
ఆసియా కప్ 2025 విజేతగా టీమిండియా అవిర్భవించింది. ఇవాళ (సెప్టెంబర్ 28) జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ లో స్కోరింగ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్ 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ కాగా.. భారత్ మరో 2 బంతులు మిగిలుండగా లక్ష్యాన్ని ఛేదించింది. తిలక్ వర్మ (69) అజేయ అర్ద శతకంతో టీమిండియాను గెలిపించాడు.
హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తిలక్
తిలక్ 41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 50 పరుగులు పూర్తి చేసుకున్డాను. 16 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 111/4గా ఉంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే 24 బంతుల్లో 36 పరుగులు చేయాలి.
నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా
12.2వ ఓవర్- 77 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. అబ్రార్ అహ్మద్ బౌలింగ్‌లో ఫర్హాన్‌కు క్యాచ్ ఇచ్చి సంజూ శాంసన్ (24) ఔటయ్యాడు.
ఆచితూచి ఆడుతున్న తిలక్, శాంసన్
20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో భారత బ్యాటర్లు తిలక్ వర్మ (24), సంజూ శాంసన్ (16) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. 10 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 58/3గా ఉంది.
స్వల్ప లక్ష్య ఛేదనలో తడబడుతున్న టీమిండియా
147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా తడబడుతుంది. 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. గిల్ (12) మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. ఫహీమ్ అష్రఫ్ బౌలింగ్‌లో హరీస్ రౌఫ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
కష్టాల్లో టీమిండియా
147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా కష్టాల్లో పడింది. 10 పరుగులకే ఇన్ ఫామ్ బ్యాటర్ అభిషేక్ శర్మ (5), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (1) వికెట్లు కోల్పోయింది.
చెలరేగిన కుల్దీప్.. 146 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్.. కుల్దీప్ యాదవ్ (4-0-30-4) ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు సాహిబ్‌జాదా ఫర్హాన్ (57), ఫకర్ జమాన్ (46) రాణించడంతో పాక్ తొలుత భారీ స్కోర్ చేసేలా కనిపించింది. 11.2 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి 100 పరుగుల మార్కును తాకిన ఆ జట్టు.. భారత బౌలర్లు ఒక్కసారిగా లైన్‌లోకి రావడంతో తట్టుకోలేకపోయింది.
33 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి 9 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో కుల్దీప్‌తో పాటు అక్షర్ పటేల్ (4-0-26-2), వరుణ్ చక్రవర్తి (4-0-30-2), బుమ్రా (3.1-0-25-2) కూడా సత్తా చాటారు. పాక్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లతో పాటు వన్ డౌన్ బ్యాటర్ సైమ్ అయూబ్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు.
చెలరేగిన కుల్దీప్
ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీసి పాక్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. తొలి బంతికి సల్మాన్ అఘా, నాలుగో బంతికి షాహీన్ అఫ్రిది (0), ఆఖరి బంతికి ఫహీమ్ అష్రాఫ్ (0) ఔటయ్యారు. 16 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 134/8గా ఉంది. నవాజ్, హరీస్ రౌఫ్ క్రీజ్‌లో ఉన్నారు.
ఆరో వికెట్ కోల్పోయిన పాక్
16.1వ ఓవర్- 133 పరుగుల వద్ద పాక్ ఆరో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో సంజూ శాంసన్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో సల్మాన్ అఘా (8) ఔటయ్యాడు.
కష్టాల్లో పాకిస్తాన్
పాక్ జట్టు మరోసారి కష్టాలో పడింది. తొలుత పరుగు వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయిన ఆ జట్టు.. ఈసారి 5 పరుగుల వ్యవధిలో మరో 2 వికెట్లు కోల్పోయింది. దీంతో పాక్ 15.3 ఓవర్లలో 132 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. సల్మాన్ అఘా (7), మొహమ్మద్ నవాజ్ (1) క్రీజ్‌లో ఉన్నారు.
14 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 118/3
పరుగు వ్యవధిలో రెండు వికెట్లు (సైమ్ అయూబ్ (14), మొహమ్మద్ హరీస్ (0)) కోల్పోవడంతతో పాక్ స్కోర్ నెమ్మదించింది. 14 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 118/3గా ఉంది. ఫకర్ జమాన్ (38), సల్మాన్ అఘా (3) క్రీజ్‌లో ఉన్నారు.
100 పరుగులు పూర్తి చేసుకున్న పాకిస్తాన్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాక్ 11.2 ఓవర్లలోనే 100 పరుగులు (వికెట్ నష్టానికి) పూర్తి చేసుకుంది. 12 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 107/1గా ఉంది. ఫకర్ జమాన్ (33), సైమ్ అయూబ్ (13) క్రీజ్‌లో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన పాక్
9.4వ ఓవర్- 84 పరుగుల వద్ద పాక్ తొలి వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ అనంతరం సాహిబ్‌జాదా ఫర్హాన్ (57) ఔటయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో తిలక్ వర్మ క్యాచ్ పట్టడంతో ఫర్హాన్ పెవిలియన్‌కు చేరాడు.
ధాటిగా ఆడుతున్న పాక్ ఓపెనర్లు.. ఫర్హాన్ హాఫ్ సెంచరీ
తొలుత నిదానంగా ఆడిన పాక్ ఓపెనర్లు గేర్ మార్చారు. సాహిబ్‌జాదా ఫర్హాన్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరో ఓపెనర్ ఫకర్ జమాన్ 18 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 22 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. 9 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 77/0గా ఉంది.
జాగ్రత్తగా ఆడుతున్న పాకిస్తాన్ ఓపెనర్లు
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్ ఆచితూచి ఆడుతుంది. ఓపెనర్లు సాహిబ్‌జాదా ఫర్హాన్ (24), ఫకర్ జమాన్ (6) చాలా జాగ్రత్తగా ఆడుతున్నారు. 4 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 32/0గా ఉంది.
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సేవలను కోల్పోయింది. గాయం కారణంగా అతను ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. అతని స్థానంలో రింకూ సింగ్ తుది జట్టులోకి వచ్చాడు. గత మ్యాచ్ మిస్ అయిన శివమ్ దూబే, బుమ్రా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు.
తుది జట్లు..
పాకిస్తాన్: సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా(సి), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్(w), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్
భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(సి), తిలక్ వర్మ, సంజు శాంసన్(w), శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి