టీ స్టాల్‌ కోసం ఐఏఎస్ డ్రీమ్‌ను వదిలేశాడు: ఏకంగా ఏడాదికి రూ. 150 కోట్లు  | Anubhav Dubey success story whofailed in CA gave up IAS dream for Rs 150 crore teastall | Sakshi
Sakshi News home page

టీ స్టాల్‌ కోసం ఐఏఎస్ డ్రీమ్‌ను వదిలేశాడు: ఏకంగా ఏడాదికి రూ. 150 కోట్లు 

Published Mon, May 15 2023 1:23 PM | Last Updated on Mon, May 15 2023 1:51 PM

Anubhav Dubey success story whofailed in CA gave up IAS dream for Rs 150 crore teastall - Sakshi

భారతదేశంలో టీ లేదా చాయ్‌కున్న ఆదరణ అంతా ఇంతా కాదు. అంతేకాదు చాయ్‌ అమ్మి సక్సెస్‌ అయిన స్టోరీలు కూడా చాలా ఉన్నాయి. అయితే అనుభవ్‌ దూబే, ఆనంద్ విజయగాథ మాత్రం కాస్త డిఫరెంట్‌. ముఖ్యంగా 23 ఏళ్ల అనుభవ్‌ దూబే సీఏ పరీక్షలో ఫెయిలయ్యాడు.  వ్యాపారవేత్త కావాలనుకుని ఏఐఎస్‌ డ్రీమ్స్‌ను వదిలేసుకున్నాడు.  టీ  వ్యాపారిగా 150కోట్లు సంపాదిస్తున్నాడు. 

మధ్యప్రదేశ్‌,  రేవాకు చెందిన అనుభవ్ దూబే ఆనంద్ నాయక్ చిన్ననాటి స్నేహితులు. అనుభవ్ తండ్రి వ్యాపారవేత్త అయినప్పటికీ తన కొడుకును వ్యాపారిగా కాకుండా ఏఐఎస్‌ ఆఫీసర్‌ అధికారి కావాలని కోరుకున్నాడు. అప్పటికే సీఏ పరీక్షలో ఫెయిలైన కొడుకు అనుభవ్ దూబేని యూపీఎస్సీకి ప్రిపేర్ కావడాని ఢిల్లీకి పంపించాడు. తండ్రి కోరిక మేరకు అనుభవ్ పరీక్షకు సిద్ధమవుతున్నప్పటికీ ఎందుకో ఉద్యోగంలో తన లైఫ్‌ సెటిల్‌ కాదని వ్యాపారమే కరెక్ట్‌ అని డిసైడయ్యాడు.  ఫలితం కోట్ల విలువ చేసే కంపెనీ  చాయ్ సుత్తా బార్‌కు  కో ఫౌండర్‌గా మారిపోయాడు. కేవలం అయిదేళ్లలో 3 లక్షల నుండి 150 కోట్లకు ఎదిగాడు. 

2016లో స్నేహితుడు ఆనంద్ నాయక్‌తో  తన ప్లాన్‌గురించి చర్చించాడు. ఆలోచన బానే ఉందిగానీ ఇద్దరి దగ్గరా సరిపడా నిధులు లేవు.  కానీ వ్యాపారవేత్త  కావాలనుకున్న వాటి పట్టుదల ముందు అదిపెద్ద సమస్యగా తోచలేదు. ఎలాగోలా రూ. 3 లక్షలు సమకూర్చుకుని , తమ తొలి టీ అవుట్‌లెట్‌ను అమ్మాయిల హాస్టల్‌కు  ఎదురుగా షురూ చేశాడు.  తరువాతి కాలంలో వీరిద్దరితో  రాహుల్‌ కూడా జత కలిశాడు. (దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!)

అసలే లో-బడ్జెట్‌. ఇక మార్కెటింగ్, ఇంటీరియర్ డిజైన్, బ్రాండింగ్ వంటి వాటి డబ్బులు ఎలా వస్తాయని అనుభవ్‌,ఆనంద్ మదనపడ్డారు. అయినా ఎక్కడా వెనక్కి తగ్గలే. తోటి  స్నేహితుల దగ్గర అప్పు చేసి, సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్‌తో ఇండోర్‌లోని హాస్టల్‌కు ఆనుకుని తొలి అవుట్‌ లెట్‌ని డిజైన్  చేసుకున్నారు.అంతేకాదు ఆఖరికి  బ్యానర్‌ను ప్రింట్ చేయడానికి డబ్బు లేకపోవడంతో, ఒక చెక్క ముక్కను తీసుకుని, చేతితో "చాయ్ సుత్తా బార్" అని రాశారు.  ఈ టీ స్టాల్‌ పేరు, ఆలోచన, ఆశయం యువతను బాగా ఆకట్టుకున్నాయి.  (స్వీట్‌ కపుల్‌ సక్సెస్‌ స్టోరీ: తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు)

 ప్రస్తుతం అనుభవ్ ,ఆనంద్ దేశంలోని 195 నగరాల్లో చాయ్ సుత్తా బార్   450కిపైగా అవుట్‌లెట్‌లను ప్రారంభించారు. దుబాయ్, యుకె, కెనడా , ఒమన్ వంటి దేశాలతో సహా విదేశాలకు కూడా ఛాయ్ సుత్తా బార్ తన సత్తా  చాటుకుంటోంది. చాయ్ సుత్తా బార్ వార్షిక టర్నోవర్ దాదాపు రూ.150 కోట్లు. అనుభవ్ దూబే నికర విలువ దాదాపు 10 కోట్లు ఉంటుందని అంచనా.

మట్టి కప్పులు, 250 కుటుంబాలకు ఉపాధి
చాయ్ సుత్తాబార్‌లో మట్టి  కప్పులు, కుల్హాద్‌లు ప్రధాన ఆకర్షణ. దీనికి  250  కుటుంబాలకు ఉపాధి అవకాశాలను కల్పించారు.  మట్టి  పాత్రనే వాడుతూ తద్వారా వృత్తి నిపుణులైన కుమ్మరి కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారు. అలాగే ఇద్దరితో మొదలై చాయ్‌సుత్తా బార్‌లో​ ఇపుడు ఎంబీఏ చదివినవారు, ఇతర ఇంజనీర్లతో సహా ఈరోజు 150 మందికి పైగా పని చేస్తున్నారంటే వీరి వ్యాపార దక్షతను అర్థం చేసుకోవచ్చు.

ఇంకో విశేషం ఏమిటంటే
ఇక్కడి  సిబ్బంది  దాదాపు అందరూ వికలాంగులు లేదా ఆర్థికంగా పేద నేపథ్యం నుండి వచ్చినవారు కావడం విశేషం.  7 రకాల టీ,  పలు రకాల కాఫీలు,  ఫాస్ట్ ఫుడ్‌లను విక్రయిస్తారు. ఇక్కడ టీ  10 రూపాయలకే టీ లభిస్తుంది. 


అనుభవ్‌ కష్టాలు, జీవిత పాఠం 
2016: స్థానిక గూండాల దాడి
2017: నార్కోటిక్స్ దాడి
2020: కోవిడ్ హిట్; అవుట్‌లెట్లు మూసివేత
2020: వ్యాపారంలో నమ్మకద్రోహం చేసిన వ్యక్తి
2021: టైప్ 1 డయాబెటిస్‌ నిర్ధారణ 
19 ఏళ్ళపుడు సీఏ వదిలి  సివిల్ సర్వీసెస్‌కి 
21 ఏళ్ళ వయసులో యూపీఎస్‌సీకి గుడ్‌బై 
20వ దశకం ప్రారంభంలో ఏం చేయాలో తెలియని అయోమయం 
కట్‌ చేస్తే..  3 లక్షల నుండి 150 కోట్లకు రాకింగ్‌ స్టార్‌గా అనుభవ్‌ దుబే
‘‘మీ ప్రయత్నాన్ని వదలవద్దు.. విజయం మీ కోసం వేచి ఉంది! ఆపొద్దు ప్రయత్నిస్తూ ఉండు!’’ అంటారు అనుభవ్‌ దూబే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement