హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫలితంగా భారత్ అంతర్జాతీయ టీ20 చరిత్రలో రెండో భారీ స్కోర్ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది.
సంజూ శాంసన్ (47 బంతుల్లో 111; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో, సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 75; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగిపోయారు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రియాన్ పరాగ్ (13 బంతుల్లో 34; ఫోర్, 4 సిక్సర్లు) కూడా తలో చేయి వేయడంతో భారత్ రికార్డు స్కోర్ సాధించింది.
భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్ శర్మ 4, రింకూ సింగ్ 8, నితీశ్ రెడ్డి 0, వాషింగ్టన్ సుందర్ ఒక్క పరుగు చేశారు. బంగ్లా బౌలర్లలో తంజిమ్ హసన్ సకీబ్ మూడు వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్, మహ్మదుల్లా తలో వికెట్ దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment