హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో 133 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. బంగ్లాదేశ్ బౌలర్లను ఊతికారేశారు.
అభిషేక్ శర్మ మినహా మిగితా అందరూ ఆకాశమే హద్దుగా చెలరేగారు. భారత బ్యాటర్లలో ఓపెనర్ సంజూ శాంసన్ (47 బంతుల్లో 111; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 75; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
వీరిద్దరితో పాటు హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రియాన్ పరాగ్ (13 బంతుల్లో 34; ఫోర్, 4 సిక్సర్లు) కూడా కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297 పరుగుల భారీ స్కోర్ చేసింది. బంగ్లా బౌలర్లలో తంజిమ్ హసన్ సకీబ్ మూడు వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్, మహ్మదుల్లా తలో వికెట్ దక్కించుకున్నారు.
3 వికెట్లతో చెలరేగిన బిష్ణోయ్..
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో స్పిన్నర్ రవి బిష్ణోయ్ 3 వికెట్లతో మెరిశాడు. అతడితో పాటు మయాంక్ యాదవ్ రెండు వికెట్లు, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో తహిద్ హృదాయ్(63) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: దంచికొట్టిన పఠాన్ బ్రదర్స్.. అయినా..!
🚨 ONE OF THE MOST RIDICULOUS SHOTS EVER 🚨
- Sanju Samson is a beast...!!!! pic.twitter.com/e3hblLeXyA— Johns. (@CricCrazyJohns) October 12, 2024
Comments
Please login to add a commentAdd a comment