
అర్జున్ టెండూల్కర్.. ఇప్పటివరకు దేశవాళీ క్రికెట్‌లో గానీ, ఐపీఎల్‌లో గానీ తన మార్క్‌ను చూపించలేకపోయాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వారుసుడిగా కెరీర్‌ను మొదలు పెట్టిన అర్జున్.. అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోతున్నాడు. లిస్ట్-ఎ క్రికెట్‌లో తొలుత ముంబైకి ప్రాతినిథ్యం వహించిన టెండూల్కర్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మాత్రం గోవా తరపున అరంగేట్రం చేశాడు. తన ఫస్ట్ క్లాస్ డెబ్యూలోనే సెంచరీ చేశాడు. ఆ తర్వాత మాత్రం పూర్తిగా తేలిపోయాడు.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అర్జున్ పేరిట 37 వికెట్లతో పాటు ఒక సెంచరీ ఉంది. అటు ఐపీఎల్‌లోనూ కూడా అర్జున్ విఫలమయ్యాడు. ముంబై ఇండియన్స్ తరపున నాలుగు మ్యాచ్ ల్లో మూడు వికెట్లు పడగొట్టాడు. గతేడాది సీజన్‌ల ఆడిన ఏకైక మ్యాచ్ లో ఒక్క వికెట్ కూడా ఈ జూనియర్ టెండూల్కర్ తీయలేకపోయాడు.
తాజాగా అర్జున్ ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్, లెజెండరీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అర్జున్ బ్యాటింగ్ ఆల్ రౌండర్ కాబట్టి ఎక్కువగా బ్యాటింగ్ పై దృష్టి పెట్టాలని యోగరాజ్ అన్నాడు. కాగా యోగరాజ్ అర్జున్ కు కొంతకాలం శిక్షణ ఇచ్చాడు. ఆ తర్వాత అతడు రంజీ ట్రోఫీలో సెంచరీ కూడా సాధించాడు.
"అర్జున్ టెండూల్కర్ నా దగ్గరకు వస్తే ఆరు నెలల్లో అతన్ని ప్రపంచంలోనే గొప్ప బ్యాటర్‌గా తయారుచేస్తాను. అతడికి అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. అతని సామర్థ్యం ఎవరికీ తెలియదు. అతడికి 12 రోజుల పాటు నేను శిక్షణ ఇచ్చాడు. అప్పుడే అతడి బ్యాటింగ్ సామర్ధ్యాన్ని గుర్తించాను. రంజీ ట్రోఫీ అరంగేట్రంలో సెంచరీ చేశాడు.
సచిన్, యువరాజ్ ఇద్దరూ అర్జున్ టెండూల్కర్‌ను తన పర్యవేక్షణలోకి తీసుకోమని చెప్పారు. అతడు దాదాపు 10 నుంచి 12 రోజుల పాటు కోచింగ్ ఆకాడమీలో ఉన్నాడు. అతడు మంచి బ్యాటర్ కానీ బౌలింగ్‌లో ఎక్కువగా సమయం వృధా చేస్తాను. అతడు బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా బ్యాటింగ్‌పై దృష్టిపెట్టాలి అని యోగరాజ్ తరువార్ కోహ్లీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment