Marriage
-
త్రిష- విజయ్‌ల పెళ్లెప్పుడు?.. తెగ వెతికేస్తోన్న నెటిజన్స్..!
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించాడు దళపతి విజయ్. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అనూహ్య విజయాన్ని(108 స్థానాలు) నమోదు చేసింది. త్వరలోనే తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం విజయ్ ఫోకస్ అంతా మేజిక్ ఫిగర్(118)కి కావాల్సిన సభ్యులను పోగు చేయడంపైనే పెట్టాడు. గవర్నర్ నుంచి అధికారిక ప్రకటన వస్తే.. ఈ రోజే విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విజయ్ పర్సనల్ లైఫ్ గురించి నెటిజన్స్ గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. హీరోయిన్ త్రిషతో పెళ్లి ఎప్పుడు? వారిద్దరి లవ్ స్టోరీ ఎలా మొదలైంది? వయసు తేడా ఎంత? తదితర అంశాలపై నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు.ఎలక్షన్లకు కొద్ది రోజుల ముందే విజయ్ సతీమణి సంగీత భర్తతో విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. ఓ నటితో ఆయన సహజీవనం చేస్తున్నట్లు ఆమె ఆరోపణలు చేసినప్పటి నుంచి త్రిష పేరు నెట్టింట ట్రెండ్ అయింది. విజయ్-త్రిషలు ప్రేమలో ఉన్నారనే పుకార్లు ఎక్కువైయ్యాయి. అయితే అవి నిజమే అన్నట్లుగా అది నిజమే అన్నట్లుగా త్రిష, విజయ్ కలిసి ఓ వివాహ వేడుకకు హాజరై, తమ బందాన్ని బహిరంగం చేశారు.అప్పటి నుంచి విజయ్, త్రిషల పెళ్లిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. త్రిష బర్త్‌డే (మే 4) రోజే ఎన్నికల ఫలితాలు రావడం.. విజయ్ భారీ విజయం సాధించడంతో వీరిద్దరి బంధంపై రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి. విజయ్ సీఎం అయిన వెంటనే త్రిషను పెళ్లి చేసుకుంటారనే వార్తలు వినిపించాయి. మరికొంతమంది అయితే.. కొన్నాళ్ల పాటు పాలనపై దృష్టిపెడతాడని, ఐదారు నెలల తర్వాతే పెళ్లి చేసుకుంటారని చెబుతున్నారు. ఏదేమైనా పెళ్లి మాత్రం చేసుకోవడం పక్కా అని తేలడంతో.. అందరూ విజయ్-త్రిషల వయసుపై గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత అనేది చాలా మంది గూగుల్‌ని అడిగి తెలుసుకుంటున్నారు. విజయ్ 1974 జూన్ 22న జన్మించాడు. ఆయనకు ప్రస్తుతం 51 ఏళ్లు. త్రిష 1983 మే 4న జన్మించింది. ప్రస్తుతం ఆమె వయసు 43 ఏళ్లు. అంటే ఇద్దరి మధ్య దాదాపు 9 ఏళ్ల ఏజ్ గ్యాప్ తేడా ఉంది. విజయ్, త్రిషలు 2004లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'గిల్లి' (ఒక్కడు సినిమా రీమేక్)లో తొలిసారి కలిసి నటించారు. ఆ తర్వాత తిరుపాచి, ఆది, కురువి, 'లియో' వంటి చిత్రాల్లో జంటగా నటించారు. వెండితెరపై వీరి జోడీకి విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే వీరిద్దరి రిలేషన్‌పై పుకార్లు రావడమే కానీ.. అధికారికంగా మాత్రం ఎక్కడ ప్రకటించలేదు. -
శ్రీదేవిని పెళ్లి చేసుకోమని అడిగారు కానీ.., : రాజశేఖర్
సీనియర్ హీరో రాజశేఖర్ ఇప్పుడు సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించారు. మొన్నటి వరకు హీరోగా మాత్రమే సినిమాలు తీసిన ఆయన..ఇప్పుడు యంగ్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ‘బైకర్’ మూవీలో శర్వానంద్ తండ్రిగా నటించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన వరుస ఇంటర్వ్యూలు ఇచ్చాడు. సినిమా విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు. వాటికి సంబంధించిన వీడియో క్లిప్పులు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.శ్రీదేవితో పెళ్లి ప్రపోజల్..రాజశేఖర్, జీవితలది ప్రేమ వివాహం అనే సంగతి అందరికీ తెలిసిందే. `తలంబ్రాలు`(1986) సినిమాతో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి.. పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. అయితే జీవిత కంటే ముందు శ్రీదేవితో తనకు పెళ్లి ప్రపోజల్ వచ్చిందని గతంలో ఓ న్యూస్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజశేఖర్ చెప్పాడు. ఇదే విషయాన్ని తాజాగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ గుర్తు చేసింది. ‘జీవిత కంటే ముందు శ్రీదేవితో పెళ్లి ప్రపోజల్ వచ్చిందట కదా.. నిజమేనా?’ అని యాంకర్ ప్రశ్నించగా.. ‘నిజమే. శ్రీదేవి తండ్రికి, మా నాన్నగారికి మధ్య మంచి స్నేహం ఉండేది. ఆ చొరవతో ఇరువైపులా స్నేహితుల మధ్య పెళ్లి ప్రపోజల్ వచ్చిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు ఆమె మన మధ్య లేరు. అందుకే ఆ విషయం గురించి ఇప్పుడు మాట్లాడడం సరికాదు. వదిలేద్దాం’ అని రాజశేఖర్ చెప్పాడు.ఆర్టిస్ట్ అని శ్రీదేవిని రిజెక్ట్ చేశారుఅయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవిని ఎందుకు పెళ్లి చేసుకోలేదో రాజశేఖర్ వివరించాడు. ‘శ్రీదేవి నాన్నతో మా నాన్నకు మంచి స్నేహబంధం ఉండేది. కులం కూడా ఒకటే. దూరపు బంధువులు అవుతారు. అందుకే శ్రీదేవి ఫ్యామిలీ నుంచి నాకు పెళ్లి ప్రపోజల్ వచ్చింది. అప్పటికీ నేను సినిమాల్లోకి రాలేదు. ఎంఎస్ చదవాలనుకుంటున్నాను. ఇదే విషయాన్ని మా నాన్న వాళ్లకు పెళ్లి.. వారి ప్రపోజల్‌ని రిజెక్ట్ చేశారు. సినిమాల్లో నటించేవాళ్లను పెళ్లి చేసుకోవడం మా ఇంట్లోవాళ్లకు ఇష్టం లేదు. అందుకే శ్రీదేవితో పెళ్లి ప్రపోజల్‌ని పక్కన పెట్టారు’ అని రాజశేఖర్ అన్నారు. -
గ్రాండ్‌గా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత మనవరాలి పెళ్లి
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత వీఆర్కే రావు ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన మనవరాలు హిమశ్రీ వేమూరి వివాహా వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లి వేడుక జన్వాడలోని నియో కన్వెన్షన్‌లో జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు. ఈ పెళ్లి వేడుకలో కేఎస్ రామారావు, శివాజీ రాజా, సాయికుమార్, అశోక్ కుమార్, రాజీవ్ కనకాల, శివబాలాజీ-మధుమిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, అలీ, యాంకర్ శిల్పా చక్రవర్తి, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సందడి చేశారు.కాగా.. వీఆర్కే రావు భారత వైమానిక దళంలో కమాండర్‌గా పనిచేశారు. వీఆర్కే రావు కేవలం ఒక సైనికుడిగానే కాకుండా సమాజ సేవకుడిగా.. కళాకారుడిగా ఎందరికో ఆదర్శంగా నిలిచారు. 1971 ఇండో-పాక్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ఉత్తమ కమాండర్ అవార్డు అందుకున్నారు. నిర్మాతగా బుల్లితెరపై, వెండితెరపై తనదైన ముద్ర వేశారు. వరకట్నం, అవినీతి వంటి సామాజిక రుగ్మతలపై ఆయన తీసిన సందేశాత్మక చిత్రాలు అనేక ప్రతిష్టాత్మక నంది అవార్డులను కొల్లగొట్టాయి. శివాజీ రాజా హీరోగా తెరకెక్కిన 'మొగుడ్స్ పెళ్లామ్స్' చిత్రంతో నిర్మాతగా మరో నంది అవార్డ్ అందుకున్నారు. అజైల్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై ఆయన అందించిన సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకులకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. -
అతనితోనే జాన్వీ కపూర్ పెళ్లి.. బోనీ కపూర్ ఏమన్నారంటే?
దేవర మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్ది మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా జూన్ 4వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ సినిమా జూన్‌లో రిలీజ్ కానుంది. అయితే బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌పై గత కొద్ది రోజులుగా రూమర్స్ వస్తున్నాయి. ఈ ఏడాది జాన్వీ పెళ్లి చేసుకోనుందని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. తన బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియాను పెళ్లాడనుందని ఊహాగానాలొస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో జాన్వీ కపూర్ పెళ్లి పీటలెక్కనుందని లేటేస్ట్ టాక్. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ స్పందించారు.తన కూతురు ఈ ఏడాదిలో పెళ్లి చేసుకోబోతోందన్న వార్తలను బోనీ కపూర్ ఖండించారు. జాన్వీ పెళ్లిపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. దీంతో పెద్ది బ్యూటీపై వస్తున్న పెళ్లి వార్తలకు చెక్ పడింది. అయితే గతంలో కాఫీ విత్ కరణ్ షోకు హాజరైన జాన్వీ కపూర్.. శిఖర్‌తో తన రిలేషన్ గురించి మాట్లాడింది. తామిద్దరం డేటింగ్లో ఉన్నామని తెలిపింది. అంతేకాకుండా వీరిద్దరు ఎక్కడికెళ్లినా జంటగా కనిపించడంతో వీరిద్దరు రిలేషన్లో ఉన్నట్లు అర్థమైపోయింది. గతంలో శిఖర్ గురించి జాన్వీ కపూర్ పాజిటివ్ కామెంట్స్ చేసింది. అతను నాతో ఉంటే సేఫ్‌గా ఉంటాననే ఫీలింగ్ వస్తుందని జాన్వీ తెలిపింది. అతనికో నేను ఒక చిన్నపిల్లలా ఉండగలనని చెప్పింది. శిఖర్‌తో తప్ప మరెవరితోనూ నేను ఇంత సరదాగా గడపలేనని పేర్కొంది. -
బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి రిసెప్షన్ లో చిరు ,మోహన్ బాబు
-
కూవాగంలో హిజ్రాల పెళ్లి సందడి..ఎందుకో తెలుసా? (ఫొటోలు)
-
ఘనంగా జరిగిన బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి
-
'పిల్లల కోసం పెళ్లి అక్కర్లేదు'.. నిత్యామీనన్ బాటలో కట్టప్ప కూతురు
ఇటీవల హీరోయిన్ నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పిల్లలను కనాలంటే పెళ్లి అవసరం లేదని అన్నారు. అది మన వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి తాను పెళ్లి చేసుకోకుండానే హ్యాపీగా ఉన్నానని తెలిపింది. తాజాగా నిత్యామీనన్ బాటలో స్టార్ నటుడి కుమార్తె నిలిచింది. ఇప్పటికే నిత్యామీనన్ చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో.. తాజాగా నటుడు సత్యరాజ్ కూతురు దివ్య చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి.వివాహ వ్యవస్థ పట్ల తనకు గౌరవం ఉందని దివ్య తెలిపింది. వ్యక్తిగతంగా తాను పెళ్లి బంధాన్ని విశ్వసించనని పేర్కొంది. కేవలం మంగళసూత్రం కట్టడం వల్లనో లేదంటే ఉంగరాలు మార్చుకోవడం వల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం బలపడుతుందని నేను భావించడం లేదని వెల్లడించింది. ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారం, ప్రేమతో కలిసి జీవించవచ్చని దివ్య స్పష్టం చేసింది. కలిసి జీవించడానికి పెళ్లి అనే సామాజిక ముద్ర, ధృవీకరణ పత్రం అవసరం లేదంటూ దివ్య సత్యరాజ్ కుండ బద్దలు కొట్టింది. -
'తిరుమలలో పెళ్లి జరగడం నా అదృష్టం..' బెల్లంకొండ
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి పీటలెక్కనున్నారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆయన పెళ్లి వేడుక జరగనుంది. కావ్య రెడ్డి అనే యువతిని పెళ్లాడనున్నారు. వీరిద్దరు పెళ్లి ఈ రోజు రాత్రి 11: 13 గంటలకు సాయి శ్రీవారి సాక్షిగా ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో జరగనుంది.ఈ సందర్భంగా హీరో సాయి శ్రీనివాస్ ఆసక్తకర కామెంట్స్ చేశారు. తిరుమలలో పెళ్లి చేసుకోవాలంటే శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అదృష్టం, ఆశీర్వాదం ఉండాలని అన్నారు. మా అమ్మ, నాన్నలు నాకు ఆ స్వామి పేరునే పెట్టారని తెలిపారు. తిరుమలలో పెళ్లి చేసుకునే అదృష్టం దొరకడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ రోజు నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని రోజుగా మిగిలిపోతుందన్నారు. నా చిన్నప్పటి నుంచి తిరుమలలో శ్రీనివాస కల్యాణం చూస్తూ పెరిగానని తెలిపారు. నా ఫియాన్నీ వచ్చాక శ్రీనివాసకావ్యాణం అని పేరు పెట్టారు. నా లైఫ్‌లో స్వామివారి పాదాల చెంత పెళ్లి చేసుకోవాలని ఎదురుచూస్తున్నట్లు సంతోషం వ్యక్తం చేశారు. -
జస్ట్, పెళ్లికి ముందు : వరుడి వింత ప్రశ్న, అతిథులు అవాక్కు
ఇరాన్ వార్ ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. ముఖ్యంగా ఇండియాలో వంటగ్యాస్ సరఫరాపై ఆందోళన తీవ్రంగానే ఉంది. దీనికి ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక సంఘటన నిదర్శనం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సాధారణంగా పెళ్లిళ్లలో కట్నకానుకలు, విందులో లేదా ఇతర డిమాండ్ల గురించి వింటుంటాం, కానీ ఇక్కడ ఒక వింత సంఘటన జరిగింది.రాష్ట్రంలోని బారాబంకి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఒక్క పక్క పెళ్లి తతంగం జరుగుతుండగానే గ్యాస్ ధరలు పెరగడం లేదాకొరత ఏర్పడటం వంటి పరిస్థితులువస్తే, ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పెళ్లి కొడుకు అశోక్‌కు వచ్చిన సందేహం ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. వరుడు అందరి ముందూ వధువుని పట్టుకుని ఒక ఊహించని ప్రశ్న వేశాడు.అసలు ఏం జరిగింది?అందరూ పెళ్లి సంబరాల్లో మునిగితేలుతుండగా, అకస్మాత్తుగా "ఒకవేళ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లేకపోతే, నువ్వు కట్టెల పొయ్యి మీద వంట చేయగలవా?" అని అడిగాడు పెళ్లి కూతుర్ని కాబోయే భర్త. ఈ ప్రశ్న వినగానే అక్కడ ఉన్న బంధువులు, అతిథులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. పెళ్లి సమయంలో ఇలాంటి ప్రశ్న ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు.దీనికి వధువు సమాధానం విని అందరూ సంతోషంగా తెగ నవ్వు కున్నారు.వధువు సమాధానంవధువు ఏమాత్రం తడబడకుండా చాలా ధైర్యంగా సమాధానం చెప్పింది. తనకు కట్టెల పొయ్యి మీద వంట చేయడం వచ్చని, అలా వండటానికి తనకేమీ ఇబ్బంది లేదని స్పష్టం చేసింది. వధువు ఇచ్చిన ఈ సమాధానంతో వరుడు సంతోషించి, పెళ్లి తంతును ముందుకు సాగించాడు. వైరల్ అవుతున్న వీడియోలో పెళ్లి ముగిసిన తర్వాత వధూవరులిద్దరూ కారులో కూర్చుని ఉండగా, ఒక వ్యక్తి కెమెరాతో వారి వద్దకు వెళ్తాడు. ముందు ముందు ఇబ్బంది రాకూడదనే ఈ ప్రశ్న అడిగానని వరుడు వివరణ ఇచ్చాడు. దీంతో వధువు ముసిముసిగా నవ్వుకుంది.నెటిజన్ల స్పందనఈ వీడియోపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు ఇది చాలా ప్రాక్టికల్ ఆలోచన అని మెచ్చుకుంటున్నారు. ఈ కాలంలో పెళ్లి కూతురు దొరకడమే కష్టమంటే, ఇప్పుడు 'పొయ్యి టెస్ట్' కూడా మొదలుపెట్టారా?" అంటూ మరికొందరు సరదాగా కామెంట్స్ చేశారు. మొత్తానికి, ఈ "కట్టెల పొయ్యి" ప్రశ్నదేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: చిన్నారుల కాళ్లు, చేతులు, కట్టేసి : డేకేర్ సెంటర్లో అమానుషం -
'పిల్లల కోసం పెళ్లే కానక్కర్లేదు'.. టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
హీరోయిన్ నిత్యామీనన్ గురించి తెలుగువారికి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన హీరోయిన్గా మెప్పించింది. అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళ ముద్దుగుమ్మ తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. గతేడాది ఇడ్లీ కొట్టు, తలైవన్ తలైవి, కాదలిక్కా నెరమిల్లై చిత్రాల్లో కనిపించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నారు. కేయూరీ ప్రొడక్షన్స్ అనే పేరుతో నిర్మాణ సంస్థ కూడా ప్రారంభించారు.అయితే ఇటీవలే 39వ వసంతంలోకి అడుగుపెట్టిన మలయాళ బ్యూటీ పెళ్లి గురించి గతంలో చాలాసార్లు మాట్లాడింది. తాజాగా మరోసారి పెళ్లిపై నిత్యా చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. గతంలో సరైన వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటానని చెప్పిన ముద్దుగుమ్మ.. పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం మాత్రమేనని అన్నారు. తాజాగా మరోసారి పెళ్లి, పిల్లలు అనే కాన్సెప్ట్‌పై మాట్లాడింది. ఈ సందర్భంగా ఆసక్తికర కామెంట్స్ చేసింది.పెళ్లికి.. పిల్లల్ని కనడానికి ఎలాంటి సంబంధం లేదని నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పిల్లలు కావాలనుకోవడం అనేది పూర్తిగా మన వ్యక్తిగత నిర్ణయమని అన్నారు. అందుకు పెళ్లి ఒక్కటే మార్గం కాదన్నారు. పెళ్లి చేసుకోకుండా పిల్లలను కనడం తప్పేం కాదని నిత్యామీనన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. పెళ్లి కేవలం లైఫ్‌లో ఓ పార్ట్ మాత్రమేనని.. ప్రస్తుతం తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్నారు. పిల్లల్ని కనడానికి పెళ్లికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తనపై ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపారు. సింగిల్ లైఫ్‌ను ఆస్వాదిస్తున్నానని పేర్కొన్నారు. -
టీడీపీ నేత ఇంట్లో పెళ్లి రగడ.. ఇరు కుటుంబాలపై కేసులు
హైదరాబాద్: పెళ్లి సంబంధం విషయంలో తలెత్తిన వివాదంలో రెండు కుటుంబాలపై కేసులు నమోదయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ లో నివాసముంటున్న సుధాకర్ పెండ్యాల, అతని కుమారుడు సాయి అక్షయ్ కుమార్ దివీస్ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. రాజేంద్రనగర్‌లో నివాసం ఉంటున్న టీడీపీ నేత, నోవా మెడికల్ కళాశాలల చైర్మన్ ముత్తంశెట్టి కృష్ణారావు, డా.విజయ నిర్మల కుమార్తెతో సాయి అక్షయ్ కుమార్‌కు వివాహం కుదిరింది. ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్నాడని నమ్మించడంతో రూ.1 కోటి వరకట్నంతో పాటు ఖరీదైన బహుమతులు, బీఎండబ్ల్యూ కారు, ఖరీదైన వాచీలు ఇచ్చారు. భారీగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఆ తరువాత ఇరు కుటుంబాల మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఉద్యోగం విషయంలో అబద్దాలు చెప్పారని ఆరోపించారు. దీంతో పెళ్లి రద్దు చేసుకుంటున్నామని సుధాకర్ తెలిపారు. తాము ఇచ్చిన కట్న కానుకలు, ఎంగేజ్మెంట్ కోసం పెట్టిన ఖర్చును వెనక్కి ఇవ్వాలంటూ కోరగా డబ్బులు వెనక్కి ఇవ్వకపోవడంతో పాటు తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం ప్రారంభం చేస్తున్నారంటూ రెండ్రోజుల క్రితం నోవా మెడికల్ కాలేజ్ చైర్ పర్సన్ డా.విజయ నిర్మలతో పాటు సుమారు 70 మంది పెండ్యాల సుధాకర్ ఇంటివద్దకు వచ్చి హల్చల్ చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా బాధితులు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డ పెళ్లి కూతురి తల్లి డా. విజయనిర్మలతో పాటు ఆమె అనుచరులపై చర్యలు తీసుకోవాలంటూ పెండ్యాల సుధాకర్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా విజయనిర్మల కూడా జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన ప్రముఖ క్యాస్టింగ్ డైరెక్టర్
ఇప్పుడంతా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ పెళ్లి భాజాలు మోగుతున్నాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ క్యాస్టింగ్ డైరెక్టర్ షానూ శర్మ పెళ్లి చేసుకుంది. తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ శుభవార్త తెలుసుకున్న బాలీవుడ్ స్టార్స్ నూతన దంపతులకు విషెసె చెబుతున్నారు. రణవీర్ సింగ్, కృతి సనన్, పరిణీతి చోప్రా, ఖుషీ కపూర్, శర్వరి, వాణి కపూర్, వరుణ్ ధావన్, రష్మిక మందన్నతో సహా పలువురు సినీ ప్రముఖులు ఈ జంటకు అభినందనలు తెలిపారు. అయితే ఆమె తన భర్త వివరాలను వెల్లడించలేదు.కాగా.. షానూ శర్మ పలువురు బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు క్యాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేసింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కీలక పాత్రల్లో వచ్చిన వార్-2 మూవీకి సైతం వర్క్ చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు నటుల కెరీర్‌ను తీర్చిదిద్దడంలో షానూ ప్రధాన పాత్ర పోషించింది. ఆమె రణ్వీర్ సింగ్ బ్యాండ్ బాజా బారాత్, వాణి కపూర్ మూవీ దమ్ లగా కే హైషాలో, అర్జున్ కపూర్ ఇషాక్జాదే చిత్రాలకు నటీనటులను ఎంపికచేసింది. అనుష్క శర్మ నటించిన రబ్ నే బనా ది జోడి మూవీకి క్యాస్టింగ్ డైరెక్టర్‌గా సేవలందించారు. గతేడాది రిలీజైన సైయారా మూవీకి అహాన్ పాండే, అనీత్ పడ్డాను షానూ శర్మనే ఎంపిక చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా మారింది. View this post on Instagram A post shared by Shanoo Sharma🌻 (@shanoosharmarahihai) -
అలాంటి వ్యక్తి దొరకాలి!
చూడగానే పక్కింటి అమ్మాయిలా స్క్రీన్ మీద మెరిసిన ‘సీతామహాలక్ష్మి’ మన మృణాల్ ఠాకూర్. తన మనసులో ఏమున్నా దాచుకోకుండా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం ఆమె స్టయిల్. బాడీ ఇమేజ్ పోరాటాల నుంచి, తనపై వచ్చే గాసిప్స్ వరకు ప్రతి విషయాన్ని ధైర్యంగా పంచుకున్న ముచ్చట్లు ఇప్పుడు మీకోసం..గాసిప్స్? నవ్వేసి ముందుకెళ్తాను!నా పెళ్లి గురించి వచ్చే వార్తలు చూస్తే నాకే నవ్వొస్తుంది. ముఖ్యంగా ఒక తమిళ హీరోతో వచ్చిన పెళ్లి వార్తల్లో అస్సలు నిజం లేదు. అలాంటి వార్తలు చదివితే, ‘ఫిబ్రవరి 14 ఒక్కసారిగా ఏప్రిల్ 1 అయిపోయిందేమో’ అని అనిపిస్తుంది.ట్రోల్ చేసినా.. నిలబడ్డాను!బాడీ షేమింగ్ గురించి చాలా బాధపడ్డాను. నన్ను ‘మట్కా’ అని పిలిచినప్పుడు చాలా కుంగిపోయాను. కానీ ఇప్పుడు నా శరీరంపై నాకు గౌరవం ఉంది. ఎవరో నన్ను నిర్వచించడం కాదు. నేను నన్ను ఎలా చూసుకుంటున్నాననేదే ముఖ్యం.బ్రేకప్ ఇచ్చిన బలంప్రస్తుతం నేను సింగిల్‌గానే ఉన్నాను. నా కోసం ఎవరినీ వెతకడం లేదు. ఎందుకంటే, నాకు కియానూ రీవ్స్ లాంటి వ్యక్తి దొరికితే బాగుంటుంది అని అనిపిస్తుంది. గతంలో ఒక రిలేషన్ ఉంది. అయితే, నేను నటిని అనే నిజాన్ని అతను అంగీకరించలేక పోయాడు. ఆ బ్రేకప్ నన్ను మరింత బలంగా మార్చింది.అమ్మకు ఇచ్చిన మాట!చిన్నప్పుడొక బాధాకరమైన జ్ఞాపకం ఉంది. మా ఆర్థిక పరిస్థితి బాగోలేని రోజుల్లో, మా అమ్మను చుట్టాలు తమ కార్లలో కూర్చోనివ్వని సందర్భాలు చూశాను. అప్పుడే నేను ఒక మాట ఇచ్చాను. ‘ఒకరోజు నువ్వు ఊహించని కారు కొనిస్తాను’ అని. ఈ రోజు ఆ మాటను నిలబెట్టుకున్నాను.చీకటి దశ నుంచి వెలుగులోకి!నా జీవితంలో ఒకప్పుడు చాలా కష్టమైన దశ వచ్చింది. లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తూ ఆలోచించేటప్పుడు చాలాసార్లు నిరాశగా అనిపించేది. ఇప్పుడు ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి రావడం, నా పోరాటానికి నిదర్శనం. ప్రస్తుతం గ్లామర్ పాత్రలు చేసినా, టెలివిజన్ నుంచి వచ్చిన అమ్మాయి అనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోను. అదే నా పునాది.నేను సిద్ధంగా లేనప్పుడు నో వే!నా కెరీర్ మొదట్లో చాలా పెద్ద అవకాశాలు వచ్చాయి. కాని, ఆ పాత్రలకు నేను మానసికంగా సిద్ధంగా లేనప్పుడు వాటిని వదిలేశాను. ఒకవేళ అప్పుడు బలవంతంగా చేసి ఉంటే, నన్ను నేను కోల్పోయేదాన్ని. అలాగే, కెరీర్ మొదట్లో కొన్ని సన్నివేశాలు చేయాల్సి వస్తుందని తెలిసి, చాలా పెద్ద సినిమాలు వదిలేశాను. అవకాశాలు కోల్పోయినా, నా విలువల విషయంలో మాత్రం ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. అదే నా అసలైన విజయం. -
పెళ్లిచేస్తే మా అబ్బాయి బాగు పడతాడా?
మా అబ్బాయి వయసు ఇరవై నాలుగు. మాది మేనరికం కావడం వల్ల అనుకుంటాను, చిన్నప్పటి నుంచి అతనికి నడక, మాటలు కొంచెం ఆలస్యంగా వచ్చాయి. ఐదేళ్ల వయసులో స్కూల్‌కు పంపించాము. ఐదవ తరగతి వరకు బాగానే చదివాడు. కానీ ఆరవ తరగతి నుంచి విషయాలు గుర్తుంచుకోలేకపోవడం, సబ్జెక్టుల్లో ఫెయిల్ అవడం జరుగుతుండేది. టీచర్లు మమ్మల్ని పిలిచి, అబ్బాయికి చదువు కష్టంగా ఉందని చెప్పేవారు. అయితే, మేము అతన్ని ఎలాగోలా పదోతరగతి పాస్ చేయించాము. తర్వాత ఓపెన్ స్కూలింగ్ ద్వారా ఇంటర్, డిగ్రీ కూడా పూర్తి చేయించాము. అబ్బాయి చూడడానికి బాగుంటాడు. బైక్ కూడా బాగా నడుపుతాడు. మేము బయటకి పంపించి ఏదైనా తీసుకు రమ్మంటే తీసుకు వస్తాడు. కానీ తనంతట తానే నిర్ణయాలు తీసుకోలేడు. అతను సినిమా లేదా టీవీలో హీరోయిన్ ను చూసినప్పుడు, లేదా బయట ఆడవాళ్లను చూసినప్పుడు కొంచెం ఎగ్జైట్ అవుతున్నాడు. మాకు ఆ విషయం అర్థమవుతోంది. ఇప్పుడు మేము అతనికి పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. పెళ్లి వల్ల అతని తెలివితేటలు పెరుగుతాయని మా చుట్టాలందరూ అంటున్నారు. పెళ్లి చేస్తే నిజంగా మా అబ్బాయి బాగుపడతాడా? దయచేసి మాకు సరైన సలహా ఇవ్వగలరు.– రామకృష్ణారావు, రాయచూరుమీ అబ్బాయి విషయంలో మీరు పడుతున్న తాపత్రయం అర్థమవుతోంది. మేనరికం వల్ల కలిగే జన్యుపరమైన ప్రభావాల వల్ల కొందరిలో శారీరక ఎదుగుదల బాగున్నా, మెదడు పరిణతి ఆశించిన స్థాయిలో ఉండదు. దీనినే ‘మేధోపరమైన వైకల్యం’ అంటాము. మీరు గమనించినట్లు చదువులో వెనుకబడటం, సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం కేవలం నిర్లక్ష్యం వల్ల వచ్చేవి కావు, అవి అతని మెదడు గ్రహణశక్తి పరిమితులను సూచిస్తాయి. మన సమాజంలో ‘పెళ్లి చేస్తే బాధ్యత వస్తుంది, తెలివి తేటలుపెరుగుతాయి’ అనే ఒక బలమైన అపోహ ఉంది. కానీ శాస్త్రీయంగా పెళ్లి వల్ల మేధోశక్తి పెరగదు, పైగా కొత్తగా వచ్చే సామాజిక వైవాహిక బాధ్యతలు అతనిపై మానసిక ఒత్తిడిని పెంచుతాయి. వైవాహిక జీవితంలో కేవలం శారీరక ఆకర్షణే కాకుండా, ఎదుటి వ్యక్తి భావాలను అర్థంచేసుకోవడం, ఆర్థికంగా కుటుంబాన్ని నడపడం, సమస్యలను పరిష్కరించుకోవడం వంటి ‘అడాప్టివ్ ఫంక్షనింగ్’ నైపుణ్యాలు చాలా కీలకం. కేవలం చూసేందుకు బాగున్నాడు కదా అని లేదా కోరికలు ఉన్నాయి కదా అని పెళ్లిచేయడం సరైన పరిష్కారం కాదు. ఇది ఇటు మీ అబ్బాయికి, ఇటు పెళ్లి చేసుకుని వచ్చే అమ్మాయికి కూడా ఇబ్బందికరంగా మారవచ్చు. పెళ్లి చేస్తే తిక్క కుదురుతుందనేది పాత నానుడి. కానీ సరైన మానసిక పరిణితి లేని పెళ్లి కొత్త చిక్కులకు నాంది అనేది నేటి పరిస్థితి. మొదట స్థానికంగా ఉన్న మనోవైద్యుని సంప్రదించి అతనికి ఐక్యూ సోషల్ మెచ్యూరిటీ పరీక్షలు చేయించండి. అతని మానసిక వయసు ఎంతో తెలుసుకోవడం వల్ల, అతను ఒక సంసారాన్ని మోయగలడా లేదా అనేది స్పష్టమవుతుంది. ఆ నివేదికల ఆధారంగా నిపుణుల సలహాతో ముందడుగు వేయడం మీ అందరికీ శ్రేయస్కరం. అలాగే, పెళ్లి సంబంధం చూసేటప్పుడు అవతలి వారికి అన్నీ నిజాలు చె΄్పాలి. నిజం దాచి పెళ్లిచేస్తే, భవిష్యత్తులో రకరకాలైన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి తొందరపడకండి. అన్ని వైపుల నుంచి ఆలోచించి సరియైన నిర్ణయం తీసుకోండి. డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్,విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
వారం రోజుల్లో పెళ్లి.. బావిలో శవమై తేలిన యువతి
మరిపెడ రూరల్: ఆ ఇద్దరూ ఒక్కటవ్వాలనుకున్నారు.. కానీ విధి మరోలా తలచింది. రెండేళ్ల ప్రేమ, పెళ్లి కోసం చేసిన పోరాటం ఇవన్నీ కళ్లముందే ఉండగా, ఆ యువతి విగతజీవిగా మారింది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి, అనుమానాస్పద స్థితిలో బావిలో శవమై తేలింది. ఇటుకలగడ్డతండాలో కలకలం రేపిన ఈ సంఘటన వివరాలివి. ప్రేమ యుద్ధం చేసి..: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఇటుకలగడ్డతండాకు చెందిన భూక్య వెంకన్న, వినోద దంపతుల చిన్న కూతురు సంగీత (19), మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని కొత్తతండాకు చెందిన అజ్మీర అరవింద్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమను ఒప్పించే క్రమంలో సంగీత గతంలో ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడింది. చివరకు వారి ప్రేమను ఇరుకుటుంబాలు అంగీకరించి, ఈ నెల 29న పెళ్లి ముహూర్తం ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం అరవింద్ ఇంట్లో జరిగిన ఓ శుభకార్యానికి సంగీత కుటుంబ సభ్యులు హాజరయ్యారు. సంగీత ఇటుకలగడ్డతండాలో ఒక్కతే ఉండగా అరవింద్ బైక్‌పై వచ్చి యువతిని తీసుకుని తండా శివారులోకి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మర్నాడు బుధవారం తండా శివారులోని ఓ వ్యవసాయ బావిలో సంగీత మృతదేహం లభించింది. బావి సమీపంలో రక్తపు మరకలతో ఓ చెప్పులు కనిపించడంతో సంగీత మృతిపై పలు అనుమానాలకు తావిస్తోంది. కాబోయే భర్తే తమ కూతురిని అన్యాయంగా హత్య చేసి బావిలో పడేశాడని మృతురాలి తల్లిదండ్రులు వెంకన్న, వినోద ఆరోపించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
నిన్ను చూస్తే నాకు ఫీలింగ్స్ రావడంలేదు!
కడప అర్బన్: చుక్కలాంటి అమ్మాయికి.. చక్కనైన అబ్బాయికి ఆర్భాటంగా నిశ్చితార్థం చేశారు. వివాహ ముహూర్తం నిర్ణయించారు. ఈ మధ్యలోనే అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరుగా తెలుసుకునేందుకు సెల్ఫోన్లలో మాట్లాడుకోవడం, చాటింగ్‌లు చేసుకున్నారు. ఏమైందో ఏమో సదరు యువకుడు ఉన్నట్లుండి తనకు వివాహం చేసుకోవడం ఇష్టం లేదని, ఇప్పటికే నలుగురు యువతులతో ప్రేమ వ్యవహారం నడిచిందని చెప్పుకొచ్చాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువతి ఈ నెల 20 తేదీన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కడప చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమో దు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎస్ఐ ప్రతాప్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. కడప ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పటేల్ రోడ్డుకు చెందిన రెహనా(26) ఎమ్మెస్సీ పూర్తి చేసుకుని ఇంటి వద్ద ఉంటోంది. తండ్రి నాదెళ్ల రాజా మధ్యవర్తుల ద్వారా ప్రొద్దుటూరుకు చెందిన వీర కుమారుడు షాజహాన్తో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. ఈఏడాది ఫిబ్రవరి 15వ తేదీన ఇందిరానగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో నిశ్చితార్థం వేడుక జరిగింది. ఆగస్టులో పెళ్లి చేయాలనుకున్నారు. ఈ క్రమంలో షాజహాన్ పెళ్లి ఇష్టం లేదంటూ యువతికి చెప్పడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి నాదెండ్ల రాజా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని మంగళవారం మార్చురీకి తరలించారు. -
పెళ్లి విందులో మ్యాంగో జ్యూస్? 400మందికి అస్వస్థత
గుజరాత్‌లోని దాహోద్ జిల్లాలో జరిగిన ఒక పెళ్లి వేడుక దుమారాన్ని రాజేసింది.పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్ కారణంగా సుమారు 400 మందికి పైగా అతిథులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సుమారు 400 మందికి పైగా వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డారు. వీరిలో 60 మంది పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఈ ఘటనపై భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) స్పందించింది.దాహోద్ జిల్లాలోని అభ్లోద్ గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి విందు భోజనం చేసిన తర్వాత, రాత్రి 11 గంటల సమయంలో ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. ఒక్కొక్కరికి వాంతులు, విరేచనాలు కావడంతో ఆందోళన మొదలైంది. ఆ తరువాత కుటుంబ సభ్యులు, స్థానికులు బాధితులను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆరోగ్య శాఖ అధికారులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. దాహోద్ కలెక్టర్ యోగేష్ నిర్గుడే తెలిపిన వివరాల ప్రకారం, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల పరిస్థితి ప్రస్తుతం స్థిరంగానే ఉంది. పెళ్లి విందులో వడ్డించిన మామిడి రసం (Mango Juice) తాగడం వల్లే ఈ సమస్య తలెత్తి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఇదీ చదవండి: కేరళంలో భారీ పేలుడు, పలువురు మృతిFSSAI సీరియస్కేంద్ర ఆహార నియంత్రణ సంస్థ (FSSAI) ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని గుజరాత్ రాష్ట్ర ఆహార కమిషనర్‌ను ఆదేశించింది. విందులో వడ్డించిన ఆహార పదార్థాల నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ప్రాథమిక అంచనా ప్రకారం, ఆహారం కలుషితం కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. ఆహార నమూనాలను సేకరించి, పరీక్షలు నిర్వహించడంలో రాష్ట్ర అధికారులకు సహాయం చేస్తోంది. దర్యాప్తులో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని FSSAI స్పష్టం చేసింది. -
పెళ్లి పేరిట సహచర కానిస్టేబుల్ మోసం
బంజారాహిల్స్: సహచర కానిస్టేబుల్ ప్రేమించినట్లు నటించి పెళ్లి చేసుకుంటానని మోసగించడంతో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు యత్నించింది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ విభేదాల కారణంగా భర్తతో వేరుగా ఉంటోంది. కోర్టులో విడాకుల ప్రక్రియ కొనసాగుతుంది. ఆమెకు నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లోనే సహచర కానిస్టేబుల్ కప్షా స్వప్నిల్(27)తో 2024లో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సన్నిహితంగా మెలిగాడు. ఆమెకు రెండుసార్లు గర్భస్రావం చేయించాడు. కొద్దిరోజులుగా ఆమెను మతపరంగా అవమానించడం, దుర్భాషలాడటమే కాకుండా మరో యువతితో సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం తెలిసిన బాధితురాలు ఈ నెల 14న శ్రీకృష్ణానగర్‌లోని తన గదిలో స్వప్నిల్‌తో గొడవ పడింది. పెళ్లి చేసుకునేది లేదని నిందితుడు తెగేసి చెప్పడమేకాకుండా నిద్రమాత్రలు వేసుకోవాలని ఒత్తిడి చేశాడు. దీంతో పెద్దమొత్తంలో నిద్రమాత్రలు మింగి అపస్మారకస్థితికి వెళ్లింది. ఈ నెల 16న ఆస్పత్రిలో చేర్చగా సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఆమె నుంచి ఫిర్యాదు తీసుకుని స్వప్నిల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరితో బ్రేకప్.. పెళ్లికి స్టార్ హీరోయిన్ రెడీ..!
కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తమిళంతో పాటు తెలుగులో సినిమాలు చేసింది. చివరిసారిగా రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ మూవీలో కనిపించింది. ఇప్పటికైతే ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. సినిమాలతో కాకపోయినా.. వ్యక్తిగత అంశాలతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా శృతికి సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. అదేంటో మనం కూడా ఓ లుక్కేద్దాం.అయితే గతంలో బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోయిన ముద్దుగుమ్మ.. సింగిల్‌గానే ఉంటోంది. ఈ నేపథ్యంలోనే శృతిహాసన్ గురించి కోలీవుడ్‌లో ఓ టాక్ వినిపిస్తోంది. శృతి పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. పెద్దలు కుదిర్చిన వాడితోనే మూడుముళ్లకు రెడీ అయినట్లు లేటేస్ట్ టాక్. వరుడిని కోసం ఆమె తండ్రి కమల్ హాసన్ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని సంబంధాలను చూడగా.. అవీ వారికి నచ్చలేదని సమాచారం. వీలైనంత త్వరగా శృతి హాసన్‌కు మ్యారేజ్ చేయాలని కమల్ రెడీగా ఉన్నట్లు కోలీవుడ్ టాక్. అయితే ఈ విషయంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.కాగా.. గతంలో లండన్‌కు చెందిన ఆర్టిస్ట్ మైఖేల్ కోర్సలేతో శృతి డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత విజువల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతోనూ బ్రేకప్ అయింది. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్‌కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో దీనిపై మరింత క్లారిటీ రానుంది. -
స్టార్ హీరో కుమారుడితో పెళ్లి.. హీరోయిన్ మదర్ రియాక్షన్..!
కొత్త లోకా మూవీతో టాలీవుడ్‌లోనూ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్. ఈ కోలీవుడ్ బ్యూటీ ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్లో కనిపించనుంది. ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాదిలోనే ప్రారంభం కానుంది. అంతేకాకుండా తమిళం, మలయాళ చిత్రాల్లో హీరోయిన్గా మెప్పించిన ముద్దుగుమ్మ.. 2022లో వచ్చిన 'హృదయం' చిత్రంలో నటించింది. ఈ మూవీలో మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా నటించారు. ఈ చిత్రంలో వీరిద్దరు భార్యా, భర్తలుగా మెప్పించారు. తెరపై వీరద్దరి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది.దీంతో నిజ జీవితంలోనూ వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. కల్యాణి ప్రియదర్శన్, ప్రణవ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని వార్తలొస్తున్నాయి. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హీరోయిన్ మదర్ లిస్సీ ప్రియదర్శన్ స్పందించింది. అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. ఇవన్నీ ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది.సోషల్ మీడియాలో ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు హీరోయిన్ కల్యాణి మదర్ లిస్సీ ప్రియదర్శన్ రిప్లై ఇచ్చింది. కళ్యాణి, ప్రణవ్ పెళ్లి కోసం వెయిటింగ్ అని నెటిజన్ కామెంట్ చేయగా.. అది తప్పుడు వార్త అంటూ లిస్సీ రూమర్స్‌కు చెక్ పెట్టింది. వారిద్దరి మధ్య ఎలాంటి లవ్, డేటింగ్ లాంటి రిలేషన్స్ లేవని ఆమె గతంలోనే స్పష్టం చేసింది. కళ్యాణి ఇప్పటి వరకు ఎవరితోనూ ప్రేమలో లేదని లిస్సీ తేల్చి చెప్పంది. దీంతో కొన్ని రోజులుగా వస్తున్న వీరిద్దరి వెడ్డింగ్ రూమర్స్‌కు తెరపడింది. -
ఇన్‌స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి
ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాకు చెందిన 21 ఏళ్ల యువకుడు, 40ఏళ్ల వితంతువు చేసిన పని నెట్టింట చర్చనీయాంశంగా మారింది. సోషల్‌మీడియా పరిచయం పెళ్లికి దారి తీసింది. మరి వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారా? నెటిజన్లు ఏమంటున్నారు? సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ ఉదంతం గురించి తెలుసుకుందాంఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వీరిద్దరూ ఒకరికొకరు పరిచయమయ్యారు. 'రీల్స్' చాటింగ్ ద్వారా వీరి పరచయం కాస్తా ప్రణయంగా మారింది. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి జీవించాలని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒక రోజు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇరు కుటుంబ సహ్యులకు ఎవరికి సమాచారం ఇవ్వకుండా, రహస్యంగా, గుడిలో పెళ్లి చేసుకున్నారు.కలిసి జీవితం మొదలుపెట్టారు. చివరికి ఈ విషయం అబ్బాయి తల్లికి తెలిసింది. ఆగ్రాలోని మహిళ ఇంట్లో ఇద్దరినీ గుర్తించారు. కానీ కుటుంబ సభ్యులు ఈ యువకుడిని ఇంట్లో ఉంచుకోవడానికి నిరాకరించారు.ఇదీ చదవండి: టీసీఎస్ వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్దీనిపై నెటిజనులలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమైనాయి. ఇది నిజమైన ప్రేమా లేక కేవలం తాత్కాలిక ఆకర్షణా? 19 ఏళ్ల వయసు వ్యత్యాసం, రహస్య వివాహం ఎంతవరకు నిలబడుతుంది అని కొందరు ప్రశ్నించగా, కుటుంబ మద్దతు లేకుండా ఇంత పెద్ద అడుగు వేయడం కష్టమే, అని ఒకరు వర్చువల్ చాటింగ్, రీల్స్‌ను చూసి నిజజీవితంలో నిజమని నమ్మితే ఇలాంటి పరిణామాలే సంభవిస్తాయని కొందరు వ్యాఖ్యానించారు. ఇన్‌స్టాలో పరిచయం అయిన ఒక మహిళ కోసం తన కుటుంబాన్ని, ఇంటిని త్యాగం చేశాడు. సోషల్ మీడియాలో కలిసిన ఒక అపరిచితుడి కోసం ఏ అబ్బాయి లేదా అమ్మాయైనా తమ తల్లిదండ్రులను, విలువలను పణంగా పెట్టడం పచ్చి అవివేకం, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎంత దూరమైనా వెళతాయి అనేందుకు ఈ ఘటనే నిదర్శనం అని మరికొందరు వ్యాఖ్యానించారు ఇద్దరూ చట్టపరంగా వయోజనులే, కాబట్టి వారి వివాహం చట్టబద్ధమే. ఎలాంటి కష్టనష్టాలొచ్చినా వారే భరిస్తారు. కానీ వీరి సంబంధం కలకాలం నిలబడాలంటే అధిక భావోద్వేగ పరిపక్వత, బలమైన విశ్వాసం అవసరమని నిపుణులు చెబుతున్న మాట.ఇదీ చదవండి: రూ.90 లక్షలు ఇస్తేనే ఫస్ట్‌నైట్ : తీవ్ర ఘర్షణ, కట్ చేస్తే! -
పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టాల్సిందే
ఒకప్పుడు ఒక ఇంటికి పిల్లను పంపించాలంటే అత్తగారు ఎలా ఉంటారో.. ఎలాంటి వారో అని తల్లిదండ్రులు అనుకునేవారు. అనేక మందిని విచారించి గాని పెళ్లి చేసేవారు కాదు. అత్త గయ్యాలి అయితే ఆ ఇంటిలోని మగ పిల్లలకు అస్సలు పెళ్లిళ్లు అయ్యేవి కావు. కొత్త కోడలు ఇంటికి రాగానే అత్తల పెత్తనం ఎక్కువగా ఉండేది. ఎక్కువగా మాట్లాడినా, మాట్లాడకున్నా తప్పు పట్టేవారు. దీన్ని ఆధారంగా తీసుకునే సినిమాలు కూడా వచ్చాయి. ఆ సమయంలో అత్త అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది సూర్యకాంతం. కాలం మారింది. కోడళ్లపై అత్తల పెత్తనం తగ్గింది. అత్తలు కోడళ్ల మాట విని మూలన కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. అత్తామామలతో కలిసి ఉండలేమని, పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టాలని యువతులు పెళ్లి చూపుల్లోనే తెగేసి చెబుతున్నారు. పలమనేరు : గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అత్తామామలు, అన్నదమ్ములు, కోడళ్లు, తోడి కోడళ్లు, ఆడ పడుచులు వారి మధ్య జరిగే గొడవ లు, ప్రేమాభిమానాలు సాధారణంగా అన్ని కుటుంబాల్లో కనిపించేవి. ఈ నేపథ్యంలో అత్త ఆధిపత్యం ప్రదర్శించడం ఎప్పటి నుంచో ఉంది. నేటి సమాజంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యాయి. గ్రామాల్లో సైతం ఉమ్మడి కుటుంబాలు వెతికినా కనిపించడం లేదు. పదేళ్ల క్రితం వరకు గ్రామంలో నాలుగైదు కుటుంబాలు ఉమ్మడిగా ఉండేవి. ఇప్పుడు ఎక్కడోగాని ఒకటి రెండు కూడా లేవు. వేరు కాపురాలు సర్వసాధరణంగా మారాయి. వారి వారి కుటుంబమే ముఖ్యమనే స్వార్థం పెరిగింది.పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టాల్సిందే పెళ్లి కాగానే కొత్త కాపురం పెట్టడం నేడు ట్రెండ్‌గా మారింది. భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తుడడం, లేదా భర్త ఉద్యోగం చేసే చోటుకు భార్య వెళ్లి వస్తుండడంతో వేరు కాపురాలు తప్పడంలేదు. కొందరు అమ్మాయిలు పెళ్లి అయినా అత్తామామలతో కలిసి ఉండబోమని, పెళ్లి అయ్యాక తమ ఇంటికి అత్తమామలు పెద్దగా రాకూడదంటూ ముందే చెబుతున్నారు. కాదు కూడదంటే పెళ్లి వయసు దాటుతుందనే భయంతో అబ్బాయిల తల్లిదండ్రులు అన్ని షరతులకు ఓకే చెప్పాల్సి వస్తోంది. ముఖ్యంగా నేడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే యువతులు తమ పెళ్లికి సంబంధించిన ప్రొఫైల్‌లోనే అనేక షరతులు పెడుతున్నారు. పెళ్లి అయిన తర్వాత అత్తామామలు ఉండకూడదని, తప్పనిసరిగా వేరుకాపురం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వేరు కాపురాలు పెట్టాక భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడం, గొడవలు పడిన సందర్భాల్లో కనీసం వీరికి నచ్చజెప్పే పెద్దలు లేక కొందరి జీవితాలు తెగతెంపులకు దారితీస్తున్నాయి. ఏది ఏమైనా మనల్ని సక్రమ మార్గంలో నడిపించే పెద్దలు, నాటి బంధాలు, బాంధవ్యాలకు నేటి తరం యూత్ దూరం చేసుకుంటోందనే మాట పెద్దతరం వారిలో వినిపిస్తోంది. -
కోటిన్నర కట్నం కోసం మధు మాస్టర్ ప్లాన్!
నల్గొండ జిల్లా : తాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినంటూ నమ్మించి పెళ్లి పేరుతో యువతి కుటుంబ సభ్యుల నుంచి రూ.కోటిన్నర కట్నం పొందాలని చూసిన మోసగాడి నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మాడుగులపల్లి మండలం చెరుపల్లి గ్రామానికి చెందిన పనస వెంకటయ్య, సుజాత దంపతుల కుమారుడు పనస మధు తాను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ) ఉద్యోగినని నమ్మించి నల్లగొండకు చెందిన యువతితో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు. అబ్బాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో యువతి కుటుంబ సభ్యులు భారీ కట్నం ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ సాకుతో మధు యువతిని హైదరాబాద్‌కు పిలి పించాడు. అక్కడ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి వేధింపులకు గురిచేశాడు. బాధితురాలు కుటుంబ సభ్యులకు విషయం తెలపడంతో వారు హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టగా.. మధు అసలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కాదని, అతడు చూపించిన ఐడీ కార్డు నకిలీదని, కట్నం కోసమే ఇదంతా ప్లాన్ చేసినట్లు నిర్ధారణ అయ్యింది. మధు తన స్నేహితులను సైతం తాను ఎఫ్‌సీఐ ఉద్యోగినంటూ నమ్మించినట్లు సమాచారం. మధుతో పాటు అతడి తల్లిదండ్రులు సైతం పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలిసింది. -
వధూవరులకు ‘దేవతాశీర్వాదం’
ఆదిలాబాద్ పట్టణంలో జరిగిన ఓ వివాహ వేడుకలో అరుదైన దృశ్యం ఆహూతులను మంత్రముగ్ధులను చేసింది. సాధారణంగా జరిగే పెళ్లి వేడుకలకంటే భిన్నంగా, ఈ పెళ్లిలో దేవతలే దివి నుంచి దిగివచ్చినట్లుగా అనిపించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ పెళ్లిలో, పెళ్లి కూతురి బంధువులు శివపార్వతులు, మహావిష్ణుమూర్తుల వేషధారణలో వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. ఈ వినూత్న ఆశీర్వాద కార్యక్రమం పెళ్లి వేడుకకు మరింత శోభను తీసుకొచి్చంది. పెళ్లికి వచి్చనవారు ఈ దృశ్యాలను తమ ఫోన్లలో బంధిస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. -
‘కుంభమేళా మోనాలిసా’ పెళ్లి.. చిక్కుల్లో సీపీఎం నేతలు
తిరువనంతపురం: ఆమధ్య కేరళలో జరిగిన ‘కుంభమేళా మోనాలిసా’ వివాహం తాజాగా సిపీఎం నేతలను చిక్కుల్లోకి నెట్టేసింది. నిన్నటి వరకు ఇది ‘రియల్ కేరళ స్టోరీ’ అంటూ మురిసిపోయిన సీపీఎం నేతలు ఇప్పుడు ఒక్కసారిగా మౌనం దాల్చారు. ప్రేమ వివాహం చేసుకున్న ఆ జంటను అక్కున చేర్చుకుని, ఘనంగా ఆశీర్వదించిన కేరళ నేతలు.. ఆ వధువు మైనర్ అని తెలియడంతో కంగుతిన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ‘కుంభమేళా మోనాలిసా’ వివాహ ఉదంతం ఇప్పుడు కేరళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.ఈ వివాహంపై మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. సోషల్ మీడియాలో ‘కుంభమేళా మోనాలిసా’గా గుర్తింపు పొందిన యువతి.. ఫర్మాన్ ఖాన్ అనే ముస్లిం యువకుడిని ఇటీవల కేరళలో వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లికి వధువు కుటుంబం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కేరళలోని అధికార సీపీఎం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఈ జంటకు అండగా నిలిచారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్ స్వయంగా ఈ వివాహ వేడుకకు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ‘ఇది అసలైన కేరళ స్టోరీ. మానవత్వాన్ని చాటిచెప్పే భూమిగా కేరళ ఈ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది’ అని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు. ఇటువంటి వివాహాలను ప్రోత్సహించడం, ఆశీర్వదించడం సమాజ బాధ్యత అని కూడా ఆయన అన్నారు. మంత్రి వి శివన్ కుట్టి, ఎంపీ ఏ.ఏ. రహీమ్ తదితర ముఖ్య నేతలు కూడా ఈ వేడుకలో పాల్గొని పూలమాలలతో కొత్త జంటను సత్కరించారు.అయితే తాజాగా వధువు మైనర్ అని పేర్కొంటూ మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేయడంతో కథ అడ్డం తిరిగింది. ఈ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండటంతో, గతంలో ఘనంగా వేడుకల్లో పాల్గొన్న సీపీఎం నాయకులు ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు. ‘పోక్సో’ చట్టం ప్రకారం మైనర్ల వివాహానికి సహకరించడం లేదా మద్దతు ఇవ్వడం నేరం. ఈ విధంగా చూస్తే పెళ్లికి సహకరించిన ప్రజాప్రతినిధులు చట్టపరమైన విచారణను ఎదుర్కోవాల్సి రావచ్చని తెలుస్తోంది. వివాహ సమయంలో జంట సమర్పించిన పత్రాలను మాత్రమే పరిశీలించామని, ఆ పత్రాలు నకిలీవన్న విషయం తమకు తెలియదని ఆలయ అధికారులు, కొందరు నేతలు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ సభలో దొంగల హల్చల్ -
మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఎలా, ఎపుడు చేసుకోవాలి? ఈ లాభాలు తెలుసా?
ఇచ్ఛాపురం: ఇటీవల సీజన్లో పెళ్లిళ్లు జోరుగా జరిగాయి. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన కొత్త జంటలు వివాహ ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీరి జీవితం కొత్తగా ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఏవైనా ప్రభుత్వం పథకాలు రావాలన్నా, రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేయించాలన్నా, పాస్‌పోర్టు, భూములకు సంబంధించిన మ్యుటేషన్లు ఇతరత్రా అవసరాలు ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం చాలా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో అప్పటికప్పుడు కార్యాలయాల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడుతూ చివరికి సర్టిఫికెట్ల కోసం బ్రోకర్లపై ఆధారపడి ఎక్కువ మొత్తంలో సొమ్ములు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులను కొత్త జంట ముందుగానే గుర్తించి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికెట్ పొందితే వారికే మంచిది.సర్టిఫికెట్ వల్ల ఉపయోగాలు పాస్‌పోర్టు అప్లికేషన్, బ్యాంక్ జాయింట్ అకౌంట్, కేంద్ర, రాష్ట్ర రక్షణ బలగాల్లో విధులు నిర్వహిస్తున్న వారి సర్వీస్ రికార్డుల్లో పేరు చేర్చుకునేందుకు, ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారికి వీసాప్రాసెస్, వీటితో పాటు ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఈ సర్టిఫికెట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నవ వధూవరులు పెళ్లి చేసుకొనే ప్రదేశం ఆధారంగా గ్రామం ఐతే గ్రామ సచివాలయం లేదా పంచా యతీ కార్యాలయం, పట్టణం ఐతే వార్డు సచివాలయం లేదా మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం వివాహ శుభలేఖ, జీలకర్ర బెల్లం తలపై పెట్టుకున్న వధూవరుల ఫొటో, మంగళసూత్రం కట్టేటప్పుడు ఫొటో, పూల దండలు మార్చుకున్నప్పుడు ఫొటోలు ఉండాలి. పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తె జనన ధ్రువీకరణ పత్రాలు, చిరునామా ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుల జిరాక్సులను జతచేయాలి. నవవధూవరుల తరఫున ఇద్దరు సాక్షులు, వారి ఆధార్ కార్డుల జిరాక్సు లను గ్రామ/వార్డు సచివాలయం లేదా పంచాయతీ కార్యాలయంలోగానీ మున్సిపల్ కార్యాలయంకు గానీ అందజేయాలి. జత చేసిన ధ్రువీకరణ పత్రాలను జనన, మరణ రిజి్రస్టేషన్ అధికారి పరిశీలించి సర్టిఫికెట్‌ని జారీ చేస్తారు. ఆలయాల్లో వివాహం చేసుకుంటే దేవదాయ శాఖకు మందస్తుగానే రుసుం చెల్లిస్తే అధికారులు రశీదులు ఇస్తారు. వాటి ఆధారంగానే వివాహానికి సంబంధించిన ఇతర పత్రాలు ఫొటోలు సాక్షుల ధ్రువీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. ఇళ్లు, కల్యాణ మండపాల్లో సంప్రదాయంగా వివాహం చేసుకుంటే అందుకు తగ్గ అన్ని రకాలు పత్రాలు సమర్పించి దరఖాస్తులు చేసుకోవాలి. ఇదీ చదవండి: ఆడబిడ్డ పుట్టిందని, అంతులేని సంబరం : వీడియో వైరల్90 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పెళ్లి జరిగిన 30 రోజుల్లో మున్సిపల్, పంచాయతీ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకొంటే తక్కువ ఫీజు ఉంటుంది. సాధారణంగా ఫీజు రూ.100 నుంచి రూ.500 వరకు మాత్రమే ఉంటుంది. వివాహం జరిగి 90రోజులు దాటితే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి ఇందుకు ఖర్చులు కొంచెం అధికంగా ఉంటాయి. యు.ఉపేంద్ర, జనన, మరణ, రిజిస్ట్రేషన్ అధికారి, ఇచ్ఛాపురం మున్సిపాలిటి -
ఇంకో మార్గంలేకే ‘ఆత్మహత్య’
(హైదరాబాద్) గచ్చిబౌలి:‘‘పెళ్లి ఏర్పాట్లకు డబ్బు కోసం శక్తికి మించి ప్రయత్నించా. ఇంకో మార్గం కనిపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచి్చంది’’ అని ఆత్మహత్యకు పాల్పడిన మెట్ల వెంకట కృష్ణ శ్రీ సాయి తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ‘‘23 మంది నుంచి తాను తీసుకున్న రూ.7.72 కోట్ల అప్పుల వివరాలు, ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ కుటుంబ సభ్యులు, కాబోయే భార్యకు మెసేజ్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు.గచ్చిబౌలి పోలీసులు సూసైడ్ నోట్లోని వివరాల వెల్లడించారు. పెట్టుబడుల పేరిట చేసిన అప్పులను నా సోదరుడు మెట్ల సాయి పవన్‌కళ్యాణ్ తీర్చాలి. అయనకు పెట్టుబడి కోసం కొంత ఇచ్చాను కాబట్టి నన్ను మోసగాడిగా, అబద్ధాల కోరుగా మిగల్చకుండా అప్పులు తీర్చాలి. నేను ఎంతగానో ప్రేమించిన పెల్సియాకు అబద్దాలు చెప్పాను. క్యాన్సర్ వచ్చిందని తెలిసినా పెల్సియా నా వైపు నిలబడింది. వ్యాపారం కోసం పెట్టుబడులు పెట్టినా రిటర్న్స్ ఆలస్యం కావడంతో ఆర్థిక ఇబ్బందులు తీవ్ర రూపం దాల్చాయి. అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేయకపోయినా ఇచ్చిన మాట ప్రకారం డిసెంబర్లో తిరిగి ఇవ్వాల్సి ఉంది. అన్ని విధాల ప్రయత్నించినా విఫలమయ్యాను. నాకు క్యాన్సర్ వచ్చింది అబద్ధం కాదు, ఢిల్లీలో చికిత్స తీసుకుంటే నయమైంది. 2023లో మళ్లీ క్యాన్సర్ వచ్చింది. ఆ సమయంలో పెల్సియా(కాబోయే భార్య) నా వైపు నిలబడింది. ఆమె కారణంగా మూడు సంవత్సరాలు బతికాను. రెండు నెలలుగా పెళ్లిని నిలిపివేయడానికి ప్రయతి్నస్తున్నాను. డబ్బు ఇవ్వాల్సిన గడువు దగ్గర పడటం, పెళ్లికి ఖర్చులకు డబ్బు లేక పోవడంతో ఒత్తిడి భరించలేక నిర్ణయం తీసుకున్నాను. అందరూ నన్ను క్షమించండి’’ అని డెత్ స్టేట్ మెంట్లో పేర్కొన్నారు. ఆ మేసేజ్‌ను గచ్చిబౌలి పోలీసులు డెత్ స్టేట్మెంట్గా పరిగణిస్తున్నారు. మెట్ల వెంకట కృష్ణ శ్రీ సాయి మృతదేహనికి ఉస్మానియా ఆస్పత్రిలో బుధవారం పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబసభ్యులకు మృతదేహన్ని అప్పగించారు. అంత్యక్రియల కోసం స్వస్థలమైన పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి గ్రామానికి తరలించారు. -
బిజినెస్ మ్యాన్ తో పెళ్లైంది... నలుగురు పిల్లలు ఉన్నారు
-
పెళ్లి పీటలు ఎక్కనున్న అనుపమ?
-
అతన్ని పెళ్లి చేసుకున్నా.. పిల్లల్ని కూడా కన్నాను : త్రిష పోస్ట్ వైరల్
స్టార్ హీరోయిన్ త్రిష పేరు ఇప్పుడు నెట్టింట ఎక్కువగా వినిపిస్తోంది. కోలీవుడ్ స్టార్, టీవీకే అధినేత విజయ్ భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో అనూహ్యంగా త్రిష పేరు తెరమీదకొచ్చింది. విజయ్‌తో త్రిష రిలేషన్‌తో ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇద్దరు కలిసి ఓ ఫంక్షన్‌కి హాజరవ్వడంతో.. ఈ పుకార్లు ఇంకా ఎక్కువైయ్యాయి. త్వరలో పెళ్లి చేసుకుంటారని..ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పి..రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారంటూ రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల నటుడు, దర్శకుడు చిత్రా లక్ష్మణన్ కూడా త్రిష ఇకపై నటించబోదని చెప్పడంతో మరోసారి త్రిషపై నెట్టింట చర్చ జరిగింది. దీనిపై త్రిష తనదైన శైలీలో స్పందించింది. చిత్రా లక్ష్మణ్ వాఖ్యలకు కౌంటర్‌గా ‘అవును నేను సినిమాలు మానేసి, ఒక ధనవంతుడైన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని, నిన్నటికి రెండేళ్లు నిండిన నలుగురు కవలలను పెంచుతున్నాను. మీ ఊహాగానాలకు ఇది సరిపోతుందా? ఈ రోజు వార్తలు రాసుకోవడానికి ఇది సరిపోతుందా లేదా ఇంకా ఏదైనా జోడించమంటారా?’ అని త్రిష ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌తో ఆమె సినిమాలు మానేసిందనేది పుకారు మాత్రమేనని తేలిపోయింది. త్రిష సినీ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం అమె ‘కరుప్పు’(తెలుగులో ‘వీరభద్రుడు’) చిత్రంలో సూర్యకు జంటగా నటిస్తోంది. తెలుగులో చిరంజీవి సరసన నటించిన విశ్వంభర రిలీజ్‌కు రెడీ అవుతుంది. దేవిధంగా మలయాళంలో మోహన్‌లాల్ కు జంటగా రామ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇవన్నీ గత ఏడాది, అంతకు ముందు ఏడాది అంగీకరించిన చిత్రాలు అన్నది గమనార్హం. -
‘ఐఐటీ బాబా’ మరో సెన్సేషన్ .. ‘ఎంత పని సేస్తివిరో..’
న్యూఢిల్లీ: లక్షల జీతం తెచ్చిపెట్టే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలివేసి, సన్యాసిగా మారి.. 2025 మహాకుంభ్ మేళాలో రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన ‘ఐఐటీ బాబా’ గుర్తున్నారా? ఇప్పుడు ఆయన తన సన్యాస జీవితానికి స్వస్తి పలికి ఓ ఇంటివాడయ్యారు. ఐఐటీ బాంబేలో చదువుకున్న అభయ్ సింగ్.. ప్రీతిక అనే ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌ను వివాహం చేసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని అఘంజర్ మహాదేవ్ ఆలయంలో శివరాత్రి పర్వదినాన వీరు ఒక్కటవ్వగా, ఫిబ్రవరి 19న కోర్టు మ్యారేజ్ జరిగింది. ఈ పెళ్లి వార్త కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. తాజాగా అభయ్ సింగ్ తన భార్యతో కలిసి హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలోని తన సొంత గ్రామానికి చేరుకున్నారు. బ్యాంకులో కేవైసీ ఫార్మాలిటీస్ పూర్తి చేయడంతో పాటు, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడానికే ఇక్కడికి వచ్చినట్లు తనదైన కాషాయ వస్త్రాల్లో ఉన్న ఆయన మీడియాతో చెప్పాడు. హర్యానాకు చెందిన అభయ్ సింగ్ (అభయ్ గ్రేవాల్).. ప్రతిష్టాత్మక ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆర్ట్స్ వైపు మళ్లి డిజైన్‌లో మాస్టర్స్ చేశారు. అనంతరం కెనడా వెళ్లి ఏటా రూ.36 లక్షల ప్యాకేజీతో మూడేళ్ల పాటు ఉద్యోగం చేశారు. కానీ అక్కడ తీవ్రమైన డిప్రెషన్‌కు గురికావడంతో.. జీవిత పరమార్థం కోసం అన్వేషణ మొదలుపెట్టాడు.కెరీర్‌ను వదిలేసి సన్యాసం స్వీకరించాడు. 2025 మహాకుంభ్ మేళాలో సన్యాసి దుస్తుల్లో ఉన్న అతను.. తాను ఐఐటీలో చదివానని ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. అప్పటినుంచి నెటిజన్లు ఆయనను ‘ఐఐటీ బాబా’ అని పిలవడం మొదలుపెట్టారు. గతంలో తన తల్లిదండ్రుల మధ్య ఉన్న విభేదాలు చూసి పెళ్లి వ్యవస్థపైనే తనకు నమ్మకం పోయిందని అభయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తనకో గర్ల్‌ఫ్రెండ్ ఉన్నప్పటికీ పెళ్లి చేసుకోలేదని తెలిపారు. కుటుంబానికి దూరంగా సన్యాసిగా గడిపిన అతను ఇప్పుడు మనసు మార్చుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టడం విశేషం. అభయ్ తాజా నిర్ణయంతో అతని తండ్రితో పాటు తల్లి షీలా దేవి కూడా ఎంతో సంతోషించారు. కొడుకు, కోడలిని ఇంటిలోనికి సాదరంగా స్వాగతించారు. ఇది కూడా చదవండి: ‘ఎప్పుడైనా పొమ్మంటారు’.. టెక్కీ కన్నీరు! -
పెళ్లి ఆగిపోయినా.. ఖర్చు మిగిలిపోదు!
భారతదేశంలో వివాహం అంటే కేవలం రెండు మనసుల కలయిక మాత్రమే కాదు, అదొక భారీ వేడుక. లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసే ఈ వేడుకలు, ఏదైనా అనుకోని కారణంతో ఆగిపోతే ఆ కుటుంబాలు ఆర్థికంగా కోలుకోవడం కష్టమవుతుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అండగా నిలిచేందుకు ఇప్పుడు 'వెడ్డింగ్ ఇన్సూరెన్స్' (Wedding Insurance)అందుబాటులోకి వచ్చింది.ఏమేమి కవర్ అవుతాయి?సాధారణంగా వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పాలసీలు ప్రధానంగా నాలుగు అంశాల్లో రక్షణ కల్పిస్తాయి..క్యాన్సిలేషన్ లేదా వాయిదా: ప్రకృతి వైపరీత్యాలు (భారీ వర్షాలు, వరదలు), ఆకస్మిక అగ్నిప్రమాదాలు లేదా వధూవరుల కుటుంబాల్లో ఎవరైనా మరణించడం వంటి కారణాలతో పెళ్లి ఆగిపోతే, ఇప్పటికే చెల్లించిన అడ్వాన్స్‌లను బీమా కంపెనీ చెల్లిస్తుంది.ఆస్తి నష్టం: ఫంక్షన్ హాల్లో అగ్నిప్రమాదం జరిగి ఆస్తికి నష్టం వాటిల్లినా లేదా దొంగతనం జరిగినా బీమా వర్తిస్తుంది.వ్యక్తిగత ప్రమాదాలు: వేడుక సమయంలో వధూవరులకు లేదా పాలసీలో పేర్కొన్న కుటుంబ సభ్యులకు ఏదైనా ప్రమాదం జరిగితే వైద్య ఖర్చులు భరిస్తుంది.పబ్లిక్ లయబిలిటీ: పెళ్లికి వచ్చిన అతిథులకు ఏదైనా ప్రమాదం జరిగినా లేదా మూడవ పక్షానికి నష్టం జరిగితే ఈ పాలసీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు.వధూవరుల్లో ఒకరు తప్పుకుంటే బీమా వస్తుందా?ఇది చాలా మందికి ఉండే సందేహం. ఒకవేళ వధూవరుల్లో ఎవరో ఒకరు పెళ్లి వద్దని వెళ్ళిపోతే ఇన్సూరెన్స్ వర్తిస్తుందా? దీనికి సమాధానం 'లేదు'. వధూవరుల మధ్య గొడవలు రావడం, ఒకరు మరొకరిని ఇష్టం లేక వదిలేయడం (Cold Feet) వంటి కారణాలకు బీమా కంపెనీలు పరిహారం ఇవ్వవు. అలాగే యుద్ధం, ఉగ్రవాద దాడులు లేదా వధూవరుల నిర్లక్ష్యం వల్ల జరిగే నష్టాలకు కూడా బీమా వర్తించదు.ప్రీమియం ఎంత ఉంటుంది?వివాహ బడ్జెట్‌ను బట్టి ఈ పాలసీ ప్రీమియం నిర్ణయిస్తారు. సాధారణంగా పెళ్లి మొత్తం ఖర్చులో 0.7 శాతం నుంచి 2 శాతం వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంటే, రూ. 20 లక్షల బడ్జెట్‌తో పెళ్లి చేసుకుంటున్న వారు దాదాపు రూ. 15 వేల నుంచి రూ. 25 వేల మధ్య ప్రీమియం చెల్లించి సురక్షితం కావచ్చు.బీమా అందించే సంస్థలుభారతదేశంలో ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ ఎర్గో (HDFC ERGO), ఐసీఐసీఐ లాంబార్డ్ (ICICI Lombard), బజాజ్ అలియంజ్ (Bajaj Allianz), ఫ్యూచర్ జనరాలి (Future Generali) వంటి సంస్థలు ఈ వెడ్డింగ్ ఇన్సూరెన్స్ ప్యాకేజీలను అందిస్తున్నాయి. పెళ్లి కార్డు ప్రింటింగ్ నుంచి క్యాటరింగ్, వెన్యూ బుకింగ్ వరకు అన్నిటికీ రసీదులు (Invoices) ఉంటే క్లెయిమ్ ప్రాసెస్ సులభతరం అవుతుంది.లక్షల రూపాయల ఖర్చుతో కూడిన శుభకార్యాన్ని నిర్వహిస్తున్నప్పుడు, స్వల్ప ప్రీమియంతో ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఆర్థిక భద్రతతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: బంగారంపై తీపి కబురు.. రెండు రోజులే గ్యాప్.. -
తెలంగాణ అబ్బాయి.. శ్రీలంక అమ్మాయి
నిజామాబాద్ రూరల్: ఆ ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ ఎల్లలు లేవని నిరూపించింది. శ్రీలంక అమ్మాయి.. తెలంగాణ అబ్బాయి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శనివారం మూడుముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. నిజామాబాద్ రూరల్ మండలం లింగితండాకు చెందిన బొంత వెంకటేశ్ 2019లో దుబాయికి వెళ్లాడు. అక్కడ ఎల్టన్ ప్రాపర్టీ అనే కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న శ్రీలంక దేశానికి చెందిన ఉమేక తారుషి వెంకటేశ్‌ల మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వారు తల్లితండ్రుల సమక్షంలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో తమ ప్రేమ విషయాన్ని వెంకటేశ్ శ్రీలంకకు వెళ్లి తారుషి తల్లితండ్రులకు చెప్పి ఒప్పించాడు. ఇటు వెంకటేశ్ తల్లితండ్రులు ఒప్పుకున్నారు. దీంతో తారుషి, ఆమె తల్లితండ్రులు సేనాదిపతిగే నిలంతి పెరీరా, గలాని గమగె జనక ప్రియదర్శన సిల్వా లింగి తండాకు పది రోజుల క్రితం చేరుకున్నారు. శుక్రవారం ఇరు కుటుంబాల సంతోషాల మధ్య హల్దీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం వీరి వివాహానికి లింగి తండా వేదికగా మారనుంది. తమ ప్రేమ వివాహాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెంకటేశ్ ‘సాక్షి’తో తెలిపారు. -
జస్ట్ తాళి కడుతుండగా షాకింగ్ న్యూస్, వరుడు మాత్రం !
కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఒక వివాహ వేడుకలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సరిగ్గా తాళి కట్టే సమయానికి కొన్ని నిమిషాల ముందు, వధువు పల్లవి అకస్మాత్తుగా పెళ్లిని ఆపేసింది. దీంతో పెళ్లి కొడుకుతోపాటు, అందరూ షాకయ్యారు. వధువు ఎందుకలా చేసింది? చివరికి ఏమైంది? ఇలాంటి మీ అనుమానాలకు, సందేహాలకు సమాధానం దొరకాలంటే..ఈ కథనాన్ని చదివేయండి మరి.బంధువుమిత్రులు, బాజా భజంత్రీల మధ్య వరుడు వేణుగోపాల్ తాళి కట్టడానికి రెడీ అయ్యాడు. ఇంతలో సినిమా ఫక్కిలో నాకీ పెళ్లి ఇష్టం లేదంటూ భయపడుతూనే ధైర్యం చేసి మెల్లగా చెప్పింది వధువు పల్లవి. దీంతో అందరూ ఒకింత దిగ్భ్రాంతికి, మరింత గందర గోళానికి గురయ్యారు.అసలు ఏం జరిగింది? అపుడు అసలు విషయం తాపీగా చెప్పింది. తాను వేరొకరిని ప్రేమిస్తున్నానని, అయితే ప్రేమించిన వ్యక్తి వేరే కులానికి చెందినవాడని, అందుకే ఈ విషయాన్ని ముందుగా తన కుటుంబానికి చెప్పలేకపోయానని కళ్ళనీళ్లతో చెప్పింది. ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, వరుడికి, ఆమె తన కుటుంబ సభ్యులకు చెప్పింది. అయినా ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించారు, కానీ ఆమె తన మనసు మార్చుకోలేదు.వరుడు ఏం చేశాడు?అయితే వరుడి స్పందన మరింత విశేషంగా నిలిచింది. వధువు మానసకి పరిస్థితిని అర్థం చేసుకున్న వరుణ వేణుగోపాల్ ఆమె పట్ల సానుకూలంగా స్పందించాడు. తాను ప్రేమించని వారిని పెళ్లి చేసుకోమని ఎవరినీ బలవంతం చేయనని స్పష్టం చేశాడు. ఈ స్టోరీని ఒక ఎక్స్యూజర్ వరుడికి హ్యాట్యాఫ్ అంటూ పోస్ట్ చేశారు. దీంతో నెటిజనులనుంచి కూడా సానుకూల స్పందన లభించింది. In Karnataka's Hassan district, minutes before the wedding started, the bride Pallavi suddenly stopped it.Everyone was shocked and confused. She told her family that she didn't want to marry the groom Venugopala because she loved someone else. She explained that the person she… pic.twitter.com/h3u9kn8ejS— Aparajite (@amshilparaghu) April 2, 2026నెటిజన్లు స్పందనఈ క్రెడిట్‌కు పల్లవికి కూడా దక్కుతుంది. ఎలాగైతేనేం ధైర్యం చేసి తన ప్రేమకోసం ధైర్యంగా నిలబడింది. అలాగే వరుడు కూడా ఎలాంటి డ్రామా క్రియేట్ చేయకుండా పరిస్థితిని అర్థం చేసుక్నాడని ఒకరు, వావ్, ఇద్దరికీ అభినందనలు! తన ప్రేమ కోసం నిలబడిన పల్లవికి, పరిస్థితిని అర్థం చేసుకున్న వేణుగోపాలకు. ఇదే నిజమైన పరిణితి, గౌరవం అంటూ ఒకరు కమెంట్ చేశారు. అంతేకాదు ఇంతదాగా ఎందుకు లాగాలని కొందరంటే.. ఒకే బెటర్ నెవర్ దేన్ లేట్, అబ్బాయ్ సేఫ్.. బతికిపోయాడు బిడ్డ ఇలాంటి ఫన్నీ కామెంట్లు వెల్లువెత్తడం గమనార్హం. Pelli koduku frds : mavodu safe pic.twitter.com/l9fO731r4R— Charan (@charan14in) April 3, 2026 -
లాస్ట్ మినిట్ ట్విస్ట్ : వరుడితో కాదు పెళ్లి !
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని (Marriages are made in heaven) చాలామంది విశ్వసించే మాట. ‘ఎవరికి ఎవరు రాసి పెట్టి ఉన్నారో’ అని పెద్దలు కూడా తరచుగా అంటుంటారు. బిహార్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుంటే ఔరా, విధి రాత అని అనుకోకమానరు. విషయం పూర్తిగా తెలియాలంటే సినిమా లెవల్లో మలుపులు తీరిగిన ఈ కథనం చదవాల్సిందే.ఊహించని విధంగా, నిశ్చయించిన వరుడితో కాకుండా వేరొకరితో ఏడు అడుగులు వేసిందో వధువు. బిహార్‌లోని సిగోయిడి పోలీస్ స్టేషన్ పరిధిలోని మోరారాచక్లో ఈ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఒకవైపు బంధుమిత్రులు ఆనంద సందోహాలు, మరోవైపు బాజా భజంత్రీల మధ్య పెళ్లి మండపంలో అంతా సందడిగా ఉంది. పెళ్లి పీటల మీద వరుడు కూర్చుని ఉండగా, వధువు మండపం వైపు వస్తోంది. ఇంతలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఏం జరుగుతోందో అర్థం చేసుకునే లోపే పెళ్లి కొడుకుని పోలీసులు తీసుకెళ్లపోయారు. గెస్ట్‌లంతా గందరగోళంతో చూస్తుండగా, ఎన్నో ఆశలతో పెళ్లి మండపం అడుగుల వేస్తున్న వధువు నిశ్చేష్టురాలైపోయింది. గ్రామ పెద్ద జోక్యంతో వధువు వరుడి తమ్ముడిని పెళ్లి చేసుకోవాలనినిర్ణయించారు. దీంతో సినీ ఫక్కీలో వారిద్దరూ ఒకరికొకరు దండలు మార్చుకున్నారు. పోలీసులు ఎందుకొచ్చారంటే..సియారాంపూర్కు చెందిన సంజయ్ యాదవ్ కుమారుడు, వరుడు అనిల్ కుమార్, మోరారాచక్కు చెందిన భీమ్ యాదవ్ (పంకజ్ ) అనే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేశారు. ఉన్నట్టుండి ఈ పెళ్లి గురించి తెలిసిన అనిల్ ప్రియురాలు ఎంట్రీ ఇచ్చింది. తాను మొదటి భార్యనని, తనకు న్యాయం కావాలంటూ సిగోయిడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇందుకు తగిన సాక్ష్యాధారాలు కూడా చూపించడంతో పోలీసులు రంగంలోకి దిగారు.దీంతో పెళ్లికొడుకుకు అప్పటికే రూబీ అనే మహిళతో వివాహం జరిగిందని గ్రామ పెద్ద అశోక్ యాదవ్‌కు తెలిపారు. ఆయన వెంటనే ఈ విషయాన్ని అమ్మాయి తండ్రికి తెలియజేయడంతో అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ వార్త గ్రామం అంతటా వేగంగా వ్యాపించింది. పోలీసులతో పాటు ఆ అమ్మాయి గ్రామానికి తిరిగి వచ్చి, అనిల్‌తో తన వివాహానికి సంబంధించిన ఆధారాలను చూపించింది. దీంతో గ్రామ పెద్ద ఇరు పక్షాల సుదీర్ఘ చర్చల అనంతరం, వధువు వరుడి తమ్ముడిని వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. ఆ ఉదయమే, ఇరు కుటుంబాల సమక్షంలో ఆ వివాహం జరిపించడంతో ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. తదనంతరం, అనిల్ రూబీ విషయాన్ని అంగీకరించి, ఆమెతో కలిసి జీవిస్తూ, ఆమెను సంరక్షిస్తానని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో పోలీసులు అతన్ని విడుదల చేశారు. అలా కథ సుఖాంతం అయింది. -
బంధువుల పెళ్లిలో విరోష్ జోడీ.. భర్త ఒడిలో కూర్చున్న రష్మిక
విరోష్ జంట ఓ పెళ్లి వేడుకలో సందడి చేశారు. విజయ్- రష్మికతో పాటు ఆనంద్ దేవరకొండ కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. తమ బంధువుల పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఆనంద్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోల్లో విజయ్ తల్లి కూడా ఉన్నారు. ఇక రష్మిక.. విజయ్ ఒడిలో కూర్చుంది. వీరిద్దరి పెళ్లి తర్వాత తొలిసారి జంటగా వివాహ వేడుకలో కనిపించారు. తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. విజయ్- రష్మిక పెళ్లి వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఈ జంట పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరిద్దరు మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇటీవలే పెళ్లై నెల రోజులు గడిచిపోయాయంటే నమ్మలేకపోతున్నానంటూ రష్మిక తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇక సినిమాల విషయానికొస్తే ఈ టాలీవుడ్ కపుల్ రణబలి చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. View this post on Instagram A post shared by Anand Deverakonda (@ananddeverakonda) -
ప్రియురాలిని పెళ్లాడిన బిగ్‌బాస్ కంటెస్టెంట్
ఇప్పుడంతా ఎక్కడ చూసినా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్లో విరోష్ జంటతో అల్లు శిరీష్ కూడా ఓ ఇంటివాడయ్యారు. మరో టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బిగ్‌బాస్ కంటెస్టెంట్ రజత్ దలాల్ ఓ ఇంటివాడయ్యారు. తన ప్రియురాలిని ఆయన పెళ్లాడారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌గా పేరు తెచ్చుకున్న రజత్ దలాల్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. అత్యంత సన్నిహితులు, మిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. తన వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభం అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. మీ అందరి ఆశీస్సులు కావాలంటూ కోరారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు అభిమానులు నూతన జంటకు అభినందనలు చెబుతున్నారు.రజత్ దలాల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాత్రమే కాదు..పలు రియాలిటీ షోల్లో పాల్గొన్నారు. బిగ్‌బాస్-18 సీజన్లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. ది 50 అనే రియాలిటీ షోతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. -
ఆమెకు 35, అతనికి 25 .. భర్తను వదిలేసి!
ఏలూరు జిల్లా: సోషల్ మీడియా ద్వారా ఓ వివాహితకు, యువకుడికి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. చివరికి ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడడంతో రెండు కుటుంబాల్లో విషాదం మిగిలింది. ఉంగుటూరు మండలం యర్రమళ్ల గ్రామానికి చెందిన గుండుగొల్లు మావుళ్లు (25) చేపల ప్యాకింగ్‌కు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి ఇంకా వివాహం కాలేదు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎర్రి రమ (35) అనే వివాహితతో మావుళ్లుకు ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అయితే అప్పటికే ఆమెకు వివాహం కాగా ఇటీవల మావుళ్లు ఆమెను ఇక్కడకు తీసుకువచ్చి వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న రమ తరుఫు బందువులు వచ్చి ఆమెను తీసుకువెళ్లారు. అప్పటి నుంచి మావుళ్లు తాడేపల్లిగూడెం మండల కడియద్దలోని తన చెల్లెలు ఇంటివద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో తిరిగి రెండు రోజుల క్రితం రమ శ్రీకాకుళం నుంచి మావుళ్లు దగ్గరకు వచ్చేసింది. ఈ సమాజం వారిని బతకనీయదు అనుకున్నారో ఏమో ఇద్దరూ కలిసి మంగళవారం రాత్రి నాచుగుంట రేవు వద్దకు చేరారు. మావుళ్లు తన తమ్ముడు కి ఫోను చేసి విషయం చెప్పి నాచుగుంట వంతెన మీదనుంచి ఇద్దరు కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మావుళ్లు తమ్ముడు వచ్చేసరికి వంతెన వద్ద సెల్‌ఫోను, ఇతర సామాన్లు కనిపించడంతో పోలీస్, ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. భీమడోలు, తాడేపల్లిగూడెం ఫైర్ సిబ్బంది, చేబ్రోలు పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు. ఎస్సై సూర్యభగవాన్, తహసీల్దార్ పూర్ణచంద్రప్రసాద్, ఇతర అధికారులు గాలింపు చర్యలను ఎప్పుటికప్పుడు పర్యవేక్షించారు. బుధవారం రాత్రి 10,30 గంటలకు మావుళ్ల మృతదేహం ఉంగుటూరు టోలు ప్లాజా సమీపంలో లభ్యమైంది. అమరావతి నుంచి వచ్చిన ప్రత్యేక ఎస్టీఆర్ఎఫ్ బృందాలు గాలించగా రమ మృతదేహం చేబ్రోలు పోలీస్టేషన్ సమీపంలో గోదావరి కాలువలో గురువారం మధ్యాహ్నం 2 30 గంటలకు లభ్యమైంది. ఎస్సై సూర్యభగవాన్ ఆధ్వర్యంలో మావుళ్లు మృతదేహనికి తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
'అప్పుడే నెల.. మీరు లేకుంటే నా పెళ్లి ఇలా జరిగేది కాదు'.. రష్మిక పోస్ట్
విజయ్- రష్మిక పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఫిబ్రవరి 26న ఈ జంట పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరిద్దరు మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి జరిగి నెల రోజులు పూర్తి కావడంతో ప్రత్యేక పోస్ట్ చేశారు. పెళ్లినాటి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. విజయ్ దేవరకొండతో పాటు రష్మిక సైతం పెళ్లి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. అప్పుడే నెల రోజులు గడిచిపోయాయంటే నమ్మలేకపోతున్నానంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.రష్మిక తన ఇన్‌స్టాలో రాస్తూ..' అప్పుడే ఒక నెల గడిచిపోయిందంటే నేను నమ్మలేకపోతున్నా. పెళ్లి చేసుకోవడం అనేది ఎంతో దూరపు కలలా అనిపించేది.. కానీ ఇప్పుడు మా పెళ్లి జరిగి నెల రోజులు పూర్తయ్యాయి. ఇది నిజంగా నమ్మశక్యం కాని విషయం. అయితే పెళ్లి చేసుకోవాలని అనుకున్న క్షణం నుంచి ఇప్పటి వరకు ఈ ప్రయాణంలో మహిళలే నాకు అండగా నిలిచి, నా రక్షకుల్లా వ్యవహరించారు. నేను మీ అందరికీ ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటా. ఇది శాశ్వతంగా నిలిచిపోయే ప్రేమ. మీరందరూ లేకుంటే ఈ పెళ్లి ఇంత అద్భుతంగా జరిగేది కాదు' తన వారిపై ప్రశంసలు కురిపించింది.ఐశర్య, మాగంటి ప్రియ, అర్పిత పేర్లను రష్మిక ప్రస్తావించింది. వారి గురించి తన అనుభవాలను పంచుకుంది. ఇవి మీ రోజులు.. అన్నీ మర్చిపోండి, హాయిగా ఉండండి.. అంటూ చెప్పిన మీ అందరికీ నా ధన్యవాదాలు.. మేము కూడా అలానే చేశామని రష్మిక తెలిపింది. మీరందరూ లేకుండా ఈ పెళ్లి ఇంత అద్భుతంగా జరిగేది కాదని రాసుకొచ్చింది. నా జీవితంలో నన్ను ప్రశాంతంగా, నిలకడగా ఉండేలా చేసిన అందమైన మహిళలకు నా అభినందనలు.. ఇదే నా చిన్న ప్రపంచం అంటూ ఎమోషనలైంది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
పెళ్లి తర్వాత తొలి వేకేషన్ ట్రిప్.. విరోష్ జంట వీడియో వైరల్..!
టాలీవుడ్ జంట విజయ్-రష్మిక ఇటీవలే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది. ఈ పెళ్లికి కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత ఈ జంట హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ వేడుక నిర్వహించారు. ఈ రిసెప్షన్ వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు.తాజాగా పెళ్లి తర్వాత విరోష్ జంట వేకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. వీరిద్దరు కలిసి ప్రస్తుతం హనీమూన్ ట్రిప్ వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధంచిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాల్లో వైరలవుతున్నాయి. అయితే పెళ్లి తర్వాత ఈ థాయ్‌లాండ్ ట్రిప్‌లో తామిద్దరం చాలా సంతోషంగా ఎంజాయ్ చేశామని రష్మిక తెలిపారు. ఈ మేరకు ఎయిర్బిఎన్బి (Airbnb) భాగస్వామ్యంతో రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఆసక్తికరమైన వీడియోను పంచుకున్నారు. ‘ప్రశాంతమైన ఉదయం, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, పూల్ ఆటలతో ఇక్కడి కో సముయ్‌లోని ప్రాంతం మా సొంత ఇల్లులా అనిపించిందని తెలిపింది. ఆ రోజుల్లో మేము గడిపిన కొన్ని క్షణాలు’ అంటూ వీడియోను పోస్ట్ చేసింది. అయితే వీరి పెళ్లి కోసం టాలీవుడ్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురు చూశారు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట ఎక్కడా తమ రిలేషన్ గురించి ఎక్కడా బయటికి చెప్పలేదు. ఎన్నిసార్లు రూమర్స్ వినిపించినా వాటిపై ఎవరు కూడా స్పందించలేదు. అయితే కొన్ని సార్లు ఇన్ డైరెక్ట్‌గా హింట్స్ ఇస్తూ వచ్చారు. చాలాసార్లు వీరిద్దరు ఉన్న ఫోటోలు బయటికొచ్చాయి. కానీ చివరికీ పెళ్లి కొద్ది రోజుల ముందు మాత్రమే సోషల్ మీడియాలో అఫీషియల్‌గా ప్రకటించారు. ఇక సినిమాల విషయానికొస్తే విజయ్ దేవరకొండ రణబలి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
సీక్రెట్‌గా సింగర్‌ని పెళ్లి చేసుకున్న నటి.. ఫోటోలు వైరల్
బాలీవుడ్ స్టార్ ర్యాపర్ బాద్షా, నటి ఇషా రిఖీ పెళ్లి చేసుకున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇషా తల్లి పూనమ్ రిఖీ సోషల్ మీడియా వేదికగా పెళ్లి ఫోటోలను పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై అటు బాద్షా కానీ, ఇటు ఇషా కానీ ఎవరూ అధికారికంగా స్పందించలేదు.ఆరేళ్ల క్రితమే విడాకులు.. ర్యాపర్ బాద్షా అసలు పేరు ఆదిత్య ప్రతీక్ సింగ్ సిసోడియా. హిందీ, పంజాబీ పాటలను రీమిక్స్ చేస్తూ యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అలాగే బాలీవుడ్లో పలు బ్లాక్‌బస్టర్ సినిమాల్లో పాటలు పాడి, మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ పీక్స్‌లో ఉండగానే.. జాస్మిన్ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. ఈ జంటకి ఓ కూతురు ఉంది. ఇద్దరి మధ్య విభేధాలు రావడంతో ఆరేళ్ల క్రితం విడాకులు తీసుకొన్నారు. ఈషాతో డేటింగ్.. విడాకుల తర్వాత పంజాబీ నటి ఇషా రిఖీతో బాద్షా ప్రేమలో పడ్డాడు. ఇషాను ఓ పార్టీలో కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకొన్నారు. అక్కడ జరిగిన వారి పరిచయం ఇద్దరిని మరింత దగ్గరకు చేర్చించింది. గతకొంత కాలంగా ఇద్దరు డేటింగ్లో ఉన్నట్లు వార్తలు కూడా బయటకు వచ్చాయి. అయితే వీరిద్దరు మాత్రం తమ ప్రేమ విషయాన్ని ఇప్పటివరకు బహిరంగంగా ప్రకటించలేదు.పెళ్లి ఫోటోలు వైరల్.. తాజాగా ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి జరిగినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇషా రిఖీ తల్లి పూనమ్ రిఖీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పెళ్లికి సంబంధించిన ఫోటోలను పంచుకుంటూ ‘గాడ్ బ్లెస్ యూ’ అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో నెటిజన్స్ పెద్ద ఎత్తున ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by POONAM RIKHI (@poonamrikhi6) View this post on Instagram A post shared by POONAM RIKHI (@poonamrikhi6) -
విజయ్-రష్మిక పెళ్లి.. గబ్బర్ సింగ్ టీమ్ ఆవేదన..!
టాలీవుడ్ మోస్ట్ ఫేవరేట్ జంట విజయ్- రష్మిక పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరిద్దరు మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరి 26న జరిగిన ఈ పెళ్లి వేడుకలో అత్యంత సన్నిహితులు, బంధుమిత్రులు, కుటుంబసభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఆ తర్వాత ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా భోజనాలు, స్వీట్స్ పంపిణీ చేసింది విరోష్ జంట.అయితే ఇటీవల ఓ చిన్నారి అభిమాని పెళ్లికి పిలవలేదని అలిగింది. నేను మీ ఫ్యాన్నే నన్ను ఎందుకు పిలవలేదు? ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇటీవలే ఆ చిట్టి అభిమానిని ఇంటికి పిలిచి లంచ్ ఏర్పాటు చేశారు. ఆ చిన్నారికి ఇష్టమైన స్వీట్స్ కూడా వడ్డించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.అయితే అలాగే తాజాగా తమను పెళ్లికి పిలవలేదని మరో వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే ఈ సారి మాత్రం వాళ్లు చిట్టి అభిమానులు మాత్రం కాదండోయ్. గబ్బర్ సింగ్ చిత్రంలో మనల్ని కడుపుబ్బా నవ్వించిన కమెడియన్ గ్యాంగ్. వీరంతా విజయ్ దేవరకొండకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ విషెస్ తెలిపారు. మేము కూడా ఆర్టిస్తులమే కదా అన్నా.. మమ్మల్ని ఎందుకు పెళ్లి పిలవలేదు అన్న అంటూ వీడియోలో వేడుకున్నారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Mammalni kuda Bhojananiki intiki pilvandi ani aduguthunna Gabbarsingh Villan Team🔥@TheDeverakonda @iamRashmika #Virosh pic.twitter.com/2YQUdeovLp— THE RWDY🗿X (@TheDEVERA_fan) March 23, 2026 -
ఆ మాత్రం దానికి పెళ్లి ఎందుకు?, 34 ఏళ్ల నటి షాకింగ్ కామెంట్స్
ఈ మధ్య చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకోమనే చెబుతున్నారు. మరికొంతమంది అయితే తనకు నచ్చిన అబ్బాయి దొరికితే చేసుకుంటా..లేదంటే సింగిల్‌గానే ఉంటామని అంటున్నారు. తాజాగా కన్నడ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి కూడా అదే కామెంట్ చేసింది. జీవితంలో పెళ్లి అనేది తప్పనిసరి కాదని, తోడు కావాలనుకుంటే సహజీవనం బెటర్ అని చెబుతోంది ఈ 34 ఏళ్ల సుందరి. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘గత 30 ఏళ్ల నా జీవితంలో పెళ్లి చేసుకున్న జంటలను ఎన్నో చూశా. వారిలో సంతోషంగా జీవితం గడుపుతున్నవారు చాలా తక్కువ. పెళ్లి తర్వాత భాగస్వామి కెరియర్లో ఆటంకాలు కలగడం నన్ను ఆలోచింపజేశాయి. ఒకప్పుడు అందరి అమ్మాయిల్లాగానే నేను కూడా పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాను. నా ఫ్రొఫైల్‌ని మ్యాట్రిమోనీ వెబ్సైట్లోనూ పెట్టాను. అయితే నా ఫోటో చూసి ఫేక్ ప్రొఫెల్ అనుకున్నారు. అదే సమయంలో నాకు పెళ్లి వ్యవస్థపై నమ్మకం పోయింది.నా ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య మనశ్శాంతి, తృప్తి ఉండాలి. అయితే అది పెళ్లితోనే సాధ్యం కాదని అర్థమైంది. నాకు కూడా తోడుగా ఉండే భాగస్వామి కావాలి. కానీ ఆ బంధం నిలబడడానికి పెళ్లి అనే ట్యాగ్ అవసరం లేదు. ఇద్ధరి మధ్య మంచి అవగాహన, గౌరవం ఉంటే.. సహజీవనం చేయడం బెటర్. పెళ్లి చేసుకుని విడిపోవడం కంటే పెళ్లి కంటే ముందే సహజీవనం చేయడమే మంచిది.’ అని ఐశ్వర్య చెప్పుకొచ్చింది.ఐశ్వర్య లక్ష్మి సినీ కెరీర్ విషయానికొస్తే.. ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ అయ్యాక 2017లో నందలవర నాడు నాడ్ ఒరు ఆవాలా సినిమాతో తన సినీ కెరీర్‌ని ప్రారంభించింది. మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం రోహిత్ కెపి దర్శకత్వంలో వస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాలో సాయి ధరమ్ తేజ్‌కి జోడీగా నటిస్తోంది. -
త్వరలోనే విజయ్‌తో పెళ్లి.. ఇలా హింట్ ఇచ్చిన త్రిష తల్లి!
టీవీకే పార్టీని స్థాపించి, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న విజయ్‌కి ఆయన సతీమణి సంగీత భారీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. విజయ్‌తో విడాకులు ఇప్పించాలంటూ ఆమె కోర్టు మెట్లు ఎక్కడం.. ఒక నటితో ఆయన సహజీవనం చేస్తున్నాడని ఆరోపించడంతో త్రిష పేరు బయటకు వచ్చింది. విజయ్ సహజీవనం చేస్తున్నది త్రిషతోనే అని తమిళ మీడియా కోడై కూసింది. అది నిజమే అన్నట్లుగా త్రిష, విజయ్ కలిసి ఓ వివాహ వేడుకకు హాజరై, తమ బందాన్ని బహిరంగం చేశారు. అప్పటి నుంచి విజయ్, త్రిషల పెళ్లిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తవ్వగానే పెళ్లి చేసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఇదంతా పుకార్లే అని అంతా భావిస్తున్న తరుణంలో త్రిష తల్లి చేసిన ఓ పని.. మరోసారి వీరిద్దరి పెళ్లిపై చర్చకు దారి తీసింది.అలా హింట్ ఇచ్చిందా?త్రిష,విజయ్ కలిసి ఓ వివాహ వేడుకకు హాజరైనప్పటి నుంచి వీరిద్దరి పెళ్లిపై నెట్టింట రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. కొంతమంది అయితే ఏఐని ఉపయోగించి పెళ్లి వీడియో క్రియేట్ చేసి..సోషల్ మీడియాలో వదిలారు. ఆ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. అలా విజయ్ అభిమాని ఒకరు ఏఐ టెక్నాలజీతో విజయ్, త్రిషల పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులంతా హాజరైనట్లు వీడియో క్రియేట్ చేశాడు. అది నెట్టింట తెగ వైరల్ అయింది. ఆ వీడియోకి త్రిష తల్లి ఉమా కృష్ణన్ లైక్ కొట్టారు. దీంతో విజయ్‌తో పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ..ఆమె లైక్ కొట్టిన పోస్ట్‌ని వైరల్ చేస్తున్నారు. ఎన్నికల తర్వాత పెళ్లివిజయ్ ప్రస్తుతం తన ఫోకస్ అంతా తమిళనాడు ఎన్నికలపైనే పెట్టాడు. పొత్తుకు బీజేపీ ఆసక్తి చూపుతున్నా.. ఈ సారి ఒంటరిగానే బరిలోకి దిగాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత త్రిషను అధికారికంగా పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాడట. ఇప్పటికే ఈ విషయంపై ఇరు కుటుంబాలలో చర్చలు కూడా జరిగాయట. ఇక సంగీత విషయానికొస్తే.. ఓ అభిమానిగా పరిచయం అయితే ఈమెను.. విజయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 1999లో వీరిద్ద వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. అయితే గత కొంతకాలంగా విజయ్, సంగీత వేరు వేరుగా ఉంటున్నారు. -
విజయ్- త్రిష ఎపిసోడ్‌పై మరో కొత్త పుకారు!
కోలీవుడ్‌లో విజయ్- త్రిష ఎపిసోడ్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. విజయ్ భార్య సంగీత విడాకులకు దరఖాస్తు చేయడంతో అనూహ్యంగా త్రిష పేరు తెరమీదకొచ్చింది. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ వివాదంపై పలువురు నటీనటులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వివాదం తర్వాత విజయ్- త్రిష జంటగా పెళ్లిలో కనిపించడంతో రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ వరుస కథనాలొచ్చాయి.అయితే అందరూ అనుకుంటున్నట్లుగానే ఈ జంట పెళ్లి చేసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం త్రిష తల్లి ఉమా కృష్ణన్ అలా చేయడంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరుతోంది. విజయ్- త్రిష కృష్ణన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని పేర్కొంటూ అభిమానులు ఓ రీల్ రూపొందించారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ జంట తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించడానికి ఆసక్తిగా ఉన్నారని అందులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఒక భారీ ప్రకటన వెలువడుతుందని వీడియోను పోస్ట్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది చూసిన త్రిష మదర్ ఉమా కృష్ణన్ ఆ వీడియోను లైక్ కొట్టింది.ఈ రీల్‌కు త్రిష తల్లి ఉమా కృష్ణన్ లైక్ కొట్టడంతో వీరిద్దరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. త్రిష, విజయ్‌ల బంధాన్ని అధికారికంగా ప్రకటించడానికి ఉమా కృష్ణన్ కూడా ఆసక్తిగా ఉన్నారని సోషల్ మీడియాలో నెటిజన్స్ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది చూసిన కొందరు త్రిష అభిమానులు సైతం ఉమా కృష్ణన్ పొరపాటున ఈ రీల్‌కు లైక్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. గతంలో కూడా త్రిష మదర్ 'థగ్ లైఫ్' మూవీ రిల్స్‌కు లైక్స్ కొట్టారని మరికొందరు గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా విజయ్- త్రిష పెళ్లిపై క్లారిటీ రావాలంటే తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే. -
పెళ్లి పీటలెక్కనున్న స్వీటీ.. వరుడు ఎవరంటే?
అరుంధతి మూవీతో జేజమ్మగా ప్రేక్షకుల గుండెల్లో స్థానం దక్కించుకున్న బ్యూటీ అనుష్క శెట్టి. ఆ తర్వాత బాహుబలి మూవీతో పాన్ ఇండియాలో క్రేజ్ దక్కించుకుంది. ప్రభాస్ సరసన నటించిన ముద్దుగుమ్మ.. తనదైన నటనతో ఆకట్టుకుంది. అయితే అప్పుడప్పుడు వీరిద్దరిపై పెళ్లి రూమర్స్ కూడా వినిపిస్తూనే ఉన్నాయి. ఏదో ఒక సందర్భంలో అనుష్కతో ప్రభాస్ పెళ్లి అంటూ బోలెడు కథనాలొచ్చాయి. కానీ అవన్నీ రూమర్స్‌గానే మిగిలిపోయాయి.తాజాగా ఈ స్వీటీ అనుష్క పెళ్లికి సంబంధించిన ఓ న్యూస్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ ఓ బిజినెస్‌మెన్‌ను పెళ్లాడనుందని సమాచారం. ప్రస్తుతం నాలుగు పదుల వయసులో ఉన్న అనుష్క బెంగళూరుకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో ఏడడుగులు వేయనుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని.. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయని తెలుస్తోంది. అబ్బాయి కన్నడ కుటుంబానికి చెందినవారని.. వీరిద్దరి వివాహ నిశ్చయానికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించినట్లు లేటేస్ట్ టాక్. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. రాబోయే రోజుల్లో అనుష్క పెళ్లిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ఒకవేళ ఈ వార్తలు నిజమైతే ఈ ఏడాది చివర్లో అనుష్క పెళ్లి పీటలెక్కే ఛాన్స్ ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే గతేడాది ఘాటీ మూవీతో అభిమానులను మెప్పించారు. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం మలయాళంలో కథనార్ అనే భారీ బడ్జెట్ సినిమాలో అనుష్క నటిస్తున్నారు. -
మరో మహిళతో భర్త సంబంధాన్ని పెళ్లి అనలేం: హైకోర్టు
శివాజీనగర(బెంగళూరు): ఓ మహిళ (66) తన భర్త (77) అక్రమంగా రెండవ పెళ్లి చేసుకున్నాడని దాఖలు చేసిన కేసును హెకోర్టు కొట్టివేసింది. భర్త పర స్త్రీతో సంబంధం కలిగి ఉండడం వివాహానికి సమానం కాదు, కాబట్టి కేసు చెల్లదని స్పష్టంచేసింది. న్యాయమూర్తి నటరాజ్ కేసును విచారించారు. వివాహం చేసుకున్నప్పుడు మాత్రమే కేసు వర్తిస్తుందన్నారు. తన భర్త మరో మహిళ (51)ను వివాహం చేసుకొన్నారు, ఆయన కుమారులు మద్దతుగా నిలిచారు అని మహిళ ఆరోపించారు. ఆ తరువాత మహిళ భర్త, కుమారులు, ఆ మహిళ కేసును రద్దు చేయాలని పిటిషన్ వేశారు. చివరకు కేసు వీగిపోయింది. -
బిజినెస్ మెన్ ను పెళ్లాడబోతున్న అరుంధతి..!
-
మోదీకి, యోగీకి విజ్ఞప్తి : మహిళ సూసైడ్ వీడియో వైరల్
ఆగ్రాలో ఒక మహిళ ఆత్మహత్య కలకలం రేపింది. నాలుగేళ్లు సహజీవనంచేసి, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, ఇప్పుడు వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నాడని ఒక పోలీస్ కానిస్టేబుల్‌పై ఆరోపణలు గుప్పిస్తూ చనిపోయే ముందు ఆమె ఒక వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు కూడా విజ్ఞప్తి చేయడంతో ఇది వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియో సంచలనంగా మారడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. అసలు స్టోరీ ఏంటంటే..ప్రాథమిక సమాచారం ప్రకారం, బాధిత మహిళది స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని కాస్గంజ్ జిల్లా. ఆమె అంతకుముందే విడాకులు తీసుకుని, ఆగ్రాలో ఒక ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్న క్రమంలో తాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లోపనిచేస్తున్న జేవీ గౌతమ్ అనే కానిస్టేబుల్‌తో పరిచయమైంది. దీంతో గత నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, కుటుంబం ఒప్పుకోదు అంటూ పెళ్లికి నిరాకరించాడు. చివరికి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధం కావడంతో వివాదం రేగింది. తీవ్ర ఆవేదనతో వీడియో సందేశం రికార్డ్ చేసి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ వీడియోలో ఇలా పేర్కొంది..తాను కలిసి జీవించిన గౌతమ్ చేతిలో ఏళ్ల తరబడి శారీరక, మానసిక వేధింపులకు గురయ్యానని ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, ఆ తర్వాత మాట తప్పాడని పేర్కొంది. గౌతమ్‌తో జీవించిన కాలంలో తీవ్రమైన శారీరక, మానసిక వేధింపులకు గురయ్యానని ఆమె పేర్కొంది. ఫిర్యాదు చేయడానికి తాను పోలీస్ స్టేషన్‌కు వెళ్ళినప్పుడు, తమ చేతుల్లో ఏమీ లేదని, ఆ కానిస్టేబుల్‌పై ఎటువంటి చర్యలూ తీసుకోలేమని అక్కడివారు చెప్పినట్లు ఆమె తెలిపింది. తాను బతికి ఉన్నప్పుడు తనకు న్యాయం జరగలేదని, కనీసం తన మరణం తర్వాత అయినా తనకు న్యాయం జరగాలని ఆశించింది. అంతేకాదు గౌతమ్, అతని కుటుంబ సభ్యులు తనను ఎంతో మోసం చేశారని, మానసికంగా వేధించారని, చివరికి ఈ దారుణ నిర్ణయం తీసుకునేలా తనను నెట్టారని ఆమె ఆరోపించింది. ఏళ్ల తరబడి అతనితో కలిసి జీవించిన తర్వాత, ఇప్పుడు అతను వేరొక మహిళను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడని ఆమె వాపోయింది."నా మరణానికి జేవీ గౌతమ్, అతని కుటుంబం మొత్తం కారణం. వారు నన్ను ఎంతగానో మోసం చేశారు. మానసికంగా ఎంతగా వేధించారంటే, చివరికి నేను చనిపోయేలా నన్ను బలవంతం చేశారు." అని చెప్పింది. అలాగే ‘‘అతని అన్నయ్య ఒకవైపు నన్ను పెళ్లి చేసుకోమని చెబుతున్నాడు. మరోవైపు, నా కుటుంబం నన్ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించదని జేవీ గౌతమ్ నాతో చెబుతున్నాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, కానీ కనీసం ఏ అమ్మాయినీ మోసం చేయకు," అని పేర్కొంది."Don't get married to anyone, but don't keep any girl in deception either"The young woman who made a video before suicide in Agra leveled serious allegations of deception against police constable Jitendra Gautam!!Constable is arrested and send to Jail.99 percent of Live in… pic.twitter.com/OCDlXiEbLb— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) March 13, 2026 ఆ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో కానిస్టేబుల్ జె.వి. గౌతమ్‌ను సస్పెండ్ చేశారు. మరోవైపు ఆమె మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ కుమార్తెకు న్యాయం జరగాలని వారు డిమాండ్ చేశారు. బాధిత మహిళ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆ కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లికి ముందే పిల్లల విషయంలో ఆ నిర్ణయం తీసుకున్నాం: అల్లు శిరీష్
టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మార్చి 6న తన ప్రియురాలు నయనికను వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లికి ముందే ఈ జంట తమకు పుట్టబోయే పిల్లల గురించి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. పుట్టబోయే పిల్లలను తెలుగులో మాట్లాడేలా పెంచాలనుకుంటున్నారట. ఈ విషయాన్ని స్వయంగా అల్లు శిరీషే చెప్పారు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లవ్‌స్టోరీ గురించి వివరించాడు.అత్తయ్యకు దొరికిపోయాం..మేమిద్దరం ప్రేమలో ఉన్న విషయం మొదట మా అత్తయ్య(చిరంజీవి సతీమణి సురేఖ)కు తెలిసింది. మేమిద్దరం ఓ రోజు కాఫీ తాగేందుకు బయటకు వెళ్లాం. కాఫీ షాపులో మా అత్తయ్యకు తెలిసివాళ్లు కూడా ఉన్నారు. అది మాకు తెలియదు. మేము కాఫీతాగి బయటకు రాగానే.. వాళ్లు మా అత్తయ్యకు ఫోన్ చేసి చెప్పారు. అలా మా ప్రేమ విషయంలో ఇంట్లో తెలిసింది. నేను కూడా నయనికను ప్రేమిస్తున్నానే విషయాన్ని ఇంట్లోవాళ్లకు చెప్పాను. వాళ్ల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం.నయనిక సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే నాకు ఇష్టంనయనిక సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే నాకు చాలా ఇష్టం. ఏ విషయానైనా ముక్కు సూటిగా మాట్లాడుతుంది. నచ్చకపోతే ముఖం మీదనే నచ్చలేదని చెప్పెస్తుంది. నా సినిమాల్లో నచ్చిన విషయాలను షేర్ చేసుకునేది. పెళ్లికి ముందే మేము పిల్లల గురించి కూడా మాట్లాడుకున్నాం. మాకు పుట్టబోయే పిల్లలు ఇంట్లో తెలుగులోనే మాట్లాడాలనేది నా కోరిక. దీనిపై మేమిద్దరం చర్చించుకున్నాం’ అని శిరీష్ చెప్పుకొచ్చాడు. -
లవ్ జిహాద్ కాదు, ఆమె ఇష్టమే నా ఇష్టం!
మహా కుంభమేళా 2025లో పూసల దండలు అమ్ముకుంటూ ఫ్యామస్ అయిన మోనాలీసా భోంస్లే (Monalisa Bhosle) మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రియుడు నటుడు ఫర్మాన్ ఖాన్ పెళ్లాడి ఫ్యాన్స్ అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది. అయితే ఈ పెళ్లి 'లవ్ జిహాద్' నెట్టింట తీవ్ర దుమారం రేగింది. దీనిపై ఈ జంట వివరణ ఇచ్చారు. గురువారం (మార్చి 12, 2026) తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ పెళ్లిపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు.తాము తమ మతాలు మార్చుకోలేదని మోనాలీసా స్పష్టం చేసింది. తాను హిందువుగా, తన భర్త ముస్లింగానే కొనసాగుతామని మోనాలీసా వివరించింది. అలాగే 'లవ్ జిహాద్' ఆరోపణలను కూడా ఆమె తోసిపుచ్చింది. ఈ వివాహం తన సొంత నిర్ణయమని తేల్చి చెప్పింది. తన తండ్రి తనతో పాటు కేరళకు వచ్చినప్పటికీ, ఈ పెళ్లి పట్ల ఆయన ఇంకా అసంతృప్తితో ఉన్నారని, త్వరలోనే ఆయనను ఒప్పించు కోగలననే ధీమా వ్యక్తం చేసింది. తన అత్త కొడుకుతో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించారని, కానీ తనకు ఇష్టం లేక ఫర్మాన్ ఖాన్‌ను ఎంచుకున్నానని ఆమె చెప్పారు.తల్లి దండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా జరిగిన తమ మతాంతర వివాహానికి సంబంధించి విమర్శలపై స్పష్టత ఇస్తూ "ప్రేమలో మత మార్పిడి అవసరం లేదు" అని ఫర్మాన్ ఖాన్ ( Farman Khan)పేర్కొన్నాడు.. అలాగే మోనాలీసా మైనర్ అంటూ వస్తున్న వార్తలను ఫర్మాన్ ఖాన్ ఖండించారు. ఆమె ఆధార్ కార్డ్, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలను మీడియాకు చూపించారు. మోనాలిసా కోరుకున్న విధంగా ఆచారాలను అనుసరించడానికి తాను అంగీకరించాననీ, ఎందుకంటే ఆమె ఆనందాన్నే తన ఆనందమని చెప్పు కొచ్చాడు. ఈ సందర్భంగా తమకు కేరళ ప్రజల మద్దతు లభించడం సంతోషమని,మోనాలీసాకు ఇష్టమైతే అక్కడే స్థిరపడతా మన్నాడు.ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్ జిల్లాకు చెందిన ఖాన్, ఇండోర్ నివాసి మోనాలీసా వివాహం కేరళలోని ఒక ఆలయంలో హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. కేరళ ప్రభుత్వానికి చెందిన K-SMART యాప్ ద్వారా వీరి వివాహం చట్టబద్ధంగా నమోదైంది. ఈ వివాహ వేడుకకు కేరళ విద్యాశాఖ మంత్రి వి. శివన్ కుట్టి, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్ లాంటి ప్రముఖ రాజకీయ నేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా 'నాగమ్మ' అనే మలయాళ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఇందులో ఫర్మాన్ ఖాన్ విలన్‌గా, మోనాలీసా హీరోయిన్గా నటిస్తున్నారు. -
ఓ ఇంటివాడైన అల్లు శిరీష్.. ప్రియురాలి మెడలో మూడు ముళ్లు
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు నయనిక మెడలో మూడుముళ్లు వేశారు. వీరిద్దరి పెళ్లి వేడుక హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లిలో టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సందడి చేశారు. అల్లు అర్జున్ పెళ్లి రోజు కూడా ఇదే కావడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. అల్లు శిరీష్- నయనిక కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. హీరో నితిన్ భార్య షాలినికి నయనిక బెస్ట్ ఫ్రెండ్ కావడం మరో విశేషం. వరుణ్‌తేజ్- లావణ్య తమ పెళ్లిలో నయనికతో శిరీష్‌కు పరిచయం ఏర్పడింది. అలా వీరిద్దరు డేటింగ్ కొనసాగించారు. తాజాగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. కాగా.. అల్లు శిరీశ్ కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, బడ్డీ, ఊర్వశివో రాక్షసివో లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. -
ఘనంగా భట్టి తనయుని వివాహం
సాక్షి, హైదరాబాద్ : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య–సాక్షిల వివాహం శంషాబాద్ జీఎంఆర్ ఏరీనాలో గురువారం ఘనంగా జరిగింది, వధూవరులను ఆశీర్వదించడానికి గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సహా పలువురు సీనియర్ రాజకీయ నాయకులు, సినీ తారలు వచ్చారు. వారందరినీ డిప్యూటీ సీఎం ఆప్యాయంగా పలకరించారు. వివాహ వేడుకకు హాజరైనవారిలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావు, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎంపీ సంతోశ్‌కుమార్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సినీ ప్రముఖుల్లో చిరంజీవి, నాగార్జున, శ్రీకాంత్, తనికెళ్ల భరణి, పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ సీనియర్ అధికారులు ఉన్నారు. -
ఘనంగా అర్జున్ టెండూల్కర్ వివాహం
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ ఒక ఇంటి వాడయ్యాడు. 26 ఏళ్ల అర్జున్ వివాహం గురువారం సానియా చందోక్‌తో ఘనంగా జరిగింది. వివిధ రంగాలకు చెందిన దేశంలోని ప్రముఖులంతా ఈ పెళ్లి వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ కుటుంబం, భారత మాజీ క్రికెటర్లు ధోని, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, వీరేంద్ర సెహ్వగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, కైఫ్, జహీర్ ఖాన్, ఐసీసీ చైర్మన్ జై షా, సినీ తారలు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ తదితరులంతా అతిథులుగా పెళ్లిలో పాల్గొన్నారు. ఆల్‌రౌండర్ అర్జున్ దేశవాళీ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి 77 మ్యాచ్‌లు ఆడాడు. -
విజయ్ దేవరకొండ & రష్మిక మందన్న రిసెప్షన్ విజువల్స్
-
జ్యోతిషుడు చెప్పిందే నిజమైంది: నటి అమలా పాల్
-
అభిమానులకు విజయ్- రష్మిక ప్రత్యేక విందు.. వీడియో వైరల్
టాలీవుడ్ కొత్త జంట విజయ్ దేవరకొండ- రష్మిక తమ గ్రాండ్ వెడ్డింగ్ అభిమానులతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇటీవల సొంతూరుకి వెళ్లిన కొత్త జంట సత్యనారాయణవ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. తమ సొంతవారితో ఈ వేడుక జరుపుకోవడం ఆనందంగా ఉందని నూతన దంపతులు తెలిపారు.తాజాగా విజయ్- రష్మిక అభిమానుల కోసం ప్రత్యేకంగా లంచ్ ఏర్పాటు చేశారు. వారికి స్వయంగా భోజనాలు వడ్డించారు. అనంతరం వీరిద్దరు వారితో పాటే కలిసి భోజనం చేశారు. విజయ్‌కి రష్మిక భోజనం తినిపిస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. టాలీవుడ్ కొత్త జంట విజయ్ దేవరకొండ- రష్మిక ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో అత్యంత సన్నిహితులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. ఈనెల 4న హైదరాబాద్‌లో వీరి గ్రాండ్ రిసెప్షన్ వేడుక జరగనుంది. The Newlyweds #VijayDeverakonda and #RashmikaMandanna had lunch with fans.#VIROSH pic.twitter.com/VkRnVkgood— Gulte (@GulteOfficial) March 3, 2026 -
ఒకే వేదికపై ఇద్దరితో వివాహం వైరల్ అయిన థాయ్ పెళ్లి
-
ఒక భార్య... ఇద్దరు భర్తలు
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌కు చెందిన 37 ఏళ్ల మహిళ దువాంగ్‌దువాన్ కెట్సారో వివాహం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కనుల పండువగా జరిగినందుకో లేక అట్టహాసంగా జరిగినందుకో కాదు..పెళ్లి జరిగిన తీరు విచిత్రంగా ఉండటమే అందుకు కారణం. కెట్సారో ఇటీవల జరిగిన వేడుకలో ఆస్ట్రియాకు చెందిన ఇద్దరు వ్యక్తులను మనువాడింది. వీరిద్దరితో ఏళ్లుగా కొనసాగిస్తున్న బంధం నిజాయతీ, పరస్పర అంగీకారమే మూలమని ఆమె అంటోంది. గాయని, పాటల రచయిత అయిన కెట్సారో మొదటగా ఆస్ట్రియా వాసి రోమన్‌తో స్నేహం చేసింది. రిటైర్డు పోలీసు అధికారి అయిన రోమన్‌తో కలిసి పట్టాయా నగరంలో ఐదేళ్లపాటు కలిసి సహజీనం సాగించింది. ఆ సమయంలో వారి బంధం బలపడింది. తర్వాత, ఆస్ట్రియాకే చెందిన పోలీసు అధికారి మ్యాకీతో పరిచయమేర్పడింది. ఇతడికి దగ్గరైంది. వీరి ముగ్గురి మధ్య బంధం క్రమంగా ఒక అసాధారణ భాగస్వామ్యంగా రూపాంతరం చెందింది. ముగ్గురూ కలిసి కూర్చుని భవిష్యత్తులో కలిసి ఎలా ఉండాలనే విషయం చర్చించుకుని, ఒక నిర్ణయం తీసుకున్నారు. కాగా, కెట్సారోకు మొదటి వివాహం ద్వారా ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు మనవలు ఉన్నారు. తల్లిదండ్రులు, కుమార్తెలతోపాటు ఇతర కుటుంబసభ్యులకు సైతం ఆస్ట్రియా వాసులతో కొనసాగుతున్న బంధాన్ని గురించి తెలిపింది. పాటలు రాయడం, పాటడం ద్వారా ఆర్థిక కష్టాలు తీరక ఇబ్బందులు పడుతున్న సమయంలో రోమన్, మ్యాకీలు తనకెంతో బాసటగా నిలిచారని కెట్సారో అంటోంది. తన కుటుంబానికి కూడా సాయపడ్డారని తెలిపింది. ఇద్దరినీ పెళ్లి చేసుకుంటానని చెప్పగా కుటుంబసభ్యులు కూడా అంగీకారం తెలిపారని, వారు తన పట్ల చూపే శ్రద్ధ, అంకితభావమే ఇందుకు కారణమని పేర్కొంది. సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వివాహ కార్యక్రమానికి దగ్గరి బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. ఈ పెళ్లికి ఆస్ట్రియా వరులు చెరో లక్ష బహాట్లు, మన కరెన్సీలో సుమారు రూ.29 లక్షలను కెట్సారోకు సమర్పించుకున్నట్లు సమాచారం. సమాజంలో మారుతున్న వివాహ సంబంధాలకు వీరి పెళ్లి తాజా ఉదాహరణగా భావిస్తున్నారు. -
నూరేళ్లూ చల్లగా ఉండాలని..
రాయవరం: ఆకాశమంత పందిరి.. భూదేవంత అరుగు.. ఒకప్పుడు గోదావరి జిల్లాల్లో పెళ్లిళ్లంటే ఇలానే మాట్లాడే వారు. ఫలానా వారి తోటలో కొబ్బరాకులు, పూలంటూ పురమాయించేవారు. ఇంటి వద్దే చలువ పందిళ్లు, మండపాల ఏర్పాటుతో ఐదు రోజుల పాటు చేసే పెళ్లిని పది కాలాల పాటు చెప్పుకొనేవారు. మళ్లీ ఇప్పుడు ఆ రోజులను గుర్తు చేస్తూనే.. హంగూ ఆర్భాటాలు, అంగరంగ వైభోగాలతో దక్షిణాది సంప్రదాయానికి ఉత్తరాది మెరుగులు అద్ది, ఖర్చుకు వెనుకాడకుండా జరిపిస్తున్నారు. ముఖ్యంగా ఏ శుభకార్యం చేయాలన్నా ముందుగా ఏసీ కల్యాణ మండపాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. జాబితా తయారీలో వధూవరులు పెళ్లి ఎక్కడ చేసుకోవాలి? ఏ మండపంలో చేయాలి.. మెనూ ఏంటనేది వధూవరులే ఓ పెద్ద జాబితా తయారు చేసుకుంటున్నారు. జీవితకాలం గుర్తుండి పోయేలా వివాహాన్ని చేసుకోవాలని ఆశించే వధూవరులు పెళ్లికి వచ్చే స్నేహితులు, కుటుంబ సభ్యుల రాకను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక ఏసీ కల్యాణ మండపంలోనే చేసుకోవాలని భావిస్తున్నారు. వాటి అద్దె, లంచ్, డిన్నర్, అలంకరణకు కనీసం రూ.10 నుంచి రూ.15 లక్షల వరకు చేస్తున్నారని రాయవరం గ్రామానికి కల్యాణ మండపం నిర్వాహకుడొకరు చెప్పారు. ముందుగానే బుకింగ్ వివాహం నిశ్చయమైన వెంటనే ముందుగా పెళ్లి ఎక్కడ చేయాలనే దానిపై అధికంగా చర్చించుకుంటున్నారు. ఆలయాల వద్ద కాకుంటే కల్యాణ మండపాలకే ప్రాధాన్యం ఇస్తూ.. వెంటనే మండపాల బుకింగ్ చేస్తున్నారు. రెండు, మూడు నెలల ముందుగా మండపం బుక్ చేసుకోకుంటే దొరకని పరిస్థితి ఉంది. విదేశాల్లో ఉండే సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అద్దె రెట్టింపు ఇస్తామని ఫోన్లు చేసి అడుగుతున్నారని మండపాల నిర్వాహకులు చెబుతున్నారు. పల్లెల్లో సైతం.. వాతావరణంలో వస్తున్న మార్పులు.. ఇప్పుడు కాకుంటే ఎప్పుడంటూ వివాహ వేడుకలకు ఇస్తున్న ప్రాధాన్యం నేపథ్యంలో పల్లెల్లో సైతం కల్యాణ మండపాల నిర్మాణాలు చేపడుతున్నారు. కొందరు కొత్త భవనాలను నిర్మిస్తుంటే.. మరికొందరు పాత భవనాలను కల్యాణ మండపాలుగా మార్చేస్తున్నారు. ఏ చిన్న శుభ కార్యం చేయాలనుకున్నా.. సమావేశాలు నిర్వహించాలనుకున్నా.. ఏసీ కల్యాణ మండపాలకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. వివాహ ఆహ్వన పత్రికల్లో సైతం ఏసీ కల్యాణ మండపం అనే విషయాన్ని స్పష్టంగా పేర్కొంటున్నారు. వచ్చిన బంధువులు, స్నేహితులు అధిక సమయం ఉండాలంటే ఏసీ కల్యాణ మండపాలే ఉండాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు ఉన్న కల్యాణ మండపాల్ని ఏసీ కల్యాణ మండపాలుగా మార్చేస్తున్నారు. ఆర్భాటానికే ప్రాధాన్యం ఓ కల్యాణ మండపంలో ఓ వ్యాపారి తన కుమారుడికి ఇటీవల పెళ్లి జరిపించారు. సుమారు 10 రకాల స్వీట్లు, నాలుగైదు రకాల స్పెషల్ రైస్, ఆకుపై 20 రకాల కూరలు (పొడులు, పచ్చళ్లతో కలిపి) ఉండాలని చెప్పారు. 2 వేల మందికి ఆర్డర్ ఇచ్చారు. ప్లేటు రూ.500 అయ్యిందని కల్యాణ మండపం నిర్వాహకుడు చెప్పారు. ఒక్క భోజనాలకే ఖర్చు రూ.10 లక్షలు అయ్యిందని చెప్పుకొనే విధంగా చేస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో పెద్ద, చిన్న కలిపి 200 వరకూ కల్యాణ మండపాలున్నాయి. అతి పెద్ద ఏసీ మండపమైతే అద్దె రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు ఉంటోంది. భోజనాలకు మెనూను బట్టి ఆకుపై వేసిన రకాలను బట్టి రూ.300 నుంచి 450 వరకూ పడుతుంది. ఇక కల్యాణ మండపంలో పచ్చిపూల మండపం ఏర్పాటుకు బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ తదితర నగరాల నుంచి నుంచి తీసుకొచ్చిన పూలకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ ఖర్చు చేస్తున్నారు. విద్యుద్దీపాలంకరణకు మరో రూ.లక్షన్నర వరకూ పెడుతున్నారు. ఇవి కాకుండా బాజాభజంత్రీలకు ఖర్చులు అదనం. బడ్జెట్ అధికమైనా తప్పదు ఏ శుభకార్యమైనా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఏసీ కల్యాణ మండపాల్లోనే నిర్వహిస్తున్నాం. ఇటీవల మా మనమరాలి ఓణీ ఫంక్షన్‌ను ఏసీ కల్యాణ మండపంలోనే నిర్వహించాం. ఒకప్పటి పరిస్థితికి, నేటి పరిస్థితికి చాలా మార్పు వచ్చింది. ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా శుభకార్యాలు చేయాల్సిందే. –ద్విభాష్యం విజయప్రభాకర్, విశ్రాంత ఉద్యోగి, రాజమహేంద్రవరం ఇళ్ల వద్ద నిర్వహించే పరిస్థితి లేదు ఏ కార్యక్రమమైనా ఇళ్ల వద్ద నిర్వహించే పరిస్థితి లేదు. చిన్న, మధ్య తరగతి కుటుంబాలు కూడా ఆర్థిక పరిస్థితిని వెరవకుండా ఏసీ కల్యాణ మండపాల్లోనే నిర్వహిస్తున్నారు. నాన్ ఏసీ అయితే ఏసీ కా దా.. అంటూ వచ్చిన వారు పెదవి విరుస్తున్నారు. –కొప్పిశెట్టి శ్రీనివాస్, వ్యాపారి, రాజమహేంద్రవరం డిమాండ్ ఎక్కువగానే ఉంది గ్రామీణ ప్రాంతాల్లో కూడా కల్యాణ మండపాలకు డిమాండ్ అధికంగానే ఉంది. రైస్ మిల్లును కల్యాణ మండపంగా మార్చాం. ముహూర్తాల సమయంలో డిమాండ్ మరింత అధికంగా ఉంటుంది. రెండు, మూడు నెలల ముందుగానే కల్యాణ మండపాన్ని బుక్ చేసుకుంటున్నారు. –మూర్తినీడి వెంకటరాజు, కల్యాణ మండపం నిర్వాహకుడు, రాయవరం -
విరాట్ కోహ్లీ రికార్డ్ బద్దలు కొట్టిన రష్మిక.. అదేంటో తెలుసా?
కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఇన్ని రోజులుగా సీక్రెట్‌గా రిలేషన్లో ఉన్న వీరిద్దరు పెళ్లికి కొద్ది రోజుల ముందు అఫీషియల్‌గా ప్రకటించారు. గత నెల ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్ ప్యాలెస్‌లో అతికొద్దిమంది సమక్షంలో వీరిద్దరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.పెళ్లి తర్వాత విజయ్, రష్మిక తమ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ జంట తమ భావాలను ప్రకటిస్తూ భావోద్వేగంగా రాసుకొచ్చారు. ఈ పిక్స్ షేర్ చేసిన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చేశాయి. అత్యధిక లైక్స్‌తో పలువురి సెలబ్రిటీల ఫోటోలు క్రియేట్ చేసిన రికార్డ్స్‌ను విరోష్ జంట తుడిచిపెట్టేసింది. తాజాగా ఈ పిక్స్ మరో రికార్డ్ సృష్టించాయి.2024లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా విరాట్ కోహ్లీ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోకు దాదాపు 23 మిలియన్ల లైక్స్ వచ్చాయి. తాజాగా ఆ రికార్డ్‌ను రష్మిక షేర్ చేసిన పెళ్లి ఫోటోలు బద్దలు కొట్టాయి. రష్మిక పోస్ట్‌కు ఏకంగా 25 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. దీంతో విరాట్ పోస్ట్ రికార్డ్‌ను రష్మిక అధిగమించింది. కాగా.. ఇన్‌స్టాలో రష్మికకు 50 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అంటే దాదాపు సగం మంది ఈ వెడ్డింగ్ ఫోటోలను లైక్ చేశారు. అంతేకాకుండా విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన ఫోటోలకు 19.8 మిలియన్ల లైక్ వచ్చాయి. కాగా.. మరోవైపు విరాట్‌కు ఇన్‌స్టాలో 274 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. రష్మిక పోస్ట్‌కు ఈ రేంజ్లో ఆదరణ దక్కడం చూస్తుంటే ఆమె క్రేజ్ ఏంటో తెలిసిపోతోంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
విరోష్... ఓ రికార్డ్
బాక్సాఫీస్ దగ్గర భారీ సినిమాలు వసూళ్లపరంగా రికార్డ్ బ్రేక్ చేయడం కామన్. అయితే ఇప్పుడు ‘విరోష్’ (విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నా) వివాహం ఓ రికార్డ్ బ్రేక్ చేసింది. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్ ప్యాలెస్ వేదికగా ఉయం 10 గంటల 10 నిమిషాలకు విరోష్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లి ఫొటోలను ‘విరోష్’ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి, ఒకరిçపట్ల మరొకరికి ఉన్న ప్రేమను చెబుతూ, ఓ పోస్ట్‌ని కూడా షేర్ చేశారు. కాగా... రష్మికా మందన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలకు అత్యధిక లైక్స్ దక్కాయి. దీంతో ‘విరోష్’ వివాహ ఫొటోలు రికార్డ్ సాధించాయి. బాలీవుడ్ కపుల్ పిద్ధార్థ్ మల్హోత్రా–కియారా అద్వానీల పెళ్లి ఫొటోలు అత్యధిక లైక్స్ దక్కించుకున్న రికార్డ్‌ని సొంతం చేసుకున్నాయి. ఆ రికార్డ్‌ని తాజాగా విరోష్ ఫొటోలు బ్రేక్ చేశాయి. షేర్ చేసిన తక్కువ సమయంలో ఎక్కువ లైక్స్ (15.8 మిలియన్లు) సాధించిన సిద్ధార్థ్–కియారాల రికార్డ్‌ని 18.5 మిలియన్ల లైక్స్‌తో ‘విరోష్’ పెళ్లి ఫొటోలు బ్రేక్ చేశాయి. ఈ నంబర్ ఇంతటితో ఆగలేదు... లైక్స్ సంఖ్య పెరుగుతూ వస్తోంది. శుక్రవారం సాయంత్రం దాటుతున్న సమయంలో ఈ సంఖ్య 20 మిలియన్లకు పైగా దాటింది. అంటే... దాదాపు రెండు కోట్లకు పైనే లైక్స్ దక్కాయి. దీన్నిబట్టి విజయ్–రష్మికల జోడీకి ఎంత క్రేజ్ ఉందో ఊహించుకోవచ్చు.ఉదయ్‌పూర్ టు హైదరాబాద్: పెళ్లి ఫొటోల్లో బ్యూటిఫుల్ కపుల్‌లా కనిపించిన విజయ్–రష్మిక శుక్రవారం ఎయిర్‌పోర్టులో క్యూట్‌గా కనిపించి, ఆకట్టుకున్నారు. శుక్రవారం ఈ నూతన జంట హైదరాబాద్ చేరుకుంది. కాగా ఎయిర్‌పోర్టులో ఈ జంటని చూసి, ‘కంగ్రాచ్యులేషన్స్’ అంటూ ఫ్యాన్స్ అభిమానం చాటుకోగా... ‘విరోష్’ శిరస్సు వంచి నమస్కరించడంతో పాటు ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ... చిరునవ్వులు చిందించారు. మార్చి 4న హైదరాబాద్‌లో వీరి వివాహ రిసెప్షన్ జరగనుంది. ప్రధానికి ఆహ్వానం... వైరల్భారత ప్రధాని నరేంద్ర మోదీని గత వారం విజయ్–రష్మిక స్వయంగా కలిసి, తమ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ జంటను ఆశీర్వదిస్తూ... మోదీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ కూడా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. కాగా... మోదీని విజయ్–రష్మిక కలిసిన ఫొటోలు తాజాగా బయటకు రాగా... అవి కూడా వైరల్‌గా మారాయి. -
విజయ్‌తో పెళ్లి.. ముందే చెప్పిన రష్మిక.. వీడియో వైరల్..!
టాలీవుడ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన విరోష్ వెడ్డింగ్ గ్రాండ్‌గా జరిగింది. కొన్నేళ్ల పాటు సీక్రెట్ రిలేషన్షిప్లో ఉన్న వీరిద్దరు పెళ్లికి కొద్ది రోజుల ముందే అఫీషియల్‌గా ప్రకటించారు. ఎంగేజ్మెంట్ కూడా అత్యంత ప్రైవసీ పాటించిన ఈ జంట ఉదయ్‌పూర్‌లో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో ఒక్కటయ్యారు. ఎక్కడా కూడా తమ రిలేషన్షిప్ బయట పడకుండా కొన్నేళ్ల పాటు కొనసాగించారు. ఎక్కడికెళ్లినా జంటగా కనిపించి దొరికిపోయినప్పటికీ ఎక్కడా కూడా అఫీషియల్‌గా ప్రకటించలేదు.అలా కొన్నేళ్లుగా వీరిద్దరి డేటింగ్ రూమర్స్ వస్తున్నా వాటిని అస్సలు పట్టింకోలేదు విరోష్ జంట. కేవలం తమ సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. అలా అత్యంత సీక్రెట్‌గా విజయ్- రష్మిక తమ బంధాన్ని కొనసాగించారు. అయితే గతేడాది ఓ సినిమా ఈవెంట్‌కు హాజరైన రష్మిక.. తన పెళ్లి గురించి ముందుగానే చెప్పేసింది. కానీ మనకే అర్థం కాలేదంటూ నెటిజన్స్ ఆ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఇంతకీ అదేంటో మనం కూడా తెలుసుకుందాం.గతంలో ఓ మూవీ ఈవెంట్‌కు హాజరైన రష్మికను.. అనంద్ దేవరకొండ ఆట పట్టించాడు. దీనికి రష్మిక సమాధానమిస్తూ.. ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీరా.. ఇలా నన్ను స్పాట్లో పెట్టి అడిగితే ఎట్లా అంటూ అప్పుడే హింట్ ఇచ్చేసింది. రష్మిక- విజయ్ పెళ్లి వేళ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2024లోనే ఈ విషయం మనం అర్థం చేసుకోవాల్సిందని అంటూ నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 2024 లోనే అర్థం చేసుకోవాల్సింది మనం We did a mistake 😭😭😭😭😭😭#RashmikaMandanna #VijayDeverakonda pic.twitter.com/tryvGuCGsF— Swaasthi (@swaasthi) February 26, 2026 -
పెళ్లయిన కొన్ని గంటలకే.. సినిమా తరహా ట్విస్ట్..
హమీర్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని హమీర్పూర్ జిల్లాలో సినిమా తరహా ట్విస్ట్‌లతో ఓ ఘటన జరిగింది. పెళ్లయిన కొన్ని గంటలకే వధూవరులు తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. పెళ్లి తర్వాత భర్తతో కలిసి ఉండటానికి వధువు నిరాకరించడంతో ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఇరు కుటుంబాల మధ్య చర్చల అనంతరం, తక్షణమే విడాకులు తీసుకోవాలని దంపతులు నిర్ణయించుకున్నారు.అసలేం జరిగిందంటే.. పెళ్లి వేడుకలు అనంతరం వధువు మిథిలేష్ కుమారి తన అత్తవారింటికి చేరుకుంది. శోభనం రాత్రి దంపతులిద్దరూ గదిలోకి వెళ్లిన సమయంలో.. ఆమె తన భర్త ధరమ్ సింగ్ కుష్వాహాతో ఉండటానికి నిరాకరించింది. తాను వేరొకరిని ప్రేమిస్తున్నానని.. తన ఇష్టానికి వ్యతిరేకంగా ఈ వివాహం జరిపించారని మిథిలేష్ పేర్కొంది. తన కుటుంబ సభ్యులు తనను కొట్టి, బలవంతంగా పెళ్లి పీటల మీద కూర్చోబెట్టారంటూ భర్తకు వివరించింది.వరుడు ధరమ్ సింగ్ కుష్వాహా స్పందిస్తూ.. వధువు ఈ విషయాన్ని ముందే చెప్పి ఉంటే బాగుండేదన్నాడు. అలా చేసి ఉంటే ఇరు కుటుంబాలకు ఈ అవమానం తప్పేదని.. అసలు పెళ్లే జరిగేది కాదన్నాడు. ఇరు కుటుంబాలు హమీర్‌పూర్‌లోని రాత్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాయి. పోలీసులు ఇరు పక్షాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, వధువు మిథిలేష్ తన నిర్ణయం మార్చుకోలేదు. తన భర్తతో ఉండటం ససేమిరా అంటూ స్పష్టం చేసింది.పోలీసులు మాట్లాడుతూ.. ఇరు వర్గాలతో సుదీర్ఘంగా చర్చలు జరిపామని.. కాపురానికి వెళ్లడానికి వధువు ఇష్టపడటం లేదని.. దీంతో పరస్పర అంగీకారంతో విడిపోవాలని కుటుంబాలు నిర్ణయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం, ఆ జంట తక్షణమే విడాకులు తీసుకున్నారు. వధువు తన కుటుంబ సభ్యులతో కలిసి తన పుట్టింటికి వెళ్లిపోయింది. -
రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి... గెస్ట్ లిస్ట్ & గ్రాండ్ ఫుడ్ మెనూ
-
రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి వీడియో వైరల్
-
'నా భర్తను పరిచయం చేస్తున్నా'.. రష్మిక ఎమోషనల్ పోస్ట్
తన పెళ్లి ఫోటోలను హీరోయిన్ రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. హాయ్ మై లవ్స్.. తన భర్త విజయ్ దేవరకొండను మీకు పరిచయం చేస్తున్నానంటూ పోస్ట్ చేసింది. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నాకు నేర్పించిన వ్యక్తి అని విజయ్ను కొనియాడింది. ప్రశాంతంగా ఎలా ఉండాలో నాకు చూపించిన వ్యక్తి అని ప్రశంసలు కురిపించింది. నా కలలు నేను ఎప్పుడైనా సాధించగలనని చెప్పిన ఏకైక వ్యక్తి అంటూ భర్త విజయ్ దేవరకొండను ఆకాశానికెత్తేసింది. ఇది చూసిన అభిమానులు రష్మిక-విజయ్ జంటకు అభినందనలు చెబుతున్నారు. రష్మిక తన ఇన్‌స్టాలో రాస్తూ..' హాయ్ మై లవ్స్.. ఇప్పుడు మీకు నా భర్తని పరిచయం చేస్తున్నా. మిస్టర్ విజయ్ దేవరకొండ.. నిజమైన ప్రేమ, ప్రశాంతంగా ఎలా ఉండాలో నేర్పించిన వ్యక్తి. ప్రతిరోజు పెద్ద కలలు కనడం.. నేను ఎప్పుడైనా సాధించగలనని చెప్పగలిగే వ్యక్తి. స్నేహితులతో ప్రయాణించడం నాకు చూపించిన వ్యక్తి. నన్ను నమ్మండి.. నేను ఈ వ్యక్తి గురించి ఒక పుస్తకం రాయగలను. నేను ఎప్పుడూ కలలు కన్న స్త్రీని అయ్యా.. ఎందుకంటే మీరు ఈ రోజు నాదిగా మార్చారు. ఈరోజు నన్ను నిజంగా ఆశీర్వదించారు. విజ్జు నీ పట్ల నాకున్న భావాలను వర్ణించడానికి నాకు మాటలు లేవు!! నేను ఎప్పుడూ నీకు చెబుతూనే ఉన్నానంటూ' పోస్ట్ చేసింది.అంతేకాకుండా..'నా విజయాలు, కష్టాలు, ఆనందం, విచారం, జీవితం అన్నీ నీకు తెలుసు. ఇప్పుడు ప్రతిదీ చాలా అర్థవంతంగా ఉంది. ఎందుకంటే నేను నీతో ఉన్నా. ఇది మన జీవితంలో అన్నింటిలో అతిపెద్ద భాగం. నేను నీ భార్యగా మారడానికి చాలా ఉత్సాహంగా ఉన్నా. మీ భార్యగా ఉండటానికి.. మీ భార్యగా పిలవడానికి.. ఇప్పుడిది పూర్తిగా పార్టీ సమయం. మనిద్దరం కలిసి ఎప్పుడూ లేనంత ఉత్తమ జీవితాన్ని గడుపుదాం. ఐ లవ్ యూ' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.'ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్..టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఇవాళ ఉదయం ఈ ఫేమస్ స్టార్స్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఎట్టకేలకు ఒక్కటయ్యారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా నిలిచింది. తెలుగు సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరగ్గా.. సాయంత్రం కర్ణాటకలోని కొడవ సంప్రదాయం ప్రకారం కూడా పెళ్లి వేడుక జరగనుంది. ఈ పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
అమ్మాయి-అబ్బాయి కనిపిస్తే ‘పెళ్లి’?.. అ నోటీసుల్లో నిజమెంత?
న్యూఢిల్లీ: నగరంలోని జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక నోటీసుపై క్లారిటీ ఇచ్చింది. ఆ నోటీసులో పవిత్ర రమజాన్ నెలలో విద్యార్థులపై కొన్ని పరిమితులు విధించారని పేర్కొనబడింది. ప్రధానంగా యూనివర్శిటీ క్యాంపస్‌లో అమ్మాయి-అబ్బాయి కనిపిస్తే పెళ్లి చేసేస్తామంటూ సదరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నోటీసుపై స్పష్టత ఇచ్చింది. అది నిజం కాదని, ఆ నోటీసు నకీలీ నోటీసు అని పేర్కొంది.దీనిపై విశ్వవిద్యాలయం అధికారులు ఈ నోటీసును పూర్తిగా నకిలీది అని ఖండించారు. వారు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని, ఇది తప్పుడు ప్రచారం అని స్పష్టం చేసింది. ఈ నోటీసుతో ప్రజల్లో గందరగోళం సృష్టించే యత్నం చేశారని, దీనిపై సైబర్ విభాగానికి అధికారిక ఫిర్యాదు ఇచ్చినట్లు పేర్కొన్నారు. క్యాంపస్‌లో అమ్మాయి-అబ్బాయి కలిసి ఉన్నందుకు ఎలాంటి పరిమితులు విధించలేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే జామియా మిల్లియా ఇస్లామియా ప్రతినిధులు ఒక విన్నపాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ‘కేవలం అధికారిక వెబ్సైట్ లేదా విశ్వ విద్యాలయం నుండి విడుదలైన ప్రకటనలే నమ్మాలి. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారం వల్ల తప్పుదారి పట్టవద్దు’ అని సూచించారు.పవిత్ర రంజాన్ నెలలో అబ్బాయి-అమ్మాయి కలిసి నిలబడి ఉన్నప్పుడు నికా ఏర్పాటు చేయాలని ఫిబ్రవరి 20 తేదీన.. ఒక నోటిఫికేషన్ సోషల్ మీడియాలో వెలుగు చూసింది నోటిఫికేషన్లో ఉన్నది పూర్తిగా తప్పుడు సమాచారం. విశ్వవిద్యాలయ అధికారులు అలాంటి నోటిఫికేషన్‌ను జారీ చేయలేదు. అందువల్ల దానిని సీరియస్‌గా తీసుకోవద్దని అందరిని కోరుతున్నాము. విశ్వవిద్యాలయ ప్రతిష్టను దెబ్బతీయడానికి మాత్రమే ఆ నోటిఫికేషన్‌ను ప్రచారం చేశారు. విశ్వవిద్యాలయ పరిపాలన అలాంటి నోటిఫికేషన్‌ను ఖండిస్తోంది. ఈ విషయమై ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేశాం’ అని సదరు యూనివర్శిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. -
విరోష్ జంట గొప్పమనసు.. వారికి ప్రత్యేకంగా స్వీట్ బాక్సులు..!
ఎన్నో ఏళ్లుగా వేచి చూసిన తరుణం రానే వచ్చింది. కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న విరోష్ జంట పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లో వీరి గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది. ఇవాళ ఉదయం 10 గంటల 10 నిమిషాలకు రష్మిక మెడలో మూడు ముళ్లు వేశాడు విజయ్ దేవరకొండ. ఈ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా విరోష్ జంట తమ గొప్పమనసు చాటుకున్నారు. వీరి పెళ్లిని కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులకు స్వీట్ బాక్సులు అందించారు. అంతేకాకుండా అక్కడే ఉన్న చిన్నపిల్లలకు సైతం స్వీట్స్ పంచారు. ఐటీసీ మెమొంటోస్ హోటల్ బయట ఉన్న వారి దగ్గరికి వచ్చిన ఈ ప్రత్యేక స్వీట్ బాక్సులు అందజేశారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #TFNExclusive A 'Sweet' gesture!❣️Team #VIROSH share joy with the media at Udaipur!!🤩✨#VijayDeverakonda #RashmikaMandanna #TeluguFilmNagar pic.twitter.com/6PryBXwsEp— Telugu FilmNagar (@telugufilmnagar) February 26, 2026 -
గ్రాండ్‌గా విజయ్-రష్మిక పెళ్లి.. అతిథుల నోరూరించే స్పెషల్ వంటకాలు ఇవే.. !
టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఇవాళ ఉదయం ఈ ఫేమస్ స్టార్స్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఎట్టకేలకు ఒక్కటయ్యారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా నిలిచింది. తెలుగు సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరగ్గా.. సాయంత్రం కర్ణాటకలోని కొడవ సంప్రదాయం ప్రకారం కూడా పెళ్లి వేడుక జరగనుంది. ఈ పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు.అయితే ఇంతలా గ్రాండ్ వెడ్డింగ్ చేసుకున్న ఈ పెళ్లిలో అతిథులు సందడి చేశారు. వీరి పెళ్లి వేడుక గురించే టాలీవుడ్లో చర్చ మొదలైంది. ఇంతకీ ఈ పెళ్లి ఎన్ని రకాల వంటకాలు చేశారనే విషయంపై నెట్టింట తెగ చర్చించుకుంటున్నారు. అసలు పెళ్లికి వచ్చిన అతిథులకు ఎలాంటి వంటకాలు వడ్డించారో మనం కూడా ఓ లుక్కేద్దాం.ప్రత్యేక వంటకాలతో అతిథులకు విందు.. ఈ పెళ్లికి హాజరైన అతిథులకు ప్రత్యేక వంటకాలతో విందు ఏర్పాటు చేశారు విరోష్ జంట. ఈ వేడుకలో తెలంగాణ సంప్రదాయ వంటకాలతో పాటు కన్నడకు చెందిన స్పెషల్స్ కూడా చేయించారు. విరోష్ వెడ్డింగ్‌లో కొడవ స్పెషల్ కర్రీ హైలెట్‌గా నిలిచింది. ఫుడ్ మెనూలో తెలంగాణ స్టైల్లో మటన్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ, నాటుకోడి పులుసు అతిథులకు అందించారు. వెజ్ విషయానికొస్తే గారెలు, పప్పు, పచ్చిపులుసు, ఓల్డ్ సిటీ కీమా సమోసాలు ఏర్పాటు చేశారు. కర్ణాటక స్పెషల్ అయిన బిసిబేలె బాత్, మైసూర్ పాక్ అతిథులకు రుచి చూపించారు. -
Nellore: కొత్త జంటకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
-
విజయ్ దేవరకొండకు రష్మిక ఎంత కట్నం ఇస్తుందో తెలుసా?
-
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బంధువుల పెళ్లిలో మెరిసిన అల్లు స్నేహారెడ్డి (ఫోటోలు)
-
విజయ్- రష్మిక పెళ్లి వేడుక.. తాళికట్టు శుభవేళ ఇదే
టాలీవుడ్ మోస్ట్ ఫేవరేట్ జంట రష్మిక- విజయ్ దేవరకొండ మరికొన్ని గంటల్లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే ఉదయ్‌పూర్‌లో ఫుల్‌గా సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు పాల్గొంటున్నారు. విజయ్- రష్మిక ఈనెల 26న మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఆన్ స్క్రీన్‌లో ఇప్పటికే పెళ్లి పీటలెక్కిన ఈ జంట.. రియల్ లైఫ్‌లోనూ వివాహం చేసుకోబోతున్నారు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది.ముహుర్తం ఫిక్స్..ఫిబ్రవరి 26న అంటే గురువారం విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి జరగనుంది. ఉదయం ఏడున్నర గంటలకు బరాత్ కార్యక్రమం ఉంటుందని సన్నిహితులు తెలిపారు. రేపు ఉదయం 10.10 నిమిషాలకి తెలుగు సాంప్రదాయం ప్రకారం వివాహ ముహూర్తం ఫిక్స్ చేశారు. అంటే అదే సమయానికి రష్మిక మెడలో మూడు ముళ్లు వేయనున్నారు విజయే దేవరకొండ. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు కన్నడలో కొడవ సాంప్రదాయం ప్రకారం మరోసారి వివాహ కార్యక్రమం జరగనుంది. అంటే రెండు పద్ధతుల్లో వీరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరగనుంది. ఈ క్షణం కోసమే విజయ్- రష్మిక ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ పెళ్లి తర్వాత టాలీవుడ్ ప్రముఖుల కోసం మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. -
నయా ట్రెండ్.. పెళ్లికి ముందు అంతా చేసేసి బ్లాక్ మెయిల్
-
విజయ్ & రష్మిక వెడ్డింగ్ విశేషాలు..
-
చిగురాశలపై పిడుగుపాటు
సమాజంలో ఉండే అసమానతలకూ, అంతరాలకూ చట్టాల ద్వారా, మధ్యవర్తిత్వంతో సహా ఇతరేతర మార్గాల ద్వారా సామరస్యపూర్వకమైన పరిష్కారం సాధించటం రాజ్యం చేయాల్సిన పని. అందుకు రాజ్యాంగం, దాని ద్వారా ఏర్పడే భిన్న వ్యవస్థలు పనిచేస్తుంటాయి. కుటుంబాల్లో తరాల మధ్య తలెత్తే సమస్యలకు కూడా ఆ పరిధిలోనే పరిష్కారాలుంటాయి. ఇతరత్రా సమస్యల మాటేమో గానీ, పెళ్లి విషయంలో మాత్రం అదేం కుదరదంటున్నది గుజరాత్ ప్రభుత్వం. వివాహం గురించి తల్లిదండ్రులకు చెప్పి, వాళ్ల అనుమతి తీసుకోవాలని ఆంక్షలు విధించటానికి సిద్ధపడుతోంది. ఇందుకోసం 2006 నాటి వివాహ నమోదు చట్టాన్ని సవరించదల్చుకున్నట్టు ప్రకటించింది. పరస్పరం ఇష్టపడి పెళ్లాడాలనుకునే జంటలకు ఇప్పటికే అనేకానేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. కులాలు, మతాలు, ప్రాంతాలు, ఆర్థిక అసమానతలు అందులో కొన్ని. ఈ గోదాలోకి తాను కూడా జొరబడి గుజరాత్ సర్కారు ఏం సాధించదల్చుకున్నదో అనూహ్యం. ప్రజాస్వామ్యంలో 18 ఏళ్ల వయసు నిండినవారు ఓటేయటానికి, పోటీ చేయటానికి అర్హులు. ప్రభుత్వాలను మార్చవచ్చు. జనం ఆమోదం పొంది ఎన్నికైతే ప్రభుత్వంలో భాగమై విధానాలు రూపొందించవచ్చు. కానీ ఆ వయసువారు తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకోవటానికి వీల్లేదని, అందుకు మరొకరి ఆమోదముద్ర తప్పనిసరని అనటం ఆశ్చర్యకరం. ఇలాంటి తలకిందుల ఆలోచనలు చేయటం గుజరాత్‌తోనే మొదలు కాలేదు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్‌లు ఈ పనే చేశాయి. ఎనిమిదేళ్ల క్రితం కేరళకు చెందిన హదియా అనే యువతి కేసులో... తనకు నచ్చిన జీవితభాగస్వామి ఎవరో నిర్ణయించుకునే స్వేచ్ఛ మైనారిటీ తీరిన ప్రతి ఒక్కరికీ ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ బంధంలో తల్లిదండ్రులు గానీ, కుల మత పెద్దలు గానీ జోక్యం చేసుకోవడం చెల్లదని చెప్పింది. నచ్చిన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవటం రాజ్యాంగం 21వ అధికరణం ద్వారా ప్రసాదించిన జీవించే హక్కులో భాగమని కూడా తెలిపింది. 2021లో అలహాబాద్ హైకోర్టు, కర్ణాటక హైకోర్టులు సైతం ఈ సంగతినే స్పష్టం చేశాయి. గత వారం గుజరాత్ అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి వివాహ నమోదు చట్టాన్ని సవరించాలనుకోవటానికి చూపిన కారణాలు హాస్యాస్పదమైనవి. పెళ్లిళ్ల నమోదు నిబంధనల్ని కఠినతరం చేయాలని వివిధ సామాజిక సంస్థల నాయకుల నుంచి వినతులొచ్చాయట. బాధ్యతాయుతమైన ప్రభుత్వమైతే అది అసాధ్యమని వారికి నచ్చజెప్పాలి. వివాహాల నమోదు చట్టం రాష్ట్రాల పరిధిలోనే ఉంటుంది. దాన్ని సవరించే హక్కు కూడా ఉంటుంది. కానీ అది రాజ్యాంగానికి లోబడి ఉండాలి. అసలు ఇప్పుడు తీసుకురాదల్చుకున్న సవరణల్లో స్పష్టత లేదు. పెళ్లి గురించి తల్లిదండ్రులకు చెప్పారా లేదా అని అడగటం, వారికి చెప్పాలని నిబంధన విధించటం తప్ప వారు అంగీకరించని పక్షంలో చట్టం ఏం చేస్తుందో, పర్యవసానాలెలా ఉంటాయో చెప్పటం లేదు. పెళ్లి నమోదు చేస్తారా లేదా అన్న విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఇది అతి తెలివి. ఏదో రకంగా పెళ్లి సంగతి తల్లిదండ్రుల చెవినబడితే చాలు... ఆ తర్వాత వాళ్లూ వాళ్లూ పడతారని చేతులు దులుపుకోవటం! ఇలాంటి సందర్భాల్లో మన దేశంలో ఏమవుతున్నదో కనబడుతూనే ఉంది. తమ కులంవాడు కాదని, ‘తక్కువ’ కులస్థుడని అనుకున్న మరుక్షణం హంతకులుగా మారు తున్న తల్లిదండ్రులు కోకొల్లలు. కనీసం ఇప్పుడైతే కొంత కాలం గడిచాకనో, బిడ్డ పుట్టాకనో ఆవేశం తగ్గించుకుని అక్కున చేర్చుకుంటున్నవారు అక్కడక్కడ కనబడు తున్నారు. ఈ చట్టం కనీసం అందుకు కూడా అవకాశం ఇవ్వదల్చుకున్నట్టు లేదు. కొన్నేళ్ల క్రితం ‘లవ్ జిహాద్’ మాట తెగ ప్రచారం చేశారు. ప్రేమ పేరిట మతాంతీకరణ జరుగుతున్నదని భూమ్యాకాశాలు ఏకం చేశారు. ‘కేరళ ఫైల్స్’ చిత్రం దాని ఆధారంగానే నిర్మించారు. కానీ ఆ వంకన మతాంతర వివాహాలను వివాదాస్పదం చేయటం తప్ప సాధించిందేమీ లేదు. రాజకీయపక్షాలు తమ ప్రయోజనాల కోసం ఏమైనా చెబుతాయి. రాజ్యం అలాంటి అంశాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉన్న సమస్యల్ని పెంచకూడదు. తానే సమస్యగా మారకూడదు. -
వేడుకల్లో డెస్టినేషన్.. ఇప్పుడు ఓ క్రేజీ పేషన్
కరోనా సందర్భంగా ఊపందుకున్న డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ సంపన్న కుటుంబాల్లో ఇప్పుడు ఒక సంప్రదాయంగా స్థిరపడింది. సినిమా సెలబ్రిటీల ప్రైవసీ (వ్యక్తిగత గోప్యత) ఆలోచనల నుంచి పుట్టిన ఈ కొత్త పోకడ... తర్వాత సంపన్న కుటుంబాలకు విస్తరించింది. ఇప్పుడు ఎగువ మధ్య తరగతి కూడా ఇదే బాట పట్టేందుకు దారితీసింది. ఒకప్పుడు వేర్వేరు ప్రాంతాలలో కేవలం పెళ్లిళ్లకు మాత్రమే డెస్టినేషన్ అన్వేషించేవారు. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ షూట్స్‌కు కూడా వ్యాపించింది. ఊళ్లను చుట్టేస్తున్న వివాహ వేడుకల ప్రక్రియగతంలో పెద్దింటి నుంచి పెళ్లి ఆహ్వానం వస్తే ఏ హోటల్లో?, ఏ ఆడిటోరియంలో? అని అడిగేవారు. ఇప్పుడు ఏ ఊర్లో..? ఏ టూరిస్ట్ ప్లేస్‌లో? అంటూ ఆసక్తి చూపే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న నేపథ్యంలో మరోసారి డెస్టినేషన్ వెడ్డింగ్స్ సందడి చేస్తున్నాయి. ఈ తరహా పెళ్లిళ్లు ఆన్లైన్లో తరచూ వైరల్ అవుతుండడం దీనికి మరింత క్రేజ్ పెంచుతోంది. ప్రీ వెడ్డింగ్ షూట్స్‌తో మొదలు వివాహ సందర్భంగా ఊర్లు, టూర్లు వెళ్లడం అనేది ప్రీ వెడ్డింగ్ షూట్స్‌తో మొదలై పెళ్లితో ముగుస్తోంది. దంపతులు కాబోతున్న జంటతో పాటు కొందరు సన్నిహితులు, ఫొటో/వీడియోగ్రాఫర్లు కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం పలు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. అక్కడ కొన్ని రోజులు గడిపి అచ్చంగా సినిమా తరహాలోనే షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తున్నారు. ఈ తరహా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కోసం గోవా, ఊటీ, కూర్గ్, మున్నార్... వంటి సుందరమైన ప్రకృతి అందాలకు నిలయమైన ప్రాంతాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు.హల్దీ టు సంగీత్పెళ్లికి హాజరయ్యే అతిథులు పర్యాటక ప్రాంతాల అందాలను ఆస్వాదించే అవకాశం ఉంటుంది. దంపతులు, ఇరు కుటుంబాలతో పాటు హాజరయ్యే బంధుమిత్రులు సైతం పూర్తిగా పెళ్లి వేడుకల్లో ఇతరత్రా అడ్డంకులు లేకుండా పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. అదే నివసించే ప్రాంతంలోనే అయితే వ్యక్తిగత పనులు, రోజువారీ కార్యకలాపాల్లో పెళ్లికి హాజరవడం ఒక భాగంగా మాత్రమే పరిమితం అవుతుంది. సంగీత్, హల్దీ... వంటి భిన్న రకాల కార్యక్రమాలతో పాటు మొత్తం వేడుకల్లో హాజరైనవారిలో అత్యధికులు భాగం పంచుకునే వీలుంటుంది.సెలబ్రిటీ..నీవు నేరి్పన విద్యే టాలీవుడ్ స్టార్ కపుల్ రష్మికా, విజయ్ దేవరకొండల పెళ్లి ఫలానా నెలలో జరుగుతుంది అని తెలియగానే అది డెస్టినేషన్ వెడ్డింగే అనేది కన్ఫర్మ్ అయిపోయింది. అంతగా సెలబ్రిటీ సర్కిల్లో మమేకమైపోయిన ఈ ట్రెండ్ ఇప్పుడు సంపన్నులనూ ఆకర్షిస్తోంది. గత ఏడాది చివరిలో నగరవాసి, అమెరికాలో స్థిరపడిన పారిశ్రామికవేత్త రామరాజు మంతెన కుమార్తె నేత్రా మంతెన–వంశీ గాదిరాజు వివాహ వేడుకను ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో నిర్వహించారు. దీనికి ఏకంగా హాలీవుడ్ నటి, గాయని జెన్నిఫర్ లోపెజ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్ సైతం హాజరవగా, బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ నృత్య కార్యక్రమం హైలైట్‌గా నిలిచింది. డెస్టినేషన్‌ను పేషన్‌గా మారుస్తున్నవి ఇవే.. పెళ్లిని ఒక గొప్ప జ్ఞాపకంగా మార్చుకోవాలనే ఆలోచన, ఈ వేడుకలను అత్యంత సన్నిహితులు, బంధువులకు మాత్రమే పరిమితం చేయాలని భావించే ధోరణి పెరుగుతోంది. ఇదే డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ఆదరణ పెంచుతోంది. స్థానికంగా నివసించే చోట పెళ్లి నిర్వహిస్తే రకరకాల సమస్యలు ముఖ్యంగా మీడియా నుంచి ప్రైవసీ ఉండదని తొలుత సెలబ్రిటీలు ఈ మార్గాన్ని ఎంచుకుంటే అనంతరం రిచ్/పోష్ సర్కిల్ కూడా అదే బాట పట్టింది. పేరొందిన డెస్టినేషన్ వెడ్డింగ్స్.. ఇవే! రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ (సిటీ ఆఫ్ లేక్స్), జోథ్‌పూర్ (బ్లూసిటీ), జైపూర్ (పింక్ సిటీ), జై సల్మేర్ గోవాలోని పలు రిసార్ట్స్, క్లబ్స్, బీచ్‌లు హిమాచల్‌ప్రదేశ్, సిమ్లా, మనాలి, రిషికేష్ ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ విభిన్న రకాల ప్యాకేజీలుడెస్టినేషన్ వెడ్డింగ్స్ నిర్వహించేందుకు పలు ఆన్లైన్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఇవి వివిధ ధరల్లో ప్యాకేజ్ కూడా అందిస్తున్నాయి. కనీసం 50 నుంచి 100 మందితో కూడిన బృందానికి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల్లో కూడా ప్యాకేజ్ అందుబాటులో ఉంది. ఎంచుకున్న ప్లేస్, పాల్గొనేవారి సంఖ్యను బట్టి ఇది రూ.70 లక్షల వరకు పెరుగుతుంది. పలు రకాల ఈవెంట్లను కూడా వీటికి మేళవిస్తే ఆ ప్యాకేజీ రూ.కోటిపై మాటే. అయితే, రూ.కోట్లు వెచ్చించే సంపన్నులకు కొదవలేదు కాబట్టి ఈవెంట్ నిర్వాహకులకు మ్యారేజ్ సీజన్లో తగినంత డిమాండ్ ఉంటోంది. -
పిప్పీ.. డుం డుం..
నగరంలో పెళ్లిసందడి మొదలైంది.. వరుస ముహూర్తాలతో పెళ్లిబాజాలు మోగుతున్నాయి. దీంతో వేలాది కొత్త జంటలు ఒక్కటి కానున్నాయి. మూడు నెలలుగా ఉన్న మూఢాలు తొలగిపోయి.. తిరిగి శుభ ముహూర్తాలు ప్రారంభమయ్యాయి.. దీంతో ఎంతో కాలంగా ఒక్కటవ్వాలని భావిస్తున్న వధూవరులకు మళ్లీ మంచి రోజులతోపాటు పెళ్లి బాజాలు మోగే సమయం ఆసన్నమైంది.. వేలాది జంటలతో.. వరుస ముహూర్తాలతో వివాహ వేదికలు, కళ్యాణ మండపాలు సందడిగా మారాయి. ఈనెల 17తో శుక్రమౌఢ్యమి అమావాస్య ముగిసింది. మూడు నెలల తర్వాత ముహూర్త బలం పెరిగింది. నగరంలోని ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, బాంక్వెట్ హాళ్లకు ముందస్తు బుకింగ్‌లతో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. వేద మంత్రాలు ఉచ్చరించే పంతుళ్లు, బాజాభజంత్రీలు, స్టేజ్ డెకరేషన్ వర్కర్లు, వంట మనుషులు, సర్వీసు బాయ్స్, కేటరర్స్, ఈవెంట్ మేనేజర్లకు చేతినిండా పని దొరికింది. డిసెంబర్ నుంచి ముహూర్తాలు లేకపోవడంతో శుభ కార్యాలు నిలిచిపోయాయి. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలను వాయిదా వేసుకోవాల్సి వచి్చంది. దీంతో నిన్న మొన్నటి వరకు ఖాళీగా కనిపించిన వాళ్లంతా ప్రస్తుత శుభ ముహూర్తాలతో బిజీగా మారారు. మార్చిలో పండుగలు మార్చి 2న కామదహనం, 3న హోలీ, 19న ఉగాది, 27న శ్రీరామ నవమి పండుగలు ఉన్నాయి. మార్చి 27 నుంచి మే 14 వరకు మంచి లఘ్నాల ఉన్నాయి. మే 17 నుంచి జూన్ 15 వరకు అధిక జ్యేష్ట మాసం ఉన్నందున శుభ కార్యాలు చేయొద్దని పండితులు చెబుతున్నారు. తిరిగి జూన్ 17 నుంచి జూలై 9వ తేదీ వరకు నిజ జ్యేష్ట మాసంలో మంచి రోజులు ఉన్నందున శుభకార్యాలు చేసుకోవచ్చని పండితులు పేర్కొంటున్నారు. -
సెలబ్రేషన్స్‌కు రెడీ.. విజయ్- రష్మిక పెళ్లి సందడి షురూ..!
టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పెళ్లి వేడుకకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ అఫీషియల్‌గా తన పెళ్లిని అనౌన్స్ చేశారు. అభిమానులు ముద్దుగా పిలుచుకునే విరోష్ జంట ఒక్కటి కానుందని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ గ్రాండ్ వేడుకలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24న ఉదయపూర్‌లో మెహందీ వేడుకతో రష్మిక-విజయ్ పెళ్లి సందడి మొదలు కానుంది.ఆ తర్వాత ఫిబ్రవరి 25న హల్దీ, సంగీత్ సందడి కొనసాగనుంది. ఈ వేడుకలు ఉదయపూర్‌లోని విలాసవంతమైన ఐటీసీ మెమెంటోస్ జరుగుతాయి. ఈ వేడుకల్లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొననున్నారు. ఈ జంట ఫిబ్రవరి 26న మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. కాగా.. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు తెలుస్తోంది. విజయ్ - రష్మిక వారి కుటుంబ సభ్యులు, సహచరులతో కలిసి సోమవారం ఉదయమే ఉదయ్‌పూర్ చేరుకున్నారు. కొన్నేళ్లుగా తమ రిలేషన్‌ను సీక్రెట్‌గా కొనసాగించిన ఈ జంట చివరికీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. విజయ్ దేవరకొండనే స్వయంగా తన పెళ్లిని ప్రకటించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. వివాహం తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. -
హిందూ యువతికి పెళ్లి చేసిన ముస్లిం
చిత్తూరు: తన వద్ద పెరిగిన హిందూ యువతికి హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసి మనసుకు మత బేధం లేదని ఒక ముస్లిం నిరూపించాడు. మండలంలోని చౌడేపల్లిలో హేమలత అనే చిన్నారి తండ్రి మరణించగా తల్లి ఎక్కడికి వెళ్లిపోయింది. దీంతో ఆ చిన్నారిని షాబీనా, అబ్దుల్ బాషా దంపతులు చేరదీసి సొంత కూతురిలా పెంచి పెద్ద చేశారు. తమ శక్తి మేరకు చదివించారు. తగిన హిందూ వరుడిని చూసి ఆదివారం ఒక కల్యాణ మండపంలో హిందూ సంప్రదాయం ప్రకారం వైభవంగా వివాహం జరిపించారు. రెండు మతాల పెద్దలు, స్థానికులు, బంధుమిత్రులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మత సామరస్యానికి ఈ వివాహం ఒక ఉదాహరణ అని కొనియాడారు. ఈ వివాహ వేడుక సామాజీక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు షాబీనా, అబ్దుల్ బాషా దంపతులను అభినందిస్తున్నారు. -
కాసేపట్లో పెళ్లి.. అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య
జైపూర్: కాసేపట్లో వివాహ వేడుక.. ఇళ్లంతా సందడిగా కుటుంబ సభ్యులు, బంధువులతో కలకలలాడుతోంది. ఒకే ఇంట్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లకు పెళ్లి ముహుర్తం ఫిక్స్ చేయడంతో అక్కడంతా సందడి నెలకొంది. ఇంతలో పెద్దగా ఏడుస్తూ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి పరుగులు తీశారు. కట్ చేస్తూ.. వివాహం చేసుకోవాల్సిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పెళ్లులు జరగాల్సిన ఇంట్లో.. ఒక్కసారిగా విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామానికి చెందిన శోభ (25), విమ్ల (23) ఇద్దరూ అక్కాచెల్లళ్లకు కుటుంబ సభ్యులు ఒకేరోజు వివాహం చేసేలా ముహుర్తం పెట్టారు. శనివారం ఇద్దరికీ వివాహం జరగాల్సి ఉంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఇంట్లో పెళ్లి వేడుకలు, సంప్రదాయ ‘బంధోలి’ కార్యక్రమాలు ఎంతో ఉత్సాహంగా సాగాయి. అయితే, శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి అకస్మాత్తుగా విషమించింది. కుటుంబ సభ్యులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.అయితే, అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో కుటుంబ సభ్యులు మృతదేహాలను ఇంటికి తెచ్చి, పోలీసులకు చెప్పకుండానే అంత్యక్రియలకు ఏర్పాట్లు మొదలుపెట్టారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాధితుల మేనమామ జస్వంత్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పరిశీలించడంతో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. ఈ సందర్బంగా జస్వంత్ సింగ్ మాట్లాడుతూ.. వారిద్దరిదీ ఆత్మహత్యేనని ఆరోపించారు. బాధితుల తండ్రి, సోదరులు (బాబాయిలు) ఈ పెళ్లి విషయంలో వారిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని అన్నారు. మొదట కుదిరిన పెళ్లి సంబంధాలను రద్దు చేసి, బాబాయిల ఒత్తిడి మేరకు పోఖ్రాన్ ప్రాంతానికి చెందిన వ్యక్తులతో వారికి పెళ్లి నిశ్చయించారని, ఈ బలవంతపు పెళ్లి ఇష్టం లేకనే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పుకొచ్చారు.అనంతరం, పోలీసులు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రాథమిక దర్యాప్తులో పురుగుల మందు తాగినట్లు ఆధారాలు లభించాయి. అయితే, ఘటనా స్థలంలో ఎటువంటి ఆత్మహత్య లేఖ లభించలేదని, కుటుంబ సభ్యులందరినీ విచారిస్తున్నామని ఏడీసీపీ రోషన్ మీనా తెలిపారు. కాగా, వీరిద్దరూ స్కూల్లో టీచర్లుగా పనిచేస్తున్నట్టు స్పష్టంచేశారు. -
మనసే మంత్రం..!
పెళ్లి అంటే నూరేళ్ల పంట. జీవితంలో అత్యంత కీలక ఘట్టం. అంతటి ప్రాముఖ్యత ఉంది కాబట్టే కులం, వయసు, ఆస్తితో సంబంధం లేకుండా సరైన జోడీ ఉండాల్సిందేనన్నది నేటి తరం మాట. ‘మనసే మంత్రం’అని జపించే వారి సంఖ్య మన దేశంలో అంతకంతకూ పెరుగుతుండటం ఆసక్తికరం. భాగస్వామి వేట, వివాహం విషయంలో భారత్‌లో ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన సంప్రదాయాలను నేటి తరం ఎలా తిరగరాస్తోంది అన్న అంశంపై జీవన్సాథీ మ్యాట్రిమోనీ ఓ నివేదికను రూపొందించింది. దశాబ్ద కాలంలో (2016–2025) మారిన యూజర్ల పోకడలు, అలాగే ఈ ఏడాది దేశవ్యాప్తంగా 30 వేల పైచిలుకు యాక్టివ్ మెంబర్స్ నుంచి సేకరించిన అభిప్రాయాలను ఇందులో పొందుపరిచారు. భాగస్వామిని ఎంచుకునేటప్పుడు కులం, మతం, వయసు, సంపాదన చూడకుండా తమ ఆలోచనా ధోరణి, అభిరుచులు ఎంతవరకు కలుస్తున్నాయనే దానికి అత్యధికులు ప్రాధాన్యం ఇస్తున్నారని నివేదిక వివరించింది. సరైన భాగస్వామి దొరకడమే పెళ్లికి అసలైన అర్హతగా 90% మంది భావిస్తున్నారు.భారతీయులు తమ భాగస్వాములను ఎంచుకునే విధానంలో స్పష్టమైన మార్పులు వస్తున్నాయి. కుల ప్రాధాన్యాలు తగ్గాయి. పునర్వివాహాల పట్ల ఆదరణ పెరుగుతోంది. వివాహ వయసు ఆలస్యమవుతోంది. వరుడు/వధువు ఎంపికలో కుటుంబమూ జోక్యం చేసుకోవాలన్న ధోరణి కనపడుతోందని నివేదిక తెలిపింది. యువత తమ పెళ్లి విషయంలో మరింత స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కఠినమైన నిబంధనలు లేదా నిర్ణీత వయసుకంటే పరస్పర అవగాహన, సమాన విలువలతోపాటు మానసికంగా సిద్ధపడ్డాకే పెళ్లికి సై అంటున్నారు. విడాకుల పట్ల ఉన్న సామాజిక వివక్ష క్రమంగా తగ్గుతోంది.కులం గోడలు బద్దలు: భాగస్వామి ఎంపికలో కులం కంటే వ్యక్తిగత విలువలు, ఆలోచనల కలయికకు నేటి తరం ఎక్కువ ప్రాముఖ్యతనిస్తోంది. కులం ముఖ్యం అన్నవారు దశాబ్దం క్రితం 91% ఉంటే.. ఇప్పుడీ సంఖ్య ఏకంగా 54 శాతానికి వచ్చి చేరింది. మెట్రోల్లో వీరి సంఖ్య 49% ఉంది. పునర్వివాహానికి సై: గతంతో పోలిస్తే ప్రస్తుతం పునర్వివాహం పట్ల సమాజంలో సానుకూల మార్పు కనిపిస్తోంది. ఇటువంటి వారి సంఖ్య 2016లో కేవలం 11% మాత్రమే. 2025 నాటికి ఈ సంఖ్య 16%కి చేరింది. అంటే దశాబ్ద కాలంలో 43% పెరిగారన్న మాట. విడాకులు తీసుకున్న వారికి వస్తున్న సంబంధాలలో 15% మంది అవివాహితులు. అంటే గత చరిత్ర కంటే వ్యక్తిత్వానికే ప్రాముఖ్యత పెరుగుతోంది. అప్పుడే పెళ్లి భాజాలు‘నాకు 25 ఏళ్లు వచ్చాయి కాబట్టి పెళ్లి చేసుకోవాలి’అనే ఆలోచన పోయి ‘నన్ను అర్థం చేసుకునే వ్యక్తి దొరికినప్పుడే నేను సిద్ధం’అనే ధోరణి కనపడుతోంది. కెరీర్ స్థిరత్వం, వ్యక్తిగత ఎదుగుదలతోపాటు మానసిక ప్రశాంతత, జీవితం పట్ల స్పష్టత వచ్చిన తర్వాతే పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు. అందుకే భాగస్వామి కోసం వెతికే వయస్సు 29 ఏళ్లకు చేరింది. దశాబ్దం క్రితం ఈ వయసు 27 ఉంది. ఇద్దరూ సంపాదిస్తేనే..వివాహ బంధంలో పాతకాలపు ఆర్థిక పద్ధతులు ఇప్పుడు మారుతున్నాయి. 87% మంది పురుషులు తమ కంటే ఎక్కువ సంపాదిస్తున్న మహిళను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 15% మంది మహిళలు తమ కంటే తక్కువ సంపాదిస్తున్న పురుషులతో పెళ్లికి మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరూ సంపాదించాలని భావిస్తున్నారు. కేవలం 8% మంది మాత్రమే ఒక్కరు సంపాదిస్తే చాలని నమ్ముతున్నారు. కుటుంబమూ ఒప్పుకోవాల్సిందే..యువత తమ భాగస్వామిని తామే ఎంచుకుంటున్నారు. 77% మంది తమ ప్రొఫైల్‌ను తామే నిర్వహిస్తున్నారు. 2016లో ఇటువంటివారి సంఖ్య 67%. కుటుంబం మేనేజ్ చేస్తున్న అమ్మాయి/అబ్బాయి ప్రొఫైల్స్ సంఖ్య 33% నుంచి 23%కి పడిపోయింది. పెళ్లికి తల్లిదండ్రుల ఆమోదం మరియు సలహాలకు 69% విలువ ఇస్తున్నారు. అమ్మాయిల విషయంలో ఈ సంఖ్య 75% ఉంది. ఆసక్తికర అంశం ఏమంటే మ్యాచ్ మేకింగ్‌లో తల్లిదండ్రుల కంటే తోబుట్టువుల పాత్ర పెరుగుతోంది. -
పచ్చని పందిట్లో తీవ్ర విషాదం.. డీజేకు విద్యుత్ షాక్.. ఐదుగురు మృతి
జైపూర్: రాజస్థాన్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పచ్చని పందిట్లో విషాదం ఛాయలు నెలకొన్నాయి. డిగ్ జిల్లా నియామత్‌పూర్‌లో జరిగిన పెళ్లి ఊరేగింపు డీజేలో విద్యుత్ షాక్ సంభవించింది. విద్యుత్ షాక్ గురై ఐదుగురు మృతి చెందారు. 11కే విద్యుత్‌వైర్లకు డీజే వాహనం తగలడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
కుక్క కోసం తలలు పగిలేలా కొట్టుకున్నారు, ప్రేమ పెళ్లి రద్దు!
ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. పెంపుడు కుక్కను కొట్టిన కారణంతో రెండు కుటుంబాల మధ్య హింసాత్మక ఘర్షణకు దారి తీసింది. ఫలితంగా రెండేళ్ల ప్రేమను, బంధాన్ని కాదనుకుంది వధువు. అసలు ఏమైంది అంటే..ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ ఫతేపూర్ జిల్లాలోని ఖాగా కొత్వాలి ప్రాంతంలోని ఒక అతిథి గృహంలో బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. నిజానికి అప్పటికే రెండేళ్లుకుగా ప్రేమలో ఉన్న సుమీత్, తాన్య జంట పారిపోయి కాన్పూర్‌లోని ఆర్య సమాజ్‌లో పెళ్లిచేసుకున్నారు. అయితే విషయం తెలిసిన పెద్దలు వీరి ప్రేమను అంగీకరించి, ఫతేపూర్‌లో బంధువుల సమక్షంలో మరోసారి ఘనంగా పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు.పెళ్లి గ్రాండ్‌గా నిర్వహించేందు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వధూవరుల కుటుంబాలు పెళ్లి మండపానికి చేరుకున్నాయి. బారాత్, జైమాల వేడుక సంతోషంగా పూర్తైంది. ఇక తెల్లవారుజామున ముహూర్తం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. సరిగ్గా ఇక్కడే రగడ మొదలైంది. పూజామందిరంవద్ద ఆభరణాల సమర్పణ ఆచారాలు జరుగుతుండగా, వధువు పెంపుడు కుక్క అవిశ్రాంతంగా మొరగడం మొదలు పెట్టింది. దీంతో అసహనానికి గురైన వరుడు తరపు బందువు ఒకరు ఆ కక్కను కొట్టాడు. దీంతో వధువు, ఇతర బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.ఫలితంగా ఒక్కసారిగా అక్కడి వాతవరణం ఉద్రిక్తంగా మారిపోయింది. బంధువులంతా కర్రలు, కుర్చీలతో తలలు పగిలేలా కొట్టుకోవడంతో పెళ్లి వేదిక కాస్త రణరంగంగా మారిపోయింది. దీంతో వధువు వైపు ముగ్గురు, వరుడి వైపు ఇద్దరు గాయపడ్డారు. వధువు వేలు కూడా విరిగింది.ఇదీ చదవండి: గ్లోబల్ జాబ్స్‌కు సెగ, ఎంట్రీ లెవల్ జాబ్స్ డేంజర్లో : IMF చీఫ్ ఈ విషయం ఖాగా పోలీస్ స్టేషన్‌కు చేరడంతో అధికారులు జోక్యం చేసు కున్నారు. గాయపడిన వారిని సెంట్రల్ హెల్త్ సెంటర్ (CHC)లో చికిత్స చేసి, ప్రయాగ్‌రాజ్‌కు తిరిగి పంపించారు. అనంతరం ఇరు వర్గాల సీనియర్ సభ్యుల మధ్య చర్చించారు. ఈ క్రమంలో వధువు తాను ఇకపై తానీ పెళ్లిని కొనసాగించ లేనని వధువు స్పష్టం చేసింది. చివరికి కట్నకానులు తిరిగి ఇచ్చి పుచ్చు కునేందుకు రాజీ కుదిరింది. ఏ పక్షమూ అధికారికంగా ఫిర్యాదేమీ లేదు కాబట్టి చట్టపరమైన చర్య తీసుకోలేదు. ప్రస్తుతం ఈ ఘటన ఆన్లైన్లో చర్చకు దారితీసింది.ఇదీ చదవండి: పురుషుల్లో క్షీణిస్తున్న‘Y’ క్రోమోజోమ్: షాకింగ్ విషయాలు వెల్లడి -
శిఖర్ ధావన్ -సోఫీ షైన్ సంగీత్ నైట్, ఫోటోలు వైరల్
Shikhar&Sophie టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్, ప్రియురాలు సోఫీ షైన్ (Sophie Shine) పెళ్లి సందడి మొదలైంది. అయేషా ముఖర్జీతో విడాకుల తరువాత ధావన్ తన జీవితంలో మరో కీలక అడుగు వేయబోత్తున్నాడు. భారత క్రికెట్ జట్టులో తనదైన శైలిలోబ్యాటింగ్ చేస్తూ ‘గబ్బర్’గా పాపులర్ అయిన శిఖర్ ధావన్, వ్యక్తిగత జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్నిప్రారంభించబోతున్నాడు. తన ప్రేయసి సోఫీ షైన్ (ఐరిష్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్) తో కలిసి ఏడడుగులు వేసేందుకు ఆయన సిద్ధమయ్యాడు. ఫిబ్రవరి 19 గురువారం ధావన్ తన సంగీత్ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఇవి నెట్టింట సందడిగా మారాయి. అభినందనల వెల్లువ కురుస్తోంది. View this post on Instagram A post shared by Shikhar Dhawan (@shikhardofficial)తన ఇన్‌స్టా హ్యాండిల్లో శిఖర్ ధావన్ సోఫీ షైన్ సంగీత్ నైట్ నుండి ఫోటోలను షేర్ చేశాడు. ఆ ఫోటోల్లో శిఖర్ తెల్లటి షేర్వానీలో అందంగా కనిపించగా, సోఫీ బ్లింగీ గా బంగారు రంగు లెహంగాలో కళకళలాడింది. ఈ ఏడాది జనవరి 2న ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నారు. ఫిబ్రవరి 19న వివాహం చేసుకోవచ్చని ముందుగా ఊహాగానాలు వచ్చాయి. ప్రస్తుతం వెడ్డింగ్‌డేట్‌పై ధృవీకరణ లేనప్పటికీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా జరిగిన సంగీత్ నైట్ ఫోటోలు మాత్రం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఎవరీ సోఫీ షైన్సోఫీ షైన్ 1990 లో జన్మించిన ఐరిష్ మహిళ. సోఫీ ఐర్లాండ్‌లో చదువుకుంది. ప్రఖ్యాత లిమెరిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నత విద్యను పూర్తి చేసింది.ఆమె గ్లామర్ ప్రపంచం నుండి రాలేదు, శిఖర్ లాగా కాకుండా, కార్పొరేట్ ప్రపంచంలో తనకంటూ ఒక పేరు తెచ్చుకోవడానికి ఆమె చాలా కష్టపడింది.మమార్కెటింగ్ మరియు మేనేజ్మెంట్ విద్యార్థిని అయిన ఆమె తొలుత బహుళజాతి కంపెనీలో పనిచేసింది. అనంతరం నార్తర్న్ ట్రస్ట్ కార్పొరేషన్లో చేరింది.దుబాయ్‌లోని ఒక రెస్టారెంట్లో మొదటి సారి కలిశారు. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా సోఫీ షైన్, శిఖర్ ధావన్‌తో సన్నిహితంగా కనిపించినప్పుడు వీరి డేటింగ్ బజ్ ప్రారంభమైంది.కాగా శిఖర్ 2012లో అయేషాను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు జోరావర్ అనే కుమారుడు ఉన్నాడు. 2021లో వారు విడాకులు తీసుకున్నారు. -
ఇంట్లో తమ్ముడి దొంగతనం.. అన్న పెళ్లితో బయటపడింది
సాక్షి,హైదరాబాద్: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. తన సొంత కుటుంబ సభ్యుల బంగారాన్ని దొంగిలించి, గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి దొంగతనం చేశారని కట్టుకథ అల్లిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రూ. 12 లక్షల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల వివరాల మేరకు.. నిందితుడు భాస్కర్ ప్రమోద్ ముల (32 ఏళ్లు) బీటెక్ పూర్తి చేశాడు. చిక్కడపల్లిలో నివసిస్తున్నాడు. అయితే, భాస్కర్ ప్రమోద్ 2014లో బీటెక్ పూర్తి చేసి, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. కానీ మధ్యలోనే చదువులు మానేసి తిరిగి వచ్చాడు. బెంగళూరులో ఉన్న సమయంలో విలాసవంతమైన జీవనశైలికి అలవాటు పడి, క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్ల ద్వారా అప్పులు చేశాడు. ఈ అప్పులు తీర్చడానికి 2024 నుండి తన నానమ్మ, కుటుంబ సభ్యుల బంగారాన్ని దొంగిలించి బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రూ. 4,60,000 నగదు పొందాడు.ఇటీవల నిందితుడి అన్నయ్య పెళ్లి ఖాయం కావడంతో, కుటుంబ సభ్యులు నానమ్మ బంగారాన్ని పెళ్లి కోసం తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో భయాందోళనకు గురైన భాస్కర్, తన దొంగతనం బయటపడకుండా ఉండేందుకు ఒక పథకం వేశాడు.ఈ ఫిబ్రవరి 9న తన పెంట్ హౌస్‌లో దొంగతనం జరిగినట్లుగా సీన్ క్రియేట్ చేసి, గుర్తు తెలియని వ్యక్తులు బంగారం, వెండి ఎత్తుకెళ్లారని పోలీసులకు తప్పుడు ఫిర్యాదు ఇచ్చాడు. భాస్కర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తూ చేపట్టారు.ఈ దర్యాప్తులో ఫిర్యాదుదారుడే అసలు నిందితుడని తేల్చారు. విచారణలో నిందితుడు కొన్ని వెండి వస్తువులను మూసీ నాలాలో పడేసినట్లు అంగీకరించాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న సొత్తులో రెండు బంగారు ఉంగరాలు (సుమారు 3 తులాలు), ఒక వెండి ప్లేటు, రెండు వెండి గిన్నెలు, అలాగే హెచ్డీఎఫ్సీ,ఎస్బీఐ ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టిన 80 గ్రాముల బంగారం మార్టిగేజ్ స్లిప్పులు ఉన్నాయి. మొత్తం విలువ సుమారు రూ. 12 లక్షలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తన సొంత కుటుంబాన్ని, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన నిందితుడు చివరికి తనే ఇరుక్కున్నాడు. నేరం ఎంత తెలివిగా ప్లాన్ చేసినా, నిజం బయటపడకుండా దాచడం అసాధ్యం అనేది ఈ కేసు నిరూపించింది. ఈ కేసును ఛేదించడంలో సికింద్రాబాద్ జోన్ డీసీపీ ఐపీఎస్ రక్షితా కృష్ణమూర్తి , అడిషనల్ డీసీపీ జె. నర్సయ్య మార్గదర్శకత్వంలో చిక్కడపల్లి ఏసీపీ ఎల్. రమేష్ కుమార్, ఇన్స్పెక్టర్ ఎం. మల్లేశం, ఎస్ఐ మొహమ్మద్ కరీమ్ క్రైమ్ స్టాఫ్ చాకచక్యంగా వ్యవహరించారు. -
షాన్ కిషన్ పెళ్లిపై తాతయ్య గ్రీన్ సిగ్నల్.. తల్లి షాకింగ్ కామెంట్స్!
-
జస్ట్ అప్పగింతల ముందు తెలిసింది, పెళ్లి రద్దు!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ఒక వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. అప్పటిదాకా ఇరుకుటుంబాలు పెళ్లి సందడిలో మునిగిపోయాయి. బందు మిత్రుల ఆనందోత్సాహాల మధ్య పెళ్లిప్రమాణాలు పూర్తయ్యాయి. సరిగ్గా అప్పగింతల తతంగానికి కొన్న క్షణాల ముందు వివాదం మొదలైంది. పరిస్థితి తీవ్రమై వివాహం రద్దైంది. ఇంతకీ ఏమైంది? కట్న కానుకల గొడవా? మర్యాదల తక్కువయ్యాయని అలిగారా? ఏమైంది పదండి తెలుసుకుందాం.యూపీలోని కోఠి థానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆరు నెలల క్రితం స్థానిక అమ్మాయి, పురే గనై గ్రామంలో నివసించే 22 ఏళ్ల అబ్బాయికి పెళ్లి నిశ్చయించారు పెద్దలు. ఫిబ్రవరి 13న జరిగే పెళ్లికి బారాత్, వివాహం ఆచారాలు,సాంప్రదాయ వేడుకలు ఘనంగా ప్రారంభమైనాయి. పెళ్లి తంతు అంతా ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగింది. అతిథులు ఆతిథ్యాన్ని స్వీకరించి వధూవరులను ఆశీర్వదించాడు. అయితే, శనివారం తెల్లవారుజామున ‘బిదాయి' వేడుకకు ముందు ట్రాన్స్‌జెండర్ (కిన్నార్) బృందం ఆశీర్వాదం ఆచార 'నెగ్' (బహుమతి) తీసుకోవడానికి వేదికకు చేరుకుంది. వారు కొత్తపెళ్లికొడుకుని గుర్తించడంతో అనుమానం మొదలైంది. వధువు కుటుంబం వాగ్వాదానికి దిగింది. అసలు వరుడు మాగాడా కాదా అని స్పష్టం చేయాలని, వెరిఫికేషన్ కావాలని వధువు బంధువులు పట్టుబట్టారు. దీనికి వరుడు తిరస్కరించి గొడవకు దిగాడు. ఇంతలో వరుడిని తమ సంఘం సభ్యుడే ధృవీకరించడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దీంతో వధువు కుటుంబం వివాహాన్ని రద్దు చేసింది. ఇదీ చదవండి: ఎప్స్టీన్ ఫైల్స్‌లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలుఅయితే తమ పరువు పోయిందని, రూ. 23 వేలు తీసుకుని మౌనంగా ఉండాలని వరుడి కుటుంబం విజ్ఞప్తి చేసింది. అలా నవ వధువుతోపాటు, అప్పటిదాకా బాజా భజంత్రీలతో కళకళల్లాడిన పెళ్లి పందిర మూగబోయింది. ఈ విషయం స్థానిక పోలీసుల దృష్టికి రావడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని రెండు కుటుంబాలను శాంతింపజేశారు. విషయం సున్నితమైంది గనుక, పైగా ఇరువైపుల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదు కనుక ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: థాయ్‌లాండ్‌లో అరుదైన దృశ్యం : ఇలా వచ్చి..అలా! -
జ్యోతికతో ప్రేమ పెళ్లి.. నాన్నను ఒప్పించేందుకు సూర్య ఏం చెప్పాడంటే? (ఫొటోలు)
-
అమ్మకు రెండో పెళ్లి.. అవన్నీ అబద్ధాలే: సుప్రీత
టాలీవుడ్ నటి సురేఖవాణి కూతురు సుప్రీత ఇటీవలే బిగ్ స్క్రీన్‌పై సందడి చేసింది. అమరావతికి ఆహ్వానం పేరుతో వచ్చిన థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ నెల 13న థియేటర్లలోకి వచ్చిన టాలీవుడ్ అభిమానులను అలరిస్తోంది. అయితే ఈ మూవీ రిలీజ్‌కు ముందు జరిగిన ఈవెంట్లో సుప్రీత ఫుల్ ఎమోషనలైంది. తన జర్నీని తలచుకుని వేదికపైనే కన్నీళ్లు పెట్టుకుంది.అంతేకాకుండా ఇటీవల సురేఖవాణి రెండో పెళ్లి గురించి వార్తలొస్తూనే ఉన్నాయి. దీనిపై తాజా ఇంటర్వ్యూలో మరోసారి క్లారిటీ ఇచ్చింది సుప్రీత. అమ్మకు రెండో పెళ్లి చేయాలనే ఆలోచన కేవలం నాది మాత్రమేనని.. అమ్మకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. గతంలో మీ అమ్మ మళ్లీ పెళ్లి చేసుకుంటుందని మీరెప్పుడైనా ఆలోచించారా? అని నన్ను కొందరు అడిగారని పేర్కొంది.ఈ ప్రశ్నకు తాను అవును సమాధానమిచ్చానని సుప్రీత తెలిపింది. కానీ చాలామంది నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని వెల్లడించింది. నా మాటలు విని అమ్మ రెండో పెళ్లి చేసుకోబోతోందన్న వార్తలు రాసుకొచ్చారని పేర్కొంది. అదంతా పూర్తిగా అబద్ధమని.. అమ్మకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదన్నారు. ఆమెకు మ్యారేజ్ చేయాలన్న ఆలోచన నాది మాత్రమేనని ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది -
విజయ్ రష్మిక పెళ్లి సందడి శుభలేఖ ఇదే.. పెళ్లి ముహూర్తం ఫిక్స్
-
పెళ్లి బంధం ఫెయిల్..నటుడి మోసం.. మానసికంగా కుంగిపోయా..!
జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ మూవీతో టాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ మమతా మోహన్ దాస్. ఆ తర్వాత పలు సినిమాల్లో కనిపించారు. అంతేకాకుండా రాఖీ మూవీలో తన గాత్రంలో అభిమానులను అలరించింది. అయితే కొన్నాళ్లకే క్యాన్సర్ బారిన మమతా మోహన్ దాస్ చాలా ఇబ్బందులు పడింది. ఓసారి క్యాన్సర్ జయించినా మమతకు మళ్లీ తిరగబెట్టడంతో తన కెరీర్ ముగిసిపోయిందనుకుంది. కానీ చాలా ఏళ్ల తర్వాత మహారాజా మూవీతో ప్రేక్షకులను పలకరించింది. విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన ఈ సినిమాలో కీలక పాత్రలో మెప్పించింది. అంతేకాకుండా రుద్రంగి సినిమాతో టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చింది.అయితే సినిమా రంగంలో ఎంతటి విజయాలు అందుకున్నా..పర్సనల్ లైఫ్‌లో ఎన్నో ఇబ్బందులు పడ్డానంటోంది ముద్దుగుమ్మ. తాజాగా ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడింది. ఒక స్టార్ యాక్టర్ తనను ఎలా మోసం చేశాడని తెలిపింది. క్యాన్సర్, బొల్లి వ్యాధి సమస్యలతో సమస్యలతో పోరాడుతున్న సమయంలోనే ప్రేమ, పెళ్లి విషయంలోనూ ఎంతో మానసిక వేదనను అనుభవించానని అంటోంది.అదే సమయంలో మలయాళంలో ఒక ప్రముఖ నటుడితో డేటింగ్ చేసినట్లు వెల్లడించింది. ఈ విషయం అమ్మ కూడా తెలుసని.. కానీ అతనికి అప్పటికే వేరే అమ్మాయితో నిశ్చితార్థం అయిందనే నిజాన్ని దాచిపెట్టి నను మోసం చేశాడని తెలిపింది. అయితే మమతా మోహన్ దాస్ మొదట తన చిన్ననాటి స్నేహితుడు ప్రజిత్‌ను ఇష్టపడి 2011లో వివాహం చేసుకుంది. కానీ ఆ బంధం ఆరు నెలలకే ముగిసిపోయింది. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు పెళ్లి బంధంలో విడాకులు తనను మానసికంగా కుంగదీశాయని మమతా ఆవేదన వ్యక్తం చేసింది. -
"హల్దిరామ్ వివాహం": వేదికగా ప్యాలెస్ సెట్, భారీ కేక్..
అత్యంత విలావంతసమైన వివాహా వేడుక. చూడటానికి రెండు కళ్లు చాలవు అన్నంత రేంజ్లో హంగుఆర్భాటంగా జరుగుతోంది. ఓ పక్క బాణసంచాతో దద్దర్లిపోతున్న ఆకాశం, మరోవైపు ప్యాలెస్ రేంజ్ వేదిక సెట్, బారీ కేక్‌లు, మంచు విగ్రహాలు..ఎన్నో అబ్బురపరిచే...దృశ్యాలతో మిరుమిట్లు గొలిపేలా పెళ్లి వేడుక జరుగుతుంది. ఇంతకీ ఆ పెళ్లి ఎవరిదంటే..అది బిలియనీర్ శివకిషన్ అగర్వాల్ వివాహ వేడుక. నాగపూర్‌లో అట్టహాసంగా జరిగింది. అత్యంత విలాసవంతమైన వివాహ వేడుకలో ఒకటిగా నిలిచింది కూడా. ప్యాలెస్‌లాంటి వివాహ సెట్, ఎత్తైన పూల అలంకరణలు, మెరిసే మంచు శిల్పాలు, ప్రతిది కనుతిప్పుకోనివ్వతంగా అందంగా ఉన్నాయి అక్కడి దృశ్యాలు. ఈ వేడుకలో సంగీత్‌లో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ డ్యాన్స్ హైలెట్‌గా నిలిచింది. View this post on Instagram A post shared by The Cake Affair Ⓡ | Custom Cake Boutique (@thecakeaffair.nagpur) అంతేగాదు బారీ కేక్, అడుగడుగున రాజదర్పం ఉట్టిపడేలే అత్యంత గ్రాండ్‌గా జరిగింది ఆ వివాహ తంతు. ఈ వివాహానికి బిజెపి నాయకుడు హన్స్‌రాజ్ అహిర్ హాజరై నూతన వధువరులకు పూలబొకేని బహుకరించారు. అంతేగాదు ఆయన వారి వైవాహిక జీవితం అత్యంత సంతోషభరితంగా సాగిపోవాలంటూ ఆ జంటను దీవించారు కూడా View this post on Instagram A post shared by Harsh Ekonkar | FOOD & TRAVELLER 🇮🇳 (@harsh_storiess) ఎవరీ శివకిషన్..?హల్దిరామ్ వ్యవస్థాపక కుటుంబంలోని మూడవ తరం శివకిషన్ అగర్వాల్. ఆయన నాగ్‌పూర్ ఆధారిత వ్యాపార విభాగానికి నాయకత్వం వహిస్తారు. హల్దిరామ్ బ్రాండ్ రాజస్థాన్‌లోని బికనీర్‌లోని ఒక చిన్న దుకాణంలో మూలాలు ఉన్నాయి. దీనిని శివకిషన్ అగర్వాల్ తాత గంగా బిషన్ అగర్వాల్ ప్రారంభించారు. కాగా ఇది దేశంలోని అత్యంత ప్రసిద్ధ స్నాక్స్, మిఠాయి బ్రాండ్లలో ఒకటిగా ఎదిగింది. ఏప్రిల్ 2023లో ఢిల్లీ, నాగ్‌పూర్‌కు చెందిన కుటుంబంలోని రెండు విభాగాలు కలిసి హల్దిరామ్ స్నాక్స్ ఫుడ్ లిమిటెడ్‌ను సృష్టించాయి. ఈ వ్యాపారంలో ఆయన వాటా ఏకంగా రూ. 27 వేల కోట్లు. (చదవండి: 14 కిలోల బరువు తగ్గిన డాక్టర్..! ఓపిక, స్థిరత్వంతోనే సాధ్యం..) -
60 కోట్లు ఇస్తానన్న నెట్ ఫ్లిక్స్.. షాకిచ్చిన విజయ్
-
వివాహమా?.. ఇప్పుడే వద్దులే!
న్యూఢిల్లీ: వివాహం చేసుకోవడానికి యువత తొందరపడడం లేదు. జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి అంటున్నారు. కెరీర్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉద్యోగంలో లేక వ్యాపారంలో నిలదొక్కుకున్నాక పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. భారత్‌లో సగటు వివాహ వయసు పదేళ్ల క్రితం 27 ఏళ్లు కాగా.. అది ఇప్పుడు 29 ఏళ్లకు చేరుకుంది. అంటే సగటున 29 ఏళ్లకు వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి యువత ఆసక్తి చూపుతోంది. వివాహ పరిచయ వేదిక ‘జీవన్సాథీ’నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది. వివాహాలపై 2016 నుంచి 2025 దాకా ప్రజల్లో మారిన ధోరణిని అధ్యయనం చేశారు. అలాగే ఈ ఏడాది 30 వేల మంది అభిప్రాయాలు సైతం సేకరించారు. ‘అతిపెద్ద మార్పు: జీవిత భాగస్వామి ఎంపిక, పెళ్లి విషయలో నిబంధనలు తిరగరాస్తున్న భారత్’ఒక నివేదికను జీవన్సాథీ తాజాగా విడుదల చేసింది. ఇందులో పలు ఆసక్తికరమైన అంశాలున్నాయి. → పెళ్లంటే యువతలో అయిష్టత ఏమీ లేదు. ఒక ఇంటివారు కావాలనే కోరుకుంటున్నారు. కానీ, అందుకోసం తొందర పడడం లేదు. 29 ఏళ్లు వచ్చాక తోడు కోసం అన్వేషిస్తున్నారు. → ఈ మార్పు రావడం వెనుక ఆర్థిక కోణమే కీలకంగా కనిపిస్తోంది. ఉద్యోగంలో కుదురుకొని ఆర్థికంగా స్థిరపడితే జీవిత భాగస్వామితో ఆనందంగా గడపొచ్చన్నది యువత ఆలోచన. సాధారణంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా కాపురంలో కలతలు రేగుతుంటాయి. ఆ పరిస్థితి రావొద్దని నేటి యువత భావిస్తోంది. → పెళ్లిని వ్యక్తిగత ఎదుగుదలకు అవరోధంగా కొందరు భావిస్తున్నారు. అందుకే అనుకున్న లక్ష్యం సాధించిన తర్వాత పెళ్లి ఆలోచన తీసుకొస్తున్నారు. → జీవిత భాగస్వామి మృతిచెందడం లేదా తొలి వివాహం విఫలమైన సందర్భాల్లో మరో పెళ్లి కోసం ఆరాటపడుతున్నవారి సంఖ్య దేశంలో పెరుగుతోంది. → 2016లో 11 శాతం మంది రెండో పెళ్లి కోసం ప్రయత్నాలు సాగించారు. ఇప్పుడు వారి సంఖ్య 16 శాతం పెరిగింది. → విడాకులు తీసుకున్న తర్వాత మరో పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదని చాలామంది భావిస్తున్నారు. తొలిసారి పెళ్లికి సిద్ధమైనవారు కూడా అప్పటికే ఒకసారి విడాకులు తీసుకున్న వారిని వివాహమాడేందుకు ముందుకొస్తుండడం గమనార్హం. → సరైన జీవిత భాగస్వామి కోసం అన్వేషించే వారి సంఖ్య కూడా తక్కువేమీ లేదు. పెళ్లి విషయంలో వయసు, ఆదాయం వంటి వాటికి ప్రాధాన్యం లేదని, ‘రైట్ పర్సన్’కావాలని, అందుకోసం ఎన్నాళ్లయినా వేచి చూస్తామని అంటున్నారు. → కులం పట్టింపు తగ్గిపోతుండడం మరో శుభ పరిణామం. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడంలో కులం ముఖ్యం కాదని కొందరు చెబుతున్నారు. 2016తో పోలిస్తే ఇప్పుడు ఇలాంటివారి సంఖ్య మరింత పెరిగింది. గ్రామాలతో పోలిస్తే పట్టణాలు, నగరాల్లో ఈ ధోరణి అధికంగా ఉంది. → పెళ్లి అనేది వ్యక్తిగత వ్యవహారమని, భార్య/భర్తను తామే ఎంపిక చేసుకుంటామని యువత వాదిస్తోంది. వీరి సంఖ్య 2016లో 67 శాత ఉండగా, ప్రస్తుతం 77 శాతానికి చేరుకుంది. పెళ్లి కుదిర్చే పనిని తమ కుటుంబ సభ్యులకు అప్పగించే పరిస్థితి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. → భార్య తమ కంటే ఎక్కువ సంపాదిస్తున్నప్పటికీ యువకులు పెద్దగా ఇబ్బంది పడడం లేదు. ఎక్కువ సంపాదించే భార్య రావాలని 87 శాతం మంది కోరుకుంటున్నట్లు అధ్యయనంలో తేలింది. భర్త తమ కంటే తక్కువ సంపాదించినప్పటికీ తమకు అంగీకారమేనని 15 శాతం మంది యువతులు చెప్పారు. -
Mrunal Thakur: ధనుష్‌తో పెళ్లి..? మృణాల్ ఠాకూర్ క్లారిటీ
సినీ ఇండస్ట్రీలో ఈ మద్య కాలంలో తరచూ వినిపించే ఓ వార్త ఏమిటంటే.. హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్నది. అయితే ఈ వార్తలు కొత్తవి కావు. గతంలో ఒక ఫంక్షన్లో వీరిద్దరూ క్లోజ్‌గా కనిపించడంతో ఈ ఊహాగానాలు మరింత వేగం పుంజుకున్నాయి. కొంతమంది మేధావులు ఫిబ్రవరి 14న వీరి వివాహం జరుగుతుందని కథనాలు ప్రచారం చేశారు. అయితే తాజాగా మృణాల్ ఠాకూర్ ఈ పుకార్లపై స్పందింది. “ఫిబ్రవరి 14 కాస్తా ఏప్రిల్ 1గా మారినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే ఏప్రిల్ 1 ఫూల్స్ డే కదా. ఇదంతా ఎవరు మొదలుపెడుతున్నారో అర్థం కావడం లేదు. నేను అధికారికంగా చెప్పినట్టు కొంతమంది ఇలాంటి గాసిప్స్ వ్యాపింపజేస్తున్నారు. ఇది తనకు చాలా భయంకరంగా ఉందని వ్యాఖ్యానించింది. ఇంతకుముందు పలుమార్లు ఈ విషయంపై ఆమె స్పందించినప్పటికీ, ఆ మాటలు పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్టే అయ్యాయి. ఈసారి మాత్రం మృణాల్ స్పష్టంగా తనకు ధనుష్‌తో ఎలాంటి సంబంధం లేదని ఖండించింది. అయితే ఆమె ఇచ్చిన క్లారిటీతో ఈ గాసిప్స్‌కు ముగింపు లభిస్తాయేమో చూడాలి. మొత్తానికి ధనుష్‌తో వస్తున్న పెళ్లి వార్తలు కేవలం పుకార్లేనని మృణాల్ ఠాకూర్ తేల్చి చెప్పింది. -
రష్మిక-విజయ్ పెళ్లి వేడుక.. కోట్ల రూపాయల డీల్‌కు నో..!
టాలీవుడ్లో గత కొంత కాలంగా వీరి పెళ్లి చుట్టే చర్చ నడుస్తోంది. ఎంగేజ్మెంట్ వార్తల తర్వాత ఆ ఇద్దరు స్టార్స్ పెళ్లి వేడుక కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ జంట మరెవరో కాదు.. టాలీవుడ్లో మోస్ట్ వైరల్ ప్రేమజంట రష్మిక- విజయ్ దేవరకొండ. వీరిద్దరి పెళ్లి ఫిబ్రవరిలోనే జరనుందని వచ్చినా డేట్ విషయంలో క్లారిటీ లేదు. మొదట ఫిబ్రవరి 2న జరగనుందని వార్తలొచ్చనా అలా జరగలేదు. తాజాగా ఈనెల 26న ఈ గ్రాండ్ వెడ్డింగ్ జరగనుందని టాక్ వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో విజయ్- రష్మిక పెళ్లికి సంబంధించిన మరో న్యూస్ తెగ వైరలవుతోంది. వీరి పెళ్లి వీడియోను ఏ ఓటీటీకి ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ వెడ్డింగ్ కార్యక్రమాన్ని స్ట్రీమింగ్ చేసేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్‌తో ముందుకొచ్చనట్లు సమాచారం. అయితే తమ వ్యక్తిగత జీవితంలో బిజినెస్ చేసే ఉద్దేశం లేదని ఓటీటీ విజ్ఞప్తిని తిరస్కరించనట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.గతంలో లేడీ సూపర్ స్టార్ నయనతార వెడ్డింగ్ వీడియో విషయంలో ఎదురైన న్యాయపరమైన చిక్కులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే విజయ్- రష్మిక జాగ్రత్త పడుతున్నట్లు టాక్. ముఖ్యంగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వేడుకతో వ్యాపారం చేయడం విజయ్‌కి అస్సలు ఇష్టం లేదని సమాచారం. అందుకే కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా ఓటీటీ డీల్‌ను వీరు సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. తమ పెళ్లిని కేవలం కుటుంబ సభ్యుల మధ్య ప్రైవేట్‌గా ఉంచుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. ఏదేమైనా వీరిద్దరి పెళ్లి కోసం టాలీవుడ్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. -
నటితో విడాకులు.. చాలా హ్యాపీగా అనిపించింది: డైరెక్టర్ కామెంట్స్
కోలీవుడ్ డైరెక్టర్ ఆర్ పార్తీబన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన వ్యక్తిగత లైఫ్ గురించి తాజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. నటి సీతను పెళ్లాడిన ఆయన.. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఆమెతో విడిపోయారు. ఈ సందర్భంగా తమ వైవాహిక బంధం, విడాకుల గురించి చెప్పుకొచ్చారు. సీతతో విడిపోయినందుకు తానెప్పుడు బాధపడలేదని అన్నారు. నిజం చెప్పాలంటే ఆమెతో విడాకుల తర్వాత చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. అయితే తనతో ఉన్న 12 సంవత్సరాల నా జీవితం అత్యంత మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయిందని వెల్లడించారు. ఎందుకంటే ఈ రోజుల్లో పురుషులు, మహిళలు వివాహం కంటే స్వతంత్రంగా ఉండటాన్నే ఇష్టపడతారని పార్థీబన్ అన్నారు. ఏ స్త్రీ కూడా వివాహం పేరుతో పరిమితులు ఉండే జీవితాన్ని కోరుకోదని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా జీవితాన్ని గడపాలని కోరుకుంటారని ఆర్ పార్థీబన్ పేర్కొన్నారు. ఈ కామెంట్స్ఆర్ పార్తీబన్ కెరీర్..కాగా.. ఆర్ పార్తీ బన్ 1990లో నటి సీతను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. ఒక కుమారుడిని దత్తత తీసుకున్నారు. 2001లో పార్తీబన్- సీత విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి పార్తీబన్ ఒంటరిగానే ఉంటున్నాడు. సీత మరొకరిని పెళ్లి చేసుకోగా తర్వాతి కాలంలో ఆయనకు సైతం విడాకులు తీసుకుంది. ఇక ఆర్ పార్తీబన్ సినిమాల విషయానికి వస్తే.. యుగానికి ఒక్కడు, నేనూ రౌడీనే, పొన్నియన్ సెల్వన్ 1, పొన్నియన్ సెల్వన్ 2 వంటి పలు చిత్రాల్లో నటించాడు. అంతేకాకుండా సుడల్ 1 వెబ్ సిరీస్‌లోనూ యాక్ట్ చేశాడు. I have never worried about separation with my ex wife Seetha, to be honest I'm very happy about it. The 12 years with her is the Sweetest memory of my life.These days men & women prefer independence over Marriage. No woman wants a restricted life in the name of Marriage.… pic.twitter.com/LfgirOi8Eh— Kolly Censor (@KollyCensor) February 10, 2026 -
ముస్లిం దంపతుల ఔదార్యం
రాయచూరు(కర్ణాటక): ముస్లిం తల్లిదండ్రులు, తమ హిందూ దత్తపుత్రుని పెళ్లిని హిందూ సంప్రదాయ రీతిలో ఘనంగా జరిపించి ఆదర్శంగా నిలిచారు. ఈ అపురూపమైన సంఘటన బెళగావి జిల్లా హుక్కేరి తాలూకా బస్తవాడిలో జరిగింది. వివరాలు.. మెహబూబ్ హసన్ నాయికోడి, నూర్జహాన్ దంపతులు ఈ ఔదార్యాన్ని చాటుకున్నారు. లింగాయత్ వర్గానికి చెందిన శివానంద కాడయ్య దంపతులు అర్ధాంతరంగా చనిపోయారు. వారి కుమారులు సోమశేఖర్ (4), వసంత్ (2)లను మెహబూబ్ దంపతులు చిన్నప్పుడే దత్తత తీసుకుని పోషిస్తున్నారు. మెహబూబ్ ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేసి రిటైరయ్యారు. అప్పటికే వారికి ఇద్దరు చొప్పున మగపిల్లలు, ఆడపిల్లలు ఉన్నా భారంగా భావించకుండా చదువులు చెప్పించి ప్రయోజకుల్ని చేశారు. సోమశేఖర్ డిగ్రీ పూర్తి చేసి ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తు పూనం అనే యువతిని ప్రేమించాడు. దీంతో కాడ సిద్ధేశ్వర మండపంలో ముస్లిం తల్లిదండ్రులు హిందూ సంప్రదాయ రీతిలో దత్త కుమారుని పెళ్లి వేడుకలను జరిపించారు. మత సమైక్యతకు ఈ సన్నివేశం అద్దం పట్టగా, మెహబూబ్, నూర్జహాన్‌లను గ్రామస్తులు అభినందించారు. -
టెన్త్ విద్యార్థినికి తాళి కట్టిన ఉపాధ్యాయుడు
నిజామాబాద్ జిల్లా: అన్నోజిగూడలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివే టెన్త్ క్లాస్ విద్యార్థిని మెడలో అదే స్కూల్‌కు చెందిన ఉపాధ్యాయుడు తాళి కట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నోజిగూడలోని ఓ స్కూల్లో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినికి అదే స్కూల్లో ఫిజిక్స్ టీచర్‌గా పనిచేస్తున్న పర్రే మైటీస్ మాయమాటలు చెప్పి రహస్యంగా పెళ్లి చేసు కున్నాడు. విద్యార్థిని మెడలో పసుపు తాడు చూసిన తల్లి ప్రశ్నించగా..తమ ఉపాధ్యా యుడు మైటీస్ తనను పెళ్లి చేసుకున్నట్లు కూతురు చెప్పింది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వచ్చి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడిని పిలిపించి నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. విషయం బయటకు వస్తే స్కూలు పరువు పోతుందని భావించిన యాజమాన్యం ఉపాధ్యాయుడిని ఉద్యోగం నుంచి తొలగించి, పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. మై నర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్ప డిన ఉపాధ్యాయుడితో పాటు స్కూల్ యాజ మాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
విజయ్ దేవరకొండ పెళ్లికి వెళ్తున్నారా?.. తరుణ్ భాస్కర్ ఏమన్నారంటే?
టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఇటీవలే హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఓం శాంతి శాంతి శాంతిః. అనే మలయాళ రీమేక్‌తో పలకరించారు. ఈ చిత్రంలో ఈషా రెబ్బా హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది. అంతలోనే మరో సినిమాకు రెడీ అయిపోయారు తరుణ్ భాస్కర్. ఆయన హీరోగా వస్తోన్న. కొత్త సినిమా ‘గాయపడ్డ సింహం. తాజాగా ఈ మూవీ టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.ఈ ఈవెంట్‌కు హాజరైన తరుణ్ భాస్కర్‌కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీరు హీరోగా చేసిన సినిమా హిట్ కొట్టలేదు కదా.. మీతో సినిమా చేయడానికి నిర్మాత ఎలా ధైర్య చేశారని ఓ మీడియా ప్రతినిధి అడిగారు. దీనికి తరుణ్ భాస్కర్ స్పందించారు. మీరు స్టోరీ రాసి ప్రొడ్యూస్ చేయండి.. ఆ సినిమాతో హిట్ కొడదామన్నారు. అయితే లైఫ్‌లో ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన ఏదీ ఆపొద్దు.. ది అందరికీ చెబుతున్నా. గెలిచే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలని అన్నారు. అయినా ఎందుకు సార్ నేను ఫెయిల్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారని ఫన్నీగా చమత్కరించారు.ఇదే ఈవెంట్లో తరుణ్ భాస్కర్‌కు మరో ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. విజయ్ దేవరకొండ మ్యారేజ్‌కి మీరు కూడా వెళ్తున్నారా? అని అడిగారు. ఇది విన్న తరుణ్.. నాకైతే ఇప్పటి వరకు ఆహ్వానం లేదు.. ఒక వేళ ఇన్విటేషన్ వస్తే మీకు వెంటనే వాట్సాఫ్‌లో ఫార్వార్డ్ చేస్తాను.. మనిద్దరం కలిసి విజయ్ దేవరకొండ పెళ్లికి వెళ్దామని తరుణ్ భాస్కర్ ఫన్నీగా పంచ్‌లు వేశారు.కాగా.. గాయపడ్డ సింహం చిత్రానికి ‘డోన్ట్ లాఫ్... ఇట్స్ ఏ సీరియస్ మేటర్’ (నవ్వొద్దు... ఇది సీరియస్ మేటర్) అనేది క్యాప్షన్ ఇచ్చారు. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో విష్ణు ఓయి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని కల్యాణ చక్రవర్తి మంతెన, భానుకిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మిస్తున్నారు. పొలిటికల్ సెటైర్, క్రైమ్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. -
వివాహ వేడుకలో వైఎస్ జగన్.. జననేతకు ఆత్మీయ పలకరింపులు (ఫొటోలు)
-
వైఎస్ జగన్‌ను కలిసిన స్టార్ హీరోలు.. వీడియో వైరల్
వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ కలిశారు. చెన్నైలో జరిగిన సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోలీవుడ్ హీరోలు కార్తీ, సూర్య వైఎస్ జగన్‌ను ఆత్మీయంగా పలకరించారు. పెళ్లి వేడుకలో హీరోలు కార్తీ, సూర్యతో వైఎస్ జగన్‌తో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు అటు రాజకీయాలతో పాటు ప్రజల్లోనూ ఆసక్తికర చర్చలకు దారి తీసింది. View this post on Instagram A post shared by Sakshi (@sakshinews) -
శుభ లేఖలు పంచుతూ.. పెళ్లివారింట తీరని శోకం
రేవా: మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో పెళ్లివారింట తీవ్ర విషాదం నెలకొంది. ఫిబ్రవరి 24న జరగబోయే పెళ్లికి బంధువులను ఆహ్వానించేందుకు శుభలేఖలు తీసుకుని బైక్‌పై వెళ్లిన తండ్రి, కొడుకుతో పాటు మరో బంధువు మృత్యువాత పడ్డారు. రేవా-ప్రయాగ్‌రాజ్ హైవేపై కోస్టా గ్రామం సమీపంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.బాధితులు తమ ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో, ప్రయాగ్‌రాజ్ వైపు నుంచి అతివేగంగా దూసుకొచ్చిన ఒక కారు వీరి బైక్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొంది ఈ ప్రమాద తీవ్రతకు బైక్ నుజ్జునుజ్జవ్వగా, బైక్‌పై ప్రయాణిస్తున్న భగవత్ విశ్వకర్మ (55), ఆయన కుమారుడు శివం విశ్వకర్మ, బంధువు శీతల్ విశ్వకర్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఆ కారు డివైడర్‌ను బలంగా ఢీకొని ఆగిపోయింది.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతుల్లో భగవత్, శివం చాచాయ్ గ్రామానికి చెందిన వారు కాగా, శీతల్.. రథారా నివాసిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం రేవాలోని సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. కారు అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే బాధితుల కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. మృతులను చూసి వారు చేసిన ఆర్తనాదాలు మిన్నంటాయి. పెళ్లి పత్రికలతో వెళ్లిన వారు శవాలై తిరిగిరావడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ఘజియాబాద్ విషాదం: మరో దారుణం వెలుగులోకి.. -
అమ్మ కూతురి పెళ్లిలో రఘువరన్ బీటెక్.. ఫోటోలు వైరల్
ప్రముఖ నటి శరణ్య కూతురు రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగింది. చెన్నైలో జరిగిన ఈ వేడుకలో కోలీవుడ్ సినీతారలంతా పాల్గొన్నారు. హీరో కార్తీ, ధనుశ్‌తో పాటు పలువురు నటులు రిసెప్షన్ వేడుకలో సందడి చేశారు. ఈ ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కాగా.. శరణ్య పొన్నవన్.. ధనుశ్ హీరోగా నటించిన రఘువరన్ బీటెక్ చిత్రంలో నటించారు. ఈ మూవీలో ధనుశ్కు అమ్మగా కనిపించారు. అమాయకపు తల్లి పాత్రలో మెప్పించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. అంతే కాకుండా శరణ్య రఘువరన్ బీటెక్‌తో పాటు 24, వేదం, గ్యాంగ్ లీడర్, మహాసముద్రం, ఖుషి లాంటి సినిమాల్లోనూ కనిపించారు. Karthi at Saranya Ponvannan’s daughter marriage reception.💥pic.twitter.com/aWA2Ag3hN4— Christopher Kanagaraj (@Chrissuccess) February 7, 2026 .@dhanushkraja sir at Saranya Ponvannan Daughter Wedding Function! @theSreyas pic.twitter.com/Z3egrQzMTI— Chowdrey (@Chowdrey_Pro) February 7, 2026 -
నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
-
రష్మిక, విజయ్ పెళ్లి డేట్ వచ్చేసింది..!
-
ముగియనున్న మూడు నెలల మూఢం
శ్రీకాకుళం కల్చరల్/శ్రీకాకుళం: మూడు నెలల విరామం తర్వాత మంచి ముహూర్తాలు రావడంతో మళ్లీ వివాహాల సందడి మొదలైంది. గత ఏడాది నవంబరు 26 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 13 వరకు మూఢాలు కావడంతో చాలామంది వివాహాది శుభకార్యాలకు దూరంగా ఉన్నారు. మాఘ మాసం వివాహాలకు మంచిదైనప్పటికీ మూఢం కారణంగా ఫిబ్రవరి 18 వరకు సరైన ముహుర్తాలు లేకుండాపోయాయి. ఎట్టకేలకు ఫిబ్రవరి 19 నుంచి ఫాల్గుణ మాసం మొదలు కావడంతో వివాహాలకు సిద్ధమవుతున్నారు. అంతటా బిజీబిజీ.. ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది అపురూప ఘట్టం. వివాహ మధురానుభూతులను జీవితాంతం గుర్తుగా దాచుకోవాలనుకుంటారు. పెళ్లి ముహూర్తాలు మొదలుకావడంతో వివాహ సంబంధిత వ్యాపారాలైన భాజాభజంత్రీలు, డెకరేషన్ నిర్వాహకులు, కర్పూర దండల షాపులు, లైటింగ్, మైక్‌సెట్ నిర్వాహకులు, వస్త్ర వ్యాపారులు, బంగారం షాపుల వద్ద హడావిడి బాగా పెరిగింది. పెళ్లి మండపాలకు డిమాండు బాగానే ఉంది. ఇక, ముహుర్తాల కోసం జాతకాలు తీసుకొచ్చే వారితో జ్యోతిషాలయాల కిటకిటలాడుతున్నాయి. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా సుమారు 2వేల వరకు పెళ్లిళ్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. భోజనాల్లో తగ్గేదేలే.. వివాహ వేడుకల్లో భోజనాలదీ కీలక ఘట్టమే. దీనికోసం జిల్లాలో అనేక కేటరింగ్ సరీ్వసులు సిద్ధంగా ఉన్నాయి. వడ్డించే ఐటెమ్స్ బట్టి ధరలు ఉన్నాయి. ప్లేట్ రూ.150 నుంచి రూ.1000 వరకు ధరలు పలుకుతున్నాయి. కొందరు దూరప్రాంతాలైన విశాఖ, విజయవాడ, రాజమండ్రిల నుంచి సైతం కేటరింగ్ సర్వీసులను రప్పిస్తున్నారు. 19 నుంచి శుభముహూర్తాలు గత ఏడాది నవంబరు నెలాఖరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 18 వరకు మూఢాలు ఉండడంతో మంచి ముహూర్తాలు లేవు. ఫిబ్రవరి 19 నుంచి శుభముహుర్తాలు మొదలు కానున్నాయి. చాలా మంది వివాహాలకు సన్నద్ధమవుతున్నారు. – తెన్నేటి విక్రమశర్మ, పంచాంగకర్త మంచి ముహూర్తాలివే.. ఫిబ్రవరితో పాటు మార్చి, ఏప్రిల్, మే, జూన్, ఆగస్టు, నవంబరు, డిసెంబరు నెలల్లో ఎక్కువగా పెళ్లిళ్లు జరగనుట్లు పంచాంగకర్తలు చెపుతున్నారు. ఫిబ్రవరి: 19, 20, 21, 24, 25, 26 మార్చి : 4, 5, 6, 7, 8, 11, 12, 13, 14, 20, 21, 25, 29 ఏప్రిల్: 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12, 21, 25, 26, 28, 29, 30 మే: 1, 3, 5, 6, 7, 8, 9, 10, 12, 13 జూన్: 19, 20, 21, 24, 25, 26, 27, 28, జూలై: 1, 2, 3, 4, 5, 8, 9 ఆగస్టు: 16, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30, సెపె్టంబరు : 1, 3, 4, 5 , అక్టోబరు : 11, 14, 29, 30 నవంబరు: 5, 11, 12, 13, 14, 15, 18, 19, 20, 21, 22, 24, 25, 26 ,డిసెంబరు : 2, 3, 4, 10, 11, 12, 13, 15, 16, 17, 18, 19, 22, 23, 27, 29, 30, 31అభిరుచికి తగ్గట్టు.. కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా పెల్లి మండపాన్ని అలంకరిస్తుంటారు. కొందరు ప్లాస్టిక్ పూలతో సరిపెట్టుకోగా, మరికొంత మంది నిజమైన పూలతో మండపం సిద్ధం చేయమంటారు. వారి కోసం బెంగళూరు వంటి దూర ప్రాంతాల నుంచి సైతం పూలు, ఇతర సామగ్రి తెస్తుంటాం. – గోపి, క్లాత్ డెకరేషన్, శ్రీకాకుళం ముహూర్తాలు మళ్లీ మొదలుఏడాదిలో ఎన్ని పెళ్లి ముహుర్తాలు ఉంటే అంత ఆదాయం. ఈ ఏడాది మూడునెలలు మూఢాల వల్ల వివాహాది శుభకార్యాలు చాలా వరకు వాయిదాపడ్డాయి. మళ్లీ ముహుర్తాలు మొదలు కావడంతో వివాహాలు జరుపుకునేందుకు మా వద్దకు వస్తున్నారు. – పి.నర్సింహమూర్తి, పురోహితులు -
20 రోజుల్లో కూతురు పెళ్లి.. అంతలోనే మృత్యు ఒడికి
రంగారెడ్డి జిల్లా: కూతురి పెళ్లి ఘనంగా చేసి మురిసిపోదాం అనుకున్న ఆ తండ్రి కల చెదిరిపోయింది. మరో 20 రోజుల్లో పెళ్లి ఉందనగా రోడ్డు ప్రమాదం పొట్టనపెట్టుకుంది. ఈ విషాదకర సంఘటన సోమవారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలం తంగడుపల్లి గ్రామానికి చెందిన రవీందర్‌గౌడ్ (42) ప్రైవేటు ఉద్యోగి. భార్య లలిత, కూతురు ఉంది. కొడుకు ఏడాదిన్నర క్రితం వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం వీరు పటాన్చెరు మండలం ముత్తంగిలో నివాసం ఉంటున్నారు. ఇటీవలే రవీందర్‌గౌడ్ కూతురి వివాహం నిశ్చయం కాగా.. ఈనెల 22న పెళ్లి ఉంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం కూతురి వివాహ పనుల నిమితం తన ద్విచక్రవాహనంపై సిమెంటు బస్తా వేసుకొని సొంత గ్రామానికి బయలుదేరాడు. బైక్ ఎర్వగూడ గేటు వద్ద ఉండగా.. ఎదురుగా వికారాబాద్ వైపు నుంచి వస్తున్న కారు అతివేగం, అజాగ్రత్తగా వచ్చి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రవీందర్ గౌడ్ తలకి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 20 రోజుల్లో పెళ్లి ఉందనగా ఇంటి పెద్ద మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
సెలవు అడిగితే.. పెళ్లి ఎమర్జెన్సీ కాదన్న బాస్
కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులు ఎన్నెన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో.. చాలా సందర్భాలలో తెలుసుకున్నాం. ఇప్పుడు తాజాగా ఓ సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. వర్క్ కంటే పెళ్లి ముఖ్యం కాదని తమ బాస్ చెప్పినట్లు ఉద్యోగి వెల్లడించారు.నేను పనిచేస్తున్న కంపెనీలో.. నా నిశ్చితార్థం & వివాహం గురించి రెండు నెలల ముందే మేనేజర్లకు సమాచారం ఇచ్చాను. అయితే వాళ్లు దానిని సీరియస్‌గా తీసుకోలేదని.. పైగా పెళ్లి ఎమర్జెన్సీ కాదని చెప్పినట్లు ఉద్యోగి రెడ్దిట్ పోస్టు ద్వారా వివరించారు. దీనిపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఉద్యోగం కంటే వ్యక్తిగత జీవితం ముఖ్యమని, అవసరమైతే కొంతకాలం ఉద్యోగం మానేయమని ఒకరు వెల్లడించగా.. చాలా కంపెనీలు ఇలాగే ఉన్నాయని, ఉద్యోగుల అవసరాలను సైతం గుర్తించడం లేదని మరొకరు వెల్లడించారు. జీవితంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ముఖ్యమని ఇంకొకరు అన్నారు.కొన్ని సంస్థలు ఇప్పటికి కూడా పనికి ఇచ్చిన ప్రాధాన్యత.. ఉద్యోగులకు ఇవ్వడం లేదు. ఈ విషయంపై గతంలో చాలా వార్తలు వెల్లడయ్యాయి. ''ఇంట్లో కూర్చుని ఎంతసేపని భార్యని చూస్తూ ఉంటారు?.. ఇంట్లో కంటే ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటామని మీ భార్యకు చెప్పండి. వారానికి 90 గంటలు పనిచేయండి. నేను ఆదివారాలు కూడా పనిచేస్తున్నా.. ఆరోజు మీతో పని చేయించలేక పోతున్నందుకు బాధపడుతున్నా'' అంటూ గతంలో లార్సెన్ & టూబ్రో చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యానించారు. -
అతను కన్నీళ్లు పెట్టుకోవడం అదే మొదటిసారి: కీర్తి సురేశ్
హీరోయిన్ కీర్తి సురేశ్ ఇటీవలే రివాల్వర్ రీటాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. లేడీ ఓరియంటేడ్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రంగా తెరకెక్కించిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. ప్రస్తుతం కీర్తి సురేశ్ తోట్టం అనే మూవీలో కనిపించనుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కీర్తి సురేశ్.. తన ప్రేమ పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. పెళ్లి రోజు తన ప్రియుడు ఆంటోనీ తట్టిల్ భావోద్వేగానికి గురయ్యాడని వెల్లడించింది. 15 ఏళ్ల ప్రేమ తర్వాత పెళ్లి చేసుకోవడంతో తాను మరింత ఎమోషనల్ అయ్యాడని తెలిపింది. ఆంటోనీ కన్నీళ్లు పెట్టుకోవడం తాను చూడటం మొదటిసారని అన్నారు.కీర్తి సురేశ్ మాట్లాడుతూ..'మేము ఇలాంటి పెళ్లి గురించి కలలో కూడా ఊహించలేదు, ఎందుకంటే మేము పారిపోయి పెళ్లి చేసుకుందామని అక్షరాలా అనుకున్నాం. కానీ ఇలాంటి పెళ్లిని ఎప్పుడూ ఊహించలేదు. అది నిజం కావడంతో మాకు మాటలు రాని స్థితిలో ఉండిపోయాం. ఈ క్షణం కోసం 15 ఏళ్లుగా ఎదురుచూశాం. ఇదంతా కేవలం 30 సెకన్లలోనే ముగిసింది. నేను పూర్తిగా శూన్యంలోకి వెళ్లిపోయాను. ఆ సమయంలో నాకు తాళి తప్ప అన్నీ శూన్యంగా అనిపించాయి. అది చాలా భావోద్వేగభరితమైన క్షణం. బహుశా అతను కన్నీళ్లు పెట్టుకోవడం కూడా నేను చూడటం అదే మొదటిసారి. ఇది ఒక అందమైన ప్రయాణం' అంటూ చెప్పుకొచ్చింది.కీర్తి సురేష్- ఆంటోనీ తట్టిల్ ప్రేమకథ..కాగా.. కీర్తి సురేశ్ సినీ పరిశ్రమలోకి ప్రవేశించడానికి ముందే ఆంటోనీ తట్టిల్ ప్రేమలో ఉంది. చిన్ననాటి స్నేహితుడైన 15 ఏళ్ల సుదీర్ఘ ప్రేమాయణం నడిచింది. ఈ జంట డిసెంబర్ 12, 2024న గోవాలో వివాహం చేసుకున్నారు. మొదట సాంప్రదాయ హిందూ వివాహం.. ఆ తర్వాత మలయాళీ క్రైస్తవ పద్ధతిలో ఒక్కటయ్యారు. -
రాజ్‌తో పెళ్లి తర్వాత ఫుల్ హ్యాపీగా సమంత.. వీడియో వైరల్!
డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో పెళ్లి తర్వాత సమంత ఫుల్ బిజీ అయిపోయింది. ఎక్కడికెళ్లినా సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూనే ఉంటోంది. ఇటీవలే రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న సామ్.. ఆ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. తాను కలలో ఇక్కడికి వస్తానని ఊహించలేదని రాసుకొచ్చింది. అయితే ప్రస్తుతం సామ్- రాజ్ నిడిమోరుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పికిల్ బాల్ మ్యాచ్ వీక్షిస్తున్న నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో సమంత ఫుల్ హ్యాపీగా మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. క్యూట్ కపుల్ అంటూ పోస్టులు పెడుతున్నారు.కాగా.. సామ్- రాజ్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ -2, సిటాడెల్: హనీ బన్నీ వంటి ప్రాజెక్టుల్లో కలిసి పనిచేశారు. ఆ తర్వాత వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ వినిపించాయి. ఆ రూమర్స్‌ను నిజం చేస్తూ గతేడాది డిసెంబర్ 1న వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌లో వీరిద్దరి పెళ్లి జరిగింది. ఇక సినిమాల విషయానికొస్తే సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం చిత్రంలో కనిపించనుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
అలా అయితేనే పెళ్లి.. వింత కండిషన్ పెట్టిన నటి
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ నిక్కీ తంబోలి, నటుడు అర్బాజ్ పటేల్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ జంట పెళ్లి చేసుకోబోతుందనే ప్రచారం కూడా జరిగింది. దీనిపై తాజాగా నిక్కీ తంబోలి స్పందించారు. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఆమె స్పష్టం చేసింది. అంతేకాదు తమ పెళ్లికి ఓ వింత కండీషన్ కూడా పెట్టుకున్నారట. అదేంటే.. నిక్కీ లేదా అర్బాజ్.. ఇద్దరిలో ఒకరు ఏదో ఒక రియాల్టీ షోలో విన్నర్‌గా గెలిస్తే పెళ్లి చేసుకుంటారట. గెలుపు అనేది పాజిటివ్ ఎనర్జీ అని.. విజయం తర్వాతే వివాహ బంధంలోకి అడుగుపెడతామని నిక్కీ చెప్పుకొచ్చింది.కాగా, ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్న 'ది ఫిఫ్టీ' రియాలిటీ షోలో ఈ జంట కలిసి పాల్గొంటోంది. ఇందులో మొత్తం 50 మంది సెలబ్రిటీలు పోటీపడుతున్నారు. ఈ షోకి ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. -
ఇద్దరు పిల్లలున్న మహిళ.. పెళ్లి చేయమని టవరెక్కిన యువకుడు
కాకినాడ రూరల్ / సామర్లకోట: ఓ మహిళతో వివాహం జరిపించాలని డిమాండ్ చేస్తూ ఓ యువకుడు విద్యుత్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. సామర్లకోట మండలం పనసపాడు గ్రామానికి చెందిన, యువకుడు, జేసీబీ డ్రైవర్ వానపల్లి వెంకట సురేష్ ఆదివారం సాయంత్రం కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం అవంతినగర్‌లో టవర్ ఎక్కి బెదిరింపులకు దిగాడు. హైటెన్షన్ విద్యుత్ లైన్ స్తంభం కావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. తీగలను తాకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగడంతో పాటు దాదాపు రెండు గంటల పాటు టవర్‌పైనే ఉండిపోయాడు. సమాచారం అందుకున్న తిమ్మాపురం పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో పాటు పనసపాడ గ్రామస్తులు టవర్ వద్దకు చేరుకుని వెంకట సురేష్‌ను ఒప్పించే ప్రయత్నం చేశారు. పనసపాడు సర్పంచ్ చీకట్ల వెంకటేశ్వరరావు, తిమ్మాపురం ఎస్సై గణేష్‌కుమార్ సెల్ ఫోన్లో సంప్రదింపులు జరిపారు. టవర్ ఎక్కి బెదిరింపులకు పాల్పడిన వెంకట సురేష్ తాను ప్రేమించిన మహిళ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడడంతో, వారు అల్లరి చేయవద్దని మాట్లాడుకుందామని నచ్చజెప్పడంతో కొద్దిసేపటికి స్తంభం నుంచి తాను కిందకు రావడంతో పోలీసులు, పనసపాడు గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం యువకుడిని తిమ్మాపురం పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఐదు రోజుల క్రితం టవర్ ఎక్కి ఆందోళన చేస్తానని హెచ్చరించినట్టుగా వెంకట సురేష్ గురించి గ్రామస్తులు పేర్కొన్నారు. మాధవపట్నంకు చెందిన ఓ మహిళ భర్తను విడిచి ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటుంది. పెళ్లి కోసం ఒత్తిడి తీసుకు రావడంతో ఆమె వెంకట సురేష్ సెల్ నంబరు, వాట్సాప్ బ్లాక్‌లో పెట్టినట్టు పోలీసులు తెలిపారు. దీంతో సెల్ టవర్ ఆ యువకుడు బెదిరింపులకు దిగాడు. -
ధనుష్, మృణాల్ పెళ్లి..! ఇదిగో క్లారిటీ
-
వాట్ ఏ కమిట్మెంట్ బ్రో.. వైరల్ వీడియో
ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని తన కెమెరాలో బంధించేందుకు కెమెరామెన్లు పడే కష్టం మామూలుది కాదు. ప్రోగ్రాం ఏదైనా కీలకమైన అంశాలను కవర్ చేస్తూ నానా కష్టాలు పడుతూ ఉంటారు. పండుగైనా, వేడుకైనా వీడియో గ్రాఫర్లది చాలా ప్రత్యేక మైన పాత్ర. ఇందులో సందేహమేలేదు. ఉద్యమం అయినా, ఉపద్రవం అయినా, వానొచ్చినా, వరదొచ్చినా వెరవకుండా నిబద్ధతతో పనిచేయాల్సి ఉంటుంది. ఇలాంటి నిబద్ధతకు సంబంధించి ఒక వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది.పెళ్లికూతుర్ని వేదికకు వద్దకు తీసుకొస్తున్నారు తల్లిదండ్రులు. సిగ్గుల మొగ్గవుతూ, కాబోయే భర్తను చూస్తూ మెల్లిగా అడుగులు వస్తోంది అమ్మాయి. మరోవైపు ఈ క్షణాలకోసమే ఎదురు చూస్తున్నా అన్నట్టు వరుడు కూడా ముందుకునడిచివస్తున్నాడు. ఈ అపురూపమైన దృశ్యాల్ని తన కెమెరాలో బంధిస్తూ వీడియో తీస్తున్నాడు ఒక కెమెరామెన్. అతని దృష్టి అంతా అక్కడున్న వేడుక మీదే. ఏ చిన్న మెరుపు క్షణాన్ని కూడా మిస్ అవ్వకూడదు. అదీ అతని కమిట్మెంట్. ఈ ధ్యాసలో వెనుక వున్న పూల్‌ని చేసుకోలేదు. దీంతో కాలు పట్టు తప్పి ఒక్క ఉదుటున అందులో పడిపోయాడు. కానీ ఏమాత్రం తొట్రుపడలేదు. పైగా ‘‘మీరు కానివ్వండి...’’ అంటూ వధూవరులకు, ఇతరులకు ఆదేశాలిస్తూ, తన పనిలో తాను నిమగ్నమైపోయాడు. దీంతో అతనికి సాయం చేద్దామని వచ్చిన మరో కెమెరామెన్ తన పనిలో మునిగిపోయాడు. అటు పెళ్లి కొడుకు కూడా కెమెరామెన్ ఇచ్చిన ధైర్యంతో వధువుకి ఉంగరం తొడిగే పనిలో ముందుకు కదిలాడు. ఈ వీడియో ఫన్నీ కమెంట్లతో నెట్టింట వైరల్ అవుతోంది. వాట్ ఏ కమిట్మెంట్ బ్రో అని నీ డెడికేష్కి సలాం అంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. నిన్నగాక మొన్న పెళ్లి : చిలకా గోరింకల్లా ఉండాల్సిన వాళ్లుఇదీ చదవండి : అనంత్ అంబానీ మరో లగ్జరీ వాచ్, అదిరిపోయే డిజైన్, ధర ఎంత? The way he said "you guys carry on" Shows the level of passion 🤍 pic.twitter.com/PeR4mB15W6— .. (@Superoverr) January 22, 2026 -
అమెను ఇప్పటికే పెళ్లి చేసుకున్నా.. కానీ..: అమిర్ ఖాన్
బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ గతేడాది అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆరు పదుల వయస్సులోనూ తనకు గర్ల్‌ఫ్రెండ్ ఉందంటూ బర్త్ డే రోజే పెద్ద షాకిచ్చాడు. బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్‌ను తన ప్రియురాలిగా ఫ్యాన్స్‌కు పరిచయం చేశారు. ఆ తర్వాత వీరిద్దరు ఎక్కడికెళ్లినా జంటగా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి పెళ్లిపై నెట్టింట చర్చ నడుస్తోంది. అమిర్ ఖాన్- గౌరీ వివాహ బంధంతో ఒక్కటవుతున్నారా? అనే టాక్ వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో అమిర్ ఖాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా గౌరీ స్ప్రాట్‌తో తన రిలేషన్ గురించి మాట్లాడారు. గౌరీని వెంటనే పెళ్లి చేసుకోవాలనే ప్రణాళిక ఏదీ లేదని ఆమిర్ ఖాన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం నేను, గౌరీ ఒకరి పట్ల ఒకరం చాలా చాలా నిబద్ధతతో ఉన్నామని తెలిపారు. మీ అందరికీ తెలుసు.. ప్రస్తుతం మేము భాగస్వాములం.. మేమిద్దరం కలిసే ఉన్నామని వెల్లడించారు. ఇక పెళ్లి విషయానికొస్తే ఆమెను నా మనసుతో ఇప్పటికే పెళ్లి చేసుకున్నానని తెలిపారు. ప్రస్తుతానికి పెళ్లిని అధికారికంగా చేసుకోకపోయినా.. అలా చేసుకోవాలా? వద్దా? అనేది భవిష్యత్తులో ఇద్దరం నిర్ణయించుకుంటామని అమిర్ ఖాన్ అన్నారు.కాగా.. ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారు. గతేడాది పుట్టినరోజు ఆమిర్ తన రిలేషన్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు. తాము ముంబైలో ఒక విలాసవంతమైన కొత్త ఇంటికి మారుతున్నట్లు ఆమిర్ ఇటీవలే తెలిపారు. కాగా.. మొదట ఆమిర్ మొదట రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కుమార్తె ఐరా ఖాన్, కుమారుడు జునైద్ ఖాన్ జన్మించారు. దాదాపు 16 సంవత్సరాల వివాహం తర్వాత 2002లో వారు విడిపోయారు. ఆ తర్వాత అమిర్ 2005లో కిరణ్ రావును వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులు సరోగసీ ద్వారా ఆజాద్ రావు ఖాన్ అనే కుమారుడికి జన్మనిచ్చారు. ఆమిర్ కిరణ్ రావుతో 2021లో విడిపోయారు. ఇద్దరితో విడాకులు తీసుకున్నప్పటికీ కుటుంబంలో జరిగే ఈవెంట్లకు అమిర్ ఖాన్ హాజరవుతున్నారు. విడిపోయిన ఇద్దరు భార్యలతో స్నేహపూర్వక రిలేషన్ కొనసాగిస్తూనే ఉన్నారు. -
వచ్చేనెలలో విజయ్‌తో పెళ్లి.. రష్మిక ఏమన్నారంటే?
హీరోయిన్ రష్మిక ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయింది. గతేడాది ది గర్ల్‌ఫ్రెండ్‌తో హిట్ కొట్టిన ముద్దుగుమ్మ.. కొత్త ఏడాదిలోనూ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ.. తనపై వస్తున్న రూమర్స్‌పై స్పందించింది. విజయ్ దేవరకొండతో వచ్చే నెలలోనే పెళ్లంటూ వార్తలొస్తున్నాయి. దీనిపై క్లారిటీ ఇవ్వాలని యాంకర్ రష్మికను ప్రశ్నించింది.ఈ ప్రశ్నకు రష్మిక చాలా తెలివిగా సమాధానం చెప్పుకొచ్చింది. నాలుగేళ్లుగా ఇలాంటి వింటూనే ఉన్నానని తెలిపింది. జనం కూడా ఎప్పటి నుంచో ఇదే ప్రశ్న అడుగుతున్నారు.. దాని కోసమే తాను కూడా ఎదురుచూస్తున్నానంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది. దీనిపై ఎప్పుడు చెప్పాలో అప్పుడే మాట్లాడతానని తెలిపింది. ఆ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెప్తానంటూ మరోసారి క్లారిటీ ఇచ్చేసింది. అంతేకాకుండా కెమెరా ముందు కాకుండా ఆఫ్ ది రికార్డ్‌లో ఈ విషయం గురించి మాట్లాడతానని రష్మిక సమాధానం దాటవేసింది.కాగా.. విజయ్ దేవరకొండతో ఫిబ్రవరి 26న రష్మిక పెళ్లి జరగనుందని నెట్టింట వైరలవుతోంది. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్ జరగనుందని టాక్. గతేడాది అక్టోబర్‌లో వీరిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారని వార్తలొచ్చాయి. కానీ దీనిపై కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు. అలాగే తాజాగా పెళ్లి విషయంలోనూ అదే ఫాలో అవుతూ సర్ప్రైజ్ ఇస్తారేమో వేచి చూడాల్సిందే. Q: There’s been a lot of buzz that #VijayDeverakonda and Rashmika are engaged and getting married on FEB 26th in Udaipur. What’s the truth?#RashmikaMandanna : pic.twitter.com/x6vD2jSIZB— Whynot Cinemas (@whynotcinemass_) January 19, 2026 -
ధనుశ్‌తో పెళ్లి రూమర్స్.. మృణాల్ ఠాకూర్ పోస్ట్ వైరల్..!
ఇటీవల కొద్దికాలంగా మృణాల్ ఠాకూర్ పెళ్లి రూమర్స్ తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో చాలా సార్లు వీరిద్దరు ఈవెంట్స్‌లో కనిపించడంతో త్వరలోనే వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారని వార్తలొచ్చాయి. వచ్చేనెల ఫిబ్రవరిలోనే వీరి పెళ్లి అంటూ తాజాగా సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే వీటిపై ఏ ఒక్కరూ కూడా స్పందించలేదు.అయితే తనపై పెళ్లి రూమర్స్ వస్తున్న వేళ సీతారామం బ్యూటీ ఫుల్‌గా చిల్ అవుతోంది. వీటిని అస్సలు పట్టించుకోకుండా ఎంజాయ్ చేస్తోంది. అయితే ఆమె సన్నిహితుల్లో ప్రస్తుతం ఆమైపై వస్తున్న పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశారు. ఇలాంటి సమయంలో ఓ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. మృణాల్ సముద్రంలో విహరిస్తూ చిల్ అవుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.కాగా.. గతేడాది మృణాల్, ధనుశ్‌లపై ఆగస్టు 2025లో మొదటిసారి డేటింగ్ రూమర్స్ వినిపించాయి. ఆ సమయంలో చిత్రం 'సన్ ఆఫ్ సర్దార్ 2' ప్రీమియర్‌లో వారిద్దరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. అది కాస్తా నెట్టింట వైరల్ కావడం.. అంతకు ముందు, మృణాల్ ధనుశ్ ప్రాజెక్ట్ 'తేరే ఇష్క్ మే' ముగింపు పార్టీలో కనిపించడంతో వీరిద్దరి రిలేషన్‌పై ఊహగానాలు మొదలయ్యాయి. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
నార్వే చిన్నది.. వైజాగ్ చిన్నోడు..
విశాఖపట్నం: ప్రేమకు దేశాలు, సరిహద్దులు అడ్డుకావని నిరూపించింది ఈ జంట. ఏడు సముద్రాల అవతల పుట్టిన ఓ యువతి, మన వైజాగ్ కుర్రాడి ప్రేమలో పడి.. పెద్దలను ఒప్పించి భారతీయ సంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యేందుకు సిద్ధమైంది. శుక్రవారం వీరి నిశి్చతార్థం అత్యంత వైభవంగా జరిగింది. నార్వేలో చిగురించిన ప్రేమ ఎన్ఏడీ జంక్షన్ శాంతినగర్(అంబేడ్కర్ నగర్)కు చెందిన గొట్టిపల్లి జ్ఞాన్ ప్రకాష్ కుమారుడు సైమన్ 2016లో ఉద్యోగ రీత్యా నార్వే వెళ్లారు. అక్కడ ఓ బ్యాంకులో ఉద్యోగిగా స్థిరపడ్డారు. అదే ప్రాంతంలో స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపిస్ట్‌గా పనిచేస్తున్న తూరాతో సైమన్‌కు పరిచయం ఏర్పడింది. రెండేళ్ల కిందట నార్వేలో జరిగిన ఓ మ్యూజిక్ క్విజ్‌లో తొలిసారి కలుసుకున్న వీరి పరిచయం ప్రేమగా మారింది. తూరాలోని స్వచ్ఛమైన నవ్వు, స్వేచ్ఛా భావాలు సైమన్ను ఆకట్టుకోగా, సుమారు రెండేళ్ల డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ తమ ప్రేమ విషయాన్ని ఇళ్లలో చెప్పగా, ఇరు కుటుంబాలు సానుకూలంగా స్పందించాయి. భారతీయ కుటుంబ వ్యవస్థ, నార్వే కుటుంబ వ్యవస్థకు దగ్గరగా ఉంటుందని, ఇక్కడి వారిలో కనిపించే ప్రేమ, ఆప్యాయతలు తమకు ఎంతగానో నచ్చాయని వధువు కుటుంబ సభ్యులు తెలిపారు. తన కోడలిని భారతీయ సంప్రదాయ వస్త్రధారణలో చూడాలన్న ఆశతో, తొలి బహుమతిగా చీరను అందించానని వరుడి తండ్రి జ్ఞాన్ ప్రకాష్ సంతోషం వ్యక్తం చేశారు. వంటకాలు అదిరిపోయాయ్.. ఈ వేడుకకు హాజరైన నార్వే అతిథులు భారతీయ వంటకాలు ‘యమ్మీ’ అంటూ లొట్టలేశారు. చీరకట్టులో భారతీయ స్త్రీలు ఎంతో అందంగా ఉన్నారని, ఇక్కడి వారి మర్యాదలు, ఆప్యాయమైన పలకరింపులు తమను మంత్రముగ్ధులను చేశాయని ఆనందం వ్యక్తం చేశారు. ఒకరినొకరు అర్థం చేసుకుని, నిండు నూరేళ్లు కలిసి జీవిస్తామని నూతన జంట ఆనందం వ్యక్తం చేసింది. కాగా.. మాజీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, బీఎస్ కృష్ణ తదితరులు పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు. -
త్వరలో ధనుశ్ -మృణాల్ పెళ్లి.. తేదీ కూడా ఫిక్స్..!
సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్ ఎంట్రీతోనే సూపర్ హిట్ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం అడివి శేష్ హీరోగా వస్తోన్న డకాయిట్ చిత్రంలో మెప్పించనుంది. ఈ సినిమా సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక సినీ కెరీర్ సంగతి పక్కన పెడితే.. మృణాల్ వ్యక్తిగత జీవితంపై గత కొన్ని నెలలుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఆమె కోలీవుడ్ స్టార్ ధనుశ్‌తో డేటింగ్లో ఉన్నారని వార్తలొచ్చాయి. అయితే వీటిపై ఇద్దరు కూడా స్పందించలేదు. ఆ తర్వాత మృణాల్ ధనుష్ సిస్టర్స్ డాక్టర్ కార్తీక కృష్ణమూర్తి, విమల గీతలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో కావడంతో ఆ రూమర్స్‌కు మరింత బలం చేకూరింది. అంతేకాకుండా వారిద్దరు కూడా మృణాల్‌ను ఫాలో అయ్యారు. ఇక ఈ జంట డేటింగ్ కన్ఫామ్ అని చాలామంది ఫిక్సయిపోయారు.తాజాగా ఈ జంటపై మరో రూమర్ నెట్టింట వైరలవుతోంది. వీరిద్దరు త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని లేటేస్ట్ టాక్. తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం వచ్చేనెల 14న మృణాల్- ధనుశ్ ఒక్కటి కాబోతున్నారని సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే ఈ పెళ్లికి కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు కూడా తమ పర్సనల్ లైఫ్‌లో ఎల్లప్పుడూ గోప్యతను పాటిస్తారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ వార్తలపై మృణాల్ ఠాకూర్ కానీ, ధనుశ్ స్పందించలేదు. ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తేనే ఈ రూమర్స్‌కు చెక్ పడనుంది.కాగా.. గతేడాది ఆగష్టు 1న మృణాల్ పుట్టినరోజు వేడుకలో ధనుశ్ పాల్గొన్నారు. పార్టీ వీడియోలో ధనుష్ ఆమె చేతిని పట్టుకుని ఆత్మీయంగా మాట్లాడుతున్న దృశ్యం ఒకటి వైరలైంది. ఆపై మృణాల్ ఠాకూర్ నటించిన కొత్త సినిమా 'సన్ ఆఫ్ సర్దార్ 2' స్పెషల్ స్క్రీనింగ్‌కు ధనుష్ ప్రత్యేకంగా ముంబయికి వెళ్లారు. స్క్రీనింగ్ సమయంలో ధనుష్ చెవిలో మృణాల్ ఏదో గుసగుసలాడటం కనిపించింది. అంతకుముందు ధనుశ్ మూవీ 'తేరే ఇష్క్ మే' పార్టీకి మృణాల్ కూడా హాజరయ్యారు. అక్కడ కూడా వీరిద్దరూ కలిసి కనిపించారు. అప్పటి నుంచి వారిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. -
తన వల్లే నా పెళ్లి జరిగింది: నుపుర్ సనన్
బాలీవుడ్ భామ, హీరోయిన్ కృతి సనన్ సిస్టర్ నుపుర్ సనన్ ఇటీవలే పెళ్లి చేసుకుంది. తన ప్రియుడైన స్టీబిన్‌ను పెళ్లాడింది ముద్దుగుమ్మ. మొదటి క్రిస్టియన్ సంప్రదాయంతో వివాహం చేసుకున్న బ్యూటీ.. ఆ తర్వాత హిందూ సంప్రదాయంలోనూ గ్రాండ్‌గా పెళ్లి వేడుకను జరుపుకుంది. ఈ పెళ్లిలో ఆదిపురుష్ బ్యూటీ కృతి సనన్ సందడి చేసింది. చెల్లి పెళ్లిలో అన్నీ తానై ముందుండి నడిపించింది.అయితే వీరిద్దరిదీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అన్న సంగతి తెలిసిందే. దీంతో పెళ్లికి నుపుర్ సనన్ మదర్ ఒప్పుకోలేదు. ఆమె ససేమిరా అనడంతో కృతి సనన్ రంగంలోకి దిగింది. సిస్టర్ కోసం అమ్మను ఒప్పించి మరీ ఈ పెళ్లి జరిపించింది ముద్దుగుమ్మ. తాజాగా తన అక్క స్టీబిన్ గురించి తల్లిని ఎలా ఒప్పించిందో కూడా నుపుర్ సనన్ వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నుపుర్ ఈ విషయాన్ని పంచుకుంది.నుపుర్ సనన్ మాట్లాడుతూ.. "స్టీబిన్ గురించి నేను మొదట చెప్పింది నా సోదరికే. మా ఇద్దరి మధ్య ఐదేళ్ల వయస్సు తేడా ఉన్నప్పటికీ మేము చాలా క్లోజ్‌గా ఉంటాం. అంతేకాదు ప్రాణ స్నేహితులం కూడా. స్టీబిన్ వృత్తిపరంగా ఇప్పుడే కెరీర్ ప్రారంభించాడు. కాబట్టి కెరీర్ పరంగా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. నేను అతని గురించి ఒక వ్యక్తిగా ఎక్కువగా చెప్పా. తనకు అతని పాట వినిపించా. వెంటనే అతను అపారమైన ప్రతిభ ఉన్నవాడని కృతి చెప్పింది." అని తెలిపింది."కొన్ని నెలల తర్వాత ఈ విషయం మా అమ్మకు చెప్పా. చాలా మంది తల్లులలాగే ఆమె కూడా కొంచెం సంకోచించింది. అప్పుడే నా సోదరి రంగంలోకి దిగింది. నేను స్టీబిన్‌ను కలిశాను.. అతని పాటలు కూడా విన్నాను.. చాలా ప్రతిభావంతుడు.. కష్టపడి పనిచేసేవాడని అమ్మతో చెప్పింది. అలా తన మాటలతో అమ్మను మార్చేసింది. అక్కడి నుండి అంతా సజావుగా జరిగిపోయింది" అని పంచుకుంది. కాగా.. నుపుర్ సనన్- స్టీబిన్ పెళ్లి ఉదయపూర్ జరిగింది. ఈ వేడుకలకు సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. -
గ్రాండ్‌గా సిస్టర్ పెళ్లి.. సందడి చేసిన ఆదిపురుష్ హీరోయిన్
బాలీవుడ్ బ్యూటీ, ఆదిపురుష్ భామ కృతి సనన్ తన సిస్టర్ నుపుర్ సనన్ పెళ్లిలో సందడి చేసింది. ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో ఆదిపురుష్ భామ కృతి సనన్ అన్నీ తానై దగ్గరుండి నడిపించింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతకుముందే వీరిద్దరు క్రిస్టియన్ సంప్రదాయంలో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా కృతి సనన్ తన చెల్లి పెళ్లిలో హంగామా చేస్తూ కనిపించింది. కాగా.. నుపుర్ సనన్.. తన ప్రియుడు, సింగర్ అయిన స్టెబిన్‌ను పెళ్లాడింది. ఉదయపూర్‌లో జరిగిన వివాహ వేడుకలో కృతి సనన్ ప్రియుడు కబీర్ బహియా కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా దిశా పటాని, మౌనీ రాయ్ సన్నిహితులు కూడా హాజరయ్యారు.నుపుర్ సనన్ సినీ కెరీర్..నుపుర్ సనన్.. 'టైగర్ నాగేశ్వరరావు' అనే తెలుగు మూవీతో హీరోయిన్గా పరిచయమైంది. తర్వాత ఒకటీరెండు ఆల్బమ్ సాంగ్స్‌లో కనిపించింది. ప్రస్తుతం 'నూరని చెహ్రా' అనే హిందీ సినిమా చేస్తోంది. బాలీవుడ్లో ఇదే తన తొలి సినిమా కావడం విశేషం. View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) Kriti Sanon walks sister Nupur down the aisle as she weds Stebin Ben in dreamy Christian & Hindu ceremonies!#kritisanon #stebin #nupursanon #marriage #ptcpunjabigold pic.twitter.com/hNpgUbEeFo— PTC Punjabi Gold (@PtcGold) January 12, 2026 -
టీనేజ్ లవర్స్ : 40 ఏళ్లకు 60లలో మళ్లీ పెళ్లి
నలభై ఏళ్ల ప్రేమ అరవై ఏళ్ల వయసులో నెరవేరడం నిజంగా అదృష్టం. 65 ఏళ్ల వయసులో జయప్రకాష్ అనే వ్యక్తి, తన టీనేజ్ ప్రియురాలు యాభై తొమ్మిదేళ్ల రష్మిని పెళ్లాడాడు. ఇది కేవలం ప్రేమకథ కాదు. అనేక ట్విస్టు అండ్ టర్న్ మధ్య వారి చిరకాల ప్రేమసంతోషం, ఆనందం గెలిచిన రోజు. ఒకనాడు విధికి తలవంచిన ఈ జంట, మళ్లీ ఆ విధి చేసిన వింతలో భాగంగానే పిల్లల అనుమతితో ఒకటయ్యారు. అలనాటి ప్రేమికులు జయప్రకాష్ , రష్మిల అందమైన, అరుదైన ఈ పెళ్లి కథ గురించి తెలుసుకోవాలని ఉందా.. అయితే పదండి! కేరళలో జరిగిన ఆసక్తికరమైన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి:-కేరళలోని కొల్లం ముందక్కల్‌కు చెందినవారు జయప్రకాష్, రష్మి. వీరిద్దరూ పొరుగువారే. చాలా చిన్న వయసులోనే ప్రేమించు కున్నారు. కానీ వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. విధి వారిద్దరినీ మరొకరి జీవితంలోకి ప్రవేశించేలా చేసింది. దీంతో ఇద్దరూ తమ ప్రేమను త్యాగం చేసి, పెద్దలు చెప్పిన పెళ్లిళ్లు చేసుకొని వారి వారి జీవితాల్లో స్థిరపడ్డారు. రష్మికి ఆమె తల్లిదండ్రులు వేరే వ్యక్తితో వివాహం జరిపించారు.ప్రేమ విఫలం కావడంతో జయప్రకాష్ ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లి, పెళ్లి చేసుకున్నాడు. జయప్రకాష్‌కు ఇద్దరు కుమారులు, రష్మికి ఇద్దరు కుమార్తెలున్నారు. పిల్లలు, మనవరాళ్ళు, మునిమనవళ్లు వారి కుటుంబాలు నిండుగా సంతోషంగా ఉన్నాయి. అయితే జయప్రకాష్, రష్మి ఇద్దరూ కూడా తమతమ జీవిత భాగస్వాములను కోల్పోయారు. రష్మి భర్త పదేళ్ల క్రితం అకస్మాత్తుగా మరణించగా, జయప్రకాష్ భార్య 5 సంవత్సరాల క్రితం మరణించింది. అప్పటి నుంచి వారు తమ పిల్లలే తమ ప్రాణమని భావించి తిరిగి వివాహం చేసుకోకుండానే జీవించారు. దీంతో వారిద్దరూ ఒంటరిగా మారారు. షార్ట్ ఫిలిం కలిపిన ప్రేమభర్తను కోల్పోయిన బాధను మర్చిపోయేందుకు రష్మి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనేది. ఆమె షార్ట్ ఫిల్మ్‌లలో కూడా నటించేది. ఈలోగా జయప్రకాష్ రష్మి నటించిన ఒక షార్ట్ ఫిల్మ్ చూశాడు. తన చిన్ననాటి ప్రియురాలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించినట్టు తెలిసి సంబరపడిపోయారు. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ వద్ద రష్మి కుమార్తె సెల్ ఫోన్ నంబర్ తీసుకుని, రష్మితో మాట్లాడారు. ఈ క్రమంలోనే జీవిత భాగస్వాములు చనిపోయారని పరస్పరం తెలుసుకున్నారు. మరోవైపు భార్య చనిపోవడంతో పిల్లల పట్టుబట్టడంతో జయప్రకాష్ కూడా తిరిగి వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. తాను తిరిగి వివాహం చేసుకోవాలని భావిస్తున్నానని జయప్రకాష్ రష్మికి చెప్పాడు. అలా ఇద్దరిమధ్య పాత ప్రేమ మళ్లీ చిగురించింది. పిల్లల అంగీకారంతో ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చని కూడా ప్రపోజ్ చేశాడు. రష్మి తన కూతురు, అల్లుడికి ఆ విషయం చెప్పింది. వారిద్దరూ పెళ్లి చేసుకోవడానికి అంగీకరించారు. ఇంకేముంది పెళ్లి సందడి వేళ అయ్యింది.పిల్లలే పెద్దలుగా జయప్రకాష్-రష్మి సమీప బంధువుల సమక్షంలో దంపతులుగా మారారు. యవ్వనంలో ప్రేమలో పడిన ఈ జంట 60 ఏళ్ల తర్వాత కలిసి "నిజమైన ప్రేమ ఒకరోజు తప్పకుండా గెలుస్తుంది" అని నిరూపించారు. నూతన వధూవరులు రష్మి, జయప్రకాష్ మలేషియాకు హనీమూన్ వెళ్లాలని నిర్ణయించు కున్నారు. జయప్రకాష్, రష్మిల వివాహ ఫోటోను రష్మి కుమార్తె సోషల్ మీడియాలో షేర్ చేసి, "ఈ అదృష్టం ఏ పిల్లలకు లభిస్తుంది?" అని పేర్కొనడం విశేషంగా నిలిచింది.ఇదీ దచవండి: అమ్మానాన్నల్ని ఫస్ట్ ఫ్లైట్ ఎక్కిస్తే.. ఆ కిక్కే వేరప్పా! -
ప్రాణం తీసిన వేధింపులు
రంగారెడ్డి జిల్లా: తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ యువకుడు పెడుతున్న వేధింపులను భరించలేక, తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లికి చెందిన సిద్దగోని మహేశ్, ఇదే గ్రామానికి చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థిని పూజ(17)ను కొన్నేళ్లుగా ప్రేమిస్తున్నాడు. వీరి పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో ఆమె తనకు దక్కుతుందో.. లేదోనని ఆందోళనకు గురైన మహేశ్ నెల రోజుల క్రితం పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆస్పత్రిలో చేరి్పంచగా, కోలుకుని ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత తరచూ పూజకు ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే చచ్చిపోతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని సదరు యువతి తన కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో, ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇది తెలిసిన మహేశ్ యువతిపై మరింత ఒత్తిడి పెంచడంతో మనోవేదనకు గురై మంగళవారం ఉదయం ఇంట్లో ఉరేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు, ఇబ్రహీంపట్నంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయింది. కాగా, మహేశ్ బెదిరింపులతోనే తమ బిడ్డ చనిపోయిందని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు మంగళవారం ఉద యం పూజ మృతదేహంతో యువకుడి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. సీఐ, గ్రామస్తు లు నచ్చజెప్పడంతో శాంతించారు. మహేశ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
పెళ్లయితే ఇంటి పేరు మార్చుకోవాలా?
భారతీయ స్త్రీ పెళ్లయి అత్తారింట్లో అడుగు పెట్టిన తర్వాత ఆమె జీవితంలో ఎన్నోమార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త వ్యక్తులతో కలిసి నూతన జీవితం ప్రారంభించే మహిళ పేరులోనూ మార్పులు వచ్చి చేరుతాయి. నిజానికి పెళ్లైన తర్వాత తన ఇంటి పేరును మార్చి భర్త ఇంటి పేరును చేర్చుకోవాలా? చట్టాలు ఏం చెబుతున్నాయి? – కడప సిటీఆడపిల్లగా... అమ్మాయి పెళ్లాయ్యాక అత్తారింటికి వెళ్లి అక్కడ ఉండే పిల్లగా మారిపోతుంది. అందువల్ల మనం ‘ఆడ’ పిల్ల అనడం సహజం. పెళ్లైయిన తర్వాత భర్తతో కలిసి ముందుకు సాగుతుంది. వారి కుటుంబంలో ఒకరిగా భాగమై పోతుంది. అందుకే భర్త ఇంటి పేరును తన ఇంటి పేరుగా మార్చుకుంటుంది. ఈ సమాజంలో సంప్రదాయంగా ఇది అనాదిగా వస్తున్నదే. కానీ చట్టప్రకారం పెళ్లైన తర్వాత మహిళ తన ఇంటి పేరును మార్చుకోవాల్సిన అవసరం లేదు.కానీ రాజ్యాంగం ప్రకారం ఇది పూర్తిగా వారి ప్రాథమిక హక్కులోకి వస్తుంది. ఏ పేరుతో కొనసాగడమన్నది వారి ఇష్టం. అయితే పేరు మార్చుకునే విషయంలో మూడు ఆప్షన్లు ఉన్నాయి. వివాహిత తనకు పెళ్లికాకముందు ఉన్న ఇంటి పేరునే (మెయిడెన్ నేమ్) కొనసాగించవచ్చు. పెళ్లైన తర్వాత తన ఇంటి పేరు స్థానంలో భర్త ఇంటి పేరును చేర్చుకోవడం రెండవది. మన దేశంలో అ«ధికశాతం మంది అనుసరించే విధానం ఇదే. పెళ్లి కాకముందే ఉన్న ఇంటి పేరు మార్చుకోకుండానే పేరు చివరలో భర్త పేరును చేర్చుకోవడం మరో విధానం. ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? పేరు మార్చుకోవడం వల్ల అన్నింటి కంటే ముఖ్య ప్రయోజనం చట్టపరంగా గుర్తింపు సమస్యలు ఎదురు కావు. అత్తారింటిని గౌరవించినట్లవుతుంది. ఆ కుటుంబం తనదిగా భావించినట్లు భర్త తరుపు వారిలో సానుకూలత పెరుగుతుంది. కాకపోతే పేరు మార్పునకు కొంత శ్రమించాల్సి వస్తుంది. తన తల్లిదండ్రులతో ఉన్న అనుబంధం ఆ కుటుంబంలో భాగమైన తన పేరు మారిపోతుందనే మానసిక సంఘర్షణ ఎదురవుతుంది. వీటిని మరిచిపోగలిగితే పేరు మార్చుకోవడం ద్వారా వచ్చే ప్రయోజనాలతో ఆనందంగా ఉండడం సాధ్యమే. పెళ్లి కాక ముందు.. పెళ్లికాకముందున్న పేరుతో పెళ్లయిన స్త్రీ కొనసాగితే భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు తప్పక ఎదుర్కోవాల్సి రావచ్చు. కుటుంబ పరమైన వివాదాలు తలెత్తితే ఇలాంటి సమస్యలు వస్తాయి. అప్పుడు ఆ మహిళ గుర్తింపునకు సంబంధించిన సవాలక్ష ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఏ విధంగా ఊహించని ఆస్తి, ఇతరత్రా వివాదాలు తలెత్తినా సమస్యల బారిన పడకుండా ఉండేందుకు పెళ్లయిన మహిళ తన ఇంటి పేరు స్థానంలో భర్త ఇంటి పేరును చేర్చుకోవడం మంచిదని పలువురు సూచిస్తున్నారు. ఒకవేళ పేరు మార్చుకున్నట్లయితే ఆ తర్వాత ఇతర డాక్యుమెంట్లలోనూ ఈ మేరకు మార్పులు చేసుకోవాలి. రెండు, మూడు ఆప్షన్లలో ఆ మేరకు కీలక డాక్యుమెంట్లతో పేర్లను మార్చుకోవాలి. ఈ విధానం ద్వారా ఆర్థిక, ఆస్తి లావాదేవీ విషయంలో భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉండదు.వీటిల్లోనూ మార్చుకోవాలి భర్త ఇంటి పేరును స్వీకరిస్తే ఆధార్‌కార్డు, ఓటరు కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్టు వంటి వాటిల్లో కూడా ఈ మేరకు పేరు మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే బ్యాంకు ఖాతాల్లోనూ పేరు మార్పు చేసుకోవాలి. ఎందుకంటే అన్ని లావాదేవీలకు కీలకంగా బ్యాంకు ఖాతా ఉంటుంది. ఇక మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ ఖాతాల్లోనూ మార్పులు చేసుకోవాలి. వీటిలో పేర్లు మార్పు కోసం అఫిడవిట్ జిరాక్స్ కాపీ లేదా వివాహ నమోదు పత్రం కాపీలను ఇవ్వాలి ఉంటుంది. అప్పటికీ పాత పేరుతోనే బీమా పాలసీ కలిగి ఉంటే బీమా కంపెనీలకు పేరుమార్పు గురించి తెలియజేయాలి.అలాగే డ్రైవింగ్లైసెన్స్ ఉంటే ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇంకా ఇతరత్రా ఎక్కడెక్కడ పేరు మార్చుకోవాలన్నది మీకున్న వ్యవçహారాలనుబట్టి తెలిసిపోతుంది. ఉద్యోగం చేస్తుంటే కార్యాలయ రికార్డుల్లోనూ మార్పులు తప్పనిసరి. మహిళను ఇంటి పేరుతో పిలువడం సర్వసాధారణం. అంతేకాదు...ఎక్కడైనా పేరు రాయాల్సి వచ్చినప్పుడు పూర్తి పేరు అడగకుండానే సర్ నేమ్‌గా భర్త తరుపు పేరును చేరుస్తారు. ఎక్కడెక్కడ మార్చుకోవాలిముందుగా వివాహాన్ని రిజిష్టర్ చేయించుకోవాలి. చట్టప్రకారం మన దేశంలో ప్రతి వివాహాన్ని తప్పకుండా రిజిష్టర్ చేయించుకోవాలి. కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారెజెస్ యాక్టు–2005 ఇలా నిర్దేశిస్తోంది. కానీ ఈ చట్టం పటిష్టంగా అమలు కావడం లేదు. వివాహాన్ని రిజిష్టర్ చేసుకున్న తర్వాత రిజిష్టర్ కార్యాలయం ఓ ధృవీకరణ సర్టీఫికెట్‌ను జారీ చేస్తుంది. ఇది చాలా కీలకమైంది. పెళ్లయిన తర్వాత ఏ పేరుతో కొనసాగుతారో అదే పేరును కూడా రిజిస్ట్రేషన్ సర్టీఫికెట్లో ఉండేలా చూసుకోవాలి. ఇదే సర్టిఫికెట్ అన్నింటికి ఆధారంగా పనికి వస్తుంది.ఒకవేళ గుర్తింపు, వారసత్వ హక్కుల విషయంలో సమస్యలు తలెత్తితే ఈ సర్టిఫికెట్ కీలకంగా మారుతుంది. పైగా ఇతర అన్నిచోట్ల పేర్ల మార్పునకు కీలక ఆధారంగా పనిచేస్తుంది. వివాహ రిజిస్ట్రేషన్ సర్టీఫికెట్ పొందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ గెజిట్ కార్యాలయంలో పేరు మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్థానిక పత్రికలో గెజిట్ కార్యాలయం ప్రకటన ఇచ్చిన తర్వాత పేరు మారుతుంది. లేదంటే భర్తతో కలిసి సంయుక్తంగా అఫిడవిట్ తీసుకుంటే సరిపోతుంది. -
తిరగలి చూడాలి!
ఓ ఉదయం పాండిచ్చేరి పట్టణం నుంచి కారులో ఒక జంట తిరుమల కొండకు దర్శనానికి బయలుదేరింది. వారిది పాండిచ్చేరి స్వంత పట్టణమైనా, ప్రస్తుతం వారు అమెరికాలో నివసిస్తూ ఉన్నారు. దారి మధ్యలో తిరువళ్ళూరు వద్ద కారు పంక్చర్ అయ్యింది. కారును రోడ్డు పక్కన ఆపి టైరు మార్చుకోవడానికి అవస్థలు పడుతూ ఉన్నారు.అదే దారిలో తిరువళ్ళూరు నుంచి తిరుమలకు మరో జంట వెళ్తూ ఉన్నారు. ఆ తిరువళ్ళూరు జంట, పాండిచ్చేరి జంటను చూసి కారు ఆపింది. సమస్య తెలుసుకుని టైరు మార్చడంలో సహాయం చేయసాగారు. మాటల్లో రెండు జంటలూ దేవుని దర్శనానికి తిరుమలకు వెళ్తున్నట్లు తెలుసుకుని సంతోషపడ్డారు.పాండిచ్చేరి జంట కొంచెం ఒత్తిడితో ఉన్నట్లు గుర్తించింది తిరువళ్ళూరు జంట. దర్శనానికి ఇంకా చాలా సమయం ఉంది కదా, ఎందుకు ఆదుర్దా పడుతున్నారని అడిగింది.‘‘మేము దారిలో ఉన్న నారాయణవనం కళ్యాణ వేంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి. అక్కడ శ్రీ పద్మావతీ శ్రీనివాసుల దర్శనం చేసుకుని తిరగలి చూసి ఆపైన కొండకు రావాలి’’ అని సమాధానమిచ్చింది పాండిచ్చేరి జంట.‘‘అవునా... నారాయణవనం అనేది స్వామివారికి కళ్యాణం జరిగిన ప్రదేశమని తెలుసు. కానీ తిరగలి గురించి తెలియదు. అక్కడి తిరగలి అంత విశేషమైనదా?’’ అని ఎదురు ప్రశ్న వేశారు.‘‘ఎంతో విశేషమున్న తిరగలి అది. తప్పకుండా చూసి తీరాలి. గుడిలోని పద్మావతి అమ్మవారి ఆలయం పక్కన ఉంటుంది. స్వామివారి పరిణయోత్సవ వేడుకల్లో నలుగుపిండి, వడియాల పిండి, పసుపును విసరిన తిరగలి అది. వేల సంవత్సరాలైనా అది చెక్కు చెదరలేదు. మనవారు దాన్ని భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నారు’’ అని వివరించారు.‘‘అయ్యో... మేము ఇంత దగ్గర ఉండి కూడా ఇన్నాళ్ళూ చూడలేకపోయామే. మీరు అమెరికానుంచి వచ్చి దాన్ని చూస్తున్నారు’’ అని ఆశ్చర్యపోయారు.ఇంతలో టైరును మార్చే పని పూర్తయ్యింది.అందరూ కలిసి నారాయణవనం వెళ్ళారు. ఏడుకొండలస్వామి ఎరుకలసాని వేషంలో ఆ పుర వీధుల్లోనే తిరిగినాడని తెలుసుకుని పులకరించిపోయారు. ఆకాశరాజు పుత్రిక పద్మావతిగా అవతరించిన శ్రీ మహాలక్ష్మిని శ్రీనివాసుడు వివాహమాడిన పుణ్యక్షేత్రాన్ని కనులారా చూశారు. అమ్మవారు విహారం చేసే విమాన ప్రదక్షిణ మార్గంలో పసుపు కుంకుమలు పెట్టి ఉన్న తిరగలి కనిపించింది. అంత పెద్ద తిరగలిని తామెప్పుడూ చూడలేదని ఆశ్చర్యపోతూ ముక్కుమీద వేలు వేసుకున్నారు. తిరగలిని భక్తిభావంతో తాకిన ఆ నలుగురూ పరవశించిపోయారు. తిరగలిని చూస్తూ ఎంతో బలవంతులైతే కానీ దాన్ని తిప్పలేరని అనుకున్నారు. అప్పట్లో మనుషులు అంత బలంగా ఉండేవారు కాబట్టి అది సాధ్యమయిందని తిరగలికి దణ్ణం పెట్టుకుని తిరుమల ప్రయాణం కొనసాగించారు.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
ఈ పెళ్లికి యాచకులే వీఐపీలు!
పెళ్లికి బంధువులు, స్నేహితులను పిలవడం కొత్తేమీ కాదు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజిపూర్కు చెందిన సిద్దార్థ్ తన సోదరి వివాహానికి యాచకులను స్పెషల్ గెస్ట్లుగా ఆహ్వానించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.తన సోదరి వివాహనికి హాజరైన యాచకులను సిద్దార్థ్ ఆత్మీయంగా ఆహ్వాస్తున్న దృశ్యం వీడియోలో కనిపిస్తుంది. వారు విందుభోజనాన్ని సంతోషంగా ఆస్వాదిస్తున్న దృశ్యాలు ఈ వీడియో క్లిప్‌లో కనిపిస్తాయి.అలాంటి ఖరీదైన, రుచికరమైన భోజనాన్ని తినడం వారిలో చాలామందికి అదే మొదటిసారి.కడుపు నిండా భోజనం చేసిన యాచకులలో కొందరు సంతోషంతో నృత్యం చేశారు!వివాహానికి కొన్నిరోజుల ముందు సిదార్థ్ వివిధ ప్రాంతాలకు పనిగట్టుకుని వెళ్లి మరీ యాచకులను ఆహ్వానించాడు.‘ఈ యాచకులలో ఎంతమంది అర్ధాకలితో ఉన్నారో, ఎంతమంది కొన్నిరోజుల పాటు భోజనానికి దూరమయ్యారో. ఇలాంటి దీనులకు వరంలాంటి పెళ్లివిందు ఇది’‘అంతులేని ఆడంబరాలతో, అనవసర ఖర్చుతో మన దేశంలో వివాహ వేడుకలు నిర్వహిస్తుంటారు. ఒక్క రోజైనా పెళ్లి విందు రూపంలో దీనుల కడుపు నింపడం అద్భుతమైన పని’‘విందు భోజనాల సమయంలో యాచకులు కనిపిస్తే విసుక్కుంటూ వారిని దూరంగా తరిమే దృశ్యాలను చాలా చూశాను. ఇలా మనసును కదిలించే దృశ్యం చూడడం ఇదే తొలిసారి’‘మానవత్వానికి అద్దం పట్టే అరుదైన వీడియో’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వెల్లువెత్తాయి. -
ప్రియుడిని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి పిల్చి, ప్రైవేట్ పార్ట్స్‌పై దాడి
పెళ్లికి నిరాకరించిన ప్రేమికుడిపై దాడిచేసి ప్రైవేట్ భాగాలను నరికివేసింది.తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో ఇద్దరూ వివాహితులే. ముంబైలో ఈ దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్డీటీవీ కథనం ప్రకారం 25 ఏళ్ల ఒక మహిళ ఇద్దరు పిల్లల తల్లి. ఈమెకు 42 ఏళ్ల వివాహితుడితో దాదాపు ఏడు సంవత్సరాలుగా వివాహేతర సంబంధం ఉంది. భార్యకు విడాకులిచ్చి తనన పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోంది. దీంతో అసలు పెళ్లి ఊసు ఎత్తగానే సరైన సమాధానం చెప్పకుండా ముఖం చాటేసేవాడు. తన మాట వినడం లేదని, భార్యను విడిచిపెట్టడానికి నిరాకరించాడన్న కోపంతో ఆ మహిళ ఇంత దారుణానికి ఒడిగట్టింది.పెళ్లి చేసుకోవాలన్న ఒత్తిడి తీవ్రమవుతున్న నేపథ్యంలో గత ఏడాది నవంబరులో బిహార్‌కు వెళ్లి పోయాడు. భార్యాబిడ్డలు ముంబైలోని శాంటా క్రజ్‌లోని ఇంట్లో ఉంటున్నారు. గత 18 ఏళ్లుగా కుటుంబంతో కలిసి ఇక్కడే ఉంటున్నాడు. బాధితుడు. బిహార్‌కు వెళ్లిన తరువాత కూడా ఆమె ఫోన్ కాల్స్ ద్వారా పెళ్లి గురించి అడగడం, అతన్ని బెదిరించడం జరుగుతూనే ఉంది. అయితే 2026 కొత్త సంవత్సరం సందర్బంగా డిసెంబర్ 19న ముంబైకి తిరిగొచ్చాడు. ఇదే అదనుగా భావించిన ప్రేమికురాలు నూతన సంవత్సర వేడుకలకు ఇంటికి రావాల్సిందిగా బాధితుడిని ఆహ్వానించింది. గురువారం తెల్లవారుజామున మాటల్లో పెట్టి, సమయం చూసి పదునైన ఆయుధంతో అతని ప్రైవేట్ భాగాలపై దాడిచేసిందని ముంబై పోలీసు అధికారి తెలిపారు.ఇదీ చదవండి: ఐదు నెలల చిన్నారి ఉసురు తీసిన ‘పాలు’తీవ్ర గాయాలపాలై అధిక రక్తస్రావంతో బాధితుడు మొత్తం మీద బైటపడి, సోదరుడు, ఇతర బంధువుల సాయంతో బీఎన్ దేశాయ్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. గాయం చాలా లోతుగా ఉందని శస్త్రచికిత్స అవసరం కావచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో ఇద్దరికీ బంధుత్వం ఉన్నట్టు తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితురాలి కోసం వెతుకుతున్నారు. ఇదీ చదవండి: ఐఐటీ హైదరాబాద్ విద్యార్థికి ఏకంగా రూ. 2.5 కోట్ల ఆఫర్, రికార్డ్ -
మా ‘సిక్స్త్ సెన్స్’ ముందే చెప్పింది
న్యూఢిల్లీ: విబేధాలతో వ్యక్తిపై అత్యాచార కేసు నమోదుచేసిన బాధితురాలు తన మనసు మార్చుకుని అతడినే పెళ్లాడవచ్చని తాము ముందే ఊహించామని, తమ ‘సిక్స్త్ సెన్స్’ అదే చెప్పిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఓ కేసు విచారణ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు. మహిళను రేప్ చేశాడన్న కేసులో దోషిగా తేలి మధ్యప్రదేశ్ హైకోర్టులో పదేళ్ల శిక్ష పడిన వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించగా సంబంధిత కేసును జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల విచారించింది. బాధితురాలు, దోషి వివాహంచేసుకుని గత ఆరునెలలుగా సంతోషంగా జీవిస్తున్న నేపథ్యంలో దోషికి గతంలో హైకోర్టు విధించిన శిక్షను రద్దుచేస్తూ సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు పలు ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు. డిసెంబర్ ఐదున వెలువ డిన ఈ కేసు తీర్పు వివరాలు ఆలస్యంగా శనివారం వెలుగుచూశాయి. ‘‘ శిక్షను రద్దుచేయాలంటూ అప్పీల్ చేసుకున్న వ్యక్తిని బాధితురాలు ఒకవేళ వివాహం చేసుకునేందుకు సుముఖత చూపితే ఇద్దరూ మళ్లీ కలిసిపోతారని మేం ముందే ఊహించాం. మా సిక్త్స్ సెన్స్ ఇదే చెప్పింది. ముందుచూపుతో ముందే ఊహించాం. ఇలాంటి కేసు నిజంగా అరుదైంది. బాధితురాలిని పెళ్లిచేసుకోవడం ద్వారా దోషిపై ఉన్న నేరారోపణలను, శిక్షను రద్దుచేస్తున్నాం’’ అని న్యాయమూర్తులు తీర్పు చెప్పారు. 2015లో సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన వ్యక్తిని మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక యువతి ఇష్టపడింది. తర్వాత కొన్నాళ్లపాటు ఇద్దరూ సహజీవనంచేశారు. తర్వాత మనస్పర్థలొచ్చాయి. దీంతో పెళ్లాడతానని మాయమాటలు చెప్పి తనను పలుమార్లు అత్యాచారంచేశాడని మహిళ ఫిర్యాదుచేయడంతో 2021 నవంబర్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. గత ఏడాది ఏప్రిల్‌లో ట్రయల్ కోర్టు ఆ వ్యక్తిని దోషిగా తేల్చింది. తీర్పును అతను మధ్యప్రదేశ్ హైకోర్టులో సవాల్‌చేయగా అక్కడా అతనికి చుక్కెదురైంది. పైగా పదేళ్ల కఠిన కారాగార శిక్షను, రూ.55,000 జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పుచెప్పింది. దీంతో అతను సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీంతో ఇద్దరినీ, వాళ్ల తల్లిదండ్రులను సుప్రీంకోర్టు ధర్మాస నం పిలిపించింది. వివాహంచేసుకునేందుకు ఇరువైపులా సమ్మతి తెలపడంతో పెళ్లాడేందుకు వీలుగా అతనికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది. ఆ తర్వాత వాళ్లు పెళ్లాడారు. ఈ విషయంతెల్సి ధర్మాసనం ఈ కేసును విచారించింది. ‘‘ఇద్దరి మధ్య చిన్నపాటి బేధాభిప్రాయాలు ఉన్నట్లు మాకు అర్థమైంది. అనివార్య కారణాలతో వివాహం వాయిదావేద్దామని కలిసున్నకాలంలో అబ్బాయి చెప్పడంతో ఆగ్రహించిన అమ్మాయి నేరపూరిత రంగు పులిమి విషయాన్ని పెద్దదిచేసింది. వాస్తవానికి పెళ్లిచేసుకోవాలన్న ఉద్దేశం ఇద్దరికీ ఉందని మా సిక్త్స్ సెన్స్ ఎప్పుడో చెప్పింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా మాకు సంక్రమించిన అసాధారణ అధికారాలతో ఎఫ్ఐఆర్ను, ట్రయల్ కోర్టులో తీర్పును రద్దుచేస్తున్నాం. తద్వారా హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న సంబంధిత కేసు నిర్వీర్యమైపోయినట్లే’’అని ధర్మాసనం స్పష్టంచేసింది. -
పెళ్లి చేసుకోలేదంటే జరిమానా.. గ్రామస్తుల తీర్మానం
బీజింగ్: చైనాలోని ఓ గ్రామం ఇటీవల తీసుకున్న నిర్ణయం ఆ దేశవ్యాప్తంగా, సోషల్ మీడియాలో చర్చాంశనీయంగా మారింది. గ్రామ కమిటీ ప్రత్యేకంగా రూపొందించిన నియమావళి ప్రకారం.. ఆ ఊరి గ్రామస్తులు ఆలస్యంగా వివాహం చేసుకోవడం, గర్భధారణకు సంబంధించిన నియమాలు పాటించని వారికి, అలాగే పిల్లల పెంపకం విధానాల్లో మార్పులు చేసిన వారికి జరిమానాలు విధిస్తూ ఆ ఊరి పెద్దలు తీర్మానించారు. జరిమానా వివరాలు• పెళ్లి కాకముందే గర్భం దాల్చితే 3,000 యువాన్ (సుమారు రూ.35,000).• పెళ్లి కాకముందే కలిసి నివసిస్తే సంవత్సరానికి 500 యువాన్ (సుమారు రూ.6,000).• బయటి ప్రావిన్స్ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే 1,500 యువాన్ (సుమారు రూ.18,000).• అసత్య వదంతులు వ్యాప్తి చేస్తే 500 నుంచి 1,000 యువాన్ జరిమానా.ఈ వార్త వెలుగులోకి రావడంతో నెటిజన్లు ఊరు పెద్దలు తీసుకున్న నిర్ణయంపై ప్రశ్నల వర్షం కురిపించారు. చాలా మంది నెటిజన్లు ఈ నియమాలను వ్యక్తిగత స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించారు. వివాహం ఎప్పుడు చేసుకోవాలి? పిల్లల్ని ఎప్పుడు కనాలి? అనేది వ్యక్తిగత నిర్ణయం. దానిపై గ్రామ కమిటీకి హక్కు ఎలా వస్తుంది?’ అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, కొందరు మాత్రం గ్రామంలో జనాభా నియంత్రణ కోసం తీసుకున్న చర్యలుగా సమర్థిస్తున్నారు.నిపుణుల అభిప్రాయం ప్రకారం, చైనాలో ప్రస్తుతం జనన రేటు తగ్గుదల (Demographic Winter) ఒక పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వం జనన రేటు పెంచాలని ప్రయత్నిస్తున్న సమయంలో, గ్రామ స్థాయిలో ఇలాంటి జరిమానాలు విధించడం వ్యతిరేక ధోరణిగా కనిపిస్తోంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న విధానాలకు విరుద్ధమని విశ్లేషకులు చెబుతున్నారు.ఈ సంఘటనతో చైనా గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక నియంత్రణ ఎంత కఠినంగా అమలవుతోందో బయటపడింది. ఒకవైపు ఆధునికీకరణ, ఆర్థికాభివృద్ధి దిశగా చైనా దూసుకెళ్తుంటే, మరోవైపు గ్రామాల్లో ఇలాంటి నియమాలు వ్యక్తిగత స్వేచ్ఛను ప్రశ్నార్థకంగా మార్చుతున్నాయి. మొత్తానికి, ఈ గ్రామం తీసుకున్న నిర్ణయాలు స్థానిక సమస్యగానే కాకుండా, జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. -
అబ్బాయిలంటే ఇష్టంలేదు, ఇద్దరు యువతుల పెళ్లి
పెళ్లి అంటే పందిళ్లు, సందళ్లు తప్పెట్లు.. తాళాలు... తలంబ్రాలు ఉండాలి. అంతేనా కట్నాలు, కానుకలు, ప్రీవెడ్డింగ్ షూట్లు ఘనంగా జరగాలి. కానీ ఒక జంట మాత్రం అక్షరాలా గ్యాస్ స్టవ్ సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. ఎక్కడో తెలియాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే.పెళ్లిసందడి, హంగూ ఆర్బాటం, మూడు ముళ్లు లాంటి హడావిడి లేకుండానే బిహార్‌లో ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్న ఘటన నెట్టింట సందడిగా మారింది. అబ్బాయిలంటే ఇష్టంలేకనే తాము ఈ పెళ్లి చేసుకున్నామని ఆ యువతులు ప్రకటించారు. బిహార్‌లోని సుపాల్‌లో, ఇద్దరు యువతులు ప్రత్యేకంగా వివాహ వేడుకను నిర్వహించారు. మగాళ్లపై ఆసక్తిలేకనే ఇద్దరూ ఒకరికొకరు తోడుగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఒకరి చేయి మరొకరు పట్టుకుని కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. గ్యాస్ స్టవ్‌ను సాక్షిగా ఏడడుగులు వేయడం విశేషం.ఇదీ చదవండి: ఐటీ ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ క్రిస్మస్ కానుక In Supaul, two young women held a unique marriage ceremony. Both revealed that they have no interest in boys, so they decided to hold hands and live together. They took seven rounds considering the gas stove as witness.pic.twitter.com/rwVaMFjxrJ— Ghar Ke Kalesh (@gharkekalesh) December 24, 2025 -
వివాహబంధంలో వీనస్
ఫ్లోరిడా: అమెరికా సీనియర్ టెన్నిస్ క్రీడాకారిణి, మాజీ వరల్డ్ నంబర్‌వన్ వీనస్ విలియమ్స్ 45వ ఏట పెళ్లి చేసుకుంది. ఇటలీకి చెందిన నటుడు, మోడల్ ఆండ్రియా ప్రెటీని ఆమె వివాహమాడింది. దాదాపు ఏడాదిన్నరగా వీరి మధ్య స్నేహం కొనసాగుతోంది. ఈ ఏడాది జూలైలో ఇద్దరి మధ్య నిశ్చితార్ధం జరిగింది. నిజానికి సెపె్టంబర్‌లోనే వీనస్, ప్రెటీ ఇటలీలో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే వీనస్ విదేశీయురాలు కావడం ఈ పెళ్లికి ప్రభుత్వం తరఫున అధికారిక ముద్ర పొందేందుకు కనీసం ఎనిమిది నెలల సమయం పడుతుంది. దాంతో తన స్వస్థలం ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో వీనస్ మళ్లీ పెళ్లి తంతువును నిర్వహించింది. అతి తక్కువ మంది కుటుంబసభ్యులు, సన్నిహితులు మాత్రమే దీనికి హాజరయ్యారు. సోదరి సెరెనా విలియమ్సన్ కానుకగా ఇచ్చిన ‘యాట్’పైనే ఐదు రోజుల పాటు పెళ్లి వేడుకలు జరగడం విశేషం. మహిళల సింగిల్స్‌లో 7 గ్రాండ్‌స్లామ్‌లు గెలుచుకున్న వీనస్ విలియమ్స్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో కలిపి మరో 16 గ్రాండ్‌స్లామ్‌లు సాధించింది. ఇటీవలే వాషింగ్టన్ డీసీ ఓపెన్‌ను గెలుచుకున్న వీనస్ టూర్ టైటిల్ సాధించిన రెండో అతి పెద్ద వయసు్కరాలిగా నిలిచింది. -
జగపతిబాబు ఇంట శుభకార్యం.. ఇలా రివీల్ చేశాడేంటి?
టాలీవుడ్ నటుడు జగపతిబాబు గుడ్ న్యూస్ చెప్పారు. తన రెండో కూతురి పెళ్లి అయిపోయిందని ఓ వీడియోను షేర్ చేశారు. అయితే ఏఐతో రూపొందించిన పెళ్లి వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ విషయం తెలిసిన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే కుమార్తె పెళ్లికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు రివీల్ చేయకపోవడం గమనార్హం.కాగా.. జగపతిబాబు తెలుగులో హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన జగపతిబాబు.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా రెండో ఇన్నింగ్స్‌లో దూసుకెళ్తున్నారు. సినిమాలతో పాటు ప్రముఖ టాక్ షో హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. 'జయమ్ము నిశ్చయమ్మురా' పేరుతో ప్రసారం అవుతోన్న షోను హోస్ట్ చేస్తున్నారు. ఈ ఏడాది మిరాయి చిత్రంతో అలరించిన జగ్గుభాయ్..ప్రస్తుతం రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న పెద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Jaggu Bhai (@iamjaggubhai_) -
ఆ ప్యాలెస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ఇంత ఖరీదా..?
డెస్టినేషన్ వివాహాలు గురించి తెలిసిందే. సంపన్నులు, సెలబ్రిటీలు, ప్రముఖులు ఇలాంటి విలాసవంతమైన వివాహాలు చేసుకుంటుంటారు. విలాసవంతమైన ప్యాలెస్‌లు, రాజుల కాలంనాటి ఫేమస్ భవనాల్లో అలనాటి చారిత్రక దర్పానికి తగ్గట్టు అంగరంగ వైభవవంగా వివాహాలు చేసుకుంటుంటారు. అలాంటి ప్రఖ్యాతిగాంచిన డెస్టినేషన్ వెడ్డింగ్ భవంతులలో ఒకటి ఈ రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని ప్యాలెస్. ఇక్కడ ఒక్క రాత్రికి బస ఎంత అవుతుందో తెలిస్తే కంగుతింటారు. ఈ ప్రముఖ రాజస్థాన్ ప్యాలెస్‌లో లగ్జరీ రిసార్ట్లు, వాటి హంగుఆర్భాటాలు పర్యాటకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తాయి. ఇలాంటి ప్యాలెస్‌లలో పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా నుంచి వెంకట దత్త సాయి పివీ సింధు -నేత్ర మంతెన-వంశీ గదిరాజు వంటి ఎందరో జంటలు పెళ్లి బంధంతో ఇక్కడే ఒక్కటయ్యారు. ఎప్పటికీ గుర్తుండిపోయేలా చారిత్రకనేపథ్యం ఉన్న ఇలాంటి ప్యాలెస్‌లను ఎంచుకుంటారు చాలామంది జంటలు. ఈ డిసెంబర్22తో వెంకట దత్త సాయి పీవీ సింధుల దంపతులకు పెళ్లై ఏడాది అవుతున్న నేపథ్యంలో వారి వివాహానికి వేదిక అయిన ఉదయ్‌పూర్ ప్యాలెస్ విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా.పీవీ సింధు రాఫెల్స్ ఉదయ్‌పూర్ సూట్లో వివాహం చేసుకున్నారు. యూరోపియన్ వాస్తుశిల్పాల మిశ్రమాన్ని కలిగి ఉన్న ఈ రిసార్ట్ తన కస్టమర్లకు మంచి ఆధునిక సౌకర్యాలను అందిస్తోంది. మహారాణా ప్రతాప్ విమానాశ్రయం నుంచి కేవలం 20 నిమిషాల దూరంలో ఉంటుంది ఈ ప్యాలెస్. ఇక్కడ ఉదయ్ సాగర్ సరస్సు మీదుగా పడవ ప్రయాణం అత్యంత ఆహ్లాదభరితంగా ఉంటుంది. దాని చుట్టూ ఉన్న పచ్చదనం చూపు మరల్చనివ్వని విధంగా కట్టిపడేస్తుంది. అలాగే భోజన ప్రియుల కోసం చక్కటి వంటకాల నిధిని, ఫిట్నెస్ ఔత్సాహికుల కోసం మంచి వెల్నెస్ చికిత్సలు, ఆయుర్వేద సెషన్ వంటి సకల సౌకర్యాలను అందిస్తుంది. ముఖ్యంగా మౌంటైన్ బైకింగ్, వాల్ క్లైంబింగ్, షూటింగ్, ఆర్చరీ తదితర ఎన్నో వినోదాలను నిలయం. దాదాపు 21 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ ప్యాలస్ మర్చిపోలేని మధురానుభూతిని పంచి ఇస్తుందని అక్కడ నిర్వాహకులు చెబుతున్నారు. అంతేకాదండోయ్ పురాతనమైన మహాదేవ్ ఆలయాన్ని సందర్శించడం కోసం ట్రెక్కింగ్ అనుభవాన్ని కూడా అందిస్తుందట.'స్టే' చేయడానికి అయ్యే ఖర్చు..పీవీ సింధు-వెంకటసాయి దత్త రాఫెల్స్ ప్రెసిడెన్షియల్ సూట్‌ని బుక్ చేసుకున్నారు. అది ఏకంగా దగ్గర దగ్గర ఒక్క రాత్రికి బస రూ. 7 లక్షలు పైనే అవుతుందట. ఇంత లగ్జరీలోనే కాదు ఓ మోస్తారు ధరలో లభించే రిసార్టుల కూడా ఉన్నాయట.లేక్‌షోర్ సిగ్నేచర్ - ద్వీపంలో లేని గది, రాత్రికి రూ. 57,000ఫ్లెమింగో సిగ్నేచర్ రూమ్, తోటతో పాటు, ట్విన్ లేదా కింగ్ బెడ్‌తో, రాత్రికి రూ. 77,000ఫ్లెమింగో సిగ్నేచర్ రూమ్, బాల్కనీతో పాటు, ట్విన్ లేదా కింగ్ బెడ్‌తో, రాత్రికి రూ. 81,000ఫ్లెమింగో సిగ్నేచర్ రూమ్, ప్లంజ్ పూల్తో పాటు, ట్విన్ లేదా కింగ్ బెడ్‌తో, రాత్రికి రూ. 87,000రాఫెల్స్ లేక్‌షోర్ మనోర్ - ద్వీపంలో లేని రిసార్ట్, రాత్రికి రూ. 97,000రాఫెల్స్ మనోర్ సూట్, రాత్రికి రూ. 1,17,000రాఫెల్స్ ఒయాసిస్ సూట్, రాత్రికి రూ. 1,37,000రాఫెల్స్ ప్రెసిడెన్షియల్ సూట్, రాత్రికి రూ. 7,57,000అయితే, బుకింగ్ తేదీని అనుసరించి గదులు, సూట్ల లభ్యతలో ధరలు మార్పు ఉంటుందట. View this post on Instagram A post shared by Raffles Udaipur (@rafflesudaipur) (చదవండి: Worlds Most Expensive Saree: అత్యంత ఖరీదైన 'పట్టుచీర'..! ఆద్యంతం ఆసక్తికరం..అద్భుతం..) -
యూదులపై కాల్పులు: అక్కడ మ్యారేజ్.. ఇక్కడ నిఖా!
సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్‌లో యూదులపై కాల్పులు జరిపిన ఐసిస్ ఉగ్రవాది, హైదరాబాదీ సాజిద్ అక్రమ్ రెండుసార్లు వివాహం చేసుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. 1998 నవంబర్‌లో స్టూడెంట్ వీసాతో ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్ 1999లో యూరోపియన్ మహిళ వెనెరా గ్రోసోని వివాహం చేసుకున్నాడు. తొలుత అక్కడ అమలులో ఉన్న సాధారణ పద్ధతిలో పెళ్లి చేసుకున్న ఈ జంట 2000 సంవత్సరంలో హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ సాజిద్ తల్లిదండ్రుల సమక్షంలో మరోసారి నిఖా జరిగింది. వీరికి 2001 ఆగస్టు 12న నవీద్ జన్మించగా.. అతడి 15వ ఏట తండ్రితో కలిసి హైదరాబాద్ వచ్చాడు. అప్పట్లో కొద్దిరోజులు టోలిచౌకీలో ఉండి దూద్‌బౌలీలో కొన్ని స్థిరాస్తుల్ని విక్రయించి వెళ్లినట్లు తెలిసింది. ఉగ్రవాద బాటపట్టిన సాజిద్, నవీద్ భవిష్యత్తులో ఎదుర్కోబోయే పరిణామాలను ముందే ఊహించి ఉంటారని నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో సాజిద్ ఆస్తిపాస్తుల్లో తనకు ఉన్న వాటాలను గత ఏడాది ఫిబ్రవరిలోనే వెనెరాకు బదిలీ చేసినట్టు తెలుస్తోంది. నవీద్ 2019లో సిడ్నీలోని అల్–మురాద్ ఇన్స్టిట్యూట్లో చేరి అరబిక్ నేర్చుకున్నాడు. అక్కడే ఇతడికి పరిచయమైన వారి ద్వారా ఐసిస్‌లో చేరాడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీళ్లు ఫిలిప్పీన్స్‌లో ఉన్న మిండానావో ఐలాండ్‌లోని ఐసిస్ శిబిరంలో శిక్షణ తీసుకున్నట్లు ఆస్ట్రేలియా పోలీసులు అనుమానిస్తున్నారు. ఫిలిప్పీన్స్ నుంచి వచ్చినప్పటి నుంచి గత ఆదివారం వరకు వీరి కదలికలను పూర్తిస్థాయిలో తెలుసుకోవడానికి ఆస్ట్రేలియన్ ఏజెన్సీలు ప్రయత్నిస్తున్నాయి. ఆదివారం ఉదయం వీళ్లు దాదాపు 20 కిమీ ప్రయాణించి బీచ్ వద్దకు చేరుకున్నట్లు ఆధారాలు సేకరించారు. బాండీ బీచ్ మారణహోమంలో పాల్గొన్న ఇరువురిలో సాజిద్ పోలీసుల కాల్పుల్లో చనిపోగా, నవీద్ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతడిపై న్యూ సౌత్ వేల్స్ పరిధిలోని బాండీ బీచ్ పోలీసులు మొత్తం 59 నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు మోపారు. వీటిలో 15 హత్యలు, ఒక ఉగ్రవాద చర్యకు సంబంధించినవీ ఉన్నాయి. సాజిద్, నవీద్‌లు వినియోగించిన కార్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. సాజిద్ వినియోగించిన కారులో ఆరు తుపాకులు, రెండు ఐసిస్ జెండాలను కూడా స్వాదీనం చేసుకున్నారు. -
'నాకు ఎవరితోనూ పెళ్లి కాలేదు'.. రూమర్స్‌పై టాలీవుడ్ హీరోయిన్ ఆగ్రహం
టాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ ఫిర్జాదా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. కృష్ణగాడి వీర ప్రేమగాథ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. వెంకీమామ, వరుణ్ తేజ్ నటించిన ఎఫ్2, ఎఫ్3 సినిమాలతో అభిమానులను మెప్పించింది. అంతేకాకుండా రాజా ది గ్రేట్ చిత్రంలో రవితేజ సరసన కనిపించింది.అయితే సినీతారలపై రూమర్స్ రావడం సహజం. డేటింగ్, పెళ్లి అంటూ ఎప్పుడో ఒకసారి రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. గతంలో మెహరీన్‌పై కూడా అలాగే వదంతులు వచ్చాయి. మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో మెహరీన్ ప్రేమలో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. ఆ తర్వాత అదంతా ఫేక్ అని తేలిపోయింది. అప్పటి నుంచి మెహరీన్ సినిమాలతో బిజీ అయిపోయింది.అయితే తాజాగా మరోసారి మెహరీన్ పెళ్లి అంటూ వార్తలొచ్చాయి. సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారాయి. దీంతో మెహరీన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి సమాచారం లేకపోయినా ఇలాంటి వార్తలు రాయడం చూస్తుంటే వింతగా అనిపిస్తోందని ట్వీట్ చేశారు. కేవలం డబ్బుల కోసం పనికిమాలిన వార్తలతో జర్నలిజం పూర్తిగా దెబ్బతినిందని మెహరీన్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఈ విషయంపై రెండు ఏళ్లుగా మౌనంగా ఉన్నానని.. నిరంతరం ఇలాంటి వేధింపుల కారణంగా ఈ రోజు మాట్లాడాల్సి వస్తోందని అన్నారు.తాను ఎవరో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు రాశారని మెహరీన్ ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఎప్పుడు కలవని వ్యక్తితో పెళ్లయిందని రాయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించింది. నాకు ఇప్పటి వరకు ఎవరితోనూ పెళ్లి కాలేదు.. నన్ను నమ్మండి అంటూ పోస్ట్ చేసింది. నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు.. ఈ ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేసుకుంటానని మెహరీన్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ ట్వీట్‌తో మెహరీన్ పెళ్లి రూమర్స్‌కు ఇక చెక్ పడినట్లే.IMPORTANT!!!Nowadays it’s bizzare how misinformation can spread without any repercussions for it. And journalism has definitely taken a hit when it comes to stupid paid articles. I’ve stayed shut about this for 2 years but because of constant harassment I choose to speak up…— Mehreen Pirzada👑 (@Mehreenpirzada) December 16, 2025 -
పెళ్లి కాదనే బెంగతో యువకుడి ఆత్మహత్య
గార్లదిన్నె/అనంతపురం సిటీ: కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఇక తనకు పెళ్లి కాదనే బెంగతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన భీమన్నగారి చిదంబర కుమారుడు ప్రతాప్(31) వ్యవసాయ పనులతో కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. తన ఈడు పిల్లలందరూ పెళ్లిళ్లు చేసుకొని స్థిరపడగా.. తనకు ఇంకా పెళ్లి కాకపోవడంతో కుంగిపోయాడు. తనకు పెళ్లి చేయాలని ఇంట్లో అడుగుతూ వస్తున్నా... అప్పులు ఎక్కువగా ఉన్నాయని, అవి తీరాక పెళ్లి చేస్తామంటూ కుటుంబ సభ్యులు వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో జీవితంపై విరక్తి పెంచుకున్న ప్రతాప్ ఆదివారం రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయి గార్లదిన్నె రైల్వేగేట్ సమీపంలో గ్వాలియర్ నుంచి బెంగళూరుకు వెళుతున్న యశ్వంత్‌పూర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. లోకో పైలెట్ నుంచి సమాచారం అందుకున్న రైల్వే ఎస్ఐ వెంకటేష్ సోమవారం అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
తొలిసారి అలా కనిపించిన సామ్ దంపతులు.. వీడియో వైరల్
అందరూ ఊహించినట్లుగానే సమంత రెండోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టింది. కొన్ని నెలలుగా వస్తున్న రూమర్స్‌ను నిజం చేస్తూ రెండో పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు సామ్ పెళ్లాడింది. భూత శుద్ధి వివాహం పేరుతో ఇషా ఫౌండేషన్‌లో వీరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సమంత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పెళ్లిలో సమంత అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు.అయితే ఈ పెళ్లి తర్వాత వీరిద్దరు మొదటిసారి జంటగా బయట కనిపించారు. ఎయిర్‌పోర్ట్‌లో వెళ్తుండగా ఈ నూతన వధువరులు కెమెరాలకు చిక్కారు. ఈ జంటను చూసిన కొందరు కంగ్రాట్స్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. సమంత మొదట టాలీవుడ్ హీరో నాగ చైతన్యను పెళ్లాడారు. ఆ తర్వాత వీరిద్దరు 2021లో విడాకులు తీసుకున్నారు. గతేడాది నాగచైతన్య.. మరో హీరోయిన్ శోభిత ధూలిపాళ్లను పెళ్లాడారు. తాజాగా ఈ ఏడాది సామ్ రెండోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టారు. #Samantha was seen at the airport with husband #RajNidimoru for the first time after their wedding. 😍#FilmfareLens pic.twitter.com/ohc48wCUgj— Filmfare (@filmfare) December 13, 2025 -
ఫస్ట్ నైటే చెప్పేశాడు...కొత్త పెళ్ళి కూతురి విడాకులు
పెళ్లయిన మూడు రోజులకే నవ వధువు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న ఘటన ఆశ్చర్యానికి గురి చేసింది. ఉత్తర ప్రదేశ్‌లో గోరఖపూర్‌లో ఈ ఘటన జరిగింది. శారీరకంగా అసమర్థుడైన వ్యక్తితో తాను జీవితాన్ని గడపలేను అంటూ కొత్త పెళ్లికూతురు లీగల్ నోటీసు పంపించింది.వరుడు సహజన్వాలోని రైతు కుటుంబానికి చెందిన ఏకైక కుమారుడు. వయస్సు 25. జిఐడిఎలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. బేలియాపర్లోని బంధువుల ద్వారా ఈ వివాహం నిశ్చయమైంది. బంధు మిత్రులు సమక్షంలో నవంబర్ 28న వీరి వివాహం జరగింది. సాంప్రదాయం ప్రకారం మరుసటి రోజు అత్తవారింటికి సాగనంపారు. సాధారణంగా పెళ్ళిళ్లలో జరిగే తంతు ప్రకారం డిసెంబర్ 1న మూడో రోజు ఫస్ట్ నైట్ కార్యక్రమానికి ముహర్తం పెట్టారు. కానీ ఆ రాత్రే ఆమెకు చేదు అనుభవాన్ని మిగిలుస్తుందని ఆమె ఊహించి ఉండదు. పెళ్లయిన మొదటి రాత్రి కోటి ఆశలతో గదిలోకి అడుగుపెట్టిన ఆమెకు స్వయంగా భర్తే బాంబు పేల్చాడు. తాను వైవాహిక సంబంధాలకు శారీరకంగా అసమర్థుడిని చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో ఆమె హతాశురాలైంది. తరువాత ఇంట్లోని పెద్దలకు అసలు విషయం చెప్పింది. వెంటనే ఆమెను తిరిగి పుట్టింటికి తీసుకువచ్చారు. క్షణం ఆలస్యం చేయకుండా లీగల్ నోటీసు పంపింది.డిసెంబర్ 3న బేలియాపర్లో ఇరుపక్షాలు కలుసుకున్నాయి. వరుడి పరిస్థితిని దాచిపెట్టారని వధువు కుటుంబం ఆరోపించింది. అంతే కాదు ఇది అతని రెండవ విఫల వివాహమని, రెండేళ్ల క్రితం మొదటి వధువు నెల రోజుల్లోనే విడిచిపెట్టి వెళ్లిపోయిందని కూడా వారు పేర్కొన్నారు.ఇదీ చదవండి: మహిళలూ వంటింటి ఆయుధాలతో సిద్ధంకండి : మమత సంచలన వ్యాఖ్యలుఇరుపక్షాల సమ్మతితో, వరుడికి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు అతడు శారీరంగా అసమర్థుడని, "తండ్రి కాలేడు" అనివైద్యపరీక్షలు కూడా నిర్ధారించాయి. దీంతో పెళ్లి బహుమతులు ఖర్చులన్నింటినీ తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీన్ని వారు తిరస్కరిండంతో వధువు కుటుంబం సహజన్వా పోలీసులను ఆశ్రయించి, అన్ని బహుమతులు మరియు నగదును తిరిగి ఇవ్వాలని కోరింది. పోలీసుల జోక్యంతో, ఇరు పక్షాల మధ్య రాజీ కుదిరింది. వరుడి కుటుంబం రూ. 7 లక్షలు, అన్ని పెళ్లి బహుమతులను ఒక నెలలోగా తిరిగి ఇవ్వడానికి అంగీకరించింది. బంధువుల సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేశారని సహజన్వా ఎస్హెచ్ఓ మహేష్ చౌబే వెల్లడించారు.ఇదీ చదవండి: ఇండిగో బాధితులకు స్వల్ప ఊరట,ఆఫర్ ఏంటంటే.. -
పటాన్ చెరులో పరువు హత్య!
సాక్షి,హైదరాబాద్: ప్రేమ పేరుతో మరో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి చేస్తామంటూ ఇంటికి పిలిచి ఓ యువకుడిని క్రూరంగా హత్య చేసిన ఘటన పటాన్ చెరులో వెలుగులోకి వచ్చింది. ప్రేమ వ్యవహారమే ఈ దారుణానికి కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు.పటాన్ చెరుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి శ్రవణ్ అదే ప్రాంత బీబీఏ విద్యార్థిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరి మధ్య స్కూల్ వయస్సు నుంచే ప్రేమాయణం కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రేమ వ్యవహారం సదరు యువతి కుటుంబ సభ్యులకు నచ్చలేదు. వారి మధ్య ప్రేమ వ్యవహారం బయటపడడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది.పెళ్లి చేస్తామని నమ్మించి పోలీసుల ప్రకారం..యువతి కుటుంబ సభ్యులు ముందుగా పక్కా ప్లాన్ వేసుకున్నారు. ‘మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం. ఇదే విషయం గురించి మాట్లాడుకుంది. ఇంటికి రావాలని శ్రవణ్‌ని తమ ఇంటికి పిలిపించారు. పెళ్లి మాట నమ్మిన శ్రవణ్ యువతి ఇంటికి వెళ్లాడు. ఇంటికి చేరుకున్న వెంటనే యువతి కుటుంబ సభ్యులు శ్రవణ్‌పై దాడి దిగారు. క్రికెట్ బ్యాట్లతో విచక్షణారహితంగా కొట్టడంతో శ్రవణ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.పోలీసుల దర్యాప్తు ప్రారంభంసమాచారం అందుకున్న పటాన్ చెరు పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. శ్రవణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. యువతి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరువు హత్య కోణంలో విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.స్థానికులు ఆగ్రహం ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ పేరుతో యువకుడి ప్రాణం తీసిన కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన బుల్లితెర నటి.. ఫోటోలు వైరల్!
ప్రముఖ బుల్లితెర భామ, బిగ్‌బాస్ బ్యూటీ రూపాలి త్యాగి వివాహబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు నోమిష్ భరద్వాజ్‌ను పెళ్లాడింది. ముంబయిలో జరిగిన ఈ పెళ్లి వేడుకలో సినీతారలు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ముద్దుగుమ్మ. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ డిసెంబర్ 5న జరిగింది.కాగా.. రూపాలి త్యాగి సప్నే సుహానే లడక్పన్ కే సీరియల్లో గుంజన్ పాత్రతో ఫేమ్ తెచ్చుకుంది. అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్- 9లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. కాగా.. వీరిద్దరు రెండు సంవత్సరాల క్రితం ముంబయిలో స్నేహితుల ద్వారా పరిచయమయ్యారు. ముంబయికి చెందిన నోమిష్ ప్రస్తుతం లాస్ ఏంజిల్స్‌లో యానిమేషన్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు.రూపల్ త్యాగి కెరీర్..హమారీ బేటియూన్ కా వివాహ్ సీరియల్‌తో కెరీర్ ప్రారంభించిన రూపాలి త్యాగి..బాలీవుడ్లో పలు సీరియల్స్‌లో నటించింది. ఏక్ నయీ చోటి సి జిందగీ, రంజు కి బేటియాన్, కసమ్ సే, దిల్ మిల్ గయే, శక్తి- అస్తివా కే ఎసాస్ కీ, యంగ్ డ్రీమ్స్ లాంటి హిందీ సీరియల్స్‌లో కనిపించింది. బెంగళూరుకు చెందిన రూపల్ త్యాగి కొరియోగ్రాఫర్‌గా కూడా రాణిస్తోంది. అంతేకాకుండా బిగ్ బాస్ -9 తో పాటు 2015లో ఝలక్ దిఖ్లా జా -8 లాంటి రియాలిటీ షోలో కూడా పాల్గొంది. View this post on Instagram A post shared by Roopal Tyagi (@roopaltyagi06) -
శ్రీకృష్ణుడిని పెళ్లాడిన యువతి : బరాత్, వైభవంగా వేడుక
యూపీలోని బదౌన్‌కు చెందిన ఈ యువతి ఏకంగా శ్రీకృష్ణుడినే పెళ్లాడింది. శ్రీకృష్ణుడిని అమితంగా ఆరాధించే యువతి, సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణుడినే భర్తగా ప్రకటించుకుంది. గ్రామమంతా తరలివచ్చి ఈ పెళ్లి తంతును ఆసక్తిగా తిలకించడం విశేషం.ఉత్తరప్రదేశ్‌లోని బుడాన్ జిల్లాకు చెందిన 28 ఏళ్ల మహిళ హిందూ సంప్రదాయ వేడుకలో కృష్ణుడి విగ్రహాన్ని వివాహం చేసుకోవడం విస్తృత చర్చకు దారితీసింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన పింకీ శర్మ కుటుంబం, బంధువులు, గ్రామ నివాసితులు సమక్షంలో సంప్రదాయ బద్ధంగా ఈ వివాహ తంతునుముగించారు. ఇస్లాంనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైయూర్ కాశీమాబాద్ గ్రామంలో జరిగిన ఈ ప్రత్యేకమైన వేడుక పలువురి దృష్టిని ఆకర్షించింది.దైవిక వరుడితో సాంప్రదాయ వివాహంఈ సందర్భంగా పింకీ ఇంటిని అలంకరించారు. ఆమె సమీప బంధువు ఇంద్రేష్ కుమార్ వరుడిలా అలంకరించిన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని వివాహ మండపానికి తీసుకొని వచ్చారు. దాదాపు 125 మందితో ఊరేగింపుగా తరలి వచ్చారు.పింకీ విగ్రహాన్ని తన చేతులతో ఎత్తుకొని ఆచారాల కోసం వేదికపైకి అడుగుపెట్టింది. ఆమె దేవుడితో దండలు మార్చుకుంది, తరువాత సిందూర వేడుక జరిగింది. వేడుకల్లో భాగంగా బృందావనం నుండి వచ్చిన కళాకారులు భక్తి నృత్యాలు చేశారు. మొత్తం గ్రామం అంతా వివాహ విందును సిద్ధం చేశారు. పింకీ ఏడు సాంప్రదాయ వివాహ రౌండ్ల కోసం కృష్ణ విగ్రహాన్ని మోసుకెళ్లి పవిత్ర అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేసింది. వీడ్కోలు వేడుక మరుసటి రోజు ఉదయం జరిగింది. ప్రస్తుతం ఆమె తన తల్లిదండ్రుల ఇంట్లో నివసిస్తోంది.बदायूं की पिंकी शर्मा ने भगवान श्रीकृष्ण जी से की शादीबदायूं जिले के इस्लामनगर थाना क्षेत्र के गांव ब्यौर कासिमाबाद में 28 साल की पिंकी शर्मा ने श्रीकृष्ण की प्रतिमा के साथ धूमधाम से विवाह कर लिया। पूरे गांव ने घराती की भूमिका निभाई और परिवार ने विवाह की पूरी रस्में पूरी कीं pic.twitter.com/dtT9fjfARU— Arjun Chaudharyy (@Arjun5chaudhary) December 7, 2025వధువు తండ్రి ఏమన్నారంటే ఆమె తండ్రి సురేష్ చంద్ర మాట్లాడుతూ, పింకీ చిన్నప్పటి నుండి కృష్ణ భగవానుడుఅంటే ఆమెకు ఎంతోభక్తి ఉండేదనీ,తరచుగా బృందావనానికి తనతో పాటు వచ్చేదని చెప్పారు. తన కుమారుల మాదిరిగానే కుటుంబ ఆస్తిలో ఆమెకు వాటా ఇస్తానని వాగ్దానం చేశానని చెప్పాడు. ఆమె తల్లి రామేంద్రి మాట్లాడుతూ, ఈ ఆలోచన మొదట్లో అసాధారణంగా అనిపించినప్పటికీ, పింకీ ఇది భక్తి భావంతో కూడుకున్నది కనుక కుటుంబం అంగీకరించిందని అన్నారు.ఇదీ చదవండి: ఎప్పటికీ భారతీయుడిగానే ఉంటా : ఎన్ఆర్ఐ పోస్ట్ వైరల్బంగారు ఉంగరం దాదాపు నాలుగు నెలల క్రితం, ఆమె దైవిక జోక్యంగా భావించిన ఒక అనుభవాన్ని అనుభవించిందట. బాంకే బిహారీ ఆలయంలో ప్రసాదం స్వీకరిస్తున్నప్పుడు, ఒక బంగారు ఉంగరం ఆమె కండువాలో పడింది. దీంతో ఇది వరమని పింకీ నమ్మింది. అందుకే తానిక ఏ మానవుడిని వివాహం చేసుకోనని, కృష్ణుడిని మాత్రమే వివాహం చేసుకుంటాని నిర్ణయించుకుంది. ఇటీవలి అనారోగ్యంగా ఉన్నపుడు బృందావనం ద్వారా బరువైన కృష్ణ విగ్రహాన్ని మోసుకెళ్లి గోవర్ధన పరిక్రమను పూర్తి చేసి తరువాత కోలుకుంది. ఇది తన వివాహానికి మరొక సంకేతంగా భావించిందట. తన జీవితం దేవునికి అంకితమని పింకీ వెల్లడించింది. తన జీవితంలో విద్యాతోపాటు, , భక్తి ,కృష్ణుడికి లొంగిపోవడంలోనే తనకు శాంతి అని తెలిపింది. కాగా ఇలా కృష్ణుడ్ని వివాహ మాడిన ఘటనలు యూపీలో గతంలోకూడా నమోదైనాయి. చదవండి: మంచు గడ్డలా ప్రియురాలి మృతదేహం : ప్రియుడు ఎంత పనిచేశాడు -
మాస్క్‌తో పలాష్ : ప్రేమానంద్ మహారాజ్‌ని ఎందుకు కలిశాడు?
స్టార్ క్రికెటర్ స్మృతి మంధానతో సంగీత స్వరకర్త పలాష్ ముచ్చల్ (Palaash Muchhal) వివాహం వాయిదా పడిన నేపథ్యంలో ఇంకా భారీ ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. డిసెంబరు 7న వీరిద్ధరూ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారనే పుకార్లు వ్యాపించాయి. అలాంటిదేమీ లేదని స్మృతి సోదరుడు శ్రావణ్ మంధాన కొట్టి పారేశారు. ఈ ఊహాగానాల మధ్య పెళ్లిలో అనారోగ్యం, పెళ్లి వాయిదా తరువాత పలాష్ తొలిసారి తన కుటుంబంతో విమానాశ్రయంలో కనిపించాడు.ఇంతకీఅతను ఎక్కడి వెళ్లాడు అనేది హాట్ టాపిక్‌గా మారింది. విమానాశ్రయంలో తన కుటుంబంతో మొదటిసారి కనిపించిన తర్వాత, పలాష్ ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లో శ్రీ హిట్ రాధా కేలి కుంజ్‌లో ప్రేమానంద్ మహారాజ్ (Premanand Maharaj )ను సందర్శించు కున్నారు. తెల్ల చొక్కా, నల్ల జాకెట్ ధరించి, చేతులు ముడుచుకుని ముందు వరుసలో కూర్చుని ఫోటోల వైరల్‌గా మారింది. అంతకుముందు, ముంబై విమానాశ్రయంలో ఆయన అంతే దిగులుగా కనిపించిన పలాష్ ఇక్కడ ముఖానికి మాస్క్‌తో, భక్తితో నమస్కరిస్తూ కనిపించాడు.చదవండి: జస్ట్ రూ. 200తో మొదలై రూ. 10 కోట్లదాకా ఇంట్రస్టింగ్ సక్సెస్ స్టోరీకాగా మెహిందీ, సంగీత్ వేడుకల మధ్య మహారాష్ట్రలోని సాంగ్లిలో నవంబర్ 23న వివాహం చేసుకోవాల్సిన స్మృతి-పలాష్ పెళ్లి స్మృతి తండ్రి అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యం కారణంగా వాయిదా పడింది. ఆ తరువాత పలాష్ ప్రైవేట్ చాట్స్, స్క్రీన్షాట్లు అంటూ మరికొన్ని పుకార్లు షికార్లు చేశాయి. దీనిపై ఇరు కుటుంబాలనుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది.ఇదీ చదవండి: రిటైర్డ్ డాక్టర్ లక్ష్మీ బాయ్ రూ. 3.4 కోట్ల భారీ విరాళం -
మీకు తెలియని హిందూ వివాహ రకాలు..
-
సమంత రెండో పెళ్లి.. ఆమె ఆస్తుల విలువ అన్ని కోట్లా?
ఎన్నో రోజులుగా వస్తున్న రూమర్స్ నిజమయ్యాయి. అందరూ ఊహించినట్లుగానే హీరోయిన్ సమంత రెండో సారి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అది కూడా మామూలుగా కాదు.. భూత శుద్ధి వివాహం పేరుతో ఇషా ఫౌండేషన్‌లో వీరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లిలో సమంత అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసిన సమంతకు అభినందనలు వెల్లువెత్తాయి. 2021లో నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సామ్.. మరో పెళ్లితో కొత్త జీవితం ప్రారంభించింది.అయితే వీరిద్దరి పెళ్లి తర్వాత టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. కొందరేమో వీరి వయస్సుల గురించి చర్చిస్తే.. మరికొందరు డేటింగ్, పరిచయం ఎలా మొదలైంది అంటూ ఆరా తీస్తున్నారు. సమంత టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ కావడం.. రాజ్ నిడిమోరు సైతం తెలుగువాడు కావడంతో బ్యాక్ గ్రౌండ్ గురించి తెగ వెతికేస్తున్నారు. అదే క్రమంలో సామ్-రాజ్ ఆస్తులు కూడా హాట్ టాపిక్‌గా మారాయి. ఎవరికెంత ఆస్తులున్నాయి?.. ఇద్దరిలో ఎవరికీ ఎక్కువ ఉన్నాయని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఆ వివరాలేంటో మనం కూడా చూసేద్దాం.ఏ మాయ చేశావే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత.. కొద్ది కాలంలోనే స్టార్ హోదాను సొంతం చేసుకుంది. తెలుగులో అగ్రహీరోల సరసన వరుసపెట్టి సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే దక్షిణ భారత సినిమాల్లో అత్యధిక పారితోషికం తీసుకునే హరోయిన్లలో ఒకరిగా నిలిచింది. సమంత ఒక్కో సినిమాకు రూ.3-5 కోట్ల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రకటనల ద్వారా భారీగానే సంపాదించింది సామ్. పలు టాప్ కంపెనీలకు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నారు. దీంతో ఓవరాల్‌గా డిసెంబర్ 2025 నాటికి సమంత ఆస్తుల విలువ దాదాపు రూ.110 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం.సమంత ఆస్తులే ఎక్కువ.. ఇక రాజ్ నిడిమోరు ఆస్తుల విషయానికొస్తే బాగానే వెనకేసినట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం రాజ్ నిడిమోరు ఆస్తుల విలువ దాదాపు రూ.85 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. ఈ లెక్కన రాజ్ కంటే సమంతనే 29 శాతం అధికంగా ఆస్తులు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన వీరిద్దరి ఆస్తులను కలిపితే ఏకంగా రూ.200 కోట్ల వరకు ఉంటుందని నెటిజన్స్ అంచనా వేస్తున్నారు.కాగా.. వీరిద్దరు ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటాడెల్: హనీ బన్నీలో కలిసి పనిచేశారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట డిసెంబర్ 1న వివాహబంధంలోకి అడుగుపెట్టింది. -
రాజ్‌తో సమంత రెండో పెళ్లి.. ఇంత ఏజ్ గ్యాప్ ఏంటి సామీ..!
గత కొన్ని నెలలుగా వస్తున్న రూమర్స్‌కు నేటితో చెక్ పడింది. సామ్-రాజ్ ఎక్కడా కనిపించినా డేటింగ్ రూమర్స్ వైరలయ్యాయి. అంతేకాకుండా వీరిద్దరు మరింత సన్నిహితంగా మెలగడంతో అభిమానులతో పాటు నెటిజన్స్ సైతం దాదాపు ఫిక్సయిపోయారు. అందరూ అంచనాలను నిజం చేస్తూ రెండో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది సమంత. ఊహించిందే అయినప్పటికీ.. సామ్ స్టార్ హీరోయిన్ కావడంతో హాట్ టాపిక్‌గా మారింది. ఎట్టకేలకు ఆమె బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ఇషా యోగా సెంటర్లోని లింగ భైరవి ఆలయంలో వివాహం చేసుకుంది. పెళ్లికి సంబంధించిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం.ఇక పెళ్లి విషయం పక్కనపెడితే అందరి నోటా ఒకటే చర్చ నడుస్తోంది. రెండో పెళ్లి ఓకే.. కానీ వీరిద్దరు వయస్సు మధ్య తేడా ఎంత అనేది ప్రశ్న. ప్రేమ, పెళ్లికి వయసుతో పనేంటని అందరూ అంటూనే ఉంటారు. కానీ జీవితాంతం కలిసి ఉండాల్సిన ఇద్దరి మధ్య వయసు తేడా అనేది కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు సామ్- రాజ్ ఏజ్ గ్యాప్ ఎంతనేది కూడా నెట్టింట చర్చ మొదలైంది. పెళ్లి చేసుకునే జంటకు పదేళ్ల లోపు ఏజ్ గ్యాప్ ఉంటే మంచిదని అందరూ అనడ మనం వింటుంటాం. మరి వీరి మధ్య ఏంత తేడా ఉంది? అసలు సమంత- రాజ్ మధ్య ఎంత గ్యాప్ ఉందో తెలుసుకుందాం.సమంత రూత్ ప్రభు 1987 ఏప్రిల్ 28న చెన్నైలో జన్మించారు. ఈ లెక్కన సమంతకు ప్రస్తుతం 38 ఏళ్లు. అయితే రాజ్‌కు సంబంధించిన అఫీషియల్ పుట్టినరోజు లేకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రాజ్ 1975 ఆగస్టు 4వ తేదీన తిరుపతలో జన్మించారని టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే ఆయనకు ఇప్పుడు 50 ఏళ్లు. ఈ లెక్కన సామ్- రాజ్‌కు మధ్య ఏజ్ గ్యాప్ దాదాపు 12 సంవత్సరాలు. వయస్సుల పరంగా చూస్తే ఇద్దరి మధ్య ఇంత అంతరం ఉండడం చర్చకు దారితీసింది. దీంతో సమంత నిర్ణయంపై కొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ప్రేమకు వయస్సుతో పనిలేదని కొట్టిపారేస్తున్నారు. ఏదేమైనా ఇద్దరి మధ్య పదేళ్ల లోపు ఏజ్ గ్యాప్ ఉంటే మంచిదని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కాగా.. సమంత రూత్ ప్రభు 2017లో టాలీవుడ్ హీరో నాగ చైతన్యను వివాహం చేసుకుంది. ఆ తర్వాత 2021లో వివాహాబంధానికి గుడ్ బై చెప్పేసింది. తాజాగా మరోసారి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. రాజ్ నిడిమోరును పెళ్లాడింది. రాజ్ సైతం గతంలో శ్యామలి దేను వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నారు. సామ్- రాజ్.. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌ల్లో కలిసి పనిచేశారు. -
జడ్జి‘మెంటల్స్’కు ఇచ్చిపడేసిన ప్రేమ జంట
సోషల్ మీడియా వచ్చిన తరువాత మనుషుల్లోని అపరిచితుడు అనేక రూపాల్లో బయటపడుతున్నాడు. ప్రతీ వాడూ జడ్జి‘మెంటల్’ అయిపోతాడు. పెచ్చుమీరుతున్న ఆన్లైన్ ట్రోల్స్ గురించి తలుచుకున్నపుడు ఇలాంటి ఆలోచనే వస్తుంది ఎవరికైనా. పెళ్లి చేసుకున్నా,విడాకులు తీసుకున్నా, తమ అభిప్రాయాల్ని ప్రకటించుకున్నా...వేధింపులే..నోటికొచ్చినట్టు కామెంట్స్ రాసేయడమే. వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, ప్రాధాన్యతలు, మనోభావాలు ఇవేవీ పట్టించుకోరు. వచ్చామా? కమెంట్ చేశామా..వికృతం అనందం పొందామా? అంతే.. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన జంట మాత్రం తమను అవమానించిన ట్రోలర్స్‌కు ఇచ్చిపడేశారు.11 ఏళ్ల ప్రేమ తరువాత మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రేమ జంట రిషబ్, సోనాలి ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లికి సంబంధించినఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలపాల్సింది పోయి, ఆన్లైన్లో పిచ్చి పిచ్చి కామెంట్లతో వారిని ఆనందాన్ని, ఉత్సాహాన్ని దూరం చేశారు. రిషబ్ షేర్వానీలో ప్రకాశవంతమైన గులాబీ రంగు శాలువా సఫాతో మెరిసిపోగా, మెజెంటా లెహంగాలో సోనాలీ చాలా అందంగా కనిపించారు. అయితే వరుడు నల్లగా ఉన్నాడంటూ నోరు పారేసుకున్నాడు."బ్యాంక్ బ్యాలెన్స్ ముఖ్యం," అని ఒకరు, డబ్బు కోసమే ఈ పెళ్లి అని మరొకరు వ్యాఖ్యానించారు. "దీదీ, ఇలా చేయడం అవసరమా అని ఒకరు, బహుశా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నట్టుందని మరో యూజర్ ఎగతాళి చేశారు. ఈ ట్రోలింగ్ తీవ్ర కావడంతో, పోస్ట్ 30 లక్షలకు పైగా వీక్షణలను దాటేసింది. అయితే ఈ ట్రోలింగ్‌ను కలర్-షేమింగ్‌ను వ్యతిరేకిస్తూ, వారి నిజమైన ప్రేమకు, అనురాగానికి మంచి మద్దతు కూడా లభించడం ఊరటనిచ్చే అంశం.ఇదీ చదవండి: పరువు పేరుతో ప్రేమకు సమాధి, తప్పెవరిది?ట్రోలర్స్‌కు కొత్త జంట సమాధానంమామధ్య ఉన్న దూరం ఇన్నాళ్లకు ముగిసింది. వాళ్లు ఏమన్నా మాకేమీ బాధలేదు. ఈ క్షణాన్నిమేము అస్వాదిస్తున్నామని సోనాలి ట్రోలర్స్‌ను తిప్పి కొట్టింది. రిషబ్ కూడా అదే విధంగా స్పందించారు. సోనాలిని పెళ్లాడే క్షణాలకోసం 2014 నుంచి ఎదురు చూస్తున్నానని, ఆమెను పెళ్లికూతురుగా చూసినప్పుడు కన్నీళ్లను ఆపుకోవడం తన తరం కాలేదంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఉద్యోగం పుకార్లను ప్రస్తావిస్తూ, "మిమ్మల్ని నిరాశపరిచినందుకు క్షమించండి. నేను ప్రభుత్వ ఉద్యోగిని కాదు కానీ నేను నా కుటుంబం కోసం పని చేస్తున్నాను. ఇపుడు నాకు మంచి ఆదాయమే ఉంది. కానీ నాకు ఏమీ లేనప్పుడే ఆమె నన్ను ప్రేమించింది, నా కాలేజీ రోజుల నుంచే నా శరీర రంగు, ఆకారం కంటే. ఆమె నన్ను నన్నుగానే ఇష్టపడింది. నాకు వెన్ను దన్నుగా నిలిచింది...వాళ్ల కమెంట్స్ అస్సలు పట్టించుకోను అని అన్నారు. అలాగే రిషబ్ తన చర్మం రంగు కారణంగా జీవితాంతం వివక్షను ఎదుర్కొన్నా అంటూ ఆవేదను వ్యక్తం చేశారు. బాహ్య సౌందర్యంతో సంబంధం లేకుండా.. నమ్మకమే పునాదిగా నిలబడిన ప్రేమను పరస్పర విశ్వాసం, అనురాగాలతో రిషబ్-సోనాలి కొత్త ప్రయాణం దిగ్విజయంగా సాగిపోవాలని మనమూ మనస్ఫూర్తిగా కోరుకుందాం.


