teamindia
-
అశ్విన్‌కు వచ్చే పెన్షన్ ఎంతో తెలుసా?
భారత క్రికెట్లో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ శకం ముగిసిన సంగతి తెలిసిందే. బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముగిసిన అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు అశ్విన్ వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి విలేకరుల సమావేశంలో అశూ వెల్లడించాడు.ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా నిలిచిన అశ్విన్ ఆకస్మికంగా రిటైర్మెంట్ ప్రకటించడం అందరిని షాక్‌కు గురిచేసింది. అయితే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన అశ్విన్‌కు ఎంత మొత్తం పెన్షన్ వస్తుందనే ప్రశ్న అభిమానుల్లో మొదలైంది.అశ్విన్‌కు ఎంతంటే?ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో కనీసం 25 మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లకు భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) పెన్షన్ సౌకర్యం కల్పిస్తోంది. 2022 వరకు ఆటగాళ్లకు తక్కువ మొత్తంలో పెన్షన్ లభించేది. కానీ జూన్ 1, 2022 ఆటగాళ్ల పెన్షన్ స్కీమ్‌లో బీసీసీఐ భారీగా మార్పులు చేసింది.ప్రస్తుత విధానం ప్రకారం.. 25 నుండి 49 మ్యాచ్‌లు ఆడిన ఫస్ట్-క్లాస్ క్రికెటర్లందరికి ప్రతీ నెలా రూ.30 వేల పెన్షన్ లభిస్తుంది. గతంలో వారికి నెలకు 15,000 రూపంలో పెన్షన్ అందేది. అదే విధంగా 50 నుంచి 74 మ్యాచులు ఆడిన వారికి రూ.45 వేల పెన్షన్ బీసీసీఐ నుంచి అందనుంది.75కి పైగా మ్యాచులు ఆడిన క్రికెటర్లకు ప్రతి నెలా రూ.52,500 పెన్షన్ ఇస్తారు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో 25 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన టెస్టు క్రికెటర్లందరికీ నెలకు రూ.70,000 పెన్షన్ లభించింది. గతంలో వీరి పింఛన్ రూ. 50,000గా ఉండేది. ఈ లెక్కన 106 టెస్టులు ఆడిన అశ్విన్‌కు రూ. 70,000 పెన్షన్ అందనుంది.చదవండి: SA vs PAK: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
'అశ్విన్‌ను చాలా సార్లు తొక్కేయాలని చూశారు'
టీమిండియా స్టార్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్ నిర్ణయం భారత క్రికెట్ అభిమానులనే కాకుండా యావత్తు క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముగిసిన అనంతరం అశ్విన్ తన నిర్ణయాన్ని వెల్లడించి అందరిని షాక్‌కు గురిచేశాడు. అయితే టెస్టు క్రికెట్లో భారత తరపున సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచిన అశ్విన్ కనీసం ఫేర్వెల్ మ్యాచ్ కూడా ఆడకుండా రిటైర్ అవ్వడం ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది. అతడికి బీసీసీఐ ఫేర్వెల్ మ్యాచ్ ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు."అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటన చేసి షాకయ్యాను. నిజాయితీగా చెప్పాలంటే అశ్విన్ పట్ల భారత జట్టు మెనెజ్‌మెంట్ సరైన రీతిలో వ్యవహరించలేదు. పెర్త్ టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత విడ్కోలు పలకాలని అశ్విన్ నిర్ణయించకున్నాడని స్వయంగా కెప్టెన్ రోహిత్ శర్మనే చెప్పాడు.తొలి టెస్టులో తనను కాదని వాషింగ్టన్ సుందర్‌ను ఆడించిన తర్వాతే అశ్విన్ రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. అతడు సంతోషంగా లేడన్న అంశాన్ని ఆ విషయం చెబుతోంది. నిజం చెప్పాలంటే.. తమిళనాడు నుంచి ఓ క్రికెటర్ ఈ స్ధాయికి చేరుకోవడం చాలా గొప్ప విషయం.అందుకు చాలా కారణాలున్నాయి. భారత క్రికెట్లో కొన్ని రాష్ట్రాల ఆటగాళ్లకే మంచి అవకాశాలు లభిస్తాయి. ఇన్ని అసమానతలు ఉన్నప్పటికీ, అశ్విన్ 500 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టి లెజెండ్ అయ్యాడు. అశ్విన్ కూడా చాలా సార్లు పక్కన పెట్టడానికి ప్రయత్నించారు. కానీ అలా జరిగినా ప్రతిసారీ అతడు పక్షిలా తిరిగి గాల్లోకి ఎగిరాడు అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బద్రీనాథ్ పేర్కొన్నాడు.చదవండి: SA vs PAK: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
శిఖర్ ధావన్ ఊచకోత.. కేవలం 29 బంతుల్లోనే! అయినా
బిగ్ క్రికెట్ లీగ్ 2024లో టీమిండియా మాజీ ఓపెనర్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఈ లీగ్‌లో నార్తరన్ ఛాలెంజర్స్‌కు సారథ్యం వహిస్తున్న ధావన్.. సోమవారం ఎంపీ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.గబ్బర్ తనదైన స్టైల్లో షాట్లు ఆడుతూ అభిమానులను అలరించాడు. కేవలం 29 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే ధావన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికి తన జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు.236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నార్తరన్ ఛాలెంజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు మాత్రమే చేయగల్గింది. దీంతో 12 పరుగుల తేడాతో ధావన్ జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. నార్తరన్ బ్యాటర్లలో ధావన్‌తో పాటు గురుకీరత్ సింగ్ మాన్(32 బంతుల్లో 73, 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.నమన్ ఓజా సూపర్ సెంచరీ..అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎంపీ టైగర్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఎంపీ టైగర్స్ బ్యాటర్లలో నమన్ ఓజా(55 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీతో మెరవగా.. సాకేత్ శర్మ(78) హాఫ్ సెంచరీతో రాణించాడు. నార్తరన్ బౌలర్లలో కుందన్ కుమార్ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా ఈ బిగ్ క్రికెట్లో పాకిస్తాన్ మినహా అన్ని దేశాల మాజీ క్రికెటర్లు భాగమయ్యారు. -
దేశం కోసం క్యాన్సర్‌ను లెక్కచేయని యోధుడు.. హ్యాపీ బర్త్‌డే యువీ (ఫోటోలు)
-
కాంబ్లీ తన ఆరోగ్యంపై బాధ్యతతో ఉండాలి: కపిల్ దేవ్
భారత మాజీ కెప్టెన్, ఆల్‌రౌండ్ దిగ్గజం కపిల్ దేవ్ సాయానికి ఎందరు ముందుకొచ్చినా... వినోద్ కాంబ్లీ తన ఆరోగ్యం పట్ల తనే శ్రద్ధ చూపెట్టాలని సూచించాడు. 52 ఏళ్ల కాంబ్లీ గతితప్పిన జీవనశైలితో పాటు మద్యానికి బానిసై తీవ్ర ఆనారోగ్యం పాలయ్యాడు.కోచింగ్ లెజెండ్ రమాకాంత్ ఆచ్రేకర్ స్మారకార్థం ఇటీవల ముంబైలో జరిగిన కార్యక్రమంలో కాంబ్లీ ఓ పేషంట్లా కనిపించడంతో విచారం వ్యక్తం చేసిన భారత మాజీలు, దిగ్గజాలు అతని పరిస్థితి మెరుగయ్యేందుకు తమవంతు ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించారు.ఆ కార్యక్రమంలో సచిన్ కూడా పాల్గొని కాంబ్లీని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. భారత్‌కు తొలి వన్డే ప్రపంచకప్ (1983లో) అందించిన కపిల్ దేవ్ కూడా తాజాగా కాంబ్లీ ఆరోగ్య పరిస్థితిపై విచారం వెలిబుచ్చారు. ‘మేమంతా అతనికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ దీనికంటే ముఖ్యం తను కూడా తన ఆరోగ్య పరిస్థితికి తగ్గట్లుగా నడుచుకోవాలి. తిరిగి ఆరోగ్యవంతుడయ్యేందుకు స్వీయ నియంత్రణ పాటించాలి. ఒక విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఒక వ్యక్తి తనను తాను చూసుకోలేకపోతే మనం మాత్రం చేయగలిగేదేమీ ఉండదు’ అని అన్నారు.కాంబ్లీ సహచరులే కాదు... అతని సీనియర్లు, పలువురు దిగ్గజ క్రికెటర్లు అతని దీన పరిస్థితి చూసి బాధపడుతున్నారని, అతని సన్నిహితులెవరైనా బాధ్యత తీసుకొని అతను మెరుగయ్యేందుకు చొరవ చూపించాలని, రిహాబిలిటేషన్‌కు పంపి యోగక్షేమాలు చూసుకోవాలని కపిల్ సూచించారు.సచిన్ బాల్యమిత్రుడు, క్రికెట్లో సమకాలికుడు అయిన కాంబ్లీ ఓ ప్రొఫెషనల్ క్రికెటర్ అన్న సంగతి మరిచి క్రమశిక్షణ లేని జీవితంతో క్రీడా భవిష్యత్తునే కాదు... తాజాగా ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నాడు.తన కెరీర్లో 104 వన్డేలాడి 2477 పరుగులు, 17 టెస్టుల్లో 1084 పరుగులు చేశాడు. కెరీర్ ముగిశాక గాడితప్పిన జీవితం వల్ల 39 ఏళ్ల వయసులోనే అతని గుండెకు 2012లోనే శస్త్రచికిత్స జరిగింది. అయినాసరే కాంబ్లీ ఏమాత్రం మారకుండా నిర్లక్ష్యంగా ఉండటంతో ఇప్పుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.చదవండి: సిరాజ్ మ్యాచ్ ఫీజులో కోత -
మహ్మద్ షమీ విధ్వంసం.. కేవలం 17 బంతుల్లోనే! వీడియో వైరల్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ తన బ్యాట్‌ను ఝళిపించాడు. ఈ టోర్నీలో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. చంఢీఘర్‌తో జరుగుతున్న ప్రీ క్వార్టర్ మ్యాచ్‌లో తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. పదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షమీ ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కులు చూపించాడు.అద్భుతమైన షాట్లతో ఈ వెటరన్ క్రికెటర్ అలరించాడు. కేవలం 17 బంతులు మాత్రమే ఎదుర్కొన్న షమీ.. 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా షమీ మెరుపు ఇన్నింగ్స్ ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ జట్టు 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. బెంగాల్ బ్యాటర్లలో షమీతో పాటు కరణ్ లాల్(33), ప్రదీప్త ప్రమాణిక్(30) పరుగులతో రాణించారు. చంఢీగర్ బౌలర్లలో జగిత్ సింగ్ 4 వికెట్లు పడగొట్టగా.. రాజ్ భా రెండు, నికిల్, అమ్రిత్, లాథర్ తలా వికెట్ సాధించారు.టీమిండియాలోకి ఎంట్రీ ఎప్పుడంటే?బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీలో ఆఖరి రెండు టెస్టులకు షమీ భారత జట్టుకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. తొలుత బ్రిస్బేన్ వేదికగా జరిగే మూడో టెస్టుకు ముందు షమీ జట్టుతో కలుస్తాడని వార్తలు వినిపించాయి. కానీ భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఆ వార్తలను కొట్టిపారేశాడు. షమీ ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని, బ్రిస్బేన్ టెస్టుకు అందుబాటులో ఉండకపోవచ్చని పరోక్షంగా హిట్‌మ్యాన్ స్పష్టం చేశాడు. Bengal have set a target of 160 in front of Chandigarh 🎯Mohd. Shami provides a crucial late surge with 32*(17)Karan Lal top-scored with 33 (25)Jagjit Singh Sandhu was the pick of the Chandigarh bowlers with 4/21#SMAT | @IDFCFIRSTBankScorecard ▶️ https://t.co/u42rkbUfTJ pic.twitter.com/gQ32b5V9LN— BCCI Domestic (@BCCIdomestic) December 9, 2024 -
చెలరేగిన భారత బౌలర్లు.. 198 పరుగులకు బంగ్లా ఆలౌట్
అండర్-19 ఆసియాకప్‌లో దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఫైనల్లో భారత బౌలర్లు అదరగొట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా బ్యాటర్లకు టీమిండియా బౌలర్లు చుక్కులు చూపించారు. భారత బౌలర్ల దాటికి బంగ్లాదేశ్ 49.1 ఓవర్లలో కేవలం 198 పరుగులకే ఆలౌటైంది.బంగ్లా బ్యాటర్లలో రిజాన్ హసన్(47) టాప్ స్కోరర్‌గా నిలవగా.. షిహాబ్ (40), ఫరిద్ (39) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో యుధాజిత్ గుహా 2, చేతన్ శర్మ 2, హార్దిక్ రాజ్ 2.. కిరణ్, కేపీ కార్తికేయ, ఆయుష్ మాత్రే తలో వికెట్ తీశారు.తుది జట్లుబంగ్లాదేశ్జవాద్ అబ్రార్, కలాం సిద్ధికి అలీన్, ఎండి అజీజుల్ హకీమ్ తమీమ్ (కెప్టెన్), మహ్మద్ షిహాబ్ జేమ్స్, ఎండి ఫరీద్ హసన్ ఫైసల్ (వికెట్ కీపర్), దేబాసిష్ సర్కార్ దేబా, ఎండి సమియున్ బసిర్ రతుల్, మరుఫ్ మృదా, ఎండి రిజాన్ హోసన్, అల్ ఫహాద్, ఇక్మోన్, ఇక్మోన్భారత్ఆయుష్ మత్రే, వైభవ్ సూర్యవంశీ, ఆండ్రీ సిద్దార్థ్, మహమ్మద్ అమన్ (కెప్టెన్), కెపి కార్తికేయ, నిఖిల్ కుమార్, హర్వాన్ష్ సింగ్ (వికెట్ కీపర్), కిరణ్ చోర్మలే, హార్దిక్ రాజ్, చేతన్ శర్మ, యుధాజిత్ గుహ -
అభిషేక్ శర్మ ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అభిషేక్.. గురువారం మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.143 పరుగుల లక్ష్య చేధనలో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 28 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా ఉర్విల్ పటేల్ రికార్డును అభిషేక్ సమం చేశాడు.ఇదే టోర్నీలో నవంబర్ 27న త్రిపురపై 28 బంతుల్లో ఉర్విల్ సెంచరీ సాధించాడు. తాజా మ్యాచ్‌తో ఉర్విల్ సరసన అభిషేక్ నిలిచాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 29 బంతులు ఎదుర్కొన్న శర్మ 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో 106 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా 143 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్.. 3 వికెట్లు కోల్పోయి కేవలం 9.3 ఓవర్లలోనే చేధించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన మేఘాలయ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.మేఘాలయ బ్యాటర్లలో అర్పిత్ భతేవారా(31) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో అభిషేక్ శర్మ, రమణ్‌దీప్ సింగ్ తలా రెండో వికెట్లు పడగొట్టగా.. అశ్విని కుమార్, ధలేవాల్ ఒక్కో వికెట్ తీశారు.చదవండి: ఆసీస్‌తో రెండో టెస్టు.. టీమిండియా ఓపెనర్లుగా వారే: రోహిత్ శర్మ -
ఆసీస్‌తో రెండో టెస్టు.. ఆ ముగ్గురిపై వేటు! ఓపెనర్లగా రోహిత్, జైశ్వాల్
భారత్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమిండియా అద్భుతమైన విజయంతో ఆరంభించిన సంగతి తెలిసిందే. పెర్త్‌లో జరిగిన మొదటి టెస్ట్‌లో ఆస్ట్రేలియాను 295 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.ఇక ఇదే జోరును డిసెంబర్ 6న ఆడిలైడ్ వేదికగా ప్రారంభం కానున్న పింక్‌బాల్ టెస్టు(సెకెండ్ మ్యాచ్)లో కనబరచాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చాడు.మరోవైపు బొటనవేలు గాయం కారణంగా మొదటి టెస్టుకు దూరమైన యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సైతం సెకెండ్ టెస్టులో ఆడే అవకాశముంది.ఈ నేపథ్యంలో ఆడిలైడ్ టెస్టుకు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఎంచుకున్నాడు."సెకెండ్ టెస్టులో భారత్ ఖచ్చితంగా రెండు మార్పులు చేస్తుందని నేను భావిస్తున్నాను. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ ఇద్దరూ తుది జట్టులోకి రానున్నారు. ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఎంట్రీతో దేవ్‌దత్త్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ బెంచ్‌కే పరిమితవ్వాల్సిందే. అదే విధంగా రోహిత్, గిల్ తిరిగి రావడంతో భారత బ్యాటింగ్ ఆర్డర్ మారే అవకాశముంది. యధావిధిగా రాహుల్ స్థానంలో రోహిత్ శర్మ ఓపెనర్‌గా, ఫస్ట్ డౌన్లో గిల్ బ్యాటింగ్‌కు రానున్నారు. రాహుల్ ఆరో స్ధానంలో బ్యాటింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు వాషింగ్టన్ సుందర్ స్ధానంలో రవీంద్ర జడేజాకు జట్టు మేనెజ్మెంట్ చోటు ఇచ్చే అవకాశముందని" 7 క్రికెట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.ఆసీస్‌తో రెండో టెస్టుకు గవాస్కర్ ఎంచుకున్న భారత తుది జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.చదవండి: IND vs AUS: టీమిండియాతో రెండు టెస్టు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్ -
సంపాదనలో టాప్.. విరాట్ కోహ్లిని దాటేసిన రిషబ్ పంత్
ఐపీఎల్-2025 మెగా వేలం భారత క్రికెటర్లను ఓవర్‌నైట్‌లో కోటీశ్వరులగా మార్చేసింది. ఇటీవల జెడ్డా వేదికగా జరిగిన ఈ క్యాష్‌రిచ్ మెగా వేలంలో టీమిండియా క్రికెటర్లపై కాసుల వర్షం కురిసింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ రూ. 27 కోట్లకు అమ్ముడుపోయి ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.ఈ వేలంలో రిషబ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. పంత్ తర్వాత అత్యంత ఎక్కువ ధర పలికిన ఆటగాళ్లగా శ్రేయస్ అయ్యర్(రూ. 26.75 కోట్లు), వెంకటేష్ అయ్యర్(రూ.23.75) నిలిచారు. మరోవైపు రిటెన్షన్ జాబితాలో అత్యధిక ధర దక్కించుకున్న భారత ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. అతడిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 21 కోట్లకు రిటైన్ చేసుకుంది.కోహ్లిని దాటేసిన పంత్.. అయితే ఆటగాళ్ల ఐపీఎల్ జీతాలు ఖారారు కావడంతో రిషబ్ పంత్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. క్రికెట్ ఒప్పందాల ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న భారత ఆటగాడిగా పంత్ నిలిచాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లిని పంత్ అధిగమించాడు. ఇండియన్ ప్లేయర్లకు బీసీసీఐ, ఐపీఎల్ కాంట్రాక్ట్‌ల ద్వారా వార్షిక అదాయం లభిస్తోంది. పంత్ క్రికెట్ కమిట్మెంట్లతో ఇప్పుడు ఏడాదికి రూ. 32 కోట్లు అందుకోన్నాడు. పంత్ ప్రస్తుతం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఎ కేటగిరీలో ఉన్నాడు.బీసీసీఐ కాంట్రాక్ట్ ద్వారా రిషబ్ ఏడాదికి రూ. 5 కోట్లు అందుకుంటున్నాడు. అదేవిధంగా ఈ ఏడాది నుంచి అతడికి ఐపీఎల్ కాంట్రక్ట్ ద్వారా రూ.27 కోట్లు లభించనున్నాయి. మొత్తంగా ఏడాదికి రూ. 32 కోట్లను ఈ ఢిల్లీ చిచ్చరపిడుగు అందుకోనున్నాడు.మరోవైపు విరాట్ కోహ్లి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఎ ప్లస్ కేటగిరీలో ఉన్నాడు. బీసీసీఐ కాంట్రాక్ట్ వల్ల కోహ్లికి ఏడాదికి రూ. 7 కోట్లు అందుతున్నాయి. ఐపీఎల్లో ఆర్సీబీ రిటెన్షన్తోతో కోహ్లికి రూ. 21 కోట్లు అందనున్నాయి. మొత్తంగా కోహ్లి ఏడాదికి రూ.28 కోట్లు తీసుకుంటున్నాడు. అంటే పంత్ కంటే రూ. 4 కోట్లు కోహ్లి వెనకబడి ఉన్నాడు.చదవండి: -
ఆస్ట్రేలియా పార్లమెంట్లో స్పీచ్ ఇచ్చిన హిట్‌మ్యాన్ (ఫొటోలు)
-
వేలంలో ఎవరూ కొనలేదు..! రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్
టీమిండియా వెటరన్ పేసర్ సిద్దార్థ్ కౌల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సిద్దార్డ్ కౌల్ అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్-2025 మెగా వేలంలో అమ్ముడుపోని తర్వాత కౌల్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రూ.40 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ రైట్ ఆర్మ్ పేసర్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ఈ విషయాన్ని కౌల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. భారత క్రికెట్ తరపున ఆడేందుకు అవకాశమిచ్చిన బీసీసీఐకి, తను ప్రాతినిథ్యం వహించిన ఐపీఎల్ ఫ్రాంచైజీలకు సిద్దార్ద్ ధన్యవాదాలు తెలిపాడు.ఐర్లాండ్‌పై అరంగేట్రం..కాగా పంజాబ్‌కు చెందిన సిద్దార్థ్ కౌల్ 2018లో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌తో భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అదే ఏడాదిలో ఇంగ్లండ్‌పై వన్డే డెబ్యూ చేశాడు. కౌల్ చివరగా టీమిండియా తరపున 2019లో ఆడాడు. భారత్ తరపున మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడిన కౌల్.. 4 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, ఎస్ఆర్హెచ్ జట్లకు అతడు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా 55 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఈ పంజాబీ పేసర్.. 29.98 సగటుతో 58 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. -
జైశ్వాల్ అరుదైన ఫీట్.. 16 ఏళ్ల గంభీర్ రికార్డు బద్దలు
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన జైశ్వాల్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సెంచరీ దిశగా సాగుతున్నాడు.తొలిసారి ఆస్ట్రేలియాలో ఆడుతున్న జైశ్వాల్.. స్టార్క్, హాజిల్‌వుడ్ వంటి వరల్డ్‌క్లాస్ ఫాస్ట్ బౌలర్లను సైతం అలోవకగా ఎదుర్కొని అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రస్తుతం జైశ్వాల్ 90 పరుగులతో క్రీజులో ఉన్నాడు. యశస్వి మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసి తొలి వికెట్‌కు 172 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఆసాదరణ ఇన్నింగ్స్ ఆడుతున్న జైశ్వాల్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒక క్యాలెండర్ ఈయర్‌లో టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా జైశ్వాల్ రికార్డులకెక్కాడు. ఈ ఏడాది ఇప్పటివరకు 12 టెస్టులు ఆడిన జైశ్వాల్..1170* పరుగులు చేశాడు.ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ గౌతం గంభీర్ పేరిట ఉండేది. 2008లో గంభీర్ ఒక క్యాలెండర్ ఈయర్‌లో 8 టెస్టులు ఆడి 1,134 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో గంభీర్ ఆల్‌టైమ్ రికార్డును జైశ్వాల్ బ్రేక్ చేశాడు. 2024లో అత్యధిక టెస్టు పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా యశస్వి కొనసాగుతున్నాడు. ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఇంగ్లండ్ లెజెండ్ జోరూట్(1,338*) ఉన్నాడు.చదవండి: IND vs AUS: జైశ్వాల్, రాహుల్‌కు సెల్యూట్ చేసిన కోహ్లి.. వీడియో వైరల్ -
వారెవ్వా పంత్.. ఆ షాట్ ఎలా కొట్టావు భయ్యా! వీడియో వైరల్
టెస్టు క్రికెట్లో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లపై అదరగొట్టిన పంత్.. ఇప్పుడు ఆస్ట్రేలియా గడ్డపై కూడా అదే దూకుడును కనబరిచాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టులో రిషబ్ పంత్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడతున్నప్పటికీ ఈ ఢిల్లీ చిచ్చరపిడుగు మాత్రం ప్రత్యర్ధి బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. నితీష్ కుమార్ రెడ్డితో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ఓవరాల్‌గా 78 బంతులు ఎదుర్కొన్న పంత్.. 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 37 పరుగులు చేసి ఔటయ్యాడు.పంత్ స్టన్నింగ్ షాట్..కాగా రిషబ్ తన ఇన్నింగ్స్‌లో సంచలన షాట్‌తో మెరిశాడు. అతడు కొట్టిన షాట్ మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. భారత ఇన్నింగ్స్ 41 ఓవర్ వేసిన పాట్ కమ్మిన్స్.. చివరి బంతిని రౌండ్ ది వికెట్ నుండి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా సంధించాడు. వెంటనే పంత్ తన బ్యాటింగ్ పొజిషన్ మార్చుకుని ఎడమవైపునకు వచ్చి డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా స్కూప్ షాట్ ఆడాడు.అయితే ఈ షాట్ ఆడే క్రమంలో పంత్ బ్యాలెన్స్ కోల్పోయి కిందపడిపోయాడు. అయినప్పటకి అతడి పవర్‌కు బంతి బౌండరీ లైన్ అవతల పడింది. పంత్ షాట్ చూసి ప్రత్యర్ధి ఆటగాళ్లు సైతం ఫిదా అయిపోయారు.కామెంటేర్లు కూడా రిషబ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా ఎక్స్‌లో షేర్ చేసింది. రిషబ్ పంత్ ఒక్కడే ఈ షాట్ ఆడగలడు అంటూ క్యాప్షన్‌గా ఇచ్చింది.150@ భారత్..ఇక మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 150 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో నితీష్ కుమార్ రెడ్డి(41) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో హాజిల్ వుడ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, కమ్మిన్స్, మిచెల్ మార్ష్ తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన ఆసీస్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి కేవలం 67 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం క్రీజులో అలెక్స్ క్యారీ(19), మిచెల్ స్టార్క్(6) పరుగులతో ఉన్నారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ రెండు, హర్షిత్ ఒక్క వికెట్ సాధించారు. As only Rishabh Pant can do! 6️⃣#AUSvIND | #PlayOfTheDay | @nrmainsurance pic.twitter.com/vupPuWA8GG— cricket.com.au (@cricketcomau) November 22, 2024 -
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..! 'ఐరెన్ లెగ్' అంపైర్ వచ్చేశాడు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25కు సర్వం సిద్దమైంది. మరి కొన్ని గంటల్లో ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌కు తెర లేవనుంది. ఈ సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.అందుకు తగ్గట్టే ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాయి. ఇక పెర్త్ వేదికగా జరిగే ఈ తొలి టెస్టుకు అంపైర్లను ఐసీసీ ప్రకటించింది. రిచర్డ్ కెటిల్‌బరో, క్రిస్ గాఫ్నీలు ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. అదేవిధంగా రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ థర్డ్ అంపైర్‌గా, సామ్ నోగాజ్స్కీ నాలుగో అంపైర్‌గా, రంజన్ మదుగల్లె మ్యాచ్ రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.అయితే ఈ జాబితాలో రిచర్డ్ కెటిల్‌బరో ఉండడంతో భారత అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. గతంలో భారత్ ఓడిపోయిన ప్రతీ కీలక మ్యాచ్‌లోనూ రిచర్డ్ కెటిల్‌బరోనే అంపైర్ కావడం గమనార్హం. ముఖ్యంగా అతడు అంపైర్‌గా ఉన్న ఒక్క ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించలేదు. దీంతో ఫ్యాన్స్ అతడిని ఐరెన్ లెగ్ అంపైర్‌గా పిలుస్తుంటారు. ఈసారి మరి ఫలితం ఏవిధంగా ఉంటుందో ఎదురు చూడాలి.చదవండి: ఇదంతా విరాట్ భాయ్ వల్లే.. అతడే నాకు ఆదర్శం: యశస్వీ జైశ్వాల్ -
నన్ను రిటైన్ చేసుకోకపోవడానికి అది కారణం కాదు: రిషబ్ పంత్
ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తనను రిటైన్ చేసుకోకపోవడంతో రిషబ్ వేలంలోకి వచ్చాడు.ఈ వేలంలో రూ. 2 కోట్ల కనీస ధరగా పంత్ తన పేరును నమోదు చేసుకున్నాడు. రిషబ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉండడంతో ఈ మెగా వేలంలో కాసుల వర్షం కురిసే అవకాశముంది.క్లారిటీ ఇచ్చిన పంత్..అయితే ఈ ఏడాది సీజన్లో పంత్ అద్బుతంగా రాణించినప్పటికి ఢిల్లీ ఎందుకు వేలంలోకి విడిచిపెట్టిందో ఎవరికి ఆర్ధం కావడం లేదు. ఢిల్లీ మేనెజ్మెంట్తో విభేదాల కారణంగానే పంత్ బయటకు వచ్చాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.అతడు ఎక్కువ డబ్బు అడిగిన కారణంగానే ఢిల్లీ విడిచిపెట్టిందని మరి కొన్ని రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. తాజాగా ఇదే విషయంపై రిషబ్ పంత్ క్లారిటీ ఇచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తనను జట్టులో ఉంచుకోకపోవడానికి డబ్బు కారణం కాదని కచ్చితంగా నేను చెప్పగలను అని ఎక్స్‌లో రిషబ్ పోస్ట్ చేశాడు.కాగా ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ తమ సపోర్ట్ స్టాప్‌లో సమూల మార్పులు చేసింది. ఢిల్లీ తమ హెడ్‌కోచ్‌గా రికీ పాంటింగ్ స్థానంలో హేమంగ్ బదానీని, సౌరవ్ గంగూలీ ప్లేస్‌లో వేణుగోపాల్ రావును క్రికెట్ డైరెక్టర్‌గా నియమించింది. ఇక ఐపీఎల్ మెగా వేలం నవంబర్ 24, 25వ తేదీల్లో జెడ్డా వేదికగా జరగనుంది.చదవండి: BGT 2024: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్‌దే పైచేయి.. ఆసీస్‌కు మరోసారి సవాల్? The curious case of Rishabh Pant & Delhi! 🧐🗣 Hear it from #SunilGavaskar as he talks about the possibility of @RishabhPant17 returning to the Delhi Capitals!📺 Watch #IPLAuction 👉 NOV 24th & 25th, 2:30 PM onwards on Star Sports Network & JioCinema! pic.twitter.com/ugrlilKj96— Star Sports (@StarSportsIndia) November 19, 2024 -
అతడొక అద్బుతం.. తొలి టెస్టులో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడించండి: రవిశాస్త్రి
పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న మొదటి టెస్టుకు టీమిండియా అన్ని విధాల సన్నదమవుతోంది. ఈ మ్యాచ్‌కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో బుమ్రా సారథ్యంలో భారత జట్టు ఆసీస్‌ను ఢీకొట్టనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి టీమ్ మేనెజ్మెంట్కు కీలక సూచనలు చేశాడు. ఆసీస్‌తో తొలి టెస్టుకు యవ ఆటగాడు ధృవ్ జురెల్‌ను స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఎంపిక చేయాలని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.కాగా ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన ధృవ్ జురెల్ తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తిరిగి రావడంతో జురెల్‌కు తుది జట్టులో అవకాశాలు లభించడం లేదు.స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో సిరీస్‌లకు జురెల్ ఎంపికైనప్పటికి ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే ఈ సిరీస్ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా-ఎతో తలపడిన మ్యాచ్‌లో భారత్ -ఎ తరఫున రెండు హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు.ఈ నేపథ్యంలో ఐసీసీ రివ్యూలో శాస్త్రి మాట్లాడుతూ.."తొలి టెస్టుకు ధృవ్ జురెల్‌ను స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఎంపిక చేయండి. అతడికి ఆ సత్తా ఉంది. ఒత్తిడిలో చాలా మంది ఆటగాళ్లు తీవ్ర ఇబ్బంది పడటం మనం చూసి ఉంటాం. మరి కొంతమంది వెంటనే వికెట్‌ను సమర్పించుకుని ఔటవ్వడం చూసి ఉంటాము. కానీ ధృవ్ జురెల్ కథ మాత్రం వేరు. జురెల్ ఎటువంటి పరిస్థితులోనైనా ప్రశాంతంగా బ్యాటింగ్ చేయగలడు. అతడి కూల్‌నెస్ నాకు బాగా నచ్చింది. అదే అతడి స్పెషల్ కూడా. ఇంగ్లండ్‌తో జరిగిన ఆ సిరీస్‌లో కూడా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అతడెంతో పరిపక్వతను చూపించాడు. కాబట్టి పెర్త్ టెస్టులో అతడు ఆడితే చూడాలనుకుంటున్నాను" పేర్కొన్నాడు.చదవండి: ఆస్ట్రేలియా అంటే చాలు కోహ్లికి పూనకాలే.. జాగ్రత్తగా ఉండండి: వార్నర్ -
SL vs NZ: మెండిస్ సూపర్ ఇన్నింగ్స్.. కివీస్‌పై శ్రీలంక విజయం
పల్లెకలె వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో శ్రీలంక 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో ఆతిథ్య శ్రీలంక సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 45.1 ఓవర్లలో 209 పరుగులకే ఆలౌటైంది.మార్క్ చాప్మన్ (81 బంతుల్లో 76; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), మిచెల్ హే (62 బంతుల్లో 49; 4 ఫోర్లు) రాణించారు. శ్రీలంక బౌలర్లలో వాండర్సే, తీక్షణ చెరో 3 వికెట్లు తీయగా, అసిత ఫెర్నాండో 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 210 పరుగుల సులువైన లక్ష్యాన్ని చేధించేందుకు లంకేయులు తీవ్రంగా శ్రమించారు. చివరకు 46 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసి గెలిచింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కుశాల్ మెండీస్ (102 బంతుల్లో 74 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా... మిగతావారిలో ఓపెనర్ నిసాంక (28; 4 ఫోర్లు), అవిష్క ఫెర్నాండో (5), కమిండు (0), కెపె్టన్ అసలంక (13), సమరవిక్రమ (8) విఫలమవడంతో లంక 163 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.83 బంతుల్లో 47 పరుగులు చేయాల్సివుండగా... కుశాల్, మహీశ్ తీక్షణ (44 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) అబేధ్యమైన ఎనిమిదో వికెట్‌కు అవసరమైన 47 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. బ్రాస్‌వెల్ 4, సాంట్నర్, ఫిలిప్స్, స్మిత్ తలా ఒక వికెట్ తీశారు. మంగళవారం ఇదే వేదికపై ఆఖరి వన్డే జరుగనుంది. కాగా 2012 తర్వాత కివీస్‌పై శ్రీలంక వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి.చదవండి: రోహిత్ వచ్చినా అతడినే కెప్టెన్‌గా కొనసాగించండి: హర్భజన్ -
కోహ్లి, పంత్ కాదు.. అతడితోనే మాకు డేంజర్: ఆసీస్ కెప్టెన్
టీమిండియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఆస్ట్రేలియా సిద్దమైంది. గత రెండు పర్యాయాలు తమ సొంత గడ్డపై భారత్ చేతిలో సిరీస్ కోల్పోయిన ఆసీస్.. ఈసారి ఎలాగైనా ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలతో ఉంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు ఇరు జట్ల మధ్య నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది.ఈ క్రమంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ బ్రాడ్‌కాస్టర్ నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గోన్నాడు. ఈ సందర్భంగా టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు. బుమ్రాకు తనొక బిగ్ ఫ్యాన్ అని కమ్మిన్స్ తెలిపాడు. కాగా బుమ్రాకు ఇది మూడో బీజీటీ ట్రోఫీ కావడం గమనార్హం. ఒకవేళ తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరమైతే బుమ్రానే జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. బుమ్రాకు ఆసీస్ గడ్డపై టెస్టుల్లో మంచి రికార్డు ఉంది. ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు 7 టెస్టులు ఆడిన జస్ప్రీత్.. 32 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు."నేను జస్ప్రీత్ బుమ్రాకు పెద్ద అభిమానిని. అతడొక అద్భుతమైన బౌలర్. ఈ సిరీస్‌లో భారత జట్టుకు అతడు కీలకం కానున్నాడు. ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం కూడా బుమ్రాకు ఉంది. అతడితో మా బ్యాటర్లకు ముంపు పొంచి ఉన్నది" అని కమ్మిన్స్ పేర్కొన్నాడు.ఇదే విషయంపై పాట్ కమ్మిన్స్ మాట్లాడుతూ.. "పుజారా, రహానే జట్టులో లేకపోవడం మాకు కలిసిస్తోంది. వారిద్దరూ గతంలో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. పుజారాకు బౌలింగ్ చేయడం నాకు ఎల్లప్పుడూ ప్రత్యేకమే. అతడితో పోటీ అంటే నాకు ఎంతో ఇష్టం. కొన్ని సార్లు గెలిచాను. మరి కొన్ని సార్లు అతడు నాపై పైయి చేయి సాధించాడు. అతడు ఎప్పుడూ ఓటమని అంగీకరించడు" అని చెప్పుకొచ్చాడు.చదవండి: రెండు భారీ రికార్డులపై కన్నేసిన కోహ్లి.. మరో 458 పరుగులు చేస్తే! -
ఆసీస్ తొలి టెస్టు.. టీమిండియా తుది జట్టు ఇదే! స్టార్ ప్లేయర్‌కు నో ఛాన్స్
ఆస్ట్రేలియా-భారత్ మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి మరో ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. నవంబర్ 22న పెర్త్ వేదికగా తొలి టెస్టుతో ఈ ప్రతిష్టాత్మక సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు మొదటి టెస్టు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ అయిన భారత జట్టు ఆసీస్ పర్యటనను విజయంతో ప్రారంభించాలని భావిస్తోంది. అయితే తొలి టెస్టుకు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటుపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది.ఈ క్రమంలో పెర్త్ టెస్టు కోసం భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఎంచుకున్నాడు. తొలి టెస్టులో భారత ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్‌ను రవిశాస్త్రి ఎంపిక చేశాడు. అదే విధంగా కేఎల్ రాహుల్ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ రావాలని అతడు సూచించాడు. మరోవైపు ధ్రువ్ జురెల్‌కు సైతం శాస్త్రి చోటిచ్చాడు."తొలి టెస్టులో భారత ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్‌ను ప్రమోట్ చేయాలి. అతడికి ఓపెనర్‌గా అనుభవం ఉంది. గత ఆస్ట్రేలియా పర్యటనలో అతడు టీమిండియా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఒకవేళ గిల్ జట్టులో లేకపోయింటే ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాల్సి ఉండేది. రోహిత్ బ్యాకప్‌గా ఎంపికైన ఈశ్వరన్ పెద్దగా రాణించలేకపోయాడు. ఆస్ట్రేలియా-ఎతో జరిగిన సిరీస్‌లో ఈశ్వరన్ కనీసం హాఫ్ సెంచరీ మార్క్‌ను దాటలేకపోయాడు. అయితే నెట్స్‌లో ఎలా బ్యాటింగ్ చేస్తున్నాడో జట్టు మేనెజ్‌మెంట్‌కే తెలియాలి. తుది జట్టులో అశ్విన్ లేదా జడేజాకు చోటు ఇవ్వాలా అన్న చర్చ నడుస్తోంది. నేను అయితే జడేజాతోనే వెళ్తాను. ఎందుకంటే అతడు ఫీల్డింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా అద్బుతంగా చేయగలడు. అశ్విన్‌కు ఓవర్సీస్లో పెద్దగా రికార్డు లేదు" అని ఐసీసీ రివ్యూలో శాస్త్రి పేర్కొన్నాడు.రవిశాస్త్రి ఎంచుకున్న భారత తుది జట్టు ఇదేశుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా/వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్.చదవండి: #Tilak Varma: తిలక్ వర్మ సరికొత్త చరిత్ర.. విరాట్ కోహ్లి ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ -
అందులో సీక్రెట్ ఏమీ లేదు.. వారిద్దరూ మాత్రం అద్బుతం: సూర్య
జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో 135 పరుగులతో టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. తద్వారా నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. ఆఖరి టీ20లో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు.తిలక్ వర్మ (47 బంతుల్లో 120 నాటౌట్; 9 ఫోర్లు, 10 సిక్స్‌లు), సంజూ శాంసన్ (56 బంతుల్లో 109 నాటౌట్; 6 ఫోర్లు, 9 సిక్స్‌లు) మెరుపు సెంచరీలతో చెలరేగారు. ఫలితంగా టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో దక్షిణాఫ్రికా 18.2 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది.భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లతో సత్తాచాటగా.. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఈ విజయం తనకెంతో ప్రత్యేకమని సూర్య చెప్పుకొచ్చాడు.వారిద్దరూ అద్బుతం: సూర్య"పరిస్థితులకు అనుగుణంగా మారి ఆడటంలో ఎటువంటి రహస్యం లేదు. మేము డర్బన్‌లో అడుగుపెట్టిన వెంటనే మా ప్రణాళికలను సిద్దం చేసుకున్నాము. మేము గతంలో దక్షిణాఫ్రికాకు వచ్చినప్పుడు ఎలా ఆడామో ఈ సారి కూడా అదే బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌ను కొనసాగించాలని నిర్ణయించుకున్నాము.ఫలితాలు గురించి మేము ఎప్పుడూ ఆలోచించలేదు. తిలక్ వర్మ, సంజూ శాంసన్ ఇద్దరూ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇద్దరిలో ఎవరిది గొప్ప నాక్ అని ఎంచుకోవడం నాకు చాలా కష్టంగా ఉంది. వారిద్దరితో పాటు అభిషేక్ కూడా తన బ్యాటింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించాడు.ఉష్ణోగ్రత తగ్గిన అనంతరం బౌలింగ్‌కు అనుకూలిస్తుందని భావించాం. చక్కని లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తే ప్రత్యర్ధి బ్యాటర్లను కట్టడి చేయవచ్చని మా బౌలర్లకు చెప్పారు. అందుకు తగ్గట్టే వారు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మేము ఇక్కడే మా తదుపరి టీ20 వరల్డ్‌కప్‌ను ఆడనున్నాము.దక్షిణాఫ్రికా వంటి పరిస్థితుల్లో విజయాలు సాధించడం అంత ఈజీ కాదు. కాబట్టి ఇది ఎంతో ప్రత్యేకమైన విజయం. కోచింగ్ స్టాప్ కూడా మాకు ఎంతో సపోర్ట్‌గా ఉన్నారు. ఈ సిరీస్ మొదటి రోజే మాకు ఓ క్లారిటీ ఇచ్చేశారు. మీకు నచ్చిన విధంగా ఆడడండి, మేము కూర్చోని మీ ప్రదర్శనను ఎంజాయ్ చేస్తాము అని మాతో చెప్పారు" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో సూర్య పేర్కొన్నాడు.చదవండి: #Rohit Sharma: రెండోసారి తండ్రైన రోహిత్ శర్మ.. మగబిడ్డకు జన్మనిచ్చిన రితికా -
IND Vs AUS: 'కింగ్ తన రాజ్యానికి తిరిగొచ్చాడు'.. ఆసీస్‌ను హెచ్చరించిన రవిశాస్త్రి
టెస్టు క్రికెట్లో గత ఏడాదిగా పేలవ ఫామ్‌ను కనబరుస్తున్న టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఇప్పుడు మరో కఠిన సవాల్‌ను ఎదుర్కొనేందుకు సిద్దమయ్యాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో తలపడేందుకు కోహ్లి తీవ్రంగా నెట్స్‌లో శ్రమిస్తున్నాడు.స్వదేశంలో బంగ్లాదేశ్,న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో నిరాశపరిచిన విరాట్ తనకు ఇష్టమైన ఆసీస్‌పై సత్తాచాటాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లి తన ఫామ్‌ను తిరిగి పొందుతాడని రవిశాస్త్రి ఆశాభావం వ్యక్తం చేశాడు."రాజు(కింగ్) తన రాజ్యానికి తిరిగి వచ్చాడు. ఇదొక్కటే ఆస్ట్రేలియాకు నేను చెప్పేది. ఆస్ట్రేలియాలో అద్బుత ప్రదర్శనల తర్వాతే అతడు కింగ్‌గా మారాడు. అది మీకు కూడా తెలుసు. విరాట్ క్రీజులో ఉంటే మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. కోహ్లికి కూడా నేను ఓ సలహా ఇవ్వాలనకుంటున్నాను.క్రీజులో వచ్చినవెంటనే తొందరపడవద్దు. హడావిడిగా ఆడి వికెట్‌ను కోల్పోవద్దు. బ్యాటింగ్‌కు దిగిన మొదటి అరగంటలో ప్రశాంతంగా ఆడి సింగిల్స్‌పై దృష్టి సారించాలి. ఎటువంటి రిస్క్ షాట్లు ఆడకుండా, కూల్ తన ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తే విరాట్ కచ్చితంగా తన రిథమ్‌ను తిరిగి పొందుతాడు" అని ఐసీసీ రివ్యూ మీటింగ్‌లో శాస్త్రి పేర్కొన్నాడు.ఆసీస్ గడ్డపై అదుర్స్...కాగా కోహ్లికి ఆస్ట్రేలియా గడ్డపై అద్భుతమైన రికార్డు ఉంది. విరాట్ 2011-12లో తన తొలి ఆసీస్ టెస్టు పర్యటనలో సెంచరీతో మెరిశాడు. ఆ తర్వాత 2014-15 ఆస్ట్రేలియా టూర్లో కూడా విరాట్ తన విశ్వరూపాన్ని చూపించాడు. ఏకంగా నాలుగు సెంచరీలతో 692 పరుగులు సాధించి చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఆసీస్ గడ్డపై 13 టెస్టులు ఆడిన విరాట్ 50పైగా సగటుతో 1352 పరుగులు చేశాడు. ఆసీస్‌లో అతడికి 6 టెస్టు సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా అతడి కెప్టెన్సీలోనే తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై భారత్ టెస్టు సిరీస్ సొంతం చేసుకుంది. -
రీ ఎంట్రీలో చెలరేగిన మహ్మద్ షమీ..
టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. 361 రోజుల తర్వాత తిరిగి మైదానంలో అడుగు పెట్టిన షమీ తన మాస్టర్ క్లాస్ బౌలింగ్‌తో అదరగొట్టాడు. రంజీ ట్రోపీ 2024-25 సీజన్లో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. తన రీ ఎంట్రీ మ్యాచ్‌లోనే ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.ఇండోర్ వేదికగా మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో షమీ 4 వికెట్లతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ బెంగాల్ స్టార్ పేసర్ కేవలం పరుగులిచ్చి 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.అతడితో పాటు సురజ్ జైశ్వాల్, మహ్మద్ కైఫ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఫలితంగా మధ్యప్రదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే కుప్పకూలింది. ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ కూడా కేవలం 228 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం బెంగాల్ 61 పరుగుల ఆధిక్యంలో ఉంది.టీమిండియాలోకి రీ ఎంట్రీ!?షమీ టీమిండియా తరపున చివరగా గతేడాది వన్డే వరల్డ్‌కప్‌లో ఆడాడు. ఆ తర్వాత తన కాలి మడమ గాయానికి శస్త్రచికిత్స చేయించుకోవడంతో ఏడాది పాటు ఆటకు దూరమయ్యాడు. అతడి తిరిగి మళ్లీ బోర్డర్ - గావస్కర్ ట్రోఫీట్రోఫీతో జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇస్తాడని అంతా భావించారు.కానీ ఫిట్నెస్ సమస్యల వల్ల షమీని భారత సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. రంజీల్లో తన ఫిట్నెస్ను నిరూపించుకోవాలని షమీని సెలక్టర్లు సూచించారు. ఈ క్రమంలోనే రంజీల్లో ఆడేందుకు షమీ బరిలోకి దిగాడు.ఇదే ఫిట్నెస్తో అతడు ఒకట్రెండు మ్యాచ్‌లు బెంగాల్ తరపున ఆడితే జాతీయ జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఆస్ట్రేలియాతో ఆఖరి మూడు టెస్టులకు భారత జట్టులో షమీ చేరే అవకాశమున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.చదవండి: IPL 2025: చహల్ కోసం పోటా పోటీ.. రూ.12 కోట్లకు కొనుక్కున్న ఆర్సీబీ!? అట్లుంటది మరి ఫ్యాన్స్‌తో.. -
మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్న శిఖర్ ధావన్..
టీమిండియా మాజీ ఓపెనర్ మళ్లీ మైదానంలో అడుగు పెట్టేందుకు సిద్దమయ్యాడు. ఈ ఏడాది అగస్టులో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు ధావన్ విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ధావన్ భారత్ వేదికగా జరిగిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీలో గుజరాత్ జెయింట్స్‌కు సారథ్యం వహించాడు. ఇప్పుడు మరో ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నీలో ఆడేందుకు గబ్బర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు.నేపాల్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్లో ఈ ఢిల్లీ ఆటగాడు భాగం కానున్నాడు. నేపాల్ ప్రీమియర్ లీగ్-2024లో కర్నాలీ యాక్స్ ఫ్రాంచైజీకి ధావన్ ప్రాతినిథ్యం వహించనున్నాడు. కాగా ధావన్‌కు టీ20ల్లో మంచి రికార్డు ఉంది. టీ20ల్లో అతడు 9,797 పరుగులు చేశాడు. ఐపీఎల్లో కూడా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ధావన్(6769) రెండో స్ధానంలో ఉన్నాడు.ఇక ఎన్పీఎల్ విషయానికి వస్తే.. ఈ లీగ్‌లో మొత్తం 8 జట్లు పాల్గోనున్నాయి. కర్నాలీ యాక్స్‌తో పాటు బిరత్‌నగర్ కింగ్స్, చిత్వాన్ రైనోస్, జనక్‌పూర్ బోల్ట్స్, ఖాట్మండు గూర్ఖాస్, లుంబినీ లయన్స్, పోఖరా ఎవెంజర్స్, సుదుర్పాస్చిమ్ రాయల్స్ మిగితా ఏడు జట్లగా ఉన్నాయి. ఈ లీగ్ నవంబర్ 30 నుంచి డిసెంబర్ 21 వరకు జరగనుంది. ఈ టోర్నీకి సబంధించి పూర్తి షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది.చదవండి: అతడి కోసం నా ప్లేస్‌ను త్యాగం చేశా.. చెప్పి మరీ సెంచరీ బాదాడు: సూర్య -
#BGT2024 : ప్రాక్టీస్ మొదలు పెట్టిన టీమిండియా (ఫోటోలు)