టీ20ల్లో తమకు తిరుగులేదని టీమిండియా మరోసారి నిరూపించింది. హైదరాబాద్ వేదికగా జరిగిన మూడో టీ20లో 133 పరుగుల తేడాతో భారత్ విజయ భేరి మ్రోగించింది. తద్వారా టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది.
తొలుత బ్యాటింగ్‌లో 297 పరుగులు చేసిన టీమిండియా.. ఆ తర్వాత బౌలింగ్‌లో 164 పరుగులకే ప్రత్యర్ధిని కట్టడి చేసింది. ఇక ఈ అద్బుత విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. తమ కుర్రాళ్ల ఆటతీరు పట్ల సూర్య సంతోషం వ్యక్తం చేశాడు.
"బంగ్లాతో టీ20 సిరీస్‌ను వైట్ వాష్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మేము ఒక జట్టుగా చాలా సాధించాము. నా జట్టులో నిస్వార్థమైన క్రికెటర్లు ఉండాలని కోరుకుంటా. హార్దిక్ చెప్పినట్లుగా ఫీల్డ్‌లోనైనా, ఆఫ్‌ది ఫీల్డ్‌లోనైనా ఒకరి ప్రదర్శనలను ఒకరు ఆస్వాదించాలనుకుంటున్నాము.
వీలైనంత ఎక్కువ సమయం సరదగా గడపాలని అనుకుంటున్నాము. మైదానంలో కూడా మా స్నేహాన్ని కొనసాగిస్తాము. ఇక గతంలో శ్రీలంకతో సిరీస్‌కు వెళ్లినప్పుడు గౌతీ భాయ్(గౌతమ్ గంభీర్) ఏం చెప్పాడో.. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు కూడా అదే సలహా ఇచ్చాడు. జట్టు కంటే ఏది ముఖ్యం కాదు. ఎవరైనా 99 లేదా 49 మీద ఉన్నప్పుడు షాట్ ఆడే ఆవకాశం వస్తే ఏమాత్రం ఆలోచించకుండా ఆడేయాలి.
ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ అదే చేశాడు. నిజంగా అతడి ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. జట్టుకు బ్యాటింగ్, బౌలింగ్ విషయంలో ఖచ్చితంగా ఆప్షన్స్ ఉండాలి. ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో మా జట్టు ప్రదర్శన నాకు సంతృప్తినిచ్చింది. జట్టు విజయాల్లో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావడం చాలా అనందంగా ఉంది" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో సూర్యకుమార్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs BAN: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
Comments
Please login to add a commentAdd a comment