IAS
-
నాగారం ల్యాండ్ కేసు.. మాజీ ఆర్డీవోకు ఈడీ సమన్లు..
-
క్యాట్‌లో ఐఏఎస్‌ల పిటిషన్: నాలుగు వారాలకు విచారణ వాయిదా
సాక్షి,హైదరాబాద్: ఐఏఎస్ అధికారుల కేటాయింపుపై కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్)లో ఇవాళ( సోమవారం) విచారణ జరగింది. స్వాపింగ్, డొమిసిల్ (స్థిర నివాసం) ఆధారంగా తమ అభ్యర్థనలను పరిగణలోకి తీసుకోలేదన్న ఐఏఎస్‌ల పిటిషన్‌పై క్యాట్ విచారణ చేపట్టింది. అయితే ఈరోజు డీఓపీటీ కౌంటర్ దాఖలు చేయలేదు. ఇక.. ఎడుగురు ఐఏఎస్ అధికారుల విడిగా కౌంటర్ దాఖలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఐఏఎస్ తరుపు న్యాయవాదులు కోరారు. వచ్చే విచారణకు ఏడుగురు ఐఏఎస్‌ల కేటాయింపుపై విడిగా కౌంటర్లు ఫైల్ చేయాలనీ డీఓపీటీకి క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ క్యాట్ 4 వారాలకు వాయిదా వేసింది.గత నెలలో కేటాయించిన రాష్ట్రాల్లోనే విధులు నిర్వహించాలంటూ డీవోపీటీ జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఐఏఎస్ అధికారులు క్యాట్‌ను ఆశ్రయించారు. డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్లో కోరారు. ఐఏఎస్‌ల పిటిషన్‌పై క్యాట్ విచారణ చేపట్టింది. వాదనల అనంతరం ..డీవోపీటీ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు క్యాట్ నిరాకరించింది. ప్రతివాదులైన కేంద్రం, డీవోపీటీలకు నోటీసులు ఇచ్చింది. నవంబరు 5లోపు కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. ఏపీకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. క్యాట్ ఆదేశాలతో ఇప్పటికే కేటాయించిన రాష్ట్రాల్లో ఐఏఎస్‌లు రిపోర్ట్ చేశారు.అయితే తమని డొమిసిల్,స్వాపింగ్ ఆధారంగా కేటాయింపు జరగలేదని, డీవోపీటీ తమ అభ్యర్థనలను పరిగణలోకి తీసుకోలేదని ఏడుగురు ఐఏఎస్‌లు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
సీడీఎంఏగా శ్రీదేవి.. హరీశ్‌కు ఐఅండ్‌పీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రస్థాయి కమిషనర్లు, డైరె క్టర్లు, జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ఈ జాబి తాలో ఉన్నారు. వీరితో పాటు ఇద్దరు ఐఎఫ్ఎస్ అధికా రులను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమ వారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ టి.కె. శ్రీదేవిని మళ్లీ పుర పాలక శాఖకు పంపారు. ఆమెను కమిషనర్ అండ్ డైరె క్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ)గా బదిలీ చేస్తు న్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ప్రస్తుతం సమాచార, పౌర సంబంధాల శాఖ (ఐఅండ్‌పీఆర్) స్పెషల్ కమిషనర్‌గా ఉన్న ఎం. హనుమంతరావును యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేయగా, ఐఅండ్‌పీఆర్ బాధ్యతలను రెవెన్యూ జాయింట్ సెక్ర టరీ ఎస్.హరీశ్‌కు అప్పగించారు. ఆయనను ఐఅండ్‌పీఆర్ స్పెషల్ కమిషనర్‌గా బది లీ చేసినప్పటికీ రెవెన్యూ శాఖ జాయింట్ సెక్రటరీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని ఉత్తర్వుల్లో వెల్లడించారు. నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న సి.నారాయణరెడ్డిని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేయగా, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న శశాంకకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల కమిషనర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. కాగా సమాచార, పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్‌గా నియమితులైన ఎస్.హరీశ్ సోమవారం ఆన్లైన్లో బాధ్యతలు స్వీకరించారు. (వీరితో పాటు టీజీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తికి వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్‌గా, హాకా ఎండీ కె. చంద్రశేఖర్‌రెడ్డికి పాడి అభివృద్ధి సమాఖ్య ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎండీగా ఉన్న ఐఎఫ్ఎస్ అధికారిణి సోని బాలాదేవిని డైరెక్టర్, స్పోర్ట్స్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎండీగా పునర్నియమించారు. మేడ్చల్–మల్కాజ్గిరి జెడ్పీ సీఈవోగా ఉన్న ఎస్.దిలీప్‌కుమార్‌ను నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేశారు. రాజన్న సర్కిల్లో అసిస్టెంట్ కన్జర్వేటర్‌గా ఉన్న అటవీశాఖ అధికారి జి.జ్ఞానేశ్వర్‌ను వికారాబాద్ జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌వో)గా నియమించారు.) -
ఐఏఎస్ టీనా దాబీ వైరల్ .. అధికార పార్టీ నేతకు వంగి వంగి దండాలు
జైపూర్ : ఒకటి,రెండు,మూడు.. ఇదంతా ఏంటని అనుకుంటున్నారా? ఓ జిల్లా ఐఏఎస్ అధికారిణి సదరు అధికార పార్టీ నేతకు వంగి వంగి పెట్టిన దండాలు. ఇప్పుడీ అంశంపై సోషల్ మీడియాలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐఏఎస్ అధికారిణి టీనా దాబి గత నెలలో రాజస్థాన్ రాష్ట్రం బార్మర్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. నగరంలో పరిశుభ్రత, స్వచ్ఛత కోసం ‘నవో బార్మర్’ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా నవో బార్మర్ కార్యక్రమానికి రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ సీనియర్ నేత సతీష్ పూనియాను ఆహ్వానించారు."दादागिरी करके सफाई करवा रहे हो, बाड़मेर भी इंदौर जैसा हो जाएगा। आप अच्छा काम कर रही हो।"#tinadabi @DrSatishPoonia pic.twitter.com/DDc16wrtcf— Mukesh Mathur (@mukesh1275) October 24, 2024 అయితే కార్యక్రమానికి వచ్చిన సతీష్ పూనియా కాన్వాయ్ నుంచి దిగి వస్తూనే ఫోన్లో బిజీ అయ్యారు. అదే సమయంలో సతీష్ పూనియాను ఆహ్వానించేందుకు వచ్చిన టీనా దాబి ఆయనకు వంగి వంగి దండాలు పెట్టింది. ఏడు సెకన్ల వ్యవధిలో ఐదుసార్లు నమస్కరించారు. కొద్ది సేపటి తర్వాత టీనా దాబి పనితీరుపై ప్రశంసలు కురిపించారు. ఇండోర్ మాదిరిగా బార్మర్ కూడా మారుతుందని అన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సతీష్ పూనియాకు జిల్లా కలెక్టర్ టీనా దాబి వంగి వంగి దండాలు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సంచలనాలకు.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ టీనా దాబిరాజస్థాన్కు చెందిన టీనా దాబి.. ఢిల్లీ లేడీ శ్రీ రామ్ కాలేజీలో చదివారు. దళిత వర్గం నుంచి మొదటి ప్రయత్నంలోనే టాపర్‌గా నిలిచిన ఫీట్‌ను సొంతం చేసుకున్నారు. టీనా దాబి 2015 సివిల్స్ సర్వీసెస్ ఎంట్రెన్స్‌లో టాపర్. రెండో ర్యాంకర్ అథర్ అమీర్ ఖాన్. వీళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నట్లు 2016లో సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆ సమయంలో మతపరమైన చర్చతో పెను దుమారమే చెలరేగింది. అయినా ఈ జంట వెనక్కి తగ్గలేదు. 2018లో వీళ్లద్దరూ పెద్దల సమక్షంలో ప్రేమవివాహం చేసుకున్నారు. ఢిల్లీలో జరిగిన వీళ్ల వెడ్డింగ్ రిసెప్షన్‌కు వెంకయ్య నాయుడు, సుమిత్ర మహాజన్ లాంటి రాజకీయ ప్రముఖులు సైతం హాజరయ్యారు. అయితే.. 2020లో విడిపోతున్నట్లు ప్రకటించిన ఈ జంట..2021లో జైపూర్ కోర్టు నుంచి అధికారికంగా విడాకులు కూడా తీసుకుంది.గతేడాది 2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ప్రదీప్ గవాన్డేతో ఆమె నిశ్చాతార్థం చేసుకున్నారు. టీనా కంటే ఆయన మూడేళ్లు సీనియర్ బ్యాచ్. గ్లామర్ ఉన్న ఆఫీసర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువే. టీనా దబీకి సుమారు మిలియన్న్నర ఫాలోవర్లు ఉన్నారు. టీనా సోదరి రియా దాబి 2020 ఐఏఎస్ ఫలితాల్లో 15వ ర్యాంకు సాధించింది. -
భూదాన్ భూముల భాగోతం..ఐఏఎస్‌పై ఈడీ ప్రశ్నల వర్షం
సాక్షి,హైదరాబాద్: భూదాన్ భూముల భాగోతంపై ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్‌పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ఈడీ అధికారుల విచారణ కొనసాగుతుంది. విచారణలో భాగంగా ఐఏఎస్ అమోయ్ కుమార్ శుక్రవారం ఉదయం ఈడీ కార్యాలయానికి వచ్చారు. అనంతరం, ఆయనను ఈడీ అధికారులు బయటకు తీసుకెళ్లారు. తిరిగి ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. అయితే ఈడీ కార్యాలయం నుంచి ఐఏఎస్ అధికారిని బయటకు తీసుకెళ్లిన ఈడీ అధికారులు సర్వే నెంబర్ 181,182 మహేశ్వరం మండలం నాగారంలోని భూములపై విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. సుమారు 70ఎకరాల భూదాన్ భూముల అన్యాక్రాంతంపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. భూముల అక్రమ బదిలీ ఆరోపణలు మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూముల బదిలీపై ఈడీ విచారణ చేపట్టింది. ఇక్కడ రూ.వందల కోట్ల విలువైన 42 ఎకరాలను ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ అక్రమంగా బదిలీ చేశారని ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌గా అమోయ్ కుమార్ పనిచేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆయన పాత్రపై నిజానిజాలను తేల్చేందుకు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా ఇవాళ మూడో రోజు ఐఏఎస్ అమోయ్ కుమార్ ఈడీ ఎదుట హాజరయ్యారు. -
ఐఏఎస్ అమోయ్ కుమార్‌కు బిగుస్తున్న ఉచ్చు.. ఈడీ ఫుల్ ఫోకస్
సాక్షి, హైదరాబాద్: ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ నేడు మరోసారి ఈడీ విచారణకు హాజరు కానున్నారు. నిన్న ఎనిమిది గంటల పాటు విచారించిన ఈడీ.. నేడు కూడా మరోసారి విచారణకు రావాలని తెలిపింది. మహేశ్వరం మండలం నాగరంలో 42 ఎకరాల భూమి కేటాయింపుపై అమోయ్ కుమార్‌ను ఈడీ ప్రశ్నిస్తోంది.గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పని చేసిన ఐఏఎస్ అమోయ్ కుమార్ 50 ఎకరాల భూదాన్ భూములను అన్యాక్రాంతం చేశాడు. విజిలెన్స్ విచారణలో అమోయ్ కుమార్ బాగోతం బయటపడింది. విజిలెన్స్ అధికారులు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాగారంలోని సర్వే నెంబర్ 181, 182 లోని 102.2 ఎకరాలపై కొంత కాలంగా వివాదం నడుస్తోంది. అందులో 50 ఎకరాల భూమి భూదాన్ బోర్డుకు చెందినదని బోర్డ్ వాదిస్తోంది.ఇక, ఈ భూమి జబ్బార్దస్త్ ఖాన్ అనే వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది. తర్వాత ఆయన కొడుకు హజీఖాన్ 50 ఎకరాల ల్యాండ్‌ను భూదాన్ బోర్డుకి దానం చేశాడు. 2021లో హజీఖాన్ వారుసురాలిని అంటూ 40 ఎకరాలు తనదేనని ఖాదురున్నీసా దరఖాస్తు చేసుకుంది. క్షేత్ర స్థాయిలో ఆర్డీవో, తహశీల్దార్, ఆర్ఐలు, సీనియర్ అసిస్టెంట్ ఖాదురున్నీసాకు అనుకూలంగా ఉండి.. ఆఘమేఘాల మీద ఆమె పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ చేశారు. ఆ భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీకి అమ్మారు. దీంతో ఎన్నికల సమయంలో భారీగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ భూమిపై క్రయవిక్రయాలు చేయకుండా ధరణిలో నిషేధిత జాబితాలో పెట్టారు అధికారులు. దీంతో, ఈ వ్యవహారంపై కేసు నమోదైంది. మరోవైపు ఈ కేసులో ఈడీ.. ఎమ్మార్వో జ్యోతి, ఆర్డీవోను సైతం నేడు విచారించే అవకాశం ఉంది. -
TG: అమోయ్‌కుమార్‌ను ప్రశ్నించిన ‘ఈడీ’
సాక్షి,హైదరాబాద్: భూముల కేటాయింపుల వ్యవహారంలో తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ అధికారి అమోయ్‌కుమార్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించింది. బుధవారం(అక్టోబర్ 23) ఈడీ కార్యాలయంలో అమోయ్‌కుమార్‌ను సుదీర్ఘంగా 8 గంటల పాటు విచారించిన అధికారులు ఆయన స్టేట్మెంట్ రికార్డు చేశారు. రంగారెడ్డిజిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో జిల్లాలో భూదాన్ భూముల్లో జరిగిన అవకతవకలపై అమోయ్‌కుమార్‌ను ఈడీ ప్రశ్నించినట్లు తెలిసింది. ఇదే అంశంలో తహసిల్దార్ జ్యోతి, ఆర్డీవో ఇతర సిబ్బంది చేసిన అవకతవకలపైనా ఈడీ ఆరా తీసినట్లు సమాచారం. భూదాన్ భూముల్లో జరిగిన అవకతవకలపై మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ఇవ్వాలని అమోయ్‌కుమార్‌ను ఈడీ కోరినట్లు తెలిసింది.కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమోయ్‌కుమార్ రంగారెడ్డి కలెక్టర్‌గా పనిచేశారు. ఆయన కలెక్టర్‌గా ఉన్న సమయంలో భూ కేటాయింపుల్లో భారీ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై విచారించేందుకు ఈడీ అమోయ్‌కుమార్‌కు నోటీసులిచ్చి విచారణకు పిలిచింది. -
TG: ఐఏఎస్‌లను రిలీవ్ చేసిన ప్రభుత్వం
సాక్షి,హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించిన ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, రొనాల్డ్‌రోస్, వాణి ప్రసాద్, వాకాటి కరుణలను తెలంగాణ ప్రభుత్వం బుధవారం(అక్టోబర్ 16) సాయంత్రం రిలీవ్ చేసింది. దీంతో ఈ అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మెయిల్ ద్వారా రిపోర్ట్ చేయనున్నారు. ఈ అధికారులు ఏపీకి వెళ్లాల్సిందేని డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలను క్యాట్, తెలంగాణ హైకోర్టు సమర్థించడంతో వీరు తెలంగాణను వీడక తప్పని పరిస్థితి ఏర్పడింది. రిలీవ్ అయిన నలుగురు ఐఏఎస్‌ల స్థానంలో ఇన్‌ఛార్జి అధికారులను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.సందీప్ కుమార్ సుల్తానియాకు విద్యుత్ శాఖ, ఆరోగ్య శాఖక్రిస్టినా, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్‌కు క్రిస్టినా, జీహెచ్ఎంసీ ఇన్‌ఛార్జి కమిషనర్‌గా ఇలంబర్తిలను ప్రభుత్వం నియమించింది.ఇదీ చదవండి: ఐఏఎస్‌లకు తెలంగాణ హైకోర్టు చుక్కెదురు -
ఐఏఎస్ లకు హై కోర్టు షాక్..
-
ఐఏఎస్‌లకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్‌లకు చుక్కెదురైంది. ఐఏఎస్‌లు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది డీవోపీటీ ఉత్తర్వులపై ఐఏఎస్ అధికారులు వాణి ప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి బుధవారం తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై హైకోర్టు జస్టిస్ అభినందన్ కుమార్ శావలే బెంచ్ విచారించింది. విచారణలో భాగంగా ఐఏఎస్‌లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. దీంతో ఐఏఎస్‌లో ఏపీలో రిపోర్ట్ చేయనున్నారు.ఐఏఎస్ అధికారుల పిటిషన్‌పై విచాణ జరిగిందిలావిచారణ సందర్భంగా.. డీపీవోటీ తరపు లాయర్ తెలంగాణ హైకోర్టులో తన వాదనలు వినిపించారు. కేంద్రంలో ఉన్న అధికారులంతా అనుభవజ్ఞులు. ఏ అధికారి ఎక్కడ పనిచేయాలనే విజ్ఞత వాళ్లకు ఉంది. ఏ అధికారి ఎక్కడ పనిచేయాలనే అధికారం కోర్టులకు లేదని అన్నారు.ప్రజా సేవ కోసమే ఐఏఎస్లుప్రజా సేవ కోసమే ఐఏఎస్‌లు. ఎక్కడ అవకాశం కల్పిస్తే అక్కడికి వెళ్ళాలి. ట్రైబ్యునల్ కొట్టేస్తే కోర్టులకు రావడం కరెక్ట్ కాదు. డిస్మిస్ చేస్తే మళ్ళీ అప్పీల్ చేస్తారు.ఇది లాంగ్ ప్రాసెస్.అధికారులు ముందు రిపోర్ట్ చేయండి’అని హైకోర్టు స్పష్టం చేసింది.అనంతరం ఐఏఎస్ తరుఫు న్యాయవాదులు కోర్టులో తమ వాదనల్ని వినిపించారు. స్థానిక తను పరిగణలోకి తీసుకోవాలని,ప్రభుత్వం అభిప్రాయం కూడా తీసుకోవాలని కోరారు.తీర్పును వాయిదా వేయాలంటూపండగలు ఉన్నాయి అప్పటివరకు స్టే విధించాలని విజ్ఞప్తి చేశారు. పండుగలు ఇప్పుడు ఏం లేవన్న హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. అయితే అందుకు ఐఏఎస్ తరుఫు న్యాయవాదులు.. క్యాట్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తున్నామని చెప్పగా.. క్యాట్ ఆర్డర్ కాపీ ఇవ్వాలని కోరిన హై కోర్ట్ కోరింది. అందుకు ఆర్డర్ కాపీ ఇంకా రాలేదని ఐఏఎస్ తరుపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. క్యాట్ తదుపరి విచారణ నవంబర్ 4కు వాయిదా వేసింది. అప్పటి వరకు ఐఏఎస్‌లను రిలీవ్ చేయకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఐఏఎస్‌ల విజ్ఞప్తిపై హైకోర్టు తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించగా.. బుధవారం సాయంత్రంలోగా ఐఏఎస్‌లు ఏపీలో రిపోర్ట్ చేయాలని, కాబట్టి పూర్తి స్థాయిలో వినాలంటూ పట్టుబట్టడటంతో వాదనలు తిరిగి ప్రారంభమయ్యాయి.ముందు ఏపీలో రిపోర్ట్ చేయండిఅటు డీవోపీటీ, ఇటు ఐఏఎస్‌ల తరుఫు న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు ..15రోజుల పాటు ఊరట కల్పించాన్న ఐఏఎస్‌ల విజ్ఞప్తిని తోసిపుచ్చింది. క్యాట్ ఆదేశాలను సమర్థించింది. ఐఏఎస్‌లు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. అనంతరం, ‘ముందు ఏపీలో రిపోర్ట్ చేయండి. ఏదైనా సమస్యలు ఉంటే తర్వాత వింటాం. ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సమస్యలు మరింత జఠిలం అవుతాయి’ అని తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఐఏఎస్ అధికారులు వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తూ తుది తీర్పును వెలువరించింది. 👉చదవండి: ఐఏఎస్‌లకు క్యాట్ చురకలు -
ఆ ఐదుగురు ఐఏఎస్‌లకు బిగ్ షాక్
సాక్షి,హైదరాబాద్: డీఓపీటీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యున్‌ల్‌లో(క్యాట్) దాఖలు చేసిన పిటిషన్లపై ఐదుగురు ఐఏఎస్ అధికారులకు బిగ్ షాక్ తగిలింది. డీఓపీటీ ఉత్తర్వులను పాటించాల్సిందేనని క్యాట్ వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం సదరు ఐఏఎస్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టింది క్యాట్డీఓపీటీ ఆర్డర్స్ ప్రకారం రిపోర్ట్ చేయాలని, ఎక్కడి వాళ్లు అక్కడే రిపోర్ట్ చేయాలంటూ క్యాట్ ఆదేశాలు జారీచేసింది. రేపు యథావిధిగా రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసింది. ‘ఏపీలో ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి చోటుకు వెళ్లి వారికి సేవ చేయాలని మీకు లేదా? ఐఏఎస్‌ల కేటాయింపులపై డీవోపీటీకి పూర్తి అధికారాలు ఉన్నాయి. స్థానికత ఉన్నప్పటికీ స్వాపింగ్ చేసుకునే అవకాశం గైడ్‌లైన్స్‌లో ఉందా?’ అని క్యాట్ ప్రశ్నించింది. కాగా రాష్ట్ర పునర్విభజన సందర్భంగా జరిగిన కేటాయింపుల ప్రకారం ఆయా రాష్ట్రాలకు వెళ్లాలంటూ ఈ నెల 9న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, కె.ఆమ్రపాలి, ఎ.వాణీప్రసాద్, డి.రొనాల్డ్‌రాస్, జి.సృజనలు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్(క్యాట్)లో పిటిషన్ దాఖలు చేశారు.ఇదిలా ఉండగా ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణీప్రసాద్, రొనాల్డ్‌రాస్‌లు కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏపీకి వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్న సృజన తెలంగాణకు రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం తాము పనిచేస్తున్న రాష్ట్రంలోనే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని, కేంద్రం జారీ చేసిన కేటాయింపు ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్లో కోరారు.👉చదవండి: ఐఏఎస్, ఐపీఎస్‌ల కేడర్ విభజనపై కేంద్రం కీలక ఆదేశాలు -
క్యాట్ పిటిషన్ కహానీ
-
ఏపీలో మేం పని చేయలేం ఐఏఎస్ అధికారుల విముఖత
-
‘మేం ఏపీకి వెళ్లలేం’.. క్యాట్‌లో ఐఏఎస్‌ల పిటిషన్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్, ఐపీఎస్ కేడర్ విభజనలో కీలక పరిణామం చోటు చేసుకుంది.తమను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలంటూ డీవోపీటీ ఆదేశాలు జారీ చేసిందని, ఆ ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణలో కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT)లో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్ అధికారిణి సృజన కోరారు. నలుగురు ఐఏఎస్‌లు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్ల క్యాట్ మంగళవారం విచారణ చేపట్టనుంది.తెలంగాణ సీఎస్ శాంతికుమారితో భేటీతెలంగాణ సీఎస్ శాంతికుమారితో ఏపీ కేడర్ ఐఏఎస్,ఐపీఎస్ అధికారులు సమావేశమయ్యారు. సీఎస్‌తో వాకాటి కరుణ, రోనాల్డ్ రోస్, అమ్రాపాలితో పాటు పలువురు అధికారులు భేటీ అయ్యారు. గతవారం ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌లు ఎల్లుండి (అక్టోబర్ 16) లోపు రిపోర్టు చేయాలని డీవోపీటీ (డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఐఏఎస్‌లు ఇంకా రిలీవ్ కాలేదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ తరుణంలో డీవోపీటీ ఆదేశాల మేరకు ఎల్లుండి ఏపీలో రిపోర్ట్ చేసే విషయంపై సీఎస్‌తో అధికారులు భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేందుకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు విముఖత వ్యక్తం చేశారు. ఇప్పటికే తాము ఏపీకి వెళ్ళబోమని డీవోపీటీకి విజ్ఞప్తి చేయగా.. ఆ విజ్ఞప్తిని డీవోపీటీ తిరస్కరించింది. దీంతో ఐఏఎస్ అధికారులు క్యాట్‌ను ఆశ్రయించారు. రేపు క్యాట్ విచారణ చేపట్టనుంది. అనంతరం ఐఏఎస్‌లు,ఐపీఎస్‌లు ఏపీకి వెళ్తారా? లేదంటే తెలంగాణలోనే కొనసాగుతారా? అనేది తేలనుంది.👉చదవండి: మీరు వెళ్లాల్సిందే -
ఆరో తరగతి ఫెయిలైన అమ్మాయికి ‘ఐఏఎస్’ కలలు ఉంటాయా? (ఫొటోలు)
-
ఆంధ్రాకు వెళ్లాల్సిందే.. ఐఏఎస్, ఐపీఎస్‌లకు DOPT బిగ్ షాక్
-
సొంత రాష్ట్రాలకు వెళ్లిపోండి.. ఐఏఎస్, ఐపీఎస్ లకు కేంద్రం షాక్
-
మీరు వెళ్లాల్సిందే!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఐఏఎస్‌ల కేడర్ విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏ రాష్ట్రానికి కేటాయించినవారు ఆ రాష్ట్రానికి వెళ్లాల్సిందేనని స్పష్టంచేసింది. తెలంగాణకు కేటాయించినా ఏపీలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు సృజన(ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్), శివశంకర్ లోతేటి (వైఎస్సార్ జిల్లా కలెక్టర్), సీహెచ్ హరికిరణ్(వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్)లను వెంటనే తెలంగాణకు వెళ్లాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించినప్పటికీ తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, రోనాల్డ్ రోస్, ఆమ్రపాలి, వాణిప్రసాద్, ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, అభిలాష బిస్త్‌ను వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలని ఆదేశించింది. ఈ అధికారులను ప్రస్తుతం పని చేస్తున్న రాష్ట్రాల నుంచి రిలీవ్ చేస్తూ వారికి కేటాయించిన రాష్ట్రాల్లో ఈ నెల 16వ తేదీలోగా రిపోర్ట్ చేయాల్సిందిగా స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు తెలియజేసింది. రాష్ట్ర విభజన సమయంలోనే... రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన కొంతమంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు తమను తెలంగాణకు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. అయితే కేంద్ర ప్రభుత్వం వారి అభ్యర్థనలను తోసిపుచ్చింది. అలాగే తెలంగాణకు కేటాయించిన కొంతమంది ఐఏఎస్‌లు.. తమను ఏపీకి కేటాయించాలని కేంద్రాన్ని కోరినా అంగీకరించలేదు. దీంతో తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు క్యాట్‌ను ఆశ్రయించారు. వారికి అనుకూలంగా క్యాట్ తీర్పు ఇచ్చింది. క్యాట్ తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది. గత మార్చిలో తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టి వారి అభ్యర్థనలు మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు అధికారుల అభ్యంతరాల పరిశీలనకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దీపక్‌ను కేంద్రం నియమించింది. దీపక్ ఇచ్చిన నివేదిక మేరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల అభ్యర్థనలను తిరస్కరించింది. కచ్చితంగా కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లాల్సిందేనని ఉత్తర్వుల్లో పేర్కొంది. -
బాబు, పవన్ రాజీనామా చేయాలి మాజీ IAS డిమాండ్..
-
Puja Khedkar: పూజా ఖేద్కర్‌కు బిగ్ షాక్
న్యూఢిల్లీ: మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఆమెకు కేంద్రం షాకిచ్చింది. ఆమెను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ నుంచి తొలిగిస్తున్నట్లు ప్రకటించింది. తక్షణమే ఆమెపై వేటు నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఐఏఎస్ రూల్స్ 1954 ప్రకారం ఆమెపై చర్యలు తీసుకున్నట్లు అధికార ఉత్తర్వుల్లో పేర్కొంది.కాగా పుణెలో ఐఏఎస్ ప్రొబేషనరీ సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు గత జూన్‌లో ఖేద్కర్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ట్రైనింగ్ సమయంలో అధికారిక ఐఏఎస్ నెంబర్ ప్లేట్ కలిగిన కారు, కార్యాలయం వినియోగించడంతో ఆమెపై పుణె కలెక్టర్ మహారాష్ట్ర సీఎస్‌కు లేఖ రాశారు. దీంతో ఆమెపై బదిలీ వేటు పటింది. అక్కడి నుంచి పూజా అక్రమాల చిట్టా బయటపడింది.సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక అయ్యేందుకు ఓబీసీ, వికలాంగుల కోటాలో నకిలీ దృవీకరణ పత్రాలు సర్పించినట్లు సైతం తేలింది. అంతేగాక నిబంధనలకు మించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ... ఆమెను ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది. నకిలీ పత్రాలతో పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులిచ్చింది. ఆమెపై ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. -
యూపీఎస్సీకి పూజా ఖేద్కర్ సవాల్!
ఢిల్లీ : తన అభ్యర్థిత్వం రద్దు చేసే హక్కు యూపీఎస్సీకి లేదని వివాదాస్పద మాజీ ఐఏఎస్ ట్రైనీ అధికారిణి పూజా ఖేద్కర్ వాదిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తన అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేయడంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. ఈ తరుణంలో ఒకసారి ఎంపికై ప్రొబేషనర్‌గా నియమితులైన తర్వాత, యూపీఎస్సీ తన అభ్యర్థిత్వాన్ని అనర్హులుగా ప్రకటించే అధికారం లేదన్నారు. ఒకవేళ చర్యలు తీసుకోవాలనుకుంటే కేవలం డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) మాత్రమే ఉందని, ఆల్ ఇండియా సర్వీసెస్ యాక్ట్, 1954 సీఎస్ఈ 2022 రూల్స్‌లోని రూల్ 19 ప్రకారం ప్రొబేషనర్ రూల్స్ ప్రకారం చర్య తీసుకోవచ్చు’అని ఖేద్కర్ పేర్కొన్నారు.పూజా ఖేద్కర్ కేసు ఈ ఏడాది జులైలో మహారాష్ట్ర వాసిం జిల్లా సూపర్ న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్ హోదాలో ఉన్న పూజా ఖేద్కర్ జిల్లా కలెక్టర్ స్థాయిలో తనకూ అధికారిక సదుపాయాలు, వసతులు కల్పించాలని డిమాండ్ చేయడంతో ఆమె వ్యవహార శైలి తొలిసారిగా వార్తల్లోకి ఎక్కింది. ప్రత్యేకంగా ఆఫీస్‌ను కేటాయించాలని, అధికారిక కారు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు సొంత ఖరీదైన కారుపై ఎర్ర బుగ్గను తగిలించుకుని తిరిగారు. దీంతో పుణెలో అసిస్టెంట్ కలెక్టర్ హోదా నుంచి ఆమెను వాసిమ్ జిల్లాలో సూపర్‌న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్‌గా ప్రభుత్వం బదిలీచేసింది.ఆ తర్వాత ఆమె తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి సివిల్స్‌లో ఆమె ఆలిండియా 821వ ర్యాంక్ సాధించారని ఆరోపణలు రావడంతో యూపీఎస్సీ విచారణ చేపట్టింది. విచారణలో ఆమె తప్పుడు వైకల్య ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు తేలింది. దీంతో పూజా ఖేద్కర్ అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేసింది. యూపీఎస్సీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ తరుణంలో పూజా ఖేద్కర్ యూపీఎస్సీ గురించి పై విధంగా వ్యాఖ్యలు చేశారు. -
పూజా ఖేద్కర్ వివాదం.. కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ వైకల్య ధ్రువీకరణ పత్రాల వివాదం నేపథ్యంలో సివిల్ సర్వెంట్ల నియామకం, శిక్షణ, నిర్వహణ సంబంధిత కార్యకలాపాలు నిర్వహించే కేంద్ర విభాగానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ)విభాగం అప్రమత్తమైంది. ఆరుగురు సివిల్ సర్వెంట్ల వైకల్య ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో ఐదుగురు ఐఏఎస్, ఒకరు ఐఆర్ఎస్ అధికారి ఉన్నట్లు సమాచారం.లగ్జరీ సౌకర్యాల కోసం అతిగా ప్రవర్తించి మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ పలు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. ఉద్యోగం కోసం ఓబీసీ సర్టిఫికెట్తో పాటు కంటి, మానసిక సంబంధిత సమస్యలపై తప్పుడు పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటిని నిర్ధారించేందుకు నిర్వహించే వైద్య పరీక్షలకు ఖేద్కర్ ఆరుసార్లు గైర్హాజరవ్వడం వంటి వరుస వివాదాలు ఆమె ఐఏఎస్ అభ్యర్థితత్వం రద్దుకు దారి తీసింది. ట్రైనీ ఐఎస్ఎస్ అధికారిణి చేసిన తప్పుల్ని గుర్తించిన యూపీఎస్సీ ఆమె ఎంపికను రద్దు చేసింది. భవిష్యత్తులో సివిల్స్ పరీక్షల్లో పాల్గొనకుండా ఆమెపై జీవితకాల నిషేధం విధించింది.తదుపరి చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆమెపై ఢిల్లీ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే తన అరెస్ట్ తప్పదేమోనన్న అనుమానంతో ఖేద్కర్ ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది. ఈ వరుస పరిణామాలతో ఖేద్కర్ విదేశాలకు పారిపోయినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.Puja Khedkar case: Following the row over #IAS probationer #PujaKhedkar, the Department of Personnel and Training (#DoPT) will now scrtutinise the disability certificates of six other civil servants.https://t.co/F4bXZs7rL9— Business Today (@business_today) August 2, 2024 -
Aruna Roy: 'ఈ పయనం సామాజికం'!
‘మహిళలు ఐఏయస్ కావడం కష్టం’ అనుకునే ఆ రోజుల్లో తొలి ప్రయత్నంలోనే ఐఏయస్ సాధించింది. ‘ఎంత పెద్ద ఉద్యోగమైనా సరే, ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగపడనప్పుడు ఆ ఉద్యోగం చేయడం వృథా’ అనుకొని ఉద్యోగాన్ని వదులుకొని ప్రజాక్షేత్రంలోకి వచ్చింది అరుణారాయ్. గ్రామీణ మహిళలతో కలిసి పోయి ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసింది. తాజా విషయానికి వస్తే... తన జ్ఞాపకాలను ‘ది పర్సనల్ ఈజ్ పొలిటికల్’ పేరుతో పుస్తకంగా తీసుకువచ్చింది. ఈ సందర్భంగా ఆమె ఉద్యమ ప్రయాణం గురించి...మనం పుట్టి, పెరిగిన వాతావరణం ఏదో రకంగా బలమైన ప్రభావం చూపుతుంది. కాలం కంటే కాస్త ముందుగా ఆలోచించే కుటుంబంలో చెన్నైలో పుట్టి పెరిగింది అరుణ. ‘యూనివర్శిటీ ఆఫ్ దిల్లీ’లో పోస్ట్–గ్రాడ్యుయేషన్ చేసింది.‘మహిళలు ఐఏఎస్‌కు సెలెక్ట్ కాలేరు’ అని బలంగా అనుకునే కాలంలో తొలి ప్రయత్నంలోనే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పరీక్ష రాసి ఎంపికైంది. సబ్–డివిజనల్ మెజిస్ట్రేట్ నుంచి ‘లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ దిల్లీ’ సెక్రెటరీ వరకు ఎన్నో పదవులు నిర్వహించినప్పటికీ తనలో ఏదో అసంతృప్తి ఉండేది. వ్యవస్థీకృతమైన అవినీతికి సంబంధించిన అసంతృప్తి అది. ఈ అసంతృప్తులు తారస్థాయికి చేరి ఉద్యోగానికి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఉద్యోగానికి ఆరు నెలలు సెలవు పెట్టి భర్త సంజిత్ రాయ్ నిర్వహిస్తున్న సోషల్ వర్క్ రిసెర్చ్ సెంటర్(బేర్‌ఫుట్ కాలేజీ)లో చేరింది. రాజస్థాన్‌లోని తిలోనియ గ్రామంలో ఉన్న ‘బేర్‌ఫుట్ కాలేజీ’లో పనిచేయడం అరుణకు ఎంతో సంతృప్తి ఇచ్చింది. ఉద్యోగానికి రాజీనామా చేసి సేవాపథంలోకి వచ్చింది.గ్రామాల్లో విద్యుత్ సరఫరా, తాగు నీటి సౌకర్యం, రోడ్డు సౌకర్యం... మొదలైనవి లేని కాలం అది. కిలోమీటర్ల కొద్దీ దూరం నడవాల్సి వచ్చేది. అయితే ఈ అసౌకర్యాలేవీ ఎప్పుడూ అరుణకు కష్టంగా అనిపించలేదు. మహిళలు ఒక బృందంగా ఏర్పడి గ్రామ అభివృద్ధికి పాటుపడేలా కృషి చేసింది. కెన్యాలో జరిగే అంతర్జాతీయ మహిళా సదస్సుకు ఆహ్వానం అందినప్పటికీ అక్కడికి వెళ్లకపోగా దానికి ప్రత్యామ్నాయంగా రాజస్థాన్‌లో మహిళా మేళ (మహిళల పండగ) నిర్వహించింది. కెన్యాలో జరిగే అంతర్జాతీయ మహిళా సదస్సుకు, ఈ స్థానిక సదస్సుకు తేడా ఏమిటంటే... మొదటి దానిలో మధ్యతరగతి, ఆ పై తరగతి విద్యాధికులైన మహిళలే ఎక్కువగా పాల్గొనే సదస్సు. ఇక రెండోది పూర్తిగా గ్రామీణ మహిళలు, శ్రామిక మహిళల కోసం నిర్వహించిన సదస్సు. ఈ తరహా పండగ జరగడం దేశంలో మొదటిసారి.‘మహిళ మేళ’ ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక–రాజకీయ చర్చలకు వేదిక అయింది. మహిళలపై జరిగే హింసను నిరోధించడానికి జరిగిన తొలి బహిరంగ చర్చావేదిక అయింది. ఉన్నత ఉద్యోగాన్ని వదిలి ప్రజాక్షేత్రంలోకి వచ్చిన అరుణారాయ్ బాల్య వివాహాలకు, మూఢనమ్మకాలకు, భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడింది. ‘మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్’ ఆర్గనైజేషన్ ద్వారా సోషల్ యాక్టివిస్ట్‌గా మరింత క్రియాశీలంగా పనిచేయడం ్రపారంభించింది.స్థూలంగా చెప్పాలంటే... అరుణా రాయ్ అంటే ఒక నామం కాదు. అనేకానేక ఉద్యమాల సమాహారం. సమాజహితాన్ని కోరుకునే వారికి స్ఫూర్తిదాయక ఉత్తేజం.పేద మహిళల కోసం...‘జ్ఞానం యొక్క ఉద్దేశం జ్ఞానం కాదు. కార్యాచరణ’ అంటాడు అరిస్టాటిల్. జ్ఞానం అనేది బుర్రలో భద్రపరుచుకొని మురిసిపోవడానికి కాదు. ఆ జ్ఞాన ఫలాలను ఆచరణలోకి, పదిమంది ఉపయోగంలోకి తీసుకురావడం ముఖ్యం. విశ్వవిద్యాలయాల నుంచి మారు మూల పల్లెల వరకు జ్ఞానమార్గంలో పయనించిన అరుణా రాయ్ ఆ జ్ఞానాన్ని పేద మహిళల సంక్షేమం, చైతన్యం కోసం వినియోగించింది. ఉద్యోగ, ఉద్యమ జ్ఞాపకాల ‘ది పర్సనల్ ఈజ్ పొలిటికల్’ ఆమె వ్యక్తిగతం కాదు. సామాజికం. ఉద్యమ బాటలో పయనించడానికి ఉపకరించే ఇంధనం. -
కోచింగ్ కోళ్ళఫారాలు
వ్యవస్థల్ని నడిపే వ్యక్తులు చేయాల్సిన పని చేయకపోతే... విషాదం ఎలా ఉంటుందో చెప్పడానికి శనివారం సాయంత్రం ఢిల్లీలోని ఓ ప్రసిద్ధ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో జరిగిన ఘటనే ఉదాహరణ. నిబంధనలకు విరుద్ధంగా ఎనిమిది అడుగుల లోతు బేస్మెంట్లో నడుపుతున్న స్టడీ సెంటర్లోకి పైపులు పగిలి నీళ్ళు వెల్లువెత్తినప్పుడు, జలదిగ్బంధంలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు పోగొట్టు కున్న తీరు కన్నీరు తెప్పిస్తుంది. పూర్తిస్థాయి ఈ మానవ తప్పిదానికి ముగ్గురు చనిపోయారని అధికారికంగా చెబుతున్నా, సంఖ్య అంతకన్నా ఎక్కువే ఉంటుందట. పది పన్నెండు మంది కనిపించట్లేదట. కొద్దిరోజుల క్రితం పొంగిపొర్లిన వర్షపునీటి వీధిలో విద్యుదాఘాతంతో ఒక ఐఏఎస్ కోచింగ్ విద్యార్థి మరణించినప్పుడే వ్యవస్థ మేల్కొని ఉండాల్సింది. దురదృష్టవశాత్తూ అది జరగలేదు. ఇప్పుడీ తాజా ఘటనతో దేశమంతా ఉలిక్కిపడింది. గమనిస్తే, క్రిక్కిరిసిన అభ్యర్థులతో కోళ్ళఫారాలుగా మారిన కోచింగ్ సెంటర్లు, కిందికి వేలాడుతున్న కరెంట్ తీగలు, వర్షం పడితే చాలు వీధుల్లో కాలువలు కట్టే నీళ్ళు, అధ్వాన్నమైన డ్రైనేజ్ వ్యవస్థ, అవినీతికి పాల్పడి అన్నిటినీ వదిలేసిన అధికార యంత్రాంగం... అలా ఇది సామూహిక వైఫల్యం. సమష్టిగా అందరూ చేసిన పాపం. ఒకరిద్దరు అధికారుల సస్పెన్షన్, యజమానుల లాంటి పెద్ద చేపల్ని వదిలేసి చిరుద్యోగుల అరెస్ట్, ఘటనకు దారి తీసిన కారణాలు – నివారణ చర్యలపై నివేదికకు కేంద్ర హోమ్‌శాఖ ప్రత్యేక ప్యానెల్ ఏర్పాటు లాంటివి చకచకా జరిగాయి. కానీ, పోయిన ఆ ప్రతిభావంతుల ప్రాణాలు తిరిగొస్తాయా? వారిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లితండ్రుల గర్భశోకం తీరుస్తాయా? శనివారం నుంచి విద్యార్థులు బైఠాయించి, శాంతియుత నిరసన తెలియజేస్తుంటే ప్రభుత్వాలు వారికి తగిన హామీనిచ్చి సాంత్వన పరచలేకపోవడం మరో వైఫల్యం.ఢిల్లీలో వేర్వేరు ప్రాంతాలకు విస్తరిస్తున్న ఈ విద్యార్థి నిరసనల వద్ద ప్రచారం కోసం కాసేపు కనిపించిపోతున్న టీచర్లు, పరస్పర నేరారోపణలు చేసుకుంటున్న రాజకీయ నేతలను చూస్తుంటే వెగటు పుట్టక మానదు. ప్రజలెన్నుకున్న ఢిల్లీ ‘ఆప్’ సర్కార్‌పై కేంద్రం పనుపున లెఫ్టినెంట్ గవర్నర్, ఆయన తైనాతీ అధికారుల పెత్తనం ఒక తప్పయితే... క్షేత్రస్థాయిలో లేకున్నా జైలు నుంచే రోజువారీ పాలన సాగిస్తానంటున్న ఢిల్లీ సీఎం మొండి వైఖరి మరో తప్పు. శిక్ష, నష్టం మాత్రం ఢిల్లీలో ప్రజలకు, పరిపాలనకు పడుతోంది.ఢిల్లీలో పుట్టగొడుగుల్లా వెలిసిన కోచింగ్ కేంద్రాల్లో ప్రమాదాలు జరగడం ఇదేమీ తొలిసారి కాదు. ఏడాది క్రితం కూడా ఢిల్లీ ఉత్తర ప్రాంతంలోని ఓ కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. 61 మంది విద్యార్థులు గాయపడ్డారు. అప్పుడూ ఇలాగే జనాగ్రహం పెల్లుబికింది. సదరు కేంద్రం పర్మిట్ లేకుండా అక్రమంగా నడుస్తున్నట్టు అప్పట్లో అగ్నిమాపక శాఖ ప్రకటించింది. ఢిల్లీలో 600 దాకా కోచింగ్ సెంటర్లుంటే, వాటిలో 67కే అనుమతులున్నాయట. కఠిన చర్యలు తీసుకుంటామంటూ పాలకులు అప్పుడూ చెప్పారు, ఇప్పుడూ చెబుతున్నారు. కానీ, చేసింది శూన్యం. నిజానికి, 2021 నాటి ఢిల్లీ మాస్టర్ ప్లాన్, అలాగే 2016 నాటి యూనిఫైడ్ బిల్డింగ్ బైలాస్ భవనాల సెల్లార్ల వినియోగంపై స్పష్టమైన నిబంధనలు విధించాయి. అయినా సరే బేస్మెంట్లలో కోచింగ్ కేంద్రాలు, వాటి లైబ్రరీలు, జిమ్‌లు, షాపులు నడుస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా అనేక ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో ఇలాంటి పొంచివున్న ప్రమాదాలు అనేకం. ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చని తెలిసినా, ఈ ఉల్లంఘనలపై అన్నిచోట్లా పాలకులది ఓ గుడ్డిదర్బారే! వాహనాల పార్కింగ్, స్టోర్ రూమ్ కోసం ఉద్దేశించిన సెల్లార్లను ఇలా చట్టవ్యతిరేకంగా స్టడీ సెంటర్లుగా వాడుతూ, వందల విద్యార్థుల్ని కూర్చోబెడుతున్న వైనం పట్ల చాలాకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయి. నెల క్రితం కూడా సాక్షాత్తూ ఓ విద్యార్థే ఈ సెల్లార్ల నియమోల్లంఘనపై ఢిల్లీ నగరపాలక సంస్థకు ఫిర్యాదు చేశారు. ‘‘పెను ప్రమాదం సంభవించవచ్చు’’ అని భవిష్యద్వాణిలా హెచ్చరించారు. అయినా పట్టించుకున్న నాథుడు లేడు. తక్కువ వసతులు, కనీస ఖర్చుతో ఎక్కువ సంపాదించాలన్న కోచింగ్ సెంటర్ల అత్యాశ తెలియనిది కాదు. సక్సెస్ రేటు, సెలక్టయిన వారి సంఖ్య లాంటి వివరాలు ప్రకటనల్లో ఇవ్వరాదని నిబంధనలున్నా, వాటినవి గాలికొదిలేస్తున్న వైనమూ నిత్యం చూస్తున్నదే. తప్పుడు గొప్పలు చెప్పుకొని ఆకర్షించే జిమ్మిక్కులూ తెలిసినవే. వందలాది విద్యార్థుల్ని ఒకే గదిలో కుక్కుతున్న వీటికి అడ్డూ ఆపూ లేదు. నియంత్రిత ఆర్థిక వ్యవస్థకు భిన్నమైన ఈ విద్యావ్యాపారపు మార్కెట్ ఎకానమీని అడ్డుకోలేకున్నా అమాయకుల ధన, ప్రాణాలకు నష్టం వాటిల్లకుండా నిబంధనలతో అదుపు చేయడం పాలకులు తలుచుకుంటే కష్టం కాదు. ఆ చిత్తశుద్ధి లేకనే సమస్య! తాజా ఘటన పార్లమెంట్లో చర్చ దాకా వెళ్ళడంతో నగరపాలక సంస్థ హడావిడిగా డజనుకు పైగా చట్టవిరుద్ధ కోచింగ్ సెంటర్లకు సీలు వేసింది. మరో అరడజను పేరున్న సంస్థల బేస్మెంట్లకు తాళాలు బిగించింది. స్థలాలను ఆక్రమించి, వరద నీటి కాల్వలపై అక్రమంగా కట్టిన నిర్మాణాలపై బుల్డోజర్ల ప్రయోగం మొదలుపెట్టింది. నిజానికిది నిరంతరం సాగాల్సిన ప్రక్రియ. మూడు విలువైన ప్రాణాలు పోయాక నడుం కట్టడమే విషాదం. కోచింగ్, దాని అనుబంధ వ్యాపారం కోట్లలో సాగుతూ, వేలాది విద్యార్థుల భవిష్యత్తు ముడిపడి ఉన్నా, కనీస రక్షణ, వసతులు ప్రభుత్వపరంగా కల్పించలేకపోవడం పాలకుల హ్రస్వదృష్టికి తార్కాణం. పైగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణ మంత్రాన్ని నిత్యం పఠిస్తూ, వికసిత భారత గాథను లిఖించాలని చూస్తున్న పాలకులకిది శోభనివ్వదు. సరైన పట్టణ ప్రణాళిక లేకుండా కాంక్రీట్ కీకారణ్యాల్ని ప్రోత్సహిస్తే ప్రయోజనమూ లేదు. ఢిల్లీ ఘటనలు పునరావృతం కాకముందే కేంద్రం, రాష్ట్రాలు నిద్ర లేవాలి. -
ఢిల్లీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఎంపీ భాన్సూరి