breaking news
India vs Pakistan
-
ఆసియా కప్-2025: ఒమన్ జట్టు ప్రకటన.. కెప్టెన్ మనోడే
ఆసియా కప్-2025 టోర్నమెంట్‌కు ఒమన్ తమ క్రికెట్ జట్టును ప్రకటించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగే ఈ ఈవెంట్‌కు పదిహేడు మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మంగళవారం వెల్లడించింది. ఈ జట్టుకు ఓపెనింగ్ బ్యాటర్ జతీందర్ సింగ్ (Jatinder Singh) కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.కొత్తగా నలుగురు.. కెప్టెన్ మనోడేఇక ఆసియా కప్ ఆడబోయే ఒమన్ జట్టులో జితేందర్ (పంజాబ్‌లోని లుథియానాలో జన్మించాడు)తో పాటు వినాయక్ శుక్లా, సమయ్ శ్రీవాస్తవ, ఆర్యన్ బిస్త్ తదితర భారత సంతతి ఆటగాళ్లు ఉన్నారు. మరోవైపు.. సూఫియాన్ యూసఫ్, జిక్రియా ఇస్లాం, ఫైజల్ షా, నదీం ఖాన్ కొత్తగా ఈ టీ20 జట్టులోకి వచ్చారు.ఇదే తొలిసారిఇదిలా ఉంటే.. ఒమన్ ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఒమన్ హెడ్‌కోచ్ దులీప్ మెండిస్ మాట్లాడుతూ.. ‘‘ఆసియా కప్ వంటి ప్రధాన టోర్నీలో ఆడటం మా జట్టుకు లభించిన గొప్ప అవకాశం.గ్లోబల్ వేదిక మీద మా నైపుణ్యాలు ప్రదర్శించే ఛాన్స్ దక్కినందుకు సంతోషంగా ఉంది.భారత్, పాకిస్తాన్ వంటి జట్లతో ఆడటం అద్భుతమైన అవకాశం. టీ20 మ్యాచ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఒక్క మ్యాచ్ కూడా మా రాతను మార్చేయవచ్చు.మా జట్టులో అనుభవజ్ఞులతో పాటు యువకులు కూడా ఉన్నారు. ఈ టోర్నీలో పాల్గొనడం ద్వారా మా ఆటగాళ్ల ఆత్మవిశ్వాసంతో పాటు మానసిక దృఢత్వం కూడా మరింతగా పెరుగుతుంది’’ అని హర్షం వ్యక్తం చేశాడు.ఎనిమిది జట్లుకాగా ఆసియా కప్-2025 ఈవెంట్లో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ పోటీపడతాయి. ఇక ఈ టోర్నీలో సెప్టెంబరు 12న ఒమన్ తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడుతుంది. సెప్టెంబరు 15న యూఏఈతో మ్యాచ్ ఆడనుండగా.. సెప్టెంబరు 19న టీమిండియాను ఢీకొడుతుంది.ఇదిలా ఉంటే.. ఆసియా కప్-2025 టోర్నీకి ఇప్పటికే భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ తమ జట్లను ప్రకటించగా... తాజాగా ఒమన్ కూడా ఈ జాబితాలో చేరింది. కాగా సెప్టెంబరు 9- 28 వరకు ఆసియా కప్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.ఆసియా కప్-2025 టోర్నమెంట్‌కు ఒమన్ జట్టుజతీందర్ సింగ్ (కెప్టెన్), హమ్మద్ మీర్జా, వినాయక్ శుక్లా, సూఫియాన్ యూసుఫ్, ఆశిష్ ఒడెదెరా, అమీర్ కలీమ్, మహ్మద్ నదీమ్, సూఫియాన్ మెహమూద్, ఆర్యన్ బిష్త్, కరణ్ సోనావాలే, జిక్రియా ఇస్లాం, హస్నైన్ అలీ షా, ఫైసల్ షా, మహమ్మద్ ఇమ్రాన్, షకీల్ అహ్మద్, సమయ్ శ్రీవాస్తవ.చదవండి: ఒక్క సిక్స్‌తో అంతా తలకిందులయ్యేది.. అప్పుడు నేను..: సిరాజ్ -
'టీమిండియాపై విజయం మాదే'.. మీకు అంత సీన్ లేదులే! పాక్ బౌలర్‌కు కౌంటర్
ఆసియాకప్-2025 సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురుచుస్తోంది. సెప్టెంబర్ 14న దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్ధులు భారత్, పాక్ అమీతుమీ తెల్చుకోనున్నాయి.ఈ ఆసియా జెయింట్స్ పోరు కోసం ఇరు దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. భారత జట్టు సూర్యకుమార్ కుమార్ యాదవ్ సారథ్యంలో ఈ టోర్నీ బరిలోకి దిగనుండగా.. ప్రత్యర్ధి పాక్ జట్టు సల్మాన్ అలీ అఘా కెప్టెన్సీలో ఆడనుంది. ఈ ఈవెంట్ కోసం పాక్ తమ సన్నాహకాలను ప్రారంభించింది. ఆసియాకప్ ఆరంభానికి ముందు యూఏఈ, అఫ్గానిస్తాన్‌లతో పాక్ ట్రైసిరీస్ ఆడనుంది. ప్రస్తుతం పాక్ జట్టు దుబాయ్‌లోని ఐసీసీ ఆకాడమీలో తీవ్రంగా శ్రమిస్తోంది. కాగా ఆసియాకప్‌లో భారత్-పాక్ జట్లు రెండు సార్లు తలపడే అవకాశముంది. మెన్ ఇన్ బ్లూ, మెన్ ఇన్ గ్రీన్ గ్రూపు-ఎలో ఉన్నాయి. ఈ రెండు జట్లు సూపర్ 4కి అర్హత సాధించి సెకెండ్ రౌండ్లో మళ్లీ తలపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రౌఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాతో జరిగే రెండు మ్యాచ్‌ల్లో విజయం తమదే థీమా వ్యక్తం చేశాడు."ఐసీసీ ఆకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్న హ్యారీస్ రవూఫ్‌ను ఓ అభిమాని భారత్-పాకిస్తాన్ మ్యాచ్ గురించి అడిగాడు. భారత్ జరిగే రెండు మ్యాచ్‌ల్లో గెలుపు మాదే అంటూ రవూఫ్ బదలిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రవూఫ్ కౌంటిరిస్తున్నారు. మీకు అంత సీన్ లేదులే ముందు యూఏఈ పై గెలవండి అంటూ" ఓ యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. కాగా గ్రూపు-ఎలో భారత్, పాక్‌తో పాటు యూఈఏ, ఒమన్ కూడా ఉన్నాయి. ఇక ఆసియాకప్ లో పాక్‌పై భారత్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది.ఆసియాకప్ టోర్నీ(వన్డే, టీ20)లో దాయాదులు ఇప్పటివరకు ముఖాముఖి 18 సార్లు తలపడ్డాయి. ఇందులో టీమిండియా పదింట విజయం సాధించగా.. పాక్ ఆరు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. మరో రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.ఆసియా కప్ కోసం భారత జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివం దూబే, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా మరియు రింకు సింగ్.ఆసియా కప్ కోసం పాకిస్తాన్ జట్టుసల్మాన్ ఆగా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారిస్ (వికెట్ కీపర్), హారిస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం, సాహిబ్జాదా ఫర్హాన్, సామ్ అయూబ్, సల్మాన్ మిర్జా, షాహీన్ అఫ్రిది ,సుఫియాన్ ముఖీమ్.చదవండి: 1258 బంతులు.. 521 పరుగులు.. ఆ స్టయిలే వేరు!.. వారసుడు ఎవరో? -
ODI World Cup 2025: పాకిస్తాన్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
భారత్, శ్రీలంక వేదికలగా జరగనున్న మహిళల వన్డే ప్రపంచకప్-2025 కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ప్రకటించింది. ఈ జట్టుకు సీనియర్ ఆల్‌రౌండర్ ఫాతిమా సనా నాయకత్వం వహించనుంది. ఐసీసీ టోర్నీల్లో పాక్ జట్టు కెప్టెన్‌గా ఫాతిమా సనా వ్యవహరించడం ఇదే తొలిసారి.అదే విధంగా నటాలియా పర్వైజ్, రమీన్ షమీమ్, సదాఫ్ షమాస్, సాదియా ఇక్బాల్, షావాల్ జుల్ఫికర్ వంటి యంగ్ ప్లేయర్లు తొలిసారి వన్డే ప్రపంచకప్‌లో పాక్ తరపున ఆడనున్నారు. డయానా బేగ్, ఒమైమా సోహైల్ వంటి సీనియర్ ప్లేయర్లు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.సెప్టెంబర్ 30న ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నమెంట్లో పాకిస్తాన్ మహిళల జట్టు తమ అన్ని మ్యాచ్‌లను కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆడనుంది. అదేవిధంగా ఆక్టోబర్ 5న కొలంబో వేదికగా భారత్-పాక్ జట్లు తలపడనున్నాయి.ఈ మెగా ఈవెంట్ కోసం భారత జట్టును ఇప్పటికే బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. హర్మాన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 30న గౌహతి వేదికగా శ్రీలంకతో ఆడనుంది.మహిళల వన్డే ప్రపంచకప్‌కు పాక్ జట్టుఫాతిమా సనా (కెప్టెన్), మునీబా అలీ సిద్ధిఖీ (వైస్ కెప్టెన్), అలియా రియాజ్, డయానా బేగ్, ఎమాన్ ఫాతిమా, నష్రా సుంధు, నటాలియా పర్వైజ్, ఒమైమా సొహైల్, రమీన్ షమీ, సదాఫ్ షమాస్, సాదియా ఇక్బాల్, షావాల్ జుల్ఫికర్, సిద్రా అమిన్ (సిద్రా అమీన్ మరియు) అరూబ్ షానాన్-ట్రావెలింగ్ రిజర్వ్‌లు: గుల్ ఫిరోజా, నజిహా అల్వీ, తుబా హసన్, ఉమ్-ఎ-హని మరియు వహీదా అక్తర్వన్డే వరల్డ్‌కప్-2025 టోర్నీకి భారత మహిళా క్రికెట్ జట్టుహర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీక రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, యస్తిక భాటియా, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రిచా ఘోష్, అమన్‌జోత్ కౌర్, రాధ యాదవ్, రేణుక ఠాకూర్, శ్రీచరణి, స్నేహ్ రాణా. స్టాండ్‌బై: సయాలీ సత్ఘరే, తేజల్ హసబ్నిస్, ప్రేమ రావత్, ప్రియా మిశ్రా, ఉమా ఛెత్రి, మిన్ను మణి -
షాకింగ్.. ఆసియాకప్ ఫైనల్లో ఒక్కసారి కూడా తలపడని భారత్-పాక్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఆసియాకప్-2025కు సమమయం దగ్గరపడుతోంది. ఈ ఆసియా సింహాల పోరు సెప్టెంబర్ 9నంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో ప్రారంభం కానుంది. ఈ ఖండంతర టోర్నీ కోసం అన్ని జట్లు తమ సన్నహాకాలను ప్రారంభించాయి.ఇప్పటికే భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. భారత జట్టులో శ్రేయస్ అయ్యర్, యశస్వి జైశ్వాల్ వంటి స్టార్ ప్లేయర్లు, పాక్ జట్టులో మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం వంటి సీనియర్ ప్లేయర్లు పేర్లు లేకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక టోర్నీలో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. అయితే ఆసియాకప్ టీ20 ఫార్మాట్లో మాత్రం టీమిండియా చివరగా 2016లో టైటిల్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ ఆసియాకప్ టోర్నీకి సంబంధించి అందరిని ఆశ్చర్యపరిచే విషయం ఒకటి ఉంది.ఒక్కసారి కూడా.. 41 సంవత్సరాల ఆసియాకప్ చరిత్రలో చిరకాల ప్రత్యర్ధిలు పాకిస్తాన్-భారత్ ఒక్కసారి కూడా ఫైనల్లో తలపడలేదు. ప్రపంచ క్రికెట్లో రెండు గట్టి ప్రత్యర్థులుగా ఉన్న పాక్-భారత్ ఒక్కసారి కూడా సంయుక్తంగా ఫైనల్‌కు చేరలేకపోయాయి.ఓవరాల్‌గా ఆసియాకప్ టోర్నీ(వన్డే, టీ20)లో దాయాదులు ఇప్పటివరకు ముఖాముఖి 18 సార్లు తలపడ్డాయి. ఇందులో టీమిండియా పదింట విజయం సాధించగా.. పాక్ ఆరు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. మరో రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. చివరగా రెండు జట్లు ఆసియాకప్ వన్డే ఫార్మాట్లో తలపడ్డాయి. ఆసియాకప్-2023లో పాక్‌ను 228 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. ఆసియా కప్ ఫైనల్లో భారత్, శ్రీలంక జట్లు అత్యధికంగా 9 సార్లు తలపడ్డాయి.కాగా ఆసియాకప్ చరిత్రలో భారత్ అత్యధికంగా ఎనిమిది సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. అందులో 7 సార్లు వన్డే ఫార్మాట్లో టైటిల్‌ను సొంతం చేసుకోగా.. ఒక్కసారి టీ20 ఫార్మాట్లో టీమిండియా విజేతగా నిలిచింది. ఇక భారత్ తర్వాత శ్రీలంక ఆరు సార్లు, పాకిస్తాన్ రెండుసార్లు ఈ ట్రోఫీని ముద్దాడాయి. ఇక ఈ ఏడాది ఖండాంత పోరులో భారత్-పాక్ మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా జరగనుంది.చదవండి: మా నాన్న చాలా నేర్పించారు.. కానీ అతడే నాకు రోల్ మోడల్: ఆర్యవీర్ సెహ్వాగ్ -
ఆసియాకప్ పుట్టింది ఇలా.. తొలి టైటిల్ ఎవరిదంటే?
ఆసియా దేశాల మధ్య క్రికెట్ సమరానికి సమయం ఆసన్నమవుతోంది. సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్లో మొత్తం 8 జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఇందుకోసం ఆయా జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి.ఇప్పటికే భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఈ క్రమంలో ఈ ఆసియాకప్ ఎప్పుడు మొదలైంది? ఈ ఖండాంతర టోర్నీలో భారత జట్టు రికార్డు ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.సెప్టెంబర్ 13.. 1984న ఒక కొత్త వన్డే టోర్నమెంట్ క్రికెట్ ప్రపంచానికి పరిచయమైంది. అదే ఆసియా కప్. దక్షిణాసియా పొరుగు దేశాలైన భారత్, పాకిస్తాన్, శ్రీలంకల మధ్య క్రికెట్, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచేందుకు 19 సెప్టెంబర్, 1983న ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ను స్ధాపించారు. ఈ ఏసీసీనే ఆసియాకప్ పుట్టుకకు కారణమైంది. తొలి టైటిల్ మనదే..ఆసియాకప్ తొలి ఎడిషన్‌కు యూఏఈలోని షార్జా అతిథ్యమిచ్చింది. అయితే ఈ టోర్నీలో 1983 ఐసీసీ ప్రూడెన్షియల్ ప్రపంచ కప్ విజేతగా నిలిచిన టీమిండియా పాల్గొనడంతో మరింత ప్రాధన్యత సంతరించుకుంది. అయితే ఈ టోర్నీకి 1983 ప్రపంచ కప్ గెలిచిన పూర్తి జట్టును బీసీసీఐ పంపలేదు. కపిల్ దేవ్, కె శ్రీకాంత్, సయ్యద్ కిర్మాణి, మోహిందర్ అమర్నాథ్ వంటి ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చారు. వారి స్దానంలో మనోజ్ ప్రభాకర్, చేతన్ శర్మ, సురీందర్ ఖన్నా వంటి ఆటగాళ్లు మాత్రం తొట్ట తొలి ఆసియాకప్‌లో భాగమమయ్యారు. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే సునీల్ గావస్కర్ సారథ్యంలోని భారత బృందం అద్బుతం చేసింది.ఈ మ్యాచ్‌లో శ్రీలంకను ఏకంగా 10 వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. అయితే తొలి ఎడిషన్‌లో కేవలం శ్రీలంక, భారత్, పాక్ జట్లు మాత్రమే తలపడ్డాయి. ఫైనల్లో పాక్‌ను చిత్తు చేసిన భారత్ తొట్ట తొలి ఆసియాకప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.ఏకైక జట్టుగా శ్రీలంక..ఇప్పటివరకు 16 ఆసియాకప్‌లు జరిగితే అన్ని టోర్నీలో ఆడిన ఆడిన ఏకైక జట్టుగా శ్రీలంక నిలిచింది. ఇక భారత్, పాకిస్తాన్‌లు చెరో 15 సార్లు ఆసియాకప్‌లో పాల్గొన్నాయి. శ్రీలంకతో క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్న కారణంగా 1986 టోర్నమెంట్‌ను భారత్ బహిష్కరించింది. అనంతరం భారత్ వేదికగా 1990-91 ఆసియాకప్‌ను పాక్ బాయ్‌కట్ చేసింది. ఇదే కారణంతో 1993లో ఆసియాకప్‌ను నిర్వహించలేదు. బంగ్లాదేశ్ కూడా 15 సార్లు ఆసియాకప్‌లో భాగమైంది.ఐసీసీ జోక్యం..కాగా 2015లో ఆసియాకప్‌నకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. టోర్నీ నిర్వహించే ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు ఐసీసీ అధికారాలు తగ్గించింది. ఇకపై ఆసియాకప్ రెండేళ్లకోసారి వన్డే, టి20 ఫార్మాట్లో రొటేషన్ పద్దతిలో జరుగుతుందని తెలిపింది.ఐసీసీ టోర్నీలకు అనుగుణంగా ఆసియాకప్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఫలితంగా 2016లో ఆసియాకప్‌ను తొలిసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించారు. టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముందు సన్నాహక టోర్నమెంట్‌గా అది ఉపయోగపడింది. మొట్టమొదటి ఆసియాకప్ టీ20 టోర్నీ టైటిల్‌ను కూడా టీమిండియానే కైవసం చేసుకుంది.తిరుగులేని భారత్..1984 నుంచి 2023 వరకు 16 సార్లు ఆసియా కప్‌ను నిర్వహించారు. 2022 లో చివరిసారిగా టీ20 ఫార్మాట్లో నిర్వహించగా, నాడు ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి శ్రీలంక విజేతగా నిలిచింది. అయితే ఈ టోర్నీలో భారత జట్టుకు మాత్రం ఘనమైన రికార్డు ఉంది. ఇక ఆసియాకప్ చరిత్రలో భారత్ అత్యధికంగా ఎనిమిది సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. అందులో 7 సార్లు వన్డే ఫార్మాట్లో టైటిల్‌ను సొంతం చేసుకోగా.. ఒక్కసారి టీ20 ఫార్మాట్లో టీమిండియా విజేతగా నిలిచింది. ఇక భారత్ తర్వాత శ్రీలంక ఆరు సార్లు, పాకిస్తాన్ రెండుసార్లు ఈ ట్రోఫీని ముద్దాడాయి.చదవండి: Asia Cup 2025: 'ఆసియాకప్ గెలిచేది ఆ జట్టే'.. వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం -
Asia Cup 2025: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌కు గ్రీన్ సిగ్నల్
ఆసియా కప్-2025లో భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. పీటీఐ నివేదిక ప్రకారం.. ఖండాంతర టోర్నీలో దాయాదితో సమరానికి భారత క్రీడా మంత్రిత్వ శాఖ అనుమతిచ్చింది. బహుళ దేశాలు పాల్గొనే టోర్నీలో టీమిండియా పాక్‌తో ఆడితే ఆపబోమని స్పష్టం చేసింది. అయితే పాక్‌తో ఏ క్రీడలో అయినా ద్వైపాక్షిక సిరీస్‌లు మాత్రం ఉండవవి తేల్చి చెప్పింది. వారు తమ గడ్డపై అడుగు పెట్టడానికి కానీ.. భారత జట్టు పాక్‌లో ఆడటానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో అనుమతివ్వబోమని తెలిపింది. అంతర్జాతీయ టోర్నీల్లో, తటస్థ వేదికలపై పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు ఆడితే అభ్యంతరం లేదని పేర్కొంది. ఈ లెక్కన సెప్టెంబర్ 14న దుబాయ్‌లో జరుగబోయే భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు లైన్ క్లియర్ అయినట్లే.కాగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియా కప్‌లో భారత్, పాక్ మ్యాచ్‌పై అనుమానాలు ఉండేవి. ఈ టోర్నీలో టీమిండియా పాక్‌తో ఆడేందుకు భారత ప్రభుత్వం అనుమతించదని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారానికి చెక్ పెడుతూ భారత క్రీడా మంత్రిత్వ శాఖ టీమిండియాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఆసియా కప్ టోర్నీ సెప్టెంబర్ 9 నుంచి దుబాయ్, అబుదాబీ వేదికలుగా జరుగనుంది. ఈ టోర్నీలో భారత్, పాక్ ఒకే గ్రూప్‌లో (ఏ) ఉన్నాయి. టీమిండియా సెప్టెంబర్ 10న దుబాయ్ వేదికగా యూఏఈతో తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. అనంతరం సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌తో.. సెప్టెంబర్ 19న ఒమన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టును ఆగస్ట్ 19న ప్రకటించారు.ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు..సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్‌కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్‌కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్ -
Asia Cup: ‘ఆఖరి నిమిషంలో కూడా మనసు మార్చుకోవచ్చు’
ఆసియా కప్-2025 (Asia Cup)టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ దిగ్గజ పేసర్ వసీం అక్రం (Wasim Akram) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మెగా ఈవెంట్లో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ఆఖరి నిమిషంలో రద్దైనా ఆశ్చర్యపోనక్కర్లేదన్నాడు. ఏనాటికైనా పరిస్థితులు చక్కబడి దాయాదులు టెస్టు సిరీస్‌లో పోటీపడితే చూడాలని ఉందని తెలిపాడు.ఎనిమిది జట్లుఈసారి టీ20 ఫార్మాట్లో ఆసియా కప్ టోర్నీ నిర్వహించనున్నారు. భారత్ ఆతిథ్య హక్కులు దక్కించుకున్నా.. పాక్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం ప్రకారం తటస్థ వేదికైన యూఏఈలో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ ఖండాంతర టోర్నీలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్‌లతో పాటు ఒమన్, హాంకాంగ్, యూఏఈ పాల్గొంటున్నాయి.అఫ్గనిస్తాన్- హాంకాంగ్ మ్యాచ్‌తో ఆసియా కప్ టోర్నీకి సెప్టెంబరు 9న తెరలేవనుండగా.. 28న ఫైనల్‌తో ముగుస్తుంది. ఇక ఈ ఈవెంట్లో చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ సెప్టెంబరు 14న తొలిసారి తలపడనున్నాయి. అన్నీ సజావుగా సాగితే మరో రెండుసార్లు దాయాదులు పరస్పరం ఢీకొట్టే అవకాశం ఉంది.అయితే, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరుదేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రీడల్లో ఏ స్థాయిలోనూ పాకిస్తాన్‌తో ఆడొద్దనే డిమాండ్లు వెల్లువెత్తాయి. కానీ.. ఆసియా కప్ టోర్నీలో పాక్‌తో మ్యాచ్‌ను బహిష్కరించే పరిస్థితి కనబడటం లేదు. ఏదేమైనా భారత ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే బీసీసీఐ ఈ విషయంలో నిర్ణయం తీసుకోనుంది.ఈ నేపథ్యంలో పాక్ లెజెండ్ వసీం అక్రం స్పందిస్తూ.. ‘‘ఆసియా కప్ షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. దీనిపై వ్యతిరేకత కూడా వస్తోంది. అయితే, పాకిస్తాన్లో మేము మాత్రం సైలైంట్‌గానే ఉన్నాము. ఆఖరి నిమిషంలో కూడా మనసు మార్చుకోవచ్చుఒకవేళ వాళ్లు మాతో మ్యాచ్ ఆడినా.. ఆడకపోయినా ఓకే. ఆఖరి నిమిషంలో వారు మనసు మార్చుకున్నా ఆట ముందుకు సాగుతూనే ఉంటుంది. అయితే, నా జీవితకాలంలో భారత్- పాకిస్తాన్ మధ్య టెస్టు సిరీస్ జరిగితే చూడాలని ఉంది’’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యానించాడు.అదే విధంగా.. ‘‘రాజకీయాలు వేరు. వాటి గురించి నాకు తెలియదు. వాళ్లు వారి దేశం గురించి ఆలోచిస్తున్నారు. అలాగే మేము కూడా. అయితే, అంతకు మించి ఎక్కువ మాట్లాడకూడదు. ఎవరైనా సరే తమ దేశం సాధించిన విజయాల గురించి తలచుకోవడానికే ఇష్టపడతారు. అక్కడితో ఆగిపోతే అంతా బాగుంటుంది’’ అని వసీం అక్రం చెప్పుకొచ్చాడు.కాగా భారత్- పాకిస్తాన్ చివరగా ఈ ఏడాది ఫిబ్రవరిలో యూఏఈ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో ముఖాముఖి తలపడ్డాయి. దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సెంచరీతో చెలరేగి.. టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. పాక్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందిన రోహిత్ సేన.. ఆ తర్వాత వరుస విజయాలతో చాంపియన్‌గా నిలిచింది.చదవండి: Asia Cup 2025: ‘చెత్త సెలక్షన్.. అతడంటే ఎవరికి ఇష్టమో అందరికీ తెలుసు’ -
Ind Vs Pak మ్యాచ్ గురించి అగార్కర్‌కు ప్రశ్న.. బీసీసీఐ రియాక్షన్ ఇదే
క్రికెట్ ప్రేమికులకు మరోసారి మజా అందించేందుకు ఆసియా కప్ (Asia Cup 2025) టోర్నమెంట్ సిద్ధంగా ఉంది. యూఏఈ వేదికగా ఈసారి పొట్టి ఫార్మాట్లో నిర్వహణకు సెప్టెంబరు 9- 28 వరకు షెడ్యూల్ ఖరారైంది. ఇక ఈ ఖండాంతర టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి.ఆరోజే భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్!గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ తలపడనుండగా.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ పోటీపడనున్నాయి. ఒకే గ్రూపులో ఉన్న దాయాదులు భారత్- పాక్ (India vs Pakistan) జట్లు ఈ టోర్నీ లీగ్ దశలో సెప్టెంబరు 14న తొలిసారి తలపడతాయి. ఆ తర్వాత సూపర్ 4, ఫైనల్ కలుపుకొని మరో రెండుసార్లు పరస్పరం ఢీకొట్టే అవకాశం లేకపోలేదు.ఆ మ్యాచ్ రద్దుఅయితే, ప్రస్తుతం ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత్- పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న చర్చ జరుగుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్‌తో క్రీడల్లోనూ ఎలాంటి బంధం కొనసాగించవద్దనే డిమాండ్లు పెరిగాయి. ఇటీవల వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్లోనూ ఇండియా చాంపియన్స్.. పాకిస్తాన్‌తో ఆడేందుకు విముఖత చూపింది.లీగ్, సెమీ ఫైనల్ మ్యాచ్‌ను బహిష్కరించి.. దేశమే తమకు ముఖ్యమని మాజీ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు తేల్చిచెప్పింది. అయితే, ఆసియా కప్ టోర్నీలో మాత్రం చిరకాల ప్రత్యర్థులు కచ్చితంగా ముఖాముఖి పోటీపడే సంకేతాలు కనిపిస్తున్నాయి.ఈ విషయం గురించి టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌కు తాజాగా ప్రశ్న ఎదురైంది. ఆసియా కప్-2025 టోర్నీ కోసం మంగళవారం భారత జట్టును ప్రకటించారు. ఈ సందర్భంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి అగార్కర్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు.అగార్కర్‌కు ప్రశ్న.. బీసీసీఐ రియాక్షన్ ఇదేఈ క్రమంలో ఓ విలేఖరి.. ‘‘సెప్టెంబరు 14న ఆసియా కప్ టోర్నీలో బిగ్ మ్యాచ్ ఉంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఇరుదేశాల మధ్య గత రెండు నెలలుగా ఏం జరుగుతుందో మనకి తెలుసు. మరి ఈ మ్యాచ్ విషయంలో మీ వైఖరి ఏమిటి?’’ అని ప్రశ్నించారు.ఇందుకు అగార్కర్ బదులిచ్చేందుకు సిద్ధమవుతుండగా.. బీసీసీఐ మీడియా మేనేజర్ అతడికి అడ్డుపడ్డారు. ‘‘ఆగండి.. కాస్త ఆగండి. జట్టు ఎంపిక గురించిన ప్రశ్నలు మాత్రమే అడగండి’’ అంటూ సమాధానం దాటవేసేలా చేశారు. దీంతో మరోసారి భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.ఆసియా కప్ టీ20-2025 టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టుసూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్. చదవండి: Asia Cup 2025: అందుకే శ్రేయస్‌ను సెలక్ట్ చేయలేదు: కుండబద్దలు కొట్టిన అగార్కర్ -
Asia Cup 2025: 'ఆసియాకప్‌లో భారత్- పాక్ మ్యాచ్ జరగదు'
ఆసియాకప్-2025 సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టును బీసీసీఐ ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కకర్ మంగళవారం(ఆగస్టు 19) ప్రకటించనున్నారు. టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడనుంది. అనంతరం సెప్టెంబర్ 14న దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో భారత్ అమీతుమీ తెల్చుకోనుంది.అయితే పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత నెలకొన్న ఉద్రిక్తల కారణంగా పాక్‌తో మ్యాచ్‌ను భారత్ బహిష్కరించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ జాబితాలోకి టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ చేరాడు. ఈ ఖండాంతర టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ జరగదని జాదవ్ థీమా వ్యక్తం చేశాడు. "ఆసియాకప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను భారత జట్టు బహిష్కరించాలి. భారత్ ఆడదనే నమ్మకం నాకు ఉంది. పాకిస్తాన్‌తో ఎక్కడ ఆడినా టీమిండియానే గెలుస్తోంది. ఈ విషయం పాక్ జట్టుకు కూడా తెలుసు. కానీ ఈ మ్యాచ్ మాత్రం జరగకూడదు" అని ఏఎన్ఐతో జాదవ్ పేర్కొన్నాడు.అంతకుముందు దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లను బాయ్‌కట్ చేయాలని బీసీసీఐని కోరాడు. కాగా ఇటీవల జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో పాకిస్తాన్‌తో ఆడేందుకు ఇండియా ఛాంపియన్స్ నిరాకరించింది. లీగ్ స్టేజీలో ఓ మ్యాచ్‌తో పాటు సెమీ ఫైనల్స్‌ను కూడా యువీ సారథ్యంలోని భారత్ బాయ్‌కట్ చేసింది. అయితే ఆసియాకప్‌లో మాత్రం పాక్-భారత్ జట్లు తలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డబ్ల్యూసీఎల్ అనేది ప్రైవేట్ లీగ్ కావడంతో ఇండియా పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించింది.కానీ ఈ ఖండాంతర టోర్నీ ఆసియాక్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరగనుంది కాబట్టి పాక్‌తో భారత్ కచ్చితంగా తలపడతుందనే చెప్పాలి. ఒకవేళ పాక్‌తో మ్యాచ్‌ను టీమిండియా బాయ్‌కట్ చేస్తే బ్రాడ్కాస్టర్లకు భారీ నష్టం వాటిల్లనుంది.ఆసియాకప్‌కు భారత జట్టు(అంచనా): సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సామ్సన్, జైస్వాల్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, జితేశ్ శర్మ.చదవండి: ఆ క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను: ఇంగ్లండ్ స్పిన్నర్ -
ఆసియాకప్‌లో టీమిండియాపై విజయం మాదే: పాక్ క్రికెట్ డైరక్టర్
ఆసియాకప్-2025 కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తొలి అడుగు వేసింది. ఈ మెగా టోర్నీకి 17 మంది సభ్యులతో కూడిన జట్టును పీసీబీ ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా సల్మాన్ అలీ అఘా ఎంపికయ్యాడు. అదేవిధంగా స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లపై సెలక్టర్లు వేటు వేశారు.అయితే జట్టు ప్రకటన అనంతరం విలేకరుల సమావేశంలో పాల్గోన్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు హై-పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ ఆకిబ్ జావేద్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆసియాకప్‌లో భారత జట్టును ఓడించే సత్తా పాక్‌కు ఉందని జావేద్ అభిప్రాయపడ్డాడు. జట్టులోని ప్రతీ ఆటగాడు టీమిండియా విసిరే సవాల్‌కు సిద్ధంగా ఉన్నారని ఈ పాక్ మాజీ పేసర్ తెలిపాడు. కాగా పాకిస్తాన్‌పై టీ20ల్లో భారత్‌కు అద్బుతమైన రికార్డు ఉంది. కానీ పాక్ జట్టు మాత్రం ఆసియా కప్-2022లో విజయాన్ని పునరావృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు ఇరు జట్లు 13 మ్యాచ్‌లలో ముఖాముఖి తలపడగా.. భారత్ తొమ్మిది మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, పాకిస్తాన్ మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. పాక్ చివరగా దుబాయ్‌లో జరిగిన 2022 ఆసియా కప్ సూపర్ ఫోర్లో భారత్‌పై టీ20 విజయం సాధించింది."పాకిస్తాన్ టీ20 జట్టు టీమిండియాను ఓడించగలదు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే భారీ అంచనాలు ఉంటాయి. కానీ మేము ఎంపిక చేసిన ఈ 17 మంది సభ్యుల జట్టు ఏ టీమ్‌నైనా ఓడించగలదు. అయితే వారిపై మేము ఎటువంటి ఒత్తిడి తీసుకురావడం లేదు.ఈ జట్టుపై నాకు చాలా నమ్మకం ఉంది. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లను మేము పూర్తిగా పక్కన పెట్టలేదు. ప్రస్తుత ప్రదర్శనల ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేశాము. సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, ఫఖార్ జమాన్ వంటి ఆటగాళ్లు అద్బుతంగా రాణిస్తున్నారు. అందుకే వారిని జట్టులో కొనసాగించాము. సైమ్ తన రీ ఎంట్రీలో కాస్త ఇబ్బంది పడ్డాడు. కానీ ఆ తర్వాత తన రిథమ్‌ను అందుకున్నాడు. ప్రతీ ప్లేయర్‌కు జట్టులోకి తిరిగొచ్చేందు ఎల్లప్పుడూ తలపులు తెరిచే ఉంటాయి. ఎవరు మెరుగైన ప్రదర్శన చేస్తే వారు ఖచ్చితంగా జట్టులో ఉంటారు. వారే పాక్ తరపున ఆడటానికి అర్హులు" జావేద్ పేర్కొన్నాడు.ఆసియా కప్-2025 కోసం పాక్ జట్టు..సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్-కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహీన్ అఫ్రిది, సుఫ్యాన్ మొకిమ్చదవండి: Asia Cup 2025: పాక్-భారత్ మ్యాచ్‌కు భారీ డిమాండ్.. 10 సెకన్లకు రూ.16 లక్షలు! -
పాక్-భారత్ మ్యాచ్‌కు భారీ డిమాండ్.. 10 సెకన్లకు రూ.16 లక్షలు!
వరల్డ్ క్రికెట్లో బిగ్గెస్ట్ రైవలరీలలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఒకటి. ఈ దాయాదుల పోరును వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వెయ్యి కళ్లుతో ఎదురుచూస్తుంటున్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయాల ఉద్రిక్తల కారణంగా రెండు జట్లు కేవలం ఐసీసీ, ఏసీసీ ఈవెంట్లు మాత్రమే తలపడతున్నాయి.దీంతో ఈ చిరకాల ప్రత్యర్ధుల పోరు రోజున యావత్తు క్రికెట్ ప్రపంచం టీవీలకు అతుక్కుపోతారు. అయితే అభిమానుల నిరీక్షణకు తెరదించే సమయం అసన్నమవుతోంది. ఈ చిరకాల ప్రత్యర్ధిలు మరోసారి అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమవుతున్నారు.ఆసియాకప్-2025లో భాగంగా సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా పాక్-భారత్ జట్లు తలపడనున్నాయి. అయితే భారత్-పాక్ మ్యాచ్‌కు ఉన్న క్రేజును సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా (SPNI) భారీగా క్యాష్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఆసియాకప్‌లో భారత్ ఆడే మ్యాచ్‌ల సమయంలో పది సెకన్ల సెకన్ల ప్రకటనకు రూ. 14 నుంచి 16 లక్షలు సోనీ నెట్వర్క్ నిర్ణయించినట్లు సమాచారం. భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్‌కు కూడా ఇదే ధర వర్తించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కాగా సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా 2031 వరకు ఆసియా కప్ మీడియా హక్కులను 170 మిలియన్ డాలర్ల(భారత కరెన్సీలో వెయ్యి కోట్ల పైగా)కు సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో మ్యాచ్‌లు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో పాటు సోనీ లివ్‌లో యాప్‌లో కూడా ప్రసారం కానున్నాయి.ఇక 8 మ్యాచ్‌లు పాల్గోనే ఈ మెగా ఈవెంట్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఆసియాకప్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే తమ జట్టును ప్రకటించగా.. బీసీసీఐ ఒకట్రెండు రోజుల్లో భారత జట్టును వెల్లడించనుంది.ఆసియా కప్-2025 కోసం పాక్ జట్టు..సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్-కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహీన్ అఫ్రిది, సుఫ్యాన్ మొకిమ్ఆసియాకప్-2025కు భారత జట్టు(అంచనా)సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, జితేశ్ శర్మ -
ఆసియాకప్ కోసం టీమిండియా మాస్టర్ ప్లాన్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఆసియాకప్ టీ20 టోర్నీకి మరో 22 రోజుల్లో తెరలేవనుంది. సెప్టెంబర్ 9న ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్ తొలి మ్యాచ్‌లో అబుదాబి వేదికగా అఫ్గానిస్తాన్, హాంకాంగ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.ఈ ఆసియా జెయింట్స్ పోరు కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆగస్టు 19న ప్రకటించే అవకాశముంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ అనంతరం భారత జట్టుకు ఒక నెల పాటు విరామం లభించింది. వాస్తవానికి ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల్లో టీమిండియా తలపడాల్సిండేది.కానీ ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో ఈ సిరీస్ తాత్కాలికంగా వాయిదా పడింది. దీంతో భారత ఆటగాళ్లకు లాంగ్ బ్రేక్ దొరికింది. ఈ క్రమంలో టీమిండియా మెనెజ్‌మెంట్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఆసియాకప్‌నకు ముందు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు యూఏఈలో ఒక ప్రత్యేక శిబిరాన్ని చేయనుంది. ఇందుకోసం టీమిండియా నాలుగు రోజుల ముందే యూఏఈ గడ్డపై అడుగుపెట్టనుంది. అయితే తొలుత ఆసియాకప్‌కు సిద్దం కావడానికి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఒక క్యాంప్ ఏర్పాటు చేయాలని బీసీసీఐ సూచించినట్లు సమాచారం.కానీ టీమ్ మెనెజ్‌మెంట్ మాత్రం యూఏఈ పరిస్థితులు అలవాటు పడేందుకు అక్కడకి వెళ్లి తమ శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయితే ఈ స్పెషల్ క్యాంపు చాలా మంది భారత ఆటగాళ్లకు ఉపయోగపడనుంది.ఐపీఎల్-2025 తర్వాత సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ వంటి ఆటగాళ్లకు మ్యాచ్ ప్రాక్టీస్ లోపించింది. అటువంటి వారు ఈ క్యాంపును సన్నాహాకంగా ఉపయోగించుకోవచ్చు. ఇక దాయాది పాకిస్తాన్ కూడా ఈ మెగా టోర్నీకి తమ సన్నాహాకాలను ప్రారంభించనుంది. అయితే భారత్‌కు భిన్నంగా పాక్ జట్టు అఫ్గాన్-యూఏఈలతో ట్రై సిరీస్ ఆడనుంది.అంతేకాకుండా మెన్ ఇన్ గ్రీన్ ఐసీసీ ఆకాడమీలో నాలుగు రోజుల పాటు ఒక ప్రత్యేక క్యాంపును నిర్వహించనుంది. ఈ టోర్నీ కోసం పీసీబీ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో స్టార్ ప్లేయర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజంలకు చోటు దక్కలేదు. ఈ ఆసియా జెయింట్స్ పోరులో పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా వ్యవహరించనున్నాడు.చదవండి: వాళ్ళేమి తోపు ఆటగాళ్లు కాదు.. సెలక్టర్లు మంచి పనిచేశారు: పాక్ మాజీ కెప్టెన్ -
‘చెత్త ప్రవర్తన.. పద్ధతి లేనివాడు.. నా గురించి తప్పుగా మాట్లాడాడు’
పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది (Shahid Afridi)కి పద్ధతులు తెలియవని టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) అన్నాడు. ఎదుటి వ్యక్తులను కించపరిచే సంకుచిత స్వభావం కలవాడంటూ ఘాటు విమర్శలు చేశాడు. తనకైతే షాహిద్ ఆఫ్రిది పట్ల సదభిప్రాయం లేదని.. ఇందుకు అతడి చెత్త ప్రవర్తనే కారణమంటూ కుండబద్దలు కొట్టాడు.కాగా ఆల్‌రౌండర్‌గా షాహిద్ మెరుగ్గా రాణించినా.. మైదానంలో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో ముఖ్యంగా టీమిండియా ప్లేయర్లతో అతడి ప్రవర్తన ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియా ప్రస్తుత హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)తో అతడికి క్షణం పడేది కాదు. వీలు చిక్కినప్పుడల్లా భారత ఆటగాళ్లను రెచ్చగొడుతూ కవ్వింపు చర్యలకు పాల్పడేవాడు షాహిద్.నా గురించి తప్పుగా మాట్లాడాడుఈ క్రమంలోనే ఓసారి మైదానం వెలుపల కూడా తనను కించపరిచేలా షాహిద్ ఆఫ్రిది వ్యాఖ్యలు చేశాడని ఇర్ఫాన్ పఠాన్ తాజాగా వెల్లడించాడు. లలన్‌టాప్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్లో షాహిద్ ఆఫ్రిదిని 11 సార్లు అవుట్ చేశాను. ఓసారి హర్షా భోగ్లేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు నా గురించి తప్పుగా మాట్లాడాడు.తనకు తాను నిజమైన పఠాన్‌గా చెప్పుకొన్న షాహిద్.. నేను రియల్ పఠాన్ కాదంటూ చెత్తగా మాట్లాడాడు. అక్కడ అతడు కేవలం నన్ను మాత్రమే కాదు.. నా తల్లిదండ్రులను కూడా కించపరిచాడు. నిజానికి అతడు అలా మాట్లాడి ఉండకపోతే.. తనతో నాకసలు ఎలాంటి గొడవా లేదు.చెత్త ప్రవర్తనకానీ ఎప్పుడైతే వ్యక్తిగత విషయాలు ప్రస్తావిస్తూ తప్పుగా మాట్లాడాడో అప్పుడే.. అతడిని ఎప్పుడైనా, ఎక్కడైనా అవుట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా. సిరీస్ విజేతను తేల్చే కీలక మ్యాచ్‌లలో.. వరల్డ్‌కప్ ఫైనల్లో.. ఇలా మేజర్ ఈవెంట్లలో అతడి వికెట్ తీశాను.అయితే, అతడితో నేరుగా మాట్లాడేందుకు నాకు ఒక్క అవకాశం కూడా రాలేదు. అతడి వికెట్ ఎంత త్వరగా.. వీలైతే అంత త్వరగా తీయడం మాత్రమే నాకు తెలుసు. అయితే, ఓసారి కరాచి నుంచి లాహోర్‌కు వెళ్తున్న విమానంలో అతడు నాతో వ్యక్తిగతంగా మాట్లాడాడు.అప్పుడు కూడా నా వెనుక నుంచి వచ్చి.. నా జట్టులోకి వేళ్లు పోనిచ్చి.. ‘ఎలా ఉన్నావు పిల్లోడా’ అంటూ పలకరించాడు. అప్పుడు కూడా షాహిద్‌కు హుందాగా మాట్లాడటం చేతకాలేదు’’ అంటూ ఇర్ఫాన్ పఠాన్ షాహిద్ ఆఫ్రిది ప్రవర్తనను విమర్శించాడు.బరోడా ఆల్‌రౌండర్‌కాగా 40 ఏళ్ల ఇర్ఫాన్ పఠాన్ లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్. అదే విధంగా.. ఎడమచేతి వాటం బ్యాటర్. టీమిండియా తరఫున అంతర్జాతీయ స్థాయిలో 2003- 2012 వరకు క్రికెట్ ఆడాడు. తన కెరీర్లో మొత్తంగా 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఇర్ఫాన్ పఠాన్.. ఆయా ఫార్మాట్లలో 100, 173, 28 వికెట్లు తీశాడు. అదే విధంగా.. టెస్టుల్లో 1105, వన్డేల్లో 1544, టీ20లలో 172 పరుగులు సాధించాడు.వన్డేల్లో అత్యుత్తమంగామరోవైపు.. షాహిద్ ఆఫ్రిది 1996- 2018 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్ తన కెరీర్లో 27 టెస్టుల్లో 48 వికెట్లు, 1716 పరుగులు చేశాడు. 99 టీ20 మ్యాచ్‌లలో 98 వికెట్లు తీయడంతో పాటు 91 పరుగులు సాధించాడు.అయితే, వన్డేల్లో మాత్రం ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అత్యుత్తమంగా రాణించాడు. తన కెరీర్లో 398 వన్డేలు ఆడిన షాహిద్ ఆఫ్రిది.. 395 వికెట్లు పడగొట్టడంతో పాటు.. 8064 పరుగులు సాధించాడు.చదవండి: టీమిండియాకు మరో సెహ్వాగ్ దొరికేశాడు..? -
టీమిండియా మాతో ఆడకపోవడమే మంచింది.. ఆ చావుదెబ్బను ఊహించలేము: పాక్ మాజీ
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ఇటీవల The Game Plan అనే యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ 2025లో భారత్ తమతో ఆడకపోతేనే మంచిదని అభిప్రాయపడ్డాడు. ఇటీవల వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో భారత్ తమతో మ్యాచ్‌లను ఎలాగైతే బాయ్‌కాట్ చేసిందో ఆసియా కప్‌లోనూ అలాగే చేస్తే బాగుంటుందని అన్నాడు.ఒకవేళ భారత్ ఆసియా కప్‌లో తమతో మ్యాచ్‌లు ఆడేందుకు ముందుకు వస్తే మాత్రం వారు కొట్టే చావుదెబ్బను ఊహించలేమని తెలిపాడు. ఇలా జరగకూడదని దేవుడిని ప్రార్దిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.బాసిత్ అలీ చేసిన ఈ వ్యాఖ్యలు పాక్ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. బాసిత్ వ్యాఖ్యలపై పాక్ మీడియా కూడా దుమ్మెత్తిపోస్తుంది. మరోవైపు భారత అభిమానులు మాత్రం బాసిత్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు. కరెక్ట్‌గా చెప్పాడంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. తాజాగా పాక్ విండీస్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న తర్వాత బాసిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. విండీస్‌తో జరిగిన చివరి వన్డేలో పాక్ 92 పరుగులకే ఆలౌటై, 202 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ ఓటమితో పాక్ విండీస్‌కు 35 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్‌ను కోల్పోయింది.ఈ ఓటమి తర్వాత బాసిత్ అలీ పాక్ జట్టుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇలాంటి జట్టుతో భారత్ లాంటి పటిష్ట జట్టును ఎప్పుడు ఓడించాలంటూ కామెంట్లు చేశాడు.కాగా, యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్-2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 14న జరగనుంది. ఈ టోర్నీలో ఇరు జట్ల మధ్య మరిన్ని మ్యాచ్‌లు జరిగే ఆస్కారం కూడా ఉంది. దీనికి ముందు పాక్‌తో ఆడేందుకు భారత ప్రభుత్వం సమ్మతించాలి. పాక్‌తో ఆడే విషయమై భారత క్రీడాభిమానులు, క్రికెట్ విశ్లేషకులు, మాజీలు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు క్రికెట్ వేరు, దేశ సమస్య వేరని అంటుంటే.. మరికొందరు మాత్రం నీచ బుద్ది ఉన్న పాక్‌తో క్రికెటే కాకుండా ఏ ఆట ఆడకూడదని భీష్మించుకూర్చున్నారు. -
మీకు ఆటే ముఖ్యమా?: బీసీసీఐ తీరుపై హర్భజన్ ఆగ్రహం
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీరుపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మండిపడ్డాడు. దేశం కంటే మీకు ఆటే ముఖ్యమా అంటూ బోర్డు పెద్దల్ని ప్రశ్నించాడు. క్రికెట్ కంటే సైనికుల త్యాగం ఎంతో గొప్పదని.. కాబట్టి ఇప్పటికైనా ఆసియా కప్-2025 (Asia Cup) విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించాడు.పాక్‌తో మ్యాచ్ బహిష్కరించిన ఇండియా చాంపియన్స్ఇటీవల పహల్గామ్లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి అమాయక పర్యాటకుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో తీవ్రంగా స్పందించిన భారత సైన్యం.. ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఇందుకు పాక్ సైన్యం ప్రతిస్పందించగా.. దాయాదికి కూడా గట్టిగానే బుద్ధి చెప్పింది.ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకొనగా.. ఇటీవల జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) టోర్నీలో భారత ఆటగాళ్లు పాకిస్తాన్ (IND vs PAK)తో మ్యాచ్‌ను బహిష్కరించారు. సెమీ ఫైనల్లో దాయాదితో పోటీ పడాల్సి ఉండగా.. తమకు అన్నింటికంటే దేశమే ముఖ్యమని శిఖర్ ధావన్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు ఈ మ్యాచ్ నుంచి కూడా నిష్క్రమించారు.ఆసియా కప్‌లో మాత్రం దాయాదితో పోరుకు సై!అయితే, ఆసియా కప్ టీ20 టోర్నీ-2025లో మాత్రం భారత్- పాకిస్తాన్ ఒకే గ్రూపులో ఉండటంతో పాటు.. అత్యధికంగా మూడుసార్లు ముఖాముఖి పోటీ పడే అవకాశం ఉన్నట్లు షెడ్యూల్ ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరుపై మాజీ క్రికెటర్లు, అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మీకు ఆటే ముఖ్యమా?పాకిస్తాన్‌తో టీమిండియా మ్యాచ్‌లను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ముందుగా నిర్ణయించిన ప్రకారం మ్యాచ్‌లు యథావిధిగా సాగనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ స్పందించాడు. ‘‘వారికి (బీసీసీఐ) ఏది ముఖ్యమో.. ఏది ప్రాధాన్యం లేని విషయమో అర్థం కావడం లేదు.సరిహద్దులో నిలబడి ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడే సైనికుల కుటుంబాలు.. తరచూ వారిని చూడలేవు. ఒక్కోసారి సైనికులు తమ ప్రాణాలనే త్యాగం చేయాల్సి వస్తుంది. వాళ్లు ఎప్పటికీ ఇంటికి తిరిగా రాలేరు కూడా!వారి త్యాగమే ఎంతో గొప్పదిఅందరి కంటే వారి త్యాగమే ఎంతో గొప్పది. వారితో పోలిస్తే ఇలాంటివి చాలా చిన్న విషయాలు. వారి కోసం మనం ఒక్క క్రికెట్ మ్యాచ్‌ను వదులుకోలేమా? మన ప్రభుత్వం కూడా ‘హింస- త్యాగం’ ఒకేచోట ఉండలేవని చెప్తోంది.కొంత మంది సరిహద్దులో యుద్ధం చేస్తున్నపుడు.. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నపుడు.. మనం మాత్రం వెళ్లి వాళ్లతో క్రికెట్ ఆడటమా?.. సమస్య పరిష్కారమయ్యేంత వరకు క్రికెట్ అనేది చిన్న విషయంలా చూడాలి. దేశ ప్రయోజనాలే మనకు ప్రథమ ప్రాధాన్యం కావాలి.మనకు ఏ గుర్తింపు వచ్చినా.. అది దేశం కారణంగానేనని గుర్తుపెట్టుకోండి. మీరొక ఆటగాడు లేదంటే నటుడు.. ఎవరైనా కానీవండి. దేశం కంటే ఎవరూ గొప్పవారు కాదు. దేశం తరఫున తప్పక నిర్వర్తించాల్సిన విధులను విస్మరించకూడదు’’ అంటూ భజ్జీ బీసీసీఐ తీరును ఎండగట్టాడు. చదవండి: Shai Hope: వన్డే క్రికెట్ చరిత్రలో మోస్ట్ అండర్ రేటెడ్ బ్యాటర్ -
ఆసియాకప్ నుంచి తప్పుకొన్న పాకిస్తాన్..?
ఆసియాకప్ హాకీ టోర్నమెంట్-2025 టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ టీమ్ తప్పుకొన్నట్లు తెలుస్తోంది. ఈ మెగా ఈవెంట్ బీహార్‌లోని రాజ్‌గిర్‌లో ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు జరగనున్నది. అయితే భద్రతా కారణాలను సాకుగా చూపుతూ ఆసియా కప్ కోసం భారత్‌కు ప్రయాణించకూడదని పాకిస్తాన్ హాకీ సమాఖ్య (PHF) నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కాగా తొలుత ఈ టోర్నీలో పాల్గోనేందుకు పాక్ జట్టు వీసాలకు ధరఖాస్తు చేసింది. ది హిందూ రిపోర్ట్ ప్రకారం.. భారత ప్రభుత్వం కూడా పాక్ ఆటగాళ్ల వీసాలను ఆమోదించడానికి సిద్దంగా ఉందంట. కానీ అంతలోనే పాక్ యూటర్న్ తీసుకున్నట్లు సమాచారం."పీహెచ్ఎఫ్ బుధవారం ఆసియా హాకీ సమాఖ్యకు ఒక లేఖ రాసింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆసియా కప్‌లో పోటీ పడలేమని అందులో పేర్కొంది. తమ దేశంలో ఆడేందుకు బంగ్లాదేశ్ హాకీ జట్టును పాక్ ఆహ్వానించింది" అని హాకీ ఇండియా అధికారి ఒకరు ది హిందూకు తెలిపారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.కాగా పెహల్గమ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు మరింత తీవ్రమయ్యాయి. అపరేషన్ సింధూర్ పేరిట పాక్ అక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్ధావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. పాక్ ప్రతిస్పందనగా దాడికి యత్నించగా భారత సాయుధ దళాలు తిప్పికొట్టాయి. దాదాపు వారం రోజుల పాటు సరిహద్దు వెంబడి ఉద్రిక్త వాతవారణం నెలకొంది. ఆ తర్వాత ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో పరిస్థితులు కాస్త శాంతించాయి. ఈ క్రమంలో పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా వరల్డ్ ఛాంపియన్షిప్ లెజెండ్స్ టోర్నమెంట్లో పాకిస్తాన్ ఛాంపియన్‌తో మ్యాచ్‌లను ఇండియా లెజెండ్స్ బహిష్కరించింది. యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా జట్టు తీసుకున్న ఈ నిర్ణయాన్ని చాలా మంది సమర్ధించారు. అయితే ఆసియాకప్-2025 క్రికెట్ టోర్నీలో మాత్రం భారత్-పాక్ జట్లు తలపడే అవకాశముంది. సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్ధులు తాడోపేడో తేల్చుకోనున్నారు. ఈ మ్యాచ్‌ను కూడా భారత్ బాయ్ కాట్ చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.చదవండి: టీమిండియా స్టార్ వికెట్ కీపర్‌కు ప్రమోషన్.. ఆ జట్టు కెప్టెన్‌గా -
టీమిండియాపై గెలవడం అంత ఈజీ కాదు: పాక్ మాజీ కెప్టెన్
ఇంగ్లండ్ పర్యటనను విజయవంతంగా ముగించిన టీమిండియా.. ఇక ఆసియాకప్-2025కు సిద్దం కానుంది. ఈ ఖండాంతర మెగా టోర్నీ సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఈ ఆసియా సింహాల పోరు కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ త్వరలోనే ప్రకటించనుంది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న దుబాయ్ వేదికగా తలపడనుంది.ఆ తర్వాత సెప్టెంబర్ 14న అదే దుబాయ్ అంతర్జాతీయ మైదానంలో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తాడోపేడో తెల్చుకోనుంది. పెహాల్గమ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని కొంతమంది అంటుంటే.. మరి కొంతమంది దాయాదిని చిత్తు ప్రతీకారం తీర్చుకోవాలని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికి క్రికెట్ ప్రపంచంలో పాకిస్తాన్-భారత్ మ్యాచ్ ఉన్న క్రేజే వేరు. దాయాదుల పోరు రోజును అభిమానులు టీవీలకు అతుక్కుపోవాల్సిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుపై మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాతో పోలిస్తే తమ జట్టు చాలా బలహీనంగా ఉందని, ఇటీవలే పాక్ ప్రదర్శనలపై అతడు ఆందోళన వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉంది. ఆతిథ్య జట్టుతో టీ20 సిరీస్‌ను పాక్ 2-1 తేడాతో సొంతం చేసుకుంది. కానీ అంతకుముందు బంగ్లాదేశ్‌తో సిరీస్‌ను మాత్రం 1-2 తేడాతో మెన్ ఇన్ గ్రీన్ కోల్పోయింది."ఆసియాకప్‌లో బలమైన భారత జట్టుతో తలపడడం పాకిస్తాన్‌కు అంత సులువు కాదు. మా జట్టు ప్రస్తుతం నిలకడగా రాణించలేకపోతుంది. ఎప్పుడు లేని విధంగా బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను కోల్పోయింది. పాక్ జట్టు ప్రదర్శన ఎలా ఉందో ఈ సిరీస్ ఫలితం బట్టి ఆర్ధం చేసుకోవచ్చు.ఆ తర్వాత వెస్టిండీస్‌లో కూడా ఓ మ్యాచ్ ఓడిపోయారు. సల్మాన్ అలీ అఘా కెప్టెన్‌గా సరైనోడే. కానీ మూడు ఫార్మాట్లలో జట్టును నడిపించడం అంత ఈజీ కాదు. మా దగ్గర అద్బుతమైన ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. కానీ వారిని సరిగ్గా ఉపయోగించుకోవడంలో పాక్ క్రికెట్ బోర్డు విఫలమవుతోంది" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లతీఫ్ పేర్కొన్నాడు.చదవండి: ఇక్కడున్నా బిర్యానీ తక్కువే.. ఆ ఫుడ్ అసలే తినడు: సిరాజ్ సోదరుడు -
పాక్‌తో మ్యాచ్ బహిష్కరణ: స్పందించిన ధావన్.. మాలో కొందరు..
పాకిస్తాన్ చాంపియన్స్‌తో మ్యాచ్‌ను బహిష్కరించడంపై టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) స్పందించాడు. తనపై ఎవరి ఒత్తిడీ లేదని.. తన మనసు చెప్పినట్లు మాత్రమే నడుచుకున్నానని తెలిపాడు. కాగా వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) -2025 టోర్నమెంట్లో భారత్ పాకిస్తాన్‌తో మ్యాచ్‌లను బహిష్కరించిన విషయం తెలిసిందే.సెమీ ఫైనల్లోనూ..లీగ్ దశలో దాయాదితో పోటీ పడాల్సి రాగా ఇండియా చాంపియన్స్ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసింది. అనంతరం ఇరుజట్లు తొలి సెమీ ఫైనల్లో తలపడాల్సి వచ్చింది. ఒకవేళ ఈ మ్యాచ్‌ను కూడా బహిష్కరిస్తే టోర్నీ నుంచే తప్పుకోవాల్సిన పరిస్థితి. అయినప్పటికీ భారత ఆటగాళ్లు.. తమకు దేశమే ముఖ్యమంటూ చిరకాల ప్రత్యర్థితో మ్యాచ్ ఆడేది లేదని తేల్చిచెప్పారు.పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా ఇండియా చాంపియన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. పాకిస్తాన్ చాంపియన్స్ ఫైనల్ చేరింది. టైటిల్ పోరులో సౌతాఫ్రికా చేతిలో ఓడి పాక్ మరోసారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.పూర్తి స్పృహలో ఉండే ఈ నిర్ణయంఈ పరిణామాల నేపథ్యంలో ఇండియా చాంపియన్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ తాజాగా మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడటం వ్యక్తిగతంగా నాకు అస్సలు ఇష్టం లేదు. పూర్తి స్పృహలో ఉండి నేను ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాను.మా జట్టులోని కొంత మంది నాతో పాటు ఏకీభవించారు. భజ్జీ పా (హర్భజన్ సింగ్) కూడా ఇదే అభిప్రాయం వ్యక్తపరిచారు. అందుకే పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు ఆడకూడదని నిశ్చయించుకున్నాం.ఎవరూ ఒత్తిడి చేయలేదుమ్యాచ్ నుంచి తప్పుకోవాలని మాపై ఎవరూ ఒత్తిడి చేయలేదు. పాకిస్తాన్‌తో ఆడటం మాలో కొందరికి ఏమాత్రం ఇష్టం లేదు. పాక్‌తో మ్యాచ్ ఆడటానికి మాకు ఎటువంటి సరైన కారణం కనిపించనే లేదు. అంతకుమించి ఏమీ లేదు’’ అని తెలిపాడు. క్రిక్‌బ్లాగర్‌తో ముచ్చటిస్తూ ధావన్ ఈ మేరకు తన మనసులోని అభిప్రాయాలు పంచుకున్నాడు.తొలి చాంపియన్ ఇండియాకాగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లతో నిర్వహిస్తున్న టీ20 టోర్నీయే డబ్ల్యూసీఎల్. గతేడాది ఇంగ్లండ్ వేదికగా మొదలైన ఈ పొట్టి ఫార్మాట్ టోర్నీలో ఇండియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్ చాంపియన్స్ రూపంలో ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఇక అరంగేట్ర సీజన్ ఫైనల్లో యువరాజ్ సింగ్ కెప్టెన్సీలోని ఇండియా చాంపియన్స్ పాకిస్తాన్‌ను ఓడించి టైటిల్ గెలిచింది.ఇదిలా ఉంటే.. జమ్మూకశ్మీర్‌లోని ప్రశాంత పహల్గామ్ లోయలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి.. అమాయక పర్యాటకులను పొట్టనబెట్టుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ.. పాక్ ఆక్రమిత, పాక్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసింది. దీంతో పాక్ ఆర్మీ ప్రతిదాడికి యత్నించగా.. భారత సైన్యం గట్టిగా కౌంటర్ ఇచ్చింది. డబ్ల్యూసీఎల్-2025లో ఇండియా చాంపియన్స్ జట్టు ఇదేయువరాజ్ సింగ్ (కెప్టెన్), శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, పీయూష్ చావ్లా, స్టువర్ట్ బిన్నీ, వరుణ్ ఆరోన్, వినయ్ కుమార్, అభిమన్యు మిథున్, సిద్దార్థ్ కౌల్, గురుకీరత్ మాన్.చదవండి: బహిష్కరించిన భారత్.. పాక్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం! -
ఆసియాకప్ పూర్తి షెడ్యూల్ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడంటే?
ఆసియాకప్-2025 వేదికలు ఖరారు అయ్యాయి. ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేసిన ఆసియా క్రికెట్ కౌన్సిల్.. తాజాగా మ్యాచ్‌లు జరిగే వేదికలను ప్రకటించింది. ఈ మెగా టోర్నమెంట్ యూఏఈలోని అబుదాబి, దుబాయ్ వేదికలగా జరగనున్నట్లు ఏసీసీ వెల్లడించింది.ఈ ఆసియాకప్‌లో 11 మ్యాచ్‌లు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, మరో 8 మ్యాచ్‌లు అబుదాబి ఇంటర్ననేషనల్ మైదానంలో జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్‌కు దుబాయ్ ఆతిథ్యమివ్వనుంది. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 14న జరగనుంది.ఈ మెగా టోర్నమెంట్ సెప్టెంబర్ 9న ప్రారంభమై 28న ముగియనుంది. తొలి మ్యాచ్‌లో దుబాయ్ వేదికగా అఫ్గానిస్తాన్, హాంకాంగ్ జట్లు తలపడనున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. వాస్తవానికి ఈ ఏడాది ఆసియాకప్‌కు భారత్ ఆతిథ్యమివ్వాల్సింది.కానీ భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఈ ఈవెంట్‌ను యూఏఈలో నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గోనున్నాయి. ఈ జట్లను మొత్తం రెండు గ్రూపులుగా విభజించారు.ఏ గ్రూప్‌లో ఎవరు?గ్రూప్ ఎ: భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్గ్రూప్ బి: శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్, హాంకాంగ్ఆసియా కప్‌లో టీమిండియా షెడ్యూల్..10 సెప్టెంబర్: భారత్ - యూఏఈ (దుబాయ్)14 సెప్టెంబర్: భారత్ - పాకిస్తాన్ (దుబాయ్)19 సెప్టెంబర్: భారత్ - ఒమన్ (అబుదాబీ)ఈ టోర్నీ కోసం భారత జట్టును బీసీసీఐ త్వరలోనే ప్రకటించే అవకాశముంది. అయితే ఈ ఆసియా జెయింట్స్ పోరుకు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.చదవండి: IND vs ENG: టీమిండియాతో ఐదో టెస్టు.. 123 ఏళ్ల చరిత్రను ఇంగ్లండ్ తిరగరాస్తుందా? -
బహిష్కరించిన భారత్.. పాక్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం!
వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL)-2025 టోర్నమెంట్లో సెమీస్ ఆడకుండానే ఇండియా చాంపియన్స్ వెనుదిరిగింది. సెమీ ఫైనల్లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ (IND vs PAK)ను ఎదుర్కోవాల్సి రావడమే ఇందుకు కారణం. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో క్రీడల్లోనూ ఎలాంటి ‘బంధం’ వద్దంటూ భారత ఆటగాళ్లు ఈ మ్యాచ్‌ను బహిష్కరించారు.దేశమే ముఖ్యమంటూ..ఫలితంగా ఇండియా చాంపియన్స్ టోర్నమెంట్ నుంచే వెనుదిరిగాల్సి వచ్చినా.. దేశమే తమకు ముఖ్యమంటూ ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు.. ఇండియా చాంపియన్స్ తప్పుకోవడంతో పాకిస్తాన్ చాంపియన్స్ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది.సర్వహక్కులు పాకిస్తాన్ క్రికెట్ బోర్డువేఇక ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ప్రైవేట్ క్రికెట్ లీగ్‌లలో దేశం పేరును వాడటాన్ని పూర్తిగా నిషేధించినట్లు సమాచారం. వార్తా సంస్థ ANI నివేదిక ప్రకారం.. ‘‘ప్రైవేట్ సంస్థలు పాకిస్తాన్ పేరును తమ లీగ్‌లలో ఉపయోగిస్తే వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటాం.క్రికెట్ ఈవెంట్లలో దేశం పేరు వాడుకునే సర్వహక్కులు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మాత్రమే ఉన్నాయి. గురువారం జరిగిన బోర్డ్ డైరెక్టర్ల సమావేశంలో కూలంకషంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు.డబ్ల్యూసీఎల్ రెండో ఎడిషన్‌లో భారత క్రికెటర్లు పాకిస్తాన్‌తో ఆడమంటూ తిరస్కరించడం.. దేశ గౌరవానికి భంగం కలిగించింది. అందుకే ప్రైవేటు లీగ్‌లలో దేశం పేరు వాడవద్దని నిర్ణయించారు’’ అని పీసీబీ సన్నిహిత వర్గాలు తెలిపాయి.ఆసియా కప్‌లో మాత్రం దాయాదుల పోరు!ఇదిలా ఉంటే.. ఆసియా కప్-2025లో మాత్రం టీమిండియా పాకిస్తాన్‌తో ఆడేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినట్లు తెలుస్తోంది. ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే, తటస్థ వేదికలపై మాత్రమే ఆడతామంటూ దాయాదులు గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. యూఏఈలో టోర్నీ జరుగనుంది.ఈ క్రమంలో లీగ్ దశలో ఓసారి, సూపర్ ఫోర్ మ్యాచ్‌లో ఓసారి చిరకాల ప్రత్యర్థులు తలపడే అవకాశం ఉంది. మరోవైపు.. డబ్ల్యూసీఎల్-2025లో శనివారం నాటి ఫైనల్లో పాకిస్తాన్.. సౌతాఫ్రికా చాంపియన్స్‌ను ఢీకొట్టనుంది. ఇదిలా ఉంటే.. పహల్గామ్లో ఉగ్రదాడికి బదులు.. భారత్ ‘ఆపరేషన్ సిందూర్’తో పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఇందుకు పాక్ సైన్యం బదులివ్వగా.. భారత ఆర్మీ గట్టిగా బుద్ధిచెప్పింది.చదవండి: IPL 2026: గైక్వాడ్‌పై వేటు.. సీఎస్కే కెప్టెన్‌గా టీమిండియా స్టార్! అతడిపై కూడా కన్ను? -
‘మీకు మరో దారి లేదు’.. ఆఫ్రిది ఓవరాక్షన్.. దిమ్మతిరిగిపోయింది!
పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది (Shahid Afridi)కి ఇండియా చాంపియన్స్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ‘ఏ ముఖం పెట్టుకుని వస్తారో చూడాలని ఉంది’ అంటూ అతడు చేసిన ‘అతి’ వ్యాఖ్యలకు.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో ఆడకపోవడమే ఉత్తమం అంటూ వాకౌట్ ద్వారా సమాధానం ఇచ్చింది. కాగా ‘వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్’ (WCL) టోర్నమెంట్లో ఇండియా చాంపియన్స్ సెమీస్ చేరిన విషయం తెలిసిందే. అయితే, సెమీ ఫైనల్ పోరులో దాయాది పాకిస్తాన్‌తో భారత్ తలపడాల్సి వచ్చింది. అయితే, టీమిండియా ఇందుకు నిరాకరించింది.లీగ్ దశలోనూలీగ్ దశలోనూ పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన భారత స్టార్లు... దాయాదితో మైదానంలో తలపడేది లేదని మరోసారి తేల్చిచెప్పారు. జమ్మూ కశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌తో ఏ స్థాయిలోనూ క్రికెట్ ఆడబోమని... భారత చాంపియన్స్ జట్టు ప్లేయర్లు శిఖర్ ధావన్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా (Suresh Raina) స్పష్టం చేశారు.ఇక లీగ్ దశలో పాక్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన భారత్... మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒక దాంట్లో గెలిచి మూడింట ఓడి 3 పాయింట్లు దక్కించుకుంది. అయితే చివరి లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భారీ విజయం నమోదు చేసుకున్న భారత్... మెరుగైన రన్‌రేట్‌తో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన పాకిస్తాన్‌తో గురువారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరగనున్న తొలి సెమీఫైనల్లో భారత్ తలపడాల్సి ఉండగా... మన ప్లేయర్లు ఈ మ్యాచ్‌ను సైతం బహిష్కరించారు.వాళ్లకు మరోదారి లేదు.. అస్సలు ఆడముఅయితే, ఈ సెమీ ఫైనల్ కంటే ముందు మీడియాతో మాట్లాడుతూ షాహిద్ ఆఫ్రిది ఓవరాక్షన్ చేశాడు. ‘‘భారత జట్టు ఏ ముఖం పెట్టుకుని మాతో ఆడుతుందో చూడాలని ఉంది. మాతో ఆడటం తప్ప వాళ్లకు ఇప్పుడు మరోదారి లేదు’’ అంటూ వ్యాఖ్యానించాడు. కానీ దేశమే తమకు ముఖ్యమంటూ భారత క్రికెటర్లు పాక్‌తో మ్యాచ్‌ను బహిష్కరించారు. అయితే, భారత జట్టు నిర్ణయంతో పాక్ ఫైనల్‌కు చేరింది. మరోవైపు.. యువీ సేన టోర్నీ నుంచి నిష్క్రమించినా.. దేశ ప్రజల కోసం సరైన పనే చేశామనే సంతోషంతో వెనుదిరిగింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో క్రీడల్లోనూ బంధం కొనసాగించడం సరికాదనే అభిప్రాయంతో డిఫెండింగ్ చాంపియన్ స్వయంగా సెమీస్ పోరు నుంచి బయటకు వచ్చింది.నాడు ఆఫ్రిదికి ధావన్ కౌంటర్కాగా షాహిద్ ఆఫ్రిదికి నోటి దురుసు ఎక్కువేనన్న విషయం తెలిసిందే. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా భారత సైన్యం ‘ఆపరేషర్ సిందూర్’ పేరిట.. ముష్కరులను మట్టుపెడితే షాహిద్ ఆఫ్రిది బాధపడిపోయాడు. తప్పు మీదేనంటూ భారత ఆర్మీని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ షాహిద్ ఆఫ్రిదిని ఉద్దేశించి.. ‘‘కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్‌ను మట్టికరిపించిన భారత సైన్యం గురించి మాట్లాడుతున్నారా? మీకు ఇంకా బుద్ధిరాలేదా? ఇలాంటి వ్యాఖ్యలు చేసే బదులు దేశ అభివృద్ధి మీద దృష్టి పెట్టండి’’ అంటూ చురకలు అంటించాడు.ఆరు జట్లుఇక అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లతో కూడిన ఆరుజట్లు ఇంగ్లండ్ వేదికగా డబ్ల్యూసీఎల్ పేరిట టీ20 టోర్నమెంట్ ఆడుతున్నాయి. 2024లో ఈ టోర్నీ మొదలుకాగా.. యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా చాంపియన్స్.. ఫైనల్లో పాకిస్తాన్ చాంపియన్స్‌ను ఓడించి టైటిల్ గెలిచింది. కాగా భారత్, పాక్‌తో పాటు ఈ ఈవెంట్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు పాల్గొంటున్నాయి. ఈ సీజన్లో భారత్- పాక్ మధ్య జరగాల్సిన తొలి సెమీ ఫైనల్ రద్దుకాగా.. రెండో సెమీస్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా- ఆస్ట్రేలియా గురువారం (జూలై 31) అమీతుమీ తేల్చుకుంటాయి. చదవండి: AUS vs IND: ఆస్ట్రేలియా టూర్‌కు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి చోటు -
పాకిస్తాన్‌తో సెమీస్ మ్యాచ్ రద్దు.. టోర్నీ నుంచి వాకౌట్ చేసిన భారత్..?
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ నుంచి భారత్ వాకౌట్ చేసినట్లు తెలుస్తుంది. టోర్నీలో భాగంగా రేపు (జులై 31) సాయంత్రం 5 గంటలకు భారత్, పాకిస్తాన్ మధ్య మొదటి సెమీఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత ఆటగాళ్లంతా మూకుమ్మడిగా ఈ మ్యాచ్‌ను బహిష్కరించారని సమాచారం. దీంతో పాకిస్తాన్ ఫైనల్‌కు క్వాలిఫై అయినట్లు తెలుస్తుంది. ఈ టోర్నీలో లీగ్ దశలోనూ భారత్ ఇదే కారణంగా పాక్‌తో మ్యాచ్ రద్దు చేసుకుంది. అప్పుడు ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.భారత్ సెమీస్‌కు చేరిందిలా..!పాక్‌తో లీగ్ దశలో మ్యాచ్‌ను రద్దు చేసుకున్న భారత్.. ఆతర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో వరుసగా పరాజయాలు ఎదుర్కొని సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించి, ఫైనల్ ఫోర్లో తుది బెర్త్ దక్కించుకుంది.అయితే అప్పటికే పాకిస్తాన్ వరుస విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటంతో సెమీస్‌లోనే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అనివార్యమైంది. ఒకవేళ లీగ్ దశలో భారత్ మెరుగైన ప్రదర్శన చేసినా ఫైనల్లో అయినా పాక్‌తో పోరు తప్పేది కాదు.మరోపక్క పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీఫైనల్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ రేపు రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో పాకిస్తాన్ ఫైనల్లో తలపడుతుంది. సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లు బర్మింగ్హమ్లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరగాల్సి ఉంది.దేశమే ముఖ్యంపాక్తో సెమీస్ మ్యాచ్ రద్దు చేసుకోవాలని భారత ఆటగాళ్లు నిర్ణయించుకోకముందే టోర్నీ ప్రధాన స్పాన్సర్ 'ఈజ్‌మైట్రిప్' నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకుంది. భారత్, పాక్ మ్యాచ్‌కు తాము స్పాన్సర్‌గా వ్యవహరించలేమంటూ సంస్థ వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టి సోషల్ మీడియా వేదికగా బుధవారం వెల్లడించాడు.‘డబ్ల్యూసీఎల్లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఇక్కడి వరకు చేరుకుంది. దేశాన్ని గర్వించేలా చేసింది. అయితే, పాకిస్తాన్‌తో జరుగబోయే సెమీ ఫైనల్ మ్యాచ్ కేవలం ఆటలో భాగం కాదు.. ఉగ్రవాదం, క్రికెట్ ఒకే ఒరలో ఇమడలేవు. మేము ఎల్లప్పుడూ జాతికి మద్దతుగా నిలబడతాం.ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో ఎలాంటి సంబంధాన్ని మేము అంగీకరించము. దేశ ప్రజల మనోభావాలు మేము అర్థం చేసుకుంటాము. అందుకే మేము డబ్ల్యూసీఎల్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కు అండగా ఉండలేము.కొన్ని విషయాలు క్రీడల కంటే కూడా ముఖ్యమైనవి. ముందు దేశం.. ఆ తర్వాతే వ్యాపారం. జై హింద్ ’ అంటూ నిశాంత్ పిట్టి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. కాగా, అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టార్ ఆటగాళ్లతో డబ్ల్యూసీఎల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. -
WCL: సెమీస్‌లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. తప్పుకొన్నారు!
వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL)- 2025 సెమీ ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. పాయింట్ల పట్టికలో టాపర్‌గా ఉన్న పాకిస్తాన్ చాంపియన్స్‌తో పాటు సౌతాఫ్రికా చాంపియన్స్, ఆస్ట్రేలియా చాంపియన్స్ ముందుగానే టాప్-4లో అడుగుపెట్టాయి.తాజాగా వెస్టిండీస్ చాంపియన్స్‌ను ఓడించి.. మెరుగైన నెట్‌రన్‌రేటు సాధించిన ఇండియా చాంపియన్స్ (India Champions) కూడా సెమీస్‌కు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో తొలి సెమీ ఫైనల్లో టాపర్ పాకిస్తాన్‌ను ఇండియా ఢీకొట్టనుండగా.. రెండో సెమీస్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా- ఆస్ట్రేలియా తలపడతాయి.బర్మింగ్‌హామ్ వేదికగా గురువారం సాయంత్రం ఐదు గంటలకు ఇండియా వర్సెస్ పాక్ (Ind vs Pak), రాత్రి తొమ్మిది గంటలకు సౌతాఫ్రికా- ఆసీస్ (SA vs AUS) మ్యాచ్‌లకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో గ్రూప్ దశలోనే దాయాది పాక్‌తో ఆడేందుకు భారత జట్టు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో మ్యాచ్ రద్దు కాగా.. ఇరుజట్లకు చెరో పాయింట్ వచ్చింది.సెమీస్‌లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్అయితే, తాజాగా సెమీస్‌లోనూ చిరకాల ప్రత్యర్థితో యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా చాంపియన్స్ పోటీపడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఒకవేళ భారత జట్టు ఈ మ్యాచ్ నుంచి తప్పుకొంటే.. టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. ఇలాంటి తరుణంలో ఇండియా చాంపియన్స్ ఏ నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది.ఈ నేపథ్యంలో డబ్ల్యూసీఎల్ టాప్ స్పాన్సర్ ఈజ్‌మైట్రిప్ మాత్రం భారత్ వర్సెస్ పాకిస్తాన్ సెమీస్ పోరు నుంచి తప్పుకొంది. ఈ మ్యాచ్‌కు తాము స్పాన్సర్‌గా వ్యవహరించలేమంటూ సంస్థ వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టి సోషల్ మీడియా వేదికగా బుధవారం వెల్లడించాడు.మాకు దేశమే ముఖ్యం‘‘డబ్ల్యూసీఎల్ సెమీ ఫైనల్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్. వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఇక్కడి వరకు చేరుకుంది. దేశాన్ని గర్వించేలా చేసింది. అయితే, పాకిస్తాన్‌తో జరుగబోయే సెమీ ఫైనల్ మ్యాచ్ కేవలం ఆటలో భాగం కాదు.. ఉగ్రవాదం, క్రికెట్ ఒకే ఒరలో ఇమడలేవు. మేము ఎల్లప్పుడూ జాతికి మద్దతుగా నిలబడతాం.ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో ఎలాంటి సంబంధాన్ని మేము అంగీకరించము. దేశ ప్రజల మనోభావాలు మేము అర్థం చేసుకుంటాము. అందుకే మేము డబ్ల్యూసీఎల్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కు అండగా ఉండలేము. కొన్ని విషయాలు క్రీడల కంటే కూడా ముఖ్యమైనవి. ముందు దేశం.. ఆ తర్వాతే వ్యాపారం. జై హింద్ ’’ అంటూ నిశాంత్ పిట్టి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లతో ఇంగ్లండ్ వేదికగా డబ్ల్యూసీఎల్ పేరిట టీ20 టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు.చదవండి: బిన్నీ విధ్వంసం, యువీ, పఠాన్ మెరుపులు.. ఇండియా సెమీస్‌లో చేరిందిలా! -
పాకిస్తాన్ క్రికెటర్ నన్ను అసభ్యంగా దూషించింది: మిథాలీ రాజ్
భారత్- పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ (Indv vs Pak) అంటే అభిమానుల్లో అంచనాలు తారస్థాయిలో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరకాల ప్రత్యర్థులు పరస్పరం తలపడుతూ ఉంటే.. ఇరు దేశాల అభిమానులు తామే స్వయంగా పోటీపడుతున్నట్లుగా భావిస్తారు. వీరి పరిస్థితే ఇలా ఉంటే.. మైదానంలో నేరుగా ఢీకొట్టే ఆటగాళ్లు ఒక రకంగా భావోద్వేగాలతో యుద్ధం చేస్తారనడంలో అతిశయోక్తి లేదు.అయితే, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ క్రీడా స్పూర్తితో మెలిగే వారే నిజమైన ఆటగాళ్లు అనిపించుకుంటారు. భారత క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ (Mithali Raj) కూడా ఈ కోవకే చెందుతుంది. పాకిస్తాన్ మహిళా జట్టుతో మ్యాచ్ సందర్భంగా తన పట్ల ప్రత్యర్థి టీమ్ ప్లేయర్ అనుచితంగా ప్రవర్తించినా ఆమె సహనం కోల్పోలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాతే సదరు ప్లేయర్‌తో రిఫరీ ద్వారా ‘లెక్క’ తేల్చుకుంది.నన్ను అసభ్యంగా దూషించిందిఈ విషయాన్ని మిథాలీ రాజ్ స్వయంగా తాజాగా వెల్లడించింది. ‘‘టీ20 ప్రపంచకప్ సమయంలో పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడుతున్నాం. అప్పుడు నేను బ్యాటింగ్ చేస్తున్నా. ఇంతలో పాక్ మహిళా క్రికెటర్ వచ్చి మైదానంలో నన్ను అసభ్యంగా దూషించడం మొదలుపెట్టింది.అసలు ఆమె అలా ఎందుకు చేస్తుందో నాకు అర్థం కాలేదు. నేను అవుటై పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలోనూ ఆమె బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తోంది. అప్పుడు కూడా నన్ను దూషించింది. నేను మాత్రం అందుకు బదులు ఇవ్వాలని అనుకోలేదు.కరచాలనం చేసే సమయంలోనూ నా చేతిపై కొట్టింది. ఈ విషయం గురించి మా మేనేజర్‌తో చెప్పాను. వాళ్లు మ్యాచ్ రిఫరీ దృష్టికి తీసుకువెళ్లారు. ఇది హై వోల్టేజీ మ్యాచ్.. ఇలాంటివి సహజంగానే జరుగుతూ ఉంటాయి అని రిఫరీ చెప్పారు.తప్పును అంగీకరించి.. క్షమాపణలు చెప్పించారుఅయితే, ఇలాంటి విషయాలు పాక్ జట్టు మేనేజ్మెంట్ దృష్టికి కూడా తీసుకువెళ్లాలని నేను నిశ్చయించుకున్నాను. వాళ్లు తమ తప్పును అంగీకరించడంతో పాటు ఆమెతో నాకు క్షమాపణలు చెప్పించారు. ఆటలో పోటీపడాలి కానీ.. అకారణంగా ఇతరులను దూషించడం సరికాదు’’ అని మిథాలీ రాజ్ ది లలన్‌టాప్‌నకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి పంచుకుంది.కాగా భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా సేవలు అందించిన మిథాలీ రాజ్.. 232 వన్డేలు, 12 టెస్టులు, 89 అంతర్జాతీయ టీ20లు ఆడింది. టెస్టుల్లో 699 పరుగులు చేసిన ఈ హైదరాబాదీ.. వన్డేల్లో ఏడు శతకాల సాయంతో 7805 పరుగులు సాధించింది. ఇక పొట్టి ఫార్మాట్లో ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 17 హాఫ్ సెంచరీలు కొట్టి 2364 రన్స్ రాబట్టింది.చదవండి: ‘వేరొకరి భర్తను లాక్కోవడం కూడా మోసమే కదా’ -
‘పాక్‌తో మ్యాచ్ ఆడాలి’!.. గంగూలీపై అభిమానుల ఆగ్రహం
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly)పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదా నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఊహించలేదని వాపోతున్నారు. అసలేం జరిగిందంటే.. ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్‌కు ఇటీవలే షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే.కుదిరితే మూడుసార్లుఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఈ మెగా ఈవెంట్లో భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూపులో ఉన్నాయి. ఇరుజట్లు సెప్టెంబరు 14న దుబాయ్‌లో ముఖాముఖి తలపడనున్నాయి. ఆసియా క్రికెట్ మండలి (ACC) ప్రసారకర్తలతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సూపర్ ఫోర్ దశలో ఇరుజట్లు మరోసారి పరస్పరం ఢీకొట్టే అవకాశం ఉంది. అంతా సవ్యంగా సాగి.. మెరుగైన ప్రదర్శన కనబరిస్తే సెప్టెంబరు 28 నాటి ఫైనల్లోనూ దాయాదులు పోటీపడతాయి. నిజానికి ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు భారత్‌వి. అయితే, అంతకుముందు పాక్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ హక్కులు దక్కించుకోగా.. టీమిండియాను అక్కడికి పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిరాకరించింది. తటస్థ వేదికపైనేభద్రతా కారణాల దృష్ట్యా పాక్‌కు వెళ్లలేమని ఐసీసీకి తేల్చిచెప్పింది. ఈ క్రమంలో దుబాయ్ వేదికగా ఈ టోర్నీ జరుగగా.. టీమిండియా చాంపియన్‌గా నిలిచింది.అయితే, నాటి చర్చల ప్రకారం 2027 వరకు భారత్- పాక్ ఏ టోర్నీ ఆతిథ్య హక్కులు దక్కించుకున్నా తటస్థ వేదికపైనే ఆడాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో ఇందుకు అంగీకరించాయి. కానీ.. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో మరోసారి పరిస్థితులు శ్రుతిమించాయి.పాక్‌కు బుద్ధి చెప్పిన భారత సైన్యంప్రశాంతమైన పహల్గామ్ లోయలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి అమాయక పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు. ఇందుకు ప్రతిగా భారత సైన్యం పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అయితే, ఉగ్రవాదులపై జరిపిన దాడులకు పాక్ సైన్యం స్పందిస్తూ.. ప్రతిదాడికి దిగగా.. ఇండియన్ ఆర్మీ గట్టిగా బుద్ధిచెప్పింది.ఈ నేపథ్యంలో ఇకపై పాకిస్తాన్‌తో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదని.. క్రీడల్లోనూ బంధం తెంచుకోవాలనే డిమాండ్లు వచ్చాయి. ఈ విషయంపై గంగూలీ గతంలో స్పందిస్తూ.. ఈ డిమాండ్లకు మద్దతు తెలిపాడు. అయితే, తాజాగా మరోసారి ఆసియా కప్-2025 నేపథ్యంలో ఇందుకు సంబంధించి ప్రశ్న ఎదురుకాగా దాదా భిన్నంగా స్పందించాడు.పాక్‌తో మ్యాచ్.. ఆటలు కొనసాగాలి‘‘ఇరుజట్లు పరస్పరం పోటీపడటంలో నాకెలాంటి ఇబ్బందీ లేదు. ప్రణాళిక ప్రకారం క్రీడలు కొనసాగాలి. అదే సమయంలో పహల్గామ్ వంటి ఘటనలను అరికట్టాలి. అయితే, ఆటలు మాత్రం కొనసాగుతూనే ఉండాలి. ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలి. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భారత్ పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. కాబట్టి క్రీడలు కొనసాగించడంలో తప్పులేదు’’ అని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇటీవల ప్రపంచ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 సీజన్లో భాగంగా ఇండియా- పాకిస్తాన్‌తో తలపడాల్సి ఉండగా.. విమర్శల నేపథ్యంలో మ్యాచ్ రద్దైపోయింది. ఇండియా చాంపియన్స్ జట్టులో భాగమైన శిఖర్ ధావన్, సురేశ్ రైనా తదితరులు పాక్‌తో ఆడేందుకు విముఖత వ్యక్తం చేయడంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆసియా కప్ వంటి కీలక టోర్నీలో బీసీసీఐ.. దాయాదితో ముఖాముఖి పోరు నాటికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి!చదవండి: Asia Cup 2025: పూర్తి షెడ్యూల్ విడుదల.. భారత్- పాక్ మ్యాచ్‌లు ఎప్పుడంటే? #WATCH | Kolkata: On India-Pakistan placed in the same group in the Asia Cup, former Indian cricketer Saurav Ganguly says, "I am okay. The sport must go on. At the same time Pahalgam should not happen, but the sport must go on. Terrorism must not happen; it needs to be stopped.… pic.twitter.com/Qrs17KOKrN— ANI (@ANI) July 27, 2025 -
Asia Cup: పూర్తి షెడ్యూల్ విడుదల.. భారత్- పాక్ మ్యాచ్‌ల తేదీలివే!
Asia Cup 2025: ఆసియా కప్-2025 నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే టోర్నమెంట్‌కు సంబంధించి ఆసియా క్రికెట్ మండలి (ACC) శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.మూడుసార్లు ఢీకొట్టే అవకాశం!చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ (India vs Pakistan) జట్లు సెప్టెంబరు 14న పరస్పరం తలపడనున్నాయి. దాయాదులు రెండూ ఒకే గ్రూపులో ఉన్నాయి కాబట్టి సూపర్ ఫోర్ దశలో మరోసారి అంటే.. సెప్టెంబరు 21న ఢీకొట్టే వీలుంది. ఒకవేళ ఇరుజట్లు ఫైనల్ చేరితో సెప్టెంబరు 28న మరోసారి ముఖాముఖి పోటీపడతాయి.గ్రూప్- ఎ నుంచి ఇండియా, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ పోటీపడనుండగా.. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ గ్రూప్-బి నుంచి తలపడతాయి. దుబాయ్, అబుదాది వేదికలుగా ఈ 19 మ్యాచ్‌ల టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు.బీసీసీఐపై విమర్శలుకాగా ఆసియా కప్ టీ20 టోర్నీకి ఈసారి భారత్ వేదిక. అయితే, ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గతంలో మాదిరి ఈసారి కూడా తటస్థ వేదికపై టోర్నీని నిర్వహించనున్నారు. అయితే, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో అన్ని స్థాయిల్లోనూ క్రీడల్లోనూ బంధం తెంచుకోవాలనే డిమాండ్లు వచ్చాయి. బీసీసీఐ సైతం దాయాదితో పోటీ పడేందుకు సుముఖంగా లేమని వెల్లడించింది.కానీ.. తాజా షెడ్యూల్ ప్రకారం చిరకాల ప్రత్యర్థితో టీమిండియా తలపడనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరుపై విమర్శలు వస్తున్నాయి. కాగా ఇటీవల వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్‌లో పాక్‌తో మ్యాచ్ ఆడేందుకు ఇండియా చాంపియన్స్ నిరాకరించింది. దీంతో ఇరుజట్ల మధ్య మ్యాచ్ రద్దు కాగా.. చెరో పాయింట్ వచ్చింది.లీగ్ దశ షెడ్యూల్👉సెప్టెంబరు 9: అఫ్గనిస్తాన్ వర్సెస్ హాంగ్‌కాంగ్👉సెప్టెంబరు 10: ఇండియా వర్సెస్ యూఏఈ👉సెప్టెంబరు 11: బంగ్లాదేశ్ వర్సెస్ హాంగ్‌కాంగ్👉సెప్టెంబరు 12: పాకిస్తాన్ వర్సెస్ ఒమన్👉సెప్టెంబరు 13: బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక👉సెప్టెంబరు 14: ఇండియా వర్సెస్ పాకిస్తాన్👉సెప్టెంబరు 15: యూఏఈ వర్సెస్ ఒమన్👉సెప్టెంబరు 15:శ్రీలంక వర్సెస్ హాంగ్‌కాంగ్👉సెప్టెంబరు 17: పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ👉సెప్టెంబరు 18: శ్రీలంక వర్సెస్ అఫ్గనిస్తాన్👉సెప్టెంబరు 19: ఇండియా వర్సెస్ ఒమన్సూపర్ 4 దశ👉సెప్టెంబరు 20: గ్రూప్- బి టాపర్ వర్సెస్ రెండో స్థానంలో ఉన్న జట్టు (B1 Vs B2)👉సెప్టెంబరు 21: గ్రూప్-ఎ టాపర్ వర్సెస్ రెండో స్థానంలో ఉన్న జట్టు (A1 vs A2)👉సెప్టెంబరు 23: A2 vs B1👉సెప్టెంబరు 24: A1 vs B2👉సెప్టెంబరు 25: A2 vs B2👉సెప్టెంబరు 26: A1 vs B1👉సెప్టెంబరు 28: ఫైనల్.చదవండి: IND vs AUS: ధావన్ ధనాధన్.. పఠాన్ విధ్వంసం.. యువీ మాత్రం విఫలం -
WCL 2025: నీకసలు దేశభక్తి ఉందా?.. ఆఫ్రిదితో ముచ్చట్లు పెడతావా?
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది (Shahid Afridi)- బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ (Ajay Devgan) కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్రికెట్ మైదానంలో వీరిద్దరు సరదాగా ముచ్చటించుకుంటూ.. పరస్పరం ఆలింగనం చేసుకున్న దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో అజయ్ దేవగణ్‌పై భారతీయ నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.నీకసలు దేశభక్తి ఉందా?‘‘నీకసలు దేశభక్తి అనేదే లేదా? ఒకవేళ ఉన్నా సోషల్ మీడియా పోస్టులకు మాత్రమే పరిమితం చేస్తావా?’’ అంటూ అజయ్ దేవగణ్‌ను భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఈ ఫొటోలు, వీడియోలు నిజమైనవేనా? అవును.. ఇవేమీ కృత్రిమ మేధ (AI)తో సృష్టించినవి కాదు. నిజమైనవే. అయితే, గతేడాదికి సంబంధించినవి.ఇండియా చాంపియన్స్ సహ యజమానిఅసలు విషయం ఏమిటంటే.. ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) పేరిట మాజీ క్రికెటర్లతో కూడిన ఆరుజట్లతో టీ20 టోర్నమెంట్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగమైన ఇండియా చాంపియన్స్ జట్టుకు అజయ్ దేవగణ్ సహ యజమానిగా ఉన్నాడు. గతేడాది ఈ టోర్నీ మొదలు కాగా.. తొలి ఎడిషన్‌లో యువరాజ్ సింగ్ సారథ్యంలోని భారత్.. ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి ట్రోఫీ గెలిచింది.భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ రద్దుఇక WCL రెండోసీజన్ శుక్రవారం (జూలై 18)న మొదలుకాగా చిరకాల ప్రత్యర్థుల మధ్య ఆదివారం (జూలై 20) మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరించాలని కెప్టెన్ యువీతో సహా శిఖర్ ధావన్, సురేశ్ రైనా నిర్ణయించుకున్నట్లు తెలిసింది.గతేడాది ఫొటోలు ఇవిఈ నేపథ్యంలో ఈ టోర్నీని నిర్వహిస్తున్న ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) దాయాదుల పోరును రద్దు చేయాల్సి వచ్చింది. అయితే, అజయ్ దేవగణ్ మాత్రం.. భారత్‌పై తన వ్యాఖ్యలతో విషం చిమ్మే షాహిద్ ఆఫ్రిదిని కలిసినట్లుగా ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. కానీ అవి తాజా సీజన్‌కు సంబంధించినవి కావు. గతేడాది ఇరుదేశాలు కలిసి టోర్నీలో ఆడాయి.అప్పుడే అంటే అరంగేట్ర సీజన్ (2024)లో అజయ్ ఆఫ్రిదిని కలిశాడు. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ఫొటోలు మరోసారి తెరమీదకు రాగా.. అజయ్ దేవగణ్‌ను ట్రోల్ చేస్తున్నారు. కాగా ఈ ఏడాది జమ్మూకశ్మీర్‌లోని ప్రశాంత పహల్గామ్లో ఉగ్రవాదులు దాడికి తెగబడిన విషయం తెలిసిందే. ఇందుకు బదులుగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరిట ప్రత్యేక ఆపరేషన్‌తో పాక్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఇందుకు పాక్ సైన్యం బదులివ్వగా అనుచిత దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. దీంతో ఇరుదేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా WCL-2025లో తొలి మ్యాచ్‌ను రద్దు చేసుకున్న యువీ సేన మంగళవారం తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది. సౌతాఫ్రికా చాంపియన్స్‌తో తలపడనుంది.చదవండి: WCL 2025: బరిలో యువీ, డివిలియర్స్, బ్రెట్ లీ.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు Ajay Devgan meets Shahid Afridi happily. These celebs desh bhakti will remain for PR only, rest they will do anything for money and don't care about the people of the country. pic.twitter.com/FqfKTMPNOm— Div🦁 (@div_yumm) July 20, 2025Bollywood star Ajay Devgan with legend Shahid Afridi !! pic.twitter.com/eFlR9Ad5jY— TEAM AFRIDI (@TEAM_AFRIDI) July 6, 2024 -
T20 WC 2026: వార్మప్ మ్యాచ్‌ల వేదికలు ప్రకటించిన ఐసీసీ
మహిళల టీ20 ప్రపంచకప్-2026 (T20 WC 2026) టోర్నమెంట్‌కు సంబంధించిన అంతర్జాతీయ మండలి (ICC) తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మెగా ఈవెంట్ సన్నాహకాల్లో భాగంగా జట్లు ఆడనున్న వార్మప్ మ్యాచ్‌ల వేదికలను ఖరారు చేసింది. కాగా వచ్చే ఏడాది జూన్ 12- జూలై 5 వరకు టీ20 ప్రపంచకప్ నిర్వహణకు ఐసీసీ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న ఈ ఐసీసీ టోర్నీలో మొత్తం పన్నెండు జట్లు పాల్గొననున్నాయి. ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్, పాకిస్తాన్‌లు ఇప్పటికే అర్హత సాధించగా.. గ్లోబల్ క్వాలిఫయర్స్ ఫలితాల ఆధారంగా మరో నాలుగు జట్లు ఈ టోర్నీ ఆడతాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించి.. ఒక్కో గ్రూపులో ఆరు జట్లను ఆడిస్తారు.ఇక ఈ టోర్నీని 24 రోజుల పాటు నిర్వహించనుండగా.. ఎడ్జ్‌బాస్టన్, ఓల్డ్ ట్రఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్, హాంప్‌షైర్ బౌల్, హెడింగ్లీ, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్, ది ఓవల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే, వార్మప్ మ్యాచ్‌లకు సంబంధించి షెడ్యూల్ ఖరారు చేయని ఐసీసీ.. వేదికలకు మాత్రం ఫైనల్ చేసింది. కార్డిఫ్స్ సోఫియా గార్డెన్స్, డెర్బీ కౌంటీ గ్రౌండ్, లొబరో యూనివర్సిటీ మైదానాల్లో సన్నాహక మ్యాచ్‌లు జరుగుతాయని గురువారం వెల్లడించింది.కాగా 2024 నాటి మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో న్యూజిలాండ్ చాంపియన్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే.. ఈసారి భారత్ జూన్ 14 నాటి తమ తొలి మ్యాచ్‌లోనే దాయాది పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. ఆ తర్వాత గ్లోబల్ క్వాలిఫయర్ నుంచి వచ్చిన జట్టుతో జూన్ 17న మ్యాచ్ ఆడుతుంది. అనంతరం సౌతాఫ్రికాతో జూన్ 21, క్వాలిఫయర్ జట్టుతో జూన్ 25, ఆస్ట్రేలియాతో జూన్ 28న భారత జట్టు తలపడనుంది. ఈ టోర్నీలో భాగంగా మొత్తం 33 మ్యాచ్‌లు జరుగుతాయి.చదవండి: నేను ఎదుర్కొన్న టఫెస్ట్ బౌలర్ అతడే: శిఖర్ ధావన్ -
జట్టులోనే ఉండడు.. ఖేల్ ఖతం అనుకున్నాం.. కానీ: భారత మాజీ బ్యాటర్
టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ఘనత మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) సొంతం. 2007లో తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్‌తో పాటు వన్డే వరల్డ్‌కప్-2011 (ODI World Cup), ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2013లను ధోని సారథ్యంలో భారత్ గెలుచుకుంది. తద్వారా దేశానికి మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్‌గా ధోని ఇప్పటికీ కొనసాగుతున్నాడు.జట్టులోనే ఉండడు.. ఖేల్ ఖతం అనుకున్నాం.. అయితే, అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రంలోనే డకౌట్ అయిన ధోని.. జట్టులో కొనసాగడం కష్టమేనని అప్పటికి జట్టులో ఉన్న క్రికెటర్లు భావించారట. అతడి ఆట మూణ్ణాళ్ల ముచ్చటేనని.. సుదీర్ఘకాలం కెరీర్ కొనసాగించలేడని అనుకున్నారట. టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ (Mohammad Kaif) ఈ విషయాన్ని వెల్లడించాడు.కాగా ధోని సోమవారం (జూలై 7) 44వ వసంతంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ధోని గురించిన జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న కైఫ్.. అరంగేట్ర వన్డే సిరీస్‌లో తీవ్రంగా నిరాశపరిచిన ధోని.. 2005లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అదరగొట్టిన తీరు తమను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు.వన్‌డౌన్‌లో రావడమే సర్ప్రైజ్‘‘పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే ఒత్తిడి ఎంతగా ఉంటుందో తెలుసు కదా!.. నాటి ఆ మ్యాచ్‌లో ధోనిని టాపార్డర్‌కు ప్రమోట్ చేయాలని గంగూలీ భావించాడు. అతడు కొన్నైనా పరుగులు చేస్తాడని అనుకున్నాడు.కానీ అతడు 140 పరుగులు చేస్తాడని ఎవరు అనుకోగలరు. డ్రెసింగ్‌రూమ్‌లో ఈ విషయం గురించి ఒక్కరికీ తెలియదు. కనీసం ఎవరూ ఊహించను కూడా లేదు. అసలు అతడు వన్‌డౌన్ (మూడో స్థానం)లో బ్యాటింగ్‌కు వెళ్లడమే ఒక సర్ప్రైజ్.అలాంటిది అతడు పాయింట్, మిడాఫ్ మీదుగా అలా షాట్లు బాదుతుంటే అందరూ అలా చూస్తూ ఉండిపోయారు. అసలు ఇతడు ఇలాంటి సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడతాడని ఒక్కరమూ ఊహించలేదు. మా ఆలోచన ఎంత తప్పో తన ఆట ద్వారానే నిరూపించాడు.అందరి బౌలింగ్‌ను చితక్కొట్టాడుఇన్నింగ్స్ సాగుతున్న కొద్దీ అతడు షాట్లు బాదుతూనే ఉన్నాడు. పవర్ ప్లేలో మొదలుపెడితే.. స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లు అన్న తేడా లేకుండా అందరి బౌలింగ్‌ను చితక్కొట్టాడు. తనకు చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ అని అతడికి తెలుసు.ఒకవేళ మూడో స్థానంలో గనుక తను రాణించకపోతే.. భవిష్యత్తులో తనకు మళ్లీ అవకాశాలు రావని కూడా అతడికి తెలుసు. అందుకే అతడు ధైర్యంగా, దూకుడుగా ఆడి సత్తా చాటాడు’’ అని మహ్మద్ కైఫ్ జియోస్టార్ షోలో పేర్కొన్నాడు. కాగా 2005లో పాక్‌తో రెండో వన్డేలో ధోని 123 బంతుల్లో 15 ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 148 పరుగులు చేశాడు. అతడి ధనాధన్ ఇన్నింగ్స్ వల్ల టీమిండియా పాక్‌ను ఓడించింది. అయితే, స్వదేశంలో జరిగిన ఆ సిరీస్‌లో మాత్రం 4-2తో ఓటమిపాలైంది.దిగ్గజ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్‌కాగా 2004లో బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా ధోని అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆ మరుసటి ఏడాది టెస్టుల్లోనూ అరంగేట్రం చేసిన ధోని.. 2006లో టీ20లలో ప్రవేశించాడు. జట్టులోకి వచ్చిన అనతికాలంలోనే నాయకుడిగా ఎదిగిన ధోని.. 2007లో జట్టును విశ్వవిజేతగా నిలిపాడు.భారత దిగ్గజ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఎదిగాడు ధోని. టీమిండియా తరఫున మొత్తంగా 350 వన్డేలు, 98 టీ20లు, 90 టెస్టులు ఆడిన తలా... ఆయా ఫార్మాట్లలో 10773, 1617, 4876 పరుగులు సాధించాడు. 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో కెప్టెన్‌గా.. చెన్నై సూపర్ కింగ్స్‌ను రికార్డు స్థాయిలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు తలా.చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్ -
భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా యువరాజ్ సింగ్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) సీజన్ 2 కోసం ఇండియా ఛాంపియన్స్ మెనెజ్‌మెంట్ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా లెజెండరీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మరోసారి ఎంపికయ్యాడు. 2024లో అరంగేట్ర ఎడిషన్‌లో యువీ సారథ్యంలోనే భారత జట్టు విజేతగా నిలిచింది.ఇక ఈ 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో శిఖర్ ధావన్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, యూసుఫ్ పఠాన్ వంటి దిగ్గజాలు ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో ఇండియా జట్టు సమతుల్యంగా కన్పిస్తోంది.పేస్ బౌలింగ్ విభాగంలో వరుణ్ ఆరోన్, సిద్ధార్థ్ కౌల్, వినయ్ కుమార్ చోటు దక్కించుకోగా.. స్పిన్ బాధ్యతలు హర్భజన్, పియూష్ చావ్లా, పవన్ నేగి నిర్వహించనున్నారు. ఇక బ్యాటింగ్ లైనప్‌లో యువీ, ధావన్, సురేష్ రైనా వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు.తొలి పోరు పాక్‌తోనే..ఇక డబ్ల్యూసీఎల్ సెకెండ్ సీజన్ జూలై 18 నుండి ఆగస్టు 2 వరకు ఇంగ్లండ్‌లోని నాలుగు వేదికలలో జరగనుంది. ఎడ్జ్‌బాస్టన్ (బర్మింగ్‌హామ్), కౌంటీ గ్రౌండ్ (నార్తాంప్టన్), గ్రేస్ రోడ్ (లీసెస్టర్), హెడింగ్లీ (లీడ్స్) మైదానాలు ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమివ్వనున్నాయి.ఈ టోర్నీలో భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మొత్తం ఆరు జట్లు పాల్గోనున్నాయి. ఈ మెగా ఈవెంట్ రౌండ్-రాబిన్ లీగ్ ఫార్మాట్లో జరగనుంది. పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్దానాల్లో నిలిచే జట్లు సెమీ-ఫైనల్స్‌కు చేరుకుంటాయి. ఇక ఇండియా ఛాంపియన్స్ తమ తొలి మ్యాచ్‌లో జూలై 20న పాకిస్తాన్‌తో తలపడనుంది.ఇండియా ఛాంపియన్స్ జట్టుయువరాజ్ సింగ్ (కెప్టెన్), శిఖర్ ధావన్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, పీయూష్ చావ్లా, స్టువర్ట్ బిన్నీ, గురుకీరత్ మాన్, వినయ్ కుమార్, సిద్దార్థ్ కౌల్, వరుణ్ ఆరోన్, అభిమన్యు మిథున్, పవన్ నేగి మిథున్ -
Ind vs Pak: ఆసియా కప్-2025.. భారత్-పాక్ మ్యాచ్ ఆరోజే!
ఆసియా కప్-2025 నిర్వహణకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరులో టోర్నమెంట్ నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ మండలి (ACC) ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి జూలై మొదటి వారంలోనే షెడ్యూల్ విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కాగా భారత్- పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య ఇటీవలి ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియా కప్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్న విషయం తెలిసిందే. కశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదులు అమాయక పర్యాటకులను కాల్చి చంపగా.. ఇందుకు ప్రతిగా భారత సైన్యం పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట దాడులు చేసింది.ఈ క్రమంలో పాకిస్తాన్ సైన్యం ఎదురుదాడికి తెగబడగా.. భారత ఆర్మీ ధీటుగా బదులిచ్చింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. అయితే, సింధు జలాల ఒప్పందం రద్దు సహా పాక్‌పై భారత్ కఠిన చర్యలకు ఉపక్రమించిన నేపథ్యంలో దాయాది కాల్పుల విరమణకు అంగీకరించింది. దీంతో ప్రస్తుతం పరిస్థితులు చక్కబడ్డాయి.అయితే, ఆసియా కప్‌లో భారత్- పాకిస్తాన్ కలిసి ఆడతాయా లేదా అన్న సందేహాల నడుమ.. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆసక్తికర కథనం ప్రచురించింది. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీని ముందుగా నిర్ణయించినట్లుగా తటస్థ వేదికైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో నిర్వహించనున్నట్లు తెలిపింది.భారత్- పాక్ మ్యాచ్ ఆరోజేఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్న ఆసియా కప్.. సెప్టెంబరు 5న ఆరంభం కానున్నట్లు పేర్కొంది. అదే విధంగా.. గ్రూప్ దశలో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్- పాక్ తొలుత సెప్టెంబరు 7న ముఖాముఖి తలపడనున్నట్లు వెల్లడించింది. ఇక 2022, 2023 మాదిరే ఈసారి కూడా గ్రూప్ దశ తర్వాత సూపర్ ఫోర్ ఫార్మాట్లోనే టోర్నీని నిర్వహించనున్నట్లు సమాచారం.ఒకవేళ భారత్‌తో పాటు పాకిస్తాన్ కూడా సూపర్ ఫోర్కు అర్హత సాధిస్తే సెప్టెంబరు 14న మరోసారి దాయాదులు పరస్పరం ఢీకొట్టనున్నాయి. అన్నీ సజావుగా సాగి ఇరు జట్లు ఫైనల్ చేరితే సెప్టెంబరు 21న మరోసారి హై వోల్టేజీ మ్యాచ్ చూసేందుకు అభిమానులకు అవకాశం లభిస్తుంది.మూడుసార్లు పోటీ పడే అవకాశం!అయితే, ప్రస్తుత ఫామ్ దృష్ట్యా పాక్ గ్రూప్ దశ దాటడమే కష్టంగా కనిపిస్తోంది. ఏదేమైనా దాయాదులు ఈ టోర్నీలో మూడుసార్లు ముఖాముఖి పోటీ పడే అవకాశాలు మాత్రం లేకపోలేదు. కాగా ఆసియా కప్-2025లో మొత్తంగా ఆరు జట్లు తలపడనున్నాయి. టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్‌లతో పాటు ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్‌లో అగ్రస్థానంలో నిలిచిన యూఏఈ కూడా టైటిల్ కోసం పోటీపడనుంది.తటస్థ వేదిక కాబట్టికాగా పాకిస్తాన్‌తో కలిసి ఆడకూడదని టీమిండియా భావించగా.. ఏసీసీ సమావేశంలో భాగంగా ఆతిథ్య హోదాలో ఆడేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల బ్రాడ్కాస్టన్ సోనీ స్పోర్ట్స్ విడుదల చేసిన పోస్టర్లో పాక్ కెప్టెన్ కనబడకపోవడంతో.. ఈ టోర్నీ నుంచి పాక్ తప్పుకొందనే సంకేతాలు వచ్చాయి. ఇక ఈ కథనాల్లో ఏది నిజమో తేలాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే!చదవండి: ఇంగ్లండ్ గడ్డపై ఇరగదీస్తున్న ఇషాన్ కిషన్, తిలక్ వర్మ -
సెప్టెంబర్ 10 నుంచి ఆసియా కప్..! భారత్-పాక్ మ్యాచ్ ఉంటుందా?
సెప్టెంబర్‌లో ఆసియా కప్.. భారత్-పాక్ మ్యాచ్ ఉంటుందా?క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఆసియాకప్-2025 సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ జూలై మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు క్రిక్‌బజ్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది.వాస్తవానికి టీ20 ఫార్మాట్లో జరగనున్న ఈ మెగా ఈవెంట్‌కు భారత్ ఆతిథ్యమివ్వాల్సి ఉంది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో జరిగిన ఒప్పందం ప్రకారం.. పాక్ తమ మ్యాచ్‌లను యూఏఈలో ఆడనుంది. కానీ ఇప్పుడు మ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య రాజీకీయ ఉద్రిక్తలు మరింత పెరిగాయి.దీంతో ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ పాల్గోంటుందా? ఒకవేళ పాల్గోన్న భారత్ దాయాది జట్టుతో ఆడుతుందా అన్నది ఇంకా ప్రశ్నార్ధకంగానే ఉంది. ఈ విషయాలపై మరి కొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశముంది. ఈ మెగా టోర్నీలో పాల్గోనే ఆరు జట్లలో అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, యూఎఈ ఉన్నాయి.ప్రభుత్వం నిర్ణయమే ఫైనల్..కాగా పాకిస్తాన్‌తో ఉద్రిక్తల కారణంగా ఆసియాకప్ నుంచి వైదొలగాలని భారత్ నిర్ణయించుకుందని తొలుత వార్తలు వినిపించాయి. ఈ వార్తలను కార్యదర్శి దేవజిత్ సైకియా ఖండించారు. అవన్నీ ఆ వాస్తవమని, తాము ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అని సైకియా కొట్టిపారేశారు. తాజాగా మరో బీసీసీఐ సీనియర్ ఆధికారి కూడా ఇదే విషయాన్ని స్ఫష్టం చేశారు."ఆసియాకప్‌లో పాల్గోకపోవడం లేదా మ్యాచ్‌లను బాయ్‌కట్ చేయడం గురుంచి ఎటువంటి చర్చ కూడా జరగలేదు. ఐసీసీ ఈవెంట్లలో మేము పాకిస్తాన్‌తో ఆడుతాము. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మేము నడుచుకుంటాము.ఒకవేళ గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ రాకపోతే అందుకు తగ్గట్టు నిర్ణయం తీసుకుంటాము. ఈ టోర్నీకి సంబంధించి రాబోయే రోజుల్లో మాకు ఒక క్లారిటీ వస్తోంది" అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్సైడ్ స్పోర్ట్‌తో పేర్కొన్నారు. -
టీ20 ప్రపంచకప్-2026 షెడ్యూల్ విడుదల
మహిళల టీ20 ప్రపంచకప్-2026 (ICC Women's T20 World Cup) షెడ్యూల్ విడుదలైంది. ఇంగ్లండ్ వేదికగా ఈ ఐసీసీ టోర్నీకి వచ్చే ఏడాది జూన్ 12న తెర లేవనుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది.ఈ మెగా ఈవెంట్లో పన్నెండు జట్లు భాగం కానున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్‌లతో పాటు.. గ్లోబల్ క్వాలిఫయర్స్ ఫలితాల ఆధారంగా మరో నాలుగు జట్లు వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించనున్నాయి.ఈ పన్నెండు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఎ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, భారత్, పాకిస్తాన్‌తో పాటు మరో రెండు జట్లు.. గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్‌లతో పాటు మరో రెండు టీమ్‌లు పోటీపడనున్నాయి.డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి న్యూజిలాండ్కాగా చివరగా 2024లో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీలో న్యూజిలాండ్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇక టీ20 ప్రపంచకప్-2026 ఏడు వేదికల్లో 24 రోజుల పాటు సాగనుంది. ఇందులో భాగంగా 33 మ్యాచ్‌లు జరుగనున్నాయి.కాగా ఎడ్జ్‌బాస్టన్, హాంప్‌షైర్ బౌల్, హెడ్డింగ్లీ, ఓల్డ్ ట్రఫోర్డ్, ది ఓవల్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్, లార్డ్స్ మైదానాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇంగ్లండ్- శ్రీలంక మధ్య మ్యాచ్‌తో జూన్ 12న మొదలయ్యే మహిళల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ జూలై 5న లార్డ్స్‌లో ఫైనల్‌తో ముగియనుంది.భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అప్పుడే..ఈ మెగా టోర్నీలో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. జూన్ 14న ఈ హైవోల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. అనంతరం గ్లోబ్ క్వాలిఫయర్ నుంచి వచ్చిన టీమ్‌తో జూన్ 17న భారత్ తలపడుతుంది.ఆ తర్వాత జూన్ 21న సౌతాఫ్రికాతో, జూన్ 25న క్వాలిఫయర్ జట్టుతో, జూన్ 28న పటిష్ట ఆస్ట్రేలియా జట్టుతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026 పూర్తి షెడ్యూల్జూన్ 12- శుక్రవారం- ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక, ఎడ్జ్బాస్టన్జూన్ 13- శనివారం: క్వాలిఫైయర్ vs క్వాలిఫైయర్, ఓల్డ్ ట్రఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్జూన్ 13- శనివారం: ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా, ఓల్డ్ ట్రఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్జూన్ 13- శనివారం: వెస్టిండీస్ vs న్యూజిలాండ్, హాంప్‌షైర్ బౌల్జూన్ 14- ఆదివారం: క్వాలిఫైయర్ vs క్వాలిఫైయర్, ఎడ్జ్బాస్టన్జూన్ 14- ఆదివారం: ఇండియా vs పాకిస్తాన్, ఎడ్జ్బాస్టన్జూన్ 16- మంగళవారం: న్యూజిలాండ్ vs శ్రీలంక, హాంప్‌షైర్ బౌల్జూన్ 16- మంగళవారం: ఇంగ్లండ్ vs క్వాలిఫయర్, హాంప్షైర్బౌల్జూన్ 17- బుధవారం: ఆస్ట్రేలియా vs క్వాలిఫయర్, హెడ్డింగ్లీజూన్ 17- బుధవారం: ఇండియా vs క్వాలిఫయర్, హెడ్డింగ్లీజూన్ 17- బుధవారం: సౌతాఫ్రికా vs పాకిస్తాన్, ఎడ్జ్బాస్టన్జూన్ 18- గురువారం: వెస్టిండీస్ vs క్వాలిఫయర్, హెడ్డింగ్లీజూన్ 19- శుక్రవారం: న్యూజిలాండ్ vs క్వాలిఫయర్, హాంప్‌షైర్ బౌల్జూన్ 20- శనివారం: ఆస్ట్రేలియా vs క్వాలిఫయర్, హాంప్‌షైర్ బౌల్జూన్ 20- శనివారం: ఇంగ్లండ్ vs క్వాలిఫయర్, హెడ్డింగ్లీజూన్ 21- ఆదివారం: వెస్టిండీస్ vs శ్రీలంక, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్జూన్ 23- మంగళవారం: న్యూజిలాండ్ vs క్వాలిఫయర్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్జూన్ 23- మంగళవారం: శ్రీలంక vs క్వాలిఫయర్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్జూన్ 23- మంగళవారం: ఆస్ట్రేలియా vs పాకిస్తాన్, హెడ్డింగ్లీజూన్ 24- బుధవారం: ఇంగ్లండ్ vs వెస్టిండీస్, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్జూన్ 25- గురువారం: ఇండియా vs క్వాలిఫయర్, ఓల్డ్ ట్రఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్జూన్ 25- గురువారం: సౌతాఫ్రికా vs క్వాలిఫయర్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్జూన్ 26- శుక్రవారం: శ్రీలంక vs క్వాలిఫయర్, ఓల్డ్ ట్రఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్జూన్ 27- శనివారం: పాకిస్తాన్ vs క్వాలిఫయర్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్జూన్ 27- శనివారం: వెస్టిండీస్ vs క్వాలిఫయర్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్జూన్ 27- శనివారం: ఇంగ్లండ్ vs న్యూజిలాండ్, ది ఓవల్జూన్ 28- ఆదివారం: సౌతాఫ్రికా vs క్వాలిఫయర్, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్.జూన్ 28- ఆదివారం: ఆస్ట్రేలియా vs ఇండియా, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్.జూన్ 30- మంగళవారం: సెమీ ఫైనల్ 1- ది ఓవల్జూలై 2- గురువారం: సెమీ ఫైనల్ 2- ది ఓవల్జూలై 5- ఆదివారం: ఫైనల్, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్.చదవండి: గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసకర శతకం.. 13 సిక్సర్లతో -
భారత ఆటగాడిని అవమానించిన పాక్ టెన్నిస్ ప్లేయర్.. వైరల్ వీడియో
పాకిస్తాన్ టెన్నిస్ ప్లేయర్ ఒకరు భారత ఆటగాడిని అవమానించాడు. భారత్ చేతిలో ఓటమిని తట్టుకోలేక ఓవరాక్షన్ చేశాడు. మ్యాచ్ పూర్తయ్యాక షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వెళ్లిన భారత ఆటగాడి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. కోపంతో ఊగిపోతూ కరచాలనం చేసేందుకు నిరాకరించాడు. కజకిస్థాన్ వేదికగా జరిగిన ఏసియా-ఓసియానియా జూనియర్ డేవిడ్ కప్ (అండర్-16) టెన్నిస్ టోర్నీమెంట్లో ఇది జరిగింది. India defeats Pakistan 2-0 in Junior Davis CupLook at the Pakistan player's attitude on handshake after loosing, Pathetic Stuff! 😡 pic.twitter.com/8twsAbDqPd— India Insights 🇮🇳 (@India_insights0) May 27, 2025ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. పాక్ ఆటగాడి ప్రవర్తనను భారత క్రీడాభిమానులు ఖండిస్తున్నారు. క్రీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించాడని మండిపడుతున్నారు. పాక్ ఆటగాళ్ల నుంచి ఇంతకంటే గొప్ప ప్రవర్తన ఆశించలేమంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. భారత్-పాక్ మధ్య యుద్దం తర్వాత జరిగిన ఘటన కావడంతో భారత అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు.కాగా, జూనియర్ డేవిడ్ కప్ టెన్నిస్ టోర్నీలో 11వ స్థానం కోసం జరిగిన ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లో భారత్ పాక్‌ను 2-0 తేడాతో చిత్తుగా ఓడించింది. సింగిల్స్ మ్యాచ్‌ల్లో భారత ఆటగాళ్లు ప్రకాశ్ సర్రన్, తవిశ్ పహ్వా వరుస సెట్లలో పాక్ ఆటగాళ్లును ఓడించారు. -
పాకిస్తాన్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్?.. భద్రతే ముఖ్యం..
ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన పాకిస్తాన్ క్రికెట్ (Pakistan Cricket) మళ్లీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. పాక్ జట్టు ఇటీవలి కాలంలో వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శల పాలైన విషయం తెలిసిందే. తరచూ కెప్టెన్లు, క్రికెట్ బోర్డు యాజమాన్యాన్ని మారుస్తూ ఒక దశ, దిశ లేకుండా కొట్టుమిట్టాడుతోంది.ఇటీవల సొంతగడ్డపై జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy 2025)లోనూ రిజ్వాన్ బృందం పేలవ ప్రదర్శన కనబరిచింది. గ్రూప్-ఎలో భాగంగా న్యూజిలాండ్, టీమిండియా చేతుల్లో ఓడి.. కనీసం సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలుద్దామనుకుంటే వర్షం వల్ల అదీ రద్దై పోవడంతో ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్‌కు అసలు గెలుపన్నదే లేకుండా పోయింది.పరిమిత ఓవర్ల సిరీస్‌లోనైనా గెలవాలని..ఈ క్రమంలో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లో గెలిచి పరువు దక్కించుకోవాలని పాకిస్తాన్ క్రికెట్ జట్టు భావిస్తోంది. అయితే, ఇప్పట్లో అదీ జరిగేలా లేదు. కాగా.. ఉగ్రదాడుల నేపథ్యంలో సుదీర్ఘకాలం సొంతగడ్డపై క్రికెట్ మ్యాచ్‌లకు పాక్ జట్టు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి పరిస్థితులే ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి.నాడు శ్రీలంక జట్టుపై ఉగ్రవాదుల దాడికాగా 2009లో శ్రీలంక జట్టుపై పాకిస్తాన్లో ఉగ్రవాదులు దాడి చేయడంతో అంతర్జాతీయ జట్లు ఆ దేశంలో పర్యటించడాన్ని దాదాపు నిషేధించగా... ఇటీవలే పరిస్థితులు తిరిగి మెరువడంతో కొన్ని జట్లు పాకిస్తాన్లో పర్యటిస్తున్నాయి. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణతో పాకిస్తాన్లో క్రికెట్‌కు పూర్వవైభవం రావడం ఖాయమే అనుకుంటున్న దశలో... మరోసారి దీనికి బ్రేక్ పడేలా కనిపిస్తోంది.ఆపరేషన్ సిందూర్‌తో పాక్ గజగజజమ్మూకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం గట్టిగా బదులిస్తోంది.‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాకిస్తాన్‌లోని పలు ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. ఇందుకు బదులుగా పాకిస్తాన్ ప్రతిదాడులు ప్రారంభించగా... భారత సాయుధ బలగాలు వాటిని బలంగా తిప్పికొట్టాయి.5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసంఈ నేపథ్యంలో అతిత్వరలో పాకిస్తాన్లో పర్యటించాల్సి ఉన్న బంగ్లాదేశ్ జట్టు... ఈ పర్యటనపై పునరాలోచనలో పడింది. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలించడంతో పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో నిరంతరం చర్చిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న ఈ పర్యటనలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనున్నాయి.ఆటగాళ్ల భద్రతే ముఖ్యం‘ఆటగాళ్ల భద్రతే అన్నిటికంటే ముఖ్యం. పాకిస్తాన్ బోర్డుతో చర్చిస్తున్నాం. ఏ నిర్ణయమైనా త్వరలోనే వెల్లడిస్తాం’ అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు బంగ్లాదేశ్ జట్టు ఈ నెల 17 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. మరోవైపు పాకిస్తాన్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ నిలిచిపోగా... అందులో పాల్గొంటున్న రిషాద్ హుసేన్, నహీద్ రాణా ఇప్పటికే బంగ్లాదేశ్‌కు చేరుకున్నారు. చదవండి: క్షిపణి దాడి నుంచి తప్పించుకున్న ఆసీస్ క్రికెటర్లు! -
క్షిపణి దాడి నుంచి తప్పించుకున్న ఆసీస్ క్రికెటర్లు!
రావల్పిండి: ఆస్ట్రేలియా క్రికెటర్లు తృటిలో క్షిపణి దాడి నుంచి తప్పించుకున్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, అందులో పాల్గొంటున్న పలువురు విదేశీ ఆటగాళ్లు పాక్‌లోని రావల్పిండి నూర్ ఖాన్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కాసేపటికి అక్కడ క్షిపణి దాడి జరిగింది.జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడికి బదులుగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టి ముష్కరులను మట్టుపెట్టగా... దానికి పాక్ ప్రతిదాడి చేసింది. దీంతో తీవ్రంగా స్పందించిన భారత సైన్యం... పాకిస్తాన్‌లోని మూడు వైమానిక స్థావరాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడి జరగడానికి కాసేపు ముందే అంతర్జాతీయ క్రికెటర్లు నూర్ ఖాన్ విమానాశ్రయం నుంచి బయలుదేరినట్లు ఆస్ట్రేలియా మీడియా వెల్లడించింది.ఈ ఘటనతో మరోసారిఆసీస్కు చెందిన సీన్ అబాట్, బెన్ డ్వార్షుయిస్, ఆస్టన్ టర్నర్, మిచ్ ఓవెన్ ఆ సమయంలో పాక్‌లో ఉన్నట్లు పేర్కొంది. పీఎస్ఎల్ వాయిదా పడటంతో శనివారం విదేశీ ఆటగాళ్లు చార్టర్ ఫ్లయిట్లో రావల్పిండి నుంచి బయలుదేరగా... గంటల వ్యవధిలోనే అక్కడ క్షిపణి దాడితో పరిస్థితి భయానకంగా మారిందని పేర్కొంది. పౌర విమాన రాకపోకలను కవచంగా వినియోగించుకుంటూ పాకిస్తాన్ దాడులకు పాల్పడిందనే అంశం ఈ ఘటనతో మరోసారి నిరూపితమైంది.మరోవైపు పీఎస్ఎల్లోని మిగిలిన 8 మ్యాచ్‌లను వాయిదా వేస్తున్నట్లు పీసీబీ ప్రకటించింది. మిగిలిన టోర్నీని యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించినా... అటువైపు నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో నిరవధికంగా వాయిదా వేసింది. ఇదీ చదవండి: బాబ్ కూపర్‌కు నివాళిమెల్బోర్న్: ఆస్ట్రేలియా గడ్డపై తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన టెస్టు క్రికెటర్ బాబ్ కూపర్ (84) మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న కూపర్ కన్నుమూసినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఆదివారం వెల్లడించింది. ఆసీస్ క్రికెట్‌కు విశేష సేవలందించిన కూపర్ మృతికి సంతాపం వ్యక్తం చేసింది. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1964 నుంచి 1968 మధ్య జాతీయ ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కూపర్ 27 టెస్టులాడి 2,061 పరుగులు చేశారు. తన ఆఫ్‌స్పిన్‌తో 36 వికెట్లు సైతం పడగొట్టాడు. 1966లో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కూపర్ 12 గంటల పాటు క్రీజులో నిలిచి 589 బంతుల్లో 307 పరుగులు చేశారు. 20వ శతాబ్దంలో ఆస్ట్రేలియాలో నమోదైన ఏకైక త్రిశతకం ఇదే. 28 ఏళ్లకే ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం కూపర్ స్టాక్ బ్రోకర్‌గా మారడంతో పాటు ఐసీసీ మ్యాచ్ రిఫరీగానూ పనిచేశారు. ఆస్ట్రేలియా క్రికెట్‌కు చేసిన సేవలకు గానూ కూపర్‌కు 2023లో ‘మెడల్ ఆఫ్ ద ఆర్డర్’ అవార్డు దక్కింది. చదవండి: 16 లేదా 17 నుంచి ఐపీఎల్! -
కుక్క తోక వంకరే!.. నీచ బుద్ధిని మరోసారి చాటుకుంది..
పాకిస్తాన్ తీరుపై టీమిండియా మాజీ క్రికెటరుల వీరేందర్ సెహ్వాగ్, శిఖర్ ధావన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒప్పందం కుదిరిన కాసేపటికే దాయాది మరోసారి తమ నీచ బుద్ధిని బయటపెట్టుకుందని మండిపడ్డారు. కుక్క తోక వంకర అనే సామెత వీరికి సరిగ్గా సరిపోతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆపరేషర్ సిందూర్కాగా పహల్గామ్ ఉగ్రదాడితో జమ్మూకశ్మీర్‌లో ముష్కరులు మరోసారి కల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రశాంతమైన బైసరన్ లోయలో అమాయక పర్యాటకులపై కాల్పులు జరిపి ఇరవై ఆరు మందిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. పురుషులే లక్ష్యంగా కాల్పులకు తెగబడి ఆడబిడ్డల నుదిటి సిందూరం చెరిగిపోయేలా పాశవిక దాడికి పాల్పడ్డారు.ఇందుకు ఆపరేషర్ సిందూర్ పేరిట భారత్ గట్టి బదులిచ్చింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. అయితే, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారత్ చేపట్టిన దాడులను సహించలేకపోయిన పాకిస్తాన్ సైన్యం.. రంగంలోకి దిగింది.సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడటంతో పాటు సామాన్యులు, భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేయగా.. భారత సైన్యం ఇందుకు దీటుగా బదులిచ్చింది. పాక్ పప్పులు ఉడకనీయకుండా గాల్లోనే డ్రోన్లు, క్షిపణులను పేల్చివేసింది. అంతేకాదు కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్‌ల నుంచి తమను టార్గెట్ చేసిన వారికి బుద్ధి వచ్చేలా విజయవంతంగా ఎదురుదాడులు చేసింది.కాళ్ల బేరానికి వచ్చి.. ఆపై మరోసారిఈ నేపథ్యంలో కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలంటూ భారత్‌ను కోరింది. అమెరికాతో మధ్యవర్తిత్వం చేయించి.. భారత్‌ను ఒప్పించింది. ఈ క్రమంలో శాంతి సాధన లక్ష్యంగా భారత్ ఇందుకు అంగీకరించింది. అయితే, విరమణ ఒప్పందం జరిగిన కాసేపటికే పాక్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది.కుక్క తోక ఎప్పటికీ వంకరేసరిహద్దుల వెంట దాడులకు దిగింది. జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్తాన్ వంటి తదితర చోట్ల డ్రోన్లతో దాడికి దిగగా.. భారత్ వాటిని తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తీరును ఉద్దేశించి.. ‘‘కుక్క తోక ఎప్పటికీ వంకరే’’ అన్నట్లు బుద్ధులు ఎక్కడకు పోతాయి అన్న అర్థంలో వీరేందర్ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.నీచ స్వభావాన్ని మరోసారి చాటుకుందిఅయితే, ఇందుకు పాక్ నెటిజన్లు వీరూ భాయ్‌ను అసభ్యకరరీతిలో ట్రోల్ చేస్తుండగా.. భారతీయ నెటిజన్లు వారికి చురకలు అంటిస్తున్నారు. మరోవైపు.. శిఖర్ ధావన్ స్పందిస్తూ.. ‘‘తుచ్చమైన బుద్ధి గల దేశం.. తన తుచ్చమైన చేష్టలను మరోసారి ప్రపంచానికి చూపిస్తోంది’’ అంటూ పాక్ తన నీచ స్వభావాన్ని మరోసారి చాటుకుంది అన్న అర్థంలో ఘాటుగా వ్యాఖ్యానించాడు.ఇదిలా ఉంటే.. భారత్- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్-2025ని వారం పాటు వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, పరిస్థితులు అనుకూలిస్తే షెడ్యూల్ ప్రకారమే మే 25న ఫైనల్ నిర్వహించేలా బోర్డు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఆదివారం జరిగే సమావేశంలో ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. ఇక టీమిండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ఐపీఎల్ హర్యాన్వీ కామెంటేటర్‌గా ఉన్న విషయం తెలిసిందే. చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. స్వింగ్ కింగ్‌కు పిలుపు? భారత జట్టు ఇదే? -
Vikram Misri : కాల్పుల విరమణ
-
26 చోట్ల డ్రోన్లతో పాక్ దాడులు.. నేలమట్టం చేసిన భారత సైన్యం
-
పాకిస్తాన్‌కు అంత సీన్ లేదు.. త్వరలోనే ఐపీఎల్ మళ్లీ మొదలు!
ఐపీఎల్-2025 (IPL 2025)ని వాయిదా వేస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీసుకున్న నిర్ణయాన్ని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) స్వాగతించాడు. దేశ సరిహద్దుల వెంబడి నెలకొన్న యుద్ధ పరిస్థితుల దృష్ట్యా బోర్డు సరిగ్గా స్పందించిందని పేర్కొన్నాడు. అయితే, త్వరలోనే ఈ మెగా టోర్నీ మళ్లీ మొదలవుతుందని ధీమా వ్యక్తం చేశాడు.దాయాది దుశ్చర్యలుపాకిస్తాన్కు ఎక్కువ కాలం పోరాడే శక్తి లేదని.. కాబట్టి త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని గంగూలీ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా పహల్గామ్ ఉగ్రదాడికి బదులు తీర్చుకునేందుకు భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని దాదాపు తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో భారత్ చేపట్టిన ఈ చర్యను దాయాది జీర్ణించుకోలేకపోతోంది. అందుకే అనుచితంగా దాడులకు తెగబడుతోంది.ఈ క్రమంలో దాయాది పాక్ దుశ్చర్యలకు భారత్ గట్టి సమాధానిమిస్తోంది. దీంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారి.. రణరంగాన్ని తలపిస్తోంది. ముఖ్యంగా సరిహద్దుల వెంబడి పాక్ ఎక్కువగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతూ.. సామాన్యులు, సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తోంది. భారత్ ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతోంది.ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న ధర్మశాల స్టేడియంలో గురువారం పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ అర్ధంతరంగా ఆగిపోయింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వారం రోజుల పాటు లీగ్‌ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది.పాకిస్తాన్‌కు అంత సీన్ లేదుఈ పరిణామాలపై స్పందించిన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ బీసీసీఐ భారత, విదేశీ ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది.అయితే, త్వరలోనే లీగ్ మళ్లీ మొదలు కావాలని ఆకాంక్షిద్దాం. ప్రస్తుతం టోర్నీ ప్లే ఆఫ్స్ దశలో ఉంది. ఇలాంటి తరుణంలో ధర్మశాల, చండీగఢ్, ఢిల్లీ, రాజస్తాన్, జైపూర్ వంటి ప్రాంతాలు మినహా.. మిగతా చోట్ల ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉంది.కాలక్రమేణా పరిస్థితులు చక్కబడతాయనే విశ్వాసం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ఇలాంటి పరిస్థితులను, ఒత్తిడిని ఎక్కువ కాలం భరించలేదు. ఆ దేశానికి అంతటి సామర్థ్యం లేదు. కాబట్టి బీసీసీఐ కచ్చితంగా ఐపీఎల్-2025ని పూర్తి చేస్తుంది’’ అని గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు.సురక్షితంగా ఢిల్లీకిఇదిలా ఉంటే.. ధర్మశాలలో మ్యాచ్ రద్దు కాగానే.. బీసీసీఐ పంజాబ్- ఢిల్లీ ఆటగాళ్లను సురక్షితంగా ఢిల్లీకి చేర్చింది. అత్యంత భద్రత నడుమ వందే భారత్ రైలులో ఆటగాళ్లను తరలించింది. కాగా మార్చి 22న మొదలైన ఐపీఎల్-2025లో ఇప్పటికి 57 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ రేసులో ముందున్నాయి. మరోవైపు.. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేట్ అయిపోయాయి. మిగతా మ్యాచ్‌లలో ఢిల్లీ, కోల్‌కతా, లక్నో జట్లు తమ అదృష్టం పరీక్షించుకోనున్నాయి.చదవండి: విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం!.. బీసీసీఐకి చెప్పేశాడు! -
పంజాబ్ లో చైనా మిస్సైల్..!?
-
War Updates: పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ
-
భారత్ బాలిస్టిక్ క్షిపణులు, వీటి పవర్ చూస్తేనే సగం చస్తారు
-
ఆపరేషన్ సిందూర్ పై ముస్లింల రియాక్షన్
-
ఐసీసీ టోర్నీల్లోనూ పాక్‌తో మ్యాచ్‌లు వద్దు: గంభీర్
టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కీలక వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) టోర్నీల్లోనూ భారత్ పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. కాగా సరిహద్దు వివాదాల నేపథ్యంలో టీమిండియా-పాకిస్తాన్ (IND vs PAK) మధ్య పుష్కర కాలంగా ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు జరగడం లేదన్న విషయం తెలిసిందే.. అయితే ఐసీసీ టోర్నీలలో మాత్రం ఇరు జట్లూ తలపడుతున్నాయి.ఇప్పుడు దీనికి కూడా ఫుల్స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. భారత్, పాక్ సరిహదుల్లో తీవ్రవాదం ముగిసేవరకు ఇరు జట్ల మధ్య ఆటలకు ప్రాధాన్యత లేదని అతను అన్నాడు. అప్పటిదాకా ఎలాంటి ఆటలు అవసరం లేదుఈ విషయంలో బీసీసీఐ మాత్రమే కాదు, భారత ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని గంభీర్ వ్యాఖ్యానించాడు. ‘నా అభిప్రాయం ప్రకారం ఇరు దేశాల మధ్య పరిస్థితులు మెరుగుపడే వరకు అసలు ఎలాంటి ఆటలు అవసరం లేదు.గతంలోనూ ఈ అభిప్రాయాన్ని వెల్లడించాను. నా దృష్టిలో క్రికెట్ మ్యాచ్, బాలీవుడ్ సినిమాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలేవీ భారత సైనికులు లేదా భారత పౌరుల ప్రాణాలకంటే ముఖ్యం కాదు. మ్యాచ్‌లు జరుగుతుంటాయి.సినిమాలు వస్తూ పోతూ ఉంటాయి. గాయకులు వేదికలపై పాడుతూనే ఉంటారు. కానీ మీ ఆత్మీయులను కోల్పోయిన బాధను ఏదీ తగ్గించలేదు’’ అని గంభీర్ ఉద్వేగభరితంగా మాట్లాడాడాడు. ఆసియా కప్ గురించి చెప్పలేనుఅదే విధంగా.. ‘‘ఈ ఏడాది జరిగే ఆసియా కప్ గురించి నేను ఏమీ చెప్పలేను. అది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయం. వారు ఏం చెబితే దానిని పాటిస్తాం’ అని గంభీర్ స్పష్టం చేశాడు. కాగా ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదులు పాశవిక దాడికి తెగబడిన విషయం విదితమే. బైసరన్ లోయలో పర్యాటకులపై కాల్పులు జరిపి ఇరవై ఆరు మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారత్ తీవ్ర స్థాయిలో మండిపడింది. సింధు జలాల ఒప్పందం రద్దు సహా అనేక ఆంక్షలు విధించింది. ఆపరేషన్ సింధూర్తాజాగా ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లో నాలుగు, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఐదు ప్రాంతాల్లో భారత సైన్యం దాడులకు దిగింది. దీంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇంటెలిజెన్స్ వర్గాల సహకారంతో భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించేందుకు డ్రోన్లు, ఇతర ఆయుధాలు వాడినట్లు భారత భద్రతా వర్గాలు పేర్కొన్నాయి.చదవండి: Virat Kohli: అందుకే టీమిండియా, ఆర్సీబీ కెప్టెన్‌గా తప్పుకొన్నా -
Magazine Story: ఉగ్రదేశం చుట్టూ ఉచ్చు బిగిస్తోన్న భారత్
-
ఎంటర్ ది విక్రాంత్ ఇక పాక్ కు చుక్కలే...!
-
జోక్ కాదు.. పాక్ క్రికెట్‌తో సంబంధాలన్నీ తెంచుకోండి: గంగూలీ
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ క్రికెట్‌తో సంబంధాలన్నీ తెంచుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి సూచించాడు. కాగా జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదులు మంగళవారం పాశవిక దాడికి తెగబడిన విషయం తెలిసిందే.ప్రశాంతమైన బైసరన్ లోయలో 26 మంది పర్యాటకులను లష్కర్-ఎ-తొయిబా ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ క్రమంలో భారత్- పాక్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. 2008 తర్వాత టీమిండియా ఒక్కసారి కూడా పాకిస్తాన్ పర్యటనకు వెళ్లలేదన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత పాక్ 2013లో భారత పర్యటనకు వచ్చింది.అనంతరం దాయాది దేశాల పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేకపోవడంతో ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోయాయి. అయితే, ఐసీసీ ఈవెంట్లు, ఆసియా కప్ టోర్నీల్లో మాత్రం భారత్- పాక్ (Ind vs Pak) ముఖాముఖి తలపడుతున్నాయి. కానీ తాజాగా పహల్గామ్ ఘటన నేపథ్యంలో సంబంధాలు పూర్తిగా తెగిపోయే పరిస్థితి వచ్చింది.సంబంధాలు తెంచుకోవాలిఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. ‘‘అవును.. వందకు వంద శాతం పాకిస్తాన్‌తో అన్ని సంబంధాలు తెంచుకోవాలి. కఠిన చర్యలు చేపట్టాలి. ప్రతి ఏడాది ఇలాంటి ఘటనలు జరగడాన్ని తేలికగా తీసుకోవద్దు. ఇదేమీ జోక్ కాదు. ఉగ్రవాదాన్ని సహించకూడదు. టెర్రరిజంను తుడిచిపెట్టేయాలి’’ అని పేర్కొన్నాడు.ఇక బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఇప్పటికే పాక్‌తో భవిష్యత్తులోనూ ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండబోవని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఐసీసీ నిబంధనలకు అనుగుణంగా ప్రస్తుతం దాయాదితో ఆడుతున్నామని.. అయితే, పరిస్థితులన్నింటినీ ఐసీసీ కూడా గమనిస్తోందని తెలిపారు. భారత ప్రభుత్వం చెప్పినట్లే తాము నడుచుకుంటామని స్పష్టం చేశారు.ముక్తకంఠంతో ఖండించిన క్రీడా లోకంకాగా పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను భారత క్రీడా లోకం ముక్తకంఠంతో ఖండించిన విషయం తెలిసిందే. ‘‘బాధిత కుటుంబాలు ఊహించలేని కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఈ కష్టకాలంలో భారత్‌తో పాటు యావత్ ప్రపంచం వారికి అండగా నిలుస్తోంది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తేలియజేస్తున్నా. న్యాయం జరగాలని ప్రార్థిస్తున్నా’’ అని టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నాడు.ఇక విరాట్ కోహ్లి సైతం.. ‘‘ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు శాంతి, బలం చేకూరాలని ప్రార్థిస్తున్నా. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నా. ఇలాంటి క్రూరమైన చర్యకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు.మరోవైపు.. ‘‘అమాయకులైన పర్యాటకులపై దాడి హేయమైన చర్య. దీనికి రాబోయే కాలంలో మన ధైర్యవంతమైన సైనికులు గట్టి బదులిస్తారు. జమ్మూకశ్మీర్‌లో శాంతికి భంగం కలగించాలనుకునే వారి ప్రణాళికలు ఎప్పటికీ విజయవంతం కావు’’ అని బాక్సర్ విజేందర్ సింగ్ తన స్పందన తెలియజేశాడు.భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు స్పందిస్తూ.. ‘‘పహల్గామ్ ఉగ్ర దాడి బాధితుల కోసం నా హృదయం తపిస్తోంది. ఎలాంటి కారణమైనా.. ఇంత క్రూరత్వాన్ని సమర్థించదు. బాధితుల దుఖం మాటల్లో చెప్పలేనిది. కానీ వారు ఒంటరి వారు కాదు. వారి వెంట యావత్ దేశం ఉంది. క్లిష్ట సమయంలో ఒకరికొకరు అండగా నిలుద్దాం. శాంతి పునరుద్ధరణ తప్పక జరుగుతుంది’’ అని పేర్కొంది.చదవండి: PSL 2025 Live Suspended: పాకిస్తాన్‌కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక.. -
మీరేం సాధించారు?.. మరో 78 వేల ఏళ్లైనా ఇదే పరిస్థితి: గావస్కర్ ఫైర్
పహల్గామ్ ఉగ్రదాడి ఘటన (Pahalgam Incident) నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. డెబ్బై ఎనిమిదేళ్లుగా ఒక్క మిల్లీ మీటర్ భూమి కూడా చేతులు మారలేదని.. మరో 78 వేల ఏళ్లు గడిచినా పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆయన అన్నారు. మరి అలాంటప్పుడు శాంతియుత జీవనం గడపకుండా.. అమాయకుల ప్రాణాలు తీస్తే వచ్చే లాభమేమిటంటూ తీవ్రవాదులకు చురకలు అంటించారు.బైసరన్ లోయలోఉగ్రవాదులు, వారికి మద్దతుగా నిలిచే వారు ఇకనైనా వాస్తవాన్ని గుర్తించి.. ఇలాంటి పిరికిపంద చర్యలను చాలించాలని గావస్కర్ సూచించారు. కాగా జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో పర్యాటకులపై మంగళవారం ఉగ్రదాడి జరిగిన విషయం విదితమే. జమ్మూకశ్మీర్‌లో ‘మినీ స్విట్జర్లాండ్’గా పేరుగాంచిన బైసరన్ లోయలో ఉగ్రవాదులు జరిపిన భీకర దాడిలో 26 మంది మృతి చెందారు. బాధితులకు అండగాఈ నేపథ్యంలో తీవ్రవాదుల చర్యను క్రీడాలోకం ముక్తకంఠంతో ఖండించింది. ఇలాంటి క్లిష్ట సమయంలో మనమంతా ఒక్కటిగా ఉండి... బాధితులకు అండగా నిలవాల్సిన అవసరముందని పలువురు క్రీడాకారులు అభిప్రాయపడ్డారు.క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ సిరాజ్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, పార్థివ్ పటేల్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, అనీల్ కుంబ్లే, రవిశాస్త్రి, శ్రీవత్స గోస్వామి, టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్, స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్, స్టార్ షట్లర్ పీవీ సింధు, సైనా నెహ్వాల్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, షూటర్ అభినవ్ బింద్రా, బాక్సర్ నిఖత్ జరీన్, పీఆర్ శ్రీజేశ్ తదితరులు ఉగ్రవాదుల దాడిని ఖండించారు. అంతేకాదు.. పాకిస్తాన్‌తో క్రీడా సంబంధాలు ఎప్పటికీ పునరుద్ధరించకూడదని పలువురు ప్లేయర్లు పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై సునిల్ గావస్కర్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితులు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. భారతీయులందరిపై దీని ప్రభావం ఉంటుంది.మరో 78 వేల ఏళ్లు గడిచినా ఇదే పరిస్థితిదుశ్చర్యలకు పాల్పడేవారిని, వారికి మద్దతునిచ్చే వారిని నేను ఒకే ఒక్క ప్రశ్న అడగాలనుకుంటున్నా.. ఇలాంటి పనుల వల్ల మీరు ఏం సాధించారు? ఇకపై ఏం సాధిస్తారు?గత 78 ఏళ్లుగా ఒక్క మిల్లీ మీటర్ భూభాగం కూడా చేతులు మారలేదు. మరో 78 వేల ఏళ్లు గడిచినా పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాదు. మరి అలాంటపుడు శాంతియుతంగా జీవిస్తూ.. దేశాభివృద్ధిపైన దృష్టి పెట్టడం మంచిది కదా! దయచేసి ఇకనైనా పిరికిపంద చర్యలు మానుకుని.. బుద్ధిగా ఉండండి’’ అని ఉగ్రవాదులకు హితవు పలికారు.చదవండి: PSL: పాకిస్తాన్‌కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక.. -
PSL: పాకిస్తాన్‌కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అసలే అంతంత మాత్రంగా కొనసాగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ప్రసారాలు భారత్‌లో బంద్ అయిపోయాయి. పాక్ బోర్డుకు చెందిన పీఎస్ఎల్ టోర్నీని భారత్‌లో ప్రసారం చేస్తున్న ‘ఫ్యాన్ కోడ్’ మొబైల్ స్ట్రీమింగ్ సంస్థ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గావ్ ఘటన నేపథ్యంలో భారత్‌లో ఇకపై పీఎస్ఎల్ టోర్నీ ప్రసారం చేయమని ప్రకటించింది. భారతీయుల మనోభావాలను గౌరవిస్తూ పీఎస్ఎల్లో మిగిలిన మ్యాచ్‌లను ప్రసారం చేయరాదని నిర్ణయం తీసుకున్నట్లు ‘ఫ్యాన్ కోడ్’ వెల్లడించింది. మరోవైపు పీఎస్ఎల్ టోర్నీ కోసం పాకిస్తాన్లో ఉండి మ్యాచ్‌ల ప్రసారానికి సంబంధించిన వేర్వేరు సాంకేతిక విభాగాల్లో పని చేస్తున్న భారతీయులను వెనక్కి పంపాలని ఆ దేశ ప్రభుత్వం కూడా నిర్ణయించింది. భారత్‌కు చెందిన దాదాపు రెండు డజన్ల మంది పీఎస్ఎల్లో ఇంజినీర్లు, ప్రొడక్షన్ మేనేజర్లు, కెమెరామెన్లు, ప్లేయర్ ట్రాకింగ్ ఎక్స్‌పర్ట్‌లుగా పని చేస్తున్నారు. రెండు రోజుల్లోగా వీరంతా దేశం వీడాలని పాక్ ప్రభుత్వం ఆదేశించింది. నిషేధం కొనసాగుతుంది: బీసీసీఐమరోవైపు- టీమిండియా- పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లపై ఉన్న నిషేధం ఇక ముందు కూడా కొనసాగుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండవని ఆయన పునరుద్ఘాటించారు. భారత్, పాక్ మధ్య 2013లో చివరిసారిగా ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. అయితే ఆ తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బాగా దెబ్బ తినడంతో ఆ తర్వాత ఎలాంటి సిరీస్‌ను నిర్వహించలేదు. ఐసీసీ టోర్నీల్లో మాత్రం రెండు జట్లూ తలపడుతూ వస్తున్నాయి. తాజాగా కశ్మీర్‌లోని పహల్గాంలో పాక్ తీవ్రవాదుల చేతుల్లో 26 మంది భారత పర్యాటకులు మరణించిన నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్‌లపై మళ్లీ చర్చ మొదలైంది. ‘పాక్‌తో క్రికెట్ సిరీస్‌ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేం పూర్తిగా కట్టుబడి ఉన్నాం. వారు చెప్పిందే మేం వింటాం. కాబట్టి ఇకపై కూడా పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే అవకాశం లేదు.ఐసీసీతో ఒప్పందాల కారణంగానే వేర్వేరు టోర్నీల్లో ఆ జట్టుతో తలపడాల్సి వస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై అవగాహన ఉన్న ఐసీసీ కూడా ఈ విషయాన్ని గమనిస్తోంది. ఇకపై ఏదైనా ఐసీసీ టోర్నీ వచ్చినపుడు తగిన విధంగా స్పందిస్తాం’ అని రాజీవ్ శుక్లా వివరించారు. ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చినా... టీమిండియా అక్కడికి వెళ్లలేదు. తటస్థ వేదిక దుబాయ్‌లోని అన్ని మ్యాచ్‌లు ఆడింది. పాక్‌ను లీగ్ దశలో ఓడించడం సహా టోర్నీ చాంపియన్‌గా నిలిచింది. చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
IND vs PAK: బీసీసీఐ కీలక నిర్ణయం
ప్రశాంతమైన పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులోనూ పాకిస్తాన్ క్రికెట్ జట్టు (IND vs PAK)తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడబోమని పునరుద్ఘాటించింది. ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూ.. ముష్కరుల చర్యను తీవ్రంగా ఖండించింది.పాకిస్తాన్‌తో ఇకపై కూడా..బీసీసీఐ తరఫున కార్యదర్శి దేవజిత్ సైకియా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (Rajiv Shukla) ఈ మేరకు తమ స్పందన తెలియజేశారు. రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. ‘‘బాధిత కుటుంబాలకు మా మద్దతు. ఉగ్రవాదుల చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.ప్రభుత్వ నిర్ణయానికి మేము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాం. పాకిస్తాన్‌తో ఇకపై కూడా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడబోము. ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకుంటాం. పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే అంశం గురించి సమీప భవిష్యత్తులో కనీసం చర్చ కూడా ఉండదు.అయితే, ఐసీసీ ఈవెంట్లలో మాత్రం నిబంధనలకు అనుగుణంగా పాకిస్తాన్‌తో భారత్ మ్యాచ్‌లు ఆడుతుంది. ప్రస్తుత పరిస్థితులను ఐసీసీ కూడా నిశితంగా గమనిస్తోంది’’ అని స్పోర్ట్స్‌తక్‌తో పేర్కొన్నారు.మాటలకు అందని విషాదంఇక బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ.. ‘‘పహల్గామ్లో జరిగిన పాశవిక ఉగ్రదాడి కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. బాధిత కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి.బీసీసీఐ తరఫున ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాం. ఈ కష్ట సమయంలో వారంతా ధైర్యం కోల్పోకుండా ఉండాలని ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో చోటు చేసుకున్న ఈ విషాదాన్ని వర్ణించేందుకు మాటలు సరిపోవడం లేదు. మనమంతా వారికి అండగా ఉండాల్సిన సమయం ఇది’’ అని పేర్కొన్నారు.బాధితులకు నివాళికాగా పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఐపీఎల్-2025లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్- ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ బాధితులకు నివాళి అర్పించింది. ఆటగాళ్లంతా నిమిషం పాటు మౌనం పాటించారు. అదే విధంగా చీర్‌లీడర్స్ ప్రదర్శనలు లేకుండా చూసుకున్నారు. బాణసంచా కూడా కాల్చలేదు.చివరగా 2008లోఇదిలా ఉంటే.. భారత జట్టు చివరగా 2008లో పాకిస్తాన్లో పర్యటించింది. అదే విధంగా పాక్ జట్టు 2012-13లో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు భారత్‌కు వచ్చింది. ఆ తర్వాత ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 ఆడేందుకు పాక్ జట్టు భారత పర్యటనకు రాగా.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియా మాత్రం అక్కడకు వెళ్లలేదు. భద్రతా కారణాల దృష్ట్యా బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకోగా.. ఐసీసీ జోక్యంతో తటస్థ వేదికైన దుబాయ్‌లో రోహిత్ సేన తమ మ్యాచ్‌లు ఆడింది. ఈ మెగా టోర్నీలో భారత్ విజేతగా నిలవగా.. ఆతిథ్య పాక్ జట్టు ఒక్క విజయం లేకుండానే నిష్క్రమించింది.కాగా జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో గల బైసారన్ ప్రాంతంలో మంగళవారం ఉగ్రవాదులు ఆకస్మిక దాడికి దిగారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన ఈ ప్రదేశాన్ని చూసేందుకు వచ్చిన పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి.. 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడిలో అనేక మంది గాయపడ్డారు.చదవండి: Pahalgam Incident: "గౌతమ్ గంభీర్‌ను చంపేస్తాం".. ఐసిస్ బెదిరింపులు -
పాకిస్తాన్ భారత్‌లో మ్యాచ్‌లు ఆడదు: పీసీబీ చీఫ్
భారత్ వేదికగా జరగనున్న మహిళల వన్డే వరల్డ్‌కప్ (ICC Women's ODI World Cup) కోసం పాకిస్తాన్ జట్టు భారత్‌లో పర్యటించబోదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహసిన్ నఖ్వీ శనివారం స్పష్టంచేశారు. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల ఐసీసీ పురుషుల చాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025) ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్లో పర్యటించేందుకు నిరాకరించింది. ఈ క్రమంలో రోహిత్ సేన ఆడే మ్యాచ్‌లను ‘హైబ్రీడ్ మోడల్’లో దుబాయ్‌లో నిర్వహించారు. ఇప్పుడదే రీతిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ఆడనున్న మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహించనున్నారు. దీనికి గతంలోనే ఇరు దేశాల క్రికెట్ బోర్డులు అంగీకారం తెలిపాయి. ‘భారత జట్టు పాకిస్తాన్లో చాంపియన్స్ ట్రోఫీ ఆడలేదు. తటస్థ వేదికపై మ్యాచ్‌లు ఆడింది. ఇప్పుడు మహిళల ప్రపంచకప్ విషయంలోనే అదే జరుగుతుంది. ఆతిథ్య హోదాలో భారత్ నిర్ణయించిన తటస్థ వేదికపై మ్యాచ్‌లు ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు సిద్ధంగా ఉంది’అని నఖ్వీ పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ –అక్టోబర్లలో భారత్ వేదికగా మహిళల వన్డే వరల్డ్‌కప్ టోర్నీ జరుగనుంది.వెస్టిండీస్ అవుట్.. బంగ్లాదేశ్ క్వాలిఫైభారత్ వేదికగా ఈ ఏడాది చివర్లో జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌కు బంగ్లాదేశ్ అర్హత సాధించింది. పాకిస్తాన్లో జరుగుతున్న వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలవడం ద్వారా బంగ్లాదేశ్ వరల్డ్‌కప్ బెర్త్ దక్కించుకుంది. లాహోర్‌లో శనివారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ చేతిలో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. రితూ మోని (48; 5 ఫోర్లు), ఫహీమా ఖాతూన్ (44 నాటౌట్; 4 ఫోర్లు) రాణించారు. పాకిస్తాన్ బౌలర్లలో సాదియా 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్ మహిళల జట్టు 39.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’మునీబా అలీ (93 బంతుల్లో 69; 8 ఫోర్లు), ఆలియా రియాజ్ (52 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) సత్తాచాటారు.ఈ టోర్నీలో ఆడిన 5 మ్యాచ్‌ల్లోనూ గెలిచిన పాకిస్తాన్ 10 పాయింట్లతో పట్టిక అగ్ర స్థానంలో నిలవగా... బంగ్లాదేశ్ జట్టు 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 2 పరాజయాలతో 6 పాయింట్లు ఖాతాలో వేసుకున్న బంగ్లాదేశ్ రెండో ‘ప్లేస్’దక్కించుకుంది. వెస్టిండీస్ కూడా 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 2 ఓటములతో 6 పాయింట్లు సాధించినా... రన్‌రేట్‌లో స్వల్పంగా మెరుగ్గా ఉన్న బంగ్లాదేశ్ ముందంజ వేసింది. మాథ్యూస్ మెరుపులు వృథా... వెస్టిండీస్ మహిళల జట్టుకు నిరాశ తప్పలేదు. థాయ్‌లాండ్‌తో మ్యాచ్‌లో 10 ఓవర్లలో లక్ష్యఛేదన పూర్తిచేస్తే మెరుగైన రన్‌రేట్‌తో వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించే అవకాశం ఉండగా...ఐదు బంతుల తేడాతో అవకాశం కోల్పోయింది. ఆ జట్టు 10.5 ఓవర్లలో 168 పరుగులు చేసింది. మొదట థాయ్‌లాండ్ మహిళల జట్టు 46.1 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. నాథకన్ చాంతమ్ (66; 7 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా.. విండీస్ బౌలర్లలో అఫీ ఫ్లెచర్ 4, ఆలియా అలీనె 3 వికెట్లు పడగొట్టింది.అనంతరం ఛేదనలో విండీస్ 10.5 ఓవర్లలో 4 వికెట్లకు 168 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, కెపె్టన్ హేలీ మాథ్యూస్ (29 బంతుల్లో 70; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా... షినెల్ హెన్రీ (17 బంతుల్లో 48; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) దంచికొట్టింది.మాథ్యూస్ మెరుపులతో కరీబియన్ జట్టు సునాయాసంగా గమ్యాన్ని చేరేలా కనిపించినా... కీలక సమయంలో ఆమె అవుట్ కావడం విండీస్ అవకాశాలను దెబ్బకొట్టింది. చివర్లో హెన్రీ విజృంభించినా... అది సాధ్యపడలేదు. లీగ్ మ్యాచ్‌లు ముగిసేసరికి బంగ్లాదేశ్ 0.639 రన్‌రేట్‌తో నిలవగా... వెస్టిండీస్ 0.626తో నిలిచింది. అంటే 0.013 తేడాతో వెస్టిండీస్ వరల్డ్‌కప్ పోటీ నుంచి తప్పుకొంది. చదవండి: కెరీర్లో తొలి బంతికే సిక్సర్.. చరిత్రపుటల్లోకెక్కిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ -
'వారిని బూట్లతో కొట్టాలి.. పాక్ క్రికెట్‌ను నాశనం చేశారు'
అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో దారుణ ప్రదర్శన అనంతరం పాకిస్తాన్ జట్టు.. వైట్‌బాల్ సిరీస్‌లు ఆడేందుకు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. అక్కడ కూడా పాక్ జట్టు ఆటతీరు ఏ మాత్రం మారలేదు. తొలుత కివీస్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను 4-1 తేడాతో కోల్పోయిన పాకిస్తాన్.. ఇప్పుడు వన్డే సిరీస్‌లో కూడా అదే దిశగా కొనసాగుతోంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేపియర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 73 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 345 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో రిజ్వాన్ సేన చతకలపడింది. లక్ష్య చేధనలో మంచి ఆరంభం లభించినప్పటికి మిడిలార్డర్ విఫలమం కావడంతో పాక్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఫిలిప్స్, కాన్వే, హెన్రి వంటి స్టార్ ప్లేయర్లు కివీస్ జట్టులో లేనప్పటికి.. పాకిస్తాన్ ఓడిపోవడాన్ని ఆ దేశ మాజీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో పాక్ జట్టుపై మాజీ క్రికెటర్ బాసిత్ అలీ విమర్శల వర్షం గుప్పించాడు. అదేవిధంగా స్టార్ క్రికెటర్ బాబర్ ఆజం బ్యాటింగ్ పొజిషన్‌పై కూడా అలీ కీలక వ్యాఖ్యలు చేశాడు."బాబర్ ఎందుకు మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాలి?. ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు ఓపెనింగ్ చేశాడు. చాలా మంది ఓపెనర్‌గానే బాబర్ రావాలని సూచించారు. అసలు ఎవరా క్రికెట్ ప్రొఫెసర్స్? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వారి వాళ్లే బాబర్ ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇప్పుడు మూడో స్ధానంలో వచ్చి బాబర్ ఎలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు? క్రికెట్ ప్రొఫెసర్స్ ఇప్పుడు బయటకు వచ్చి దేశానికి క్షమాపణలు చెప్పాలి. ఇప్పుడు ఎవరూ బయటకు రారు. ఇలా క్రికెట్ ప్రొఫెసర్స్ అవ్వాలనుకునేవారిని బూట్లతో కొట్టాలి. బాబర్, రిజ్వాన్‌లను ఓపెనర్లుగా చేసిన వారే పాకిస్తాన్ క్రికెట్‌ను నాశనం చేశారు. పాకిస్థాన్ జట్టు ఫ్రాంచైజీ జట్టుగా మారిపోయింది" అని అలీ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: IPL 2025: ఏంటి పరాగ్ బ్రో ఇది.. ఎందుకంత యాటిట్యూడ్? వీడియో వైరల్ -
CT 2025: టీమిండియాకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ
టీమిండియాపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కాసుల వర్షం కురిపించింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో విజేతగా నిలిచినందుకు భారీ క్యాష్ రివార్డు ప్రకటించింది. ఈ మెగా వన్డే టోర్నీలో ఐదింటికి ఐదు మ్యాచ్‌లు గెలిచి అజేయంగా చాంపియన్‌గా నిలిచిన రోహిత్ సేనకు రూ. 58 కోట్ల నజరానా ఇచ్చింది. రోహిత్ సేన జైత్రయాత్రను ప్రస్తావిస్తూఈ మొత్తాన్ని ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది.. అదే విధంగా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సభ్యులకు బీసీసీఐ పంచనుంది. ఇందుకు సంబంధించి బోర్డు గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు.. ‘‘ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో అద్భుత ప్రదర్శన కనబరిచిన టీమిండియాకు రూ. 58 కోట్ల క్యాష్ రివార్డు ప్రకటిస్తున్నాం.మెన్స్ సెలక్షన్ కమిటీ సభ్యులతో పాటు ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది పనితీరును గుర్తిస్తూ వారిని ఇలా సత్కరిస్తున్నాం’’ అని పేర్కొంది. అదే విధంగా.. ‘‘కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా టోర్నీ ఆసాంతం ఆధిపత్యం కనబరిచింది. ఓటమన్నదే ఎరుగక నాలుగు విజయాలతో ఫైనల్ చేరింది.తొలుత బంగ్లాదేశ్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా.. ఆ తర్వాత పాకిస్తాన్‌పై కూడా ఆరు వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. అదే జోరును కొనసాగిస్తూ న్యూజిలాండ్‌పై 44 పరుగుల తేడాతో గెలిచి గ్రూప్ టాపర్ అయ్యింది. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ చేరుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించింది’’ అని బీసీసీఐ తమ ప్రకటనలో రోహిత్ సేన జైత్రయాత్రను ప్రస్తావించింది.అందుకే ఈ నగదు బహుమతిఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ మాట్లాడుతూ.. ‘‘వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు సాధించడం ఎంతో ప్రత్యేకమైనది. భారత జట్టు అంకిత భావం, ప్రపంచ వేదికపై దేశానికి వారు తెచ్చి పెట్టిన కీర్తి ప్రతిష్టలకు గుర్తింపుగా నగదు బహుమతి అందజేస్తున్నాం.ఈ గెలుపునకు కారణమైన ప్రతి ఒక్కరి సేవలను మేము గుర్తించాం. భారత్‌కు ఈ ఏడాది ఇది రెండో ఐసీసీ ట్రోఫీ. అండర్-19 వుమెన్స్ వరల్డ్‌కప్‌లో మనం చాంపియన్లుగా నిలిచాం. ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని కూడా సొంతం చేసుకున్నాం.దేశంలో క్రికెటింగ్ ఎకోసిస్టమ్ ఎంత పటిష్టంగా ఉందో చెప్పేందుకు ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు’’ అని హర్షం వ్యక్తం చేశాడు. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్-2024 సాధించిన రోహిత్ సేన.. ఆ టోర్నీలోనూ అన్ని మ్యాచ్‌లలో అజేయంగా నిలిచింది. నాడు బీసీసీఐ రోహిత్ సేనకు ఏకంగా రూ. 125 కోట్ల నజరానా ప్రకటించింది.ఎనిమిది జట్ల మధ్య పోటీతాజాగా చాంపియన్స్ ట్రోఫీలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయగా.. ఈసారి రూ. 58 కోట్ల బహుమతి ఇచ్చింది. ఇది ఐసీసీ ఇచ్చిన ప్రైజ్ మనీ (భారత కరెన్సీలో దాదాపు రూ. రూ.19.5 కోట్లు) కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడం విశేషం. ఇక ఈ మెగా ఈవెంట్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వగా.. భారత జట్టు మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లోనే తమ మ్యాచ్‌లన్నీ ఆడింది. ఈ టోర్నీలో భారత్‌తో పాటు గ్రూప్-ఎ నుంచి పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీపడ్డాయి.తొలి సెమీస్‌లో భారత్ ఆస్ట్రేలియాను ఓడించగా.. రెండో సెమీస్‌లో సౌతాఫ్రికాను న్యూజిలాండ్ చిత్తు చేసింది. ఈ క్రమంలో టీమిండియా- న్యూజిలాండ్ మధ్య మార్చి 9న జరిగిన టైటిల్ పోరులో రోహిత్ సేన నాలుగు వికెట్ల తేడాతో కివీస్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో అద్భుత అర్ధ శతకం(76) బాదిన కెప్టెన్ రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.చదవండి: ‘రేపు మీ బౌలింగ్‌ను చితక్కొడతాను చూడు!.. అన్నంత పని చేశాడు’ -
ఉన్నదే ఒక్కడు.. మీరు కాస్త నోళ్లు మూయండి: పాక్ మాజీ స్పిన్నర్ ఫైర్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీరుపై ఆ జట్టు మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ (Saeed Ajmal) ఆగ్రహం వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్‌తో సిరీస్ నేపథ్యంలో బాబర్ ఆజంపై వేటు వేయడాన్ని తప్పుబట్టాడు. అదే విధంగా.. బాబర్‌ను విమర్శిస్తున్న మాజీ క్రికెటర్లపై కూడా అజ్మల్ ఈ సందర్భంగా మండిపడ్డాడు.అంతటి సచిన్‌కే తప్పలేదుఅంతటి సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar)కు అయినా ప్రతి మ్యాచ్‌లో సెంచరీ చేయడం సాధ్యం కాదని.. అలాంటపుడు బాబర్‌ను పదే పదే ఎందుకు విమిర్శిస్తారని అసహనం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన బాబర్ ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా వ్యవహరించడం మానుకోవాలని అజ్మల్ హితవు పలికాడు.కాగా వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ లీగ్ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. అంతేకాదు చరిత్రలో లేని విధంగా తొలిసారి అఫ్గనిస్తాన్ చేతిలో వన్డే పరాజయం చవిచూసింది. దీంతో బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి వైదొలగగా.. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభానికి ముందు పీసీబీ మరోసారి అతడికి పగ్గాలు అప్పగించింది.ఇక ఈ ఐసీసీ టోర్నమెంట్లోనూ పాకిస్తాన్‌కు పరాభవమే ఎదురైంది. పసికూన అమెరికా చేతిలో ఓడి లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. ఈ క్రమంలో బాబర్‌పై వేటు వేసిన పీసీబీ.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అతడి కెప్టెన్సీలో వన్డేల్లో పాక్ చిరస్మరణీయ విజయాలు సాధించింది.ఆ ఇద్దరిపై వేటుఆస్ట్రేలియా పర్యటనలో కంగారూలను ఓడించడంతో పాటు.. సౌతాఫ్రికా గడ్డపై ఇంత వరకు ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో ప్రొటిస్ జట్టును 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇదే జోరులో సొంతగడ్డపై ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరింది. అయితే, అంతకంటే ముందు సౌతాఫ్రికా- న్యూజిలాండ్‌లతో త్రైపాక్షక వన్డే సిరీస్‌లో ఓటమిపాలైన రిజ్వాన్ బృందం.. ఐసీసీ టోర్నీలోనూ చేదు అనుభవం చవిచూసింది.డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి ఒక్క విజయం లేకుండానే ఈ వన్డే ఈవెంట్ నుంచి నిష్క్రమించింది. తొలుత న్యూజిలాండ్ చేతిలో.. అనంతరం టీమిండియా చేతిలో పరాజయం పాలైన పాక్.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో నిరాశగా వెనుదిరిగింది. ఇక ఈ టోర్నీలో బాబర్‌తో పాటు.. రిజ్వాన్ కూడా తేలిపోయాడు.ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌కు ప్రకటించిన జట్టులో పీసీబీ ఈ ఇద్దరికి చోటు ఇవ్వలేదు. కెప్టెన్‌గా రిజ్వాన్‌ను తప్పించడంతో పాటు బాబర్‌పై కూడా వేటు వేసింది. ఈ విషయంపై సయీద్ అజ్మల్ స్పందిస్తూ పీసీబీ తీరును ఎండగట్టాడు. విరాట్ లాంటి దిగ్గజాలు కూడా అంతే‘‘బాబర్, రిజ్వాన్ గొప్ప ఆటగాళ్లు. అయితే, మిగతా వాళ్లలా వాళ్లు దూకుడుగా బ్యాటింగ్ చేయలేరు. అయినా సరే జట్టుకు అవసరమైనప్పుడు కచ్చితంగా రాణిస్తారు. కానీ మా వాళ్ల(మాజీ క్రికెటర్లను ఉద్దేశించి) ఆలోచనా విధానం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.అంతర్జాతీయ క్రికెట్ అంటే దూకుడుగా ఆడాలనే ఫిక్సైపోయినట్టున్నారు. మ్యాచ్ విన్నర్లకు దూకుడుతో పని ఏముంది? అటాకింగ్ చేసే కంటే ముందు విరాట్ లాంటి దిగ్గజాలు కూడా తమ ఇన్నింగ్స్‌ను నెమ్మదిగానే ఆరంభిస్తారు. అది వాళ్ల శైలి. కానీ బాబర్- రిజ్వాన్‌లను మీరెందుకు తప్పుబడుతున్నారు?వాళ్లను టీ20 జట్టు నుంచి తొలగించడం ముమ్మాటికీ తప్పే. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే.. బాబర్‌పై వేటు వేయకుండా.. అతడితో చర్చించి ఆటను మార్చుకునే విధంగా.. తిరిగి పుంజుకునేలా స్ఫూర్తి నింపి ఉండాల్సింది.మీరు కాస్త నోళ్లు మూయండిప్రతి ఒక్క క్రికెటర్ జీవితంలో ఒకానొక సమయంలో గడ్డు దశ ఎదుర్కోక తప్పదు. కెరీర్ మొత్తం ఏ ఆటగాడూ అద్భుతంగా ఆడలేడు. అంతెందుకు.. సచిన్ టెండుల్కర్ కూడా ప్రతి మ్యాచ్‌లో శతకం బాదలేడు కదా!పాకిస్తాన్ క్రికెట్‌కు ఉన్న ఏకైక స్టార్ బాబర్. మీరు గనుక అతడిని కూడా డీగ్రేడ్ చేస్తే.. ఎవరి పేరు మీద పాక్ క్రికెట్‌ను నడుపుతారు? కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి. మన మాజీ క్రికెటర్లు కాస్త నోళ్లు మూసుకుని ఉంటే బాగుంటుంది’’ అని సయీద్ అజ్మల్ ఘాటు విమర్శలు చేశాడు.చదవండి: ఎవరూ ఊహించని నిర్ణయం.. అతడి రాకతో కివీస్ కుదేలు: పాక్ దిగ్గజం -
CT 2025: రికార్డులు బద్దలు.. సరికొత్త చరిత్ర! ఏకంగా 11 వేల కోట్లకు పైగా..
భారత్‌లో క్రికెట్ ఓ ‘మతం’ లాంటిది.. వేదిక ఏదైనా టీమిండియా ఆడుతోందంటే అందరూ టీవీలకు అతుక్కుపోవాల్సిందే. ఆ వెసలుబాటు లేని వాళ్లకు డిజిటల్ మీడియా రూపంలో ప్రత్యామ్నాయం ఉండనే ఉంది. ఇక ఇటీవల జరిగిన మెగా ఐసీసీ ఈవెంట్ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) జియోహాట్‌స్టార్(JioHotstar)లో ప్రత్యక్ష ప్రసారం అయిన విషయం తెలిసిందే.11 వేల కోట్ల నిమిషాలకు పైగాఈ నేపథ్యంలో తాజాగా ఈ టోర్నమెంట్ వ్యూయర్‌షిప్‌నకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ఈ వన్డే టోర్నీకి 540.3 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక వాచ్ టైమ్ ఏకంగా 11 వేల కోట్ల నిమిషాలకు పైగా నమోదు కావడం విశేషం. అంతేకాదు.. ఓవరాల్‌గా 6.2 కోట్ల మంది వ్యూయర్స్ ఈ మెగా ఈవెంట్‌ను వీక్షించినట్లు బ్రాడ్‌కాస్టర్ వెల్లడించింది.కాగా 2017లో చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించారు. నాటి ఫైనల్లో టీమిండియాపై గెలిచి పాకిస్తాన్ టైటిల్ సొంతం చేసుకుంది. అయితే, అప్పటి నుంచి సుదీర్ఘకాలం పాటు ఈ టోర్నీని వాయిదా వేశారు. ఈ క్రమంలో 2025లో తిరిగి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించేందుకు సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్(Pakistan) ఆతిథ్య హక్కులు దక్కించుకోగా.. టీమిండియా మాత్రం భద్రతా కారణాల వల్ల దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడింది.కాగా పాకిస్తాన్లో 1996 తర్వాత ఓ ఐసీసీ టోర్నీ జరగడం ఇదే తొలిసారి. ఇక ఫిబ్రవరి 19న పాకిస్తాన్లో మొదలైన ఈ వన్డే ఈవెంట్ మార్చి 9న భారత్- న్యూజిలాండ్ మధ్య దుబాయ్ వేదికగా ఫైనల్‌తో ముగిసింది. హిట్‌మ్యాన్ ఖాతాలో రెండో ఐసీసీ టైటిల్ఇక ఈ టోర్నమెంట్లో రోహిత్ సేన ఆది నుంచి ఆఖరి వరకు అజేయంగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్... సెమీస్‌లో ఆస్ట్రేలియాను, ఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది.తద్వారా హిట్‌మ్యాన్ ఖాతాలో రెండో ఐసీసీ టైటిల్ చేరింది. మరోవైపు.. ఈ వన్డే టోర్నీలో తొలిసారి అడుగుపెట్టిన అఫ్గనిస్తాన్ ఇంగ్లండ్ వంటి పటిష్ట జట్టును చిత్తు చేసి గెలుపు నమోదు చేయడం విశేషం. ఇక వన్డే వరల్డ్‌కప్-2023 విజేత ఆసీస్‌పై రన్నరప్ టీమిండియా ప్రతీకారం తీర్చుకోవడం కూడా హైలైట్‌గా నిలిచింది.ఇన్ని ప్రత్యేకతలు ఉన్న చాంపియన్స్ ట్రోఫీ-2025ని కోట్లాది మంది వీక్షించడంలో ఆశ్చర్యమేమీ లేకపోయినా.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 540 కోట్లకు పైగా వ్యూస్ రావడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్' 18 నెట్‌వర్క్‌లో టీవీలో ప్రసారాలు జరుగగా.. జియోహాట్‌స్టార్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం చేశారు. అత్యధిక వ్యూస్ ఆ మ్యాచ్కేకాగా మిగతా మ్యాచ్‌లతో పోలిస్తే టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఫైనల్‌కు అత్యధిక వ్యూస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ పోరుకు ఏకంగా 124.2 కోట్ల వీక్షణలు వచ్చాయి.కాగా మొత్తంగా చాంపియన్స్ ట్రోఫీకి వచ్చిన వ్యూయర్షిప్లో ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, గోవా, పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి 38 శాతం మేర వ్యూస్ వచ్చినట్లు సమాచారం. ఇక వైఫై సాయంతో మ్యాచ్ వీక్షించిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందు ఉంది. కాగా 16 మాధ్యమాల్లో చాంపియన్స్ ట్రోఫీని ప్రసారం చేశారు. తొమ్మిది భాషల్లో కామెంట్రీ ఇచ్చారు.ఇక ఈ మెగా టోర్నీలో గెలవడం ద్వారా భారత్ ఖాతాలో ఏడో ఐసీసీ టైటిల్ చేరింది. 1983 వన్డే వరల్డ్‌కప్, 2002లో శ్రీలంకతో కలిసి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ, 2024 టీ20 ప్రపంచకప్, 2025 చాంపియన్స్ ట్రోఫీలను భారత్ గెలుచుకుంది. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పాల్గొన్నాయి. దుబాయ్‌తో పాటు కరాచీ, లాహోర్, రావల్పిండి ఇందుకు వేదికలు.చదవండి: IPL 2025: అతడి గురించి ఎవరూ మాట్లాడమే లేదు.. మూడో స్థానంలో ఆడిస్తారా? -
రూ. లక్ష నుంచి పది వేలకు.. ఆటగాళ్లకు షాకిచ్చిన పాక్ బోర్డు
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(PCB) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ క్రికెటర్లకు ఊహించని షాకిచ్చింది. దేశీ మ్యాచ్ ఫీజులను భారీగా తగ్గించేసింది. కాగా అంతర్జాతీయ క్రికెట్లో వరుస పరాజయాలతో పాక్ సీనియర్ జట్టు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుని విమర్శల పాలైంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. న్యూజిలాండ్, టీమిండియా చేతుల్లో ఓడిపోయిన రిజ్వాన్ బృందం.. వర్షం వల్ల బంగ్లాదేశ్‌తో మ్యాచ్ రద్దవడం వల్ల నిరాశగా వెనుదిరిగింది.ఈ నేపథ్యంలో రిజ్వాన్ బృందంపై ఇంటాబయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక చాంపియన్స్ నిర్వహణ హక్కులు దక్కించుకున్న పీసీబీ.. స్టేడియాల మరమత్తుల కోసం భారీగానే ఖర్చు చేసింది. అయితే, ఆతిథ్య జట్టుగా దిగి దారుణంగా విఫలం కావడంతో సెలక్షన్ కమిటీపై కూడా ఆరోపణలు వస్తున్నాయి.ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ బ్యాటింగ్ కోచ్ మొహమ్మద్ యూసుఫ్ వ్యక్తిగత కారణాలతో తప్పుకోవడం గమనార్హం. తదుపరి న్యూజిలాండ్‌తో సిరీస్‌కు అతడు దూరమయ్యాడు. కివీస్‌తో జరిగే 5 టి20లు, 3 వన్డేల సిరీస్ కోసమే అతడిని పీసీబీ ఎంపిక చేయగా... అతడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. అయితే తన కూతురు అనారోగ్యం కారణంగా టూర్‌నుంచి అతను తప్పుకొన్నట్లు యూసుఫ్ వెల్లడించగా.. అతడి స్థానంలో పీసీబీ ఎవరినీ ఎంపిక చేయలేదు. ఇక చాంపియన్స్ ట్రోఫీ వైఫల్యం తర్వాత కివీస్‌తో ఎంపిక చేసిన టీ20 జట్టులో కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌తో పాటు బాబర్ ఆజంకు పీసీబీ చోటివ్వలేదు. లక్ష నుంచి పది వేలకు.. తాజాగా.. దేశవాళీ క్రికెట్లో మార్పులకు శ్రీకారం చుడుతూ.. ఆటగాళ్లపై దెబ్బ వేసింది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా పాక్ దేశవాళీ క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను భారీగా తగ్గించేసింది. ఆ బోర్డు ఆర్థిక స్థితికి ఇది నిదర్శనం!కాగా జాతీయ టీ20 చాంపియన్‌షిప్‌లో ఇప్పటి వరకు ఒక లక్ష పాకిస్తానీ రూపాయలు (భారత కరెన్సీలో రూ. 31 వేలు) ఫీజుగా ఇస్తుండగా.. ఇప్పుడు దానిని ఏకంగా 10 వేల రూపాయలకు (రూ.3,100) తగ్గించారు. ఈ 90 శాతం కోతతో పాటు తక్కువ ఖర్చుతో కూడిన హోటల్స్‌లో వసతి, తక్కువ సార్లు మాత్రమే విమానాల్లో ప్రయాణించేలా నిర్ణయం తీసుకున్నారు. పాక్‌తో టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ సారథిగా బ్రేస్‌వెల్ ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్‌ను న్యూజిలాండ్ టీ20 కెప్టెన్‌గా నియమించారు. సొంతగడ్డపై పాకిస్తాన్‌తో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లో పాల్గొనే కివీస్ జట్టును మంగళవారం ప్రకటించారు. చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో భుజం గాయానికి గురైన హెన్రీకి మొదటి 3 మ్యాచ్‌లకు విశ్రాంతినిచ్చి ఆఖరి 4, 5వ మ్యాచ్‌లకు ఎంపిక చేయగా, జేమీసన్ తొలి మూడు మ్యాచ్‌లు ఆడనున్నాడు.దుబాయ్‌లో ఆదివారం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌తో తలపడిన ఏడుగురు ఆటగాళ్లు ఐపీఎల్, పీఎస్ఎల్ (పాక్) కాంట్రాక్టుల వల్ల జాతీయ జట్టుకు అందుబాటులో ఉండటం లేదు. రెగ్యులర్ కెప్టెన్ సాంట్నర్ సహా కాన్వే, రచిన్ రవీంద్ర, ఫిలిప్స్, ఫెర్గూసన్ ఐపీఎల్ ఆడనుండగా, కేన్ విలియమ్సన్ పాక్ సూపర్ లీగ్ ఆడేందుకు వెళ్లనున్నాడు.కివీస్ జట్టు మార్చి 16, 18, 21, 23, 26 తేదీల్లో పాక్‌తో ఐదు టీ20లు ఆడుతుంది. అనంతరం ఇరుజట్ల మధ్య మార్చి 29, ఏప్రిల్ 2, 5వ తేదీల్లో మూడు వన్డేల సిరీస్ కూడా జరుగనుంది. ఈ జట్టును తర్వాత ఎంపిక చేస్తారు. న్యూజిలాండ్ టీ20 జట్టు: బ్రేస్‌వెల్ (కెప్టెన్), అలెన్, చాప్మన్, ఫౌల్కెస్, మిచెల్ హే, హెన్రీ, జేమీసన్, మిచెల్, నీషమ్, రూర్కే, రాబిన్సన్, బెన్ సీర్స్, సీఫెర్ట్, జేకబ్ డఫీ, ఇష్ సోధి. తస్కీన్ ఒక్కడికే బంగ్లా ‘ఎ’ప్లస్ కాంట్రాక్టు బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ తస్కీన్ అహ్మద్ ఒక్కడికే బోర్డు కాంట్రాక్టుల్లో అగ్ర తాంబూలం దక్కింది. బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ) ఈ ఏడాది సెంట్రల్ కాంట్రాక్టు దక్కించుకున్న క్రికెటర్ల జాబితాను ప్రకటించింది. కొన్నేళ్లుగా బీసీబీ ఫార్మాట్ల ప్రాతిపదికన కాంట్రాక్టులు ఇస్తూ వచ్చింది. అయితే దీనికి మంగళం పాడిన బోర్డు మళ్లీ పాత పద్ధతిలోనే గ్రేడ్లవారీగా కాంట్రాక్టులు ఇచ్చింది. ఇందులో భాగంగా ‘ఎ’ ప్లస్ గ్రేడ్‌లో ఉన్న ఒకే ఒక్కడు తస్కీన్‌కు నెలకు బంగ్లా కరెన్సీలో ఒక మిలియన్ టాకాలు (రూ.7.15 లక్షలు) చెల్లిస్తారు.కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ సహా మెహదీ హసన్ మిరాజ్, లిటన్ దాస్, ముష్ఫికర్ రహీమ్‌లకు ‘ఎ’గ్రేడ్ కాంట్రాక్టు దక్కింది. ఇందులో భాగంగా వీరికి నెలకు 8 లక్షల టాకాలు (రూ.5.75 లక్షలు) లభిస్తాయి. చాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపిక కాని ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు బీసీబీ కాంట్రాక్టు లభించలేదు. 2022 తర్వాత సౌమ్య సర్కార్, షాద్మన్ ఇస్లామ్‌లకు సెంట్రల్ కాంట్రాక్టు దక్కింది. ‘సి’ గ్రేడ్‌లో ఉన్న వీరికి నెలకు 4 లక్షల టాకాలు (రూ.2.87 లక్షలు) జీతంగా చెల్లిస్తారు. ‘బి’ గ్రేడ్ ప్లేయర్లకు 6 లక్షల టాకాలు (రూ.4.27 లక్షలు) చెల్లిస్తారు. -
ఛీ.. ‘డి’ జట్లను కూడా ఓడించలేకపోతున్నాం: పాక్ మాజీ క్రికెటర్ ఫైర్
పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్(Kamran Akmal) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. కనీసం ‘డి’ స్థాయి జట్లపై కూడా తమ ప్రధాన జట్టు గెలవలేకపోతోందని.. ఇంతకంటే అవమానం మరొకటి ఉండదని మండిపడ్డాడు. టీమిండియా, న్యూజిలాండ్ లాంటి జట్లను చూసి రిజ్వాన్ బృందం నేర్చుకోవాల్సింది చాలా ఉందని అభిప్రాయపడ్డాడు. ఒక్క విజయం లేకుండానేఇతర దేశాల్లో ప్రతిభ ఆధారంగా జట్లను ఎంపిక చేస్తే.. పాక్ క్రికెట్ బోర్డు మాత్రం ఇందుకు విరుద్ధమని కమ్రాన్ అక్మల్ విమర్శించాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో పాక్ జట్టు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ మెగా వన్డే టోర్నీకి ఆతిథ్యమిస్తూ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన పాకిస్తాన్.. కనీసం ఒక్క విజయం లేకుండానే వెనుదిరిగింది.గ్రూప్ దశలో న్యూజిలాండ్, టీమిండియా(Team India) చేతుల్లో ఓడిన రిజ్వాన్ బృందం.. ఆఖరిగా బంగ్లాదేశ్‌పై అయినా గెలవాలని ఉవ్విళ్లూరింది. అయితే, వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దు కావడంతో పాకిస్తాన్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. దీంతో గెలుపున్నదే లేకుండా నిష్క్రమించాల్సి వచ్చింది. దీంతో పాక్ మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.ఛీ.. ‘డి’ జట్లను కూడా ఓడించలేకపోతున్నాంఈ క్రమంలో మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ మాట్లాడుతూ... ‘‘మా దేశానికి వచ్చిన ‘డి’ స్థాయి(చిన్న జట్లను అన్న ఉద్దేశంలో) జట్లను కూడా పాకిస్తాన్ తమ పూర్తి స్థాయి జట్టుతో ఓడించలేకపోయింది. మన జట్టు బాగా ఆడి గెలిస్తేనే గౌరవం, మర్యాద ఉంటాయి’’ అని రిజ్వాన్ బృందం ఆట తీరుపై అసహనం వ్యక్తం చేశాడు.అదే విధంగా.. ‘‘టీమిండియా వరుసగా ఐసీసీ ఈవెంట్లు గెలుస్తోంది. న్యూజిలాండ్ కూడా అద్భుతంగా ఆడుతోంది. ఒక్క సిరీస్ ఓడిపోగానే ఆ జట్ల బోర్డులు మార్పులు చేసుకుంటూ వెళ్లవు. మరింత ఉత్సాహంతో తిరిగి పుంజుకునేలా స్ఫూర్తి నింపుతాయి. వాళ్లు మళ్లీ గెలుపుబాట పట్టేలా చేస్తాయి.కానీ మన పరిస్థితి వేరు. ఒక్కటి ఓడితే.. వరుసగా ఇక పరాజయాలే. చాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ విధానంలో నిర్వహించడం వల్ల మనకు ఎంత డబ్బు వచ్చిందనేదే మనకు ప్రధానం. కానీ ఆటలో గెలవాలి. గౌరవప్రదంగా ముందుకు వెళ్లాలని మాత్రం ఉండదు’’ అంటూ కమ్రాన్ అక్మల్ పాక్ బోర్డు తీరును కూడా తప్పుబట్టాడు.పాక్ క్రికెట్ ‘ఐసీయూ’లో ఉందిఇదిలా ఉంటే.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇటీవలి ప్రదర్శనపై ఆ జట్టు మాజీ ప్లేయర్ షాహిద్ అఫ్రిది కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తప్పుడు నిర్ణయాల వల్ల ప్రస్తుతం జట్టు పరిస్థితి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉందని అతను ఘాటుగా వ్యాఖ్యానించాడు. శస్త్రచికిత్స చేసి కోలుకునే పరిస్థితి నుంచి కూడా ఇప్పుడు చేయిదాటిపోయిందని అతను అన్నాడు. ముఖ్యంగా జట్టులో షాదాబ్ ఖాన్ ఎంపికను అతను తీవ్రంగా విమర్శించాడు.గత టీ20 వరల్డ్ కప్ తర్వాత జట్టులో స్థానం కోల్పోయిన షాదాబ్‌ను న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేయడంతో పాటు వైస్ కెప్టెన్‌గా కూడా నియమించారు. ‘ఏ ప్రాతిపదికన షాదాబ్‌ను మళ్లీ జట్టులోకి తీసుకున్నారు. దేశవాళీలో అతను ఏమాత్రం ప్రదర్శన ఇచ్చాడని ఎంపిక చేశారు.టోర్నీకి ముందు అంతా సన్నాహకాల గురించి మాట్లాడతారు. చిత్తుగా ఓడిపోగానే శస్త్రచికిత్స అవసరమంటారు. ఇప్పుడు అది కూడా సాధ్యం కాదు. పాక్ క్రికెట్ ఐసీయూలోకి చేరింది. బోర్డు విధానాలు, నిర్ణయాల్లో నిలకడ లేదు. కెప్టెన్లు, కోచ్‌లను మార్చడం తప్ప బోర్డు అధికారులకు జవాబుదారీతనం లేదు. వాళ్ల ఉద్యోగాలు కాపాడుకోవడానికి అంతా ఆటగాళ్లను బలి పశువులను చేస్తారు’ అని అఫ్రిది అభిప్రాయ పడ్డాడు. చదవండి: అదే జరిగితే బుమ్రా కెరీర్ ముగిసినట్లే: కివీస్ మాజీ పేసర్ స్ట్రాంగ్ వార్నింగ్ -
ఎక్కడైనా టీమిండియాదే గెలుపు!.. ఇచ్చిపడేసిన పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్
టీమిండియాపై పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రం(Wasim Akram) ప్రశంసలు కురిపించాడు. వేదిక ఏదైనా రోహిత్ సేనకు తిరుగులేదని.. అద్భుత ప్రదర్శనతో విజయాలు సాధిస్తున్న తీరు అమోఘమని కొనియాడాడు. ఎల్లవేళలా తమ కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌లకు సంపూర్ణ మద్దతు ప్రకటించి భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) అనుకున్న ఫలితాన్ని రాబట్టగలిగిందని ప్రశంసించాడు.కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఈ మెగా టోర్నీ నిర్వహణ హక్కులు దక్కించుకోగా.. టీమిండియా మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడింది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను ఓడించిన రోహిత్ సేన.. సెమీస్‌లో ఆస్ట్రేలియాను, ఫైనల్లో న్యూజిలాండ్‌లపై గెలిచి టైటిల్ సాధించింది.బీసీసీఐ అనుసరించిన విధానాల వలనే..అయితే, ఒకే వేదికపై ఆడటం భారత్‌కు సానుకూలంగా మారిందనే విమర్శల నేపథ్యంలో పాక్ దిగ్గజ ఫాస్ట్‌బౌలర్ వసీం అక్రం తనదైన శైలిలో స్పందించాడు. బీసీసీఐ అనుసరించిన విధానాలే టీమిండియా జైత్రయాత్రకు కారణమని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘ప్రస్తుత భారత జట్టు ప్రపంచంలోని ఏ వేదికపై ఆడినా కచ్చితంగా గెలుస్తుంది.ఒక్క ఓటమి కూడా లేకుండాదుబాయ్లో ఆడినందుకు టీమిండియా లాభపడిందని చాలా మంది అంటున్నారు. కానీ పాకిస్తాన్లో ఆడినా రోహిత్ సేన టైటిల్ గెలిచేది. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో భారత జట్టు కూడా అన్ని టీమ్స్ మాదిరే వివిధ వేదికలకు ప్రయాణాలు చేసింది. మరి అజేయంగానే చాంపియన్‌గా నిలిచింది కదా! ఒక్క ఓటమి కూడా లేకుండా ట్రోఫీని ముద్దాడింది.ఐసీసీ ఈవెంట్లలో భారత జట్టుకు నిలకడకు ఇది నిదర్శనం. రోహిత్ శర్మ నాయకత్వ పటిమకు ఇదో కొలమానం. న్యూజిలాండ్‌తో స్వదేశంలో టీమిండియా టెస్టు సిరీస్‌లో కనీవినీ ఎరుగని రీతిలో 3-0తో వైట్‌వాష్ అయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో.. పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది.అంతకు ముందు శ్రీలంకకు వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయింది. ఇలాంటి సమయాల్లో బోర్డుపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. కెప్టెన్, కోచ్‌లను తొలగించాలనే డిమాండ్లు వస్తాయి. అయితే, బీసీసీఐ మాత్రం తమ సారథికి, శిక్షకుడికి అన్ని వేళలా పూర్తి మద్దతుగా నిలిచింది. అందుకు తగ్గ ఫలితాన్ని చాంపియన్స్ ట్రోఫీలో చాంపియన్‌గా నిలవడం ద్వారా పొందింది’’ అని వసీం అక్రం పేర్కొన్నాడు.మూడోసారి ఈ ఐసీసీ టైటిల్‌ను కైవసంకాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో టీమిండియా కివీస్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా మూడోసారి(2002, 2013, 2025) ఈ ఐసీసీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. దుబాయ్‌లో ఆదివారం రాత్రి ముగిసిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బౌలింగ్ చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(63), మైకేల్ బ్రాస్‌వెల్(40 బంతుల్లో 53 నాటౌట్) రాణించడం ద్వారా నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ చెరో రెండు, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధ శతకం(83 బంతుల్లో 76)తో రాణించగా.. శ్రేయస్ అయ్యర్(48), కేఎల్ రాహుల్(33 బంతుల్లో 34 నాటౌట్), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 18), రవీంద్ర జడేజా(6 బంతుల్లో 9 నాటౌట్) జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. రోహిత్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ టోర్నీలో పాకిస్తాన్ ఒక్క విజయం కూడా లేకుండా నిష్క్రమించడం గమనార్హం.చదవండి: అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్ కెప్టెన్ TEAM INDIA ARE CHAMPIONS AGAIN! 🏆🇮🇳#ChampionsTrophyOnJioStar #INDvNZ #ChampionsTrophy2025 pic.twitter.com/Uh6EZWFfSL— Star Sports (@StarSportsIndia) March 9, 2025 -
నోరు అదుపులో పెట్టుకోండి గవాస్కర్ సాబ్: ఇంజమామ్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్‌పై ఓటమి అనంతరం పాకిస్తాన్ జట్టును లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పాకిస్తాన్ జట్టు ఇండియన్-బి టీమ్‌ను కూడా ఓడించలేదని ఆయన ఎద్దేవా చేశారు. "పాకిస్తాన్ జట్టు బెంచ్ అంత బలంగా లేకపోవడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. పాకిస్తాన్ జట్టులో ఒకప్పుడు సహజమైన నైపుణ్యాలు, ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఉండేవారు. టెక్నికల్‌గా వారు అంత గొప్పగా లేకపోయినా, గేమ్‌పై మాత్రం వారికి మంచి అవగహన ఉండేది. బ్యాట్‌తో పాటు బంతితో కూడా అద్భుతాలు చేసేవారు.ఉదాహరణకు ఇంజమామ్-ఉల్-హక్‌ను తీసుకుంటే... అతడిలా ఉండాలని యువ ఆటగాళ్లకు సలహా ఇవ్వలేం. కానీ ఆట పట్ల అతడికి ఒక తరహా పిచ్చి ఉండేదని చెప్పవచ్చు. ఆటే పరమావధిగా ముందుకు సాగేవాడు. తన దూకుడుతో ఒక్కోసారి సాంకేతిక లోపాలను అధిగమించి అనుకున్న ఫలితాన్ని రాబట్టడంలోనూ సఫలమయ్యేవాడు. ప్రస్తుతం ఉన్న ఫామ్‌తో పాక్ జట్టు, భారత్-బి టీమ్‌పై కూడా గెలవలేదు. సి టీమ్ విషయంలో కచ్చితంగా చెప్పలేను" అని గవాస్కర్ పేర్కొన్నాడు.ఇంజమామ్ ఫైర్.. తాజాగా గవాస్కర్ వ్యాఖ్యలపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ ఘూటుగా స్పందించాడు. ఇతర జట్ల గురుంచి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని ఇంజమామ్ హెచ్చరించాడు. "గవాస్కర్ సాబ్.. మీ జట్టు బాగా ఆడి గెలిచింది. అది నేను కూడా అంగీకరిస్తాను. కానీ మా జట్టు గురించి ఏది పడితే అది మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోము. మా జట్టు గణాంకాలు చూసి మాట్లాడండి. షార్జా వేదికగా జరిగిన ఓ మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు భయపడి మీరు పారిపోలేదా? మీరు మా కంటే పెద్దవారు.మిమ్మల్ని మేము చాలా గౌరవిస్తాము. కానీ మీరు ఇతర దేశం కోసం అలా తక్కువ చేసి మాట్లాడం సరికాదు. మీ జట్టును ఎంత కావాలంటే అంతగా ప్రశంసించే హక్కు మీకు ఉంది. కానీ ఇతర జట్లను చులకన చేసే మాట్లాడే హక్కు మీకు లేదు. ముందు మా పాకిస్తాన్ గణాంకాలను చెక్ చేసుకోండి.మీ వ్యాఖ్యలు నన్ను చాలా బాధించాయి. మీరు గొప్ప క్రికెటర్, కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో మీ గౌరవాన్ని పోగట్టుకుంటున్నారు. ఇటువంటి కామెంట్స్ చేసేముందు అతడు తన నోటిని అదుపులో పెట్టుకోవాలి" అని 24 న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంజమామ్ మండిపడ్డాడు.పాక్‌దే పై చేయి..కాగా వన్డే క్రికెట్లో భారత్‌పై పాక్‌దే పైచేయిగా ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు వన్డేల్లో ముఖా ముఖి 136 సార్లు తలపడ్డాయి. వాటిల్లో భారత్ 58 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. పాకిస్తాన్ 73 సార్లు విజేతగా నిలిచింది. ఐదు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. అయితే ఐసీసీ టోర్నీల్లో మాత్రం భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. వరుసగా మూడు టోర్నీల్లో పాకిస్తాన్‌ను టీమిండియా మట్టికర్పించింది. ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి టైటిల్‌ను భారత్ ఎగరేసుకుపోయింది.చదవండి: కోహ్లి, గిల్ కాదు.. అతడే సైలెంట్ హీరో: రోహిత్ శర్మ -
ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్: జియోస్టార్ సరికొత్త రికార్డ్
జియోస్టార్ టీవీ.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో లైవ్ స్పోర్ట్స్ ప్రసార అనుభవాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తూనే ఉంది. ఇటీవల జరిగిన ఐసీసీ మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 'ఇండియా vs పాకిస్తాన్' మ్యాచ్‌ను 20.6 కోట్లమంది వీక్షించారు. ఇది బీఏఆర్సీ చరిత్రలోనే ఎక్కువమంది వీక్షించిన రెండవ క్రికెట్ మ్యాచ్‌గా (వరల్డ్ కప్ మ్యాచ్‌లు మినహా) నిలిచింది.2025 ఫిబ్రవరి 23న జరిగిన ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా జరిగిన భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్‌ను 20.6 కోట్లమంది వీక్షించారు. ఈ సంఖ్య 2023లో అహ్మదాబాద్‌లో జరిగిన ఓడీఐ ప్రపంచ కప్ మ్యాచ్ కంటే దాదాపు 11% ఎక్కువ. ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ఇండియా 2023లో జరిగిన మ్యాచ్‌తో పోలిస్తే రేటింగ్లలో 10% కంటే ఎక్కువ. వ్యూయ్స్ టైమ్ కూడా 2609 కోట్ల నిమిషాలుగా నమోదైంది.భారతదేశంలో జరుగుతున్న క్రీడా కార్యక్రమాలతో జియోస్టార్ కొత్త మైలురాళ్లను చేరుకుంటోంది. అభిమానుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి, మా ప్రేక్షకుల సంఖ్యను విస్తరించడానికి మేము కట్టుబడి ఉన్నామని జియోస్టార్ ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఈ మ్యాచ్‌ను మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ కలిసి ప్రత్యక్షంగా వీక్షించారు. -
‘లాహోర్‌లో ఫైనల్ జరిగితే బాగుండేది’.. బీసీసీఐ స్ట్రాంగ్ రియాక్షన్
టీమిండియా విజయాలను తక్కువ చేసే విధంగా మాట్లాడేవారికి భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా గట్టి కౌంటర్ ఇచ్చారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) నిర్ణయానుసారమే భారత్ దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుతోందన్నారు. గెలుపు కోసం పిచ్‌లపై ఆధారపడే దుస్థితిలో టీమిండియా లేదని.. వేదిక ఒకటే అయినా వేర్వేరు పిచ్‌లపై ఆడుతున్న విషయాన్ని గమనించాలని శుక్లా పేర్కొన్నారు.అజేయంగా ఫైనల్కుఅదే విధంగా చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) ఫైనల్ లాహోర్‌లో జరిగితే బాగుండేదన్న పాకిస్తాన్ జర్నలిస్టు ప్రశ్నకు రాజీవ్ శుక్లా ఇచ్చిన సమాధానం వైరల్‌గా మారింది. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాక్ పంపేందుకు బీసీసీఐ నిరాకరించగా.. ఐసీసీ జోక్యంతో తటస్థ వేదికపై మ్యాచ్‌లు ఆడేలా రోహిత్ సేనకు అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో గ్రూప్-ఎ నుంచి పోటీపడిన టీమిండియా అజేయంగా ఫైనల్‌కు చేరింది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను ఓడించిన భారత్.. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. కానీ, ఒకే వేదికపై ఆడటం వల్ల టీమిండియాకు అదనపు ప్రయోజనాలు చేకూరుతున్నాయని ఇంగ్లండ్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్లు ప్రముఖంగా గళం వినిపించారు.ఐసీసీ నిబంధన ప్రకారమేఈ క్రమంలో లాహోర్‌లో జరిగిన సౌతాఫ్రికా- న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌కు హాజరైన రాజీవ్ శుక్లా పైవిధంగా స్పందించారు. అదే విధంగా.. భారత్- పాక్ ద్వైపాక్షిక సిరీస్‌ల గురించి ప్రస్తావన రాగా.. ‘‘భారత ప్రభుత్వం నిర్ణయం ప్రకారమే మేము నడుచుకుంటాము. పాక్ క్రికెట్ బోర్డు కూడా వారి ప్రభుత్వం చెప్పినట్లే చేస్తుంది.ఇరుజట్లు.. ఒకరి దేశంలో మరొకరు ఆడితే చూడాలని భారత్- పాక్ అభిమానులు కోరుకుంటున్నారని మాకు తెలుసు. అయితే, పరిస్థితులకు అనుగుణంగానే ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. ఐసీసీలో ఒక నిబంధన ఉంది. ప్రభుత్వాల సమ్మతితోనే బోర్డులు ముందుకు వెళ్లాలి. బీసీసీఐ, పీసీబీ ఆ నిబంధనను పాటిస్తున్నాయి.అయితే, భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌లకు ఉన్న ఆదరణ దృష్ట్యా ప్రతీ దేశం దాయాదుల పోరుకు ఆతిథ్యం ఇవ్వాలని కోరుకుంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఏదేమైనా సుదీర్ఘకాలం తర్వాత పాకిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఇదొక శుభపరిణామం. టోర్నీ సజావుగా సాగేలా చేశారు’’ అని రాజీవ్ శుక్లా పీసీబీని ప్రశంసించారు.ఆసీస్ ఓడిపోయింది కదా!ఇక లాహోర్‌లో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరిగితే బాగుండేది కదా అని ఓ పాకిస్తాన్ జర్నలిస్తు రాజీవ్ శుక్లాను ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఇందుకు బదులిస్తూ.. ‘‘మీరన్నట్లు జరగాలంటే ఆస్ట్రేలియా గెలిచి ఉండాల్సింది. కానీ వాళ్లు ఓడిపోయారు కద! అందుకే ఫైనల్ మ్యాచ్ దుబాయ్‌లోనే జరుగబోతోంది’’ అని రాజీవ్ శుక్లా కౌంటర్ ఇచ్చారు.ఇక ఆసియా కప్ షెడ్యూలింగ్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘ఆసియా క్రికెట్ మండలి నిర్ణయాల ప్రకారం అంతా జరుగుతుంది. ఆసియా కప్ గురించి చర్చించేందుకు కూడా నేను ఇక్కడకు వచ్చాను. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఐసీసీ చైర్మన్ జై షా కూడా ఈ విషయంలో సహకరిస్తున్నారు’’ అని రాజీవ్ శుక్లా పేర్కొన్నారు.కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్... గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీపడగా.. భారత్- న్యూజిలాండ్.. ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా సెమీస్ చేరాయి. అయితే, తొలి సెమీ ఫైనల్లో ఆసీస్‌ను భారత్.. రెండో సెమీస్‌లో సౌతాఫ్రికాను కివీస్ ఓడించి ఫైనల్‌కు చేరుకున్నాయి.చదవండి: Steve Smith: కోహ్లికి ముందే తెలుసు! -
'ఐపీఎల్‌ను బాయ్‌కట్ చేయండి'.. భారత్‌పై అక్కసు వెల్లగక్కిన ఇంజమామ్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. అయితే 29 ఏళ్ల తర్వాత తమ దేశంలో జరుగుతున్న ఐసీసీ టోర్నీలో ఆతిథ్య పాకిస్తాన్ మాత్రం పూర్తిగా తేలిపోయింది. న్యూజిలాండ్, భారత్ చేతిలో వరుస ఓటములను చవిచూసిన పాకిస్తాన్ జట్టు.. ఈ మెగా టోర్నీ గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది.దీంతో పాక్ జట్టుపై ఆ దేశ మాజీ క్రికెటర్లు, అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు టీమిండియా మాత్రం వరుస విజయాలతో తమ సెమీస్ బెర్త్‌ను బెర్త్‌ను ఖారారు చేసుకుంది. కాగా పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో భారత్ మాత్రం తమ మ్యాచ్‌లను దుబాయ్ వేదికగా ఆడుతోంది.భద్రత కారణాల రీత్యా తమ జట్టును పాక్‌కు పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. దీంతో ఐసీసీ ఈ ఈవెంట్‌ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తోంది. ఈ క్రమంలో భారత జట్టుపై పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం ఇంజమామ్ ఉల్ హక్ మరోసారి తన అక్కసును వెల్లగక్కాడు. బీసీసీఐకి వ్యతిరేకంగా అన్ని క్రికెట్ బోర్డులు ఏకం కావాలని ఇంజమామ్ విషం చిమ్మాడు. "ఛాంపియన్స్ ట్రోఫీ విషయం పక్కన పెట్టండి. ప్రపంచంలోని టాప్ ప్లేయర్లందరూ ఐపీఎల్లో పాల్గోంటారు. కానీ భారత ఆటగాళ్లు మాత్రం ఇతర ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌ల్లో పాల్గోనరు. అందుకు వారి క్రికెట్ బోర్డు అంగీకరించదు. కాబట్టి ఇతర క్రికెట్ బోర్డులు కూడా తమ ఆటగాళ్లను ఐపీఎల్ ఆడేందుకు ఎన్వోసీ జారీ చేయకూడదు. ఈ విషయంపై అన్ని క్రికెట్ బోర్డులు ఒకే తాటిపై రావాలని" ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంజమామ్ పేర్కొన్నాడు.అయితే ఒక్క పాకిస్తాన్ మినహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లందరికి ఐపీఎల్లో ఆడేందుకు అనుమతి ఉంది. ఐపీఎల్ ప్రారంభంలో పాకిస్థాన్ ఆటగాళ్లు టోర్నీలో పాల్గొనేవారు. ఐపీఎల్ మొదటి ఎడిషన్(2008) లో చాలా మంది పాక్ ప్లేయర్లు ఐపీఎల్లో ఆడారు.అయితే ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడి తరువాత పాక్ ఆటగాళ్లను ఐపీఎల్లో ఆడకుండా నిషేధించారు. కాగా బీసీసీఐ మాత్రం తమ ఆటగాళ్లను విదేశీ లీగ్‌లలో ఆడేందకు అనుమతించదు. ఒక ఇండియన్ క్రికెటర్ ఓవర్సీస్ లీగ్‌లు ఆడేందుకు అర్హత సాధించాలంటే ఐపీఎల్‌తో సహా భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇవ్వాలి.చదవండి: CT 2025 IND Vs NZ: కివీస్‌తో మ్యాచ్.. స్టార్ ప్లేయర్లకు రెస్ట్! విధ్వంసకర వీరుడి ఎంట్రీ? -
యుద్ధం మాదిరి సిద్ధం.. భారత్ చేతిలో చిత్తు! పాక్ జట్టులో భారీ మార్పులు?
భారత్-పాకిస్తాన్(India vs Paksitan) క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు ఏ వేదిక పైన జరిగినా ప్రత్యేకమే. ఈ మ్యాచ్ లు ఎప్పుడూ ప్రపంచ క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షిస్తాయి. ఇటీవల ఈ రెండు జట్లు మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ కోసం పాకిస్తాన్ భారీ స్థాయిలో సన్నద్ధమైంది. "యోధుల్లాగా పోరాడండి. ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో(ICC Champions Trophy) భారత జట్టును ఓడించి మీ సత్తా చూపించండి" అని ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌కు ముందు సాక్షాత్తూ పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్(Shehbaz Sharif) ఆ దేశ క్రికెటర్లను తన సందేశంతో యుద్ధం స్థాయిలో సన్నద్ధం చేశారు. కానీ భారత్ క్రికెటర్ల ప్రతిభ ముందు ఇవేమి పనిచేయలేదు.ఘోర పరాజయంపాకిస్తాన్ తన చిరకాల ప్రత్యర్థితో జరిగిన మ్యాచ్ లో ఘోర పరాజయం చవిదూడడంతో ప్రస్తుతం గ్రూప్ స్టేజి లోనే టోర్నమెంట్ నుంచి వైదొలిగింది. 29 సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో తొలిసారిగా ఈ ఐసీసీ టోర్నమెంట్‌కు ఆతిధ్యమిచ్చిన మొహమ్మద్ రిజ్వాన్ నాయకత్వంలోని పాకిస్తాన్ జట్టు కేవలం ఐదు రోజుల్లోనే అవమానకరమైన రీతిలో గ్రూప్ దశలోనే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.ప్రకృతి కూడా సహకరించలేదుమొదట న్యూజిలాండ్, ఆ తర్వాత భారత్ చేతిలో వరుస పరాజయాలు చవిచూసిన పాకిస్తాన్ కి ప్రకృతి కూడా సహకరించలేదు. చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించాలని ఆశించిన పాకిస్తాన్ కి వర్షం అడ్డంకిగా నిలిచింది. దీంతో రావల్పిండిలో జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో పాకిస్తాన్ మూడు మ్యాచ్ ల నుంచి కేవలం ఒక్క పాయింట్ తో అవమానకరంగా వైదొలిగింది.స్వదేశం లో జరిగిన ఈ ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ లో పాకిస్తాన్ క్రికేటర్ల పేలవమైన ప్రదర్శన పై ఆ దేశం మొత్తం అసంతృప్తి గా ఉంది. అభిమానులు, క్రికెట్ పండితులు, మాజీ ఆటగాళ్ల నుండి చాలా మంది పాకిస్తాన్ ప్రదర్శన పై దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో పాకిస్తాన్ జట్టు ఆట తీరు ని షెహబాజ్ షరీఫ్ స్వయంగా సమీక్షించాలని భావిస్తున్నారు.షెహబాజ్ షరీఫ్ రాజకీయ మరియు ప్రజా వ్యవహారాల సలహాదారు రాణా సనావుల్లా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఛాంపియన్స్ ట్రోఫీలో తమ జట్టు దారుణమైన ప్రదర్శనను ప్రధాని స్వయంగా సమీక్షించాలని భావిస్తున్నారని వెల్లడించారు. అంతేకాకుండా, ఈ క్రికెట్ సంబంధిత అంశాన్ని పాకిస్తాన్ పార్లమెంట్ లో లేవనెత్తుతామని కూడా ఆయన సూచించారు.పీసీబీ అధికారులపై అసంతృప్తిప్రధాన మంత్రి సహాయకుడు రాణా సనావుల్లా, దేశంలోని ప్రొఫెషనల్ క్రికెట్‌పై ఆర్థిక వ్యయాలకు సంబంధించి పారదర్శకత కోసం పిలుపునిచ్చారు. క్రీడలకు వనరులు ఎలా కేటాయించబడుతున్నాయ్యో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని ఆయన చెప్పారు. జవాబుదారీతనం మరియు సంస్కరణల అవసరాన్ని గురుంచి మరింత నొక్కి చెప్పారు.పాకిస్తాన్‌కు చెందిన 'ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్' నివేదిక ప్రకారం, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)లోని ఉన్నత స్థాయి అధికారుల అధిక జీతాలపై దృష్టిని సారించాలని రాణా సనావుల్లా సూచించారు. దాదాపు నెలకు రూ.5 మిలియన్ల వరకు జీతం పొందుతున్న పీసీబీ అధికారులలో చాలా మందికి వారి బాధ్యతల గురించి స్పష్టమైన అవగాహన లేదని, అయినప్పటికీ వారు తమ విధులను నిర్వర్తించకుండా గణనీయమైన పరిహారం పొందుతూనే ఉన్నారని సనావుల్లా విమర్శించారు.అంతేకాకుండా, పీసీబీ అధికారులు అనుభవిస్తున్న విపరీత ప్రోత్సాహకాలు మరియు అధికారాలపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు, వారు పాకిస్తాన్ సంస్థలో పనిచేస్తున్నారా లేదా అభివృద్ధి చెందిన దేశంలో పనిచేస్తున్నారా అని ప్రశ్నించారు. పిసిబి లో చాలా కాలంగా కొనసాగుతున్న అధికార దుర్వినియోగానికి సనావుల్లా ఈ సమస్యలను ఆపాదించారు. పీసీబీ అధికారుల జవాబురాహిత్యం ప్రస్తుత పాకిస్తాన్ క్రికెట్ క్షీణతకు ప్రత్యక్షంగా దోహదపడిందని ఆయన వాదించారు.పాక్ జట్టులో భారీ మార్పులు ? ఈ సమీక్ష పాకిస్తాన్ జట్టులో భారీ కుదుపులకు దారితీయవచ్చు, బాబర్ అజామ్, షాహీన్ అఫ్రిది, హరిస్ రౌఫ్ మరియు నసీమ్ షా వంటి ప్రముఖ ఆటగాళ్ళు బహిష్కరణకు గురయ్యే అవకాశం కూడా ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. జట్టు వైఫల్యం కారణంగా తాను రాజీనామా చేసే ఉద్దేశ్యం లేదని తాత్కాలిక ప్రధాన కోచ్ ఆకిబ్ జావేద్ బహిరంగంగా ప్రకటించినప్పటికీ, పీసీబీ అతని ఒప్పందాన్ని రద్దు చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత, ఈ ఏడాది లో జరిగే ఆసియా కప్ సమయంలో రెండు చిరకాల ప్రత్యర్థులు కనీసం మూడుసార్లు తలపడనున్నాయి. 2026 ఫిబ్రవరి, మార్చి నెలల్లో భారత్ , శ్రీలంకలో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కోసం ఈ జట్లు సిద్ధమవుతున్నందున ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఆసియా కప్‌ను నిర్వహించే హక్కులు భారత్ కి కేటాయించినప్పటికీ ఈ టోర్నమెంట్ తటస్థ దేశంలో జరుగుతుందని భావిస్తున్నారు. భారత్- పాకిస్తాన్ ఆతిథ్య దేశాలుగా ఉన్నప్పుడు, పోటీని వేరే చోట నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఎసీసీ) గతంలో ప్రకటించింది.చదవండి: Karun Nair: మళ్లీ శతక్కొట్టాడు.. సెలబ్రేషన్స్‌తో సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్! -
మార్చి పడేయండి.. అంత సీనుందా?.. వసీం అక్రంకు ఆఫ్రిది కౌంటర్
పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై విమర్శల పర్వం కొనసాగుతోంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో చెత్త ప్రదర్శన కారణంగా రిజ్వాన్ బృందంపై ఆ దేశ మాజీ క్రికెటర్లు విరుచుకుపడుతున్నారు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగి ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడాన్ని తప్పుబడుతున్నారు.కనీసం ఒక్క విజయం కూడా లేకుండానే ఈ వన్డే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించడాన్ని తప్పుబడుతున్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(PCB) ఇప్పటికైనా ప్రక్షాళన చర్యలు చేపట్టాలని.. ఆటగాళ్ల పట్ల కాస్త కఠినంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దిగ్గజ పేస్ బౌలర్ వసీం అక్రం(Wasim Akram) కూడా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.5-6 మార్పులు చేయాల్సి వచ్చినాటెన్ స్పోర్ట్స్ షో లో మాట్లాడుతూ.. ‘‘జరిగిందేదో జరిగింది. ఇదే జట్టుతో గత రెండేళ్లుగా మనం ఎన్నో పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు కోల్పోయాం. ఇప్పటికైనా కఠినమైన నిర్ణయాలు తీసుకోకతప్పదు. ప్రతిభ ఉన్న యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని వకార్ యూనిస్ అంటున్నాడు. ఒకవేళ మన జట్టులో 5-6 మార్పులు చేయాల్సి వచ్చినా అందుకు వెనుకాడకండి.ఇదే జట్టును మాత్రం కొనసాగిస్తే వచ్చే ఆరునెలల్లో మనం మరిన్ని చేదు అనుభవాలు చూస్తాం. టీ20 ప్రపంచకప్-2026కు ఇప్పటి నుంచే జట్టును సిద్ధం చేయండి’’అని వసీం అక్రం పీసీబీకి సూచించాడు. అయితే, ఈ దిగ్గజ ఫాస్ట్‌బౌలర్ వ్యాఖ్యలపై పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది అభ్యంతరం వ్యక్తం చేశాడు.‘‘వసీం భాయ్ మాటలు నేను విన్నాను. టీమిండియా చేతిలో ఓటమి తర్వాత మనమంతా భావోద్వేగంలో మునిగిపోయిన మాట వాస్తవం. అయినా.. జట్టు నుంచి 6-7 మంది ఆటగాళ్లను తప్పించాలని వసీం భాయ్ అంటున్నాడు.నిజంగా అంత సీనుందా?ఒకవేళ అదే జరిగితే.. మనకు వారి స్థానాన్ని భర్తీ చేసేందుకు ఐదారుగురు ప్లేయర్లు ఉన్నారా?.. మన బెంచ్ బలమెంతో మీకు తెలియదా వసీం భాయ్! మన దేశవాళీ క్రికెటర్లలో అంతర్జాతీయ స్థాయిలో రాణించగల ఆటగాళ్లు ఎంతమంది?.. ఒకవేళ మీరన్నట్లు ఆటగాళ్లను జట్టు నుంచి తొలగిస్తే వారిలో ఎంత మందికి సరైన రీప్లేస్మెంట్ దొరుకుతుంది? మీరేమో ప్రపంచకప్‌నకు ఇప్పటి నుంచి సిద్ధం కావాలని చెబుతున్నారు.కానీ ఒకవేళ మనం ఆ పని మొదలుపెట్టినా.. అప్పుడు కూడా మన మీద ఏడ్చేవాళ్లు చాలా మందే ఉంటారు. పీసీబీ ఎలాంటి చర్యలు తీసుకున్నా మళ్లీ విమర్శలు వస్తూనే ఉంటాయి’’ అని షాహిద్ ఆఫ్రిది సామా టీవీ షోలో వసీం అక్రం వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ లీగ్ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే.ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో గ్రూప్-‘ఎ’లో భాగంగా తొలుత న్యూజిలాండ్ చేతిలో ఓడిన రిజ్వాన్ బృందం.. రెండో మ్యాచ్‌లో దాయాది భారత్ చేతిలో పరాజయం పాలైంది. అనంతరం బంగ్లాదేశ్‌తో మ్యాచ్ రద్దు కావడంతో ఒక్క గెలుపు కూడా లేకుండానే ఈ మెగా టోర్నీలో తమ ప్రయాణం ముగించింది. ఇక ఈ ఈవెంట్లో భారత్, న్యూజిలాండ్ , పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో పాటు.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ బరిలో నిలిచాయి.చదవండి: 'భారత్‌దే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఒకే ఒక్క పరుగు తేడాతో'.. క్లార్క్ జోస్యం -
ఈ ఏడాది మరో మూడు భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌లు
భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌లు ఈ ఏడాది మరిన్ని జరిగే అవకాశం ఉంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియా కప్‌ను షెడ్యూల్ చేసింది. ఈసారి ఈ కాంటినెంటల్ టోర్నీ టీ20 ఫార్మాట్లో జరుగనుంది. ఇందులో మొత్తం 19 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో భారత్, పాక్ మూడు సార్లు తలపడే అవకాశం ఉంది. సెప్టెంబర్ రెండు, నాలుగు వారాల మధ్యలో ఈ టోర్నీ జరుగుతుంది.ఈ టోర్నీ మొదట భారత్‌కు కేటాయించబడింది. అయితే, భారత్-పాక్‌ల మధ్య సత్సంబంధాలు లేని కారణంగా ఈ టోర్నీని తటస్థ వేదికపై నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది. ప్రస్తుతానికి వేదిక ఖరారు కానప్పటికీ.. యూఏఈ లేదా శ్రీలంకలో టోర్నీ నిర్వహించే అవకాశం ఉంది. ఈ టోర్నీ 2025 ఎడిషన్‌లో భారత్, పాక్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ, ఒమన్, హాంకాంగ్ పాల్గొంటాయి. ఉపఖండం నుండి నేపాల్ ఒక్కటే ఈ టోర్నీకి అర్హత సాధించలేకపోయింది.గత ఎడిషన్లోలాగా, ఈ ఏడాది ఆసియా కప్‌లో కూడా ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించబడతాయి. భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో ఉండటంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు జట్లు సూపర్ ఫోర్ దశకు చేరుకుంటాయి. ఈ దశలో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు ఫైనల్‌కు చేరతాయి. భారత్, పాకిస్తాన్ గ్రూప్ దశలో ఓసారి.. సూపర్ ఫోర్ రౌండ్లో మరోసారి.. ఫైనల్లో మూడోసారి తలపడే అవకాశం ఉంది.కాగా, 2031లో ముగిసే ప్రస్తుత సైకిల్లో నాలుగు ఆసియా కప్‌లు జరుగనున్నాయి. 2025 ఎడిషన్ (19 మ్యాచ్‌లు) తర్వాత, 2027 ఎడిషన్ బంగ్లాదేశ్‌లో (13 మ్యాచ్‌లు) వన్డే ఫార్మాట్లో జరుగుతుంది. ఆతర్వాత పీసీబీ ఆతిథ్యం ఇచ్చే టోర్నీ టీ20 ఫార్మాట్లో (19 మ్యాచ్‌లు) జరుగుతుంది. చివరిగా, 2031 ఎడిషన్ వన్డే ఫార్మాట్లో (13 మ్యాచ్‌లు) శ్రీలంకలో జరుగుతుంది. -
ఇమ్రాన్ ఖాన్ వల్లే నా పేరు చరిత్రలో నిలిచిపోయింది: టీమిండియా దిగ్గజం
మార్చి 7, 1987లో టెస్టుల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్(Sunil Gavaskar). తద్వారా ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు పద్నాలుగు మంది ఈ ఫీట్ నమోదు చేసినా.. ఈ జాబితాలోకి ఎక్కిన మొదటి ఆటగాడిగా గావస్కర్ పేరు మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉండిపోతుంది.అయితే, ఇంతటి ఘనమైన రికార్డు సాధించడానికి పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్(Imran Khan) మాటలే కారణం అంటున్నాడు సునిల్ గావస్కర్. టెన్ స్పోర్ట్స్ షోలో భాగంగా పాక్ మాజీ సారథి వసీం అక్రం(Wasim Akram) అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఈ విషయాన్ని తెలిపాడు. ‘‘పదివేల పరుగులు సాధించడం అత్యద్భుతమైన అనుభూతి.వెయ్యి పరుగులు చేసినాక్రికెటర్గా కెరీర్ మొదలుపెట్టినప్పుడు నేను ఇక్కడిదాకా చేరుకుంటానని అస్సలు ఊహించలేదు. వెయ్యి పరుగులు చేసినా ఇంతే సంతోషంగా ఉండేవాడినేమో!.. నిజానికి ఈ మైల్స్టోన్ చేరుకోవాలనే లక్ష్యం నాకైతే లేదు. ఏదేమైనా.. టెంజింగ్ నార్గే, ఎడ్మండ్ హిల్లరీ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తులుగా ఎలా చరిత్రలో నిలిచిపోతారో.. నేనూ ఈ మైలురాయికి చేరుకున్న మొదటి ఆటగాడిగా అలాగే గుర్తుండిపోతాను.నిజానికి నేను ఈ ఘనత సాధించడానికి ఏకైక కారణం ఇమ్రాన్ ఖాన్. అప్పుడు మేము ఇంగ్లండ్‌లో ఉన్నాం. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి ఓ ఇటాలియన్ రెస్టారెంట్లో భోజనానికి వెళ్లాము. 1986లో ఇది జరిగింది. ఆరోజు.. నేను ఇమ్రాన్‌తో ఇదే నా చివరి సిరీస్ అని చెప్పాను. ఆ తర్వాతరిటైరైపోతానని అన్నాను.అలా అస్సలు చేయొద్దుఅందుకు అతడు.. ‘లేదు.. లేదు.. అలా అస్సలు చేయొద్దు’ అన్నాడు. అందుకు నేను.. ‘ఎందుకు? ఇది నా ఇష్టం కదా’ అన్నాను. దీంతో ఇమ్రాన్ కలుగుచేసుకుంటూ.. ‘త్వరలోనే పాకిస్తాన్ జట్టు భారత్‌కు రాబోతోంది. అక్కడ మేము మీ జట్టును ఓడిస్తాం. నువ్వున్న భారత జట్టును ఓడిస్తేనే అసలు మజా. నువ్వు లేకుండా టీమిండియాను ఓడించడం నాకైతే నచ్చదు’ అన్నాడు.అవునా.. పాక్ టీమ్ ఇండియాకు వస్తుందా? నిజమా అని అడిగాను. అవును.. ఐసీసీ సమావేశం తర్వాత వచ్చే వారం ప్రకటన వస్తుంది చూడు అన్నాడు. ఒకవేళ ఆ అనౌన్స్మెంట్ వస్తే ఓకే. నేను ఆటలో కొనసాగుతా. లేదంటే రిటైర్ అవుతా అన్నాను. ఇక పాకిస్తాన్‌తో సిరీస్‌కు ముందు మరో రెండో మూడో మ్యాచ్‌లు జరిగాయి. అప్పటికి నేను బహుశా 9200- 9300 పరుగుల వద్ద ఉన్నాననుకుంటా.ఇమ్రాన్ ఖాన్ వల్లే నా పేరు చరిత్రలో నిలిచిపోయిందిఏదేమైనా ఇమ్రాన్ ఖాన్ వల్లే నాకు ఈ అరుదైన రికార్డు దక్కింది’’ అని గావస్కర్ చెప్పుకొచ్చాడు. కాగా 1971 నుంచి 1987 వరకు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన సన్నీ 125 టెస్టులు, 108 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 34 శతకాలు, నాలుగు డబుల్ సెంచరీల సాయంతో 10122 రన్స్ చేసిన గావస్కర్.. వన్డేల్లో ఒక సెంచరీ సాయంతో 3092 పరుగులు సాధించాడు. 75 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు. చదవండి: ఆస్ట్రేలియానూ వదలకండి: అఫ్గనిస్తాన్ జట్టుపై పాక్ మాజీ క్రికెటర్ ప్రశంసలు -
Champions Trophy: పాకిస్తాన్‌కు చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలవాలన్న పాకిస్తాన్ ఆశలపై వరణుడు నీళ్లు చల్లాడు. వర్షం కారణంగా పాక్- బంగ్లాదేశ్(Pakistan vs Bangladesh) మధ్య గురువారం జరగాల్సిన మ్యాచ్ రద్దైపోయింది. ఫలితంగా ఇరుజట్లకు చెరో పాయింట్ వచ్చింది. ఈ క్రమంలో డిఫెండింగ్ చాంపియన్‌గా ఈ వన్డే టోర్నమెంట్ బరిలో దిగిన పాకిస్తాన్ పేరిట ఓ చెత్త రికార్డు నమోదైంది. అదేమిటంటే....కాగా 2017 తర్వాత చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ జరగటం ఇదే తొలిసారి. నాడు టైటిల్ గెలిచిన పాకిస్తాన్ ఈసారి ఈ మెగా ఈవెంట్ ఆతిథ్య హక్కులను సంపాదించింది. తద్వారా వన్డే వరల్డ్‌కప్-2023(ICC ODI World Cup)లో చెత్త ప్రదర్శన కనబరిచినా ఆతిథ్య జట్టు హోదాలో నేరుగా అర్హత సాధించింది. ఇక ఈ టోర్నీలో పాక్‌తో పాటు గ్రూప్-‘ఎ’లో భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ భాగమయ్యాయి. ఫిబ్రవరి 19న ఈ టోర్నమెంట్ మొదలుకాగా.. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్- న్యూజిలాండ్ తలపడ్డాయి. ఇందులో కివీస్ జట్టు గెలిచింది. రెండు ఓటములు.. సెమీస్ ఆశలు గల్లంతుఅనంతరం పాకిస్తాన్ దాయాది టీమిండియాతో పోరులోనూ ఓడిపోయింది. ఈ క్రమంలో సెమీస్ చేరే అవకాశాన్ని పోగొట్టుకున్న రిజ్వాన్ బృందం.. కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భావించింది. లీగ్ దశలో చివరగా బంగ్లాదేశ్‌తో గురువారం మ్యాచ్ ఆడేందుకు సిద్ధం కాగా.. వర్షం రూపంలో చేదు అనుభవం ఎదురైంది.రావల్పిండిలో ఎడతెగని చినుకుల కారణంగా టాస్ పడకుండానే పాక్- బంగ్లా మ్యాచ్ ముగిసిపోయింది. ఈ క్రమంలో నిబంధనల ప్రకారం ఇరుజట్లకు చెరో పాయింట్ వచ్చింది. దీంతో గ్రూప్-‘ఎ’ పాయింట్ల పట్టికలో అట్టడుగున నాలుగో స్థానంతో టోర్నీని ముగించింది. బంగ్లాదేశ్‌తో సమానంగా ఒక పాయింట్ సాధించినప్పటికీ నెట్ రన్‌రేటు పరంగా పాక్ వెనుబడి ఉండటం ఇందుకు కారణం.పాకిస్తాన్ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి జట్టుగాఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో గ్రూప్ దశ(2002 నుంచి) ప్రవేశపెట్టిన తర్వాత.. ఒక్క విజయం కూడా సాధించకుండా.. అదే విధంగా పాయింట్ల పట్టికలో ఆఖరున నిలిచిన తొలి జట్టుగా పాకిస్తాన్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఓవరాల్‌గా ఈ జాబితాలో కెన్యా తర్వాత రెండో స్థానంలో నిలిచింది. 2000 సంవత్సరంలో చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిచ్చిన కెన్యా ఒక్కటీ గెలవకుండానే నిష్క్రమించింది.ఇదే కాకుండా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో చాంపియన్స్ ట్రోఫీ బరిలో దిగి ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా ఇంటిబాట పట్టిన రెండో జట్టుగానూ పాకిస్తాన్ నిలిచింది. 2009, 2013 ఎడిషన్లలో ఆస్ట్రేలియా కూడా మూడు మ్యాచ్‌లలో ఒక్కటి గెలవలేదు. వర్షం వల్ల ఓ మ్యాచ్ రద్దు కావడంతో ఇప్పుడు పాక్ మాదిరే వరణుడి వల్ల ఒక్క పాయింట్ సాధించగలిగింది.చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్ ప్రయాణం👉ఫిబ్రవరి 19- కరాచీలో న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓటమి👉ఫిబ్రవరి 23- దుబాయ్‌లో టీమిండియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమి👉ఫిబ్రవరి 27- రావల్పిండిలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దుగ్రూప్-‘ఎ’ పాయింట్ల పట్టిక1. న్యూజిలాండ్- ఆడినవవి రెండు- గెలిచినవి రెండు- పాయింట్లు నాలుగు- నెట్ రన్‌రేటు+0.863(సెమీస్‌కు అర్హత)2. ఇండియా- ఆడినవవి రెండు- గెలిచినవి రెండు- పాయింట్లు నాలుగు- నెట్ రన్‌రేటు +0.647(సెమీస్‌కు అర్హత)3. బంగ్లాదేశ్- మ్యాచ్‌లు మూడు- ఓడినవి రెండు- ఒకటి రద్దు ఒక పాయింట్- నెట్ రన్‌రేటు-0.443(ఎలిమినేటెడ్)4. పాకిస్తాన్- మ్యాచ్‌లు మూడు- ఓడినవి రెండు- ఒకటి రద్దు ఒక పాయింట్- నెట్ రన్‌రేటు-1.087 (ఎలిమినేటెడ్).చదవండి: ఆస్ట్రేలియానూ వదలకండి: అఫ్గనిస్తాన్ జట్టుపై పాక్ మాజీ క్రికెటర్ ప్రశంసలు -
నేను అలాంటి వాడిని కాదు.. కఠిన చర్యలు ఉంటాయి: పాక్ హెడ్‌కోచ్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో వరుస పరాజయాలతో.. కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది పాకిస్తాన్ క్రికెట్ జట్టు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగి లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ఇంటా బయటా రిజ్వాన్(Mohammad RIzwan) బృందంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్ ఆకిబ్ జావేద్(Aaqib Javed) సైతం ఆటగాళ్లపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడని.. ఘాటు వ్యాఖ్యలతో వారిని దూషించాడని స్థానిక మీడియాలో ప్రచారం జరుగుతోంది.ఆటగాళ్లను గౌరవిస్తానుఈ వార్తలపై ఆకిబ్ జావేద్ తాజాగా స్పందించాడు. తానెన్నడూ ఆటగాళ్లను దూషించలేదని స్పష్టం చేశాడు. తమ జట్టులో కోచ్ ఆటగాళ్లను తిట్టే సంస్కృతి ఉందన్న మాట నిజమేనని.. అయితే, తాను మాత్రం అందుకు విరుద్ధమని తెలిపాడు. ఈ మేరకు.. ‘‘ఆటగాళ్లపై నేనెప్పుడూ అసభ్య పదజాలం వాడను.గురువు పిల్లలను కొట్టడం, కోచ్ ఆటగాళ్లను తిట్టడం మా సంస్కృతిలో ఉంది. అయితే, నేను మాత్రం ఈ విధానాన్ని విశ్వసించను. ఆటగాళ్లను నేను గౌరవిస్తాను. కోచ్‌గా వారికి కావాల్సిన సాయం చేస్తాను. జట్టు ప్రయోజనాల కోసం కఠినంగా శ్రమించేలా చేస్తాను. అంతేగానీ.. తిట్టడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని ఆలోచించే రకం కాదు’’ అని ఈ మాజీ క్రికెటర్ పేర్కొన్నాడు.అందుకే నిలకడ కూడా ఉండదుఇక చాంపియన్స్ ట్రోఫీలో పాక్ బ్యాటింగ్ వైఫల్యాల గురించి ప్రస్తావనకు రాగా.. ‘‘గత నాలుగేళ్లుగా మా క్రికెట్ బోర్డులో, జట్టులో చాలా మార్పులే జరిగాయి. సరైన, నిర్ధిష్టమైన విధానాలు లేనప్పుడు నిలకడ కూడా ఉండదు.మా ఆటగాళ్లను వేరే జట్ల ఆటగాళ్లతో పోల్చినపుడు వారి బోర్డులు ఏ విధంగా ఉన్నాయి? ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నాయి? అన్న అంశాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. యాజమాన్యం నిలకడగా ఉంటే.. ఆటగాళ్లను కూడా మనం ప్రశ్నించే వీలు ఉంటుంది’’ అని పాక్ క్రికెట్ బోర్డు తీరుపై ఆకిబ్ జావేద్ పరోక్షంగా విమర్శలు సంధించాడు.ఏదేమైనా ఐసీసీ టోర్నమెంట్లలో వరుస ఓటములు చవిచూసిన జట్టును ఉపేక్షించేది లేదని.. కచ్చితంగా చర్యలు ఉంటాయని ఆకిబ్ జావేద్ పేర్కొన్నాడు. సాకులు చెప్పి తప్పించుకునే వీలులేదు. కచ్చితంగా చర్యలు ఉంటాయి. ప్రతి మ్యాచ్‌కు ముందు ఫలితం అనుకూలంగా ఉంటుందనే భావిస్తాం.కచ్చితంగా బాధ ఉంటుందికానీ ఒక్కోసారి చెత్త ప్రదర్శన కారణంగా తీవ్ర నిరాశకు గురికావాల్సి వస్తుంది. కచ్చితంగా ఈ ఓటములు మమ్మల్ని బాధించాయి. భవిష్యత్తులో మరింత మెరుగ్గా ఆడతామని జాతికి చెప్పడం తప్ప ప్రస్తుతం చేసేదేమీ లేదు’’ అని ఆకిబ్ జావేద్ చెప్పుకొచ్చాడు. కాగా లీగ్ దశలో భాగంగా చివరగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఇక చాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్-‘ఎ’లో ఉన్న పాకిస్తాన్ న్యూజిలాండ్, టీమిండియా చేతిలో ఓడి సెమీస్ చేరకుండానే నిష్క్రమించింది. అంతకుముందు వన్డే వరల్డ్‌కప్-2023, టీ20 ప్రపంచకప్-2024లోనూ ఇదే తరహా చెత్త ప్రదర్శనతో నాకౌట్ దశకు కూడా చేరలేకపోయింది.చదవండి: #Jos Buttler: అఫ్గాన్ చేతిలో ఓటమి.. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం! -
పాకిస్తాన్ కోచ్‌గా వెళ్లేందుకు నేను సిద్దం: యువరాజ్ తండ్రి
పాకిస్తాన్ క్రికెట్ జట్టు వరుసగా మూడో ఐసీసీ టోర్నమెంట్లోనూ నిరాశపరిచింది. వన్డే ప్రపంచకప్-2023, టీ20 వరల్డ్‌కప్-2024 టోర్నీల్లో గ్రూపు స్టేజిలో ఇంటి ముఖం పట్టిన పాకిస్తాన్.. ఇప్పుడు తమ సొంత గడ్డపై జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అదే తీరును కనబరిచింది. న్యూజిలాండ్, భారత్ చేతుల్లో వరుస ఓటములను చవిచూసిన పాకిస్తాన్.. లీగ్ స్టేజిలోనే తమ ప్రయాణాన్ని ముగించింది.పాకిస్తాన్‌కు ఎంత మంది కోచ్‌లు మారుతున్నా, ఆ జట్టు తలరాత మాత్రం మారడం లేదు. రోజురోజుకు పాక్ క్రికెట్ పరిస్థితి మరింత అద్వానంగా తాయారుఅవుతోంది. ఆఖరికి వారి దేశ మాజీ క్రికెటర్లు సైతం పాక్ జట్టుకు అండగ నిలవడం లేదు. వసీం అక్రమ్, షోయబ్ అక్తర్, వకార్ యూనిస్ వంటి పాక్ దిగ్గజాలు తమ జట్టుపై విరుచుకుపడుతున్నారు. బాబర్ ఆజం ఒక మోస గాడని అక్తర్ విమర్శించగా.. పాక్ క్రికెటర్లకు ఆట కంటే తిండే ఎక్కువ అని అక్రమ్ హేళన చేశాడు.అయితే సొంత దేశ ఆటగాళ్లే సపోర్ట్‌గా నిలవని పాక్ జట్టుకు.. భారత మాజీ క్రికెటర్, లెజెండరీ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ మద్దతుగా నిలిచాడు. పాక్ జట్టును ఉద్దేశించి ఆ దేశ మాజీ క్రికెటర్లు చేస్తున్న వ్యాఖ్యలపై యోగరాజ్ మండిపడ్డాడు. విమర్శలు చేసే బదులుగా ఒక మంచి జట్టును తాయారు చేయవచ్చుగా అంటూ పాక్ మాజీ క్రికెటర్లకు యోగరాజ్ చురకలు అంటించాడు."వసీం అక్రమ్ లాంటి దిగ్గజాలు ఏమి చేస్తున్నారో నాకు ఆర్ధం కావడం లేదు. క్రికెట్ కామెంట్రీ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. మీ దేశానికి తిరిగి వెళ్లి క్రికెట్ శిబిరాలను నిర్వహించి, మంచి టీమ్‌ను తాయారు చేయవచ్చుగా. మీ జట్టుపై మీరే విమర్శలు చేసుకుంటే ఏమి వస్తుంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరుగుతుంది. మీలో ఎవరు పాకిస్తాన్ ప్రపంచ కప్ గెలవడానికి కృషి చేస్తారో చూడాలనుకుంటున్నాను. లేకుంటే నేనే పాకిస్తాన్‌కు వెళ్లి ఓ మంచి జట్టును తాయారు చేస్తాను" అని యోగరాజ్ పేర్కొన్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా యోగరాజ్ సింగ్ సొంతంగా క్రికెట్ అకాడమీని నిర్వహిస్తున్నారు. ఆయన అర్జున్ టెండూల్కర్ వంటి ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చాడు. 1980లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన యోగరాజ్.. భారత్ తరఫున ఒక టెస్టు, 6 వన్డేలు ఆడాడు.చదవండి: 'ఇంత చెత్తగా ఆడుతారని ఊహించలేదు.. నన్ను క్షమించండి' -
'ఇంత చెత్తగా ఆడుతారని ఊహించలేదు.. నన్ను క్షమించండి'
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆతిథ్య పాకిస్తాన్ ప్రయాణం ముగిసిన సంగతి తెలిసిందే. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన పాకిస్తాన్.. టోర్నీ ప్రారంభమైన కేవలం ఆరు రోజుల్లోనే ఇంటిముఖం పట్టింది. దీంతో ఈ మెగా టోర్నీకి ముందు తాము చేసిన వ్యాఖ్యలను పాక్ మాజీ ఆటగాళ్లు వెనక్కి తీసుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో పాక్ మాజీ బ్యాటర్ బసిత్ అలీ చేరాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు పాకిస్తాన్ చేరుతుందని, తుది పోరు లాహోర్ వేదికగా జరుగుతుందని అలీ అంచనా వేశాడు. అయితే పాక్ లీగ్ స్టేజిలోనే నిష్క్రమించిడంతో తాజాగా అలీ క్షమాపణలు చెప్పాడు. భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగాలని తను కోరుకుంటున్నట్లు అతడు తెలిపాడు."ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లాహెర్ వేదికగా జరుగుతుందని, పాక్ టైటిల్ పోరుకు ఆర్హత సాధిస్తుందని చెప్పినందుకు నన్ను క్షమించిండి. ఈ టోర్నీలో పాకిస్తాన్ టీమ్ ఇంత చెత్తగా ఆడుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఈ మెగా ఈవెంట్లో భారత్ తమ అధిపత్యాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. మర్చి 9న దుబాయ్ వేదికగా ఫైనల్లో దక్షిణాఫ్రికా, భారత్‌లు తలపడితే బాగుంటుంది. మరోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్‌ను తలపిస్తుందని అనుకుంటున్నాను" అని అలీ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.బై బై అకీబ్..!ఇక ఈ ఘోర ప్రదర్శన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తమ జట్టు తాత్కాలిక హెడ్ కోచ్ అకిబ్ జావెద్‌తో పాటు సహాయక సిబ్బందిని తొలిగించాలని పీసీబీ చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. తాత్కాలిక హెడ్ కోచ్‌గా ఉన్న అకిబ్ పదవీ కాలం ఈ నెల 27తో ముగియనుంది.ఈ టోర్నీ ముగిసిన అనంతరం పాకిస్తాన్ జట్టు వైట్‌బాల్ సిరీస్‌లో తలపడేందుకు న్యూజిలాండ్‌కు వెళ్లనుంది. దీంతో న్యూజిలాండ్ టూర్‌కు ముందు పాక్‌కు కొత్త హెడ్‌కోచ్ అవకాశముందని పీసీబీ మూలాలు వెల్లడించాయి. పాక్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఫిబ్రవరి 27న బంగ్లాదేశ్‌తో రావల్పిండి వేదికగా తలపడనుంది.చదవండి: మీ కంటే కోతులు బెటర్.. తక్కువగా తింటాయి: వసీం అక్రమ్ -
కోహ్లి లాంటి ఆటగాడిని నేను ఇప్పటివరకు చూడలేదు: పాంటింగ్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అద్బుతమైన సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఫామ్‌తో లేమితో సతమతమవుతున్న కోహ్లి.. దాయాదితో జరిగిన మ్యాచ్‌తో తన రిథమ్‌ను తిరిగి పొందాడు. 242 పరుగుల లక్ష్య చేధనలో ఆఖరి వరకు క్రీజులో నిలబడిన కోహ్లి.. వరల్డ్ క్రికెట్లో తనకు మించిన ఛేజ్ మాస్టర్ లేడని మరోసారి నిరూపించుకున్నాడు. కింగ్ కోహ్లి సరిగ్గా 100 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. కోహ్లికి ఇది 51వ వన్డే సెంచరీ. మ్యాచ్ ముగిసి మూడు రోజులు అవుతున్నప్పటికి కోహ్లిపై ఇంకా ప్రశంసల వర్షం కురుస్తునే ఉంది. తాజాగా ఈ జాబితాలో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ చేరాడు."వన్డేల్లో విరాట్ కోహ్లి కంటే మెరుగైన ఆటగాడిని నేను ఇప్పటివరకు చూడలేదు. అతడు ఇప్పుడు నన్ను (అత్యధిక వన్డే పరుగుల్లో) దాటేశాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో అతడి కంటే ముందు కేవలం ఇద్దరు బ్యాటర్లు మాత్రమే ఉన్నారు. కాబట్టి వన్డేల్లో టాప్ రన్ స్కోరర్‌గా నిలవాలని కోహ్లి భావిస్తాడనంలో సందేహం లేదు. కోహ్లి ఎప్పటిలాగే ఫిట్‌గా ఉన్నాడు. భవిష్యత్తులో కూడా ఇదే ఫిట్నెస్ను మెయింటేన్ చేస్తాడని నేను అనుకుంటున్నాను.అతడికి కష్టపడి పనిచేసే తత్వం ఉంది. అతడు ఇప్పటికీ సచిన్ కంటే 4,000 పరుగులు వెనుకబడి ఉన్నాడు. సచిన్‌ను కోహ్లి అధిగిమించలేడని చెప్పలేం. అతడిలో కసి ఉంటే కచ్చితంగా సచిన్‌ను దాటగలడు. టీ20 ప్రపంచకప్-2022లో పాకిస్తాన్‌పై ఏ విధంగా అయితే కోహ్లి ఆడాడో.. ఇప్పడు ఈ టోర్నీలో కూడా అదే చేశాడు. అతడొక ఛాంపియన్ ప్లేయర్. ముఖ్యంగా వైట్‌బాల్ ఫార్మాట్లలో అతడిని మించిన వారు లేరని" పాంటింగ్ ఐసీసీ రివ్యూ షోలో పేర్కొన్నాడు.కాగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి తన 14,000 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. ఇప్పటివరకు 299 మ్యాచ్‌ల్లో కోహ్లి 58.20 సగటుతో 14085 పరుగులు చేశాడు. అతడి వన్డే కెరీర్లో 51 సెంచరీలు ఉన్నాయి. కోహ్లి కంటే ముందు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర(14234), సచిన్(18426) ఉన్నారు.చదవండి: మీ కంటే కోతులు బెటర్.. తక్కువగా తింటాయి: వసీం అక్రమ్ -
మీ కంటే కోతులు బెటర్.. తక్కువగా తింటాయి: వసీం అక్రమ్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్(Pakistan) కథ ముగిసిన సంగతి తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన పాకిస్తాన్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలై మరో మ్యాచ్ మిగిలూండగానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి మ్యాచ్‌లో కివీస్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన రిజ్వాన్ బృందం.. ఆ తర్వాతి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి భారత్ చేతిలో 6 వికెట్ల తేడాతో పాక్ పరాజయం పాలైంది.ఈ క్రమంలో పాక్ జట్టు గ్రూపు స్టేజీలోనే ఇంటిముఖం పట్టడాన్ని ఆ దేశ మాజీ క్రికెటర్లు, అభిమానులు జీర్ణించుకులేకపోతున్నారు. యావత్తు పాకిస్తాన్ మొత్తం వారి క్రికెట్ జట్టు ప్రదర్శనపై మండిపడుతోంది. మాజీ క్రికెటర్లు అయితే పాక్ జట్టును ఏకిపారేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్(Wasim Akram) రిజ్వాన్ సేనపై విమర్శల వర్షం కురిపించాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ ప్లేయర్లు సరైన డైట్ కూడా పాటించలేదని అక్రమ్ మండిపడ్డాడు."పాకిస్తాన్ ఆటగాళ్లు పూర్తి ఫిట్నెస్గా లేరు. సరైన డైట్ కూడా పాటించడం లేదు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటి డ్రింక్స్ బ్రేక్ సమయంలో ఆటగాళ్ళ కోసం ఒక ప్లేట్ నిండా అరటిపండ్లు ఉండడం చూశాను. కోతులు కూడా ఇన్ని అరటిపండ్లు తినవు. అవి వాటికి ఆహారం అయినప్పటికి అతిగా తినవు.కానీ మా ప్లేయర్లు మాత్రం కోతులు కంటే ఎక్కువగా తింటున్నారు. ఈ చెత్త ప్రదర్శన కనబరిచినందుకు జట్టుపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. క్రికెట్ ఎంతో ముందుకు వెళ్తున్నప్పటికి మా జట్టు మాత్రం ఇంకా గతంలో ఆడినట్లే ఆడుతోంది.అది మారాలి. ఫియర్ లెస్ క్రికెటర్లు, యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకురండి. ప్రస్తుత జట్టులో కచ్చితంగా ఐదు, ఆరు మార్పులు చేయాలి. ఇప్పటికైనా మీ తప్పులను మీరు తెలుసుకుంది.టీ20 ప్రపంచకప్-2026 కోసం జట్టును సిద్దం చేయండి" అంటూ అక్రమ్ ఓ క్రికెట్ షోలో పేర్కొన్నాడు. ఇక పాకిస్తాన్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఫిబ్రవరి 27న బంగ్లాదేశ్‌తో తలపడనుంది.చదవండి: IML 2025: సచిన్, యువీ మెరుపులు.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్ -
Ind vs NZ: కివీస్‌తో మ్యాచ్‌లో అతడికి విశ్రాంతి!
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భారత జట్టు అదరగొడుతోంది. ఈ వన్డే ఫార్మాట్ టోర్నమెంట్లో తొలుత బంగ్లాదేశ్‌తో తలపడ్డ టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. అనంతరం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్(India vs Pakistan)పై కూడా ఇదే ఫలితాన్ని పునరావృతం చేసింది.దుబాయ్ వేదికగా సమిష్టిగా రాణించి దాయాదిపై విజయం సాధించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. తదుపరి లీగ్ దశలో భాగంగా చివరగా పటిష్ట న్యూజిలాండ్ జట్టుతో రోహిత్ సేన ఆదివారం తలపడనుంది. ఇక తొలి రెండు మ్యాచ్‌లలోనూ భారత్ ఒకే జట్టుతో ఆడింది. ఈ నేపథ్యంలో కివీస్‌తో నామమాత్రపు మ్యాచ్‌లో మాత్రం ఒక మార్పు చేస్తే బాగుంటుందని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డారెన్ గాఫ్ అన్నాడు.షమీ లేకపోయినాకివీస్తో మ్యాచ్‌లో భారత తుదిజట్టు గురించి తన అభిప్రాయాలు పంచుకుంటూ.. ‘‘షమీకి విశ్రాంతినివ్వాలి. పాకిస్తాన్‌పై అద్భుత విజయంతో టీమిండియా విశ్వాసం రెట్టింపు అయింది. వారి బ్యాటింగ్ లైనప్ బాగుంది.కాబట్టి దుబాయ్‌లో మరో స్పిన్నర్‌ను అదనంగా తుదిజట్టులో చేర్చుకోవచ్చు. లాహోర్ మాదిరి దుబాయ్ పిచ్ మరీ అంత ఫ్లాట్‌గా కూడా ఏమీ లేదు. ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న షమీని కాపాడుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంది.అంతేకాదు.. హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేసిన విధానం అద్భుతంగా ఉన్న కారణంగా షమీ లేకపోయినా పెద్దగా ఆందోళనపడాల్సిన పనిలేదు. నాకు తెలిసి న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఈ ఒక్క మార్పు చేస్తుంది. షమీని పక్కనపెట్టి మరో స్పిన్నర్‌ను ఆడిస్తుంది’’ అని డారెన్ గాఫ్ హిందుస్తాన్ టైమ్స్‌తో పేర్కొన్నాడు.కాగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 10 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తిచేసిన షమీ.. 53 పరుగులు ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు. అయితే పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్ తీయలేకపోయాడు. చీలమండ గాయం తాలుకు నొప్పి తిరగబెట్టడంతో పాక్‌తో మ్యాచ్ సందర్భంగా కాసేపు అతడు విశ్రాంతి తీసుకున్నాడు.ఇక చాంపియన్స్ ట్రోఫీ-2025లో విజేతపై తన అంచనా తెలియజేస్తూ.. ‘‘టీమిండియా పటిష్టంగా ఉంది. ఇందులో సందేహం లేదు. వన్డేల్లో ఇటీవల ఇంగ్లండ్ జట్టును మట్టికరిపించిన విధానం అద్బుతంగా అనిపించింది.టైటిల్ ఫేవరెట్ టీమిండియానేఇక ఇండియాతో పాటు సౌతాఫ్రికా, న్యూజిలాండ్ కూడా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. మరి టోర్నీలో ఎవరు విజేతగా అవతరిస్తారని అడిగితే మాత్రం నేను టీమిండియానే ఎంచుకుంటాను. బ్యాటింగ్‌లో భారత్ అదరగొడుతోంది. ప్రపంచస్థాయి బౌలర్, ప్రధాన పేసర్ అయిన జస్ప్రీత్ బుమ్రా జట్టుతో లేకపోయినా ఆ ప్రభావం పడకుండా సమిష్టిగా రాణిస్తోంది. అందుకే నా టైటిల్ ఫేవరెట్ టీమిండియానే’’ అని ఇంగ్లండ్ మాజీ పేసర్ డారెన్ గాఫ్ చెప్పుకొచ్చాడు.కాగా బంగ్లాదేశ్, పాకిస్తాన్లతో మ్యాచ్‌లలో టీమిండియా ఒక స్పెషలిస్టు స్పిన్నర్(కుల్దీప్ యాదవ్), ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు(అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా), ఒక పేస్‌బౌలింగ్ ఆల్‌రౌండర్(హార్దిక్ పాండ్యా), ఇద్దరు పేసర్ల(హర్షిత్ రాణా, మహ్మద్ షమీ)లతో బరిలోకి దిగింది.చాంపియన్స్ ట్రోఫీ-2025లో బంగ్లాదేశ్, పాకిస్తాన్లతో మ్యాచ్‌లలో భారత తుదిజట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.బెంచ్: రిషభ్ పంత్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్.చాంపియన్స్ ట్రోఫీ-2025లో న్యూజిలాండ్ జట్టువిల్ యంగ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైకేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మాట్ హెన్రీ, కైలీ జెమీసన్, విలియం ఒరూర్కీ, డారిల్ మిచెల్, నాథన్ స్మిత్, మార్క్ చాప్మన్, జాకొబ్ డఫీ.చదవండి: NZ vs BAN: చర్రిత సృష్టించిన రచిన్ రవీంద్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
భారత్ పటిష్ట జట్టు.. ఆ అడ్వాంటేజ్ కూడా ఉండటం వల్ల..: కమిన్స్
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్‌లలో జయభేరి మోగించిన రోహిత్ సేన.. సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. లీగ్ దశలో భాగంగా ఆఖరిగా నామమాత్రపు మ్యాచ్‌లో న్యూజిలాండ్(India vs New Zealand)ను ఢీకొట్టనుంది. ఇక కివీస్ కూడా ఇప్పటికే సెమీస్ చేరుకోగా.. ఇరుజట్లకు నాకౌట్ స్టేజ్ కోసం ఇదొక సన్నాహక మ్యాచ్‌గా ఉండబోతోంది.ఇదిలా ఉంటే.. ఈ మెగా వన్డే టోర్నమెంట్ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా మాత్రం అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) ఆమోదంతో తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లన్నీ ఆడుతోంది.భారత్ పటిష్ట జట్టు.. ఆ అడ్వాంటేజ్ కూడా ఉండటం వల్ల..ఈ నేపథ్యంలో ఒకే వేదికపై ఆడటం భారత జట్టుకు అదనపు ప్రయోజనాన్ని చేకూరుస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. ‘‘టోర్నీ సజావుగా సాగిపోతోంది. అయితే, ఒకే మైదానంలో ఆడటం వల్ల టీమిండియాకు కచ్చితంగా ప్రయోజనం ఉంటుంది.అయినా ఆ జట్టు ఎంతో పటిష్టంగా ఉంది. అద్భుతంగా ఆడుతున్నారు. ఒకే వేదికపై ఆడటం మాత్రం అదనంగా ఎంతో కొంత లాభం చేకూరుస్తుందనడంలో సందేహం లేదు’’ అని యాహూ స్పోర్ట్‌తో కమిన్స్ పేర్కొన్నాడు. కాగా చీలమండ నొప్పి కారణంగా ప్యాట్ కమిన్స్ చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన విషయం తెలిసిందే.ఈ క్రమంలో స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో ఆసీస్ ఈ వన్డే టోర్నీ బరిలో దిగింది. గ్రూప్-బిలో భాగంగా తమ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడ్డ కంగారూ జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. విజయంతో టోర్నీని ఆరంభించిన స్మిత్ బృందం.. తదుపరి సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో నెగ్గి సెమీస్ చేరాలనే పట్టుదలతో ఉంది.ఐపీఎల్‌తో రీఎంట్రీఇదిలా ఉంటే.. కమిన్స్ ఐపీఎల్-2025 ద్వారా పునరాగమనం చేయనున్నాడు. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ... ‘‘చీలమండ గాయానికి చికిత్స తీసుకుంటున్నాను. ఏదేమైనా ఇంట్లో ఉండటం, కుటుంబ సభ్యులతో సమయం గడపటం సంతోషంగా ఉంది. వచ్చే వారం నుంచి బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెడతాను.వచ్చే నెల నుంచి ఐపీఎల్ ఆరంభం కాబోతోంది. తదుపరి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడాల్సి ఉంది. ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటన.. ఇలా రానున్న ఆరు నెలలు బిజీబిజీగా గడువబోతోంది’’ అని కమిన్స్ చెప్పుకొచ్చాడు. కాగా కమిన్స్ ఇటీవలే రెండోసారి తండ్రయ్యాడు. కుమార్తె ఈదికి అతడి భార్య జన్మనిచ్చింది. కాగా ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆస్ట్రేలియా జట్టుస్టీవ్ స్మిత్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్, సీన్ అబాట్, ఆరోన్ హార్డీ, జేక్ ఫ్రేజర్ మెగర్క్, తన్వీర్ సంఘా.చదవండి: Virat Kohli: ఇదేం తీరు కోహ్లి? ఇలాంటివి అవసరమా?.. మండిపడ్డ గావస్కర్ -
ఛాంపియన్స్ ట్రోఫీలో 'పాక్' చెత్త ప్రదర్శన.. అతడిపై వేటు..!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆతిథ్య పాకిస్తాన్(Pakistan) ప్రయాణం గ్రూపు స్టేజిలోనే ముగిసింది. 29 ఏళ్ల తర్వాత తమ సొంతగడ్డపై జరుగుతున్న ఐసీసీ టోర్నీలో పాకిస్తాన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటమి చవిచూసిన పాక్ జట్టు.. భారత్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. దీంతో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన రిజ్వాన్ బృందం.. ఈ టోర్నీ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చర్యలకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.హెడ్ కోచ్‌పై వేటు..ఇందులో భాగంగా తమ జట్టు తాత్కాలిక హెడ్ కోచ్ అకిబ్ జావెద్‌తో పాటు సహాయక సిబ్బందిని తొలిగించాలని పీసీబీ చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. గతేడాది ఆఖరిలో గ్యారీ కిర్‌స్టెన్ తప్పుకున్న తర్వాత పాక్ జట్టు తాత్కాలిక హెడ్‌కోచ్‌గా సెలక్షన్ కమిటీలో భాగంగా ఉన్న అకిబ్ జావెద్‌ను పీసీబీ నియమించింది.ఆ తర్వాత జాసన్ గిల్లెస్పీ తప్పుకోవడంతో టెస్టు జట్టుకు కూడా అకిబ్నే కోచ్‌గా కొనసాగించారు. అతడి నేృత్వంలోనే పాక్ జట్టు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లను సొంతం చేసుకుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి వచ్చే సారికి పాక్ జట్టు పూర్తిగా తేలిపోయింది."ఛాంపియన్స్ ట్రోఫీలో మా జట్టు దారుణ ప్రదర్శన కనబరిచింది. పాక్ జట్టుకు వేర్వేరు ప్రధాన కోచ్‌లు(వైట్‌బాల్, రెడ్ బాల్ క్రికెట్) ఉంటారా అనే దానిపై బోర్డు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ మెగా టోర్నీలో పాక్ పేలవమైన ప్రదర్శన కనబరచడంతో ప్రస్తుత కోచింగ్ స్టాప్ మొత్తాన్ని మార్చడం ఖాయమని" ఓ పీసీబీ సీనియర్ అధికారి పీటీఐతో పేర్కొన్నారు. అయితే పీసీబీ విదేశీ కోచ్‌ల కోసం కాకుండా, తమ దేశ మాజీ ఆటగాళ్లను హెడ్ కోచ్‌గా ఎంపిక చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సదరు అధికారి తెలిపారు. ఇక పాక్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఫిబ్రవరి 27 రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది.చదవండి: దేశవాళీలో ఆడితే మంచిదే కానీ... -
క్రికెట్ స్టేడియంలో ఊర్వశి ‘దబిడిదిబిడి’.. ‘ఓరీ’ఎంత పనిచేశావ్!
భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే.. ఆట కాదు..భావోద్వేగాల యుద్దం. ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడినా.. ఇండియా, పాకిస్తానే కాదు ప్రపంచం మొత్తం టీవీలకు అతుక్కుపోతుంది. ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గత ఆదివారం(ఫిబ్రవరి23 ) పాకిస్తాన్‌తో భారత్ జట్టు తలపడిన సంగతి తెలిసిందే. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ని ప్రత్యేక్షంగా తిలకించేందుకు సామాన్య క్రికెట్ అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు చాలా మంది దుబాయ్ వెళ్లారు. టాలీవుడ్ నుంచి చిరంజీవి, సుకుమార్, ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela)తో పాటు మరికొంతమంది తారలు హాజరయ్యారు. అయితే వీరందరిలో ఊర్వశి రౌతేలా మాత్రమే అందరికి కళ్లను తనవైపుకు తిప్పుకునేలా చేసింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో డ్యాన్స్ చేయడంతో పాటు తన బర్త్‌డే వేడుకను కూడా అక్కడే జరుపుకోవడంతో ఈ బాలీవుడ్ భామసెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.మైదానంలో ‘దబిడిదిబిడి’ స్టెప్పులుబాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj). ఈ చిత్రంలో ఊర్వశి రౌతేలా కీలక పాత్ర పోషించడంతో పాటు ‘దబిడి డిబిడి’ అనే ఐటం సాంగ్‌కి స్టెప్పులేసింది. ఆ స్టెప్పులపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ అలాంటి స్టెప్పులేయడంపై నెటిజన్స్ మండిపడ్డారు. అయినా కూడా బాలయ్యతో పాటు చిత్రబృందం ఎవరూ స్పందించలేదు. ఇక తాజాగా ఇదే పాటకు క్రికెట్ స్టేడియంలో మరోసారి స్టెప్పులేసింది ఊర్వశి.ఓరీ..అదేం పనిఊర్వశికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇంతకు ముందు కూడా భారత్ ఆడిన చాలా మ్యాచ్ లలో మెరిసింది. ఇక తాజాగా దుబాయ్‌లో జరిగిన భారత్-పాక్ మ్యాచ్‌లో ఓరీ(Orry)తో కలిసి డబిడి డిబిడి పాటకు స్టెప్పులేసింది. కిక్కిరిసిన స్టేడియంలో డాన్స్ చేస్తుండగా.. ఓరీ సడెన్‌గా ఆమెకు ముద్దు పెట్టాడు. దీంతో ఊర్వశి షాక్ అయింది. కొద్ది క్షణాలు అలానే ఆశ్చర్యంగా చూసింది. అనంతరం మళ్లీ సరదగా చిందులేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Orhan Awatramani (@orry)ఎవరీ ఓరీ?ఓర్హాన్ అవత్రమని(Orhan Awatramani)... సింపుల్‌గా ఇతడిని ఓరీ అని పిలుస్తుంటారు.న్యూయార్క్ పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడట. ఆ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన ఓ ఆఫీసులో స్పెషల్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పని చేసినట్లు తెలుస్తోంది. కొన్నాళ్ల తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చి నటుడిగా, గ్రాఫిక్ డిజైనర్‌గా రకరకాలుగా పని చేసిన ఇతడు ఇప్పుడు మాత్రం బాలీవుడ్ తారల పార్టీల్లో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాడు. బాలీవుడ్ తారల ప్రతి పార్టీలోనూ ఓరీ కనిపిస్తాడు. చిత్ర విచిత్ర పోజులు ఇస్తూ వారిని నవ్విస్తాడు. -
'అతడు కోహినూరు వజ్రం లాంటి వాడు.. తరానికి ఒక్కడే ఉంటాడు'
విరాట్ కోహ్లి.. ప్రపంచ క్రికెట్లో తనను మించిన ఛేజ్ మాస్టర్ లేడని మరోసారి నిరూపించుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy 2025)లో భాగంగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తన ఫామ్‌పై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే కింగ్ కోహ్లి(Virat Kohli) సమాధనమిచ్చాడు.దాయాదిపై విరాట్ ఆజేయ శతకం సాధించాడు. ఈ ఢిల్లీ క్రికెటర్ లక్ష్య చేధనలో ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను ముగించాడు. అతడి ఇన్నింగ్స్‌కు, పట్టుదలకు ప్రత్యర్ధి జట్టు కెప్టెన్ సైతం ఫిదా పోయాడు. ఈ మ్యాచ్‌లో 111 బంతులు ఎదుర్కొన్న కోహ్లి సరిగ్గా 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లికి ఇది 51వ వన్డే సెంచరీ కాగా.. అంతర్జాతీయ కెరీర్లో 82వది కావడం. సచిన్ 100 సెంచరీలకు కోహ్లి 18 శతకాల దూరంలో ఉన్నాడు.కోహ్లి ప్రదర్శనపై అన్ని వైపులనుంచి ప్రశంసలు వస్తున్నాయి. "అతని ఆటను చూస్తే కనీసం మరో 2–3 ఏళ్లు ఆడి మరిన్ని శతకాలు సాధించే అవకాశం ఉందని భారత మాజీ క్రికెటర్ నవ్‌జోత్ సింగ్ సిద్ధూ అభిప్రాయ పడ్డాడు. ‘కోహ్లిలాంటి ఆటగాడు తరానికొక్కడు మాత్రమే ఉంటాడు. అతని పట్టుదల, పోరాటతత్వం ఈ మ్యాచ్‌లో కనిపించింది. ప్రతికూల పరిస్థితుల్లో బాగా ఆడినప్పుడు ఒకరి సత్తా ఏమిటో తెలుస్తుంది. కోహ్లి కనీసం మరో 2–3 ఏళ్లు ఆడటం మాత్రమే కాదు, మరో 10–15 సెంచరీలు సాధిస్తాడని బల్లగుద్ది చెప్పగలను. గత ఆరు నెలల్లో అతనిపై విమర్శలు వచ్చాయి. కానీ పాకిస్తాన్‌పై పరుగులు సాధించడం మరో పదేళ్ల పాటు దీనిని ఎవరూ మరచిపోలేరు’ అని సిద్ధూ వ్యాఖ్యానించాడు. కుర్రాళ్లు కోహ్లి లాంటి ఆటగాళ్ల నుంచే స్ఫూర్తి పొందుతారని, వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళతారని సిద్ధూ అభిప్రాయ పడ్డాడు. ‘కోహ్లి సామర్థ్యం ఏమిటో ఈ మ్యాచ్‌లో కనిపించింది. ఇన్నింగ్స్ ఆరంభంలో అతని ట్రేడ్‌మార్క్ కవర్ డ్రైవ్‌లు చూస్తే పాత విరాట్ గుర్తుకొచ్చాడు. ఇన్నింగ్స్ సాగిన కొద్దీ అతనిలోని పోరాట తత్వానిŠన్ నేను చూశాను. ఒక ఆట ఎదగాలంటే ఇలాంటివారే స్ఫూర్తిగా నిలుస్తారు.అతను కోహినూర్‌లాంటి వాడు. ఛేదనలో కోహ్లి రికార్డు చూస్తే ఒత్తిడిని ఏమాత్రం దరిచేరనీయకుండా ఆడతాడని అర్థమవుతుంది. కోహ్లి సెంచరీ చేసినప్పుడు రోహిత్ శర్మ కూడా ఎంతో ఆనందంగా కనిపించాడు. సహచరుడి పట్ల గర్వంగా ఉండటం టీమ్ గేమ్‌లో ఉండే గొప్పతనం ఏమిటో చూపించింది’ అని సిద్ధూ పేర్కొన్నాడు. -
కోహ్లి సెంచరీ కోసం లెక్కలు వేసుకున్నాను: అక్షర్ పటేల్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఆజేయ శతకంతో చెలరేగాడు. ఆఖరి వరకు క్రీజులో ఉండి తమ జట్టును విజయ తీరాలకు చేర్చాడు.అయితే కోహ్లి తన 51 వ వన్డే సెంచరీని అందుకునే క్రమంలో కొంత ఉత్కంఠ నెలకొంది. మైదానంలోనూ, టీవీల ముందు అభిమానులు కూడా కోహ్లి సెంచరీ చేస్తాడా లేదా అనేదాని గురించే ఆసక్తిగా ఎదురు చూశారు.వీరి పరిస్థితి ఇలా ఉంటే క్రీజ్‌లో మరోవైపు ఉన్న అక్షర్ పటేల్ పరిస్థితి ఎలా ఉంది! భారత్ విజయానికి 19 పరుగులు, కోహ్లి సెంచరీకి 14 పరుగులు కావాల్సిన స్థితిలో అక్షర్ బ్యాటింగ్‌కు వచ్చాడు. అతను ఒక్క పెద్ద షాట్ ఆడి బౌండరీ సాధించినా లెక్క మారిపోయేది. అందుకే అతను పరుగులు తీయరాదనే అందరూ కోరుకున్నారు.తాను కూడా ఇలాగే భావించినట్లు, కోహ్లి సెంచరీ కోసం లెక్కలు వేసుకున్నట్లు అక్షర్ వెల్లడించాడు. ‘మ్యాచ్ చివరికి వచ్చేసరికి నేను కూడా లెక్కలు వేయడం మొదలు పెట్టాను. బంతి నా బ్యాట్ ఎడ్జ్ తీసుకొని కూడా వెళ్లరాదని కోరుకున్నాను. ఆ సమయంలో అంతా సరదాగా అనిపించింది.ఇంత తీవ్ర ఒత్తిడి ఉండే మ్యాచ్‌లో విరాట్ సెంచరీని డ్రెస్సింగ్ రూమ్ నుంచి నేను చూడటం ఇదే మొదటిసారి. ఈ ఇన్నింగ్స్‌ను చాలా ఆస్వాదించాను. 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేసిన తర్వాత వికెట్ల మధ్య అతను పరుగెత్తిన తీరు విరాట్ ఫిట్‌నెస్‌కు తార్కాణం’ అని అక్షర్ వ్యాఖ్యానించాడు. ఇక టీమిండియా తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో మార్చి 2న దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో తలపడనుంది. -
కోహ్లి, రోహిత్ మర్రిచెట్టు లాంటి వాళ్లు.. అయినా అతడు ఎదుగుతున్నాడు!
టీమిండియా స్టార్ ప్లేయర్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తొలి మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన గిల్.. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లోనూ సత్తాచాటాడు. 52 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 46 పరుగులు చేసి ఔటయ్యాడు.గిల్ క్రీజులో ఉన్నంతసేపు తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. ఈ క్రమంలో గిల్‌పై భారత మాజీ క్రికెటర్లు సంజయ్ బంగర్, నవజ్యోత్ సింగ్ సిద్దూ ప్రశంసల వర్షం కురిపించారు. రాబోయే రోజుల్లో భారత జట్టు బ్యాటింగ్ ఎటాక్‌ను గిల్ లీడ్ చేస్తాడని వారిద్దరూ కొనియాడారు."శుబ్‌మన్ గిల్ ఒక అద్బుతం. తన కెరీర్ ఆరంభం నుంచే అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు. తన రెండున్నర ఏళ్ల వన్డే క్రికెట్ కెరీర్లో ఎన్నో మైలు రాయిలను సాధించాడు. ప్రపంచ నంబర్-1 బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. అతడి బ్యాటింగ్ టెక్నిక్ కూడా చాలా బాగుంది.స్ట్రెయిట్ డ్రైవ్, ఆన్-డ్రైవ్ షాట్లను అద్బుతంగా ఆడుతున్నాడు. మిడ్-ఆఫ్, మిడ్ ఆన్ ఫీల్డర్లు 30 యార్డ్ సర్కిల్ ఉన్నప్పటికి వారి మధ్య నుంచి బంతిని బౌండరీకు తరలిస్తున్నాడు. అతడు కచ్చితంగా రాబోయే రోజుల్లో భారత బ్యాటింగ్ యూనిట్‌కు వెన్నముకగా నిలుస్తాడని" బంగర్ జియో హాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. గిల్ షాట్ ఆడే టైమింగ్ అద్బుతంగా ఉంది. భారత జట్టులో విరాట్ కోహ్లి, రోహిత్ మర్రిచెట్టు లాంటి వాళ్లు. సాధరణంగా మర్రి చెట్టు కింద ఎటువంటి మెక్కలు పెరగవు. కానీ గిల్ మాత్రం.. రోహిత్, విరాట్ వంటి మర్రిచెట్టు నీడల్లోంచి గొప్ప క్రికెటర్‌గా ఎదుగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో గిల్ కొట్టిన రెండు స్ట్రెయిట్ డ్రైవ్‌లు, కవర్ డ్రైవ్ షాట్లను చూడటానికి రెండు కళ్లు సరిపోలేదు. ఆ షాట్లు చూసి ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లు సైతం షాక్ అయిపోయారు" అని సిద్దూ చెప్పుకొచ్చాడు.చదవండి: చాలా అలసిపోయాను.. అది నా బలహీనత.. కానీ అదే బలం: కోహ్లి -
చాలా అలసిపోయాను.. అది నా బలహీనత.. కానీ అదే బలం: కోహ్లి
విరాట్ కోహ్లి అంటే విరాట్ కోహ్లి(Virat Kohli)నే.. తనకు ఎవరూ సాటిలేరు.. సాటిరారు అని మరోసారి నిరూపించాడు ఈ రన్‌మెషీన్. తన పనైపోయిందన్న వారికి అద్బుత శతకంతో ఫినిషింగ్ టచ్ ఇచ్చి చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్(India vs Pakistan)తో పోరులో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.ఈ సందర్భంగా కోహ్లి ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా పద్నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్‌గా నిలవడంతో పాటు.. ఈ మైలురాయి చేరుకున్న మూడో ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. అంతేకాదు.. ఓ ఐసీసీ టోర్నమెంట్లో ఒకే ప్రత్యర్థిపై అత్యధికసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఆటగాడిగా వరల్డ్ రికార్డు సాధించాడు.అదే విధంగా చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో తనకు ఒక్క శతకం కూడా లేదన్న లోటును కూడా కోహ్లి ఈ మ్యాచ్ సందర్భంగా తీర్చేసుకున్నాడు. ఇక వన్డేల్లో అత్యధికంగా 51 సెంచరీలు పూర్తి చేసుకుని ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్‌గా నిలిచిన కోహ్లి.. అంతర్జాతీయ కెరీర్లో ఓవరాల్‌గా 82 సెంచరీల మైలురాయిని అందుకుని.. శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్ రికార్డుకు మరింత చేరువయ్యాడు.ఈ నేపథ్యంలో తన మ్యాచ్ విన్నింగ్స్ అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘‘సెమీస్ చేరే అవకాశం ఉన్న కీలక మ్యాచ్‌లో ఈ తరహాలో ఆడటం సంతృప్తిగా ఉంది. రోహిత్ అవుటైన తర్వాత మధ్య ఓవర్లలో ఎలాంటి సాహసోపేత షాట్లకు పోకుండా జాగ్రత్తగా ఆడే బాధ్యత నాపై పడింది. చాలా అలసిపోయానుఇది సరైన వ్యూహం. నేను వన్డేల్లో ఎప్పుడూ ఇలాగే ఆడతాను. నా ఆట గురించి నాకు చాలా బాగా తెలుసు. బయటి విషయాలను పట్టించుకోకుండా నా సామర్థ్యాన్ని నమ్ముకోవడం ముఖ్యం.ఎన్నో అంచనాలు ఉండే ఇలాంటి మ్యాచ్‌లలో వాటిని అందుకోవడం నాకు కష్టం కాదు. స్పిన్‌లో జాగ్రత్తగా ఆడుతూ పేస్ బౌలింగ్‌లో పరుగులు రాబట్టాలనే స్పష్టత నాకు ఉంది. గిల్, అయ్యర్ కూడా బాగా ఆడారు. ఈ ఇన్నింగ్స్‌తో నేను చాలా అలసిపోయాను. తర్వాతి మ్యాచ్‌కు వారం రోజుల విరామం ఉంది. 36 ఏళ్ల వయసు ఉన్న నాకు ఇది సంతోషాన్ని కలిగించే విషయం’’ అని పేర్కొన్నాడు.నాకు ఇదొక క్యాచ్-22 లాంటిదిఇక బీసీసీఐ టీవీ ఇంటర్వ్యూలో భాగంగా తన బలహీనత, బలం అయిన షాట్ గురించి కోహ్లి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘కవర్ డ్రైవ్ షాట్.. నాకు ఇదొక క్యాచ్-22 లాంటిది(ముందే వద్దని అనుకున్నా ఓ పని చేయకుండా ఉండలేకపోవడం అనే అర్థంలో). అంటే.. చాలా ఏళ్లుగా నాకు ఇది బలహీనతగా మారింది. అయితే, ఈ షాట్ కారణంగా నేను ఎన్నో పరుగులు రాబట్టాను.ఈరోజు మాత్రం ఆచితూచే ఆడాను. తొలి రెండు బౌండరీలు కవర్ డ్రైవ్ షాట్ల ద్వారానే వచ్చినట్టు గుర్తు. అయితే, కొన్నిసార్లు రిస్క్ అని తెలిసినా సాహసం చేయకతప్పలేదు. ఏదేమైనా అలాంటి షాట్లు ఆడటం ద్వారా మ్యాచ్ నా ఆధీనంలో ఉందనే భావన కలుగుతుంది.వ్యక్తిగతంగా నాకిది ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్. ఇక జట్టుకు కూడా ఇది గొప్ప విజయం’’ అని విరాట్ కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా వన్డేల్లో ఫామ్‌లోకి వచ్చినప్పటికీ.. టెస్టుల్లో కోహ్లి అవుటైన తీరుపై మాత్రం విమర్శలు ఎక్కువగానే వచ్చాయి. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ సమయంలో ఆఫ్ సైడ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతిని ఆడే క్రమంలో అతడు ఎక్కువసార్లు అవుటయ్యాడు. అయితే, తాజాగా ఆ షాట్ల గురించి కోహ్లి ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం విశేషం.చదవండి: Virat Kohli: ఇదేం తీరు కోహ్లి? ఇలాంటివి అవసరమా?.. మండిపడ్డ గావస్కర్ View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
అతడు ఫామ్‌లో లేడన్నారు.. కానీ మాకు చుక్కలు చూపించాడు: పాక్ కెప్టెన్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆతిథ్య పాకిస్తాన్ కథ దాదాపు ముగిసినట్లే. ఈ మెగా టోర్నీలో పాక్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. దుబాయ్ వేదికగా భారత్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పాక్ ఓటమి పాలైంది. దీంతో తమ సెమీస్ అవకాశాలను పాక్ సంక్లిష్టం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ పాక్ విఫలమైంది. తొలుత బ్యాటింగ్‌లో 241 పరుగులకు కుప్పకూలిన పాక్.. అనంతరం బౌలింగ్‌లోనూ తేలిపోయింది. 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 42.3 ఓవర్లలో ఊదిపడేసింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి అద్భుతమైన సెంచరీతో మెరిశాడు.పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది రెండు వికెట్లు పడగొట్టగా.. అర్బర్ ఆహ్మద్, కుష్దిల్ షా తలా వికెట్ సాధించారు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. బ్యాటింగ్‌లోనూ సౌద్ షకీల్, రిజ్వాన్, కుష్దీల్ షా మినహా మిగితా బ్యాటర్లంతా చేతులెత్తేశారు.ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన విరాట్ కోహ్లిపై రిజ్వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. విరాట్ కోహ్లి అద్బుత ఇన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడి తమ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడని రిజ్వాన్ చెప్పుకొచ్చాడు."తొలుత విరాట్ కోహ్లి గురుంచి మాట్లాడాలి అనుకుంటున్నాను. అతడి హార్డ్ వర్క్ చూసి ఆశ్చర్యపోయాను. అతడు చాలా కష్టపడి ఈ స్దాయికి చేరుకున్నాడు. అతడు ఫామ్‌లో లేడని క్రికెట్ ప్రపంచం మొత్తం అనుకుంటుంది. కానీ ఇటువంటి పెద్ద మ్యాచ్‌లలో మాత్రం విరాట్ ఆటోమేటిక్‌గా ఫామ్‌లోకి వచ్చేస్తాడు.అతడు ఈ మ్యాచ్‌లో ఎక్కడ కూడా ఇబ్బంది పడేట్లు కన్పించలేదు. చాలా సులువగా షాట్లు ఆడాడు. అతడు మేమి పరుగులు ఇవ్వకుండా కట్టడిచేయాలనకున్నాము. కానీ అతడు ఈజీగా పరుగులు సాధించాడు. అతడి ఫిట్నెస్ లెవల్స్‌తో పాటు హార్డ్ వర్క్‌ను ప్రశంసించాల్సిందే.అతడు మా లాంటి క్రికెటరే. కానీ మా కంటే ఎంతో ఫిట్‌గా ఉన్నాడు. వికెట్ల మధ్య ఎంతో వేగంగా పరుగులు తీస్తున్నాడు. అతడిని ఔట్ చేయడానికి చాలా ప్రయత్నించాం. కానీ అతడు తన అద్బుతమైన ఆట తీరుతో మ్యాచ్‌ను మా నుంచి తీసుకుపోయాడు. ఇక మ్యాచ్‌లో మేము అన్ని విభాగాల్లో మేము నిరాశపరిచాం.అందుకే ఓడిపోయాము. అర్బర్ ఆహ్మద్ మాత్రం అద్బుతంగా బౌలింగ్ చేశాడు. ఈ ఒక్కటి మినహా ఇంకా ఏమీ మాకు సానుకూళ అంశాలు లేవు. మా తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరముంది" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రిజ్వాన్ పేర్కొన్నాడు.చదవండి: ‘కావాలనే అలా చేశాడు.. లూజర్’.. ఆ కోరల నుంచి తప్పించుకుని ఇలా! -
IND vs PAK: ‘కావాలనే అలా చేశాడు.. లూజర్’
టీమిండియాతో మ్యాచ్‌లో పాకిస్తాన్ ఫాస్ట్‌బౌలర్ షాహిన్ ఆఫ్రిది(Shaheen Afridi) అనుసరించిన వ్యూహంపై విమర్శలు వస్తున్నాయి. బౌలింగ్ పరంగా అతడి ఆటకు వంక పెట్టాల్సిన అవసరం లేకున్నా.. ఆఖర్లో అతడు వైడ్లు వేసిన తీరు ఇందుకు కారణం. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భాగంగా రిజ్వాన్ బృందం.. ఆదివారం రోహిత్ సేనను ఢీకొట్టిన విషయం తెలిసిందే.చిరకాల ప్రత్యర్థుల(India vs Pakistan) పోటీని చూసేందుకు భారత సినీ, క్రీడా తారలు దుబాయ్ స్టేడియానికి విచ్చేయగా.. వారికి టీమిండియా పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చింది. టాస్ ఓడిన భారత జట్టు తొలుత బౌలింగ్ చేసి.. దాయాదిని 241 పరుగులకు కట్టడి చేసింది. కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లతో చెలరేగగా.. హార్దిక్ పాండ్యా రెండు కీలక వికెట్లు కూల్చాడు. మిగతా వాళ్లలో అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.36 ఓవర్లు ముగిసే సరికిఇక లక్ష్య ఛేదనలో భారత్ అలవోకగా విజయం వైపు దూసుకుపోతోంది... 36 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు సరిగ్గా 200కు చేరింది. 84 బంతుల్లో 42 పరుగులు చేయడం ఇక లాంఛనమే! సరిగ్గా ఇక్కడే అభిమానులు ఫలితం గురించి కాకుండా కోహ్లి శతకం గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. ఆ సమయంలో విరాట్ స్కోరు 81. అంటే మరో 19 పరుగులు కావాలి.కానీ మరో వైపు శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా చకచకా పరుగులు రాబట్టడంతో ఉత్కంఠ పెరిగింది. పరుగులు తరుగుతూ పోవడంతో అటు వైపు బ్యాటర్ పరుగులు చేయరాదని, కోహ్లి సెంచరీ పూర్తి చేసుకోవాలని అంతా కోరుకున్నారు. ముందుగా అయ్యర్ 7, ఆపై పాండ్యా 8 పరుగులు చేశారు!ఇక పాండ్యా అవుటయ్యే సమయానికి కోహ్లి 86 వద్ద ఉన్నాడు. విజయానికి 19 పరుగులు కావాలి. ఈ సమయంలో అక్షర్ పటేల్ కాస్త సంయమనం పాటించాడు. సింగిల్స్ తీసే అవకాశం ఉన్నా ఆగిపోయాడు. దాంతో కోహ్లి పని సులువైంది. గెలుపు కోసం 2 పరుగులు చేయాల్సిన స్థితిలో కోహ్లి 96 వద్ద ఉన్నాడు. తర్వాతి బంతి(42.3 ఓవర్)కి ఎక్స్ట్రా కవర్ మీదుగా ఫోర్ కొట్టడంతో కోహ్లి 51వ వన్డే సెంచరీ, భారత్ గెలుపు పూర్తయ్యాయి.ఏకంగా మూడు వైడ్ బాల్స్ వేయడంతోఅయితే, టీమిండియా ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్ ఖుష్దిల్ వేయగా.. అంతకంటే ముందు ఓవర్లో షాహిన్ ఆఫ్రిది రంగంలోకి దిగాడు. ఆ ఓవర్లో అతడు ఏకంగా మూడు వైడ్ బాల్స్ వేయడం టీమిండియా అభిమానులకు చిరాకు తెప్పించింది. అప్పటిదాకా మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌల్ చేసిన షాహిన్.. కోహ్లి శతకానికి చేరువైన సమయంలో వైడ్స్ వేయడం విమర్శలకు తావిచ్చింది. షాహిన్ ఉద్దేశపూర్వకంగానే కోహ్లి శతకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.లూజర్.. లూజర్ అంటూఇక స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు కూడా లూజర్.. లూజర్ అంటూ అతడి బౌలింగ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రముఖ నటుడు పరేశ్ రావల్ కూడా స్పందించాడు. ‘‘విరాట్ కోహ్లి నుంచి నిజంగా ఇదొక అద్భుతమైన ఇన్నింగ్స్. అతడి 51వ వన్డే శతకాన్ని అడ్డుకునేందుకు చాలా ప్రయత్నాలే జరిగాయి. షాహిన్ ఆఫ్రిది వైడ్ బాల్స్ అనే కోరల నుంచి తప్పించుకుని సూపర్ సెంచరీ చేశాడు’’ అని బాలీవుడ్, టాలీవుడ్ నటుడు పరేశ్ రావల్ షాహిన్ ఆఫ్రిదిని ఉద్దేశించి సెటైరికల్ ట్వీట్ చేశాడు.చదవండి: అతి చేయొద్దు.. ఇలాంటి ప్రవర్తన సరికాదు: పాక్ దిగ్గజం ఆగ్రహం -
బాబర్ ఆజం ఒక మోసగాడు.. మొదటి నుంచి అంతే: షోయబ్ అక్తర్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. దీంతో తమ సెమీస్ అవకాశాలను పాక్ జట్టు సంక్లిష్టం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి చవిచూసిన పాకిస్తాన్.. రెండో మ్యాచ్‌లో కూడా అదే ఫలితం పునరావృతమైంది. దుబాయ్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పాక్ పరాజయం పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమైన ఆతిథ్య జట్టు ఈ ఘోర ఓటమిని మూటకట్టుకుంది.దీంతో పాక్ జట్టు ఇంటాబయట విమర్శలు ఎదుర్కొంటుంది. తాజాగా ఈ జాబితాలోకి పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం షోయబ్ అక్తర్ చేరాడు. ఈ మ్యాచ్‌లో విఫలమైన పాక్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం(Babar Azam)పై విమర్శలు గుప్పించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన బాబర్ ఆట తీరును అక్తర్ తప్పుబట్టాడు."మనం ఎప్పుడూ బాబర్ ఆజంను విరాట్ కోహ్లితో పోలుస్తాం. విరాట్‌కు బాబర్‌కు చాలా వ్యత్యాసం ఉంది. కోహ్లి.. సచిన్ టెండూల్కర్‌ను రోల్‌మోడల్‌గా తీసుకుని తన కెరీర్‌ను ప్రారంభించాడు. టెండ్కూలర్ అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు చేశాడు. విరాట్ ఇప్పుడు అతడి వారసత్వాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నాడు.సచిన్ సెంచరీలకు చేరువతున్నాడు. కానీ బాబర్ ఆజంకు ఎవరూ ఆదర్శం లేరు. అతడి ఆలోచిన విధానం సరిగ్గాలేదు. అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టి తన రిథమ్‌ను కోల్పోయాడు. బాబర్ ఆజం ఒక మోసగాడు. అతడు కెరీర్ ఆరంభం నుంచి సెల్ఫిష్‌గా ఉన్నాడు. పాకిస్థాన్ క్రికెట్ జట్టు గురించి మాట్లాడేందుకు నాకు ఆసక్తి లేదు" అని అక్తర్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజం 23 పరుగులు చేసి ఔటయ్యాడు.విరాట్ కోహ్లి సూపర్ సెంచరీ..కాగా ఈ మ్యాచ్‌లో 242 పరుగుల టార్గెట్‌ను భారత్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 42.3 ఓవర్లలో చేధించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి ఆజేయ సెంచరీతో చెలరేగాడు. కోహ్లి 111 బంతుల్లో 7 ఫోర్లతో సరిగ్గా 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.అతడితో పాటు శ్రేయస్ అయ్యర్(67 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 56), శుబ్‌మన్ గిల్(46) పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది రెండు వికెట్లు పడగొట్టగా.. ఆర్బర్ ఆహ్మద్, కుష్దిల్ షా తలా రెండు వికెట్లు వికెట్ సాధించారు.చదవండి: పాకిస్తాన్ మ్యాచ్‌లో హార్దిక్ ధరించిన వాచీ ధర తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..! -
అతి చేయొద్దు.. ఇలాంటి ప్రవర్తన సరికాదు: పాక్ దిగ్గజం ఆగ్రహం
పాకిస్తాన్ యువ బౌలర్ అబ్రార్ అహ్మద్ వ్యవహారశైలిపై ఆ దేశ దిగ్గజ పేసర్ వసీం అక్రం ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలని.. అంతేతప్ప అతి చేయకూడదంటూ చీవాట్లు పెట్టాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా పాకిస్తాన్ ఆదివారం టీమిండియాతో తలపడింది.దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, భారత బౌలర్ల ధాటికి పాకిస్తాన్ 241 పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ మూడు, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ తీయగా.. పేసర్లలో హార్దిక్ పాండ్యా రెండు, హర్షిత్ రాణా ఒక వికెట్ దక్కించుకున్నారు.పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో వన్‌డౌన్ బ్యాటర్ సౌద్ షకీల్(62) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రిజ్వాన్(46) ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా ఆరంభం నుంచే ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ 15 బంతుల్లోనే 20 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఆదిలో దూకుడుగా ఆడినా వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించాడు.చక్కటి షాట్లతో అలరిస్తూ అర్ధ శతకానికి చేరువైన సమయంలో అనూహ్య రీతిలో గిల్ పెవిలియన్ చేరాడు. మొత్తంగా 52 బంతులు ఎదుర్కొన్న ఈ 25 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాటర్.. పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ వేసిన అద్భుత బంతికి బౌల్డ్ అయ్యాడు. దీంతో 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.అయితే, ఆ సమయంలో అబ్రార్ అహ్మద్ కాస్త అతిగా స్పందించాడు. రెండు చేతులు కట్టుకుని నిలబడి.. ‘‘ఇక వెళ్లు’’.. అన్నట్లుగా కళ్లతోనే సైగలు చేయగా సహచర ఆటగాళ్లు కూడా వచ్చి అతడితో ఆనందం పంచుకున్నారు. అప్పుడు మరో ఎండ్‌లో ఉన్న విరాట్ కోహ్లి కాస్త సంయమనం పాటించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ కాగా.. అబ్రార్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.‘‘ప్రిన్స్‌తో పెట్టుకున్నందుకు.. కింగ్ మీకు చుక్కలు చూపించాడు. మిమ్మల్ని ఓడించాడు. అందుకే అతి చేయొద్దు’’ అంటూ టీమిండియా అభిమానులు కోహ్లి శతకంతోనే పాక్ జట్టుకు బదులిచ్చాడంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ గిల్ వికెట్ తీసిన తర్వాత అబ్రార్ అహ్మద్ వ్యవహరించిన తీరుపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్‌బౌలర్ వసీం అక్రం కూడా స్పందించాడు.‘‘అబ్రార్ బంతి వేసిన తీరు నన్ను ఆకట్టుకుంది. కానీ అతడి చర్య ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు. సెలబ్రేట్ చేసుకునేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. వికెట్ తీసిన ఆనందాన్ని వ్యక్తపరచడంలో తప్పులేదు. కానీ.. మ్యాచ్‌లో మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఇలాంటివి పనికిరావు. ఎంత హుందాగా ఉంటే అంత మంచిది. అయితే, ఈరోజు అబ్రార్ అతి చేశాడు. అతడిని వారించేందుకు అక్కడ ఒక్కరూ ముందుకు రాలేదు. ఇలాంటి ప్రవర్తన టీవీల్లో చూడటానికి కూడా అస్సలు బాగాలేదు’’ అని వసీం అక్రం అబ్రార్‌కు చురకలు అంటించాడు. కాగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత్.. గ్రూప్-ఎ నుంచి సెమీస్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. ఇక మెగా వన్డే టోర్నమెంట్లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో పాటు గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. -
IND vs PAK: హార్దిక్ ధరించిన వాచీ ధర తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే!
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 23) భారత్, పాకిస్తాన్ మ్యాచ్ (దుబాయ్ వేదికగా) జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. విరాట్ కోహ్లి సూపర్ సెంచరీ (111 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు) చేసి భారత్‌కు ఘన విజయాన్ని అందించాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (62) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ రిజ్వాన్ (46), ఖుష్దిల్ షా (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. వీరు మినహా పాక్ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఇమామ్ ఉల్ హక్ 10, బాబర్ ఆజమ్ 23, సల్మాన్ అఘా 19, తయ్యబ్ తాహిర్ 4, షాహీన్ అఫ్రిది 0, నసీం షా 14, హరీస్ రౌఫ్ 8 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ 3, హార్దిక్ 2, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.అనంతరం బరిలోకి దిగిన భారత్.. కోహ్లి శతక్కొట్టడంతో 42.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ (56) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో రాణించాడు. విరాట్‌తో కలిసి మూడో వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత విజయాన్ని ఖరారు చేశాడు. అంతకుముందు ఓపెనర్ రోహిత్ శర్మ (20) తన సహజ శైలిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శుభ్‌మన్ గిల్ (46) యధావిధిగా క్లాసికల్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. పాక్ బౌలర్లలో అఫ్రిది 2, అబ్రార్ అహ్మద్, ఖుష్దిల్ షా తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో భారత్ సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారు చేసుకుంది. వరుస పరాజయాలతో పాక్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.కాగా, ఈ మ్యాచ్‌లో విరాట్ సెంచరీతో పాటు మరో నాన్ క్రికెటింగ్ అంశం హైలైట్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ధరించిన వాచీ అందరి దృష్టిని ఆకర్శించింది. ఈ వాచీ గురించి క్రికెట్ అభిమానులు ఆరా తీయగా కళ్లు బైర్లు కమ్మే విషయాలు వెలుగు చూశాయి. ఈ వాచీ ప్రపంచంలో అత్యంత ఖరీదైన బ్రాండ్‌ల్లో ఒకటైన రిచర్డ్ మిల్లె RM 27-02 టైమ్‌పీస్ అని తెలిసింది. దీని విలువ భారత కరెన్సీలో సుమారు 6.92 కోట్లుంటుంది. ఈ అల్ట్రా లగ్జరీ వాచ్ చాలా అరుదుగా దర్శనమిస్తుంది. అత్యంత సంపన్నులు మాత్రమే ఇలాంటి ఖరీదైన ఈ వాచీలను ధరించగలరు. ఈ వాచీ విలువ తెలిసి క్రికెట్ అభిమానులు షాక్ తిన్నారు.ఈ అరుదైన వాచీని మొదట టెన్నిస్ లెజెండ్ రాఫెల్ నాదల్ కోసం రూపొందించారని తెలుస్తోంది. ఇది విప్లవాత్మక కార్బన్ TPT యూనిబాడీ బేస్‌ప్లేట్‌కు ప్రసిద్ధి చెందింది. ఇలాంటి వాచీలు ఇప్పటివరకు కేవలం 50 మాత్రమే ఉత్పత్తి చేయబడ్డాయని సమాచారం.ఇదిలా ఉంటే, పాక్‌తో మ్యాచ్‌లో హార్దిక్ భారత్ విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ 8 ఓవర్లు వేసి కీలకమైన బాబర్ ఆజమ్, సౌద్ షకీల్ వికెట్లు తీశాడు. అత్యంత పొదుపుగా కూడా బౌలింగ్ చేశాడు. 8 ఓవర్లలో కేవలం 31 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అనంతరం హార్దిక్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినా పెద్ద స్కోర్ చేయలేకపోయాడు. అప్పటికే భారత విజయం ఖరారైపోయింది. మ్యాచ్‌ను తొందరగా ముగించే క్రమంలో హార్దిక్ 6 బంతుల్లో 8 పరుగులు చేసి ఔటయ్యాడు.ఈ మ్యాచ్‌లో హార్దిక్ ఓ మైలురాయిని అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో హార్దిక్ 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. కెరీర్లో ఇప్పటివరకు 216 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన హార్దిక్.. 30.76 సగటున 200 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత్ బౌలర్ల జాబితాలో హార్దిక్ 24వ స్థానంలో నిలిచాడు. -
‘పాకిస్తాన్లో గెలిచి ఉంటే బాగుండేది’.. ఇచ్చిపడేసిన శ్రేయస్ అయ్యర్
టీమిండియా విజయాన్ని తక్కువ చేసేలా మాట్లాడిన పాకిస్తాన్ జర్నలిస్టుకు శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) గట్టి కౌంటర్ ఇచ్చాడు. వేదిక ఏదైనా పాక్‌పై గెలుపు తమకు ఎల్లప్పుడూ మధురంగానే ఉంటుందని.. ఆదివారం నాటి మ్యాచ్‌లో తనకు మజా వచ్చిందంటూ అతడికి తమ జట్టు ఓటమిని గుర్తు చేశాడు.కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఆతిథ్య హక్కులను డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) నిరాకరించగా.. ఐసీసీ జోక్యంతో హైబ్రిడ్ విధానంలో టోర్నీ జరుగుతోంది. తటస్థ వేదికైన దుబాయ్‌లో భారత జట్టు తమ మ్యాచ్‌లు ఆడుతోంది.42.3 ఓవర్లలోనే..ఇందులో భాగంగా తొలుత బంగ్లాదేశ్‌ను ఓడించిన రోహిత్ సేన.. తాజా మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసి సెమీస్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్ పాక్‌ను 241 పరుగులకు కట్టడి చేసింది. ఇక 42.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి పాక్‌పై గెలుపొందింది.ఈ విజయంలో విరాట్ కోహ్లి(100 నాటౌట్)తో పాటు శుబ్‌మన్ గిల్(46), శ్రేయస్ అయ్యర్(56)లది కూడా కీలక పాత్ర. ఈ నేపథ్యంలో విజయానంతరం శ్రేయస్ మీడియా సమావేశంలో మాట్లాడగా.. ఓ పాకిస్తానీ జర్నలిస్టు.. దుబాయ్‌లో గాకుండా పాకిస్తాన్లో పాకిస్తాన్‌ను ఓడించి ఉంటే ఇంకా బాగుండేది కదా అని ప్రశ్నించాడు.ఇరుజట్లకు తటస్థ వేదికే..సదరు జర్నలిస్టు మాటల్లోని వ్యంగ్యాన్ని అర్థం చేసుకున్న శ్రేయస్ అయ్యర్ హుందాగానే కౌంటర్ వేశాడు. ‘‘పాకిస్తాన్లో నేను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కాబట్టి అక్కడ గెలిస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుందో నాకు తెలియదు. అయితే, దుబాయ్ అనేది ఇరుజట్లకు తటస్థ వేదికే.ఇక భారత్- పాక్ మ్యాచ్ అంటే అంచనాలు భారీగానే ఉంటాయి. అయినా మేము దుబాయ్‌లో ఎక్కువగా మ్యాచ్‌లు ఆడలేదు. ఏదైతేనేం ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఓడించాము కదా. అదే ఓ మధురానుభూతి. బయట నుంచి వచ్చే ఒత్తిడిని అధిగమించి మరీ మా పని పూర్తి చేశాం.నేనైతే ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నా. పాకిస్తాన్‌పై ఇది నాకు మూడో మ్యాచ్. ఇందులో గెలవడం ఎంతో మజాన్నిచ్చింది’’ అని శ్రేయస్ అయ్యర్ సమాధానమిచ్చాడు. సొంతగడ్డపై పాక్ బలమైన జట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ దేశ జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలను తన మాటలతో ఇలా తిప్పికొట్టాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ స్కోర్లు👉వేదిక: దుబాయ్👉టాస్: పాకిస్తాన్.. తొలుత బ్యాటింగ్👉పాకిస్తాన్ స్కోరు- 241(49.4) ఆలౌట్👉భారత్ స్కోరు- 244/4 (42.3)👉ఫలితం: పాక్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: విరాట్ కోహ్లి(100 పరుగులు నాటౌట్).చదవండి: Virat Kohli: ఇదేం తీరు కోహ్లి? ఇలాంటివి అవసరమా?.. మండిపడ్డ గావస్కర్ -
గిల్‌ను ఔట్ చేశాక పాక్ బౌలర్ ఓవరాక్షన్.. ఏకి పారేస్తున్న టీమిండియా అభిమానులు
భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌ల్లో ఆటగాళ్లు ఒకరినొకరు కవ్వించుకోవడం, మాటల యుద్దానికి దిగడం సర్వ సాధారణం. అయితే ఇటీవలికాలంలో ఇలాంటి వాతావరణంలో బాగా మార్పు వచ్చింది. ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు. స్నేహపూర్వకంగా మెలుగుతున్నారు. మైదానంలో హుందాగా ప్రవర్తిస్తున్నారు. కోహ్లి, రోహిత్ జమానా మొదలయ్యాక భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ల్లో స్లెడ్జింగ్ అనేదే కనిపించడం లేదు. జూనియర్లు సీనియర్లను గౌరవిస్తున్నారు. వీలైతే సలహాలు తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో చాలామంది పాక్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి దగ్గర చిట్కాలు తీసుకోవడం చూశాం.Virat Kohli to Abrar Ahmed pic.twitter.com/4BrIhnw6vb— Sagar (@sagarcasm) February 23, 2025అయితే తాజాగా జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లో పాక్ యువ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ఈ మంచి సంప్రదాయానికి తూట్లు పొడిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో అబ్రార్ చాలా ఓవరాక్షన్ చేశాడు. ఫలితంగా భారత క్రికెట్ అభిమానుల నుంచి తిట్ల దండకాన్ని అందుకుంటున్నాడు. Look at audacity of Abrar 🤬Beta Karachi airport ke liye flight pakdo, hold this elimination ✌🏽 pic.twitter.com/J6c3ax7LDS— 🥹 shim8u (@veerjatt007) February 23, 2025అసలేం జరిగిందంటే.. భారత్, పాకిస్తాన్ జట్లు నిన్న (ఫిబ్రవరి 23) దుబాయ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అబ్రార్ అహ్మద్ అతి చేశాడు. పాక్ నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ సాఫీగా ఛేదిస్తుండగా.. శుభ్‌మన్ గిల్ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. గిల్‌ను అబ్రార్ క్లీన్ బౌల్డ్ చేశాడు. గిల్‌ను ఔట్ చేశాక అబ్రార్ ఓవరాక్షన్ అంతాఇంతా కాదు. Batao, ye Abrar Ahmed ne utne matches nahi khele jitney ki Centuries Gill ki hai, lekin send-off dekho lukkhe ka https://t.co/3C8Sd4TLNz pic.twitter.com/dhtHqbPUPG— Mihir Jha (@MihirkJha) February 23, 2025చేతులు కట్టుకుని నిలబడి 'వెళ్లు.. ఇక వెళ్లు.. వెళ్లి బ్యాగ్ సర్దుకో' అన్నట్టు సైగలు చేశాడు. దీంతో భారత అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. అబ్రార్‌ను సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. బ్యాగ్ సర్దుకోవాల్సింది గిల్ కాదు, మీరే అంటూ కామెంట్లు చేస్తున్నారు. Watch it before it get remove Abrar reaction to Gill One word for abrar 👇🏼👇🏼 #indvspak #viratkohli pic.twitter.com/coEQydD2qy— Vodka triceps (@vodkatriceps) February 24, 2025కొందరు గిల్ హార్డ్ కోర్ అభిమానులు వాడకూడని భాషలో అబ్రార్‌ను దూషిస్తున్నారు. ఇంకొందరేమో నీకు సరిగ్గా బుద్ది చెప్పే విరాట్ కోహ్లి ఇంకా క్రీజ్‌లోనే ఉన్నాడంటూ కామెంట్స్ చేశారు. మొత్తానికి అబ్రార్ చేసిన ఓవరాక్షన్‌తో పాక్ జట్టు మొత్తం ట్రోలింగ్‌కు గురైంది.మ్యాచ్ విషయానికొస్తే.. విరాట్ సూపర్ సెంచరీతో కదంతొక్కడంతో పాక్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విరాట్ అజేయ సెంచరీతో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (62) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ రిజ్వాన్ (46), ఖుష్దిల్ షా (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. వీరు మినహా పాక్ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఇమామ్ ఉల్ హక్ 10, బాబర్ ఆజమ్ 23, సల్మాన్ అఘా 19, తయ్యబ్ తాహిర్ 4, షాహీన్ అఫ్రిది 0, నసీం షా 14, హరీస్ రౌఫ్ 8 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ 3, హార్దిక్ 2, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.అనంతరం బరిలోకి దిగిన భారత్.. కోహ్లి శతక్కొట్టడంతో (111 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు) 42.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ (56).. విరాట్‌తో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత విజయాన్ని ఖరారు చేయగా.. ఓపెనర్లు రోహిత్ శర్మ (20), శుభ్‌మన్ గిల్ (46) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. పాక్ బౌలర్లలో అఫ్రిది 2, అబ్రార్ అహ్మద్, ఖుష్దిల్ షా తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో భారత్ సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారు చేసుకుంది. వరుస పరాజయాలతో పాక్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. -
ఇదేం తీరు కోహ్లి? ఇలాంటివి అవసరమా?.. మండిపడ్డ గావస్కర్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) తీరుపై భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్(Sunil Gavaskar) అసహనం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్(India vs Pakistan)తో మ్యాచ్‌లో అనవసర చర్య ద్వారా వికెట్ కోల్పోయే ప్రమాదం తెచ్చుకున్నాడని.. అయితే, అదృష్టవశాత్తూ బయటపడటంతో తాము ఊపిరి పీల్చుకున్నామన్నాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత్ ఆదివారం పాకిస్తాన్‌తో తలపడింది.దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన రోహిత్ సేన తొలుత ఫీల్డింగ్ చేసింది. బౌలర్ల విజృంభణ కారణంగా దాయాదిని 241 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనను దూకుడుగా ఆరంభించిన టీమిండియా.. మిడిల్ ఓవర్లలో మాత్రం ఆచితూచి నిలకడగా ఆడింది. సెంచరీ మార్కు.. విన్నింగ్ షాట్ముఖ్యంగా ఓపెనర్ శుబ్‌మన్ గిల్(46), నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(56)లతో కలిసి విరాట్ కోహ్లి అద్భుత భాగస్వామ్యాలు నెలకొల్పాడు.ఏ దశలో నిర్లక్ష్యపు షాట్లకు యత్నించకుండా.. సహచర బ్యాటర్లతో చక్కగా సమన్వయం చేసుకుంటూ ఇన్నింగ్స్ నిర్మించాడు. ఈ క్రమంలో అర్ధ శతకం పూర్తి చేసుకున్న కోహ్లి.. దానిని శతకంగా మలిచాడు. అంతేకాదు బౌండరీ బాది సెంచరీ మార్కు అందుకున్న ఈ రన్‌మెషీన్.. టీమిండియాను గెలుపుతీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లిపై భారత్‌తో పాటు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.అయితే, బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లి చేసిన ఓ పని మాత్రం సునిల్ గావస్కర్‌కు ఆగ్రహం తెప్పించింది. భారత ఇన్నింగ్స్‌లో 21 ఓవర్‌ను పాక్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ వేయగా.. ఐదో బంతికి కోహ్లి సింగిల్ తీశాడు. ఈ క్రమంలో సురక్షితంగానే క్రీజులోకి చేరుకున్న కోహ్లి.. ఆ తర్వాత ఓవర్ త్రో కాబోతున్న బంతిని తన చేతితో ఆపేశాడు.నిజానికి అక్కడ దగ్గర్లో పాకిస్తాన్ ఫీల్డర్లు ఎవరూ లేరు. ఒకవేళ ఓవర్ త్రో అయినా ఓ అదనపు పరుగు వచ్చేది. అయినా, ఎంసీసీ నిబంధనల ప్రకారం ఓ బ్యాటర్ బంతి లైవ్‌లో ఉన్నపుడు దానిని తన మాటలు, చేతల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా అతడు అలా చేసినట్లు భావించి ఫీల్డింగ్ చేస్తున్న జట్టు అప్పీలు చేస్తే.. సదరు బ్యాటర్‌ను అవుట్‌గా ప్రకటించవచ్చు.అబ్స్ట్రక్ట్ ఫీల్డ్ నిబంధన కింద..కోహ్లి విషయంలో ఒకవేళ పాక్ జట్టు ఈ విషయంలో అప్పీలుకు వెళ్లి ఉంటే పరిస్థితి చేజారిపోయేదని గావస్కర్ అన్నాడు. కామెంట్రీ సమయంలో.. ‘‘అతడు తన చేతితో బంతిని ఆపాడు. ఒకవేళ పాకిస్తాన్ గనుక అప్పీలు చేస్తే ఏమయ్యేది?.. అబ్స్ట్రక్ట్ ఫీల్డ్ నిబంధన కింద అతడు అవుటయ్యేవాడేమో?!.. కానీ వాళ్లు అలా చేయలేదు. ఎందుకంటే.. అక్కడ దగ్గర్లో ఫీల్డర్ లేడు.అంతేకాదు ఓవర్ త్రో ద్వారా అదనపు పరుగు రాకుండా ఉండిపోయిందని భావించి ఉండవచ్చు. నిజానికి మిడ్‌వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఆటగాడు డైవ్ చేస్తే బాగుండేది. కానీ ముందుకు వెళ్లిపోతున్న బంతిని కోహ్లి జోక్యం చేసుకుని మరీ ఆపడం సరికాదు. అదృష్టవశాత్తూ ఎవరూ అప్పీలు చేయలేదు కాబట్టి సరిపోయింది’’ అని గావస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. కాగా 21వ ఓవర్ ముగిసే సరికి కోహ్లి కేవలం 41 పరుగుల వద్ద ఉండటం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌లో 111 బంతులు ఎదుర్కొన్న కోహ్లి సరిగ్గా 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వన్డేల్లో అతడికి ఇది 51వ సెంచరీ కాగా.. అంతర్జాతీయ కెరీర్లో 82వది కావడం విశేషం. సచిన్ టెండ్కులర్ వంద సెంచరీల రికార్డుకు కోహ్లి ఇంకా 18 శతకాల దూరంలో ఉన్నాడు.చాంపియన్స్ ట్రోఫీ-2025: భారత్ వర్సెస్ పాకిస్తాన్ స్కోర్లు👉పాకిస్తాన్- 241(49.4) ఆలౌట్👉భారత్- 244/4 (42.3)👉ఫలితం: పాక్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన భారత్.చదవండి: ‘ఏంటిది?’.. రిజ్వాన్ చర్యకు హర్షిత్ రాణా రియాక్షన్ వైరల్.. గంభీర్ కూడా! -
పాంటింగ్‌ను దాటేసిన కోహ్లి.. ఇక మిగిలింది సంగక్కర, సచిన్ మాత్రమే..!
పరుగుల యంత్రం విరాట్ కోహ్లి (Virat Kohli) అంతర్జాతీయ క్రికెట్లో మరో ఘనత సాధించాడు. మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్-3లోకి చేరాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో (Champions Trophy 2025) భాగంగా పాకిస్తాన్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో (India Vs Pakistan) సెంచరీ చేసిన విరాట్.. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ను (Ricky Ponting) వెనక్కు నెట్టి మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో.. లంక దిగ్గజ బ్యాటర్ కుమార సంగక్కర రెండో స్థానంలో ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ మరో 514 పరుగులు చేస్తే సంగక్కరను కూడా వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకుతాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్స్సచిన్ టెండూల్కర్- 782 ఇన్నింగ్స్‌ల్లో 34357 పరుగులుకుమార సంగక్కర- 666 ఇన్నింగ్స్‌ల్లో 28016విరాట్ కోహ్లి- 614 ఇన్నింగ్స్‌ల్లో 27503రికీ పాంటింగ్- 668 ఇన్నింగ్స్‌ల్లో 27483మహేళ జయవర్దనే- 725 ఇన్నింగ్స్‌ల్లో 25957కాగా, పాక్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో విరాట్ మరో అరుదైన మైలురాయిని కూడా దాటాడు. 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వన్డేల్లో 14000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. విరాట్‌కు ముందు సచిన్ (18426), సంగక్కర్ (14234) మాత్రమే వన్డేల్లో 14000 పరుగుల మార్కును దాటారు. ఈ రికార్డు సాధించే క్రమంలో విరాట్ మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 14000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ 350 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా.. విరాట్ కేవలం 287వ ఇన్నింగ్స్‌ల్లో 14000 పరుగులు పూర్తి చేశాడు.వన్డేల్లో 51వ సెంచరీనిన్నటి మ్యాచ్‌లో పాక్‌పై సెంచరీతో విరాట్ వన్డే సెంచరీల సంఖ్య 51కి చేరింది. మూడు ఫార్మాట్లలో కలిపి విరాట్ సెంచరీల సంఖ్య 82కు చేరింది. ప్రపంచ క్రికెట్లో సెంచరీల సంఖ్యా పరంగా సచిన్ (100) ఒక్కడే విరాట్ కంటే ముందున్నాడు.విరాట్ సూపర్ సెంచరీ.. పాక్‌ను చిత్తు చేసిన భారత్విరాట్ సూపర్ సెంచరీతో కదంతొక్కడంతో నిన్నటి మ్యాచ్‌లో పాక్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో విరాట్ అజేయ సెంచరీతో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (62) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ రిజ్వాన్ (46), ఖుష్దిల్ షా (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. వీరు మినహా పాక్ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఇమామ్ ఉల్ హక్ 10, బాబర్ ఆజమ్ 23, సల్మాన్ అఘా 19, తయ్యబ్ తాహిర్ 4, షాహీన్ అఫ్రిది 0, నసీం షా 14, హరీస్ రౌఫ్ 8 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ 3, హార్దిక్ 2, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.అనంతరం బరిలోకి దిగిన భారత్.. కోహ్లి శతక్కొట్టడంతో (111 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు) 42.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ (56).. విరాట్‌తో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత విజయాన్ని ఖరారు చేశాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ (20), శుభ్‌మన్ గిల్ (46) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. పాక్ బౌలర్లలో అఫ్రిది 2, అబ్రార్ అహ్మద్, ఖుష్దిల్ షా తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో భారత్ సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారు చేసుకుంది. వరుస పరాజయాలతో పాక్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. -
ఆ ముగ్గురు అద్బుతం.. కోహ్లి గురించి చెప్పేదేమీ లేదు: రోహిత్ శర్మ
టీమిండియా బౌలింగ్ దళంపై కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ప్రశంసలు కురిపించాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో తమ బౌలర్లు అదరగొట్టారని.. ప్రత్యర్థిని నామమాత్రపు స్కోరుకు కట్టడి చేసి తమపై కాస్త ఒత్తిడిని తగ్గించారని అన్నాడు. మిడిల్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేసిన తీరు అద్భుతమని బౌలర్లను కొనియాడిన రోహిత్ శర్మ.. ఇక ఛేజ్‌మాస్టర్ విరాట్ కోహ్లి(Virat Kohli) నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ రావడం తననేమీ ఆశ్చర్యపరచలేదని తెలిపాడు.చాంపియన్స్ ట్రోఫీ-2025లో బంగ్లాదేశ్‌పై గెలిచి విజయంతో ఈ ఐసీసీ టోర్నీని ఆరంభించిన రోహిత్ సేన.. ఆదివారం నాటి తమ రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఓడించింది. చిరకాల ప్రత్యర్థిపై ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించి సెమీ ఫైనల్ రేసులో మున్ముందుకు దూసుకుపోయింది.దుబాయ్ వేదికగా దాయాది పాకిస్తాన్‌తో తలపడ్డ టీమిండియా.. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో 49.4 ఓవర్లలో ప్రత్యర్థిని 241 పరుగులకు ఆలౌట్ చేసింది. కుల్దీప్ యాదవ్ మూడు, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లతో మెరవగా.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా ఒక్కో వికెట్ తీశారు. అదే విధంగా.. అక్షర్ తన అద్భుత ఫీల్డింగ్‌తో రెండు రనౌట్లలో భాగమయ్యాడు.ఇక లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 42.3 ఓవర్లలోనే టార్గెట్‌ను ఊదేసింది. విరాట్ కోహ్లి ఫోర్ బాది శతకం పూర్తి చేసుకోవడంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. మిగతా వాళ్లలో ఓపెనర్ శుబ్‌మన్ గిల్(46), మిడిలార్డర్ స్టార్ శ్రేయస్ అయ్యర్(56) అద్బుత ఇన్నింగ్స్ ఆడారు.ఈ నేపథ్యంలో విజయానంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ... జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘బంతితో మేము మ్యాచ్ ఆరంభించిన విధానం సూపర్. బౌలింగ్ విభాగం అద్భుతమైన ప్రదర్శనతో పాకిస్తాన్‌ను నామమాత్రపు స్కోరుకే పరిమితం చేసింది. లక్ష్య ఛేదనలో లైట్ల వెలుగులో బ్యాటింగ్ చేయడం ఈ పిచ్‌పై ఎంత బాగుంటుందో.. స్లో వికెట్‌పై ఆడటం అంతే కఠినంగానూ ఉంటుందని మాకు తెలుసు.అయితే, మా బ్యాటింగ్ లైనప్ త్వరగానే పనిపూర్తి చేసింది. ఏదేమైనా.. అక్షర్, కుల్దీప్, జడేజా మిడిల్ ఓవర్లలో గొప్పగా రాణించారు. వన్డే ఫార్మాట్లో తమకున్న అనుభవాన్ని ఇక్కడ చూపించారు. రిజ్వాన్‌తో పాటు సౌద్ షకీల్‌ల వికెట్లు మాకు కీలకం. వారిద్దరిని ఎక్కువ సేపు క్రీజులో ఉండనీయవద్దనే మా ప్రయత్నాలు ఫలించాయి.ఈ ముగ్గురు స్పిన్నర్లు ఈరోజు అద్భుతమే చేశారు. అయితే, పేసర్లు హార్దిక్, హర్షిత్, షమీ బౌలింగ్ చేసిన విధానాన్ని కూడా మనం మర్చిపోకూడదు. బౌలింగ్ యూనిట్లో ప్రతి ఒక్కరు తమ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించారు.ఇక కోహ్లి దేశం కోసం ఆడటాన్ని ఎంతగా ఇష్టపడతాడో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జట్టు ప్రయోజనాల కోసం తన శక్తినంతా ధారపోస్తాడు. కీలక సమయంలో తనలోని అత్యుత్తమ నైపుణ్యాలను మరింత మెరుగ్గా ప్రదర్శిస్తాడు. కోహ్లి అంటే ఏమిటో ఈరోజు మరోసారి నిరూపించాడు.డ్రెసింగ్ రూంలో కూర్చున వాళ్లలో ఒక్కరు కూడా కోహ్లి ఇన్నింగ్స్ చూసి ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే.. సుదీర్ఘకాలంగా జట్టు కోసం అతడేం చేస్తున్నాడో అందరికీ తెలుసు. మిడిల్ ఓవర్లలో.. మరో ఎండ్‌లోని బ్యాటర్లతో చక్కటి సమన్వయంతో అతడు ముందుకు సాగిన విధానం అద్భుతం. అంతేకాదు తనదైన స్టైల్లో మ్యాచ్‌ను ముగించడం రెట్టింపు సంతోషం. గిల్, శ్రేయస్ కూడా విలువైన ఇన్నింగ్స్ ఆడారు’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.చదవండి: ‘ఏంటిది?’.. రిజ్వాన్ చర్యకు హర్షిత్ రాణా రియాక్షన్ వైరల్.. గంభీర్ కూడా! -
CT 2025: ఎల్లలు దాటిన అభిమానం.. సూర్యకుమార్ యాదవ్‌తో ఫోటోలకు ఎగబడిన పాక్ మహిళా అభిమాని
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో నిన్న (ఫిబ్రవరి 23) పాక్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో భారత్ అన్ని విభాగాల్లో సత్తా చాటి దాయాదిని మట్టికరిపించింది. పాక్ నిర్దేశించిన 242 పరుగుల సాధారణ లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించింది. కోహ్లి సూపర్ సెంచరీతో మెరిసి భారత్‌ను గెలిపించాడు. బౌండరీతో సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. కోహ్లి మ్యాచ్ విన్నింగ్ సెంచరీని విశ్వవాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. కోహ్లి సెంచరీ అనంతరం పాక్‌లోనూ సంబరాలు జరిగాయి. అసలైన క్రికెట్ అభిమానులు భారత్-పాక్ మధ్య ఉన్న అంతరాలను మరిచి క్రికెట్‌ను ఆస్వాధించారు. మ్యాచ్‌కు వేదిక అయిన దుబాయ్ స్టేడియంలో ఓ ఆసక్తికర సన్నివేశం అందరి దృష్టిని ఆకర్శించింది. Suryakumar Yadav poses with a Pakistani fan 🇵🇰🇮🇳♥️#INDvsPAK #ChampionsTrophy2025 pic.twitter.com/CUHBhOjWM3— Ahtasham Riaz (@ahtashamriaz22) February 23, 2025భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో ఫోటో కోసం ఓ పాక్ మహిళా అభిమాని ఎగబడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. అభిమానం ఎల్లలు దాటడమంటే ఇదేనేమో అని అభిమానులు చర్చించుకుంటున్నారు. కాగా, ఈ మ్యాచ్ చూసేందుకు భారత క్రికెటర్లతో పాటు చాలామంది సెలబ్రిటీలు హాజరయ్యారు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (62) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ రిజ్వాన్ (46), ఖుష్దిల్ షా (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. వీరు మినహా పాక్ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఇమామ్ ఉల్ హక్ 10, బాబర్ ఆజమ్ 23, సల్మాన్ అఘా 19, తయ్యబ్ తాహిర్ 4, షాహీన్ అఫ్రిది 0, నసీం షా 14, హరీస్ రౌఫ్ 8 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ 3, హార్దిక్ 2, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.అనంతరం బరిలోకి దిగిన భారత్.. కోహ్లి సెంచరీతో కదంతొక్కడంతో 42.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ (56).. విరాట్‌తో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత విజయాన్ని ఖరారు చేశాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ (20), శుభ్‌మన్ గిల్ (46) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. పాక్ బౌలర్లలో అఫ్రిది 2, అబ్రార్ అహ్మద్, ఖుష్దిల్ షా తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో భారత్ సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారు చేసుకుంది. వరుస పరాజయాలతో పాక్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. -
Champions Trophy 2025: పాక్‌పై కోహ్లి సెంచరీ.. ఇస్లామాబాద్‌లోనూ సంబరాలు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) పాక్‌పై విరాట్ (Virat Kohli) సెంచరీని విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. నిన్న దుబాయ్‌లో దాయాదితో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి బౌండరీ కొట్టి తన సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు భారత్‌ను విజయతీరాలకు చేర్చిన విషయం తెలిసిందే. ఈ విజయం అనంతరం భారత్‌లో సంబరాలు అంబరాన్ని అంటాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అభిమానులు భారత విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.Fans dancing and celebrating Virat Kohli's Hundred & Team India's Win against Pakistan in Mumbai. 🔥🇮🇳 (ANI).pic.twitter.com/Hxg0VCq43Y— Tanuj Singh (@ImTanujSingh) February 23, 2025మ్యాచ్ జరిగిన దుబాయ్‌లో భారత అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. మ్యాచ్ చూడటానికి వచ్చిన సెలబ్రిటీలు సైతం సాధారణ వ్యక్తుల్లా భారత విజయాన్ని ఆస్వాధించారు. కోహ్లి క్రేజ్ ఎల్లలు దాటి పాకిస్తాన్‌కు కూడా పాకింది. పాక్ సిటిజన్లు కోహ్లి తమ సొంత జట్టుపై సెంచరీ చేసినా సెలబ్రేట్ చేసుకున్నారు. కోహ్లి సెంచరీ అనంతరం పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లోనూ సంబరాలు జరిగాయి.Crazy scenes in ISLAMABAD! ONLY @imVkohli can do this 🙏🙏🙏🙏pic.twitter.com/reIvbpr9nk— CricTracker (@Cricketracker) February 23, 2025కొందరు క్రికెట్ అభిమానులు భారత్, పాక్ మధ్య ఉన్న అంతరాన్ని మరిచి విరాట్ సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. పాక్‌పై భారత విజయాన్ని అతి సున్నితమైన కశ్మీర్ ప్రాంతంలోనూ సెలబ్రేట్ చేసుకున్నారు. భారత అభిమానులు రోడ్లపైకి వచ్చి కేరింతలు కొడుతూ బాణాసంచా కాల్చారు. 'భారత్ మాతాకి జై' అన్న నినాదాలతో యావత్ భారత దేశం మార్మోగిపోయింది. కోహ్లి నామస్మరణతో క్రికెట్ ప్రపంచం దద్దరిల్లింది.CELEBRATIONS IN JAMMU AFTER INDIA'S VICTORY OVER PAKISTAN. 🇮🇳pic.twitter.com/OYLNoYSoE3— Mufaddal Vohra (@mufaddal_vohra) February 23, 2025కాగా, నిన్నటి మ్యాచ్‌లో భారత్ పాక్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సూపర్ సెంచరీ చేసి భారత్‌ను గెలిపించాడు. పాక్ నిర్దేశించిన 242 పరుగుల సాధారణ లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించింది. కోహ్లి వన్డేల్లో 51వ సెంచరీతో, ఓవరాల్‌గా 82వ సెంచరీతో మెరిశాడు. భారత్‌ను గెలిపించడంలో శ్రేయస్ అయ్యర్ (56), శుభ్‌మన్ గిల్ (46), కుల్దీప్ యాదవ్ (9-0-40-3), హార్దిక్ పాండ్యా (8-0-31-2) తమవంతు పాత్రలు పోషించారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (62) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ రిజ్వాన్ (46), ఖుష్దిల్ షా (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. వీరు మినహా పాక్ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. భారత బౌలర్లలో కుల్దీప్ 3, హార్దిక్ 2, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో భారత్ సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారైంది. వరుస పరాజయాలతో పాక్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. -
CT 2025: భారత్ చేతిలో ఓడినా, పాక్ సెమీస్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి..!
స్వదేశంలో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో (Champions Trophy-2025) పాకిస్తాన్ (Pakistan) వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఖంగుతిన్న దాయాది.. భారత్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. వరుసగా న్యూజిలాండ్, భారత్ చేతిలో ఓడినా పాక్ సెమీస్‌కు చేరే అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. న్యూజిలాండ్‌తో నేడు (ఫిబ్రవరి 24) జరుగబోయే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయం సాధించాలి. అలాగే ఫిబ్రవరి 27వ తేదీన జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై పాక్ ఘన విజయం సాధించాలి. దీంతో పాటు మార్చి 2న జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను భారత్ ఓడించాలి. ఇలా జరిగితే గ్రూప్-ఏలో పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ తలో రెండు పాయింట్లు కలిగి ఉంటాయి. అప్పుడు నెట్ రన్‌రేట్ ఆధారంగా రెండో సెమీస్ బెర్త్ ఖరారవుతుంది. ఈ లెక్కన పాక్ సెమీస్ అవకాశాలు ఇంకా ఉన్నట్లే. ఒకవేళ నేటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో బంగ్లాదేశ్ ఓడితే మాత్రం పాక్ మిగతా మ్యాచ్‌లతో సంబంధం లేకుండా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. చివరి గ్రూప్ మ్యాచ్‌లో పాక్ బంగ్లాదేశ్‌పై ఎంతటి భారీ విజయం సాధించినా ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి పాక్ టోర్నీలో సజీవంగా ఉండాలంటే నేటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ న్యూజిలాండ్‌ను ఓడించాలి.కాగా, దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సూపర్ సెంచరీ చేసి భారత్‌ను గెలిపించాడు. పాక్ నిర్దేశించిన 242 పరుగుల సాధారణ లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించింది. కోహ్లి వన్డేల్లో 51వ సెంచరీతో, ఓవరాల్‌గా 82వ సెంచరీతో మెరిపించాడు. భారత్‌ను గెలిపించడంలో శ్రేయస్ అయ్యర్ (56), శుభ్‌మన్ గిల్ (46), కుల్దీప్ యాదవ్ (9-0-40-3), హార్దిక్ పాండ్యా (8-0-31-2) తమవంతు పాత్రలు పోషించారు. ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఏ నుంచి సెమీస్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకున్నట్లే. తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించిన టీమిండియా.. 4 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నిలిచింది. ప్రస్తుతం భారత నెట్ రన్‌రేట్ 0.647గా ఉంది. రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ రన్‌రేట్ (1.200) భారత్ కంటే కాస్త మెరుగ్గా ఉంది.భారత్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (62) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ రిజ్వాన్ (46), ఖుష్దిల్ షా (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. వీరు మినహా పాక్ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఇమామ్ ఉల్ హక్ 10, బాబర్ ఆజమ్ 23, సల్మాన్ అఘా 19, తయ్యబ్ తాహిర్ 4, షాహీన్ అఫ్రిది 0, నసీం షా 14, హరీస్ రౌఫ్ 8 పరుగులు చేసి ఔటయ్యారు. పాక్ 47 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయినప్పటికీ.. రిజ్వాన్, షకీల్ క్రీజ్‌లో ఉండగా భారీ స్కోర్ చేసేలా కనిపించింది. అయితే వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో పాక్ తిరిగి కోలుకోలేకపోయింది. ఈ దశలో భారత బౌలర్లు రెచ్చిపోవడంతో పాక్ వరుస క్రమాల్లో వికెట్లు కోల్పోయి నామమాత్రపు స్కోర్‌కు పరిమితమైంది. భారత బౌలర్లలో కుల్దీప్, హార్దిక్‌తో పాటు హర్షిత్ రాణా (7.4-0-30-1), అక్షర్ పటేల్ (10-0-49-1), రవీంద్ర జడేజా (7-0-40-1) కూడా వికెట్లు తీశారు.అనంతరం బరిలోకి దిగిన భారత్.. 42.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ (20), శుభ్‌మన్ గిల్ (46) ఓ మోస్తరు ఆరంభాన్ని ఇచ్చారు. రోహిత్ తన సహజ శైలిలో షాట్లు ఆడి క్రీజ్‌లో ఉన్న కొద్ది సేపు అలరించాడు. గిల్.. సెంచరీ హీరో విరాట్ కోహ్లితో కలిసి భారత్ గెలుపుకు బాటలు వేశాడు. గిల్ ఔటయ్యాక శ్రేయస్ విరాట్ జత కలిశాడు. వీరిద్దరు మూడు వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్ గెలుపును ఖరారు చేశారు. ఆఖర్లో కోహ్లి సెంచరీ పూర్తి చేస్తాడా లేదా అన్న ఉత్కంఠ నెలకొని ఉండింది. అయితే అక్షర్ పటేల్ లెక్కలు చూసుకుని సెంచరీ పూర్తి చేసేందుకు కోహ్లికి స్ట్రయిక్ ఇచ్చాడు. కోహ్లి బౌండరీతో సెంచరీ పూర్తి చేసుకోవడమే కాకుండా భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. పాక్ బౌలర్లలో అఫ్రిది 2, అబ్రార్ అహ్మద్, ఖుష్దిల్ షా తలో వికెట్ తీశారు. -
IND Vs PAK: కోహ్లి సూపర్ సెంచరీ.. పాక్‌పై భారత్ ఘన విజయం (ఫోటోలు)
-
కోహ్లి‘నూరు’.. పాకిస్తాన్ చిత్తు
ఇంట (పాక్‌లో) జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో... దుబాయ్‌లో జరిగిన పోరులో భారత్ చేతిలో... చిత్తుగా ఓడిన పాకిస్తాన్‌కు ఇక ఆతిథ్య మురిపెమే మిగలనుంది. సెమీఫైనల్‌కు వెళ్లే దారైతే మూసుకుపోయింది. 2017 విజేత పాక్.. గ్రూప్ ‘ఎ’లో అందరికంటే ముందే ని్రష్కమించే జట్టుగా అట్టడుగున పడిపోనుంది. ఈ ఆదివారం కోసం అందరూ ఎదురుచూసిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించింది. 2017లో తమపైనే ఫైనల్లో గెలిచి కప్‌ను లాక్కెళ్లిన పాక్ జట్టును టీమిండియా ఈసారి పెద్ద దెబ్బే కొట్టింది. అసలు కప్ రేసులో పడకముందే లీగ్ దశలోనే ని్రష్కమించేలా ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (76 బంతుల్లో 62; 5 ఫోర్లు), రిజ్వాన్ (77 బంతుల్లో 46; 3 ఫోర్లు) రాణించారు. కుల్దీప్ 3 వికెట్లు, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 42.3 ఓవర్లలో నాలుగే వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసి గెలిచింది. సులువైన విజయం ముంగిట విరాట్ కోహ్లి (111 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు) బౌండరీ కొట్టి సెంచరీని పూర్తి చేసుకోగా.. భారత్ కూడా లక్ష్యాన్ని అధిగమించింది. శ్రేయస్ అయ్యర్ (67 బంతుల్లో 56; 5 ఫోర్లు, 1 సిక్స్), శుబ్‌మన్ గిల్ (52 బంతుల్లో 46; 7 ఫోర్లు) రాణించారు. షాహిన్ షా అఫ్రిది 2 వికెట్లు తీశాడు. కోహ్లికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ లభించింది. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను మార్చి 2న న్యూజిలాండ్‌తో ఆడుతుంది. భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ టీమ్‌కంటే ఒక ‘కాంతి సంవత్సరం’ ముందుంది! దుబాయ్‌లో ఇది మరోసారి రుజువైంది. అందరిలోనూ ఆసక్తి, చర్చను రేపుతూ ప్రసారకర్తలు, ప్రకటనకర్తలకు అతి పెద్ద బ్రాండ్ ఈవెంట్‌గా మారిన భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ మళ్లీ ఏకపక్షంగా ముగిసింది. మ్యాచ్ ఆరంభమైనప్పటి నుంచి టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం కనబర్చగా, ఏ దశలోనూ పాక్ కనీస పోటీ ఇచ్చే స్థితిలో కనిపించలేదు.పిచ్ నెమ్మదిగా ఉండవచ్చు... పరుగులు రావడం కష్టంగా మారవచ్చు... అయినా సరే పాక్ బ్యాటింగ్ బృందం పేలవ ఆటతో అతి సాధారణ స్కోరుకే పరిమితమైంది... మన బౌలర్లు సమష్టిగా రాణిస్తూ ప్రత్యర్థి ని పూర్తిగా అడ్డుకున్నారు. ఆపై ఛేదనలో భారత్ అలవోకగా దూసుకుపోయింది... పాక్ బౌలర్లు టీమిండియాను ఏమాత్రం నిలువరించలేకపోయారు. పిచ్ ఎలా ఉన్నా సత్తా ఉంటే పరుగులు రాబట్టవచ్చనే సూత్రాన్ని చూపిస్తూ మన బ్యాటర్లంతా తమ స్థాయిని ప్రదర్శించాడు.ఎప్పటిలాగే ఛేదనలో వేటగాడైన విరాట్ కోహ్లి తన లెక్క తప్పకుండా పరుగులు చేస్తూ ఒకే షాట్‌తో భారత్‌ను గెలిపించడంతో పాటు తన శతకాన్ని కూడా పూర్తి చేసుకున్నాడు. తాజా గెలుపుతో భారత్ దాదాపు సెమీఫైనల్లో చోటు ఖాయం చేసుకోగా... రెండు పరాజయాల తర్వాత డిఫెండింగ్ చాంపియన్ పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించడం దాదాపుగా ఖాయమైంది. ఆతిథ్య దేశమైన ఆ జట్టు ఇక తమ సొంతగడ్డకు వెళ్లి అభిమానుల మధ్య నామమాత్రమైన చివరి పోరులో ఆడటమే మిగిలింది. దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నమెంట్లో భారత్ దాదాపుగా సెమీఫైనల్ స్థానాన్ని ఖాయం చేసుకుంది. తొలి పోరులో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన రోహిత్ శర్మ బృందం ఇప్పుడు గ్రూప్ ‘ఎ’ రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ పాకిస్తాన్ జట్టుపై గెలిచింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (76 బంతుల్లో 62; 5 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (77 బంతుల్లో 46; 3 ఫోర్లు), ఖుష్దిల్ షా (39 బంతుల్లో 38; 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్‌కు 3 వికెట్లు దక్కగా...హార్దిక్ పాండ్యా 2 కీలక వికెట్లు తీశాడు. అనంతరం భారత్ 42.3 ఓవర్లలో 4 వికెట్లకు 244 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విరాట్ కోహ్లి (111 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు) సెంచరీ సాధించాడు. శుబ్‌మన్ గిల్ (52 బంతుల్లో 46; 7 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (67 బంతుల్లో 56; 5 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచారు. కోహ్లి, అయ్యర్ మూడో వికెట్‌కు 114 పరుగులు జోడించారు. తమ ఆఖరి మ్యాచ్‌లో వచ్చే ఆదివారం న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతుంది. షకీల్ అర్ధ సెంచరీ... షమీ నియంత్రణ కోల్పోయి వేసిన తొలి ఓవర్‌తో పాక్ ఇన్నింగ్స్ మొదలైంది. ఈ ఓవర్లో అతను ఏకంగా 5 వైడ్లు వేయడంతో మొత్తం 11 బంతులతో ఓవర్ పూర్తి చేయాల్సి వచ్చింది! ఆ తర్వాత బాబర్ ఆజమ్ (26 బంతుల్లో 23; 5 ఫోర్లు) చక్కటి కవర్‌డ్రైవ్‌లతో పరుగులు రాబట్టాడు. అయితే బాబర్‌ను పాండ్యా వెనక్కి పంపించగా, అక్షర్ ఫీల్డింగ్‌కు ఇమామ్ ఉల్ హక్ (10) రనౌటయ్యాడు. ఈ దశలో రిజ్వాన్, షకీల్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే వీరిద్దరు మరీ నెమ్మదిగా ఆడటంతో పరుగుల వేగం మందగించింది. ఒకదశలో 32 బంతుల తర్వాత గానీ బౌండరీ రాలేదు.హార్దిక్ పాండ్యా చక్కటి స్పెల్ (6–0–18–1)తో పాక్‌ను కట్టి పడేసాడు. తొలి 10 ఓవర్లలో 52 పరుగులు చేసిన జట్టు తర్వాతి 10 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది. ఆ తర్వాతా ఒక దశలో వరుసగా 53 బంతుల పాటు ఫోర్ రాలేదు! అనంతరం కాస్త ధాటిని పెంచిన షకీల్ 63 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అక్షర్ బౌలింగ్‌లో ముందుకొచ్చి షాట్ ఆడబోయే క్రమంలో రిజ్వాన్ బౌల్డ్ కావడంతో 104 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. మరో 14 పరుగుల వ్యవధిలో షకీల్, తాహిర్ (4) వెనుదిరగ్గా... ఆపై కుల్దీప్ వరుస బంతుల్లో 2 వికెట్లు తీసి దెబ్బ కొట్టాడు. చివర్లో ఖుష్దిల్ కాస్త వేగంగా ఆడటంతో పాక్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. శతక భాగస్వామ్యం... స్వల్ప లక్ష్యమే అయినా భారత్ తమ ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించింది. ఛేదనలో రోహిత్ శర్మ (15 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్), గిల్ చకచకా పరుగులు రాబట్టారు. అయితే షాహిన్ అఫ్రిది అద్భుత బంతితో రోహిత్‌ను క్లీన్»ౌల్డ్ చేయడంతో జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత అఫ్రిది వరుస రెండు ఓవర్లలో కలిపి 5 ఫోర్లు బాదిన గిల్ జోరు ప్రదర్శించాడు. మరోవైపు కోహ్లి కూడా తనదైన శైలిలో చక్కటి షాట్లతో ఆధిక్యం ప్రదర్శించాడు. కోహ్లితో రెండో వికెట్‌కు 69 పరుగులు జోడించిన తర్వాత గిల్ వెనుదిరిగాడు. ఈ దశలో కోహ్లి, అయ్యర్ పార్ట్నర్íÙప్ జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లింది.వీరిద్దరు ఎక్కడా తడబాటు లేకుండా చక్కటి సమన్వయంతో దూసుకుపోయారు. వీరిని నిలువరించేందుకు పాక్ బౌలర్లు తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఈ క్రమంలో కోహ్లి 62 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 25 పరుగుల వద్ద అయ్యర్ ఇచ్చిన క్యాచ్‌ను షకీల్ వదిలేయడం కూడా కలిసొచ్చింది. అనంతరం 63 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. విజయానికి 28 పరుగుల దూరంలో అయ్యర్... 19 పరుగుల దూరంలో హార్దిక్ పాండ్యా (8) అవుటైనా ... అక్షర్ పటేల్ (3 నాటౌట్)తో కలిసి కోహ్లి మ్యాచ్ ముగించాడు. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: ఇమామ్ (రనౌట్) 10; బాబర్ (సి) రాహుల్ (బి) పాండ్యా 23; షకీల్ (సి) అక్షర్ (బి) పాండ్యా 62; రిజ్వాన్ (బి) అక్షర్ 46; సల్మాన్ (సి) జడేజా (బి) కుల్దీప్ 19; తాహిర్ (బి) జడేజా 4; ఖుష్దిల్ (సి) కోహ్లి (బి) రాణా 38; అఫ్రిది (ఎల్బీ) (బి) కుల్దీప్ 0; నసీమ్ (సి) కోహ్లి (బి) కుల్దీప్ 14; రవూఫ్ (రనౌట్) 8; అబ్రార్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 241. వికెట్ల పతనం: 1–41, 2–47, 3–151, 4–159, 5–165, 6–200, 7–200, 8–222, 9–241, 10–241. బౌలింగ్: షమీ 8–0–43–0, హర్షిత్ రాణా 7.4–0–30–1, హార్దిక్ పాండ్యా 8–0–31 –2, అక్షర్ పటేల్ 10–0–49–1, కుల్దీప్ యాదవ్ 9–0–40–3, జడేజా 7–0–40–1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (బి) షాహిన్ అఫ్రిది 20; గిల్ (బి) అబ్రార్ 46; విరాట్ కోహ్లి (నాటౌట్) 100; శ్రేయస్ అయ్యర్ (సి) ఇమామ్ (బి) ఖుష్దిల్ 56; పాండ్యా (సి) రిజ్వాన్ (బి) షాహిన్ అఫ్రిది 8; అక్షర్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (42.3 ఓవర్లలో 4 వికెట్లకు) 244. వికెట్ల పతనం: 1–31, 2–100, 3–214, 4–223. బౌలింగ్: అఫ్రిది 8–0–74–2, నసీమ్ షా 8–0–37–0, హారిస్ రవూఫ్ 7–0–52–0, అబ్రార్ 10–0–28–1, ఖుష్దిల్ 7.3–0–43–1, సల్మాన్ 2–0–10–0. 14000 వన్డేల్లో 14 వేల పరుగులు దాటిన మూడో ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. సచిన్ (350), సంగక్కర (378)కంటే చాలా తక్కువ ఇన్నింగ్స్ (287)లలో అతను ఈ మైలురాయిని దాటాడు.158 వన్డేల్లో కోహ్లి క్యాచ్‌ల సంఖ్య. అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత ఫీల్డర్‌గా అజహరుద్దీన్ (156) రికార్డును అతను అధిగమించాడు. 82 అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి కోహ్లి శతకాల సంఖ్య. వన్డేల్లో 51, టెస్టుల్లో 30, టి20ల్లో 1 సెంచరీ అతని ఖాతాలో ఉన్నాయి. చాంపియన్స్ ట్రోఫీలో నేడున్యూజిలాండ్ X బంగ్లాదేశ్మధ్యాహ్నం గం. 2:30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
IND Vs PAK: చాలా సంతోషంగా ఉంది.. అతడు అందుకే నెం1 అయ్యాడు: విరాట్ కోహ్లి
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. పాకిస్తాన్‌పై తనకు తిరుగులేదని మరోసారి నిరూపించున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 242 పరుగుల లక్ష్య చేధనలో కోహ్లి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ ఔటయ్యక క్రీజులోకి విరాట్.. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. తొలుత శుబ్‌మన్ గిల్‌తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పిన కోహ్లి.. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్‌తో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో 94 బంతుల్లో తన 51వ వన్డే సెంచరీ మార్క్‌ను కింగ్ కోహ్లి అందుకున్నాడు. ఓవరాల్‌గా కోహ్లికి ఇది 81వ అంతర్జాతీయ సెంచరీ కావడం గమనార్హం. కాగా కోహ్లి అద్భుత సెంచరీ ఫలితంగా 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ 4 వికెట్లు కోల్పోయి 42.3 ఓవర్లలో చేధించింది. దీంతో చిరకాల ప్రత్యర్ధిపై 6 వికెట్ల తేడాతో రోహిత్ సేన విజయాన్ని అందించాడు."సెమీస్‌కు ఆర్హత సాధించడానికి అవసరమైన మ్యాచ్‌లో ఈ తరహా ఇన్నింగ్స్ ఆడటం చాలా సంతోషంగా ఉంది. ఆరంభంలోనే రోహిత్ వికెట్ కోల్పోయిన తర్వాత ఆఖరి వరకు ఉండి మ్యాచ్‌ను ఫినిష్ చేయాలనుకున్నాను. ఆఖరి మ్యాచ్‌లో చేసిన తప్పిదాలు ఈ రోజు చేయకూడదని నిర్ణయించుకున్నాను. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్ల బౌలింగ్‌లో ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకువెళ్లడమే నా పని. కానీ శ్రేయస్ అయ్యర్ మాత్రం ఆఖరిలో స్పిన్నర్లను ఎటాక్ చేసి బౌండరీలు రాబాట్టాడు. నాకు కూడా కొన్ని బౌండరీలు వచ్చాయి. గతంలో ఛేజింగ్‌లో ఏ విధంగా ఆడానో, ఈ మ్యాచ్‌లో కూడా అదే చేశాను. నా ఆట తీరుపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నా ఫామ్‌పై వస్తున్న వార్తలను పెద్దగా పట్టించుకోను. బయట విషయాలకు దూరంగా ఉంటాను. అలా అని పొగడ్తలకు పొంగిపోను. జట్టు కోసం వంద శాతం ఎఫక్ట్ పెట్టడమే నా పని. ఇక రోహిత్ ఔటైనప్పటికి శుబ్‌మన్ మాత్రం అద్బుతంగా ఆడాడు.షహీన్ అఫ్రిది లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్‌ను ఎటాక్ చేసి ఒత్తిడిలో పెట్టాడు. అందుకే అతడు ప్రపంచంలోనే నంబర్ వన్ బ్యాటర్ బ్యాటర్ అయ్యాడు. శ్రేయస్ కూడా నాలుగో స్ధానంలో బాగా ఆడాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లలో అయ్యర్‌తో కలిసి కొన్ని భాగస్వామ్యాలు నెలకొల్పాను. ఈ రోజు కూడా ఇద్దరం కలిసి మ్యాచ్‌ను విజయానికి దగ్గరగా తీసుకువెళ్లామని" మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ కోహ్లి పేర్కొన్నాడు.చదవండి: విరాట్ కోహ్లి ప్రపంచ రికార్డు.. సచిన్‌కు సాధ్యం కాని ఘనత -
IND Vs PAK: కోహ్లి సెంచరీ.. పాక్‌పై భారత్ ఘన విజయం
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా దాయాది పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో టీమిండియా విజయభేరి మోగించింది. ఈ గెలుపుతో భారత్ తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు దాదాపు ఖారారు చేసుకున్నట్లే. పాకిస్తాన్ నిర్ధేశించిన 242 పరుగుల టార్గెట్‌ను భారత్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 42.3 ఓవర్లలో ఊదిపడేసింది.విరాట్ సూపర్ సెంచరీ..భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి సూపర్ సెంచరీతో మెరిశాడు. రోహిత్ శర్మ ఔటయ్యక క్రీజులోకి విరాట్.. అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తొలుత శుబ్‌మన్ గిల్‌తో కలిసి విలువైన పార్టనర్షిప్ నెలకొల్పిన కోహ్లి.. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్‌తో కలిసి మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యం నమోదు చేశాడు.ఈ క్రమంలో 111 బంతుల్లో తన 51వ వన్డే సెంచరీ మార్క్‌ను కింగ్ కోహ్లి అందుకున్నాడు. కోహ్లి 111 బంతుల్లో 7 ఫోర్లతో సరిగ్గా 100 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కోహ్లికి ఇది 82వ అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. ఇక కోహ్లితో పాటు శ్రేయస్ అయ్యర్(67 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 56), శుబ్‌మన్ గిల్(46) పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది రెండు వికెట్లు పడగొట్టగా.. ఆర్బర్ ఆహ్మద్, కుష్దిల్ షా తలా రెండు వికెట్లు వికెట్ సాధించారు.చెలరేగిన భారత బౌలర్లు.. అంతకముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో సౌద్ షకీల్(62) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ రిజ్వాన్(46), ఖుష్దిల్ షా(38) మెరుగ్గా ఆడారు. ఇక భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడనుంది.చదవండి: IND vs PAK: అఫ్రిది కళ్లు చెదిరే యార్కర్.. రోహిత్ శర్మ షాక్! వీడియో వైరల్ -
IND Vs PAK: విరాట్ కోహ్లి ప్రపంచ రికార్డు.. సచిన్‌కు సాధ్యం కాని ఘనత
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ప్రపంచ రికార్డు(Virat Kohli World Record) సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా పద్నాలుగు వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్, క్రికెట్ దేవుడుగా పేరొందిన సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar) ఆల్‌టైమ్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ అరుదైన ఘనత సాధించాడు.రాణించిన భారత బౌలర్లుకాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భాగంగా భారత్ ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొట్టింది. దుబాయ్‌లో టాస్ ఓడి తొలుత ఫీల్డింగ్ చేసిన రోహిత్ సేన.. రిజ్వాన్ బృందాన్ని 241 పరుగులకు కట్టడి చేసింది. టీమిండియా బౌలర్లలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రెండు కీలక వికెట్లు కూల్చాడు.మిగతా వాళ్లలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీయగా.. పేసర్లలో హర్షిత్ రాణా కూడా ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఇక పాక్ విధించిన 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు.ఈ క్రమంలో 15 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఒక సిక్సర్ బాది 20 పరుగులు చేసిన హిట్‌మ్యాన్.. పాక్ ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది వేసిన అద్భుత బంతికి బౌల్డ్ అయ్యాడు. దీంతో రోహిత్ స్థానంలో క్రీజులోకి వచ్చిన కోహ్లి గిల్‌తో కలిసి నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. అయితే, పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ సూపర్ డెలివరీతో గిల్(46)ను పెవిలియన్‌కు పంపాడు.తొలి క్రికెటర్‌గా వరల్డ్ రికార్డుఈ నేపథ్యంలో సరిగ్గా వంద పరుగులు చేసిన తర్వాత టీమిండియా రెండో వికెట్ కోల్పోగా.. కోహ్లి ఆచితూచి ఆడుతూ సహనం ప్రదర్శించాడు. ఈ క్రమంలో పదిహేను పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి వన్డేల్లో 14000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా ఈ రన్‌మెషీన్ నిలిచాడు. అంతేకాదు.. అత్యంత వేగంగా అంటే.. తక్కువ ఇన్నింగ్స్‌లోనే ఈ మైల్స్టోన్ అందుకున్న తొలి క్రికెటర్‌గా వరల్డ్ రికార్డు సాధించాడు.కాగా వన్డేల్లో పద్నాలుగు వేల పరుగులు చేయడానికి సచిన్ టెండుల్కర్‌కు 350 ఇన్నింగ్స్ అవసరమైతే.. కోహ్లి 287వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించడం విశేషం. తద్వారా 300లోపు ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ నమోదు చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే వన్డేల్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో కోహ్లి మూడో స్థానానికి ఎగబాకాడు. ఇదిలా ఉంటే.. పాక్‌తో మ్యాచ్‌లో శతకంతో లక్ష్య ఛేదన పూర్తి చేసి జట్టును గెలిపించాడు.వన్డేల్లో అత్యధిక పరుగుల వీరులు1.సచిన్ టెండుల్కర్(ఇండియా)- 18426 రన్స్(452 ఇన్నింగ్స్)2.కుమార్ సంగక్కర(శ్రీలంక)- 14234 రన్స్(380 ఇన్నింగ్స్)3.విరాట్ కోహ్లి(ఇండియా)- 14000+ రన్స్(287 ఇన్నింగ్స్)*4. రిక్కీ పాంటింగ్(ఆస్ట్రేలియా)- 13704 రన్స్(365 ఇన్నింగ్స్)5. సనత్ జయసూర్య(శ్రీలంక)- 13430 రన్స్(433 ఇన్నింగ్స్).చదవండి: కోహ్లి సరికొత్త చరిత్ర.. భారత్ తరఫున తొలి ఆటగాడిగా అరుదైన ఫీట్ -
IND Vs PAK: అఫ్రిది కళ్లు చెదిరే యార్కర్.. రోహిత్ శర్మ షాక్! వీడియో వైరల్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో దుబాయ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ స్పీడ్ స్టార్ షాహీన్ అఫ్రిది సంచలన బంతితో మెరిశాడు. అఫ్రిది ఇన్‌స్వింగ్ యార్కర్‌తో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు రోహిత్ శర్మ ఘనమైన ఆరంభించేందుకు ప్రయత్నించాడు.అందుకు తగ్గట్టుగానే భారత ఇన్నింగ్స్ రెండో ఓవర్లో సిక్సర్, ఫోర్ బాది రోహిత్ మంచి టచ్‌లో కన్పించాడు. దీంతో కెపెన్ నుంచి భారీ ఇన్నింగ్స్ రావడం ఖాయమని అందరూ భావించారు. కానీ షాహీన్ అఫ్రిది మాత్రం అందరి ఆశలపై నీళ్లు చల్లాడు. ఐదో ఓవర్ వేసిన అఫ్రిది ఆఖరి బంతిని రోహిత్‌కు అద్బుతమైన ఇన్‌స్వింగింగ్ యార్కర్‌గా సంధించాడు.అఫ్రిది వేసిన బంతికి రోహిత్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. హిట్‌మ్యాన్ తన బ్యాట్‌ను కిందకు దించే లోపే బంతి వెళ్లి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో రోహిత్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. రోహిత్ 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 20 పరుగులు చేశాడు.మూడేసిన కుల్దీప్.. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో సౌద్ షకీల్(62) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ రిజ్వాన్(46), ఖుష్దిల్ షా(38) మెరుగ్గా ఆడారు. ఇక భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు.చదవండి: IND vs PAK: రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు.. What a yorker by Shaheen AfridiRohit Sharma gone 🔥🔥Pakistan vs India | India vs Pakistan#ViratKohli𓃵 #ICCChampionsTrophy2025 #RohitSharma𓃵 #BabarAzam𓃵 #CT25 #PakistanCricket #INDvsPAK #ENGvsAUS #ENGvAUS #AUSvENG #AUSvsENG #PAKvIND #PAKvsINDIA #INDvPAK #IndiavsPakistan pic.twitter.com/3Jzczetqth— SOHAIB (@S0HAIB_7) February 23, 2025 -
IND Vs PAK: భారత్-పాక్ మ్యాచ్.. సందడి చేసిన చిరంజీవి (ఫోటోలు)
-
IND vs PAK: రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంతవేగంగా 9000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఓపెనర్‌గా రోహిత్ వరల్డ్ రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఒక్క పరుగు వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ ఈ ఘనతను అందుకున్నాడు.హిట్‌మ్యాన్ ఈ ఫీట్‌ను కేవలం 181 ఇన్నింగ్స్‌లలో సాధించాడు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ 197 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్ సాధించాడు. ఇక ఓవరాల్‌గా ఈ రికార్డు సాధించిన ఆరో ప్లేయర్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు.కాగా వన్డే ఫార్మాట్లో రోహిత్ శర్మకు అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు ఏకంగా తన కెరీర్లో మూడు డబుల్ సెంచరీలను రోహిత్ నమోదు చేశాడు. ఓవరాల్‌గా తన కెరీర్లో 270 వన్డేలు ఆడిన రోహిత్..48.89 సగటుతో 11049 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 32 సెంచరీలు ఉన్నాయి. ఇక పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో రోహిత్ క్విక్ ఇన్నింగ్స్ ఆడి ఔటయ్యాడు. 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 20 పరుగులు చేశాడు. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో వన్‌డౌన్ బ్యాటర్ సౌద్ షకీల్(62) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ రిజ్వాన్(46), ఖుష్దిల్ షా(38) మెరుగ్గా ఆడారు. ఇక భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు.వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్లు వీరే..సచిన్ టెండూల్కర్-15310సనత్ జయసూర్య- 12740క్రిస్ గేల్-10179ఆడమ్ గిల్‌క్రిస్ట్- 9200సౌరవ్ గంగూలీ- 9146రోహిత్ శర్మ 9000చదవండి: ‘ఏంటిది?’.. రిజ్వాన్ చర్యకు హర్షిత్ రాణా రియాక్షన్ వైరల్.. గంభీర్ కూడా! -
IND Vs PAK: కోహ్లి సరికొత్త చరిత్ర.. భారత్ తరఫున తొలి ఆటగాడిగా అరుదైన ఫీట్
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు(Most Catches) పట్టిన ఫీల్డర్‌గా అరుదైన ఘనత సాధించాడు. దాయాది పాకిస్తాన్(India vs Pakistan)తో మ్యాచ్ సందర్భంగా కోహ్లి ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును ఈ మాజీ సారథి బద్దలు కొట్టాడు.241 పరుగులకు పాక్ ఆలౌట్చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా గ్రూప్-‘ఎ’లో ఉన్న భారత్ తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడింది. దుబాయ్‌లో గురువారం నాటి మ్యాచ్‌లో బంగ్లాను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తాజాగా అదే వేదికపై చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొట్టిన భారత్ 241 పరుగులకు దాయాదిని ఆలౌట్ చేసింది.బాబర్ ఆజం(23), సౌద్ షకీల్(62) రూపంలో రెండు కీలక వికెట్లను హార్దిక్ పాండ్యా దక్కించుకోగా.. కుల్దీప్ యాదవ్ సల్మాన్ ఆఘా(19), షాహిన్ ఆఫ్రిది(0), నసీం షా(14)లను అవుట్ చేశాడు. ఇక అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా ఒక్కో వికెట్ తీయగా.. అక్షర్ పటేల్ ఇమామ్-ఉల్-హక్(10), హ్యారిస్ రవూఫ్(8) రనౌట్లలో భాగమయ్యాడు.Jaha matter bade hote hai, waha @hardikpandya7 khade hote hai! 😎Two big wickets in two overs & #TeamIndia are in the driver's seat! 🇮🇳💪#ChampionsTrophyOnJioStar 👉 #INDvPAK | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2 & Sports 18-1!📺📱 Start Watching… pic.twitter.com/Neap2t4fWC— Star Sports (@StarSportsIndia) February 23, 2025 కోహ్లి సరికొత్త చరిత్రఅయితే, ఈ మ్యాచ్‌లో కోహ్లి రెండు సూపర్ క్యాచ్‌లు అందుకుని తన పేరును చరిత్రలో పదిలం చేసుకున్నాడు. తొలుత కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో నసీం షా ఇచ్చిన క్యాచ్‌ను అందుకున్న కోహ్లి.. అనంతరం హర్షిత్ రాణా బౌలింగ్‌లో ఖుష్దిల్ షా(38) ఇచ్చిన క్యాచ్‌ను అద్భుత రీతిలో అందుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా తరఫున వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్‌గా కోహ్లి నిలిచాడు. అంతకు ముందు మహ్మద్ అజారుద్దీన్ పేరిట ఈ రికార్డు ఉండేది. ఇప్పుడు కోహ్లి దానిని బద్దలు కొట్టాడు. ఇక జాబితాలో ఓవరాల్‌గా శ్రీలంక స్టార్ మహేళ జయవర్దనే(218), ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్(160) ఈ జాబితాలో టాప్-2లో కొనసాగుతున్నారు.వన్డేల్లో టీమిండియా తరఫున అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్లు1. విరాట్ కోహ్లి- 1582. మహ్మద్ అజారుద్దీన్- 1563. సచిన్ టెండుల్కర్- 1404. రాహుల్ ద్రవిడ్- 1245. సురేశ్ రైనా- 102.చాంపియన్స్ ట్రోఫీ-2025: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ తుదిజట్లుటీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.పాకిస్తాన్సౌద్ షకీల్, బాబర్ ఆజం, ఇమామ్-ఉల్ -హక్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్/వికెట్ కీపర్), సల్మాన్ ఆఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహిన్ అఫ్రిది, నసీం షా, హ్యారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.చదవండి: ‘ఏంటిది?’.. రిజ్వాన్ చర్యకు హర్షిత్ రాణా రియాక్షన్ వైరల్.. గంభీర్ కూడా! -
రాణించిన భారత బౌలర్లు.. 241 పరుగులకు పాక్ ఆలౌట్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 41.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లతో సత్తాచాటాడుఫస్ట్ స్పెల్‌లో వికెట్ లెస్‌గా వెనుదిరిగిన కుల్దీప్.. తన రెండో స్పెల్‌లో మాత్రం అదరగొట్టాడు. అతడితో హార్దిక్ పాండ్యా సైతం బంతితో మ్యాజిక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో మంచి టచ్‌లో కన్పించిన పాక్ ఓపెనర్ బాబర్ ఆజంను హార్దిక్ ఔట్ చేసి భారత్‌కు తొలి వికెట్‌ను అందించాడు.అదే విధంగా హాఫ్ సెంచరీతో మెరిసిన సౌద్ షకీల్‌ను కూడా పాండ్యానే పెవిలియన్‌కు పంపాడు. ఓవరాల్‌గా 8 ఓవర్లు బౌలింగ్ చేసిన పాండ్యా.. కేవలం 31 పరుగులిచ్చి 2 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. వీరిద్దరితో పాటు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలా వికెట్ సాధించారు.ఇక పాకిస్తాన్ బ్యాటర్లలో సౌద్ షకీల్(76 బంతుల్లో 5ఫోర్లతో 62) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(46), కుష్దీల్ షా(38) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. మరి 242 పరుగుల టార్గెట్‌ను భారత్ సునాయసంగా ఛేదిస్తుందో లేదా పాక్ డిఫెండ్ చేసుకుంటుందో వేచి చూడాలి.చదవండి: ‘ఏంటిది?’.. రిజ్వాన్ చర్యకు హర్షిత్ రాణా రియాక్షన్ వైరల్.. గంభీర్ కూడా! -
‘ఏంటిది?’.. రిజ్వాన్ చర్యకు హర్షిత్ రాణా రియాక్షన్ వైరల్.. గంభీర్ కూడా!
పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా యువ బౌలర్ హర్షిత్ రాణా(Harshit Rana) అసహనానికి గురయ్యాడు. దాయాది జట్టు కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(Mohammad Rizwan) చేసిన పనికి అతడు ఇచ్చిన రియాక్షన్ వైరల్‌గా మారింది. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) బుధవారం(ఫిబ్రవరి 19) మొదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం తమ తొలి మ్యాచ్ ఆడిన రోహిత్ సేన.. బంగ్లాదేశ్‌ను ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది.కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఇక రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థిని పాకిస్తాన్‌తో తలపడుతున్న టీమిండియా టాస్ ఓడి తొలుత ఫీల్డింగ్ చేసింది. ఆరంభం నుంచే భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పాక్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఓపెనర్ బాబర్ ఆజం(23)ను హార్దిక్ పాండ్యా పెవిలియన్‌కు పంపగా.. మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(10)ను రనౌట్ చేశాడు అక్షర్ పటేల్.Jaha matter bade hote hai, waha @hardikpandya7 khade hote hai! 😎Two big wickets in two overs & #TeamIndia are in the driver's seat! 🇮🇳💪#ChampionsTrophyOnJioStar 👉 #INDvPAK | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2 & Sports 18-1!📺📱 Start Watching… pic.twitter.com/Neap2t4fWC— Star Sports (@StarSportsIndia) February 23, 2025ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ సౌద్ షకీల్(62) కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. భారత స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఈ జోడీని విడదీశాడు. రిజ్వాన్(46)ను బాపూ బౌల్డ్ చేయడంతో 104 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో సౌద్ షకీల్ ఇచ్చిన క్యాచ్‌ను అక్షర్ పట్టడంతో వరుస విరామాల్లో పాక్ వికెట్లు కోల్పోయింది.ఆ తర్వాత తయ్యబ్ తాహిర్(4)ను రవీంద్ర జడేజా పెవిలియన్‌కు పంపగా.. వరుస బంతుల్లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సల్మాన్ ఆఘా(19), షాహిన్ ఆఫ్రిది(0)లను అవుట్ చేశాడు. ఇదిలా ఉంటే.. యువ పేసర్ హర్షిత్ రాణా మాత్రం ఈ మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో రిజ్వాన్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను వదిలేసిన ఈ ఫాస్ట్‌బౌలర్.. ఖుష్దిల్ షా(38)ను అవుట్ చేసి పాక్ ఇన్నింగ్స్‌లో ఆఖరి వికెట్‌ను దక్కించుకున్నాడు. ఏంటిది?ఇక మొత్తంగా ఈ మ్యాచ్‌లో హర్షిత్ రాణా 7.4 ఓవర్ల బౌలింగ్‌లో 30 రన్స్ ఇచ్చాడు. అయితే, పొదుపుగా బౌలింగ్ చేసిన హర్షిత్ రాణా ఆట కంటే.. రిజ్వాన్‌తో ఢీకొట్టిన విధానంతో ఎక్కువ హైలైట్ అయ్యాడు. పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో 21వ ఓవర్‌ను రాణా వేశాడు.అప్పుడు క్రీజులో ఉన్న రాణా వేసిన షార్ట్ బాల్‌ను డీప్ లెగ్స్వ్కేర్ దిశగా షాట్ బాది సింగిల్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో రాణా తన లైన్లోనే ఉండగా.. రిజ్వాన్ మాత్రం పరిగెడుతూ కాస్త పక్కకు జరిగి రాణాను ఢీకొట్టాడు. దీంతో అతడు రిజ్వాన్‌ను వైపు గుర్రుగా చూస్తూ.. ‘ఏంటిది?’’ అన్నట్లుగా సీరియస్ అయ్యాడు. ఇక డగౌట్లో ఉన్న టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కూడా రిజ్వాన్ తీరుకు కాస్త అసహనంగా ఫీలైనట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. పాక్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా ఒక్కో వికెట్ తీశారు. అక్షర్ పటేల్ రెండు రనౌట్లలో భాగమయ్యాడు.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 42.3 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ విరాట్ కోహ్లి అజేయ శతకం(100)తో జట్టును విజయతీరాలకు చేర్చగా.. మిగతా భారత బ్యాటర్లలో శుబ్‌మన్ గిల్(46), శ్రేయస్ అయ్యర్(46) అదరగొట్టారు.చదవండి: IND vs PAK: బాబర్ ఆజం అరుదైన రికార్డు..Md. Rizwan collide with Harshit Rana .And Harhit dont control his emotion and that we want .Recreate Gambhir-Afridi Moment#INDvsPAK #ChampionTrophy2025 pic.twitter.com/5pRDBliPuX— Bowler 🆚 Batsman (@ICT__buzz) February 23, 2025 -
అక్షర్ పటేల్ బుల్లెట్ త్రో.. పాక్ ఓపెనర్ మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అద్బుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచాడు. అక్షర్ సంచలన త్రోతో పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 9 ఓవర్లో బాబర్ ఆజం రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఓవర్లోనే ఇమామ్ ఉల్ హక్ దూరదృష్టవశాత్తూ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. పాక్ ఇన్నింగ్స్ పదో ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో రెండో బంతికి ఇమామ్ మిడాన్ దిశగా ఆడాడు. షాట్ ఆడిన వెంటనే ఇమామ్ నాన్‌స్టైకర్ ఎండ్‌వైపు సింగిల్ కోసం ప్రయత్నించాడు.కానీ మిడాన్‌లో ఉన్న అక్షర్ పటేల్ డైరక్ట్త్రోతో స్టంప్స్‌ను గిరాటేశాడు. ఇమామ్ డైవ్ చేసినప్పటికి ఫలితం మాత్రం లేకపోయింది. దీంతో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఇమామ్ పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.అదేవిధంగా ఓ క్యాచ్‌ను అక్షర్ ఈ మ్యాచ్‌లో అందుకున్నాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్ తడబడుతోంది. 44 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఇప్పటివరకు హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు సాధించగా.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలా వికెట్ సాధించారు.చదవండి: IND vs PAK: టీమిండియా చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి జట్టుగా Bapu, tari fielding kamaal chhe...!!! 🔥 pic.twitter.com/uL1YObjwvJ— Mufaddal Vohra (@mufaddal_vohra) February 23, 2025 -
#INDvsPAK : భారత్-పాకిస్తాన్ మ్యాచ్ హైలైట్స్ (ఫోటోలు)
-
బాబర్ ఆజం అరుదైన రికార్డు..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం(Babar Azam) మరోసారి తన మార్క్‌ను చూపించడంలో విఫలమయ్యాడు. ఈ మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై హాఫ్ సెంచరీతో పర్వాలేదన్పించిన బాబర్.. టీమిండియాతో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో మాత్రం నామమాత్రపు స్కోర్‌కే పరిమితమయ్యాడు.ఓపెనర్‌గా బరిలోకి దిగిన బాబర్.. 26 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 23 పరుగులు చేసి ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఆజం ఔటయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో బాబర్ పెద్ద ఇన్నింగ్స్ ఆడకపోయినప్పటికి.. ఓ అరుదైన రికార్డును మాత్రం తన పేరిట లిఖించుకున్నాడు.మూడో పాక్ బ్యాటర్‌గా..ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో 1000 పరుగుల మైలు రాయిని అందుకున్న మూడో పాకిస్తాన్ బ్యాటర్‌గా బాబర్ ఆజం రికార్డులకెక్కాడు. హర్షిత్ రాణా బౌలింగ్‌లో కవర్ డ్రైవ్ షాట్‌తో బాబర్ ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఈ ఘనత సాధించడానికి ఆజంకు 24 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో పాకిస్తాన్ దిగ్గజ ఓపెనర్ సయీద్ అన్వర్(1204) అగ్రస్ధానంలో ఉండగా.. రెండో స్ధానంలో జావేద్ మియాందాద్(1083) ఉన్నారు. కాగా బాబర్ ఆజం గత కొంత కాలంగా తన స్దాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతడి చివరి సెంచరీ ఆగస్టు 2023లో నేపాల్‌పై సాధించాడు.అప్పటి నుంచి మూడెంకెల స్కోర్‌ను ఈ మాజీ అందుకోలేకపోతున్నాడు. ఓవరాల్‌గా తన కెరీర్లో ఇప్పటివరకు 128 వన్డేలు ఆడిన ఆజం.. 55.51 సగటుతో 6106 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 19 సెంచరీలు ఉన్నాయి. చదవండి: Ind vs Pak: పాక్‌తో మ్యాచ్‌లో అతడిని ఆడించాల్సింది.. కానీ: గావస్కర్ -
పాక్‌తో మ్యాచ్‌లో అతడిని ఆడించాల్సింది.. కానీ: గావస్కర్
బంగ్లాదేశ్‌పై గెలుపొంది చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)ని విజయంతో ఆరంభించింది టీమిండియా. రెండో మ్యాచ్‌లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో రోహిత్ సేన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్(India vs Pakistan)ను ఢీకొట్టింది. దుబాయ్ వేదికగా ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ భారత జట్టును తొలుత ఫీల్డింగ్‌కు ఆహ్వానించింది.ఆ నలుగురు మళ్లీ బెంచ్ మీదేఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. బంగ్లాదేశ్‌తో ఆడిన తుదిజట్టునే పాక్‌తో మ్యాచ్‌లోనూ కొనసాగించింది. స్టార్ ప్లేయర్లు రిషభ్ పంత్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్‌కు మరోసారి మొండిచేయి చూపింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ టాస్ సమయంలో స్పోర్ట్స్ ప్రజెంటర్ మయాంతి లాంగర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ప్లేయింగ్ ఎలెవన్ విషయంలో మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాడు.ఒక్క మార్పు చేసి ఉంటే బాగుండేది..‘‘అయినా.. వాళ్లెందుకు తుదిజట్టులో మార్పులు చేయాలి? ఇది స్లో వికెట్. అంతేగాక ప్రస్తుత ప్లేయింగ్ ఎలెవన్‌తోనే వారు గత మ్యాచ్ గెలిచారు. అయితే, ఒక్క మార్పు చేసి ఉంటే బాగుండేది. వరుణ్ చక్రవర్తిని పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆడించి ఉండాల్సింది. కానీ గత మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన మహ్మద్ షమీని ఎలా పక్కనపెట్టగలరు?అంతేగాక.. మరో పేసర్ హర్షిత్ రాణా కూడా గత మ్యాచ్‌లో ఎలాంటి తప్పిదాలు చేయలేదు. అందుకే టీమిండియాపాక్తో పోరులోనూ అదే జట్టుతో బరిలోకి దిగింది’’ అని సునిల్ గావస్కర్ నిక్కచ్చిగా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ మాత్రం ఒక మార్పుతో మైదానంలో దిగింది. ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడిన సమయంలో ఫఖర్ జమాన్ గాయపడగా.. భారత్‌తో మ్యాచ్‌లో సౌద్ షకీల్‌తో అతడి స్థానాన్ని భర్తీ చేసింది.2017లో చివరిసారిగాకాగా చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత్- పాకిస్తాన్ 2017లో చివరిసారిగా తలపడ్డాయి. నాడు లీగ్ దశలో టీమిండియా గెలుపొందగా.. ఫైనల్లో మాత్రం పాకిస్తాన్ భారత జట్టును ఓడించిన టైటిల్ ఎగురేసుకపోయింది. ఈ క్రమంలో దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత మరోసారి చాంపియన్స్ ట్రోఫీ జరుగుతుండగా. ఆతిథ్య జట్టు హోదాలో డిఫెండింగ్ చాంపియన్‌గా పాక్ బరిలోకి దిగింది.అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడుతోంది. ఇక ఈ మెగా టోర్నీలో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ ట్రోఫీ కోసం తలపడుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో పాకిస్తాన్‌పై న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌పై భారత్, అఫ్గనిస్తాన్‌పై సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా గెలుపొందాయి. పాయింట్ల పట్టికలో గ్రూప్-ఎ నుంచి న్యూజిలాండ్.. గ్రూప్-బి నుంచి సౌతాఫ్రికా టాప్‌లో ఉన్నాయి.పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత తుదిజట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.పాకిస్తాన్ ప్లేయింగ్ ఎలెవన్సౌద్ షకీల్, బాబర్ ఆజం, ఇమామ్ ఉల్ హక్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్/వికెట్ కీపర్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహిన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్.చదవండి: షమీ చెత్త రికార్డు.. చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే.. -
టీమిండియా చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్-భారత్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ షురూ అయింది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్ధులు తాడోపేడో తెల్చుకుంటున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్‌లో పాక్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. గాయపడిన ఫఖార్ జమాన్ స్దానంలో ఇమామ్ ఉల్ హాక్ తుది జట్టులోకి వచ్చాడు. భారత్ మాత్రం తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు.టీమిండియా చెత్త రికార్డు..కాగా ఈ మ్యాచ్ ప్రారంభం కాకముందే టీమిండియా ఓ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. వన్డే క్రికెట్ చరిత్రలో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిన జట్టుగా భారత్ చెత్త రికార్డును నెలకొల్పింది. వన్డే వరల్డ్‌కప్-2023 నుంచి భారత్ ఇప్పటివరకు వన్డేల్లో వరుసగా 12 సార్లు టాస్ ఓడిపోయింది.ఇంతకుముందు ఈ రికార్డు నెదర్లాండ్స్ క్రికెట్ జట్టు పేరిట ఉండేది. డచ్ జట్టు 2011-2013 కాలంలో వరుసగా 11 సార్లు టాస్ ఓడిపోయింది. తాజా మ్యాచ్‌తో నెదర్లాండ్స్‌ను భారత్ అధిగమించింది. అదేవిధంగా వన్డేల్లో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిన మూడో కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచాడు.రోహిత్ ఇప్పటివరకు వరుసగా 9 సార్లు టాస్ ఓడిపోయాడు. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా అగ్రస్ధానం ఉన్నాడు. లారా వన్డేల్లో వరుసగా 12 సార్లు టాస్ ఓడిపోయాడు.తుది జట్లు..పాకిస్తాన్: సౌద్ షకీల్, బాబర్ ఆజమ్, ఇమామ్ ఉల్ హక్, రిజ్వాన్ (కెప్టెన్, సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, షమీ, కుల్దీప్ యాదవ్చదవండి: షమీ చెత్త రికార్డు.. చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే.. -
షమీ చెత్త రికార్డు.. చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే..
టీమిండియా వెటరన్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammad Shami) చెత్త రికార్డు నమోదు చేశాడు. పాకిస్తాన్(India vs Pakistan)తో మ్యాచ్‌లో ఆరంభ ఓవర్లోనే ఏకంగా ఐదు వైడ్‌బాల్స్(Five Wides) వేశాడు. తద్వారా చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఇన్నింగ్స్ ఆరంభ ఓవర్లోనే అత్యధికంగా ఐదు అదనపు పరుగులు సమర్పించుకున్న రెండో బౌలర్‌గా నిలిచాడు.విజయంతో ఆరంభంఅంతేకాదు.. వన్డేల్లో భారత్ తరఫున ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్ పేరిట ఉన్న మరో చెత్త రికార్డును షమీ సమం చేశాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో దుబాయ్‌లో తమ తొలి మ్యాచ్ ఆడిన టీమిండియా విజయంతో ఈ మెగా టోర్నీని ఆరంభించింది.డాట్ బాల్స్, వైడ్లుతాజాగా అదే వేదికపై చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత ఫీల్డింగ్ చేయగా.. వెటరన్ పేసర్ షమీ బౌలింగ్ అటాక్ ఆరంభించాడు. అయితే, తొలి బంతిని బాగానే వేసిన ఈ రైటార్మ్ పేసర్ రెండో బంతిని వైడ్‌గా వేశాడు. అనంతరం పరుగు ఇవ్వని షమీ.. ఆ తర్వాత మళ్లీ వరుసగా రెండు వైడ్లు వేశాడు. ఆ మరుసటి బంతికి పరుగులేమీ ఇవ్వని షమీ.. అనంతరం ఒక పరుగు ఇచ్చి.. మళ్లీ డాట్ బాల్ వేశాడు.కానీ ఆ తర్వాత మళ్లీ రెండు రెండు వైడ్లు వేయడంతో కెప్టెన్ రోహిత్ శర్మ కాస్త అసహనానికి గురయ్యాడు. అయితే, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మాత్రం షమీని ఉత్సాహపరుస్తూ మరేం పర్లేదు అన్నట్లుగా ఊరటకలిగించాడు. ఇక ఆఖరి బంతిని డాట్ బాల్‌గా వేసిన షమీ తొలి ఓవర్లో వరుసగా 0 Wd 0 Wd Wd 0 1 0 Wd Wd 0 నమోదు చేశాడు. అలా మొత్తంగా పదకొండు బాల్స్ వేశాడు.అత్యధిక వైడ్ బాల్స్ వేసిన క్రికెటర్ల జాబితాలోతద్వారా చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఇలా ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే అత్యధిక వైడ్ బాల్స్ వేసిన క్రికెటర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. షమీ పాక్‌తో మ్యాచ్‌లో ఐదు వైడ్‌బాల్స్ వేయగా.. అంతకు ముందు జింబాబ్వే క్రికెటర్ టినాషే పన్యంగర 2004లో బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఏకంగా ఏడు వైడ్ బాల్స్ వేసి ఈ జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక వన్డేల్లో తొలి ఓవర్లో టీమిండియా తరఫున అత్యధిక బాల్స్ వేసిన బౌలర్ల జాబితాలో షమీ ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్ సరసన చేరాడు.ఇదిలా ఉంటే.. పాక్‌తో మ్యాచ్‌లో భారత్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తోంది. ఆరంభంలోనే షమీ కాస్త నిరాశపరిచినా ఆ తర్వాత పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. మరోవైపు.. యువ పేసర్ హర్షిత్ రాణా, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అదరగొడుతున్నారు. ఫలితంగా పవర్‌ప్లే ముగిసే సరికి పాకిస్తాన్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. పది ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి కేవలం 52 పరుగులే చేసింది. ఇందులో బాబర్ ఆజం(23) రూపంలో హార్దిక్ పాండ్యా కీలక వికెట్ తీయగా.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమైన మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ సింగిల్ తీసేందుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. అక్షర్ పటేల్ డైరెక్ట్ త్రో కారణంగా వికెట్ సమర్పించుకుని పది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు.పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో తొలి ఓవర్లో ఐదు వైడ్ బాల్స్ వేయడం ద్వారా షమీ పేరిట నమోదైన చెత్త రికార్డులు👉చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఇన్నింగ్స్ ఆరంభ ఓవర్లో అత్యధిక వైడ్లు వేసిన రెండో బౌలర్.👉వన్డేల్లో వైడ్స్, నో బాల్స్‌తో కలిపి తొలి ఓవర్లోనే అత్యధిక బంతులు బౌల్ చేసిన మూడో బౌలర్. ఈ జాబితాలో జహీర్ ఖాన్ వాంఖడే వేదికగా 2003లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో పదకొండు బంతులు వేసి ముందు వరుసలో ఉండగా.. ఇర్ఫాన్ పఠాన్ వెస్టిండీస్‌తో 2006లో కింగ్స్టన్ వేదికగా ఈ చెత్త గణాంకాలు నమోదు చేశాడు. చదవండి: ICC CT 2025 India vs Pakistan Updates: అప్డేట్లు -
పాకిస్థాన్ వర్సెస్ ఇండియా హైవోల్టేజ్ మ్యాచ్.. ఫ్యాన్స్ సందడి (ఫొటోలు)
-
CT 2025 Ind vs Pak: కోహ్లి సూపర్ సెంచరీ.. పాక్‌ను చిత్తు చేసిన భారత్
ICC CT 2025 India vs Pakistan Updates: చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్‌ను టీమిండియా చిత్తు చేసింది. 2017 ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. దాయాది జట్టు విధించిన 242 పరుగుల లక్ష్యాన్ని 42.3 ఓవర్లలోనే ఛేదించి ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. లక్ష్య ఛేదనలో కోహ్లి 42.3 ఓవర్లో కోహ్లి ఫోర్ బాది సెంచరీ పూర్తి చేసుకొని.. భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. కోహ్లి వంద పరుగులతో అజేయంగా నిలవగా.. శ్రేయస్ అయ్యర్(56), శుబ్‌మన్ గిల్(46) రాణించారు. ఈ విజయంతో భారత్ సెమీస్ రేసులో ముందుకు దూసుకుపోయింది.పాక్ 241 ఆలౌట్క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన దాయాదుల పోరుకు తెరలేచింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భాగంగా దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్(India vs Pakistan) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పాక్ తొలుతబ్యాటింగ్ చేసి 241 పరుగులకు ఆలౌట్ కాగా.. టీమిండియా ఛేజింగ్‌కు దిగింది.41 ఓవర్లలో టీమిండియా స్కోరు: 225-4విజయానికి ఇంకా 17 పరుగుల దూరంలో భారత్‌నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియాహార్దిక్ పాండ్యా రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. షాహిన్ ఆఫ్రిది బౌలింగ్‌లో పాండ్యా(8) కీపర్ రిజ్వాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. స్కోరు: 223-4. కోహ్లి 86 పరుగులతో ఉండగా అక్షర్ పటేల్ క్రీజులోకి వచ్చాడు. విజయానికి ఇంకా 19 పరుగులు కావాలి.మూడో వికెట్ కోల్పోయిన టీమిండియాశ్రేయస్ అయ్యర్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఖుష్దిల్ బౌలింగ్‌లో శ్రేయస్ ఇచ్చిన క్యాచ్‌ను ఇమామ్ అద్భుతరీతిలో క్యాచ్ అందుకున్నాడు. దీంతో 56 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శ్రేయస్ అయ్యర్ నిష్క్రమించాడు. హార్దిక్ పాండ్యా క్రీజులోకి రాగా కోహ్లి 85 పరుగులతో ఉన్నాడు. భారత్ స్కోరు: 215/3 (39). విజయానికి 66 బంతుల్లో 27 పరుగులు కావాలి.అర్ధ శతకం పూర్తి చేసుకున్న శ్రేయస్ అయ్యర్శ్రేయస్ అయ్యర్ తన వన్డే కెరీర్లో 21వ హాఫ్ సెంచరీ సాధించాడు. భారత్ విజయానికి ఇంకా 41 పరుగుల దూరంలో ఉంది. స్కోరు: 201/2 (37) విజయం దిశగా భారత్36 ఓవర్లలో టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. కోహ్లి 81, శ్రేయస్ 49 పరుగుల వద్ద ఉన్నారు. విజయానికి 42 పరుగులు కావాలి.34 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు: 185/2కోహ్లి 69, శ్రేయస్ 46 రన్స్‌తో ఆడుతున్నారు. పాక్‌పై గెలవాలంటే ఇంకా 57 పరుగులు కావాలి.టీమిండియా స్కోరు: 168/2 (31) కోహ్లి 65, శ్రేయస్ అయ్యర్ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు. విజయానికి ఇంకా 74 పరుగులు కావాలి.29 ఓవర్లలో టీమిండియా స్కోరు: 150/2.శ్రేయస్ అయ్యర్ 17, కోహ్లి 64 పరుగులతో ఉన్నారు. ఇద్దరూ కలిసి 69 బంతుల్లో యాభై పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. విజయానికి ఇంకా 92 పరుగులు కావాలి.కోహ్లి హాఫ్ సెంచరీవిరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ ఆచితూచి ఆడుతున్నారు. ఈ క్రమంలో 63 బంతుల్లో కోహ్లి అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. శ్రేయస్ అయ్యర్ 28 బంతుల్లో 12 పరుగులతో ఉన్నాడు. టీమిండియా స్కోరు: 132/2 (26.1).భారత్ రెండో వికెట్ డౌన్..100 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 46 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్.. అర్బర్ ఆహ్మద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. 18 ఓవర్లకు భారత్ స్కోర్: 102/214 ఓవర్లకు భారత్ స్కోర్: 87/114 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 87 పరుగులు చేసింది. క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి(23) దూకుడుగా ఆడుతున్నాడు. అతడితో పాటు శుబ్‌మన్ గిల్(41) పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.టీమిండియా తొలి వికెట్ డౌన్..242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. 20 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మను షాహీన్ అఫ్రిది అద్బుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు.దూకుడుగా ఆడుతున్న రోహిత్..4 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(16), శుబ్‌మన్ గిల్(9) పరుగులతో ఉన్నారు.2 ఓవర్లకు భారత్ స్కోర్: 12/02 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(11), శుబ్‌మన్ గిల్(0) ఉన్నారు.241 పరుగులకు పాక్ ఆలౌట్..టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్ ఎంచుకోగా.. రోహిత్ సేన ఫీల్డింగ్‌కు దిగింది. ఈ క్రమంలో 49.4 ఓవర్లలో పాకిస్తాన్ 241 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ బ్యాటర్లలో వన్‌డౌన్ బ్యాటర్ సౌద్ షకీల్(62) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ రిజ్వాన్(46), ఖుష్దిల్ షా(38) మెరుగ్గా ఆడారు. ఇక భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు.పాక్ ఆలౌట్.. స్కోరెంతంటే?49.4: హర్షిత్ రాణా బౌలింగ్‌లో ఖుష్దిల్ (38) కోహ్లికి క్యాచ్ ఇచ్చి పదో వికెట్‌గా వెనుదిరిగాడు. పాక్ స్కోరు: 241 (49.4).48.6: తొమ్మిదో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్షమీ బౌలింగ్‌లో హ్యారిస్ రవూఫ్ సింగిల్ పూర్తి చేసుకుని రెండోరన్ కోసం పరిగెత్తగా అక్షర్ పటేల్ అద్భుత త్రో వేశాడు. బంతిని అందుకున్న వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ స్టంప్స్‌ను గిరాటేయడంతో రవూఫ్(7) తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. పాక్ స్కోరు: 241/9 (49.2) 46.4: ఎనిమిదో వికెట్ కోల్పోయిన పాక్నసీం షా(14) రూపంలో పాకిస్తాన్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి నసీం పెవిలియన్ చేరాడు. పాక్ స్కోరు: 222/8 (47). ఖుష్దిల్ షా 27 పరుగులతో ఉన్నాడు. ఏడో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్42.5: కుల్దీప్ బౌలింగ్‌లో షాహిన్ ఆఫ్రిది లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగాడు.ఆరో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్42.4: కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఆరో వికెట్‌గా వెనుదిరిగిన సల్మాన్ ఆఘా. పందొమ్మిది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజాకు క్యాచ్ ఇచ్చిన సల్మాన్ పెవిలియన్ చేరాడు.40 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ స్కోరు: 183/5 (40)ఖుష్దిల్ షా 8, సల్మాన్ ఆఘా 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఐదో వికెట్ డౌన్రవీంద్ర జడేజా బౌలింగ్‌లో తయ్యబ్ తాహిర్(4) బౌల్డ్. ఐదో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్. స్కోరు: 165/5 (36.1) నాలుగో వికెట్ కోల్పోయిన పాక్34.5: హాఫ్ సెంచరీ వీరుడు సౌద్ షకీల్(62) రూపంలో పాకిస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో షకీల్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద అక్షర్ పటేల్ ఒడిసిపట్టాడు.33.2: మూడో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్అక్షర్ పటేల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయిన రిజ్వాన్. షకీల్‌తో కలిసి రిజ్వాన్ వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేయగా అక్షర్ ఈ జోడీని విడదీశాడు. 77 బంతులు ఎదుర్కొన్న రిజ్వాన్ మూడు ఫోర్ల సాయంతో 46 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. సల్మాన్ ఆఘా క్రీజులోకి వచ్చాడు. షకీల్ 57 పరుగులతో ఉన్నాడు.30 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ స్కోరు: 129/2రిజ్వాన్ 39, షకీల్ 44 రన్స్‌తో క్రీజులో ఉన్నారు.25 ఓవర్లలో పాకిస్తాన్ స్కోరు: 99/2షకీల్ 29, రిజ్వాన్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు.21 ఓవర్లలో పాకిస్తాన్ స్కోరు: 82-2రిజ్వాన్ 15, షకీల్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు.పొదుపుగా బౌల్ చేస్తున్న టీమిండియా ప్లేయర్లు17 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ స్కోరు: 72/2 (17). రిజ్వాన్ 23 బంతుల్లో 10, సౌద్ షకీల్ 27 బంతుల్లో 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.కట్టుదిట్టంగా భారత్ బౌలింగ్పవర్ప్లే ముగిసే సరికి పాకిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి కేవలం 52 పరుగులు చేసింది. రిజ్వాన్ 4, షకీల్ మూడు పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 52-29.2: రెండో వికెట్ డౌన్పాక్ మరో ఓపెనర్ ఇమామ్ రనౌట్‌గా వెనుదిరిగాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో మిడాన్ మీదుగా షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమైన ఇమామ్.. సింగిల్ కోసం వెళ్లాడు. అయితే, సరైన సమయంలో క్రీజులోకి చేరకోకపోవడంతో అవుటయ్యాడు. ఫీల్డర్ అక్షర్ పటేల్ డైరెక్ట్ త్రోతో వికెట్ కోల్పోయాడు. 26 బంతులు ఎదుర్కొని 10 పరుగులు చేసి ఇమామ్ వెనుదిరిగాడు. రిజ్వాన్ క్రీజులోకి వచ్చాడు. పాక్ స్కోరు: 48/2 (9.3) 8.2: తొలి వికెట్ కోల్పోయిన పాకిస్తాన్టీమిండియా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి బాబర్ ఆజం పెవిలియన్ చేరాడు. మొత్తంగా 26 బంతులు ఎదుర్కొన్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ఇమామ్‌కు జతగా సౌద్ షకీల్ క్రీజులోకి వచ్చాడు. పాక్ స్కోరు: 45/1 (8.3) ఆరు ఓవర్లలో పాక్ స్కోరు: 26/0 (6)బాబర్ 10, ఇమామ్ 9 పరుగులతో ఉన్నారు. మూడు ఓవర్లో పాకిస్తాన్ స్కోరు: 14-0రెండు ఓవర్లు ముగిసే సరికి పాక్ స్కోరు: 10-0బాబర్, ఇమామ్ చెరో రెండు పరుగులతో క్రీజులో ఉన్నారు.తొలి ఓవర్లో పాకిస్తాన్ స్కోరు: 6-0బాబర్ ఆజం 0, ఇమామ్ ఉల్ హక్ ఒక పరుగుతో ఉన్నారు. తొలి ఓవర్లో మీ ఏకంగా ఐదు వైడ్లు వేయడం గమనార్హం. తద్వారా పాకిస్తాన్‌కు అదనంగా ఐదు పరుగులు వచ్చాయి.భారత్ వర్సెస్ పాకిస్తాన్ తుది జట్లుభారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్పాకిస్తాన్: సౌద్ షకీల్, బాబర్ ఆజం, ఇమామ్ ఉల్ హక్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్/వికెట్ కీపర్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహిన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్. -
Champions Trophy 2025: పాక్‌తో కీలక సమరం.. మళ్లీ టాస్ ఓడిన రోహిత్ శర్మ
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్, పాకిస్తాన్ జట్లు ఇవాళ (ఫిబ్రవరి 23) తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ వరుసగా తొమ్మిదో మ్యాచ్‌లో టాస్ ఓడాడు. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఎలాంటి ప్రయోగాలు చేయలేదు. గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. పాక్ మాత్రం ఓ మార్పుతో బరిలోకి దిగింది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో గాయపడిన ఫకర్ జమాన్ స్థానంలో ఇమామ్ ఉల్ హక్ తుది జట్టులోకి వచ్చాడు. తుది జట్లు..పాకిస్తాన్: సౌద్ షకీల్, బాబర్ ఆజమ్, ఇమామ్ ఉల్ హక్, రిజ్వాన్ (కెప్టెన్, సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, షమీ, కుల్దీప్ యాదవ్ -
Champions Trophy 2025: భారత్‌తో కీలక సమరానికి ముందు పాక్‌కు బిగ్ షాక్..!
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్, పాకిస్తాన్ జట్లు ఇవాళ (ఫిబ్రవరి 23) తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు పాక్‌కు సంబంధించి ఓ చేదు వార్త వినిపిస్తుంది. భారత్‌తో మ్యాచ్‌కు స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్ దూరం కానున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. నిన్న జరిగిన ట్రైనింగ్ సెషన్స్‌లో బాబర్ పాల్గొనకపోవడంతో ఈ ప్రచారం మొదలైంది. బాబర్ కంటి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడని తెలుస్తుంది. ట్రైనింగ్ సెషన్స్‌కు బాబర్ మినహా అందరూ హాజరయ్యారు. బాబర్‌కు ఏమైందోనని పాక్ అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని గంటలు ఎదురుచూడాల్సిందే.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో (న్యూజిలాండ్‌తో) జిడ్డుగా (90 బంతుల్లో 64 పరుగులు) ఆడి బాబర్ విమర్శలపాలైన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న బాబర్ న్యూజిలాండ్‌పై హాఫ్ సెంచరీ చేసినప్పటికీ ముప్పేట దాడిని ఎదుర్కొన్నాడు. భారీ లక్ష్య ఛేదనలో బాబర్ నిదానంగా ఆడటం పాక్ విజయావకాశాలను దెబ్బ తీసింది. ఫామ్‌లో లేకపోయినా భారత్‌తో మ్యాచ్‌లో పాక్ బాబర్‌పై గంపెడాశలు పెట్టుకుంది. మిగతా మ్యాచ్‌ల్లో అతని ఫామ్ ఎలా ఉన్నా భారత్‌పై మాత్రం చెలరేగాలని పాక్ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే వారి ఊహలకు ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం చెక్ పెడుతుంది. దాయాదితో సమరంలో బాబర్ లేకపోతే తమ పరిస్థితి ఏంటని పాక్ అభిమానులు మదనపడిపోతున్నారు. ప్రస్తుతానికి ఫామ్‌లో లేకపోయినా పాక్ బ్యాటింగ్‌కు బాబరే పెద్ద దిక్కు. అతను మినహాయించి జట్టులో కెప్టెన్ రిజ్వాన్ ఒక్కడే అనుభవజ్ఞుడు. స్టార్ ప్లేయర్ ఫకర్ జమాన్ దూరమై (గాయం) ఇప్పటికే సతమతమవుతున్న పాక్‌కు.. బాబర్‌పై జరుగుతున్న ప్రచారం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఒకవేళ నేటి మ్యాచ్‌లో బాబర్ నిజంగా దూరమైతే అతని స్థానంలో కమ్రాన్ గులామ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. భారత్‌తో మ్యాచ్‌లో పాక్ బ్యాటింగ్ కంటే బౌలింగ్‌పైనే ఎక్కువగా ఆధారపడుతుంది. పేసర్లు షాహీన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్‌లపై ఆ జట్టు గంపెడాశలు పెట్టుకుంది.ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ భారత్‌పై స్వల్ప ఆధిక్యం కలిగి ఉంది. ఈ టోర్నీలో ఇరు జట్లు ఇప్పటివరకు ఐదు సార్లు తలపడగా.. పాక్ 3, భారత్ 2 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో చివరిసారి ఈ రెండు జట్లు తలపడినప్పుడు పాక్ పైచేయి సాధించింది. 2017 ఎడిషన్ ఫైనల్లో పాక్.. భారత్‌పై జయకేతనం ఎగురవేసి తొలిసారి ఛాంపియన్‌గా అవతరించింది.ఓవరాల్‌గా భారత్, పాకిస్తాన్ వన్డేల్లో ఇప్పటివరకు 135 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 57 సార్లు విజయం సాధించగా.. పాక్ 73 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. 5 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.భారత్, పాక్ మ్యాచ్‌కు తుది జట్లు (అంచనా)..పాకిస్తాన్: సౌద్ షకీల్, ఇమామ్ ఉల్ హక్, రిజ్వాన్ (కెప్టెన్,, కమ్రాన్ గులామ్, సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, షమీ, కుల్దీప్ యాదవ్ -
Champions Trophy 2025: దాయాదుల సమరం.. చరిత్ర ఏం చెబుతుందంటే..?
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఏ వేదికపై జరిగినా ప్రపంచ క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంది. వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భారత్, పాకిస్తాన్ వరుసగా ఎనిమిది సార్లు తలపడగా భారత్ తన పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి అన్ని మ్యాచ్ ల్లో విజయం సాధించింది. మరో మారు ఈ రెండు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లో తలపడనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ ల వివరాలు మీ కోసం.1992, (సిడ్నీ): భారత్ 43 పరుగుల తేడాతో విజయంఆశ్చర్యకరంగా అనిపించినప్పటికీ, భారత్ మరియు పాకిస్తాన్ ప్రపంచ కప్ మొదటి నాలుగు ఎడిషన్లలో ఎదురెదురుపడలేదు. సిడ్నీ క్రికెట్ మైదానంలో భారత్ పాకిస్తాన్‌ను ఎదుర్కొన్నప్పుడు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తన తొలి ప్రపంచ కప్ ఆడుతున్న సచిన్ టెండూల్కర్ 62 బంతుల్లో 54 పరుగులుతో రాణించడంతో 49 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. 217 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ 48.1 ఓవర్లలో 173 పరుగులకే ఆలౌటైంది. కపిల్ దేవ్, మనోజ్ ప్రభాకర్, జవగల్ శ్రీనాథ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. సచిన్, వెంకటపతి రాజు రాణించారు. పాక్ ఆటగాడు అమీర్ సోహైల్ 95 బంతుల్లో 62 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జావేద్ మియాందాద్ 40 పరుగులు చేసి ఔటయ్యాడు.1996, (బెంగళూరు): భారత్ 39 పరుగుల తేడాతో విజయం1996లో జరిగిన ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్లో భారత్, పాకిస్తాన్‌లు రెండోసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో గాయం కారణంగా వసీం అక్రమ్ లేకపోవడం రెండు జట్లకు డూ-ఆర్-డై అనే అంశంగా మారింది. నవజ్యోత్ సిద్ధు 115 బంతుల్లో 93 పరుగులు చేసి భారత్‌కు సరైన ఆరంభం ఇచ్చాడు. వకార్ యూనిస్‌పై అజయ్ జడేజా చేసిన ఎదురు దాడి భారత్-పాకిస్తాన్ క్రికెట్ చరిత్ర లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. జడేజా డెత్ ఓవర్లలో విజృంభించడంతో భారత్ 50 ఓవర్లలో 287/8 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా, సయీద్ అన్వర్, సోహైల్ తమ జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు, పాకిస్తాన్ 10 ఓవర్లలో 84/0తో చెలరేగింది. సోహైల్ తొందరబాటుతో వెంకటేష్ ప్రసాద్ ని కవ్వించడం తో మ్యాచ్ అనూహ్యమైన మలుపు తిరిగింది. వెంకటేష్ ప్రసాద్ పాకిస్తాన్ ఓపెనర్ మిడిల్ స్టంప్‌ను పడగొట్టి ప్రతీకారం తీర్చుకోవడంతో పాకిస్తాన్ పతనం ప్రారంభమైంది. ప్రసాద్, అనిల్ కుంబ్లే వారి సొంత గడ్డ అయిన బెంగళూరులో బాగా రాణించడంతో పాకిస్తాన్ 248/9 తో ఇన్నింగ్స్ ముగించింది. దీనితో భారత్ సెమీఫైనల్‌కు చేరుకుంది.1999, (మాంచెస్టర్): భారత్ 47 పరుగుల తేడాతో విజయంఈ భారత్ xపాకిస్తాన్ మ్యాచ్ మరే ఇతర మ్యాచ్ కి తీసిపోని భావోద్వేగంగా జరిగింది. భారత్, పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగిన సమయంలోనే ప్రపంచ కప్ ప్రారంభమైంది, కానీ మాంచెస్టర్‌లోని చారిత్రాత్మక ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో పోటీ మ్యాచ్ వరకే పరిమితం అయ్యే విధంగా చూసుకోవడంలో రెండు జట్లు బాగా కృషి చేశాయి. సచిన్ టెండూల్కర్ 45 పరుగులతో భారత్‌ను ఆదుకున్నాడు. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్ మరియు కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ చెరో అర్ధ సెంచరీతో భారత్‌ను 227/5 స్కోరుకు చేర్చారు. అన్వర్ మరోసారి రాణించినప్పటికీ 36 పరుగులకే ప్రసాద్ అతన్ని వెనక్కి పంపాడు. ఆ తర్వాత, పాకిస్తాన్ పతనమైంది.ప్రసాద్ ఐదు వికెట్లు, జవగల్ శ్రీనాథ్‌తో కలిసి మిడిల్ ఆర్డర్‌ను దెబ్బతీసి పాకిస్తాన్‌ను 27 బంతులు మిగిలి ఉండగానే 180 పరుగులకు ఆలౌట్ చేశాడు.2003, (సెంచూరియన్): భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయంఇది భారత్ xపాకిస్తాన్ ప్రపంచ కప్ మ్యాచ్‌ల్లో అత్యుత్తమ మ్యాచ్‌గా పరిగణించబడుతుంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలో, భారత్ మరియు పాకిస్తాన్ 2003 ప్రపంచ కప్‌లో సెంచూరియన్‌లో తలపడ్డాయి. సచిన్ టెండూల్కర్ కి బహుశా అతని కెరీర్లో అత్యుత్తమ ప్రపంచ కప్ ఇన్నింగ్స్ గా నిలిచిపోతుంది. అతని 98 పరుగులు చేసి మైమరిపించింది. 273 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్‌కు అవసరమైన స్కోర్ రేట్ ని అందించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 273/7 స్కోర్ సాధించగా, బదులుగా భారత్ 45.4 ఓవర్లలో నాలుగు వికెట్లకే లక్ష్యాన్ని సాధించింది.2011, (మొహాలీ): భారత్ 29 పరుగుల తేడాతో విజయంసొంత గడ్డ పై జరిగిన కీలకమైన ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లో మళ్ళీ సచిన్ టెండూల్కర్ విజృభించి భారత్ తరఫున అత్యధిక స్కోరు సాధించాడు. కానీ సచిన్ నాలుగు సార్లు క్యాచ్ లు జారవిడవడంతో తప్పించుకొని 85 పరుగులు చేయగా సురేష్ రైనా అజేయంగా 36 పరుగులు చేయడంతో భారత్ స్కోర్ 260/6కి చేరుకుంది. దీనికి సమాధానంగా, ఐదుగురు భారత బౌలర్లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. దీనితో పాకిస్తాన్ 231 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ ఫైనల్‌కు చేరుకుంది.2015, (అడిలైడ్): భారత్ 76 పరుగుల తేడాతో విజయంఅడిలైడ్లో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ కి విరాట్ కోహ్లీ అండగా నిలిచాడు. విరాట్ కోహ్లీ తన రెండవ ప్రపంచ కప్ సెంచరీని సాధించాడు. శిఖర్ ధావన్ మరియు సురేష్ రైనా అర్ధ సెంచరీలతో కలిసి భారత్ 7 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. మహమ్మద్ షమీ నాలుగు వికెట్లు పడగొట్టడంతో పాకిస్తాన్ చివరికి 224 పరుగులకే ఆలౌట్ అయింది.2019, (మాంచెస్టర్): భారత్ 89 పరుగుల తేడాతో విజయం ప్రపంచ కప్ చరిత్రలో రెండు ప్రత్యర్థి దేశాలు ఒకదానితో ఒకటి తలపడటం ఇది 7వ సారి. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో వర్షం కారణంగా ప్రభావితమైన మ్యాచ్‌లో, భారత్ మరోసారి పాకిస్తాన్‌పై తమ ఆధిపత్యాన్ని పునరుద్ఘాటించింది. రోహిత్ శర్మ అసాధారణంగా 140 పరుగులు చేయడం ద్వారా భారత్ 336/5 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. వర్షం అంతరాయం కారణంగా, పాకిస్తాన్ లక్ష్యాన్ని 40 ఓవర్లలోపు 302 పరుగులకు సర్దుబాటు చేశారు. కానీ వారు లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. మొత్తం 212/6తో 89 పరుగుల తేడాతో ఓడిపోయారు.2023, ( అహ్మదాబాద్): భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయంప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానమైన నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. కెప్టెన్ బాబర్ అజామ్ మరియు మహ్మద్ రిజ్వాన్ రాణించడంతో పాకిస్తాన్ ఓ దశలో వేగంగా పరుగులు సాధించి 155-2 కి చేరుకుంది. కానీ ఆ తర్వాత వరుసగా వికెట్లు పడడంతో 42.5 ఓవర్లలో 191 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ 63 బంతుల్లో 86 పరుగులు చేయడంతో భారత్ ఏడు వికెట్లతో విజయం సాధించింది.ఛాంపియన్స్ ట్రోఫీ లో పాకిస్తాన్ మెరుగైన ఫలితాలు అయితే ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో అందుకు భిన్నంగా పాకిస్తాన్ మెరుగైన ఫలితాలు సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ లో భారత్ పాకిస్తాన్‌తో ఐదుసార్లు తలపడింది, ఇందులో పాకిస్తాన్ మూడు మ్యాచ్‌లలో గెలిచింది మరియు భారత్ రెండు మ్యాచ్‌లలో విజేతగా నిలిచింది.2004 (ఎడ్జ్‌బాస్టన్): పాకిస్తాన్ 3 వికెట్ల తేడాతో విజయంభారత్ మరియు పాకిస్తాన్ మొదటిసారి సెప్టెంబర్ 19న బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో తలపడ్డాయి, పాకిస్తాన్ టాస్ గెలిచి భారత్ ని ముందుగా బ్యాటింగ్‌కు పంపింది. భారత్ 49.5 ఓవర్లలో 200 పరుగులు చేసింది మరియు పాకిస్తాన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాకిస్తాన్‌కు చెందిన మహ్మద్ యూసుఫ్‌ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ప్రకటించారు, అతను 114 బంతుల్లో 81 పరుగులు చేశాడు.2009 (సెంచూరియన్): పాకిస్తాన్ 54 పరుగుల తేడాతో విజయం2009 ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ దశ మ్యాచ్ కోసం సెప్టెంబర్ 26న సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో ఈ రెండు జట్లు తలపడ్డయి. పాకిస్తాన్ మళ్ళీ టాస్ గెలిచింది కానీ ఈసారి వారు మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. పాకిస్తాన్ 50 ఓవర్లలో 302/9 పరుగులు చేయగా భారత్ ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది, 44.5 ఓవర్లలో 248 పరుగులకు తమ ఇన్నింగ్స్‌ను ముగించింది. 126 బంతుల్లో 128 పరుగులు చేసిన షోయబ్ మాలిక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.2013 (ఎడ్జ్‌బాస్టన్): భారత్ 8 వికెట్ల తేడాతో విజయం2013 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జూన్ 15న బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ మరియు పాకిస్తాన్ తలపడ్డాయి. ఈసారి భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ సమయంలో వాతావరణ మార్పుల కారణంగా, మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. పాకిస్తాన్ 39.4 ఓవర్లలో 165 పరుగులు చేయగలిగింది.మళ్ళీ వర్షం వచ్చింది. ఫలితంగా, భారత ఇన్నింగ్స్‌ను అదనంగా 22 ఓవర్లకు కుదించారు.102 పరుగుల సవరించిన లక్ష్యంతో. 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత, డిఎల్ఎస్ పద్ధతి ద్వారా పాకిస్తాన్‌పై భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ లో తొలి విజయాన్ని సాధించింది. 8 ఓవర్లలో 2 వికెట్లు తీసిన భువనేశ్వర్ కుమార్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.2017 (ఎడ్జ్‌బాస్టన్): భారత్ 124 పరుగుల తేడాతో విజయంజూన్ 4న బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో గ్రూప్ బి ఛాంపియన్స్ ట్రోఫీ -దశ ఘర్షణలో భారత్ తమ ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఎదుర్కొంది. పాకిస్తాన్ ఈసారి కూడా టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. భారత్ ఇన్నింగ్స్‌లో మ్యాచ్‌ను 48 ఓవర్లకు తగ్గించారు. భారత్ 319/3 స్కోరు చేసింది. పాకిస్తాన్ లక్ష్యాన్ని 41 ఓవర్లలో 289 పరుగులుగా సవరించగా, పాకిస్తాన్ 33.4 ఓవర్లలో 9 వికెట్లకు 164 పరుగులు చేసింది. డి ఎల్ ఎస్ పద్ధతి ప్రకారం భారత్‌ను విజేతగా ప్రకటించారు. ఛాంపియన్స్ ట్రోఫీ లో పాకిస్తాన్‌పై భారత్ సాధించిన రెండవ విజయం ఇది. యువరాజ్ సింగ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.2017 (ఓవల్): పాకిస్తాన్ 180 పరుగుల తేడాతో విజయం2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో భారత్ పాకిస్తాన్‌ను రెండో సారి ఎదుర్కొంది. ఈ మ్యాచ్ జూన్ 18న లండన్‌లోని ది ఓవల్‌లో జరిగింది. టాస్ గెలిచి పాకిస్తాన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఫఖర్ జమాన్ చేసిన అద్భుతమైన తొలి వన్డే సెంచరీతో పాకిస్తాన్ 50 ఓవర్లలో 389 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది మరియు భారత్ 30.3 ఓవర్లలో 158 పరుగులు చేసింది. ఈ ఫైనల్స్‌లో భారత్ పై విజయంతో పాకిస్తాన్‌కు తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. -
దాయాదుల సమరానికి సమయం
గత పద్నాలుగేళ్ల కాలంలో వన్డేలు, టి20లు కలిపి భారత్, పాకిస్తాన్ మధ్య 13 మ్యాచ్‌లు జరిగితే భారత్ 11 గెలిచి 2 మ్యాచ్‌లలో మాత్రమే ఓటమిపాలైంది... ఇరు జట్ల మధ్య జరిగిన గత 11 వన్డేల్లో భారత్ 9 గెలిచి 2 ఓడింది...ఇది చాలు దాయాదిపై టీమిండియా ఆధిపత్యం ఎలా సాగుతోందో చెప్పడానికి... అయినా సరే...అంతర్జాతీయ క్రికెట్లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ ప్రతీ సారి అంతే ఉత్సుకత రేపుతుంది... ఆటగాళ్లు, అభిమానులు, ప్రసారకర్తలు, విశ్లేషకులు... ఇలా అందరి దృష్టిలో ఇది ఎంతో ప్రత్యేకమైన సమరం. తుది ఫలితంతో సంబంధం లేకుండా దాయాదుల మధ్య పోరు అంటే ఒక్కసారిగా ఆసక్తి పెరిగిపోతుంది. ఆదివారం ఆటవిడుపు వేళ మరో సారి భారత్, పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికపై తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఆతిథ్య జట్టే అయినా... ఈ మ్యాచ్ కోసం పాక్ దుబాయ్ చేరగా, ఇప్పటికే ఈ వేదికపై ఒక మ్యాచ్ గెలిచిన టీమిండియా ఉత్సాహంగా సిద్ధమైంది. భారత్ గెలిస్తే దాదాపు సెమీస్ చేరుకుంటుంది. పాక్‌కు మాత్రం టోర్నీనుంచి నిష్క్రమించకుండా ఉండాలంటే ఈ మ్యాచ్ జీవన్మరణ సమస్య. దుబాయ్: వన్డే వరల్డ్ కప్‌లో తలపడిన దాదాపు 16 నెలల తర్వాత మరో ఐసీసీ టోర్నీలో భారత్, పాకిస్తాన్ వన్డే సమరానికి సై అంటున్నాయి. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్ ‘ఎ’లో జరిగే మ్యాచ్‌లో ఇరు జట్లు నేడు తలపడతాయి. భారత్ తొలి తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేయగా... పాక్ స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో పరాజయంపాలైంది. బలాబలాలు, ఫామ్‌పరంగా చూస్తే అన్ని విధాలా రోహిత్ సేనదే పైచేయిగా ఉన్నా... అనూహ్య ప్రదర్శనతో చెలరేగాలని పాకిస్తాన్ భావిస్తోంది. మార్పుల్లేకుండా... గత మ్యాచ్‌లో టీమిండియా ప్రదర్శన చూస్తే తుది జట్టులో ఎలాంటి మార్పూ చేయాల్సిన అవసరం కనిపించడం లేదు. వన్డేల్లో వరుసగా రెండు సెంచరీలతో గిల్ తన ఫామ్‌ను చాటి చెప్పగా, రోహిత్ శర్మ అందించే శుభారంభాలు జట్టును ముందంజలో నిలుపుతున్నాయి. విరాట్ కోహ్లి మాత్రమే కాస్త తడబడినట్లు కనిపిస్తున్నాడు. ఇంకా తనదైన స్థాయి ఆటను విరాట్ ప్రదర్శించలేదు. దాని కోసం ఇంతకంటే మంచి వేదిక ఉండదు. రాహుల్ బంగ్లాతో ఆకట్టుకున్నాడు. అయ్యర్ కూడా చెలరేగితే భారీ స్కోరు ఖాయం. పాండ్యా, జడేజా బ్యాటింగ్ అవసరం రాకుండానే మన జట్టు గత మ్యాచ్‌ను ముగించింది. అక్షర్ బ్యాటింగ్‌పై టీమ్ మేనేజ్మెంట్ మరోసారి నమ్మకం ఉంచుతోంది. బౌలింగ్‌లో షమీ అద్భుత పునరాగమనం భారత్ బలాన్ని ఒక్కసారిగా పెంచింది. బంగ్లాపై ఐదు వికెట్ల ప్రదర్శనతో అతను తనలో ఇంకా సత్తా తగ్గలేదని నిరూపించుకున్నాడు. షమీకి తోడుగా హర్షిత్ రాణా ఆకట్టుకున్నాడు. ముగ్గురు స్పిన్నర్లు కుల్దీప్, అక్షర్, జడేజాలను ఎదుర్కొని పాక్ బ్యాటర్లు పరుగులు సాధించడం అంత సులువు కాదు. మొత్తంగా టీమిండియా ఆటగాళ్లంతా సమష్టి ప్రదర్శన చేస్తే తిరుగుండకపోవచ్చు. గెలిపించేదెవరు! పాకిస్తాన్ జట్టు పరిస్థితి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. స్వదేశంలో జరిగిన ముక్కోణపు వన్డే టోర్నీలో రెండుసార్లు న్యూజిలాండ్ చేతిలో ఓడిన ఆ జట్టు ఇప్పడు ఈ మెగా టోర్నీ తొలి పోరులోనూ ఓటమిపాలైంది. పైగా భారీ తేడాతో ఓడటం వల్ల రన్‌రేట్‌పై కూడా తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో కచ్చితంగా భారత్‌తో మ్యాచ్‌లో గెలిస్తేనే ఆ జట్టు టోర్నీలో నిలుస్తుంది. లేదంటే ఆతిథ్య జట్టుగా సొంతగడ్డపై చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో ఆడే సమయానికి పాక్ ఆట ముగిసిపోతుంది. జట్టు బ్యాటింగ్ బలహీనంగా కనిపిస్తోంది. ఎన్ని వైఫల్యాలున్నా ఇప్పటికీ టీమ్ నంబర్‌వన్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌పైనే ప్రధానంగా ఆధారపడుతోంది. కానీ గత మ్యాచ్‌లో కూడా అతను చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. ఈ సారి అతని ప్రదర్శన మెరుగవుతుందేమో చూడాలి. ఫఖర్ గాయంతో దూరం కావడంతో టీమ్‌లోకి వచ్చిన ఇమామ్ కూడా దూకుడుగా ఆడలేడు. రిజ్వాన్, షకీల్ గత మ్యాచ్‌లో విఫలమయ్యారు. సల్మాన్, ఖుష్దిల్ ప్రదర్శన సానుకూలాంశం. మరో వైపు బౌలింగ్ అయితే మరీ పేలవంగా ఉంది. పాక్ ఎంతో నమ్ముకున్న ముగ్గురు పేసర్లు పోటీ పడి భారీగా పరుగులిస్తున్నారు. ఇటీవలి రికార్డు చూసినా...షాహిన్ అఫ్రిది, రవూఫ్, నసీమ్‌లను భారత బ్యాటర్లు అలవోకగా ఎదుర్కొన్నారు. పైగా ఒక్క నాణ్యమైన స్పిన్నర్ కూడా జట్టులో లేడు. ఈ నేపథ్యంలో పాక్ గెలవాలంటే అసాధారణ పోరాటం చేయాల్సి ఉంది. 23 వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్‌లలో పాక్‌పై భారత్ ఆధిపత్యం ఉన్నా...చాంపియన్స్ ట్రోఫీలో పాక్ రికార్డు మెరుగ్గా ఉంది. ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్‌లు జరిగితే భారత్ 2 గెలిచి 3 ఓడింది. 57 - 73 ఓవరాల్‌గా భారత్, పాకిస్తాన్ మధ్య 135 వన్డేలు జరగ్గా...భారత్ 57 గెలిచి 73 ఓడింది. మరో 5 మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు. పిచ్, వాతావరణం గత మ్యాచ్ తరహాలోనే నెమ్మదైన పిచ్. కానీ బ్యాటర్లు పట్టుదలగా ఆడితే భారీ స్కోరు సాధించవచ్చు. వర్ష సమస్య లేదు. మంచు ప్రభావం కూడా లేదు కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లి, అయ్యర్, రాహుల్, అక్షర్, పాండ్యా, జడేజా, కుల్దీప్, షమీ, రాణా. పాకిస్తాన్: రిజ్వాన్ (కెప్టెన్), ఇమామ్, షకీల్, బాబర్, సల్మాన్, తాహిర్, ఖుష్దిల్, అఫ్రిది, నసీమ్, రవూఫ్, అబ్రార్. -
టీమిండియాతో మ్యాచ్.. పాక్ జట్టుకు ‘స్పెషల్ కోచ్’
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో హైవోల్టేజ్ మ్యాచ్‌కు సమయం అసన్నమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్ధిలు భారత్-పాకిస్తాన్(IND-PAK) జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్.. పాక్‌పై కూడా గెలిచి సెమీస్‌కు ఆర్హత సాధించాలని పట్టుదలతో ఉంది.కానీ పాకిస్తాన్‌కు మాత్రం ఇది డూర్ ఆర్ డై మ్యాచ్. మొదటి మ్యాచ్‌లో కివీస్ చేతిలో ఓటమి చవిచూసిన పాకిస్తాన్.. సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే భారత్‌పై ఖచ్చితంగా గెలవాల్సిందే. ఈ క్రమంలో టీమిండియాతో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓ కీలక నిర్ణయం తీసుకుంది.కేవలం ఒక్క మ్యాచ్ కోసం తమ జట్టు స్పెషల్ కోచ్‌గా మాజీ క్రికెటర్ ముదాసర్ నాజర్‌ను పీసీబీ నియమించింది. పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాన కోచ్ ఆకిబ్ జావేద్‌తో కలిసి ముదాసర్ పనిచేయనున్నాడు. రెండు రోజుల కిందటే జట్టుతో కలిసిన ముదాసర్.. ప్రాక్టీస్ సెషన్లో తన అనుభవాన్ని ఆటగాళ్లతో పంచుకున్నాడు.కాగా ముదాసర్ దుబాయ్ పిచ్ కండీషన్స్‌పై విస్తృతమైన అవగాహన ఉంది. అతడు గత కొంతకాలంగా దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ముదాసర్ను పాక్ క్రికెట్ బోర్డు తమ జట్టు కోచింగ్ స్టాప్‌లోకి తీసుకుంది. కాగా ముదాసర్కు కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. గతంలో పాకిస్తాన్, కెన్యా, యూఏఈ జట్లకు కోచ్‌గా అతడు పనిచేశాడు. అంతేకాకుండా లాహోర్‌లోని పీసీబీ హై పెర్ఫార్మెన్స్ సెంటర్ డైరకర్ట్గా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన ముదాసర్ పాకిస్తాన్ తరఫున 76 టెస్ట్‌లు ఆడి 4114 పరుగులు, 122 వన్డేల్లో 2653 పరుగులు చేశాడు.తుది జట్లు(అంచనా)భారత్: శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిపాకిస్తాన్: ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్చదవండి: Champions Trophy: కళ్లు చెదిరే క్యాచ్.. సూపర్‌మేన్‌లా డైవ్ చేస్తూ! వీడియో వైరల్ -
IND Vs PAK: పాకిస్తాన్‌తో మ్యాచ్.. టీమిండియాకు భారీ షాక్!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు సర్వం సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా దాయాదుల పోరు జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది.భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయపడినట్లు తెలుస్తోంది. నెట్ ప్రాక్టీస్‌లో ఎడమ కాలికి గాయమైనట్లు సమాచారం. తాజాగా మ్యాచ్‌కు ముందు ఆఖరి ప్రాక్టీస్ సెషన్లో కోహ్లి తన ఎడమ కాలికి ఐస్ ప్యాక్ పెట్టుకుని కన్పించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవతున్నాయి. దీంతో పాక్‌తో మ్యాచ్‌కు కోహ్లి అందుబాటులో ఉంటాడా లేదా అన్న ఆందోళన అభిమానుల్లో నెలకొంది.అయితే విరాట్ గాయంపై బీసీసీఐ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ రాలేదు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కోహ్లి తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. కేవలం 22 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఒకవేళ కోహ్లి పాక్‌తో మ్యాచ్‌కు దూరమైతే రిషబ్ పంత్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. ఇక హైవోల్డేజ్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.భారత్‌దే పై చేయి..కాగా ఐసీసీ టోర్నమెంట్లలో పాకిస్తాన్‌పై భారత్‌కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇరు జట్లు ముఖాముఖి 21 మ్యాచ్‌ల్లో తలపడగా.. 16 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించగా, పాక్ కేవలం ఐదింట మాత్రమే గెలుపొందింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఓవరాల్‌గా వన్డే క్రికెట్లో అయితే భారత్‌పై పాక్ పై చేయి సాధించింది.ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు ఇప్పటివరకు ఐదు సార్లు ముఖాముఖి తలపడగా.. పాక్ 3, భారత్ 2 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. వన్డే ఫార్మాట్లో పాకిస్తాన్, ఇండియా ఇప్పటివరకు 153 సార్లు తలపడ్డాయి. ఈ 153 వన్డే మ్యాచ్‌లలో పాకిస్తాన్ 73 సార్లు భారత్‌ను ఓడించగా.. భారత్ 57 సార్లు విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి.చదవండి: IND vs PAK: 'అతడొక అద్భుతం.. పాక్‌పై 60 బంతుల్లోనే సెంచరీ చేస్తాడు' Virat Kohli spotted with an ice pack on his left leg after India’s practice session ahead of the high-voltage clash against Pakistan. A concern or just routine recovery? #INDvPAK #ViratKohli #CT2025 pic.twitter.com/eSUSETB6FY— Ankan Kar (@AnkanKar) February 22, 2025 -
'అతడొక అద్భుతం.. పాక్‌పై 60 బంతుల్లోనే సెంచరీ చేస్తాడు'
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్-పాకిస్తాన్(India vs Pak) మధ్య బ్లాక్ బాస్టర్ మ్యాచ్‌కు మరో 24 గంటల్లో తెరలేవనుంది. ఆదివారం(ఫిబ్రవరి 23)న దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్ధిలు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వెయ్యుకళ్లతో ఎదురుచూస్తున్నారు.ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీపైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకోవాలని భారత్ భావిస్తుంటే.. పాకిస్తాన్ మాత్రం ఎలాగైనా గెలిచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాక్‌తో మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) సెంచరీతో మెరుస్తాడని యువీ జోస్యం చెప్పాడు.కాగా ఆస్ట్రేలియా పర్యటనలో నిరాశపరిచిన హిట్‌మ్యాన్.. ఇంగ్లండ్ సిరీస్‌తో తన ఫామ్‌ను అందుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్ కేవలం 36 బంతుల్లో 41 పరుగులు చేసి ఔటయ్యాడు."రోహిత్ శర్మ ఫామ్‌లో ఉన్నా.. లేకపోయిన అది నాకు ముఖ్యం కాదు. నేను ఎప్పుడు రోహిత్ లాంటి మ్యాచ్ విన్నర్లకు సపోర్ట్‌గా ఉంటాను. ముఖ్యంగా వన్డే క్రికెట్లో విరాట్ కోహ్లితో పాటు రోహిత్ కూడా భారత్‌కు ఎన్నో అద్బుతమైన విజయాలను అందించాడు. రోహిత్ ఫామ్ లేమితో సతమతమవుతున్నప్పటికి.. కొన్ని కొన్ని మ్యాచ్‌ల్లో పరుగులు సాధించడం సానుకూళ అంశం.కచ్చితంగా ప్రత్యర్ధికి రోహిత్ నుంచి ముప్పు పొంచి ఉంది. పాక్‌తో మ్యాచ్‌లో రోహిత్ ఫామ్‌ను అందుకుంటే 60 బంతుల్లోనే సెంచరీ సాధిస్తాడు. అది అతడి నైజం. ఒక్కసారి రిథమ్‌ను అందుకుంటే అతడిని ఆపడం ఎవరి తరం కాదు. అతడు బౌండరీలు మాత్రమే కాదు సిక్సర్లను కూడ ఈజీగా కొట్టగలడు. ప్రపంచక్రికెట్లో షార్ట్ బాల్స్‌ను అత్యుత్తమంగా ఆడే ఆటగాళ్లలో రోహిత్ ఒకడు.ఏ బౌలర్ అయినా 145 కి.మీ పైగా వేగంతో బౌలింగ్ చేసినా.. ఆ షార్ట్‌బాల్‌ను సిక్సర్‌గా మలిచే సత్తా అతడికి ఉంది. అతని స్ట్రైక్ రేట్ ఎల్లప్పుడూ 120-140 మధ్య ఉంది. రోహిత్ తనదైన రోజున సింగిల్ హ్యాండ్‌తో మ్యాచ్‌ను గెలిపించగలడు. కాగా దుబాయ్‌లోని పరిస్థితులు పాకిస్తాన్ కలిసొచ్చే అవకాశముంది.వారు అక్కడ చాలా క్రికెట్ ఆడారు. అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో వారికి బాగా తెలుసు. స్లో వికెట్స్‌పై స్పిన్‌ను బాగే ఆడే ఆటగాళ్లు ఇరు జట్లలో కూడా ఉన్నారు. ఏ జట్టు అయితే అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణిస్తుందో ఆ జట్టే విజేతగా నిలుస్తుందని" జియో హాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ పేర్కొన్నాడు.తుది జట్లు(అంచనా)భారత్: శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిపాకిస్తాన్: ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్చదవండి: భారత్‌తో మ్యాచ్.. మాకు స్పెషలేమి కాదు: పాక్ స్టార్ బౌలర్ -
Champions Trophy 2025: దాయాదుల సమరంలో ఎవరిది పైచేయి..?
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దాయాదుల సమరంలో (India Vs Pakistan) రేపు జరుగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) భాగంగా భారత్, పాకిస్తాన్ జట్లు దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ భారత్‌పై ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందని ఆ దేశ అభిమానులు ఊహల్లో ఊరేగుతుంటే.. భారత అభిమానులు ఈసారి గెలుపు తమదే అని ధీమాగా ఉన్నారు. ఎవరి అంచనాలు ఎలా ఉన్పప్పటికీ ఫలితం తేలాలంటే రేపటి వరకు ఆగాలి.చరిత్ర పరిశీలిస్తే.. భారత్, పాకిస్తాన్ వన్డేల్లో ఇప్పటివరకు 135 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 57 సార్లు విజయం సాధించగా.. పాక్ 73 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. 5 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్ల హెడ్ టు హెడ్ రికార్డ్స్ విషయానికొస్తే.. భారత్‌పై పాక్ స్వల్ప ఆధిక్యత కలిగి ఉంది. ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు ఇప్పటివరకు ఐదు సార్లు ఎదురెదురుపడగా.. పాక్ 3, భారత్ 2 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాక్ తొలిసారి 2004 ఎడిషన్‌లో ఢీకొన్నాయి. నాటి మ్యాచ్‌లో (బర్మింగ్హమ్) పాక్ భారత్‌పై విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 200 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ ద్రవిడ్ (67), అజిత్ అగార్కర్ (47) భారత్ 200 పరుగల మార్కును తాకేందుకు దోహదపడ్డారు. అనంతరం మొహమ్మద్ యూసఫ్ (81 నాటౌట్), ఇంజమామ్ ఉల్ హక్ (41) రాణించడంతో పాక్ విజయతీరాలకు చేరింది.ఛాంపియన్స్ ట్రోఫీలో రెండోసారి దాయాదుల సమరంలో 2009లో జరిగింది. సెంచూరియన్ వేదికగా నాడు జరిగిన మ్యాచ్‌లో మరోసారి పాక్‌నే విజయం వరించింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. షోయబ్ మాలిక్ (128), మొహమ్మద్ యూసఫ్ (87) సత్తా చాటడంతో 302 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో తడబడిన భారత్.. రాహుల్ ద్రవిడ్ (76), గౌతమ్ గంభీర్ (57) రాణించినప్పటికీ లక్ష్యానికి 54 పరుగుల దూరంలో నిలిచిపోయింది.2013 ఎడిషన్‌లో భారత్, పాక్‌లు మూడోసారి ఢీకొట్టాయి. ఈసారి భారత్.. పాక్‌ను మట్టికరిపించింది. బర్మింగ్హమ్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్ష ప్రభావితమైన ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 165 పరుగులకే ఆలౌటైంది. ఛేదనలో శిఖర్ ధవన్ (48) రాణించడంతో భారత్ సునాయాసంగా విజయం సాధించింది. ఆ సీజన్లో భారత్.. శ్రీలంకతో కలిసి సంయుక్తంగా విజేతగా నిలిచింది.2017 ఎడిషన్‌లో భారత్, పాక్ అదే బర్మింగ్హమ్ వేదికగా నాలుగోసారి తలపడ్డాయి. ఈసారి కూడా భారత్‌దే పైచేయి అయ్యింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రోహిత్ శర్మ (91), శిఖర్ ధవన్ (68), విరాట్ కోహ్లి (81 నాటౌట్) చెలరేగడంతో భారత్ 319 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన పాక్ 164 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూగట్టుకుంది.2017 ఎడిషన్‌లోనే భారత్, పాక్ మరోసారి తలపడ్డాయి. ఆ సీజన్ ఫైనల్లో పాక్.. భారత్‌ను ఓడించి తమ తొలి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఓవల్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. ఫకర్ జమాన్ (114) సెంచరీతో కదంతొక్కాడు. అనంతరం ఛేదనలో భారత్ తడబడింది. 30.3 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో హార్దిక్ పాండ్యా (76) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఏడేళ్ల అనంతరం భారత్, పాక్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆరోసారి తలపడుతున్నాయి. ఇరు జట్ల ఫామ్ ప్రకారం చూస్తే.. పాక్‌పై టీమిండియా పైచేయి సాధించే అవకాశం ఉంది. ఈ ఎడిషన్‌లో భారత్ ఇప్పటికే బంగ్లాదేశ్‌పై విజయం సాధించి ఉత్సాహంగా ఉండగా.. పాక్ తమ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో చావుదెబ్బ తిని సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. రేపు జరుగబోయే మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడితే పాక్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.బలాబలాల విషయానికొస్తే.. పాక్‌తో పోలిస్తే భారత్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. భారత బ్యాటింగ్ లైనప్‌ను చూస్తే ప్రపంచంలో ఎంతటి మేటి జట్టైనా గజగజ వణకాల్సిందే. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ కూడా మాంచి టచ్‌లో కనిపించాడు. పాకిస్తాన్ అనగానే విరాట్‌కు పూనకం వస్తుంది. ఇటివలికాలంలో విరాట్ పెద్దగా ఫామ్‌లో లేకపోయినా పాక్‌తో మ్యాచ్ అంటే అతను చెలరేగుతాడు. శ్రేయస్ అయ్యర్ అయ్యర్ సైతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. బంగ్లాతో మ్యాచ్‌లో నిరాశపర్చినా తిరిగి గాడిలో పడతాడు. బంగ్లా మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సైతం మంచి ఇన్నింగ్స్ ఆడి టచ్‌లోకి వచ్చాడు. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా గత కొంతకాలంగా అద్భుతంగా రాణిస్తున్నారు. బౌలింగ్ విభాగంలోనూ పాక్‌తో పోలిస్తే భారత్ పటిష్టంగానే కనిపిస్తుంది. షమీ గత మ్యాచ్‌లో ఐదు వికెట్లతో చెలరేగాడు. అదే మ్యాచ్‌లో అక్షర్ తృటిలో హ్యాట్రిక్ చేజార్చుకున్నాడు. యువ పేసర్ హర్షిత్ రాణా సైతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. స్పిన్నర్లు జడేజా, కుల్దీప్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ పాక్‌పై రెచ్చిపోయేందుకు రెడీగా ఉన్నారు.పాక్ విషయానికొస్తే.. భారత్‌తో పోలిస్తే ఈ జట్టు పరిస్థితి భిన్నంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఈ జట్టు పేలవంగా ఉంది. గడిచిన మ్యాచ్‌లో ఈ జట్టు న్యూజిలాండ్ చేతిలో చావుదెబ్బతింది. ఆ మ్యాచ్‌లో బాబర్ ఆజమ్, ఖుష్దిల్ షా మినహా ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. కీలక ఆటగాడు ఫకర్ జమాన్ తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడి టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. కెప్టెన్ రిజ్వాన్ పెద్దగా ఫామ్‌లో లేదు. బాబర్, రిజ్వాన్ తప్పించి పాక్ బ్యాటింగ్ లైనప్‌లో అనుభవజ్ఞుడైన ఆటగాడే లేడు. సౌద్ షకీల్, సల్మాన్ అఘా ఎప్పుడు రాణిస్తారో వారికే తెలీదు. బౌలింగ్ విషయానికొస్తే.. పాక్ బౌలింగ్ గతంలో ఎన్నడూ లేనంత ఛండాలంగా ఉంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ పేసర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. షాహీన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్ పోటీ పడి పరుగులు ఇచ్చారు. స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ పర్వాలేదనిపించినా స్పిన్‌ను గట్టిగా ఆడే భారత బ్యాటర్ల ముందు నిలవడం చాలా కష్టం. ఎలా చూసినా పాక్‌పై పైచేయి సాధించేందుకు భారత్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
Champions Trophy 2025: పాకిస్తాన్ మ్యాచ్‌లో అతన్ని పక్కన పెట్టండి..!
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) భారత్ రేపు కీలక మ్యాచ్ ఆడనుంది. దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓ కీలక మార్పు చేయాలని దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) సూచించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన హర్షిత్ రాణాను (Harshit Rana) పక్కన పెట్టాలని సలహా ఇచ్చాడు. రాణా స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి (Varun Chakravarthy) అవకాశం ఇవ్వాలని కోరాడు. బంగ్లాతో మ్యాచ్‌లో పేసర్లే అధికంగా వికెట్లు తీసినప్పటికీ.. స్పిన్నర్లు టీమిండియా గెలుపులో ప్రధాన పాత్ర పోషించారని అన్నాడు. బంగ్లాదేశ్ మ్యాచ్‌లో పేసర్ల కంటే స్పిన్నర్లే పొదుపుగా బౌలింగ్ చేసిన విషయాన్ని గుర్తు చేశాడు. అందుకే భారత్ కీలకమైన పాకిస్తాన్ మ్యాచ్‌లో నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. షమీకి జతగా హార్దిక్ పాండ్యాను రెండో పేసర్‌గా వినియోగించుకోవాలని సలహా ఇచ్చాడు. స్పోర్ట్స్ టుడేతో మాట్లాడుతూ గవాస్కర్ ఈ విషయాలను వెల్లడించాడు.కాగా, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బౌలర్లతో పాటు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ భారత విజయంలో కీలకపాత్ర పోషించారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. భారత బౌలర్లు చెలరేగడంతో ఆదిలో కష్టాల్లో ఎదుర్కొంది. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌ను తౌహిద్ హృదయ్ (100) వీరోచిత సెంచరీతో ఆదుకున్నాడు. అతనికి జాకిర్ అలీ (68) సహకరించడంతో బంగ్లాదేశ్ గౌరవప్రదమైన స్కోర్ (228) చేయగలిగింది. ఐసీసీ ఈవెంట్లలో చెలరేగిపోయే మహ్మద్ షమీ ఈ మ్యాచ్‌లోనూ జూలు విదిల్చి ఐదు వికెట్లు తీశాడు. మరో పేసర్ హర్షిత్ రాణా 3 వికెట్లు పడగొట్టాడు. స్పిన్నర్ అక్షర్ పటేల్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 2 వికెట్లు తీశాడు. రోహిత్ తప్పిదం వల్ల ఈ మ్యాచ్‌లో అక్షర్ హ్యాట్రిక్ తీసే సువర్ణావకాశాన్ని కోల్పోయాడు. మిగతా స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ సైతం పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్లు తీయలేకపోయారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ కూడా ఇబ్బంది పడింది. రోహిత్ (41) తన సహజ శైలిలో బ్యాట్‌ను ఝులిపించినప్పటికీ భారీ స్కోర్ చేయలేకపోయాడు. శుభ్‌మన్ గిల్ బాధ్యతాయుతమై సెంచరీతో చివరి వరకు క్రీజ్‌లో ఉండి భారత విజయాన్ని ఖరారు చేశాడు. అతనికి కేఎల్ రాహుల్ సహకరించాడు. ఇన్నింగ్స్ మధ్యలో భారత్ స్వల్ప వ్యవధిలో విరాట్ కోహ్లి(22), శ్రేయస్ అయ్యర్ (15), అక్షర్ పటేల్ (8) వికెట్లు కోల్పోయి తడబడింది. అయితే గిల్, రాహుల్ జాగ్రత్తగా ఆడి భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. లక్ష్యం చిన్నదే అయినప్పటికీ ఛేదించేందుకు భారత్ కాస్త ఇబ్బందిపడింది. బంగ్లా బౌలర్లు.. ముఖ్యంగా స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. రిషద్ హొసేన్ పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా రెండు వికెట్లు తీశాడు. మెహిది హసన్ మిరాజ్ భారత బ్యాటర్ల సహనాన్ని పరీక్షించాడు. ఈ మ్యాచ్‌లో లక్ష్యం కాస్త పెద్దదై ఉంటే టీమిండియా ఇబ్బంది పడాల్సి వచ్చేది. -
భారత్‌తో మ్యాచ్.. మాకు స్పెషలేమి కాదు: పాక్ స్టార్ బౌలర్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో అసలు సిసిలైన పోరుకు సమయం అసన్నమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్దులు భారత్-పాకిస్తాన్(India-Pakistan) అమీతెల్చుకోనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ఐసీసీ ఈవెంట్లలో పాక్‌పై తమ అధిపత్యాన్ని కొనసాగించాలని భారత్ భావిస్తోంది. మరోవైపు పాకిస్తాన్ మాత్రం 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలతో ఉంది. ట్రోఫీ-2017 ఫైనల్లో మాత్రం పాక్ చేతిలో టీమిండియా ఓటమి చవిచూసింది.ఓవరాల్‌గా ఐసీసీ టోర్నీల్లో పాక్‌పై భారత్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఐసీసీ ఈవెంట్లలో ఇరు జట్లు ముఖాముఖి 21 మ్యాచ్‌ల్లో తలపడగా.. 16 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించగా, పాక్ కేవలం ఐదింట మాత్రమే గెలుపొందింది. ఇక ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ స్టార్ పేసర్ హరీస్ రౌఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్‌తో జరిగే మ్యాచ్ గురించి ఎక్కువగా ఆలోచించడం లేదని రౌఫ్ తెలిపాడు."భారత్‌తో మ్యాచ్ సందర్బంగా మాపై ఎలాంటి ఒత్తడి లేడు. ఆటగాళ్లందరూ రిలాక్స్‌గా ఉన్నారు. ఇది సాధారణ మ్యాచ్ మాత్రమే. పాకిస్తాన్-భారత్ మ్యాచ్ అన్ని క్రికెట్ మ్యాచ్‌లనే జరుగుతుంది" అని జియో న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రౌఫ్ పేర్కొన్నాడు. ఇక ఈ మెగా టోర్నీని భారత్ అద్భుతమైన విజయంతో ఆరంభించింది. గురువారం దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది. పాక్ మాత్రం కివీస్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది.తుది జట్లు(అంచనా)భారత్: శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిపాకిస్తాన్: ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్చదవండి: IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్.. -
‘టీమిండియా ఓడినా.. 2027 వరల్డ్‌కప్ వరకు అతడే కెప్టెన్’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్(Mohammad Kaif) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్‌కప్-2027 వరకు హిట్‌మ్యాన్ సారథిగా కొనసాగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ అసాధారణ విజయాలు సాధించాడన్న కైఫ్.. అతడు సమీపకాలంలో రిటైర్ అయ్యే ప్రసక్తి లేదని పేర్కొన్నాడు.కాగా టీమిండియా ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ వేదికగా బుధవారం ఈ మెగా టోర్నీ మొదలుకాగా.. దుబాయ్‌లో భారత జట్టు తమ మ్యాచ్‌లన్నీ ఆడనుంది. తొలుత గురువారం బంగ్లాదేశ్‌తో తలపడనున్న రోహిత్ సేన.. ఆ తర్వాత ఫిబ్రవరి 23న పాకిస్తాన్, మార్చి 2న న్యూజిలాండ్‌లతో మ్యాచ్‌లు ఆడుతుంది.ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ?ఇదిలా ఉంటే.. 37 ఏళ్ల రోహిత్ శర్మకు ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ కానుందంటూ సురేశ్ రైనా, ఆకాశ్ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే, మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో టీమిండియా ఓడిపోయినా రోహిత్ శర్మ భవిష్యత్తుకు ఢోకా ఏమీ ఉండబోదని జోస్యం చెప్పాడు.కోచ్‌లకే ఇబ్బంది.. రోహిత్ సేఫ్ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా.. ‘‘కెప్టెన్‌గా రోహిత్ శర్మ సాధించిన విజయాలు అందరికీ సాధ్యం కాకపోవచ్చు. వన్డే ప్రపంచకప్-2023 ఈవెంట్లో టీమిండియాను ఫైనల్‌కు చేర్చాడు. ఆ తర్వాత మనవాళ్లు ఎక్కువగా వన్డే క్రికెట్ ఆడలేదు. ఆ దేవుడి దయ వల్ల ఇలా జరుగకూడదు.. కానీ ఒకవేళ టీమిండియా గనుక చాంపియన్స్ ట్రోఫీలో గొప్పగా రాణించకపోతే కోచ్‌లు మాత్రమే ఇబ్బందుల్లో పడతారు.అప్పటి దాకా అతడే కెప్టెన్అయితే, రోహిత్ శర్మకు మాత్రం ఎలాంటి సమస్యా ఉండదు. టెస్టుల్లో చోటు విషయంలో స్పష్టత లేదు గానీ.. వన్డేల్లో మాత్రం అతడి స్థానాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. ప్రస్తుతం అతడు ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో వన్డేల్లో విధ్వంసర సెంచరీ బాదాడు.జట్టుకు అద్భుతమైన క్లీన్‌స్వీప్ విజయం అందించాడు. బ్యాటర్‌గా వన్డేల్లో అతడి రికార్డు గొప్పగా ఉంది. సారథిగా విజయాల శాతం కూడా ఎక్కువే. అందుకే ఈ టోర్నమెంట్లో టీమిండియా కాస్త చెత్తగా ఆడినా.. ఓడినా జట్టులో అతడి స్థానం పదిలంగానే ఉంటుంది. 2027 వన్డే వరల్డ్‌ప్ వరకు అతడు కొనసాగుతాడు’’ అని మహ్మద్ కైఫ్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు.చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొంటున్న భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: CT 2025: అదొక చెత్త నిర్ణయం.. అతడి వల్లే ఇదంతా: మాజీ క్రికెటర్ ఫైర్ -
CT 2025: టీమిండియాతో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ
స్వదేశంలో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌కు చేదు ఆరంభం లభించింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పాక్ చిత్తుగా ఓడింది. ఓటమి బాధలో ఉన్న పాక్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడిన ఫకర్ జమాన్ భారత్‌తో జరుగబోయే కీలక మ్యాచ్‌కు దూరమయ్యాడు. జమాన్‌కు ప్రత్యామ్నాయంగా ఇమామ్ ఉల్ హాక్ పేరును ప్రకటించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. భారత్‌తో మ్యాచ్‌కు జమాన్ దూరం కావడం పాక్‌కు పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించబడుతుంది. ఈ టోర్నీలో పాక్ సెమీస్‌కు చేరాలంటే భారత్‌తో సహా బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాల్సి ఉంది.గాయపడినా బరిలోకి దిగిన జమాన్న్యూజిలాండ్తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ సందర్భంగా గాయపడిన ఫకర్ జమాన్.. ఆతర్వాత కొద్ది సేపు రెస్ట్ తీసుకుని బ్యాటింగ్‌కు దిగాడు. అయితే జమాన్ తన రెగ్యులర్ ఓపెనింగ్ స్థానంలో కాకుండా నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. బ్యాటింగ్ చేస్తున్నంత సేపు జమాన్ చాలా ఇబ్బందిపడ్డాడు. 41 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 24 పరుగులు చేసిన అనంతరం బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జమాన్.. ఛాతీలో కండకాల నొప్పితో బాధపడుతున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. జమాన్.. భారత్‌తో మ్యాచ్‌కు మాత్రమే దూరంగా ఉంటాడా, లేక టోర్నీ మొత్తానికి దూరమయ్యాడా అన్న విషయంపై క్లారిటీ లేదు.ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 60 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. ఓపెనర్ విల్ యంగ్ (107), వికెట్‌కీపర్ టామ్ లాథమ్ (118 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 320 పరుగుల భారీ స్కోర్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో డెవాన్ కాన్వే (10), కేన్ విలియమ్సన్ (1), డారిల్ మిచెల్ (10) తక్కువ స్కోర్లకే ఔటయ్యాడు. ఇన్నింగ్స్ చివర్లో గ్లెన్ ఫిలిప్స్ (39 బంతుల్లో 61; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లలో నసీం షా, హరీస్ రౌఫ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. అబ్రార్ అహ్మద్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పాక్ పేసర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. రౌఫ్ 10 ఓవర్లలో ఏకంగా 83 పరుగులిచ్చాడు.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. చాలా నిదానంగా బ్యాటింగ్ చేసింది. పాక్ ఏ దశలోనూ గెలవాలన్న ఆసక్తితో బ్యాటింగ్ చేయలేదు. బాబర్ ఆజమ్ (64) బ్యాటింగ్ నత్త నడకను తలపించింది. సౌద్ షకీల్ (6), కెప్టెన్ రిజ్వాన్ (3), తయ్యబ్ తాహిర్ (1) దారుణంగా విఫలమయ్యారు. ఖుష్దిల్ షా (69), సల్మాన్ అఘా (42) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే జరగాల్సి నష్టం జరిగిపోయింది. న్యూజిలాండ్ బౌలర్లు విలియమ్ ఓరూర్కీ (9-0-47-3), మిచెల్ సాంట్నర్ (10-0-663), మ్యాట్ హెన్రీ (7.2-1-25-2), బ్రేస్‌వెల్ (10-1-38-1) రెచ్చిపోవడంతో పాక్ 47.2 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌటైంది. పాక్.. ఈ నెల 23న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో టీమిండియాను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతుంది -
CT 1998- 2017: టీమిండియాకు అత్యంత చేదు జ్ఞాపకం అదొక్కటే!
భారత అభిమానులకు 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఒక చేదు జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ఈ టోర్నమెంట్ ఫైనల్లో భారత్ జట్టు తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఘోరమైన పరాజయం చవిచూడటమే ఇందుకు కారణం. ప్రపంచ కప్ ఛాంపియన్షిప్ మ్యాచ్‌లలో ఒక్కసారి కూడా పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓడిపోలేదు. కానీ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మాత్రం పాకిస్తాన్ భారత్ పై భారీ ఆధిక్యంతో విజయం సాధించి తన ప్రతీకారం తీర్చుకుంది. ఇందుకు బదులు చెప్పేందుకు ఇప్పుడు సమయం ఆసన్నమైంది. మరి.. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ప్రయాణం ఇప్పటి వరకు ఎలా సాగిందో చూద్దామా?!ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్రారంభమైన 23 సంవత్సరాల విరామం తర్వాత 1998లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పోటీలకు శ్రీకారం చుట్టింది. ఈ టోర్నమెంట్లో ప్రపంచ క్రికెట్ అగ్రస్థానంలో ఉన్న జట్లు ఈ ట్రోఫీ కోసం పోటీ పడతాయి. ఇంతవరకు ఎనిమిది సార్లు ఛాంపియన్షిప్ పోటీలు జరుగగా, ఆస్ట్రేలియా మరియు భారత్ రెండుసార్లు ఈ టైటిల్ ని గెలుచుకున్న అత్యంత విజయవంతమైన జట్లుగా నిలిచాయి. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్ మరియు పాకిస్తాన్ ఒక్కొక్కసారి గెలిచాయి. 1998లో ఛాంపియన్షిప్ ట్రోఫీ ప్రారంభం నుంచి ఈ టోర్నమెంట్లో భారత్ ప్రదర్శన మీ కోసం:1998 (బంగ్లాదేశ్)1998లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ టౌర్నమెంట్ కి బంగ్లాదేశ్ ఆతిధ్యమిచ్చింది. నాకౌట్ ఫార్మాట్లో జరిగిన ఈ టౌర్నమెంట్ లోని ప్రారంభ మ్యాచ్ లో భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది, సచిన్ టెండూల్కర్ 141 పరుగులు సాధించడం తో భారత్ 307 పరుగుల భారీ స్కోరు చేసింది. సచిన్ మళ్ళీ బౌలింగ్ లోనూ విజృంభించి నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థులను 263 పరుగులకే పరిమితం చేశాడు. మహ్మద్ అజారుద్దీన్ నాయకత్వం లోని భారత్ జట్టు సెమీ-ఫైనల్లో వెస్టిండీస్‌తో తలపడింది. సౌరవ్ గంగూలీ మరియు రాబిన్ సింగ్ లు అర్థ సెంచరీలు సాధించి భారత్ స్కోర్ ను 242/6 కు చేర్చారు. కానీ శివనారాయణ్ చంద్రపాల్ (74) మరియు బ్రియాన్ లారా (60 నాటౌట్) రాణించడంతో వెస్టిండీస్ ఆరు వికెట్ల తేడాతో భారత్ పై విజయం సాధించి ఫైనల్ కి చేరుకుంది. అయితే, వెస్టిండీస్‌ను ఫైనల్లో దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల తేడాతో ఓడించి తొలి ఛాంపియన్షిప్ ట్రోఫీ ని చేజిక్కించుకుంది.2000 (కెన్యా)కెన్యా ఆతిధ్యమిచ్చిన రెండో ఛాంపియన్షిప్ ట్రోఫీలో భారత్ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం చవిచూసింది. భారత్ తొలి మ్యాచ్ లో ఆతిథ్య కెన్యాను సునాయాసంగా ఓడించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాను 20 పరుగుల తేడాతో ఓడించి సెమీ-ఫైనల్‌కు చేరుకుంది.సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడిన భారత్ జట్టు సౌరవ్ గంగూలీ అజేయంగా నిలిచి 141 పరుగులు చేయడంతో భారత్ 295 పరుగులు స్కోర్ చేసింది. 296 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 200 పరుగులకే ఆలౌట్ అయింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో, గంగూలీ సెంచరీని సాధించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. క్రిస్ కైర్న్స్ కూడా రాణించి సెంచరీ సాధించడంతో కివీస్ భారత్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని ఎగరవేసుకొనిపోయింది.2002 (శ్రీలంక)2002 నుండి ఈ టౌర్నమెంట్ ని నాకౌట్ ఫార్మాట్ లో నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో పన్నెండు జట్లు పాల్గొన్నాయి. వాటిని నాలుగు "పూల్స్"గా విభజించారు. భారత్, ఇంగ్లాండ్ మరియు జింబాబ్వేతో పాటు పూల్ 2లో ఉంది. ప్రతి పూల్ నుండి అగ్రస్థానంలో ఉన్న జట్టు సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించింది. భారత్ రెండు విజయాలతో పూల్‌లో అగ్రస్థానంలో నిలిచి నాకౌట్ అర్హత సాధించింది. గంగూలీ నేతృత్వంలోని జట్టు సెమీ-ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికా ను 10 పరుగుల తేడాతో ఓడించింది.ఫైనల్లో శ్రీలంక మొదట బ్యాటింగ్ ఎంచుకోగా, కెప్టెన్ సనత్ జయసూర్య, కుమార్ సంగక్కరల అర్ధ సెంచరీలతో రాణించడం తో ఆ జట్టు 244/5 స్కోర్ చేసింది. కానీ భారత్ లక్ష్య సాధనకి వర్షం అడ్డంకిగా నిలిచింది. ఫలితంగా భారత్ స్కోర్ రెండు ఓవర్ల కు 14/0 వద్ద ఉండగా మ్యాచ్ నిలిచిపోయింది. ఆ తర్వాత మ్యాచ్‌ను రిజర్వ్ డేకి మార్చారు, అక్కడ ఆట మళ్ళీ మొదటి నుండి ప్రారంభమైంది. శ్రీలంక మళ్ళీ మొదట బ్యాటింగ్ చేసి 222/7 స్కోరు చేసింది. వర్షం మరోసారి ఆటకు అవరోధం గా నిలిచింది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత్ 38/1తో ఉంది. చివరికి భారత్, శ్రీలంక లని సంయుక్త విజేతలు గా ప్రకటించారు.2004 (ఇంగ్లాండ్)ఇంగ్లాండ్‌లో జరిగిన 2004 ఛాంపియన్స్ ట్రోఫీలో 12 జట్లు పాల్గొన్నాయి. కానీ ఈ టౌర్నమెంట్ లో భారత్ పేలవమైన ప్రదర్శన తో గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. భారత్, పాకిస్తాన్ మరియు కెన్యాతో పాటు గ్రూప్ సి నుంచి రంగంలోకి దిగింది. కానీ కెన్యాపై కేవలం ఒక మ్యాచ్ గెలిచిన భారత్ తన చిరకాల ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలై గ్రూప్ దశలోనే టౌర్నమెంట్ నుంచి వైదొలగింది. ఈ టౌర్నమెంట్ లో వెస్టిండీస్ విజేతగా నిలిచింది.2006 (భారత్)భారత్ ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నమెంట్ లో పది జట్లు పాల్గొన్నాయి. రాహుల్ ద్రావిడ్ సారథ్యంలోని భారత్ జట్టు గ్రూప్ దశలో ఇంగ్లాండ్ పై గెలిచింది కానీ, ఫైనల్ కి అర్హత సాధించిన ఆస్ట్రేలియా మరియు వెస్టిండీస్ చేతిలో వరుసగా ఆరు వికెట్లు మరియు మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలై టౌర్నమెంట్ నుంచి గ్రూప్ స్థాయిలోనే వైదొలిగింది. ఫైనల్లో ఆస్ట్రేలియా వెస్టిండీస్ ను ఓడించి ట్రోఫీ ని కైవసం చేసుకుంది.2009 (దక్షిణాఫ్రికా)2009లో ఛాంపియన్స్ ట్రోఫీ దక్షిణాఫ్రికాలో జరిగింది మరియు టోర్నమెంట్‌ను ఎనిమిది జట్లుగా కుదించారు. అన్ని జట్లని నాలుగు గ్రూపులుగా విభజించారు. భారత్ ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మరియు వెస్టిండీస్‌లతో పాటు గ్రూప్ ఎ నుంచి రంగంలోకి దిగింది. కానీ మరోసారి గ్రూప్ లో మూడవ స్థానంలో నిలిచి తర్వాత గ్రూప్‌ను దాటలేకపోయింది. భారత్ పాకిస్తాన్ చేతిలో 54 పరుగుల తేడాతో పరాజయం చవిచూడగా, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆ తర్వాత భారత్ జట్టు వెస్టిండీస్‌ను ఓడించింది, కానీ సెమీ-ఫైనల్‌కు చేరుకోవడానికి అది సరిపోలేదు.2013 (ఇంగ్లాండ్ అండ్ వేల్స్)ఎమ్ ఎస్ ధోని నేతృత్వంలోని భారత్ జట్టు ఇంగ్లాండ్‌లో జరిగిన 2013 ఛాంపియన్స్ ట్రోఫీని లో విజేత గా నిలిచింది. గ్రూప్ బి లో మూడు విజయాలతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత సెమీఫైనల్లో శ్రీలంకను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తర్వాత ఫైనల్ లో భారత్ జట్టు ఇంగ్లాండ్‌తో తలపడింది, వర్షం కారణంగా ఈ మ్యాచ్ ని 20 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 129/7కే పరిమితమైంది. కానీ రవీంద్ర జడేజా (2/24), ఇషాంత్ శర్మ (2/36) మరియు రవిచంద్రన్ అశ్విన్ (2/15) రాణించడంతో భారత్ బౌలర్లు ఇంగ్లాండ్ ని 124/8కే పరిమితం చేయడంతో భారత్ ట్రోఫీ ని చేజిక్కించుకుంది.2017 (ఇంగ్లాండ్ అండ్ వేల్స్)2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ జట్టు ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో పరాజయం చవిచూడడం తో ట్రోఫీ ని నిలబెట్టుకోలేకపోయింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మరియు శ్రీలంకలతో కూడిన తమ గ్రూప్‌లో మొదటి స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. రోహిత్ శర్మ అజేయంగా నిలిచి 123 పరుగులు సాధించడంతో భారత్ సెమీఫైనల్స్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. అయితే భారత్ చివరికి ఫైనల్ లో పాకిస్తాన్ చేతి లో ఓటమి చవిచూసింది. -
CT 2025: ఈ జట్ల మధ్యే ప్రధాన పోటీ?.. కివీస్‌కు ఛాన్సులు ఎక్కువే!
సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్ కి ఆతిథ్యమిస్తోంది 2017 ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) విజేత పాకిస్తాన్. సొంతగడ్డపై జరిగే ఈ ఈవెంట్లో గెలిచి మరోసారి ట్రోఫీని చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరి.. ఎనిమిదేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ టోర్నమెంట్లో విజయావకాశాలు ఎవరికి ఉన్నాయంటే?..ప్రపంచ కప్ వంటి పలు అంతర్జాతీయ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఎప్పుడూ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించే ఆస్ట్రేలియా ప్రస్తుతం గాయాలతో చతికిలపడి పోయింది. సొంత గడ్డపై బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో టీమిండియాను ఓడించి 3-1తో గెలిచింది ఆస్ట్రేలియా. ఆసీస్‌కు ఎదురుదెబ్బలుఅయితే, ఈ టెస్టు సిరీస్ తర్వాత కీలకమైన ఆటగాళ్లు గాయాలబారిన పడటం ఆందోళనకర అంశంగా పరిణమించింది. అందుకే చాంపియన్స్ ట్రోఫీకి తమ పూర్తి స్థాయి జట్టుని పంపలేకపోయింది ఆసీస్ బోర్డు.ముఖ్యంగా జట్టులోని ప్రధాన బౌలర్ల అందరూ గాయాల కారణంగా ఈ టోర్నమెంట్ కి దూరంకావడం ప్రభావం చూపనుంది. కెప్టెన్ పాట్ కమ్మిన్స్‌తో పాటు ఫాస్ట్ బౌలర్లు మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, అల్ రౌండర్ మిచెల్ మార్ష్ గాయాల వల్ల వైదొలిగారు. ఇదే సమయంలో జట్టులోని ప్రధాన ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ కూడా అనూహ్యంగా తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా బ్యాటర్లు మునుపటి స్థాయి లో చెలరేగి ఆడి ఈ ట్రోఫీ ని సాధించడం అనుమానంగానే కనిపిస్తోంది.అంత సులువు కాక పోవచ్చుఈ టోర్నమెంట్ లో మరో ప్రధానమైన జట్టుగా బరిలో దిగుతున్న ఇంగ్లండ్ 2019 వన్డే ప్రపంచ కప్, 2022 టి20 ప్రపంచ కప్ ల విజయం తర్వాత ఇటీవలి కాలంలో ఆశించిన రీతిలోరాణించలేకపోయింది. ఇటీవల భారత్ లో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ లో ఇంగ్లండ్ 3-0 తేడాతో ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. అయితే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి జట్లని పూర్తి స్థాయిలో పక్కకు పెట్టడం కష్టమే.కానీ ఇలాంటి ప్రధానమైన టోర్నమెంట్ లో రాణించడానికి ముందు వారి ప్రదర్శన, పిచ్ ల ప్రభావం కూడా కీలకం. ఈ నేపధ్యం లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లకు ప్రస్తుత పరిస్థితుల్లో రాణించడం అంత సులువు కాక పోవచ్చు. ఇక ఈ టోర్నమెంట్ మూడు జట్ల మధ్యే ట్రోఫీ కోసం పోటీ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. అందులో ప్రధానమైనవి భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్. ఈ నేపథ్యం లో ఈ మూడు జట్ల బలాబలాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం.భారత్: ఛాంపియన్ ట్రోఫీ రికార్డ్: ఛాంపియన్స్ (2002, 2013)ప్రస్తుత వన్డే ర్యాంకింగ్: 1ప్రధాన ఆటగాళ్ళు: కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యాఇంగ్లండ్లో 2017లో జరిగిన చివరి ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ ఫైనల్లో పాకిస్తాన్ జట్టు 180 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి ట్రోఫీ ని గెలుచుకుంది. ప్రస్తుత టి20 ప్రపంచ ఛాంపియన్స్ అయిన భారత్ వరుసగా రెండో ఐసిసి టోర్నమెంట్ టైటిల్ సాధించాలని చూస్తోంది. సొంతగడ్డ పై 2023లో జరిగిన వన్డే ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా అనూహ్యంగా భారత్ పై విజయం సాధించి ట్రోఫీ ని చేజిక్కించుకుంది.అయితే రోహిత్ శర్మ సేన ఆ ఘోర పరాజయం నుంచి తొందరగా కోలుకొని ఏడు నెలల తర్వాత టి20 ప్రపంచ ఛాంపియన్స్ ట్రోఫీ ని సాధించింది. గత ఏడాది కాలంగా భారత్ జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్భుతమైన ఫామ్‌లో ఉంది. టెస్ట్‌లలో పేలవమైన ప్రదర్శననను పక్కన పెడితే టి20, వన్డే ఫార్మాట్లలో భారత్ ప్రత్యర్థి జట్లపై ఆధిపత్యం చెలాయించింది. ఇటీవల స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను 3-0 తేడాతో ఓడించడం, అలాగే టాప్-ఆర్డర్ బ్యాట్స్‌మన్ అద్భుతమైన ఫామ్‌తో ఉండడటం తో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌కు భారత్ ప్రధాన పోటీదారులలో ఒకటిగా చెప్పడంలో సందేహం లేదు. ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం ఒక్కటే భారత్ కి కొద్దిగా ప్రతికూలంగా కనిపిస్తున్న అంశం. సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీ మునుపటి ఫామ్ ని కనబరిచినట్టయితే ఈ లోపాన్ని కూడా అధిగమించే అవకాశం ఉంది. కుల్దీప్ యాదవ్ చాకచక్యమైన లెగ్-బ్రేక్ బౌలింగ్, హార్దిక్ పాండ్యా ఆల్ రౌండ్ ఫామ్ జట్టుకి అదనపు బలం. మంచి ఊపు మీద ఉన్న ప్రస్తుత భారత్ జట్టుని నిలువరించడం ప్రత్యర్థులకు అంత సులువు కాకపోవచ్చు.పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ రికార్డ్: ఛాంపియన్స్ (2017)వన్డే ర్యాంకింగ్: 3ప్రధాన ఆటగాళ్ళు: బాబర్ ఆజం, షాహీన్ షా అఫ్రిది, ఫఖర్ జమాన్, మహ్మద్ రిజ్వాన్ఇటీవల కాలంలో పాకిస్తాన్ జట్టు ప్రదర్శన ఎప్పుడూ నిలకడగా లేదు. సొంత గడ్డ పై ప్రధాన జట్లు ఆడకపోవడం, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, జట్టులో రాజకీయాలు, కోచ్, కెప్టెన్ ల పై వేటు .. ఇలా పాకిస్తాన్ పేలవమైన ఫామ్ కి అనేక కారణాలు. అయితే 2017 చాంపియన్స్ అయిన పాకిస్తాన్ ఈసారి సొంత గడ్డ పై ఆడటం వారికి కలిసొచ్చే అంశం. పాకిస్తాన్ స్వదేశం లో ఆడిన మూడు ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను చేజిక్కించుకుంది.ప్రపంచ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాపై 2-1 తో విజయం, బలీయమైన దక్షిణాఫ్రికా జట్టును 3-0 తేడాతో ఓడించడం వంటివి ఆ జట్టుకు ఈ టోర్నమెంట్ కి ముందు కొత్త ఉత్సాహాన్నిస్తాయనడంలో సందేహం లేదు. మొహమ్మద్ రిజ్వాన్, స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజం, ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది మరియు 2017 టైటిల్ హీరో ఫఖర్ జమాన్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. అదీ కాక స్వదేశీ ప్రేక్షకుల ముందు ఆ జట్టు విజృంభించి ఆడితే ప్రత్యర్థి జట్లకు అంత సులువు కాకపోవచ్చు.న్యూజిలాండ్చాంపియన్స్ ట్రోఫీ రికార్డ్: ఛాంపియన్స్ (2000)వన్డే ర్యాంకింగ్: 4ప్రధాన ఆటగాళ్ళు: కేన్ విలియమ్సన్, మాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్గత ఐదు ఐసిసి పరిమిత ఓవర్ల ప్రపంచ కప్‌లలో ఒకటి తప్ప మిగతా వాటిలో న్యూజిలాండ్ నాకౌట్ దశకు చేరుకుని తన సత్తా చాటుకుంది. అయితే 2000 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత న్యూజీల్యాండ్ ఒక్క ఐసిసి టోర్నమెంట్‌ను కూడా గెలవలేదు. కానీ ఆల్ రౌండర్ మిచెల్ సాంట్నర్ నాయకత్వం, మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మళ్ళీ ఫామ్‌లోకి రావడంతో, న్యూజిలాండ్ ఈసారి ఆటుపోట్లను తట్టుకొని నిలబడ గలమని ఆశాభావంతో ఉంది. పాకిస్తాన్లో జరిగిన ముక్కోణపు సిరీస్ విజయంతో న్యూజిలాండ్ కొత్త ఉత్సహంతో ఈ టోర్నమెంట్లోకి అడుగుపెట్టింది. అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్ ఫామ్ తో పటు పేస్ బౌలర్లు సరైన రీతి రాణించి నట్లయితే న్యూజిలాండ్ మరోసారి టైటిల్ గెలిచినా ఆశ్చర్యం లేదు.చదవండి: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్ -
పాకిస్తాన్‌కి మళ్ళీ ఊపిరి పోసిన జింబాబ్వే.. ఇప్పుడిలా!
తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యమిచ్చే అవకాశం లభించడంతో పాకిస్తాన్ క్రికెట్ అభిమానుల్లో మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్ పోటీలపై ఆశలు చిగురిస్తున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ పూర్తి స్థాయిలో అంతర్జాతీయ క్రికెట్ పోటీల్ని చూసే అవకాశం లభించడంతో వారంతా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో ప్రధాన జట్టుగా వెలుగొందిన పాకిస్తాన్‌కి ఉగ్రవాద ముద్ర పడిన తర్వాత ప్రధాన క్రికెట్ జట్లన్నీ ఆ దేశంలో పర్యటించడానికి వెనుకాడాయి.ముఖ్యంగా 2009లో ఆ దేశానికీ పర్యటనకి వచ్చిన శ్రీలంక జట్టు ఆటగాళ్ల బస్సుపై ఉగ్రవాద దాడి జరిగినప్పటి నుండి పాకిస్తాన్ దేశం లో దాదాపు అంతర్జాతీయ క్రికెట్ పర్యటనలు నిలిచిపోయాయి. విదేశీ జట్ల రాకపోకలు నిలిచిపోవడంతో భద్రతా కారణాల దృష్ట్యా కొంతకాలం క్రితం వరకు పాకిస్తాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)ని తమ స్వదేశీ వేదిక చేసుకొని క్రికెట్ మ్యాచ్ లు ఆడింది.పాకిస్తాన్‌కి మళ్ళీ ఊపిరి పోసిన జింబాబ్వే2015లో జింబాబ్వే తొలిసారిగా పాకిస్తాన్ లో పర్యటించింది. దీంతో మళ్ళీ ఆ దేశంలో క్రికెట్ పర్యటనలకు దారులు తెరుచుకున్నాయి. ఆ తర్వాత 2017లో వరల్డ్ XI జట్టు టి20 సిరీస్ ఆడింది. దీంతో అంతర్జాతీయ జట్ల పర్యటనలు మళ్ళీ మెల్ల మెల్లగా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా దేశాల క్రికెట్ జట్లు పాకిస్తాన్ కి పర్యటనలకు వెళ్లడంతో మళ్ళీ ఆ దేశ క్రికెట్ అభిమానులకి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లను చూసే అవకాశం లభించింది. వివాదాల ఛాంపియన్స్ ట్రోఫీఎనిమిది సంవత్సరాల విరామం తర్వాత పాకిస్తాన్ అభిమానులు ఒక అంతర్జాతీయ టోర్నమెంట్, అదీ ఛాంపియన్స్ ట్రోఫీ చూసేందుకు అవకాశం లభించడంతో వారంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనేక వివాదాల అనంతరం పాకిస్తాన్ కి మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కి ఆతిధ్యమిచ్చే అవకాశం లభించింది. 2017లో సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్తాన్‌ను తమ చిరకాల ప్రత్యర్థి భారత్‌పై ఫైనల్లో 180 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటి నుండి అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి.ఎందుకంటె భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ), పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (పీసీబీ)ల మధ్య ఈ టోర్నమెంట్ ఆడితిధ్యం హక్కులపై వివాదం నెలకొంది. ముఖ్యంగా బీసీసీఐ అధ్యక్షుడుగా వ్యవహరించిన రోజర్ బిన్నీ నేతృత్వంలోని బోర్డు భద్రతా కారణాల దృష్ట్యా భారత్ గతంలో జట్టు ని పాకిస్తాన్‌కు పంపడానికి నిరాకరించింది. బీసీసీఐ హైబ్రిడ్ మోడల్ ని ప్రతిపాదించగా, పీసీబీ మాత్రం మొత్తం టోర్నమెంట్‌ను పాకిస్తాన్‌లోనే ఉంచాలని పట్టుదలకు పోయింది.పాకిస్తాన్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కావడం, అంతే కాక 1996 ప్రపంచ కప్ తర్వాత తొలిసారి ఐసీసీ టోర్నమెంట్ ని నిర్వహించే అవకాశం రావడం ఇందుకు ప్రధాన కారణం. చివరికి పాకిస్తాన్ కొద్దిగా పట్టు సడలించింది. దీంతో పాకిస్తాన్ అభిమానుల కల నెరవేరే రోజు రానే వచ్చింది. పాకిస్తాన్ క్రికెట్‌కి ఇది చాల ప్రత్యేకమైన రోజు!ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఎందుకు రద్దు చేసింది?ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి సారించిన ఐసీసీ 1998లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించేందుకు ప్రతిపాదించింది. ఐసీసీలో అసోసియేట్ దేశాలు గా గుర్తింపు పొందిన దేశాల జట్లు మాత్రమే ప్రతిష్టాత్మకమైన యాభై ఓవర్ల ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి ఐసీసీ అనుమతించింది.మొదటి రెండు టౌర్నమెంట్లకు ఇదే పద్ధతిని అనుసరించారు. కానీ త్వరలోనే పూర్తి సభ్య దేశాల జట్లు కూడా ఈ టోర్నమెంట్లో పాలొనడం ప్రారంభించడం తో ఇది వన్డే ప్రపంచ కప్ తర్వాత ఎలైట్ ఐసీసీ యాభై ఓవర్ల ఈవెంట్‌గా మారిపోయింది. 2006 వరకు ఛాంపియన్స్ ట్రోఫీని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేవారు కానీ ఆ తర్వాత ఐసీసీ దీనిని వన్డే ప్రపంచ కప్ మాదిరిగానే దీన్ని నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం ప్రారంభించింది. అయితే యాభై ఓవర్ల ఫార్మాట్లో రెండు ప్రధాన టౌర్నమెంట్లను -- ప్రపంచ కప్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీ --- నిర్వహించడంపై దుమారం చెలరేగడంతో, ముఖ్యంగా ప్రపంచ కప్ స్థాయిలో రెండు వన్డే టౌర్నమెంట్లు నిర్వహించడం అర్ధరహితమని క్రికెట్ అభిమానులు వాదనలు వినిపించారు.మరోవైపు.. మూడు ఫార్మాట్లలోనూ మెగా టోర్నీ నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ను ఐసీసీ ప్రవేశట్టింది. ఈ క్రమంలో 2017లో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణను నిలిపివేసిన ఐసీసీ... 2021లో రీ ఎంట్రీపై అప్డేట్ ఇచ్చింది. 2025లో ఈ వన్డే ఫార్మాట్ టోర్నీని నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే ఈ టోర్నమెంట్ వేదిక కోసం పాకిస్తాన్ పట్టుబడటం, ఉగ్రవాద ముప్పు దృష్ట్యా ఆ దేశంలో పర్యటించేందుకు భారత్ నిరాకరించడంతో మళ్ళీ ఛాంపియన్ ట్రోఫీ ఆతిధ్యం పై వివాదం చెలరేగింది.తటస్థ వేదికైన యూఏఈలోఈ టోర్నమెంట్ నిర్వహణ పై అనుమానాలు కూడా తలెత్తాయి. ఈ టోర్నమెంట్ పాకిస్తాన్ నుంచి వేరే దేశానికీ మార్చాలని కూడా భావించారు. అయితే గత సంవత్సరం నవంబర్ లో బీసీసీఐ, పీసీబీ అధికారుల మధ్య ఐసీసీ ఒక సమావేశం నిర్వహించింది. భారత్ మ్యాచ్‌లను తటస్థ దేశమైన యూఏఈలో నిర్వహించేందుకు చివరికి అంగీకారం కుదరడంతో మళ్ళీ ఈ టోర్నమెంట్ నిర్వహణకు అడ్డంకులన్నీ తొలిగిపోయాయి.చదవండి: భారత తుదిజట్టులో బుమ్రా స్థానంలో అతడే సరైనోడు: రిక్కీ పాంటింగ్ -
CT 2025: షెడ్యూల్, జట్లు, టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) రూపంలో మెగా క్రికెట్ పండుగ అభిమానులకు కనువిందు చేయనుంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలయ్యే ఈ ఐసీసీ టోర్నమెంట్ మార్చి 9న ఫైనల్‌తో ముగియనుంది. ఈ ఈవెంట్లో ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి.ఇందులో భాగంగా గ్రూప్-‘ఎ’ నుంచి భారత్(India), పాకిస్తాన్(Pakistan), న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్, వేదికలు,జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్ తదితర వివరాలు తెలుసుకుందామా?!చాంపియన్స్ ట్రోఫీ-2025 పూర్తి షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం(భారత కాలమానం ప్రకారం)👉1. ఫిబ్రవరి 19- పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్- ఎ, నేషనల్ స్టేడియం, కరాచీ (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉2. ఫిబ్రవరి 20- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్, గ్రూప్-ఎ, దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉3. ఫిబ్రవరి 21- అఫ్గనిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా, గ్రూప్-బి, నేషనల్ స్టేడియం, కరాచి(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉4. ఫిబ్రవరి 22- ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్, గ్రూప్-బి, గడాఫీ స్టేడియం, లాహోర్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉5. ఫిబ్రవరి 23- ఇండియా వర్సెస్ పాకిస్తాన్, గ్రూప్-ఎ, దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉6. ఫిబ్రవరి 24- బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్-ఎ, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉7. ఫిబ్రవరి 25- ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా, గ్రూప్-బి, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉8. ఫిబ్రవరి 26- అఫ్గనిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్, గ్రూప్-బి, గడాఫీ స్టేడియం, లాహోర్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉9. ఫిబ్రవరి 27- పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్, గ్రూప్-ఎ, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉10. ఫిబ్రవరి 28- అఫ్గనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా, గ్రూప్-బి, గడాఫీ స్టేడియం, లాహోర్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉11. మార్చి 1- సౌతాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్, గ్రూప్-బి, నేషనల్ స్టేడియం, కరాచి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉12. మార్చి 2- ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్-ఎ, దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉సెమీ ఫైనల్ 1: మార్చి 4- దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(ఇండియా క్వాలిఫై అయితే), 👉సెమీ ఫైనల్ 2: మార్చి 5- గడాఫీ స్టేడియం లాహోర్(పాకిస్తాన్ క్వాలిఫై అయితే)👉ఫైనల్ మార్చి 9: గడాఫీ స్టేడియం లాహోర్ లేదా దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(ఇండియా క్వాలిఫై అయితే).లైవ్ టెలికాస్ట్, ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే..భారత్‌లో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, స్పోర్ట్స్ 18లో లైవ్ టెలికాస్ట్. అదే విధంగా.. జియోహాట్‌స్టార్ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్. స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియా(ఎక్స్) హ్యాండిల్లో ఉన్న వివరాల ప్రకారం.. జియోహాట్‌స్టార్‌లో ఉచితంగా మ్యాచ్‌లు చూడవచ్చు. టెలివిజన్, మొబైల్‌లలో ఈ వెసలుబాటు ఉంటుంది.చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్లుగ్రూప్-ఎఇండియా రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.నాన్ ట్రావెలింగ్ సబ్స్టిట్యూట్స్: యశస్వి జైస్వాల్, మహ్మద్ సిరాజ్, శివం దూబే.పాకిస్తాన్మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, ఉస్మాన్ ఖాన్, మహ్మద్ హస్నైన్, షాహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా.న్యూజిలాండ్‌డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మ్యాట్ హెన్రీ, విల్ ఓ రూర్కీ, నాథన్ స్మిత్, విల్ యంగ్, జాకబ్ డఫీ, మైఖేల్ బ్రేస్‌వెల్, కైల్ జెమీషన్.బంగ్లాదేశ్సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొసేన్ శాంటో (కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, పర్వేజ్ హొస్సేన్ ఇమాన్, తాంజిమ్ హసన్ సకీబ్, నహీద్ రాణా, నసూమ్ అహ్మద్.గ్రూప్-బిఆస్ట్రేలియాజేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, సీన్ అబాట్, అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, తన్వీర్ సంఘా, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా, బెన్ డ్వార్షూయిస్, స్పెన్సర్ జాన్సన్.ట్రావెలింగ్ రిజ్వర్స్: కూపర్ కొనొలి.సౌతాఫ్రికాటెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, హెన్రిచ్ క్లాసెన్, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ట్రిస్టన్ స్టబ్స్, రాస్సీ వాన్ డెర్ డసెన్, వియాన్ ముల్దర్, కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడి, కగిసో రబడా, ర్యాన్ రికెల్టన్, తబ్రేజ్ షంసీ, కార్బిన్ బాష్ట్రావెలింగ్ రిజర్వ్: క్వెనా మఫాకా.ఇంగ్లండ్జోస్ బట్లర్ (కెప్టెన్), బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జో రూట్, బ్రైడన్ కార్సే, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, టామ్ బాంటన్.అఫ్గనిస్తాన్ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్, సెదిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), ఇక్రమ్ అలీఖిల్, గుల్బాదిన్ నాయబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫరూఖీ, ఫరీద్ మాలిక్, నంగ్యాల్ ఖరోటీ, నవీద్ జద్రాన్రిజర్వ్ ప్లేయర్లు: డార్విష్ రసూలీ, బిలాల్ సమీ.చదవండి: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్ -
మా జట్టుకు గట్టి పోటీ తప్పదు.. సెమీస్ చేరే జట్లు ఇవే: పాక్ మాజీ కెప్టెన్
చాంపియన్స్ ట్రోఫీ-2025 గ్రూప్ దశలో తమ జట్టుకు గట్టిపోటీ తప్పదంటున్నాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్(Sarfaraz Ahmed). టీమిండియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌ల జట్ల రూపంలో కఠిన సవాలు ఎదురుకానుందని పేర్కొన్నాడు. అయితే, సొంతగడ్డపై జరిగే ఈ టోర్నీలో పాకిస్తాన్(Pakistan) తప్పకుండా సెమీ ఫైనల్‌కు మాత్రం చేరుతుందని సర్ఫరాజ్ అహ్మద్ ధీమా వ్యక్తం చేశాడు.కాగా 2017లో చివరగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) టోర్నమెంట్లో పాక్ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. నాడు సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్సీలో లండన్ వేదికగా జరిగిన ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి టీమిండియాపై గెలుపొంది ట్రోఫీని ముద్దాడింది. ఎనిమిదేళ్ల అనంతరంఇక ఇప్పుడు.. దాదాపు ఎనిమిదేళ్ల అనంతరం ఈ మెగా టోర్నీ మరోసారి జరుగనుండగా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ ఆతిథ్య హక్కులు దక్కించుకుంది.ఇక ఈ ఐసీసీ ఈవెంట్‌కు పాకిస్తాన్‌తో పాటు వన్డే వరల్డ్‌కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ అర్హత సాధించాయి.ఈ క్రమంలో ఈ ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-‘ఎ’లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-‘బి’లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్ , ఇంగ్లండ్‌ను చేర్చారు. ఇక పాక్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఈ టోర్నీ మొదలుకానుండగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడనుంది.సెమీ ఫైనల్స్‌లో ఆ నాలుగేఈ నేపథ్యంలో సర్ఫరాజ్ అహ్మద్ చాంపియన్స్ ట్రోఫీ-2025లో సెమీస్ చేరే జట్లపై తన అంచనా తెలియజేశాడు. ‘‘పాకిస్తాన్ ఉన్న గ్రూపులో జట్ల నుంచి గట్టి పోటీ తప్పదు. అయితే, నా అభిప్రాయం ప్రకారం... ఈసారి పాకిస్తాన్, ఇండియా, అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా బలమైన జట్లుగా కనిపిస్తున్నాయి. సెమీ ఫైనల్స్ ఈ నాలుగే చేరతాయి’’ అని సర్ఫరాజ్ అహ్మద్ పేర్కొన్నాడు.ఇక తమ జట్టు గురించి మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ టీమ్ పటిష్టంగా ఉంది. సొంతగడ్డపై టోర్నీ ఆడనుండటం అతిపెద్ద సానుకూలాంశం. సొంత మైదానాల్లో ఎలా ఆడాలన్న అంశంపై ప్రతి ఒక్క ఆటగాడికి అవగాహన ఉంది. 2017లో ట్రోఫీ గెలిచిన జట్టుతో పోలిస్తే.. ప్రస్తుత జట్టు మరింత స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది.ప్రధాన బలం వారేబాబర్ ఆజం రూపంలో జట్టులో వరల్డ్‌క్లాస్ ప్లేయర్ ఉన్నాడు. ఫఖర్ జమాన్ ఆనాడు కొత్తగా జట్టులోకి వచ్చాడు. ఇప్పుడు అనుభవం కలిగిన ఆటగాడిగాబరిలోకి దిగబోతున్నాడు. వీళ్దిద్దరు పాకిస్తాన్ జట్టుకు ప్రధాన బలం’’ అని సర్ఫరాజ్ అహ్మద్ చెప్పుకొచ్చాడు.కాగా 2017లో చివరగా ఐసీసీ టైటిల్ గెలిచిన పాకిస్తాన్ ఇప్పటివరకు మళ్లీ మెగా ఈవెంట్లలో గెలుపు రుచిచూడలేదు. 2023 వన్డే వరల్డ్‌కప్, టీ20 ప్రపంచకప్-2024లో కనీసం సెమీస్ చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఇప్పుడు స్వదేశంలోనైనా.. గత చేదు అనుభవాలను మరిపించేలా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక ఇటీవల వన్డే సిరీస్‌లలో వరుస విజయాలతో జోరు మీదున్న పాక్ జట్టుకు సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో పరాభవం ఎదురైంది.మహ్మద్ రిజ్వాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్ విజయం సాధించిన పాక్.. సౌతాఫ్రికాలో 3-0తో క్లీన్‌స్వీప్ చేసి ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. అయితే, తాజాగా స్వదేశంలో సౌతాఫ్రికా- న్యూజిలాండ్‌తో జరిగిన ట్రై సిరీస్‌లో ఫైనల్ చేరుకున్న రిజ్వాన్ బృందం కివీస్ చేతిలో ఓటమిపాలైంది.చదవండి: డబ్బులేదు.. మూడేళ్లపాటు మ్యాగీ మాత్రమే.. మరో ఆణిముత్యం.. అతడే ఓ చరిత్ర: నీతా అంబానీ -
షాకింగ్.. భారత్-పాక్ మ్యాచ్ టిక్కెట్ ధర రూ.4 లక్షలు
వరల్డ్ క్రికెట్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజు గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ దాయుదుల పోరు కోసం కోట్లాది మంది ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఈ రెండు జట్లు ఎక్కడ తలపడినా స్టేడియం హౌస్ ఫుల్ కావల్సిందే. ఇప్పడు మరోసారి అభిమానులను అలరించేందుకు చిరకాల ప్రత్యర్థులు సిద్దమయ్యారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy)లో భాగంగా పాక్-భారత్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఫిబ్రవరి 23 న జరగనున్న ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు ఉన్న క్రేజును బ్లాక్ మార్కెట్లు క్యాష్ చేసుకుంటున్నాయి. అధికారికరంగా టిక్కెట్లు దొరకని అభిమానులు బ్లాక్ మార్కెట్‌ను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది.బ్లాక్‌లో గ్రాండ్ లాంజ్ టిక్కెట్ ధర 4 లక్షల రూపాయల కంటే ఎక్కువగా పలుకుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఐసీసీ ఈ టిక్కెట్ ధరను దిర్హామ్ 5,000(రూ.1,18,240.90)గా నిర్ణయించుకుంది. అయితే ఇప్పుడు బ్లాక్ మార్కెట్లో కొన్ని వెబ్సైట్లు అసలు ధరను మూడింతలు చేసి అమ్ముతున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.దుబాయ్‌లో అడుగుపెట్టిన టీమిండియా..ఇక ఈ మెగా టోర్నీ కోసం రోహిత్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే దుబాయ్‌లో అడుగుపెట్టింది. ఆదివారం నుంచి తమ ప్రాక్టీస్‌ను కూడా భారత్ మొదలు పెట్టింది. టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. బంగ్లా జట్టు కూడా దుబాయ్‌కు చేరుకుంది.ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని భారత్ భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్ధానంలో పేసర్ హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకున్నారు. అదేవిధంగా జైశ్వాల్‌ను జట్టు నుంచి రిలీజ్ చేసి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి అవకాశమిచ్చారు.చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: ఆ ఇద్దరి విషయంలో అగార్కర్‌తో గంభీర్ గొడవ.. ఆఖరికి! -
Ind vs Pak: టీమిండియా నుంచి మ్యాచ్ లాక్కోగలిగేది ఆ ఒక్కడే! కానీ..
భారత్ వర్సెస్ పాకిస్తాన్(India vs Pakistan) మ్యాచ్ అంటే క్రికెట్ ప్రేమికులకు పండుగే. ఇరుదేశాల సంబంధాల దృష్ట్యా ఈ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఎప్పుడో నిలిచిపోయాయి. ఆసియా కప్, ఐసీసీ వంటి అగ్రశ్రేణి ఈవెంట్లలో మాత్రమే ముఖాముఖి తలపడుతున్నాయి.అందుకే దాయాదుల మధ్య పోరును వీక్షించేందుకు అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు. వారి నిరీక్షణకు ఫిబ్రవరి 23న తెరపడనుంది. చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం భారత్- పాక్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఓవర్‌హైప్...‘‘ఇండియా- పాకిస్తాన్.. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌కు ఓవర్‌హైప్ ఇస్తున్నారు. దీనికి ఇంతగా ప్రచారం అవసరం లేదు. ఓసారి పాకిస్తాన్ ప్రధాన బ్యాటర్ల గణాంకాలు పరిశీలించండి. బాబర్ ఆజం వాళ్ల స్టార్ బ్యాటర్. మరి టీమిండియాపై అతడి బ్యాటింగ్ సగటు కేవలం 31.టాప్ బ్యాటర్ అన్నప్పుడు కనీసం అతడి యావరేజ్ 50కి దగ్గరలో ఉంటే ప్రత్యర్థి జట్టుతో మ్యాచ్ సమయంలో ఎలివేషన్ ఇవ్వచ్చు. ఇక రిజ్వాన్ విషయానికొస్తే.. ఆటగాడిగా అతడంటే నాకు ఇష్టమే. స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపిస్తాడు. కానీ భారత జట్టుపై అతడి బ్యాటింగ్ సగటు 25 మాత్రమే.టీమిండియా నుంచి మ్యాచ్ లాక్కోగలిగేది ఆ ఒక్కడే! అయితే, ఫఖర్ జమాన్ సంగతి వేరు. అతడు పాక్ జట్టు పూర్తిస్థాయి ఓపెనర్. టీమిండియా మీద బ్యాటింగ్ యావరేజ్ 46. కాబట్టి టీమిండియా నుంచి మ్యాచ్ లాక్కోగల సమర్థత అతడొక్కడికి మాత్రమే ఉంది. ఇక ఫాహీం ఆష్రఫ్ గురించి అంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.కనీస పోటీ కూడా ఇవ్వదుఅతడి సగటు.. 12.5. కాబట్టి అతడి గురించి టీమిండియా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సౌద్ షకీల్ టీమిండియాపై సగటున 8 పరుగులు చేశాడు. పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్ చూసిన తర్వాత ఆ జట్టు భారత్‌కు కనీస పోటీ కూడా ఇస్తుందని అనిపించడం లేదు’’ అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. కాగా బాబర్ ఆజం పాకిస్తాన్ తరఫున టాప్ వన్డే ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు.అయితే, టీమిండియాపై మాత్రం బాబర్ ఆజం రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు. ఇప్పటి వరకు భారత్‌తో ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి సగటున 31.14తో 218 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఓ అర్ధ శతకం ఉంది. భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా అతడు హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా అద్బుత విజయం సాధించిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను రోహిత్ సేన 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. మరోవైపు.. పాకిస్తాన్ మాత్రం స్వదేశంలో న్యూజిలాండ్-సౌతాఫ్రికాలతో జరిగిన త్రైపాక్షిక సిరీస్‌ను కివీస్‌కు సమర్పించుకుంది. చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చాంపియన్స్ ట్రోఫీ-2025కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసిన జట్టుమహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులాం, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫాహీం అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా (వైస్ కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్, హ్యారీస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది.చదవండి: CT 2025: కోహ్లి, హెడ్ కాదు!.. టాప్ రన్ స్కోరర్‌గా అతడే.. వికెట్ల వీరుడిగా ఆర్చర్! -
CT 2025: రోహిత్ శర్మ ఇంకో 183 పరుగులు చేస్తే...
ఇంగ్లండ్‌తో స్వదేశంలో వన్డే సిరీస్(India vs England)ను ఘనంగా ముగించిన టీమిండియా తదుపరి చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)తో బిజీ కానుంది. బట్లర్ బృందాన్ని 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన రోహిత్ సేన.. ఆత్మవిశ్వాసంతో ఈ ఐసీసీ టోర్నమెంట్లో అడుగుపెట్టనుంది.ఇక ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఈ మెగా ఈవెంట్ ఆరంభం కానుండగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లన్నీ తటస్థ వేదికైన దుబాయ్‌లో ఆడనుంది. లీగ్ దశలో భాగంగా తొలుత బంగ్లాదేశ్‌తో ఫిబ్రవరి 20న.. అనంతరం ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో.. ఆ తర్వాత మార్చి 2న న్యూజిలాండ్‌తో భారత జట్టు తలపడనుంది.అరుదైన రికార్డు ముంగిట హిట్మ్యాన్ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ను ఓ ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. దుబాయ్‌లో చరిత్ర సృష్టించేందుకు హిట్‌మ్యాన్ ఇంకా 183 పరుగుల దూరంలో ఉన్నాడు. కాగా గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో సతమతమైన రోహిత్ శర్మ ఇంగ్లండ్‌తో రెండో వన్డే సందర్భంగా వింటేజ్ హిట్‌మ్యాన్‌ను గుర్తు చేశాడు.డెబ్బై ఆరు బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్న రోహిత్ శర్మ... తన వన్డే కెరీర్లోనే రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. కటక్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో మొత్తంగా పన్నెండు ఫోర్లు, ఏడు సిక్స్‌ల సాయంతో 119 పరుగులు చేశాడు. అయితే, తదుపరి మ్యాచ్‌లో మాత్రం పేసర్ మార్క్ వుడ్ సంధించిన సూపర్ డెలివరీని ఆడలేక.. మళ్లీ విఫలమై ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు.ఇంకో 183 పరుగులు జతచేశాడంటేఇక తదుపరి రోహిత్ శర్మ దుబాయ్ వేదికగా ఐసీసీ వన్డే టోర్నీ చాంపియన్స్ ట్రోఫీ బరిలో దిగనున్నాడు. కాగా దుబాయ్‌లో ఇప్పటి వరకు అతడు వన్డేల్లో 317 పరుగులు సాధించాడు. ఈ ఈవెంట్ సందర్భంగా ఇందుకు ఇంకో 183 పరుగులు జతచేశాడంటే.. దుబాయ్‌లో అత్యధిక వన్డే పరుగులు సాధించిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ చరిత్రకెక్కుతాడు.ప్రస్తుతం ఈ ప్రపంచ రికార్డు స్కాట్లాండ్కు చెందిన రిచీ బెరింగ్టన్ పేరిట ఉంది. అతడు ఇప్పటి వరకు దుబాయ్‌లో వన్డేల్లో 424 పరుగులు సాధించాడు. టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ 342 పరుగులతో భారత బ్యాటర్లలో టాప్‌లో కొనసాగుతున్నాడు.కాగా వన్డేల్లో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో రోహిత్ శర్మ మూడు డబుల్ సెంచరీలు సాధించాడు. వన్డేల్లో అతడి అత్యధిక స్కోరు 264. ఇక మొత్తంగా ఇప్పటి వరకు టీమిండియా తరఫున 260 వన్డేలు పూర్తి చేసుకుని 10988 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో 338 వన్డే సిక్సర్లు ఉన్నాయి. చాంపియన్స్ ట్రోఫీ-2025కి టీమిండియారోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: రోహిత్, కోహ్లితో పాటు అతడికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ: భారత మాజీ క్రికెటర్ -
క్రికెట్ ఫ్యాన్స్ కు పూనకాలు ...!
-
Ind vs Pak: టీమిండియా చేతిలో ఓటమి తర్వాత కసి పెరిగింది! ఫైనల్లో అలా..
క్రికెట్ ప్రపంచంలో భారత్- పాకిస్తాన్(India vs Pakistan) మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇరుదేశాల అభిమానులతో పాటు క్రికెట్ ప్రేమికులంతా దాయాదుల పోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ఇక గత కొన్నేళ్లుగా ఆసియా కప్, ఐసీసీ వంటి ప్రధాన ఈవెంట్లలో మాత్రమే ఈ చిరకాల ప్రత్యర్థుల ముఖాముఖి పోటీపడుతుండగా.. అత్యధిక సార్లు భారత్ పైచేయి సాధించింది.కానీ 2017 నాటి చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) ఫైనల్లో మాత్రం టీమిండియాకు దాయాది చేతిలో భంగపాటు ఎదురైంది. లీగ్ దశలో పాక్‌ను చిత్తు చేసిన భారత జట్టు.. టైటిల్ పోరులో మాత్రం దురదృష్టవశాత్తూ ఓటమిపాలైంది. ఇక ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ మొదలుకానున్న తరుణంలో నాటి విన్నింగ్ పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్(Sarfaraz Ahmed) గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.మాలో కసి పెరిగిందిచాంపియన్స్ ట్రోఫీ-2017లో తమ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘‘గ్రూప్ స్టేజ్‌లో టీమిండియా చేతిలో ఓడిపోయిన తర్వాత జట్టు సమావేశంలో భాగంగా సీనియర్లు షోయబ్ మాలిక్, మొహమ్మద్ హఫీజ్ మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. జట్టులో అలాంటి వ్యక్తులు ఉండటం అదనపు బలం.ఆరోజు నుంచి మా ఆలోచనా ధోరణి మారిపోయింది. ఆ చేదు అనుభవం నుంచి పాఠాలు నేర్చుకున్నాం. జట్టులో రెండు మార్పులతో బరిలోకి దిగి వరుస విజయాలు సాధించాం. సౌతాఫ్రికా, శ్రీలంక జట్లను ఓడించాం.టీమిండియా మనకు కొత్తదేమీ కాదుఇక ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో మా బౌలర్లు అద్భుతంగా ఆడి గెలిపించారు. ఆ తర్వాత టీమిండియాతో ఫైనల్. అప్పుడు రెట్టింపు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాల్సిన పరిస్థితి. అందరూ పూర్తిగా రిలాక్స్ అవ్వాలని మా వాళ్లకు సందేశం ఇచ్చాను.అత్యుత్తమ జట్లను ఓడించాం. ఇక టీమిండియా కూడా మనకు కొత్తదేమీ కాదు. మనం చూడని జట్టూ కాదు. ఫలితం ఏమిటన్న విషయం గురించి ఆలోచించవద్దు. గెలిచేందుకు వంద శాతం ప్రయత్నం చేశామా లేదా అన్నది మాత్రమే ముఖ్యం.ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలుసు. చివరి వికెట్ పడగానే మాకు కలిగిన అనుభూతిని మాటల్లో వర్ణించలేము’’ అంటూ ఐసీసీతో తన జ్ఞాపకాలు పంచుకున్నాడు సర్ఫరాజ్ అహ్మద్. కాగా లండన్ వేదికగా నాటి ఫైనల్లో పాకిస్తాన్ కోహ్లి సేనపై 180 పరుగుల తేడాతో గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది.దుబాయ్‌లో టీమిండియా మ్యాచ్లుఇక 2017లో ఫైనల్ ఆడిన జట్టులో ఉన్న రోహిత్ శర్మ ప్రస్తుతం కెప్టెన్‌గా ఉండగా.. విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా కూడా ప్రస్తుత చాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఈసారి పాకిస్తాన్ ఈ ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులు సంపాదించుకోగా.. భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడనుంది. ఇక భారత్- పాకిస్తాన్ మధ్య ఫిబ్రవరి 23న మ్యాచ్ జరుగనుంది. ఈసారి.. టీమిండియా హాట్ ఫేవరెట్‌గా బరిలో దిగనుంది. చదవండి: CT 2025: ఏ జట్టునైనా ఓడిస్తాం.. చాంపియన్స్ ట్రోఫీ మాదే: బంగ్లాదేశ్ కెప్టెన్ -
వరల్డ్‌క్లాస్ ప్లేయర్.. ఈసారి చాంపియన్స్ ట్రోఫీ వారికే: క్రిస్ గేల్
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో విజేతగా ఎవరన్న అంశంపై వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్(Chris Gayle) తన అంచనా తెలియజేశాడు. ఈసారి టీమిండియానే టైటిల్ గెలుస్తుందని జోస్యం చెప్పాడు. కాగా 2013లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత్.. 2017లో ఫైనల్ చేరింది.తటస్థ వేదికపై రోహిత్ సేనఅయితే, నాటి టైటిల్ పోరులో దాయాది పాకిస్తాన్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత మరోసారి ఈ వన్డే ఫార్మాట్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ ఆతిథ్య హక్కులు దక్కించుకోగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేందుకు నిరాకరించింది.ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)తో ఈ విషయం గురించి చర్చించగా.. తటస్థ వేదికపై రోహిత్ సేన మ్యాచ్‌లు ఆడేలా హైబ్రిడ్ విధానానికి అంగీకరించింది. అయితే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తొలుత ఈ ప్రతిపాదనకు అంగీకరించకపోయినా.. ఐసీసీ చర్యలకు ఉపక్రమించడంతో దిగివచ్చింది. దీంతో దుబాయ్ వేదికగా టీమిండియా తమ మ్యాచ్‌లు ఆడేందుకు మార్గం సుగమమైంది.రెండు గ్రూపులుమరోవైపు.. పాకిస్తాన్‌లోని రావల్పిండి, కరాచి, లాహోర్ నగరాలను వేదికలుగా ఎంపిక చేశారు. ఇక ఈ టోర్నీకి ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, పాకిస్తాన్ అర్హత సాధించగా.. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-‘ఎ’లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఉండగా.. గ్రూప్-‘బి’లో ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఉన్నాయి.ఇక ఫిబ్రవరి 19న పాకిస్తాన్- న్యూజిలాండ్ మధ్య కరాచీ వేదికగా మ్యాచ్‌తో చాంపియన్స్ ట్రోఫీ-2025కి తెరలేవనుంది. మరోవైపు.. టీమిండియా ఫిబ్రవరి 20న ఈ ఐసీసీ ఈవెంట్లో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. లీగ్ దశలో తొలుత బంగ్లాదేశ్‌తో తలపడనున్న రోహిత్ సేన.. ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. అనంతంర మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడుతుంది.ఐసీసీ టోర్నీలలో అద్భుతంగాకాగా సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్-2023లో ఫైనల్ వరకు అజేయంగా నిలిచిన టీమిండియా.. ఆఖరి మెట్టుపై తడబడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దాదాపు లక్ష మందికి పైగా ప్రేక్షకుల నడుమ ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై.. టైటిల్‌ను చేజార్చుకుంది. అయితే, అనంతరం టీ20 ప్రపంచకప్-2024లో ఆఖరి వరకు జైత్రయాత్ర కొనసాగించి చాంపియన్‌గా అవతరించింది.ఇదే జోరులో చాంపియన్స్ ట్రోఫీలోనూ అడుగుపెట్టనున్న రోహిత్ సేనకు.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ మంచి సన్నాహకంగా ఉపయోగపడుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలుత నాగ్‌పూర్‌లో నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన భారత్.. కటక్‌లో జరిగిన రెండో వన్డేలోనూ నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఇక రెండో వన్డే సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి వచ్చి.. విధ్వంసకర శతకం(90 బంతుల్లో 119 రన్స్) బాదడం టీమిండియాకు అతిపెద్ద సానుకూలాంశంగా పరిణమించింది.అతడొక వరల్డ్‌క్లాస్ ప్లేయర్ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ తక్‌తో మాట్లాడిన విండీస్ హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్.. ‘‘చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియానే ఫేవరెట్. టైటిల్ గెలిచే జట్టు ఇదే’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ.. ‘‘అతడొక వరల్డ్‌క్లాస్ ప్లేయర్. వన్డేల్లో డబుల్ సెంచరీలు చేసిన ఘనత అతడిది. హిట్‌మ్యాన్ అతడు. వన్డేల్లో నా సిక్సర్ల రికార్డును బ్రేక్ చేశాడు. టెస్టుల్లో విఫలమైనా మెగా టోర్నీలో మాత్రం తప్పక రాణిస్తాడు’’ అని క్రిస్ గేల్ విశ్వాసం వ్యక్తం చేశాడు.చదవండి: IPL 2025: కొత్త యాజమాన్యం చేతిలోకి గుజరాత్ టైటాన్స్! -
భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. అంపైర్లు వీరే! ఐరెన్ లెగ్ లేడు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 మరో తొమ్మిది రోజుల్లో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19 నుంచి ఈ మెగా టోర్నీ అభిమానులను ఉర్రూతలూగించింది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్-న్యూజిలాండ్ జట్లు కరాచీ వేదికగా తలపడనున్నాయి. ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఆయా జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి.కాగా ఈ మెగా ఈవెంట్ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అంపైర్ల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ టోర్నీలో ప్రతీ మ్యాచ్‌కు సంబంధించిన అంపైర్ల వివరాలను ఐసీసీ వెల్లడించింది. న్యూజిలాండ్-పాకిస్తాన్ మధ్య జరిగే తొలి మ్యాచ్‌కు రిచర్డ్ కెటిల్‌బరో, షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్ ఆన్ ఫీల్డ్ అంపైర్లగా వ్యవహరించన్నాడు.టీవీ అంపైర్‌గా జోయెల్ విల్సన్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఇక ఫిబ్రవరి 23న జరగనున్న భారత్-పాకిస్తాన్ హైవోల్టేజ్ మ్యాచ్‌కు పాల్ రీఫిల్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ ఆన్ ఫీల్డ్ అంపైర్లగా ఎంపికయ్యారు. అదేవిధంగా థర్డ్ అంపైర్‌గా మైఖేల్ గోఫ్, మ్యాచ్ రిఫరీగా డేవిడ్ బూన్ వ్యవహరించనున్నారు.ఐరెన్ లెగ్ అంపైర్ లేడు..అయితే భారత్ ఆడే గ్రూపు స్టేజి మ్యాచ్‌ల అంపైర్ జాబితాలో ఐరెన్ లెగ్ రిచర్డ్ కెటిల్‌బరో లేకపోవడం అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. అతడు అంపైర్‌గా టీమిండియా అభిమానులు భావిస్తుంటారు. ముఖ్యంగా ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో చాలా సార్లు అది రుజువైంది. 2014 నుంచి అతడు అంపైర్‌గా ఉన్న ఏ నాకౌట్ మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించలేదు.అంపైర్ల పూర్తి జాబితాపాకిస్థాన్ vsన్యూజిలాండ్, ఫిబ్రవరి 19 - కరాచీఆన్-ఫీల్డ్ అంపైర్లు: రిచర్డ్ కెటిల్‌బరో, షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్టీవీ అంపైర్: జోయెల్ విల్సన్, ఫోర్త్ అంపైర్: అలెక్స్ వార్ఫ్, మ్యాచ్ రిఫరీ: ఆండ్రూ పైక్రాఫ్ట్బంగ్లాదేశ్ vs భారత్, ఫిబ్రవరి 20 - దుబాయ్ఆన్-ఫీల్డ్ అంపైర్లు: అడ్రియన్ హోల్డ్‌స్టాక్, పాల్ రీఫిల్టీవీ అంపైర్: రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, ఫోర్త్ అంపైర్: మైఖేల్ గోఫ్, మ్యాచ్ రిఫరీ: డేవిడ్ బూన్ఆఫ్ఘనిస్తాన్ vs సౌతాఫ్రికా, ఫిబ్రవరి 21 - కరాచీఆన్-ఫీల్డ్ అంపైర్లు: అలెక్స్ వార్ఫ్, రోడ్నీ టక్కర్టీవీ అంపైర్: రిచర్డ్ కెటిల్‌బరో, ఫోర్త్ అంపైర్: షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్, మ్యాచ్ రిఫరీ: రంజన్ మదుగల్లెఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్, ఫిబ్రవరి 22 - లాహోర్ఆన్-ఫీల్డ్ అంపైర్లు: జోయెల్ విల్సన్, క్రిస్ గఫానీటీవీ అంపైర్: కుమార్ ధర్మసేన, ఫోర్త్ అంపైర్: అహ్సన్ రజా, మ్యాచ్ రిఫరీ: ఆండ్రూ పైక్రాఫ్ట్పాకిస్థాన్ v భారత్, ఫిబ్రవరి 23 - దుబాయ్ఆన్-ఫీల్డ్ అంపైర్లు: పాల్ రీఫిల్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ టీవీ అంపైర్: మైఖేల్ గోఫ్, ఫోర్త్ అంపైర్: అడ్రియన్ హోల్డ్‌స్టాక్, మ్యాచ్ రిఫరీ: డేవిడ్ బూన్ బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్, ఫిబ్రవరి 24 - రావల్పిండిఆన్-ఫీల్డ్ అంపైర్లు: అహ్సన్ రజా, కుమార్ ధర్మసేనటీవీ అంపైర్: రోడ్నీ టక్కర్, ఫోర్త్ అంపైర్: జోయెల్ విల్సన్, మ్యాచ్ రిఫరీ: రంజన్ మదుగల్లెఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా, ఫిబ్రవరి 25 – రావల్పిండిఆన్-ఫీల్డ్ అంపైర్లు: రిచర్డ్ కెటిల్‌బరో, క్రిస్ గఫానీటీవీ అంపైర్: అలెక్స్ వార్ఫ్, ఫోర్త్ అంపైర్: కుమార్ ధర్మసేన, మ్యాచ్ రిఫరీ: ఆండ్రూ పైక్రాఫ్ట్ఆఫ్ఘనిస్తాన్ vs ఇంగ్లాండ్, ఫిబ్రవరి 26 - లాహోర్ఆన్-ఫీల్డ్ అంపైర్లు: షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్, జోయెల్ విల్సన్టీవీ అంపైర్: అహ్సన్ రజా, ఫోర్త్ అంపైర్: రోడ్నీ టక్కర్, మ్యాచ్ రిఫరీ: రంజన్ మదుగల్లెపాకిస్థాన్ vs బంగ్లాదేశ్, ఫిబ్రవరి 27 - రావల్పిండిఆన్-ఫీల్డ్ అంపైర్లు: మైఖేల్ గోఫ్, అడ్రియన్ హోల్డ్స్టాక్టీవీ అంపైర్: పాల్ రీఫిల్, ఫోర్త్ అంపైర్: రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిఫరీ: డేవిడ్ బూన్ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా, ఫిబ్రవరి 28 - లాహోర్ఆన్-ఫీల్డ్ అంపైర్లు: అలెక్స్ వార్ఫ్, కుమార్ ధర్మసేనటీవీ అంపైర్: క్రిస్ గఫానీ, ఫోర్త్ అంపైర్: రిచర్డ్ కెటిల్‌బరో, మ్యాచ్ రిఫరీ: ఆండ్రూ పైక్రాఫ్ట్ -
ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే సరిపోదు.. టీమిండియాను ఓడించాలి: పాక్ ప్రధాని
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సమయం అసన్నమవుతోంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్, యూఏఈ వేదికలగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అయితే ఈ మెగా ఈవెంట్లో అందరి కళ్లు భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పైనే ఉన్నాయి. ఈ టోర్నీ మొత్తం ఒక లెక్క.. ఈ దాయుదుల పోరు ఒక లెక్క. ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తల మధ్య పాక్-భారత్ జట్లు కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ముఖాముఖి తలపడుతున్నాయి.దీంతో ఈ రెండు జట్లు ఎప్పుడెప్పుడు తలపడతాయా అని అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తుంటారు. వారి నిరీక్షణకు మరి కొన్ని రోజుల్లో తెరపడనుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్ధులు అమీతుమీ తెల్చుకోనున్నారు. అయితే ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తమ జట్టుకు దిశానిర్దేశం చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం ఎంత ముఖ్యమో, టీమిండియాను ఓడించడం అంతే ముఖ్యమని షరీఫ్ ఉద్ఘాటించారు. శుక్రవారం రాత్రి లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు."పాకిస్తాన్ క్రికెట్ జట్టు చాలా బాగుంది. ఇటీవల కాలంలో ఆటగాళ్లు సైతం అద్బుతంగా రాణిస్తున్నారు. కానీ ఇప్పుడు వారికి అసలైన సవాలు ఎదురు కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడమే కాకుండా మన చిరకాల ప్రత్యర్ధి భారత్‌పై విజయం సాధించాలి. దేశం మొత్తం మీ వెనక ఉంది. అల్ ది బెస్ట్ అంటూ" షరీఫ్ పేర్కొన్నారు. కాగా షరీఫ్ వ్యాఖ్యలకు టీమిండియా అభిమానులు గట్టిగా కౌంటరిస్తున్నారు. మీకు అంత సీన్ లేదులే.. ముందు గెలిచి మాట్లాడండి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాగా గత రెండు ఐసీసీ టోర్నీల్లోనూ పాక్‌ను భారత్ మట్టికర్పించింది. వన్డే ప్రపంచకప్-2023లో దాయాదిని చిత్తు చేసిన భారత్.. టీ20 ప్రపంచకప్-2024లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ-2017 ఫైనల్లో మాత్రం పాక్ చేతిలో టీమిండియా ఓటమి చవిచూసింది.ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ జట్టు: మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ అజం, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా, ఉస్మాన్ ఖాన్, అబ్రర్ షాహమ్, హరీస్ నహ్మద్, హరీస్ నహ్మద్, హరీస్ షాహమ్ రౌఫ్ అఫ్రిది. భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, షమీ, అర్ష్‌దీప్ సింగ్చదవండి: రోహిత్ ప్రాక్టీస్ ఆపేయ్.. ఫస్ట్ ఆ పనిచేయు: భారత మాజీ క్రికెటర్ -
CT 2025: ఆసీస్ కాదు!.. సెమీస్ చేరే జట్లు ఇవే: షోయబ్ అక్తర్
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) నేపథ్యంలో పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ షోయబ్ అక్తర్(Shoaib Akhtar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఐసీసీ టోర్నీలో ఈసారి మూడు ఆసియా దేశాలు సెమీ ఫైనల్ చేరతాయని అంచనా వేశాడు. అదే విధంగా.. మరోసారి 2017 నాటి ఫైనలిస్టులే టైటిల్ కోసం హోరాహోరీ తలపడటం ఖాయమని జోస్యం చెప్పాడు.కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్- దుబాయ్ వేదికలుగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. అయితే, ఈ ప్రతిష్టాత్మక వన్డే టోర్నమెంట్లో టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్(Dubai)లోనే ఆడనుంది. రెండు గ్రూపులుఇక ఈ మెగా ఈవెంట్‌కు డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ నేరుగా అర్హత సాధించగా.. వన్డే వరల్డ్‌కప్-2023లో సత్తా చాటిన ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ తమ ప్రదర్శన ఆధారంగా బెర్తులు ఖరారు చేసుకున్నాయి.ఆసీస్ లేదు.. మూడు ఆసియా దేశాలుఇక ఈ ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-‘ఎ’లో దాయాదులు భారత్, పాకిస్తాన్‌తో పాటు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఉండగా.. గ్రూప్-‘బి’లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్రికెట్పాకిస్తాన్తో మాట్లాడిన పాక్ మాజీ ఫాస్ట్‌బౌలర్ షోయబ్ అక్తర్.. సెమీస్ చేరే మూడు జట్లను అంచనా వేశాడు.‘‘చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్, ఇండియాతో పాటు అఫ్గనిస్తాన్ ఈసారి టాప్-4కు చేరుతుంది’’ అని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ అన్నాడు. అయితే, నాలుగో జట్టుగా వన్డే వరల్డ్‌కప్-2023 విజేత ఆస్ట్రేలియా ఉంటుందన్న మెజారిటీ విశ్లేషకుల అభిప్రాయాల నడుమ అక్తర్ మాత్రం ఆ పేరును విస్మరించి.. కేవలం మూడు పేర్లే చెప్పడం గమనార్హం.ఈసారి పాక్‌దే పైచేయిఇక ఈసారి భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌లో తమ జట్టే పైచేయి సాధిస్తుందని షోయబ్ అక్తర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘‘ఫిబ్రవరి 23న పాకిస్తాన్ టీమిండియాను ఓడిస్తుందని ఆశిస్తున్నాను. ఈ రెండూ ఈసారి కూడా ఫైనల్ చేరతాయి’’అని జోస్యం చెప్పాడు. కాగా 2017లో ఆఖరిసారిగా చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించగా.. నాడు టైటిల్ కోసం భారత్- పాకిస్తాన్ తలపడ్డాయి.అఫ్గనిస్తాన్ జట్టు ఫేవరెట్.. ఎందుకంటేఅయితే, ఆ మ్యాచ్‌లో టీమిండియాను ఓడించి పాక్ జట్టు ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. అక్తర్ చెప్పినట్లు ఈసారి అఫ్గనిస్తాన్ జట్టు సెమీస్ ఫేవరెట్లలో ఒకటిగా ఉందనడంలో సందేహం లేదు. భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023లో తొలిసారి పాకిస్తాన్‌ను ఓడించి చరిత్ర సృష్టించిన అఫ్గన్.. లీగ్ దశలో ఆస్ట్రేలియాకు కూడా గట్టిపోటీనిచ్చింది.తృటిలో సెమీస్ అవకాశాలకు చేజార్చుకుని ఆరోస్థానంతో సరిపెట్టుకుంది. మరోవైపు.. టీ20 ప్రపంచకప్-2024లోనూ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన అఫ్గనిస్తాన్.. ఏకంగా సెమీ ఫైనల్ చేరి ఆశ్చర్యపరిచింది. ఇక ఈ రెండు టోర్నీల్లోనూ కనీసం టాప్-4లో అడుగుపెట్టలేకపోయిన పాకిస్తాన్.. చాంపియన్స్ ట్రోఫీలో మాత్రం ఫేవరెట్‌గానే ఉంది. మహ్మద్ రిజ్వాన్ సారథ్యంలో ఇటీవల ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా గడ్డ మీద పాకిస్తాన్ రికార్డు విజయాలతో వన్డే సిరీస్‌లను గెలుచుకోవడమే ఇందుకు కారణం.ఇక చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా ఫిబ్రవరి 20న తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొడుతుంది. అనంతరం మార్చి 2న న్యూజిలాండ్‌తో మ్యాచ్‌తో లీగ్ దశను ముగిస్తుంది.చదవండి: సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్ -
చాంపియన్స్ ట్రోఫీ: తప్పుకొన్న నితిన్, శ్రీనాథ్.. అంపైర్లు, మ్యాచ్ రిఫరీలు వీరే!
చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) అంపైర్లు, మ్యాచ్ రిఫరీల వివరాలను ప్రకటించింది. మొత్తంగా పన్నెండు మంది అంపైర్లు, ముగ్గురు మ్యాచ్ రిఫరీలు ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భాగం కానున్నట్లు వెల్లడించింది. అయితే, ఇందులో భారత్ నుంచి ఒక్కరూ లేకపోవడం గమనార్హం.కాగా 2017లో చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీ జరుగగా.. నాడు ఫైనల్లో టీమిండియాపై గెలుపొందిన పాకిస్తాన్ విజేతగా అవతరించింది. అయితే, ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ఐసీసీ మళ్లీ ఈ వన్డే టోర్నీని ఇప్పటిదాకా నిర్వహించలేదు. తాజాగా మళ్లీ ఇప్పుడు మరోసారి ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేసింది.డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ ఆతిథ్య హక్కులు దక్కించుకోగా.. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా అక్కడకు వెళ్లడం లేదు. ఐసీసీ అనుమతితో హైబ్రిడ్ విధానంలో తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లన్నీ ఆడనుంది. ఈ క్రమంలో మ్యాచ్ అఫీషియల్స్‌లో భాగమైన అంపైర్ నితిన్ మీనన్, మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఈ ఇద్దరు పాకిస్తాన్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపలేదని సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘నితిన్ మీనన్‌ను చాంపియన్స్ ట్రోఫీ రోస్టర్‌లో పెట్టాలని ఐసీసీ భావించింది. కానీ వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఆయన పాకిస్తాన్ పర్యటనకు నిరాకరించారు’’ అని పేర్కొన్నాయి.ఇక జవగళ్ శ్రీనాథ్ కూడా సెలవులు తీసుకుంటున్న క్రమంలో పాక్ వెళ్లడం కుదరదని చెప్పినట్లు సమాచారం. కాగా ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ రిఫరీస్, అదే విధంగా ఐసీసీ అంపైర్ల ఎలైట్ ప్యానెల్లో భారత్ నుంచి చోటు దక్కించుకున్నది వీళ్లిద్దరే.అయితే, ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ నుంచి మాత్రం ఈ ఇద్దరూ దూరంగా ఉండటం గమనార్హం. కాగా జవగళ్ శ్రీనాథ్ ప్రస్తుతం భారత్- ఇంగ్లండ్ వన్డే సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. ఫిబ్రవరి 6, 9, 12 తేదీల్లో ఇరుజట్ల మధ్య జరిగే మూడు మ్యాచ్‌లకు శ్రీనాథ్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నాడు. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ - దుబాయ్ వేదికలుగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, పాకిస్తాన్ ఈ మెగా టోర్నీలో టైటిల్ కోసం తలపడతాయి. ఇక క్రికెట్ ప్రేమికులకు అసలైన మజా అందించే భారత్- పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్‌లో ఫిబ్రవరి 23న జరుగుతుంది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 అంపైర్లు:కుమార్ ధర్మసేన, క్రిస్ గఫానీ, మైఖేల్ గోఫ్, అడ్రియన్ హోల్డ్‌స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటిల్‌బరో, అహ్సన్ రజా, పాల్ రీఫిల్, షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్, రోడ్నీ టక్కర్, అలెక్స్ వార్ఫ్, జోయెల్ విల్సన్.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 మ్యాచ్ రిఫరీలు:డేవిడ్ బూన్, రంజన్ మదుగల్లె, ఆండ్రూ పైక్రాఫ్ట్.చదవండి: Ind vs Eng: తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. వెటరన్ ప్లేయర్ రీఎంట్రీ -
భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. హాట్‌కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు
చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత జట్టు ఆడే మూడు లీగ్ మ్యాచ్‌లతో పాటు తొలి సెమీఫైనల్ మ్యాచ్ టికెట్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం నుంచి అభిమానుల కోసం అందుబాటులో ఉంచింది. సోమవారం సాయంత్రం గం. 5:30 నుంచి టికెట్ల అమ్మకాలు మొదలయ్యాయి. భారత్ తమ అన్ని మ్యాచ్‌లను యూఏఈలోని దుబాయ్‌లోనే ఆడుతుంది.ఈ నెల 20న బంగ్లాదేశ్‌తో, 23న పాకిస్తాన్‌తో, మార్చి 2న న్యూజిలాండ్‌తో తమ గ్రూప్ ‘ఎ’లో తలపడుతుంది. ఈ ఫలితాల అనంతరం భారత్ ముందంజ వేస్తే తొలి సెమీఫైనల్ కూడా దుబాయ్‌లోనే ఆడుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ కోసం టికెట్లను కూడా ఐసీసీ ముందుగానే అమ్ముతోంది. టికెట్ల కనీస ధర 125 యూఏఈ దిర్హామ్‌లు (సుమారు రూ. 2,900)గా నిర్ణయించారు. ఇక పాక్‌లో జరిగే మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్లు పీసీబీ, ఐసీసీ ఇప్పటికే విడుదల చేశాయి.గంటలో టిక్కెట్లు హామ్ ఫట్..ఇక వరల్డ్ క్రికెట్లో భారత్-పాకిస్తాన్(India-Pakistan) మ్యాచ్‌కు ఉన్న క్రేజి గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాయాదుల పోరు ఎప్పుడు జరుగుతుందా అని ఇరు దేశాల అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తుంటారు. చాలా మంది అభిమానులు నేరుగా స్టేడియంకు వెళ్లి ఈ చిరకాల ప్రత్యర్థుల పోరును వీక్షించాలని తహతహలడుతుంటారు.ఈ క్రమంలో భారత్-పాక్ మ్యాచ్ కోసం అన్లైన్లో అమ్మకానికి ఉంచిన టిక్కెట్లు మొత్తం గంటలోనే అమ్ముడుపోయాయి. 25వేల సీటింగ్ సామర్థ్యం ఉన్న దుబాయ్ స్పోర్ట్స్ సిటీ క్రికెట్ స్టేడియంలో టిక్కెట్ల కోసం అన్లైన్లో సుమారు లక్షా 50 వేల మంది పోటీ పడినట్లు తెలుస్తోంది.కాగా ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో కరాచీ వేదికగా పాకిస్తాన్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ ఈవెంట్ కోసం ఫిబ్రవరి 15న భారత క్రికెట్ జట్టు దుబాయ్‌లో అడుగుపెట్టనుంది. ఈ మెగా ఈవెంట్ హైబ్రిడ్ మోడల్లో జరగనుంది.ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ జట్టు ఇదేరోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, షమీ, అర్ష్‌దీప్ సింగ్పాక్ జట్టు:బాబర్ అజం, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులాం, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా (వైస్ కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్, హరీస్ రౌఫ్, మహ్మద్ , నసీమ్ షా, షాహీన్ షా అఫ్రిదిచదవండి: ఐసీసీ ‘టీమ్ ఆఫ్ ద టోర్నీ'లో త్రిష -
టీమిండియా ఆటగాళ్లతో స్నేహం వద్దు.. ఎందుకంటే: పాక్ మాజీ కెప్టెన్
భారత్- పాకిస్తాన్(India vs Pakistan) మ్యాచ్ అంటే ఇరు దేశాల అభిమానులకే కాదు.. క్రికెట్ ప్రపంచం మొత్తానికి ఆసక్తి. దాయాది దేశాల జట్లు నువ్వా- నేనా అన్నట్లు హోరాహోరీ తలపడుతుంటే చూడటానికి రెండు కళ్లు చాలవంటారు క్రికెట్ ప్రేమికులు.ఇక ఇరుదేశాల మధ్య పరిస్థితుల దృష్ట్యా కేవలం ఆసియా కప్(Asia Cup), ఐసీసీ మేజర్ టోర్నమెంట్లలో మాత్రమే భారత్- పాకిస్తాన్ ముఖాముఖి పోటీపడుతున్నాయి. ఇందులోనూ ఎక్కువ సందర్భాల్లో టీమిండియానే చిరకాల ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తోంది. ఈ క్రమంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లోనూ అదే ఫలితం పునరావృతం చేయాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది.స్నేహంగా మెలుగుతున్న ఆటగాళ్లు2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. మరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగనున్న పాకిస్తాన్ కూడా వరుస విజయాలపై కన్నేసింది. అయితే, ఆటలో ప్రత్యర్థులే అయినా.. మైదానం వెలుపల మాత్రం ఇరు దేశాల ఆటగాళ్లు స్నేహభావంతోనే మెలుగుతున్నారు. నిన్నటితరం ఆటగాళ్లు హర్భజన్ సింగ్- షోయబ్ అక్తర్ చిన్నపిల్లల్లా మైదానంలోకి పరుగులు తీస్తున్న వీడియో ఒకటి తాజాగా వైరల్ కావడం ఇందుకు నిదర్శనం. View this post on Instagram A post shared by Shoaib Akhtar (@imshoaibakhtar) వారితో స్నేహం వద్దుఅయితే, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ మాత్రం భారత్- పాక్ క్రికెటర్లను ఉద్దేశించి విచిత్ర వ్యాఖ్యలు చేశాడు. మైదానంలో టీమిండియా ఆటగాళ్లతో ఎక్కువగా స్నేహంగా మెలగవద్దని సూచించాడు. ప్రత్యర్థి జట్టుతో ఫ్రెండ్షిప్ చేస్తే దానిని వాళ్లు అడ్వాంటేజ్‌గా మలచుకుంటారని అభిప్రాయపడ్డాడు.నాకైతే అర్థం కావడం లేదు‘‘అసలు ఇటీవలి కాలంలో పాకిస్తాన్- ఇండియా మ్యాచ్ సమయంలో మన ఆటగాళ్లు ప్రవర్తిస్తున్న తీరు నాకు చిత్రంగా అనిపిస్తోంది. భారత బ్యాటర్లు క్రీజులోకి రాగానే మనవాళ్లు వెళ్లి.. వారి బ్యాట్‌ను పరిశీలించడం, వాళ్ల వెన్నుతట్టడం, స్నేహంగా మాట్లాడటం.. ఇదంతా ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు.మాట్లాడాల్సిన అవసరమే లేదుమైదానం లోపల, వెలుపల ప్రొఫెషనల్‌గా ఉండాలి. వాళ్లతో అంత స్నేహంగా మెలగాల్సిన అవసరం లేదు. ఆటగాళ్లు అయినా.. కొన్ని హద్దులు ఉంటాయి. అసలు మైదానంలో టీమిండియా ఆటగాళ్లతో అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదని మా సీనియర్లు చెప్పేవారు.ఎందుకంటే.. ప్రత్యర్థి జట్టుతో ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటే.. అది మన బలహీనతకు సంకేతంలా కనిపిస్తుంది’’ అని ఉష్నా షా పాడ్‌కాస్ట్‌లో మొయిన్ ఖాన్ చిత్రమైన వ్యాఖ్యలు చేశాడు. కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలుకానుంది.అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా మాత్రం ఈ టోర్నీలో తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడనుంది. తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న రోహిత్ సేన బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అనంతరం ఫిబ్రవరి 23న పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. అనంతరం.. లీగ్ దశలో చివరిగా మార్చి 2న న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడుతుంది. చదవండి: T20 WC 2025: ప్రపంచకప్ ఫైనల్లో భారత్.. సెమీస్‌లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించిందిలా! -
BCCI: బుమ్రా ఆడతాడా?.. రిస్క్ వద్దు!.. ఆ డాక్టర్ చేతిలోనే అంతా..
టీమిండియా స్టార్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో అంతా తానై ముందుండి నడిపించిన ఈ పేస్ దళ నాయకుడు ఆఖర్లో గాయపడిన విషయం తెలిసిందే. కంగారూ దేశ పర్యటనలో చివరిదైన సిడ్నీ టెస్టు సందర్భంగా బుమ్రా వెన్నునొప్పితో విలవిల్లాడాడు. మూడు వారాలుగా విశ్రాంతిమ్యాచ్ మధ్యలోనే మైదానం వీడిన ఈ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్.. స్కానింగ్ అనంతరం జట్టుతో చేరినా మళ్లీ బంతితో బరిలోకి దిగలేకపోయాడు. ఈ క్రమంలో స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. బుమ్రా ఆటకు దూరమై ఇప్పటికే మూడు వారాలు గడిచిపోయింది. అయితే, అతడి ఫిట్నెస్ గురించి ఇంత వరకు స్పష్టత రాలేదు.ఇప్పటికే స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్(India vs England)కు దూరమైన బుమ్రా.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నాటికైనా జట్టుతో చేరాలని టీమిండియా యాజమాన్యం ఆశిస్తోంది. ఈ మెగా టోర్నీ నాటికి అతడు ఫిట్‌గా మారతాడనే ఆశాభావంతోనే జట్టుకు ఎంపిక చేసింది. ఒకవేళ బుమ్రా గనుక ఈ ఐసీసీ ఈవెంట్‌కు దూరమైతే.. జట్టుపై ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అందుకే.. అతడి విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఎలాంటి రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేదు.న్యూజిలాండ్ స్పెషలిస్టుతో సంప్రదింపులుఇందులో భాగంగా.. ఇప్పటికే బీసీసీఐ వైద్య బృందం ఎప్పటికప్పుడు బుమ్రా పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. అంతేకాదు.. వెన్నునొప్పి తీవ్రత, దాని తాలుకు ప్రభావాన్ని అంచనా వేసేందుకు న్యూజిలాండ్ స్పెషలిస్టు డాక్టర్ రొవాన్ షోటన్తో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.అదొక అద్భుతమని తెలుసుఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘బీసీసీఐ వైద్య బృందం షోటన్తో కాంటాక్టులో ఉంది. బుమ్రాను స్వయంగా అక్కడికి పంపాలని బోర్డు భావించింది. అయితే, ఇంత వరకు అది కార్యరూపం దాల్చలేదు. తనకు విధించిన గడువులోగా బుమ్రా గనుక వందశాతం ఫిట్నెస్ సాధిస్తే అదొక అద్భుతమని సెలక్టర్లకు కూడా తెలుసు.అదే జరగాలని యాజమాన్యం కోరుకుంటోంది కూడా! అందుకే బుమ్రా స్కానింగ్ రిపోర్టులను షోటన్కు పంపించి.. ఫీడ్‌బ్యాక్ తీసుకుంటోంది. ఏదేమైనా.. బుమ్రా వీలైనంత త్వరగా జట్టుతో చేరితే బాగుంటుందని బోర్డు భావిస్తోంది. అతడు కూడా ఇదే ఆలోచనతో ఉన్నాడు’’ అని పేర్కొన్నాయి. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది.ఫిబ్రవరి 12 వరకు అవకాశంఈ నేపథ్యంలో జనవరి 18న బీసీసీఐ తమ ప్రాథమిక జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో బుమ్రాకు కూడా చోటు దక్కింది. అయితే, ఫిట్నెస్ ఆధారంగానే అతడి విషయంలో తుది నిర్ణయం ఉంటుందని.. జట్టు ప్రకటన సందర్భంగా టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో మార్పులు చేసుకునేందుకు ఫిబ్రవరి 12 వరకు అవకాశం ఉంది. కాగా భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లడం లేదు. తటస్థ వేదికైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో తమ మ్యాచ్‌లు ఆడనుంది. తొలి మ్యాచ్‌లో భాగంగా ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్‌ను ఢీకొట్టనున్న రోహిత్ సేన.. మార్చి 2న న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడుతుంది. చదవండి: షమీ రీఎంట్రీ.. మళ్లీ వాయిదా?!.. గంభీర్‌తో సమస్యా? -
BCCI: టీమిండియా జెర్సీలపై పాకిస్తాన్ పేరు.. డ్రెస్ కోడ్ ఫాలో అవుతాం
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా ధరించే జెర్సీ గురించి వస్తున్న వార్తలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా(Devajit Saikia) స్పందించాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిబంధనలకు అనుగుణంగానే తాము నడుచుకుంటామని స్పష్టం చేశాడు. తమ ఆటగాళ్లు ధరించే జెర్సీ లోగోలో పాకిస్తాన్ పేరు ఉండటాన్ని బీసీసీఐ వ్యతిరేకించిందన్న వార్తలను కూడా ఈ సందర్భంగా ఖండించాడు.దుబాయ్‌లో టీమిండియా మ్యాచ్‌లుకాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేందుకు నిరాకరించిన బీసీసీఐ(BCCI).. ఐసీసీ అనుమతితో తటస్థ వేదికపై మ్యాచ్‌లు ఆడనుంది. ఈ క్రమంలో పాక్‌తో పాటు దుబాయ్ కూడా ఈ ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది.ఇక ఈ మెగా ఈవెంట్లో తమ తొలి మ్యాచ్‌లో భాగంగా ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రోహిత్ శర్మ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇదిలా ఉంటే.. నిబంధనల ప్రకారం ఐసీసీ టోర్నీ ఆతిథ్య దేశం పేరు.. అన్ని జట్ల ఆటగాళ్ల జెర్సీలపై ఉంటుంది. అయితే, బీసీసీఐ మాత్రం దాయాది పేరును తమ జెర్సీలపై ముద్రించకుండా ఉండాలని ఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి.మా డ్రెస్ కోడ్ కూడా అలాగే ఉంటుందిఈ విషయం గురించి బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘‘ చాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం ఐసీసీ రూపొందించిన అన్ని నిబంధనలను బీసీసీఐ పాటిస్తుంది. జెర్సీ లోగో అంశం సహా అన్నింటినీ మేము ఫాలో అవుతాము. ఏ దశలోనూ ఉద్దేశపూర్వకంగా మేము నిబంధనలను ఉల్లంఘించబోము. కానీ మీడియాలో ఇలాంటి వార్తలు ఎందుకు పుట్టుకు వస్తున్నాయో.. వారికి వీటి గురించి ఎవరు సమాచారం ఇస్తున్నారో అర్థం కావడం లేదు. ఐసీసీ రూల్స్‌ను అతిక్రమించేందుకు మాకు ఎలాంటి కారణాలు లేవు. చాంపియన్స్ ట్రోఫీ కోసం ఐసీసీ పెట్టిన డ్రెస్ కోడ్‌ను మేము ఫాలో అవుతాం. లోగో కూడా యథాతథంగా ఉంటుంది’’ అని స్పష్టం చేశాడు. కాగా దాయాదులు భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబాయ్‌లో జరుగుతుంది.ఫిబ్రవరి 5లోగా మైదానాలు రెడీ: పీసీబీఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి రెండు వారాల ముందే స్టేడియంలను సిద్ధం చేసేలా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పనులు వేగవంతం చేసింది. కరాచీ, లాహోర్ స్టేడియాలలో పునరి్నర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. అధునాతన కుర్చీలు, అదనపు సౌకర్యాలతో కూడిన భవనాలు, ఎల్ఈడీ ఫ్లడ్‌లైట్లు, డిజిటల్ స్కోరు బోర్డులు ఇలా సర్వాంగ సుందరంగా ముస్తాబవుతన్న మైదానాలను వచ్చే నెల 5 వరకు సిద్ధం చేయనున్నారు. చాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి ముందు పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ఆడనున్న ముక్కోణపు సిరీస్‌ను ఈ మైదానాల్లో నిర్వహించనున్నారు. ఈ రెండు మైదానాల పునర్నిర్మాణం కోసం పీసీబీ 12 బిలియన్ పాకిస్తానీ రూపాయలను ఖర్చు చేస్తోంది. కరాచీ స్టేడియం మేనేజర్ అర్షద్‌ఖాన్ మాట్లాడుతూ... ‘నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయి. మిగిలి ఉన్న కొన్ని చిన్న చిన్న పనులు ఈ నెలాఖరులోగా ముగుస్తాయి. ఫిబ్రవరి 5లోగా అధునాతన మైదానాన్ని పీసీబీకి అందిస్తాం. లాహోర్ స్టేడియంలో కూడా పనులు దాదాపు ముగిశాయి. తాజా మార్పుల్లో అధునాతన సదుపాయాలు కల్పించాం’ అని పేర్కొన్నాడు.చదవండి: రీ ఎంట్రీ ఇస్తా.. కాంపిటేటివ్ క్రికెట్ ఆడాలని ఉంది.. కానీ: డివిలియర్స్ -
పాకిస్తాన్ భయపడుతోందా?.. అతడి వల్లే జట్టు ప్రకటన ఆలస్యం!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఇంత వరకు తమ జట్టును ప్రకటించలేదు. ప్రాథమిక జట్ల ప్రకటనకు సంబంధించి జనవరి 12నే డెడ్‌లైన్ ముగిసినా పీసీబీ మాత్రం ఇంకా ఆలస్యం చేస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ(Basit Ali) కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టు ప్రకటన విషయంలో పీసీబీ జాప్యం చేయడానికి గల కారణాలను విశ్లేషించాడు.పాకిస్తాన్ భయపడుతోందా?ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘జట్టును ప్రకటించేందుకు పాకిస్తాన్ భయపడుతోందా?.. కానే కాదు.. అయితే, ఏం చేయాలి? ఏం చేయకూడదు అన్న విషయాలపై మాత్రం పీసీబీకి ఇంకా స్పష్టత రానట్టుంది.అతడి వల్లే జట్టు ప్రకటన ఆలస్యం!ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏమిటంటే.. సయీమ్ ఆయుబ్. అతడు ఫిట్నెస్ సాధిస్తాడా? లేదా అన్నది ఇంకా తేలలేదు. అందుకే ఈ ఆలస్యం’’ అని బసిత్ అలీ పేర్కొన్నాడు. కాగా ఇటీవలికాలంలో అద్భుత ప్రదర్శనతో దుమ్ములేపుతూ.. సూపర్ ఫామ్‌లో ఉన్న యువ బ్యాటర్ సయీమ్ ఆయుబ్(Saim Ayub) గాయపడిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికాతో రెండో టెస్టు సందర్భంగా అతడు చీలమండ నొప్పితో విలవిల్లాడాడు. ఇప్పటి దాకా అతడు పూర్తిగా కోలుకోలేదని సమాచారం.ప్రస్తుతం పాకిస్తాన్ వన్డే జట్టులో సయీమ్ ఆయుబ్ కీలక సభ్యుడిగా ఉన్నాడు. పాక్ తరఫున 2023లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన 22 ఏళ్ల ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. 2024లో వన్డే, టెస్టుల్లోనూ అరంగేట్రం చేశాడు.మూడు శతకాలుఇప్పటి వరకు 27 టీ20లలో 498 పరుగులు చేసిన ఆయుబ్.. ఏడు టెస్టుల్లో 364 రన్స్ చేయడంతో పాటు నాలుగు వికెట్లు తీశాడు. ఇక వన్డే ఫార్మాట్లో మాత్రం ఇటీవల అతడు అదరగొట్టాడు. తొమ్మిది మ్యాచ్‌లు పూర్తి చేసుకుని 515 పరుగులు సాధించాడు. ఈ లెఫ్టాండ్ బ్యాటర్ ఖాతాలో ఇప్పటికే మూడు శతకాలు ఉండటం విశేషం. ఆస్ట్రేలియా పర్యటనలో ఆకట్టుకోవడంతో పాటు... సౌతాఫ్రికాలో ఏకంగా రెండు సెంచరీలు చేయడం అతడి సూపర్ ఫామ్‌కు నిదర్శనం.అలాంటి ఆటగాడు గనుక జట్టుకు దూరమైతే పాకిస్తాన్‌కు తిప్పలు తప్పవు. అందుకే.. ఆయుబ్ ఫిట్‌నెస్‌పై స్పష్టత వచ్చిన తర్వాతే జట్టును ప్రకటించాలని పీసీబీ భావిస్తున్నట్లు బసిత్ అలీ అభిప్రాయపడ్డాడు. కాగా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి పాకిస్తాన్ నేరుగా అర్హత సాధించింది.ఇక వన్డే వరల్డ్‌కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ కూడా ఈ మెగా ఈవెంట్‌కు క్వాలిఫై అయ్యాయి. ఈ టోర్నీలో పాల్గొంటున్న ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-‘ఎ’లో భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా ఉండగా.. గ్రూప్-‘బి’లో ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ ఆడనున్నాయి. ఇక పాకిస్తాన్ తప్ప ఇప్పటికే మిగిలిన ఏడు దేశాలు తమ జట్లను ప్రకటించాయి. అయితే, జట్లలో మార్పులకు ఫిబ్రవరి 11 వరకు సమయం ఉంది.ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19న చాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ వేదికగా మొదలుకానుండగా.. భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబాయ్‌లో జరుగుతుంది. భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు తమ మ్యాచ్‌లన్నింటినీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోనే ఆడనుంది.చదవండి: జైస్వాల్‌కు చోటు.. తర్వాతి తరం ‘ఫ్యాబ్ ఫోర్’ వీరే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు -
Ind vs Pak: టికెట్లు కావాలంటే.. ముందుగా చేయాల్సింది ఇదే! ధరల సంగతి?
క్రికెట్ ప్రపంచంలో భారత్ వర్సెస్ పాకిస్తాన్(India vs Pakistan) మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే!.. దాయాదులు పరస్పరం నువ్వా- నేనా అన్నట్లుగా పోటీ పడుతుంటే.. ఇరు దేశాల అభిమానులే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులంతా మ్యాచ్‌కే అతుక్కుపోతారు. ఇరు దేశాల మధ్య పరిస్థితుల దృష్ట్యా భారత్- పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఎప్పుడో నిలిచిపోయిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో కేవలం ఆసియా కప్, అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్వహించే టోర్నమెంట్లలో మాత్రమే చిరకాల ప్రత్యర్థులు పోటీపడుతున్నాయి. భారత్- పాకిస్తాన్ చివరగా గతేడాది టీ20 ప్రపంచకప్ సందర్భంగా న్యూయార్క్‌లో ముఖాముఖి తలపడ్డాయి. నాటి మ్యాచ్‌లో రోహిత్ సేన బాబర్ ఆజం బృందాన్ని ఓడించడమే కాకుండా.. లీగ్ దశ ఆసాంతం దుమ్ములేపడంతో పాటు చాంపియన్‌గా నిలిచింది.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) సందర్భంగా మరోసారి దాయాదుల సమరం జరుగనుంది. ఈ ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ సంపాదించుకోగా.. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా మాత్రం అక్కడకు వెళ్లడం లేదు. తటస్థ వేదికైన యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లో రోహిత్ సేన తమ మ్యాచ్‌లు ఆడనుంది. ఫిబ్రవరి 19న ఈ వన్డే ఫార్మాట్ టోర్నీ మొదలుకానుండగా.. భారత్ తమ తొలి మ్యాచ్‌లో దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది.అనంతరం.. ఫిబ్రవరి 23న పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇందుకు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలని వేయికళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులకు డైరెక్ట్ సేల్ ద్వారా టికెట్లు అందుబాటులో లేవు. ఇందుకోసం ముందుగా ఐసీసీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. అప్పుడే టికెట్లు ఎప్పుడు, ఎక్కడ అందుబాటులోకి వస్తాయన్న విషయం ఐసీసీ ద్వారా నేరుగా తెలుసుకోవచ్చు.ఆ ప్రక్రియ ఎలా ఉంటుందంటే..తొలుత ఐసీసీ అధికారిక రిజిస్ట్రేషన్ పేజీలోకి వెళ్లి.. ఈ కింది వివరాలు పూర్తి చేయాలి.👉పూర్తి పేరు:👉ఈ-మెయిల్ అడ్రస్:👉ఫోన్ నంబర్:👉పుట్టిన తేది:👉ఏ దేశంలో నివాసం ఉంటున్నారు:👉ఏ జట్టుకు మీ మొదటి ప్రాధాన్యం:👉షరతులకు అంగీకరిస్తున్నారా?!:👉అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయనుకుంటే.. సబ్మిట్ చేయండి.ధరల సంగతేంటి?ఇక జనవరి 16, 2025 నాటికి ఎక్స్ఛేంజ్టికెట్స్(xchangetickets) వెబ్సైట్ ద్వారా అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. భారత్- పాక్ మ్యాచ్‌ల టికెట్ల రేట్లు చుక్కల్ని తాకుతున్నాయి.👉జనరల్ స్టాండ్- 2386.00 AED(అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్స్- భారత కరెన్సీలో దాదాపు రూ. 56,170)👉ప్రీమియమ్ టికెట్ల ధర- 5032 AED(భారత కరెన్సీలో దాదాపు రూ. 1,18, 461)👉గ్రాండ్ లాంజ్- 12240 AED(భారత కరెన్సీలో దాదాపు రూ. 2,88,150)👉ప్లాటినమ్ టికెట్ల ధర- 17680 AED(భారత కరెన్సీలో దాదాపు రూ. 2,24, 116).పాక్‌లో టికెట్ల ధరలు ఇలాకాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 లీగ్ దశ మ్యాచ్ టికెట్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఇక కరాచీ, లాహోర్, రావల్పిండిలో జనరల్ ఎన్‌క్లోజర్ టికెట్ల ధర 1000 పాకిస్తానీ రూపీస్(భారత కరెన్సీలో కేవలం రూ. 310). ఇక పాకిస్తాన్లో అత్యధిక ప్రీమియమ్ సీటింగ్ టికెట్ల ధర(లాహోర్ సెమీ ఫైనల్ మ్యాచ్)- 25,000 పాకిస్తానీ రూపీస్(భారత కరెన్సీలో దాదాపు రూ. 7764). మరోవైపు.. వీవీఐపీ టికెట్ల ధర 12,000 పాకిస్తానీ రూపీస్(భారత కరెన్సీలో దాదాపు రూ. 3726). అయితే, రావల్పిండిలో పాకిస్తాన్- బంగ్లాదేశ్ జనరల్ ఎన్‌క్లోజర్ టికెట్ రేట్లను మాత్రం 2500 పాకిస్తానీ రూపీస్(భారత కరెన్సీలో రూ. 776)కు పెంచినట్లు సమాచారం.చదవండి: Ind vs Eng: టీ20, వన్డే సిరీస్‌లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే -
పాకిస్తాన్‌కు వెళ్లనున్న రోహిత్ శర్మ!.. కారణం?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) పాకిస్తాన్‌కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఆరంభోత్సవంలో భారత సారథి పాల్గొననున్నట్లు సమాచారం. కాగా 1996 తర్వాత తొలిసారి పాకిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తోంది.వన్డే ఫార్మాట్లో జరిగే చాంపియన్స్ ట్రోఫీని చివరగా 2017లో నిర్వహించగా.. నాడు పాక్ జట్టు విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ ఐసీసీ టోర్నీకి నేరుగా అర్హత సాధించడంతో పాటు నిర్వహణ హక్కులను కూడా దక్కించుకుంది.ఇక ఆతిథ్య పాకిస్తాన్‌తో పాటు.. భారత్ వేదికగా 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ ఈవెంట్ ప్రదర్శన ఆధారంగా చాంపియన్ ఆస్ట్రేలియా, రన్నరప్ టీమిండియా.. అదే విధంగా టాప్-7లో నిలిచిన న్యూజిలాండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ కూడా ఈ టోర్నమెంట్‌కు అర్హత సాధించాయి.తటస్థ వేదికపైఅయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్‌కు పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిరాకరించింది. తటస్థ వేదికపైన తమకు మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించాలని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. అయితే, పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మాత్రం ఆరంభంలో ఇందుకు ససేమిరా అన్నప్పటికీ.. ఐసీసీ జోక్యంతో పట్టువీడింది. తాము కూడా ఇకపై భారత్‌లో ఐసీసీ టోర్నీ జరిగితే అక్కడికి వెళ్లకుండా తటస్థ వేదికపైనే ఆడతామన్న షరతుతో హైబ్రిడ్ విధానానికి అంగీకరించింది.ఈ నేపథ్యంలో దుబాయ్(Dubai) వేదికగా భారత క్రికెట్ జట్టు తమ మ్యాచ్‌లు ఆడనుంది. ఇక ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలుకానుండగా.. ఫిబ్రవరి 16 లేదంటే 17వ తేదీన ఈ ఈవెంట్ ఆరంభ వేడుకను నిర్వహించేందుకు పాక్ బోర్డు సిద్ధమైనట్లు సమాచారం. ఆనవాయితీ ప్రకారం ఈ టోర్నీలో పాల్గొనే జట్ల కెప్టెన్లందరూ ఈ వేడుకకు హాజరు కావాల్సి ఉంటుంది.టీమిండియా కెప్టెన్ కూడా వస్తాడుఈ విషయం గురించి పాక్ బోర్డు వర్గాలు వార్తా సంస్థ(IANS)తో మాట్లాడుతూ.. ‘‘చాంపియన్స్ ట్రోఫీ ఆరంభ వేడుకలను పీసీబీ ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. టీమిండియా కెప్టెన్ కూడా ఇందులో పాల్గొనేందుకు పాకిస్తాన్‌కు వస్తాడు. 29 ఏళ్ల తర్వాత పాకిస్తాన్లో ఐసీసీ ఈవెంట్ జరుగబోతోంది. దీనిని విజయవంతం చేయాలని పీసీబీ పట్టుదలగా ఉంది’’ అని పేర్కొన్నాయి.అయితే, బీసీసీఐ రోహిత్ శర్మను పాకిస్తాన్‌కు పంపిస్తుందా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. కాగా పాకిస్తాన్- న్యూజిలాండ్ మధ్య కరాచీ వేదికగా జరుగనున్న మ్యాచ్‌తో చాంపియన్స్ ట్రోఫీ-2025కి తెరలేవనుంది. మరోవైపు.. టీమిండియా ఫిబ్రవరి 20న దుబాయ్‌లో తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. దాయాదుల సమరం ఆరోజేఇక క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసే భారత్ వర్సెస్ పాకిస్తాన్(India vs Pakistan) మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగుతుంది. దాయాదుల సమరానికి దుబాయ్ ఆతిథ్యం ఇస్తుంది. కాగా భారత్- పాక్ చివరగా టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా న్యూయార్క్ వేదికగా తలపడగా.. టీమిండియా విజయం సాధించింది.ఇక టీ20 ప్రపంచకప్‌లో ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న రోహిత్ సేన.. చాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి ట్రోఫీ సొంతం చేసుకున్న తర్వాత.. రోహిత్ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం టెస్టు, వన్డే జట్ల సారథిగా కొనసాగుతున్నాడు.చదవండి: టి20 ప్రపంచకప్.. టీమిండియా ఘన విజయం -
భారత్ వర్సెస్ పాక్.. నెట్‌ఫ్లిక్స్‌లో దాయాది జట్ల డ్రామా
న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఉండే ఉత్కంఠ, ఉత్సాహమే వేరు. ఈ రెండు దాయాది జట్ల మధ్య ఇన్నేళ్లలో ఎన్నో గొప్ప మ్యాచ్‌లు జరిగాయి. టెస్టులైనా, వన్డేలైనా, టి20లైనా ప్రతీ పోరు ప్రత్యేకమే. మైదానంలో ఇరు జట్ల వైరానికి సంబంధించి ఎన్నో ఘటనలను అభిమానులు ఎవరూ ఎప్పటికీ మర్చిపోలేరు. అలాంటి ఆసక్తికర ఘటనలు, వ్యాఖ్యలు, వివాదాలతో నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొత్త డాక్యుమెంటరీని రూపొందించింది. ‘ద గ్రేటెస్ట్ రైవల్రీ’ పేరుతో సిద్ధం చేసిన ఈ డాక్యుమెంటరీ ఫిబ్రవరి 7న ప్రసారం కానుంది. గ్రే మ్యాటర్ ఎంటర్‌నైట్‌మెంట్ నిర్మించిన ఈ డ్రామాకు చంద్రదేవ్ భగత్, స్టివార్ట్ సగ్ దర్శకత్వం వహించారు. ఇరు దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు సునీల్ గావస్కర్, జావేద్ మియాందాద్, వకార్ యూనిస్, సౌరవ్ గంగూలీ, ఇంజమాముల్ హక్, వీరేంద్ర సెహా్వగ్, షోయబ్ అక్తర్, రవిచంద్రన్ అశి్వన్ ఇంటర్వ్యూలు ఇందులో ఉంటాయి. ‘రెండు దేశాల మధ్య మ్యాచ్‌లలో ఉండే భావోద్వేగాలు, తీవ్రతవంటివి ఇందులో చూపించాం. మీ అంచనాలకు తగ్గకుండా ఉత్కంఠభరితంగా దీనిని రూపొందించాం. మైదానంలో ఆట మాత్రమే కాదు. మైదానం బయట ఎన్నో ఆసక్తికర అంశాలను ఇందులో చూడవచ్చు’ అని రూపకర్తలు పేర్కొన్నారు. -
‘చాంపియన్స్ ట్రోఫీలో కచ్చితంగా ఆడతా.. ఈసారి కూడా’
త్వరలోనే పాకిస్తాన్ క్రికెట్ జట్టులో తాను పునరాగమనం చేస్తానని వెటరన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. సొంతగడ్డపై జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)లో భాగమమవుతానని తెలిపాడు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు.కేవలం 33 పరుగులేకాగా టీ20 ప్రపంచకప్-2024 సందర్భంగా పాక్ తరఫున చివరిసారిగా బరిలోకి దిగాడు ఫఖర్ జమాన్(Fakhar Zaman). అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన ఈ మెగా టోర్నీలో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ పూర్తిగా తేలిపోయాడు. నాలుగు మ్యాచ్‌లలో కలిపి కేవలం 33 పరుగులే చేశాడు. ఇక ఈ ఐసీసీ ఈవెంట్లో అమెరికా చేతిలో ఓడి పాకిస్తాన్ అవమాన భారంతో లీగ్ దశలోనే నిష్క్రమించింది.బోర్డుతో విభేదాలుఇక అప్పటి నుంచి ఫఖర్ జమాన్ మరోసారి పాక్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అంతేకాదు.. బాబర్ ఆజం(Babar Azam)నకు మద్దతుగా నిలిచిన కారణంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై టెస్టు సిరీస్‌లో సమయంలో బాబర్, షాహిన్ ఆఫ్రిదిలపై వేటు వేస్తూ పీసీబీ తీసుకున్న నిర్ణయాన్ని 34 ఏళ్ల ఈ వెటరన్ బ్యాటర్ తప్పుబట్టాడు. ముఖ్యంగా బాబర్ విషయంలో ఇలా చేయడం సరికాదంటూ సెలక్టర్ల తీరును విమర్శించాడు.ఈ నేపథ్యంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ.. ఫఖర్ జమాన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మేనేజ్మెంట్ను ప్రశ్నించడం వెనుక కారణమేమిటో చెప్పాలంటూ బోర్డు తరఫున షోకాజ్ నోటీస్ జారీ చేశాడు. ఈ క్రమంలో ఉద్దేశపూర్వకంగానే పీసీబీ.. ఫఖర్ జమాన్‌ను పక్కనపెట్టిందని.. అందుకే జట్టుకు ఎంపిక చేయడంలేదనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.అసలు కారణం ఇదీఈ విషయాలపై ఫఖర్ జమాన్ తాజాగా స్పందించాడు. ‘‘చాలా మందికి నేను జట్టుకు ఎందుకు దూరమయ్యానో తెలియదు. టీ20 ప్రపంచ కప్ టోర్నీలో ఆడిన తర్వాత నేను అనారోగ్యం పాలయ్యాను. వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాను. నేను వందశాతం ఫిట్‌గా లేకపోవడం వల్లే జట్టుకు ఎంపిక చేయలేదు.అయితే, కచ్చితంగా నేను మళ్లీ పాక్ తరఫున బరిలోకి దిగుతాను. ఇప్పుడు నేను పూర్తిగా కోలుకున్నాను. పాకిస్తాన్ తదుపరి ఆడే పరిమిత ఓవర్ల సిరీస్‌లో పాల్గొంటాను’’ అని ఫఖర్ జమాన్ ధీమా వ్యక్తం చేశాడు. ఇక చాంపియన్స్ ట్రోఫీతో తనకు గుర్తింపు వచ్చిందన్న ఈ వెటరన్ ప్లేయర్.. ‘‘పాకిస్తాన్ ఇటీవల ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలో పర్యటించింది.ఆ జట్లలో నేను భాగం కాలేకపోయాను. కానీ ప్రస్తుతం నా దృష్టి మొత్తం చాంపియన్స్ ట్రోఫీ మీదే ఉంది. 2017లో చాంపియన్స్ ట్రోఫీలో ప్రతిభ చూపినందు వల్లే నాకు ఎక్కువగా గుర్తింపు వచ్చింది. ఈసారి కూడా అదే తరహాలో రాణించాలని పట్టుదలగా ఉన్నాను. మెగా టోర్నీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని పేర్కొన్నాడు.అందుకు రెడీగానే ఉన్నానుఇక ఇప్పటికే ఓపెనర్‌గా యువ బ్యాటర్ సయీమ్ ఆయుబ్ జట్టులో పాతుకుపోయిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఫఖర్ జమాన్ స్పందిస్తూ.. ‘‘అతడు గొప్పగా ఆడుతున్నాడు. వచ్చే నాలుగైదేళ్లలో టాప్ బ్యాటర్‌గా ఎదుగుతాడు. ఇక మేనేజ్మెంట్ నన్ను నాలుగు లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయమన్నా రెడీగానే ఉన్నాను. అన్నింటికంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యం’’ అని పేర్కొన్నాడు.కాగా 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా సెంచరీతో చెలరేగి.. పాకిస్తాన్‌కు టైటిల్ అందించాడు ఫఖర్ జమాన్. ఇదిలా ఉంటే.. 2017 తర్వాత తొలిసారిగా జరిగే చాంపియన్స్ ట్రోఫీకి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే, టీమిండియా మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుతుంది.చదవండి: VHT: ఇంగ్లండ్‌తో సిరీస్.. దేశీ టోర్నీలో టీమిండియా స్టార్లు! అతడికి విశ్రాంతి! -
CT 2025: శుబ్‌మన్ గిల్‌పై ‘వేటు’?.. అతడికి ప్రమోషన్?
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్‌లో చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది టీమిండియా. ముఖ్యంగా బ్యాటింగ్ వైఫల్యం కారణంగా దాదాపు దశాబ్దం తర్వాత ఈ టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. కంగారూ గడ్డపై 3-1తో ఓడి రిక్తహస్తాలతో స్వదేశానికి పయనమైంది.బౌలర్‌గా, కెప్టెన్‌గా రాణించిఇక ఆసీస్‌తో ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో టీమిండియా కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా గెలిచిందంటే అందుకు కారణం జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)నే. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) గైర్హాజరీలో ఈ ఫాస్ట్‌బౌలర్ భారత జట్టును ముందుకు నడిపించాడు. పేసర్‌గా, కెప్టెన్‌గా రాణించి ఆసీస్ గడ్డపై టీమిండియాకు అతిపెద్ద టెస్టు విజయం(295 పరుగుల తేడాతో) అందించాడు.వెన్నునొప్పి వేధించినాఅయితే, ఆ తర్వాత రోహిత్ శర్మ తిరిగి వచ్చినా టీమిండియా ఇదే జోరును కొనసాగించలేకపోయింది. బ్యాటర్‌గా, సారథిగా రోహిత్ విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ఆఖరిదైన ఐదో టెస్టు నుంచి అతడు స్వచ్చందంగా తప్పుకోగా.. బుమ్రా మరోసారి పగ్గాలు చేపట్టాడు. వెన్నునొప్పి వేధించినా జట్టును గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశాడు.కానీ సిడ్నీ వేదికగా జరిగిన ఐదో టెస్టులో టీమిండియాకు భంగపాటు తప్పలేదు. మ్యాచ్‌తో పాటు సిరీస్‌లోనూ ఓటమిని చవిచూసింది. బుమ్రా లేకపోయి ఉంటే.. టీమిండియా ఆసీస్ చేతిలో 5-0తో వైట్‌వాష్‌కు గురయ్యేదని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడంటే.. ఈ సిరీస్‌లో అతడి ప్రాధాన్యం ఎంతటితో అర్థం చేసుకోవచ్చు.పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్‌గా?ఈ నేపథ్యంలో ఇప్పటికే పేస్ దళ నాయకుడిగా ఉన్న బుమ్రా.. త్వరలోనే పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టనున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మరో ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. వన్డేల్లోనూ రోహిత్ వారసుడిగా బుమ్రా ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.గిల్‌పై వేటు.. బుమ్రాకు ప్రమోషన్?ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 సందర్భంగా రోహిత్ శర్మకు బుమ్రా డిప్యూటీగా వ్యవహరించనున్నట్లు సమాచారం. కాగా శ్రీలంక పర్యటన 2024 సందర్భంగా వన్డే, టీ20లలో యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ). అయితే, ఏదేని కారణాల వల్ల రోహిత్ దూరమైతే.. గిల్ ఇప్పటికప్పుడు కెప్టెన్‌గా వ్యవహరించే పరిణతి సాధించలేదని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అందుకే బుమ్రాను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయాలనే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. ఇదిలా ఉంటే.. సిడ్నీ టెస్టు నుంచి రోహిత్ శర్మ తప్పుకొన్న తర్వాత.. వన్డే కెప్టెన్సీకి అతడు దూరం కానున్నాడనే వదంతులు వచ్చాయి. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించనున్నారనే ఊహాగానాలు వినిపించాయి.ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్లుకాగా చాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు టీమిండియా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. ఇందులో భాగంగా ఐదు టీ20లు, మూడు వన్డేల్లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. అయితే, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు బుమ్రా దూరంగా ఉండనున్నట్లు సమాచారం. వెన్నునొప్పి కారణంగా అతడు విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలుకానుంది. పాకిస్తాన్ ఈ మెగా వన్డే టోర్నీకి ఆతిథ్యం ఇస్తుండగా.. టీమిండియా మ్యాచ్‌లు మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో జరుగుతాయి. హైవోల్టేజీ పోరు భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది.చదవండి: 13 నిమిషాల్లోనే ఖేల్ ఖతం.. రషీద్ ఖాన్ మాయాజాలం.. అఫ్గన్ సరికొత్త చరిత్ర