breaking news
Vijay Devarakonda
-
విజయ్-రష్మిక.. ఎవరు ముందు ప్రపోజ్ చేశారంటే?
టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకున్నారు. ఉదయ్‌పుర్ వేదికగా ఈ శుభకార్యం జరిగింది. అనంతరం సొంతూరిలో సత్యనారాయణ వ్రతం చేయడంతోపాటు నూతన గృహప్రవేశం కూడా చేశారు. తర్వాత గ్రామ ప్రజలందరికీ భోజనాలు కూడా విజయ్ పెట్టించాడు. ఈ సందర్భంగానే తన నియోజకవర్గంలలోని 9,10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్న పిల్లలకు స్కాలర్షిప్స్ ఇస్తాం, తమ్ముడు ఆనంద్ పెళ్లి ఇక్కడే చేస్తామని తదితర విషయాలు పంచుకున్నాడు. ఇప్పుడు తమ ఇద్దరిలో ఎవరు ముందు ప్రపోజ్ చేశారో విజయ్ బయటపెట్టాడు.(ఇదీ చదవండి: 'విరోష్' పెళ్లి కానుక.. శుభవార్త చెప్పిన విజయ్ దేవరకొండ)సొంతూరి నుంచి తిరిగి హైదరాబాద్‌కి వచ్చేసిన విజయ్-రష్మిక.. ఈ రోజు(మార్చి 04) సాయంత్రం సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ఇచ్చే రిసెప్షన్లో పాల్గొనున్నారు. అంతకు ముందు అనగా మంగళవారం దాదాపు 200 మంది అభిమానులతో కలిసి బంతి భోజనం చేశారు. ఈ సందర్భంగానే పలు విషయాలు మాట్లాడారు. విజయ్ మాట్లాడుతూ.. 'గీతగోవిందం' చేస్తున్నప్పుడు తాము స్నేహితులు మాత్రమేనని, 'డియర్ కామ్రేడ్' చేస్తున్న టైంలో తమ మధ్య ప్రేమ పుట్టిందని, తర్వాత కొన్నాళ్లకు రష్మికనే తనకు లవ్ ప్రపోజ్ చేసిందని విజయ్ చెప్పినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన రష్మిక.. 'ఛలో'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ 'గీతగోవిందం'తో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకుంది. 'డియర్ కామ్రేడ్' సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయినప్పటికీ చాలామంది విరోష్ ఫ్యాన్స్‌కి ఇది ఫేవరెట్. మళ్లీ చాన్నాళ్ల తర్వాత ప్రస్తుతం 'రణబాలి'లో వీళ్లిద్దరూ జంటగా నటిస్తున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత విజయ్-రష్మిక నుంచి రాబోతున్న మూవీ ఇదే. ఈ ఏడాది సెప్టెంబరు 11న పాన్ ఇండియా రిలీజ్ కానుందని ఇదివరకే ప్రకటించారు. పీరియాడిక్ కాన్సెప్ట్‌తో తీస్తున్నారు.(ఇదీ చదవండి: విరోష్... సెలబ్రిటీ పెళ్లిళ్లలో ట్రెండ్ సెట్టర్..)Star couple #VijayDeverakonda and #Rashmika arranged banthi bojanalu for 200 of their fans.Served them and had lunch together.👌A special day for all🫶🏽#Virosh pic.twitter.com/ZGUPWMdY5o— Suresh PRO (@SureshPRO_) March 3, 2026 -
విరోష్... సెలబ్రిటీ పెళ్లిళ్లలో ట్రెండ్ సెట్టర్..
ఈ సంవత్సరంలో టాప్ హై ప్రొఫైల్ సెలబ్రిటీ ఈవెంట్ గా విజయ్ దేవరకొండ, రష్మిక ల వివాహం ‘ విరోష్’ను సినీ పండితులు అభివర్ణిస్తున్నారు అయితే అంతకు మించి విరోష్ అర్థవంతమైన వేడుకగా కూడా నిలుస్తోంది. ఇది సెలబ్రిటీ వేడుకలలో మనం ఇకపై చూడబోయే సరికొత్త సంప్రదాయాలకు నాందిగా మారనుంది.స్టార్స్‌లో అరుదుగా కనిపించే మానవత్వాన్ని ప్రదర్శించిన ఈ జంట తమ ఆనందాన్ని ప్రైవేట్ ఉత్సవాలకు మించి విస్తరించారు, తమ ప్రయాణంలో తమకు మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చిన ప్రతీ ఒక్కరితో తమ ఆనందాన్ని పంచుకోవడం అందర్నీ ఆకట్టుకుంది. పెళ్లి చేసుకున్న నవదంపతులకు అందరూ కానుకలు ఇవ్వడం రివాజు. అయితే దీనికి భిన్నంగా ఈ జంట... నిరుపేదలకు తామే కానుకలు పంచి మనసులు గెలుచుకున్నారు.నోరు తీపి చేశారు..గత మార్చి 1న, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు అహ్మదాబాద్‌తో సహా అనేక ఇతర ప్రధాన కేంద్రాలతో పాటు భారతదేశంలోని 23 నగరాల్లో వేలాది స్వీట్ బాక్స్‌లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించబడిన కస్టమ్–డిజైన్డ్∙కవర్లతో ప్యాక్ చేసిన స్వీట్ బాక్స్‌లు, కీలకమైన నగరాల మీదుగా అందంగా అలంకరించిన ట్రక్కుల ద్వారా పంపిణీ చేశారు, ప్రత్యేకంగా రూపొందించిన ‘‘వి అండ్ ఆర్’ ’ టీ–షర్టులు టోపీలు ధరించిన ఆన్–గ్రౌండ్ బృందాలు ప్రజలకు వ్యక్తిగతంగా స్వీట్లు అందించాయి, ఇది ఓ ప్రైవేట్ వేడుక ను పబ్లిక్ ఫెస్టివల్‌గా మార్చింది. అంతేకాకుండా ప్రతి స్వీట్ బాక్స్‌లో క్యుఆర్ కోడ్ ఏర్పాటు చేశారు, దీనిని స్కాన్ చేసి నేరుగా నవదంపతులకు ఆశీర్వాదాలు కూడా పంపవచ్చు.ఆలయాల్లో... అన్నదానం...అదే సమయంలో, అన్నదానం – ఆహారాన్ని పవిత్రంగా సమర్పించడం – భారతదేశంలోని అనేక దేవాలయాలలో నిర్వహిస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక సేవ... ఆ దేవుళ్ల ఆశీర్వాదాలను కోరుతూనే తమ వంతుగా సమాజానికి తిరిగి ఇవ్వాలనే రష్మిక విజయ్ ల ఉద్దేశ్యాన్ని నొక్కి చెబుతుంది, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ ఇతర రాష్ట్రాలలోని పదహారు దేవాలయాలలో ‘అన్నదానం‘ నిర్వహించారు. వీటిలో బెంగళూరులోని శివోహం ఆలయం, బృందావనంలోని శ్రీ శ్రీ కృష్ణ బలరాం మందిర్ వంటివి ఉన్నాయి.తమ వివాహాన్ని ఒక ఖరీదైన వేదికకు మాత్రమే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా ఉన్న నగరాలకు విస్తరించడం ద్వారా, ప్రముఖుల వివాహ వేడుక అర్ధాన్ని ఈ జంట పునర్నిర్వచించారు. ఇది కేవలం ఇద్దరు తారల మధ్య కలయిక మాత్రమే కాదు, సామూహిక ఆనందంతో మేళవించిన జాతీయ అనుభవంగా మార్చారు. నేషనల్ క్రష్ అనే బిరుదును ఆనందించడం మాత్రమే కాదు ఆ స్థాయి ఇచ్చిన వాళ్లను గుర్తుంచుకోవడం కూడా తనకు తెలుసని విజయ్ తోడుగా రష్మిక తెలియజెప్పారు. ‘ఈ దేశంలోని అందరు అందమైన ప్రజలకు, మీరు ఎల్లప్పుడూ మా ప్రయాణాలలో మా ప్రేమలో భాగమయ్యారు. మీ అందరికీ సన్నిహితంగా మా వివాహాన్ని జరుపుకోవడం మాకు నిజంగా సంతోషంగా ఉంటుంది’’ అంటూ వీరు సోషల్ మీడియాలో ఇచ్చిన తమ వివాహ ప్రకటన రికార్డులను బద్దలు కొట్టింది, ఆసియాలో అత్యధికులు లైక్ చేసిన పోస్ట్‌గా విరాట్ కోహ్లీ గత రికార్డును అధిగమించింది.విద్యాదానం...తెలంగాణలోని తుమ్మన పేటలో విద్యార్థుల కోసం స్కాలర్షిప్లను ఈ విరోష్ జంట ప్రకటించారు. పెళ్లి తర్వాత నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట డివిజన్లోని విజయ్ స్వస్థలాన్ని ఈ జంట సందర్శించారు, నిరుపేదలకు విద్యాదానం చేయడానికి తమ వంతు సాయం అందించారు.దేవరకొండ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించిన ఈ స్కాలర్షిప్లు, ఈ ప్రాంతంలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లోని 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తాయి. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న టీనేజర్లకు సహాయం చేయడం వారి చదువును కొనసాగించడానికి ప్రోత్సహించడం, ముఖ్యంగా వారు కీలకమైన పాఠశాల పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు వారికి ఆసరాగా నిలవడం ఈ కార్యక్రమ ప్రాథమిక లక్ష్యం.తరచుగా ఆ గ్రామాన్ని సందర్శించి గ్రామాభివృద్ధి కోసం తమ వంతు సాయం చేస్తామ ని ఈ సందర్భంగా ఈ జంట జనం సాక్షిగా ప్రతిజ్ఞ చేశారు. స్కాలర్షిప్ కార్యక్రమం ప్రత్యేకతలను వివరిస్తూ, విజయ్ గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు జనంలో నుంచి వచ్చిన హర్షాతిరేకాలకు విజయ్ దేవరకొండ తల్లి మాధవి పొంగిపోయారు. మరి ఇది కదా పుత్రోత్సాహం అంటే... మార్చి 4న హైదరాబాద్‌లో ఈ జంట రిసెప్షన్ వేడుక నిర్వహించనుంది. మరోవైపు సెప్టెంబర్‌లో విడుదల కానున్న ’రణబాలి’ చిత్రంలో రష్మిక విజయ్ ఇద్దరూ కలిసి కనిపించనున్నారు. గీత గోవిందం తర్వాత ఇది వారి మూడవ చిత్రం కాగా పెళ్లి తర్వాత వీరు కలిసి నటించిన తొలి చిత్రం కానుంది. తారలంటే తెరమీద నుంచి ఆనందం పంచేవారు మాత్రమే కాదు తమను ఆదరించిన సమాజానికి కృతజ్ఞత పంచేవారు కూడా అని నిరూపించిన వీరిద్దరికీ ప్రేక్షక దేవుళ్ల ఆశీర్వచనాలు ఎప్పుడూ ఉంటాయని ఉండాలని కోరుకుందాం. -
విరోష్ వెడ్డింగ్.. సూపర్ హిట్
-
అభిమానులకు విజయ్- రష్మిక ప్రత్యేక విందు.. వీడియో వైరల్
టాలీవుడ్ కొత్త జంట విజయ్ దేవరకొండ- రష్మిక తమ గ్రాండ్ వెడ్డింగ్ అభిమానులతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇటీవల సొంతూరుకి వెళ్లిన కొత్త జంట సత్యనారాయణవ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. తమ సొంతవారితో ఈ వేడుక జరుపుకోవడం ఆనందంగా ఉందని నూతన దంపతులు తెలిపారు.తాజాగా విజయ్- రష్మిక అభిమానుల కోసం ప్రత్యేకంగా లంచ్ ఏర్పాటు చేశారు. వారికి స్వయంగా భోజనాలు వడ్డించారు. అనంతరం వీరిద్దరు వారితో పాటే కలిసి భోజనం చేశారు. విజయ్‌కి రష్మిక భోజనం తినిపిస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. టాలీవుడ్ కొత్త జంట విజయ్ దేవరకొండ- రష్మిక ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో అత్యంత సన్నిహితులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. ఈనెల 4న హైదరాబాద్‌లో వీరి గ్రాండ్ రిసెప్షన్ వేడుక జరగనుంది. The Newlyweds #VijayDeverakonda and #RashmikaMandanna had lunch with fans.#VIROSH pic.twitter.com/VkRnVkgood— Gulte (@GulteOfficial) March 3, 2026 -
హ్యాపీ పార్టీ
విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా వివాహం ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కాగా, పెళ్లికి ముందు జరిగిన వేడుకల్లో సంగీత్కి సంబంధించిన ఫొటోలను మంగళవారం విజయ్–రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘ఆ రోజు (సంగీత్ని ఉద్దేశించి) సాయంత్రం కన్నీళ్లు వచ్చేంతవరకూ నవ్వుతూనే ఉన్నాం. మా పాదాలు నొప్పి పుట్టేంతవరకు డ్యాన్స్ చేశాం. అందరి స్పీచ్‌లతో భావోద్వేగానికి గురయ్యాం.మా కళ్లు చమర్చేలా సంభ్రమాశ్చర్యాలతో మంచి మనుషులతో గడిపిన బిగ్ హ్యాపీ పార్టీ ఇది’’ అని ‘ఎక్స్’లో విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. ‘‘ఆ రోజు సాయంత్రం నేను, విజ్జు ఒకరినొకరం సర్ప్రైజ్ చేసుకోవాలనుకున్నాం. ఫ్యామిలీ మమ్మల్ని సర్ప్రైజ్ చేయాలనుకుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ స్వేచ్ఛగా డ్యాన్స్ చేయడం మాకు సంతోషాన్నిచ్చింది. ఆ రోజు రాత్రి నేను, విజయ్ బాగా డ్యాన్స్ చేశాం’’ అని పేర్కొన్నారు రష్మిక. ఇదిలా ఉంటే... తమ ఫ్యాన్స్ కోసం విజయ్–రష్మిక ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. ఈ ఇద్దరూ స్వయంగా వడ్డించడంతో పాటు అభిమానులను ఆత్మీయంగా పలకరించి, వారితో కలిసి భోజనం చేశారు. -
పెళ్లిలో హైలైట్... రష్మిక నగలు!
-
విజయ్ దేవరకొండ నయా ట్రెండ్ : డైమండ్ ఎమరాల్డ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్
Virosh Wedding సినిమా స్టార్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి సందడిలోని ప్రతీ వేడుకు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పెళ్లి తరువాత సొంత ఊరిలో కొత్త దంపతుల సత్యనారాయణ వ్రతం, భోజనాల విశేషాల సందడి ముగియముందే ఈ జంట సంగీత్ వేడుక ఫోటోలను పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. పదండి దాని సంగతులేంటో తెలుసుకుందాం.రష్మిక ఎప్పటిలాగానే డైమండ్ ఆభరణాలతో నిండుగా కనిపించింది. ఇక విజయ్ దేవరకొండ తన 'సంగీత్' వేడుకలో ధరించిన స్పెషల్ హారం అందరి దృష్టిని ఆకర్షించింది. విజయ్ మెడలోని ప్రత్యేకమైన పచ్చ నెక్లెస్ దృష్టిని ఆకర్షించింది. విజయ్ దేవరకొండ పెళ్ళిలో రాకుమారుడిలా నగలతో కొత్త ఫ్యాషన్ ట్రెండ్‌కు నాంది పలికాడు. తన వెడ్డింగ్ లుక్స్‌తో అభిమానులను ఆశ్చర్యపరచడమే కాకుండా, తన సంగీత్ వేడుకలో అతని ఫ్యాషన్ స్టేట్మెంట్ కూడా చాలామంది దృష్టిని ఆకర్షించింది. విజయ్ ,రష్మిక ఫల్గుణి షేన్ పీకాక్ దుస్తుల్లో నాట్య మయూరాల్లా విన్యాసాలు చేశారు. విజయ్ ముదురు నీలం రంగులో ఉన్న కుర్తా-పైజామా సెట్‌ను ఎంబ్రాయిడరీ కోటుతో ధరించగా, రష్మిక సిల్వర్ కలర్ లెహంగాను ధరించింది.యూనిక్ ఎమరాల్డ్ నెక్లెస్విజయ్ ప్రత్యేకమైన వజ్రాలు పొదిగిన పచ్చ నెక్లెస్ మాత్రం స్పెషల్ ఎట్రాక్షన్. విజయ్ నెక్లెస్‌లో మధ్యలో భారీ పచ్చ లాకెట్టు అందంగా అమిరిందిన. ఆ లాకెట్టు పైన ఒక పెద్ద డైమండ్ క్యాప్ మరింత వన్నెతెచ్చింది. అలాగే ఎంగేజ్మెంట్ రింగ్‌గా భావిస్తున్న విజయ్ పదహారు రాళ్ల డైమండ్ రింగ్ చాలా విలక్షణమైంది.ఆ ఉంగరంలో ప్రేమకు చిహ్నంగా బ్రాండ్ క్రిస్క్రాస్ X మోటిఫ్ కూడా ఉంది. ఈ వజ్రపు ఉంగరం ధర సుమారు రూ. 15 లక్షలు ఫిబ్రవరి 26, 2026న, తెలుగు, కొడవ సంప్రదాయల ప్రకారం వివాహ వేడుక జరిగితన తరువాత తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. (విజయ్‌పై మాజీ అసిస్టెంట్ సెల్వరాజ్ సంచలన ఆరోపణలు) -
విజయ్, రష్మిక రిసెప్షన్ రూల్స్.. సింగిల్ ఎంట్రీ కోడ్
విజయ్ దేవరకొండ, రష్మిక రిసెప్షన్ వేడుక గురించి ఒక వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. తమ ఫ్యాన్స్ కోసం దేశవ్యాప్తంగా పలు నగరాల్లో స్వీట్లు పంచారు. ప్రధాన ఆలయాల్లో భోజనాలు పెట్టారు. ఇలా తమ సంతోషాన్ని అందరితో పంచుకున్నారు. అయితే, మార్చి 4న వీరి వివాహ రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకలో సినీ, రాజకీయ నాయకులు పాల్గొననున్నారు. అందుకోసం పోలీసులు కఠినమైన భద్రతను ఏర్పాటు చేశారు.(ఇదీ చదవండి: 'విరోష్' పెళ్లి కానుక.. శుభవార్త చెప్పిన విజయ్ దేవరకొండ)మార్చి 4, 2026న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ రిసెప్షన్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు చాలామంది సినీ, రాజకీయ నాయకులు పాల్గొననున్నారు. దీంతో కార్యక్రమానికి ఎంట్రీ అయ్యే వారికి చాలా కఠినమైన నియమాన్ని విధించింది. రిషెప్షన్‌కు వచ్చే అతిథులు లోపలికి వెళ్లాలంటే ఒకసారి మాత్రమే ఉపయోగించగల QR కోడ్‌ను ఏర్పాటు చేశారు. రోండోసారి ఆ కోడ్ పనిచేయదు. ఒక్కసారి లోపలికి ఎంట్రీ ఇస్తే బయటకు వచ్చేందుకు ఛాన్స్ వుండదు.రిసెప్షన్‌కు ఆహ్వానం, QR కోడ్లు లేని వారు అక్కడికి రావద్దని ఇప్పటికే తెలిపారు. ఇది పూర్తిగా పోలీసుల నిఘాలో ఉన్నందున హాజరు కావద్దని వారు అధికారికంగా ప్రకటించారు. పరిస్థితిని అర్థం చేసుకుని భద్రతా చర్యలకు సహకరించాలని విజయ్ టీమ్ కోరింది.(ఇదీ చదవండి: సొంతూరు ప్రజలకు విందు.. విజయ్‌పై విమర్శలు) -
సొంతూరులో సత్యనారాయణ స్వామి వ్రతం.. విజయ్, రష్మిక స్పెషల్ (ఫోటోలు)
-
సొంతూరు ప్రజలకు విందు.. విజయ్‌పై విమర్శలు
సతీమణి రష్మికతో పాటు విజయ్ దేవరకొండ తన సొంతూరులో సందడి చేశారు. పెళ్లి తర్వాత తొలిసారి స్వగ్రామానికి తిరిగి రావడంతో స్థానికులు సంతోషించారు. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం తుమ్మన్‌పేటలో తమ ఫాంహౌజ్‌లో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. కొత్తగా నిర్మించుకున్న ఇంట్లో భక్తిశ్రద్ధలతో గృహ ప్రవేశ పూజలు నిర్వహించారు. తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయితే, గ్రామస్థులకు, అభిమానులకు ఏర్పాటు చేసిన విందులో నాన్- వెజ్ ఏర్పాటు చేయడం నెట్టింట వైరల్ అయింది. సత్యనారాయణ స్వామి వ్రతం సమయంలో అతిథిలకు నాన్- వెజ్ ఆహారం పెట్టడం ఏంటి అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే, విజయ్ ఇచ్చిన విందుకు గ్రామస్తులు ఫిదా అయ్యారు. చాలామంచి భోజనంతో పాటుగా అందరినీ గౌరవంగా పలకరించారని చెబుతున్నారు. హిందూ సంప్రదాయాల ప్రకారం సత్యనారాయణ వ్రతం వంటి పూజలు జరిగిన సమయంలో శాఖాహారం (వెజ్) మాత్రమే అతిథిలకు వడ్డిస్తారు. కానీ, విజయ్ దేవరకొండ వెజ్‌తో పాటు నాన్-వెజ్ కూడా వడ్డించారు. ఈ క్రమంలో ఆయనపై విమర్శలు వస్తున్నాయి. అయితే, తెలంగాణ నెటిజన్లు మాత్రం ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు. హిందూ సంప్రదాయాల అందరూ పాటిస్తారంటూనే ప్రాంతాన్ని బట్టి కొన్ని పద్దతులు మారుతాయని చెబుతున్నారు. తెలంగాణలో భక్తితో పాటు తమ ఆహారం పట్ల ప్రత్యేకమైన శైలి ఉంటుందని గుర్తు చేస్తున్నారు. విజయ్ వారింట్లో పూజ ముగిసిన తర్వాత స్వామివారి పీఠాన్ని జరిపి ఆ కార్యక్రమాన్ని మొదట పూర్తి చేశారని చెబుతున్నారు. ఆ తర్వాతనే మాంసాహార విందును ఏర్పాటు చేశారని తెలుపుతున్నారు. తెలంగాణలోని చాలా కుటుంబాల్లో ఇలాంటి ఆనవాయితీగా వస్తోందని నెటిజన్లు పేర్కొంటున్నారు. విజయ్ ఇంటికి దూరంగానే నాన్- వెజ్ ఆహారం వడ్డించారని చెబుతున్నారు. తెలంగాణలో ఇప్పటికీ చాలా గ్రామాల్లో పూజ పూర్తయిన సాయంత్రం లేదా మరుసటి రోజు తప్పకుండా విందు ఉంటుందని అందులో మాంసం వడ్డించడం సర్వసాధారణమని గుర్తుచేస్తున్నారు.సొంతిల్లు కట్టుకున్నా: విజయ్స్వగ్రామం తుమ్మన్‌పేటకు మూడు దశబ్దాలుగా దూరంగా ఉన్నప్పటికీ తమ కుటుంబానికి గ్రామస్థులతో విడదీయరాని అనుబంధం ఉందని విజయ్ దేవరకొండ తెలిపారు. తన తొలి పుట్టినరోజు కూడా ఇదే గ్రామంలో నిర్వహించినట్లు అమ్మా నాన్న చెప్పారని ఆయన గుర్తుచేసుకున్నారు. తన తండ్రి కోరిక మేరకు స్వగ్రామంలో ఇల్లు నిర్మించుకున్నానని ఆయన అన్నారు. అందుకే తన వివాహానంతరం వ్రతం చేసి గ్రామస్థులకు, అభిమానులకు విందు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతిఒక్కరు భోజనం చేసి తమను ఆశీర్వదించాలని కోరారు. తుమ్మన్‌పేట పాఠశాలలో 9, 10వ తరగతుల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఉపకారవేతనం ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి అచ్చంపేట పరిధిలోని 44 పాఠశాలల విద్యార్థులకు దీన్ని అమలు చేస్తానన్నారు.ఊరందరికీ వివాహభోజనం పెట్టిన #VijayDeverakondaసొంత ఊర్లో సత్యనారాయణ వ్రతం చేసిన అనంతరం బంధుమిత్రులనదరికీ గ్రామస్తులకు విందు భోజనం పెట్టిన విజయ్ దేవరకొండ..#Virosh ❤️ pic.twitter.com/tojnbgBJcj— Suresh PRO (@SureshPRO_) March 2, 2026 -
Vijay-Rashmika: శుభవార్త చెప్పిన కొత్త జంట
-
విజయ్ దేవరకొండ & రష్మిక సత్యనారాయణ స్వామి వ్రతం
-
సొంతూరుకు విజయ్ వరాలు... ఆనంద్ పెళ్లి ఇక్కడే చేస్తా
-
సంగీత్ పార్టీలో విరోష్ జోడీ.. ఫోటోలు షేర్ చేసిన విజయ్ (ఫోటోలు)
-
'విరోష్' పెళ్లి కానుక.. శుభవార్త చెప్పిన విజయ్ దేవరకొండ
హీరోయిన్ రష్మికని పెళ్లి చేసుకున్న తర్వాత విజయ్ దేవరకొండ.. సోమవారం తన సొంతూరు అయిన తుమ్మనపేటకు వచ్చాడు. ఈ గ్రామం తెలంగాణలోని అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలంలో ఉంది. సొంతూరిలోని ఫామ్ హౌస్‌లో నూతన వధూవరులిద్దరూ సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ప్రజలందరికీ వెజ్-నాన్ వెజ్ భోజనాలు కూడా పెట్టారు. అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: భర్తని చూస్తూ సిగ్గుపడిపోతూ.. రష్మిక వీడియో వైరల్)సొంతూరితో ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఉంది. ఊర్లో పొలం కొందాం వ్యవసాయం చేసుకుందాం ఇల్లు కట్టుకుందామని నాన్న ఎప్పుడూ అడిగేవాడు. ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది . ఊరిలో ఇల్లు కట్టుకోవడం పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడంతో హ్యాపీ. ఇకనుంచి గ్రామానికి రెగ్యులర్‌గా వస్తాం. తమ్ముడు ఆనంద్ పెళ్లి గ్రామంలోని అందరి సమక్షంలో చేస్తాం. ఊరికి చేసేది చాలా ఉంది. అందరం కలిసి ఊరిని అభివృద్ధి చేసుకుందాం. దేవరకొండ ఫౌండేషన్ ద్వారా అచ్చంపేట నియోజకవర్గంలోని 44 ప్రభుత్వ స్కూళ్లలో 9వ తరగతి, 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తాం అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.ఇకపోతే నిన్న అనగా ఆదివారం.. దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో అభిమానుల కోసం 'విరోష్' జంట అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పలుచోట్ల స్వీట్ల పంపిణీ కూడా చేశారు. ఈ బుధవారం(మార్చి 04) హైదరాబాద్‌లో రిసెప్షన్ జరగనుంది. దీనికి టాలీవుడ్‌కి చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు చాలామంది హాజరు కానున్నారు. (ఇదీ చదవండి: సీఎం ఇంట్లో కొత్త పెళ్లికూతురు రష్మిక.. ఫొటోలు వైరల్)విరోష్ పెళ్లికానుక.. విద్యార్థులకు విజయ్ దేవరకొండ శుభవార్తవిజయ్ దేవరకొండ తన 'విరోష్' పెళ్లికానుకగా విద్యార్థులకు భారీ శుభవార్త చెప్పారు. తమ ట్రస్ట్ ద్వారా మొదట అచ్చంపేట డివిజన్లోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతి ప్రతిభావంతులకు స్కాలర్షిప్లు అందజేయనున్నారు. భవిష్యత్తులో ఈ… pic.twitter.com/nwMlm0M7sI— ChotaNews App (@ChotaNewsApp) March 2, 2026 -
భర్తని చూస్తూ సిగ్గుపడిపోతూ.. రష్మిక వీడియో వైరల్
టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ-రష్మిక.. గతవారం పెళ్లి చేసుకున్నారు. ఉదయ్‌పుర్ వేదికగా జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌తో ఒక్కటయ్యారు. తిరిగి హైదరాబాద్ వచ్చేసిన కొత్త జంట.. తెలంగాణలోని తుమ్మనపేట అనే గ్రామానికి వెళ్లారు. విజయ్ దేవరకొండ సొంతూరు ఇది. సోమవారం ఉదయం అక్కడే సత్యనారాయణ వ్రతం చేశారు. అలానే ఊరి వాళ్లందరికీ భోజనాలు కూడా పెట్టించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు చాలానే వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: సీఎం ఇంట్లో కొత్త పెళ్లికూతురు రష్మిక.. ఫొటోలు వైరల్)అయితే ఈ మొత్తం వాటిలో ఒక్క వీడియో మాత్రం విరోష్ (ViRosh) అభిమానుల్ని తెగ ఆకట్టుకుంటోంది. ఎందుకంటే ఇందులో రష్మిక.. తన భర్త విజయ్‌ని చూస్తూ సిగ్గుపడుతూ కనిపించింది. విజయ్ తనని చూసేసరికి రష్మిక ముఖాన్ని పక్కకు తిప్పుకొని మురిసిపోయింది. పూజ చేస్తున్న టైంలో ఈ క్యూట్ మూమెంట్ కనిపించింది.విజయ్ దేవరకొండ స్వస్థలం తెలంగాణలోని అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలం తుమ్మనపేట. తన వివాహం తర్వాత తొలిసారి సతీమణి రష్మికతో సొంతూరికి వచ్చాడు. తన ఫామ్ హౌస్‌లోనే సత్యనారాయణ వ్రతం జరిపించాడు. అలానే ఆదివారం దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో అభిమానుల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించాడు. పలుచోట్ల స్వీట్లు పంపిణీ చేశాడు. ఈ బుధవారం(మార్చి 04) హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)#VijayDeverakonda & #RashmikaMandanna ❤️pic.twitter.com/9S7AW5b0Zw— cinee worldd (@Cinee_Worldd) March 2, 2026 -
విజయ్-రష్మిక.. సత్యనారాయణ స్వామి వ్రతం
-
స్వగ్రామంలో విజయ్, రష్మిక సందడి
-
విజయ్ సొంతూరుకు 'విరోష్' జోడీ
విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న ఫిబ్రవరి 26న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెద్దల అంగీకారంతో ఉదయ్‌పూర్‌లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత తొలిసారి సతీమణితో పాటుగా తన సొంతూరుకు విజయ్ చేరుకున్నారు. దీంతో భారీగా అభిమానులు, కుటుంబ సభ్యులు తరలివచ్చారు. తెలంగాణలోని మారుమూల గ్రామంలో జన్మించిన విజయ్ స్వశక్తితో ఎదిగి ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపుని సాధించారు. తనకు ఇష్టమైన రష్మికని సినిమానే దగ్గర చేసింది. తమకు అభిమానులు పెట్టిన ‘విరోష్’ ట్యాగ్‌నే వివాహ వేడుకకి పేరుగా పెట్టుకుని వారికి ప్రథమ స్థానం ఇచ్చారు. అంతటితో ఆగని ఈ జంట దేశవ్యాప్తంగా పలు నగరాల్లో స్వీట్లు పంపిణీ చేసి ఫ్యాన్స్ నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే, ఇప్పుడు వివాహ అనంతరం సొంత ఊరుకు తొలిసారి జంటగా చేరుకోవడంతో అక్కడ సందడి వాతావారణం నెలకొంది.విజయ్ దేవరకొండ స్వస్థలం తెలంగాణలోని అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలం తుమ్మనపేట. తన వివాహం తర్వాత తొలిసారి సతీమణి రష్మికతో సొంతూరు రావడంతో తన చిన్ననాటి స్నేహితులు అందరూ చేరుకున్నారు. నేడు (మార్చి 2న) తుమ్మనపేటలోని ఆయన ఫామ్ హౌస్‌లో సత్యనారాయణ వ్రతం జరిపించనున్నారు. ఇప్పటికే సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. విజయ్ అనుకుంటే హైదరాబాద్‌లోనే ఈ కార్యక్రమం జరిపించవచ్చు. కానీ, తన సొంతూరు గ్రామ ప్రజల సమక్షంలో ఈ వేడుక జరగాలని ఆయన కోరుకున్నట్లు తెలుస్తోంది. (వీడియో క్రెడిట్ — Telugu Scribe)స్వగ్రామానికి చేరుకున్న విజయ్ దేవరకొండ దంపతులునాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్ పేట గ్రామానికి చేరుకున్న నవదంపతులు విజయ్ దేవరకొండ - రష్మిక మందన్ననూతన ఫామ్ హౌస్‌లో గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించనున్న నవ దంపతులు https://t.co/GUBdsVIVLA pic.twitter.com/9GRJBql2Uu— Telugu Scribe (@TeluguScribe) March 2, 2026 -
అల్లు అర్జున్ ఇంటికి విజయ్, రష్మిక జోడీ (ఫోటోలు)
-
విజయ్, రష్మికల రిసెప్షన్.. ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి
విజయ్ దేవరకొండ , రష్మికల వివాహం ఫిబ్రవరి 26న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఉదయ్‌పూర్‌లో కొద్దిమంది సమక్షంలో వారిద్దరు వివాహం చేసుకున్నారు. అయితే, పరిశ్రమలోని ప్రముఖులతో పాటు పలు రాజకీయ నాయకుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కూడా కొద్దిమంది మాత్రమే పాల్గొననున్నారు. తాజాగా విరోష్ జోడి తమ ఫ్యాన్స్‌కు, ఈ వేడుకకు హాజరయ్యే అతిథులకు విజ్ఞప్తి చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి 4న సాయంత్రం జరిగే రిసెప్షన్ వేడుకకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆహ్వానం అందిన అతిథులు మాత్రమే హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. ఆహ్వానం లేకుండా ఇతరులు ఈ వేడకకు వచ్చి ఇబ్బంది పడొద్దని ప్రకటనలో పేర్కొన్నారు.విజయ్, రష్మిక రిసెప్షన్ కోసం సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీస్‌ల ఆంక్షల నేపథ్యంలో ఆహ్వానం లేకుండా ఇతరులు, అభిమానులు ఈ కార్యక్రమానికి రావొద్దని, వచ్చి ఇబ్బందుల పాలు కావద్దని విరోష్ జంట కోరింది. మీ క్షేమమే మాకు ముఖ్యమని, మీరు ఎక్కడున్నా మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నట్లు టీమ్ తెలిపింది. -
సీఎం ఇంట్లో కొత్త పెళ్లికూతురు రష్మిక.. ఫొటోలు వైరల్
టాలీవుడ్ హీరోహీరోయిన్ విజయ్ దేవరకొండ, రష్మిక.. గతవారం ఉదయ్‌పుర్ వేదికగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. ఆదివారం నాడు దేశవ్యాప్తంగా పలు నగరాల్లోని ఆలయాల్లో అన్నదానం, స్వీట్ల పంపిణీ లాంటి కార్యక్రమాలు చేశారు. ఇకపోతే ఈ బుధవారం(మార్చి 04) హైదరాబాద్‌లో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి సినీ రాజకీయ ప్రముఖులు రాబోతున్నారు.(ఇదీ చదవండి: 'పెద్ది' మొదలుపెట్టేశాడు.. బుచ్చిబాబుని ఆడుకున్న చరణ్)పెళ్లి జరగడానికే ముందే విజయ్ దేవరకొండ వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వచ్చారు. అయితే అది పెళ్లి ఆహ్వానం కోసమే అని అంతా అనుకున్నారు. ఇప్పుడు కొత్త పెళ్లి కూతురు రష్మిక.. స్వయంగా రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి.. ఆయన కుటుంబాన్ని రిసెప్షన్‌కి వ్యక్తిగతంగా ఆహ్వానించింది. ఈ క్రమంలోనే రష్మికని సాదరంగా ఆహ్వానించిన రేవంత్ రెడ్డి దంపతులు.. తెలుగు సంప్రదాయంలో భాగంగా చీరపెట్టి గౌరవించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.రిసెప్షన్ సందర్భంగా అభిమానులని ఉద్దేశిస్తూ.. 'విరోష్' జోడి ఓ నోట్ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్లో మార్చి 04 సాయంత్రం వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. కొద్దిమంది సన్నిహితులు, పరిమిత సంఖ్యలో అతిథులు ఇందులో పాల్గొనున్నారు. పోలీసులు ఆంక్షల నేపథ్యంలో ఆహ్వానం లేకుండా ఇతరులు, అభిమానులు ఈ కార్యక్రమానికి రావొద్దు. వచ్చి ఇబ్బంది పడొద్దు అని ఇందులో విజ్ఞప్తి చేశారు. (ఇదీ చదవండి: అల్లు అర్జున్‌తో సినిమా.. 15 రోజులు తినడం మానేశా) -
హైదరాబాద్ టీటీడీ ఆలయంలో విజయ్-రష్మిక (ఫొటోలు)
-
'రణబాలి' పోస్టర్ వెనుక ఎమోషనల్ స్టోరీ: దర్శకుడు
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి సందర్భంగా రణబాలి నుంచి ఒక పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వారిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో నెట్టింట వైరల్ అయింది. పోస్టర్లో వారిద్దరి లుక్ చాలా ఓల్డ్ గెటప్‌లో ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే, దీని వెనుక దాగిన ఆసక్తికరమైన స్టోరీని చిత్ర దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ షేర్ చేశారు. రణబాలి నుంచి తాజాగా విడుదలైన పోస్టర్ కేవలం ఒక సినిమాకు సంబంధించినది మాత్రమే కాదని తెలిపారు. ఈ పోస్టర్ రూపకల్పనలో ఎన్నో భావోద్వేగాలు ఉన్నాయని చెప్పారు. పాత కాలపు ఫోటోలంటే తనకు ఎంతో ఇష్టమని దర్శకుడు గుర్తుచేసుకున్నారు. మన పూర్వీకులు కెమెరా ముందు ఎలాంటి కృత్రిమమైన ఫోజులు లేకుండా చాలా సహజంగా ఫోటోలు దిగేవారని చెప్పారు. అలాంటి కృత్రిమమైన లుక్‌ను రణబాలి పోస్టర్లో తీసుకురావాలని తాము ప్రయత్నించినట్లు రాహుల్ సాంకృత్యన్ తెలిపారు.రణబాలి పోస్టర్ గురించి దర్శకుడు ఇలా చెప్పారు. '1800ల కాలం నాటి నేపథ్యంలో ‘రణబాలి’ మూవీ ఉండనుంది. కాబట్టి, ఆ కాలపు గాంభీర్యం, మట్టి వాసన కనిపించేలా ఈ చిత్రంలో వివాహ వేడుకను డిజైన్ చేశాం. ఈ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో విజయ్, రష్మిక పెళ్లి దుస్తుల్లో వచ్చినప్పుడు వారిద్దరూ నిజంగానే మన పూర్వపు కాలంలోకి వెళ్ళిన వ్యక్తుల్లా కనిపించారు. ఫోటో లుక్‌లో కూడా వారిద్దరూ ఎలాంటి స్టైలిష్ ఫోజులు ఇవ్వలేదు. కేవలం సాధారణ వ్యక్తుల్లా వారిద్దరినీ కెమెరాతో బంధించాం. ఇదే ఈ పోస్టర్ ప్రత్యేకత. ఈ సినిమా పోస్టర్ విడుదల నాటికి వారిద్దరూ నిజ జీవితంలో ఒక్కటి కావడం ఆశ్చర్యంగా అనిపించింది. ఒక్కోసారి సినిమా, నిజ జీవితం రెండూ పలకరించుకుంటాయ్. ఈ పోస్టర్ చూస్తుంటే వారి గత జన్మకు సంబంధించిన పెళ్లి ఫోటోలా అనిపిస్తుంది.' అని రాహుల్ సాంకృత్యన్ ఎమోషనల్ స్టోరీ రాసుకొచ్చారు.STORY BEHIND THE WEDDING POSTERYesterday, we released the wedding poster of Ranabaali.But this wasn’t designed as a “poster.” It was a moment.I’ve always been fascinated by old photographs — our parents, grandparents… the way they stood before a camera. No posing. No… pic.twitter.com/ppuBj9tMjQ— Rahul Sankrityan (@Rahul_Sankrityn) March 1, 2026 -
విజయ్, రష్మిక మూడోసారి.. చిరు-త్రిష రెండోసారి.. జోడీ రిపీట్
వెండితెరపై ఓ హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కుదిరి, ఆ సినిమా హిట్ కూడా అయితే అప్పుడు ‘హిట్ పెయిర్’ అనిపించుకుంటారు. ఆ హిట్ పెయిర్ కాంబినేషన్‌కి ఓ స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అలాంటి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న కొన్ని జోడీలు రిపీట్ అవుతున్నాయి. తొలిసారి జోడీగా నటించి, సక్సెస్ సాధించిన ఈ జంటకు సక్సెస్ రిపీట్ కావడం ఖాయం అనే అంచనాలున్నాయి. ఇక... రిపీట్ అవుతున్న జోడీల గురించి తెలుసుకుందాం. రెండోసారి... ఈ మధ్య చిరంజీవి హీరోగా నటించిన చిత్రాల్లో ‘విశ్వంభర’ మూవీ ఒకటి. ‘బింబిసార’ మూవీ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహించారు. త్రిష మెయిన్ హీరోయిన్గా, ఆషికా రంగనాథ్ సెకండ్ హీరోయిన్గా నటించారు. చిరంజీవి, త్రిష కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘స్టాలిన్ ’. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2006 సెప్టెంబరు 20న విడుదలై, హిట్‌గా నిలిచింది. ఆ చిత్రం తర్వాత వీరి కాంబోలో మరో సినిమా రాలేదు. దాదాపు 20 ఏళ్ల తర్వాత వీరి జోడీ ‘విశ్వంభర’ సినిమాతో రిపీట్ అవుతోంది. ‘‘స్టాలిన్’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన చిరంజీవి–త్రిష జోడీ ‘విశ్వంభర’తో రెండోసారీ అలరించనుంది. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్‌గా ఈ మూవీ రూపొందింది. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్ఫై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. చిరంజీవి పుట్టినరోజుని పురస్కరించుకుని 2025 ఆగస్టు 22న విడుదల చేసిన ‘విశ్వంభర’ సినిమా గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. ఈ వేసవిలో సినిమాని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘‘వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పనుల వల్ల సినిమా విడుదల ఆలస్యం అయింది. చందమామ కథలా సాగిపోయేటటువంటి అద్భుతమైన కథ ‘విశ్వంభర’. ముఖ్యంగా చిన్నపిల్లలకు, మరీ ముఖ్యంగా పెద్దవాళ్లలో ఉండే చిన్న పిల్లలను సైతం ఇది అలరిస్తుంది... వినోదపరుస్తుంది. ఈ వేసవికి ఈ సినిమా మీ ముందు ఉంటుంది. నాది భరోసా’’ అని చిరంజీవి పేర్కొన్న సంగతి తెలిసిందే. వందో చిత్రంలో... హీరో నాగార్జున, హీరోయిన్ టబు జోడీకి ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరి పేరు చెప్పగానే ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా గుర్తొస్తుంది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలో మొదటిసారి నటించారు నాగార్జున–టబు. 1996 అక్టోబరు 4న రిలీజైన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో తమదైన నటనతో ఆడియన్స్‌ని ఆకట్టుకున్నారు నాగార్జున–టబు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత నాగార్జున–టబు కలిసి నటించిన చిత్రం ‘ఆవిడా మా ఆవిడే’. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1998 జనవరి 14న విడుదలైంది. ఈ చిత్రంలోనూ మరోసారి సందడి చేశారు. ఆ తర్వాత వీరిద్దరూ జోడీగా నటించలేదు. కానీ, ‘సిసింద్రి’ (1995) సినిమాలో మాత్రం ‘ఆటాడుకుందాం రా అందగాడా...’ అంటూ సాగే స్పెషల్ సాంగ్‌లో సందడి చేశారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత నాగార్జున–టబు ముచ్చటగా మూడోసారి నటిస్తున్నారు. నాగార్జున కెరీర్లో 100వ సినిమాగా రూపొందుతోన్న చిత్రం ‘కింగ్ 100’ (వర్కింగ్ టైటిల్). ఈ మూవీకి తమిళ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌పై అక్కినేని నాగార్జున ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నాగార్జున కెరీర్లో మైలురాయిలాంటి ఈ చిత్రంలో మరోసారి ఆయనకి జోడీగా టబు నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ మైసూర్లో జరుగుతోంది. మూడోసారి... హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికా మందన్నా జోడీకి పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ వంటి సినిమాల్లో జంటగా నటించిన వీరిద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘రణబాలి’. విజయ్–రష్మిక కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ‘గీత గోవిందం’. పరశురాం దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018 ఆగస్టు 15న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ మూవీ తర్వాత వీరిద్దరూ జోడీగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 జూలై 16న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం విడుదలైన దాదాపు ఏడేళ్లకు విజయ్–రష్మిక కలిసి నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. విజయ్ దేవరకొండతో ‘టాక్సీవాలా’ (2018) వంటి హిట్ మూవీ తెరకెక్కించిన రాహుల్ సంకృత్యాన్ ‘రణబాలి’కి దర్శకత్వం వహిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిలింస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా వారి లైఫ్‌లో ప్రత్యేకంగా నిలవనుంది. ఎందుకంటే.. రీల్ లైఫ్‌లో జోడీగా నటించిన విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా రియల్ లైఫ్‌లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడమే. ఫిబ్రవరి 26న వీరి వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత వీరి కాంబోలో రానున్న ‘రణబాలి’ మూవీపై ఇటు ఇండస్ట్రీలో, అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. 19వ సెంచరీ నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో విజయ్ రణబాలిగా, రష్మిక జయమ్మ పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 11న రిలీజ్ కానుంది. సెకండ్ టైమ్ హీరో శర్వానంద్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ లది హిట్ జోడీ. ‘శతమానం భవతి’ మూవీలో ఫస్ట్ టైమ్ జోడీగా నటించిన ఈ జంట సెకండ్ టైమ్ ‘భోగి’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా, డింపుల్ హయతి కీలక పాత్రలో నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో తొమ్మిదేళ్ల తర్వాత మరోసారి జోడీగా నటిస్తున్నారు శర్వానంద్–అనుపమ. వీరిద్దరూ ఫస్ట్ టైమ్ నటించిన చిత్రం ‘శతమానం భవతి’. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ మూవీ 2017 సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీలో క్యూట్ జోడీగా ఆకట్టుకున్నారు శర్వా, అనుపమ. ఈసారి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ‘భోగి’లో నటిస్తున్నారు.1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో జరిగిన వాస్తవ ఘటనల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 28న విడుదల కానుంది.ఈసారి భయపెడతారు ‘సామజ వరగమన’ సినిమాతో ప్రేక్షకులకు కడుపుబ్బా వినోదాలు పంచారు హీరో శ్రీవిష్ణు, హీరోయిన్ రెబా మోనికా జాన్. వీరిద్దరూ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘సామజవరగమన’. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 జూన్ 29న విడుదలై, థియేటర్లలో నవ్వుల జల్లులు కురిపించింది. ‘సామజవరగమన’ వంటి హిట్ మూవీ తర్వాత శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ నటించిన సెకండ్ మూవీ ‘మృత్యుంజయ్’. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. రమ్య గుణ్ణం సమర్పణలో సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఈ మూవీ కోసం రెండోసారి జోడీ కట్టారు శ్రీవిష్ణు–రెబా. తొలి చిత్రంలో ప్రేక్షకులకు నవ్వులు పంచిన ఈ జంట ‘మృత్యుంజయ్’లో మాత్రం భయపెట్టనున్నారు. పూర్తి స్థాయి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది. ‘సాంగ్స్, కామెడీ లేకుండా హానెస్ట్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘మృత్యుంజయ్’. ఈ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. నా నటన కూడా సరికొత్తగా ఉంటుంది’’ అంటూ ఇటీవల శ్రీ విష్ణు తెలిపారు. ఈ సినిమా ఫిబ్రవరి 27న విడుదల కావాల్సి ఉంది. అయితే అదే రోజు శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘విష్ణు విన్యాసం’ మూవీ రిలీజ్ అవుతుండటంతో ఈ నెల 6కి ఈ మూవీ రిలీజ్‌ని వాయిదా వేశారు. బేబీ హిట్‌తో... ‘బేబీ’ మూవీతో ఓవర్‌నైట్ స్టార్స్ అయిపోయారు హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవీ చైతన్య. వారిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా ‘బేబీ’. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023 జూలై 14న విడుదలై కల్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రత్యేకించి వీరి జోడీపై యూత్‌లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. ‘బేబీ’తో హిట్ పెయిర్ అనిపించుకున్న ఆనంద్– వైష్ణవి జంటగా నటిస్తున్న రెండో సినిమా ‘ఎపిక్’. ‘90స్’ (ఎ మిడిల్ క్లాస్ బయోపిక్) వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మి స్తున్నారు. కాగా ఎపిక్– ఫస్ట్ సెమిస్టర్ పేరుతో రిలీజ్ చేసిన ఈ మూవీ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోలాంటి అబ్బాయికి... సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో హీరోలాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథ’ అంటూ ఆనంద్ దేవరకొండ చెప్పిన డైలాగ్ సినిమాపై ఆసక్తి రేకెత్తించేలా ఉంది. ‘బేబీ’ మూవీతో సూపర్‌హిట్ జోడీ అనిపించుకున్న ఆనంద్–వైష్ణవి కలిసి నటిస్తున్న ‘ఎపిక్’ మూవీపై మంచి క్రేజ్ నెలకొంది. రెండోసారి... ‘కోర్ట్’ సినిమాతో హిట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు హర్ష్ రోషన్, శ్రీదేవీ అపల్లా. ఈ ఇద్దరూ పరిచయమైన తొలి చిత్రం ‘కోర్ట్’. ఇప్పుడు రెండోసారి జంటగా నటించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. ప్రియదర్శి, శివాజీ, రోషన్, శ్రీదేవి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్ట్’. రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా 2025 మార్చి 14న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో తొలిసారి జోడీగా నటించిన హర్ష్ రోషన్–శ్రీదేవి హిట్ పెయిర్‌గా నిలిచారు. సినిమా మంచి విజయం అందుకోవడంతో ఆడియన్స్‌లో వీరి జోడీకి ఫుల్ క్రేజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో వీరు జంటగా నటించిన తాజా చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహించారు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంపై ఫుల్ బజ్ నెలకొంది. -
ఫ్యాన్స్ అన్నదానం.. విజయ్- రష్మికపై వెల్లువిరిసిన అభిమానం
టాలీవుడ్ కొత్త జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరి పెళ్లి వేడుక ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లిలో సన్నిహితులు, బంధుమిత్రులు సందడి చేశారు. పెళ్లి తర్వాత తమ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు విరోష్ జంట. పెళ్లి తర్వాత విరోష్ జంట తొలిసారి భార్య, భర్తలుగా భాగ్యనగరంలోకి ఎంట్రీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.అయితే వీరి పెళ్లిని అభిమానులు కూడా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరో, హీరోయిన్ల పెళ్లి సందర్భంగా జగిత్యాల జిల్లాలోని శ్రీ సాయికృప బాలాజీ మందిర్‌లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ఓ అభిమాని ట్విటర్లో షేర్ చేశారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అభిమానుల కోసం విరోష్ జంట అన్నదానం..కాగా.. తమ అభిమానుల కోసం విరోష్ జంట కీలక నిర్ణయం తీసుకుంది. తమ వెడ్డింగ్ సందర్భంగా అభిమానుల కోసం ప్రత్యేక స్వీట్స్ పంపిణీ చేయనున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాల్లో మిఠాయిలు మార్చి 1వ తేదీన పంచనున్నారు. ఆ రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల వద్ద ఆదివారం అన్నదానం కూడా నిర్వహించనున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కాగా.. ఈ టాలీవుడ్ జంట మార్చి 4న సినీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. Vijay Deverakonda – Rashmika Mandanna వారి వివాహం సందర్భంగా అన్నదానం కార్యక్రమం.VDFC JAGITYAL - Dharmapuri❤️❤️#VijayDeverakonda #rashmikamandanna #virosh #TeamDeverakonda #ViRoshWedding pic.twitter.com/jQNFuTENir— Adarsh Vinny (@AdarshVinn53747) February 28, 2026 Vijay Deverakonda – Rashmika Mandanna వారి వివాహం సందర్భంగా అన్నదానం కార్యక్రమం.#VijayDeverakonda #rashmikamandanna #virosh #TeamDeverakonda pic.twitter.com/jcR3130HNM— Adarsh Vinny (@AdarshVinn53747) February 28, 2026 -
విరాట్ కోహ్లీ రికార్డ్ బద్దలు కొట్టిన రష్మిక.. అదేంటో తెలుసా?
కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఇన్ని రోజులుగా సీక్రెట్‌గా రిలేషన్లో ఉన్న వీరిద్దరు పెళ్లికి కొద్ది రోజుల ముందు అఫీషియల్‌గా ప్రకటించారు. గత నెల ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్ ప్యాలెస్‌లో అతికొద్దిమంది సమక్షంలో వీరిద్దరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.పెళ్లి తర్వాత విజయ్, రష్మిక తమ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ జంట తమ భావాలను ప్రకటిస్తూ భావోద్వేగంగా రాసుకొచ్చారు. ఈ పిక్స్ షేర్ చేసిన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చేశాయి. అత్యధిక లైక్స్‌తో పలువురి సెలబ్రిటీల ఫోటోలు క్రియేట్ చేసిన రికార్డ్స్‌ను విరోష్ జంట తుడిచిపెట్టేసింది. తాజాగా ఈ పిక్స్ మరో రికార్డ్ సృష్టించాయి.2024లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా విరాట్ కోహ్లీ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోకు దాదాపు 23 మిలియన్ల లైక్స్ వచ్చాయి. తాజాగా ఆ రికార్డ్‌ను రష్మిక షేర్ చేసిన పెళ్లి ఫోటోలు బద్దలు కొట్టాయి. రష్మిక పోస్ట్‌కు ఏకంగా 25 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. దీంతో విరాట్ పోస్ట్ రికార్డ్‌ను రష్మిక అధిగమించింది. కాగా.. ఇన్‌స్టాలో రష్మికకు 50 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అంటే దాదాపు సగం మంది ఈ వెడ్డింగ్ ఫోటోలను లైక్ చేశారు. అంతేకాకుండా విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన ఫోటోలకు 19.8 మిలియన్ల లైక్ వచ్చాయి. కాగా.. మరోవైపు విరాట్‌కు ఇన్‌స్టాలో 274 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. రష్మిక పోస్ట్‌కు ఈ రేంజ్లో ఆదరణ దక్కడం చూస్తుంటే ఆమె క్రేజ్ ఏంటో తెలిసిపోతోంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
విరోష్ వెడ్డింగ్.. పాన్ ఇండియా ఫ్యాన్స్‌కు కొత్త జంట సర్ప్రైజ్
టాలీవుడ్ కొత్త జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరి పెళ్లి వేడుక ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లిలో సన్నిహితులు, బంధుమిత్రులు సందడి చేశారు. పెళ్లి తర్వాత తమ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు విరోష్ జంట. పెళ్లి తర్వాత విరోష్ జంట తొలిసారి భార్య, భర్తలుగా భాగ్యనగరంలోకి ఎంట్రీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.తాజాగా అభిమానుల కోసం విరోష్ జంట కీలక నిర్ణయం తీసుకుంది. తమ వెడ్డింగ్ సందర్భంగా అభిమానుల కోసం ప్రత్యేక స్వీట్స్ పంపిణీ చేయనున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాల్లో మార్చి 1వ తేదీన ఆదివారం మిఠాయిలు పంచనున్నారు. ఆ రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల వద్ద స్వీట్స్ పంపిణీ చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అంతేకాకుండా ఈ ఆలయాల వద్ద అన్నదానం కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ టాలీవుడ్ జంట మార్చి 4న సినీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొననున్నారు.❤️ pic.twitter.com/zXPGxIxHz7— Rashmika Mandanna (@iamRashmika) February 28, 2026 -
విశేషాలకు కొదవ లేని కొడవ కళ్యాణం
అక్కడ పురోహితులు ఉండరు... వేద మంత్రోచ్చారణలు వినిపించవు... వధూవరులు ఏడడుగులు వేయరు... ‘కొడవ’ సంప్రదాయ పద్ధతిలో జరిగే వివాహ వేడక ఇలానే ఉంటుంది. అంతేనా? ఇంకా చాలా విశేషాలుంటాయి. తెలుగు సంప్రదాయానికి పూర్తి భిన్నంగా ఈ వేడుక ఉంటుంది. టాలీవుడ్ లవ్‌బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా ఈ రెండు పద్ధతుల్లోనూ పెళ్లి చేసుకున్నారు. ఫిబ్రవరి 26న ఉదయం తెలుగు సంప్రదాయంలో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. అదే రోజు సాయంత్రం కర్ణాటకలోని కొడవ పద్ధతిలో పెళ్లి జరిగింది. దీంతో కొడవ తెగకు సంబంధించిన వేడుక ఎలా జరిగి ఉంటుందా?! అనే చర్చలు మొదలయ్యాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం...విజయ్ దేవరకొండది తెలంగాణలోని నాగర్‌కర్నూలు. రష్మికది కర్ణాటకలోని కొడగు జిల్లాలోని విరాజ్ పేట. కొడగునే కూర్గ్ అని కూడా పిలుస్తారు. అక్కడి స్థానిక వారియర్ కమ్యూనిటీనే కొడవగా పిలుస్తారు. కొడవ ప్రజల సంస్కృతి, ఆహార్యం, సంప్రదాయాలు మిగతా వారితో పోల్చితే భిన్నంగా ఉంటాయి. వారి పూర్వీకులను గౌరవిస్తూ వివాహ వేడుకలను జరుపుతారు. మామూలుగా జరిగే తెలుగు వివాహాలకు భిన్నంగా కొడవ వెడ్డింగ్ ఉంటుంది. అగ్నిసాక్షిగా ఏడడుగులు నడుస్తూ ప్రమాణాలు చేసుకోవడం వంటిది ఏమీ ఉండదు. సుదీర్ఘంగా పెళ్లి మంత్రాలు వినిపించవు. అరిటాకుల్లో విందు, సంప్రదాయ అలంకరణలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణ. ఈ వివాహ వేడుకను వాళ్లు ‘మంగళ’ అని పిలుస్తారు. అంతా పెద్దల సమక్షంలో, ప్రకృతి సాక్షిగా జరుగుతుంది. వేదికను అరిటాకులతో పచ్చదనానికి ప్రతీకగా అలంకరిస్తారు.భిన్నమైన కట్టుకొడవ పెళ్లిలో వధూవరులిద్దరూ అభ్యంగన స్నానం చేస్తారు. అనంతరం తమ సంప్రదాయ దుస్తులు ధరిస్తారు. పెళ్లి కొడుకు ‘కుష్య’ అనే నల్లని కోటు, ‘చేలే’ అని పిలిచే నడుముకు కట్టే పట్టీ, ‘పీచే కత్తి’ (చిన్న కత్తి) ధరిస్తాడు. ఇక వధువు చీరకట్టు సంప్రదాయం మిగతా చీరకట్టులతో పోల్చితే భిన్నంగా ఉంటుంది. సాధారణంగా భారతీయ వస్త్రధారణలో చీర పల్లూను ముందు నుంచి వెనక వైపుకు వేస్తారు. కానీ కొడవ సంప్రదాయంలో చీర కొంగును వెనక నుంచి ముందుకు తీసి, వేస్తారు. అలాగే, వెనక వైపు కుచ్చిళ్లు వచ్చేలా కట్టుకునే ప్రత్యేకమైన కట్టు ఈ కమ్యూనిటీలో కనిపిస్తుంది. ఇక వేడుక అంతా డ్రమ్ బీట్స్, పాటలతో వారియర్ నేపథ్యాన్ని గుర్తుచేసే నృత్యాలు చేస్తారు. అలాగే గన్ సెల్యూట్స్ కూడా ఆ వేడుకలో భాగమే. ఈ పద్ధతిని అనుసరిస్తూ విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా కూడా ఈ నృత్యాలు చేశారు.కొడవలు ఎవరు కొడవలను ‘కూర్గులు’ అని కూడా అంటారు. వీరిది కర్ణాటక రాష్ట్రంలోని కొడగు (కూర్గ్) ప్రాంతం. వీరు సుమారు 1.6 లక్షల దాకా ఉన్నారని అంచనా. గతంలో వీరు వ్యవసాయం, ఇతర పనుల మీద ఆధారపడి జీవించేవారు. 19వ శతాబ్దంలో కాఫీ సాగు ద్వారా వీరి పనికి ప్రాధాన్యం లభించింది. మొదట వ్యవసాయ ఆధారిత పండుగలు జరుపుకునే వీరు అనంతరం ఇతర పండుగలూ జరుపుకోవడం మొదలుపెట్టారు. కావేరి నది వీరికి ప్రాధాన్యమైనది. బ్రిటిష్ పాలన సమయంలో వీరు ఇతర రంగాల్లోకి ప్రవేశించారు. వీరి నైపుణ్యాలను గమనించి బ్రిటిష్ అధికారులు వీరిని మొదటి, రెండో ప్రపంచ యుద్ధ సమయాల్లో వినియోగించారు. కొడవల్లో అనేకమంది స్వాతంత్య్ర సమరయోధులు ఉన్నారు.బంగారు నాణేల మూటపెళ్లి వేదికకు వచ్చే మార్గంలో అరటి చెట్టు నాటుతారు. వరుడు దీని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి, అనంతరం ఆ చెట్టు కాండాన్ని నరకడం ఒక ముఖ్యమైన ఆచారంగా ఉంటుంది. ఇది వరుడి పరాక్రమానికి, అడ్డంకులను తొలగించడానికి ప్రతీకగా నిలుస్తుంది. తర్వాత వరుడు పెళ్లి పీటల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి, తూర్పు ముఖంగా కూర్చుంటాడు. ఆ సమయంలో ముందుగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు వరుడిని ఆశీర్వదిస్తారు. తర్వాత వధువు అక్కడికి చేరుకుని వరుడికి పాలు, బహుమతులు, బంగారం, వెండి, రాగి నాణేలను అందిస్తుంది. ఇది సంపద, శుభం, స్థిరత్వానికి సంకేతంగా భావిస్తారు.12 గులకరాళ్లతో వధువుపై సర్వహక్కులువధూవరులిద్ద్దరూ మల్లెపూల దండలు మార్చుకుంటారు. పవిత్ర దీపం ఎదురుగా నిలబడి వధువు బాధ్యత వరుడికి అప్పగిస్తున్నామని పెద్దలు చెబుతారు. దీంతో పాటు వధువు తరఫు పెద్దలు 12 గులకరాళ్లు వరుడి పెద్దలకు ఇచ్చి, వధువుపై సర్వహక్కులు ఇస్తున్నామని చెబుతారు. అయితే వరుడి వైపు పెద్దలు 11 రాళ్లు తీసుకొని ఒకటి తీసుకోకుండా వదిలేస్తారు. అవసరమైన సందర్భంలో వధువుపై వారికీ హక్కు ఉందనే అర్థంలో ఇలా చేస్తారు. పుట్టింటివారికి కూతురి పట్ల కొంత బాధ్యత ఉంటందని సూచించడానికే ఇలా చేస్తారని చెప్పవచ్చు.నీళ్ల బిందె తలపై పెట్టుకొని..పెళ్లి తర్వాత వధువు తమ అత్తగారి ఇంటి వద్ద గంగా పూజ చేస్తుంది. ఈ పూజ కోసం వధువు బావి నుంచి నీటిని తోడి, ఆ బిందెను తలపై పెట్టుకుని నడుచుకుంటూ వస్తుంది. ఈ సమయంలో వరుడి కుటుంబ సభ్యులు ఆమెను ఆటపట్టిస్తూ, ఆమె నడవకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఆమె సహనాన్ని, ఓర్పును పరీక్షించడానికే ఈ ఘట్టం. ఇతర హిందూ వివాహాలకు భిన్నంగా కొడవ పెళ్లిళ్లలో మాంసాహారాన్ని వడ్డిస్తారు. అందులో ప్రధానంగా పంది మాంసం, మద్యం తప్పనిసరిగా ఉంటాయట. దీంతో విజయ్–రష్మిక పెళ్లి వేడుకలో ఈ వంటకాన్ని కూడా వడ్డించారు. ఇలా ఉదయం తెలుగు సంప్రదాయ పద్ధతిలో, సాయంత్రం కొడవ సంప్రదాయ పద్ధతిలో జరిగిన విజయ్–రష్మికల వివాహ వేడుకలు ‘టాక్ ఆఫ్ ది నేషన్’ అయ్యాయి. మార్చి 4న హైదరాబాద్‌లో వీరి వివాహ రిసెప్షన్ అత్యంత వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.విరోష్ సెలబ్రేషన్స్‘‘దేశంలోని ప్రజలందరూ ఎప్పుడూ మా ప్రయాణం, ప్రేమలో భాగమయ్యే ఉన్నారు. అందుకే మీ అందరితో మా వెడ్డింగ్‌ను సెలబ్రేట్ చేసుకోవడం మాకెంతో సంతోషం. ప్రతి వేడుకను ఇండియా ఎలా అయితే ఫుడ్ అండ్ మిఠాయిలతో సెలబ్రేట్ చేసుకుంటుందో అలా మా జీవితంలోని ఈ బిగ్ మూమెంట్‌ను మీతో కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు మార్చి 1న దేశవ్యాప్తంగా ఫుడ్ అండ్ స్వీట్ ట్రక్స్‌ను పంపిస్తున్నాం (కొన్ని నగరాల్లో మాత్రమే). అలాగే దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నాం. మాకు మీ అందరి ఆశీస్సులు కావాలి. ప్రేమతో విజయ్ అండ్ రష్మిక’’ అంటూ విజయ్ దేవరకొండ, రష్మిక ‘ఎక్స్’ లో శనివారం రాత్రి ఓ పోస్ట్ షేర్ చేశారు. అలాగే ‘విరోష్ సెలబ్రేషన్స్’ అంటూ, ఏయే నగరాల్లో స్వీట్స్ పంచనున్నారు, ఏయే దేవాలయాల్లో అన్నదానం నిర్వహించనున్నారన్న జాబితాను కూడా ఈ ఇద్దరూ షేర్ చేశారు.స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్... ∙తెలంగాణ – హైదరాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, ∙ఢిల్లీ (ఎన్సీటీ) – ఢిల్లీ ∙చండీఘర్ (యూటీ)– చండీఘర్ ∙ఉత్తరప్రదేశ్ – నోయిడా, గజియాబాద్ ∙గుజరాత్ – అహ్మదాబాద్ ∙మధ్యప్రదేశ్ – భోపాల్ ∙మహారాష్ట్ర – ముంబై ∙రాజస్థాన్ – జైపూర్ ∙ఆంధ్రప్రదేశ్ – వైజాగ్, విజయవాడ, పుట్టపర్తి ∙కేరళ – కొచ్చి ∙కర్ణాటక – మైసూర్, కూర్గ్, బెంగళూరు ∙తమిళనాడు – కోయంబత్తూర్, చెన్నై ∙పాండిచ్చేరి (యూటీ) – పాండిచ్చేరి ∙బిహార్– (ట్రైన్ యాక్సిడెంట్ కారణంగా సోమవారానికి వాయిదా). -
విజయ్ పెళ్లిలో ఈషా రెబ్బ, తరుణ్ భాస్కర్ అట్రాక్షన్ (ఫోటోలు)
-
విజయ్, రష్మికలకు సర్ప్రైజ్ గిఫ్ట్
విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న నూతనంగా పెళ్లి చేసుకున్నారు. వారిద్దరి సంతోషాన్ని రెట్టింపు చేసేందుకు రణబాలి మూవీ నుంచి స్పెషల్ వీడియోను విడుదల చేసి మేకర్స్ సర్ప్రైజ్ చేశారు. ఏందయ్య సామీ అంటూ సాగే ఒక గీతాన్ని ప్రోమోగా వదిలారు. సింగర్స్ శ్వేతా మోహన్, అజయ్ గోగవాలే ఆలపించిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. ఈ పాటలో కొత్తగా పెళ్లైన దంపతులుగా విజయ్, రష్మికలు కనిపిస్తున్నారు. 1854 - 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా రణబాలి చిత్రాన్ని డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఉదయపూర్ ఎయిర్‌పోర్ట్‌లో సందడి చేసిన 'విరోష్' జోడీ (ఫొటోలు)
-
నెట్టింట్లో వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ మాజీ ప్రేయసి ఫోటోలు
-
విరోష్... ఓ రికార్డ్
బాక్సాఫీస్ దగ్గర భారీ సినిమాలు వసూళ్లపరంగా రికార్డ్ బ్రేక్ చేయడం కామన్. అయితే ఇప్పుడు ‘విరోష్’ (విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నా) వివాహం ఓ రికార్డ్ బ్రేక్ చేసింది. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్ ప్యాలెస్ వేదికగా ఉయం 10 గంటల 10 నిమిషాలకు విరోష్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లి ఫొటోలను ‘విరోష్’ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి, ఒకరిçపట్ల మరొకరికి ఉన్న ప్రేమను చెబుతూ, ఓ పోస్ట్‌ని కూడా షేర్ చేశారు. కాగా... రష్మికా మందన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలకు అత్యధిక లైక్స్ దక్కాయి. దీంతో ‘విరోష్’ వివాహ ఫొటోలు రికార్డ్ సాధించాయి. బాలీవుడ్ కపుల్ పిద్ధార్థ్ మల్హోత్రా–కియారా అద్వానీల పెళ్లి ఫొటోలు అత్యధిక లైక్స్ దక్కించుకున్న రికార్డ్‌ని సొంతం చేసుకున్నాయి. ఆ రికార్డ్‌ని తాజాగా విరోష్ ఫొటోలు బ్రేక్ చేశాయి. షేర్ చేసిన తక్కువ సమయంలో ఎక్కువ లైక్స్ (15.8 మిలియన్లు) సాధించిన సిద్ధార్థ్–కియారాల రికార్డ్‌ని 18.5 మిలియన్ల లైక్స్‌తో ‘విరోష్’ పెళ్లి ఫొటోలు బ్రేక్ చేశాయి. ఈ నంబర్ ఇంతటితో ఆగలేదు... లైక్స్ సంఖ్య పెరుగుతూ వస్తోంది. శుక్రవారం సాయంత్రం దాటుతున్న సమయంలో ఈ సంఖ్య 20 మిలియన్లకు పైగా దాటింది. అంటే... దాదాపు రెండు కోట్లకు పైనే లైక్స్ దక్కాయి. దీన్నిబట్టి విజయ్–రష్మికల జోడీకి ఎంత క్రేజ్ ఉందో ఊహించుకోవచ్చు.ఉదయ్‌పూర్ టు హైదరాబాద్: పెళ్లి ఫొటోల్లో బ్యూటిఫుల్ కపుల్‌లా కనిపించిన విజయ్–రష్మిక శుక్రవారం ఎయిర్‌పోర్టులో క్యూట్‌గా కనిపించి, ఆకట్టుకున్నారు. శుక్రవారం ఈ నూతన జంట హైదరాబాద్ చేరుకుంది. కాగా ఎయిర్‌పోర్టులో ఈ జంటని చూసి, ‘కంగ్రాచ్యులేషన్స్’ అంటూ ఫ్యాన్స్ అభిమానం చాటుకోగా... ‘విరోష్’ శిరస్సు వంచి నమస్కరించడంతో పాటు ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ... చిరునవ్వులు చిందించారు. మార్చి 4న హైదరాబాద్‌లో వీరి వివాహ రిసెప్షన్ జరగనుంది. ప్రధానికి ఆహ్వానం... వైరల్భారత ప్రధాని నరేంద్ర మోదీని గత వారం విజయ్–రష్మిక స్వయంగా కలిసి, తమ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ జంటను ఆశీర్వదిస్తూ... మోదీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ కూడా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. కాగా... మోదీని విజయ్–రష్మిక కలిసిన ఫొటోలు తాజాగా బయటకు రాగా... అవి కూడా వైరల్‌గా మారాయి. -
హైదరాబాద్‌లో అడుగుపెట్టిన విరోష్ జంట.. వీడియో వైరల్
టాలీవుడ్ కొత్త జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న హైదరాబాద్ చేరుకున్నారు. ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్ తర్వాత భాగ్యనగరంలో అడుగుపెట్టారు. ఫ్యామిలీతో కలిసి శంషాబాద్ చేరుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈ ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరిద్దరి వివాహ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లిలో సన్నిహితులు, బంధుమిత్రులు సందడి చేశారు. పెళ్లి తర్వాత తమ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు విరోష్ జంట.అంతకుముందు ఇవాళ ఉదయం ఈ జంట ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ కొత్త ఈ జోడిని చూసిన వారందరూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో విజయ్, రష్మికలు అక్కడ ఉన్న ప్రేక్షకులకు నమస్కారం చేస్తూ అభివాదం చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలైంది. ఈ టాలీవుడ్ జంట మార్చి 4న సినీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. The lovely couple #VijayDeverakonda & #RashmikaMandanna touch down in Hyderabad post-wedding!❣️✨#VIROSH #TFNExclusive #TeluguFilmNagar pic.twitter.com/gY55ei8q5s— Telugu FilmNagar (@telugufilmnagar) February 27, 2026 -
విజయ్‌తో పెళ్లి.. ముందే చెప్పిన రష్మిక.. వీడియో వైరల్..!
టాలీవుడ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన విరోష్ వెడ్డింగ్ గ్రాండ్‌గా జరిగింది. కొన్నేళ్ల పాటు సీక్రెట్ రిలేషన్షిప్లో ఉన్న వీరిద్దరు పెళ్లికి కొద్ది రోజుల ముందే అఫీషియల్‌గా ప్రకటించారు. ఎంగేజ్మెంట్ కూడా అత్యంత ప్రైవసీ పాటించిన ఈ జంట ఉదయ్‌పూర్‌లో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో ఒక్కటయ్యారు. ఎక్కడా కూడా తమ రిలేషన్షిప్ బయట పడకుండా కొన్నేళ్ల పాటు కొనసాగించారు. ఎక్కడికెళ్లినా జంటగా కనిపించి దొరికిపోయినప్పటికీ ఎక్కడా కూడా అఫీషియల్‌గా ప్రకటించలేదు.అలా కొన్నేళ్లుగా వీరిద్దరి డేటింగ్ రూమర్స్ వస్తున్నా వాటిని అస్సలు పట్టింకోలేదు విరోష్ జంట. కేవలం తమ సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. అలా అత్యంత సీక్రెట్‌గా విజయ్- రష్మిక తమ బంధాన్ని కొనసాగించారు. అయితే గతేడాది ఓ సినిమా ఈవెంట్‌కు హాజరైన రష్మిక.. తన పెళ్లి గురించి ముందుగానే చెప్పేసింది. కానీ మనకే అర్థం కాలేదంటూ నెటిజన్స్ ఆ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఇంతకీ అదేంటో మనం కూడా తెలుసుకుందాం.గతంలో ఓ మూవీ ఈవెంట్‌కు హాజరైన రష్మికను.. అనంద్ దేవరకొండ ఆట పట్టించాడు. దీనికి రష్మిక సమాధానమిస్తూ.. ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీరా.. ఇలా నన్ను స్పాట్లో పెట్టి అడిగితే ఎట్లా అంటూ అప్పుడే హింట్ ఇచ్చేసింది. రష్మిక- విజయ్ పెళ్లి వేళ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2024లోనే ఈ విషయం మనం అర్థం చేసుకోవాల్సిందని అంటూ నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 2024 లోనే అర్థం చేసుకోవాల్సింది మనం We did a mistake 😭😭😭😭😭😭#RashmikaMandanna #VijayDeverakonda pic.twitter.com/tryvGuCGsF— Swaasthi (@swaasthi) February 26, 2026 -
ఉదయపూర్ ఎయిర్‌పోర్ట్‌లో సందడి చేసిన 'విరోష్' జోడీ
-
విజయ్- రష్మిక పెళ్లి వేడుక.. అందరి ఫోకస్ వాటిపైనే..!
విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా ఎట్టకేలకు పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు ఉదయ్‌పూర్ వేదికగా ఒక్కటయ్యారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో అత్యంత సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 26న ఉదయం పదిగంటల పది నిమిషాలకు విజయ్ దేవరకొండ.. రష్మిక మెడలో మూడు ముళ్లు వేశారు. ఆ తర్వాత తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు విరోష్ జంట.ఈ ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెట్టారు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు, నెటిజన్స్ వీరి పెళ్లి గురించి తెగ చర్చించుకుంటున్నారు. ఇప్పుడు అందరి దృష్టి పెళ్లిలో వీరిద్దరు ధరించిన నగలపై పడింది. రాయల్ లుక్‌లో కనిపించిన ఈ నగలే వీరు షేర్ చేసిన ఫోటోలు హైలెట్‌గా నిలిచాయి. దీంతో నెట్టింట వాటి గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ వేడుకలో విరోష్ జంట ధరించిన నగలు హైలెట్‌గా నిలిచాయి. రష్మిక నక్షీ వర్క్ నగలు రాజసం ఉట్టిపడేలా కనిపించాయి. విజయ్ దేవరకొండ ధరించిన క్లాసిక్ గోల్డ్ జ్యూవెలరీ కూడా అచ్చం రాజులు ధరించినట్లుగా మెరిసిపోయింది. అలా గ్రాండ్ రాయల్ లుక్‌తో వీరిద్దరు తమ వెడ్డింగ్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. -
హైదరాబాద్‌కు విజయ్– రష్మిక.. తొలిసారి జంటగా (వీడియో)
విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న హైదరాబాద్‌కు రానున్నారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకున్న తర్వాత తొలిసారిగా కలిసి కనిపించారు. తాజాగా ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఈ జోడిని చూసిన వారందరూ శుభాకాంక్షలు చెప్పారు. ఈ క్రమంలో విజయ్, రష్మికలు అక్కడ ఉన్న ప్రేక్షకులకు నమస్కారం చేస్తూ అభివాదం చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.పెళ్లికి ముందు కూడా వారిద్దరూ కలిసి ప్రయాణం చేసినప్పటికీ వేర్వేరుగా ప్లాన్ చేసుకునేవారు. ఆ సమయంలో కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే, ఇప్పుడు పెళ్లి తర్వాత ఒకరిచేయి మరోకరు పట్టుకుని సంతోషంగా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ఇలా వారిద్దరూ కలిసి కనిపించడంతో ఆ వీడియోను షేర్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
ViRosh అచ్చమైన దేవతలా ఆమె, ఆభరణాలతో కొత్త ట్రెండ్
లవ్‌బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లో అత్యంత వైభవంగా పెళ్లి చేసుకున్నారు. తమ పెళ్లిని అత్యంత గోప్యంగా నిర్వహింకున్న వీరిద్దరూ పెళ్లి వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఫ్యాన్స్ అంతా సంబరాలు చేసుకున్నారు. ఏఐ కాదు ఒరిజినల్ అంటూ తమ అభిమాన నటుల వెడ్డింగ్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే సంస్కృతి,కళ, సంప్రదాయాల ప్రాముఖ్యతల కలయికతో రాజసం ఉట్టిపడేలా , ప్రత్యేకంగా చేత్తో తయారు చేసిన ఆభరణాలు వారి రాయల్ వెడ్డింగ్‌ను మరింత వైభోగంగా మార్చాయి. విరోష్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో రికార్డ్ సృష్టించాయి.కర్ణాటకకు చెందిన మందన్న కొడవ వంశం, దేవరకొండ తెలుగు మూలాల సంప్రదాయాలను గౌరవిస్తూ రాయల్ లుక్‌లో అదరగొట్టారు. ఈ జంట దక్షిణ భారత సాంప్రదాయ వివాహ దుస్తులు , పురాతన ఆలయ ఆభరణాలతో స్వర్గం నుండి దిగివచ్చిన దేవతల్లా కనిపించారు. విరోష్ వివాహంలో వధూవరుల ఆభరణాలు, ముఖ్యంగా విజయ్ దేవర కొండ ధరించిన చెవి రింగ్స్, సాంప్రదాయ హరామ్‌లు, స్టేట్మెంట్ ఝుమ్కాలు, జడ బిల్లా, చంపసరాలు, హత్ఫూల్, మఠపట్టి, ముక్కు పిన్, గాజులు, బాజుబంద్, నడుము బెల్ట్, చోకర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హై-రిలీఫ్ నక్షి పని , క్లిష్టమైన రావ గ్రాన్యులేషన్ లాంటి మాస్టర్ ఆర్టిస్టులచే చేతితో రూపుదిద్దుకున్నాయని ఆభరణాల నిపుణులు పేర్కొన్నారు. ఈ వివాహ ఆభరణాలను ఒక బలమైన థీమ్‌తో రూపొందించారట. విజయ్ను ఒక శక్తివంతమైన రాజుగా, రష్మికను ఒక దేవతగా ప్రతిబింబించేలా ఈ డిజైన్లు శ్రీ జ్యువెలర్స్ (Shree Jewellers) తీర్చిదిద్దింది.పది నెలల కష్టం.. కిలోల కొద్దీ బంగార అద్భుత సృష్టిన్యూస్ 18 కథనం ప్రకారం, శ్రీ జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్లు అభిషేక్ అగర్వాల్ , కౌశిక్ కుమార్ ఈ జంటతో కలిసి పనిచేయడం మర్చిపోలేని అనుభూతిగా పేర్కొన్నారు. విరోష్ జీవితంలో ఒక ముఖ్యమైన వేడుకలో తాము భాగమైనందుకు సంతోషం వ్యక్తం చేశారు.ఈ ఆభరణాల తయారీకి సంబంధించి ఆలోచన మొదలు , చివరి రూపం తీసుకొచ్చేవరకు సుమారు పది నెలల సమయం పట్టింది. ఇందులో క్రియేటివ్ చర్చలు, కస్టమైజేషన్, మేకింగ్ , స్టైలింగ్ వంటి అనేక దశలు ఉన్నాయి. దక్షిణ భారత సాంప్రదాయ పద్ధతులైన రావా గ్రాన్యులేషన్ (Rava granulation) దీప్ నక్షి (Deep Nakshi)తో ఈ కళాఖండాలను రూపొందించారు.దేవతలా రష్మిక మందన్నవివాహ వేడుకలో రష్మిక 11 రకాల ప్రత్యేక ఆభరణాలతో మెరిసిపోయింది.దక్షిణ భారత దేవాలయ శిల్పాల నుండి స్ఫూర్తి పొంది, అనుభవజ్ఞులైన కళాకారుల నక్షి పనితనం,యాంటిక్ మ్యాట్ పాలిష్ (Antique matte polish) ఆభరణాలు ఆకర్షణీయంగా నిలిచాయి. లేయర్డ్ చోకర్, సాంప్రదాయ హారాలు, జుంకాలు, జడ బిళ్ళ, చెంపసరాలు, హాత్ ఫూల్, మఠాపట్టి, ముక్కు పుడక, గాజులు, బాజుబంద్ (వంకీ), వడ్డాణం , పట్టీలు ఈ సెట్లో ఉన్నాయి. ఇవి కేవలం అందం కోసం మాత్రమే కాకుండా, తరతరాలకు గుర్తుండిపోయే వారసత్వ ఆభరణాలుగా (Heirloom pieces) నిలిచిపోయేలా రూపొందించబడ్డాయి.విజయ్ దేవరకొండ అలంకరణ: సాధారణంగా భారతీయ వివాహాల్లో వరుడి ఆభరణాల గురించి పెద్దగా పట్టింపు ఉండదు. కానీ విజయ్ దేవరకొండ ట్రెండ్‌కు భిన్నంగా పెద్ద చెవిపోగులు, మణికట్టు కఫ్, ఉంగరం రెండు నెక్లెస్‌లు, కాళ్లకు కడియాలు, నడుము ఆభరణాలతో పురుషుల వెడ్డింగ్ జ్యువెలరీకి విజయ్ కొత్త మార్క్‌ను క్రియేట్ చేశారు. డిజైనర్ అనామికా ఖన్నా రూపొందించిన రస్ట్ ఆరెంజ్ చీరను ధరించగా, విజయ్ దేవరకొండ ఐవరీ ధోతీ , ఎరుపు రంగు అంగవస్త్రంతో కళకళలాడుతూ అలరించారు. -
రికార్డ్ క్రియేట్ చేసిన విజయ్, రష్మిక పెళ్లి ఫోటో..
ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్ ప్యాలెస్‌లో అతికొద్దిమంది సమక్షంలో ఒక్కటయ్యారు. విరోష్ పేరుతో తమ ఫ్యాన్స్ కోసం వారు కొన్ని ఫోటోలు షేర్ చేశారు. అయితే, తమ అభిమానులు ఈ జంటపై ప్రేమతో పాటు శుభాకాంక్షలు కురిపించారు. పెళ్లి ఫోటోలు సోషల్‌మీడియాలో సంచలనంగా మారాయి. మిలియన్ల కొద్ది లైక్స్‌తో రికార్డ్ క్రియేట్ చేశాయి. పాన్ ఇండియా రేంజ్లో వీరి పెళ్లి ఫోటోకు అత్యధికంగా లైక్స్ వచ్చాయి. ఇప్పటి వరకు ఇదే రికార్డ్ అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.సినీ పరిశ్రమకు సంబంధించి ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఆ సందర్భంగా గతంలో వారు కూడా ఫోటోలు పంచుకున్నారు. బాలీవుడ్ నటి కియారా అద్వానీ తమ పెళ్లి సమయంలో ఫోటోలు షేర్ చేస్తే 15.8 మిలియన్ల లైక్స్ వచ్చాయి. ఇప్పటివరకు ఇదే రికార్డ్. కానీ, తాజాగా విరోష్ జోడీ 18.5 మిలియన్ల లైక్స్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. విజయ్ దేవరకొండ కూడా అవే ఫోటోలను షేర్ చేశారు. అక్కడ కూడా 15.2 మిలియన్ల లైక్స్ రావడం విశేషం. మరోసారి విజయ్- రష్మిక జోడీ తమ ఇమేజ్ను చిత్రపరిశ్రమకు చూపారని ఫ్యాన్స్ అంటున్నారు.విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి రణబాలి సినిమాలో నటిస్తున్నారు. టీ సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రాన్ని రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్నారు. ‘టాక్సీవాలా’ విజయం తర్వాత మరోసారి విజయ్‌తో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదే ఏడాది సెప్టెంబర్ 11న ఈ మూవీ విడుదల కానుంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
ప్రధాని మోదీని కలిసిన 'విరోష్' జోడీ
-
మండపంలో విరోష్ ఆనందభాష్పాలు.. కల్యాణి పోస్ట్
గతకొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న విజయ్ దేవరకొడ- రష్మిక మందన్నా జంట మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్టారు. ఫిబ్రవరి 26న వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని మెమొంటోస్ ప్యాలెస్ ఈ వివాహ వేడుకకు వేదికగా నిలిచింది. ఈ పెళ్లి సెలబ్రేషన్స్‌కు ఇరు కుటుంబ సభ్యులతో పాటు దగ్గరి బంధుమిత్రులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు.ఇది నా అదృష్టంవారిలో మలయాళ హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ ఒకరు. విరోష్ (విజయ్-రష్మిక జంటను ఫ్యాన్స్ ముద్దుగా విరోష్ అనే పిల్చుకుంటారు) జంట పెళ్లి చూడటం తన అదృష్టమంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. ఎంతో మంచి మనసున్న అమ్మాయి తన బెస్ట్ ఫ్రెండ్‌ను పెళ్లాడిన మధుర క్షణాలను కళ్లారా చూశాను. ఆమె అతడివైపు అడుగులు వేస్తూ వస్తున్నప్పుడు అతడు స్తబ్ధుగా కూర్చుని ఆ శబ్ధాన్ని వింటున్నాడు.ఆనంద భాష్పాలుఆమె అలా మండం వైపు వస్తుంటే ఇద్దరి కళ్లలో కనిపించిన ఆనంద భాష్పాలు వారి మధ్య ప్రేమను తెలియజేస్తున్నాయి. డీప్ ఫ్రెండ్షిప్, పరస్పర గౌరవంతో ఒక్కటైన ఈ జంటను ఇలా చూడటం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. రష్మిక- విజయ్‌కు ఇది మరో అందమైన ప్రారంభం అని రాసుకొచ్చింది.చదవండి: విరోష్ పెళ్లి.. ఇద్దరూ ఎంత చదువుకున్నారంటే? -
పెళ్లి తర్వాత మోదీ, అమిత్ షాలను కలిసిన 'విరోష్' జోడీ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా సరే ‘విరోష్’ జోడీ పేరుతో వారి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నిన్న ఉదయపూర్‌లో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగిన విషయం తెలసిందే. అయితే, మార్చి 4న జరగనున్న తమ రిసెప్షన్‌కు రావాలని ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్రమంత్రి అమిత్ షాను విజయ్, రష్మిక ఆహ్వానించారు. పెళ్లి కార్యక్రమం పూర్తి అయిన తర్వాత నూతన దంపతులు కలిసి అహ్వానం అందించారు. ఇప్పటికే వారిద్దరికీ శుభాంకాక్షలు చెబుతూ మోదీ ఒక లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో రిసెప్షన్ జరగునుంది. ఈ రిసెప్షన్ కోసం ఇప్పటికే పలువురు రాజకీయ సినీ వ్యాపారవేత్తలను విజయ్, రష్మిక ఆహ్వానించారు.‘గీత గోవిందం’ సినిమాలో హీరో హీరోయిన్లుగా పెళ్లి పీటల మీద కూర్చున్న విజయ్ దేవరకొండ – రష్మికా మందన్నా నిజ జీవితంలో ఏడడుగులు వేశారు. ముందు స్నేహితులై, ఆ తర్వాత ప్రేమికులుగా మారి ఇప్పుడు భార్యాభర్తలయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్ ప్యాలెస్‌లో ఉదయం 10 గంటల 10 నిమిషాలకు వైభవంగా, ఆహ్లాదకరంగా జరిగింది. ఉదయం తెలుగు, సాయంత్రం కొడవ (కర్ణాటకకు చెందిన కొడగు జిల్లా రష్మిక సొంతూరు) సంప్రదాయం పరంగా పెళ్లి వేడుకలు జరిగాయి. దండలు మార్చుకున్నప్పుడు వధూవరులిద్దరూ ఆనందబాష్పాలతో ఉద్వేగానికి గురయ్యారు. భావోద్వేగాలు, చిరునవ్వులు మధ్య జరిగిన ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్నవారు నూతన వధూవరులిద్దర్నీ ఆశీర్వదించారు. -
నా బెస్ట్ ఫ్రెండ్.. ఇప్పుడు నా వైఫ్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్
-
పెళ్లి వేళ.. రష్మిక, విజయ్ విద్యార్హతలు వైరల్.. ఎవరెంత చదువుకున్నారు?
టాలీవుడ్ ప్రేమ పక్షులు విజయ్ దేవరకొండ, రష్మిక భార్యభర్తలయ్యారు. ఫిబ్రవరి 26న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్ ప్యాలెస్‌లో వీరి వివాహం జరిగింది. ఉదయం తెలుగు, సాయంత్రం కొడవ (కర్ణాటకకు చెందిన కొడగు జిల్లా రష్మిక సొంతూరు) సంప్రదాయం పరంగా పెళ్లి వేడుకలు జరిగాయి. పెళ్లి ఫోటోలను అటు రష్మిక, ఇటు విజయ్ ఒకేసారి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అదే సమయంలో రష్మిక, విజయ్‌లకు సంబంధించిన మరో విషయంపై కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వీరిద్దరిలో ఎవరు ఎక్కువ చదువుకున్నారు? వీళ్ల ఎడ్యుకేషన్ ఎలా సాగింది? తదితర వివరాలపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు.విజయ్ ఏం చదువుకున్నాడు?విజయ్ దేవరకొండ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా అనంతపురం జిల్లా పుట్టపర్తిలోనే సాగింది. శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్లో బోర్డింగ్ విద్యార్థిగా తన పాఠశాల విద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్‌కు చేరుకున్న విజయ్, అబిడ్స్‌లోని భద్రుకా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ నుండి బీకాం (B.Com) డిగ్రీని పూర్తి చేశాడు. ఆ తర్వాత చదువు ఆపేసి.. ప్యాషన్ వైపు అడుగులు వేశాడు. థియేటర్ ఆర్ట్స్ ద్వారా సినిమాల్లోకి ప్రవేశించాడు.చదువులోనూ రష్మిక ‘స్టారే’రష్మిక నటిగానే కాకుండా చదవులోనూ ‘స్టార్’గానే కొనసాగింది. ఆమె పాఠశాల విద్య మొత్తం కొడగులోని కూర్గ్ పబ్లిక్ స్కూల్లో సాగింది. ఉన్నత చదువుల కోసం బెంగళూరు వెళ్లిన రష్మిక, అక్కడ ఎం.ఎస్. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ నుండి డిగ్రీ పట్టా అందుకుంది. కేవలం ఒకే సబ్జెక్టులో కాకుండా, రష్మిక సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్‌లో ట్రిపుల్ మేజర్ డిగ్రీని పూర్తి చేయడం గమనార్హం.మొత్తంగా విజయ్, రష్మిక ఇద్దరూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పటికీ.. డిగ్రీల పరంగా చూస్తే మాత్రం విజయ్ కంటే రష్మికనే కాస్త ముందంజలో ఉంది. ఆమె సైకాలజీ, జర్నలిజం లాంటి కీలక రంగాలలో డిగ్రీ పట్టాపొందింది. -
వైభవంగా... ఆహ్లాదకరంగా విరోష్ వివాహం
‘గీత గోవిందం’ సినిమాలో హీరో హీరోయిన్లుగా పెళ్లి పీటల మీద కూర్చున్న విజయ్ దేవరకొండ – రష్మికా మందన్నా నిజ జీవితంలో ఏడడుగులు వేశారు. ముందు స్నేహితులై, ఆ తర్వాత ప్రేమికులుగా మారి, ఫిబ్రవరి 26న ‘విరోష్’ (ఫ్యాన్స్ ఈ ఇద్దర్నీ అలానే పిలుస్తారు. తమ వివాహ వేడుకకు ఆ పేరునే పెట్టారు విజయ్–రష్మిక) భార్యాభర్తలయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్ ప్యాలెస్‌లో ఉదయం 10 గంటల 10 నిమిషాలకు వైభవంగా, ఆహ్లాదకరంగా జరిగింది.ఉదయం తెలుగు, సాయంత్రం కొడవ (కర్ణాటకకు చెందిన కొడగు జిల్లా రష్మిక సొంతూరు) సంప్రదాయం పరంగా పెళ్లి వేడుకలు జరిగాయి. దండలు మార్చుకున్నప్పుడు వధూవరులిద్దరూ ఆనందబాష్పాలతో ఉద్వేగానికి గురయ్యారు. భావోద్వేగాలు, చిరునవ్వులు మధ్య జరిగిన ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్నవారు నూతన వధూవరులిద్దర్నీ ఆశీర్వదించారు. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇక సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నా తమ పెళ్లి ఫొటోలను షేర్ చేసి, ఒకరిపట్ల మరొకరికి ఉన్న మమకారాన్ని, నమ్మకాన్ని, ఇష్టాన్ని పంచుకున్నారు.ప్రాణ స్నేహితురాల్ని భార్యను చేసుకున్నాను: విజయ్ ‘‘ఒక రోజు ఆమెను నేను మిస్ అయ్యాను... ఆమె పక్కన ఉండి ఉంటే ఈరోజు ఇంకా బాగుండేది కదా అన్నంతగా ఆమెని మిస్ అయ్యాను. ఒకవేళ ఆమె నా పక్కన కూర్చుని ఉంటే.. నా భోజనం ఇంకా పరిపూర్ణంగా అనిపించేది కదా అనిపించింది... అలాగే నాతో కలిసి ఆమె వర్కవుట్స్ చేస్తే అది పనిష్మెంట్లా కాకుండా ఫన్‌లా ఉండేది అనిపించింది. నా జీవితానికి ఆమె అవసరం అనిపించింది. నేను ఎక్కడ ఉన్నా ఇంట్లో ఉన్న అనుభూతిని, ప్రశాంతతను ఇచ్చే ‘ఇల్లు’ అంటే తనే అని నాకు అర్థమైంది. అందుకే నేను నా ప్రాణ స్నేహితురాల్ని నా భార్యను చేసుకున్నాను... 26.02.2026’’ అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) విజ్జూ... మాటలు సరిపోవడం లేదు: రష్మికహాయ్ మై లవ్స్, ఇప్పుడు మీకు ‘నా భర్త’ని పరిచయం చేస్తున్నాను! మిస్టర్ విజయ్ దేవరకొండ!! నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నాకు నేర్పించిన వ్యక్తి. ప్రశాంతంగా ఉంటే ఎలా ఉంటుందో నాకు చూపించిన వ్యక్తి. ప్రతి రోజూ పెద్ద కలలు కనడం మంచిదే అనీ, ఆ కలను సాకారం చేసుకునే సామర్థ్యం నీకు ఉందని చెప్పిన వ్యక్తి. ఎవరూ నన్ను చూడడంలేదనుకుంటూ నేను డ్యాన్స్ చేస్తుంటే నన్ను ఆపని వ్యక్తి. అలాగే స్నేహితులతో ప్రయాణం చేయడం ఎంత బాగుంటుందో చూపించిన వ్యక్తి. నన్ను నమ్మండి... ఈ వ్యక్తి గురించి ఓ పుస్తకం రాయొచ్చు. నేను ఎలాంటి స్త్రీగా ఉండాలని కలలు కన్నానో అలా ఉండేలా నువ్వు నన్ను మార్చావు.విజ్జూ... నీ గురించి ఎప్పుడు ఏం చెప్పాలన్నా నాకు మాటలు సరిపోవు. నా విజయాలు, కష్టాలు, ఆనందం, విచారం, జీవితం... ఇవన్నీ హఠాత్తుగా నాకు అర్థవంతంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నందుకు.... వీటన్నింటికీ సాక్ష్యంగా నువ్వు ఉన్నందుకు... నేను నీ భార్యను కావడం, నీ భార్యగా పిలవబడడం నాకు చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఇది పూర్తిగాపార్టీ టైమ్. మనిద్దరం కలిసి ఒక అందమైన జీవితాన్ని గడుపుదాం. ఐ లవ్ యు. -
రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి... గెస్ట్ లిస్ట్ & గ్రాండ్ ఫుడ్ మెనూ
-
రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి వీడియో వైరల్
-
ఒక రోజు రష్మికను చాలా మిస్ అయ్యా.. పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ విజయ్ ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత కొంతకాలంగా వీరిద్దరి ప్రేమపై వస్తున్న వార్తలకు తెరదించుతూ, నేడు (ఫిబ్రవరి 26) ఉదయం 10.10 గంటలకు రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్ ప్యాలెస్ వేదికగా వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక సాగింది.వివాహం అనంతరం విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ఖాతాలో పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ, తన లవ్‌స్టోరీని అభిమానులతో పంచుకున్నారు. ‘ఒక రోజు ఆమెను చాలా మిస్ అయ్యాను. తను నా పక్కనే ఉంటే బాగుంటుందని, తను ఎదురుగా ఉంటే నేను తినే భోజనానికి ఒక అర్థం ఉంటుందని గ్రహించాను. జిమ్‌లో తను తోడుంటే ఆ కష్టం శిక్షలా కాకుండా సరదాగా అనిపించేది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే, మనశ్శాంతిని ఇచ్చే 'ఇల్లు' అంటే తనే అని నాకు అర్థమైంది. అందుకే నా బెస్ట్ ఫ్రెండ్‌నే నా భార్యగా చేసుకున్నాను’ అని విజయ్ తన పెళ్లి విషయాన్ని అధికారికంగా తెలియజేశాడు. అటు రష్మిక కూడా ‘నా భర్తను పరిచయం చేస్తున్నా’ అంటూ పెళ్లి ఫోటోలను అభిమానులతో పంచుకుంది.'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలతో వెండితెరపై మాయ చేసిన ఈ జంట, నిజ జీవితంలోనూ జంటగా మారడం పట్ల అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి పెళ్లి ఫోటోలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. నటీనటులు, ప్రముఖులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
ఇదిగో విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫోటోలు
-
'నా భర్తను పరిచయం చేస్తున్నా'.. రష్మిక ఎమోషనల్ పోస్ట్
తన పెళ్లి ఫోటోలను హీరోయిన్ రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. హాయ్ మై లవ్స్.. తన భర్త విజయ్ దేవరకొండను మీకు పరిచయం చేస్తున్నానంటూ పోస్ట్ చేసింది. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నాకు నేర్పించిన వ్యక్తి అని విజయ్ను కొనియాడింది. ప్రశాంతంగా ఎలా ఉండాలో నాకు చూపించిన వ్యక్తి అని ప్రశంసలు కురిపించింది. నా కలలు నేను ఎప్పుడైనా సాధించగలనని చెప్పిన ఏకైక వ్యక్తి అంటూ భర్త విజయ్ దేవరకొండను ఆకాశానికెత్తేసింది. ఇది చూసిన అభిమానులు రష్మిక-విజయ్ జంటకు అభినందనలు చెబుతున్నారు. రష్మిక తన ఇన్‌స్టాలో రాస్తూ..' హాయ్ మై లవ్స్.. ఇప్పుడు మీకు నా భర్తని పరిచయం చేస్తున్నా. మిస్టర్ విజయ్ దేవరకొండ.. నిజమైన ప్రేమ, ప్రశాంతంగా ఎలా ఉండాలో నేర్పించిన వ్యక్తి. ప్రతిరోజు పెద్ద కలలు కనడం.. నేను ఎప్పుడైనా సాధించగలనని చెప్పగలిగే వ్యక్తి. స్నేహితులతో ప్రయాణించడం నాకు చూపించిన వ్యక్తి. నన్ను నమ్మండి.. నేను ఈ వ్యక్తి గురించి ఒక పుస్తకం రాయగలను. నేను ఎప్పుడూ కలలు కన్న స్త్రీని అయ్యా.. ఎందుకంటే మీరు ఈ రోజు నాదిగా మార్చారు. ఈరోజు నన్ను నిజంగా ఆశీర్వదించారు. విజ్జు నీ పట్ల నాకున్న భావాలను వర్ణించడానికి నాకు మాటలు లేవు!! నేను ఎప్పుడూ నీకు చెబుతూనే ఉన్నానంటూ' పోస్ట్ చేసింది.అంతేకాకుండా..'నా విజయాలు, కష్టాలు, ఆనందం, విచారం, జీవితం అన్నీ నీకు తెలుసు. ఇప్పుడు ప్రతిదీ చాలా అర్థవంతంగా ఉంది. ఎందుకంటే నేను నీతో ఉన్నా. ఇది మన జీవితంలో అన్నింటిలో అతిపెద్ద భాగం. నేను నీ భార్యగా మారడానికి చాలా ఉత్సాహంగా ఉన్నా. మీ భార్యగా ఉండటానికి.. మీ భార్యగా పిలవడానికి.. ఇప్పుడిది పూర్తిగా పార్టీ సమయం. మనిద్దరం కలిసి ఎప్పుడూ లేనంత ఉత్తమ జీవితాన్ని గడుపుదాం. ఐ లవ్ యూ' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.'ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్..టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఇవాళ ఉదయం ఈ ఫేమస్ స్టార్స్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఎట్టకేలకు ఒక్కటయ్యారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా నిలిచింది. తెలుగు సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరగ్గా.. సాయంత్రం కర్ణాటకలోని కొడవ సంప్రదాయం ప్రకారం కూడా పెళ్లి వేడుక జరగనుంది. ఈ పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
గ్రాండ్‌గా విరోష్ పెళ్లి.. విజయ్ దేవరకొండకు భారీ కట్నకానుకలు?
టాలీవుడ్ పవర్ కపుల్ విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న చుట్టూ ఇప్పుడు భారీ హైప్ నడుస్తోంది. ఈ ప్రేమ జంట పెళ్లి ఈ రోజు(ఫిబ్రవరి 26) ఉదయం ఉదయపూర్‌లో ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో కట్న, కానులకు సంబంధించి పలు గాసిప్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ రష్మిక నుంచి భారీ కట్నం తీసుకుంటున్నాడనే విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ రూమర్స్ నిజమా? లేక ఓవర్ హైప్‌నా?విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న 'గీతా గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాల్లో కలిసి నటించారు. అప్పటి నుంచి వీళ్ల మధ్య లింకప్ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. 2025 అక్టోబర్‌లో హైదరాబాద్‌లో సీక్రెట్ ఎంగేజ్మెంట్ జరిగిందని సోర్సెస్ చెబుతున్నాయి. కానీ ఇద్దరూ ఓపెన్‌గా కన్ఫర్మ్ చేయలేదు. ఇప్పుడు వెడ్డింగ్ హడావిడి బాగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఈ వెడ్డింగ్ డీటైల్స్ నెటిజెన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లోని ఒక హెరిటేజ్ ప్యాలెస్‌లో వీరిద్దరి వివాహం జరిగింది. మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఉంటుందని చెబుతున్నారు. ఈ వెడ్డింగ్‌ను 'విరోష్ వెడ్డింగ్' అని పిలుస్తున్నారు . ఇక్కడ విరోష్ అంటే విజయ్ + రష్మిక = విరోష్ అని అర్ధం.ఇకపోతే వీళ్ళ పెళ్ళి వార్తల్లో మెయిన్ కాంట్రవర్సీ డౌరీ క్లెయిమ్స్! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్స్ ప్రకారం, రష్మిక సైడ్ నుంచి విజయ్‌కు భారీ డౌరీ ఇస్తున్నారని... గోల్డ్, లగ్జరీ ప్రాపర్టీలు, ఇండియాలో హై-ఎండ్ హోమ్స్, కార్లు, క్యాష్ వంటివి ఉన్నాయని చెబుతున్నారు. కొన్ని పోస్టుల్లో "150 కోట్ల డౌరీ" అని కూడా రాస్తున్నారు! ఇది 'బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్' అని, టాలీవుడ్లో ఎప్పుడూ లేనంత గ్రాండ్‌గా జరగబోతోందని ట్రెండ్ అవుతోంది.కానీ ఈ క్లెయిమ్స్ ఎంత వరకు నిజం? చాలా ముఖ్యంగా – ఇవన్నీ *అన్‌వెరిఫైడ్* అలాగే *వైరల్ రూమర్స్* మాత్రమే! విజయ్ లేదా రష్మిక ఎవరూ ఈ డౌరీ గురించి కాదు కదా కనీసం వాళ్ళ పెళ్ళి గురించి కూడా ఇప్పటిదాకా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. డౌరీ అనేది చట్టవిరుద్ధం, ఈ రకమైన రూమర్స్ సెలబ్రిటీల చుట్టూ తరచూ వస్తాయి – కొన్ని ట్రోల్స్, కొన్ని ఫేక్ న్యూస్ కోసం. గతంలో కూడా ఫిబ్రవరి 2 లేదా ఇతర డేట్స్‌పై ఫేక్ వీడియోలు వచ్చాయి, కానీ అవి తప్పు అని తేలాయి.ఈ కట్నకానుకలతో పాటు ఇంకా కొన్ని హాట్ రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ వీళ్ల వెడ్డింగ్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం రూ. 260 కోట్లు కూడా ఆఫర్ చేసిందని, కానీ విజయ్ రిజెక్ట్ చేశాడని చెబుతున్నారు .ఎందుకంటే తమ వెడ్డింగ్ మెమరీస్ పర్సనల్ అని వాటిని పబ్లిక్ డొమైన్ లో ఉంచడం తమకు ఇష్టంలేదని విజయ్ చెప్పాడట. అంతేకాదు ఈ పెళ్ళికి సంబంధించి సెక్యూరిటీ టీమ్ 3 వారాలు ట్రైనింగ్ తీసుకుందని, స్టార్ గెస్ట్స్ లిస్ట్ భారీగా ఉందని కూడా లీక్ అయ్యాయి. అయితే పెళ్లి గురించి అయితే కొంతవరకు ఓకే కాసీ డౌరీ లాంటి సెన్సిటివ్ టాపిక్స్‌పై కూడా రూమర్స్ వ్యాప్తి చేయడం మంచిది కాదు. -
రష్మిక చూసిన మొదటి తెలుగు సినిమా.. మన స్టార్ హీరోదే..!
స్టార్ హీరోయిన్ రష్మిక తెలుగింటి కోడలిగా మెట్టినింట అడుగుపెట్టనుంది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో రష్ పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. కర్ణాటకకు చెందిన రష్మిక తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. కొన్నేళ్ల పాటు విజయ్‌తో ప్రేమలో ఉన్న ముద్దుగుమ్మ ఈ రోజే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వీరి పెళ్లి వేదికగా నిలిచింది. ఈ వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు.అియితే రష్మిక మందన్నా తెలుగింటి కోడలిగా రానున్న తరుణంలో గత ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మికను మీకిష్టమైన తెలుగు సినిమా ఏది? ఎందుకు? అని ప్రశ్నించారు. దీనికి రష్మిక సమాధానమిచ్చింది.తాను చూసిన ఫస్ట్ తెలుగు సినిమా మహేశ్ బాబు నటించిన బిజినెస్మెన్ అని తెలిపింది. నాన్నతో పాటు వెళ్లి బిజినెస్మెన్ థియేటర్లో చూశానని రష్మిక పంచుకుంది. నా కెరీర్ కాకుండా తెలుగులో నేను చూసిన మొదటి సినిమా ఇదేనని వెల్లడించింది. రష్మిక- విజయ్ పెళ్లి వేళ ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. “First Telugu movie I watched was #Businessman. I went to theatre with my father” - #RashmikaMandanna 🔥#MaheshBabu | #Varanasi pic.twitter.com/4d1xb3PWK2— VardhanDHFM (@_VardhanDHFM_) February 26, 2026 -
విరోష్ జంట గొప్పమనసు.. వారికి ప్రత్యేకంగా స్వీట్ బాక్సులు..!
ఎన్నో ఏళ్లుగా వేచి చూసిన తరుణం రానే వచ్చింది. కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న విరోష్ జంట పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లో వీరి గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది. ఇవాళ ఉదయం 10 గంటల 10 నిమిషాలకు రష్మిక మెడలో మూడు ముళ్లు వేశాడు విజయ్ దేవరకొండ. ఈ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా విరోష్ జంట తమ గొప్పమనసు చాటుకున్నారు. వీరి పెళ్లిని కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులకు స్వీట్ బాక్సులు అందించారు. అంతేకాకుండా అక్కడే ఉన్న చిన్నపిల్లలకు సైతం స్వీట్స్ పంచారు. ఐటీసీ మెమొంటోస్ హోటల్ బయట ఉన్న వారి దగ్గరికి వచ్చిన ఈ ప్రత్యేక స్వీట్ బాక్సులు అందజేశారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #TFNExclusive A 'Sweet' gesture!❣️Team #VIROSH share joy with the media at Udaipur!!🤩✨#VijayDeverakonda #RashmikaMandanna #TeluguFilmNagar pic.twitter.com/6PryBXwsEp— Telugu FilmNagar (@telugufilmnagar) February 26, 2026 -
విజయ్ దేవరకొండకు రష్మిక ఎంత కట్నం ఇస్తుందో తెలుసా?
-
కొడవ సంప్రదాయంలో ‘విరోష్’ వివాహం.. పెళ్లి ప్రత్యేకతలు ఇవే!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా వివాహం బంధంలోకి అడుగుపెట్టారు. గురువారం ఉదయం 10:10 గంటలకు రష్మిక మెడలో విజయ్ దేవరకొండ మూడుమూళ్లు వేశాడు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్ ప్యాలెస్ ఈ పెళ్లికి వేదికగా మారింది. ఈ రోజు సాయంత్రం మరోసారి రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకోబోతున్నారు. తొలుత తెలుగు హిందూ పద్దతిలో ఈ జంట పెళ్లి చేసుకుంది. ఇప్పుడు రష్మిక కుటుంబ మూలలను గౌరవిస్తూ కొడవ సంప్రదాయంలో వివాహం చేసుకోబోతున్నారు.కొడవ పెళ్లి ఎలా జరుగుతుంది?రష్మికది కర్ణాటకలోని కొడగు (కూర్గ్) ప్రాంతానికి చెందిన కొడవ సామాజిక వర్గం. అక్కడి వారి పెళ్లి సంప్రదాయ భారతీయ వివాహాలన్నింటిలోకి చాలా భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుంది. పెళ్లి తంతుని వాళ్లు ‘మంగళ’ అని పిలుస్తారు. ఈ పెళ్లిళ్లలో హిందూ సంప్రదాయాల్లో కనిపించే పురోహితులు (బ్రాహ్మణులు), అగ్ని సాక్షి (హోమం) వంటివి ఉండవు. అంతా పెద్దల సమక్షంలో, ప్రకృతి సాక్షిగా జరుగుతుందట.పెళ్లి రోజు ఉదయం వధూవరులు తమ తమ ఇళ్లలో అభ్యంగన స్నానం చేసి, సంప్రదాయ దుస్తులు ధరిస్తారు. పెళ్లి కొడుకు'కుప్య' (నల్లని కోటు), 'చేలే' (నడుముకు కట్టే పట్టీ) మరియు 'పీచే కత్తి' (చిన్న కత్తి) ధరిస్తాడు. పెళ్లి కూతురు వెనుక వైపు కుచ్చెళ్లు వచ్చేలా కట్టుకునే ప్రత్యేకమైన కొడవ చీరను ధరిస్తుంది.పెళ్లి వేదిక వద్దకు వరుడు వచ్చే ముందు, అడ్డుగా ఉన్న అరటి చెట్టు కాండాలను నరకడం ఒక ముఖ్యమైన ఆచారం. ఇది వరుడి పరాక్రమానికి, అడ్డంకులను తొలగించడానికి ప్రతీక.వధూవరులు పెళ్లి పీటలపై కూర్చున్నప్పుడు, కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చి వారిని ఆశీర్వదిస్తారు. ఇక్కడ ఎటువంటి మంత్రాలు ఉండవు. కేవలం పెద్దల దీవెనలే ప్రధానం. వధువుకి ఒడి బియ్యానికి బదులు ఒక చిన్న నాణేల మూట అందిస్తారట.ఇది సంపద, శుభం, స్థిరత్వానికి సంకేతం.పెళ్లి తర్వాత వధువు తన అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు గంగా పూజ జరుగుతుంది. వధువు బావి నుంచి నీటిని తోడి, ఆ బిందెను తలపై పెట్టుకుని నడుచుకుంటూ వస్తుంది. ఈ సమయంలో వరుడి కుటుంబ సభ్యులు ఆమెను ఆటపట్టిస్తూ, ఆమె నడవకుండా అడ్డుకుంటారు. ఆమె సహనాన్ని, ఓర్పును పరీక్షించే ఆహ్లాదకరమైన ఘట్టం ఇది. ఇతర హిందూ వివాహాలకు భిన్నంగా, కొడవ పెళ్లిళ్లలో మాంసాహారం (ముఖ్యంగా పంది మాంసం), మద్యం తప్పనిసరిగా వడ్డిస్తారు.కొడవ భాష మాట్లాడుతూ.. తన సంప్రదాయ బట్టల్లో రష్మిక#RashmikaMandana #Virosh #VijayDevarakonda pic.twitter.com/ZNNrxCCYgl— Milagro Movies (@MilagroMovies) February 26, 2026 -
విజయ్-రష్మిక పెళ్లి.. ప్రధాని స్పెషల్ విషెస్
-
తెలుగు హీరోలు.. ఎవరు ఏ వయసులో పెళ్లి చేసుకున్నారంటే?
తెలుగు హీరో విజయ్ దేవరకొండ ఎట్టకేలకు బ్యాచిలర్ లైఫ్‌కి టాటా చెప్పేశాడు. హీరోయిన్ రష్మిక మెడలో మూడు ముళ్లు వేసేశాడు. ఉదయ్‌పుర్ వేదికగా ఇరువురి కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. అయితే విజయ్ వయసు 36 కాగా రష్మిక వయసు 29. ఈ సందర్భంగా తెలుగు హీరోలు.. ఎవరు ఏ వయసులో పెళ్లి చేసుకున్నారు? అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఎవరెప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారంటే?(ఇదీ చదవండి: ఎట్టకేలకు సొంతిల్లు కట్టుకున్న 'బిగ్‌బాస్ 8' విజేత నిఖిల్)చిరంజీవి కొడుకు రామ్ చరణ్.. 27 ఏళ్లకే ఉపాసనని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ప్రస్తుతం ఇద్దరు ఆడపిల్లలు, ఓ బాబు ఉన్నాడు.ఎన్టీఆర్ తన 28వ ఏట లక్ష్మీ ప్రణతిని వివాహమాడాడు. వీళ్లకు ప్రస్తుతం ఇద్దరు కొడుకులు ఉన్నారు.హీరో నాని కూడా తనకు 28 ఏళ్లున్నప్పుడే వైజాగ్‌కి చెందిన అంజనని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఓ కొడుకు ఉన్నాడు.అల్లు అర్జున్ తన 29 ఏళ్లకు స్నేహారెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహమిది. వీళ్లకు ఓ బాబు, పాప ఉన్నారు.మహేశ్ బాబు కూడా తన 29 ఏటనే నమ్రతతో ఏడడుగులు వేశాడు. వీళ్లది ప్రేమ వివాహమే. ప్రస్తుతం ఓ కొడుకు, కూతురు ఉన్నారు.నాగచైతన్య 30 ఏళ్ల వయసులో సమంతని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆమెకు విడాకులిచ్చేశాడు. ఏడాదిన్నర క్రితం శోభితని పెళ్లాడాడు.మెగాహీరో వరుణ్ తేజ్ 33వ ఏట హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వివాహమాడాడు. ఇది ప్రేమ వివాహం. వీళ్లకు ఓ కొడుకు ఉన్నాడు.హీరో నిఖిల్.. తనకు 34 ఏళ్లున్నప్పుడు పల్లవి వర్మ అనే డాక్టర్ని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఓ కొడుకు కూడా ఉన్నాడు.రానా తన 35వ ఏట మిహీక బజాజ్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు.విజయ్ దేవరకొండ 36 ఏళ్ల వయసులో ఇప్పుడు రష్మికని పెళ్లి చేసుకున్నాడు. చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. పెద్దల్ని ఒప్పించి ఇప్పుడు ఒక్కటయ్యారు.హీరో నితిన్ 37 ఏళ్లకు షాలినీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు కూడా ఓ కొడుకు పుట్టాడు.హీరో శర్వానంద్ అయితే 38 ఏళ్లకు రక్షితా రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీళ్లకు ఓ కూతురు ఉంది.ఇంతమంది హీరోలు పెళ్లిచేసుకుంటున్నారు గానీ ప్రభాస్ మాత్రం 47 ఏళ్లొచ్చినా ఇప్పటికే సింగిల్‌గానే ఉండిపోయాడు. పెళ్లి చేసుకుంటాడో లేదో?(ఇదీ చదవండి: #Virosh హల్దీ సెలబ్రేషన్.. ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్) -
#Virosh.. పెళ్లి చేసుకున్న విజయ్-రష్మిక
హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మెడలో మూడు ముళ్లు వేసేశాడు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ వేదికగా ఉదయం 10:10 గంటలకు కుటుంబ సభ్యులు, పలువురు సన్నిహితుల నడుమ వీళ్లిద్దరూ ఒక్కటయ్యారు. తెలుగు సంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరిగింది. ఇదే రోజు సాయంత్రం 4 గంటలకు కన్నడ(కొడవ) సంప్రదాయంలోనూ విజయ్-రష్మిక పెళ్లి చేసుకోనున్నారు. పెళ్లిలో నో ఫేన్ నిబంధన కారణంగా ఫొటోలు ఇంకేం బయటకు రాలేదు. అధికారికంగా విజయ్-రష్మిక వాటిని పోస్ట్ చేసేంతవరకు వెయిట్ చేయాల్సిందే.(ఇదీ చదవండి: Virosh.. రష్మికకు మూడోసారి.. విజయ్‌కు మాత్రం తొలిసారి!)తెలంగాణకు చెందిన విజయ్ దేవరకొండ.. తొలుత చిన్న చిన్న పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం చిత్రాలు మంచి పాపులారిటీ తీసుకొచ్చాయి. గీతగోవిందం మూవీలో తనతో పాటు కలిసి నటించిన రష్మికనే ఇప్పుడు విజయ్ పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరూ డియర్ కామ్రేడ్ అనే మూవీ కూడా చేశారు. ప్రస్తుతం 'రణబాలి'లో చాన్నాళ్ల తర్వాత కలిసి నటిస్తున్నారు.రష్మిక విషయానికొస్తే కర్ణాటకలోని కొడుగు ప్రాంతానికి చెందిన అమ్మాయి. 'కిరిక్ పార్టీ' మూవీతో హీరోయిన్ అయింది. 'ఛలో'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మహేశ్ బాబు, అల్లు అర్జున్ తదితర స్టార్ హీరోలతోనూ కలిసి నటించింది. 'పుష్ప' దెబ్బకు ఈమెకు పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీలో వరస సినిమాలు చేస్తూ రష్మిక బిజీగా ఉంది.విజయ్-రష్మిక చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నప్పటికీ తమ బంధాన్ని అస్సలు బయటపెట్టలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీళ్లు డేటింగ్, ట్రిప్స్ గురించి ఎప్పటికప్పుడు ఫొటోలు బయటకొస్తూనే ఉండేవి. ఇప్పుడు పెళ్లి బంధంతో దాన్ని అధికారికం చేసేశారు.(ఇదీ చదవండి: విజయ్- రష్మిక వెడ్డింగ్.. అసలేంటి ఈ సెలబ్రిటీ ట్రెండ్?) -
#Virosh : పెళ్ళి సందడి.. ట్రెండింగ్‌లో రష్మిక మందన్న (ఫొటోలు)
-
#Virosh హల్దీ సెలబ్రేషన్.. ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్
టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ రష్మిక పెళ్లికి అంతా సిద్ధం. ఈరోజు(ఫిబ్రవరి 26) ఉదయం 10:10 గంటలకు విజయ్ మూడు మూళ్లు వేయనున్నాడు. రాజస్థాన్‌లోని ఉదయ్పుర్లో మెమొంటోస్ హోటల్.. ఈ వివాహానికి వేదిక. ఇప్పటికే బారాత్ మొదలైపోయింది. ఉదయం తెలుగు సంప్రదాయంలో పెళ్లి జరగనుండగా.. సాయంత్రం 4 గంటల తర్వాత (కొడవ) కన్నడ సంప్రదాయంలో మరోసారి వివాహ తంతు జరగనుంది.(ఇదీ చదవండి: Virosh.. రష్మికకు మూడోసారి.. విజయ్‌కు మాత్రం తొలిసారి!)ఇకపోతే బుధవారం సాయంత్రం హల్దీ సెలబ్రేషన్స్ జరగ్గా.. వేడుకకు వచ్చిన అతిధులు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ కూడా వెళ్లింది. హల్దీకి సంబంధించిన ఫొటోలని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇది హల్దీ కాదని ముందే హోలీ వచ్చేసిందని చెప్పుకొచ్చింది. ఇదే పెళ్లి కోసం హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ కూడా అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇన్ స్టాలో పెట్టిన ఓ ఫొటో చూస్తే.. ఈమె కూడా హల్దీ వేడుకల్లో పాల్గొన్నట్లు కనిపిస్తోంది.ఇదే పెళ్లి కోసం డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా, టాలీవుడ్ స్టైలిష్ట్ శ్రావ్య వర్మ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తదితరులు ఇప్పటికే ఉదయ్‌పుర్ చేరుకున్నారు. ఈ రోజు గానీ రేపు గానీ వాళ్లు కూడా సోషల్ మీడియాలో కొత్త జంట విజయ్ దేవరకొండ-రష్మికకు పెళ్లి శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడతారు. ఫొటోలు కూడా రిలీజ్ చేయడం గ్యారంటీ. అలానే మార్చి 4న హైదారాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు.(ఇదీ చదవండి: విజయ్- రష్మిక వెడ్డింగ్.. అసలేంటి ఈ సెలబ్రిటీ ట్రెండ్?) -
ఉదయపూర్ లో విరోష్ పెళ్లి హంగామా
-
విజయ్- రష్మిక పెళ్లి వేడుక.. తాళికట్టు శుభవేళ ఇదే
టాలీవుడ్ మోస్ట్ ఫేవరేట్ జంట రష్మిక- విజయ్ దేవరకొండ మరికొన్ని గంటల్లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే ఉదయ్‌పూర్‌లో ఫుల్‌గా సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు పాల్గొంటున్నారు. విజయ్- రష్మిక ఈనెల 26న మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఆన్ స్క్రీన్‌లో ఇప్పటికే పెళ్లి పీటలెక్కిన ఈ జంట.. రియల్ లైఫ్‌లోనూ వివాహం చేసుకోబోతున్నారు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది.ముహుర్తం ఫిక్స్..ఫిబ్రవరి 26న అంటే గురువారం విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి జరగనుంది. ఉదయం ఏడున్నర గంటలకు బరాత్ కార్యక్రమం ఉంటుందని సన్నిహితులు తెలిపారు. రేపు ఉదయం 10.10 నిమిషాలకి తెలుగు సాంప్రదాయం ప్రకారం వివాహ ముహూర్తం ఫిక్స్ చేశారు. అంటే అదే సమయానికి రష్మిక మెడలో మూడు ముళ్లు వేయనున్నారు విజయే దేవరకొండ. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు కన్నడలో కొడవ సాంప్రదాయం ప్రకారం మరోసారి వివాహ కార్యక్రమం జరగనుంది. అంటే రెండు పద్ధతుల్లో వీరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరగనుంది. ఈ క్షణం కోసమే విజయ్- రష్మిక ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ పెళ్లి తర్వాత టాలీవుడ్ ప్రముఖుల కోసం మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. -
విజయ్- రష్మిక వెడ్డింగ్.. అసలేంటి ఈ సెలబ్రిటీ ట్రెండ్..!
టాలీవుడ్ మోస్ట్ ఫేవరేట్ జంట మరికొన్ని గంటల్లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఉదయ్‌పూర్‌లో ఫుల్‌గా సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. కొన్నేళ్లుగా ఎక్కడా బయటపడుకుండా రిలేషన్‌లోన్న విజయ్- రష్మిక ఈనెల 26న పెళ్లిబంధంతో ఒక్కటి కాబోతున్నారు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది.అయితే సెలబ్రిటీల పెళ్లి సందడి మామూలుగా ఉండదు. ఎక్కడా కూడా చిన్న పొరపాటు జరగకుండా జాగ్రత్తపడతారు. గతంలో విరాట్- అనుష్క, దీపిక-రణ్వీర్ సింగ్ సైతం తమ పెళ్లికి అత్యంత సీక్రెట్‌గా జరుపుకున్నారు. దీనికోసం నో మొబైల్ పాలసీని అత్యంత కఠినంగా అమలు చేశారు. ఇప్పుడదే బాటలో రష్మిక- విజయ్ జంట కూడా పెళ్లి వేడుకను జరుపుకుంటోంది. స్టార్ కపుల్ ఫాలో అవుతోన్న ఈ పద్ధతి ఓ అందమైన పేరు కూడా ఉంది. ఈ నో మొబైల్ పాలసీ సంప్రదాయాన్ని అన్ప్లగ్డ్ వెడ్డింగ్స్ అని పిలుస్తారు.అన్ప్లగ్డ్ వెడ్డింగ్స్ అంటే..?అన్ప్లగ్డ్ వెడ్డింగ్స్ అంటే పెళ్లికి వచ్చిన అతిథులందరూ కూడా తమ మొబైల్స్ స్విచ్ఛాఫ్ చేసి అక్కడ సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించాలి. ఎవరు కూడా ఫోటోలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలు పెట్టడానికి వీలుండదు. అంతే కాకుండా ముందువరుసలో కూర్చొని ఫోన్లలో పెళ్లి ఫోటోలు తీయడానికి కూడా ఛాన్స్ ఉండదు. పెళ్లికి సంబంధిచిన ఫోటోలు, వీడియోలు ఆ జంట షేర్ చేసేవరకు సోషల్ మీడియాలో కనిపించవు. ఈ పద్ధతినే అన్ప్లగ్డ్ వెడ్డింగ్స్ అని పిలుస్తున్నారు. లైఫ్‌లో చాలా ముఖ్యమైన ఈ క్షణాలను అత్యంత ప్రైవసీగా నిర్వహించాలనేది సెలబ్రిటీ వధూవరుల కోరిక. వారు మాత్రమే ఫస్ట్ ఈ వేడుక పిక్స్ పంచుకోవాలనే కాన్సెప్ట్ మంచిదే. దీంతో స్టార్ కపుల్ వివాహ వేడుకల్లో ఇదొక ట్రెండ్‌గా మారిపోయింది.ఈ వెడ్డింగ్ ప్రైవసీ అన్ప్లగ్డ్ ట్రెండ్ అనుష్క-విరాట్ కోహ్లీ పెళ్లి సమయంలో మొదటిసారి వైరలైంది. ఆ తర్వాత 2018లో ఇటలీలో పెళ్లి చేసుకున్న దీపిక-రణ్వీర్ సింగ్ కూడా నో ఫోన్ పాలసీని అమలు చేశారు. అంతేకాకుడా ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్, కత్రినాకైఫ్-విక్కీ కౌశల్, ఆలియా భట్-రణ్‌బీర్ కపూర్ సైతం ఇదే పద్ధతిని ఫాలో అయ్యారు. తాజాగా విరోష్ పెళ్లిలోనూ ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. -
రష్మికకు మూడోసారి.. విజయ్‌కు మాత్రం తొలిసారి!
సినిమాలు, పనులు ఎప్పుడూ ఉండేవే.. కానీ పెళ్లి జీవితంలో ఒక్కసారే వస్తుంది. కల్యాణం వచ్చినా ఆగదు, కక్కొచ్చినా ఆగదన్నట్లు ఆ శుభఘడియలు ముంచుకొచ్చాక ఎవరూ దాన్ని వాయిదా వేయలేరు. టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా విషయంలో ఇదే జరుగుతోంది. చాలాకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ దాన్ని బయటకు చెప్పకుండా దాగుడుమూతలు ఆడుతున్నారు.ఇప్పుడు ఆ ఆటకు ముగింపు పలుకుతూ భార్యాభర్తలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఫిబ్రవరి 26న విరోష్ (విజయ్- రష్మిక) పెళ్లి జరగనుంది. ఇప్పటికే ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. తాజాగా జరిగిన సంగీత్ వేడుకలో విజయ్ తల్లి మాధవి.. వారసత్వంగా వస్తున్న బంగారు గాజులను రష్మికకు బహుకరించి తన ప్రేమను చాటుకున్నట్లుృ తెలుస్తోంది. మరి విరోష్ లవ్ స్టోరీ ఎప్పుడు? ఎలా? మొదలైందో ఓసారి చూసేద్దాం..2018లోనే పెళ్లిగీత గోవిందం.. 2018లో వచ్చిన ఈ సినిమాలో తొలిసారి విజయ్- రష్మిక జంటగా నటించారు. ఆన్ స్క్రీన్‌లో పెళ్లి కూడా చేసుకున్నారు. ఇలా పెళ్లి సీన్లో నటించడం రష్మికకు మూడోసారి కానీ విజయ్‌కు మాత్రం అదే తొలిసారి కావడం విశేషం! ఈ చిత్రంతోనే వీరి మధ్య పరిచయం మొదలైంది. డియర్ కామ్రేడ్ మూవీతో స్నేహం కాస్త ప్రేమగా మారింది. అందుకే ఈ మూవీ తమకెంతో స్పెషల్ అంటుంటారు. కానీ ప్రేమలో ఉన్నామని మాత్రం నేరుగా ఎన్నడూ చెప్పలేదు. అందరి ముందు..కలిసి విహారయాత్రలకు వెళ్లినప్పుడు కూడా జంటగా ఫోటోలు షేర్ చేసిందీ లేదు. అయితే ఇద్దరూ కలిసే ఉన్నట్లుగా హింట్లు మాత్రం వదిలేవారు. పుష్ప సినిమా సమయంలో విజయ్ను డార్లింగ్ ఫ్రెండ్ అని అభివర్ణించింది రష్. ఇంటర్వ్యూలలో కూడా అతడు తన ఫేవరెట్ అని వెల్లడించింది. ది గర్ల్‌ఫ్రెండ్ ఈవెంట్లో తొలిసారి విజయ్.. అందరిముందు రష్మిక చేయిని ముద్దాడాడు. దీంతో ఆమె సిగ్గుల మొగ్గయింది.ఆ ఒక్క మాటతో..జయాపజయాల్లోనూ ఒకరికి ఒకరు తోడుగా ఉన్నారు. పలు బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ తర్వాత విజయ్.. కింగ్డమ్తో పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే చిన్నపిల్లలా సంబరపడిపోయింది నేషనల్ క్రష్. మనం హిట్ కొట్టాం అని మురిసిపోయింది. తన ప్రేమ విజయ్ దగ్గరే ఆగిపోలేదు, అతడి కుటుంబాన్ని కూడా తన కుటుంబంగా భావించింది. విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ సినిమా ఈవెంట్స్‌కు వెళ్లేందుకు ఏనాడూ నో చెప్పలేదు. అటు విజయ్ తల్లితోనూ తనకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆమె తనకు అమ్మ తర్వాత అమ్మతో సమానం అన్నప్పుడే ఆమె తెలుగింటి కోడలైపోయింది.పెళ్లి పత్రికలోనూ..విజయ్- రష్మికల ప్రేమను చూసిన అభిమానులు వీరికి విరోష్ (#Viorsh) అనే ట్యాగ్ ఇచ్చారు. అలానే పిలవడం మొదలుపెట్టారు. అభిమానులు ఇచ్చిన విరోష్ అనే పేరు ఈ లవ్‌బర్డ్స్‌కు సైతం నచ్చడంతో పెళ్లి పత్రికలోనూ అదే పేరు అచ్చువేయించారు. మరికొన్ని గంటల్లో ఒక్కటి కాబోతున్న ఈ విరోష్ జంటకు అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్!!చదవండి: పెళ్లి వేళ.. రష్మిక వ్యాఖ్యలు వైరల్ -
విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి సందడి విశేషాలు (ఫొటోలు)
-
ViRosh రెండు పద్ధతుల్లో వెడ్డింగ్, కాబోయే కోడలికి అత్తగారి అందమైన గిఫ్ట్
Wedding of ViRosh నేషనల్ క్రష్, నటి రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి సందడికి సంబంధించిన కబుర్లుఉ ఊపందుకున్నాయి.విరోష్ అంటూ తమ వివాహాన్ని అధికారికంగా ప్రకటించిన ఈ జంట ఫిబ్రవరి 26న వివాహం చేసుకోనున్నారు. ఇప్పటికే వధూవరులతోపాటు, అతిరథమహారథులు ఈ వివాహ వేడుకకోసం ఉదయపూర్‌కు వెళ్లారు. తెలుగు, కొడవ ఇలా రెండు సంప్రాదాయ పద్ధతుల్లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. తాజా నివేదికల ప్రకారం ప్రీ వెడ్డింగ్ వేడుకలు జోరుగా సాగుతున్నాయి.విజయ్ దేవరకొండ తల్లి రష్మిక మందన్నకు బహుమతిసంగీత వేడుకను మంగళవారం ఘనంగా జరిగింది. సరదాగా క్రికెట్ ఆడిన తర్వాత, ఉదయపూర్‌లోని ఐటీసీ మెమెంటోస్ హోటల్లో సంగీత నైట్ ఉత్సాహంగా నిర్వహించుకోగా, ఈ వేడుకలకు సంబంధించి ఒక భావోద్వేగ సంగతి నెట్టింట విశేషంగా నిలుస్తోంది. సంగీత వేడుకలో విజయ్ తల్లి మాధవి దేవరకొండ కుటుంబ సంప్రదాయానికిఅనుగుణంగా రష్మికకు వారసత్వ గాజులను బహుకరించారట. తద్వారా తమ కుటుంబంలోకి కోడలిగా రష్మికను ప్రేమగా ఆహ్వానం పలికినట్టుగా భావిస్తున్నారు. సంగీత వేడుక నుండి లీక్ అయిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈరోజు హల్దీ వేడుకు జరగనుందివిరోష్ పెళ్లికి తరలివెళ్లిన అతిథులుమరోవైపు అనేక మంది అతిథులు ఇప్పటికే లేక్స్ నగరానికి చేరుకున్నారు. పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్,నటి ఈషా రెబ్బాతోపాటు ఈ జంటకు సన్నిహితురాలైన స్టైలిస్ట్ శ్రావ్య వర్మ కూడా హాజరయ్యారు. అంతేకాదు రష్మిక బ్లాక్‌బస్టర్ మూవీ ది గర్ల్‌ఫ్రెండ్ నటి ఆషికా రంగనాథ్ , దర్శకుడు-నటుడు రాహుల్ రవీంద్రన్ కూడా వేడుకలకు తరలివెళ్లారు. కోకిలాబెన్ అంబానీ, ముఖేష్ అంబానీ, నీతా, ఆకాష్, శ్లోకా అంబానీలతో సహా అంబానీ కుటుబం కూడా ఉదయపూర్‌లో దిగినట్టు సమాచారం. ఇది ఇలా ఉంటే మార్చి 4న హైదరాబాద్‌లో జరగబోయే రిసెప్షన్ కోసం హితులు, సన్నిహితులతోపాటు, స్టార్ లవ్‌బర్డ్స్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
విజయ్ & రష్మిక వెడ్డింగ్ విశేషాలు..
-
విజయ్, రష్మిక సంగీత్ వీడియో వైరల్.. క్రికెట్ బ్యాట్‌పై పెళ్లి డేట్!
రష్మిక, విజయ్ దేవరకొండ మరికొన్ని గంటల్లో వివాహం బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే ఇరు కుటుంబాలలో పెళ్లి సందడి మొదలైంది. మోహందీ, సంగీత్ సందడి కూడా జరిగిపోయింది. సంగీత్‌లో విజయ్, రష్మిక కలిసి నటించిన చిత్రాల్లోని క్యూట్ ఫోటోలతో కలర్పుల్గా డెకరేషన్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో అధికారికంగా షేర్ చేయాలని కోరుతూ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. దీంతో పాటు సంగీత్‌లో ఇరుకుటుంబ సభ్యులు సరదగా ‘విరోష్ ప్రీమియర్ లీగ్’ను కూడా సెలెబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోని విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశాడు. అందులో క్రికెట్ బ్యాట్, సిల్వర్ మెడల్‌పై ఫిబ్రవరి 26 అని రాసి పెళ్లిడేట్ని డిఫరెంట్‌గా ప్రకటించారు. From the #Virosh Premier league! #VijayDeverakonda pic.twitter.com/ghf7F7TMDF— Hourly Vijay Deverakonda (@HourlyDVS) February 24, 2026ఈ రోజు హల్దీ వేడుకలు జరుగనున్నాయి. సాయంత్రం మెహందీ ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకోనున్నారు. గురువారం(ఫిబ్రవరి 26) ఉదయం తెలుగు సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరగనుంది. ఇదే రోజు సాయంత్రం కొడవ స్టైల్లో మరోసారి విజయ్-రష్మిక వివాహం చేసుకోనున్నారని తెలుస్తోంది. ఉదయ్‌పూర్‌లోని మెమెంటోస్ హోటల్ జరిగే ఈ పెళ్లికి కేవలం 100 మంది లోపే అతిథులు హాజరుకానున్నారు. మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షెన్ ఏర్పాటు చేశారు.We need those original pictures @iamRashmika please 🥹❤️❤️#ViRosh pic.twitter.com/uVx2O2gWLz— Rahul (@The_pathbreaker) February 24, 2026 -
విజయ్-రష్మిక పెళ్లి.. శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని
టాలీవుడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి.. గురువారం(ఫిబ్రవరి 26) జరగనుంది. ఇప్పటికే వీళ్లిద్దరి కుటుంబ సభ్యులు.. ఉదయ్‌పుర్ వెళ్లిపోయారు. పెళ్లి సందడి కూడా మొదలైపోయింది. మంగళవారం నాడు పెళ్లికొడుకు, పెళ్లి కూతురు టీమ్స్‌గా విడిపోయి క్రికెట్ మ్యాచ్ ఆడారు. అలానే రాత్రి సంగీత్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. నేడు హల్దీ, మెహందీ తదితర సెలబ్రేషన్స్ జరగనున్నాయి. మరోవైపు కాబోయయే వధూవరులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు నోట్ వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: రష్మికకు విజయ్ తల్లిదండ్రులు పెట్టిన కండిషన్ ఏంటి?)విజయ్-రష్మిక వివాహ వేడుకకు ఆహ్వానం అందుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్న మోదీ.. తన తరఫున శుభాకాంక్షలు తెలిపారు. విజయ్-రష్మిక జీవితంలో ఇది ఓ కొత్త, సుందరమైన అధ్యాయానికి నాంది అని పేర్కొన్నారు. సప్తపది అనే పవిత్ర సంప్రదాయంతో ఏడడుగులు కలిసి వేస్తూ జీవితాంతం స్నేహితులు, భాగస్వాములుగా మారుతున్నారని అన్నారు. సినిమాల్లో ఇప్పటికే ఎన్నో పాత్రలు చేసిన విజయ్, రష్మిక.. నిజ జీవితంలో ప్రేమ, అనురాగాలతో నిండిన కొత్త అధ్యాయాన్ని మరింత అందంగా నిర్మించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. పరస్పర గౌరవంతో జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ శుభసందర్భంగా వధూవరులకు, వారి కుటుంబ సభ్యులకు తన ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.(ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. ఒకేరోజు 'రెండుసార్లు' పెళ్లి!) -
పెళ్లి వేళ.. రష్మిక ముద్దు సీన్ వ్యాఖ్యలు వైరల్
టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసిన విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి గురించే చర్చ జరుగుతుంది. గతకొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట.. ఈ నెల 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. వీరిద్దరి ప్రేమాయణంపై గత కొంతకాలంగా వార్తలు వస్తున్నప్పటికీ.. ఇద్దరూ స్పందించలేదు. తాము రిలేషన్లో ఉన్నామనే విషయాన్ని ఎప్పుడూ బయటకు చెప్పలేదు. కానీ పరోక్షంగా హింట్ ఇస్తూనే వచ్చారు. చివరకు ఎంగేజ్మెంట్ అయిన విషయాన్ని కూడా అధికారికంగా వెల్లడించలేదు. కానీ సడెన్‌గా పెళ్లి డేట్‌ని చెప్పి అభిమానులను సర్ప్రైజ్ చేశారు. రేపు ఉదయం ఉదయ్‌పూర్‌లోని ఓ రిసార్ట్‌లో వీరిద్దరు ఏడు అడుగులు వేయబోతున్నారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు.ఇదిలా ఉంటే..పెళ్లివేళ రష్మికకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. రష్మిక గతంలో 'గీత గోవిందం' సినిమాలోని తన తొలి ముద్దు సీన్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘తొలిసారి ఆన్‌స్క్రీన్‌పై ముద్దు సీన్లో నటించడం చాలా ఇబ్బందిగా అనిపించింది. అది చాలా వ్యక్తిగతమైన విషయం. సెట్లో 200 మంది చూస్తుండగా ఎలా చేయాలో అర్థం కాలేదు. అయితే, నా కో-యాక్టర్ విజయ్‌ది కూడా అదే పరిస్థితి. నాలాగే ఆయన కూడా ఇబ్బంది పడ్డాడు. చివరకు అది ఒక టెక్నికల్ విషయంలా పూర్తి చేశాం. పాత్రకు అవసరమైతే అలాంటి సీన్ చేయాల్సిందే’ అని చెప్పుకొచ్చింది. కాబోయే భర్తతోనే తొలి ముద్దు సీన్ చేయడం గమనార్హం. కాగా, రష్మిక, విజయ్ గీత గోవిందంతో పాటు డియర్ కామ్రేడ్ అనే సినిమాలోనూ కలిసి నటించారు. -
విజయ్-రష్మిక.. ఒకేరోజు 'రెండుసార్లు' పెళ్లి!
టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లికి రెడీ అయిపోయారు. రెండు రోజుల క్రితమే అధికారికంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాజాగా మంగళవారం నుంచి పెళ్లి సందడి మొదలైపోయింది. ఇదలా ఉండగానే పెళ్లి జరగబోయే సంప్రదాయ పద్ధతులు, పెళ్లి జరిగే చోటు, అతిథుల లిస్ట్, మెనూ అని చెప్పి సోషల్ మీడియాలో చాలానే విషయాలు వైరల్ అయిపోతున్నాయి.(ఇదీ చదవండి: రష్మికకు విజయ్ తల్లిదండ్రులు పెట్టిన కండిషన్ ఏంటి?)కలిసి రెండు సినిమాలు చేసిన విజయ్-రష్మిక.. చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. కాకపోతే ఎప్పుడూ బయటకు చెప్పలేదు. తమ పెళ్లిని గ్రాండ్‌గానే ప్లాన్ చేసుకున్నప్పటికీ.. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే ఇప్పుడు ఒక్కటి కాబోతున్నారు. ఉదయ్‌పుర్‌లోని ఆరావళి పర్వతాల మధ్యలో ఉన్న 'ద మెమొంటోస్' అనే లగ్జరీ హోటల్లో ఈ శుభకార్యం జరగనుంది. ఈ వివాహానికి విరోష్(VIROSH) అని పేరు కూడా పెట్టారు.ఇకపోతే మంగళవారం(ఫిబ్రవరి 24) సాయంత్రం సంగీత్ జరగనుంది. బుధవారం(ఫిబ్రవరి 25) ఉదయం హల్దీ.. సాయంత్రం మెహందీ ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకోనున్నారు. గురువారం(ఫిబ్రవరి 26) ఉదయం తెలుగు సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరగనుంది. ఇదే రోజు సాయంత్రం కొడవ స్టైల్లో మరోసారి విజయ్-రష్మిక వివాహం చేసుకోనున్నారని తెలుస్తోంది. శుక్రవారం నాడు అంతా కలిసి తిరిగి హైదరాబాద్ వచ్చేయనున్నారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.అలానే ఈ పెళ్లికి కేవలం 100 మంది లోపే హాజరు కానున్నారని, అతిథుల కోసం తెలుగు సంప్రదాయ ఆహారంతో పాటు జపనీస్ వంటకాలు కూడా మెనూలో ఉండనున్నాయని తెలుస్తోంది. వివాహం ఫొటోలు బయటకు రాకుండా ఉండేందుకు 'నో-ఫోన్' కాన్సెప్ట్ కూడా అమలు చేయనున్నట్లు టాక్.(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ, రష్మిక జోడీ.. ఏజ్ గ్యాప్ ఎంతంటే?) -
రష్మికకు విజయ్ తల్లిదండ్రులు పెట్టిన కండిషన్ ఏంటి?
అనుకున్నట్లే టాలీవుడ్ హీరోహీరోయిన్ విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారు. చాన్నాళ్లుగా వస్తున్న రూమర్స్ నిజం చేస్తూ రెండు రోజుల క్రితమే అధికారికంగా తమ వివాహం విషయాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం ఉదయ్పుర్లో పెళ్లి హడావుడి మొదలైపోయింది. ఈ గురువారమే(ఫిబ్రవరి 26) విజయ్-రష్మిక కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు. అయితే తమ ఇంటికి రాబోయే కోడలి గురించి విజయ్ తల్లిదండ్రులు గతంలో మాట్లాడారు. ఒకటి రెండు కండిషన్స్ కూడా పెట్టారు. ఇంతకీ అవేంటి?(ఇదీ చదవండి: 'ఓజీ' హీరోయిన్ కొరియన్ కాన్సెప్ట్ మూవీ.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్)విజయ్ తెలంగాణ అబ్బాయి కాగా.. రష్మిక కన్నడ అమ్మాయి. వీళ్లిద్దరూ తొలుత 'గీతగోవిందం' అనే సినిమా కోసం కలిసి పనిచేశారు. ఆ టైంలోనే వీళ్లిద్దరి మధ్య స్నేహం చిగురించి, తర్వాత ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లిపీటల వరకు వచ్చింది. అయితే అదే మూవీ ఈవెంట్లోనే విజయ్ తల్లిదండ్రులు తమ కోడలి ఎలా ఉండాలి అనే విషయాల్ని కొన్ని చెప్పారు. ఇప్పుడు రష్మిక వాటిని నిజం చేసినట్లు కనిపిస్తోంది.'గీతగోవిందం' ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాంకర్ సుమ మాట్లాడుతూ.. మీకు ఎలాంటి కోడలు కావాలనుకుంటున్నారు? అని విజయ్ తల్లిదండ్రులని అడిగింది. దీనికి సమాధానమిచ్చిన తల్లి మాధవి.. మా బాబుని(విజయ్ దేవరకొండ) బాగా చూసుకునే కోడలు వస్తే చాలు, అతడిని ప్రేమించాలి అంతే. ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి ఆమె, అతడిని బాగా అర్థం చేసుకోవాలి అని చెప్పుకొచ్చారు. విజయ్ తండ్రి గోవర్థన్ ఇదే ప్రశ్నకు సమాధానమిస్తూ.. తనకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకోవచ్చు. నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కులం, మతం గురించి పట్టింపులు లేవు. భారతీయురాలిని, ముఖ్యంగా దక్షిణాది అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు చాలా సంతోషం అని అన్నారు.మరో మూవీ ఈవెంట్లో విజయ్ కూడా తనకు కాబోయే భార్య గురించి మాట్లాడుతూ.. తనకు అరేంజ్డ్ మ్యారేజ్ వర్కౌట్ కాదని, చేసుకుంటే లవ్ మ్యారేజ్ మాత్రమే చేసుకుంటాను. కానీ ఆ అమ్మాయి నా తల్లిదండ్రులకు కూడా నచ్చాలి అని కండిషన్ పెట్టాడు. మరో సందర్భంలో రష్మిక మాట్లాడుతూ.. మాధవి(విజయ్ తల్లి) ఆంటీ తనకు మరో అమ్మలాంటిది అని చెప్పుకొచ్చింది. చూస్తుంటే విజయ్ దేవరకొండ పేరెంట్స్ పెట్టిన కండిషన్స్‌కి తగ్గట్లే రష్మిక.. వీళ్ల ఇంటి కోడలు కాబోతోంది. గతంలో పలుమార్లు వీళ్లు హింట్స్ ఇచ్చారు. ఇప్పుడు అవన్నీ కలిపి ఉన్న ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ, రష్మిక జోడీ.. ఏజ్ గ్యాప్ ఎంతంటే?)They imagined the perfect daughter-in-law… Rashmika is their dream come true ❤️#VijayDeverakonda #RashmikaMandanna #Virosh pic.twitter.com/eq3a1NwyTd— Lilly ✨ (@therwdygirl) February 21, 2026 -
సెలబ్రేషన్స్‌కు రెడీ.. విజయ్- రష్మిక పెళ్లి సందడి షురూ..!
టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పెళ్లి వేడుకకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ అఫీషియల్‌గా తన పెళ్లిని అనౌన్స్ చేశారు. అభిమానులు ముద్దుగా పిలుచుకునే విరోష్ జంట ఒక్కటి కానుందని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ గ్రాండ్ వేడుకలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24న ఉదయపూర్‌లో మెహందీ వేడుకతో రష్మిక-విజయ్ పెళ్లి సందడి మొదలు కానుంది.ఆ తర్వాత ఫిబ్రవరి 25న హల్దీ, సంగీత్ సందడి కొనసాగనుంది. ఈ వేడుకలు ఉదయపూర్‌లోని విలాసవంతమైన ఐటీసీ మెమెంటోస్ జరుగుతాయి. ఈ వేడుకల్లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొననున్నారు. ఈ జంట ఫిబ్రవరి 26న మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. కాగా.. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు తెలుస్తోంది. విజయ్ - రష్మిక వారి కుటుంబ సభ్యులు, సహచరులతో కలిసి సోమవారం ఉదయమే ఉదయ్‌పూర్ చేరుకున్నారు. కొన్నేళ్లుగా తమ రిలేషన్‌ను సీక్రెట్‌గా కొనసాగించిన ఈ జంట చివరికీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. విజయ్ దేవరకొండనే స్వయంగా తన పెళ్లిని ప్రకటించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. వివాహం తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. -
ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్.. పెళ్లిపై విజయ్ ఎమోషనల్
-
విజయ్ దేవరకొండ, రష్మిక జోడీ.. ఏజ్ గ్యాప్ ఎంతంటే..?
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ వివాహం గురించి తొలిసారి స్పందించారు. తమ బంధం గురించి అభిమానులు పెట్టిన 'విరోష్' పేరును గౌరవిస్తున్నట్లు సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఫ్యాన్స్ తమలో ఒక భాగం అంటూ.. వారి కోరిక మేరకు పెళ్లి కార్యక్రమానికి వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు పెట్టినట్లు తెలిపారు. అయితే, వారిద్దరి వయసు గురించి కొందరు కామెంట్లు చేస్తుండగా... అభిమానులే కౌంటర్ ఇస్తున్నారు. వాస్తవంగా ఇద్దరి మధ్య పెద్దగా ఏజ్ గ్యాప్ లేదనే విషయం తెలిసిందే.విజయ్ దేవరకొండ (36), రష్మిక(30)ల మధ్య సుమారు ఆరేళ్ల గ్యాప్ ఉంది. విజయ్ 1989లో జన్మించగా.. రష్మిక 1996లో జన్మించారు. ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకుంటే పెద్దగా ఏజ్ గ్యాప్ కనిపించదు. దీంతో వారిద్దరిది సరైన జోడీ అంటూ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. విజయ్ దేవరకొండకు సంబంధించి సుమారు రూ. 80 కోట్ల మేరకు ఆస్తులు ఉన్నట్లు సమాచారం. తను ఒక్కో సినిమాకు రూ. 15 కోట్ల మేరకు రెమ్యునరేషన్ తీసుకుంటారని టాక్. రష్మికకు సంబంధించి సుమారు రూ. 70 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. తను ఒక్కో సినిమాకు రూ. 6 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం.గీత గోవిందం మూవీతో పరిచయమైన ఈ జోడీ.. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఆపై ‘డియర్ కామ్రేడ్’ మూవీతో మరోసారి ప్రేక్షకుల్ని అలరించారు. ఇప్పుడు వివాహంతో కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ వారి వివాహానికి వేదిక కానుంది. హైదరాబాద్‌లో మార్చి 4న వివాహ రిసెప్షన్ కార్యక్రమం జరగనుంది. -
రష్మిక, విజయ్‌ల పెళ్లి వేదికగా ఐటీసీ మెమెంటోస్..! ప్రత్యేకతలు ఇవే..
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ – నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ నెల ఫిబ్రవరి 26, 2026న వివాహ చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు వేదిక కానుంది రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఐటీసీ మెమెంటోస్ హోటల్. సన్నిహిత వర్గాల ప్రకారం..ఒక వారం ముందుగానే బుక్ చేసినట్లు తెలుస్తోంది. పచ్చటి ఆరావళి కొండలు, నీలి ఆకాశానికి నిలయమైన ఈ వాతావరణంలో గడపాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..!.రష్మిక-విజయ్‌లు వివాహం చేసుకుంటున్న ITC మెమెంటోస్ లోపల 117 విల్లాలతో, ప్రశాంతమైన సరస్సులు, పచ్చని పచ్చిక బయళ్లు, విశాలమైన పచ్చని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ వెల్నెస్ సెంటర్, అందంగా రూపొందించిన లాంజ్‌లు ఉన్నాయి. ఇక్కడ అతిథులు చేతితో తయారు చేసిన కాక్టెయిల్స్, వెచ్చని పానీయాలు, ప్రశాంతమైన దృశ్యాలను హాయిగా ఆస్వాదించవచ్చు.ఈ హోటల్లో ఉదయ్ పెవిలియన్, కబాబ్స్ అండ్ కుర్రీస్, రాయల్ వేగా, ది రాక్ బార్ వంటి చక్కటి భోజనాలను ఆస్వాదించొచ్చు. శాఖాహారం నుంచి వివిధ ప్రపంచ రుచుల తోపాటు రిఫ్రెష్ కాక్టెయిల్ వరకు అన్నిరకాల టేస్ట్‌లను ఆస్వాదించొచ్చు. పలనా రెసిపీ లోటు అనేదానికి అవకాశం లేకుండా ప్రతి వంటకం అందుబాటులో ఉంటుందట. ఆరోగ్యం పరంగా ఫిట్నెస్ సెంటర్‌ని అధునాతన యంత్రాలతో సెట్ చేశారు. ఇక్కడ ఉన్న విశాలమైన ప్రకృతి దృశ్యాన్ని చూస్తూ హాయిగా వర్కౌట్లు చేసుకోవచ్చు. ఇదేగాక మరో గొప్ప అనుభూతి ఏంటంటే..ఇక్కడ రాయల్ స్పాలో, వేడుకకు విచ్చేసిన అతిథులు పురాతన భారతీయ చికిత్సలు, ఉత్తేజకరమైన వెల్నెస్ చికిత్సలను ఆస్వాదించవచ్చు. ఇక్కడ తప్పనిసరిగా ఇన్ఫినిటీ పూల్ లేదా లాంజ్ పూల్‌ను మిస్ అవ్వకండి. చక్కటి విశ్రాంతికి నిలయం. ఈ పెళ్లికి విచ్చేస్తున్న అతిథులంతా ఇక్కడ జరిగే అన్ని రకాల వినోద కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు, ఉదయ్‌పూర్‌ను సందర్శించొచ్చు. ఈ ప్రాంతం ప్రకృతి సహజ సౌందర్యానికి, సాహస అనుభవాలను గమ్యస్థానం. ఈ మెమెంటోస్ సూట్లో బసకి- అక్షరాల రూ. 73,199 - 91,499/-లు ఖర్చు అవుతుందట. View this post on Instagram A post shared by Mementos By ITC Hotels- Ekaaya Udaipur (@mementosbyitchotels_udaipur) (చదవండి: నాట్యమయూరి సుధా చంద్రన్ వెల్నెస్ సీక్రెట్..! ఆయిల్ మసాజ్‌లు, ఇంట్లో తయారు చేసే..) -
‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’.. పెళ్లిపై స్పందించిన విజయ్, రష్మిక
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ – నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరూ తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి విషయమై స్పందించారు. అభిమానులు వీరిని ఎంతో ఇష్టంగా “విరోష్” అని పిలుస్తున్నారు. అదే పేరును తమ వివాహ వేడుకకు ఖరారు చేస్తున్నట్లు తెలిపారు. “మేం ఏదైనా ప్లాన్ చేసుకోవాలనుకున్నా, ముందే అభిమానులు ఆ పనులు చేసి పెడుతున్నారు. ఇప్పుడు పెళ్లి విషయంలోనూ చాలా ప్రేమతో ఒక పేరు పెట్టారు. అందువల్ల మా వివాహ వేడుకకు ‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాం. మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు” అంటూ విజయ్, రష్మిక పేర్కొన్నారు. ఈ జంట వివాహ వేడుక అతి కొద్ది మంది సమక్షంలో రాజస్థాన్‌లోని ఉదయ్పుర్లో జరగనుందని సమాచారం. ఫిబ్రవరి 26న విజయ్ – రష్మిక మూడుముళ్లతో ఒక్కటవుతున్నారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ కృష్ణలో రాత్రి 7 గంటలకు గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించనున్నారు. దీనికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.వీరిద్ధరూ కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు. అప్పటి నుంచే ఈ జంటపై రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు పెళ్లి వార్తలతో ఆ రూమర్స్‌కు ముగింపు పలుకుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘రణబలి’ అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది. దీనికి రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్లో అత్యంత క్రేజీ కపుల్‌గా పేరుగాంచిన విజయ్, రష్మిక వివాహం కోసం వీరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి రిసెప్షన్ డేట్ లీక్
-
విజయ్ & రష్మిక పెళ్లిపై నటుడు ప్రమోద్ శెట్టి కీలక వ్యాఖ్యలు
-
విజయ్-రష్మిక పెళ్లి..నాకు ఆహ్వానం అందలేదు: ప్రముఖ నటుడు
రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండల వివాహానికి తమను ఆహ్వానిస్తారని వెయిట్ చేయడం లేదని ప్రముఖ నటుడు ప్రమోద్ శెట్టి కామెంట్స్ చేశారు. అంతేకాకుండా రక్షిత్ శెట్టిని.. తనను ఆమె వివాహానికి పిలుస్తారని భావించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం రక్షిత్ శెట్టి పూర్తిగా సినిమాలతో బిజీగా ఉన్నాడని ప్రమోద్ శెట్టి తెలిపారు. హీరోయిన్ రష్మికతో వివాహం కానందుకు రక్షిత్ శెట్టి బాధపడడం లేదని వెల్లడించారు.కాగా.. గతంలో రష్మికకు కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకోకుండానే విడిపోయారు. అంతకుముందు రష్మిక, రక్షిత్ కిరిక్ పార్టీ మూవీలో జంటగా నటించారు. రష్మిక ఈ మూవీతోనే కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ప్రమోద్‌శెట్టి కీలక పాత్రలో కనిపించారు.కాగా.. ఈ నెల 26న టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ- రష్మిక వివాహం జరగనుంది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో జరగనుంది. ఈ వేడుకకు ప్రముఖులు, సన్నిహితులు హాజరు కానున్నారు. -
విజయ్, రష్మికల సంపాదన ఇద్దరి ఆస్తులు ఎన్ని కోట్లు అంటే..?
-
సోషల్ మీడియాలో విజయ్- రష్మిక వెడ్డింగ్ కార్డ్.. టీమ్ ఆగ్రహం..!
టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లిపై తెగ చర్చ నడుస్తోంది. ఈ నెల 26న వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారని వెడ్డింగ్ కార్డ్ నెట్టింట తెగ వైరలైంది. తాజాగా దీనిపై విజయ్ దేవరకొండ టీమ్ స్పందించింది. వివాహం, రిసెప్షన్‌కు సంబంధించిన అన్ని వివరాలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం కరెక్ట్ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.'విజయ్- రష్మిక పెళ్లి గురించి కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పెళ్లి, రిసెప్షన్ వేదిక వివరాలను వెల్లడిస్తున్నారు. ఇలాంటి వాటితో అతిథులకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలున్నాయి. వీరి పెళ్లికి టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన వారితోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరవుతారు. ఇలాంటి వేదికల వివరాలను సామాజిక మాధ్యమాల్లో పెట్టడం సరైంది కాదు. పెళ్లికి హాజరయ్యే అతిథులు కాంటాక్ట్ కావాల్సిన ఫోన్ నెంబర్ వెడ్డింగ్ కార్డుపై ప్రింట్ చేస్తే.. అది కూడా పోస్ట్ చేశారు. పెళ్లి అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. ఇలాంటి సున్నితమైన సమాచారాన్ని ఆన్లైన్లో పోస్ట్ చేయవద్దని' విజయ్ టీమ్ పేర్కొంది.Special request from Team Vijay Deverakonda & Rashmika !! As many people were posting the marriage details of Vijay & Rashmika including the RSVP contact and venue. The team now are requesting not to post such sensitive information online which could lead to unnecessary fanfare… pic.twitter.com/YESwrwNumE— Filmy Focus (@FilmyFocus) February 18, 2026 -
విజయ్, రష్మికల పెళ్లికి వెళ్తున్న స్టార్స్ వీళ్లే..!
-
గుట్టుచప్పుడు కాకుండా విజయ్,రష్మిక లవ్ స్టోరీ
-
విజయ్- రష్మికల పెళ్లికి వెళ్తున్న స్టార్స్ వీళ్లే..
విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న వివాహం ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో జరగనుంది. ఈ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు పాల్గొననున్నారు. అయితే, మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో రిసెప్షన్ జరగనుంది. ఆ సమయంలో భారీగా టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.విజయ్, రష్మికల వివాహానికి ఉదయ్‌పూర్ వెళ్లే అతిధుల జాబితా నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వేడుకలో సినీ పరిశ్రమ నుండి ఎంపిక చేసిన ప్రముఖులతో పాటు వారి సన్నిహితులు మాత్రమే పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో వస్తున్న సమాచారం ప్రకారం, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, అల్లు అర్జున్, సుకుమార్, వర్ష బొల్లమ్మ, సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, కరణ్ జోహార్, కృతి సనన్, దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ వంటి ప్రముఖులు వివాహ వేడుకకు హాజరవుతారని భావిస్తున్నారు.అయితే, హైదరాబాద్‌లో మార్చి 4న జరిగే రిసెప్షన్ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్‌గా నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఆ సమయంలో చిరంజీవి, బాలకృష్ణ వంటి ప్రముఖ తెలుగు స్టార్స్‌తో పాటు యువ నటీనటులు హజరుకానున్నారు. ఆపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నుండి కొంతమంది కీలక రాజకీయ నాయకులు కూడా విజయ్ పెళ్లిలో పాల్గొంటారని సమాచారం. ఈ జాబితా గురించి విజయ్ జోడీ నుండి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.విజయ్-రష్మిక తొలిసారి జంటగా 'గీతగోవిందం' సినిమా చేశారు. అది సూపర్ హిట్. తర్వాత 'డియర్ కామ్రేడ్' మూవీ చేశారు. ఇది బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. తర్వాత చాన్నాళ్ల పాటు కలిసి పనిచేయలేదు. ప్రస్తుతం విజయ్ 'రణబాలి' అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో రష్మికనే హీరోయిన్. ఇది దసరాకు రిలీజ్ కానుందని కొన్నిరోజుల క్రితమే ప్రకటించారు. -
విజయ్ రష్మిక పెళ్లి సందడి శుభలేఖ ఇదే.. పెళ్లి ముహూర్తం ఫిక్స్
-
బ్రేకింగ్: విజయ్ రష్మిక పెళ్లి శుభలేఖ ఇదే.. ఫొటో వైరల్
టాలీవుడ్ హీరోహీరోయిన్ విజయ్ దేవరకొండ-రష్మిక.. ఈ నెల 26న పెళ్లి చేసుకోనున్నారు. ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించలేదు. తాజాగా హైదరాబాద్ విమానాశ్రయంలోనూ కనిపించారు. వీళ్లిద్దరూ వెళ్తున్నది పెళ్లి జరిగే రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌కే అనేది తెలిసిందే. తాజాగా వీళ్ల పెళ్లి శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్)26వ తేదీన ఉదయ్పుర్లో పెళ్లి జరగనుందని అందులో రాసుకొచ్చారు. కాకపోతే కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ శుభకార్యానికి హాజరు కానున్నారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో రిసెప్షన్ జరగనుంది. ఆ విషయాన్ని పెళ్లి పత్రికలో ముద్రించారు. ఈ మేరకు సినిమా సెలబ్రిటీలకు ఇదివరకే ఆహ్వానాలు అందాయి. ఇప్పుడు ఆ ఫొటోలే వైరల్ అవుతున్నాయి.విజయ్-రష్మిక తొలిసారి జంటగా 'గీతగోవిందం' సినిమా చేశారు. అది సూపర్ హిట్. తర్వాత 'డియర్ కామ్రేడ్' మూవీ చేశారు. ఇది బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. తర్వాత చాన్నాళ్ల పాటు కలిసి పనిచేయలేదు. ప్రస్తుతం విజయ్ 'రణబాలి' అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో రష్మికనే హీరోయిన్. ఇది దసరాకు రిలీజ్ కానుందని కొన్నిరోజుల క్రితమే ప్రకటించారు. అంటే పెళ్లి తర్వాత విజయ్-రష్మిక నుంచి రాబోయే మూవీ ఇదే.(ఇదీ చదవండి: బీజేపీ నేత దారుణ కామెంట్స్‌పై స్పందించిన త్రిష) -
పెళ్లి పిలుపులు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ?
హీరో విజయ్ దేవరకొండ, రష్మిక ఈ నెలలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. గత కొన్నాళ్ల నుంచి ఈ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇద్దరిలో ఎవరూ కూడా దీన్ని ధ్రువీకరించడం లేదు. బహుశా పెళ్లి అయిపోయిన తర్వాత ఫొటోలు రిలీజ్ చేసి వెల్లడిస్తారేమో! సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు పెళ్లి పిలుపులు మొదలైపోయినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడమే దీనికి కారణం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)విజయ్ దేవరకొండ ఇప్పుడు కలిశాడంటే వేరే కారణాలేం లేవు. కచ్చితంగా పెళ్లికి ఆహ్వానించే విషయమై కలిసుంటారు. ఇందుకు సంబంధించిన ఫొటో బయటకు వచ్చింది గానీ మిగతా వివరాలు అయితే రాలేదు. అసలు విషయానికొస్తే ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ వేదికగా విజయ్-రష్మిక డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చాలారోజులుగా జరుగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి 20నే ఇరు కుటుంబాలు రాజస్థాన్ వెళ్లనున్నారు.ఈనెల 22వ తేదీ నుంచి పెళ్లి కార్యక్రమాలు అంటే హల్దీ, మెహందీ, సంగీత్ లాంటివి ఉండనున్నాయి. చివరగా 26వ తేదీన పెళ్లి. తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చేయనున్నారని తెలుస్తోంది. అయితే మార్చి తొలివారంలో టాలీవుడ్ సెలబ్రిటీల కోసం రిసెప్షన్ ఉండనుంది. దీని వివరాలు తెలియాల్సిఉంది. ఏదేమైనా వివాహ తేదీ దగ్గరపడినప్పటికీ విజయ్-రష్మిక.. పెళ్లి విషయాన్ని రహస్యం ఉంచుతూనే ఉన్నారు.(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా) -
60 కోట్లు ఇస్తానన్న నెట్ ఫ్లిక్స్.. షాకిచ్చిన విజయ్
-
రష్మిక-విజయ్ పెళ్లి వేడుక.. కోట్ల రూపాయల డీల్‌కు నో..!
టాలీవుడ్లో గత కొంత కాలంగా వీరి పెళ్లి చుట్టే చర్చ నడుస్తోంది. ఎంగేజ్మెంట్ వార్తల తర్వాత ఆ ఇద్దరు స్టార్స్ పెళ్లి వేడుక కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ జంట మరెవరో కాదు.. టాలీవుడ్లో మోస్ట్ వైరల్ ప్రేమజంట రష్మిక- విజయ్ దేవరకొండ. వీరిద్దరి పెళ్లి ఫిబ్రవరిలోనే జరనుందని వచ్చినా డేట్ విషయంలో క్లారిటీ లేదు. మొదట ఫిబ్రవరి 2న జరగనుందని వార్తలొచ్చనా అలా జరగలేదు. తాజాగా ఈనెల 26న ఈ గ్రాండ్ వెడ్డింగ్ జరగనుందని టాక్ వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో విజయ్- రష్మిక పెళ్లికి సంబంధించిన మరో న్యూస్ తెగ వైరలవుతోంది. వీరి పెళ్లి వీడియోను ఏ ఓటీటీకి ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ వెడ్డింగ్ కార్యక్రమాన్ని స్ట్రీమింగ్ చేసేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్‌తో ముందుకొచ్చనట్లు సమాచారం. అయితే తమ వ్యక్తిగత జీవితంలో బిజినెస్ చేసే ఉద్దేశం లేదని ఓటీటీ విజ్ఞప్తిని తిరస్కరించనట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.గతంలో లేడీ సూపర్ స్టార్ నయనతార వెడ్డింగ్ వీడియో విషయంలో ఎదురైన న్యాయపరమైన చిక్కులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే విజయ్- రష్మిక జాగ్రత్త పడుతున్నట్లు టాక్. ముఖ్యంగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వేడుకతో వ్యాపారం చేయడం విజయ్‌కి అస్సలు ఇష్టం లేదని సమాచారం. అందుకే కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా ఓటీటీ డీల్‌ను వీరు సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. తమ పెళ్లిని కేవలం కుటుంబ సభ్యుల మధ్య ప్రైవేట్‌గా ఉంచుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. ఏదేమైనా వీరిద్దరి పెళ్లి కోసం టాలీవుడ్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. -
విజయ్ దేవరకొండ పెళ్లికి వెళ్తున్నారా?.. తరుణ్ భాస్కర్ ఏమన్నారంటే?
టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఇటీవలే హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఓం శాంతి శాంతి శాంతిః. అనే మలయాళ రీమేక్‌తో పలకరించారు. ఈ చిత్రంలో ఈషా రెబ్బా హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది. అంతలోనే మరో సినిమాకు రెడీ అయిపోయారు తరుణ్ భాస్కర్. ఆయన హీరోగా వస్తోన్న. కొత్త సినిమా ‘గాయపడ్డ సింహం. తాజాగా ఈ మూవీ టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.ఈ ఈవెంట్‌కు హాజరైన తరుణ్ భాస్కర్‌కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీరు హీరోగా చేసిన సినిమా హిట్ కొట్టలేదు కదా.. మీతో సినిమా చేయడానికి నిర్మాత ఎలా ధైర్య చేశారని ఓ మీడియా ప్రతినిధి అడిగారు. దీనికి తరుణ్ భాస్కర్ స్పందించారు. మీరు స్టోరీ రాసి ప్రొడ్యూస్ చేయండి.. ఆ సినిమాతో హిట్ కొడదామన్నారు. అయితే లైఫ్‌లో ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన ఏదీ ఆపొద్దు.. ది అందరికీ చెబుతున్నా. గెలిచే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలని అన్నారు. అయినా ఎందుకు సార్ నేను ఫెయిల్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారని ఫన్నీగా చమత్కరించారు.ఇదే ఈవెంట్లో తరుణ్ భాస్కర్‌కు మరో ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. విజయ్ దేవరకొండ మ్యారేజ్‌కి మీరు కూడా వెళ్తున్నారా? అని అడిగారు. ఇది విన్న తరుణ్.. నాకైతే ఇప్పటి వరకు ఆహ్వానం లేదు.. ఒక వేళ ఇన్విటేషన్ వస్తే మీకు వెంటనే వాట్సాఫ్‌లో ఫార్వార్డ్ చేస్తాను.. మనిద్దరం కలిసి విజయ్ దేవరకొండ పెళ్లికి వెళ్దామని తరుణ్ భాస్కర్ ఫన్నీగా పంచ్‌లు వేశారు.కాగా.. గాయపడ్డ సింహం చిత్రానికి ‘డోన్ట్ లాఫ్... ఇట్స్ ఏ సీరియస్ మేటర్’ (నవ్వొద్దు... ఇది సీరియస్ మేటర్) అనేది క్యాప్షన్ ఇచ్చారు. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో విష్ణు ఓయి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని కల్యాణ చక్రవర్తి మంతెన, భానుకిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మిస్తున్నారు. పొలిటికల్ సెటైర్, క్రైమ్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. -
ఉదయ్‌పూర్‌లో పెళ్లి
గత ఏడాది అక్టోబరులో విజయ్ దేవరకొండ – రష్మికా మందన్నాల నిశ్చితార్థం జరిగినప్పట్నుంచి వీరి వివాహ తేదీ ఎప్పుడు? అనే విషయంపై చర్చ మొదలైంది. ఈ నెల 26న ఈ ప్రేమికులు... భార్యాభర్తలు కానున్నారు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్ వీరి పెళ్లికి వేదిక కానుంది. ఇంకా 20 రోజులే ఉన్నందున ఇటు విజయ్ అటు రష్మిక కుటుంబ సభ్యులు జోరుగా పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు.ఇరువైపు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరగనుంది. అలాగే హైదరాబాద్‌లో మార్చి 4న సినీ, రాజకీయ ప్రముఖులు, ఇతర సన్నిహితుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారని సమాచారం. ఇక గతంలో ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో విజయ్–రష్మిక జంటగా నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. తాజాగా వీరి కాంబినేషన్లో మూడో సినిమాగా ‘రణబాలి’ రూపొందుతోంది. ఈ చిత్రం సెప్టెంబరు 11న విడుదల కానుంది. -
రష్మిక, విజయ్ పెళ్లి డేట్ వచ్చేసింది..!
-
స్పిరిట్ లో అర్జున్ రెడ్డి.. వంగ మాస్టర్ ప్లాన్..!
-
యాసలందు అన్నియాసలూ భేషు
రోల్ డిమాండ్ చేస్తే నోరు తిరగని యాస నేర్చుకుని మరీ డైలాగులు చెప్పేస్తారు స్టార్స్. రామ్‌చరణ్ ఉత్తరాంధ్ర యాస మాట్లాడారు. అఖిల్, వరుణ్ తేజ్ రాయలసీమలో సంభాషణలు చెప్పారు. విజయ్ దేవరకొండ అయితే ఈస్ట్ గోదావరి, రాయలసీమ యాసలు నేర్చుకున్నారు. హీరోలేనా? హీరోయిన్ కావ్యా థాపర్ తెలంగాణ యాసలో రెచ్చిపోయారు. ఈ ఉత్తరాది బ్యూటీ ఈ యాస నేర్చుకుని మరీ తెలంగాణ అమ్మాయిలా మారిపోయారు. ‘యాసలందు అన్ని యాసలూ భేషు’ అన్నట్లుగా ఈ స్టార్స్ ఏయే సినిమాల్లో ఏయే యాసలో మాట్లాడారో తెలుసుకుందాంసేసేయాల... ‘ఓటే పని చేసే నాకి, ఒకే నాక బతికే నాకి ఇంత పెద్ద బతుకెందుకు?’, ‘ఏదైనా ఈ నేలమీదున్నప్పుడే సేసేయాల, పుడతాం ఏటి మళ్లీ’ అంటూ ఉత్తరాంధ్ర యాసలో రామ్‌చరణ్ పలికిన సంభాషణలకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక, థియేటర్లో వింటున్నప్పుడు ఈలలు, గోలలు పక్కా. ‘పెద్ది’ సినిమాలో చేస్తున్నప్పాత్రకి అనుగుణంగా రామ్‌చరణ్ ఉత్తరాంధ్ర యాస మాట్లాడారు. గుబురు గడ్డం, ఒత్తయిన జుట్టు, మాస్ లుక్‌తో రామ్‌చరణ్ హీరోగా ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరో యిన్‌గా నటిస్తు న్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 27న రిలీజ్ కానుంది.సామి సాచ్చిగా...‘‘కదిరి నరసింహ సామి సాచ్చిగా ఈతూరి నవ్వించేకి వస్తుండా..’ అంటూ వరుణ్ తేజ్ తన కెరీర్‌లోని 15వ సినిమాను ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్‌ను ఖరారు చేసి, ఇటీవల టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో కనకరాజుప్పాత్రలో నటిస్తున్నారు వరుణ్ తేజ్. ఈ చిత్రం రాయలసీమలోని అనంతపురం బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని తెలిసింది. దీంతో ఈ సినిమా కోసం రాయలసీమ యాసలో డైలాగ్స్ చెబుతున్నారు వరుణ్ తేజ్. రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో హాస్యనటుడు సత్య ప్రధానప్పాత్రలో నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది. ఇండో–కొరియన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే హారర్ కామెడీ సినిమా ఇది. ఈస్ట్ గోదావరి... రాయలసీమ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘రణబాలి’, ‘రౌడీ జనార్ధన’ సినిమాలు చేస్తున్నారు. ఈ రెండూ పీరియాడికల్ చిత్రాలే. ‘రణబాలి’ సినిమా కోసం రాయలసీమ యాసలో డైలాగ్స్ చెబుతున్న విజయ్ దేవరకొండ, ‘రౌడీ జనార్ధన’ చిత్రం కోసం ఈస్ట్ గోదావరి యాసలో డైలాగ్స్ చెబుతున్నారు. ఇలా ఒకే సమయంలో రెండు భిన్నమైన యాసలతో కూడిన క్యారెక్టర్స్‌లో విజయ్ దేవరకొండ నటిస్తుండటం విశేషం. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా ‘రణబాలి’. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పరిపాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా, ఆర్నాల్డ్ వోస్లూ కీలకప్పాత్రల్లో నటిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిలింస్ సమర్పణలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 11న విడుదల కానుంది. ఇక విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘రౌడీ జనార్ధన’. 1980 దశకం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబరులో విడుదల కానుంది. ఏంది మీ లొల్లి...‘పండగ పూట మా బాబుకి బియ్యమిచ్చి నాలుగు ముక్కలు తిందమంటే ఏంది మీ లొల్లి..., ఏయ్ పండగ కాబట్టే కక్క ముక్క వండినం... చెప్పురంకుల్’ అంటూ తెలంగాణ యాసలో రెచ్చిపోయారు కావ్యా థాపర్. ‘నేను రెడీ’ చిత్రం కోసమే కావ్య ఇలా తెలంగాణ మాట్లాడటానికి రెడీ అయ్యారు. ‘నువ్విలా, జీనియస్, రామ్ లీలా, సెవెన్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హవీష్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘నేను రెడీ’. ఈ చిత్రంలో కావ్యా థాపర్ కథానాయికగా నటిస్తున్నారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో నిఖిల కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వినోదాత్మక, కుటుంబ కథా చిత్రంగా రూపొందుతోన్న ‘నేను రెడీ’ వేసవిలో రిలీజ్ కానుంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఇంటెన్స్ లవ్‌స్టోరీ ‘లెనిన్’ కోసం అక్కినేని అఖిల్ రాయలసీమ యాసలో డైలాగ్స్ చెబుతున్నారు. ఈ సినిమా ప్రధాన కథనం రాయలసీమ ్రపాంతంలోని చిత్తూరు నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 1న రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్ ప్రకటించారు. ఇంకా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా కోసం ‘ఏటిగట్టు సాచ్చిగా సెప్తుండ ఈతూరి నరికినానంటే అరుపు గొంతులో నుంచి కాదు... తెగిన నరాల్లోన్నించి వస్తాది’ అంటూ రాయలసీమ యాసలో సాయిధరమ్ తేజ్ సంభాషణలు పలికారు. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్న తొలి సినిమా ‘ఎల్లమ్మ’. వేణు యెల్దండి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం రూటెడ్ తెలంగాణ యాసలో మాట్లాడనున్నారట దేవిశ్రీ ప్రసాద్. అలాగే ‘డెకాయిట్’ సినిమా కోసం అడివి శేష్ రాయలసీమ యాసలో, ‘భోగి’ సినిమా కోసం తెలంగాణ యాసలో శర్వానంద్, ‘క్రేజీ కల్యాణం’ కోసం అనుపమా పరమేశ్వరన్ తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతున్నట్లుగా తెలిసింది. వీరే కాదు... తమ కొత్త సినిమాల కోసం విభిన్న యాసల్లో డైలాగ్స్ చెబుతున్న నటీనటులు మరికొంతమంది ఉన్నారు. -
రష్మిక- విజయ్ పెళ్లి తేదీపై కన్ఫ్యూజన్.. కన్ఫామ్ చేసినట్టేనా?
టాలీవుడ్లో ఇప్పుడంతా వీరిద్దరి పెళ్లి గురించి చర్చ నడుస్తోంది. డేటింగ్ నుంచి ఎంగేజ్మెంట్ వరకు ఫ్యాన్స్‌లో కన్ఫ్యూజన్ అలాగే ఉంది. గతేడాది నిశ్చితార్థం జరిగినట్లు వార్తలొచ్చినప్పటికీ ఇంకా ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. ఇంతకీ ఎవరి పెళ్లి అనుకుంటున్నారా? అదేనండి మన రష్మిక- విజయ్ దేవరకొండ జంట గురించే. గత కొద్ది రోజలుగా ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్ అంటూ వార్తలు హల్ చల్ చేశాయి. అంతేకాకుండా ఈనెల 2న రష్మిక- విజయ్ వెడ్డింగ్ అంటూ ఇద్దరు అమ్మాయిలు మాట్లాడిన వీడియో తెగ వైరలైంది. కానీ అదంతా ఫేక్ అని తర్వాత తెలిసిపోయింది.అయితే తాజాగా మరో మ్యారేజ్ డేట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. రష్మిక ఎయిర్‌పోర్ట్‌లో వెళ్తుండగా ఓ అభిమాని ఫోటో తీసుకుంటానంటూ రష్మికను రిక్వెస్ట్ చేశాడు. దీంతో వెంటనే మాస్క్ తొలగించి ఫోటోలకు పోజులిచ్చింది. ఆ తర్వాత వెంటనే అతను రష్మికకు కంగ్రాట్స్ చెప్పాడు. దీనికి రష్మిక దేనికి రా అంటూ అతన్ని నవ్వుతూ అడిగింది. వెయిటింగ్ ఫర్ ఫిబ్రవరి 26 ఫర్ వెడ్డింగ్ మేడం అన్నాడు. దీనికి రష్మిక క్యూట్‌గా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. తన స్మైల్‌తో పెళ్లి తేదీ ఫిక్సయినట్లేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక పరోక్షంగా తన పెళ్లి తేదీని రివీల్ చేసిందని అంటున్నారు.గత డిసెంబర్లో వచ్చిన సమాచారం ప్రకారం రష్మిక- విజయ్ ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లోని ప్యాలెస్‌లో వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో తమ సినీ ఇండస్ట్రీ స్నేహితుల కోసం రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే వీటిపై ఈ జంట ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయలేదు. కాగా.. వీరిద్దరు జంటగా గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలలో నటించారు. View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_) -
రష్మిక- విజయ్ పెళ్లి డేట్ ఫిక్స్.. వీడియో వైరల్..!
టాలీవుడ్ మోస్ట్ క్రేజీ హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో పుష్ప మూవీతో నేషనల్ క్రష్‌గా మారిపోయింది. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా ముద్ర వేసుకున్న రష్మిక.. బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఓ లేడీ ఓరియంటెడ్ మూవీలో నటిస్తోంది ముద్దుగుమ్మ.అయితే రష్మిక సినీ కెరీర్ పక్కనపెడితే.. వ్యక్తిగతంగా ఎన్నో రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. గతేడాది విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్ అయిందని వార్తలొచ్చినా.. వీళ్లు మాత్రం అఫీషియల్‌గా ప్రకటించలేదు. అయితే ఈవెంట్స్‌లో మాత్రం చెప్పి చెప్పనట్లుగా మాట్లాడుతూ వచ్చారు. అలా అభిమానుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల వీరిద్దరి పెళ్లి ఉదయ్‌పూర్‌లో జరగనుందని వార్తలొచ్చాయి. దీనిపై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. అటు విజయ్ దేవరకొండ కానీ.. రష్మిక కానీ ఎక్కడా బయటికి చెప్పలేదు.కానీ తాజాగా వీరి పెళ్లి ఏర్పాట్లకు సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట వైరలవుతోంది. ఇద్దరు ఈవెంట్ ప్లానర్స్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఇది రష్మిక- విజయ్ దేవరకొండ పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నామంటూ ఇద్దరు అమ్మాయిలు వీడియోలో మాట్లాడారు. రష్మిక- విజయ్ ఈ నెల 2న పెళ్లి చేసుకోబోతున్నారంటూ వీడియో రిలీజ్ చేశారు. అయితే ఇది చూసిన కొందరు నెటిజన్స్ ఇదంతా ఫేక్ అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో కంగ్రాట్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే రష్మిక కానీ.. విజయ్ కానీ క్లారిటీ ఇవ్వాల్సిందే. Rashmika Mandanna and Vijay Devrakonda are getting married in Udaipur on Feb 2 😲-Confirmed by the Event Planners.pic.twitter.com/HXGUS8RdOE— Christopher Kanagaraj (@Chrissuccess) January 31, 2026 -
విజయ్-రష్మిక పెళ్లి తర్వాత వచ్చే సినిమా ఇదే.. వీడియో రిలీజ్
గత కొన్నాళ్లుగా సినిమాలైతే చేస్తున్నాడు గానీ సరైన సక్సెస్ మాత్రం విజయ్ దేవరకొండకు దొరకట్లేదు. గతేడాది 'కింగ్డమ్'తో వచ్చాడు గానీ అదే సీన్ రిపీటైంది. ప్రస్తుతం రెండు మూవీస్ చేస్తున్నాడు. వాటిలో ఒకటి 'రౌడీ జనార్ధన' కాగా మరొకటి రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పీరియాడిక్ ప్రాజెక్టుకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఇందులో విజయ్ సరసన రష్మిక హీరోయిన్గా నటిస్తుండటం విశేషం.విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు 'రణబాలి' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. 1876-78 మధ్య రాయలసీమ ప్రాంతంలో జరిగే స్టోరీతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ కాలంలో భారతదేశానికి వచ్చిన బ్రిటీషర్లు.. హిట్లర్ చేసిన దానికంటే ఎంత పెద్ద మారణహోమం సృష్టించారు. ఏకంగా 45 ట్రిలియన్ డాలర్లు దోచుకోవడం, 40 ఏళ్లలో 100 మిలియన్ల మంది చావులకు కారణమవడం.. ఇలాంటి చాలా విషయాలు సినిమాలో ఉండబోతున్నాయని అనౌన్స్మెంట్ వీడియోతో చెప్పకనే చెప్పేశారు.ఇందులో విజయ్.. బ్రిటీషర్లపై పోరాడిన రణబాలి అనే వీరుడిగా కనిపించనున్నాడు. రష్మిక.. జయమ్మ అనే పాత్ర పోషించింది. 'మమ్మీ' ఫేమ్ ఆర్నాల్డ్ ఓస్లో ... సర్ థియోడర్ హెక్టర్ పాత్ర చేశాడు. బాలీవుడ్ ఫేమ్ అజయ్ అతుల్ సంగీతమందిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 11న ఇది పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఫిబ్రవరిలో విజయ్-రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే వీళ్లిద్దరూ భార్యభర్తలుగా నటించిన తొలి సినిమా ఇదే అవుతుంది. గతంలో వీళ్లిద్దరూ గీతగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలు జంటగా చేశారు. -
VD 14 : విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ని ఇప్పటి వరకు ప్రకటించలేదు. వీడీ14 అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ ప్రారంభించారు. అయితే రిపబ్లిక్ డే సందర్భంగా రౌడీ ఫ్యాన్స్‌కి మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సినిమా టైటిల్‌ని జనవరి 26న అనౌన్స్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా బ్రిటీష్ కాలం నేపథ్యంతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా "వీడీ 14" సినిమా రూపొందుతోంది. 'డియర్ కామ్రేడ్', 'ఖుషి' వంటి సక్సెస్ ఫుల్ సినిమాల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్, విజయ్ కలిసి చేస్తున్న మూడో చిత్రమిది. 'టాక్సీవాలా' లాంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాతో మరోసారి కలిసి పనిచేస్తున్నారు. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' తర్వాత "వీడీ 14"లో మూడోసారి రష్మిక, విజయ్ జంటగా కనిపించనున్నారు. 26.1.26.Remember the date🔥You will remember the name❤️🔥#VD14@TheDeverakonda @Rahul_Sankrityn @MythriOfficial #NiravShah #BhushanKumar #KrishanKumar @TSeries #ShivChanana @neerajkalyan_24 @vd14thefilm pic.twitter.com/07HL8UJqth— Mythri Movie Makers (@MythriOfficial) January 24, 2026 -
రౌడీ ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా వీడీ 14.. ప్రామిస్ చేసిన దర్శకుడు!
‘టాక్సీవాలా’ తర్వాత విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్లో వీడీ14 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సారి తమ హీరో విజయ్ దేవరకొండ కు మంచి హిట్ మూవీ ఇవ్వాలంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ రాహుల్ కు రిక్వెస్ట్స్ పంపుతున్నారు.రీసెంట్ గా యశ్వంత్ అనే విజయ్ దేవరకొండ ఫ్యాన్ తమ హీరోకు మెమొరుబల్ మూవీ ఇవ్వాలటూ హార్ట్ టచింగ్ రిక్వెస్ట్ ఒకటి పంపారు. ఆ అభిమాని రిక్వెస్ట్ కు స్పందించిన రాహుల్ సంకృత్యన్ 'మీ అభిమానులందరి ఆకలి తీర్చేలా వీడీ 14 ఉంటుంది..' అంటూ ప్రామిస్ చేశారు. విజయ్ అభిమానికి స్పందిస్తూ రాహుల్ ఇచ్చిన రిప్లైతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా కథతో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ వీడీ 14 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. -
షూటింగ్ పోదాం చలో చలో...
ఓ వైపు నూతన సంవత్సరం జోరు. మరోవైపు చిత్ర పరిశ్రమలో సినిమాల విడుదలకు అతి పెద్ద పండగలా భావించే సంక్రాంతి సందడి... ఈ సంక్రాంతికి విడుదలైన ప్రభాస్ ‘ది రాజా సాబ్’, చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్‌గారు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒకరాజు’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి సినిమాలన్నీ ప్రేక్షకులను అలరించాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళుతున్నాయి. థియేటర్లలో సంక్రాంతి పండగ సందడి ఇంకా కనిపిస్తోంది.ఈ పండగకి చిన్న విరామం తీసుకున్న మన హీరోలు సంక్రాంతి ముగియగానే ‘షూటింగ్ పోదాం చలో చలో’ అంటూ సెట్స్‌లో వాలిపోయారు. తమ సినిమాల చిత్రీకరణలతో బిజీ బిజీగా ఉంటున్నారు. కొందరు హీరోలు విదేశాల్లో తమ మూవీ షూటింగ్స్‌లో జాయిన్ కాగా... వెంకటేశ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్, నాని, విజయ్ దేవరకొండ, సాయిదుర్గా తేజ్ వంటి పలువురు హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో జోరుగా హుషారుగా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం.... వెంకటేశ్ బేగంపేటలో... ‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత వెంకటేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’. తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ, సక్సెస్‌పుల్ డైరెక్టర్‌గా పేరు సం పాదించుకున్న త్రివిక్రమ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. వెంకటేశ్ కెరీర్లో 77వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని బేగంపేట చిరాగ్ పోర్ట్‌లో జరుగుతోంది.వెంకటేశ్‌తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట త్రివిక్రమ్. వెంకటేశ్ హీరోగా నటించిన హిట్ మూవీ ‘నువ్వు నాకు నచ్చావ్, మళ్లీశ్వరి’ కి త్రివిక్రమ్ మాటలు అందించిన సంగతి తెలిసిందే. ఆ మూవీస్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’. ఫ్యామిలీ హీరోగా వెంకటేశ్‌కి ఉన్న ఇమేజ్, చక్కిలిగింతలు పెట్టే హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల మేళవింపుతో కుటుంబ బంధాలను, విలువలను తెలియజేసే చిత్రాలను తెరకెక్కించడంలో త్రివిక్రమ్ దిట్ట. వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ చిత్రంపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.మహేశ్‌బాబు గండిపేటలో... ‘గుంటూరు కారం’ (2024) వంటి హిట్ మూవీ తర్వాత మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. ‘ఆర్ఆర్ఆర్’ (2022) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ప్రియాంకా చో్ర పా హీరోయిన్గా నటిస్తున్నారు. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కరడుగట్టిన, కమాండింగ్ ప్రతినాయకుడు కుంభ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఆయన లుక్‌కి మంచి స్పందన వచ్చింది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని గండిపేటలో జరుగుతోంది.అక్కడ ప్రత్యేకంగా వేసిన వారణాసి సెట్లో ఈ మూవీ చిత్రీకరణ జరుపుతున్నారట రాజమౌళి. ఈ షెడ్యూల్లో మహేశ్‌బాబుతో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ సినిమా కోసం మహేశ్‌బాబు పొడవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ అయిన సంగతి తెలిసిందే. మహేశ్‌బాబు, రాజమౌళి కలిసి చేస్తున్న ఎపిక్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు ఎదురుచూస్తున్నారు. గత నవంబరులో హైదరాబాద్‌లో నిర్వహించిన ‘వారణాసి’ గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ సోషల్ మీడియాను షేక్ చేయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరేలా చేసింది.ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీని హాలీవుడ్‌కి ఏ మాత్రం తగ్గని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నారట రాజమౌళి. ఈ సినిమాని 2027 వేసవిలో విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పక్కా డేట్ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ అప్డేట్ కోసం వేచి చూస్తున్న అభిమానులకు త్వరలోనే ఒక తీపి కబురు అందనుందని ఫిల్మ్‌నగర్ టాక్.‘వారణాసి’ విడుదల తేదీని ఈ ఏడాది శ్రీరామ నవమి (మార్చి 26న) సందర్భంగా ప్రకటించాలని చిత్ర యూనిట్ భావిస్తోందని తెలుస్తోంది. ఈ సినిమాపై మహేశ్‌బాబు ఎంతో నమ్మకంతో ఉన్నారు. ‘‘వారణాసి’ నా కలల ్ర పాజెక్ట్. జీవితంలో ఒక్కసారి వచ్చే అవకాశం ఇది. దీని కోసం ఎంత కష్టపడాలో అంతా కష్టపడతాను. ఈ సినిమా విడుదలైనప్పుడు దేశమంతా గర్వపడుతుంది’’ అంటూ గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్లో మహేశ్‌బాబు మాట్లాడిన మాటల్ని బట్టి చూస్తే సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆర్ఎఫ్సీలో... ‘దేవర’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, సలార్’ వంటి హిట్ చిత్రాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఈ మూవీలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా, బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘డ్రాగన్ ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని ఫిల్మ్‌నగర్ టాక్. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ సమీపంలోని ఆర్ఎఫ్సీలో శరవేగంగా జరుగుతోంది. అక్కడి స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్లో ఎన్టీఆర్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట ప్రశాంత్ నీల్. ఈ సెట్లోనే జరిగిన గత షెడ్యూల్స్‌లో ఓ నైట్ సాంగ్‌ని, ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా చిత్రీకరించారని తెలిసింది. ప్రస్తుత షెడ్యూల్లో ఎన్టీఆర్‌పై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుందని సమాచారం. ఈ షెడ్యూల్ జనవరి ఆఖరు వరకు సాగుతుందట. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతిదీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది. మూడువేల మంది జూనియర్ ఆర్టిస్టులతో చిత్రీకరించిన ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్, అలాగే సుమారు 2000 మందితో తెరకెక్కించిన ఓ పాట... సుమారు పదిహేను కోట్ల రూ పాయలతో వేసిన ఎన్టీఆర్ ఇంటి సెట్... ఇలా అన్నీ హైలెట్‌గా మారాయి. ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాకు ‘కేజీఎఫ్, సలార్, మార్కో’ చిత్రాల ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. రామ్‌చరణ్ అజీజ్‌నగర్‌లో... రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘పెద్ది’. తొలి సినిమా ‘ఉప్పెన’తో (2021) బ్లాక్‌బస్టర్ అందుకున్న బుచ్చిబాబు సానా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో సమీపంలోని అజీజ్ నగర్లో జరుగుతోంది.రామ్ చరణ్‌తో పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట బుచ్చిబాబు. ‘రంగస్థలం’ (2018) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ‘పెద్ది’ చిత్రంలోనూ ఫుల్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు రామ్‌చరణ్. ఆట కూలీ అనే కొత్త కాన్సెప్ట్‌ను ఈ సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్‌కు పరిచయం చేయబోతున్నారు దర్శకుడు. వింటేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో చరణ్ చేస్తున్న క్యారెక్టర్ తన కెరీర్లోనే ఇంట్రస్టింగ్ అని టాక్.రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది మార్చి 27న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టే షూటింగ్ శరవేగంగా సాగుతోందని టాక్. అయితే ఓ వైపు షూటింగ్ జరగుతుండటం, మరోవైపు పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతుండటంతో అనుకున్న సమయానికి సినిమా ప్రేక్షకుల ముందుకు రాకపోవచ్చనే ప్రచారం ఫిల్మ్‌నగర్‌లో జరుగుతోంది. కానీ ముందుగా ప్రకటించిన మార్చి 27నే ‘పెద్ది’ విడుదలవుతుందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు రామ్‌చరణ్. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి...’ పాట 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించినట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ గండిపేటలో... విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రౌడీ జనార్థన’. ‘రాజావారు రాణిగారు’ (2019) సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభని నిరూపించుకున్న రవికిరణ్ కోలా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని గండిపేటలో జరుగుతోంది. విజయ్ దేవరకొండ, కీర్తీ సురేష్‌లపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట రవికిరణ్ కోలా. ‘‘రౌడీ జనార్థన’ కథ 1980 దశకం నేపథ్యంలో సాగుతుంది. ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్లో విజయ్ కనిపించబోతున్నారు. ఈ మూవీ కోసం విజయ్ తొలిసారిగా ఈస్ట్ గోదావరి యాసలో డైలాగులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఇంత మాస్, బ్లడ్ షెడ్ ఉన్న క్యారెక్టర్ని ఆయన చేయలేదు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ ఏడాది డిసెంబరులో ‘రౌడీ జనార్థన’ విడుదల కానుంది. సాయిదుర్గాతేజ్ తుక్కుగూడలో..‘విరూ పాక్ష’, ‘బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్ మెంట్‌పై ‘హను–మాన్’ (2024) చిత్రంతో పాన్ ఇండియన్ హిట్ అందుకున్న కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు.ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే... ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో జరుగుతోంది. అక్కడ ప్రత్యేకంగా వేసిన సెట్లో లాంగ్ షెడ్యూల్ జరుపుతున్నారు మేకర్స్. ఈ షెడ్యూల్లో సాయిదుర్గా తేజ్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు.ఈ మూవీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వస్తోంది. సాయిదుర్గా తేజ్ పుట్టినరోజు సందర్భంగా 2025 అక్టోబరు 15న ‘అసుర ఆగమన’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మూవీ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో తన పాత్ర కోసం సాయిదుర్గా తేజ్ కండలు తిరిగిన దేహంతో, గుబురు గెడ్డంతో ఫుల్‌గా మేకోవర్ అయ్యారు. ఈ మూవీకి బి.అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. నాని ముచ్చింతల్‌లో.. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘దసరా’. కీర్తీ సురేష్ హీరోయిన్గా నటించిన ఈ మూవీని ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. 2023 మార్చి 30న విడుదలైన ఈ మూవీ ఘనవిజయం సాధించింది. ‘దసరా’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మంచు మోహన్ బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో శరవేగంగా జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో జరుగుతున్న ఈ షెడ్యూల్లో నానితో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొంటోంది. ఈ సన్నివేశాలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయట. జనవరి నెలాఖరు వరకు ఈ షెడ్యూల్ కొనసాగే అవకాశముందని తెలిసింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో జడల్ అనే శక్తిమంతమైన పాత్రలో నాని కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన స్టిల్‌లో నాని రెండు జడలు వేసుకుని, పక్కా మాస్ లుక్‌లో కనిపించగా అద్భుతమైన స్పందన వచ్చింది.నాని లుక్, స్టోరీ, టేకింగ్... ఇలా ప్రతిదీ వైవిధ్యంగా ఉండేలా తెరకెక్కిస్తున్నారట శ్రీకాంత్ ఓదెల. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఈ ఏడాది మార్చి 26న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే మార్చి 27న రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదలవుతుండటంతో డేట్స్ క్లాష్ అయ్యే అవకాశం ఉన్నందువల్ల ఈ మూవీ రిలీజ్ ఉండకపోవచ్చనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.ఈ విషయాలపై చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి స్పష్టత ఇచ్చారు. ‘‘ది ప్యారడైజ్’ చిత్రీకరణ 60 శాతం పూర్తయింది. సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలన్నింటినీ పూర్తి చేశాం. పాటలు, ఫైట్స్ దాదాపు పూర్తయ్యాయి. అయితే టాకీ పార్ట్ మాత్రమే పూర్తవ్వాల్సి ఉంది. అది కూడా వీలైనంత త్వరలో పూర్తి చేస్తాం. అయితే ‘పెద్ది’ సినిమాతో పోటీ పడి మా ‘ది ప్యారడైజ్’ని విడుదల చేయం. రెండు సినిమాలను ఒకేసారి రిలీజ్ చేయకుండా వేర్వేరు తేదీల్లో రిలీజ్ చేసే ΄్లాన్ చేసే ఆలోచన కూడా ఉంది’’ అని సుధాకర్ చెరుకూరి తెలి పారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. పైన పేర్కొన్న సినిమాలే కాదు... మరికొన్ని చిన్న, పెద్ద సినిమాలు కూడా హైదరాబాద్‌లో, పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
వచ్చేనెలలో విజయ్‌తో పెళ్లి.. రష్మిక ఏమన్నారంటే?
హీరోయిన్ రష్మిక ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయింది. గతేడాది ది గర్ల్‌ఫ్రెండ్‌తో హిట్ కొట్టిన ముద్దుగుమ్మ.. కొత్త ఏడాదిలోనూ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ.. తనపై వస్తున్న రూమర్స్‌పై స్పందించింది. విజయ్ దేవరకొండతో వచ్చే నెలలోనే పెళ్లంటూ వార్తలొస్తున్నాయి. దీనిపై క్లారిటీ ఇవ్వాలని యాంకర్ రష్మికను ప్రశ్నించింది.ఈ ప్రశ్నకు రష్మిక చాలా తెలివిగా సమాధానం చెప్పుకొచ్చింది. నాలుగేళ్లుగా ఇలాంటి వింటూనే ఉన్నానని తెలిపింది. జనం కూడా ఎప్పటి నుంచో ఇదే ప్రశ్న అడుగుతున్నారు.. దాని కోసమే తాను కూడా ఎదురుచూస్తున్నానంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది. దీనిపై ఎప్పుడు చెప్పాలో అప్పుడే మాట్లాడతానని తెలిపింది. ఆ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెప్తానంటూ మరోసారి క్లారిటీ ఇచ్చేసింది. అంతేకాకుండా కెమెరా ముందు కాకుండా ఆఫ్ ది రికార్డ్‌లో ఈ విషయం గురించి మాట్లాడతానని రష్మిక సమాధానం దాటవేసింది.కాగా.. విజయ్ దేవరకొండతో ఫిబ్రవరి 26న రష్మిక పెళ్లి జరగనుందని నెట్టింట వైరలవుతోంది. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్ జరగనుందని టాక్. గతేడాది అక్టోబర్‌లో వీరిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారని వార్తలొచ్చాయి. కానీ దీనిపై కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు. అలాగే తాజాగా పెళ్లి విషయంలోనూ అదే ఫాలో అవుతూ సర్ప్రైజ్ ఇస్తారేమో వేచి చూడాల్సిందే. Q: There’s been a lot of buzz that #VijayDeverakonda and Rashmika are engaged and getting married on FEB 26th in Udaipur. What’s the truth?#RashmikaMandanna : pic.twitter.com/x6vD2jSIZB— Whynot Cinemas (@whynotcinemass_) January 19, 2026 -
నా ఫేవరేట్ టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ: యంగ్ హీరోయిన్
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ సారా అర్జున్ ఇటీవలే దురంధర్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ డైరెక్టర్ గుణ శేఖర్ తెరకెక్కించిన యుఫోరియా మూవీతో అలరించేందుకు వస్తోంది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది.ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన సారా అర్జున్ అచ్చ తెలుగులో అనర్గళంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తెలుగులో నటించడం చాలా గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా యాంకర్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. టాలీవుడ్ మీ ఫేవరేట్ హీరో అని యాంకర్ ప్రశ్నించింది. దీనికి బాలీవుడ్ బ్యూటీ సారా అర్జున్ ఆసక్తికరమైన పేరు చెప్పింది. తెలుగులో చాలామంది హీరోలు ఉన్నారని.. కానీ నాకు మాత్రం విజయ్ దేవరకొండ ఫేవరేట్ అని బాలీవుడ్ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.కాగా.. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ‘యుఫోరియా చిత్రంలో భూమిక, సారా అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మేనన్ ప్రధాన పాత్రల్లో నటింటారు. ఈ సినిమాకు నీలిమా గుణశేఖర్ నిర్మాతగా వ్యవహరించారు. డ్రగ్స్ వల్ల యువత ఎదుర్కొన సమస్యల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు. -
ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా.. బాధగా ఉంది : విజయ్ దేవరకొండ
టాలీవుడ్లో ఫేక్ రివ్యూలు, నెగెటివ్ రేటింగ్స్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా నిర్మాతలు ఈ సమస్యపై కోర్టును ఆశ్రయించారు. బుక్ మై షో (BookMyShow) వంటి ఆన్లైన్ టికెటింగ్ పోర్టల్లలో రేటింగ్స్, రివ్యూలు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కోర్టు ఆదేశాల మేరకు బుక్ మై షో ఈ సినిమాకు రేటింగ్స్ , రివ్యూలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీనిపై స్టార్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ విషయం తనకు సంతోషాన్నిచ్చినప్పటికీ, కొంత బాధను కూడా కలిగిస్తోందని ట్వీట్ చేశారడు.‘ఫేక్ రేటింగ్స్, రివ్యూలకు చెక్ పెట్టడం సంతోషకరం. ఇది చాలా మంది కష్టం, కలలు, డబ్బును కాపాడుతుంది. అదే సమయంలో బాధ కలిగిస్తోంది ఎందుకంటే... మన సొంత మనుషులే ఇలాంటి సమస్యలు సృష్టిస్తున్నారు. ‘మనం బతుకుతూ ఇంకొకరికి బతికించాలి’ అనే సూత్రం ఏమైంది? అందరూ కలిసి ఎదగాలనే భావన ఎక్కడికి వెళ్లింది?(చదవండి: మొన్న అల్లు అర్జున్, ఇప్పుడు ప్రభాస్‌పై కక్ష.. హరీశ్‌రావు సంచలన కామెంట్)'డియర్ కామ్రేడ్' సినిమా నుంచే నాకు ఇలాంటి దాడులు ఎదురయ్యాయి. అలా చెబితే ఎవరూ పట్టించుకోలేదు .ఒక మంచి సినిమాను ఎవరూ ఆపలేరని నాకే తిరిగి చెప్పారు. కానీ నాతో సినిమా తీసిన దర్శకులకు, నిర్మాతలకు ఈ సమస్య యొక్క తీవ్రత తర్వాత అర్థమయింది.ఇలాంటి పనులు చేసేది ఎలాంటి మనుషులు అని ఆలోచిస్తూ, నా కలలను , నా లాగే నా తర్వాత వచ్చే చాలా మంది కలలను కాపాడుకోవడానికి వారితో ఎలా వ్యవహరించాలో అని ఆలోచిస్తూ అనేక రాత్రులు నిద్రలేకుండా గడిపాను. ఇన్నాళ్లకు ఈ విషయం బహిరంగంగా వచ్చినందుకు సంతోషిస్తున్నాను. (చదవండి: చిరు-అనిల్ రావిపూడి.. ఈసారి హిట్ కొడతారా?)మెగాస్టార్ లాంటి పెద్ద హీరో సినిమాకు కూడా ముప్పు ఉందని కోర్టు గుర్తించినందుకు ఆనందంగా ఉంది. ఈ ఆదేశాలతో సమస్యను పూర్తి పరిష్కారం లభించదు కానీ, ఆందోళన చెందాల్సిన విషయాల్లో ఒకటి తగ్గుతుంది. ఇదంతా పక్కనపెట్టి ఇప్పుడైతే మనం ‘మన శంకరవరప్రసాద్’(Mana Shankara Varaprasad Garu) తో పాటు సంక్రాంతికి వస్తున్న అన్ని సినిమాలు విజయవంతంగా అలరించాలని కోరుకుందాం’ అని విజయ్ ట్వీట్ చేశాడు. Happy and Sad to see this - Happy to know hardwork, dreams and money of many is protected in a way. And Sad because of the reality of our own people causing these problems. What happened to live and let live? and growing together?Since the Days of Dear Comrade i first began… pic.twitter.com/gF55B8nXqt— Vijay Deverakonda (@TheDeverakonda) January 11, 2026 -
విజయ్ దేవరకొండ కింగ్డమ్ సీక్వెల్... నాగవంశీ ఫుల్ క్లారిటీ
ఈ ఏడాది విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కింగ్డమ్. ఈ చిత్రంలో హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మించిన కింగ్డమ్ మూవీ ఈ ఏడాది జులైలో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్లు రాబట్టడంతో విఫలమైంది. సినిమాకు నెగటివ్ టాక్ రావడంతో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.అయితే ఈ మూవీకి కొనసాగింపుగా సీక్వెల్ ఉంటుందని విజయ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. కొన్ని నెలలుగా కింగ్డమ్ పార్ట్-2పై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయిందని చాలాసార్లు సోషల్ మీడియాలో టాక్ వినిపించింది.ఈ నేపథ్యంలోనే నిర్మాత నాగవంశీ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కింగ్డమ్-2 సీక్వెల్ ఆలోచన తమకు లేదని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ప్రకటనతో తమ సినిమాపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టేశారు నిర్మాత. అయితే తాము గౌతమ్ తిన్ననూరితో మరో సినిమా చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం గౌతమ్ మరో మూవీతో బిజీగా ఉన్నారని.. ఆ తర్వాత మాతో కలిసి పనిచేస్తారని నాగవంశీ పేర్కొన్నారు. ఈ ప్రకటనతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కింగ్డమ్-2 గురించి ఆశలు వదులుకోవాల్సిందే.ఇక విజయ్ దేవరకొండ విషయానికొస్తే ఆయన ప్రస్తుతం 'రౌడీ జనార్ధన మూవీతో బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 2026లోనే విడుదల కానుంది. -
విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి తేదీ ఫిక్స్..?
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నా నిశ్చితార్థం జరిగిందన వార్తలు వచ్చినప్పటికీ వారు మాత్రం అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. కానీ, సరైన సమయంలో ఆ విషయం గురించి చెబుతానని ఇప్పటికే రష్మిక క్లారిటీ ఇచ్చింది. హైదరాబాద్‌లోని విజయ్ దేవరకొండ నివాసంలో వీరి ఎంగేజ్మెంట్ అయిందని వారి సన్నిహితులు కూడా పోస్టులు పెట్టారు. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. అయితే, ఇప్పుడు పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి.సోషల్‌మీడియాలో వస్తున్న తాజా సమాచారం ప్రకారం 2026 ఫిబ్రవరి 26న విజయ్-రష్మికల పెళ్లి జరగనుందని తెలుస్తోంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో వారిద్దరూ పెళ్లిపీటలెక్కబోతున్నారని టాక్ జరుగుతుంది. ఘనంగా పెళ్లి జరిపేందుకు ఇరు కుటుంబ సభ్యులు ఘనంగా ఏర్పాట్లు చేయబోతున్నారని టాక్. అయితే, ఇందులో నిజమెంతో తెలియాలంటే విజయ్-రష్మికలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే. -
టాలీవుడ్ లవ్ బర్డ్స్.. న్యూ ఇయర్ పార్టీకి రెడీ..!
టాలీవుడ్ ప్రేమ జంటల్లో విజయ్- రష్మిక జోడీ గురించి మనందరికీ సుపరిచితమే. చాలా ఏళ్లుగా డేటింగ్లో ఉన్న వీరిద్దరు ఈ ఏడాదిలోనే నిశ్చితార్థం చేసుకున్నారని వార్తలొచ్చాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ.. పరోక్షంగానైతే హింట్ ఇచ్చారు. వచ్చే ఏడాదిలో వీరిద్దరు పెళ్లి పీటలెక్కబోతున్నారని టాక్ కూడా వినిపిస్తోంది. వచ్చే ఫిబ్రవరిలో గ్రాండ్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వైరలైంది.ప్రస్తుతం తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన, రష్మిక మందన్నా మైసా చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా వచ్చేశాయి. అయితే ప్రస్తుతం షూటింగ్‌కు కాస్తా గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. వరుసగా క్రిస్మస్, న్యూ ఇయర్ ఉండడంతో ఈ జంట వేకేషన్ ప్లాన్ చేశారు. నూతన ఏడాది వేడుకల కోసం ఫారిన్ ట్రిప్‌కు బయల్దేరారు. దీనికి సంబంధించిన ఫోటోలను రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. వెకేషన్ ట్రిప్ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. అయితే విజయ్, రష్మిక హైదరాబాద్ విమానాశ్రయంలో విడివిడిగా కనిపించారు. దీంతో వీరిద్దరు కలిసే వేకేషన్‌కు ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది.పెళ్లి గురించి ఇటీవల రష్మికతో ప్రస్తావించగా.. సమయం వచ్చినప్పుడు తానే అందరికీ చెప్తానని తెలిపింది. నిశ్చితార్థ వార్తలను కొట్టిపారేయలేదు.. అలాగని డైరెక్ట్‌గా చెప్పలేదు నేషనల్ క్రష్. ఇటీవలే ది గర్ల్‌ఫ్రెండ్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన రష్మిక.. ప్రస్తుతం మైసా చిత్రంలో నటిస్తోంది. గతంలో విజయ్, రష్మిక గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలలో నటించారు. -
విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన’ టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మాస్ రౌడీ జనార్ధన
విజయ్ దేవరకొండ హీరోగా రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న రూరల్ యాక్షన్ డ్రామా సినిమాకు ‘రౌడీ జనార్ధన’ అనే టైటిల్ ఖరారైంది. ఈ చిత్రంలో కీర్తీసురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా 2026 డిసెంబరులో విడుదల కానుంది. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌ని సోమవారం నిర్వహించారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘రౌడీ జనార్ధన’ కోసం విజయ్‌తో తొలిసారిగా ఈస్ట్ గోదావరి యాసలో మాట్లాడిస్తున్నాం. 1980 దశకం నేపథ్యంతో ఈ సినిమా కథనం ఉంటుంది.ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్లో విజయ్ కనిపించబోతున్నాడు. తను ఇప్పటి వరకు ఇంత మాస్, బ్లడ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేయలేదు. వచ్చే ఏడాది ఈ సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని చెప్పారు. ‘‘నేను కూడా విజయ్ దేవరకొండ అభిమానినే. నేను అభిమానించే కీర్తీ సురేష్, ‘దిల్’ రాజుగార్లతో సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్ర కథ ఎంత బాగుందో, ఈస్ట్ గోదావరి యాసలో విజయ్ మాట్లాడటం కూడా అంతే బాగుందని రాజుగారు అనేవారు’’ అని తెలిపారు రవికిరణ్ కోలా. శిరీష్, ప్రోడక్షన్ డిజైనర్ డినో శంకర్, కెమెరామేన్ ఆనంద్ సి. చంద్రన్ మాట్లాడారు. -
ఫుల్ వయొలెంట్‌గా విజయ్ దేవరకొండ.. రౌడీ జనార్ధన గ్లింప్స్ చూశారా?
కింగ్డమ్ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న పుల్ యాక్షన్ మూవీ రౌడీ జనార్ధన. ఈ సినిమాకు రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీనివ రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. రౌడీ జనార్ధన గ్లింప్స్ చూస్తే ఈ చిత్రంలో ఫుల్ వయొలెన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది.ఈ గ్లింప్స్‌లో ఫైట్ సీన్స్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. 'ఈ కళింగపట్నంలో ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్నోడు ఒక్కడే ఉన్నాడు.. రౌడీ జానార్ధన' అనే డైలాగ్ అభిమానులను అలరిస్తోంది. కాగా.. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు- శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి విలన్‌గా కనిపించనున్నారని టాక్. -
శ్రీలంకలో రష్మిక బ్యాచిలర్ పార్టీ.. తోడుగా ఆ హీరోయిన్
పాన్ ఇండియా సినిమాలతో రష్మిక ఫుల్ బిజీగా ఉంది. ఈ ఏడాది ఈమె నుంచి ఐదు సినిమాలు వచ్చాయి. వీటి కంటే ఈమెకు గత నెలలో హీరో విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం జరిగిందనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఇది నిజమని ఇప్పటివరకు అటు రష్మిక గానీ ఇటు విజయ్ గానీ బయటపెట్టలేదు. కానీ ఈమె చేతికి ఉన్న రింగ్ మాత్రం ఇదంతా నిజమని చెప్పకనే చెబుతోంది.(ఇదీ చదవండి: 'అవతార్'లో కళ్లుచెదిరే గ్రాఫిక్స్ వెనక భారతీయ మహిళ)వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారనే రూమర్స్ వస్తున్నాయి. మరి ఇందులో నిజానిజాల సంగతి పక్కనబెడితే ఇప్పుడు రష్మిక.. తన గర్ల్స్ గ్యాంగ్‌తో కలిసి శ్రీలంక ట్రిప్ వేసింది. బీచ్, రిసార్ట్స్‌లో ఫుల్ చిల్ అవుతూ కనిపించింది. ఈమెతో పాటు హీరోయిన్ వర్ష బొల్లమ్మ, కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య వర్మ కనిపించారు. మిగిలిన స్నేహితులు ఎవరనేది పెద్దగా తెలియదు.'నాకు ఈ మధ్యే రెండు రోజుల బ్రేక్ దొరికింది. నా గర్ల్స్‌తో పాటు చిల్ అయ్యే ఛాన్స్ దొరికింది. మేం శ్రీలంకలోని ఈ అందమైన ప్రదేశానికి వెళ్లాం. గర్ల్స్ ట్రిప్స్.. ఎంత చిన్నవి అనేది సమస్య కాదు. నా గర్ల్స్ బెస్ట్' అని రష్మిక.. తన శ్రీలంక ట్రిప్ జ్ఞాపకాల్ని పోస్ట్ చేసింది. అయితే ఇది ఈమె బ్యాచిలరేట్ పార్టీ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. చూస్తుంటే అలానే అనిపిస్తుంది కూడా. రష్మిక చేతిలో ఇప్పుడు మైసా, రెయిన్ బో అనే చిత్రాలున్నాయి.(ఇదీ చదవండి: శ్రీలీల కూడా బాధితురాలే.. ఆవేదనతో పోస్ట్) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
విజయ్ దేవరకొండ యాక్షన్ మూవీ... విలన్‌గా స్టార్ హీరో..!
కింగ్డమ్ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫుల్ బిజీ అయిపోయారు. దిల్ రాజు నిర్మాణంలో 'రౌడీ జనార్ధన్', రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ మూవీస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రాలతో బిజీగా ఉన్నారు. విజయ్ మూవీ రౌడీ జనార్ధన్ రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తున్నారు.మరోవైపు ఈ చిత్రంలో విలన్ ఎవరనేది ఇప్పటి వరకు మేకర్స్ రివీల్ చేయలేదు. ఈ యాక్షన్ మూవీలో ప్రముఖ స్టార్ హీరో ప్రతినాయకుడిగా కనిపించనున్నారని లేటేస్ట్ టాక్. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ చిత్రంలో విలన్ రోల్ ప్లే చేస్తారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. విజయ్ సేతుపతి వల్ల తమిళంలోనూ ఫుల్ క్రేజ్ వస్తుందని మేకర్స్ భావిస్తున్నారట.ఇదే నిజమైతే విజయ్ దేవరకొండ చిత్రానికి కోలీవుడ్‌లో కలిసి రావడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో విజయ్ సేతుపతి విలన్‌గా నటించడం వల్ల తమిళ ప్రేక్షకుల్లోనూ మరింత ఆసక్తి పెంచునుంది. దేవరకొండ- విజయ్ సేతుపతి మధ్య ఫైట్ సీన్స్ చూసే ఛాన్స్ ఫ్యాన్స్‌కు దక్కనుంది. కాగా.. ఈ సినిమాకు రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. -
విజయ్ దేవరకొండ చేయాల్సిన సీక్వెల్ ఆగిపోయిందా?
కొన్ని సినిమాలు రిలీజైనప్పుడు హిట్ అని మేకర్స్ ఘనంగా చెప్పుకొంచారు. కలెక్షన్స్ పోస్టర్ రిలీజ్ చేస్తారు. అభిమానులు కూడా మా హీరో హిట్ కొట్టేశాడు అని హడావుడి చేస్తారు. తీరా చూస్తే కొన్నిరోజులకు అసలు ఫలితం ఏంటనేది బయటపడుతుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ విషయంలోనూ సేమ్ ఇలాంటి పరిస్థితే ఎదురైనట్లు అనిపిస్తుంది. ఇంతకీ ఏంటి విషయం?పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం లాంటి హిట్స్ అందుకున్న విజయ్ దేవరకొండ.. టాలీవుడ్లో క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ తర్వాత చేసిన సినిమాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా బాక్సాఫీస్ దగ్గర సరిగా ఫెర్ఫార్మ్ చేయలేకపోయాయి. యాక్టింగ్ పరంగా విజయ్‌ని వంకపెట్టడానికి ఏం లేనప్పటికీ సినిమాల్లో సరైన కంటెంట్ లేకపోవడంతో చాలావరకు ఫ్లాప్స్ అవుతూ వచ్చాయి. ఈ ఏడాది విజయ్ నుంచి 'కింగ్డమ్' వచ్చింది. మే చివరలో థియేటర్లలో రిలీజైంది.(ఇదీ చదవండి: మెడికల్ మాఫియాపై ఓటీటీ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)విడుదల రోజు.. విజయ్ హిట్ కొట్టేశాడని రష్మిక పోస్ట్ పెట్టింది. తొలిరోజు మూవీ చూసిన చాలామంది కూడా బాగుందనే అన్నారు. కానీ రెండో రోజు నుంచి యావరేజ్ అనే టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాకు రూ.130 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు. రెండు భాగాలుగా తీయాలని అనుకున్నారు. తొలి భాగంలో కొంత కథ చూపించారు. కాకపోతే పెట్టిన బడ్జెట్‌కి వచ్చిన వసూళ్లకు పొంతన కుదరలేదు. దీంతో ఇప్పుడు రెండో భాగాన్ని పక్కనబెట్టేశారని తెలుస్తోంది.ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. దిల్ రాజు నిర్మాణంలో 'రౌడీ జనార్ధన్', రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ మూవీ చేస్తూ బిజీగా ఉన్నాడు. మరోవైపు 'కింగ్డమ్' దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కూడా 'మ్యాజిక్' అనే చిన్న సినిమా తీశాడు. దీన్ని విడుదల చేసే పనుల్లో ఉన్నాడు. 'కింగ్డమ్' సీక్వెల్ లెక్క ప్రకారం వచ్చే ఏడాది మొదలవ్వాలి. కానీ అది ఇప్పుడు ఆర్థిక కారణాల వల్ల క్యాన్సిల్ అయిపోయిందని అంటున్నారు. ఇందులో నిజమేంటనేది కొన్ని నెలలు ఆగితే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.(ఇదీ చదవండి: గతవారం నిల్.. ఈసారి ఏకంగా థియేటర్లలోకి 15 సినిమాలు) -
జోరుగా... హుషారుగా...
ఆడుతుపాడుతూ పని చేస్తుంటే అలుపూ సొలుపేం ఉండదు అంటూ... బిజీ బిజీగా షూటింగ్ చేసేస్తున్నారు స్టార్స్. జోరుగా షూటింగ్స్ జరుగుతుంటే స్టూడియోలు కూడా కళకళలాడుతున్నాయి. కొన్ని స్టూడియోస్‌లో కలర్‌ఫుల్ సెట్స్ కనువిందు చేస్తున్నాయి. సీన్‌కి తగ్గట్టు సహజమైన లొకేషన్స్‌లో మరికొన్ని షూటింగ్స్ జరుగుతున్నాయి. ఇక... ఏ స్టార్ ఎక్కడెక్కడ షూటింగ్ చేస్తున్నారో చూద్దాం...దౌలతాబాద్ టు అన్నపూర్ణ... చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘పండక్కి వస్తున్నారు’ అనేది ఉపశీర్షిక. నయనతార హీరోయిన్ . ఈ సినిమాలో హీరో వెంకటేశ్ ముఖ్యపాత్రపోషిస్తున్నారు. కేథరిన్, సచిన్ ఖేడేకర్ ఇతరపాత్రల్లో నటిస్తున్నారు. వెంకటేశ్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రం కీలక షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. హైదరాబాద్‌లోని దౌలతాబాద్ అసెంబ్లీ పబ్‌లో రెండు రోజులపాటు పలు సన్నివేశాల చిత్రీకరణ జరిపారు. ఆ తర్వాత తిరిగి అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ ఆరంభించారు. ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేకమైన సెట్లో చిరంజీవితోపాటు చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు అనిల్ రావిపూడి. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి నటిస్తున్న పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం ఇది.ఈ మూవీలో చిరంజీవి–నయనతార భార్యాభర్తలుగా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల..’పాట ఏ స్థాయిలో శ్రోతలను అలరించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ మూవీలో తనపాత్రకు సంబంధించిన చిత్రీకరణ బుధవారంతో పూర్తయినట్లు వెంకటేశ్ పేర్కొన్నారు. ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కోఠిలో... వరుసపాన్ ఇండియా చిత్రాలతో జెట్ స్పీడ్‌లో దూసుకెళుతున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన మారుతి దర్శకత్వంలో ‘ది రాజాసాబ్’, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’, హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి’ వంటి ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా ఉన్నారు. ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ మూవీలో ‘యానిమల్’ మూవీ ఫేమ్ త్రిప్తీ దిమ్రి హీరోయిన్. సీనియర్ నటి కాంచన, ప్రకాశ్‌రాజ్, బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ ఇతరపాత్రలుపోషిస్తున్నారు.భద్రకాళి పిక్చర్స్ప్రోడక్షన్ ్స, టీ–సిరీస్ బ్యానర్స్‌పై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, కృషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారి ఓపోలీసాఫీసర్గా కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని కోఠిలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్పాల్గొనడం లేదు. అయితే ఈ చిత్రంలోని ప్రధాన తారాగణంపై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు సందీప్ రెడ్డి. నాన్ స్టాప్‌గా జరగనున్న ఈ మూవీ షూటింగ్లో తర్వాతి షెడ్యూల్లో ప్రభాస్ జాయిన్ అవుతారట.ప్రభాస్ మొదటిసారిపోలీసాఫీసర్గా నటిస్తుండటం.. ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ వంటి హ్యాట్రిక్ మూవీస్ తర్వాత సందీప్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండటంతో ‘స్పిరిట్’ సినిమాపై ఇటు ఇండస్ట్రీలో ఇటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు డాన్ లీ విలన్‌గా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ‘స్పిరిట్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిది భాషల్లో విడుదల కానుంది.ఆర్ఎఫ్సీలో... ‘ఆర్ఆర్ఆర్’ (2022) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్). మహేశ్‌బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ సినిమా కోసం మహేశ్‌బాబు ΄÷డవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ అయిన సంగతి తెలిసిందే.అమేజాన్ అడవుల నేపథ్యంలో భారీ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ మూవీ కోసం ఆర్ఎఫ్సీలో ప్రత్యేకంగా సెట్ వేశారు మేకర్స్. ప్రస్తుతం అక్కడ మహేశ్‌బాబుతోపాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట రాజమౌళి. మహేశ్‌బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నవంబరులో నిర్వహించిన ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. దయాదాక్షిణ్యం లేని, కరడుగట్టిన, కమాండింగ్ ప్రతినాయకుడు కుంభపాత్రలో పృథ్విరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. ఆయన లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి ఈ నినిమాకి సంగీతం అందిస్తున్నారు. ముచ్చింతల్‌లో... నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ (2023) వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో రూపొందుతోన్న ద్వితీయ చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. హిట్ కాంబోలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలున్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతోంది. ఈ మూవీ కోసం ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో జరుగుతున్న ఈ షెడ్యూల్లో నానితోపాటు చిత్రంలోని ప్రధాన తారాగణంపాల్గొంటోంది. ఈ చిత్రంలో నానిపాత్ర పేరు జడల్. ఇప్పటికే విడుదల చేసిన స్టిల్‌లో నాని రెండు జడలు వేసుకుని, పక్కా మాస్ లుక్‌లో కనిపించగా మంచి స్పందన వచ్చింది. నాని లుక్, స్టోరీ, టేకింగ్... ఇలా ప్రతిదీ వైవిధ్యంగా ఉండేలా తెరకెక్కిస్తున్నారట శ్రీకాంత్ ఓదెల. ఈ సినిమాని తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో 2026 మార్చి 26న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.అయితే ఆ తేదీకి ఈ మూవీ రిలీజ్ ఉండకపోవచ్చనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రామ్‌చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ‘ది ΄్యారడైజ్’ చిత్రం విడుదల ఉంటుందా? లేదా? లేకుంటే మరో తేదీ ఫిక్స్ అవుతుందా? అన్నది ఆసక్తిగా మారింది. ఈ విషయాలపై స్పష్టత రావాలంటే వేచి చూడాలి. దండు మైలారంలో... విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘వీడీ 14’ (వర్కింగ్ టైటిల్). ‘ది ఎండ్, టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్’ చిత్రాల ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ దేవరకొండ–రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘టాక్సీవాలా’ 2018 నవంబరు 17న విడుదలై, మంచి హిట్‌గా నిలిచింది. ‘టాక్సీవాలా’ వంటి హిట్ మూవీ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తోన్న ద్వితీయ చిత్రం ‘వీడీ 14’. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని దండు మైలారంలో జరుగుతోంది. 19వ శతాబ్దం నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా భారీపాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రూపొందుతోంది. బ్రిటీష్‌పాలన కాలం నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీని ఇప్పటివరకూ ఎవరూ తెరకెక్కించని కథాంశంతో పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దుతున్నారట రాహుల్ సంకృత్యాన్.దండుమైలారంలో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతోంది. పతాక సన్నివేశాల్లో విజయ్ దేవరకొండతోపాటు ఇతర నటీనటులుపాల్గొంటున్నారని సమాచారం. ఈ సినిమాలో హాలీవుడ్ దిగ్గజ నటుడు (‘మమ్మీ’ సినిమా విలన్) ఆర్నాల్డ్ వస్లూ నటిస్తున్నారనే వార్తలు వచ్చాయి. బ్రిటిష్ అధికారిపాత్రలో ఆర్నాల్డ్ వస్లూ నెగటివ్ క్యారెక్టర్లో నటిస్తుండటంతో వీరి మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ సినిమా 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో... వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వీటీ 15’ (వర్కింగ్ టైటిల్). ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ’ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మేర్లపాక గాంధీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రితికా నాయర్ హీరోయిన్గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్ ్స, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్స్‌పై ‘వీటీ 15’ రూపొందుతోంది. ఇండో కొరియన్ హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి సమీపంలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంటోంది.హీరో హీరోయిన్లతోపాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట దర్శకుడు. వరుణ్ కోసం తనదైన శైలిలో అద్భుతమైన వినోదాత్మక కథను సిద్ధం చేశారు మేర్లపాక గాంధీ. గత కొన్నాళ్లుగా వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ వస్తోన్న వరుణ్... జస్ట్ ఫర్ ఛేంజ్ అన్నట్లు ఈసారి ఆడియన్స్‌కి వినోదాలు అందించేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే... అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా వేసిన సెట్లో ఇటీవల ఓ ప్రత్యేక సాంగ్‌ని చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ‘జాంబి రెడ్డి, బంగార్రాజు’ చిత్రాల ఫేమ్ దక్షా నగార్కర్, వరుణ్ తేజ్‌లపై ఈపాట తెరకెక్కించారు. ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మరి... అదే టైటిల్‌ని ఫిక్స్ చేస్తారా? లేకుంటే మరేదైనా నిర్ణయిస్తారా? అన్నది వేచి చూడాలి. తుక్కుగూడలో... సాయిదుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలకపాత్రలుపోషిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై ‘హను–మాన్’ (2024) వంటిపాన్ ఇండియన్ హిట్ అందుకున్న కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోపాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.ఇదిలా ఉంటే... ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో జరుగుతోంది. అక్కడ ప్రత్యేకంగా వేసిన సెట్లో గత కొన్నాళ్లు నుంచి లాంగ్ షెడ్యూల్ జరుపుతున్నారు మేకర్స్. ఈ షెడ్యూల్లో హీరో, హీరోయిన్లతోపాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట రోహిత్. అక్టోబరు 15న సాయి దుర్గాతేజ్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ‘అసుర ఆగమన’ పేరుతో ఈ మూవీ గ్లింప్స్‌ను విడుదల చేయగా, మంచి స్పందన వచ్చింది.భూత్ బంగ్లాలో... అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రదర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ΄÷డవాటి జుట్టు, గెడ్డంతో ఫుల్ మాస్ లుక్‌లోకి మారిపోయారు అఖిల్. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని భూత్ బంగ్లాలో జరుగుతోంది. శరవేగంగా సాగుతోన్న ఈ చిత్రీకరణలో హీరో, హీరోయిన్లతోపాటు చిత్రంలోని ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని తెలిసింది. రాయలసీమ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఏప్రిల్ 8న అఖిల్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చింది. ‘‘గతాన్ని తరమడానికిపోతా... మా నాయన నాకో మాట సెప్పినాడు... పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాది రా... పేరు ఉండదు, అట్నేపోయేటప్పుడు ఊపిరుండదు... పేరు మాత్రమే ఉంటాది. ఆ పేరు ఎట్టా నిలబడాలంటే...’’ అంటూ రాయలసీమ యాసలో అఖిల్ చెప్పిన డైలాగ్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే ఈ మూవీపై మంచి క్రేజ్ నెలకొంది. రామానాయుడులో క్లైమాక్స్... ‘పెదకాపు’ (2023) చిత్రం ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న రెండో చిత్రం ‘నాగబంధం’. ‘ది సీక్రెట్ ట్రెజర్’ అన్నది ట్యాగ్‌లైన్ . నిర్మాత అభిషేక్ నామా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. నభా నటేశ్ ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు, జయప్రకాశ్, మురళీ శర్మ, బీఎస్ అవినాష్ కీలకపాత్రలుపోషిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని కిశోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ రామానాయుడు స్టూడియోలో జరుగుతోంది.పతాక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ‘‘పాన్ ఇండియా ఎపిక్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘నాగబంధం’. నానక్‌రామ్‌గూడలోని రామానాయుడు స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్లో క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. కేవలం క్లైమాక్స్ సెట్ కోసమే రూ.20 కోట్లు ఖర్చు చేశాం. ఓ మహద్వారం చుట్టూ రూపొందించిన ఈ క్లైమాక్స్‌లోని భావోద్వేగం, డ్రామాను విజువల్‌గా అద్భుతంగా చూపించేలా ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ ఈ సెట్‌ని డిజైన్ చేశారు.థాయ్ స్టంట్ మాస్టర్ కేచా ఖాంఫాక్‌డీ అద్భుతమైన టేకింగ్ యాక్షన్ కొరియోగ్రఫీతో సీక్వెన్స్‌ని గ్రాండ్‌గా తీర్చిదిద్దితున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఇక ఈ సినిమా కోసంప్రోడక్షన్ డిజైనర్ అశోక్ కుమార్ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కేరళలోని అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్లో విరాట్ కర్ణతోపాటు 5000 మంది నృత్య కళాకారులతో ఓపాటని చిత్రీకరించడం విశేషం. పై చిత్రాలే కాదు.. మరికొన్ని సినిమాల షూటింగ్స్ కూడా హైదరాబాద్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌లు జరుపుకుంటున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ 'ఆట' మొదలైంది!
సినిమా ఇండస్ట్రీలో స్పోర్ట్స్ జానర్ చిత్రాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు స్పోర్ట్స్ చిత్రాలు వస్తుంటాయి. ఈ చిత్రాల్లోని స్పోర్ట్స్, నటీనటుల ఎమోషన్స్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయితే చాలు... భాషతో కూడా పని లేకుండా సూపర్ హిట్ అయిన స్పోర్ట్స్ మూవీస్ చాలానే ఉన్నాయి. తాజాగా తెలుగులో కొన్ని స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ చిత్రాలు రూపొందుతున్నాయి. మరి.. ఏయే హీరోలు స్పోర్ట్స్‌కి సై అంటూ... బరిలోకి దిగి, ఆట మొదలుపెట్టారో ఓ లుక్ వేయండి.క్రికెట్... కబడ్డీ ఏదైనా స్పోర్ట్స్ డ్రామా సినిమా వెండితెరపైకి వస్తే, ఆ సినిమాలో ఒక స్పోర్ట్ గురించిన ప్రస్తావనే ఉంటుంది. కానీ ‘పెద్ది’ సినిమాలో ఆడియన్స్ మూడ్నాలుగు క్రీడలను చూడబోతున్నారు. అవును... రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలో ప్రధానంగా క్రికెట్ కనపడుతుంది. అలాగే ఈ సినిమాలో కోకో, కబడ్డీ, కుస్తీ వంటి ఆటల ప్రస్తావన కూడా ఉంటుందని తెలిసింది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌ను బట్టి ‘పెద్ది’ సినిమాలో రామ్‌చరణ్ క్రికెటర్‌గా కనిపిస్తారనే విషయంపై క్లారిటీ వచ్చింది.మరి... మిగతా ఆటలతో రామ్‌చరణ్ పాత్ర ఏ విధంగా కనెక్ట్ అయ్యుంటుందనే విషయంపై వచ్చే ఏడాది మార్చిలో స్పష్టత రానుంది. మల్టీస్పోర్ట్స్ పీరియాడికల్ రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ‘పెద్ది’లో రామ్‌చరణ్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారన్న ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణను ప్లాన్ చేశారు. ‘దంగల్’ ఫేమ్ షామ్ కౌశల్ (బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తండ్రి) పర్యవేక్షణలో, నవనీత్ మాస్టర్ ఈ యాక్షన్ సీక్వెన్స్‌కు కొరియోగ్రఫీ వహిస్తున్నారు.హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ షూటింగ్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత, ‘పెద్ది’ టీమ్ ఢిల్లీకి వెళ్లనుందని తెలిసింది. ఢిల్లీలో ఓ పెద్ద క్రికెట్ మ్యాచ్‌ను షూట్ చేస్తారని సమాచారం. ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్‌లో జరిగే ఓ లాంగ్ షెడ్యూల్‌తో ‘పెద్ది’ షూటింగ్ ఓ కొలిక్కి వస్తుందని తెలిసింది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ల సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది.బైకర్ అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ వారంలో అంటే... ఈ నెల 6న ‘బైకర్’ సినిమా థియేటర్స్‌కి వచ్చి ఉండేది. కానీ క్వాలిటీ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకూడదని, ఆడియన్స్‌కు నిజమైన స్పోర్ట్స్ సినిమా చూసిన మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వాలని ‘బైకర్’ సినిమా టీమ్ తమ సినిమా రిలీజ్‌ను వాయిదా వేసింది. శర్వానంద్ హీరోగా నటించిన మోటో క్రాస్ రేసింగ్ ఫిల్మ్ ‘బైకర్’. ఈ చిత్రంలో శర్వానంద్ బైకర్‌గా నటించారు. ఈ సినిమా కోసం శర్వానంద్ తనను తాను కొత్తగా మలచుకున్నారు.వెండితెరపై పర్ఫెక్ట్ బైకర్‌గా కనిపించేందుకు సరైన ఫిట్నెస్ ట్రైనింగ్‌తో బైకర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. ఈ పాత్ర కోసం బాగా బరువు తగ్గారు కూడా. ఈ సినిమాలోని బైక్ చేజింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లను ఇండోనేషియాలో చిత్రీకరించారు. అలాగే ‘బైకర్’ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ కావొచ్చు కానీ ఈ సినిమాలో బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నట్లుగా తెలిసింది. మూడు తరాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. 1990, 2000ల టైమ్ పీరియడ్‌లో ‘బైకర్’ సినిమా ఉంటుంది.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. మాళవికా నాయర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో నటించారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో విక్రమ్ సమర్పణలో వంశీ–ప్రమోద్ నిర్మించిన ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.తొలిసారి స్పోర్ట్స్ డ్రామా దాదాపు ఐదేళ్ల క్రితం విజయ్ దేవరకొండ ‘హీరో’ (అప్పట్లో ప్రచారంలోకి వచ్చిన టైటిల్) అనే ఓ బైక్ రేసింగ్ స్పోర్ట్స్ డ్రామా చేయాల్సింది. ఈ స్పోర్ట్స్ బేస్డ్ మ్యూజికల్ మూవీలో మాళవికా మోహనన్ హీరోయిన్. ఈ సినిమాకు ఆనంద్ అన్నామలై దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించాల్సింది. ఈ మూవీ ఓపెనింగ్ కూడా జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం షూటింగ్ నిలిచిపోయింది. అలా అప్పట్లో విజయ్ దేవరకొండ చేయాల్సిన స్పోర్ట్స్ మూవీ పట్టాలెక్కలేదు. కానీ ఐదేళ్లకు మళ్లీ విజయ్ దేవరకొండకు ఓ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కథ నచ్చిందట.‘ఇష్క్, మనం, 24’ వంటి సూపర్‌హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు విక్రమ్ కె. కుమార్ ఓ స్పోర్ట్స్ డ్రామా కథను అనుకుంటున్నారట. ఈ కథను ఇటీవల విజయ్ దేవరకొండకు వినిపించగా, ఈ హీరో ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పారని తెలిసింది. దీంతో ఈ సినిమా స్క్రిప్ట్‌కు మరింత మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట విక్రమ్ కె. కుమార్. అయితే ప్రస్తుతం దర్శకుడు రవికిరణ్ కోలాతో విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన’ అనే సినిమా చేస్తున్నారు.ఈ సినిమా తర్వాత రాహుల్ సంకృత్యాన్‌తో విజయ్ మరో సినిమా చేయాల్సి ఉంది. ఇలా... ‘రౌడీ జనార్ధన, రాహుల్ సంకృత్యాన్లతో విజయ్ చేయాల్సిన సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత విక్రమ్ కె. కుమార్ సినిమాను విజయ్ టేకప్ చేస్తారని ఊహించవచ్చు. అయితే విజయ్ దేవరకొండకు విక్రమ్ కె. కుమార్ ఎలాంటి కథ చెప్పారనే విషయంపై స్పష్టత లేదు. లబ్బరు పందు మేక్... క్రికెట్ నేపథ్యానికి లవ్ అండ్ ఫ్యామిలీ అంశాలను జోడించి తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా ‘లబ్బరు పందు’. హరీష్ కల్యాణ్, దినేష్, శ్వాసిక, సంజన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2024 సెప్టెంబరులో విడుదలై, సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తెలుగులో రీమేక్ అవుతున్నట్లుగా తెలిసింది. ఈ తెలుగు రీమేక్‌లో రాజశేఖర్, రాజశేఖర్ కుమార్తె శివానీ రాజశేఖర్, రమ్యకృష్ణ, ‘35’ సినిమా ఫేమ్ విశ్వదేవ్, ప్రధాన తారాగణంగా నటిస్తున్నారని సమాచారం.ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైనట్లుగా తెలిసింది. ఈ సినిమాలో రాజశేఖర్, విశ్వ తేజ్ క్రికెటర్లుగా కనిపిస్తారు. త్వరలోనే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన రానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. మరోవైపు దాదాపు పాతిక సంవత్సరాల తర్వాత రాజశేఖర్, రమ్యకృష్ణ ఈ సినిమా కోసం మళ్లీ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుండం విశేషం.థండర్ హీరో ఆది పినిశెట్టి ఫిట్నెస్, కటౌట్ ఓ స్పోర్ట్స్ డ్రామాకు కరెక్ట్‌గా సరిపోతుంది. ఇందుకు తగ్గట్లుగానే ఆది పినిశెట్టి ‘థండర్’ అనే ఓ స్పోర్ట్స్ డ్రామా సినిమా చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా తెలిసింది. ఈ మూవీ కోసం ఆది కొత్తగా మేకోవర్ అయ్యారట. ఈ సినిమా గురించి త్వరలోనే మరికొన్ని కొత్త విషయాలను తెలియజేస్తానని ఆది పినిశెట్టి ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నారు.మట్టి కుస్తీ సీక్వెల్ విష్ణు విశాల్, ఐశ్వర్యా లక్ష్మి హీరో హీరోయిన్లుగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘గట్టా కుస్తీ’. చెల్లా అయ్యావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తెలుగు హీరో రవితేజ ఓ నిర్మాత. ఈ చిత్రం 2022లో విడుదలై, సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం తెలుగులో ‘మట్టి కుస్తీ’గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఈ సినిమా సీక్వెల్ రూపొందుతోంది.ఇటీవలే ‘మట్టి కుస్తీ 2’ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. తొలి భాగంలో నటించిన విష్ణు విశాల్, ఐశ్వర్యా లక్ష్మిలే మలి భాగంలోనూ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే చెల్లా అయ్యావుయే సీక్వెల్‌కూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను వేల్స్ ఇంటర్నేషనల్ ఫిలింస్‌తో కలిసి విష్ణు విశాల్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.మండాడి తమిళ నటుడు సూరి హీరోగా, తెలుగు హీరో సుహాస్ విలన్‌గా నటిస్తున్న ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘మండాడి’. ఈ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా సినిమాకు మదిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. అయితే గత ఏడాది అక్టోబరులో ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ప్రమాదం జరిగింది. యూనిట్ సభ్యులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు కానీ, సామాగ్రి పాడైపోయింది. మరి... ఈ సినిమా నెక్ట్స్ అప్డేట్ గురించి మేకర్స్ మరోసారి స్పష్టత ఇవ్వాల్సి ఉంది.ఇటు క్రికెట్... అటు లవ్ ‘సుడిగాలి’ సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జీఓఏటీ’. ఈ చిత్రంలో దివ్య భారతి హీరోయిన్గా నటించారు. మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మించిన ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమా కథ ప్రధానంగా క్రికెట్ నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. కథనం క్రికెట్ నేపథ్యంలో సాగినా, లవ్ ట్రాక్, కామెడీ ట్రాక్‌లు కూడా ఉంటాయని సమాచారం. మొట్ట రాజేంద్రన్, సర్వదమన్ బెనర్జీ, నితిన్ ప్రసన్న, పృథ్వీ, ఆడుకులం నరైన్, ఆనంద రామరాజు, పమ్మి సాయి, చమ్మక్ చంద్ర, నవీన్ నేని ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ సినిమాకు మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.పతంగుల పోటీ ఇప్పటివరకూ ఎన్నో స్పోర్ట్స్ డ్రామా సినిమాలు చూసి ఉంటాం. కానీ గాలి పటాల పోటీ నేపథ్యంలో సినిమా వచ్చి ఉండదు. పతంగుల పోటీ అనే కాన్సెప్ట్‌తో రాబోతున్న స్పోర్ట్స్ డ్రామా ‘పతంగ్’. ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ప్రధాన తారాగణంగా, సింగర్ ఎస్పీ చరణ్ మరో కీలక పాత్రలో నటించిన సినిమా ‘పతంగ్’. ఈ కామెడీ స్పోర్ట్స్ మూవీకి ప్రణీత్ పత్తిపాటి దర్శకత్వం వహించారు. డి. సురేష్‌బాబు సమర్పణలో విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది.ఇంకా మరికొన్ని స్పోర్ట్స్ డ్రామా చిత్రాలు సెట్స్‌పై ఉండగా, ఇంకొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
విజయ్ దేవరకొండకు 'ఐబొమ్మ' రవి సవాల్.. విచారణలో వెల్లడి
సినీ పైరసీ కేసులో ఇమ్మడి రవి (అలియాస్ ఐ బొమ్మ రవి) పోలీసు కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నాడు. ఐబొమ్మ వెనుక ఉన్న రహస్యాలను పోలీసులు రాబడుతున్నారు. పైరసీతో సంబంధం ఉన్న నెట్వర్క్ గురించి చెప్పాలని రవిని ప్రశ్నించగా.. ఇందులో ఎవరూ లేరని, అన్నింటికీ తానే బాధ్యత వ్యవహరిస్తున్నట్లు చెప్పాడు. డబ్బు సంపాధించేందుకు మాత్రమే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు ఆయన చెప్పారు. అయితే, ఈ క్రమంలో విజయ్‌దేవరకొండకు విసిరిన సవాల్ గురించి రవి పోలీసులకు చెప్పాడు.ఈ ఏడాది ఆగష్టులో విజయ్‌దేవరకొండను ఉద్దేశించి సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ చేసింది. 2023లో ఖుషీ సినిమాను పైరసీ చేసి విజయ్ దేవరకొండకు ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా రవి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని పోలీసుల విచారణలో రవి ఒప్పుకున్నాడు. ఖుషీ సినిమా సమయంలో ఏం జరిగిందో రవి ఇలా చెప్పాడు. 'మేము మీకు ముందే చెప్పాము.. మీరు మా మీద ఫోకస్ చేస్తే.. మీ మీద కూడా ఫోకస్ చేయాల్సి వస్తుందని..! కానీ, మీరు మా మాట పట్టించుకోలేదు. మీరు ఏజెన్సీస్‌కి డబ్బులు ఇస్తున్నారు. కానీ, వాళ్లు మమ్మల్ని తొక్కి మా పేరుతో ఐ బొమ్మ ఎఫ్ఎఫ్ డాట్ ఇన్ పేరుతో రన్ చేస్తున్నారు. అలా మా పేరుతో తప్పుడు వెబ్సైట్లు రన్ చేస్తున్నారు. దీనిని ముందే హెచ్చరించాం.. అందుకే మీ కింగ్డమ్ సినిమాను విడుదలకు ముందే బయటకు తెస్తాం.' అంటూ గతంలోనే విజయ్ దేవరకొండను రవి హెచ్చరించాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని పోలీసులు తెలిపారు. -
విజయ్ దేవరకొండ 'వీడీ14'.. విలన్ పాత్రలో హాలీవుడ్ యాక్టర్!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది కింగ్డమ్తో ప్రేక్షకులను ముందుకొచ్చారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ డ్రామా జూలైలో థియేటర్లలో విడుదలైంది. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ నిరాశపరిచింది. భారీ హైప్ ఉన్నప్పటికీ కలెక్షన్స్ రాబట్టడంలో విఫలమైంది.ఈ మూవీ తర్వాత విజయ్ మరోసారి రాహుల్ సాంకృత్యాన్‌తో జతకట్టారు. టాక్సీవాలా కాంబో మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి వీడీ14 అనే వర్కింగ్ టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు.ఇదిలా ఉంటే వీడీ14 మూవీకి సంబంధించి ఓ టాక్ నెట్టింట వైరల్‌గా మారింది. ప్రముఖ హాలీవుడ్ యాక్టర్, మమ్మీ విలన్ ఆర్నాల్డ్ వోస్లూ వీడీ14లో నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇటీవలే మూవీ సెట్స్‌లో వినోద్ సాగర్‌తో కలిసి ఆర్నాల్డ్ వోస్లూ కనిపించడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. హాలీవుడ్ యాక్టర్ ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెంచేసింది. ఈ పీరియాడికల్ డ్రామాలో ది మమ్మీ స్టార్ రోల్ ఏంటో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.ఈ స్టోరీ 1854 నాటి బ్రిటీష్ కాలం నేపథ్యంలో వస్తోన్న కథ కావడంతో వోస్లూ ఆంగ్ల అధికారి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఆర్నాల్డ్ విలన్ పాత్ర చేయనున్నట్లు సమాచారం. అయితే ఇందులో ఆర్నాల్డ్ పాత్ర ఏంటనేది ఫుల్ క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా.. గతంలో లైగర్ మూవీలో మాజీ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ పాత్రలో ఆర్నాల్డ్ కనిపించారు. ఈ మూవీతో రెండోసారి విజయ్ దేవరకొండ సినిమాలో మమ్మీ విలన్ కనిపించనున్నారు. -
'మీరు పెట్టిన ఆ పేరుతోనే'.. స్మరించుకున్న విజయ్ దేవరకొండ!
సత్యసాయి వందో జయంతి సందర్భంగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఆయనను స్మరించుకున్నారు. నాకు చిన్నప్పుడు మీరు పెట్టిన విజయ్ సాయి అనే పేరుతోనే ప్రతి రోజు జీవిస్తున్నానని పోస్ట్ చేశారు. ఈ ప్రపంచానికి దూరంగా మాకు విద్యను, ఎన్నో జ్ఞాపకాలను అందించిన వాతావరణాన్ని కల్పించారని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు.విజయ్ తన ట్వీట్లో రాస్తూ.. 'మేమందరం ప్రతిరోజూ మీ గురించి ఆలోచిస్తాం. ముఖ్యంగా మంచి, చెడు సమయాల్లో. మీ నుంచి మేము చాలా నేర్చుకున్నాం. మా జీవితాల్లో వచ్చిన మార్పును తెలుసుకున్నాం. ప్రపంచానికి ఇవ్వడానికి మేము చేయగలిగిన విధంగా మాలో శక్తిని నింపారు. మీకు 100వ పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీరు మాతో పాటే ఎప్పటికీ జీవించే ఉంటారు' అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.Happy Birthday Swami ❤️You gave me my name “Vijay Sai” when i was months old - a name that i work to live upto everyday.You gave us a safe environment, away from the world, where we got our education and made so many memories.We all always think about you everyday, more so… pic.twitter.com/gTnAltkHiO— Vijay Deverakonda (@TheDeverakonda) November 23, 2025 -
రష్మికది చాలా మంచి మనసు
‘‘రష్మికని నేను ‘గీత గోవిందం’ సినిమా నుంచి చూస్తున్నా.. నిజ జీవితంలోనూ తను భూమానే. తను ఇన్నోసెంట్. తన గురించి ఆలోచించదు.. సెట్స్‌లో అందరూ సంతోషంగా ఉండాలి.. డైరెక్టర్ హ్యాపీగా ఉండాలని ఆలోచిస్తుంటుంది. డైరెక్టర్ ఏది చేయమంటే అది చేస్తుంటుంది. తన ప్రయాణం చూస్తుంటే చాలా గర్వంగా ఉంటుంది. ‘నన్ను ఎవడన్నా ఏదైనా గెలికితే నేను మళ్లీ రివర్స్‌లో వెళతాను. కానీ, రష్మిక ఏంటంటే... ప్రపంచంలో ఎవరు ఎన్ని మాటలు అన్నా పట్టించుకోకుండా తన పనిపైనే దృష్టి పెడుతుంది.. అంత మంచి మనసు తనది. తను నిజంగా అమేజింగ్ ఉమన్’’ అని హీరో విజయ్ దేవరకొండ తెలిపారు. రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లో రూ. 20.4 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ నేపథ్యంలో బుధవారం నిర్వహించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ–‘‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా నన్ను ఎంత భావోద్వేగానికి గురి చేసిందంటే చాలా చోట్ల కన్నీళ్లు ఆపుకోవాల్సి వచ్చింది. చాలా సన్నివేశాల్లో మనసు బరువెక్కిన అనుభూతి కలిగింది. ఈ మధ్య నేను చూసిన గొప్ప చిత్రాల్లో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ఒకటి. ఈ సినిమా ఇటు ఇండియాలో అటు విదేశాల్లో హ్యూజ్ సక్సెస్ అందుకుంది. ఇలాంటి సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కిన సినిమాని నంబర్స్‌తో పోల్చలేం. ఈ చిత్రం సమాజంలో అవేర్నెస్ తీసుకొస్తుంది. ఈ సినిమాకి పని చేసిన అందరూ మీ లైఫ్‌లో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ లాంటి మూవీ చేసి జీవితం పరిపూర్ణం చేసుకున్నారు’’ అని చెప్పారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ది గర్ల్ ఫ్రెండ్’కి హీరో మా డైరెక్టర్ రాహుల్. మా ‘గీత గోవిందం’లో నటించిన రష్మిక.. ‘ది గర్ల్ ఫ్రెండ్’తో మా సంస్థకు వన్నె తెచ్చింది’’ అని పేర్కొన్నారు. రష్మికా మందన్నా మాట్లాడుతూ– ‘‘ది గర్ల్‌ఫ్రెండ్’లో నేను చేసిన భూమా పాత్రలో ఏం జరిగిందో నా జీవితంలోనూ అలానే జరిగింది. మనందరి జీవితాల్లోనూ జరిగి ఉంటుంది. ఈ చిత్రం కోసం మొదటిసారి రాహుల్‌కి సరెండర్ అయిపోయి పనిచేశాను. ఈ సినిమాని మీరు (ప్రేక్షకులు) అర్థం చేసుకున్నారు.. బాగా కనెక్ట్ అయ్యారు.. అదే నాకు పెద్ద అవార్డుతో సమానం. ఈ సినిమాలో మొదటి నుంచి విజయ్ భాగమయ్యారు. తనలాంటి వ్యక్తి ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఉంటే అదొక బ్లెస్సింగ్ అనుకోవాలి’’ అని తెలిపారు. ‘‘భూమా పాత్రలో నటించడం ద్వారా ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి ఇచ్చారు రష్మిక’’ అన్నారు విద్య కొప్పినీడి. ‘‘మా సినిమాకి ప్రేక్షకులు ఇస్తున్న ప్రశంసలతో జాతీయ అవార్డు పొందినంత సంతోషంగా ఉంది’’ అని ధీరజ్ మొగిలినేని పేర్కొన్నారు. ‘‘నా గత సినిమా (మన్మథుడు 2) రిలీజై ఆరేళ్లయింది. ‘ది గర్ల్ ఫ్రెండ్’ చేస్తున్నప్పుడు ఈ సినిమా ఫలితం అనుకున్నట్లు రాకుంటే నా పరిస్థితి, నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అని భయపడ్డాను. కానీ సినిమా చూశాక నా కుటుంబ సభ్యులు గర్వపడుతున్నారు’’ అని రాహుల్ రవీంద్రన్ అన్నారు. ఈ వేడుకలో మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రశాంత్ విహారి, హేషమ్ అబ్దుల్ వహాబ్, ప్రొడ్యూసర్స్ బన్నీ వాస్, ఎస్కేఎన్, డైరెక్టర్ సాయి రాజేశ్, పాటల రచయిత రాకేందు మౌళి, కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య వర్మ, నటి రోహిణి తదితరులు మాట్లాడారు. -
మీరెందుకు ప్రచారం చేశారు?
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లపై ప్రత్యేకంగా ఏర్పాటైన సీఐడీ సిట్ ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది. దర్యాప్తులో భాగంగా పలువురు సినీ నటులకు నోటీసులు జారీ చేసిన సీఐడీ అధికారులు ఒక్కొక్కరిని విచారణకు పిలుస్తున్నారు. మంగళవారం విజయ్ దేవరకొండ సీఐడీ కార్యాలయంలో అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ‘బెట్టింగ్ యాప్‌ల తరఫున మీరెందుకు ప్రచారం చేశారు? ఈ యాడ్స్ ప్రమోట్ చేయాలని మిమ్మల్ని ఎవరు సంప్రదించారు? యాడ్స్‌లో నటించినందుకు ఎంత డబ్బు తీసుకున్నారు?’అని విజయ్ దేవరకొండను అధికారులు ప్రశ్నించారు. సాయంత్రం 4 గంటల సమయంలో సీఐడీ కార్యాలయంలోకి వెళ్లిన విజయ్‌ని అధికారులు గంటకుపైగా ప్రశ్నించారు. ప్రధానంగా బెట్టింగ్ యాప్‌ల ప్రచారంలో పాల్గొనడానికి దారితీసిన కారణాలు, అందుకు సంబంధించి నగదు లావాదేవీలపై ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్‌ల వైపు ప్రోత్సహించేలా యాడ్స్ చేయడం సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో గుర్తించారా? అంటూ ప్రశ్నించినట్టు ఓ అధికారి తెలిపారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు విజయ్ సమాధానమిచ్చినట్టు తెలిసింది. కాగా, ఇదే కేసు దర్యాప్తులో భాగంగా బిగ్‌బాస్ ఫేం సిరి హనుమంత్‌ను సైతం అధికారులు ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌కు ఆమె భారీగా పారితోషికం తీసుకున్న ఆరోపణలున్న నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలపైనే ప్రధానంగా ప్రశ్నించినట్టు తెలిసింది. గోవిందా 365 అనే బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసిన సిరి హనుమంత్‌ను అందుకు సంబంధించిన వివరాలు అడిగి నట్టు సమాచారం. నేడు సీఐడీ ఎదుటకు ప్రకాశ్‌రాజ్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసు దర్యాప్తులో భాగంగా నటుడు ప్రకాశ్‌రాజ్‌కు సైతం సీఐడీ అధికారులు సమన్లు జారీ చేశారు. కీలక సమాచారం సేకరించాల్సి ఉన్నందున తమ ఎదుట హాజరుకావాలని చెప్పారు. సమన్ల మేరకు ప్రకాశ్‌రాజ్ బుధవారం ఉదయం సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నట్టు సమాచారం. -
'గర్ల్‌ఫ్రెండ్' కోసం వస్తున్న బాయ్ ఫ్రెండ్
పాన్ ఇండియా సెన్సేషన్ హీరోయిన్ రష్మిక.. గత 11 నెలల్లో ఐదు విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. రీసెంట్గా అయితే 'ద గర్ల్‌ఫ్రెండ్' మూవీతో వచ్చింది. దీనికి అన్నివైపుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ మూవీని సపోర్ట్ చేసేందుకు రష్మిక కోసం స్వయంగా విజయ్ దేవరకొండ కూడా రాబోతున్నాడు.(ఇదీ చదవండి: నాన్న చనిపోలేదు.. ధర్మేంద్ర కూతురి షాకింగ్ పోస్ట్)'గర్ల్‌ఫ్రెండ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మాట్లాడిన నిర్మాత అల్లు అరవింద్.. సక్సెస్ మీట్‌కు విజయ్ దేవరకొండని తీసుకొస్తానని అన్నారు. ఇప్పుడు అదే జరగబోతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో బుధవారం సక్సెస్ ఈవెంట్ నిర్వహించబోతున్నారని టాక్. సాధారణంగా చూస్తే ఇందులో పెద్ద విషయమేం ఉండదు. కానీ గతకొన్నాళ్లుగా రిలేషన్లో ఉన్న వీళ్లిద్దరూ.. కొన్నాళ్ల క్రితమే రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయం అనధికారికంగా బయటకొచ్చినా విజయ్ గానీ రష్మిక గానీ బయటపడట్లేదు.ఎంగేజ్మెంట్ రూమర్స్ తర్వాత విజయ్-రష్మిక కలిసి తొలిసారి స్టేజీపై కనిపించబోతున్నారు. మరి ఇద్దరిలో ఎవరైనా ఈ విషయం గురించి మాట్లాడుతారా అనేది చూడాలి? మరోవైపు విజయ్-రష్మికల పెళ్లి గురించి కూడా అప్పుడే రూమర్స్ వచ్చేస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారని అంటున్నారు. ఇప్పుడు కనిపించబోతున్న ఈవెంట్లో వివాహం గురించి కూడా ఏమైనా హింట్ ఇస్తారా అనేది చూడాలి.(ఇదీ చదవండి: ట్రెండింగ్ బ్యూటీ.. ఇంతకీ ఎవరీమె? డీటైల్స్ ఏంటి?) -
నాకోసం యుద్ధాలు చేయాలి.. విజయ్‌నే పెళ్లాడతా..: రష్మిక
సోషల్ మీడియాలో ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా టాక్ చూస్తుంటే రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఖాతాలో మరో హిట్టు పడినట్లే కనిపిస్తోంది! మొన్నటివరకు థామా, ఇప్పుడు ది గర్ల్‌ఫ్రెండ్‌తో మంచి జోష్ మీదుంది. వీటన్నింటికన్నాముందు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో ఎంగేజ్మెంట్ న్యూస్‌తో వార్తల్లోకెక్కింది. తాజాగా ఓ చిట్‌చాట్‌లో తన భాగస్వామికి ఉండాల్సిన లక్షణాల గురించి మాట్లాడింది రష్మిక. యుద్ధానికైనా రెడీగా ఉండాలి'నిజాయితీగా చెప్పాలంటే నా భాగస్వామికి నన్ను లోతుగా అర్థం చేసుకునే శక్తి ఉండాలి. ప్రతి విషయాన్ని నావైపు నుంచి ఆలోచించి అవగాహన చేసుకోగలగాలి. పరిస్థితులను దాటుకుంటూ అన్నింటినీ అర్థం చేసుకుంటే చాలు. మనిషి మంచివాడై ఉండాలి. నాకోసం యుద్ధం చేయడానికి కూడా వెనుకాడనివాడై ఉండాలి. అలాంటి మనిషి కోసం నేను తూటాకైనా ఎదురెళ్తాను' అని రష్మిక చెప్పుకొచ్చింది.విజయ్ దేవరకొండను పెళ్లాడతా..డేటింగ్, పెళ్లి గురించి మాట్లాడుతూ.. యానిమేషన్ క్యారెక్టర్ నరుటోతో డేట్‌కు వెళ్తా.. విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంటా.. అని చెప్పుకొచ్చింది. రష్మిక- విజయ్ అక్టోబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనప్పటికీ పరోక్షంగా దానిగురించి మాట్లాడుతూనే ఉన్నారు. వీరి పెళ్లి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరూ గీతా గోవిందం, డియర్ కామ్రేట్ చిత్రాల్లో జంటగా నటించారు.చదవండి: ఇక చాలు ఆపండి, మీ కాళ్లు మొక్కుతా..: విశాల్ -
తొడకొట్టిన చైల్డ్ ఆర్టిస్ట్.. విజయ్ దేవరకొండకు ఆర్డర్..
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలు, సీరియల్స్ చేసిన రోహన్ (Rohan Roy).. #90's వెబ్ సిరీస్‌తో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. తన టాలెంట్‌కు ఫిదా అయిన దర్శకనిర్మాతలు రోహన్ కోసం మంచి పాత్రలు ఆఫర్ చేస్తున్నారు. అలా వెబ్ సిరీస్‌లు, సినిమాలతో ఫుల్ బిజీ అయ్యాడు రోహన్ రాయ్. అతడు కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ద గ్రేట్ ప్రీవెడ్డింగ్ షో. తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన ఈ మూవీ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెడీగా పెట్టుకో..కథపై నమ్మకంతో ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ వేశారు. సినిమా చూసినవాళ్లంతా కూడా బాగుందని పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. దీంతో మూవీ హిట్టు కొట్టేసినట్లేనని చిత్రయూనిట్ ఫిక్సయిపోయింది. ఈ క్రమంలో నటుడు రోహన్ కల్ట్ బొమ్మ ఇచ్చామని తొడ కొట్టి మరీ చెప్పాడు. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) అన్నా.. నా సైజ్ ఎస్.. హీరోయిన్ సైజ్ తెలీదు. మా మొత్తం టీమ్‌కు రౌడీ షర్ట్స్ రెడీగా పెట్టుకో.. మేమందరం నీ దగ్గరికి వస్తున్నాం అని స్పీచ్ ఇచ్చాడు. నీ అభిమానిని: విజయ్ దేవరకొండఇది హీరో విజయ్ దేవరకొండ కంటపడింది. రోహన్.. నీకేది కావాలంటే అది తీసుకో.. #90's: ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ చూసినప్పటి నుంచి నీకు అభిమానిగా మారిపోయాను. త్వరలోనే కలుద్దాం. ప్రీవెడ్డింగ్ షో మూవీ సక్సెస్ అయినందుకు టీమ్ మొత్తాన్ని అభినందిస్తున్నా అంటూ ట్వీట్ చేశాడు. ఇటీవల తెలుగు యూట్యూబర్ మౌళి హీరోగా నటించిన లిటిల్ హార్ట్స్ కూడా ఘన విజయం సాధించింది. ఆ సమయంలో హీరో విజయ్.. వారిని అభినందిస్తూ రౌడీ షర్ట్స్ బహుమతిగా ఇచ్చాడు. Rohann ❤️I’ll give you whatever you want, know that I am your fan since I watched 90s. I will see you soon my boy. And wishing the entire team of #PreWeddingShow all success 🤗 https://t.co/8eLU9QRjXu— Vijay Deverakonda (@TheDeverakonda) November 6, 2025 చదవండి: లవ్ లెటర్ రాసిన రష్మిక మందన్నా.. నెట్టింట వైరల్ -
రష్మిక - విజయ్ పెళ్లి.. డేట్, వేదిక ఫిక్స్ చేశారుగా!
టాలీవుడ్లో మోస్ట్ క్రేజ్ ఉన్న జంటల్లో వీరిద్దరు ముందు వరుసలో ఉంటారు. వీళ్లు ఎక్కడా కనిపించినా సరే డేటింగ్ వార్తలు పుట్టుకొస్తాయి. చాలాసార్లు ఈ జంటపై రూమర్స్ వినిపించినా అస్సలు పట్టించుకోలేదు. అంతేకాదు ఎప్పుడు వాటిపై స్పందించలేదు కూడా. అలాంటిది ఇటీవలే వీరిద్దరికి ఎంగేజ్మెంట్ అయినట్లు వార్చలొచ్చాయి. ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటనైతే రాలేదు. రష్మిక, విజయ్ చేతులకు ఉన్న రింగ్స్ చూసిన ఫ్యాన్స్ మాత్రం ఎంగేజ్మెంట్ అయినట్లు ఫిక్సయిపోయారు.అయితే నిశ్చితార్థం గురించి ఇంకా అధికారిక ప్రకటనే రాలేదు. కానీ రష్మిక- విజయ్ పెళ్లిపై అప్పుడే చర్చ మొదలైంది. వీరిద్దరు పెళ్లి ఎక్కడ చేసుకుంటారు? సింపుల్గానా?..డెస్టినేషన్ వెడ్డింగా? అని సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. కొందరైతే పెళ్లి వేదికను కూడా ప్రకటించేశారు. అంతే కాదండోయ్ తేదీ, ముహుర్తం కూడా ఖరారు చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ జంట ఒక్కనున్నారని నెట్టింట పోస్ట్ వైరలవుతోంది. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని కోట ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు వేదిక కానుందన్న వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇది ఎంతవరకు నిజమనే మాట పక్కనపెడితే రష్మిక- విజయ్ పెళ్లి విషయంలో వారికంటే ఆడియన్సే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. ఏదేమైనా రష్మిక- విజయ్ దేవరకొండ పెళ్లి కోసం టాలీవుడ్ ప్రియులే కాదు.. దక్షిణాది ఫ్యాన్స్ సైతం ఎంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇటీవల ఓ టాక్ షోకు హాజరైన రష్మిక తన చేతికి ఉన్న ఉంగరాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. వాటిలో ఒకటి చాలా స్పెషల్ అని తెలిపింది. ఆడియన్స్ ఏమనుకున్నా అది నాకు సంతోషమేనని తెలిపింది. దీంతో పరోక్షంగా ఆమె నిశ్చితార్థం అయినట్లు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. ప్రస్తుతం రష్మిక నటించిన మూవీ ది గర్ల్‌ఫ్రెండ్ విడుదలకు సిద్దమైంది. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by The Cine Gossips (@thecinegossips) -
Bandla Ganesh: నా ఉద్దేశం అది కాదు.. సారీ విజయ్..
-
ఎవరినీ ఉద్దేశించి అనలేదు.. క్షమించండి: బండ్ల గణేశ్
ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh) మరోసారి క్షమాపణలు చెప్పాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. కె-ర్యాంప్ సినిమా సక్సెస్ మీట్లో నేను మాట్లాడిన మాటలు కొందరిని బాధపెట్టాయని తెలిసింది. నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు. నా ఉద్దేశం అందరూ బాగుండాలి, కళామాత ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే. ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు అని రాసుకొచ్చాడు.అసలేం జరిగిందంటే?కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన 'K ర్యాంప్' సినిమా దీపావళికి రిలీజైంది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ర్యాంపేజ్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ పేరిట సోమవారం ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ ఈవెంట్‌కు బండ్ల గణేష్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. టాలెంట్‌ను నమ్ముకుని పైకి వస్తున్న కిరణ్ అబ్బవరాన్ని పొగిడే క్రమంలో తెలుగులోని ఓ స్టార్ హీరోను కింపరిచేలా కామెంట్స్ చేశాడు. బండ్ల గణేశ్ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో ఒక్క సినిమా హిట్ కాగానే లూజ్ ప్యాంట్లు, కొత్త చెప్పులు, కళ్లకు అద్దాలు పెట్టుకుని.. కాలు మీద కాలు వేసుకుని వాట్సప్.. వాట్సప్ అంటూ పోజులు కొడుతున్నారు.విజయ్‌పైనే విమర్శలుతన తర్వాతి సినిమా కోసం లోకేష్ కనగరాజ్‌ను తీసుకురా... రాజమౌళిని తీసుకురా... సుకుమార్‌ను తీసుకురా... అనిల్ రావిపూడిని తీసుకురా అంటున్న ఈ రోజుల్లో ఆరుగురు కొత్త దర్శకులను కిరణ్ పరిచయం చేశాడు' అని ఎలివేషన్ ఇచ్చాడు. ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) మాత్రమే ఎక్కువగా 'వాట్సాప్.. వాట్సాప్ మై రౌడీ బాయ్స్' అంటూ ఫ్యాన్స్‌ను పలకరిస్తుంటాడు. దీంతో బండ్ల.. విజయ్‌పైనే విమర్శలు గుప్పించాడని ప్రచారం జరిగింది. కిరణ్‌ను పొగడటం తప్పు కాదు కానీ మధ్యలో విజయ్ ఏం పాపం చేశాడని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే బండ్ల క్షమాపణలు చెప్తూ ట్వీట్ చేశాడు. ఇటీవల కె రాంప్ సినిమా సక్సెస్ మీట్లో నేను మాట్లాడిన మాటలు కొందరిని బాధపెట్టాయని తెలిసింది. నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు.నా ఉద్దేశం అందరూ బాగుండాలి, కళామాత ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే.ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు.మీ బండ్ల గణేష్— BANDLA GANESH. (@ganeshbandla) November 5, 2025 -
విజయ్‌తో ఎంగేజ్మెంట్ రింగ్.. అసలు విషయం చెప్పేసిన రష్మిక!
ఈ ఏడాది వరుస సినిమాలతో దూసుకెళ్తోన్న బ్యూటీ రష్మిక మందన్నా. ఇప్పటికే ఛావాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ఈ బ్యూటీ.. ఇటీవలే థామా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం రష్మిక నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో సందడి చేయనుంది.ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ ప్రమోషన్లలో భాగంగా రష్మిక తాజాగా టాలీవుడ్ టాక్ షోకు హాజరైంది. నటుడు జగపతిబాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము..నిశ్చయమ్మురా టాక్ షోలో సందడి చేసింది. ఈ షోలో పాల్గొన్న రష్మిక చేతికి రెండు ఉంగరాలు కనిపించడంతో అందరి దృష్టి వాటిపై పడింది. ఈ సందర్భంగా రష్మికను జగపతిబాబు సరదాగా ఆటపట్టించారు. దళపతి విజయ్, విజయ్ సేతుపతి, విజయ్ దేవరకొండతో ఫ్రెండ్షిప్, విజయ్ సేతుపతి ఫ్యాన్, దళపతి విజయ్‌కి ఆల్ టైమ్ ఫ్యాన్ ఇలా విజయాన్ని సొంతం చేసేసుకున్నావా? అంటూ ఫన్నీగా మాట్లాడారు.ఆ తర్వాత చేతికి ఉన్న రింగ్స్‌ను సెంటిమెంట్‌తోనే పెట్టుకున్నావా అని జగపతిబాబు అడిగారు. దీనికి రష్మిక మాట్లాడుతూ.. అవీ చాలా ఇంపార్టెంట్ అని ముద్దుగుమ్మ చెప్పేసింది. వాటిలో ఒక రింగ్ ఫేవరేట్ అయి ఉంటుంది.. దానికి ఓ హిస్టరీ కూడా ఉంటుందని జగపతి నవ్వుతూ అన్నారు. దీనిపై ఆడియన్స్ ఏదో గోల చేస్తున్నారు.. అదేంటో కనుక్కోండని రష్మికతో చెప్పగా.. అది తాను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నానంటూ సంతోషం వ్యక్తం చేసింది.అయితే గతనెలలో రష్మిక- విజయ్ దేవరకొండకు ఎంగేజ్మెంట్ జరిగిందని వార్తలొచ్చాయి. కానీ ఈ విషయాన్ని ఎవరూ కూడా అధికారికంగా ప్రకటించలేదు. దీంతో టాలీవుడ్ ప్రియులతో పాటు అభిమానుల్లోనూ సస్పెన్స్ నెలకొంది. ఇటీవల తరచుగా రష్మిక చేతికి ప్రత్యేక రింగ్ కనిపించడంతో నిశ్చితార్థం జరిగినట్లు ఫ్యాన్స్ ఫుల్‌గా ఫిక్సయిపోయారు. -
స్టార్ హీరోపై బండ్ల గణేష్ పంచ్‌లు
టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం నటించిన 'K ర్యాంప్' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది. క సినిమా తర్వాత కిరణ్ మరో హిట్ అందుకున్నాడు. దీంతో కె ర్యాంప్ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రంలో నిర్మాత బండ్ల గణేష్‌తో పాటు సినీ, రాజకీయ నాయకులు అతిథిలుగా వచ్చారు. ఈ క్రమంలో స్టేజీపై బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కిరణ్ అబ్బవరాన్ని ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో పోల్చడమే కాకుండా.. విజయ్ దేవరకొండపై పరోక్షంగా పంచ్‌లు వేశారని తెలుస్తోంది.బండ్ల గణేష్ కామెంట్లు ఎవరిపై..'K ర్యాంప్' సినిమా సక్సెస్ ఈవెంట్లో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. ' ఈ రోజుల్లో ఒక్క సినిమా హిట్ కాగానే లూజు పేంట్లు, కొత్త కొత్త చెప్పులు, కళ్లకు అద్దాలు పెట్టుకుని ఆపై కాలు మీద కాలు వేసుకుని వాట్సప్.. వాట్సప్ అంటూ తన తర్వాతి సినిమా కోసం లోకేష్ కనగరాజ్‌ను తీసుకురా... రాజమౌళిని తీసుకురా... సుకుమార్‌ను తీసుకురా... అనీల్ రావిపూడిని తీసుకురా అంటున్న ఈ రోజుల్లో ఆరుగురు కొత్త దర్శకులను కిరణ్ పరిచయం చేశాడు. ' అని బండ్ల అన్నారు. ఇప్పటివరకు కిరణ్ చేసిన ప్రతి సినిమా కూడా కొత్త డైరెక్టర్‌తోనే చేశాడని గుర్తుచేశాడు.చిరంజీవిని ఆదర్శంగా తీసుకోకిరణ్ అబ్బవరంను మెగాస్టార్ చిరంజీవితో బండ్ల గణేష్ పోల్చారు. తనపై ప్రశంసల వర్షం కురిపించారు. కిరణ్ ఒక రియల్ కుర్రోడు. బాంచెన్ హీరో అంటే ఇలాగే ఉండాలి. ప్రస్తుతం కిరణ్‌ని చూస్తుంటే నాకు చిరంజీవినే గుర్తొస్తున్నారు. కెరీర్ ప్రారంభంలో చిరంజీవి కూడా ఇలాగే ఉండేవారు. ఆయన ఇప్పటికే 150 సినిమాలు పూర్తి చేసి.. త్వరలో భారతరత్న అందుకోబోతున్నారు. అయినప్పటికీ చిరంజీవి లాంటి వ్యక్తి కూడా గ్రౌండ్ మీద ఉంటాడు. నువ్వు (కిరణ్) చిరంజీవిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకు వెళ్లు.. నిన్ను చూస్తేంటే చాలా ముచ్చటేస్తుంది. అంటూ పొగడ్తలతో ముచ్చేత్తారు.రౌడీ బాయ్స్‌ను టార్గెట్ చేసిన బండ్లసినిమా పరిశ్రమలో విజయ్ దేవరకొండ మాత్రమే ఎక్కువగా 'వాట్సాప్ వాట్సాప్ మై రౌడీ బాయ్స్' అంటూ తన ఫ్యాన్స్‌ను పలకరిస్తుంటాడు. ఇప్పుడు బండ్ల గణేష్ కూడా ఇదే ఆటిట్యూడ్‌తో విజయ్ పేరు ఎత్తకుండా పరోక్షంగా పంచ్‌లు వేశారని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఒక హీరోను పొగిడేందుకు మరో నటుడిని కించపరచేలా ఈ వ్యాఖ్యలు ఏంటి అంటూ నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఆ మధ్య లిటిల్ హార్ట్స్ ఈవెంట్లో మాట్లాడుతూ ఇండస్ట్రీలో పెద్దలు సెలబ్రిటీలు చేసే పొగడ్తలు నమ్మవద్దు, అన్నీ అబద్దాలే అంటూ నటుడు మౌళికి హితబోధ చేసి ఇప్పుడు ఈ భజన అవసరమా అంటూ బండ్లపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, గణేష్ అన్నది నిజంగా విజయ్ దేవరకొండనేనా కాదా అనేది పక్కన పెడితే కిరణ్‌ని పొగిడే క్రమంలో మరొకరి ప్రస్తావన ఎందుకనే ప్రశ్న ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. -
విన్నారా... విన్నారా?
ప్రతి వారం కొత్త సినిమాలు థియేటర్స్‌కు వస్తూనే ఉంటాయి. అలాగే హీరోలు కూడా ఎప్పటికప్పుడు తమ కొత్త ప్రాజెక్ట్స్ కోసం కథలు వింటూనే ఉంటారు. అయితే ప్రజెంట్ తమ కొత్త సినిమాల కోసం కథలు వింటున్న తెలుగు హీరోల సంఖ్య ఎక్కువగానే ఉంది. కథలు విన్నారనీ, ఇప్పటికే కొన్ని కొత్త సినిమాలకు సైన్ చేశారనీ కొంతమంది హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. మరి... ఏ హీరో ఏయే దర్శకుల కథ విన్నారు? అనే విషయాలపై మీరూ ఓ లుక్ వేయండి.జెట్ స్పీడ్‌తో... హీరో రవితేజ జెట్ స్పీడ్‌తో సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. రవితేజ హీరోగా నటించిన ‘మాస్ జాతర’ సినిమా నేటి (అక్టోబరు 31) నుంచి థియేటర్స్‌లో ప్రదర్శితమౌతోంది. అలాగే రవితేజ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే ఈ మూవీ తర్వాత ‘మ్యాడ్’ చిత్రాల ఫేమ్ కల్యాణ్ శంకర్‌తో రవితేజ సినిమా చేయాల్సి ఉంది.ఈ చిత్రాలు ఇలా ఉండగానే... ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయనున్నారని, కథ విన్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో తెరపైకి వచ్చింది. అలాగే రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ కూడా రవితేజకు ఓ స్టోరీ లైన్ వినిపించారని, మరోసారి పూర్తి కథ విన్న తర్వాత ఈ సినిమాపై రవితేజ ఓ నిర్ణయానికి వస్తారని సమాచారం. అయితే ఈ విషయాలపై పూర్తి స్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.పవన్‌తో అనిల్ రావిపూడి? హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు అనిల్ రావిపూడిల కాంబినేషన్లో ఓ సినిమాకి సన్నాహాలు మొదలవుతున్నాయనే టాక్ తెరపైకి వచ్చింది. ‘దిల్’ రాజు, ఈ సినిమాను నిర్మించనున్నారట. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ సినిమాపై ఓ క్లారిటీ రానుందని టాక్. అలాగే ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రోడక్షన్స్‌తో పవన్ కల్యాణ్ ఓ సినిమా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని భోగట్టా.ఈ చిత్రానికి తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ‘రేసుగుర్రం, కిక్’ చిత్రాల ఫేమ్ దర్శకుడు సురేందర్ రెడ్డితో పవన్ కల్యాణ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. మరి... సురేందర్ రెడ్డితో సినిమాను పూర్తి చేసిన తర్వాత పవన్ కల్యాణ్ తన కొత్త సినిమాల చిత్రీకరణలను సెట్స్‌కు తీసుకువెళ్తారా? లేదా అనే అంశంపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా చేస్తున్నారు పవన్ కల్యాణ్. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది.తమిళ దర్శకుడితో...! ‘పెద్ది’ సినిమాతో రామ్‌చరణ్ బిజీగా ఉన్నారు. ఇటీవల శ్రీలంకలో మొదలైన ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసి గురువారం రామ్‌చరణ్ హైదరాబాద్ చేరుకున్నట్లుగా తెలిసింది. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న విడుదల కానుంది. అయితే ఈ చిత్రం తర్వాత దర్శకుడు సుకుమార్‌తో రామ్‌చరణ్ సినిమా చేయాల్సి ఉంది.మరోవైపు తమిళ దర్శకుడు ‘జైలర్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్, హిందీ దర్శకుడు ‘కిల్’ ఫేమ్ నిఖిల్ నగేశ్ భట్ చెప్పిన స్టోరీలను కూడా రామ్‌చరణ్ విన్నారనే టాక్ తెరపైకి వచ్చింది. అలాగే దర్శకులు త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాలతో కూడా రామ్‌చరణ్ సినిమాలు చేస్తారనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మరి... నెల్సన్‌తో రామ్‌చరణ్ సినిమా ఎప్పుడు సెట్స్‌కు వెళ్తుంది? అసలు... ఈ తమిళ దర్శకుడితో రామ్‌చరణ్ సినిమా ఉంటుందా? అనే అంశాలపై స్పష్టత రావడానికి మరింత సమయం పడుతుంది.నాగచైతన్య 25 నాగచైతన్య హీరోగా ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు ఓ మిథికల్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇది నాగచైతన్య కెరీర్‌లోని 24వ సినిమా. కాగా, నాగచైతన్య కెరీర్‌లోని 25వ సినిమాకు సంబంధించిన పనులు కూడా మొదలై పోయాయన్న టాక్ వినిపిస్తోంది. దర్శకులు కొరటాల శివ, బోయపాటి శ్రీను, శివ నిర్వాణ చెప్పిన కథలను హీరో నాగచైతన్య విన్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. మరి... నాగచైతన్య కెరీర్‌లోని ఈ 25వ సినిమాకు ఈ ముగ్గురు దర్శకుల్లో ఎవరో ఒకరు ఖరారు అవుతారా? లేక మరో దర్శకుడి పేరు ఏమైనా తెరపైకి వస్తుందా? అనేది వేచి చూడాలి.గ్రీన్ సిగ్నల్ గోపీచంద్‌తో ‘విశ్వం’ సినిమా చేసి, మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చారు దర్శకుడు శ్రీను వైట్ల. ఈ సినిమా తర్వాత తనదైన శైలిలో మరో ఎంటర్టైనింగ్ స్టోరీని శ్రీను వైట్ల సిద్ధం చేసుకున్నారని, ఈ కథను ఇటీవల శర్వానంద్‌కు వినిపించగా, ఈ హీరో ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందట. ఇక ప్రస్తుతం ‘బైకర్’, ‘భోగి’ సినిమాల చిత్రీకరణలతో శర్వానంద్ బిజీగా ఉన్నారు. అలాగే ఆల్రెడీ శర్వానంద్ హీరోగా నటించిన ‘నారి నారి నడుమ మురారి’ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇలా వచ్చే ఏడాది మూడు సినిమాలతో శర్వానంద్ సందడి చేయనున్నారు.స్పోర్ట్స్ డ్రామా ‘రౌడీ జనార్ధన’ (వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు హీరో విజయ్ దేవరకొండ. ఈ చిత్రం కోసం హీరోయిన్ కీర్తీ సురేశ్, విజయ్ దేవరకొండలపై మహారాష్ట్ర సరిహద్దుల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు ఈ చిత్రదర్శకుడు రవికిరణ్ కోలా. అయితే ఈ సినిమా తర్వాత తనకు ‘టాక్సీవాలా’తో సూపర్‌హిట్ అందించిన రాహుల్ సంకృత్యాన్‌తో ఓ పీరియాడికల్ వార్ డ్రామా కమిటయ్యారు విజయ్ దేవరకొండ. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది.అయితే రీసెంట్గా దర్శకుడు విక్రమ్ కె. కుమార్ ఓ స్పోర్ట్స్ డ్రామా స్టోరీని విజయ్ దేవరకొండకు వినిపించారని, ఈ కథ పట్ల విజయ్ కూడా సుముఖంగా ఉన్నారని, యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్‌నగర్ సమాచారం. మరి... ‘రౌడీ జనార్ధన’ తర్వాత విజయ్ దేవరకొండ.. రాహుల్ సంకృత్యాన్ సినిమాను స్టార్ట్ చేస్తారా? లేక విక్రమ్ కె. కుమార్ సినిమాను మొదలు పెడతారా? అనే అంశాలపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. దర్శకులు రాహుల్ సంకృత్యాన్, విక్రమ్ కె. కుమార్ల సినిమాలను విజయ్ ఒకేసారి సెట్స్‌కు తీసుకువెళ్లే అవకాశాలూ లేక పోలేదు.ద్విపాత్రాభినయం ‘తమ్ముడు’ సినిమా తర్వాత నితిన్ కొత్త చిత్రంపై ఇంకా సరైన స్పష్టత లేదు. దర్శకుడు శ్రీను వైట్ల, ‘బలగం’ ఫేమ్ దర్శకుడు వేణు యెల్దండి చెప్పిన కథలను నితిన్ విన్నారన్న వార్తలు వినిపించాయి. కానీ ఈ సినిమాలేవీ ఫైనలైజ్ కాలేదు. కాగా, ఇటీవల దర్శకుడు వీఐ ఆనంద్ ఓ సైన్స్ ఫిక్షన్ కథను సిద్ధం చేసుకుని, నితిన్‌కు వినిపించారట. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు కాస్త విభిన్నంగా ఉండటంతో ఈ కథ నచ్చి, నితిన్ ఈ సినిమా చేసేందుకు పచ్చజెండా ఊపారని సమాచారం. ఈ చిత్రంలో నితిన్ ద్విపాత్రాభినయం చేయనున్నారని, ఈ సినిమాను శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్నారని, త్వరలోనే ఈ మూవీ గురించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం.గ్రీన్ సిగ్నల్ ప్రస్తుతం ‘ఫంకీ’ సినిమాతో విశ్వక్ సేన్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ‘జాతి రత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ డిసెంబరు చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా తర్వాత తరుణ్ భాస్కర్‌తో ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా సీక్వెల్‌ను చేయనున్నారట. అలాగే శర్వానంద్‌తో ‘శ్రీకారం’ సినిమా తీసి, ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు కిశోర్ ఓ కథను సిద్ధం చేసి, విశ్వక్ సేన్‌కు వినిపించారని, ఈ సినిమాకు విశ్వక్ దాదాపు ఓకే చెప్పారని తెలిసింది. వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. సుకుమార్ శిష్యుడితో...! ఇటీవలే ‘కె–ర్యాంప్’ సినిమాతో సక్సెస్ అందుకున్న కిరణ్ అబ్బవరం ప్రజెంట్ ‘చెన్నై లవ్‌స్టోరీ’ అనే సినిమా చేస్తున్నారు. అలాగే ఇటీవల మరో రెండు మూడు కొత్త సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఈ చిత్రాల్లో ఒకటి సుకుమార్ శిష్యుడు వీర అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన రానుందని తెలిసింది.జటాయులో..? ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ‘జటాయు’ అనే టైటిల్‌తో ఓ పవర్ఫుల్ స్టోరీని ఎప్పుడో సిద్ధం చేశారు. కానీ ఈ కథతో ఈ చిత్రం ఇంకా సెట్స్‌కు వెళ్లలేదు. ఇందులో విజయ్ దేవరకొండ వంటి వారు హీరోలుగా నటిస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఈ ‘జటాయు’ స్టోరీని ప్రముఖ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా విన్నారని, ఈ యువ హీరోతో ఈ’ సినిమా ఆల్మోస్ట్ ఖరారై పోయిందని, ‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా విషయాలపై అధికారిక ప్రకటన రానుందట. ఇక రోషన్ ప్రజెంట్ ‘చాంపియన్’ అనే ఓ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాతో బిజీగా ఉన్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది. ఇలా తమ కొత్త సినిమాల కోసం కథలు వింటున్న హీరోలు మరికొంతమంది ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
'కింగ్డమ్'కు భారీ నష్టాలు.. నాగవంశీ ఫస్ట్ రియాక్షన్ ఇదే
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ డ్రామా మూవీ ‘కింగ్డమ్’ (Kingdom). ఇందులో హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే నటించగా సత్యదేవ్, వెంకటేశ్, అయ్యప్ప పి.శర్మ, రాజ్‌కుమార్ కసిరెడ్డి వంటి వారు నటించారు. నిర్మాత నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మించిన కింగ్డమ్ మూవీ ఈ ఏడాది జులైలో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, సినిమాకు నెగటివ్ టాక్ రావడంతో భారీ నష్టాలు వచ్చాయని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలో తాజాగా కింగ్డమ్ కలెక్షన్స్‌పై నాగవంశీ రియాక్ట్ అయ్యారు.'అందరూ కింగ్డమ్ సినిమా ఫెయిల్యూర్ అయిందని అంటున్నారు. అందులో నిజం లేదు. అమెరికాలోనే సుమారు రూ. 28 కోట్లు కలెక్ట్ చేసింది. కేవలం నైజాంలోనే రూ. 12 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇలాంటి సినిమాను ఫెయిల్యూర్ అంటే ఎలా..? కింగ్డమ్ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్, గౌతమ్ తిన్ననూరి వంటి వారు పనిచేయడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. దీంతో ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను మేము రీచ్ కాలేకపోయాం. నా నుంచి కింగ్డమ్ సినిమాను కొన్న బయ్యర్లు అందరూ సేఫ్ జోన్లోనే ఉన్నారు. కలెక్షన్స్ పరంగా ఒకరో ఇద్దరో నష్టపోయిన బయ్యర్లకు జీఎస్టీ రూపంలో రిటర్న్ చేశాను. దీంతో వారు కూడా సేఫ్ జోన్లోకి వచ్చేశారు. ఈ సినిమాతో నాకు ఎలాంటి నష్టం జరగలేదు. అలాంటప్పుడు కింగ్డమ్ ప్లాప్ సినిమా ఎలా అవుతుంది..? కానీ, మేము అనుకున్నంత రేంజ్లో కింగ్డమ్ రన్ కాలేదు. బాక్సాఫీస్ లెక్కల పరంగా కింగ్డమ్ హిట్ చిత్రంగానే ఉంటుంది.' అని ఆయన అన్నారు. -
విజయ్ దేవరకొండతో పెళ్లి.. క్యూట్‌గా 'రష్మిక' సమాధానం (వీడియో)
టాలీవుడ్లో ఆన్‌స్క్రీన్ ఫేవరెట్ జంట ఎవరంటే.. విజయ్ దేవరకొండ- రష్మిక గురించే మొదట చెప్తారు. అక్టోబర్ 3న వీరి నిశ్చితార్థం జరిగిందని వారి సన్నిహితులు వెల్లడించారు. కానీ, ఈ జోడీ మాత్రం ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. అయితే, వీరిద్దరూ ఒకేరకమైన ఉంగరాలు పెట్టుకొని ఈ మధ్య కనిపించడంతో అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే రష్మిక నటించిన కొత్త సినిమా ది గర్ల్‌ఫ్రెండ్ ట్రైలర్ ఈవెంట్లో తన పెళ్లి గురించి టాపిక్ రాగానే అవుననే సిగ్నల్ ఆమె ఇచ్చేసింది.ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా ఈవెంట్లో యాంకర్ వేసిన ప్రశ్నతో రష్మిక పెళ్లి గురించి మరోసారి క్లారిటీ వచ్చేసింది. ఒక వ్యక్తిని బాయ్‌ఫ్రెండ్‌గా ఎంపిక చేసుకోవాలంటే ఎలా జడ్జ్ చేయాలని రష్మికను యాంకర్ అడుగుతుంది. ఆ సమయంలో ప్రేక్షకుల నుంచి విజయ్ దేవరకొండను అడిగితే చెప్తారని సమాధానం వస్తుంది. అప్పుడు రష్మిక కూడా నవ్వుతూ కనిపిస్తుంది. రష్మిక ఎలాంటి అబ్బాయిని ఇష్టపడుతుంది అంటూ యాంకర్ మరో ప్రశ్న వేయగానే మళ్లీ ఆడియన్స్ నుంచి రౌడీ (విజయ్ దేవరకొండ) లాంటి వ్యక్తినే అంటూ ఆన్సర్ వస్తుంది. ఆ సమయంలో రష్మిక కూడా చిరునవ్వుతో అందరికీ తెలుసే.. అంటూ చేతులతో అవుననే సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో ఇలాగైనా ఫ్యాన్స్‌కు ఒక క్లారిటీ వచ్చినట్లు అయింది. అయితే, వచ్చే ఏడాదిలో రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకోనున్నారని సమాచారం. View this post on Instagram A post shared by Captures by Chan (@celebrities_tollywood_) -
కాంబినేషన్ సెట్?
హీరో విజయ్ దేవరకొండ–డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. తనకు ‘టాక్సీవాలా’ (2018) వంటి హిట్ మూవీ అందించిన దర్శకుడు రాహుల్ సంకృత్యాన్‌తో రెండో సినిమా చేస్తున్నారు విజయ్. మరోవైపు ‘రాజావారు రాణిగారు’ చిత్రదర్శకుడు రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.ఈ రెండు చిత్రాల తర్వాత డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్‌తో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయనున్నారని టాక్. ‘ఇష్క్, మనం, హలో, నానీస్ గ్యాంగ్‌లీడర్’ వంటి పలు చిత్రాలను తెరకెక్కించి, తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నారు విక్రమ్ కె. కుమార్. ఇక ఆ మధ్యలో నితిన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తారనే వార్తలు వచ్చినప్పటికీ ఎలాంటి ప్రకటన లేదు. అయితే తన తాజా చిత్రాన్ని విజయ్‌తో చేయనున్నారట విక్రమ్. ఇందుకోసం కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారట. మరి... ఈ కాంబినేషన్ సెట్ అవుతుందా? వేచి చూడాల్సిందే. -
విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ కొత్త చిత్రం ప్రారంభం..
-
మొన్న విజయ్..నేడు రష్మిక.. అలా బయటపెట్టేశారుగా!
విజయ్ దేవరకొండ( Vijay Devarakonda), రష్మిక మందన్నా(Rashmika Mandanna) ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ డైరెక్ట్‌గా తమ ప్రేమ విషయాన్ని బయటి ప్రపంచానికి చెప్పకపోయినా.. చాలాసార్లు హింట్ ఇస్తూనే ఉన్నారు. ఇండస్ట్రీకి చెందిన వారితోనే ప్రేమలో ఉన్నానని గతంలో విజయ్ చెప్పాడు. రష్మిక కూడా సింగిల్ కాదంటూ.. చెప్పేసింది. ఇలా పరోక్షంగానే ప్రేమ విషయాన్ని చెప్పిన ఈ జంట..ఇటీవల ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఆ విషయాన్ని కూడా బయటకు చెప్పలేదు. మీడియాతో వార్తలు రావడం.. వాటిని వీరిద్దరు ఖండించకపోవడంతో ఎంగేజ్మెంట్ జరిగింది నిజమనే అంతా నమ్మారు. తాజాగా ఈ జంట తమ నిశ్చితార్థం విషయాన్ని కూడా పరోక్షంగానే అభిమానులతో పంచుకున్నారు.విజయ్ అలా.. రష్మిక ఇలావిజయ్-రష్మికల ఎంగేజ్మెంట్ ఈ నెల 3న జరిగినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కొద్ది మంది సన్నిహితుల సమక్షంలోనే ఉంగరాలు మార్చుకున్నారట. ఈ విషయాన్ని మొదట విజయ్ పరోక్షంగా బయటకు తెలియజేశాడు. ఇటీవల ఆయన పుట్టపర్తికి వెళ్లాడు. అక్కడ ఆయన చేతికి ఉంగరం కనిపించింది. గతంలో ఎప్పుడూ ఉంగరం ధరించని విజయ్ చేతికి.. కొత్త రింగ్ కనిపించడంతో ఇది కచ్చితంగా ఎంగేజ్మెంట్దే అంటూ ఫోటోలు వైరల్ అయ్యాయి. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక కూడా తన నిశ్చితార్థం విషయాన్ని పరోక్షంగానే బయటపెట్టింది. ఇన్‌స్టాలో తన పెంపుడు కుక్కతో ఆడుకుంటున్న ఓ వీడియోని పోస్ట్ చేసింది. అందులో రష్మిక చేతికి డైమండ్ ఉంగరం ఉంది. అది హైలెట్ చేసేలా ఆ వీడియో ఉంది. దీంతో రష్మిక కూడా ఎంగేజ్మెంట్ విషయాన్ని బయటకు చెప్పడానికే ఆ వీడియో పెట్టిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.అలా ప్రేమలో..రష్మిక-విజయ్ కలిసి నటించిన తొలి సినిమా ‘గీత గోవిందం’. ఆ సినిమాలో వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. షూటింగ్ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారట. ఆ తర్వాత ఇద్దరు కలిసి డియర్ కామ్రేడ్ అనే సినిమా చేశారు. అప్పటికే వీరిద్దరు ప్రేమలో ఉన్నారట. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరిద్దరి పెళ్లి జరగబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం రష్మిక ‘థామా’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. విజయ్.. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు రవి కిరణ్ కోలాతోనూ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ రోజు ఈ సినిమా పూజాకార్యక్రమం జరిగింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన కీర్తి సురేష్ నాయికగా నటిస్తోంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్దన్’ షూటింగ్ ప్రారంభం (ఫోటోలు)
-
విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రారంభం.. హీరోయిన్ ఎవరంటే..
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కొత్త సినిమా రౌడీ జనార్దన్ (Rowdy Janardhan) ప్రారంభమైంది. ‘రాజా వారు రాణి గారు’ సినిమాతో మెప్పించిన క్లాసిక్ డైరెక్టర్ రవికిరణ్ ఇప్పుడు విజయ్‌తో భారీ యాక్షన్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా కీర్తి సురేష్ నటిస్తుంది. గతంలో వీరిద్దరు కలిసి మహానటి మూవీలో కలిసి పనిచేశారు. ఇప్పుడు విజయ్‌కు జోడీగా ఆమె నటిస్తున్నారు. గతేడాదిలో కీర్తి పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. వివాహం తర్వాత ఆమె చేస్తున్న భారీ చిత్రం ఇదే కావడం విశేషం.ఫ్యామిలీస్టార్ మూవీ తర్వాత నిర్మాత దిల్ రాజు మరోసారి విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్నారు. తాజాగా జరిగిన పూజా కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. SVC బ్యానర్లో భారీ బడ్జెట్‌తో దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. 2026లో ఈ మూవీ విడుదల కానుంది. ఇందులో విలన్‌గా నటుడు రాజశేఖర్ నటించబోతున్నారని సమాచారం. -
'ఫ్యామిలీస్టార్' తర్వాత విజయ్, దిల్ రాజు కొత్త సినిమా
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), దిల్ రాజు కలిసి మరోసారి పనిచేయనున్నారు. వీరిద్దరూ కలిసి ఇప్పటికే ఫ్యామిలీస్టార్ సినిమాను అందించారు. దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన ఈ చిత్రం అనుకున్నంత రేంజ్లో అయితే మెప్పించలేదు. అయితే, మరోసారి విజయ్ దేవరకొండతో కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తానని నిర్మాత దిల్‌రాజు గతంలోనే ప్రకటించారు. ఈ క్రమంలోనే సరికొత్తగా యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.విజయ్ దేవరకొండ కొత్త చిత్రం అక్టోబర్ 11న ప్రారంభం కానుంది. ఈ మూవీని దర్శకుడు రవికిరణ్ కోల తెరకెక్కించనున్నారు. గతంలో రవికిరణ్ డైరెక్ట్ చేసిన ‘రాజా వారు రాణి గారు’ సినిమా క్లాసిక్ లవ్ స్టోరీగా ప్రేక్షకులను మెప్పించింది. అయితే, ఇప్పుడు యాక్షన్ సినిమా కోసం ఆయన పనిచేయనున్నారు. ఈ మూవీకి ‘రౌడీ జనార్ధన’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. అక్టోబర్ 16 నుంచే ముంబైలో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు టాక్. SVC బ్యానర్లో భారీ బడ్జెట్‌తో దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. 2026లో ఈ మూవీ విడుదల కానుంది. ఇందులో హీరోయిన్గా కీర్తి సురేష్ నటించనున్నట్లు తెలుస్తుంది. -
వ్యక్తిగత జీవితంలోకి కెమెరా రాకూడదు: రష్మిక మందన్నా
సెలబ్రిటీల వృత్తిపరమైన విషయాల కంటే వ్యక్తిగత విషయాలపైనే చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అలాంటిది సినీ హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. వాళ్లు ఏం చేసినా వార్తే అవుతోంది. వారి వ్యక్తిగత జీవితాల గురించి రకరకాల వార్తలు వెలువడుతుంటాయి. ఇదే మంచిది కాదంటున్నారు నటి రష్మికా మందన్నా. ఈ భామ క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. నేషనల్ క్రష్‌గా వెలుగొందుతున్న రస్మికా మందన్నా ప్రస్తుతం బాలీవుడ్‌ను దున్నేస్తున్నారనే చెప్పాలి.ఇక తెలుగు,తమిళం భాషల్లోనూ నటిస్తూ పాన్ ఇండియా కథానాయకిగా రాణిస్తున్న ఈ బ్యూటీ టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన్ని పెళ్లి చేసుకోనున్నట్లు ఆ మద్య చెప్పకనే చెప్పారు. కాగా ఇటీవల విజయ్‌దేవరకొండ, రష్మిక మందన్నాల వివాహ నిశ్చితార్థం చాలా నిడారంబరంగా జరిగినట్లు వార్తలు బలంగానే వెలువడ్డాయి. అయితే ఈ విషయాన్ని ఈ ఇద్దరిలో ఎవరూ బహిరంగంగా వెల్లడించలేదు. ఇలాంటి సరిస్థితుల్లో నటి రష్మిక మందన్నా ఇటవల ఒక భేటీలో పేర్కొంటూ లోపల ఏం జరుగుతోందన్నది ప్రపంచానికి తెలియదన్నారు. అదేవిధంగా మన వ్యక్తిగత జీవితాల్లోకి కెమెరా రాకూడదని అన్నారు.తాము వ్యక్తిగత విషయాలను ఆన్లైన్ వంటి సామాజిక మాధ్యమాల్లో వెల్లడించే వాళ్లం కాదన్నారు. అదే విధంగా ప్రజలు తమ వ్యక్తిగత జీవితాల గురించి ఏం అనుకుంటున్నారు అన్నది ముఖ్యం కాదనీ, తమ వృత్తిపరమైన జీవితాల గురించే ముఖ్యం అని పేర్కొన్నారు. రష్మిక మందన్నాకు వివాదాలు కొత్తేమీ కాదు. ఈమెను కన్నడ చిత్ర పరిశ్రమ బ్యాన్ చేసిందనే ప్రచారం వాడివేడిగా సాగింది. అయితే ఇప్పటి వరకూ తాను బ్యాన్ చేయబడలేదని రష్మిక మందన్నా స్పష్టం చేశారు. అదే విధంగా ఇంతకు ముందే కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో నటి రష్మిక మందన్నా ప్రేమ వివాహ నిశ్చితార్థం వరకూ వెళ్లి ఆ తరువాత విడిపోయారు. ఆపై రష్మిక మందన్నా కన్నడ చిత్రాల్లో నటించలేదు. కాంతార చిత్రం విడుదలయిన సమయంలోనూ రష్మిక మందన్నా వివాదాలకు గురయ్యారు. ఆ చిత్రాన్ని తాను ఇంకా చూడలేదని పేర్కొనడంతో పెద్ద రచ్చే జరిగింది. అలాంటిది ఇటీవల కాంతారకు ఫ్రీక్వెల్‌గా రూపొందిన కాంతార ఛాప్టర్ 1 చిత్రాన్ని చూసిన తరువాత ఆ చిత్ర బృందానికి మెసేజ్ పెట్టినట్లు, వాళ్లు అందుకు థ్యాంక్స్ చెప్పినట్లు నటి రషి్మకా మందన్నా పేర్కొన్నారు. మొత్తం మీద ఈ అమ్మడు ఏదో ఒక విషయంతో నిత్యం వార్తల్లో ఉంటున్నారు. -
వీడియో: పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ.. ముఖంలో పెళ్లికళ
హీరో విజయ్ దేవరకొండ రీసెంట్‌గానే రష్మికతో నిశ్చితార్థం చేసుకున్నాడని టాక్. ఇది నిజమే అయినప్పటికీ బయటకు చెప్పకుండా రహస్యంగా ఉంచుతున్నారు. అయితే ఇది జరిగిన వెంటనే విజయ్.. తల్లి, తమ్ముడు ఆనంద్‌తో కలిసి పుట్టపర్తి సాయిబాబా దర్శనం చేసుకున్నాడు. ఒకటి రెండు ఫొటోలతో ఈ విషయం కూడా బయటపడింది. అయితే ఇప్పుడు ఆ ట్రిప్ వీడియోని స్వయంగా విజయ్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు.పుట్టపర్తి వెళ్లడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పిన విజయ్ దేవరకొండ.. తను మొదట చేరిన '1ఏ' క్లాస్ రూమ్.. వేదాలు, మంత్రాలు, భజనలు నేర్చుకున్న మందిరం.. గతంలో తనలా ఇప్పుడు ఇక్కడున్న పిల్లలు... నా రూమ్ బీ-13 మధ్యలో కప్ బోర్డ్ నాదే.. మమ్మల్ని సక్రమమైన దారిలో నడిపించిన సార్స్.. అంటూ 20 ఏళ్ల తన జ్ఞాపకాల్ని వీడియో రూపంలో పొందుపరిచి ఇన్ స్టాలో వీడియోగా పోస్ట్ చేశాడు.(ఇదీ చదవండి: పవన్ సినిమాలో మూడు కోట్ల ఆఫర్.. ఆ రోల్‌కు ఒప్పుకోలేదు: మల్లా రెడ్డి)విజయ్ దేవరకొండ ముఖంలో పెళ్లికళ ఉట్టిపడుతున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత సడన్‌గా పుట్టపర్తి దర్శనం చేసుకోవాల్సిన అవసరం విజయ్ దేవరకొండకు అయితే లేదు. అలాంటిది ఫ్యామిలీతో కలిసి అక్కడికి వెళ్లాడంటే కచ్చితంగా నిశ్చితార్థం జరిగిన తర్వాత సాయిబాబా ఆశీర్వదాలు తీసుకోవడానికేనని రౌడీ హీరో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.అయితే పుట్టపర్తి దర్శనానంతరం.. విజయ్ ప్రయాణిస్తున్న కారు ఓ చోట ప్రమాదానికి గురైంది. అయితే ఈ యాక్సిడెంట్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏదేమైనా ఇప్పుడు విజయ్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది.(ఇదీ చదవండి: 80'స్ రీ యూనియన్.. వీడియో వైరల్) View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
కారు ప్రమాదంపై విజయ్ దేవరకొండ ట్వీట్!
కారు ప్రమాదంపై హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. అంతా బాగానే ఉందని ట్వీట్ చేశారు. ఈ ప్రమాదంలో తన కారు దెబ్బతిందని.. కానీ మాకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. ఇప్పుడే వ్యాయామం చేసి ఇంటికి తిరిగి వచ్చానని పోస్ట్ చేశారు. నా గురించి ఆరా తీసిన మీ అందరికీ లవ్ యూ అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. ఈ ప్రమాదం వల్ల మీరు ఎలాంటి ఒత్తిడికి గురి కావొద్దని అభిమానులకు సూచించారు.టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురైంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నుంచి విజయ్ సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఈ ఘటనలో కారు స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారును.. బొలెరో వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ మరో కారులో హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. All is well ❤️Car took a hit, but we are all fine. Went and did a strength workout as well and just got back home. My head hurts but nothing a biryani and sleep will not fix. So biggest hugs and my love to all of you. Don’t let the news stress you 🤗❤️— Vijay Deverakonda (@TheDeverakonda) October 6, 2025 -
విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురైంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నుంచి విజయ్ సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో కారు స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారును.. బొలెరో వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ మరో కారులో హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. కాగా.. ఇటీవల రష్మికతో ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నిశ్చితార్థం తర్వాత విజయ్ దేవరకొండ పుట్టిపర్తిలోని సత్యసాయి సమాధిని దర్శించుకునేందుకు వెళ్లారు. తన స్నేహితులతో కలిసి తిరిగి హైదరాబాద్ వస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. All is well ❤️Car took a hit, but we are all fine. Went and did a strength workout as well and just got back home. My head hurts but nothing a biryani and sleep will not fix. So biggest hugs and my love to all of you. Don’t let the news stress you 🤗❤️— Vijay Deverakonda (@TheDeverakonda) October 6, 2025 -
పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ
-
రష్మికతో ఎంగేజ్మెంట్ వార్తలు.. ఆయన సన్నిదిలో విజయ దేవరకొండ!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో రూమర్స్ వస్తోన్న రష్మికతో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. హైదరాబాద్‌లోని విజయ్ సృగృహంలో రెండు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరిగినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి కూడా జరగనుందని టాక్ వినిపిస్తోంది. కానీ ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఎవరూ కూడా అధికారికంగా ప్రకటించలేదు.ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ ప్రముఖ ఆలయంలో కనిపించారు. శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి సత్యసాయి మహా సమాధిని నటుడు విజయ్ దేవరకొండ దర్శించుకోనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ విజయ్ పుట్టిపర్తిలోని ప్రశాంతి నిలయం చేరుకున్నారు. శాంతి భవన్ అతిథి గృహం వద్ద ట్రస్ట్ వర్గాలు అతనికి ఘన స్వాగతం పలికాయి. ఇకపోతే విజయ్ దేవరకొండకి పుట్టపర్తితో ఉన్న అనుబంధం తెలిసిందే. అక్కడే శ్రీ సత్యసాయి పాఠశాలలో ఆయన చదువుకున్నారు. Puttaparthi ❤️🙏Sensational @TheDeverakonda visits Bhagwan Satya Sai Baba's Maha Samadhi and seeks blessings ✨#VijayDeverakonda has a special connection with this place from childhood❤️ pic.twitter.com/pOq8fY02Hy— Pavan Kumar (@pavankumar__123) October 5, 2025 -
రహస్యంగానే విజయ్ దేవరకొండ, రష్మిక.. కారణం ఏంటి?
సెలబ్రిటీల ఇంట్లో పెళ్లి అంటే సోషల్‌మీడియాలో బాగా వైరల్ అవుతుందనే విషయం తెలిసిందే. రీసెంట్గా అక్కినేని నాగార్జున కుటంబంతో పాటు అల్లు అరవింద్ ఫ్యామిలీ నుంచి కూడా శుభవార్తలు విన్నాం. అయితే, తాజాగా విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక(Rashmika Mandanna)లు నిశ్చితార్థం చేసుకున్నారు. ఇదే విషయాన్ని వారి సన్నిహిత వర్గాలు కూడా చెబుతున్నాయి. సోషల్‌మీడియాలో అయితే, పాన్ ఇండియా రేంజ్లో ఈ వార్తలు వైరల్ అయ్యాయి. కానీ, ఈ జోడీ మాత్రం తమకు ఏమ్ తెలియనట్లు సైలెంట్‌గా ఉంది. గతంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఐశ్వర్యరాయ్, దీపికా పదుకొణెలతో పాటు చాలామంది సెలబ్రిటీలు తమ పెళ్లి సందర్భం వచ్చినప్పుడు తమ అభిమానులతో పంచుకున్నారు. నేటి ప్రపంచంలో ఎవరూ కూడా తమ ప్రేమ,పెళ్లి విషయాల్ని దాచుకోవడం లేదు. సమయం వచ్చినప్పడు చెప్పేస్తున్నారు.విజయ్ దేవరకొండ, రష్మికల నిశ్చితార్థం గురించి సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. మిలియన్ల కొద్ది శుభాకాంక్షలు చెబుతున్నారు. కానీ, ఈ జంట మాత్రం ఇలాంటి సమయంలో చాలా గుంభనంగా ఉంది. కనీసం ఇవన్ని రూమర్స్ మాత్రమే అని కూడా వారు తమ అభిమానులకు చెప్పలేదు. నిజమే అయితే, కనీసం తమ ఫ్యాన్స్‌కు కూడా చెప్పకుండా ఇలా చేయడం ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.గత కొన్నేళ్లుగా ఇద్దరూ ఒక లోకేషన్లో కనిపించడం చూశాం. విజయ్ ఇంట్లో రష్మిక ఫోటోలు దిగడం, పుట్టినరోజు సమయంలో ఒకే ప్రదేశానికి వెకేషన్ ప్లాన్ చేయడం వంటి సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా పలు ఫోటోలతో అభిమానులే డీకోడ్ చేశారు. ప్రేమ విషయాన్ని రహస్యంగా దాచారంటే తప్పులేదు. కానీ, నిశ్చితార్థం విషయాన్ని కూడా అంత సీక్రెట్‌గా ఉంచడం ఎందుకు అనే సందేహం అందరిలో వస్తుంది. రష్మిక రీసెంట్గా తన కొత్త సినిమా విడుదల తేదీ ప్రకటించింది కానీ నిశ్చితార్థం గురించి మాత్రం చెప్పలేదు. ఇలాంటి విషయాల్లో ఇంత రహస్యం అవసరమా అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. -
రష్మికతో ఎంగేజ్మెంట్.. విజయ్ దేవరకొండ నెట్‌వర్త్ ఎంతో తెలుసా?
తెలుగు సినీ ప్రపంచంలో అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయిన నటులలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఒకరు. అర్జున్ రెడ్డి సినిమాలో ఓ డాక్టర్‌గా, గీత గోవిందంలో మేడమ్ మేడమ్ ప్లీజ్ మేడమ్ అంటూ అమ్మాయిల మనసు దోచుకున్న.. ఈ వరల్డ్ ఫెమస్ లవర్ గ్యారేజిలో జర్మన్, బ్రిటీష్, అమెరికన్, స్వీడన్ బ్రాండ్లకు చెందిన ఖరీదైన కార్లు ఉన్నాయి. అంతే కాకుండా హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ పరిసరాల్లో రూ. కోట్ల విలువైన బంగ్లాలో నివసిస్తున్నారు. అయితే ఈ కథనంలో విజయ్ దేవరకొండ లగ్జరీ కార్లు, నెట్‌వర్త్ వంటి ఆసక్తికరమైన విషయాలు చూసేద్దాం..విజయ్ దేవరకొండ కార్ల ప్రపంచం (Vijay Deverakonda Car Collection)ఫోర్డ్ మస్టాంగ్: ఇండియన్ మార్కెట్లో ఒకప్పటి నుంచి ఎంతో ప్రజాదరణ పొందిన అమెరికన్ కార్ తయారీ సంస్థ ఫోర్డ్ భారతదేశంలో తన కార్యకలాపాలను నిలిపివేసింది. అయితే గ్లోబల్ మార్కెట్లో విక్రయిస్తున్న ఫోర్డ్ మస్టాంగ్ విజయ్ దేవరకొండ గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 75 లక్షలు ఉంటుందని సమాచారంమెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ: భారతీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్.. కంపెనీకి చెందిన జీఎల్సీ కూడా విజయ్ గ్యారేజిలో ఉంది. ఇతర కార్లకంటే కూడా విజయ్ ఈ కారునే ఎక్కువగా ఉపయోగిస్తాడని సమాచారం. దీని ధర సుమారు రూ. 60 లక్షల కంటే ఎక్కువ. ఇది పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది.వోల్వో ఎక్స్‌సీ 90: విజయ్ దేవరకొండ గ్యారేజిలో స్వీడన్ బ్రాండ్ కారు.. వోల్వో ఎక్స్‌సీ 90 కూడా ఉంది. దీని ధర దేశీయ మార్కెట్లో సుమారు రూ. 90 లక్షల నుంచి రూ. 1.31 కోట్ల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. వోల్వో కంపెనీ భారతదేశంలో విక్రయిస్తున్న అత్యంత విలాసవంతమైన, సురక్షితమైన కార్లలో ఇది ఒకటి కావడం విశేషం.రేంజ్ రోవర్: ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ కార్లలో ల్యాండ్ రోవర్ ఒకటి. విజయ్ దేవరకొండ గ్యారేజిలో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కూడా ఉంది. దీని ధర సుమారు రూ. 60 లక్షల కంటే ఎక్కువ. ఎక్కువ మంది సెలబ్రిటీలు ఇష్టపడే కార్లలో ఇది కూడా ఒకటి కావడం విశేషం.బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్: విజయ్ దేవరకొండ గ్యారేజిలో మెర్సిడెస్ బెంజ్ కారు మాత్రమే కాకుండా బీఎండబ్ల్యు కంపెనీకి చెందిన 5-సిరీస్ కూడా ఉంది. దీని ప్రారంభ ధర రూ. 60 లక్షల కంటే ఎక్కువ. 2021 బిఎండబ్ల్యు 5-సిరీస్ 530ఐ ఎమ్ స్పోర్ట్స్, 520డి మరియు 530డి ఎమ్ స్పోర్ట్స్ అనే మూడు వేరియంట్లో విడుదలైంది. వీటి ధరలు రూ. 63 లక్షల నుంచి రూ. 72 లక్షల వరకు ఉన్నాయి.నెట్‌వర్త్ (Net Worth) విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ కేవలం ఒక నటుడుగా మాత్రమే కాకుండా.. కొన్ని బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవరిస్తున్నారు. దీంతో ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. ఈయన నెట్‌వర్త్ మొత్తం రూ. 50 కోట్ల నుంచి రూ. 70 కోట్ల మధ్యలో ఉంటుందని సమాచారం.విజయ్ దేవరకొండ, రష్మిక నిశ్చితార్థంహీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నా నిశ్చితార్థం శుక్రవారం నిరాడంబరంగా జరిగింది. హైదరాబాద్‌లోని విజయ్ దేవరకొండ నివాసంలో ఉదయం 11 గంటలకు వీరి ఎంగేజ్మెంట్ అయింది. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ విషయాన్ని వారి సన్నిహితులు స్వయంగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహానికి ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: గిఫ్ట్‌గా రూ.33 లక్షల కారు: అభిషేక్ శర్మపై పడే ట్యాక్స్ ఎంత? -
రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక
-
విజయ్ దేవరకొండ - రష్మిక నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్
-
విజయ్ దేవరకొండ, రష్మిక నిశ్చితార్థం
సాక్షి, సినిమా : హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నా నిశ్చితార్థం శుక్రవారం నిరాడంబరంగా జరిగింది. హైదరాబాద్‌లోని విజయ్ దేవరకొండ నివాసంలో ఉదయం 11 గంటలకు వీరి ఎంగేజ్మెంట్ అయింది. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ విషయాన్ని వారి సన్నిహితులు స్వయంగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహానికి ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది. వీరు తొలిసారి జంటగా నటించిన సినిమా ‘గీత గోవిందం’. ఈ మూవీతోనే వారిద్దరి మధ్య ప్రేమ మొదలైనట్లు తెలుస్తోంది.అయితే దీనిపై ఇటు విజయ్ కానీ, అటు రష్మిక కానీ ఎప్పుడూ స్పందించ లేదు. కానీ, వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు మాత్రం ఎయిర్‌పోర్ట్‌లో ఫొటోగ్రాఫర్ల కంట పడేవారు. వీరి నిశ్చితార్థంపై గతంలోనూ పలు వార్తలొచ్చినప్పటికీ అవి వదంతులుగా మిగిలిపోయాయి. అయితే శుక్రవారం ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా విజయ్, రష్మిక నిశ్చితార్థం చేసుకున్నారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


