విరాట్ కోహ్లీ రికార్డ్ బద్దలు కొట్టిన రష్మిక.. అదేంటో తెలుసా? | Tollywood Actress Rashmika Mandanna Wedding Post Breaks Virat Kohli Instagram Like Record, Check Out Posts Inside | Sakshi
Sakshi News home page

Rashmika: విరాట్ కోహ్లీ రికార్డ్ బద్దలు కొట్టిన రష్మిక.. అదేంటంటే?

Mar 1 2026 8:07 AM | Updated on Mar 1 2026 1:05 PM

tollywood actress rashmika mandanna post breaks Virat Kohli Record

కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న టాలీవుడ్ లవ్‌ బర్డ్స్‌ విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఇన్ని రోజులుగా సీక్రెట్‌గా రిలేషన్‌లో ఉన్న వీరిద్దరు పెళ్లికి కొద్ది రోజుల ముందు అఫీషియల్‌గా ప్రకటించారు. గత నెల ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్‌ ప్యాలెస్‌లో అతికొద్దిమంది సమక్షంలో వీరిద్దరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

పెళ్లి తర్వాత విజయ్, రష్మిక తమ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ జంట తమ భావాలను ప్రకటిస్తూ భావోద్వేగంగా రాసుకొచ్చారు. ఈ పిక్స్ షేర్ చేసిన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చేశాయి. అత్యధిక లైక్స్‌తో పలువురి సెలబ్రిటీల ఫోటోలు క్రియేట్ చేసిన రికార్డ్స్‌ను విరోష్ జంట తుడిచిపెట్టేసింది. తాజాగా ఈ పిక్స్‌ మరో రికార్డ్ సృష్టించాయి.

2024లో టీమిండియా వరల్డ్ కప్‌ గెలిచిన సందర్భంగా విరాట్ కోహ్లీ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోకు దాదాపు 23 మిలియన్ల లైక్స్ వచ్చాయి. తాజాగా ఆ రికార్డ్‌ను రష్మిక షేర్ చేసిన పెళ్లి ఫోటోలు బద్దలు కొట్టాయి. రష్మిక పోస్ట్‌కు ఏకంగా 25 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. దీంతో విరాట్‌ పోస్ట్ రికార్డ్‌ను రష్మిక అధిగమించింది. కాగా.. ఇన్‌స్టాలో రష్మికకు 50 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అంటే దాదాపు సగం మంది ఈ వెడ్డింగ్ ఫోటోలను లైక్‌ చేశారు. అంతేకాకుండా విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన ఫోటోలకు 19.8 మిలియన్ల లైక్ వచ్చాయి. కాగా.. మరోవైపు విరాట్‌కు ఇన్‌స్టాలో 274 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. రష్మిక పోస్ట్‌కు ఈ రేంజ్‌లో ఆదరణ దక్కడం చూస్తుంటే ఆమె క్రేజ్‌ ఏంటో తెలిసిపోతోంది. 


 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement