ips
-
రెండో పెళ్లితో ‘చిక్కుల్లో’ ఐపీఎస్.. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా..
జైపూర్ : రెండో వివాహం ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిని చిక్కుల్లో పడేసింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి సీనియర్ ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఓ ఐపీఎస్ అధికారి హోదా తగ్గించింది. ఈ నిర్ణయంతో సీనియర్ ఐపీఎస్ అధికారిగా హోదాతో పాటు తీసుకునే పేస్కేలు సైతం తగ్గింది. కొత్తగా విధుల్లో చేరిన ఐపీఎస్ ఎంత వేతనం తీసుకుంటారో.. అంతే వేతనం సదరు సీనియర్ ఐపీఎస్ అధికారికి అందుతుంది.పలు నివేదికల ప్రకారం.. రాజస్థాన్ కేడర్ ఐపీఎస్ అధికారి పంకజ్ కుమార్ చౌదరి జైపూర్‌లో కమ్యూనిటీ పోలీసింగ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా పని చేస్తున్నారు. అయితే పంకజ్ కుమార్ మొదటి భార్య నుంచి విడాకులు తీసుకోకుండా రెండో వివాహం చేసుకున్నారు. ఈ వివాదంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ పంకజ్ కుటుంబ సభ్యులు రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టుకు చేరింది. విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని పంకజ్ కుమార్ మీడియాకు వెల్లడించారు.ఈ తరుణంలో ఐపీఎస్ అధికారి పంకజ్ కుమార్ వివాహంపై రాజస్థాన్ రాష్ట్ర ఉన్నాతాధికారులు విచారణ చేపట్టారు. విచారణలో పంకజ్ కుమార్ దోషిగా తేల్చారు. విచారణ అనంతరం మూడు సంవత్సరాల పాటు ప్రస్తుతం ఉన్న తన డిజిగ్నేషన్‌ను తగ్గించారు. లెవల్ 11 సీనియర్ పే స్కేల్ నుండి లెవల్ 10 జూనియర్ పే స్కేల్‌కు కుదించారు. ఈ పేస్కేల్ కొత్తగా విధుల్లోకి చేరిన ఐపీఎస్‌లకు కేటాయిస్తారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా, 2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి పంకజ్ చౌదరి. ప్రస్తుతం,జైపూర్‌లో కమ్యూనిటీ పోలీసింగ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా పని చేస్తున్నారు. హోదా తగ్గించడంతో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (లెవల్ 10)గా కొనసాగనున్నారు. -
ఐఏఎస్, ఐపీఎస్ లపై సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్
-
సునామీలో సర్వం కోల్పోయారు..కానీ ఆ అక్కా చెల్లెళ్లు ఐఏఎస్, ఐపీఎస్‌లుగా..
ప్రకృతి ప్రకోపానికి సర్వం కోల్పోయింది ఆ కుటుంబం. ఉండేందుకు నీడ కూడా లేకుండా రోడ్డున పడిపోయాయి జీవితాలు. ఒక్క రోజులో కథే మారిపోయింది. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితి. అలాంటి గడ్డు పరిస్థితిలో చదువుపై ధ్యాస పెట్టి ఉన్నతాధికారి కావాలనే ఆలోచన వైపుకే వెళ్లనంతగా జీవితం కటికి చీకటిమయంగా ఉంటుంది. అయితే అంతటి కటిక దారిద్య్రంలో బతికీడుస్తూ కూడా అన్నింటిని ఓర్చుకుని కన్నెరజేసిన ప్రకృతికే సవాలు విసిరారు. కష్టతర సాధ్యమైన హోదాలని అందుకున్నారు ఈ అక్కా చెల్లెళ్లు. ఎవ్వరూ ఊహించని విధంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారిణులై మనిషి సంకల్పానికి ఎలాంటి కష్టమైనా.. తోక ముడిచి తీరాల్సిందేనని చూపించారు. ఇంతకీ ఎవరా అక్కాచెల్లెళ్లు అంటే..తమిళనాడులోని కడలూరు జిల్లాకి చెందిన రైతు కుమార్తెలు ఆ అక్కాచెల్లెళ్లు. వారి పేర్లు సుష్మిత రామనాథన్, ఐశ్వర్య రామనాథన్. ఆర్థికంగా వెనుకబడిన వ్యవసాయం కుటుంబం వారిది. కటిక పేదరికంలో పెరిగారు. కనీస వనురుల లేక అల్లాడిపోయారు. అలాంటి కుటుంబం ప్రకృతి ప్రకోపానికి పూర్తిగా అల్లకల్లోలమైపోయింది. సరిగ్గా 2004 హిందూ మహాసముద్రం సునామీలో ఇల్లుతో సహా సర్వం కోల్పోయారు. అప్పటికీ అంతంత మాత్రంగా ఉన్నజీవితాలు పూర్తిగా రోడ్డున పడిపోయాయి. అయితే అక్కాచెల్లెళ్లు అంతటి భరించలేని పరిస్థితుల్లో కూడా చదువుని వదలలేదు. అదే తమ జీవితాలను మార్చే ఆయుధమని పూర్తిగా నమ్మారు. దానికే కట్టుబడి ఇరవురు యూపీఎస్సీకి సన్నద్ధమై అనుకున్నది సాధించారు. మరీ అక్కాచెల్లెళ్ల విజయ ప్రస్థానం ఎలా సాగిందంటే..ఐఏఎస్ ఐశ్వర్య రామనాథన్2018లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో 628వ ర్యాంకు సాధించి రైల్వే అకౌంట్స్ సర్వీస్ (RAS)కి ఎంపికయ్యింది. కానీ ఆ పోస్టుతో సంతృప్తి చెందని ఐశ్వర్య మరోసారి 2019లో యూపీఎస్సీకి సన్నద్ధమైంది. అప్పుడు మెరుగైన ర్యాంకు సాధించి 22 ఏళ్లకే తమిళనాడు కేడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారిణి అయ్యింది. ప్రస్తుతం ఆమె తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో అదనపు కలెక్టర్‌గా నియమితురాలైంది.ఐపీఎస్ సుష్మితా రామనాథన్చెల్లెలు ఐశ్వర్యలా సునాయాసంగా యూపీఎస్సీలో విజయం అందుకోలేకపోయింది. ఏకంగా ఐదు సార్లు విఫలమైంది. చెల్లలు కంటే ఎక్కువ కష్టపడి సివల్స్‌లో సక్సెస్ అయ్యింది. ఆమె 2022లో ఆరవ ప్రయత్నంలో సివిల్స్ పరీక్షలో 528వ ర్యాంకు సాధించి ఆంధ్రప్రదేశ్ కేడర్‌కి చెందిన ఐపీఎస్ అధికారిణి అయ్యింది. ఆమె ప్రస్తుతం దక్షిణ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ASP)గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. (చదవండి: ప్రపంచం అంతమయ్యేది అప్పుడే..! వెలుగులోకి న్యూటన్ లేఖ..) -
భారీ వేతనమిచ్చే ఉద్యోగాన్ని వదిలేసి.. ఐపీఎస్ అయ్యిందిలా!
అదృష్టాన్ని నమ్ముకుంటే కలలు సాకారం కావు. కృషి, పట్టుదల ఉంటేనే ఏదైనా సాధించవచ్చు. విజయం సాధించాలనే సంకల్పం ఉంటే సరిపోదు.. ఎన్ని కష్టాలైనా, నష్టాలైనా ఓపికతో కృషి చేయాలి. అలా ఆత్మవిశ్వసంతో విజయ తీరాలకు చేరుకున్న స్ఫూర్తిదాతలెందరో ఉన్నారు. అలా తన జీవితంలో ఒక బిగ్ డ్రీమ్ కోసం ఎవరూ ఊహించని విధంగా సాహసోపేతంగా ప్రతిభను చాటుకున్న ఒక ధీర గురించి తెలుసు కుందాం రండి..!ఆమె పేరే పూజా యాదవ్. హర్యానాకు చెందిన పూజా పట్టుదలగా ఎదిగి ఐపీఎస్ ఆఫీసర్ స్థాయికి ఎదిగింది. 1998లో హర్యానాలోని సోనిపట్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆమె సోనిపట్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. బయోటెక్నాలజీలో బీటెక్, జీ, ఫుడ్ టెక్నాలజీలో ఎంటెక్ పూర్తి చేసింది. అందివచ్చిన అవకాశాలతో కెనడా, జర్మనీలో మంచి వేతనంతో ఉద్యోగాలు చేశారు. కుటుంబ పరిస్థితి గురించి ఆలోచించి ఉద్యోగం చేయాల్చి వచ్చినా, ఐపీఎస్(IPS) అవ్వాలనే ఆశయం మాత్రం నిరంతరం పూజా మదిలో మెదులుతూనే ఉంది. దీనికితోడు దేశాభివృద్ధికి తోడ్పడాలనే బలమైన కోరిక ఉంది. మొదటి నుంచీ, ఆమె తన దేశానికి సేవచేయాలని కోరిక సివిల్ సర్వీసెస్ పరీక్షకు (UPSC వైపు నడిపించింది. అంతే వన్ ఫైన్‌మార్నింగ్ కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఉద్యోగం వదిలేసి భారత దేశానికి తిరిగి వచ్చింది. సివిల్స్ ప్రిపరేషన్ (మొదలు పెట్టింది. కానీ ఇది ఆమె అనుకున్నంత సులువుగా సాగలేదు. ఒకవైపు పూజా కుటుంబం ఆర్థిక పరిస్థితి, మరోవైపు చదువుకి అయ్యే ఖర్చులు ఇలా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే ఐపీఎస్ కావాలనే నిర్ణయానికి కుటుంబంలో అందరూ తోడుగా నిలిచారు.ఇదీ చదవండి: నీతా అంబానీకి ముఖేష్ అంబానీ సర్ప్రైజ్ గిప్ట్రిసెప్షనిస్టుగా పనిచేస్తూనే,ఒకవైపు సిపిల్స్కు ప్రిపేర్ అవుతూనే,తన ఆర్థిక అవసరాల నిమిత్తం పిల్లలకు ట్యూషన్లు చెప్పింది. దీంతోపాటు రిసెప్షనిస్టుగా పనిచేస్తూ, పరీక్షలకు ప్రిపేర్ అయింది. తొలి ప్రయత్నం విఫలమైంది. అయినా పట్టువీడలేదు. నిరాశపడకుంగా, ఏకాగ్రతతో తపస్సులా చేసింది. చివరికి ఆమె కష్టం వృధా పోలేదు.సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఇండియన్ పోలీస్ సర్వీస్‌లో చేరడం ద్వారా పౌరుల జీవితాలపై ప్రభావాన్ని చూపిస్తోంది. 2018 కేడర్‌లో IPSగా నియమితురాలు కావడం తన జీవితంలో మర్చిపోలేని రోజని సంతోషంగా చెప్పింది పూజా. 2021లో స్నేహితుడు వికల్ప్ భరద్వాజ్‌ను ముస్సోరీలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడెమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో సాగిన పరిచయం పెళ్లికి దారి తీసింది. ప్రస్తుతం గుజరాత్ ట్రాఫిక్ డీసీపీగా పనిచేస్తున్నారు. వృత్తిబాధ్యలతోపాటు, పూజ యాదవ్, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆమె ఇన్స్టాగ్రామ్ పేజీలో 3.28 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ప్రజలతో కమ్యూనికేట్ అవ్వడానికి సోషల్ మీడియాను మించినది లేదు అని నమ్మేవారిలో పూజా యాదవ్ ఒకరు. చదవండి: Maha Kumbh Mela అద్భుతమైన అనుభవం: నీనా గుప్తా ప్రశంసలు -
ఏపీ క్యాడర్‌పై కక్ష.. నాన్ ఏపీ క్యాడర్‌పై ఆపేక్ష
సాక్షి, అమరావతి: పొరుగింటి పుల్ల కూర రుచి అన్నట్లుగా తయారైంది చంద్రబాబు సర్కారు తీరు! ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన అఖిల భారత సర్వీసు అధికారులకు కక్ష పూరితంగా పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్న కూటమి ప్రభుత్వం ఇతర రాష్ట్రాల క్యాడర్ అధికారులను మాత్రం ఏపీకి కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పదేపదే కోరుతుండటం విస్మయ పరుస్తోంది. టీడీపీ కూటమి సర్కారు రాగానే 9 మంది ఐపీఎస్‌లు, ఐదుగురు ఐఏఎస్‌లకు పోస్టింగులు ఇవ్వకుండా పక్కనపెట్టింది. కక్షపూరితంగా నలుగురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ వేటు వేసింది. మరోవైపు రాష్ట్రంలో పాలన వ్యవస్థను సక్రమంగా నిర్వహించేందుకు తగినంత మంది ఐఏఎస్, ఐపీఎస్‌లు లేరంటూ జిత్తులమారితనాన్ని ప్రదర్శిస్తోంది. రెడ్‌బుక్ కుట్రలపై మినహా పాలన వ్యవస్థపై ఏమాత్రం చిత్తశుద్ధి లేని చంద్రబాబు సర్కారు నిర్వాకాలతో రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా భ్రష్టు పట్టిపోతోంది. రాగానే కక్ష సాధింపు చర్యలు.. గతేడాది జూన్‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 15 మంది ఐఏఎస్‌లు, 24 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా పక్కనపెట్టింది. ప్రభుత్వ విధానాలను అమలు చేసే అధికారులపై తన అక్కసు చూపడంతో రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. దాదాపు ఐదు నెలల తరువాత దశలవారీగా కొందరికి అప్రాధాన్య పోస్టుల్లో పోస్టింగులు ఇచ్చింది.పలువురికి ఇప్పటికీ పోస్టింగులు ఇవ్వకుండా ఇంకా వెయిటింగ్‌లోనే ఉంచడం చంద్రబాబు ప్రభుత్వ దుర్నీతికి నిదర్శనం. వీరిలో ఐదుగురు ఐఏఎస్‌లు, ఐదుగురు ఐపీఎస్ అధికారులున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, మురళీధర్‌రెడ్డి, ముత్యాల రాజు, నీలకంఠరెడ్డి, మాధవీలతకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికీ పోస్టింగులు ఇవ్వలేదు. ఇక సీనియర్ ఐపీఎస్ అధికారులు పీవీ సునీల్‌కుమార్, కొల్లి రఘురామ్‌రెడ్డి, రిషాంత్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, జాషువాకు పోస్టింగులు ఇవ్వకపోవడం గమనార్హం. పదిమంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అందుబాటులో ఉన్నా వారి సేవలను వినియోగించుకోకుండా ఇతర రాష్ట్రాల క్యాడర్ అధికారులను డిప్యుటేషన్‌పై పంపాలని కోరడం గమనార్హం. నలుగురు ఐపీఎస్‌ల సస్పెన్షన్ నలుగురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ చంద్రబాబు సర్కారు రెడ్‌బుక్ కుట్రకు పరాకాష్ట. సీనియర్ ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, ఎన్.సంజయ్, టి. కాంతిరాణా, విశాల్ గున్నీను ప్రభుత్వం కక్ష పూరితంగా సస్పెండ్ చేసింది. వలపు వల(హనీ ట్రాప్) విసిరి బడా బాబులను బ్లాక్ మెయిలింగ్ చేయడమే పనిగా పెట్టుకున్న ముంబై మోడల్ కాదంబరి జత్వానీతో తప్పుడు ఫిర్యాదు ఇప్పించి పీఎస్ఆర్ ఆంజనేయులు, టి.కాంతిరాణా, విశాల్‌గున్నీను సస్పెండ్ చేయడం బాబు సర్కారు కుట్రపూరిత రాజకీయాలకు నిదర్శనం. రామోజీ కుటుంబానికి చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలను వెలికి తీశారనే కక్షతో ఎన్.సంజయ్‌పై అక్రమ కేసులు బనాయించి సస్పెండ్ చేశారు. ఒకవైపు అందుబాటులో ఉన్న సమర్థులైన ఐపీఎస్ అధికారులపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ మరోవైపు ఇతర రాష్ట్రాల అధికారుల కోసం అర్రులు చాస్తుండటం కూటమి సర్కారు దుర్నీతికి నిదర్శనంగా నిలుస్తోంది. డిప్యుటేషన్ అధికారులే ముద్దు...తమ అక్రమాలకు వత్తాసు పలికేందుకే ఇతర రాష్ట్రాల ఐఏఎస్ అధికారుల కోసం చంద్రబాబు ప్రభుత్వం పట్టుబడుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి అస్మదీ య అధికారులను డిప్యుటే షన్‌పై రప్పించి కీలక స్థానాలు కట్టబెడుతోంది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో డిప్యుటేషన్‌పై రాష్ట్రంలో కీలక పోస్టింగులు నిర్వహించిన యూ ్డపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి రాజమౌళి గతేడాది చంద్రబాబు సీఎం కాగానే రాష్ట్రంలో వాలిపోయారు. ఆయనకు ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక పోస్టు కట్టబెట్టారు. అదే తరహాలో గతంలో టీడీపీ ప్రభుత్వంలో డిప్యుటేషన్‌పై వచ్చి ఏపీఎండీసీ ఎండీగా పని చేసిన ఐఆర్ఎస్ అధికారి వెంకయ్య చౌదరిని కూటమి సర్కారు అధికారంలోకి రాగానే మరోసారి రప్పించి ఏకంగా టీటీడీ అదనపు ఈవోగా అత్యంత కీలక పోస్టు కట్టబెట్టారు. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుని ఆరుగురు భక్తులు మృతి చెందినా ఆయనపై ఎలాంటి చర్య తీసుకోలేదు. టీటీడీలో ప్రైవేట్ వ్యక్తులు అనధికారికంగా పాగా వేసి అక్రమాలకు తెగబడటం వెనుక కీలక పాత్ర వెంకయ్య చౌదరిదే.అదే రీతిలో తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సుబ్బారాయుడుకు కూటమి ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచింది. ఆయన్ను తిరుపతి జిల్లా ఎస్పీగా నియమించింది. తిరుపతిలో తొక్కిసలాటకు బాధ్యుడైనప్పటికీ సస్పెండ్ చేయకుండా బదిలీతో సరి పెట్టింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్‌ఫోర్స్ ఎస్పీగా చిత్తూరు జిల్లాలోనే పోస్టింగు ఇచ్చింది. ఇవన్నీ చంద్రబాబు కోటాగా పరిగణించడంతో ఇక తన కోటా కూడా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భావించారు. అందుకే ఆయన డిమాండ్ మేరకు కేరళ క్యాడర్‌కు చెందిన మైలవరపు కృష్ణ తేజను డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తెచ్చి పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్‌గా నియమించారు. నలుగురు ఇతర రాష్ట్రాల అధికారులను డిప్యుటేషన్ మీద తెప్పించుకున్నా చంద్రబాబు ప్రభుత్వం సంతృప్తి చెందడం లేదు. ఇతర రాష్ట్రాల క్యాడర్‌కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మరింత మంది కావాలంటూ కేంద్రానికి పదే పదే విజ్ఞప్తులు చేస్తోంది. టీడీపీ తీరుపట్ల రాష్ట్రానికి చెందిన ఏఐఎస్ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ విధానాలను అమలు చేయడమే విద్యుక్త ధర్మంగా భావించే ఏఐఎస్ అధికారులపై కక్షపూరితంగా వ్యవహరించడం ద్వారా దుష్ట సంప్రదాయానికి పాల్పడుతోందని పేర్కొంటున్నారు. -
ఐఏఎస్, ఐపీఎస్‌లపై కూటమి సర్కార్ కక్ష
సాక్షి, విజయవాడ: ఏపీలో ఐఏఎస్(IAS), ఐపీఎస్(IPS)లపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఏడు నెలలైన అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తోంది. రాష్ట్రంలోనే సీనియర్ అధికారి అయిన శ్రీలక్ష్మికి పోస్టింగ్‌కు ఇవ్వ లేదు. చీఫ్ సెక్రటరీ అర్హత జాబితాలో శ్రీలక్ష్మి తొలి స్థానంలో ఉన్నారు. కనీసం పోస్టింగ్ ఇవ్వకుండా మహిళ అధికారిపై కక్ష సాధిస్తున్నారు. ఆల్ ఇండియా టాపర్, బీసీ అధికారి ముత్యాల రాజుకు కూడా పోస్టింగ్ దక్కలేదు.వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో సీఎంవోలో పనిచేశారనే కారణంతోనే ముత్యాలరాజుకు పోస్టింగ్ ఇవ్వలేదని సమాచారం. మురళీధర్‌రెడ్డి, మాధవిలత, నీలకంఠరెడ్డికి ఇప్పటివరకు పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం.. ఐపీఎస్‌లు రఘురామిరెడ్డి, విశాంత్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డిలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఆంజేయులు, సంజయ్, పీవీ సునీల్, క్రాంతి రాణా, విశాల్ గున్నిలను ప్రభుత్వం వేధిస్తోంది.ఇదీ చదవండి: కాంతి లేని కూటమి పాలన -
కాదంబరి జత్వానీ కేసులో.. ఐపీఎస్ లకు ఊరట!
-
తెలంగాణలో పది మంది ఐపీఎస్ అధికారులు బదిలీ
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 మంది ఏఎస్పీలను బదిలీ చేస్తూ సీఎం రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.2021, 2022 బ్యాచ్‌లకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేసినట్లు తెలంగాణ పోలీస్ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఏఎస్పీగా కాజల్, భువనగిరి ఏఎస్పీగా కంకణాల రాహుల్ రెడ్డి, ఆసిఫాబాద్ ఏఎస్పీగా చిత్తరంజన్, కామారెడ్డి ఏఎస్పీగా బొక్కా చైతన్య, జనగామ ఏఎస్పీగా పందిరే చైతన్య రెడ్డి, భద్రాచలం ఏఎస్పీగా విక్రాంత్ కుమార్ సింగ్, కరీంనగర్ రూరల్ ఏఎస్పీగా నగ్రాలే శుభం ప్రకాశ్, నిర్మల్ ఏఎస్పీగా రాజేశ్ మీనా, దేవరకొండ ఏఎస్పీగా పీ మౌనిక బదిలీ అయ్యారు. -
కర్నాటకలో యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ మృతి
-
‘మేం ఏపీకి వెళ్లలేం’.. క్యాట్‌లో ఐఏఎస్‌ల పిటిషన్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్, ఐపీఎస్ కేడర్ విభజనలో కీలక పరిణామం చోటు చేసుకుంది.తమను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలంటూ డీవోపీటీ ఆదేశాలు జారీ చేసిందని, ఆ ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణలో కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT)లో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్ అధికారిణి సృజన కోరారు. నలుగురు ఐఏఎస్‌లు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్ల క్యాట్ మంగళవారం విచారణ చేపట్టనుంది.తెలంగాణ సీఎస్ శాంతికుమారితో భేటీతెలంగాణ సీఎస్ శాంతికుమారితో ఏపీ కేడర్ ఐఏఎస్,ఐపీఎస్ అధికారులు సమావేశమయ్యారు. సీఎస్‌తో వాకాటి కరుణ, రోనాల్డ్ రోస్, అమ్రాపాలితో పాటు పలువురు అధికారులు భేటీ అయ్యారు. గతవారం ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌లు ఎల్లుండి (అక్టోబర్ 16) లోపు రిపోర్టు చేయాలని డీవోపీటీ (డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఐఏఎస్‌లు ఇంకా రిలీవ్ కాలేదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ తరుణంలో డీవోపీటీ ఆదేశాల మేరకు ఎల్లుండి ఏపీలో రిపోర్ట్ చేసే విషయంపై సీఎస్‌తో అధికారులు భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేందుకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు విముఖత వ్యక్తం చేశారు. ఇప్పటికే తాము ఏపీకి వెళ్ళబోమని డీవోపీటీకి విజ్ఞప్తి చేయగా.. ఆ విజ్ఞప్తిని డీవోపీటీ తిరస్కరించింది. దీంతో ఐఏఎస్ అధికారులు క్యాట్‌ను ఆశ్రయించారు. రేపు క్యాట్ విచారణ చేపట్టనుంది. అనంతరం ఐఏఎస్‌లు,ఐపీఎస్‌లు ఏపీకి వెళ్తారా? లేదంటే తెలంగాణలోనే కొనసాగుతారా? అనేది తేలనుంది.👉చదవండి: మీరు వెళ్లాల్సిందే -
ఆంధ్రాకు వెళ్లాల్సిందే.. ఐఏఎస్, ఐపీఎస్‌లకు DOPT బిగ్ షాక్
-
మీరు వెళ్లాల్సిందే!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఐఏఎస్‌ల కేడర్ విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏ రాష్ట్రానికి కేటాయించినవారు ఆ రాష్ట్రానికి వెళ్లాల్సిందేనని స్పష్టంచేసింది. తెలంగాణకు కేటాయించినా ఏపీలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు సృజన(ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్), శివశంకర్ లోతేటి (వైఎస్సార్ జిల్లా కలెక్టర్), సీహెచ్ హరికిరణ్(వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్)లను వెంటనే తెలంగాణకు వెళ్లాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించినప్పటికీ తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, రోనాల్డ్ రోస్, ఆమ్రపాలి, వాణిప్రసాద్, ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, అభిలాష బిస్త్‌ను వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలని ఆదేశించింది. ఈ అధికారులను ప్రస్తుతం పని చేస్తున్న రాష్ట్రాల నుంచి రిలీవ్ చేస్తూ వారికి కేటాయించిన రాష్ట్రాల్లో ఈ నెల 16వ తేదీలోగా రిపోర్ట్ చేయాల్సిందిగా స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు తెలియజేసింది. రాష్ట్ర విభజన సమయంలోనే... రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన కొంతమంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు తమను తెలంగాణకు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. అయితే కేంద్ర ప్రభుత్వం వారి అభ్యర్థనలను తోసిపుచ్చింది. అలాగే తెలంగాణకు కేటాయించిన కొంతమంది ఐఏఎస్‌లు.. తమను ఏపీకి కేటాయించాలని కేంద్రాన్ని కోరినా అంగీకరించలేదు. దీంతో తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు క్యాట్‌ను ఆశ్రయించారు. వారికి అనుకూలంగా క్యాట్ తీర్పు ఇచ్చింది. క్యాట్ తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది. గత మార్చిలో తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టి వారి అభ్యర్థనలు మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు అధికారుల అభ్యంతరాల పరిశీలనకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దీపక్‌ను కేంద్రం నియమించింది. దీపక్ ఇచ్చిన నివేదిక మేరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల అభ్యర్థనలను తిరస్కరించింది. కచ్చితంగా కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లాల్సిందేనని ఉత్తర్వుల్లో పేర్కొంది. -
ఆ ఐపీఎస్ ఓ క్రిమినల్.. బ్లాక్‌మెయిలర్
శివాజీనగర: ఏడీజీపీ చంద్రశేఖర్ ఒక బ్లాక్ మెయిలర్, క్రిమినల్, అతడు తోటి ఉద్యోగులకు రాసిన లేఖను చక్కగా తయారు చేశారు. సరైన సమయంలో దీనికి సమాధానం ఇస్తానని జేడీఎస్ నేత, కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్.డీ.కుమారస్వామి ధ్వజమెత్తారు. ఆదివారం జేపీ నగర నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఏడీజీపీ తన తోటి ఉద్యోగులకు రాసిన లేఖ గురించి స్పందిస్తూ, ఆయన చెప్పినట్లుగా నేను కేసుల్లో నిందితున్ని కావచ్చు, అయితే అతను అధికారి అనే హోదాలో ఉన్న క్రిమినల్. వరుస నేరాలకు పాల్పడిన ఆరోపణలు ఉన్నాయి. ఆయన చేతికింద పనిచేసే ఇన్స్పెక్టర్కు రూ. 20 కోట్లు డిమాండ్ పెట్టి చిక్కుకొన్నాడు. ఆ ఇన్స్పెక్టర్ ఈ అధికారి మీద ఫిర్యాదు చేశారు. తక్షణమే రూ.2 కోట్లు తీసుకురావాలని బ్లాక్మెయిల్ చేసింది ఇతను కాదా? అని దుయ్యబట్టారు. లోకాయుక్తకు గవర్నర్ రాసిన లేఖ ప్రభుత్వ సహకారమున్న ఒక టీవీ చానెల్‌కు లీక్ అయ్యింది, దానిని లీక్ చేసింది ఎవరు? అనేది అందరికి తెలుసునన్నారు. అయితే అది రాజ్‌భవన్ నుండే లీకేజీ అయ్యిందని, అక్కడి అధికారులను విచారించాలని చంద్రశేఖర్ పై అధికారులకు లేఖ రాశారు, అందుకే అతని దర్పం, నేపథ్యంపై తాను ఆధారాల సమేతంగా మాట్లాడుతున్నానని చెప్పారు. నా ప్రశ్నలకు సమాధానమివ్వాలి తాను అడిగిన ప్రశ్నలకు ఐపీఎస్ చంద్రశేఖర్ సమాధానమివ్వాలి, అలా కాకుండా క్రిమినల్ మనస్తత్వంతో కూడిన అసభ్యకరమైన భాషను ఉపయోగించి ఒక కేంద్ర మంత్రి గురించి చెడుగా లేఖను విడుదల చేశారు, ఇందుకు ఏమి చేయాలి, ఆధారాలు, విషయం లేనిదే నేను మాట్లాడను. తాను శనివారం ఉదయం మీడియాతో మాట్లాడగానే, సాయంత్రం ఆ అధికారి ఎక్కడకి వెళ్లాడనేది తెలుసు. ఆయన లేఖను ఎవరు తయారు చేసిచ్చారు అనేది తెలుసని పరోక్షంగా కాంగ్రెస్ నేతలపై ధ్వజమెత్తారు. చంద్రశేఖర్ ఉపయోగించిన భాష అతని సంస్కృతికి నిదర్శనం. అతడు ఏం మాట్లాడారు అనేది అందరికీ తెలుసు అని మండిపడ్డారు. కుమార ఆధారాలివ్వాలి: డీసీఎం కేంద్ర మంత్రి హెచ్.డీ.కుమారస్వామి, ఏడీజీపీ చంద్రశేఖర్ మాటల యుద్ధం తారాస్థాయికి చేరగా, ఇందులో ఆధారాలు ఏమున్నాయో కుమారస్వామి విడుదల చేయాలని డీసీఎం డీ.కే.శివకుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన నెలమంగలలో మాట్లాడుతూ కుమారస్వామికి విరుద్ధంగా కేపీసీసీ కార్యాలయంలో లెటర్‌ను తయారుచేసి లీక్ చేశారని ఆరోపించడం సబబు కాదన్నారు. కుమారస్వామి ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు. కేపీసీసీకి, ఏడీజీపీ చంద్రశేఖర్‌కు ఏమి సంబంధమని ప్రశ్నించారు. చంద్రశేఖర్ నన్ను కలిసింది, మాట్లాడిందీ లేనే లేదన్నారు. -
నాలుగో సింహం.. విమెన్ ఇన్ ఖాకీ
ఎన్ని ప్రయత్నాలు చేశామన్నది కాదు... లక్ష్యం చేరామా? లేదా? అన్నదే ముఖ్యం’ అన్నట్లుగా పట్టుదలతో ఐపీఎస్ సాధించారు ఈ ఆఫీసర్లు. ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం అయినా అందరి టార్గెట్ విమెన్ ఇన్ ఖాకీనే. హైదరాబాద్‌లో జరిగిన 76వ బ్యాచ్ రెగ్యులర్ రిక్రూట్స్ ΄ాసింగ్ ఔట్ పరేడ్‌లో ఈ ఐపీఎస్ ్ర΄÷బేషనరీ అధికారులు ‘సాక్షి ఫ్యామిలీ’తో మాట్లాడిన విశేషాలు...సైబర్ నేరాలునియంత్రిస్తానునేను ఢిల్లీలో పుట్టి పెరిగాను. విద్యాభ్యాసం అంతా అక్కడే కొనసాగింది. మా అమ్మ ప్రభుత్వ కళాశాలలో ్ర΄÷ఫెసర్‌గా పని చేస్తున్నారు. నాన్న ఢిల్లీలో జిల్లా విద్యాశాఖ అధికారి. నేను ఢిల్లీ యూనివర్సిటీలో జాగ్రఫీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. జేఎన్‌యూలో మాస్టర్స్ చేశాను. తొలి మహిళా ఐపీఎస్ అధికారి కిరణ్‌బేడీ గురించి తెలుసుకుంటూ పెరిగాను. ఆమె స్ఫూర్తితోనే ఐపీఎస్ కావాలని కలలు కన్నాను. సమాజ సేవలో విమెన్ ఇన్ ఖాకీగా ఉండాలి అన్నదే నా లక్ష్యం. నా భర్త, మా అత్తమామలు, నా కుటుంబ సహకారంతోనే ఐదో ప్రయత్నంలో నా లక్ష్యాన్ని ఛేదించాను. ఐపీఎస్‌గా సెలెక్ట్ కాకముందు ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్‌లో నాలుగేళ్లు ఢిల్లీలో పని చేశాను. 2018లో నాకు వివాహం అయ్యింది. నా భర్త ఐఆర్ఎస్ అధికారి. ఐపీఎస్ కావాలన్నది నా కల. నా భర్త సహకారంతో నా ప్రయత్నాలు కొనసాగిస్తూనే వచ్చాను. ఐదో ప్రయత్నంలో సాధించాను. నాలుగు ప్రయత్నాల్లోనూ ప్రిలిమ్స్, మెయిన్స్‌ను క్లియర్ చేసినా నేను అనుకున్న ఐపీఎస్ రాలేదు. అందుకే ప్రయత్నం కొనసాగించాను. ఐపీఎస్ శిక్షణ అనేది నన్ను మానసికంగా, శారీరకంగా దృఢంగా మార్చింది. ఏపీ కేడర్‌కు వెళుతున్నాను. మహిళల భద్రతకు, సైబర్ నేరాల నియంత్రణకు ్ర΄ాధాన్యత ఇస్తాను. – దీక్ష, ఢిల్లీకిరణ్ బేడి స్ఫూర్తి.నేను పెద్ద ΄ోలీస్ ఆఫీసర్ కావాలన్నది మా అమ్మానాన్నల కల. అది నెరవేర్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఆరో ప్రయత్నంలో ఐపీఎస్ సాధించాను. నా స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్. బీటెక్ కంప్యూటర్ సైన్స్‌లో పూర్తి చేశాను. తర్వాత నుంచి సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపరేషన్ మొదలు పెట్టాను. నాన్న వ్యా΄ారం చేస్తుంటారు. మా కుటుంబం నుంచి మొదటి ΄ోలీస్ అధికారిని నేనే. మొదటి ఐదు ప్రయత్నాలు విఫలమైనా ఆరో ప్రయత్నంలో సక్సెస్ సాధించాను. సివిల్స్ క్లియర్ చేయాలంటే ఒక మెంటార్ తప్పనిసరి అని నా అభి్ర΄ాయం. లేదంటే మార్కెట్లో ఉన్న మెటీరియల్ అంతా చదువుకుంటూ కూర్చుంటే మన శక్తి, సమయం సరి΄ోదు. అది వృథా ప్రయత్నమే అవుతుంది. ఇప్పటికే సివిల్స్ క్లియర్ చేసిన వారి సూచనలతో ముందుకు వెళ్లడం ముఖ్యం. నేను ఐదుసార్లు విఫలం అయినా కూడా నా ప్రయత్నాన్ని వదలలేదు. కిరణ్‌బేడీ నాకు స్ఫూర్తి. నేను ఇప్పుడు తెలంగాణ కేడర్‌కు అలాట్ అయ్యాను. – వసుంధర యాదవ్, ఉత్తరప్రదేశ్నా శక్తిని తెలుసుకున్నానుచదువుకునే సమయంలో మా నాన్నే నీకో లక్ష్యం ఉండాలమ్మా అన్నారు. ΄ోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నాను. మాది నంద్యాల. వ్యవసాయ కుటుంబం. అమ్మా నాన్నలు పెద్దగా చదవక΄ోయినా మా చదువుల విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. కెరీర్ విషయంలోనూ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. సమాజ సేవలో ప్రజలకు దగ్గరగా ఉండాలని నా లక్ష్యం. 2020లో మొదటి అటెంప్ట్ చేశాను. 2022 రెండో ప్రయత్నంలో ఐపీఎస్ సాధించాను. సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యేప్పుడు ఒక స్ట్రాటజీ ఉండాలి. ఎక్కడ మనం బలంగా ఉన్నాం, ఎక్కడ మెరుగు పర్చుకోవాలన్నది గుర్తించి దానికి తగ్గట్టుగా ప్రిపేర్ కావాలి. సీనియర్ల సూచనలు తీసుకోవడం ఉపయోగపడుతుంది. మొదటిసారి నేషనల్ ΄ోలీస్ అకాడమీలో అడుగుపెట్టినప్పుడు ఇంత కఠినమైన శిక్షణ చేయగలనా అనుకున్నాను. కానీ అకాడెమీ ట్రైనింగ్ నాలో శక్తిని తెలుసుకునేలా చేసింది. క్రమంగా మనల్ని శిక్షణలో భాగం చేస్తారు. ఏపీ కేడర్‌కు అలాట్ కావడం సంతోషంగా ఉంది. మహిళా భద్రత అనేది నా ప్రధాన లక్ష్యం. – మనీశా రెడ్డి, నంద్యాలఆత్మవిశ్వాసం పెరిగిందినీపై నీకు విశ్వాసం ఉంటే ప్రయత్న లోపం లేకుండా సాధన చేస్తే కాలం కూడా కలిసి వస్తుందని నమ్ముతాను. అపజయాలనేవి మనల్ని నిర్వచించలేవు. కొన్నిసార్లు మీ ప్రయత్నంలో లోపం లేకున్నా ఏదో ఒక చిన్న తప్పుతో విజయం రాక΄ోవచ్చు. అంత మాత్రాన నిరాశ చెందాల్సిన పని లేదు. మాది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లా. నా విజయంలో కుటుంబ సహకారం ఉంది. నేను రైల్వే ట్రాఫిక్ సర్వీస్‌లో 2019లో సెలక్ట్ అయ్యాను. కానీ నా లక్ష్యం మాత్రం సివిల్ సర్వీసెస్. నాలుగు ప్రయత్నాల్లో విఫలమైనా నిరాశ చెందలేదు. ఐదోసారి ఐపీఎస్ సాధించాను. నా కుటుంబంలో నేనే మొదటి ఐపీఎస్ అధికారిని. ఔట్‌డోర్ శిక్షణలో 15 కిలోల బరువుతో 40 కిలోమీటర్లు నడవడం వంటి ఎన్నో కఠిన శిక్షణల తర్వాత ఆత్మవిశ్వాసం పెరిగింది. నేను యూపీ కేడర్‌కు అలాట్ అయ్యాను. – సోనాలి మిశ్రాఉత్తరప్రదేశ్ం -
అన్ని అంశాల్లో మెరికల్లా శిక్షణ
సాక్షి, హైదరాబాద్: అకాడమీ శిక్షణలో భాగంగా శాంతిభద్రతల నిర్వహణ, సైబర్ నేరాల కట్టడి, డ్రగ్స్ మహమ్మారిని తుద ముట్టించడం సహా అనేక అంశాల్లో యువ ఐపీఎస్‌లను సుశిక్షితులైన అధికారులుగా మార్చినట్టు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అమిత్ గార్గ్ చెప్పారు. 76వ బ్యాచ్ ఆర్ఆర్ (రెగ్యులర్ రిక్రూటీస్)కు చెందిన 188 మంది ఐపీఎస్ అధికారులు, నేపాల్, రాయల్ భూటాన్, మారిషస్, మాల్దీవులకు చెందిన 19 మంది విదేశీ అధికారులు అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నట్టు తెలిపారు. వీరిలో 58 మంది మహిళా అధికారులు ఉన్నారన్నారు. వీరంతా శుక్రవారం అకాడమీలో జరిగే దీక్షాంత్ పరేడ్‌లో పాల్గొంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ హాజరుకానున్నట్టు చెప్పా రు. బుధవారం అకాడమీ జాయింట్ డైరెక్టర్ మధుసూదన్‌రెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మహిళా అధికారులు పెరిగారుసైబర్ నేరాలు, డ్రోన్ టెక్నాలజీ, కొత్త చట్టాలపై అవగాహన, శారీరక, మానసిక ధృఢత్వాన్ని పెంచడం, అన్ని రకాల ఆయుధాలను వాడే విధానం, వివిధ పోలీస్ విభాగాల్లో, సరిహద్దుల్లో మిలిటరీ విభాగాల్లో పనిచేయడం సహా అనేక అంశాల్లో యువ ఐపీఎస్ అధికారులు శిక్షణ పొందినట్లు అమిత్ గార్గ్ తెలిపారు. ఐపీఎస్ అధికారులు కేటాయించబడే రాష్ట్రంలోని స్థానిక భాష, అక్కడి భౌగోళిక పరిస్థితులు, స్థానిక సమస్యలు, సాంప్రదాయాలపై పట్టు సాధించేలా ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. ఈ బ్యాచ్ అధికారుల్లో విద్యార్హత పరంగా చూస్తే ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు 109 మంది, ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు 15 మంది ఉన్నట్టు తెలిపారు. మహిళా అధికారుల సంఖ్యలో ఈసారి పెరుగుదల ఉందని, 75వ బ్యాచ్‌లో 21 శాతం మహిళలుండగా, ఈసారి 29% మంది ఉన్నట్టు చెప్పారు. పరేడ్ కమాండర్‌గా అచ్యుత్ అశోక్ వ్యవహరిస్తారని, ఈ బ్యాచ్‌లో టాపర్స్‌గా నిలిచిన 8 మంది పరేడ్ అనంతరం ట్రోఫీలు అందుకోనున్నట్టు తెలిపారు. తెలంగాణ, ఏపీకి నలుగురు చొప్పున ఐపీఎస్‌లు 76వ ఐపీఎస్ బ్యాచ్ నుంచి తెలంగాణకు నలుగురు, ఏపీకి నలుగురు చొప్పున అధికారులను కేటాయించారు. తెలంగాణ కేడర్‌కు తెలంగాణకు చెందిన రుత్విక్ సాయి కొట్టె, పత్తిపాక సాయికిరణ్, జమ్మూకశీ్మర్‌కు చెందిన మనన్ భట్, యూపీకి చెందిన యాదవ్ వసుంధర ఫరెబీలను కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మనీశరెడ్డి వంగాల, హేమంత్ బొడ్డు, హరియాణాకు చెందిన దీక్ష, తమిళనాడుకు చెందిన ఆర్ సుస్మితలను కేటాయించారు. తప్పుల్లోంచి పాఠాలు నేర్చుకున్నా.. మాది వరంగల్ జిల్లా భీందేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామం. నాన్న పేరు కొమరెల్లి, అమ్మపేరు లక్షి్మ. మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం. మా కుటుంబం నుంచి మొదటి ఐపీఎస్ అధికారిని. సివిల్స్ సాధించాలన్న లక్ష్యంతో 2019లో జాబ్‌కు రిజైన్ చేసి, నేనే సొంతంగా ఇంటి వద్ద ప్రిపరేషన్ కొనసాగించా. రోజుకు 8 గంటలు చదివేవాడిని. మా తల్లిదండ్రులు, సిస్టర్స్, ఇతర కుటుంబసభ్యుల నుంచి సంపూర్ణ సహకారం లభించింది. అయితే నా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్లా. మొత్తం మీద మూడో ప్రయత్నంలో ఐపీఎస్ సాధించా. తెలంగాణ కేడర్‌కు రావడం, మన రాష్ట్ర ప్రజలకే సేవ చేసే అవకాశం దక్కడంతో సంతోషంగా ఉంది. – పత్తిపాక సాయికిరణ్డ్రగ్స్ విషయంలో గట్టిగా పని చేయాలనుకుంటున్నా నా స్వస్థలం వరంగల్. అక్కడే స్కూల్, ఇంటర్ చదివా. నాన్న రాధాకృష్ణరావు సోషల్ వెల్ఫేర్ విభాగంలో లైబ్రేరియన్. మా అమ్మ టీచర్‌గా కొంత కాలం పనిచేశారు. నాన్న చిన్నప్పటి నుంచి చెప్పే మాటలు నాలో స్ఫూర్తిని నింపాయి. బీటెక్ పూర్తయిన తర్వాత 2017 నుంచి సివిల్స్ ప్రిపరేషన్ మొదలు పెట్టా. 2022లో నాకు ఐపీఎస్ వచ్చి0ది. పక్కా ప్రణాళికతో ముందుకు వెళితే తప్పకుండా విజయం సాధించవచ్చు. ఐపీఎస్ శిక్షణ మనలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంచుతుంది. తెలంగాణ కేడర్‌కు రావడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఏదైనా సమస్య ఉంటే ప్రజలు స్వేచ్ఛగా, ధైర్యంగా రాగలిగేలా పోలీసులపై విశ్వాసం పెంచడమే నా లక్ష్యం. డ్రగ్స్ విషయంలో నేను గట్టిగా పనిచేయాలనుకుంటున్నా. – రిత్విక్ సాయి కొట్టే -
కూటమి సర్కార్ కక్ష సాధింపు.. ముగ్గురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్
సాక్షి, అమరావతి: ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోంది. రాష్ట్రంలో ఐపీఎస్‌లపై కక్ష సాధింపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముంబై నటి జత్వానీ ఆరోపణల నేపథ్యంలో తాజాగా ముగ్గురు ఐపీఎస్‌లపై కూటమి సర్కార్ సస్పెన్షన్ విధించింది. కాన్ఫిడెన్షియల్ పేరుతో రహస్య జీవోలు విడుదల విడుదల చేసింది.కాగా, ముంబై నటి జిత్వానీ ఆరోపణలు చేశారన్న కారణంగా ముగుర్గు ఐపీఎస్‌లు సస్పెండ్ అయ్యారు. జిత్వానీ.. పోలీసులకు ఫిర్యాదు చేసిన 48 గంటల్లోనే ప్రభుత్వం ముగ్గురు అధికారులు సస్పెండ్ చేయడం సర్వత్రా విస్మయానికి గురిచేస్తోంది. అంతేకాకుండా కాన్ఫిడెన్షియల్ పేరుతో రహస్య జీవోలు విడుదల చేయడం గమనార్హం. నటి జిత్వానీ ఆరోపణలతో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతి రాణా టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిని సస్పెండ్ చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఇక, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఐపీఎస్‌లను సర్కార్ టార్గెట్ చేస్తూనే ఉంది. గత మూడు నెలలుగా వీరికి పోస్టింగ్ ఇవ్వకుండా వేధింపులకు గురిచేసింది. ఇప్పుడు కూడా పోస్టింగ్ ఇవ్వకుండానే ఆరోపణల పేరుతో వేధింపు.. వారిని సస్పెండ్ చేసింది.ఇది కూడా చదవండి: విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ‘కూటమి’ కుట్ర: బొత్స -
ప్రధాని మోదీ ప్రస్తావించిన డీజీపీ రష్మీశుక్లా ఎవరు?
ముంబై: మహారాష్ట్ర తొలి మహిళా డీజీపీ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ఆమె గురించి ప్రస్తావించారు. మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారిగా మహిళా డీజీపీ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) పోలీసులను ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. మహారాష్ట్ర తొలి మహిళా డీజీపీగా ఎంపికైన ఈ మహిళా ఐపీఎస్ ఎవరో తెలుసుకుందాం.మహారాష్ట్ర తొలి మహిళా డీజీపీ పేరు రష్మీ శుక్లా. ఆమె 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 2024 జనవరి 4న మహారాష్ట్ర నూతన డీజీపీగా నియమితులయ్యారు. అంతకుముందు ఆమె డిప్యూటేషన్‌పై సశాస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) డైరెక్టర్ జనరల్ (డీజీ)గా పనిచేశారు. ఐపీఎస్ అధికారి, డీజీపీ రజనీష్ సేథ్ 2023, డిసెంబర్ 31న పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్‌కు డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం 2024,జనవరి 4న నూతన డీజీపీగా రష్మీ శుక్లాను నియమించింది.మహారాష్ట్ర డీజీపీ రష్మీ శుక్లా రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారి. మూడేళ్లపాటు ఆమె కేంద్రంలో డిప్యూటేషన్‌పై కొనసాగారు. ఆమె గత జూన్‌లో పదవీ విరమణ చేయవలసి ఉంది. అయితే ఆమె పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. రష్మీ శుక్లా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందినవారు. ప్రయాగ్‌రాజ్‌లోనే తన చదువును పూర్తి చేశాడు. అక్కడే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. 24 ఏళ్లకే ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. రష్మీ శుక్లా.. ఉదయ్ శుక్లాను వివాహం చేసుకున్నారు. ఉదయ్ ప్రస్తుతం ముంబైలోని ఆర్పీఎఫ్లో విధులు నిర్వహిస్తున్నారు.ఐపీఎస్ రష్మీ శుక్లా నాగ్‌పూర్ రూరల్ పోలీస్ సూపరింటెండెంట్‌గా కూడా పనిచేశారు. సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ డైరెక్టర్‌గా, పూణే పోలీస్ కమిషనర్ కూడా విధులు నిర్వహించారు. గతంలో ఆమె రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారంటూ పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఆమెపై పూణె, ముంబైలలో కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం మారిన దరిమిలా ఆమెపై పెట్టిన కేసులను ఉపసంహరిస్తూ, క్లీన్ చిట్ ఇచ్చారు. -
ఐదుగురు ఐపీఎస్‌లకు డీజీలుగా పదోన్నతి
సాక్షి, హైదరాబాద్: ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డీజీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారిలో 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారులు కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, బి.శివధర్‌రెడ్డి, అభిలాష బిస్త్, సౌమ్యా మిశ్రా, శిఖాగోయల్ ఉన్నారు. అయితే, వీరిలో కేడర్ కేటాయింపు వివాదం కొనసాగుతున్న ఐపీఎస్ అధికారి అభిలాష బిస్త్‌కు మాత్రం డీఓపీటీ నుంచి తెలంగాణ కేడర్‌కు కేటాయించినట్టు నిర్ధారణ అయిన తర్వాతే పదోన్నతి వర్తిస్తుందని స్పష్టం చేశారు. డీజీలుగా పదోన్నతి పొందిన ఐదుగురు అధికారులను తిరిగి ప్రస్తుత పోస్టింగ్‌లలోనే డీజీపీ హోదాలో కొనసాగిస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు. వీరిలో కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్ సీపీగా, బి.శివధర్‌రెడ్డి ఇంటెలిజెన్స్ డీజీపీ, అభిలాష బిస్త్‌ను తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్, డీజీపీ ట్రైనింగ్‌గా, డా.సౌమ్యా మిశ్రా జైళ్లశాఖ డీజీగా, శిఖాగోయల్ సీఐడీ డీజీపీగా, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా, టీజీఎఫ్ఎస్ఎల్, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇన్చార్జి డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.కాగా, పదోన్నతి పొందిన వారిలో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సర్వీస్ వచ్చే ఏడాది ఆగస్టు వరకు, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి సరీ్వస్ 2026 ఏప్రిల్ వరకు, జైళ్లశాఖ డీజీ సౌమ్యా మిశ్రా సరీ్వస్ 2027 డిసెంబర్ వరకు, శిఖాగోయల్ సర్వీస్ 2029 మార్చి వరకు ఉంది. -
ఐపీఎస్‌కు ఎంపికైన ఏలూరు ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్
ఏలూరు టౌన్: పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం సీసలి గ్రామానికి చెందిన గణేశ్న భాను శ్రీలక్ష్మి అన్నపూర్ణ ప్రత్యూష ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ప్రత్యూష గత ఏప్రిల్‌లో విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 198 ర్యాంకు సాధించగా.. తాజాగా ఐపీఎస్ శిక్షణకు రావాలంటూ ఉత్తర్వులు అందాయి. గతంలో గ్రూప్–1లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించగా ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఐపీఎస్‌కు ఎంపికవడంతో ఆగస్టు 26 నుంచి ముస్సోరీలో జరగనున్న శిక్షణకు హాజరుకావాల్సి ఉంది. సిసలికి చెందిన గణేశ్న వెంకట రామాంజనేయులు, ఉషా దంపతుల కుమార్తె ప్రత్యూష మొదట నుంచి చదువుపై ఆసక్తితో ఉన్నత శిఖరాలు అందుకోవాలని కష్టపడి చదివింది. ఏడాది ఆగస్టులో విడుదలైన గ్రూప్–1 పరీక్షా ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది. అనంతరం ఏలూరు జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా ట్రైనింగ్‌లో ఉన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ లేడీ శ్రీరామ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. -
కక్ష సాధింపు తీరు.. ఇదెక్కడి పాలన చంద్రబాబు..?
-
ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. ఏకంగా 37 మందిని వివిధ జిల్లాలకు, విభాగాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం సాయంత్రం ఉత్వర్వులు జారీ చేసింది. ఇందులో.. బదిలీ అయిన ఐపీఎస్‌ల వివరాలుశ్రీకాకుళం ఎస్పీగా కె వి మహేశ్వర రెడ్డివిజయనగరం ఎస్పీగా వకుల్ జిందాల్అనకాపల్లి ఎస్పీగా ఎం దీపికసత్యసాయి జిల్లా ఎస్పీగా వి రత్నపార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీగా మాధవరెడ్డికాకినాడ ఎస్పీగా విక్రాంత్ పాటిల్గుంటూరు ఎస్పీగా ఎస్ సతీష్ కుమార్బాపట్ల ఎస్పీగా తుషార్ దూబిఅల్లూరి జిల్లా ఎస్పీగా అమిత్ బర్దర్విశాఖ సిటీ డీసీపీ గా తుహిన్ సిన్హాతూర్పుగోదావరి ఎస్పీగా నరసింహ కిశోరెఅన్నమయ్య జిల్లా ఎస్పీగా విద్యా సాగర్ నాయుడుకోనసీమ జిల్లా ఎస్పీగా బి కృష్ణా రావుకృష్ణా ఎస్పీగా గంగాధర్ రావుపశ్చిమగోదావరి ఎస్పీగా అద్నాన్ నాయిమ్ అస్మివిశాఖపట్నం డీసీపీ గా అజిత వెజెండ్లఏలూరు ఎస్పీగా ప్రతాప్ శివ కిషోర్పల్నాడు ఎస్పీగా కె శ్రీనివాసరావుప్రకాశం ఎస్పీగా ఆ ఆర్ దామోదర్విజయనగరం చింతవలస 5 వ బెటాలియన్ కమాండెంట్ గా మల్లికా గార్గ్కర్నూల్ ఎస్పీగా జి బిందు మాధవ్నెల్లూరు ఎస్పీగా కృష్ణ కాంత్నంద్యాల ఎస్పీగా అధిరాజ్ సింగ్ రాణావై ఎస్సార్ కడప ఎస్పీగా హర్షవర్ధన్ రాజుఅనంతపురం ఎస్పీగా కె వి మురళి కృష్ణఎన్టీఆర్ కమిషనరేట్(విజయవాడ) డీసీపీ గా గౌతమి సాలితిరుపతి ఎస్పీగా ఎల్ సుబ్బారాయుడుఇంటెలిజెన్స్ ఎస్పీగా వి గీతా దేవిబదిలీ అయిన ఐపీఎస్‌లను హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం తన జీవోలో ఆదేశించింది. అలాగే.. ఐపీఎస్‌లు జీఆర్ రాధిక, మేరీ ప్రశాంతి, ఆరిఫ్ హఫీజ్, కె రఘువీరా రెడ్డి, సిద్దార్థ్ కౌశల్, సుమిత్ సునీల్, పి జగదీష్, ఎస్ శ్రీధర్, ఎం సత్తిబాబులను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చెయ్యాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.బదిలీ ఐపీఎస్‌ల జీవో కోసం క్లిక్ చేయండి -
Telangana: తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ జితేందర్ నియామకం
-
TG: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం భారీగా ఐపీఎస్ బదిలీలు చేసింది. మొత్తం 28 మంది పోలీసు ఉన్నతాధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సాధారణపరిపాలన శాఖ సోమవారం(జూన్17) ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో భారీగా ఐపీఎస్ బదిలీలు.. వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఐపీఎస్‌లను వెంటనే డెప్యుటేషన్‌పై పంపండి
సాక్షి, అమరావతి: కేంద్ర దర్యాప్తు సంస్థలు, భద్రత విభాగాల్లో విధులు నిర్వర్తించడానికి రాష్ట్రాలు డెప్యుటేషన్‌పై ఐపీఎస్ అధికారులను పంపకపోవడంపై కేంద్ర హోం శాఖ అసహనం వ్యక్తం చేసింది. ‘ఐపీఎస్ అధికారులను డెప్యుటేషన్‌పై పంపండి. ఇప్పటికే ఓసారి చెప్పాం. అయినా పంపడంలేదు. ఇది సరైన పద్ధతి కాదు. కేంద్ర దర్యాప్తు సంస్థలు, భద్రతా విభాగాల్లో కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వెంటనే కోటా మేరకు ఐపీఎస్ అధికారులను పంపించడి’ అని కేంద్ర హోం శాఖ రాష్ట్రాలకు స్పష్టం చేసింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శు (సీఎస్)లకు లేఖలు రాసింది. కేంద్ర హోం శాఖ ఈ విధంగా రాష్ట్రాలకు లేఖ రాయడం ఈ ఏడాది ఇది రెండోసారి. కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర భద్రతా విభాగాల్లో రాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారులనే డెప్యుటేషన్‌పై నియమిస్తారు. అందుకోసం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వాటికి నిర్దేశించిన కోటా ప్రకారం ఐపీఎస్ అధికారులను డెప్యుటేషన్‌పై కొంతకాలం కేంద్ర సర్వీసులకు పంపాల్సి ఉంటుంది. డెప్యుటేషన్ ముగిసి తిరిగి రాష్ట్ర సర్వీసులో చేరిన అధికారుల స్థానంలో మరికొందరిని పంపాలి. కానీ ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు కోటా మేరకు ఐపీఎస్‌లను కేంద్ర సర్వీసులకు పంపడంలేదు. దీనిపై కొన్ని నెలల క్రితం కేంద్ర హోం శాఖ లేఖ రాసింది. అయినా హిమాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర మినహా మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఐపీఎస్ అధికారులను పంపించలేదు. దీనిపై కేంద్ర హోం శాఖ తీవ్రంగా స్పందించింది. ఐపీఎస్ అధికారులను కేంద్రానికి పంపాలని ఇటీవల మరో లేఖ రాసింది.దాదాపు 250 పోస్టులు ఖాళీరాష్ట్రాల నుంచి ఐపీఎస్ అధికారులను డెప్యుటేషన్‌పై పంపించకపోవడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు, భద్రతా విభాగాల్లో భారీగా పోస్టులు ఖాళీగా ఉండిపోయాయని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 3 నాటికి ఎస్పీ, ఆ పైస్థాయి అధికారుల పోస్టులు 250 వరకు ఖాళీగా ఉన్నాయి. ప్రత్యేక డీజీ, అదనపు డీజీ పోస్టులూ ఖాళీగా ఉన్నాయి. ఎస్పీస్థాయిలో 129 పోస్టులు, డీఐజీ స్థాయిలో 81 పోస్టులు, ఐజీ స్థాయిలో 25 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.దర్యాప్తులో జాప్యం.. దేశ భద్రత విధుల్లో ఇబ్బందులుకేంద్ర దర్యాప్తు సంస్థలు, భద్రతా విభాగాల్లో ఇంత భారీగా అధికారుల పోస్టులు ఖాళీగా ఉండటం ప్రతికూల ప్రభావం చూపిస్తోందని కేంద్ర హోం శాఖ పేర్కొంది. సీబీఐ, ఎన్ఐఏలపై ఇప్పటికే పనిభారం విపరీతంగా పెరిగింది. కీలక కేసుల దర్యాప్తులో తీవ్ర జాప్యం జరుగుతోంది. బీఎస్ఎఫ్, ఐటీబీపీ విభాగాల్లో అధికారుల కొరతతో సరిహద్దుల్లో భద్రత విధుల్లో సమస్యలు ఏర్పడుతున్నాయి. సీఆర్పీఎఫ్లో అధికారుల కొరత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఆపరేషన్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తోందని కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో తెలిపింది. విభాగాల వారీగా ఖాళీలు» కేంద్ర దర్యాప్తు సంస్థలో 63 డీఐజీ పోస్టుల్లో 30 పోస్టులు దీర్ఘకాలంగా భర్తీ కావడంలేదు. రెండు ప్రత్యేక డైరెక్టర్ జనరల్, 8 అదనపు డైరెక్టర్ జనరల్ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి.» కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లో 73 ఎస్పీ స్థాయి పోస్టులకుగాను 54 పోస్టులు ఖాళీగా ఉన్నాయి» ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)లో 36 ఎస్పీ స్థాయి పోస్టులలో 13 భర్తీ చేయాల్సి ఉంది.» కేంద్ర నిఘా విభాగం (ఐబీ)లో 83 ఎస్పీ పోస్టుల్లో 50 ఖాళీగా ఉన్నాయి.» భారత్–చైనా సరిహద్దుల్లో భద్రత విధులు నిర్వర్తించే ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) విభాగంలో 11 డీఐజీ పోస్టుల్లో 5 ఖాళీగా ఉన్నాయి. » సరిహద్దు భద్రతా విభాగం (బీఎస్ఎఫ్) లో ఒక అదనపు డీజీ పోస్టు, 26 డీఐజీ పోస్టుల్లో 10 పోస్టులు, 21 ఐజీ పోస్టులకుగాను ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.» కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాలు (సీఆర్పీఎఫ్)లో 7 డీఐజీ పోస్టులు, 5 ఐజీ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. -
ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత..
సాక్షి, విజయవాడ: ఏపీలో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుపై సస్పెన్షన్ ఎత్తివేయబడింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఏబీ వెంకటేశ్వర రావుకు పోస్టింగ్ ఇవనున్నారు. అయితే, అవినీతి ఆరోపణలపై గతంలో సస్పెండ్ అయిన ఏబీ వెంకటేశ్వరరావు తిరిగి విధుల్లో చేరునున్నారు. ఏపీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రింటింగ్ అండ్ స్టేషనరి డీజీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, నేడు ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేయనున్నారు. -
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దుపై పిటిషన్
-
UPSC: సివిల్స్ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు
సాక్షి, ఢిల్లీ: యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో 1,016 మంది ఎంపికయ్యారు. ఆదిత్య శ్రీవాత్సవకు మొదటి ర్యాంకు, అనిమేష్ ప్రధాన్‌కు రెండో ర్యాంకు, దోనూరి అనన్యరెడ్డికి మూడో ర్యాంకు దక్కింది. ఇక ఈ యూపీఎస్సీ ఫలితాల్లో వరంగల్‌కు చెందిన ఇద్దరు సెలక్ట్ అయ్యారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ర్యాంకుల పంట పండింది. మొత్తం 1,016 మంది ఎంపికయితే.. అందులో తెలుగు అభ్యర్థులు కనీసం 50కి పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దోనూరు అనన్యారెడ్డికి మూడో ర్యాంకు అన్షుల్ భట్ 22వ ర్యాంకు నందల సాయి కిరణ్‌కు 27 ర్యాంకు మెరుగు కౌశిక్‌కు 82వ ర్యాంకు పింకిస్ ధీరజ్ రెడ్డి 173 ర్యాంకు అక్షయ్ దీపక్ 196 ర్యాంకు భానుశ్రీ 198 ర్యాంకు ప్రదీప్ రెడ్డి 382 ర్యాంకు వెంకటేష్ 467 ర్యాంకు హరిప్రసాద్ రాజు 475వ ర్యాంకు పూల ధనుష్ 480 ర్యాంకు కె. శ్రీనివాసులు 526 ర్యాంకు సాయితేజ 558 ర్యాంకు కిరణ్ సాయింపు 568 ర్యాంకు మర్రిపాటి నాగభరత్ 580 ర్యాంకు పీ. భార్గవ్ 590 ర్యాంకు అర్పిత 639 ర్యాంకు ఐశ్వర్య నీలిశ్యామల 649 ర్యాంకు సాక్షి కుమార్ 679 ర్యాంకు రాజ్‌కుమార్ చౌహన్ 703 ర్యాంకు జి.శ్వేత 711 ర్యాంకు ధనుంజయ్ కుమార్ 810 ర్యాంకు లక్ష్మీ భానోతు 828 ర్యాంకు ఆదా సందీప్ కుమార్ 830 ర్యాంకు జె.రాహుల్ 873 ర్యాంకు హనిత వేములపాటి 887 ర్యాంకు కె.శశికాంత్ 891 ర్యాంకు కెసారపు మీనా 899 ర్యాంకు రావూరి సాయి అలేఖ్య 938 ర్యాంకు గోపద నవ్యశ్రీ 995 ర్యాంకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముగ్గురికి ర్యాంకులు వచ్చాయి. వరంగల్ నగరానికి చెందిన జయసింహారెడ్డికి 103వ ర్యాంకు వచ్చింది. గీసుకొండ మండలం అనంతరం గ్రామానికి చెందిన సయింపు కిరణ్‌కు 568 ర్యాంకు వచ్చింది. శివనగర్ కు చెందిన కోట అనిల్ కుమార్‌కు 764వ ర్యాంకు వచ్చింది. జయసింహారెడ్డికి IAS వచ్చే అవకాశం ఉంది. కిరణ్‌కు IPS లేదా IRS రావొచ్చు. అనిల్ కుమార్‌కు IRS వచ్చే అవకాశం ఉంది. (సయింపు కిరణ్) గతేడాది మే 28వ తేదీన యూపీఎస్పీ ప్రిలిమ్స్ పరీక్ష జరిగాయి. ప్రిలిమ్స్ పరీక్షల అనంతరం మేయిన్స్ పరీక్షలు సెప్టెంబర్ 15, 16, 17, 23, 24 తేదీల్లో జరిగాయి. మేయిన్స్ పరీక్షల ఫలితాలను డిసెంబర్ ఎనిమిదో తేదీన విడుదల చేశారు. అనంతరం జనవరి రెండో తేదీ నుంచి ఏప్రిల్ రెండు నుంచి ఏప్రిల్ తొమ్మిదో తేదీ వరకు ఇంటర్వ్యూలు జరిగాయి. నేడు తుది ఫలితాలు వెలువడ్డాయి. UPSC has announced the final results of the Civil Services Examination. Congratulations to all achievers who have cleared this prestigious milestone! Your hard work and dedication have paid off.#Upsc_final_result#UPSC2024 #upsc#upsc2023 pic.twitter.com/jkj3sCPoSD — आदर्श यादव(Adarsh Yadav) (@AdarshY59491482) April 16, 2024 -
తెలంగాణ విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ హఠాన్మరణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో పండుగ వేళ తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ కన్నుమూశారు. గుండెపోటుతో ఓ ప్రైవేట్ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందారు. రాజీవ్ రతన్ 1991 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన ఆఫీసర్. గతంలో కరీంనగర్ ఎస్పీగా పనిచేశారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. కిందటి ఏడాది మహేందర్‌రెడ్డి డీజీపీగా పదవీ విరమణ చేసిన టైంలో.. కొత్త పోలీస్ బాస్ రేసులో ఈయన పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత ఆయన విజిలెన్స్ డీజీగా ప్రమోషన్ పొందారు. .. కాళేశ్వరం అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ డీజీ హోదాలో రాజీవ్ రతన్ విచారణ జరిపారు. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగానే ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. అంతేకాదు మేడిగడ్డ వ్యవహారంపై ఇటీవలె సీఎం రేవంత్‌రెడ్డి రాజీవ్ రతన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చారు. మరోవైపు రాజీవ్ రతన్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి తెలంగాణ విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ హఠాన్మరణంపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు రాజీవే సారధ్యం వహించారు. సుదీర్ఘ కాలంగా రాష్ట్రంలో పోలీసు విభాగానికి ఆయన విశిష్టమైన సేవలందించారు. సమర్థవంతంగా, నిజాయితీగా విధులు నిర్వహించిన అధికారులను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరిచిపోదు. రాజీవ్ రతన్ మృతి పట్ల నా సంతాపం వ్యక్తం చేస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా అని సీఎం రేవంత్ సంతాప ప్రకటన విడుదల చేశారు. సీనియర్ #IPS అధికారి రాజీవ్ రతన్ హఠాన్మరణంపై ముఖ్యమంత్రి @revanth_anumula దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా రాష్ట్రంలో పోలీసు విభాగానికి ఆయన అందించిన విశిష్టమైన సేవలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సమర్థవంతంగా, నిజాయితీగా విధులు నిర్వహించిన అధికారులను… — Telangana CMO (@TelanganaCMO) April 9, 2024 -
ఎల్లోమీడియాకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వార్నింగ్
-
చంద్రబాబు కోసం బరితెగించొద్దు!
సాక్షి, అమరావతి: ‘‘వీళ్లా ఎస్పీలు?’’ అంటే అర్థమేంటి రామోజీరావ్? ఎస్పీలు మీరు ఊహించినట్లు ఉండాలా? మీకు కావాల్సినట్లు ఉండాలా? ఇదెక్కడి దుర్మార్గం!. అత్యున్నత సర్వీసుల్లో పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు అవినీతి అంటగట్టడం, ఎవరెవరు ఎక్కడెక్కడ పని చేయాలో కూడా మీరే నిర్దేశించటం.. ఆఖరికి ఎన్నికల కమిషన్ ఎవరిని నియమించాలో కూడా మీరే సిఫారసు చేయటం ఇదెక్కడి దౌర్భాగ్యం? అసలిది పత్రికేనా? ‘‘వీళ్లా ఎస్పీలు?’’ అంటూ శుక్రవారం ‘ఈనాడు’ పతాక స్థాయిలో ప్రచురించిన హీనాతిహీనమైన కథనంపై అటు ఐఏఎస్ అధికారులు, ఇటు ఐపీఎస్ అధికారులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఈనాడు’ ‘ఆంధ్రజ్యోతి’ హద్దులు మీరుతున్నాయని, ఆ పార్టీల నేతలు నోటికొచ్చినట్లు వాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈసీకి ఇప్పటికే ఫిర్యాదు చేశామని తెలిపారు. అందరిపైనా చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తూ ‘పచ్చ’ మందకు ఐపీఎస్ అధికారులు వార్నింగ్ ఇచ్చారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిగా నిలుస్తున్న రాజ్యాంగబద్ధ సంస్థ కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రతిష్టకు భంగం కలిగిస్తూ ఈనాడు పత్రిక దు్రష్పచారపూరిత కథనాన్ని ప్రచురించడం దారుణం అని ఇంకో వైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి మండిపడ్డారు. ఈసీ రాజ్యాంగ నిబంధనలను పాటిస్తూ కొత్తగా ఒక ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లను నియమిస్తే ‘వీళ్లా.. కొత్త ఎస్పీలు’ అంటూ ప్రశ్నించే హక్కు రామోజీకి ఎక్కడిదని ప్రశ్నించారు. నిరాధార ఆరోపణలతో ఈనాడు పత్రిక ఈసీ ప్రతిష్టకు భంగం కలిగించడంతోపాటు యావత్ ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపీఎస్ అధికారులంటే.. రామోజీ తన ఫిల్మ్ సిటీలో పని చేస్తున్న గార్డులుగా భావిస్తున్నట్లుందని పౌర సంఘాలు సైతం తీవ్రంగా తప్పు పట్టాయి. ఎలక్షన్ కమిషన్ నియామకాలను తప్పు పడుతున్నారంటే రామోజీ తనకు తాను రాజ్యాంగేతర శక్తిగా భావిస్తున్నట్లుందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఒక వర్గానికి కొమ్ము కాసేలా, రెండు ప్రభుత్వ వ్యవస్థల మధ్య అపోహలు కల్పించేలా ఈనాడు, దాని తోక పత్రిక, కొంత మంది టీడీపీ నేతలు నిత్యం పనిగట్టుకుని దు్రష్పచారం చేస్తున్నారని నిప్పులు చెరిగాయి. అది రాజకీయ దురుద్ధేశమే ఎన్నికల విధులు నిర్వహిస్తున్న రాష్ట్ర అధికార యంంత్రాంగం నిబద్ధత, మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఈనాడు పత్రిక దురుద్దేశపూరిత కథనాన్ని ప్రచురించడం ఏ మాత్రం భావ్యం కాదని సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. అధికారుల ప్రతిష్టకు భంగం కలిగిస్తూ వారిని అవమానపరిచే రీతిలో రాసిన కథనాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఒక్కో పోస్టుకు మూడేసి పేర్లతో పంపిన జాబితాను పరిశీలించి ఈసీ తన విచక్షణాధికారాల మేరకు నిర్ణయం తీసుకుంటుందన్నారు. తాము పంపించే జాబితాపై సందేహాలు ఉంటే దాన్ని తిరస్కరిస్తూ కొత్తగా మరికొందరు అధికారుల పేర్లతో మరో జాబితాను పంపించమని ఈసీ ఆదేశిస్తుందన్నారు. గుంటూరు ఐజీ పోస్టు కోసం తాము పంపిన జాబితాను ఈసీ వెనక్కి పంపడంతో మరో జాబితాను పంపించామని తెలిపారు. కీలకమైన ఎన్నికల తరుణంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అఖిల భారత సర్వీసు అధికారుల ప్రతిష్టకు భంగకరంగా ఈనాడు తప్పుడు కథనాన్ని ప్రచురించడం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని భావిస్తున్నామన్నారు. పాత్రికేయ ప్రమాణాలు, విలువలకు విరుద్ధంగా ఈనాడు పత్రిక వ్యవహరించిందని చెప్పారు. ఈనాడు కథనంపై తన అభిప్రాయాన్ని సైతం బ్యానర్‌గా ప్రచురించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. లేదంటే న్యాయపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని స్పష్టం చేశారు. సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటాం పోలీసు అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఈనాడు పత్రిక దు్రష్పచారం చేస్తోందని రాష్ట్ర ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా విమర్శించింది. ప్రజల భద్రత, ఎన్నికల సక్రమ నిర్వహణ కోసం రాష్ట్రంలోని పోలీసు యంత్రాంగం మొత్తం సమష్టిగా కృషి చేస్తోందని స్పష్టం చేసింది. తమ విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు ఈనాడు పత్రిక దురుద్దేశాలు ఆపాదించడాన్ని తీవ్రంగా ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ దురుద్దేశంతోనే అవాస్తవ కథనాలను ప్రచురించారని మండి పడింది. దుష్ప్రచారం చేస్తున్న వారికి వ్యతిరేకంగా సంబంధిత ఐపీఎస్ అధికారులు వ్యక్తిగతంగా, సమష్టిగా సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటారని కూడా తెలిపింది. ఈ మేరకు ఐపీఎస్ అధికారుల సంఘం తరపున ఆ సంఘం కార్యనిర్వాహక సభ్యుడు క్రాంతిరాణా టాటా శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పలువురు ఐఏఎస్ అధికారులు సైతం ఈనాడు వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. తామంతా ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరించాలన్నట్లు రామోజీ వైఖరి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదని, రామోజీ తన హద్దులెరిగి ప్రవర్తించాలన్నారు. ఈసీ, ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు ఈనాడు దినపత్రికలో శుక్రవారం పతాక శీర్షికన ప్రచురితమైన కథనం ఒక వర్గానికి కొమ్ము కాసేలా, రెండు ప్రభుత్వ వ్యవస్థల మధ్య అపోహలు కల్పించేదిగా ఉందంటూ ఎన్నికల సంఘానికి రెండు పౌర సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఏపీ ఇంటిలెక్చువల్ అండ్ సిటిజన్స్ ఫోరం, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం సచివాలయంలోని ఎన్నికల కార్యాలయంలోని ఫిర్యాదుల విభాగానికి ఈ మేరకు ఒక లేఖను అందజేశారు. అనంతరం ఇంటిలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు పి.విజయబాబు మాట్లాడుతూ.. ఈనాడులో ‘వీళ్ళా కొత్త ఎస్పీలు.. సగానికి పైగా వైకాపా విధేయులే’ అన్న కథనం ఎటువంటి ఆధారాలు లేని అర్ధరహిత కథనంగా ఉందన్నారు. ఒక రాజకీయ పార్టీపై వ్యతిరేకతతో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి పై అసత్య ఆరోపణలు చేసే విధంగా వార్తను ప్రచురించారని, అందువల్ల ఆ పత్రిక యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈనాడు పత్రిక కథనాలు సత్య దూరంగా ఉంటున్నాయని, అందువల్ల దీనిపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా ఫిర్యాదు చేయబోతున్నామని ఆయన తెలిపారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు మాట్లాడుతూ.. కొత్త ఎస్పీల నియామకం నిబంధనల ప్రకారమే జరిగినప్పటికీ జవహర్ రెడ్డి పై అనవసర విమర్శలు చేశారన్నారు. జవహర్ రెడ్డి ఒక్కో పోస్టుకు ముగ్గురు అభ్యర్థుల పేర్లను మాత్రమే సూచించారని వారిలో ఒకరి పేరు నిర్ధారించే అధికారం ఎన్నికల సంఘానికే ఉందని కృష్ణంరాజు వివరించారు. ఎస్పీల నియామకాన్ని తప్పు పట్టడం అంటే ఎన్నికల సంఘాన్ని తప్పు పట్టడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉన్నంతకాలం వివిధ పత్రికల్లో వస్తున్న అసత్య, అర్ధసత్య వార్తలను ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు పరిశీలించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయవాది ఎం విఠల్ రావు, పలువురు ప్రముఖులు ఎన్నికల సంఘాన్ని కలిసిన వారిలో ఉన్నారు. రాజ్యాంగేతర శక్తి అనుకుంటున్నారు.. చింత చచ్చినా పులుపు చావలేదు అంటే ఇదేనేమో.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు ఛీకొట్టి నిర్ద్వందంగా తిరస్కరించి ఐదేళ్లు అవుతున్నా ఈనాడు రామోజీరావు మాత్రం తాను ఇంకా రాజ్యాంగేతర శక్తినేనని భావిస్తున్నారు. తాను చెప్పిందే శాసనం.. తన మాటే వేదం అన్నట్టుగా సాగాలని అనుకుంటున్నారు. అందుకోసం ఏకంగా రాజ్యంగబద్ధ సంస్థ ఎన్నికల కమిషన్ (ఈసీ)నే తూలనాడుతున్నారు. ఈసీ అంటే తన జేబు సంస్థ అన్నట్టుగా... తన ఆదేశాలే పాటించాలని, ఈనాడు ఉద్యోగుల్లా తన మనసెరిగి మసలుకోవాలని హకుం జారీ చేస్తున్నారు. తమ బాబుకు అనుకూలంగా జరిగితే ఆహా ఓహో అంటామని, అలా కాకుండా రాజ్యాంగ నిబంధనల మేరకు నిక్కచ్చిగా వ్యవహరిస్తామంటే మాత్రం ఎవరినైనా సరే బురదజల్లి బజారుకీడుస్తామని రామోజీరావు పాత్రికేయ వీరంగం వేస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొందరు ఎస్పీలను ఈసీ నియమిస్తే.. ‘వీళ్లా కొత్త ఎస్పీలు..?’అంటూ ఈనాడు పతాక శీర్షికన కథనాన్ని అచ్చేయడం రామోజీరావు పెత్తందారి పోకడలకు నిదర్శనం. ఎస్పీలు అంటే అఖిల భారత సర్వీసు అధికారులు కాదు.. తన ఇంటి నౌకర్లు.. ఫిలింసిటీ గార్డులు అన్నట్టుగా రామోజీరావు తన ఈనాడు పత్రిక నిండా విషాక్షరాలు కక్కడం పాత్రికేయ నైచత్వానికి పరాకాష్ట. ఈనాడు పాత్రికేయ దుర్మార్గంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వంటి రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల కమిషన్ ప్రతిష్టకు భంగకరంగా ఈనాడు పత్రిక దు్రష్పచారం చేసిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి మండిపడ్డారు. అసలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నప్పుడు అధికారుల పోస్టింగుల ప్రక్రియ ఎలా సాగుతుందన్న కనీస పరిజ్ఞానం ఈనాడు పత్రికకు ఉందా అని ఆయన నిలదీశారు. నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారుల మనో స్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు ఈనాడు పత్రిక కుట్ర పన్నిందని రాష్ట్ర ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ధ్వజమెత్తింది. అటువంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్న వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు వెనుకడామని కూడా స్పష్టం చేసింది. ఈనాడు రామోజీరావు రాజ్యాంగబద్ధ సంస్థల ప్రతిష్టను దెబ్బతీస్తూ అప్రజస్వామికంగా వ్యవహరిస్తున్నారని పౌర సమాజం తీవ్రంగా దుయ్యబట్టింది. ఈనాడు పత్రిక రాజకీయ కుట్రలపై ఈసీకి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని ఏపీ ఇంటిలెక్చువల్ అండ్ సిటిజన్స్ ఫోరం, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ తెలిపాయి. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగబద్ధ సంస్థ ఈసీనీ, యావత్ అధికార యంత్రాంగంపై ఈనాడు రామోజీరావు దు్రష్పచారం చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. పరాజయానికి సాకులు త్వరలో నిర్వహించనున్న ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ మరోసారి దారుణంగా ఓడిపోనుందన్నది ఇప్పటికే స్పష్టమైంది. ‘జై జగన్’ అనే జన నినాదాలతో ‘సిద్ధం’ సభలు మార్మోగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ‘వన్స్ మోర్ జగన్’ అని ముక్తకంఠంతో నినదిస్తున్నారని జాతీయ చానళ్ల సర్వేలు పదే పదే వెల్లడిస్తున్నాయి. దాంతో బెంబేలెత్తిన చంద్రబాబు, రామోజీరావులు తమకు అలవాటైన రీతిలో కుట్ర రాజకీయాలకు తెరతీశారు. అందులో భాగంగా అధికార యంత్రాంగం మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు పన్నాగం పన్నారు. మరిది మనసెరిగి మసలుకుంటున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ ఈ కుట్రలో భాగస్వాములయ్యారు. దాంతో ఈ ఎల్లో గ్యాంగ్ దురుద్దేశపూరితంగా రాష్ట్రంలోని ఎస్పీలు, కలెక్టర్లు, ఇతర అఖిల భారత సర్వీసు అధికారులపై నిరాధార ఆరోపణలతో హడావుడి చేస్తోంది. సమర్థ పనితీరు, చిత్తశుద్ధితో నిమిత్తం లేకుండా శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు మొత్తం ఎస్పీలు, కలెక్టర్లు, డీఐజీలు, డీజీ స్థాయి అధికారుల వరకు ఓ జాబితా తయారు చేసి వారందరినీ బదిలీ చేయాలని ఈసీకి విజ్ఞప్తులపై విజ్ఞప్తులు చేశారు. ఓ వైపు చంద్రబాబు, లోకేశ్.. మరోవైపు పురందేశ్వరి, పవన్ కల్యాణ్.. దీనికి తోడు టీడీపీ అనుకూల ఎల్లో మీడియా రాష్ట్రంలోని ఉన్నతాధికారులపై అవాకులు చవాకులు పేలుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి, వ్యవస్థలను ప్రభావితం చేసేందుకు యత్నించారు. తద్వారా రానున్న ఎన్నికల్లో తమ ఓటమికి ఇప్పటి నుంచే సాకులు వెతుక్కునే పనలో పడింది పచ్చ ముఠా. బదిలీ చేస్తే ఈసీ ఆహా ఓహో అంటారా... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న చిలకలూరిపేట సభను అవకాశంగా చేసుకుని అసత్య ఆరోపణలతో ఎల్లో మీడియా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. వాహనాలు సమకూర్చినా, డబ్బులు ఇస్తామన్నా సరే సభకు ఆశించిన స్థాయిలో జనం హాజరు కాకపోవడంతో ఆ సభ అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. తమ వైఫల్యాన్ని అంగీకరించలేక చంద్రబాబు రాష్ట్రంలోని అధికారులపై సాకు నెట్టేసేందుకు యత్నించారు. అందుకే పలువురు అధికారుల జాబితాను రూపొందించి వారిని బదిలీ చేయాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు తానా అంటే పురందేశ్వరి, పవన్ కల్యాణ్ తందానా అన్నారు. పోనీ.. సక్రమంగా ఎన్నికల నిర్వహణకు ప్రతిపక్షాలు సహకరిస్తాయనే ఉద్దేశంతో ఈసీ.. ఒక ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లను బదిలీ చేసింది. తమ దు్రష్పచార కుట్ర ఫలించడంతో రామోజీ ‘ఈడ్చి కొట్టిన ఈసీ’ అంటూ ఈనాడు పత్రికలో బ్యానర్ వార్త రాశారు. ఆ అధికారులను బదిలీ చేయడాన్ని అధికార వైఎస్సార్సీపీ ఏమీ తప్పుపట్ట లేదు. ఈసీ తన విచక్షణాధికారాలతో తీసుకున్న నిర్ణయాన్ని హుందాగా స్వీకరించి గౌరవించింది. కొత్త అధికారులను నియమిస్తే తూలనాడుతారా? బదిలీ చేసిన ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్ల స్థానంలో ఈసీ కొత్త అధికారులను నియమించింది. అందుకోసం రాజ్యాంగ నిబంధనలను పక్కాగా పాటించింది. కానీ ఈనాడు రామోజీరావుకు మాత్రం ఆ నిర్ణయం రుచించ లేదు. అధికారులను నియమించే ముందు ఈసీ హైదరాబాద్ శివార్లలో ఉన్న ఫిల్మ్ సిటీలో తాను అక్రమంగా నిర్మించిన తన బంగ్లాకు వచ్చి.. తాను మెట్లు దిగేవరకు వేచి చూసి.. ఎవరెవర్ని ఎస్పీలుగా, కలెక్టర్లుగా నియమించాలని తనను అడిగి.. తాను ఇచ్చిన జాబితాను మహా ప్రసాదంగా తీసుకుని వెళ్లి.. వారికి పోస్టింగులు ఇవ్వాలని రామోజీరావు భావించినట్టు ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అలానే చేసేవారన్నది ఆయన ఉద్దేశం. పాపం.. ఈసీకి ఆ విషయం తెలియదు కదా! రాజ్యాంగ నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుని గుంటూరు ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లను నియమించింది. అందుకోసం ముందుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ని ప్రతిపాదనలు పంపమని ఆదేశించింది. ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటిస్తూ సీఎస్ ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున మొత్తం మీద 27 మంది అధికారుల పేర్లను ప్రతిపాదిస్తూ ఈసీకి జాబితా సమర్పించారు. ఆ జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, అదనపు డీజీ (శాంతి, భద్రతలు) ఎస్.ఎస్. బాగ్చీలతో కూడిన కమిటీ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదించింది. ఆ జాబితాపై కేంద్ర ఎన్నికల కమిషన్ సమగ్రంగా సమీక్షించింది. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున ప్రతిపాదించిన అధికారుల సీనియారిటీ, పనితీరు, ట్రాక్ రికార్డ్‌ను కూలంకుషంగా పరిశీలించింది. సీఎస్ పంపిన జాబితాకే ఈసీ కట్టుబడాలని లేదు. స్వయం ప్రతిపత్తిగల ఈసీ తన విచక్షణాధికారాలతో నిర్ణయం తీసుకుంటుంది. సీఎస్ తన జాబితాలో పేర్కొన్న ప్యానళ్లలో అధికారుల సమర్థత, నిబద్ధతపై ఈసీకి సందేహాలు ఉంటే వారి పేర్లను తిరస్కరించవచ్చు. కొత్త ప్యానళ్లతో అధికారుల పేర్లను పంపించమని ఆదేశించవచ్చు. తాజాగా గుంటూరు ఐజీ పోస్టు కోసం సీఎస్ పంపిన మూడు పేర్లతో కూడిన ప్యానల్‌పై ఈసీ సంతృప్తి చెందలేదు. దాంతో మరో ముగ్గురు అధికారుల పేర్లతో కొత్త ప్యానల్‌ను సీఎస్ పంపారు. అనంతరం ఆ జాబితా నుంచి కొత్త ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లను ఈసీ నియమించింది. ఈ ప్రక్రియ అంతా పక్కాగా నిబంధన మేరకు సాగింది. రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఈసీ సక్రమంగా వ్యవహరించడంతో రామోజీరావుకు పిచ్చి నాషాళానికి ఎక్కింది. ‘వీళ్లా ఎస్పీలు...’ అంటూ అధికారులను తూలనాడుతూ, అవమానపరుస్తూ, ఈసీ అధికారాలను ప్రశ్నిస్తూ విద్వేషపు విషం చిమ్మారు. కాదనడానికి మీరెవరు రామోజీ? దేశంలో అత్యంత ఉన్నతమైన అధికార వ్యవస్థ అఖిల భారత సర్వీసులు. ఏటా దేశంలో అత్యంత ప్రతిభావంతులైనవారే ఈ సర్వీసులకు ఎంపికవుతారు. అటువంటి అత్యున్నత వ్యవస్థను ఉద్దేశించి ‘వీళ్లా కొత్త ఎస్పీలు’ అని రామోజీరావు తూలనాడారంటే చంద్రబాబుకు మేలు చేయడం కోసం ఆయన ఎంతగా బరితెగించారో తెలుస్తోంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తన ఇంట్లో నౌకర్ల మాదిరిగా.. తన మోచేతి నీళ్లు తాగేవారి మాదిరిగా చిత్రీకరిస్తూ హేళన చేయడం రామోజీ పెత్తందారి పోకడలను నిదర్శనం. ఆ అధికారులేమీ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నియమించిన వారు కాదు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అఖిల భారత సర్వీసులకు ఎంపికైన వారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు నుంచి రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న వారే. టీడీపీ ప్రభుత్వంలో కూడా వివిధ హోదాల్లో నిబద్ధతతో విధులు నిర్వర్తించిన అధికారులేనని అఖిల భారత అధికారుల సంఘం గుర్తు చేస్తోంది. కానీ అప్పుడు తప్పుబట్టని చంద్రబాబు, రామోజీ.. ప్రస్తుతం మాత్రం వారు అధికారులు కాదు.. నౌకర్లు అన్నట్టుగా అవమాన పరచడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం. అసలు ఈసీ నియమించిన ఎస్పీలను కాదని అనడానికి మీరెవరు రామోజీ? ఆనాడు ఎన్టీ రామారావును కుట్రతో కూలదోసిన కుట్రలో చంద్రబాబు భాగస్వామి కాబట్టి.. ఆయనకు మీరు ఇంద్రుడు.. చంద్రుడిగా కనిపిస్తారేమో. అందుకే మీరు వేలాది ఎకరాలు కొల్లగొట్టడానికి ఆయన సహకరించి ఉండొచ్చు. టీడీపీ ప్రభుత్వంలో మీరు రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిపోయినా సహించి ఉండొచ్చు. కానీ రాజ్యాంగ బద్ధ సంస్థ ఈసీకి మీరు ఓ సాధారణ వ్యక్తే. మీ ఉడత ఊపులకు బెదిరి పోవాల్సిన అగత్యం ఈసీకి లేదు. ఇక అఖిల భారత సర్వీసులకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మీకు జీ హుజూర్ అని ఎందుకు అంటారు? మిమ్మల్ని చూసి బెంబేలెత్తిపోయి దాసోహం కావాల్సిన గతి పట్టలేదు. రామోజీ.. ఇక చంద్రబాబును మీరు నెత్తిన పెట్టుకుని ఊరేగితే ఊరేగండి. మీరిద్దరూ కలసి ఏ ఏట్లో దూకినా ఎవరికీ పట్టదు. కానీ నిరంకుశుడు, ప్రజాకంటకుడు, అవినీతి చక్రవర్తి అయిన చంద్రబాబును మోయాల్సిన అగ్యతం రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం లేదు. ఆ విషయాన్ని కుండబద్దలుగొడుతూ 2019లోనే ఇచ్చిన విస్పష్టమైన తీర్పును 2024 ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని ప్రజలు ఇప్పటికే డిసైడయ్యారు. ఆ నిజాన్ని భరించేందుకు మీరు, మీ చంద్రబాబు సిద్ధంగా ఉండాలని సిద్ధం సభలే స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ ఘోర పరాజయాన్ని జీర్ణించుకోగలిగితే సరి. లేకపోతే మీ చంద్రబాబు, మీరు కలసి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేరేందుకు అంబులెన్స్‌ను సిద్ధం చేసుకోండి. -
మూడు జిల్లాల కలెక్టర్లు బదిలీ
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పలువురు ఉన్నతాధికారులను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ముగ్గురు ఐఏఎస్ అధికారులను, ఆరుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. వీరి స్థానంలో కొత్త అధికారులను నియమించేందుకు ఒక్కో పోస్టుకు ముగ్గురి పేర్లు సూచిస్తూ వెంటనే జాబితా పంపించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డికి మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి రాజాబాబు, అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి గౌతమి, తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీశాతో పాటు ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్, పల్నాడు జిల్లా ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి, చిత్తూరు జిల్లా ఎస్పీ పి.జాషువా, అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్, నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజును కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. వీరికి ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని స్పష్టం చేసింది. -
ప్యాకేజీల కోసం కాదు.. ప్రజాసేవ కోసమే బీఆర్ఎస్ లోకి
-
కోచింగ్ లేకుండా సివిల్స్ పాస్ అవ్వచ్చు
-
'ది కేరళ స్టోరీ మేకర్స్'.. మరో సెన్సేషనల్ మూవీ వచ్చేస్తోంది!
ది కేరళ స్టోరీ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ సుదీప్తో సేన్. అదా శర్మ ప్రధాన పాత్రలో మెప్పించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. వివాదాలు చుట్టుముట్టినప్పటీకి ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం రిలీజైన దాదాపు 9 నెలల తర్వాత ఓటీటీకి వచ్చింది. ప్రస్తుతం జీ5 స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన వస్తోంది. కేరళలో అమ్మాయిలను బలవంతంగా విదేశాలకు తరలించారన్న నేపథ్యంలో ఈ కథను తెరకెక్కించారు. ది కేరళ స్టోరీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మేకర్స్ మరో కాంట్రవర్షి మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆదాశర్మ- సుదీప్తో సేన్ కాంబినేషన్లో బస్తర్ అనే మరో చిత్రం వస్తోంది. నక్సలిజం ప్రధానంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ముఖ్యంగా చత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో జరిగిన మారణహోమం ఆధారంగా రూపొందించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ చిత్రంలో ఆదాశర్మ ఐపీఎస్ అధికారి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 15న థియేటర్లలో విడుదల కానుంది. -
హైదరాబాద్ కూకట్ పల్లి లో సదరన్ ట్రావెల్స్ బ్రాంచ్ ప్రారంభం
-
తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్ నగర్ ఎస్పీ పాటిల్ సంగ్రామ్ సింగ్‌ను డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేసింది. మహబూబ్‌నగర్ ఎస్పీగా సుధీర్ రామ్‌నాథ్, సెంట్రల్ డీసీపీగా ఆకాంక్ష యాదవ్, మంచిర్యాల డీసీపీగా అశోక్ కుమార్ బదిలీ అయ్యారు. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో హైఅలర్ట్ ప్రకటన -
ఇవాళ ఇక్కడికి.. రేపు ఎక్కడికో
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్‌లు మొదలు డీఎస్పీల వరకు ఇటీవల పోలీస్‌శాఖలో పెద్ద ఎత్తున బదిలీ లు జరిగాయి. అయితే సివిల్ డీఎస్పీల పోస్టింగ్‌లు మారుస్తూ జరిగిన వరుస బదిలీలు మాత్రం చర్చనీయాంశమయ్యాయి. ఈ నెల 12న ఏకంగా 110 మంది సివిల్ డీఎస్పీలు, 14వ తేదీన మరో 95మంది, 15న మరో 26 మంది సివిల్ డీఎస్పీలను బదిలీ చేశారు. ఆ తర్వాత ఈనెల 17న వెల్లడైన ఉత్తర్వుల్లోనూ మరో 61 మంది సివిల్ డీఎస్పీలను బదిలీ చేశారు. ప్రతిశాఖలోనూ బదిలీల ప్రక్రియ అత్యంత సహజమే అయినా, ఒకసారి ఇచ్చిన పోస్టింగ్ మారుస్తూ...లేదంటే అప్పటికే ట్రాన్స్ఫర్ చేసిన వారిని తిరిగి అక్కడే కొనసాగి స్తున్నట్టు పేర్కొంటూ వరుస ఉత్తర్వులు వెలువడుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ‘పట్టు’నిలుపుకుని.. ‘అనుకూల’పోస్టింగ్‌లు కొందరు అధికారులు బదిలీ అయినా తమ ‘పట్టు’నిలుపుకొని తిరిగి అదే స్థానాల్లో కొనసాగుతున్నారు. మరికొందరు బదిలీ అయిన స్థానంలో చేరకముందే రోజుల వ్యవధిలోనే ‘అనుకూల’పోస్టింగ్‌లు తెచ్చుకుంటున్నారన్న ప్రచా రం జరుగుతోంది. ఒకే సారి పెద్ద సంఖ్యలో బదిలీ జరిగినప్పుడు కొద్దిమేర పోస్టింగ్‌ల్లో మార్పులు సహజమే కానీ గత మూడు రోజుల్లో విడుదల చేసిన పోస్టింగ్ ఉత్తర్వులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని పోలీసు వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఎప్పుడు ఎక్కడికో అనే ఆందోళనలో కొందరు ఒక రోజు వచ్చిన ఆర్డర్ కాపీలో ఉన్న పోస్టింగ్‌లు ఆ తర్వాతి బదిలీ ఉత్తర్వులు వచ్చే సరికి మారిపోతుండడం కొంతమందిని మాత్రం కలవరానికి గురి చేస్తోంది. ఎప్పుడు ఎక్కడికి బదిలీ అవుతామో..అక్కడి నుంచి మళ్లీ ఎక్కడికి మారుస్తున్నారో అన్న గందరగోళం నెలకొందని కొందరు అధికారులు వాపోతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగిన వారికే మళ్లీ కీలకస్థానాల్లో పోస్టింగ్‌లు దక్కుతున్నాయన్న చర్చ జరుగుతోంది. ‘పోలీసులపై రాజకీయ పెత్తనం ఉండబోదు’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ఐపీఎస్ ఆఫీసర్ల గెట్ టు గెదర్‌లో చెప్పినా, వాస్తవ పరిస్థితి మాత్రం అలా లేదని కొందరు వాపోతున్నారు. -
ఐపీఎస్ నవీన్‌కుమార్ కొడుకుపై కేసు
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: మాజీ ఐఏఎస్ అధికారి భన్వర్‌లాల్ ఇంటిని కబ్జా చేయడానికి ఐపీఎస్ అధికారి నవీన్‌కుమార్ నకిలీ పత్రాలతో ప్రయతి్నంచిన కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నవీన్‌కుమార్ భట్ కుమారుడు సాహిత్పై కూడా జూబ్లీహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. దర్యాప్తు అధికారులు శుక్రవారం సాహిత్‌కు నోటీసులు జారీ చేశారు. మరోపక్క భన్వర్‌లాల్ భార్య మణిలాల్ ఫిర్యాదుతో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో నమోదైన కేసు విచాణకు నవీన్‌కుమార్ శుక్రవారం గైర్హాజరయ్యారు. దీంతో ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లాలని పోలీసులు నిర్ణయించారు. భన్వర్‌లాల్‌కు జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లో సొంత ఇల్లు ఉంది. ఆయన పదవీ విరమణ చేయకముందే ఇంటిని నవీన్‌కుమార్ సోదరుడు సాంబశివరావు అద్దెకు తీసుకున్నారు. 2019లో భన్వర్‌లాల్ పదవీ విరమణ చేయడంతో తమ ఇల్లు ఖాళీ చేసి అప్పగించాల్సిందిగా సాంబశివరావును కోరగా, ఆయన స్పందించలేదు. ఆ ఇంట్లో ఐపీఎస్ అధికారి నవీన్‌కుమార్ కూడా ఎలాంటి రెంటల్ అగ్రిమెంట్ లేకుండా ఉన్నారు. నాటకీయ పరిణామాల నేపథ్యంలో వీరిద్దరితో పాటు సాంశివరావు భార్య రూపా డింపుల్ నకిలీ పత్రాలు సృష్టించి, భన్వర్‌లాల్‌తో పాటు ఆయన భార్య మణిలాల్ సంతకాలు ఫోర్జరీ చేసి ఇంటిని కబ్జా చేయాలని చూశారు. మణిలాల్ ఫిర్యాదు మేరకు గతేడాది నవంబర్ 17న సీసీఎస్ పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. గత నెల 22న సాంబశివరావు దంపతులను అరెస్టు చేశారు. నవీన్‌కుమార్‌కు గత నెల 27న నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నవీన్‌కుమార్ ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయారు. బౌన్సర్లతో బెదిరింపు.. ఇదిలా ఉండగా.. జూబ్లీహిల్స్ రోడ్డు నం.72లోని ప్రశాసన్‌నగర్‌లో ఉన్న తమ ఇంట్లోకి వెళ్లేందుకు భన్వర్‌లాల్ సన్నాహాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఆయన భార్య మణిలాల్ గురువారం సాయంత్రం అక్కడకు వెళ్లి కొన్ని మరమ్మతులు చేయించేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆ ఇంటి వద్ద ఉన్న సాహిత్ ఇద్దరు బౌన్సర్లతో కలసి బీభత్సం సృష్టించారు. మణిలాల్ ఉండగానే ఇంటి లోపలి నుంచి గడియ పెట్టడంతో పాటు అతి సమీపం నుంచి బెదిరిస్తూ మాట్లాడారు. చాలాసేపు నిర్బంధించినంత పని చేశారు. దీంతో తీవ్ర భయభ్రాంతులకు గురైన ఆమె జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా సాహిత్ భట్ తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం అతడిని అదుపులోకి తీసుకుని నోటీసులు జారీ చేశారు. -
IPS నవీన్ కుమార్ కుమారుణ్ణి అదుపులోకి తీసుకున్న సీసీఎస్
-
ఐపీఎస్ నవీన్ కుమార్, మాజీ ఐఏఎస్ బన్వర్ లాల్ మధ్య వివాదం
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ నవీన్ కుమార్, మాజీ ఐఏఎస్ బన్వర్ లాల్ మధ్య వివాదం చెలరేగుతోంది. ఐపీఎస్ నవీన్ కుమార్ తన ఇంటిని కబ్జా చేసే ప్రయత్నం చేశాడంటూ గతంలో సిసిఎస్ పోలీసులకు బన్వర్ లాల్ ఫిర్యాదు చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి తన నివాసాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేశాడు అంటూ ఆరోపణలు చేశారు. దీంతో గతంలో నవీన్ కుమార్ ను విచారణ చేసిన సిసిఎస్ పోలీసులు.. ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ ప్రశాసననగర్ లో ఐపీఎస్ నవీన్ కుమార్ కుమారుడిని సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవీన్ కుమార్ ని కూడా మరికొద్ది సేపట్లో అదుపులోకి తీసుకొని విచారించనున్నామని తెలిపారు. ఇప్పటికే నవీన్ కుమార్ అన్న వదినలను అరెస్ట్ చేశారు. గతంలో 41ఏ నోటీసులు జారీ చేసి నవీన్ కుమార్ ను విచారించారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో ఐపిఎస్ అధికారి నవీన్ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇదీ చదవండి: చింతమనేని సీట్ సిరిగిపోయిందా ? -
IPS నవీన్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్న సీసీఎస్
-
కేడర్ వివాదం కేసు.. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేత
హైదరాబాద్, సాక్షి: ఏడేళ్లుగా సాగుతున్న.. ఏపీ-తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్ కేడర్ వివాదం కేసును ముగించింది ఎట్టకేలకు ముగించింది తెలంగాణ హైకోర్టు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్- క్యాట్(Central Administrative Tribunal) తీర్పును ఉన్నత న్యాయస్థానం కొట్టిపారేసింది. ప్రత్యూష సిన్హా కమిటీ మార్గదర్శకాల మేరకే కేడర్ కేటాయింపు ఉండాలన్న కేంద్రం వాదనతో ఏకీభవించిన కోర్టు.. మరోవైపు ఐఏఎస్, ఐపీఎస్‌ల అభ్యంతరాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని తన తీర్పులో స్పష్టం చేసింది. తాజా తీర్పులో.. ఏడేళ్ల కిందటి నాటి క్యాట్ తీర్పును కొట్టేయడంతో పాటుగా డీవోపీటీకి ఐఏఎస్, ఐపీఎస్‌లు తమ అభ్యంతరాలు చెప్పుకునే అవకాశం కల్పించింది తెలంగాణ హైకోర్టు. అలాగే.. అధికారుల సీనియారిటీ, స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. అప్పటివరకు ఇప్పుడున్న రాష్ట్రాల్లోనే విధులు కొనసాగించాలని ఆదేశించింది. ‘‘ఈ 13 మంది బ్యూరో క్రాట్ లు క్యాడర్ కేటాయింపు అంశంపై కేంద్రాన్ని అభ్యర్థించాలి. అధికారులు 10 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ చేసిన విషయాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకోవాలి. ఒక్కొక్క అధికారి అభ్యర్థనను కేంద్రం విడివిడిగా వినాలి. అధికారులు అవసరమైతే లీగల్‌గా ముందుకు వెళ్లొచ్చు. అధికారుల కేటాయింపుకు క్యాట్ లు ఎలాంటి హక్కు లేదు. బ్యూరో క్రాట్ ల కేటాయింపు కేవలం డీవోపీటీ పరిధిలో అంశమే’’ అని తీర్పు సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. వివాదం ఏంటంటే.. రాష్ట్ర విభజన సమయంలో 14 మంది ఐఏఎస్, ఐపీఎస్‌లను తెలుగు రాష్ట్రాలకు కేటాయించింది కేంద్రం పరిధిలోని డీవోపీటీ( Department of Personnel and Training). అయితే.. ఆ ఉత్తర్వుల్ని క్యాట్ కొట్టేసింది. తన కేటాయింపులు పక్కనపెట్టి మరీ క్యాట్ ఉత్తర్వులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ 2016లో డీవోపీటీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తన పరిధి దాటి బ్యూరోక్రాట్ లపై క్యాట్ ఉత్తర్వులు జారీ చేసిందని వాదిస్తూ వచ్చింది. 2016 నుండి హైకోర్టు లో ఈ వివాదంపై విచారణ కొనసాగుతుండగా.. ఇవాళ ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్ కేటాయింపుల పై తుది వాదనలు ముగిశాయి. ఈ మధ్యలో కేడర్ కేటాయింపు అంశాన్ని కేంద్ర ప్రభుత్వం కు పంపుతామని హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే.. సోమేష్ కుమార్ ను ఏపీకి కేటాయిస్తూ గత ఏడాది హైకోర్ట్ ఆదేశాలు కూడా ఇచ్చింది. దీంతో.. మిగిలిన 13 మంది అధికారుల క్యాడేర్ కేటాయింపు పై తుది వాదనలు ఇవాళ జరిగాయి. -
IAS vs IPS అసలు తప్పు ఎవరిది ?
-
ఐపీఎస్ అధికారి ఫోర్జరీ..మాజీ ఐఏఎస్ కే కుచ్చుటోపీ..
-
TS:ఐపీఎస్ అధికారుల బదిలీ..ఎవరు ఎక్కడికంటే..?
సాక్షి,హైదరాబాద్: సివిల్ సర్వీసు అధికారుల బదిలీపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆదివారం మధ్యాహ్నమే 12 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం రాత్రి 8 గంటలకు 9 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.10 మంది ఐపీఎస్‌లు, ఐదుగురు నాన్ క్యాడర్ ఐపీఎస్‌లను బదిలీ చేసింది. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా బాలాదేవిని ప్రభుత్వం నియమించింది. వరంగల్ కమిషనర్‌గా ఉన్న రంగనాథ్‌ను హైదరాబాద్ జాయింట్ సీపీగా బదిలీ చేశారు. మాదాపూర్ డీసీపీ సందీప్‌పై వేటు వేశారు. రైల్వే అడ్మిన్ ఎస్పీగా సందీప్ రావును నియమించారు. వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డెవీస్ ఎస్బీ హైదరాబాద్ డీసీపీగా బదిలీ అయ్యారు. నార్త్ జోన్ డీసీపీగా రోహిణి ప్రియదర్శినిని నియమించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ జాయింట్ సీపీగా విశ్వప్రసాద్, సిట్, క్రైమ్స్ జాయింట్ సీపీగా ఏవీ రంగనాథ్, పశ్చిమ మండల డీసీపీగా విజయ్‌కుమార్, ఉత్తర మండల డీసీపీగా రోహిణి ప్రియదర్శిని, సీసీఎస్ డీసీపీగా ఎన్.శ్వేత, హైదరాబాద్ ట్రాఫిక్-1 డీసీపీగా ఎస్ సుబ్బారాయుడిని బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదీచదవండి..నిజమైన బాధితుడికి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్: సీపీ శ్రీనివాస్‌రెడ్డి -
తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు
-
ఏపీకి వెళ్లాల్సిన IAS, IPSలపై హైకోర్టు ఫైనల్ విచారణ
-
ఏపీకి వెళ్లాల్సిన ఐఏఎస్, ఐపీఎస్‌లపై హైకోర్టులో తుది విచారణ
సాక్షి, హైదరాబాద్: ఏపీకి వెళ్లాల్సిన ఐఏఎస్, ఐపీఎస్‌లపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన 12 మంది అధికారులకు సంబంధించిన పిటిషన్‌పై తుది విచారణ జరుపుతోంది. గతంలో సోమేష్ కుమార్ విషయంలో ఇచ్చిన తీర్పు అమలు చేయాలని ఎన్నికలు కమిషన్ వాదిస్తోంది. హైకోర్టులో తుది విచారణ జరుగుతుండటంతో తీర్పు ఎలా వస్తుందన్న దానిపై ఐఏఎస్ఉ, ఐపీఎస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా ఏపీ విభజన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 376 మంది ఐఏఎస్, 258 మంది ఐపీఎస్, 149 ఐఎఫ్ఎస్ అధికారులను ప్రత్యూష్ సిన్హా కమిటీ రెండు రాష్ట్రాలకు పంపకాలు చేసింది. పునర్విభజన తర్వాత ఏపీకి వెళ్లేందుకు కొంతమంది అధికారులు ఇష్టపడటం లేదు. క్యాట్ తీర్పును అడ్డుపెట్టుకొని తెలంగాణలోనే పనిచేస్తున్నారు. వాస్తవానికి రూల్ 5(1) ప్రకారం ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఒప్పంద పత్రం రాసి ఉంటారు. అయితే తెలంగాణలో కొంతమంది అధికారులు ఏపీకి వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2017లో హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. దీనిపై జస్టిస్ అభినంద్ కుమార్, జస్టిస్ అనిల్ కుమార్ బెంచ్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఏపీకి వెళ్లని ఐఏఎస్‌ల జాబితాలో హరికిరణ్, అనంతరామ్, మల్లెల ప్రశాంతి, వాకాటి కరుణ, శివశంకర్ లోహితి, ఎస్,ఎస్ రావత్, గుమ్మల శ్రీజన, రోనాల్డ్ రాస్, వాణి ప్రసాదా్, డిప్యూటేషన్‌పై సెంట్రల్ బిష్టా ఉన్నారు. ఆమ్రాపాలి, అబిలాష్ బిస్టా డిప్యూటేషన్‌పై కేంద్రంలో పనిచేస్తున్నారు. ఏపీకి వెళ్లని ఐపీఎస్‌ల జాబితాలో తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ కూడా ఉన్నారు. చదవండి: నేడు మరోసారి రాష్ట్రానికి అమిత్ షా.. మూడుచోట్ల ప్రసంగం గతంలో హైకోర్టు తీర్పుతో సోమేష్ కుమార్ ఏపీకి వెళ్లారు. అక్కడ జాయిన్ అయి ముందస్తు రాజీనామా చేసి హైదరాబాద్‌కు వచ్చేశారు. సోమేష్ కుమార్ తీర్పుకు భిన్నంగా అభిషేక్ మహంతి కేసు ఉంది. ఉమ్మడి ఏపీ రాష్ట్ర పునర్విభజన సందర్భంగా యువ ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతిని కేంద్రం ఏపీకి కేటాయించింది. తనను తెలంగాణ కేడర్‌కి కేటాయించాలని ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన పరిపాలన ట్రిబ్యునల్ అభిషేక్ మహంతిని తెలంగాణకు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అభిషేక్ మహంతిని రిలీవ్ చేయాలని ఏపీకి.. ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణకు క్యాట్ ఆదేశాలిచ్చింది. క్యాట్ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం మహంతిని రిలీవ్ చేయగా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆయనను విధుల్లోకి తీసుకోకుండా తాత్సారం చేసింది. ఈ వ్యవహారంపై మహంతి మరోమారు ట్రిబ్యునల్‌కి వెళ్లారు. క్యాట్ ఆదేశాలు అమలు చేయలేదంటూ తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్‌పై ఆయన కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం క్యాట్ ఆదేశాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తూ.. అభిషేక్ మహంతికి తెలంగాణ ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వాల్సిందేనని గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలిచ్చింది. చాలాకాలంపాటు పోస్టింగ్ ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం.. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కరీంనగర్ సీపీగా బాధ్యతలు అప్పగించింది. నేడు తుది వాదనల తర్వాత తీర్పు ఎన్నికలలోపు వస్తుందా? రాదా.. ఎన్నికల కమిషన్ హైకోర్టుకు ఎలాంటి వాదనలు వినిపిస్తుందోనని ఆసక్తిగా మారింది. సోమేష్ కుమార్‌కు తీర్పుఇచ్చేనట్లు తీర్పు వస్తే 12 మంది ఏపీకి వెళ్లాల్సి ఉంటుంది. -
Telangana Assembly Elections: సార్ నుంచి అధ్యక్షా వరకు..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగమంటే..ప్రభుత్వ నిర్ణయాలను అమలుపర్చడం, ఉన్నతాధికారి ఆదేశాలను పాటిస్తూ నిర్దేశించిన విధులు నిర్వర్తించడం మాత్రమే. కానీ చట్టసభలో సభ్యుడంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో ముఖ్యపాత్ర పోషించడంతో పాటు ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం వివిధ కార్యక్రమాల రూపకల్పనలో కీలకమైన ప్రతినిధి. ప్రభుత్వం ముందుకు సాగాలంటే పాలకులు, ఉద్యోగులు ముఖ్యులే. కానీ ఈ రెండు రంగాల్లో అనుభవం గడించిన ఘనులు అరుదుగా కనిపిస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసిన అనుభవంతో ప్రజాక్షేత్రంలోకి వచ్చి విజయం సాధించిన వారు రెండుపదులకు పైబడే ఉన్నారు.అలాంటి వారెవరో ఇప్పుడు చూద్దాం. ♦ ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసిన జయప్రకాశ్‌నారాయణ ఆ తర్వాత లోక్‌సత్తా పార్టీని స్థాపించి కూకట్పల్లి నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ♦ సంక్షేమశాఖలో అధికారిగా పనిచేసిన స్వర్ణకు మారి శాసనసభ్యురాలుగా ఎన్నికయ్యారు. బ్యాంకు అధికారిగా పనిచేసిన అరుణతార ఎమ్మెల్యేగా గెలుపొంది చట్టసభల్లో అడుగుపెట్టారు. ♦ రెవెన్యూ శాఖలో పనిచేసిన సినీనటుడు బాబుమోహన్ పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా రాష్ట్ర మంత్రిగా సేవలందించారు. ♦ లెక్చరర్‌గా ప్రస్థానం ప్రారంభించిన కడియం శ్రీహరి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికై తెలంగాణ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి కూడా పనిచేశారు. ♦ ఉపాధ్యాయులుగా పనిచేసిన కోవా లక్ష్మి, ఆత్రం సక్కు, రేగా కాంతారావు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ♦ రవాణాశాఖలో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన మాణిక్‌రావు జహీరాబాద్ నుంచి 2014లో పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ 2018లో రెండోసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ♦ ఐపీఎస్ అధికారిగా అత్యున్నత పదవులు చేపట్టిన విజయరామారావు ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. ♦ మరో ఐపీఎస్ అధికారి పీవీ రంగయ్య కూడా ఎంపీగా గెలుపొంది కేంద్ర మంత్రిగా పనిచేశారు. జడ్జి హోదాలో కొనసాగిన మల్యాల రాజయ్య ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. మరో అధికారి బలరాం నాయక్ సైతం ఎంపీగా ఎన్నికై కేంద్రమంత్రిగా పనిచేశారు. ♦ ప్రభుత్వ శాఖల్లో వివిధ స్థాయిలో పనిచేసిన పి.రాములు, సంజీవరావు, ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలుపొందగా, ఐపీఎంలో పనిచేసి పదవీ విరమణ పొందిన తర్వాత ఎమ్మెల్సీగా పోటీ చేసిన స్వామిగౌడ్ గెలుపొంది తెలంగాణ శాసనమండలికి తొలి చైర్మన్‌గా నియమితులయ్యారు. ♦ పురపాలక శాఖలో మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన వి.శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్ నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఎకైŠస్జ్ శాఖలో ఉన్నతాధికారిగా పనిచేసిన వెంకటేశ్‌నేత పెద్దపల్లి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రొఫెసర్‌గా పనిచేసిన కె.నాగేశ్వర్ ఎమ్మెల్సీగా, సీతారాంనాయక్ ఎంపీగా ఎన్నికయ్యారు. ♦ జిల్లా పరిషత్ సీఈఓగా పనిచేసి రాజయ్య వరంగల్ ఎంపీ గెలుపొందారు. ♦ ఎఫ్‌సీఐలో అధికారిగా పనిచేసిన సోమారపు సత్యనారాయణ రామగుండం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ♦ ఇక ప్రభుత్వ ఉద్యోగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో నిలిచినప్పటికీ విజయం సాధించని వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరిలో కొందరు ప్రస్తుతం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈ ఎన్నికల్లోనూ పోటీలో ఉన్నారు. -
పేదల హక్కులు కాపాడండి
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగం కల్పించిన హక్కులు, అధికారాలను దేశంలోని ప్రతి పేదకు దక్కేలా చట్టాన్ని అమలు చేయాలని యువ ఐపీఎస్ అధికారులకు కేంద్ర హోంమంత్రి దిశానిర్దేశం చేశారు. బ్రిటిష్ చట్టాలను మార్చి ప్రజల రక్షణే ధ్యేయంగా నూతన ఆశయాలు, విశ్వాసాలతో ఐపీసీ, సీఆరీ్పసీ, ఎవిడెన్స్ యాక్ట్‌లలో కీలక మార్పులు తెస్తున్నట్లు చెప్పారు. అతిత్వరలో రానున్న ఈ నూతన చట్టాలను రాజ్యాంగ స్ఫూర్తితో అమలు చేయాల్సిన బాధ్యత యువ అధికారులపై ఉందన్నారు. బాధ్యతాయుత పోలీసింగ్ నుంచి ఒక అడుగు ముందుకేసి సానుకూల పోలీసింగ్ వైపు అడుగులు వేయాలని సూచించారు. స్థానిక భాష, ఆచార వ్యవహారాలను తెలుసుకుంటేనే యువ ఐపీఎస్‌లు సుదీర్ఘ సరీ్వస్‌లో ప్రజలకు మరింత దగ్గర అవుతారని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో నిర్వహించిన 75వ రెగ్యులర్ రిక్రూటీ ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన 155 మంది ఐపీఎస్‌లు, రాయల్ భూటాన్, మాల్దీవులు, మారిషస్, నేపాల్‌కు చెందిన 20 మంది విదేశీ కేడెట్ల దీక్షాంత్ పరేడ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. యువ ఐపీఎస్‌ల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగించారు. వచ్చే 25 ఏళ్లలో భారత్‌ను నంబర్ వన్‌గా నిలపాలి ‘మరో 25 ఏళ్లలో భారత్ వందేళ్ల స్వాతంత్య్ర ఉత్సవాలు జరుపుకోనుంది. అప్పటికి 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకొని మీరు ఉన్నత స్థానాల్లో ఉండటమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో భారత్‌ను నంబర్ వన్‌గా నిలపడంలోనూ మీ శ్రమ తప్పక ఉంటుందని విశ్వసిస్తున్నా. దేశ అంతర్గత భద్రత, దేశ ప్రగతిలోనూ మీరు కీలకపాత్ర పోషించాలని ఆశిస్తున్నా’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆకాంక్షించారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఆశయాలకు అనుగుణంగా గత 75 ఏళ్లలో సుశిక్షితులైన ఎందరో ఐపీఎస్‌లు దేశ భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేశారన్నారు. 75వ రెగ్యులర్ బ్యాచ్‌లోని 155 మంది ఐపీఎస్‌లలో 32 మంది మహిళా ఐపీఎస్‌లు ఉండటం మహిళా సాధికారతకు అద్దం పడుతోందని.. ఇది శుభశూచకమని అమిత్ షా చెప్పారు. కొత్త సవాళ్లకు సిద్ధం కావాలి.. ఇటీవల కాలంలో పెరిగిన సైబర్ నేరాలు, అంతర్గత భద్రత ముప్పు, అంతర్జాతీయ ఆర్థిక నేరాలు, హవాలా, క్రిప్టోకరెన్సీతో దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం, డ్రగ్స్ రవాణా వంటి నూతన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఐపీఎస్‌లు మరింత సిద్ధం కావాలని అమిత్ షా సూచించారు. సైబర్ నేరాల కట్టడికి పోలీసులు ఎప్పుడూ రెండు అడుగులు ముందే ఉండేలా సాంకేతికంగా పోలీసింగ్ బలోపేతం కావాలని అభిప్రాయపడ్డారు. అకాడమీ డైరెక్టర్ అమిత్ గార్గ్ మాట్లాడుతూ యువ ఐపీఎస్‌లు చట్టాన్ని నిష్పాక్షికంగా అమలు చేయడంతోపాటు మానవతా విలువలతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేలా శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా విజేతలకు ట్రోఫీలు బహూకరించారు. కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా, సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, ఐబీ డైరెక్టర్ తపన్ డేకా, రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్, హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆరోగ్యంతోనే అన్నీ.. ఫిట్‌రైజ్ 75 ప్రారంభంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే మానసికంగా ఉల్లాసంగా ఉంటామని, పూర్తి శక్తిసామర్థ్యాలతో పనిచేయగలుగుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఫిట్నెస్ సాధించేందుకు తాను నిరంతరం శ్రమిస్తానని పేర్కొన్నారు. దీక్షాంత్ పరేడ్ అనంతరం ఎన్పీఏ ఆవరణలో ఫిట్‌రైజ్–75ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. యోగా, ధ్యానం, శారీరక శ్రమ మానసిక ధృఢత్వాన్ని, ఆలోచన శక్తిని పెంచుతుందన్నారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటే దేశం ప్రగతి మార్గంలో పయనిస్తుందన్నారు. -
HYD: ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్‌కు హాజరైన అమిత్‌షా
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 175 మంది ఐపీఎస్ అధికారుల నుంచి అమిత్‌షా గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఐపీఎస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళ సై, తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ పాల్గొన్నారు. ముందుగా నేషనల్ పోలీస్ అకాడమీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి అమిత్ షా నివాళులర్పించారు. దేశ ప్రతిష్టలు కాపాడంలో పోలీస్ వ్యవస్థ రోల్ చాలా కీలకమని, దేశానికి సేవలు అందించడంలో ఐపీఎస్‌లు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని అమిత్‌షా అన్నారు. పీడిత ప్రజల అభ్యున్నతి, భద్రత కోసం నిబద్దతతో పనిచేయాలన్నారు. 75వ బ్యాచ్ ఐపీఎస్ శిక్షణలో 33 మంది మహిళలు ఉండడం సంతోషం, గర్వకారణం. సైబర్ నేరాల అదుపు, నేరగాళ్లకు చెక్ పెట్టడంలోనూ టెక్నాలజీ పై ఐపీఎస్‌లు దృష్టి కేంద్రీకరించాలి. భవిష్యత్‌లో ఎదురయ్యే ఎన్నో సవాళ్లను ఐపీఎస్‌లు అలవోకగా ఎదుర్కొవాలి. అంతిమంగా ఐపీఎస్‌లు ప్రజల భద్రత అందించడంలో మనసులు గెలవాలని అమిత్‌షా పిలుపునిచ్చారు. విజయవంతంగా మొదటి దశ శిక్షణ పూర్తి చేసిన యువ ఐపీఎస్ అధికారులు విధి నిర్వహణలో తొలి అడుగు వేయబోతున్నారు. శుక్రవారం ఉదయం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (ఎస్వీపీఎన్పీఏ)లో 75వ రెగ్యులర్ రిక్రూటీస్ (ఆర్ఆర్) బ్యాచ్‌కు చెందిన 155 మంది యువ ఐపీఎస్ అధికారులు, వీరితోపాటు శిక్షణ పొందిన మరో 20 మంది విదేశీ అధికారులు పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్నారు. -
ఐఏఎస్ వదిలి సీఎం అయ్యిందెవరు? ఎంపీలో ఏం జరుగుతోంది?
మధ్యప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు బ్యూరోక్రాట్లు(పరిపాలనా విభాగంలోని ఉన్నతాధికారులు) రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఐఏఎస్ అధికారి రాజీవ్ శర్మ రాజీనామా ఆమోదం పొందింది. రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు చెందిన నిషా బాంగ్రే రాజీనామా ఆమోదం పెండింగ్‌లో ఉంది. అయితే తాను ప్రస్తుతానికి రాజకీయాల్లోకి రానని రాజీవ్ చెప్పగా, నిషా మాత్రం రాజకీయ రంగంలోకి దూకేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఐఏఎస్ సర్వీస్ నుంచి రిటైర్డ్ అయిన కొందరు అధికారులు రెండు నెలల క్రితమే బీజేపీలో చేరగా, మరికొందరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు క్యూలో ఉన్నారు. కాగా ఒక ఉన్నతాధికారి రాజకీయాల్లో విజయవంతమయ్యారనే దానికి ఉదాహరణ ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి అజిత్ జోగి. ఈయన ఐఏఎస్ సర్వీస్ వదిలి కాంగ్రెస్‌లో చేరారు. తరువాతి కాలంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి అయ్యారు. మధ్యప్రదేశ్‌కు చెందిన పలువురు ఉన్నతాధికారులు తమ పదవులను వదిలి రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అజాతశత్రు: ఐఏఎస్ సర్వీస్ నుండి రిటైర్ అయ్యాక బీజేపీలో చేరారు. అజితా వాజ్‌పేయి పాండే: ఐఏఎస్ నుండి పదవీ విరమణ చేసిన తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. జీఎస్ దామోర్: నీటి వనరులశాఖలో ఇంజనీర్ అయిన ఈయన బీజేపీ నుంచి పోటీ చేసి, రత్లాం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హీరాలాల్ త్రివేది: ఐఏఎస్ సర్వీస్ నుండి రిటైర్ అయ్యాక ‘స్పాక్స్’ పార్టీని స్థాపించారు. రుస్తమ్ సింగ్: ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి పదవీ విరమణ చేశాక బీజేపీలోకి వచ్చారు. మంత్రిగా కూడా అయ్యారు. ఎస్ ఎస్ ఉప్పల్ : ఐఏఎస్ నుంచి రిటైర్ అయ్యాక బీజేపీలో చేరారు. వరదమూర్తి మిశ్రా: ఐఏఎస్ ఉద్యోగాన్ని వదిలి, ప్రత్యేక పార్టీని స్థాపించారు. వీణా ఘనేకర్: ఐఏఎస్ నుండి పదవీ విరమణ తర్వాత స్పాక్స్లో చేరారు. వీకే బాతం: ఐఏఎస్ నుండి పదవీ విరమణ చేశాక కాంగ్రెస్‌లో చేరారు. ఉన్నతాధికారులు రాజకీయాల్లో ప్రవేశించడం వెనుక ఒక కారణమందని విశ్లేషకులు అంటున్నారు. వీరు ఎమ్మెల్యేలను, మంత్రులను దగ్గరి నుంచి చూడటం వలన వారి హోదాకు ప్రభావితమవుతుంటారు. దీంతో రాజకీయాల్లో తాము కూడా రాణించగలమన్న భావన వారిలో కలుగుతుంది. ఈ నేపధ్యంలోనే వారు రాజకీయ నాయకులు, పార్టీలతో సత్సంబంధాలు ఏర్పరుచుకుని, రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇది కూడా చదవండి: నాటి రాజీవ్ సభ చారిత్రకం.. సీటు మాత్రం బీజేపీ పరం! -
కానిస్టేబుల్ కుమార్తెకు కాన్పూర్ ఐఐటీ సీటు
గుంటూరు: మార్టూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న పూర్ణాంజనేయరాజు చిన్న కుమార్తె అనుపమ ప్రతిష్టాత్మక కాన్పూర్ ఐఐటీలో ఇంజినీరింగ్ సీటు సాధించింది. ఈ సందర్భంగా కానిస్టేబుల్ కుటుంబాన్ని ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ గురువారం తమ కార్యాలయానికి పిలిపించుకొని అనుపమను శాలువాతో సత్కరించి రూ.10 వేలు నగదు పురస్కారం బహుమతిగా అందించారు. ప్రస్తుతం కాన్పూర్ ఐఐటీ కళాశాలలో మూడో ఏడాది ఇంజినీరింగ్ చదువుతున్న కానిస్టేబుల్ పూర్ణాంజనేయరాజు పెద్ద కుమార్తె జాహ్నవి గతంలో ర్యాంకు సాధించిన సందర్భంగా ఎస్పీ మల్లికా గర్గ్ రూ.25 వేలు నగదు పురస్కారం అందించి అభినందించినట్లు కానిస్టేబుల్ గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో కానిస్టేబుల్ భార్య సునీత కుమార్తెలు జాహ్నవి, అనుపమ పాల్గొన్నారు. -
కేజీఎఫ్ ఎస్పీగా శాంతరాజు
కేజీఎఫ్: కేజీఎఫ్ నూతన ఎస్పీగా కేఎం శాంతరాజు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. బదిలీపై వెళ్తున్న ఎస్పీ ధరణీదేవి నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఈయన 2012 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఈ సందర్భంగా సహాయక పోలీస్ పాలనాధికారి జి విశ్వనాథ్ తదితరులు కొత్త ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు. -
ఐపీఎస్‌ను పెళ్లాడిన టీనా దాబి సోదరి.. ఐఏఎస్ భార్య కోసం కేడర్ మార్పు..
ఐఏఎస్ అధికారి, యూపీఎస్సీ టాపర్ టీనా దాబి సోదరి ఐఏఎస్ రియా దాబి పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఐపీఎస్ అధికారి మనీష్ కుమార్‌తో ఏడడుగులు వేశారు. కాగా మనిష్ కుమార్, రియా దాబిలు కుటుంబ సభ్యుల అనుమతితో ఏప్రిల్ నెలలోనే కోర్టు వివాహం చేసుకున్నారు. అంటే వీరి పెళ్లి జరిగి రెండు నెలలు కావొస్తుంది. అయితే మనీష్ కుమార్ కేడర్‌ను మహారాష్ట్ర నుంచి రాజస్థాన్‌కు మారుస్తూ హోం మంత్రిత్వశాఖ నోటీసులు జారీ చేయడంతో ఈ విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఇక రియా దాబి ఆమె భర్త ఐపీఎస్ మనీష్ కుమార్ ఇద్దరూ 2020 యూపీఎస్సీ బ్యాచ్‌కు చెందిన వారే. యూపీఎస్సీ పరీక్షల్లో ఆమె 15వ ర్యాంకర్‌గా నిలిచారు. ప్రస్తుతం ఆమె రాజస్థాన్‌లోని అల్వార్‌కు కలెక్టర్‌గా ఉన్నారు. వీరిద్దరికి ముస్సోరీలోని శిక్షణా అకాడమీలో పరిచయం ఏర్పడగా.. అనంతరం స్నేహం ప్రేమగా మారింది. అయితే రియా రాజస్థాన్ కేడర్ కాగా మనీష్ మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపీఎస్. వివాహామనంతరం మనీష్ తన కేడర్ మార్పు కోసం దరఖాస్తు చేసుకొని..మహారాష్ట్ర నుంచి రాజస్థాన్‌కు మార్చుకున్నారు. చదవండి: బిల్లు కట్టకుండా ఫైవ్ స్టార్ హోటల్లో రెండేళ్లు.. తర్వాత ఏమైందంటే! కాగా మనీష్ కుటుంబం ఢిల్లీలో నివసిస్తోంది. బీటెక్ చదివిన తర్వాత సివిల్ సర్వీసెస్‌లో చేరారు. 2020 పరీక్షలో 581 ర్యాంకు సాధించాడు. మహారాష్ట్రలోని ఒసామాబాద్లో విధులు నిర్వహిస్తున్న ఆయన ఇప్పుడు రాజస్థాన్‌కు బదిలీ కానున్నారు. త్వరలోనే వీరు జైపూర్‌లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేసుకోనున్నారు. కాగా రియా సోదరి టీనా దాబి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 2015 టాపర్‌గా నిలిచారు. అంతేగాక సివిల్ సర్వీసెస్ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచిన మొదటి దళితురాలిగా రికార్డు సృష్టించింది. సెకండ్ ర్యాంకర్ అయిన అథర్ అమీర్ ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తరువాత రెండేళ్లకే 2021లో వీరు విడాకులు తీసుకున్నారు. గతేడాది ఐఏఎస్ ప్రదీప్ గావండేను రెండో పెళ్లి చేసుకున్నారు.. ప్రస్తుతం జైసల్మేర్ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. -
హలో.. జాగ్రత్త!
ఒంగోలు టౌన్: మోసపూరిత టోల్‌ఫ్రీ నంబర్లతో కస్టమర్ సపోర్ట్ స్కాములపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ మలికా గర్గ్ సూచించారు. ఈ మేరకు ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి సమాచారం కోసమైనా గూగుల్ సెర్చ్ చేస్తున్న ఈ రోజుల్లో మోసగాళ్లు తెలివిగా ప్రజలను బోల్తా కొట్టిస్తున్నారని తెలిపారు. వివిధ సంస్థలు, బ్యాంకులు, ఆసుపత్రులు, సర్వీస్ సెంటర్ వివరాల కోసమే కాకుండా వివిధ కస్టమర్ కేర్ నంబర్ల కోసం కూడా గూగుల్‌లో సెర్చ్ చేయడం సర్వసాధరణంగా మారిందన్నారు. ఈ క్రమంలో కొందరు కేటుగాళ్లు వివిధ బ్యాంకులు, ప్రముఖ వ్యాపార సంస్థలకు సంబంధించిన అధికారిక వెబ్సైట్లను పోలిఉండేలా ఫేక్ వెబ్సైట్లను తయారు చేసి నకిలీ కస్టమర్ కేర్ నంబర్లను సృష్టిస్తున్నారని తెలిపారు. ఏదైనా సమస్యపై కస్టమర్లు ఫోన్ చేసినప్పుడు వారి బ్యాంకు ఖాతా వివరాలు, ఫోన్‌కు వచ్చిన ఓటీపీ సేకరించి క్షణాల్లోనే డబ్బు దోచేస్తున్నారని వివరించారు. నకిలీ కస్టమర్ కేర్ నంబర్లతో జాగ్రతగా ఉండాలన్నారు. ఈ జాగ్రతలు పాటించండి ► ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆయా కంపెనీలకు సంబంధించిన యాప్ లేదా అధికారిక సైట్లో మాత్రమే కస్టమర్ కేర్ నంబర్ కోసం సెర్చ్ చేయాలి. ► గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్లలో లేదా ట్రూ కాలర్ లాంటి యాప్స్‌లో కస్టమర్ కేర్ సంప్రదింపుల కోసం సెర్చ్ చేయవద్దు. ► కాల్ సెంటర్ నుంచి ఎవరైనా మీ బ్యాంకు ఖాతా వివరాలు, లాగిన్ ఐడీలు, పాస్ వర్డ్లు, పిన్, ఓటీపీలు అడిగితే పొరపాటున కూడా ఇవ్వరాదు. బ్యాంకింగ్ సంస్థలు ఎప్పుడూ మీ వివరాలను అడగవు. ►రీఫండ్ వస్తుందని కొన్ని కాల్‌సెంటర్ల నుంచి ఓ లింక్ పంపించి దానిపై క్లిక్ చేసి బ్యాంకు అకౌంట్, ఓటీపీ, పాస్వర్డ్ తదితర వివరాలు నమోదు చేయాలని అడిగితే అసలు చేయవద్దు. ► ఈ తరహా సైబర్ నేరం జరిగినట్లు గుర్తించిన వెంటనే హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేయాలి. లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. -
ఏపీలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు
-
ఐపీఎస్‌ను పెళ్లాడనున్న ఆప్ మంత్రి
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత, పంజాబ్ మంత్రి హర్జోత్ సింగ్ బెయిన్స్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారిణి జ్యోతి యాదవ్‌ను ఆయన మనువాడనున్నారు. వీరి వివాహం ఈ నెల చివర్లో జరగనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అంతేగాక ఇటీవలె ఈ జంట నిశ్చితార్థం కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వివాహ బంధంతో ఒకటై కొత్త జీవితాన్ని ప్రాంభించనున్న హర్జోత్ సింగ్, జ్యోతి యాదవ్‌లకు పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వన్ అభినందనలు తెలిపారు. రూపానగర్ జిల్లాలోని ఆనంద్‌పూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి తొలిసారి శాసనసభకు ఎన్నికైన హర్జోత్ సింగ్ ప్రస్తుతం భగవంత్ మాన్ కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అనంతర్పూర్ సాహిబ్‌లోని గంభీపూర్ గ్రామానికి చెందిన 32 ఏళ్ల బైన్స్.. రాజకీయాల్లోకి రాకముందు వృత్తిరీత్యా అడ్వకేట్. పంజాబ్ యూనివర్సిటీ నుంచి 2014లో బీఏ ఎల్ఎల్బీ పూర్తి చేశారు. అంతేగాక 2018లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ లాలో సర్టిఫికెట్ పొందారు. పంజాబ్ ఆప్ యూత్ వింగ్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2017లో జరిగిన ఎన్నికల్లో సాహ్నేవాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తరువాత 2022లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన జ్యోతి యాదవ్. పంజాబ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారణి.. ప్రస్తుతం మానస జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతకుముందు లుథియానాలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా పనిచేస్తున్న సమయంలో లుథియానా సౌత్ ఎమ్మెల్యే రాజిందర్‌పాల్ కౌర్ చిన్నతో వివాదం కారణంగా ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు. కాగా పంజాబ్‌లో గతేడాది ఆప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరాష్ట్ర సీఎం భగవంత్ మాన్ గురుప్రీత్ కౌర్‌ను పెళ్లాడారు, ఆప్ ఎమ్మెల్యే నరీందర్ కౌర్ భరాజ్-నరీందర్‌పాల్ సింగ్ సవానా పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం మరో జంట పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. చదవండి: పార్లమెంట్లో రాహుల్ వ్యాఖ్యల దుమారం.. క్షమాపణలు చెప్పాల్సిందే! -
డబుల్ స్ట్రోక్.. ఇద్దరు సివిల్ సర్వెంట్లకు బొమ్మ చూపించిన బొమ్మై సర్కార్
-
కర్ణాటకలో ఐఏఎస్ vs ఐపీఎస్
-
సత్తా చాటారు ఐపీఎస్ అయ్యారు
లక్ష్య సిద్ధి ఉంటే విజయం ఖాయమని నిరూపించారు...లక్షల్లో జీతాలు ఇవ్వని తృప్తి్తని వెతుక్కుంటూ ప్రజాసేవలో అడుగుపెట్టబోతున్నారు. వెన్నుతట్టి ప్రో త్సహిస్తే ఏ రంగంలోనైనా విజేతలమేననడానికి మరోమారు ఉదాహరణగా నిలిచారు యువ ఐపీఎస్ప్రోబేషనరీ అధికారిణులు. కూతుళ్లను ఉన్నతంగా చూడాలన్న ఆ తండ్రుల ఆశయాలను..మహోన్నతంగా తమ విజయంతో చాటారు ఈ యువ ఐపీఎస్ అధికారిణులు. తగినప్రోత్సాహం అందిస్తే.. తామేంటో చూపిస్తామని నిరూపించారు.సమాజంలో అత్యున్నతమైన ఇండియన్ పోలీస్ సర్వీస్‌కు ఎంపిక కావడమే కాదు..ట్రైనింగ్‌లోనూ తాము సివంగులమని పురుషులతో కలబడి నిలబడ్డారు. బెస్ట్ ఔట్‌డోర్ ట్రోఫీని దక్కించుకున్నారు. రేపు శనివారం దీక్షాంత్ పరేడ్‌తో ప్రజాసేవలోకి తొలి అడుగు పెట్టబోతున్న మహిళా ఐపీఎస్ అధికారులు ‘ఫ్యామిలీ’తో తమ శిక్షణ అనుభవాలు..భవిష్యత్ లక్ష్యాలను ఇలా పంచుకున్నారు... – నాగోజు సత్యనారాయణ, సాక్షి, హైదరాబాద్ ప్రణాళిక ఉండే విజయం తప్పక వస్తుంది నా పేరు శేషాద్రి రెడ్డి... మా నాన్న సుధాకర్‌రెడ్డి సివిల్ కాంట్రాక్టర్. చిన్నప్పటి నుంచి మా నాన్న ఎంతో ప్రో త్సహించేవారు. సివిల్ సర్వీసెస్ ఆఫీసర్‌గా ప్రజలకు ఎంత సేవ చేసే అవకాశం ఉంటుంది..వాళ్లకు సమాజంలో ఎంత గౌరవం ఉంటుందన్నది బాగా చెప్పేవారు. అది నాలో ఎంతో ప్రేరణ నింపింది. అలా చిన్ననాటి నుంచే నేను ఐపీఎస్ కావాలని నిశ్చయించుకున్నా. ముందు నుంచి నేను ప్రణాళిక ప్రకారం చదువుకుంటూ వచ్చాను. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత ప్రిపరేషన్ పై మరింత ఫోకస్ పెట్టాను. అమ్మా నాన్నల సహకారం నా కష్టంతో చివరకు విజయం సాధించడం సంతోషంగా ఉంది. హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన నాకు మళ్లీ తెలంగాణ కేడర్‌లో సొంత రాష్ట్రంలోనే సేవ చేసే అవకాశం రావడం ఇంకా సంతోషంగా ఉంది. తెలంగాణలో పోలీస్ టెక్నాలజీ పరంగా, ఇతర అంశాల్లోనూ ఎంతో బాగున్నాయి. ఇప్పటికే మా సీనియర్ అధికారులు అమలు చేస్తున్న విధానాలను తెలుసుకుంటూనే ప్రజలకు పోలీసింగ్ మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తాను. భవిష్యత్తులో మరింతగా పెరగనున్న సైబర్ నేరాలను ఎలా కట్టడి చేయాలన్న దానిపైన మాకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. అది మరింత ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. – శేషాద్రిని రెడ్డి, ఐపీఎస్, తెలంగాణ కేడర్ నేనే ఫస్ట్ పోలీస్ మా కుటుంబంలో చాలా మంది బిజినెస్‌లోనే ఉన్నారు. కానీ, నాకు మాత్రం ప్రజలకు దగ్గరగా ఉండే వృత్తిలో ఉండాలని కోరిక .. అందుకే నేను డిగ్రీ చేస్తున్నప్పటి నుంచి సివిల్స్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నా. అలా నాల్గో ప్రయత్నంలో ఐపీఎస్ వచ్చింది. మా కుటుంబం నుంచి నేను మొదటి పోలీస్ అధికారి కావడంతో మా కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఉన్నారు. మా సొంతప్రా ంతం మహారాష్ట్ర. కానీ, మా కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. నాన్న బిజినెస్‌లో ఉన్నారు. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ నుంచి బీఎస్సీ బయో కెమిస్ట్రీ పూర్తి చేశాను. ఆ తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించాను. లక్ష్యంపై స్థిరంగా ఉన్నాను..అందుకే మూడుసార్లు విజయం రాకపోయినా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. నాల్గో ప్రయత్నంలో సివిల్స్ సాధించాను. నేను ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు ఎంపికయ్యాను. అక్కడి ప్రభుత్వం మహిళా భద్రతకు తీసుకుంటున్న చర్యల గురించి విన్నాను.ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో జిల్లాల్లో మరిన్ని విషయాలు తెలుసుకునే అవకాశం వస్తుందని భావిస్తున్నా. ఒక ఐపీఎస్ అధికారిగా నా లక్ష్యం ఒక్కటే ...నేను ఎక్కడ పనిచేసినా అక్కడ ప్రజలు భద్రంగా ఉన్నామన్న భావన కల్పించడం.. ప్రత్యేకించి మహిళలు, చిన్నారులకు పోలీస్‌పై నమ్మకం పెంచేలా పనిచేయడం. – అంకిత సురాన, ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐపీఎస్ నాన్నే నాకు స్ఫూర్తి నాపేరు దీక్ష.. రాజస్థాన్ లోని జుంజున్ జిల్లా ఖేత్రీ పట్టణం. నాన్న అక్కడే హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో ఏజీఎంగా పనిచేస్తారు. మా అమ్మ గవర్నమెంట్ టీచర్. ఐఐటీ ఢిల్లీ నుంచి నేను బీటెక్ పూర్తి చేశాను. ఆ తర్వాత యూపీఎస్సీ ప్రిపరేషన్ ్ర΄ారంభించాను. మా నాన్నకు నన్ను ఐపీఎస్‌గా చూడడం ఎంతో ఇష్టం. ఆయన ప్రోత్సాహంతోనే నేను సివిల్స్‌వైపు దృష్టి పెట్టాను. ఆయన ప్రతి విషయంలో నాకు ఎంతో సపో ర్ట్‌గా ఉంటారు. అలాగే మా సీనియర్స్ కూడా సివిల్స్ గురించి గొప్పగా చెప్పడం కూడా ఒక కారణం. సివిల్స్ రెండో ప్రయత్నంలో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్‌కు ఎంపికయ్యాను. ఆ తర్వాత మళ్లీ మా నాన్నప్రోత్సాహంతో మూడోసారి సివిల్స్ రాశాను. అలా నాకు మూడో ప్రయత్నంలో ఐపీఎస్ వచ్చింది. ఈ శిక్షణకు వచ్చినప్పుడు చాలా ఆందోళనగా అనిపించింది. కానీ క్రమంగా అన్నీ నేర్చుకున్నాను..గుర్రపు స్వారీ, గన్ షూటింగ్, క్రై మ్ ఇన్వెస్టిగేషన్ ఇలా ప్రతి పని నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. మహిళలు ఏదైనా సాధించగలరు..మన శక్తి ఏంటో మనం గుర్తించాలి. అప్పుడు మనం చేసే పనిలో ఆత్మవిశ్వాసంతో చేయగల్గుతాం. అందుకు నేను ఉదాహరణ. నాకు బెస్ట్ ఔట్‌డోర్ ప్రోబేషనర్ అవార్డు వచ్చింది. ఆ విషయం తెలియగానే మొట్టమొదట మా నాన్నకే ఫోన్ చేసి చె΄్పా..ఆయన ఆనందం అంతా ఇంతా కాదు. నాన్న డ్రీమ్ పూర్తి చేశానన్న తృప్తి నాకు ఎంతో అనిపించింది. సివిల్స్ లేదా ఇంకా ఏ పో టీ పరీక్షకు ప్రిపేర్ అయ్యే వారికి నేను చెప్పేది ఒక్కటే... మన లక్ష్యం ఏంటి...? ఎలా సాధించాలన్నదానిపై స్పష్టత ఉండాలి. అందుకు తగ్గట్టుగా ప్రణాళిక పెట్టుకుని చదవాలి. శ్రద్ధగా, నిష్టగా ఉండాలి..అలా అని మిగిలిన విషయాలు వదిలేయద్దు. మనకు నచ్చినట్టు రిలాక్స్ అవ్వాలి. ఎంత ఏకాగ్రతతో చదువుతామన్న దాన్ని బట్టి రోజుకు ఎన్ని గంటలు చదవాలన్నది ఉంటుంది. నేను రోజుకు ఆరు నుంచి ఏడు గంటలు మాత్రమే చదివాను. పరీక్ష దగ్గరపడే కొద్ది కొద్దిగా పెంచుతూ వెళ్లా..రోజుకు 10 గంటలకు పెంచాను. నాకు విజయం వచ్చింది. – దీక్ష, బెస్ట్ ఔట్డోర్ప్రాబేషనరీ ఐపీఎస్, బీహార్ కేడర్ ఆరేళ్ల బాబును వదిలి ట్రైనింగ్‌కు వచ్చా ఐపీఎస్ కావాలన్న లక్ష్యం కోసం ఆరేళ్ల బాబును వదిలి ట్రైనింగ్‌కు వచ్చాను..చివరకు మా బ్యాచ్‌లో లేడీప్రోబేషనరీ ఔట్‌డోర్ టాపర్‌గా నేను నిలవడం సంతోషంగా ఉంది. నాది తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా. మా నాన్నగారు రైతు, మా అమ్మ టీచర్. నాకు ఒక చెల్లి. వీఐటీ యూనివర్సిటీ వెల్లూరులో నేను బీటెక్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివాను. తర్వాత వివాహం అయ్యింది. సాఫ్ట్‌వేర్‌లో మంచి ఉద్యోగం అయినా ఏదో వెలితి ఉండేది. దాన్ని వదిలేశాను. ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్‌లో పనిచేశాను.అదీ మంచి ఉద్యోగమే అయినా తృప్తి లేదు. ప్రజలతో మమేకమై వారికి ఉపయోగపడే వృత్తిలో ఉండాలని నిర్ణయించుకున్నాను. అప్పటికే నాకు కొడుకు పుట్టాడు. ఈ టైంలో మంచి ఉద్యోగం వదిలి సివిల్స్ ఎందుకు అని మా కుటుంబం, ముఖ్యంగా నా భర్త నిరుత్సాహపర్చలేదు.. నీ లక్ష్యం కోసం వెళ్లు.. కుటుంబాన్ని నేను చూసుకుంటా అన్నాడు. దాంతో బాబు పుట్టిన తర్వాత నేను యూపీఎస్సీకి ప్రిపరేషన్ ్ర΄ారంభించాను. అలా ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యాను. నేను ఔట్‌డోర్ ట్రైనింగ్‌లో ట్రోఫీ ΄÷ందానంటే ఈ ట్రైనింగ్ నాలో పెంచిన ఆత్మవిశ్వాసమే కారణం. ఐపీఎస్ శిక్షణ అనేది అంత చిన్న విషయమేమీ కాదు. ఫిజికల్‌గా, మెంటల్‌గా కూడా ఎంతో శ్రమించాలి. శిక్షణప్రారంభంలో చాలా కష్టంగా అనిపించినా..క్రమంగా మనలోని శక్తిని మనం గుర్తిస్తాం. మా కుటుంబం నుంచి నేను మొదటి పో లీస్‌ను. ఎంతోమంది మహిళా పో లీసు అధికారులు నేను చూసిన వాళ్లు.. వాళ్లంతా నాకు ప్రేరణే. ఒక మహిళాపోలీస్ అధికారిగా నా వృత్తి జీవితంలో మహిళలు, చిన్నారుల సంరక్షణకు ఎక్కువప్రా ధాన్యం ఇవ్వాలని నేను భావిస్తున్నాను. నా శిక్షణలో నా కుటుంబం పోర్ట్ ఎంతో ఉంది. – నిత్యా రాధాకృష్ణన్,ప్రోబేషనరీ ఐపీఎస్, ఏజీఎంటీయూటీ కేడర్ చూశారుగా వీరి ఆశయాలు, లక్ష్యాలు... నెరవేరాలని కోరదాం. -
తెలంగాణలో భారీగా ఐపీఎస్ లు బదిలీలు
-
1,472 ఐఏఎస్, 864 ఐపీఎస్ ఖాళీలు: కేంద్రం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 1,472 ఐఏఎస్, 864 ఐపీఎస్, 1,057 ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు(ఐఎఫ్ఎస్) పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రకటించింది. 2022 జనవరి 1వ తేదీ నాటికి దేశంలో శాంక్షన్డ్ ఐఏఎస్ పోస్టులు 6,789, ఐపీఎస్ పోస్టులు 4,984, ఐఎఫ్ఎస్ పోస్టులు 3,191 ఉన్నాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్రసింగ్ బుధవారం సభలో లిఖితపూర్వకంగా తెలియజేశారు. ప్రస్తుతం 5,317 ఐఏఎస్ అధికారులు, 4,120 ఐపీఎస్ అధికారులు, 2,134 ఐఎఫ్ఎస్ అధికారులు పనిచేస్తున్నారని వెల్లడించారు. ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ విభాగాల్లో 9.79 లక్షల ఖాళీలు కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో 2021 మార్చి 1 నాటికి ఏకంగా 9.79 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు జితేంద్ర సింగ్ లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. వీటి భర్తీకి ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. చదవండి: (భార్య వేధింపులు తట్టుకోలేక.. నవ వరుడు ఆత్మహత్య!) -
ఖాకీ వెబ్ సిరీస్‌తో ఫేమస్.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్
బిహార్ ఐపీఎస్ అధికారి అమిత్ లోధా జీవితం ఆధారంగా ఖాకీ: ది బిహార్ చాప్టర్ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో వెబ్ సిరీస్‌గా రూపొందిన సంగతి తెలిసిందే. దీనికి ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది కూడా. వాస్తవానికి ఐపీఎస్ అధికారి అమిత్ ఒక గ్యాంగ్‌స్టర్ అశోక్ మెమతోను పట్టుకోవడానికి చేపట్టిన ఆపరేషన్ ఆధారంగా తెరకెక్కించిందే ఈ వెబ్ సీరిస్. ఇది ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది కూడా. కానీ ఇప్పుడూ ఆ వెబ్ సిరీస్ కారణంగానే ఐపీఎస్ అధికారి అవినీతి అరోపణలను ఎదుర్కొంటున్నారు. ఆర్థిక స్వలాభం కోసం తన పదవిని ఉపయోగించుకున్నట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈమేరకు ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది. ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్న సమయంలో నెట్‌ఫ్లిక్స్ ప్రొడక్షన్ హౌస్ ఫ్రైడే స్టోరీ టెల్లర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు అమిత్. ఐతే ప్రొడక్షన్ హౌస్‌తో అతని డీల్ విలువ రూ.1 కానీ అతని భార్య అకౌంట్లోకి సుమారు రూ.48 లక్షల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. అసలు ఈ ఒప్పందం కుదరక మునుపే భార్య ఖాతాలో కొంత సొమ్ము జమ అయినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దీంతో సదరు ఐపీఎస్ అధికారి అమిత్‌పై మనీలాండరింగ్ కింద పలు కేసులు నమోదు చేశారు. వాస్తవానికి ఆయన తీసిన నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ఖాకీ ఐపీఎస్ అధికారి తన కెరియర్లో ఎదుర్కొన్న సవాళ్ల గురించి రాసిన పుస్తకం బిహార్ డైరీస్: 'ది ట్రూ స్టోరీ ఆఫ్ హౌ బిహార్స్ మోస్ట్' ఆధారంగా రూపొందించింది. ఇదిలా ఉండగా, సదరు అధికారి అమిత్ గయాలో ఐపీఎస్‌గా నియమితులైనప్పటి నుంచే అక్రమంగా సంపాదిస్తున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అతను రచయిత కాదని పుస్తకాలు రాసి వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించే అధికారం అమిత్‌కు లేదని ఆర్థిక నేరాల విభాగం పేర్కొంది. (చదవండి: పాముని కాపాడేందుకు బ్రేక్ వేయడంతో.. ఏకంగా ఐదు వాహనాలు) -
నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాసరావు గురించి విస్తుపోయే విషయాలు
-
సూటు..బూటు..బీఎండబ్య్లూ కారు
సాక్షి, బంజారాహిల్స్: ఐఏఎస్ అధికారిగా ప్రచారం చేసుకుంటూ ప్రముఖులతో పరిచయాలను అడ్డం పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని గుంటూరు జిల్లా, నల్లపాడు పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఇతను గతంలో జూబ్లీహిల్స్ రోడ్ నెం. 9లోని ఓ మహిళకు చెందిన రూ. 25 కోట్ల విలువ చేసే ఇంటిని కబ్జా చేసేందుకు యత్నించాడు. ప్రధాని మోదీ భద్రతా సలహాదారునంటూ పోలీసులను బురిడీ కొట్టించేందుకు యత్నించాడు. వివరాల్లోకి వెళితే..గుంటూరు జిల్లాకు చెందిన తెలదేవులపల్లి వెంకట లక్ష్మినరసింహమూర్తి కొంత కాలంగా ఐఏఎస్‌నని చెప్పుకుంటూ అటు పోలీసు ఉన్నతాధికారులను, ఇటు ప్రధాని, ముఖ్యమంత్రి కార్యాలయాల ప్రముఖులను నమ్మిస్తూ పలువురికి రూ.కోట్లలో టోకరా వేశాడు. ఖరీదైన దుస్తులతో, బీఎండబ్య్లూ కారుకు పీఎంఓ కార్యాలయం అంటూ స్టిక్కర్ తగిలించి ఘరానా మోసాలకు పాల్పడుతున్నట్లుగా తేలింది. జూబ్లీహిల్స్‌లోని ఒంటరి మహిళ ఇంటిని కబ్జా చేసేందుకు యత్నించిన అతను ఆమెను ఇంటి నుంచి బయటికి పంపించేందుకు గతేడాది డిసెంబర్ 30న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అతడి వైఖరిపై అనుమానం వచ్చిన పోలీసులు సివిల్ మ్యాటర్ కింద కేసును పక్కన పెట్టారు. అయితే తాను ప్రధాని మోదీ భద్రతా సలహాదారుగా పని చేస్తున్నానని జూబ్లీహిల్స్ పోలీసులు తన మాట వినడం లేదని తనకు ఎక్స్‌ప్రెస్ అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరుతూ గవర్నర్‌కు నకిలీ లెటర్ ప్యాడ్‌పై లేఖ రాశారు. అయితే గవర్నర్ కార్యాలయం అతడికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేశానని, ఇస్రో పాలసీ మేకర్నని పీఎంవో భద్రతా సలహాదారునని తనకు 20 డిగ్రీలు ఉన్నాయని సోషల్‌మీడియాలో ప్రచారం చేసుకుంటూ పలువురిని మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. గతంలో పోలీసు ఉన్నతాధికారులకు న్యాయ సలహాదారుగా పని చేసిన ఓ వ్యక్తి ఇతడికి అండగా నిలవడంతో మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. జూబ్లీహిల్స్‌లోని ఇంటిని ఖాళీ చేసే విషయంలో నానా రభస చేశారు. అందులో దేశ భద్రతకు సంబంధించిన రికార్డులు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఉన్నాయంటూ పోలీసులకు చుక్కలు చూపించారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీవోపీటీ)లో ఆరా తీయగా ఆ పేరు మీద ఐఏఎస్‌లు ఎవరూ లేరని స్పష్టమైంది. విషయం తెలుసుకున్న ఐబీ అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ నకిలీ ఐఏఎస్‌పై విచారణ చేస్తుండగానే గుంటూరులో పట్టుబడ్డాడు. దొరికింది ఇలా.. సదరు నకిలీ ఐఏఎస్ టీవీ. లక్ష్మీనరసింహ మూర్తి పీఏనంటూ శుక్రవారం రాత్రి నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తి మా సార్ నరసింహ మూర్తి మాట్లాడుతారని ఎస్ఐ ఆరోగ్య రాజ్‌కు ఫోన్ ఇచ్చారు. తాను డీజీపీ, ఎస్పీతో మాట్లాడానని చెప్పిన నరసింహ మూర్తి తాను బస చేసిన హోటల్‌కు కానిస్టేబుళ్లను పంపించాలని సూచించాడు. ఈ విషయాన్ని ఎస్ఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో డీఎస్సీ ప్రశాంతి నరసింహ మూర్తికి ఫోన్ చేయగా తాను అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్తో మాట్లాడానని, గుంటూరు వికాస్ నగర్లో ఓ యువతికి తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని తనతో పోలీసు బలగాలను పంపించాలని చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన డీఎస్పీ సదరు హోటల్‌కు పోలీసులకు పంపగా అప్పటికే నకిలీ ఐఏఎస్ అక్కడినుంచి ఉడాయించాడు. దీంతో పోలీసులు అతడి మొబైల్ లొకేషన్ ఆధారంగా విజయవాడకు వెళ్తున్న అతడిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి ల్యాప్‌టాప్, మొబైల్ఫోన్లు, నకిలీ లెటర్హెడ్లు స్వాధీనం చేసుకున్నారు. పదుల సంఖ్యలో నిరుద్యోగులను మోసం చేసి కోట్లాది రూపాయలు కాజేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇతడి కోసం ఐబీ గత ఆరు నెలలుగా గాలిస్తోంది. ఇతడి బాధితుల్లో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, విశ్రాంత అధికారులు ఉన్నట్లు తేలింది. (చదవండి: ఫోన్ చేసి మాటల్లో పెట్టి.. 5 నిమిషాల్లోనే..) -
సూపర్ ఉమెన్.. ఆమె తెగువకు సీఎం స్టాలిన్ ప్రశంసలు..
సాక్షి, చెన్నై: ఆమె ఓ మహిళా అధికారి.. రాత్రివేళ అని కూడా చూడకుండా తన విధి నిర్వహణలో తెగువ చూపించింది. అర్థరాత్రి సైకిల్‌పై పెట్రోలింగ్ చేసి ఆమె చూపించిన సాహసం తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం మెప్పించింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇంతకీ ఆమె ఎవరూ అనుకుంటున్నారా..? చెన్నై నార్త్ జోన్‌కు చెందిన మహిళా ఐపీఎస్ అధికారిణి, జాయింట్ కమిషనర్ ఆర్వీ రమ్యా భారతి.. గురువారం అర్ధరాత్రి విధుల్లో భాగంగా సైకిల్‌పై పెట్రోలింగ్‌కు వెళ్లారు. తన వ్యక్తిగత భద్రతతో పాటు తెల్లవారుజామున 2.45 గంటల నుంచి 4.15 గంటల వరకు రైడ్ చేస్తూ ఉత్తర చెన్నైలో దాదాపు 9 కిలోమీటర్లు ప్రయాణించి పోలీసు అధికారులను ఆశ్చర్యానికి గురిచేశారు. వాలాజా పాయింట్ నుండి ఆమె పెట్రోలింగ్ ప్రారంభించి ముత్తుసామి బ్రిడ్జి, రాజా అన్నామలై మండ్రం, ఎస్ప్లానేడ్ రోడ్, కురలగం, ఎన్ఎస్సీ బోస్ రోడ్, మింట్ జంక్షన్, వాల్ టాక్స్ రోడ్, ఎన్నూర్ హై రోడ్, ఆర్కేనగర్, తిరువొత్తియూర్ హై రోడ్‌తో సహా అనేక ప్రాంతాలను ఆమె కవర్ చేశారు. తన పెట్రోలింగ్‌లో భాగంగా పలువురు అనుమానితులను సైతం ఆమె పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఆమె చూపించిన తెగువ తమిళనాడులో హాట్ టాపిక్ మారింది. ఈ విషయం కాస్తా సీఎంకు చేరడంతో స్టాలిన్ స్పందించారు. ముఖ్యమంత్రి ట్విట్టర్ వేదికగా..‘‘రమ్యా భారతికి అభినందనలు.. తమిళనాడులో మహిళలపై హింసను తగ్గించాలని, మహిళలకు భద్రత కల్పించాలని డీజీపీని ఆదేశించాను అంటూ కామెంట్స్ చేశారు. అనంతరం, విధి నిర్వహణలో భాగంగా అర్దరాత్రి పూట రోడ్లపై తిరుగుతూ మహిళల భద్రతను పర్యవేక్షించిన ఐపీఎస్ రమ్యా భారతిపై తమిళనాడు పోలీసు శాఖ హర్షం వ్యక్తం చేసింది. దీంతో, ఆమెను డ్రగ్స్‌పై డ్రైవ్‌కు నోడల్ ఆఫీసర్‌గా చెన్నై పోలీస్ కమిషనర్ నియమించారు. ఈ క్రమంలో ఒక్క రాత్రిలోనే ఆమె వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. రాష్ట్రంలో మహిళా పోలీసులకు ఆమె ఆదర్శంగా నిలిచారంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
దివ్యాంగులు ఐపీఎస్‌కు అర్హులే..
న్యూఢిల్లీ: దివ్యాంగులు సైతం ఐపీఎస్, ఢిల్లీ, అండమాన్ నికోబార్ దీవులు, డయ్యూ డామన్, దాద్రా నగర్ హవేలి, లక్షద్వీప్ పోలీసు సర్వీసు(డీఏఎన్‌ఐపీఎస్), ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీసు(ఐఆర్పీఎఫ్ఎస్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తెలియజేసింది. సివిల్ సర్వీసెస్‌లతో ఆయా సర్వీసులను ప్రాధాన్యతలుగా ఎంచుకోవడానికి అనుమతించింది. సంబంధిత దరఖాస్తు పత్రాలను ఏప్రిల్1లోగా యూపీఎస్సీకి సమర్పించాలని దివ్యాంగ అభ్యర్థులకు సూచించింది. ఐపీఎస్, డీఏఎన్‌ఐపీఎస్, ఐఆర్పీఎఫ్ఎస్ పోస్టుల నుంచి దివ్యాంగులను మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 18న జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తదుపరి విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది. చదవండి: (Ukraine Russia War: కీవ్‌లో కల్లోలం.. ఏ క్షణంలోనైనా) -
అభిషేక్‌ను రెండు వారాల్లో తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతిని రెండు వారాల్లో తెలంగాణ రాష్ట్ర కేడర్‌లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం సోమేశ్‌కుమార్‌ను ముందుగా ఏపీకి కేటాయించగా తామిచ్చిన ఆదేశాలతో తెలంగాణ కేడర్‌లో కొనసాగుతున్నారని గుర్తుచేసింది. అభిషేక్ మొహంతి కేసులో తమ ఆదేశాలను అమలు చేయకపోతే గతంలో తామిచ్చిన ఆదేశాలను పునఃసమీక్షించి సోమేశ్‌ను తిరిగి ఏపీ కేడర్‌కు పంపుతామని హెచ్చరించింది. ఈ మేరకు క్యాట్ సభ్యులు ఆశిష్కాలియా, బీవీ సుధాకర్ ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. తనను ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ అభిషేక్ మొహంతి దాఖలు చేసిన పిటిషన్‌ను గతంలో విచారించిన క్యాట్.. తెలంగాణ కేడర్‌లోకి తీసుకోవాలంటూ 8 నెలల క్రితం ఆదేశించింది. ఈ ఆదేశాలను అమలు చేయకపోవడంతో అభిషేక్ కోర్టుధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణలో భాగంగా సీఎస్ సోమేశ్‌కుమార్‌ను వ్యక్తిగతంగా హాజరుకావాలని గత విచారణ సందర్భంగా ధర్మాసనం ఆదేశించింది. కోర్టుధిక్కరణ పిటిషన్ మరోసారి విచారణకు రాగా.. సీఎస్ తరఫున కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ అభ్యర్థించారు. తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో సీఎస్ స్వయంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందేనని, గంట సమయం ఇస్తున్నామని, ఈలోగా హాజరుకాకపోతే సీఎస్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేయాల్సి ఉంటుందని ధర్మాసనం హె చ్చరించింది. దీంతో కొద్దిసేపటి తర్వాత సీఎస్ ఆన్లైన్లో ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేడర్ కేటాయింపులు చేసే అధికారం కేంద్రానికి ఉందని, ఈ నేపథ్యంలో క్యాట్ ఆదేశాలపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రా నికి నివేదించామని సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. రెండు వారాల్లోగా అభిషేక్‌ను తెలంగాణ కేడర్‌లోకి తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను 2 వారాల తర్వాతకు వాయిదా వేసింది. కాగా, సోమేశ్‌తోపాటు ఇతర అధికారులను తెలంగాణకు కేడర్‌కు కేటాయించాలంటూ క్యాట్ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్రం ఇప్పటికే హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. -
సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్‌రెడ్డి
AP: ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కె.ఎస్.జవహర్‌రెడ్డి నియమితులయ్యారు. టీటీడీ ఈవో అదనపు బాధ్యతలను ఆయనకే కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో ఎనిమిదిమంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఉత్తర్వులు జారీచేశారు. చదవండి: ‘జగనన్న తోడు’ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే.. -
ఫస్ట్ ఉమన్.. క్లిష్ట పరిస్థితుల్లో గట్టి పోలిస్ ఆఫీసర్
‘దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉంది ఇప్పుడు’ అనేది మన తెలుగు సినిమా డైలాగైతే కావచ్చుగానీ హరియాణాలోని గుర్‌గ్రామ్‌కు వెళితే ‘సిటీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు’ అనే రియల్ డైలాగ్ లోకల్ లాంగ్వేజ్‌లో అప్పట్లో తరచు వినిపించేది. సిటీ పరిస్థితి క్లిష్టస్థితిలో పడడానికి శాంతిభద్రతల నుంచి ట్రాఫిక్ అస్తవ్యస్తతల వరకు రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇలాంటి క్లిష్టసమయంలో గుర్‌గ్రామ్ తొలి మహిళా పోలిస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు కళారామచంద్రన్. రెవారి, ఫతేహబాద్, పంచ్‌కుల జిల్లాల సూపరిండెంట్ ఆఫ్ పోలిస్‌గా పనిచేసినా, ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసినా, మేఘాలయాలోని ఈశాన్య ప్రాంత పోలిస్ అకాడమీ హెడ్‌గా పనిచేసినా... కళా రామచంద్రన్ తనదైన ప్రత్యేకతను సృష్టించుకున్నారు. నిఖార్సయిన పోలిస్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారు.గుర్‌గ్రామ్‌లో చూడచక్కని రోడ్లు ఉన్నాయి. కానీ ఏంలాభం? ‘వేగమే మా నైజం’ అన్నట్లుగా దూసుకుపోతుంటాయి వాహనాలు. దీనివల్ల యాక్సిడెంట్లు, మరణాలు. మరోవైపు డ్రంకెన్ డ్రైవింగ్. ఇంకోవైపు స్ట్రీట్క్రైమ్స్. సైబర్‌క్రైమ్, ఈవ్‌టీజింగ్ లాంటి సమస్యలు బోలెడన్ని ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల నిష్క్రియాపరత్వం మీద వేడివేడి విమర్శ లు కూడా వచ్చాయి.అలాంటి క్లిష్ట సమయంలో బాధ్యత లు తీసుకున్న కళారామచంద్రన్ ‘నగరాన్ని ఏ మేరకు భద్రంగా ఉంచగలరు?’ అనే సందేహాలు రాకపోవడానికి కారణం ఆమెకు ఉన్న వృత్తి నిబద్ధత, మంచిపేరు. ‘క్షేత్రస్థాయి నుంచి పోలిసు పర్యవేక్షణను బలోపేతం చేసే కార్యాచరణకు శ్రీకారం చుట్టాం’ అంటున్నారు కళా రామ చంద్రన్. రకరకాల ప్రాంతాలలో పనిచేసిన అనుభవంతో పాటు, భర్త ఇచ్చిన సూచనలు కూడా గుర్గ్రామ్ని ‘సేఫర్ అండ్ బెటర్’ సిటీగా మార్చడానికి ఉపయోగపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కళారామచంద్రన్ భర్త నవదీప్‌సింగ్ సీనియర్ ఐపీయస్ అధికారి. గుర్‌గ్రామ్ పోలిస్ కమిషనర్‌గా పనిచేశారు. -
సివిల్ ‘సర్వీస్’ మాకే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతితో సంబంధం లేకుండానే.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను నేరుగా డిప్యుటేషన్‌పై నియమించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఈ మేరకు కేంద్రం ‘ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (కేడర్) రూల్స్–1954’కు ప్రతిపాదిస్తున్న సవరణలను పలు రాష్ట్రాలు తప్పుబ డుతున్నాయి. ఈ సవరణలు భారత సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయంటూ పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ తదితర రాష్ట్రాలు ఇప్పటికే వ్యతిరేకత వ్యక్తం చేశాయి. అఖిల భారత సర్వీసుల అధికారులను తమ అధీనంలోని తెచ్చుకుని.. రాష్ట్రాల హక్కులను కాలరాసేయడానికే కేంద్రం ఈ సవరణలను చేపట్టిందని మండిపడ్డాయి. దీనిపై ఆరు రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు కూడా రాశాయి. త్వరలో సీఎం కేసీఆర్‌కూడా..: కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. సమాఖ్య స్ఫూర్తి, రాష్ట్రాల హక్కుల పరిరక్షణ కోసం సీఎం కేసీఆర్ కొంతకాలంగా కేంద్రంతో కొట్లాట వైఖరి అవలంబిస్తున్నారు. ఈ క్రమంలో ఐఏఎస్(కేడర్) రూల్స్ సవరణలను సైతం రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించే అవకాశాలున్నాయి. ఈ మేరకు సీఎం త్వరలో కేంద్రానికి లేఖ రాయనున్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. నిబంధనలేంటి?.. సవరణలేంటి? ఐఏఎస్ కేడర్ రూల్స్‌లోని నిబంధన 6(1) ప్రకారం.. ఏదైనా రాష్ట్ర కేడర్ ఐఏఎస్/ఐపీఎస్/ఐఎఫ్ఎస్ అధికారిని సదరు రాష్ట్ర ప్ర భుత్వ సమ్మతితోనే కేంద్ర సర్వీసులకుగానీ, ఇతర రాష్ట్రాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు గానీ డిప్యుటేషన్‌పై పంపించాలి. రాష్ట్ర ప్ర భుత్వ సమ్మతి లేకుంటే.. కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై తీసుకోవడానికి వీలులేదు. ♦ కేంద్ర ప్రభుత్వం ఇక ముందు రాష్ట్రాల సమ్మతితో సంబంధం లేకుండా నేరుగా అధికారులను డిప్యుటేషన్‌పై నియమించుకోవడానికి వీలుగా 6(1) నిబంధనకు సవరణలు ప్రతిపాదించింది. దీనిపై జనవరి 25లోగా తమ అభిప్రాయాలను తెలపాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (డీఓపీటీ) గత నెలలోనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. ♦ రాష్ట్రాల నుంచి తగినంత మంది అధికారులను డిప్యుటేషన్‌పై కేంద్రానికి పంపడం లేదని, అందువల్ల అధికారుల కొరత తీవ్రంగా ఉందని పేర్కొంది. ♦ ఈ ప్రతిపాదనల ప్రకారం రాష్ట్రాలు తమ కేడర్ స్ట్రెంథ్ నుంచి నిర్దేశిత సంఖ్యలో వివిధ స్థాయిలకు చెందిన అధికారులను కేంద్రానికి డిప్యుటేషన్‌పై పంపించేందుకు సిద్ధంగా ఉంచాల్సి వస్తుంది. అధికారుల్లో ఆందోళన ప్రతిపాదిత ఐఏఎస్(కేడర్) రూల్స్ సవరణ పట్ల.. రాష్ట్రంలోని అఖిల భారత సర్వీసుల అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సవరణలు అమల్లోకి వస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ విభేదాలు, వివాదాలకు అధికారులు బలికావాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు.. యాస్ తుఫాన్‌పై ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షకు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర సీఎస్ అలాపన్ బందో పాధ్యాయ్ గైర్హాజరయ్యారు. దానితో గతేడాది మార్చిలో సీఎస్ బందోపాధ్యాయ్‌ను కేంద్రానికి రీకాల్ చేస్తూ డీఓపీటీ ఉత్తర్వులు జారీ చేయడం, ఆ వెంటనే బందోపాధ్యాయ్ స్వచ్ఛంద పదవీవిరమణ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ♦ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతితోపాటు అధికారులు తమకోరిక మేరకు కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్ వెళ్తున్నారు. ఇకపై ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా.. అధికారులను డిప్యుటేషన్‌పై కేంద్రం పిలిచే అవశాలుంటాయి. ఏదైనా అంశంపై కేంద్ర, రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సమయాల్లో సంబంధిత అధికారులను శిక్షించడానికి/ఇబ్బందిపెట్టడానికి ఈ నిబంధన కేంద్రం చేతిలో ఆయుధంగా మారే అవకాశం ఉం దనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ♦ రాష్ట్రాల్లో కీలక పథకాలు, ప్రాజెక్టులు, బాధ్యతల్లో పనిచేస్తున్న సమర్థులైన అధికారులను కేంద్రం ఏకపక్షంగా తీసుకుంటే.. రాష్ట్రాల్లో సమర్థులైన అధికారుల కొరతఏర్పడుతుందనే అభిప్రాయమూ ఉంది. ♦ కేంద్రం ప్రతిపాదించిన సవరణలపై రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం ప్రతినిధి అభిప్రాయాన్ని కోరగా.. ఇది కేంద్రం వర్సెస్ రాష్ట్రమని, ఇందులో తామేమీ చెప్పడానికి లేదని సమాధానమిచ్చారు. -
సీనియర్ ఐపీఎస్‌లకు డీజీలుగా ప్రమోషన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు సీనియర్ ఐపీఎస్‌లకు డీజీలుగా ప్రమోషన్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమోషన్ పొందిన వారిలో సీనియర్ ఐపీఎస్‌లు అంజనాసిన్హా, మాదిరెడ్డి ప్రతాప్, మహ్మద్ అసన్‌రేజా, పీఎస్ఆర్ ఆంజనేయులు, కే రాజేంద్రనాథ్‌రెడ్డి, నళిని ప్రభాత్ గజరవు భూపాల్, పేముషీ, గోపీనాథ్ జెట్టి, సెంథిల్‌కుమార్, గ్రీవల్ నవదీప్‌సింగ్, నవీన్‌గులాటి, కాంతిరాణా టాడా, ఎల్‌కేవీ రంగారావు, పి వెంకట్రామిరెడ్డి ఉన్నారు. చదవండి: (దివాలా ముంగిట్లో రఘురామ కంపెనీ) -
తెలంగాణలో రికార్డ్: తొలి ముస్లిం మహిళా ఐపీఎస్ సలీమా
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లాకు చెందిన షేక్ సలీమా రాష్ట్రంలోనే తొలి ముస్లిం మహిళా ఐపీఎస్‌గా రికార్డులకెక్కారు. కేంద్రం మంగళవారం విడుదల చేసిన నాన్ కేడర్ ఐపీఎస్‌ల పదోన్నతి జాబితాలో ఆమెకు స్థానం దక్కింది. చింతకాని మండలం కోమట్లగూడెంకు చెందిన లాల్ బహదూర్, యాకూబీ దంపతుల కూతురు సలీమా. తండ్రి ఖమ్మంలో ఎస్సైగా పనిచేసి రిటైర్ అయ్యారు. సలీమా కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి బయో టెక్నాలజీలో ఎమ్మెస్సీ చేశారు. 2007లో గ్రూప్–1లో డీఎస్పీగా ఎంపికయ్యారు. ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో తొలి పోస్టింగ్ పొందిన ఆమె అంబర్‌పేట పీటీసీ వైస్ ప్రిన్సిపాల్‌గా, మాదాపూర్‌లో అదనపు కమిషనర్(అడ్మిన్)గా పనిచేసి ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్‌లో డీసీపీగా ఉన్నారు. కుటుంబమంతా విద్యావంతులే.. సలీమాకు ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడు. ఒక సోదరి జరీనా ఇటీవల ఏపీలో గ్రూప్–1 పరీక్ష రాసి మెయిన్స్‌కు ఎంపికయ్యారు. ఇంటర్వ్యూలో అర్హత సాధిస్తే ఆమె కూడా ప్రభుత్వ సర్వీసుకు ఎంపికవుతారు. మరో చెల్లెలు మున్నీ ఖైరతాబాద్ ఎంవీఐగా పనిచేస్తున్నారు. తమ్ముడు ఖాసిం హైదరాబాద్ కేర్ హాస్పిటల్లో డాక్టర్‌గా స్థిరపడ్డారు. సలీమా భర్త కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు. -
నాన్‌కేడర్ నుంచి ఐపీఎస్
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు రాష్ట్ర పోలీస్ శాఖలో నాన్‌కేడర్ ఎస్పీలుగా పనిచేస్తున్న అధికారులకు ఐపీఎస్ హోదా దక్కింది. 20 మంది అధికారులకు ఐపీఎస్ పదోన్నతి కల్పిస్తూ కేంద్ర హోంశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. 2007లో గ్రూ ప్–1లో డీఎస్పీలుగా చేరిన అధికారులతోపా టు ఎస్ఐగా కేరీర్ ప్రారంభించి నాన్‌కేడర్ ఎస్పీలుగా ఉన్న వారికీ కన్ఫర్డ్ ఐపీఎస్ పదోన్నతి కల్పించింది. రాష్ట్రానికి కేడర్ అలాట్మెంట్లో భాగంగా ఇచ్చిన ప్రమోషన్ కోటాలో ఖాళీగా ఉన్న 23 ఐపీఎస్ పోస్టులకు సంబంధించి ఈ నెల 11న సెలెక్షన్ కమిటీ స మావేశం నిర్వహించింది. రాష్ట్రం నుంచి 23 మంది పేర్లను ప్రతిపాదించగా ముగ్గురిపై క్రమశిక్షణ చర్య లు పెండింగ్‌లో ఉండటంతో కమిటీ వారి పేర్లను పెండింగ్‌లో పెట్టింది. దీంతో మిగిలిన 20 మంది నాన్‌కేడర్ ఎస్పీలకు ఐపీఎస్ హోదా పదోన్నతి కల్పిస్తూ ఆమోదముద్ర వేసింది. యూపీఎస్సీ సెలెక్షన్ కమిటీ ఈనెల 17న జాబితాను కేంద్ర సిబ్బంది, వ్యవహారాల విభాగంతోపాటు కేంద్ర హోంశాఖకు పంపింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ జాబితాను ఆమోదిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోన్నతి పొందిన అధికారులు 2016 సంవత్సరం జాబితాలో ఎన్.కోటిరెడ్డి, ఎల్.సుబ్బారాయుడు, కె.నారాయణరెడ్డి, డీవీ శ్రీనివాస్‌రావు, టి.శ్రీనివాస్‌రావు, టి.అన్నపూర్ణ, పీవీ పద్మజ, జానకీ ధరావత్, 2017 జాబితాలో పి.యాదగిరి, 2018 కోటా కింద కేఆర్ నాగరాజు, ఎం.నారాయణ, 2019 జాబితాలో వి.తిరుపతి, ఎస్.రాజేంద్రప్రసాద్, డి.ఉదయ్‌కుమార్ రెడ్డి, కె.సురేష్‌కుమార్, 2020 జాబితాలో బి.అనురాధ, సి.అనసూయ, షేక్ సలీమా, ఆర్.గిరిధర్, సీహెచ్ ప్రవీణ్‌కుమార్ ఐపీఎస్ పదోన్నతి పొందారు. క్రమశిక్షణ చర్యలు పెండింగ్‌లో ఉండటం వల్ల జానకీ షర్మిల, వై.సాయిశేఖర్, వి.భాస్కర్‌రావు పదోన్నతి రాకుండా ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఇంటిగ్రెటి సర్టిఫికెట్ తీసుకొని యూపీఎస్సీకి సమర్పిస్తే వీరికి కూడా పదోన్నతులు కల్పించనున్నట్టు కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఐదేళ్ల పోరాటంతో ఫలితం.. రాష్ట్ర విభజనకు ముందు జరిగిన సీనియారిటీ జాబితా వివాదంతో కన్ఫర్డ్ ఐపీఎస్ పదోన్నతి ఐదేళ్ల నుంచి వాయిదా పడుతూ వచ్చింది. ప్రతీ ఏటా ఖాళీల భర్తీకి హోంశాఖ ప్యానల్ నోటిఫికేషన్ ఇస్తూ వచ్చినా సీనియారిటీ సమస్య పరిష్కారం కాకపోవడంతో పదోన్నతి ఆలస్యమైంది. రెండు రాష్ట్రాల ఉన్నతాధికారుల చొరవతో ఎట్టకేలకు ఈ ఏడాది మొదట్లోనే సీనియారిటీ సమస్యను పరిష్కరించడంతో 2016 నుంచి పెండింగ్‌లో ఉన్న ప్యానల్ పదోన్నతులను యూపీఎస్సీ, కేంద్ర హోంశాఖ ఒకేసారి క్లియర్ చేశాయి. -
త్వరలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు జరగనున్నట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసే 16వ తేదీ తర్వాత ట్రాన్స్ఫర్లపై రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎక్కువ కాలం ఒకే పోస్టులో ఉంటున్న.. ముఖ్యంగా ప్రత్యేక ప్రధాన, ముఖ్య కార్యదర్శులుగా కొనసాగుతున్న సీనియర్లను స్థానచలనం చేయనున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు అత్యంత నమ్మకస్తులుగా ఉండి కీలక శాఖల్లో ప్రధాన, ముఖ్య కార్యదర్శులుగా చాలాకాలంగా కొనసాగుతున్న కొంత మంది సీనియర్ ఐఏఎస్‌లను పరస్పరం బదిలీ చేయనున్నట్టు తెలిసింది. కీలక శాఖలకు కొత్త అధికారులు వస్తారని తెలుస్తోంది. ప్రాధాన్యం లేని పోస్టుల్లో మగ్గుతున్న కొందరు అధికారులకూ కొత్త పోస్టింగ్స్‌లో కొంత ప్రాధాన్యం కల్పించాలనుకుంటున్నట్టు సమాచారం. ఆర్థిక, ఐటీ, సింగరేణి, జలమండలిల్లో.. దీర్ఘకాలంగా ఒకే పోస్టులో కొనసాగుతున్న ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు.. పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, సింగరేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీ ఎన్. శ్రీధర్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జలమండలి ఎండీ దానకిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లొకేశ్కుమార్కు స్థానచలనం కల్పించే అవకాశముంది. కీలకమైన రెవెన్యూ శాఖతో పాటు కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, సీసీఎల్ఏ శాఖల కార్యదర్శిగా అదనపు బాధ్యతల్లో సీఎస్ సోమేశ్‌కుమార్ కొనసాగుతున్నారు. ఆయనపై భారం తగ్గించేందుకు కొన్ని శాఖలు/విభాగాలను సీనియర్ ఐఏఎస్‌లకు అప్పగించే అవకాశముంది. ఎన్నికల నేపథ్యంలో కొత్త జట్టు మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాల్సి ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త జట్టు కూర్పుపై దృష్టి పెట్టినట్టు తెలిసింది. యువ, సీనియర్ అధికారుల సమ కూర్పుతో పాలన యంత్రాంగంలో కొత్త ఉత్తేజం నింపాలని సర్కారు భావిస్తోంది. ఈ దిశగా బదిలీలపై చేపట్టిన కసరత్తు కొంత కొలిక్కి వచ్చినట్టు సమాచారం. కొందరు అధికారులు చాలాకాలంగా ఒకే పోస్టులో ఉండటంతో ఆ శాఖల్లో కొంత నిస్తేజం నెలకొంది. ఆ శాఖలకు త్వరలో కొత్త అధికారులను నియమించే అవకాశముంది. ఎన్నికల నాటికి జిల్లా పాలన యాంత్రాంగంపై పట్టు సాధించేలా భారీగా కలెక్టర్లు, ఎస్పీల బదిలీలూ చేసే అవకాశం కనిపిస్తోంది. పలువురు అదనపు డీజీలు, ఐజీలు, డీఐజీలు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు కూడా బదిలీ అయ్యే అవకాశముంది. -
మహిళా ఐపీఎస్‌లకు సైబర్ స్టార్స్ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాల కట్టడికి తీసుకుంటున్న చర్యలకుగాను సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ సైబర్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్ (సీఆర్‌సీఐడీఎఫ్)సంస్థ ప్రతీఏటా ప్రకటించే సైబర్ స్టార్స్ అవార్డులు రాష్ట్ర పోలీస్‌శాఖకు చెందిన ఇద్దరు మహిళా ఐపీఎస్ అధికారు లకు లభించాయి. రెండు కీలక కేసుల్లో సోషల్ మీడియా వెబ్‌సైట్స్ ద్వారా నిందితుల గుర్తింపునకు తీసుకున్న చర్యలకుగాను సీఐడీలో సీనియర్ ఎస్పీ (ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం) పరిమళ హనానూతన్కు అవార్డు లభించింది. సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారికి చెక్ పెట్టడం, నిందితులను అరెస్ట్ చేయడం, వినూ త్న పద్ధతుల ద్వారా నిందితులను ట్రాక్ చేయడం, కేసుల పర్యవేక్షణకుగాను సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని డీసీపీ (నేర విభాగం) రోహిణి ప్రియదర్శినికి అవార్డు దక్కింది. -
నెలలుగా వెయిటింగ్ ట్యాగ్‌తో..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. పదోన్నతి పొందినా పాత పోస్టుల్లోనే ఏళ్ల తరబడి నెట్టుకొస్తూ బదిలీ కోసం ఎదురుచూస్తున్న వాళ్లు కొందరైతే.. కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్ పూర్తి చేసుకొని వచ్చిన వారు మరికొందరు. వీరే కాక శిక్షణ పూర్తి చేసుకొని ఉత్సాహంతో పనిచేయాల్సిన యువ ఐపీఎస్‌లు కూడా నెలల తరబడి పోస్టింగ్ లేక ఇళ్లకే పరిమితమయ్యారు. అదనపు డీజీపీ నుంచి ఏఎస్పీ దాకా పదుల సంఖ్యలో ఐపీఎస్ అధికారులు వెయిటింగ్లో ఉండిపోయారు. కొంతమంది అధికారులైతే ఏకంగా నెలల నుంచి వెయిటింగ్ ట్యాగ్‌తో ఉండిపోయారు. వెయిటింగ్లో ఉన్నన్నాళ్లు జీతాలు రావు. అంతేకాదు కూర్చుందామన్నా ఏ ఆఫీస్‌లో సీటు కూడా ఉండదు. అటు ఆఫీస్‌కు వెళ్లలేకా.. ఇటు ఇంట్లో ఉండలేక కాలాన్ని గడిపేస్తున్నారు. డిప్యుటేషన్ పూర్తిచేసుకొని... సీనియర్ ఐపీఎస్, అదనపు డీజీపీ హోదాలో ఉన్న 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ కేంద్ర సర్వీసుల నుంచి డిప్యుటేషన్ పూర్తి చేసుకొని నెల క్రితమే రాష్ట్రంలో రిపోర్ట్ చేశారు. అదేవిధంగా కేంద్ర సర్వీసులోని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) నుంచి ఐజీ విజయ్ కుమార్ (1997) సైతం డిప్యుటేషన్ పూర్తి చేసుకొని వచ్చి రిపోర్ట్ చేశారు. ఇంటర్కేడర్ డిప్యుటేషన్లో భాగంగా పంజాబ్‌లో పనిచేస్తున్న డీఐజీ విక్రమ్ జిత్ దుగ్గల్ (2007) కూడా తిరిగి వచ్చి రాష్ట్ర పోలీస్ శాఖకు రిపోర్ట్ చేశారు. వీరంతా వెయిటింగ్ లిస్టులోనే ఉండిపోయారు. బదిలీపై వచ్చి... కరీంనగర్ కమిషనర్‌గా ఐదేళ్లపాటు పనిచేసిన వీబీ కమలాసన్ రెడ్డి (2004 బ్యాచ్) గత జూలైలో బదిలీ అయ్యారు. డీజీపీ కార్యాలయం లో రిపోర్ట్ చేసిన ఆయనకు ఇప్పటివరకు పోస్టిం గ్ లేదు. అదే రీతిలో మహబూబ్‌నగర్ ఎ స్పీ స్థా నం నుంచి ఏప్రిల్‌లో బదిలీ అయిన ఐపీఎస్ రె మా రాజేశ్వరి (2009) సైతం అప్పటి నుంచి వెయిటింగ్‌లోనే ఉండిపోయారు. ఇటీవల సూ ర్యాపేట ఎస్పీగా ఉన్న ఆర్.భాస్కరన్ (2012) బదిలీ అయి ప్రస్తుతం వెయిటింగ్లో ఉన్నారు. కేడర్ మార్పుతో.. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఐపీఎస్ అధికారులు కేడర్ మార్పుతో తెలంగాణ పోలీస్ శాఖకు వారం క్రితం రిపోర్ట్ చేశారు. రిటైర్డ్ డీజీపీ ఏకే మహంతీ కుమారుడు, సీనియర్ ఐపీ ఎస్ అవినాష్ మహంతీ సోదరుడు అభిషేక్ మ హంతి (2011) ఏపీ నుంచి తెలంగాణకు కేడర్ మార్చుకొని వెయిటింగ్లో ఉన్నారు. అదేవిధం గా రాష్ట్ర పోలీస్ సర్వీస్ (ఎస్పీఎస్) కోటా నుం చి ఐపీఎస్ అయిన గ్రూప్–1 అధికారి నారాయణ్ నాయక్ కేడర్ అలాట్మెంట్లో భాగంగా తెలంగాణకు వచ్చారు. ఆయనా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. కాగా యూపీఎస్సీ ద్వారా ఐపీఎస్ అయి నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందిన 13 మంది యువ ఐపీఎస్‌లు సైతం పోస్టింగ్ కోసం వెయిటింగ్‌లోనే ఉన్నారు. ఏఎస్పీలుగా ఉన్న వీరు ఆరు నెలలుగా వెయిటింగ్ లోనే ఉన్నట్టు ఉన్నతాధికార వర్గాలు చెప్పాయి. -
కష్టంగానే సివిల్స్ ప్రిలిమ్స్
సాక్షి, అమరావతి: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర కేంద్ర అత్యున్నత సర్వీసుల్లో పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్స్ పరీక్షల్లో ప్రిలిమ్స్–2021 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 77 పట్టణాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 10 లక్షలమంది వరకు దరఖాస్తు చేసుకోగా 90 శాతం మంది హాజరైనట్లు అంచనా. రాష్ట్రంలో విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురం నగరాల్లో 68 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 40 వేలమంది వరకు హాజరయ్యారు. కోవిడ్–19 నేపథ్యంలో ప్రతి కేంద్రంలో ప్రొటోకాల్‌ను అనుసరించి ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 నుంచి పేపర్–1, మధ్యాహ్నం 2.30 నుంచి పేపర్–2 పరీక్ష నిర్వహించారు. జూన్ 29న జరగాల్సిన ఈ పరీక్షను కోవిడ్ కారణంగా అక్టోబర్ 10న నిర్వహించారు. పరీక్షలో ప్రశ్నల తీరు ఎలా ఉందంటే... ప్రిలిమ్స్‌లో జనరల్ స్టడీస్‌కు సంబంధించి కరెంటు అఫైర్స్ ప్రశ్నలు విభిన్నమైన రీతిలో అడిగారు. కరోనా నేపథ్యంలో పాండమిక్, ఇండో చైనా సంబంధాలు తదితర అంశాల్లో ప్రశ్నలున్నాయి. ఆధునిక చరిత్ర, కళలు, సంస్కృతికి సంబంధించిన అంశాల నుంచి 20 వరకు ప్రశ్నలు వచ్చాయి. పాలిటీ, ఎకానమీల నుంచి 15 చొప్పున ప్రశ్నలున్నాయి. ఈసారి కొత్తగా స్పోర్ట్స్ ప్రశ్నలు క్రికెట్ టెస్టు సిరీస్ వంటివి అడిగారు. పేపర్–2కు సంబంధించి సీశాట్‌లో వచ్చిన ప్రశ్నలు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆన్సర్ చేయగలిగేలా ఉన్నాయి. మేథ్స్, రీజనింగ్, పాసేజ్ రీడింగ్ వంటి అంశాలు కష్టంగా ఉన్నాయి. ప్రశ్నలు దీర్ఘంగా ఉన్నాయి. లాజికల్, రీజనింగ్, అనలటికల్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్, ఇంటర్ పర్సనల్ ఎబిలిటీ, జనరల్ మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలు వచ్చినట్లు అభ్యర్థులు తెలిపారు. గత ఏడాదికన్నా ఈసారి ప్రిలిమ్స్ ప్రశ్నలు కష్టంగా ఉన్నాయన్నారు. మొత్తంగా మూడొంతుల ప్రశ్నలు కష్టంగా ఉన్నాయని తెలిపారు. ఆధునిక చరిత్ర, ఎకనామీ సబ్జెక్టుల్లోని ప్రశ్నలు ఎక్కువగా ఉన్నా పర్యావరణ శాస్త్రం, ప్రాచీన, మధ్యయుగ చరిత్రలకు సంబంధించిన ప్రశ్నలు కఠినంగా వచ్చాయి. ఎన్సీఈఆర్టీ 11, 12 తరగతుల పుస్తకాల్లోని అంశాల ఆధారంగా ప్రశ్నలున్నాయి. కటాఫ్‌పై అంచనాలు ప్రిలిమ్స్ కటాఫ్‌పై వేర్వేరు అంచనాలు వేస్తున్నారు. గత ఏడాది 796 పోస్టులు ఉండగా ఈసారి ఆ సంఖ్య 712కు తగ్గింది. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు వెళ్లే అభ్యర్థుల సంఖ్య తగ్గనుంది. పోస్టుల సంఖ్య తగ్గడంతోపాటు, గత ఏడాదికన్నా ఈసారి ప్రశ్నలు కూడా కష్టంగా ఉన్నందున ఈ ప్రిలిమ్స్ కటాఫ్ 93 నుంచి 95గా ఉండవచ్చని అంచనా వేస్తున్నామని కోచింగ్ సెంటర్ల అధ్యాపకులు చెబుతున్నారు. పేపర్–1లోని మార్కుల ఆధారంగానే కటాఫ్ నిర్ణయిస్తారు. పేపర్–2 (సీశాట్)కు కటాఫ్ ఉండదు. ఇది కేవలం క్వాలిఫయింగ్ పరీక్ష మాత్రమే. అభ్యర్థులు 33 శాతం మార్కులు సాధించాలి. ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్లో వెలువడవచ్చని భావిస్తున్నారు. మెయిన్స్ పరీక్ష తేదీలను యూపీఎస్సీ త్వరలోనే ప్రకటించే అవకాశముంది. -
అన్న ఐపీఎస్, తమ్ముడు ఐఏఎస్
సాక్షి, రాయచూరు రూరల్: తెలంగాణ రాష్ట్ర సరిహద్దు జిల్లా బీదర్‌లో ఇద్దరు సోదరులు ఉన్నత హోదా ఉద్యోగాలు పొందారు. వివరాలు... స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న నదీముద్దీన్‌కు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు మహ్మద్ నదీముద్దీన్ గత ఏడాది నిర్వహించిన యూపీఎస్సీలో ఉత్తమ ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన కేరళలో శిక్షణ పొందుతున్నారు. ఇక రెండో కుమారుడు మహ్మద్ హ్యారీస్ కూడా అన్న బాటలో నడి చాడు. తాజాగా వచ్చిన యూపీఎస్సీలో 270 ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. కుమారులు ఇద్దరు సివిల్స్ విజేతలు కావడంతో కుటుంబంలో ఆనందం నెలకొంది.