
ఆసియాకప్ 2025లో గ్రూపు-ఎ నుంచి భారత క్రికెట్ జట్టు సూపర్-4కు అర్హత సాధించింది. ఈ మెగా టోర్నీ గ్రూపు-ఎలో భాగంగా సోమవారం అబుదాబి వేదికగా యూఏఈ, ఒమన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఒమన్‌ను 42 పరుగుల తేడాతో యూఏఈ చిత్తు చేసింది.
దీంతో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఓటమి పాలైన ఒమన్ టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. ఇదే సమయంలో వరుసగా రెండు మ్యాచ్‌లలో గెలిచి టేబుల్ టాపర్‌గా కొనసాగుతున్న సూపర్ ఫోర్‌కు క్వాలిఫై అయిన తొలి జట్టుగా నిలిచింది.
రెండో జట్టు ఏది?
ఇక గ్రూపు-ఎ నుంచి సూపర్ ఫోర్ రౌండ్‌కు అర్హత సాధించేందుకు పాకిస్తాన్, యూఏఈ జట్లు పోటీపడుతున్నాయి. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో భారత్, పాకిస్తాన్, యూఏఈ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. సెప్టెంబర్ 17న దుబాయ్ వేదికగా యూఏఈ-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు భారత్‌తో పాటు సూపర్-4లో అడుగు పెడుతోంది. బుధవారం జరిగే మ్యాచ్‌లో యూఏఈను ఓడించడం పాక్‌కు అంత సులువు కాదు.
ఈ టోర్నీకి ముందు జరిగిన ట్రైసిరీస్‌లో కూడా పాక్‌కు యూఏఈ గట్టి పోటీ ఇచ్చింది. ఇప్పుడు ఆసియాకప్‌లోనూ అదే పట్టుదలతో పాక్‌ను ఢీకొట్టేందుకు ఆతిథ్య యూఏఈ సిద్దమైంది. పాకిస్తాన్ ఎప్పుడూ ఎలా ఆడుతుందో ఎవరూ ఊహించలేరు. పాకిస్తాన్ జట్టు జింబాబ్వే వంటి పసికూన చేతిలో కూడా ఓడిన సందర్భాలు ఉన్నాయి.
కాబట్టి ఈ రెండు జట్లలో ఎవరూ సూపర్-4కు వస్తారన్నది ముందే అంచనా వేయడం కష్టమనే చెప్పాలి. మరోవైపు భారత ఆటగాళ్లు తమకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో పాకిస్తాన్ ఘోర అవమానంగా ఫీల్ అవుతోంది. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని పీసీబీ డిమాండ్ చేస్తోంది. ఐసీసీ చర్యలు తీసుకోపోతే యూఏఈతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామని పాకిస్తాన్ క్రికెట్ బెదరిస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే యూఏఈ సూపర్-4కు ఆర్హత సాధిస్తోంది.
చదవండి: Asia cup 2025: హ్యాండ్ షేక్ వివాదం.. పాకిస్తాన్‌కు ఐసీసీ షాక్?