breaking news
Asia Cup 2025
-
Asia Cup 2025: పాక్ 'బాయ్‌కాట్' బెదిరింపులకు తలొగ్గని ఐసీసీ
నో హ్యాండ్‌షేక్ ఉదంతంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెనక్కు తగ్గింది. ఇవాళ (సెప్టెంబర్ 17) యూఏఈతో మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు పీసీబీ హైడ్రామా నడిపింది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్ నుంచి తప్పించాలని భీష్మించుకు కూర్చుంది. పైక్రాఫ్ట్‌ను తప్పించకపోతే యూఏఈతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేసింది. మ్యాచ్ ప్రారంభానికి సమయం ఆసన్నమైనా, వారి ఆటగాళ్లను హోటల్ రూమ్‌ల నుంచి బయటకు రానివ్వలేదు.దీంతో ఆసియా కప్‌లో పాక్ కొనసాగడంపై కాసేపు నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఈ విషయంలో ఐసీసీ కూడా ఏమాత్రం తగ్గకపోవడంతో పాక్ క్రికెట్ బోర్డే తోక ముడిచింది. నో హ్యాండ్‌షేక్ ఉదంతంతో పైక్రాఫ్ట్‌ది ఏ తప్పు లేదని ఐసీసీ మరోసారి పీసీబీకి స్పష్టం చేసింది. మ్యాచ్ అఫీషియల్స్ విషయంలో పీసీబీ అతిని సహించబోమని స్ట్రిక్ట్‌గా వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది.దీంతో చేసేదేమీ లేక పీసీబీ తమ ఆటగాళ్లను మ్యాచ్ ఆడటానికి మైదానానికి రావాల్సిందిగా ఆదేశించింది. మ్యాచ్‌ను గంట ఆలస్యంగా ప్రారంభించాలని నిర్వహకులకు కబురు పంపింది. భారతకాలమానం ప్రకారం పాక్-యూఏఈ మ్యాచ్ రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా, పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా సెప్టెంబర్ 14న జరిగిన మ్యాచ్‌లో భారత క్రికెటర్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించారు. దీన్ని అవమానంగా భావించిన పాక్.. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది.అలాగే ఆ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్ నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. పైక్రాఫ్ట్ షేక్‌హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్ సల్మాన్ అఘాకు చెప్పాడని, ఈ వివాదానికి అతనే బాధ్యుడని గగ్గోలు పెట్టింది.పీసీబీ డిమాండ్లను పరిశీలించిన ఐసీసీ.. షేక్ హ్యాండ్ ఇవ్వడమనేది ఆటగాళ్ల వ్యక్తిగత విషయమని కొట్టిపారేసింది. అలాగే షేక్‌హ్యాండ్ ఉదంతంలో పైక్రాఫ్ట్ పాత్ర ఏమీ లేదని, యూఏఈతో మ్యాచ్‌కు అతన్నే రిఫరీగా కొనస్తామని ప్రకటించింది. -
Asia Cup 2025: యూఏఈతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయనున్న పాకిస్తాన్..?
ఆసియా కప్-2025లో భాగంగా భారత్, పాకిస్తాన్ క్రికెటర్ల మధ్య చోటు చేసుకున్న 'హ్యాండ్‌షేక్ వివాదం' తీవ్రరూపం దాల్చినట్లు కనిపిస్తుంది. పాక్ క్రికెట్ టీమ్ ఇవాళ (సెప్టెంబర్ 17) యూఏఈతో జరుగబోయే మ్యాచ్ సహా ఆసియా కప్ మొత్తాన్ని బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. యూఏఈతో మ్యాచ్ ప్రారంభానికి గంట సమయం మాత్రమే ఉన్నా, పాక్ క్రికెటర్లు ఇంకా హోటల్ రూమ్‌ల నుంచి బయటికి రాలేదని సమాచారం. హ్యాండ్‌షేక్ వివాదంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ కాసేపట్లో పాక్ నుంచి మీడియా సమావేశం నిర్వహిస్తాడని తెలుస్తుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సెప్టెంబర్ 14న జరిగిన మ్యాచ్ సందర్భంగా భారత క్రికెటర్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించారు. దీన్ని అవమానంగా భావించిన పాక్.. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అలాగే ఆ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్ నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. పైక్రాఫ్ట్ షేక్‌హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్ సల్మాన్ అఘాకు చెప్పాడని, ఈ వివాదానికి అతనే బాధ్యుడని పీసీబీ గగ్గోలు పెడుతుంది.పీసీబీ డిమాండ్లను పరిశీలించిన ఐసీసీ.. షేక్ హ్యాండ్ ఇవ్వడమనేది ఆటగాళ్ల వ్యక్తిగత విషయమని కొట్టిపారేసింది. అలాగే షేక్‌హ్యాండ్ ఉదంతంలో పైక్రాఫ్ట్ పాత్ర ఏమీ లేదని యూఏఈతో మ్యాచ్‌కు అతన్నే రిఫరీగా కొనసాగించేందుకు నిర్ణయించుకుంది.ఐసీసీ నిర్ణయాలతో ఖంగుతిన్న పీసీబీ చేసేదేమీ లేక ఆసియా కప్‌ను బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే, ఆసియా కప్‌లో ముందు దశకు (సూపర్-4) వెళ్లాలంటే పాక్ యూఏఈపై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంది. గ్రూప్-ఏలో పాక్ పసికూన ఒమన్‌పై విజయం సాధించి, టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది. మరోవైపు యూఏఈ టీమిండియా చేతిలో ఓడి, ఒమన్‌పై విజయం సాధించింది.ప్రస్తుతం పాక్, యూఏఈ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో చెరో విజయంతో పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఒకవేళ పాక్ యూఏఈతో మ్యాచ్‌ను బహిష్కరిస్తే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇదే జరిగితే యూఏఈ భారత్‌తో పాటు సూపర్-4కు చేరుకుంటుంది. -
‘వాళ్ల క్యారెక్టరే అంత.. చదువు, సంస్కారం ఉంటే ఇలాంటివి చేయరు’
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొహ్మద్ యూసఫ్‌పై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ మదన్ లాల్ (Madan Lal) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. పబ్లిసిటీ కోసం ఎంతకైనా దిగజారడం పాక్ క్రికెటర్లకు అలవాటేనని.. వాళ్ల క్యారెక్టరే అంత అంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా ఆసియా కప్-2025 టోర్నమెంట్లో టీమిండియా పాకిస్తాన్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే.నో- షేక్హ్యాండ్దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. పాక్‌ను 127 పరుగులకే పరిమితం చేసింది. ఇక స్వల్ప లక్ష్య ఛేదనను 15.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి పూర్తి చేసింది. ఇదిలా ఉంటే.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారి దాయాదితో ముఖాముఖి తలపడిన టీమిండియా మైదానంలో ఏ దశలోనూ పాక్ ఆటగాళ్లతో ఎలాంటి కమ్యూనికేషన్ పెట్టుకోలేదు.టాస్ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాక్ సారథి సల్మాన్ ఆఘాకు షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా టీమిండియా ఇదే పంథా అనుసరించింది. దీనిని తీవ్ర అవమానంగా భావించిన పాక్.. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారంటూ నానాయాగీ చేసింది.సూర్యకుమార్ యాదవ్‌పై దిగజారుడు వ్యాఖ్యలుఈ క్రమంలో పాక్ మాజీ క్రికెటర్ మొహ్మద్ యూసఫ్.. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. సూర్య పేరును కావాలనే తప్పుగా పలుకుతూ ‘ఆ పంది’ కుమార్ అంటూ చీప్ కామెంట్లు చేశాడు. అంతేకాదు.. అంపైర్లను అడ్డుపెట్టుకుని టీమిండియా మ్యాచ్ గెలిచిందంటూ ఆరోపించాడు.పాకిస్తాన్ క్రికెటర్ల క్యారెక్టరే అంతఈ నేపథ్యంలో 1983 వరల్డ్‌కప్ విజేత మదన్ లాల్ మొహ్మద్ యూసఫ్ తీరుపై మండిపడ్డాడు. ‘‘పాకిస్తాన్ క్రికెటర్ల క్యారెక్టరే అంత. ఎవరైనా దూషించే హక్కు మీకెక్కడిది?.. వాళ్లకు ఇలా మాట్లాడటం మాత్రమే తెలుసు. అంతకంటే ఇంకేమీ పట్టదు.సొంత జట్టు ప్లేయర్లనే తిట్టిన చరిత్ర వారికి ఉంది. వరుస పరాజయాలతో విసుగెత్తిపోయి ఉన్నారు. అందుకే ఇప్పుడు ఇతర జట్ల ఆటగాళ్లను కూడా దూషించడం మొదలుపెట్టారు. దీనిని బట్టి వాళ్ల చదువు, సంస్కారాలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. ఇలా మాట్లాడేవారంతా మూర్ఖులు.పబ్లిసిటీ కోసమే ఈ విషయం గురించి మనం ఎక్కువగా మాట్లాడకూడదు. నిజానికి మనమే వాళ్లకు ఎక్కువగా ప్రచారం ఇస్తున్నాం. వాళ్లకు కావాల్సింది కూడా ఇదే. పబ్లిసిటీ కోసం వాళ్లు ఏమైనా చేస్తారు. భారత జట్టు గురించి మాట్లాడుతూ వ్యూస్ కోసం యూట్యూబ్ చానెళ్లు ఇలాంటి పనిచేస్తున్నాయి’’ అని 74 ఏళ్ల మదన్ లాల్ ANIతో పేర్కొన్నాడు.అదే విధంగా.. టీమిండియా తమ అద్భుత ఆట తీరుతో గెలిచిందంటూ యూసఫ్‌కు మదన్ లాల్ కౌంటర్ ఇచ్చాడు. కొన్నిసార్లు అంపైర్లు తప్పు చేసినా.. ఇప్పుడున్న అత్యాధునిక సాంకేతికతో వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు.చదవండి: చావో- రేవో!.. పాకిస్తాన్ సూపర్-4కు అర్హత సాధించాలంటే.. -
మా స్థాయి ఇది కాదు!.. అందుకే బంగ్లా చేతిలో ఓటమి: రషీద్ ఖాన్
బంగ్లాదేశ్ చేతిలో ఓటమిపై అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ (Rashid Khan) స్పందించాడు. తాము స్థాయికి తగ్గట్లు ఆడలేదని.. అందుకే ఓడిపోయామని విచారం వ్యక్తం చేశాడు. ఆసియా కప్-2025 టోర్నమెంట్లో అఫ్గనిస్తాన్.. శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్‌లతో కలిసి గ్రూప్-బిలో ఉంది.ఈ క్రమంలో తొలుత హాంకాంగ్‌తో తలపడిన అఫ్గన్ జట్టు.. 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే, తాజాగా తమ రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఢీకొట్టిన రషీద్ ఖాన్ బృందం ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. అబుదాబిలో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా.. తొలుత బ్యాటింగ్ చేసింది.తప్పక గెలిస్తేనే.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. అయితే, ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో అఫ్గనిస్తాన్ విఫలమైంది. 20 ఓవర్లలో 146 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా బంగ్లా చేతిలో ఎనిమిది పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో అఫ్గన్ సూపర్-4 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. లీగ్ దశలో చివరిగా శ్రీలంకతో ఆడబోయే మ్యాచ్‌లో తప్పక గెలిస్తేనే.. రషీద్ బృందానికి సూపర్-4 ఆశలు సజీవంగా ఉంటాయి.మా స్థాయి ఇది కాదుఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం రషీద్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘ఆఖరి వరకు పోరాడినా అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయాము. 18 బంతుల్లో 30 పరుగుల సమీకరణం పెద్ద కష్టమేమీ కాదు. దూకుడైన క్రికెట్ ఆడే జట్టుగా మాకు పేరుంది. కానీ ఈసారి స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాము.చెత్త బ్యాటింగ్ వల్లే ఓటమిఅనవసరంగా ఒత్తిడికి లోనయ్యాము. ఆరంభంలో తడబడ్డా ప్రత్యర్థిని 160 పరుగులలోపే కట్టడి చేశాము. కానీ బ్యాటింగ్ పరంగా విఫలమయ్యాము. కొన్ని చెత్త, బాధ్యతారహిత షాట్లు ఆడి మూల్యం చెల్లించుకున్నాము.టీ20 ఫార్మాట్లో కొన్నిసార్లు ప్రత్యర్థి తొలి ఆరు ఓవర్లలోనే మ్యాచ్‌ను తమవైపునకు తిప్పేసుకున్నా.. తిరిగి పుంజుకోవడం కష్టం. ఈ మ్యాచ్ ద్వారా మేము చాలా పాఠాలు నేర్చుకున్నాం. ఆసియా కప్ టోర్నీలో ప్రతీ మ్యాచ్ ముఖ్యమైనదే.శ్రీలంకతో మ్యాచ్‌కు అన్ని విధాలుగా సన్నద్ధం కావాల్సి ఉంది. ప్రస్తుతం మా ముందున్న అతిపెద్ద సవాలు ఇదే’’ అని పేర్కొన్నాడు. కాగా అఫ్గన్ జట్టు గురువారం (సెప్టెంబరు 18) శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇరుజట్ల మధ్య జరిగే ఈ నాకౌట్ పోరుకు అబుదాబి వేదిక.బంగ్లాదేశ్ వర్సెస్ అఫ్గనిస్తాన్ స్కోర్లుబంగ్లాదేశ్: 154/5 (20)అఫ్గనిస్తాన్: 146 (20)చదవండి: చావో- రేవో!.. పాకిస్తాన్ సూపర్-4కు అర్హత సాధించాలంటే..Bangladesh win, keeping playoff hopes alive 🤞 Group B battles are going down the wire. Watch #DPWorldAsiaCup2025 from Sept 9-28, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #BANvAFG pic.twitter.com/9mHoLUcTGw— Sony Sports Network (@SonySportsNetwk) September 16, 2025 -
ఆల్‌టైమ్ రికార్డు బద్దలు.. చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్
ఆసియా కప్ టోర్నమెంట్లో అఫ్గనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ (Rashid Khan) సరికొత్త చరిత్ర లిఖించాడు. ఈ ఖండాంతర టోర్నీ టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ ఫాస్ట్‌బౌలర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) పేరిట ఉన్న ఆల్‌టైమ్ ఆసియా కప్ టీ20 వికెట్ల రికార్డును బద్దలు కొట్టాడు.రెండు వికెట్లు పడగొట్టిన రషీద్బంగ్లాదేశ్తో మంగళవారం నాటి మ్యాచ్ సందర్భంగా రషీద్ ఖాన్ ఈ ఘనత సాధించాడు. ఆసియా కప్-2025 టోర్నీలో భాగంగా అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌తో తలపడింది. అబుదాబిలో టాస్ గెలిచిన బంగ్లా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఓపెనర్లు సైఫ్ హసన్ (30), తాంజిద్ హసన్ (52)లతో పాటు తౌహీద్ హృదోయ్ (26) రాణించడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లా ఐదు వికెట్ల నష్టానికి 154 పరుగులు స్కోరు చేసింది. అఫ్గన్ బౌలర్లలో కెప్టెన్ రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.ఈ మ్యాచ్‌లో అఫ్గన్ మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్.. నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటాలో 26 పరుగులు ఇచ్చి.. సైఫ్ హసన్ రూపంలో కీలక వికెట్ దక్కించుకోవడంతో పాటు షమీమ్ హొసేన్‌ను కూడా అవుట్ చేశాడు. ఈ క్రమంలోనే ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్ల వీరుడిగా రషీద్ ఖాన్ అవతరించాడు.ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు అత్యధిక వికెట్లు తీసింది వీరే👉రషీద్ ఖాన్(అఫ్గనిస్తాన్)- 10 మ్యాచ్‌లలో కలిపి 14 వికెట్లు👉భువనేశ్వర్ కుమార్ (భారత్)- 6 మ్యాచ్‌లలో కలిపి 13 వికెట్లు👉అమ్జద్ జావేద్ (యూఏఈ)- 7 మ్యాచ్‌లలో కలిపి 12 వికెట్లు👉వనిందు హసరంగ (శ్రీలంక)- 8 మ్యాచ్‌లలో కలిపి 12 వికెట్లు👉హార్దిక్ పాండ్యా (భారత్)- 10 మ్యాచ్‌లలో కలిపి 12 వికెట్లు.ఆఖరి వరకు పోరాడినా..ఇక మ్యాచ్ విషయానికొస్తే.. బంగ్లా విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించలేక అఫ్గనిస్తాన్ చతికిలపడింది. నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఆఖరి వరకు పోరాడినా ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది.అఫ్గన్ బ్యాటర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ (35), అజ్మతుల్లా ఒమర్జాయ్ (30) మాత్రమే ఓ మోస్తరుగా రాణించారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ మూడు వికెట్లతో చెలరేగగా.. సనూమ్ అహ్మద్, టస్కిన్ అహ్మద్, రిషాద్ హొసేన్ రెండేసి వికెట్లు కూల్చారు. ఇక అఫ్గన్‌కు సూపర్-4 ఆశలు సజీవంగా ఉండాలంటే.. తదుపరి మ్యాచ్‌లో శ్రీలంకను తప్పక ఓడించాలి.చదవండి: IND Vs PAK Handshake Row: ఐసీసీ యూటర్న్.. పాకిస్తాన్‌కు ఊరట?!Rashid Khan proves his genius, even in a loss 🌟 Watch #DPWorldAsiaCup2025 from Sept 9-28, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #BANvAFG pic.twitter.com/voUMwhtD2g— Sony Sports Network (@SonySportsNetwk) September 16, 2025 -
చావో- రేవో!.. పాకిస్తాన్ సూపర్-4కు చేరాలంటే..
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో టీమిండియా ఇప్పటికే సూపర్-4 దశకు అర్హత సాధించింది. గ్రూప్-‘ఎ’లో ఉన్న భారత జట్టు తొలుత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)ని ఓడించింది. యూఏఈ విధించిన లక్ష్యాన్ని 4.3 ఓవర్లలోనే ఛేదించి తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.సూపర్-4 బెర్తు ఖరారైంది ఇలా..ఇక రెండో మ్యాచ్‌లో సూర్యకుమార్ సేన.. దాయాది పాకిస్తాన్ (Ind vs Pak)ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ క్రమంలో నాలుగు పాయింట్లు సంపాదించిన టీమిండియా.. యూఏఈ- ఒమన్‌ను ఓడించి.. ఎలిమినేట్ చేయగానే సూపర్-4 బెర్తు ఖరారు చేసుకుంది. ఇక గ్రూప్-‘ఎ’ నుంచి రెండో బెర్తు కోసం పాకిస్తాన్- యూఏఈ పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం నాటి మ్యాచ్‌లో ఇరుజట్లు చావోరేవో తేల్చుకోనున్నాయి. కాగా యూఏఈ- పాకిస్తాన్ ఈ టోర్నీలో ఇప్పటి వరకు చెరో మ్యాచ్ గెలిచాయి. ఈ రెండు జట్లు ఒమన్‌ను ఓడించి చెరో రెండు పాయింట్లు సాధించాయి.గెలిచిన జట్టుకే అవకాశంఈ క్రమంలో దుబాయ్ వేదికగా జరిగే బుధవారం జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఖాతాలో మరో రెండు పాయింట్లు చేరతాయి. తద్వారా మొత్తంగా నాలుగు పాయింట్లతో సూపర్-4కు అర్హత సాధిస్తుంది.అంటే.. పాకిస్తాన్ యూఏఈని ఓడిస్తే.. నేరుగా సూపర్-4లో అడుగుపెడుతుంది. ఒకవేళ యూఏఈ గెలిస్తే.. టీమిండియాతో కలిసి గ్రూప్-‘ఎ’ నుంచి సూపర్-4కు అర్హత సాధిస్తుందన్న మాట.ఫలితం తేలకుంటే మాత్రంఒకవేళ మ్యాచ్ గనుక ‘టై’ అయినా.. ఏదేని కారణాల చేత ఫలితం తేలకపోయినా ఇరుజట్లకు చెరో పాయింట్ వస్తుంది. అప్పుడు నెట్ రన్‌రేటు ఆధారంగా మెరుగ్గా ఉన్న జట్టుకు బెర్తు ఖరారు అవుతుంది. ప్రస్తుతం నెట్ రన్‌రేటు పరంగా పాకిస్తాన్ (+1.649).. యూఏఈ కంటే మెరుగ్గా ఉంది. కాబట్టి ఈ సమీకరణ ఆధారంగా పాకిస్తాన్‌కే సూపర్-4 చేరే అవకాశం ఉంటుంది.AI ఆధారిత టేబుల్ఒమన్, హాంకాంగ్ ఎలిమినేట్యూఏఈ వేదికగా ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్ టోర్నీలో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ... గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ పాల్గొంటున్నాయి. ఇప్పటికే గ్రూప్-‘ఎ’ నుంచి ఒమన్.. గ్రూప్-‘బి’ నుంచి హాంకాంగ్ ఎలిమినేట్ అయ్యాయి.చదవండి: IND Vs PAK Handshake Row: ఐసీసీ యూటర్న్.. పాకిస్తాన్‌కు ఊరట?! -
Handshake Row: ఐసీసీ యూటర్న్.. పాకిస్తాన్‌కు ఊరట?!
ఆసియా కప్-2025 టోర్నీలో టీమిండియాతో మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) రచ్చకెక్కింది. తమ ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్లు కరచాలనం చేయకపోవడాన్ని పీసీబీ జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలో భారత్, పాక్ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్ (Andy Pycroft)ను తక్షణం ఆసియా కప్ నుంచి తప్పించాలని పీసీబీ డిమాండ్ చేసింది.ఆయనే బాధ్యుడంటూ..ఈ మేరకు ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లకు ఫిర్యాదు కూడా చేసింది. మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ షేక్‌హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్ సల్మాన్ ఆఘాకు చెప్పాడని, ఈ వివాదానికి ఆయనే బాధ్యుడని ఫిర్యాదులో ప్రముఖంగా పేర్కొంది.ఈ విషయంపై మంగళవారం స్పందించిన ఐసీసీ పాక్ బోర్డు ఫిర్యాదును తోసిపుచ్చింది. ‘సోమవారం రాత్రే ఐసీసీ తమ నిర్ణయాన్ని వెలువరించింది. రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్‌ను తప్పించలేమని పాక్ బోర్డు ఫిర్యాదును తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశాం’ అని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. కాగా జింబాబ్వేకు చెందిన పైక్రాఫ్ట్‌కు అంతర్జాతీయ క్రికెట్లో విశేషానుభవం వుంది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో సీనియర్ రిఫరీ అయిన ఆయన మూడు ఫార్మాట్లలో కలిసి 695 మ్యాచ్‌లకు రిఫరీగా వ్యవహరించారు. పురుషులు, మహిళల మ్యాచ్‌లు కలిపి ఉన్నాయి.ఐసీసీ యూటర్న్.. పాక్‌కు ఊరట?!ఈ నేపథ్యంలో కనీసం తమ మ్యాచ్‌ల వరకైనా ఆండీ క్రాఫ్ట్‌ను దూరం పెట్టి రిచీ రిచర్డ్సన్కు రిఫరీ బాధ్యతలు ఇవ్వాలని పీసీబీ కోరింది. కాగా ఆసియా కప్ టోర్నీలో బుధవారం పాకిస్తాన్- యూఏఈ మధ్య జరిగే మ్యాచ్‌కూ పైక్రాఫ్ట్ రిఫరీగా ఉన్నారు. అయితే, పీసీబీ విజ్ఞప్తిని మన్నించిన ఐసీసీ.. ఈ టోర్నీలో పాకిస్తాన్ ఆడబోయే అన్ని మ్యాచ్‌ల నుంచి పైక్రాఫ్ట్‌ను రిఫరీగా తప్పించినట్లు ఎన్డీటీవీ తన తాజా కథనంలో పేర్కొంది.కాగా పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాక్ సారథి సల్మాన్ ఆఘాకు షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా భారత ఆటగాళ్లు పాక్ జట్టుతో కరచాలనం చేయలేదు. కచ్చితమైన నిబంధనలేమీ లేవుఈ నేపథ్యంలో పీసీబీ రిఫరీతో పాటు టీమిండియా తీరును తప్పుబట్టగా.. ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వాలన్న కచ్చితమైన నిబంధనలేమీ లేవని బీసీసీఐ కౌంటర్ ఇచ్చింది.ఇక దుబాయ్ వేదికగా ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కొన్ని అంశాలు క్రీడాస్ఫూర్తికి మించినవి ఉంటాయంటూ పాక్ విమర్శలను తిప్పికొట్టాడు. పాక్‌పై ఈ గెలుపును ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత సైన్యానికి అంకితం చేస్తున్నట్లు తెలిపాడు. అలాగే పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని సూర్య స్పష్టం చేశాడు.చదవండి: సూర్యకుమార్‌పై పాక్ మాజీ కెప్టెన్ దిగజారుడు వ్యాఖ్యలు.. ఇచ్చిపడేసిన కోచ్ -
Asia Cup: గట్టెక్కిన బంగ్లాదేశ్
అబుదాబి: ఆసియా కప్ టి20 టోర్నీలో బంగ్లాదేశ్ కీలక విజయాన్ని అందుకుంది. ‘సూపర్–4’ రేసులో తమకు పోటీగా వచ్చే అవకాశం ఉన్న అఫ్గానిస్తాన్‌పై పైచేయి సాధించింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో బంగ్లా 8 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్‌ను ఓడించింది. ముందుగా బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఓపెనర్ తన్జీద్ హసన్ (31 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తన్జీద్, మరో ఓపెనర్ సైఫ్ హసన్ (28 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) కలిసి తొలి వికెట్‌కు 40 బంతుల్లో 63 పరుగులు జోడించారు. అయితే ఆ తర్వాత అఫ్గాన్ స్పిన్నర్లు నూర్ అహ్మద్ (2/23), రషీద్ ఖాన్ (2/26) బంగ్లా బ్యాటర్లను కట్టి పడేసి తొలి నాలుగు వికెట్లు పడగొట్టారు. ఈ దశలో తౌహీద్ హృదయ్ (20 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్) కొంత పోరాడటంతో స్కోరు 150 పరుగులు దాటింది. అనంతరం అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. గుర్బాజ్ (31 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఒమర్జాయ్ (16 బంతుల్లో 30; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించగా...ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. చివర్లో రషీద్ ఖాన్ (11 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) గెలిపించేందుకు ప్రయత్నించినా ... 11 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన దశలో అతను అవుట్ కావడంతో అఫ్గాన్ ఓటమి ఖాయమైంది. ముస్తఫిజుర్ రహమాన్ 3 వికెట్లు పడగొట్టగా... నసుమ్ అహ్మద్, రిషాద్ హుస్సేన్ చెరో 2 వికెట్లు తీశారు. నేడు జరిగే మ్యాచ్‌లో యూఏఈతో పాకిస్తాన్ ఆడుతుంది. -
చరిత్ర సృష్టించిన నిసాంక.. శ్రీలంక తొలి ప్లేయర్‌గా..
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో శ్రీలంక వరుసగా రెండో విజయం సాధించింది. గ్రూప్-బిలో ఉన్న లంక జట్టు తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. అయితే, రెండో మ్యాచ్‌లో భాగంగా పసికూన హాంకాంగ్‌తో తలపడిన శ్రీలంక (SL vs HK).. గెలుపు కోసం ఆపసోపాలు పడింది.దుబాయ్ వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 149 పరుగుల మేర మెరుగైన స్కోరు సాధించింది.నిజాకత్ ఖాన్ మెరుపులుఓపెనర్లు జీషన్ అలీ (23), అన్షుమాన్ రథ్ (48) శుభారంభం అందించగా.. నాలుగో నంబర్ బ్యాటర్ నిజాకత్ ఖాన్ అజేయ మెరుపు అర్ధ శతకం (38 బంతుల్లో 52)తో అలరించాడు. అయితే, హాంకాంగ్ విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు శ్రీలంక గట్టిగానే శ్రమించాల్సి వచ్చింది.హాంకాంగ్ బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓపెనర్ కుశాల్ మెండిస్ 11, కమిల్ మిశారా 19, కుశాల్ పెరీరా 20 పరుగులు చేయగా.. కెప్టెన్ చరిత్ అసలంక (2), కమిందు మెండిస్ (5) పూర్తిగా విఫలమయ్యారు.పాతుమ్ నిసాంక హాఫ్ సెంచరీఅయితే, ఓవైపు వికెట్లు పడుతున్నా మరో ఓపెనర్ పాతుమ్ నిసాంక మాత్రం పట్టుదలగా నిలబడ్డాడు. మొత్తంగా 44 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేశాడు. నిసాంక అర్ధ శతకానికి తోడు ఆఖర్లో వనిందు హసరంగ (9 బంతుల్లో 29 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో లంక గట్టెక్కగలిగింది.శ్రీలంక తొలి ప్లేయర్‌గా..ఇక శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించిన పాతుమ్ నిసాంకకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అంతేకాదు ఈ మ్యాచ్ సందర్భంగా నిసాంక ఓ అరుదైన రికార్డు కూడా సాధించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో శ్రీలంక తరఫున అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.కాగా అంతకు ముందు ఈ రికార్డు కుశాల్ మెండిస్ పేరిట ఉండేది. అతడి ఖాతాలో 16 ఫిఫ్టీ ప్లస్ టీ20 స్కోర్లు ఉండగా.. నిసాంక (17) అతడిని అధిగమించాడు. ఇదిలా ఉంటే కుశాల్ పెరీరా కూడా 16సార్లు యాభైకి పైగా స్కోర్లు సాధించి కుశాల్ మెండిస్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.శ్రీలంక వర్సెస్ హాంకాంగ్ స్కోర్లు👉హాంకాంగ్:149/4 (20)👉శ్రీలంక: 153/6 (18.5)👉ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో హాంకాంగ్‌పై శ్రీలంక గెలుపు.చదవండి: ఒకప్పుడు ‘చిరుత’.. ఇప్పుడు మెట్లు ఎక్కాలన్నా ఆయాసమే! -
సూర్యపై పాక్ మాజీ కెప్టెన్ దిగజారుడు వ్యాఖ్యలు.. ఇచ్చిపడేసిన కోచ్
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొహ్మద్ యూసఫ్ (Mohammed Yousuf)పై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) చిన్ననాటి కోచ్ అశోక్ అస్వాల్కర్ మండిపడ్డాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన క్రికెటర్ నుంచి ఇలాంటి చెత్త మాటలు ఊహించలేదన్నాడు. అయినా అతడి స్థాయికి ఇంతకంటే గొప్పగా మాట్లాడతాడనుకోలేదంటూ చురకలు అంటించాడు.ఆసియా కప్-2025 టోర్నీలో భాగంగా టీమిండియా ఆదివారం పాక్‌తో మ్యాచ్ ఆడింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ టీ20 పోరులో సూర్యకుమార్ సేన సల్మాన్ ఆఘా బృందాన్ని ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. బీసీసీఐ కౌంటర్ అయితే, టాస్ సమయంలోగానీ.. మ్యాచ్ ముగిసిన తర్వాత గానీ భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో కరచాలనం చేయలేదు. పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు మద్దతుగా పాక్ ఆటగాళ్లతో షేక్‌హ్యాండ్‌కు నిరాకరించింది.దీనిని అవమానంగా భావించిన పాక్ జట్టు.. విషయాన్ని ఐసీసీ వరకు తీసుకువెళ్లగా.. కచ్చితంగా షేక్‌హ్యాండ్ చేయాలన్న నిబంధన లేదంటూ బీసీసీఐ కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ మొహ్మద్ యూసఫ్ టీమిండియాపై అవాకులు, చెవాకులు పేలుతూ అక్కసు వెళ్లగక్కాడు.సూర్య పేరును ఉద్దేశపూర్వకంగానే తప్పుగా పలుకుతూషేక్హ్యాండ్ గురించి సామా టీవీలో మాట్లాడుతూ.. సూర్యకుమార్‌ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. సూర్య పేరును ఉద్దేశపూర్వకంగానే తప్పుగా పలుకుతూ పంది అనే అర్థం వచ్చేలా దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు అంపైర్లను అడ్డుపెట్టుకుని గెలిచారంటూ నిరాధార ఆరోపణలు చేశాడు. అతడి మాటలకు అక్కడున్న వాళ్లు పళ్ళు ఇకిలిస్తూ శునకానందం పొందారు.ఇంతకంటే ఇంకా ఎంతకు దిగజారగలరు?ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ చిన్ననాటి కోచ్ అశోక్ అస్వాల్కర్ స్పందించాడు. ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘ఇంతకంటే ఇంకా ఎంతకు దిగజారగలరు? వాళ్లు ఇలాంటి చెత్త మాటలు మాట్లాడుతూనే ఉంటారు.మైదానంలో ఏం చేయాలో మాత్రం అది చేయరు. కానీ మైదానం వెలుపల ఇలాంటి పిచ్చి మాటలతో హైలైట్ అవుతారు. ప్రపంచం మొత్తం వీరిని గమనిస్తూనే ఉంది. ఇంతకంటే టీమిండియాను వారు ఏం చేయగలరు?ప్రతి ఒక్కరికి తమకంటూ గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన వ్యక్తి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడంటే వారు ఎలాంటి వారో అర్థం చేసుకోవచ్చు. అయినా.. ఎవరైనా సరే తమ స్థాయికి తగ్గట్లే మాట్లాడతారు కదా!మా జట్టు గొప్పగా ఆడుతోందిఆట గురించి ఎలాంటి విమర్శలు చేసినా తప్పులేదు. కానీ వ్యక్తిగతంగా ఇలా చేయడం ముమ్మాటికీ తప్పే. మీరు ఏదైనామాట్లాడాలనుకుంటే ఆట గురించి మాట్లాడండి. మా జట్టు గొప్పగా ఆడుతోంది. మీ ఆటగాళ్ల పరిస్థితి ఎలా ఉందో చూసుకోండి. క్రికెట్ మీద మాత్రమే దృష్టి పెట్టి.. బాగా ఆడితే మిమ్మల్ని కూడా ఎవరో ఒకరు పొగుడుతారు. అంతేగానీ ఇతర జట్ల ఆటగాళ్ల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు’’ అంటూ అశోక్ అస్వాల్కర్ మొహ్మద్ యూసఫ్నకు గట్టిగానే చురకలు అంటించాడు.చదవండి: టీమిండియా ‘బిగ్ లూజర్’ అంటూ కామెంట్లు?.. పాక్ మీడియాపై పాంటింగ్ ఫైర్ -
టీమిండియా ‘బిగ్ లూజర్’?.. పాక్ మీడియాపై పాంటింగ్ ఫైర్
టీమిండియా- పాకిస్తాన్ మధ్య ‘నో-షేక్‌హ్యాండ్ No- Shakehand)’ వివాదం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆసియా కప్-2025 టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా దాయాదులు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత జట్టు పాక్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది.అయితే, పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు భారత జట్టు నిరాకరించింది. షేక్‌హ్యాండ్ లేకుండానే డ్రెసింగ్ రూమ్‌కు వెళ్లిపోయింది. ఈ క్రమంలో తమను అవమానించారంటూ పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసేవరకు వెళ్లింది.మరోవైపు.. షేక్‌హ్యాండ్ చేయాలన్న నిబంధన లేదని.. తమ ఆటగాళ్లు చేసిన దాంట్లో తప్పేమీ లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో టీమిండియాను సమర్థిస్తూ భారత మాజీ క్రికెటర్లు వ్యాఖ్యలు చేయగా.. ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్ మాత్రం సూర్యకుమార్ సేనను విమర్శించినట్లు వార్తలు వైరల్ అయ్యాయి.టీమిండియా ‘బిగ్ లూజర్’?‘‘ఈ మ్యాచ్ ఎల్లకాలం గుర్తుండిపోతుంది. ఇండియా బిగ్ లూజర్‌గా మనకు గుర్తుంటుంది. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు వెళ్లిన పాకిస్తానీ జట్టు ప్రవర్తన జెంటిల్‌మేన్ గేమ్‌లో వాళ్లను అమరులుగా నిలిపితే.. భారత జట్టు మాత్రం పరాజితగా మిగిలిపోతుంది’’ అని పాంటింగ్ అన్నట్లుగా పాక్ మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.అసలు అలాంటి కామెంట్లు చేయనేలేదుఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్‌పై భారతీయ నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో పాంటింగ్ స్వయంగా ఈ విషయంపై స్పందించాడు. ‘‘సోషల్ మీడియాలో నా పేరు చెప్పి వైరల్ అవుతున్న వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి.నేను అసలు అలాంటి కామెంట్లు చేయనేలేదు. అసలు ఆసియా కప్ టోర్నమెంట్ గురించి నేను ఇంత వరకు బహిరంగంగా ఒక్క మాట కూడా మాట్లాడనే లేదు’’ అంటూ పాక్ నెటిజన్లకు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చాడు. ‘ఎక్స్’ వేదికగా పాంటింగ్ ఈ మేరకు స్పష్టతనిచ్చాడు.ఐపీఎల్‌తో విడదీయరాని అనుబంధంకాగా ఆసీస్ దిగ్గజ కెప్టెన్‌గా పేరొందిన పాంటింగ్‌కు ఐపీఎల్‌తో విడదీయరాని అనుబంధం ఉంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు హెడ్‌కోచ్‌గా పనిచేసిన ఈ లెజెండరీ బ్యాటర్.. గతేడాది పంజాబ్ కింగ్స్‌కు మార్గనిర్దేశనం చేశాడు. అతడి గైడెన్స్‌లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ ఫైనల్ చేరింది. అయితే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. చదవండి: ఛీ.. మరీ సిగ్గు లేకుండా తయారయ్యారు.. ఇదేం పద్ధతి? -
టీమిండియాకు కొత్త జెర్సీ స్పాన్సర్
టీమిండియాకు కొత్త జెర్సీ స్పాన్సర్ వచ్చేసింది. అపోలో టైర్స్ (Apollo Tyres) భారత జట్టు జెర్సీ స్పాన్సర్ హక్కులు దక్కించుకుంది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. ఒప్పందం ప్రకారం 2027 వరకు అపోలో టైర్స్ టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ‘డ్రీమ్ 11’తో కటీఫ్కాగా ఫాంటసీ స్పోర్ట్స్ కంపెనీ ‘డ్రీమ్ 11’ ఇటీవలే భారత క్రికెట్ జట్టు జెర్సీ స్పాన్సర్ హక్కులు కోల్పోయిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్’ను అనుసరించి.. డ్రీమ్ 11తో బీసీసీఐ తమ బంధాన్ని తెంచుకుంది. ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. కాగా మూడేళ్ల కాలానికి 2023లో రూ.358 కోట్లతో డ్రీమ్ 11 ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.ఒక్కో మ్యాచ్‌కు రూ. 4.5 కోట్లుఅయితే, ఇప్పుడు అనూహ్య రీతిలో డ్రీమ్ 11పై వేటు పడగా.. అపోలో టైర్స్ ఆ స్థానాన్ని భర్తీ చేసింది. ఈ క్రమంలో ఒక్కో మ్యాచ్‌కు రూ. 4.5 కోట్ల చొప్పున అపోలో టైర్స్ బోర్డుకు చెల్లించనుంది. ఒప్పంద కాలంలో దాదాపు 130 మ్యాచ్‌లకు ఈ సంస్థ జెర్సీ స్పాన్సర్‌గా ఉండనుంది. అంతకు ముందు డ్రీమ్ 11 జెర్సీ స్పాన్సర్‌గా ఉండి.. ఒక్కో మ్యాచ్‌కు రూ. 4 కోట్లు చెల్లించింది.కాగా టీమిండియా జెర్సీ స్పాన్సర్ హక్కులు దక్కించుకునేందుకు కాన్వా, జేకే టైర్, బిర్లా ఓప్టస్ పెయింట్స్ వంటివి ఆసక్తి చూపగా.. అపోలో టైర్స్ తమ బిడ్‌ను ఖరారు చేసుకుంది. ఇదిలా ఉంటే.. అర్ధంతరంగా డ్రీమ్ 11 తప్పుకోవాల్సి రావడంతో టీమిండియా ఆసియా కప్-2025 టోర్నమెంట్లో జెర్సీ స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగిన విషయం తెలిసిందే.చదవండి: ఛీ.. మరీ సిగ్గు లేకుండా తయారయ్యారు.. ఇదేం పద్ధతి? -
నీ గర్ల్‌ఫ్రెండ్ నాలా ఉండాలని కోరుకోవా?.. ఆమెతో హార్దిక్ పాండ్యా డేటింగ్?
టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఆసియా కప్-2025 టోర్నమెంట్‌తో బిజీగా ఉన్నాడు. ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఈ ఆల్‌రౌండర్ ఇప్పటి వరకు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు.తొలుత యూఏఈతో మ్యాచ్‌లో వికెట్లు తీయలేకపోయిన హార్దిక్.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మాత్రం ఫర్వాలేదనిపించాడు. సయీమ్ ఆయుబ్ రూపంలో కీలక వికెట్ కూల్చి టీమిండియాకు బ్రేక్ ఇచ్చిన హార్దిక్.. సాహిబ్జదా ఫర్హాన్ (40), మొహమ్మద్ హ్యారిస్ (3) ఇచ్చిన క్యాచ్‌లు అందుకుని ఫీల్డర్‌గా తన వంతు పాత్ర పూర్తి చేశాడు.ఇక పాక్ విధించిన 128 పరుగుల లక్ష్య ఛేదనలో హార్దిక్ పాండ్యాకు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. ఇక ఆటతోనే కాకుండా వ్యక్తిగత విషయాలతోనూ హార్దిక్ ఇటీవలి కాలంలో వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రాక్టీస్ సమయంలో రూ. 22 కోట్ల ధర కలిగిన వాచ్ ధరించి హాట్ టాపిక్ అయ్యాడు.మూడుసార్లు పెళ్లితాజాగా హార్దిక్ పాండ్యా రిలేషన్‌షిప్‌నకు సంబంధించి మరో వార్త తెరమీదకు వచ్చింది. కాగా సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్‌ను ప్రేమించిన హార్దిక్.. ఆమెను పెళ్లాడాడు. వీరికి కుమారుడు అగస్త్య సంతానం. అయితే, కోవిడ్ సమయంలో ఘనంగా పెళ్లి చేసుకోలేకపోయామన్న లోటు లేకుండా.. ఆ తర్వాత హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో కుమారుడి ముందే ఈ జంట వివాహం చేసుకుంది.జాస్మిన్‌కు కూడా గుడ్‌బై?ఎంతో అన్యోన్యంగా ఉండే హార్దిక్- నటాషా విడాకులు తీసుకున్నామంటూ గతేడాది ప్రకటన విడుదల చేసి అభిమానులకు షాకిచ్చారు. ఆ తర్వాత నటాషా కొన్నాళ్లు సెర్బియా వెళ్లిపోగా.. ఇంతలో హార్దిక్.. సింగర్ జాస్మిన్ వాలియాతో ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరి సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా ఇవి నిజమేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అయితే, హార్దిక్ జాస్మిన్‌కు కూడా గుడ్‌బై చెప్పినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా అతడు మరో ముద్దుగుమ్మతో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహీక శర్మతో హార్దిక్ ప్రేమలో ఉన్నట్లు సమాచారం. పరస్పరం సోషల్ మీడియాలో ఫాలో కావడంతో పాటు.. మహీక ప్రతీసారి హార్దిక్‌కు సంబంధించిన హింట్ ఇచ్చేలా పోస్టులు పెట్టడం ఇందుకు ఊతమిచ్చింది.నీ గర్ల్‌ఫ్రెండ్ నాలా ఉండాలని కోరుకోవా?ఇక హార్దిక్ పాండ్యా తాజా ప్రేమాయణానికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్న వేళ.. అతడి మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ షేర్ చేసిన సాంగ్ క్లిప్ వైరల్ అవుతోంది. ‘‘నీ గర్ల్‌ఫ్రెండ్ నాలా హాట్‌గా ఉండాలని కోరుకోవా.. నీ గర్ల్‌ఫ్రెండ్ నాలా ఫ్రీక్‌గా ఉండాలని కోరుకోవా?’’ అంటూ సాగే లిరిక్స్‌కు పెదాలు కదుపుతూ నటాషా డాన్స్ చేయడం నెటిజన్లను ఆకర్షించింది. View this post on Instagram A post shared by @angreziedaaru -
‘అల్లుడు’ నీ పరుగులేం అక్కర్లేదు.. పాక్ ప్లేయర్‌పై అఫ్రిది ఫైర్
ఆసియాకప్-2025లో దుబాయ్ వేదికగా ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. అయితే ప్రస్తుతం అంతా పాక్ చెత్త ప్రదర్శన గురించి కాకుండా ఈ మ్యాచ్ అనంతరం చెలరేగిన హ్యాండ్ షేక్ వివాదం గురించే చర్చించుకుంటున్నారు.కానీ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మాత్రం తమ జట్టు చెత్త ఆటను మర్చిపోలేదు. తాజాగా ఓ టీవీ ఛానల్ డిబేట్లో పాల్గోన్న అఫ్రిది.. తన అల్లుడు షాహీన్ షా అఫ్రిదిని విమర్శించాడు. షాహీన్ షా అఫ్రిది బౌలింగ్‌లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.అఫ్రిది బౌలింగ్‌ను భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఉతికారేశాడు. కానీ బ్యాటింగ్‌లో మాత్రం అఫ్రిది మెరుపులు మెరిపించాడు. కేవలం 16 బంతుల్లో 33 పరుగులు చేసి పాక్ స్కోర్ 100 పరుగుల మార్కు దాటడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే షాహీన్ బ్యాట్‌తో కాకుండా బంతితో రాణించి ఉంటే బాగుండేదని షాహిద్ అఫ్రిది అన్నాడు."షాహీన్ బ్యాటింగ్‌లో కొన్ని పరుగులు చేశాడు. అతడి ఆడిన ఇన్నింగ్స్ ఫలితంగానే మా జట్టు స్కోర్ 100 పరుగులు దాటింది. అందుకు అతడికి ధన్యవాదాలు. కానీ షాహీన్ నుంచి నేను ఆశించింది పరుగులు కాదు. అతడు నుంచి మంచి బౌలింగ్ కావాలి. అలాగే అయుబ్ నుంచి నేను బౌలింగ్‌ను కోరుకోను.అతడు పరుగులు చేయాలి. జట్టులో అతడి పాత్ర ఎంటో షాహీన్ ఆర్ధం చేసుకోవాలి. కొత్త బంతిని స్వింగ్ చేసి, వికెట్లు సాధించేందుకు మార్గాలను అన్వేషించాలి. అతను తన గేమ్ ప్లాన్‌పై దృష్టి సారించాలి" అని సామా టీవీ ఇంటర్వ్యూలో అఫ్రిది పేర్కొన్నాడు -
ఛీ.. మరీ సిగ్గు లేకుండా తయారయ్యారు.. ఇదేం పద్ధతి?
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ (Atul Wassan) తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. మరీ సిగ్గు లేకుండా తయారయ్యారంటూ ఘాటు విమర్శలు చేశాడు. అసలేం జరిగిందంటే.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత టీమిండియా- పాకిస్తాన్ ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నీలో భాగంగా తొలిసారి ముఖాముఖి తలపడిన విషయం తెలిసిందే.మరోసారి జయభేరిదుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు పాక్‌పై ఆధిపత్యం కొనసాగిస్తూ మరోసారి జయభేరి మోగించింది. సల్మాన్ ఆఘా బృందాన్ని ఏడు వికెట్ల తేడాతో సూర్యకుమార్ సేన చిత్తు చేసింది. ఇదిలా ఉంటే.. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా.. భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో కరచాలనానికి నిరాకరించారు.రచ్చకెక్కిన పాక్ బోర్డుటాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాక్ సారథి సల్మాన్ ఆఘాను పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా భారత జట్టు ఇదే పంథా అనుసరించింది. పాక్ ప్లేయర్లు షేక్‌హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేసినట్లు కనిపించగా.. భారత ఆటగాళ్లు మాత్రం ఇందుకు విముఖత వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు రచ్చకెక్కింది. తమను అవమానించారని.. క్రీడాస్ఫూర్తికి ఇది విరుద్దమని గగ్గోలు పెడుతోంది. మ్యాచ్ రిఫరీపై వేటు వేయాలంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలికి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి.మరీ సిగ్గు లేకుండా తయారయ్యారుఈ విషయంపై భారత మాజీ పేసర్ అతుల్ వాసన్ ఘాటుగా స్పందించాడు. ‘‘ఛీ.. వాళ్లు మరీ సిగ్గు లేకుండా తయారయ్యారు. షేక్‌హ్యాండ్ ఇవ్వాలంటూ మనల్ని బలవంతపెట్టాలని చూస్తున్నారు. ఇదేం పద్ధతి?.. మీకు అవమానం జరిగిందని ప్రపంచం మొత్తానికి తెలిసింది.మీతో కరచాలనం చేసేందుకు మేము సిద్ధంగా లేమని స్పష్టంగా అర్థమైంది కదా!.. మరి ఇంకెందుకు కరచాలనం కావాలంటూ పట్టుబడుతున్నారు? ఈ విషయంపై ఫిర్యాదు చేయడం ద్వారా తమను తామే మరింతగా కించపరుచుకున్నట్లు అయింది. అందుకే మ్యాచ్ ఆడారుఇలా కంప్లైంట్ చేయడం ద్వారా తమకు పరిణతి లేదని వారే చెప్పినట్లుగా ఉంది. క్రీడా విధానానికి అనుగుణంగానే మనం ఆ మ్యాచ్ ఆడాము.అంతేగానీ.. వాళ్లు మన నుంచి ఇంతకంటే ఎక్కువగా ఆశించడం తప్పే అవుతుంది. ఎందుకంటే మీరంటే మాకు ఇష్టం లేదు’’ అంటూ అతుల్ వాసన్ వార్తా సంస్థ ANIతో తన మనసులోని భావాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశాడు.చదవండి: Asia Cup Handshake Controversy: హ్యాండ్ షేక్ వివాదం.. పాకిస్తాన్‌కు ఐసీసీ షాక్? -
'షేక్ హ్యాండ్’ వివాదంలో బిగ్ ట్విస్ట్.. అతడి తప్పేమీ లేదు?
ఆసియా కప్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అనంతరం ‘నో-షేక్ హ్యాండ్’ వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యుడిగా మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేయడంతో ఈ వివాదం మరింత రాజుకుంది.పాకిస్తాన్ జట్టు సభ్యులతో కరచాలనం చేయకూడదనే తమ నిర్ణయానికి భారత్ టాస్ నుంచి ఆట ముగిసే వరకు కట్టుబడి ఉంది. టాస్ సందర్భంగా ఆండీ పైక్రాప్ట్.. భారత సారధి సూర్యకుమార్ దగ్గరికి షేక్ హ్యాండ్ కోసం వెళ్లవద్దని పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాతో చెప్పాడు.ఇక్కడ నుంచే ఈ వివాదం మొదలైంది. దీంతో మ్యాచ్ రిఫరీ క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించాడని వెంటనే అతడిని ఆసియాకప్ నుంచి తప్పించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది.అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పుడు వరకు ఇండియన్ టీమ్ మెనెజ్‌మెంట్ సూచన మేరకే పై క్రాప్ట్.. నో షేక్ హ్యాండ్ కోసం అఘాకు చెప్పాడని అంతా అనుకున్నారు. కానీ టైమ్స్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. పీసీబీ ఛీఫ్ మొహ్సిన్ నఖ్వీ హెడ్‌గా ఉన్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ సూచనల మేరకే పై క్రాప్ట్ నో షేక్ హ్యాండ్ గురించి సల్మాన్ అఘాకు తెలియజేశాడంట."హ్యాండ్ షేక్ వివాదంతో ఐసీసీకి సంబంధం ఏంటి? మ్యాచ్ అధికారులను నియమించడంతో ఐసీసీ పాత్ర ముగిస్తోంది. ఆ తర్వాత అంతా ఏసియన్ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఏసీసీ నుంచి ఒకరు పైక్రాఫ్ట్‌తో మాట్లాడారు.దాని ఫలితమే టాస్ వద్ద మనం చూశాము. పైక్రాప్ట్తో ఎవరు మట్లాడారు..? దేని గురించి చర్చించారో తెలుసుకోవాల్సి బాధ్యత ఏసీసీ చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీపై ఉంది. అంతే తప్ప ఈ వివాదాన్ని మరింత తీవ్రం చేస్తూ ఐసీసీ వైపు వేలు చూపిస్తే ఫలితం ఉండదు అని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి.చదవండి: సూర్య గ్రేట్.. మా ఐన్‌స్టీన్ మాత్రం తొలుత బ్యాటింగ్ తీసుకున్నాడు: షోయబ్ అక్తర్ -
మా ఐన్‌స్టీన్ మాత్రం తొలుత బ్యాటింగ్ తీసుకున్నాడు: షోయబ్ అక్తర్
ఆసియాకప్-2025లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. బౌలింగ్, బ్యాటింగ్‌లో దుమ్ములేపిన టీమిండియా దాయాది పాక్‌ను చావుదెబ్బ కొట్టింది. అయితే భారత్ చేతిలో ఓటమిని పాక్ మాజీ క్రికెటర్లు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.అంతేకాకుండా మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ప్లేయర్లతో కరచాలనం చేసేందుకు నిరాకరించారు. ఒకవైపు ఓటమి, మరోవైపు భారత్ చేసిన పనికి పాక్ మాజీ ఆటగాళ్లు ఘోర అవమానంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాపై ఆ జట్టు మాజీ స్పీడ్ స్టార్ షోయబ్ అక్తర్ విమర్శల వర్షం కురిపించాడు. సల్మాన్ తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడాన్ని అక్తర్ తప్పుబట్టాడు."టాస్ సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పిచ్ రిపోర్ట్ మొత్తం చెప్పాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉండే అవకాశముందని, పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని అతడు అంచనా వేశాడు. మా బ్యాటింగ్ లైనప్ చాలా డెప్త్‌గా ఉంది.మేం మొదట బౌలింగే చేయాలనుకున్నాం అని సూర్య స్పష్టంగా చెప్పాడు. కానీ మా ఐన్‌స్టీన్ (సల్మాన్ అలీ ఆఘా) మాత్రం పిచ్ గురించి ఏమీ తెలుసుకోకుండానే మేం మొదట బ్యాటింగ్ చేస్తాం అన్నాడు. అందుకు తగ్గ మూల్యం పాక్ చెల్లించుకుందని" అక్తర్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.అదేవిధంగా భారత్ ఆటగాళ్లు హ్యాండ్ షేక్ ఇవ్వడంపై కూడా అక్తర్ స్పందించాడు. "నాకు మాటలు రావడం లేదు. చాలా బాధగా ఉంది. గెలిచిన టీమిండియాకు శుభాకాంక్షలు. కానీ మీరు క్రికెట్ మ్యాచ్‌ను రాజకీయాల నుంచి వేరుగా ఉంచండి. మీ గురించి మేము ఎన్నో గొప్ప విషయాలు చెప్పాము. మేము ఈ నో షేక్ హ్యాండ్ చర్య గురించి మాట్లాడొచ్చు. ప్రతి ఇంట్లోనూ గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ వాటిని మరచిపోయి ముందుకు సాగిపోవాలి" అని అక్తర్ అన్నాడు.చదవండి: పాకిస్తాన్‌తో ఆడితే తప్పు కాదా? షేక్ హ్యాండ్ ఇస్తేనే తప్పా?: మనోజ్ తివారీ -
పాకిస్తాన్‌తో ఆడితే తప్పు కాదా? షేక్ హ్యాండ్ ఇస్తేనే తప్పా?: మనోజ్ తివారీ
ఆసియాకప్-2025లో పాకిస్తాన్ జట్టుతో సంప్రదాయ కరచాలనాన్ని టీమిండియా ఆటగాళ్లు తిరష్కరించిన సంగతి తెలిసిందే. ఈ ఖండాంతర టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్ధులు మధ్య పోరు జరిగింది. అయితే ఈ మ్యాచ్ టాస్ దగ్గర నుంచి ఆట ముగిసే వరకు భారత జట్టు పాకిస్తాన్ ఆటగాళ్లతో అంటిముట్టనట్టు ఉన్నారు.తొలుత టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించాడు. అనంతరం మ్యాచ్ ముగిశాక కూడా కరచాలనం చేసేందుకు భారత జట్టు ఇష్టపడలేదు. దీంతో భారత జట్టు తీసుకున్న ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.కానీ భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ మాత్రం టీమిండియా మెనెజ్‌మెంట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. పాకిస్తాన్‌తో ఆడాలని నిర్ణయించుకున్నప్పుడు, షేక్ హ్యాండ్ ఇస్తే తప్పు ఏముందని తివారీ అన్నాడు. అయితే పాకిస్తాన్ మ్యాచ్‌తో భారత్ బహిష్కరించాలని తివారీ ముందే నుంచే తన వాదన వినిపిస్తూ వస్తున్నాడు."నేను భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌తో ఆసియాకప్ మొత్తాన్ని బాయ్‌కట్ చేస్తున్నాను. ఎందుకంటే క్రికెట్ అనేది కేవలం ఒక క్రీడ మాత్రమే. క్రీడలకు ఇచ్చిన విలువ జీవితాలకు ఇవ్వడం లేదు. ఇది నాకు నచ్చడం లేదు. మనం మానవ జీవితాలను క్రీడలతో పోల్చడం సరి కాదు" అని పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు తివారీ స్టెట్మెంట్ ఇచ్చాడు.ఇప్పుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. "పాక్ ఆటగాళ్లతో హ్యాండ్ షేక్‌ను తిరష్కరించడం సరైన నిర్ణయం కాదు. మీరు పాకిస్తాన్‌తో ఆడాలని నిర్ణయించుకున్నప్పుడు.. హ్యాండ్ షేక్ చేస్తే తప్పు ఏముంది. పాక్‌తో మ్యాచ్‌ను బహిష్కరించి మీరు ఏది చెప్పినా ప్రజులు నమ్మేవారు.ఈ టోర్నీ ఆరంభానికి ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సూర్యకుమార్ యాదవ్.. పాకిస్తాన్ కెప్టెన్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ వీడియోను నేను చూశాను. మరి అప్పుడు ఎలా కరచాలనం చేశారు. ఆ సమయంలో మీకు తప్పు అన్పించలేదా? అంటే ఇప్పుడు విమర్శకుల నుంచి తప్పించుకోవడం కోసం నో హ్యాండ్ షేక్ నిర్ణయం తీసుకున్నారా? ముందే వారి కెప్టెన్, చైర్మెన్‌కు హ్యాండ్ షేక్ ఇచ్చి ఇప్పుడు మ్యాచ్‌లో తిరష్కరించి ఏమి సాధించారో నాకు ఆర్ధం కావడం లేదు. విమర్శకుల నుంచి తామును తాము రక్షించుకోవడానికే ఈ విజయాన్ని పహల్గామ్ బాధితులకు, భారత సాయుధ దళాలకు అంకితం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు" అని ఇన్సైడ్ స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తివారీ పేర్కొన్నాడు.చదవండి: Asia Cup Handshake Controversy: హ్యాండ్ షేక్ వివాదం.. పాకిస్తాన్‌కు ఐసీసీ షాక్? -
సూపర్-4కు అర్హత సాధించిన భారత్.. పాకిస్తాన్ మరి?
ఆసియాకప్ 2025లో గ్రూపు-ఎ నుంచి భారత క్రికెట్ జట్టు సూపర్-4కు అర్హత సాధించింది. ఈ మెగా టోర్నీ గ్రూపు-ఎలో భాగంగా సోమవారం అబుదాబి వేదికగా యూఏఈ, ఒమన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఒమన్‌ను 42 పరుగుల తేడాతో యూఏఈ చిత్తు చేసింది.దీంతో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఓటమి పాలైన ఒమన్ టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. ఇదే సమయంలో వరుసగా రెండు మ్యాచ్‌లలో గెలిచి టేబుల్ టాపర్‌గా కొనసాగుతున్న సూపర్ ఫోర్కు క్వాలిఫై అయిన తొలి జట్టుగా నిలిచింది.రెండో జట్టు ఏది?ఇక గ్రూపు-ఎ నుంచి సూపర్ ఫోర్ రౌండ్‌కు అర్హత సాధించేందుకు పాకిస్తాన్, యూఏఈ జట్లు పోటీపడుతున్నాయి. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో భారత్, పాకిస్తాన్, యూఏఈ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. సెప్టెంబర్ 17న దుబాయ్ వేదికగా యూఏఈ-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు భారత్‌తో పాటు సూపర్-4లో అడుగు పెడుతోంది. బుధవారం జరిగే మ్యాచ్‌లో యూఏఈను ఓడించడం పాక్‌కు అంత సులువు కాదు.ఈ టోర్నీకి ముందు జరిగిన ట్రైసిరీస్‌లో కూడా పాక్‌కు యూఏఈ గట్టి పోటీ ఇచ్చింది. ఇప్పుడు ఆసియాకప్‌లోనూ అదే పట్టుదలతో పాక్‌ను ఢీకొట్టేందుకు ఆతిథ్య యూఏఈ సిద్దమైంది. పాకిస్తాన్ ఎప్పుడూ ఎలా ఆడుతుందో ఎవరూ ఊహించలేరు. పాకిస్తాన్ జట్టు జింబాబ్వే వంటి పసికూన చేతిలో కూడా ఓడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ రెండు జట్లలో ఎవరూ సూపర్-4కు వస్తారన్నది ముందే అంచనా వేయడం కష్టమనే చెప్పాలి. మరోవైపు భారత ఆటగాళ్లు తమకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో పాకిస్తాన్ ఘోర అవమానంగా ఫీల్ అవుతోంది. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని పీసీబీ డిమాండ్ చేస్తోంది. ఐసీసీ చర్యలు తీసుకోపోతే యూఏఈతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామని పాకిస్తాన్ క్రికెట్ బెదరిస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే యూఏఈ సూపర్-4కు ఆర్హత సాధిస్తోంది.చదవండి: Asia cup 2025: హ్యాండ్ షేక్ వివాదం.. పాకిస్తాన్‌కు ఐసీసీ షాక్? -
సూర్య బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయిందిగా.. దేవిషాతో కలిసి సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
హ్యాండ్ షేక్ వివాదం.. పాకిస్తాన్‌కు ఐసీసీ షాక్?
ఆసియాకప్-2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత హ్యాండ్ షేక్ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లతో భారత ప్లేయర్లు కరచాలనం చేసేందుకు నిరాకరించారు. పెహల్గమ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ వంటి పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడడటంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలోనే బీసీసీఐ సూచన మేరకు నో హ్యాండ్‌షేక్ విధానాన్ని భారత్ అనుసరించినట్లు తెలుస్తోంది. ఇందుకు నిరసనగా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్కు హాజరకాలేదు. అదేవిధంగా భారత ఆటగాళ్లు పరస్పర కరచాలనం తిరస్కరించడంపై పాకిస్తాన్ అగ్గిమీద గుగ్గిలమవుతోంది.ఈ ఘటనపై పీసీబీ ఐసీసీకి,ఏసీసీకి ఫిర్యాదు చేసింది. భారత్, పాక్ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్‌ను ఆసియాకప్ 2025 నుంచి వెంటనే తొలగించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేసింది. 'నో హ్యాండ్‌షేక్' గురుంచి పైక్రాఫ్ట్‌కు ముందే తెలుసు అని పీసీబీ ఆరోపిస్తుంది. పైక్రాఫ్ట్ టాస్ సందర్బంగా ఈ విషయాన్ని తమ కెప్టెన్‌కు తెలియజేశాడని, కానీ మ్యాచ్ అనంతరం కూడా ఇదే విధానం కొనసాగుతుందని ఆయన చెప్పలేదని పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ఉల్లంఘన జరిగింది. మ్యాచ్ రిఫరీపై చర్య తీసుకోవాలి పాక్ క్రికెట్ ఐసీసీని అభ్యర్దించింది. ఒకవేళ ఐసీసీ చర్యలు తీసుకోపోతే యూఏఈతో జరిగే తమ తదుపరి మ్యాచ్‌ను బహష్కిరిస్తామని పీసీబీ బెదరింపులకు దిగింది.పీసీబీకి షాక్..?అయితే ఆసియా కప్ మ్యాచ్ రిఫరీల ప్యానెల్ నుండి ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని పీసీబీ చేసిన అభ్యర్థనను ఐసీసీ తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. క్రిక్‌బజ్ ప్రకారం.. పీసీబీ వాదనతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఏకీభవించకపోయినట్లు సమాచారం.ఈ ఘటనతో పైక్రాఫ్ట్‌కు సంబంధం లేదని పీసీబీకి ఐసీసీ తెలియజేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా ఆటగాళ్లు తప్పనిసరిగా హ్యాండ్ షేక్ ఇవ్వాలని ఎంసీసీ మాన్యువల్‌లో లేదు అని ఐసీసీ ప్రతినిథులు పీసీబీ చీఫ్‌కు మెయిల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఐసీసీ అధికారికంగా స్పందించాల్సిన అవసరముంది.చదవండి: PKL 12: ఉత్కంఠపోరులో తెలుగు టైటాన్స్ ఓటమి.. -
Asia Cup 2025: ‘చేయి’ కలపలేదని...
దుబాయ్: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నిలో భారత్, పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఫలితం ఏకపక్షంగా ముగిసింది. చెత్తగా ఆడిన పాకిస్తాన్ తమ ఆటతీరును విశ్లేషించు కోవాల్సిందిపోయి ఇరు జట్ల ఆటగాళ్లు ‘షేక్ హ్యాండ్’ ఇచ్చుకోలేదనే అంశంపై వివాదాన్ని రాజేస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) దీనిపైనే దృష్టి పెట్టినట్లుంది. ఫిర్యాదులు, చర్యలు చేపట్టాలంటూ తెగ హడావుడి చేస్తోంది. కానీ కరచాలనం తిరస్కరణ కొత్తదేమీ కాదు. టెన్నిస్‌లో, ఫుట్‌బాల్‌లోనూ ఉద్రిక్తతలు, రాజకీయ వైరం కారణంగా ఆయా దేశాలకు చెందిన ప్లేయర్లు ఎన్నోసార్లు ‘షేక్ హ్యాండ్’ ఇచ్చుకోలేదు. దీనిపై టెన్నిస్ ఇంటిగ్రిటీ గానీ, ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిపా) గానీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ పీసీబీ మాత్రం నానా యాగీ చేస్తోంది. మ్యాచ్ రిఫరీని తొలగించండి మ్యాచ్ ముగిసిన తర్వాత తమ జట్టు ఆటగాళ్లతో టీమిండియా క్రికెటర్లు పరస్పర కరచాలనం తిరస్కరించడంపై పీసీబీ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఆదివారం నాటి లీగ్ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన అండీ పైక్రాఫ్ట్‌ను తక్షణమే తొలగించాలని ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ)కి ఫిర్యాదు చేసింది. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జోక్యం చేసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. ఎందుకంటే ఏసీసీ చీఫ్‌గా పీసీబీ అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ ఉంటే, ఐసీసీ చీఫ్‌గా భారత్‌కు చెందిన జై షా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై ఎవరెలా స్పందిస్తారోనన్నది, ఎలా ముగింపు పలుకుతారో అన్నది ఆసక్తికరంగా మారింది. ‘మ్యాచ్ రిఫరీపై ఐసీసీకి ఫిర్యాదు చేశాం. ఐసీసీ నియమావళి, ఎంసీసీ చట్టాలు, క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధంగా మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ వ్యవహరించారు. దీన్ని తీవ్రంగా పరిగణించి వెంటనే ఆయన్ని ఆసియా కప్ నుంచి తొలగించాలని పీసీబీ డిమాండ్ చేస్తోంది’ అని ఏసీసీ చీఫ్ కూడా అయిన నఖ్వీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. టాస్ వేసే సమయంలోనే భారత కెపె్టన్ సూర్యకుమార్‌తో షేక్‌హ్యాండ్ చేయొద్దని పాక్ కెపె్టన్ సల్మాన్ అగాతో రిఫరీ పైక్రాఫ్ట్ చెప్పారని పీసీబీ పేర్కొంది. టీమ్ షీట్ల మారి్పడి సజావుగా జరగలేదని పాకిస్తన్ జట్టు మేనేజర్ నవిద్ చిమా కూడా ఏసీసీకి ఫిర్యాదు చేశారు. షీమ్ షీట్లను ఇద్దరు కెపె్టన్లు మార్చుకోవడం సహజం. కానీ ఈ సారి టీమ్ షీట్లను కెపె్టన్ల నుంచి రిఫరీ తీసుకున్నారు. తెలుసా... ఆతిథ్య హక్కులు దక్కవు!పాక్‌తో క్రికెట్ మ్యాచ్‌లు ఆడొద్దు, ఇకపై జరగొద్దు అని భారత్‌లో చాలా మంది విమర్శలు చేస్తున్నారు. కానీ బహుళ జట్లు బరిలో ఉండే ఈవెంట్లలో తప్పుకుంటే ప్రతిష్టాత్మక మెగా ఈవెంట్ ఆతిథ్య హక్కులు పొందే అవకాశాలు రావు. ఎందుకంటే ప్రస్తుతం క్రికెట్ ఇప్పుడు ఒలింపిక్ చార్టర్లో భాగమైంది. లాస్ ఏంజెలిస్–2028 ఒలింపిక్స్‌లో నిర్వహణకు సిద్ధమైంది. ఇక భారత్ 2030 కామన్వెల్త్ క్రీడలు, 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం పోటీపడాలనుకుంటుంది. ఇలాంటి సమయంలో పాక్‌తో ఆడం, మ్యాచ్‌లను బహిష్కరిస్తామంటే ఆతిథ్య ఆశలు, అవకాశాలు అడుగంటుతాయి.గతంలో... టెన్నిస్‌లో...ఇప్పుడు ఆసియా కప్ క్రికెట్లో షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడం వివాదాస్పదం చేస్తున్నారు కానీ... ఇలా జరగడం క్రీడల్లో ఇదేమీ మొదటిసారి కాదు. 2023లో ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నిలో ఉక్రెయిన్‌కు చెందిన స్వితోలినా, బెలారస్ ప్లేయర్ విక్టోరియా అజరెంకా మ్యాచ్ అనంతరం షేక్‌హ్యాండ్ ఇచ్చుకోలేదు. వింబుల్డన్ నిర్వాహక కమిటీ స్వితోలినాపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ అంశాన్ని అసలు పట్టించుకోనేలేదు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంలో బెలారస్ అండగా నిలవడమే ఈ వైఖరికి కారణం కాగా... ఇప్పటికీ కూడా పలువురు ఉక్రెయిన్ ప్లేయర్లతో... బెలారస్, రష్యా ప్లేయర్లు కరచాలనం చేయడం లేదు. అమెరికా, ఇరాన్ దేశాల వైరం కారణంగా ఫుట్‌బాల్‌లో ఇరుజట్లు తలపడినపుడు కూడా ఆటగాళ్ల మధ్య షేక్‌హ్యాండ్స్ కనిపించవు. అదేమీ నిబంధన కాదు... రూల్ బుక్ చూస్కోండి పహల్గాంలో పాక్ ఉగ్రమూకల ఊచకోతకు గురైన కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు పాకిస్తానీ క్రికెటర్లతో పరస్పరం చేయి కలపకూడదని జట్టు మేనేజ్మెంట్ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఇది కోచ్ గంభీర్దో లేదంటే కెపె్టన్ సూర్యకుమార్ నిర్ణయం కానేకాదని జట్టు వర్గాలు స్పష్టం చేశాయి. దాయాది క్రికెటర్ల షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సమర్థించుకుంది. ‘ప్రత్యర్థి ఆటగాళ్లతో కరచాలనం ఇవ్వాలనే నిబంధనేది రూల్ బుక్‌లో లేదు. ఇది పూర్తిగా గుడ్‌విల్‌తో ముడిపడిన స్నేహపూర్వక అంశమే! అంతేకానీ చట్టం అయితే కాదు. కాబట్టి కచ్చితంగా షేక్‌హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరమైతే లేదు’ అని బోర్డు సీనియర్ అధికారి ఒకరు స్పష్టత ఇచ్చారు. -
Asia Cup 2025: బోణీ కొట్టిన యూఏఈ
ఆసియా కప్-2025లొ ఆతిథ్య యూఏఈ బోణీ కొట్టింది. ఇవాల్టి సాయంత్రం మ్యాచ్‌లో ఒమన్‌పై 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసి, ఆతర్వాత లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచి మూడో స్థానానికి ఎగబాకింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఒమన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.పూర్తి వివరాల్లో వెళితే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. ఓపెనర్లు ముహమ్మద్ వసీం (54 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 69 పరుగులు), అలీషాన్ షరాఫు (38 బంతుల్లో 51; 7 ఫోర్లు, సిక్స్) అర్ద సెంచరీతో రాణించడంతో మంచి స్కోర్ చేసింది. ఆరంభంలో ధాటిగా ఆడి 200 స్కోర్ దిశగా పయనించిన యూఏఈ.. ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. ఆసిఫ్ ఖాన్ (2), వికెట్ కీపర్ రాహుల్ చోప్రా (0) నిరాశపర్చగా.. ముహమ్మద్ జోహైబ్ (21), హర్షిత్ కౌశిక్ (19 నాటౌట్) తేలికపాటి మెరుపులు మెరిపించారు. ఒమన్ బౌలర్లలో జితేన్ రామనంది 2, హస్నైన్ షా, సమయ్ శ్రీవాత్సవ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన ఒమన్ ఆది నుంచే తడబడుతూ వచ్చింది. 50 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఆ దశలోనే మ్యాచ్‌పై ఆశలు వదులుకుంది. ఆర్యన్ బిస్త్ (24), వినాయక్ శుక్లా (20), రామనంది (13) కొద్ది సేపు ఓటమిని వాయిదా వేయగలిగారు. 18.4 ఓవర్లలో ఆ జట్టు 130 పరుగులకే కుప్పకూలింది. జునైద్ సిద్దిఖీ 4 వికెట్లు తీసి ఒమన్‌ను దెబ్బకొట్టాడు. హైదర్ అలీ, ముహమ్మద్ జవాదుల్లా తలో 2, రోహిద్ ఖాన్ ఓ వికెట్ తీశారు. యూఏఈ తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో (సెప్టెంబర్ 17) తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆ జట్టుకు సూపర్ 4 అవకాశాలు ఉంటాయి. -
హ్యాండ్ షేక్ వివాదంలో అనూహ్య పరిణామం
భారత్-పాక్ ఆటగాళ్ల హ్యాండ్ షేక్ వివాదంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విషయాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడని సొంత అధికారినే సస్పెండ్ చేసింది. జట్టు క్రికెట్ ఆపరేషన్ష్ డైరెక్టర్ ఉస్మాన్ వాహ్లాపై పీసీబీ సస్పెన్షన్ వేటు వేసింది. అధ్యక్షుడు నఖ్వీ బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించి వాహ్లాను ఫైర్ చేశాడని తెలుస్తుంది.ఈ విషయాన్ని హ్యాండిల్ చేసే విషయంలో వాహ్లా నుంచి ఎక్కువగా ఆశించాము. అయితే అతను నిరాశపరిచాడు. వాహ్లా కారణంగా భారత్ ముందు పాక్ పరువు పోయింది. టాస్కు ముందే మ్యాచ్ రిఫరీ కరచాలనం విషయాన్ని ప్రస్తావించినా, వాహ్లా పరిస్థితిని నియంత్రించడంలో విఫలమయ్యాడని నఖ్వీ అన్నట్లు సమాచారం.కాగా, ఆసియా కప్‌లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వని విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ఆటగాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. సూపర్-4 దశ మ్యాచ్‌లోనూ భారత ఆటగాళ్లు నో హ్యాండ్‌షేక్ పాలసీని కొనసాగించనున్నట్లు తెలుస్తుంది.ఈ విషయంపై పీసీబీ ఇప్పటికే నానా యాగీ చేస్తుంది. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అలాగే మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్ విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. భారత ఆటగాళ్లు క్రీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించారని, ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనకు పాల్పడ్డారని వారికి తగని నీతులు చెబుతుంది.ఐసీసీ తమ డిమాండ్లను పరిష్కరించకపోతే యూఏఈతో తదుపరి జరుగబోయే మ్యాచ్‌ను బహిష్కరిస్తామని బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఐసీసీ మాత్రం ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం అన్నది ఆటగాళ్ల వ్యక్తిగతం అంశమని లైట్ తీసుకుంది. పీసీబీ మాత్రం భారత్ ముందు తమ పరువు పోయిందని ఐసీసీ ముందు గగ్గోలు పెడుతుంది. -
హ్యాండ్ షేక్ వివాదం.. భారత్‌కు ఫైన్ పడుతుందా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
ఆసియాకప్-2025 గ్రూపు-ఎలో భాగంగా ఆదివారం భారత్-పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పాక్‌ను 7 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం కంటే హ్యాండ్‌షేక్ వివాదమే ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసన తెలిపింది.టాస్ దగ్గర నుంచి మ్యాచ్ పూర్తి అయ్యేంతవరకు పాక్ ఆటగాళ్లను టీమిండియా కనీసం పట్టించుకోలేదు. గతంలో ఇరు జట్లు తలపడినప్పుడు ఆటగాళ్లు ఒకరొకరు పలకరించుకునేవారు. కానీ ఈసారి కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. మైదానంలోకి వచ్చామా, గెలిచి వెళ్లామా అన్నట్లు భారత జట్టు తమ వైఖరిని కనబరిచింది.తొలుత టాస్ సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘాతో కరచాలనం చేసేందుకు నిరాకరించాడు. కనీసం అతడి ముఖం కూడా చూడకుండా సూర్య డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. ఇదంతా ముందుస్తు ప్రణాళికలో భాగంగానే జరిగింది.ఆ తర్వాత మ్యాచ్ ముగిశాక కూడా పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు భారత జట్టు నిరాకరించింది. అంతేకాకుండా పాక్ ప్లేయర్లు టీమిండియా డ్రెసింగ్‌రూమ్ వైపు వెళ్లగా.. సహాయక సిబ్బంది తలుపు మూసేసినట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ టీమ్ అసహననానికి లోనైంది. ఫలితంగా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సెర్మనీని సల్మాన్ ఆఘా బహిష్కరించాడు. ఆ తర్వాత విలేకరుల సమావేశంలో పాల్గోన్న పాక్ హెడ్ కోచ్ మైక్ హసన్ భారత ఆటగాళ్లు తమ పట్ల వ్యవహరించిన తీరు బాధ కలిగించందని చెప్పుకొచ్చాడు.ఈ హ్యాండ్ షేక్ వివాదంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సైతం స్పందించింది. "భారత ఆటగాళ్లు కరచాలనం చేయకపోవడం పట్ల జట్టు మేనేజర్ నవీద్ చీమా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది క్రీడా స్పూర్తికి విరుద్దం. నిరసనలో భాగంగా తమ కెప్టెన్‌ను పోస్టు మ్యాచ్ సెర్మనీకి పంపలేదని" పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ హ్యాండ్ షేక్ వివాదంపై ఏసీసీకి, ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు పీసీబీ సిద్దమైనట్లు సమాచారం. అంతేకాకుండా ఐసీసీ చర్యలు తీసుకుపోతే యూఏఈతో తమ తదుపరి మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పీసీబీ బెదిరిస్తోంది.ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టుపై ఐసీసీ చర్యలు తీసుకుంటుందా? అసలు రూల్స్ ఏమి చెబుతున్నాయి? అన్న విషయాలను ఓసారి తెలుసుకుందాం. ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయి?ఆసియాకప్‌ను ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహిస్తున్నప్పటికి.. ఈ టోర్నీపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు పూర్తి అధికారం ఉంటుంది. ఈ టోర్నీలో పాల్గోనే జట్లు, ఆటగాళ్లకు ఐసీసీ ప్రవర్తనా నియమావళి వర్తిస్తుంది. ఐసీసీ ఎల్లప్పుడూ క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహిస్తుంది.ఆటగాళ్లు తమ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఐసీసీ కచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. కానీ మ్యాచ్ ముగిశాక ఇరు జట్ల ఆటగాళ్లు తప్పనిసరిగా షేక్ హ్యాండ్ ఇవ్వాలనే నిబంధన ఐసీసీ రూల్స్ బుక్‌లో ఎక్కడా లేదు. షేక్ హ్యాండ్ అనేది క్రీడా స్ఫూర్తికి చిహ్నంగా మాత్రమే పరిగణిస్తారు. అదేమి ఖచ్చితమైన రూల్ కాదు. కరచాలనం చేయాలా వద్దా అన్నది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఐసీసీ రూల్ బుక్ ముందు మాటలో ఆటగాళ్లు.. సహచరులను, మ్యాచ్ అధికారులను, అంపైర్లను గౌరవించడం గురుంచి ఉంటుంది. అంతే తప్ప షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం నేరమని ఐసీసీ తమ రూల్స్‌లో ఎక్కడా ప్రస్తావించలేదు.ఒకవేళ ఆటగాళ్లతో దురుసగా ప్రవర్తించి కరచాలనం చేయకపోతే దాన్ని ఐసీసీ నేరంగా పరిగణిస్తోంది. కానీ ఈ సందర్భంలో టీమిండియా ఆటగాళ్లు ప్రత్యర్థులను ఏ మాత్రం రెచ్చ గొట్టేలా ప్రవర్తించలేదు. దీంతో భారత జట్టుకు ఐసీసీ ఎటువంటి జరిమానా విధించే అవకాశం లేదు.బీసీసీఐ స్పందన ఇదే..ఈ విషయంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు స్పందించారు. "మీకు ఏదైనా సందేహం ఉంటే ఒక్కసారి రూల్ బుక్‌ను చదవండి. అందులో ఎక్కడ కూడా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు కరచాలనం ఇవ్వాలని ప్రత్యేకంగా ఏమీలేదు. అది కేవలం మర్యాదపూర్వకమైన సంజ్ఞ మాత్రమే. షేక్ హ్యాండ్స్ ఇవ్వాలా లేదా అన్నది వారి సొంత నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప ప్రత్యేకంగా చట్టం ఏమీ లేదు. కాబట్టి ఇండియన్ క్రికెట్ టీమ్ ప్రత్యర్థి జట్టుతో కరచాలనం చేయకపోయిన అదేమి పెద్ద నేరం కాదు" అని సదరు అధికారి పీటీఐతో పేర్కొన్నారు. -
Asia Cup 2025: రషీద్ ఖాన్ సేనకు భారీ ఎదురుదెబ్బ
ఆసియా కప్ 2025లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆఫ్ఘనిస్తాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్‌తో రేపు (సెప్టెంబర్ 16) జరుగబోయే కీలక మ్యాచ్‌కు ముందు స్టార్ పేసర్ నవీన్ ఉల్ హక్ గాయపడ్డాడు. గత కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్న నవీన్ ఆసియా కప్ మొత్తానికే దూరమయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు నవీన్‌కు ప్రత్యామ్నాయంగా అహ్మదుల్లా అహ్మద్జాయ్ను ప్రకటించింది. ఇదివరకే రిజర్వ్ ప్లేయర్ల జాబితాలో ఉండిన అహ్మద్జాయ్ మెయిన్ జట్టులోకి ప్రమోట్ అయ్యాడు.కాగా, ఆసియా కప్‌ను ఆఫ్ఘనిస్తాన్ గెలుపుతో బోణీ కొట్టింది. టోర్నీ ఓపెనర్‌లో హాంగ్‌కాంగ్‌పై 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రేపు బంగ్లాదేశ్‌తో జరుగబోయే మ్యాచ్ గెలిస్తే ఆఫ్ఘనిస్తాన్ సూపర్-4 దశకు చేరుకుంటుంది. ఈ టోర్నీలో ఆఫ్గన్లు.. శ్రీలంక, బంగ్లాదేశ్, హాంగ్‌కాంగ్‌తో పాటు గ్రూప్-బిలో ఉన్నారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తానే గ్రూప్-బి టాపర్‌గా ఉంది. ఆ జట్టు అద్భుతమైన రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉంది. శ్రీలంక, బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. హాంగ్‌కాంగ్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడి చిట్టచివరి స్థానంలో ఉంది.గ్రూప్-ఏ విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో భారత్, పాక్, ఒమన్, యూఏఈ జట్లు ఉన్నాయి. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్ ఈ గ్రూప్ టాపర్‌గా ఉంది. పాకిస్తాన్, ఒమన్, యూఏఈ ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నిన్న జరిగిన మ్యాచ్‌లో భారత్ పాక్‌ను చిత్తుగా ఓడించింది. టోర్నీలో ఇవాళ రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. యూఏఈ, ఒమన్ మధ్య మ్యాచ్ 5:30 గంటలకు మొదలైంది. రాత్రి 8 గంటలకు శ్రీలంక, హాంగ్‌కాంగ్ మ్యాచ్ జరుగుతుంది. -
ఐసీసీకి పాక్ బెదిరింపులు.. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోకపోతే..!
ఆసియా కప్ 2025లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 14) జరిగిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ వివాదాస్పదంగా మారింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు పాక్ జాతీయ గీతానికి బదులు 'జిలేబీ బేబీ' పాట ప్లే చేశారు. ఇది ఓ రకమైన గందరగోళాన్ని సృష్టించింది.టాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాక్ సారధి సల్మాన్ అఘాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత్ ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు.మ్యాచ్ అనంతరం కూడా భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు హ్యాండ్‌షేక్ ఇవ్వకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయారు. భారత ఆటగాళ్లు తమ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ నిరాకరించడాన్ని పాక్ క్రికెట్ బోర్డు చాలా సీరియస్‌గా తీసుకుంది.ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లి భారత ఆటగాళ్లపై, మ్యాచ్ రిఫరి ఆండీ పైక్రాఫ్ట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. భారత ఆటగాళ్లు క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించారని, వారికి పైక్రాఫ్ట్ వంత పాడాడని ఆరోపిస్తుంది.యూఏఈతో తదుపరి మ్యాచ్ సమయానికి (సెప్టెంబర్ 17) తమ డిమాండ్లకు పరిష్కారం చూపకపోతే ఆ మ్యాచ్‌ను బహిష్కరిస్తామని ఐసీసీకి ధమ్కీ ఇచ్చింది. పీసీబీ బహిష్కరణ బెదిరింపుతో షేక్ హ్యాండ్ ఉదంతం తీవ్ర రూపం దాల్చినట్లైంది.భారత ఆటగాళ్లు క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించడమే కాకుండా ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనకు కూడా పాల్పడిందని పీసీబీ గగ్గోలు పెడుతుంది. తాజాగా యూఏఈతో మ్యాచ్ రద్దు చేసుకుంటామని కొత్త పాట మొదలుపెట్టింది.మొత్తంగా ఈ వివాదం ఎలాంటి ఉద్రిక్తతలకు దారి తీస్తుందోనని క్రీడాభిమానులు భయపడుతున్నారు. కాగా, నిన్నటి మ్యాచ్‌లో భారత్ పాకిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో పాక్ తొలుత బ్యాటింగ్ చేసి 127 పరుగులకే పరిమితం కాగా.. భారత్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. -
'అలా ఎక్కడా రాసి లేదు'.. షేక్హ్యాండ్పై పాక్‌కు బీసీసీఐ స్ట్రాంగ్ కౌంటర్
ఆసియాకప్-2025లో ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో టీమిండియా విజయభేరి మ్రోగించింది. అయితే ఈ మ్యాచ్ టాస్ సందర్భంగా గానీ, ఆట ముగిశాక కానీ భారత జట్టు ఆటగాళ్లు పాకిస్తాన్ ప్లేయర్లతో కరచాలనం చేసేందుకు ఇష్టపడలేదు. ఎటువంటి కరచాలనాలు, పలకరింపులు లేకుండా తమ పని తాము చేసుకుని మైదానం వీడారు.పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా ఇండియన్ టీమ్ మెనెజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ సూపర్-4లో మరోసారి పాక్‌తో తలపడితే సూర్య అండ్ కో ఇదే పద్దతిని కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం.. బీసీసీఐ నుంచి అనుమతి లభించిన తర్వాతే పాక్ ఆటగాళ్లతో హ్యాండ్ షేక్చేయకూడదనే నిర్ణయాన్ని టీమిండియా తీసుకుందంట. అయితే భారత ఆటగాళ్లు తమతో కరచాలనం చేయకపోవడంపై పాకిస్తాన్ టీమ్ అసహనం వ్యక్తం చేసింది. ఇది క్రీడా స్పూర్తికి విరుద్దమని, భారత జట్టు తీరుపై ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసేందుకు పాకిస్తాన్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్‌కు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు గట్టి కౌంటరిచ్చారు. పాక్ ఫిర్యాదు చేసిన అది చెల్లదు అని ఆయన తెలిపారు."మీకు ఏదైనా సందేహం ఉంటే ఒక్కసారి రూల్ బుక్‌ను చదవండి. అందులో ఎక్కడ కూడా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు కరచాలనం ఇవ్వాలని ప్రత్యేకంగా ఏమీలేదు. అది కేవలం మర్యాదపూర్వకమైన సంజ్ఞ మాత్రమే. షేక్ హ్యాండ్స్ ఇవ్వాలా లేదా అన్నది వారి సొంత నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప ప్రత్యేకంగా చట్టం ఏమీ లేదు. కాబట్టి ఇండియన్ క్రికెట్ టీమ్ ప్రత్యర్థి జట్టుతో కరచాలనం చేయకపోయిన అదేమి పెద్ద నేరం కాదు" అని సదరు అధికారి పీటీఐతో పేర్కొన్నారు.చదవండి: Asia Cup 2025: ఇది కదా సక్సెస్ అంటే.. గురువు రికార్డునే బద్దలు కొట్టిన అభిషేక్ -
ముదురుతున్న IND-PAK 'షేక్ హ్యాండ్' వివాదం
ఆసియా కప్ 2025లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 14) జరిగిన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కొత్త వివాదానికి దారి తీసింది. మ్యాచ్ పూర్తయ్యాక భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లకు హ్యాండ్‌షేక్ ఇవ్వకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిపోయారు. దీన్ని అవమానంగా భావించిన పాక్ క్రికెట్ బోర్డు భారత ఆటగాళ్లపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. భారత ప్లేయర్లు క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొంది.తాజాగా పీసీబీ నిన్నటి మ్యాచ్‌కు రిఫరిగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్‌పై (జింబాబ్వే) కూడా ఐసీసీకి కంప్లైంట్ చేసింది. పైక్రాఫ్ట్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. దీనిపై పీసీబీ చైర్మన్ మొహిసిన్ నఖ్వీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ “ICC కోడ్ ఆఫ్ కండక్ట్, MCC Spirit of Cricket నిబంధనలను పైక్రాఫ్ట్ ఉల్లంఘించారు. వెంటనే ఆయన్ని తొలగించాలి” అని పేర్కొన్నారు.పైక్రాఫ్ట్‌కు ఏం సంబంధం..?నిన్నటి భారత్-పాక్ మ్యాచ్‌కు రిఫరిగా వ్యవహరించిన పైక్రాఫ్ట్ భారత ఆటగాళ్లు క్రీడా స్పూర్తికి విరుద్దంగా (షేక్ హ్యాండ్ ఇవ్వకుండా) ప్రవర్తించడాన్ని లైట్‌గా తీసుకున్నాడని పీసీబీ ఆరోపిస్తుంది. పైక్రాఫ్ట్ భారత ఆటగాళ్ల ప్రవర్తనపై చర్య తీసుకోలేదని అంటుంది. టాస్ సమయంలో పైక్రాఫ్ట్ ఇరు కెప్టెన్లను హ్యాండ్‌షేక్ ఇచ్చుకోవద్దని చెప్పినట్టు ఆరోపిస్తుంది. పాక్ టీమ్ మేనేజర్ నవీద్ చీమా పైక్రాఫ్ట్‌పై మాటల డోసును పెంచాడు. ఉర్దూ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పైక్రాఫ్ట్ ప్రవర్తనను “అస్పోర్ట్స్మన్షిప్”గా అభివర్ణించాడు.మొత్తంగా చూస్తే షేక్ హ్యాండ్ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తుంది. భారత్-పాక్ ఇదే టోర్నీలో మరోసారి (సూపర్-4) తలపడాల్సి ఉంది. సెప్టెంబర్ 21న జరిగే ఆ మ్యాచ్‌లో కూడా భారత ఆటగాళ్లు నో షేక్ హ్యాండ్ పాలసీని కొనసాగిస్తారని తెలుస్తుంది. ఈ వివాదం రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసేలా ఉంది.ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో భారత్ పాకిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో పాక్ తొలుత బ్యాటింగ్ చేసి 127 పరుగులకే పరిమితం కాగా.. భారత్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇది కదా సక్సెస్ అంటే.. గురువు రికార్డునే బద్దలు కొట్టిన అభిషేక్
ఆసియాకప్-2025లో దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 128 పరుగుల లక్ష్య చేధనలో పాక్ బౌలర్లను అభిషేక్ ఉతికారేశాడు. ఈ పంజాబ్ ఆటగాడు ఇన్నింగ్స్ తొలి బంతి నుంచే బౌండరీలు బాదడం మొదలు పెట్టాడు. అభిషేక్ కేవలం 13 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31 పరుగులు చేశాడు. ఈ యువ సంచలనం తన ఇన్నింగ్స్‌ను 238.46 స్ట్రైక్ రేట్‌తో ముగించాడు. ఈ మ్యాచ్‌లో అద్బుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచిన అభిషేక్.. తన మెంటార్ యువరాజ్ సింగ్ రికార్డును బ్రేక్ చేశాడు.పాకిస్తాన్‌పై టీ20ల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన భారత బ్యాటర్‌గా అభిషేక్ రికార్డులెక్కాడు. యువరాజ్ సింగ్ 2012లో పాక్‌పై 200.00 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి 36 బంతుల్లో 72 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌లో 238.46 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన అభిషేక్.. యువీని అధిగమించాడు. కాగా అభిషేక్ శర్మ కెరీర్ ఎదుగుదలలో యువరాజ్‌ది కీలక పాత్ర. అతడి గైడెన్స్‌లోనే అభిషేక్ ఇంతలా రాటు దేలాడు. ఈ పంజాబీ బ్యాటర్‌కు యువీ దగ్గరుండి మరి మెళకువలు నేర్పాడు. ఇప్పుడు అభిషేక్ టీ20ల్లో ఏకంగా వరల్డ్ నెం1 బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో పాక్‌ను 7 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
పాక్‌తో టీమిండియా మ్యాచ్.. సురేశ్ రైనా సంచలన వ్యాఖ్యలు!
టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్ (IND vs PAK)ను ఉద్ధేశించి టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాక్‌తో మ్యాచ్ ఆడటం భారత ఆటగాళ్లకు ఇష్టం లేదని అన్నాడు. అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కుదుర్చుకున్న ఒప్పందం కారణంగానే వారంతా బరిలోకి దిగాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని వేదికలపై పాక్‌తో మ్యాచ్‌లు బహిష్కరించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే, ఆసియా క్రికెట్ మండలి (ACC), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిర్వహించే బహుళ దేశాలు పాల్గొనే టోర్నీల్లో మాత్రం పాక్‌తో ఆడేందుకు కేంద్ర ప్రభుత్వం టీమిండియాకు అనుమతినిచ్చింది.షేక్‌హ్యాండ్ నిరాకరణఈ నేపథ్యంలో ఆసియా టీ20 కప్-2025లో భాగంగా దుబాయ్ వేదికగా పాక్‌తో మ్యాచ్ ఆడిన భారత్.. ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా దాయాదిపై మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. అంతేకాదు.. పాక్ ఆటగాళ్లకు షేక్‌హ్యాండ్ నిరాకరించడం ద్వారా తమ నిరసనను బహిరంగంగానే తెలియజేసింది.ఎవరికీ ఇష్టం లేదు.. కానీ బీసీసీఐ వల్లే..అయితే, అసలు పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడాల్సిన అవసరమే లేదు కదా అంటూ కొందరు మాత్రం టీమిండియాను విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో సురేశ్ రైనా స్పందిస్తూ.. ‘‘ఆటగాళ్లను వ్యక్తిగతంగా కలిసి.. ‘ఆసియా కప్‌లో పాక్‌తో ఆడటం ఇష్టమేనా అడిగితే కచ్చితంగా లేదు’ అనే చెప్తారు.కానీ బీసీసీఐ ముందుగా ఇందుకు అంగీకరించిన కారణంగా బలవంతంగానైనా వారు ఆడాల్సి వచ్చింది. సూర్యకుమార్ యాదవ్ సేన పాక్‌తో మ్యాచ్ ఆడేందుకు వ్యక్తిగతంగా విముఖంగా ఉన్నారని నేను నమ్ముతున్నా. భారత జట్టులోని ఏ ఒక్క ఆటగాడికి కూడా పాక్‌తో మ్యాచ్ ఆడటం ఇష్టం లేదని కచ్చితంగా చెప్పగలను’’ అని రైనా స్పోర్ట్స్‌తక్‌తో పేర్కొన్నాడు.పాక్‌తో మ్యాచ్ బహి ష్కరించిన ఇండియాకాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత వరల్డ్ చాంపియన్‌షిన్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్)లో పాక్ చాంపియన్స్‌తో మ్యాచ్ ఆడాల్సి ఉండగా ఇండియా చాంపియన్స్ ఇందుకు తిరస్కరించింది. ఇంగ్లండ్ వేదికగా జరిగే ఈ టీ20 లీగ్‌లో పాక్‌తో మ్యాచ్‌ను లీగ్ దశలోనే బహిష్కరించింది. కానీ ఆ తర్వాత సెమీస్‌లో కూడా పాక్‌తో తలపడాల్సి రాగా.. అప్పుడు కూడా నిరాకరించి టోర్నీ నుంచే నిష్క్రమించింది. కాగా యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా చాంపియన్స్ జట్టులో శిఖర్ ధావన్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ వంటి ప్లేయర్లు ఉన్నారు.చదవండి: IND vs PAK: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ -
చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్.. పాక్ ఆటగాడి రికార్డు బ్రేక్
ఆసియాకప్-2025లో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్‌లో బంతితో మ్యాజిక్ చేసిన కుల్దీప్.. ఇప్పుడు రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై కూడా అదే తీరును కనబరిచాడు.ఆదివారం దుబాయ్ వేదికగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతడి స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొవడానికి పాక్ బ్యాటర్లు ముప్పు తిప్పలు పడ్డారు. ఈ ఎడమ చేతి వాటం స్పిన్నర్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 18 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఓ అరుదైన ఫీట్‌ను కుల్దీప్ తన పేరిట లిఖించుకున్నాడు.భారత్-పాకిస్తాన్ మధ్య టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసిన స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ రికార్డులెక్కాడు. ఇంతకుముందు వరకు ఈ ఘనత పాక్ స్పిన్నర్ మొహమ్మద్ నవాజ్ పేరిట ఉండేది. ఆసియాకప్-2022లో భారత్‌పై నవాజ్ 33 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించాడు. తాజా మ్యాచ్‌లో కేవలం 18 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టిన కుల్దీప్.. నవాజ్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. ప్రత్యర్ధి నిర్ధేశించిన 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.5 ఓవర్లలో చేధించింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 47 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా..భిషేక్ శర్మ (13 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు.పాక్ బౌలర్లలో అయూబ్ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులకే పరిమితమైంది.చదవండి: ఏడ్చేసిన షోయబ్ అక్తర్..! కాస్తైనా బుద్ధి లేదంటూ ఫ్యాన్స్ ఫైర్ -
ఏడ్చేసిన షోయబ్ అక్తర్..! కాస్తైనా బుద్ధి లేదంటూ ఫ్యాన్స్ ఫైర్
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు టీమిండియా (IND vs PAK) గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ముఖాముఖి తలపడిన తొలి పోరులో దాయాదికి చుక్కలు చూపించింది. దుబాయ్ వేదికగా ఆసియా కప్-2025 (Asia Cup)లో సమిష్టి ప్రదర్శనతో రాణించి.. పాక్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది.ఊహించని దెబ్బఅయితే, ఆట పరంగానే కాకుండా.. నైతికంగానూ భారత జట్టు పాకిస్తాన్‌ను ఊహించని దెబ్బ కొట్టింది. మైదానంలో పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. అంతేకాదు.. షేక్‌హ్యాండ్ కోసం మరోసారి ప్రయత్నం చేసినా డ్రెసింగ్‌రూమ్ తలుపులు మూసివేసినట్లు సమాచారం.మంచిగానే బుద్ధి చెప్పారుఈ విషయంపై స్పందించిన టీమిండియా అభిమానులు.. ‘‘ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశానికి మంచిగానే బుద్ధి చెప్పారు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా భారత ఆటగాళ్లను సమర్థిస్తున్నారు. అయితే, పాకిస్తాన్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మాత్రం నో- షేక్‌హ్యాండ్ చర్యను జీర్ణించుకోలేకపోయాడు.‘‘నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. నా మనసు ముక్కలైంది. హ్యాట్సాఫ్ ఇండియా. కానీ మీరు క్రికెట్ మ్యాచ్‌ను రాజకీయాల నుంచి వేరుగా ఉంచండి. మీ గురించి మేము ఎన్నో గొప్ప విషయాలు చెప్పాము.అక్తర్ కంటతడిఅలాంటి మాకు ఈ నో-షేక్‌హ్యాండ్ చర్య గురించి కూడా ఏదైనా మాట్లాడే హక్కు ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ వాటినే గుర్తుపెట్టుకుని ఇలా చేయకూడదు. మరచిపోయి ముందుకు సాగిపోవాలి.ఇది క్రికెట్. చేతులు కలపండి. కాస్త దయ చూపండి’’ అంటూ అక్తర్ కంటతడి పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో భారతీయ నెటిజన్లు అక్తర్‌కు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇస్తున్నారు.షేక్‌హ్యాండ్ ఇవ్వనందుకే ఇంత బాధగా ఉంటే..‘‘అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకల గురించి మర్చిపోవాలా?.. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా?.. షేక్‌హ్యాండ్ ఇవ్వనందుకే మీరు ఇంతగా బాధపడిపోతున్నారు.. తమ వారిని శాశ్వతంగా పోగొట్టుకున్న బాధితుల మనసులో ఎలాంటి అలజడి చెలరేగుతుందో మీరు కనీసం ఊహించగలరా?మ్యాచ్ గెలవడమే కాదు.. ఇలా వారికి సరైన బుద్ధి చెప్పినందుకు టీమిండియాకు హ్యాట్సాఫ్. దెబ్బ అదుర్స్’’ అంటూ అక్తర్ తీరును ఏకిపారేస్తూ.. సూర్యకుమార్ సేనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా ఇటీవల కశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదులు అమాయక పర్యాటకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు.ఇందుకు బదులుగా భారత ఆర్మీ ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసి ధ్వంసం చేసింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పాకిస్తాన్ సైన్యం.. ఎదురుదాడికి ప్రయత్నించగా.. భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆసియా కప్ టోర్నీలో టీమిండియా- పాక్ ముఖాముఖి తలపడటం గమనార్హం.చదవండి: IND vs PAK: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మShoaib Akhtar crying over the handshake saga 😂 Same guy was chilling with Asim Munir & Afridi months back. Well done Surya – strike as deep as Nur Khan Air Base! 🔥🇮🇳 #INDvsPAK #IndianCricket #IndiaVsPakistan #aisacup2025 #indvspak2025 https://t.co/6O4XkugN8U pic.twitter.com/t9V8pCk0U8— Gaurav (@k_gauravs) September 15, 2025CAKEWALK 👏#TeamIndia cruise past Pakistan, chasing 127 inside 16 overs 🤩 Watch #DPWorldAsiaCup2025, from Sept 9-28 on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/EncO07RSlD— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025 -
పాకిస్తాన్ కాదు.. టీమిండియాకు ఆ జట్టుతో డేంజర్?
ఆసియాకప్-2025లో టీమిండియా జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో యూఏఈను చిత్తు చేసిన భారత జట్టు.. ఇప్పుడు రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌పై అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ విజయభేరి మ్రోగించింది.వరుసగా రెండు విజయాలతో గ్రూపు-ఎ నుంచి టేబుల్ టాపర్‌గా భారత్ నిలిచింది. భారత్‌కు ఇంకా ఒకే ఒక లీగ్ మ్యాచ్ మిగిలి ఉంది. సెప్టెంబర్ 19న పసికూన ఒమన్‌తో సూర్య కుమార్ సేన తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం నల్లేరు మీద నడక అనే చెప్పుకోవాలి.ఇప్పటికే పాక్‌పై విజయంతో మెన్ ఇన్ బ్లూ సూపర్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. గ్రూపు-ఎ టేబుల్ టాపర్‌గా ఉన్న భారత్ సూపర్-4 రౌండ్ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 21న ఏ2తో తలపడనుంది. అంటే దాదాపు మళ్లీ పాక్-భారత్ జట్లు సూపర్ ఫోర్ దశలో తలపడే అవకాశముంది. శ్రీలంకతో జాగ్రత్త.. అయితే ఈ టోర్నీలో భారత్ అద్బుతమైన విజయాలతో దూసుకెళ్లుతున్నప్పటికి డిఫిండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో ముప్పు పొంచి ఉంది. ఆ తర్వాత అఫ్గానిస్తాన్ ఎంతో కొంత పోటీ ఎదురయ్యే అవకాశముంది. పాక్, బంగ్లాదేశ్ వంటి ప్రధాన జట్లు పోటీపడుతున్నప్పటికి.. ఆ టీమ్స్ తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాయి.ముఖ్యంగా శ్రీలంకను టీమిండయిఆ ఏ మాత్రం తేలికగా తీసుకుంటే భారీ మూల్యం చెల్లంచుకోక తప్పదు. శ్రీలంక ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉంది. ముఖ్యంగా బౌలింగ్‌లో సూపర్ స్టార్లు ఉన్నారు. ఈ టోర్నీలో అన్ని జట్లకు భిన్నంగా శ్రీలంక ముగ్గురు పేస్ బౌలర్లతో తమ తొలి మ్యాచ్‌లో ఆడింది. దుష్మాంత చమీరా, మతీషా పతిరానా, నువాన్ తుషారా వంటి పేస్ త్రయం శ్రీలంక వద్ద ఉంది. పవర్‌ప్లేలో తుషారా తన సంచలన బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను కట్టడి చేయగలడు. స్పిన్ బౌలింగ్ విభాగంలో వరల్డ్ క్లాస్ వనిందు హసరంగా ఉన్నాడు.ఐపీఎల్లో ఆడిన అనుభవం హసరంగా ఉండడంతో భారత బ్యాటర్ల వీక్నెస్ అతడికి బాగా తెలుసు. అంతేకాకుండా ఐపీఎల్ ఎస్ఆర్హెచ్కు ఆడిన కమిందు మెండిస్ సైతం లంక జట్టులో భాగంగా ఉన్నాడు. అతడి కూడా బంతిని గింగరాలు తిప్పగలడు.బ్యాటింగ్ విషయానికి వస్తే కుశాల్ మెండిస్, నిస్సాంక, కుశాల్ పెరీరా, కెప్టెన్ చరిత్ అసలంక వంటి హిట్టర్లతో శ్రీలంక పటిష్టంగా ఉంది. యువ ఆటగాడు కమిల్ మిశ్రా సైతం మెరుపు బ్యాటింగ్ చేస్తున్నాడు. బంగ్లాదేశ్‌పై మిశ్రా 46 పరగులతో సత్తాచాటగా.. నిస్సాంక హాఫ్ సెంచరీతో రాణించాడు.శ్రీలంక కూడా టీమిండియా మాదిరిగానే అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఒకవేళ శ్రీలంక గ్రూపు-బి టేబుల్ టాపర్‌గా కొనసాగితే.. సూపర్-4 రౌండ్లో భారత్‌తో సెప్టెంబర్ 26న తలపడనుంది. కాగా చివరసారిగా టీ20 ఫార్మాట్లో జరిగిన ఆసియాకప్(2022)ను శ్రీలంకనే సొంతం చేసుకుంది.అత్యధిక ఆసియాకప్ టైటిల్స్ గెలుచుకున్న జట్టుగా భారత్ తర్వాత శ్రీలంకనే కొనసాగుతోంది. టీమిండియా అత్యధికంగా 8 సార్లు ఈ మెగా టోర్నీ విజేతగా నిలవగా.. లంక 6 సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. -
IND vs PAK: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma)సరికొత్త చరిత్ర లిఖించాడు. పాకిస్తాన్‌పై టీ20 ఫార్మాట్లో.. పవర్ ప్లేలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును అభిషేక్ శర్మ బద్దలు కొట్టాడు.ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్-2025 టోర్నమెంట్లో దుబాయ్ వేదికగా భారత్- పాక్ ఆదివారం మ్యాచ్ ఆడాయి. టాస్ గెలిచిన పాక్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది.తొలి బంతికే బౌండరీ బాదిఈ క్రమంలో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభం అందించాడు. తొలి బంతికే బౌండరీ బాది.. పాక్ కీలక పేసర్ షాహిన్ ఆఫ్రిది (Shaheen Afridi)కి స్వాగతం పలికిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. రెండో బంతిని ఏకంగా సిక్సర్‌గా మలిచాడు.ధనాధన్ దంచికొట్టిఆ తర్వాత కూడా ధనాధన్ దంచికొట్టిన అభిషేక్ శర్మ మొత్తంగా.. 13 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 31 పరుగులు సాధించాడు. సయీమ్ ఆయుబ్ బౌలింగ్‌లో ఇచ్చిన క్యాచ్‌ను ఫాహిమ్ అష్రాఫ్ అందుకోవడంతో అభిషేక్ సునామీ ఇన్నింగ్స్ (3.4 ఓవర్లో)కు తెరపడింది. కాగా పాకిస్తాన్ జట్టు మీద పవర్ ప్లేలో భారత బ్యాటర్లలో ఎవరికైనా ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు (31) కావడం విశేషం. ఇదిలా ఉంటే.. అభిషేక్ (31)తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (47 నాటౌట్), తిలక్ వర్మ (31), శివం దూబే (7 బంతుల్లో 10 నాటౌట్) రాణించారు. ఫలితంగా 15.5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసిన టీమిండియా.. పాక్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.పాకిస్తాన్‌పై టీ20 ఫార్మాట్లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు రాబట్టిన భారత క్రికెటర్లు🏏అభిషేక్ శర్మ- 31 పరుగులు- 2025లో దుబాయ్ వేదికగా..🏏విరాట్ కోహ్లి- 29 పరుగులు- 2022లో దుబాయ్ వేదికగా🏏రోహిత్ శర్మ- 28 పరుగులు- 2022లో దుబాయ్ వేదికగా🏏కేఎల్ రాహుల్- 28 పరుగులు- 2022లో దుబాయ్ వేదికగా.చదవండి: పాక్ జట్టుకు ఘోర అవమానం!?.. అలాంటివాళ్లకు గంభీర్ కరెక్ట్! -
‘అక్కడికి వెళ్లినా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.. అందుకే మా కెప్టెన్ ఇలా’
టీమిండియా చేతిలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు (IND vs PAK)కు మరోసారి పరాభవమే ఎదురైంది. ఆసియా కప్ టీ20 టోర్నీ-2025లో భాగంగా భారత్ చేతిలో సల్మాన్ ఆఘా బృందం ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరుదేశాలు ముఖాముఖి తలపడటం ఇదే మొదటిసారి.ఈ నేపథ్యంలో తీవ్రమైన భావోద్వేగాల వ్యక్తీకరణల నడుమ భారత్- పాక్ మైదానంలో దిగాయి. ‘బాయ్‌కాట్’ ట్రెండ్ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryalumar Yadav) ముందుగానే జాగ్రత్తపడ్డాడు. టాస్ సమయంలో పాక్ సారథి సల్మాన్ ఆఘా (Salman Agha)కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనానికి భారత ఆటగాళ్లు నిరాకరించారు. ఈ క్రమంలో పాక్ ప్లేయర్లు టీమిండియా డ్రెసింగ్‌రూమ్ వైపు వెళ్లగా.. సహాయక సిబ్బంది తలుపు మూసేసినట్లు తెలుస్తోంది.అక్కడికి వెళ్లినా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు..ఈ క్రమంలో అవమానభారంతో పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌కు కూడా రాలేదు. ఈ విషయంపై పాక్ కోచ్ మైక్ హసన్ వివరణ ఇచ్చాడు. ‘‘ఏదో ఫ్లోలో అలా జరిగిపోయి ఉంటుందని అనుకున్నాం. వారితో కరచాలనం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ మా ప్రత్యర్థి జట్టు చేసిన పని మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచింది.ఆ తర్వాత కూడా షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి వెళ్లాము. కానీ వాళ్లు అప్పటికే చేంజింగ్ రూమ్‌కి వెళ్లిపోయారు. నిజంగానే మేము కరచాలనానికి సిద్ధంగా ఉన్నా ఇలా జరగడం బాధ కలిగించింది’’ అని మైక్ హసన్ మీడియాతో పేర్కొన్నాడు.ఆడుతూ.. పాడుతూ.. అలవోకగా..కాగా దుబాయ్ వేదికగా భారత- పాక్ ఆదివారం తలపడ్డాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (40), పేసర్ షాహిన్ ఆఫ్రిది (33) రాణించడంతో.. నిర్ణీత 20 ఓవర్ల ఆటలో తొమ్మిది వికెట్ల నష్టానికి 127 పరుగులు చేయగలిగింది.భారత బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లతో చెలరేగగా.. అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలకు చెరో ఒక వికెట్ దక్కింది.ఇక లక్ష్య ఛేదనను టీమిండియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. 15.4 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 131 పరుగులు చేసింది. ఫలితంగా దాయాదిపై ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. పాక్ స్పెషలిస్టు బౌలర్లంతా విఫలం కాగా.. పార్ట్‌టైమ్ స్పిన్నర్ సయీమ్ ఆయుబ్ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.చదవండి: పాక్ జట్టుకు ఘోర అవమానం!?.. అలాంటివాళ్లకు గంభీర్ కరెక్ట్! Trick after trick, Pakistan fell for Kuldeep's magic show 🪄Watch the #DPWorldAsiaCup2025, from Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/F5lOWqPrvK— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025 -
ఒకటి.. రెండు.. మూడు.. అయ్యో పాపం! తిలక్ నవ్వులు.. వీడియో
ఆసియా కప్-2025 టోర్నీలో టీమిండియాతో మ్యాచ్‌లో పాకిస్తాన్ (Ind Vs Pak) ఆది నుంచే తడబడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్ల ధాటికి తాళలేక నామమాత్రపు స్కోరు కూడా చేయలేకపోయింది.అభిషేక్ శర్మ ధనాధన్ఏదేమైనా బ్యాటింగ్‌లో కాస్త ఫర్వాలేదనిపించినా.. బౌలింగ్‌లో మాత్రం పాక్ తేలిపోయింది. దాయాది విధించిన లక్ష్యాన్ని పటిష్ట టీమిండియా 15.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత ఓపెనర్లలో అభిషేక్ శర్మ (13 బంతుల్లో 31) మరోసారి విధ్వంసం సృష్టించగా.. శుబ్‌మన్ గిల్ (10) మాత్రం ఈసారి విఫలమయ్యాడు.రాణించిన తిలక్, సూర్యఅయితే, వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 47 నాటౌట్)తో కలిసి.. నాలుగో నంబర్ బ్యాటర్ తిలక్ వర్మ (31 బంతుల్లో 31) మెరుగ్గా రాణించాడు. అయితే, పన్నెండో ఓవర్లో తిలక్ 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నపుడు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.మూడుసార్లు ప్రయత్నించినా ఇందుకు పాక్ స్పిన్నర్ మహ్మద్ నవాజ్ పొరపాటే కారణం. తన బౌలింగ్‌లో తిలక్ ఇచ్చిన స్ట్రెయిట్ క్యాచ్‌ను పట్టడంలో నవాజ్ దారుణంగా విఫలమయ్యాడు. మూడుసార్లు ప్రయత్నించినా బంతిని ఒడిసిపట్టలేకపోయాడు. దీంతో తిలక్ వర్మ.. ‘మనం సేఫ్’ అన్నట్లుగా చిరునవ్వులు చిందించగా.. మహ్మద్ నవాజ్ మాత్రం నేలపై పంచ్‌లు కొడుతూ తనను తాను తిట్టుకున్నాడు.ఇంతలో మరో ఎండ్‌లో ఉన్న సూర్య వేగంగా స్పందించి.. రనౌట్ ప్రమాదం జరగకుండా చూసుకున్నాడు. అంతేకాదు.. జాగ్రత్తగా ఉండమంటూ తిలక్‌కు సైగ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఒకటి.. రెండు.. మూడు.. అయ్యో పాపం!‘‘ఒకటి.. రెండు.. మూడు.. అయ్యో పాపం!.. ప్రపంచంలోని బెస్ట్ స్పిన్నర్ ఇంత చెత్తగా ఫీల్డింగ్ చేస్తాడా?’’ అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ హెడ్‌కోచ్ మైక్ హసన్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్ మహ్మద్ నవాజ్ మా జట్టులో ఉన్నాడు’’ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు ఇలా కౌంటర్లు ఇస్తున్నారు.ఇదిలా ఉంటే.. సూర్యకుమార్‌తో కలిసి శివం దూబే (7 బంతుల్లో 10) ఆఖరి వరకు అజేయంగా నిలిచి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. ఇక ఆసియా కప్ టోర్నీలో భారత్‌కు ఇది వరుసగా రెండో విజయం. తొలుత యూఏఈని ఓడించిన టీమిండియా.. తాజాగా పాక్‌పై గెలిచి సూపర్-4కు లైన్ క్లియర్ చేసుకుంది.చదవండి: ఈ విజయం వారికి అంకితం.. నేను ఎల్లప్పుడూ ఆ బౌలర్లకు అభిమానినే: సూర్య Looked simple… until the ball turned lava 🤭Watch #INDvPAK LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/wVztsgkJv3— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025 -
పాక్ జట్టుకు ఘోర అవమానం!?.. అలాంటివాళ్లకు గంభీర్ కరెక్ట్!
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో టీమిండియా వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను ఓడించిన సూర్య సేన.. ఆదివారం నాటి రెండో మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. దుబాయ్ వేదికగా ఏడు వికెట్ల తేడాతో సల్మాన్ ఆఘా బృందాన్ని ఓడించి.. చిరకాల ప్రత్యర్థిపై తమదే పైచేయి అని మరోసారి నిరూపించింది.కాగా పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ఆర్మీ ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట ఉగ్రమూకలకు గట్టిగా బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత కూడా క్రీడల్లోనూ పాక్‌తో ఎలాంటి సంబంధాలు ఉండకూడదనే డిమాండ్లు వచ్చాయి. అయితే, బహుళ దేశాలు ఆడుతున్న ఆసియా కప్ టోర్నీలో మాత్రం దాయాదితో ఆడేందుకు కేంద్ర అనుమతినివ్వగా.. ఆదివారం మ్యాచ్ జరిగింది.నో షేక్‌హ్యాండ్!స్థాయికి తగ్గట్లుగానే టీమిండియా మరోసారి రాణించి పాక్‌పై ఘన విజయం సాధించింది. అయితే, సాధారణంగా టాస్ వేసినపుడు, ఆట ముగిసిన తర్వాత ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోవడం ఆనవాయితీ. అయితే, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారత ఆటగాళ్లు కనీసం ఒక్క చిరునవ్వు గానీ.. షేక్‌హ్యాండ్ గానీ లేకుండానే వెనుదిరిగారు.ముఖం మీదే తలుపు వేశారు!ఆ తర్వాత పాక్ ఆటగాళ్లు ఇండియన్ డ్రెసింగ్ రూమ్ వైపునకు రాగా.. సిబ్బంది వారి ముఖం మీదే తలుపు వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘షేక్‌హ్యాండ్’ ఇవ్వకపోవడంపై భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు.క్రీడాస్ఫూర్తికి మించినవి కూడా ఉంటాయి‘‘ముందుగానే ఈ విషయం గురించి నిర్ణయం తీసుకున్నాము. ఇక్కడికి కేవలం మ్యాచ్ ఆడేందుకు మాత్రమే మేము వచ్చాము. వారికి సరైన విధంగా బదులిచ్చాము. కొన్ని విషయాలు క్రీడాస్ఫూర్తికి మించినవి ఉంటాయి. ఈ విజయం ఆపరేషన్ సిందూర్‌లో ధైర్యసాహసాలు చూపిన భారత ఆర్మీకి అంకితం. పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు మేము ఎల్లవేళలా మద్దతుగా ఉంటాము’’ అని సూర్య చెప్పాడు.అలాంటివాళ్లకు గంభీర్ కరెక్ట్!కాగా టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ నిర్ణయానుగుణంగానే భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో షేక్ హ్యాండ్‌కు నిరాకరించినట్లు ‘టెలికామ్ ఆసియా స్పోర్ట్’ పేర్కొంది. అంతేకాదు మైదానంలోనూ వారితో ఒక్క మాట కూడా మాట్లాడవద్దని గౌతీ ముందుగానే హెచ్చరించినట్లు తెలిపింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ నేపథ్యంలో.. ‘‘పాకిస్తాన్‌కు సరైన విధంగా బుద్ధిచెప్పారు. ఉగ్రమూకలను ప్రోత్సహించే దేశానికి చెందిన ఆటగాళ్లకు ఇలాంటి సన్మానాలు తప్పవు. ఇలాంటి వారికి గంభీరే కరెక్ట్’’ అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ఆసియా కప్-2025 టీ20 టోర్నీ: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్👉పాక్ స్కోరు: 127/9 (20)👉టీమిండియా స్కోరు: 131/3 (15.5)👉ఫలితం: పాక్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.చదవండి: Asia Cup 2025: అభిషేక్ విధ్వంసం.. షాహిన్ అఫ్రిదికి ఫ్యూజ్‌లు ఔట్! వీడియో CAKEWALK 👏#TeamIndia cruise past Pakistan, chasing 127 inside 16 overs 🤩 Watch #DPWorldAsiaCup2025, from Sept 9-28 on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/EncO07RSlD— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025 -
ఈ విజయం వారికి అంకితం.. నేను ఎల్లప్పుడూ ఆ బౌలర్లకు అభిమానినే: సూర్య
పాకిస్తాన్ జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించింది. ఆసియా కప్-2025 టోర్నమెంట్లో భాగంగా ఆదివారం పాక్ (IND vs PAK)తో తలపడిన భారత్.. ఏడు వికెట్ల తేడాతో దాయాదిని చిత్తు చేసింది. తద్వారా సూపర్-4 దశకు మార్గాన్ని సుగమం చేసుకుంది.ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శనపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సంతృప్తి వ్యక్తం చేశాడు. అదే విధంగా.. చిరకాల ప్రత్యర్థి పాక్‌పై సాధించిన ఈ విజయాన్ని భారత సైన్యానికి అంకితం చేశాడు. అంతేకాదు.. తన పుట్టినరోజున టీమిండియా అభిమానులకు ఇలాంటి కానుక ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్నాడు.పాక్‌పై టీమిండియా గెలుపు అనంతరం సూర్య మాట్లాడుతూ.. ‘‘స్టేడియంలోని ప్రేక్షకులు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం సంతోషకరం. టీమిండియాకు నా తరఫున ఇదొక రిటర్న్ గిఫ్ట్ లాంటిది. ముందు నుంచి గెలుపుపై ఆత్మవిశ్వాసంగానే ఉన్నాము.స్పిన్నర్లకు నేను ఎల్లప్పుడూ అభిమానినేఅన్ని మ్యాచ్‌లలాగే ఇదీ ఒకటి అని ముందుగానే అన్నింటికీ సిద్ధమయ్యాము. ఈ టోర్నీలో పాల్గొంటున్న అన్ని జట్లను ఎలా ఎదుర్కోవాలో ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. కొన్ని నెలల క్రితమే ఇక్కడ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచాము. ఇక్కడి పిచ్‌లపై స్పిన్నర్ల అవసరం ఎలాంటిదో నాకు తెలుసు. మధ్య ఓవర్లలో మ్యాచ్‌ను మలుపు తిప్పగల స్పిన్నర్లకు నేను ఎల్లప్పుడూ అభిమానినే’’ అని తెలిపాడు. భారత సైన్యానికి ఈ విజయం అంకితంఅదే విధంగా.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు మేము ఎల్లవేళలా అండగా ఉంటామని ఈ సందర్భంగా మరోసారి చెబుతున్నాను. ఉగ్రమూకలను ఏరివేయడంలో ధైర్యసాహసాలు చూపిన భారత సైన్యానికి ఈ విజయం అంకితం చేస్తున్నాము.వారు ఎల్లప్పుడూ ఇలాగే మనల్ని గర్వపడేలా చేస్తూ.. ఆదర్శంగా నిలుస్తూ ఉంటారని కోరుకుంటున్నా. వారి ముఖాలపై చిరునవ్వులు తీసుకువచ్చేందుకు మైదానంలో మాకు వచ్చిన ఏ అవకాశాన్ని మేము వదులుకోము’’ అంటూ సూర్యకుమార్ యాదవ్ ఉద్వేగానికి లోనయ్యాడు.భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ స్కోర్లు👉వేదిక: దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, దుబాయ్👉టాస్: పాకిస్తాన్.. తొలుత బ్యాటింగ్👉పాక్ స్కోరు: 127/9 (20)👉భారత్ స్కోరు: 131/3 (15.5)👉ఫలితం: పాక్‌పై ఏడు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కుల్దీప్ యాదవ్ (4 ఓవర్ల కోటాలో 18 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు).చదవండి: Asia Cup 2025: అభిషేక్ విధ్వంసం.. షాహిన్ అఫ్రిదికి ఫ్యూజ్‌లు ఔట్! వీడియోThis victory is for you, India 🇮🇳 Watch #DPWorldAsiaCup2025, Sept 9-28, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/KXXzoF9fIR— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025 -
#INDvsPAK : పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం (ఫొటోలు)
-
చీల్చిచెండాడిన భారత్.. పాక్ చిత్తుచిత్తు.. హైలైట్స్ ఇవే
-
అభిషేక్, సూర్య మెరుపులు.. పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్
ఆసియాకప్-2025లో టీమిండియా జోరు కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన తమ రెండో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను భారత్ చిత్తు చేసింది. పాక్ విధించిన 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.5ఓవర్లలో చేధించింది.ఈ స్వల్ప లక్ష్య చేధనలో అభిషేక్ శర్మ(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31), తిలక్ శర్మ(31) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడగా.. సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 47), శివమ్ దూబే(10) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్ ఒక్కడే మూడు వికెట్లు సాధించాడు. మిగతా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు.కుల్దీప్ మ్యాజిక్..అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ భారత బౌలర్ల దాటికి విలవిల్లాడింది. పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 127 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో సాహిబ్జాదా ఫర్హాన్(40) టాప్ స్కోరర్‌గా నిలవగా.. షాహిన్ అఫ్రిది(16 బంతుల్లో 4 సిక్స్‌లతో 33) ఆఖరిలో మెరుపులు మెరిపించాడు.భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. స్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో భారత్ సూపర్-4కు ఆర్హత సాధించింది. ఇక తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సెప్టెంబర్ 19న ఒమన్‌తో తలపడనుంది.#PKMKBForever#INDvsPAK pic.twitter.com/wSdhqOsx8R— Sarcastic Ujel (@Sarcasticujel) September 14, 2025 -
అభిషేక్ విధ్వంసం.. షాహిన్ అఫ్రిదికి ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆసియాకప్-2025లో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌పై అభిషేక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 128 పరుగుల లక్ష్య చేధనలో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించాడు.ముఖ్యంగా పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిదిని ఈ పంజాబ్ ఆటగాడు ఉతికారేశాడు. భారత ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన అఫ్రిది బౌలింగ్‌లో అభిషేక్ తొలి బంతినే బౌండరీకి మలిచాడు. ఆ తర్వాత రెండో బంతికి లాంగాఫ్ మీదగా అభిషేక్ కొట్టిన సిక్స్ మ్యాచ్ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. మళ్లీ మూడో ఓవర్ వేసిన అఫ్రిది బౌలింగ్‌లో అభిషేక్ ఓ ఫోర్, భారీ సిక్సర్ బాదాడు. దీంతో షాహీన్ తెల్లముఖం వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. అభిషేక్ శర్మ కేవలం 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31 పరుగులు చేసి ఔటయ్యాడు. అంతకుముందు యూఏఈతో మ్యాచ్‌లో అభిషేక్ కూడా 30 పరుగులు చేశాడు.భారత్ ఘన విజయం..ఇక ఈ మ్యాచ్‌లో పాక్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 15.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా చేధించింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్సర్‌తో 47 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అభిషేక్ శర్మ(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31), తిలక్ శర్మ(31) రాణించారు.6️⃣ & 4️⃣ last time, 4️⃣ & 6️⃣ this time 🥵🥶Stay put & watch #INDvPAK as Abhishek takes off - #DPWORLDASIACUP2025. LIVE on #SonyLIV & #SonySportsNetwork TV Channels 📺#AsiaCup pic.twitter.com/guAssBLFJC— Sony LIV (@SonyLIV) September 14, 2025 -
Asia Cup 2025: నిన్ను ఎవరు భయ్యా కెప్టెన్ చేశారు?
ఆసియాకప్-2025లో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ఏ మాత్రం అంచనాలను అందుకోలేకపోతున్నాడు. ఈ మెగా టోర్నీలో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సల్మాన్ అలీ విఫలమయ్యాడు. ఒమన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో గోల్డెన్ డకౌటైన సల్మాన్.. ఇప్పుడు దుబాయ్ వేదికగా భారత్‌తో మ్యాచ్‌లో కూడా పేలవ ప్రదర్శన కనబరిచాడు.కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ తొలి బంతి నుంచే భారత స్పిన్నర్లను ఎదుర్కొవడానికి తీవ్రంగా శ్రమించాడు. ఆఖరికి 12 బంతులు ఆడి కేవలం 3 పరుగులు చేసిన సల్మాన్.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అతడి వికెట్ పాక్ మరింత ఒత్తిడిలో కూరుకుపోయింది.దీంతో కెప్టెన్‌గా దారుణ ప్రదర్శన కనబరుస్తున్న అలీ అఘాను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. నిన్ను ఎవరు భయ్యా కెప్టెన్ చేశారు? అంటూ ఓ యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. మహ్మద్ రిజ్వాన్ నుంచి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన సల్మాన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. కెప్టెన్‌గా ఒకట్రెండు సిరీస్‌లు గెలిపించినప్పటికి ఆటగాడిగా మాత్రం విఫలమవుతున్నాడు. దీంతో అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని పాక్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.SALMAN ALI AGHA IN T20Is4(2) – 0(1) – 1(9) – 13(19) – 32(32)5 innings, 50 runs, 10 avg, 79 SR. pic.twitter.com/6rgh4P6ZlA— junaiz (@dhillow_) March 4, 2025ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులకే పరిమితమైంది. పాక్ బ్యాటర్లలో సాహిబ్జాదా ఫర్హాన్(40) టాప్ స్కోరర్‌గా నిలవగా.. షాహిన్ అఫ్రిది(16 బంతుల్లో 4 సిక్స్‌లతో 33) ఆఖరిలో మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ తీశారు. -
కోహ్లి రికార్డు బ్రేక్ చేసిన హార్దిక్ పాండ్యా
ఆసియా కప్-2025 (Asia Cup)లో భాగంగా టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా పాకిస్తాన్‌కు ఆదిలోనే షాకిచ్చాడు. భారత బౌలింగ్ అటాక్‌ను ఆరంభించిన ఈ పేస్ ఆల్‌రౌండర్ తొలి బంతిని వైడ్‌గా సంధించాడు. అయితే, ఆ తర్వాత వెంటనే వికెట్ తీసి టీమిండియాకు శుభారంభం అందించాడు.హార్దిక్ వేసిన అవుట్‌స్వింగర్‌ను తప్పుగా అంచనా వేసిన పాక్ ఓపెనర్ సయీమ్ ఆయుబ్.. బంతిని గాల్లోకి లేపగా జస్ప్రీత్ బుమ్రా క్యాచ్ పట్టాడు. దీంతో ఆయుబ్ డకౌట్ అయ్యాడు. ఫలితంగా పాక్ తొలి వికెట్ కోల్పోగా.. హార్దిక్ ఖాతాలో తొలి వికెట్ చేరింది.పాండ్యా సూపర్ క్యాచ్ఇక ఆ మరుసటి ఓవర్లో హార్దిక్ పాండ్యా మంచి క్యాచ్ అందుకున్నాడు. బుమ్రా బౌలింగ్‌లో వన్‌డౌన్ బ్యాటర్ మహ్మద్ హ్యారిస్ (3) ఇచ్చిన క్యాచ్‌ను పాండ్యా కష్టపడి పట్టాడు. బ్యాట్ టాప్ ఎడ్జ్‌ను తాకిన బంతి గాల్లోకి లేవగా లాంగ్ లెగ్‌లో నుంచి పరిగెత్తుకుని వచ్చి మరీ అందుకున్నాడు. ఫలితంగా పాక్ రెండో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా.. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లిని అధిగమించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న రెండో భారత ఫీల్డర్‌గా నిలిచాడు. రోహిత్ శర్మ 65 క్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉండగా.. హార్దిక్ పాండ్యా.. మహ్మద్ హ్యారిస్ క్యాచ్‌తో కలిపి 55 క్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. దుబాయ్ వేదికగా ఆసియా కప్-2025 టోర్నమెంట్లో భారత్- పాక్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పది ఓవర్ల ఆట ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది.అంతర్జాతీయ టీ20లలో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న భారత ఫీల్డర్లురోహిత్ శర్మ- 65హార్దిక్ పాండ్యా- 55*విరాట్ కోహ్లి- 54సూర్యకుమార్ యాదవ్- 51*సురేశ్ రైనా- 42. చదవండి: టీమిండియా కెప్టెన్‌గా తిలక్ వర్మ.. బీసీసీఐ ప్రకటన𝗕𝗢𝗢𝗠! 💥India are tearing through. Pakistan lose their 2nd wicket 🔥Watch #INDvPAK LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/xqJXwEHqnf— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025 -
బుమ్రా బౌలింగ్‌లో 6 సిక్స్‌లు కొడతాడన్నారు.. కట్ చేస్తే! తొలి బంతికే ఔట్
ఆసియాకప్-2025లో పాకిస్తాన్ యువ ఓపెనర్ సైమ్ అయూబ్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఒమన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో గోల్డెన్ డకౌటైన అయూబ్.. ఇప్పుడు దుబాయ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అదే తీరును కనబరిచాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో అయూబ్ తను ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. పాక్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన పాండ్యా.. మొదటి బంతిని ఆఫ్ స్టంప్ దిశగా బ్యాక్ ఆఫ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని అయూబ్ ఆఫ్ సైడ్ పాయింట్ దిశగా షాట్ ఆడేందుకు ప్రయత్నిచాడు.అయూబ్ షాట్ అద్బుతంగా కనక్ట్ చేసినప్పటికి బంతి మాత్రం నేరుగా బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న జస్ప్రీత్ బుమ్రా చేతికి వెళ్లింది. దీంతో ఒక్కసారిగా అయూబ్ తెల్లముఖం చేశాడు. చేసేదేమిలేక నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.అయితే భారత్ మ్యాచ్‌కు ముందు అయూబ్‌ను ఉద్దేశించి పాక్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ ఇచ్చిన స్టెట్మెంట్ ఇప్పుడు భారత అభిమానులు ప్రస్తావిస్తున్నారు. బుమ్రా బౌలింగ్‌లో అయూబ్ ఆరు సిక్స్‌లు కొడతాడని అహ్మద్ బిల్డప్ ఇచ్చాడు.దీంతో అహ్మద్, అయూబ్‌ను కలిసి నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. "భారత్‌పై కనీసం ఒక్క పరుగు చేయలేకపోయావు, నీవా బుమ్రా బౌలింగ్‌లో 6 సిక్స్‌లు కొడతావని" ఓ యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో తొలి వికెట్‌గా అయూబ్ వెనుదిరగగా.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో మహ్మద్ హరిస్(3) ఔటయ్యాడు. అయితే వీరిద్దరి ఔటయ్యాక ఫఖార్ జమాన్(16), సాహిబ్జాదా ఫర్హాన్(19) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 6 ఓవర్లు ముగిసే సారికి పాక్ రెండు వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది.Aapka Mother of all Rivalries mein 𝘏𝘈𝘙𝘋𝘐𝘒 swaagat 😉 Watch #INDvPAK LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/AEQE0TLQju— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025చదవండి: IND vs PAK: టాస్ గెలిచినా అదే చేసేవాళ్లం: సూర్య!.. తుదిజట్లు ఇవే Saim Ayub is gone! #Pakistan lose their first wicket. 🏏#PAKvIND #INDvsPAK pic.twitter.com/9p3V2jakgd— Maham Awan (@awanmaham_) September 14, 2025 -
IND vs PAK: టాస్ గెలిచినా అదే చేసేవాళ్లం: సూర్య!.. తుదిజట్లు ఇవే
భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌కు నగారా మోగింది. టీమిండియాతో మ్యాచ్‌లో పాక్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసియా కప్-2025 టోర్నమెంట్లో భాగంగా గ్రూప్-‘ఎ’లో ఉన్న దాయాదుల మధ్య ఆదివారం నాటి పోరుకు దుబాయ్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.ఈసారి టీ20 ఫార్మాట్లో జరుగుతున్న ఈ ఖండాంతర టోర్నీలో టీమిండియా, పాక్‌లతో పాటు యూఏఈ, ఒమన్ గ్రూప్-‘ఎ’లో ఉన్నాయి. ఇప్పటికే భారత జట్టు యూఏఈపై ఘన విజయం సాధించగా.. పాకిస్తాన్ ఒమన్‌పై గెలుపొందింది. ఈ క్రమంలో చిరకాల ప్రత్యర్థులు ఈ టోర్నీలో తమ రెండో మ్యాచ్‌లో పరస్పరం తలపడుతున్నాయి.మేము గొప్పగా ఆడుతున్నాముఇక భారత్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన నేపథ్యంలో పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మాట్లాడుతూ.. ‘‘మేము తొలుత బ్యాటింగ్ చేస్తాము. గత కొన్ని రోజులుగా మేము గొప్పగా ఆడుతున్నాము. ఈ మ్యాచ్ కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నాం.ఇది కాస్త స్లో వికెట్లా కనిపిస్తోంది. అందుకే తొలుత బ్యాటింగ్ చేసి మెరుగైన స్కోరు సాధించాలని పట్టుదలగా ఉన్నాము. గత ఇరవై రోజులుగా మేము ఇక్కడ ఆడుతున్నాం కాబట్టి పిచ్ పరిస్థితులపై మాకు పూర్తి అవగాహన ఉంది’’ అని పేర్కొన్నాడు.కాగా ఆసియా కప్ టోర్నీ సన్నాహకాల్లో భాగంగా పాక్.. యూఏఈ- అఫ్గనిస్తాన్‌తో టీ20 ట్రై సిరీస్ ఆడింది. ఈ ముక్కోణపు సిరీస్‌ను పాక్ కైవసం చేసుకుంది. మరోవైపు.. టీమిండియాకు కూడా దుబాయ్ పిచ్‌లు కొత్తేం కాదు.తొలుత బౌలింగ్ చేయాలనే భావించాంఇక టాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘మేము తొలుత బౌలింగ్ చేయాలనే భావించాం. వికెట్ చాలా బాగుంది. పాతబడే కొద్ది బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. తేమగా ఉంది. కాబట్టి డ్యూ ఉంటుందని ఆశిస్తున్నాం. ఈ మ్యాచ్‌లో... యూఏఈతో ఆడిన తుదిజట్టునే ఆడిస్తున్నాం’’ అని తెలిపాడు.ఆసియా కప్-2025 భారత్ వర్సెస్ పాకిస్తాన్ తుదిజట్లుటీమిండియాఅభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తిపాకిస్తాన్సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, మహ్మద్ హారీస్(వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, సల్మాన్ ఆఘా(కెప్టెన్), హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్.చదవండి: టీమిండియా కెప్టెన్‌గా తిలక్ వర్మ.. బీసీసీఐ ప్రకటన Coin falls in favour of Pakistan and they choose to bat first 🏏Watch #INDvPAK LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/IU98kUSWda— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025 -
Asia Cup 2025: పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం
India vs Pakistan Match live updates: దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. పాక్ నిర్ధేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 15.5 ఓవర్లలో చేధించింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్సర్‌తో 47 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అభిషేక్ శర్మ(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31), తిలక్ శర్మ(31) రాణించారు. పాక్ బౌలర్లలో అయూబ్ ఒక్కడే మూడు వికెట్లు సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులకే పరిమితమైంది.తిలక్ ఔట్..తిలక్ వర్మ రూపంలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన తిలక్ వర్మ.. సైమ్ అయూబ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత విజయానికి ఇంకా 31 పరుగులు కావాలి. క్రీజులో సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే ఉన్నారు.నిలకడగా ఆడుతున్న సూర్య, తిలక్..8 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. క్రీజులో తిలక్ వర్మ(19), సూర్యకుమార్ (9) ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 57 పరుగులు కావాలి.రెండో వికెట్ కోల్పోయిన భారత్..అభిషేక్ శర్మ రూపంలో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. అభిషేక్ కేవలం 13 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31 పరుగులు చేసి ఔటయ్యాడు. 4 ఓవర్లకు భారత్ స్కోర్: 42/1. క్రీజులో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు.భారత్ తొలి వికెట్ డౌన్.. గిల్ ఔట్128 పరుగుల లక్ష్య చేధనలో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్.. సైమ్ అయూబ్ బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. 2 ఓవర్లకు భారత్ స్కోర్: 22/1. అభిషేక్ శర్మ (5 బంతుల్లో 12) దూకుడుగా ఆడుతున్నాడు.టీమిండియా టార్గెట్@128దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగారు. టీమిండియా బౌలర్ల దాటికి పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులకే పరిమితమైంది. పాక్ బ్యాటర్లలో సాహిబ్జాదా ఫర్హాన్(40) టాప్ స్కోరర్‌గా నిలవగా.. షాహిన్ అఫ్రిది(16 బంతుల్లో 4 సిక్స్‌లతో 33) ఆఖరిలో మెరుపులు మెరిపించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ తీశారు.తొమ్మిదో వికెట్ డౌన్..పాకిస్తాన్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన సోఫియన్ ముఖియమ్.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.పాక్ ఎనిమిదో వికెట్ డౌన్..పాకిస్తాన్‌కు ఆలౌట్‌కు చేరువైంది. ఫహీం అష్రఫ్(11) రూపంలో పాక్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో అష్రప్ ఔటయ్యాడు. 18 ఓవర్లకు పాక్ స్కోర్: 99/8. క్రీజులో షాహీన్ అఫ్రిది(15), ముఖియమ్(1) ఉన్నారు.పాక్ ఏడో వికెట్ డౌన్..సాహిబ్జాదా ఫర్హాన్ రూపంలో పాకిస్తాన్ ఏడో వికెట్ కోల్పోయింది. 40 పరుగులు చేసిన ఫర్హాన్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.కుల్దీప్కు ఇది మూడో వికెట్. 16.1 ఓవర్లకు పాక్ స్కోర్: 83/712.5: ఆరో వికెట్ కోల్పోయిన పాక్కుల్దీప్ యాదవ్ మహ్మద్ నవాజ్‌ను డకౌట్ చేశాడు. వికెట్ల ముందు దొరకబుచ్చుకుని వచ్చీ రాగానే పెవిలియన్‌కు పంపాడు. దీంతో పాక్ ఆరో వికెట్ కోల్పోయింది. స్కోరు: 65/6 (13).12.4: ఐదో వికెట్ కోల్పోయిన పాక్కుల్దీప్ యాదవ్ బౌలింగ్ హసన్ నవాజ్ (5) అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. సాహిబ్జాదా 32, నవాజ్ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 64/5 (12.4).నాలుగో వికెట్ కోల్పోయిన పాక్9.6: అక్షర్ పటేల్ మరోసారి అదరగొట్టాడు. అద్భుతమైన బంతితో సల్మాన్ ఆఘా (3)ను పెవిలియన్‌కు పంపాడు. అక్షర్ బౌలింగ్‌లో సల్మాన్ ఇచ్చిన బంతిని అభిషేక్ శర్మ క్యాచ్ పట్టడంతో పాక్ నాలుగో వికెట్ కోల్పోయింది. స్కోరు: 49/4 (10). సల్మాన్ స్థానంలో హసన్ నవాజ్ క్రీజులోకి రాగా.. సాహిబ్జాదా 22 పరుగులతో క్రీజులో ఉన్నాడు. Axar Patel joins the party 🥳Fakhar Zaman departs for just 17.Watch #INDvPAK LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/xwkBnHbnqr— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025 మూడో వికెట్ కోల్పోయిన పాక్7.4: అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఫఖర్ జమాన్ (17) అవుటయ్యాడు. జమాన్ ఇచ్చిన క్యాచ్‌ను తిలక్ వర్మ అద్భుత రీతిలో పట్టడంతో.. పాక్ మూడో వికెట్ కోల్పోయింది. పాక్ స్కోరు: 45/3 (7.4) పవర్ ప్లేలో పాకిస్తాన్ స్కోరు: 42/2 (6)సాహిబ్జాదా 19, ఫఖర్ జమాన్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారుమూడు ఓవర్ల ఆట ముగిసే సరికి పాకిస్తాన్ స్కోరు: 20/2సాహిబ్జాదా మూడు, ఫఖర్ జమాన్ పది పరుగులతో క్రీజులో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన పాక్1.2: బుమ్రా బౌలింగ్‌లో రెండో వికెట్‌గా వెనుదిరిగిన మహ్మద్ హ్యారిస్. మూడు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి హ్యారిస్ అవుటయ్యాడు. పాక్ స్కోరు: 6/2 (1.2)తొలి వికెట్ కోల్పోయిన పాక్..0.1: పాకిస్తాన్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో సైమ్ అయూబ్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆసియాకప్-2025లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడతున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పాకిస్తాన్ తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరి ఫాస్ట్ బౌలర్లలతో మెన్ ఈన్ గ్రీన్ బరిలోకి దిగింది. స్పీడ్ స్టార్ హరిస్ రౌఫ్ మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యాడు. మరోవైపు భారత్ కూడా తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎటువంటి మార్పులు లేకుండా ఆడుతోంది. ప్రాక్టీస్ సెషన్లో గాయపడిన సూపర్ స్టార్ శుబ్‌మన్ గిల్ పూర్తి ఫిట్నెస్ను సాధించాడు. దీంతో గిల్‌కు తుది జట్టులో చోటు దక్కింది. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ స్పిన్నర్లగా ఉండగా.. జస్ప్రీత్ బుమ్రా ఫ్రంట్ లైన్ పేసర్‌గా ఉన్నాడు. బుమ్రాతో పాటు ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే బంతిని పంచుకోనున్నారు.తుది జట్లుభారత్ : అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తిపాకిస్థాన్ : సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, మహ్మద్ హారీస్(వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్ -
మెదడు ఉందా?.. లేదా?.. అతడే నిరూపించాలి: ఇచ్చిపడేసిన దాదా
పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్‌కోచ్ మైక్ హసన్ కు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. హసన్ మెదడు పనిచేస్తుందో లేదో ఆ జట్టు స్పిన్నర్ మొహమ్మద్ నవాజే (Mohammad Nawaz)నిరూపించాల్సి ఉందని పేర్కొన్నాడు. ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో భాగంగా భారత్- పాక్ మధ్య మ్యాచ్ నిర్వహణకు ఆదివారం (సెప్టెంబరు 14) షెడ్యూల్ ఖరారైంది.ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్ఈసారి యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో టీమిండియా, పాకిస్తాన్ ఇప్పటికే చెరో విజయం సాధించాయి. తద్వారా గ్రూప్-‘ఎ’లో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఇదిలా ఉంటే.. దాయాదుల పోరు నేపథ్యంలో పాక్ హెడ్‌కోచ్ మైక్ హసన్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్ మొహమ్మద్ నవాజ్ మా జట్టులో ఉన్నాడు’’ అని పేర్కొన్నాడు.ఇదే విషయాన్ని సౌరవ్ గంగూలీ దగ్గర ఆనంద్ బజార్ పత్రిక విలేకరి ప్రస్తావించారు. ‘‘పాకిస్తాన్ కోచ్ మైక్ హసన్.. ప్రపంచలోని అత్యుత్తమ స్పిన్నర్ మా జట్టులో ఉన్నాడు’’ అని అన్నాడు సదరు విలేకరి చెప్పగా.. ‘‘ఎవరా స్పిన్నర్?’’ అని దాదా అడిగాడు.మెదడు ఉందా?.. లేదా?.. అతడే నిరూపించాలిఇందుకు బదులిస్తూ.. ‘‘మొహమ్మద్ నవాజ్’’ అని విలేకరి పేర్కొనగా.. ‘‘సరే.. తమ కోచ్ మెదడు సరిగ్గా పనిచేస్తుందని నిరూపించాల్సిన బాధ్యత సదరు స్పిన్నర్‌పైనే ఉంది’’ అంటూ గంగూలీ ఘాటుగా కౌంటర్‌గా ఇచ్చాడు.వీళ్లంతా వరల్డ్‌క్లాస్ క్రికెటర్లుఅదే విధంగా.. భారత్- పాక్ జట్ల మధ్య పోలికల గురించి ప్రస్తావన రాగా.. ‘‘రెండు జట్లకు అసలు పోలికే లేదు. పాక్ జట్టు నాణ్యత రోజురోజుకీ దిగజారిపోతోంది. వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్, సయీద్ అన్వర్, ఇంజమామ్ ఉల్ హక్, యూనిస్ ఖాన్, మొహహ్మద్ యూసఫ్... వీళ్లంతా వరల్డ్‌క్లాస్ క్రికెటర్లు.కానీ పాకిస్తాన్‌కు ఇపుడు ఆడుతున్న ప్లేయర్లు ఉన్నారో మీరే చూడండి. ఇక ఆ టీ20 జట్టులో బాబర్ ఆజం లేడు. మహ్మద్ రిజ్వాన్ కూడా లేడు. ఫఖర్ జమాన్ ఓకే. బౌలింగ్‌లో షాహిన్ ఆఫ్రిది, హ్యారిస్ రవూఫ్ ఫర్వాలేదు.షాహిన్ ఎన్నటికీ వసీం అక్రం కాలేడుకానీ టాలెంట్ విషయంలో షాహిన్ ఆఫ్రిది ఎన్నటికీ వసీం అక్రం కాలేడు కదా!.. వసీం, వకార్, షోయబ్‌లతో షాహిన్ లేదంటే రవూఫ్‌లను పోల్చగలమా? టీ20 ఫార్మాట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టమే. ఏదేమైనా ప్రస్తుత టీమిండియా- పాక్ జట్లకు ఎలాంటి పోలికా లేదని స్పష్టంగా చెప్పగలను’’ అని గంగూలీ పేర్కొన్నాడు. చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన భారత ఓపెనింగ్ జోడి -
భారత్‌తో మ్యాచ్.. అలా జరిగితే మాదే విజయం: షోయబ్ మాలిక్
ఆసియాకప్-2025లో అసలు సిసలైన పోరుకు సమయం అసన్నమైంది. ఈ ఖండాంతర టోర్నీలో భాగంగా మరికాసేపట్లో దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ చిరకాల ప్రత్యర్దుల పోరు తీవ్ర ఉద్రిక్తల నడుమ జరగనుంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్ వంటి పరిణామాల నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని దేశ వ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. బాయ్ కాట్ ఇండియా వర్సెస్ పాక్ హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ఎక్స్‌లో ట్రెండ్ అవుతుంది. కానీ ఈ మ్యాచ్‌లో తలపడేందుకు ఇరు జట్లు సిద్దమయ్యాయి. మరికాసేపట్లో ఇరు జట్ల ఆటగాళ్లు స్టేడియంకు చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉడేందుకు దుబాయ్ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. స్టేడియంలోకి జెండాలు, గొడుగులు, బ్యాన్సర్ లాంటివి పోలీసులు అనుమతించడం లేదు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ వెటరన్ షోయబ్ మాలిక్ తన జట్టుకు కీలక సూచనలు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత టాపార్డర్‌ను తొందరగా ఔట్ చేస్తే పాక్‌కు గెలిచే అవకాశముందని మాలిక్ అభిప్రాయపడ్డాడు."ఈ మ్యాచ్‌లో టాస్ కీలకంగా మారనుంది. కానీ టాస్ అనేది ఎవరి చేతుల్లోనూ లేదు. ఒకవేళ పాక్ టాస్ ఓడిపోయినా కూడా మ్యాచ్ గెలిచేందుకు గెలిచేందుకు కొన్ని అవకాశాలు ఉన్నాయి. భారత్ అగ్రశ్రేణి బ్యాటర్లలో ముగ్గురు, నలుగురుని త్వరగా అవుట్ చేసి వారిని తక్కువ స్కోర్‌కే పరిమితం చేస్తే వారిని ఓడించవచ్చు.భారత్ స్కోర్ 150-160 మధ్య ఉంటే మనకు విజయం సాధించే అవకాశముంటుంది" అని ఓ లోకల్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాలిక్ పేర్కొన్నాడు. ఆసియాకప్‌లో పాక్‌పై భారత్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు 18 మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఇందులో భారత్ 10 మ్యాచ్‌లలో గెలిస్తే, ఆరింట పాక్ విజయం సాధించింది. రెండు మ్యాచ్‌లలో ఫలితం రాలేదు. అయితే ఆసియాకప్ వన్డే ఫార్మాట్లో 15 మ్యాచ్‌లు జరగ్గా.. ఎనిమిదింట్లో భారత్.. ఐదింట్లో పాక్ గెలిచాయి. మూడు టీ20 మ్యాచ్‌లలో రెండింట్లో భారత్, ఒకసారి పాక్ విజయం సాధించాయి. మరోసారి పాక్‌పై భారత్ ఆధిపత్యం చెలాయించే అవకాశముంది. దీంతో హిస్టరీ చూసి మాట్లాడు అని మాలిక్‌కు టీమిండియా ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు.చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన భారత ఓపెనింగ్ జోడి -
కాసేపట్లో భారత్-పాక్ మ్యాచ్.. క్రిస్ గేల్ ఆసక్తికర ట్వీట్
ఆసియాకప్ 2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. మరికాసేపట్లో దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్ధుల పోరుకు తెరలేవనుంది. ఓ వైపు బాయ్‌కాట్ డిమాండ్ వినిపిస్తున్నప్పటికి.. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో తలపడేందుకు ఇరు జట్లు సిద్దమయ్యాయి.ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, మాజీ క్రికెటర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందులో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం,యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ కూడా ఉన్నాడు. భారత్-పాక్ పోరు నేపథ్యంలో గేల్ ఆసక్తికర ట్వీట్ చేశాడు."ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను ఉర్రూతలూగించేందుకు భారత్-పాక్ జట్లు మరోసారి సిద్దమయ్యాయి. ఇరు జట్లు కూడా తమ సూపర్ స్టార్లు లేకుండా ఆడుతున్నాయి. దీంతో భారత్-పాక్ రైవలరీలో కొత్త శకం ప్రారంభం కానుంది. సీనియర్ ప్లేయర్లు లేనప్పటికి ఈ రోజు మ్యాచ్ అదరిపోతుందని ఆశిస్తున్నాను" గేల్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు తమ స్టార్ ప్లేయర్లు లేకుండా ఆడుతున్నాయి.భారత దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ మెగా టోర్నీలో భాగం కావడం లేదు. మరోవైపు పాక్ స్టార్ ప్లేయర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజంలను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఇటీవల కాలంలో ఈ నలుగురు క్రికెటర్లు లేకుండా భారత్-పాక్ మ్యాచ్ జరగనుండడం ఇదే తొలిసారి. కాగా ఆసియాకప్‌లో పాక్‌పై భారత్‌దే పై చేయిగా ఉంది. ఆసియా కప్‌లో ఇప్పటి వరకు 19 మ్యాచ్‌ల్లో భారత్, పాక్ ముఖాముఖి తలపడ్డాయి. టీమిండియా 10 మ్యాచుల్లో విజయం సాధిస్తే.. పాక్ ఆరు మ్యాచుల్లో గెలిచింది. 3 మ్యాచ్‌ల్లో మాత్రం ఫలితం తేలలేదు.తుది జట్లు (అంచనా)భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్, గిల్, సామ్సన్, తిలక్, శివమ్ దూబే, పాండ్యా, అక్షర్, కుల్దీప్, బుమ్రా, వరుణ్. పాకిస్తాన్: సల్మాన్ ఆగా (కెప్టెన్), ఫర్హాన్, అయూబ్, ఫఖర్, హసన్, హారిస్, నవాజ్, ఫహీమ్, అఫ్రిది, ముఖీమ్, అబ్రార్ చదవండి: పాక్‌తో మ్యాచ్ బహిష్కరించాలంటూ విజ్ఞప్తులు!.. ఆటగాళ్లకు గంభీర్ మెసేజ్ ఇదే.. -
IND vs PAK: మనదే ఏకపక్ష విజయం.. అలా వద్దే వద్దు!.. ఊరించి మరీ..!
చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ (IND vs PAK) క్రికెట్ జట్లు ముఖాముఖి తలపడేందుకు ముహూర్తం ఖరారైంది. ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో భాగంగా ఆదివారం రాత్రి (సెప్టెంబరు 14) దాయాదులు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు సబా కరీం, ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అతడికి తిరుగులేదుటీమిండియా మాజీ వికెట్ కీపర్ సబా కరీం మాట్లాడుతూ.. భారత్- పాక్ మ్యాచ్‌లో కొందరు ఆటగాళ్ల మధ్య పోరు చూసేందుకు తాను ఆసక్తిగా ఉన్నానని తెలిపాడు. ‘‘పాక్ పేసర్ షాహిన్ ఆఫ్రిది- టీమిండియా స్టార్లు అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్ల మధ్య పోటీ ఎలా ఉండబోతుందో చూడాలి.ఇక కుల్దీప్ యాదవ్ మధ్య ఓవర్లలో ఎలా బౌలింగ్ చేయబోతున్నాడదనేది కూడా ఆసక్తికరం. బుమ్రా గురించి మాత్రం నేను మాట్లడను. ఎందుకంటే.. అతడికి తిరుగులేదు. ఎవరితో పోటీ కూడా లేదు. ఈసారి పాక్ జట్టు కనీస పోటీ ఇస్తుందనే అనుకుంటున్నా.ఏకపక్ష విజయంటీమండియా ఏకపక్ష విజయం సాధిస్తుంది. ప్రస్తుతం జట్టు పటిష్టంగా ఉంది. అందుకే సులువుగానే గెలుస్తారని నమ్ముతున్నా’’ అని సబా కరీం పేర్కొన్నాడు. అయితే, భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాత్రం భిన్నంగా స్పందించాడు.ఆఖరి వరకు సాగాలి.. ఊరించి గెలవాలి‘‘భారత్- పాక్ మ్యాచ్ ఆఖరి వరకు ఉత్కంఠగా సాగాలి. టీ20 ప్రపంచకప్-2022లో చివరి బంతి వరకు మ్యాచ్ సాగింది. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో కూడా ఇలాగే జరిగింది. అక్కడ బుమ్రా హీరో అయ్యాడు. ఈసారి కూడా పాక్‌ను ఊరించి మరీ టీమిండియా విజయం సాధించాలి’’ అని ఇర్ఫాన్ పఠాన్ ఆకాంక్షించాడు.కాగా 2022 ప్రపంచకప్‌లో భారత్ ఆఖరి బంతికి పరుగు తీసి.. పాక్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక 2024 వరల్డ్‌కప్ టోర్నీలో ఆరు పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఇదిలా ఉంటే.. ఈసారి యూఏఈ వేదికగా ఆసియా కప్ టోర్నీని టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గ్రూప్-‘ఎ’లో ఉన్న భారత్, పాకిస్తాన్ ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచాయి. భారత్ యూఏఈపై అద్భుత విజయం సాధించగా.. పాక్ ఒమన్‌ను ఓడించింది.బాయ్‌కాట్ చేయాలంటూ డిమాండ్లుపహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను టీమిండియా బహిష్కరించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఇదొక మల్టీలేటరల్ టోర్నీ కావున ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దాయాదుల పోరుకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. కానీ.. మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న చర్చలు ఇప్పటికీ జరుగుతున్నాయి.చదవండి: విరాట్ కోహ్లిపై తాలిబన్ అగ్రనేత ఆసక్తికర వ్యాఖ్యలు -
పాక్‌తో మ్యాచ్ బహిష్కరించండి!;.. ఆటగాళ్లకు గంభీర్ మెసేజ్ ఇదే..
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో పాకిస్తాన్‌తో మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లలో హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) ఆత్మవిశ్వాసం నింపినట్లు తెలుస్తోంది. సాధారణ మ్యాచ్‌లాగానే దీనిని భావించాలని.. ఒత్తిడి దరిచేరనీయకుండా అనుకున్న ఫలితాన్ని రాబట్టాలని సూచించినట్లు సమాచారం. కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ ఆసియా కప్ వేదికగా తొలిసారి ముఖాముఖి తలపడనున్నాయి.పాక్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలిగ్రూప్-‘ఎ’లో ఉన్న దాయాది జట్ల మధ్య ఆదివారం రాత్రి మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, పహల్గామ్ బాధితులకు మద్దతుగా.. టీమిండియా పాక్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ‘బాయ్‌కాట్’ ప్రచారం జరుగుతోంది. తమ మనోభావాలు వెల్లడిస్తూ భారతీయ నెటిజన్లు భావోద్వేగానికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్లపై ప్రతికూల ప్రభావం పడకుండా, ఒత్తిడి పెరగకుండా ఉండేందుకు మేనేజ్మెంట్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శుబ్‌మన్ గిల్ సహా ప్రధాన ఆటగాళ్లంతా ఈ విషయం గురించి గంభీర్‌తో చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా సున్నితమైన ఈ పరిస్థితుల నేపథ్యంలో కెప్టెన్, కోచ్ పాక్‌తో మ్యాచ్‌కు మీడియా ముందుకు రానేలేదు. అయితే అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే మాత్రం విలేకరులతో సమావేశమయ్యాడు.కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే ఈ సందర్భంగా డష్కాటే మాట్లాడుతూ.. ‘‘ఇదొక సున్నితమైన అంశం. భారత ప్రజల భావోద్వేగాలను, మనోభావాలను ఆటగాళ్లు అర్థం చేసుకోగలరు. అయితే, కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే మేము ఇక్కడ ఉన్నాము.దేశం కోసం ఆడేందుకు ఆటగాళ్లు ఎదురుచూస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రొఫెషనల్‌గా ఉండటం ఆటగాళ్ల లక్షణం. ప్రజల మనోభావాల పట్ల మాకు స్పష్టమైన అవగాహన ఉంది. గౌతీ కూడా ఆటగాళ్లకు ఇదే చెప్పాడు. ప్రొఫెషనల్‌గా ఉండాలని సూచించాడు.ఆట మీద మాత్రమే దృష్టిమన నియంత్రణలో లేని వాటి గురించి ఆలోచించవద్దని చెప్పాడు. ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. అయితే, జట్టుగా అంతా ఒకే తాటిపై ఉండాలి. ఏదేమైనా ఆట మీద మాత్రమే దృష్టి పెట్టడం అత్యంత ముఖ్యం’’ అని డష్కాటే శనివారం నాటి ప్రెస్మీట్లో పేర్కొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. కాగా పహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా భారత సైన్యం ‘ఆపరేషర్ సిందూర్’ పేరిట ఉగ్రమూకలకు బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలను మన ఆర్మీ ధ్వంసం చేసింది. ఆ తర్వాత దాయాదితో క్రీడల్లోనూ ఎటువంటి సంబంధాలు ఉండకూడదనే డిమాండ్లు వచ్చాయి. అయితే, బహుళ దేశాలు పాల్గొంటున్న టోర్నమెంట్లలో మాత్రం ఆడవచ్చంటూ ఇటీవలే కేంద్రం పాక్‌తో మ్యాచ్‌కు టీమిండియాకు అనుమతినిచ్చింది.చదవండి: విరాట్ కోహ్లిపై తాలిబన్ అగ్రనేత ఆసక్తికర వ్యాఖ్యలు -
Asia Cup 2025: రోహిత్, రహానే సరసన బంగ్లాదేశ్ ఓపెనర్లు
ఆసియా కప్ 2025లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 13) శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓపెనర్లు తంజిద్ హసన్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఖాతా తెరవకుండానే ఔటైన వారిద్దరు.. టీ20 ఆసియా కప్ చరిత్రలో డకౌటైన నాలుగో ఓపెనింగ్ జోడీగా నిలిచింది. గతంలో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, అజింక్య రహానే, బంగ్లాదేశ్‌కే చెందిన మరో ఓపెనింగ్ జోడీ మొహమ్మద్ మిధున్, సౌమ్య సర్కార్, ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ ఇలాంటి చెత్త ప్రదర్శన (డకౌట్లు) చేశారు. తాజా ఉదంతంతో తంజిద్-పర్వేజ్ జోడీ రోహిత్, రహానే సరసన చేసింది.కాగా, నిన్నటి ఆసియా కప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ శ్రీలంక చేతిలో 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. శ్రీలంక బౌలర్లు రెచ్చిపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 139 పరుగులకే పరిమితమైంది. లంక బౌలర్లలో నువాన్ తుషార (4-1-17-1), చమీరా (4-1-17-1), హసరంగ (4-0-25-2) అద్భుతంగా బౌలింగ్ చేసి బంగ్లాదేశ్ పని పట్టారు. బంగ్లా ఇన్నింగ్స్‌కు ఓపెనర్లు తంజిద్, పర్వేజ్ డకౌటై చెత్త ఆరంభాన్ని ఇచ్చారు. లిట్టన్ దాస్ (28), జాకిర్ అలీ (41 నాటౌట్), షమీమ్ హొస్సేన్ (42 నాటౌట్) అతి కష్టం మీద పరుగులు చేసి బంగ్లాదేశ్‌కు ఆమాత్రం స్కోరైనా అందించారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో శ్రీలంక బ్యాటర్లు చెలరేగి ఆడారు. ఓపెనర్ పథుమ్ నిస్సంక (50), కమిల్ మిషారా (46 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో ఆ జట్టు 14.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
Asia Cup 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా..?
ఆసియా కప్ 2025లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 14) జరుగబోయే భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు ఈ మ్యాచ్‌కు ససేమిరా అంటున్నాయి. మ్యాచ్ చూడకుండా టీవీలు ఆఫ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.దేశవాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఈ మ్యాచ్ రద్దుకు పిలుపునిచ్చాయి. మ్యాచ్ ప్రారంభానికి మరికొద్ది గంటల సమయమే ఉన్న నేపథ్యంలో మ్యాచ్ బహిష్కరణ పిలుపులు తారాస్థాయికి చేరాయి. సోషల్‌మీడియా #BoycottIndvsPak హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ప్రస్తుత సందిగ్ద పరిస్థితుల్లో మ్యాచ్ జరుగుతోందో లేదోనని యావత్ క్రీడా ప్రపంచం ఆసక్తిగా గమనిస్తుంది.ఈ మ్యాచ్‌లో దుబాయ్‌లోని దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. మ్యాచ్ ప్రారంభానికి మరో 8 గంటలు ఉన్న నేపథ్యంలో ఏమైనా జరగవచ్చని (రద్దు) నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మెజార్జీ శాతం భారతీయులకు ఈ మ్యాచ్ జరగడం అస్సలు ఇష్టం లేదు. కొందరు ఈ మ్యాచ్ రద్దు చేయాలని సుప్రీం కోర్టును సైతం ఆశ్రయించారు. అయితే క్రికెట్‌ను రాజకీయాలతో ముడిపెట్టలేమని పలువురు వేసిన పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది.కాగా, ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పాక్ ఆధారిత ఉగ్రమూకలు ఈ దాడులకు తెగబడ్డాయి. ఇందుకు భారత్ కూడా ధీటుగా బదులిచ్చింది. ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్‌లో తలదాచుకున్న ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. భారత్ కొట్టిన ఈ దెబ్బకు పాక్ విలవిలలాడిపోయింది.అపరేషన్ సిందూర్ తర్వాత భారత్ ఏ విషయంలోనూ పాక్‌తో సంబంధాలు పెట్టుకోకూడదని నిర్ణయించుకుంది. ఇందుకు అంతర్జాతీయ వేదికలపై జరిగే మేజర్ క్రీడా పోటీలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. ఈ క్రమంలోనే భారత్ బహుళ దేశాలు పాల్గొంటున్న ఆసియా కప్‌లో పాక్‌తో మ్యాచ్‌కు సిద్దమైంది. అయితే ఈ మ్యాచ్ రద్దుకు భారత్‌లో ఆందోళనలు ఉధృతమవడంతో సందిగ్దత నెలకొంది. -
పాక్‌తో భారత్ మ్యాచ్.. మోదీకి షాకిచ్చిన పహల్గాం బాధితులు
ఢిల్లీ: ఆసియా కప్ (Asia Cup)లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పహల్గాం దాడి ఘటన బాధితులు స్పందిస్తున్నారు. పాక్ జట్టుతో మ్యాచ్ ఆడటాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. భారత ప్రభుత్వం, బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పాక్ జట్టుతో మ్యాచ్ ఆడాలని ఉంటే.. తుపాకీ తూటాలకు బలైన తమ వారిని తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఆపరేషన్ సిందూర్ ఇప్పుడు వృథా అని అనిపిస్తోంది అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు.ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్‌పై పహల్గాం బాధిత కుటుంబాలు స్పందిస్తున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాక్‌తో మ్యాచ్ ఆడుతున్నారని తెలిసి బాధపడ్డాం. పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధాలు ఉండొద్దు. మీరు మ్యాచ్ ఆడాలి అనుకుంటే దాడి ప్రాణాలు కోల్పోయిన మా వారిని తీసుకురావాలి. ఆపరేషన్ సిందూర్ ముగియలేదని ప్రధాని మోదీ చెప్పారు. మరి పాకిస్తాన్‌తో ఎందుకు మ్యాచ్ నిర్వహిస్తున్నారు అని ప్రశ్నించారు.ఆపరేషన్ సిందూర్ ఎందుకు?మరోవైపు.. పహల్గాం ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన బాధితురాలు ఐషాన్య ద్వివేది స్పందిస్తూ.. భారత్-పాక్ మ్యాచ్‌పై బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగాలను బీసీసీఐ విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. భారత్-పాక్ మ్యాచ్‌ను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. కేవలం ఇద్దరు ముగ్గురు క్రికెటర్లే ముందుకువచ్చారు. మిలిగిన వారు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. పాక్‌తో మ్యాచ్ ఆడాలని క్రికెటర్లను బీసీసీఐ బలవంతపెట్టొద్దని.. దేశం తరఫున నిలబడాలని సూచించాలన్నారు. కానీ అందుకు విరుద్ధంగా బీసీసీఐ నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు. పహల్గాం దాడిలో తమ కుటుంబసభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాల వేదనను అప్పుడే మర్చిపోయారా అని స్పాన్సర్లు, క్రికెటర్లను ప్రశ్నించారు. ఈ మ్యాచ్‌తో వచ్చిన ఆదాయాన్ని ఆ దేశ ప్రభుత్వం మళ్లీ ఉగ్రవాదులను పోషించడానికే ఉపయోగిస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మ్యాచ్‌ను నిర్వహిస్తే.. మనపై దాడి చేయడానికి వారిని మనమే సిద్ధం చేస్తున్నట్లు అవుతుందన్నారు. దేశ ప్రజలంతా భారత్-పాక్ మ్యాచ్‌ను చూడకుండా బహిష్కరించాలని కోరారు.నా తమ్ముడిని తీసుకురండి: సావన్పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో సావన్ పర్మార్.. తన తండ్రితో పాటు సోదరుడు కూడా ఉగ్రవాదుల కాల్పులకు బలై ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే భారత్-పాక్ మ్యాచ్‌పై సావన్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘మీకు మ్యాచ్ ఆడాలని ఉంటే.. తుపాకీ తూటాలకు బలైన నా 16 ఏళ్ల తమ్ముడిని తిరిగి తీసుకురండి. ఆపరేషన్ సిందూర్ ఇప్పుడు వృథానేమో అనిపిస్తోంది. పహల్గాంలో పాక్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు 26 మంది అమాయక పర్యాటకులను చంపిన తర్వాత కూడా ఈ మ్యాచ్ ఆడటం సరికాదు అని ఘాటు విమర్శలు చేశారు.మా బాధ మీకు పట్టదా?మరోవైపు.. సావన్ తల్లి కిరణ్ యతీష్ పర్మార్ మాట్లాడుతూ.. బాధిత కుటుంబాల గాయాలు ఇంకా మానలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని.. ఇలాంటి సమయంలో భారత్-పాక్ మ్యాచ్ ఎందుకు జరుగుతోందని ఆమె ప్రధాని మోదీని ప్రశ్నించారు. ‘ఈ మ్యాచ్ జరగకూడదు. నేను ప్రధానమంత్రి మోదీని అడగాలనుకుంటున్నాను. ఆపరేషన్ సిందూర్ ముగియనప్పుడు ఈ మ్యాచ్ ఎందుకు జరుగుతోంది? పహల్గాం ఉగ్రదాడిలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలను ఒకసారి సందర్శించి, వారి బాధ ఎలా ఉందో చూడాలని దేశంలోని ప్రతి ఒక్కరికీ నేను చెప్పాలనుకుంటున్నాను. మా గాయాలు ఇంకా మానలేదు’ అని అన్నారు. -
భారత్-పాక్ మ్యాచ్.. మోదీ, బీజేపీపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఆసియా కప్-2025లో భాగంగా నేడు భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పాక్ జట్టుతో భారత్ క్రికెట్ ఆడటంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని చెప్పిన ప్రధాని మోదీ.. క్రికెట్ మ్యాచ్ ఆడటానికి ఎలా అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు. దీనికి బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. భారత్-పాక్ మ్యాచ్‌పై స్పందించారు. ఈ క్రమంలో తాజాగా అసద్ మీడియాతో మాట్లాడుతూ.. పహల్గాం దాడి తర్వాత పాక్‌తో మ్యాచ్ ఎలా ఆడుతారు. మతాన్ని అడిగి మరీ 26 మందిని దారుణంగా కాల్చి చంపారు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని చెప్పిన మోదీ.. క్రికెట్ మ్యాచ్ ఎలా జరుగుతుందో చెప్పాలి. 26 మంది పౌరుల ప్రాణాల కంటే డబ్బే ఎక్కువ విలువైందా?. దీనికి కేంద్రంలోని బీజేపీ సమాధానం చెప్పాలి. పాకిస్తాన్‌తో అన్ని సంబంధాలు తెంచుకున్నప్పుడు.. నీటి ఒప్పందాలు కూడా రద్దు చేసుకున్నప్పుడు మ్యాచ్ మాత్రం ఎందుకు ఆడుతున్నారు. పహల్గాం బాధితులకు మోదీ ఏం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు. దేశభక్తి పేరుతో బీజేపీ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు.ఇదిలా ఉండగా.. భారత్–పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ నిర్వాహణపై మొదటి నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ, ఇరు జట్లు మాత్రం ఆడకూడదని ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇక, మాజీ క్రికెటర్లు కూడా దీనిపై స్పందిస్తూ, “అంతర్జాతీయ టోర్నమెంట్లలో మ్యాచ్‌లు తప్పనిసరిగా ఆడాలి. లేకపోతే జట్లను మొత్తం సిరీస్ నుంచి ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది” అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక సోషల్ మీడియాలో కూడా భారత్–పాక్ మ్యాచ్ చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. #BoycottPakistanMatch హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో కొనసాగుతుండగా, యువత భారీ స్థాయిలో ఆన్లైన్లో ప్రచారం చేస్తున్నారు. పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడవద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
శ్రీలంక శుభారంభం
అబుదాబి: ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో శ్రీలంక శుభారంభం చేసింది. గ్రూప్ ‘బి’లో శనివారం జరిగిన మ్యాచ్‌లో అసలంక సారథ్యంలోని లంక 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. టాస్ నెగ్గిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 139 పరుగులే చేసింది. ఓపెనర్లు తన్జీద్ హసన్ (0), పర్వేజ్ హుసేన్ (0) డకౌట్ కావడంతో జట్టు పరుగుల ఖాతా తెరువకముందే 2 టాపార్డర్ వికెట్లను కోల్పోయింది. జట్టు రెండంకెల స్కోరు 11కు చేరగానే తౌహీద్ హృదయ్ (8) రనౌటయ్యాడు. ఈ దశలో కెపె్టన్ లిటన్ దాస్ (26 బంతుల్లో 28; 4 ఫోర్లు) కాసేపు పోరాడాడు. అయితే స్వల్ప వ్యవధిలోనే మెహదీ హసన్ (9)తో పాటు లిటన్ దాస్ కూడా పెవిలియన్ చేరడంతో బంగ్లా 53 పరుగులకే 5 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో షమీమ్ (34 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), జాకీర్ అలీ (34 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు) రాణించారు. మరో వికెట్ పడకుండా జట్టు స్కోరును వంద పరుగులు దాటించారు. అనంతరం సులువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 14.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లలో కుశాల్ మెండిస్ (3) నిరాశ పరచగా, నిసాంక (34 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించాడు. వన్‌డౌన్ బ్యాటర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కమిల్ మిషార (32 బంతుల్లో 46 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి నిసాంక రెండో వికెట్‌కు 95 పరుగులు జోడించాడు. -
పాకిస్తాన్‌తో మ్యాచ్.. టీమిండియాకు భారీ షాక్!
ఆసియాకప్-2025లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ప్రాక్టీస్ సమయంలో భారత స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ గాయపడ్డాడు.త్రోడౌన్ స్పెషలిస్ట్ బౌలింగ్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా బంతి గిల్ చేతికి బలంగా తాకింది. వెంటనే గిల్ నొప్పితో విలవిల్లాడు. ఆ తర్వాత ఫిజియో వచ్చి అతడి ఐస్ ప్యాక్ పెట్టి చికిత్స అందించాడు. అయితే విశ్రాంతి తీసుకున్నాక గిల్ తన ప్రాక్టీస్‌ను తిరిగి మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. కానీ గిల్ కాస్త ఆసౌకర్యంగా కన్పించనట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయితే ఇప్పటివరకు అతడి గాయంపై టీమ్ మెనెజ్‌మెంట్ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ గిల్ గాయం కారణంగా దూరమైతే అది భారత్‌కు గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి. గిల్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్‌లో 20 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.భారత్ తుది జట్టు(అంచనా)అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి -
నిప్పులు చెరిగిన శ్రీలంక బౌలర్లు.. తేలిపోయిన బంగ్లా బ్యాటర్లు
ఆసియాకప్ 2025 గ్రూపు-బిలో అబుదాబి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్లు నిప్పులు చెరిగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. లంక బౌలర్ల ధాటికి విల్లవిల్లాడింది. ఆరంభంలోనే బంగ్లాదేశ్‌కు పేసర్లు నువాన్ తుషారా, దుష్మాంత చమీరలు భారీ షాకిచ్చారు.బంగ్లాదేశ్ మొదటి రెండు ఓవర్లలోనే ఎటువంటి పరుగు చేయకుండా రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ లిట్టన్ దాస్ (28) కాసేపు ధాటిగా ఆడాడు. అతడు ఔటయ్యాక మళ్లీ బంగ్లా స్కోర్ బోర్డు నెమ్మదించింది. ఈ క్రమంలో షమీమ్ హుస్సేన్(40), జాకర్ అలీ(33) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 86 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. ఫలితంగా బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కేవలం 139 పరుగులు మాత్రమే చేయగల్గింది. శ్రీలంక బౌలర్లలో స్పిన్నర్ వనిందు హసరంగా రెండు వికెట్లు పడగొట్టగా.. చమీరా, తుషారా తలా వికెట్ సాధించారు. -
భారత్‌తో మ్యాచ్.. అతడిని చూసి వణకిపోతున్న పాకిస్తాన్!
ఆసియాకప్-2025లో ఉత్కంఠభరితమైన పోరుకు సమయం అసన్నమైంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఈ మ్యాచ్ వీక్షించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెహల్గమ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ వంటి పరిణామాల తర్వాత దాయాదుల పోరు జరగనుండడంతో మరింత ఆసక్తి నెలకొంది. ఈ హైవోల్టేజ్ ఈ మ్యాచ్ కోసం తమ వ్యూహాలను ఇరు జట్లు సిద్దం చేసుకుంటున్నాయి. ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌లలో విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్నాయి. యూఏఈతో ఆడిన తుది జట్టునే పాక్‌తో మ్యాచ్‌కు భారత్ కొనసాగించే అవకాశముంది.అభిషేక్ 'ఫియర్'అయితే భారత యువ సంచలనం అభిషేక్ శర్మను చూసి పాకిస్తాన్ భయపడుతందంట. అతడి కోసం పాక్ టీమ్ మెనెజ్‌మెంట్ ప్రత్యేక వ్యూహాలను రచిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అభిషేక్‌ను ఎలాగైనా పవర్ ప్లే లోపు ఔట్ చేసేందుకు మెన్ ఇన్ గ్రీన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అతడి బ్యాటింగ్‌కు సంబంధించిన పాత వీడియోలను పాక్ హెడ్ కోచ్ తమ బౌలర్లకు చూపించి ప్రాక్టీస్ చేయస్తున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అభిషేక్‌కు అవుట్‌సైడ్ ఆఫ్‌స్టంప్ బంతుల వీక్నెస్ ఉంది. అతడి బలహీనతను క్యాష్ చేసుకోవాలని పాక్ భావిస్తోంది. కానీ ఒక ఆరు ఓవర్ల పాటు అభిషేక్ క్రీజులో ఉంటే పాక్ బౌలర్లను షేక్ ఆడించేస్తాడు. యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా ఈ పంజాబ్ బ్యాటర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 30 పరుగులు చేసి ఔటయ్యాడు.అభిషేక్.. విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. అంతర్జాతీయ టీ20ల్లో అతడి స్ట్రైక్ రేటు 193.50గా ఉంది. అంతేకాకుండా ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ తరపున ఎన్నో తుపాన్ ఇన్సింగ్స్‌లు ఈ లెఫ్డ్ హ్యాండ్ బ్యాటర్ ఆడాడు.చదవండి: టీమిండియాతో మ్యాచ్.. పాక్ జట్టులోకి డేంజరస్ బౌలర్? -
టీమిండియాతో మ్యాచ్.. పాక్ జట్టులోకి డేంజరస్ బౌలర్?
ఆసియాకప్-2025లో తమ తొలి మ్యాచ్‌లో ఒమన్‌ను చిత్తు చేసిన పాకిస్తాన్.. ఇప్పుడు అసలు సిసలైన పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా పాక్ ఆదివారం తమ చిరకాల ప్రత్యర్ధి భారత్ తలపడనుంది. పాక్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉంది.ఈ ఈవెంట్‌కు ముందు యూఏఈ వేదికగా జరిగిన ట్రైసిరీస్ను కూడా మెన్ ఇన్ బ్లూ సొంతం చేసుకుంది. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ బ్యాటింగ్ పరంగా కాస్త నిరాశపరిచినప్పటికి బౌలింగ్‌లో మాత్రం అదరగొట్టింది. ముఖ్యంగా స్పిన్నర్లు సైమ్ అయూబ్, మహ్మద్ నవాజ్, సోఫియన్ ముఖియమ్, అబ్రార్ ఆహ్మద్ అద్బుతంగా రాణించారు. అయితే భారత్‌తో మ్యాచ్‌కు మాత్రం పాక్ తుది జట్టులో ఓ మార్పు చోటు చేసుకునే అవకాశముంది.హ్యారిస్ రౌఫ్ ఇన్..?తొలి మ్యాచ్‌కు బెంచ్‌కే పరిమితమైన స్పీడ్ స్టార్ హారిస్ రౌఫ్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకురావాలని పాక్ టీమ్ మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. యూఏఈతో మ్యాచ్‌లో ఫ్రంట్ లైన్ పేసర్‌గా షాహీన్ అఫ్రిది ఒక్కడే ఆడాడు. అతడితో ఆల్‌రౌండర్ ఫహీమ్ అష్రఫ్ బంతిని పంచుకున్నాడు. కానీ టీమిండియా వంటి కఠిన ప్రత్యర్ధితో ఆడుతున్నప్పుడు కచ్చితంగా పాక్ వ్యూహాలు మారుతాయి. స్పిన్నర్ సోఫియన్ ముఖియమ్ను పక్కన పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతడి స్ధానంలోనే రౌఫ్ ఎంట్రీ ఇవ్వనున్నాడంట. దుబాయ్ వికెట్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. అయితే భారత బ్యాటర్లు స్పిన్నర్లకు ఎలాగో మెరుగ్గానే ఆడుతారు. కాబట్టి అదనపు ఫాస్ట్ బౌలర్‌తో బరిలోకి దిగేందుకు పాక్ సిద్దమైందంట. ముఖియమ్ను పక్కన పెట్టిన అర్బర్ ఆహ్మద్, నవాజ్, అయూబ్ రూపంలో ముగ్గురు స్పిన్నర్లు ఉంటారు. ఒకవేళ నాలుగో స్పిన్నర్ అవసరమైతే కెప్టెన్ సల్మాన్ సైతం బంతిని గింగరాలు తిప్పగలడు. ఈ ఒక్క మార్పు మినహా ఒమన్‌తో ఆడిన జట్టునే పాక్ కొనసాగించే అవకాశముంది.భారత్‌తో మ్యాచ్‌కు పాక్ జట్టు..సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, ఫఖర్ జమాన్, సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), హసన్ నవాజ్, మహ్మద్ హారీస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, సుఫియాన్ ముఖీమ్ -
యుద్దం తర్వాత తొలి మ్యాచ్.. దుబాయ్ దద్దరిల్లిపోతుంది: అక్తర్
వరల్డ్ క్రికెట్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజు గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు జట్లు ఎప్పెడెప్పుడు తలపడతాయా? అని ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తుంటారు. చివరగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్-పాక్ జట్లు తలపడ్డాయి.ఇప్పుడు మరోసారి అభిమానులను అలరించేందుకు చిరకాల ప్రత్యర్ధులు సిద్దమయ్యారు. ఆసియాకప్-2025లో భాగంగా ఆదివారం(సెప్టెంబర్ 14) దాయాదులు అమీతుమీ తేల్చుకోనున్నారు. అయితే ఈసారి ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌పై అభిమానుల ఆసక్తి కాస్త తగ్గినట్లు అన్పిస్తోంది. సాధారణంగా భారత్- పాక్ మ్యాచ్ టిక్కెట్లు నిమిషాల్లో హట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. కానీ ఈసారి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. అమ్మకాలు ప్రారంభమై పది రోజులు అవుతున్నప్పటికి టిక్కెట్లు ఇంకా పూర్తి స్ధాయిలో అమ్ముడు పోలేదు. పహల్గామ్ ఉగ్ర దాడి, "ఆపరేషన్ సిందూర్" నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్‌ను బాయ్ కాట్ చేయాలని చాలా మంది సూచిస్తున్నారు. ఈ కారణంగానే టిక్కెట్లు ఇంకా అమ్ముడుపోలేదని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.ఆదివారం భారత్-పాక్ మ్యాచ్‌కు దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం హౌస్ ఫుల్ కావడం ఖాయమని అక్తర్ జోస్యం చెప్పాడు. "భావోద్వేగాలు ఉప్పొంగుతున్నాయి. యుద్దం తర్వాత పాకిస్తాన్ తొలిసారి భారత్‌తో ఆడనుంది. అలాంటిప్పుడు స్టేడియం ఎలా హౌస్ ఫుల్ కాకుండా ఉంటుంది? టిక్కెట్లు అమ్ముడుపోవడం లేదని నాతో ఒకరు అన్నారు. వెంటనే అవన్నీ వట్టి రూమర్సే అని, అన్నీ అమ్ముడుపోయాయి అని చెప్పా. ఇదంతా బయట జరుగుతున్న ప్రచారమే అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్ పేర్కొన్నాడు.చదవండి: SA20: సన్ రైజర్స్‌తో తెగదెంపులు.. కట్ చేస్తే! ఇప్పుడు ఆ జట్టు కెప్టెన్‌గా ఎంపిక -
భారత్‌తో మ్యాచ్ ముఖ్యం కాదు.. మా టార్గెట్ అదే: పాక్ ఓపెనర్
ఆసియాకప్-2025లో రసవత్తర పోరుకు సమయం అసన్నమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం(సెప్టెంబర్ 14) దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు అన్ని విధాల సిద్దమైంది.ఇప్పటికే ఈ టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు శుభారంభం చేశారు. టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో యూఏఈను చిత్తు చేయగా.. పాక్ తమ మొదటి మ్యాచ్‌లో ఒమన్‌ను మట్టికర్పించింది. ఈ మల్టీనేషన్ టోర్నమెంట్లలో పాక్‌పై భారత్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. చివరగా ఈ రెండు జట్లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పాక్‌ను భారత్ చిత్తు చేసింది. ఇప్పుడు మళ్లీ ఆరు నెలలు తర్వాత దాయాదుల మధ్య క్రికెట్ సమరం జరగనుంది. ఈ మ్యాచ్‌లో కూడా పాక్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించాలని భారత్ పట్టుదలతో ఉంది. ఇక ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్‌కు ముందు పాక్ యువ ఓపెనర్ సైమ్ అయూబ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమకు టీమిండియాపై గెలవడం ఒక్కటే ముఖ్యం కాదని, టోర్నీ విజేతగా నిలవడమే తమ లక్ష్యమని అయూబ్ చెప్పుకొచ్చాడు."మాకు జ్ఞాపకాలు ముఖ్యం కాదు. మా దృష్టింతా ప్రస్తుతం టోర్నమెంట్‌పైనే ఉంది. ఆసియాకప్ విజేతగా మేము నిలవాలనుకుంటున్నాము. టీమిండియాతో మ్యాచ్ ఒక్కటే మాకు ముఖ్యం కాదు. ఛాంపియన్‌షిప్‌ను గెలిచేందుకు మేము ఆతృతగా ఎదురు చూస్తున్నాము" అని ఒమన్‌తో మ్యాచ్ అనంతరం అయూబ్ పేర్కొన్నాడు.కాగా ఒమన్‌తో మ్యాచ్‌లో అయూబ్ బ్యాట్‌తో విఫలమైన బంతితో సత్తా చాటాడు. రెండు కీలక వికెట్లు పడగొట్టి పసికూన పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో మొహమ్మద్ హ్యారిస్ (43 బంతుల్లో 66) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఒమన్ బౌలర్లలో షా ఫైసల్, ఆమిర్ కలీమ్ మూడేసి వికెట్లు తీయగా.. మొహమ్మద్ నదీమ్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం లక్ష్య చేధనలో ఒమన్ కేవలం 67 పరుగులకే ఆలౌటైంది.ఫలితంగా 93 పరుగుల తేడాతో పాక్ విజయం సాధించింది. పాక్ బౌలర్లలో సూఫియాన్ ముకీమ్, సయీమ్ ఆయుబ్ ఫాహిమ్ అష్రాఫ్ రెండేసి వికెట్లు సాధించారు. వీరితోపాటు షాహిన్ ఆఫ్రిది, అబ్రార్ అహ్మద్ , మొహమ్మద్ నవాజ్తలా ఒక వికెట్ పడగొట్టారు.చదవండి: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా.. -
Asia Cup 2025: ఏ జట్టునైనా ఓడిస్తాం: పాకిస్తాన్ కెప్టెన్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో శుభారంభం అందుకుంది. తొలి మ్యాచ్‌లో పసికూన ఒమన్‌ను ఎదుర్కొన్న సల్మాన్ ఆఘా బృందం.. 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. దుబాయ్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్.. తొలుత బ్యాటింగ్ చేసింది.ఆయుబ్ డకౌట్.. హ్యారిస్ అర్ధ శతకంఓపెనర్లలో షాహిబ్జాదా ఫర్హాన్ (29) ఫర్వాలేదనిపించగా.. సయీమ్ ఆయుబ్ డకౌట్ అయ్యాడు. అయితే, వన్‌డౌన్ బ్యాటర్ మొహమ్మద్ హ్యారిస్ అర్ధ శతకం (43 బంతుల్లో 66)తో రాణించడంతో పాక్ ఇన్నింగ్స్ గాడినపడింది.హ్యారిస్‌తో పాటు ఫఖర్ జమాన్ (16 బంతుల్లో 23 నాటౌట్) రాణించగా.. నవాజ్ 19 పరుగులు చేయగలిగాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో పాక్ ఏడు వికెట్ల నష్టానినకి 160 పరుగులు రాబట్టగలిగింది. ఒమన్ బౌలర్లలో షా ఫైసల్, ఆమిర్ కలీమ్ మూడేసి వికెట్లు తీయగా.. మొహమ్మద్ నదీమ్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. 67 పరుగులకే ఆలౌట్ చేసిఇక లక్ష్య ఛేదనకు దిగిన ఒమన్‌ను పాక్ 67 పరుగులకే ఆలౌట్ చేసి సత్తా చాటింది. స్పిన్నర్లు సూఫియాన్ ముకీమ్, సయీమ్ ఆయుబ్.. పేసర్ ఫాహిమ్ అష్రాఫ్ రెండేసి వికెట్లు తీయగా.. షాహిన్ ఆఫ్రిది (పేసర్), అబ్రార్ అహ్మద్ (స్పిన్నర్), మొహమ్మద్ నవాజ్ (స్పిన్నర్) తలా ఒక వికెట్ పడగొట్టారు.ఇక ఒమన్ బ్యాటర్లలో హమావ్ మీర్జా 27 పరుగులతో టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. ఒమన్‌పై విజయానంతరం పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మాట్లాడుతూ.. బౌలింగ్ విభాగం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. తమ జట్టులో మేటి స్పిన్నర్లు ఉన్నారని.. యూఏఈ వంటి వేదికపై వారి అవసరమే ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నాడు.స్పిన్నర్లు కీలకం‘‘బ్యాటింగ్‌పై మేము మరింత దృష్టి సారించాల్సి ఉంది. అయితే, బౌలింగ్ పరంగా మా వాళ్లు అద్భుతం. మా బౌలర్ల ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను. మా జట్టులో ముగ్గురు స్పిన్నర్లు.. తమకు తామే ప్రత్యేకం. వీరికి తోడుగా ఆయుబ్ కూడా ఉన్నాడు.దుబాయ్, అబుదాబి వంటి వేదికల్లో స్పిన్నర్లు కీలకం. మాకు 4-5 స్పిన్ ఆప్షన్లు ఉండటం సానుకూలాంశం. అయితే, మేము ఈ మ్యాచ్‌లో 180 పరుగులు చేయాల్సింది. కానీ ఒక్కోసారి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతాము. ఆటలో ఇలాంటివి సహజం.ఎలాంటి జట్టునైనా ఓడించగలమునిజానికి ఇక్కడ మేము చాలా రోజులుగా ఆడుతున్నాం. ఈ టోర్నీకి ముందు టీ20 ట్రై సిరీస్ ఆడాము. అలవోకగానే సిరీస్‌ను సొంతం చేసుకున్నాము. సుదీర్ఘ కాలంలో మా ప్రణాళికలను పక్కాగా అమలు చేయగలిగితే ఎలాంటి జట్టునైనా ఓడించగలము’’ అని సల్మాన్ ఆఘా ధీమా వ్యక్తం చేశాడు.కాగా యూఏఈ వేదికగా ఆసియా కప్-2025లో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, ఒమన్, యూఏఈ... గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ రేసులో ఉన్నాయి. ఇక ఇప్పటికే టీమిండియా యూఏఈపై గెలుపొందగా.. పాక్ ఒమన్‌పై గెలిచింది. అయితే, నెట్ రన్‌రేటు పరంగా అందనంత ఎత్తులో ఉన్న భారత్ (+10.483) ప్రస్తుతం గ్రూప్-‘ఎ’ టాపర్‌గా ఉండగా.. పాక్ (+4.650) రెండో స్థానంలో ఉంది.ఆసియా కప్-2025: పాకిస్తాన్ వర్సెస్ ఒమన్ స్కోర్లు👉పాకిస్తాన్- 160/7 (20)👉ఒమన్- 67 (16.4)👉ఫలితం: ఒమన్‌పై 93 పరుగుల తేడాతో పాక్ గెలుపు.చదవండి: సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు బద్దలు.. తొలి ప్లేయర్‌గా సాల్ట్ చరిత్ర -
నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే: శుబ్‌మన్ గిల్
టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మ (Abhishek Sharma)తో కలిసి జీవితాంతం బ్యాటింగ్ చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. దాదాపు ఏడాది విరామం తర్వాత గిల్ భారత టీ20 జట్టులో పునరాగమనం చేసిన విషయం తెలిసిందే.ఆసియా కప్-2025 (Asia Cup 2025) టోర్నీలో భాగంగా యూఏఈతో మ్యాచ్‌లో గిల్ ఆడాడు. తన చిన్ననాటి స్నేహితుడు అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. తొమ్మిది బంతుల్లోనే 20 పరుగులతో అదరగొట్టాడు. తద్వారా యూఏఈ విధించిన 57 పరుగుల లక్ష్యాన్ని.. టీమిండియా 4.3 ఓవర్లలోనే ఛేదించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక గిల్ టీమిండియాతో కలిసి తదుపరి దాయాది పాకిస్తాన్ (సెప్టెంబరు 14)తో మ్యాచ్‌కు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ బ్రాడ్‌కాస్టర్ సోనీ స్పోర్ట్స్ గిల్ ర్యాపిడ్ ఫైర్ సెషన్లో పాల్గొన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో పలు ప్రశ్నలకు అతడు జవాబు ఇచ్చాడు.👉ఈ టోర్నమెంట్ కోసం మీరు ఎన్ని బ్యాట్లు తీసుకువచ్చారు?😊గిల్: తొమ్మిది బ్యాట్లు👉ఏ బ్యాటర్‌తో కలిసి జీవితాంతం బ్యాటింగ్ చేయాలని అనుకుంటున్నారు?😊గిల్: ప్రస్తుతానికైతే అభిషేక్ శర్మతో కలిసి👉మీరు ఏ ఆటగాడి నుంచైనా దొంగతనం చేయాలని అనుకునే నైపుణ్యం ఏమిటి?😊గిల్: ఏబీ డివిలియర్స్ స్కూప్ షాట్👉మీరు ఎదుర్కొన్న కఠినమైన బౌలర్?😊గిల్: జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లండ్)👉మీ క్రికెట్ కెరీర్లో ఇప్పటి వరకు అత్యంత మధురమైన జ్ఞాపకం?😊గిల్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలవడం.👉మీ చీట్ మీల్లో ఉండే ఫుడ్?😊గిల్: ప్యాన్‌కేక్స్, బటర్ చికెన్, దాల్ మఖ్నీ.మూడు ఫార్మాట్ల భవిష్య కెప్టెన్‌గా..ఇరవై ఆరేళ్ల శుబ్‌మన్ గిల్ ఇటీవలే భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ నేపథ్యంలో ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా టీమిండియా సారథిగా సరికొత్త బాధ్యతలు తీసుకున్నాడు. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో 754 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.ఇక కెప్టెన్‌గా ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియాకు తొలి విజయం అందించిన సారథిగా గిల్ చరిత్రకెక్కాడు. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత 2-2తో సమం చేసుకోవడంలో బ్యాటర్‌గానూ తన వంతు పాత్ర పోషించాడు. కాగా ప్రస్తుతం టీమిండియాకు మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లు ఉన్న విషయం తెలిసిందే. వన్డేలకు రోహిత్ శర్మ, టీ20లకు సూర్యకుమార్ యాదవ్, టెస్టులకు గిల్ సారథ్యం వహిస్తున్నారు.అయితే, భవిష్యత్తులో మూడు ఫార్మాట్లకు కలిపి గిల్‌ను నియమించేలా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే అతడిని టీ20 జట్టులోకి వైస్ కెప్టెన్‌గా తీసుకువచ్చింది. త్వరలోనే గిల్ భారత వన్డే, టీ20 జట్లకు కూడా కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.చదవండి: సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు బద్దలు.. తొలి ప్లేయర్‌గా సాల్ట్ చరిత్రThe Prince took on the rapid-fire challenge. Here’s how it went… Watch cricket's 𝑼𝑳𝑻𝑰𝑴𝑨𝑻𝑬 𝑹𝑰𝑽𝑨𝑳𝑹𝒀 come alive on Sept 14, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV 📺#SonySportsNetwork #DPWorldAsiaCup2025 #INDvPAK pic.twitter.com/d2Rz0TUVGa— Sony Sports Network (@SonySportsNetwk) September 12, 2025 -
అందుకే అతడిని ఆడించలేదు.. సంజూ మాత్రం హ్యాపీ: టీమిండియా కోచ్
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో కేవలం ఒకే ఒక స్పెషలిస్టు పేసర్‌తో బరిలోకి దిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో మ్యాచ్‌లో పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) సేవలు వినియోగించుకుంది.ఇక ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా (Hardik Pandya), శివం దూబేలను పార్ట్‌టైమ్ సీమ్ బౌలర్లుగా వాడుకుంది. మరోవైపు.. స్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిని ఆడించింది. వీరికి తోడుగా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను కూడా బరిలోకి దించింది.అర్ష్‌దీప్‌నకు మొండిచేయిఓవరాల్గా బౌలింగ్ విభాగంలో బుమ్రా, కుల్దీప్, వరుణ్ సేవలను ఉపయోగించుకున్న యాజమాన్యం.. యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను మాత్రం పక్కనపెట్టింది. నిజానికి అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్ల వీరుడిగా ఉన్నది అర్ష్‌దీప్. ఇప్పటి వరకు ఈ లెఫ్టార్మ్ పేసర్ 63 మ్యాచ్‌లలో కలిపి 99 వికెట్లు కూల్చాడు.యూఏఈతో మ్యాచ్‌లో ఇలాంటి ఆటగాడిని పక్కనపెట్టడం పట్ల విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ స్పందించాడు. ‘‘కెప్టెన్, హెడ్‌కోచ్‌తో చర్చ తర్వాతే తుదిజట్టు కూర్పుపై స్పష్టత వస్తుంది.అందుకే అతడిని ఆడించలేదుజట్టులోని 15 మంది ఇందుకు అర్హులే. కానీ పరిస్థితులకు తగ్గట్లుగా నిర్ణయాలు ఉంటాయి. ఒక ఆటగాడికి తుదిజట్టులో చోటు దక్కనపుడు అతడు నిరాశకు గురికావడం సహజం. అయితే, ఇదొక టీమ్ స్పోర్ట్. ఎజెండా ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఇందులో వ్యక్తిగత ఇష్టాలు, అయిష్టాలకు తావు ఉండదు.ఆరోజు అత్యుత్తమ జట్టు ఏది అనిపిస్తుందో.. కెప్టెన్, హెడ్‌కోచ్ దానినే ఎంపిక చేసుకుంటారు. ఆడే అవకాశం రాని వాళ్లు కూడా.. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉన్న ప్లేయర్లకు సహకారం అందిస్తారు’’ అని సితాన్షు కొటక్ స్పష్టం చేశాడు.సంజూ సంతోషంగా ఉన్నాడుఅదే విధంగా.. చాన్నాళ్లుగా టీమిండియా టీ20 ఓపెనర్‌గా సంజూ శాంసన్‌ను మిడిలార్డర్‌కు పంపడంపై కూడా సితాన్షు కొటక్ స్పందించాడు. ‘‘బ్యాటింగ్ ఆర్డర్లో ఐదు లేదంటే ఆరో స్థానంలో సంజూ ఎక్కువగా బ్యాటింగ్ చేయలేదు. దీనర్థం అతడు ఆ స్థానంలో ఆడలేడని కాదు.ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సత్తా అతడికి ఉంది. ముందుగా చెప్పినట్లు జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే హెడ్‌కోచ్, కెప్టెన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. సంజూ కూడా మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసేందుకు సంతోషంగా ఉన్నాడు’’ అని కొటక్ మీడియా సమావేశంలో పేర్కొన్నాడు. కాగా ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్ టోర్నీలో భారత్ తదుపరి సెప్టెంబరు 14న దాయాది పాకిస్తాన్‌తో తలపడుతుంది. ఇందుకు దుబాయ్ వేదిక.చదవండి: పాక్‌ను ఓడించడానికి వైభవ్ సూర్యవంశీ వంటి వాళ్లు చాలు! -
పాక్‌ను ఓడించడానికి వైభవ్ సూర్యవంశీ వంటి వాళ్లు చాలు!
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో టీమిండియా తొలి మ్యాచ్‌లోనే తమ సత్తా చూపించింది. ఈసారి టీ20 ఫార్మాట్లో జరుగుతున్న ఈ ఈవెంట్లో తొలుత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) జట్టుతో తలపడిన సూర్యకుమార్ సేన ఏకపక్ష విజయం సాధించింది.యూఏఈని తొలుత 57 పరుగులకే ఆలౌట్ చేసిన భారత జట్టు.. కేవలం 4.3 ఓవర్లలోనే లక్ష్య ఛేదనను పూర్తి చేసింది. తద్వారా తమ బలాన్ని మరోసారి నిరూపించుకుంది. మరోవైపు.. పాకిస్తాన్ ఈ టోర్నీ ఆరంభానికి ముందు యూఏఈ- అఫ్గనిస్తాన్‌లతో టీ20 ట్రై సిరీస్ ఆడింది. అయితే, ఈ రెండు జట్లపై మరీ అంత సునాయాసంగా మాత్రం గెలవలేకపోయింది. ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో ఒమన్‌పై మాత్రం 93 పరుగుల తేడాతో గెలిచింది.వైభవ్ సూర్యవంశీ వంటి వాళ్లు చాలు!ఇక ఆసియా కప్ టోర్నీలో భాగంగా.. చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ సెప్టెంబరు 14న ముఖాముఖి తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. టీమిండియా పాక్‌ను చిత్తుగా ఓడించడం ఖాయం అంటున్నారు. అంతేకాదు.. ప్రస్తుత బలాబలాల దృష్ట్యా దాయాది స్థాయికి భారత ద్వితీయ శ్రేణి జట్టు సరిపోతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రియాన్ష్ ఆర్య, పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీ వంటి ఐపీఎల్ స్టార్లు ఉన్న జట్టుతో పాక్‌ను ఓడించవచ్చనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.ఆఫ్రో-ఆసియా కప్‌గా మార్చాలిఈ టోర్నీ ఆరంభానికి ముందు టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ.. ఆసియా క్రికెట్ మండలి (ACC)కి ఓ విజ్ఞప్తి చేశాడు. సౌతాఫ్రికాను కూడా ఈ టోర్నీలో చేర్చి.. దీనిని ఆఫ్రో-ఆసియా కప్‌గా మార్చాలన్నాడు. అంతేకాదు.. భారత్ నుంచి ప్రధాన జట్టుతో పాటు ‘ఎ’ టీమ్‌ను కూడా బరిలో దించాలని.. అప్పుడే కాస్త పోటీ ఉంటుందని అభిప్రాయపడ్డాడు.ఇండియా- ‘బి’ జట్టు సరిపోతుందిఇక టీమిండియా మాజీ పేసర్ అతుల్ వాసన్ (Atul Wassan) తాజాగా మాట్లాడుతూ.. పాకిస్తాన్ ప్రస్తుత జట్టును ఓడించేందుకు భారత ద్వితీయ శ్రేణి జట్టు చాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘‘90వ దశకంలో పాకిస్తాన్ పటిష్ట జట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ జట్టు బలహీనంగా కనిపిస్తోంది. ప్రస్తుత తరుణంలో పాకిస్తాన్‌ను ఓడించేందు ఇండియా- ‘బి’ జట్టు సరిపోతుంది. రో-కోను మిస్ కావడం లేదుఏదేమైనా ఈ టోర్నీలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల గైర్హాజరీ మాత్రం నన్ను బాధించడం లేదు. ఎందుకంటే వారి గురించి ఆలోచించడం మొదలుపెడితే.. నేను సునిల్ గావస్కర్, కపిల్ దేవ్ల గురించి ఆలోచిస్తూనే ఉండిపోతాను. కాలంతో పాటుగా ముందుకు సాగటమే ఉత్తమం’’ అని అతుల్ వాసన్ న్యూస్18తో పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రంపచకప్-2024లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత కోహ్లి, రోహిత్ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవలే టెస్టులకు కూడా ఈ దిగ్గజాలు వీడ్కోలు పలికారు.చదవండి: బుమ్రా బౌలింగ్‌లో మా వాడు 6 సిక్స్‌లు కొడతాడు: పాక్ ప్లేయర్ ఓవరాక్షన్ -
పాకిస్తాన్ జోరు
దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీని పాకిస్తాన్ జట్టు విజయంతో మొదలు పెట్టింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పాక్ 93 పరుగుల తేడాతో ఒమన్‌ను ఓడించింది. తొలిసారి ఆసియా కప్ బరిలోకి దిగిన ఒమన్ జట్టు పాక్ బౌలింగ్ ముందు నిలబడలేకపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగా...ఛేదనలో ఒమన్ 16.4 ఓవర్లలో 67 పరుగులకే కుప్పకూలింది. అబుదాబిలో నేడు జరిగే మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ తలపడతాయి. ఓపెనర్ సయీమ్ అయూబ్ (0) డకౌట్ కాగా... మొహమ్మద్ హరీస్ (43 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), సాహిబ్జాదా ఫర్హాన్ (29 బంతుల్లో 29; 1 ఫోర్) కలిసి పాక్ ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఆరంభంలో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో ఒమన్ సఫలమైనా...ఆ తర్వాత పట్టు విడిచింది. హరీస్, ఫర్హాన్ రెండో వికెట్‌కు 64 బంతుల్లో 85 పరుగులు జోడించారు. కెప్టెన్ సల్మాన్ ఆఘా (0) తొలి బంతికే వెనుదిరగ్గా... ఫఖర్ జమాన్ (23 నాటౌట్; 2 ఫోర్లు), మొహమ్మద్ నవాజ్ (19 నాటౌట్) కూడా కీలక పరుగులు జత చేయడంతో స్కోరు 150 పరుగులు దాటింది. ఒమన్ బౌలర్లలో షా ఫైసల్, ఆమిర్ కలీమ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో ఒమన్ పూర్తిగా చేతులెత్తేసింది. హమ్మద్ మీర్జా (23 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఎవరూ కనీసం క్రీజ్‌లో నిలబడలేకపోయారు. పాకిస్తాన్ తరఫున ఫహీమ్ అష్రఫ్, ముఖీమ్, అయూబ్ తలా 2 వికెట్లు తీశారు. పాక్ తమ తర్వాతి మ్యాచ్‌లో రేపు భారత్‌ను ఎదుర్కొంటుంది. -
పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన పసి కూన..
ఆసియాకప్-2025లో దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటర్లకు ఒమన్ బౌలర్లు చుక్కలు చూపించారు. పాక్ బ్యాటర్లలో మహ్మద్ హరిస్ మినహా మిగితా బ్యాటర్లు ఎవరూ తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు.టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేయగల్గింది. తొలి ఓవర్లోనే ఇన్ ఫామ్ బ్యాటర్ సైమ్ అయూబ్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మహ్మద్ హరిస్(43 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66).. సాహిబ్జాదా ఫర్హాన్(29 బంతుల్లో 29)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఫర్హాన్ దాదాపు 10 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నప్పటికి బ్యాట్ ఝూళిపించలేకపోయాడు. తన చెత్త బ్యాటింగ్‌తో జట్టుకు భారంగా మారాడు. అతడు ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ఫఖార్ జమాన్(16 బంతుల్లో 23) తన మార్క్ చూపించలేకపోయాడు. కెప్టెన్ సల్మాన్ అలీ అఘా అయితే తొలి బంతికే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆఖరిలో మహ్మద్ నవాజ్(10 బంతుల్లో 19) కాస్త దూకుడుగా ఆడాడు. ఇక ఒమన్ బౌలర్లలో షా ఫైజల్, అమీర్ కలీం తలా మూడు వికెట్లు తీయగా.. నదీమ్ ఒక్క వికెట్ తీశాడు. -
చిన్ననాటి స్నేహితుడిని కలిసిన గిల్.. 14 ఏళ్ల తర్వాత! వీడియో
టీమిండియా స్టార్ ప్లేయర్, టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తన చిన్ననాటి స్నేహితుడు సిమ్రన్‌జీత్ సింగ్‌ను 14 ఏళ్ల తర్వాత కలిశాడు. ఇందుకు ఆసియాకప్-2025 వేదికైంది. పంజాబ్‌కు చెందిన స్పిన్నర్ సిమ్రంజీత్ సింగ్ ప్రస్తుతం యూఏఈ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు.ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం దుబాయ్ వేదికగా యూఏఈ, భారత్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో యూఏఈను తొమ్మిది వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్ ముగిశాక గిల్.. సిమ్రన్‌జీత్ వద్దకు వెళ్లి ఆలింగనం చేసుకుంటూ ఆప్యాయతగా మాట్లాడాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ మ్యాచ్‌లో గిల్ కేవలం 9 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్స్‌తో 20 పరుగులు చేశాడు. అతడితో పాటు అభిషేక్ శర్మ( 16 బంతుల్లో 30) మెరుపులు మెరిపించాడు. దీంతో 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం 4.3 ఓవర్లలో చేధించింది.నాకు గిల్ తెలుసు..కాగా భారత్‌తో మ్యాచ్‌కు ముందు పీటీఐతో మాట్లాడిన సిమ్రన్‌జీత్.. గిల్ తనకు చిన్ననాటి నుంచి తెలుసు అని చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు అతడికి తాను గుర్తున్నానో లేదో తెలియదని ఈ యూఏఈ స్పిన్నర్ పేర్కొన్నాడు. కానీ ఇప్పుడు గిల్ కలిసి మాట్లాడడంతో సిమ్రన్‌జీత్ ఆనందంలో మునిగి తేలిపోతున్నాడు. ఇక భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆదివారం దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో తలపడనుంది.When Shubman Gill Meets his childhood friend after 14 years | Asia Cup | Asia Cup 2025 | Simranjeet Singh | UAE | India | Team India | Ind vs uae...#Cricket #teamindia #india #shubmangill #shubman #asiacup #asiacup2025 #indvsuae #simranjeetsingh #shubmangillchildhoodfriend pic.twitter.com/WFQwrzIrPf— Dinesh Bedi (@dineshbedi6) September 11, 2025 -
తోపు, తురుము అన్నారు.. కట్ చేస్తే? తొలి బంతికే ఔట్
ఆసియాకప్-2025కు ముందు పాకిస్తాన్ యువ ఓపెనర్ సైమ్ అయూబ్‌పై భారీ అంచనాలు ఉండేవి. ద్వైపాక్షిక సిరీస్‌లలో అద్బుతంగా రాణిస్తున్న అయూబ్.. ఈ ఖండాంతర టోర్నీలో కూడా దుమ్ములేపుతాడని అంతా భావించారు. కానీ ఈ యువ ఆటగాడు అందరి అంచనాలను తలకిందలు చేశాడు.ఈ మెగా ఈవెంట్లో భాగంగా దుబాయ్ వేదికగా ఒమన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో యూబ్ తీవ్ర నిరాశపరిచాడు. గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో అయూబ్ తన ఎదుర్కొన్న తొలి బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. పాక్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన ఒమన్ పేసర్ షా ఫైజల్.. రెండో బంతిని మిడిల్ స్టంప్ దిశగా ఫుల్లర్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు.ఆ బంతిని అయూబ్ కాస్త బెండ్ అయ్యి లెగ్ సైడ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి బ్యాక్ ప్యాడ్‌కు తాకింది. దీంతో బౌలర్‌తో పాటు ఫీల్డర్లు ఎల్బీకి అప్పీల్ చేయగా.. అంపైర్ వెంటనే ఔట్ అని వేలు పైకెత్తాడు. ఆ తర్వాత అయూబ్ రివ్యూ తీసుకున్నప్పటికి ఫలితం మాత్రం ఒమన్‌కు ఫేవర్‌గానే వచ్చింది. బంతి క్లియర్‌గా మిడిల్ స్టంప్‌కు తాకినట్లు తేలింది. దీంతో నిరాశతో అయూబ్ పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. తొలి బంతికే ఔటైన అయూబ్ నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు. ఎందుకంటే పాక్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్.. జస్ప్రీత్ బుమ్రాను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆదివారం దుబాయ్ వేదికగా భారత్-పాక్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్‌లో అయూబ్ ఆరు సిక్స్‌లు కొడతాడని అహ్మద్ బిల్డప్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు అయూబ్ పసికూన ఒమన్‌పై ఆడలేకపోయాడు.💥 Golden Duck! Saim Ayub trapped plumb LBW, Pakistan lose review early!#AsiaCup2025 #Pakistan #Oman #starzplay pic.twitter.com/cJ74GBVZ7q— Cricket on STARZPLAY (@starzplaymasala) September 12, 2025 -
పాక్‌తో మ్యాచ్.. టీమిండియా తుది జట్టు ఇదే! అతడికి నో ఛాన్స్?
ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్లు దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. ఈ దాయాదుల పోరు కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ మెగా టోర్నీని ఇప్పటికే టీమిండియా అద్బుతమైన విజయంతో ప్రారంభించింది.బుధవారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో యూఏఈను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 4.3 ఓవర్లలోనే భారత్ ఊదిపడేసింది. ఇప్పుడు పాకిస్తాన్‌పై కూడా అదే జోరును కొనసాగించాలని మెన్ ఇన్ బ్లూ భావిస్తోంది. మరోవైపు పాక్ తమ తొలి మ్యాచ్‌లో శుక్రవారం దుబాయ్ వేదికగానే ఒమన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో పసికూన ఒమన్‌ను పాక్ ఓడించడం దాదాపు ఖాయం అని చెప్పాలి. కానీ ఆదివారం మాత్రం పాక్‌కు భారత్ నుంచి కఠిన సవాల్ ఎదురుకానుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో దుమ్ములేపుతున్న సూర్య సేనను పాక్ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.నో ఛేంజ్..?కాగా పాక్‌తో మ్యాచ్‌కు భారత తుది జట్టులో ఎటువంటి మార్పులు చోటు చేసుకోపోవచ్చు. యూఈఏతో ఆడిన ప్లేయింగ్ ఎలెవన్‌తో టీమిండియా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తుది జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్‌గా సంజూ శాంసన్‌ను కొనసాగించనున్నారు.యూఏఈతో మ్యాచ్‌లో సంజూకు బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. ఈ కేరళ ఆటగాడు మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు రానున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా భారత ముగ్గురు స్పిన్నర్లతో ఆడే అవకాశముంది. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఇద్దరూ స్పెషలిస్టు స్పిన్నర్లగా కొనసాగనున్నారు. దీంతో యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా ప్రధాన పేసర్‌గా ఉండనున్నాడు. అతడితో పాటు మీడియం పేస్ బౌలర్లు శివమ్ దూబే, హార్ధిక్ పాండ్యా బంతిని పంచుకోనున్నారు.భారత్ తుది జట్టు(పాకిస్తాన్)అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తిచదవండి: టీమిండియాలో నో ఛాన్స్.. ఆ కసి అక్కడ చూపించేశాడు! 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో -
పాకిస్తాన్ డేంజరస్ ప్లేయర్లు.. ఎప్పుడు ఎలా ఆడతారో తెలీదు!
భారత్-పాకిస్తాన్ జట్లు క్రికెట్ మైదానంలో మరోసారి యుద్దానికి సిద్దమయ్యాయి. ఆసియాకప్-2025లో భాగంగా ఆదివారం(సెప్టెంబర్ 14) దుబాయ్ వేదికగా దాయాదుల పోరు జరగనుంది. చివరగా ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో ముఖాముఖి తలపడిన భారత్-పాక్.. ఇప్పుడు మళ్లీ ఆరు నెలల తర్వాత అభిమానులను ఉరూత్రలూగించనున్నాయి.ఈ మెగా టోర్నీలో భారత్ ఇప్పటికే అద్బుతమైన విజయంతో శుభారంభం చేసింది. దుబాయ్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో యూఏఈను 9 వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. ఇప్పుడు అదే మైదానంలో పాక్ ఒమన్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. పసికూన ఒమన్‌ను చిత్తు చేసి టోర్నీలో శుభారంభం చేయాలని పాక్ కూడా యోచిస్తోంది. పాకిస్తాన్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉంది. ట్రైసిరీస్ విజయంతో ఈ టోర్నీలో అడుగుపెట్టింది. అయితే బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లు లేకపోయినప్పటికి చాలా మంది యంగ్ టాలెంటడ్ ఆటగాళ్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో పాక్ బలాలు, బలహీనతలపై ఓ లుక్కేద్దాం.పాకిస్తాన్ జట్టు ఎప్పుడూ ఎలా ఆడుతుందో ఎవరూ చెప్పలేరు. తమదైన రోజున వరల్డ్ నెం1 జట్టును ఓడించగలిగే పాకిస్తాన్.. కొన్నిసార్లు జింబాబ్వే, అఫ్గాన్ వంటి పసికూన చేతిలో సైతం ఘోర పరాజయాల పాలై విమర్శకులకు దొరకిపోతుంటుంది. అయితే పాక్ జట్టు ప్రస్తుతం బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో పటిష్టం కన్పిస్తోంది. జమాన్‌తో జాగ్రత్త..ఫఖర్ జమాన్ గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి రావడం మెన్ ఇన్ గ్రీన్‌కు మరింత బలాన్ని చేకూరుస్తోంది. జమాన్‌కు భారత్‌పై మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2017ను పాక్ సొంత చేసుకోడంలో జమాన్‌ది కీలక పాత్ర. భారత్‌తో జరిగిన ఫైనల్లో అతడు అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. టీమిండియాపై టీ20ల్లో అతడు పెద్దగా రన్స్ సాధించికపోయినప్పటికి.. వన్డేల్లో మాత్రం కేవలం 6 మ్యాచ్‌లు ఆడి 234 పరుగులు చేశాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ పాక్‌కు మరోసారి కీలకం కానున్నాడు.వారిద్దరూ చాలా డేంజరస్..అతడితో పాటు యువ ఆటగాళ్లు సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్‌ల నుంచి భారత బౌలర్లకు గట్టి పోటీ ఎదురు కానుంది. టీ20ల్లో పాక్ కొత్త ఓపెనింగ్ జోడీ అయినా ఫర్హాన్, సైమ్లు.. ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరూ యూఏఈ ట్రైసిరీస్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయనప్పటికి.. విధ్వంసకర బ్యాటింగ్ చేసే సత్తా వీరికి ఉంది. ఫర్హాన్‌కు టీ20ల్లో145కు పైగా స్ట్రైక్ రేట్ ఉంది. అయూబ్ అయితే తన అరంగేట్రం నుంచి బ్యాట్‌తో పాటు బంతితో కూడా రాణిస్తూ వస్తున్నాడు. ఇక మిడిలార్డర్లో కెప్టెన్ సల్మాన్ అఘా.. నిలకడకు పెట్టింది పేరు. అతడు పరిస్థితిని బట్టి తన బ్యాటింగ్ గేర్లను మారుస్తూ ఉంటాడు. అతడితో కొత్త ఆటగాడు హసన్ నవాజ్ సైతం మెరుపులు మెరిపించలడు. నవాజ్ న్యూజిలాండ్‌పై 44 బంతుల్లోనే సెంచరీ చేసి చరిత్రకెక్కాడు. హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా వంటి వెటరన్లు ఉన్నారు. అయితే వికెట్ కీపర్ మహ్మద్ హరిస్ ఫామ్‌లో లేకపోవడం పాక్ మెనెజ్‌మెంట్‌ను కాస్త కలవరపెడుతోంది.ఆ నలుగురు..ఇక ఆసియా ఉపఖండ పిచ్లలపై ప్రధాన ఆయుధం స్పిన్ బౌలింగ్. ఈ విభాగంలో పాక్ చాలా పటిష్టంగా ఉంది. ముఖ్యంగా మహ్మద్ నవాజ్, అబ్రార్ అహ్మద్ నుంచి భారత బ్యాటర్లకు సవాలు ఎదురు కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీ-2005లో గిల్‌ను అబ్రార్ ఔట్ చేసిన విధానం ఇప్పటికి గుర్తుండే ఉంటుంది. ఈ లెగ్ స్పిన్నర్ అద్బుతమైన బంతితో గిల్‌ను బోల్తా కొట్టించాడు. వీరిద్దరితో పాటు ఖుష్దిల్ షా, సుఫియాన్ ముకీమ్ బంతిని గింగిరాలు తిరిగేలా చేయగలరు.పేస్ బ్యాటరీ పవర్ ఫుల్..ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ చాలా పవర్ ఫుల్‌గా ఉంది. షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, హసన్ అలీలు వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నారు. వీరందరికి బంతిని స్వింగ్, రివర్స్ స్వింగ్ చేయడం వెన్నతో పెట్టిన విధ్య. ముఖ్యంగా దుబాయ్ పిచ్‌లపై ఆడిన అనుభవం మనకంటే వారికే ఎక్కువగా ఉంది.ఆ కండీషన్స్ ఉపయోగించుకుని ఈ పేస్ త్రయం చెలరేగితే భారత బ్యాటర్లకు కష్టాలు తప్పవు. అఫ్రిదికి భారత్‌పై మంచి రికార్డు ఉంది. అయితే ఎన్ని బలాలు ఉన్న పాక్‌కు బలహీనతలు కూడా ఉన్నాయి. బ్యాటింగ్‌లో స్ధిరత్వం లేకపోవడం పాక్ ప్రధాన బలహీనతగా ఉంది.టాప్ ఆర్డర్ మీద ఆధారపడటం ఎక్కువగా ఆధారపడుతూ వస్తుంది. అదేవిధంగా ఫీల్డింగ్‌లో కూడా పాక్ పేలవ ప్రదర్శన కనబరుస్తూ వస్తుంది. చాలా మ్యాచ్‌ల్లో కాచులు డ్రాప్, రన్ అవుట్స్ మిస్ చేయడం చేస్తూ భారీ మూల్యం చెల్లించుకుంటోంది. కాగా ఆసియాకప్‌లో పాక్‌పై టీమిండియానే ఇప్పటివరకు పూర్తి ఆధిపత్యం చెలాయించింది.ఆసియా కప్ 2025 కోసం పాకిస్థాన్ జట్టు:సల్మాన్ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహీన్ షా ఆఫ్రిది, సుఫియాన్ ముఖీమ్ -
బుమ్రా బౌలింగ్‌లో మా వాడు 6 సిక్స్‌లు కొడతాడు: పాక్ ప్లేయర్
ఆసియాకప్-2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు సమయం అసన్నమవుతోంది. సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్ధులు అమీతుమీ తెల్చుకోనున్నారు. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. భారత్ ఇప్పటికే తమ తొలి మ్యాచ్‌లో యూఏఈను చిత్తు చేయగా.. పాక్ జట్టు వారి మొదటి మ్యాచ్‌లో శుక్రవారం ఒమన్‌తో తలపడనుంది.పాకిస్తాన్ కూడా వారి తొలి మ్యాచ్‌లో సునాయసంగా విజయం సాధించే అవకాశముంది. కానీ అసలు సిసలైన సవాల్ ఆదివారం ఎదురుకానుంది. ఆసియాకప్‌లో పాక్‌పై టీమిండియాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. మరోసారి దాయాదిపై తమ జోరును కొనసాగించాలని సూర్యకుమార్ సేన ఉవ్విళ్లూరుతోంది.ప్రత్యర్ధి పాక్ సైతం ఎలాగైనా టీమిండియాను ఓడించాలని పట్టుదలతో ఉంది. ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ తన్వీర్ అహ్మద్ సంచలన కామెంట్స్ చేశాడు. టీమిండియా సూపర్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో పాక్ యవ ఓపెనర్ సైమ్ అయూబ్ వరుసగా ఆరు సిక్స్‌లు కొడతాడని తన్వీర్ బిల్డప్ ఇచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన్వీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. దీంతో భారత అభిమానులు తన్వీర్‌కు కౌంటరిస్తున్నారు. బుమ్రా బౌలింగ్‌లో అయూబ్ కనీసం ఫోర్ అయినా కొడతాడా? అని ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. కాగా ప్రపంచ క్రికెట్లో బుమ్రా నెంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. స్మిత్, రూట్, స్టోక్స్ వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లు సైతం బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డారు. అటువంటిది ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు అంటే అది కలలో కూడా జరగదు. అయితే పాక్ జట్టులో అయూబ్ గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. 41 టీ20ల్లో 816 పరుగులు చేశాడు. ఆఫ్ బ్రేక్ బౌలింగ్ కూడా అయూబ్ చేయగలడు.చదవండి: మా జట్టుకు మాత్రం.. గిల్ ఇలా ఆడడు: గుజరాత్ టైటాన్స్ కోచ్ -
మా జట్టుకు మాత్రం.. గిల్ ఎప్పుడూ ఇలా ఆడడు: కోచ్
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నీతో అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేశాడు టీమిండియా స్టార్ శుబ్‌మన్ గిల్ (Shubman Gil). దాదాపు ఏడాది విరామం తర్వాత యూఏఈతో మ్యాచ్ సందర్భంగా బుధవారం రీఎంట్రీ ఇచ్చాడు. అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించిన గిల్ ధనాధన్ దంచికొట్టాడు.గిల్ ధనాధన్యూఏఈ విధించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గిల్ విశ్వరూపం ప్రదర్శించాడు. పసికూనపై ఆది నుంచే ఎదురుదాడి ఆరంభించాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతి (రెండో ఓవర్ మొదటి బంతి)నే ఫోర్‌గా మలిచిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. అదే ఓవర్లో ఓ సిక్సర్ కూడా బాదాడు.టీమిండియా ఘన విజయం ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా తొమ్మిది బంతులు ఆడిన శుబ్‌మన్ గిల్.. రెండు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి స్ట్రైక్‌రేటు 222.22. ఇదిలా ఉంటే.. గిల్‌తో పాటు అభిషేక్ శర్మ (16 బంతుల్లో 30), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (2 బంతుల్లో 7 నాటౌట్) రాణించడంతో 4.3 ఓవర్లలోనే పని పూర్తి చేసింది టీమిండియా. యూఏఈని తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి ఘన విజయం సాధించింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, ఐపీఎల్ ఫ్రాంఛైజీ బ్యాటింగ్ కోచ్ పార్థివ్ పటేల్.. తమ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టైటాన్స్‌కు ఆడేటపుడు గిల్లో ఇలాంటి దూకుడు చూడలేదని అన్నాడు. ‘‘తొలి బంతి నుంచే గిల్ అటాకింగ్ మోడ్‌లోకి వెళ్లిపోయాడు.మా జట్టుకు మాత్రం.. గిల్ ఇలా ఆడడుఆ తర్వాత వెంటనే.. క్రీజు బయటకు వచ్చి మరీ ఫోర్ బాదాడు. అదే ఓవర్లో సిక్స్ కూడా కొట్టాడు. గుజరాత్ టైటాన్స్‌కు ఆడేటపుడు అతడిలో ఇలాంటి దూకుడు ఎప్పుడూ చూడలేదు. నిజానికి ఇక్కడ కుదురుకునేందుకు గిల్ కాస్త సమయం తీసుకుంటాడు.కానీ టీమిండియా తరఫున ఈ మ్యాచ్‌లో ఎనిమిది మంది బ్యాటర్లు ఉన్న కారణంగా ఆది నుంచే దూకుడు ప్రదర్శించాడు. అద్భుతంగా ఆడాడు కూడా!’’ అని పార్థివ్ పటేల్ గిల్‌ను ప్రశంసించాడు. టీ20 జట్టు వైస్ కెప్టెన్గాకాగా టైటాన్స్‌కు సారథ్యం వహించడంతో పాటు ఓపెనర్‌గానూ గిల్ సేవలు అందిస్తున్నాడు. ఇటీవలే ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా టీమిండియా టెస్టు కెప్టెన్‌గా గిల్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా బ్యాట్‌తో ఇరగదీసిన ఈ పంజాబీ బ్యాటర్.. కెప్టెన్‌గానూ 2-2తో సిరీస్ సమం చేయగలిగాడు.ఇక భవిష్యత్తులో టీమిండియా మూడు ఫార్మాట్లలో గిల్‌ను కెప్టెన్‌ను చేయాలనే ఉద్దేశంతో.. ఇటీవలే టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా బీసీసీఐ తిరిగి నియమించింది. ప్రస్తుతం టీమిండియాకు వన్డేల్లో రోహిత్ శర్మ, టీ20లలో సూర్యకుమార్ యాదవ్, టెస్టుల్లో శుబ్‌మన్ గిల్ కెప్టెన్లుగా పనిచేస్తున్నారు.చదవండి: 21 సార్లు డకౌట్ అయినా సరే.. జట్టులోనే.. అతడికి గంభీర్ చెప్పిందిదే.. -
ఇలాంటివి మనకు అవసరమా సూర్య?.. గట్టిగానే ఇచ్చిపడేశాడు!
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) వ్యవహార శైలిపై భారత మాజీ క్రికెటర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా.. సూర్య తీరు విమర్శలకు దారితీసే విధంగా ఉందన్నాడు. అయితే, మాజీ కెప్టెన్ అజింక్య రహానే మాత్రం సూర్య చేసింది సరైన పనేనంటూ మద్దతు పలికాడు.అసలేం జరిగిందంటే... ఆసియా కప్-2025 (Asia Cup) టీ20 టోర్నమెంట్లో భాగంగా టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో బుధవారం తలపడింది. దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.57 పరుగులకే ఆలౌట్‌ఈ క్రమంలో ఆకాశమే హద్దుగా చెలరేగిన భారత బౌలర్లు యూఏఈని 57 పరుగులకే ఆలౌట్ చేశారు. కుల్దీప్ యాదవ్ నాలుగు, శివం దూబే మూడు వికెట్లు కూల్చగా.. అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. యూఏఈ బ్యాటర్లలో ఓపెనర్ అలీషాన్ షరాఫూ (22) పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.సూర్యకుమార్ యాదవ్ క్రీడాస్ఫూర్తిఇదిలా ఉంటే.. యూఏఈ పదో నంబర్ బ్యాటర్ జునైద్ సిద్దిఖీ విషయంలో సూర్యకుమార్ యాదవ్ క్రీడాస్ఫూర్తి కనబరిచాడు. యూఏఈ ఇన్నింగ్స్‌లో 13వ ఓవర్‌ను శివం దూబే వేశాడు. ఒకటో బంతికి ధ్రువ్ పరాశర్ (1)ను దూబే అవుట్ చేయగా జునైద్ క్రీజులోకి వచ్చాడు.ఈ క్రమంలో దూబే షార్ట్ డెలివరీ సంధించగా.. దానిని షాట్ ఆడబోయి జునైద్ విఫలమయ్యాడు. అయితే, దూబే బౌలింగ్ కోసం రన్ మొదలుపెట్టిన సమయంలో అతడి టవల్ జారి పడగా.. జునైద్ అటు వైపు చూసి సైగ చేశాడు. ఇంతలో బంతిని అందుకున్న భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ దానిని వికెట్లకు గిరాటేశాడు.అప్పీలును వెనక్కి తీసుకుని.. అప్పటికి జునైద్ క్రీజు బయట ఉండగా.. అంపైర్ అతడిని అవుట్‌గా ప్రకటించాడు. అయితే, కెప్టెన్ సూర్య మాత్రం తమ అప్పీలును వెనక్కి తీసుకుని.. జునైద్‌ను తిరిగి బ్యాటింగ్‌కు రావాల్సిందిగా ఆహ్వానించాడు. ఇలాంటివి అవసరమా సూర్య?ఈ విషయంపై స్పందించిన ఆకాశ్ చోప్రా.. ‘‘పాకిస్తాన్‌తో సెప్టెంబరు 14 నాటి మ్యాచ్‌లో మాత్రం ఇలా అస్సలు జరిగి ఉండేది కాదు. సల్మాన్ ఆఘా.. 14 ఓవర్లో బ్యాటింగ్ చేస్తున్నపుడు మ్యాచ్ రసవత్తరంగా ఉన్న వేళ.. సూర్య అస్సలు ఇలాంటి పని చేసి ఉండేవాడు కాదు. సంజూ అద్భుతంగా స్పందించి వికెట్లను గిరాటేశాడు. అతడు చేసింది సరైన పని.బ్యాటర్ క్రీజు బయట ఉన్నాడు కాబట్టి అది కచ్చితంగా అవుటే అని నా అభిప్రాయం. కానీ సూర్య ఇలా చేయడం వల్ల మున్ముందు పరిస్థితులు ఇబ్బందికరంగా మారతాయి. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఇలాంటివి జరిగితే అప్పుడు సూర్య అలా చేశాడు.. ఇలా చేశాడు అనే విమర్శలు వస్తాయి’’ అని పేర్కొన్నాడు.ఇచ్చిపడేసిన రహానేఅయితే, అజింక్య రహానే మాత్రం సూర్యను సమర్థించాడు. క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించినందుకు అతడిని ప్రశంసించాలని సూచించాడు. క్రికెట్లో ఇలాంటి ఘటనలు తరచూ జరగవని.. ఏదేమైనా టీమిండియా మంచి పనే చేసిందని కితాబులు ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. యూఏఈ విధించిన స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 4.3 ఓవర్లలో ఛేదించి.. తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది.చదవండి: 21 సార్లు డకౌట్ అయినా సరే.. జట్టులోనే.. అతడికి గంభీర్ చెప్పిందిదే.. -
‘ఇలాంటి జట్లపై ఎవరైనా ఆడతారు.. అతడికి మున్ముందు కఠిన సవాలు’
ఆసియా కప్-2025 (Asia Cup) టీ20 టోర్నమెంట్లో తమ తొలి మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు స్పెషలిస్టు బౌలర్లతో బరిలోకి దిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో మ్యాచ్‌లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav), మిస్టరీ స్పిన్ బౌలర్ వరుణ్ చక్రవర్తి, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాలను ఆడించింది.ఇక యూఏఈతో మ్యాచ్‌లో కేవలం ఏడు పరుగులే ఇచ్చి కుల్దీప్ నాలుగు వికెట్లు కూల్చగా.. బుమ్రా, వరుణ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. అయితే ఆల్‌రౌండర్ల కోటాలో బరిలోకి దిగిన అక్షర్ పటేల్ ఒక వికెట్ తీయగా.. శివం దూబే (Shivam Dube) అద్భుత గణాంకాలు నమోదు చేశాడు. రెండు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం నాలుగు పరుగులే ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు.ఇలాంటి జట్లపై ఎవరైనా ఆడతారుఈ నేపథ్యంలో శివం దూబే గురించి టీమిండియా మాజీ క్రికెటర్ సదగోపన్ రమేశ్ (Sadagopan Ramesh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీ20లలో హార్దిక్ పాండ్యా భారత మూడో సీమర్‌గా సేవలు అందించేవాడు. అయితే, ఇప్పుడు శివం దూబే మూడో సీమర్‌గా ఉన్నాడు.యూఏఈతో మ్యాచ్‌లో అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయితే, అలాంటి జట్టులపై ఎవరైనా రాణించగలరు. మున్ముందు కాస్త పటిష్ట జట్లను ఎదుర్కొంటున్నపుడు అతడికి కఠిన సవాలు ఎదురవుతుంది.PC: BCCIనమ్మకం నిలబెట్టుకుంటేనే రింకూ సింగ్‌ను కాదని శివం దూబేను జట్టులోకి తీసుకోవడానికి కారణం.. అతడు మూడో సీమింగ్ ఆప్షన్‌గా అందుబాటులో ఉంటాడని మాత్రమే కదా!.. ఏదేమైనా శివం దూబేపై మేనేజ్మెంట్ నమ్మకం ఉంచుతున్న విషయం స్పష్టమవుతోంది. అతడు దానిని నిలబెట్టుకుంటేనే పరిస్థితులు మున్ముందు ఎలా ఉంటాయో తెలుస్తుంది’’ అని సదగోపన్ రమేశ్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు.తొలి మ్యాచ్‌లో ఘన విజయంకాగా యూఏఈ వేదికగా సెప్టెంబరు 9న ఆసియా కప్-2025 టోర్నీ ఆరంభమైంది. ఈ ఖండాంతర ఈవెంట్లో టీమిండియా.. పాకిస్తాన్, ఒమన్, యూఏఈతో కలిసి గ్రూప్-‘ఎ’లో ఉంది. ఈ క్రమంలో తమ తొలి మ్యాచ్‌లో యూఏఈతో ఆడిన టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచి .. శుభారంభం అందుకుంది.టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న భారత్ యూఏఈని 57 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత కేవలం 4.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. తదుపరి చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో సెప్టెంబరు 14న టీమిండియా తలపడనుంది.చదవండి: ఆకాశమే హద్దుగా చెలరేగిన అర్జున్ టెండుల్కర్.. సానియా చందోక్ రాకతో.. -
నువ్వు 21 సార్లు డకౌట్ అయినా సరే.. జట్టులో ఉంటావు: గంభీర్
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్‌ను టీమిండియా అద్భుత విజయంతో ఆరంభించింది. గ్రూప్-‘ఎ’లో భాగమైన యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో తమ తొలి మ్యాచ్ ఆడిన భారత్.. పసికూనను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించి మరోసారి సత్తా చాటింది.టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. యూఏఈ జట్టును 57 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత స్వల్ప లక్ష్య ఛేదనను.. కేవలం 4.3 ఓవర్లలోనే పూర్తి చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (16 బంతుల్లో 30), శుబ్‌మన్ గిల్ (9 బంతుల్లో 20 నాటౌట్), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (2 బంతుల్లో 7 నాటౌట్) వేగంగా ఆడటంతో ఈ రికార్డు విజయం సాధ్యమైంది.వికెట్ కీపర్‌గా సేవలుఇదిలా ఉంటే.. యూఏఈతో ఆడిన భారత తుదిజట్టులో సంజూ శాంసన్‌కు చోటు దక్కింది. అయితే, గిల్ (Shubman Gill) గైర్హాజరీలో అంతర్జాతీయ టీ20లలో ఓపెనర్‌గా వచ్చిన సంజూ.. ఇప్పుడు మిడిలార్డర్లో ఆడనున్నాడు. యూఏఈతో బుధవారం నాటి మ్యాచ్‌లో అతడు వికెట్ కీపర్‌గా సేవలు అందించగా.. బ్యాటింగ్ చేసే అవకాశం మాత్రం రాలేదు.ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ సంజూ పట్ల టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్‌కోచ్ గౌతం గంభీర్ల వైఖరిపై స్పందించాడు. ‘‘నిజంగా నాకైతే ఆశ్చర్యంగా అనిపించింది. అయితే, సంజూకు కెప్టెన్, కోచ్ ఇంతలా మద్దతునివ్వడం సంతోషంగా ఉంది.నువ్వు 21 సార్లు డకౌట్ అయినా సరేసంజూ పట్ల వారు వ్యవహరిస్తున్న తీరు అద్భుతం. మీడియా సమావేశంలో తాము సంజూ గురించి శ్రద్ధ తీసుకుంటున్నామని సూర్య చెప్పడం ఆనందదాయకం. ఇక సంజూకు బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే అతడు మిడిలార్డర్లో వస్తాడు.పవర్ ప్లేలో త్వరగా వికెట్ కోల్పోతే సంజూ అప్పుడు బరిలోకి దిగుతాడు. అతడికి మంచి ప్రాధాన్యమే దక్కింది. ఏదేమైనా ఇది ప్రాజెక్ట్ సంజూ శాంసన్ అని చెప్పవచ్చు. నేను సంజూను ఇంటర్వ్యూ చేసినపుడు గంభీర్ తనతో ఏం చెప్పాడో సంజూ వివరించాడు.‘నువ్వు 21 సార్లు డకౌట్ అయినా సరే.. 22వ మ్యాచ్‌లో నీకు ఛాన్స్ ఉంటుంది’ అని గంభీర్ తనకు మద్దతుగా నిలిచాడని సంజూ చెప్పాడు. కోచ్, కెప్టెన్ ఓ ఆటగాడికి ఇలా అండగా నిలిస్తే అతడి ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది.నిజంగా అద్భుతంసంజూ నైపుణ్యాల పట్ల మేనేజ్మెంట్కు ఉన్న అవగాహన, నమ్మకం గురించి నాకు అప్పుడే అర్థమైంది. అతడి గురించి వారు ఆలోచించడం నిజంగా అద్భుతం’’ అని అశ్విన్.. సూర్య, గంభీర్‌లపై ప్రశంసలు కురిపించాడు. కాగా సంజూ శాంసన్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు 43 టీ20 మ్యాచ్‌లు ఆడి 861 పరుగులు చేశాడు.ఇందులో మూడు శతకాలు ఉన్నాయి ఇక ఆసియా టీ20 కప్-2025 కంటే ముందు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మాత్రం సంజూ తేలిపోయాడు. ఐదు మ్యాచ్‌లలో నాలుగింటిలో కేవలం సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యాడు. అయితే, ఇటీవల జరిగిన కేరళ క్రికెట్ లీగ్‌లో భాగంగా సంజూ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. చదవండి: IND vs WI: వాషింగ్టన్ సుందర్ కీలక నిర్ణయం -
Asia Cup 2025: బంగ్లాదేశ్ శుభారంభం
అబుదాబి: ఆసియా కప్ టి20 టోర్నీని బంగ్లాదేశ్ సునాయాస విజయంతో మొదలుపెట్టింది. గ్రూప్ ‘బి’లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన బంగ్లా 7 వికెట్ల తేడాతో హాంకాంగ్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హాంకాంగ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్ 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 144 పరుగులు సాధించి గెలిచింది. తమ తొలి పోరులో అఫ్గానిస్తాన్ చేతిలో ఓడిన హాంకాంగ్‌కు ఇది వరుసగా రెండో పరాజయం. ఓపెనర్ అన్షుమన్ రథ్ (4) తొందరగానే వెనుదిరిగినా... మరో ఓపెనర్ జీషాన్ అలీ (34 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి షాట్లతో హాంకాంగ్‌కు తగిన ఆరంభాన్ని అందించాడు. సీనియర్ బ్యాటర్ బాబర్ హయత్ (14) విఫలం కాగా, నిజాకత్ ఖాన్ (40 బంతుల్లో 42; 2 ఫోర్లు, 1 సిక్స్) పట్టుదలగా క్రీజ్‌లో నిలిచి పరుగులు సాధించాడు. ఈ క్రమంలో తాను ఆడిన 32వ బంతికి గానీ అతను తన తొలి బౌండరీ కొట్టలేకపోయాడు! చివర్లో కెప్టెన్ యాసిమ్ ముర్తజా (19 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడు హాంకాంగ్‌కు చెప్పుకోదగ్గ స్కోరును అందించింది. బంగ్లా బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేయడంలో సఫలమయ్యారు. ముఖ్యంగా 3–13 మధ్య ఆడిన 11 ఓవర్లలో ఒక్క ఓవర్లో మాత్రమే హాంకాంగ్ రెండంకెల స్కోరు చేయగలిగింది. అయితే ఆఖరి 6 ఓవర్లలో 54 పరుగులు రాబట్టడంతో హాంకాంగ్ గౌరవప్రదంగా ముగించగలిగింది. తన్జీమ్, తస్కీన్, రిషాద్ తలా 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో ఓపెనర్లు పర్వేజ్ (19), తన్జీద్ (14) ఎక్కువ సేపు నిలబడకపోయినా... కెపె్టన్ లిటన్ దాస్ (39 బంతుల్లో 59; 6 ఫోర్లు, 1 సిక్స్), తౌహీద్ (36 బంతుల్లో 35 నాటౌట్; 1 ఫోర్) భాగస్వామ్యంతో బంగ్లా సునాయాస విజయాన్ని అందుకుంది. వీరిద్దరు మూడో వికెట్‌కు 70 బంతుల్లో 95 పరుగులు జోడించారు. నేడు దుబాయ్‌లో జరిగే మ్యాచ్‌లో ఒమన్ జట్టుతో పాకిస్తాన్ ఆడుతుంది. -
రాణించిన హాంకాంగ్ బ్యాటర్లు.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే?
ఆసియాకప్-2025లో భాగంగా అబుదాబి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హాంకాంగ్ బ్యాటర్లు పర్వాలేదన్పించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 143 పరుగులు సాధించింది. హాంకాంగ్ బ్యాటర్లలో నిజాకత్ ఖాన్(42) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ యాసిమ్ ముర్తజా(28), జీషన్ అలీ(30) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హుస్సేన్, తంజిమ్ హసన్ సాకిబ్, టాస్కిన్ ఆహ్మద్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ముస్తఫిజుర్ రెహ్మన్ ఓ వికెట్ సాధించాడు. కాగా ఈ మ్యాచ్ హాంకాంగ్‌కు చాలా కీలకం. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడిపోతే హాంకాంగ్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. -
టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.. శ్రేయస్ రీ ఎంట్రీ?
ఆసియాకప్-2025 తర్వాత టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఈ రెడ్ బాల్ క్రికెట్ సిరీస్ ఆక్టోబర్ 2 నుంచి 16 వరకు జరగనుంది. వెంటనే ఆక్టోబర్ 19 భారత్-ఇండియా వైట్ బాల్ సిరీస్ ప్రారంభం కానుంది. దీంతో రాబోయో రెండు నెలల పాటు భారత జట్టు వరుస సిరీస్‌లతో బీజీబీజీగా గడపనుంది.కెప్టెన్‌గా రాహుల్..?వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు మరో పది రోజుల్లో ప్రకటించే అవకాశముంది. అయితే ఈ సిరీస్‌లోని తొలి టెస్టుకు టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు దూరమయ్యే అవకాశముంది. గిల్ ప్రస్తుతం ఆసియా కప్ టోర్నీలో బిజీగా ఉన్నాడు. గ్రూపు-ఎలో ఉన్న భారత్ ఫైనల్‌కు చేరడం దాదాపు ఖాయమనే చెప్పుకోవాలి. ఈ ఖండాంతర టోర్నీ ఫైనల్ సెప్టెంబర్ 28న జరగనుంది. అక్కడికి మూడు రోజుల్లో అంటే అక్టోబర్ 2 నుంచి వెస్టిండీస్‌తో తొలి టెస్టు మొదలు కానుంది. దీంతో మొదటి టెస్టుకు సెలక్టర్లు గిల్‌కు విశ్రాంతి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇదే జరిగితే తొలి టెస్టులో భారత కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించవచ్చు. రాహుల్ ఆసియాకప్ జట్టులో సభ్యునిగా లేని సంగతి తెలిసిందే.ఓపెనర్లగా రాహుల్, జైశ్వాల్..ఇక ఇంగ్లండ్ టూర్లో అద్బుతంగా రాణించిన యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనర్లగా కొనసాగనున్నారు. అదేవిధంగా అభిమన్యు ఈశ్వరన్ మరోసారి రిజర్వ్ ఓపెనర్‌గా ఉంటాడు. సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లగా ఎంపిక కానున్నారు. అయితే వీరిద్దరిలో ఒకరికే తుది జట్టులో చోటు దక్కే అవకాశముంది.పంత్‌కు గాయం, జగదీశన్‌కు చోటు..ఇక ఇంగ్లండ్ టూర్లో గాయపడ్డ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్.. విండీస్ సిరీస్‌కు దూరమయ్యే సూచనలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. అతడి స్ధానంలో ధ్రువ్ జురెల్ మరోసారి వికెట్ల వెనక బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అయితే తమిళనాడుకు చెందిన నారయణ్ జగదీశన్ సెకెండ్ వికెట్ కీపర్‌గా ఉండనున్నాడు.అయ్యర్ ఎంట్రీ?ఇక మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి భారత టెస్టు జట్టులోకి రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ కారణంతోనే అతడిని ఆసీస్-ఎతో సిరీస్‌కు భారత-ఎ జట్టు కెప్టెన్‌గా అయ్యర్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. శ్రేయస్‌కు భారత టెస్టు జట్టులో చోటు దక్కితే మరోసారి సర్ఫరాజ్ ఖాన్‌పై వేటు పడే అవకాశముంది.ఇక ఆల్రౌండర్లగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్,నితీష్ కుమార్ రెడ్డి తమ స్దానాలను పదిలం చేసుకున్నారు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చోటు దక్కించుకోనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ కొనసాగనున్నాడు. అయితే ఆసియాకప్‌లో కెప్టెన్ గిల్‌తో భాగమైన బుమ్రా, కుల్దీప్ యాదవ్‌లు తొలి టెస్టుకు అందుబాటులో ఉంటారో లేదో వేచి చూడాలి.వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టు (అంచనా)యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్ జగదీశన్.చదవండి: #Babar Azam: 6 లగ్జరీ కార్లు.. పాక్ రిచెస్ట్ క్రికెటర్‌గా! బాబర్ ఆజం నెట్ వర్త్ ఎంతంటే? -
బుమ్రా కంటే అతడు ఎంతో బెటర్.. ఎందుకు పక్కన పెట్టారు?
ఆసియాకప్-2025ను టీమిండియా విజయంతో ఆరంభించిన సంగతి తెలిసిందే. దుబాయ్ వేదికగా జరిగిన తమ తొలి మ్యాచ్‌లో యూఏఈను 9 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ ప్లేయింగ్ ఎలెవన్ నుంచి అర్ష్‌దీప్ సింగ్‌ను తప్పించడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాశంగా మారింది. గత కొన్నళ్లగా టీ20ల్లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్న ఆర్ష్‌దీప్‌కు యూఏఈపై ఆడే అవకాశం లభించలేదు. టీమ్ మెనెజ్‌మెంట్ తీసుకున్న ఈ నిర్ణయం అందరిని ఆశ్చర్యపరిచింది. తొలి మ్యాచ్‌లో భారత్ కేవలం ఒకే ప్రధాన పేసర్ బరిలోకి దిగింది. బుమ్రాతో పాటు మీడియం పేస్ బౌలర్లు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే బంతిని పంచుకున్నారు. దూబే మూడు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా ఓ వికెట్ సాధించాడు. హార్దిక్ కేవలం ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు.అర్ష్‌దీప్‌ను బెంచ్‌కే పరిమితం చేయడంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ లైనప్‌ను చూస్తుంటే భారత్ ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీ హ్యాంగోవర్ లో ఉన్నట్లు ఉందని చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్‌లను భారత్ దుబాయ్ వేదికగానే ఆడింది. ఫైనల్లో కివీస్‌ను చిత్తు చేసి టైటిల్‌ను మెన్ ఇన్ బ్లూ సొంతం చేసుకుంది.అర్ష్‌దీప్ సింగ్ అద్బుతమైన ఫాస్ట్ బౌలర్. అతడికి టీ20ల్లో 99 వికెట్లు ఉన్నాయి. ఈ ఫార్మాట్లో అతడు భారత్ తరపున లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. టీ20 క్రికెట్లో జస్ప్రీత్ బుమ్రా కంటే అర్ష్‌దీప్ గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి. ఈ ప్లేయింగ్ ఎలెవన్‌ను చూస్తుంటే భారత్ ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీ హ్యాంగోవర్ నుంచి రానిట్లు అన్పిస్తోంది. మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. ఆ సమయంలో వాతవారణం చాలా పొడిగా ఉంది. కాబట్టి అప్పుడు మీ వ్యహాలు పనిచేశాయి. కానీ ఇది సెప్టెంబర్. వాతారణ పరిస్థితులు మారాయి. అయినప్పటికి టీమ్ మెనెజ్‌మెంట్ అదే వ్యూహాంతో వెళ్లారు. ఫార్మాట్ మారిన భారత్ ప్లాన్ మారలేదు.వన్డే ఫార్మాట్‌కు టీ20కు చాలా తేడా ఉంది. రాబోయే మ్యాచ్‌లలో కూడా ఇదే ఎలెవన్‌తో ఆడనున్నారా? ఏదేమైనప్పటికి అత్యుత్తమ జట్టును ఎంపిక చేయండి" తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ నలుగురు స్పిన్నర్లతో ఆడింది. ఇప్పుడు ఫార్మాట్ మరినప్పటికి టీమిండియా అదే ప్రణాళికను అనుసరిస్తుందని చోప్రా విమర్శించాడు. కాగా ఈ మ్యాచ్‌లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. -
టీమిండియాతో మ్యాచ్.. పాకిస్తాన్‌కు భారీ షాక్!?
ఆసియాకప్-2025లో పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. శుక్రవారం (సెప్టెంబర్12) దుబాయ్ వేదికగా ఒమన్‌తో పాక్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు పాక్ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ అలీ అఘాకు స్వల్ప గాయమైనట్లు వార్తలు వస్తున్నాయి.దీంతో బుధవారం (సెప్టెంబర్ 10) దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు అతడు దూరంగా ఉన్నట్లు పాక్ మీడియా వర్గాలు వెల్లడించాయి. జియో న్యూస్ రిపోర్ట్ ప్రకారం.. ప్రాక్టీస్ సెషన్లో సల్మాన్ ఆఘా నెక్ బ్యాండ్‌తో కన్పించినట్లు సమాచారం. జట్టుతో పాటు ఐసీసీ ఆకాడమీకి వెళ్లినప్పటికి అతడు ఎటువంటి ప్రాక్టీస్‌లోనూ పాల్గోలేదంట. ఈ క్రమంలో భారత్‌తో మ్యాచ్‌కు ముందు తమ కెప్టెన్ గాయం బారిన పడడంతో పాకిస్తాన్ శిబిరంలో ఆందోళన నెలకొంది. అయితే ముందుస్తు జాగ్రత్తలో భాగంగానే అతడి విశ్రాంతికి ఇచ్చినట్లు పాక్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అతడు ప్రస్తుతం మెడ నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.ఒకవేళ ఒమన్‌తో జరిగే తొలి మ్యాచ్‌కు అఘా దూరమైనా.. భారత్‌తో మ్యాచ్‌కు మాత్రం పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశముంది. అప్పటికి అతడి గాయం తీవ్రమై భారత్ మ్యాచ్‌కు దూరమైతే పాక్‌కు గట్టి ఎదురు దెబ్బే అని చెప్పుకోవాలి.కాగా పాకిస్తాన్ దాదాపు రెండు వారాల ముందే యూఏఈకు చేరుకుంది. ఆసియాకప్ టోర్నీ సన్నాహాకాల్లో భాగంగా అఫ్గానిస్తాన్-యూఏఈలతో ట్రైసిరీస్‌లో పాక్ తలపడింది. ఫైనల్లో అఫ్గాన్‌ను చిత్తు చేసి టైటిల్‌ను పాక్ సొంతం చేసుకుంది. అదే జోరును ఇప్పుడు ఆసియాకప్‌లోనూ కొనసాగించాలని మెన్ ఇన్ గ్రీన్ పట్టుదలతో ఉంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా భారత్-పాక్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.ఆసియాకప్‌కు పాక్ జట్టుసల్మాన్ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రాఫ్, ఫకర్ జమాన్, హారిస్ రవూఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారిస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వాసిమ్ జూనియర్, షహిబ్జాద ఫర్హాన్, సయామ్ ఆయుబ్, సల్మాన్ మిర్జా, షహీన్ షా అఫ్రిది, సుఫ్యాన్ మోకిమ్చదవండి: Asia Cup 2025: 'అతడొక సంచలనం.. అందుకే వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ అయ్యాడు' -
'అతడొక సంచలనం.. అందుకే వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ అయ్యాడు'
ఆసియాకప్-2025లో టీమిండియా శుభారంభం చేసింది. బుధవారం దుబాయ్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ 57 పరుగులకే ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం 4.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి చేధించింది.అభిషేక్ శర్మ(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 30), శుభ్‌మన్ గిల్(9 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 20 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో 93 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని భారత్ అందుకుంది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. నాలుగు వికెట్లతో చెలరేగిన కుల్దీప్ యాదవ్, బ్యాటింగ్‌లో దుమ్ములేపిన అభిషేక్ శర్మపై సూర్య ప్రశంసల వర్షం కురిపించాడు."పిచ్ ఎలా స్పందిస్తుందో తెలుసుకోవాలనుకున్నాము. అందుకే టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాము. రెండు ఇన్నింగ్స్‌లోనూ వికెట్ ఒకేలా ఉంది. ఈ మ్యాచ్‌లో మా బాయ్స్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. మేము ప్రతీ మ్యాచ్‌లోనూ మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌ను కొనసాగించాలనకుంటున్నాము. ఈ మ్యాచ్‌లో మేము అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా రాణించాము. మా జట్టులో చాలా మంది ఆటగాళ్లు ఇటీవల ఛాంపియన్ ట్రోఫీలో ఇక్కడ ఆడారు. పిచ్ బాగానే ఉంది. కానీ వికెట్ కాస్త నెమ్మదిగా ఉంది. స్పిన్నర్లకు అనుకూలంగా ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం దుబాయ్‌లో వాతవారణం చాలా వేడిగా ఉంది. నిజంగా కుల్దీప్ యాదవ్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. అతడికి దూబే, బుమ్రా, వరుణ్ నుంచి సపోర్ట్ లభించింది. ఇక అభిషేక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడొక అద్భుతం. జట్టు 200 పరుగులు చేధించినా, టార్గెట్ 50 అయినా అతడి ఆట తీరు ఒకే విధంగా ఉంటుంది. అందుకే అతడు ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్ కోసం మా ఆటగాళ్లంతా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో పేర్కొన్నాడు. సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనుంది.చదవండి: Asia Cup 2025: చరిత్ర సృష్టించిన టీమిండియా.. తొలి జట్టుగా -
భారత్-పాక్ మ్యాచ్ రద్దుకు సుప్రీం కోర్టులో పిల్.. న్యాయస్థానం స్పందన ఇదే..!
ఆసియా కప్ 2025లో భాగంగా ఈ నెల 14న దుబాయ్‌లో జరుగబోయే భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై సుప్రీం కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (PIL) దాఖలైంది. ఈ మ్యాచ్‌ను రద్దు చేయాలని ఉర్వశి జైన్ నేతృత్వంలో నలుగురు న్యాయ విద్యార్థులు ఆర్టికల్ 32 ప్రకారం పిటిషన్‌ను దాఖలు చేశారు.పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జాతీయ గౌరవానికి విరుద్ధమని వారు పిటిషన్లో పేర్కొన్నారు. మ్యాచ్ నిర్వహణ అమరవీరుల కుటుంబాలకు బాధ కలిగించే చర్యగా అభిప్రాయపడ్డారు.అయితే, ఈ పిటిషన్‌ను జస్టిస్ జె.కె.మహేశ్వరి, విజయ్ బిష్ణోయి నేతృత్వంలోని బెంచ్ విచారణకు తీసుకోలేదు. "ఇది కేవలం మ్యాచ్ మాత్రమే.. వదిలేయండి" అంటూ న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై రాజకీయ, సామాజిక భావోద్వేగాలు ఉన్నప్పటికీ, సుప్రీం కోర్టు ఈ విషయాన్ని క్రీడా పరంగా మాత్రమే పరిగణించింది. క్రికెట్‌ను జాతీయ ప్రయోజనాల కంటే పైగా చూడలేమన్న అభిప్రాయాలు ఉన్నా, ప్రస్తుత విధానాలు మరియు అంతర్జాతీయ ఒప్పందాలు కారణంగా మ్యాచ్‌ను కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బహుల దేశాలు పాల్గొనే టోర్నీల్లో పాక్‌తో మ్యాచ్‌ను రద్దు చేసుకుంటే, అది భారత ఆటగాళ్ల కెరీర్లపై ప్రభావం చూపే ప్రమాదముంది.బహుల దేశాలు పాల్గొనే టోర్నీల్లో టీమిండియా పాక్‌తో తలపడనున్నా, ద్వైపాక్షిక సిరీస్‌లు మాత్రం ఆడదు. ఈ విషయాన్ని బీసీసీఐ ఇదివరకే స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే, ఆసియా కప్‌లో భారత్ ఘనంగా బోణీ కొట్టింది. నిన్న (సెప్టెంబర్ 10) యూఏఈతో జరిగిన మ్యాచ్‌ను టీమిండియా 27 బంతుల్లోనే ముగించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. కుల్దీప్ యాదవ్ (2.1-0-7-4), శివమ్ దూబే (2-0-4-3), వరుణ్ చక్రవర్తి (2-0-4-1), అక్షర్ పటేల్ (3-0-13-1), బుమ్రా (3-0-19-1) ధాటికి 13.1 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. అభిషేక్ శర్మ (16 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (9 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (2 బంతుల్లో 7 నాటౌట్; సిక్స్) చెలరేగడంతో 4.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
ఆసియా కప్ టీ-20లో టీమిండియా బోణి
-
Asia Cup 2025: రోహిత్ శర్మ సరసన అభిషేక్ శర్మ
టీమిండియా యువ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ యూఏఈతో నిన్న (సెప్టెంబర్ 10) జరిగిన ఆసియా కప్ 2025 మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో తొలి బంతి నుంచే ఊచకోత మొదలుపెట్టిన అభిషేక్.. యూఏఈ బౌలర్లపై తారాస్థాయిలో విరుచుకుపడ్డాడు. హైదర్ అలీ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్సర్ బాదిన అభిషేక్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ సరసన చేరాడు.ABHISHEK SHARMA - HIT THE FIRST BALL OF THE INNINGS FOR A SIX. 🤯 pic.twitter.com/4sWr6hOLl0— Johns. (@CricCrazyJohns) September 10, 2025రోహిత్ (2021లో ఇంగ్లండ్‌పై), జైస్వాల్ (2024లో జింబాబ్వేపై), సంజూ (2025లో ఇంగ్లండ్‌పై) కూడా గతంలో అభిషేక్ తరహాలనే ఇన్నింగ్స్ టీ20ల్లో తొలి బంతికే సిక్సర్ కొట్టారు.భారీ విజయంఅభిషేక్ విధ్వంసం ధాటికి యూఏఈ నిర్దేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం 4.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. బంతుల పరంగా టీ20ల్లో భారత్‌కు ఇదే భారీ విజయం. మరో 93 బంతులు మిగిలుండగానే టీమిండియా లక్ష్యాన్ని ఊదేసింది. 2021లో స్కాట్లాండ్పై 81 బంతులు మిగిలుండగానే గెలుపొందడం దీనికి ముందున్న రికార్డు.ఆసియా కప్ చరిత్రలోనూ బంతుల పరంగా ఇదే భారీ విజయం. గతంలో ఈ రికార్డు ఆఫ్ఘనిస్తాన్ పేరిట ఉండేది. 2022 ఎడిషన్‌లో ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంకపై 59 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.27 బంతుల్లోనే టార్గెట్ ఫినిష్ఈ మ్యాచ్‌లో టీమిండియా మరో ఘనత కూడా సాధించింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా లక్ష్య ఛేదన చేసిన రెండో జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ కేవలం 27 బంతుల్లోనే టార్గెట్‌ను ఊదేసింది. ఈ రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉంది. 2022 ప్రపంచకప్‌లో ఆ జట్టు ఒమన్‌పై కేవలం 19 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ.. కుల్దీప్ యాదవ్ (2.1-0-7-4), శివమ్ దూబే (2-0-4-3), వరుణ్ చక్రవర్తి (2-0-4-1), అక్షర్ పటేల్ (3-0-13-1), బుమ్రా (3-0-19-1) ధాటికి 13.1 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది. యూఏఈ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు అలీషాన్ షరాఫు (22), ముహమ్మద్ వసీం (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. అభిషేక్, శుభ్‌మన్ గిల్ (9 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (2 బంతుల్లో 7 నాటౌట్; సిక్స్) ధాటికి 4.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఈ టోర్నీలో భారత్ సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌తో తలపడనుంది. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. తొలి జట్టుగా
ఆసియాకప్-2025ను టీమిండియా అద్బుతమైన విజయంతో ఆరంభించింది. ఈ టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన తమ తొలి మ్యాచ్‌లో యూఏఈను 9 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. యూఏఈ నిర్ధేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 4.3 ఓవర్లలోనే చేధించింది.భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 30), శుబ్‌మన్ గిల్(9 బంతుల్లో 20 నాటౌట్) దూకుడుగా ఆడి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన యూఏఈ 13.1 ఓవర్లలో కేవలం 57 పరుగులకే కుప్పకూలింది.భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు, శివమ్ దూబే మూడు వికెట్లు పడగొట్టగారు. వీరితో పాటు బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా వికెట్ సాధించారు.ఇక ఈ మ్యాచ్‌లో కేవలం 4.3 ఓవర్లను టార్గెట్‌ను ఫినిష్ చేసిన భారత్ పలు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది. చరిత్ర సృష్టించిన భారత్..ఆసియాకప్ టీ20 టోర్నీలో బంతులు పరంగా భారీ విజయం సాధించిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో 93 బంతులు మిగిలుండగానే భారత్ లక్ష్యాన్ని చేధించింది. ఇంతకుముందు ఈ రికార్డు అఫ్గానిస్తాన్ పేరిట ఉండేది.ఆసియాకప్-2022లో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై 59 బంతులు మిగిలూండగానే అఫ్గాన్ గెలుపొందింది. తాజా మ్యాచ్‌తో అఫ్గాన్ అల్‌టైమ్ రికార్డును భారత్ బ్రేక్ చేసింది. ఓవరాల్‌గా టీ20ల్లో టీమిండియాకు బంతులు పరంగా ఇదే భారీ విజయం కావడం గమనార్హం. అంతకుముందు టీ20 ప్రపంచకప్-2021లో స్కాట్లాండ్పై 81 బంతుల్లో మిగిలూండగా భారత్ విజయం సాధించింది. అదేవిధంగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యంతవేగంగా రన్ ఛేజ్ చేసిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. అగ్రస్దానంలో ఇంగ్లండ్ ఉంది. టీ20 ప్రపంచకప్-2024లో ఒమన్‌పై కేవలం 3.1 ఓవర్లలోనే ఇంగ్లండ్ లక్ష్యాన్ని చేధించింది. -
టీమిండియా సూపర్ విక్టరీ.. 27 బంతుల్లోనే టార్గెట్ ఫినిష్
ఆసియాకప్-2025లో భారత్ శుభారంభం చేసింది. ఈ టోర్నీలో భాగంగా బుధవారం దుబాయ్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ.. భారత బౌలర్ల ధాటికి 13.1 ఓవర్లలో కేవలం 57 పరుగులకే కుప్పకూలింది.టీమిండియా స్పిన్ ఉచ్చులో యూఏఈ బ్యాటర్లు చిక్కుకున్నారు. ఓపెనర్లు అలీషన్ షరాఫు(22), కెప్టెన్ వసీం మహ్మద్(19) ఆరంభంలో పర్వాలేదన్పించారు. షరాఫూను బుమ్రా ఔట్ చేశాక యూఏఈ వికెట్ల పతనం మొదలైంది. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 2.1 ఓవర్లలో కేవలం 7 పరుగులిచ్చి 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో పాటు ఆల్‌రౌండర్ శివమ్ దూబే మూడు, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, బుమ్రా తలా వికెట్ సాధించారు.అభిషేక్ ధానాధన్..అనంతరం 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 4.3 ఓవర్లలో ఊదిపడేసింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 30) టాప్ స్కోరర్ కాగా.. శుబ్‌మన్ గిల్(20), సూర్యకకుమార్ యాదవ్(7) ఆజేయంగా నిలిచారు. యూఏఈ బౌలర్లలో సిద్దుఖీ ఒక్క వికెట్ సాధించాడు. ఇక భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది.చదవండి: Asia Cup 2025: జస్ప్రీత్ బుమ్రా సూపర్ యార్కర్.. దెబ్బకు బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో -
జస్ప్రీత్ బుమ్రా సూపర్ యార్కర్.. దెబ్బకు బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా మరోసారి తన మార్క్ చూపించాడు. ఆసియాకప్-2025లో భాగంగా యూఏఈతో జరుగుతున్న మ్యాచ్‌లో అద్బుతమైన యార్కర్‌తో మెరిశాడు. అతడి వేసిన బంతికి యూఏఈ బ్యాటర్ అలీషన్ షరాఫు వద్ద సమాధానమే లేకుండా పోయింది.యూఏఈ ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేసిన బుమ్రా.. నాలుగో డెలివరీని అలీషన్కు సూపర్ యార్కర్‌గా సంధించాడు. అలీషన్ షరాఫు తన బ్యాట్‌ను కిందకు దించే లోపు బంతి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. దెబ్బకు యూఏఈ బ్యాటర్ బిత్తర పోయాడు. దీంతో అలీషన్(17 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 22) ధానాదన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.కాగా వర్క్‌లోడ్ మెనెజ్‌మెంట్‌లో భాగంగా ఇంగ్లండ్ పర్యటనలో మధ్యలోనే వచ్చేసిన బుమ్రాకు ఇదే తొలి మ్యాచ్. అయితే యూఏఈతో మ్యాచ్‌కు బుమ్రాకు విశ్రాంతి ఇస్తారని వార్తలు వచ్చాయి. కానీ టీమ్‌మెనెజ్‌మెంట్ బుమ్రాకు మొదటి మ్యాచ్‌లో ఆడించి యువ పేసర్ అర్ష్‌దీప్‌ను బెంచ్‌కే పరిమితం చేసింది. ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా.. 19 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 13.1 ఓవర్లలో కేవలం 57 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించాడు. అతడితో పాటు శివమ్ దూబే మూడు, అక్షర్ పటేల్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి తలా వికెట్ సాధించాడు. యూఏఈ బ్యాటర్లలో అలీషన్ షరాఫు(22) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.Jasprit Bumrah and knocking stumps over — name a better combo 💥Watch #DPWORLDASIACUP2025 - LIVE on #SonyLIV & #SonySportsNetwork TV Channels 📺#AsiaCup #INDvUAE pic.twitter.com/q3wrec57d2— Sony LIV (@SonyLIV) September 10, 2025 -
టీమిండియా లీడింగ్ వికెట్ టేకర్.. కట్ చేస్తే! తుది జట్టులో నో ఛాన్స్
అర్ష్‌దీప్ సింగ్.. టీ20 క్రికెట్లో 100 వికెట్లు సాధించిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో నిలిచాడు. ఆసియాకప్-2025లో బుధవారం దుబాయ్ వేదికగా భారత్-యూఏఈ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ వంద వికెట్ల మైలు రాయిని అందుకుంటాడని అంతా భావించారు. కానీ భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో అర్ష్‌దీప్‌కు చోటు దక్కకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. అతడి స్ధానంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు టీమ్ మెనెజ్‌మెంట్ అవకాశమిచ్చింది. తుది జట్టులో ప్రధాన పేసర్‌గా జస్ప్రీత్ బుమ్రా ఒక్కడికే చోటు దక్కింది. అతడితో పాటు మీడియం పేస్ బౌలర్ హార్దిక్ పాండ్యా బంతిని పంచుకోనున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలు స్పిన్నర్లగా ఉన్నారు. అయితే పిచ్ కండీషన్స్ దృష్ట్యా కెప్టెన్ సూర్య కుమార్ అండ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. వికెట్ మధ్యలో చిన్న చిన్న పగుళ్లు ఉండడంతో స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది. అయితే అర్ష్‌దీప్‌ను పక్కన పెట్టడానికి గల కారణాన్ని అయితే కెప్టెన్ సూర్య వెల్లడించలేదు. కాగా అర్ష్‌దీప్ గత కొంతకాలంగా భారత టీ20 జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నాడు. కొత్త బంతితో పాటు డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసే సత్తా అతడికి ఉంది. అంతేకాకుండా టీమిండియా తరపున టీ20ల్లో లీడింగ్ వికెట్ టేకర్ కూడా అర్ష్‌దీప్(97)నే కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. -
ఆసియాకప్‌లో భారత్ బోణీ.. యూఏఈ చిత్తు
Asia Cup 2025 Ind vs Uae live Updates and Highlights:భారత్ ఘన విజయం..ఆసియాకప్‌లో టీమిండియా బోణీ కొట్టింది. దుబాయ్ వేదికగా యూఏఈ జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 4.3 ఓవర్లలో చేధించింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 30) టాప్ స్కోరర్ కాగా.. శుబ్‌మన్ గిల్(20), సూర్యకకుమార్ యాదవ్(7) ఆజేయంగా నిలిచారుయూఏఈ బౌలర్లలో సిద్దుఖీ ఒక్కడే వికెట్ సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన యూఏఈ 13.1 ఓవర్లలో కేవలం 57 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు, శివమ్ దూబే మూడు వికెట్లు పడగొట్టగారు. వీరితో పాటు బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా వికెట్ సాధించారు.దూకుడుగా ఆడుతున్న గిల్,అభిషేక్58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. రెండు ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(13), అభిషేక్ శర్మ(11) ఉన్నారు.57 పరుగులకే యూఏఈ ఆలౌట్..దుబాయ్ వేదికగా యూఏఈతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 13.1 ఓవర్లలో కేవలం 57 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించాడు.అతడితో పాటు శివమ్ దూబే మూడు, అక్షర్ పటేల్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి తలా వికెట్ సాధించాడు. యూఏఈ బ్యాటర్లలో అలీషన్ షరాఫు(22) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.ఆలౌట్ దిశగా యూఏఈ..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ ఆలౌట్ దిశగా సాగుతోంది. 57 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఆతిథ్య యూఏఈ పీకల్లోతు కష్టాల్లో పడింది. కుల్దీప్ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్లో 3 వికెట్లుకుల్దీప్ యాదవ్ స్పిన్ మయాజాలానికి యూఏఈ ఒకే ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయింది. 9వ ఓవర్లో తొలి బంతికి రాహుల్ చోప్రా ఔట్ కాగా.. నాలుగో బంతికి కెప్టెన్ మహ్మద్ వసీం(19),.. ఆఖరి బంతికి హర్షిత్ కౌశిక్(2) పెవిలియన్‌కు చేరారు. 9 ఓవర్లకు యూఏఈ స్కోర్: 50/57 ఓవర్లకు యూఏఈ స్కోర్: 45/27 ఓవర్లు ముగిసే సరికి యూఏఈ రెండు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. క్రీజులో మహ్మద్ వసీం(18), రాహుల్ చోప్రా(2) ఉన్నారు.యూఏఈ రెండో వికెట్ డౌన్..29 పరుగుల వద్ద యూఏఈ రెండో వికెట్ కోల్పోయింది. రెండు పరుగులు చేసిన ముహమ్మద్ జోహైబ్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు. యూఏఈ తొలి వికెట్ డౌన్..27 పరుగుల వద్ద యూఏఈ తొలి వికెట్ కోల్పోయింది. అలీషన్ షరాఫు(22)ను బుమ్రా అద్బుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. 4 ఓవర్లకు యూఏఈ స్కోర్: 27/0రెండు ఓవర్లకు యూఏఈ స్కోర్: 16/0రెండు ఓవర్లు ముగిసే సరికి యూఏఈ వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. క్రీజులో మహ్మద్ వసీం(1),అలీషన్ షరాఫు(14) ఉన్నారు.ఆసియాకప్-2025లో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో అబుదాబి వేదికగా యూఏఈతో తలపడతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పిచ్‌పై గ్రాస్ ఎక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత కెప్టెన్ సూర్యకుమార్ కుమార్ యాదవ్ వెల్లడించాడు. అదేవిధంగా ఈ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్స్‌లో తీవ్రంగా శ్రమించినట్లు సూర్య చెప్పుకొచ్చాడు. కాగా భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో వికెట్ కీపర్ బ్యాటర్‌గా సంజూ శాంసన్‌కు చోటు దక్కింది. అయితే సంజూ మిడిలార్డర్ బ్యాటింగ్‌కు రానున్నాడు. ఓపెనర్లుగా శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ బరిలోకి దిగనున్నారు. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా సైతం ఈ మ్యాచ్‌లో ఆడుతున్నాడు.తుది జట్లుభారత్అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తియునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ : ముహమ్మద్ వసీమ్(కెప్టెన్), అలీషాన్ షరాఫు, ముహమ్మద్ జోహైబ్, రాహుల్ చోప్రా(వికెట్ కీపర్), ఆసిఫ్ ఖాన్, హర్షిత్ కౌశిక్, హైదర్ అలీ, ధ్రువ్ పరాశర్, ముహమ్మద్ రోహిద్ ఖాన్, జునైద్ సిద్ధిక్, సిమ్రంజీత్ సింగ్ -
‘నా మీద పడి కరిచేసింది.. చచ్చిపోయేవాడిని బతికాను’
ఆసియాకప్-2025 కోసం టీమిండియా నయా ఫినిషర్ రింకూ సింగ్ సిద్దమయ్యాడు. అయితే ఈ స్ధాయికి చేరుకున్న రింకూ విజయం వెనక ఎన్నో కష్టాలు దాగి ఉన్నాయి. ఒక స్వీపర్‌గా, ఆటోడ్రైవర్‌గా, గ్యాస్ డెలివరీగా బాయ్‌గా పనిచేస్తూనే అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగాడు.అయితే రింకూ జీవితంలో ఇవే కాకుండా మరో విషాద సంఘటన కూడా దాగి ఉందంట. ఈ యూపీ క్రికెటర్ ఇటీవల రాజ్ షమ్మానీ యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో పాల్గోన్నాడు. ఈ సందర్భంగా రింకూ సింగ్ చిన్నతనంలో జరిగిన ఓ ఊహించని సంఘటనను అభిమానులతో పంచుకున్నాడు. తన పదేళ్ల వయస్సులో కోతి కరవడంతో ప్రాణాపాయ స్థితికి వెళ్లానని రింకూ చెప్పుకొచ్చాడు."నా చిన్నతనంలో జరిగిన ఓ ఘటనను నేను ఎప్పటికి మర్చిపోలేను. అప్పటిలో మా ఇంట్లో వాష్ రూమ్స్ లేవు. కాబట్టి మేము ఆరు బయటకు వెళ్లేవాళ్లం. ఓ రోజు వర్షం పడుతుండడగా నేను మా అన్నయ్య, కొంత మంది స్నేహితులు కలిసి బయటకు వెళ్లాము.అయితే కోతి వస్తుంది దూరంగా ఉండండి అంటూ వెనక నుంచి మాకు అరుపులు వినిపించాయి. కానీ అంతలోనే ఆ కోతి వెనక నుంచి నాపై తీవ్రంగా దాడి చేసింది. దీంతో ఒక్కసారిగా కిందపడిపోయాను. అయినప్పటికి నన్ను అది వదలకుండా కరుస్తూనే ఉంది. నా చేతిలోని ముక్కను తన దంతాలతో లాగేసింది. నన్ను ఆ కోతి నుంచి కాపాడానికి అక్కడ పెద్దగా జనం లేరు.మా అన్నయ్య మాత్రం కోతిపై రాళ్లు విసిరి వెళ్లగొట్టే ప్రయత్నం చేశాడు. కానీ అది నన్ను వదలలేదు. అది నన్ను తీవ్రంగా గాయపరిచింది. ఏదో విధంగా అక్కడ నుంచి తప్పించుకుని పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాను. అప్పటికే నా చేతి నుంచి తీవ్రంగా రక్తస్రావం అవుతోంది. నా చేతిలోని ఎమకులు బయటకు కన్పించాయి. తరువాత మేము ఒక క్లినిక్‌కి వెళ్ళాము. అక్కడ డాక్టర్ డ్రెస్సింగ్ చేశారు. అయినప్పటికి చాలా రక్తం బయటకు వచ్చిస్తోంది. నేను బ్రతుకుతానో లేదో తెలియక నా కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత మరో డాక్టర్ వచ్చి నాకు చికిత్స అందించారు. దీంతో నేను ప్రాణపాయం స్ధితి నుంచి తప్పించుకున్నాను.రెండు చేతులూ ఒకేలా ఉండవు..ఇటీవలే నేను డెక్సా టెస్టుకు హాజరయ్యాను. రెండు చేతుల మధ్య బరువు కిలో తేడాగా ఉన్నట్లు తేలింది. ఎందుకంటే ఆ కోతి నా చేతిలో ఒక కండను కొరికి బయటకు తీసేసేంది. అందుకే నేనే జిమ్ చేసే సమయంలో ఒక చేతితో ఎత్తగలిగినంత బరువును మరొక చేతితో ఎత్తలేను. రెండు చేతుల మధ్య చాలా తేడా ఉంది. ఆ కోతి ఎవరినీ వదిలిపెట్టలేదు. మా ఐదుగురు సోదరులలో అందరిని కరిచింది" అని రింకూ సింగ్ పేర్కొన్నాడు.చదవండి: ‘యువీ, సెహ్వాగ్ వంటి వారే లేరు.. బుమ్రాను తీర్చిదిద్దండి’ -
గిల్‌కు ప్రమోషన్.. సూర్యకు సెగ!
ఆసియాకప్ 2025 టోర్నిలో టీమిండియా ఈరోజు తన తొలి మ్యాచ్ ఆడనుంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. యంగ్ ప్లేయర్స్‌తో టీమిండియా మంచి ఊపుమీద ఉంది. భారత క్రికెట్ కొత్త పోస్టర్ బాయ్ శుబ్‌మన్ గిల్‌ను టి20 టీమ్‌కు వైస్ కెప్టెన్‌గా నియమించడంతో పాజిటివ్ బజ్ క్రియేటయింది. ఇదే సమయంలో కెప్టెన్ సూర్యకు పరోక్షంగా హెచ్చరిక జారీ చేసినట్టయింది. 'నీ పోస్టుకు ఎసరు తప్పద'ని సందేశం ఇచ్చినట్టుగా కనబడుతోంది. గిల్‌కు ప్రమోషన్‌తో సూర్యకు సెగ తాకిందా అనే చర్చ మొదలైంది.టీమిండియా పొట్టి ఫార్మాట్ కెప్టెన్‌గా సూర్య విజయవంతం అయ్యాడు. టి20 టీమ్ నాయకుడిగా అతడి విజయాల శాతం 80 వరకు ఉంది. కానీ ఆటగాడిగా విఫలమవుతున్నాడు. స్కై భారీ ఇన్నింగ్స్ ఆడి చాలా కాలమైంది. కెప్టెన్‌గా జట్టును విజయవంతంగా నడిపించడంతోనే సరిపెట్టుకోకుండా, వ్యక్తిగతంగానూ పరుగులు చేయాలని బీసీసీఐ (BCCI) పెద్దలు కోరుకుంటున్నారు. గత నెల టీమ్ ప్రకటన సందర్భంగా సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 'సిరీస్‌లు గెలవడం ఒక్కటే కెప్టెన్ పనికాదు. అతడి బ్యాట్ నుంచి ధారాళంగా పరుగులు కూడా రావాలి' అంటూ అగార్కర్ కమెంట్ చేశారు.కెప్టెన్ అయ్యాక రన్స్ డౌన్ సూర్యకుమార్ యాదవ్ 22 మ్యాచ్‌ల్లో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి 26.57 సగటుతో 558 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. జట్టు పగ్గాలు చేపట్టిన తర్వాత అతడి బ్యాట్ నుంచి పరుగులు రావడం తగ్గిపోయాయి. కెప్టెన్ కాకముందు 66 మ్యాచ్‌ల్లో 43.40 సగటుతో 2040 పరుగులు సాధించాడు. ఇందులో మూడు శతకాలు, 17 ఫిఫ్టీలు ఉన్నాయి. నాయకత్వ బాధ్యతలు తలకెత్తుకున్న తర్వాత స్కై బ్యాట్ నుంచి పరుగులు రావడం క్రమంగా తగ్గింది. గత ఏడాది అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌పై అతడు చేసిన హాఫ్ సెంచరీ(75) తర్వాత మళ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడలేదు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల సిరీస్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు. ఈ సిరీస్‌లో అతడు చేసిన అత్యధిక స్కోరు 28.షార్ట్ సెలక్షన్ బాలేదుఆసియాకప్లో సూర్య ఎలా ఆడతాడనే దానిపై అతడి భవితవ్యం ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నాయి. అయితే సూర్య పుంజుకుంటాడని, ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగిస్తాడని టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ (Wasim Jaffer) అభిప్రాయపడ్డాడు. 'పరుగులు సాధించలేకపోవడమే అతడి సమస్య. ఇంతకుముందు ఆడిన ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో అతడి షార్ట్ సెలక్షన్ స్థాయికి తగినట్టు లేదు. కానీ ఐపీఎల్లో మాత్రం బాగా ఆడాడు. పొట్టి ఫార్మాట్లో అతడు ప్రమాదకర ఆటగాడు. తనదైన రోజున బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. ఆసియాకప్ భిన్నంగా ఉంటుంది. జట్టు కూర్పు, బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉండాలో చూసుకోవడంతోనే సరిపోదు. ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా ఎక్కువ పరుగులు చేసి స్కై తన స్థానాన్ని పదిలపరుచుకోవాల'ని జాఫర్ అన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో 16 మ్యాచ్‌ల్లో 717 పరుగులు చేసిన సూర్య.. సాయి సుదర్శన్ తర్వాత రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.చదవండి: యువరాజ్ సింగ్‌కు అప్‌గ్రేడ్ వర్షన్ అతడు బ్యాట్‌తోనే జవాబిస్తాడుశుబ్మన్ గిల్‌ను వైస్ కెప్టెన్ నియమించడం వల్ల సూర్యపై ఒత్తిడి పెరగబోదని జాఫర్ అభిప్రాయపడ్డాడు. ప్రతి టోర్నమెంట్‌కు వైస్ కెప్టెన్ ఉంటాడని, అలాగే ప్రతి టోర్నీ కూడా సవాల్‌తో కూడుకున్నదని చెప్పాడు. భారీ స్కోరుతో గతవైభవాన్ని అందుకోవడమే సూర్య తక్షణ కర్తవ్యమని, అంచనాలకు తగినట్టుగా రాణించాలని అన్నాడు. తనపైన ముసురుకున్న నీలి మేఘాలను పటాపంచలు చేయాలని ప్రపంచం ఎదురు చూస్తోందన్నాడు. సూర్యపై తనకు నమ్మకం ఉందని, ఆటతోనే సమాధానం చెబుతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా, ఆరంభ రోజుల్లో జాఫర్ కెప్టెన్సీలో ముంబై తరపున సూర్య ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సంగతి క్రికెట్ లవర్స్‌కు గుర్తుండే ఉంటుంది. -
అభిషేక్, బుమ్రా, సంజూ.. వావ్.. ఎవరిని తప్పిస్తారు?: అక్తర్
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా మంగళవారం మొదలైంది. గ్రూప్-‘బి’ మ్యాచ్‌లో భాగంగా హాంకాంగ్‌పై అఫ్గనిస్తాన్ 94 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా టాపర్‌గా నిలిచి.. రన్‌రేటు పరంగా (+4.700)నూ పటిష్ట స్థితిలోకి వెళ్లింది.ఈ క్రమంలో గ్రూప్-‘ఎ’ తొలి మ్యాచ్‌లో భాగంగా టీమిండియా- యూఏఈ (IND vs UAE)తో తలపడనుంది. దుబాయ్‌లో బుధవారం నాటి ఈ మ్యాచ్‌కు భారత తుదిజట్టు ఎంపిక ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్‌బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.అభిషేక్, బుమ్రా, సంజూ.. వావ్.. ఎవరిని తప్పిస్తారు?భారత్ పటిష్ట జట్టుగా పేర్కొన్న అక్తర్.. ఉన్న పదిహేను మంది సూపర్ అని.. వారిలో ఎవరిని పక్కనపెడతారో అర్థం కావడం లేదని పేర్కొన్నాడు. ఓ యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. ‘‘అచ్చా.. అభిషేక్ వచ్చేశాడు. బుమ్రా (Jasprit Bumrah) ఉన్నాడు. అంతేకాదు సంజూ కూడా ఉన్నాడు. తిలక్ ఉన్నాడు.హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, రింకూ సింగ్ కూడా ఉండనే ఉన్నారు. శుబ్‌మన్ ఉన్నాడు. సూర్య ఉన్నాడు. శివం దూబేతో పాటు మన అక్షర్ పటేల్ కూడా!.. ఇందులో ఎవరిని తప్పించగలరు మిత్రమా!’’ అంటూ షోయబ్ అక్తర్ తనదైన శైలిలో కామెంట్లు చేశాడు.కత్తిమీద సాములాప్రస్తుత పరిస్థితుల్లో భారత తుదిజట్టు కూర్పు మేనేజ్మెంట్కు కత్తిమీద సాములా మారిందంటూ టీమిండియా అత్యంత పటిష్టంగా ఉందని అక్తర్ చెప్పకనే చెప్పాడు. ఇక తొలి మ్యాచ్‌లో సూర్యకుమార్ సేన విజయం నల్లేరు మీద నడకేనన్న అక్తర్.. యూఏఈ కూడా మంచి జట్టేనని కితాబులు ఇచ్చాడు.ఓటమి ఖాయమే.. కానీ కనీసం‘‘టీమిండియా చేతిలో యూఏఈ ఓడిపోతుందని తెలుసు. అయితే, తక్కువ తేడాతో ఓడిపోవాలని ఆకాంక్షిస్తున్నా. తొలి మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్ చేతిలో హాంకాంగ్ చిత్తుగా ఓడింది. కనీసం మీరైనా అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. కాస్తైనా పోరాట పటిమ కనబరచండి. విజయానికి దగ్గరగా వచ్చి ఓడిపోయినా పర్లేదు. అది కూడా గొప్ప అచీవ్మెంట్ లాంటిదే’’ అని అక్తర్ యూఏఈ జట్టుకు సూచించాడు.దాయాదితో ఆరోజే పోరుఇదిలా ఉంటే.. రెండో మ్యాచ్‌లో టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొడుతుంది. సెప్టెంబరు 14న ఈ హై వోల్టేజీ మ్యాచ్‌కు షెడ్యూల్ ఖరారైంది. ఇక లీగ్ దశలో ఆఖరిగా భారత జట్టు.. సెప్టెంబరు 19న ఒమన్‌తో తలపడుతుంది. కాగా ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి.గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్... గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ రేసులో నిలిచాయి. ఇక ఈ ఖండాంతర టోర్నీలో టీమిండియా అత్యధికంగా ఎనిమిదిసార్లు గెలవగా.. శ్రీలంక ఆరు, పాకిస్తాన్ రెండుసార్లు గెలిచాయి. మిగతా జట్లలో బంగ్లాదేశ్ రెండుసార్లు ఫైనల్ చేరి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆసియా కప్-2025కి టీమిండియాసూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.చదవండి: పక్షవాతం.. నొప్పి భరించలేకపోయా: టీమిండియా స్టార్ క్రికెటర్ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు -
పక్షవాతం.. నొప్పి భరించలేకపోయా: టీమిండియా స్టార్ క్రికెటర్
గత కొన్నాళ్లుగా భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైన పేరు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer). పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మంచి ఫామ్‌లో ఉన్నా ఆసియా కప్-2025 ఆడే టీమిండియాలో అతడికి చోటు దక్కకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇదిలా ఉంటే.. 2022-23 మధ్య కాలంలో శ్రేయస్ ఇంతకంటే గడ్డు పరిస్థితులే ఎదుర్కొన్నాడు.క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డాడన్న కారణంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శ్రేయస్ సెంట్రల్ కాంట్రాక్టును రద్దు చేసింది. అదే సమయంలో ఫిట్నెస్ సమస్యలు కూడా అతడిని వెంటాడాయి. నాటి పరిస్థితి గురించి శ్రేయస్ అయ్యర్ తాజాగా మాట్లాడుతూ విస్మయకర విషయాలు వెల్లడించాడు.పక్షవాతం వచ్చింది‘‘ఆ సమయంలో నేను నొప్పితో ఎంతగా విలవిల్లాడానో ఎవరికీ తెలియదు. నా కాలుకు పక్షవాతం వచ్చింది. వెన్నెముకకు సర్జరీ జరిగిన తర్వాత.. నడుములో రాడ్డుతో ఎలా మేనేజ్ చేసుకున్నానో నాకే తెలియదు. ఆ ప్లేస్‌లో ఉన్న నరం కూడా దెబ్బతిన్నది.అదెంతో ప్రమాదకరమని వైద్యులు చెప్పారు. ఆ సమయంలో భరించలేని నొప్పి. నా కాలి చిటికిన వేలు వరకు నొప్పి పాకింది. నిజంగా అదొక భయంకర అనుభవం’’ అని జీక్యూ ఇండియాకు శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.కాగా గాయం నుంచి కోలుకున్న తర్వాత శ్రేయస్ అయ్యర్ ముంబై తరఫున దేశవాళీ క్రికెట్లో తనను తాను నిరూపించుకున్నాడు. అదే విధంగా ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా టైటిల్ అందించాడు. ఈ క్రమంలోనే టీమిండియాలో పునరాగమనం చేయగా.. బీసీసీఐ అతడి సెంట్రల్ కాంట్రాక్టును పునరుద్ధరించింది. వన్డే వరల్డ్‌కప్-2023లో ఆడిన శ్రేయస్ అయ్యర్ భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.వాటిని మాత్రమే నియంత్రించగలనుఅదే విధంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియాను విజేతగా నిలపడంలో ముఖ్య భూమిక అతడిదే. ఇక ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా శ్రేయస్ అయ్యర్ గొప్పగా రాణించాడు. జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అయినప్పటికీ ఆసియా టీ20 కప్ ఆడే భారత జట్టులో మాత్రం అతడికి చోటు దక్కకపోవడం గమనార్హం.ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘నా ఆధీనంలో ఉన్న వాటిని మాత్రమే నేను నియంత్రించగలను. నా నైపుణ్యాలు, బలాలను మరింత మెరుగుపరచుకోవడం మాత్రమే నాకు తెలిసిన పని. అవకాశం వచ్చినప్పుడు రెండు చేతులతో దానిని అందిపుచ్చుకునేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను’’ అని శ్రేయస్ అయ్యర్ స్పష్టం చేశాడు.చదవండి: ‘యువీకి అప్‌గ్రేడ్ వర్షన్ అతడు.. గిల్‌కు కూడా మంచి ఛాన్స్’ -
భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు ఇంకా అమ్ముడుపోలేదు.. ఆసక్తి తగ్గిందా..? ఆగ్రహమా..?
క్రీడ ఏదైనా భారత్, పాకిస్తాన్ సమరమంటే నెలల ముందుగానే టికెట్లు అమ్ముడుపోతుంటాయి. రేట్ ఎంతైనా కొనేందుకు అభిమానులు వెనుకాడరు. కొన్ని సందర్భాల్లో టికెట్ల ధరలు లక్షల్లో ఉన్నా జనాలు తగ్గలేదు.అయితే తాజా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. క్రికెట్ ఆసియా కప్‌లో భాగంగా ఈ నెల 14న దుబాయ్‌లో దాయాదుల పోరు జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించి ఇప్పటివరకు టికెట్లు అమ్ముడుపోలేదు.ఇందుకు విపరీతంగా పెరిగిన రేట్లు ఓ కారణమని తెలుస్తుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రెండు ప్రీమియం సీట్ల ధర రూ. 2.5 లక్షలుగా (VIP Suites East) ఉంది. - Royal Box: ₹2.30 లక్షలు- Sky Box East: ₹1.67 లక్షలు- Platinum, Lounge, Pavilion: ₹28,000-₹75,000- సాధారణ టికెట్ ధర ₹10,000గా ఉన్నాయి.ఇవి సాధారణంగా ఉండే రేట్ల కంటే చాలా ఎక్కువ. ఆర్దిక స్థితి బాగా ఉన్న అభిమానులు కూడా ఇంత రేట్లు పెట్టి టికెట్లు కొనడానికి వెనకడుగు వేస్తారు.టికెట్లు అమ్ముడుపోకపోవడానికి ఇదో కారణమైతే, భారత్-పాక్‌ల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు మరో కారణంగా తెలుస్తుంది. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి దాడి తర్వాత భారతీయులు ఏ విషయంలోనూ పాక్‌తో సంబంధాలు పెట్టుకోవాలని అనుకోవడం లేదు. ఇరు దేశాలు క్రికెట్ మ్యాచ్‌ల్లో తలపడటం కూడా చాలా మందికి ఇష్టం లేదు. ఈ కారణంగానే భారత్-పాక్ ఆసియా కప్ సమరంపై ఆసక్తి తగ్గి ఉంటుంది. పైగా ఆసియా కప్‌లో భారత్ తలపడబోయే పాక్ జట్టు గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా బలహీనంగా ఉంది. భారత అభిమానులు ఆసక్తి చూపకపోవడానికి ఇదీ ఓ కారణం కావచ్చు. ద్వితియ శ్రేణి జట్లపై గెలిచినా మజా ఉండదన్నది చాలా మంది భావన. -
ఆసియా కప్-2025: ‘యువీకి అప్‌గ్రేడ్ వర్షన్ అతడు’
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో టీమిండియా టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా భారత్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టీ20 టోర్నీ మంగళవారం మొదలైంది. అఫ్గనిస్తాన్- హాంకాంగ్ మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవగా.. బుధవారం టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో యూఏఈతో తలపడనుంది.అనంతరం సెప్టెంబరు 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్, సెప్టెంబరు 19న ఒమన్‌తో మ్యాచ్‌తో సూర్యకుమార్ సేన తమ లీగ్ దశను పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. టీమిండియా యువ స్టార్లు శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అరంగేట్రంలోనే డకౌట్.. ఆ తర్వాతకాగా పంజాబ్‌కు చెందిన అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఐపీఎల్లో సత్తా చాటి.. గతేడాది జూలైలో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. జింబాబ్వేతో జరిగిన టీ20 మ్యాచ్‌లో అరంగేట్రంలోనే డకౌట్ అయిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. మరుసటి మ్యాచ్‌లో 47 బంతుల్లోనే సెంచరీ చేసి సత్తా చాటాడు.ఈ క్రమంలో టీమిండియా టీ20 జట్టులో ఓపెనర్‌గా పాతుకుపోయిన అభిషేక్.. ఇప్పటి వరకు 17 మ్యాచ్‌లలో కలిపి 33కు పైగా సగటుతో 193కు పైగా స్ట్రైక్‌రేటుతో 535 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.వైస్ కెప్టెన్‌గా రీఎంట్రీఇక మరోవైపు.. దాదాపు ఏడాది కాలం తర్వాత వైస్ కెప్టెన్‌గా టీమిండియా టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు శుబ్‌మన్ గిల్. టెస్టుల్లో ఇప్పటికే సారథిగా పగ్గాలు చేపట్టిన ఈ పంజాబీ బ్యాటర్.. భవిష్యత్తులో మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంది.యువీకి అప్‌గ్రేడ్ వర్షన్ అతడుఇక ఆసియా కప్-2025లో తొలి మ్యాచ్‌కు అభిషేక్, గిల్ సిద్ధమవుతున్న వేళ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘యూఏఈ పిచ్‌లపై కూడా అభిషేక్ శర్మ దూకుడైన ఆట కొనసాగుతుందో లేదో చూడాలి. ఏదేమైనా అతడో సూపర్ ప్లేయర్. యువరాజ్ సింగ్ అప్‌గ్రేడ్ వర్షన్ లాంటోడు.గిల్‌కు మంచి అవకాశంఇక ఈ టోర్నీలో పరుగులు చేయాలనే ఒత్తిడి శుబ్‌మన్ గిల్‌పై తప్పక ఉంటుంది. 140- 150కి పైగా స్ట్రైక్‌రేటుతో అతడు పరుగులు రాబట్టాల్సి ఉంటుంది. ఈసారి ఈ టోర్నమెంట్లో అత్యధిక పరుగుల వీరుడు అయ్యేందుకు గిల్‌కు మంచి అవకాశం ఉంది’’ అని పేర్కొన్నాడు.కాగా ఐపీఎల్-2025లో అభిషేక్ శర్మ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఓపెనర్‌గా.. 14 మ్యాచ్‌లలో కలిపి 439 పరుగులు సాధించాడు. మరోవైపు.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. 15 మ్యాచ్‌లు ఆడి 650 పరుగులతో టాప్-4లో నిలిచాడు.చదవండి: టెంబా బవుమాకు ఘోర అవమానం.. వరుసగా రెండోసారి..! -
చరిత్ర సృష్టించిన అఫ్గన్ ప్లేయర్.. ఆల్‌టైమ్ రికార్డు!
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్‌ను అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు ఘన విజయంతో ఆరంభించింది. హాంకాంగ్‌ను 94 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఈ టోర్నీలో తొలి గెలుపు నమోదు చేసింది. అబుదాబి వేదికగా మంగళవారం మొదలైన ఈ టీ20 ఈవెంట్ తొలి మ్యాచ్‌లో గ్రూప్- ‘బి’లో భాగమైన అఫ్గనిస్తాన్- హాంకాంగ్ (AFG vs HK) తలపడ్డాయి.టాస్ గెలిచిన అఫ్గన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 188 పరుగులు సాధించింది. ఓపెనర్ సెదీఖుల్లా అజేయ అర్ధ శతకం (52 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు)తో అద్భుత ప్రదర్శన కనబరచగా.. నాలుగో స్థానంలో వచ్చిన మహ్మద్ నబీ (26 బంతుల్లో 33) ఫర్వాలేదనిపించాడు.ఆకాశమే హద్దుగా.. ఇరవై బంతుల్లోనే ఇక లోయర్ ఆర్డర్లో అఫ్గన్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ (Azmatullah Omarzai) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం ఇరవై బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 21 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 53 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లతో పాటు ఏకంగా ఐదు సిక్సర్లు ఉన్నాయి.సూర్య రికార్డు బద్దలు.. సరికొత్త చరిత్రఈ క్రమంలోనే ఒమర్జాయ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆసియా కప్ టీ20 టోర్నీలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించాడు. కాగా ఆసియా కప్-2022 సందర్భంగా సూర్య హాంకాంగ్‌పై 22 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఒమర్జాయ్ తాజాగా ఈ రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాదు అఫ్గన్ తరఫున ఫాస్టెస్ట్ టీ20 ఫిఫ్టీ సాధించిన ఆటగాడిగానూ నిలిచాడు.కేవలం 94 పరుగులే చేసి.. ఇదిలా ఉంటే.. అఫ్గన్ విధించిన 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో పసికూన హాంకాంగ్ విఫలమైంది. ఓపెనర్లు జీషన్ అలీ (5), అన్షుమన్ రథ్ (0) నిరాశపరచగా.. నిజఖత్ ఖాన్ (0), కించిత్ షా (6), ఐజాజ్ ఖాన్ (6), ఎషాన్ ఖాన్ (6) పూర్తిగా తేలిపోయారు. ఆఖర్లో ఆయుశ్ శుక్లా 1, అతీక్ ఇక్బాల్ ఒక పరుగుతో అజేయంగా నిలిచారు.ఇక వన్‌డౌన్‌లో వచ్చిన బాబర్ హయత్ 39 పరుగులతో హాంకాంగ్ టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ యాసిమ్ ముర్తాజా 16 పరుగులు చేయగలిగాడు. అఫ్గన్ బౌలర్ల ధాటికి తాళలేక హాంకాంగ్ బ్యాటర్లు ఇలా పెవిలియన్‌కు వరుస కట్టడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో జట్టు తొమ్మిది వికెట్లు నష్టపోయి కేవలం 94 పరుగులు మాత్రమే చేయగలిగింది.అఫ్గన్ బౌలర్లలో ఫజల్హక్ ఫారూఖీ, గుల్బదిన్ నైబ్ రెండేసి వికెట్లు కూల్చగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్, కెప్టెన్ రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. బ్యాట్‌తో, బాల్‌తో రాణించి అజ్మతుల్లా ఒమర్జాయ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.ఆసియా టీ20 టోర్నీలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు నమోదు చేసింది వీరే..🏏అజ్మతుల్లా ఒమర్జాయ్ (అఫ్గనిస్తాన్)- హాంకాంగ్ మీద-20 బంతుల్లో🏏సూర్యకుమార్ యాదవ్ (ఇండియా)- హాంకాంగ్ మీద- 22 బంతుల్లో🏏రహ్మనుల్లా గుర్బాజ్ (అఫ్గనిస్తాన్)- శ్రీలంక మీద- 22 బంతుల్లో.చదవండి: ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు -
ఆసియా కప్ జట్టును మరింత బలోపేతం చేసుకున్న శ్రీలంక
శ్రీలంక క్రికెట్ బోర్డు ఆసియా కప్ ఆడబోతున్న తమ జట్టును మరింత బలోపేతం చేసుకుంది. ఇదివరకే 17 మంది సభ్యుల జట్టును ప్రకటించిన ఆ బోర్డు.. తాజాగా మరో ఆటగాడిని యాడ్ చేసి బృంద సంఖ్యను 18కి పెంచుకుంది. కొత్తగా మిడిలార్డర్ బ్యాటర్, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జనిత్ లియనాగేను జట్టులో చేర్చుకుంది. లియనాగే మూడేళ్ల తర్వాత టీ20 జట్టులోకి వచ్చాడు. తాజాగా జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో రాణించినందుకు (70, 19) లియనాగేకు లేటుగా ఆసియా కప్ బెర్త్ దక్కింది. లియనాగే చివరిగా 2022 ఫిబ్రవరిలో భారత్‌తో తన చివరి అంతర్జాతీయ టీ20 ఆడాడు. కెరీర్లో 29 వన్డేలు, 3 టీ20లు ఆడిన లియనాగే సెంచరీ, 6 అర్ద సెంచరీల సాయంతో 852 పరుగులు చేశాడు. అలాగే 3 వికెట్లు తీశాడు. ఆసియా కప్‌లో లియనాగే.. దసున్ షనక, చమిక కరుణరత్నేతో కలిసి లంక బ్యాటింగ్ లోతును పెంచనున్నాడు.జట్టులో చేరిన హసరంగగాయంతో బాధపడుతున్నా, ఆసియా కప్ బెర్త్ దక్కించుకున్న స్టార్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగ.. గాయం నుంచి పూర్తిగా కోలుకుని లేటుగా జట్టులో చేరాడు. హసరంగ, లియనాగే దుబాయ్‌లో ఉన్న జట్టుతో కలిశారు.ఆసియా కప్‌లో శ్రీలంక సెప్టెంబర్ 13న తొలి పోటీ (బంగ్లాదేశ్‌తో) ఎదుర్కొంటుంది. ఈ టోర్నీలో గ్రూప్-బిలో ఉన్న ఆ జట్టు.. సెప్టెంబర్ 15న హాంకాంగ్‌తో, సెప్టెంబర్ 18న ఆఫ్ఘానిస్తాన్‌తో పోటీపడుతుంది.శ్రీలంక ఆసియా కప్ 2025 జట్టు: చరిత్ అసలంక (కెప్టెన్), పాతుం నిస్సాంక, కుసల్ మెండిస్, కుసల్ పెరెరా, నువానిడూ ఫెర్నాండో, కమిందు మెండిస్, కమిల్ మిశారా, దసున్ శానకా, జనిత్ లియనాగే, చామికా కరుణరత్నే, దునిత్ వెలలాగే, వనిందు హసరంగ, మహీష్ తీక్షణ, దుష్మంత చమీరా, బినురా ఫెర్నాండో, నువాన్ తుషార, మతీషా పథిరానా -
అఫ్గానిస్తాన్ అలవోకగా...
అబుదాబి: అఫ్గానిస్తాన్ జట్టు అంచనాలకు తగిన ప్రదర్శనతో ఆసియా కప్‌లో శుభారంభం చేసింది. మంగళవారం మొదలైన ఈ టి20 టోర్నీ గ్రూప్ ‘బి’ తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 94 పరుగుల తేడాతో హాంకాంగ్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేయగా... ఆ తర్వాత హాంకాంగ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 94 పరుగులే చేయగలిగింది. అఫ్గాన్ భారీ స్కోరులో ఓపెనర్ సాదిఖుల్లా అటల్ (52 బంతుల్లో 73 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), అజ్మతుల్లా ఒమర్జాయ్ (21 బంతుల్లో 53; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో ప్రధాన పాత్ర పోషించారు. ముఖ్యంగా అజ్మతుల్లా 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకొని అఫ్గాన్ తరఫున ‘ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ’ని నమోదు చేశాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 35 బంతుల్లోనే 82 పరుగులు జోడించడం విశేషం. సీనియర్ ఆటగాడు మొహమ్మద్ నబీ (26 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా కీలక పరుగులతో రాణించగా... రహ్మనుల్లా గుర్బాజ్ (8), ఇబ్రహీం జద్రాన్ (1), గుల్బదిన్ నైబ్ (5) విఫలమయ్యారు. హాంకాంగ్ బౌలర్లలో కించిత్ షా, ఆయుశ్ శుక్లా చెరో 2 వికెట్లు పడగొట్టాడు. హాంకాంగ్ ఫీల్డింగ్ వైఫల్యం కూడా అఫ్గాన్ టీమ్‌కు కలిసొచ్చింది. ఆ జట్టు ఆటగాళ్లు ఏకంగా నాలుగు సునాయాస క్యాచ్‌లు వదిలేశారు. సాదిఖుల్లాకు 4, 45, 51 పరుగుల వద్ద లైఫ్ లభించగా...అజ్మతుల్లా 22 పరుగుల వద్ద బతికిపోయి ఆ తర్వాత మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చాడు. కఠినమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హాంకాంగ్ పూర్తిగా తడబడింది. మొత్తం జట్టులో బాబర్ హయత్ (43 బంతుల్లో 39; 3 సిక్స్‌లు), ముర్తజా (16) మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. 9.5 ఓవర్ల వద్దే 43/5 వద్ద నిలిచిన జట్టు ఆ తర్వాత కోలుకోలేకపోయింది. హాంకాంగ్ తమ తర్వాతి మ్యాచ్‌లో 11న బంగ్లాదేశ్‌తో... అఫ్గానిస్తాన్ తమ తర్వాతి మ్యాచ్‌లో 16న బంగ్లాదేశ్‌తో తలపడతాయి. -
దుమ్ములేపిన ఒమర్జాయ్, అటల్.. హాంకాంగ్ టార్గెట్ ఎంతంటే?
ఆసియాకప్-2025లో అబుదాబి వేదికగా హాంకాంగ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ బ్యాటర్లు దుమ్ములేపారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అఫ్గాన్ ఆరంభంలోనే రెహ్మతుల్లా గుర్బాజ్(8), ఇబ్రహీం జాద్రాన్(1) వికెట్లు కోల్పోయినప్పటికి.. ఓపెనర్ సెదికుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్ దుమ్ములేపారు. వీరిద్దరూ హాంకాంగ్ బౌలర్లను వీరిద్దరూ ఉతికారేశారు. అటల్ 49 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 73 పరుగులు చేసి ఆజేయంగా నిలవగా.. ఒమర్జాయ్ కేవలం 21 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 53 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరిద్దరితో పాటు మహ్మద్ నబీ(33) రాణించాడు.హాంకాంగ్ బౌలర్లలో కించిత్ షా, అయూష్ శోక్లా తలా రెండు వికెట్లు పడగొట్టగా..ఇషాన్, అతీక్ చెరో వికెట్ పడగొట్టారు. అయితే హాంకాంగ్ ఫీల్డర్లు మూడు సునాయస క్యాచ్‌లను జారవిడిచారు. ఫలితంగా అఫ్గాన్ ఈ భారీ స్కోర్ సాధించగల్గింది. -
యూఈఏతో మ్యాచ్.. భారత తుది జట్టు ఇదే! శాంసన్‌కు నో ఛాన్స్
ఆసియాకప్-2025లో తమ తొలి మ్యాచ్‌కు టీమిండియా సిద్దమైంది. సెప్టెంబర్ 10న అబుదాబి వేదికగా యూఈఏతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని భారత జట్టు భావిస్తోంది. ఈ క్రమంలో యూఏఈతో మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అంచనా వేశాడు. తన ఎంచుకున్న తుది జట్టులో ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ఛాన్స్ ఇచ్చాడు. ఈ జట్టులో సంజూ శాంసన్‌కు మాత్రం చోటు దక్కలేదు. అతడి స్ధానంలో వికెట్ కీపర్ బ్యాటర్‌గా జితేష్ శర్మను శ్రీకాంత్ ఎంపిక చేశాడు. మిడిలార్డర్లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబేలతో అతడు వెళ్లాడు. తిలక్ వర్మ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో పాటు ఐపీఎల్-2025లో దుమ్ములేపాడు. దీంతో అతడికి భారత తుది జట్టులో చోటు ఖాయం. ఇక ఆల్రౌండర్లగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌కు ఈ తమిళనాడు క్రికెటర్ అవకాశమిచ్చాడు. అదేవిధంగా ఫాస్ట్ బౌలర్ల కోటాలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లకు చోటు దక్కింది. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తికి ఛాన్స్ లభించింది. అయితే గిల్ తిరిగి రావడంతో తుది జట్టులో సంజూ శాంసన్ స్దానంపై సందిగ్ధం కొనసాగుతోంది.కానీ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం శాంసన్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందన్న సంకేతాలు ఇచ్చాడు. సంజూ ప్రస్తుతం టీ20 క్రికెట్లో దుమ్ములేపుతున్నాడు.ఐపీఎల్-2025తో పాటు కేరళ క్రికెట్ లీగ్ టోర్నీలోనూ మెరుగైన ప్రదర్శన చేశాడు. మరోవైపు జితేష్ కూడా ఐపీఎల్లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేశాడు. టీమ్ మెనెజ్‌మెంట్‌కు ఇదొక కఠిన సవాల్ అనే చెప్పుకోవాలి. మరి సూర్య అండ్ గంభీర్ ఎవరివైపు మొగ్గు చూపుతారో బుధవారం వరకు వేచి చూడాల్సిందే.యూఏఈతో మ్యాచ్‌కు శ్రీకాంత్ అంచనా వేసిన భారత తుది జట్టు: అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్చదవండి: IND vs AUS: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆ సిరీస్‌కు కోహ్లి-రోహిత్ దూరం!? -
Asia Cup 2025: శివం దూబే మాకు కీలకం: భారత బౌలింగ్ కోచ్
టీమిండియా స్టార్ శివం దూబే (Shivam Dube)ను ఉద్దేశించి బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ (Morney Morkel) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో అతడి సేవలను పూర్తిగా వినియోగించుకుంటామని తెలిపాడు. ఈ టీ20 టోర్నీలో శివంను పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌గా ఉపయోగించుకుంటామని పేర్కొన్నాడు.ఎనిమిది జట్ల మధ్య పోటీ కాగా యూఏఈ వేదికగా భారత్ ఆసియా కప్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈసారి పొట్టి ఫార్మాట్లో నిర్వహించే ఈ ఈవెంట్లో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ పాల్గొంటుండగా.. గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ తలపడుతున్నాయి.రెండు నైపుణ్యాలపై దృష్టి ఉండాలిఇక అఫ్గనిస్తాన్- హాంకాంగ్ మ్యాచ్‌తో మంగళవారం (సెప్టెంబరు 9) ఈ టోర్నీ మొదలుకానుండగా.. బుధవారం టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను యూఏఈతో ఆడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మీడియా సమావేశంలో మాట్లాడాడు.ఈ సందర్భంగా.. ‘‘నాలుగు ఓవర్లు బౌల్ చేసే ఆటగాడిగా శివంను మేము ఉపయోగించుకుంటాము. నా దృష్టిలో ఇది అత్యంత ముఖ్యమైన విషయం. ఆల్‌రౌండర్లు బ్యాటర్, బౌలర్‌గా తమకున్న రెండు నైపుణ్యాలపై దృష్టి సారించాలని నేను ఎల్లప్పుడూ చెబుతూ ఉంటా.ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలికొంతమంది ప్రాక్టీస్ సమయంలో ఏదో ఒక దానిపై మాత్రమే ఫోకస్ చేస్తారు. కానీ మేము మాత్రం వారు రెండు విధాలుగా రాణించాలని కోరుకుంటాము. ఇక.. మ్యాచ్ రోజున అందరి కంటే అతడికే పరిస్థితులు ఎక్కువగా అనుకూలించవచ్చు. కాబట్టి అందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలని చెప్తాము’’ అని మోర్నీ మోర్కెల్ పేర్కొన్నాడు.ఆల్‌రౌండర్లు మెరుగ్గా రాణిస్తే కెప్టెన్‌కు పని సులువు అవుతుందన్న మోర్నీ.. ఫ్రంట్‌లైన్ బౌలర్లతో పాటు ఆల్‌రౌండర్ల సేవలు కూడా బౌలింగ్ విభాగంలో ఉపయోగించుకుంటామని మరోసారి స్పష్టం చేశాడు. కాగా ఆసియా కప్ టోర్నీలో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ రూపంలో ముగ్గురు కీలక ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉన్నారు. ఆసియా కప్ టీ20-2025 టోర్నీకి టీమిండియాసూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.చదవండి: ముందుగానే స్టేజీ దిగిపోయిన పాక్ కెప్టెన్.. సూర్య, రషీద్ ఖాన్ ఏం చేశారంటే? -
మైదానంలో వాళ్లను ఆపను.. ఈసారి ఫేవరెట్ జట్టు ఏదీ లేదు: పాక్ కెప్టెన్
పొట్టి క్రికెట్ ప్రేమికులకు వినోదం పంచేందుకు ఆసియా కప్-2025 (Asia Cup 2025) టోర్నమెంట్ సిద్ధంగా ఉంది. అఫ్గనిస్తాన్- హాంకాంగ్ (AFG vs HK) మ్యాచ్‌తో మంగళవారం (సెప్టెంబరు 9) ఈ మెగా ఈవెంట్‌కు తెరలేస్తుంది. ఈ నేపథ్యంలో టోర్నీలో పాల్గొనే ఎనిమిది జట్ల కెప్టెన్లు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)తో పాటు.. రషీద్ ఖాన్ (అఫ్గనిస్తాన్), చరిత్ అసలంక (శ్రీలంక), లిటన్ దాస్ (బంగ్లాదేశ్), సల్మాన్ ఆఘా (పాకిస్తాన్), జతీందర్ సింగ్ (ఒమన్), ముహమ్మద్ వసీం (యూఏఈ), యాసిమ్ ముర్తాజా (హాంకాంగ్) విలేకరులతో ముచ్చటించారు.హుందాగా బదులిచ్చిన సూర్యఈ క్రమంలో ఆసియా కప్ తాజా ఎడిషన్ టోర్నీ విజేతగా టీమిండియా ఫేవరెట్ కదా అన్న ప్రశ్న వచ్చింది. ఇందుకు సూర్య తనదైన శైలిలో హుందాగా సమాధానమిచ్చాడు. ‘‘మీకెవరు ఈ విషయం చెప్పారు?.. నేనైతే ఎప్పుడూ వినలేదు.అయితే, సుదీర్ఘకాలంగా మేము టీ20 క్రికెట్లో ఉత్తమంగా రాణిస్తున్నాం. ఇప్పుడు కూడా టోర్నీకి పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాము’’ అని సూర్య తెలిపాడు. ఇక ఇదే ప్రశ్నకు పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా ఇచ్చిన సమాధానం వైరల్‌గా మారింది.షాకింగ్‌గా సల్మాన్ సమాధానంటీమిండియాను ఫేవరెట్‌గా భావిస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘టీ20 క్రికెట్లో గంట.. రెండు గంటల సమయంలోనే అంతా తలకిందులైపోతాయి. మ్యాచ్ రోజు ఎవరైతే గొప్పగా ఆడతారో వారిదే విజయం. అందుకే ఈ ఫార్మాట్ టోర్నీలో ఓ జట్టు ఫేవరెట్‌గా ఉంటుందని నేను అనుకోను’’ అని సల్మాన్ ఆఘా పేర్కొన్నాడు.మైదానంలో వాళ్లను ఆపనుఇక మైదానంలో ఫాస్ట్‌బౌలర్లను కట్టడి చేస్తారా అని విలేకరులు అడుగగా.. ‘‘ఫాస్ట్ బౌలర్లు అంటేనే దూకుడుగా ఉంటారు. వారిని దాని నుంచి మనం వేరుచేయలేము. ఎవరైతే మైదానంలో అగ్రెసివ్ ఉండాలనుకుంటారో వారికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.క్రీడా స్ఫూర్తికి భంగం కలగనంత వరకు స్వేచ్ఛ కొనసాగుతుంది. నా వైపు నుంచైతే ఫాస్ట్‌బౌలర్లపై ఎలాంటి ఆంక్షలూ ఉండవు’’ అని సల్మాన్ ఆఘా స్పష్టం చేశాడు.కాగా ఆసియా కప్-2025 టోర్నీకి ముందు పాకిస్తాన్.. యూఏఈ- అఫ్గనిస్తాన్‌లతో ముక్కోణపు టీ20 సిరీస్ ఆడింది. ఇందులో యూఏఈ, అఫ్గన్లపై వరుస విజయాలతో ఫైనల్ చేరింది. టైటిల్ పోరులో రషీద్ ఖాన్ బృందాన్ని ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. తద్వారా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో పాక్ బరిలోకి దిగుతోంది.టీమిండియాదే హవాఇదిలా ఉంటే.. ఆసియా కప్ టోర్నీలో ఆది నుంచీ టీమిండియాదే హవా. ఇప్పటికి ఎనిమిది సార్లు భారత్ టైటిల్ గెలవగా.. శ్రీలంక ఆరుసార్లు చాంపియన్‌గా నిలిచింది. పాకిస్తాన్ రెండుసార్లు మాత్రమే ట్రోఫీని సొంతం చేసుకోగలిగింది. ఇక ఈసారి దాయాదులు భారత్- పాక్ సెప్టెంబరు 14న ముఖాముఖి తలపడనున్నాయి.చదవండి: ముందుగానే స్టేజీ దిగిపోయిన పాక్ కెప్టెన్.. సూర్య, రషీద్ ఖాన్ ఏం చేశారంటే? -
ఆసియా కప్-2025కి రె‘ఢీ’ అంటున్న కెప్టెన్లు.. హైలైట్‌గా సూర్య (ఫొటోలు)
-
ముందుగానే స్టేజీ దిగిపోయిన పాక్ కెప్టెన్.. సూర్య, రషీద్ ఖాన్ ఏం చేశారంటే?
క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ గురించే చర్చ. ఈ ఖండాంతర టోర్నీలో టీమిండియా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో (2023 వన్డే ఫార్మాట్ విజేత ) టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా.. టీ20 ఫార్మాట్లో గత చాంపియన్‌గా శ్రీలంక పోటీలో ఉంది.ఈసారి పొట్టి ఫార్మాట్లో నిర్వహించే ఈ టోర్నీకి భారత్.. యూఏఈ వేదికగా ఆతిథ్యం ఇస్తోంది. ఇందులో గ్రూప్-‘ఎ’ నుంచి టీమిండియాతో పాటు పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ పోటీలో ఉన్నాయి. ఇక గ్రూప్- ‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ పోటీపడుతున్నాయి.కెప్టెన్ల మీడియా సమావేశంఇక సెప్టెంబరు 9- 28 వరకు ఆసియా కప్ టోర్నీ జరుగనుండగా.. మంగళవారం ఎనిమిది జట్ల కెప్టెన్లు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి టీమిండియా- పాకిస్తాన్ కెప్టెన్లపైనే కేంద్రీకృతమైంది.సూర్య - సల్మాన్ మధ్యలో రషీద్భారత టీ20 జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్ ప్రెస్మీట్లో అఫ్గన్ కెప్టెన్ రషీద్ ఖాన్ పక్కన కూర్చున్నాడు. ఇక పాక్ జట్టు నాయకుడు సల్మాన్ ఆఘా రషీద్‌కు మరోవైపు కూర్చున్నాడు. విలేకరులతో మాట్లాడిన అనంతరం సల్మాన్ ఆఘా.. హాంకాంగ్, ఒమన్ కెప్టెన్లతో కలిసి ముందుగానే వేదిక దిగిపోయాడు.సారథుల ఆలింగనం.. పాక్ కెప్టెన్ మిస్ఇంతలో రషీద్- సూర్యతో మాట్లాడుతూ నవ్వులు చిందించగా.. యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం వచ్చి ఒక్కొక్కరిగా వేదికపై ఉన్న జట్ల సారథులను ఆలింగనం చేసుకుని కరచాలనం చేశాడు. ఈ క్రమంలో సూర్య, రషీద్ శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక, బంగ్లా సారథి లిటన్ దాస్‌లకు షేక్‌హ్యాండ్ ఇచ్చి హగ్ చేసుకున్నారు.ఆ తర్వాత..ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోకి రాగా.. టీమిండియా- పాకిస్తాన్ కెప్టెన్లు దూరం దూరంగానే ఉన్న వార్త ప్రచారం అయింది. అయితే, ఇంకో వీడియోలో మిగతా కెప్టెన్లతో పాటు సల్మాన్‌కు కూడా సూర్య షేక్‌హ్యాండ్ ఇచ్చినట్లు కనిపించింది.కేంద్రం అనుమతితోనే..కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దాయాది దేశాలు భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో క్రీడల్లోనూ అన్ని స్థాయిల్లోనూ పాకిస్తాన్‌తో బంధం తెంచుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే, ఆసియా కప్ మల్టీలేటరల్ టోర్నీ కావున చిరకాల ప్రత్యర్థితో టీమిండియా మ్యాచ్ ఆడేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినివ్వడం గమనార్హం.ఇక ప్రెస్మీట్లో అంటీముట్టనట్టుగానే ఉన్న భారత్- పాక్ జట్ల సారథులు ఆఖర్లో కర్టసీగా కరచాలనం చేసుకోవడం నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 10న తమ తొలి మ్యాచ్‌లో యూఏఈతో తలపడనున్న సూర్యకుమార్ సేన.. 14న దాయాది పాక్‌తో తలపడుతుంది. లీగ్ దశలో ఆఖరిగా సెప్టెంబరు 19న ఒమన్‌తో మ్యాచ్ ఆడుతుంది.చదవండి: ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలుIndian Captain Suryakumar Yadav and Pakistan Captain Salman Agha..(This video is for those saying that the Pakistan captain wasn't sitting next to the Indian players and they didn’t even shake hands)pic.twitter.com/76CSDcJIQW— Sporttify (@sporttify) September 9, 2025 -
ఆల్‌టైమ్ ఆసియా టీ20 జట్టు: భారత్ నుంచి ఐదుగురు.. యువీకి నో ఛాన్స్
ఆసియా కప్- 2025 (Asia Cup) టోర్నీకి రంగం సిద్ధమైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు టీ20 ఫార్మాట్లో ఈసారి ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. భారత్ ఆతిథ్య దేశంగా వ్యవహరించనుండగా.. టీమిండియాతో పాటు శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఒమన్, యూఏఈ, హాంకాంగ్ ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి.భారత్ నుంచి ఐదుగురుఇందుకోసం ఇప్పటికే ఎనిమిది జట్లు యూఏఈకి చేరుకుని.. అన్ని విధాలా సన్నద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బ్రెట్ లీ.. ఆసియా ఉత్తమ టీ20 జట్టును ఎంచుకున్నాడు. ఇందులో ఐదుగురు టీమిండియా స్టార్లకు చోటిచ్చిన ఈ ఆసీస్ దిగ్గజం.. బంగ్లాదేశ్ నుంచి ఒక్కరిని కూడా ఎంపిక చేయలేదు.యూఏఈ నుంచి ఇద్దరుఅయితే, అనూహ్యంగా యూఏఈ నుంచి ఇద్దరు.. హాంకాంగ్ నుంచి ఒక ఆటగాడికి బ్రెట్ లీ తన జట్టులో చోటివ్వడం విశేషం. ఇక పాకిస్తాన్ నుంచి ఇద్దరిని ఎంచుకున్న బ్రెట్ లీ... స్పిన్ విభాగంలో శ్రీలంక, అఫ్గనిస్తాన్ ప్లేయర్లకు అవకాశం ఇచ్చాడు. అయితే, బ్రెట్ లీ ఎంచుకున్న జట్టులో టీమిండియా టీ20 ప్రపంచకప్ విజేతలు యువరాజ్ సింగ్ (2007), సూర్యకుమార్ యాదవ్ (2024)లకు మాత్రం చోటు ఇవ్వకపోవడం గమనార్హం. ధోని, రో- కో తమకు తామే సాటిఐసీసీ తొలిసారి ప్రవేశపెట్టిన పొట్టి క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్‌గా ధోని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. 2007లో భారత్ వరల్డ్‌కప్ గెలవడంలో యువీది కూడా కీలక పాత్ర.ఇక అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక రన్‌స్కోరర్ రోహిత్ శర్మ (4231 పరుగులు). ఇక మూడో స్థానంలో విరాట్ కోహ్లి (4188) ఉన్నాడు. 2024లో కెప్టెన్‌గా రోహిత్ పొట్టి ప్రపంచకప్ గెలవగా.. కోహ్లి ఖాతాలో మరో టైటిల్ చేరింది. వీరితో పాటు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా కూడా టీమిండియాను చాంపియన్‌గా నిలపడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ టోర్నీ తర్వాత రోహిత్- కోహ్లి.. ఇద్దరూ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారుబ్రెట్ లీ ఎంచుకున్న ఆసియా ఆల్‌టైమ్ టీ20 ప్లేయింగ్ ఎలెవన్విరాట్ కోహ్లి (ఇండియా), రోహిత్ శర్మ (ఇండియా), మొహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్), బాబర్ హయత్ (హాంకాంగ్), మహేంద్ర సింగ్ ధోని (ఇండియా), హార్దిక్ పాండ్యా (ఇండియా), వనిందు హసరంగ (శ్రీలంక), రషీద్ ఖాన్ (అఫ్గనిస్తాన్), అమ్జద్ జావేద్ (యూఏఈ), మొహమ్మద్ నవీద్ (యూఏఈ), హ్యారిస్ రవూఫ్ (పాకిస్తాన్), జస్ప్రీత్ బుమ్రా (ఇండియా).చదవండి: ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు -
వారిద్దరిని మిస్ అవ్వడం లేదు..అన్నింటికీ మేము రెడీ: పాక్ కెప్టెన్
ఆసియాకప్-2025కు రంగం సిద్దమైంది. అబుదాబి వేదికగా మరి కొన్ని గంటల్లో అఫ్గానిస్తాన్-యూఏఈ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. అయితే ఈ ఖండాంతర టోర్నమెంట్ ఆరంభానికి ముందు మొత్తం 8 జట్ల కెప్టెన్లు విలేకరుల సమావేశంలో పాల్గోన్నారు.ఈ సందర్భంగా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ జట్టులో లేకపోవడం తమకు ఎటువంటి నష్టం కలిగించదు సల్మాన్ చెప్పుకొచ్చాడు. కాగా గత కొంత కాలంగా బాబర్, రిజ్వాన్ పేలవ ప్రదర్శన కనబరుస్తుండడంతో ఆసియాకప్‌కు సెలక్టర్లు చేయలేదు. సెలక్టర్ల నిర్ణయాన్ని చాలా మంది తప్పు బట్టారు. కాగా ఇటీవల కాలంలో పాక్ ఈ ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు లేకుండా ఓ మల్టీనేషనల్ టోర్నమెంట్లో పాల్గొంటుండడం ఇదే తొలిసారి"ప్రస్తుతం మా జట్టు చాలా బాగుంది. గత నాలుగు సిరీస్‌లలో మేము మూడింట మేము విజయం సాధించాము. అన్ని విభాగాల్లోనూ మేము మెరుగ్గా రాణిస్తున్నాము. ఏదేమైనప్పటికి ఆసియాకప్ మాకు ఒక కఠిన సవాల్ వంటిది. ఎందుకంటే మా జట్టులో చాలా మంది ఆటగాళ్లు తొలిసారి ఒక ప్రధాన టోర్నమెంట్లో ఆడనున్నారు.ఈ సవాల్‌ను ఎదుర్కొనేందుకు మేము సిద్దంగా ఉన్నాము. టీ20 క్రికెట్లో ఏ జట్టు ఫేవరేట్ కాదు. తమదైన రోజున ప్రతీ జట్టు అద్బుతాలు చేస్తోంది. ఒకట్రెండు ఓవర్లలో మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది. ఈ టోర్నీకి ముందు ముక్కోణపు సిరీస్‌ను మేము సన్నాహకంగా ఉపయోగించుకున్నాము.సిరీస్‌ను గెలిచినందుకు సంతోషంగా ఉన్నాము" అని సల్మాన్ పేర్కొన్నాడు. కాగా ఈ మల్టీనేషన్ టోర్నమెంట్‌కు ముందు పాక్ జట్టు యూఏఈ, అఫ్గానిస్తాన్‌లతో ట్రైసిరీస్‌లో తలపడింది. ఫైనల్లో అఫ్గానిస్తాన్‌ను చిత్తు చేసి పాక్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.ఇప్పుడు అదే జోరును ఆసియాకప్‌లోనూ కనబరిచాలని మెన్ ఈన్ గ్రీన్ భావిస్తుంది. ఈ ఖండాంత టోర్నీలో పాక్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 12న ఒమన్‌తో తలపడనుంది. అనంతరం సెప్టెంబర్ 14న టీమిండియాతో అమీతుమీ తెల్చుకోనుంది.పాకిస్తాన్ జట్టుసల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్-కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహిన్ అఫ్రిది, సూఫియాన్ మొకిమ్ -
టీమిండియా ఫేవరెటా?.. అతడి గురించి బెంగ వద్దు: సూర్యకుమార్
ఆసియా కప్-2025 (Asia Cup 2025) టోర్నమెంట్ నేపథ్యంలో ఎనిమిది జట్ల కెప్టెన్లు మీడియాతో మంగళవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘గత వారమే మేము యూఏఈకి చేరుకున్నాము. ఇక్కడ గట్టిగానే ప్రాక్టీస్ చేశాము.వాళ్లు మరింత గొప్పగా రాణించాలిఆసియాలోని అత్యుత్తమ జట్లతో పోటీ పడనుండటం సంతోషంగా ఉంది. యూఏఈతోనే తొలి మ్యాచ్ ఆడబోతున్నాం. ఆ జట్టు బ్రాండ్ క్రికెట్ ఆడుతోంది. ఇటీవలే ఓ టోర్నీలోనూ పాల్గొన్నారు. తాము ఉత్తమంగా రాణించి గెలుపు అంచుల వరకు వెళ్లామని యూఏఈ కెప్టెన్ చెప్పాడు.ఆసియా కప్‌లో కూడా వాళ్లు మరింత గొప్పగా రాణించి.. ఈసారి అనుకున్న ఫలితాన్ని రాబట్టడంలో సఫలం కావాలి. ఆ జట్టుతో ఆడేందుకు మేము ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నాం’’ అని సూర్యకుమార్ యాదవ్ ప్రత్యర్థి జట్టుకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాడు.టీమిండియా ఫేవరెటా?.. నేనైతే వినలేదుఇక ఆసియా కప్ టోర్నీలో టీమిండియా ఫేవరెట్ కదా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఈ విషయం మీకెవరు చెప్పారు. నేనైతే ఎక్కడా వినలేదు. మేము సుదీర్ఘకాలంగా టీ20లలో అత్యుత్తమంగా రాణిస్తున్నాం. ఏదేమైనా పూర్తి స్థాయిలో టోర్నీకి సిద్ధంగా ఉన్నామని మాత్రం చెప్పగలను.మైదానంలో దూకుడుగా ఉండటం అన్నికంటే ముఖ్యం. అసలు అగ్రెషన్ లేకుండా గ్రౌండ్‌కు ఎలా వెళ్లగలం?.. మేము ఈసారి కూడా అలాగే చేస్తాం’’ అని సూర్య పేర్కొన్నాడు. ఇక టీమిండియా ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్- సంజూ శాంసన్‌లలో ఎవరు వస్తారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. అతడి గురించి బెంగ వద్దు‘‘తుదిజట్టు ప్రకటన సమయంలో నేనే చెప్తాను. అతడి గురించి బెంగ వద్దు. మేము అతడి గురించి ఆలోచిస్తున్నాం. బుధవారం నాటి మ్యాచ్‌లో మేము సరైన నిర్ణయమే తీసుకుంటామని హామీ ఇస్తున్నా’’ అని సూర్య తెలిపాడు.ఇక తాము జనవరి- ఫిబ్రవరి తర్వాత కలిసి టీ20లు ఆడలేదన్న సూర్యకుమార్ యాదవ్.. ఐపీఎల్ ద్వారా టీమిండియా ఆటగాళ్లకు కావాల్సినంత ప్రాక్టీస్ లభించిందని తెలిపాడు. జూన్ నుంచి తాము టీ20లు ఆడలేదని.. టోర్నీలో మున్ముందు ఏం జరుగుతుందో చూద్దామని పేర్కొన్నాడు.కాగా భారత్.. యూఏఈ వేదికగా ఆసియా కప్-2025 టోర్నీకి ఆతిథ్యమిస్తోంది. సెప్టెంబరు 9- 28 వరకు పొట్టి ఫార్మాట్లో ఈ టోర్నీ జరుగనుంది. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ పోటీపడుతుండగా.. గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ రేసులో ఉన్నాయి. చదవండి: ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు -
ఆసియా కప్‌కు ముందు పాక్ క్రికెటర్ రిటైర్మెంట్
ఆసియా కప్ 2025 ప్రారంభానికి ముందు ఓ పాకిస్తానీ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. పాక్ తరఫున ఓ టెస్ట్, 17 వన్డేలు, 16 టీ20లు ఆడిన 31 ఏళ్ల ఉస్మాన్ షిన్వారీ అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయిన షిన్వారీ టెస్ట్‌ల్లో ఒకటి, వన్డేల్లో 34, టీ20ల్లో 13 వికెట్లు తీశాడు.2013లో టీ20 ఫార్మాట్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన షిన్వారీ, 2019లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్ తర్వాత పాక్ జట్టులోకి తిరిగి రాలేకపోయాడు. ఈ మధ్యలో ఆరేళ్లు జాతీయ జట్టుకు దూరంగా ఉన్న అతను, తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు. షిన్వారీకి స్వల్ప కెరీర్లోనే ఓ ప్రత్యేకత ఉంది. అతనాడిన 17 వన్డేల్లోనే రెండు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. ఇంత స్వల్ప కెరీర్లో ఇలా చాలా అరుదుగా జరుగుతుంది. షిన్వారీ 2018 ఆసియా కప్ ఆడిన పాకిస్తాన్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే ఆ ఎడిషన్‌లో భారత్, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో అతను ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. హాంగ్‌కాంగ్‌పై మాత్రం మూడు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఈ ఏడాది మధ్య వరకు దేశవాలీ క్రికెట్లో కొనసాగిన షిన్వారీ.. పాకిస్తాన్ సూపర్ లీగ్, లంక ప్రీమియర్ లీగ్‌ల్లో పాల్గొన్నాడు. -
గిల్ చిన్నప్పటి నుంచే తెలుసు.. గుర్తుపడతాడో లేదో!: యూఏఈ క్రికెటర్
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)ను ఉద్దేశించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) స్పిన్నర్ సిమ్రన్‌జీత్ సింగ్ (Simranjeet Singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చిన్ననాడు గిల్‌కు నెట్స్‌లో బౌలింగ్ చేశానని.. అయితే, ఇప్పుడు అతడికి తాను గుర్తున్నానో లేదో తెలియదని అన్నాడు. కాగా పంజాబ్‌లోని లుథియానాకు చెందిన సిమ్రన్‌జీత్ సింగ్ ఊహించని పరిస్థితుల్లో యూఏఈకి చేరుకున్నాడు.ఆ తర్వాత వరుస అవకాశాలు రావడంతో అక్కడే ఉండిపోయాడు. జూనియర్లకు కోచ్‌గా వ్యవహరిస్తూనే.. యూఏఈ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో పన్నెండు టీ20 మ్యాచ్‌లు ఆడిన సిమ్రన్‌జీత్ సింగ్ పదిహేను వికెట్లు పడగొట్టాడు. ఇక ఇప్పుడు ఆసియా కప్-2025 రూపంలో మేజర్ టోర్నీ ఆడేందుకు అతడు సిద్ధమయ్యాడు.తొలి మ్యాచ్‌లోనే టీమిండియాతో ఢీకాగా సొంతగడ్డపై జరుగనున్న ఈ ఖండాంతర టోర్నీలో యూఏఈ.. టీమిండియాతో కలిసి గ్రూప్-‘ఎ’లో ఉంది. ఇరుజట్లు సెప్టెంబరు 10న తమ తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన సిమ్రన్‌జీత్ సింగ్ గిల్‌తో తనకున్న జ్ఞాపకాలు, తన క్రికెట్ ప్రయాణం గురించి తెలిపాడు.గిల్ చిన్నప్పటి నుంచే తెలుసు‘‘శుబ్‌మన్ చిన్నపిల్లాడిగా ఉన్నప్పటి నుంచే నాకు తెలుసు. అయితే, ప్రస్తుతం తనకు నేను గుర్తున్నానో లేదో తెలియదు. 2011-12లో మొహాలీలో ఉన్న పంజాబ్ క్రికెట్ అకాడమీలో ఉదయం ఆరు నుంచి పదకొండు వరకు మేము ప్రాక్టీస్ చేసేవాళ్లం.శుబ్‌మన్ వాళ్ల నాన్నతో కలిసి పదకొండు గంటలకు అక్కడికి వచ్చేవాడు. నేను కాసేపు ఎక్కువ సమయం అక్కడే ఉండేవాడిని గనుక గిల్‌కు బౌలింగ్ చేసేవాడిని. అయితే, ఇప్పుడు తను నన్ను గుర్తుపట్టగలడో లేదో తెలియదు’’ అని 35 ఏళ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్ సిమ్రన్‌జీత్ సింగ్ గుర్తు చేసుకున్నాడు.అనూహ్య పరిస్థితుల్లోఅదే విధంగా.. ‘‘పంజాబ్ జట్టుకు జిల్లా స్థాయిలో చాలా మ్యాచ్‌లే ఆడాను. 2017 రంజీ ప్రాబబుల్స్‌లోనూ నాకు చోటు దక్కింది. అంతేకాదు ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ మొహాలీలో మ్యాచ్ ఆడినప్పుడల్లా నెట్స్‌లో బౌలింగ్ చేసేవాడిని.అయితే, 2021 ఏప్రిల్‌లో దుబాయ్‌లో ఇరవై రోజుల పాటు ప్రాక్టీస్ చేసేందుకు నాకు ఆఫర్ వచ్చింది. అప్పుడే కోవిడ్ రెండో దశ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇండియాలో మరోసారి లాక్డౌన్ విధించారు. దీంతో నేను దుబాయ్‌లోనే మరి కొన్నినెలల పాటు ఉండిపోవాల్సి వచ్చింది.సెంట్రల్ కాంట్రాక్టు కూడాఅప్పటి నుంచి దుబాయ్‌లోనే సెటిల్ అయ్యాను. జూనియర్ ఆటగాళ్లకు కోచింగ్ ఇవ్వడం ద్వారా మంచిగానే సంపాదించాను. క్లబ్ క్రికెట్ ఆడేవాడిని కూడా!.. అలా కుటుంబాన్ని పోషించుకునేవాడిని.ఈ క్రమంలోనే యూఏఈ జట్టులోకి వచ్చాను. యూఏఈ బోర్డు నాకు సెంట్రల్ కాంట్రాక్టు కూడా ఇచ్చింది. అప్పటి నుంచి నా ఆర్థిక పరిస్థితి మరింత మెరుగైంది’’ అని సిమ్రన్‌జీత్ సింగ్ చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం టెస్టుల్లో టీమిండియా కెప్టెన్‌గా ఉన్న గిల్.. టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా ఇటీవలే తిరిగి నియమితుడయ్యాడు. ఇక సెప్టెంబరు 9- 28 వరకు టీ20 ఫార్మాట్లో ఆసియా కప్ టోర్నీ జరుగనుంది.చదవండి: ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు -
ఆసుపత్రిలో రోహిత్ శర్మ.. ఆందోళనలో అభిమానులు
భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ నిన్న (సెప్టెంబర్ 8) రాత్రి ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. రోహిత్ ఆసుపత్రికి ఎందుకు వెళ్లాడోనని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ROHIT SHARMA AT THE KOKILABEN HOSPITAL IN MUMBAI. (Pallav Paliwal).pic.twitter.com/sT42YFD5Ak— Tanuj (@ImTanujSingh) September 8, 2025కొందరేమో రోహిత్‌కు బాగలేదని అంటుంటే, మరికొందరేమో ఆసుపత్రిలో ఉన్న సన్నిహితులను పరామర్శించేందుకు వెళ్లాడని అంటున్నారు. మొత్తంగా ఈ అంశంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సోషల్‌మీడియాలో నిరాధార ప్రచారం జరుగుతుంది.అయితే రోహిత్ ఆసుపత్రిలోకి ప్రవేశించే సమయంలో వ్యవహరించిన తీరు మాత్రం కాస్త ఆందోళనకరంగా ఉంది. ఎప్పుడూ సరదాగా కనిపించే హిట్‌మ్యాన్ ఎందుకో కాస్త భిన్నంగా కనిపించాడు. మీడియా ప్రశ్నలకు స్పందించకుండా హడావుడిగా ఆసుపత్రి లోపలికి వెళ్లిపోయాడు. రోహిత్‌వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన కొందరు జర్నలిస్ట్‌లకు ఆసుపత్రి సిబ్బంది అడ్డుకున్నారు.రోహిత్ అసౌకర్యంగా (శారీకంగా) కనిపించకపోయినా రాత్రి వేళ అసుపత్రికి వెళ్లడం ఊహాగానాలకు తావిస్తుంది. రోహిత్ ఇటీవలే బీసీసీఐ ఆథ్వర్యంలో నిర్వహించిన Yo-Yo టెస్ట్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. రోహిత్ ఆసుపత్రి సందర్శన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.38 ఏళ్ల రోహిత్ ఇటీవలే టెస్టులు, గతేడాది టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి, వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అతను 2027 వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా ఫిట్నెస్ను మెరుగుపరచేందుకు ప్రయత్నిస్తున్నాడు. రోహిత్ త్వరలో ఆస్ట్రేలియాతో జరుగబోయే వన్డే సిరీస్‌లో ఆడే అవకాశం ఉంది. రోహిత్ లాగే టెస్ట్‌లకు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లి కూడా ఆస్ట్రేలియా సిరీస్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. వీరిద్దరి రాక కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
హార్దిక్ వాచ్ ధర ఆసియా కప్ ప్రైజ్‌మనీ కంటే 8 రెట్లు ఎక్కువ..!
కొద్ది రోజుల కిందట ఆసియా కప్ 2025 ట్రైనింగ్ సెషన్లో భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ధరించిన "Richard Mille RM 27-04 Tourbillon" చేతి గడియారం (వాచ్) క్రికెట్ అభిమానులనే కాక యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది. ఈ వాచ్ విలువ రూ.20 కోట్లకు పైబడి ఉంటుంది. ఇది ఆసియా కప్ ప్రైజ్ మనీతో (రూ.2.6 కోట్లు) ఎనిమిది రెట్లు ఎక్కువ.ఈ లిమిటెడ్ ఎడిషన్ టైమ్‌పీస్‌లు ప్రపంచవ్యాప్తంగా కేవలం 50 మాత్రమే తయారు చేయబడ్డాయి. ఈ లగ్జరీ చేతి గడియారం టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నదాల్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది.ఈ టైమ్‌పీస్ ప్రత్యేకతలు ఏమిటంటే..- 30 గ్రాముల బరువు మాత్రమే, స్ట్రాప్‌తో సహా- 12,000 g’s వరకు షాక్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఇది రికార్డు స్థాయి- టెన్నిస్ రాకెట్ స్ట్రింగ్‌ల ప్రిన్సిపుల్ ఆధారంగా రూపొందించిన స్టీల్ మెష్- TitaCarb® అనే అత్యాధునిక పాలిమర్‌తో తయారైన కేస్ - 38.5% కార్బన్ ఫైబర్ కలిగి ఉండి, అత్యధిక బలాన్ని కలిగిస్తుందికాగా, వాచ్‌ల పిచ్చి ఉన్న హార్దిక్ పాండ్యా గతంలో Richard Mille RM 27-04 Tourbillon కంటే చాలా రెట్లు ఖరీదైన Patek Philippe Nautilus Travel Time Blue Diamond వాచ్‌ను ధరించాడు. దీని విలువ రూ. 43.83 కోట్లు ఉంటుందని అంచనా. హార్దిక్ వద్ద రూ.7 కోట్ల విలువైన RM 27-02 వాచ్ కూడా ఉంది.హార్దిక్ తర్వాత భారత క్రికెటర్లలో అత్యంత ఖరీదైన వాచ్‌ను విరాట్ కోహ్లి ధరించాడు. కోహ్లి ఓ సందర్భంలో రూ. 4.36 కోట్ల విలువైన Rolex Daytona Rainbow Everose Gold మోడల్‌ను ధరించాడు. క్రీడా ప్రపంచం మొత్తంలో అత్యంత ఖరీదైన వాచ్‌ను ధరించిన ఘనత బాక్సింగ్ దిగ్గజం ఫ్లాయిడ్ మెవెదర్ను దక్కుతుంది. మెవెదర్ ఓ సందర్భంలో Jacob & Co. Billionaire వాచ్ ధరించాడు. దీని విలువ రూ. 150 కోట్లు. దీన్ని 260 కారెట్ల డైమండ్లతో ప్రత్యేకంగా తయారు చేశారు.కాగా, ఆసియా కప్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న UAEతో ఆడుతుంది. సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌తో హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. -
ఆసియా కప్‌లో సెహ్వాగ్
ఆసియా కప్ 2025 కోసం టోర్నీ బ్రాడ్‌కాస్టర్ సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ బహుభాషా కామెంటరీ ప్యానెల్‌ను ప్రకటించింది. ఈ ప్యానెల్లో వరల్డ్ ఫీడ్ (ఇంగ్లీష్) అందించడానికి సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, సంజయ్ మంజ్రేకర్, రాబిన్ ఉతప్ప, వకార్ యూనిస్, వసీం అక్రమ్, బాజిద్ ఖాన్, రస్సెల్ ఆర్నాల్డ్, సైమన్ డౌల్ ఎంపిక చేయబడ్డారు.హిందీ ప్యానెల్లో వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, అజయ్ జడేజా, అభిషేక్ నాయర్, సబా కరీమ్ సభ్యులుగా ఉన్నారు. తమిళ ప్యానెల్లో భరత్ అరుణ్, WV రామన్.. తెలుగు వ్యాఖ్యాతలుగా వెంకటపతి రాజు, వేణుగోపాల్ రావు తదితరులు వ్యవహరిస్తారు.ప్రత్యేక ఆకర్షణగా వీరూకామెంటరీ ప్యానెల్ మొత్తంలో భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడు. సెహ్వాగ్ తన స్పష్టమైన అభిప్రాయాలు, హాస్యంతో కూడిన వ్యాఖ్యానంతో అభిమానులను మంత్రముగ్దుల్ని చేస్తాడు. ఆటగాడిగా ఏరకంగా మెరుపులు మెరిపించాడో, వ్యాఖ్యానంతోనూ అలాగే కట్టిపడేస్తాడు.కాగా, ఇవాల్టి నుంచే (సెప్టెంబర్ 9)ప్రారంభం కాబోయే ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ, ఆఫ్ఘానిస్తాన్, యూఏఈ, ఒమన్, హాంకాంగ్ జట్లు పోటీపడనున్నాయి. భారత్, పాకిస్తాన్, ఒమన్, యూఏఈ గ్రూప్-బిలో ఉండగా.. మిగతా జట్లు గ్రూప్-ఏలో ఉన్నాయి. ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్, హాంగ్‌కాంగ్ తలపడనున్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న UAEతో ఆడనుంది. ఈ టోర్నీ మొత్తంలో ప్రత్యేక మ్యాచైన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 14న జరుగనుంది.ఈ టోర్నీలో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నాడు. జట్టులో శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్, జస్ప్రీత్ బుమ్రా లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. -
పంత్‌కు సంబంధించి బిగ్ అప్డేట్
టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. ఇటీవల (జులై 23న) ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా గాయపడిన పంత్.. నెలకు పైగా ఇంగ్లండ్‌లోనే ట్రీట్మెంట్ తీసుకుని కొద్ది రోజుల కిందటే భారత్‌కు తిరిగి వచ్చాడు. ముంబైలో వైద్య నిపుణులను సంప్రదించిన అనంతరం, వారి సలహా మేరకు త్వరలోనే నేషనల్ క్రికెట్ అకాడమీ (CoE) పునరావాస శిబిరంలో చేరనున్నాడు.అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే సిరీస్ సమయానికి తిరిగి జట్టులోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్న పంత్.. ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం పంత్‌కు గాయం పూర్తిగా తగ్గలేదని తెలుస్తుంది. వైద్యులు అతనికి తిరిగి ఫిట్నెస్ సాధించేందుకు టైమ్‌లైన్ ఇచ్చినట్లు సమాచారం.టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ 2025లో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో పంత్ తొలి రోజు ఆటలో క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో గాయపడ్డాడు. వోక్స్ సంబంధించిన బంతి పంత్ పాదానికి తీవ్ర గాయం చేసింది. నొప్పితో విలవిలలాడిన పంత్ అప్పుడు మైదానాన్ని వీడి, జట్టు అవసరాల దృష్ట్యా కుంటుతూనే రెండో రోజు బ్యాటింగ్‌కు దిగాడు.తొలి రోజు గాయపడిన సమయానికి 37 పరుగుల వద్ద ఉండిన పంత్.. రెండో రోజు తిరిగి బరిలోకి దిగి జట్టుకు చాలా ముఖ్యమైన 17 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ గాయం కారణంగా పంత్ ఓవల్‌లో జరిగిన ఐదో టెస్ట్ దూరమయ్యాడు. ఆ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి సిరీస్‌ను సమం చేసింది.పంత్ పాదం గాయం నుంచి పూర్తిగా కోలుకుని అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే హోమ్ టెస్ట్ సిరీస్ సమయానికంతా రెడీగా ఉండాలని అనుకుంటున్నాడు. ఇందులో భాగంగానే CoEలోని రీహ్యాబ్‌లో చేరనున్నాడు. ఒకవేళ విండీస్‌తో సిరీస్ సమయానికి పూర్తిగా కోలుకోకపోతే, తదుపరి ఆస్ట్రేలియాతో జరిగే వైట్-బాల్ సిరీస్ సమయానికైనా పునారగమనం చేయడం లక్ష్యంగా పెట్టుకుంటాడు.పంత్ భావోద్వేగ పోస్ట్తాజాగా పంత్ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ పోస్ట్ చేశాడు. ఎంత బాధను గతంలో అనుభవించినా, మళ్లీ గాయపడితే అదే స్థాయిలో బాధ కలుగుతుంది. అయితే రెండో సారి మన సహనశక్తి పెరుగుతుంది. ఇదే మనల్ని బలంగా మారుస్తుందని తన ఇన్‌స్టా ఖాతాలో రాసుకొచ్చాడు. కాగా, 2022లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పంత్ తీవ్రగాయాలపాలై, అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఆ స్థాయి గాయాలు కాకపోయినా పంత్ మరోసారి గాయపడ్డాడు. ఫలితంగా మరోమారు జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం భారత టీ20 జట్టు ఆసియా కప్ కోసం యూఏఈలో పర్యటిస్తుంది. ఈ జట్టులో వికెట్కీపర్లుగా సంజూ శాంసన్, జితేశ్ శర్మ ఎంపికయ్యారు. -
ఆసియా కప్‌కు మందు సంజూ శాంసన్ ఆసక్తికర నిర్ణయం
ఆసియా కప్ 2025 ప్రారంభానికి ముందు టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల తన సొంత రాష్ట్రం కేరళలో జరిగిన టీ20 టోర్నీ (KCL 2025) ద్వారా అర్జించిన జీతాన్ని సహచరులు, సహాయక బృందానికి విరాళంగా ఇచ్చాడు. ఈ టోర్నీ ద్వారా సంజూ రూ. 26.8 లక్షల జీతాన్ని పొందాడు. ఈ మొత్తాన్ని కొచ్చి బ్లూ టైగర్స్ బృందానికి ఇచ్చేసి ఉదారతను చాటుకున్నాడు. వాస్తవానికి ఈ టోర్నీ వేలంలో సంజూ రూ. 50 లక్షలకు (ఈ సీజన్ వేలంలో ఇదే అత్యధికం) అమ్ముడుపోయాడు. అయితే అతనికి కొచ్చితో ఉన్న ప్రత్యేక అనుబంధం కారణంగా తన వేతనంలో సగం డబ్బుకే ఆడేందుకు ఒప్పుకున్నాడు.Sanju Samson's brother "Saly Samson" led Kochi Blue Tigers won the KCL 2025. 🏅- Sanju Samson played an important role in the Group Stage with 368 runs from 5 Innings. pic.twitter.com/w7ZFClxpGz— Johns. (@CricCrazyJohns) September 8, 2025KCL 2025లో సంజూ ప్రాతినిథ్యం వహించిన కొచ్చి బ్లూ టైగర్స్ ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో ఏరిస్ కొల్లమ్ టైగర్స్ 75 పరుగుల భారీ తేడాతో గెలుపొంది టైటిల్ కైవసం చేసుకుంది. సంజూ ఫైనల్, సెమీఫైనల్లో ఆడకపోయినా, కొచ్చి టైటిల్ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు.లీగ్ దశలో ఆడిన 5 ఇన్నింగ్స్‌ల్లో 186.80 స్ట్రయిక్‌రేట్‌తో 73.60 సగటున 368 పరుగులు చేశాడు. ఇందులో ఓ విధ్వంసకర సెంచరీతో కలిపి నాలుగు 50 ప్లస్ స్కోర్లు ఉన్నాయి. ఈ టోర్నీలో కొచ్చిని ఛాంపియన్‌గా నిలిపింది (కెప్టెన్) సంజూ సోదరుడు శాలీ శాంసన్ కావడం మరో విశేషం. శాలీ కూడా ఈ టోర్నీలో బ్యాటర్‌గా, కెప్టెన్‌గా అద్భుతంగా రాణించాడు.సంజూకు కేరళ క్రికెట్‌పై అమితాసక్తి ఉంది. తన సొంత రాష్ట్రం నుంచి చాలా మంది టీమిండియాకు ఆడాలన్నది అతని కల. అతనికి తన KCL టీమ్ కొచ్చి బ్లూ టైగర్స్ అంటే కూడా చాలా ఇష్టం. ఈ ఇష్టంలో భాగంగానే అతను తన జీతం మొత్తాన్ని సహచరులకు విరాళంగా ఇచ్చాడు. సంజూకు ఇలాంటి దానాలు కొత్తేమీ కాదు. తన పేరిట ఓ ట్రస్ట్‌ను నడిపిస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాడు. ఇందుకుగానూ కేరళ ప్రభుత్వం నుంచి కూడా అభినందనలు పొందాడు. గత దశాబ్దకాలంలో కేరళ నుంచి టీమిండియాకు ఆడిన క్రికెటర్ సంజూ ఒక్కడే.ఇదిలా ఉంటే, సంజూ KCLలో అద్భుతంగా రాణించినప్పటికీ భారత తుది జట్టులో (ఆసియా కప్‌లో) స్థానం ప్రశ్నార్థకంగా ఉంది. సంజూ ఆడాల్సిన ఓపెనింగ్ స్థానం కోసం జట్టు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పోటీపడుతున్నాడు. గిల్‌ను ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా ప్రమోట్ చేయడంలో భాగంగా సంజూపై వేటు పడుతుందని టాక్ నడుస్తుంది. ఈ విషయంపై స్పష్టత రావాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. -
గిల్ వద్దు!.. టీమిండియా ఓపెనర్‌గా అతడే సరైనోడు: రవిశాస్త్రి
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో భారత ఓపెనింగ్ జోడీ గురించి టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి (Ravi Shastri) కీలక వ్యాఖ్యలు చేశాడు. టాపార్డర్‌లో విశ్వరూపం ప్రదర్శించే సంజూ శాంసన్ (Sanju Samson)ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెనర్‌గా తప్పించవద్దని జట్టు యాజమాన్యానికి సూచించాడు.వైస్ కెప్టెన్ అయినప్పటికీ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) కూడా సంజూను రీప్లేస్ చేయలేడని.. అతడు వేరొక స్థానంలో బ్యాటింగ్‌కు రావాలని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు టీ20 ఫార్మాట్లో ఆసియా కప్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. వైస్ కెప్టెన్‌గా..ఈ మెగా ఈవెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. దాదాపు ఏడాది తర్వాత అంతర్జాతీయ టీ20లలోకి గిల్‌కు పిలుపునిచ్చిన మేనేజ్మెంట్.. అతడిని వైస్ కెప్టెన్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో గిల్ గైర్హాజరీలో ఓపెనర్‌గా వచ్చిన సంజూ శాంసన్‌పై వేటు పడే అవకాశాలు ఉన్నాయి.గిల్ లేనందు వల్లే సంజూ ఓపెనింగ్ చేశాడని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం. అంతేకాదు ఓపెనర్‌గా అభిషేక్ శర్మ పాతుకుపోయాడంటూ కితాబులు ఇవ్వడం ద్వారా.. అభి- గిల్ భారత ఇన్నింగ్స్ ఆరంభిస్తారనే సంకేతాలు ఇచ్చాడు.ప్రమాదకర బ్యాటర్ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి మాత్రం సంజూ శాంసన్‌కే తన మద్దతు అంటూ కుండబద్దలు కొట్టేశాడు. ‘‘టాపార్డర్‌లో అత్యంత ప్రమాదకర బ్యాటర్ సంజూ శాంసన్. అక్కడ ఆడిస్తేనే మనకోసం మ్యాచ్‌లు గెలవగలడు. కాబట్టి తన బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చకూడదు.సంజూ శాంసన్ స్థానాన్ని భర్తీ చేయడం ఎవరికీ అంత సులువేం కాదు. టాప్ ఆర్డర్లో టీమిండియా తరఫున టీ20లలో సంజూకు మంచి రికార్డు ఉంది. గిల్ కూడా అతడిని డిస్ప్లేస్ చేయలేడు. కాబట్టి గిల్ వేరొకరి స్థానంలో బ్యాటింగ్ చేస్తే మంచిది.సంజూనే సరైనోడుసంజూ శాంసనే ఓపెనర్‌గా ఉండాలి. టీ20 ఫార్మాట్లో తనకు ఉన్న రికార్డును బట్టి సంజూనే సరైనోడు. టాప్‌లో రాణిస్తూ పరుగులు రాబట్టడంతో పాటు సెంచరీలు కూడా చేసిన ఘనత అతడిది’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.కాగా రవిశాస్త్రి హెడ్‌కోచ్‌గా ఉన్న సమయంలోనే సంజూ టీమిండియాలో పునరాగమనం చేశాడు. అయితే, అతడికి వరుస అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో టీ20 ప్రపంచకప్-2021 జట్టులోనూ చోటు దక్కలేదు. ఇక టీ20 ప్రపంచకప్-2024 ఆడిన భారత జట్టులో స్థానం దక్కినప్పటికీ.. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు.జితేశ్ శర్మతో పోటీఇక గిల్ రాకతో ఆసియా కప్ టోర్నీలో కేవలం వికెట్ కీపర్ కోటాలొ సంజూ తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, అక్కడ కూడా జితేశ్ శర్మతో అతడికి పోటీ తప్పదు. జితేశ్ స్పెషలైజ్డ్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు కాబట్టి మేనేజ్మెంట్ అతడి వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. కాగా అంతర్జాతీయ స్థాయిలో 42 టీ20 మ్యాచ్‌లు ఆడిన సంజూ.. మూడు శతకాల సాయంతో 861 పరుగులు చేశాడు.చదవండి: అతడే నా ఫేవరెట్ క్రికెటర్.. టీమిండియాకు ఎందుకు సెలక్ట్ చేయరు? -
ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ఖండాంతర క్రికెట్ టోర్నమెంట్ ఆసియా కప్ (Asia Cup). ఈసారి పొట్టి ఫార్మాట్లో జరిగే ఈ ఈవెంట్లో ఎనిమిది జట్లు భాగంగా ఉన్నాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో టీమిండియా (2023 వన్డే ఫార్మాట్ విజేత) బరిలోకి దిగుతుండగా.. శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఒమన్, యూఏఈ, హాంకాంగ్ కూడా పాల్గొంటున్నాయి.ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు భారత్‌వే అయినా.. పాక్ కూడా ఈ ఈవెంట్లో భాగమైనందున తటస్థ వేదికైన యూఏఈలో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. మరి.. ఆసియా కప్-2025 టోర్నీ పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం, ప్రత్యక్ష ప్రసారం తదితర వివరాలు తెలుసుకుందామా!!గ్రూపులు- రెండుగ్రూప్-‘ఎ’- భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్గ్రూప్-‘బి’- శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్పూర్తి షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం👉సెప్టెంబరు 9: అఫ్గనిస్తాన్ వర్సెస్ హాంగ్‌కాంగ్- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 10: ఇండియా వర్సెస్ యూఏఈ- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు 👉సెప్టెంబరు 11: బంగ్లాదేశ్ వర్సెస్ హాంగ్‌కాంగ్- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 12: పాకిస్తాన్ వర్సెస్ ఒమన్- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 13: బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 14: ఇండియా వర్సెస్ పాకిస్తాన్- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 15: యూఏఈ వర్సెస్ ఒమన్- అబుదాబి- సాయంత్రం 5.30 నిమిషాలకు👉సెప్టెంబరు 15:శ్రీలంక వర్సెస్ హాంగ్‌కాంగ్- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 17: పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 18: శ్రీలంక వర్సెస్ అఫ్గనిస్తాన్- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 19: ఇండియా వర్సెస్ ఒమన్- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 20: గ్రూప్- బి టాపర్ వర్సెస్ రెండో స్థానంలో ఉన్న జట్టు (B1 Vs B2)- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 21: గ్రూప్-ఎ టాపర్ వర్సెస్ రెండో స్థానంలో ఉన్న జట్టు (A1 vs A2)- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 23: A2 vs B1- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 24: A1 vs B2- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 25: A2 vs B2- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 26: A1 vs B1- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 28: ఫైనల్- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు.జట్లు ఇవేటీమిండియాసూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.పాకిస్తాన్సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్-కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహిన్ అఫ్రిది, సూఫియాన్ మొకిమ్యూఏఈముహమ్మద్ వసీం (కెప్టెన్), అలిశాన్ షరాఫూ, ఆర్యాంశ్ శర్మ (వికెట్ కీపర్), ఆసిఫ్ ఖాన్, ధ్రువ్ పరాశర్, ఈథన్ డిసౌజా, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్దిఖీ, మతీఉల్లా ఖాన్, ముహమ్మద్ ఫారూక్, ముహమ్మద్ జవాదుల్లా, ముహమ్మద్ జోహైబ్, రాహుల్ చోప్రా (వికెట్ కీపర్), రోహిద్ ఖాన్, సిమ్రన్‌జీత్ సింగ్, సాఘిర్ ఖాన్.ఒమన్జతీందర్ సింగ్ (కెప్టెన్), హమ్మద్ మీర్జా, వినాయక్ శుక్లా, సూఫియాన్ యూసుఫ్, ఆశిష్ ఒడెదెరా, అమీర్ కలీమ్, మహ్మద్ నదీమ్, సూఫియాన్ మెహమూద్, ఆర్యన్ బిష్త్, కరణ్ సోనావాలే, జిక్రియా ఇస్లాం, హస్నైన్ అలీ షా, ఫైసల్ షా, మహమ్మద్ ఇమ్రాన్, షకీల్ అహ్మద్, సమయ్ శ్రీవాస్తవ.శ్రీలంకచరిత్ అసలంక (కెప్టెన్), కుశాల్ మెండిస్ (వికెట్‌కీపర్), పాతుమ్ నిస్సాంక, కుశాల్ పెరీరా, కమిల్ మిషార, దసున్ షనక, కమిందు మెండిస్, వనిందు హసరంగ, నువానీదు ఫెర్నాండో, దునిత్ వెల్లాలగే, చమిక కరుణరత్నే, మహీశ్ తీక్షణ, మతీశ పతిరణ, నువాన్ తుషార, దుష్మంత చమీరా, బినుర ఫెర్నాండో.బంగ్లాదేశ్లిట్టన్ కుమార్ దాస్ (కెప్టెన్), తాంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఇమాన్, సైఫ్ హసన్, తౌహిద్ హ్రిదోయ్, జాకర్ అలీ అనిక్, షమీమ్ హొస్సేన్, క్వాజీ నూరుల్ హసన్ సోహన్, షాక్ మహేదీ హసన్, రిషద్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తాంజిమ్ హసన్ సకీబ్, టస్కిన్ అహ్మద్, షరీఫుల్ ఇస్లాం, షైఫ్ ఉద్దీన్స్టాండ్బై ప్లేయర్లు: సౌమ్య సర్కార్, మెహిదీ హసన్ మిరాజ్, తన్వీర్ ఇస్లాం, హసన్ మహమూద్.అఫ్గనిస్తాన్రషీద్ ఖాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, దర్విష్ రసూలీ, సెదిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కరీం జనత్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, షరాఫుద్దీన్ అష్రఫ్, మహ్మద్ ఇషాక్, ముజీబ్ ఉర్ రహమాన్, అల్లాహ్ గజన్ఫార్. నూర్ అహ్మద్, ఫారిక్ అహ్మద్ మాలిక్, నవీన్-ఉల్-హక్, ఫజల్హాక్ ఫరూకీరిజర్వ్ ఆటగాళ్లు: వఫివుల్లా తారఖాల్, నంగ్యాల్ ఖరోటే, అబ్దుల్లా అహ్మద్జాయ్హాంకాంగ్యాసిమ్ ముర్తాజా (కెప్టెన్), బాబర్ హయత్, ఆదిల్ మెహమూద్, జీషన్ అలీ (వికెట్ కీపర్), ఎహ్సాన్ ఖాన్, అనాస్ ఖాన్, షాహిద్ వాసిఫ్ (వికెట్ కీపర్), కల్హన్ చల్లు, హరూన్ అర్షద్, నిజకత్ ఖాన్, ఆయుశ్ శుక్లా, అలీ హసన్, నస్రుల్లా రానా, ఐజాజ్ ఖాన్, ఎండీ ఘజన్ఫర్, మార్టిన్ కోయెట్జి, అతీక్ ఇక్బాల్, మహ్మద్ వాహిద్, అన్షుమన్ రథ్, కించిత్ షా.ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే..ఆసియా కప్-2025 టీ20 మ్యాచ్‌లను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ (టీవీ)లో వీక్షించవచ్చు. డిజిటల్ యూజర్ల కోసం సోనీలివ్ వెబ్సైట్, మొబైల్ అప్లికేషన్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.ప్రైజ్ మనీ ఎంతంతంటే?ఆసియాకప్-2022(టీ20 ఫార్మాట్) ఛాంపియన్స్‌గా నిలిచిన శ్రీలంకకు దాదాపు 200,000 డాలర్ల( సుమారు రూ. 1.6 కోట్లు) ప్రైజ్‌మనీ లభించింది. ఈ ఏడాది ఆసియా విజేతగా నిలిచే జట్టుకు 300,000 డాలర్లు (దాదాపు రూ. 2.6 కోట్లు) నగదు బహుమతి ఏసీసీ అందజేయనున్నట్లు సమాచారం. గత ఎడిషన్‌తో పోలిస్తే ఇది 50 శాతం అధికం. రన్నరప్‌గా నిలిచే జట్టు 150,000 డాలర్లు (సుమారు రూ. 1.3 కోట్లు) ప్రైజ్‌మనీ సొంతం చేసుకోనుంది. మూడు, నాలుగు స్ధానాల్లో నిలిచే జట్లు వరుసగా రూ. 80, 60 లక్షలు దక్కించుకోనున్నాయి.చదవండి: కుంబ్లేకి చెప్పి ఏడ్చాను.. అయినా పట్టించుకోలేదు.. కేఎల్ రాహుల్ కాల్ చేసి: క్రిస్ గేల్ -
IND vs UAE: భయమేమీ లేదు.. బాగా ఆడిన జట్టుదే గెలుపు: యూఏఈ కోచ్
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కోచ్, భారత మాజీ క్రికెటర్ లాల్‌చంద్ రాజ్‌పుత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరని.. మ్యాచ్ రోజున బాగా ఆడిన వాళ్లనే విజయం వరిస్తుందని పేర్కొన్నాడు. కాగా పొట్టి క్రికెట్ ప్రేమికులను అలరించేందుకు ఆసియా కప్ టోర్నీ సిద్ధమైపోయింది.టీమిండియా వర్సెస్ యూఏఈఈసారి టీ20 ఫార్మాట్లో యూఏఈలో జరిగే ఈ ఖండాంతర టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్- ‘ఎ’ నుంచి భారత్ , పాకిస్తాన్లతో పాటు పసికూనలు యూఏఈ, ఒమన్.. గ్రూప్- ‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ పోటీ పడతాయి. సెప్టెంబరు 9న అఫ్గనిస్తాన్- హాంకాంగ్ మ్యాచ్‌తో టోర్నీకి తెరలేవనుండగా.. సెప్టెంబరు 10న యూఏఈ టీమిండియాను ఢీకొట్టనుంది.మేము ఫియర్లెస్ క్రికెట్ ఆడతాముఈ నేపథ్యంలో యూఏఈ కోచ్ లాల్‌చంద్ రాజ్‌పుత్ మీడియాతో మాట్లాడాడు.. ‘‘టీమిండియా పటిష్ట జట్టు. గత టీ20 ప్రపంచకప్‌లో చాంపియన్. అలాంటి జట్టుతో ఆడే అవకాశం రావడం గొప్ప విషయం.అయితే, టీ20 ఫార్మాట్లో మ్యాచ్ రోజున ఏ జట్టైతే బాగా ఆడుతుందో అదే గెలుస్తుంది. ఒక్క బ్యాటర్ లేదంటే బౌలర్ మ్యాచ్‌ను మలుపు తిప్పగలరు. మేము ఫియర్లెస్ క్రికెట్ ఆడతాము.అన్నింటికీ సిద్ధంగా ఉన్నారుమా జట్టు బ్యాటింగ్ విభాగం బలంగా ఉంది. బౌలింగ్ యూనిట్లో మంచి స్పిన్నర్లు ఉన్నారు. యూఏఈలో మ్యాచ్‌లు ఆడిన అనుభవం వారికి ఉంది. అయితే, పటిష్ట జట్టు అయిన టీమిండియాతో ఎలా ఆడతారో చూద్దాం.ప్రతి ఒక్క జట్టుకు టీమిండియాతో ఆడాలని ఉంటుంది. మేము కూడా అంతే. అయితే, కాస్త ఆందోళనగానే ఉంది. ఏదేమైనా మా ఆటగాళ్లు అన్నింటికీ సిద్ధంగా ఉన్నారు’’ అని లాల్‌చంద్ రాజ్‌పుత్ పేర్కొన్నాడు. కాగా యూఏఈ జట్టు ఇటీవల పాకిస్తాన్- అఫ్గనిస్తాన్‌లతో కలిసి ముక్కోణపు టీ20 సిరీస్ ఆడింది. అయితే, ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదు.ఆసియా కప్-2025 టోర్నీకి యూఏఈ జట్టు:ముహమ్మద్ వసీం (కెప్టెన్), అలిశాన్ షరాఫూ, ఆర్యాంశ్ శర్మ (వికెట్ కీపర్), ఆసిఫ్ ఖాన్, ధ్రువ్ పరాశర్, ఈథన్ డిసౌజా, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్దిఖీ, మతీఉల్లా ఖాన్, ముహమ్మద్ ఫారూక్, ముహమ్మద్ జవాదుల్లా, ముహమ్మద్ జోహైబ్, రాహుల్ చోప్రా (వికెట్ కీపర్), రోహిద్ ఖాన్, సిమ్రన్‌జీత్ సింగ్, సాఘిర్ ఖాన్.చదవండి: కుంబ్లేకి చెప్పి ఏడ్చాను.. అయినా పట్టించుకోలేదు.. కేఎల్ రాహుల్ కాల్ చేసి: క్రిస్ గేల్ -
Asia Cup 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ న్యాయనిర్ణేతలు వీరే..!
ఆసియా కప్-2025లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య ఈనెల 14న జరుగనున్న గ్రూప్ స్టేజీ మ్యాచ్ కోసం న్యాయనిర్ణేతల (Match Officials) జాబితాను ఐసీసీ ఇవాళ (సెప్టెంబర్ 8) ప్రకటించింది. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ హై వోల్టేజీ మ్యాచ్‌కు ఫీల్డ్ అంపైర్లుగా రుచిర పల్లియగురుగె (శ్రీలంక), మసుదుర్ రెహ్మాన్ (బంగ్లాదేశ్) ఎంపిక చేయబడ్డారు. వీరిద్దరికి అంతర్జాతీయ అంపైర్లుగా అపార అనుభవం ఉంది.రుచిరాకు 160కి పైగా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో న్యాయనిర్ణేతగా పని చేసిన అనుభవం ఉండగా.. మసుదూర్ 70కి పైగా మ్యాచ్‌ల్లో అంపైర్‌గా వ్యవహరించాడు. రుచిరా 2019 వన్డే వరల్డ్‌కప్, 2022 మహిళల వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీల్లో పని చేయగా.. మసుదూర్ 2022 ఆసియా కప్ ఫైనల్లో అంపైర్‌గా వ్యవహరించాడు.భారత్, పాక్ మధ్య తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో, ఆసియా కప్ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ల పాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే, మైదానంలో వారు తీసుకునే నిర్ణయాలు ఇరు దేశాల అభిమానుల భావోద్వేగాలతో ముడిపడి ఉంటాయి. ఇరు జట్లకు సంబంధించి ఏ ఒక్క తప్పు నిర్ణయం తీసుకున్నా, దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.ఈ మ్యాచ్‌కు సంబంధించి ఐసీసీ టీవీ అంపైర్, ఫోర్త్ అంపైర్, మ్యాచ్ రిఫరీ పేర్లను కూడా ప్రకటించింది. టీవీ అంపైర్‌గా అహ్మద్ పక్తీన్ (ఆఫ్ఘానిస్తాన్), ఫోర్త్ అంపైర్‌గా ఇజతుల్లా సఫీ (ఆఫ్ఘానిస్తాన్) వ్యవహరించనున్నారు. మ్యాచ్ రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్ (జింబాబ్వే) ఉంటారు. -
ఖాళీ కడుపుతోనే పాక్‌పై సెంచరీ చేశా: వీరేంద్ర సెహ్వాగ్
ఆసియాకప్-2025కు మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. సెప్టెంబర్ 9న అబుదాబి వేదికగా అఫ్గానిస్తాన్-హాంకాంగ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అయితే ఈ మల్టీ నేషనల్ టోర్నమెంట్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. దాదాపు ఆరు నెలల తర్వాత క్రికెట్ మైదానంలో చిరకాల ప్రత్యర్ధులు అమీతుమీ తెల్చుకోనున్నారు.సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా దాయాదుల పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అధికారిక బ్రాడ్ కాస్టర్ సోన్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. పాకిస్తాన్‌తో తన ఆడిన రోజులను సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. పాక్‌పై ఓడిపోయినా ప్రతీసారి తన అసహనానికి లోనయ్యేవాడని అని అతడు తెలిపాడు. "పాకిస్తాన్‌పై ఓడిపోయిన ప్రతీసారి నేను కుంగిపోయేవాడిని. ఫలితంగా నా ఏకాగ్రతను కోల్పోయేవాడని. ఆ సమయంలో ప్రతిదీ కోల్పోయినట్లు అన్పించేది" అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.కాగా ఈ నజాఫ్‌గఢ్ నవాబుకు ప్రత్యర్ధి పాకిస్తాన్ అయితే చాలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయేవాడు. ముఖ్యంగా టెస్టుల్లో అయితే పాక్‌కు చుక్కలు చూపించేవాడు. సెహ్వాగ్ తన తొలి ట్రిపుల్ సెంచరీని పాక్ పైనే నమోదు చేశాడు.2008లో పాకిస్తాన్ టూర్లో కరాచీ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో సెహ్వాగ్ ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికి అభిమానులకు గుర్తుండిపోతుంది. 300 పరుగుల టార్గెట్‌ను చేధించే క్రమంలో వీరు సూపర్ సెంచరీతో చెలరేగాడు. 95 బంతుల్లోనే 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 119 పరుగులు సాధించాడు. ఈ సెంచరీ కోసం కూడా తాజా ఇంటర్వ్యూలో వీరేంద్రుడు మాట్లాడాడు."కరాచీ వన్డే రోజున నేను ఊపవాసంతో ఉన్నాను. ఖాలీ కడుపుతో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. కానీ ఆ మ్యాచ్‌లో పరుగులు సాధించి నా ఆకలిని తీర్చుకున్నాను" అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. -
ఆసియా కప్ జట్టులో నో ప్లేస్.. సత్తా చాటిన యశస్వి జైస్వాల్
ఆసియా కప్ 2025 ప్రధాన జట్టులో (స్టాండ్‌బైగా ఎంపిక) చోటు దక్కించుకోలేకపోయిన టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ దులీప్ ట్రోఫీలో సత్తా చాటాడు. ఈ టోర్నీలో వెస్ట్ జోన్‌కు ఆడుతున్న జైస్వాల్.. సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో రాణించాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనా (4).. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మెరుపు అర్ద సెంచరీతో (70 బంతుల్లో 64; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరిశాడు.రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ రాణించినా అతని జట్టు చేతుల్లో నుంచి మ్యాచ్ జారిపోయేలా కనిపిస్తుంది. సెంట్రల్ జోన్ బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధించారు. ఒక వేళ మ్యాచ్ డ్రా అయిన పక్షంలో తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగానే విజేతను నిర్ణయిస్తారు. అదే జరిగితే సెంట్రల్ జోన్ ఫైనల్స్‌కు చేరుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో 600 పరుగులు చేసిన సెంట్రల్ జోన్ 162 పరుగుల కీలక ఆధిక్యాన్ని సాధించింది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్ జోన్.. రుతురాజ్ గైక్వాడ్ (184) భారీ సెంచరీతో కదంతొక్కడంతో 438 పరుగులు చేసింది. తనుశ్ కోటియన్ (76), కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ (64) అర్ద సెంచరీలతో రాణించారు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ జోన్.. ఒక్క ఆటగాడు కూడా సెంచరీ చేయకపోయినా 600 పరుగుల భారీ స్కోర్ చేసింది. దనిశ్ మాలేవార్ (76), షుభమ్ శర్మ (96), కెప్టెన్ రజత్ పాటిదార్ (77), ఉపేంద్ర యాదవ్ (87), హర్ష్ దూబే (75), సరాన్ష్ జైన్ (63 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు.162 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్ట్ జోన్ నాలుగో రోజు రెండో సెషన్ సమయానికి 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో రుతురాజ్ (16) విఫలం కాగా.. తనుశ్ కోటియన్ (1), షమ్స్ ములానీ (1) క్రీజ్‌లో ఉన్నారు. సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు వెస్ట్ జోన్ ఇంకా 30 పరుగులు వెనుకపడి ఉంది. -
Hockey Asia Cup: ఫైనల్లో భారత్
రాజ్‌గిర్ (బిహార్): ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నమెంట్లో ఆతిథ్య భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ‘సూపర్–4’ దశ చివరి మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్నా ముందంజ వేసే స్థితిలో బరిలోకి దిగిన టీమిండియా భారీ విజయం ఖాతాలో వేసుకుంది. ‘సూపర్–4’ ఆఖరి పోరులో శనివారం భారత్ 7–0 గోల్స్ తేడాతో చైనాను చిత్తుచేసింది. భారత్ తరఫున అభిషేక్ (46వ, 50వ నిమిషాల్లో) డబుల్ గోల్స్‌తో సత్తా చాటగా... శిలానంద్ లక్డా (4వ నిమిషంలో), దిల్‌ప్రీత్ సింగ్ (7వ నిమిషంలో), మన్దీప్ సింగ్ (18వ నిమిషంలో), రాజ్ కుమార్ పాల్ (37వ నిమిషంలో), సుఖ్జీత్ సింగ్ (39వ నిమిషంలో) తలా ఒక గోల్ చేశారు. ‘సూపర్–4’ దశ ముగిసేసరికి భారత్ 7 పాయింట్లతో పట్టిక అగ్ర స్థానంలో నిలవగా... డిఫెండింగ్ చాంపియన్ కొరియా 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ రెండు జట్ల మధ్య ఆదివారం టైటిల్ సమరం జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు వచ్చే ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత సాధించనుంది. మూడో స్థానం కోసం మలేసియాతో చైనా తలపడుతుంది. చైనాతో పోరులో టీమిండియా పూర్తి ఆధిపత్యం కనబర్చింది. భారత స్ట్రయికర్ల ధాటికి చైనా ప్లేయర్లు ఆత్మరక్షణలో పడిపోయారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ప్రత్యర్థికి ఒక్క పెనాల్టీ కార్నర్ అవకాశం కూడా ఇవ్వలేదు. మ్యాచ్ ఆరంభమైన నాలుగో నిమిషంలో శిలానంద్ గోల్‌తో ఖాతా తెరిచిన భారత్... ఇక చివరి వరకు అదే జోరు కొనసాగించింది. మరో మ్యాచ్‌లో కొరియా 4–3 గోల్స్ తేడాతో మలేసియాపై గెలిచింది. -
IND vs PAK: కేంద్రం అనుమతి.. బీసీసీఐ స్పందన ఇదే
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో టీమిండియా- పాకిస్తాన్ (Ind vs Pak) మ్యాచ్ నిర్వహణపై సందిగ్దం పూర్తిగా తొలగిపోయింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పాక్‌తో క్రికెట్ మ్యాచ్‌కు రాజముద్ర వేసిన విషయం తెలిసిందే. తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించింది.కాగా ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఆసియా కప్ టోర్నీ ఆతిథ్య హక్కులు భారత్ దక్కించుకుంది. కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో ఉన్న ఒప్పందం దృష్ట్యా తటస్థ వేదికపై మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.రెండు గ్రూపులు.. ఎనిమిది జట్లుఇక సెప్టెంబరు 9- 28 మధ్య నిర్వహించే ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్.. గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్ టైటిల్ కోసం పోటీపడనున్నాయి.ఇదిలా ఉంటే.. ఒకే గ్రూపులో ఉన్న భారత్- పాక్ లీగ్ దశలో ఒకసారి కచ్చితంగా ముఖాముఖి తలపడాల్సి ఉంది. సెప్టెంబరు 14న చిరకాల ప్రత్యర్థుల పోరుకు షెడ్యూల్ ఖరారైంది. ఆ తర్వాత సూపర్ ఫోర్ దశలో.. అన్నీ సజావుగా సాగితే ఫైనల్లోనూ ఈ రెండు జట్లు పోటీ పడే అవకాశం ఉంది.అనుమతినిచ్చిన కేంద్ర ప్రభుత్వం అయితే, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో క్రీడల్లోనూ అన్ని సంబంధాలు తెంచుకోవాలనే డిమాండ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆసియా కప్ టోర్నీలోనూ దాయాదుల పోరు ఉండబోదనే వార్తలు వచ్చాయి. అయితే, ఇదొక మల్టీలేటరల్ ఈవెంట్ (ఇతర దేశాలు కూడా పాల్గొంటున్న టోర్నీ) కావడంతో కేంద్ర ప్రభుత్వం ఇందుకు అంగీకరించింది.బీసీసీఐ స్పందన ఇదేఅయితే, ఈ విషయంపై బీసీసీఐ మాత్రం ఇంత వరకు నోరు విప్పలేదు. తాజాగా.. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించాడు. ‘‘కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించాలనేది బీసీసీఐ విధానం. ఇప్పుడు కూడా అంతే. మల్టీ నేషనల్ టోర్నమెంట్ లేదంటే అంతర్జాతీయ స్థాయి టోర్నీలో ఆడాలన్నా కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పక తీసుకుంటాం.భారత్‌తో సంబంధాలు బాగాలేని దేశాల జట్లతో ఆడాలా? లేదా? అన్న విషయాన్ని కూడా కేంద్రమే నిర్ణయిస్తుంది. ఆసియా కప్ టోర్నీలో కూడా వివిధ దేశాలు పాల్గొంటున్నందున మాకు అనుమతి లభించింది. ఆసియా క్రికెట్ నియంత్రణ మండలి లేదంటే అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి నిర్వహించే టోర్నీల్లో టీమిండియా ఆడకుండా ఉండదు కదా!ఫిఫా, ఏఎఫ్సీ.. ఇలా ఈ క్రీడలోనైనా.. మేము ప్రత్యేకంగా ఓ దేశంతో మ్యాచ్ ఆడబోమని చెబితే.. ఇండియన్ ఫెడరేషన్ మీద ఆంక్షలు విధించే అవకాశం ఉండవచ్చు’’ అని దేవజిత్ సైకియా పేర్కొన్నాడు. ద్వైపాక్షిక సిరీస్‌లలో మాత్రం టీమిండియా పాక్‌తో ఆడబోదని స్పష్టం చేశాడు.చదవండి: చిన్ననాటి గురువుకు రూ. 80 లక్షల సాయం.. హార్దిక్, కృనాల్ మంచి మనసు -
ఈసారైనా టైటిల్ గెలవండి: భారత మాజీ క్రికెటర్
టీమిండియా అత్యధికంగా ఎనిమిదిసార్లు.. శ్రీలంక ఆరుసార్లు.. పాకిస్తాన్ రెండుసార్లు.. ఆసియా కప్ (Asia Cup) టైటిల్‌ను గెలిచాయి. ఇక ఈ ఖండాంతర టోర్నమెంట్లో బంగ్లాదేశ్ మూడుసార్లు ఫైనల్ చేరగలిగింది. కానీ కప్ మాత్రం గెలవలేక రన్నరప్‌తో సరిపెట్టుకుంది.ఇక ఆసియా కప్ తాజా ఎడిషన్‌లో గ్రూప్- ‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, ఒమన్, యూఏఈ.. గ్రూప్- ‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ పాల్గొంటున్నాయి. ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఈ టోర్నీకి సెప్టెంబరు 9- 28 వరకు షెడ్యూల్ ఖరారైంది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra).. అఫ్గనిస్తాన్ జట్టును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. గత కొంతకాలంగా ఐసీసీ టోర్నీల్లో సత్తా చాటిన అఫ్గన్‌కు.. ఈసారి ఆసియా కప్ టైటిల్ రేసులో నిలిచే అవకాశం ఉందన్నాడు.తేలికగా తీసిపారేసే జట్టు కాదు‘‘ఇప్పటి వరకు వాళ్లు తోడి పెళ్లికూతుళ్లుగా మాత్రమే ఉన్నారు. పెళ్లికూతురు మాత్రం కాలేకపోయారు. అంటే.. వారి ప్రాముఖ్యత ఇంకా పెరగలేదని అర్థం. అయితే, అంత తేలికగా తీసిపారేసే జట్టు కూడా కాదు. అఫ్గన్ క్రికెటర్లను మనం గౌరవిస్తాం.. ప్రశంసలు కురిపిస్తాం.కానీ వారు ఇంత వరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా ఆసియా కప్ గెలవలేదు. టీ20 ప్రపంచకప్-2024 సెమీ ఫైనల్‌కు వెళ్లడం.. వన్డే వరల్డ్‌కప్-2023లో రాణించడం.. గొప్ప విషయాలు.ఈసారైనా గెలవండిఅయితే, ఈసారి ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో జరగడం.. ఆ జట్టుకు టైటిల్ గెలిచేందుకు సువర్ణావకాశాన్ని ఇచ్చింది. దీనిని వారు సద్వినియోగం చేసుకుంటారో.. లేదో చూడాలి. సెదీఖుల్లా అటల్, డార్విష్ రసూలీ, అల్లా ఘజన్ఫర్ వంటి యువ ఆటగాళ్లకు ఇదొక మంచి అవకాశం. ఒకవేళ వారు ఇక్కడ రాణిస్తే గనుక ఐపీఎల్‌లోనూ మంచి అవకాశాలు వస్తాయి’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.తమ బలమైన స్పిన్ మాయాజాలంలో ప్రత్యర్థిని బంధిస్తే అఫ్గనిస్తాన్ గెలుపు సులువేనన్న ఆకాశ్ చోప్రా.. రహ్మనుల్లా గుర్బాజ్ శుభారంభం అందిస్తే బ్యాటింగ్ పరంగానూ తిరుగు ఉండదని పేర్కొన్నాడు. ఇబ్రహీం జద్రాన్ కూడా తన వంతు పాత్ర పోషించాల్సి ఉందని పేర్కొన్నాడు.అయితే, అఫ్గన్ జట్టులో ఉన్న ప్రధాన బలహీనత.. నిలకడలేమి అని ఆకాశ్ చోప్రా అన్నాడు. ప్రతి ఒక్క జట్టుకు ఇలాంటి బలహీనత ఉంటుందని.. ప్రతిసారీ గెలవడం ఎవరికీ సాధ్యం కాదని పేర్కొన్నాడు. కాబట్టి సరైన సమయంలో రాణించి కప్ గెలిచే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని రషీద్ ఖాన్ బృందానికి సూచించాడు.ఆసియాకప్-2025 టోర్నీకి అఫ్గనిస్తాన్ జట్టు ఇదేరషీద్ ఖాన్ (కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, డార్విష్ రసూలీ, సెదిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కరీం జనత్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, షరాఫుద్దీన్ అష్రఫ్, మహ్మద్ ఇషాక్, ముజీబ్ ఉర్ రహమాన్, అల్లా ఘజన్ఫర్, నూర్ అహ్మద్, ఫారిక్ అహ్మద్ మాలిక్, నవీన్-ఉల్-హక్, ఫజల్హాక్ ఫరూకీరిజర్వ్ ఆటగాళ్లు: వఫివుల్లా తారఖాల్, నంగ్యాల్ ఖరోటే, అబ్దుల్లా అహ్మద్జాయ్.చదవండి: చరిత్ర సృష్టించిన బవుమా బృందం.. బ్రీట్జ్కే వరల్డ్ రికార్డుతో.. -
పాపం సెలక్టర్లు..! కొందరు ఆటగాళ్లు దురదృష్టవంతులు అంతే!
టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ (Parthiv Patel)ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఎక్కువగా ఉండటం జట్టుకు మంచిదని.. అయితే, అదే సెలక్టర్లకు తలనొప్పిగా మారుతుందన్నాడు. ఈ క్రమంలో కొంతమంది నైపుణ్యాలున్న ఆటగాళ్లు కూడా బెంచ్‌కే పరిమితం అవుతారని.. అలాంటి వాళ్లు దురదృష్టవంతులేనని పేర్కొన్నాడు.శ్రేయస్ అయ్యర్‌కు అన్యాయంఆసియా కప్-2025 (Asia Cup) టోర్నీకి భారత జట్టును ప్రకటించిన నాటి నుంచి బీసీసీఐ (BCCI) తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇందులో ప్రధానంగా శ్రేయస్ అయ్యర్‌కు అన్యాయం జరిగిందనేది మాజీ క్రికెటర్ల వాదన. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు.. టీ20 ఫార్మాట్లోనూ మంచి ఫామ్‌లో ఉన్నా అతడిని ఎందుకు ఎంపిక చేయడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.ఈ నేపథ్యంలో పార్థివ్ పటేల్ సైతం.. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)కు మద్దతుగా నిలిచాడు. అతడిని ఆసియా కప్ ఆడే జట్టుకు ఎంపిక చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. అయితే, కొన్నిసార్లు జట్టులో చోటు కోసం ఎదురుచూడక తప్పదని.. దురదృష్టం వెంట ఉంటే ఇలాంటివే జరుగుతాయని పేర్కొన్నాడు.కొంతమంది దురదృష్టవంతులుగా..‘‘టీమిండియాను ఎంపిక చేసిన ప్రతిసారి ఏదో ఒక రకంగా విమర్శలు రావడం సహజం. ఆసియా కప్ టోర్నీకి శివం దూబే, రింకూ సింగ్.. ఇద్దరినీ సెలక్టర్లు ఎంపిక చేశారు. వీరిద్దరూ ఎడమచేతి వాటం బ్యాటర్లే. ఈ క్రమంలోనే శ్రేయస్ అయ్యర్‌కు ఎందుకు స్థానం ఇవ్వలేదనే ప్రశ్నలు వస్తున్నాయి.పోటీలో ఎక్కువ మంది ఉన్నపుడు కొంతమంది దురదృష్టవంతులుగా మిగిలిపోవాల్సి వస్తుంది. క్రికెట్ ఆడుతున్నపుడు ఒక్కోసారి అదృష్టం కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది మరి!.. ఏదేమైనా శ్రేయస్ అయ్యర్ మరికొన్నాళ్లు ఓపికగా వేచిచూడకతప్పదు’’ అని పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు.పాపం సెలక్టర్లు ఏం చేస్తారు?అదే విధంగా.. ‘‘ప్రస్తుతం టీమిండియా సెలక్టర్లుగా ఉండటం అత్యంత కఠిన సవాలుతో కూడుకున్న పని. వారికి నా సానుభూతి. భారత్‌లో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. అందుకే అతడికి ఎందుకు అవకాశం రాలేదు? ఇతడికి మాత్రమే ఎందుకు ఛాన్స్ ఇచ్చారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతూనే ఉంటాయి’’అ అని పార్థివ్ పటేల్ చెప్పుకొచ్చాడు.ఇక ప్రస్తుతం ఆసియా కప్ టోర్నీకి పదిహేను మంది సభ్యులను మాత్రమే సెలక్టర్లు ఎంపిక చేయగలరన్న పార్థివ్ పటేల్.. శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, ఐపీఎల్-2025 ఆరెంజ్ క్యాప్ విజేత సాయి సుదర్శన్, పర్పుల్ క్యాప్ విజేత ప్రసిద్ కృష్ణలు కూడా ఈ జట్టులో ఉండేందుకు అర్హులని పేర్కొన్నాడు.కాగా యూఏఈ వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు ఆసియా కప్ టోర్నీ జరుగనుంది. ఈసారి పొట్టి ఫార్మాట్లో ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో భారత్‌తో పాటు పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఒమన్, యూఏఈ, హాంకాంగ్ పాల్గొంటున్నాయి.ఆసియా కప్ టీ20-2025 టోర్నీకి భారత జట్టు సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్. -
BCCI: ఒక్కో మ్యాచ్‌కు రూ. 3 కోట్ల 50 లక్షలు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ప్రధాన (జెర్సీ) స్పాన్సర్షిప్ విలువను బీసీసీఐ మరింత పెంచింది. ఇటీవలే ‘డ్రీమ్ 11’ను తప్పించడంతో కొత్త స్పాన్సర్షిప్ వేటలో ఉన్న బోర్డు ఈసారి మరింత పెద్ద మొత్తాన్ని ఆశిస్తోంది. కొత్త విలువ ప్రకారం భారత్ ఆడే ద్వైపాక్షిక సిరీస్‌లో ఒక్కో మ్యాచ్‌కు స్పాన్సరర్ రూ. 3 కోట్ల 50 లక్షల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.ఇక ఎక్కువ దేశాలు పాల్గొనే ఐసీసీ లేదా ఏసీసీ టోర్నీలో అయితే ఇది ఒక్కో మ్యాచ్‌కు రూ. 1 కోటీ 50 లక్షలుగా ఉంది. ‘డ్రీమ్ 11’ ఇప్పటి వరకు రూ. 3 కోట్ల 17 లక్షలు, రూ.1 కోటీ 12 లక్షలు చెల్లిస్తూ వచ్చింది. ఆసియా కప్ ముగిసిన తర్వాతే జెర్సీ స్పాన్సర్షిప్ ఒప్పందం ఖరారు కానుంది. ఇక బోర్డు ఆశించిన విధంగా జరిగితే ఏడాదికి సుమారు రూ. 400 కోట్లు బీసీసీఐ ఖాతాలో చేరతాయి.ఇదిలా ఉంటే.. స్పాన్సర్షిప్ కోసం బిడ్లను కోరుతూ మంగళవారం బోర్డు ప్రకటన ఇచ్చింది. దీనికి ఆఖరి తేదీ సెప్టెంబరు 16 కావడంతో జెర్సీ స్పాన్సర్ లేకుండానే టీమిండియా బరిలోకి దిగనుంది. ఇదీ చదవండి: 27 ఏళ్ల తర్వాత... లండన్: ఆఖరిదాకా ఉత్కంఠ రేపిన రెండో వన్డేలోనూ దక్షిణాఫ్రికానే విజయం సాధించింది. తద్వారా వరుస విజయాలతో మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో ఇంగ్లండ్‌పై సిరీస్‌ను కైవసం చేసుకుంది. 1998 తర్వాత ఇంగ్లండ్ గడ్డపై దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవడం విశేషం. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో వన్డేలో సఫారీ జట్టు 5 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది.ముందుగా దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 330 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మాథ్యూ బ్రిట్జ్కీ (77 బంతుల్లో 85; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), ట్రిస్టన్ స్టబ్స్ (62 బంతుల్లో 58; 2 ఫోర్లు, 1 సిక్స్), మార్క్రమ్ (64 బంతుల్లో 49; 6 ఫోర్లు, 1 సిక్స్), బ్రెవిస్ (20 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), కార్బిన్ బాష్ (32 నాటౌట్; 3 ఫోర్లు) సమష్టిగా రాణించారు.తన కెరీర్లో ఐదో వన్డే ఆడిన బ్రిట్జ్కీ వరుసగా నాలుగో అర్ధ సెంచరీ చేయడం విశేషం. న్యూజిలాండ్‌తో ఫిబ్రవరి 10న అరంగేట్రం వన్డేలో సెంచరీ (150) చేసిన బ్రిట్జ్కీ ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో 83, 57, 88, 85 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ 4, ఆదిల్ రషీద్ 2 వికెట్లు తీశారు. తర్వాత భారీ లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ దాదాపు గెలుపుతీరం దాకా కష్టపడింది. చివరకు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 325 పరుగులకు పరిమితమైంది.తద్వారా విజయానికి కేవలం 5 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఆర్చర్ (14 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆఖరిదాకా జట్టును గెలిపించేందుకు విఫల ప్రయత్నం చేశాడు. అంతకుముందు రూట్ (72 బంతుల్లో 61; 8 ఫోర్లు), బట్లర్ (51 బంతుల్లో 61; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), బెథెల్ (40 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించారు. బర్గర్ 3, కేశవ్ మహరాజ్ 2 వికెట్లు తీశారు. రేపు ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే జరుగుతుంది. చదవండి: చిన్ననాటి గురువుకు రూ. 80 లక్షల సాయం.. హార్దిక్, కృనాల్ మంచి మనసు -
Asia Cup 2025: టీమిండియా ప్రాక్టీస్ షురూ! వీడియో వైరల్
ఆసియాకప్-2025 కోసం టీమిండియా తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టింది. దాదాపు నెల రోజుల విరామం తర్వాత భారత ఆటగాళ్లు తిరిగి మైదానంలో అడగుపెట్టేందుకు సిద్దమవుతున్నారు. ఈ మల్టీ నేషనల్ టోర్నమెంట్ కోసం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత బృందం గురువారం రాత్రి దుబాయ్‌కు చేరుకున్నారు.ఈ క్రమంలో శుక్రవారం దుబాయ్‌లోని ఐసిసి అకాడమీలో టీమిండియా తమ తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గోంది. హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఆధ్వర్యంలోనే భారత ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.వాస్తవానికి బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ట్రైనింగ్ శిబిరాన్ని ఏర్పాటు చేస్తారని తొలుత వార్తలు వచ్చాయి. కానీ యూఏఈ పరిస్థితులను అలవాటు పడేందుకు అక్కడకే వెళ్లి ట్రైనింగ్ క్యాంపును ఏర్పాటు చేయాలని టీమ్ మెనెజ్‌మెంట్ భావిచింది.మరో మూడు రోజుల పాటు నెట్ ప్రాక్టీస్‌లో ఆటగాళ్లు బీజీబీజీగా గడపనున్నారు. అయితే యూఏఈ పరిస్థితులు భారత ఆటగాళ్లకు కొత్తేమి కాదు. ఈ ఏడాది ఆరంభంలో జట్టులో చాలా మంది ప్లేయర్లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడారు. అంతకుముందు ఆ వేదికలపై ఆసియాకప్, ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం భారత ఆటగాళ్లకు ఉంది. ఈ టోర్నీలో భారత తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 9న యూఏఈతో తలపడనుంది.కాగా ఈ ఖండాంత టోర్నీలో భారత జట్టు ప్రధాన స్పాన్సర్ లేకుండానే ఆడనుంది. ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు-2025కు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో డ్రీమ్ 11తో బీసీసీఐ ఒప్పందం రద్దు చేసుకుంది. దీంతో కొత్త స్పాన్సర్స్ కోసం బీసీసీఐ టెండర్లను ఆహ్వానించింది. ఐసీసీ ఆకాడమీలో భారత ఆటగాళ్లు జెర్సీపై స్పాన్సర్ లేకుండా ప్రాక్టీస్ చేశారు.ఆసియాకప్-2025కు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రిత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్. స్టాండ్‌బై ప్లేయర్లు: యశస్వి జైస్వాల్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్.భారత జట్టు షెడ్యూల్ భారత్ వర్సెస్ యుఏఈ - సెప్టెంబర్ 10,భారత్ వర్సెస్ పాకిస్తాన్ - సెప్టెంబర్ 14, భారత్ వర్సెస్ ఒమన్ - సెప్టెంబర్ 19 -
'అతడొక అండర్రేటెడ్ ప్లేయర్.. ఆసియాకప్‌లో ఇరగదీస్తాడు'
ఆసియాకప్-2025కు టీమిండియా తమ సన్నాహాకాలను ప్రారంభించింది. ఇప్పటికే దుబాయ్‌కు చేరుకున్న భారత జట్టు శుక్రవారం తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గోంది. మరో మూడు రోజుల పాటు ఐసీసీ అకాడమీలో ఏర్పాటు స్పెషల్ ట్రైనింగ్ క్యాంపులో భారత ఆటగాళ్లు చెమటోడ్చనున్నారు. మెన్ ఇన్ బ్లూ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గురించి వెటరన్ ఆటగాడు అజింక్య రహానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా తరపున అద్బుతంగా రాణిస్తున్నప్పటికి, అక్షర్‌కు తగినంత గుర్తింపు దక్కలేదని రహానే తెలిపాడు."అక్షర్ పటేల్ ఒక అండర్రేటెడ్ ప్లేయర్ అని నేను భావిస్తున్నాను. గత రెండు, మూడేళ్లలో అతడు ఒక క్రికెటర్‌గా అతడు చాలా మెరుగుపడ్డాడు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అద్బుతంగా రాణిస్తున్నాడు. తనకు వచ్చినప్పుడల్లా బ్యాటర్‌గా, బౌలర్‌గా తన మార్క్‌ను చూపిస్తున్నాడు. పవర్ ప్లేలో కొత్త బంతితో బౌలింగ్ చేసే సత్తా కూడా అక్షర్‌కు ఉంది. మిడిల్ ఫేజ్‌లో కూడా బౌలింగ్ చేయగలడు. అవసరమైతే డెత్ ఓవర్లలో బంతితో మ్యాజిక్ చేయగలడు. అక్షర్ లాంటి ఆటగాడు జట్టులో ఉంటే కెప్టెన్ ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు. అక్షర్ ఫీల్డింగ్‌లో కూడా అద్బుతాలు చేయగలడు. ఆసియాకప్ దుబాయ్‌లో జరగనుంది. అక్కడి పిచ్‌లు ఎక్కువగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి అక్షర్ జట్టుకు ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారనున్నాడు" అని యూట్యూబ్ ఛానల్లో రహానే పేర్కొన్నాడు. కాగా ఆసియాకప్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో అక్షర్ సభ్యునిగా ఉన్నాడు. అయితే భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్సీ నుంచి మాత్రం పటేల్‌ను తప్పించారు. అతడి స్దానంలో శుబ్‌మన్ గిల్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు.చదవండి: ODI WC 2027: ఇంగ్లండ్‌కు డేంజర్ బెల్స్.. వన్డే వరల్డ్ కప్‌కు డైరెక్ట్ ఎంట్రీ కష్టమే!? -
కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. ఓపెనర్లుగా బాబర్ ఆజం, జైశ్వాల్
ఆసియాకప్-2025 సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో అబుదాబి వేదికగా అఫ్గానిస్తాన్, హాంకాంగ్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీ కోసం భారత జట్టు కూడా యూఏఈ గడ్డపై అడుగు పెట్టింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత బృందం.. శుక్రవారం సాయంత్రం దుబాయ్‌లోని ఐసీసీ ఆకాడమీలో తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనుంది.టీమిండియా తమ మొదటి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న దుబాయ్ వేదికగా యూఏఈతో తలపడనుంది. అయితే ఈ ఖండాంతర టోర్నీకి చాలా మంది స్టార్ ప్లేయర్లు దూరమయ్యారు. ముఖ్యంగా భారత జట్టులో కీలక ఆటగాళ్లు యశస్వి జైశ్వాల్, శ్రేయస్ అయ్యర్.. పాక్ జట్టులో మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం, నషీంలకు చోటు దక్కకపోవడం అందరని ఆశ్చర్యపరిచింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జైశ్వాల్‌ను సెలక్టర్లు స్టాండ్‌బై జాబితాలో చేర్చారు. అయ్యర్‌ను అయితే పూర్తిగా పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పటికి భారత జట్టు సెలక్షన్‌పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే ఆసియాకప్‌కు ఎంపిక కాని ఆటగాళ్లతో కూడిన ప్లేయింగ్ ఎలెవన్ జాబితా ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది.కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. ఈ ప్లేయింగ్ ఎలెవన్‌లో భారత్ నుంచి యశస్వి జైశ్వాల్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, సిరాజ్‌కు చోటు దక్కగా.. పాక్ నుంచి రిజ్వాన్, బాబర్, కమ్రాన్ గుఆల్, నసీం షాకు అవకాశమిచ్చారు. అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి మెహది హసన్ మిరాజ్, నహిద్ రాణా.. శ్రీలంక నుంచి ఏంజులో మాథ్యూస్ ఈ తుది జట్టులో ఉన్నారు.ఈ జట్టుకు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేశారు. ఓపెనర్లుగా జైశ్వాల్, బాబర్ ఆజం ఉండగా.. ఫస్ట్ డౌన్లో అయ్యర్‌కు ఛాన్స్ దక్కింది. ఇక మూడో స్ధానంలో రిజ్వాన్, నాలుగో స్ధానంలో కమ్రాన్ గులాం ఉన్నారు. ఆల్‌రౌండర్ల కోటాలో మాథ్యూస్, మెహది హసన్ మిరాజ్, సుందర్‌లకు అవకాశం దక్కింది. ఫాస్ట్ బౌలర్లగా నసీం షా, సిరాజ్, రాణాలకు చోటు లభించింది.ఆసియాకప్‌కు ఎంపిక కాని ఆటగాళ్లతో కూడిన ప్లేయింగ్ ఎలెవన్యశస్వి జైస్వాల్, బాబర్ ఆజం, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, కమ్రాన్ గులామ్, ఏంజెలో మాథ్యూస్, మెహిదీ హసన్ మిరాజ్, వాషింగ్టన్ సుందర్, నసీమ్ షా, మహ్మద్ సిరాజ్, నహిద్ రాణాచదవండి: ‘సచిన్ తప్ప ఎవరూ లేరు.. ధోని, కోహ్లిలకు యువీ అంటే భయం -
తుదిజట్టులో రింకూకు నో ఛాన్స్!.. చీఫ్ సెలక్టరే చెప్పాడు కదా!
టీమిండియా స్టార్ రింకూ సింగ్ (Rinku Singh) గురించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra )ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఉత్తరప్రదేశ్ బ్యాటర్‌కు తుదిజట్టులో చోటు దక్కకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. యాజమాన్యం అతడిని ప్రధాన జట్టుకు ఎంపిక చేసినా.. ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం ఆడించకపోవచ్చని పేర్కొన్నాడు.అదనపు బ్యాటర్గాకాగా గత కొంతకాలంగా ఫామ్‌లో లేకపోయినా టీమిండియా సెలక్టర్లు రింకూ సింగ్ వైపు మొగ్గుచూపి.. ఆసియా కప్ టోర్నీకి ఎంపిక చేశారు. జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం మాకు అదనపు బ్యాటర్‌గా రింకూ అందుబాటులో ఉన్నాడు’’ అని తెలిపాడు.ఇదిలా ఉంటే.. సూపర్ ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌ను కాదని.. రింకూను ఎంపిక చేయడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్‌లో ఆల్‌రౌండర్ ప్రతిభతో రాణిస్తూ విమర్శకులకు ఆటతోనే సమాధానమిస్తున్నాడు.బెంచ్‌కే పరిమితంఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాత్రం భిన్నంగా స్పందించాడు. ‘‘రింకూ సింగ్.. ఫినిషర్. కానీ ఆసియా కప్ టోర్నీలో అతడు బెంచ్‌కే పరిమితం కాకతప్పకపోవచ్చు. ఎందుకంటే.. శివం దూబేకు తుదిజట్టులో అవకాశం ఉంటే.. అతడుఏడో స్థానంలో బ్యాటింగ్‌కు రావొచ్చు. మరోవైపు.. హార్దిక్ పాండ్యా.. జితేశ్ శర్మ కూడా ఉండనే ఉన్నారు. మరి రింకూకు చోటెక్కడ ఉంటుంది’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.కాగా సెప్టెంబరు 9- 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆసియా కప్ టోర్నీ జరుగనుంది. భారత్ ఆతిథ్య దేశంగా వ్యవహరించనుండగా.. టీమిండియాతో పాటు పాకిస్తాన్, ఒమన్, యూఏఈ, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఈసారి టీ20 ఫార్మాట్లో ఈ టోర్నీని నిర్వహించనున్నారు.ఆసియా కప్ టీ20-2025 టోర్నీకి భారత జట్టు సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.చదవండి: సెన్స్ ఉందా?.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఏంటి?: రాజస్తాన్ రాయల్స్ స్టార్ -
ఆసియా కప్-2025: జట్టును ప్రకటించిన యూఏఈ
ఆసియా కప్-2025 టోర్నమెంట్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తమ జట్టును ప్రకటించింది. ఈసారి పొట్టి ఫార్మాట్లో నిర్వహించే ఈ టోర్నీకి పదిహేడు మంది సభ్యులను ఎంపిక చేసినట్లు గురువారం వెల్లడించింది. ముహమ్మద్ వసీం కెప్టెన్సీలో యూఏఈ ఈ టోర్నీ ఆడనుంది. ఇందులో ఆర్యాంశ్ శర్మ (Aryansh Sharma), ధ్రువ్ పరాశర్, రాహుల్ చోప్రా (Rahul Chopra) తదితర భారత సంతతి ఆటగాళ్లు కూడా ఉన్నారు.ఆతిథ్య హక్కులు భారత్‌వి.. వేదిక యూఏఈకాగా ఈ ఖండాంతర ఈవెంట్ ఆతిథ్య హక్కులను ఈసారి భారత్ దక్కించుకుంది. అయితే, పాకిస్తాన్ కూడా ఈ టోర్నీలో భాగమైనందున గత ఒప్పందం ప్రకారం.. తటస్థ వేదికపై మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) యూఏఈలో ఆసియా కప్ టోర్నీని పూర్తి చేయనుంది.ఈ టోర్నమెంట్లో ఎనిమిది జట్లు పాల్గొననుండగా.. రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, ఒమన్, యూఏఈ.. గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్ పోటీపడుతున్నాయి.సూపర్ ఫోర్ దశకు చేరాలంటే..ఇక సొంతగడ్డపై టోర్నీ జరుగనుండటం యూఏఈకి సానుకూలాంశంగా మారనుంది. భారత్, పాకిస్తాన్, ఒమన్‌లతో కలిసి గ్రూప్-‘ఎ’లో ఉన్న యూఏఈ.. లీగ్ దశలో కనీసం రెండు గెలిస్తే సూపర్ ఫోర్ దశకు చేరుకునే అవకాశం ఉంటుంది. టీమిండియా వంటి పటిష్ట జట్టుపై గెలిచే అవకాశం లేకపోయినా.. ప్రస్తుతం బలహీనంగా ఉన్న పాకిస్తాన్‌తో పాటు పసికూన ఒమన్‌పై గెలవడం ద్వారా యూఏఈ తన కలను నెరవేర్చుకోవచ్చు.ఇక సెప్టెంబరు 10న టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా ఆసియా కప్ టోర్నీలో తమ ప్రయాణం మొదలుపెట్టనున్న యూఏఈ.. తదుపరి సెప్టెంబరు 17న పాకిస్తాన్‌తో తలపడనుంది. కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్ఆ మరుసటి రోజే ఒమన్ జట్టుతో యూఏఈ మ్యాచ్ ఆడుతుంది. కాగా టీమిండియా మాజీ క్రికెటర్ లాల్‌చంద్ రాజ్‌పుత్ ఇటీవలే యూఏఈ హెడ్‌కోచ్‌గా నియమితుడైన విషయం తెలిసిందే. ఆసియా కప్ టోర్నీలో లాల్‌చంద్ ఆ జట్టుకు మార్గదర్శనం చేయనున్నాడు.ఇదిలా ఉంటే.. ఈ టోర్నీ సన్నాహకాల్లో భాగంగా యూఏఈ ప్రస్తుతం.. పాకిస్తాన్, అఫ్గనిస్తాన్‌లతో కలిసి టీ20 ముక్కోణపు సిరీస్ ఆడుతోంది. ఇప్పటికి రెండు మ్యాచ్‌లు ఆడి పాకిస్తాన్, అఫ్గన్ జట్ల చేతిలో ఓడిపోయింది. అయితే, మెగా టోర్నీకి ముందు కావాల్సినంత ప్రాక్టీస్ మాత్రం లభించింది.ఆసియా కప్-2025 టోర్నమెంట్‌కు యూఏఈ జట్టు ఇదేముహమ్మద్ వసీం (కెప్టెన్), అలిశాన్ షరాఫూ, ఆర్యాంశ్ శర్మ (వికెట్ కీపర్), ఆసిఫ్ ఖాన్, ధ్రువ్ పరాశర్, ఈథన్ డిసౌజా, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్దిఖీ, మతీఉల్లా ఖాన్, ముహమ్మద్ ఫారూక్, ముహమ్మద్ జవాదుల్లా, ముహమ్మద్ జోహైబ్, రాహుల్ చోప్రా (వికెట్ కీపర్), రోహిద్ ఖాన్, సిమ్రన్‌జీత్ సింగ్, సాఘిర్ ఖాన్.చదవండి: సెన్స్ ఉందా?.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఏంటి?: రాజస్తాన్ రాయల్స్ స్టార్ -
ఆసియా కప్ విజేతకు ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?
ఆసియాలోనే అతి పెద్ద క్రికెట్ పండగకు సమయం అసన్నమవుతోంది. ఆసియా కప్-2025 సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. గ్రూప్-‘ఎ’లో భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ ఉండగా, గ్రూప్ 'బి'లో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ జట్లు ఉన్నాయి. ప్రతీ గ్రూపు నుంచి టాప్-2 టీమ్స్ సూపర్ ఫోర్ స్టేజికి చేరుకుంటాయి. ఈ ఖండాంతర టోర్నీలో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఆసియాకప్-2023ను భారత్ సొంత చేసుకుంది. కానీ అది వన్డే ఎడిషన్ కావడం గమనార్హం. చివరగా 2022లో జరిగిన ఆసియాకప్ టీ20 టోర్నీ టైటిల్‌ను శ్రీలంక సొంతం చేసుకుంది. అయితే గత ఎడిషన్ కంటే ఈసారి ప్రైజ్ మనీని భారీగా పెంచేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ సిద్దమైనట్లు తెలుస్తోంది.ఆసియాకప్ విజేతకు ప్రైజ్ మనీ ఎంతంతంటే?ఆసియాకప్-2022(టీ20 ఫార్మాట్) ఛాంపియన్స్‌గా నిలిచిన శ్రీలంకకు దాదాపు 200,000 డాలర్ల( సుమారు రూ. 1.6 కోట్లు) ప్రైజ్‌మనీ లభించింది. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం.. ఈ ఏడాది ఆసియా విజేతగా నిలిచే జట్టుకు 300,000 డాలర్లు (దాదాపు రూ. 2.6 కోట్లు) నగదు బహుమతి ఏసీసీ అందజేయనున్నట్లు తెలుస్తోంది. గత ఎడిషన్‌తో పోలిస్తే ఇది 50 శాతం అధికం కావడం గమనార్హం. అదేవిధంగా రన్నరప్‌గా నిలిచే జట్టు 150,000 డాలర్లు (సుమారు రూ. 1.3 కోట్లు) ప్రైజ్‌మనీ సొంతం చేసుకోనుంది. మూడు, నాలుగు స్ధానాల్లో నిలిచే జట్లు వరుసగా రూ. 80, 60 లక్షలు దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రైజ్‌మనీపై ఏసీసీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కాగా ఈ ఈవెంట్లో భారత తొలి మ్యాచ్ సెప్టెంబర్ 10న యూఈఏతో ఆడనుంది.చదవండి: 'సంజూ శాంసన్ కంటే అతడు ఎంతో బెటర్.. అద్భుతాలు సృష్టిస్తాడు' -
'సంజూ శాంసన్ కంటే అతడు ఎంతో బెటర్.. అద్భుతాలు సృష్టిస్తాడు'
ఆసియాకప్-2025 సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు గురువారం దుబాయ్ పయనం కానుంది. నాలుగు రోజుల పాటు స్పెషల్ ట్రైనింగ్ క్యాంపులో టీమిండియా చెమటోడ్చనుంది. అయితే ఈ టోర్నీలో భారత జట్టు తరపున సంజూ శాంసన్‌కు ఆడే అవకాశం లభిస్తుందా లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లు ఓపెనర్‌గా ఆడిన శాంసన్‌కు శుబ్‌మన్ గిల్ రీఎంట్రీతో తుది జట్టులో చోటుపై సందేహం నెలకొంది. సంజూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికి టీమ్ మెనెజ్‌మెంట్ గిల్ వైపే మొగ్గు చూపే అవకాశముంది. భారత ఇన్నింగ్స్‌ను అభిషేక్‌తో పాటు గిల్ ప్రారంభించే సూచనలు కన్పిస్తున్నాయి.ఒకవేళ శాంసన్‌ను మిడిలార్డర్లో ఆడించాలని భావిస్తే అతడికి తుది జట్టులో చోటు దక్కే అవకాశముంది. లేదంటే అతడి స్ధానంలో వికెట్ కీపర్‌గా జితేష్ శర్మను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోవడం ఖాయం. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ ఆటగాడు దీప్ దాస్ గుప్తా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. భారత తుది జట్టులో సంజూకు చోటు కష్టమేనని అతడు అన్నాడు."టీమిండియా ఇన్నింగ్స్‌ను అభిషేక్ శర్మతో కలిసి శుబ్‌మన్ గిల్ ప్రారంభిస్తాడని అనుకుంటున్నాను. అతడు జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్నందున కచ్చితంగా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటాడు. అంతేకాకుండా రెట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ కాంబనేషన్ కూడా సరిగ్గా సరిపోతుంది. ఇక మూడో స్ధానంలో కెప్టెన్ సూర్యకుమార్, నాలుగో స్ధానంలో తిలక్ వర్మ రానున్నారు. ఈ రెండు స్ధానాల్లో ఇంతకంటే బెటర్ ఆప్షన్స్ లేవని భావిస్తున్నాను. మరోసారి లెఫ్ట్-హ్యాండ్, రైట్-హ్యాండ్ కాంబినేషన్ జట్టుకు ఉపయోగపడుతోంది. ఇక వికెట్ కీపర్ బ్యాటర్‌గా జితేష్ శర్మకు అవకాశమివ్వాలని నేను సూచిస్తాను. సంజూ శాంసన్ కంటే అతడు బెటర్ ఆప్షన్. జితేష్ ఐదు లేదా ఆరో స్ధానంలో బ్యాటింగ్ వచ్చి జట్టుకు మంచి ఫినిష్ను అందించగలడు. అదే శాంసన్ అయితే టాపర్డర్‌లో మాత్రమే ఆడగలడు. కాబట్టి సంజూ కంటే జితేష్కే తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని" రేవ్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుప్తా పేర్కొన్నాడు.ఆసియాకప్-2025కు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కులదీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్‌కీపర్), హర్షిత్ సింగ్ రానాచదవండి: ఎంత గొప్పగా ఆడినా ప్రయోజనం ఉండదు.. అంతా సెలక్టర్ల ఇష్టం: భువీ -
సెన్స్ ఉందా?.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఏంటి?: రాజస్తాన్ రాయల్స్ స్టార్
రాజస్తాన్ రాయల్స్ పేసర్ సందీప్ శర్మ (Sandeep Sharma) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో కెప్టెన్‌గా రాణించినంత ఉన్నంత మాత్రాన.. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను టీమిండియా సారథిని చేయాల్సిన అవసరం లేదన్నాడు. సెన్స్‌లేని వాళ్లే అతడిని కెప్టెన్‌ను చేయాలని మాట్లాడతారని పేర్కొన్నాడు.పరుగుల వరద.. అయినా కనికరించని సెలక్టర్లుకాగా దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారించాడు ముంబై బ్యాటర్ శ్రేయస్ అయ్యర్. గతేడాది ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)ను విజేతగా నిలిపిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఈ సంవత్సరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా వచ్చి.. జట్టును ఫైనల్‌కు చేర్చాడు.అంతేకాదు బ్యాటర్‌గానూ శ్రేయస్ అయ్యర్ మరోసారి తనను తాను నిరూపించుకున్నాడు. అయినప్పటికీ ఆసియా కప్-2025 టోర్నీకి ప్రకటించిన జట్టులో అతడికి చోటు దక్కలేదు. దాదాపు ఏడాది కాలంగా అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉన్న శుబ్‌మన్ గిల్‌ను పిలిపించిన బీసీసీఐ.. అతడికి మరోసారి వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ ఇచ్చింది.శ్రేయస్‌ను కెప్టెన్ చేయాలి ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ అన్యాయం చేస్తోందనే విమర్శలు వచ్చాయి. ఓ ఆటగాడిగా తాను చేయాల్సిందింతా చేసినా అయ్యర్‌ను పక్కనపెట్టడం సరికాదని మాజీ క్రికెటర్లు సెలక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మరికొంత మంది టీమిండియా టీ20 భవిష్య కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ సరైనోడని అభిప్రాయపడ్డారు.సెన్స్ ఉందా?.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఏంటి?ఈ విషయంపై రాజస్తాన్ రాయల్స్ బౌలర్ సందీప్ శర్మ తాజాగా స్పందించాడు. క్రిక్‌ట్రాకర్‌తో మాట్లాడుతూ.. ‘‘బీసీసీఐకి సొంత డొమెస్టిక్ లీగ్ ఉంది కదా!.. ఎంతో మంది అక్కడ ఆడుతూ ఉంటారు. అయితే, అంతర్జాతీయ స్థాయి జట్టును ఎంపిక చేసినపుడు కేవలం 15 మంది పేర్లనే పరిగణనలోకి తీసుకుంటారు.ఆ పదిహేను మందిని మేనేజ్ చేయగల ఆటగాడినే కెప్టెన్‌గా ఎంపిక చేస్తారు. ఇక ఇక్కడ.. అంటే ఐపీఎల్లో చాలా మంది దేశీ క్రికెటర్లతో పాటు.. యువకులు, విదేశీ ప్లేయర్లు ఉంటారు. ఇక్కడ కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం వేరు.టీమిండియాను మేనేజ్ చేయగల వ్యక్తి మాత్రమే మంచి కెప్టెన్ అవుతాడు. మరి ఈ చర్చ ఎందుకు? ఇలాంటివి సెన్స్‌లెస్ అని అనిపిస్తుంది. ఓ ఆటగాడు ఐపీఎల్లో కెప్టెన్‌గా రాణిస్తే.. టీమిండియా కెప్టెన్ అయిపోలేడు’’ అని సందీప్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు.రెండే మ్యాచ్‌లు.. ఒక వికెట్‌కాగా చాలా మంది ఆటగాళ్లలాగే.. పంజాబ్‌కు చెందిన సందీప్ శర్మ కూడా ఐపీఎల్లో సత్తా చాటి టీమిండియాలోకి వచ్చాడు. 2015లో జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా అడుగుపెట్టిన ఈ రైటార్మ్ పేసర్.. కేవలం రెండు మ్యాచ్‌లు ఆడి ఒక వికెట్ మాత్రమే తీశాడు. కానీ ఐపీఎల్లో ఆడితే టీమిండియాలోకి రావడం అంతతేలిక కాదంటూ సందీప్ వ్యాఖ్యానించడం విశేషం. లీగ్ క్రికెట్ జట్టుకు, అంతర్జాతీయ జట్టుకు తేడా ఉంటుందని.. శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్ చేయాలనడం సరికాదంటూ అభిప్రాయపడటం గమనార్హం.చదవండి: రూ. 4 వేల కోట్ల ప్యాలెస్.. 560 కిలోల బంగారం, వెండి రైలు, రథం.. ఇంకా.. -
ఆసియా కప్-2025 విజేతలుగా మనోళ్లే.. కానీ ఆ జట్టుతో జాగ్రత్త!
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ రూపంలో మినీ క్రికెట్ సంగ్రామం అభిమానులకు కావాల్సినంత మజా పంచనుంది. ఈసారి పొట్టి ఫార్మాట్లో నిర్వహించే ఈ ఖండాంతర టోర్నీకి సెప్టెంబరు 9న తెరలేవనుంది. ఆతిథ్య హక్కులు భారత్‌వే అయినా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో గత ఒప్పందం దృష్ట్యా తటస్థ వేదికైన యూఏఈలో ఆసియా కప్ ఈవెంట్ జరుగనుంది.పాకిస్తాన్‌ను చిత్తు చేసిగ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్.. గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్ ఈ టోర్నీలో తలపడనున్నాయి. కాగా చివరగా 2022లో టీ20 ఫార్మాట్లో ఆసియా కప్ జరుగగా.. నాటి ఫైనల్లో శ్రీలంక పాకిస్తాన్‌ను చిత్తు చేసి టైటిల్ గెలిచింది. ఆనాడు రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా సూపర్ ఫోర్ దశలో ఊహించని రీతిలో పాకిస్తాన్, శ్రీలంక చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది.ప్రపంచకప్ టోర్నీలో సత్తా చాటిన భారత్అయితే, ఆ చేదు జ్ఞాపకాన్ని చెరిపివేసేలా రోహిత్ సేన.. టీ20 ప్రపంచకప్-2024 (T20 World Cup) ట్రోఫీని సొంతం చేసుకుంది. టోర్నీ ఆసాంతం అజేయంగా నిలిచి టైటిల్‌ను గెలుచుకుంది. ఈ టోర్నీలో పాక్ కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది. అంతేకాదు.. అమెరికా వంటి పసికూన చేతిలో ఓడి ఓటమిపాలైంది.చాంపియన్స్ ట్రోఫీ కూడా టీమిండియాదేఇదిలా ఉంటే.. గత ఆసియా కప్-2023 టోర్నీ వన్డే ఫార్మాట్లో జరుగగా రోహిత్ సేన విజేతగా నిలిచింది. అనంతరం సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023లో అద్భుత ప్రదర్శన కనబరిచిన టీమిండియా.. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అయితే, యాభై ఫార్మాట్లోనే జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో రోహిత్ సేన టైటిల్ గెలిచి సత్తా చాటింది.పాకిస్తాన్ ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వగా తటస్థ వేదికైన దుబాయ్‌లో టీమిండియా తమ మ్యాచ్‌లు ఆడింది. ఈ టోర్నీలో పాక్ జట్టు గెలుపున్నదే లేకుండా నిష్క్రమించగా.. శ్రీలంక అసలు ఈ ఈవెంట్‌కు అర్హతే సాధించలేదు. మరోవైపు.. బంగ్లాదేశ్ కూడా వరుస ఓటములతో ఇంటిబాట పట్టింది.అఫ్గనిస్తాన్ అద్భుత ప్రదర్శనలుఅయితే, టీ20 ప్రపంచకప్-2024లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి పటిష్ట జట్లను ఓడించడంతో పాటు.. సెమీస్ చేరి అఫ్గనిస్తాన్ సంచలనం సృష్టించింది. అంతేకాదు.. వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా తొలిసారి పాకిస్తాన్‌ను ఓడించి సెమీ ఫైనల్ దగ్గరగా వచ్చింది.కానీ.. ఆఖరి నిమిషంలో ఒత్తిడిలో చిత్తై లీగ్ దశలోనే నిష్క్రమించినా.. తొలిసారి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి మాత్రం అర్హత సాధించింది అఫ్గన్ జట్టు. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్‌ను ఓడించి సత్తా చాటింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మదన్ లాల్ ఆసియా కప్ విజేత ఎవరన్న అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.విజేత టీమిండియానే.. కానీ ఆ జట్టుతో జాగ్రత్త‘‘టీమిండియా అద్భుత నైపుణ్యాలు గల జట్టు. కచ్చితంగా హాట్ ఫేవరెట్ టీమిండియానే. అయితే, టీ20 ఫార్మాట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ ప్రదర్శనలను ఓసారి పరిశీలించాలి.ముఖ్యంగా అఫ్గనిస్తాన్. గత కొన్నాళ్లుగా ఈ ఫార్మాట్లో వాళ్లు అద్భుత విజయాలు అందుకుంటున్నారు. కచ్చితంగా పాకిస్తాన్‌కు అఫ్గనిస్తాన్ గట్టి పోటీ ఇస్తుంది. అఫ్గన్ల ఆత్మవిశ్వాసం, ఫామ్ అసాధారణంగా ఉన్నాయి.కాబట్టి శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పాటు అఫ్గనిస్తాన్‌ను కూడా ఈ టోర్నీలో స్ట్రాంగ్ కంటెండర్‌గా పేర్కొనవచ్చు’’ అని వార్తా సంస్థ ANIతో మదన్ లాల్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా సెప్టెంబరు 9న అఫ్గనిస్తాన్- హాంకాంగ్ మ్యాచ్‌తో మొదలయ్యే ఆసియా కప్-2025 టోర్నీ సెప్టెంబరు 28న ఫైనల్‌తో ముగుస్తుంది.చదవండి: ఇంకెంత రెస్ట్ కావాలి: రోహిత్‌పై గంభీర్ ఫైర్.. నాడు.. -
ఇంకెంత రెస్ట్ కావాలి: రోహిత్‌పై గంభీర్ ఫైర్.. నాడు..
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నీ ఆరంభానికి సమయం సమీపిస్తున్న తరుణంలో పాత ఘటనలు మరోసారి తెరమీదకు వస్తున్నాయి. ఈ క్రమంలో 2022 నాటి ఆసియా కప్ ఈవెంట్ సందర్భంగా రోహిత్ శర్మపై ప్రస్తుత టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ చేసిన వ్యాఖ్యలు తాజాగా వైరల్ అవుతున్నాయి.ఇంతకీ ఆనాడు ఏమైంది?!... 2022లో పొట్టి ఫార్మాట్లో ఆసియా కప్ టోర్నీని నిర్వహించారు. దుబాయ్ వేదికగా జరిగిన ఈ ఈవెంట్లో లీగ్ దశలో టీమిండియా పాకిస్తాన్, హాంకాంగ్ జట్లపై గెలిచి సూపర్-4 దశకు చేరుకుంది.పాక్, లంక చేతిలో ఓడిన రోహిత్ సేనఅయితే, అనూహ్య రీతిలో పాకిస్తాన్, శ్రీలంక చేతిలో ఓడి ఫైనల్ చేరకుండానే రోహిత్ సేన టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలో అఫ్గనిస్తాన్‌తో జరిగిన నామమాత్రపు టీ20కి రోహిత్ శర్మ దూరమయ్యాడు. సెలక్టర్లు అతడికి విశ్రాంతినిచ్చారు.ఇంకెంత రెస్ట్ కావాలి?ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ (Gautam Gambhir) నాడు స్పందిస్తూ.. ‘‘అతడికి ఇంకెంత రెస్ట్ కావాలి?.. ఇప్పటికే కావాల్సినంత విశ్రాంతి దొరికింది కదా!.. నా అభిప్రాయం ప్రకారం రోహిత్ శర్మ ఇప్పటి నుంచి ప్రతి ఒక్క టీ20 మ్యాచ్ ఆడాల్సిందే.టీ20 ప్రపంచకప్-2024కు సిద్ధమవ్వాలంటే ఇప్పటి నుంచే ఆటపై మరింత ఎక్కువగా దృష్టి సారించాలి’’ అని న్యూస్18తో పేర్కొన్నాడు. కాగా శ్రీలంకతో మ్యాచ్ తర్వాత రెండురోజులకు అఫ్గనిస్తాన్‌తో నాడు మ్యాచ్ జరిగింది. ఇక ఆ టోర్నీలో ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి శ్రీలంక విజేతగా అవతరించింది.భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన రోహిత్ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024లో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మ.. మహేంద్ర సింగ్ ధోని తర్వాత ఈ ఘనత సాధించిన భారత రెండో కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు. ఇక ఈ టోర్నీ ముగిసిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన హిట్‌మ్యాన్.. ఇటీవలే టెస్టుల నుంచి కూడా తప్పుకొన్నాడు.ఇక ఈ ఏడాది ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్‌కు టైటిల్ అందించిన రోహిత్ శర్మ.. ప్రస్తుతం వన్డేలతో పాటు ఐపీఎల్లనూ కొనసాగుతున్నాడు. మరోవైపు.. టీ20 ప్రపంచకప్-2024 ముగిసిన తర్వాత రాహుల్ ద్రవిడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోగా.. గంభీర్ టీమిండియా హెడ్‌కోచ్ అయ్యాడు. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 9- 28 వరకు తాజా ఆసియా కప్ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈసారి పొట్టి ఫార్మాట్లో జరిగే ఈ ఈవెంట్‌కు వేదిక యూఏఈ. భారత్, పాకిస్తాన్, ఒమన్, యూఏఈ.. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ పాల్గొంటున్నాయి.చదవండి: అతడికి అనుమతి ఎందుకు?.. అసలు బీసీసీఐ ఏం చేస్తోంది? -
Asia Cup 2025: ‘తిలక్ వద్దు.. సంజూ శాంసన్‌ను ఆడించండి’
టీమిండియా స్టార్ సంజూ శాంసన్ (Sanju Samson)కు భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ (Mohammed Kaif) మద్దతుగా నిలిచాడు. ఈ కేరళ బ్యాటర్‌ను టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో తప్పక ఆడించాలని భారత జట్టు యాజమాన్యానికి సూచించాడు. అది జరగాలంటే.. ముందుగా ఆసియా కప్-2025 (Asia Cup) ఈవెంట్లో సంజూకు తుదిజట్టులో ఛాన్స్ ఇవ్వాలని పేర్కొన్నాడు.ఎనిమిది జట్లుఈసారి టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్ టోర్నీ నిర్వహణకు సెప్టెంబరు 9- 28 వరకు షెడ్యూల్ ఖరారైంది. యూఏఈ వేదికగా జరిగే ఈ ఖండాంతర టోర్నీలో.. భారత్, పాకిస్తాన్, యూఈఏ, ఒమన్.. బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ జట్లు పాల్గొంటున్నాయి.వైస్ కెప్టెన్గాఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గత నెలలోనే తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన వివరాలను వెల్లడించింది. ఇక దాదాపు ఏడాది విరామం తర్వాత అంతర్జాతీయ టీ20లలోకి రీఎంట్రీ ఇచ్చిన శుబ్‌మన్ గిల్.. వైస్ కెప్టెన్‌గా తిరిగి నియమితుడయ్యాడు.ఓపెనర్‌గానూ ఫిక్స్అభిషేక్ శర్మతో కలిసి గిల్ ఓపెనర్‌గా రావడం దాదాపుగా ఖాయమైంది. ఈ క్రమంలో.. గిల్ గైర్హాజరీలో అభిషేక్‌కు జోడీగా ఉన్న సంజూ శాంసన్‌కు తుదిజట్టులో చోటుపై సందేహాలు నెలకొన్నాయి. వికెట్ కీపర్‌గా వద్దామన్నా.. జితేశ్ శర్మ రూపంలో సంజూకు గట్టి పోటీ ఉంది. ఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్ సంజూను మూడో స్థానంలో ఆడించాలంటూ కొత్త వాదన తీసుకువచ్చాడు.తిలక్ వద్దు.. సంజూను ఆడించండి‘‘ఆసియా కప్ టోర్నీలో అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్ ఓపెనర్లుగా వస్తారు. అయితే, మూడో స్థానం కోసం తిలక్ వర్మ కంటే సంజూ బెటర్. తిలక్.. ఇంకా యువకుడే. అతడికి మున్ముందు ఎన్నో అవకాశాలు వస్తాయి. కానీ సంజూ శాంసన్ లాంటి సీనియర్, అనుభవశాలి అయిన బ్యాటర్ ఇప్పుడు జట్టుకు అవసరం.ఇంకో ఆర్నెళ్ల తర్వాత టీమిండియా టీ20 ప్రపంచకప్ ఆడబోతోంది. కాబట్టి సంజూకు వరుస అవకాశాలు ఇవ్వాల్సి ఉంది. అందుకు అతడు అర్హుడు కూడా’’ అని మహ్మద్ కైఫ్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా సంజూ శాంసన్ ఇప్పటి వరకు కేవలం మూడు అంతర్జాతీయ టీ20లలో మాత్రమే మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే, పొట్టి ఫార్మాట్లో (వివిధ లీగ్‌లలో) వన్‌డౌన్‌లో వచ్చి భారీగా పరుగులు రాబట్టిన ఘనత సంజూకు ఉంది.ఏకైక బ్యాటర్‌గా సంజూ చరిత్రఇప్పటి వరకు ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్.. మొత్తంగా 291 ఇన్నింగ్స్‌లో 133 సార్లు మూడో స్థానంలో వచ్చి.. 4136 పరుగులు సాధించాడు. ఇందులో మూడు శతకాలు, 31 ఫిఫ్టీలు కూడా ఉండటం విశేషం. ఇక గతేడాది తిలక్ వర్మ, సంజూ శాంసన్ అంతర్జాతీయ టీ20 క్రికెట్లో గొప్పగా రాణించారు. సౌతాఫ్రికా గడ్డ మీద సెంచరీలతో ఇరగదీశారు.ఈ క్రమంలో ఒకే ఏడాదిలో టీమిండియా తరఫున మూడు శతకాలు బాదిన ఏకైక బ్యాటర్‌గా సంజూ చరిత్ర సృష్టించగా.. తిలక్ వర్మ వరుసగా రెండు సెంచరీలు సాధించడం గమనార్హం. చదవండి: ధృవ్ జురెల్‌ను తప్పించిన సెలెక్టర్లు -
అలా మిగిలిపోవడం ఇష్టం లేదు.. రింకూ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా యువ బ్యాటర్ రింకూ సింగ్ తన క్రికెట్ ప్రయాణాన్ని కొత్త దశకు తీసుకెళ్లే లక్ష్యంతో ముందుకెళ్తున్నాడు. నన్ను కేవలం టీ20 స్పెషలిస్ట్‌గా మాత్రమే చూడకండని టీమిండియా సెలెక్టర్లను పరోక్షంగా మొరపెట్టుకున్నాడు. ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా కొనసాగడం తనకు ఇష్టమని, టీమిండియా తరఫున టెస్ట్ మ్యాచ్‌లు ఆడటం తన జీవిత లక్ష్యమని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పుకొచ్చాడు.రింకూ మాటల్లో.. నాకు తెలుసు. నేను సిక్సర్లు కొట్టడాన్ని ఫ్యాన్స్ అమితంగా ఇష్టపడతారు. దీనికి నేనెంతో కృతజ్ఞుడిని. అలాగని నేను కేవలం టీ20లకు మాత్రమే పరిమితం కాదలచుకోలేదు. రంజీ ట్రోఫీలో నా యావరేజ్ చాలా బాగుంది. ఈ ఫార్మాట్లో 55కి పైగా సగటుతో పరుగులు చేశాను.నేను రెడ్ బాల్ క్రికెట్ ఆడటాన్ని చాలా ఇష్టపడతాను. నేను టీమిండియా తరఫున రెండు వన్డేలు ఆడిన విషయాన్ని కూడా గమనించాలి. అందులో ఓ మ్యాచ్‌లో నేను రాణించాను కూడా. కాబట్టి నేను కేవలం టీ20 ప్లేయర్‌ను మాత్రమే కాదు. అవకాశాలు వస్తే మిగతా ఫార్మాట్లలో కూడా సత్తా చాటగలనని నేను నమ్ముతాను.వన్ ఫార్మాట్ ప్లేయర్‌గా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు. నన్ను నేను ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అనుకుంటాను. భారత్ తరఫున టెస్ట్ క్రికెట్ ఆడటం నా కల. ఆ అవకాశం వస్తే తప్పక సద్వినియోగం చేసుకుంటాను.టీమిండియా మాజీ సురేశ్ రైనా నాకు మార్గదర్శి. ప్రతి అవకాశానికి సిద్ధంగా ఉండాలి అని అతను చెప్పిన మాట నా మదిలో ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది. ఆ మాటను నేనెప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటాను. ఇప్పటి వరకు నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకున్నాను. టెస్ట్ జెర్సీ ధరించాలన్న కలను సాకారం చేసుకునేందుకు చాలా కృషి చేస్తున్నాను.రింకూ త్వరలో జరుగబోయే ఆసియా కప్‌కు ఎంపికైన విషయం తెలిసిందే. ఆసియా కప్ జట్టు ప్రకటనకు ముందు టీమిండియాలో అతని స్థానంపై సందేహాలు ఉండేవి. ఇటీవలికాలంలో అతను చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయకపోవడంతో ఆసియా కప్‌కు ఎంపిక చేస్తారో లేదో అని చాలామంది అనుకున్నారు. ఆసియా కప్‌కు ఎంపికైన తర్వాత అతను తనపై ఉన్న అపనమ్మకాన్ని చెరిపేశాడు. స్వరాష్ట్రంలో జరిగిన యూపీ టీ20 లీగ్‌లో ఓ విధ్వంసకర శతకం, పలు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి భారత సెలెక్టర్లు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కాకుండా కాపాడుకున్నాడు. ఈ టోర్నీలో రింకూ బౌలర్‌గానూ మెప్పించాడు. -
అతడు కొడితే సెంచరీలు.. లేదంటే చీప్‌గా ఔట్ అవుతాడు: ఇర్ఫాన్ పఠాన్
ఆసియాకప్-2025 సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా ఓపెనర్ ఎవరన్నది? ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చానీయాంశంగా మారింది. ఒక ఓపెనర్‌గా అభిషేక్ శర్మ ఖాయం కాగా.. మరో స్ధానం కోసం శుబ్‌మన్ గిల్, సంజూ శాంసన్ మధ్య పోటీ నెలకొంది.గత 12 నెలలుగా సంజూ భారత జట్టుకు ఓపెనర్ గా ఉన్నాడు. అయితే టీ20ల్లో గిల్‌కు విశ్రాంతి ఇవ్వడంతోనే ఓపెనర్‌గా శాంసన్‌కు అవకాశం లభించింది. ఇప్పుడు గిల్ టీ20 జట్టులోకి తిరిగి రావడంతో శాంసన్ పరిస్థితి ఏంటో ఆర్ధం కావడం లేదు. శాంసన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికి తుది జట్టు కూర్పులో పక్కన పెట్టే అవకాశముంది. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్‌కు మిడిలార్డర్లో మంచి రికార్డు లేదు. దీంతో అతడి స్ధానంలో జితేష్ శర్మకు చోటు దక్కే సూచనలు కన్పిస్తున్నాయి.జితేష్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శలను చేశాడు. అతడు ఫినిషర్‌గా, వికెట్ కీపర్‌గా సేవలను అందించగలడు. అతడి వైపే టీమ్ మెనెజ్‌మెంట్ మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. తాజాగా ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆసియాకప్‌కు భారత తుది జట్టులో సంజూకు చోటు దక్కడం కష్టమేనని పఠాన్ అభిప్రాయపడ్డాడు."సంజూ శాంసన్ ఓపెనర్‌గా బాగా రాణించాడు. కానీ అతడి స్ధిరత్వంపై అందరికి సందేహం ఉంది. ఎందుకంటే అతడు చేస్తే సెంచరీలు చేస్తాడు లేదా చీప్‌గా ఔట్ అవుతాడు. బంగ్లాదేశ్ సిరీస్‌లో అద్బుతంగా రాణించిన సంజూ.. ఇంగ్లండ్‌పై పూర్తిగా తేలిపోయాడు.అయితే ప్లేయింగ్ ఎలెవన్‌లో అభిషేక్ శర్మ స్ధానానికి ఎటువంటి ఢోకా లేదు. అభిషేక్ అద్బుతమైన స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు. బౌలింగ్ కూడా చేయగలడు. అభిషేక్‌తో కలిసి శుబ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశముంది. ప్రస్తుతం బీసీసీఐ ఆల్‌ఫార్మాట్ కెప్టెన్ కోసం వెతుకుతోంది.అందుకే గిల్ ఏడాది తర్వాత అనూహ్యంగా టీ20 సెటాప్లోకి వచ్చాడు. కాబట్టి తుది జట్టులో గిల్‌కు అవకాశమిచ్చేందుకు సంజూను పక్కన పెట్టచ్చు. అప్పటికి శాంసన్‌ను ఆడించాలంటే ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు పంపాలి.ఒకవేళ అదే జరిగితే జితేష్ శర్మ బెంచ్‌కు పరిమితవ్వాల్సిందే. అయితే సంజూను మిడిలార్డర్లో ఆడించి టీమ్ మెనెజ్‌మెంట్ రిస్క్ తీసుకుంటుందో లేదో వేచి చూడాలి" అని సోనీ స్పోర్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ పేర్కొన్నాడు.చదవండి: ‘ధోని సహనం కోల్పోయాడు.. నా మీద గట్టిగా అరిచాడు.. వికెట్ తీసినా సరే’ -
టీమిండియా స్పాన్సర్ షిప్ కోసం టెండర్లను ఆహ్వానించిన బీసీసీఐ
టీమిండియా జెర్సీ స్పాన్సర్షిప్ నుంచి ఫ్యాంటసీ గేమ్ ఫ్లాట్ ఫామ్ డ్రీమ్ 11 తప్పుకొన్న సంగతి తెలిసిందే. ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు-2025కు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో డ్రీమ్ 11 ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆసియాకప్ టోర్నీలో ప్రధాన స్పాన్సర్షిప్ లేకుండానే భారత జట్టు ఆడనుంది. అయితే ఈ ఏడాది ఆక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్ సమయానికి మాత్రం టీమిండియాకు కొత్త స్పాన్సర్‌ను బీసీసీఐ తీసుకురానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం టీమిండియా స్పాన్పర్ షిప్ కోసం భారత క్రికెట్ బోర్డు టెండర్లను అహ్హనించింది.ఇందుకోసం ఆసక్తి ఉన్న కంపెనీలు సెప్టెంబర్ 16 లోపు తమ ధరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ డెడ్‌లైన్ విధించింది. బిడ్డింగ్‌లో పాల్గోనే కంపెనీలు ఐఈఓఐ కింద రూ. 5,90,000(నాన్ రిఫండ్బుల్) ధరఖాస్తు రుసుము చెల్లించాలి.అంతేకాకుండా ధరఖాస్తు చేసే కంపెనీల వార్షిక టర్నోవర్ కనిష్టంగా రూ.300 కోట్లు అయినా ఉండాలని నిబంధనను బీసీసీఐ విధించింది. వీటితో పాటు స్పాన్సర్షిప్ కోసం దరఖాస్తు చేసుకునే కంపెనీలకు పలు మార్గదర్శకాలను బోర్డు జారీ చేసింది.స్పాన్సర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకునే కంపెనీలకు మార్గదర్శకాలు ఇవే..👉అథ్లెటిజర్, స్పోర్ట్స్‌వేర్ తయారీదారులు ధరఖాస్తు చేయకూడదు.👉బ్యాంకులు, ఆర్ధిక సేవలను అందించే సంస్థలు, బ్యాంకింగేతర ఆర్ధిక కంపెనీలకు అవకాశం లేదు.👉శీతల పానీయాలు తాయారు చేసే కంపెనీలకూ ఛాన్స్ లేదు.👉కంపెనీలు ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, గాంబ్లింగ్‌తో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎలాంటి సంబంధం కలిగి ఉండకూడదు. ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లఘించకూడదు👉క్రిప్టో ట్రేడింగ్, క్రిప్టో ఎక్ఛేంజ్, క్రిప్టో టోకెన్స్‌కు సంబంధించిన వ్యాపార కార్యకలాపాల్లో భాగస్వామ్యం ఉండకూడదు.చదవండి: ఆసియాకప్‌లో లీడింగ్ వికెట్ టేకర్.. మూడేళ్లగా జట్టుకు దూరం -
ఆసియాకప్‌లో లీడింగ్ వికెట్ టేకర్.. మూడేళ్లుగా జట్టుకు దూరం
ఆసియాకప్-2025 (Asia Cup) సమయం అసన్నమవుతోంది. సెప్టెంబర్ 9న అబుదాబీ వేదికగా అఫ్గనిస్తాన్- హాంకాంగ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈ మల్టీనేషన్ టోర్నమెంట్ కోసం ఆయా జట్లు తమ ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నాయి. టీ20 ఫార్మాట్లో జరగనున్న ఈ మెగా ఈవెంట్లో మొత్తం 8 జట్లు పాల్గొననున్నాయి. గ్రూప్-‘ఎ’లో భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ ఉండగా, గ్రూప్ బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ జట్లు ఉన్నాయి. ఈ ఖండాంతర టోర్నీ కోసం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు కూడా మరో రెండు రోజుల్లో దుబాయ్‌కు చేరుకోనుంది.నాలుగు రోజుల ప్రాక్టీస్ క్యాంపులో టీమిండియా తీవ్రంగా శ్రమించనుంది. మెన్ ఇన్ బ్లూ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న దుబాయ్ వేదికగా యూఏఈ (IND vs UAE)తో తలపడనుంది. ఈ నేపథ్యంలో.. ఈ ఆసియాకప్ టోర్నమెంట్(వన్డే, టీ20) చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లపై ఓ లుక్కేద్దాం.1984లో ప్రారంభమైన ఆసియాకప్ 2014 వరకు వన్డే ఫార్మాట్లో మాత్రమే జరిగింది. అయితే ఐసీసీ సూచన మేరకు 2016లో తొలిసారిగా ఆసియాకప్‌ను టీ20 ఫార్మాట్లో నిర్వహించారు. ఈ ఖండాంతర టోర్నీ టీ20 ఫార్మాట్లో చివర సారిగా 2022లో జరిగింది. మళ్లీ ఇప్పుడు మూడేళ్ల తర్వాత ఈ మార్క్యూ ఈవెంట్ పొట్టి ఫార్మాట్లో జరగనుంది.టాప్‌లో భువీ..ఆసియాకప్ టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన జాబితాలో టీమిండియా వెటరన్ భువనేశ్వర్ కుమార్ అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆసియాకప్ టీ20 టోర్నీలో భువీ ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు 13 వికెట్లు పడగొట్టాడు. అతడి ఏకానమీ 5.34గా ఉంది. రెండో స్థానంలో యూఏఈ బౌలర్ అమ్జాద్ జావేద్ ఉన్నాడు. జావేద్ 7 మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లు పడగొట్టాడు.వీరిద్దరి తర్వాత మహ్మద్ నవీద్(111), రషీద్ ఖాన్(11), హార్దిక్ పాండ్య(11), అల్-అమీన్ హుస్సేన్(11) ఉన్నారు. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఆసియాకప్ టీ20ల్లో 6 వికెట్లు పడగొట్టాడు. అయితే బుమ్రా ఒక్క ఎడిషన్‌లో మాత్రమే భాగమయ్యాడు. ఆసియాకప్-2022కు గాయం కారణంగా బుమ్రా దూరమయ్యాడు. కాగా ఆసియాకప్‌లో లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్న భువీ.. టీమిండియా తరపున చివరగా ఆడాడు.వన్డేల్లో అతడే టాప్..ఇక ఆసియాకప్ వన్డే ఫార్మాట్లో శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ ముత్తయ్య మురళీధరన్(30) టాప్‌లో ఉన్నారు. ఆ తర్వాత స్ధానాల్లో లసిత్ మలింగ(29), అజింతా మెండిస్(26), సయీద్ అజ్మల్(25), రవీంద్ర జడేజా(25) కొనసాగుతున్నారు. టాప్ 10లో భారత్ నుంచి జడేజా, ఇర్ఫాన్ పఠాన్(22) మాత్రమే ఉన్నారు. ఈ జాబితాలో కూడా బుమ్రా పేరు లేదు.చదవండి: బుమ్రాతో నాకు పోలికా?.. మేమిద్దరం..: వసీం అక్రమ్ -
‘ఆసియా కప్-2025లోనూ అతడిని ఆడించరు.. మళ్లీ బెంచ్ మీదే’
టీమిండియాకు దొరికిన అదురైన లెఫ్టార్మ్ స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) ఒకడు. అండర్-19 ప్రపంచకప్-2014లో భారత్ తరఫున ఆరు ఇన్నింగ్స్‌లో పద్నాలుగు వికెట్లు కూల్చి వెలుగులోకి వచ్చాడీ కాన్పూర్ ‘కుర్రాడు’. ఆ తర్వాత దేశీ క్రికెట్లో, ఐపీఎల్లో రాణించి టీమిండియాకు ఆడే అవకాశం దక్కించుకున్నాడు.మ్యాచ్ విన్నర్చైనామన్ స్పిన్నర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న కుల్దీప్ యాదవ్.. ఇప్పటికే మ్యాచ్ విన్నర్‌గా నిరూపించుకున్నాడు. గతేడాది సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ (IND vs ENG)ను భారత్ 4-1తో గెలవడంలో కుల్దీప్ది కీలక పాత్ర. అదే విధంగా.. టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిళ్లను టీమిండియా సొంతం చేసుకోవడంలోనూ అతడు కీలకంగా వ్యవహరించాడు.అయినప్పటికీ చాన్నాళ్లుగా కుల్దీప్ బెంచ్‌కే పరిమితమవుతున్నాడు. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఐదు టెస్టుల్లోనూ అతడికి ఆడే అవకాశం రాలేదు. మార్చిలో చివరగా టీమిండియాకు ఆడిన కుల్దీప్ యాదవ్.. ఆసియా కప్-2025 టోర్నమెంట్‌తో పునరాగమనం చేసే అవకాశం ఉంది.ఇంగ్లండ్‌లో ఆడిస్తే గెలిచేవాళ్లంఅయితే, ఈ టీ20 టోర్నీలోనూ కుల్దీప్ యాదవ్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉందని.. భారత మాజీ స్పిన్నర్ మణిందర్ సింగ్ అంటున్నాడు. ‘‘ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో కుల్దీప్ యాదవ్‌ను ఆడించి ఉంటే.. టీమిండియా 3-1తో గెలిచేది.కుల్దీప్ లాంటి బౌలర్లు అరుదుగా ఉంటారు. ఇంగ్లిష్ బ్యాటర్లు అతడి బౌలింగ్‌లో ఇబ్బందిపడేవారు. అతడి గూగ్లీలను వాళ్లు రీడ్ చేయలేకపోయేవారు. తొలి టెస్టులో వాళ్లు 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. ఆ సమయంలో కుల్దీప్ గనుక మైదానంలో ఉండి ఉంటే ఇలా జరిగేదే కాదు.ఈసారి కూడా బెంచ్ మీదే!ఇక ఆసియా కప్ టోర్నీలోనూ ఇద్దరు స్పిన్నర్లను మాత్రమే ఆడించాలని భావిస్తే.. మేనేజ్మెంట్ కుల్దీప్ యాదవ్‌ను ఈసారి కూడా పక్కనపెట్టవచ్చు. వరుణ్ చక్రవర్తిని ఆడిస్తారు. బ్యాటింగ్ కూడా చేయగలడు కాబట్టి అక్షర్ పటేల్‌ను తీసుకుంటారు’’ అని మణిందర్ సింగ్ ఇండియా టుడేతో పేర్కొన్నాడు.కాగా సెప్టెంబరు 9- 28 వరకు యూఏఈ వేదికగా ఆసియా కప్ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇదిలా ఉంటే.. చివరగా ఇంగ్లండ్‌లో పర్యటించిన టీమిండియా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీని 2-2తో సమం చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ టూర్తోనే శుబ్‌మన్ గిల్ టీమిండియా టెస్టు సారథిగా ప్రయాణం ఆరంభించాడు. బౌలింగ్ దళంలో పేసర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ కీలకంగా వ్యవహరించగా.. స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా సత్తా చాటాడు.చదవండి: ఒక్కరికే మద్దతు.. అందుకే గిల్‌కు టీ20 జట్టులో చోటు: ఊతప్ప -
Asia Cup 2025: భారీ రికార్డుపై కన్నేసిన రషీద్ ఖాన్
ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ 26 ఏళ్ల వయసులోనే ఎన్నో రికార్డులు నెలకొల్పి, ప్రపంచ అగ్రశ్రేణి స్పిన్నర్‌గా కొనసాగుతున్నాడు. 10 ఏళ్ల కెరీర్లో ప్రపంచవాప్తంగా దాదాపు అన్ని టోర్నీల్లో సత్తా చాటి తిరుగులేని బౌలర్‌గా చలామణి అవుతున్నాడు.అయితే రషీద్ ఒక్క టోర్నీలో మాత్రం తనపై ఉన్న హైప్‌కు న్యాయం చేయలేకపోయాడు. ఆ టోర్నీ టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్. ఈ టోర్నీలో రషీద్ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి ఓ మోస్తరు ఎకానమీతో 11 వికెట్లు తీశాడు. ఇది అంత తీసి పారేసే ప్రదర్శనేమీ కానప్పటికీ.. రషీద్ స్థాయి అయితే కాదు.త్వరలో ప్రారంభం కాబోయే ఆసియా కప్‌లో (టీ20) రషీద్ తన మార్కు చూపించాలని తహతహలాడుతున్నాడు. సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కాబోయే ఈ ఖండాంతర టోర్నీలో మరో 3 వికెట్లు తీస్తే.. ఈ టోర్నీలోని అత్యుత్తమ రికార్డు రషీద్ ఖాతాలో పడుతుంది. ప్రస్తుతం టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ పేరిట ఉంది. భువీ ఈ టోర్నీలో 6 మ్యాచ్‌ల్లో 5.34 ఎకానమీ చొప్పున పరుగులిచ్చి 13 వికెట్లు తీశాడు.ఈ రికార్డుకు సంబంధించి ప్రస్తుతం రషీద్ నాలుగో స్థానంలో ఉన్నాడు. రషీద్‌కు ముందు భువీకి మధ్యలో యూఏఈ బౌలర్లు అంజద్ జావెద్ (7 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు), మొహమ్మద్ నవీద్ (7 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు) ఉన్నారు. రషీద్ ఖాన్‌తో పాటు టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆసియా కప్ టీ20 టోర్నీ చరిత్రలో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచేందుకు రషీద్‌తో పాటు హార్దిక్ పాండ్యాకు కూడా సమాన అవకాశాలు ఉన్నాయి.ప్రస్తుతం రషీద్ షార్జాలో జరుగుతున్న యూఏఈ ట్రై సిరీస్‌లో అదరగొడుతున్నాడు. తాజాగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి, అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. యూఏఈ ట్రై సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్, యూఏఈతో పాటు పాకిస్తాన్ కూడా పాల్గొంటుంది.ఇంతకీ ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో ఎన్ని సార్లు జరిగింది..?కాగా, ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో ఇప్పటివరకు రెండు సార్లు జరిగింది. త్వరలో జరుగబోయేది మూడో ఎడిషన్ అవుతుంది. 2016లో ఈ ఖండాంతర టోర్నీని తొలిసారి పొట్టి ఫార్మాట్లో (బంగ్లాదేశ్) నిర్వహించారు. ఆతర్వాత 2022లో రెండో సారి జరిగింది (యూఏఈలో). తొలి ఎడిషన్‌లో భారత్ విజేతగా నిలువగా.. రెండో ఎడిషన్‌లో శ్రీలంక ఛాంపియన్‌గా నిలిచింది. ఈసారి టీ20 ఫార్మాట్లో జరుగబోయే ఆసియా కప్ యూఏఈ వేదికగా జరుగనుంది. -
‘ప్రతిసారి ఒక్కరికే మద్దతు.. అందుకే గిల్‌కు టీ20 జట్టులో చోటు’
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేయడంపై భారత క్రికెట్ వర్గాల్లో చర్చ కొనసాగుతూనే ఉంది. ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్‌కు జట్టు ప్రకటన సందర్భంగా గిల్‌కు చోటివ్వడంతో పాటు.. అతడిని వైస్ కెప్టెన్‌గానూ నియమించినట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు.ఓపెనర్‌గానే గిల్!కాగా దాదాపు ఏడాది పాటు భారత టీ20 జట్టుకు గిల్ దూరంగా ఉండగా.. అభిషేక్ శర్మ- సంజూ శాంసన్ (Sanju Samson) ఓపెనింగ్ జోడీగా వచ్చి సత్తా చాటారు. అయితే, గిల్ రీఎంట్రీ సంజూకు గండంగా మారింది. అభిషేక్ శర్మనే ఓపెనర్‌గా కొనసాగిస్తామని అగార్కర్ ఇప్పటికే స్పష్టం చేశాడు.అంతేకాదు.. గిల్ లేడు కాబట్టే సంజూ ఓపెనర్‌గా వచ్చాడని అగార్కర్ పేర్కొన్నాడు. దీనిని బట్టి గిల్ కోసం సంజూపై వేటు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఓపెనర్‌గా కాకపోయినా వికెట్ కీపర్‌గా అయినా ఈ కేరళ స్టార్‌ను ఆడిస్తారనుకుంటే.. యాజమాన్యం జితేశ శర్మ వైపే మొగ్గుచూపే అవకాశం కనిపిస్తోంది.ఒక ఆటగాడిని అలా తయారు చేస్తారుఈ పరిణామాల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరోవైపు.. ఇప్పటికే టెస్టుల్లో కెప్టెన్ అయిన గిల్‌ను.. టీ20, వన్డేల్లోనూ భవిష్య కెప్టెన్‌గా నియమించేందుకు బీసీసీఐ అడుగులు వేస్తోందని మరికొందరు పేర్కొంటున్నారు. అయితే, భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప మాత్రం భిన్నంగా స్పందించాడు.‘‘భారత క్రికెట్లో పరిణామాలు నిశితంగా పరిశీలిస్తే.. ప్రతి తరంలోనూ ఒక సూపర్‌స్టార్‌ను తయారు చేస్తారు. భారత క్రికెట్‌ను కాపాడేందుకు ఎవరో ఒక ప్లేయర్‌కు ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తూనే ఉంటారు.మార్కెటింగ్, వ్యాపారం కోసమేఇప్పుడు కూడా అదే జరుగుతోంది. మార్కెటింగ్, వ్యాపారం కోసం ఇలాంటి నిర్ణయాలు జరుగుతాయి. అతడిని అందుకే ఇప్పుడు టీ20 జట్టులోకి తిరిగి తీసుకువచ్చారు. అలాంటి సూపర్స్టార్లతో ఆటను ముందుకు తీసుకువెళ్లాలనే ప్లాన్. శుబ్‌మన్ గిల్ కూడా సూపర్స్టార్లలో ఒకడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు’’ అని రాబిన్ ఊతప్ప తన యూట్యూబ్ చానెల్ వేదికగా చెప్పుకొచ్చాడు. కాగా యూఏఈ వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు ఆసియా కప్ టోర్నీ జరుగుతుంది. ఈసారి టీ20 ఫార్మాట్లో ఈ ఖండాంతర టోర్నీని నిర్వహిస్తున్నారు. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, యూఏఈ, హాంగ్‌కాంగ్, ఒమన్ జట్లు ఇందులో పాల్గొంటున్నాయి.ఆసియా కప్ టీ20-2025 టోర్నీకి టీమిండియా సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన రషీద్ ఖాన్.. సరికొత్త చరిత్ర -
భారత్ 15 కజకిస్తాన్ 0
రాజ్‌గిర్ (బిహార్): తొలి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో ఒక్కో గోల్ తేడాతో నెగ్గిన భారత హాకీ జట్టు... చివరి లీగ్ మ్యాచ్‌లో మాత్రం చెలరేగిపోయింది. ఆసియా కప్ పురుషుల హాకీ టోరీ్నలో భాగంగా... కజకిస్తాన్ జట్టుతో సోమవారం జరిగిన పూల్ ‘ఎ’ ఆఖరి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు 15–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ఎనిమిది మంది ఆటగాళ్లు గోల్స్ చేశారు. టీమిండియా సగటున నాలుగు నిమిషాలకు ఒక్కో గోల్ సాధించడం విశేషం. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి టీమిండియా అజేయంగా నిలిచింది. తొమ్మిది పాయింట్లతో పూల్ ‘ఎ’లో అగ్రస్థానం పొందిన భారత బృందం ‘సూపర్–4’ సెమీఫైనల్ దశకు అర్హత సాధించింది. అంతర్జాతీయస్థాయిలో తొలిసారి కజకిస్తాన్‌తో పోటీపడ్డ భారత్ ప్రత్యర్థి జట్టుపై ఎడతెరిపిలేని దాడులు నిర్వహించి హడలెత్తించింది. ఐదో నిమిషంలో భారత్ నుంచి తొలి గోల్ నమోదుకాగా... మ్యాచ్ ముగియడానికి మరో నిమిషం వరకు ఈ గోల్స్ వేట కొనసాగింది. భారత్ తరఫున అభిõÙక్ (5వ, 8వ, 20వ, 59వ నిమిషాల్లో) అత్యధికంగా నాలుగు గోల్స్ చేశాడు. సుఖ్జీత్ సింగ్ (15వ, 32వ, 38వ నిమిషాల్లో), జుగ్రాజ్ సింగ్ (24వ, 31వ, 47వ నిమిషాల్లో) మూడు గోల్స్ చొప్పున సాధించారు. కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (26వ నిమిషంలో), అమిత్ రోహిదాస్ (29వ నిమిషంలో), రాజిందర్ సింగ్ (32వ నిమిషంలో), సంజయ్ (54వ నిమిషంలో), దిల్‌ప్రీత్ సింగ్ (55వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. భారత జట్టుకు 13 పెనాల్టీ కార్నర్లు, 2 పెనాల్టీ స్ట్రోక్‌లు లభించాయి. 13 పెనాల్టీ కార్నర్లలో కేవలం నాలుగింటిని మాత్రమే భారత ఆటగాళ్లు గోల్స్‌గా మలిచారు. లేదంటే భారత్ ఖాతాలో మరిన్ని గోల్స్ చేరేవి. కజకిస్తాన్ జట్టు తమకు లభించిన మూడు పెనాల్టీ కార్నర్లను వృథా చేసుకుంది. చైనా ముందుకు... పూల్ ‘ఎ’లో భాగంగా చైనా, జపాన్ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. చైనా, జపాన్ జట్లు నాలుగు పాయింట్లతో సమంగా నిలిచినా... గోల్స్ అంతరంలో జపాన్ను (6 గోల్స్) వెనక్కి నెట్టిన చైనా (11 గోల్స్) జట్టుకు ‘సూపర్–4’ బెర్త్ దక్కింది. పూల్ ‘బి’ నుంచి డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియా, మలేసియా జట్లు కూడా ‘సూపర్–4’ దశకు అర్హత పొందాయి. నేడు విశ్రాంతి దినం. బుధవారం నుంచి భారత్, కొరియా, చైనా, మలేసియా జట్ల మధ్య ‘సూపర్–4’ దశ మ్యాచ్‌లు మొదలవుతాయి. బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో దక్షిణ కొరియాతో భారత్ (రాత్రి గం. 7:30 నుంచి), మలేసియాతో చైనా (సాయంత్రం గం. 5 నుంచి) తలపడతాయి. -
‘నాకు గంభీర్ సర్ సపోర్టు ఉంది.. దుబాయ్ వెళ్లాక మాట్లాడతా’
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్‌కు ముందు టీమిండియా స్టార్ రింకూ సింగ్ (Rinku Singh) సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. యూపీ టీ20 లీగ్‌లో మీరట్ మావెరిక్స్ (Meerut Mavericks)కు ప్రాతినిథ్య వహిస్తున్న అతడు.. ఈ టోర్నీలో నాలుగో లీడింగ్ రన్ స్కోరర్‌గా ఉన్నాడు. ఇప్పటికి పది మ్యాచ్‌లలో కలిపి రింకూ 332 పరుగులు సాధించాడు. అతడి స్ట్రైక్‌రేటు 179.46.ఇదే జోరును రింకూ కొనసాగిస్తే ఆసియా కప్ భారత తుదిజట్టులోనూ చోటు సంపాదించుకోవడం ఖాయం. కాగా సెప్టెంబరు 9- 28 వరకు యూఏఈ వేదికగా ఈసారి టీ20 ఫార్మాట్లో ఈ టోర్నీ జరుగనుంది. ఈ నేపథ్యంలో రింకూ సింగ్.. టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌తో తనకున్న అనుబంధం గురించి తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడాడు.దుబాయ్‌కు వెళ్లాక గంభీర్ సర్‌తో మాట్లాడతాతనకు ఆసియా కప్ జట్టులో చోటు దక్కడం గురించి ఎదురైన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఇప్పటి వరకు నేనైతే ఎవరినీ అడుగలేదు. దుబాయ్‌కు వెళ్లిన తర్వాత గంభీర్ సర్‌తో సుదీర్ఘంగా సంభాషిస్తా.ఇప్పటి వరకు మేము ఈ విషయం గురించి మాట్లాడుకోనేలేదు’’ అని రింకూ సరదాగా బదులిచ్చాడు. అదే విధంగా.. ‘‘ఆయనను కలవడమే కాదు.. ఆయన నుంచి పాఠాలు నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటా.నాకు గంభీర్ సర్ మద్దతు ఉందికెరీర్లో నేను ఎదగడానికి ఆయన సహకారం ఎంతగానో ఉంది. జీజీ (గౌతం గంభీర్) సర్ నాకు ఎల్లవేళలా మద్దతుగా నిలిచారు. కేకేఆర్‌తో ఉన్నపుడు తొలి పరిచయంలోనే నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. పుల్ షాట్ల గురించి నాకు సలహాలు ఇచ్చారు.ఆటగాళ్ల పట్ల ఆయన ఎంతో ప్రేమగా ఉంటారు. ఆయనకు పరిజ్ఞానం ఎక్కువ. బ్యాటింగ్ మెళకువల గురించి ఎంతో చక్కగా వివరిస్తారు. ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో బాగుంటుంది. జీజీ సర్ కోచింగ్‌లో టీమిండియాకు ఆడటం గొప్పగా అనిపిస్తుంది. అలాంటి లెజెండ్‌తో డ్రెసింగ్‌రూమ్ పంచుకోవడం ఓ ప్రత్యేకమైన అనుభూతి’’ అని రింకూ సింగ్ గంభీర్ పట్ల అభిమానాన్ని చాటుకున్నాడు. కాగా ఐపీఎల్లో కేకేఆర్‌కు రింకూ కీలక ప్లేయర్ కాగా.. గతేడాది గంభీర్ ఆ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించాడు. చదవండి: తప్పుకొన్న తిలక్ వర్మ.. జట్టులోకి గుంటూరు కుర్రాడు -
ఓర్నీ.. ఔటయ్యావని అలా చేస్తావా? పాక్ ప్లేయర్లంతే! వీడియో
ఆసియాప్-2025కు ముందు పాకిస్తాన్ యువ వికెట్ కీపర్ బ్యాటర్ మొహమ్మద్ హారిస్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. మహ్మద్ రిజ్వాన్ స్దానంలో చోటు దక్కించుకున్న హారిస్.. ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. ఆసియాకప్ సన్నాహాకాల్లో భాగంగా యూఏఈ, అఫ్గానిస్తాన్‌లతో పాక్ జట్టు ట్రైసిరీస్ ఆడుతోంది.ఈ ముక్కోణపు సిరీస్‌లో హారిస్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. అఫ్గాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కేవలం 15 పరుగులు మాత్రమే చేసిన హారిస్.. యూఏఈతో జరిగిన రెండో మ్యాచ్‌లో ఒక్క పరుగుకే పరిమితమయ్యాడు. 2 బంతులు ఎదుర్కొని జునైద్ సిద్ధిక్ బౌలింగ్‌లో జవదుల్లాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.నిర్లక్ష్యపు షాట్ ఆడి డీప్ థర్డ్‌మ్యాన్‌లో అతడు దొరికిపోయాడు. దీంతో హరిస్ తన సహనాన్ని కోల్పోయాడు. తన కోపాన్ని బ్యాట్‌పై చూపించాడు. బ్యాట్ ను నేలకేసి బలంగా కొట్టాడు. దెబ్బకు బ్యాట్ హ్యాండిల్ దగ్గర విరిగిపోయింది. విరిగిన బ్యాట్‌ను తీసుకొని పెవిలియన్‌కు వెళ్లాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అంత ఓవరాక్షన్ అవసరమా అంటే కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది అతడికి మద్దతుగా నిలుస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో యూఏఈపై 31 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది.హారిస్‌పై విమర్శలు..ఇక ఇది ఇలా ఉండగా.. ట్రై-సిరీస్ ప్రారంభానికి ముందు బాబర్ ఆజం గురుంచి హారిస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాబర్ టీ20లకు సరిపోడని, అతడి స్ట్రైక్ రేటు చాలా తక్కువ ఉంటుందని హారిస్ పేర్కొన్నాడు. ఇప్పుడు అతడి ప్రదర్శనలపై పాక్ అభిమానులు మండిపడుతున్నారు. బాబర్‌ను విమర్శించే స్ధాయి తనది కాదని ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.చదవండి: IND vs AUS: టీమిండియాకు గుడ్ న్యూస్.. ఫిట్నెస్ టెస్టులో పాసైన కెప్టెన్This was silly bud...really silly. pic.twitter.com/WK9zB3h3xK— Aatif Nawaz (@AatifNawaz) August 30, 2025