bubbles
-
బుడగల మాదిరి భవనం..కట్టడానికే 14 ఏళ్లు..కానీ..
ఈ విచిత్ర నిర్మాణం ఫ్రాన్స్‌లోనిది. పీయెయిర్ బెర్నార్డ్ అనే ఫ్రెంచ్ పారిశ్రామికవేత్త ఈ భవనాన్ని కట్టించుకున్నాడు. ప్రపంచంలో ఎక్కడా లేనంత వినూత్నంగా భవనాన్ని నిర్మించాలని కోరడంతో ఫిన్నిష్ ఆర్కిటెక్ట్ యాంటీ లోవాగ్ 13 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బుద్బుద భవంతికి రూపకల్పన చేశాడు. దీని నిర్మాణానికి పద్నాలుగేళ్లు పట్టింది. చూడటానికి విచిత్రంగా బుడగల మాదిరిగా కనిపించే ఈ భవన నిర్మాణాన్ని 1975లో మొదలుపెడితే, 1989లో పూర్తయింది. ఇందులోకి వచ్చిన రెండేళ్లకే బెర్నార్డ్ మరణించాడు. తర్వాత దీనిని ఫ్రెంచ్ ఫ్యాషన్ డిజైనర్ పీయెయిర్ కార్డిన్ కొనుగోలు చేశాడు. భవనం పాతబడినట్లు అనిపించడంతో ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ ఓడిల్ డెక్ ఆధ్వర్యంలో మరమ్మతులు జరిపించి, కొత్త హంగులు సమకూర్చాడు. దీనిని 2017లో 350 మిలియన్ యూరోలకు (రూ.3120 కోట్లు) అమ్మకానికి పెట్టినా, కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈలోగా 2020లో కార్డిన్ మరణించాడు. ఇప్పుడు దీన్ని విహారయాత్రలకు వచ్చే పర్యాటకులకు అద్దెకు ఇస్తున్నారు. (చదవండి: 16 రోజుల్లో యూరప్ చుట్టేశాడు!..అదికూడా కేవలం..) -
ఇది కదా అద్భుతం: ఎగ్జోటిక్ వీడియోషేర్ చేసిన ఆనంద్ మహీంద్ర
సాక్షి, ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త ఎంఅండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర మరో అద్బుతమైన వీడియోను షేర్ చేశారు. ఎన్నో ఇన్నోవేటివ్ వీడియోలతో అభిమానులను ఆకట్టుకునే ఆయన తాజాగా మరో వీడియోతో ఫాన్స్‌ను ఫిదా చేశారు. చెన్నైకి చెందిన ఒక వ్లాగర్ వీడియోలోని విశేషాలపై అబ్బురపడుతూ అసలు ఇప్పటికే ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన హాలిడే అనుభవాలలో ఒకటిగా ఎందుకు జాబితా కాలేదంటూ ప్రశంసించారు. ఆవిష్కర్తలకు సెల్యూట్ చెబుతూ సాటర్డేవండరింగ్ అనే హ్యాష్ ట్యాగ్‌తో దీన్ని ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: మలేసియాలో ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి గ్రామానికి: రారాజులా లాభాల పంట ప్రకృతి సోయగాల నడుమ మనోహరమైన మున్నార్‌లోని బబుల్ గ్లాంపింగ్లో ట్రాన్స్పరంట్గా హోటల్ గదులు ఉండటం విశేషం.హోటల్ గది నుంచే సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని ఆకాశాన్ని, చుక్కల్ని ఎంజాయ్ చేస్తూ గడవపచ్చు టాప్ లగ్జరీ హోటల్స్‌లో ఉండే అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ ఉంటాయి. ప్రేమికులకు, కొత్తజంటల రొమాంటిక్ అనుభవంకోసం ఇవి బెస్ట్ సమ్మర్ వెకేషన్స్గా బాగా పాపులర్ అయ్యాయి. (అక్షయ తృతీయ 2023: టన్నుల కొద్దీ విక్రయాలు, ఏడాదిలో షాకింగ్ ధరలు) Why isn’t this listed yet as one of the world’s most exotic holiday experiences. ( Hope it’s a net-zero facility?) Salute to the innovators who established this…On my bucket list now… 👏🏽👏🏽👏🏽 #saturdaywandering pic.twitter.com/0lQGmcwld3 — anand mahindra (@anandmahindra) April 22, 2023 -
ఆనందాన్ని నింపే బబుల్స్
గడప ముందు వేసే డోర్ మ్యాట్ నుంచి టేబుల్ మ్యాట్స్ వరకు.. రూఫ్‌కి వేలాడే షాండ్లియర్ నుంచి క్యాండిల్ వరకు.. ఫ్లవర్ వేజ్ నుంచి సోప్కేస్ వరకు .. ఇంట్లోని అలంకరణ వస్తువులన్నీ బబుల్స్‌లా ఒకదానితో ఒకటి జత కలిసినట్టుగా కొత్తందాన్ని సంతరించుకుంటున్నాయి! చిన్నపిల్లలు సబ్బు ద్రావకాన్ని బుడగలుగా ఊదుతూ ఆనందాన్ని పొందే విధానం చూడటానికి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో ప్రతి ఒక్కరికీ అనుభవమే. ఆ రంగురంగుల బుడగలు గాలిలోకి ఎగిరినప్పుడు వెలువడి కాంతి ఎప్పుడూ కళ్ల ముందు కదలాడుతూ ఉంటే... ఆ ఆలోచనే హోమ్ డెకార్ నిపుణులను మరింతగా ఆకర్షించి ఉంటుంది. అందుకే, ఇప్పుడు ఇంటి అలంకరణలో ‘బబుల్’ ప్రధాన ఆకర్షణ అయ్యింది. బుడగల్లో ఇంద్రధనస్సు రంగులను ఇంటి గోడలపైనే కాదు, ఇతర అలంకరణ వస్తువుల్లోనూ చూపుతున్నారు హోమ్ డెకార్లు. కాంతులు వెదజల్లే బబుల్స్ పువ్వుల అమరికకే కాదు మంచినీళ్ల బాటిళ్లూ బబుల్ షేప్‌తో అలరిస్తున్నాయి. పూల కుండీలు, పెన్ హోల్డర్లు, ఇతర టేబుల్ అలంకరణ గ్లాస్ వస్తువులన్నీ బుడగల షేప్‌తో ఆకర్షిస్తున్నాయి. గాజు బుడగల వస్తువుల మీదుగా పడే కాంతి కూడా గది అందాన్ని పెంచడంతో అవీ ప్రధాన అలంకరణ జాబితాలోకి చేరిపోతున్నాయి. కాదేదీ అనర్హం టేబుల్ టాప్స్, ల్యాంప్ స్టాండ్స్, షెల్ఫ్స్... కాదేదీ అనర్హం అన్నట్టు సిరామిక్తోనూ, ప్లాస్టిక్‌తోనూ బబుల్ షేప్ వస్తువులు ముచ్చటగా ఆకట్టుకుంటున్నాయి. గోడకు అలంకరించే వాల్‌పేపర్స్ లేదా పెయింటింగ్స్‌లో కూడా బబుల్ షేప్ మరింత ఆహ్లాదంగా మారిపోయింది. పిల్లల గదులనే కాదు మెట్ల మార్గంలోనూ బబుల్ అలంకరణ చూపులను ఇట్టే కట్టిపడేస్తుంది. కలిసి జతకట్టు వేసవి వేడి తీవ్రతను తట్టుకునేందుకు ధరించే దుస్తులే కాదు ఇంటి వాతావరణమూ ఆహ్లాదంగా ఉండాలి. అందుకు లేత రంగుల బబుల్ డిజైన్స్ మనసుకు హాయినిచ్చే అలంకరణ అవుతుంది. ‘అంతే కాదు, ఒకదానితో ఒకటి కలిసికట్టుగా ఉండే బబుల్స్ కుటుంబ సభ్యుల మధ్య మమతానుబంధాన్ని బలం చేస్తాయి’ అంటున్నారు డెకార్ నిపుణులు. అందుకే, ఇంటి అలంకరణలో ప్రత్యేక ఆకర్షణగా ఈ సీజన్‌ని మరింత ఆహ్లాదంగా మార్చేస్తున్నాయి బబుల్స్. -
నీటిలో గాలి బుడగలు ఊదుతున్న శునకం.. ఫన్నీ వీడియో..
మనలో చాలా మందికి నీటిలో ఆడుకోవడమంటే మహా సరదా. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు నీళ్లలో గడపటానికి తెగ ఇష్టపడతారు. అందుకే, చాలా మంది స్నానమనే వంకతో గంటల కొద్ది బాత్రూంలలో గడిపేస్తారన్న సంగతి మనకు తెలిసిందే. అయితే, నీళ్లలో ఆడుకోవడం మనుషులకే కాదూ.. నోరులేని జీవాలకు కూడా ఇష్టమే. అందుకే అడవిలోని చాలా జంతువులు నీరు కనిపించగానే నీళ్లలో దిగి సేద తీరుతుంటాయి. ఈ క్రమంలో, ఇప్పటికే అనేక జంతువుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా, ఇలాంటి కోవకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వివరాలు..ఈ వీడియోలో ఒక శునకం పొలం గట్టున కట్టేసి ఉంది. దాని పక్కనే కాలువ ప్రవహిస్తుంది. అయితే, ఎండ వేడికి బాగా అలసిపోయిందో.. ఏమో కానీ.. ఆ శునకం ఏంచక్కా కూర్చుని.. అటూ ఇటూ చూస్తూ సేద తీరుతుంది. అంతటితో ఆగకుండా అది నీటిలో మూతిపెట్టి గాలిని వదిలింది. ఈ క్రమంలో కొన్ని గాలి బుడగలు వచ్చాయి. ఆ శునకం ఇదేం వింత అని చూసి.. మరోసారి నీటిలో అలాగే చేసింది. ఈసారి కూడా నీటిలో బుడగలు వచ్చాయి. అయితే, ఈ వీడియో ఎక్కడ జరిగిందో వివరాలు తెలియలేదు. కాగా, ఈ ఫన్నీ వీడియోను ఫ్రెడ్ స్కూజ్ అనే వ్యక్తి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు, ‘వావ్.. శునకం నీటిలో ఎంత బాగా సేదతీరుతుంది..’,‘ఈ వీడియోను చూసి వీలైతే నవ్వు ఆపుకోండి.. చూద్దాం..’, ‘నీటిలో బుడగలు.. మీరేనా.. నేను తెప్పిస్తాను.. అని చూయిస్తుందేమో..’, ‘శునకం.. ఎంత క్యూట్ గా ఉంది..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. Chillin’ like a villain. 😑😎 pic.twitter.com/TPDQfIT0wT — Fred Schultz (@fred035schultz) June 15, 2021 చదవండి: ఆకలితో వచ్చిన పక్షి.. అతను చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. -
సుదీర్ఘ కాలం ‘బయో బబుల్’లో కష్టమే
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ కోసం భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ‘బయో బబుల్’లోకి ప్రవేశించి 75 రోజులైంది. మరో ఐదు రోజులు కలుపుకుంటే 80 రోజులవుతుంది. ఆ తర్వాత వెంటనే ఆస్ట్రేలియా పర్యటన కోసం అతను బయలుదేరాల్సి ఉంది. అక్కడా బయో బబుల్‌లో గడపాల్సి ఉండగా, జనవరి 19న పర్యటన ముగుస్తుంది. ఇదే విషయంపై కోహ్లి ఆందోళన వ్యక్తం చేశాడు. సుదీర్ఘ కాలం ‘బయో బబుల్’లో ఉండాల్సి రావడం చాలా కష్టమని అతను వ్యాఖ్యానించాడు. ఇది ఆటగాళ్లపై మానసికంగా ప్రభావం చూపిస్తుందని కోహ్లి అభిప్రాయపడ్డాడు. ఇండోర్ గేమ్స్, ఎంటర్టైన్మెంట్ జోన్లు, ప్రైవేట్ బీచ్‌లలో సరదాలు కొంత వరకు ఒత్తిడిని తప్పించగలవేమో తప్ప పూర్తిగా కాదని అతను అన్నాడు. ‘బయో బబుల్’లో జరిగే సిరీస్‌ల వ్యవధిని తగ్గించే విషయంపై దృష్టి పెట్టాలని కోహ్లి సూచించాడు. ‘బయో బబుల్‌లో సహచరులతో కలిసి గడపడం, మంచి సాహచర్యం ఉండటంతో ఆరంభంలో బాగానే అనిపించింది. కానీ ఇది సుదీర్ఘంగా కొనసాగడమే సమస్య. రాన్రానూ అంతా కఠినంగా అనిపిస్తోంది. వినోదం కోసం ఎన్ని ఏర్పాట్లు చేసినా... మానసికంగా ప్రశాంతంగా ఉండే విషయం గురించి కూడా సీరియస్‌గా ఆలోచించాలి. ఇదే అన్నింటికంటే ముఖ్యం. రాబోయే రోజుల్లో సిరీస్‌ల వ్యవధి తగ్గించే అంశంపై దృష్టి పెట్టాలి. ఒకే రకమైన వాతావరణంలో 80 రోజుల పాటు ఉంటూ మరో ప్రత్యామ్నాయం లేకుండా, భిన్నంగా కనిపించకుండా చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయడం చాలా కష్టం. ఇది మానసికంగా మాపై ప్రభావం చూపిస్తుంది’ అని కోహ్లి విశ్లేషించాడు. -
బుడగలు సృష్టిస్తే కేన్సర్ మాయం!
రక్తనాళాల్లో సూక్ష్మస్థాయి బుడగలను సృష్టిస్తే కేన్సర్ కణాలను చిటికెలో నాశనం చేయవచ్చునని అంటున్నారు చైనా, ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు. ఆశ్చర్యంగా అనిపిస్తున్నా... ఇందులో మంచి తర్కమే ఉంది. కేన్సర్ కణుతులు బోలెడన్ని రక్తనాళాలను సృష్టించుకుని శక్తిని గ్రహిస్తూంటాయి. రక్తసరఫరా ఆగిపోతే కణుతులు పెరగలేవు. కొద్దికాలంలోనే నశించిపోతాయి కూడా. ఈ విషయం చాలాకాలంగా తెలిసినప్పటికీ ఆచరణలోకి తీసుకువచ్చే విషయంలో ఇబ్బందులు ఉండేవి. చైనా, ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు ఒక ద్రవాన్ని కణితికి రక్తాన్ని సరఫరా చేస్తున్న రక్తనాళంలోకి ఎక్కించారు. ఆ తరువాత కొన్ని శబ్ద ప్రకంపనలను ప్రసారం చేసినప్పుడు ఈ ద్రవం నుంచి బుడగల్లాంటివి ఏర్పడ్డాయి. రక్త సరఫరాను అడ్డుకున్నాయి కూడా. అంతేకాకుండా .. చిన్నస్థాయి బుడగలు క్యాపిలరీల్లోకి కూడా వెళ్లిపోయి అక్కడ విధ్వంసం సృష్టించాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మింగ్సీ వాన్ తెలిపారు. ఈ సరికొత్త గ్యాస్ ఎంబోలో థెరపీ ద్వారా మందులు కూడా నేరుగా కణుతుల్లోకి ఎక్కించవచ్చునని, ఫలితంగా అతి తక్కువ దుష్ప్రభావాలతో చికిత్స సాధ్యమవుతుందని వివరించారు. త్వరలోనే ఎలుకలపై పరీక్షించి ఈ విధానానికి మరింత పదును పెడతామని, ఆ తరువాత అందరికీ అందుబాటులోకి తెస్తామని చెప్పారు. -
స్టాక్‌మార్కెట్‌పై ఆర్థిక సర్వే ఏం చెప్పింది?
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త రికార్డులతో దూసుకెళుతున్న దేశీయ ఈక్విటీమార్కెట్లపై ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ కీలక హెచ్చరిక చేశారు. మార్కెట్లో బబుల్ లాంటి వాతావరణం నెలకొందని చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అక్రమ ఆస్తులను నిరోధించే భాగంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్లకు తరలినట్టు తెలిపారు. ముఖ్యంగా నోట్ల రద్దు తర్వాత విధించిన పన్ను దీనికి దారి తీసిందన్నారు. నగదు నిల్వలు, ఆస్తులు, బంగారం నిల్వలపై విధించిన పన్ను కారణంగా స్టాక్‌మార్కెట్ పెట్టుబడులకు మళ్లినట్టు తెలిపారు. అయితే ఈ బబుల్ ఎపుడైనా పేలే అవకాశం ఉందంటూ ఇన్వెస్టర్లకు కీలక సూచనలు అందించారు. ఎకనామిక్ సర్వే రిపోర్టును సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మార్కెట్లు బాగా పెరిగినపుడు తప్పని సరిగా వెనక్కి రావాలని, ప్రపంచవ్యాప్తంగా ఈ ధోరణిని చూశామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అప్రతమత్తంగా వుంటూ మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. మార్కెట్లో స్టాక్ ధరల పరంగా వేగంగా వృద్ధి చెందుతున్నట్లు మార్కెట్ అంచనా వేస్తోంది. ఏదేమైనా, ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రమాదాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలంటూ ఆర్థిక సర్వే నివేదిక ఈ భయాలను పునరుద్ఘాటించింది. ఆదాయ వృద్ధి అంచనాలు భారతదేశంలో చాలా ఎక్కువగా ఉన్నాయని సర్వే నివేదించింది. భారతదేశంలో స్టాక్ మార్కెట్ పెరుగుదలలో ఉంది. కానీ ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కార్పొరేట్ లాభం / జీడీపీ నిష్పత్తి క్షీణిస్తోందని పేర్కొంది. ఇది భారత్‌లో 3.5క్షీణిస్తే.. అమెరికా 9శాతం జీడీపీతో పటిష్టంగా ఉందని పేర్కొంది. స్టాక్ మార్కెట్ బూమ్ కాలంలో, అమెరికా రియల్ రేట్లు సగటున -1.0 శాతం ఉండగా, భారతదేశంలో ఇది 2.2 శాతంగా ఉందని సర్వే తెలిపింది. -
మీరు ఆఫీసులో నీరు తాగుతున్నారా?
మీరు మా ఆఫీసులో సరఫరా చేసే మినరల్ వాటర్ తాగుతున్నారా? మీ వాటర్ ప్యూరిఫయర్ ను ఎన్నాళ్లకి ఓ సారి కడుగుతున్నారు? వాటర్ మంచి కంపెనీ నుంచే వచ్చి ఉండవచ్చు. కానీ వాటర్ ను తీసుకొచ్చే బబుల్స్ (ప్లాస్టిక్ సిలెండర్స్) ఎంత శుభ్రంగా ఉన్నాయి? ఈ ప్రశ్నలను ఎప్పుడైనా వేసుకున్నారా? ముంబాయిలో ఈ మధ్యే కార్పొరేట్ ఆఫీసుల్లో తాగునీటి సరఫరా విధానంపై ఎం జీ ఎం స్కూల్ ఆఫ్ హెల్త్ మేనేజ్ మెంట్ విద్యార్థులు ఒక అధ్యయనం చేశారు. ఆ అధ్యయన వివరాలు చూస్తే కళ్లు తేలవేయడం ఖాయం. ముంబాయిలోని 52 ప్రముఖ కార్పొరేట్ సంస్థలపై ఈ అధ్యయనం జరిగింది. మొత్తం కంపెనీల్లో 49 శాతం ఆఫీసుల్లో వాటర్ ప్యూరిఫయర్ ను ఏడాదికి ఒక్కసారే కడిగి శుభ్రం చేస్తారు. అంతే కాదు... ఉద్యోగుల్లో 92 శాతం మంది నీటి వల్ల కలిగే జీర్ణకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఆ కారణంగా చాలా మంది సెలవులు కూడా తీసుకోవలసి వచ్చింది. అన్నికంపెనీల్లోనూ నీటి సరఫరాను కాంట్రాక్టుకు ఇవ్వడం జరుగుతోంది. అయితే వాటర్ జార్ల శుభ్రత విషయంలో ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. వాటి నాణ్యతను పరీక్షించే ఏర్పాటు ఏ సంస్థలోనూ లేదు. మంచి బ్రాండ్ లను తీసుకుని వస్తున్నారు కానీ, వాటర్ జార్ల నాణ్యతను మాత్రం పరీక్షించడం జరగడం లేదు. దీని వల్ల జీర్ణకోశ సంబంధిత సమస్యలు వస్తున్నాయి. జీవితంలో ఎక్కువకాలం గడిపేది ఆఫీసుల్లోనే కాబట్టి ఆఫీసుల్లో మంచి నీరు అందించడమే కాదు, వాటిని పట్టి నింపే జార్లు, కంటెయినర్లు కూడా శుభ్రంగా ఉండాలని ఈ అధ్యయనం తెలియచేస్తోంది. మరి.. మీ ఆఫీసులో ఎలా ఉంది?