
ఆసియా కప్ 2025లో (Asia cup 2025) భాగంగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (సెప్టెంబర్ 24) జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో (India vs Bangladesh) టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నామమాత్రపు స్కోర్‌కు పరిమితమైంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (19 బంతుల్లో 29; 2 ఫోర్లు, సిక్స్) మంచి ఆరంభాన్ని ఇచ్చినా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులే చేసింది.
అభిషేక్ క్రీజ్‌లో ఉండగా భారత్ స్కోర్ తప్పకుండా 200 పరుగులు దాటుతుందని అంతా అనుకున్నారు. అయితే అతను ఔట్ కావడంతో పరిస్థితితారుమారైంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Surya kumar Yadav) బంతులు వృధా చేసి (11 బంతుల్లో 5) ఔటయ్యాడు. అంతకుముందే శివమ్ దూబే (2) నిరాశపరిచాడు.
తిలక్ వర్మ (7 బంతుల్లో 5) కూడా స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోయాడు. హార్దిక్ పాండ్యా (29 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడినా.. టీ20 స్థాయి తగ్గట్టుగా లేదు. అక్షర్ పటేల్ (15 బంతుల్లో 10 నాటౌట్) దారుణంగా ఆడాడు. చివరి ఓవర్‌లో బంతులు వృధా చేసి భారత్ ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమయ్యేలా చేశాడు.
తొలి 11 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసిన భారత్.. చివరి 9 ఓవర్లలో కేవలం 56 పరుగులే చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది.
మంచి ఆరంభం లభించినా టీమిండియా నామమాత్రపు స్కోర్‌కు పరిమితమవడానికి అభిషేక్, గిల్ మినహా అంతా కారణమైనప్పటికీ.. భారత అభిమానులు మాత్రం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను నిందిస్తున్నారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఇన్ ఫామ్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను కాదని అక్షర్ పటేల్‌ను ముందుగా పంపడాన్ని తప్పుబడుతున్నారు.
శివమ్ దూబే విషయంలోనూ (తిలక్ వర్మను కాదని దూబేను వన్‌డౌన్‌లో పంపారు) ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. వ్యక్తితంగా విఫలమవడాన్ని నిందిస్తున్నారు. మొత్తంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో అనవసర మార్పులపై ఫైరవుతున్నారు.
భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పుల గురించి అటుంచితే, ఈ మ్యాచ్‌లో బంగ్లా బౌలర్లకు క్రెడిట్ ఇవ్వాలి. భారత ఆటగాళ్ల వరుస విరామాల్లో ఔట్ చేసి ఒత్తిడి తెచ్చారు. ముస్తాఫిజుర్ తన అనుభవాన్నంతా రంగరించి చివరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రిషద్ హొసేన్, తంజిమ్ హసన్ కూడా భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు.
169 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని కాపాడుకునేందుకు బరిలోకి దిగిన భారత్.. ఆదిలోనే సత్ఫలితాన్ని రాబట్టగలిగింది. బుమ్రా తన తొలి ఓవర్‌లోనే తంజిద్‌ను (1) ఔట్ చేశాడు. ఆతర్వాత కుల్దీప్ ధాటిగా ఆడుతున్న పర్వేజ్ హొసేన్‌ను (21) పెవిలియన్‌కు పంపాడు. 9 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 57/2గా ఉంది. సైఫ్ హసన్ (24), తౌమిద్ హృదోయ్ (6) క్రీజ్‌లో ఉన్నారు.
చదవండి: Asia cup 2025: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ