలకు ఇరువైపులా సింహం, శంకుచక్ర నామాలు ఏర్పాటు చేశారు. రెండున్నర అడుగుల ఎత్తుతో గరుత్మంతుడి విగ్రహాలు, ఒకటిన్నర అడుగు ఎత్తుతో సింహపు విగ్రహాలు, శంకు, చక్ర, తిరునామాలను అమర్చారు. లోపలి సాలహారాల్లో విగ్రహాల బిగింపు ప్రధాన ఆలయ మొదటి ప్రాకారంలోని సాలహారాల్లో శ్రీత్రిదండి చినజీయర్ స్వామి సలహాలు, సూచనలతో దేవతా మూర్తుల విగ్రహాలను బిగించే ప్రక్రియను ఇటీవల పూర్తి చేశారు. ప్రధాన ఆలయం మొదటి ప్రాకారంలో సాలహారాల్లో 93 విగ్రహాలను బిగించారు. ఇందులో ప్రధానంగా దశవతారాలు, అష్టలక్ష్మి, నృసింహస్వామి, ఆళ్వారులు, నారాయణమూర్తి వంటి విగ్రహాలను అమర్చారు.ఈ అంతర్, బాహ్య ప్రాకార మండపాల పైభాగంలోని సాలహారాల్లో విగ్రహాలను బిగించాల్సి ఉంది. సుమారు 150 విగ్రహాలు ప్రస్తుతం ఆళ్లగడ్డలో తయారు అవుతున్నాయి. వీటిని ఆలయ ప్రారంభం వరకు బిగించనున్నారు. రాజగోపురాల ముందు.. ఆలయానికి నలు దిశలుగా పంచ, సప్త తల రాజగోపురాలను నిర్మించారు. ఈ రాజగోపురాలకు ముందు భాగంలో ప్రత్యేక ఆకర్షణీయంగా రాతి విగ్రహాలను ఏర్పాటు చేశారు. తూర్పు, పడమర రాజగోపురాల ముందు భారీ ఏనుగులు, ఉత్తర, దక్షిణ రాజగోపురాల ముందు భాగాల్లో రాతితో చెక్కిన భారీ సింహం విగ్రహాలను అమర్చారు. తూర్పు రాజగోపురం నుంచి భక్తులు ఆలయంలోకి ప్రవేశించి పడమటి రాజగోపురం నుంచి బయటికి వచ్చే సమయంలో ఈ భారీ ఎనుగు విగ్రహాలు కనువిందు చేయనున్నాయి. ఇక ఆలయానికి దక్షిణ, ఉత్తర రాజగోపురాల దిక్కుల్లో పర్యటించే సమయంలో సింహం విగ్రహాలు భక్తులను ఆధ్యాత్మిక పారావశ్యంలోకి ముంచెత్తనున్నాయి. ఆలయ సన్నిధిలోని బ్రహ్మోత్సవ మండపం, వేంచేపు మండపం, పుష్కరిణి మండపాలపై ఇప్పటికే గరుత్మంతుడి విగ్రహాలను బిగించారు. స్వాగత విగ్రహాల అమరిక ప్రధాన ఆలయంలోని మహా మండపంలో ధ్వజస్తంభం వెనుక భాగంలో ఏర్పాటు చేసే దర్పనానికి ఇరువైపులా స్వాగత విగ్రహాలుగా ఆరు అడుగుల దీపకన్యలను అమర్చారు. ముఖిలత హస్తాలతో స్వామివారిని దర్శించిన భక్తులకు స్వాగతించే విధంగా ఏర్పాటు చేశారు. గర్భాలయానికి ఇరువైపులా తూర్పు, పడమర పంచతల రాజగోపురాల ముందు, బ్రహ్మోత్సవ మండపం ముందు భాగాల్లో సుమారు 6 అడుగుల ఎత్తులో ఉన్న స్వామివారి ద్వారాపాలకులైన భారీ చండ ప్రచండ విగ్రహాలను బిగించారు. -
గోల్డెన్ టెంపుల్ తరహాలో యాదాద్రి ఆలయం
-
కరోనా వేళ.. శిల్పుల పనులు
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ పునర్నిర్మాణంలో భాగంగా అభివృద్ధి చేస్తున్న శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయ పనులు తుది దశకు చేరాయి. కరోనా విపత్తులోనూ శిల్పులు, కూలీలు ఆలయ పనుల్లో నిమగ్నమై పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. సుమారు రూ.15 కోట్ల వ్యయంతో ఎకరం స్థలంలో కృష్ణశిలతో ఈ శివాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రధానాలయం, ముఖమండపం, ప్రాకార మండపం, రాజగోపురం పనులు పూర్తయ్యాయి. ఇక ప్రధానాలయం పక్కనే ఉప ఆలయాలైన గణపతి, పర్వతవర్ధిని అమ్మవారి ఆలయం, ఆంజనేయస్వామి ఆలయాన్ని పూర్తి చేశారు. అంతే కాకుండా నవగ్రహ మండపం, యాగశాలను సైతం ఇటీవలనే శిల్పులు పూర్తి చేశారు. ప్రధానాలయంలోని మండపాలు, నాలుగు దిశల్లో కృష్ణ శిలలతో ఫ్లోరింగ్ పనులు చేశారు. ప్రధానాలయం ముందుభాగంలో బలిపీఠం, ధ్వజస్తంభం ఏర్పాటు చేసేందుకు దిమ్మెలు పూర్తి చేశారు. ఆలయంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు కూడా పూర్తయ్యాయి. ఆలయ పునఃప్రారంభం సమయానికల్లా స్పటికలింగాన్ని ఏర్పాటు చేసేందుకు ఇటీవల వైటీడీఏ అధికారులు మార్కింగ్ చేశారు. సాలహారాల్లో విగ్రహాలు.. వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఆర్కిటెక్టు ఆనంద్‌సాయి, ఈఓ గీతారెడ్డి పర్యవేక్షణలో శిల్పాల పనులు పూర్తయ్యాయి. ప్రధానాలయ మండపాల ప్రకారాల్లోని సాలహారాల్లో ద్వాదశ జ్యోతిర్లింగాలు, శివుడి అవతారాలు, పార్వతి అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇక ముఖ మండపంలో దక్షణామూర్తి, బ్రహ్మ, భైరవులతో పాటు ఇతర దేవతామూర్తుల విగ్రహాలను అమర్చేందుకు ఆలయ శిల్పులు సన్నాహాలు చేస్తున్నారు. జరగాల్సిన పనులు ఇవే.. రామలింగేశ్వరస్వామి ఆలయంలో కల్యాణమండపం, రథశాలను ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. ఆలయంలోని ఉత్తర దిశలో కల్యాణ మండపాన్ని, రథశాలను ఏర్పాటు చేసేందుకు ఇటీవల మార్కింగ్ చేశారు. ఈ పనులను త్వరలోనే చేపట్టనున్నారు. అంతే కాకుండా దక్షిణ భాగంలో ఇంకా మిగిలి ఉన్న ప్రాంతంలో కృష్ణ శిలలతో స్టోన్ ఫ్లోరింగ్ పనులు చేస్తున్నారు. ఇక ప్రాకారాలపై అందంగా కనిపించే విధంగా నంది విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఆలయంలో విద్యుదీకరణ పనులు చేయాల్సి ఉంది. -
కనుల పండువగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు
-
మత్స్యావతారం పుష్పాలంకృతం
-
యాదాద్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
-
యాదాద్రీశుడిని దర్శించుకున్న గవర్నర్
సాక్షి, యాదగిరిగుట్ట: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సోమవారం కుటుంబసభ్యులతో కలిసి ప్రసిద్ధి పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు గవర్నర్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బాలాలయంలో ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్ కుటుంబానికి ఆలయ ఆచార్యులు ప్రధాన మండపంలో వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం గవర్నర్ తమిళ సై మాట్లాడుతూ యాదాద్రీశుడి దర్శనం బాగా జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని శ్రీలక్ష్మీనరసింహస్వామిని వేడుకున్నట్లు చెప్పారు. అనంతరం ఆమె వరంగల్ బయల్దేరి వెళ్లారు. కాగా గవర్నర్ వెంట విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునిత, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, కలెక్టర్ అనితారాంచంద్రన్ ఉన్నారు. -
‘యాదాద్రి’కి త్వరలో సీఎం రాక..?
సాక్షి, యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి దేవస్థానం అభివృద్ధి పనులను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ త్వరలో యాదాద్రికి రానున్నట్టు తెలిసింది. చినజీయర్ స్వామితో కలిసి గుట్టను సందర్శించే సీఎం కేసీఆర్ అభివృద్ధి పనులు ఎంత మేరకు పూర్తయ్యాయి, సుదర్శన హోమం, ఆలయ ప్రారంభం తదితర అంశాలను చర్చించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే చినజీయర్ స్వామికి ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా తేదీలు ఖరారు చేసుకుని వచ్చే అవకాశాలు ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. యాదాద్రి ఆలయాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించనున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్న విషయం విధితమే. సీఎం కేసీఆర్ మాత్రం చినజీయర్‌స్వామిని కలుసుకుని వీటిపై చర్చలు జరిపిన అనంతరమే ముహూరం ఖరారు చేయనున్నట్టు సమాచారం. పనులు వేగిరం సీఎం కేసీఆర్ యాదాద్రికొండను సందర్శించనున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు పనులను వేగి రం చేశారు. యాదాద్రి ప్రధానాలయ పునర్నిర్మాణ పనులు ఇప్పటికే 90 శాతం మేర పూర్తయ్యాయి. మి గిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసేం దుకు తగు చర్యలు తీసుకుంటున్నారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా పాత వైకుంఠద్వారం తొలగించి నూతనంగా నిర్మాణం చేశారు. అదే విధంగా భక్తులు కొండపైకి వెళ్లడానికి అనుగుణంగా నూ తన మెట్ల దారిని కూడా ఏర్పాటు చేశారు.వాటి పనులు కూడా త్వరలో పూర్తి కానున్నాయి. అంతేకాదు గ ర్భాలయంలో కూడా వైటీడీఏ వైస్ చైర్మెన్ కిషన్‌రా వుతో పాటు అధికారులు జరుగుతున్న పనులపై ఎ ప్పటికప్పుడు సమీక్షలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. త్వరలో చినజీయర్ స్వామితో సీఎం సమావేశం యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవంపై సీఎం కేసీఆర్ త్వరలో చినజీయర్‌స్వామిని కలుసుకోనున్నట్టు తెలిసింది. ఫిబ్రవరిలో ఆలయ ప్రారంభోత్సవం, 1008 హోమగుండాలతో సుదర్శనహోమం, అదే విధంగా వీఐపీ సూట్స్ వంటి ప్రారంభోత్సవాలపై సుదీర్ఘంగా చర్చించనున్నట్టు సమాచారం. కాగా, సుదర్శనహోమాన్ని నిర్వహించేందుకు వేదపండితులు ఎవరిని పిలవాలి అనే అంశంపై కూడా ప్రధానంగా చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. వీటన్నింటిపై ఓ సమగ్ర నివేదిక పొందుపర్చుకున్న తర్వాతనే సీఎం వీలుంటే చినజీయర్‌స్వామితో కలిసి ఆలయాన్ని సందర్శిస్తారని విశ్వసనీయంగా తెలిసింది. -
యాదగిరిగుట్ట ఆర్టీసీలో కలకలం..
యాదగిరిగుట్ట/నిడమనూరు : ఆర్టీసీ సమ్మె కొలిక్కి రాకపోవడంతో మనోవేదనకు గురైన ఇద్దరు కార్మికులకు గుండెపోటు వచ్చింది. వీరిద్దరిని చూసి చలించిపోయిన ఓ మహిళా కండక్టర్ తీవ్ర అస్వస్థతకు గురైంది. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోవద్ద ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. వివరాలు.. తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు నడపకుండా అడ్డుకోవాలనే ఉద్దే శంతో గ్యారేజీలో విధులు నిర్వహించే పోతంశెట్టి ప్రభాకర్ బుధవారం రాత్రి డిపో పార్కింగ్‌లో పడుకున్నాడు. ఉదయం 6 గంటల ప్రాంతంలో కార్మికులందరితో కలసి ప్రభాకర్ ధర్నా చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలాడు. కార్మికులు అతడిని 108లో భువనగిరి ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం కొత్తపేటలోని సాయిసంజీవిని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని జేఏసీ నేతలు తెలిపారు. ఈ ఘటనతో చలించిపోయిన యాదగిరిగుట్ట డిపో కండక్టర్ పుష్పలత అస్వస్థతకు గురవడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి బాగానే ఉందని కార్మికులు తెలిపారు. సమ్మెపై రోజుకోరకమైన ప్రకటనలు వస్తుండటం చూసి మనోవేదనకు గురై యాదగిరిగుట్ట డిపో ఆర్టీసీ డ్రైవర్ రమేశ్ గుండెపోటుకు గురయ్యాడు. గురువారం ఇంట్లో కుటుంబ సభ్యులతో సమ్మె గురించి మాట్లాడుతూ కుప్పకూలాడు. దీంతో అతడిని మిర్యాలగూడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం హైదరాబాద్‌లోని మెడికేర్ ఆస్పత్రికి తరలించారు. మరో కార్మికుడి ఆత్మహత్యాయత్నం సాక్షి, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం సోమారంలో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. తొర్రూర్ డిపో కేంద్రంలో మేకల అశోక్ రెండేళ్ల నుంచి శ్రామిక్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సమ్మె నేపథ్యంలో జీతాలు రాక కుటుంబ పోషణ కష్టంగా మారడంతో మనస్తాపం చెందాడు. ఈ క్రమంలో పురుగుల మందు తాగాడు. దీంతో అతడిని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతోహైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. -
తీవ్రమనోవేదనతో ఆర్టీసీ కార్మికుడికి గుండెపోటు
-
కుటుంబాలతో కలిసి ఆందోళన..
యాదగిరిగుట్ట : ఆర్టీసీ కార్మికులు సమ్మె ఉధృతం చేశారు. 17వ రోజు సోమవారం కుటుంబసభ్యులతో కలిసి ఆందోళన చేపట్టారు. కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో సమస్య కొలిక్కి వస్తుందని ఆశించినా.. సర్కార్ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించకపోవడంతో పరిస్థితి యథావిధిగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కార్మికులు తమ సమ్మెను ఉధృతం చేసేందుకు నెలాఖరు వరకు ఉద్యమ కార్యాచరణను ప్రకటించి సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించారు. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ జేఏసీ కార్మికులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఆయా కార్మిక సంఘాలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. కార్మికులు వినూత్న నిరసన ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు కార్మికులంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరిగుట్ట ఆర్టీ సీ డిపో గేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. మ హిళా కార్మికులు బతుకమ్మ, కబడ్డీ ఆడి నిరసన తెలియజేశారు. ఈ సందర్భం గా పలువురు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు ప్రగతి చక్రాలను ఆపి ప్రత్యేక రాష్ట్రం సాధనకు పోరాడారని గుర్తుచేశారు. ఉద్యమంలో కీలకంగా పనిచేసిన తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని సమ్మెలోకి వెళ్తే తమ ఉద్యోగాల నుంచి తొలగిస్తామని సీ ఎం కేసీఆర్ ప్రకటించడం బాధాకరమన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తే కలిగే ప్ర యోజనాలను సీఎం కేసీఆర్‌కు ఆర్టీసీ జేఏసీ నాయకులు గతంలోనే వివరించారని, కానీ ఆర్టీసీ నష్టాల్లో ఉందని, ప్రయివేటీకరణ చేసే దిశగా వ్యూహాలు రచించడం మంచిది కాదన్నారు. విద్యార్థులకు తప్పని ఇబ్బందులు.. దసరా సెలవుల పూర్తయిన తరువాత రాష్ట్ర ప్ర భుత్వం ఆర్టీసీ కార్మికుల సమ్మెను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 19వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులను పొడగించిన విషయం తెలిసిందే. సోమవారం నుంచి విద్యాసంస్థలు తిరిగి ప్రా రంభమయ్యాయి. కానీ వివిధ రూట్లలో ఉద యం నడిచే బస్సులు సరైన సమయానికి వెళ్లకపోవడంతో విద్యార్థులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు సమయానికి బస్సులు నడపకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డెక్కిన 69 బస్సులు సోమవారం ఆర్టీసీ 56, ప్రైవేట్‌కు చెందిన 13బస్సులను అధికారులు రోడ్డెక్కించారు. మొదటి రోజు మాదిరిగానే ఆర్టీసీ అధికారులు బస్సులకు ముందు పోలీస్ ఎస్కార్ట్ వాహనాలతో తీసుకెళ్లారు. బస్టాండ్, డిపో ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీపీ మనోహర్‌రెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్ నర్సింహారావు ఆధ్వర్యంలో పోలీసు నిఘా పెట్టారు. ఇన్చార్జ్ డీఎంగా రమేష్ యాదగిరిగుట్ట డిపో ఇన్చార్జ్ మేనేజర్‌గా రమేష్ సోమవారం బాధ్యతలను స్వీకరించారు. డిపో మేనేజర్‌గా పని చేసిన రఘుకు ఆదివారం అర్ధరాత్రి నుంచి తీవ్ర జ్వరం రావడంతో ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన స్థానంలో ఇన్చార్జ్ డీఎంగా రమేష్‌ను పంపించారు. -
బైక్ ఇవ్వలేదని గొడ్డలితో..
సాక్షి, యాదగిరిగుట్ట: బైక్ ఇవ్వలేదన్న అక్కసులో ఓ యువకుడు ఇద్దరు యువకులపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ క్రమంలో అడ్డొచ్చిన బాధిత యువకుల తండ్రి తలపై గొడ్డలి వేటు పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి యాదగిరిగుట్ట పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..పట్టణంలోని వైకుంఠద్వారం వద్ద నివాసం ఉండే బొమ్మ నిఖిల్, నీరజ్ ఇద్దరు అన్నదమ్ములతో అంగడి జజార్లో ఉండే కరుణాకర్‌కు మధ్య ఇటీవల బైక్ విషయంలో గొడవ జరిగింది. ఇది మనసులో పెట్టుకున్న కరుణాకర్ వైకుంఠ ద్వారం వద్ద ఉండే నీరజ్, నిఖిల్‌పై కక్ష పెట్టుకున్నాడు. దీంతో మంగళవారం రాత్రి నిఖిల్, నీరజ్ ఉండే ఇంటికి కరుణాకర్ మారణాయుధాలతో వచ్చి హత్యాయత్నానికి పాల్పడబోయాడు. గమనించిన నిఖిల్, నీరజ్‌లు ఇంట్లోకి పరుగులు తీశారు. తలుపులు పెట్టుకున్న తర్వాత కూడా దాడికి యత్నిస్తున్న కరుణాకర్‌ను నిఖిల్, నీరజ్‌ల తండ్రి నగేష్ అడ్డుకున్నాడు. ఈ క్రమంలో కరుణాకర్ తన వద్ద ఉన్న గొడలితో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో నగేష్ తలపై గొడ్డలి వేటు పడింది. బలమైన గాయమైంది. వెంటనే కరుణాకర్ అక్కడి నుంచి పారి పోయాడు. నగేష్‌ను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్సం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి సికింద్రబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అక్కడినుంచి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో కరుణాకర్, నిఖిల్ మధ్యలో గొడవలు జరిగాయని, వారిని నిఖిల్ కుటుంబ సభ్యులు కూర్చోపెట్టి రాజీ కుదిర్చినట్లు తెలుస్తోంది. పాత కక్షలతో పాటు బైక్ విషయంలో వచ్చిన గొడవ ఇంతకు దారి తీసిందని స్థానికలు అంటున్నారు. నగేష్‌తో పాటు ఆయన కుమారులు నీరజ్, నిఖిల్‌పై హత్యాయత్నానికి పాల్పడిన కరుణాకర్‌ను పట్టణ ఇన్స్పెక్టర్ నర్సింహారావు రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నగేష్ భార్య స్వర్ణలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, కరుణాకర్‌ను రిమాండ్‌కు పంపించినట్లు సీఐ తెలిపారు. -
ఇదేమిటి యాదగిరీశా..?
సాక్షి, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పరమ పవిత్రం. తెలంగాణకే తలమానికంగా ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అలాంటి పుణ్యక్షేత్రాన్ని కొందరు అపవిత్రం చేస్తున్నారు. అత్యంత భక్తితో కొలిచే స్వామివారి సన్నిధిలోనే కొందరు పాదరక్షలు విడిచి అపవిత్రం చేస్తున్నా రు. అయినా దేవస్థానం అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెప్పుల స్టాండ్లు ఉన్నా.. యాదాద్రి దేవస్థానంలో మూడు చెప్పుల స్టాండ్లు ఉÐన్నాయి.వీటిని సంవత్సరానికి రూ.26లక్షలతో కాంట్రాక్టు కు అప్పగించారు. ఇవి కొండపైన 5 దుకాణాల్లో చెప్పులు విడిచి దర్శనానికి వెళ్లాలని అధికారులు నిర్ణయించా రు. అయితే దేవస్థానంలోని కొంతమంది అధికారులే ఆలయానికి పాదరక్షలతో వచ్చి ద్వారాల ఎదుట విడుస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీఐపీలు దర్శనానికి వచ్చే క్రమంలో కూడా పాదరక్షలతోనే వస్తున్నారని విమర్శలు ఉన్నాయి. దీంతో ఎంత పవిత్రంగా భావించే ఆలయ పరిసరాలు అపవిత్రం అవుతున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ యాదాద్రిని తిరుమల మాదిరిగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. అందుకు అనుగుణంగానే అభివృద్ధి పనులు కూడా చేస్తున్నారు. తిరుమలలో దా దాపు ఐదు కిలోమీటర్ల దూరం నుంచే పాదరక్షలతో నడవకూడదనే నిబంధనలు ఉన్నాయి. అయితే యాదాద్రిలో భద్రతా సిబ్బంది కూడా పట్టనట్లు వ్యవహరిస్తున్నానే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా దేవస్థానం అధికారులు తగు చర్యలు చేపట్టి ఆలయ పవిత్రతను కాపాడాలని భక్తులు కోరుతున్నారు. -
అద్భుత క్షేత్రంగా శివాలయం
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్ర అభివృద్ధి పనుల్లో భాగంగా నిర్మిస్తున్న శివాలయం అద్భుతంగా రూపు దిద్దుకుంటోంది. యాదగిరికొండపై ఎకరం స్థలంలో శివాలయాన్ని నభూతోనభవిష్యత్ అన్న రీతిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఆలయం చుట్టూ ప్రాకారం పూర్తి చేశారు. ప్రాకార గోడలపై అందమైన పువ్వుల డిజైన్లతోపాటు శిల్పాలను అమర్చారు. నవ నందులు, శివుడికి ప్రతి రూపాలు, అమ్మవారి అష్టలక్ష్మి శిల్పాలను ఏర్పాటు చేశారు. భక్తులను ఆకట్టుకునే విధంగా పంచతల రాజగోపురాన్ని నిర్మించారు. ఆలయంలోని గర్భాలయానికి ఎదురుగా ముఖ మండపాన్ని నిర్మిస్తున్నా రు. అదే విధంగా మరకత లింగాన్ని ప్రతిష్ట చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరో రెండు మూడు నెలల్లో పూర్తయ్యేలా పనులను వేగవంతం చేశారు. గతంలో ఉన్న ఆలయం కంటే భిన్నంగా.. సీఎం కేసీఆర్ ఆదేశాలతో యాదగిరికొండపై 14 ఎకరాల్లో ప్రధాన ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అందులో భాగంగా శివాలయాన్ని గతంలో కంటే భిన్నంగా నిర్మిస్తున్నారు. కాకతీయులు, చోళుల కాలంనాటి నిర్మాణ రీతులను ప్రామాణికంగా తీసు కుని అందుకు అనుగుణంగా ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. అంతేకాకుండా భక్తులకు అన్ని వసతుల ను ఏర్పాటు చేయడానికి వైటీడీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆలయానికి ఎదురుగా ఉన్న çవిశాలమైన స్థలంలో స్వామివారి పూజకు కావాల్సిన బిల్వం, మారేడు వృక్షాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సుమారు రూ.300 కోట్ల ప్రణాళికతో ఆలయ పనులు కొనసాగుతున్నాయి. -
యాదాద్రి గర్భాలయం ప్రారంభ తేదీలు ఖరారు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి నూతన గర్భాలయాన్ని మార్చి 3 లేదా 13 తేదీల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్‌స్వామి తేదీలను ఖరారు చేసినట్లు స్తపతి సుందరరాజన్ తెలిపారు. ఆలయ ప్రారంభ తేదీ ఖరారు కావడంతో నిర్మాణ పనుల్లో అధికారులు వేగం పెంచారు. ఇప్పటికే సప్త రాజగోపురాలతో పాటు ధ్వజస్తంభ పీఠం, బలిహరణ పీఠం దాదాపు పూర్తయ్యాయి. గర్భాలయంలో ఫ్లోరింగ్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. జనవరి 15లోపు గర్భాలయం పూర్తిస్థాయిలో నిర్మితం కానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆలయ మాడవీధులు, రాజగోపురాల మధ్య లో అతికించేందుకు శిల్పాలు త్వరలో రానున్నాయి. జనవరిలో రానున్న సీఎం కేసీఆర్... పనులు జరుగుతున్న తీరును పరిశీలించేందుకు జనవరి మొదటి వారంలో సీఎం కేసీఆర్ యాదాద్రికి రానున్నట్లు సమాచారం. త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నందున కోడ్ అమల్లోకి రాకముందే సీఎం పర్యటన ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గర్భాలయ ప్రారంభానికి మార్చిలో తేదీలను ఖరారు చేసిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ యాదాద్రి పనులను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం చిన జీయర్‌స్వామి ఖరారు చేసిన తేదీలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈసారి సీఎం కేసీఆర్ ప్రభుత్వ లాంఛనాలతో స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించే సుందరఘట్టం నూతన గర్భాలయంలోనే జరగనుంది. ముగిసిన అధ్యయనోత్సవాలు.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆరు రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు ఆదివారం ముగిశాయి. చివరిరోజు స్వామివారిని ముస్తాబు చేసిన శ్రీలక్ష్మీనరసింహుడి అలంకరణతో అధ్యయనోత్సవాలు ముగిశాయి. సుమారు 25 వేల మంది భక్తులు స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానికి ఐదు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. -
మరో ఏడుగురు బాలికలకు విముక్తి
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో వ్యభిచార నిర్మూలనకు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పోలీసులు దాడులతో బాలికలను వ్యభిచార కూపంలోకి దించుతున్న నిర్వాహకుల అరాచకాలు ఒక్కొ క్కటి వెలుగు చూస్తున్నాయి. శనివారం రాచ కొండ పోలీసులు గుట్టలో బాలికలను అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు మహిళలను అరెస్టు చేసి వారి చెరలో ఉన్న ఏడుగురు బాలికలకు విముక్తి కల్పించారు. జూలై 30న, బాలికల అక్రమ రవాణాకు పాల్పడుతున్న 8 మంది వ్యభిచార గృహ నిర్వాకులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో 11మంది చిన్నారులకు విముక్తి కల్పించారు. ఈ నెల 2న మరో 9 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని నలుగురు చిన్నారులను వారి నుంచి కాపాడారు. ఇందులో బాలికలకు హర్మోన్ ఇంజెక్షన్లు ఇస్తున్న ఓ ఆర్ఎంపీ వైద్యుడినీ అరెస్టు చేశారు. ఈనెల 10న కూడా ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకుని మరో ఇద్దరు చిన్నారులను రక్షించారు. ఇప్పటి వరకు 24 మంది చిన్నారులను రక్షించి, 24 మంది వ్యభిచార నిర్వాహకులను అరెస్టు చేశారు. ప్రత్యేక టీమ్‌ల ఏర్పాటు గుట్ట సంఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బాలికలు ఇంకా వ్యభిచార కూపా ల్లో మగ్గుతున్నారని తేలడంతో అప్రమత్తమైన పోలీస్ శాఖ ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసింది. ఎస్ఐ స్థాయి అధికారి పర్యవేక్షణలో బృం దాలను ఏర్పాటు చేసి అనుమానిత ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఐదుగురు మహిళలను అరెస్టు చేసి ఏడుగురు చిన్నారులను రక్షించారు. బాలికలను వ్యభిచార కూపాలనుంచి రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు భువనగిరి జోన్ డీసీపీ రామచంద్రారెడ్డి చెప్పారు. -
యాదగిరిగుట్ట: ఐదుగురు ఉమెన్ ట్రాఫికర్స్ అరెస్టు!
సాక్షి, యాదాద్రి : పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదిద్రిలో చిన్నారులను అక్రమంగా తరలిస్తూ.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఐదుగురు ఉమెన్ ట్రాఫికర్స్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బాలికలను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు యాదగిరి గుట్టలో దాడులు నిర్వహించారు. బ్రోతల్ హౌజ్‌లపై దాడులు నిర్వహించి.. వారి చెరలో ఉన్న ఏడుగురు చిన్నారులకు విముక్తి కల్పించారు. జిల్లాల్లో ఇప్పటి వరకు 24 మంది ఉమెన్ ట్రాఫికర్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఏడు బ్రోతల్ హౌజ్‌లను సీజ్ చేశారు. -
వ్యభిచార దందాలపై చర్యలు తీసుకోండి: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాల్లో జరుగుతున్న వ్యభిచార దందా, అకృత్యాలపై సమగ్ర విచారణ జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. వీటికి కారణమైన దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు బుధవారం ఆయన లేఖ రాశారు. యాదాద్రిలో వెలుగుచూస్తున్న విషయాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయని.. చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి, చిత్రహింసలు పెట్టి, వ్యభిచార కేంద్రాలకు అమ్మడం, వారికి పశువులకు వాడే ఇంజెక్షన్లు ఇవ్వడం చాలా దారుణమని పేర్కొన్నారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే పోలీసులు, ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. యాదగిరిగుట్టలో సుమారు 100కు పైగా కుటుంబాలు వ్యభిచార వృత్తిలో ఉన్నాయని వెల్లడించారు. వ్యభిచార గృహాల నిర్వాహకులకు రాజకీయ నేతల అండదండలుండటం, పోలీసులకు ప్రతీ నెలా మామూళ్లు అందుతుండటంతోనే ఈ అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయని తమ్మినేని ఆరోపించారు. -
యాదాద్రి ఉదంతంపై బీజేపీ నేత కిషన్‌రెడ్డి ఫైర్
-
వ్యభిచార ఊబి!
సాక్షి, సిద్దిపేట/మెదక్: అభం శుభం తెలియని చిన్నారులను అపహరించి.. వ్యభిచార ముఠాలకు అప్పగించడం, వారిని పెద్దచేసి వ్యభిచార ఊబిలోకి దింపడం లాంటి ఘటనలు యాదగిరిగుట్టలో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో బాలికల అపహరణ ముఠాల మూలాలు వెలికి తీస్తున్న రాష్ట్ర ప్రత్యేక పోలీసు బృందాలకు పలు కొత్త విషయాలు తెలుస్తున్నాయి. సిద్దిపేటతో పాటు జిల్లాలోని కొడకండ్ల (రాంచంద్రాపూర్)లో కూడా అపహరించిన ఆడపిల్లలను వ్యభిచార ఊబిలోకి దింపినట్టు సమాచారం. ఈ విషయాన్ని నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర పోలీసు ప్రత్యేక బృందాలు సిద్దిపేట జిల్లాపైనా నిఘా పెంచినట్టు తెలిసింది. ఇతర ప్రాంతాలతోనూ లింకులు.. సిద్దిపేట పట్టణం, జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లో పోలీసుల దాడుల్లో వ్యభిచార ముఠాలు పట్టుబడినప్పుడు కొంతకాలం మిన్నకుండిపోయి ఆపై యథావిధిగా తమ పనులు సాగించడం పరిపాటిగా మారింది. అనేక ఏళ్లుగా పలు కుటుంబాలు ఈ వృత్తిని కొనసాగిస్తున్నాయి. అయితే, స్థానికులే కాకుండా ఈ వ్యభిచార గృహాలకు నెల, రెండునెలలకు ఒకసారి ఇతర ప్రాంతాల అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచారం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. సిద్దిపేట, కొడకండ్లలోని వ్యభిచార గృహాల నిర్వాహకులకు యాదగిరిగుట్ట, రామాయంపేట, వంగపాడు, గీసుగొండ ప్రాంతాలు, ఏపీలోని చిలకలూరిపేట, పెద్దాపురం వంటి ప్రాంతాల వ్యభిచార రాకెట్లతోనూ సంబంధాలున్నట్టు సమాచారం. ఈ సంబంధాలతో వ్యభిచార గృహాలలో ఉండే అమ్మాయిలను ఇక్కడి వారిని అక్కడికి పంపడం.. అక్కడివారిని ఇక్కడికి తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అపహరించిన పిల్లలను సిద్దిపేటలో కూడా పెంచి పెద్ద చేస్తున్నట్టు సమాచారం. కాగా, యాదగిరిగుట్టలో పిల్లల సంఘటన వెలుగు చూసిన నేపథ్యంలో ఎప్పుడూ సందడిగా ఉండే సిద్దిపేటలోని కోమటిచెరువు సమీపంలోని వ్యభిచార గృహాలతో పాటు కొడ కండ్ల సమీపంలోని రాంచంద్రాపురం గృహాల వద్ద కొద్ది రోజులుగా స్తబ్ధత నెలకొంది. సిద్దిపేట జిల్లాలోనూ పిల్లలు.. సిద్దిపేట జిల్లాలో కూడా పలు ప్రాంతాలలో వ్యభిచార గృహాల నిర్వాహకులవద్ద 5 నుంచి 10 సంవత్సరాల వయసున్న చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. యాదగిరి గుట్టలో వెలుగు చూసిన సంఘటనతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు గుట్టలో పట్టుకున్న వారిని విచారించిన సందర్భంగా ఈ విషయం బయటపడినట్టు సమాచారం. దీంతో ప్రత్యేక బృందాలు సిద్దిపేట జిల్లాపైనా నిఘా పెంచినట్లు తెలిసింది. జప్తిశివనూరుపై నిఘా యాదగిరిగుట్టలో చిన్నారులను వ్యభిచార కూపంలోకి దించుతున్న ఘటన వెలుగు చూసిన నేపథ్యంలో మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని జప్తిశివనూరు (సరోజీనగర్)పై పోలీసులు దృష్టిపెట్టారు. గతంలో ఇక్కడ గుట్ట తరహా సంఘటనలు చోటు చేసుకున్న దృష్ట్యా మరోమారు అందరి దృష్టి జప్తిశివనూరుపై పడింది. తాజాగా ఇక్కడా చిన్నారులేమైనా ఉన్నారా.. అన్న అనుమానాలు పోలీసుల్లో వ్యక్తమవుతున్నాయి. దీంతో పోలీసులు రహస్యంగా విచారణ సాగిస్తున్నట్టు సమాచారం. జప్తిశివనూరులో వ్యభిచార గృహాలకు యాదగిరిగుట్ట, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఏపీ నుంచి కూడా యువతులను తీసుకువచ్చి వ్యభిచారం చేయించేవారు. మైనర్ పిల్లలతో వ్యభిచారం చేయించిన సంఘటనలపై గతంలో పలు కేసులు నమోదు చేశారు. గత ఏడాది మార్చిలో పోలీసుల ప్రత్యేక బృందం రాత్రి వేళ ఆకస్మికంగా జప్తిశివనూరులోని పలు గృహాలపై దాడులు చేసింది. అప్పట్లో 50 మందికిపైగా యువతులను అదుపులోకి తీసుకుని స్టేట్ హోమ్‌కు తరలించారు. ఈ దాడుల అనంతరం జప్తిశివనూరు వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గట్టి నిఘా పెట్టారు. దీంతో వ్యభిచారం కొంతవరకు సద్దుమణిగింది. తాజాగా గుట్టలో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు జరిపిన విచారణలో జప్తిశివనూరు విషయం కూడా బయటపడినట్లు తెలుస్తోంది. అక్కడ దాడులు నిర్వహించిన అధికారులు జిల్లా యంత్రాంగాన్ని అలర్ట్ చేసినట్లు సమాచారం. ఈ విషయమై ఎస్పీ చందనాదీప్తి స్పందిస్తూ జప్తిశివనూరుతోపాటు అనుమానం ఉన్న అన్ని ప్రాంతాలపై నిఘా వేసినట్లు తెలిపారు. -
యాదగిరిగుట్టలో వెలుగులోకి వస్తున్న అరాచకాలు
-
యాదగిరిగుట్ట వ్యభిచార గృహాల్లో భయంకర వాస్తవాలు
-
నేలకింద బందీలు
సాక్షి, యాదాద్రి: ఇరుకు గదులు.. మంచం పట్టేంత జాగా.. ఆ మంచం కింద నేలమాళిగలు.. వాటిలో ఒక్కరిద్దరు మనుషులు పట్టేంత స్థలం..! ఇంటి ఆవరణ, ఖాళీ ప్రదేశాల్లో మ్యాన్‌హోల్స్.. ఎవరికీ అనుమానం రాకుండా వాటిపై మంచాలు, టేబుళ్లు.. అవి తెరిచి చూస్తే ఓ మనిషి పట్టేంత జాగా..!ఎందుకు ఈ ఏర్పాట్లన్నీ? వ్యభిచార గృహాలపై పోలీసులు రైడింగ్ చేస్తే బాలికలు, యువతులను దాచిపెట్టేందుకు! చిన్నారుల శరీరాలతో సాగిస్తున్న తమ వికృత క్రీడను కప్పిపెట్టేందుకు. ఊపిరి కూడా ఆడని ఆ నేలమాళిగలు, మ్యాన్‌హోల్స్‌లో చిన్నారుల ఆర్తనాదాలను అదిమిపెట్టేందుకు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట వ్యభిచార గృహాల్లో వెలుగు చూస్తున్న భయంకర వాస్తవాలివీ. అచ్చు ముంబైలోని రెడ్‌లైట్ ఏరియా తరహాలో సాగుతున్న ఈ రాకెట్ వెనుక విస్తుగొలిపే అంశాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. పిల్లల శరీర అవయవాలు పెరిగేందుకు ఇంజెక్షన్ల ద్వారా ఈస్ట్రోజన్ హార్మోన్లు ఇవ్వడం, వ్యభిచారం చేయాల్సిందిగా రాచిరంపాన పెట్టడం, దాడుల సమయంలో దాచేందుకు పక్కాగా నేలమాళిగలు, మ్యాన్‌హోళ్ల నిర్మాణాలు.. ఇవన్నీ చూసి పోలీసులే అవాక్కవుతున్నారు. ఈ చీకటి కూపాల నుంచి ఇప్పటికే 11 మంది చిన్నారులను కాపాడిన పోలీసులు.. గురువారం ఇంకో నలుగురిని రక్షించారు. మరో ఆరుగురు వ్యభిచార గృహాల నిర్వాహకుల అరెస్టు చేశారు. బాలికలకు ఈస్ట్రోజన్ ఇంజెక్షన్లు ఇస్తున్న ఆర్ఎంపీ డాక్టర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో ఇలాగే మరికొందరు పిల్లలు వ్యభిచార గృహాల్లో మగ్గుతున్నట్టు తెలుస్తోంది. రావడం ఆలస్యమైతే ప్రాణాలకే ప్రమాదం యాదగిరిగుట్ట నుంచి పాతగుట్టకు వెళ్లే ప్రధాన రహదారిలో పట్టణం నడిబొడ్డున ఉన్న వ్యభిచార గృహాల్లో ఈ నేలమాళిగలు వెలుగు చూశాయి. ఎవరైనా అధికారులు, పోలీసులు వస్తున్నారన్న అనుమానం వస్తే చాలు నిర్వాహకులు.. చిన్నారులు, యువతులను అందులోకి పంపించేస్తారు. వారు వెళ్లిపోయాక అందులోంచి బయటికి తెస్తారు. ఎవరూ గుర్తించలేని విధంగా వీటి నిర్మాణం ఉంటుంది. భూగృహాల్లో ఇద్దరు చిన్నారుల వరకు కూర్చునే వీలుంటుంది. బయటకు రావడం ఆలస్యమైతే ఊపిరి ఆడక అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. గతంలో పిల్లలు ఇలా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉండొచ్చని స్థానికులు అంటున్నారు. ఇలాంటి గదులు ముంబై రెడ్‌లైట్ ఏరియాలో ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. అలాగే ఇంటి వరండా, ఖాళీ స్థలాల్లోనూ ఇలాంటి ఏర్పాట్లే వెలుగుచూశాయి. మనిషి పట్టేంత గుంతలు తీసి పైన మ్యాన్‌హోల్స్‌ను ఏర్పాటు చేస్తారు. ఎవరికీ అనుమానం రాకుండా వాటిపై మంచాలు, టేబుళ్లు పెడతారు. అలాగే బీరువాలు, కప్‌బోర్డులు, డోర్ల వెనుక పిల్లలను నక్కి ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇబ్బడిముబ్బడిగా ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు పిల్లలకు ఈస్ట్రోజన్ ఇంజెక్షన్ ఇస్తున్నాడన్న అనుమానంతో యాదగిరిగుట్టలోని అనురాధ నర్సింగ్‌హోంపై ఎస్వోటీ పోలీసులు దాడి చేసి ఆర్ఎంపీ వైద్యుడు నర్సింహను అరెస్ట్ చేశారు. అతడిని విచారణలో పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలికల అవయవాల ఎదుగుదల కోసం ఈస్ట్రోజన్ ఇంజెక్షన్ ఇస్తున్నట్టు తేలింది. దీంతోపాటు 48 ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇతడి వద్ద దొరికాయి. పాడి పశువుల నుంచి అధిక పాలను తీయడానికి ఈ ఇంజెక్షన్‌ను వాడుతారు. ప్రభుత్వం ఈ ఆక్సిటోసిన్‌ను నిషేధించింది. మరిన్ని దాడులకు పోలీసులు సిద్ధం యాదగిరిగుట్టతోపాటు రాజధాని శివారులోని మరికొన్ని చోట్ల దాడులు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. పోలీసుల దాడుల నేపథ్యంలో వ్యభిచార గృహ నిర్వాహకులు చిన్నారులను శివారు కేంద్రాల్లో దాచి ఉంచినట్లు తెలుస్తోంది. ఇంజెక్షన్లు ఇవ్వడంలో మరో ఇద్దరు ఆర్ఎంపీ డాక్టర్ల పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వ్యభిచార గృహ నిర్వాహకులు పిల్లల్ని కొనుగోలు చేసందుకు కొందరు ఫైనాన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు వారి కోసం ఆరా తీస్తున్నారు. -
మనుషులు కాదు..రాక్షసులు
-
పాపం పసి మొగ్గలు!
సాక్షి, యాదాద్రి : కొందరిని కిడ్నాప్ చేసి ఎత్తుకొస్తారు.. ఇంకొందరిని లక్షల రూపాయలు పోసి కొంటారు.. మరికొందరిని మాయమాటలతో పట్టుకొస్తారు.. ఎవరికీ అనుమానం రాకుండా ఆ ఆడపిల్లలు తమ పిల్లలే అని చెప్పి స్కూళ్లలో చేర్పిస్తారు.. ఎవరడిగినా తామే తల్లిదండ్రులని చెప్పాలంటూ చిత్రహింసలు పెడతారు.. శరీర అవయవాలు పెంచేందుకు, యుక్త వయస్కులుగా కనిపించేందుకు ఇంజెక్షన్ల ద్వారా హార్మోన్లు ఎక్కిస్తారు.. 14 ఏళ్లు రాగానే వ్యభిచార కూపంలోకి దింపుతారు! ముక్కుపచ్చలారని పిల్లల దేహాలతో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో సాగిస్తున్న అమానుష దందా ఇదీ!! సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కంసాని కల్యాణి అనే వ్యభిచార గృహ నిర్వాహకురాలు ఓ బాలికను చిత్రహింసలకు గురి చేస్తున్న విషయాన్ని స్థానికులు షీ టీమ్‌కు అందించడంతో ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. తీగ లాగితే డొంక కదిలినట్లుగా ఈ కేసు మూలాల్లోకి వెళ్లే కొద్దీ ఒళ్లు గగుర్పొడిచే అనేక అంశాలు బయటికి వస్తున్నాయి. అదుపులోకి తీసుకున్న అమ్మాయిని షీ టీమ్ పోలీసులు విచారించగా.. తనతోపాటు చాలా మంది బాలికలు నిర్బంధంలో ఉన్నారని చెప్పింది. విషయం బయటపడటంతో.. చిన్నారులను ఇలా మురికి కూపంలోకి దింపుతున్నవారు ఇళ్లకు తాళాలు వేసి పారిపోయారు. ఎలా పట్టుకొస్తారంటే.. పిల్లలను వ్యభిచార కూపంలోకి అమ్మేందుకు కొన్ని ముఠాలు పనిచేస్తున్నాయి. ఏపీలోని మంగళగిరి, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు తెలంగాణలోని కరీంనగర్, మెదక్, దుబ్బాక, నిజామాబాద్ జగదేవ్‌పూర్ తదితర ప్రాంతాల నుంచి ఈ ముఠా సభ్యులు పిల్లల్ని తీసుకొస్తారు. వీరు రద్దీగా ఉండే బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ఉండే ఆడపిల్లలు, ఒంటరి మహిళలను, ప్రధాన చౌరస్తాల వద్ద భిక్షాటన చేసే పిల్లల్ని టార్గెట్ చేస్తారు. వీరితోపాటు అనాథలు, ఇళ్ల నుంచి పారిపోయి వచ్చే పిల్లల్ని గుర్తించి వారిని మచ్చిక చేసుకుని తీసుకొస్తారు. తమ మాట వినకుంటే బిస్కెట్లు, కూల్‌డ్రింక్‌లలో మత్తుమందు కలిపి తినిపించి కిడ్నాప్ చేస్తారు. సాధారంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఫుట్‌పాత్‌లపై ఉన్న పిల్లల్ని నాలుగు నుంచి ఐదు రోజుల వరకు గమనించి వారితో మాట కలిపి దగ్గరవుతారు. ఈ ప్రయత్నం సఫలమైతే ఆ పిల్లలను నేరుగా వారు అనుకున్న ప్రదేశానికి తరలిస్తారు. అలా కాకుంటే కిడ్నాప్ చేస్తారు. అలాగే ఆస్పత్రులు, గిరిజన తండాలకు తిరిగి ‘మాకు పిల్లలు లేరు.. మీ పిల్లలను పెంచుకుంటాం..’అని మాయమాటలు చెప్పి తల్లిదండ్రులకు ఎంతో కొంత డబ్బులు ముట్టజెప్పి వారిని వ్యభిచార గృహాలకు అమ్మేస్తారు. ఒంటరి మహిళలను కూడా ముఠాలు టార్గెట్ చేస్తున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామని తెచ్చి వారిని వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారు. పిల్లల్ని వ్యభిచార గృహాలకు అమ్మే కొందరిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. యాదగిరిగుట్టకు చెందిన శంకర్ 2015లో పట్టుబడ్డాడు. యాదగిరి అనే మరో వ్యక్తి జైల్లో ఉన్నాడు. ఇంకా తెరవెనుక చాలామంది సూత్రధారులు ఉన్నట్లు తెలుస్తోంది. రంగును బట్టి రేటు అమ్మాయిలను తీసుకువచ్చిన ఏజెంట్లు, బ్రోకర్లు వ్యభిచార గృహాల నిర్వాహకులకు అమ్మేస్తారు. 3 నుంచి 4 సంవత్సరాల వయసున్న చిన్నారులను రంగును బట్టి రూ.30 వేల నుంచి రూ.3 లక్షల వరకు విక్రయిస్తుంటారు. యాదగిరిగుట్టలో పట్టుబడిన 13 మంది అమ్మాయిల్లో ముగ్గురిని ఇలానే కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. చిన్నారులను కొనుగోలు చేసిన వ్యభిచార గృహాల నిర్వాహకులు.. తమను తల్లిదండ్రులుగా గుర్తించాలని వారిని చిత్రహింసలకు గురి చేస్తారని తేలింది. గుండు గీయించడం, విపరీతంగా కొట్టడం, ఇనుప చువ్వలతో కాల్చడం, అన్నం, నీళ్లు ఇవ్వకుండా కడుపు మాడ్చడం వంటి హింసలకు గురి చేస్తారు. గతాన్ని మరిచిపోయేలా బీభత్సాన్ని సృష్టించి, ఎవరడిగా వారే మా తల్లిదండ్రులు అనేలా ఒప్పిస్తారు. తర్వాత పాఠశాలల్లో తమ పిల్లలుగా నమోదు చేసి చదువు చెప్పిస్తారు. తొందరగా రజస్వల అయ్యేందుకు హార్మోన్లు చిన్న వయస్సులోనే రజస్వల కావడానికి పిల్లలకు ఇంజక్షన్ల ద్వారా హర్మోన్లను ఎక్కిస్తున్నారు. ఈ ఇంజక్షన్లతో 13 ఏళ్ల అమ్మాయి 20 ఏళ్ల యుక్త వయస్కురాలిగా కనిపిస్తుంది. పోలీసుల దాడులు చేసిన వ్యభిచార గృహాల్లో ఆరు ఈస్ట్రోజన్ ఇంజక్షన్లు లభించినట్లు తెలిసింది. ఆర్ఎంపీ వైద్యుల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా పిల్లలకు ఈ సూదులు ఇప్పిస్తున్నారు. తర్వాత వ్యభిచార నిర్వాహకులు వారిని ఈ ప్రాంతాలకు దూరంగా బంధువుల వద్దకు పంపించి వ్యభిచారం చేయిస్తారు. ఒకవేళ అందుకు అంగీకరించకుంటే చిత్రహింసలకు గురిచేస్తారు. తప్పుడు పత్రాలతో స్కూళ్లో చేర్పించి.. ప్రజ్వల లెర్నింగ్ స్కూలు నుంచి ఏడుగురు అమ్మాయిలను పోలీసులు రక్షించారు. కేవలం కంసాని ఇంటి పేరు గల వారి పిల్లల కోసమే ఈ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇందులో వ్యభిచార నిర్వాహకులు తప్పుడు ధ్రువీకరణతో ఆడపిల్లలను చేర్పించారు. సోమవారం పోలీసులు రక్షించిన వారంతా 5 నుంచి 7 సంవత్సరాల బాలికలే కావడం గమనార్హం. వ్యభిచార నిర్వాహకులు రెండేళ్ల క్రితం వారిని ఈ పాఠశాలలో చేర్పించారు. మూడేళ్ల క్రితమే వెలుగులోకి.. 2015 నవంబర్ 16లో తూర్పుగోదావరికి చెందిన ఐదేళ్ల చిన్నారిని ఖమ్మంకు చెందిన సునీత, ఆదిలాబాద్‌కు చెందిన కుమార్‌లు యాదగిరిగుట్టకు చెందిన శంకర్‌కు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అమ్మారు. ఈ మేరకు కేసు కూడా నమోదైంది. అక్కడ సీసీ పుటేజీ, ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కిడ్నాపర్ల వివరాలను సేకరించేందుకు రైల్వే పోలీసులు తనిఖీలు చేశారు. సునీత, కుమార్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా.. ఐదేళ్ల చిన్నారితోపాటు మరో ముగ్గురు అమ్మాయిలను కూపంలోకి దింపినట్టు తేలింది. 11 మంది చిన్నారులకు విముక్తి: సీపీ బాలికల అక్రమ రవాణా కేసులో 8 మంది వ్యభిచార గృహ నిర్వాహకులను అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపినట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. మంగళవారం యాదగిరిగుట్టలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఓ బాలికను తల్లి చిత్రహింసలకు గురిచేస్తుందన్న సమాచారంతో కంసాని కల్యాణి అనే మహిళ ఇంటిపై దాడులు చేశామన్నారు. ఇంట్లో ఉన్న చిన్నారి ఎవరని ఆరా తీయగా తన కూతురు కాదని, కొనుగోలు చేసినట్లు తెలిపినట్లు చెప్పారు. గణేష్‌నగర్‌లో ఉంటున్న మరొకొందరు కూడా 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలను కొనుగోలు చేసినట్లు ఆమె చెప్పిందని, దీంతో వారిళ్లపై దాడులు చేసి 11 మంది చిన్నారులకు విముక్తి కల్పించామని వివరించారు. -
అరుణ్ కేసుపై ఆరా తీస్తున్నాం
యాదగిరిగుట్ట (ఆలేరు) : ఏడాది క్రితం అదృశ్యమై.. తిరిగొచ్చిన బాలుడు అరుణ్ కేసుపై ఆరా తీస్తున్నామని యాదగిరిగుట్ట టౌన్ సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది మే 16వ తేదీన అరుణ్ (బిట్టు)ను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని తల్లిదండ్రులు అశోక్–నిర్మల దంపతులు యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని తెలిపారు. అప్పటినుంచి బాలుడి అదృశ్యం కేసు మిస్టరీని ఛేదించేందుకు కృషిచేస్తున్నామన్నారు. తీసుకెళ్లిన అగంతకుడే బాలుడిని తిరిగి తీసుకువచ్చి వదిలివెళ్లడం సంతోషకరమన్నారు. అయినా అతను ఎవరు..? ఏ కారణంతో బాలు డిని తీసుకెళ్లాడు..? అన్న కోణాల్లో విచారణ జరుపుతున్నామన్నారు. బాలుడిని వదిలి వెళ్లే క్రమంలో అతడు యాదగిరిగుట్టలో ఎక్కడెక్కడ సంచరించాడు. అతడి ఆచూకీ తెలుసుకునేందుకు సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నట్టు సీఐ వివరించారు. గారాబంగా చూసుకున్నారు : అరుణ్ తనను ఇంటివద్ద నుంచి తీసుకెళ్లిన వ్యక్తి, వారి కు టుంబ సభ్యులు గారాబంగా చూసుకున్నారు. మీ నాన్న నా దగ్గరే ఉన్నాడంటే అతడి వెంట వెళ్లా. అనంతరం బస్సులో తెలియని ఊరికి తీసుకెళ్లా డు. అక్కడ నన్ను ఎవరూ కొట్టలేదు.. తిట్టలేదు. ఇటీవల ఫోన్లో మా తల్లిదండ్రి ఫొటోలు చూపిం చాడు. నేను గుర్తుపట్టడంతో ఆదివా రం సాయంత్రం యాదగిరిగుట్టకు తీసుకువచ్చి.. నా చేతిలో ఒక చిట్టీ పెట్టి తెల్లబట్టలు వేసుకున్న పోలీస్ అంకుల్‌కు అది ఇవ్వమని చెప్పి వెళ్లాడు. ఎవరా అగంతకుడు..? బాలుడిని యాదగిరిగుట్టకు తీసుకువచ్చిన వ్యక్తి ఎవరు అనే అంశాలపై ఆరా తీస్తున్నామని సీఐ తెలిపారు. బాలుడిని సుమారు 30 సంవత్సరాల వ్యక్తి యాదగిరిగుట్ట బస్టాండ్ నుంచి గ్రామపంచాయతీ వరకు తీసుకెళ్లాడని, అతడు తలపై టోపీ ధరించి ఉన్నట్లు సీసీ కెమెరాలో కనపిస్తోందన్నారు. ఆ వ్యక్తి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని, అతడు పట్టుబడితేనే బా లు డిని ఎందుకు తీసుకెళ్లారు.. ఎక్కడికి తీసుకెళ్లారు అనే అంశాలు తెలుస్తాయని చెప్పారు. త్వరలోనే కిడ్నాప్ చేసిన వ్యక్తిని పట్టుకుంటామన్నారు. -
అరుణ్ దొరికాడోచ్..
తప్పిపోయిన కుమారుడి కోసం ఆ తల్లిదండ్రి వెతకని చోటు లేదు.. మొక్కని దేవుడు లేడు.. సరిగ్గా ఏడాది తర్వాత ఆ చిరుప్రాయం స్వస్థలం యాదగిరిగుట్టలోనే ప్రత్యక్షమవ్వడంతో పేద దంపతుల ఆనందానికి అవధుల్లేవు..తమ కన్నపేగు దరికి చేరేలా చొరవచూపిన ‘సాక్షి’కి వారు ఈ సందర్భంగా ఆనందబాష్పాలతో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యాదగిరిగుట్ట (ఆలేరు) : యాదగిరి పట్టణానికి న్యాలపట్ల అశోక్, నిర్మల దంపతులకు అరుణ్ ఒక్కడే కుమారుడు. అశోక్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గతేడాది మే 16వ తేదీన అరుణ్ తన స్నేహితులతో ఆడుకుంటున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు.ఆ రోజు అరుణ్ తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అప్పటి ఏసీపీ సాదూమోహన్రెడ్డి, సీఐ రఘువీరారెడ్డి, ఎస్ఐ గోపాల్‌దాస్ ప్రభాకర్ వివిధ ప్రాంతాల్లో బాలుడి ఆచూకీ కోసం వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ ముగ్గురు పోలీస్ అధికారులు ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లారు. దీంతో ఇటీవల బాధ్యతలు తీసుకున్న ఏసీపీ శ్రీనివాసచార్యులు, టౌన్ సీఐ అశోక్ కుమార్‌లను బాలుడి తల్లిదండ్రులు కలిసి తన కొడుకు జాడ చూపాలని వేడుకున్నారు. జనసంద్రంగా పోలీస్‌స్టేషన్... ఏడాది క్రితం తప్పిపోయిన బాలుడు ఆదివారం కనిపించడంతో యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌కు బీసీకాలనీ, గుండ్లపల్లి, శ్రీరాంనగర్ ప్రాంతాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో చేరుకున్నారు. బాలుడిని చూసి అరుణ్ బంధువులతో పాటు స్థానిక ప్రజలు కన్నీరుకార్చారు. సంవత్సరం అంతా చిన్నారి ఎక్కడ ఉన్నాడు.. ఎలా ఉన్నాడు.. ఏమీ చేశాడని పలువురు బాలుడిని అడిగే ప్రయత్నం చేశారు. దీంతో బాలుడు తల్లిదండ్రులతో పాటు అమ్మమ్మ తాతా, తన స్నేహితులను ప్రతి ఒక్కరిని పేరుపెట్టి అడగడంతో అందరూ ఆనందం వ్యక్తం చేశారు. ఆ చిట్టీలో ఏముంది..? అరుణ్‌ను పాతగుట్ట చౌరస్తాలో సుమారు సాయంత్రం 4.20గంటల సమయంలో ఓ కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చి వదిలి వెళ్లారని తెలుస్తోంది. వారు వెళ్లే ముందు బాలుడి జేబులో ఓ చిట్టీని ఆ వ్యక్తులు పెట్టి వెళ్లారని తెలుస్తోంది. ఆ చిట్టీలో ‘నాకు ముగ్గురు కూతుళ్లు.. మగపిల్లలు లేరు.. అరుణ్‌ను నాకు రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ సమీపంలో కనిపించాడు.. అతడిని అక్కడి నుంచి తీసుకెళ్లాను.. ఇటీవల ఓ దిన పత్రికలో వచ్చిన కథనం చూసి బాలుడిని ఇక్కడ వదిలేసి వెళ్తున్నా.. వేరే ఏ దురుద్దేశంతో బాలుడిని తీసుకెళ్లలేదు.. నన్ను క్షమించండి’ ఉందని తెలుస్తోంది. కారు ఎక్కడి నుంచి వచ్చింది.. ఆ కారులో ఎవరు ఉన్నారనే అంశాలపై సీఐ అశోక్ కుమార్ ఆరా తీస్తున్నారు. బాలుడిని తీసుకెళ్లిన వ్యక్తులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. అరుణ్‌ను ఎవరైనా కిడ్నాప్ చేసి ఈ రోజు వదిలి వెళ్లిన వ్యక్తులకు అమ్మారా.. లేక.. ఇక్కడి నుంచి అరుణ్‌ను తీసుకెళ్లిన వ్యక్తులే పెంచుకుంటున్నారా అనే అంశాలు తెలియాల్సి ఉంది. ఆస్పత్రికి బాలుడి తరలింపు ఏడాది తర్వాత కనిపించిన అరుణ్‌ను స్థానిక సీఐ అశోక్‌కుమార్ ఆస్పత్రికి తరలించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే అంశాలపై ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు సీఐ వెల్లడించారు. అరుణ్ వద్ద పూర్తి వివరాలు సేకరించి మీడియాకు తెలుపుతామని సీఐ పేర్కొన్నారు. ‘సాక్షి’కి ప్రత్యేక ధన్యవాదాలు... సాక్షి పత్రికలో ఈ నెల 16వ తేదీన ప్రచురితమైన కథనంతోనే తమ కొడుకు దొరికాడని అరుణ్ తల్లిదండ్రులు న్యాలపట్ల అశోక్–నిర్మల తెలిపారు. ఇటీవల సాక్షి పత్రికల్లో కథనాలు రావడంతోనే ఆ వ్యక్తి అరుణ్‌ను గుట్టలో వదిలేసి వెళ్లారని చెప్పారు. ట్రాఫిక్ పోలీసుల చెంత...ఏడాది క్రితం ఇంట్లో నుంచి కిడ్నాప్ అయినా అరుణ్.. ఆదివారం పాతగుట్ట చౌరస్తా వద్ద ఏడ్చూకుంటూ తిరుగుతున్నాడు. దీంతో వాహనాలను క్రమబద్ధీకరిస్తున్న ట్రాఫిక్ సీఐ ప్రవీణ్‌కుమార్, కానిస్టేబుల్స్ గోవర్ధన్, సిద్దులు, నర్సింహలు బాలుడి వద్దకు వెళ్లి ఎవరని ఆరా తీశారు. దీంతో అరుణ్ మాది గుట్టనే.. నేను ఆటోడ్రైవర్ కొడుకును అని చెప్పాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి టౌన్ సీఐ అశోక్‌కుమార్‌కు అప్పగించారు. ఇటీవల సాక్షి పత్రికలో వచ్చిన కథనంలో బాలుడిలానే ఉన్నాడని సీఐ అశోక్ కుమార్ అరుణ్ తల్లిదండ్రులు అశోక్–నిర్మలలకు సమాచారం ఇచ్చారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న అరుణ్ తల్లిదండ్రులతో పాటు యాదగిరిగుట్ట ఎంపీపీ గడ్డమీది స్వప్నరవీందర్గౌడ్లు అనంద బాష్పాలతో కన్నీరు కార్చారు. ఈనెల 16న సాక్షి కథనంతో... ఈనెల 16వ తేదీన సాక్షి మినీలో ‘ బాలుడి ఆచూకీ ఎక్కడ..? అరుణ్ కనిపించక నేటికి ఏడాది.. కిడ్నాప్ అయ్యాడా..? తప్పిపోయాడా..? ఎమయ్యాడో స్పష్టత కరువు.. బాలుడి కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు..’ అనే కోణంలో కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంతో అప్రమత్తమైన పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బాలుడి తల్లిదండ్రులతో స్థానిక టౌన్ సీఐ అశోక్ కుమార్ పలుమార్లు కలిసి.. ఏవరైనా శత్రువులు ఉన్నారా.. ఎవరిపైన అనుమానం ఉందా.. అనే అంశాలపై ఇటీవల ఆరా తీశారు.ప్రత్యేకంగా ఆయనే రంగంలోకి దిగి బాలుడి ఆచూకీ కోసం వెతకడానికి సిద్ధమయ్యాడు. దీంతో ఆదివారం బాలుడు యాదగిరిగుట్ట పట్టణంలోని పాతగుట్ట చౌరస్తాలో కనిపించాడు. -
ఫోర్జరీ కేసులో మాజీ ఎమ్మెల్యే
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మండలంలో 250 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు సంతకాలు ఫోర్జరీ చేసిన కేసులో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్, ఆయన భార్య, కుమారుడు నిందితులుగా గుర్తించామని డీసీపీ యాదగిరి తెలిపారు. ఇందుకు సంబంధించి ముగ్గురుని అరెస్ట్ చేసి శనివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్ సహా మరో ఏడుగురిపై కేసులు నమోదు అయ్యాయి. అయితే, భిక్షమయ్య గౌడ్, ఆయన భార్య సువర్ణ, కొడుకు ప్రవీణ్ ముందుగానే బెయిల్ పొందారు. నిపుణుల విచారణలో ఫోర్జరీ జరగడం వాస్తవమని తేలడంతో బెయిల్ రద్దు కోసం పిటిషన్ వేస్తామని డీసీపీ యాదగిరి తెలిపారు. మరో ఇద్దరిని తొందరలోనే పట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు. -
అటూ ఇటూ భక్తాద్రి.. నడుమ యాదాద్రి
యాదాద్రిలో భక్తుల వసతికి గుట్టపై మినీ పట్టణం - 940 ఎకరాల్లో ఏర్పాట్లు.. వీఐపీ అతిథుల కోసం మరో గుట్ట - వందల్లో కాటేజీలు, హోటళ్లు, ఆసుపత్రులు, ఉద్యానవనాలు - రెండు మూడేళ్లలో సర్వాంగ సుందరంగా ముస్తాబు - వచ్చే మార్చిలో బ్రహ్మోత్సవాలకల్లా ప్రధాన ఆలయం సిద్ధం - 4 మాడవీధులు, 7 గోపురాలు, ప్రధాన మండపంతో కనువిందు సాక్షి, హైదరాబాద్: నీవుండేదా కొండపై నా స్వామి... నేనుండేదీ నేలపై అంటూ ఓ భక్తుడు అప్పుడెప్పుడో పాడుకున్నాడు. కానీ.. యాదగిరీశుడి సన్నిధిలో ‘నీవుండేదా కొండపై నా స్వామి.. నేనుండేదీ కొండపై..’ అని భక్తులు పాడుకోనున్నారు! యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఓ కొండపై కొలువుదీరితే, స్వామిని దర్శించేందుకు వచ్చే భక్తులు మరో రెండు గుట్టలపై ఉండనున్నారు. తొమ్మిది గుట్టలతో యాదాద్రి క్షేత్రం అభివృద్ధి చెందనుండటం తెలిసిందే. వాటిలో రెండింటిని భక్తుల వసతి గృహాలకు కేటాయించారు. ఈ రెండింటిలో పెద్ద గుట్టపై భారీ పట్టణమే వెలవనుంది. నిర్మాణ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. అవి పూర్తయ్యేందుకు మరో రెండుమూడేళ్లు పట్టే అవకాశముంది. ప్రధానాలయ ప్రాంగణం వచ్చే మార్చి నాటికి సిద్ధమయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే జరిగితే మార్చిలో స్వామివారి బ్రహ్మోత్సవాల నాటికి ప్రధానాలయం కొత్త రూపుతో భక్తులను మంత్రముగ్ధులను చేయనుంది. 4 మాడ వీధులు, 7 గోపురాలు, విమానగోపురం, ప్రధాన మండపం సిద్ధమయ్యేలా పనులు జరుగుతున్నాయి. రూ.1,900 కోట్లు అవసరమని భావిస్తున్న ఈ పనుల్లో రూ.300 కోట్ల వ్యయంతో తొలి దశ సిద్ధమవుతోంది. తొమ్మిది గుట్టల్లో రెండు భక్తులకే యాదగిరీశుడు వెలిసిన గుట్టకు చుట్టూ ఉన్న గిరులను ప్రత్యేక ఇతివృత్తాలతో అభివృద్ధి చేయబోతున్నారు. రెండు గుట్టలను భక్తుల విడిది కేంద్రాల పనులు మొదలయ్యాయి. ఒక గుట్టను రాష్ట్రపతి, ప్రధాని, మంత్రులు, ఇతర ప్రముఖులకు కేటాయించారు. మరో గుట్టను ఖరీదైన భక్తులుండే కాటేజీల నిర్మాణానికి కేటాయించారు. వీవీఐపీల వసతి గృహాలు నిర్మించే గుట్టపై 13.25 ఎకరాల స్థలమే ఉంది. మరో గుట్టపై ఏకంగా 945 ఎకరాల్లో కాటేజీలు రానున్నాయి. భక్తులుండేందుకు వీలుగా వందలాది కాటేజీలు, హోటళ్లు, ఉద్యానవనాలు, ఆసుపత్రి, శుభకార్యాల నిర్వహణకు కల్యాణ మండపం, పార్కింగ్... ఇలా పెద్ద గుట్టపై ఓ పట్టణమే రూపుదిద్దుకోబోతోంది. తొలి విడతలో 250 ఎకరాల్లో పనులు మొదలుపెట్టారు. రోడ్ల నిర్మాణం, ప్లాటింగ్ పూర్తయింది. ప్లాట్లను దాతల కోసం సిద్ధం చేశారు. కాటేజీల నిర్మాణానికి ముందుకొచ్చే దాతలకు ప్లాట్లను కేటాయిస్తారు. ఒక్కోటి నాలుగు పడక గదుల క్వార్టర్లను నిర్మిస్తారు. వాటిని గుట్ట దేవాలయాభివృద్ధి సంస్థ నిర్దేశించిన నమూనాల్లోనే నిర్మించాల్సి ఉంటుంది. లేదంటే ఆ నిధులు అందజేస్తే సంస్థే వాటిని నిర్మిస్తుంది. ఆ కాటేజీలను తిరుమల తరహాలో దాతలకు ఏడాదిలో 30 రోజులు కేటాయిస్తారు. దాతలు, వారు సిఫారసు చేసినవారు ఆయా రోజుల్లో వాటిలో ఉచితంగా ఉండొచ్చు. అద్భుత శిల్పకళతో ప్రధాన క్షేత్రం లక్ష్మీ నరసింహుడు ప్రస్తుతం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బాలాలయంలో కొలువుదీరాడు. గత ఏప్రిల్‌లో ప్రధానాలయాన్ని మూసేసి పనులు ప్రారంభించడం తెలిసిందే. ప్రధానాలయం 4.2 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రస్తుతం 2.33 ఎకరాల్లో పనులు జరుగుతున్నాయి. తిరుమల తరహాలో ఎత్తయిన ప్రాకారాలతో నాలుగు మాడ వీధులు సిద్ధం చేస్తున్నారు. నాలుగు వైపులా నాలుగు గోపురాలతోపాటు మొత్తం ఏడు గోపురాలు నిర్మిస్తారు. వీటిలో రెండు గోపురాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మిగతా వాటి బేస్మెంట్లు సిద్ధమయ్యాయి. ప్రధాన మండపం, దానిపై ప్రస్తుత శిఖరాన్ని అనుసరిస్తూ కొత్త శిఖరాన్ని నిర్మిస్తారు. స్వామివారు వెలిసిన గుట్ట భాగాన్ని అలాగే ఉంచి దానిపై మండపాన్ని నిర్మిస్తారు. ప్రధానాలయ నిర్మాణంలో ఎక్కడా సిమెంట్ వాడటం లేదు. పనులను వేగంగా పూర్తి చేస్తున్నట్టు యాడా ఉపాధ్యక్షుడు కిషన్‌రావు తెలిపారు. కాకతీయ, విజయనగర శిల్ప సౌందర్యం ఉట్టిపడేలా రాతి శిల్పాలు సిద్ధం చేస్తున్నారు. 500 మంది శిల్పులు ఈ పనుల్లో తలమునకలుగా ఉన్నారు. యాదాద్రితోపాటు ఏపీలోని ఆళ్లగడ్డ, మార్టూరు ప్రాంతాల్లో శిల్పులు వాటిని సిద్ధం చేస్తున్నారు. 12 మంది ఆళ్వార్ల విగ్రహాలతో బృహత్ మండపం రూపుదిద్దుకో నుంది. నాలుగు విగ్రహాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. 11.9 అడుగుల వెడల్పున్న ఆలయం ఈ భారీ నిర్మాణాలతో 48 అడుగులకు పెరగనుంది. ఎత్తు కూడా రెట్టింపై 48 అడుగులకు చేరుతుంది. దీంతో పైన ఇతర భవనాలేవీ ఉండవు. పార్కింగ్ సహా అన్నీ దిగువే ఉంటాయి. దిగువన ఏడు వేల కార్లను పార్క్ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గుట్ట కిందే గుండం, కల్యాణకట్ట స్వామివారికి తలనీలాలు సమర్పించే కల్యాణ కట్ట ప్రస్తుతం క్షేత్రం పక్కనే ఉంది. ఆ పక్కనే గుండం (కోనేరు) ఉంది. భవిష్యత్తులో ఈ రెంటినీ కిందకు మారుస్తారు. ప్రస్తుత గుండం అలాగే ఉంటుంది. స్వామి దీక్షలో ఉన్నవారు అందులో స్నానమాచరించవచ్చు. భక్తుల కోసం దిగువన భారీ కోనేటిని నిర్మిస్తున్నారు. కొండ చుట్టూ 100 అడుగుల సర్క్యులర్ రోడ్డు, గిరి ప్రదక్షిణ రోడ్డు ఏర్పాటవుతున్నాయి. కల్యాణ మండపం, ఆర్టీసీ డిపో, బస్టాండ్, భారీ పార్కింగ్ స్థలం, పూజారుల అగ్రహారం, డార్మిటరీ, సాధారణ భక్తుల వసతి గృహ సముదాయాలు, యాగశాల, ప్రవచనశాల, వ్రత మండపం తదితరాలు దిగువన ఏర్పాటు కానున్నాయి. ఆలయం వద్ద 30 వేల మందికి సరిపడా క్యూలైన్లు సిద్ధం చేస్తారు. గుట్టపైకి ఎక్కేందుకు, దిగేందుకు విడిగా దారులు ఏర్పాటవుతున్నాయి. క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామిది 108 అడుగుల భారీ విగ్రహం ఏర్పాటవుతుంది. వచ్చే మార్చి బ్రహోత్సవాల నాటికి ఆలయ పనులు, మరో ఏడాదిన్నర, రెండేళ్లలో మిగతా పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. -
యాదాద్రిలో సదుపాయాలెలా ఉన్నాయి..?
తెలియజేయాలని దేవాదాయ శాఖకు హైకోర్టు ఆదేశం ‘సాక్షి’ పత్రికలో వార్త.. పిల్‌గా స్వీకరణ సాక్షి, హైదరాబాద్: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో భక్తులకు కల్పించే కనీస సౌకర్యాలు, వైద్య సదుపాయా ల కల్పన ఏవిధంగా ఉందో తెలియజేయాలని తెలం గాణ సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. యాదగిరిగుట్టలోని భక్తులు స్నానమాచరించే గుండంలో పడి గత నెల 3న పదేళ్ల బాలుడు మృతి చెందాడు. ‘విష్ణు పుష్కరిణిలో పడి బాలుడి మృతి’ పేరిట జూన్ 4న ‘సాక్షి’లో వచ్చిన వార్తను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. ఈ పిల్‌ను మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ తెల్లప్రోలు రజనీలతో కూడిన ధర్మాసనం విచారించింది. నాగర్‌కర్నూల్ జిల్లా షాన్‌పల్లికి చెందిన చెవ్వొల బాలస్వామి కుమారుడు శివకుమార్ హైదరాబాద్‌లో ఉండే మేనమామ వీరయ్యతో కలసి యాదాద్రికి వెళ్లాడు. స్నానం చేసేందుకు గుండంలోకి దిగిన బాలుడు లోతైన ప్రాంతంలోకి వెళ్లడంతో మునిగిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలుడు మరణించాడని వైద్యులు తెలిపారు. ఈ కేసును విచారించిన ధర్మాసనం యాదాద్రిలో భక్తుల సౌకర్యాలు ఏవిధంగా ఉన్నా యో, వైద్య సదుపాయాల కల్పన ఎలా ఉందో తెలపాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం విచారణను ఆగస్టు 1వ తేదీకి వాయిదా వేసింది. -
యాదగిరిగుట్టలో దారుణం
యాదగిరిగుట్ట(యాదాద్రి భువనగిరి జిల్లా): యాదగిరిగుట్ట పట్టణంలోని యాదగిరిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. శుభకార్యం జరగాల్సిన ఇంట్లో ప్రేమోన్మాది విషాదం రేపాడు. ప్రేమించలేదన్న కోపంతో యువతిని ఉన్మాది పొడిచి చంపాడు. స్థానికంగా నివసిస్తున్న గాయత్రి(22) అనే యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే కాలనీలో నివాసముంటున్న శ్రీకాంత్ అనే యువకుడు కత్తితో పొడిచాడు. ఆరుసార్లు బలంగా కడుపులో పొడవడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు అప్రమత్తమై ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది. ఘటన అనంతరం నిందితుడు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. రేపు గాయత్రికి రేపు వివాహ నిశ్చితార్థం జరగనున్న నేపథ్యంలో ఈ దారుణం చోటుచేసుకోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. గాయత్రిని కొంత కాలంగా శ్రీకాంత్ వేధిస్తున్నాడని గాయత్రి బంధువులు వెల్లడించారు. తనను ప్రేమించలేదన్న అక్కసుతోనే అతడీ ఘాతుకానికి పాల్పడినట్టు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యాదగిరీశుడిని దర్శించుకున్న మంత్రులు
యాదాద్రి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహుడిని తెలంగాణ మంత్రులు మంగళవారం దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత రెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వారికి ఆలయ ఆర్చుకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం బాలాలయ మండపంలో అర్చకులు వారికి ఆశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి గీత స్వామి వారి ప్రసాదాలు అందజేశారు. -
అగ్నిప్రమాదంలో వంద గుడిసెలు దగ్ధం
యాదగిరిగుట్ట: యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వంద గుడిసెలకు పైగా కాలి బూడిదయ్యాయి. యాదగిరిగుట్టలో సాయిపవన్ కన్స్ట్రక్షన్ కంపెనీ అభివృద్ధి పనులు చేపట్టింది. ఈ కంపెనీలో పనిచేస్తున్న పశ్చిమబెంగాల్, బిహార్, ఒడిశాకు చెందిన కూలీలు పనులు జరిగే సమీపంలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. శనివారం ఉదయం కూలీలు పనిలోకి వెళ్లగా ఒక గుడిసెలో ప్రమాదవశాత్తు అంటుకున్న మంటలు సమీపంలో ఉన్న వందకుపైగా గుడిసెలకు వ్యాపించాయి. అప్రమత్తమైన కూలీలు మంటలను కంపెనీ వాహనాల సహాయంతో నీళ్లు తెచ్చి ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే గుడిసెలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. రెండు ఆవులు మృత్యువాత పడ్డాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. రెవెన్యూ అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
స్వామివారి ఆదాయం 14, ఖర్చు 11
- అమ్మవారి ఆదాయం 14 , ఖర్చు 2 - ఘనంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనారసింహస్వామి పంచాంగ శ్రవణం యాదగిరికొండ: యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీనారసింహ స్వామి దేవస్థానంలో బుధవారం హేవళంబినామ సంవత్సరం సందర్భంగా ఉగాది పండుగను, పంచాంగ శ్రవణాన్ని అర్చకులు, పురోహితులు ఘనంగా నిర్వహించారు. స్వామివారిది స్వాతి నక్షత్రం తులారాశి 14 ఆదాయం, 11 ఖర్చు, ఆండాళు అమ్మవారిది పుబ్బ నక్షత్రం సింహరాశి 14 ఆదాయం, 2 ఖర్చుగా వచ్చిందని పురోహితులు తెలిపారు. ఈ ఏడాది అందరికీ కాలం కలిసి వస్తుందన్నారు. పంటలు సమృద్ధిగా పండి రైతులు ధాన్యరాశులను ధనరాశులుగా పోస్తారని పేర్కొన్నారు. వర్షాకాలంలో చెరువులు, కుంటలు, జలాశయాలు పొంగి పొర్లి జలపాతాలను తలపిస్తాయన్నారు. నూతనంగా నిర్మిస్తున్న ఆలయం పూర్తవుతుందనీ, ఈ ఏడాది స్వామి, అమ్మవార్ల ఉత్సవాలన్నీ కొత్త ఆలయంలోనే జరుపుకొంటామని జోస్యం చెప్పారు. దేవస్థానం ఖజానా నిండుతుందన్నారు. రాష్ట్ర ప్రజలు ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతారని, ప్రజానీకం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నలుగురు వేద పండితులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్, కలెక్టర్ అనితా రాంచంద్రన్, దేవస్థానం చైర్మన్ బి.నరసింహమూర్తి, ఈవో గీతారెడ్డి, అర్చకులు నల్లందీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, ఆలయ అధికారులు దోర్భల భాస్కరశర్మ, చలమాచార్యులు, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
28నే ఉగాది జరుపుకోవాలి
యాదగిరిగుట్ట: శ్రీ హేమలంబ నామ ఉగాది పండుగను ఈనెల 28వ తేదీనే ప్రజలు జరుపుకోవాలని కంచిపీఠ ఆస్థాన పంచాంగకర్త సుబ్రమణ్య సిద్ధాంతి శ్రీనివాస గార్గేయ కోరారు. మార్చి 28వ తేదీనా లేక 29వ తేదీ రోజున ఉగాది పండుగ జరుపుకోవాలా అని సందిగ్ధం అందరిలోనూ ఉందని ఆయన తెలిపారు. శాస్త్రీయతను చాటి చెప్పే దృగ్గణితం ప్రామాణికంగా 28వ తేదీన పండుగ చేసుకోవాలని కొడకండ్ల సిద్దాంతి (పాలకుర్తి నృసింహరామ సిద్దాంతిఽ) తెలిపినట్లు ఆయన వెల్లడించారు. -
ఒకే గదిలో ఐదుగురు డిబార్
యాదగిరిగుట్ట: ఇంటర్ ద్వితియ సంవత్సరం పరీక్షల్లో భాగంగా ఒకే గదిలో పరీక్ష రాస్తున్న ఐదుగురు విద్యార్థులను అధికారులు డీబార్ చేశారు. యాదాద్రి జిల్లా యాదగిరిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఈ సంఘటన జరిగింది. నేడు జరుగుతున్న ఇంటర్ ద్వితియ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష సందర్భంగా వీరంతా మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతు పట్టుబడ్డారు. జిల్లాలోని పరీక్ష కేంద్రాలను పరిశీలించిన రిజనల్ జాయింట్ డైరెక్టర్ సుహాసిని ఇది గుర్తించి అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి వచ్చే సమయంలో సరిగ్గా తనిఖీలు నిర్వహించవకపోవడం పై మండిపడ్డారు. కామారెడ్డిలో మరో ముగ్గురు: ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ పరీక్షా కేంద్రంలో ముగ్గురు ఇంటర్ విద్యార్థులు డిబార్ అయ్యారు. ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీకి వచ్చిన సమయంలో ముగ్గురు విద్యార్థులు కాపీ కొడుతూ పట్టుపడటంతో స్క్వాడ్ అధికారి నాగరాజు వారిని డిబార్ చేశారు. -
వైశ్యులకు ప్రభుత్వ పథకాలు అందాలి
యాదగిరిగుట్ట : ఆర్యవైశ్యులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని మైలార్‌గూడెంలో ఆదివారం జరిగిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ యాదాద్రిభువనగిరి జిల్లా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. దేశంలో వైశ్య సంఘాలు ఎన్నో పుట్టుకొస్తున్నాయని, అవన్నీ నిరుపేదలకు సహాయం చేసేందుకు పోటీపడాలన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ భగవంతుడిచ్చిన వరం వైశ్యులని పేర్కొన్నారు. ఘర్షణలు జరగకుండా ప్ర«శాంత జీవి తం గడపడంలో వైశ్యులు ముందుంటారని తెలిపారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్యవైశ్యుల అభివృద్ధికి ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. యా దాద్రి పుణ్యక్షేత్రంలో వైశ్యులు లోటస్‌టెంపుల్ ఏర్పా టుచేసి ఇక్కడికి వచ్చే భక్తులకు నిత్యన్నదానం చేయ డం సంతోషకరమని పేర్కొన్నారు. ఐవీఎఫ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గంజి రాజమౌళిగుప్త, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, దక్షిణాది రాష్ట్రాల ఇన్చార్జి ఉప్పల శ్రీనివాస్‌గుప్త మాట్లాడుతూ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేద వైశ్యులకు సహకారం చేయాలని కోరారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో త్వరలో నియమించే ట్రస్ట్ బోర్డులో వైశ్యులకు చోటు కల్పించాలని కోరారు. అనంతరం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన తాళ్లపల్లి విశ్వనాథం, ప్రధాన కార్యదర్శి వంగపల్లి అంజయ్యగుప్త, కోశాధికారి తడ్క వెంకటేష్, మహిళ అధ్యక్షురాలు సముద్రాల కల్పన, యువజన సంఘం అధ్యక్షుడు సముద్రాల శ్రీనివాస్ గుప్తతో పాటు కార్యవర్గ సభ్యులను ఉప్పల శ్రీనివాస్‌గుప్త ప్ర మాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ మహిళ అధ్యక్షురాలు మలిపెద్ది మేఘమాల, చకిలం రమణయ్య, శింగిరికొండ నర్సిం హులు, ఉడుతా పురుషోత్తం, గౌరిశెట్టి ప్రభాకర్, పబ్బా చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కాలె సుమలత, నర్సింహమూర్తి, ఎంపీపీ గడ్డమీది స్వప్న, జెడ్పీటీసీ కర్రె కమలమ్మ పాల్గొన్నారు. -
అట్టహాసంగా కైట్ ఫెస్టివల్
సాక్షి, యాదాద్రి /యాదగిరికొండ / యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలోని పెద్దగుట్టపై జరిగిన అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు పతంగులను ఎగురవేసి సంబ రాలు జరుపుకున్నారు. నింగిలో ఎగురుతున్న పతంగులను చూసి స్థానిక ప్రజలు ఆనందపారవశ్యంతో మునిగితేలా రు. ఫెస్టివల్‌కు భువనగిరికి చెందిన బచ్పన్ పాఠశాల, వివిధ ఇంజనీరింగ్ కలేజీల విద్యార్థులు వలంట రీలుగా వ్యవహరించారు. ఆరోగ్య శిబిరం ఏర్పాటు కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్న ప్రదేశంలో జిల్లా వైద్యాధికారి డీకే చారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్‌రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, అర్అండ్బీ చీఫ్ ఇంజనీర్ నాయక్ ప్రారంభించారు. మధ్యాహ్న సమయంలో పెద్దగుట్టపై ఎండ ఎక్కువగా ఉండటంతో జిల్లా కలెక్టర్ బీపీ చెక్ చేయించుకున్నారు. అనంతరం వైద్యులు కలెక్టర్‌కు గ్లూకోజ్ తాగించారు. ప్రత్యేక ఆకర్షణగా చేనేత వస్త్రాలు ఈ కైట్ ఫెస్టివల్లో చేనేత వస్త్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరూ ధరించాలన్న తెలంగాణ ప్రభుత్వం సూచనలతో ఈ వేడుకలు జరుగుతున్న సమయంలో భూదాన్‌పోచంపల్లి నుంచి తీసుకొచ్చి ఇక్కడ విక్రయించారు. ఎక్కువగా చీరలు తీసుకురావడంతో అధిక సంఖ్యలో మహిళలు అక్కడికి చేరుకొని తిలకించారు. అలాగే వేడుకలు జరుగుతున్న సమయంలో ఎలాంటి అగ్ని ప్రమాదం జరగకుండా భువనగిరి అగ్నిమాపక కేంద్రం నుంచి ఫైరింజన్ తీసుకువచ్చారు. సంక్రాంతి రోజున జరిగిన అగ్నిప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా ఈ ఫైరింజన్‌ను తీసుకువచ్చారు. అందరికీ తెల్ల టోపీలు తెలంగాణ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ పే రిట వైటీడీఏ అధికారులు అక్కడికి వచ్చిన భక్తులకు, ప్రజలకు, విదేశీయులకు శాంతి ని కోరుతూ తెల్లటోపీలను ఉచితంగా అం దజేశారు. వచ్చిన అతిథులు కూర్చోవడానికి శామియానాలతో పాటు కుర్చీలను ఏర్పాటు చేశారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక రుచులు పెద్దగుట్టపై తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఫుడ్‌కోర్టు ఏర్పాటు చేశారు. ఇందులో సమోసా, మిర్చీలు, స్యాండ్విచ్ వంటి ఆహార పదార్థాలను విక్రయించారు. చిరువ్యాపారుల సందడి పతంగుల పండుగ సందర్భంగా చిరువ్యాపారులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పుట్నాలు, జామకాయలు, ఐస్‌క్రీమ్స్ వ్యాపారులు వచ్చి తమ వ్యాపారాన్ని కొనసాగించారు.జేసీ జి.రవినాయక్, ఈఓ గీతారెడ్డి, వైటీడీఏ వైస్‌చైర్మన్ కిషన్Sరావు, జౌళిశాఖ ఏడీ పద్మ, ఏసీపీ మోహన్‌రెడ్డి, తహసీల్దార్ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు -
లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న గవర్నర్
యాదాద్రి: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుక్రవారం యాదగిరి గుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు పుర్ణకుంభంతో స్వాగతం పలికారు. అర్చకుల ఆశీర్వచనం అనంతరం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దే పనులను ఆయన పరిశీలించారు.