girl trafficking
-
యవ్వనంగా కనిపించేందుకు హార్మోన్ ఇంజెక్షన్లా?
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో అభం శుభం తెలియని చిన్నారులను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టిన వ్యవహారంపై హైకోర్టు సోమవారం తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బీ రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్ల ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. చిన్నారులు యవ్వనంగా కనిపించేందుకు హార్మోన్ ఇంజెక్షన్లు ఉపయోగించడం ఏంటని మండిపడింది. యాదాద్రి డీసీపీ రామచంద్రా రెడ్డి, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అధికారులు స్వయంగా కోర్టుకు హాజరై కేసు వివరాలను తెలియజేశారు. వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న 30 మందిపై కేసులు పెట్టామని, 27 మందిపై పీడీ యాక్ట్‌లు పెట్టి జైలుకు కూడా పంపిచామని తెలిపారు. రెస్క్యూ చేసిన చిన్నారులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు పేర్కొన్నారు. మహిళల రక్షణకోసం షీటీమ్‌లు ఏర్పాటు చేసామని, వ్యభిచార గృహాలు, నిర్వాహకులపై నిఘా పెట్టామని అధికారులు కోర్టుకు తెలిపారు. కాగా బ్రాయిలర్ కోళ్లకు ఇచ్చినట్లు ఆడపిల్లలకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నారులపై ఆక్సోటోసిన్ ఇంజక్షన్ వాడకం వల్ల కలిగే అనర్థాలపై వివరణ ఇవ్వాలని కోరడంతో ఉస్మానియా వైద్య బృందం కోర్టుకు హాజరై వివరణ ఇచ్చింది. దీంతో చిన్నారులకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు వారికి సూచించింది. ఈ కేసులో బెయిల్ కోసం దాఖలు చేసుకున్న వారి వివరాలను సైతం తెలుపాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. -
ఆడపిల్లలా.. బ్రాయిలర్ కోళ్లా?
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో అభం శుభం తెలియని చిన్నారులను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టిన వ్యవహారంపై ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు సోమవారం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బ్రాయిలర్ కోళ్లకు ఇచ్చినట్లు ఆడపిల్లలకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చినా ఇంటెలిజెన్స్ ఏం చేస్తోందని మండిపడింది. యాదాద్రిలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా.. మీకు తెలియలేదంటే అసలేం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిర్వాహకులు, అధికారులు కుమ్మక్కయి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. అటు, ఈ వ్యవహారంలో నిందితులుగా ఉన్న వారికి దిగువ కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బీ రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్ల ధర్మాసనం సోమవారం విస్మయం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన కేసుల విచారణలో జాప్యం జరగకుండా అవసరమైతే ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు ఆదేశాలు ఇస్తామని తెలిపింది. ‘యాదాద్రి’ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయడంపై వైఖరి తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నరకకూపం నుంచి బయటపడిన బాధితులను రక్షించేందుకు ఏమేం చర్యలు తీసుకున్నారో చెప్పాలని, ఇటువంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా ఏం చేయాలనుకుంటున్నారో కూడా వివరించాలని ఆదేశాలు జారీచేసింది. పూర్తి వివరాలన్నింటినీ తమ ముందుంచాలంటూ విచారణను మంగళవారానికి (అక్టోబర్ 23) వాయిదా వేసింది. అలాంటి వారికి బెయిలిస్తారా? యాదాద్రి వ్యవహారంలో నిందితులుగా ఉన్న వారికి కింది కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలాంటి హేయమైన కేసుల్లో దిగువ కోర్టు బెయిల్ ఇస్తుంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ‘సదరు కోర్టు బెయిల్‌ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యతిరేకించారా? ఒకవేళ ఆయన వ్యతిరేకించినా.. జడ్జీ బెయిల్ ఇచ్చారా? ఇంత క్రూరంగా వ్యవహరించిన వారికి బెయిల్ ఎలా ఇస్తారు?’ అని ధర్మాసనం మండిపడింది. ఈ కేసు వివరాలన్నింటినీ తన ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘చిన్నారులను వ్యభిచార వృత్తిలోకి దింపడమే తీవ్రమైన నేరమైతే.. వారు యుక్త వయస్కులుగా కనిపించేందుకు హార్మోన్ల ఇంజక్షన్లు ఇవ్వడం అమానవీయం. మాంసం ఎక్కువగా వచ్చేందుకు బ్రాయిలర్ కోళ్లకు హార్మోన్ ఇంజక్షన్లు ఇస్తారు. ఇక్కడ హార్మోన్ ఇంజక్షన్లు ఇవ్వడానికి వాళ్లు.. ఆడపిల్లలా? లేక బ్రాయిలర్ కోళ్లా?’ అని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. చిన్నారులను బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపడం ఓ మార్కెట్‌గా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేసింది. బాధితులకోసం ఏం చేస్తున్నారు? యాదాద్రిలో చిన్నారులను వ్యభిచార వృత్తిలోకి దింపిన దారుణ వ్యవహారంపై పత్రికల్లో వచ్చిన కథనాలతో చలించిపోయిన ప్రధాన న్యాయమూర్తి ఈ ఘటనను సుమోటోగా పరిగణించారు. ఈ వ్యాజ్యంపై సోమవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ స్పందిస్తూ.. యాదాద్రి ఘటనపై ఇప్పటి వరకు నమోదు చేసిన కేసులు, జరిపిన అరెస్టులు వివరాలను కోర్టు ముందుంచారు. కొందరిపై పీడీ యాక్ట్ కూడా ప్రయోగించామన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. బాధితులను రక్షించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని, ఇలాంటివి పునరావృత్తం కాకుండా ఏం చర్యలు తీసుకోబోతున్నారని ప్రశ్నించింది. ఘటన జరిగిన తీరును చూస్తుంటే.. నిర్వాహకులు, అధికారులు కుమ్మక్కయ్యారనే అనుమానం వస్తోందని పేర్కొంది. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసే అంశంపై ప్రభుత్వ వైఖరేంటో తెలియచేయాలని ఆదేశించిన ధర్మాసనం.. ఈ సిట్‌లో మహిళాధికారులకు తగిన ప్రాధాన్యత ఉండాలని తేల్చిచెప్పింది. వర్ణనాతీత వేదనకు పరిహారం సరిపోతుందా? అమాయకులైన చిన్నారులకు హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చిన వైద్యుడికి కూడా బెయిల్ రావడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసింది. ఈ వైద్యుడిపై నేరపూరిత కుట్ర (ఐపీసీ సెక్షన్ 120(బీ)కింద) కేసు ఎందుకు నమోదు చేయలేదని పోలీసులను నిలదీసింది. ఈ సమయంలో అదనపు ఏజీ జె. రామచంద్రరావు జోక్యం చేసుకుంటూ బాధితులకు పరిహారం చెల్లించామని చెబుతుండగా.. ధర్మాసనం జోక్యం చేసుకుని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘తమపై అరాచకంగా వ్యవహరించిన నరకకూపంలో మగ్గిన చిన్నారులు పడ్డ వర్ణనాతీత వేదనకు పరిహారం ఇస్తే సరిపోతుందా?’ అంటూ మండిపడింది. పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో ఇటువంటి హేయమైన ఘటనలు జరుగుతున్నా.. తెలియలేదంటే ఏం చేస్తున్నారని ఇంటెలిజెన్స్‌ను, ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై అదనపు ఏజీ సమాధానమిస్తూ.. అసలు వ్యభిచారం జరుగుతున్నట్లు చుట్టుపక్కల వారికీ తెలియదని చెప్పారు. దీనిపైనా ధర్మాసనం మండిపడింది. దారుణమైన అరాచకాన్ని నిరోధించలేకపోవడానికి ఇలాంటి వాదనలు ఎంత మాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేసింది. పత్రికల్లో వచ్చిన కథనాలపై అదనపు ఏజీ అభ్యంతరం వ్యక్తం చేయగా.. ‘మేం పత్రికా కథనాలపై పూర్తిగా ఆధారపడలేదు. జిల్లా జడ్జీ నుంచి కూడా నివేదిక కూడా తెప్పించుకున్నాం’ అని వెల్లడించింది. అవసరమైతే ఈ కేసులో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసేందుకు సైతం ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. మంగళవారం నాటి విచారణకు యాదాద్రి డీసీపీ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. -
యాదగిరిగుట్ట: ఐదుగురు ఉమెన్ ట్రాఫికర్స్ అరెస్టు!
సాక్షి, యాదాద్రి : పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదిద్రిలో చిన్నారులను అక్రమంగా తరలిస్తూ.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఐదుగురు ఉమెన్ ట్రాఫికర్స్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బాలికలను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు యాదగిరి గుట్టలో దాడులు నిర్వహించారు. బ్రోతల్ హౌజ్‌లపై దాడులు నిర్వహించి.. వారి చెరలో ఉన్న ఏడుగురు చిన్నారులకు విముక్తి కల్పించారు. జిల్లాల్లో ఇప్పటి వరకు 24 మంది ఉమెన్ ట్రాఫికర్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఏడు బ్రోతల్ హౌజ్‌లను సీజ్ చేశారు. -
‘తల్లి’డిల్లుతున్నారు..
యాదగిరిగుట్ట(ఆలేరు) : ‘‘ముక్కు పచ్చలారని మా పిల్లలను కొందరు దుండగులు మా నుంచి దూరం చేశారు. ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా దొరికిన పిల్లలపై వస్తున్న కథనాలను చూసి మా పిల్లల ఆచూకీ కోసం వచ్చాం. ఇటీవల వ్యభిచార ముఠా చెర నుంచి విముక్తి పొందిన పిల్లల్లో మా పిల్లలు ఉన్నారేమో చూడండి’ అని తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుంచి తల్లిదండ్రులు యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఏసీపీ, సీఐలను ఆశ్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన మతం చిన్న దిబ్బయ్య–విశ్రాంతమ్మ దంపతులు తన కూతురు చిన్ని మార్కపురం వద్ద హాస్టల్లో చదువుకుంటూ 2017 నుంచి కనిపించడం లేదని యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అదేరోజు ఈసీఐఎల్‌కు చెందిన అనురాధ–కృష్ణ దంపతులు తమ కూతురు ఇందు 2014 లో కుషాయిగూడలో వినాయకచవితి పండగ నుంచి కనిపించకుండా పోయిందని కలిశారు. 15మంది చిన్నారుల్లో తమ కూతురు కల్పన ఉండొచ్చని బొమ్మలరామారం మండలం మైసిరెడ్డిపల్లికి చెందిన తుంగని నందం–భాగ్యమ్మ దంపతులు యాదగిరిగుట్ట టౌన్ సీఐ అశోక్ కుమార్‌ను ఈనెల 4న∙కలిశారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం చిన్నకోడూర్‌కు చెందిన ఆరేళ్ల ఎల్లమ్మ 27–7–2018 నుంచి కనిపించడం లేదని పాప తండ్రి పెద్ద నర్సింహులు ఈనెల 5వ తేదీన యాదగిరి గుట్ట పోలీసులను ఆశ్రయించారు. విజయవాడలోని మచ్చనారాయణపురానికి చెందిన మూడేళ్ల చిన్నారి త్రివేణి అక్కడ రైల్వే స్టేడియం దగ్గర 22–8–2015న కూర్చోని రో డ్డుపైకి వెళ్లి వచ్చే సరికి కనిపించడం లేదని ఆమె తండ్రి రెడ్డి రమణ 5వ తేదీన వచ్చారు.విజయవాడకు చెందిన మల్లీశ్వరి–కుమారుల మూడో కుమార్తె గరికపాటి అనుష(4) 24–4–2017న ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్లారని ఈనెల 5న పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. గోషమాల్లోని బేగంబజార్‌కు చెందిన ఆరేళ్ల కుమారి రజిత 2006 నుంచి కనిపించకుండా పోయిందని, అప్పటి నుంచి తన కూతురిని వెతుకుతున్నామని తండ్రి మల్లేష్ యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌కు ఈనెల 6వ తేదీన వచ్చాడు. వరంగల్ జిల్లా కేంద్రంలోని చిత్రాసికుంటకు చెందిన అయిలమ్మ తమ కూతురు ప్రవళిక(26)తో పాటు మనవరాల్లు కూతుర్లు వైష్ణవి (4), విశాల(3)లు ఏడాది క్రితం ఇంటి నుంచి కనిపించకుండా పోయారని వచ్చింది. అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన మధులత–భగవాన్ దంపతులు ఐదేళ్ల కూతురు లిఖిత 5–8–2012లో తమ హోటల్లో పనికోసం వచ్చిన ఓ వ్యక్తి ఎత్తుపోయాడని 7వ తేదీన (మంగళవారం) తల్లి మధులత యాదగిరిగుట్ట సీఐ అశోక్‌కు ఆశ్రయించి తమ పిల్లల ఆచూకీ తెలిపాలని కోరారు. డీఎన్ఏ టెస్టులు చేయిస్తాం.. ఇటీవల వ్యభి చా ర గృహాల నిర్వాహకుల నుంచి విముక్తి పొందిన చిన్నారుల్లో ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్ ప్రజ్వల హోమ్స్‌లో 11మంది, మరో నలుగురు స్త్రీ, శిశు సంక్షేమ సంరక్షణలో క్షేమంగా ఉన్నారు. పిల్లలు తప్పిపోయినప్పుడు ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన సమయంలో ఇచ్చిన ఫొటోలను కొంతమంది తల్లిదండ్రులు తీసుకువచ్చి చూపెడుతున్నారు. చిన్నారులకు, వారి తల్లిదండ్రులుగా వచ్చిన వారికి డీఎన్ఏ పరీక్షలు చేయించిన తర్వాత అప్పగిస్తాం. – అశోక్‌కుమార్, టౌన్ సీఐ, -
‘మా పిల్లల్లాగే ఉన్నారు’ !
యాదగిరిగుట్ట(ఆలేరు) : ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా ఇటీవల పోలీసుల దాడుల్లో వ్య భిచార ముఠా చెర నుంచి విముక్తి పొందిన చిన్నారులు తమ పిల్లల్లాగే ఉన్నారని వరంగల్ జిల్లా కేంద్రంలోని చిత్రాసికుంటకు చెందిన అయిలమ్మ యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. తమ కూతురు ప్రవళిక(23)తో పాటు మనమరాళ్లు వైష్ణవి (3), విశాల(2)లు ఏడాది క్రితం ఇంటి నుంచి కనిపించకుండా పోయారని అయిలమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. అప్పటి నుంచి వివిధ ప్రాం తాల్లో వెతికామని, అయినా ఫలితం కనిపించలేదని కన్నీటిపర్యంతమైంది. ఇటీవల యాదగిరిగుట్టలో 15 మంది చిన్నారులు దొరి కారని పేపరు, టీవీల్లో చూశామని, అందులో ఓ అమ్మాయి తమ మనవరాలు వైష్ణవి లాగానే కనిపించిందని తెలిపింది. పిల్లలను చూసేందుకు యాదగిరిగుట్టకు వచ్చినట్లు ఆమె వెల్లడించింది. -
సమగ్రత కొరవడిన బిల్లు
మనుషుల అక్రమ తరలింపును సమర్ధవంతంగా అరికట్టేందుకు వీలుగా చట్టం తీసుకురావాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించిన పద్నాలుగేళ్లకు ఆ అంశంపై రూపొందించిన బిల్లు లోక్‌సభ ఆమోదం పొందింది. వ్యక్తుల అక్రమ తరలింపు(నిరోధం, పరిరక్షణ, పునరావాసం) బిల్లు తొలిసారి మనుషుల్ని అమ్మడం, కొనడం నేరంగా పరిగణించింది. అత్యంత అనాగరికమైన ఈ దుర్మార్గం ప్రపంచంలోని అనేక దేశాలతోపాటు మన దేశంలో కూడా ఎన్నాళ్లనుంచో వేళ్లూనుకుంది. దీని వెనక మాఫియా ముఠాలు పని చేస్తున్నాయి. ఇంకా కళ్లు తెరవని పసి గుడ్డుల నుంచి బాల బాలికలు, యువతుల వరకూ దీని బారిన పడనివారంటూ లేరు. మాఫియా ముఠాలు బాధితులను ఒక రాష్ట్రంలో ఓ మూల నుంచి మరో మూలకు తరలించటం మాత్రమే కాదు...రాష్ట్రాలు దాటిస్తున్నారు. కొందరిని వేరే దేశాలవారికి అమ్ముతున్నారు. అలాగే బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ తదితర దేశాలనుంచి యువతులను ఇక్కడకు తీసుకొచ్చే ముఠాలు కూడా ఉన్నాయి. ఈ దారుణాన్ని నిరోధించి, నేరగాళ్లను కఠినంగా శిక్షించడానికి అనువైన చట్టాలను తీసుకురావాలన్న ఐక్యరాజ్యసమితి ఒడంబడికపై మన దేశం కూడా సంతకం చేసింది. ఈమధ్య తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రిలో అనేకమంది పిల్లల్ని పో లీసులు కాపాడారు. చాక్లెట్లు ఆశ చూపటం దగ్గర నుంచి మాయమాటలు చెప్పి వలలో వేసుకోవటం వరకూ ఈ ముఠాలు అనేక రూపాల్లో మనుషుల్ని మాయం చేస్తున్నారు. ఇలా తరలిస్తున్న వారిని వివిధ రకాల పనులకు వినియోగిస్తున్నారు. బాలికలు, యువతులు అయితే వ్యభిచారంలోకి, మగ పిల్లల్ని వెట్టి చాకిరీకి అమ్మడం యధేచ్ఛగా సాగుతోంది. బాలికలపై అమానుషంగా హార్మోన్ ఇంజ క్షన్లు ప్రయోగించి వారిని చిన్న వయసునుంచే వ్యభిచారం రొంపిలోకి దింపుతున్నారు. పిల్లల అవయ వాలు తొలగించి వారిని భిక్షాటనకు వినియోగిస్తున్నారు. వలస పాలకుల హయాంలో 1860లో వచ్చిన భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 370, 1976 నాటి వెట్టి చాకిరీ వ్యవస్థ(నిర్మూలన) చట్టం, 1956నాటి అనైతిక తరలింపు(నిరోధక) చట్టం ఇంతవరకూ మనుషుల అక్రమ తరలింపు కేసుల్లో పట్టుబడిన నిందితులపై ప్రయోగిస్తున్నారు. పిల్లల అక్రమ తరలింపుపై ఎన్నో ఫిర్యాదులొస్తున్నా దాన్ని నేరంగా పరిగణించాలని 2013 వరకూ కేంద్రం అనుకోలేదు. ఆ ఏడాది ఐపీసీ సెక్షన్ 370లో ఆ నేరాన్ని కూడా చేర్చారు. అయినా ఈ చట్టాలేవీ ఆచ రణలో అక్కరకు రాలేదు గనుకనే సమగ్రమైన కఠిన చట్టం తీసుకురావాలని ఆదేశించమంటూ సుప్రీం కోర్టులో 2004లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఇప్పుడు ప్రవేశపెట్టిన బిల్లు ఈ చట్టాలతో పోలిస్తే అనేక విధాల మెరుగైనదే. ముఖ్యంగా మనుషుల అక్రమ తరలింపును తొలిసారి ఒక సంఘ టిత నేరంగా గుర్తించింది. అది ప్రశంసించదగ్గది. అలాగే బాధితుల మానసిక, సామాజిక, ఆర్థిక సమ స్యలను కూడా ఇది పరిగణనలోకి తీసుకుంది. తమను అక్రమంగా తరలించారని బాధితులు నిరూ పించుకోవటం కాక, తాము నేరానికి పాల్పడలేదని నిందితులే రుజువు చేసుకోవాల్సిన స్థితి కల్పిం చటం కూడా ఆహ్వానించదగ్గదే. అయితే సమగ్రత పేరుతో తీసుకొచ్చిన కొన్ని అంశాలు బాధితులను ఇబ్బందుల్లో పడేస్తాయని పౌర సమాజ కార్యకర్తలు, బాలల హక్కుల కార్యకర్తలు, మహిళా సంఘాల ప్రతినిధులు, ఈ రంగంలో పనిచేసే న్యాయవాదులు అంటున్నారు. ఇప్పుడున్న చట్టాల్లో లోటు పాట్లున్నాయని చెబుతూ తీసుకొచ్చిన బిల్లులో సైతం సమగ్రత కొరవడితే అనుకున్న లక్ష్యమెలా నెర వేరుతుందని వీరు ప్రశ్నిస్తున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకోవటంలో ప్రభుత్వానికొచ్చిన ఇబ్బందే మిటో అర్ధంకాదు. ముఖ్యంగా అక్రమ తరలింపుల వల్ల బాధితులుగా మారేవారినీ, మరో దారి లేక వ్యభిచార వృత్తి చేస్తున్నవారినీ ఒకే గాటన కట్టడం ఈ బిల్లు ప్రధాన లోపం. ఇప్పుడున్న వివిధ చట్టాలు వ్యభిచారం చేస్తున్నవారిని నేరస్తులుగా పరిగణిస్తున్నాయి తప్ప విటులను నేరగాళ్లుగా గుర్తించటం లేదు. ఇప్పుడు తీసుకొచ్చిన బిల్లు చట్టమైతే పట్టుబడిన సెక్స్ వర్కర్లను వారి అభీష్టానికి భిన్నంగా పునరావాస కేంద్రా లకు తరలించాల్సి ఉంటుంది. అలాగే హెచ్ఐవీ వంటి ప్రమాదకర వ్యాధుల్ని సంక్రమింపజేసేవారికి బిల్లు కఠిన శిక్షలను ప్రతిపాదిస్తోంది. దీన్ని ఖచ్చితంగా సెక్స్‌వర్కర్లకు వ్యతిరేకంగా వినియోగిస్తారన్న అనుమానాలున్నాయి. అలాంటి భయం అవసరం లేదని బిల్లుపై చర్చ జరిగినప్పుడు మహిళా, శిశు సంక్షేమ మంత్రి మేనకాగాంధీ హామీ ఇచ్చారు. అయితే ఆ సంగతిని బిల్లు స్పష్టంగా చెప్పడం లేదు. దీని రూపకల్పనలో కేవలం సాంఘిక నైతికతను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు తప్ప రాజ్యాంగ నైతికతను పట్టించుకోలేదని మేనకా గాంధీకి సెక్స్‌వర్కర్లు లేఖ రాశారు. మనుషుల అక్రమ తరలింపు వ్యవహారం అత్యంత సంక్లిష్టమైనది. తమ పిల్ల లేదా పిల్లవాడు తప్పిపోయాడని పోలీస్స్టేషన్లకు ఫిర్యాదు చేయడానికెళ్తే వాటిని స్వీకరించటంలోనే అలసత్వం ప్రదర్శిస్తారు. తప్పిపోయింది యుక్త వయసు బాలికైతే పోలీసుల నుంచి వచ్చే హితవచనం ‘మీ అమ్మాయి ఎవరితోనైనా ఇష్టప్రకారం వెళ్లిపోయిందేమో చూసుకోండ’న్నదే. దిక్కూ మొక్కూ లేనివారి ఫిర్యాదులు వారికి పట్టనే పట్టవు. అందుకే పోలీసు విభాగాన్ని చైతన్యవంతం చేయాలి. మనుషుల అక్రమ తరలింపునకు సంబంధించి నిరుడు దేశవ్యాప్తంగా 8,132 కేసులు నమోదయ్యాయి. ఈ అక్రమ తరలింపుల్లో 59 శాతంమంది బాధితులు పిల్లలే. బాధితులపై మాదకద్రవ్యాలు, రసాయ నాలు, హార్మోన్లు ప్రయోగించటం, వెట్టిచాకిరీ చేయించటం వగైరాలను ఈ బిల్లు నేరాలుగా పరిగ ణించి వాటికి కఠిన శిక్షలు ప్రతిపాదించింది. గత మూడేళ్లుగా వివిధ సంస్థలతో, సంఘాలతో చర్చించి ఈ బిల్లు రూపొందించామంటున్నారు. అది నిజమే అయినా ఇప్పుడొస్తున్న అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. అలాగైతేనే ఒక సమగ్రమైన చట్టం రూపుదాలుస్తుంది. మనుషుల తరలింపు దుర్మార్గం అంతమవుతుంది. -
ఆర్ఎంపీల ధనదాహం
యాదగిరిగుట్ట(ఆలేరు) : అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొంతమంది ఆర్ఎంపీ వైద్యులు తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు. ఎలా ంటి అనుభవం లేకున్నా .. తమకు తెలిసిన వై ద్యంతో ప్రజ లకు వైద్యం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. పట్టణంలోని గణేష్‌నగర్‌లో ఇటీవల కొంతమంది ఆర్ఎంపీలు డబ్బులకు ఆశపడి వ్యభిచార నిర్వాహకులతో చేతులు క లిపి చిన్నారులకు హర్మోన్గ్రోత్ ఇం జక్షన్లు ఇచ్చి అక్రమంగా సంపాదిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు వ్యభిచారగృహాల్లో జ్వరా లు, అస్వస్థతకు గురైన మహిళలకు ఇంటింటికి వెళ్లి వైద్యం చేసే ఆర్ఎంపీలు నేడు పట్టణంలో ఆస్పత్రులను సైతం ఏర్పాటు చేసుకున్నారంటే ఈ దందా ఎంతగా సాగుతుందో ఇట్టే అర్థమవుతోంది. అసలు ఏం జరుగుతోంది.. యాదగిరిగుట్ట పట్టణంలో జూలై 30వ తేదీన ఓ చిన్నారిని చిత్రహింసలు పెడుతున్నట్లు తెలియడంతో ఎస్వోటీ, షీటీం, ఐసీడీఎస్, స్థానిక పోలీసులు ఆ ఇంటిపై దాడులు చేశారు. దీంతో చిన్నారులను అక్రమంగా అమ్మకాలు చేస్తున్న వ్యభిచారగృహ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నా రు. వారిని పోలీసులు లోతుగా విచారించడంతో చిన్నారుల శరీర ఎదుగుదలకు స్థానికంగా కొంత మంది వైద్యుల వద్ద హర్మోన్గ్రోత్కు సంబంధించిన ఈస్ట్రోజన్, ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు ఇస్తునట్లు తెలిపారు. దీంతో దర్యాఫ్తు ముమ్మరం చేసిన పోలీ సులు గురువారం పట్టణంలోని అనురాధ నర్సిం గ్‌హోం పై రాచకొండ సీపీ మహేష్‌భగవత్ ఆదేశాలతో ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. తీగ లాగితే డొంక కదిలినట్లు.. ఈ దాడుల్లో సుమారు 48 హర్మోన్ గ్రోత్‌కు సంబంధించిన ఆక్సిటోసిన్ ఇంజకన్ల శాంపిల్స్ దొరికాయి. అంతే కాకుండా ఆర్ఎంపీ వైద్యుడిగా కొనసాగుతున్న అనురాధ నర్సింగ్ హోం వైద్యుడు నర్సింహ ఎలాంటి అనుమతులు లేకుండా సిజేరియన్, అబార్షన్, పిల్లలు కాకుండా ఆపరేషన్, హెన్రీయా ఆపరేషన్లు చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. దీంతో డీసీపీ రాంచంద్రారెడ్డి ఆస్పత్రి నిర్వాహకుడు నర్సింహను విచారించి రిమాండ్‌కు పంపారు. ఇంకా ముగ్గురు ఎక్కడ..? చిన్నారులకు హర్మోన్గ్రోత్ ఇంజక్షన్లు ఇస్తుంది నలుగురు డాక్టర్లని పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. కానీ ఇప్పటికే అనురాధ నర్సింగ్ హోం వైద్యుడు నర్సింహ పట్టుబడ్డాడు. ఇంకా ముగ్గురు వైద్యులు ఎవరు.. వారి ఆస్పత్రులు ఎక్కడ ఉన్నాయని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇందులో ఒకరు భువనగిరి నుంచి గణేష్‌నగర్‌కు వచ్చి చిన్నారులకు ఇంజక్షన్లు ఇస్తున్నట్లు తెలిసిం ది. యాదగిరిగుట్ట పట్టణంలోని మరో ఇద్దరు ఆర్ఎంపీ డాక్టర్లు ఈ దారుణాలకు సహకరిస్తు ఇంజక్షన్లు ఇస్తున్నారని సమాచారం. దీంతో ఆ ముగ్గురు వైద్యులు ఎవరు అనే చర్చ యాదగిరిగుట్ట పట్టణంలో జోరుగా సాగుతోంది. మరో రెండ్రోజుల్లో ఆ ముగ్గురు వైద్యులను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వ్యభిచారగృహాలకు సమీపంలోఆస్పత్రులు.. గణేష్‌నగర్‌లో ఉండే వ్యభిచార నిర్వాహకులకు అ త్యంత సమీపంలో అనురాధ నర్సింగ్ హోంతో పాటు పలు ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయి. దీంతో ఎక్కువగా ఈ ఆస్పత్రులకే వ్యభిచారగృహ నిర్వాహకులు వెళ్తున్నట్లు తెలుస్తోంది. దీంతో దగ్గర్లో ఉన్న ఆర్ఎంపీలతో పరిచయం పెంచుకుని ఇలా ంటి నీచ సంస్కృతికి తెర తీసినట్లు స్థానిక ప్రజల్లో చర్చ జరుగుతోంది. అంతే కాకుండా మంగళగిరి, జగిత్యాల, ఉభయగోదావరి, వరంగల్ ప్రాంతా ల్లో ఉండే వ్యభిచార నిర్వాహకుల బంధువుల ద్వా రా ఈ ఇంజక్షన్లు తెలుసుకుని ఇక్కడి చిన్నారులకు ఇస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. -
యాదగిరిగుట్ట వ్యభిచార గృహాల్లో భయంకర వాస్తవాలు
-
నేలకింద బందీలు
సాక్షి, యాదాద్రి: ఇరుకు గదులు.. మంచం పట్టేంత జాగా.. ఆ మంచం కింద నేలమాళిగలు.. వాటిలో ఒక్కరిద్దరు మనుషులు పట్టేంత స్థలం..! ఇంటి ఆవరణ, ఖాళీ ప్రదేశాల్లో మ్యాన్‌హోల్స్.. ఎవరికీ అనుమానం రాకుండా వాటిపై మంచాలు, టేబుళ్లు.. అవి తెరిచి చూస్తే ఓ మనిషి పట్టేంత జాగా..!ఎందుకు ఈ ఏర్పాట్లన్నీ? వ్యభిచార గృహాలపై పోలీసులు రైడింగ్ చేస్తే బాలికలు, యువతులను దాచిపెట్టేందుకు! చిన్నారుల శరీరాలతో సాగిస్తున్న తమ వికృత క్రీడను కప్పిపెట్టేందుకు. ఊపిరి కూడా ఆడని ఆ నేలమాళిగలు, మ్యాన్‌హోల్స్‌లో చిన్నారుల ఆర్తనాదాలను అదిమిపెట్టేందుకు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట వ్యభిచార గృహాల్లో వెలుగు చూస్తున్న భయంకర వాస్తవాలివీ. అచ్చు ముంబైలోని రెడ్‌లైట్ ఏరియా తరహాలో సాగుతున్న ఈ రాకెట్ వెనుక విస్తుగొలిపే అంశాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. పిల్లల శరీర అవయవాలు పెరిగేందుకు ఇంజెక్షన్ల ద్వారా ఈస్ట్రోజన్ హార్మోన్లు ఇవ్వడం, వ్యభిచారం చేయాల్సిందిగా రాచిరంపాన పెట్టడం, దాడుల సమయంలో దాచేందుకు పక్కాగా నేలమాళిగలు, మ్యాన్‌హోళ్ల నిర్మాణాలు.. ఇవన్నీ చూసి పోలీసులే అవాక్కవుతున్నారు. ఈ చీకటి కూపాల నుంచి ఇప్పటికే 11 మంది చిన్నారులను కాపాడిన పోలీసులు.. గురువారం ఇంకో నలుగురిని రక్షించారు. మరో ఆరుగురు వ్యభిచార గృహాల నిర్వాహకుల అరెస్టు చేశారు. బాలికలకు ఈస్ట్రోజన్ ఇంజెక్షన్లు ఇస్తున్న ఆర్ఎంపీ డాక్టర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో ఇలాగే మరికొందరు పిల్లలు వ్యభిచార గృహాల్లో మగ్గుతున్నట్టు తెలుస్తోంది. రావడం ఆలస్యమైతే ప్రాణాలకే ప్రమాదం యాదగిరిగుట్ట నుంచి పాతగుట్టకు వెళ్లే ప్రధాన రహదారిలో పట్టణం నడిబొడ్డున ఉన్న వ్యభిచార గృహాల్లో ఈ నేలమాళిగలు వెలుగు చూశాయి. ఎవరైనా అధికారులు, పోలీసులు వస్తున్నారన్న అనుమానం వస్తే చాలు నిర్వాహకులు.. చిన్నారులు, యువతులను అందులోకి పంపించేస్తారు. వారు వెళ్లిపోయాక అందులోంచి బయటికి తెస్తారు. ఎవరూ గుర్తించలేని విధంగా వీటి నిర్మాణం ఉంటుంది. భూగృహాల్లో ఇద్దరు చిన్నారుల వరకు కూర్చునే వీలుంటుంది. బయటకు రావడం ఆలస్యమైతే ఊపిరి ఆడక అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. గతంలో పిల్లలు ఇలా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉండొచ్చని స్థానికులు అంటున్నారు. ఇలాంటి గదులు ముంబై రెడ్‌లైట్ ఏరియాలో ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. అలాగే ఇంటి వరండా, ఖాళీ స్థలాల్లోనూ ఇలాంటి ఏర్పాట్లే వెలుగుచూశాయి. మనిషి పట్టేంత గుంతలు తీసి పైన మ్యాన్‌హోల్స్‌ను ఏర్పాటు చేస్తారు. ఎవరికీ అనుమానం రాకుండా వాటిపై మంచాలు, టేబుళ్లు పెడతారు. అలాగే బీరువాలు, కప్‌బోర్డులు, డోర్ల వెనుక పిల్లలను నక్కి ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇబ్బడిముబ్బడిగా ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు పిల్లలకు ఈస్ట్రోజన్ ఇంజెక్షన్ ఇస్తున్నాడన్న అనుమానంతో యాదగిరిగుట్టలోని అనురాధ నర్సింగ్‌హోంపై ఎస్వోటీ పోలీసులు దాడి చేసి ఆర్ఎంపీ వైద్యుడు నర్సింహను అరెస్ట్ చేశారు. అతడిని విచారణలో పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలికల అవయవాల ఎదుగుదల కోసం ఈస్ట్రోజన్ ఇంజెక్షన్ ఇస్తున్నట్టు తేలింది. దీంతోపాటు 48 ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇతడి వద్ద దొరికాయి. పాడి పశువుల నుంచి అధిక పాలను తీయడానికి ఈ ఇంజెక్షన్‌ను వాడుతారు. ప్రభుత్వం ఈ ఆక్సిటోసిన్‌ను నిషేధించింది. మరిన్ని దాడులకు పోలీసులు సిద్ధం యాదగిరిగుట్టతోపాటు రాజధాని శివారులోని మరికొన్ని చోట్ల దాడులు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. పోలీసుల దాడుల నేపథ్యంలో వ్యభిచార గృహ నిర్వాహకులు చిన్నారులను శివారు కేంద్రాల్లో దాచి ఉంచినట్లు తెలుస్తోంది. ఇంజెక్షన్లు ఇవ్వడంలో మరో ఇద్దరు ఆర్ఎంపీ డాక్టర్ల పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వ్యభిచార గృహ నిర్వాహకులు పిల్లల్ని కొనుగోలు చేసందుకు కొందరు ఫైనాన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు వారి కోసం ఆరా తీస్తున్నారు. -
కారు చీకట్లో కంటి దీపాలు!
23.. గత 24 గంటల్లో తెలంగాణలో కిడ్నాప్ అయిన చిన్నారుల సంఖ్య ఇదీ! వారిలో పోలీసులు 9 మందిని కాపాడారు.ఇంకా 14 మంది జాడ తెలియరాలేదు. 2,283.. గత ఏడాది కాలంగా రాష్ట్రంలో తప్పిపోయిన చిన్నారుల సంఖ్య ఇది. వారిలో పోలీసులు 1,371 మందిని కిడ్నాప్ ముఠాల నుంచి కాపాడారు. ఇంకా 912 మంది చిన్నారులు ఎక్కడున్నారో.. ఎలా ఉన్నారో ఎవరికీ తెలియదు! 6,088.. పోలీసు లెక్కల ప్రకారం ఏపీ, తెలంగాణల్లో 2010–16 మధ్య కనిపించ కుండా పోయిన మహిళల సంఖ్య ఇది. వీరంతా ఎటు పోతున్నారు? ఏమై పోతున్నట్టు? సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్ : యాదగిరిగుట్ట వ్యభిచార గృహాల నుంచి 11 మంది బాలికలను పోలీసులు కాపాడిన నేపథ్యంలో ఈ ప్రశ్నలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా మాయమవుతున్న చిన్నారులు, మహిళలపై ‘సాక్షి’ దృష్టి సారించగా విస్మయకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. మహిళల అక్రమ రవాణాకు తెలంగాణ, ఏపీలో అనేక గ్యాంగ్‌లు పని చేస్తున్నాయి. చిన్నపిల్లలు, యుక్తవయసులో ఉన్న పేద ఆడపిల్లలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను గుర్తించడమే ఈ ముఠాల పని. ఇందుకు వారు పెద్ద నెట్‌వర్క్‌నే నడుపుతున్నారు. ఈజీగా వలలో పడే మహిళల వివరాలు ఇస్తే రూ.25 వేల నగదును అందజేస్తూ కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారు. ఓ పోలీసు అధికారి చెప్పిన వివరాల ప్రకారం హైదరాబాద్, విజయవాడలో ఇలాంటి గ్యాంగ్‌లు వందకు పైగానే ఉన్నాయి. వీరి కింద దాదాపు ఐదు వేల మంది ఏజెంట్లు పని చేస్తుంటారు. మాయమాటలు.. కిడ్నాప్‌లు.. ఈజీ మనీకి అలవాటుపడ్డ ముఠాలు చిన్నారులు, యుక్తవయసు ఆడపిల్లలు, మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామని, చదువు చెప్పిస్తామని మాయమాటలతో నమ్మించి నట్టేట ముంచుతున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలను టార్గెట్ చేసుకుని.. విదేశాల్లో పనిమనుషులుగా మంచి వేతనాలు ఇప్పిస్తామంటూ మహిళలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. మోసపోయిన నెల, ఆరు నెలల తర్వాత బాధితుల తరఫు బంధువులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ విషయంలో చైతన్యం తెచ్చేందుకు ఎంతగా ప్రయత్నించినా ఫలితం ఉండటం లేదని ‘ఆపరేషన్ ముస్కాన్’లో పని చేసిన ఓ పోలీసు అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కరీంనగర్ జిల్లాలోని ఒక గ్రామంలో పది కుటుంబాలకు చెందిన మహిళలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని, నెలకు రూ.25 వేలు ఇంటికి పంపిస్తానని తల్లిదండ్రులు, భర్తలకు ఆశ చూపి తీసుకెళ్లాడు ఓ మోసగాడు. వరుసగా నాలుగు మాసాల పాటు డబ్బులు పంపాడు. తర్వాత మరో ఐదుగురు ఇంటర్ చదివే అమ్మాయిలను తీసుకెళ్లాడు. ఇది జరిగి రెండున్నర సంవత్సరాలవుతోంది. ఇప్పుడు వాళ్లు ఎక్కడ ఉన్నారో తెలియదు’’ అని ఆ పోలీసు అధికారి పేర్కొన్నారు. హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న విషయం తెలిసి అతని సమీప బంధువు పదో తరగతి పాసైన అతని కూతురుకు నెలకు రూ.30 వేల ఉద్యోగం ఇప్పిస్తానని ముంబై తీసుకెళ్లాడు. ఏడాది దాటినా కూతురు ఆచూకీ తెలియకపోవడంతో తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఉద్యోగం ఇప్పిస్తానని కూతురిని తీసుకువెళ్లిన బంధువు జాడ కూడా తెలియలేదు. దాదాపు రెండేళ్ల పాటు పుణెలోని వ్యభిచార గృహాల్లో చిత్రహింసలు భరించిన ఆ బాలికను పోలీసులు కాపాడారు. ఆ అమ్మాయి బయటకు వచ్చి అసలు విషయం చెప్పేదాకా ఆమె ఎంత నరకం అనుభవించందో తెలియదు. ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకువెళ్లిన వ్యక్తి ఆమెను రూ.లక్షకు ఓ వ్యభిచార గృహానికి అమ్మేశాడు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి వెతలెన్నో కనిపిస్తున్నాయి. కిడ్నాప్ చేసి అమ్మేస్తున్నారు ఆరు నుంచి పదేళ్ల వయసున్న అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్న ముఠాలు వారిని ముంబై, పుణె, ఢిల్లీలోని వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నాయి. చిన్న పిల్లలు తప్పిపోతున్నట్లు అనేక ఫిర్యాదులు వస్తుండటంతో తెలంగాణ పోలీసు శాఖ ‘ముస్కాన్’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆపరేషన్ స్మైల్ పేరుతో పోలీసులు గడచిన మూడున్నర సంవత్సరాల్లో 25,834 మందిని కాపాడారు. వీరిలో 12,483 మంది పిల్లల్ని వారి తల్లిదండ్రులకు అప్పగించగా 13,351 మందిని సేŠట్ట్ హోమ్‌కు తరలించారు. -
11మంది చిన్నారులకు విముక్తి
యాదగిరిగుట్ట(ఆలేరు) : బాలికల అక్రమ రవాణాలో 8మంది వ్యభిచార గృహా నిర్వాహకులను అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపినట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. యాదగిరిగుట్టలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన బాలికల అక్రమ రవాణాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. యాదగిరిగుట్టలో వ్యభిచారగృహాల నుంచి 11మంది చిన్నారులకు విముక్తి కల్పించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించామన్నారు. జూలై 1వ తేదీ నుంచి నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా ఈనెల 30న యాదగిరిగుట్ట పట్టణంలోని బీసీ కాలనీలో ఓ అమ్మాయిని తల్లి చిత్రహింసలకు గురి చేస్తుందని స్థానికులు కొందరు షీటీం, ఐసీడీఎస్, ఎస్ఓటీ, చైల్డ్‌లైన్, పోలీస్‌లకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే కంసాని కల్యాణి ఇంటిపై దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. పట్టణంలోని గణేష్‌నగర్‌లో ఉంటున్న అనిత, సుశీల, నర్సింహ, శృతి, సరిత, వాణి, వంశీలు ఇతర ప్రాంతాల్లో ఉన్న మూడు నుంచి 5 సంవత్సాల పిల్లలను కొనుగోలు చేసి అమ్ముతున్నట్లు కల్యాణి చెప్పారని తెలిపారు. వారి ఇళ్లలో దాడులు నిర్వహించి 11 మంది చిన్నారులకు విముక్తి కల్పించామన్నారు. పిల్లలను విచారించిన తర్వాత వారు సొంత పిల్లలుకాదని, రైల్వే ఫ్లాట్ పాం, జనవాసాల్లో చాక్లెట్లు ఇస్తామని తీసుకువచ్చారని తెలిసిందన్నారు. చిన్నారులను ఇక్కడికి తీసుకువచ్చి వ్యభిచార గృహాల్లో ఉన్న మహిళలకు రూ.లక్షకు అమ్ముతున్నారని తెలిసిందన్నారు. గతంలో 5మందిపై పీడీ యాక్టులు పెట్టామని తెలిపారు. ఇందులో కంసాని యాదగిరి అనే వ్యక్తికి చిన్నారుల అక్రమ రవాణాతో సంబంధం ఉందని తెలిసిందన్నారు. చిన్నారులను అక్రమంగా కొనుగోలు చేసిన 8మంది ఇళ్లను సీజ్ చేయాలని ఆర్డీఓను కోరతామన్నారు. శారీరకంగా ఎదిగేందుకు ఇంజక్షన్లు... అక్రమంగా కొనుగోలు చేసిన చిన్నారులు 12 సంవత్సరాలు దాటిన తర్వాత తొందరగా శారీరకంగా ఎదిగే విధంగా ఓ ప్రైవేట్ డాక్టర్‌తో కలిసి హర్మోన్గ్రోత్కు సంబంధించిన ఈస్ట్రోజన్ అనే ఇంజక్షన్‌ను ఇప్పిస్తున్నారని తెలిపారు. ఇంజక్షన్లు ఇవ్వడంతో మైనర్లుగా ఉన్న బాలికలను వ్యభిచార కుంపిలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అక్రమ రవాణాను నిలుపుదలకు కృషి.. గత రెండేళ్ల కాలంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో అక్రమ చిన్నారులు, మహిళలు, అమ్మాయిల రవాణ జరగకుండా, వ్యభిచారం నిర్వహించకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సీపీ మహేష్‌భగవత్ తెలిపారు. ఇప్పటి వరకు 170 అక్రమ రవాణ కేసులు, 341 ఆర్గనైజర్లను, 208 మంది కస్టమర్లను అరెస్టు చేశామన్నారు. 268 మంది మహిళలను, చిన్నారులను రక్షించామని, 68 వ్యభిచార గృహాలను సీజ్ చేశామని చెప్పారు. మార్పు రానందుకే పీడీ యాక్టు.. పట్టణంలోని గణేష్ నగర్లో చేస్తున్న వ్యభి చారవృత్తిని మాన్పించేందుకే గత కొన్నేళ్లుగా నిర్వాహకులకు, యువతులకు అవగాహన సదస్సు నిర్వహిస్తు, పునారావసం కల్పిస్తున్నామన్నారు. అయిన వారిలో మార్పు రాకపోవడంతో ఇటీవల 5గురిపై పీడీ యాక్టు నమోదు చేశామన్నారు. పలువురికి రివార్డులు.. చిన్నారుల అక్రమ రవాణా నుంచి 11మందికి విముక్తి కలిగించినందుకు షీటీం, ఐసీడీఎస్, పోలీస్ శాఖల అధికారులకు సీపీ మహేష్‌భగవత్ రివార్డులను అందజేశారు. అందులో షీటీం ఎస్ఐ వీరభద్రయ్య, ఏఎస్ఐ కిష్టయ్య, పీసీ అనిల్, డబ్ల్యూహెచ్ రమ, హోంగార్డు నరేష్, ఎస్లోటీ ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్ గంగాధర్, రూరల్ సీఐ ఆంజనేయులు, టౌన్ సీఐ అశోక్‌కుమార్, ఏఎస్ఐ సోమయ్య, ముఖేష్, హెడ్ కానిస్టేబుల్ అశోక్, పీసీ శ్రీను, ఐసీడీఎస్ సీడీపీఓ చంద్రకళ, చైల్డ్‌లైన్ కో కన్వీనర్ రోహితలతో పాటు పలువురికి రివార్డును అందజేశారు. ఈ సమావేశంలో డీసీపీ రాం చంద్రారెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి శారద, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ప్రతినిధి నిమ్మయ్య, ఏసీపీ శ్రీనివాసచార్యులు తదితరులు ఉన్నారు. -
అక్రమ రవాణా.. ఎక్కడ యంత్రాంగం?
చీరాల: అబల ఇప్పుడు అమ్మకానికి ఆటబొమ్మగా మారింది. బాలికల అక్రమ రవాణా జిల్లా అడ్డాగా మారింది. వలస బతుకులు.. పేదరికం.. కారణంగా ఆడిపాడాల్సిన వయసులో బాలికలు ఆటబొమ్మలుగా మారుతున్నారు. తప్పిపోయిన బాలికల ఆచూకీ కూడా లభించడం లేదు. జిల్లాలో మార్కాపురం గ్రానైట్‌కు అంతర్జాతీయ ఖ్యాతి. చీరాల చేనేతల ఖిల్లా.. కారంచేడు, ఒంగోలు, మేదరమెట్ల సినీనటులకు, కళాకారులకు రాజకీయ వేత్తలకు పేరుగాంచింది. అన్నీ రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచి ప్రకాశిస్తున్న జిల్లా మానవ అక్రమ రవాణాలో కూడా మొదటి స్థానం పొందిందంటే జిల్లాలో మహిళ, బాలికల అక్రమ రవాణా ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చీరాలలో బాలికలు, మహిళల అక్రమ రవాణా, అదృశ్యాలు, లైంగిక దాడులు పెట్రేగి పోతున్నాయంటే క్షీరపురిలో అతివలు, బాలికల పరిస్థితిని అవగతనం చేసుకోవచ్చు. మూడు నెలల క్రితం చీరాల ఎన్ఆర్ అండ్ పీఎం హైస్కూల్ ఆవరణలో జాతీయ స్థాయిలో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పలు స్వచ్ఛంద సంస్థల సహకారం, జిల్లా న్యాయసేవాధికార సంస్ద ఆధ్వర్యంలో మహిళల అక్రమ రవాణా, మహిళా చట్టాలు, తక్షణ న్యాయ సాయం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారంటే జిల్లాతో పాటు చీరాల్లో బాలికలు, మహిళల అక్రమ రవాణా స్థాయిని అర్థం చేసుకోవచ్చు. చీరాల ప్రాంతంలో తరుచూ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. జిల్లా కేంద్రం ఒంగోలు తర్వాత పెద్ద పట్టణం చీరాల. వస్త్ర వ్యాపారానికి, చేతివృత్తులు, రోజువారీ కూలీ పనులకు, సుందరమైన సముద్ర తీరానికి వాడరేవు ప్రసిద్ధి. చీరాల పట్టణానికి గుంటూరు, నెల్లూరు, కడప, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటు తమిళనాడు, రాజస్థాన్, ఒడిశా, రాష్ట్రాల నుంచి వలస కూలీలు వచ్చి ఇక్కడ పనులు చేస్తుంటారు. ఉపాధి అవకాశాల కోసం వలస కూలీలకు అడ్డాగా చీరాల మారింది. మహిళలు, బాలికల అమాయకత్వం, నిరక్షరాస్యతలను ఆసరాగా చేసుకుని డబ్బు ఆశగా చూపించి లోబర్చుకోవడం, కొందరు చీరాల నుంచే మహిళలను ఇతర ప్రాంతాలకు విక్రయిస్తున్నారు. గతంలో ఎక్కడో ఒకచోట మహిళ అదృశ్యం అనే వార్తలు వినిపించేవి. చీరాల్లో మాత్రం ఇటీవల కాలంలో బాలిక, మహిళ అదృశ్యం పరిపాటిగా మారింది. చీరాల సబ్ డివిజన్ పరిధిలోని పోలీసుస్టేషన్లో ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనలు, బాలికలపై లైంగిక దాడులు అనేకం జరుగుతూనే ఉన్నాయి. 2015లో బాలికపై నలుగురు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో ఓ హోంగార్డు కూడా నిందితుడు కావడం గమనార్హం. పేరాల్లో కూడా బాలికపై 40 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మూడు రోజుల క్రితం జె.పంగులూరులో పదేళ్ల బాలికపై 40 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇలా చీరాల సబ్ డివిజన్లో లైంగిక దాడులు కేసులు అనేకం ఉన్నాయి. దీనిపై ఆందోళన వ్యక్తమవుతోంది. కఠినంగా వ్యవహరిస్తున్నాం: బాలికలు, మహిళలు అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాం. మేలుకొలుపు పేరుతో గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక వాహనం ద్వారా అవగాహన సదస్సులు నిర్వహిస్తుఆన్నం. పాఠశాలలు, కళాశాలల్లో బాలికల అక్రమ రవాణాపై సదస్సులు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నాం. చీరాల సబ్‌డివిజన్ పరిధిలో అక్రమ రవాణా, అదృశ్యం కేసులను చాలావరకు ఛేదించాం. ప్రధానంగా అక్రమ రవాణా చేసేవారితో పాటు అందుకు సహకరించడం, తోడ్పాటు అందించిన వారిపై ఫోక్సా వంటి కేసులు నమోదు చేస్తున్నాం. తల్లిదండ్రులు కూడా తమ బాధ్యతను గుర్తెరగాలి. పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ వంటి వాటిని దూరంగా ఉంచాలి. -జి.ప్రేమ్‌కాజల్, డీఎస్పీ, చీరాల చీరాల ప్రాంతంలో అధికం: జిల్లా వ్యాప్తంగా చీరాలలోనే బాలికలు, మహిళల అక్రమ రవాణా అధికంగా ఉంది. మాతో పాటు కొన్ని సర్వే సంస్థలు కూడా ఇదే అంశాన్ని గుర్తించాయి. కొన్ని సంస్థలు ఇదే విషయంపై హైకోర్టు, సుప్రీంకోర్టులకు నివేదికలు ఇచ్చాయి. దీని కారణంగా కొద్ది నెలల క్రితం బాలికల అక్రమ రవాణాపై హైకోర్టు జడ్జిల ఆధ్వర్యంలో దేశంలో మొదటిసారిగా ప్రత్యేక సదస్సు చీరాలలో నిర్వహించాం. పోలీసు అధికారులతో కలిసి మేము కూడా బాలికల అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం.- బీవీ సాగర్, చైల్డ్‌లైన్ ప్రతినిధి -
ఉద్యోగం వల.. నరకంలో విలవిల!
నరసరావుపేట నుంచి యూఏఈకి బాలికల అక్రమ రవాణా నిరుపేద కుటుంబాలే బ్రోకర్ల టార్గెట్ నెలకు రూ.20 వేల జీతం అంటూ మాయమాటలు తప్పుడు పత్రాలతో పాస్‌పోర్ట్‌లు హోటళ్లలో డ్యాన్సర్లుగా వ్యభిచారంలోకి మెయిల్ ద్వారా ‘సాక్షి’కి సమాచారం ఇచ్చిన గుంటూరు వాసి సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లా నుంచి బాలికల ను ఇతర దేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్న వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. నిరుపేద కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని కొందరు బ్రోకర్లు మైనర్లను అక్రమంగా రవాణా చేస్తూ భారీ ఎత్తున డబ్బు సంపాదిస్తున్నారు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో సేల్స్ గాల్స్‌గా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తల్లిదండ్రులకు వల వేస్తున్నారు. నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు జీతం ఇప్పిస్తామని చెప్పడంతో కూలినాలి చేసుకొని జీవితాలు వెళ్లతీసేవారు.. వారి మాయమాటలు నమ్మి బాలికలను అరబ్ దేశాలకు పంపుతున్నారు. అయితే అక్కడ ఏంపని చేస్తున్నారనే విషయం మాత్రం వీరికి తెలియడం లేదు. వారి మాటలు నమ్మి అక్కడకు వెళ్లిన అనేక మంది బాలికలు వ్యభిచార కూపంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. జిల్లాలోని నరసరావుపేట కేంద్రంగా కొందరు బ్రోకర్లు బాలికల అక్రమ రవాణాకు పాల్పడుతున్న విషయం బయటకు పొక్కడంతో పోలీసులు సైతం ఉలికిపాటుకు గురవుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు.. నరసరావుపేట పట్టణంలో పెద్దచెరువు ప్రాంతంలో నివాసం ఉంటున్న కనకం అనే మహిళకు చెన్నైకు చెందిన హరి అనే బంధువు ఉన్నాడు. హరి అప్పుడప్పుడు కనకం ఇంటికి వచ్చి వెళుతూ ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న అనేక మంది నిరుపేదలకు వలవేసి వారి కుమార్తెలకు అరబ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించాడు. భారీ వేతనాలు, ఆకర్షణీయమైన ఉద్యోగాలు ఇప్పిస్తానని వల విసిరాడు. తమ పిల్లల భవిష్యత్ బాగుంటుందనే ఆశతో కొందరు తల్లితండ్రులు తమ కుమార్తెలను హరితో పంపారు. ఇలా నరసరావుపేటకు చెందిన సుమారు పది మంది బాలికలను హరి అరబ్ దేశాలకు పంపి అక్కడ హోటళ్లు, పబ్‌ల్లో డ్యాన్సర్లుగాను, మరికొందరిని వ్యభిచార వృత్తిలోకి దించినట్లు సమాచారం. వెళ్లిన వారిలో కొందరు తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పగా, మరికొందరు భయంతో ఇష్టం లేకపోయినా నరకాన్ని అనుభవిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ విషయం కొందరు తల్లిదండ్రులకు తెలిసినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు, బయటకు తెలిస్తే పరువు పోతుందనే భయంతో మౌనంగా ఉంటున్నారు. వెలుగులోకి ఇలా... యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో వ్యభిచార గృహానికి వెళ్లిన గుంటూరు జిల్లా వాసికి నరసరావుపేటకు చెందిన ఓ మైనర్ బాలిక పరిచయమైంది. తెలుగు వ్యక్తి కలవటంతో ఆ బాలిక తన వేదన చెప్పి విలపించింది. తనను వ్యభిచార కూపం నుంచి తప్పించాలని వేడుకొంది. దీనికి చలించిన ఆయన.. వ్యభిచార గృహం నడిపే యజమానులకు కొంత పైకం చెల్లించి ఆమెను పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు నిర్వాహకులు అంగీకరించలేదు. ఈ విషయంలో కలుగచేసుకుంటే హతమారుస్తామంటూ హెచ్చరించారు కూడా. అక్కడ జరిగిన వ్యవహారాన్ని మెయిల్ ద్వారా ఆయన ‘సాక్షి’ కి సమాచారాన్ని చేరవేశారు. దీనిపై నరసరావుపేటలో సాక్షి ఆరా తీయగా మైనర్ బాలికల అక్రమ రవాణా వ్యవహారం గుట్టు రట్టయింది. ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి సైతం వెళ్లటంతో బాలిక తల్లిని పిలిచి విచారిస్తున్నారు. తప్పుడు జనన ధృవీకరణ çపత్రాలతో పాస్‌పోర్టులు మైనర్ బాలికలకు పాస్‌పోర్టులు రావని తెలిసిన అక్రమార్కులు వారి పేర్లు, తల్లిదండ్రుల పేర్లు మార్చి, నకిలీ జనన ధృవీకరణ పత్రాలతో పాస్‌పోర్టులు పొందుతున్నట్లు తెలిసింది. నరసరావుపేటకు చెందిన బాలికలకు సైతం ఇదే తరహాలో తప్పుడు పత్రాలు సృష్టించి హైదరాబాద్ చిరునామాలతో పాస్‌పోర్టులు పుట్టించినట్లు సమాచారం. అక్రమ రవాణా గుట్టు రట్టుయినా.. మైనర్ బాలికలు పేర్లు, అడ్రస్సులు తప్పుడువి కావటంతో తాము తప్పించుకోవచ్చనేది అక్రమార్కుల ఆలోచన. -
ఎన్నికల్లో డాన్సుల కోసం.. అమ్మాయిల అక్రమ రవాణా
వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉండటంతో.. డాన్సులు వేసే అమ్మాయిలకు డిమాండ్ పెరిగిపోతోంది. దీంతో వేరే రాష్ట్రాల నుంచి అమ్మాయిలను బలవంతంగా ఇక్కడకు తీసుకొస్తున్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి ఇలాంటి అవసరం కోసమే తీసుకొచ్చిన 32 మంది అమ్మాయిలను అలహాబాద్‌లో పోలీసులు రక్షించారు. దీన్ని బట్టి చూస్తే.. ఇక్కడ డాన్సు చేయిస్తున్న అమ్మాయిలంతా ముంబైలోని లైసెన్సుడు బార్ల నుంచి వచ్చిన డాన్స్ గర్ల్స్ మాత్రమే కాదని తెలుస్తోందని పోలీసులు అంటున్నారు. అమ్మాయిల అక్రమ రవాణాను నిరోధించేందుకు కృషిచేస్తున్న శక్తివాహిని అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన రిషికాంత్ యూపీలో ఈ వ్యవహారంపై గట్టిగా పోరాడుతున్నారు. తాను త్వరలోనే దీనిపై ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తానని, ఎన్నికల ప్రచారంలో అమ్మాయిల డాన్సులు ఏర్పాటుచేయకుండా చూడాలని కోరతానని తెలిపారు. యూపీలో ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న డాన్స్ ట్రూపులు చాలా ఉన్నాయన్నారు. చాలావరకు డాన్సులు రాత్రిపూటే జరుగుతాయని, అందువల్ల ఆ తర్వాత వారితో ఎలాంటి పనులు చేయిస్తున్నారనేది కూడా చెప్పలేమని.. ఈ అమ్మాయిలను ఎక్కడి నుంచి తెస్తున్నారో తెలియదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్లకు కనీసం తిండి సరిగ్గా పెడుతున్నారా, జీతాలు ఇస్తున్నారా లేదా అని పర్యవేక్షించేందుకు ఎలాంటి వ్యవస్థలు లేవని తెలిపారు. ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో ఎలాంటి ఫంక్షన్లు జరిగినా వాటిలో అమ్మాయిల డాన్సులు సర్వసాధారణం. పిల్లలు పుట్టినప్పుడు, పెళ్లిళ్లలో కూడా వీటిని ఏర్పాటుచేస్తారు. అయితే ఎన్నికల సమయంలో తమ ర్యాలీలకు జనాన్ని ఆకట్టుకోడానికి రాజకీయ నాయకులు చాలా పెద్ద స్థాయిలో ఈ డాన్సులు ఏర్పాటు చేస్తారు. అలహాబాద్‌లో శక్తివాహిని సంస్థ సాయంతో పోలీసులు రక్షించిన 32 మంది అమ్మాయిల్లో 14 ఏళ్ల బాలిక కూడా ఉంది. తమతో అర్ధరాత్రి వరకు డాన్సులు చేయిస్తున్నారని, డ్రగ్స్ ఇచ్చి ఆ తర్వాత విటుల వద్దకు పంపుతున్నారని కొందరు అమ్మాయిలు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ నుంచి చాలా మంది అమ్మాయిలు ఇళ్లలో పనిమనుషులుగాను, పొలాల్లో కూలీలుగాను చేయడానికి వేర్వేరు ప్రాంతాలకు వెళ్తుంటారు. ఎక్కువగా హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లో పనులకోసం వీళ్లు వెళ్తారు. కానీ, ఈసారి ఎన్నికల్లో డబ్బులు ఎక్కువ వస్తాయన్న ఉద్దేశంతో యూపీ వెళ్తున్నారని బలోద్ జిల్లా ఎస్పీ ఆరిఫ్ షేక్ చెప్పారు. చిన్న వయసు అమ్మాయిలు బాగా పుష్టిగా కనిపించడానికి వాళ్లకు స్టెరాయిడ్లు కూడా ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇంత దారుణాలకు పాల్పడుతుండటంతో దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం తక్షణం కనిపిస్తోంది. -
ఏమి'టీ' దుస్థితి?
పదహారేళ్ల సోమిలి తంతి... టీ గార్డెన్లో బతుకు వెళ్లదీసే కన్నా ఢిల్లీలాంటి నగరంలో మంచి ఉద్యోగం వస్తే కుటుంబ కష్టాలు గట్టెక్కుతాయని ఆశపడింది. వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుపోయింది. గ్రహించేలోపే మోసగాళ్లు రొంపిలోకి దింపేశారు. కలలు ఛిద్రమై, చిక్కిశల్యమైన సోమిలి అదృష్టవశాత్తు కొంతమంది స్థానికుల సహాయంతో మురికి కూపం నుంచి బయటపడింది. సోమిలి జీవితం కొంతవరకు నయం.. కనీసం ఆ మాత్రం అదృష్టం లేని సోమిలీలు ఎందరో.. అస్సాం టీ తోటల్లోంచి మహానగరాల ఉక్కుపాదాల కింద నలిగిపోతున్న బాలికలు, మహిళలు ఎందరో... అందుకు కారణాలు ఎన్నో... అసోం యువతుల జీవితాలను నిరక్షరాస్యత నిలువునా ముంచేస్తోంది. మద్యపానం, గృహహింస వారి పాలిట శాపమైంది. ఆర్థిక వెనుకబాటుతనమే అక్కడ ట్రాఫికర్లకు అదనుగా మారింది. అసోం టీ గార్డెన్లలో పనిచేసే మహళల సమస్యలపై ఇటీవల జరిపిన కొన్ని అధ్యయనాలు వారి దయనీయ పరిస్థితులను కళ్లకు కడుతున్నాయి. ట్రాఫికర్ల కన్ను ఇప్పుడు అసోం టీ గార్డెన్లలో పనిచేసే యువతులపై పడింది. వారిని నమ్మించి ఉచ్చులో దింపుతున్నారు. అరచేతిలో వైకుంఠం చూపిస్తూ యువతుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. బాలికలు అక్రమ రవాణాలో పావులవుతున్నారు. బానిసత్వ కార్మికులుగా మిగిలిపోతున్నారు. అంతేకాదు వారిపై ట్రాఫికర్లు శారీరక హింసలకు పాల్పడుతూ, బలవంతపు పెళ్లిళ్లకు కూడా వారిని బలి చేస్తున్నారు. అసోం టీ గార్డెన్లలో పనిచేసే మహిళల్లో ఎక్కువ ఆదివాసీ, గిరిజనులే ఉంటారు. బ్రిటిష్ కాలం నుంచే వీరు టీ ఎస్టేట్లలో పనిచేస్తున్నారు. ఇక్కడ పని చేసేవారిలో ఎక్కువగా ఒడిశా, బీహార్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలనుంచీ వచ్చినవారే. టీ పరిశ్రమ అభివృద్ధి చెందినా అక్కడి కూలీల బతుకుల్లో మాత్రం మార్పు లేదు. ఇటీవల ఢిల్లీలో వెలుగుచూసిన 16 ఏళ్ల సోమిలి తంతి కథ ఇందుకు ఓ ఉదాహరణ. నగరాల్లో ఆఫీసులో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి, అక్రమ రవాణాకు పాల్పడ్డ కిడ్నాపర్ల మోసాన్ని ఆమె గ్రహించలేకపోయింది. మహానగరంలో జీవితాన్ని ఊహించుకొని కలలు కంది. చివరికి కిడ్నాపర్ల ఉచ్చులో చిక్కుకుపోయింది. లైంగిక వేధింపులకూ గురైంది. ఎలాగో స్థానికుల సహాయంతో బయటపడింది. క్లాసులోనూ ఎప్పుడూ ముందుండే సోమిలి మంచి ఉద్యోగం పొంది ఆనందంగా ఉంటుందని అనుకుంటే.. ఆమె కాస్తా ట్రాఫికర్ల ఉచ్చులో చిక్కుకుపోయింది. సోమిలి ఒక్కర్తే కాదు.. ఇలా అసోం నుంచి వెళ్లి ఇళ్లలో పనిచేసేవారు బానిసత్వపు సంకెళ్లలో చిక్కుకుంటున్నారు. లైంగిక వేధింపులకు గురవుతున్నారు. బీబీఏ లెక్కల ప్రకారం 2013-2015 మధ్య 200 మందికి పైగా పైగా బాలికలు అక్రమ రవాణాకు గురైనట్లు అసోంలోని కేవలం ఒక్క పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులను బట్టి చూస్తే తెలుస్తోంది. వీరంతా అక్కడి టీ ఎస్టేట్లలో పనిచేసే వారే. కొందరు కనీసం కేసులు కూడ నమోదు చేయని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ట్రాఫికింగ్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ పేరిట యునిసెఫ్, అసోం ప్రభుత్వం ఓ పరిశోధన చేశారు. అక్రమ రవాణాకు గురవుతున్న కార్మికుల ఇబ్బందులపై లెక్కలు తీశారు. కొన్ని ప్రైవేటు సంస్థలు, సంఘాల ఆధ్వర్యంలో ప్రజలు, టీ ఎస్టేట్లలోని కార్మికులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. యువతులను ఇతర నగరాలకు పంపించే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరిస్తున్నారు. వీరేకాదు ట్రాఫికర్ల బారి నుంచి తప్పించుకొని బయట పడ్డవారు కూడా మిగిలిన వారికి అవగాహన కల్పించడంతో పాటు, తమ జీవితాలను తిరిగి నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.