IND Vs PAK: పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. టీమిండియాకు భారీ షాక్‌! | Virat Kohli Carrying A Leg Injury Ahead Of Champions Trophy 2025 India Vs Pakistan Match? Pic Goes Viral | Sakshi
Sakshi News home page

Champions Trophy IND Vs PAK: పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. టీమిండియాకు భారీ షాక్‌!

Published Sat, Feb 22 2025 5:28 PM | Last Updated on Sat, Feb 22 2025 5:48 PM

Virat Kohli carrying a leg injury for India vs Pakistan match?

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో భారత్‌-పాకిస్తాన్ మ్యాచ్‌కు సర్వం సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా దాయాదుల పోరు జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది.

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయపడినట్లు తెలుస్తోంది. నెట్ ప్రాక్టీస్‌లో ఎడమ కాలికి గాయమైనట్లు సమాచారం. తాజాగా మ్యాచ్‌కు ముందు ఆఖరి ప్రాక్టీస్ సెషన్‌లో కోహ్లి తన ఎడమ కాలికి ఐస్ ప్యాక్ పెట్టుకుని కన్పించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరలవతున్నాయి. దీంతో పాక్‌తో మ్యాచ్‌కు  కోహ్లి అందుబాటులో ఉంటాడా లేదా అన్న ఆందోళన అభిమానుల్లో నెలకొంది.

అయితే విరాట్ గాయంపై బీసీసీఐ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అప్‌డేట్ రాలేదు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కోహ్లి తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. కేవలం 22 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఒకవేళ కోహ్లి పాక్‌తో మ్యాచ్‌కు దూరమైతే రిషబ్ పంత్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. ఇక హైవోల్డేజ్‌ మ్యాచ్‌​ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

భారత్‌దే పై చేయి..
కాగా ఐసీసీ టోర్నమెంట్లలో పాకిస్తాన్‌పై భారత్‌కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది.  ఇరు జట్లు ముఖాముఖి 21 మ్యాచ్‌ల్లో తలపడగా.. 16 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించగా, పాక్ కేవలం ఐదింట మాత్రమే గెలుపొందింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఓవరాల్‌గా వన్డే క్రికెట్‌లో అయితే భారత్‌పై పాక్ పై చేయి సాధించింది.

ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు ఇప్పటివరకు ఐదు సార్లు ముఖాముఖి తలపడగా.. పాక్‌ 3, భారత్‌ 2 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. వన్డే ఫార్మాట్‌లో పాకిస్తాన్, ఇండియా ఇప్పటివరకు 153 సార్లు తలపడ్డాయి. ఈ 153 వన్డే మ్యాచ్‌లలో పాకిస్తాన్ 73 సార్లు భారత్‌ను ఓడించగా.. భారత్ 57 సార్లు విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి.
చదవండి: IND vs PAK: 'అత‌డొక అద్భుతం.. పాక్‌పై 60 బంతుల్లోనే సెంచ‌రీ చేస్తాడు'


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement