tea
-
రూ.25 వేలతో మూడేళ్లలో రూ.33 కోట్ల వ్యాపారం!
కాలేజీ డ్రాపవుట్ అయిన ఓ యువకుడు తన స్నేహితుడి సాయంతో రూ.25,000 పెట్టుబడితో వ్యాపారం సాగించి మూడేళ్లలో ఏకంగా రూ.33.61 కోట్ల వ్యాపారాన్ని విస్తరించాడు. అసలు కాలేజీ డ్రాపవుట్ అయ్యాక తాను ఏ బిజినెస్ ఎంచుకున్నాడు.. తన వ్యాపారాన్ని ఎలా విస్తరించాడో ఈ కథనంలో తెలుసుకుందాం.డారియన్ క్రెయిగ్(31) కొన్ని కారణాల వల్ల కాలేజ్ డ్రాపవుట్ అవ్వాల్సి వచ్చింది. ఇళ్లు గడవడం ఇబ్బందిగా ఉండడంతో చిన్న ఉద్యోగం చేరాడు. ఒకరోజు ఆఫీస్‌కు వచ్చిన క్రెయిగ్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు. తాను ఉద్యోగం కోల్పోయే నాటికి తన బ్యాంకు అకౌంట్లో కేవలం 7 డాలర్లు(రూ.600) ఉన్నాయి. తాను ఎలాగై జీవితంలో ఎదగాలని నిర్ణయించుకున్నాడు. డబ్బు సంపాదించాలనుకున్నాడు. అందుకోసం తన చిన్ననాటి స్నేహితుడు బ్రాండన్ ఎకోల్స్ సాయంతో 300 డాలర్లు(రూ.25,000) అప్పుచేసి వ్యాపారం మొదలు పెట్టాడు. ‘వైఆల్ స్వీట్ టీ’ పేరుతో టీ బిజినెస్ ప్రారంభించాడు. 2021లో మొదలుపెట్టిన ఈ వ్యాపారం అభివృద్ధి చెంది మూడేళ్లలో ఏటా రూ.33.61 కోట్ల ఆదాయం సమకూర్చే స్థాయికి ఎదిగింది.వెంచర్ క్యాపిటలిస్ట్‌ల నుంచి విశేష ఆదరణయునైటెడ్ స్టేట్స్లో కార్యకలాపాలు సాగించే ఈ సంస్థ ద్వారా నేరుగా వినియోగదారులకు తమ టీ ఉత్పత్తులను అందిస్తున్నారు. సుమారు 600 రిటైల్ అవుట్లెట్లతో వ్యాపారం సాగిస్తున్నారు. విభిన్న ఫ్లేవర్లలో టీను అందిస్తున్నారు. ఇటీవల క్రెయిగ్, ఎకోల్స్ తమ కంపెనీ విస్తరణకు వెంచర్ క్యాపిటలిస్ట్‌ల సాయం కోరగా విశేష ఆదరణ లభించిందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: రిలయన్స్ బ్రాండ్స్ ఎండీగా వైదొలిగిన మెహతాకష్టాలు సహజం.. సరైన నిర్ణయాలు ముఖ్యంఉద్యోగం రాలేదనో, డబ్బు లేదనో, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయనో చాలా మంది కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ క్రెయిన్, ఎకోల్స్లాగా జీవితంలో కష్టపడి ఎదుగుతున్నవారు కోట్లల్లో ఉన్నారు. కాబట్టి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు వాటిని సమర్థంగా ఎలా ఎదుర్కోవాలో ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
కర్నూలులో టీ షాప్ ప్రారంభించిన టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మనందం (ఫొటోలు)
-
ఇంటెల్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ సౌకర్యాలు మళ్లీ..
ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సిబ్బందికి ఉచితంగా కాఫీ, టీ వంటి పానీయాలు అందించే సౌకర్యాన్ని తిరిగి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. శ్రామికశక్తిని ఉత్తేజపరిచే ఈ నిర్ణయం అంతర్గత సందేశాల ద్వారా షేర్ చేసినట్లు తెలుస్తోంది.వ్యయ నియంత్రణ, నిర్వహణ సమస్యలతో సతమవుతున్న ఇంటెల్ దాదాపు ఏడాది తర్వాత తమ కార్యాలయ సంస్కృతిని మెరుగుపరచడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల రోజువారీ జీవితంలో చిన్న సౌకర్యాల ప్రాముఖ్యతను గుర్తిస్తున్నట్లు అంతర్గత సందేశంలో ఇంటెల్ పేర్కొంది."ఇంటెల్ ఇప్పటికీ ఖర్చు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, చిన్న సౌకర్యాలు మన దినచర్యలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని మేము అర్థం చేసుకున్నాము. ఇది ఒక చిన్న అడుగు అని మాకు తెలుసు, కానీ మన కార్యాలయ సంస్కృతికి మద్దతు ఇవ్వడంలో ఇది అర్ధవంతమైనదని మేము ఆశిస్తున్నాము." అని వివరించింది.ఫ్రీ ఫ్రూట్స్‌కు నోఉచిత పానీయాల సౌకర్యాన్ని తిరిగి ప్రారంభిస్తున్నప్పటికీ, ఒకప్పుడు ఉద్యోగులకు అందుబాటులో ఉన్న ఉచితంగా పండ్లు అందించే సౌలభ్యాన్ని మాత్రం కంపెనీ పునఃప్రారంభించడం లేదు. కంపెనీ నిరంతర వ్యయ-తగ్గింపు ప్రయత్నాలలో భాగంగా ఈ వసతిని మళ్లీ కల్పించేందుకు ఇంటెల్ సిద్ధపడలేదు. -
జనసేన ఎమ్మెల్యే దౌర్జన్యం.. సొంత పార్టీ కార్యకర్త టీ దుకాణం కూల్చివేత
సాక్షి, కాకినాడ: జిల్లాలో దారుణం జరిగింది. రూ.10 లక్షలు ఇవ్వలేదన్న అక్కసుతో జనసేన కార్యకర్త నిర్మించుకున్న టీ దుకాణాన్ని జనసేన ఎమ్మెల్యే కూల్చివేయించారు. సర్పవరం భావన నారాయణ స్వామి ఆలయం సమీపంలో మాధవపట్నంకు చెందిన ఆకుల బాలరాజు మూడు నెలల క్రితం టీ దుకాణాన్ని నిర్మించుకున్నారు.అయితే, బాలరాజు టీ దుకాణం వెనుక ఉన్న 2వేల గజాల స్థలాన్ని కొనాలంటూ కొద్ది రోజుల కిందట బాలరాజుతో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, సర్పవరం జనసేన నాయకులు మంతనాలు జరిపారు. స్థలం కొనకపోతే రూ.10 లక్షలు చెల్లించాలంటూ హుకుం జారీ చేశారు.డబ్బులు చెల్లించకపోవడంతో నోటీసులు ఇవ్వకుండానే ఇవాళ టీ దుకాణాన్ని పంచాయితీ అధికారులు కూల్చేశారు. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జనసేన నాయకులు ఆదేశాలతోనే తన దుకాణాన్ని కూల్చివేశారని బాధితుడు బాలరాజు ఆరోపిస్తున్నారు. టీ దుకాణం నిర్మించుకున్న స్ధలాన్ని (266 గజాలు) 2000 సంవత్సరంలో కొనుగోలు చేసినట్లు బాలరాజు చెబుతున్నారు.ఇదీ చదవండి: జనసేన ఎంపీ ఏకపక్ష ధోరణిపై టీడీపీలో అసంతృప్తి -
యంగ్ హీరోయిన్ సింప్లీసిటీ.. రోడ్డు పక్కన టీ తాగిన ముద్దుగుమ్మ!
తెలుగులో వరుస సినిమాలతో మెప్పించిన కన్నడ బ్యూటీ శ్రీలీల. గతేడాది భగవంత్ కేసరి, ఆదికేశవ, స్కంద సినిమాలతో మెప్పించింది. ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంది. ఈ ఏడాది గుంటూరు కారంతో అలరించిన ముద్దుగుమ్మ.. నితిన్ సరసన రాబిన్‌హుడ్ చిత్రంలో కనిపించనుంది. అంతేకాకుండా ఉస్తాద్ భగత్ సింగ్లోనూ నటిస్తోంది. వీటితో పాటు ఓ బాలీవుడ్ చిత్రానికి ఓకే చెప్పినా భామ.. ఇటీవల ఆ మూవీ నుంచి తప్పుకుంది.ప్రస్తుతం శ్రీలీల తన ఫ్యామిలీతో కలిసి వేకేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా తమిళనాడులో అరకులో ఫ్యామిలీతో కలిసి కనిపించింది. తన కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్లో కనిపించింది. సామాన్యురాలిగా టీ తాగుతూ సందడి చేసింది. ఆమెను గమనించిన స్థానికులు సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు శ్రీలీల క్రేజీ హీరోయిన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. #TFNExclusive: The charming beauty @sreeleela14 snapped along with her family as she enjoys a tea break at Araku!!☕😍#Sreeleela #UstaadBhagatSingh #Robinhood #TeluguFilmNagar pic.twitter.com/zNFABqBY3P— Telugu FilmNagar (@telugufilmnagar) October 27, 2024 -
HYD: బయట టీ తాగే వారు జాగ్రత్త.. నకిలీ టీ పౌడర్ ముఠా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: రోజులో ఒక్కసారైనా టీ తాగినిదే ఏం పని తోచదు చాలా మందికి. ఇంట్లోనే కాదు బయటకు వెళ్లినా సమాయనుసారం టీ చుక్కా నోట్లో పడాల్సిందే. కానీ షాపుల్లో, టీ కొట్టుల్లో ఎక్కువగా లూస్ టీపోడినే వాడుతుంటారు. ఇకపై బయట టీ తాగే సమయంలో చాయ్ లవర్లు కాస్తా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో నకిలీ టీ పొడి తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. నగరంలో టీ దుకాణాలకు తక్కువ ధరకు కల్తీ టీ పొడి సరఫరా చేస్తున్న ముఠాను ఆటకట్టించారు మధ్యమండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు. సనత్‌నగర్‌లోని ఓ కంపెనీపై దాడి చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. టన్నుల కొద్దీ నకిలీ టీపొడి స్వాధీనం చేసుకున్నారు.నాసిరకమైన టీ పొడిలో కొబ్బరి చిప్ప పొడి, రసాయనాలు, రంగులు, చాక్లెట్ ఫ్లేవర్ మిల్క్ పౌడర్ కలిపి కస్తే టీ పొడి తయారు చేస్తున్న ముఠాకు మధ్య మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. ముగ్గురు నిందితులను పట్టుకుని వారి నుంచి 300 పేజీల కల్తీ టీ పొడి, 200 కేజీల కొబ్బరి చిప్పల పొడి స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వైవీఎస్ సుదీంద్ర తెలిపారు. ఫతేనగర్‌కు చెందిన జగన్నాథ్ కోణార్క్ టీ పౌడర్ సేల్స్ ఆండ్ సప్లయర్స్ పేరుతో వ్యాపారం చేస్తున్నారు.తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కల్తీ టీ పొడి తయారీకి సిద్ధమ య్యాడు. మార్కెట్ నుంచి కేజీ రూ. 80 ఖరీదు చేసే టీ పొడి, రయనాలు, రంగులు, ఫ్లేవర్స్‌తో పాటు కొబ్బరి చిప్పల పొడి కొనేవాడు. దీన్ని తన దుకాణానికి తీసుకువెళ్లి తన వద్ద పని చేసే ప్రతాప్, పరాదాలకు ఇచ్చే వాడు. వీళ్లు వాటన్నింటినీ కలిపి కల్తీ టీ పొడి తయారు చేసి ప్యాక్ చేసే వారు. ఈ పొడిని కేజ్ రూ.250కి అమ్మే జగన్నాథ్ లాభాలు ఆర్థిస్తున్నాడు.ఈ టీ పొడిని ప్రతినిదులు ఎక్కువగా చిన్న చిన్న దుకాణదారులతో పాటు రోడ్డు వచ్చిన టీ బుధవారం స్టాల్స్ కు అమ్మేవాడు. వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న కార్యాలయ మధ్య మండల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎన్ రామకృష్ణ నేతృత్వంలో ఎస్సై డి.శ్రీకాంత్ గౌడ్ వలపన్ని ముగ్గురినీ పట్టుకున్నారు. నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న సరుకును సనత్‌నగర్ పోలీ సులకు అప్పగించారు. జగన్నాథ్‌పై ఇప్పటికే మోమిన్‌పేట్, సనత్ నగర్ ఠాణాల్లో మూడు అదే తరహా కేసులు ఉన్నాయని అయిన ప్పటికీ అతడు తన వంతా కొనసాగుస్తున్నాడని టీసీపీ తెలిపారు. కల్తీ పొడితో చేసిన టీ పొడి తాగడం వల్ల కేన్సర్, కామెర్లు సహా అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. -
ఈ ‘టీ’తో నష్టాలే!
సాక్షి, హైదరాబాద్: నాసిరకమైన టీ పొడిలో కొబ్బరి చిప్ప పొడి, రసాయనాలు, రంగులు, చాక్లెట్ ఫ్లేవర్, మిల్క్ పౌడర్ కలిపి కల్తీ టీ పొడి తయారు చేస్తున్న ముఠాకు మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. ముగ్గురు నిందితులను పట్టుకుని వారి నుంచి 300 కేజీల కల్తీ టీ పొడి, 200 కేజీల కొబ్బరి చిప్పల పొడి స్వా«దీనం చేసుకున్నట్లు డీసీపీ వైవీఎస్ సుదీంద్ర బుధవారం తెలిపారు. ఫతేనగర్‌కు చెందిన జగన్నాథ్ కోణార్క్ టీ పౌడర్ సేల్స్ అండ్ సప్లయర్స్ పేరుతో వ్యాపారం చేస్తున్నాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కల్తీ టీ పొడి తయారీకి సిద్ధమయ్యాడు. మార్కెట్ నుంచి కేజీ రూ.80 ఖరీదు చేసే టీ పొడి, రసాయనాలు, రంగులు, ఫ్లేవర్స్‌తో పాటు కొబ్బరి చిప్పల పొడి కొనేవాడు. దీన్ని తన దుకాణానికి తీసుకువెళ్లి తన వద్ద పని చేసే ప్రతాప్, పరాదాలకు ఇచ్చే వాడు. వీళ్లు వాటన్నింటినీ కలిపి కల్తీ టీ పొడి తయారు చేసి ప్యాక్ చేసే వారు. ఈ పొడిని కేజీ రూ.250కి అమ్మే జగన్నాథ్ లాభాలు ఆర్జిస్తున్నాడు. ఈ టీ పొడిని ఎక్కువగా చిన్న చిన్న దుకాణదారులతో పాటు రోడ్డు పక్కన టీ స్టాల్స్‌కు అమ్మేవాడు. వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎన్.రామకృష్ణ నేతృత్వంలో ఎస్సై డి.శ్రీకాంత్ గౌడ్ వలపన్ని ముగ్గురినీ పట్టుకున్నారు. నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న సరుకును సనత్‌నగర్ పోలీసులకు అప్పగించారు. జగన్నాథ్‌పై ఇప్పటికే మోమిన్‌పేట్, సనత్‌నగర్ ఠాణాల్లో మూడు ఇదే తరహా కేసులు ఉన్నాయని, అయినప్పటికీ అతడు తన పంథా కొనసాగస్తున్నాడని డీసీపీ తెలిపారు. కల్తీ పొడితో చేసిన టీ తాగడం వల్ల కేన్సర్, కామెర్లు సహా అనేక వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. -
'టీ'లో బిస్కెట్స్ ముంచుకుని తింటున్నారా..?
మనం కొన్ని రకాల ఆహార పదార్థాలని పలు కాంబినేషన్స్‌లో తింటుంటాం. అయితే ఇలా తినడం అన్ని రకాల ఆహార పదార్థాలకు మంచిది కాదు. ఒక్కోసారి ఇలా తినడం వల్ల లేనిపోని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కూడా. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. చాలామందికి విరామ సమయంలో 'టీ' తాగే అలవాటు ఉంటుంది. దీంతోపాటు బిస్కెట్లు తీసుకుంటుంటారు. ఇలా 'టీ'లో బిస్కెట్లు ఇముంచుకుని తినడం అలవాటు లేదా ఇష్టంగా ఉంటుంది కొందరికి. ముఖ్యంగా సాయంత్రం సమయాల్లో స్నాక్స్‌గా ఇలా తింటుంటారు కూడా. అయితే ఇది అస్సలు మంచిది కాదని హెచ్చరిస్తున్నారు పోషకాహార నిపుణులు ఎందుకంటే..మనం ఇలా చాయ్‌లో బిస్కెట్లు ముంచుకుని తినడం వల్ల అధిక షుగర్ కంటెంట్ శరీరానికి చేరే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అందులోనూ ఈ బిస్కెట్లు ప్యాక్ చేయబడి ఉంటాయి. వీటిని శుద్ధి చేసిన మైదాపిండి, చక్కెరలతో తయారు చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇలా తింటామో రక్తంలో చక్కెర స్థాయిలు అనూహ్యంగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఫలితంగా శరీరంలో వాపు, హార్మోన్ల అసమతుల్యత, బరువు పెరగడం, ఇన్సులిన్ నిరోధకత తదితర ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశాలు ఎక్కువ అని చెబుతున్నారు.అంతేగాదు ఇది గట్ మైక్రోబయోమ్‌కు అంతరాయం కలిగిస్తుంది. పైగా మనం ఇలా తెలయకుండానే అధిక మొత్తంలో మైదా తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇది కాస్తా అధిక బరువుకి, జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. అలాగే అనేక ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలలో పామ్ ఆయిల్ ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ బిస్కెట్లు కూడా ప్రాసెస్ చేసిన ఆహారపదార్థాల్లోకే వస్తాయి. ఇందులో ఉపయోగించే పామాయిల్ గుండె సంబంధిత సమ్యలకు దారితీసే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు పోషకాహార నిపుణులు. దీనికి బదులు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయ హెర్బల్ టీలను వినయోగించడం మంచిదని సూచిస్తున్నారు. అవేంటంటే..హార్మోన్ బ్యాలెన్స్ 'టీ'లు..కొత్తిమీర సీడ్స్‌తో చేసే 'టీ' అదేనండి ధనియాలతో చేసే టీ. ఇది హైపోధైరాయిడజంతో సమర్థవంతంగా పోరాడుతుంది. మేతి సీడ్స్ 'టీ' మధుమేహం ఉన్నవారికి మంచిది. ఫెన్నెల్ అజ్వెన్ 'టీ' జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కరివేపాకు 'టీ' జుట్టు పెరుగుదలకు ప్రయోజనకారిగా ఉంటుంది. ఈ హెర్బల్ 'టీ'లు హార్మోన్ల సముతుల్యత తోపాటు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: అలాంటి పెర్ఫ్యూమ్స్ కొంటున్నారా..? నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్!) -
రెండు 'టీ' లకు మించొద్దు..! లేదంటే ఆ సమస్య తప్పదు..!
రోజూ రెండు కప్పుల టీ, మరో రెండు కప్పుల కాఫీ తాగేవారిలో మతిమరపు సమస్య అంత తేలిగ్గా రాదని అంటున్నారు చైనా పరిశోధకులు. టీ, కాఫీలను చాలా పరిమితంగా అంటే రోజూ రెండు కప్పులకు మించకుండా తాగేవారిలో కేవలం మతిమరపు (డిమెన్షియా) నివారితం కావడమే కాదు... పక్షవాతం వచ్చే అవకాశాలూ తక్కువే అంటున్నారు ఈ పరిశోధన నిర్వహించిన పరిశోధకులు. టీ కాఫీలు తాగని వారితో పోల్చినప్పుడు... రోజూ రెండు కప్పుల చొప్పున టీ, కాఫీ తాగేవారిలో మతిమరపు రావడమన్నది దాదాపు 28 శాతం తక్కువని పేర్కొంటున్నారు చైనాకు చెందిన టియాంజిన్ మెడికల్ యూనివర్సిటీ అధ్యయనవేత్తలు డాక్టర్ యువాన్ ఝాంగ్, ఆయన బృందం. దాదాపు 5,00,000 మందిపై పదేళ్ల పాటు వారు బ్రిటన్‌లో సుదీర్ఘ పరిశోధన చేశారు. కాఫీ, టీల మీద ఇలా పరిశోధనలు జరగడం మొదటిసారి కాదు. గతంలోనూ జరిగాయి. ఈ ఫలితాల మీద కొన్ని భిన్నాభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. రీడింగ్ యూనివర్సిటీకి చెందిన ప్రయుఖ న్యూట్రిషనల్ సైన్సెస్ నిపుణురాలు డాక్టర్ కార్లోట్ మిల్స్ మాట్లాడుతూ... ‘‘మతిమరపు నివారణకు కేవలం కాఫీ, టీలు మాత్రమే కారణం కాకపోవచ్చు. ఇతర అంశాలూ కారణమయ్యే అవకాశాలూ లేక΄ోలేద’’న్న అభి్ప్రాయం వ్యక్తం చేశారు. ఇంకొందరు అధ్యయనవేత్తలు సైతం ఈ పరిశోధనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాఫీ, టీలలో మెదడు, నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచే పదార్థాలుంటాయి. వాటిని పరిమితికి మించి తీసుకుంటే కలిగే ప్రమాదాల గురించి వారు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు గతంలో ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో రోజుకు ఆరు కప్పులకు మించి కాఫీ/టీ తాగేవారిలో 53% మందికి డిమెన్షియా వస్తుందని తెలిసిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. అందుకే ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ‘‘కేవలం రెండే’’ అన్న పరిమితికి గట్టిగా కట్టుబడి ఉండాలంటున్నారు. ఈ పరిశోధన పలితాలు ప్రముఖ మెడికల్ జర్నల్ ప్లాలస్ మెడిసిన్’ (PLos Medicine)లో ప్రచురితమయ్యాయి.(చదవండి: కిస్మిస్ని నీళ్లల్లో నానబెట్టే ఎందుకు తినాలో తెలుసా..!) -
గుళికల ప్యాకెట్‌ను తెచ్చిన కోతి.. టీ పొడి అనుకుని..
రాజానగరం: ఓ కోతి చేసిన పనికి వృద్ధ దంపతులు కన్నుమూశారు. రాజానగరం మండలంలోని పల్లకడియం గ్రామానికి చెందిన వెలుచూరి గోవిందు (75), అప్పాయమ్మ (70) దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కుమారుడు తన పిల్లల చదువు కోసం కుటుంబంతో సహా రాజమహేంద్రవరంలో ఉంటున్నారు. ముగ్గురు కుమార్తెలకు వివాహాలు చేశారు. గోవిందు, అప్పాయమ్మ మాత్రమే తమ ఇంట్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం గోవిందు, అప్పాయమ్మల ఇంటి నుంచి ఒక టీ పొడి ప్యాకెట్‌ను కోతి ఎత్తుకుపోయింది. మరుసటి రోజు శుక్రవారం ఉదయం వేరొక ఇంటి నుంచి పంటలకు ఉపయోగించే విష గుళికల మందు ప్యాకెట్‌ను తీసుకువచ్చి వీరి ఇంటి పెరటిలో పడేసింది. కళ్లు సరిగా కనిపించని అప్పాయమ్మ పెరటిలో పడి ఉన్న ప్యాకెట్‌ను తన ఇంటి నుంచి కోతి తీసుకువెళ్లిందేనని భావించి దానితో టీ పెట్టింది. ఆ టీని తన భర్తకు ఇచ్చి, తాను కూడా తాగింది. కొద్దిసేపటికే వారిద్దరూ నోటి నుంచి నరుగులు కక్కుతూ పడిపోయారు. ఇరుగు పొరుగువారు చూసి హుటాహుటిన రాజమహేంద్రవరం ఆస్పత్రికి తీసుకువెళ్లగా, అప్పటికే మరణించారు. ఈ మేరకు రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు శనివారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
"నెయ్యి టీ"నా..! ఎన్ని లాభాలో తెలుసా?
గ్రీన్ టీ, బ్లాక్ టీ, నిమ్మ టీ వంటి ఎన్నో రకాల చాయ్‌లు గురించి విన్నాం. కానీ ఇదేంటి 'నెయ్యి టీ' అని అనుకోకుండి. ఎందుకంటే పోషకాహార నిపుణులు వారంలో కనీసం రెండుసార్లు ఈ టీని తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతున్నారు. మన దైనందిన జీవితంలో దీన్ని భాగం చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చని చెబుతున్నారు. అదెలాగో సవివరంగా చూద్దాం..'నెయ్యి టీ' అనేది కొత్తగా వచ్చిన వంటకం ఏం కాదు. శతాబ్దాలుగా ఆయుర్వేదంలో దీన్ని ఉపయోగించేవారని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు చరక సంహితలో రోజువారీ వినియోగానికి అవసరమైన 11 ప్రధాన ఆహారాలలో దీన్ని ఒకటిగా చెప్పారు ఆయుర్వేద నిపుణులు. దీన్ని సాధారణ టీ మాదిరిగానే చేసుకుంటారు. అయితే చివర్లో ఓ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే అదే నెయ్యి టీ. ఇది తాగేందుకు టేస్టీగానే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందట. అదెలా అంటే..?తక్షణ ఎనర్జీని పొందిన ఫీల్ లభిస్తుందట. అందువల్ల చిరుతిండులు తినాలనే కోరికన నివారించడమే కాకుండా ఎక్కువసేపు శక్తిమంతంగా ఉండొచ్చు.ఇది అధిక కేలరీలను కలిగి ఉంటుంది. ఎక్కువ శ్రమ లేకుండా శీఘ్ర శక్తిని పొందడంలో సహాయపడుతుంది.మలబద్ధకం, జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. నెయ్యిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్ జీర్ణక్రియను సులభతరం చేస్తుందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.ప్రకాశవంతంమైన చర్మాన్ని పొందొచ్చట. క్రమం తప్పకుండా తాగితే చర్మానికి మంచి పోషణను అందిస్తుందట. ఇందులో ఉండే విటమిన్లు, ఏ, డీ, ఈ, కేలు చర్మాన్ని హైడ్రేట్ చేసి, పునరుజ్జీవింప చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. బ్లడ్ షుగర్‌కి చెక్ పెడుతుంది.అయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారు ఈ పానీయాన్ని కనీసం వారానికి రెండుసార్లు అయినా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో తీసుకోవడం మంచిదని అన్నారు. ముఖ్యంగా వ్యాయమాలు చేసేవాళ్లకు ఈ టీ మరింత మంచిదని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. (చదవండి: రెడ్‌లైట్ థెరపీ అంటే ఏంటీ..? నటి సమంత బ్యూటీ సీక్రెట్ ఇదే..!) -
నయన తార మెచ్చిన హైబిస్కస్ టీ : ఎన్ని మ్యాజిక్కులో
మన భారతదేశంలో మందార మొక్కకు ఉన్న ప్రాముఖ్యత చాలా పెద్దదే. మందార ఆకులు, పువ్వులు, పువ్వుల నుంచి తీసిన తైలం సౌందర్య ఉత్పత్తుల్లో అనాదిగా వాడుకలో ఉన్నవే. ముఖ్యంగా ఆయుర్వేదంలో చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. ఈ వర్షాకాలంలో ఈ మందార టీ తాగడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటోంది స్టార్ హీరోయన్ నయనతార.మందార పువ్వుల టీ, లేదా హైబిస్కస్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి .మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు , గుండె సంబంధిత వ్యాధులు,తదితర సమస్యలకు చక్కగా పనిచేస్తోంది. బాడీకి చల్లదనాన్ని ఇస్తుంది. మొటిమలు, చర్మంపై వేడి కురుపులు రాకుండా కాపాడుతుంది. అలాగే హైబిస్కస్ టీ వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని కాపాడుతుంది. సీజనల్ ఇన్ఫెక్షన్/అనారోగ్యం నుండి రక్షించే యాంటీ బాక్టీరియల్ ప్రభావాలను కలిగి ఉంటుంది. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) రోజూ మందార టీ తాగడం సురక్షితమేనా? అంటే నిక్షేపంలా తాగవచ్చు (మితంగా) మందారతో దాదాపు ఎలాంటి అలెర్జీలు ఉండవు. మందార టీ దేనికి మంచిది? మందార టీ వల్ల కలిగే అనేక ప్రయోజనాలను వివరంగా పరిశీలిద్దాం. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.హైపోలిపిడెమిక్ లక్షణాల వల్ల మధుమేహం వంటి బ్లడ్ షుగర్ డిజార్డర్స్‌తో బాధపడేవారికి అద్భుతాలు చేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి , రక్త నాళాలు దెబ్బతినకుండా కాపాడటానికి దోహదం చేస్తుంది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు మన శరీర కణజాలం, కణాలలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటం ద్వారా ఈ వ్యాధుల నుండి కాపాడుతుంది. మెరిసే చర్మం కోసం మందార టీ చర్మానికి కూడా మేలు చేస్తుంది. హైబిస్కస్ టీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇంకా మైరిసెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది, ఇది కొల్లాజెన్ విచ్ఛిన్నతను తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా చర్మం వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది కాబట్టి చర్మం మెరుపును కాపాడుతుంది.ఆరోగ్యకరమైన జుట్టుమందార టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మెలనిన్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. జుట్టుకు సహజమైన రంగును అందించి పట్టుకుచ్చులా మెరిసేలా చేస్తుంది. జుట్టు తొందరగా తెల్లగా కావడాన్ని అడ్డుకుంటుంది. ఈ టీలో ఉన్న అమైనో ఆమ్లాలు మీ శరీరంలో ఎక్కువ ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. ఇది కుదుళ్లు గట్టి జుట్టు ఒత్తుగా, షైనీ ఉంచేందుకు మ్యాజిక్‌లా పనిచేస్తుంది.ఇంకా రక్తపోటు నియంత్రణలోనూ మెరుగ్గా పనిచేస్తుంది. ఇందులోని ఆస్కార్బిక్ యాసిడ్ (విటమిన్ సి) సమృద్ధిగా ఉండటం వల్ల, రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలకు కూడా ప్రసిద్ది చెందింది, ఇది సాధారణ అనారోగ్యాలను అరికట్టడంలో సహాయపడుతుంది ప్రేగు కదలికలను క్రమబద్ధీకరించి జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకం చికిత్సలోనూ పనిచేస్తుంది.మందార పూల టీ తయారీఎండ బెట్టిన మందార పూలను నీటిలో వేసి కొద్ది సేపు మరిగించాలి.దీంట్లో ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను కూడా వేసి మరికొద్దిసేపు మరిగించాలి. చక్కటి రంగు వచ్చిన తరువాత ఒక కప్పులోకి ఈ మిశ్రమాన్ని వడబోసుకోవాలి. రుచికోసం ఇందులో తేనె కూడా కలుపుకోవచ్చు. ఇంకా నిమ్మ, పుదీనాతో గార్నిష్ చేసుకొని చల్లగాగానీ, వేడిగా గానీ తాగవచ్చు. రెండు రోజులు ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు. -
హెల్దీ తిండి.. కొత్త ట్రెండీ
వీలైతే నాలుగు రకాల స్నాక్స్.. కుదిరితే కప్పు కాఫీ.. సాయంత్రమైతే చాలు. విశాఖ వాసి మదిలో మెదిలో మొదటి ఆలోచన ఇదే. చిరుతిండి.. మన జీవితాల్లో భాగమైపోయింది. టీ తాగుతూ స్నాక్స్.. సాయంత్రం సరదాగా స్నాక్స్.. ఇంటికి చుట్టాలొస్తే స్నాక్స్.. చినుకుపడినా.. సమయమేదైనా.. స్నాక్స్ తిందాం మిత్రమా అన్నట్లుగా చిరుతిళ్లపై మనసు మళ్లిస్తున్నారు. అయితే.. ఈ మధ్య కాలంలో చిరుతిళ్లలోనూ ఆరోగ్యాన్ని వెదుకుతున్నారు. విశాఖ సహా 30 నగరాల్లో స్నాక్స్ విక్రయాలు, ప్రజల ఇష్టాయిష్టాలపై ప్రముఖ స్నాక్స్ తయారీ సంస్థ ఫార్మ్‌లే విడుదల చేసిన ది హెల్దీ స్నాకింగ్–2024 నివేదిక పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. చిరుతిళ్లలో పోషకాల స్నాక్స్ వేరయా.. అవే మాకు ఇష్టమయా అంటూ 73 శాతం మంది చూసి మరీ తింటున్నారంట. మార్కెట్లోకి బెస్ట్ స్నాక్స్ ఏమొచ్చాయో అని ప్రతి 10 మందిలో తొమ్మిది మంది వెతుకుతున్నారని నివేదిక చెబుతోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చిరుతిళ్లకు గిరాకీ పెరుగుతోంది. టీ, కాఫీ తాగుతున్నప్పుడు వేడి వేడి సమోసా లేదంటే.. బిస్కెట్లు ఉండాల్సిందే. లంచ్, డిన్నర్‌కి మధ్య స్నాక్స్ టైమ్ ఫిక్సయిపోయింది. అందుకే భారతీయులకు చిరుతిండి ఇష్టంగా మారిపోయింది. అయితే ఇటీవల ఆహార పదార్థాల కల్తీపై ఆందోళనల నేపథ్యంలో.. స్నాక్స్ ఎంపికలోనూ జాగ్రత్త పడుతున్నారు. భారతీయులు ఎలాంటి స్నాక్స్ ఇష్టపడుతున్నారనే వివరాలను తెలుసుకునేందుకు ఫార్మ్‌లే దేశవ్యాప్తంగా 30 నగరాల్లో సర్వే చేసింది.ఈ వివరాలతో ది హెల్దీ స్నాకింగ్–2024 అనే నివేదికను విడుదల చేసింది. నగరంలోనూ సర్వే నిర్వహించగా.. ఆకలేస్తే పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లి రెండు బంగాళాదుంప చిప్స్ ప్యాకెట్లు లేదా బేకరీకి వెళ్లి సమోసా తినే రోజులు పోయాయని విశాఖ వాసులు చెప్పారంట.! కొనేది చిన్న ప్యాకెట్ అయినా.. అందులో ఏం ఇంగ్రిడియంట్స్ ఉన్నాయి? వాటిలో పోషకాల విలువెంత? అవి తింటే వచ్చే అనర్థాలేమైనా ఉన్నాయా? ఇలా ప్రతి విషయంలోనూ మిస్టర్ పర్ఫెక్ట్లమని తెగేసి చెబుతున్నారు. మార్కెట్ ట్రెండ్.. మారిపోయిందండోయ్.. ప్రస్తుతం ఫుడ్ ప్యాకేజీ మార్కెట్‌ని స్నాక్స్ సంస్థలే శాసిస్తున్నాయి. దేశవ్యాప్తంగా రూ.3.75 ట్రిలియన్ల ఫుడ్ ప్యాకేజీ ఇండస్ట్రీ ఉండగా.. ఇందులో 33.4 శాతం వరకూ స్నాక్స్, స్వీట్స్ పరిశ్రమలు ఆక్రమించేసుకున్నాయి. ఆరోగ్యకరమైన స్నాక్స్‌ని ఇష్టపడుతున్నారని తెలిసి.. వాటి తయారీ పైనే ఆసక్తి చూపిస్తున్నాయి. శరీరంలో తక్కువ కొవ్వు ఉత్పత్తి చేసే పాపింగ్, బేకింగ్, ఎయిర్ఫ్రైయింగ్, వాక్యూమ్ ఫ్రైయింగ్ మొదలైన ప్రాసెస్ విధానంలో తయారు చేసే స్నాక్స్ ఎక్కువగా మార్కెట్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డీప్ ఫ్రై చేసిన స్నాక్స్‌తో పోలిస్తే 75 శాతం కేలరీలను తగ్గిస్తాయనే ఉద్దేశంతో ఎయిర్ ఫ్రయర్ స్నాక్స్‌కే మొగ్గు చూపుతున్నారు.బ్రాండెడ్ స్నాక్స్ కావాలి ఒకప్పుడు స్నాక్స్ ప్యాకెట్ తీసుకుంటే కేవలం ఎక్స్పైరీ డేట్ మాత్రమే చూసేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. స్నాక్స్ కొనుగోలు చేసినప్పుడు ఫస్ట్ అవి బ్రాండెడ్ సంస్థలు తయారు చేస్తున్నాయా లేదా అని చూస్తున్నారు. అంతేకాదండోయ్.. ప్రతి 100 మందిలో 73 మంది మాత్రం అందులో పోషకాలు ఏం ఉన్నాయి.? సోడియం కంటెంట్ ఎంత ఉంది.? అవి తినడం వల్ల కొవ్వు శరీరంలో పెరుగుతుందా లేదా.? ఆరోగ్యానికి హానికరమైన ముడిపదార్థాలేమైనా ఉన్నాయా అనేది కచ్చితంగా చెక్ చేస్తున్నారు.మిల్లెట్ల వైపు దృష్టి.. ఇప్పుడిప్పుడే స్నాక్స్ ప్లేస్‌లో మిల్లెట్స్ వినియోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. సాయంత్రం సమయంలో బిస్కెట్, సమోసా, బజ్జీ, ఆలూ చిప్స్ మొదలైన వాటి స్థానాలను బాదం, పిస్తా, ఖర్జూరం, జీడిపప్పు, తృణధాన్యాలు, మొలకలు ఆక్రమించేస్తున్నాయి. కొన్ని సంస్థలు ఈ మిల్లెట్స్‌ను ప్యాకేజింగ్ ఫుడ్‌గా మార్చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. 2025 నాటికి మిల్లెట్ స్నాక్స్ 20 శాతానికి చేరుతాయని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది.స్నాక్స్ ప్లేస్‌ను పప్పుగింజలు ఆక్రమించుకుంటున్నాయి ఒకప్పుడు ఇంట్లో స్నాక్స్ తయారు చేసి.. వాటినే తినేవారు. ఇప్పుడు కాలం మారిపోయింది. ప్యాకేజ్డ్ స్నాక్స్ రావడంతో వాటిపైనే మొగ్గు చూపుతున్నారు. ఇవి ఆరోగ్యానికి హానికరమని తెలుసుకున్నారు. దీంతో స్నాక్స్ స్థానాన్ని పప్పుగింజలు ఆక్రమించేసుకున్నాయి. ముఖ్యంగా బాదం, పిస్తా వంటివాటికే ఓటేస్తున్నారు. ప్రోటీన్, కాంప్లెక్స్, కార్బొహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు తగినంతగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. యాంటీఆక్సిడెంట్, విటమిన్ ఈ వంటివి ఉండే బాదంను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. తృణధాన్యాలు, పప్పుగింజలు పోషకాలు అవసరమైన విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి. అందుకే చిరుతిళ్లలో పప్పుగింజలు తీసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. – షీలా కృష్ణస్వామి, పోషకాహార నిపుణురాలు -
రకుల్ ప్రీత్ ‘ఫెన్నెల్ టీ’ పోస్ట్ వైరల్, దీని లాభాలేంటో తెలుసా?
అందానికి, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చేనటి రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రమంగా జిమ్ చేస్తూ, బలవర్ధక ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చే రకుల్ ప్రీత్ తాజాగా ఒకటీ గురించి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అసలు ఏంటీ ఫెన్నెల్ టీ, దీని ప్రయోజనాలేంటి అనేది హాట్ టాపిక్‌గా మారింది. మరి ఫెన్నెల్ టీతో కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందామా?ఫెన్నెల్ టీ అంటే సోంపు గింజలతో తయారు చేసే టీ. దీన్నే ఫెన్నెల్ సీడ్స్ వాటర్, లేదా ఫెన్నెల్-ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అని కూడా పిలుస్తారు. ప్రతిరోజూ ఉదయం ఈ సోంపు గింజల నీళ్లను తీసుకోవడం ద్వారా అనేక అరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. సోపు గింజలను నీటిలో వేసి కాచడం ద్వారా ఫెన్నెల్ టీని తయారు చేస్తారు. దీని రుచి చిరు చేదుగా, చక్కటి సువాసనతో ఉంటుంది. శతాబ్దాలుగా దీన్ని ఔషధంగా ఉపయోగిస్తున్నారు.ఫెన్నెల్ టీ ఎలా తయారు చేయాలిఒక టేబుల్ స్పూన్ ఫుల్ ఫెన్నెల్ గింజలను తీసుకుని వాటిని రెండు కప్పుల నీటిలో మరిగించాలి. ఆ నీటిని వడకట్టి చల్లబడిన తరువాత గానీ, వేడి వేడిగా కానీ సేవించవచ్చు ఉదయం ఖాళీ కడుపుతో ఫెన్నెల్ టీ తాగితే మంచి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఫెన్నెల్ టీ లాభాలుసోంపు గింజలలో ఉండే విటమిన్ సీ ఐరన్, ఖనిజాలు నిరోధక వ్యవస్థకు తోడ్పడతాయి. సోంపు గింజల నీటిని తీసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాల నుంచి రక్షణ అందిస్తుంది. ఫెన్నెల్ టీ వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. సోంపు గింజలలో అనెథోల్ వంటి నూనెలు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. జీర్ణక్రియలో సాయపడతాయి. సోంపు గింజలలో కార్మినేటివ్ గుణాలు ప్రేగు కదలికలను మెరుగు పరుస్తాయి. జీర్ణశయాంతర ప్రేగులలోని కండరాలను ప్రేరేపించి, గ్యాస్, ఉబ్బరాన్ని తగ్గించడంలో సాయపడతాయి. తద్వారా మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే అజీర్ణం, గుండెల్లో మంటకు ఉపశమనం లభిస్తుంది. మధుమేహులకు లేదా డయాబెటిస్ రిస్క్ ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరం. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. సోంపు గింజల వాటర్ తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. బరువు తగ్గడంలో సాయపడుతుంది. వయస్సు-సంబంధిత మచ్చలు తగ్గుతాయి. కంటి సమస్యల నుంచి కూడా రక్షణ పొందవచ్చు.సోంపు గింజలలో పొటాషియం ఉంటుంది. సోంపు గింజలలోని ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సాయ పడుతుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. ఫెన్నెల్ టీ పీరియడ్స్ క్రాంప్ల నుండి ఉపశమనం పొందడంలో సహాయ పడుతుంది. ఋతు చక్రాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. కండరాలకు శాంతి కలుగుతుంది. దీంతో ప్రశాంతమైన నిద్ర పడుతుంది. -
భార్యతో టీ తాగుతూ.. మనీష్ సిసోడియా భావోద్వేగ సెల్ఫీ
న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో అరెస్టయి పదిహేడు నెలల తర్వాత తీహార్ జైలు నుంచి విడుదలైన మనీష్ సిసోడియా ఇంటి జీవితాన్ని ఆస్వాదించడం ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి విడుదలైన సిసోడియా శనివారం(ఆగస్టు10) ఉదయం ఇంట్లో తన భార్యతో కలిసి టీ తాగుతూ తీసుకున్న సెల్ఫీ చిత్రాన్ని ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. आज़ादी की सुबह की पहली चाय….. 17 महीने बाद!वह आज़ादी जो संविधान ने हम सब भारतीयों को जीने के अधिकार की गारंटी के रूप में दी है।वह आज़ादी जो ईश्वर ने हमें सबके साथ खुली हवा में साँस लेने के लिए दी है। pic.twitter.com/rPxmlI0SWF— Manish Sisodia (@msisodia) August 10, 2024ఈ సందర్భంగా ‘17 నెలల తర్వాత.. ఫస్ట్ మార్నింగ్ టీ ఆఫ్ ఫ్రీడమ్. భారతీయులందరికీ రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కు నుంచి వచ్చిందే ఈ స్వేచ్ఛ’అని తన ట్వీట్‌కు సిసోడియా భావోద్వేగపూరిత కామెంట్స్ జత చేశారు. గత ఏడాది ఫిబ్రవరిలో లిక్కర్‌స్కామ్ కేసులో అరెస్టయిన సిసోడియాకు శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన 17 నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. -
వాడేసిన టీ పొడితో అందాన్ని పెంచుకోవచ్చు! ఎలాగో తెలుసా..!
టీ తయారు చేశాక సాధారణంగా టీ పొడిని వడకట్టి బయటపడేస్తారు. అలాగే టీ బ్యాగులను కూడా పడేస్తారు. అందులో మిగిలిన టీ పొడితో అందాన్ని పెంచుకోవడమే కాదు, ఇంటిని మెరిపించుకోవచ్చు. చాలామందికి టీతోనే రోజు ప్రారంభమవుతుంది. చెప్పాలంటే.. దాదాపు ప్రతి ఇంట్లో ఉదయం, సాయంత్రం టీ తాగాల్సిందే. టీ తయారు చేసిన తర్వాత, టీ పొడి మిగిలిపోతుంది. దీనిని తరచూ చెత్తగా భావించి చెత్తబుట్టలో వేస్తాం. ఈ పనికిరాని టీ పొడితో ఇంటి శుభ్రతను నుంచి అందం వరకు పలు రకాలుగా ఉపయోగించొచ్చు. అదెలాగో సవివరంగా చూద్దాం. !అద్దాలు శుభ్రం చేసేందుకు..టీ పొడితో ఇంటి అద్దాలను పాలిష్ చేయవచ్చు. దీని కోసం, మిగిలిన టీ ఆకులను నీటిలో మరిగించండి. ఈ నీటిని స్ప్రే బాటిల్ లో నింపి దాని సహాయంతో అద్దాలను శుభ్రం చేస్తే అద్దాలు తళతళ ప్రకాశిస్తాయి. దీనితో పాటు, గ్యాస్ బర్నర్లు ఎంత నల్లగా మారినా, మీరు వాటిని నిమిషాల్లో శుభ్రం చేయవచ్చు. టీ నీటిలో కొద్దిగా డిష్ వాష్ మిక్స్ చేసి బ్రష్ సహాయంతో క్లిన్ చేస్తే గ్యాస్ బర్నర్లను తళతళ మెరిసిపోతాయి..పాదాల దుర్వాసనరోజంతా బూట్లు ధరించడం వల్ల పాదాల్లో తరచూ దుర్వాసన వస్తుంటుంది. అలాంటప్పుడు మిగిలిపోయిన టీ పొడిని నీటిలో బాగా మరిగించి చల్లారాక ఆ నీటిలో మీ పాదాలను 10 నుండి 15 నిమిషాలు ఉంచండి. ఇలా రోజూ చేస్తే పాదాల నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.నేచురల్ షైనింగ్..మిగిలిపోయిన టీ పొడి జుట్టుకు ఒక వరం. ఇది శిరోజాలకు నేచురల్ షైన్ జోడించడానికి పనిచేస్తుంది. అలాగే జుట్టు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. దీని కోసం, టీ పొడిని శుభ్రమైన నీటిలో మరిగించాలి. మరిగిన తర్వాత నీళ్లు చల్లారనివ్వాలి. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత చివరగా ఈ నీటితో తలస్నానం చేయాలి. కొద్ది రోజుల్లోనే జుట్టు సిల్కీగా మెరుస్తూ ఉంటుంది. మొక్కలకు ఎరువుగా..ఇంట్లో పెంచుకునే మొక్కలకు సహజ ఎరువుగా టీ పొడి ఉపయోగపడుతుంది. ఇంట్లో చెట్లు, మొక్కలు ఉంటే ఈ టీ పొడివాటి ఎదుగుదల రెట్టింపు అయ్యేలా చూసుకోవచ్చు. మిగిలిపోయిన టీ పొడిని కంపోస్టులా మొక్కల కుండీల్లో వేసేయండి. ఇది మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అయితే పంచదార కలిపిన టీ పొడిని మాత్రం బాగా కడిగి అప్పుడు వినియోగించండి.(చదవండి: క్రీడా నైపుణ్యం, మాతృత్వం రెండింటిని ప్రదర్శించిన ఆర్చర్ !) -
టీ అమ్మే వ్యక్తి కూతురు సీఏ అయ్యింది..ఏడుస్తూ తండ్రిని..!
ప్రతిభ ఎవ్వరి సొత్తు కాదు. ఎందరో మట్టిలో మాణిక్యాలు విద్యతో తమ ప్రతిభాపాటవాలను చాటుకుని ఔరా అనిపించుకున్నారు. సకల సౌకర్యాలు తల్లిదండ్రులు సమకూర్చినా..చదువు అబ్బదు కొందరు పిల్లలకి. మరి కొందరూ కటిక దారిద్ర్యంలో మగ్గిపోతూ కూడా సరస్వతి కటాక్షం మెండుగా ఉంటుంది వారికి. అయితే వారి తల్లిదండ్రులు కనీస సౌకర్యాలు ఇవ్వలేని స్థితిలో ఉంటారు. చెప్పాలంటే ఉన్నత చదువులు చదివే సత్తా ఉన్న ధనలక్ష్మీ అనుగ్రహం లేక విలవిల్లాడుతుంటారు. అలాంటి కోవకు చెందిందే ఈ అమ్మాయి. ప్రతిష్టాత్మకమైన సీఏ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అందరిచేత శభాష్ అనిపించుకుంది. వివరాల్లోకెళ్తే.. ఢిల్లీకి చెందిన అమితా ప్రజాపతి మురిక వాడలో నివశించే టీ అమ్మే వ్యక్తి కూతురు. ఎంతో కష్టపడి సీఏ ఉత్తీర్ణురాలయ్యింది. అందుకు ఆమెకు పదేళ్లు పట్టింది. ఈ భావోద్వేగపూరిత క్షణాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది అమిత. ఆ పోస్ట్‌లో అమిత..తాను టీ అమ్మే వాళ్ల కూతురునని, తన చదువుకు విషయమై చాలా అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. చుట్టుపక్కల వాళ్లు డబ్బు ఆదా చేసి ఇల్లు కట్టుకోమని చెప్పేవారు. ఎదిగిన కూతుళ్లతో ఎంతకాలం వీధుల్లో ఉంటారిని సూటిపోటీ మాటలు అనేవారు అంతా. అయినా వాళ్లు అమ్మాయిలు చదివి డబ్బులు సంపాదించినా వేరు వాళ్ల పరమే అవుతుందని ఉచిత సలహాలు ఇచ్చి బాధపెడుతుండేవారిని ఆవేదనగా పోస్టులో తెలిపింది. అంతేగాదు ఏదో ఒక రోజు తాను తన తల్లిదండ్రులను విడిచి వెళ్లాల్సి వస్తుందన్న ఆలోచన తనకు రాలేదని, బదులుగా తన కూతుళ్లను బాగా చదివించుకోవాలన్న కసి పుట్టిందని అంటోంది.ఈ రోజు తాను సాధించిన విజయం నిజమా..? కలనా..? అని సంభమాశ్చర్యంలోనే ఉన్నానంటూ భావోద్వేగంగా చెబుతోంది. పదేళ్ల కష్టం ఫలించిందని, ఏ నాటికైనా ఉత్తీర్ణురాలినవ్వాలంటూ ఆశగా ఎదురుచూశానని పోస్ట్‌లో పేర్కొంది. ఈ ఆనంద క్షణానికి ఉబ్బితబ్బిబై తనం తండ్రిని హగ్ చేసుకుని కన్నీరు మున్నీరుగా విలపించింది. అందుకు సంబధించిన వీడియోకి "భావోద్వేగపు క్షణం" అనే క్యాప్షన్‌తో జోడించి మరీ పోస్ట్ చేసింది అమిత. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. This is Amita Prajapati of Delhi, who said her father(Chai seller) ignored jibes from relatives and faced financial difficulties to ensure she could study. She finally cracked the CA exam after a decade of hard work and realized her dream. pic.twitter.com/iauQpgfyI1— Kakul Misra (@KakulMisra) July 21, 2024 (చదవండి: ఆటో డ్రైవర్‌గా మైక్రోసాఫ్ట్ ఇంజనీర్..ఎందుంటే..?) -
వేడి టీ పడి ఒళ్లంతా గాయాలు.. రూ.12.5 కోట్ల దావా
విమానంలో వేడి టీ సర్వ్ చేస్తున్నపుడు కుదుపులకు గురవడంతో ప్రయాణికురాలికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో సదరు విమాన సంస్థపై ప్యాసింజర్ ఏకంగా 1.5 మిలియన్ డాలర్లు (రూ.12.5 కోట్లు) దావా వేశారు.ప్రయాణికురాలు ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం..తహజానా లూయిస్ అనే మహిళా ప్యాసింజర్ తన కుటుంబంతో మే 15న ఓర్లాండో నుంచి కనెక్టికట్‌లోని హార్ట్‌ఫోర్డ్‌కు ‘జెట్‌బ్లూ ఫ్లైట్ 2237’ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికి సీట్‌బెల్ట్ పెట్టుకోవాలనే సిగ్నల్ వచ్చింది. అదేమీ పట్టించుకోకుండా విమాన సిబ్బంది వేడి టీ సర్వ్ చేయడానికి సిద్ధం అయ్యారు. కానీ అప్పటికే సీట్‌బెల్ట్ వార్నింగ్ రావడంతో విమానం కుదుపులకు గురైంది. దాంతో వేడి టీ ప్రయాణికురాలి శరీరంపై పడి ఛాతీ, కాళ్లు, కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన సమయంలో కనీసం విమాన సిబ్బంది ప్రథమ చికిత్స కూడా చేయలేదు.ప్రయాణికురాలు గాయాల నుంచి కోలుకున్నాక ఇటీవల విమాన ఘటనపై కోర్టును ఆశ్రయించారు. యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో ఈమేరకు ఫిర్యాదు చేశారు. దాంతోపాటు సంస్థ నిర్లక్ష్యం కారణంగా తీవ్ర గాయాలపాలయ్యానని తెలియజేస్తూ 1.5 మిలియన్ డాలర్లు(రూ.12.5 కోట్లు) దావా వేశారు. దీనిపై కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. నిబంధనల ప్రకారం విమానంలో సీట్‌బెల్ట్ సిగ్నల్ వచ్చినపుడు వేడి పానీయాలు, భోజన సేవలను నిలిపేయాలి.ఇదీ చదవండి: జీతం ఇవ్వలేదని సీఈఓ కిడ్నాప్.. 8 మంది అరెస్టుఇదిలాఉండగా, మే నెలలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం తీవ్ర కుదుపులకు గురవడంతో అత్యవసర ల్యాండింగ్ చేశారు. దాంతో ఒక ప్యాసింజర్ గుండెపోటుతో మరణించారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
‘టీ’పాట
‘చాయ్ హోటల్‌కు ఎందుకు వెళతారు?’ అనే ప్రశ్నకు–‘చాయ్ కోసమే వెళతారు’ అనే జవాబు మాత్రమే వినిపిస్తుంది. అయితే సూరత్‌లోని విజయ్భాయి పటేల్ అలియాస్ డాలీ చాయ్‌వాలా అలియాస్ సింగింగ్ చాయ్‌వాలా హోటల్‌కు ‘పాట’ కోసం వెళతారు. డాలీ చాయ్‌వాలా కస్టమర్లకు వేడి వేడి టీ అందిస్తూనే, మైక్రోఫోన్లో అద్భుతంగా పాడుతుంటాడు. ఆయన గానం వింటూ ‘మరో చాయ్’ అనే మాట కస్టమర్ల నోటి నుంచి వినిపించడం అక్కడ సాధారణ దృశ్యం. ఈ ‘సింగింగ్ చాయ్‌వాలా’కు సంబంధించిన వీడియో క్లిప్‌ను ముంబైలోని సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ బయాని ఇన్‌స్టాగ్రామ్‌లో ΄ోస్ట్ చేస్తే వైరల్ అయింది. -
భ్రుకు టీ ముడిపడే సీన్!
శివుని జటాఝూటంలోని గంగ గురించి మనకు తెలుసు. అయితే ఇరానీ మోడల్ శిరోజాలలోని ‘టీపాట్’ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. హెయిర్ స్టైల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. అయితే ‘టీ పాట్ హెయిర్‌స్టైల్’ గురించి మాత్రం ఎప్పుడూ విని ఉండం. ఇరాన్‌కు చెందిన హెయిర్ స్టైలిస్ట్ సైదెహ్ ‘టీపాట్ హెయిర్‌స్టైల్’ వీడియోను చూసి నెటిజనులు ‘ఆహో వోహో’ అంటున్నారు. ఈ వీడియో నాలుగు మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. హెయిర్ పిన్స్‌తో మోడల్ సబుర్ నగర్‌కు పోనీ టెయిల్ వేసింది. ఆ తరువాత మెటల్ వైర్లు, గ్లూ గన్‌తో టీపాట్ స్ట్రక్చర్స్‌ను సెట్ చేసింది. ఈ శిరో టీపాట్‌లో టీ ΄ోసి ఆ తరువాత కప్పులోకి ఒంపి తాగింది. ‘ఫ్యాషన్ స్టైల్ అనేది ఎన్నో వెరైటీలకు కేంద్రం. హెయిర్ స్టైల్‌కు సంబంధించి సహజంగా ఉండేలా ఏదైనా చేయాలనుకున్నాను. రెండు రోజుల కృషి ఫలితమే ఈ విజయం. ఇంత స్పందన వస్తుందని ఊహించలేదు’ అని తన ఇన్స్టాగ్రామ్ ΄ోస్ట్‌లో చెప్పింది సైదేహ్. -
అడగకుండా నీళ్లు తాగాడని..
మియాపూర్: తమను అడగకుండా నీళ్లు తీసుకున్నాడని టీ స్టాల్లో పనిచేసే ముగ్గురు యువకులు ఓ వ్యక్తిని కొట్టి చంపిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ దుర్గా రామలింగ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా టేక్ మాల్ మండలం బోడగట్టు గ్రామానికి చెందిన చాకలి సాయిలు (35)కు భార్య మీనా ఇద్దరు కుమారులు మహి, కిరణ్ ఉన్నారు. బీరంగూడలో ఉంటూ మియాపూర్‌లోని లారీలలో ఇసుకను ఖాళీ చేసే పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. సాయిలు ప్రతిరోజూ రాత్రి 10 గంటలకు మియాపూర్ వచ్చి లారీలలోని ఇసుకను ఖాళీ చేసి ఉదయం ఇంటికి వెళ్తుంటాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి 10 గంటలకు పనికి వచ్చి లారీలలోని ఇసుకను ఖాళీ చేశాడు. శుక్రవారం తెల్లవారు జామున దాహం వేస్తోందని మియాపూర్‌లోని రాజారామ్ కాలనీ సమీపంలో ఉన్న సురక్ష టీ స్టాల్లో నీళ్లు తాగేందుకు వెళ్లాడు. నీళ్లు తాగుతుండగా టీ స్టాల్లో పని చేస్తున్న సతీష్ అనే యువకుడు సాయిలుతో ఘర్షణకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తర్వాత సాయిలు అక్కడి నుంచి సమీపంలో ఉన్న కూలీల అడ్డా వద్దకు వెళ్లాడు. కొంత సేపటి తర్వాత టీ స్టాల్లో పనిచేసే సతీష్ పాల ప్యాకెట్ తీసుకువచ్చేందుకు వెళ్తుండగా మళ్లీ వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. స్నేహితులకు ఫోన్ చేసి.. రప్పించి.. సతీష్ ఆగ్రహంతో సమీపంలో ఉన్న స్నేహితులు భాను, లక్ష్మణ్ అలియాస్ లక్కీలకు ఫోన్ చేసి రప్పించాడు. ముగ్గురూ కలిసి సాయిలుపై దాడికి దిగారు. సమీపంలోని కూలీలు విడిపిస్తున్నా వినకుండా తీవ్రంగా కొట్టి సాయిలును స్కూటీపై తీసుకుని టీ స్టాల్ వద్ద పడేసి వెళ్లిపోయారు. స్థానికులు, కూలీలు చూసేసరికి సాయిలు మృతిచెంది ఉన్నాడు. మియాపూర్ పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుని బంధువు నాగారం సాయిలు ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. సాయిలు హత్యకు గురయ్యారడనే విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, తోటి కూలీలు మియాపూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని న్యాయం చేయాలంటూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
సౌందర్యమైన ‘బ్లూ టీ’ తో ఆరోగ్య ప్రయోజనాలెన్నో! ఎలా చేసుకోవాలి?
ఆధునిక కాలంలో ఆరోగ్యంపై అవగాహన బాగా పెరిగింది. పోషకాలతో నిండిన ఆహారం, పానీయాలు, హెర్బల్‌టీ పై శ్రద్ధ పెరిగింది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా, బరువును అదుపులోఉంచుకునే హెర్బల్ టీల గురించి తెలుసుకుంటున్నారు. మరి అపరాజిత పువ్వులు, ఈ పువ్వులతో తయారు చేసుకునే ‘బ్లూ టీ’ ప్రయోజనాలు గురించి తెలుసా? తెలుసుకుందాం రండి!అపరాజిత, వీటినే శంఖుపుష్కాలు , బటర్‌ఫ్లై పీ అని కూడా అంటారు. తెలుగు, నీలం, ముదురు నీలం రంగుల్లో ఈ పూలు పూస్తాయి. ఈ పువ్వులతో తయారు చేసిన టీని తాగితే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ‘బ్లూ టీ’ గా పాపులర్ అయిన ఈ టీతో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా లభిస్తాయి. పలు వ్యాధుల చికిత్సలో ఆయుర్వేదంలో అపరాజిత ప్రస్తావన ఉంది. బ్లూ టీ తాగడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. లక్షణాలతో రక్త ప్రసరణను మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఊబకాయంతో బాధపడుతున్న వారు ఈ టీతాగడం బరువు తగ్గినట్టు అధ్యయనాల్లో రుజువైంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది. జుట్టు, చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.యాంటీ-డయాబెటిక్, యాంటీ-కేన్సర్ లక్షణాలుకూడా ఉన్నాయి. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నవారికి ఇది బెస్ట్ ఆప్షన్. గుండెకు ఎంతో మేలు చేస్తుంది. ఈ టీలోని యాంటిథ్రాంబోటిక్ లక్షణం రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. తద్వారా గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.బ్లూటీ తయారీనాలుగు నీలిరంగు అపరాజిత పువ్వులను తీసుకొని ఒక కప్పు నీళ్లలో బాగా మరిగించాలి. నీళ్లు నీలం రంగులోకి మారతాయి. తరువాత, దీన్ని ఒక కప్పులోకి ఫిల్టర్ చేసుకొని హనీ, లేదా పంచదార, నిమ్మకాయ కలపుకుని తాగవచ్చు. ఇందులో తురిమిన అల్లం కూడా వేసుకోవచ్చు. -
అల్లం టీ పెట్టిన సీఎం.. మురిసిపోయిన జనం
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఏదో ఒక విషయమై తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. మరోవైపు సీఎం నిరాడంబరతను చాలామంది మెచ్చుకుంటుంటారు. ప్రస్తుతం ఆయన నైనిటాల్లో బస చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఒక పని ప్రజల దృష్టిని ఆకర్షించింది.ధామీ క్రమంతప్పక మార్నింగ్‌వాక్ చేస్తుంటారు. తాజాగా ఆయన మార్నింగ్ వాక్ సమయంలో రోడ్డు పక్కగా ఉన్న ఒక టీ దుకాణాన్ని గమనించారు. తరువాత అక్కడికి వెళ్లి, స్వయంగా అల్లాన్ని తరిగి టీ పెట్టారు. దీనిని గమనించిన అక్కడున్న వారంతా సీఎం చుట్టూ చేరారు. సీఎం వారిని కుశలప్రశ్నలు వేశారు. ఇంతటి సింప్లిసిటీ కలిగిన సీఎం దొరకడం తమకు లభించిన వరమని అంటూ అక్కడున్నవారంతా మురిసిపోయారు. అనంతరం సీఎం ఆ పక్కనే మైదానంలో ఆడుకుంటున్న క్రీడాకారులను పలుకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. -
లెమన్‌గ్రాస్ టీతో ఎన్ని లాభాలో తెలుసా..!
మనం ఎన్నో రకాల టీల గురించి విన్నాం. వాటిలో కొన్ని ఆరోగ్యకరమైన గ్రీన్ టీ వంటి పలు పానీయాలు గురించి కూడా విన్నారు. అలాంటి కోవకు చెందిన నిమ్మగడ్డి టీ గురించి విన్నారా. దీని వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబతున్నారు నిపుణులు. జీర్ణక్రియ దగ్గర నుంచి బరువు తగ్గడం, రోగ నిరోధక శక్తి వరకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందించగలదు ఈ టీ. అలాంటి ఈ లెమన్‌గ్రాస్ టీని ఎలా తయారు చేస్తారు? దీని వల్ల కలిగే లాభలేంటో సవివరంగా తెలుసుకుందామా..!లెమన్ గ్రాస్ టీ తయారీ విధానం..కావాల్సినవి:నీళ్లు: నాలుగు కప్పులు, నిమ్మగడ్డి: మూడు కాడలు (పచ్చివి), తేనె: మూడు చెంచాలు (బెల్లం కూడా వేసుకోవచ్చు)తయారీ: ముందుగా గిన్నెలో నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి బాగా మరిగించుకోవాలి. అందులో నిమ్మగడ్డి వేసి మరో పది నిమిషాలు మరిగించి, ఆవిరి బయటికి రాకుండా మూతపెట్టేయాలి. కప్పులో తేనె వేసుకొని, తేనీటిని అందులోకి వడకట్టుకోవాలి. చక్కటి పరిమళంతో పసందైన నిమ్మగడ్డి టీ రెడీ!. మధుమేగ్రస్తులు బెల్లం ఉపయోగించొచ్చు లేదా వేయకుండా తీసుకోవచ్చు. ఆరోగ్య ప్రయోజనాలు..దీనిలో ఉండే సిట్రల్ జెరేనియల్ గుండె జబ్బులు, స్ట్రోక్‌లు వంటివి రాకుండా కాపాడుతుంది. యాంటీ కేన్సర్ సామర్థ్యాలను కలిగి ఉంది. లెమన్ గ్రాస్‌లో ఉండే ఔషధ గుణాలు కేన్సర్‌తో పోరాడటంలో సహాయపడతాయి. సెల్ డెత్‌కు కారణమయ్యే వాటిని నివారించేలా రోగ నిరోధక శక్తిని పెంచి కేన్సర్‌తో పోరాడగలిగే శక్తిని ఇస్తుంది. గ్యాస్ట్రిక్ అల్సర్లకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉంటుంది. రక్తపోటుని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేగాదు ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల నిమ్మరసం మూత్ర ఉత్పత్తిని పెంచి రక్తపోటును తగ్గిస్తుంది.కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుందిబరువు తగ్గడంలో సహాయపడుతుంది జీవక్రియను నియంత్రిస్తుంది. శరీరం నుంచి అదనపు వ్యర్థాలను తొలగించి జీవక్రియను వేగవంతం చేస్తుంది. రుతుక్రమంలో ఎదురయ్యే అధిక రక్తస్రావం వంటి అసౌకర్యాలను తగ్గిస్తుంది. ఇది ఎంత సురక్షితమైనదైనప్పటికీ అతిగా తాగితే దుష్ప్రభావాలను ఎదుర్కొనక తప్పదు. అవేంటంటే..తల తిరగడంఆకలి పెరగటంనోరు పొడిబారడంతరుచుగా మూత్రవిసర్జన అలసటదద్దుర్లు, దురద, శ్వాస ఆడకపోవడం, వేగవంతమైన హృదయ స్పందన వంటి అలర్జీలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ గర్భవతిగా ఉన్నట్లయితే, వాళ్లలో తక్కువ హృదయ స్పందన రేటు లేదా తక్కువ పొటాషియం స్థాయిని కలిగి ఉంటే ఎట్టిపరిస్థితుల్లో లెమన్‌గ్రాస్ టీని తాగకూడదు.(చదవండి: హెయిర్ పెర్ఫ్యూమ్లు ఎక్కువగా ఉయోగిస్తున్నారా? నిపుణులు వార్నింగ్) -
ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
ప్రపంచంలో తేయాకు రకాలు ఎన్నో ఉన్నాయి. అరుదైన రకాల తేయాకుకు, అలాంటి రకాల తేయాకు తయారు చేసిన తేనీటికి ధర ఎక్కువగా ఉంటుంది. చైనాకు చెందిన ఊలాంగ్ టీ చూడటానికి బంగారు రంగులో ఉంటుంది. అంతమాత్రాన అది బంగారు తేనీరు కాదు. సింగపూర్‌లోని టీడబ్ల్యూజీ కంపెనీ మాత్రం అచ్చంగా బంగారు తేయాకు విక్రయిస్తోంది.నాణ్యమైన తేయాకులను పొడవుగా కత్తిరించి, ఆరబెట్టిన తర్వాత ఆ తేయాకులకు 24 కేరట్ల బంగారు పూత పూసి కళ్లు చెదిరే ప్యాకింగ్‌తో అందిస్తోంది. బంగారు పూత పూసిన ఈ తేయాకును 50 గ్రాముల మొదలుకొని 1 కిలో వరకు ప్యాకెట్లలో అమ్ముతోంది. ఈ తేయాకు తయారు చేసిన తేనీరు బంగారు రంగులో ధగధగలాడుతూ కళ్లు చెదరగొడుతుంది.ప్రస్తుతం దీని ధర కిలో 12,830 డాలర్లు (రూ.10.70 లక్షలు) మాత్రమే! టీడబ్ల్యూజీ కంపెనీ సింగపూర్‌లో రెస్టారంట్‌ను కూడా నిర్వహిస్తున్నా, అక్కడ ఈ బంగారు తేనీటిని అందించరు. కావలసిన వారు ఈ తేయాకు ప్యాకెట్లను కొని తీసుకువెళ్లాల్సిందే!ఇవి చదవండి: ఈ 'ట్రే గార్డెన్' ని ఎప్పుడైనా చూశారా?