Virat Kohli
-
ఆర్సీబీ ఇక కోహ్లిపై ఆధారపడదు: భారత మాజీ క్రికెటర్
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆర్సీబీ విజయం సాధించింది. శుక్రవారం చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో సీఎస్కేను ఆర్సీబీ చిత్తు చేసింది. దీంతో సీఎస్కే కంచుకోటను ఆర్సీబీ బద్దలు కొట్టింది. 2008 సీజన్ తర్వాత చెపాక్‌లో సీఎస్కేను ఆర్సీబీ ఓడించడం ఇదే తొలిసారి.అయితే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. 30 బంతులు ఎదుర్కొని కేవలం 31 పరుగులు మాత్రమే చేసి విరాట్ ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో కోహ్లి ఇన్నింగ్స్‌పై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు."ఈ మ్యాచ్‌లో చెన్నై బౌలర్లను ఎదుర్కొనేందుకు విరాట్ కోహ్లి ఇబ్బందిపడ్డాడు. తను ఎదుర్కొన్న తొలి బంతి నుంచే కోహ్లి అంత కంఫార్ట్‌గా కన్పించలేదు. ఎక్కువగా లెగ్ సైడ్ షాట్లు ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతిని మిడిల్ చేయలేకపోయాడు. పతిరానా బౌలింగ్‌లో తన హెల్మెట్‌కు బంతి బలంగా తగిలింది. వెంటనే ఓ సిక్స్, ఫోరు కొట్టి టచ్‌లోకి వచ్చినట్లు కన్పించాడు. కానీ వెంటనే నూర్ అహ్మద్ బౌలింగ్‌లో లాఫ్టెడ్ స్వీప్ ఆడుతూ డీప్ స్క్వేర్ లెగ్‌లో దొరికిపోయాడు. అస్సలు ఇది కోహ్లి ఇన్నింగ్సే కాదు. కోహ్లి ఫెయిల్ అయినప్పటికి మిగితా ప్లేయర్లు అద్బుతంగా రాణించారు.విరాట్ 30 బంతుల్లో 31 పరుగులు చేస్తే.. మిగిలిన ప్లేయర్ చెలరేగడంతో ఆర్సీబీ 196 పరుగులు చేసింది. అంటే కోహ్లి 5 ఓవర్లు ఆడినప్పటికి.. మిగితా ప్లేయర్ల 15 ఓవర్లలో జట్టుకు 166 పరుగులు అందించారు. గతంలో కోహ్లి బాగా ఆడితే మిగితా ఆర్సీబీ బ్యాటర్లు నిరాశపరిచేవారు.దీంతో ప్రతీసారి జట్టు 15 నుంచి 20 పరుగులు వెనకబడి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కోహ్లి ఇబ్బంది పడుతున్నప్పటికీ.. మిగితా ప్లేయర్లు ఎటాక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉంది" అని తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు.చదవండి: PAK vs NZ: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ ప్లేయర్.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా -
సీఎస్కే బౌలర్ ‘ఓవరాక్షన్’.. ఇచ్చిపడేసిన కోహ్లి! నవ్వేసిన జడ్డూ
ఐపీఎల్-2025లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)- చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య పోరు ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ముఖాముఖి పోటీలో సీఎస్కేదే పైచేయి అయినా.. ఈసారి మాత్రం ఆర్సీబీ అదరగొట్టింది. చెన్నై కంచుకోటను బద్దలు కొట్టి 2008 తర్వాత మొదటిసారి చెపాక్‌లో జయకేతనం ఎగురవేసింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగులు సాధించింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్(32), విరాట్ కోహ్లి (Virat Kohli- 31) ఫర్వాలేదనిపించగా.. దేవదత్ పడిక్కల్(14 బంతుల్లో 27), కెప్టెన్ రజత్ పాటిదార్ (32 బంతుల్లో 51), టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22 నాటౌట్) రాణించారు.ఇక చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా.. మతీశ పతిరణకు రెండు వికెట్లు దక్కాయి. మిగతా వాళ్లలో ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో చెన్నై 146 పరుగులకే పరిమితం కావడంతో ఆర్సీబీ 50 పరుగుల తేడాతో గెలుపొందింది. Back 2️⃣ back wins! 🔥Chat, how are we feeling? 🤩pic.twitter.com/8xT6VaS7hf— Royal Challengers Bengaluru (@RCBTweets) March 28, 2025 చెన్నై బ్యాటర్లలో రచిన్ రవీంద్ర (31 బంతుల్లో 41), రవీంద్ర జడేజా (19 బంతుల్లో 25), మహేంద్ర సింగ్ ధోని (16 బంతుల్లో 30 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.జడేజాతో ముచ్చట్లుఇదిలా ఉంటే.. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లి.. చెన్నై స్టార్ రవీంద్ర జడేజాతో కలిసి ముచ్చట్లు పెట్టాడు. ఆ సమయంలో కోహ్లి కాస్త సీరియస్‌గా మాట్లాడుతున్నట్లు కనిపించగా.. జడ్డూ మాత్రం నవ్వులు చిందించాడు. ఇంతలో అక్కడికి చెన్నై పేసర్ ఖలీల్ అహ్మద్ రాగానే కోహ్లి మరింత సీరియస్ అయినట్లు కనిపించింది. అతడితో వాదనకు దిగిన కోహ్లి.. ఖలీల్ ఏం చెప్తున్నా పట్టించుకోకుండా తన పాటికి తాను ఏదో మాట్లాడుతూనే కనిపించాడు.కోహ్లి చేయి పట్టుకుని మరీ ఖలీల్ అతడిని అనునయించేందుకు ప్రయత్నించగా.. అతడు మాత్రం అందుకు సుముఖంగా కనిపించలేదు. ఇంతలో కోహ్లికి డ్రెస్సింగ్‌రూమ్ నుంచి పిలుపు రావడటంతో వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.సీఎస్కే బౌలర్ ‘ఓవరాక్షన్’కాగా చెన్నై బౌలింగ్ అటాక్‌ను ఆరంభించిన ఖలీల్.. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో మూడో ఓవర్ కూడా తానే వేశాడు. ఆ ఓవర్ తొలి బంతికే కోహ్లిని ఎల్బీడబ్ల్యూ(లెగ్ బిఫోర్ వికెట్) చేసినట్లుగా భావించిన ఖలీల్.. సంబరాలు మొదలుపెట్టేశాడు. కానీ ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు.అయితే, అంపైర్ నిర్ణయంతో సంతృప్తి చెందని ఖలీల్.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను ఒప్పించి డీఆర్ఎస్కు వెళ్లాడు. కానీ అక్కడ చెన్నైకి విరుద్ధంగా థర్డ్ అంపైర్ తీర్పు వచ్చింది. బంతి లెగ్ స్టంప్ ఆవలి దిశగా పిచ్ అయినట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో కోహ్లి సేవ్ అవ్వగా.. సీఎస్కే ఓ రివ్యూను కోల్పోయింది. ఈ నేపథ్యంలో కోహ్లి ఇదే విషయమై ఖలీల్‌తో సీరియస్‌గా చర్చించి ఉంటాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చదవండి: MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే! Kohli mere bacche shant hoja 😭😭 pic.twitter.com/yGITzOsOXr— n (@humsuffer_) March 29, 2025 -
పతిరణ షార్ప్ డెలివరీ.. ఇదీ నా పవర్! కోహ్లి రియాక్షన్ వైరల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) అద్భుత విజయం సాధించింది. 2008 తర్వాత తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్‌ను చెపాక్‌లో ఓడించింది. ఏకంగా యాభై పరుగుల తేడాతో సీఎస్కేను చిత్తు చేసి చిదంబరం స్టేడియంలో గెలుపు జెండా ఎగురవేసింది.ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓపెనర్లలో ఫిల్ సాల్ట్ (16 బంతుల్లో 32) ధనాధన్ దంచికొట్టగా.. విరాట్ కోహ్లి (Virat Kohli) మాత్రం ఆచితూచి ఆడాడు. 30 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 31 పరుగులు మాత్రమే రాబట్టగలిగాడు. అయితే, తాను సిక్స్ కొట్టిన సందర్భంగా.. కోహ్లి ఇచ్చిన రియాక్షన్ వింటేజ్ కింగ్‌ను గుర్తు చేసింది.హెల్మెట్‌కు బలంగా తాకిన బంతిఅసలేం జరిగిందంటే.. సీఎస్కేతో శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో పదకొండో ఓవర్లో చెన్నై పేసర్ మతీశ పతిరణ బంతితో రంగంలోకి దిగాడు. అప్పుడు కోహ్లి క్రీజులో ఉండగా.. పతిరణ పదునైన షార్ట్ డెలివరీ సంధించగా.. కోహ్లి హెల్మెట్‌కు బంతి బలంగా తాకింది. ఫలితంగా.. ఒకవేళ కంకషన్ సబ్‌స్టిట్యూట్ అవుతుందేమోనని చెక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.క్లాసీ కౌంటర్.. మాస్ రియాక్షన్అయితే, తాను బాగానే ఉన్నానని చెప్పిన కోహ్లి.. పతిరణ సంధించిన రెండో బంతికి భారీ షాట్ బాదాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్ సంధించిన షార్ట్ బాల్‌ను ఫైన్ లెగ్ మీదుగా బౌండరీవైపు తరలించి ఆధిపత్యం చాటుకున్నాడు. ఈ క్రమంలో.. ‘‘ఇదీ నా పవర్’’ అన్నట్లుగా పతిరణ వైపు కింగ్ గుర్రుగా చూసిన విధానం అభిమానులను ఆకర్షించింది. ఇక అదే ఓవర్లో మరుసటి బంతికి కోహ్లి ఫోర్ కూడా బాదడం విశేషం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.1st ball – 😮💨2nd ball – 6️⃣ That’s what it’s like facing the GEN GOLD! ❤Classy counter from #ViratKohli! 🙌🏻Watch LIVE action ➡ https://t.co/MOqwTBm0TB#IPLonJioStar 👉 #CSKvRCB | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 3 & JioHotstar! pic.twitter.com/MzSQTD1zQc— Star Sports (@StarSportsIndia) March 28, 2025 పాటిదార్, పడిక్కల్, డేవిడ్ అదరహోఇక మ్యాచ్ విషయానికొస్తే.. సాల్ట్, కోహ్లిలు ఫర్వాలేదనిపించగా.. దేవదత్ పడిక్కల్ (14 బంతుల్లో 27), కెప్టెన్ రజత్ పాటిదార్ (32 బంతుల్లో 51) దుమ్ములేపారు. మిగతా వాళ్లలో టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా ఆర్సీబీ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు, మతీశ పతిరణ రెండు, ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.హాజిల్‌వుడ్ తీన్మార్ లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్ల ముగిసే సరికి ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో యాభై పరుగుల తేడాతో ఆర్సీబీ చేతిలో ఓటమిపాలైంది. సీఎస్కే బ్యాటర్లలో రచిన్ రవీంద్ర (41), రవీంద్ర జడేజా(25), మహేంద్ర సింగ్ ధోని(16 బంతుల్లో 30 నాటౌట్) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ మూడు వికెట్ల(3/21)తో సత్తా చాటగా.. లియామ్ లివింగ్‌స్టోన్, యశ్ దయాళ్ రెండేసి వికెట్లు కూల్చారు. భువనేశ్వర్కుమార్కు ఒక వికెట్ దక్కింది. ఐపీఎల్-2025: సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ👉టాస్: సీఎస్కే.. బౌలింగ్👉ఆర్సీబీ స్కోరు: 196/7 (20)👉సీఎస్కే స్కోరు: 146/8 (20)👉ఫలితం: యాభై పరుగుల తేడాతో సీఎస్కేపై ఆర్సీబీ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రజత్ పాటిదార్.చదవండి: MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే! -
ఇదేం ప్రశ్న? ఆఖర్లో ఎవరు గెలుస్తారో చూడాలి: సీఎస్కే కోచ్ ఆగ్రహం
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కంచుకోటను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఎట్టకేలకు బద్దలు కొట్టింది. పదిహేడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చెపాక్‌లో జయకేతనం ఎగురవేసింది. ఫలితంగా ఆర్సీబీ ఆటగాళ్లతో పాటు అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.మరోవైపు.. సొంతగడ్డపై ఆర్సీబీ చేతిలో పరాభవాన్ని సీఎస్కే జీర్ణించుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడిన చెన్నై జట్టు హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు చేదు అనుభవం ఎదురైంది. రుతురాజ్ సేన బ్యాటింగ్ తీరును ఉద్దేశించి ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్న అతడికి ఆగ్రహం తెప్పించింది.కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025లో తమ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై.. చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్‌తో తలపడింది. చెపాక్‌లో ఈ మాజీ చాంపియన్ల మధ్య జరిగిన పోరులో చెన్నై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత ముంబైని 155 పరుగులకు కట్టడి చేసిన సీఎస్కే.. 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.పాటిదార్, టిమ్ డేవిడ్ మెరుపులుతాజాగా ఆర్సీబీతో శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగుల మేర మంచి స్కోరు రాబట్టింది.ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (16 బంతుల్లో 32), విరాట్ కోహ్లి (30 బంతుల్లో 31)లతో పాటు దేవదత్ పడిక్కల్ (14 బంతుల్లో 27) రాణించగా.. కెప్టెన్ రజత్ పాటిదార్ (32 బంతుల్లో 51), టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22) మెరుపులు మెరిపించారు.అయితే, లక్ష్య ఛేదనలో చెన్నై ఆరంభం నుంచే తడబడింది. టాపార్డర్‌లో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి (5), వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (0) పూర్తిగా విఫలం కాగా.. మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర (31 బంతుల్లో 41) ఫర్వాలేదనిపించాడు.ధోని ధనాధన్ సరిపోలేదుమిగతా వాళ్లలో రవీంద్ర జడేజా (19 బంతుల్లో 25), మహేంద్ర సింగ్ ధోని (16 బంతుల్లో 30 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 146 పరుగుల వద్ద చెన్నై నిలిచిపోయింది. ఫలితంగా యాభై పరుగుల తేడాతో ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది.A never ending story 😊Last over 🤝 MS Dhoni superhits 🔥Scorecard ▶ https://t.co/I7maHMwxDS #TATAIPL | #CSKvRCB | @ChennaiIPL pic.twitter.com/j5USqXvf7r— IndianPremierLeague (@IPL) March 28, 2025అవుట్‌డేటెడ్ అంటూ సెటైర్లుఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మీడియా ముందుకు రాగా.. ‘‘తొలి మ్యాచ్‌లో 20 ఓవర్లలో మీరు 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. ఈరోజు 146 పరుగులు చేశారు.మీ బ్రాండ్ క్రికెట్ ఇలాగే ఉంటుందని తెలుసు. కానీ ఇది పాతబడి పోయిందని మీకు అనిపించడం లేదా?’’ అని ఓ రిపోర్టర్ ప్రశ్నించారు.ఇందుకు బదులుగా.. ‘‘నా బ్రాండ్ క్రికెట్ అంటే ఏమిటి? మీరు ఫైర్ పవర్ గురించి మాట్లాడుతున్నారా? మా జట్టు సత్తా ఏమిటో అందరికీ తెలుసు. అసలు మీ ప్రశ్న ఏమిటో నాకు అర్థం కావడమే లేదు.మమ్మల్ని తక్కువ చేయకండితొలి బంతి నుంచే మేము స్వింగ్ చేయడం లేదని మీరిలా అంటున్నారా? మా వ్యూహాల గురించి సానుకూలంగా ఆలోచించడంలో తప్పేముంది? గెలుపు కోసమే ఎవరైనా ప్రయత్నిస్తారు. దీనినే సానుకూల దృక్పథం (పాజిటివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్) అంటారు.మమ్మల్ని తక్కువగా అంచనా వేయడం.. మా గురించి తక్కువగా మాట్లాడటం చేయకండి. ఆఖర్లో ఎవరు గెలుస్తారో చూడండి! ’’ అని ఫ్లెమింగ్ ఒకింత అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఇందుకు సదరు జర్నలిస్టు.. ‘‘నేను మిమ్మల్ని తక్కువ చేసి చూపడటం లేదు’’అని సమాధానమిచ్చారు. దీంతో.. ‘‘మీరు అలాగే మాట్లాడుతున్నారు.. అర్థంపర్థంలేని ప్రశ్నలు వేస్తున్నారు’’ అని ఫ్లెమింగ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు. అదే విధంగా.. చెపాక్‌లో ఆడటం వల్ల తమకు అదనపు ప్రయోజనాలేమీ ఉండవని.. ఇతర వేదికలపై తమ జట్టు సత్తా చాటిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఫ్లెమింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. చదవండి: MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే! -
నితీశ్ కు గోల్డెన్ ఛాన్స్? విరాట్, రోహిత్ కు షాక్!
-
IPL 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..
ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పర్వాలేదన్పించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 30 బంతులు ఎదుర్కొన్న విరాట్.. 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 31 పరుగులు చేశాడు. తద్వారా కింగ్ కోహ్లి ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి నిలిచాడు.కోహ్లి ఇప్పటివరకు సీఎస్కేపై 34 మ్యాచ్‌ల్లో 1068 పరుగులు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ శిఖర్ ధావన్ పేరిట ఉండేది. ధావన్ చెన్నైపై 29 మ్యాచ్‌ల్లో 44.04 సగటుతో మొత్తం 1,057 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీతో పాటు, 8 అర్ధ సెంచరీలు ఉన్నాయి. తాజా మ్యాచ్‌లో 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ధావన్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో కోహ్లి, ధావన్ తర్వాతి స్దానాల్లో వరుసగా రోహిత్ శర్మ(896), డేవిడ్ వార్నర్(696), కీరన్ పొలార్డ్(583) ఉన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(51) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ఫిల్ సాల్ట్(32), విరాట్ కోహ్లి(31), పడిక్కల్(27) రాణించారు. ఆఖరి ఓవర్లో టిమ్ డేవిడ్( 8 బంతుల్లో 1ఫోర్లు, 3 సిక్స్‌లతో 22) మెరుపులు మెరిపించాడు. సీఎస్కే బౌలర్లలో నూర్ ఆహ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా.. పతిరానా రెండు, ఖాలీల్ అహ్మద్, అశ్విన్ తలా వికెట్ సాధించారు. -
కోహ్లితో పాటు అతడిని కట్టడి చేస్తే విజయం మాదే: CSK హెడ్‌కోచ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఐదుసార్లు చాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK)- ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య శుక్రవారం మ్యాచ్ జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారడానికి కారణం టీమిండియా దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోని- విరాట్ కోహ్లి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.2008 తర్వాత అక్కడ నో విన్!అయితే, ఇందుకు మరో కారణం.. వేదిక. అవును.. సీఎస్కే సొంత మైదానం చెపాక్ స్టేడియం ఈ హై రేంజ్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ఇక్కడ ఆరంభ సీజన్లో అంటే 2008లో తొలిసారి గెలిచిన ఆర్సీబీ.. ఇంత వరకు ఒక్కసారి కూడా మళ్లీ గెలుపు రుచిచూడలేదు. ఇప్పటి వరకు చిదంబరం స్టేడియంలో ఏడు మ్యాచ్‌లు ఆడి అన్నింటా ఓటమిపాలైంది.ఇక ముఖాముఖి పోరులోనూ ఇప్పటి వరకు చెన్నైతో జరిగిన 33 మ్యాచ్‌లలో 11 మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నాటి మ్యాచ్‌లో అందరి దృష్టి ఆర్సీబీ సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి మీదే కేంద్రీకృతమై ఉంది. జట్టు పరిస్థితి ఎలా ఉన్నా.. కోహ్లి మాత్రం సీఎస్కే మీద మెరుగై రికార్డు కలిగి ఉన్నాడు.ఇప్పటి వరకు సీఎస్కే 33 మ్యాచ్‌లలో ఆడిన కోహ్లి 1053 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు మీడియా ముందుకు వచ్చిన చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కోహ్లితో ప్రమాదం ఉందని భావిస్తున్నారా ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ ఈ సీజన్లో ఆర్సీబీ ఇప్పటికి ఒక్క మ్యాచ్ ఆడింది. దానిని బట్టి ఇప్పుడే అంచనాకు రాలేము.కోహ్లితో పాటు అతడిని కట్టడి చేస్తే విజయం మాదేగతేడాదితో పోలిస్తే ఈసారి సీఎస్కే- ఆర్సీబీ సరికొత్తగా ఉన్నాయి. గత రికార్డుల గురించి ప్రస్తావన అప్రస్తుతం. ఏదేమైనా ఆర్సీబీకి కోహ్లి అత్యంత కీలకమైన ఆటగాడు. వాళ్ల జట్టు కూడా గతం కంటే మరింత పటిష్టంగా మారింది.ఒకవేళ మేము కోహ్లి, పాటిదార్లను కట్టడి చేయగలిగితే.. అది మా విజయానికి దోహం చేస్తుంది’’ అని స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. కాగా తాజా ఎడిషన్‌లో ఆర్సీబీ తొలుత డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడింది. ఆ మ్యాచ్‌లో కోహ్లి 36 బంతుల్లో 59 పరుగులతో అజేయంగా నిలవగా.. కెప్టెన్ రజత్ పాటిదార్ 16 బంతుల్లోనే 34 రన్స్ చేశాడు. ఫలితంగా 16.2 ఓవర్లలోనే 175 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసి ఆర్సీబీ గెలిచింది.ఇక సీఎస్కే తమ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఆర్సీబీకి గతంలో కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరించగా.. చెన్నైని ముందుండి నడిపించిన ధోని.. గతేడాది తన బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడు.చదవండి: MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే! -
BCCI: అతడికి ఈసారి టాప్ గ్రేడ్.. తొలిసారి వీళ్లకు చోటు!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవల మహిళల సీనియర్ జట్టుకు సంబంధించిన వార్షిక కాంట్రాక్టులను విడుదల చేసింది. అయితే, పురుషుల సీనియర్ టీమ్ సెంట్రల్ కాంట్రాక్టుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున కాస్త జాప్యం జరుగుతోందని బోర్డు వర్గాలు వెల్లడించాయి. తాజా సమాచారం ప్రకారం మరికొన్ని రోజుల్లోనే బీసీసీఐ ఈ అంశంపై తుదినిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా.. టీమిండియా ప్రధాన కోచ్ గౌతం గంభీర్‌తో శనివారం సమావేశం కానున్నట్లు సమాచారం. కాగా బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లను A+, A, B, C గ్రేడ్లుగా విభజించి వార్షిక వేతనాలు అందచేస్తోన్న విషయం తెలిసిందే. రోహిత్, కోహ్లిల కొనసాగింపు!కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా అత్యుత్తమ గ్రేడ్ అయిన A+లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.అయితే, టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత రోహిత్, కోహ్లి, జడ్డూ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం ఈ ముగ్గురు కేవలం వన్డే, టెస్టుల్లో మాత్రమే కొనసాగుతున్నారు. కాబట్టి వీరిని A+ గ్రేడ్ నుంచి తప్పించాలని బోర్డు నిర్ణయించినట్లు గతంలో వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే, టైమ్స్ ఆఫ్ ఇండియా అందించిన తాజా సమాచారం ప్రకారం.. ఈ ముగ్గురితో పాటు బుమ్రాను A+ గ్రేడ్‌లోనే కొనసాగించనున్నారు.అంతేకాదు..టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు ఈసారి ప్రమోషన్ దక్కనుంది. B గ్రేడ్ నుంచి అతడిని A గ్రేడ్‌కు ప్రమోట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాదు.. క్రమశిక్షణారాహిత్యం వల్ల సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి ఈ జాబితాలో చేరనున్నాడు.అంతేకాదు.. టాప్ గ్రేడ్‌లో అతడిని చేర్చేందుకు బీసీసీఐ నాయకత్వ బృందం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత టాప్ రన్ స్కోరర్‌గా నిలిచి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు అతడికి ఈ మేర రిటర్న్‌గిఫ్ట్ లభించనున్నట్లు తెలుస్తోంది. అయితే, శ్రేయస్ మాదిరి అనూహ్యంగా సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన ఇషాన్ కిషన్ విషయంలో మాత్రం బీసీసీఐ ఇంకా గుర్రుగానే ఉన్నట్లు తెలుస్తోంది.టాప్ క్లాస్‌లో అతడి పేరుఈ విషయాల గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు మాట్లాడుతూ.. ‘‘శ్రేయస్ తిరిగి వార్షిక కాంట్రాక్టు దక్కించుకోబోతున్నాడు. అది కూడా టాప్ క్లాస్‌లో అతడి పేరు చేరనుంది. ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇషాన్ కిషన్ విషయంలో మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు’’ అని పేర్కొన్నాయి.తొలిసారి వీళ్లకు చోటుఇక ఈసారి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ కొత్తగా బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులు దక్కించుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా బీసీసీఐ కాంట్రాక్టు దక్కించుకోవాలంటే.. ఒక క్యాలెండర్ ఇయర్లో టీమిండియా తరఫున మూడు టెస్టులు లేదంటే.. ఎనిమిది వన్డేలు.. లేదా పది అంతర్జాతీయ టీ20లు ఆడి ఉండాలి. తద్వారా మరుసటి ఏడాది సదరు ఆటగాళ్లకు బోర్డు వార్షిక కాంట్రాక్టు ఇస్తుంది.ఇక బీసీసీఐ A+ గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు ఏడాదికి రూ. 7 కోట్లు, A గ్రేడ్‌లో ఉన్నవారికి రూ. 5 కోట్లు, B గ్రేడ్‌లో ఉన్నవారికి రూ. 3 కోట్లు, C గ్రేడ్‌లో ఉన్నవారికి రూ. కోటి వార్షిక జీతంగా ఇస్తుంది.గతేడాది కాలానికి (2023-24) గానూ బీసీసీఐ ప్రకటించిన కాంట్రాక్టుల జాబితాగ్రేడ్- A+: రోహిత్ శర్మ,విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాగ్రేడ్- A: రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యాగ్రేడ్- B: సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్గ్రేడ్- C: రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివం దూబే, రవి బిష్ణోయి, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముకేశ్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ కృష్ణ, ఆవేశ్ ఖాన్,రజత్ పాటిదార్. -
ఆర్సీబీ స్పిన్నర్లు భేష్.. కేకేఆర్ బౌలర్లు ఏం చేశారు?: రహానేకు పిచ్ క్యూరేటర్ కౌంటర్
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టును ఉద్దేశించి ఈడెన్ గార్డెన్స్ పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఇక్కడ క్యూరేటర్‌గా ఉన్నంత కాలం పిచ్‌లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశాడు. పిచ్ రూపకల్పన గురించి సలహాలు ఇచ్చే అధికారం ఫ్రాంఛైజీలకు లేదని పేర్కొన్నాడు.ఏడు వికెట్ల తేడాతో ఓటమికాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఆదిలోనే చుక్కెదురైన విషయం తెలిసిందే. లీగ్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో ఏకంగా ఏడు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో స్థాయికి తగ్గట్లు రాణించలేక చేతులెత్తేసింది.ఆర్సీబీతో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్య రహానే (31 బంతుల్లో 56) ఒక్కడే అర్ధ శతకం సాధించాడు. కృనాల్ పాండ్యాకు మూడుఇక ఆర్బీసీ బౌలర్లలో స్పిన్నర్లు కృనాల్ పాండ్యా మూడు, సూయశ్ శర్మ ఒక వికెట్ తీయగా.. పేసర్లు జోష్ హాజిల్‌వుడ్ రెండు, యశ్ దయాళ్, రసిఖ్ ధార్ సలాం ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ 16.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి పనిపూర్తి చేసింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (31 బంతుల్లో 56), విరాట్ కోహ్లి (36 బంతుల్లో 59 నాటౌట్), కెప్టెన్ రజత్ పాటిదార్ (16 బంతుల్లో 34) రాణించారు. ఇక కేకేఆర్ బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునిల్ నరైన్ ఒక్కో వికెట్ తీయగా.. పేసర్ వైభవ్ అరోరా ఒక వికెట్ పడగొట్టాడు.రహానే కామెంట్స్ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ.. ‘‘పిచ్ స్పిన్ బౌలర్లకు సహకరిస్తుందని అనుకున్నాం. కానీ నిన్నటి నుంచి పిచ్‌ను కవర్లతో కప్పేసి ఉంచారు. నిజానికి మా జట్టులో ఉన్న ఇద్దరు స్పిన్నర్లు అద్భుతంగా ఆడతారు. ఎలాంటి వికెట్ మీదైనా రాణిస్తారు. కానీ ఈరోజు పరిస్థితి అంతగొప్పగా లేదు’’ అని పేర్కొన్నాడు.రహానే వ్యాఖ్యలపై ఈడెన్ గార్డెన్స్ పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ తాజాగా స్పందించాడు. రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘నేను ఇక్కడ ఉన్నంత కాలం ఈడెన్ గార్డెన్స్ పిచ్ ఇలాగే ఉంటుంది. ఇందులో ఎటువంటి మార్పూ లేదు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం పిచ్ ఎలా ఉండాలో చెప్పే అధికారం ఫ్రాంఛైజీలకు లేదు.ఆర్సీబీ స్పిన్నర్లు భేష్.. కేకేఆర్ బౌలర్లు ఏం చేశారు?నేను గతంలో ఎలా ఉన్నానో.. ఇప్పుడూ అలాగే ఉన్నాను. అందుకే మరీ మరీ చెప్తున్నా.. ఈడెన్ గార్డెన్స్ వికెట్లో ఇప్పుడు.. అదే విధంగా భవిష్యత్తులోనూ ఎలాంటి మార్పులు ఉండబోవు.అయినా ఆర్సీబీ స్పిన్నర్లు మొత్తంగా నాలుగు వికెట్లు తీశారు. మరి కేకేఆర్ స్పిన్నర్లు ఏం చేశారు? ఆర్సీబీలో కృనాల్ మూడు, సూయశ్ ఒక వికెట్ పడగొట్టారు’’ అని సుజన్ ముఖర్జీ కేకేఆర్ స్పిన్నర్ల తీరును విమర్శించాడు.ఇక ఈ సీజన్లో తమ రెండో మ్యాచ్ ఆడేందుకు కేకేఆర్ గువాహతికి పయనమైంది. రాజస్తాన్ రాయల్స్‌తో బుధవారం నాటి పోరులో గెలిచి బోణీ కొట్టాలని పట్టుదలగా ఉంది. అనంతరం వాంఖడేలో మార్చి 31న ముంబైతో తలపడుతుంది. మళ్లీ హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్.. ఏప్రిల్ 3న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢీకొట్టనుంది.చదవండి: 4 ఓవర్లలో 76 రన్స్ ఇచ్చాడు.. జట్టులో అవసరమా?: భారత మాజీ క్రికెటర్ -
సెంచరీ త్యాగం చేసిన శ్రేయస్.. గతంలో సెంచరీ కోసం కోహ్లి పాకులాడిన తీరును గుర్తు చేసుకున్న ఫ్యాన్స్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో నిన్న (మార్చి 25) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. పంజాబ్ గెలుపులో ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలక భూమిక పోషించాడు. ఈ మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన శ్రేయస్‌కు సెంచరీ చేసే అవకాశమున్నా జట్టు ప్రయోజనాల కోసం దాన్ని వద్దనుకున్నాడు.పంజాబ్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌కు ముందు శ్రేయస్ 97 పరుగులతో అజేయంగా ఉన్నాడు. ఆ ఓవర్లో కనీసం ఒక్క బంతి ఎదుర్కొన్నా శ్రేయస్ సెంచరీ చేసేవాడు. కానీ అతను స్ట్రయిక్ కోసం పాకులాడలేదు. శశాంక్ మంచి టచ్‌లో ఉన్న విషయాన్ని గమనించి అతన్నే స్ట్రయిక్ తీసుకోమన్నాడు. శశాంక్ స్వయంగా వచ్చి స్ట్రయిక్ రొటేట్ చేస్తానన్నా శ్రేయస్ వినలేదు. ఆ ఓవర్ అంతా సింగిల్స్‌కు కాకుండా బౌండరీలు, సిక్సర్లకు ప్రయత్నించమని చెప్పాడు.శశాంక్.. తన కెప్టెన్ చెప్పినట్లుగా చేసే క్రమంలో 5 బంతులు బౌండరీలకు తరలి వెళ్లగా.. ఓ బంతికి రెండు పరుగులు (రెండో బంతి) వచ్చాయి. వాస్తవానికి ఇక్కడ శ్రేయస్ స్ట్రయిక్ తీసుకుని (సింగిల్ తీసుంటే) ఉండవచ్చు. కానీ అతను అలా చేయలేదు. జట్టు ప్రయోజనాల కోసం సెంచరీ త్యాగం చేసిన అనంతరం యావత్ క్రికెట్ ప్రపంచం శ్రేయస్‌పై ప్రశంసల వర్షం కురిపించింది.ఈ క్రమంలో విరాట్ కోహ్లికి సంబంధించిన ఓ ఉదంతాన్ని క్రికెట్ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. 2019 ఐపీఎల్ సీజన్లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ చేశాడు. ఆ సెంచరీ కోసం కోహ్లి పడ్డ తాపత్రయాన్ని ఫ్యాన్స్ శ్రేయస్ ఉదంతంతో పోల్చుకుంటున్నారు. అప్పుడు కోహ్లి తన వ్యక్తిగత మైలురాయి కోసం జట్టుకు అదనంగా వచ్చే పరుగును వద్దన్నాడు. సెంచరీకి ముందు కోహ్లి ఆడిన ఓ షాట్‌కు రెండు పరుగులు వచ్చేవి. నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న స్టోయినిస్ కూడా రెండో పరుగుకు వచ్చేందుకు సుముఖత చూపాడు. కానీ కోహ్లి మళ్లీ తనే స్ట్రయిక్ తీసుకునేందుకు రెండో రన్ వద్దన్నాడు. తిరిగి స్ట్రయిక్‌లోకి వచ్చిన తర్వాత కోహ్లి బౌండరీ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు.ఆ మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ చేసి, అతని జట్టు ఆర్సీబీ గెలిచినా అభిమానులు కోహ్లిని తప్పుబట్టారు. జట్టుకు వచ్చే అదనపు పరుగు కంటే కోహ్లి తన సెంచరీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడా అన్న చర్చ అప్పట్లో జరిగింది. ఆ మ్యాచ్‌లో కోహ్లి 58 బంతుల్లో సెంచరీ చేయడంతో ఆర్సీబీ భారీ స్కోరు (213/4) చేసింది.ఛేదనలో ఆండ్రీ రస్సెల్ (65), నితీష్ రాణా (85*) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడినా కేకేఆర్ 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.శ్రేయస్ విషయానికొస్తే.. సెంచరీ గురించి పట్టించుకోకపోవడంతో పంజాబ్ భారీ స్కోర్ చేసి గెలిచింది. శ్రేయస్ కూడా కోహ్లిలా సెంచరీ కోసం పాకులాడి ఉంటే పంజాబ్ 243 పరుగుల భారీ స్కోర్ చేసుండేది కాదు. శ్రేయస్ సెంచరీ త్యాగం చేసి పంజాబ్ అంత భారీ స్కోర్ చేసినా గుజరాత్ అద్భుతంగా పోరాడి లక్ష్యానికి కేవలం 11 పరుగుల దూరంలో మాత్రమే నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ సెంచరీ వదులుకుని హీరో అయ్యాడు.. ఆ రోజు కోహ్లి సెంచరీ చేసి కూడా విమర్శలపాలయ్యాడు. -
‘ఇక్కడి నుంచి త్వరగా పారిపో అని విరాట్ సర్ చెప్పారు’
సెలబ్రిటీలను ఆరాధ్య దైవంగా భావించే యువత మన దేశంలో చాలా మందే ఉన్నారు. క్రికెటర్లు, సినీ నటులను చూసేందుకు ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడతారు. ఈ క్రమంలో.... ఒక్కోసారి తొందరపాటు చర్యలు, అత్యుత్సాహం కారణంగా జైలు పాలుకావాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. పద్దెమినిదేళ్ల రితూపర్నో పఖిరా కూడా ఈ కోవకే చెందుతాడు.భారత్‌లో క్రికెట్ కూడా ఓ మతం లాంటిది. సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar), విరాట్ కోహ్లి, మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ (Rohit Sharma).. ఇలా టీమిండియా దిగ్గజాలను దేవుళ్లలా భావించే ఫ్యాన్స్ కోకొల్లలు. వారిలో ఒకడే రితూపర్నో. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025 ఆరంభ మ్యాచ్ సందర్భంగా తన అభిమాన ఆటగాడు విరాట్ కోహ్లిని చూసేందుకు ఈడెన్ గార్డెన్స్‌లోకి దూసుకువచ్చాడు.ఒకరోజు జైలులోఈ రన్‌మెషీన్ పాదాలకు నమస్కరించి.. అతడిని ఆలింగనం చేసుకుని జన్మధన్యమైనట్లు తరించాడు. ఈ హఠాత్పరిణామంతో కంగుతిన్న భద్రతా సిబ్బంది పరుగుపరుగున వచ్చి రితూపర్నోను మైదానం నుంచి తీసుకుని వెళ్లి పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిని అరెస్టు చేసి ఒకరోజు జైలులో ఉంచినట్లు సమాచారం. అనంతరం.. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. ఓ షరతు మీద రితూపర్నోకు బెయిల్ మంజూరు చేశారు. ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం ఈడెన్ గార్డెన్స్ వైపు వెళ్లకుండా ఉండాలని మెజిస్ట్రేట్ రితూపర్నోకు కండిషన్ విధించారు. PC: BCCI/IPLపశ్చాత్తాపం లేదుఅయితే, అతడి వైఖరిలో మాత్రం ఎటువంటి మార్పూ రాలేదు. బెయిలు మీద బయటకు వచ్చిన తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘విరాట్ కోహ్లి పాదాలను తాకగానే ఆయన నా భుజాలు పట్టుకుని పైకి లేపారు. నా పేరేమిటని అడిగారు.ఇక్కడి నుంచి త్వరగా పారిపో అని చెప్పారు. అంతేకాదు.. నా పట్ల కాస్త సౌమ్యంగా వ్యవహరించాలని భద్రతా సిబ్బందికి చెప్పారు కూడా. నన్ను కొట్టవద్దని వారికి పదే పదే చెప్పారు. ఎలాగైనా ఆరోజు మైదానంలోకి వెళ్లాలని నేను ముందుగానే ప్రణాళికలు రచించుకున్నా.ఈ విషయంలో నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. నా దేవుడి పాదాలు తాకే అవకాశం వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నా’’ అని రితూపర్నో చెప్పడాన్ని బట్టి అతడి మానసిక పరిపక్వత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.పెద్ద మనసుతో క్షమించండిఅయితే, రితూపర్నో తల్లి మాత్రం తన కుమారుడు తెలియక చేసిన తప్పును క్షమించాలని న్యాయ వ్యవస్థను వేడుకుంటున్నారు. ‘‘విరాట్ కోహ్లిని ఆరాధిస్తాడు. వాడికి ఆయన దేవుడితో సమానం. అందుకే ఇలాంటి పని చేశాడు.వాడి వయసు, కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని పోలీసులు, న్యాయమూర్తి నా కుమారుడి తప్పులను పెద్ద మనసుతో క్షమించాలి’’ అని విజ్ఞప్తి చేశారు. కాగా రితూపర్నో 12వ ఏట నుంచి జమాల్‌పూర్‌లో ఉన్న నేతాజీ అథ్లెటిక్స్ క్లబ్లో క్రికెట్ కోచింగ్ తీసుకుంటున్నాడు. కాగా రితూపర్నో మైదానంలోకి దూసుకువచ్చి.. కోహ్లి కాళ్లు మొక్కడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించిన తీరు విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే.శుక్లా తీరుపై విమర్శలు‘‘కోహ్లి క్రేజ్ ఇలా ఉంటుంది’’ అని రాజీవ్ శుక్లా ట్వీట్ చేయగా.. ‘‘భద్రతా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా? ఒకవేళ ఆ వ్యక్తి సాధారణ పౌరుడు కాకుండా.. ఓ ఆటంకావాదో అయి ఉంటే కోహ్లి పరిస్థితి ఏమిటి? ఆటగాళ్లకు సరైన భద్రత కల్పించండి. అలాగే ఇలాంటి యువత తమ భవిష్యత్తు నాశనం చేసుకునేందుకు ఆస్కారం ఇవ్వకండి’’ అని నెటిజన్లు చురకలు అంటించారు.కాగా ఐపీఎల్-2025 కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్‌లో అంగరంగ వైభవంగా శనివారం మొదలైంది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఆరంభ మ్యాచ్‌లో కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 36 బంతుల్లోనే 59 పరుగులతో అజేయంగా నిలిచి బెంగళూరును గెలిపించాడు.ఐపీఎల్-2025: కోల్‌కతా వర్సెస్ ఆర్సీబీ స్కోర్లు👉కోల్‌కతా- 174/8 (20)👉ఆర్సీబీ- 177/3 (16.2)👉ఫలితం- ఏడు వికెట్ల తేడాతో కోల్‌కతాపై ఆర్సీబీ గెలుపుచదవండి: విఘ్నేశ్ పుతూర్‌ను ‘సన్మానించిన’ నీతా అంబానీ.. పాదాలకు నమస్కరించిన స్పిన్నర్ -
IPL 2025: దూసుకెళ్తున్న కోహ్లీ.. ఈసారి ట్యాక్స్ ఎంత?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ టాప్ పెర్ఫార్మర్ గా నిలిచాడు. రాయల్ చాలెంజర్ బెంగళూరు కీలక ఆటగాడైన కోహ్లీ ఐపీఎల్లో టాప్ పెర్ఫార్మర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. అతని ఆట, పాపులారిటీని పరిగణనలోకి తీసుకుని రాయల్ చాలెంజర్ బెంగళూరు జట్టు కోహ్లీకి అత్యధిక ధర (కాంట్రాక్ట్ ఫీజు) చెల్లించి నిలుపుకొంది.ఈసారి రూ.21 కోట్లుఈ ఏడాది ఐపీఎల్ 18వ ఎడిషన్‌లో రాయల్ చాలెంజర్ బెంగళూరు జట్టు విరాట్ కోహ్లీకి రూ.21 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 40 శాతం అధికం. ఆన్టైన్ టాక్స్ అండ్ బిజినెస్ కన్సల్టెన్సీ సంస్థ టాక్సాలజీ ఇండియా డేటా ప్రకారం.. 2008 నుండి 2010 వరకు విరాట్ కోహ్లీ పలికిన ధర కేవలం రూ .12 లక్షలు మాత్రమే. తన ఆకట్టుకునే ఆట, ఫ్యాన్స్‌లో ఉన్న క్రేజ్ కారణంగా 2025లో రూ .21 కోట్లకు పెరిగింది.2010 తర్వాత 2011-13 మధ్య కాలంలో విరాట్ కోహ్లీ ధర రూ.8.28 కోట్లకు పెరిగింది. 2014 నుంచి 2017 వరకు రూ.12.5 కోట్లు, 2018 నుంచి 2021 వరకు రూ.17 కోట్లు. అయితే 2022 నుంచి 2024 వరకు ఆయన ధర రూ.15 కోట్లకు పడిపోగా, ఇప్పుడు 40 శాతం పెరిగి రూ.21 కోట్లకు చేరుకుందని టాక్సాలజీ ఇండియా గణాంకాలు చెబుతున్నాయి. 2008 నుంచి ఇప్పటి వరకు ఐపీఎల్ ద్వారా విరాట్ కోహ్లీ రూ.179.70 కోట్లు అందుకున్నాడు.కట్టాల్సిన పన్ను ఎంత?2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ ఎడిషన్ కోసం విరాట్ కోహ్లీ తన ఐపీఎల్ పేమెంట్ రూ .21 కోట్లకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కోహ్లీ ఆర్సీబీ ఉద్యోగి కాదు కానీ ఐపీఎల్ కాంట్రాక్ట్ ఫీజు అందుకుంటున్నాడు కాబట్టి, ఈ ఆదాయాన్ని ఆదాయపు పన్ను చట్టం, 1961 సెక్షన్ 28 కింద "వ్యాపారం లేదా వృత్తి నుండి వచ్చే ఆదాయం" గా వర్గీకరిస్తారు.పన్ను లెక్కింపురూ.5 కోట్లకు పైగా సంపాదిస్తున్న వ్యక్తిగా విరాట్ కోహ్లీ అత్యధిక ఆదాయపు పన్ను శ్లాబ్ పరిధిలోకి వస్తాడు. అతను కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నాడనుకుంటే (ఇది అధిక ఆదాయం సంపాదించేవారికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది) సంపాదనపై 30% పన్ను వర్తిస్తుంది.సంపాదన రూ.21 కోట్లపై 30% పన్ను అంటే రూ.6.3 కోట్లు అవుతుంది. ఆదాయం రూ.5 కోట్లకు పైగా ఉంటే పన్ను మొత్తంపై 25 శాతం సర్ఛార్జ్ అదనంగా ఉంటుంది. అలా రూ.6.3 కోట్లపై ఇది రూ.1.575 కోట్లు అవుతుంది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ (ట్యాక్స్ + సర్‌ఛార్జ్‌పై 4%) రూ.0.315 కోట్లు. ఇప్పుడు చెల్లించాల్సిన మొత్తం పన్ను రూ.8.19 కోట్లు అవుతుందన్న మాట. అంటే పన్ను కింద పోయేది తీసేయగా విరాట్ కోహ్లీ అందుకునేది రూ.12.81 కోట్లు.ఒకవేళ వ్యాపార ఖర్చులు (ఏజెంట్ ఫీజులు, ఫిట్ నెస్ ఖర్చులు, బ్రాండ్ మేనేజ్ మెంట్ వంటివి) ఉంటే, పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని లెక్కించడానికి ముందు సెక్షన్ 37(1) కింద మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇతర ఆదాయ మార్గాలు (ఎండార్స్ మెంట్లు, పెట్టుబడులు మొదలైనవి) కూడా విడిగా పన్ను విధించబడతాయి. -
ఐపీఎల్ ప్రారంభ వేడుక.. కింగ్ ఖాన్‌తో స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ
వేసవి క్రీడా సంబురం ఐపీఎస్ సందడి అట్టహాసంగా ప్రారంభమైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ ఏడాది మెగా సీజన్ మొదలైంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ ప్రారంభ వేడుకల్లో పలువురు సినీతారలు కూడా సందడి చేశారు. ముఖ్యంగా కేకేఆర్ యజమాని షారూఖ్ ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ఈవెంట్లో బాలీవుడ్ భామ దిశాపటానీ తన డ్యాన్స్‌తో అభిమానులను మెప్పించింది.అయితే ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో బాలీవుడ్ కింగ్ షారూక్ ఖాన్ క్రికెటర్లను కాసేపు నటులుగా మార్చేశారు. తనతో పాటు విరాట్ కోహ్లీ, రింకూ సింగ్‌ను డ్యాన్స్ చేయించారు. పఠాన్ మూవీలోని ఓ సాంగ్‌కు కింగ్ కోహ్లీ సైతం స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఐపీఎల్ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అంతేకాకుండా ఈ వేడుకలో ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ తన పాటలతో అభిమానులను అలరించారు. పుష్ప-2 సాంగ్ పాడి ప్రేక్షకుల్లో ఫుల్ జోష్ నింపారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం షారూక్ ఖాన్ ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్‌లో నటించడం లేదు. చివరిసారిగా జవాన్ మూవీతో అభిమానులను అలరించాడు. ఈ సినిమాకు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించారు. King Khan 🤝 King Kohli When two kings meet, the stage is bound to be set on fire 😍#TATAIPL 2025 opening ceremony graced with Bollywood and Cricket Royalty 🔥#KKRvRCB | @iamsrk | @imVkohli pic.twitter.com/9rQqWhlrmM— IndianPremierLeague (@IPL) March 22, 2025 -
ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్, ధోనీ.. హెయిర్ కట్ కోసం ఎంత చెల్లిస్తారంటే..
జీవితంలో ఏదైనా జరగవచ్చు. సాధారణ వృత్తి అనుకున్న దానిలో కూడా లక్షలు గడించవచ్చు. అందరూ చేసే అదే వృత్తిలో కొందరు మాత్రమే పాపులర్ అవుతుంటారు. దీన్నే లక్ అంటారనుకుంటా.. కానీ, దాని వెనుక ఎంతో కష్టం కూడా ఉండొచ్చు. కొందరి జీవిత సక్సెస్ స్టోరీలు చూస్తే మనకు నిజమే అనిపిస్తుంది. అందుకు చిన్న ఉదాహరణ ఆలీమ్ హకీమ్. సాధారణంగా ఒక సెలూన్ షాప్‌నకు వెళితే అక్కడ ఒక మనిషి హెయిర్ కటింగ్‌కు రూ.150 తీసుకుంటారు. లగ్జరీ సెలూన్ అయితే రూ.500 తీసుకుంటారు. ఇక సెలబ్రిటీస్‌కు ఇంకా ఎక్కువ మొత్తంలో చెల్లిస్తుండవచ్చు. అయితే ఒక్కసారి కటింగ్‌కు లక్షల్లో చెల్లించడం అనేది ఎప్పుడైనా విని ఉంటామా..? మనం విని ఉండకపోవచ్చు. ఇది జరుగుతున్న వాస్తవం. ఆలీమ్ హకీమ్ అనే హెయిర్‌స్టర్ గురించే ఇదంతా. ఇతను హాలీవుడ్ హెయిర్‌స్టర్. మొదట్లో ఒకరికి హెయిర్ కట్ చేస్తే రూ.20 తీసుకునేవారట. ఆ తరువాత దాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ ఇప్పుడు మినిమమ్ లక్ష రూపాయల వరకూ తీసుకుంటున్నారని సమాచారం. ఏంటి ఒకసారి జుత్తు కట్ చేస్తే లక్ష ఎవరు చెల్లిస్తారు ? అని ఆశ్చర్యపోతున్నారా. నిజమేనండి..? ఇది కూడా మినిమమ్ ధర మాత్రమేనట.. అత్యధికంగా ఆయన రూ.2.5 లక్షల వరకు ఛార్జ్ చేస్తారని సమాచారం. ఆలీమ్ హకీమ్ ఇప్పుడు సాదారణ హెయిరిస్ట్ కాదు. సెలబ్రిటీల హెయిరిస్ట్. అదీ మామూలు సెలబ్రిటీలకు కాదు. సూపర్‌స్టార్స్‌కు హెయిర్‌స్టర్. ఈయన తల మీద కత్తెర పెట్టారంటే అక్షరాలు లక్ష చెల్లించాల్సిందేనట. హాలీవుడ్‌కు చెందిన ఈయనకు కస్టమర్స్ అందరూ ఇండియాకు చెందిన వారే కావడం విశేషం. ఆలీమ్ హకీమ్ కస్టమర్స్ లిస్ట్ ఇదేఈయనకు సినీ, క్రికెట్ క్రీడాకారుల మధ్య మంచి క్రేజ్ ఉంది. ఈయన కస్టమర్లంతా సినీస్టార్స్, క్రికెట్స్టార్స్ వంటి వారే. అందులో సూపర్‌స్టార్ రజనీకాంత్,విజయ్ సేతుపతి, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అభిషేక్ బచ్చన్, క్రికెట్ స్టార్ ఎంఎస్.ధోని, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్,చాహల్ వంటి సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. రజనీకాంత్ తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న కూలీ చిత్రంలో ఆయనకు హెయిర్స్టర్గా పని చేసింది ఆలీమ్ హకీమే. అటువంటింది ఆయన హెయిర్‌స్టైల్ పని తనం. ఏదైనా ఒక్కసారి పాపులర్ అయితే ఆ తరువాత పేరైనా, డబ్బైనా వెతుక్కుంటూ వస్తుందనడానికి ఇదొక ఉదాహరణ. -
ఈడెన్‌లో మెరుపులతో మొదలు
డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ కొత్త సీజన్‌ను ఓటమితో మొదలు పెట్టింది. సొంతగడ్డ ఈడెన్ గార్డెన్స్‌లో ఆడిన మ్యాచ్‌లోనూ శుభారంభం చేయలేకపోయింది. బ్యాటింగ్‌లో రహానే, నరైన్ మెరుపులతో ఒక దశలో 200 సాధించగలదనిపించిన టీమ్ ఆ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలి స్వల్ప స్కోరుకే పరిమితమైంది.ఆర్సీబీ బౌలర్లు కేకేఆర్‌ను సరైన సమయంలో నిలువరించడంలో సఫలమయ్యారు. ఆ తర్వాత సాల్ట్, కోహ్లి మెరుపు ఓపెనింగ్‌తో విజయానికి బాటలు వేసుకున్న బెంగళూరు ఆశావహ దృక్పథంతో తమ ప్రయాణాన్ని మొదలు పెట్టింది. మరో 22 బంతులు మిగిలి ఉండగానే గెలిచిన మ్యాచ్‌తో రజత్ పాటీదార్ కెపె్టన్‌గా శుభారంభం చేశాడు. కోల్‌కతా: ఐపీఎల్ తొలి పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పైచేయి సాధించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అజింక్య రహానే (31 బంతుల్లో 56; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించగా... సునీల్ నరైన్ (26 బంతుల్లో 44; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), అంగ్కృష్ రఘువంశీ (22 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. రహానే, నరైన్ రెండో వికెట్‌కు 55 బంతుల్లోనే 103 పరుగులు జోడించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కృనాల్ పాండ్యా (3/29) కీలక సమయంలో 3 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అనంతరం బెంగళూరు 16.2 ఓవర్లలో 3 వికెట్లకు 177 పరుగులు సాధించింది. విరాట్ కోహ్లి (36 బంతుల్లో 59 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఫిల్ సాల్ట్ (31 బంతుల్లో 56; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో చెలరేగగా...తొలి సారి కెప్టెన్‌గా వ్యవహరించి రజత్ పాటీదార్ (16 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా దూకుడుగా ఆడాడు. భారీ భాగస్వామ్యం... 10 ఓవర్లలో 107 పరుగులు...ఇన్నింగ్స్ తొలి భాగంలో కోల్‌కతా బ్యాటింగ్ జోరింది. డి కాక్ (4) మొదటి ఓవర్లోనే వెనుదిరిగిన తర్వాత రహానే, నరైన్ కలిసి చెలరేగిపోయారు. సలామ్ ఓవర్లో ఫోర్, 2 సిక్స్‌లు బాదిన రహానే...కృనాల్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. అదే ఓవర్లో సిక్స్‌తో నరైనా కూడా జత కలిశాడు. దయాళ్ ఓవర్లో కూడా ఇదే తరహాలో రహానే 2 ఫోర్లు, సిక్స్‌తో చెలరేగిపోయాడు. సుయాశ్ ఓవర్లో సిక్స్‌తో 25 బంతుల్లోనే రహానే అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా...చివరి రెండు బంతులను రహానే సిక్స్, ఫోర్‌గా మలిచాడు. సలామ్ తర్వాతి ఓవర్లో కూడా 4, 6 కొట్టిన నరైన్ అదే ఊపులో చివరి బంతికి అవుటయ్యాడు. ఇక్కడే కేకేఆర్ ఇన్నింగ్స్ మలుపు తిరిగింది. ఒక్కసారిగా చెలరేగిన బెంగళూరు బౌలర్లు ప్రత్యర్థిపై పట్టు సాధించారు. 16 పరుగుల తేడాతో రహానే, వెంకటేశ్ అయ్యర్ (6) వెనుదిరగ్గా...ఐదు పరుగుల వ్యవధిలో భారీ హిట్టర్లు రింకూ సింగ్ (12), ఆండ్రీ రసెల్ (4) వికెట్లను జట్టు కోల్పోయింది. దాంతో అంచనాలకు అనుగుణంగా భారీ స్కోరును సాధించలేకపోయింది. దూకుడుగా దూసుకుపోయి... ఛేదనలో బెంగళూరు చెలరేగిపోయింది. ఇన్నింగ్స్ తొలి బంతినే ఫోర్‌గా మలచిన సాల్ట్ ఘనంగా మొదలు పెట్టగా, అతనికి కోహ్లి తోడవడంతో టీమ్ లక్ష్యం దిశగా సునాయాసంగా దూసుకుపోయింది. అరోరా ఓవర్లో సాల్ట్ 2 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టగా, కోహ్లి మరో ఫోర్ బాదడంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి. నైట్‌రైడర్స్ ఎంతో ఆశలు పెట్టుకున్న వరుణ్ చక్రవర్తికి తొలి ఓవర్లో బాగా దెబ్బ పడింది. వరుస బంతుల్లో సాల్ట్ 4, 6, 4, 4 బాదడంతో పరిస్థితి అంతా ఆర్సీబీకి అనుకూలంగా మారిపోయింది. జాన్సన్ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు బాది తానూ తగ్గలేదని కోహ్లి చూపించగా, 25 బంతుల్లో సాల్ట్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. తక్కువ వ్యవధిలో సాల్ట్, పడిక్కల్ (10) వికెట్లు తీసి కోల్‌కతా కాస్త ఊరట చెందినా...తర్వాత వచ్చిన పాటీదార్ కూడా బౌండరీల వర్షం కురిపించాడు. రాణా ఓవర్లోనే అతను ఏకంగా 4 ఫోర్లు కొట్టడం విశేషం. 30 బంతుల్లో విరాట్ హాఫ్ సెంచరీ సాధించాడు. చివర్లో వరుసగా 6, 4 కొట్టి లివింగ్‌స్టోన్ (15 నాటౌట్) మ్యాచ్ ముగించాడు. స్కోరు వివరాలుకోల్కాత నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: డి కాక్ (సి) జితేశ్ (బి) హాజల్‌వుడ్ 4; నరైన్ (సి) జితేశ్ (బి) సలామ్ 44; రహానే (సి) సలామ్ (బి) పాండ్యా 56; వెంకటేశ్ (బి) పాండ్యా 6; రఘువంశీ (సి) జితేశ్ (బి) దయాళ్ 30; రింకూ (బి) పాండ్యా 12; రసెల్ (బి) సుయాశ్ 4; రమణ్‌దీప్ (నాటౌట్) 6; హర్షిత్ (సి) జితేశ్ (బి) హాజల్‌వుడ్ 5; జాన్సన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–4, 2–107, 3–109, 4–125, 5–145, 6–150, 7–168, 8–173. బౌలింగ్: హాజల్‌వుడ్ 4–0–22–2, యశ్ దయాళ్ 3–0–25–1, రసిఖ్ సలామ్ 3–0–35–1, కృనాల్ పాండ్యా 4–0–29–3, సుయాశ్ శర్మ 4–0–47–1, లివింగ్‌స్టోన్ 2–0–14–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) జాన్సన్ (బి) వరుణ్ 56; కోహ్లి (నాటౌట్) 59; పడిక్కల్ (సి) రమణ్‌దీప్ (బి) నరైన్ 10; పటీదార్ (సి) రింకూ (బి) అరోరా 34; లివింగ్‌స్టోన్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (16.2 ఓవర్లలో 3 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–95, 2–118, 3–162. బౌలింగ్: వైభవ్ అరోరా 3–0–42–2, స్పెన్సర్ జాన్సన్ 2.2–0–31–0, వరుణ్ చక్రవర్తి 4–0–43–1 హర్షిత్ రాణా 3–0–32–0, సునీల్ నరైన్ 4–0–27–1. సందడిగా ప్రారంభోత్సవంతొలి మ్యాచ్‌కు ముందు ఈడెన్ గార్డెన్స్‌లో ఐపీఎల్ ప్రారంభ వేడుకలు జరిగాయి. షారుఖ్ ఖాన్ వ్యాఖ్యానంతో ఈ కార్యక్రమం మొదలు కాగా...ఆ తర్వాత ప్రముఖ గాయని శ్రేయా ఘోషాల్ తన పాటతో అలరించింది. అనంతరం దిశా పటాని తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. సింగర్ కరణ్ ఔజ్లా ఆమెకు జత కలిశాడు. చివర్లో షారుఖ్ చిత్రం ‘పఠాన్’లోని సూపర్ హిట్ పాటకు అతనితో కలిసి విరాట్ కోహ్లి వేసిన స్టెప్పులు హైలైట్‌గా నిలిచాయి. తొలి ఐపీఎల్ నుంచి ఇప్పటి వరకు ఆడుతున్న విరాట్ కోహ్లికి బీసీసీఐ ప్రత్యేక ‘18’ జ్ఞాపికను అందించింది. ఐపీఎల్లో నేడుహైదరాబాద్ X రాజస్తాన్ వేదిక: హైదరాబాద్ మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి చెన్నై X ముంబైవేదిక: చెన్నైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
RCB Vs KKR: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ఒకే ఒక్కడు
ఐపీఎల్-2025ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఘనంగా ఆరంభించాడు. ఈ టోర్నీలో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 175 పరుగుల లక్ష్య చేధనలో కోహ్లి తన క్లాస్ చూపించాడు. కేకేఆర్ బౌలర్లను కింగ్ కోహ్లి ఓ ఆట ఆడేసుకున్నాడు.విరాట్ మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్‌తో స్కోర్ బోర్డున పరుగులు పెట్టించాడు. ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను ముగించాడు. విరాట్ 36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కోహ్లికి ఇది 55వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన కోహ్లి పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.చరిత్ర సృష్టించిన కోహ్లి..👉విరాట్ కోహ్లికి ఇది 400వ టీ20 మ్యాచ్ కావడం గమనార్హం. తద్వారా టీ20 ఫార్మాట్లో 400 మ్యాచ్ లు ఆడిన మూడో భారత ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. రోహిత్ శర్మ (448), దినేశ్ కార్తీక్ (412) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. కాగా భారత్ తరపున 125 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి..ఆర్సీబీ తరపున 268 మ్యాచ్ లాడాడు.👉ఐపీఎల్లో కేకేఆర్‌పై 1000 పరుగుల మైలు రాయిని అందుకున్న మూడో క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. కేకేఆర్ పై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అగ్రస్థానంలో ఉన్నాడు. వార్నర్ 28 ఇన్నింగ్స్‌ల్లో 43.72 సగటుతో 1,093 పరుగులు చేశాడు. రెండో స్థానంలో ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్‌మ్యాన్ 34 ఇన్నింగ్స్‌ల్లో 39.62 సగటుతో 1,070 పరుగులు చేశాడు.👉ఐపీఎల్ చరిత్రలో నాలుగు జట్లపై 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా విరాట్ రికార్డులకెక్కాడు. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లపై 1000కి పైగా రన్స్ చేశాడు. ఇక మ్యాచ్‌లో కేకేఆర్‌పై 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది.చదవండి: IPL 2025: కృనాల్ సూపర్ బాల్.. రూ.23 కోట్ల ఆటగాడికి ఫ్యూజ్‌లు ఔట్! వీడియో -
RCB Vs KKR: సాల్ట్, కోహ్లి విధ్వంసం.. కేకేఆర్‌ను చిత్తు చేసిన ఆర్సీబీ
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శుభారంభం చేసింది. ఈ టోర్నీలో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆరంభంలోనే క్వింటన్ డికాక్ వికెట్ కోల్పోయినప్పటికి కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే(31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56), సునీల్ నరైన్(26 బంతుల్లో 44) అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు.వీరితో పాటు రఘువంశీ(30) పరుగులతో రాణించాడు. డికాక్‌తో పాటు వెంకటేశ్ అయ్యర్(6), అండ్రీ రస్సెల్(4), రింకూ సింగ్(12) తీవ్ర నిరాశపరిచారు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా మూడు వికెట్లతో సత్తాచాటగా.. హాజిల్ వుడ్ రెండు, రసీఖ్ ధార్ సలీం, యశ్‌దయాల్ తలా వికెట్ సాధించారు.కోహ్లి, సాల్ట్ విధ్వంసం..175 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.2 ఓవర్లలో చేధించింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(59 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఫిల్‌సాల్ట్(31 బంతుల్లో 56), పాటిదార్(16 బంతుల్లో 34) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. పవర్‌ప్లేలో కోహ్లి, సాల్ట్ చాలా దూకుడుగా ఆడారు.వీరిద్దరి విధ్వంసం ఫలితంగా ఆర్సీబీ స్కోర్ ఆరు ఓవర్లలోనే 80 పరుగులు దాటేసింది. ఇక కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా,సునీల్ నరైన్ తలా వికెట్ సాధించారు. ఆర్సీబీ స్టార్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు ప్లేయర్ ఆప్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: IPL 2025: కృనాల్ సూపర్ బాల్.. రూ.23 కోట్ల ఆటగాడికి ఫ్యూజ్‌లు ఔట్! వీడియో -
ఈ ఏడాది ఐపీఎల్లో కోహ్లి బ్రేక్ చేయగలిగే ఐదు భారీ రికార్డులు
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రేపటి నుంచి (మార్చి 22) ప్రారంభం కానుంది. సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్ కేకేఆర్ సొంత మైదానమైన ఈడెన్ గార్డెన్స్‌లో రాత్రి 7:30 గంటలకు మొదలవుతుంది.అత్యధిక బౌండరీలుఈ సీజన్లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని పలు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ సీజన్లో కోహ్లి మరో 64 బౌండరీలు బాదితే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక బౌండరీలు బాదిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు శిఖర్ ధవన్ పేరిట ఉంది. ధవన్ ఖాతాలో 768 బౌండరీలు ఉండగా.. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 705 బౌండరీలు ఉన్నాయి.అత్యధిక హాఫ్ సెంచరీలుఈ సీజన్లో విరాట్ మరో నాలుగు హాఫ్ సెంచరీలు చేస్తే.. ఐపీఎల్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు (హాఫ్ సెంచరీ ప్లస్ సెంచరీలు) చేసిన బ్యాటర్‌గా అవతరిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ ఖాతాలో 66 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు ఉండగా.. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 63 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు ఉన్నాయి.తొలి భారతీయుడిగా రికార్డుఈ ఐపీఎల్ సీజన్లో విరాట్ మరో 114 పరుగులు చేస్తే.. టీ20 క్రికెట్లో 13000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 12886 పరుగులు ఉన్నాయి. ప్రస్తుతం విరాట్ ప్రపంచవాప్తంగా అత్యధిక టీ20 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ (14562), అలెక్స్ హేల్స్ (13610), షోయబ్ మాలిక్ (13537), కీరన్ పోలార్డ్ (13537), డేవిడ్ వార్నర్ (12913) టాప్-5లో ఉన్నారు.తొలి ప్లేయర్‌గా..!ఈ ఐపీఎల్ సీజన్లో విరాట్ మరో 24 పరుగులు చేస్తే ఆసియా ఖండంలో 11000 టీ20 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు.విరాట్ ఆసియాలో ఇప్పటివరకు 10976 పరుగులు స్కోర్ చేశాడు.ఓపెనర్‌గా 5000 పరుగులుఈ ఐపీఎల్లో విరాట్ మరో 97 పరుగులు చేస్తే టీ20 క్రికెట్లో 5000 పరుగులు పూర్తి చేసుకున్న ఓపెనర్ల జాబితాలో చేరతాడు.ఐపీఎల్ 2025లో ఆర్సీబీ జట్టు..రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవ్‌దత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, స్వస్తిక్ చికారా, కృనాల్ పాండ్యా, మనోజ్ భాండగే, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, మోహిత్ రతీ, ఫిలిప్ సాల్ట్, జితేశ్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, రసిఖ్ సలాం ధార్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్, నువాన్ తుషార, అభినందన్ సింగ్ఐపీఎల్ 2025లో కేకేఆర్ జట్టు..అజింక్య రహానే (కెప్టెన్), మనీశ్ పాండే, రింకూ సింగ్, రోవ్‌మన్ పావెల్, అంగ్క్రిష్ రఘువంశీ, అనుకుల్ రాయ్, రమన్‌దీప్ సింగ్, వెంకటేశ్ అయ్యర్, మొయిన్ అలీ, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, క్వింటన్ డికాక్, రహ్మానుల్లా గుర్బాజ్, లవ్నిత్ సిసోడియా, వరుణ్ చక్రవర్తి, మయాంక్ మార్కండే, వైభవ్ అరోరార, హర్షిత్ రాణా, అన్రిచ్ నోర్జే, చేతన్ సకారియా, స్పెన్సర్ జాన్సన్ -
ఈసారి ఆర్సీబీ పదో స్థానంలో నిలుస్తుంది: ఆస్ట్రేలియా దిగ్గజం
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆడం గిల్‌క్రిస్ట్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ఆర్సీబీ అంటే తనకేమీ ద్వేషం లేదని.. సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli)కి తానెప్పుడూ వ్యతిరేకం కాదని పేర్కొన్నాడు. అయితే, ఆర్సీబీలో ఓ దేశానికి చెందిన ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారని.. అందుకే ఈసారి ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలుస్తుందంటూ వ్యంగ్యాత్మక వ్యాఖ్యలు చేశాడు.నాయకుడిగా రజత్ పాటిదార్ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పద్దెనిమిదవ ఎడిషన్ శనివారం (మార్చి 22)ఆరంభం కానున్న విషయం తెలిసిందే. కోల్‌కతా నైట్ రైడర్స్- ఆర్సీబీ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్-2025కి తెరలేవనుంది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతాతో పాటు ఆర్సీబీకి కూడా ఈసారి కొత్త కెప్టెన్ వచ్చాడు. కేకేఆర్‌కు అజింక్య రహానే సారథ్యం వహించనుండగా... బెంగళూరు జట్టుకు రజత్ పాటిదార్ నాయకుడిగా వ్యవహరించనున్నాడు.ఈసారి చివరి స్థానంలో ఉండేది ఆర్సీబీఈ నేపథ్యంలో ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతున్న ఆసీస్ దిగ్గజం గిల్‌క్రిస్ట్‌కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఈసారి ఐపీఎల్లో పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో ఉండే జట్టు ఏది? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఆ జట్టులో అనేక మంది ఇంగ్లండ్ ఆటగాళ్లు ఉన్నారు.కాబట్టి.. వాస్తవాల ఆధారంగానే నేను ఈ మాట చెబుతున్నా. ఈసారి చివరి స్థానంలో ఉండేది ఆర్సీబీ. వాళ్లకే ఈసారి ఆఖర్లో ఉండే అర్హతలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి’’ అని పేర్కొన్నాడు. అయితే, అదే సమయంలో ఆర్సీబీ, కోహ్లి అభిమానులకు గిల్‌క్రిస్ట్ క్షమాపణలు కూడా చెప్పడం విశేషం.మనస్ఫూర్తిగా క్షమాపణలు‘‘విరాట్ లేదంటే.. ఆర్సీబీ ఫ్యాన్స్‌కు నేను వ్యతిరేకం కాదు. ఇలా మాట్లాడినందుకు వారికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా. కానీ మీ రిక్రూట్మెంట్ ఏజెంట్లకు మీరైనా చెప్పండి. ఆటగాళ్ల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం అత్యంత ముఖ్యం’’ అని గిల్‌క్రిస్ట్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ ప్లేయర్ల ప్రదర్శన అంతగొప్పగా ఉండదని.. ఈసారి వారి వల్ల ఆర్సీబీకి పెద్దగా ఒరిగేదేమీ ఉండదని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.కాగా మెగా వేలం-2025 సందర్భంగా ఆర్సీబీ.. ఇంగ్లండ్ స్టార్లు లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బెతెల్, ఫిల్ సాల్ట్ తదితరులను కొనుగోలు చేసింది. సాల్ట్ ఈసారి కోహ్లితో కలిసి ఆర్సీబీ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది.కాగా ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు జట్టుకు రెండుసార్లు ట్రోఫీని దూరం చేసిన జట్టు హైదరాబాద్. 2009లో ఆడం గిల్‌క్రిస్ట్ కెప్టెన్సీలో నాటి దక్కన్ చార్జర్స్.. 2016లో డేవిడ్ వార్నర్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఫైనల్లో ఓడించి టైటిల్ సొంతం చేసుకున్నాయి. ఇక ఆర్సీబీ ఇంత వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదన్న విషయం తెలిసిందే. గతేడాది ప్లే ఆఫ్స్ చేరిన ఈ జట్టు.. ఈసారి టైటిల్ రేసులో నిలవాలని పట్టుదలగా ఉంది.ఐపీఎల్-2025లో ఆర్సీబీ జట్టురజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, లియామ్ లివింగ్‌స్టోన్, రసిఖ్ దార్, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, నువాన్ తుషార, మనోజ్ భాండగే, జేకబ్ బెతెల్, దేవ్‌దత్ పడిక్కల్, స్వస్తిక్చికార, లుంగి ఎంగిడి, అభినందన్ సింగ్, మోహిత్ రాఠీ.చదవండి: 44 బంతుల్లో శతక్కొట్టిన పాక్ ఓపెనర్.. 9 వికెట్ల తేడాతో చిత్తైన న్యూజిలాండ్ -
‘అక్షర్‌తో పోలిస్తే అతడికి కాస్త కష్టమే.. కోహ్లి సూపర్స్టార్డమ్తో పోటీ’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025లో ఐదు జట్లకు కొత్త కెప్టెన్లు వచ్చారు. లక్నో సూపర్ జెయింట్స్‌కు రిషభ్ పంత్ (Rishabh Pant), పంజాబ్ కింగ్స్‌కు శ్రేయస్ అయ్యర్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు అక్షర్ పటేల్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు రజత్ పాటిదార్, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు అజింక్య రహానే సారథ్యం వహించనున్నారు.అయితే, వీరిలో రజత్ (Rajat Patidar), అక్షర్‌లకు ఐపీఎల్లో కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం లేదు. ఈ నేపథ్యంలో ఈసారి ఈ ఇద్దరు కఠిన సవాళ్లు ఎదుర్కోబోతున్నారని టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప అన్నాడు. అయితే, వీరిద్దరిలో రజత్తో పోలిస్తే అక్షర్‌పై ఒత్తిడి కాస్త తక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.కోహ్లి సూపర్స్టార్డమ్తోనూ పోటీఇందుకు గల కారణాన్ని వెల్లడిస్తూ.. ‘‘అక్షర్ పటేల్, రజత్ పాటిదార్లను పోల్చి చూస్తే అక్షర్‌కు కాస్త వెసలుబాటు ఉంటుంది. జట్టు, సారథ్య బాధ్యతలు తీసుకోవడం కొత్తే అయినా.. కొంతమంది పాతవాళ్లు కూడా ఉండటం అక్షర్‌కు సానుకూలాంశం.రజత్‌కు కూడా జట్టులో కొంతమంది ఆటగాళ్లతో గతంలో ఆడిన అనుభవం ఉంది. కానీ.. అతడు మిగతా విషయాలతో పాటు.. విరాట్ కోహ్లి సూపర్స్టార్డమ్తోనూ పోటీ పడాల్సి ఉంటుంది. అతడిపై కోహ్లి ప్రభావం కచ్చితంగా ఉంటుంది. కెప్టెన్సీ నైపుణ్యాలు మెరగుపరచుకునే క్రమంలో ఒక్కోసారి కోహ్లిపైనే ఆధారపడాల్సి ఉంటుంది.కోహ్లి నీడలో కాకుండా.. అయితే, నాకు తెలిసి రజత్‌కు ఆర్సీబీ మేనేజ్మెంట్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఉంటుందనిపిస్తోంది. కోహ్లి నీడలో కాకుండా.. రజత్ తన మార్కు చూపిస్తే బాగుంటుంది. ఏదేమైనా ఈసారి ఆర్సీబీ, కోల్‌కతా, ఢిల్లీ జట్లు తమ కొత్త కెప్టెన్లతో ఎలాంటి ఫలితాలు సాధిస్తాయో చూడాలని ఆతురతగా ఉంది.ముఖ్యంగా రజత్పైనే ఎక్కువ మంది దృష్టి సారిస్తారు అనడంలో సందేహం లేదు. ఆర్సీబీకి ఉన్న క్రేజ్ అలాంటిది. ఈ జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు.. కాబట్టి రజత్ ఆ రాతను మారుస్తాడో లేదో చూడాలి. దేశవాళీ క్రికెట్లో మధ్యప్రదేశ్ జట్టుకు విజయాలు అందించిన ఘనత అతడికి ఉంది. అయితే, ఐపీఎల్‌లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయడం అంత సులువేమీ కాదు’’ అని రాబిన్ ఊతప్ప అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2025 సీజన్ మార్చి 22న కోల్‌కతా- బెంగళూరు మధ్య మ్యాచ్‌తో మొదలుకానుంది.ఐపీఎల్-2025లో ఆర్సీబీ జట్టువిరాట్ కోహ్లి, రజత్ పటిదార్, యశ్ దయాళ్, జోష్ హాజల్‌వుడ్, ఫిల్ సాల్ట్,జితేశ్ శర్మ, భువనేశ్వర్ కుమార్, లియామ్ లివింగ్‌స్టోన్, రసిక్ ధార్, కృనాల్ పాండ్యా , టిమ్ డేవిజ్, జాకబ్ బెథెల్, సుయాశ్ శర్మ, దేవ్‌దత్ పడిక్కల్, తుషార, రొమరియో షెఫర్డ్, లుంగి ఎంగిడి, స్వప్నిల్ సింగ్, మనోజ్, మోహిత్ రాఠి, అభినందన్, స్వస్తిక్ చికార.చదవండి: ముగ్గురు టీమిండియా కెప్టెన్లు.. అది నా అదృష్టం: హార్దిక్ పాండ్యా -
BCCI: విరాట్ కోహ్లి ఘాటు విమర్శలు.. స్పందించిన బీసీసీఐ
ఆటగాళ్ల కుటుంబ సభ్యులను విదేశీ పర్యటనలకు అనుమతించే విషయంలో తమ నిర్ణయం మారదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) స్పష్టం చేసింది. జట్టుతో పాటు బోర్డుకు కూడా ఇదే మంచిదని పేర్కొంది. ఈ విషయంలో ఆటగాళ్లకు భిన్నాభిప్రాయాలు ఉండవచ్చని.. అయితే, తాము జట్టు ప్రయోజనాల కోసం కఠినంగా వ్యవహరించక తప్పదని తెలిపింది.ఈ మేరకు బోర్డు తరఫున.. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా (Devajit Saikia) తమ స్పందన తెలియజేశారు. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్ గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. 3-1తో ఓడి ఇంటిబాటపట్టింది.ఈ పరాభవం తర్వాత.. విదేశీ పర్యటనలకు ఆటగాళ్ల కుటుంబ సభ్యులను అనుమతించే విషయమై బీసీసీఐ కఠిన నిబంధనలు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. నలభై ఐదు రోజుల్లోపు విదేశీ పర్యటనలో ఆటగాళ్లు, సహాయ సిబ్బంది కుటుంబ సభ్యులను వారం రోజులు మాత్రమే అనుమతిస్తారు.విరాట్ కోహ్లి ఘాటు విమర్శలుఅంతకు మించి పర్యటన కొనసాగితే రెండు వారాల పాటు సన్నిహితులకు అక్కడే ఉండే వెసలుబాటు ఉంటుంది. అయితే, ఈ విషయంలో టీమిండియా సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli) బీసీసీఐ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. సన్నిహితులే సగం బలమని.. ఆటగాడి విజయం వెనుక కుటుంబ సభ్యుల పాత్రను అందరికీ వివరించలేమని పేర్కొన్నాడు.మైదానంలో దిగని వాళ్లు, అక్కడ ఏం జరుగుతుందో తెలియని వాళ్లు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిరాశ కలిగించిందని కోహ్లి ఘాటుగా విమర్శించాడు. ప్రతి ఆటగాడు తన కుటుంబ సభ్యులు వెంట ఉంటే మరింత బాధ్యతగా ఆడతారని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఈ విషయంలో యూటర్న్ తీసుకోనుందనే వార్తలు వచ్చాయి.బీసీసీఐకి, దేశానికి ఇదే మంచిదిఅయితే, అలాంటిదేమీ లేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తాజాగా కొట్టిపడేశారు. ‘‘మేము ప్రవేశపెట్టిన నిబంధనలో ప్రస్తుతం ఎలాంటి మార్పులు చేయడం లేదు. బీసీసీఐకి, వ్యవస్థకి, జట్టుకు, దేశానికి ఇదే మంచిది.ఈ అంశంలో ఆటగాళ్ల నుంచి భిన్నాభిప్రాయాలు, మిశ్రమ స్పందన వస్తుందని తెలుసు. ఇక్కడంతా ప్రజాస్వామ్యం ఉంటుంది కాబట్టి.. ఎవరైనా తమ గొంతును వినిపించవచ్చు. తమ భావాలను నిర్భయంగా పంచుకోవచ్చు.అయితే, ఈ నిబంధన విషయంలో అందరు ఆటగాళ్లూ సమానమే. జట్టులోని ప్రతి సభ్యుడు, కోచ్‌లు, మేనేజర్లు, సహాయక సిబ్బంది.. ఇలా అందరికీ రూల్స్ వర్తిస్తాయి. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం.రాత్రికి రాత్రే హడావుడిగా ఈ విధానాన్ని మేము ప్రవేశపెట్టలేదు. దశాబ్దాలుగా జరుగుతున్న విషయాలను పరిగణనలోకి తీసుకుని మా అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఈ పాలసీ తీసుకువచ్చారు. నిజానికి గతంతో పోలిస్తే విదేశీ పర్యటనల సమయంలో కుటుంబ సభ్యులను అనుమతించే విషయమై మేము ఆటగాళ్లకు చాలా వరకు మినహాయింపులు ఇచ్చాం. అయితే, ఇప్పుడు ఈ రూల్ కాస్త కఠినంగా అనిపించినా.. తప్పక అమలు చేస్తాం’’ అని దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.చదవండి: IPL 2025: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ -
IPL 2025: అంపైర్‌గా కోహ్లి సహచరుడు
ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి చిన్ననాటి స్నేహితుడు తన్మయ్ శ్రీవాత్సవ ఐపీఎల్ 2025 సీజన్ కోసం అంపైర్‌గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఉత్తర్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (శ్రీవాత్సవ సొంత రాష్ట్రం) అధికారికంగా ప్రకటించింది. నిజమైన ఆటగాడు ఎప్పుడూ మైదానాన్ని వడిచి వెళ్ళడు. మైదానంలో అతని పాత్ర మాత్రమే మారుతుంది. కొత్త ప్రయాణంలో శ్రీవాస్తవకు శుభాకాంక్షలు అంటూ ఉత్తర్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తమ ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చింది.35 ఏళ్ల తన్మయ్ శ్రీవాత్సవ్ కోహ్లి కెప్టెన్సీలో అండర్-19 వరల్డ్‌కప్ (2008) గెలిచిన భారత జట్టులో కీలక సభ్యుడు. సౌతాఫ్రికాతో జరిగిన ఆ టోర్నీ ఫైనల్లో శ్రీవాత్సవ్ టాప్ రన్ స్కోరర్‌గా (ఇరు జట్ల తరఫున) నిలిచి భారత్ టైటిల్ సాధించడంలో ప్రధానపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శ్రీవాత్సవ్ 46 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో భారత 12 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి (డక్ వర్త్ లూయిస్ పద్దతిలో) ఛాంపియన్‌గా నిలిచింది. ఐదేళ్ల క్రితం ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీవత్సవ.. అప్పటి నుంచి దేశవాలీ క్రికెట్లో అంపైర్‌గా వ్యవహరిస్తున్నాడు. శ్రీవాత్సవ 2008-2012 వరకు ఐపీఎల్ ఆడాడు. ఐపీఎల్లో ఆటగాడిగా శ్రీవాత్సవ కెరీర్ అంత ఆశాజనకంగా సాగలేదు. ఐదేళ్లలో అతను 7 మ్యాచ్‌లు ఆడి కేవలం 8 పరుగులే చేశాడు. శ్రీవాత్సవ దేశవాలీ కెరీర్ మాత్రం పర్వాలేదన్నట్లుగా ఉంది. ఉత్తర్‌ప్రదేశ్ తరఫున అతను 90 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 44 లిస్ట్-ఏ, 34 టీ20 ఆడి 7000 పైచిలుకు పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 81 అర్ద సెంచరీలు ఉన్నాయి.ఆసక్తికరమైన మరో విషయం ఏంటంటే.. శ్రీవాత్సవతో పాటు 2008 అండర్-19 వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో మరో సభ్యుడు కూడా బీసీసీఐ అంపైర్‌గా ఉన్నాడు. ఆ జట్టులోని అజితేశ్ అర్గాల్ ప్రస్తుతం ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో అంపైరింగ్ చేస్తున్నాడు. ఇద్దరు సహచరులు అంపైర్లుగా మారినా కోహ్లి మాత్రం ఇంకా ఆటగాడిగానే కొనసాగుతున్నాడు. కోహ్లి కెరీర్ ప్రస్తుతం ఉన్నత దశలో ఉంది. సహచరుడు అంపైరింగ్ చేస్తుండగా కోహ్లి ఆటగాడిగా ఆడటం వింత ఆసక్తికరం.ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్.. ఆర్సీబీతో తలపడనుంది. -
‘అందుకే ఆర్సీబీ టైటిల్ గెలవలేదు.. ఈసారి ఆరెంజ్ క్యాప్ అతడికే’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆరంభ ఎడిషన్ నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు టైటిల్ కోసం పోరాడుతూనే ఉంది. కానీ పదిహేడు సీజన్లుగా ఆర్సీబీ కల మాత్రం నెరవేరడం లేదు. విరాట్ కోహ్లి (Virat Kohli) వంటి సూపర్ స్టార్ జట్టుతో ఉండటం వల్ల భారీ స్థాయిలో క్రేజ్ సంపాదించగలిగింది కానీ.. ఇప్పటి వరకు ట్రోఫీని అందుకోలేకపోయింది.ఇందుకు ప్రధాన కారణం.. బెంగళూరు ఫ్రాంఛైజీ ఆటగాళ్లందరినీ సమానంగా చూడకపోవటమే అంటున్నాడు ఆ జట్టుకు ఆడిన షాబాద్ జకాతి. గతంలో రెండుసార్లు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ భారత స్పిన్నర్.. అనంతరం ఆర్సీబీకి కూడా ఆడాడు. 2014లో బెంగళూరు తరఫున.. కోహ్లి కెప్టెన్సీలో ఒక్క మ్యాచ్ ఆడిన షాదాబ్ జకాతి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఇది జట్టుగా ఆడాల్సిన ఆట..పదిహేడేళ్లుగా ఆర్సీబీకి టైటిల్ అందని ద్రాక్షగా ఉండటానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఇది జట్టుగా ఆడాల్సిన ఆట. మనం ట్రోఫీలు గెలవాలని బలంగా కోరుకుంటే.. జట్టంతా ఐకమత్యంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది.చెన్నై జట్టు పటిష్టంగా ఉండటానికి కారణం.. టీమిండియాలోని ప్రధాన ప్లేయర్లు ఆ టీమ్‌తో కొనసాగడం. అంతేకాదు.. ఆ జట్టులోని విదేశీ క్రికెటర్లు కూడా అంకితభావంతో ఆడతారు. ఒక జట్టు విజయవంతం కావాలంటే.. కూర్పు సరిగ్గా ఉండాలి. నేను ఆర్సీబీకి ఆడుతున్నపుడు.. ఆ ఫ్రాంఛైజీ కేవలం ఇద్దరు- ముగ్గురు ఆటగాళ్లపై మాత్రమే దృష్టి సారించేది.నమ్మకం, సహోదర భావం లేదుయాజమాన్యం, డ్రెసింగ్‌రూమ్ వాతావరణానికి పొంతనే ఉండేది కాదు. నిజానికి ఆ జట్టులో మంచి మంచి ఆటగాళ్లు ఉన్నారు. కానీ.. వారి మధ్య పరస్పర నమ్మకం, సహోదర భావం లోపించినట్లు అనిపిస్తుంది. సీఎస్కేలో మాదిరి ఆర్సీబీ ఆటగాళ్లు ఒకరితో ఒకరు మమేకం కాలేదనేది నా భావన’’ అని జకాతి స్పోర్ట్స్‌కీడాతో పేర్కొన్నాడు.గెలిచేది ఆ జట్టేఇక ఈసారి ప్లే ఆఫ్స్ చేరే జట్లపై తన అంచనా తెలియజేస్తూ.. ‘‘కోల్‌కతా నైట్ రైడర్స్ ఈసారి కూడా క్వాలిఫై అవుతుంది. చెన్నై కూడా బలంగా కనిపిస్తోంది. ఈ రెండు జట్లతో పాటు గుజరాత్ కూడా టాప్-4లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.అయితే, నాలుగో జట్టుగా లక్నో ఉంటుందా? లేదా ఢిల్లీ వస్తుందా? అనేది మాత్రం స్పష్టంగా చెప్పలేను. ఈసారి ఢిల్లీ జట్టు బాగుంది. కాబట్టి ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరినా ఆశ్చర్యం లేదు.అంతేకాదు.. ఢిల్లీ ఈసారి టైటిల్ గెలుస్తుందని నాకు అనిపిస్తోంది’’ అని షాదాబ్ జకాతి వెల్లడించాడు. ఇక ఆర్సీబీ ఈసారి ప్లే ఆఫ్స్ చేరే సూచనలు కనిపించడం లేదన్న అతడు.. విరాట్ కోహ్లి కోసమైనా వారు ట్రోఫీ గెలిస్తే బాగుండని పేర్కొన్నాడు.ఆరెంజ్ క్యాప్ అతడికేఇక ఈసారి కోహ్లి లేదంటే.. రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్)అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ గెలుస్తారని జకాతి అంచనా వేశాడు.ఇక పర్పుల్ క్యాప్‌ను పేసర్ జస్ప్రీత్ బుమ్రా (ముంబై ఇండియన్స్) దక్కించుకుంటాడని జోస్యం చెప్పాడు. స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ (ఢిల్లీ క్యాపిటల్స్), యజువేంద్ర చహల్ (పంజాబ్ కింగ్స్)కు ఈ అవకాశం ఉందని పేర్కొన్నాడు.చదవండి: IPL: అప్పుడు బాల్ బాయ్.. ఇప్పుడు టైటిల్ గెలిచిన కెప్టెన్!.. హ్యాట్సాఫ్ -
IPL 2025: రజత్‌ను ఆశీర్వదించండి.. ఆర్సీబీ అభిమానులకు విరాట్ పిలుపు
యువ ఆటగాడు రజత్ పాటీదార్ సుదీర్ఘ కాలం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు కెప్టెన్‌గా కొనసాగుతాడని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. రజత్‌ను ఆశీర్వదించాలని ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్ సందర్భంగా పిలుపునిచ్చాడు. గత సీజన్లో డు ప్లెసిస్ ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించగా... ఈ సీజన్ ఆరంభానికి ముందు ఫ్రాంచైజీ సారథ్య బాధ్యతలను రజత్ పాటీదార్‌కు అందించింది. విరాట్ మాటల్లో..‘రజత్ పెద్ద బాధ్యతలు అందుకున్నాడు. సుదీర్ఘ కాలం అతడు సారథిగా కొనసాగుతాడు. జట్టును నడిపంచేందుకు అతడికి తగిన వనరులు అందుబాటులో ఉన్నాయి’ అని విరాట్ అన్నాడు. ఇక లీగ్ ఆరంభం (2008) నుంచి ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లి... ఇదంతా ఆర్సీబీ అభిమానుల ప్రేమాభిమానాల వల్లే సాధ్యమైందని అన్నాడు. ‘18 సంవత్సరాలుగా ఆర్సీబీకి ఆడుతున్నా. ఇదో అద్భుతమైన అనుభూతి. ప్రతి సీజన్‌కు ముందు అదే ఉత్సాహం నన్ను మరింత ఉత్తేజపరుస్తోంది. జట్టులో నైపుణ్యానికి కొదవలేదు. ఈ బృందంతో కలిసి ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా’ అని అన్నాడు. గతేడాది టి20 ప్రపంచకప్ గెలిచాక అంతర్జాతీయ స్థాయిలో ఈ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి ఆ తర్వాత తొలిసారి ఐపీఎల్ ఆడనున్నాడు.గౌరవం.. ఆనందం.. సక్రమంగా నిర్వర్తిస్తా: పాటీదార్బెంగళూరు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నానని రజత్ పాటీదార్ అన్నాడు. ‘విరాట్, డివిలియర్స్, క్రిస్ గేల్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించిన జట్టుకు సారథిగా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉంది. వీళ్ల ఆటను చూస్తూనే పెరిగా. చిన్నప్పటి నుంచే ఆర్సీబీ అంటే ప్రత్యేక అభిమానం. కెప్టెన్సీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తా’ అని ఆర్సీబీ జట్టు సోమవారం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పాటీదార్ వ్యాఖ్యానించాడు. -
రోహిత్, కోహ్లి, బుమ్రా లేకున్నా భారత్ గెలిచింది: టీమిండియా దిగ్గజం
పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా దూసుకుపోతోంది. తొమ్మిది నెలల వ్యవధిలో రెండు ఐసీసీ ట్రోఫీలు గెలవడమే ఇందుకు నిదర్శనం. రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీలో గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత్.. ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy)ని సొంతం చేసుకుంది.ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)జట్టుతో లేకపోయినా అద్భుత ప్రదర్శనతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. అంతకు ముందు పొట్టి వరల్డ్‌కప్ టోర్నీలో పరాజయమన్నదే లేకుండా ట్రోఫీని ముద్దాడింది. ఈ రెండు ఐసీసీ ఈవెంట్లలో వంద శాతం విజయాలతో రోహిత్ సేన తమ సత్తా చాటింది.అత్యంత పటిష్టంగాఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. భారత జట్టు ప్రస్తుతం అత్యంత పటిష్టంగా ఉందన్న సన్నీ.. బెంచ్ స్ట్రెంత్‌లోనూ మిగతా జట్లతో పోలిస్తే ముందు వరుసలో ఉందని పేర్కొన్నాడు. వ్యక్తులకు అతీతంగా జట్టుగా భారత్ ఎదిగిందని.. రోహిత్, కోహ్లి, బుమ్రా లాంటి వాళ్లు లేకపోయినా గెలవగల స్థాయికి చేరుకుందని అన్నాడు.రోహిత్, కోహ్లి లేకుండానేఈ మేరకు ‘మిడ్-డే’కు రాసిన కాలమ్‌లో.. ‘‘బుమ్రా లేకుండానే టీమిండియా చాంపియన్స్ ట్రోఫీలో అద్భుత విజయం సాధించిన తర్వాత.. వ్యక్తులను మించి టీమిండియా స్థాయి పెరిగిందని అర్థమవుతోంది. గతంలో కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లేకుండానే టీమిండియా చాలాసార్లు గెలిచింది.అయితే, వాళ్లిద్దరు ఉంటే జట్టు మరింత పటిష్టంగా మారినట్లు కనిపిస్తుంది. ఆస్ట్రేలియా పర్యటనలో జస్ప్రీత్ బుమ్రాపై టీమిండియా ఎక్కువగా ఆధారపడింది. ఇలాంటివి అరుదుగా జరుగుతూ ఉంటాయి.అయితే, అతడు లేకుండానే ఆస్ట్రేలియా వెలుపల స్వల్ప టార్గెట్లను కూడా టీమిండియా డిఫెండ్ చేసుకుంది. ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై టీ20, వన్డే సిరీస్‌లలో టీమిండియా పరిపూర్ణ విజయాలు సాధించింది. భారత క్రికెట్ జట్టుతో పాటు బెంచ్ కూడా ఎంత బలంగా ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు’’ అంటూ గావస్కర్ టీమిండియాపై ప్రశంసల జల్లు కురిపించాడు. రోహిత్, కోహ్లి లేకుండానే యువ ఆటగాళ్లు టీ20 ఫార్మాట్లో భారత్‌కు అద్భుత విజయాలు అందిస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.ఏకంగా 17 గెలిచిన సూర్య సేనకాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత రోహిత్- కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అంతకుముందు కూడా విశ్రాంతి పేరిట ఈ దిగ్గజాలు పలు మ్యాచ్‌లకు దూరమయ్యారు. ఇక రోహిత్- కోహ్లి రిటైర్మెంట్ తర్వాత టీమిండియా 20 టీ20 మ్యాచ్‌లు ఆడితే.. అందులో ఏకంగా 17 గెలవడం విశేషం. సూర్యకుమార్ సేన విజయాల శాతం 85గా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే గావస్కర్ పైవిధంగా స్పందించినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025కి పాకిస్తాన్ ఆతిథ్యమివ్వగా.. రోహిత్ సేన మాత్రం ఈ వన్డే టోర్నీలో తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే ఆడింది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను ఓడించిన భారత్.. సెమీస్‌లో ఆస్ట్రేలియా, ఫైనల్లో న్యూజిలాండ్‌లపై గెలిచి చాంపియన్‌గా నిలిచింది. ఇక సెమీస్ మ్యాచ్‌లో కోహ్లి.. ఫైనల్లో రోహిత్ శర్మ అద్భుత అర్ధ శతకాలతో జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు.చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే.. మూడు ఫార్మాట్లలోనూ బెస్ట్: కోహ్లి -
Virushka: తల్లీ, తండ్రి, తోబుట్టువు.. అందరికీ ఒకేలా కనిపించవు!
విదేశీ పర్యటనల సమయంలో కుటుంబ సభ్యుల అనుమతిని పరిమితం చేస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీసుకున్న నిర్ణయంపై స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) అసంతృప్తి వ్యక్తం చేశాడు. సన్నిహితులు వెంట ఉంటే ఆటగాళ్లు మానసికంగా మరింత బలంగా ఉంటారని అతడు అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో కోహ్లి సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ (Anushka Sharma) సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. అందరికీ ఒకేలా కనిపించవు!‘‘నువ్వెవరో తెలిసిన ప్రతి వ్యక్తి మనసులో నీ పట్ల భిన్న భావాలు ఉన్నాయి. నువ్వు ఎవరని నువ్వు అనుకుంటావో అదే నువ్వు. ఆ ‘నువ్వు’ ఎవరన్నది నీకూ పూర్తిగా తెలియదు. నిన్ను కలిసిన వ్యక్తులు, నీ బంధువులు.. లేదంటే వీధిలో వెళ్తున్నపుడు నీతో చూపులు కలిపిన వాళ్లు.. ఇలా ప్రతి ఒక్కరి మదిలో నీ గురించిన ఆలోచన వేరుగా ఉంటుంది.తల్లి, తండ్రి, తోబుట్టువులకు నువ్వు ఒకే తీరుగా కనిపించవు. సహచరులకు, ఇరుగుపొరుగు వారికి, నీ స్నేహితులకూ వారి కోణంలోనే కనిపిస్తావు. ఎదుటివారి ఆలోచనల్లో నీకు వెయ్యి రూపాలు ఉండవచ్చు. కానీ.. ప్రతి వర్షన్లోనూ నువ్వు ప్రత్యేకమే. నువ్వు నువ్వే.. వేరొకరివి అసలే కావు’’ అని అనుష్క శర్మ తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో తన భర్త.. ప్రత్యేకమైన వాడని అనుష్క చెప్పాలనుకుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పరోక్షంగా బీసీసీఐ నిబంధనను ఆమె కూడా విమర్శించిందని అభిప్రాయపడుతున్నారు.కాగా ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో టీమిండియా పరాజయం పాలవడంతో బీసీసీఐ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 45 రోజుల్లోపు విదేశీ పర్యటనలో ఆటగాళ్లు, సహాయ సిబ్బంది కుటుంబ సభ్యులను వారం రోజులు మాత్రమే అనుమతించనుంది. దానికి వెలకట్టలేంనలభై ఐదు రోజులకు మించిన విదేశీ పర్యటనల్లో రెండు వారాల పాటు సన్నిహితులకు అనుమతి ఉంటుంది. ఈ నేపథ్యంలో కోహ్లి మాట్లాడుతూ... ‘ఒక ఆటగాడి వెనక కుంటుబ సభ్యుల ప్రాతను అందరికీ వివరించడం కష్టం. కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు వారిచ్చే మద్దతును వెలకట్టలేం. దాని మీద ప్రజలకు అవగాహన లేదని అనుకోలేం.కుటుంబ సభ్యులు పక్కన ఉంటే మైదానంలో ఆవరించిన నిరాశ, నిస్పృహ నుంచి ప్లేయర్లు త్వరగా బయటపడగలరు. అంతేకానీ మ్యాచ్ ముగిసిన తర్వాత దిగాలుగా వెళ్లి గదిలో కూర్చోవడం ఎవరికీ ఇష్టం ఉండదు. నిరాశ కలిగించిందిసన్నిహితుల సమక్షంలో బాధ్యత మరింత పెరుగుతుంది. ఆట అయిపోయిన తర్వాత కుటుంబంతో గడపడంలో తప్పేముంది. నా వరకైతే కుటుంబ సభ్యులతో ఉండేందుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తా. అలాంటి అవకాశాలను వదిలిపెట్టను.మైదానంలో ఏం జరుగుతుందో తెలియని వ్యక్తులు దీనిపై నియంత్రణ తేవడం నిరాశ కలిగించింది. ఏ ఆటగాడిని అడిగినా కుటుంబ సభ్యులు వెంట ఉండటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు’ అని వివరించాడు. కాగా ఐపీఎల్‌లోనూ డ్రెసింగ్ రూమ్‌లోకి కుటుంబ సభ్యులను అనుమతించబోమని బీసీసీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే, కోహ్లి మాత్రం తాను అనుష్కతో ప్రేమలో ఉన్ననాటి నుంచి.. ఇప్పుడు తాము ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులైన తర్వాత కూడా.. భార్యను ఎల్లవేళలా తన వెంటే తీసుకువెళ్లడానికి ప్రాధాన్యం ఇస్తాడు. ఆమె ఎదురుగా ఉంటే.. తాను సానుకూల దృక్పథంతో ముందుకు సాగగలనని పలు సందర్భాల్లో కోహ్లి వెల్లడించాడు. అయితే, బీసీసీఐ తెచ్చిన కొత్త రూల్ వల్ల కోహ్లి బాగా ఇబ్బంది పడుతున్నట్లు అతడి మాటల ద్వారా వెల్లడైంది. అనుష్క శర్మ కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే.. మూడు ఫార్మాట్లలోనూ బెస్ట్: కోహ్లి -
నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే.. అన్ని ఫార్మాట్లలోనూ బెస్ట్: కోహ్లి
భారత పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)పై టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli) ప్రశంసలు కురిపించాడు. మూడు ఫార్మాట్లలోనూ ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ బౌలర్ అతడేనని కొనియాడాడు. తాను ఎదుర్కొన్న బౌలర్లలో అత్యంత కఠినమైన బౌలర్ బుమ్రానే అని కోహ్లి వెల్లడించాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో సత్తా చాటిన కోహ్లి.. ప్రస్తుతం ఐపీఎల్-2025 సన్నాహకాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) సోషల్ మీడియాతో మమేకమైన కోహ్లి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అత్యుత్తమ బౌలర్ ఇక మీ కెరీర్లో ఎదుర్కొన్న టఫెస్ట్ బౌలర్ ఎవరన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ప్రపంచంలో ప్రస్తుతం వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్లలో అత్యుత్తమ బౌలర్ ఎవరంటే.. జస్ప్రీత్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఐపీఎల్లో కొన్ని సందర్భాల్లో అతడు నన్ను అవుట్ చేశాడు. అయితే, ఎక్కువసార్లు నేనే అతడిపై పైచేయి సాధించాను. అయినా సరే.. మా ఇద్దరి మధ్య పోటీ అంటే ఎంతో ఆసక్తికరంగా, సరదాగా ఉంటుంది. ప్రతి బంతిని షాట్ బాదేందుకు నేను ప్రయత్నిస్తా.నన్ను ఆపేందుకు అతడూ ట్రై చేస్తాడు. ఇద్దరి మధ్య పోటీ తీవ్రస్థాయికి చేరుకున్న వేళ.. ఎవరూ కూడా తగ్గకుండా ముందుకు సాగితే మజాగా ఉంటుంది కదా!.. ఇక నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నపుడు నేను రెగ్యులర్‌గా బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొంటా. నాకు నచ్చిన, నేను ఆస్వాదించే మూమెంట్ అది. అంతేకాదు.. అదే కఠినమైన సవాల్ కూడా!’’ అని విరాట్ కోహ్లి చెప్పుకొచ్చాడు.కాగా క్యాష్ రిచ్ లీగ్ ఆరంభమైన నాటి(2008) నుంచి కోహ్లి ఆర్సీబీలో కొనసాగుతుండగా.. బుమ్రా తన కెరీర్ ఆరంభం నుంచి ముంబై ఇండియన్స్‌తో ప్రయాణిస్తున్నాడు. ఫోర్లు బాదిన కోహ్లి.. అవుట్ చేసిన బుమ్రాఇక 2013, ఏప్రిల్ 4న ముంబై తరఫున ఆర్సీబీతో మ్యాచ్‌తో బుమ్రా ఐపీఎల్లో అరంగ్రేటం చేసిన విషయం తెలిసిందే. నాడు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి.. 32 పరుగులు ఇచ్చిన బుమ్రా మూడు వికెట్లు తీశాడు.తన ఆరంభ ఓవర్లోనే కోహ్లి ఒకటి, రెండు, నాలుగో బంతుల్లో ఫోర్లు బాది చుక్కలు చూపించగా.. ఐదో బంతికి బుమ్రా విజయం సాధించాడు. నాడు 19 ఏళ్ల వయసులో ఉన్న బుమ్రా తన అద్భుత నైపుణ్యాలతో వికెట్ల ముందు కోహ్లిని దొరకబుచ్చుకుని.. తన తొలి వికెట్ సాధించాడు. ఇక ఇప్పటి వరకు 133 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న బుమ్రా 165 వికెట్లు తీశాడు. ముంబై జట్టు ఐదుసార్లు టైటిల్ గెలిచిన సందర్భాల్లోనూ అతడు జట్టులో భాగంగా ఉన్నాడు.మరోవైపు.. కోహ్లి జట్టు ఆర్సీబీ ఇంత వరకు ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయింది. ఇదిలా ఉంటే.. కోహ్లి- బుమ్రా టీమిండియాకు కలిసి ఆడుతున్న విషయం తెలిసిందే. కోహ్లి సారథ్యంలో బుమ్రా ఆడగా.. పలు సందర్భాల్లో బుమ్రా కెప్టెన్సీలో కోహ్లి ఆడటం విశేషం. చదవండి: అసలు అతడిని జట్టులోకి తీసుకుంది ఎవరు?: పాక్ మాజీ క్రికెటర్ ఆగ్రహం"𝙒𝙝𝙚𝙣𝙚𝙫𝙚𝙧 𝙄 𝙛𝙖𝙘𝙚 𝙝𝙞𝙢, 𝙞𝙩'𝙨 𝙡𝙞𝙠𝙚, '𝙊𝙠𝙖𝙮, 𝙞𝙩'𝙨 𝙜𝙤𝙣𝙣𝙖 𝙗𝙚 𝙛𝙪𝙣.'" 🗣Ever wondered who’s the toughest bowler Virat’s ever faced? 🤔 Catch him spill the tea, at the 𝗥𝗖𝗕 𝗜𝗻𝗻𝗼𝘃𝗮𝘁𝗶𝗼𝗻 𝗟𝗮𝗯 𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗦𝗽𝗼𝗿𝘁𝘀 𝗦𝘂𝗺𝗺𝗶𝘁… pic.twitter.com/36F8d8twN6— Royal Challengers Bengaluru (@RCBTweets) March 17, 2025 -
IPL 2025: ఓపెనర్లుగా కోహ్లి, సాల్ట్.. ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవెన్ ఇదే..?
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 18వ ఎడిషన్ మరో 5 రోజుల్లో (మార్చి 22) ప్రారంభం కానుంది. లీగ్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ సాధించని ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్ కేకేఆర్ హోం గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్‌లో జరుగనుంది.అన్ని సీజన్లకు ముందు లాగే ఈ సారి కూడా ఆర్సీబీ 'ఈ సాలా కప్ నమ్మదే' అన్న నినాదంతో బరిలోకి దిగుతుంది. 17 సీజన్లలో ఒక్క సారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీ ఈసారి ఎలాగైనా తమ కల నెరవేర్చుకోవాలని భావిస్తుంది. ఈ సారి ఓ అంశం ఆర్సీబీ టైటిల్ కలను సాకారం చేసేలా సూచిస్తుంది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి జెర్సీ నంబర్.. ఈ సారి ఐపీఎల్ ఎడిషన్ సంఖ్య మ్యాచ్ అవుతున్నాయి. విరాట్ జెర్సీ నంబర్ 18 కాగా.. ఈ యేడు ఐపీఎల్ ఎడిషన్ సంఖ్య కూడా పద్దెనిమిదే. ఇలాగైనా విరాట్ లక్కీ నంబర్ 18 ఆర్సీబీకి టైటిల్ సాధించిపెడుతుందేమో చూడాలి.ఇదిలా ఉంటే, గత సీజన్లతో పోలిస్తే ఆర్సీబీ ఈ సీజన్లో కాస్త ఫ్రెష్‌గా కనిపిస్తుంది. కొత్త కెప్టెన్ (రజత్ పాటిదార్), కొత్త ఆటగాళ్లతో బెంగళూరు ఫ్రాంచైజీ ఉరకలేస్తుంది. మెగా వేలానికి ముందు విరాట్ (21 కోట్లు), రజత్ పాటిదార్ (11 కోట్లు), యశ్ దయాల్‌ను (5 కోట్లు) మాత్రమే అట్టిపెట్టుకున్న ఆర్సీబీ.. మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్, సిరాజ్ లాంటి స్టార్లను వదిలేసింది.మెగా వేలంలో ఆర్సీబీకి 25 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉన్నా కేవలం 22 మందితోనే సరిపెట్టుకుంది. వేలంలో ఆర్సీబీ ఫిల్ సాల్ట్, జేకబ్ బేతెల్, లియామ్ లివింగ్‌స్టోన్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్ లాంటి విధ్వంసకర విదేశీ బ్యాటర్లను.. హాజిల్‌వుడ్, ఎంగిడి లాంటి స్టార్ విదేశీ పేసర్లను కొనుగోలు చేసింది. దేశీయ స్టార్లు జితేశ్ శర్మ, భువనేశ్వర్ కుమార్, దేవ్‌దత్ పడిక్కల్, కృనాల్ పాండ్యాపై కూడా ఆర్సీబీ మేనేజ్మెంట్ నమ్మకముంచింది.ఈ సీజన్ కోసం ఆర్సీబీ ఎంపిక చేసుకున్న జట్టును చూస్తే.. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆ జట్టు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ కూడా ధృవీకరించాడు. వన్‌డౌన్‌లో కెప్టెన్ రజత్ పాటిదార్.. నాలుగో స్థానంలో లివింగ్‌స్టోన్, ఐదో స్థానంలో జితేశ్ శర్మ, ఆరో ప్లేస్‌లో టిమ్ డేవిడ్, ఏడో స్థానంలో కృనాల్ పాండ్యా, బౌలర్లుగా భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, హాజిల్‌వుడ్, సుయాశ్ శర్మ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది.ఆర్సీబీ మొత్తం జట్టు: రజత్ పాటీదార్ (కెప్టెన్), కోహ్లి, సాల్ట్, జితేశ్ శర్మ, దేవదత్ పడిక్కల్, స్వస్తిక్ చికారా, లియామ్ లివింగ్‌స్టోన్, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, మనోజ్ భాండగే, జాకబ్ బెథెల్, జోష్ హాజల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, రసిక్ సలాం దార్, సుయశ్ శర్మ, నువాన్ తుషారా, లుంగి ఇన్‌గిడి, అభినందన్ సింగ్, మోహిత్ రతీ, యశ్ దయాల్. -
18వ సారైనా... బెంగళూరు రాత మారేనా!
పరుగుల వీరులు... వికెట్లు ధీరులు... మెరుపు ఫీల్డర్లు... అశేష అభిమానులు... విశేష ఆదరణ... ఇలా ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఒక్కసారి కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయింది. లీగ్ ఆరంభం (2008) నుంచి ప్రతిసారీ ‘ఈ సాలా కప్ నమ్దే’ అంటూ బరిలోకి దిగడం... రిక్తహస్తాలతో వెనుదిరగడం పరిపాటిగా మారింది. టోర్నమెంట్ ఆరంభం నుంచి ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కిన విరాట్ కోహ్లి... తన జెర్సీ నంబర్ 18వ సారైనా ట్రోఫీని అందిస్తాడా లేదో వేచి చూడాలి! – సాక్షి క్రీడావిభాగం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యధిక జనాదరణ ఉన్న జట్లలో ఒకటైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరోసారి కప్పు వేటకు సిద్ధమైంది. ఇప్పటి వరకు 17 సీజన్లు ఆడి ఒక్కసారి కూడా ట్రోఫీ నెగ్గలేకపోయిన ఆర్సీబీ ఈ సారైనా తమ కల నెరవేర్చుకోవాలని భావిస్తోంది. లీగ్ చరిత్రలో అత్యుత్తమంగా మూడుసార్లు (2009, 2011, 2016లో) రన్నరప్‌గా నిలిచిన ఆర్సీబీ... తమ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి జెర్సీ నంబర్ 18వ సీజన్లో ట్రోఫీ ఒడిసి పట్టాలని పట్టుదలతో ఉంది. అంతర్జాతీయ స్టార్లపై ఎక్కువ నమ్మకముంచే ఫ్రాంచైజీ ఈసారి దేశీ ఆటగాడు రజత్ పాటీదార్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. 2021 నుంచి ఆర్సీబీకు ప్రాతినిధ్యం వహిస్తున్న రజత్ జట్టు రాత మారుస్తాడని ఆశిస్తోంది. గతేడాది జరిగిన ఐపీఎల్ వేలంతోనే ఈసారి విభిన్నమైన ప్రణాళికతో బరిలోకి దిగనున్నట్లు ఆర్సీబీ సంకేతాలు పంపింది. వేలంలో ఒక్కో జట్టు అత్యధికంగా 25 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉన్నా... ఆర్సీబీ 22 మంది ప్లేయర్లకే పరిమితమైంది. విరాట్ కోహ్లికి రూ. 21 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకున్న ఫ్రాంచైజీ... రజత్ పాటీదార్ (రూ. 11 కోట్లు), యశ్ దయాల్ (రూ. 5 కోట్లు)ను రిటైన్ చేసుకుంది. మ్యాక్స్‌వెల్, సిరాజ్ వంటి అంతర్జాతీయ స్టార్లను వదిలేసుకున్న ఆర్సీబీ... స్వప్నిల్ సింగ్‌ను రూ. 50 లక్షలతో ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా తిరిగి తీసుకుంది. కేఎల్ రాహుల్, చహల్, రిషబ్ పంత్ వంటి వారిని వేలంలో చేజిక్కించుకునే అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. అటు అనుభవం... ఇటు యువరక్తంతో కూడిన కొత్త బృందాన్ని కొనుగోలు చేసుకుంది. గత సీజన్లో తొలి ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడింట ఓడి ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచ్‌లు నెగ్గి ప్లేఆఫ్స్‌కు చేరిన బెంగళూరు... ఎలిమినేటర్‌లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. అతడే బలం... బలహీనత ఆర్సీబీ ప్రయాణాన్ని గమనిస్తే... ఆ జట్టుకు అతిపెద్ద బలం విరాట్ కోహ్లినే. అదే సమయంలో బలహీనత కూడా అతడే. విరాట్ రాణించిన మ్యాచ్‌ల్లో అలవోకగా విజయాలు సాధించే ఆర్సీబీ... అతడు విఫలమైన సమయంలో కనీస ప్రదర్శన కూడా కనబర్చలేక వెనుకబడి పోతుంది. 17 సీజన్లుగా ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ ఐపీఎల్లో ఇప్పటి వరకు 252 మ్యాచ్‌లాడి 8004 పరుగులు చేసి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. 8 శతకాలు, 55 అర్ధశతకాలు ఇలా లెక్కకు మిక్కిలి రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలో ఐదు సీజన్లలో జట్టు తరఫున అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచిన కోహ్లి... చాంపియన్స్ ట్రోఫీ తాజా ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కొనసాగించాలని భావిస్తున్నాడు. గతేడాది కోల్‌కతా నైట్‌రైడర్స్ చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించిన ఫిల్ సాల్ట్... ఫార్మాట్‌తో సంబంధం లేకుండా రాణిస్తున్న ఇంగ్లండ్ యువ ఆల్‌రౌండర్ జాకబ్ బెథెల్... హార్డ్ హిట్టర్ లివింగ్‌స్టోన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. రూ. 11 కోట్లు పెట్టి తీసుకున్న భారత వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ, స్పిన్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాపై కూడా టీమ్ మేనేజ్మెంట్ ఆశలు పెట్టుకుంది. ఆండీ ఫ్లవర్ ఆర్సీబీ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా... దినేశ్ కార్తీక్ మెంటార్‌గా వ్యవహరించనున్నాడు.బౌలర్లపైనే భారం... బ్యాటింగ్ విషయంలో బలంగా ఉన్న బెంగళూరు... ఈసారి మెరుగైన బౌలింగ్ దళంతో బరిలోకి దిగనుంది. ఆస్థాన బౌలర్ సిరాజ్‌ను వదిలేసుకున్న ఆర్సీబీ... తిరిగి తీసుకునే అవకాశం వచ్చినా పట్టించుకోలేదు. రూ. 12.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసుకున్న ఆ్రస్టేలియా స్పీడ్‌స్టర్ జోష్ హాజల్‌వుడ్, ఐపీఎల్లో అపార అనుభవం ఉన్న భువనేశ్వర్ కుమార్, గతేడాది మెరుగైన ప్రదర్శన చేసిన యశ్ దయాల్, దక్షిణాఫ్రికా పేసర్ ఇన్‌గిడి పేస్ భారాన్ని మోయనున్నారు. స్వప్నిల్ సింగ్, జాకబ్ బెథెల్, సుయశ్ శర్మ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. అంతర్జాతీయ అనుభవం ఉన్న నాణ్యమైన స్పిన్నర్ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఐపీఎల్లో ఇతర స్టేడియాలతో పోల్చుకుంటే కాస్త చిన్నదైన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఈ బౌలింగ్ బృందం ప్రదర్శనపైనే ఆర్సీబీ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఆర్సీబీ జట్టు: రజత్ పాటీదార్ (కెప్టెన్ ), కోహ్లి, సాల్ట్, జితేశ్ శర్మ, దేవదత్ పడిక్కల్, స్వస్తిక్, లివింగ్‌స్టోన్, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, మనోజ్, జాకబ్ బెథెల్, హాజల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, రసిక్, సుయశ్ శర్మ, నువాన్ తుషారా, ఇన్‌గిడి, అభినందన్ సింగ్, మోహిత్ రాఠి, యశ్ దయాల్. అంచనా ఇప్పటి వరకు ఐపీఎల్లో 9 సార్లు ప్లేఆఫ్స్‌కు చేరిన చరిత్ర ఉన్న ఆర్సీబీ... స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే ఈసారి కూడా ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశం ఉంది. -
బీసీసీఐ నిర్ణయంపై కోహ్లి అసంతృప్తి
బీసీసీఐ కొత్తగా ప్రవేశపెట్టిన కుటుంబ నియంత్రణ నిర్ణయంపై (విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబాలపై అంక్షలు) టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అసంతృప్తి వ్యక్తం చేశాడు. విదేశీ పర్యటనల్లో కుటుంబాలు దగ్గరగా లేకపోతే ఆటగాళ్లు మానసిక సమస్యలు ఎదుర్కొంటారని అన్నాడు. దీని ప్రభావం జట్టు జయాపజయాలపై పడుతుందని తెలిపాడు. కఠిన సమయాల్లో కుటుంబాలు వెంట ఉంటే ఆటగాళ్లకు ఊరట కలుగుతుందని పేర్కొన్నాడు. పర్యటనల్లో ఆటగాళ్లకు కుటంబాలు తోడుండటం ఎంతో ముఖ్యమో కొంతమందికి తెలియట్లేదని బీసీసీఐపై పరోక్షంగా తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. మ్యాచ్‌లు ముగిశాక ఆటగాళ్లు ఒంటరిగా కూర్చొని బాధపడాలా అని ప్రశ్నించాడు. కుటుంబాలు దగ్గరగా ఉంటే ఆటగాళ్ల ప్రదర్శన మరింత మెరుగుపడుతుందని తెలిపాడు. ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియన్ స్పోర్ట్స్ సమ్మిట్‌లో కోహ్లి ఈ విషయాలను పంచుకున్నాడు.కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 పరాజయం తర్వాత బీసీసీఐ విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబాలపై నియంత్రణ విధించింది. ఈ మేరకు ఓ రూల్‌ను జారీ చేసింది. కుటుంబ నియంత్రణ రూల్ ప్రకారం.. 45 రోజుల కంటే తక్కువ వ్యవధి ఉండే విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబాలకు అనుమతి లేదు. 45 రోజుల కంటే ఎక్కువ నిడివితో సాగే విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబాలను రెండు వారాల తర్వాత అనుమతిస్తారు. మొత్తంగా కుటుంబాలు ఆటగాళ్లతో కేవలం 14 రోజులు మాత్రమే గడిపే అవకాశం ఉంటుంది.ఇదిలా ఉంటే, తాజాగా ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో విరాట్ అద్భుతంగా ఆడి భారత్ మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం కొద్ది రోజులు దుబాయ్‌లోనే సేద తీరిన విరాట్.. తాజాగా ఐపీఎల్ 2025 సీజన్ కోసం తన జట్టుతో చేరాడు. ఐపీఎల్లో విరాట్ ప్రాతినిథ్యం వహించే ఆర్సీబీ.. మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌తో తమ జర్నీ ప్రారంభిస్తుంది. ఐపీఎల్లో ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని ఆర్సీబీ.. ఈ సాలా కప్ నమ్మదే అంటూ మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.ఆర్సీబీ ఈ ఏడాది జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేసింది. గత రెండు సీజన్లు కెప్టెన్‌గా వ్యవహరించిన డుప్లెసిస్‌ను తప్పించి కొత్త కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌ను నియమించుకుంది. ఈ ఏడాది ఆర్సీబీలోకి టిమ్ డేవిడ్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, ఫిల్ సాల్ట్, రొమారియో షెపర్డ్, జోష్ హాజిల్‌వుడ్ లాంటి విదేశీ స్టార్లు వచ్చారు. చాలాకాలం పాటు తమకు సేవలందించిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను ఆర్సీబీ ఈ ఏడాది వదులుకుంది. ఈ ఏడాది ఆర్సీబీలోకి కృనాల్ పాండ్యా, దేవ్‌దత్ పడిక్కల్, భువనేశ్వర్ కుమార్ లాంటి దేశీయ స్టార్లు కూడా వచ్చారు. జట్టు మొత్తం మారడంతో తమ ఫేట్ కూడా మారుతుందని ఆర్సీబీ అభిమానులు ఆశిస్తున్నారు.ఐపీఎల్-2025లో ఆర్సీబీ జట్టు..రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవ్‌దత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, స్వస్థిక్ చికారా, కృనాల్ పాండ్యా, మనోజ్ భండగే, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, జేకబ్ బేతెల్, లియామ్ లివింగ్‌స్టోన్, మోహిత్ రతీ, ఫిలిప్ సాల్ట్, జితేశ్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, రసిక్ సలాం దార్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్, నువాన్ తుషార, అభినందన్ సింగ్ -
ఒలింపిక్ చాంపియన్‌గా నిలిస్తే బాగుంటుంది!
బెంగళూరు: ఒక క్రికెటర్‌గా ఒలింపిక్ పతకాన్ని గెలుచుకోగలిగితే అది ఎంతో ప్రత్యేకం అవుతుందని, దానికి మరేదీ సాటి రాదని భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అన్నాడు. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలు జరగనున్న నేపథ్యంలో కోహ్లి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 1900 తర్వాత తొలిసారి విశ్వక్రీడల్లో క్రికెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కడంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కూడా కీలక పాత్ర పోషించిందని కోహ్లి అభిప్రాయపడ్డాడు. ‘ఒలింపిక్ చాంపియన్‌గా నిలిస్తే ఎంతో బాగుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఐపీఎల్ ఇందులో ప్రముఖ పాత్ర పోషించింది. క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో భాగమయ్యే స్థాయికి తెచి్చంది. ఇది యువ ఆటగాళ్లకు గొప్ప అవకాశం. ప్రతి అథ్లెట్ దాని కోసమే కష్టపడతాడు. పురుషుల, మహిళల విభాగాల్లో మన జట్టు పతకానికి చేరువవుతుందని అనుకుంటున్నా’ అని విరాట్ అన్నాడు. ఇటీవల చాంపియన్స్ ట్రోఫీలో చక్కటి ప్రదర్శన కనబర్చిన కోహ్లి... లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ వరకు కెరీర్ కొనసాగిస్తాడా అనేది చూడాలి. 2028కి విరాట్ 40వ పడిలోకి అడుగుపెట్టనున్నాడు. ‘ఇప్పుడే దాని గురించి మాట్లాడటం తొందరపాటు అవుతుంది. ఒకవేళ ఒలింపిక్ పసిడి పతకం కోసం మ్యాచ్ ఆడుతుంటే... నేను గుట్టు చప్పుడు కాకుండా జట్టులో చేరి పతకం సాధించి ఇంటికి వస్తా’ అని విరాట్ చమత్కరించాడు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు వివిధ అంశాలపై విరాట్ పంచుకున్న విశేషాలు అతడి మాటల్లోనే... » మహిళల ప్రీమియర్ లీగ్ వల్ల దేశంలో మహిళల క్రికెట్ ప్రాధాన్యత మరింత పెరిగింది. భారత మహిళల క్రికెట్ జట్టు గత కొంతకాలంగా నిలకడైన ప్రదర్శన చేస్తూ అభిమానుల మనసులు గెలుచుకుంటోంది. » ఆరేడేళ్ల క్రితం మహిళల ఆటకు ఇంత ప్రాధాన్యత దక్కలేదు. డబ్ల్యూపీఎల్‌కు వస్తున్న ఆదరణ చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా వారి గురించి చర్చ జరుగుతోంది. రోజు రోజుకు ఆటలో ప్రమాణాలు పెరుగుతున్నాయి. » వేరే రంగాల్లో విజయం సాధించినప్పుడు రాని పేరు, ప్రఖ్యాతలు క్రీడల్లో సులువుగా వస్తాయి. ఎందుకంటే మైదానంలో ఆడేది తామే అని ప్రతి ఒక్క అభిమాని ఊహించుకుంటాడు కాబట్టే ఇది సాధ్యం. అందుకే క్రీడాకారులు విజయాలు సాధించినప్పుడు యావత్ భారత్ సంబరాలు చేసుకుంటుంది. » ఆటను ఆస్వాదించడం నాకు ఇష్టం... అదే చేస్తున్నా. ఎలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవాలని అనుకోవడం లేదు. మైదానంలో వంద శాతం కష్టపడటం అలవాటు. దాన్ని ఇక మీద కూడా కొనసాగిస్తా. భావోద్వేగాలు ఆటలో భాగం. వాటిని దాచుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించను. » ఆటలో పోటీ సహజం. అప్పుడే మన సహజ నైపుణ్యం బయటకు వస్తుంది. ఈ స్థాయికి చేరుకున్నాక కూడా ఇంకేదో గుర్తింపు పొందాలనుకోవడం లేదు. ఆటపై ప్రేమ ఉన్నంతకాలం మైదానంలో కొనసాగుతా. ఈ అంశంలో రాహుల్ ద్రవిడ్ విలువైన సూచనలిచ్చారు. ‘‘నీతో నువ్వు తరచూ మాట్లాడుతూ ఉండు ఎప్పుడు ఆపేయాలో నీకే తెలుస్తుంది’’ అన్నారు. దాన్నే పాటిస్తున్నా. » జీవితంలో సాధించిన దాంతో సంతృప్తిగా ఉన్నా. కెరీర్ ఆరంభంతో పోల్చుకుంటే సుదీర్ఘ అనుభవం సాధించిన తర్వాత అన్నీ విషయాలను అనుకున్న విధంగా పూర్తి చేయడం కష్టం. వయసు పెరుగుతున్న భావన కలగడం సహజం. ఫిట్‌గా ఉండేందుకు మరింత కష్టపడాల్సి వస్తుంది. » అప్పుడప్పుడు అసంతృప్తి ఆవరిస్తుంది. నా వరకు ఈ ఏడాది ఆరంభంలో ఆ్రస్టేలియా పర్యటనలో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయా. దీంతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నా.. అయితే దాన్ని ఒత్తిడిగా భావించలేదు. అందులో నుంచి బయటపడేందుకు మార్గాలు అన్వేషించి వాటిపై కసరత్తు చేసి ఫలితాలు సాధించా. 2014లో ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే అన్నింటిని అధిగమించాల్సిందే. మరో అవకాశం వచ్చినప్పుడు దాన్ని మరింపిచే ప్రదర్శన చేయాలి. 2018లో నేను అదే చేశా. » క్రికెటేతర విషయాల గురించి ఆలోచించి ఒత్తిడి పెంచుకోను. డ్రెస్సింగ్ రూమ్ బయటి వ్యాఖ్యలకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వను. ఒక్కసారి వాటిని పట్టించుకోవడం ప్రారంభిస్తే ఇక ఒత్తిడి కొండలా పెరుగుతుంది. -
IPL 2025: కోహ్లీ ఈసారైనా టైటిల్ సాధించేనా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. అయితే ఈ జట్టు ఇంతవరకూ ఒక్కసారి కూడా ట్రోఫీని సాధించలేకపోవడం ఒకింత ఆశ్చర్యకరం. ఎప్పుడూ ఉత్సాహంతో ఉరకలేసే స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మస్కట్ గా ఉన్న ఈ జట్టుకి ఎందుకో ఇంతవరకు ఐపీఎల్ టైటిల్ అందించలేకపోయాడు.ఐపీఎల్ 2025 ప్రారంభం రోజున (మార్చి 22) కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో గతేడాది టైటిల్ విజేత కోల్‌కతా నైట్ రైడర్స్ జరిగే మ్యాచ్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తన టైటిల్ వేటను ప్రారంభిస్తుంది. ఒకవేళ అదృష్టం కలిసి రానందువల్ల ఆర్సీబీ ఇంతవరకు టైటిల్ సాధించలేకపోయిందని భావించినట్టయితే, ఈ సీజన్ అందుకు చాల అనుకూలమైనది గా భావించాలి. ఎందుకంటే ఐపిఎల్ సీజన్ 18 స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఐకానిక్ జెర్సీ నంబర్ 18 తో సరిగ్గా సరిపోతుంది. చాలా కాలంగా జెర్సీ నంబర్ 18 కి పర్యాయపదంగా ఉన్న విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కి ఈ సారైనా టైటిల్ సాధించి పెడతాడని అతని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రజత్ పాటిదార్ కి కెప్టెన్సీ బాధ్యతలుఇక జట్టు కూర్పును చూస్తే, దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్న 31 ఏళ్ల రజత్ పాటిదార్ కి ఆర్సీబీ ఈసారి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పింది. ఐపీఎల్లో తొలిసారి కెప్టెన్సీ చేపట్టనున్నప్పటికీ, పాటిదార్ 2024-25 సయ్యద్ ముష్తాక్ అలీ టోర్నమెంట్ లో మధ్యప్రదేశ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో మధ్యప్రదేశ్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. మెగా వేలం ద్వారా గణనీయమైన మార్పులు చేసిన తర్వాత ఆర్సీబీ కొత్త దృక్పథంతో, కొత్త ఉత్సాహంతో ఐపీఎల్-2025లోకి అడుగుపెడుతుంది. గత సీజన్లో ఆర్సీబీ వరుసగా ఆరు మ్యాచ్‌లను గెలిచి టాప్ నాలుగు స్థానాల్లో నిలిచి ప్లేఆఫ్‌లకు అర్హత సాధించింది. చివరికి రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఎలిమినేటర్‌లో పరాజయం చవిచూసింది. ఆర్సీబీ మరోసారి సామర్థ్యంతో నిండిన జట్టును నిర్మించింది. శక్తివంతమైన బ్యాటింగ్ లైనప్, బలీయమైన బౌలింగ్, నాయకత్వ అనుభవం, కలగలిసి ఈ సీజన్ లోనైనా తొలి టైటిల్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఫిల్ సాల్ట్ తో కోహ్లీ ఓపెనింగ్ఐసీసీ టి20 ర్యాంకింగ్స్ లో మూడో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ ను ఆర్సీబీ రూ. 11.50 కోట్లకు తీసుకుంది. గత సీజన్లో కేకేఆర్ టైటిల్ గెలుచుకోవడంలో సాల్ట్ కీలక పాత్ర పోషించాడు. 12 మ్యాచ్‌ల్లో 182.01 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో 435 పరుగులు సాధించాడు. గత సీజన్లో ఓపెనర్‌గా అతను సాధించిన విజయాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఆర్సీబీలో సాల్ట్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఫిల్ సాల్ట్ మరియు విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉన్నందున, జట్టు అసాధారణమైన టాప్ ఆర్డర్‌ను సమకూర్చుకుంది. మిడిల్ ఆర్డర్లో రజత్ పాటిదార్, లియామ్ లివింగ్‌స్టోన్ మరియు టిమ్ డేవిడ్ ఉండటం జట్టు లైనప్‌ను మరింత బలోపేతం అవుతుంది. యావ బ్యాట్స్‌మన్ జితేష్ శర్మ కీపింగ్ విధులను కూడా నిర్వహిస్తాడు.సీనియర్ పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీ రావడంతో వారి బౌలింగ్ లైనప్‌కు గణనీయమైన బలాన్నిచ్చింది. ముంబై ఇండియన్స్‌తో బిడ్డింగ్ యుద్ధం తర్వాత ఆస్ట్రేలియన్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ సేవలను పొందేందుకు ఆర్సీబీ రూ. 12.50 కోట్లు ఖర్చు చేసింది. ఇంకా లుంగి ఎంగిడి, నువాన్ తుషార వంటి ఫాస్ట్ బౌలర్లను చేర్చుకోవడం వలన ఆర్సీబీ బౌలింగ్ బలీయంగా ఉంది.ఫీల్ సాల్ట్: గత సంవత్సరం కోల్‌కతా నైట్ రైడర్స్ టైటిల్ సాధించడం లో కీలక పాత్ర పోషించిన సాల్ట్ ఈసారి జట్టులో చేరడంతో ఆర్సీబీ బ్యాటింగ్ మరింత బలోపేతంగా తయారైంది. గత సీజన్లో ఓపెనర్‌గా అద్భుతంగా రాణించిన సాల్ట్ మళ్ళీ అదే రీతిలో విజృభించి ఆడతాడని ఆర్సీబీ అభిమానులు ఆశిస్తున్నారు. భువనేశ్వర్ కుమార్: ఎంతో అనుభవ్గుణుడైన సీనియర్ బౌలర్ భువనేశ్వర్ జట్టులో చేరడంతో ఆర్సీబీ బౌలింగ్ లైనప్‌కు గణనీయమైన పదును లభించింది. కొత్త బంతిని స్వింగ్ మరియు డెత్ ఓవర్లలో యార్కర్లను వేసే సామర్థ్యం ఉన్న భువనేశ్వర్ జట్టు బౌలింగ్ కి కీలకం అనడంలో సందేహం లేదు. రజత్ పాటిదార్: ఆర్సీబీ తొలి సారి ఐపీఎల్ టైటిల్ సాధించాల్సిన బృహత్తర బాధ్యత రజత్ పాటిదార్ పై ఉంది. మంచి ఫామ్ తో నిలకడగా బ్యాటింగ్ చేస్తున్న రజత్ పాటిదార్ జట్టును ముందుండి నడిపించడం ఆర్సీబీకి చాల ముఖ్యం.విరాట్ కోహ్లీ: ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించి మంచి ఫామ్ లో ఉన్న కోహ్లీ కి ఐపీల్ సీజన్ 18 చాల కీలకం. చాలా సంవత్సరాలుగా ఐపీఎల్ ట్రోఫీని గెలవాలనే కోహ్లీ ఆకాంక్ష ఈ సారైనా నెరవేరుతుందేమో చూడాలి.ఆర్సీబీ జట్టు: రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, యష్ దయాల్, జోష్ హాజిల్‌వుడ్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, లియామ్ లివింగ్‌స్టోన్, రసిక్ దార్, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, నువాన్ తుషార, మనోజ్ భండగే, జాకబ్ బెథెల్, దేవదత్ పడిక్కల్, స్వస్తిక్ చికర, లుంగి ఎంగిడి, అభినందన్ సింగ్, మోహిత్ రథీ. -
న్యూ లుక్‌లో విరాట్.. సోషల్‌మీడియాను షేక్ చేస్తున్న ఫోటోలు
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సరికొత్త లుక్‌లో కనిపించాడు. కోహ్లి న్యూ లుక్కు సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ఫోటోలను విరాట్ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ ఖాన్ ఇన్‌స్టాలో షేర్ చేయగా.. అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. ఈ ఫొటోలకు అలీమ్ ఖాన్ 'ది గోట్ ఎనర్జీ' అని క్యాప్షన్ ఇచ్చారు. "వన్ అండ్ ఓన్లీ విరాట్ కోహ్లీ కోసం కొత్త స్నిప్. రేజర్ షార్ప్ గా కనిపిస్తున్నాడు" అని ఆలీమ్ ఖాన్ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. నయా లుక్‌లో ఫోటోలను చూసి తమదైనశైలిలో స్పందిస్తున్నారు. కొత్త లుక్‌లో కింగ్ అదుర్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Aalim Hakim (@aalimhakim)ఇదిలా ఉంటే మరో 8 రోజుల్లో (మార్చి 22) ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లోనే విరాట్ జట్టు ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ కోల్‌కతా వేదికగా జరుగనుంది. అన్నీ ఫ్రాంచైజీలు ఐపీఎల్ కోసం సన్నాహకాలు మొదలుపెట్టాయి. ఆటగాళ్లు ఒక్కొక్కరుగా తమతమ జట్లలో చేరుతున్నారు. విరాట్ మరి కొద్ది రోజుల్లో ఆర్సీబీ క్యాంప్‌లో చేరే అవకాశం ఉంది. ఆర్సీబీ తమ ప్రాక్టీస్‌ను ఇదివరకే షురూ చేసింది. విరాట్ కొన్ని యాడ్ షూట్స్ కారణంగా జట్టుతో కలవడం ఆలస్యమైంది.విరాట్‌తో కూడిన టీమిండియా కొద్ది రోజుల కిందట ఛాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచిన విషయం తెలిసిందే. దుబాయ్ వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌ను ఓడించి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో విరాట్ భారత విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ టోర్నీలో అతను 5 మ్యాచ్‌ల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 218 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో విరాట్ ఐదో లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.ఈ టోర్నీలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ సెంచరీ చేసిన విరాట్.. కీలకమైన సెమీఫైనల్లో ఆసీస్‌పై మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీ సాధించాడు. గత కొంతకాలంగా ఫామ్ లేమి వల్ల అపవాదులు ఎదుర్కొన్న విరాట్.. ఈ టోర్నీతో తిరిగి పూర్వ వైభవం సాధించాడు. విరాట్ ఇదే ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కొనసాగించాలని ఆర్సీబీ అభిమానులు కోరుకుంటున్నారు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ఆర్సీబీ అభిమానులు ఈ సాలా కప్ నమ్మదే అంటూ డప్పు కొట్టుకుంటున్నారు.ఆర్సీబీ ఈ ఏడాది జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేసింది. గత రెండు సీజన్లు కెప్టెన్‌గా వ్యవహరించిన డుప్లెసిస్‌ను సైతం తప్పించి కొత్త కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌ను నియమించుకుంది. ఈ ఏడాది ఆర్సీబీలోకి టిమ్ డేవిడ్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, ఫిల్ సాల్ట్, రొమారియో షెపర్డ్, జోష్ హాజిల్‌వుడ్ లాంటి విదేశీ స్టార్లు వచ్చారు. చాలాకాలం పాటు తమకు సేవలందించిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను ఆర్సీబీ ఈ ఏడాది వదులుకుంది. ఈ ఏడాది ఆర్సీబీలోకి కృనాల్ పాండ్యా, దేవ్‌దత్ పడిక్కల్, భువనేశ్వర్ కుమార్ లాంటి దేశీయ స్టార్లు కూడా వచ్చారు. జట్టు మొత్తం మారడంతో తమ ఫేట్ కూడా మారుతుందని ఆర్సీబీ అభిమానులు ఆశిస్తున్నారు.ఐపీఎల్-2025లో ఆర్సీబీ జట్టు..రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవ్‌దత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, స్వస్థిక్ చికారా, కృనాల్ పాండ్యా, మనోజ్ భండగే, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, జేకబ్ బేతెల్, లియామ్ లివింగ్‌స్టోన్, మోహిత్ రతీ, ఫిలిప్ సాల్ట్, జితేశ్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, రసిక్ సలాం దార్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్, నువాన్ తుషార, అభినందన్ సింగ్ -
ఉన్నదే ఒక్కడు.. మీరు కాస్త నోళ్లు మూయండి: పాక్ మాజీ స్పిన్నర్ ఫైర్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీరుపై ఆ జట్టు మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ (Saeed Ajmal) ఆగ్రహం వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్‌తో సిరీస్ నేపథ్యంలో బాబర్ ఆజంపై వేటు వేయడాన్ని తప్పుబట్టాడు. అదే విధంగా.. బాబర్‌ను విమర్శిస్తున్న మాజీ క్రికెటర్లపై కూడా అజ్మల్ ఈ సందర్భంగా మండిపడ్డాడు.అంతటి సచిన్‌కే తప్పలేదుఅంతటి సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar)కు అయినా ప్రతి మ్యాచ్‌లో సెంచరీ చేయడం సాధ్యం కాదని.. అలాంటపుడు బాబర్‌ను పదే పదే ఎందుకు విమిర్శిస్తారని అసహనం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన బాబర్ ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా వ్యవహరించడం మానుకోవాలని అజ్మల్ హితవు పలికాడు.కాగా వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ లీగ్ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. అంతేకాదు చరిత్రలో లేని విధంగా తొలిసారి అఫ్గనిస్తాన్ చేతిలో వన్డే పరాజయం చవిచూసింది. దీంతో బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి వైదొలగగా.. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభానికి ముందు పీసీబీ మరోసారి అతడికి పగ్గాలు అప్పగించింది.ఇక ఈ ఐసీసీ టోర్నమెంట్లోనూ పాకిస్తాన్‌కు పరాభవమే ఎదురైంది. పసికూన అమెరికా చేతిలో ఓడి లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. ఈ క్రమంలో బాబర్‌పై వేటు వేసిన పీసీబీ.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అతడి కెప్టెన్సీలో వన్డేల్లో పాక్ చిరస్మరణీయ విజయాలు సాధించింది.ఆ ఇద్దరిపై వేటుఆస్ట్రేలియా పర్యటనలో కంగారూలను ఓడించడంతో పాటు.. సౌతాఫ్రికా గడ్డపై ఇంత వరకు ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో ప్రొటిస్ జట్టును 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇదే జోరులో సొంతగడ్డపై ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరింది. అయితే, అంతకంటే ముందు సౌతాఫ్రికా- న్యూజిలాండ్‌లతో త్రైపాక్షక వన్డే సిరీస్‌లో ఓటమిపాలైన రిజ్వాన్ బృందం.. ఐసీసీ టోర్నీలోనూ చేదు అనుభవం చవిచూసింది.డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి ఒక్క విజయం లేకుండానే ఈ వన్డే ఈవెంట్ నుంచి నిష్క్రమించింది. తొలుత న్యూజిలాండ్ చేతిలో.. అనంతరం టీమిండియా చేతిలో పరాజయం పాలైన పాక్.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో నిరాశగా వెనుదిరిగింది. ఇక ఈ టోర్నీలో బాబర్‌తో పాటు.. రిజ్వాన్ కూడా తేలిపోయాడు.ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌కు ప్రకటించిన జట్టులో పీసీబీ ఈ ఇద్దరికి చోటు ఇవ్వలేదు. కెప్టెన్‌గా రిజ్వాన్‌ను తప్పించడంతో పాటు బాబర్‌పై కూడా వేటు వేసింది. ఈ విషయంపై సయీద్ అజ్మల్ స్పందిస్తూ పీసీబీ తీరును ఎండగట్టాడు. విరాట్ లాంటి దిగ్గజాలు కూడా అంతే‘‘బాబర్, రిజ్వాన్ గొప్ప ఆటగాళ్లు. అయితే, మిగతా వాళ్లలా వాళ్లు దూకుడుగా బ్యాటింగ్ చేయలేరు. అయినా సరే జట్టుకు అవసరమైనప్పుడు కచ్చితంగా రాణిస్తారు. కానీ మా వాళ్ల(మాజీ క్రికెటర్లను ఉద్దేశించి) ఆలోచనా విధానం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.అంతర్జాతీయ క్రికెట్ అంటే దూకుడుగా ఆడాలనే ఫిక్సైపోయినట్టున్నారు. మ్యాచ్ విన్నర్లకు దూకుడుతో పని ఏముంది? అటాకింగ్ చేసే కంటే ముందు విరాట్ లాంటి దిగ్గజాలు కూడా తమ ఇన్నింగ్స్‌ను నెమ్మదిగానే ఆరంభిస్తారు. అది వాళ్ల శైలి. కానీ బాబర్- రిజ్వాన్‌లను మీరెందుకు తప్పుబడుతున్నారు?వాళ్లను టీ20 జట్టు నుంచి తొలగించడం ముమ్మాటికీ తప్పే. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే.. బాబర్‌పై వేటు వేయకుండా.. అతడితో చర్చించి ఆటను మార్చుకునే విధంగా.. తిరిగి పుంజుకునేలా స్ఫూర్తి నింపి ఉండాల్సింది.మీరు కాస్త నోళ్లు మూయండిప్రతి ఒక్క క్రికెటర్ జీవితంలో ఒకానొక సమయంలో గడ్డు దశ ఎదుర్కోక తప్పదు. కెరీర్ మొత్తం ఏ ఆటగాడూ అద్భుతంగా ఆడలేడు. అంతెందుకు.. సచిన్ టెండుల్కర్ కూడా ప్రతి మ్యాచ్‌లో శతకం బాదలేడు కదా!పాకిస్తాన్ క్రికెట్‌కు ఉన్న ఏకైక స్టార్ బాబర్. మీరు గనుక అతడిని కూడా డీగ్రేడ్ చేస్తే.. ఎవరి పేరు మీద పాక్ క్రికెట్‌ను నడుపుతారు? కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి. మన మాజీ క్రికెటర్లు కాస్త నోళ్లు మూసుకుని ఉంటే బాగుంటుంది’’ అని సయీద్ అజ్మల్ ఘాటు విమర్శలు చేశాడు.చదవండి: ఎవరూ ఊహించని నిర్ణయం.. అతడి రాకతో కివీస్ కుదేలు: పాక్ దిగ్గజం -
రిషబ్ పంత్ ఇంట్లో పెళ్లి భజాలు.. సందడి చేయనున్న భారత క్రికెటర్లు
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇంట్లో పెళ్లి భజాలు మోగనున్నాయి. అతడి సోదరి సాక్షి పంత్ పెళ్లి పీటలు ఎక్కనుంది. సాక్షి పంత్.. వ్యాపారవేత్త అంకిత్ చౌదరిని వివాహం చేసుకోబోతోంది. ఈ వివాహ వేడుకలు మంగళవారం, బుధవారం ముస్సోరీలో జరగనున్నట్లు తెలిసింది.ఈ వివాహానికి భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని హాజరు కానున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా 9 ఏళ్లపాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట.. గతేడాది నిశ్చితార్థం చేసుకున్నారు. లండన్‌లో జరిగిన వారి నిశ్చితార్థానికి ఎంఎస్ ధోని హాజరయ్యాడు.లక్నో కెప్టెన్‌గా..ఇక ఛాంపియన్స్ ట్రోఫీ-2025 గెలుచుకున్న భారత జట్టులో పంత్ సభ్యునిగా ఉన్నాడు. కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం పంత్‌కు రాలేదు. కేఎల్ రాహుల్ ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా ఉండడంతో పంత్‌కు తుది జట్టులో చోటుదక్కలేదు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఐపీఎల్‌పైనే పడింది. ఐపీఎల్-2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది.ఒకట్రెండు రోజులు విశ్రాంతి తీసుకుని ఆటగాళ్లంతా తమ తమ జట్లలో చేరనున్నారు. ఇప్పటికే రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా వంటి స్టార్ ప్లేయర్లు తమ ప్రాతినిథ్యం వహిస్తున్న ఫ్రాంచైజీలతో కలిశారు. ఈ ఏడాది సీజన్ ఐపీఎల్లో రిషబ్ పంత్ లక్నో సూపర్‌జెయింట్స్ తరపున ఆడనున్నాడు. గత డిసెంబర్లో జరిగిన మెగా వేలంలో పంత్‌ను రూ.27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా పంత్ రికార్డులెక్కాడు. ఈ సీజన్లో లక్నో కెప్టెన్‌గా పంత్ వ్యవహరించనున్నాడు.చదవండి: అక్షర్, రాహుల్ కాదు..? ఢిల్లీ కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్!? -
All Time India ODI XI: రోహిత్, కోహ్లిలకు చోటు.. కెప్టెన్‌గా ఎవరంటే?
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) విజేతగా నిలవడంతో టీమిండియా ఐసీసీ టైటిళ్ల సంఖ్య ఏడుకు చేరింది. భారత్ తొలిసారి 1983లో ప్రపంచకప్‌ను ముద్దాడింది. నాటి వన్డే వరల్డ్‌కప్ టోర్నమెంట్లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన కపిల్ సేన ఏకంగా చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. పటిష్ట వెస్టిండీస్ జట్టును ఓడించి వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది.ఫలితంగా టీమిండియాకు మొట్టమొదటి ఐసీసీ ట్రోఫీ అందించిన సారథిగా కపిల్ దేవ్(Kapil Dev).. భారత క్రికెట్ చరిత్రలో తన పేరును అజరామరం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత దాదాపు రెండు దశాబ్దాలకు పైగా భారత జట్టుకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా దక్కలేదు. అయితే, మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) ఆ లోటును తీర్చేశాడు.ధోని ఖాతాలో ముచ్చటగా మూడుఅంతర్జాతీయ క్రికెట్ మండలి 2007లో తొలిసారిగా ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్‌ను టీమిండియాకు అందించాడు. అనంతరం 2011లో వన్డే వరల్డ్‌కప్ గెలిచిన కెప్టెన్‌గానూ ధోని నిలిచాడు. అంతేనా.. 2013లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను విజేతగా నిలిపి.. అత్యధిక ఐసీసీ టైటిళ్లు గెలిచిన భారత కెప్టెన్‌గా ఇప్పటికీ కొనసాగుతున్నాడు.రోహిత్ ‘డబుల్’ హ్యాపీఇక తాజాగా రోహిత్ శర్మ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచి రెండో ఐసీసీ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన హిట్‌మ్యాన్.. తాజా ఈ వన్డే టోర్నమెంట్లోనూ జట్టును అజేయంగా ముందుకు నడిపి ట్రోఫీని ముద్దాడాడు. తద్వారా ధోని తర్వాత అత్యధిక సార్లు టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన కెప్టెన్‌గా నిలిచాడు ఈ వన్డే ‘ట్రిపుల్’ డబుల్ సెంచరీల వీరుడు.మరి కపిల్ దేవ్, ధోని, రోహిత్ శర్మ.. కెప్టెన్లుగా ఈ ఘనతలు సాధించారంటే అందుకు అప్పటి జట్లలో ఉన్న ఆటగాళ్లది కూడా కీలక పాత్ర. 1983లో ఆల్‌రౌండర్ మొహిందర్ అమర్నాథ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి జట్టును ఫైనల్‌కు చేర్చాడు.ఇక 2011 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లిలు కూడా అద్భుతంగా ఆడారు. హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ తమ వంతు పాత్ర పోషించగా.. తాజా చాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్ రోహిత్, కోహ్లిలతో పాటు రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ కూడా రాణించారు.బుమ్రాకు దక్కని చోటుఈ నేపథ్యంలో తన ఆల్‌టైమ్ వన్డే తుదిజట్లులో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ వీరందరికి చోటివ్వడం గమనార్హం. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత చిన్నపిల్లాడిలా గంతులేసిన ఈ మాజీ సారథి... తాజాగా తన వన్డే బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను పంచుకున్నాడు. ఈ జట్టులో క్రికెట్ దేవుడ్, వంద శతకాల వీరుడు సచిన్ టెండుల్కర్‌కు ఓపెనర్‌గా గావస్కర్ చోటిచ్చాడు. అయితే, ఈ జట్టుకు టీమిండియా ప్రధాన పేసర్, ప్రపంచస్థాయి ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను మాత్రం గావ స్కర్ ఎంపిక చేయలేదు.సునిల్ గావస్కర్ ఆల్‌టైమ్ వన్డే ఎలెవన్:సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, మొహిందర్ అమర్నాథ్, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), కపిల్ దేవ్, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, మహ్మద్ షమీ, జహీర్ ఖాన్. భారత్ గెలిచిన ఐసీసీ టైటిళ్లు ఇవే1983- వన్డే వరల్డ్‌కప్2002- చాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా 2007- టీ20 ప్రపంచకప్2011- వన్డే వరల్డ్‌కప్2013- చాంపియన్స్ ట్రోఫీ2024- టీ20 ప్రపంచకప్2025- చాంపియన్స్ ట్రోఫీ.చదవండి: Team of the Tourney 2025: జట్టును ప్రకటించిన ఐసీసీ.. రోహిత్‌కు దక్కని చోటు -
అత్యధిక ఐసీసీ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా విరాట్.. పాంటింగ్ సరసన చోటు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025తో టీమిండియా ఖాతాలో ఏడో ఐసీసీ ట్రోఫీ చేరింది. భారత్ తొలిసారి 1983లో ఐసీసీ ట్రోఫీ (వన్డే వరల్డ్‌కప్) గెలిచింది. ఆతర్వాత 2002 (ఛాంపియన్స్ ట్రోఫీ, శ్రీలంకతో సంయుక్తంగా), 2007 (టీ20 వరల్డ్‌కప్), 2011 (వన్డే వరల్డ్‌కప్), 2013 (ఛాంపియన్స్ ట్రోఫీ), 2024 (టీ20 వరల్డ్‌కప్), 2025లో (ఛాంపియన్స్ ట్రోఫీ) ఐసీసీ ట్రోఫీలు కైవసం చేసుకుంది. ప్రపంచంలో అత్యధిక ఐసీసీ ట్రోఫీలు గెలిచిన జట్ల జాబితాలో భారత్ ఆస్ట్రేలియా తర్వాతి స్థానంలో ఉంది.ఆస్ట్రేలియా అత్యధికంగా 10 ఐసీసీ ట్రోఫీలు (1987, 1999, 2003, 2007, 2015, 2023 వన్డే వరల్డ్‌కప్‌లు.. 2021 టీ20 వరల్డ్‌కప్.. 2006, 2009 ఛాంపియన్స్ ట్రోఫీ.. 2021-23 డబ్ల్యూటీసీ టైటిల్) కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా, భారత్ తర్వాత అత్యధిక ఐసీసీ టైటిళ్లు గెలిచిన ఘనత వెస్టిండీస్‌కు దక్కుతుంది. విండీస్ మొత్తంగా ఐదు ఐసీసీ టైటిళ్లు (1975, 1979 వన్డే వరల్డ్‌కప్‌లు.. 2012, 2016 టీ20 వరల్డ్‌కప్‌లు.. 2004 ఛాంపియన్స్ ట్రోఫీ) సాధించింది.విండీస్ తర్వాత పాకిస్తాన్ (1992 వన్డే వరల్డ్‌కప్.. 2009 టీ20 వరల్డ్‌కప్.. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ), శ్రీలంక (1996 వన్డే వరల్డ్‌కప్.. 2014 టీ20 వరల్డ్‌కప్.. 2002 ఛాంపియన్స్ ట్రోఫీ (భారత్‌తో కలిసి సంయుక్తంగా), ఇంగ్లండ్ (2019 వన్డే వరల్డ్‌కప్.. 2010, 2022 టీ20 వరల్డ్‌కప్‌లు) తలో మూడు ఐసీసీ టైటిళ్లు సాధించాయి. న్యూజిలాండ్ రెండు (2000 ఛాంపియన్స్ ట్రోఫీ.. 2019-2021 డబ్ల్యూటీసీ), సౌతాఫ్రికా ఓ ఐసీసీ టైటిల్ (1998 ఛాంపియన్స్ ట్రోఫీ) గెలిచింది.ఐసీసీ టైటిళ్లు గెలిచిన జట్ల విషయం ఇలా ఉంటే.. వ్యక్తిగతంగా అత్యధిక ఐసీసీ టైటిళ్లు గెలిచిన ఘనత ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి దక్కుతుంది. ఈ ఇద్దరు తలో ఐదు ఐసీసీ టైటిళ్లు (అండర్-19 ఈవెంట్లు కలుపుకొని) సాధించారు. పాంటింగ్ 1999, 2003,2007 వన్డే వరల్డ్‌కప్‌లు.. 2006, 2009 ఛాంపియన్స్ ట్రోఫీలు గెలువగా.. విరాట్ 2008 అండర్ 19 వరల్డ్‌కప్.. 2011 వన్డే వరల్డ్‌కప్.. 2013, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలు.. 2024 టీ20 వరల్డ్‌కప్ టైటిళ్లు గెలిచాడు.పాంటింగ్, విరాట్ తర్వాత అత్యధిక ఐసీసీ టైటిళ్లు గెలిచిన ఘనత రోహిత్ శర్మ (2007, 2024 టీ20 వరల్డ్‌కప్‌లు.. 2013, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలు), ఆడమ్ గిల్‌క్రిస్ట్ (1999, 2003, 2007 వన్డే వరల్డ్‌కప్‌లు.. 2006 ఛాంపియన్స్ ట్రోఫీ), గ్లెన్ మెక్‌గ్రాత్ (1999, 2003, 2007 వన్డే వరల్డ్‌కప్‌లు.. 2006 ఛాంపియన్స్ ట్రోఫీ), షేన్ వాట్సన్ (2007, 2015 వన్డే వరల్డ్‌కప్‌లు.. 2006, 2009 ఛాంపియన్స్ ట్రోఫీలు), డేవిడ్ వార్నర్ (2015, 2023 వన్డే వరల్డ్‌కప్‌లు.. 2021 టీ20 వరల్డ్‌కప్.. 2021-23 డబ్ల్యూటీసీ టైటిల్), మిచెల్ స్టార్క్ (2015, 2023 వన్డే వరల్డ్‌కప్‌లు.. 2021 టీ20 వరల్డ్‌కప్.. 2021-23 డబ్ల్యూటీసీ టైటిల్), స్టీవ్ స్మిత్‌కు (2015, 2023 వన్డే వరల్డ్‌కప్‌లు.. 2021 టీ20 వరల్డ్‌కప్.. 2021-23 డబ్ల్యూటీసీ టైటిల్) దక్కుతుంది. వీరంతా తలో నాలుగు ఐసీసీ టైటిళ్లు గెలిచారు.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొంది, మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను, ఓవరాల్‌గా ఏడో ఐసీసీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. -
CT 2025: జట్టును ప్రకటించిన ఐసీసీ.. రోహిత్‌కు దక్కని చోటు
పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy) ఎడిషన్ మార్చి 9న దుబాయ్‌లో ముగిసింది. టైటిల్ పోరులో న్యూజిలాండ్‌తో తలపడ్డ టీమిండియా జయకేతనం ఎగురవేసి ట్రోఫీని ముద్దాడింది. గ్రూప్ దశలో మూడు.. సెమీస్, ఫైనల్ గెలిచి అజేయంగా ఈ వన్డే టోర్నమెంట్‌ను ముగించింది.ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) తాజాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ప్రకటించింది. ఈ పదకొండు మంది సభ్యుల జట్టులో భారత్ హవా కొనసాగింది. టీమిండియా నుంచి ఈ జట్టులో ఏకంగా ఐదుగురు క్రికెటర్లు స్థానం సంపాదించారు.పాకిస్తాన్‌కు మొండిచేయిమరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి గెలుపన్నదే లేకుండా నిష్క్రమించిన పాకిస్తాన్‌కు మొండిచేయి ఎదురైంది. అంతేకాదు.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్ల నుంచి కూడా ఒక్క ఆటగాడూ ఐసీసీ జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. ఇక టీమిండియా తర్వాత న్యూజిలాండ్ నుంచి అత్యధికంగా నలుగురు ఐసీసీ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నారు. అదే విధంగా అఫ్గనిస్తాన్ నుంచి ఇద్దరు ఇందులో ఉన్నారు. అయితే, ఇందులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రం చోటు దక్కకపోవడం గమనార్హం. ఈ జట్టుకు సారథిగా కివీస్ నాయకుడు మిచెల్ సాంట్నర్ ఎంపికయ్యాడు.నాలుగు వికెట్ల తేడాతో ఓడించికాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ పోటీపడగా.. టీమిండియా, కివీస్ సెమీస్ చేరాయి. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, అఫ్గనిస్తాన్ బరిలో దిగగా.. ఆసీస్, ప్రొటిస్ జట్లు సెమీ ఫైనల్లో అడుగుపెట్టాయి.ఈ క్రమంలో తొలి సెమీస్ మ్యాచ్‌లో భారత్- ఆసీస్‌ను... రెండో సెమీస్‌లో కివీస్ ప్రొటిస్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకున్నాయి. ఈ క్రమంలో దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో రోహిత్ సేన సాంట్నర్ బృందాన్ని నాలుగు వికెట్ల తేడాతో ఓడించి చాంపియన్‌గా అవతరించింది. ఈ మ్యాచ్‌లో 76 పరుగులతో రాణించిన భారత సారథి రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. మొత్తంగా రెండు శతకాల సాయంతో 263 పరుగులు సాధించిన కివీస్ యువ ఆటగాడు రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కింది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’రచిన్ రవీంద్ర(న్యూజిలాండ్), ఇబ్రహీం జద్రాన్(అఫ్గనిస్తాన్), విరాట్ కోహ్లి(ఇండియా), శ్రేయస్ అయ్యర్(ఇండియా), కేఎల్ రాహుల్(ఇండియా), గ్లెన్ ఫిలిప్స్(న్యూజిలాండ్), అజ్మతుల్లా ఒమర్జాయ్(అఫ్గనిస్తాన్), మిచెల్ సాంట్నర్(కెప్టెన్, న్యూజిలాండ్), మ్యాట్ హెన్రీ(న్యూజిలాండ్), వరుణ్ చక్రవర్తి(ఇండియా)12వ ఆటగాడు: అక్షర్ పటేల్(ఇండియా)చాంపియన్స్ ట్రోఫీ-2025లో వీరి ప్రదర్శన👉రచిన్ రవీంద్ర- రెండు శతకాల సాయంతో 263 రన్స్. స్పిన్ బౌలర్‌గానూ రాణించిన రచిన్. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపిక👉ఇబ్రహీం జద్రాన్- ఒక సెంచరీ సాయంతో 216 పరుగులు. ఇంగ్లండ్‌పై అఫ్గన్ గెలుపొందడంలో కీలక పాత్ర👉విరాట్ కోహ్లి- ఒక శతకం సాయంతో 218 పరుగులు. పాకిస్తాన్‌పై అజేయ సెంచరీ. వన్డేల్లో అత్యంత వేగంగా పద్నాలుగు వేల మార్కు అందుకున్న క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు.👉శ్రేయస్ అయ్యర్- రెండు అర్ధ శతకాల సాయంతో 243 రన్స్. టీమిండియా చాంపియన్‌గా నిలవడంతో కీలక మిడిలార్డర్ బ్యాటర్‌గా రాణింపు.👉కేఎల్ రాహుల్- 140 పరుగులు. వికెట్ కీపర్‌గానూ సేవలు.👉గ్లెన్ ఫిలిప్స్- 177 పరుగులు. రెండు వికెట్లు, ఐదు క్యాచ్‌లు.👉అజ్మతుల్లా ఒమర్జాయ్- 126 రన్స్, ఏడు వికెట్లు.👉మిచెల్ సాంట్నర్- 4.80 ఎకానమీతో తొమ్మిది వికెట్లు👉మహ్మద్ షమీ- 5.68 ఎకానమీతో తొమ్మిది వికెట్లు. ఇందులో ఓ ఫైవ్ వికెట్ హాల్.👉మ్యాట్ హెన్రీ- 5.32 ఎకానమీతో పది వికెట్లు👉వరుణ్ చక్రవర్తి- 4.53 ఎకానమీతో తొమ్మిది వికెట్లు👉అక్షర్ పటేల్- 4.35 ఎకానమీతో ఐదు వికెట్లు.చదవండి: అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్ కెప్టెన్ View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
రిటైర్మెంట్ ప్రకటిస్తాడంటూ వార్తలు.. జడ్డు రియాక్షన్ ఇదే!
దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) టోర్నమెంట్ జరుగగా.. టీమిండియా విజేతగా అవతరించింది. డిఫెండింగ్ చాంపియన్ పాకిస్తాన్ ఒక్క గెలుపు కూడా లేకుండా నిష్క్రమించగా.. భారత్ ఆఖరి వరకు అజేయంగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. దుబాయ్ వేదికగా ఆదివారం నాటి ఫైనల్లో న్యూజిలాండ్(India vs New Zealand)ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి చాంపియన్‌గా నిలిచింది.ఆ నలుగురు.. అప్పుడూ.. ఇప్పుడూఇక 2017 చాంపియన్స్ ట్రోఫీ నాటి భారత జట్టులో ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా(Ravindra Jadeja), హార్దిక్ పాండ్యా.. తాజా ఎడిషన్‌లోనూ ఆడారు. ప్రస్తుతం ఈ వన్డే టోర్నమెంట్ గెలిచిన జట్టుకు రోహిత్ కెప్టెన్‌గా ఉండగా.. మిగతా ముగ్గురు అతడితో కలిసి టీమిండియాను విజేతగా నిలపడంలో తమ వంతు పాత్ర పోషించారు.ముఖ్యంగా స్పిన్‌కు అనుకూలించిన దుబాయ్ పిచ్‌పై ఆల్‌రౌండర్ జడ్డూ ప్రభావం చూపాడు. మొత్తంగా ఐదు మ్యాచ్‌లలో పొదుపుగా బౌలింగ్ చేసిన జడ్డూ మొత్తంగా ఐదు వికెట్లు తీశాడు. ప్రత్యర్థి జట్ల బ్యాటర్లపై ఒత్తిడి పెంచుతూ కీలక వికెట్లు కూల్చి టీమిండియాను విజయపథంలో నిలపడంలో కీలకంగా వ్యవహరించాడు. ఈ టోర్నీలో ఐదు మ్యాచ్‌లలో కలిపి 42 ఓవర్లు బౌలింగ్ చేసిన జడేజా.. 4.35 ఎకానమీ రేటుతో 183 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. బంతితోనే కాకుండా.. అవసరమైన వేళ బ్యాట్‌తోనూ జడ్డూ రాణించాడు. ముఖ్యంగా కివీస్‌తో ఫైనల్లో ఫోర్ బాది టీమిండియా విజయాన్ని ఖరారు చేసి.. ఈ టోర్నీని చిరస్మరణీయంగా మార్చుకున్నాడు. జడేజా రిటైర్మెంట్ గురించి ఊహాగానాలుఅయితే, ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో జడేజా తన బౌలింగ్ ఓవర్ల కోటా పూర్తి చేయగానే విరాట్ కోహ్లి వచ్చి జడ్డూను ఆత్మీయంగా హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట విస్తృతంగా వైరల్ అయ్యాయి.ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన స్టీవ్ స్మిత్‌కు కోహ్లి హగ్ ఇచ్చిన ఫొటోలను షేర్ చేస్తూ.. జడేజా రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు వచ్చాయి. జడ్డూ వన్డేల్లో తన చివరి స్పెల్ వేసేశాడని.. ఇక రిటైర్మెంట్ ప్రకటనే తరువాయి అన్నట్టుగా ప్రచారం సాగింది.జడ్డు రియాక్షన్ ఇదే!టీమిండియా విజయానంతరం ఈ విషయంపై స్పందించిన జడేజా.. ‘‘అనవసరంగా వదంతులు ప్రచారం చేయద్దు.. ధన్యవాదాలు’’ అంటూ చేతులెత్తి నమస్కరిస్తున్నట్లుగా ఉన్న ఎమోజీతో పాటు సెల్యూట్ చేస్తున్నట్లుగా ఉన్న ఎమోజీని జత చేశాడు. కాగా ఫైనల్లో జడ్డూ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఆరు బంతుల్లో ఒక ఫోర్ సాయంతో తొమ్మిది పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఇదిలా ఉంటే.. సెమీ ఫైనల్లో టీమిండియా చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయిన తర్వాత స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకంటే ముందు కోహ్లి అతడిని ఆలింగనం చేసుకోగా.. అధికారిక ప్రకటన కంటే ముందే స్మిత్ కోహ్లికి ఈ విషయం చెప్పాడని వార్తలు వచ్చాయి. జడ్డూ విషయంలో కూడా ఇలాగే జరుగుతుందని భావించిన వాళ్లకు తాజాగా అతడి పోస్టుతో స్పష్టతవచ్చింది.చదవండి: తప్పులు సరిదిద్దుకుని.. ‘టాప్’ రన్ స్కోరర్‌గా.. మాటలకు అందని అనుభూతి!Ravindra Jadeja with his family!#INDvsNZ #ChampionsTrophy2025 pic.twitter.com/16MpYrm7V6— Chandra 🇮🇳 (@cbatrody) March 9, 2025 -
CT 2025 Final: షమీ తల్లి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న కోహ్లి
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో టీమిండియా విజయానంతరం దుబాయ్ క్రికెట్ స్టేడియంలో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. టీమిండియా ఆటగాళ్ల విజయోత్సవ సంబురాలతో పాటు పలు దృష్యాలు సోషల్‌మీడియాను విపరీతంగా ఆకర్శించాయి. ఇందులో ఒకటి విరాట్ కోహ్లి.. సహచరుడు మహ్మద్ షమీ తల్లికి పాదాభివందనం చేయడం. విజయోత్సవ సంబురాల్లో భాగంగా టీమిండియా ఆటగాళ్లంతా కుటుంబ సభ్యులతో కలిసి స్టేడియంలో కలియతిరుగుతుండగా.. కోహ్లికి షమీ తల్లి తారసపడింది. Virat Kohli Touched Mohammad Shami’s Mother Feet And Clicked Pictures With Shami’s Family. pic.twitter.com/D08GRCfurN— khalid Chougle (@ChougleKhalid) March 10, 2025కోహ్లి వెంటనే షమీ తల్లి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. అనంతరం షమీ కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగాడు. విరాట్ షమీ తల్లి పాదాలకు నమస్కరించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఇది చూసి జనాలు విరాట్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. విరాట్‌కు పెద్దలంటే ఎంత గౌరవమోనని చర్చించుకుంటున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయానంతరం దుబాయ్ స్టేడియంలో ఇలాంటి ఫ్యామిలీ మూమెంట్స్ చాలా కనిపించాయి. శుభ్‌మన్ గిల్ తండ్రితో రిషబ్ పంత్ చిందులేయడం.. శ్రేయస్ తల్లి అతన్ని ముద్దాడటం.. ఇలా చాలా ఆసక్తికర ఫ్యామిలీ మూమెంట్స్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వేదికైంది.Shubman Gill's father doing Bhangra with Rishabh Pant. 😂❤️pic.twitter.com/SdUu58044d— Mufaddal Vohra (@mufaddal_vohra) March 10, 2025ఇదిలా ఉంటే, నిన్నటి ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. భారత్ ఆటగాళ్లలో విరాట్, రోహిత్, జడేజా మినహా దాదాపుగా అందరికీ ఇదే తొలి ఐసీసీ టైటిల్ కావడం విశేషం. చాలాకాలంగా టీమిండియాలో కీలక సభ్యుడిగా ఉన్నా షమీకి సైతం ఐదే తొలి ఐసీసీ టైటిల్. 2013 జనవరిలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన షమీ.. ఐసీసీ ఈవెంట్లలో టీమిండియా తరఫున ఎన్నో అత్యుత్తమ ప్రదర్శనలు చేసినా దీనికి ముందు ఒక్కసారి కూడా టైటిల్ విన్నింగ్ జట్టులో భాగం కాలేకపోయాడు. గతేడాది భారత్ టీ20 వరల్డ్‌కప్ గెలిచినప్పటికీ.. ఆ ఐసీసీ టోర్నీకి షమీ దూరంగా ఉన్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా గాయపడిన షమీ.. తిరిగి ఛాంపియన్స్ ట్రోఫీ-2025తోనే (ఐసీసీ టోర్నీలు) రీఎంట్రీ ఇచ్చాడు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో షమీ 5 మ్యాచ్‌ల్లో 25.88 సగటున, 5.68 ఎకానమీ రేటుతో 9 వికెట్లు తీసి భారత్ అజేయ యాత్రతో తనవంతు పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో షమీ అత్యుత్తమ ప్రదర్శన బంగ్లాదేశ్‌పై వచ్చింది. ఆ మ్యాచ్‌లో షమీ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై కూడా షమీ సత్తా చాటాడు. ఆ మ్యాచ్‌లో షమీ మూడు వికెట్లు పడగొట్టాడు.ఫైనల్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేయగా.. భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు చెలరేగడంతో న్యూజిలాండ్ ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. న్యూజిలాండ్ తరఫున డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్‌వెల్ (53 నాటౌట్) రాణించారు. రచిన్ రవీంద్ర (37), ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విల్ యంగ్ (15), కేన్ విలియమ్సన్ (11), టామ్ లాథమ్ (14),మిచెల్ సాంట్నర్ (8) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో 2.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు.ఛేదనలో రోహిత్ (76) భారత్‌కు శుభారంభాన్ని అందించారు. శుభ్‌మన్ గిల్‌తో (31) కలిసి తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించాడు. అయితే భారత్ 17 పరుగుల వ్యవధిలో గిల్, కోహ్లి (1), రోహిత్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ (48), అక్షర్ పటేల్ (29) మంచి భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను తిరిగి గేమ్‌లోకి తెచ్చారు. అయితే శ్రేయస్, అక్షర్ కూడా స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో టీమిండియా మరోసారి కష్టాల్లో పడింది. అయితే కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజాతో (18 నాటౌట్) కలిసి మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్, బ్రేస్‌వెల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జేమీసన్, రచిన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
ఐసీసీ ఈవెంట్లలో తిరుగులేని కోహ్లి, రోహిత్.. ఇద్దరూ ఇద్దరే..!
ఐసీసీ వైట్ బాల్ టోర్నీలు (పరిమిత ఓవర్ల టోర్నీలు) అనగానే టీమిండియా కృష్ణార్జునులు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు పూనకం వస్తుంది. ఈ ఇద్దరు మామూలు మ్యాచ్‌ల్లో ఎలా ఆడినా ఐసీసీ ఈవెంట్లలో మాత్రం చెలరేగిపోతారు. ఇందుకు తాజా నిదర్శనం 2025 ఛాంపియన్స్ ట్రోఫీ. ఈ ఐసీసీ టోర్నీలో విరాట్ ఆది నుంచే చెలరేగగా.. రోహిత్ కీలకమైన ఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు.ఈ ఇద్దరు గడిచిన 18 ఏళ్లలో భారత్‌కు ఐసీసీ టోర్నీల్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. రోహిత్ ఆటగాడిగా 2007 టీ20 వరల్డ్‌కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ.. కెప్టెన్‌గా 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయాల్లో భాగం కాగా.. విరాట్ ఆటగాడిగా 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2024 టీ20 వరల్డ్‌కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయాల్లో భాగమయ్యాడు.ఐసీసీ ఈవెంట్లలో కోహ్లి, రోహిత్‌ల ట్రాక్ రికార్డును పరిశీలిస్తే ప్రపంచంలో ఏ ఆటగాడికి సాధ్యం కాని రికార్డు వీరు సొంతం చేసుకున్నారు. కోహ్లి, రోహిత్ ఐసీసీ వైట్‌బాల్ టోర్నీల్లో ఇప్పటివరకు (ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్) తలో 90 మ్యాచ్‌లు ఆడి 70కి పైగా విజయాల్లో (కోహ్లి 72, రోహిత్ 70) భాగమయ్యారు. ప్రపంచంలో మరే క్రికెటర్ ఐసీసీ వైట్‌బాల్ టోర్నీల్లో వీరు సాధించినన్ని విజయాలు సాధించలేదు. కోహ్లి, రోహిత్ తర్వాత ఐసీసీ వైట్ బాల్ టోర్నీల్లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన ఘనత మహేళ జయవర్దనేకు దక్కుతుంది. జయవర్దనే 93 మ్యాచ్‌ల్లో 57 విజయాలు సాధించాడు.ఐసీసీ వైట్ బాల్ టోర్నీల్లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన ఆటగాళ్లు..విరాట్ కోహ్లి- 72 (90 మ్యాచ్‌లు)రోహిత్ శర్మ- 70 (90)మహేళ జయవర్దనే- 57 (93)కుమార సంగక్కర- 56 (90)రవీంద్ర జడేజా- 52 (66)రికీ పాంటింగ్- 52 (70)ఎంఎస్ ధోని- 52 (78)ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విషయానికొస్తే.. ఈ టోర్నీలో భారత్ అజేయ జట్టుగా ఫైనల్‌కు చేరి ఫైనల్లో న్యూజిలాండ్‌ను మట్టికరిపించి ఛాంపియన్‌గా నిలిచింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. భారత స్పిన్నర్లు చెలరేగిన వేల డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్‌వెల్ (53 నాటౌట్) అద్భుతమైన అర్ద సెంచరీలు సాధించి న్యూజిలాండ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. ఆదిలో రచిన్ రవీంద్ర (37), ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (34) మంచి ఇన్నింగ్స్‌లు ఆడగా.. విల్ యంగ్ (15), కేన్ విలియమ్సన్ (11), టామ్ లాథమ్ (14),మిచెల్ సాంట్నర్ (8) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో 2.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఛేదనలో రోహిత్ (76) భారత్‌కు శుభారంభాన్ని అందించారు. శుభ్‌మన్ గిల్‌తో (31) కలిసి తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించాడు. అయితే భారత్ 17 పరుగుల వ్యవధిలో గిల్, కోహ్లి (1), రోహిత్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ (48), అక్షర్ పటేల్ (29) మంచి భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను తిరిగి గేమ్‌లోకి తెచ్చారు. అయితే శ్రేయస్, అక్షర్ కూడా స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో టీమిండియా మరోసారి కష్టాల్లో పడింది.ఈ దశలో కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజాతో (18 నాటౌట్) కలిసి మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. జడేజా బౌండరీ బాది భారత్‌ను గెలిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్, బ్రేస్‌వెల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జేమీసన్, రచిన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం భారత్‌కు ఇది మూడోసారి (2002, 2013, 2025). ఫైనల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.. టోర్నీ ఆధ్యాంతం రాణించిన రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు లభించింది. -
రోహిత్‌ను ఆలింగనం చేసుకున్న అనుష్క శర్మ.. ప్రత్యేక అభినందనలు
వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ నాటి చేదు అనుభవాన్ని మరిపిస్తూ టీమిండియా అద్భుత విజయం సాధించింది. సొంతగడ్డపై ఎదురైన పరాభవాన్ని మరిపించేలా.. దుబాయ్‌లో చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) గెలిచి అభిమానులకు కానుక అందించింది. ఈ మెగా వన్డే టోర్నమెంట్ ఆద్యంతం అజేయంగా నిలిచి పరిపూర్ణ విజయంతో ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది.పాతికేళ్ల క్రితం న్యూజిలాండ్(India vs New Zealand) చేతిలో ఫైనల్లో ఓడిపోయిన భారత జట్టు తాజాగా అదే ప్రత్యర్థిని ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. నాలుగు వికెట్ల తేడాతో కివీస్‌పై గెలుపొంది 2025 చాంపియన్స్ ట్రోఫీ విజేతగా అవతరించింది. దీంతో అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ నేపథ్యంలో టీమిండియాపై.. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై ప్రశంసల వర్షం కురుస్తోంది.స్వదేశంలో వన్డే వరల్డ్‌కప్-2023లో తన అద్భుత కెప్టెన్సీతో జట్టును ఫైనల్ చేర్చిన హిట్‌మ్యాన్.. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాను చాంపియన్‌గా నిలిపాడు. తాజాగా చాంపియన్స్ ట్రోఫీ గెలిచి రెండో ఐసీసీ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా మహేంద్ర సింగ్ ధోని తర్వాత ఎక్కువ ఐసీసీ ట్రోఫీలు గెలిచిన రెండో కెప్టెన్‌గా నిలిచాడు.ఆత్మీయంగా హత్తుకుని.. శుభాకాంక్షలుఇక చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత సహచరులు రోహిత్ శర్మతో తమ ఆనందాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. స్టార్ బ్యాటర్, మాజీ సారథి విరాట్ కోహ్లి అయితే సంతోషంతో తబ్బిబ్బైపోయాడు. ఆ సమయంలో రోహిత్ కుటుంబంతో పాటు కోహ్లి ఫ్యామిలీ కూడా అక్కడే ఉంది.అయితే, విజయానంతరం రోహిత్ తన కుమార్తె సమైరాను ముద్దాడటంతో పాటు భార్య రితికాను ఆలింగనం చేసుకుని సంతోషం పంచుకున్నాడు. ఆ సమయంలో రితికా పక్కనే ఉన్న కోహ్లి భార్య అనుష్క శర్మ రోహిత్‌ను ప్రత్యేకంగా అభినందించింది. అంతేకాదు ఆత్మీయంగా అతడిని హత్తుకుని శుభాకాంక్షలు తెలిపింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కాగా చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా గెలవగానే అనుష్క- కోహ్లి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఆనందాన్ని పంచుకున్నారు. ఇక టీమిండియాకు మద్దతుగా అనుష్క పలుమార్లు స్టేడియంలో సందడి చేయడంతో పాటు భర్త విరాట్ అద్భుతంగా ఆడిన వేళ గాల్లో ముద్దులు ఇస్తూ అతడిపై ప్రేమను చాటుకున్న సందర్భాలు కోకొల్లలు. This moment!🏆❤️#AnushkaSharma hugged #ViratKohli after India's epic win in the #ICCChampionsTrophy2025 finals. #INDvsNZ pic.twitter.com/QmEDAJcziu— Filmfare (@filmfare) March 9, 2025 విరాట్ కూడా తాను కీలక మైలురాయిని అందుకున్న ప్రతివేళా సతీమణికి దానిని అంకితమిస్తాడు. ముఖ్యంగా ఫామ్‌లేమితో సతమతమైన వేళ అనుష్క వల్లే తాను తిరిగి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేవాడినని.. ఆమె తనకు నైతికంగా ఎల్లవేళలా మద్దతు ఇస్తుందని గతంలో వెల్లడించాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ బారత్ వర్సెస్ న్యూజిలాండ్ వేదిక: దుబాయ్, మార్చి 9టాస్: న్యూజిలాండ్ .. మొదట బ్యాటింగ్కివీస్ స్కోరు: 251/7 (50)టీమిండియా స్కోరు: 254/6 (49)ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచి చాంపియన్‌గా భారత్ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రోహిత్ శర్మ(83 బంతుల్లో 76) Anushka Sharma specially called Rohit Sharma and gave him a tight hug.🔥They are like a family bro.#INDvNZ pic.twitter.com/6UgeFchHVT— 𝐕𝐢𝐬𝐡𝐮 (@Ro_45stan) March 9, 2025 -
భారత్ ఘన విజయం.. అభిమానంతో దద్దరిల్లిన ట్యాంక్ బండ్ (ఫొటోలు)
-
IND Vs NZ: చాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్ (ఫొటోలు)
-
Virat Kohli: అద్భుత విజయం.. అంతులేని సంతోషం!.. ఆసీస్ టూర్ తర్వాత..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) ఫైనల్లో టీమిండియా విజయం పట్ల స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) హర్షం వ్యక్తం చేశాడు. టోర్నమెంట్ ఆసాంతం జట్టులోని ప్రతి ఒక్క సభ్యుడు టైటిల్ గెలిచేందుకు తమ వంతు సహకారం అందించాడని తెలిపాడు. భారత జట్టులో ప్రస్తుతం ప్రతిభకు కొదువలేదని.. యువ ఆటగాళ్లు సీనియర్ల సలహాలు తీసుకుంటూనే తమదైన శైలిలో ముందుకు సాగుతున్న తీరును కొనియాడాడు.కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్.. ఆదివారం దుబాయ్ వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య ఫైనల్‌తో ముగిసింది. ఈ వన్డే టోర్నీలో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్ ఇంగ్లండ్ పోటీపడ్డాయి. అయితే, ఆసీస్‌ను ఓడించి టీమిండియా.. సౌతాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్ తుదిపోరుకు అర్హత సాధించాయి.ఈ క్రమంలో మార్చి 9 నాటి మ్యాచ్‌లో రోహిత్ సేన ఆఖరి వరకు పోరాడి కివీస్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది.. టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో విజయానంతరం కోహ్లి తన మనసులోని భావాలు పంచుకున్నాడు. ‘‘ఇది అద్భుత విజయం. ఆస్ట్రేలియా పర్యటనలో చేదు అనుభవం తర్వాత పెద్ద టోర్నమెంట్ గెలవాలని మేము కోరుకున్నాం.సరైన దిశలోఇలాంటి తరుణంలో చాంపియన్స్ ట్రోఫీ గెలవడం అద్భుతంగా అనిపిస్తోంది. యువ ఆటగాళ్లతో కలిసి ఆడటం సంతోషంగా ఉంది. సీనియర్లుగా మేము మా అనుభవాలను వారితో పంచుకుంటున్నాం. వారు కూడా మా సలహాలు, సూచనలు తీసుకుంటూనే తమదైన శైలిలో రాణిస్తున్నారు.జట్టు ప్రస్తుతం సరైన దిశలో వెళ్తోంది. ఈ టోర్నీ మొత్తాన్ని మేము ఆస్వాదించాం. కొంతమంది బ్యాట్‌తో రాణిస్తే.. మరికొందరు బంతితో ప్రభావం చూపారు. అంతా కలిసి జట్టు విజయంలో భాగమయ్యారు. ఐదు మ్యాచ్‌లలో ప్రతి ఒక్కరు సరైన సమయంలో సరైన విధంగా రాణించి జట్టు గెలుపునకు బాటలు వేశారు. నిజంగా మాకు ఇది చాలా చాలా అద్భుతమైన టోర్నమెంట్’’ అంటూ కోహ్లి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.కాగా ఈ టోర్నీలో దాయాది పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో శతకం(100 నాటౌట్)తో మెరిసిన కోహ్లి.. ఆసీస్‌తో సెమీ ఫైనల్లోనూ అద్భుత అర్ధ శతకం(84)తో రాణించాడు. అయితే టైటిల్ పోరులో మాత్రం దురదృష్టవశాత్తూ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉంటే.. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను చిత్తు చేసిన రోహిత్ సేన.. సెమీస్‌లో ఆసీస్‌ను, ఫైనల్లో కివీస్‌ను ఓడించి అజేయంగా టైటిల్ విజేతగా నిలిచింది. ఇక కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇది రెండో ఐసీసీ టైటిల్. గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన హిట్‌మ్యాన్.. తాజాగా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను కూడా సాధించాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ స్కోర్లు👉వేదిక: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, దుబాయ్👉టాస్: న్యూజిలాండ్... తొలుత బ్యాటింగ్👉న్యూజిలాండ్ స్కోరు: 251/7 (50)👉కివీస్ టాప్ రన్ స్కోరర్: డారిల్ మిచెల్(101 బంతులలో 63)👉టీమిండియా స్కోరు: 254/6 (49)👉ఫలితం: న్యూజిలాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రోహిత్ శర్మ(83 బంతుల్లో 7 ఫోర్లు,3 సిక్స్ లు 76 పరుగులు).చదవండి: మా స్పిన్నర్లు అద్భుతం: రోహిత్ -
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ముందు విరాట్‌కు గాయం..?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి గాయమైనట్లు తెలుస్తుంది. ఇవాళ (మార్చి 8) ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా విరాట్ గాయపడినట్లు జియో న్యూస్ తెలిపింది. నెట్స్‌లో ఓ పేసర్‌ను ఎదుర్కొనే క్రమంలో విరాట్ మోకాలికి గాయమైనట్లు సమాచారం. గాయపడిన అనంతరం విరాట్ ప్రాక్టీస్‌ను ఆపేసినట్లు తెలుస్తుంది. విరాట్ గాయానికి ఫిజియో చికిత్స చేశాడని సమాచారం. చికిత్స తర్వాత విరాట్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లకుండా మైదానంలోనే సహచరులతో గడిపినట్లు తెలుస్తుంది. విరాట్ గాయంపై కోచింగ్ స్టాఫ్‌ను ఆరా తీయగా తీవ్రమైంది కాదని పేర్కొన్నట్లు తెలుస్తుంది. ప్రాక్టీస్ సెషన్లో విరాట్ మోకాలికి కట్టు కట్టుకుని తిరిగినట్లు జియో న్యూస్ పేర్కొంది. విరాట్ గాయం గురించి తెలిసి అభిమానులు తొలుత ఆందోళన చెందారు. విరాట్ గాయంపై టీమిండియా మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఫైనల్లో విరాట్ ఎంత కీలకమైన ఆటగాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఒకవేళ స్వల్ప గాయమైనా ముందు జాగ్రత్త చర్చగా విరాట్‌ను ప్రాక్టీస్ చేయనిచ్చి ఉండరు. ఈ టోర్నీలో విరాట్ అత్యంత కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడి టీమిండియా ఫైనల్‌కు చేరడంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఈ టోర్నీలో విరాట్ దాయాది పాకిస్తాన్‌పై సూపర్ సెంచరీ చేసి భారత్‌ను గెలిపించాడు. ఆసీస్‌తో జరిగిన సెమీఫైనల్లోనూ విరాట్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో కూడా విరాట్ సెంచరీ చేసుండాల్సింది. అయితే తృటిలో ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. విరాట్ సూపర్ ఫామ్‌ను ఫైనల్లోనూ కొనసాగించి భారత్‌కు మరో ఐసీసీ టైటిల్ అందించాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు. ఫైనల్లో విరాట్ మంచి ఇన్నింగ్స్ ఆడితే భారత విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు. దుబాయ్ పిచ్‌లకు విరాట్ అలవాటు పడ్డాడు కాబట్టి ఫైనల్లో తప్పక రాణిస్తాడని అంతా అనుకుంటున్నారు.కాగా, దుబాయ్ వేదికగా రేపు (మార్చి 9) జరుగబోయే ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో టీమిండియా అజేయ జట్టుగా ఫైనల్‌కు చేరింది. భారత్.. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌నూ సూపర్ విక్టరీలు సాధించి సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో ఆసీస్‌ను మట్టికరిపించి ఫైనల్‌కు చేరింది. మరోవైపు న్యూజిలాండ్ గ్రూప్ దశలో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌పై విజయాలు సాధించి, భారత్ చేతిలో ఓడింది. అయినా గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచి సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో కివీస్ సౌతాఫ్రికాను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది.ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ భారత్‌ను ఎదుర్కోవడం ఇది రెండోసారి. 2000 ఎడిషన్ ఫైనల్లో కివీస్ భారత్‌ను ఢీకొట్టి విజేతగా నిలిచింది. న్యూజిలాండ్‌కు అది తొలి ఐసీసీ టైటిల్. ఐసీసీ టోర్నీల్లో టీమిండియాను న్యూజిలాండ్‌పై అంత మంచి ట్రాక్ రికార్డు లేదు. ఈ టోర్నీలో భారత్ న్యూజిలాండ్‌ను గ్రూప్ దశలో ఓడించినప్పటికీ.. ఫైనల్లో ఓడించడం మాత్రం అంత ఈజీ కాదు. ఐసీసీ ఈవెంట్లలో (అన్ని ఫార్మాట్లలో) న్యూజిలాండ్ భారత్‌తో ఆడిన 16 మ్యాచ్‌ల్లో పదింట గెలిచింది. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్‌పై న్యూజిలాండ్‌కు మరింత ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఐసీసీ నాకౌట్స్‌లో భారత్, న్యూజిలాండ్ నాలుగు సార్లు ఎదురెదురుపడగా.. 3 మ్యాచ్‌ల్లో కివీస్, ఒక మ్యాచ్‌లో భారత్ గెలుపొందాయి. న్యూజిలాండ్ తమ చరిత్రలో గెలిచిన రెండు ఐసీసీ టైటిళ్లు భారత్‌పైనే (ఫైనల్స్‌లో) సాధించినవే కావడం గమనార్హం. 2000 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత న్యూజిలాండ్ తమ రెండో ఐసీసీ టైటిల్‌ను 2021లో సాధించింది. 2019-2021 డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ భారత్‌ను ఓడించి తమ రెండో ఐసీసీ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. -
శ్రేయస్ అయ్యర్ లేకపోతే కోహ్లి లేడు..!
-
కోహ్లికి సాంట్నర్ సవాల్ పైచేయి ఎవరిది?
-
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ముందు కోహ్లిని ఊరిస్తున్న మూడు భారీ రికార్డులు
భారత్, న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ మార్చి 9న దుబాయ్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మూడు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో కోహ్లి మరో 95 పరుగులు చేస్తే వన్డేల్లో న్యూజిలాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అవతరిస్తాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమిస్తాడు. సచిన్ వన్డేల్లో న్యూజిలాండ్‌పై 1750 పరుగులు చేయగా.. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 1656 పరుగులు ఉన్నాయి.ఈ మ్యాచ్‌లో (ఫైనల్లో) విరాట్ సెంచరీ సాధిస్తే.. వన్డేల్లో న్యూజిలాండ్‌పై అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్‌గా సరికొత్త రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు విరాట్, వీరేంద్ర సెహ్వాగ్ పేరిట సంయుక్తంగా ఉంది. వీరిద్దరూ వన్డేల్లో న్యూజిలాండ్‌పై చెరో 6 సెంచరీలు బాదారు.ఈ మ్యాచ్‌లో విరాట్ మరో 128 పరుగులు చేస్తే.. ఐసీసీ వన్డే నాకౌట్స్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా అవతరిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ఐసీసీ వన్డే నాకౌట్స్‌లో మాస్టర్ బ్లాస్టర్ 657 పరుగులు చేశాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 530 పరుగులు ఉన్నాయి.ఈ మ్యాచ్‌లో విరాట్ హాఫ్ సెంచరీ చేస్తే ఐసీసీ వన్డే నాకౌట్స్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ సరసన నిలుస్తాడు. సచిన్ ఐసీసీ నాకౌట్స్‌లో ఆరు అర్ద సెంచరీలు చేయగా.. ప్రస్తుతం విరాట్ ఖాతాలో ఐదు అర్ద శతకాలు ఉన్నాయి.ప్రస్తుతం విరాట్ ఉన్న ఫామ్ ప్రకారం చూస్తే పైన ఉన్న మూడు రికార్డులు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో విరాట్ ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడి 72.33 సగటున, 83.14 స్ట్రయిక్‌రేట్‌తో 217 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఫైనల్లో విరాట్ సెంచరీ చేస్తే వన్డేల్లో 52వ శతకం.. ఓవరాల్‌గా 83వ శతకం అవుతుంది.విరాట్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై సెంచరీ సాధించాలని ప్రతి భారత క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు. అలాగే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కూడా ఫామ్‌లోకి రావాలని టీమిండియా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. టీమిండియాకు కృష్ణార్జులు లాంటి రోహిత్, కోహ్లి భారత్‌కు మరో ఐసీసీ టైటిల్ అందించాలని యావత్ భారతం ఆశిస్తుంది.టీమిండియాకు చెడు సూచకంఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు చెడు సూచిస్తుంది. ఐసీసీ టోర్నీల ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ను ఎదుర్కొన్న ప్రతిసారి భారత్‌కు అపజయమే ఎదురైంది. ఐసీసీ టోర్నీల ఫైనల్స్‌లో భారత్, న్యూజిలాండ్ ఇప్పటివరకు రెండు సార్లు ఎదురెదురుపడ్డాయి. తొలిసారి ఈ ఇరు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ-2000 ఎడిషన్ ఫైనల్లో తలపడ్డాయి. నాడు న్యూజిలాండ్ భారత్‌ను ఓడించి తమ తొలి ఐసీసీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ ఇరు జట్లు ఇనాగురల్ డబ్ల్యూటీసీ ఫైనల్లో (2019-2021) రెండో సారి పోటీపడ్డాయి. ఈసారి కూడా న్యూజిలాండ్ భారత్‌ను ఓడించి తమ రెండో ఐసీసీ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. న్యూజిలాండ్, తమ రెండు ఐసీసీ టైటిళ్లను భారత్‌పైనే గెలవడం విశేషం. -
కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్‌బై?.. బీసీసీఐ నిర్ణయం ఏమిటి?
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా ఎదురులేని విజయాలతో ఫైనల్‌కు చేరుకుంది. గ్రూప్ దశలో టాపర్‌గా నిలవడంతో పాటు సెమీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. దుబాయ్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్(India vs New Zealand)తో మ్యాచ్‌లో రోహిత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. ఇక ఈ మెగా వన్డే టోర్నమెంట్ తర్వాత టీమిండియాలో కీలక మార్పు చోటుచేసుకోనున్నట్లు సమాచారం.రోహిత్ శర్మ(Rohit Sharma) భారత వన్డే, టెస్టు జట్ల కెప్టెన్సీకి వీడ్కోలు పలికి కేవలం ఆటగాడిగా కొనసాగనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ అంశం గురించి ఇప్పటికే చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మధ్య చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. అది రోహిత్ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుందిఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియా ఘోర పరాజయం తర్వాత జరిగిన ఈ సమీక్షలో రోహిత్ భవిష్యత్తు గురించి చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సన్నిహిత వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘తనలో ఇంకా క్రికెట్ ఆడే సత్తా మిగిలే ఉందని రోహిత్ విశ్వసిస్తున్నాడు. అయితే, తన భవిష్యత్ కార్యాచరణ ఏమిటన్న అంశం గురించి యాజమాన్యం అతడిని అడిగింది. రిటైర్మెంట్ ప్రకటిస్తాడా లేదా అన్నది పూర్తిగా అతడి నిర్ణయమే. అయితే, కెప్టెన్సీ విషయంలో మాత్రం మేనేజ్మెంట్ మార్పు వైపు మొగ్గుచూపుతున్నట్లు అనిపిస్తోంది. వచ్చే వరల్డ్‌కప్ నాటికి జట్టును సిద్ధం చేసుకోవాలని దిగ్గజ కెప్టెన్ రోహిత్‌కూ తెలుసు. ఇదే విషయం గురించి కోచ్, చీఫ్ సెలక్టర్ అతడితో మాట్లాడారు.కోహ్లి గురించి కూడా చర్చ.. కానీఇక విరాట్ కోహ్లి గురించి చర్చకురాగా.. మేనేజ్మెంట్ కూడా అతడితో మాట్లాడినట్లు తెలిసింది. అయితే, అతడి భవిష్యత్తుకు ఇప్పట్లో ఢోకా లేనట్లే అనిపిస్తోంది’’ అని పేర్కొన్నాయి. కాగా ద్వైపాక్షిక సిరీస్‌లలో టీమిండియాకు తిరుగులేని విజయాలు అందించడంతో పాటు ఐసీసీ టోర్నీల్లోనూ గొప్పగా రాణించిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ పేరొందాడు.ఏకైక సారథిగా అరుదైన ఘనతగతేడాది అతడి కెప్టెన్సీలో టీమిండియా టీ20 ప్రపంచకప్-2024లో చాంపియన్‌గా నిలిచింది. అనంతరం అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రోహిత్ వీడ్కోలు పలకగా.. విరాట్ కోహ్లి కూడా అతడి బాటలో నడిచాడు. ప్రస్తుతం ఈ దిగ్గజ బ్యాటర్లు వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్నారు. ఇటీవల ఇంగ్లండ్‌తో సిరీస్‌లో శతకం బాది రోహిత్.. చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌పై సెంచరీ కొట్టి కోహ్లి వన్డేల్లో ఫామ్‌లోకి వచ్చారు. అయితే, టెస్టుల్లో మాత్రం వారి వైఫల్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను ఫైనల్‌కు చేర్చడం ద్వారా ఇంత వరకు ఏ కెప్టెన్‌కూ సాధ్యం కాని ఘనతను రోహిత్ శర్మ సాధించాడు. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్, టీ20 ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీ టోర్నీల్లో తమ జట్టును ఫైనల్‌కు తీసుకువెళ్లిన ఏకైక కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు. ఇక ఇటీవల ఆసీస్‌తో సెమీస్ మ్యాచ్‌లో విజయానంతరం గంభీర్‌కు రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి ప్రశ్నలు ఎదురుకాగా.. తమ కెప్టెన్ అద్భుతమైన టెంపోతో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇలాంటి విషయాలపై తానేమీ మాట్లాడలేనన్నాడు.చదవండి: Steve Smith: కోహ్లికి ముందే తెలుసు! -
CT 2025 Final IND vs NZ: విజేతను తేల్చేది ఆ ఇద్దరే!
ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) క్రికెట్ టోర్నమెంట్లో టీమిండియాను ఢీ కొట్టేందుకు న్యూజిలాండ్ సిద్ధంగా ఉంది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో బుధవారం జరిగిన రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టులోని భారత సంతతి బ్యాటర్ రచిన్ రవీంద్ర(Rachin Ravindra), మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్(Kane Williamson) సెంచరీలు సాధించారు.రికార్డ్-బ్రేకర్ల మధ్య ఉత్కంఠమైన పోటీఇక టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఫైనల్‌కు రంగం సిద్ధమైన నేపథ్యంలో ఓ ఆసక్తికర పోటీ చూడబోతున్నాం. ఫ్యాబ్ ఫోర్లో భాగమైన కేన్ విలియమ్సన్ , విరాట్ కోహ్లీ.. ఇద్దరూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. అనేక రికార్డులు బద్దలు కొడుతున్నారు. మార్చి 9 ఆదివారం జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఈ ఇద్దరు గొప్ప బ్యాటర్ల మధ్య జరిగే పోటీని ప్రధాన పోరుగా అభివర్ణించవచ్చు.ఎందుకంటే జట్టులో వీరిద్దరిదీ బాధ్యత ఒక్కటే. తమ జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒక వైపు దృఢంగా నిలబడడం లేదా కాపు కాయడం. పరుగుల ప్రవాహాన్ని కొనసాగించడం. దీని ద్వారా ప్రత్యర్థి బౌలర్లకు బ్యాటర్‌పై పట్టు సాధించుకుండా నిరోధించడం. ఇందుకోసం వీరిద్దరూ ఆఖరి ఓవర్ వరకూ బ్యాటింగ్ చేయాలని చూస్తారు. విజేతను తేల్చేది ఆ ఇద్దరే!ఈ ప్రయత్నం లో వీరిద్దరూ సఫలమైతే వారి జట్టుకి గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. దీంతో వీరిద్దరూ వారి జట్లలో ఎంత ప్రాముఖ్యం ఉందో అర్థమైపోతుంది.ఇక మంగళవారం దుబాయ్‌లో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో 36 ఏళ్ల విరాట్ కోహ్లీ ఆడిన తీరు అందరికీ తెలిసిందే. కోహ్లీ ఎంతో నింపాదిగా ఆడి భారత్ ఇన్నింగ్స్ కి వెన్నెముక గా నిలిచాడు. కోహ్లీ.. శ్రేయస్ అయ్యర్, ఆ తర్వాత కేఎల్ రాహుల్‌లతో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.కివీస్ విజయంలో కేన్ పాత్రదక్షిణాఫ్రికా తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో కూడా కేన్ అదే రీతిలో ఆడాడు. విలియమ్సన్, రచిన్ రవీంద్ర ఇద్దరూ సెంచరీలు సాధించి తమ జట్టు 362/6 పరుగుల భారీ స్కోరును చేరుకోవడానికి సహాయపడ్డారు. రవీంద్ర 108 పరుగులు చేయగా, విలియమ్సన్ తన 102 పరుగులు సాధించాడు. ఈ జంట రెండవ వికెట్‌కు ఏకంగా 164 పరుగులు జోడించి దక్షిణాఫ్రికాను కోలుకోలేని దెబ్బ కొట్టారు.ఈ ఇన్నింగ్స్ లో భాగంగా 34 ఏళ్ల కేన్ విలియమ్సన్ 19000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేశాడు. ఈ రికార్డును సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్‌గా ఖ్యాతి వహించాడు. విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ (432 ఇన్నింగ్స్), బ్రియాన్ లారా (433 ఇన్నింగ్స్) తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లో ఈ రికార్డ్ ని వేగవంతంగా సాధించిన వారిలో విలియమ్సన్ నాలుగో వాడు. ఈ ఘనతను నమోదు చేయడానికి న్యూజిలాండ్ దిగ్గజం 440 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. అతను వన్డే ల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్మన్ల ల లో 16వ స్థానంలో ఉన్నాడు.వన్డేల్లో విరాట్ కోహ్లీభారత్ ‘రన్ మెషిన్’గా ప్రసిద్ధి చెందిన విరాట్ కోహ్లీ 301 వన్డే మ్యాచ్‌ల్లో సగటు 58.11 సగటుతో 14,180 పరుగులు చేశాడు, ఇందులో 51 సెంచరీలు మరియు 74 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ స్ట్రైక్ రేట్ 93.35.వన్డేల్లో కేన్ విలియమ్సన్ఎప్పడూ ప్రశాంతంగా, నిబ్బరంగా బ్యాటింగ్ చేసే విలియమ్సన్ 172 వన్డే మ్యాచ్‌లు ఆడాడు, ఇందులో అతను 49.47 సగటు తో 81.72 స్ట్రైక్ రేట్‌తో 7,224 పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలు మరియు 47 అర్ధ సెంచరీలు ఉన్నాయి.ఈ ఇద్దరు స్టార్లలో ఎవరు ఫైనల్లో పైచేయి సాధిస్తారన్న దాని పైనే టైటిల్ విజేత నిర్ణయించబడుతుందనడం లో సందేహం లేదు. గణాంకాల ఆధారంగా చుస్తే విరాట్ కోహ్లీ మరింత ఆధిపత్యం చెలాయించే అవకాశం కనిపిస్తుంది. కానీ మ్యాచ్ ఫైనల్ మలుపులు తిరుగుతూ ఉత్కంఠంగా సాగడం ఖాయం. మరి ఫైనల్ మ్యాచ్ లో వీరిద్దరి లో ఎవరు మెరుస్తారో మ్యాచ్ రోజున స్పష్టంగా తెలుస్తుంది.చదవండి: అతడిని స్పేర్ టైర్ కంటే దారుణంగా వాడుతున్నారు: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
Steve Smith: కోహ్లికి ముందే తెలుసు!
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్(Steve Smith) వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికి.. తన అకస్మాత్ నిర్ణయంతో అభిమానులకు షాకిచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో భారత్ చేతిలో ఆసీస్ పరాజయం అనంతరం స్మిత్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. అయితే, యాభై ఓవర్ల ఫార్మాట్ నుంచి తప్పుకొన్నా... టెస్టులు, టీ20ల్లో కొనసాగాలనుకుంటున్నట్లు 35 ఏళ్ల స్మిత్ వెల్లడించాడు.అయితే, స్మిత్ తన రిటైర్మెంట్(ODI Retirement) నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే కంటే ముందే.. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి(Virat Kohli)కి ఈ విషయం గురించి చెప్పినట్లు తెలుస్తోంది. సెమీ ఫైనల్లో ఆసీస్‌పై భారత్ విజయానంతరం ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకుంటున్న వేళ స్మిత- కోహ్లి ముఖాలు దిగాలుగా కనిపించాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇదే చివరి మ్యాచా?ఈ క్రమంలో.. ‘‘ఇదే చివరి మ్యాచా?’’ అని కోహ్లి అడుగగా.. ‘అవును’ అంటూ స్మిత్ సమాధానమిచ్చాడని.. వారి మధ్య జరిగిన సంభాషణ ఇదేనంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మైదానంలో ప్రత్యర్థులే అయినా కోహ్లి- స్మిత్ మధ్య వ్యక్తిగతంగా ఉన్న స్నేహబంధానికి ఇదే నిదర్శనమని పేర్కొంటున్నారు. కొన్నిసార్లు చిలిపిగా వ్యవహరించినా క్రీడా స్ఫూర్తిని చాటడంలో.. ఆటగాళ్లకు తగిన గౌరవం ఇవ్వడంలో కింగ్‌కు మరెవరూ సాటిరారని కోహ్లిని కొనియాడుతున్నారు.నాడు స్మిత్‌కు కోహ్లి మద్దతుకాగా నవతరం ఫ్యాబ్ ఫోర్(కోహ్లి, విలియమ్సన్, స్మిత్, రూట్)లో విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. మైదానంలో నువ్వా- నేనా అన్నట్లుగా తలపడే ఈ ఇద్దరు పరస్పరం ప్రశంసలు కురిపించుకోవడంలోనూ ముందే ఉంటారు. కోహ్లి వంటి గొప్ప ఆటగాడిని తాను చూడలేదని.. అతడంటే తనకు ఎంతో గౌరవమని స్మిత్ పలు సందర్భాల్లో వెల్లడించాడు.ఇక వరల్డ్ కప్-2019లో టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ సమయంలో స్మిత్‌ను ప్రేక్షకులు ‘చీటర్’ అంటూ గేళి చేయగా.. బ్యాటింగ్ చేస్తున్న కోహ్లి బౌండరీ వద్దకు వచ్చి అలా చేయవద్దని వారించాడు. అంతేకాదు.. స్మిత్ భుజంపై చేయి వేసి మద్దతు పలికాడు. దీంతో ప్రేక్షకులు కూడా సంయమనం పాటించారు.5,800 పరుగులుఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో... చాంపియన్స్ ట్రోఫీలో అతడి స్థానంలో స్మిత్ కంగారూ జట్టుకు సారథ్యం వహించాడు. 2010లో వెస్టిండీస్‌పై వన్డే అరంగేట్రం చేసిన స్మిత్... కెరీర్లో ఇప్పటి వరకు 170 మ్యాచ్‌లాడి 43.28 సగటుతో 5,800 పరుగులు చేశాడు. అందులో 12 సెంచరీలు, 35 హాఫ్‌సెంచరీలు ఉన్నాయి. గొప్ప ప్రయాణంఇక 2015, 2023 వన్డే ప్రపంచకప్‌లు గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో కీలక సభ్యుడైన స్మిత్... బంతితో 28 వికెట్లు పడగొట్టాడు. లెగ్‌స్పిన్నర్‌గా జట్టులోకి వచ్చిన స్టీవ్ స్మిత్... ఆ తర్వాత నెమ్మదిగా ఆల్‌రౌండర్‌గా... ఆపై టాపార్డర్ బ్యాటర్‌గా... అటు నుంచి స్టార్ ప్లేయర్‌గా ఎదిగాడు. ‘ఇది చాలా గొప్ప ప్రయాణం. ప్రతి నిమిషాన్ని ఆస్వాదించా. ఈ ఫార్మాట్లో ఎన్నో అద్భుత జ్ఞాపకాలు ఉన్నాయి. రెండు ప్రపంచకప్‌లు గెలవడం ఎప్పటికీ మరవలేను. ఎంతో మంది గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడా’ అని స్మిత్ పేర్కొన్నాడు.అందుకే రిటైర్ అయ్యానుకాగా 2027 వన్డే ప్రపంచకప్‌నకు జట్టును సిద్ధం చేసుకునేందుకు టీమ్ మేనేజ్మెంట్కు తగినంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతోనే వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. ‘ఇంకా నాలో చాలా క్రికెట్ మిగిలే ఉంది. అయితే మరో రెండేళ్లలో వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో జట్టును సిద్ధం చేసుకునేందుకు మేనేజ్మెంట్కు సమయం దక్కుతుంది. టెస్టులు, టీ20ల్లో అవకాశం కల్పిస్తే తప్పక జట్టు విజయాల కోసం కృషి చేస్తా’ అని స్మిత్ అన్నాడు. చదవండి: అదే మా కొంపముంచింది... లేదంటే విజయం మాదే: స్టీవ్ స్మిత్YOU MISS, I HIT! 🎯Shami strikes big, sending the dangerous Steve Smith back to the pavilion with a stunning delivery! 🤯#ChampionsTrophyOnJioStar 👉 #INDvAUS | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2 & Sports18-1!📺📱 Start Watching FREE on… pic.twitter.com/cw9RB77Ech— Star Sports (@StarSportsIndia) March 4, 2025 -
ఒకడే ఒక్కడు మొనగాడు
ఆస్ట్రేలియాతో భారత్ మ్యాచ్ ఎప్పుడూ రసవత్తరంగా సాగుతుంది. అదీ నాకౌట్ దశలో ఆడే మ్యాచ్ మరింత క్లిష్టతరంగా ఉంటుంది. ఇందుకు చివరివరకూ పోరాడే ఆస్ట్రేలియా నైజం, వారి పోరాట తత్త్వం ప్రధాన కారణాలు. సాధారణముగా ఈ విషయం లో భారత్‌పై ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా దే పైచేయిగా నిలిచింది. ముఖ్యంగా భారత్‌లో జరిగిన 2023 వరల్డ్ కప్ ఫైనల్ , అదే సంవత్సరం ఇంగ్లండ్‌లో జరిగిన టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఒక నిదర్శనం. ఈ రెండిటిని లోనూ ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ ప్రధాన భూమిక వహించాడు.కోహ్లీ విభిన్నమైన ఇన్నింగ్స్అయితే, మంగళవారం దుబాయ్ వేదిక పై జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఇందుకు భిన్నమైనిది. అందుకు ప్రధాన కారణం 36 ఏళ్ల భారత్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. కోహ్లీ ఆడిన తీరు భారత్ క్రికెట్ అభిమానులకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కోహ్లీ లో అసాధారణ పరిణతి కనిపించింది. ఎక్కడా తడబాటు లేదు. పెద్ద షాట్లు కొట్టి ఆస్ట్రేలియా వాళ్లకి అవకాశం ఇవ్వకూడదనే దృఢ సంకల్పంతో సింగిల్స్ కోసం చిన్నపిల్లల వాడిలాగా పరిగెడుతూనే ఉన్నాడు.ఎక్కడా అలసట లేదు. అలసత్వం లేదు. ఇక్కడ ముఖ్యంగా గమినించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అందులో ప్రధానమైనది కోహ్లీ వయ్యస్సు. కోహ్లీ దుబాయ్ ఎండలో మధ్యానమంతా ఫీల్డింగ్ చేసాడు. ఇక కోహ్లీ ఫీల్డ్ లో ఎలా ఉంటాడో చెప్పనవసరం లేదు. ఒక మెరుపు తీగలాగా, పాదరసం లాగా మైదానమంతా కళయదిరగడం, తోటి ఆటగాళ్ళని ఉత్సహాబారచడం కోహ్లీ కి అలవాటు.కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ కీలక భాగస్వామ్యం265 పరుగుల విజయ లక్ష్యం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కొద్దిగా దూకుడుగా ఆడినా కెప్టెన్ రోహిత్ శర్మ మరియు శుభ్‌మాన్ గిల్ త్వరితగతిన ఔటవ్వడంతో పవర్‌ప్లే ముగిసే సమయానికి భారత్ 55/2తో ఉంది. ఆ దశలో జత కలిసిన కోహ్లీ మరియు శ్రేయాస్ అయ్యర్ 91 పరుగుల కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చాలా పరిణతితో ఆడారు. ఎక్కడా ఆస్ట్రేలియా బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. ఆస్ట్రేలియా ఫీల్డ్ ప్లేసిమెంట్లను జల్లెడ పట్టారు. గాప్స్ లో కొడుతూ ప్రధానంగా సింగిల్స్ పైనే దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా బౌలర్లకు ఎలాంటి అవకాశం రాలేదు. బ్యాటర్ తప్పిదాలు చేస్తేనే కదా ప్రత్యర్థికి అవకాశం.అలాంటిది షాట్లు కొట్టకుండా నిబ్బరంగా ఆడుతుంటే ఆస్ట్రేలియా బౌలర్లకు ఒక దశలో ఏమి చేయాలో తెలియకుండా పోయింది. భారత్ మాత్రం విజయం దశగా పరుగు తీసింది. ఈ మ్యాచ్ కోహ్లీ మాస్టర్ స్ట్రోక్ కి మచ్చు తునక గా నిలిచిపోతుంది.సచిన్ టెండూల్కర్ రికార్డుబ్రేక్అవసరమైన పక్షంలో విజృన్భించి ఆడగల బ్యాటర్ జట్టులో ఉన్నందునే కోహ్లీకి ఈ అవకాశం దక్కిందండంలో సందేహం లేదు. తెలివైన స్ట్రైక్ రొటేషన్ మరియు సకాలంలో బౌండరీలతో కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ భారత్ ఇన్నింగ్స్‌ను స్థిరపరిచారు. 25వ ఓవర్లో కోహ్లీ తన అర్ధ సెంచరీని సాధించాడు. విరాట్ కోహ్లీ, 98 బంతుల్లో 84 పరుగులు చేసి ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో అత్యధికంగా 50+ స్కోర్లు సాధించిన సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. ఇప్పుడు కోహ్లీ ఖాతాలో 24 అర్థసెంచరీలు ఉండగా, సచిన్ సాధించిన 23 అర్థసెంచరీల మైలురాయి ని అధిగమించాడు.కోహ్లీ క్రూయిజ్ మోడ్ బ్యాటింగ్కోహ్లీ ఇన్నింగ్స్ ఒక విషయాన్నీ స్పష్టం చేసింది. వన్డే ఫార్మాట్లో అతని నైపుణ్యం ఒక దశకు చేరుకుంది. కోహ్లీ ఇప్పుడు ఎటువంటి అనవసరమైన ఒత్తిడి లేకుండా హైవే పై పరుగు తీసే క్రూయిజ్ మోడ్ లో ఉండే కారు లాగా సునాయాసంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. "నేను ఎక్కడా తొందరపడలేదు. చాల ప్రశాంతంగా బ్యాటింగ్ చేశాను. ఒక్క సింగిల్స్ తో ఇన్నింగ్స్ ని అలా నిర్మించడం నాకు చాలా సంతోషకరంగా ఉంది" అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. కోహ్లీ ఇప్పుడు 106 ఇన్నింగ్స్‌లలో 5999 పరుగులు చేసి భారత్ విజయలక్ష్య సాధన లో పరుగులు సాధించిన బ్యాటర్లలో అగ్రస్థానంలో నిలిచాడు.ఈ మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ విరాట్ కోహ్లీ పై ప్రశంసలు కురిపించాడు. " కోహ్లీ మరో సారి తన ప్రతిభని చాటి చెప్పాడు. పరిస్థితులను అద్భుతంగా అంచనా వేశాడు. ఒక క్లాస్ ప్లేయర్ అయిన అతనికి తన జట్టుకు ఏమి అవసరమో మరియు మ్యాచ్ ని గెలవడానికి సరిగ్గా ఎలా ఆడాలో దిశా నిర్దేశం చేసాడు. ముందుండి జట్టుని నడిపించాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సాధించిన సెంచరీ తో ఈ విషయం స్పష్టమైంది. మళ్ళీ కోహ్లీ అదే ఇన్నింగ్స్ ని పునరావృతం చేసాడు. వన్డేలలో మొనగాడని మరోసారి నిరూపించుకున్నాడు’’ అని క్లార్క్ విరాట్ కోహ్లీని ప్రశంసించాడు.చదవండి: కోహ్లి పైపైకి.. పడిపోయిన రోహిత్ శర్మ ర్యాంకు -
కోహ్లి పైపైకి.. పడిపోయిన రోహిత్ శర్మ!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ముందుకు దూసుకువచ్చాడు. ఆరు నుంచి నాలుగో స్థానానికి ఎగబాకాడు. మరోవైపు.. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం తన మూడో ర్యాంకు కోల్పోయాడు.కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా అదరగొడుతున్న విషయం తెలిసిందే. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను ఓడించి గ్రూప్-‘ఎ’ టాపర్‌గా సెమీ ఫైనల్‌కు చేరింది భారత్. దుబాయ్‌లో మంగళవారం జరిగిన సెమీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకువెళ్లింది.నిరాశపరిచిన రోహిత్ఇక ఈ మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma- 28) నిరాశపరచగా.. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి మాత్రం అద్భుత అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. 98 బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో 84 పరుగులు చేసి జట్టు విజయానికి బాటలు వేశాడు. మిగతా వాళ్లలో శ్రేయస్ అయ్యర్(45), వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్(42 నాటౌట్) రాణించారు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో ఆసీస్ విధించిన 265 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో పదకొండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.నాలుగో స్థానానికిఇదిలా ఉంటే.. ఆసీస్‌తో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కారణంగా.. ఐసీసీ ప్రకటించిన తాజా వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో కోహ్లి అదరగొట్టాడు. 747 రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఇక టీమిండియా మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఆసీస్‌తో మ్యాచ్‌లో విఫలమైనా(8) తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మరోవైపు.. రోహిత్ మూడు నుంచి ఐదో ర్యాంకుకు పడిపోయాడు.ఇదిలా ఉంటే.. ఐసీసీ మెన్స్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ అక్షర్ పటేల్ దుమ్ములేపాడు. ఏకంగా 17 స్థానాలు ఎగబాకి 13వ ర్యాంకు సాధించాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌లో శ్రీలంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ టాప్‌లో కొనసాగుతుండగా.. సౌతాఫ్రికా స్పిన్ బౌలర్ కేశవ్ మహరాజ్ రెండు స్థానాలు మెరుగుపరచుకుని రెండో స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు.. న్యూజిలాండ్ స్టార్ మ్యాట్ హెన్రీ మూడు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంకులో నిలిచాడు.ఐసీసీ మెన్స్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే1. శుబ్‌మన్ గిల్(ఇండియా)- 791 రేటింగ్ పాయింట్లు2. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 770 రేటింగ్ పాయింట్లు3. హెన్రిచ్ క్లాసెన్(సౌతాఫ్రికా)- 760 రేటింగ్ పాయింట్లు4. విరాట్ కోహ్లి(ఇండియా)- 747 రేటింగ్ పాయింట్లు5. రోహిత్ శర్మ(ఇండియా)- 745 రేటింగ్ పాయింట్లు.చదవండి: శుబ్‌మన్ గిల్ చేసిన ‘తప్పు’..! టీమిండియాకు శాపమయ్యేది! ఎందుకంటే.. -
నేను ఎంతగానో చెప్పాను.. అయినా నా మాట కోహ్లి వినలేదు: రాహుల్
భారత క్రికెట్ జట్టు రెండో సారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను ముద్దాడేందుకు అడుగు దూరంలో నిలిచింది.ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో భారత్ అడుగుపెట్టింది. మంగళవారం దుబాయ్ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో ఆసీస్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. తమ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఆసీస్ నిర్ధేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 48.1 ఓవర్లలో చేధించింది. కాగా భారత్ విజయంలో విరాట్ కోహ్లి కీలక పాత్ర పోషించాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి.. తృటిలో తన 52వ వన్డే సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 98 బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో 84 పరుగులు చేసిన కోహ్లి.. జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించాడు.అప్పటివరకు ఆచితూచి ఆడుతున్న కోహ్లి అనూహ్యంగా ఔట్ అవ్వడంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. నాన్‌స్ట్రైక్‌లో ఉన్న కేఎల్ రాహుల్ సైతం నిరాశచెందాడు. నేను కొడుతున్నా కదా భయ్యా అన్నట్లు రాహుల్ రియాక్షన్ ఇచ్చాడు. అయితే దీనిపై మ్యాచ్ అనంతరం రాహుల్ స్పందించాడు."నేను క్రీజులోకి వచ్చాక పది పన్నేండు బంతులు ఆడాక కోహ్లి వద్దకు వెళ్లి కాసేపు మాట్లాడాను. ఆఖరి వరకు క్రీజులోనే ఉండాలని తనకు చెప్పాను. నేను రిస్క్ తీసుకుని షాట్లు ఆడుతాను, ఏదో ఒక ఓవర్‌ను టార్గెట్ చేస్తాను అని చెప్పా. ఎందుకుంటే ఆ సమయంలో మాకు ఓవర్‌కు 6 పరుగులు మాత్రమే అవసరం. కానీ ఈ వికెట్‌పై ఓవర్‌కు ఎనిమిది పరుగులు సులువగా సాధించవచ్చు అన్పించింది. ఓవర్‌కు ఒక్క బౌండరీ వచ్చినా చాలు. కాబట్టి ఆ రిస్క్ నేను తీసుకుంటూ, నీవు కేవలం స్ట్రైక్ రోటేట్ చేస్తే చాలు అని చెప్పాను. కానీ కోహ్లి నా మాట వినలేదు. భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. బహుశా బంతి స్లాట్‌లో ఉందని భావించి ఆ షాట్ ఆడిండవచ్చు. కానీ షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో మైదానం వీడాల్సి వచ్చింది" అని రాహుల్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.చదవండి: అదే మా కొంపముంచింది... లేదంటే విజయం మాదే: స్టీవ్ స్మిత్ -
గెలిపించినందుకు థాంక్యూ భయ్యా.. రాహుల్‌ను హగ్ చేసుకున్న ఫ్యాన్ (ఫొటోలు)
-
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను భారత్ చిత్తు చేసింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ సెమీస్ పోరులో 4 వికెట్ల తేడాతో ఆసీస్‌ను ఓడించిన భారత్.. తమ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. 265 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 48.1 ఓవర్లలో చేధించింది. భారత విజయంలో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి కీలక పాత్రపోషించాడు.లక్ష్య చేధనలో కోహ్లి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. 98 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 5 ఫోర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. అతడితో పాటు కేఎల్ రాహుల్(34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42 నాటౌట్), హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 28) సత్తాచాటారు.ఆసీస్ బౌలర్లలో ఎల్లీస్, జంపా రెండు వికెట్లు పడగొట్టగా.. బెన్ ద్వార్షుయిస్, కొన్నోలీ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 రన్స్ కు ఆలౌటైంది. భారత బౌలర్లలలో మహ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్, జడేజా చెరో రెండు వికెట్లు తీశారు. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(96 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్ తో 73) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అలెక్స్ కేరీ(61) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.టీమిండియా ప్రపంచ రికార్డు..ఇక ఈ విజయంతో టీమిండియా పలు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది. ఇక ఈ విజయంతో టీమిండియా పలు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది. చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో వరుసగా మూడుసార్లు (2013, 2017, 2025) ఫైనల్లోకి ప్రవేశించిన తొలి జట్టుగా భారత్ నిలిచింది.గతంలో ఆస్ట్రేలియా 2006 2009లో బ్యాక్-టు-బ్యాక్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ ఆడింది. అదేవిధంగా ఐసీసీ టోర్నీలలో అత్యధికంగా ఫైనల్‌కు చేరుకున్న జట్టుగా టీమిండియా రికార్డులకెక్కింది. భారత్ ఐసీసీ టోర్నీల్లో ఫైనల్‌కు చేరడం ఇది 14వ సారి కావడం గమనార్హం. ఇప్పటివరకు ఈ రికార్డు వరల్డ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా(13) పేరిట ఉండేది. తాజా విజయంతో ఆసీస్ ఆల్‌టైమ్ రికార్డును భారత్ బ్రేక్ చేసింది.చదవండి: ఆఖరి వరకు ఏమీ చెప్పలేం.. వారిద్దరి వల్లే ఈ విజయం: రోహిత్ శర్మ -
రికార్డుల కంటే జట్టు గెలవడమే నాకు ముఖ్యం: విరాట్ కోహ్లి
ప్రపంచ క్రికెట్లో అతడొక రారాజు. తన ముందు ఉన్న ఎంతటి లక్ష్యమున్న వెనకడుగేయని ధీరుడు. కొండంత లక్ష్యాన్ని అలోవకగా కరిగించే ఛేజ్ మాస్టర్. ఐసీసీ టోర్నమెంట్లు అంటే పరుగులు వరద పారించే రన్ మిషన్ అతడు. అతడే టీమిండియా లెజెండ్ విరాట్ కోహ్లి. ఐసీసీ ఈవెంట్లలో తనకు ఎవరూ సాటి రారాని కోహ్లి మరోసారి నిరూపించుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీఫైనల్లో కోహ్లి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 264 పరుగుల లక్ష్యచేధనలో పవర్ ప్లేలోనే ఓపెనర్లు వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. ఈ దశలో కింగ్ కోహ్లి బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి భారత్‌ను విజయం దిశగా నడ్పించాడు.అయితే భారత్ విజయానికి మరో 39 పరుగులు కావాల్సిన దశలో ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి కోహ్లి ఔటయ్యాడు. 98 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 5 ఫోర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. అతడి అద్బుత ఇన్నింగ్స్ ఫలితంగా ఆసీస్‌ను 4 వికెట్ల తేడాతో భారత్ ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది.జస్ట్ సెంచరీ మిస్..కాగా కేవలం 16 పరుగుల దూరంలో తన 52వ వన్డే సెంచరీ చేసే అవకాశాన్ని కింగ్ కోహ్లి కోల్పోయాడు. అయితే కోహ్లి సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోవడంతో తన సహచర ఆటగాళ్లతో పాటు అభిమానులు నిరాశచెందారు.ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయమే తనకు ముఖ్యమని కోహ్లి చెప్పుకొచ్చాడు. "పాకిస్తాన్‌పై ఎలా లక్ష్యాన్ని ఛేదించామో ఇది కూడా దాదాపు అదే తరహాలో సాగింది. అప్పుడు సెంచరీ చేసినా ఏడు ఫోర్లే కొట్టాను. పరిస్థితులను అర్థం చేసుకోవడమే అన్నింటికంటే ముఖ్యం. దాని ప్రకారమే నా వ్యూహం సాగుతుంది. స్ట్రయిక్ రొటేట్ చేయడం కూడా అలాంటిదే.ఇలాంటి పిచ్‌పై భాగస్వామ్యాలు నెలకొల్పడం కీలకం. బౌండరీలతో వేగంగా ఆటను ముగించే ప్రయత్నంలో నేను వెనుదిరిగా. కొన్నిసార్లు అనుకున్న ప్రణాళికలు పని చేయవు. క్రీజులో పరుగుల కోసం నేను తొందరపడలేదు. అదే నా ఇన్నింగ్స్‌లో నాకు నచ్చిన విషయం. సింగిల్స్ తీయడాన్ని కూడా ప్రాధాన్యతగా భావిస్తేనే మంచి క్రికెట్ ఆడుతున్నట్లు లెక్క. ఇక ఎలాంటి ఒత్తిడి లేదు. లక్ష్యం దిశగా వెళుతున్నామని అప్పుడే అర్థమవుతుంది. ఇలాంటి నాకౌట్ మ్యాచ్‌లలో చేతిలో వికెట్లు ఉంటే ప్రత్యర్థి కూడా ఒత్తిడిలో సునాయాసంగా పరుగులు ఇచ్చేస్తుంది. అప్పుడు మన పరిస్థితి మరింత సులువవుతుంది. ఓవర్లు, చేయాల్సిన పరుగుల గురించి స్పష్టత ఉంటే చాలు. రన్‌రేట్ ఆరు పరుగులకు వచ్చినా సమస్య ఉండదు. ఎందుకంటే ఈ సమయంలో వికెట్లు తీస్తేనే ప్రత్యర్ధులకు అవకాశం దక్కుతుంది తప్ప నిలదొక్కుకున్న బ్యాటర్లను వారు అడ్డుకోలేరు. ఈ దశలో మైలురాళ్లు నాకు ఏమాత్రం ముఖ్యం కాదు. సెంచరీ సాధిస్తే మంచిదే. లేకపోతే విజయం దక్కిన ఆనందం ఎలాగూ ఉంటుంది. డ్రెస్సింగ్ రూమ్‌లో సంబరాలు ఉంటాయి. ఏం చేసినా ఒదిగి ఉండి మళ్లీ సాధన చేయడం, జట్టును గెలిపించేందుకు మళ్లీ కొత్తగా బరిలోకి దిగడమే నాకు తెలిసింది. ఇప్పటికీ అదే చేస్తున్నాను" అని ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ విరాట్ కోహ్లి పేర్కొన్నాడు.చదవండి: ఆఖరి వరకు ఏమీ చెప్పలేం.. వారిద్దరి వల్లే ఈ విజయం: రోహిత్ శర్మ -
IND Vs AUS: ఆస్టేలియాను కొట్టేశారు... ఫైనల్లో భారత్
కంగారేమీ లేదు... అంతా మన నియంత్రణలోనే సాగింది... ఆస్ట్రేలియాతో ఐసీసీ నాకౌట్ మ్యాచ్ అనగానే పెరిగే ఉత్కంఠ, ఒత్తిడి అన్నింటినీ టీమిండియా అధిగమించేసింది... ఎప్పటిలాగే టాస్ ఓడిపోవడం మినహా 11 బంతుల ముందే మ్యాచ్ ముగించే వరకు భారత్ అన్ని విధాలుగా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ముందు పదునైన బౌలింగ్‌తో... ఆపై చక్కటి బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియాను పడగొట్టి చాంపియన్స్ ట్రోఫీలో ఆఖరి సమరానికి అర్హత సాధించింది.265 పరుగుల లక్ష్యం... చాంపియన్స్ ట్రోఫీ గత రెండు మ్యాచ్‌లలో భారత్ ఛేదించిన స్కోర్లతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ. బ్యాటింగ్ సాగుతున్నకొద్దీ పిచ్ నెమ్మదిస్తోంది. అయితేనేమి... కోహ్లి తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో క్లాస్ ఆటతీరుతో అలవోకగా పరుగులు రాబడుతూ జట్టును నడిపించాడు. ఆరంభంలో రోహిత్, ఆపై అయ్యర్, రాహుల్, పాండ్యా... ఇలా అంతా అండగా నిలవడంతో గెలుపు భారత్ దరిచేరింది. ఆసీస్ ఆట సెమీఫైనల్లోనే ముగిసింది. 2017 చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ చేరిన భారత్ తుది పోరులో పాకిస్తాన్ చేతిలో ఓడింది. ఆ తర్వాత మూడు ఐసీసీ వన్డే టోర్నీల్లోనూ కనీసం సెమీస్ లేదా ఫైనల్‌కు చేరి తమ స్థాయిని చూపించింది. మధ్యలో గెలిచిన టి20 వరల్డ్ కప్ దీనికి అదనం. ఇప్పుడు మరో టైటిల్ వేటలో టీమిండియా ప్రత్యర్థి ఎవరో నేడు తేలనుంది. ఇదే జోరు కొనసాగిస్తే 2013 తరహాలోనే అజేయ ప్రదర్శనతో మళ్లీ మనం చాంపియన్స్ కావడం ఖాయం! దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మూడోసారి భారత్ ఫైనల్ చేరింది. గత టోర్నీ రన్నరప్ అయిన టీమిండియా ఈసారి అజేయ ప్రదర్శనతో తుది పోరుకు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియాను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ్రస్టేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (96 బంతుల్లో 73; 4 ఫోర్లు, 1 సిక్స్), అలెక్స్ కేరీ (57 బంతుల్లో 61; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. షమీ 3 వికెట్లు పడగొట్టగా... రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 48.1 ఓవర్లలో 6 వికెట్లకు 267 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విరాట్ కోహ్లి (98 బంతుల్లో 84; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా... శ్రేయస్ అయ్యర్ (62 బంతుల్లో 45; 3 ఫోర్లు), కేఎల్ రాహుల్ (34 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. నేడు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఆదివారం దుబాయ్‌లోనే జరిగే ఫైనల్లో భారత్ తలపడుతుంది. రాణించిన స్మిత్... హెడ్ మరోసారి భారత బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. ‘సున్నా’ వద్ద ఇచి్చన రిటర్న్ క్యాచ్‌ను షమీ అందుకోలేకపోవడంతో అతను బతికిపోగా, మరో ఎండ్‌లో కూపర్ కనోలీ (9 బంతుల్లో 0) విఫలమయ్యాడు. పాండ్యా ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన హెడ్, షమీ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదాడు. దాంతో ఆరో ఓవర్లోనే భారత్ స్పిన్నర్ కుల్దీప్ను బౌలింగ్‌కు దింపింది. మరో మూడు ఓవర్ల తర్వాత భారత్ అసలు ఫలితం సాధించింది.వరుణ్ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతినే భారీ షాట్ ఆడబోయి హెడ్ లాంగాఫ్‌లో గిల్‌కు క్యాచ్ ఇవ్వడంతో జట్టు ఊపిరి పీల్చుకుంది. మరోవైపు స్మిత్ సాహసాలకు పోకుండా జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. అతనికి కొద్దిసేపు లబుషేన్ (36 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) సహకరించాడు. 68 బంతుల్లో స్మిత్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అయితే తక్కువ వ్యవధిలో లబుషేన్, ఇన్‌గ్లిస్ (12 బంతుల్లో 11)లను అవుట్ చేసి జడేజా దెబ్బ కొట్టాడు. ఈ దశలో స్మిత్, కేరీ భాగస్వామ్యంతో జట్టు కోలుకుంది. వీరిద్దరు కలిసి స్కోరును 200 వరకు తీసుకొచ్చారు. ఈ భాగస్వామ్యం బలపడుతున్న దశలో షమీ ఆటను మలుపు తిప్పాడు. అతని బౌలింగ్‌లో ముందుకొచ్చి షాట్ ఆడబోయిన స్మిత్ బౌల్డయ్యాడు. మ్యాక్స్‌వెల్ (5 బంతుల్లో 7; 1 సిక్స్) విఫలం కాగా, ఆసీస్ వరుసగా వికెట్లు కోల్పోయింది. చివర్లో కేరీ దూకుడుతో జట్టు మెరుగైన స్కోరు సాధించగలిగింది. కీలక భాగస్వామ్యాలు... ఛేదనలో ఆరంభంలోనే శుబ్‌మన్ గిల్ (11 బంతుల్లో 8; 1 ఫోర్) వెనుదిరగ్గా... క్రీజ్‌లో ఉన్నంత సేపు రోహిత్ శర్మ (29 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. అయితే ఓపెనర్లు వెనుదిరిగిన తర్వాత కోహ్లి, అయ్యర్ భాగస్వామ్యంతో జట్టు సురక్షిత స్థితికి చేరింది. చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేసిన వీరిద్దరు ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా టీమ్‌ను విజయం దిశగా నడిపించారు. ఈ క్రమంలో 53 బంతుల్లో కోహ్లి హాఫ్ సెంచరీ పూర్తి కాగా, అయ్యర్ దానిని చేజార్చుకున్నాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 18.3 ఓవర్లలో 91 పరుగులు జోడించారు. ఆ తర్వాత అక్షర్ పటేల్ (30 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్), రాహుల్‌లతో కోహ్లి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. 51 వద్ద మ్యాక్స్‌వెల్ క్యాచ్ వదిలేయడం కూడా కోహ్లికి కలిసొచ్చింది. చక్కటి షాట్లతో ఆకట్టుకున్న అతను టోర్నీలో మరో శతకం అందుకునేలా కనిపించాడు. అయితే విజయానికి 40 పరుగుల దూరంలో భారీ షాట్‌కు ప్రయత్నించి విరాట్ అవుటయ్యాడు. ఈ స్థితిలో హార్దిక్ పాండ్యా (24 బంతుల్లో 28; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్ ఛేదనను సులువు చేసింది. 20 బంతుల్లో 24 పరుగులు చేయాల్సి ఉండగా కొంత ఉత్కంఠ పెరిగింది. అయితే జంపా ఓవర్లో పాండ్యా రెండు వరుస సిక్సర్లు బాదగా... అతను అవుటైన తర్వాత మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో భారీ సిక్స్‌తో రాహుల్ మ్యాచ్‌ను ముగించాడు. 1 చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో వరుసగా మూడుసార్లు (2013, 2017, 2025) ఫైనల్లోకి ప్రవేశించిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. 7 ఐసీసీ వన్డే టోర్నీలలో కోహ్లికి లభించిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (10), రోహిత్ శర్మ (8) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 14 ఐసీసీ టోర్నీలలో అత్యధికంగా 14 సార్లు ఫైనల్ చేరుకున్న జట్టుగా భారత్ గుర్తింపు పొందింది. ఆస్ట్రేలియా (13)ను భారత్ వెనక్కి నెట్టింది. 746 చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో కోహ్లి (746 పరుగులు) రెండో స్థానానికి చేరాడు. తొలి స్థానంలో క్రిస్ గేల్ (791 పరుగులు), మూడో స్థానంలో జయవర్ధనే (742) ఉన్నారు. గిల్‌కు అంపైర్ వార్నింగ్ హెడ్ క్యాచ్ పట్టినప్పుడు శుబ్‌మన్ గిల్ ప్రదర్శించిన ‘అతి’ ఆనందం అంపైర్ నుంచి హెచ్చరికకు గురయ్యేలా చేసింది. క్యాచ్ అందుకోగానే కొద్ది సేపయినా తన చేతిలో ఉంచకుండా అతను బంతిని గాల్లోకి విసిరేశాడు. నిజానికి క్యాచ్ పట్టడంలో అతను ఎక్కడా తడబడలేదు. అయితే ఎంతసేపు అనే విషయంలో నిబంధనలు సరిగ్గా లేకపోయినా... కనీసం 2–3 సెకన్ల పాటు ఫీల్డర్ బంతిని తన నియంత్రణలో ఉంచుకోవాలి. ఇదే విషయాన్ని అంపైర్ ఇల్లింగ్‌వర్త్ ప్రత్యేకంగా గిల్‌కు వివరించాడు. ఇలాంటి సందర్భాల్లో అవుట్/నాటౌట్ ఇచ్చే విషయంలో అంపైర్‌కు విచక్షణాధికారం ఉంటుంది.స్మిత్ అదృష్టం అక్షర్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో అనూహ్యం చోటు చేసుకుంది. స్మిత్ డ్రైవ్ చేయగా బంతి అతడి ప్యాడ్ల మీదుగా స్టంప్స్‌ను తాకింది. అయితే బెయిల్స్ పడకపోవడంతో స్మిత్ బతికిపోయాడు. ఆపే ప్రయత్నం చేస్తే తన కాలితోనే స్టంప్స్ పడిపోతాయని భావనతో కావచ్చు స్మిత్ అలా కూడా చేయలేదు. ఆ సమయంలో అతని స్కోరు 23 పరుగులు. అతని స్కోరు 36 వద్ద ఉన్నప్పుడు షమీ బౌలింగ్‌లో బలంగా షాట్ కొట్టగా... తన ఎడమ చేత్తో క్యాచ్ పట్టే ప్రయత్నం చేసిన షమీ విఫలమయ్యాడు. అయితే ఇది చాలా కఠినమైన క్యాచ్. రోహిత్‌కు లైఫ్కెప్టెన్ రోహిత్ శర్మ 28 పరుగుల ఇన్నింగ్స్‌లో కూడా రెండుసార్లు అదృష్టం కలిసొచి్చంది. 13 పరుగుల వద్ద బ్యాక్వర్డ్ పాయింట్లో అతను ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను కనోలీ వదిలేయగా... 14 వద్ద కాస్త కష్టసాధ్యమైన క్యాచ్‌ను లబుషేన్ అందుకోలేకపోయాడు. పాకిస్తాన్‌పై ఎలా లక్ష్యాన్ని ఛేదించామో ఇది కూడా దాదాపు అదే తరహాలో సాగింది. అప్పుడు సెంచరీ చేసినా ఏడు ఫోర్లే కొట్టాను. పరిస్థితులను అర్థం చేసుకోవడమే అన్నింటికంటే ముఖ్యం. దాని ప్రకారమే నా వ్యూహం సాగుతుంది. స్ట్రయిక్ రొటేట్ చేయడం కూడా అలాంటిదే. ఇలాంటి పిచ్‌పై భాగస్వామ్యాలు నెలకొల్పడం కీలకం. బౌండరీలతో వేగంగా ఆటను ముగించే ప్రయత్నంలో నేను వెనుదిరిగా. కొన్నిసార్లు అనుకున్న ప్రణాళికలు పని చేయవు. క్రీజులో పరుగుల కోసం నేను తొందరపడలేదు. అదే నా ఇన్నింగ్స్‌లో నాకు నచ్చిన విషయం. సింగిల్స్ తీయడాన్ని కూడా ప్రాధాన్యతగా భావిస్తేనే మంచి క్రికెట్ ఆడుతున్నట్లు లెక్క. ఇక ఎలాంటి ఒత్తిడి లేదు. లక్ష్యం దిశగా వెళుతున్నామని అప్పుడే అర్థమవుతుంది. ఇలాంటి నాకౌట్ మ్యాచ్‌లలో చేతిలో వికెట్లు ఉంటే ప్రత్యర్థి కూడా ఒత్తిడిలో సునాయాసంగా పరుగులు ఇచ్చేస్తుంది. అప్పుడు మన పరిస్థితి మరింత సులువవుతుంది. ఓవర్లు, చేయాల్సిన పరుగుల గురించి స్పష్టత ఉంటే చాలు. రన్‌రేట్ ఆరు పరుగులకు వచ్చినా సమస్య ఉండదు. ఎందుకంటే ఈ సమయంలో వికెట్లు తీస్తేనే ప్రత్యర్థికి అవకాశం దక్కుతుంది తప్ప నిలదొక్కుకున్న బ్యాటర్లను వారు అడ్డుకోలేరు. ఈ దశలో మైలురాళ్లు నాకు ఏమాత్రం ముఖ్యం కాదు. సెంచరీ సాధిస్తే మంచిదే. లేకపోతే విజయం దక్కిన ఆనందం ఎలాగూ ఉంటుంది. డ్రెస్సింగ్ రూమ్‌లో సంబరాలు ఉంటాయి. ఏం చేసినా ఒదిగి ఉండి మళ్లీ సాధన చేయడం, జట్టును గెలిపించేందుకు మళ్లీ కొత్తగా బరిలోకి దిగడమే నాకు తెలిసింది. ఇప్పటికీ అదే చేస్తున్నాను. –విరాట్ కోహ్లి ఆటలో ఆఖరి బంతి పడే వరకు ఏమీ చెప్పలేం. ఆసీస్ ఇన్నింగ్స్ ముగిశాక ఇది మరీ చిన్న స్కోరేమీ కాదని, విజయం కోసం మేం చాలా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని అర్థమైంది. ఇవాళ మా బ్యాటింగ్ అన్ని రకాలుగా బాగుంది. పిచ్ కూడా మెరుగ్గా అనిపించింది. అయితే పిచ్‌పై ఎక్కువ దృష్టి పెట్టకుండా మా ఆటనే నమ్ముకున్నాం. ఆరు బౌలింగ్ ప్రత్యామ్నాయాలు, ఎనిమిదో నంబర్ వరకు బ్యాటింగ్ చేయగలవారు ఉండాలని మేం కోరుకున్నాం.దానిని బట్టే జట్టును ఎంపిక చేశాం. ఇప్పుడు ఆ ఆరుగురు బౌలర్లను సమర్థంగా వాడుకున్నాం. కోహ్లి ఎన్నో ఏళ్లుగా ఇదే తరహాలో జట్టును గెలిపిస్తూ వస్తున్నాడు. ఫైనల్‌కు ముందు ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉంటే జట్టులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే దాని గురించి అతిగా ఆలోచించడం లేదు. సమయం వచి్చనప్పుడు అంతా సరైన రీతిలో స్పందిస్తారు. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్ 4 ఐసీసీ ఈవెంట్లు... వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లలో భారత్‌ను ఫైనల్ చేర్చిన తొలి కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. 336 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక క్యాచ్‌లు తీసుకున్న భారతీయ ఫీల్డర్‌గా కోహ్లి ఘనత వహించాడు. 334 క్యాచ్‌లతో రాహుల్ ద్రవిడ్ పేరిట ఉన్న రికార్డును కోహ్లి సవరించాడు. వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు తీసుకున్న రెండో ఫీల్డర్‌గానూ కోహ్లి (161 క్యాచ్‌లు) నిలిచాడు. శ్రీలంక ప్లేయర్ మహేళ జయవర్ధనే (218 క్యాచ్‌లు) తొలి స్థానంలో ఉన్నాడు. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: హెడ్ (సి) గిల్ (బి) వరుణ్ 39; కనోలీ (సి) రాహుల్ (బి) షమీ 0; స్మిత్ (బి) షమీ 73; లబుషేన్ (ఎల్బీ) (బి) జడేజా 29; ఇన్‌గ్లిస్ (సి) కోహ్లి (బి) జడేజా 11; కేరీ (రనౌట్) 61; మ్యాక్స్‌వెల్ (బి) అక్షర్ 7; డ్వార్షూయిస్ (సి) అయ్యర్ (బి) వరుణ్ 19; జంపా (బి) పాండ్యా 7; ఎలిస్ (సి) కోహ్లి (బి) షమీ 10; తన్విర్ సంఘా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్) 264. వికెట్ల పతనం: 1–4, 2–54, 3–110, 4–144, 5–198, 6–205, 7–239, 8–249, 9–262, 10–264. బౌలింగ్: షమీ 10–0–48–3, హార్దిక్ పాండ్యా 5.3–0–40–1, కుల్దీప్ యాదవ్ 8–0–44–0, వరుణ్ చక్రవర్తి 10–0–49–2, అక్షర్ పటేల్ 8–1–43–1, రవీంద్ర జడేజా 8–1–40–2. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) కనోలీ 28; గిల్ (బి) డ్వార్షూయిస్ 8; కోహ్లి (సి) డ్వార్షూయిస్ (బి) జంపా 84; అయ్యర్ (బి) జంపా 45; అక్షర్ (బి) ఎలిస్ 27; రాహుల్ (నాటౌట్) 42; పాండ్యా (సి) మ్యాక్స్‌వెల్ (బి) ఎలిస్ 28; జడేజా (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (48.1 ఓవర్లలో 6 వికెట్లకు) 267. వికెట్ల పతనం: 1–30, 2–43, 3–134, 4–178, 5–225, 6–259. బౌలింగ్: డ్వార్షూయిస్ 7–0–39–1, ఎలిస్ 10–0–49–2, కనోలీ 8–0–37–1, జంపా 10–0–60–2, సంఘా 6–0–41–0, మ్యాక్స్‌వెల్ 6.1–0–35–0, హెడ్ 1–0–6–0. -
Champions Trophy 2025: విరాట్ అదరహో.. సెమీస్‌లో ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఎడిషన్ భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది. దుబాయ్ వేదికగా ఇవాళ (మార్చి 4) జరిగిన తొలి సెమీస్‌లో టీమిండియా ఆసీస్‌ను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మూడోసారి (మొత్తంగా ఐదోసారి) ఫైనల్స్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది.స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలతో రాణించారు. ఆసీస్ ఆటగాళ్లలో ట్రవిస్ హెడ్ 39, కూపర్ కన్నోలీ 0, లబూషేన్ 29, జోస్ ఇంగ్లిస్ 11, మ్యాక్స్‌వెల్ 7, డ్వార్షుయిస్ 19, ఆడమ్ జంపా 7, నాథన్ ఇల్లిస్ 10 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్‌తో (షమీ) బరిలోకి దిగినప్పటికీ ఆసీస్‌ను ఆలౌట్ చేయడంలో సఫలమైంది.ఛేదనలో విరాట్ (84) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో సిక్సర్ బాది కేఎల్ రాహుల్ (42 నాటౌట్) మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఆఖర్లో హార్దిక్ (24 బంతుల్లో 28) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. భారత్ గెలుపులో శ్రేయస్ అయ్యర్ (45), అక్షర్ పటేల్ (27) తలో చేయి వేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ (28) టీమిండియాకు మెరుపు ఆరంభాన్ని అందించాడు. భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (8) ఒక్కడే సింగిల్ డిజిట్ స్కోర్‌కు ఔటయ్యాడు. ఆసీస్ బౌలర్లలో ఇల్లిస్, జంపా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. డ్వార్షుయిస్, కన్నోలీ చెరో వికెట్ దక్కించుకున్నారు.ఆసీస్ నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ వన్డే ఈవెంట్లలో ఆసీస్ నిర్దేశించిన అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది.కాగా, రేపు (మార్చి 5) జరుగబోయే రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లాహోర్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌లో విజేతతో భారత్ మార్చి 9న జరిగే ఫైనల్లో తలపడుతుంది. -
CT 2025, IND Vs AUS 1st Semis: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (మార్చి 4) జరుగుతున్న తొలి సెమీఫైనల్లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. 265 పరుగుల ఛేదనలో విరాట్ 98 బంతుల్లో 5 బౌండరీల సాయంతో 84 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో విరాట్ చరిత్రపుట్లోకెక్కాడు. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..విరాట్ కోహ్లి-1003రోహిత్ శర్మ-808రికీ పాంటింగ్-731ఈ మ్యాచ్‌లో విరాట్ మరో రికార్డు కూడా సాధించాడు. ఐసీసీ టోర్నీల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు (24) చేసిన ఆటగాడిగా అవతరించాడు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ (23) పేరిట ఉండేది. తాజా హాఫ్ సెంచరీతో విరాట్ తన పేరిట ఉండిన మరో రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. ఐసీసీ నాకౌట్స్‌లో విరాట్ తన హాఫ్ సెంచరీల సంఖ్యను 10కి పెంచుకున్నాడు. ఐసీసీ నాకౌట్స్‌లో సచిన్, స్టీవ్ స్మిత్ తలో ఆరు అర్ద సెంచరీలు చేశారు.మ్యాచ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియాపై భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది.స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం విరాట్ కోహ్లి కీలకమైన ఇన్నింగ్స్ (84) ఆడటంతో భారత్ 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో సిక్సర్ బాది కేఎల్ రాహుల్ (42 నాటౌట్) మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఆఖర్లో హార్దిక్ (24 బంతుల్లో 28) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. భారత్ గెలుపులో శ్రేయస్ అయ్యర్ (45), అక్షర్ పటేల్ (27) తలో చేయి వేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ (28) టీమిండియాకు మెరుపు ఆరంభాన్ని అందించాడు. -
CT 2025, IND VS AUS 1st Semis: రోహిత్, విరాట్ ఇలాంటి నిర్ణయం ఎందుకు?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇవాళ (మార్చి 4) తొలి సెమీఫైనల్ జరుగుతుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలతో రాణించడంతో ఆసీస్ 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఆటగాళ్లలో ట్రవిస్ హెడ్ 39, కూపర్ కన్నోలీ 0, లబూషేన్ 29, జోస్ ఇంగ్లిస్ 11, మ్యాక్స్‌వెల్ 7, డ్వార్షుయిస్ 19, ఆడమ్ జంపా 7, నాథన్ ఇల్లిస్ 10 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.ఛేదనలో భారత్ లక్ష్యం దిశగా పయనిస్తుంది. 33 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 167/3గా ఉంది. శుభ్‌మన్ గిల్ (8), రోహిత్ శర్మ (28), శ్రేయస్ అయ్యర్ (45) ఔట్ కాగా.. విరాట్ కోహ్లి (64), అక్షర్ పటేల్ (20) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే 17 ఓవర్లలో మరో 98 పరుగులు చేయాలి. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ వికెట్ కూపర్ కన్నోలీకి.. గిల్ వికెట్ డ్వార్షుయిస్‌కు.. శ్రేయస్ అయ్యర్ వికెట్ ఆడమ్ జంపాకు దక్కింది.pic.twitter.com/9zGKhnuFuP— kuchnahi123@12345678 (@kuchnahi1269083) March 4, 2025రోహిత్, విరాట్ చెత్త నిర్ణయంకాగా, భారత్ బ్యాటింగ్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఓ చెత్త నిర్ణయం తీసుకున్నారు. ఇన్నింగ్స్ 8వ ఓవర్ చివరి బంతికి కూపర్ కన్నోలీ బౌలింగ్‌లో రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూ అయినట్లు ఫీల్డ్ అంపైర్ ప్రకటించాడు. రోహిత్ వికెట్ల ముందు దొరికిపోయినట్లు సుస్పష్టంగా తెలుస్తుంది. ఈ విషయం రోహిత్‌తో పాటు నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న విరాట్ కోహ్లి కూడా తెలుసు. అయినప్పటికీ రోహిత్, కోహ్లితో చర్చించి రివ్యూ వెళ్లడం అభిమానులను విస్మయానికి గురి చేసింది. వికెట్ల ముందు దొరికిపోయినట్లు క్లియర్‌గా తెలుస్తున్నా రోహిత్, కోహ్లి రివ్యూకి వెళ్లడమేంటని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మ్యాచ్‌లో చాలా దూరం ప్రయాణించాల్సి ఉండగా అనవసరంగా రివ్యూ వేస్ట్ చేశారని దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా, కన్నోలీ సంధించిన ఫుల్ లెంగ్త్ బంతిని స్వీప్ చేయబోయి రోహిత్ వికెట్ల ముందు ఈజీగా దొరికిపోయాడు. -
‘ఎందుకింత నిర్లక్ష్యం?’.. కుల్దీప్పై మండిపడ్డ కోహ్లి, రోహిత్!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy).. సెమీ ఫైనల్ మ్యాచ్.. అసలే ఆస్ట్రేలియా.. ఏమాత్రం అవకాశం ఇచ్చినా మ్యాచ్‌ను లాగేసుకునే ఆటగాళ్లకు ఆ జట్టులో కొదువలేదు. అలాంటి ప్రత్యర్థితో తలపడుతున్నపుడు ఒళ్లంతా కళ్లు చేసుకోవాలి. ముఖ్యంగా ఫీల్డింగ్ చేస్తున్నపుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి కీలక మ్యాచ్‌లలో ప్రతీ పరుగు ఎంతో విలువైనది. సింగిలే కదా అని వదిలేస్తే అదే మన పాలిట శాపంగా మారవచ్చు. అందుకే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli).. భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చేసిన తప్పిదాన్ని సహించలేకపోయారు. మైదానంలోనే అతడిపై ఈ ఇద్దరు తిట్ల దండకం అందుకున్నారు.ఎందుకింత నిర్లక్ష్యం? మండిపడ్డ దిగ్గజాలు‘ఎందుకింత నిర్లక్ష్యం’ అన్నట్లుగా గుడ్లు ఉరిమి చూస్తూ కుల్దీప్ యాదవ్‌పై ‘విరాహిత్’ ద్వయం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసీస్‌తో సెమీస్ మ్యాచ్ సందర్భంగా 32వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మిడ్ వికెట్ మీదుగా బంతిని బాది.. అలెక్స్ క్యారీతో సమన్వయం చేసుకుని సింగిల్ కోసం వెళ్లాడు.ఈ క్రమంలో వేగంగా కదిలిన విరాట్ కోహ్లి వెంటనే బంతిని కలెక్ట్ చేసుకుని నాన్- స్ట్రైకర్ ఎండ్ దగ్గర ఉన్న కుల్దీప్ వైపు వేశాడు. అయితే, కుల్దీప్ మాత్రం బంతిని అందుకునే ప్రయత్నం కూడా చేయకుండా.. బాల్ దూరంగా వెళ్తున్నపుడు అలాగే చూస్తుండిపోయాడు. కనీసం దానిని ఆపేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. బహుశా బంతి వికెట్లను తాకుతుందని అతడు అలా చేసి ఉంటాడు.అయితే, అలా జరుగలేదు. ఇంతలో కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ వచ్చి వెంటనే బంతిని ఆపి.. ఆసీస్‌కు అదనపు పరుగు రాకుండా అడ్డుకున్నాడు. ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్ వైపు చూస్తూ అతడిపై మండిపడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 264 పరుగులకు ఆసీస్ ఆలౌట్‌కాగా దుబాయ్ వేదికగా ఈ సెమీస్ మ్యాచ్‌లో టీమిండియా ఆస్ట్రేలియాను 264 పరుగులకు కట్టడి చేయగలిగింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ(3/48), వరుణ్ చక్రవర్తి(2/49), రవీంద్ర జడేజా (2/40) రాణించగా.. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ నిరాశపరిచాడు. ఎనిమిది ఓవర్ల బౌలింగ్‌లో 44 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.సెమీస్‌లో ఈ నాలుగుఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఎనిమిది జట్లు భాగంగా ఉన్నాయి. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన పాకిస్తాన్‌తో పాటు బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ గ్రూప్ దశలోనే ఈ వన్డే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాయి. ఇక పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లను నాకౌట్ చేసి గ్రూప్-‘ఎ’ నుంచి టీమిండియా, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ చేరగా.. గ్రూప్-‘బి’ నుంచి అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్లను ఇంటికి పంపి సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్‌లో అడుగుపెట్టాయి. భారత్ మంగళవారం దుబాయ్ వేదికగా.. ఆసీస్‌ను నాలుగు వికె ట్ల తేడాతో ఓడించి ఫైనల్ చేరింది. విరాట్ కోహ్లి(84), శ్రేయస్ అయ్యర్(45), కేఎల్ రాహుల్(42) రాణించారు. సౌతాఫ్రికా- న్యూజిలాండ్ లాహోర్‌లో బుధవారం అమీతుమీ తేల్చుకుంటాయి. చదవండి: NZ vs PAK: రిజ్వాన్, బాబర్‌లపై వేటు.. పాక్ కొత్త కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్Chuldeep😭😭 https://t.co/KNa6yFug5e pic.twitter.com/fHfGsRl8iD— S A K T H I ! (@Classic82atMCG_) March 4, 2025😂😂😂 https://t.co/r5K5MJW6XX pic.twitter.com/iVansWOhAv— Ayush. (@Ayush_vk18) March 4, 2025 -
Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) అంతర్జాతీయ క్రికెట్లో మరో రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఈసారి విరాట్ బ్యాటర్‌గా కాకుండా ఫీల్డర్‌గా ఓ ప్రత్యేకమైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy-2025) భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (మార్చి 4) జరుగుతున్న మ్యాచ్‌లో జోస్ ఇంగ్లిస్ క్యాచ్ పట్టుకున్న విరాట్.. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్న ఫీల్డర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లిస్ క్యాచ్‌కు ముందు ఈ రికార్డు విరాట్, రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పేరిట సంయుక్తంగా ఉండేది. వీరిద్దరు అంతర్జాతీయ క్రికెట్లో చెరి 334 క్యాచ్‌లు పట్టారు. ఇంగ్లిస్ క్యాచ్‌తో విరాట్ సోలోగా ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. విరాట్ అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లు) ఇప్పటివరకు 657 ఇన్నింగ్స్‌ల్లో పాల్గొని 335 క్యాచ్‌లు అందుకోగా.. రాహుల్ ద్రవిడ్ 571 ఇన్నింగ్స్‌ల్లో 334 క్యాచ్‌లు పట్టాడు. భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్, ద్రవిడ్ తర్వాత మహ్మద్ అజహరుద్దీన్ (261), సచిన్ టెండూల్కర్ (256) ఉన్నారు.ఓవరాల్‌గా చూస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక క్యాచ్‌ల రికార్డు మహేళ జయవర్దనే పేరిట ఉంది. జయవర్దనే 768 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌ల్లో 440 క్యాచ్‌లు పట్టాడు. ఈ జాబితాలో జయవర్దనే తర్వాత రికీ పాంటింగ్ (364), రాస్ టేలర్ (351) జాక్ కల్లిస్ (338) ఉన్నారు. విరాట్ 335 క్యాచ్‌లతో ఐదో స్థానంలో ఉన్నాడు.భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ విషయానికొస్తే.. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇవాళ తొలి సెమీఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కూపర్ కన్నోలిని షమీ డకౌట్ చేశాడు. ఆతర్వాత కొద్ది సేపు ట్రవిస్ హెడ్ మెరుపులు మెరిపించాడు. హెడ్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం కెప్టెన్ స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్ కొద్ది సేపటి వరకు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 56 పరుగులు జోడించారు. అనంతరం రవీంద్ర జడేజా లబూషేన్‌ను (29) బోల్తా కొట్టించాడు. ఆతర్వాత వచ్చిన జోస్ ఇంగ్లిస్ (11) కొద్ది సేపే క్రీజ్‌లో నిలబడి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇంగ్లిస్ తర్వాత బరిలోకి దిగిన అలెక్స్ క్యారీ ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టాస్తున్నాడు. స్టీవ్ స్మిత్, క్యారీ ఐదో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసి ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నారు. స్టీవ్ స్మిత్ 71, క్యారీ 38 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 36 ఓవర్ల అనంతరం ఆసీస్ స్కోర్ 195/4గా ఉంది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 2, షమీ, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు. -
IND vs AUS: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అతడే: సురేశ్ రైనా
క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా టీమిండియా- ఆస్ట్రేలియా(India vs Australia) మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ గురించే చర్చ. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) కీలక పోరులో విజయం సాధించే జట్టుపై మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో మెజారిటీ మంది భారత్‌వైపే మొగ్గుచూపుతున్నారు. ఒకే వేదికపైనే తమ మ్యాచ్‌లన్నీ ఆడటం టీమిండియాకు సానుకూలంగా మారిందని అభిప్రాయపడుతున్నారు.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా(Suresh Raina) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకునే ఆటగాడిపై తన అంచనా తెలియజేశాడు. భారత్- ఆసీస్ మ్యాచ్‌లో టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లి ఈ అవార్డు గెలుచుకుంటాడని జోస్యం చెప్పాడు.ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అతడేఅదే విధంగా.. ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్లో కెప్టెన్ రోహిత్ శర్మ శతకం బాదితే టీమిండియా గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందని సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. అయితే, ఫీల్డింగ్, క్యాచ్‌ల విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా మొదటికే మోసం వస్తుందని రోహిత్ సేనను రైనా హెచ్చరించాడు.ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఆసీస్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలుస్తాడు. ఇక ఈ ఐసీసీ టోర్నీలో శ్రేయస్ అయ్యర్ ఎంత అద్భుతంగా ఆడుతున్నాడో మనం చూస్తూనే ఉన్నాం.కోహ్లి అయితే వికెట్ల మధ్య పరిగెడుతున్న తీరు అబ్బురపరుస్తోంది. రోహిత్ శర్మ- శుబ్‌మన్ గిల్ శుభారంభం అందిస్తే మనకు తిరుగు ఉండదు. అయితే, కేఎల్ రాహుల్ కూడా బ్యాట్ ఝులిపించాడు. అతడు కూడా ఫామ్‌లోకి వస్తే జట్టుకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. రోహిత్ గనుక సెంచరీ చేశాడంటే విజయం మనదే.అయితే, ఫీల్డింగ్‌లో నిర్లక్ష్యం వద్దు. క్యాచ్‌లు మిస్ చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి’’ అని సురేశ్ రైనా టీమిండియాకు సూచనలు ఇచ్చాడు. కాగా ఆస్ట్రేలియాతో ఐసీసీ టోర్నమెంట్లలో 2011 నుంచి టీమిండియాకు పరాభవాలే ఎదురవుతున్నాయి. కీలక మ్యాచ్‌లలో ఆసీస్ చేతిలో ఓడిపోతోంది. అయితే, దుబాయ్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో మాత్రం టీమిండియా ఫేవరెట్‌గా కనిపిస్తోంది.ఇక దుబాయ్ వేదికగా మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. టీమిండియా ఫీల్డింగ్ చేస్తోంది. ఆసీస్ తుదిజట్టులో రెండు మార్పులు చేయగా.. భారత్ కివీస్‌తో ఆడిన టీమ్‌తోనే బరిలోకి దిగింది.సెమీ ఫైనల్ 1- తుదిజట్లు ఇవేభారత్రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.ఆస్ట్రేలియా కూపర్ కన్నోలీ, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా.చదవండి: CT 2025: కివీస్‌తో సెమీస్.. సఫారీలకు గాయాల బెడద! జట్టులోకి స్టార్ ప్లేయర్ -
రోహిత్‌పై బాడీషేమింగ్ కామెంట్స్.. కోహ్లీని వదలని షామా!
న్యూఢిల్లీ: స్టార్ బ్యాటర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై బాడీ షేమింగ్ పోస్టుతో వివాదంలో చిక్కుకున్న కాంగ్రెస్ నేత షామా మహమ్మద్.. ఎట్టకేలకు స్పందించారు. రోహిత్ అభిమానులు, టీమిండియా మాజీలు, బీజేపీ, ఆఖరికి సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.‘‘ఓ ఆటగాడు ఎప్పుడూ ఫిట్‌గా ఉండాలన్నది నా అభిప్రాయం. అందుకే రోహిత్ శర్మ విషయంలో పరిశీలనపూర్వకంగానే నేను మాట్లాడా. అతను కాస్త ఓవర్‌వెయిట్ అనిపించాడు. అందుకే అలా ట్వీట్ చేశా. అందులో బాడీ షేమింగ్ ఏం లేదు. నేనేం తప్పు చేయలేదు’’ అని అన్నారామె. ఈ క్రమంలో.. గతంలో టీమిండియా మాజీ కెప్టెన్ల పేర్లను ప్రస్తావించిన షామా.. వాళ్లతో రోహిత్‌ను బాడీని పోల్చారు.#WATCH | On her comment on Indian Cricket team captain Rohit Sharma, Congress leader Shama Mohammed says, "It was a generic tweet about the fitness of a sportsperson. It was not body-shaming. I always believed a sportsperson should be fit, and I felt he was a bit overweight, so I… pic.twitter.com/OBiLk84Mjh— ANI (@ANI) March 3, 2025ఇది ప్రజాస్వామ్యం.. అందులో తప్పేం ఉంది. నాకు మాట్లాడే హక్కు ఉంది అని అన్నారామె. అలాగే.. ఈ సందర్భంగా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై షామా ప్రశంసలు గుప్పించారు. గతంలో పాక్‌పై ఓటమి తర్వాత మహమ్మద్ షమీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో షమీకి కోహ్లీ అండగా నిలిచాడు. అందుకు కోహ్లీని కూడా విమర్శించారు. తోటి ఆటగాళ్లకు అండగా ఉంటూ జట్టును ముందు ఉండి నడిపించడం, పరుగులు చేయడం, ప్రత్యర్థి జట్టు ప్రదర్శన గురించి తెలిసి ఉండడం.. ఇవన్నీ మంచి సారథికి ఉండే లక్షణాలు. ఇవన్నీకోహ్లీకి ఉన్నాయి. ప్రత్యర్థులు బాగా ఆడినా మెచ్చుకునేందుకు కోహ్లీ వెనకాడడు’’ అని షామా అన్నారు. అయితే ఇదే షామా గతంలో కోహ్లీపై చేసిన ఓ పోస్ట్ అంటూ ఒక స్క్రీన్ షాట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.2018లో కెప్టెన్‌గా ఉన్న సమయంలో కోహ్లీ ఓ ఫ్యాన్ పెట్టిన పోస్టుకు తీవ్రంగా స్పందించాడు. ‘‘నాకు భారతీయుల కంటే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రీడాకారుల క్రికెట్ బాగుంటుంది. ఇక కోహ్లీని అయితే జనాలు అనసవరంగా ఆకాశానికి ఎత్తేస్తుంటారు’’ అని ఓ ఫ్యాన్ చేసిన పోస్టును కోహ్లీ స్వయంగా చదివి వినిపించాడు.‘‘నువ్వు ఇండియాలో ఉండాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. భారత్‌లో ఉంటూ ఇతర దేశాలపై అభిమానం చూపించడం ఏమిటి. నీకు నేను నచ్చకపోవడంపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే, ఇతర దేశాల వారు నచ్చినప్పుడు నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం’’ అని కోహ్లీ అన్నాడు.అయితే.. కోహ్లీ పోస్టుపై అప్పట్లో షామా చాలా ఘాటుగా స్పందించారు. ‘‘బ్రిటిషర్లు కనిపెట్టిన ఆటను కోహ్లీ ఆడుతుంటాడు. విదేశీ బ్రాండ్లకు ప్రచారం చేస్తూ కోట్లు సంపాదిస్తుంటాడు. పెళ్లి కూడా ఇటలీలో చేసుకున్నాడు. హెర్షెల్ గిబ్స్ తన ఫేవరెట్ క్రికెటర్ అని కూడా చెబుతాడు. కెర్బర్ తన ఫేవరెట్ టెన్నిస్ ప్లేయర్ అని అంటాడు. కానీ ఇతర దేశాల క్రీడాకారులను అభిమానించే వారు మాత్రం దేశాన్ని విడిచిపెట్టి పోవాలని అంటాడు’’ అని షామా మండిపడ్డారు. రోహిత్‌పై ఆమె చేసిన కామెంట్లు దుమారం రేపడం, కోహ్లీని పొగడడం నేపథ్యంలో ఈ పోస్ట్ మళ్లీ తెరపైకి వచ్చింది.షామా ఏమన్నారంటే..ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. ‘‘క్రీడాకారుడిగా రోహిత్ శర్మ ఫిట్‌గా లేడు. అతడు బరువు తగ్గాలి. అంతేకాదు.. గత కెప్టెన్లతో పోలిస్తే అత్యంత ఆకట్టుకోని సారథి ఇతడే’’ అని షామా రాసుకొచ్చారు. ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారడంతో దీనిపై తీవ్ర వివాదం రాజుకుంది. -
'బాబర్ ఆజం ముందు విరాట్ కోహ్లి జీరో': పాక్ మాజీ క్రికెటర్
ఛాంపియన్స్ ట్రోఫీ-20525లో పాకిస్తాన్ చెత్త ప్రదర్శనతో గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. అయినప్పటికి ఆ దేశ మాజీ క్రికెటర్ల బుద్ది మాత్రం మారలేదు. వసీం అక్రమ్, షోయబ్ అక్తర్, వకార్ యూనిస్ వంటి పాక్ దిగ్గజాలు తమ జట్టుపై విమర్శల వర్షం కురిపిస్తుంటే.. మరి కొంతమంది మాజీ క్రికెటర్లు మాత్రం భారత్‌పై విషం చిమ్ముతున్నారు. తాజాగా పాకిస్తాన మాజీ క్రికెటర్ మొహ్సిన్ ఖాన్.. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని కించపరిచి మాట్లాడాడు. విరాట్ కోహ్లి కంటే పాక్ ఆటగాడు బాబర్ ఆజం ఎంతో బెటర్ అని అతడు విమర్శించాడు.మీకు ఒక్క విషయం చెప్పాలనకుంటున్నాను. బాబర్ ఆజంతో విరాట్ కోహ్లిని దయచేసి పోల్చవద్దు. బాబర్ ముంగిట విరాట్ కోహ్లి జీరో. మనం ఇక్కడ ఎవరు మంచి ఆటగాడు అనే దాని గురించి మాట్లాడటం లేదు. ఇక ఈ విషయం గురించి వదిలేద్దాం. పాకిస్తాన్ క్రికెట్ పతనం గురించి మాట్లాడుతున్నాము. ప్రణాళిక లేదు, వ్యూహాలు లేవు, జవాబుదారీతనం లేదు. పాక్ క్రికెట్ నాశనం అవుతోంది అని మొహ్సిన్ ఖాన్ ARY న్యూస్‌తో పేర్కొన్నారు.కాగా ఈ మెగా టోర్నీలో బాబర్ ఆజం విఫలమయ్యాడు. రెండు మ్యాచ్‌ల్లో కేవలం 87 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు విరాట్ కోహ్లి మాత్రం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ చెలరేగాడు. దీంతో తమ జట్టుపై విరాట్ సెంచరీ చేయడాన్ని పాక్ మాజీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే కోహ్లిపై తమ అక్కసును వెల్లగక్కుతున్నారు. అయితే మొహ్సిన్ ఖాన్‌కు భారత అభిమానులు గట్టిగా కౌంటిరిస్తున్నారు. విరాట్ కోహ్లికి బాబర్‌కు పోలికా, కొంచమైనా సిగ్గు ఉండాలి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. కాగా మెగా టోర్నీలో భారత జట్టు అదరగొడుతోంది. వరుసగా మూడు విజయాలతో గ్రూపు స్టేజిని టీమిండియా ఆజేయంగా ముగించింది. మంగళవారం జరగనున్న తొలి సెమీఫైనల్లో ఆసీస్‌తో భారత్ అమీతుమీ తెల్చుకోనుంది.చదవండి: 'అఫ్గానిస్తాన్‌ను చూసి నేర్చుకోండి'.. విండీస్‌కు వివ్ రిచర్డ్స్ హితవు -
అక్షర్ పటేల్ కాళ్లు మొక్కబోయిన కోహ్లి.. వీడియో వైరల్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత క్రికెట్ జట్టు తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఈ మెగా టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా.. లీగ్ స్టేజిని ఆజేయంగా ముగించింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఆఖరి గ్రూపు మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 44 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో విజయోత్సహంతో సెమీస్‌కు భారత్ సన్నద్దమైంది. మంగళవారం జరగనున్న తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను టీమిండియా ఢీకొట్టనుంది. ఇక ఇది ఇలా ఉండగా.. కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి.. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కాళ్లును మొక్కబోయాడు. అవును మీరు విన్నది నిజమే. కోహ్లి ఎందుకు అలా చేశాడో తెలియాలంటే పూర్తి కథనం చదవాల్సిందే.అసలేం జరిగిందంటే?టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శ్రేయస్ అయ్యర్ (79), అక్షర్ పటేల్ (42) , హార్దిక్ పాండ్యా(45) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌కు భారత స్పిన్నర్లు చుక్కలు చూపించారు. టీమిండియా స్పిన్నర్ల దాటికి బ్లాక్ క్యాప్స్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. అయితే న్యూజిలాండ్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయినప్పటికి కేన్ విలియమ్సన్ మాత్రం భారత్‌కు కొరకరాని కొయ్యగా మారాడు. మిగితా బ్యాటర్లు స్పిన్నర్లను ఎదుర్కొవడానికి ఇబ్బంది పడితే కేన్ మాత్రం సమర్ధవంతంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో విలియమ్సన్ ఔట్ చేసేందుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ చాలా ప్రయత్నాలు చేశాడు. ఆఖరికి అక్షర్ పటేల్.. విలియమ్సన్ వికెట్‌ను భారత్‌కు అందించాడు. కివీస్ ఇన్నింగ్స్ 41 ఓవర్ వేసిన అక్షర్ పటేల్.. అద్బుతమైన బంతితో కేన్‌ను బోల్తా కొట్టించాడు. అక్షర్ సంధించిన ఫ్లైటెడ్ డెలివరీని సరిగ్గాఇ అంచనా వేయలేకపోయిన విలియమ్సన్ స్టంప్ ఔట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. అక్షర్ తన 10 ఓవర్ల స్పెల్ చివరి బంతికి వికెట్ తీయడం గమనార్హం. దీంతో భారత్ విజయం లాంఛనమైంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లి వేగంగా అక్షర్ వద్దకు వెళ్లి అతడు కాళ్లను టచ్ చేసే ప్రయత్నం చేశాడు. అక్షర్ వెంటనే కిందకూర్చుని నవ్వుతూ కోహ్లిని ఆపేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.Kohli touching Axar Patel's feet after he got Williamson out 😭#Kohli #AxarPatel #INDvNZ #ChampionsTrophy2025 pic.twitter.com/mJmgQ95Y15— voodoo mama juju (@ayotarun) March 2, 2025 -
కుప్పకూలిన న్యూజిలాండ్..44 పరుగులతో టీమిండియా గెలుపు (ఫొటోలు)
-
CT 2025, IND VS NZ: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ఎవరికీ సాధ్యం కాని ఘనత సొంతం
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి (Virat Kohli) ఖాతాలో మరో వరల్డ్ రికార్డు (World Record) చేరింది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy-2025) భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌తో 300 వన్డేల మైలురాయిని తాకిన విరాట్.. అంతర్జాతీయ క్రికెట్లో 300 వన్డేలు, 100కు పైగా టెస్ట్‌లు, 100కు పైగా టీ20లు ఆడిన ఏకైక క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలో ఏ ఇతర క్రికెటర్ ఈ ఘనత సాధించలేదు. విరాట్ ఇప్పటివరకు 300 వన్డేలు, 123 టెస్ట్‌లు, 125 టీ20లు ఆడాడు. భారత్ తరఫున 300 వన్డేలు ఆడిన ఏడో క్రికెటర్‌గా, ఓవరాల్‌గా 22వ ఆటగాడిగానూ విరాట్ రికార్డుల్లోకెక్కాడు. విరాట్‌కు ముందు సచిన్ టెండూల్కర్ (463), ఎంఎస్ ధోని (350), రాహుల్ ద్రవిడ్ (344), మహ్మద్ అజారుద్దీన్ (334), సౌరవ్ గంగూలీ (311), యువరాజ్ సింగ్ (304) భారత్ తరఫున 300 వన్డేల మైలురాయిని తాకారు.కాగా, విరాట్ తన 300 వన్డేలో కేవలం 11 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. గ్లెన్ ఫిలిప్స్ నమ్మశక్యం కాని క్యాచ్‌తో విరాట్‌ను పెవిలియన్‌కు పంపాడు. గత మ్యాచ్‌లో విరాట్ పాకిస్తాన్‌పై సూపర్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో విరాట్ 52 పరుగులు చేసుంటే ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కేవాడు. ఈ రికార్డు శిఖర్ ధవన్ పేరిట ఉంది. ధవన్ ఛాంపియన్స్ ట్రోఫీలో 13 మ్యాచ్‌లు ఆడి 701 పరుగులు చేశాడు. ప్రస్తుతం (ఈ మ్యాచ్‌తో కలుపుకుని) విరాట్ ఖాతాలో 662 పరుగులు ఉన్నాయి (ఛాంపియన్స్ ట్రోఫీలో).ఓవరాల్‌గా విరాట్ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. వన్డేల్లో సచిన్ (18426), సంగక్కర (14234) మత్రమే విరాట్ కంటే ఎక్కువ పరుగులు చేశారు. విరాట్ ఇప్పటివరకు 288 ఇన్నింగ్స్‌లు ఆడి 14096 పరుగులు చేశాడు. విరాట్ ఇటీవలే వన్డేల్లో అత్యంత వేగంగా 14000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. పాక్‌పై సెంచరీతో వన్డేల్లో విరాట్ సెంచరీల సంఖ్య 51కి చేరింది. ప్రపంచ క్రికెట్లో ఇన్ని సెంచరీలు (50కిపైగా) ఎవరూ చేయలేదు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. మ్యాట్ హెన్రీ (8-0-42-5) ఐదేయడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ (79), అక్షర్ పటేల్ (42), హార్దిక్ పాండ్యా (45) రాణించారు. భారత టాప్-3 బ్యాటర్లు విఫలమయ్యారు. రోహిత్ శర్మ 15, శుభ్‌మన్ గిల్ 2, విరాట్ కోహ్లి 11 పరుగులు చేశారు. అక్షర్ పటేల్ ఔటయ్యాక కేఎల్ రాహుల్ (23) శ్రేయస్‌తో కలిసి కాసేపు నిలకడగా ఆడాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా 16, షమీ 5 పరుగులకు ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్, విలియమ్ రూర్కీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు.కాగా, గ్రూప్-ఏలో భారత్, న్యూజిలాండ్ ఇదివరకే సెమీస్‌కు చేరడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా జరుగుతుంది. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీస్‌కు చేరాయి. ఈ మ్యాచ్ ఫలితంతో భారత్ సెమీస్‌లో ఏ జట్టును ఢీకొట్టబోతుందో తెలుస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడితే సెమీస్‌లో సౌతాఫ్రికాతో తలపడుతుంది. గెలిస్తే ఆస్ట్రేలియాను ఢీకొట్టాల్సి ఉంటుంది. -
CT 2025, IND VS NZ: గ్లెన్ ఫిలిప్స్ కళ్లు చెదిరే క్యాచ్.. కోహ్లికి ఫ్యూజులు ఔట్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా న్యూజిలాండ్‌తో ఇవాళ (మార్చి 2) జరుగతున్న మ్యాచ్‌లో కివీస్ ఆటగాళ్లు మైదానంలో పాదరసంలా కదిలారు. పరుగులు నియంత్రించడంతో పాటు పలు అద్భుతమైన క్యాచ్‌లు పట్టారు. కివీస్ స్టార్ ఫీల్డర్ గ్లెన్ ఫిలిప్స్ పట్టిన ఓ క్యాచ్ మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. కెరీర్లో 300వ వన్డే ఆడుతున్న విరాట్ కోహ్లిని ఫిలిప్స్ కళ్లు చెదిరే క్యాచ్‌తో పెవిలియన్ బాట పట్టించాడు. View this post on Instagram A post shared by ICC (@icc)కోహ్లి బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడిన షాట్‌ను ఫిలిప్స్ నమ్మశకంకాని క్యాచ్‌గా మలిచాడు. కుడివైపు గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో సూపర్ మ్యాన్ క్యాచ్ అందుకున్నాడు. కోహ్లి ఆడిన షాట్‌కు ఫిలిప్స్ సెకెన్ల వ్యవధిలో రియాక్టయ్యాడు. ఈ క్యాచ్‌ను చూసి కోహ్లి సహా మైదానంలో ఉన్న వారంతా నివ్వెరపోయారు. కోహ్లి సతీమణి అనుష్క అయితే తలపట్టుకుంది. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఈ మ్యాచ్‌లో మరో అద్భుతమైన క్యాచ్ కూడా నమోదైంది. రవీంద్ర జడేజాను కేన్ విలియమ్సన్ సూపర్ క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్‌మీడియాలో వైరలవుతుంది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. మ్యాట్ హెన్నీ (8-0-42-5) ఐదేయడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ (79), అక్షర్ పటేల్ (42), హార్దిక్ పాండ్యా (45) రాణించారు. భారత టాప్-3 బ్యాటర్లు విఫలమయ్యారు. రోహిత్ శర్మ 15, శుభ్‌మన్ గిల్ 2, విరాట్ కోహ్లి 11 పరుగులు చేశారు. అక్షర్ పటేల్ ఔటయ్యాక కేఎల్ రాహుల్ (23) శ్రేయస్‌తో కలిసి కాసేపు నిలకడగా ఆడాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా 16, షమీ 5 పరుగులకు ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్, విలియమ్ రూర్కీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు. కాగా, గ్రూప్-ఏలో భారత్, న్యూజిలాండ్ ఇదివరకే సెమీస్‌కు చేరడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా జరుగుతుంది. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీస్‌కు చేరాయి.తుది జట్లు..భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిన్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, కైల్ జామీసన్, విలియం ఓరూర్కీ -
మళ్ళీ కోహ్లి హవా ... ఒక్క మ్యాచ్ తో మారిన తీరు
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు వరుకూ భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి క్రికెట్ కెరీర్ పై ఎన్నో విమర్శలు చెలరేగాయి. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ ఘోర వైఫల్యం ఇందుకు ప్రధాన కారణం. అయితే రోజులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. ఒక్క మ్యాచ్ తో పరిస్థితి అంతా మారిపోయింది. గత ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో అజేయంగా నిలిచిన విరాట్ కోహ్లీ, భారత్ బ్యాటింగ్ లో తన మునుపటి వైభవాన్ని పునరుద్ధరించుకున్నాడు.పాకిస్తాన్ మ్యాచ్ అంటే విజృంభించి ఆడే కోహ్లీ ఇవేమీ కొత్తేమీ కాదు. అయితే న్యూజిలాండ్‌తో ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ ఆఖరి లీగ్ మ్యాచ్ కోహ్లీ కి చాల ప్రత్యేకం. ఇది కోహ్లీకి 300వ వన్డే మ్యాచ్. ఈ మైలురాయిని చేరుకున్న భారత్ ఆటగాళ్లలో కోహ్లీ ఏడవ వాడు. గతంలో లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోని వంటి హేమాహేమీలు ఈ రికార్డ్ సాధించిన వారిలో ఉన్నారు.రికార్డుల వేటలో కోహ్లి..కోహ్లీ తన 300వ వన్డేకు చేరుకుంటున్న తరుణంలో, భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ ప్రశంసలతో ముంచెత్తాడు. భారత క్రికెట్‌పై కోహ్లీ ప్రభావం ఎంత ఉందో మాటల్లో చెప్పడానికి చాలా కష్టం అని రాహుల్ ప్రశంసలతో ముంచెత్తాడు. రాహుల్ కోహ్లీని తానూ క్రికెట్లో ఎల్లప్పుడూ ఆరాధించే "ముఖ్యమైన సీనియర్ ఆటగాడు" అని ప్రశంసించాడు. "300 వన్డే మ్యాచ్‌లు... కోహ్లీ భారత క్రికెట్‌కు ఎంత గొప్ప సేవకుడో వ్యక్తీకరించడానికి మాటలు సరిపోవు" అని రాహుల్ మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించాడు.కోహ్లీ ఈ మ్యాచ్ తో మరో రికార్డ్ సాధించాలన్న ఆశయంతో ఉన్నాడు. 36 ఏళ్ల కోహ్లీ న్యూజిలాండ్‌పై 3000 కంటే ఎక్కువ అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరడానికి ఇంకా 85 పరుగులు మాత్రమే కావాల్సి ఉంది. గతంలో సచిన్ టెండూల్కర్ (3345), రికీ పాంటింగ్ (3145), జాక్వెస్ కల్లిస్ (3071) మరియు జో రూట్ (3068) తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న ఐదవ బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడు. న్యూజిలాండ్‌పై కోహ్లీ ఇంతవరకూ 55 వన్డే మ్యాచ్‌ల్లో 47.01 సగటుతో 2915 పరుగులు సాధించాడు. ఇందులో 9 సెంచరీలు మరియు 15 అర్ధ సెంచరీలు ఉన్నాయి.కోహ్లీ పై బ్రేస్‌వెల్ ప్రశంసలు "ఇది చాలా పెద్ద విజయం" అని ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టు ఆల్ రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్ సైతం కోహ్లీ మైలురాయి గురించి ప్రశంసలు గుప్పించాడు. "ఒక క్రికెటర్ కెరీర్లో 300 వన్డే మ్యాచ్ లు ఆడటం చాల గొప్ప విషయం. అదీ ఒకే ఫార్మాట్లో. కోహ్లీ తన తన కెరీర్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాడనే దానికి ఇది నిదర్శనం అని నేను భావిస్తున్నాను." అని బ్రేస్‌వెల్ వ్యాఖ్యానించాడు.2023 ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కోహ్లీతో కలిసి బ్రేస్‌వెల్ ఆడాడు. అతనికి కోహ్లీ గురించి ప్రత్యక్ష అవగాహన ఉంది. "ఆర్సిబిలో అతను ప్రతి మ్యాచ్‌కు ఎలా సిద్ధమయ్యాడో నేను ప్రత్యక్షంగా చూశాను. భారత్ జట్టు లో చాల మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉన్నారు. అందులో కోహ్లీ ఒకడు. భారత్ తో ఎదురయ్యే సవాలు ఎదుర్కోవటానికి మేము ఏంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం," అని బ్రెసెవెల్ అన్నాడు.న్యూజిలాండ్ రికార్డ్ ఐసిసి టోర్నమెంట్లలో న్యూజిలాండ్ భారత్ పై ఆధిపత్యం చెలాయించింది. హెడ్-టు-హెడ్ రికార్డ్ లో న్యూజీలాండ్ 10-5 ( డబ్ల్యూ టి సి ఫైనల్‌తో సహా) తో ఆధిపత్యం లో ఉంది. అయితే ఈ రెండు జట్ల మధ్య జరిగిన వన్డేల్లో అయితే భారత్ 60-58 తో ఆధిక్యంలో ఉంది. న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో భారత్ సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ ఆడటం అనుమానంగానే ఉంది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మహమ్మద్ షమీ కాలి మడమ నొప్పితో ఇబ్బంది పడిన విషయం తెలిసిందే.ఈ కారణంగా షమీ స్థానంలో ఎడమచేతి వాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను భారత్ ఈ మ్యాచ్ లో ఆడించే అవకాశముంది. న్యూజిలాండ్ లైనప్‌లో ఐదుగురు ఎడమచేతి వాటం బ్యాటర్ ఉండటం కూడా ఇందుకు ఒక కారణం. శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో బౌలింగ్ కోచ్ మోర్న్ మోర్కెల్ పర్యవేక్షణలో అర్ష్‌దీప్ 13 ఓవర్లు ఫుల్ రన్-అప్‌తో బౌలింగ్ చేయగా, షమీ 6-7 ఓవర్లు మాత్రమే కుదించబడిన రన్-అప్‌తో బౌలింగ్ చేశాడు. ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తన మూడవ ఓవర్ వేసిన వెంటనే షమీ ఫిజియోల నుండి తన కుడి కాలుకు చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ముఖ్యమైన సెమీ-ఫైనల్స్‌కు ముందు భారత్ షమీకి విరామం ఇచ్చే అవకాశం లేకపోలేదు.చదవండి: యువీ స్పిన్ మ్యాజిక్.. రాయుడు మెరుపులు! సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్ -
Champions Trophy: చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లి..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆఖరి లీగ్ మ్యాచ్ సమరానికి సిద్దమైంది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్, భారత జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న ఇరు జట్లు లీగ్ స్టేజిని విజయంతో ముగించాలని భావిస్తున్నాయి. కాగా ఈ మ్యాచ్‌తో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి 300 వన్డేలు పూర్తి చేసుకోబోతున్నాడు. కాగా ఈ ఘనత సాధించిన 7వ భారత ఆటగాడిగా, ఓవరాల్‌గా 22వ ఆటగాడిగా కోహ్లి నిలుస్తాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన విరాట్.. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన పేరిట ఎన్నో అద్భుతమైన రికార్డులను లిఖించుకున్నాడు.ఇప్పటివరకు భారత జట్టు తరపున 299 వన్డేలు ఆడిన కోహ్లి.. 58.20 సగటుతో 14,085 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 51 సెంచరీలు, 73 అర్ధసెంచరీలు ఉన్నాయి.300 కంటే ఎక్కువ వన్డేలు ఆడిన భారత ఆటగాళ్లు..సచిన్ టెండూల్కర్ – 463 మ్యాచ్లుఎంఎస్ ధోని – 350 మ్యాచ్లురాహుల్ ద్రవిడ్ – 344 మ్యాచ్లుమహమ్మద్ అజారుద్దీన్ – 334 మ్యాచ్లుసౌరవ్ గంగూలీ – 311 మ్యాచ్లుయువరాజ్ సింగ్ – 304 మ్యాచ్లువరల్డ్ రికార్డుపై కన్ను..అదేవిధంగా ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో 300 వన్డేలు, 100 టెస్టులు, 100 టీ20లు ఆడిన తొలి క్రికెటర్‌గా విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించనున్నాడు. విరాట్ ఇప్పటివరకు 299 వన్డేలు, 123 టెస్టులు, 125 టీ20లు ఆడాడు. సంగర్కరకు చేరువలో కోహ్లి..కాగా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కింగ్ కోహ్లి మూడో స్ధానంలో కొనసాగుతున్నాడు. కోహ్లి మరో 149 పరుగులు చేస్తే శ్రీలంక కుమార్ సంగక్కర(14234)ను అధిగమిస్తాడు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అగ్రస్ధానంలో ఉన్నాడు. సచిన్ తన కెరీర్లో 463 మ్యాచ్‌లు ఆడి 18426 పరుగులు చేశాడు. సచిన్ కంటే కోహ్లి ఇంకా 4,341 పరుగులు వెనకబడి ఉన్నాడు. చదవండి: Champions Trophy: టీమిండియా కోసం.. అన్ని జట్లు దుబాయ్‌లోనే? -
వన్డేల్లో అసలైన తోపు ఎవరు?
-
ఐదో స్థానానికి ఎగబాకిన విరాట్.. టాప్-10లో నలుగురు టీమిండియా బ్యాటర్లు
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో (ICC ODI Rankings) భారత బ్యాటర్ల హవా కొనసాగింది. టాప్-10లో ఏకంగా నలుగురు భారత బ్యాటర్లు చోటు దక్కించుకున్నారు. శుభ్‌మన్ గిల్ (Shubman Gill) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రోహిత్ (Rohit Sharma) మూడు, విరాట్ (virat Kohli) ఐదు, శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తొమ్మిది స్థానాల్లో ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్‌పై సెంచరీ చేయడంతో విరాట్ ఓ స్థానాన్ని మెరుగుపర్చుకుని ఐదో స్థానానికి చేరాడు. తాజా ర్యాంకింగ్స్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ సెంచరీ హీరోలు గణనీయంగా లబ్ది పొందారు. విల్ యంగ్ 8 స్థానాలు మెరుగుపర్చుకుని 14వ స్థానానికి.. బెన్ డకెట్ 27 స్థానాలు మెరుగుపర్చుకుని 17వ స్థానానికి.. రచిన్ రవీంద్ర 18 స్థానాలు మెరుగుపర్చుకుని 24వ స్థానానికి.. టామ్ లాథమ్ 11 స్థానాలు మెరుగుపర్చుకుని 31వ స్థానానికి.. జోస్ ఇంగ్లిస్ 18 స్థానాలు మెరుగుపర్చుకుని 88వ స్థానానికి చేరారు. టాప్-10లో భారత బ్యాటర్లతో పాటు బాబర్ ఆజమ్ (2), హెన్రిచ్ క్లాసెన్ (4), డారిల్ మిచెల్ (6), హ్యారీ టెక్టార్ (7), చరిత్ అసలంక (8), షాయ్ హోప్ (10) ఉన్నారు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టాప్-10లో కుల్దీప్ (3వ స్థానం) మినహా భారత్‌కు ప్రాతినిథ్యం లేదు. లంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ టాప్‌లో కొనసాగుతుండగా.. రషీద్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నాడు. కేశవ్ మహారాజ్, బెర్నాల్డ్ స్కోల్జ్, మ్యాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్, గుడకేశ్ మోటీ, షాహీన్ అఫ్రిది, ఆడమ్ జంపా టాప్-10లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టాప్-10లో ఎలాంటి మార్పులు లేవు. మొహమ్మద్ నబీ, సికందర్ రజా, అజ్మతుల్లా ఒమర్జాయ్, మెహిది హసన్ మిరాజ్, రషీద్ ఖాన్, మిచెల్ సాంట్నర్, మ్యాక్స్‌వెల్, బ్రాండన్ మెక్‌ముల్లెన్, రవీంద్ర జడేజా, గెర్హార్డ్ ఎరాస్మస్ టాప్-10లో కొనసాగుతున్నారు. ఈ వారం ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో ఒకే ఒక చెప్పుకోదగ్గ మార్పు జరిగింది. న్యూజిలాండ్ ఆటగాడు మైఖేల్ బ్రేస్‌వెల్ ఏకంగా 26 స్థానాలు మెరుగుపర్చుకుని 11వ స్థానానికి చేరాడు.జట్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా ఎవరికీ అందనంత ఎత్తులో టాప్ ప్లేస్‌లో కొనసాగుతుంది. ఆసీస్, పాకిస్తాన్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఆతర్వాతి స్థానాల్లో నిలిచాయి. -
కోహ్లి లాంటి ఆటగాడిని నేను ఇప్పటివరకు చూడలేదు: పాంటింగ్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అద్బుతమైన సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఫామ్‌తో లేమితో సతమతమవుతున్న కోహ్లి.. దాయాదితో జరిగిన మ్యాచ్‌తో తన రిథమ్‌ను తిరిగి పొందాడు. 242 పరుగుల లక్ష్య చేధనలో ఆఖరి వరకు క్రీజులో నిలబడిన కోహ్లి.. వరల్డ్ క్రికెట్లో తనకు మించిన ఛేజ్ మాస్టర్ లేడని మరోసారి నిరూపించుకున్నాడు. కింగ్ కోహ్లి సరిగ్గా 100 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. కోహ్లికి ఇది 51వ వన్డే సెంచరీ. మ్యాచ్ ముగిసి మూడు రోజులు అవుతున్నప్పటికి కోహ్లిపై ఇంకా ప్రశంసల వర్షం కురుస్తునే ఉంది. తాజాగా ఈ జాబితాలో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ చేరాడు."వన్డేల్లో విరాట్ కోహ్లి కంటే మెరుగైన ఆటగాడిని నేను ఇప్పటివరకు చూడలేదు. అతడు ఇప్పుడు నన్ను (అత్యధిక వన్డే పరుగుల్లో) దాటేశాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో అతడి కంటే ముందు కేవలం ఇద్దరు బ్యాటర్లు మాత్రమే ఉన్నారు. కాబట్టి వన్డేల్లో టాప్ రన్ స్కోరర్‌గా నిలవాలని కోహ్లి భావిస్తాడనంలో సందేహం లేదు. కోహ్లి ఎప్పటిలాగే ఫిట్‌గా ఉన్నాడు. భవిష్యత్తులో కూడా ఇదే ఫిట్నెస్ను మెయింటేన్ చేస్తాడని నేను అనుకుంటున్నాను.అతడికి కష్టపడి పనిచేసే తత్వం ఉంది. అతడు ఇప్పటికీ సచిన్ కంటే 4,000 పరుగులు వెనుకబడి ఉన్నాడు. సచిన్‌ను కోహ్లి అధిగిమించలేడని చెప్పలేం. అతడిలో కసి ఉంటే కచ్చితంగా సచిన్‌ను దాటగలడు. టీ20 ప్రపంచకప్-2022లో పాకిస్తాన్‌పై ఏ విధంగా అయితే కోహ్లి ఆడాడో.. ఇప్పడు ఈ టోర్నీలో కూడా అదే చేశాడు. అతడొక ఛాంపియన్ ప్లేయర్. ముఖ్యంగా వైట్‌బాల్ ఫార్మాట్లలో అతడిని మించిన వారు లేరని" పాంటింగ్ ఐసీసీ రివ్యూ షోలో పేర్కొన్నాడు.కాగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి తన 14,000 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. ఇప్పటివరకు 299 మ్యాచ్‌ల్లో కోహ్లి 58.20 సగటుతో 14085 పరుగులు చేశాడు. అతడి వన్డే కెరీర్లో 51 సెంచరీలు ఉన్నాయి. కోహ్లి కంటే ముందు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర(14234), సచిన్(18426) ఉన్నారు.చదవండి: మీ కంటే కోతులు బెటర్.. తక్కువగా తింటాయి: వసీం అక్రమ్ -
Ind vs NZ: కివీస్‌తో మ్యాచ్‌లో అతడికి విశ్రాంతి!
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భారత జట్టు అదరగొడుతోంది. ఈ వన్డే ఫార్మాట్ టోర్నమెంట్లో తొలుత బంగ్లాదేశ్‌తో తలపడ్డ టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. అనంతరం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్(India vs Pakistan)పై కూడా ఇదే ఫలితాన్ని పునరావృతం చేసింది.దుబాయ్ వేదికగా సమిష్టిగా రాణించి దాయాదిపై విజయం సాధించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. తదుపరి లీగ్ దశలో భాగంగా చివరగా పటిష్ట న్యూజిలాండ్ జట్టుతో రోహిత్ సేన ఆదివారం తలపడనుంది. ఇక తొలి రెండు మ్యాచ్‌లలోనూ భారత్ ఒకే జట్టుతో ఆడింది. ఈ నేపథ్యంలో కివీస్‌తో నామమాత్రపు మ్యాచ్‌లో మాత్రం ఒక మార్పు చేస్తే బాగుంటుందని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డారెన్ గాఫ్ అన్నాడు.షమీ లేకపోయినాకివీస్తో మ్యాచ్‌లో భారత తుదిజట్టు గురించి తన అభిప్రాయాలు పంచుకుంటూ.. ‘‘షమీకి విశ్రాంతినివ్వాలి. పాకిస్తాన్‌పై అద్భుత విజయంతో టీమిండియా విశ్వాసం రెట్టింపు అయింది. వారి బ్యాటింగ్ లైనప్ బాగుంది.కాబట్టి దుబాయ్‌లో మరో స్పిన్నర్‌ను అదనంగా తుదిజట్టులో చేర్చుకోవచ్చు. లాహోర్ మాదిరి దుబాయ్ పిచ్ మరీ అంత ఫ్లాట్‌గా కూడా ఏమీ లేదు. ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న షమీని కాపాడుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంది.అంతేకాదు.. హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేసిన విధానం అద్భుతంగా ఉన్న కారణంగా షమీ లేకపోయినా పెద్దగా ఆందోళనపడాల్సిన పనిలేదు. నాకు తెలిసి న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఈ ఒక్క మార్పు చేస్తుంది. షమీని పక్కనపెట్టి మరో స్పిన్నర్‌ను ఆడిస్తుంది’’ అని డారెన్ గాఫ్ హిందుస్తాన్ టైమ్స్‌తో పేర్కొన్నాడు.కాగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 10 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తిచేసిన షమీ.. 53 పరుగులు ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు. అయితే పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్ తీయలేకపోయాడు. చీలమండ గాయం తాలుకు నొప్పి తిరగబెట్టడంతో పాక్‌తో మ్యాచ్ సందర్భంగా కాసేపు అతడు విశ్రాంతి తీసుకున్నాడు.ఇక చాంపియన్స్ ట్రోఫీ-2025లో విజేతపై తన అంచనా తెలియజేస్తూ.. ‘‘టీమిండియా పటిష్టంగా ఉంది. ఇందులో సందేహం లేదు. వన్డేల్లో ఇటీవల ఇంగ్లండ్ జట్టును మట్టికరిపించిన విధానం అద్బుతంగా అనిపించింది.టైటిల్ ఫేవరెట్ టీమిండియానేఇక ఇండియాతో పాటు సౌతాఫ్రికా, న్యూజిలాండ్ కూడా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. మరి టోర్నీలో ఎవరు విజేతగా అవతరిస్తారని అడిగితే మాత్రం నేను టీమిండియానే ఎంచుకుంటాను. బ్యాటింగ్‌లో భారత్ అదరగొడుతోంది. ప్రపంచస్థాయి బౌలర్, ప్రధాన పేసర్ అయిన జస్ప్రీత్ బుమ్రా జట్టుతో లేకపోయినా ఆ ప్రభావం పడకుండా సమిష్టిగా రాణిస్తోంది. అందుకే నా టైటిల్ ఫేవరెట్ టీమిండియానే’’ అని ఇంగ్లండ్ మాజీ పేసర్ డారెన్ గాఫ్ చెప్పుకొచ్చాడు.కాగా బంగ్లాదేశ్, పాకిస్తాన్లతో మ్యాచ్‌లలో టీమిండియా ఒక స్పెషలిస్టు స్పిన్నర్(కుల్దీప్ యాదవ్), ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు(అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా), ఒక పేస్‌బౌలింగ్ ఆల్‌రౌండర్(హార్దిక్ పాండ్యా), ఇద్దరు పేసర్ల(హర్షిత్ రాణా, మహ్మద్ షమీ)లతో బరిలోకి దిగింది.చాంపియన్స్ ట్రోఫీ-2025లో బంగ్లాదేశ్, పాకిస్తాన్లతో మ్యాచ్‌లలో భారత తుదిజట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.బెంచ్: రిషభ్ పంత్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్.చాంపియన్స్ ట్రోఫీ-2025లో న్యూజిలాండ్ జట్టువిల్ యంగ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైకేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మాట్ హెన్రీ, కైలీ జెమీసన్, విలియం ఒరూర్కీ, డారిల్ మిచెల్, నాథన్ స్మిత్, మార్క్ చాప్మన్, జాకొబ్ డఫీ.చదవండి: NZ vs BAN: చర్రిత సృష్టించిన రచిన్ రవీంద్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
'అతడు కోహినూరు వజ్రం లాంటి వాడు.. తరానికి ఒక్కడే ఉంటాడు'
విరాట్ కోహ్లి.. ప్రపంచ క్రికెట్లో తనను మించిన ఛేజ్ మాస్టర్ లేడని మరోసారి నిరూపించుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy 2025)లో భాగంగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తన ఫామ్‌పై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే కింగ్ కోహ్లి(Virat Kohli) సమాధనమిచ్చాడు.దాయాదిపై విరాట్ ఆజేయ శతకం సాధించాడు. ఈ ఢిల్లీ క్రికెటర్ లక్ష్య చేధనలో ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను ముగించాడు. అతడి ఇన్నింగ్స్‌కు, పట్టుదలకు ప్రత్యర్ధి జట్టు కెప్టెన్ సైతం ఫిదా పోయాడు. ఈ మ్యాచ్‌లో 111 బంతులు ఎదుర్కొన్న కోహ్లి సరిగ్గా 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లికి ఇది 51వ వన్డే సెంచరీ కాగా.. అంతర్జాతీయ కెరీర్లో 82వది కావడం. సచిన్ 100 సెంచరీలకు కోహ్లి 18 శతకాల దూరంలో ఉన్నాడు.కోహ్లి ప్రదర్శనపై అన్ని వైపులనుంచి ప్రశంసలు వస్తున్నాయి. "అతని ఆటను చూస్తే కనీసం మరో 2–3 ఏళ్లు ఆడి మరిన్ని శతకాలు సాధించే అవకాశం ఉందని భారత మాజీ క్రికెటర్ నవ్‌జోత్ సింగ్ సిద్ధూ అభిప్రాయ పడ్డాడు. ‘కోహ్లిలాంటి ఆటగాడు తరానికొక్కడు మాత్రమే ఉంటాడు. అతని పట్టుదల, పోరాటతత్వం ఈ మ్యాచ్‌లో కనిపించింది. ప్రతికూల పరిస్థితుల్లో బాగా ఆడినప్పుడు ఒకరి సత్తా ఏమిటో తెలుస్తుంది. కోహ్లి కనీసం మరో 2–3 ఏళ్లు ఆడటం మాత్రమే కాదు, మరో 10–15 సెంచరీలు సాధిస్తాడని బల్లగుద్ది చెప్పగలను. గత ఆరు నెలల్లో అతనిపై విమర్శలు వచ్చాయి. కానీ పాకిస్తాన్‌పై పరుగులు సాధించడం మరో పదేళ్ల పాటు దీనిని ఎవరూ మరచిపోలేరు’ అని సిద్ధూ వ్యాఖ్యానించాడు. కుర్రాళ్లు కోహ్లి లాంటి ఆటగాళ్ల నుంచే స్ఫూర్తి పొందుతారని, వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళతారని సిద్ధూ అభిప్రాయ పడ్డాడు. ‘కోహ్లి సామర్థ్యం ఏమిటో ఈ మ్యాచ్‌లో కనిపించింది. ఇన్నింగ్స్ ఆరంభంలో అతని ట్రేడ్‌మార్క్ కవర్ డ్రైవ్‌లు చూస్తే పాత విరాట్ గుర్తుకొచ్చాడు. ఇన్నింగ్స్ సాగిన కొద్దీ అతనిలోని పోరాట తత్వానిŠన్ నేను చూశాను. ఒక ఆట ఎదగాలంటే ఇలాంటివారే స్ఫూర్తిగా నిలుస్తారు.అతను కోహినూర్‌లాంటి వాడు. ఛేదనలో కోహ్లి రికార్డు చూస్తే ఒత్తిడిని ఏమాత్రం దరిచేరనీయకుండా ఆడతాడని అర్థమవుతుంది. కోహ్లి సెంచరీ చేసినప్పుడు రోహిత్ శర్మ కూడా ఎంతో ఆనందంగా కనిపించాడు. సహచరుడి పట్ల గర్వంగా ఉండటం టీమ్ గేమ్‌లో ఉండే గొప్పతనం ఏమిటో చూపించింది’ అని సిద్ధూ పేర్కొన్నాడు. -
కోహ్లీకి దీటుగా కేసీఆర్ రికార్టు
సాక్షి, హైదరాబాద్: వన్డేల్లో 14 వేల పరుగులు సాధించి విరాట్ కోహ్లి రికార్డు సృష్టిస్తే, 14 నెలలుగా అసెంబ్లీకి రాకుండా మాజీ సీఎం కేసీఆర్ కూడా రికార్డు సృష్టించారని దేవాదాయ, అటవీ శాఖమంత్రి కొండా సురేఖ ఎద్దేవా చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించడం హర్షణీయం. ఈ విజయాన్ని అందరం టీవీల్లో చూసి సంబురపడ్డాం. క్రికెట్లో అది విరాట్ కోహ్లి పర్వం అయితే, ప్రజా సమస్యలపై మాట్లాడకుండా ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడం దేశ రాజకీయ చరిత్రలో పెద్ద రికార్డే కదా? ఇది కేసీఆర్ విరాట పర్వం’ అని ఆ ప్రకటనలో సురేఖ వెల్లడించారు. ఆధార్ లేకుంటే వైద్యానికి నిరాకరిస్తున్నారా?సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఆధార్ లేకుంటే వైద్యానికి నిరాకరిస్తున్నారా? అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వివరాలు తెలుసుకొని చెప్పాలని స్పెషల్ జీపీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఓయూలో ఆధార్ లేకుంటే వైద్యం చేయట్లేదంటూ న్యాయవాది బైరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ రేణక యారా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఆకాశ్ బాగ్లేకర్ వాదిస్తూ ప్రభుత్వాస్పత్రిలో వైద్యానికి ఆధార్ తప్పనిసరి అనడం చట్టవిరుద్ధమన్నారు. ఆధార్ అడగకుండా వైద్యం అందించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కాగా, ఆధార్ లేకున్నా వైద్యం అందిస్తున్నామని స్పెషల్ జీపీ రాహుల్ పేర్కొన్నారు. -
కోహ్లి సెంచరీ కోసం లెక్కలు వేసుకున్నాను: అక్షర్ పటేల్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఆజేయ శతకంతో చెలరేగాడు. ఆఖరి వరకు క్రీజులో ఉండి తమ జట్టును విజయ తీరాలకు చేర్చాడు.అయితే కోహ్లి తన 51 వ వన్డే సెంచరీని అందుకునే క్రమంలో కొంత ఉత్కంఠ నెలకొంది. మైదానంలోనూ, టీవీల ముందు అభిమానులు కూడా కోహ్లి సెంచరీ చేస్తాడా లేదా అనేదాని గురించే ఆసక్తిగా ఎదురు చూశారు.వీరి పరిస్థితి ఇలా ఉంటే క్రీజ్‌లో మరోవైపు ఉన్న అక్షర్ పటేల్ పరిస్థితి ఎలా ఉంది! భారత్ విజయానికి 19 పరుగులు, కోహ్లి సెంచరీకి 14 పరుగులు కావాల్సిన స్థితిలో అక్షర్ బ్యాటింగ్‌కు వచ్చాడు. అతను ఒక్క పెద్ద షాట్ ఆడి బౌండరీ సాధించినా లెక్క మారిపోయేది. అందుకే అతను పరుగులు తీయరాదనే అందరూ కోరుకున్నారు.తాను కూడా ఇలాగే భావించినట్లు, కోహ్లి సెంచరీ కోసం లెక్కలు వేసుకున్నట్లు అక్షర్ వెల్లడించాడు. ‘మ్యాచ్ చివరికి వచ్చేసరికి నేను కూడా లెక్కలు వేయడం మొదలు పెట్టాను. బంతి నా బ్యాట్ ఎడ్జ్ తీసుకొని కూడా వెళ్లరాదని కోరుకున్నాను. ఆ సమయంలో అంతా సరదాగా అనిపించింది.ఇంత తీవ్ర ఒత్తిడి ఉండే మ్యాచ్‌లో విరాట్ సెంచరీని డ్రెస్సింగ్ రూమ్ నుంచి నేను చూడటం ఇదే మొదటిసారి. ఈ ఇన్నింగ్స్‌ను చాలా ఆస్వాదించాను. 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేసిన తర్వాత వికెట్ల మధ్య అతను పరుగెత్తిన తీరు విరాట్ ఫిట్‌నెస్‌కు తార్కాణం’ అని అక్షర్ వ్యాఖ్యానించాడు. ఇక టీమిండియా తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో మార్చి 2న దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో తలపడనుంది. -
చాలా అలసిపోయాను.. అది నా బలహీనత.. కానీ అదే బలం: కోహ్లి
విరాట్ కోహ్లి అంటే విరాట్ కోహ్లి(Virat Kohli)నే.. తనకు ఎవరూ సాటిలేరు.. సాటిరారు అని మరోసారి నిరూపించాడు ఈ రన్‌మెషీన్. తన పనైపోయిందన్న వారికి అద్బుత శతకంతో ఫినిషింగ్ టచ్ ఇచ్చి చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్(India vs Pakistan)తో పోరులో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.ఈ సందర్భంగా కోహ్లి ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా పద్నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్‌గా నిలవడంతో పాటు.. ఈ మైలురాయి చేరుకున్న మూడో ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. అంతేకాదు.. ఓ ఐసీసీ టోర్నమెంట్లో ఒకే ప్రత్యర్థిపై అత్యధికసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఆటగాడిగా వరల్డ్ రికార్డు సాధించాడు.అదే విధంగా చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో తనకు ఒక్క శతకం కూడా లేదన్న లోటును కూడా కోహ్లి ఈ మ్యాచ్ సందర్భంగా తీర్చేసుకున్నాడు. ఇక వన్డేల్లో అత్యధికంగా 51 సెంచరీలు పూర్తి చేసుకుని ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్‌గా నిలిచిన కోహ్లి.. అంతర్జాతీయ కెరీర్లో ఓవరాల్‌గా 82 సెంచరీల మైలురాయిని అందుకుని.. శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్ రికార్డుకు మరింత చేరువయ్యాడు.ఈ నేపథ్యంలో తన మ్యాచ్ విన్నింగ్స్ అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘‘సెమీస్ చేరే అవకాశం ఉన్న కీలక మ్యాచ్‌లో ఈ తరహాలో ఆడటం సంతృప్తిగా ఉంది. రోహిత్ అవుటైన తర్వాత మధ్య ఓవర్లలో ఎలాంటి సాహసోపేత షాట్లకు పోకుండా జాగ్రత్తగా ఆడే బాధ్యత నాపై పడింది. చాలా అలసిపోయానుఇది సరైన వ్యూహం. నేను వన్డేల్లో ఎప్పుడూ ఇలాగే ఆడతాను. నా ఆట గురించి నాకు చాలా బాగా తెలుసు. బయటి విషయాలను పట్టించుకోకుండా నా సామర్థ్యాన్ని నమ్ముకోవడం ముఖ్యం.ఎన్నో అంచనాలు ఉండే ఇలాంటి మ్యాచ్‌లలో వాటిని అందుకోవడం నాకు కష్టం కాదు. స్పిన్‌లో జాగ్రత్తగా ఆడుతూ పేస్ బౌలింగ్‌లో పరుగులు రాబట్టాలనే స్పష్టత నాకు ఉంది. గిల్, అయ్యర్ కూడా బాగా ఆడారు. ఈ ఇన్నింగ్స్‌తో నేను చాలా అలసిపోయాను. తర్వాతి మ్యాచ్‌కు వారం రోజుల విరామం ఉంది. 36 ఏళ్ల వయసు ఉన్న నాకు ఇది సంతోషాన్ని కలిగించే విషయం’’ అని పేర్కొన్నాడు.నాకు ఇదొక క్యాచ్-22 లాంటిదిఇక బీసీసీఐ టీవీ ఇంటర్వ్యూలో భాగంగా తన బలహీనత, బలం అయిన షాట్ గురించి కోహ్లి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘కవర్ డ్రైవ్ షాట్.. నాకు ఇదొక క్యాచ్-22 లాంటిది(ముందే వద్దని అనుకున్నా ఓ పని చేయకుండా ఉండలేకపోవడం అనే అర్థంలో). అంటే.. చాలా ఏళ్లుగా నాకు ఇది బలహీనతగా మారింది. అయితే, ఈ షాట్ కారణంగా నేను ఎన్నో పరుగులు రాబట్టాను.ఈరోజు మాత్రం ఆచితూచే ఆడాను. తొలి రెండు బౌండరీలు కవర్ డ్రైవ్ షాట్ల ద్వారానే వచ్చినట్టు గుర్తు. అయితే, కొన్నిసార్లు రిస్క్ అని తెలిసినా సాహసం చేయకతప్పలేదు. ఏదేమైనా అలాంటి షాట్లు ఆడటం ద్వారా మ్యాచ్ నా ఆధీనంలో ఉందనే భావన కలుగుతుంది.వ్యక్తిగతంగా నాకిది ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్. ఇక జట్టుకు కూడా ఇది గొప్ప విజయం’’ అని విరాట్ కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా వన్డేల్లో ఫామ్‌లోకి వచ్చినప్పటికీ.. టెస్టుల్లో కోహ్లి అవుటైన తీరుపై మాత్రం విమర్శలు ఎక్కువగానే వచ్చాయి. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ సమయంలో ఆఫ్ సైడ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతిని ఆడే క్రమంలో అతడు ఎక్కువసార్లు అవుటయ్యాడు. అయితే, తాజాగా ఆ షాట్ల గురించి కోహ్లి ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం విశేషం.చదవండి: Virat Kohli: ఇదేం తీరు కోహ్లి? ఇలాంటివి అవసరమా?.. మండిపడ్డ గావస్కర్ View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
కోహ్లికి శ్రేయస్ చురకలు?
-
అతడు ఫామ్‌లో లేడన్నారు.. కానీ మాకు చుక్కలు చూపించాడు: పాక్ కెప్టెన్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆతిథ్య పాకిస్తాన్ కథ దాదాపు ముగిసినట్లే. ఈ మెగా టోర్నీలో పాక్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. దుబాయ్ వేదికగా భారత్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పాక్ ఓటమి పాలైంది. దీంతో తమ సెమీస్ అవకాశాలను పాక్ సంక్లిష్టం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ పాక్ విఫలమైంది. తొలుత బ్యాటింగ్‌లో 241 పరుగులకు కుప్పకూలిన పాక్.. అనంతరం బౌలింగ్‌లోనూ తేలిపోయింది. 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 42.3 ఓవర్లలో ఊదిపడేసింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి అద్భుతమైన సెంచరీతో మెరిశాడు.పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది రెండు వికెట్లు పడగొట్టగా.. అర్బర్ ఆహ్మద్, కుష్దిల్ షా తలా వికెట్ సాధించారు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. బ్యాటింగ్‌లోనూ సౌద్ షకీల్, రిజ్వాన్, కుష్దీల్ షా మినహా మిగితా బ్యాటర్లంతా చేతులెత్తేశారు.ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన విరాట్ కోహ్లిపై రిజ్వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. విరాట్ కోహ్లి అద్బుత ఇన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడి తమ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడని రిజ్వాన్ చెప్పుకొచ్చాడు."తొలుత విరాట్ కోహ్లి గురుంచి మాట్లాడాలి అనుకుంటున్నాను. అతడి హార్డ్ వర్క్ చూసి ఆశ్చర్యపోయాను. అతడు చాలా కష్టపడి ఈ స్దాయికి చేరుకున్నాడు. అతడు ఫామ్‌లో లేడని క్రికెట్ ప్రపంచం మొత్తం అనుకుంటుంది. కానీ ఇటువంటి పెద్ద మ్యాచ్‌లలో మాత్రం విరాట్ ఆటోమేటిక్‌గా ఫామ్‌లోకి వచ్చేస్తాడు.అతడు ఈ మ్యాచ్‌లో ఎక్కడ కూడా ఇబ్బంది పడేట్లు కన్పించలేదు. చాలా సులువగా షాట్లు ఆడాడు. అతడు మేమి పరుగులు ఇవ్వకుండా కట్టడిచేయాలనకున్నాము. కానీ అతడు ఈజీగా పరుగులు సాధించాడు. అతడి ఫిట్నెస్ లెవల్స్‌తో పాటు హార్డ్ వర్క్‌ను ప్రశంసించాల్సిందే.అతడు మా లాంటి క్రికెటరే. కానీ మా కంటే ఎంతో ఫిట్‌గా ఉన్నాడు. వికెట్ల మధ్య ఎంతో వేగంగా పరుగులు తీస్తున్నాడు. అతడిని ఔట్ చేయడానికి చాలా ప్రయత్నించాం. కానీ అతడు తన అద్బుతమైన ఆట తీరుతో మ్యాచ్‌ను మా నుంచి తీసుకుపోయాడు. ఇక మ్యాచ్‌లో మేము అన్ని విభాగాల్లో మేము నిరాశపరిచాం.అందుకే ఓడిపోయాము. అర్బర్ ఆహ్మద్ మాత్రం అద్బుతంగా బౌలింగ్ చేశాడు. ఈ ఒక్కటి మినహా ఇంకా ఏమీ మాకు సానుకూళ అంశాలు లేవు. మా తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరముంది" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రిజ్వాన్ పేర్కొన్నాడు.చదవండి: ‘కావాలనే అలా చేశాడు.. లూజర్’.. ఆ కోరల నుంచి తప్పించుకుని ఇలా! -
IND vs PAK: ‘కావాలనే అలా చేశాడు.. లూజర్’
టీమిండియాతో మ్యాచ్‌లో పాకిస్తాన్ ఫాస్ట్‌బౌలర్ షాహిన్ ఆఫ్రిది(Shaheen Afridi) అనుసరించిన వ్యూహంపై విమర్శలు వస్తున్నాయి. బౌలింగ్ పరంగా అతడి ఆటకు వంక పెట్టాల్సిన అవసరం లేకున్నా.. ఆఖర్లో అతడు వైడ్లు వేసిన తీరు ఇందుకు కారణం. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భాగంగా రిజ్వాన్ బృందం.. ఆదివారం రోహిత్ సేనను ఢీకొట్టిన విషయం తెలిసిందే.చిరకాల ప్రత్యర్థుల(India vs Pakistan) పోటీని చూసేందుకు భారత సినీ, క్రీడా తారలు దుబాయ్ స్టేడియానికి విచ్చేయగా.. వారికి టీమిండియా పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చింది. టాస్ ఓడిన భారత జట్టు తొలుత బౌలింగ్ చేసి.. దాయాదిని 241 పరుగులకు కట్టడి చేసింది. కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లతో చెలరేగగా.. హార్దిక్ పాండ్యా రెండు కీలక వికెట్లు కూల్చాడు. మిగతా వాళ్లలో అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.36 ఓవర్లు ముగిసే సరికిఇక లక్ష్య ఛేదనలో భారత్ అలవోకగా విజయం వైపు దూసుకుపోతోంది... 36 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు సరిగ్గా 200కు చేరింది. 84 బంతుల్లో 42 పరుగులు చేయడం ఇక లాంఛనమే! సరిగ్గా ఇక్కడే అభిమానులు ఫలితం గురించి కాకుండా కోహ్లి శతకం గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. ఆ సమయంలో విరాట్ స్కోరు 81. అంటే మరో 19 పరుగులు కావాలి.కానీ మరో వైపు శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా చకచకా పరుగులు రాబట్టడంతో ఉత్కంఠ పెరిగింది. పరుగులు తరుగుతూ పోవడంతో అటు వైపు బ్యాటర్ పరుగులు చేయరాదని, కోహ్లి సెంచరీ పూర్తి చేసుకోవాలని అంతా కోరుకున్నారు. ముందుగా అయ్యర్ 7, ఆపై పాండ్యా 8 పరుగులు చేశారు!ఇక పాండ్యా అవుటయ్యే సమయానికి కోహ్లి 86 వద్ద ఉన్నాడు. విజయానికి 19 పరుగులు కావాలి. ఈ సమయంలో అక్షర్ పటేల్ కాస్త సంయమనం పాటించాడు. సింగిల్స్ తీసే అవకాశం ఉన్నా ఆగిపోయాడు. దాంతో కోహ్లి పని సులువైంది. గెలుపు కోసం 2 పరుగులు చేయాల్సిన స్థితిలో కోహ్లి 96 వద్ద ఉన్నాడు. తర్వాతి బంతి(42.3 ఓవర్)కి ఎక్స్ట్రా కవర్ మీదుగా ఫోర్ కొట్టడంతో కోహ్లి 51వ వన్డే సెంచరీ, భారత్ గెలుపు పూర్తయ్యాయి.ఏకంగా మూడు వైడ్ బాల్స్ వేయడంతోఅయితే, టీమిండియా ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్ ఖుష్దిల్ వేయగా.. అంతకంటే ముందు ఓవర్లో షాహిన్ ఆఫ్రిది రంగంలోకి దిగాడు. ఆ ఓవర్లో అతడు ఏకంగా మూడు వైడ్ బాల్స్ వేయడం టీమిండియా అభిమానులకు చిరాకు తెప్పించింది. అప్పటిదాకా మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌల్ చేసిన షాహిన్.. కోహ్లి శతకానికి చేరువైన సమయంలో వైడ్స్ వేయడం విమర్శలకు తావిచ్చింది. షాహిన్ ఉద్దేశపూర్వకంగానే కోహ్లి శతకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.లూజర్.. లూజర్ అంటూఇక స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు కూడా లూజర్.. లూజర్ అంటూ అతడి బౌలింగ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రముఖ నటుడు పరేశ్ రావల్ కూడా స్పందించాడు. ‘‘విరాట్ కోహ్లి నుంచి నిజంగా ఇదొక అద్భుతమైన ఇన్నింగ్స్. అతడి 51వ వన్డే శతకాన్ని అడ్డుకునేందుకు చాలా ప్రయత్నాలే జరిగాయి. షాహిన్ ఆఫ్రిది వైడ్ బాల్స్ అనే కోరల నుంచి తప్పించుకుని సూపర్ సెంచరీ చేశాడు’’ అని బాలీవుడ్, టాలీవుడ్ నటుడు పరేశ్ రావల్ షాహిన్ ఆఫ్రిదిని ఉద్దేశించి సెటైరికల్ ట్వీట్ చేశాడు.చదవండి: అతి చేయొద్దు.. ఇలాంటి ప్రవర్తన సరికాదు: పాక్ దిగ్గజం ఆగ్రహం -
‘పాకిస్తాన్లో గెలిచి ఉంటే బాగుండేది’.. ఇచ్చిపడేసిన శ్రేయస్ అయ్యర్
టీమిండియా విజయాన్ని తక్కువ చేసేలా మాట్లాడిన పాకిస్తాన్ జర్నలిస్టుకు శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) గట్టి కౌంటర్ ఇచ్చాడు. వేదిక ఏదైనా పాక్‌పై గెలుపు తమకు ఎల్లప్పుడూ మధురంగానే ఉంటుందని.. ఆదివారం నాటి మ్యాచ్‌లో తనకు మజా వచ్చిందంటూ అతడికి తమ జట్టు ఓటమిని గుర్తు చేశాడు.కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఆతిథ్య హక్కులను డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) నిరాకరించగా.. ఐసీసీ జోక్యంతో హైబ్రిడ్ విధానంలో టోర్నీ జరుగుతోంది. తటస్థ వేదికైన దుబాయ్‌లో భారత జట్టు తమ మ్యాచ్‌లు ఆడుతోంది.42.3 ఓవర్లలోనే..ఇందులో భాగంగా తొలుత బంగ్లాదేశ్‌ను ఓడించిన రోహిత్ సేన.. తాజా మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసి సెమీస్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్ పాక్‌ను 241 పరుగులకు కట్టడి చేసింది. ఇక 42.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి పాక్‌పై గెలుపొందింది.ఈ విజయంలో విరాట్ కోహ్లి(100 నాటౌట్)తో పాటు శుబ్‌మన్ గిల్(46), శ్రేయస్ అయ్యర్(56)లది కూడా కీలక పాత్ర. ఈ నేపథ్యంలో విజయానంతరం శ్రేయస్ మీడియా సమావేశంలో మాట్లాడగా.. ఓ పాకిస్తానీ జర్నలిస్టు.. దుబాయ్‌లో గాకుండా పాకిస్తాన్లో పాకిస్తాన్‌ను ఓడించి ఉంటే ఇంకా బాగుండేది కదా అని ప్రశ్నించాడు.ఇరుజట్లకు తటస్థ వేదికే..సదరు జర్నలిస్టు మాటల్లోని వ్యంగ్యాన్ని అర్థం చేసుకున్న శ్రేయస్ అయ్యర్ హుందాగానే కౌంటర్ వేశాడు. ‘‘పాకిస్తాన్లో నేను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కాబట్టి అక్కడ గెలిస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుందో నాకు తెలియదు. అయితే, దుబాయ్ అనేది ఇరుజట్లకు తటస్థ వేదికే.ఇక భారత్- పాక్ మ్యాచ్ అంటే అంచనాలు భారీగానే ఉంటాయి. అయినా మేము దుబాయ్‌లో ఎక్కువగా మ్యాచ్‌లు ఆడలేదు. ఏదైతేనేం ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఓడించాము కదా. అదే ఓ మధురానుభూతి. బయట నుంచి వచ్చే ఒత్తిడిని అధిగమించి మరీ మా పని పూర్తి చేశాం.నేనైతే ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నా. పాకిస్తాన్‌పై ఇది నాకు మూడో మ్యాచ్. ఇందులో గెలవడం ఎంతో మజాన్నిచ్చింది’’ అని శ్రేయస్ అయ్యర్ సమాధానమిచ్చాడు. సొంతగడ్డపై పాక్ బలమైన జట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ దేశ జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలను తన మాటలతో ఇలా తిప్పికొట్టాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ స్కోర్లు👉వేదిక: దుబాయ్👉టాస్: పాకిస్తాన్.. తొలుత బ్యాటింగ్👉పాకిస్తాన్ స్కోరు- 241(49.4) ఆలౌట్👉భారత్ స్కోరు- 244/4 (42.3)👉ఫలితం: పాక్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: విరాట్ కోహ్లి(100 పరుగులు నాటౌట్).చదవండి: Virat Kohli: ఇదేం తీరు కోహ్లి? ఇలాంటివి అవసరమా?.. మండిపడ్డ గావస్కర్ -
ఇదేం తీరు కోహ్లి? ఇలాంటివి అవసరమా?.. మండిపడ్డ గావస్కర్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) తీరుపై భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్(Sunil Gavaskar) అసహనం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్(India vs Pakistan)తో మ్యాచ్‌లో అనవసర చర్య ద్వారా వికెట్ కోల్పోయే ప్రమాదం తెచ్చుకున్నాడని.. అయితే, అదృష్టవశాత్తూ బయటపడటంతో తాము ఊపిరి పీల్చుకున్నామన్నాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత్ ఆదివారం పాకిస్తాన్‌తో తలపడింది.దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన రోహిత్ సేన తొలుత ఫీల్డింగ్ చేసింది. బౌలర్ల విజృంభణ కారణంగా దాయాదిని 241 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనను దూకుడుగా ఆరంభించిన టీమిండియా.. మిడిల్ ఓవర్లలో మాత్రం ఆచితూచి నిలకడగా ఆడింది. సెంచరీ మార్కు.. విన్నింగ్ షాట్ముఖ్యంగా ఓపెనర్ శుబ్‌మన్ గిల్(46), నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(56)లతో కలిసి విరాట్ కోహ్లి అద్భుత భాగస్వామ్యాలు నెలకొల్పాడు.ఏ దశలో నిర్లక్ష్యపు షాట్లకు యత్నించకుండా.. సహచర బ్యాటర్లతో చక్కగా సమన్వయం చేసుకుంటూ ఇన్నింగ్స్ నిర్మించాడు. ఈ క్రమంలో అర్ధ శతకం పూర్తి చేసుకున్న కోహ్లి.. దానిని శతకంగా మలిచాడు. అంతేకాదు బౌండరీ బాది సెంచరీ మార్కు అందుకున్న ఈ రన్‌మెషీన్.. టీమిండియాను గెలుపుతీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లిపై భారత్‌తో పాటు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.అయితే, బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లి చేసిన ఓ పని మాత్రం సునిల్ గావస్కర్‌కు ఆగ్రహం తెప్పించింది. భారత ఇన్నింగ్స్‌లో 21 ఓవర్‌ను పాక్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ వేయగా.. ఐదో బంతికి కోహ్లి సింగిల్ తీశాడు. ఈ క్రమంలో సురక్షితంగానే క్రీజులోకి చేరుకున్న కోహ్లి.. ఆ తర్వాత ఓవర్ త్రో కాబోతున్న బంతిని తన చేతితో ఆపేశాడు.నిజానికి అక్కడ దగ్గర్లో పాకిస్తాన్ ఫీల్డర్లు ఎవరూ లేరు. ఒకవేళ ఓవర్ త్రో అయినా ఓ అదనపు పరుగు వచ్చేది. అయినా, ఎంసీసీ నిబంధనల ప్రకారం ఓ బ్యాటర్ బంతి లైవ్‌లో ఉన్నపుడు దానిని తన మాటలు, చేతల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా అతడు అలా చేసినట్లు భావించి ఫీల్డింగ్ చేస్తున్న జట్టు అప్పీలు చేస్తే.. సదరు బ్యాటర్‌ను అవుట్‌గా ప్రకటించవచ్చు.అబ్స్ట్రక్ట్ ఫీల్డ్ నిబంధన కింద..కోహ్లి విషయంలో ఒకవేళ పాక్ జట్టు ఈ విషయంలో అప్పీలుకు వెళ్లి ఉంటే పరిస్థితి చేజారిపోయేదని గావస్కర్ అన్నాడు. కామెంట్రీ సమయంలో.. ‘‘అతడు తన చేతితో బంతిని ఆపాడు. ఒకవేళ పాకిస్తాన్ గనుక అప్పీలు చేస్తే ఏమయ్యేది?.. అబ్స్ట్రక్ట్ ఫీల్డ్ నిబంధన కింద అతడు అవుటయ్యేవాడేమో?!.. కానీ వాళ్లు అలా చేయలేదు. ఎందుకంటే.. అక్కడ దగ్గర్లో ఫీల్డర్ లేడు.అంతేకాదు ఓవర్ త్రో ద్వారా అదనపు పరుగు రాకుండా ఉండిపోయిందని భావించి ఉండవచ్చు. నిజానికి మిడ్‌వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఆటగాడు డైవ్ చేస్తే బాగుండేది. కానీ ముందుకు వెళ్లిపోతున్న బంతిని కోహ్లి జోక్యం చేసుకుని మరీ ఆపడం సరికాదు. అదృష్టవశాత్తూ ఎవరూ అప్పీలు చేయలేదు కాబట్టి సరిపోయింది’’ అని గావస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. కాగా 21వ ఓవర్ ముగిసే సరికి కోహ్లి కేవలం 41 పరుగుల వద్ద ఉండటం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌లో 111 బంతులు ఎదుర్కొన్న కోహ్లి సరిగ్గా 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వన్డేల్లో అతడికి ఇది 51వ సెంచరీ కాగా.. అంతర్జాతీయ కెరీర్లో 82వది కావడం విశేషం. సచిన్ టెండ్కులర్ వంద సెంచరీల రికార్డుకు కోహ్లి ఇంకా 18 శతకాల దూరంలో ఉన్నాడు.చాంపియన్స్ ట్రోఫీ-2025: భారత్ వర్సెస్ పాకిస్తాన్ స్కోర్లు👉పాకిస్తాన్- 241(49.4) ఆలౌట్👉భారత్- 244/4 (42.3)👉ఫలితం: పాక్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన భారత్.చదవండి: ‘ఏంటిది?’.. రిజ్వాన్ చర్యకు హర్షిత్ రాణా రియాక్షన్ వైరల్.. గంభీర్ కూడా! -
పాంటింగ్‌ను దాటేసిన కోహ్లి.. ఇక మిగిలింది సంగక్కర, సచిన్ మాత్రమే..!
పరుగుల యంత్రం విరాట్ కోహ్లి (Virat Kohli) అంతర్జాతీయ క్రికెట్లో మరో ఘనత సాధించాడు. మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్-3లోకి చేరాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో (Champions Trophy 2025) భాగంగా పాకిస్తాన్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో (India Vs Pakistan) సెంచరీ చేసిన విరాట్.. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ను (Ricky Ponting) వెనక్కు నెట్టి మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో.. లంక దిగ్గజ బ్యాటర్ కుమార సంగక్కర రెండో స్థానంలో ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ మరో 514 పరుగులు చేస్తే సంగక్కరను కూడా వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకుతాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్స్సచిన్ టెండూల్కర్- 782 ఇన్నింగ్స్‌ల్లో 34357 పరుగులుకుమార సంగక్కర- 666 ఇన్నింగ్స్‌ల్లో 28016విరాట్ కోహ్లి- 614 ఇన్నింగ్స్‌ల్లో 27503రికీ పాంటింగ్- 668 ఇన్నింగ్స్‌ల్లో 27483మహేళ జయవర్దనే- 725 ఇన్నింగ్స్‌ల్లో 25957కాగా, పాక్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో విరాట్ మరో అరుదైన మైలురాయిని కూడా దాటాడు. 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వన్డేల్లో 14000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. విరాట్‌కు ముందు సచిన్ (18426), సంగక్కర్ (14234) మాత్రమే వన్డేల్లో 14000 పరుగుల మార్కును దాటారు. ఈ రికార్డు సాధించే క్రమంలో విరాట్ మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 14000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ 350 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా.. విరాట్ కేవలం 287వ ఇన్నింగ్స్‌ల్లో 14000 పరుగులు పూర్తి చేశాడు.వన్డేల్లో 51వ సెంచరీనిన్నటి మ్యాచ్‌లో పాక్‌పై సెంచరీతో విరాట్ వన్డే సెంచరీల సంఖ్య 51కి చేరింది. మూడు ఫార్మాట్లలో కలిపి విరాట్ సెంచరీల సంఖ్య 82కు చేరింది. ప్రపంచ క్రికెట్లో సెంచరీల సంఖ్యా పరంగా సచిన్ (100) ఒక్కడే విరాట్ కంటే ముందున్నాడు.విరాట్ సూపర్ సెంచరీ.. పాక్‌ను చిత్తు చేసిన భారత్విరాట్ సూపర్ సెంచరీతో కదంతొక్కడంతో నిన్నటి మ్యాచ్‌లో పాక్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో విరాట్ అజేయ సెంచరీతో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (62) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ రిజ్వాన్ (46), ఖుష్దిల్ షా (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. వీరు మినహా పాక్ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఇమామ్ ఉల్ హక్ 10, బాబర్ ఆజమ్ 23, సల్మాన్ అఘా 19, తయ్యబ్ తాహిర్ 4, షాహీన్ అఫ్రిది 0, నసీం షా 14, హరీస్ రౌఫ్ 8 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ 3, హార్దిక్ 2, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.అనంతరం బరిలోకి దిగిన భారత్.. కోహ్లి శతక్కొట్టడంతో (111 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు) 42.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ (56).. విరాట్‌తో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత విజయాన్ని ఖరారు చేశాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ (20), శుభ్‌మన్ గిల్ (46) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. పాక్ బౌలర్లలో అఫ్రిది 2, అబ్రార్ అహ్మద్, ఖుష్దిల్ షా తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో భారత్ సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారు చేసుకుంది. వరుస పరాజయాలతో పాక్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. -
ఆ ముగ్గురు అద్బుతం.. కోహ్లి గురించి చెప్పేదేమీ లేదు: రోహిత్ శర్మ
టీమిండియా బౌలింగ్ దళంపై కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ప్రశంసలు కురిపించాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో తమ బౌలర్లు అదరగొట్టారని.. ప్రత్యర్థిని నామమాత్రపు స్కోరుకు కట్టడి చేసి తమపై కాస్త ఒత్తిడిని తగ్గించారని అన్నాడు. మిడిల్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేసిన తీరు అద్భుతమని బౌలర్లను కొనియాడిన రోహిత్ శర్మ.. ఇక ఛేజ్‌మాస్టర్ విరాట్ కోహ్లి(Virat Kohli) నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ రావడం తననేమీ ఆశ్చర్యపరచలేదని తెలిపాడు.చాంపియన్స్ ట్రోఫీ-2025లో బంగ్లాదేశ్‌పై గెలిచి విజయంతో ఈ ఐసీసీ టోర్నీని ఆరంభించిన రోహిత్ సేన.. ఆదివారం నాటి తమ రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఓడించింది. చిరకాల ప్రత్యర్థిపై ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించి సెమీ ఫైనల్ రేసులో మున్ముందుకు దూసుకుపోయింది.దుబాయ్ వేదికగా దాయాది పాకిస్తాన్‌తో తలపడ్డ టీమిండియా.. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో 49.4 ఓవర్లలో ప్రత్యర్థిని 241 పరుగులకు ఆలౌట్ చేసింది. కుల్దీప్ యాదవ్ మూడు, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లతో మెరవగా.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా ఒక్కో వికెట్ తీశారు. అదే విధంగా.. అక్షర్ తన అద్భుత ఫీల్డింగ్‌తో రెండు రనౌట్లలో భాగమయ్యాడు.ఇక లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 42.3 ఓవర్లలోనే టార్గెట్‌ను ఊదేసింది. విరాట్ కోహ్లి ఫోర్ బాది శతకం పూర్తి చేసుకోవడంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. మిగతా వాళ్లలో ఓపెనర్ శుబ్‌మన్ గిల్(46), మిడిలార్డర్ స్టార్ శ్రేయస్ అయ్యర్(56) అద్బుత ఇన్నింగ్స్ ఆడారు.ఈ నేపథ్యంలో విజయానంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ... జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘బంతితో మేము మ్యాచ్ ఆరంభించిన విధానం సూపర్. బౌలింగ్ విభాగం అద్భుతమైన ప్రదర్శనతో పాకిస్తాన్‌ను నామమాత్రపు స్కోరుకే పరిమితం చేసింది. లక్ష్య ఛేదనలో లైట్ల వెలుగులో బ్యాటింగ్ చేయడం ఈ పిచ్‌పై ఎంత బాగుంటుందో.. స్లో వికెట్‌పై ఆడటం అంతే కఠినంగానూ ఉంటుందని మాకు తెలుసు.అయితే, మా బ్యాటింగ్ లైనప్ త్వరగానే పనిపూర్తి చేసింది. ఏదేమైనా.. అక్షర్, కుల్దీప్, జడేజా మిడిల్ ఓవర్లలో గొప్పగా రాణించారు. వన్డే ఫార్మాట్లో తమకున్న అనుభవాన్ని ఇక్కడ చూపించారు. రిజ్వాన్‌తో పాటు సౌద్ షకీల్‌ల వికెట్లు మాకు కీలకం. వారిద్దరిని ఎక్కువ సేపు క్రీజులో ఉండనీయవద్దనే మా ప్రయత్నాలు ఫలించాయి.ఈ ముగ్గురు స్పిన్నర్లు ఈరోజు అద్భుతమే చేశారు. అయితే, పేసర్లు హార్దిక్, హర్షిత్, షమీ బౌలింగ్ చేసిన విధానాన్ని కూడా మనం మర్చిపోకూడదు. బౌలింగ్ యూనిట్లో ప్రతి ఒక్కరు తమ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించారు.ఇక కోహ్లి దేశం కోసం ఆడటాన్ని ఎంతగా ఇష్టపడతాడో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జట్టు ప్రయోజనాల కోసం తన శక్తినంతా ధారపోస్తాడు. కీలక సమయంలో తనలోని అత్యుత్తమ నైపుణ్యాలను మరింత మెరుగ్గా ప్రదర్శిస్తాడు. కోహ్లి అంటే ఏమిటో ఈరోజు మరోసారి నిరూపించాడు.డ్రెసింగ్ రూంలో కూర్చున వాళ్లలో ఒక్కరు కూడా కోహ్లి ఇన్నింగ్స్ చూసి ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే.. సుదీర్ఘకాలంగా జట్టు కోసం అతడేం చేస్తున్నాడో అందరికీ తెలుసు. మిడిల్ ఓవర్లలో.. మరో ఎండ్‌లోని బ్యాటర్లతో చక్కటి సమన్వయంతో అతడు ముందుకు సాగిన విధానం అద్భుతం. అంతేకాదు తనదైన స్టైల్లో మ్యాచ్‌ను ముగించడం రెట్టింపు సంతోషం. గిల్, శ్రేయస్ కూడా విలువైన ఇన్నింగ్స్ ఆడారు’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.చదవండి: ‘ఏంటిది?’.. రిజ్వాన్ చర్యకు హర్షిత్ రాణా రియాక్షన్ వైరల్.. గంభీర్ కూడా! -
Champions Trophy 2025: పాక్‌పై కోహ్లి సెంచరీ.. ఇస్లామాబాద్‌లోనూ సంబరాలు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) పాక్‌పై విరాట్ (Virat Kohli) సెంచరీని విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. నిన్న దుబాయ్‌లో దాయాదితో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి బౌండరీ కొట్టి తన సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు భారత్‌ను విజయతీరాలకు చేర్చిన విషయం తెలిసిందే. ఈ విజయం అనంతరం భారత్‌లో సంబరాలు అంబరాన్ని అంటాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అభిమానులు భారత విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.Fans dancing and celebrating Virat Kohli's Hundred & Team India's Win against Pakistan in Mumbai. 🔥🇮🇳 (ANI).pic.twitter.com/Hxg0VCq43Y— Tanuj Singh (@ImTanujSingh) February 23, 2025మ్యాచ్ జరిగిన దుబాయ్‌లో భారత అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. మ్యాచ్ చూడటానికి వచ్చిన సెలబ్రిటీలు సైతం సాధారణ వ్యక్తుల్లా భారత విజయాన్ని ఆస్వాధించారు. కోహ్లి క్రేజ్ ఎల్లలు దాటి పాకిస్తాన్‌కు కూడా పాకింది. పాక్ సిటిజన్లు కోహ్లి తమ సొంత జట్టుపై సెంచరీ చేసినా సెలబ్రేట్ చేసుకున్నారు. కోహ్లి సెంచరీ అనంతరం పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లోనూ సంబరాలు జరిగాయి.Crazy scenes in ISLAMABAD! ONLY @imVkohli can do this 🙏🙏🙏🙏pic.twitter.com/reIvbpr9nk— CricTracker (@Cricketracker) February 23, 2025కొందరు క్రికెట్ అభిమానులు భారత్, పాక్ మధ్య ఉన్న అంతరాన్ని మరిచి విరాట్ సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. పాక్‌పై భారత విజయాన్ని అతి సున్నితమైన కశ్మీర్ ప్రాంతంలోనూ సెలబ్రేట్ చేసుకున్నారు. భారత అభిమానులు రోడ్లపైకి వచ్చి కేరింతలు కొడుతూ బాణాసంచా కాల్చారు. 'భారత్ మాతాకి జై' అన్న నినాదాలతో యావత్ భారత దేశం మార్మోగిపోయింది. కోహ్లి నామస్మరణతో క్రికెట్ ప్రపంచం దద్దరిల్లింది.CELEBRATIONS IN JAMMU AFTER INDIA'S VICTORY OVER PAKISTAN. 🇮🇳pic.twitter.com/OYLNoYSoE3— Mufaddal Vohra (@mufaddal_vohra) February 23, 2025కాగా, నిన్నటి మ్యాచ్‌లో భారత్ పాక్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సూపర్ సెంచరీ చేసి భారత్‌ను గెలిపించాడు. పాక్ నిర్దేశించిన 242 పరుగుల సాధారణ లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించింది. కోహ్లి వన్డేల్లో 51వ సెంచరీతో, ఓవరాల్‌గా 82వ సెంచరీతో మెరిశాడు. భారత్‌ను గెలిపించడంలో శ్రేయస్ అయ్యర్ (56), శుభ్‌మన్ గిల్ (46), కుల్దీప్ యాదవ్ (9-0-40-3), హార్దిక్ పాండ్యా (8-0-31-2) తమవంతు పాత్రలు పోషించారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (62) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ రిజ్వాన్ (46), ఖుష్దిల్ షా (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. వీరు మినహా పాక్ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. భారత బౌలర్లలో కుల్దీప్ 3, హార్దిక్ 2, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో భారత్ సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారైంది. వరుస పరాజయాలతో పాక్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. -
పాక్ కు చుక్కలు చూపించిన కోహ్లీ
-
IND Vs PAK: కోహ్లి సూపర్ సెంచరీ.. పాక్‌పై భారత్ ఘన విజయం (ఫోటోలు)
-
టీమిండియాకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అభినందనలు తెలియజేశారు.అద్భుత సెంచరీ చేసిన విరాట్ కోహ్లీకి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో వైఎస్ జగన్ పోస్టు చేశారు. -
కోహ్లి‘నూరు’.. పాకిస్తాన్ చిత్తు
ఇంట (పాక్‌లో) జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో... దుబాయ్‌లో జరిగిన పోరులో భారత్ చేతిలో... చిత్తుగా ఓడిన పాకిస్తాన్‌కు ఇక ఆతిథ్య మురిపెమే మిగలనుంది. సెమీఫైనల్‌కు వెళ్లే దారైతే మూసుకుపోయింది. 2017 విజేత పాక్.. గ్రూప్ ‘ఎ’లో అందరికంటే ముందే ని్రష్కమించే జట్టుగా అట్టడుగున పడిపోనుంది. ఈ ఆదివారం కోసం అందరూ ఎదురుచూసిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించింది. 2017లో తమపైనే ఫైనల్లో గెలిచి కప్‌ను లాక్కెళ్లిన పాక్ జట్టును టీమిండియా ఈసారి పెద్ద దెబ్బే కొట్టింది. అసలు కప్ రేసులో పడకముందే లీగ్ దశలోనే ని్రష్కమించేలా ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (76 బంతుల్లో 62; 5 ఫోర్లు), రిజ్వాన్ (77 బంతుల్లో 46; 3 ఫోర్లు) రాణించారు. కుల్దీప్ 3 వికెట్లు, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 42.3 ఓవర్లలో నాలుగే వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసి గెలిచింది. సులువైన విజయం ముంగిట విరాట్ కోహ్లి (111 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు) బౌండరీ కొట్టి సెంచరీని పూర్తి చేసుకోగా.. భారత్ కూడా లక్ష్యాన్ని అధిగమించింది. శ్రేయస్ అయ్యర్ (67 బంతుల్లో 56; 5 ఫోర్లు, 1 సిక్స్), శుబ్‌మన్ గిల్ (52 బంతుల్లో 46; 7 ఫోర్లు) రాణించారు. షాహిన్ షా అఫ్రిది 2 వికెట్లు తీశాడు. కోహ్లికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ లభించింది. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను మార్చి 2న న్యూజిలాండ్‌తో ఆడుతుంది. భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ టీమ్‌కంటే ఒక ‘కాంతి సంవత్సరం’ ముందుంది! దుబాయ్‌లో ఇది మరోసారి రుజువైంది. అందరిలోనూ ఆసక్తి, చర్చను రేపుతూ ప్రసారకర్తలు, ప్రకటనకర్తలకు అతి పెద్ద బ్రాండ్ ఈవెంట్‌గా మారిన భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ మళ్లీ ఏకపక్షంగా ముగిసింది. మ్యాచ్ ఆరంభమైనప్పటి నుంచి టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం కనబర్చగా, ఏ దశలోనూ పాక్ కనీస పోటీ ఇచ్చే స్థితిలో కనిపించలేదు.పిచ్ నెమ్మదిగా ఉండవచ్చు... పరుగులు రావడం కష్టంగా మారవచ్చు... అయినా సరే పాక్ బ్యాటింగ్ బృందం పేలవ ఆటతో అతి సాధారణ స్కోరుకే పరిమితమైంది... మన బౌలర్లు సమష్టిగా రాణిస్తూ ప్రత్యర్థి ని పూర్తిగా అడ్డుకున్నారు. ఆపై ఛేదనలో భారత్ అలవోకగా దూసుకుపోయింది... పాక్ బౌలర్లు టీమిండియాను ఏమాత్రం నిలువరించలేకపోయారు. పిచ్ ఎలా ఉన్నా సత్తా ఉంటే పరుగులు రాబట్టవచ్చనే సూత్రాన్ని చూపిస్తూ మన బ్యాటర్లంతా తమ స్థాయిని ప్రదర్శించాడు.ఎప్పటిలాగే ఛేదనలో వేటగాడైన విరాట్ కోహ్లి తన లెక్క తప్పకుండా పరుగులు చేస్తూ ఒకే షాట్‌తో భారత్‌ను గెలిపించడంతో పాటు తన శతకాన్ని కూడా పూర్తి చేసుకున్నాడు. తాజా గెలుపుతో భారత్ దాదాపు సెమీఫైనల్లో చోటు ఖాయం చేసుకోగా... రెండు పరాజయాల తర్వాత డిఫెండింగ్ చాంపియన్ పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించడం దాదాపుగా ఖాయమైంది. ఆతిథ్య దేశమైన ఆ జట్టు ఇక తమ సొంతగడ్డకు వెళ్లి అభిమానుల మధ్య నామమాత్రమైన చివరి పోరులో ఆడటమే మిగిలింది. దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నమెంట్లో భారత్ దాదాపుగా సెమీఫైనల్ స్థానాన్ని ఖాయం చేసుకుంది. తొలి పోరులో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన రోహిత్ శర్మ బృందం ఇప్పుడు గ్రూప్ ‘ఎ’ రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ పాకిస్తాన్ జట్టుపై గెలిచింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (76 బంతుల్లో 62; 5 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (77 బంతుల్లో 46; 3 ఫోర్లు), ఖుష్దిల్ షా (39 బంతుల్లో 38; 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్‌కు 3 వికెట్లు దక్కగా...హార్దిక్ పాండ్యా 2 కీలక వికెట్లు తీశాడు. అనంతరం భారత్ 42.3 ఓవర్లలో 4 వికెట్లకు 244 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విరాట్ కోహ్లి (111 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు) సెంచరీ సాధించాడు. శుబ్‌మన్ గిల్ (52 బంతుల్లో 46; 7 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (67 బంతుల్లో 56; 5 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచారు. కోహ్లి, అయ్యర్ మూడో వికెట్‌కు 114 పరుగులు జోడించారు. తమ ఆఖరి మ్యాచ్‌లో వచ్చే ఆదివారం న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతుంది. షకీల్ అర్ధ సెంచరీ... షమీ నియంత్రణ కోల్పోయి వేసిన తొలి ఓవర్‌తో పాక్ ఇన్నింగ్స్ మొదలైంది. ఈ ఓవర్లో అతను ఏకంగా 5 వైడ్లు వేయడంతో మొత్తం 11 బంతులతో ఓవర్ పూర్తి చేయాల్సి వచ్చింది! ఆ తర్వాత బాబర్ ఆజమ్ (26 బంతుల్లో 23; 5 ఫోర్లు) చక్కటి కవర్‌డ్రైవ్‌లతో పరుగులు రాబట్టాడు. అయితే బాబర్‌ను పాండ్యా వెనక్కి పంపించగా, అక్షర్ ఫీల్డింగ్‌కు ఇమామ్ ఉల్ హక్ (10) రనౌటయ్యాడు. ఈ దశలో రిజ్వాన్, షకీల్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే వీరిద్దరు మరీ నెమ్మదిగా ఆడటంతో పరుగుల వేగం మందగించింది. ఒకదశలో 32 బంతుల తర్వాత గానీ బౌండరీ రాలేదు.హార్దిక్ పాండ్యా చక్కటి స్పెల్ (6–0–18–1)తో పాక్‌ను కట్టి పడేసాడు. తొలి 10 ఓవర్లలో 52 పరుగులు చేసిన జట్టు తర్వాతి 10 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది. ఆ తర్వాతా ఒక దశలో వరుసగా 53 బంతుల పాటు ఫోర్ రాలేదు! అనంతరం కాస్త ధాటిని పెంచిన షకీల్ 63 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అక్షర్ బౌలింగ్‌లో ముందుకొచ్చి షాట్ ఆడబోయే క్రమంలో రిజ్వాన్ బౌల్డ్ కావడంతో 104 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. మరో 14 పరుగుల వ్యవధిలో షకీల్, తాహిర్ (4) వెనుదిరగ్గా... ఆపై కుల్దీప్ వరుస బంతుల్లో 2 వికెట్లు తీసి దెబ్బ కొట్టాడు. చివర్లో ఖుష్దిల్ కాస్త వేగంగా ఆడటంతో పాక్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. శతక భాగస్వామ్యం... స్వల్ప లక్ష్యమే అయినా భారత్ తమ ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించింది. ఛేదనలో రోహిత్ శర్మ (15 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్), గిల్ చకచకా పరుగులు రాబట్టారు. అయితే షాహిన్ అఫ్రిది అద్భుత బంతితో రోహిత్‌ను క్లీన్»ౌల్డ్ చేయడంతో జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత అఫ్రిది వరుస రెండు ఓవర్లలో కలిపి 5 ఫోర్లు బాదిన గిల్ జోరు ప్రదర్శించాడు. మరోవైపు కోహ్లి కూడా తనదైన శైలిలో చక్కటి షాట్లతో ఆధిక్యం ప్రదర్శించాడు. కోహ్లితో రెండో వికెట్‌కు 69 పరుగులు జోడించిన తర్వాత గిల్ వెనుదిరిగాడు. ఈ దశలో కోహ్లి, అయ్యర్ పార్ట్నర్íÙప్ జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లింది.వీరిద్దరు ఎక్కడా తడబాటు లేకుండా చక్కటి సమన్వయంతో దూసుకుపోయారు. వీరిని నిలువరించేందుకు పాక్ బౌలర్లు తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఈ క్రమంలో కోహ్లి 62 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 25 పరుగుల వద్ద అయ్యర్ ఇచ్చిన క్యాచ్‌ను షకీల్ వదిలేయడం కూడా కలిసొచ్చింది. అనంతరం 63 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. విజయానికి 28 పరుగుల దూరంలో అయ్యర్... 19 పరుగుల దూరంలో హార్దిక్ పాండ్యా (8) అవుటైనా ... అక్షర్ పటేల్ (3 నాటౌట్)తో కలిసి కోహ్లి మ్యాచ్ ముగించాడు. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: ఇమామ్ (రనౌట్) 10; బాబర్ (సి) రాహుల్ (బి) పాండ్యా 23; షకీల్ (సి) అక్షర్ (బి) పాండ్యా 62; రిజ్వాన్ (బి) అక్షర్ 46; సల్మాన్ (సి) జడేజా (బి) కుల్దీప్ 19; తాహిర్ (బి) జడేజా 4; ఖుష్దిల్ (సి) కోహ్లి (బి) రాణా 38; అఫ్రిది (ఎల్బీ) (బి) కుల్దీప్ 0; నసీమ్ (సి) కోహ్లి (బి) కుల్దీప్ 14; రవూఫ్ (రనౌట్) 8; అబ్రార్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 241. వికెట్ల పతనం: 1–41, 2–47, 3–151, 4–159, 5–165, 6–200, 7–200, 8–222, 9–241, 10–241. బౌలింగ్: షమీ 8–0–43–0, హర్షిత్ రాణా 7.4–0–30–1, హార్దిక్ పాండ్యా 8–0–31 –2, అక్షర్ పటేల్ 10–0–49–1, కుల్దీప్ యాదవ్ 9–0–40–3, జడేజా 7–0–40–1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (బి) షాహిన్ అఫ్రిది 20; గిల్ (బి) అబ్రార్ 46; విరాట్ కోహ్లి (నాటౌట్) 100; శ్రేయస్ అయ్యర్ (సి) ఇమామ్ (బి) ఖుష్దిల్ 56; పాండ్యా (సి) రిజ్వాన్ (బి) షాహిన్ అఫ్రిది 8; అక్షర్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (42.3 ఓవర్లలో 4 వికెట్లకు) 244. వికెట్ల పతనం: 1–31, 2–100, 3–214, 4–223. బౌలింగ్: అఫ్రిది 8–0–74–2, నసీమ్ షా 8–0–37–0, హారిస్ రవూఫ్ 7–0–52–0, అబ్రార్ 10–0–28–1, ఖుష్దిల్ 7.3–0–43–1, సల్మాన్ 2–0–10–0. 14000 వన్డేల్లో 14 వేల పరుగులు దాటిన మూడో ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. సచిన్ (350), సంగక్కర (378)కంటే చాలా తక్కువ ఇన్నింగ్స్ (287)లలో అతను ఈ మైలురాయిని దాటాడు.158 వన్డేల్లో కోహ్లి క్యాచ్‌ల సంఖ్య. అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత ఫీల్డర్‌గా అజహరుద్దీన్ (156) రికార్డును అతను అధిగమించాడు. 82 అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి కోహ్లి శతకాల సంఖ్య. వన్డేల్లో 51, టెస్టుల్లో 30, టి20ల్లో 1 సెంచరీ అతని ఖాతాలో ఉన్నాయి. చాంపియన్స్ ట్రోఫీలో నేడున్యూజిలాండ్ X బంగ్లాదేశ్మధ్యాహ్నం గం. 2:30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
IND Vs PAK: చాలా సంతోషంగా ఉంది.. అతడు అందుకే నెం1 అయ్యాడు: విరాట్ కోహ్లి
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. పాకిస్తాన్‌పై తనకు తిరుగులేదని మరోసారి నిరూపించున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 242 పరుగుల లక్ష్య చేధనలో కోహ్లి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ ఔటయ్యక క్రీజులోకి విరాట్.. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. తొలుత శుబ్‌మన్ గిల్‌తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పిన కోహ్లి.. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్‌తో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో 94 బంతుల్లో తన 51వ వన్డే సెంచరీ మార్క్‌ను కింగ్ కోహ్లి అందుకున్నాడు. ఓవరాల్‌గా కోహ్లికి ఇది 81వ అంతర్జాతీయ సెంచరీ కావడం గమనార్హం. కాగా కోహ్లి అద్భుత సెంచరీ ఫలితంగా 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ 4 వికెట్లు కోల్పోయి 42.3 ఓవర్లలో చేధించింది. దీంతో చిరకాల ప్రత్యర్ధిపై 6 వికెట్ల తేడాతో రోహిత్ సేన విజయాన్ని అందించాడు."సెమీస్‌కు ఆర్హత సాధించడానికి అవసరమైన మ్యాచ్‌లో ఈ తరహా ఇన్నింగ్స్ ఆడటం చాలా సంతోషంగా ఉంది. ఆరంభంలోనే రోహిత్ వికెట్ కోల్పోయిన తర్వాత ఆఖరి వరకు ఉండి మ్యాచ్‌ను ఫినిష్ చేయాలనుకున్నాను. ఆఖరి మ్యాచ్‌లో చేసిన తప్పిదాలు ఈ రోజు చేయకూడదని నిర్ణయించుకున్నాను. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్ల బౌలింగ్‌లో ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకువెళ్లడమే నా పని. కానీ శ్రేయస్ అయ్యర్ మాత్రం ఆఖరిలో స్పిన్నర్లను ఎటాక్ చేసి బౌండరీలు రాబాట్టాడు. నాకు కూడా కొన్ని బౌండరీలు వచ్చాయి. గతంలో ఛేజింగ్‌లో ఏ విధంగా ఆడానో, ఈ మ్యాచ్‌లో కూడా అదే చేశాను. నా ఆట తీరుపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నా ఫామ్‌పై వస్తున్న వార్తలను పెద్దగా పట్టించుకోను. బయట విషయాలకు దూరంగా ఉంటాను. అలా అని పొగడ్తలకు పొంగిపోను. జట్టు కోసం వంద శాతం ఎఫక్ట్ పెట్టడమే నా పని. ఇక రోహిత్ ఔటైనప్పటికి శుబ్‌మన్ మాత్రం అద్బుతంగా ఆడాడు.షహీన్ అఫ్రిది లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్‌ను ఎటాక్ చేసి ఒత్తిడిలో పెట్టాడు. అందుకే అతడు ప్రపంచంలోనే నంబర్ వన్ బ్యాటర్ బ్యాటర్ అయ్యాడు. శ్రేయస్ కూడా నాలుగో స్ధానంలో బాగా ఆడాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లలో అయ్యర్‌తో కలిసి కొన్ని భాగస్వామ్యాలు నెలకొల్పాను. ఈ రోజు కూడా ఇద్దరం కలిసి మ్యాచ్‌ను విజయానికి దగ్గరగా తీసుకువెళ్లామని" మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ కోహ్లి పేర్కొన్నాడు.చదవండి: విరాట్ కోహ్లి ప్రపంచ రికార్డు.. సచిన్‌కు సాధ్యం కాని ఘనత -
IND Vs PAK: కోహ్లి సెంచరీ.. పాక్‌పై భారత్ ఘన విజయం
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా దాయాది పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో టీమిండియా విజయభేరి మోగించింది. ఈ గెలుపుతో భారత్ తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు దాదాపు ఖారారు చేసుకున్నట్లే. పాకిస్తాన్ నిర్ధేశించిన 242 పరుగుల టార్గెట్‌ను భారత్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 42.3 ఓవర్లలో ఊదిపడేసింది.విరాట్ సూపర్ సెంచరీ..భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి సూపర్ సెంచరీతో మెరిశాడు. రోహిత్ శర్మ ఔటయ్యక క్రీజులోకి విరాట్.. అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తొలుత శుబ్‌మన్ గిల్‌తో కలిసి విలువైన పార్టనర్షిప్ నెలకొల్పిన కోహ్లి.. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్‌తో కలిసి మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యం నమోదు చేశాడు.ఈ క్రమంలో 111 బంతుల్లో తన 51వ వన్డే సెంచరీ మార్క్‌ను కింగ్ కోహ్లి అందుకున్నాడు. కోహ్లి 111 బంతుల్లో 7 ఫోర్లతో సరిగ్గా 100 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కోహ్లికి ఇది 82వ అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. ఇక కోహ్లితో పాటు శ్రేయస్ అయ్యర్(67 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 56), శుబ్‌మన్ గిల్(46) పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది రెండు వికెట్లు పడగొట్టగా.. ఆర్బర్ ఆహ్మద్, కుష్దిల్ షా తలా రెండు వికెట్లు వికెట్ సాధించారు.చెలరేగిన భారత బౌలర్లు.. అంతకముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో సౌద్ షకీల్(62) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ రిజ్వాన్(46), ఖుష్దిల్ షా(38) మెరుగ్గా ఆడారు. ఇక భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడనుంది.చదవండి: IND vs PAK: అఫ్రిది కళ్లు చెదిరే యార్కర్.. రోహిత్ శర్మ షాక్! వీడియో వైరల్ -
IND Vs PAK: విరాట్ కోహ్లి ప్రపంచ రికార్డు.. సచిన్‌కు సాధ్యం కాని ఘనత
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ప్రపంచ రికార్డు(Virat Kohli World Record) సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా పద్నాలుగు వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్, క్రికెట్ దేవుడుగా పేరొందిన సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar) ఆల్‌టైమ్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ అరుదైన ఘనత సాధించాడు.రాణించిన భారత బౌలర్లుకాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భాగంగా భారత్ ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొట్టింది. దుబాయ్‌లో టాస్ ఓడి తొలుత ఫీల్డింగ్ చేసిన రోహిత్ సేన.. రిజ్వాన్ బృందాన్ని 241 పరుగులకు కట్టడి చేసింది. టీమిండియా బౌలర్లలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రెండు కీలక వికెట్లు కూల్చాడు.మిగతా వాళ్లలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీయగా.. పేసర్లలో హర్షిత్ రాణా కూడా ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఇక పాక్ విధించిన 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు.ఈ క్రమంలో 15 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఒక సిక్సర్ బాది 20 పరుగులు చేసిన హిట్‌మ్యాన్.. పాక్ ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది వేసిన అద్భుత బంతికి బౌల్డ్ అయ్యాడు. దీంతో రోహిత్ స్థానంలో క్రీజులోకి వచ్చిన కోహ్లి గిల్‌తో కలిసి నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. అయితే, పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ సూపర్ డెలివరీతో గిల్(46)ను పెవిలియన్‌కు పంపాడు.తొలి క్రికెటర్‌గా వరల్డ్ రికార్డుఈ నేపథ్యంలో సరిగ్గా వంద పరుగులు చేసిన తర్వాత టీమిండియా రెండో వికెట్ కోల్పోగా.. కోహ్లి ఆచితూచి ఆడుతూ సహనం ప్రదర్శించాడు. ఈ క్రమంలో పదిహేను పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి వన్డేల్లో 14000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా ఈ రన్‌మెషీన్ నిలిచాడు. అంతేకాదు.. అత్యంత వేగంగా అంటే.. తక్కువ ఇన్నింగ్స్‌లోనే ఈ మైల్స్టోన్ అందుకున్న తొలి క్రికెటర్‌గా వరల్డ్ రికార్డు సాధించాడు.కాగా వన్డేల్లో పద్నాలుగు వేల పరుగులు చేయడానికి సచిన్ టెండుల్కర్‌కు 350 ఇన్నింగ్స్ అవసరమైతే.. కోహ్లి 287వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించడం విశేషం. తద్వారా 300లోపు ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ నమోదు చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే వన్డేల్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో కోహ్లి మూడో స్థానానికి ఎగబాకాడు. ఇదిలా ఉంటే.. పాక్‌తో మ్యాచ్‌లో శతకంతో లక్ష్య ఛేదన పూర్తి చేసి జట్టును గెలిపించాడు.వన్డేల్లో అత్యధిక పరుగుల వీరులు1.సచిన్ టెండుల్కర్(ఇండియా)- 18426 రన్స్(452 ఇన్నింగ్స్)2.కుమార్ సంగక్కర(శ్రీలంక)- 14234 రన్స్(380 ఇన్నింగ్స్)3.విరాట్ కోహ్లి(ఇండియా)- 14000+ రన్స్(287 ఇన్నింగ్స్)*4. రిక్కీ పాంటింగ్(ఆస్ట్రేలియా)- 13704 రన్స్(365 ఇన్నింగ్స్)5. సనత్ జయసూర్య(శ్రీలంక)- 13430 రన్స్(433 ఇన్నింగ్స్).చదవండి: కోహ్లి సరికొత్త చరిత్ర.. భారత్ తరఫున తొలి ఆటగాడిగా అరుదైన ఫీట్ -
IND Vs PAK: కోహ్లి సరికొత్త చరిత్ర.. భారత్ తరఫున తొలి ఆటగాడిగా అరుదైన ఫీట్
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు(Most Catches) పట్టిన ఫీల్డర్‌గా అరుదైన ఘనత సాధించాడు. దాయాది పాకిస్తాన్(India vs Pakistan)తో మ్యాచ్ సందర్భంగా కోహ్లి ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును ఈ మాజీ సారథి బద్దలు కొట్టాడు.241 పరుగులకు పాక్ ఆలౌట్చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా గ్రూప్-‘ఎ’లో ఉన్న భారత్ తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడింది. దుబాయ్‌లో గురువారం నాటి మ్యాచ్‌లో బంగ్లాను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తాజాగా అదే వేదికపై చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొట్టిన భారత్ 241 పరుగులకు దాయాదిని ఆలౌట్ చేసింది.బాబర్ ఆజం(23), సౌద్ షకీల్(62) రూపంలో రెండు కీలక వికెట్లను హార్దిక్ పాండ్యా దక్కించుకోగా.. కుల్దీప్ యాదవ్ సల్మాన్ ఆఘా(19), షాహిన్ ఆఫ్రిది(0), నసీం షా(14)లను అవుట్ చేశాడు. ఇక అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా ఒక్కో వికెట్ తీయగా.. అక్షర్ పటేల్ ఇమామ్-ఉల్-హక్(10), హ్యారిస్ రవూఫ్(8) రనౌట్లలో భాగమయ్యాడు.Jaha matter bade hote hai, waha @hardikpandya7 khade hote hai! 😎Two big wickets in two overs & #TeamIndia are in the driver's seat! 🇮🇳💪#ChampionsTrophyOnJioStar 👉 #INDvPAK | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2 & Sports 18-1!📺📱 Start Watching… pic.twitter.com/Neap2t4fWC— Star Sports (@StarSportsIndia) February 23, 2025 కోహ్లి సరికొత్త చరిత్రఅయితే, ఈ మ్యాచ్‌లో కోహ్లి రెండు సూపర్ క్యాచ్‌లు అందుకుని తన పేరును చరిత్రలో పదిలం చేసుకున్నాడు. తొలుత కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో నసీం షా ఇచ్చిన క్యాచ్‌ను అందుకున్న కోహ్లి.. అనంతరం హర్షిత్ రాణా బౌలింగ్‌లో ఖుష్దిల్ షా(38) ఇచ్చిన క్యాచ్‌ను అద్భుత రీతిలో అందుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా తరఫున వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్‌గా కోహ్లి నిలిచాడు. అంతకు ముందు మహ్మద్ అజారుద్దీన్ పేరిట ఈ రికార్డు ఉండేది. ఇప్పుడు కోహ్లి దానిని బద్దలు కొట్టాడు. ఇక జాబితాలో ఓవరాల్‌గా శ్రీలంక స్టార్ మహేళ జయవర్దనే(218), ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్(160) ఈ జాబితాలో టాప్-2లో కొనసాగుతున్నారు.వన్డేల్లో టీమిండియా తరఫున అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్లు1. విరాట్ కోహ్లి- 1582. మహ్మద్ అజారుద్దీన్- 1563. సచిన్ టెండుల్కర్- 1404. రాహుల్ ద్రవిడ్- 1245. సురేశ్ రైనా- 102.చాంపియన్స్ ట్రోఫీ-2025: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ తుదిజట్లుటీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.పాకిస్తాన్సౌద్ షకీల్, బాబర్ ఆజం, ఇమామ్-ఉల్ -హక్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్/వికెట్ కీపర్), సల్మాన్ ఆఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహిన్ అఫ్రిది, నసీం షా, హ్యారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.చదవండి: ‘ఏంటిది?’.. రిజ్వాన్ చర్యకు హర్షిత్ రాణా రియాక్షన్ వైరల్.. గంభీర్ కూడా! -
#INDvsPAK : భారత్-పాకిస్తాన్ మ్యాచ్ హైలైట్స్ (ఫోటోలు)
-
CT 2025 Ind vs Pak: కోహ్లి సూపర్ సెంచరీ.. పాక్‌ను చిత్తు చేసిన భారత్
ICC CT 2025 India vs Pakistan Updates: చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్‌ను టీమిండియా చిత్తు చేసింది. 2017 ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. దాయాది జట్టు విధించిన 242 పరుగుల లక్ష్యాన్ని 42.3 ఓవర్లలోనే ఛేదించి ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. లక్ష్య ఛేదనలో కోహ్లి 42.3 ఓవర్లో కోహ్లి ఫోర్ బాది సెంచరీ పూర్తి చేసుకొని.. భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. కోహ్లి వంద పరుగులతో అజేయంగా నిలవగా.. శ్రేయస్ అయ్యర్(56), శుబ్‌మన్ గిల్(46) రాణించారు. ఈ విజయంతో భారత్ సెమీస్ రేసులో ముందుకు దూసుకుపోయింది.పాక్ 241 ఆలౌట్క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన దాయాదుల పోరుకు తెరలేచింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భాగంగా దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్(India vs Pakistan) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పాక్ తొలుతబ్యాటింగ్ చేసి 241 పరుగులకు ఆలౌట్ కాగా.. టీమిండియా ఛేజింగ్‌కు దిగింది.41 ఓవర్లలో టీమిండియా స్కోరు: 225-4విజయానికి ఇంకా 17 పరుగుల దూరంలో భారత్‌నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియాహార్దిక్ పాండ్యా రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. షాహిన్ ఆఫ్రిది బౌలింగ్‌లో పాండ్యా(8) కీపర్ రిజ్వాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. స్కోరు: 223-4. కోహ్లి 86 పరుగులతో ఉండగా అక్షర్ పటేల్ క్రీజులోకి వచ్చాడు. విజయానికి ఇంకా 19 పరుగులు కావాలి.మూడో వికెట్ కోల్పోయిన టీమిండియాశ్రేయస్ అయ్యర్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఖుష్దిల్ బౌలింగ్‌లో శ్రేయస్ ఇచ్చిన క్యాచ్‌ను ఇమామ్ అద్భుతరీతిలో క్యాచ్ అందుకున్నాడు. దీంతో 56 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శ్రేయస్ అయ్యర్ నిష్క్రమించాడు. హార్దిక్ పాండ్యా క్రీజులోకి రాగా కోహ్లి 85 పరుగులతో ఉన్నాడు. భారత్ స్కోరు: 215/3 (39). విజయానికి 66 బంతుల్లో 27 పరుగులు కావాలి.అర్ధ శతకం పూర్తి చేసుకున్న శ్రేయస్ అయ్యర్శ్రేయస్ అయ్యర్ తన వన్డే కెరీర్లో 21వ హాఫ్ సెంచరీ సాధించాడు. భారత్ విజయానికి ఇంకా 41 పరుగుల దూరంలో ఉంది. స్కోరు: 201/2 (37) విజయం దిశగా భారత్36 ఓవర్లలో టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. కోహ్లి 81, శ్రేయస్ 49 పరుగుల వద్ద ఉన్నారు. విజయానికి 42 పరుగులు కావాలి.34 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు: 185/2కోహ్లి 69, శ్రేయస్ 46 రన్స్‌తో ఆడుతున్నారు. పాక్‌పై గెలవాలంటే ఇంకా 57 పరుగులు కావాలి.టీమిండియా స్కోరు: 168/2 (31) కోహ్లి 65, శ్రేయస్ అయ్యర్ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు. విజయానికి ఇంకా 74 పరుగులు కావాలి.29 ఓవర్లలో టీమిండియా స్కోరు: 150/2.శ్రేయస్ అయ్యర్ 17, కోహ్లి 64 పరుగులతో ఉన్నారు. ఇద్దరూ కలిసి 69 బంతుల్లో యాభై పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. విజయానికి ఇంకా 92 పరుగులు కావాలి.కోహ్లి హాఫ్ సెంచరీవిరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ ఆచితూచి ఆడుతున్నారు. ఈ క్రమంలో 63 బంతుల్లో కోహ్లి అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. శ్రేయస్ అయ్యర్ 28 బంతుల్లో 12 పరుగులతో ఉన్నాడు. టీమిండియా స్కోరు: 132/2 (26.1).భారత్ రెండో వికెట్ డౌన్..100 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 46 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్.. అర్బర్ ఆహ్మద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. 18 ఓవర్లకు భారత్ స్కోర్: 102/214 ఓవర్లకు భారత్ స్కోర్: 87/114 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 87 పరుగులు చేసింది. క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి(23) దూకుడుగా ఆడుతున్నాడు. అతడితో పాటు శుబ్‌మన్ గిల్(41) పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.టీమిండియా తొలి వికెట్ డౌన్..242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. 20 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మను షాహీన్ అఫ్రిది అద్బుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు.దూకుడుగా ఆడుతున్న రోహిత్..4 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(16), శుబ్‌మన్ గిల్(9) పరుగులతో ఉన్నారు.2 ఓవర్లకు భారత్ స్కోర్: 12/02 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(11), శుబ్‌మన్ గిల్(0) ఉన్నారు.241 పరుగులకు పాక్ ఆలౌట్..టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్ ఎంచుకోగా.. రోహిత్ సేన ఫీల్డింగ్‌కు దిగింది. ఈ క్రమంలో 49.4 ఓవర్లలో పాకిస్తాన్ 241 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ బ్యాటర్లలో వన్‌డౌన్ బ్యాటర్ సౌద్ షకీల్(62) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ రిజ్వాన్(46), ఖుష్దిల్ షా(38) మెరుగ్గా ఆడారు. ఇక భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు.పాక్ ఆలౌట్.. స్కోరెంతంటే?49.4: హర్షిత్ రాణా బౌలింగ్‌లో ఖుష్దిల్ (38) కోహ్లికి క్యాచ్ ఇచ్చి పదో వికెట్‌గా వెనుదిరిగాడు. పాక్ స్కోరు: 241 (49.4).48.6: తొమ్మిదో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్షమీ బౌలింగ్‌లో హ్యారిస్ రవూఫ్ సింగిల్ పూర్తి చేసుకుని రెండోరన్ కోసం పరిగెత్తగా అక్షర్ పటేల్ అద్భుత త్రో వేశాడు. బంతిని అందుకున్న వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ స్టంప్స్‌ను గిరాటేయడంతో రవూఫ్(7) తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. పాక్ స్కోరు: 241/9 (49.2) 46.4: ఎనిమిదో వికెట్ కోల్పోయిన పాక్నసీం షా(14) రూపంలో పాకిస్తాన్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి నసీం పెవిలియన్ చేరాడు. పాక్ స్కోరు: 222/8 (47). ఖుష్దిల్ షా 27 పరుగులతో ఉన్నాడు. ఏడో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్42.5: కుల్దీప్ బౌలింగ్‌లో షాహిన్ ఆఫ్రిది లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగాడు.ఆరో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్42.4: కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఆరో వికెట్‌గా వెనుదిరిగిన సల్మాన్ ఆఘా. పందొమ్మిది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజాకు క్యాచ్ ఇచ్చిన సల్మాన్ పెవిలియన్ చేరాడు.40 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ స్కోరు: 183/5 (40)ఖుష్దిల్ షా 8, సల్మాన్ ఆఘా 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఐదో వికెట్ డౌన్రవీంద్ర జడేజా బౌలింగ్‌లో తయ్యబ్ తాహిర్(4) బౌల్డ్. ఐదో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్. స్కోరు: 165/5 (36.1) నాలుగో వికెట్ కోల్పోయిన పాక్34.5: హాఫ్ సెంచరీ వీరుడు సౌద్ షకీల్(62) రూపంలో పాకిస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో షకీల్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద అక్షర్ పటేల్ ఒడిసిపట్టాడు.33.2: మూడో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్అక్షర్ పటేల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయిన రిజ్వాన్. షకీల్‌తో కలిసి రిజ్వాన్ వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేయగా అక్షర్ ఈ జోడీని విడదీశాడు. 77 బంతులు ఎదుర్కొన్న రిజ్వాన్ మూడు ఫోర్ల సాయంతో 46 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. సల్మాన్ ఆఘా క్రీజులోకి వచ్చాడు. షకీల్ 57 పరుగులతో ఉన్నాడు.30 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ స్కోరు: 129/2రిజ్వాన్ 39, షకీల్ 44 రన్స్‌తో క్రీజులో ఉన్నారు.25 ఓవర్లలో పాకిస్తాన్ స్కోరు: 99/2షకీల్ 29, రిజ్వాన్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు.21 ఓవర్లలో పాకిస్తాన్ స్కోరు: 82-2రిజ్వాన్ 15, షకీల్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు.పొదుపుగా బౌల్ చేస్తున్న టీమిండియా ప్లేయర్లు17 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ స్కోరు: 72/2 (17). రిజ్వాన్ 23 బంతుల్లో 10, సౌద్ షకీల్ 27 బంతుల్లో 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.కట్టుదిట్టంగా భారత్ బౌలింగ్పవర్ప్లే ముగిసే సరికి పాకిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి కేవలం 52 పరుగులు చేసింది. రిజ్వాన్ 4, షకీల్ మూడు పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 52-29.2: రెండో వికెట్ డౌన్పాక్ మరో ఓపెనర్ ఇమామ్ రనౌట్‌గా వెనుదిరిగాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో మిడాన్ మీదుగా షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమైన ఇమామ్.. సింగిల్ కోసం వెళ్లాడు. అయితే, సరైన సమయంలో క్రీజులోకి చేరకోకపోవడంతో అవుటయ్యాడు. ఫీల్డర్ అక్షర్ పటేల్ డైరెక్ట్ త్రోతో వికెట్ కోల్పోయాడు. 26 బంతులు ఎదుర్కొని 10 పరుగులు చేసి ఇమామ్ వెనుదిరిగాడు. రిజ్వాన్ క్రీజులోకి వచ్చాడు. పాక్ స్కోరు: 48/2 (9.3) 8.2: తొలి వికెట్ కోల్పోయిన పాకిస్తాన్టీమిండియా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి బాబర్ ఆజం పెవిలియన్ చేరాడు. మొత్తంగా 26 బంతులు ఎదుర్కొన్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ఇమామ్‌కు జతగా సౌద్ షకీల్ క్రీజులోకి వచ్చాడు. పాక్ స్కోరు: 45/1 (8.3) ఆరు ఓవర్లలో పాక్ స్కోరు: 26/0 (6)బాబర్ 10, ఇమామ్ 9 పరుగులతో ఉన్నారు. మూడు ఓవర్లో పాకిస్తాన్ స్కోరు: 14-0రెండు ఓవర్లు ముగిసే సరికి పాక్ స్కోరు: 10-0బాబర్, ఇమామ్ చెరో రెండు పరుగులతో క్రీజులో ఉన్నారు.తొలి ఓవర్లో పాకిస్తాన్ స్కోరు: 6-0బాబర్ ఆజం 0, ఇమామ్ ఉల్ హక్ ఒక పరుగుతో ఉన్నారు. తొలి ఓవర్లో మీ ఏకంగా ఐదు వైడ్లు వేయడం గమనార్హం. తద్వారా పాకిస్తాన్‌కు అదనంగా ఐదు పరుగులు వచ్చాయి.భారత్ వర్సెస్ పాకిస్తాన్ తుది జట్లుభారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్పాకిస్తాన్: సౌద్ షకీల్, బాబర్ ఆజం, ఇమామ్ ఉల్ హక్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్/వికెట్ కీపర్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహిన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్. -
IND Vs PAK: పాకిస్తాన్‌తో మ్యాచ్.. టీమిండియాకు భారీ షాక్!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు సర్వం సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా దాయాదుల పోరు జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది.భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయపడినట్లు తెలుస్తోంది. నెట్ ప్రాక్టీస్‌లో ఎడమ కాలికి గాయమైనట్లు సమాచారం. తాజాగా మ్యాచ్‌కు ముందు ఆఖరి ప్రాక్టీస్ సెషన్లో కోహ్లి తన ఎడమ కాలికి ఐస్ ప్యాక్ పెట్టుకుని కన్పించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవతున్నాయి. దీంతో పాక్‌తో మ్యాచ్‌కు కోహ్లి అందుబాటులో ఉంటాడా లేదా అన్న ఆందోళన అభిమానుల్లో నెలకొంది.అయితే విరాట్ గాయంపై బీసీసీఐ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ రాలేదు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కోహ్లి తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. కేవలం 22 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఒకవేళ కోహ్లి పాక్‌తో మ్యాచ్‌కు దూరమైతే రిషబ్ పంత్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. ఇక హైవోల్డేజ్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.భారత్‌దే పై చేయి..కాగా ఐసీసీ టోర్నమెంట్లలో పాకిస్తాన్‌పై భారత్‌కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇరు జట్లు ముఖాముఖి 21 మ్యాచ్‌ల్లో తలపడగా.. 16 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించగా, పాక్ కేవలం ఐదింట మాత్రమే గెలుపొందింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఓవరాల్‌గా వన్డే క్రికెట్లో అయితే భారత్‌పై పాక్ పై చేయి సాధించింది.ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు ఇప్పటివరకు ఐదు సార్లు ముఖాముఖి తలపడగా.. పాక్ 3, భారత్ 2 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. వన్డే ఫార్మాట్లో పాకిస్తాన్, ఇండియా ఇప్పటివరకు 153 సార్లు తలపడ్డాయి. ఈ 153 వన్డే మ్యాచ్‌లలో పాకిస్తాన్ 73 సార్లు భారత్‌ను ఓడించగా.. భారత్ 57 సార్లు విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి.చదవండి: IND vs PAK: 'అతడొక అద్భుతం.. పాక్‌పై 60 బంతుల్లోనే సెంచరీ చేస్తాడు' Virat Kohli spotted with an ice pack on his left leg after India’s practice session ahead of the high-voltage clash against Pakistan. A concern or just routine recovery? #INDvPAK #ViratKohli #CT2025 pic.twitter.com/eSUSETB6FY— Ankan Kar (@AnkanKar) February 22, 2025 -
IND Vs BAN: చాంపియన్స్ ట్రోఫీ తొలి పోరులో బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం (ఫొటోలు)
-
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్ తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు.అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న మూడో ఆటగాడిగా భారత క్రికెట్ దిగ్గజం మహ్మద్ అజారుద్దీన్ రికార్డును కోహ్లి సమం చేశాడు. అజారుద్దీన్ 334 మ్యాచ్‌ల్లో 156 క్యాచ్‌లు అందుకోగా.. విరాట్ కేవలం 298 మ్యాచ్‌ల్లో సరిగ్గా 156 క్యాచ్‌లను తీసుకున్నాడు. కోహ్లి మరో క్యాచ్ అందుకుంటే అజారుద్దీన్‌ను అధిగమిస్తాడు.హృదయ్ విరోచిత సెంచరీ..ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన బంగ్లాను తౌహిద్ హృదయ్, జాకర్ అలీ తమ అద్బుత ఇన్నింగ్స్‌లతో ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 154 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.తౌహిద్ హ్రిదయ్(118 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 100) విరోచిత సెంచరీతో చెలరేగగా.. జాకర్ అలీ(68) రాణించాడు. హ్రిదయ్ ఓ వైపు కాలి కండరాలు గాయంతో బాధపడుతున్నప్పటికి.. ఫైటింగ్ నాక్‌తో తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. అయితే బంగ్లా స్టార్ ప్లేయర్లు సౌమ్యా సర్కార్, కెప్టెన్ నజ్ముల్ హోస్సేన్ శాంటో, ముష్పికర్ రహీం ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు.ఐదేసిన షమీ..ఇక టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ మరోసారి ఐసీసీ ఈవెంట్లో సత్తాచాటాడు. ఈ మ్యాచ్‌లో షమీ ఫైవ్ వికెట్ హాల్‌ను సాధించాడు. తన 10 ఓవర్ల కోటాలో షమీ 53 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించాడు. వన్డేల్లో షమీకి ఇది ఏడో ఫైవ్ వికెట్ హాల్ కావడం గమనార్హం. అదేవిధంగా వన్డేల్లో బంతుల పరంగా అత్యంత వేగంగా 200 వికెట్లు సాధించిన బౌలర్ షమీ చరిత్ర సృష్టించాడు.షమీ ఈ ఫీట్ సాధించేందుకు 5126 బంతులు అవసరమయ్యాయి. ఇంతకు ముందు ఈ రికార్డు మిచెల్ స్టార్క్ పేరిట ఉండింది. స్టార్క్ 5240 బంతుల్లో 200 వన్డే వికెట్ల మైలురాయిని తాకాడు. కాగా షమీతో పాటు హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టాడు.చదవండి: Champions Trophy 2025: బంగ్లాదేశ్‌తో మ్యాచ్.. డబుల్ సెంచరీ కొట్టిన షమీ -
CT 2025: షెడ్యూల్, జట్లు, టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) రూపంలో మెగా క్రికెట్ పండుగ అభిమానులకు కనువిందు చేయనుంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలయ్యే ఈ ఐసీసీ టోర్నమెంట్ మార్చి 9న ఫైనల్‌తో ముగియనుంది. ఈ ఈవెంట్లో ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి.ఇందులో భాగంగా గ్రూప్-‘ఎ’ నుంచి భారత్(India), పాకిస్తాన్(Pakistan), న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్, వేదికలు,జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్ తదితర వివరాలు తెలుసుకుందామా?!చాంపియన్స్ ట్రోఫీ-2025 పూర్తి షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం(భారత కాలమానం ప్రకారం)👉1. ఫిబ్రవరి 19- పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్- ఎ, నేషనల్ స్టేడియం, కరాచీ (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉2. ఫిబ్రవరి 20- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్, గ్రూప్-ఎ, దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉3. ఫిబ్రవరి 21- అఫ్గనిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా, గ్రూప్-బి, నేషనల్ స్టేడియం, కరాచి(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉4. ఫిబ్రవరి 22- ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్, గ్రూప్-బి, గడాఫీ స్టేడియం, లాహోర్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉5. ఫిబ్రవరి 23- ఇండియా వర్సెస్ పాకిస్తాన్, గ్రూప్-ఎ, దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉6. ఫిబ్రవరి 24- బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్-ఎ, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉7. ఫిబ్రవరి 25- ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా, గ్రూప్-బి, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉8. ఫిబ్రవరి 26- అఫ్గనిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్, గ్రూప్-బి, గడాఫీ స్టేడియం, లాహోర్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉9. ఫిబ్రవరి 27- పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్, గ్రూప్-ఎ, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉10. ఫిబ్రవరి 28- అఫ్గనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా, గ్రూప్-బి, గడాఫీ స్టేడియం, లాహోర్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉11. మార్చి 1- సౌతాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్, గ్రూప్-బి, నేషనల్ స్టేడియం, కరాచి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉12. మార్చి 2- ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్-ఎ, దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉సెమీ ఫైనల్ 1: మార్చి 4- దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(ఇండియా క్వాలిఫై అయితే), 👉సెమీ ఫైనల్ 2: మార్చి 5- గడాఫీ స్టేడియం లాహోర్(పాకిస్తాన్ క్వాలిఫై అయితే)👉ఫైనల్ మార్చి 9: గడాఫీ స్టేడియం లాహోర్ లేదా దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(ఇండియా క్వాలిఫై అయితే).లైవ్ టెలికాస్ట్, ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే..భారత్‌లో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, స్పోర్ట్స్ 18లో లైవ్ టెలికాస్ట్. అదే విధంగా.. జియోహాట్‌స్టార్ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్. స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియా(ఎక్స్) హ్యాండిల్లో ఉన్న వివరాల ప్రకారం.. జియోహాట్‌స్టార్‌లో ఉచితంగా మ్యాచ్‌లు చూడవచ్చు. టెలివిజన్, మొబైల్‌లలో ఈ వెసలుబాటు ఉంటుంది.చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్లుగ్రూప్-ఎఇండియా రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.నాన్ ట్రావెలింగ్ సబ్స్టిట్యూట్స్: యశస్వి జైస్వాల్, మహ్మద్ సిరాజ్, శివం దూబే.పాకిస్తాన్మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, ఉస్మాన్ ఖాన్, మహ్మద్ హస్నైన్, షాహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా.న్యూజిలాండ్‌డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మ్యాట్ హెన్రీ, విల్ ఓ రూర్కీ, నాథన్ స్మిత్, విల్ యంగ్, జాకబ్ డఫీ, మైఖేల్ బ్రేస్‌వెల్, కైల్ జెమీషన్.బంగ్లాదేశ్సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొసేన్ శాంటో (కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, పర్వేజ్ హొస్సేన్ ఇమాన్, తాంజిమ్ హసన్ సకీబ్, నహీద్ రాణా, నసూమ్ అహ్మద్.గ్రూప్-బిఆస్ట్రేలియాజేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, సీన్ అబాట్, అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, తన్వీర్ సంఘా, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా, బెన్ డ్వార్షూయిస్, స్పెన్సర్ జాన్సన్.ట్రావెలింగ్ రిజ్వర్స్: కూపర్ కొనొలి.సౌతాఫ్రికాటెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, హెన్రిచ్ క్లాసెన్, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ట్రిస్టన్ స్టబ్స్, రాస్సీ వాన్ డెర్ డసెన్, వియాన్ ముల్దర్, కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడి, కగిసో రబడా, ర్యాన్ రికెల్టన్, తబ్రేజ్ షంసీ, కార్బిన్ బాష్ట్రావెలింగ్ రిజర్వ్: క్వెనా మఫాకా.ఇంగ్లండ్జోస్ బట్లర్ (కెప్టెన్), బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జో రూట్, బ్రైడన్ కార్సే, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, టామ్ బాంటన్.అఫ్గనిస్తాన్ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్, సెదిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), ఇక్రమ్ అలీఖిల్, గుల్బాదిన్ నాయబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫరూఖీ, ఫరీద్ మాలిక్, నంగ్యాల్ ఖరోటీ, నవీద్ జద్రాన్రిజర్వ్ ప్లేయర్లు: డార్విష్ రసూలీ, బిలాల్ సమీ.చదవండి: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్ -
సచిన్ కాదు!.. నంబర్ వన్ వన్డే బ్యాటర్ అతడే: సెహ్వాగ్
క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) గురించే చర్చ. ఈ వన్డే ఫార్మాట్ టోర్నమెంట్ కోసం అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్లో సెమీ ఫైనలిస్టులు, ఫైనల్స్ చేరే జట్లు, విజేతపై తమ అంచనాలు తెలియజేస్తూ సందడి చేస్తున్నారు.సచిన్ టెండ్కులర్కు రెండో స్థానంఈ నేపథ్యంలో భారత మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) వన్డే క్రికెట్లో టాప్-5 ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్లు వీరేనంటూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇందులో తన సహచర ఓపెనర్, దిగ్గజ ఆటగాడు సచిన్ టెండ్కులర్(Sachin Tendulkar)కు వీరూ భాయ్ రెండో స్థానం ఇవ్వడం విశేషం. మరి ఆ మొదటి ప్లేయర్ ఎవరంటారా?!..అప్పుడే తొలిసారిగా చూశానుచాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ నేపథ్యంలో క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘నా ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ వన్డే బ్యాటర్లలో క్రిస్ గేల్ ఐదో స్థానంలో ఉంటాడు. అతడు గొప్ప బ్యాటర్. గొప్ప ఓపెనర్ కూడా! 2002-03లో టీమిండియా వెస్టిండీస్‌కు వెళ్లింది. నాటి ఆరు మ్యాచ్‌ల సిరీస్‌లో గేల్ మూడు శతకాలు బాదాడు.అంతర్జాతీయ స్థాయిలో ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌లో బ్యాక్ ఫుట్ షాట్లతో సిక్సర్లు బాదిన క్రికెటర్‌ను నేను అప్పుడే తొలిసారిగా చూశాను’’ అని సెహ్వాగ్ గేల్‌పై ప్రశంసలు కురిపించాడు. ఇక నాలుగో స్థానంలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌కు చోటిచ్చిన వీరూ భాయ్.. ‘‘డివిలియర్స్ బ్యాటింగ్ చేసే విధాననం నాకెంతో ఇష్టం. సిక్సర్లు కొట్టడంలో అతడిదొక ప్రత్యేక శైలి’’ అని పేర్కొన్నాడు.అతడిని చూసే నేర్చుకున్నాఅదే విధంగా.. పాకిస్తాన్ మాజీ స్టార్ ఇంజమామ్ ఉల్ హక్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఆసియాలోని అత్యుత్తమ వన్డే బ్యాటర్లలో ఇంజమామ్ ఒకడు. అతడు నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేవాడు. మ్యాచ్‌ను ఎలాగోలా తన ఆధీనంలోకి తెచ్చుకునేవాడు.చివరిదాకా ఇన్నింగ్స్ ఎలా కొనసాగించాలో నేను అతడిని చూసే నేర్చుకున్నా. ఓవర్‌కు ఏడు లేదంటే ఎనిమిది పరుగులు రాబట్టడం అప్పట్లో చాలా కష్టంతో కూడుకున్న పని. అయితే, ఇంజమామ్ మాత్రం మంచినీళ్లు తాగినంత సులువుగా ఇన్నింగ్స్ ఆడేవాడు. ఎవరి బౌలింగ్‌లో ఎప్పుడు సిక్సర్లు కొట్టాలన్న విషయంపై అతడికి స్పష్టమైన అవగాహన ఉండేది’’ అని సెహ్వాగ్ కొనియాడాడు.సింహంతో కలిసి వేటకు వెళ్తున్నట్లుఇక సచిన్ టెండుల్కర్ గురించి సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్కరికి అభిమాన క్రికెటర్.. నాకు ఆదర్శమూర్తి అయిన సచిన్ టెండుల్కర్ గురించి చెప్పాలంటే.. ఆయనతో కలిసి బ్యాటింగ్‌కు వెళ్తుంటే... అడవిలో సింహంతో కలిసి వేటకు వెళ్తున్నట్లు ఉండేది.అప్పుడు ప్రతి ఒక్కరి కళ్లు ఆ సింహంపైనే ఉండేవి. నేను సైలెంట్‌గా నా పనిచేసుకుపోయేవాడిని’’ అని అభిమానం చాటుకున్నాడు. ఇక వన్డేల్లో అత్యుత్తమ బ్యాటర్లలో విరాట్ కోహ్లికి అగ్రస్థానం ఇచ్చిన సెహ్వాగ్.. ‘‘నంబర్ వన్ విరాట్ కోహ్లి. సరైన సమయంలో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడటం అతడికి వెన్నతో పెట్టిన విద్య.అతడొక ఛేజ్‌మాస్టర్. ఆరంభంలో ఉన్న కోహ్లికి.. ఇప్పటి కోహ్లికి చాలా తేడా ఉంది. రోజురోజుకు అతడు మరింత పరిణతి చెందుతున్నాడు. 2011-12 తర్వాత మాత్రం సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. ఫిట్నెస్, ఆటలో నిలకడ.. ఈ రెండింటిలో తనకు తానే సాటి. అద్భుతమైన ఇన్నింగ్స్‌కు అతడు పెట్టింది పేరు’’అని రన్‌మెషీన్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.వీరేంద్ర సెహ్వాగ్ ఆల్‌టైమ్ బెస్ట్ టాప్-5 క్రికెటర్లు1. విరాట్ కోహ్లి(ఇండియా)2. సచిన్ టెండుల్కర్(ఇండియా)3. ఇంజమామ్ -ఉల్ -హక్(పాకిస్తాన్)4. ఏబీ డివిలియర్స్(సౌతాఫ్రికా)5. క్రిస్ గేల్(వెస్టిండీస్).చదవండి: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్ -
Ind vs Ban: భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్!
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టోర్నమెంట్‌కు టీమిండియా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఈ మెగా ఈవెంట్లో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగనున్న రోహిత్ సేనకు లీగ్ దశలోని మూడు మ్యాచ్‌లు కీలకమే. ఇందులో ఒక్కటి ఓడినా సెమీ ఫైనల్ చేరే అవకాశాలపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మూల్యం చెల్లించాల్సి వస్తుందంటున్నాడు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra). టీమిండియా ఈ టోర్నీలో ఆడబోయే తొలి మ్యాచ్‌కు తన ప్లేయింగ్ ఎలెవన్ ఇదేనంటూ యూట్యూబ్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. పేసర్ల విభాగంలో మాత్రంజట్టులో ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లతో పాటు ఓ స్పెషలిస్టు స్పిన్నర్ తప్పక ఉంటాడన్న ఆకాశ్ చోప్రా.. అయితే, ఈ విషయంలో కెప్టెన్, హెడ్‌కోచ్ ఎవరివైపు మొగ్గుచూపుతారన్నది చెప్పడం కాస్త కష్టమేనని పేర్కొన్నాడు. ఇక పేసర్ల విభాగంలో మాత్రం మొదటి ప్రాధాన్య ఆటగాడిగా అర్ష్‌దీప్ సింగ్‌కు తప్పక స్థానం దక్కుతుందని అంచనా వేశాడు.కాగా 2017 తర్వాత తొలిసారిగా చాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. పాకిస్తాన్(Pakistan) వేదికగా ఈ వన్డే ఫార్మాట్ టోర్నీ మొదలుకానుండగా... టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లు దుబాయ్‌లో ఆడనుంది. ఇందులో భాగంగా గురువారం(ఫిబ్రవరి 20) రోహిత్ సేన తమ తొలి మ్యాచ్ ఆడనుంది. గ్రూప్-‘ఎ’లో ఉన్న బంగ్లాదేశ్‌తో తలపడనుంది.ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ- శుబ్‌మన్ గిల్.. కెప్టెన్, వైస్ కెప్టెన్.. ఓపెనర్లుగా వీరే ఉంటారు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ గురించి సందేహాలు అక్కర్లేదు. రన్ మెషీన్ కోహ్లి మూడో స్థానంలో వస్తాడు.ఇక నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడతాడు. నా అభిప్రాయం ప్రకారం.. అక్షర్ పటేల్ ఐదు, కేఎల్ రాహుల్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తారు. హార్దిక్ పాండ్యా ఏడు.. రవీంద్ర జడేజా ఎనిమిదో స్థానంలో ఆడతారు. ఒకవేళ రోహిత్ శర్మ కోరుకుంటే కుల్దీప్ యాదవ్ తుదిజట్టులో ఉంటాడు.నా ఓటు కుల్దీప్ యాదవ్కేఅలా కాకుండా గంభీర్ తన నిర్ణయానుగుణంగానే వెళ్లాలనుకుంటే మాత్రం వరుణ్ చక్రవర్తికి అవకాశం వస్తుంది. అయితే, నేను మాత్రం కుల్దీప్ యాదవ్‌కే ఓటు వేస్తాను. ఇక నా జట్టులో అర్ష్‌దీప్ సింగ్ తప్పక ఉంటాడు.అతడికి తోడుగా మహ్మద్ షమీ తుదిజట్టులో ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ అలాగాక హర్షిత్ రాణాను పిలిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మిడిల్, డెత్ ఓవర్లలో అతడు చక్కగా రాణించగలడు’’ అని పేర్కొన్నాడు. దుబాయ్ పిచ్‌లకు అనుగుణంగా టీమిండియా బ్యాటర్లు క్రీజులో కాస్త ఎక్కువ సమయం గడిపితేనే భారీ స్కోర్లు చేయగలిగే ఆస్కారం ఉంటుందని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.చాంపియన్స్ ట్రోఫీ-2025: టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌కు ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత తుదిజట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్/వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ/హర్షిత్ రాణా.చదవండి: శివమ్ దూబే విజృంభణ.. కీలక మ్యాచ్‌లో ఐదు వికెట్లు -
రోహిత్, కోహ్లి, జడేజా లపైనే ఛాంపియన్స్ ట్రోఫీ భారం
దాదాపు పదేళ్ల విరామం తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని రెండోసారి గెలుచుకోవాలనే భారత జట్టు గట్టి పట్టుదలతో ఉంది. గతంలో 2013లో ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ లో జరిగిన ఫైనల్ లో ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని భారత్ జట్టు ఐదు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై విజయసాధించి ఈ ట్రోఫీని చేజిక్కించుకుంది. మళ్ళీ ఇప్పటి దాకా భారత్ ఈ ట్రోఫీని గెలుచుకోలేక పోయింది. 2017 జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ జట్టు భారత్ పై 180 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి ట్రోఫీ ని దక్కించుకుంది. మళ్ళీ ఈ ట్రోఫీ ని సాధించాలంటే భారత్ తన సత్తా చావాల్సిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్, దుబాయ్ లలో ఈ నెల 19 వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కి ఎంతో ప్రాముఖ్యముంది.ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేని భారత్ జట్టు ఫిబ్రవరి 20వ తేదీన దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో తన తొలి మ్యాచ్ ఆడుతుంది. తర్వాత ఫిబ్రవరి 23న ఇదే వేదిక పైన తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ని ఎదుర్కొంటుంది. ఆ తర్వాత మెన్ ఇన్ బ్లూ మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడనుంది.ఇంగ్లండ్‌పై స్వదేశంలో భారత్ ఇటీవల 3-0 తేడాతో వన్డే సిరీస్‌ను చేజిక్కించుకోవడంతో అభిమానుల్లోనూ, జట్టు ఆటగాళ్లలోనూ ఆత్మవిశ్వాసం పెరిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ గతేడాది వెస్టిండీస్ లో జరిగిన టి20 ప్రపంచ కప్ లో ఆడిన రీతి లో మళ్ళీ రాణించి మరో ఐసీసీ ట్రోఫీ ని భారత్ కి తెస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.రోహిత్, కోహ్లి, జడేజా లకు చివరి అవకాశం?గత సంవత్సరం టీ 20 ప్రపంచ కప్ సాధించిన తర్వాత భారత్ జట్టు ముంబై వాంఖడే స్టేడియం సమీపంలోని వీధుల్లో ఓపెన్ బస్సు లో పరేడ్ చేసింది. మళ్ళీ అలాంటి దృశ్యం రిపీట్ కావాలంటే కెప్టెన్ రోహిత్, కోహ్లీ మళ్ళీ తమ మునుపటి ఫామ్ ని కనిపించడం తప్పనిసరి.అయితే ఆస్ట్రేలియా పర్యటన లో ఘోరంగా విఫలమైన ఈ ఇద్దరు టాప్ ఆర్డర్ బ్యాటర్ ఇంగ్లాండ్ సిరీస్ లో పరుగులు సాధించి ఆత్మవిశ్వాసం తో ఉన్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన కటక్ వన్డేలో రోహిత్ 90 బంతుల్లో 119 పరుగులు చేశాడు. కోహ్లీ అహ్మదాబాద్‌లో జరిగిన చివరి వన్డే లో తన 73వ అర్ధ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఇది వారిద్దరికీ తాత్కాలిక ఉపశమనం కలిగించి ఉండవచ్చు కానీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో ఈ అగ్రశ్రేణి క్రికెటర్లు ఇద్దరూ తమ మునుపటి ఫామ్ ని చూపించక తప్పదు.వన్డే చరిత్రలో 14,000 పరుగులు చేసిన మూడవ బ్యాటర్‌గా నిలిచేందుకు కోహ్లీకి 37 పరుగులు అవసరం, మరో వైపు 11,000 పరుగులు పూర్తి చేసిన పదో బ్యాట్స్‌మన్‌గా నిలిచేందుకు రోహిత్‌కు కేవలం 12 పరుగులు మాత్రమే అవసరం. కానీ భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవకుండా వీరిద్దరూ ఈ వ్యక్తిగత రికార్డులు సాధించినా పెద్దగా ప్రయోజనం ఉండదు.భవిష్యత్తు పై చర్చ ఐసిసి మెగా ఈవెంట్‌కు ముందు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తు పై చర్చ జరుగుతోంది. గత సంవత్సరం టి 20 ప్రపంచ కప్ గెలుచుకున్న తర్వాత ఈ ముగ్గురూ ఇప్పటికే అంతర్జాతీయ టి 20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైన తర్వాత జట్టులోని సీనియర్ ఆటగాళ్ల ఇక రిటైర్మెంట్ ప్రకటించవచ్చని పుకార్లు వ్యాపించాయి. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినట్లయితే ఈ ముగ్గురు సీనియర్లు ఆటగాళ్లు మరికొంత కాలం ఆడే అవకాశం ఉందని, భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించాడు. "ఈ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మరో ఐసీసీ టోర్నమెంట్ మరో రెండు, మూడు ఏళ్ళ వరకు లేదు.వచ్చే ఏడాది టి 20 ప్రపంచ కప్ ఉన్నప్పటికీ ఈ ముగ్గురు ఇప్పటికే టి 20ల నుంచి రిటైర్ అయ్యారు. ఇక 2027 లో జరిగే వన్డే ప్రపంచ కప్ కి చాల కాలం ఉంది. అప్పటి దాకా వీరు ముగ్గురూ వన్డే క్రికెట్ లో కొనసాగడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో రోహిత్, విరాట్, జడేజా లకు ఇదే చివరి ఐసీసీ టోర్నమెంట్ కావచ్చని, చోప్రా వ్యాఖ్యానించాడు.యువ ఆటగాళ్ల కు అద్భుత అవకాశంవన్డే వైస్ కెప్టెన్‌గా యువ బ్యాటర్ శుభమాన్ గిల్‌కు పెద్ద ప్రమోషన్ వచ్చింది. పైగా ఈ ఫార్మాట్లో దాదాపు 61 సగటు ఉన్న ఈ బ్యాట్స్‌మన్ ఛాంపియన్స్ ట్రోఫీలో విజృభించి తన సత్తా చాటాలని ఎంతో ఆసక్తి గా ఉన్నాడు. గాయం కారణంగా బుమ్రా లేకపోయిన కారణంగా అర్ష్‌దీప్ సింగ్ , హర్షిత్ రాణా వంటి యువ బౌలర్లకు ఇది అద్భుత అవకాశం. ఈ నేపధ్యం లో గిల్, శ్రేయాస్ అయ్యర్, కె ఎల్ రాహుల్ వంటి బ్యాటర్, అర్ష్‌దీప్ సింగ్, రాణా వంటి యువ ఆటగాళ్లకి అంతర్జాతీయ వేదిక పై తమ సత్తా చాటేందుకు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఒక అద్భుత అవకాశంగా కనిపిస్తోంది. మరి ఈ యువ ఆటగాళ్లు రాణించి భారత్ కి మరో ఐసీసీ ట్రోఫీ తెస్తారేమో చూడాలి. -
ఆ ఇద్దరి విషయంలో అగార్కర్‌తో గంభీర్ గొడవ.. ఆఖరికి!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంపిక చేసిన జట్టు విషయంలో టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar)- హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) మధ్య విభేదాలు తలెత్తాయా? ఇద్దరు ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇచ్చే అంశమై ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదా? అదే వాగ్యుద్దానికి దారి తీసిందా? అంటే జాతీయ మీడియా వర్గాల నుంచి అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది.కాగా దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత మరోసారి చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు రంగం సిద్ధమైంది. పాకిస్తాన్(Pakistan) వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఈ మెగా టోర్నమెంట్ మొదలుకానుంది. అయితే, భద్రతా కారణాల వల్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) టీమిండియాను అక్కడికి పంపడం లేదు. యశస్వి జైస్వాల్‌పై వేటుఈ నేపథ్యంలో అనేక పరిణామాల అనంతరం తటస్థ వేదికైన దుబాయ్‌లో భారత్ తమ మ్యాచ్‌లు ఆడేందుకు ఐసీసీ అనుమతినిచ్చింది. ఇక ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు జనవరి 18న తమ ప్రాథమిక జట్టును ప్రకటించిన బీసీసీఐ.. ఫిబ్రవరి 11న ఫైనల్ టీమ్‌ను ఖరారు చేసింది. తొలుత ఈ జట్టులో స్థానం దక్కించుకున్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌పై వేటు వేసిన యాజమాన్యం.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి అవకాశం ఇచ్చింది. మొదటి ప్రాధాన్యం దక్కాలని గంభీర్ వాదనఅదే విధంగా వెన్నునొప్పి కారణంగా ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టోర్నీకి దూరం కాగా.. హర్షిత్ రాణాను జట్టులో చేర్చింది. అయితే, వికెట్ కీపర్ విషయంలో మాత్రం గంభీర్- అగార్కర్ మధ్య తీవ్రమైన చర్చ జరిగినట్లు సమాచారం. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం... సీనియర్ అయిన కేఎల్ రాహుల్‌కు మొదటి ప్రాధాన్యం దక్కాలని గంభీర్ వాదించగా.. అగార్కర్ మాత్రం రిషభ్ పంత్‌కు పెద్దపీట వేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇక ఆఖరికి గంభీర్ తన మాటను నెగ్గించుకున్నట్లు ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్ ద్వారా నిరూపితమైనట్లు తెలుస్తోంది. స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు వన్డేల్లోనూ కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా బరిలోకి దిగగా.. పంత్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. కాగా ఈ సిరీస్‌ను 3-0తో టీమిండియా క్లీన్‌స్వీప్ చేసిన తర్వాత గౌతం గంభీర్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం మా నంబర్ వన్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ మాత్రమే అని చెప్పగలను.రిషభ పంత్‌కు కూడా అవకాశాలు వస్తాయి. అయితే, కేఎల్ రాహుల్ రికార్డు బాగుంది. అందుకే అతడి వైపు మొగ్గుచూపాం. ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లను ఒకేసారి ఆడించలేము కదా!’’ అని పేర్కొన్నాడు. శ్రేయస్ అయ్యర్ విషయంలోనూఇక కేఎల్ రాహుల్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ విషయంలోనూ గంభీర్.. అగార్కర్‌తో వాదనకు దిగినట్లు తెలుస్తోంది. దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపిన ఈ ముంబై బ్యాటర్‌ను తప్పక ఎంపిక చేయాలని గౌతీ పట్టుబట్టగా.. అగార్కర్ మాత్రం అతడి పట్ల సుముఖంగా లేనట్లు సమాచారం. ఇంగ్లండ్‌తో తొలి వన్డే తర్వాత శ్రేయస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్నిస్తున్నాయి కూడా! తాను తొలుత తుదిజట్టులో లేనని.. విరాట్ కోహ్లి మోకాలి నొప్పి కారణంగానే తనకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కిందని శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు.ఏది ఏమైనా ఇంగ్లండ్‌తో వన్డేలో సిరీస్‌లో మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మూడు వన్డేల్లో వరుసగా 59, 44, 78 పరుగులు సాధించాడు. ఇక జట్టుకూర్పులో తన నిర్ణయానికే కట్టుబడి ఉన్న గంభీర్.. అగార్కర్‌తో విభేదించినప్పటికీ ఘన విజయం సాధించడం జట్టుకు సానుకూలాంశంగా మారింది.అయితే, లెఫ్ట్- రైట్ కాంబినేషన్ల కోసం అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో ఐదో స్థానానికి ప్రమోట్ చేసి.. కేఎల్ రాహుల్‌ను ఆరో నంబర్ ఆటగాడిగా పంపడం బెడిసికొట్టింది. దీంతో మూడో వన్డేలో కేఎల్ రాహుల్‌ను తన రెగ్యులర్ స్థానమైన ఐదో నంబర్లో పంపగా.. 29 బంతుల్లోనే 40 పరుగులతో దంచికొట్టాడు.చదవండి: చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా స్టార్ దూరం!? -
ఛాంపియన్స్ ట్రోఫీ.. చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లి
స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను క్వీన్ స్వీప్ చేసిన టీమిండియా.. ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై కన్నేసింది. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టు శనివారం దుబాయ్‌కు పయనమైంది.ఈ మెగా ఈవెంట్ పాకిస్తాన్, యూఏఈ వేదికలగా హైబ్రిడ్ మోడల్లో జరగనుంది. భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఈ టోర్నీలో రన్నరప్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా.. ఈసారి ఎలాగైనా ఛాంపియన్స్‌గా తిరిగిరావాలని పట్టుదలతో ఉంది. ఈ మినీ వరల్డ్‌కప్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 19న దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది.సచిన్ రికార్డుపై విరాట్ కన్ను..కాగా ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(Virat kohli)ని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. బంగ్లాతో మ్యాచ్‌లో కోహ్లి మరో 37 పరుగులు చేస్తే.. వన్డేల్లో అత్యంతవేగంగా 14,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా విరాట్ చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ తన 350వ వన్డే ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్‌పై ఈ ఫీట్‌ను అందుకున్నాడు.కోహ్లి ఇప్పటివరకు 285 ఇన్నింగ్స్‌లలో 13963 పరుగులు చేశాడు. సచిన్ తర్వాతి స్ధానంలో శ్రీలంక లెజెండ్ కుమార్ సంగక్కర ఉన్నాడు. సంగ్కర 378 ఇన్నింగ్స్‌లలో 14,000 పరుగుల మైలు రాయిని సాధించాడు. ఈ క్రమంలో తొలి మ్యాచ్‌లో ఈ దిగ్గజాలను కోహ్లి అధిగమించే అవకాశముంది.అంతేకాకుండా ఈ టోర్నీలో విరాట్ మరో 173 పరుగులు సాధిస్తే.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా శిఖర్ ధావన్ రికార్డు కూడా బద్దలు అయ్యే ఛాన్స్ ఉంది. దావన్ ఛాంపియన్స్ ట్రోఫీలో 10 మ్యాచ్‌లు ఆడి 701 పరుగులు చేశాడు. కోహ్లి విషయానికి వస్తే.. 13 మ్యాచ్‌ల్లో 529 పరుగులు చేశాడు. అదేవిధంగా కోహ్లి మరో 263 పరుగులు చేయగలిగితే ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వరల్డ్ రికార్డు సృష్టించే అవకాశముంటుంది. ప్రస్తుతం ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉంది. గిల్ 791 పరుగులతో ఈ టోర్నీలో టాప్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరి వన్డేలో కోహ్లి హాఫ్ సెంచరీ సాధించి తన ఫామ్‌ను తిరిగి అందుకున్నాడు. అదేజోరును ఈ ఐసీసీ ఈవెంట్లోనూ కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.చదవండి: ENG vs IND: రోహిత్ శర్మకు బిగ్ షాక్.. టీమిండియా కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్? -
దుబాయ్‌కు పయనమైన టీమిండియా.. రోహిత్, కోహ్లి, గంభీర్లతో పాటు..
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఫీవర్ మొదలైపోయింది. ఈ మెగా టోర్నమెంట్లో పాల్గొనేందుకు టీమిండియా దుబాయ్‌కు పయనమైంది. హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir)తో పాటు రోహిత్ సేన శనివారం ముంబై నుంచి బయల్దేరింది. ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో టీమిండియా సభ్యులు కనిపించడంతో అభిమానులు వారి ఫొటోలు తీసుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా 2017లో చివరిసారిగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరిగింది. నాడు ఫైనల్ చేరుకున్న భారత జట్టు అనూహ్య రీతిలో దాయాది పాకిస్తాన్ చేతి(India vs Pakistan)లో ఓటమిపాలై.. టైటిల్‌ను చేజార్చుకుంది. అందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఇప్పుడు సమయం వచ్చింది.తటస్థ వేదికపైపాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఈ ఐసీసీ ఈవెంట్ మొదలుకానుండగా.. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా అక్కడికి వెళ్లడం లేదు. అయితే, పాక్ క్రికెట్ బోర్డు మాత్రం భారత జట్టు తమ దేశానికి తప్పక రావాలని పట్టుబట్టగా...బీసీసీఐ అందుకు నిరాకరించింది. ఆఖరికి అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) జోక్యంతో తటస్థ వేదికపై టీమిండియా మ్యాచ్‌లు ఆడేందుకు మార్గం సుగమమైంది.ఈ నేపథ్యంలో ఐసీసీ నిర్ణయం మేరకు రోహిత్ సేన తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడనుంది. ఇందుకోసం జనవరి 18న ప్రాథమిక జట్టును ప్రకటించిన బీసీసీఐ.. ఇటీవలే రెండు మార్పులతో తమ జట్టును ఖరారు చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో చాంపియన్స్ ట్రోఫీ ఆడబోయే పదిహేను మంది సభ్యుల వివరాలు మంగళవారం వెల్లడించింది.రెండు మార్పులుయువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను తప్పించి అతడి స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి చోటిచ్చిన యాజమాన్యం.. జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా హర్షిత్ రాణాకు పిలుపునిచ్చింది. ఇక ఈ టోర్నీలో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా తమ ప్రయాణం మొదలుపెట్టనుంది.అనంతరం దాయాది పాకిస్తాన్‌తో ఫిబ్రవరి 23న తలపడనున్న రోహిత్ సేన.. లీగ్ దశలో ఆఖరిగా న్యూజిలాండ్‌ను మార్చి 2న ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో స్వదేశంలో సిరీస్ ద్వారా ఈ వన్డే టోర్నీకి టీమిండియాకు కావాల్సినంత ప్రాక్టీస్ లభించింది.మరో సానుకూలాంశంసొంతగడ్డపై ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత్‌కు.. కెప్టెన్ రోహిత్ శర్మ(సెంచరీ), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(అర్ధ శతకం) ఫామ్‌లోకి రావడం మరో సానుకూలాంశం. ఇక ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే క్రమంలో రోహిత్ సేన శనివారమే దుబాయ్‌కు పయనమైంది. రోహిత్-కోహ్లిలతో పాటు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ తదితరులు ఎయిర్‌పోర్టులో తళుక్కుమన్నారు.వీరితో పాటు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ సహా సహాయక సిబ్బంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు బయల్దేరారు.చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: రోహిత్, కోహ్లితో పాటు అతడికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ: భారత మాజీ క్రికెటర్ #WATCH | Mumbai: The first batch of the Indian Cricket team departs for Dubai to participate in the ICC Champions Trophy.All matches of Team India will be held in Dubai, while the rest will take place in Pakistan. The ICC Champions Trophy will begin on February 19 and will… pic.twitter.com/C4VdRPddyn— ANI (@ANI) February 15, 2025#WATCH | Mumbai: Cricketer Hardik Pandya arrives at the airport as the first batch of the Indian Cricket team departs for Dubai to participate in the ICC Champions Trophy. All matches of Team India will be held in Dubai, while the rest will take place in Pakistan. The ICC… pic.twitter.com/CmIjdDrRtW— ANI (@ANI) February 15, 2025 -
ఆ ముగ్గురికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ: భారత మాజీ క్రికెటర్
దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) టోర్నమెంట్ నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఈ ఐసీసీ ఈవెంట్ మొదలుకానుంది. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-‘బి’ నుంచి అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టైటిల్ కోసం పోటీపడనున్నాయి.ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎనిమిది బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఇక 2017లో చివరగా విరాట్ కోహ్లి(Virat Kohli) సారథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ ఆడిన టీమిండియా.. ఈసారి రోహిత్ శర్మ(Rohit Sharma) కెప్టెన్సీలో బరిలో దిగనుంది. నాటి జట్టులో భాగమైన కోహ్లి, రోహిత్‌తో పాటు.. రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా కూడా ఈసారి చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లో చోటు దక్కించుకున్నారు.ఆ ముగ్గురికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ నలుగురిలో ముగ్గురికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ కాబోతుందంటూ జోస్యం చెప్పాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘మీ అంచనా వందశాతం నిజమేనని మనస్ఫూర్తిగా చెబుతున్నా.కచ్చితంగా ఇలా జరిగే అవకాశం అయితే ఉంది. త్వరలోనే చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. ఆ తర్వాత వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ రూపంలో మరో ఐసీసీ టోర్నీ ఉంది. అయితే, ఈ ఈవెంట్లో టీమిండియా ఫైనల్‌కు చేరలేదు కాబట్టి.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా ఇందులో ఆడే అవకాశం లేదు.కారణం ఇదేఇక మరుసటి ఏడాది టీ20 ప్రపంచకప్ జరుగనుంది. అయితే, ఇప్పటికే ఈ ముగ్గురు అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. కాబట్టి ఇందులోనూ వీరు భాగం కాలేరు. ఇక.. మళ్లీ 2027లో వన్డే వరల్డ్‌కప్ జరుగుతుంది. అందుకు ఇంకా చాలా సమయమే ఉంది. అప్పటికి పరిస్థితుల్లో భారీ మార్పులు రావచ్చు. కాబట్టి.. కోహ్లి, రోహిత్, జడేజాలకు ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ కానుందని చెప్పవచ్చు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.అన్నీ బాగుండి ఆడాలని కోరుకుంటే మాత్రంఅయితే, ఈ ముగ్గురు లేని లోటు తెలియకుండా టీమిండియా ఆడగలిగినపుడే ఇది సాధ్యమవుతుందని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ఫిట్‌గా ఉండటంతో పాటు ఫామ్ కొనసాగిస్తూ తమకు నచ్చినంత కాలం ఆడాలని ఫిక్సయితే మాత్రం వీరిని ఎవరూ ఆపలేరనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇంటర్నేషనల్ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు. అయితే, ఐపీఎల్లో మాత్రం ఈ ముగ్గురూ కొనసాగుతున్నారు. ఇక రోహిత్ త్వరలోనే 38వ వసంతంలో అడుగుపెట్టనుండగా.. కోహ్లి, జడేజాలకు ఇప్పుడు 36 ఏళ్లు. చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: CT 2025: సురేశ్ రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్‌కప్ వీరులకు నో ఛాన్స్! -
సచిన్, కోహ్లికి సాధ్యం కాని ఘనతను సాధించిన జింబాబ్వే ఆటగాడు
క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), విరాట్ కోహ్లి (Virat Kohli) సాధించలేని ఘనతలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి వాటిలో ఓ ఘనతను ఇవాళ ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఆటగాడు బ్రియాన్ బెన్నెట్ (Brian Bennett) సాధించాడు. బెన్నెట్.. 22 ఏళ్లు నిండకముందే (21 ఏళ్ల 96 రోజులు) వన్డేల్లో 150 ప్లస్ స్కోర్ సాధించాడు. దిగ్గజ బ్యాటర్లు సచిన్, విరాట్ ఇంత చిన్న వయసులో ఈ ఘనతను సాధించలేదు. విరాట్ 23 ఏళ్ల 134 రోజుల వయసులో .. సచిన్ 26 ఏళ్ల 198 రోజుల వయసులో 150 ప్లస్ స్కోర్ సాధించారు.వన్డే క్రికెట్ చరిత్రలో బ్రియాన్ కంటే చిన్న వయసులో 150 ప్లస్ స్కోర్ చేసిన బ్యాటర్లు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. వీరిలో ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ (20 ఏళ్ల 4 రోజులు) అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించగా.. బంగ్లాదేశ్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ (20 ఏళ్ల 149 రోజులు), ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ (20 ఏళ్ల 353 రోజులు) ఆతర్వాతి ఉన్నారు. తాజాగా బ్రియాన్ వన్డేల్లో 150 ప్లస్ స్కోర్ సాధించిన నాలుగో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు.ఐర్లాండ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 14) జరుగుతున్న వన్డేలో బ్రియాన్ 163 బంతుల్లో 20 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 169 పరుగులు చేశాడు. కెరీర్లో కేవలం ఏడో వన్డేలోనే బ్రియాన్ రికార్డు సెంచరీ సాధించాడు. జింబాబ్వే తరఫున వన్డేల్లో 150 పరుగుల మార్కును తాకిన ఐదో క్రికెటర్‌గా బ్రియాన్ రికార్డుల్లోకెక్కాడు. దీనికి ముందు బ్రియాన్ జింబాబ్వే తరఫున టెస్ట్‌ల్లో సెంచరీ చేసిన రెండో అత్యంత పిన్న వయస్కుడిగానూ రికార్డు నెలకొల్పాడు.మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో ఇవాళ జరుగుతున్న తొలి వన్డేలో జింబాబ్వే తొలుత బ్యాటింగ్ చేస్తూ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ భారీ సెంచరీతో కదంతొక్కగా.. కెప్టెన్ క్రెయిగ్ ఐర్విన్ (66) అర్ద సెంచరీతో రాణించాడు. మరో ఓపెనర్ బెన్ కర్రన్ 28, సికందర్ రజా 8, మెదెవెరె 8, జోనాథన్ క్యాంప్‌బెల్ (అలిస్టర్ క్యాంప్‌బెల్ కొడుకు) 6, మరుమణి 2 పరుగులతో అజేయంగా నిలిచారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదైర్ 2, జాషువ లిటిల్, హ్యూమ్, ఆండీ మెక్‌బ్రైన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 300 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్ 31 ఓవర్ల అనంతరం 3 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ఆండ్రూ బల్బిర్నీ డకౌట్ కాగా.. పాల్ స్టిర్లింగ్ 32, కర్టిస్ క్యాంపర్ 44 పరుగులు చేసి ఔటయ్యారు. హ్యారీ టెక్టార్ (33), లోర్కాన్ టక్కర్ (30) క్రీజ్‌లో ఉన్నారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, సికందర్ రజా తలో వికెట్ పడగొట్టారు. -
అప్పుడే ఆఫర్ వచ్చింది.. కానీ!.. వదిలేసిన ఫ్రాంఛైజీ జట్టుకే కెప్టెన్‌గా..
గత ఏడాదే కెప్టెన్సీపై ఆసక్తి ఉందా అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) యాజమాన్యం తనను అడిగినట్లు కొత్త కెప్టెన్ రజత్ పాటీదార్ తెలిపాడు. అయితే, ఐపీఎల్‌కు ముందు రాష్ట్ర జట్టుకు కెప్టెన్సీ చేయాలనుకుంటున్నట్లు వారికి చెప్పానన్నాడు. ఇప్పుడిలా ఈ అవకాశం రావడం ఆనందంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశాడు.కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫ్రాంఛైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 2025 సీజన్లో కొత్త కెప్టెన్ నాయకత్వంలో బరిలోకి దిగనుంది. విరాట్ కోహ్లి మరోసారి సారథ్య బాధ్యతలు చేపట్టవచ్చనే అభిమానుల ఆశలకు భిన్నంగా టీమ్ మేనేజ్మెంట్ అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.దూకుడైన బ్యాటింగ్‌తో జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన రజత్ పాటీదార్‌ను కెప్టెన్‌గా నియమించింది. గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సారథ్య వివరాలను ఆర్సీబీ ప్రకటించింది. గత మూడు సీజన్ల పాటు కెప్టెన్‌గా వ్యవహరించిన డు ప్లెసిస్‌ను వేలానికి ముందు టీమ్ విడుదల చేయడంతో కొత్త నాయకుడి ఎంపిక అనివార్యమైంది. వేలానికి ముందు జట్టు రిటైన్ చేసుకున్న ముగ్గురు ప్లేయర్లలో పాటీదార్ ఒకడు. అతడిని రూ.11 కోట్లకు ఆర్సీబీ తమతోనే కొనసాగించింది.కాగా 2021–2024 మధ్య ఆర్సీబీ తరఫున 27 మ్యాచ్‌లు ఆడిన పాటీదార్ 158.84 స్ట్రైక్‌రేట్‌తో 799 పరుగులు సాధించాడు. ఇందులో 1 సెంచరీ, 7 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇప్పుడు తొలిసారి కెప్టెన్‌గా కూడా ఎంపిక చేసిన యాజమాన్యం పెద్ద బాధ్యతను అతనిపై పెట్టింది. ఐపీఎల్లో చరిత్రలో బెంగళూరుకు రజత్ ఎనిమిదో కెప్టెన్. గతంలో ఈ టీమ్‌కు ద్రవిడ్, పీటర్సన్, కుంబ్లే, వెటోరి, కోహ్లి, వాట్సన్, డుప్లెసిస్ సారథులుగా వ్యవహరించారు. రజత్ పాటిదార్ (PC: RCB X)మెరుపు బ్యాటింగ్‌తో గుర్తింపు... ఇండోర్‌కు చెందిన 32 ఏళ్ల పాటీదార్ దేశవాళీ క్రికెట్లో మధ్యప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2021 సీజన్లో తొలిసారి అతను ఐపీఎల్ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. అ సీజన్లో నాలుగు మ్యాచ్‌లకే పరిమితమైన అతడిని 2022 సీజన్‌కు ముందు విడుదల చేసింది. అయితే లవ్‌నీత్ సిసోడియా అనూహ్యంగా గాయపడటంతో రీప్లేస్మెంట్ ప్లేయర్‌గా మళ్లీ జట్టులోకి వచ్చి చెలరేగిపోయాడు.మొత్తం 333 పరుగులు చేయగా... ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నోపై 54 బంతుల్లో 112 పరుగులు బాదిన ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. అయితే గాయం కారణంగా 2023 సీజన్‌కు పూర్తిగా దూరమైన అతను 2024లో తిరిగొచ్చి మెరుపు బ్యాటింగ్‌తో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 2024 సీజన్లో 15 మ్యాచ్‌లలో 395 పరుగులు సాధించిన అతను 33 సిక్సర్లు బాదాడు.అదే ఏడాది ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే టోర్నీల్లో తొలిసారి మధ్యప్రదేశ్‌కు కెప్టెన్‌గా పని చేసిన అనుభవం పాటీదార్‌కు ఉంది. ముస్తాక్ అలీ టోర్నీలో 186.08 స్ట్రయిక్‌రేట్‌తో 428 పరుగులు చేసిన అతను జట్టును ఫైనల్ వరకు చేర్చాడు. కెప్టెన్‌గా ఎందుకు... ఐపీఎల్లో కెప్టెన్‌గా ఎంపిక చేసేందుకు మేనేజ్మెంట్ ముందుగా చూసేది అన్ని మ్యాచ్‌లలో కచ్చితంగా తుది జట్టులో ఉండే ఆటగాడి గురించే. అది కూడా భారత ఆటగాడైతే మరీ మంచిది. గతంలో విదేశీయులను కెప్టెన్‌గా చేసి అతను విఫలమవుతున్నా కొనసాగించి దాదాపు పది మందితోనే ఆడినట్లుగా టీమ్‌లు ఇబ్బంది పడిన ఘటనలు చాలా ఉన్నాయి. అలా చూస్తే విరాట్ కోహ్లి తర్వాత జట్టులో ప్రధాన బ్యాటర్ అయిన పాటీదార్ మినహా మరో ప్రత్యామ్నాయం ఆర్సీబీ వద్ద లేకపోయింది.కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, పడిక్కల్‌లతో పోలిస్తే ఇది మెరుగైన నిర్ణయమే. భారత్ తరఫున 3 టెస్టులు, ఒకే ఒక వన్డే ఆడిన రజత్‌కు వ్యక్తిగతంగా స్టార్ ఆటగాడిలా గుర్తింపు లేకపోయినా అతనిపై యాజమాన్యం నమ్మకం ఉంచింది. ‘రజత్ ఎంపికకు ఎన్నో కారణాలు ఉన్నాయి. అతని నెమ్మదైన స్వభావం, ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండే తీరు, కెపె్టన్సీకి పనికొచ్చే లక్షణం. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో అతని ప్రతిభ, పట్టుదల ఎలాంటివో మధ్యప్రదేశ్ కెప్టెన్‌గా దగ్గరి నుంచి చూశాం.సహచరులతో కలిసిపోవడం, వారికి అండగా నిలిచే తత్వం కూడా మంచి సారథికి ఉండాల్సిన మరో లక్షణం’ అని ఆర్సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ అన్నాడు. మరోవైపు కోహ్లికి మళ్లీ కెప్టెన్సీ ఇచ్చే విషయంపైచర్చించామన్న టీమ్ డైరెక్టర్ మో బొబాట్... ఎందుకు వద్దనుకున్నారనే ప్రశ్నపై తగిన సమాధానం ఇవ్వలేదు. కోహ్లి స్థాయి ఆటగాడికి ‘కెప్టెన్’ అనే హోదా అవసరం లేదని, తన సహజ నాయకత్వ లక్షణాలు జట్టుకు ఉపయోగపడతాయని అతను వ్యాఖ్యానించాడు.రజత్ పాటిదార్ (PC: RCB X)హడావిడి చేసే రకం కాదుఇక రజత్ పాటిదార్ మాట్లాడుతూ.. ‘‘నేను హడావిడి చేసే తరహా వ్యక్తిని కాదు కానీ మ్యాచ్‌లలో పరిస్థితులపై అవగాహన ఉంది. ఆటగాళ్లకు అండగా నిలిచి ఫలితాలు రాబడతా. టీమ్‌లో ఉన్న ఇతర ఆటగాళ్ల అనుభవమూ నాకు పనికొస్తుంది. ఇక కోహ్లినుంచి ఎంతో నేర్చుకునే అవకాశం ఉంది. అతని ఆలోచనలు, వ్యూహాలు కచ్చితంగా ఉపయోగించుకుంటా’’ అని తెలిపాడు.కోహ్లి విషెస్రజత్కు నా అభినందనలు. నీ ఆటతో ఎంతో మంది ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్న నువ్వు ఈ హోదాకు అర్హుడవు. నువ్వు జట్టును ముందుకు తీసుకెళ్లగలవనే నమ్మకం ఉంది- విరాట్ కోహ్లి. -
Ind vs Pak: టీమిండియా చేతిలో ఓటమి తర్వాత కసి పెరిగింది! ఫైనల్లో అలా..
క్రికెట్ ప్రపంచంలో భారత్- పాకిస్తాన్(India vs Pakistan) మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇరుదేశాల అభిమానులతో పాటు క్రికెట్ ప్రేమికులంతా దాయాదుల పోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ఇక గత కొన్నేళ్లుగా ఆసియా కప్, ఐసీసీ వంటి ప్రధాన ఈవెంట్లలో మాత్రమే ఈ చిరకాల ప్రత్యర్థుల ముఖాముఖి పోటీపడుతుండగా.. అత్యధిక సార్లు భారత్ పైచేయి సాధించింది.కానీ 2017 నాటి చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) ఫైనల్లో మాత్రం టీమిండియాకు దాయాది చేతిలో భంగపాటు ఎదురైంది. లీగ్ దశలో పాక్‌ను చిత్తు చేసిన భారత జట్టు.. టైటిల్ పోరులో మాత్రం దురదృష్టవశాత్తూ ఓటమిపాలైంది. ఇక ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ మొదలుకానున్న తరుణంలో నాటి విన్నింగ్ పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్(Sarfaraz Ahmed) గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.మాలో కసి పెరిగిందిచాంపియన్స్ ట్రోఫీ-2017లో తమ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘‘గ్రూప్ స్టేజ్‌లో టీమిండియా చేతిలో ఓడిపోయిన తర్వాత జట్టు సమావేశంలో భాగంగా సీనియర్లు షోయబ్ మాలిక్, మొహమ్మద్ హఫీజ్ మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. జట్టులో అలాంటి వ్యక్తులు ఉండటం అదనపు బలం.ఆరోజు నుంచి మా ఆలోచనా ధోరణి మారిపోయింది. ఆ చేదు అనుభవం నుంచి పాఠాలు నేర్చుకున్నాం. జట్టులో రెండు మార్పులతో బరిలోకి దిగి వరుస విజయాలు సాధించాం. సౌతాఫ్రికా, శ్రీలంక జట్లను ఓడించాం.టీమిండియా మనకు కొత్తదేమీ కాదుఇక ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో మా బౌలర్లు అద్భుతంగా ఆడి గెలిపించారు. ఆ తర్వాత టీమిండియాతో ఫైనల్. అప్పుడు రెట్టింపు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాల్సిన పరిస్థితి. అందరూ పూర్తిగా రిలాక్స్ అవ్వాలని మా వాళ్లకు సందేశం ఇచ్చాను.అత్యుత్తమ జట్లను ఓడించాం. ఇక టీమిండియా కూడా మనకు కొత్తదేమీ కాదు. మనం చూడని జట్టూ కాదు. ఫలితం ఏమిటన్న విషయం గురించి ఆలోచించవద్దు. గెలిచేందుకు వంద శాతం ప్రయత్నం చేశామా లేదా అన్నది మాత్రమే ముఖ్యం.ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలుసు. చివరి వికెట్ పడగానే మాకు కలిగిన అనుభూతిని మాటల్లో వర్ణించలేము’’ అంటూ ఐసీసీతో తన జ్ఞాపకాలు పంచుకున్నాడు సర్ఫరాజ్ అహ్మద్. కాగా లండన్ వేదికగా నాటి ఫైనల్లో పాకిస్తాన్ కోహ్లి సేనపై 180 పరుగుల తేడాతో గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది.దుబాయ్‌లో టీమిండియా మ్యాచ్లుఇక 2017లో ఫైనల్ ఆడిన జట్టులో ఉన్న రోహిత్ శర్మ ప్రస్తుతం కెప్టెన్‌గా ఉండగా.. విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా కూడా ప్రస్తుత చాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఈసారి పాకిస్తాన్ ఈ ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులు సంపాదించుకోగా.. భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడనుంది. ఇక భారత్- పాకిస్తాన్ మధ్య ఫిబ్రవరి 23న మ్యాచ్ జరుగనుంది. ఈసారి.. టీమిండియా హాట్ ఫేవరెట్‌గా బరిలో దిగనుంది. చదవండి: CT 2025: ఏ జట్టునైనా ఓడిస్తాం.. చాంపియన్స్ ట్రోఫీ మాదే: బంగ్లాదేశ్ కెప్టెన్ -
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా రజత్ పాటిదార్.. కోహ్లి కామెంట్స్ వైరల్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కొత్త కెప్టెన్ నియామకంపై ఆ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి(Virat Kohli) స్పందించాడు. సారథిగా ఎంపికైన రజత్ పాటిదార్(Rajat Patidar)కు శుభాకాంక్షలు చెప్పిన ఈ రన్‌మెషీన్.. కెప్టెన్సీకి అతడు వందశాతం అర్హుడని ప్రశంసలు కురిపించాడు. అతడికి ఎల్లప్పుడూ తన మద్దతు ఉంటుందని ప్రకటించాడు.కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)-2025 సీజన్‌కు గానూ ఆర్సీబీ టీమిండియా ఆటగాడు రజత్ పాటిదార్‌ను తమ కెప్టెన్‌గా నియమించింది. సౌతాఫ్రికా వెటరన్ స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ స్థానంలో ఈ మధ్యప్రదేశ్ క్రికెటర్‌కు పగ్గాలు అప్పగించింది. కాగా 2021లో ఆర్సీబీలో చేరిన పాటిదార్‌ను 2022 వేలానికి ముందు ఫ్రాంఛైజీ విడిచిపెట్టింది.కెప్టెన్ స్థాయికిఈ క్రమంలో అతడు వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోగా.. రీప్లేస్మెంట్ ఆటగాడిగా మళ్లీ జట్టులోకి చేర్చుకుంది. అయితే, తన అద్బుత ఆట తీరుతో అతడు ఇప్పుడు కెప్టెన్ స్థాయికి చేరుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి రజత్ పాటిదార్ గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు.‘‘ఆర్సీబీ కొత్త కెప్టెన్‌గా రజత్ పాటిదార్ ఎంపికయ్యాడు. నీకు శుభాభినందనలు రజత్. నిన్ను నువ్వు నిరూపించుకుని... ఫ్రాంఛైజీతో అనుబంధాన్ని పెంచుకుని.. ఇక్కడి దాకా వచ్చావు. ఆర్సీబీ అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించావు. నీ ఎదుగుదల ఇక్కడితో ఆగిపోదు.కెప్టెన్‌గా నువ్వు అర్హుడివి. నాతో పాటు జట్టులోని సభ్యులంతా నీ వెన్నంటే ఉంటాము. నీ పాత్రను సమర్థవంతంగా పోషించేలా సహకారం అందిస్తాం. ఇదొక కీలకమైన బాధ్యత. గత కొన్నేళ్లుగా నేనూ, ఫాఫ్ సారథ్య బాధ్యతలను మోశాం. ఇప్పుడు నీకు ఆ గౌరవం దక్కింది. నువ్వు ఈ స్థాయికి చేరుకోవడం పట్ల నాకు సంతోషంగా ఉంది. ఇది నీ హక్కుకెప్టెన్గా ఉండటం ఒక రకంగా నీకు నువ్వుగా సంపాదించుకున్న హక్కు. గత రెండేళ్ల నీ ప్రయాణం అద్భుతం. టీమిండియా తరఫున కూడా అరంగేట్రం చేశావు. మధ్యప్రదేశ్ జట్టును ముందుకు నడిపించిన తీరు కూడా నన్ను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు అద్భుతమైన ఫ్రాంఛైజీ జట్టుకు సారథిగా నిన్ను నువ్వు మరోసారి నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది.రజత్ పాటిదార్‌కు మద్దతుగా ఉండాలని అభిమానులకు కోరుతున్నా. ఏది ఏమైనా.. చివరకు మన అందరికీ జట్టు ప్రయోజనాలు, గెలుపే ముఖ్యం. జట్టుగా ఎదుగుదాం. మన అద్బుతమైన ఫ్రాంఛైజీకి చిరస్మరణీయ విజయాలు అందిద్దాం. రజత్‌కు మరోసారి శుభాకాంక్షలు. అభిమానుల ప్రేమ మనకు ఎల్లప్పుడూ లభిస్తుంది. రానున్న సీజన్లో ఆర్సీబీ సరికొత్తగా అద్భుతంగా సాగాలని ఆకాంక్షిస్తున్నా’’ అని మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి వీడియో సందేశంలో పేర్కొన్నాడు.కాగా గతేడాది.. రజత్ పాటిదార్ దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఇక ఐపీఎల్ కెరీర్లో 27 మ్యాచ్‌లు ఆడిన పాటిదార్ ఓ శతకం, ఏడు అర్ధ శతకాల సాయంతో 799 పరుగులు చేశాడు. ఇక తొమ్మిదేళ్లపాటు ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి 2022 సీజన్‌కు ముందు సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.చదవండి: క్రెడిట్ అతడికే ఇవ్వాలి.. నా స్థానంలో ఎవరున్నా జరిగేది అదే: రోహిత్ శర్మ 𝐊𝐢𝐧𝐠 𝐊𝐨𝐡𝐥𝐢 𝐀𝐩𝐩𝐫𝐨𝐯𝐞𝐬! 💌“Myself and the other team members will be right behind you, Rajat”: Virat Kohli“The way you have grown in this franchise and the way you have performed, you’ve made a place in the hearts of all RCB fans. This is very well deserved.”… pic.twitter.com/dgjDLm8ZCN— Royal Challengers Bengaluru (@RCBTweets) February 13, 2025 -
విరాట్‌ను అతిగా ఇబ్బంది పెట్టిన బౌలర్లు.. సౌథీ, హాజిల్‌వుడ్ సరసన రషీద్
ప్రపంచ క్రికెట్‌ను శాశించే విరాట్ కోహ్లిని (Virat Kohli) కొందరు బౌలర్లు తెగ ఇబ్బంది పెట్టారు. విరాట్‌ను అతిగా ఇబ్బంది పెట్టిన బౌలర్ల జాబితాలోకి తాజాగా ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ (Adil Rashid) చేరాడు. భారత్‌తో నిన్న (ఫిబ్రవరి 12) జరిగిన మూడో వన్డేలో ఆదిల్ రషీద్ విరాట్‌ను ఔట్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో విరాట్‌ను ఔట్ చేయడం ఆదిల్‌కు ఇది 11వ సారి. ప్రపంచ క్రికెట్లో టిమ్ సౌథీ, జోష్ హాజిల్‌వుడ్ మాత్రమే విరాట్‌ను ఇన్ని సార్లు ఔట్ చేశారు. తాజా డిస్మిసల్తో ఆదిల్.. సౌథీ, హాజిల్‌వుడ్ సరసన చేరాడు. సౌథీ 37 మ్యాచ్‌ల్లో, హాజిల్‌వుడ్ 29 మ్యాచ్‌ల్లో, రషీద్ 34 మ్యాచ్‌ల్లో తలో 11 సార్లు విరాట్‌ను ఔట్ చేశారు. వీరి తర్వాత విరాట్‌ను అధికంగా ఇబ్బంది పెట్టింది మొయిన్ అలీ (41 మ్యాచ్‌ల్లో), జేమ్స్ ఆండర్సన్ (37 మ్యాచ్‌ల్లో). వీరిద్దరూ విరాట్‌ను చెరి 10 సార్లు ఔట్ చేశారు. వీరిద్దరు కూడా ఇంగ్లండ్ బౌలర్లే కావడం విశేషం. బౌలర్లకు నిద్రలేని రాత్రులు గడిపేలా చేసే విరాట్.. పై ఐదుగురంటే తెగ బయపడిపోతాడు. వీరి బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి ఆపసోపాలు పడతాడు. నిన్నటి మ్యాచ్‌లో ఈ సీన్ రిపీట్ అయ్యింది. ఆదిల్‌ను ఎదుర్కొనేందుకు విరాట్ చాలా కష్టపడ్డాడు. ఒకానొక సందర్భంలో ఔటయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. మథ్యలో ఆదిల్ శాంతించడంతో ఎలాగోలా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్.. ఆతర్వాత ఆదిల్ చేతికే చిక్కాడు. ఆదిల్ అద్భుతమైన ఫ్లైటెడ్ డెలివరీతో విరాట్ ఆట కట్టించాడు. బాగా టర్న్ అయిన ఈ బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్‌కీపర్ ఫిల్ సాల్ట్ చేతుల్లోకి వెళ్లింది. ఆదిల్ విరాట్‌ను వన్డేల్లో ఐదు సార్లు, టెస్ట్‌ల్లో నాలుగు సార్లు, టీ20ల్లో రెండు సార్లు ఔట్ చేశాడు.కాగా, నిన్నటి మ్యాచ్‌లో విరాట్ హాఫ్ సెంచరీతో రాణించాడు. చాలా ఇన్నింగ్స్‌ల తర్వాత విరాట్ చేసిన హాఫ్ సెంచరీ ఇది. దీంతో వన్డేల్లో విరాట్ హాఫ్ సెంచరీల సంఖ్య 73కు చేరింది. ఈ మ్యాచ్‌లో విరాట్ హాఫ్ సెంచరీతో రాణించగా.. శుభ్‌మన్ గిల్ సెంచరీతో, శ్రేయస్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. వీరితో పాటు కేఎల్ రాహుల్ కూడా రాణించడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 356 పరుగులు చేసింది. ఛేదనలో తడబడిన ఇంగ్లండ్ 214 పరుగులకే ఆలౌటై 142 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. అంతకుముందు భారత్ ఇంగ్లండ్‌ను ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 4-1 తేడాతో ఓడించింది. -
IPL 2025: ఆర్సీబీ కెప్టెన్‌గా రజత్ పాటిదార్.. అధికారిక ప్రకటన
ఐపీఎల్ 2025 (IPL) సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నూతన కెప్టెన్‌ను ప్రకటించింది. వచ్చే సీజన్లో ఆర్సీబీ కెప్టెన్‌గా రజత్ పాటిదార్ (Rajat Patidar) వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ యాజమాన్యం ఇవాళ (ఫిబ్రవరి 13) అధికారికంగా వెల్లడించింది. 31 ఏళ్ల పాటిదార్ గత కొన్ని సీజన్లుగా ఆర్సీబీలో కీలక ప్లేయర్‌గా వ్యవహిరిస్తున్నాడు. తొలుత ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లి మళ్లీ బాధ్యతలు చేపడతాడని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారమంతా ఊహాగానాలే అని తేలిపోయింది. విరాట్‌కు కెప్టెన్సీ చేసే ఉద్దేశం లేకనే పాటిదార్ పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. పాటిదార్.. గత సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో మధ్యప్రదేశ్‌ను ఫైనల్‌కు చేర్చాడు. పాటిదార్‌కు రంజీల్లో మధ్యప్రదేశ్‌కు కెప్టెన్‌గా పని చేసిన అనుభవం ఉంది. పాటిదార్ కొన్ని సందర్భాల్లో ఆర్సీబీ కెప్టెన్‌గానూ (తాత్కాలిక) వ్యవహరించాడు. తాజా పరిణామంతో పాటిదార్ ఆర్సీబీ ఎనిమిదో కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గతంలో రాహుల్ ద్రవిడ్ (2008), కెవిన్ పీటర్సన్ (2009), అనిల్ కుంబ్లే (2009), డేనియల్ వెటోరీ (2011), విరాట్ కోహ్లి (2011), షేన్ వాట్సన్ (2017), ఫాప్ డుప్లెసిస్ (2022) ఆర్సీబీ కెప్టెన్లుగా వ్యవహరించారు.2022 నుంచి 2024 వరకు ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించిన ఫాఫ్ డుప్లెసిస్‌ను మెగా వేలంలో తిరిగి రీటైన్ చేసుకోకపోవడంతో 2025 సీజన్‌కు ముందు ఆర్సీబీ కెప్టెన్ లేకుండా ఉండింది. 2021లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన పాటిదార్ అప్పటినుంచి ఆర్సీబీలోనే కొనసాగుతున్నాడు. పాటిదార్.. తనదైన శైలిలో విధ్వంసం సృష్టించి ఆర్సీబీ మిడిలార్డర్లో డ్యాషింగ్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. పాటిదార్.. స్పిన్ మరియు పేస్ బౌలింగ్‌ను సమర్దవంతంగా ఎదుర్కొంటాడు. ఐపీఎల్ కెరీర్లో 27 మ్యాచ్‌లు ఆడిన పాటిదార్ 158.85 స్ట్రయిక్‌రేట్‌తో 799 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 7 అర్ద సెంచరీలు ఉన్నాయి.పాటిదార్‌ను ఇటీవల ముగిసిన మెగా వేలానికి ముందు ఆర్సీబీ రూ. 11 కోట్లు పెట్టి రీటైన్ చేసుకుంది. ఆర్సీబీ రీటైన్ చేసుకున్న ముగ్గురు ఆటగాళ్లలో పాటిదార్ ఒకడు. పాటిదార్ కాకుండా ఆర్సీబీ విరాట్ కోహ్లి, యశ్ దయాల్‌ను రీటైన్ చేసుకుంది.కాగా, ఐపీఎల్లో ఆర్సీబీ ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా సాధించని విషయం తెలిసిందే. 2009, 2011, 2016లో రన్నకప్గా నిలిచిన ఈ జట్టు.. 2015, 2020, 2021, 2022, 2024 సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు చేరింది. -
CT 2025: సీన్ రివర్స్.. బ్యాటింగ్ ఓకే.. బుమ్రా లేని లోటు తీరేనా?
ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌కు ముందు ఇంగ్లండ్‌తో నిర్వహించిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ద్వారా భారత్ బ్యాటింగ్‌పై ఇటీవల రేకెత్తిన అనేక ప్రశ్నల కి సమాధానం లభించింది. ఈ సిరీస్ తో భారత్ బ్యాటింగ్ ఇబ్బందులు మాత్రం తొలిగినట్టే కనిపిస్తున్నాయి. ఇంతకుముందు కటక్ లో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు.ఇక బుధవారం అహ్మదాబాద్‌లో జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 55 బంతుల్లో 52 పరుగులు సాధించి తన ఫామ్ పై వస్తున్న విమర్శలకు అడ్డుకట్ట వేసాడు. ఇక ఓపెనర్‌గా వచ్చిన యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ కూడా సెంచరీ సాధించడంతో భారత్ బ్యాటింగ్ మళ్ళీ గతంలో లాగా పటిష్టంగా కనిపిస్తోంది. కోహ్లీ రికార్డ్ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కి వ్యతిరేకంగా అంతర్జాతీయ క్రికెట్లో 4,000 పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డ్ కూడా సాధించాడు. ఇంగ్లండ్‌పై 4,000 పరుగుల మైలురాయిని అధిగమించిన ఆరో బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ ఘనత వహించాడు. ఇంగ్లాండ్‌పై అన్ని ఫార్మాట్లలో కలిపి 87వ మ్యాచ్ లలో ఎనిమిది సెంచరీలు, 23 అర్ధ సెంచరీలు, 41.23 సగటు తో కోహ్లీ ఈ ఘనత సాధించాడు.ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్ ఇంగ్లండ్‌పై 37 టెస్ట్ మ్యాచ్‌ల్లో 5,028 పరుగులు సాధించి తో ఈ పట్టిక లో అగ్రస్థానంలో ఉన్నాడు. తర్వాత ఆస్ట్రేలియా కి చెందిన అలన్ బోర్డర్ (124 ఇన్నింగ్స్‌లలో 4850), స్టీవ్ స్మిత్ (114 ఇన్నింగ్స్‌లలో 4815), వెస్టిండీస్ బ్యాటర్ వివియన్ రిచర్డ్స్ (84 ఇన్నింగ్స్‌లలో 4488), ఆస్ట్రేలియాకే చెందిన రికీ పాంటింగ్ (99 ఇన్నింగ్స్‌లలో 4141) వరుసగా తర్వాత స్థానాలలో ఉన్నారు. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలోనూ అంతకుముందు స్వదేశంలో జరిగిన శ్రీలంక, న్యూజిలాండ్ లతో జరిగిన సిరీస్ లలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ పేలవంగా ఆడటంతో వీరిద్దరి ఫామ్‌పై పలు విమర్శలు చెలరేగాయి. కానీ ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్ లో వీరిద్దరూ కూడా పరుగులు సాధించడంతో భారత్ జట్టు మేనేజిమెంట్ ఊపిరి పీల్చుకుంది.బుమ్రా లేని భారత్ బౌలింగ్ అయితే బ్యాటింగ్ విషయం పర్వాలేదనిపించినా ప్రస్తుతం బౌలింగ్ పెద్ద సమస్య గా పరిణమించే ప్రమాదముంది. భారత్ ప్రధాన బౌలర్ వెన్ను నొప్పి కారణంగా ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకొన్నాడు. జనవరిలో ఆస్ట్రేలియా తో జరిగిన సిడ్నీ టెస్ట్ సమయంలో మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ నుంచి వైదొలిగిన బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను కూడా తాత్కాలిక జట్టు నుంచి తొలగించారు అతని స్థానంలో ఇటీవల కాలంలో నిలకడగ రాణిస్తున్న స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేశారు. బుమ్రా తాజాగా బెంగళూరులో తీయించుకున్న స్కాన్లలో తీవ్రమైన ఇబ్బంది కనిపించక పోయినప్పటికీ, పూర్తి స్థాయిలో కోలుకోడానికి రెండు వారాలు పట్టే అవకాశం ఉన్నందున అతనికి మరింత విశ్రాంతి ఇవ్వాలని మేనేజిమెంట్ నిర్ణయించింది. గాయం కారణంగా బుమ్రా దూరమవుతున్న రెండవ ఐసీసీ టోర్నమెంట్ ఇది. గతంలో వెన్నునొప్పి కి ఆస్ట్రేలియాలో జరిగిన శస్త్రచికిత్స కారణంగా 2022 టి20 ప్రపంచ కప్ నుంచి కూడా బుమ్రా వైదొలిగిన విషయం తెలిసిందే.స్పిన్నర్ల పైనే భారం బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ సిరీస్‌లో వన్డే అరంగేట్రం చేశాడు. జనవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ మరియు ఇంగ్లండ్ సిరీస్ కోసం తాత్కాలిక జట్టును ప్రకటించినప్పుడు, ఇంగ్లండ్ వన్డేలకు బుమ్రాకు పూర్తిగా కోలుకోని కారణంగా రాణాని జట్టులోకి ఎంపిక చేశారు. గాయం నుంచి కోలుకొని మళ్ళీ జట్టులోకి వచ్చిన మహమ్మద్ షమీ కూడా ఇంకా పూర్తి స్థాయి ఫామ్ సాధించలేక పోతున్నాడన్న విషయం, ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లో తేటతెల్లమైంది.ఇక వీరిద్దరి తర్వాత మూడవ అత్యంత సీనియర్ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్‌ని ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత జట్టు నుంచి తప్పించడం తో భారత్ పేస్ బౌలింగ్ షమీ , అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా ల పై ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పేస్ బౌలింగ్ కన్నా, స్పిన్నర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి ల పైనే ఎక్కువ భారం పడే అవకాశం ఉంది. -
అహ్మదాబాద్‌లో అదరగొట్టిన భారత బ్యాటర్లు.. ఇదే తొలిసారి
ఇంగ్లండ్‌తో మూడో వన్డే(India vs England)లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. ఫలితంగా అహ్మదాబాద్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. తద్వారా నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ ఖాతాలో అతిపెద్ద స్కోరు(Highest ODI total) నమోదైంది. కాగా రోహిత్ సేన ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా నాగ్‌పూర్, కటక్ వన్డేల్లో ఇంగ్లండ్‌ను నాలుగేసి వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం మూడో వన్డేలోనూ గెలిచి వైట్‌వాష్ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగింది.అయితే, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆరంభంలోనే కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma) వికెట్ రూపంలో టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. గత వన్డేలో సెంచరీ(119)తో చెలరేగిన హిట్‌మ్యాన్ మూడో వన్డేలో మాత్రం ఒక్క పరుగే చేసి మార్క్‌వుడ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.ఎట్టకేలకు ఫామ్లోకిఈ నేపథ్యంలో మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌కు జతైన వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. మూడుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 55 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 52 పరుగులు చేశాడు. అప్పటికే, హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్.. దానిని శతకంగా మార్చుకున్నాడు.గిల్ శతకంమొత్తంగా 102 బంతులు ఎదుర్కొన్న శుబ్‌మన్ గిల్ 14 ఫోర్లు, 3 సిక్స్‌లు బాది.. 112 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(64 బంతుల్లో 78 రన్స్) అద్భుత అర్ధ శతకంతో మెరిశాడు. మరోవైపు.. తన రెగ్యులర్ స్థానమైన ఐదో నంబర్లో వచ్చిన కేఎల్ రాహుల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.కేవలం 29 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టి 40 పరుగులు సాధించాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్. మిగతా వాళ్లలో ఎవరూ పెద్దగా రాణించలేదు. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా(17), అక్షర్ పటేల్(13), వాషింగ్టన్ సుందర్(14).. పేసర్లు హర్షిత్ రాణా(13), అర్ష్‌దీప్ సింగ్(2), కుల్దీప్ యాదవ్(1*) నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు.అవయవ దానం గురించిఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 356 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో రైటార్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. పేసర్లు మార్క్ వుడ్ రెండు, గస్ అట్కిన్సన్ ఒకటి, పార్ట్ టైమ్ స్పిన్నర్ జో రూట్ ఒక వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా టీమిండియా- ఇంగ్లండ్ క్రికెటర్లు అవయవ దానం గురించి అవగాహన కల్పించే చేసే క్రమంలో గ్రీన్ ఆర్మ్ బ్యాండ్‌తో బరిలోకి దిగడం విశేషం.అహ్మదాబాద్‌లో వన్డేల్లో అత్యధిక స్కోర్లుసౌతాఫ్రికా వర్సెస్ ఇండియా- 2010లో 365/2ఇండియా వర్సెస్ ఇంగ్లండ్- 2025లో 356ఇండియా వర్సెస్ వెస్టిండీస్- 2002లో 325/5వెస్టిండీస్ వర్సెస్ ఇండియా- 2002లో 324/4 పాకిస్తాన్ వర్సెస్ ఇండియా- 2007లో 319/7.చదవండి: చరిత్ర సృష్టించిన కోహ్లి.. భారత తొలి బ్యాటర్‌గా అరుదైన రికార్డువారెవ్వా!.. శుబ్‌మన్ గిల్ ప్రపంచ రికార్డు -
చరిత్ర సృష్టించిన కోహ్లి.. భారత తొలి బ్యాటర్‌గా అరుదైన రికార్డు
అహ్మదాబాద్ వన్డే సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) సరికొత్త చరిత్ర సృష్టించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా ఈ జాబితాలో కోహ్లి ఆరో స్థానంలో ఉన్నాడు.కాగా గత కొంతకాలంగా కోహ్లి వరుస వైఫల్యాలతో సతమవుతున్న విషయం తెలిసిందే. గత పన్నెండు ఇన్నింగ్స్‌లో అతడు చేసిన పరుగులు వరుసగా 4, 1, 5, 100*, 7, 11, 3, 36, 5, 17, 6, 6. ఈ క్రమంలో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్(India vs England)లోనైనా కోహ్లి ఫామ్‌లోకి వస్తాడని భావిస్తే.. మోకాలి గాయం కారణంగా నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు.కేవలం ఐదు పరుగులుఅనంతరం కటక్‌లో జరిగిన రెండో వన్డేతో పునరాగమనం చేసిన కోహ్లి పూర్తిగా విఫలమయ్యాడు. ఎనిమిది బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ సాయంతో కేవలం ఐదు పరుగులు చేసి నిష్క్రమించాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు.ఈ క్రమంలో అహ్మదాబాద్ వేదికగా మూడో వన్డేలోనైనా బ్యాట్ ఝులిపిస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో కోహ్లి ఓ అరుదైన ఘనత సాధించడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లండ్‌పై నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. కాగా కోహ్లి ఇంగ్లండ్‌పై ఇప్పటి వరకు ఎనిమిది శతకాలు బాదడంతో పాటు 23 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. సగటు 41.23.హాఫ్ సెంచరీతో మెరిసిన కోహ్లిఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా ఇప్పటికే 2-0తో సొంతం చేసుకుంది. ఇరుజట్ల మధ్య బుధవారం నాటి నామమాత్రపు మూడో వన్డేకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక. ఇందులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుని భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే, ఆదిలోనే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్క పరుగు మాత్రమే చేసి అవుటయ్యాడు. మార్క్ వుడ్ బౌలింగ్‌లో ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరోవైపు.. వన్‌డౌన్ బ్యాటర్ కోహ్లి(52), ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఇద్దరూ అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చిన కోహ్లి అవుటయ్యాడు.ఇక ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ శతకం(112) బాదగా..శ్రేయస్ అయ్యర్(78), కేఎల్ రాహుల్(40) రాణించారు. ఫలితంగా నిర్ణీత యాభై ఓవర్లలో 356 పరుగులకు ఆలౌట్ అయింది.అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు1. డాన్ బ్రాడ్‌మన్(ఆస్ట్రేలియా)- 63 ఇన్నింగ్స్‌లో 5028 పరుగులు2. అలెన్ బోర్డర్(ఆస్ట్రేలియా)- 124 ఇన్నింగ్స్‌లో 4850 పరుగులు3. స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా)- 114 ఇన్నింగ్స్‌లో 4815 పరుగులు4. వివియన్ రిచర్డ్స్(వెస్టిండీస్)- 84 ఇన్నింగ్స్‌లో 4488 పరుగులు5. రిక్కీ పాంటింగ్(ఆస్ట్రేలియా)- 99 ఇన్నింగ్స్‌లో 4141 పరుగులు6. విరాట్ కోహ్లి(ఇండియా)-109 ఇన్నింగ్స్‌లో 4001కి పైగా పరుగులు.చదవండి: ఆఖరికి అతడికి జట్టులో స్థానమే లేకుండా చేశారు: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
ఇంగ్లండ్‌తో మూడో వన్డే.. భారీ రికార్డుకు చేరువలో రోహిత్
అహ్మదాబాద్ వేదికగా భారత్, ఇంగ్లండ్ (IND VS ENG 3rd ODI) మధ్య ఇవాళ (ఫిబ్రవరి 12) మూడో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఓ భారీ మైలురాయిని అధిగమించే అవకాశం ఉంది. నేటి మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ మరో 13 పరుగులు చేస్తే, వన్డే క్రికెట్లో 11000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 10వ ఆటగాడిగా.. నాలుగో భారతీయ క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. వన్డే క్రికెట్లో ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్ (18426), కుమార సంగక్కర (14232), విరాట్ కోహ్లి (13911), రికీ పాంటింగ్ (13704), సనత్ జయసూర్య (13430), మహేళ జయవర్దనే (12650), ఇంజమామ్ ఉల్ హక్ (11739), జాక్ కల్లిస్ (11579), సౌరవ్ గంగూలీ (11363) మాత్రమే 11000 పరుగుల మైలురాయిని దాటారు.విరాట్ తర్వాత అత్యంత వేగంగా..!నేటి మ్యాచ్‌లో రోహిత్ 11000 పరుగుల మైలురాయిని తాకితే.. విరాట్ కోహ్లి (Virat Kohli) తర్వాత అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం రోహిత్ 259 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 10987 పరుగులు చేశాడు. విరాట్.. 11000 పరుగుల మైలురాయిని తన 222వ ఇన్నింగ్స్‌లోనే అధిగమించాడు.సెంచరీ చేస్తే మరో రికార్డునేటి మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీ చేస్తే సచిన్ టెండూల్కర్ (100), విరాట్ కోహ్లి (81) తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో 50 సెంచరీలు పూర్తి చేసిన మూడో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 10వ క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు సచిన్, విరాట్, పాంటింగ్ (71), సంగక్కర (63), కల్లిస్ (62), హాషిమ్ ఆమ్లా (55), జయవర్దనే (54), బ్రియాన్ లారా (53), జో రూట్ (52) మాత్రమే యాభై సెంచరీలు పూర్తి చేశారు. కాగా, ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. అంతకుముందు జరిగిన తొలి వన్డేలోనూ భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సుడిగాలి శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ కేవలం 76 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్‌కు వన్డేల్లో ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ. -
రోహిత్‌లాగే కోహ్లి కూడా ఫామ్‌లోకి వస్తాడు.. చాంపియన్స్ ట్రోఫీ భారత్‌దే..!
ముంబై: భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli) రాణిస్తే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) భారత్ వశమవుతుందని శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ (Muttiah Muralitharan) అన్నాడు. రిలయన్స్ శీతల పానియాల ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన అతను మీడియాతో ముచ్చటించాడు. ‘ఇద్దరు అసాధారణ ఆటగాళ్లు. ప్రపంచ శ్రేణి బ్యాటర్లు. ఎప్పుడైనా సరే క్లాస్ శాశ్వతం. ఫామ్ లేకపోవడం తాత్కాలికం. తప్పకుండా రోహిత్‌లాగే కోహ్లి కూడా ఫామ్‌లోకి వస్తాడు. ఇద్దరు ప్రత్యర్థి బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగితే టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంటుంది’ అని మురళీ వివరించాడు. రోహిత్ బృందం ఆల్‌రౌండ్ వనరులతో పటిష్టంగా కనబడుతోందన్నాడు. భారత్ సహా పాక్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో నాణ్యమైన స్పిన్ బౌలర్లు ఉన్నారని, పాకిస్తాన్‌లోని పిచ్‌లు స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తాయని చెప్పాడు. -
కోహ్లి ఫామ్‌లోకి వస్తే భారత్‌కు తిరుగులేదు..
ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్ట్ నుండి పేలవమైన ఫామ్ కారణంగా వైదొలిగిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆ తర్వాత జరిగిన రంజీ ట్రోఫీ టోర్నమెంట్ లో కూడా ఆశించిన విధంగా రాణించలేక పోయాడు. ఈ నేపధ్యం లో ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ ముందు రోహిత్ మళ్ళీ ఫామ్ లోకి రావడం చాల ముఖ్యమైన విషయం.వరుసగా పది ఇన్నింగ్స్‌ల లో ( తొమ్మిది టెస్టులు, ఒక వన్డే) విఫలమైన రోహిత్ చివరికి ఆదివారం కటక్‌లో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో తన మునుపటి ఫామ్ ని ప్రదర్శించి సిక్సర్ల మోత మోగించాడు. రోహిత్ కటక్ ప్రేక్షకులను నిజంగా అలరించాడు, 12 ఫోర్లు మరియు 7 సిక్సర్లు తో వన్డేల్లో తన 32వ సెంచరీ సాధించి, భారత్ ఈ మూడు మ్యాచ్ ల సిరీస్ చేజిక్కించుకునేందుకు తన వంతు పాత్ర పోషించాడు. జట్టు రధ సారధి లాగా ముందుండి నడిపించాడు.ఈ సెంచరీతో, రోహిత్ 30 ఏళ్లు నిండిన క్రికెటర్లలో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన భారత క్రికెటర్ గా రికార్డ్ నమోదు చేసాడు. లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ గతంలో 35 సెంచరీలు తో చేసిన రికార్డును రోహిత్ అధిగమించాడు. భారత్ తరపున ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన వారి లో రోహిత్ ఇప్పుడు రెండో స్థానానికి చేరుకున్నాడు. రోహిత్ అన్ని ఫార్మాట్లలో ఓపెనర్‌గా 15,404 పరుగులు సాధించాడు. గతంలో సచిన్ టెండూల్కర్ 15,335 పరుగులతో సాధించిన మరో రికార్డును కూడా రోహిత్ ఈ మ్యాచ్ తో అధిగమించాడు. వీరేంద్ర సెహ్వాగ్ 15,758 పరుగులతో ఈ జాబితా లో అగ్ర స్థానం లో ఉన్నాడు. "చాలా సంవత్సరాలుగా నేను క్రికెట్ ఆడుతున్నాను. నేను ఏమి చేయాలో నాకు తెల్సు. నా నుండి ఏమి అవసరమో నాకు అర్థమైంది. పిచ్ లోకి వెళ్లి నేను చేసింది అదే" అని రోహిత్ మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు.రోహిత్ మళ్ళీ ఫామ్ లోకి రావడంతో భారత్ జట్టు మానేజిమెంట్ కి పెద్ద తలనొప్పి తగ్గింది. ఇక మూడో వన్డేలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా సెంచరి సాధించినట్టయితే ఛాంపియన్స్ ట్రోఫీ కి ముందు భారత్ బ్యాటింగ్ గాడి లో పడినట్టే. బ్యాటింగ్ స్థానం లో మార్పులుఅయితే భారత్ బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు పై పలువురు మాజీ ఆటగాళ్లు జట్టు మేనేజిమెంట్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌ను వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ కంటే ముందుగా పంపడం పై పెద్ద దుమారమే చెలరేగుతోంది. టాప్ ఆర్డర్ బ్యాటర్ అయిన రాహుల్ జట్టు అవసరాల అనుగుణంగా బ్యాటింగ్ స్థానాన్ని మార్చడం పై జట్టు మేనేజిమెంట్ పలు విమర్శలు ఎదుర్కొంటోంది."అక్షర్ పటేల్ మళ్ళీ కెఎల్ రాహుల్ కంటే ముందుగా బ్యాటింగ్ రావడమేమిటి? నాకు మాటలు కూడా రావడం లేదు. రాహుల్ లాంటి నైపుణ్యమైన బాట్స్మన్ ని ఆరో స్థానానికి నెట్టడం చాల దారుణం. అక్షర్‌ను రాహుల్ కన్నా ముందుగా బ్యాటింగ్ పంపడం. అదీ ఇలాంటి పిచ్ పై సరైన నిర్ణయం కాదు, అని భారత్ మాజీ ఆటగాడు దొడ్డ గణేష్ వ్యాఖ్యానించాడు. -
SA Vs NZ: చరిత్ర సృష్టించిన విలియమ్సన్.. విరాట్ కోహ్లి రికార్డు బద్దలు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ముందు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్(Kane Williamson) అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కివీస్ జట్టు ప్రస్తుతం పాకిస్తాన్ వేదికగా మక్కోణపు సిరీస్‌లో తలపడుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో సత్తాచాటిన కేన్ మామ.. సోమవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.టీ20 తరహాలో తన ఇన్నింగ్స్‌ను కొనసాగించిన విలియమ్సన్ కేవలం 72 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇది విలియమ్సన్కు ఐదేళ్ల తర్వాత వచ్చిన వన్డే సెంచరీ కావడం గమనార్హం. ఓవరాల్‌గా 113 బంతులు ఎదుర్కొన్న విలియమ్సన్.. 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 133 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు డెవాన్ కాన్వే(97) కీలక ఇన్నింగ్స్ ఆడారు. దీంతో 305 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 48.4 ఓవర్లలో చేధించింది.అంతకుమందు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో అరంగేట్ర ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కే విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.148 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 150 పరుగులు చేశాడు. అతడితో పాటు వియాన్ ముల్డర్ (64), జాసన్ స్మిత్ (41) కూడా రాణించారు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ, ఓ రూర్క్ తలా రెండు వికెట్లు పడగొట్టగా..బ్రాస్‌వెల్ ఓ వికెట్ సాధించాడు.చరిత్ర సృష్టించిన విలియమ్సన్..ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన విలియమ్సన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 7000 పరుగులు అందుకున్న రెండో బ్యాటర్‌గా విలియమ్సన్ రికార్డులకెక్కాడు. 159 ఇన్నింగ్స్‌లలో కేన్ ఈ ఫీట్ సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు విరాట్ కోహ్లి(161 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కోహ్లి రికార్డును విలియమ్సన్ బ్రేక్ చేశాడు. అయితే కివీస్ తరపున ఈ ఫీట్ సాధించిన తొలి క్రికెటర్ మాత్రం కేన్ మామనే కావడం విశేషం.వన్డేల్లో అత్యంత వేగంగా 7000 పరుగులు1. హషీమ్ ఆమ్లా: 150 ఇన్నింగ్స్‌లు2. కేన్ విలియమ్సన్: 159 ఇన్నింగ్స్‌లు3. విరాట్ కోహ్లీ: 161 ఇన్నింగ్స్‌లు4. ఏబీ డివిలియర్స్: 166 ఇన్నింగ్స్‌లు5. సౌరవ్ గంగూలీ: 174 ఇన్నింగ్స్‌లు -
IND Vs ENG: రోహిత్ సూపర్ సెంచరీ..రెండో వన్డేలో ఇంగ్లండ్‌పై టీమిండియా గెలుపు (ఫొటోలు)
-
ఇంగ్లండ్ రెండో వన్డే.. వరుణ్ చక్రవర్తి అరంగేట్రం! కోహ్లి వచ్చేశాడు
కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్లు రెండో వన్డేలో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టులో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లికి చోటు దక్కింది.తొలి వన్డేకు గాయం కారణంగా దూరమైన కోహ్లి.. పూర్తి ఫిట్నెస్ సాధించడంతో తిరిగి జట్టులోకి జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా ఈ మ్యాచ్‌తో వరుణ్ చక్రవర్తి భారత తరపున వన్డే అరంగేట్రం చేశాడు. టీ20ల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండడంతో వరుణ్‌కు వన్డేల్లో కూడా అవకాశం దక్కింది. కోహ్లి, వరుణ్ రాకతో జైశ్వాల్,కుల్దీప్ యాదవ్ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.మరోవైపు ఇంగ్లండ్ తమ జట్టులో మూడు మార్పులు చేసింది. గుస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, జేమీ ఓవర్టన్ తుది జట్టులోకి వచ్చారు. దీంతో జాకబ్ బెతల్, కార్స్, అర్చర్లకు ఇంగ్లండ్ మెనెజ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చింది.తుది జట్లుఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవన్: బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జామీ ఓవర్టన్, గుస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సాకిబ్ మహమూద్ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తిచదవండి: SL vs AUS: చరిత్ర సృష్టించిన స్మిత్.. ప్రపంచంలో తొలి ప్లేయర్‌గా -
ఇంగ్లండ్‌తో రెండో వన్డే.. భారత జట్టులో కీలక మార్పులు! కింగ్, సింగ్ ఎంట్రీ?
కటక్ వేదికగా ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. తొలి వన్డేలో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్.. ఈ మ్యాచ్‌లో కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. కటక్ వన్డేలో ఎలాగైనా గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత్ వ్యూహాలు రచిస్తోంది.మరోవైపు ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని యోచిస్తోంది. 2006 నుంచి భారత గడ్డపై 31 సార్లు భారత్‌తో తలపడిన ఇంగ్లండ్ 5 మ్యాచ్‌లే గెలిచి మరో 25 మ్యాచ్‌ల్లో ఓటమిచవిచూసింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.కింగ్ ఇన్.. జైశ్వాల్ ఔట్!మోకాలి గాయం కారణంగా తొలి వన్డేకు దూరమైన టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(Virat kohli).. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. దీంతో అతడు రెండో వన్డేలో ఆడనున్నాడు. ఈ విషయాన్ని భారత జట్టు వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సైతం ధ్రువీకరించాడు. ఈ క్రమంలో ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌పై వేటు పడనున్నట్లు తెలుస్తోంది.కటక్ మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేసిన జైశ్వాల్.. పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కేవలం 13 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. దీంతో అతడిని పక్కన పెట్టి యథావిధిగా గిల్‌ను ఓపెనర్‌గా పంపాలని జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. గిల్ స్దానంలో కోహ్లి బ్యాటింగ్‌కు వచ్చే అవకాశముంది.మరోవైపు ఈ మ్యాచ్‌లో యువపేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఆడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్దం చేసేందుకు అర్ష్‌దీప్‌ను ఈ మ్యాచ్‌లో ఆడించాలని మెనెజ్‌మెంట్ నిర్ణయించందంట. దీంతో మరో యువ పేసర్ హర్షిత్ రాణా బెంచ్‌కే పరిమితమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.కటక్ వన్డేతో అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా 3 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. కానీ పరుగులు మాత్రం భారీ సమర్పించుకున్నాడు. అదేవిధంగా ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్‌ను ఆడించాలని గంభీర్ అండ్ కో భావిస్తే కేఎల్ రాహుల్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు.రోహిత్ ఫామ్‌లోకి వస్తాడా?కాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్ అభిమానులను అందోళనకు గురిచేస్తోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విఫలమైన రోహిత్.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో కూడా కూడా అదేతీరును కనబరుస్తున్నాడు. తొలి వన్డేలో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి హిట్‌మ్యాన్ ఔటయ్యాడు.ఈ క్రమంలో రోహిత్‌కు భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ మద్దతుగా నిలిచాడు. రోహిత్ శర్మ అద్బుతమైన ఆటగాడని, అతడి ఫామ్‌పై మాకు ఎటువంటి ఆందోళన లేదని కోటక్ అన్నారు. అదేవిధంగా ఈ సిరీస్ కంటే ముందు శ్రీలంకపై వన్డేల్లో రోహిత్ మెరుగ్గా రాణించాడని, తిరిగి తన ఫామ్‌ను అందుకుంటాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్ ),శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్/ రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్ ),సాల్ట్, రూట్, బ్రూక్, బెన్ డకెట్, లివింగ్‌స్టోన్, బెతెల్, కార్స్, ఆర్చర్, రషీద్, వుడ్.చదవండి: సిరీస్ విజయమే లక్ష్యంగా... -
శ్రేయాస్ జోరు మరి విరాట్ పరిస్థితి ఏమిటి?
ఇంగ్లండ్ తో గురువారం జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో నిజానికి భారత్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఆడే పరిస్థితి లేదు. దానికి ముందు రోజు రాత్రి వరకు దీని పై స్పష్టత లేదు. శ్రేయాస్ అయ్యర్ ఏదో సినిమా చూస్తూ నిబ్బరముగా ఉన్నాడు. ఈ లోగా కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి ఫోన్ వచ్చింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి గాయం కావడంతో అతను ఆడటం కష్టమని. అందువల్ల మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉండమని కోరాడు. దాంతో సినిమా ఆపేసి మ్యాచ్ కి ముందు విశ్రాంతి కోసం నిద్రకు ఉపక్రమించాడు శ్రేయాస్ అయ్యర్. "విరాట్ మోకాలి నొప్పి కారణంగా ఆడే అవకాశం లేనందున నువ్వు ఆడే అవసరం రావచ్చు అని కెప్టెన్ (రోహిత్ శర్మ) నుండి నాకు కాల్ వచ్చింది" అని అయ్యర్ స్వయంగా వెల్లడించాడు."నేను నా గదికి తిరిగి వెళ్లి వెంటనే నిద్ర పోయాను." గురువారం మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ క్రీజులోకి అడుగు పెట్టే సమయానికి భారత్ 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో ఉంది. ఇంగ్లాండ్ పేసర్లు జోఫ్రా ఆర్చర్ మరియు సాకిబ్ మహమూద్ నిలకడగా బౌలింగ్ చేస్తూ భారత్ ని పరుగులు కొట్టకుండా నిల్వరిస్తున్నారు.ఆ దశలో రంగ ప్రవేశం చేసిన అయ్యర్ ఇంగ్లాండ్ బౌలర్ల సవాలును ఎదుర్కొన్నాడు. అయ్యర్ రెండు సిక్సర్లు, తొమ్మిది ఫోర్లతో 36 బంతుల్లో 59 పరుగులు చేశాడు. తన అద్భుతమైన ఎదురుదాడి ఇన్నింగ్స్‌తో మ్యాచ్ ని మలుపు తిప్పాడు. ఫలితంగా భారత్ తొలి వన్డేలో ఇంగ్లాండ్‌పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించగా, శ్రేయాస్ అయ్యర్ తన 19వ అర్ధ సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్ లో మరో విషయం వెల్లడైంది. యశస్వి జైస్వాల్ ఓపెనర్ గా వస్తే శుభ్‌మాన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్ కి వస్తాడు. విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉంటాడు. ఎడమచేతి వాటం అక్షర్ తదుపరి బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది, ఆట స్థితిని బట్టి కే ఎల్ రాహుల్ లేదా హార్దిక్ పాండ్యా తర్వాత బ్యాటింగ్ చేస్తారు. అయితే కోహ్లీ గాయం లేకపోతే అయ్యర్ కి స్తానం లేదా అన్నది ఇక్కడ ప్రధానాంశం. "కోహ్లీ ఫిట్ గా ఉంటే అయ్యర్ ఆడటం సాధ్యం కాదన్న విషయం గురుంచే నేను తదేకంగా ఆలోచిస్తున్నాను. 2023 ప్రపంచ కప్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 500 కి పైగా పరుగులు చేసిన తొలి భారత్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్.అటువంటి నైపుణ్యం ఉన్న బ్యాట్స్‌మన్ ని మీరెలా బెంచ్ మీద కూర్చో బెట్ట గలరు? అని భారత్ మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా జట్టు మేనేజ్మెంట్ పై విరుచుకు పడ్డాడు. భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో శ్రేయాస్ అయ్యర్ ని సమర్ధించాడు."శ్రేయస్ తన నైపుణ్యాన్ని ఇప్పటికే నిరూపించుకున్నాడు. అతను ప్రపంచ కప్‌లో పరుగుల ప్రవాహం సృష్టించాడు. ఒక ఆటగాడు ఇన్ని పరుగులు చేసినప్పుడు, అతనికి అవకాశాలు లభిస్తాయని భావించడంలో తప్పేం ఉంది. అతను అతని దృష్టిలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్. అందుకే దేవుడు కూడా అలాగే భావించాడు. అతను చేసిన 50 పరుగులు, మ్యాచ్ రూపురేఖలను మార్చాయి," అని హర్భజన్ అయ్యర్ పై ప్రశంసలు కురిపించాడు. -
పూరీ జగన్నాథుడిని దర్శించుకున్న భారత క్రికెటర్లు! వీడియో వైరల్
కటక్ వేదికగా ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఆదివారం(ఫిబ్రవరి 9) మధ్యహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి వన్డేలో పర్యాటక ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్.. రెండో వన్డేలోనూ అదే జోరును కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే కటక్‌కు చేరుకున్న ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో నిలబడాలని ఇంగ్లండ్ భావిస్తోంది.జగన్నాథుడిని దర్శించుకున్న భారత క్రికెటర్లు..ఈ క్రమంలో భారత క్రికెటర్లు అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ పూరి జగన్నాథ స్వామిని దర్శించుకున్నారు. పోలీసులు భారీ భద్రత మధ్య భారత క్రికెటర్లను ఆలయంలోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన వీరికి అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.రోహిత్ ఫామ్‌ను అందుకుంటాడా?ఇక ఇది ఇలా ఉండగా.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పేలవ ప్రదర్శన కనబరిచిన రోహిత్.. ఇప్పుడు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో కూడా అదే తీరును కనబరిచాడు. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో హిట్‌మ్యాన్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఒకప్పుడు షార్ట్ పిచ్ బంతులను అలోవకగా సిక్సర్లగా మలిచిన రోహిత్.. ఇప్పుడు అదే బంతులకు తన వికెట్‌ను సమర్పించుకుంటున్నాడు. కనీసం రెండో వన్డేతోనైనా రోహిత్ తన ఫామ్‌లను అందుకోవాలని భావిస్తున్నారు.విరాట్ కోహ్లి ఇన్..!ఇక తొలి వన్డేకు గాయం కారంణంగా దూరమైన టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తిరిగి తన ఫిట్నెస్ను సాధించాడు. దీంతో అతడు రెండో వన్డేలో జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉండనున్నాడు. కింగ్ కోహ్లి జట్టులోకి వస్తే.. ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌పై వేటు పడే అవకాశముంది.నాగ్‌పూర్ వన్డేతో అరంగేట్రం చేసిన జైశ్వాల్ కేవలం 13 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. రెండో వన్డేలో భారత ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ డౌన్లో కోహ్లి బ్యాటింగ్‌కు రానున్నాడు.చదవండి: నాయకుడే ఇలా ఉంటే ఎలా?: రోహిత్‌పై కపిల్ దేవ్ వ్యాఖ్యలు Odisha: Indian cricket team players visited the Jagannath Temple in Puri to seek blessings pic.twitter.com/fXtNjbJSuP— IANS (@ians_india) February 8, 2025 -
BCCI: రోహిత్ సేనకు ప్రత్యేకమైన వజ్రపు ఉంగరాలు.. వీడియో చూశారా?
టీమిండియా ఆటగాళ్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) అరుదైన కానుకలు అందించింది. టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024)లో విజేతగా నిలిచిన భారత జట్టులోని సభ్యులకు వజ్రపుటుంగరాలు ప్రదానం చేసింది. ఉంగరాల పైభాగంలో అశోక్ చక్ర గుర్తుతో పాటు.. సైడ్‌లో ఆటగాళ్ల జెర్సీ నంబర్ వచ్చేలా ప్రత్యేకంగా వీటిని తీర్చిదిద్దారు.ఈసారి ప్రత్యేకమైన కానుకలుఅంతేకాదు.. ఈ మెగా టోర్నీలో ఆఖరి వరకు అజేయంగా నిలిచిన జట్టు జైత్రయాత్రకు గుర్తుగా విజయాల సంఖ్యను కూడా ఈ డిజైన్‌లో చేర్చారు. ఇటీవల నమన్ అవార్డుల వేడుక సందర్భంగా రోహిత్ సేన(Rohit Sharma&Co)కు ఈ వజ్రపు ఉంగరాలను బోర్డు ఆటగాళ్లకు అందజేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది.‘‘టీ20 ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా ఆటగాళ్లను చాంపియన్స్ రింగ్‌తో సత్కరిస్తున్నాం. వజ్రాలు శాశ్వతమే కావచ్చు. అయితే, కోట్లాది మంది హృదయాల్లో వీరు సంపాదించిన స్థానం మాత్రం ఎన్నటికీ చెక్కుచెదరదు. అలాగే ఈ ఉంగరం కూడా అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది’’ అని బీసీసీఐ పేర్కొంది.కాగా అమెరికా- వెస్టిండీస్ వేదికలుగా గతేడాది పొట్టి ప్రపంచకప్ టోర్నీ జరిగిన విషయం తెలిసిందే. లీగ్ దశలో ప్రతి మ్యాచ్ గెలిచిన రోహిత్ సేన.. సౌతాఫ్రికాతో ఫైనల్లోనూ జయభేరి మోగించింది. ఆఖరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి.. ట్రోఫీని దక్కించుకుంది.ఓవరాల్‌గా ఐదోసారితద్వారా దాదాపు పదకొండేళ్ల విరామం తర్వాత మరోసారి టీమిండియా ఖాతాలో ఐసీసీ టైటిల్ చేరింది. అదే విధంగా.. ఓవరాల్‌గా ఐదో ట్రోఫీ భారత్ కైవసమైంది. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో తొట్టతొలి ప్రపంచకప్(వన్డే) గెలిచిన టీమిండియా.. 2007లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో టీ20 ప్రపంచకప్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ ధోని నాయకత్వంలోనే 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీని భారత్ దక్కించుకుంది. ఇక గతేడాది రోహిత్ శర్మ కూడా ఈ ఐసీసీ విన్నింగ్ కెప్టెన్ల జాబితాలో చేరిపోయాడు.ఇక టీ20 ప్రపంచకప్-2024లో గెలిచిన అనంతరం బీసీసీఐ రోహిత్ సేనకు అత్యంత భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. కళ్లు చెదిరే రీతిలో ఏకంగా రూ. 125 కోట్ల క్యాష్ ప్రైజ్‌ను కానుకగా ఇచ్చింది. నాడు ఇలా ఆటగాళ్లపై కనకవర్షం కురిపించిన బోర్డు.. తాజాగా వజ్రపు ఉంగరాలతో మరోసారి ఘనంగా సత్కరించింది.టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన భారత జట్టులోని సభ్యులురోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చహల్, సంజు శాంసన్, మహ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్.చదవండి: సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్Presenting #TeamIndia with their CHAMPIONS RING to honour their flawless campaign in the #T20WorldCup 🏆Diamonds may be forever, but this win certainly is immortalised in a billion hearts. These memories will 'Ring' loud and live with us forever ✨#NamanAwards pic.twitter.com/SKK9gkq4JR— BCCI (@BCCI) February 7, 2025 -
విరాట్ కోహ్లిని అధిగమించిన స్టీవ్ స్మిత్
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (Steve Smith) సెంచరీతో కదంతొక్కాడు. టెస్ట్‌ల్లో స్టీవ్‌కు ఇది 36వ సెంచరీ. ఈ సెంచరీతో స్టీవ్ పలు రికార్డులు నెలకొల్పాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు (జో రూట్‌తో కలిసి) చేసిన ఆటగాడిగా నిలిచాడు. రూట్, స్టీవ్ ప్రస్తుతం టెస్ట్‌ల్లో తలో 36 సెంచరీలు చేశారు.టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్ ఐదో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (51) అగ్రస్థానంలో ఉండగా.. జాక్ కల్లిస్ (45), రికీ పాంటింగ్ (41), కుమార సంగక్కర (38) ఆతర్వాతి స్థానాల్లో నిలిచారు.ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్ మూడో స్థానానికి ఎగబాకాడు. స్మిత్, రోహిత్ శర్మ తలో 48 అంతర్జాతీయ శతకాలతో మూడో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో విరాట్ (81 సెంచరీలు) టాప్‌లో ఉండగా.. రూట్ (52) రెండు, కేన్ విలియమ్సన్ (46) నాలుగో స్థానంలో ఉన్నారు.విరాట్‌ను అధిగమించిన స్టీవ్విదేశాల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని (Virat Kohli) అధిగమించాడు. విరాట్ ఇప్పటివరకు విదేశాల్లో 16 సెంచరీలు చేయగా.. తాజా సెంచరీతో స్టీవ్ విదేశీ సెంచరీల సంఖ్య 17కు పెరిగింది. తాజా సెంచరీతో స్టీవ్.. అలిస్టర్ కుక్, బ్రియాన్ లారా సరసన చేరాడు. కుక్, లారా ఇద్దరూ విదేశాల్లో తలో 17 టెస్ట్ సెంచరీలు చేశారు. ఈ సెంచరీతో స్టీవ్.. విదేశీ టెస్ట్‌ల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పాడు. ఈ సెంచరీతో స్మిత్ ఆసియాలో అత్యధిక టెస్ట్ సెంచరీలు (7) చేసిన ఆస్ట్రేలియా ఆటగాడిగా అవతరించాడు. ఆసియాలో అలెన్ బోర్డర్ 6, రికీ పాంటింగ్ 5 సెంచరీలు చేశారు.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 257 పరుగులకు ఆలౌటైంది. చండీమల్ (74), కుసాల్ మెండిస్ (85 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించి శ్రీలంకుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న దిముత్ కరుణరత్నే 36 పరుగులకే ఔటయ్యాడు. రమేశ్ మెండిస్ (28), కమిందు మెండిస్ (13), పథుమ్ నిస్సంక (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కుహ్నేమన్, లయోన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ట్రవిస్ హెడ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (120), అలెక్స్ క్యారీ (139) అజేయ సెంచరీలతో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ 73 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో హెడ్ 21, ఉస్మాన్ ఖ్వాజా 36, లబూషేన్ 4 పరుగులు చేసి ఔటయ్యారు. లంక బౌలర్లలో నిషాన్ పెయిరిస్ 2, ప్రభాత్ జయసూర్య ఓ వికెట్ పడగొట్టారు. -
తుదిజట్టులో నాకసలు స్థానమే లేదు.. రోహిత్ కాల్ తర్వాత..: శ్రేయస్ అయ్యర్
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) పునరాగమనంలో అదరగొట్టాడు. దేశవాళీ క్రికెట్లో అదరగొట్టిన ఈ ముంబైకర్.. ఇంగ్లండ్(India vs England)తో తొలి వన్డేలోనూ అదే ఫామ్‌ను కొనసాగించాడు. జట్టు కష్టాల్లో ఉన్న వేళ మెరుపు అర్ధ శతకంతో రాణించి భారత్ గెలుపొందడంలో తన వంతు పాత్ర పోషించాడు.అయ్యర్ షాకింగ్ కామెంట్స్ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్‌పై ప్రశంసల వర్షం కురుస్తుండగా.. విజయానంతరం అతడొక షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు. నాగ్‌పూర్ వన్డే తుదిజట్టులో తనకు తొలుత అసలు స్థానమే లేదని చెప్పాడు. అయితే, ఆఖరి నిమిషంలో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) నుంచి ఫోన్ కాల్ వచ్చిందని.. అప్పటికప్పుడు మ్యాచ్ కోసం తనను తాను మానసికంగా సన్నద్ధం చేసుకున్నట్లు తెలిపాడు.ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇదొక సరదా ఘటన. గత రాత్రి నేను సినిమా చూస్తూ సమయం గడిపేద్దామని అనుకున్న. అయితే, అంతలోనే అకస్మాత్తుగా కెప్టెన్ నుంచి కాల్ వచ్చింది. విరాట్ మోకాలు ఉబ్బిపోయింది కాబట్టి.. నీకు ఆడే అవకాశం రావొచ్చు అని మా కెప్టెన్ చెప్పాడు.తుదిజట్టులో నాకసలు స్థానమే లేదువెంటనే నా గదికి పరిగెత్తుకుని వెళ్లాను. మరో ఆలోచన లేకుండా నిద్రకు ఉపక్రమించాను. ఆ క్షణంలో ఆ ఆనందాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో కూడా నాకు తెలియలేదు. నిజానికి తొలి వన్డేలో మొదట నాకు ఆడే అవకాశం రాలేదు.దురదృష్టవశాత్తూ విరాట్ గామపడటం వల్ల నన్ను పిలిచారు. అయితే, ఏదో ఒక సమయంలో కచ్చితంగా నాకు అవకాశం వస్తుందనే ఉద్దేశంతో నన్ను నేను సన్నద్ధం చేసుకుంటూనే ఉన్నాను. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. గతంలో ఓసారి ఆసియా కప్ సమయంలో నేను గాయపడినపుడు నా స్థానంలో వేరొకరు వచ్చి శతకం బాదారు’’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.అదే నాకు ఉపయోగపడిందిఇక దేశవాళీ క్రికెట్ ఆడటం వల్ల ప్రయోజనాలను వివరిస్తూ.. ‘‘గతేడాది డొమెస్టిక్ సీజన్‌ను నేను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నా. ఇన్నింగ్స్ ఎలా నిర్మించాలన్న అంశం గురించి నేను మరిన్ని పాఠాలు నేర్చుకునే వీలు కలిగింది. కాలానుగుణంగా నా ఆటకు మెరుగులు దిద్దుకున్నా. నైపుణ్యాలకు పదును పెట్టుకున్నాను.ప్రతి విషయంలోనూ పరిపూర్ణత సాధించేందుకు కృషి చేశా. ముఖ్యంగా ఫిట్‌నెస్‌పై కూడా మరింత దృష్టి సారించాను. అదే నాకు ఇప్పుడిలా ఉపయోగపడింది’’ అని శ్రేయస్ అయ్యర్ సంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా ముంబై తరఫున రంజీల్లో తాజా సీజన్లో అయ్యర్ ఓ ద్విశతకం బాదాడు. అంతేకాదు.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కెప్టెన్‌గా ముంబైకి టైటిల్ అందించాడు.నాలుగు వికెట్ల తేడాతో రోహిత్ సేన విజయంఇక భారత్- ఇంగ్లండ్ వన్డే విషయానికొస్తే.. నాగ్‌పూర్‌లో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బట్లర్ బృందం తొలుత బ్యాటింగ్ చేసింది. ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించినా.. భారత బౌలర్ల మెరుగైన ప్రదర్శన కారణంగా 47.4 ఓవర్లలో 248 పరుగులు చేసి ఆలౌట్ అయింది.లక్ష్య ఛేదనలో టీమిండియా పందొమ్మిది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న వేళ వన్‌డౌన్ బ్యాటర్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ శుబ్‌మన్ గిల్(96 బంతుల్లో 87), నాలుగో స్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 59), ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(47 బంతుల్లో 52) ధనాధన్ దంచికొట్టారు. ఫలితంగా 38.4 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి భారత్ టార్గెట్‌ను పూర్తి చేసింది.చదవండి: IND vs ENG: శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డుSHREYAS on F-IYER! 🔥@ShreyasIyer15 shifts gears by taking on Jofra Archer for back-to-back sixes! 💪Start watching FREE on Disney+ Hotstar#INDvENGOnJioStar 1st ODI 👉 LIVE NOW on Disney+ Hotstar, Star Sports 2, Star Sports 3, Sports 18-1 & Colors Cineplex! pic.twitter.com/HrQ3WLGuPe— Star Sports (@StarSportsIndia) February 6, 2025 -
కింగ్ వచ్చేస్తున్నాడు.. పాపం అతడు! ఒక్క మ్యాచ్‌కే వేటు
నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్(England)తో జరిగిన తొలి వన్డేలో 4 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమైన భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(Virat kohli).. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. తొలి వన్డేకు ముందు నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా కోహ్లి కూడి కాలి మోకాలికి గాయమైంది.దీంతో నాగ్‌పూర్ వన్డేకు అతడు దూరంగా ఉన్నాడు. అయితే కోహ్లి ఇప్పుడు గాయం నుంచి కోలుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టినట్లు సమాచారం. దీంతో ఫిబ్రవరి 8న కటక్ వేదికగా జరగనున్న రెండో వన్డేకు అందుబాటులో ఉండనున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. "బుధవారం ప్రాక్టీస్ సందర్భంగా విరాట్ కోహ్లి కుడి కాలి మోకాలికి బంతి తాకింది. అయినప్పటికి అతడు తన ప్రాక్టీస్‌ను కొనసాగించాడు. ప్రాక్టీస్ సమయంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తలేదు. కానీ శిక్షణ తర్వాత హూటల్‌కు వెళ్లాక అతడి మోకాలిలో వాపు కన్పించింది. దీంతో ముందు జాగ్రత్తగా అతడికి విశ్రాంతిని ఇచ్చాము. విరాట్ ప్రస్తుతం బాగానే ఉన్నాడు. అతడు కటక్ వన్డేలో ఆడే అవకాశం ఉందని" బీసీసీఐ అధికారి ఒకరు టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నారు.అదేవిధంగా కోహ్లి గాయంపై టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సైతం అప్డేట్ ఇచ్చాడు. "విరాట్ భాయ్ గాయంపై ఎటువంటి ఆందోళన అవసరం లేదు. మా తర్వాతి గేమ్‌కు అతడు కచ్చితంగా అందుబాటులో ఉంటాడని" తొలి వన్డే అనంతరం గిల్ పేర్కొన్నాడు.జైశ్వాల్‌పై వేటు..ఇక విరాట్ కోహ్లి రెండో వన్డేకు అందుబాటులోకి వస్తే యువ ఆటగాడు యశస్వి జైశ్వాల్‌పై వేటు పడే అవకాశముంది. నాగ్‌పూర్ వన్డేతో అరంగేట్రం చేసిన జైశూ.. కేవలం 13 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో అతడిని పక్కన పెట్టి శుబ్‌మన్ గిల్‌ను యథావిధిగా ఓపెనర్‌గా పంపాలని టీమ్ మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వరుసగా మూడు, నాలుగు స్ధానాల్లో విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌కు వచ్చే ఛాన్స్ ఉంది.సచిన్ రికార్డుకు చేరువలో కోహ్లి..ఇక ఈ మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లికి ఓ ప్రపంచరికార్డు ఊరిస్తోంది. కటక్ వన్డేలో కోహ్లి మరో 96 రన్స్ చేస్తే.. అత్యంతవేగంగా వన్డేల్లో 14,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా విరాట్ రికార్డులకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ తన 350వ వన్డే ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్‌పై ఈ ఫీట్‌ను అందుకున్నాడు. కోహ్లి విషయానికి వస్తే.. 283 వన్డే ఇన్నింగ్స్‌లలో 58.18 సగటుతో 13906 పరుగులు చేశాడు.చదవండి: IND vs ENG: శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు.. -
ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. భారత్‌కు భారీ షాక్
నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్(England)తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(Virat kohli) మెకాలి గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్లో కోహ్లికి గాయమైనట్లు టాస్ సందర్భంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.నిజంగా భారత్‌కు ఇది గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఛాంపియన్స్ ట్రోఫీ సన్నహాకాల్లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్‌తో కోహ్లి తన ఫామ్‌ను అందుకుంటాడని అంతా భావించారు. కానీ గాయం కారణంగా విరాట్‌కే బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.అతడి స్దానంలో యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ వన్డేల్లో భారత తరపున అరంగేట్రం చేశాడు. జైశ్వాల్‌తో పాటు యువ పేసర్ హర్షిత్ రాణా వన్డేల్లోకి అడుగుపెట్టాడు. మహ్మద్ షమీతో పాటు కొత్త బంతిని రాణా పంచుకోనున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.సచిన్ రికార్డుపై కన్ను..కాగా విరాట్ కోహ్లి.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ వరల్డ్ రికార్డుకు చేరువలో ఉన్నాడు. కోహ్లి మరో 96 రన్స్ చేస్తే.. అత్యంతవేగంగా వన్డేల్లో 14,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా విరాట్ రికార్డులకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ తన 350వ వన్డే ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్‌పై ఈ ఫీట్‌ను అందుకున్నాడు. కోహ్లి విషయానికి వస్తే.. 283 వన్డే ఇన్నింగ్స్‌లలో 58.18 సగటుతో 13906 పరుగులు చేశాడు. ఒకవేళ నాగ్‌పూర్ వన్డేలో కోహ్లి ఆడి ఉంటే సచిన్ రికార్డు బద్దులయ్యే అవకాశముండేంది.తుది జట్లు..ఇండియా (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్(వికెట్‌కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్(వికెట్‌కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్చదవండి: Ind vs Eng 1st ODI: కోహ్లి దూరం.. జైస్వాల్‌తో పాటు అతడి అరంగేట్రం -
Ind vs Eng 1st ODI: కోహ్లి దూరం.. జైస్వాల్‌తో పాటు అతడి అరంగేట్రం
టీమిండియాతో తొలి వన్డేలో ఇంగ్లండ్(India vs England) టాస్ గెలిచి.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య నాగ్‌పూర్‌లో గురువారం మ్యాచ్ మొదలైంది. అయితే, దురదృష్టవశాత్తూ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.జైస్వాల్‌తో పాటు అతడి అరంగేట్రంటాస్ సందర్భంగా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఈ విషయాన్ని వెల్లడించాడు. అదే విధంగా.. ఇంగ్లండ్‌తో తొలి వన్డేతో స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, యువ పేసర్ హర్షిత్ రాణా యాభై ఓవర్ల ఫార్మాట్లో టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తున్నట్లు వెల్లడించాడు.‘‘టాస్ ఓడినా మరేం పర్లేదు. మేము తొలుత బౌలింగ్ చేయాలనే భావించాం. బంతితో, బ్యాట్‌తో దూకుడుగానే రాణించాలని కోరుకుంటున్నాం. ఇదొక సరికొత్త ఆరంభం. చాంపియన్స్ ట్రోఫీకి ముందుకు మాకు వచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాం.జైస్వాల్, హర్షిత్ రాణా వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నారు. దురదృష్టవశాత్తూ మోకాలి సమస్య వల్ల కోహ్లి ఆడలేకపోతున్నాడు’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా టీమిండియా తరఫున టెస్టుల్లో ఓపెనర్‌గా పాతుకుపోయిన యశస్వి జైస్వాల్.. ఇప్పటికే టీ20లలోనూ అరంగేట్రం చేశాడు. ఈ రెండు ఫార్మాట్లలోనూ తనను తాను నిరూపించుకున్న జైసూ.. తాజాగా వన్డేల్లోనూ అడుగుపెట్టాడు. మరోవైపు.. హర్షిత్ రాణా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అనంతరం ఇటీవల ఇంగ్లండ్‌తో నాలుగో టీ20 సందర్భంగా.. శివం దూబేకు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి పొట్టి ఫార్మాట్లో ఎంట్రీ ఇచ్చాడు. జో రూట్‌కు స్వాగతంమరోవైపు.. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలవడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. సరికొత్త ఉత్సాహంతో వన్డే బరిలో దిగుతున్నామని.. జో రూట్‌కు తిరిగి జట్టులోకి స్వాగతం పలికాడు. ఇక తాము ప్రస్తుతం పటిష్ట జట్టుతో తలపడుతున్నామన్న బట్లర్.. హెడ్‌కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ప్రతి విషయంలోనూ తమను జాగ్రత్తగా చూసుకుంటున్నాడని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో తాము ముగ్గురు పేసర్లతో పాటు ఒక అదనపు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను కూడా ఆడిస్తున్నట్లు తెలిపాడు. కాగా ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు ఆడే నిమిత్తం ఇంగ్లండ్ భారత్ పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య తొలుత టీ20 సిరీస్ జరుగగా.. సూర్యకుమార్ సేన 4-1తో జయభేరి మోగించింది. అనంతరం గురువారం నుంచి ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్‌కు తెరలేచింది.భారత తుదిజట్టురోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ.భారత్‌తో తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టుబెన్ డకెట్, ఫిల్ సాల్ట్(వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్ స్టోన్, జాకొబ్ బెతెల్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సకీబ్ మహమూద్.చదవండి: హార్దిక్ పాండ్యా లేకపోతే ఏంటి?.. అతడు లేకుండానే వరల్డ్‌కప్ ఆడాం: రోహిత్ శర్మ -
ఇంగ్లండ్‌తో వన్డేలు: రోహిత్, కోహ్లి ఫామ్‌లోకి వస్తారా?
నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్(India vs England)తో గురువారం ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత్ సంసిద్ధమవుతోంది. త్వరలో ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్(ICC Champions Trophy) జరగనున్న నేపథ్యంలో ఇరుజట్లకు ఇది కీలకంగా మారింది. అయితే టీమిండియా అభిమానుల దృష్టి మాత్రం సీనియర్ బ్యాటర్లు కెప్టెన్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీల పైనే ఉంది. మామూలుగా అయితే వారిద్దరి ఎంపిక ఎప్పుడూ చర్చనీయాంశం కాదు. కానీ ప్రస్తుతం వారిద్దరూ పేలవమైన ఫామ్ తో వరుసగా విఫలమవుతూదండటంతో అందరి దృష్టి వారిపైనే ఉంది.సీనియారిటీ పరంగా వారిద్దరూ జట్టులో చాల కీలకం కావడం కూడా ఇందుకు ప్రధాన కారణం. వారిద్దరూ ఆడటం ప్రారంభిస్తే జట్టులో ఉత్తేజం మామూలు స్థాయిలో ఉండదు. ఇక అందరికీ కోహ్లీ సంగతి తెలిసిందే. అతడు ఫీల్డ్ లో మెరుపు తీగలా కలయ తిరుగుతూ జట్టు సభ్యులని ఉత్తేజపరుస్తాడు. రోహిత్ శర్మ జట్టు సారథి. జట్టుని ముందుండి నడిపించాల్సిన ఆటగాడు వరుసగా విఫలమవుతూ ఉంటే అది తప్పనిసరిగా అతని నాయకత్వ తీరు పై ప్రభావం చూపిస్త ఉందనడంలో సందేహం లేదు.పైగా వారిద్దరి వయస్సు కూడా ముప్పై అయిదు సంవత్సరాలు దాటడంతో ఈ ఇద్దరి పై ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం వారిద్దరూ మళ్ళీ ఫామ్ లోకి వస్తే తప్ప విమర్శలకి చెక్ పెట్టడం సాధ్యం కాదు. వరుసగా విఫలమవుతూ ఒత్తిడిలో ఉన్న వారిద్దరూ రిటైర్మెంట్ గురుంచి ఆలోచిస్తున్నారని వాదనలు కూడా వినిపిస్తున్నాయి.కోహ్లిని వెంబడిస్తున్న బలహీనతఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పర్యటన లో ఘోరంగా విఫలమైన రోహిత్, కోహ్లీ దేశవాళీ రంజీ ట్రోఫీ లో రాణిస్తారని అందరూ ఆశించారు. కానీ అక్కడ కూడా వారి ఆటతీరు ఆశించిన స్థాయిలో లేదు. రోహిత్, కోహ్లీ ఆగస్టులో శ్రీలంక పర్యటనలో చివరిసారిగా వన్డే క్రికెట్లో ఆడారు. ఆ సిరీస్‌లో రోహిత్ 141.44 స్ట్రైక్ రేట్‌తో మూడు ఇన్నింగ్స్‌లలో 157 పరుగులు చేశాడు.అయితే కోహ్లీ మాత్రం మూడు మ్యాచ్‌లలో కేవలం 58 పరుగులు మాత్రమే సాధించాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీకి దీర్ఘకాలంగా ఉన్న బలహీనత మళ్లీ బయటపడింది. అతను ఆఫ్-స్టంప్ దిశగా వచ్చే బంతుల్ని ఛేజ్ చేస్తూ ఏకంగా ఎనిమిది సార్లు అవుట్ అయ్యాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్ నుంచి వైదొలగడానికి ముందు ఐదు ఇన్నింగ్స్‌లలో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు.బ్యాటింగ్ దిగ్గజాలని గౌరవించండిఇంగ్లాండ్ లెజెండ్ కెవిన్ పీటర్సన్ మాత్రం విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మల కు మద్దతుగా నిలిచాడు. ఇటీవల కాలంలో కోహ్లీ, రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ తో ఇబ్బంది పడటం వాస్తవమే అయినా వారిద్దరూ రిటైర్మెంట్ కావాలని కోరడం అన్యాయమని చెప్పాడు. ప్రతి ఆటగాడు తమ కెరీర్లో కఠినమైన దశలను ఎదుర్కొంటాడనీ.. విరాట్, రోహిత్ లు 'రోబోలు కాదని భారత్ అభిమానులు గుర్తించాలని పీటర్సన్ పేర్కొన్నాడు."నా కెరీర్లో కూడా ఇలాంటి సవాళ్ళే ఎదురయ్యాయి. రోహిత్, విరాట్ రోబోలు కాదు. వారు బ్యాటింగ్ చేసిన ప్రతిసారీ సెంచరీ చేయడం సాధ్యం కాదు. ఆస్ట్రేలియా పర్యటనలో వారిద్దరూ విఫలమై ఉండవచ్చు. అంత మాత్రం వారిద్దరూ ఇంక అంతర్జాతీయ క్రికెట్ కి పనికిరారని ముద్ర వేయడం సరికాదు’’ అని పీటర్సన్ అన్నాడు. వారిద్దరి రికార్డులని దృష్టిలో ఉంచుకొని వారి పట్ల సానుభూతి చూపాలని పీటర్సన్ భారత్ అభిమానులకి పిలుపునిచ్చాడు.సచిన్ రికార్డుపై కోహ్లీ కన్నుభారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డేల్లో సాధించిన రికార్డుకు విరాట్ కోహ్లీ అతి చేరువలో ఉన్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 14 వేల పరుగుల మైలురాయి ని సాధించిన బ్యాటర్‌గా సచిన్ సాధించిన రికార్డ్ కి కోహ్లీ కేవలం 94 పరుగుల దూరంలో ఉన్నాడు. సచిన్ఈ మైలురాయి ని చేరాడనికి 350 ఇన్నింగ్స్ లు తీసుకోగా కోహ్లీ ప్రస్తుతం 283 వన్డే మ్యాచ్ లలో 58.18 సగటుతో 13,906 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ తో జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్ లో కోహ్లీ మరో 94 పరుగులు సాధించి ఈ రికార్డ్ ని అధిగమిస్తాడని భారత్ అభిమానులు ఆశిస్తున్నారు.చదవండి: Ind vs Eng: తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. వెటరన్ ప్లేయర్ రీఎంట్రీ -
BCCI: రోహిత్ శర్మకు డెడ్‌లైన్?.. కోహ్లికి మాత్రం గ్రీన్‌సిగ్నల్?!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికే సమయం సమీపిస్తోందా?.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత అతడు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. కాగా టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024)లో భారత్‌ను చాంపియన్‌గా హిట్‌మ్యాన్ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్న రోహిత్ శర్మ మునుపటిలా దూకుడు ప్రదర్శించలేకపోతున్నాడు. గతేడాది శ్రీలంకతో వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లలో అతడు చేసిన పరుగులు 58, 64, 35. వైట్‌బాల్ క్రికెట్లో ఈ మేర ఫర్వాలేదనిపించినా.. టెస్టు ఫార్మాట్లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచాడు.కెప్టెన్‌గానూ చెత్త రికార్డుతొలుత సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో తేలిపోయిన రోహిత్ శర్మ.. కెప్టెన్‌గానూ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. అతడి సారథ్యంలో భారత్ కివీస్ చేతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. తద్వారా స్వదేశంలో ప్రత్యర్థి చేతిలో ఇంతటి పరాభవం చవిచూసిన తొలి భారత కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు.అనంతరం ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లోనూ రోహిత్ శర్మ వైఫల్యం కొనసాగింది. వ్యక్తిగత కారణాల వల్ల తొలి టెస్టుకు దూరమైన అతడు.. ఫామ్‌లేమి కారణంగా ఆఖరిదైన సిడ్నీ టెస్టు నుంచి స్వయంగా తప్పుకొన్నాడు. ఇక ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 3-1తో ఓడిపోయింది.రోహిత్ శర్మకు డెడ్లైన్ఈ క్రమంలో 37 ఏళ్ల రోహిత్ శర్మ రిటైర్మెంట్పై పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. అయితే, ఇప్పట్లో తాను రిటైర్ కాబోనని ఈ కుడిచేతి వాటం బ్యాటర్ స్పష్టం చేశాడు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) రోహిత్ శర్మకు డెడ్‌లైన్ విధించినట్లు తెలుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతడి అంతర్జాతీయ కెరీర్‌పై నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచించినట్లు సమాచారం.రోహిత్ శర్మ వయసుతో పాటు.. 2027 వన్డే వరల్డ్‌కప్ నాటికి జట్టును సన్నద్ధం చేసే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మేర అతడితో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్‌తో వన్డేలు, చాంపియన్స్ ట్రోఫీకి జట్టును ఎంపిక చేసిన సమయంలో సెలక్టర్లు, బోర్డు పెద్దలు రోహిత్ శర్మతో సుదీర్ఘ చర్చలు జరిపారు.చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత భవిష్యత్ గురించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచించారు. రానున్న వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ సీజన్‌కు.. అదే విధంగా వన్డే ప్రపంచకప్ టోర్నీకి జట్టును సిద్ధం చేసే విషయంలో యాజమాన్యానికి కొన్ని స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయి.కోహ్లికి మాత్రం గ్రీన్‌సిగ్నల్?!కాబట్టి ఇప్పటి నుంచే జట్టు పరివర్తనపై దృష్టి పెట్టింది. అన్నీ సజావుగా సాగేలా జాగ్రత్తలు తీసుకుంటోంది’’ అని పేర్కొన్నాయి. అయితే, మరో దిగ్గజ బ్యాటర్, 36 ఏళ్ల విరాట్ కోహ్లి విషయంలో మాత్రం బీసీసీఐ మరికొన్నాళ్ల పాటు వేచిచూడాలనే ధోరణితో ఉన్నట్లు తెలుస్తోంది. అతడికి మరిన్ని అవకాశాలు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు బోర్డు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.ఇక రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి ప్రస్తుతం ఇంగ్లండ్‌తో వన్డేతో సిరీస్‌తో బిజీగా ఉన్నారు. ఇరుజట్ల మధ్య నాగ్‌పూర్‌లో గురువారం తొలి వన్డేతో మూడు మ్యాచ్‌ల సిరీస్ మొదలుకానుంది. అంతకుముందు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను 4-1తో గెలుచుకుంది. చదవండి: చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు -
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. రోహిత్ శర్మను ఊరిస్తున్న భారీ రికార్డు
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా కెప్టెన్ (Team India Captain) రోహిత్ శర్మను (Rohit Sharma) ఓ భారీ రికార్డు ఊరిస్తుంది. ఈ సిరీస్‌లో హిట్‌మ్యాన్ మరో 134 పరుగులు చేస్తే, విరాట్ కోహ్లి (Virat Kohli) తర్వాత వన్డేల్లో అత్యంత వేగంగా 11,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. ఈ రికార్డు సాధించేందుకు రోహిత్‌కు మరో 19 ఇన్నింగ్స్‌ల సమయం ఉంది.ప్రస్తుతం రోహిత్ 257 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 31 సెంచరీలు, 57 అర్ద సెంచరీల సాయంతో 10866 పరుగులు చేశాడు. విరాట్ వన్డేల్లో 11,000 పరుగులను 222 ఇన్నింగ్స్‌ల్లోనే పూర్తి చేశాడు. వన్డేల్లో వేగంగా 11,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ తర్వాతి స్థానంలో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ 276 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అధిగమించాడు. రోహిత్ మరో 19 ఇన్నింగ్స్‌ల్లో 134 పరుగులు చేస్తే సచిన్‌ను వెనక్కు నెట్టి విరాట్ తర్వాతి స్థానాన్ని ఆక్రమిస్తాడు.కాగా, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌తో రోహిత్ శర్మ ఈ ఏడాది తొలిసారి టీమిండియా తరఫున బరిలోకి దిగనున్నాడు. జనవరి ప్రారంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ బరిలోకి దిగలేదు. ఫామ్‌లేమి కారణంగా రోహిత్ వాలంటీర్‌గా ఆ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. అనంతరం ఈ ఏడాది భారత్ ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఆడింది. గతేడాది టీ20 వరల్డ్‌కప్ అనంతరం రోహిత్ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ సిరీస్‌లో ఆడలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 6న ఇంగ్లండ్‌తో జరుగబోయే తొలి వన్డే రోహిత్‌కు ఈ ఏడాది భారత్ తరఫున తొలి మ్యాచ్ అవుతుంది.రంజీల్లోనూ నిరాశేఇంగ్లండ్తో టీ20 సిరీస్ జరిగే సమయంలో రోహిత్ రంజీ బరిలోకి దిగాడు. ఖాళీగా ఉన్న సమయంలో టీమిండియా క్రికెటర్లంతా రంజీల్లో ఆడాలని బీసీసీఐ అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘ విరామం అనంతరం రంజీ మ్యాచ్ ఆడిన రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. గతేడాది నుంచి పెద్దగా ఫామ్‌లో లేని రోహిత్ రంజీ మ్యాచ్‌తో అయినా తిరిగి టచ్‌లోకి రావాలని భావించాడు. కానీ రోహిత్‌కు అక్కడ కూడా నిరాశే ఎదురైంది.ఫిబ్రవరి 6 నుంచి మొదలుఇంగ్లండ్తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఫిబ్రవరి 6 నుంచి మొదలవుతుంది. తొలి మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా జరుగనుంది. అనంతరం ఫిబ్రవరి 9, 12 తేదీల్లో రెండు, మూడు వన్డేలు జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌లను కటక్, అహ్మదాబాద్ వేదిక కానుంది. ఈ మూడు మ్యాచ్‌లు మధ్యాహ్నం 1:30 గంటల నుంచి ప్రారంభమవుతాయి.చిత్తుగా ఓడిన ఇంగ్లండ్వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. తాజాగా ముగిసిన చివరి టీ20లో భారత్ 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. అనంతరం బౌలర్లు తలో చేయి వేసి భారత్‌కు ఘన విజయాన్ని అందించారు. -
ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. సచిన్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన కోహ్లి
స్వదేశంలో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించిన టీమిండియా.. ఇప్పుడు అదే జట్టుతో వన్డేల్లో తలపడేందుకు సిద్దమైంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సన్నహాకాల్లో భాగంగా భారత జట్టు ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే నాగ్‌పూర్ వేదికగా గురువారం(ఫిబ్రవరి 6) జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే నాగ్‌పూర్‌కు చేరుకున్న ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ వన్డే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులోకి తిరిగొచ్చారు. మరోవైపు ఇంగ్లండ్ జట్టులోకి సీనియర్ ఆటగాడు జో రూట్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లికి ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.సచిన్ రికార్డుపై కన్నేసిన కోహ్లి..నాగ్‌పూర్ వన్డేలో కోహ్లి మరో 96 రన్స్ చేస్తే.. అత్యంతవేగంగా వన్డేల్లో 14,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా విరాట్ రికార్డులకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ తన 350వ వన్డే ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్‌పై ఈ ఫీట్‌ను అందుకున్నాడు. కోహ్లి విషయానికి వస్తే.. 283 వన్డే ఇన్నింగ్స్‌లలో 58.18 సగటుతో 13906 పరుగులు చేశాడు. సచిన్ తర్వాతి స్ధానంలో శ్రీలంక లెజెండ్ కుమార్ సంగక్కర ఉన్నాడు. సంగ్కర 378 ఇన్నింగ్స్‌లలో 14,000 పరుగుల మైలు రాయిని సాధించాడు. ఈ క్రమంలో తొలి వన్డేల్లో వీరిద్దరి దిగ్గజాలను కోహ్లి అధిగమించే అవకాశముంది. కాగా వన్డే ప్రపంచకప్-2023 తర్వాత కోహ్లి కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడాడు. ఆ మూడు మ్యాచ్‌ల్లో 19.33 సగటుతో 58 (24, 14 మరియు 20)పరుగులు చేశాడు. అయితే కోహ్లి ప్రస్తుతం చెప్పుకొదగ్గ ఫామ్‌లో అయితే లేడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో తీవ్ర నిరాశపరిచిన కోహ్లి.. 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ బరిలోకి కూడా దిగాడు. అక్కడ కూడా కింగ్ కోహ్లి నిరాశపరిచాడు. కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో కనీసం ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌తోనైనా కోహ్లి తన ఫామ్‌ను అందుకోవాలని అతడి అభిమానులు ఆశిస్తున్నారు.జట్లుభారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజాఇంగ్లండ్: హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జోరూట్, జాకోబ్ బెతెల్, లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్స్, జేమీ ఓవర్టన్, జోస్ బట్లర్, జేమీ స్మిత్, ఫిలిప్ సాల్ట్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, సకీబ్ మహ్మూద్, మార్క్ వుడ్.చదవండి: సూర్యకుమార్.. అందుకు సమయం అసన్నమైంది: అశ్విన్ -
టీ20లు సరే.. గంభీర్‌కు అసలు పరీక్ష ఇప్పుడే!
ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన గవాస్కర్-బోర్డర్ సిరీస్ అయిదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఘోరంగా పరాజయం చవిచూసిన భారత్ జట్టు తిరిగి గాడిలో పడటం శుభపరిణామం. ఇంగ్లండ్ వంటి ప్రధాన జట్టు పై 4-1 తేడాతో టీ20 సిరీస్ ను చేజిక్కించుకోవడం సానుకూలాంశం. కొత్త సంవత్సరంలో అదీ ఇంగ్లండ్‌పై పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని ప్రదర్శించడం రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌కి ముందు జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందనడంలో సందేహం లేదు.అయితే ఈ సిరీస్‌కు ముందు భారత్ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదన్నది వాస్తవం. సొంత గడ్డపై 27 సంవత్సరాల తర్వాత శ్రీలంకతో జరిగిన ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను కోల్పోవడం భారత్ క్రికెట్ చరిత్రలో తొలిసారి. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్‌లో భారత్ జట్టు 12 సంవత్సరాల తర్వాత ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటన లో జరిగిన గవాస్కర్-బోర్డర్ సిరీస్ అయిదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ భారత్ జట్టు 3-1 తేడాతో ఓటమి పాలయింది. ఈ సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీల ఘోర వైఫల్యంతో వారిద్దరూ రిటైర్మెంట్ ప్రకటించనున్నారని, భారత్ జట్టు క్యాంప్ లో విభేదాలు తలెత్తాయని , కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్ ఒకే పేజీలో లేరని విమర్శలు కూడా వచ్చాయి.టీ20ల్లో అద్భుతమైన ఫామ్ఇదిలా ఉంటే.. గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీ20 ఫార్మాట్ లో భారత్ అద్భుతమైన ఫామ్‌ను కనబరుస్తోంది. 2024 ప్రారంభం నుంచి భారత్ జట్టు 29 మ్యాచ్‌లలో కేవలం మూడు మ్యాచ్‌లలో మాత్రమే ఓటమి చవిచూసింది. ఏదేమైనా.. గంభీర్ తన శైలిని మార్చుకోవడానికి ఇష్టపడడు. ఈ సిరీస్ అనంతరం మాట్లాడుతూ భారత్ జట్టుకి ఓడిపోతామనే భయం లేదు. మేము అధిక-రిస్క్, అధిక-రివార్డ్ క్రికెట్ ఆడతాం. ప్రతీసారి 250 పరుగులు చేయడం సాధ్యం కాదు. కొన్నిసార్లు 130 పరుగులకే ఔట్ అయ్యే ప్రమాదం ఉంది. కానీ దానికి మేము సిద్ధంగా ఉన్నాము" అని వ్యాఖ్యానించాడు.రోహిత్, కోహ్లీతో అభిప్రాయభేదాలు? అయితే భారత్ టి20 ఫార్మాట్ రికార్డును అటుంచితే , వన్డే , టెస్ట్ ఫార్మాట్లలో భారత్ ప్రదర్శన ఆశించినంత స్థాయిలో లేదు. ఇక గురువారం నుంచి ఇంగ్లండ్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. త్వరలో జరుగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్ భారత్ కి ఎంతో కీలకం. ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ కు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్ళీ జట్టులోకి రానున్నారు.వన్డే క్రికెట్లో వారిద్దరికీ అపారమైన నైపుణ్యం ఉందని, గంభీర్ అన్నాడు. వారిద్దరితో ఆస్ట్రేలియా పర్యటన లో అభిప్రాయభేదాలు తలెత్తయన్న పుకార్లకు చెక్ పెడుతూ, "వారిద్దరు ఎంతో అనుభవం ఉన్నవారు. పరిస్థితులు సరిగా లేనప్పుడు డ్రెస్సింగ్ రూమ్ గురించి చాలా విషయాలు మాట్లాడుకుంటారు. కానీ ఫలితాలు మీకు అనుకూలంగా రావడం ప్రారంభించిన తర్వాత, విషయాలు సరిగ్గా జరగడం ప్రారంభిస్తాయి" అని గంభీర్ ఆ పుకార్లను కొట్టి పారేసాడు.అభిషేక్‌పై ప్రశంసలు కోచ్ గంభీర్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సాధించిన సెంచరీ పై ప్రశంసలు కురిపించాడు."నేను ఇలాంటి టి20 సెంచరీని ఇంతవరకు చూడలేదు. జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ వంటి హేమాహేమీలైన బౌలర్లు ఎదుర్కొని అలా అలవోకగా షాట్ లు కొట్టడం సామాన్య విషయం కాదు. ఐపీఎల్ లో మీరు చాలా సెంచరీలు చూసి ఉండవచ్చు. కానీ ఇంగ్లండ్ వంటి జట్టు పై ఆ స్థాయి లో షాట్లు కొట్టి అభిషేక్ సెంచరీ సాధించాడు. అందుకే నేను చూసిన వాటిలో ఇది అత్యుత్తమైన టీ20 సెంచరీగా భావిస్తున్నాను" అని గంభీర్ వ్యాఖ్యానించాడు. -
వాళ్లిద్దరు మరో రెండేళ్లు టీమిండియాకు ఆడతారు: కెవిన్ పీటర్సన్
టీమిండియా దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma)లకు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్(Kevin Pietersen) మద్దతు పలికాడు. వీరిద్దరు మరో రెండేళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతారని అంచనా వేశాడు. ఇప్పటికే తామేంటో ‘విరాహిత్’ ద్వయం నిరూపించుకున్నారని.. కొత్తగా వాళ్లు చేయాల్సిందేమీ లేదని పేర్కొన్నాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. వన్డేలు, టెస్టుల్లో కొనసాగుతున్న ఈ ఇద్దరు గత కొన్నినెలలుగా రోహిత్-విరాట్ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా రెడ్‌బాల్ క్రికెట్లో రోహిత్, కోహ్లి విఫలమవుతున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరు ఇక ఆటకు సెలవిచ్చి యువ క్రికెటర్లకు మార్గం సుగమం చేయాలనే డిమాండ్లూ వినిపించాయి. ఇక టీ20 రిటైర్మెంట్ తర్వాత వీరిద్దరు శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో మాత్రమే పాల్గొన్నారు. తాజాగా మరోసారి ఇంగ్లండ్‌తో వన్డేలకు సిద్ధమయ్యారు.సొంతగడ్డపై జరగుతున్న ఈ సిరీస్ అనంతరం.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీతో కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారథి విరాట్ కోహ్లి బిజీ అవుతారు. ఈ మ్యాచ్‌లలో వీరి ఆట తీరు ఆధారంగానే భవిష్యత్తు ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కెవిన్ పీటర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.మరో రెండేళ్లు టీమిండియాకు ఆడతారు‘‘ఎవరి ముందు వీరు ఇంకా నిరూపించుకోవాల్సిందేమీ ఏమీలేదు. ఇద్దరూ దిగ్గజాలే. అద్భుతమైన బ్యాటింగ్‌తో ఎన్నో ఏళ్లుగా క్రికెట్ ప్రేమికులను అలరిస్తున్నారు. వారి వయసు 36- 37. అయినా సరే.. మరో రెండేళ్ల పాటు టీమిండియా తరఫున కొనసాగ గల సత్తా వారికి ఉంది.ఇక కోహ్లి విషయానికొస్తే.. భారత్ తరఫున అత్యుత్తమ చేజింగ్ కింగ్ అతడే. అంతేకాదు.. ప్రపంచంలో అతడి లాంటి ఆటగాడు మరొకరు లేరు. చేజింగ్‌లో దేశానికి ఇన్ని విజయాలు సాధించి పెట్టినవారూ లేరు. అతడు ఫామ్‌లోకి వచ్చాడంటే.. ఎవరూ ఆపలేరు.కోహ్లి- రోహిత్ ఆటను చూస్తే ముచ్చటేస్తుంది. రోహిత్ ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ఆ తర్వాత అతడు ఎదిగిన తీరు అమోఘం’’ అని పీటర్సన్ కొనియాడాడు. కాగా ఫిబ్రవరి 6 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య నాగ్‌పూర్ వేదికగా వన్డే సిరీస్ మొదలుకానుంది. కటక్ వేదికగా ఫిబ్రవరి 9న రెండో వన్డే, అహ్మదాబాద్‌లో ఫిబ్రవరి 12న మూడో వన్డే జరుగుతుంది. ఇంగ్లండ్‌తో మూడు వన్డేలకు టీమిండియారోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా.భారత్‌తో వన్డేలకు ఇంగ్లండ్ జట్టుజోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుండగా.. ఫిబ్రవరి 20న రోహిత్ సేన తమ తొలి మ్యాచ్ ఆడనుంది. తటస్థ వేదికైన దుబాయ్‌లో టీమిండియా తమ మ్యాచ్‌లు ఆడుతుంది. ఇక దాయాది పాకిస్తాన్‌తో ఫిబ్రవరి 23న మ్యాచ్ ఆడనున్న భారత్.. లీగ్ దశలో ఆఖరిగా మార్చి రెండున న్యూజిలాండ్‌తో తలపడుతుంది. -
'వావ్ వాట్ ఎ బాల్'.. తనను ఔట్ చేసిన బౌలర్‌పై కోహ్లి ప్రశంసలు
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(Virat Kohli) 12 ఏళ్ల తర్వాత రంజీ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ తరపున కోహ్లి ఆడాడు. అతడిని చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో అరుణ్ జైట్లీ స్టేడియంకు తరలివచ్చారు.కానీ కింగ్ కోహ్లి మాత్రం అభిమానులను తీవ్ర నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. రైల్వేస్ బౌలర్ హిమాన్షు సాంగ్వాన్ అద్బుతమైన బంతితో కోహ్లిని క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. కోహ్లి ఔటయ్యాక స్టేడియం నుంచి అభిమానులు వెళ్లిపోయారు.సాంగ్వాన్‌ను మెచ్చుకున్న కోహ్లి..కాగా మ్యాచ్ ముగిసిన తర్వాత హిమాన్షును కింగ్ కోహ్లి ప్రశంసించినట్లు తెలుస్తోంది. దైనిక్ జాగరణ్ రిపోర్ట్ ప్రకారం.. సాంగ్వాన్ తాను వికెట్ తీసిన బంతిపై సంతకం చేయమని కోహ్లి వద్దకు వెళ్లి అడిగాడంట. అందుకు కోహ్లి.. వాట్ ఎ బాల్.. అద్బుతమైన డెలివరీ సంధించావు అని కొనియాడినట్లు సదరు పత్రిక తమ కథనంలో పేర్కొంది.గ్రౌండ్లోకి దూసుకొచ్చిన ఫ్యాన్స్..మ్యాచ్‌లో భాగంగా మూడో రోజు రక్షణ వలయాన్ని ఛేదించుకొని విరాట్ కోసం ముగ్గురు అభిమానులు మైదానంలోకి పరుగులు తీయడంతో కాస్త గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ మ్యాచ్ తొలి రోజు గ్రౌండ్లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి వద్దకు వచ్చిన అభిమాని అతడి కాళ్లు మొక్కగా... శనివారం ముగ్గురు అభిమానులు సెక్యూరిటీని దాటి మైదానంలోకి దూసుకొచ్చారు. దీంతో భద్రతా సిబ్బంది వారిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ‘గతంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ చూడలేదు. కోహ్లి భయ్యా క్రేజ్‌కు ఇది నిదర్శనం. మైదానంలో దూసుకొచి్చన వాళ్లను కొట్టకండి అని కోహ్లి సెక్యూరిటీ సిబ్బందితో చెప్పాడు’ అని ఢిల్లీ స్పిన్నర్ శివమ్ శర్మ తెలిపాడు. మ్యాచ్ అనంతరం సహచర ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్‌తో కోహ్లి ఫొటోలు దిగాడు.ఢిల్లీ ఘన విజయం..ఇక విరాట్ కోహ్లికి తన సహచరులు గెలుపు కానుక ఇచ్చారు. కోహ్లికి రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే అవకాశమే రాకుండానే ఢిల్లీ జట్టు ఘనవిజయం సాధించింది. ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా మూడు రోజుల్లో ముగిసిన పోరులో ఢిల్లీ జట్టు ఇన్నింగ్స్ 19 పరుగుల తేడాతో రైల్వేస్ జట్టును ఓడించింది. ఓవర్‌నైట్ స్కోరు 334/7తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఢిల్లీ జట్టు... చివరకు 106.4 ఓవర్లలో 374 పరుగులకు ఆలౌటైంది. సుమిత్ మాథుర్ (206 బంతుల్లో 86; 8 ఫోర్లు) మెరుగైన ప్రదర్శన చేశాడు. రైల్వేస్ బౌలర్లలో హిమాన్షు సాంగ్వాన్ 4, కునాల్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన రైల్వేస్ జట్టు 30.5 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్ సైఫ్ (31) టాప్ స్కోరర్. ఢిల్లీ బౌలర్లలో శివమ్ శర్మ 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అంతకుముందు రైల్వేస్ తొలి ఇన్నింగ్స్‌లో 241 పరుగులు చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన సుమిత్ మాథుర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’అవార్డు దక్కింది.చదవండి: Rohit Sharma: నా భార్య లైవ్ చూస్తోంది.. నేను ఆ విషయం చెప్పలేను -
ఛాంపియన్స్ ట్రోఫీలో వారిద్దరిదే కీలక పాత్ర: గంభీర్
భారత సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి(Virat kohli) ఫామ్ లేమితో సతమతవుతున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో నిరాశపరిచిన రోకో ద్వయం.. పుష్కరకాలం తర్వాత ఆడిన రంజీ ట్రోఫీలోనూ అదే తీరును కనబరిచారు. ముంబై తరపున ఆడిన 31 పరుగులు చేయగా.. ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించిన కోహ్లి కేవలం ఆరు పరుగులు మాత్రమే చేశాడు.వీరిద్దరూ ఇప్పుడు ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు సిద్దమవుతున్నారు. ఆ తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడేందుకు యూఏఈకు పయనం కానున్నారు. ఈ క్రమంలో ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్న వీరిద్దరికి భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్ మద్దతుగా నిలిచాడు. ఈ సీనియర్ ద్వయం రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తాచాటుతారని గంభీర్ ఆశాభావం వ్యక్తం చేశాడు."రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇద్దరూ డ్రెస్సింగ్ రూమ్‌కి ఎంతో విలువను చేకూర్చారు. ఒక డ్రెస్సింగ్ రూమ్‌కే కాకుండా భారత జట్టుకు కూడా పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ జోడీ కీలక పాత్ర పోషించనున్నారు. వీరిద్దరే కాకుండా జట్టులోని మొత్తం ఆటగాళ్లు రాబోయే మెగా టోర్నీలో సత్తాచాటాలని ఉవ్విళ్లరుతున్నారు. దేశానికి గౌరవం తీసుకురావాలనే తపన ప్రతీ ఒక్కరిలోనూ ఉంది" అని బీసీసీఐ నమన్ అవార్డుల కార్యక్రమంలో గంభీర్ పేర్కొన్నాడు.అదే విధంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌పై కూడా గంభీర్ స్పందించాడు. "ఛాంపియన్స్ ట్రోఫీలో ఫిబ్రవరి 23న పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ ఒక్కటే మాకు ముఖ్యం కాదు. మొత్తం ఐదు లీగ్ మ్యాచ్‌లు మాకు ముఖ్యమే. ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా దుబాయ్‌లో అడుగుపెట్టనున్నాము. పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌నే సీరియస్‌గా తీసుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకోలేము కాదా? మొత్తం అన్ని మ్యాచ్‌లను ఒకేలా చూస్తాము. వాస్తవానికి భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే హైప్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. కానీ మేము మాత్రం కేవలం సాధారణ గేమ్‌లానే చూస్తాము" అని గంభీర్ పేర్కొన్నాడు.కాగా ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ప్రారంభం కానుంది. అయితే భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్‌లో దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న అదే స్టేడియంలో దాయాది పాకిస్తాన్‌తో భారత్ అమీతుమీ తెల్చుకోనుంది.ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డిచదవండి: 28 ఏళ్ల సుదీర్ఘ కెరీర్.. రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్ -
సూపర్‌స్టార్ విఫలమైనా..
రంజీ ట్రోఫీ పునరాగమనంలో విరాట్ కోహ్లి(Virat Kohli) విఫలమైనా.. అతడి జట్టు ఢిల్లీ మాత్రం ఘన విజయం సాధించింది. రైల్వేస్(Railways Team)ను ఏకంగా ఇన్నింగ్స్ పందొమ్మిది పరుగుల తేడాతో ఓడించింది. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో వైఫల్యం తర్వాత టీమిండియా స్టార్ క్రికెటర్ కోహ్లి ఎట్టకేలకు దేశవాళీ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రైల్వేస్ జట్టుతో గురువారం మొదలైన మ్యాచ్ సందర్భంగా కోహ్లి ఢిల్లీ తరఫున సొంతమైదానంలో అడుగుపెట్టాడు. దీంతో కోహ్లి ఆటను చూసేందుకు తొలిరోజే వేలాది మంది అరుణ్ జైట్లీ స్టేడియానికి పోటెత్తారు. అయితే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకోవడంతో తొలిరోజు.. కోహ్లికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక శుక్రవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా బ్యాట్‌తో అతడు మైదానంలో అడుగుపెట్టాడు. కరతాళ ధ్వనులు, ఆర్సీబీ... ఆర్సీబీ... కోహ్లి... కోహ్లి... అనే అభిమానుల నినాదాల మధ్య ఉదయమే అతడు క్రీజులోకి వచ్చాడు.15 బంతుల్లోనే ముగిసిన ముచ్చటఅప్పటికే ఐదు వేల పైచిలుకు ప్రేక్షకులు మైదానంలోకి వచ్చేశారు. అయితే కోహ్లిని 6 పరుగుల వద్దే హిమాన్షు క్లీన్‌బౌల్డ్ చేయడంతో మరింత మంది అభిమానులు స్టేడియం లోపలికి వచ్చేందుకు ఆసక్తి కనబరచలేదు. కనీసం అతడిబ్యాట్ నుంచి ఫిఫ్టీ వచ్చినా వేలసంఖ్యతో తొలిరోజులాగే అరుణ్ జైట్లీ స్టేడియం నిండిపోయేది.కానీ.. పుష్కర కాలం తర్వాత రంజీ బరిలోకి దిగిన ఈ దిగ్గజ ఆటగాడి బ్యాటింగ్ ముచ్చట 15 బంతుల్లోనే ముగిసింది.ఇక మ్యాచ్ విషయానికొస్తే సూపర్‌స్టార్ కోహ్లి విఫలమైనప్పటికీ ఎలైట్ గ్రూప్ ‘డి’లో రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో రైల్వేస్‌ను 241 పరుగులకు ఆలౌట్ చేసిన బదోని సేన.. తమ మొదటి ఇన్నింగ్స్‌లో 374 రన్స్ స్కోరు చేసింది.బదోని కెప్టెన్ ఇన్నింగ్స్టాపార్డర్లో ఓపెనర్లు అర్పిత్ రాణా(10), సనత్ సంగ్వాన్(30).. వన్‌డౌన్ బ్యాటర్ యశ్ ధుల్(32) ఎక్కువ సేపు నిలవలేకపోయారు. మరోవైపు.. కోహ్లి ఆరు పరుగులకే అవుట్ కాగా.. ఆయుశ్ బదోని కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 77 బంతుల్లోనే 12 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేసి.. సెంచరీకి ఒక్క పరుగు దూరంలో అవుటయ్యాడు.మూడో రోజే ముగిసిన కథఇక బదోనికి తోడుగా సుమిత్ మాథుర్ 86 పరుగులతో రాణించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ ప్రణవ్ రాజువన్షీ 39 రన్స్‌తో ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో 374 పరుగుల మేర మెరుగైన స్కోరు సాధించిన ఢిల్లీ.. శనివారం నాటి మూడో రోజు ఆటలో రైల్వేస్ కథను ముగించింది.సూరజ్ అహుజా బృందాన్ని కేవలం 114 పరుగులకే ఆలౌట్ చేసి.. ఘన విజయం సాధించింది. ఢిల్లీ బౌలర్లలో స్పిన్నర్ శివం శర్మ ఐదు వికెట్లతో చెలరేగగా.. నవదీప్ సైనీ, సిద్ధాంత్ శర్మ, మోనీ గరేవాల్, ఆయుశ్ బదోని ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక ఢిల్లీ ఇన్నింగ్స్‌లో మెరుగైన స్కోరు చేయడంతో పాటు.. ఓవరాల్‌గా మూడు వికెట్లు పడగొట్టిన స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సుమిత్ మాథుర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. రోహిత్‌కు మాత్రం పరాభవంఏదేమైనా రంజీ రీఎంట్రీలో విరాట్ కోహ్లి బ్యాట్ ఝులిపించలేకపోయినప్పటికీ.. విజయంతో తిరిగి వెళ్లడం విశేషం. మరోవైపు.. రంజీ పునరాగమనం(జనవరి 23)లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రం ఘోర పరాభవం ఎదురైంది. బ్యాటర్(3, 28)గా అతడి వైఫల్యం ముంబై జట్టుపై ప్రభావం చూపింది. జమ్ము కశ్మీర్ చేతిలో ముంబై ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.విరాట్ కోహ్లికి సన్మానంఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) తమ స్టార్ క్రికెటర్ కోహ్లిని సత్కరించింది. అంతర్జాతీయ కెరీర్లో భారత్ తరఫున వంద టెస్టులు పూర్తి చేసుకున్న తమ ఆటగాడిని డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ శాలువకప్పి సన్మానించారు. ఈ సందర్భంగా మెమెంటోను బహూకరించారు. మూడేళ్ల క్రితమే 2022లోనే కింగ్ కోహ్లి వంద టెస్టుల మార్క్ దాటాడు. కానీ రంజీల బరిలోకి దిగకపోవడంతో ఆత్మీయ సత్కారం కోసం డీడీసీఏ ఇన్నేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది.చదవండి: అతడిని ఆడించడం అన్యాయం.. మాకు ఒక మాట కూడా చెప్పలేదు: బట్లర్ -
IND VS ENG 4th T20: విరాట్ కోహ్లిని అధిగమించిన హార్దిక్ పాండ్యా
ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా (Team India) మాజీ వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అరుదైన రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీ (30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ చేసేందుకు దోహదపడిన పాండ్యా.. భారత్ తరఫున డెత్ ఓవర్లలో (16 నుంచి 20) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. పాండ్యా ఈ రికార్డును సాధించే క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని (Virat Kohli) అధిగమించాడు. విరాట్ డెత్ ఓవర్లలో 192.54 స్ట్రయిక్‌రేట్‌తో 1032 పరుగులు చేయగా.. పాండ్యా 174.24 స్ట్రయిక్‌రేట్‌తో 1068 పరుగులు చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. నాలుగో టీ20లో హార్దిక్ పాండ్యా శివాలెత్తిపోయాడు. చాలాకాలం తర్వాత అతని బ్యాట్ నుంచి విధ్వంసకర ఇన్నింగ్స్ జాలు వారింది. ఈ మ్యాచ్‌లో తొలి 14 పరుగులు చేసేందుకు 17 బంతులు తీసుకున్న హార్దిక్.. ఆతర్వాత చేసిన 39 పరుగులను కేవలం 13 బంతుల్లో రాబట్టాడు. 15 ఓవర్లు ముగిసే సమయానికి హార్దిక్ స్కోర్ 17 బంతుల్లో 14 పరుగులు కాగా.. 18 ఓవర్ ముగిసే సరికి అతని స్కోర్ 30 బంతుల్లో 53 పరుగులుగా ఉండింది. 15-18 ఓవర్ల మధ్యలో హార్దిక్.. శివమ్ దూబేతో కలిసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. హార్దిక్, శివమ్ దూబే (Shivam Dube) విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోర్ చేసింది. 12 పరుగుల వద్ద ఒకే ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన భారత్‌ను హార్దిక్ పాండ్యా , శివమ్ దూబే (34 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకున్నారు.వీరికి ముందు అభిషేక్ శర్మ (19 బంతుల్లో 29; 4 ఫోర్లు, సిక్స్), రింకూ సింగ్ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడారు. 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసిన భారత్.. చివరి ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది.చివరి ఓవర్‌ను జేమీ ఓవర్టన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత ఆటగాళ్లలో సంజూ శాంసన్ (1), తిలక్ వర్మ (0), సూర్యకుమార్ యాదవ్ (0) దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ 3, జేమీ ఓవర్టన్ 2, బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు. 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ తొలి 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. ఫిలిప్ సాల్ట్ 23, బెన్ డకెట్ 39, జోస్ బట్లర్ 2 పరుగులు చేసి ఔట్ కాగా.. హ్యారీ బ్రూక్ (12), లివింగ్‌స్టోన్ (8) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో బిష్ణోయ్ 2, అక్షర్ పటేల్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే 60 బంతుల్లో 96 పరుగులు చేయాలి. కాగా, 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
Virat Kohli: పన్నెండేళ్ల తర్వాత రీఎంట్రీ.. క్లీన్‌బౌల్డ్! దారుణ వైఫల్యం
‘కింగ్’ రాకతో రంజీ(Ranji Match)లకు కూడా కళొచ్చింది. పుష్కర కాలం తర్వాత రికార్డుల రారాజు రంజీ బరిలో దిగగానే అభిమానం కట్టలు తెంచుకుని స్టేడియం కిక్కిరిసిపోయింది. అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుందా అన్న స్థాయిలో ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు దాదాపు ఇరవై ఏడు వేల మంది తరలివచ్చారు. సూపర్‌స్టార్ బ్యాటింగ్ చేస్తే చూడాలని ఆశగా రెండో రోజు వరకు వేచి చూశారు.కానీ వారి ఆశలపై ‘రన్‌మెషీన్’ నీళ్లు చల్లాడు. పట్టుమని పది పరుగులు కూడా చేయకుండానే క్రీజును వీడాడు. తన వైఫల్యాల పరపరంపర కొనసాగిస్తూ భారంగా నిష్క్రమించాడు. దీంతో స్టేడియమంతా ఒక్కసారిగా మూగబోయింది. తమ అభిమాన ఆటగాడు మైదానం వీడుతుంటే అంతా నిరాశగా అతడి వైపు చూస్తూ ఉండిపోయారు.ఆసీస్ గడ్డపై విఫలంగత కొంతకాలంగా టెస్టుల్లో విఫలమవుతున్న భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి(Virat Kohli).. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపించాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో శతకం బాది టచ్‌లోకి వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆ తర్వాత మాత్రం అదే జోరును కొనసాగించలేకపోయాడు.ముఖ్యంగా ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతిని ఆడబోయిన ప్రతిసారీ ఆసీస్ బౌలర్ల చేతికి ఇచ్చి వికెట్ సమర్పించుకున్నాడు కోహ్లి. ఈ క్రమంలో ‘కింగ్’ పనైపోయిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దేశవాళీ క్రికెట్ బరిలోకి దిగి మునుపటి లయను అందుకోవాలనే సూచనలు వచ్చాయి.తొలిరోజు ఫీల్డింగ్‌కే పరిమితమైన కోహ్లిఈ క్రమంలో సొంతజట్టు ఢిల్లీ తరఫున రైల్వేస్‌తో మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లి రంజీల్లో పునరాగమనం చేశాడు. సొంత మైదానం అరుణ్ జైట్లీ స్టేడియంలో గురువారం మొదలైన ఈ మ్యాచ్‌ను చూసేందుకు జనం పోటెత్తారు. వాళ్లంతా వచ్చింది కేవలం కోహ్లిని చూడటానికే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.Cameras 📸. Posters 🖼️ Chants 🗣️Cheers 👏A fantastic reception for @imVkohli as he walks out to bat 🔥#RanjiTrophy | @IDFCFIRSTBankScorecard ▶️ https://t.co/IhwXam37gl pic.twitter.com/FXnCSzmOfC— BCCI Domestic (@BCCIdomestic) January 31, 2025 అయితే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. తొలిరోజు కోహ్లి ఫీల్డింగ్‌కే పరిమితమయ్యాడు. తనదైన శైలిలో ప్రేక్షకులను ఉత్సాహపరుస్తూ సందడి చేశాడు. ఇక ఆయుశ్ బదోని సారథ్యంలోని ఢిల్లీ జట్టు.. రైల్వేస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 241 పరుగులకు ఆలౌట్ చేసింది. అనంతరం గురువారమే బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ.. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 41 పరుగులు చేసింది.ఒకే ఒక్క ఫోర్ఈ క్రమంలో రెండో రోజైన శుక్రవారం ఆట సందర్భంగా కోహ్లి క్రీజులోకి వచ్చాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు పదిహేను బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క ఫోర్ సాయంతో ఆరు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. రైల్వేస్ పేసర్ హిమాన్షు సంగ్వాన్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయి.. క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. బౌలర్ దెబ్బకు కోహ్లి ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది. దీంతో రైల్వేస్ జట్టు సంబరాలు అంబరాన్నంటగా.. ప్రేక్షకులంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఇక కోహ్లి రంజీ రీఎంట్రీలో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచి పెవిలియన్ బాట పట్టిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే.. 40 ఓవర్లు పూర్తయ్యేసరికి ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 163 పరుగులే చేసింది.చదవండి: చరిత్ర సృష్టించిన సౌరాష్ట్ర బ్యాటర్.. రంజీల్లో ఆల్‌టైమ్ రికార్డుHarish Sangwan Knocked Out Virat King Kohli , At The Score of 6 (Full Crowd Reaction + Celebration) #ViratKohli𓃵 | #ViratKohli pic.twitter.com/QBHLRfsLKb— 𝐒𝐑𝐈𝐉𝐀𝐍 🇮🇹 (@LegendDhonii) January 31, 2025 -
కోహ్లి తెచ్చిన కిక్...
సాధారణంగా రంజీ మ్యాచ్ జరుగుతోందంటే.. వంద మంది ప్రేక్షకులు ఆట చూసేందుకు రావడం కూడా కష్టమైన ఈ రోజుల్లో... గురువారం న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం (గతంలో ఫిరోజ్ షా కోట్లా మైదానం) కిక్కిరిసిపోయింది. ఎటు చూసినా జనమే... ఇసుక వేస్తే రాలనంత మంది అభిమానులు రంజీ మ్యాచ్ చూసేందుకు పోటెత్తారు. సుదీర్ఘ కాలంగా దేశవాళీ క్రికెట్‌కు దూరంగా ఉన్న టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి 2012 తర్వాత తొలిసారి ఢిల్లీ జట్టు తరఫున రంజీ మ్యాచ్ ఆడుతుండటంతో అభిమానులు బ్రహ్మరథం పట్టారు. మ్యాచ్ ప్రారంభానికి మూడు గంటల ముందు నుంచే క్యూ లైన్లు నిండిపోగా... ఢిల్లీ, డిస్ట్రిక్ట్స్ క్రికెట్ సంఘం (డీడీసీఏ) చేసిన ఏర్పాట్లకు మించి ప్రేక్షకులు మైదానానికి తరలివచ్చారు. అభిమానులు భారీగా వస్తారని ముందే అంచనా వేసిన డీడీసీఏ... స్టేడియంలోని 6 వేల సామర్థ్యం గల ‘గౌతమ్ గంభీర్ స్టాండ్’ను తెరవగా... కాసేపట్లోనే అది నిండిపోయి స్వల్ప తొక్కిసలాట జరిగింది. అదే సమయంలో మైదానం వెలుపల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యక్రమం జరుగుతుండటంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది... 11 వేల సామర్థ్యం గల ‘బిషన్ సింగ్ బేడీ స్టాండ్’లోకి అభిమానులను అనుమతించారు. తొలి రోజు ఏకంగా 27 వేల మంది కంటే ఎక్కువ మంది ప్రేక్షకులు హాజరైనట్లు సమాచారం. న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్లు బరిలోకి దిగితే... దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లు కూడా కళకళలాడు తాయని నిజమైంది. రంజీ ట్రోఫీ చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో భాగంగా గురువారం అరుణ్ జైట్లీ స్టేడియంలో రైల్వేస్, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్‌కు ప్రేక్షకుల నుంచి అసాధారణ స్పందన లభించింది. 2012 తర్వాత భారత దిగ్గజం విరాట్ కోహ్లి రంజీ మ్యాచ్‌లో ఆడేందుకు సిద్ధం కావడమే దీనికి కారణం. కోహ్లి ఆటతీరును ప్రత్యక్షంగా చూసేందుకు ప్రేక్షకులు ఉదయం నుంచే ఎగబడ్డారు. ఫలితంగా మైదానం అభిమానులతో నిండిపోయింది. ‘రంజీ ట్రోఫీలో ఇలాంటి సందడి గతంలో ఎప్పుడూ చూడలేదు. దేశవాళీ మ్యాచ్‌లు చూసేందుకు అభిమానులు ఈ స్థాయిలో వస్తారని ఎప్పుడూ ఊహించలేదు. ఇదంతా కేవలం ఒక్క వ్యక్తి కోసమే. వచ్చిన వాళ్లంతా కోహ్లి నామస్మరణ చేస్తున్నారు’ అని మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన ఓ భారత మాజీ క్రికెటర్ అన్నాడు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) కార్యదర్శి అశోక్ శర్మ మాట్లాడుతూ... ‘30 ఏళ్లుగా ఢిల్లీ క్రికెట్‌ను గమనిస్తున్నా. రంజీ ట్రోఫీలో ఇలాంటి దృశ్యాలు చూడలేదు. కోహ్లి ఆదరణకు ఇది నిదర్శనం. మొదట ఒక గేట్ ద్వారానే అభిమానులను అనుమతించాం. తర్వాత పరిస్థితిని బట్టి మైదానంలోని అన్ని గేట్లు తెరిచాం’ అని అన్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కెరీర్లో చివరగా ఆడిన రంజీ మ్యాచ్‌కు ఇప్పటి వరకు అత్యధికంగా 8 వేల పైచిలుకు మంది అభిమానులు హాజరు కాగా... గురువారం రైల్వేస్–ఢిల్లీ మ్యాచ్ చూసేందుకు 27 వేల మందికి పైగా ప్రేక్షకులు పోటెత్తారు. ఈరోజు క్రీజులోకి రానున్న కోహ్లి ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఢిల్లీ కెపె్టన్ ఆయుశ్ బదోనీ ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకున్నా... అభి మానుల ఉత్సాహం మాత్రం తగ్గలేదు. ‘గంటలకొద్దీ నిలబడి మైదానంలోకి వచ్చింది... కోహ్లిని చూసేందుకే. అతడు ఫీల్డింగ్ చేసినా మాకు ఆనందమే’ అని ప్రేక్షకుల్లోని ఒక గృహిణి పేర్కొనగా... కోహ్లి ఆట చూసేందుకే పాఠశాల నుంచి వచ్చామని పలువురు విద్యార్థులు చెప్పారు. రెండో స్లిప్‌లో ఫీల్డింగ్ చేసిన కోహ్లి... అభిమానులకు చేతులు ఊపుతూ అభివాదం చేయగా... ఇన్నింగ్స్ 12వ ఓవర్లో ఓ అభిమాని మైదానంలోకి వచ్చి కోహ్లి కాళ్లకు నమస్కరించాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన రైల్వేస్ తొలి ఇన్నింగ్స్‌లో 67.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. ఉపేంద్ర యాదవ్ (95; 10 ఫోర్లు, 1 సిక్స్), కరణ్ శర్మ ( 50; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో నవ్‌దీప్, సుమిత్ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం ఢిల్లీ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 41 పరుగులు చేసింది. శుక్రవారం కోహ్లి బ్యాటింగ్‌కు రానున్న నేపథ్యంలో... మరింత మంది అభిమానులు మైదానానికి పోటెత్తడం ఖాయమే!చదవండి : 2 పరుగులే 6 వికెట్లు.. 152 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే -
CT: బుమ్రా, కోహ్లి కాదు!.. టీమిండియా ‘ఎక్స్’ ఫ్యాక్టర్ అతడే: డివిలియర్స్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) టోర్నీలో 2000 సంవత్సరంలో తొలిసారి ఫైనల్‌కు చేరింది టీమిండియా. అయితే, కెన్యాలో నాటి తుదిపోరులో న్యూజిలాండ్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2002లోశ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా నిలిచింది. అనంతరం మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) సారథ్యంలో 2013లో మరోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించిన భారత జట్టు... ఈసారి ఆఖరి గండాన్ని అధిగమించింది.ఐదు పరుగుల తేడాతో గెలుపొందిసౌతాఫ్రికా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో నరాలు తెగే ఉత్కంఠ నడుమ కేవలం ఐదు పరుగుల తేడాతో గెలుపొంది.. టైటిల్‌ను సోలోగా సొంతం చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ నాలుగేళ్లకు ఫైనల్‌కు చేరినా.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలై(India vs Pakistan).. ట్రోఫీని చేజార్చుకుంది. ఈ క్రమంలో మరోసారి ఈ మెగా టోర్నీలో భారత్ విజేతగా నిలిచే అవకాశం ముంగిట నిలిచింది.నాడు ఆ ఆరుగురు2017 తర్వాత.. దాదాపు ఎనిమిదేళ్ల అనంతరం నిర్వహిస్తున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో టీమిండియా ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగుతోంది. పాకిస్తాన్- దుబాయ్ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానున్న ఈ మెగా ఈవెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటికే జట్టును ప్రకటించింది. 2017 నాటి జట్టులో ఓపెనింగ్ బ్యాటర్‌గా ఉన్న రోహిత్ శర్మ ఈసారి కెప్టెన్ హోదాలో బరిలోకి దిగనునున్నాడు.మరోవైపు.. ఆనాటి సారథి విరాట్ కోహ్లితో పాటు.. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా.. పేస్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ కూడా తాజా జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఎక్స్’ ఫ్యాక్టర్ అతడేఈసారి టీమిండియా ‘ఎక్స్’ ఫ్యాక్టర్ ఎవరన్న అంశంపై అభిప్రాయాలు పంచుకుంటూ.. ఈ ఆరుగురిలో ఒక్కరి పేరు కూడా చెప్పలేదు. వీరికి బదులుగా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై డివిలియర్స్ నమ్మకం ఉంచాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానల్లో మాట్లాడుతూ.. ‘‘ఈసారి భారత జట్టులో ‘ఎక్స్’ ఫ్యాక్టర్‌గా కుల్దీప్ యాదవ్ మారబోతున్నాడని అనిపిస్తోంది.ఎందుకంటే.. టీమిండియా దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుబోతోంది. అక్కడి పిచ్‌లు స్పిన్నర్లకు కాస్త అనుకూలంగా ఉంటాయి. కాబట్టి కుల్దీప్ ఈసారి ఇండియా తరఫున అందరికంటే మెరుగ్గా ఆడి.. ఫలితాలను ప్రభావితం చేయగలడు’’ అని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌ను మలుపుతిప్పగల సత్తా అతడికి ఉందని పేర్కొన్నాడు.గాయం కారణంగాకాగా కుల్దీప్ యాదవ్ గత కొంతకాలంగా టీమిండియాకు దూరంగా ఉన్నాడు. ఎడమ గజ్జలో నొప్పి కారణంగా సుదీర్ఘకాలంగా ఇబ్బంది పడుతున్న ఈ స్పిన్ బౌలర్.. జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్నట్లు సమాచారం. గాయం కారణంగానే అతడు ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ పాల్గొనలేకపోయాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా కుల్దీప్ యాదవ్ టీమిండియా తరఫున పునరాగమనం చేసే అవకాశం ఉంది.ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ-2025కి భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, యశస్వి జైస్వాల్, కుల్దీప్ యాదవ్.చదవండి: మరో డీఎస్పీ!.. పోలీస్ ఉద్యోగంలో చేరిన భారత క్రికెటర్ -
13 ఏళ్ల తర్వాత రంజీ బరిలో కోహ్లి.. పోటెత్తిన జనం.. తొక్కిసలాట
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రంజీ బరిలోకి దిగాడు. రైల్వేస్‌తో ఇవాళ (జనవరి 30) మొదలైన మ్యాచ్‌లో కోహ్లి ఢిల్లీ తరఫున ఆడుతున్నాడు. కోహ్లి సొంత మైదానమైన అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. 🚨 15,748 ATTENDANCE ON DAY 1 IN DELHI vs RAILWAYS MATCH AT ARUN JAITLEY STADIUM 🚨 (Vipul Kashyap).- The Craze of King Kohli..!!!! 🐐🔥 pic.twitter.com/5yMvhgbcKU— Tanuj Singh (@ImTanujSingh) January 30, 2025చాలాకాలం తర్వాత కోహ్లి సొంత మైదానంలో రంజీ మ్యాచ్ ఆడుతుండటంతో అతన్ని చూసేందుకు జనం పోటెత్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మ్యాచ్ చూసేందుకు 15 వేల పైచిలుకు జనం హాజరయ్యారు. సాధారణంగా రంజీ మ్యాచ్ చూసేందుకు ఈ స్థాయిలో జనం రారు. THE CRAZE & AURA OF VIRAT KOHLI. 🐐- The Scenes at Arun Jaitley stadium at the moment. 🔥 pic.twitter.com/Cym5H3EM8z— Tanuj Singh (@ImTanujSingh) January 30, 2025కోహ్లిని తమ సొంత మైదానంలో చూసేందుకు అభిమానులు ఇవాళ తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. మ్యాచ్ ప్రారంభం కాగానే స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయింది. కోహ్లి నామస్మరణతో అరుణ్ జైట్లీ స్టేడియం మార్మోగిపోయింది. స్టేడియంలోకి ప్రవేశం ఉచితం కావడంతో జనాలను అదుపు చేయడం పోలీసుల వల్ల కావడం లేదు. స్కూలు విద్యార్థులు సైతం భారీ సంఖ్యలో హాజరయ్యారు. KING KOHLI IS AN EMOTION..!!!! 🐐- The Moments fan entered the ground and touched Virat Kohli's feet. 🥹❤️ pic.twitter.com/RsSgFKeK2t— Tanuj Singh (@ImTanujSingh) January 30, 2025మైదానంలోకి ప్రవేశించిన అభిమాని.. కోహ్లికి పాదాభివందనంకోహ్లి ఫీల్డింగ్ చేస్తుండగా ఓ అభిమాని స్టేడియంలోకి జోరబడ్డాడు. సెక్యూరిటీని తప్పించుకుని కోహ్లికి పాదాభివందనం చేశాడు. అనంతరం సెక్యూరిటీ అతన్ని అదుపులోకి తీసుకుని దండించే ప్రయత్నం చేసింది. అయితే కోహ్లి వారిని వారించి సదరు అభిమానిని వదిలి పెట్టాలని కోరాడు. SCHOOL KIDS COMING & CRAZY FOR VIRAT KOHLI AT ARUN JAITLEY STADIUM. 🔥 (Vipul Kashyap).pic.twitter.com/gYH6eGXoHU— Tanuj Singh (@ImTanujSingh) January 30, 2025ఈ మ్యాచ్‌లో కోహ్లిని చూసేందుకు ఢిల్లీ నుంచే కాక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అభిమానులు వచ్చారు. ఓ అభిమాని ఆంధ్ర నుంచి వచ్చి కోహ్లిని చూస్తూ తరించాడు. కోహ్లిని చూసేందుకు ఇంకా జనాలు వస్తున్నారు. అభిమానులను కంట్రోల్ చేయడం కోహ్లి వల్ల కాకపోవడంతో పారా మిలిటరీ రంగంలోకి దిగింది. గతంలో ఓ రంజీ మ్యాచ్ చూసేందుకు ఈ స్థాయిలో ప్రేక్షకులు ఎప్పుడూ రాలేదని వ్యాఖ్యాతలు అంటున్నారు. తొక్కిసలాట.. పలువురికి గాయాలుఓ దశలో స్టేడియంలోకి వచ్చేందుకు పెద్ద సంఖ్యలో జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది. పలువురు గాయాలపాలయ్యారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. పోలీసులు, పారా మిలిటరీ ఒక్కొక్కరిని స్టేడియంలోకి పంపిస్తున్నారు. ఎంట్రీ ఉచితం కావడంతోనే అభిమానులు ఈ స్థాయిలో పోటెత్తారని పోలీసులు అంటున్నారు. ఈ మ్యాచ్‌ను జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.Fan Frenzy Gets Out of Control! 🚨 Heavy rush at Arun Jaitley Stadium leaves supporters injured during Kohli’s return!Click here to view: https://t.co/OYRAcmpXHN pic.twitter.com/07mrfIxr6T— CricTracker (@Cricketracker) January 30, 2025మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బౌలింగ్ చేస్తున్న ఢిల్లీ.. రైల్వేస్‌పై పట్టు సాధించింది. ఢిల్లీ బౌలర్లు మనీ గ్రేవాల్ (8-1-14-2), సిద్దాంత్ శర్మ (6-1-25-2), నవ్‌దీప్ సైనీ (10-1-31-1) చెలరేగడంతో రైల్వేస్ 27 ఓవర్లలో 87 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు కోల్పోయింది. వికెట్‌కీపర్ ఉపేంద్ర యాదవ్ (27), కర్ణ్ శర్మ (2) క్రీజ్‌లో ఉన్నారు.Fans started gathering at Arun Jaitley stadium from 3 AM night to see Virat Kohli's Ranji Match. 🥶 (RevSportz).- King Kohli, The Biggest Crowd Puller in this Sports. 🐐pic.twitter.com/y9j2JuxfBU— Tanuj Singh (@ImTanujSingh) January 30, 2025ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోనూ అదిరిపోయే ట్రాక్ రికార్డుఅంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన ట్రాక్ రికార్డు కలిగిన విరాట్ కోహ్లికి ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ అదిరిపోయే రికార్డు ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఢిల్లీకు ప్రాతినిథ్యం వహించే విరాట్.. ఆ జట్టు తరఫున 40 ఇన్నింగ్స్‌లు ఆడి 52.66 సగటున 1843 పరుగులు చేశాడు. ఇందులో 6 శతకాలు, 6 అర్ద శతకాలు ఉన్నాయి. కోహ్లి చిన్న వయసులోనే జాతీయ జట్టులోకి ప్రవేశించడంతో ఫస్ట్‌క్లాస్ క్రికెట్ పెద్దగా ఆడలేకపోయాడు. -
అందరి చూపు కోహ్లి వైపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్లో టన్నులకొద్దీ పరుగులు చేసిన భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి 2012 తర్వాత దేశవాళీ బాట పట్టాడు. రంజీ ట్రోఫీ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆడేందుకు కోహ్లి సిద్ధమయ్యాడు. ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా రైల్వేస్‌తో గురువారం నుంచి ప్రారంభం కానున్న పోరులో కోహ్లి ఢిల్లీ జట్టు తరఫున బరిలోకి దిగుతున్నాడు.గ్రూప్ దశలో ఆడిన 6 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క దాంట్లోనే గెలిచిన ఢిల్లీ జట్టుకు నాకౌట్ చేరే అవకాశాలు పెద్దగా లేకపోయినా... కోహ్లి బరిలోకి దిగుతుండటంతో ఫలితంతో సంబంధం లేకుండా ... తమ ఆరాధ్య ఆటగాడిని చూసేందుకు భారీగా అభిమానులు మైదానానికి తరలి రానున్నారు. గత ఆరో రౌండ్ మ్యాచ్‌ల్లో ఆడిన భారత క్రికెటర్లు రిషభ్ పంత్, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ తదితరులు ఆకట్టుకోలేకపోగా... ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు కోహ్లి భారీ ఇన్నింగ్స్ ఆడితే చూడాలని అభిమానులు ఆశ పడుతున్నారు. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు పూర్తి కాగా... ఢిల్లీ జట్టుకు ఆయుశ్ బదోనీ సారథ్యం వహిస్తున్నాడు. ‘ఐపీఎల్లో కోహ్లీకి ప్రత్యర్థిగా ఆడాను. ఇప్పుడు నా నాయకత్వంలో వరుస మ్యాచ్‌ల్లో పంత్, కోహ్లి లాంటి దిగ్గజాలు ఆడటం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. కోహ్లి నాలుగో స్థానంలోనే బ్యాటింగ్ చేస్తాడు. అనవసర ఒత్తిడికి లోను కాకుండా స్వేచ్ఛగా ఆడమని కోహ్లి మాకు సూచించాడు’ అని బదోనీ అన్నాడు. కేఎల్ రాహుల్ కఠోర సాధన చాన్నాళ్ల తర్వాత రంజీ బరిలోకి దిగనున్న భారత ఆటగాడు కేఎల్ రాహుల్ బుధవారం ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నాడు. ఎలైట్ గ్రూప్ ‘సి’లో భాగంగా నేటి నుంచి బెంగళూరులో హరియాణా జట్టుతో తలపడనున్న కర్ణాటక జట్టులో రాహుల్ బరిలోకి దిగనున్నాడు. నెట్ సెషన్లో తీవ్రంగా శ్రమించిన రాహుల్... స్పిన్, పేస్ అనే తేడా లేకుండా అందరి బౌలింగ్‌లోనూ సుదీర్ఘంగా ప్రాక్టీస్ చేశాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో స్థానం దక్కించుకున్న రాహుల్... ఈ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేసి తన జట్టును రంజీ ట్రోఫీలో నాకౌట్ దశకు చేర్చాలని భావిస్తున్నాడు. సిరాజ్ పాత బంతితో ప్రాక్టీస్ గత మ్యాచ్‌లో స్టార్ ఆటగాళ్లతో బరిలోకి దిగి కూడా జమ్మూ కశ్మీర్ జట్టు చేతిలో ఓటమి పాలైన ముంబై జట్టు... ఎలైట్ గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో మేఘాలయాతో పోరుకు సిద్ధమైంది. రికార్డు స్థాయిలో 42 సార్లు రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన ముంబై నాకౌట్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో బోనస్ పాయింట్ విజయం సాధించడంతో పాటు ... ఇతర మ్యాచ్‌ల ఫలితాలు కూడా అనుకూలించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నేపథ్యంలో రోహిత్, యశస్వి, శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నారు. మరి రహానే సారథ్యంలోని ముంబై టీమ్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా విదర్భతో జరగనున్న మ్యాచ్‌లో హైదరాబాద్ తరఫున మొహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగనున్నాడు. ఈ గ్రూప్ నుంచి విదర్భ ఇప్పటికే నాకౌట్ బెర్త్ దక్కించు కోగా... హైదరాబాద్‌కు అవకాశాలు లేవు. అయితే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన హైదరాబాదీ సిరాజ్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడనేది కీలకం. పాత బంతితో సిరాజ్ పెద్దగా ప్రభావం చూపలేకపోతుండటంతోనే అతడిని ఎంపిక చేయలేదని రోహిత్ ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో... ప్రాక్టీస్‌లో ఈ హైదరాబాదీ మెరుపు తగ్గిన బంతితో సాధన చేశాడు. గ్రూప్ ‘బి’లోనే ఉన్న ఆంధ్ర జట్టు విజయనగరం వేదికగా రాజస్తాన్‌తో ఆడనుంది. -
కోహ్లితో కళకళ... ఓ బుడ్డోడి ఆసక్తికర ప్రశ్న!
న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి 2012 తర్వాత దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ బరిలోకి దిగనున్నాడు. ఇటీవలి కాలంలో ఫామ్‌లేమితో పాటు షాట్ సెలెక్షన్ విషయంలో పదే పదే పొరబాట్లు చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లి... ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు రంజీ మ్యాచ్ ద్వారా ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి రైల్వేస్‌తో ప్రారంభం కానున్న రంజీ మ్యాచ్‌లో కోహ్లి ఢిల్లీ తరఫున ఆడనున్నాడు. చివరిసారిగా 2012లో ఉత్తరాఖండ్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో ఆడిన కోహ్లి... ఆ తర్వాత అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా దేశవాళీ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలంటే దేశవాళీల్లో ఆడాల్సిందే అని ఇటీవల భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్లేయర్లను హెచ్చరించడంతో స్టార్ ఆటగాళ్లు కూడా రంజీ బాటపట్టారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్ ఆరో రౌండ్ రంజీ మ్యాచ్‌ల్లో ఆడగా... రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ సీజన్ చివరి లీగ్ మ్యాచ్‌ల్లో కోహ్లితో పాటు కర్ణాటక తరఫున కేఎల్ రాహుల్, హైదరాబాద్ తరఫున మొహమ్మద్ సిరాజ్ కూడా ఆడుతున్నారు. మంగళవారం ఢిల్లీ జట్టుతో కలిసి కోహ్లి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. ఆద్యంతం ఉత్సాహంగా కనిపించిన కోహ్లి ... కోచ్‌లతో చర్చిస్తూ కుర్రాళ్లలో ఉత్సాహం నింపుతూ సందడి చేశాడు. కోహ్లి... ‘కడీ చావల్’ కెరీర్ ఆరంభంలో ఢిల్లీ జట్టు తరఫున ఎన్నో మ్యాచ్‌లు ఆడిన విరాట్... తిరిగి 13 ఏళ్ల తర్వాత ఆ డ్రెస్సింగ్‌రూమ్‌లో అడుగు పెట్టాడు. ప్రస్తుతం ఢిల్లీ జట్టులో ఉన్న నవ్‌దీప్ సైనీ మినహా మిగిలిన 17 మంది ప్లేయర్లు కేవలం టీవీల్లో మాత్రమే చూసిన స్టార్ ఆటగాడితో కలిసి ప్రాక్టీస్ చేశారు. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ‘చీకూ’గా మొదలైన విరాట్ కోహ్లి ప్రస్థానం... దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ‘కింగ్’ వరకు చేరింది. ఢిల్లీ హెడ్ కోచ్ శరణ్‌దీప్ సింగ్, బ్యాటింగ్ కోచ్ బంటూ సింగ్ పర్యవేక్షణలో విరాట్ ప్రాక్టీస్ సాగించాడు. భారత అండర్–19 జట్టుకు కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరించిన సమయంలో కోచ్‌గా పనిచేసి, ప్రస్తుత జట్టుకు మేనేజర్‌గా పనిచేస్తున్న మహేశ్ భాటీ విరాట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ‘అతడేం మారలేదు. అప్పుడెలా ఉన్నాడో ఇప్పుడూ అలాగే ఉన్నాడు. విరాట్‌కు ‘ఛోళే పూరీ’ బాగా ఇష్టమని అతడి కోసం అవి తెప్పించాం. కానీ ఇప్పుడు తినడంలేదని విరాట్ చెప్పాడు’ అని మహేశ్ పేర్కొన్నాడు. ప్రాక్టీస్ అనంతరం ప్లేయర్లతో కలిసి ‘కడీ చావల్’ (పప్పన్నం) తిన్నాడని వెల్లడించాడు. మొదట ఈ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించకపోయినా... విరాట్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని జియో సినిమా లైవ్‌కు సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది. కుర్రాళ్లతో కలిసి... ఉదయం తొమ్మిది గంటలకు ఖరీదైన పోర్షే కారులో మైదానానికి చేరుకున్న విరాట్... ఒక్కసారి ప్రాక్టీస్ ప్రారంభించాక నిత్యవిద్యార్థిలా శ్రమించాడు. తొలుత 35 నిమిషాల పాటు ప్లేయర్లతో కలిసి వార్మప్ చేసిన కోహ్లి... ఆ తర్వాత 15 నిమిషాల పాటు ఫుట్‌బాల్ ఆడాడు. ఆ తర్వాత నెట్ సెషన్ ప్రారంభమైంది. ఆ సమయంలో ఢిల్లీ రంజీ జట్టు కెప్టెన్ ఆయుశ్ బదోనీ వద్దకు వెళ్లిన కోహ్లి... ‘ఆయుశ్ నువ్వు ముందు బ్యాటింగ్ చేయి. ఆ తర్వాత మనిద్దరం స్థానాలు మార్చుకుందాం’ అని చెప్పాడు. స్టార్ ఆటగాళ్లు రంజీల్లో ఆడనున్న నేపథ్యంలో ఢిల్లీ క్రికెట్ బోర్డు రిషబ్ పంత్‌తో పాటు విరాట్ కోహ్లికి కెపె్టన్సీ చేపట్టాలని కోరగా... ఈ ఇద్దరూ దాన్ని సున్నితంగా తిరస్కరించారు. దీంతో ఐపీఎల్ మెరుపులతో వెలుగులోకి వచ్చిన ఆయుశ్ బదోనీ ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. నెట్స్‌లో గంటకు పైగా ప్రాక్టీస్ చేసిన విరాట్... త్రోడౌన్స్ వేయించుకొని పుల్ షాట్లు సాధన చేశాడు. పేసర్లు నవ్‌దీప్ సైనీ, రాహుల్ గెహ్లాట్, సిద్ధాంత్ శర్మ, మోనీ గ్రెవాల్, స్పిన్నర్లు హర్‡్ష త్యాగి, సుమిత్ మాథుర్‌ను సునాయాసంగా ఎదుర్కొన్న కోహ్లి బ్యాక్‌ఫుట్‌పై ఎక్కువ షాట్లు ఆడే ప్రయత్నం చేశాడు. అలాగే ఆఫ్ వికెట్ లైన్ బంతులను ఎక్కువగా వదిలేశాడు. కోహ్లికి కబీర్ ఆసక్తికర ప్రశ్న! మంగళవారం విరాట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గ్రౌండ్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కోహ్లి సాధన ముగించుకొని వెళ్తున్న సమయంలో నాలుగో తరగతి చదువుతున్న ఓ కుర్రాడు... ‘విరాట్ అంకుల్’ అంటూ పిలవడంతో అటు వైపు వెళ్లిన కోహ్లి అతడితో సుదీర్ఘంగా ముచ్చటించి కీలక సూచనలు చేశాడు. ఆ కుర్రాడి పేరు కబీర్ కాగా... అతడి తండ్రి ఒకప్పుడు విరాట్ కోహ్లీతో కలిసి ఢిల్లీ అండర్–17, అండర్–19 జట్లకు ఆడిన షావేజ్. భారత జట్టుకు ఆడాలంటే ఏం చేయాలని కబీర్ ప్రశ్నించగా... ‘కఠోర సాధన చేయాలి. ప్రాక్టీస్ ఎప్పుడూ వదిలేయొద్దు. మీ నాన్న నిన్ను ప్రాక్టీస్‌కు వెళ్లు అని చెప్పకూడదు. నువ్వే నాన్నా నేను గ్రౌండ్‌కు వెళ్తున్నా అని చెప్పాలి’ అని కోహ్లి సూచించాడు.