
సాక్షి, యాదాద్రి : పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదిద్రిలో చిన్నారులను అక్రమంగా తరలిస్తూ.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఐదుగురు ఉమెన్ ట్రాఫికర్స్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బాలికలను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు యాదగిరి గుట్టలో దాడులు నిర్వహించారు. బ్రోతల్ హౌజ్‌లపై దాడులు నిర్వహించి.. వారి చెరలో ఉన్న ఏడుగురు చిన్నారులకు విముక్తి కల్పించారు. జిల్లాల్లో ఇప్పటి వరకు 24 మంది ఉమెన్ ట్రాఫికర్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఏడు బ్రోతల్ హౌజ్‌లను సీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment