పడి.. లేచి.. బబుల్‌ టీతో వేల కోట్లకు పగడలెత్తాడు | Who Is Yunan Wang,Bubble Tea Mogul Who Has Become China Latest Billionaire | Sakshi
Sakshi News home page

Yunan Wang : ఇండస్ట్రీని షేక్‌ చేస్తున్న బబుల్‌ టీ బిజినెస్‌లో పుట్టుకొచ్చిన బిలియనీర్‌!

Published Thu, Feb 13 2025 4:41 PM | Last Updated on Thu, Feb 13 2025 5:18 PM

Who Is Yunan Wang,Bubble Tea Mogul Who Has Become China Latest Billionaire

మీరు ఏదైనా కొత్త బిజినెస్‌ ఐడియా (business ideas in telugu) కోసం చూస్తున్నారా? ట్రెండింగ్‌లో ఉన్న బిజినెస్‌ ఐడియాతో ఎక్కువ లాభం అర్జించాలని అనుకుంటున్నారా? అయితే, ఇండస్ట్రీని షేక్‌ చేస్తున్న కొత్త బిజినెస్‌ ఐడియా ఏంటో తెలుసా? బబుల్‌ టీ. మనకు సాధారణ టీ గురించి, టీ ఫ్రాంచైజీల గురించి తెలుసు. దాని బిజినెస్‌ మోడల్‌ గురించి తెలుసు. మరి బబుల్‌ టీ(Bubble tea). ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న బిజినెస్సే  ఈ బబుల్‌ టీ బిజినెస్‌. బబుల్‌ టీని అమ్మి తాజాగా 38 ఏళ్ల యునాన్ వాంగ్‌ (Yunan Wang) చైనాలో బిలియనీర్‌ అవతారం ఎత్తారు.

ఫోర్బ్స్‌ నివేదిక ప్రకారం..ఇటీవల యునాన్‌ వాంగ్‌ సంస్థ ‘మింగ్‌ హోల్డింగ్స్’ ఐపీవోకి వెళ్లింది. ఈ ఐపీవోలో అదరగొట్టేలా 233 మిలియన్‌ డాలర్లను సేకరించింది. దీంతో  వాంగ్ నికర విలువ  1.2 బిలియన్లకు పెరిగింది. ఫలితంగా చైనా బిలియనీర్ల జాబితాలో చేరిపోయారు. ఇక మింగ్‌ హోల్డింగ్స్ ‘గుడ్‌మీ’ పేరుతో బబుల్‌ టీని విక్రయిస్తుంది. 2023 చివరి నాటికి చైనాలోని తొలి ఐదు బబుల్ టీ బ్రాండ్‌లలో 9.1శాతం మార్కెట్ వాటాతో దూసుకుపోతుంది.  

యునాన్ వాంగ్ ఎవరు?
38 ఏళ్ల యునాన్ వాంగ్ చైనాలోని ప్రముఖ బబుల్ టీ కంపెనీ గుమింగ్ హోల్డింగ్స్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు. అతని తల్లిదండ్రులు మయన్మార్ సరిహద్దుల్లో చిన్న రిటైల్ బిజినెస్‌ను నిర్వహిస్తున్నారు. యునాన్‌ వాంగ్‌ 2010లో జెజియాంగ్ సైన్స్-టెక్ విశ్వవిద్యాలయం నుండి మెటీరియల్ సైన్స్,ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. ఆ ఏడాది దాదాపు 15 సంవత్సరాల క్రితం తన స్వస్థలమైన డాక్సీలో బబుల్‌ టీ షాపును ప్రారంభించాడు. బబుల్‌ టీ బిజినెస్‌ ప్రారంభంలో అనేక ఆర్ధిక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు. రోజుకి వాంగ్‌ బబుల్‌ టీ అమ్మకాలు కేవలం 100 యువాన్ల (సుమారు $18.50) వరకు మాత్రమే అమ్మకాలు జరిగేవి. దీంతో పరిస్థితి మరింత దిగజారుతుందని భావించిన వాంగ్‌ తన సహ వ్యవస్థాపకుడి కూల్‌డ్రింక్‌ను అమ్మేవారు.  

ఫ్రాంచైజీలు 
రోజులు గడిచే కొద్ది వాంగ్‌ అమ్మే బబుల్‌ టీ షాపుకు కస్టమర్ల తాకిడి ఎక్కువైంది. అమ్మకాలు జోరందుకున్నాయి.  చైనా వ్యాప్తంగా మొత్తం 10వేల బబుల్‌ టీ ఫ్రాంచైజీలతో వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. తాజా బబుల్‌ టీ బిజినెస్‌లో బిలియనీర్‌ అయ్యాడు.

బబుల్ టీ క్రేజ్
బోబా టీనే బబుల్ టీగా అవతరించింది. 1980లలో తైవాన్‌లో పుట్టిన బబుల్ టీ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కుర్రకారుకు యమక్రేజ్‌. ఈ బబుల్‌  టీని చల్లని పాలు, పండ్ల రసాలు, టాపియోకా (టాపియోకా అనేది కాసావా (Cassava) అనే మొక్క వేరు నుండి తయారు చేసే పిండి పదార్థం) , జెల్లీ ముక్కలతో తయారు చేస్తారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా తైవాన్, చైనా, ఇతర ఆసియా దేశాలలో ప్రాచుర్యం పొందింది. ఈ బబుల్‌ టీ అమ్మకాలు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్‌లలో మన తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. వివిధ రకలా పండ్ల రుచులు, చాక్లెట్, ఇతర ప్రత్యేక రుచులతో బబుల్‌ టీని విక్రయిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement