సాక్షి,హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్, ఐపీఎస్ కేడర్ విభజనలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
తమను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలంటూ డీవోపీటీ ఆదేశాలు జారీ చేసిందని, ఆ ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణలో కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT)లో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్ అధికారిణి సృజన కోరారు. నలుగురు ఐఏఎస్‌లు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్ల క్యాట్ మంగళవారం విచారణ చేపట్టనుంది.
తెలంగాణ సీఎస్ శాంతికుమారితో భేటీ
తెలంగాణ సీఎస్ శాంతికుమారితో ఏపీ కేడర్ ఐఏఎస్,ఐపీఎస్ అధికారులు సమావేశమయ్యారు. సీఎస్‌తో వాకాటి కరుణ, రోనాల్డ్ రోస్, అమ్రాపాలితో పాటు పలువురు అధికారులు భేటీ అయ్యారు.
గతవారం ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌లు ఎల్లుండి (అక్టోబర్ 16) లోపు రిపోర్టు చేయాలని డీవోపీటీ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఐఏఎస్‌లు ఇంకా రిలీవ్ కాలేదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
ఈ తరుణంలో డీవోపీటీ ఆదేశాల మేరకు ఎల్లుండి ఏపీలో రిపోర్ట్ చేసే విషయంపై సీఎస్‌తో అధికారులు భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేందుకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు విముఖత వ్యక్తం చేశారు. ఇప్పటికే తాము ఏపీకి వెళ్ళబోమని డీవోపీటీకి విజ్ఞప్తి చేయగా.. ఆ విజ్ఞప్తిని డీవోపీటీ తిరస్కరించింది. దీంతో ఐఏఎస్ అధికారులు క్యాట్‌ను ఆశ్రయించారు. రేపు క్యాట్ విచారణ చేపట్టనుంది. అనంతరం ఐఏఎస్‌లు,ఐపీఎస్‌లు ఏపీకి వెళ్తారా? లేదంటే తెలంగాణలోనే కొనసాగుతారా? అనేది తేలనుంది.
👉చదవండి: మీరు వెళ్లాల్సిందే
Comments
Please login to add a commentAdd a comment