సాక్షి, విజయవాడ: ఏపీలో ఐఏఎస్(IAS), ఐపీఎస్(IPS)లపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఏడు నెలలైన అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తోంది. రాష్ట్రంలోనే సీనియర్ అధికారి అయిన శ్రీలక్ష్మికి పోస్టింగ్‌కు ఇవ్వ లేదు. చీఫ్ సెక్రటరీ అర్హత జాబితాలో శ్రీలక్ష్మి తొలి స్థానంలో ఉన్నారు. కనీసం పోస్టింగ్ ఇవ్వకుండా మహిళ అధికారిపై కక్ష సాధిస్తున్నారు. ఆల్ ఇండియా టాపర్, బీసీ అధికారి ముత్యాల రాజుకు కూడా పోస్టింగ్ దక్కలేదు.
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో సీఎంవోలో పనిచేశారనే కారణంతోనే ముత్యాలరాజుకు పోస్టింగ్ ఇవ్వలేదని సమాచారం. మురళీధర్‌రెడ్డి, మాధవిలత, నీలకంఠరెడ్డికి ఇప్పటివరకు పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం.. ఐపీఎస్‌లు రఘురామిరెడ్డి, విశాంత్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డిలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఆంజేయులు, సంజయ్, పీవీ సునీల్, క్రాంతి రాణా, విశాల్ గున్నిలను ప్రభుత్వం వేధిస్తోంది.
ఇదీ చదవండి: కాంతి లేని కూటమి పాలన
Comments
Please login to add a commentAdd a comment