Arjun Tendulkar
-
'6 నెలల సమయమివ్వండి.. అర్జున్ వరల్డ్‌లోనే బెస్ట్ బ్యాటర్ అవుతాడు'
అర్జున్ టెండూల్కర్.. ఇప్పటివరకు దేశవాళీ క్రికెట్లో గానీ, ఐపీఎల్లో గానీ తన మార్క్‌ను చూపించలేకపోయాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వారుసుడిగా కెరీర్‌ను మొదలు పెట్టిన అర్జున్.. అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోతున్నాడు. లిస్ట్-ఎ క్రికెట్లో తొలుత ముంబైకి ప్రాతినిథ్యం వహించిన టెండూల్కర్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మాత్రం గోవా తరపున అరంగేట్రం చేశాడు. తన ఫస్ట్ క్లాస్ డెబ్యూలోనే సెంచరీ చేశాడు. ఆ తర్వాత మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అర్జున్ పేరిట 37 వికెట్లతో పాటు ఒక సెంచరీ ఉంది. అటు ఐపీఎల్‌లోనూ కూడా అర్జున్ విఫలమయ్యాడు. ముంబై ఇండియన్స్ తరపున నాలుగు మ్యాచ్ ల్లో మూడు వికెట్లు పడగొట్టాడు. గతేడాది సీజన్ల ఆడిన ఏకైక మ్యాచ్ లో ఒక్క వికెట్ కూడా ఈ జూనియర్ టెండూల్కర్ తీయలేకపోయాడు. తాజాగా అర్జున్ ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్, లెజెండరీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అర్జున్ బ్యాటింగ్ ఆల్ రౌండర్ కాబట్టి ఎక్కువగా బ్యాటింగ్ పై దృష్టి పెట్టాలని యోగరాజ్ అన్నాడు. కాగా యోగరాజ్ అర్జున్ కు కొంతకాలం శిక్షణ ఇచ్చాడు. ఆ తర్వాత అతడు రంజీ ట్రోఫీలో సెంచరీ కూడా సాధించాడు."అర్జున్ టెండూల్కర్ నా దగ్గరకు వస్తే ఆరు నెలల్లో అతన్ని ప్రపంచంలోనే గొప్ప బ్యాటర్‌గా తయారుచేస్తాను. అతడికి అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. అతని సామర్థ్యం ఎవరికీ తెలియదు. అతడికి 12 రోజుల పాటు నేను శిక్షణ ఇచ్చాడు. అప్పుడే అతడి బ్యాటింగ్ సామర్ధ్యాన్ని గుర్తించాను. రంజీ ట్రోఫీ అరంగేట్రంలో సెంచరీ చేశాడు. సచిన్, యువరాజ్ ఇద్దరూ అర్జున్ టెండూల్కర్‌ను తన పర్యవేక్షణలోకి తీసుకోమని చెప్పారు. అతడు దాదాపు 10 నుంచి 12 రోజుల పాటు కోచింగ్ ఆకాడమీలో ఉన్నాడు. అతడు మంచి బ్యాటర్ కానీ బౌలింగ్‌లో ఎక్కువగా సమయం వృధా చేస్తాను. అతడు బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా బ్యాటింగ్‌పై దృష్టిపెట్టాలి అని యోగరాజ్ తరువార్ కోహ్లీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. -
సచిన్ తనయుడికి భారీ షాక్.. జట్టు నుంచి తీసేశారు!
భారత క్రికెట్ దిగ్గజం తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు గోవా క్రికెట్ అసోసియేషన్ ఊహించని షాకిచ్చింది. విజయ్ హజారే ట్రోఫీ 2024-25 మధ్యలోనే గోవా జట్టు నుంచి అర్జున్ టెండూల్కర్‌ను జీసీఎ తప్పించింది. దీంతో అతడు శనివారం ఉత్తరఖాండ్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమమయ్యాడు.25 ఏళ్ల అర్జున్ గోవా రెడ్ బాల్ జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నప్పటికి వైట్ బాట్ స్వ్కాడ్‌లో మాత్రం తన స్ధానాన్ని సుస్థిరం చేసుకోలేకపోతున్నాడు. కాగా అంతకుముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో కూడా కేవలం మూడు మ్యాచ్‌లు ఆడిన తర్వాత అతడిపై జీసీఎ వేటు వేసింది.మళ్లీ ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో సరిగ్గా మూడు మ్యాచ్‌లు ఆడిన తర్వాతే సెలక్టర్లు జట్టు నుంచి తప్పించారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన అర్జున్ కేవలం 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఒడిశాతో జరిగిన తొలి మ్యాచ్‌లో అర్జున్ 3 వికెట్లు పడగొట్టినప్పటికి.. తన 10 ఓవర్ల కోటాలో ఏకంగా 61 పరుగులు సమర్పించుకున్నాడు.ఆతర్వాతి రెండు మ్యాచ్‌ల్లో చెరో వికెట్ సాధించినప్పటకి ఆరుకు పైగా ఏకానమీ రేటుతో పరుగులు ఇచ్చాడు. ఈ క్రమంలోనే అతడిపై గోవా క్రికెట్ ఆసోసియేషన్ వేటు వేసింది. దీంతో వైట్‌బాల్ క్రికెట్లో అర్జున్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.మరోసారి ముంబైతో..కాగా అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్లో మరోసారి ముంబై ఇండియన్స్ తరపున ఆడనున్నాడు. ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ. 20 లక్షల కనీస ధరకు అర్జున్ను ముంబై సొంతం చేసుకుంది. ఈ మెగా వేలంలో అర్జున్ను తొలుత ఏ ఫ్రాంచైజీ పట్టించుకోలేదు.కానీ ఆఖరికి యాక్సిలరేటెడ్ రౌండ్లో ముంబై దక్కించుకుంది. జూనియర్ టెండూల్కర్ ఐపీఎల్-2021 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో భాగంగా ఉన్నాడు. అతడు 5 మ్యాచ్‌లలో 9.37 ఎకానమీ రేటుతో 3 వికెట్లు పడగొట్టాడు. అర్జున్ కనీసం ఈసారైనా రాణిస్తాడో లేదో వేచి చూడాలి.చదవండి: IND Vs AUS: స్టుపిడ్.. స్టుపిడ్! భారత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లొద్దు: పంత్‌పై సన్నీ ఫైర్ -
సచిన్ టెండుల్కర్ పదో తరగతితో ఆపితే.. అర్జున్ ఎంత వరకు చదివాడో తెలుసా? (ఫొటోలు)
-
ఐదు వికెట్లతో చెలరేగిన అర్జున్ టెండుల్కర్.. మెగా వేలంలో...
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ రంజీ మ్యాచ్‌లో అదరగొట్టాడు. అరుణాచల్ ప్రదేశ్‌తో పోరులో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ గోవా ఆల్‌రౌండర్.. ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు. అర్జున్ దెబ్బకు ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. 84 పరుగులకే ఆలౌట్ అయింది.గోవాకు ప్రాతినిథ్యంకాగా ముంబైకి చెందిన అర్జున్ టెండుల్కర్ దేశవాళీ క్రికెట్లో గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఎడమచేతి వాటం కలిగిన బ్యాటర్ అయిన అర్జున్.. లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ కూడా! ఇక 25 ఏళ్ల అర్జున్ రంజీ ట్రోఫీ 2024-25లో ప్లేట్ గ్రూపులో ఉన్న గోవా.. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ జట్టుతో తలపడుతోంది.పొర్వోరిమ్లోని గోవా క్రికెట్ అసోసియేషన్ అకాడమీ గ్రౌండ్లో బుధవారం ఇరుజట్ల మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన అరుణాచల్ ప్రదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆది నుంచే అటాక్ మొదలుపెట్టిన గోవా ఆల్‌రౌండర్ అర్జున్ టెండుల్కర్.. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను బెంబేలెత్తించాడు.టాప్-5 వికెట్లు అతడి ఖాతాలోనేఅర్జున్ ధాటికి టాపార్డర్‌తో పాటు మిడిలార్డర్ కకావికలమైంది. ఓపెనర్ నబాం హచాంగ్‌ను డకౌట్ చేయడంతో వికెట్ల వేట మొదలుపెట్టిన అర్జున్.. మరో ఓపెనర్ నీలం ఒబి(22), వన్‌డౌన్ బ్యాటర్ చిన్మయ్ పాటిల్(3), నాలుగో స్థానంలో వచ్చిన జే భస్వార్(0), ఐదో నంబర్ బ్యాటర్ మోజీ ఎటె(1)లను పెవిలియన్‌కు పంపాడు.ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కెరీర్లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శనతద్వారా అర్జున్ టెండుల్కర్.. తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కెరీర్లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శన(5 Wicket Haul) నమోదు చేశాడు. ఇక అర్జున్‌తో పాటు గోవా బౌలర్లలో కేత్ పింటో రెండు, మోహిత్ రేడ్కర్ మూడు వికెట్లతో రాణించారు. ఈ క్రమంలో తొలిరోజు ఆటలోనే కుప్పకూలిన అరుణాచల్ ప్రదేశ్.. 84 పరుగులకు తమ తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది.ముంబై తరఫున కాగా ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు అర్జున్ టెండుల్కర్ ఈమేరకు ఉత్తమ ప్రదర్శన కనబరచడం.. అతడికి సానుకూలాంశంగా మారింది. ఈ ఆల్‌రౌండర్‌ను దక్కించుకునేందుకు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఇక సచిన్ టెండుల్కర్ మెంటార్‌గా వ్యవహరిస్తున్న ముంబై ఇండియన్స్ తరఫున అర్జున్ గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు మొత్తంగా ఐదు మ్యాచ్‌లు ఆడి 13 పరుగులు చేయడంతో పాటు.. మూడు వికెట్లు తీశాడు. అయితే, రిటెన్షన్స్‌లో భాగంగా ఐదుగురిని అట్టిపెట్టుకున్న ముంబై.. అర్జున్ను వదిలివేసింది. ఇదిలా ఉంటే.. సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా నవంబరు 24, 25 తేదీల్లో ఐపీఎల్ వేలంపాట జరుగనుంది.చదవండి: ఆతిథ్య హక్కులు మావే.. మ్యాచ్‌లన్నీ మా దేశంలోనే.. పాక్ ప్రభుత్వ వైఖరి ఇదే! -
లవ్ యూ.. నిన్ను చూసి గర్విస్తున్నా:సారా టెండుల్కర్ (ఫొటోలు)
-
సచిన్ తనయుడి సూపర్ పెర్ఫార్మెన్స్..!
కేఎస్‌సీఏ ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్లో (కెప్టెన్ కే తిమ్మప్పయ్య మెమోరియల్) క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ అద్బుత ప్రదర్శనతో మెరిశాడు. ఈ టోర్నీలో గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్.. ఆతిథ్య కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల ఘనత నమోదు చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన అర్జున్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టాడు. అర్జున్ చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో గోవా ఇన్నింగ్స్ 189 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 103 పరుగులకు ఆలౌటైంది. అర్జున్ 13 ఓవర్లలో 41 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. అనంతరం అభినవ్ తేజ్రాణా సెంచరీతో (109) కదంతొక్కడంతో గోవా తొలి ఇన్నింగ్స్‌లో 413 పరుగులు చేసింది. గోవా ఇన్నింగ్స్‌లో మంతన్ కుట్కర్ అర్ద సెంచరీతో (69) రాణించాడు. భారీ వెనుకంజతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక..సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ పేలవ ప్రదర్శన కనబర్చింది. అర్జున్ 13.3 ఓవర్లలో 46 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడంతో కర్ణాటక సెకెండ్ ఇన్నింగ్స్‌లో 121 పరుగులకు కుప్పకూలింది. ఫలితంగా ఈ మ్యాచ్‌లో గోవా భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ మొత్తంలో అర్జున్ 26.3 ఓవర్లు వేసి 87 పరుగులిచ్చి 9 వికెట్లు పడగొట్టాడు. వచ్చే వారం 25వ పుట్టిన రోజు జరుపుకోబోతున్న అర్జున్.. సీనియర్ లెవెల్లో ఇప్పటివరకు 49 మ్యాచ్‌లు (మూడు ఫార్మాట్లలో) ఆడాడు. ఇందులో 68 వికెట్లు పడగొట్టాడు. లెఫ్ట్ అర్మ్ మీడియం పేసర్ అయిన అర్జున్ తన కెరీర్లో 13 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 21 వికెట్లు పడగొట్టాడు. చదవండి: బంగ్లాతో తొలి టెస్టు.. కోహ్లికి చుక్కలు చూపించిన బుమ్రా -
ఓటేసిన సచిన్, సూర్యకుమార్.. ఫోటోలు వైరల్
దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. ఐదో దశలో భాగంగా మహారాష్ట్రతో పాటు ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో పలువురు క్రికెటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పాటు టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్, వెటరన్ అజింక్యా రహానే, అర్జున్ టెండూల్కర్ సైతం ఓటు వేశారు. సచిన్ తన తనయుడు అర్జున్‌తో కలిసి ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ స్టేషన్ బయట సిరాతో ఉన్న వేలిని చూపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. అదేవిధంగా సూర్యకుమార్ సైతం ఓటు వేసిన అనంతరం తన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మన దేశ భవిష్యత్తును నిర్ణయించే ఓటు హక్కును వినియోగించుకోవాలని సూర్య పిలుపునిచ్చాడు. Let’s shape the future of our nation by casting our vote today. ✌️ pic.twitter.com/ZYgT69zhis— Surya Kumar Yadav (@surya_14kumar) May 20, 2024 -
MI: అర్జున్ టెండుల్కర్ ‘ఓవరాక్షన్’.. ఆ తర్వాత ఇలా డగౌట్లో!
టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. అతి చేస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయని.. అయినా పరిస్థితులు ఎదుర్కోకుండా పారిపోవడం ఏమిటంటూ నెటిజన్లు అతడిని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.ఇంతకీ ఏం జరిగిందంటే.. ఐపీఎల్ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్ టెండుల్కర్ 2024 సీజన్లో ఎట్టకేలకు శుక్రవారం తన తొలి మ్యాచ్ ఆడాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ సందర్భంగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్థానంలో తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు.ఈ మ్యాచ్‌లో కేవలం 2.2 ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ రైటార్మ్ పేస్ ఆల్‌రౌండర్ 22 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కాగా.. లక్నో ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్ బౌల్ చేసిన అర్జున్.. 3 పరుగులు మాత్రమే ఇచ్చి శెభాష్ అనిపించుకున్నాడు.అయితే, ఐదో ఓవర్లో కాస్త అతి చేశాడు. మార్కస్ స్టొయినిస్‌ను ట్రాప్ చేసేందుకు అర్జున్ ఇన్‌స్వింగర్ సంధించగా.. బ్యాటర్ తప్పించుకున్నాడు. ఈ క్రమంలో బంతిని అందుకున్న అర్జున్ వికెట్లకు స్టొయినిస్ మీదకు విసిరేస్తానన్నట్లుగా దూకుడు ప్రదర్శించాడు. ఇందుకు స్టొయినిస్ చిరాగ్గా నవ్వుతూ కౌంటర్ ఇచ్చాడు.ఇక ఆ తర్వాత 15వ ఓవర్లో మళ్లీ బాలింగ్‌కు దిగిన అర్జున్ టెండుల్కర్ బౌలింగ్‌లో నికోలసన్ పూరన్ తొలి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాదాడు. అయితే, ఆ తర్వాత అర్జున్ తనకు ఇబ్బంది ఉందంటూ ఫిజియోను పిలిపించుకున్నాడు.ఆ తర్వాత అతడితో కలిసి మైదానం వీడగా.. నమన్ ధిర్ మిగిలిన కోటా పూర్తి చేశాడు. అయితే, ఆ ఓవర్లో టెండుల్కర్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదిన పూరన్.. తర్వాత నమన్ ధిర్ బౌలింగ్‌లోనూ వరుసగా సిక్స్, ఫోర్, 1, సిక్స్ బాది 29 పరుగులు పిండుకున్నాడు.ఈ నేపథ్యంలో అర్జున్ టెండుల్కర్ కావాలనే గాయం పేరిట తప్పించుకున్నాడంటూ నెటిజన్లు అతడిని ట్రోల్ చేస్తున్నారు. పూరన్ ఫామ్ చూసి భయపడిపోయిన అర్జున్ను కాపాడేందుకు మేనేజ్మెంట్ నమన్ ధిర్‌ను బలి చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా స్టొయినిస్ విషయంలో అర్జున్ ప్రవర్తించిన తీరు కూడా ప్రస్తావిస్తూ విమర్శిస్తున్నారు.కాగా సచిన్ టెండుల్కర్ ముంబై ఇండియన్స్ మెంటార్ అన్న విషయం తెలిసిందే. గత సీజన్లో అర్జున్ మూడు వికెట్లు తీయడంతో పాటు 13 పరుగులు చేశాడు.Arjun Tendulkar shows aggression to Marcus Stoinis.🥵💥#mivslsg #mivlsg #lsgvsmi #lsgvmi #tataipl #tataipl2024 #ipl2024 #ipl #mumbaiindians #crickettwitter pic.twitter.com/SCzAdnkzmx— AK tweets (@ajithkumaarrrrr) May 17, 2024Arjun Tendulkar Going Back To Dressing Room After Pooran Hit Him Two Back To Back Sixes 🤡🤡🔥🔥😂😂He didn't Even Complete His Over 🤡🤡🤡#MIvsLSG #RCBvCSK #CSKvRCB pic.twitter.com/OlyNj9k1QW— Khabri_Prasang (@Prasang_) May 17, 2024 -
సచిన్ కొడుకు స్టన్నింగ్ యార్కర్.. దెబ్బకు కిందపడిపోయిన బ్యాటర్
ఐపీఎల్-2024 సీజన్ ఆరంభానికి సమయం దగ్గరపడుతోంది. మార్చి 22న చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్- ఆర్సీబీ మధ్య జరగననున్న మ్యాచ్‌తో ఈ ధానాధన్ లీగ్‌కు తెరలేవనుంది. ఇప్పటికే ఈ మెగా ఈవెంట్లో భాగమయ్యే అన్ని జట్లు తమ ప్రాక్టీస్‌ను మొదలెట్టేశాయి. ఈ క్రమంలో సచిన్ తనయుడు, ముంబై ఇండియన్స్ యువ పేసర్ అర్జున్ టెండూల్కర్ సైతం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ముంబై ప్రీ ట్రైనింగ్ క్యాంప్‌లో అర్జున్ చెమటోడ్చుతున్నాడు. నెట్స్‌లో ఎక్కువ సమయం పాటు జూనియర్ టెండూల్కర్ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అర్జున్ నెట్స్‌లో తన బౌలింగ్‌తో బ్యాటర్లకు చెమటలు పట్టించాడు. అర్జున్ తన సహచర ఆటగాడు నెహాల్ వధేరాను యార్కర్లతో బెంబెలెత్తించాడు. అర్జున్ వేసిన యార్కర్‌ను ఆపలేక వధేరా కిందపడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. కాగా గతేడాది సీజన్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన అర్జున్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఐపీఎల్-2023లో మూడు మ్యాచ్‌లు ఆడిన అర్జున్.. కేవలం 3 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. మరి ఈ ఏడాది సీజన్లో ఎలా రాణిస్తాడో వేచి చూడాలి. ఐపీఎల్-2024లో ముంబై తమ తొలి మ్యాచ్‌లో మార్చి 24న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. కాగా ఈ ఏడాది సీజన్లో ముంబై సారథిగా హార్దిక్ పాండ్యా వ్యహరించనున్న సంగతి తెలిసిందే. Just Arjun doing 𝘈𝘳𝘫𝘶𝘯 things 🏹😉#OneFamily #MumbaiIndians pic.twitter.com/Sv7eObeFSO — Mumbai Indians (@mipaltan) March 12, 2024 -
సచిన్ కొడుకుకు ఏమైంది..? కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా
రంజీ ట్రోఫీ సీజన్ 2023-24లో సచిన్ టెండూల్కర్ తనయడు, గోవా ఆల్ ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తాజాగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లోనూ అర్జున్ పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అర్జున్ విఫలమయ్యాడు. బౌలింగ్‌లో కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన జూనియర్ టెండూల్కర్.. బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది సీజన్ రంజీ ట్రోఫీలో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన అర్జున్ టెండూల్కర్.. 9 ఇన్నింగ్స్‌లలో 182 పరుగులు మాత్రమే చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. అటు బౌలింగ్‌లోనూ అంతంతమాత్రమే. కేవలం బౌలింగ్‌లో నాలుగు వికెట్లు మాత్రమే తీసాడు. కాగా తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌ను ముంబై తరపున ఆరంభించిన అర్జున్.. ఇప్పుడు గోవాకు ప్రాతినిథ్యం వహించాడు. జట్టులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ముంబై క్రికెట్ ఆసోషియేషన్ నుంచి ఎన్వోసీ తీసుకుని గోవా జట్టుతో చేరాడు. అక్కడ అవకాశాలు వచ్చిననప్పటికీ వాటిని సద్వినియోగ పరుచుకోవడంలో విఫలమవుతున్నాడు. తన ఫస్ట్‌క్లాస్ కెరీర్లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన అర్జున్ టెండూల్కర్.. 882 పరుగులతో పాటు 16 వికెట్లు పడగొట్టాడు. కాగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున అర్జున్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: AUS vs NZ: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. డేవిడ్ వార్నర్‌కు ఛాన్స్ -
నిరాశపరిచిన సచిన్ కొడుకు.. 135 పరుగులకే ఆలౌట్
రంజీట్రోఫీ-2024 సీజన్‌ను సచిన్ టెండూల్కర్ తనయడు అర్జున్ టెండూల్కర్ పేలవంగా ఆరభించాడు. ఈ టోర్నీలో గోవాకు ప్రాతనిథ్యం వహిస్తున్న అర్జున్.. త్రిపురతో జరుగుతున్న మ్యాచ్‌లో తన మార్క్‌ను చూపించలేకపోయాడు. తొలుత బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టనప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌లో కేవలం 11 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన అర్జున్ జట్టున ఆదుకోవడంలో విఫలమయ్యాడు. కాగా ఈ రంజీ సీజన్ ఆరంభానికి ముందు గతేడాది జరిగిన విజయ్ హాజారే ట్రోఫీలో అర్జున్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. 11 వికెట్లతో అర్జున్ అదరగొట్టాడు.దీంతో ఫస్ట్‌క్లాస్ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీలో కూడా అతడిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ తొలి మ్యాచ్‌లో మాత్రం అర్జున్ అంచనాలను అందుకోలేకపోయాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. గోవా తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 135 పరుగులకే కుప్పకూలింది. త్రిపుర బౌలింగ్‌లో ఏకే సర్కార్ 4 వికెట్లతో గోవా పతనాన్ని శాసించాడు. అతడితో పాటు మురా సింగ్, రానా దత్తా తలా 3 వికెట్లు సాధించారు. -
గిల్‌తో ఫొటో షేర్ చేసి ‘రిలేషన్’ కన్ఫర్మ్ చేసిందంటూ ప్రచారాలు.. వాస్తవం ఇదే
Fact Check: డిజిటల్ యుగంలో ఏది నిజమో ఏది అబద్ధమో పోల్చుకోవడం కష్టతరంగా మారింది. సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత మార్ఫ్డ్ ఫొటోలు, వీడియోల వ్యాప్తికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. సెలబ్రిటీలను ముఖ్యంగా ఆడవాళ్లను టార్గెట్ చేస్తూ.. సైబర్ క్రిమినల్స్ చేసే ఇలాంటి చెత్త పనుల వల్ల.. సామాన్యులు కూడా బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి తలెత్తింది. అమ్మాయిల భద్రతపై ఆందోళన స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా డీప్‌ఫేక్ వీడియో వైరల్‌గా మారిన తరుణంలో.. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్‌కు సంబంధించిన ఫొటోపై నెట్టింట చర్చ మొదలైంది. ప్రేమలో ఉన్నారంటూ వదంతులు కాగా టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌తో సారా ప్రేమలో ఉన్నట్లు వదంతులు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. గిల్ సోదరి షానిల్కు సారా స్నేహితురాలు. ఈ క్రమంలో గిల్- సారా మధ్య కూడా పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారి తీసిందని గాసిప్ రాయుళ్లు గతంలో కథనాలు అల్లారు. సోషల్ మీడియాలో శుబ్‌మన్ గిల్- సారా ఒకరినొకరు ఫాలో అవడం.. గిల్ విజయాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సారా కామెంట్లు చేయడం ఇందుకు ఊతమిచ్చింది. అయితే, కొన్ని రోజుల తర్వాత వీరిద్దరు విడిపోయారనే ప్రచారం కూడా జరిగింది. సారా వైపునకే కెమెరాలు ఈ క్రమంలో వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా ముంబైలో టీమిండియా మ్యాచ్ సందర్భంగా సారా టెండుల్కర్ స్టేడియానికి రావడంతో మరోసారి పాత రూమర్లు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా గిల్ షాట్లు ఆడినప్పుడల్లా కెమెరాలు ఆమె వైపునకు తిప్పడం.. ఆ సమయంలో సారా చప్పట్లుకొడుతూ జట్టు(గిల్‌ను మాత్రమే అన్నట్లు అపార్థాలు)ను ఉత్సాహపరుస్తూ కనిపించడం ఇందుకు కారణం. స్టేడియంలో అల్లరిమూకల అతిచేష్టలు ఇక స్టేడియంలో కొంతమందైతే గిల్ షాట్ బాదినప్పుడల్లా సారా వదిన అంటూ అత్యుత్సాహం ప్రదర్శించడం మరీ దారుణం. ఇలాంటి తరుణంలో జియో వరల్డ్ ప్లాజా ప్రారంభోత్సవంలో వీరిద్దరు కలిసి కనిపించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సారా... శుబ్‌మన్‌ను ప్రేమగా హత్తుకుని ఉన్నట్లుగా ఉన్న ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే, వాస్తవానికి అది మార్ఫ్డ్ ఫొటో. నిజం ఇదే: తన తమ్ముడు అర్జున్ టెండుల్కర్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబరు 24న సారా టెండుల్కర్ కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ‘‘నా చిన్నారి తమ్ముడు ఈ 24న 24వ వసంతంలోకి!! హ్యాపియెస్ట్ బర్త్‌డే. మీ అక్క నీకెప్పుడూ అండగా ఉంటుంది’’ అంటూ క్యాప్షన్ జతచేసింది. ఇందులో తమ చిన్ననాటి ఫొటోలతో పాటు ప్రస్తుత ఫొటోలు కూడా పోస్ట్ చేసింది. వాటిలో ఓ ఫొటోలో అర్జున్‌కు ఆత్మీయంగా హత్తుకున్న సారా ఫొటోను మార్ఫ్ చేసినట్లు స్పష్టమైంది. అర్జున్ ప్లేస్‌లో శుబ్‌మన్ ఫొటో పెట్టి కొంతమంది సోషల్ మీడియాలో వ్యాప్తి చేశారు. అయితే, సారా ఇన్స్టాగ్రామ్ పరిశీలించగా అర్జున్ ఫేస్‌కు బదులు శుబ్‌మన్ ఫేస్ యాడ్ చేసి ఈ ఫొటో మార్ఫింగ్ చేసినట్లు బయటపడింది. View this post on Instagram A post shared by ICC (@icc) -
3 వికెట్లు పడగొట్టిన అర్జున్ టెండూల్కర్.. పోరాడి ఓడిన ఆంధ్ర
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2023లో గోవా తొలి విజయం నమోదు చేసింది. ఈ టోర్నీ గ్రూపు-సిలో భాగంగా రాంఛీ వేదికగా ఆంధ్ర జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో గోవా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గోవా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. గోవా బ్యాటర్లలో కెప్టెన్ దర్శన్ మిసల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 27 బంతులు మాత్రమే ఎదుర్కొన్న దర్శన్ 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61 పరుగులు చేశాడు. అతడితో పాటు రాహుల్ త్రిపాఠి(47), తునీష్ సాకర్(11 బంతుల్లో 34) రాణించారు. ఆంధ్ర బౌలర్లలో హరిశంకర్ రెడ్డి, పృథ్వీ రాజ్ తలా రెండు వికెట్లు సాధించగా.. మోహన్, హనుమా విహారి చెరో వికెట్ పడగొట్టారు. పోరాడి ఓడిన ఆంధ్ర.. ఇక 232 పరుగుల లక్ష్య ఛేదనలో ఆంధ్ర జట్టు అద్బుతమైన పోరాట పటిమ కనబరిచింది. 18.3 ఓవర్లలో 201 పరుగులకు ఆంధ్ర ఆలౌటైంది. ఆఖరిలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ఆంధ్ర జట్టు ఓటమి పాలైంది. ఆంధ్ర బ్యాటర్లలో హనుమ విహారి(58) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ శ్రీకర్ భరత్(31), అశ్విన్ హెబ్బర్(31) పరుగులు చేశారు. గోవా బౌలర్లలో అర్జున్ టెండూల్కర్, లక్షయ్ గార్గ్ తలా మూడు వికెట్లు సాధించగా.. తారి, దర్శన్ మిసల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. చదవండి: AUS vs SL: డేవిడ్ వార్నర్ మంచి మనసు.. వీడియో వైరల్ -
అప్పట్లో శుబ్‌మన్.. ఇప్పుడు అర్జున్ టెండుల్కర్! ఒకే మాదిరి..
Arjun Tendulkar Latest Six-Pack Abs Pic: టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండుల్కర్‌కు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. సిక్స్ ప్యాక్ బాడీతో మిర్రర్ సెల్ఫీ తీసుకున్న అర్జున్.. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ఫిట్‌నెస్‌కు అర్జున్ ఎంత ప్రాధాన్యం ఇస్తాడో అర్థమవుతోందంటూ ప్రశంసిస్తున్నారు. ఈ ఏడాది కల నెరవేరింది కాగా దేశవాళీ క్రికెట్లో గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ యువ పేసర్ ఐపీఎల్లో అరంగేట్రం కోసం ఎన్నో ఏళ్లు ఎదురుచూశాడు. ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నా రెండేళ్లపాటు అర్జున్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో ఐపీఎల్ పదహారో ఎడిషన్ సందర్భంగా అతడి కల నెరవేరింది. తాజా సీజన్లో ముంబై తరఫున క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టాడు. తన తండ్రి మెంటార్‌గా ఉన్న జట్టుకే ప్రాతినిథ్యం వహించిన అర్జున్.. మొత్తంగా నాలుగు మ్యాచ్‌లు ఆడి 92 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. ఇక ప్రస్తుతం దియోదర్ ట్రోఫీ-2023లో సౌత్ జోన్‌కు ఆడుతున్న అర్జున్.. తాజా సెల్ఫీతో నెట్టింట సందడి చేస్తున్నాడు. అప్పట్లో శుబ్‌మన్.. ఇప్పుడు అర్జున్ కాగా ఆటగాళ్లకు ఫిట్నెస్ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఎప్పటికపుడు జిమ్‌లో చెమటోడుస్తూ.. సరైన జీవనశైలిని పాటిస్తేనే ఆరోగ్యంతో పాటు కెరీర్‌ను పొడిగించుకునే అవకాశం ఉంటుంది. ఇక టీమిండియా క్రికెటర్లలో ఫిట్‌నెస్‌కు మారుపేరుగా నిలిచిన విరాట్ కోహ్లి కూడా గతంలో తన సిక్స్ పాక్ ఆబ్స్ ఫొటోను పంచుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేఎల్ రాహుల్, టీమిండియా భవిష్యత్ ఆశాకిరణంగా మారిన శుబ్‌మన్ గిల్ కూడా అదే బాటలో నడిచారు. ఇప్పుడు అర్జున్ టెండుల్కర్ సైతం వారిని అనుసరిస్తూ తన ఫొటోను షేర్ చేశాడు. కాగా గోవా తరఫున ఏడు మ్యాచ్‌లు ఆడి అత్యధికంగా ఎనిమిది వికెట్లు తీసిన పేసర్‌గా అర్జున్ అగ్రస్థానంలో ఉన్నాడు. దియెదర్ ట్రోఫీలో మయాంక్ అగర్వాల్ సారథ్యంలో ఆడుతున్న అతడు.. కర్ణాటక బౌలర్ విద్వత్ కవెరప్ప, వైశాక్ విజయ్‌కుమార్, వి.కౌశిక్‌తో కలిసి పేస్ దళంలో భాగమయ్యాడు. 23 ఏళ్ల అర్జున్ టెండుల్కర్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ ఉంటూ అప్డేట్లు అభిమానులతో షేర్ చేసుకుంటాడు. చదవండి: ఏడాదికి 50 కోట్ల సంపాదన! మరి.. ధోని సొంత అక్క పరిస్థితి ఎలా ఉందంటే! -
అర్జున్ టెండూల్కర్‌కు గోల్డెన్ చాన్స్
దేవధర్ ట్రోఫీ ఇంటర్ జోనల్ వన్డే క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే సౌత్ జోన్ జట్టును ప్రకటించారు. సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు మంచి గోల్డెన్ చాన్స్ లభించింది. దేవధర్ ట్రోఫీలో భాగంగా అర్జున్ సౌత్ జోన్ జట్టులోకి ఎంపికయ్యాడు. దేశవాళీ క్రికెట్లో అర్జున్ గోవా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక 15 మంది సభ్యులతో కూడిన సౌత్ జోన్ జట్టులో హైదరాబాద్‌కు చెందిన రోహిత్ రాయుడు, ఆంధ్ర క్రికెటర్ రికీ భుయ్‌లకు స్థానం లభించింది. మయాంక్ అగర్వాల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. దేవధర్ ట్రోఫీ ఈనెల 24 నుంచి ఆగస్టు 3 వరకు పుదుచ్చేరిలో జరుగుతుంది. సౌత్ జోన్ జట్టు: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), రోహన్ కున్నుమ్మల్ (వైస్ కెప్టెన్), ఎన్ జగదీషన్ (వికెట్ కీపర్), రోహిత్ రాయడు, కెబి అరుణ్ కార్తీక్, దేవదత్ పడిక్కల్, రికీ భుయ్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, వి కావరప్ప, వి విక్షక్ వి, మోహిత్ రెడ్కర్, సిజోమోన్ జోసెఫ్, అర్జున్ టెండూల్కర్, సాయి కిషోర్. చదవండి: #BrijBhushanSharan: 'చుప్'.. మైక్ విరగ్గొట్టి రిపోర్టర్‌తో దురుసు ప్రవర్తన Duleep Trophy 2023: ఇవాళ్టి నుంచి దులీప్ ట్రోఫీ ఫైనల్.. 2011లో చివరిసారిగా -
LSG Vs MI: కుక్క కరిచిందన్న అర్జున్ టెండుల్కర్.. వీడియో వైరల్
IPL 2023 LSG Vs MI- Arjun Tendulkar : ఐపీఎల్-2023 ప్లే ఆఫ్స్ రేసులో కీలకమైన మరో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. లక్నో వేదికగా మంగళవారం జరుగనున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్- ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. ముంబై నుంచి మా దోస్త్ వచ్చాడు ఈ క్రమంలో లక్నో తమ ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన ఓ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ‘‘ముంబై నుంచి మా దోస్త్ వచ్చాడు’’ అంటూ సోమవారం పంచుకున్న ఆ వీడియోలో అర్జున్ టెండుల్కర్ చెప్పిన విషయమే ఇందుకు కారణం. కాగా టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ తనయుడు, బౌలింగ్ ఆల్‌రౌండర్ అర్జున్ తాజా ఎడిషన్‌తో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ ముంబై ఇండియన్స్ ఆటగాడు క్యాష్‌రిచ్ లీగ్‌లో అడుగుపెట్టాడు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో తొలి వికెట్ తీశాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో 92 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు అర్జున్ టెండుల్కర్. ఈ క్రమంలో లక్నోతో మ్యాచ్‌కు సిద్ధమైన.. ప్రాక్టీస్ సందర్భంగా జెయింట్స్ ఆటగాళ్లను కలిశాడు. కుక్క కరిచింది లక్నో యువ బౌలర్ యుధ్వీర్ సింగ్‌తో ముచ్చటించాడు. ఈ క్రమంలో.. అర్జున్ను ఆలింగనం చేసుకున్న యుధ్వీర్ ..‘ఎలా ఉన్నావు? అంతా ఓకే కదా!’’ అని అడిగాడు. ఇందుకు బదులుగా.. ‘‘కుక్క కరిచింది’’ అని సమాధానమిచ్చాడు. ‘‘అవునా ఎప్పుడు’’ అంటూ యుధ్వీర్ అడగ్గా.. ‘నిన్ననే’ అని బదులిచ్చాడు. ఇరగదీస్తున్నావు బ్రో ఇక తర్వాత మొహ్సిన్ ఖాన్‌ను కలిసిన అర్జున్.. బౌలింగ్ ఇరదీస్తున్నావు బ్రో అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. ‘‘అయ్యో అర్జున్ను కుక్క కరిచిందా? ఇది కూడా వార్తే’’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు!! కాగా ప్లే ఆఫ్స్ రేసులో కీలకమైన మ్యాచ్‌లో అర్జున్‌కు తుది జట్టులో అవకాశం దక్కకపోవచ్చు. లక్నోతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తుది జట్టు (అంచనా) రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నేహాల్ వధేరా, టిమ్ డేవిడ్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, క్రిస్ జోర్డాన్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్, జాసన్ బహ్రెండార్ఫ్. చదవండి: గుజరాత్లో ఉన్నాను.. నాకిష్టమైన తిండి దొరకదు కదా: మహ్మద్ షమీ Mumbai se aaya humara dost. 🤝💙 pic.twitter.com/6DlwSRKsNt — Lucknow Super Giants (@LucknowIPL) May 15, 2023 -
'అర్జున్ను తిడుతున్నావా? చావ్లా విషయంలో నువ్వు చేసిందేంటి!'
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 55 పరుగుల తేడాతో ఓటమిపాలై 2017 తర్వాత అత్యంత పెద్ద ఓటమిని మూటగట్టుకుంది. నెహల్ వదేరా 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చావ్లాను బలిచేసిన నెహల్ వదేరా.. అయితే మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన నెహర్ వదేరా చేసిన ఒక తప్పిదం చర్చనీయాంశంగా మారింది. తాను బ్యాటింగ్ చేయడం కోసం లేని పరుగు కోసం యత్నించి పియూష్ చావ్లాను రనౌట్ చేశాడు. ఆ తర్వాత అర్జున్ టెండూల్కర్ సింగిల్ తీయడానికి ప్రయత్నిస్తే అతనిపై అసహనం వ్యక్తం చేయడం ఆసక్తిగా మారింది. విషయంలోకి వెళితే.. 18వ ఓవర్లో మోహిత్ శర్మ వేసిన తొలి బంతిని పియూష్ చావ్లా మిస్ చేయడంతో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా బంతిని అందుకున్నాడు. అయితే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న నెహాల్ వదేరా వేగంగా పరిగెత్తుకొచ్చాడు. బంతి మిస్ అయిందని తెలిసినా కూడా పరిగెత్తుకురావడం పియూష్ చావ్లాను ఆశ్చర్యానికి గురి చేసింది. (Virat Kohli: చరిత్రకెక్కిన కోహ్లి.. 580 రోజుల తర్వాత) Photo: IPL Twitter అంతటితో ఆగక చావ్లాను క్రీజు వదలమని సంకేతం ఇచ్చాడు. చివరికి చేసేదేం లేక చావ్లా వదేరా కోసం క్రీజు నుంచి బయటకు వచ్చి పరిగెత్తాడు. కానీ అప్పటికే సాహా మోహిత్‌కు బంతి ఇవ్వడం.. ఆలస్యం చేయకుండా వికెట్లను ఎగురగొట్టడంతో చావ్లా రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత బంతిని నెహాల్ వదేరా డీప్స్వ్కేర్లెగ్ దిశగా ఆడాడు. అర్జున్‌పై అసహనం నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న అర్జున్ సింగిల్ కోసం పరిగెత్తుకొచ్చాడు. తన వద్దే స్ట్రైక్ ఉంచుకోవాలని భావించిన వదేరా తొలుత సింగిల్ తీయడానికి ఇష్టపడలేదు. కానీ అర్జున్ అప్పటికే సగం క్రీజు దాటడంతో చేసేదేంలేక సింగిల్ పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఎందుకు పరిగెత్తుకొచ్చావ్ అంటూ అర్జున్‌పై అసహనం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ తర్వాత బంతికి అర్జున్ సింగిల్ తీసి వదేరాకు స్ట్రైక్ ఇవ్వగా.. ఫిఫ్టీ పూర్తి చేయకుండానే వదేరా.. మోహిత్ శర్మ బౌలింగ్‌లో షమీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. (సెంచరీలతో విధ్వంసం.. పసికూనపై లంక ఓపెనర్ల ప్రతాపం) కాగా నెహల్ వదేరాపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ''అర్జున్ సింగిల్ తీయడానికి ప్రయత్నించాడని తిడుతున్నావా.. మరి పియూష్ చావ్లా విషయంలో నువ్వు చేసిందేంటి''.. ''సిగ్గుండాలి.. ఫిఫ్టీ కోసం చావ్లాను బలిచేశావు.. పైగా అర్జున్‌ని తిడుతున్నావు''.. ''ఒక రకంగా నీవల్లే ముంబై ఓడింది '' అంటూ కామెంట్ చేశారు. Nehal Wadhera gets frustrated after immature run by Arjun Tendulkar. He was saying 'No' but Arjun covered 70% pitch already. #NehalWadhera #GTvsMI pic.twitter.com/VAPip85lyF — Vikram Rajput (@iVikramRajput) April 25, 2023 -
ఐపీఎల్లో తొలి సిక్సర్ కొట్టిన అర్జున్ టెండూల్కర్
ముంబై ఇండియన్స్ ఆటగాడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్లో తొలి సిక్సర్ బాదాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో తొమ్మిదో నెంబర్ ఆటగాడిగా క్రీజులోకి వచ్చిన అర్జున్ టెండూల్కర్ మోహిత్ శర్మ బౌలింగ్‌లో భారీ సిక్స్ బాదాడు. మోహిత్ షార్ట్ బాల్ వేయగా.. అర్జున్ డీప్‌స్వ్కేర్ దిశగా సిక్సర్ కొట్టడం హైలెట్‌గా నిలిచింది. కాగా అర్జున్‌కు ఇదే తొలి సిక్సర్ కాగా.. తొలి ఐపీఎల్ సీజన్ కూడా. బౌలర్‌గా మంచి ప్రదర్శన కనబరిచిన అర్జున్.. ఇప్పుడు బ్యాటింగ్‌లోనూ సిక్సర్‌తో అలరించడంతో సచిన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అర్జున్ టెండూల్కర్‌కు బ్యాటింగ్‌లో ప్రమోషన్ ఇవ్వాలని.. అతనికి మంచి టాలెంట్ ఉందని.. ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్‌కు పంపిస్తే ముంబైకి మంచి ప్రయోజనం ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేసింది. నెహల్ వదేరా 21 బంతుల్లో 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కామెరాన్ గ్రీన్ 33 పరుగులు, సూర్యకుమార్ 23 పరుగులు చేశాడు. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్, మోహిత్ శర్మలు చెరో రెండు వికెట్లు తీశారు. అంతకముందు గుజరాత్ నిర్ణీత 20 ఓవరల్లో ఆరు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. గిల్ 56, మిల్లర్ 46, అభినవ్ మనోహర్ 46 పరుగులతో రాణించారు. Arjun aims BIG 🎯#GTvMI #IPLonJioCinema #TATAIPL #IPL2023 pic.twitter.com/cF4DZVviUm — JioCinema (@JioCinema) April 25, 2023 చదవండి: ముంబై , గుజరాత్ మ్యాచ్.. ట్రెండింగ్‌లో సారా టెండూల్కర్! -
ముంబై , గుజరాత్ మ్యాచ్.. ట్రెండింగ్‌లో సారా టెండూల్కర్!
ఐపీఎల్ 16వ సీజన్లో మంగళవారం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్నంత సేపు సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ట్విటర్లో ట్రెండింగ్ లిస్ట్‌లో నిలిచింది. ఇలా ఎందుకున్నది ఈ పాటికే మీకు అర్థమయి ఉండాలి. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్, సారా టెండూల్కర్ల మధ్య ప్రేమాయణం నడుస్తుదంటూ కొన్నాళ్ల క్రితం వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ గిల్ టీమిండియాలో సుస్థిర స్థానం సంపాదించినప్పటి నుంచి సారా, గిల్ల మధ్య మధ్య ఏదో ఉందంటూ పుకార్లు వస్తున్నాయి. అయితే తాము మంచి స్నేహితులమని గిల్ పేర్కొన్నప్పటికి క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం తమకు నచ్చింది ఊహించుకుంటూ బతికేస్తున్నారు. ఇక మరో విషయం ఏంటంటే.. ముంబై ఇండియన్స్ తరపున సారా టెండూల్కర్ సోదరుడు అర్జున్ మ్యాచ్‌లో బరిలో ఉండడమే. ఒకవైపు గుజరాత్ తరపున శుబ్‌మన్ గిల్.. ముంబై జట్టు తరపున అర్జున్ ప్రత్యర్థులుగా తలపడుతుండడంతో సారా ఎవరికి మద్దతివ్వాలో తెలియక మ్యాచ్ చూడడం మానేసిందని కొందరు అభిమానులు ట్విటర్లో ఫన్నీ ట్రోల్స్ చేశారు. ఇక మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్, శుబ్‌మన్ గిల్లు ఒక్కసారి మాత్రమే ఎదురుపడ్డారు. గుజరాత్ టైటాన్స్ తొలి ఓవర్ అర్జున్ వేసినప్పటికి ఆ ఓవర్లో నాలుగో బంతిని గిల్ ఎదుర్కొని ఒక పరుగు చేశాడు. ఇక తన రెండో ఓవర్ తొలి బంతికే సాహాను ఔట్ చేసిన అర్జున్ బౌలింగ్ ఎదుర్కొనే చాన్స్ గిల్‌కు రాలేదు. మ్యాచ్‌లో రెండు ఓవర్లు మాత్రమే వేసిన అర్జున్ 9 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. మరోవైపు గుజరాత్ టైటాన్స్ శుబ్‌మన్ గిల్ సీజన్లో మూడో అర్థసెంచరీ సాధించి తన ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. ''ఏది ఏమైనా గుజరాత్, ముంబై మ్యాచ్‌లో అటు సోదురుడు అర్జున్ టెండూల్కర్.. ఇటు గిల్ ఇద్దరు మంచి ప్రదర్శన కనబరచడంతో సారా టెండూల్కర్‌కు ఎలాంటి బాధ లేదని.. పైగా ఈ ఇద్దరు ఎదురుపడినా ఎవరు పైచేయి సాధించకపోవడం సారాకు సంతోషం కలిగించి ఉంటుందని'' ఫ్యాన్స్ పేర్కొన్నారు. Sara Tendulkar while watching match between ShubmanGill and Arjun Tendulkar 😌#GTvsMI #GTvMI pic.twitter.com/5ptef3bVQ2 — Abhinav Jha 🇮🇳 (@abhinavj617) April 25, 2023 Arjun Tendulkar bowling to Shubman Gill 🔥 Is Sara Tendulkar is in the stands?#MIvsGT | #GTvMI | #IPL2023 pic.twitter.com/pCZrgInyKI — ₹ (@cricket_banana) April 25, 2023 Sara after Shubman Gill fifty be like.#MIvsGT #IPL2023 #GTvsMI pic.twitter.com/IB8FtF5zWi — Ashutosh Srivastava 🇮🇳 (@sri_ashutosh08) April 25, 2023 Sachin and Sara watching Shubman Gill's fifty pic.twitter.com/Os9G1qwfiv — Sagar (@sagarcasm) April 25, 2023 చదవండి: వికెట్లు తీసేవాడేమో.. తప్పు చేశాడని బౌలింగ్ ఇవ్వకుంటే ఎలా? -
వికెట్లు తీసేవాడేమో.. తప్పు చేశాడని బౌలింగ్ ఇవ్వకుంటే ఎలా?
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు చేసింది. 15 ఓవర్ల వరకు 130/4తో సాధారణంగా ఉన్న గుజరాత్ స్కోరు 20 ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి 207 పరుగులకు చేరుకుంది. అంటే చివరి ఐదు ఓవర్లలో గుజరాత్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 97 పరుగులు చేసింది. మిల్లర్, అభినవ్ మనోహర్లకు తోడుగా రాహుల్ తెవాటియా చివర్లో విధ్వంసం సృష్టించడంతో గుజరాత్ 200 మార్కు దాటింది. అయితే గ్రీన్ వేసిన 18వ ఓవర్ ముంబైకి కలిసి రాలేదు. ఆ ఓవర్లో అభినవ్ మనోహర్ రెండు సిక్సర్లు కొట్టగా.. మిల్లర్ ఒక సిక్సర్ కొట్టడంతో మొత్తంగా ఓవర్లో 22 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత మెరిడిత్ బౌలింగ్‌లోనూ మూడు సిక్సర్లు వచ్చాయి. ఆ తర్వాత చివరి ఓవర్లో తెవాటియా మరో రెండు సిక్సర్లు బాదాడు. అర్జున్ను నమ్మని రోహిత్ అయితే వాస్తవానికి అర్జున్ టెండూల్కర్ ఈ మ్యాచ్‌లో మంచి బౌలింగ్ కనబరిచాడు. రెండు ఓవర్లు వేసిన అతను 9 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. అయితే పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో అర్జున్ ఒకే ఓవర్లో 31 పరుగులు సమర్పించుకొని ముంబై కొంప ముంచాడు. ఈ మ్యాచ్‌లో కూడా మరోసారి అలాగే వేస్తే ఏం చేయలేమని రోహిత్ భావించి ఉంటాడు. కానీ గుజరాత్‌తో మ్యాచ్‌లో అర్జున్ బౌలింగ్ కాస్త బెటర్ అనిపించింది. ఆ 18వ ఓవర్ కామెరాన్ గ్రీన్‌తో కాకుండా అర్జున్‌తో వేయించి ఉంటే బాగుండేదని.. వికెట్లు తీసేవాడేమోనని పలువురు అభిమానులు అభిప్రాయపడ్డారు. చదవండి: 'అర్జున్ను తిడుతున్నావా? చావ్లా విషయంలో నువ్వు చేసిందేంటి!' -
టెండుల్కర పై పగ తీర్చుకునే రోహిత్ శర్మ
-
ప్రేమ విషయం పేరెంట్స్‌కు చెప్పలేనన్న సచిన్! అంజలి అంతటి త్యాగం చేసిందా?
Sachin- Anjali Love Story In telugu: తొలి చూపులోనే ప్రేమ.. ప్రణయంలో ఐదేళ్ల ప్రయాణం.. వయసులో ఐదేళ్ల వ్యత్యాసం... అతడు ఆమె కంటే చిన్నవాడు కావడం వల్లపెద్దల నుంచి నో అనే మాట వినాల్సి వస్తుందేమోనన్న భయం.. అతడు మొహమాటపడ్డాడు.. ఆమె బాధ్యతను తన భుజాల మీద వేసుకుంది.. మనసిచ్చిన వాడితో కలిసి జీవితాంతం నడవాలన్న కలను నెరవేర్చుకునేందుకు తనే ముందుడుగు వేసింది.. పెద్దలకు తమ ప్రేమ విషయం చెప్పింది.. వాళ్లు అర్థం చేసుకున్నారు.. ఆ జంట పెళ్లి బంధంతో ఒక్కటైంది.. ఆటలో రికార్డుల రారాజే అయినా.. ఇంట్లో ప్రతి చిన్న విషయానికి తనపై ఆధారపడే భర్త కోసం ఆమె తన కెరీర్‌ను త్యాగం చేసింది.. ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు.. ముచ్చటైన కుటుంబం.. అదే ఆమె ప్రపంచం.. నిజానికి ఆమె లేకుంటే అతడు లేడు.. తను క్రికెట్ దేవుడిగా ఎదగడంలో ఆమెది కూడా కీలక పాత్రే.. అలాంటి భార్యను పొందడం తన అదృష్టం అంటాడతడు.. నిజమే.. సంపన్న కుటుంబంలో పుట్టి.. ఏకైక సంతానం కావడంతో అల్లారుముద్దుగా పెరిగి.. డాక్టర్ అయినప్పటికీ కుటుంబం కోసం బంగారం లాంటి కెరీర్‌ను పణంగా పెట్టిన ఆ మహిళ పేరు అంజలి. టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ సతీమణి. సచిన్ 50వ పుట్టిన రోజు సందర్భంగా కపుల్ గోల్స్ సెట్ చేసిన అంజలి- సచిన్ ప్రేమకథ. తొలి చూపులోనే ప్రేమ 17 ఏళ్ల వయసులో 1989లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు సచిన్ టెండుల్కర్. పాకిస్తాన్ పర్యటనలో టెస్టు సిరీస్‌లో భాగంగా అరంగేట్రం చేసిన అతడు తొలి మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయాడు.. కానీ రెండో మ్యాచ్‌లో అర్ధ శతకంతో మెరిశాడు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్ ముగించుకుని జట్టుతో పాటు భారత్‌కు పయనమయ్యాడు. స్వదేశానికి చేరుకుని స్వస్థలానికి పయనమయ్యే క్రమంలో ఎయిర్‌పోర్టులో తొలిసారి అంజలిని చూశాడు. తన తల్లిని తీసుకువెళ్లేందుకు అక్కడికి వచ్చిన అంజలి కూడా తొలి చూపులోనే ప్రేమలో పడింది. ఆమె డాక్టర్ తర్వాత కామన్ ఫ్రెండ్ ద్వారా ఇద్దరూ మరోసారి కలుసుకున్నారు. స్నేహం పెరిగి.. ప్రేమగా మారింది. అప్పుడప్పుడే క్రికెటర్‌గా ఎదుగుతున్నాడు సచిన్.. మరోవైపు అంజలి మెడిసిన్ చదువుతోంది.. ప్రేమలో ఉన్నా సచిన్ ఆటను, అంజలి చదువును నిర్లక్ష్యం చేయకుండా కెరీర్‌కు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. చదువులో చురుకైన అంజలికి క్రికెట్ గురించి పెద్దగా తెలియదు.. అయితే, ఎప్పుడైతే సచిన్‌ను ఇష్టపడటం మొదలుపెట్టిందో అప్పటి నుంచి ఆటపై కూడా ఆసక్తి పెంచుకుంది.. ఇద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం మొదలుపెట్టారు.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. జర్నలిస్టు అని చెప్పు సరేనా! అంజలిని తన తల్లిదండ్రులకు పరిచయం చేయాలనుకున్న సచిన్.. ఆమెను ఓ రోజు ఇంటికి ఆహ్వానించాడు. అయితే, ఇంట్లో వాళ్లందరికీ ముందే విషయం తెలిసిపోతే బాగుండదని భావించి తనను తాను జర్నలిస్టుగా పరిచయం చేసుకోమని అంజలికి చెప్పాడు. నువ్వు ఎలా అంటే అలా! సరే అంది అంజలి. సల్వార్ కమీజ్‌లో డ్రెస్సప్ అయి సచిన్ ఇంటికి వెళ్లింది. కాబోయే అత్తామామలను పరిచయం చేసుకుంది. ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య అనుబంధం మరింత పెరిగింది. ఫోన్ బిల్స్ కట్టలేక 1990లలో మొబైల్ ఫోన్స్ ఉనికి పెద్దగా లేదు. కాబట్టి సచిన్‌తో మాట్లాడాలంటే అంజలి ఎంతో విశాలమైన కాలేజీ క్యాంపస్ దాటి టెలిఫోన్ బూత్‌కు వెళ్లి అక్కడ నుంచి కాల్ చేసేదట. అయితే, సచిన్ తరచూ విదేశీ టూర్లకు వెళ్తున్న కారణంగా బిల్ ఎక్కువగా వస్తుందని భావించి లెటర్స్ రాయడం మొదలుపెట్టింది. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో అంజలి స్వయంగా చెప్పింది. 1994లో నిశ్చితార్థం.. మరుసటి ఏడాది పెళ్లి తమ ప్రేమ విషయం గురించి తల్లిదండ్రులకు చెప్పేందుకు సచిన్ మొహమాట పడటంతో అంజలినే స్వయంగా వారితో మాట్లాడి ఒప్పించింది. అలా సచిన్- అంజలిల నిశ్చితార్థం 1994లో న్యూజిలాండ్ టూర్లో ఉన్న సమయంలో జరిగింది. ఆ మరుసటి ఏడాది మే 24న వీరి వివాహం జరిగింది. 1997లో తొలి సంతానంగా కుమార్తె సారా జన్మించగా, 1999లో కుమారుడు అర్జున్ జన్మించాడు. సారా మోడల్‌గా, అర్జున్ క్రికెటర్‌గా అదృష్టం పరీక్షించుకుంటున్నారు. కుటుంబం కోసం త్యాగం పిడియాట్రిషియన్గా ప్రభుత్వాసుపత్రిలో ఉద్యోగం పొందిన అంజలి.. భార్యగా, డాక్టర్‌గా రెండు పడవల మీద ప్రయాణం చేయలేకపోయింది. సచిన్ తన కెరీర్లో బిజీ కావడంతో పిల్లల కోసం గృహిణిగా మారిపోయింది. ఎవరినీ ఊహించుకోలేను ‘‘సచిన్ కాకుండా నా జీవితంలో మరో వ్యక్తికి చోటు లేదు. తనని నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. నేను తన గర్ల్‌ఫ్రెండ్‌గా ఉన్నప్పుడైనా.. భార్యగా మారిన తర్వాతైనా మా బంధంలో ఎలాంటి మార్పు లేదు. తను కాకుండా నా జీవితంలో వేరే వ్యక్తిని అసలు ఊహించుకోలేను. తను ఆడే ప్రతి మ్యాచ్‌ను నేను తప్పకచూసేదాన్ని. స్టేడియానికి వెళ్లడం పెద్దగా ఇష్టం ఉండదు. అందుకే ఇంట్లోనే టీవీలో తన బ్యాటింగ్ చూసేదాన్ని. మా ఇంట్లో ఇందుకోసమే ప్రత్యేకంగా ఓ టీవీ ఉంది. దాని పక్కనే గణేషుడి విగ్రహం కూడా! సచిన్ క్రీజులో ఉన్నంత సేపు అలా చూస్తూ ఉండిపోతా. ఆ సమయంలో కనీసం తినడానికి కూడా అక్కడి నుంచి కదలను. కనీసం నీళ్లు కూడా ముట్టను. ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లకు ఆన్సర్ కూడా చేయను’’ అంటూ సచిన్‌తో పాటు తన ఆటను కూడా అంతే ప్రేమిస్తానని అంజలి ఒక సందర్భంలో చెప్పింది. అంజలి గురించి ఆసక్తికర విశేషాలు ►గుజరాతీ కుటుంబంలో జన్మించిన అంజలి ముంబైలో పెరిగింది. ►అంజలి తండ్రి ఆనంద్ మెహతా గుజరాతీ పారిశ్రామికవేత్త. ఆమె తల్లి అన్నాబెల్ బ్రిటిష్ సంతతికి చెందినవారు. అప్నాలయ పేరుతో ఎన్జీవో స్థాపించారు. ►అంజలి తాతయ్య భూస్వామి. ఆమె కుటుంబానికి బ్రీచ్‌కాండీ ఏరియాలో అత్యంత విలాసమైన రెసిడెన్షియల్ బంగ్లాలు ఉన్నాయి. ►అంజలి కజిన్లలో చాలా మంది మెక్సికన్ మూలాలు ఉన్నవారు ఉన్నారు. ►అంజలి కుటుంబానికి నెహ్రూ- గాంధీ కుటుంబంతో సత్సంబంధాలు ఉండేవట. చదవండి: #HBD Sachin: సచిన్ క్రికెట్‌కి దేవుడైతే.. ఆ భక్తుడు ప్రత్యక్షం కావాల్సిందే! గతంలో ఎప్పుడూ చూడలేదు.. పర్పుల్ క్యాప్ పొందేందుకు అర్హుడు: కోహ్లి -
రోహిత్ చేసిన తప్పు అదే.. పాపం అర్జున్ బలైపోయాడు! వీడియో వైరల్
ఐపీఎల్-2023లో ముంబై ఇండియన్స్ మరో ఓటమి చవి చూసింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో ముంబై పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ.. తొలుత పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ను 15 ఓవర్ల వరకు ముంబై బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. పంజాబ్ 15 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 118 పరుగులు మాత్రమే చేసింది. ఇక్కడే ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన తప్పిదం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. 16 ఓవర్ వేసేందుకు అద్భుతంగా బౌలింగ్ చేసిన వెటరన్ స్పిన్నర్ పియూష్ చావ్లాను కాదని, అంత అనుభవం లేని అర్జున్ టెండూల్కర్‌ను రోహిత్ తీసుకువచ్చాడు. ఇదే ముంబై కొంపముంచింది. 16 ఓవర్ వేసిన అర్జున్ ఏకంగా 31 పరుగులు సమర్పించకున్నాడు. ఇక్కడి నుంచి ఊచకోత మొదలు పెట్టిన పంజాబ్ బ్యాటర్లు.. చివరి ఐదు ఓవర్లలో 96 పరుగులు చేశారు. ఇక రోహిత్ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు ముంబై అభిమానులు తప్పబడుతున్నారు. పియూష్ చావ్లా ఓవర్ల కోటాను రోహిత్ ఎందుకు పూర్తి చేయలేదో అర్ధం కావడం లేదని సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. "రోహిత్ చేసిన తప్పుకు అంతగా అనుభవం లేని అర్జున్ బలైపోయాడు" మరి కొంత మంది కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసిన చావ్లా కేవలం 15 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా అంతకుముందు రెండు మ్యాచ్‌ల్లోనూ అర్జున్‌తో రోహిత్ రెండు ఓవర్లు మాత్రమే వేయించాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో మాత్రం అర్జున్‌కు మరో ఓవర్ ఇచ్చి రోహిత్ తప్పు చేశాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసిన అర్జున్.. ఏకంగా 48 పరుగులిచ్చి కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. చదవండి: IPL 2023: అతడే మా కొంప ముంచాడు.. బాధపడాల్సిన అవసరం లేదు! సంతోషంగా ఉంది -
ఒకే ఓవర్లో 31 పరుగులు.. అర్జున్ టెండూల్కర్ అత్యంత చెత్త రికార్డు
ఐపీఎల్-2023లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. ఇక తన తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఆకట్టుకునే ప్రదర్శనే చేసిన ముంబై ఇండియన్స్ యువ పేసర్ అర్జున్ టెండూల్కర్.. ఈ మ్యాచ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసిన అర్జున్.. ఏకంగా 48 పరుగులిచ్చి కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. అయితే తొలి రెండు ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసిన అర్జున్, తన మూడో ఓవర్లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. తీవ్ర ఒత్తిడికి గురైన టెండూల్కర్ ఆ ఓవర్లో ఏకంగా 31 పరుగులు సమర్పించుకున్నాడు. అందులో ఓ నోబ్, వైడ్ కూడా ఉండడం గమనార్హం. ఇది పంజాబ్ ఇన్నింగ్స్ 16వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఇక ఒకే ఓవర్లో భారీగా పరుగులు ఇచ్చిన అర్జున్ టెండూల్కర్ ఓ చెత్త రికార్డును నెలకొల్పాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా గుజరాత్ పేసర్ యశ్ దయాల్‌తో సంయుక్తంగా నిలిచాడు. ఈ టోర్నీలో భాగంగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో యశ్ దయాల్ కూడా ఒక ఓవర్లో 31 పరుగులు ఇచ్చాడు. ఇదే ఓవర్లో కేకేఆర్ ఆటగాడు రింకూ సింగ్ వరుసగా ఐదు సిక్సర్లు బాదిన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2023: 17 కోట్లు దండగా అన్నారు.. ఇప్పుడు దుమ్ము రేపుతున్నాడు! నోళ్లు మూయించాడుగా pic.twitter.com/RaFgBUsg2l — Guess Karo (@KuchNahiUkhada) April 23, 2023 -
ఇరగదీశాడని ఆకాశానికెత్తారు.. ఒక్క ఓవర్‌తో కొంపముంచాడు
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ బౌలర్ అర్జున్ టెండూల్కర్ తన రెండో మ్యాచ్‌లోనే తేలిపోయాడు. శనివారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో అర్జున్ దారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. మూడు ఓవర్లు వేసిన అర్జున్ 48 పరుగులిచ్చుకొని ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. మరో విచిత్రమేంటంటే.. తొలి రెండు ఓవర్లు బాగానే బౌలింగ్ చేసిన అర్జున్.. తాను వేసిన మూడో ఓవర్లో ఏకంగా 31 పరుగులు సమర్పించుకున్నాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఒక దశలో పంజాబ్ కింగ్స్ 160 పరుగులు చేస్తుందా అన్న అనుమానం కలిగింది. కానీ అర్జున్ టెండూల్కర్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ మ్యాచ్ స్వరూపాన్నే మర్చేసింది. ఆ ఓవర్లో అర్జున్ వైడ్, నోబ్ సహా 6,4,4,6,4,4,1 మొత్తంగా 31 పరుగులు సమర్పించుకొని ముంబై కొంపముంచాడు. ఈ దెబ్బతోనే పంజాబ్ కింగ్స్ స్కోరు 200 దాటింది. దీనికి పరోక్షంగా కారణం అర్జున్ టెండూల్కర్ అనే నిస్సందేహంగా చెప్పొచ్చు. కాగా కేకేఆర్‌తో మ్యాచ్ ద్వారా అర్జున్ ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ బౌలింగ్ చేసిన అర్జున్ ఒక వికెట్ తీశాడు. అంతే సోషల్ మీడియాలో అర్జున్ టెండూల్కర్ పేరు మార్మోగిపోయింది. అరె ఏం బౌలింగ్ చేశాడంటూ ఊదరగొట్టారు. కానీ నిజానికి అర్జున్ టెండూల్కర్ చేసిందేమి లేదు. అప్పటికే ఎస్ఆర్హెచ్ ఓటమి ఖరారైపోయింది. తన వంతుగా ఆఖరి వికెట్ తీసిన ఎస్ఆర్హెచ్ను ఆలౌట్ మాత్రమే చేశాడు. దీనికే అతనిపై ప్రశంసల వర్షం కురిపించారు. Arjun Tendulkar bowled the joint-most expensive over in #IPL2023 so far (31 runs). 📸: Jio Cinema pic.twitter.com/VuJMNh4l7R — CricTracker (@Cricketracker) April 22, 2023 దిగ్గజం సచిన్ కుమారుడు కావడంతో అందరు అర్జున్ను ఆకాశానికెత్తారు. కానీ అతని బౌలింగ్ ప్రతిభ ఏంటనేది పంజాబ్‌తో మ్యాచ్‌లో బయటపడింది. మ్యాచ్‌లో నాలుగు వైడ్స్ వేసిన అర్జున్ కొన్ని యార్కర్లతో మెప్పించినప్పటికి ప్రత్యర్థి బ్యాటర్లను మాత్రం ఇబ్బంది పెట్టలేకపోయాడు. సామ్ కరన్, హర్‌ప్రీత్ బాటియాలు అర్జున్ బౌలింగ్‌ను చీల్చి చెండాడారు. -
అవును.. ఒక్కసారి అలా జరిగింది.. ఈ విషయం అర్జున్‌కు గుర్తుచేయకండి: సచిన్
IPL 2023: అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు.. 34,357 పరుగులు.. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్‌గా ఎనలేని కీర్తిప్రతిష్టలు.. క్రికెట్ దేవుడంటూ నీరాజనాలు.. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ సుదీర్ఘ కెరీర్లో ఎన్నెన్నో చిరస్మరణీయ విజయాలు.. అనేకానేక రికార్డులు.. గొప్ప ఆటగాడిగా పేరొందిన సచిన్ 2013లో రిటైర్ అయినా.. అభిమానులు మాత్రం ఏదో ఒక సందర్భంలో అతడి ఘనతలు గుర్తుచేసుకుంటూ నేటికీ ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు సచిన్ కుమారుడు అర్జున్ వంతు వచ్చింది. సగటు తండ్రి మనసు దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్న ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఐపీఎల్-2023 సీజన్‌తో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చిన అర్జున్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తన రెండో మ్యాచ్‌లో తొలిసారి వికెట్ పడగొట్టాడు. ఈ నేపథ్యంలో సచిన్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. తానెంత ఎత్తుకు ఎదిగినా పిల్లల చిన్న చిన్న ఘనతలే తనకు ఎంతో గొప్ప అని భావించే సగటు తండ్రి మనసును చాటుకుంటున్నాడు. ఈ క్రమంలో ట్విటర్లో అభిమానులతో ముచ్చటించిన సచిన్‌కు ఓ ఫాలోవర్ అర్జున్ గురించి ఓ ప్రశ్న అడిగాడు. అవును.. ఒక్కసారి.. కానీ సచిన్ తొలిసారిగా ట్విటర్లో శుక్రవారం నిర్వహించిన #AskSachin సెషన్లో.. ‘‘మిమ్మల్ని అర్జున్ ఎప్పుడైనా అవుట్ చేశాడా?’ అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ‘‘అవును.. ఒకే ఒక్కసారి.. అది కూడా లార్డ్స్‌లో.. కానీ ఈ విషయం అర్జున్‌కు అస్సలు గుర్తుచేయకండి’’ అని సరదాగా బదులిచ్చాడు. కాగా సచిన్ టెండుల్కర్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్(2008-13)కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అర్జున్ అరంగేట్రం నేపథ్యంలో ఐపీఎల్లో ఆడిన.. అది కూడా ఒకే జట్టుకు ఆడిన తండ్రీకొడుకులుగా వీరు సరికొత్త చరిత్ర సృష్టించారు. కాగా సచిన్ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ఐకాన్‌గా ఉన్న విషయం తెలిసిందే. చదవండి: నువ్వేమీ ముసలోడివి కాలేదు!; సచిన్‌లా 16 ఏళ్లకే ఆట మొదలెడితే: ధోని 16 కోట్లు తీసుకున్నావు.. మంచిగా కూర్చోని ఎంజాయ్ చేస్తున్నావు! Yes, once at Lord's but don't remind Arjun!🤫 https://t.co/Mm3Bf2ZL77 — Sachin Tendulkar (@sachin_rt) April 21, 2023 A special moment for young Arjun Tendulkar, who gets his first wicket in #TATAIPL and it is his captain Rohit Sharma, who takes the catch of Bhuvneshwar Kumar. Arjun takes the final wicket and @mipaltan win by 14 runs. pic.twitter.com/1jAa2kBm0Z — IndianPremierLeague (@IPL) April 18, 2023 -
సిక్సర్ల వర్షం కురిపించిన అర్జున్ టెండూల్కర్.. వీడియో వైరల్
క్రికెట్ దిగ్గజం సచిన్ తనయుడు, ముంబై ఇండియన్స్ యువ పేసర్ అర్జున్ టెండూల్కర్ తొలి ఐపీఎల్ వికెట్ సాధించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2023లో భాగంగా మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ తొలి ఐపీఎల్ వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో అర్జున్ తన అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. 2.5 ఓవర్లు వేసిన అర్జున్ టెండూల్కర్ కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక్క వికెట్ సాధించాడు. దీంతో అతడిపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. నెట్స్‌లో చెమటోడ్చుతున్న అర్జున్ ఇక అర్జున్ అర్జున్ టెండూల్కర్‌కు బౌలింగ్‌తో బ్యాటింగ్ కూడా చేసే సత్తా ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతడి పేరిట ఓ సెంచరీ కూడా ఉంది. కాగా ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 22న వాంఖడే వేదికగా పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ క్రమంలో ఇప్పటికే ముంబై చేరుకున్న రోహిత్ సేన నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తమ నెట్ ప్రాక్టీస్‌లో భాగంగా అర్జున్ కూడా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే అర్జున్ బౌలింగ్ మాత్రమే కాకుండా బ్యాటింగ్‌పై కూడా దృష్టిపెట్టాడు. తమ బౌలర్లు బౌలింగ్ చేస్తుండగా అర్జున్ భారీ షాట్లు ఆడుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ ట్విటర్లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IPL 2023: ఎందుకు వస్తున్నాడో తెలియదు.. ప్రతీ మ్యాచ్‌లో ఇంతే! తీసి పడేయండి.. 𝕊𝕥𝕣𝕚𝕜𝕚𝕟𝕘 so good, you'd think it was their first job 😍 Look again 😉#OneFamily #MumbaiMeriJaan #MumbaiIndians #TATAIPL #IPL2023 pic.twitter.com/2QRlreAOID — Mumbai Indians (@mipaltan) April 19, 2023 -
రెండో మ్యాచ్‌లోనే తిట్ల దండకం అందుకున్న అర్జున్ టెండూల్కర్.. ఎందుకో చూడండి..!
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నిన్న (ఏప్రిల్ 18) జరిగిన మ్యాచ్ సందర్భంగా కెమరాల్లో రికార్డైన ఓ సన్నివేశానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇందులో సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కోపంతో ఊగిపోతూ కనిపించాడు. తనపై కెమెరామెన్ పదేపదే ఫోకస్ చేస్తుండటంతో సహనం కోల్పోయిన అర్జున్ తిట్ట దండకం అందుకున్నాడు. ఈ సన్నివేశం ముంబై ఇన్నింగ్స్ 2వ ఓవర్ సందర్భంగా జరిగనట్లు వీడియో ద్వారా స్పష్టమవుతుంది. ఏం జరిగిందంటే.. ముంబై ఇన్నింగ్స్ 2వ ఓవర్ సందర్భంగా బ్రాడ్‌కాస్టర్ అర్జున్‌కు సంబంధించిన ఓ క్లిప్‌ను చూపించాడు. మ్యాచ్‌కు ముందు అర్జున్.. తన తండ్రి సచిన్‌తో ఏదో మాట్లాడుతున్న సందర్భమది. ఈ క్లిప్ ప్లే చేసిన తర్వాత కెమెరా సచిన్‌పై ఫోకస్ కావడంతో కామెంటేటర్ రవిశాస్త్రి.. కొనేళ్ల కష్టం తర్వాత కలను సాకారం చేసుకున్న కొడుకును చూడటం తండ్రికి ఎంతో గర్వకారణమని సచిన్ ఉద్దేశిస్తూ అన్నాడు. pic.twitter.com/ZyvGYNfCmy — Tirth Thakkar (@ImTT01) April 18, 2023 ఆ మరు క్షణమే డగౌట్లో కూర్చున్న అర్జున్ ఫేస్‌ను కెమెరామెన్ జూమ్ చేశాడు. స్టేడియంలోని బిగ్ స్క్రీన్లపై తన ముఖం కనబడటంతో ఒక్కసారిగా కోపంతో ఊగిపోయిన అర్జున్.. కెమెరామెన్‌పై తిట్ట దండకం అందుకున్నాడు. డగౌట్లో తన పక్కను కూర్చున్న తిలక్ వర్మవైపు చూస్తూ అర్జున్ అసభ్యకరమైన పదజాలాన్ని వాడాడు. ఈ మొత్తం తంతు కెమెరాల్లో రికార్డు కావడం, అది కాస్త సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అర్జున్ ఆడుతున్నది కేవలం రెండో మ్యాచే కాబట్టి, అతనిపై కెమెరాలు పదేపదే ఫోకస్ చేస్తే ఒత్తిడికి లోనవుతాడు, అలా చేయడం కెమెరామెన్ తప్పేనని కొందరంటుంటే, మరి కొందరేమో.. ఇంత పొగరు పనికిరాదు, సెలెబ్రిటీ కొడుకు అన్న తర్వాత ఆ మాత్రం ఫోకస్ ఉంటుందంటూ అర్జున్నే తప్పుబడుతున్నారు. అర్జున్ ఏమన్నాడంటే.. వీడియోల్లో కనిపిస్తున్న దాన్ని బట్టి చూస్తే.. “Iski Maa ki, mujhe jaan bujh ke dikhate hai BC" అన్నట్లు తెలుస్తోంది. దీని అర్ధం వర్ణించలేని భాషలో ఉంది. కెమెరామెన్ ఉద్దేశపూర్వకంగా నన్ను హైలైట్ చేస్తున్నాడు అన్నది దాని అంతర్ధాం. -
Arjun Tendulkar: తీసింది ఒక్కటే వికెట్.. ఇంత హడావుడి అవసరమా..?
ఐపీఎల్-2023లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నిన్న (ఏప్రిల్ 18) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 14 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అన్ని విభాగాల్లో మూకుమ్మడిగా రాణించి, 2 వరుస పరాజయాల తర్వాత హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. కెమారూన్ గ్రీన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (64 నాటౌట్, 1/29) చెలరేగగా.. తిలక్ వర్మ (37), ఇషాన్ కిషన్ (38) బ్యాటింగ్‌లో.. మెరిడిత్ (2/33), బెహ్రెన్‌డార్ఫ్ (2/37) బౌలింగ్‌లో రాణించారు. మ్యాచ్ ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌల్ చేసిన అర్జున్ టెండూల్కర్, 20 పరుగుల టార్గెట్‌ను డిఫెండ్ చేసుకుని, తన జట్టుకు అపురూప విజయాన్ని అందించడంతో పాటు తన ఐపీఎల్ కెరీర్లో తొలి వికెట్‌ను సాధించాడు. ఈ క్రమంలో హ్యాట్రిక్ విజయాలు సాధించిన ముంబై ఇండియన్స్‌పై, ఐపీఎల్ కెరీర్లో తొలి వికెట్ (భువనేశ్వర్) సాధించిన అర్జున్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, సహచర ఆటగాళ్ల దగ్గరి నుంచి సినీ, క్రీడా, రాజకీయ, వ్యాపార రంగ దిగ్గజాల వరకు అందరూ పోటీపడుతూ ముంబై ఇండియన్స్‌ను ముఖ్యంగా సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ సాధించిన ఘనతను వేనోళ్ల కీర్తిస్తున్నారు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో అర్జున్ చివరి ఓవర్ అద్భుతంగా బౌల్ చేశాడని, అతను బౌల్ చేసిన ఐదు బంతులు అద్భుతమైన యార్కర్ లెంగ్త్ బంతులని కొనియాడుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ స్పెల్‌లోనూ అర్జున్ పొదుపుగా బౌలింగ్ చేశాడని, అరంగేట్రం మ్యాచ్‌లోనూ అతను మెరుగ్గానే బౌలింగ్ చేసినప్పటికీ వికెట్ దక్కలేదని అంటున్నారు. అర్జున్‌పై ప్రశంసలతో ఆగని సెలబ్రిటీలు.. క్రికెట్ దేవుడు, అర్జున్ తండ్రి సచిన్‌ను కూడా ఆకాశానికెత్తుతున్నారు. తండ్రి పెంపకం వల్లే అర్జున్ కష్టపడి ఈ స్థాయికి ఎదిగాడని కొనియాడుతున్నారు. సచిన్.. నెపొటిజమ్ అనే మాటకు ఛాన్స్ ఇవ్వకుండా, తన కొడుకు కష్టపడి సొంతంగా ఎదిగేలా చేశాడని కీర్తిస్తున్నారు. సచిన్ కొడుకు హోదాలో అర్జున్ ఎప్పుడో అంతర్జాతీయ క్రికెట్ కూడా ఆడి ఉండేవాడని, అలాంటిది ఫ్రాంచైజీ క్రికెట్ ఆడేందుకే అర్జున్ దాదాపు మూడేళ్లు నిరీక్షించాల్సి వచ్చిందని సచిన్ సమకాలీకులు, అతని సీనియర్లు అంటున్నారు. మున్ముందు అర్జున్ ఫ్రాంచైజీ క్రికెట్‌తో పాటు టీమిండియా తరఫున కూడా అద్భుతాలు చేస్తాడని మెజారిటీ జనం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అర్జున్ సాధించిందేమిటి.. సచిన్ కొడుకు కాకపోయి ఉంటే.. మరోవైపు అర్జున్‌పై పొగడ్తల వర్షాన్ని జీర్ణించుకోలేని వారు, అర్జున్ కష్టాన్ని చులకన చేసే వాళ్లు కూడా లేకపోలేదు. అర్జున్ కష్టాన్ని, భారత క్రికెట్‌కు సచిన్ చేసిన సేవలను లెక్క చేయకుండా కొందరు అర్జున్ను అతని తండ్రిని విమర్శిస్తున్నారు. అర్జున్ ఏం సాధించాడని ఇంతలా హైలైట్ చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఏమీ లేకపోయినా భజన చేయడం కొందరికి అలవాటుగా మారిందని అంటున్నారు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో అర్జున్‌ది అతి సాధారణ ప్రదర్శన అని, సచిన్ కొడుకు కాకపోయి ఉంటే సెలబ్రిటీలు ఇంతలా సోషల్‌మీడియాను హోరెత్తించేవారా అని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి అర్జున్ బౌలింగ్‌లో చాలా లోపాలు ఉన్నాయని, ఎవరైతే అర్జున్ను పొగుతున్నారో వారికి నిజంగా సచిన్‌పై అభిమానముంటే, వాటిని వేలెత్తి చూపి సరి చేసుకునేలా చేయాలని కోరుతున్నారు. ఆఖరి 5 బంతుల్లో 5 సిక్సర్ల కొట్టి, అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన రింకూ సింగ్ లాంటి వాళ్లకు ఇలాంటి ప్రశంసలే దక్కితే ఊహకందని ఎన్నో అద్భుతాలు చేస్తారని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా అర్జున్‌పై ప్రశంసలతో, విమర్శలతో సోషల్‌మీడియా హోరెత్తిపోతుంది. -
'ఎగతాళి చేసినోళ్లే మెచ్చుకుంటున్నారు'
ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 14 పరుగుల తేడాతో గెలిచి సీజన్లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. పెద్దగా అనుభవం లేకపోయినప్పటికి కెప్టెన్ రోహిత్ శర్మ ఆఖరి ఓవర్లో బంతిని అర్జున్ టెండూల్కర్ చేతికి ఇచ్చాడు. అయితే కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ అద్భుతంగా బౌలింగ్ చేసిన అర్జున్ ఒక వికెట్ తీసుకొని నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతేకాదు భువనేశ్వర్‌ను ఔట్ చేసిన అర్జున్ తన ఖాతాలో తొలి వికెట్‌ను వేసుకున్నాడు. అర్జున్ ప్రదర్శనపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఒకప్పుడు క్రికెటర్‌గా పనికిరాడు అని ఎగతాళి చేసినవాళ్లే ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. తాజాగా పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా అర్జున్ టెండూల్కర్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. ''చాలా మంది అర్జున్ను బంధుప్రీతి అంటూ ఎగతాళి చేశారు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో అద్బుతంగా బౌలింగ్ చేసి తానేంటో నిరూపించుకున్నాడు. పెద్దగా అనుభవం లేనప్పటికి ఆఖరి ఓవర్లో సూపర్ బౌలింగ్ చేసి కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. అర్జున్‌కు అభినందనలు. అర్జున్ ప్రదర్శన పట్ల సచిన్ కచ్చితంగా గర్వించాలి.'' అని పేర్కొంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ 40 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 60 పరుగులు నాటౌట్ టాప్ స్కోరర్‌గా నిలవగా.. తిలక్ వర్మ 17 బంతుల్లో 37 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. ఇషాన్ కిషన్ 38 పరుగులు చేశాడు. అనంతరం 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ 19.5 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌట్ అయింది. మయాంక్ అగర్వాల్ 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. క్లాసెన్ 36, మార్క్రమ్ 22 పరుగులు చేసి ఔటయ్యారు. Many mocked him for nepotism but tonight he has shown his spot is well earned 👏 Congrats Arjun. @sachin_rt you must be so proud #Arjuntendulkar #SRHvsMI #TATAIPL2023 — Preity G Zinta (@realpreityzinta) April 18, 2023 చదవండి: పరుగెత్తడంలో అలసత్వం.. కర్మ ఫలితం అనుభవించాల్సిందే #Tilak Varma: ఉన్నది కాసేపే.. కానీ దడదడలాడించాడు -
ఎట్టకేలకు టెండుల్కర్ అంటూ సచిన్ ఉద్వేగ ట్వీట్! నీ మనసు బంగారం షారుఖ్!
IPL 2023- SRH Vs MI- Arjun Tendulkar: ‘‘ముంబై ఇండియన్స్ మరోసారి అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిసింది. కామెరాన్ గ్రీన్ బ్యాట్, బాల్‌తో రాణించాడు. ఇషాన్, తిలక్ ఎప్పటిలాగానే మరోసారి తమ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. ఐపీఎల్ రోజురోజుకీ మరింత ఆసక్తికరంగా మారుతోంది. చాలా బాగా ఆడుతున్నారు బాయ్స్!’’ అంటూ టీమిండియా దిగ్గజం, ముంబై ఇండియన్స్ ఐకాన్ సచిన్ టెండుల్కర్ తమ జట్టుపై ప్రశంసలు కురిపించాడు. అదే విధంగా.. ‘ఎట్టకేలకు టెండుల్కర్ పేరు మీద ఓ ఐపీఎల్ వికెట్!’ అంటూ పుత్రోత్సాహంతో పొంగిపోయాడు. కాగా ఐపీఎల్-2023లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ముంబై 14 పరుగుల తేడాతో గెలుపొందింది. ముంబై తాజా గెలుపుతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 192 పరుగులు చేసింది. టార్గెట్ ఛేదనకు దిగిన రైజర్స్‌ను 178 పరుగులకే కట్టడి చేసి ఈ సీజన్లో మూడో విజయం అందుకుంది. ఇక ఆఖరి ఓవర్లో బౌలింగ్ చేసిన ముంబై ఆల్‌రౌండర్ అర్జున్ టెండుల్కర్.. ఎస్ఆర్హెచ్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను అవుట్ చేయడం ద్వారా కెరీర్లో తొలి ఐపీఎల్ వికెట్ సాధించాడు. నీ మనసు బంగారం షారుఖ్ ఈ నేపథ్యంలో సచిన్ టెండుల్కర్ తన కుమారుడిని ఉద్దేశించి భావోద్వేగ ట్వీట్ చేశాడు. అర్జున్ కారణంగా ఎట్టకేలకు టెండుల్కర్ ఖాతాలో వికెట్ కూడా చేరిందంటూ సంతోషం వ్యక్తం చేశాడు. ఇక బాలీవుడ్ బాద్ షా, కోల్‌కతా నైట్ రైడర్స్ సహ యజమాని షారుఖ్ ఖాన్ సైతం స్నేహితుడి కుమారుడి ప్రతిభను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. ఇందుకు బదులిచ్చిన సచిన్.. ‘‘ఎంఐ, కేకేఆర్ జెర్సీలలో బంగారు వర్ణపు దారాలు కలగలిసి ఉంటాయి. అయితే, నీ మనసు మాత్రం వందకు వంద శాతం గోల్డే షారుఖ్! థాంక్యూ’’ అంటూ షారుఖ్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ఇదిలా ఉంటే.. దాదాపు రెండేళ్లుగా ముంబై ఇండియన్స్‌తో కొనసాగుతున్న అర్జున్ ఎట్టకేలకు ఈ సీజన్లో అరంగేట్రం చేశాడు. కేకేఆర్‌పై ఎంట్రీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌తో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన అర్జున్‌కు ఈ మ్యాచ్‌లో విజయం రూపంలో శుభశకునం ఎదురైంది. తాజాగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో వికెట్ కూడా తీసి తన ఖాతా తెరిచాడు ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్. చదవండి: IPL 2023: ఫిక్సింగ్ కలకలం.. సిరాజ్‌కు అజ్ఞాత వ్యక్తి నుంచి కాల్! అతడెవరో కాదు.. A special moment for young Arjun Tendulkar, who gets his first wicket in #TATAIPL and it is his captain Rohit Sharma, who takes the catch of Bhuvneshwar Kumar. Arjun takes the final wicket and @mipaltan win by 14 runs. pic.twitter.com/1jAa2kBm0Z — IndianPremierLeague (@IPL) April 18, 2023 -
14 ఏళ్ల కిందట తండ్రికి ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్న అర్జున్ టెండూల్కర్
ముంబై ఇండియన్స్ యువ పేసర్ అర్జున్ టెండూల్కర్ తన తండ్రి సచిన్ టెండూల్కర్‌కు 14 ఏళ్ల కిందట జరిగిన ఓ అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. అది కూడా ఎక్కడైతే తన తండ్రికి ఆ అవమానం జరిగిందో అదై మైదానంలో. వివరాల్లోకి వెళితే.. ఐపీఎల్-2023లో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నిన్న (ఏప్రిల్ 18) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 14 పరుగుల తేడాతో అదిరిపోయే విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టి, రెండు వరుస పరాజయాల తర్వాత హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. కెమారూన్ గ్రీన్ (64 నాటౌట్), తిలక్ వర్మ (37) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేయగా.. సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో మరో బంతి మిగిలుండగానే 178 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. చదవండి: సచిన్ కొడుకుతో అట్లుటంది మరి.. శబాష్ అర్జున్! వీడియో వైరల్ సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్ (48), హెన్రిచ్ క్లాసెన్ (36) ఓ మోస్తరుగా రాణించగా.. ముంబై బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటారు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌల్ చేసిన సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ అందరి మన్ననలు అందుకుని శభాష్ అనిపించుకున్నాడు. సన్‌రైజర్స్ గెలుపుకు ఆఖరి ఓవర్లో 20 పరుగులు అవసరం కాగా, అర్జున్.. భువనేశ్వర్ కుమార్ వికెట్ తీసుకుని కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి ముంబైని గెలిపించాడు. ఐపీఎల్లో అర్జున్‌కు ఇది తొలి వికెట్. అర్జున్.. భువీని ఔట్ చేయడం ద్వారా 14 ఏళ్ల క్రితం ఇదే మైదానంలో తండ్రి సచిన్‌కు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. నాడు భువీ.. సచిన్‌ను ఓ రంజీ మ్యాచ్‌లో ఇదే వేదికపై డకౌట్ చేశాడు. రంజీల్లో సచిన్‌ను డకౌట్ చేసిన ఏకైక బౌలర్ భువీ ఒక్కడే. తాజాగా భువీని అదే మైదానంలో ఔట్ చేయడం ద్వారా అర్జున్, తన తండ్రికి ఎదురైన చేదు అనుభవానికి ప్రతీకారం తీర్చుకున్నట్లైంది. చదవండి: నీ ఆటకు ఓ దండం రా బాబు.. వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకో పో! -
ఉప్పల్‌లో మ్యాచ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబయి విజయం (ఫొటోలు)
-
IPL 2023: రిటైరైనా రికార్డుల్లోకెక్కిన సచిన్ టెండూల్కర్
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ క్రికెట్ అడకున్నా రికార్డులు మాత్రం కొల్లగొడుతూనే ఉన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్న సచిన్.. ఐపీఎల్-2023లో భాగంగా కేకేఆర్‌తో నిన్న (ఏప్రిల్ 16) జరిగిన మ్యాచ్ ద్వారా ఓ యూనిక్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రం చేయడంతో ఐపీఎల్ ఆడిన తొట్టతొలి తండ్రి కొడుకుల జోడీగా సచిన్-అర్జున్ జోడీ రికార్డుపుటల్లోకెక్కింది. 🎥 A special occasion 👏 👏 That moment when Arjun Tendulkar received his @mipaltan cap from @ImRo45 👍 👍 Follow the match ▶️ https://t.co/CcXVDhfzmi#TATAIPL | #MIvKKR pic.twitter.com/cmH6jMJRxg — IndianPremierLeague (@IPL) April 16, 2023 ఈ తండ్రికొడుకుల జోడీ ఒకే ఫ్రాంచైజీకి (ముంబై ఇండియన్స్) ప్రాతినిధ్యం వహించడం మరో విశేషం. 16 ఎడిషన్ల ఐపీఎల్ చరిత్రలో ఇంతవరకు ఏ తండ్రి కొడుకుల జోడీ ఏ ఫ్రాంచైజీకి ఆడింది లేదు. సచిన్.. ఐపీఎల్ అరంగేట్రం సీజన్ (2008) ద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లోకి అడుగుపెట్టి 2013 ఎడిషన్ వరకు కొనసాగగా.. అర్జున్ రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2023 సీజన్లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. The long-awaited occasion is finally here 🧢 congratulations #ArjunTendulkar 🙌🏻 proud moment for the master @sachin_rt 🤗❤️ @mipaltan pic.twitter.com/PoHgFa8KGB — Yuvraj Singh (@YUVSTRONG12) April 16, 2023 నిన్న కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగిన అర్జున్.. 2 ఓవర్లు వేసి వికెట్లేమీ తీసుకోకుండా 17 పరుగులు సమర్పించుకున్నాడు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన అర్జున్‌కు ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కాగా, అర్జున్‌కు ఐపీఎల్ (ముంబై ఇండియన్స్) ఆడే అవకాశం రావడంతో తండ్రి సచిన్ భావోద్వేగానికి లోనయ్యాడు. సచిన్ తన కుమారుడి ఐపీఎల్ ఎంట్రీని ఉద్దేశిస్తూ ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. Arjun, today you have taken another important step in your journey as a cricketer. As your father, someone who loves you and is passionate about the game, I know you will continue to give the game the respect it deserves and the game will love you back. (1/2) pic.twitter.com/a0SVVW7EhT — Sachin Tendulkar (@sachin_rt) April 16, 2023 ‘‘అర్జున్.. క్రికెటర్‌గా నీ ప్రయాణంలో ఇదొక ముఖ్యమైన ముందడుగు. ఓ తండ్రిగా.. నిన్నూ, ఆటను ప్రేమించే వ్యక్తిగా.. క్రికెట్ పట్ల అంకిత భావంతో ముందుకు సాగుతావని తెలుసు. ఆటకు నువ్విచ్చే గౌరవాన్ని ఫలితాల రూపంలో తప్పకుండా అందిస్తుంది. ఇక్కడిదాకా చేరుకోవడానికి నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు. అదే పట్టుదలతో ఈ ప్రయాణాన్ని మరింత అందంగా మార్చుకుంటావని నమ్ముతున్నా. ఆల్ ది బెస్ట్’’ అంటూ సచిన్ ట్వీట్లో రాసుకొచ్చాడు. Arjun Tendulkar made his IPL debut for @mipaltan on Sunday as the legendary @sachin_rt watched his son from the confines of the dressing room 👏🏻👏🏻 Here is the father-son duo expressing their emotions after what was a proud moment for the Tendulkar household👌🏻 - By @28anand pic.twitter.com/Lb6isgA6eH — IndianPremierLeague (@IPL) April 17, 2023 -
అర్జున్ చాలా కష్టపడ్డాడు.. సచిన్ టెండుల్కర్ భావోద్వేగం! వీడియో వైరల్
IPL 2023- Sachin Tendulkar- Arjun Tendulkar: టీమిండియా దిగ్గజం, క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ పుత్రోత్సాహంతో పొంగిపోయాడు. తన కుమారుడు అర్జున్ టెండుల్కర్ ఐపీఎల్ అరంగేట్రాన్ని చూసి మురిసిపోయాడు. ఇంతవరకు అర్జున్ ఆటను నేరుగా చూసిందే లేదని.. తన జీవితంలో ఇదో సరికొత్త అనుభవమంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్న అర్జున్ టెండుల్కర్ ఎట్టకేలకు ఆదివారం అరంగేట్రం చేశాడు. తొలి ఓవర్లో అదుర్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్ నేపథ్యంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న బౌలింగ్ ఆల్‌రౌండర్ అర్జున్.. తండ్రి ప్రాతినిథ్యం వహించిన జట్టుకే ఆడి అరుదైన రికార్డు సృష్టించాడు. ఇక ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన అర్జున్ మొత్తంగా 17 పరుగులు సమర్పించుకున్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అర్జున్ చేతికి తొలి ఓవర్లోనే బంతిని అందించగా.. ఐపీఎల్లో తన మొదటి ఓవర్లో అర్జున్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత ఇక మూడో ఓవర్లో మరోసారి తన చేతికి బంతి రాగా.. అర్జున్ 13 పరుగులు ఇచ్చాడు. అతడి బౌలింగ్‌లో కేకేఆర్ సెంచరీ స్టార్ వెంకటేశ్ అయ్యర్ వరుసగా ఫోర్, సిక్సర్ బాదాడు. తర్వాత జూనియర్ టెండుల్కర్‌కు మళ్లీ బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. కేకేఆర్ విధించిన 185 పరుగుల లక్ష్యాన్ని ముంబై 17.4 ఓవర్లలోనే ఊదేసింది. ఇక మ్యాచ్‌లో అర్జున్‌కు బ్యాటింగ్‌కు రావాల్సిన అవసరం లేకుండా పోయింది. భావోద్వేగ ట్వీట్ ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు కుమారుడిని ఉద్దేశించి... ‘‘అర్జున్.. క్రికెటర్‌గా నీ ప్రయాణంలో ఇదొక ముఖ్యమైన ముందడుగు. ఓ తండ్రిగా.. నిన్నూ, ఆటను ప్రేమించే వ్యక్తిగా.. క్రికెట్ పట్ల అంకిత భావంతో ముందుకు సాగుతావని నాకు తెలుసు. ఆట కూడా నువ్విచ్చే గౌరవానికి ప్రతిఫలాన్ని ఫలితాల రూపంలో తప్పకుండా అందిస్తుంది. ఇక్కడిదాకా చేరుకోవడానికి నువ్వు ఎంత కఠిన శ్రమకోర్చావో నాకు తెలుసు. అదే పట్టుదలతో ఈ ప్రయాణాన్ని మరింత అందంగా మార్చుకుంటావని నమ్ముతున్నా. ఆల్ ది బెస్ట్’’ అని సచిన్ ట్విటర్లో రాసుకొచ్చాడు. కొత్తగా ఉంది.. ఉద్వేగానికి లోనైన సచిన్ ఇక మ్యాచ్ చూసిన తర్వాత ఐపీఎల్ ఇంటర్వ్యూలో సచిన్ మాట్లాడుతూ.. ‘‘తనను తాను ఎలా నిరూపించుకోవాలని కోరుకుంటున్నాడో అలాగే చేయమని పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను. ఈరోజు కూడా నేను డ్రెస్సింగ్ రూంలోనే కూర్చున్నా. ఎందుకంటే నన్ను చూస్తే తన ఆలోచనలు మారిపోవచ్చు. తన ప్రణాళికలను అమలు చేసే అంశంపై ప్రభావం పడొచ్చు. మెగా స్క్రీన్ మీద తనను చూస్తూ ఉన్నా. నిజంగా నాకిది కొత్త అనుభవం. 2008లో మొదటి సీజన్.. 16 ఏళ్లవుతోంది.. ఇప్పుడు నా కుమారుడు కూడా ఇదే జట్టుకు ఆడటం బాగుంది’’ అని ఉద్వేగపూరితంగా మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చదవండి: ‘పిచ్చి వేషాలు వేసినా నన్నెవరూ ఏం చేయలేరు; అదే అర్జున్ టెండుల్కర్‌ను చూడండి!’ చెత్తగా ప్రవర్తించారు.. నితీశ్ రాణాకు బీసీసీఐ షాక్! సూర్యకు భారీ జరిమానా Arjun Tendulkar made his IPL debut for @mipaltan on Sunday as the legendary @sachin_rt watched his son from the confines of the dressing room 👏🏻👏🏻 Here is the father-son duo expressing their emotions after what was a proud moment for the Tendulkar household👌🏻 - By @28anand pic.twitter.com/Lb6isgA6eH — IndianPremierLeague (@IPL) April 17, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘పిచ్చి వేషాలు వేసినా నన్నెవరూ ఏం చేయలేరు; అదే అర్జున్ టెండుల్కర్‌ను చూడండి!’
IPL 2023 GT Vs RR: రాజస్తాన్ రాయల్స్ యువ ‘ఆల్‌రౌండర్’ రియాన్ పరాగ్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. వరుస వైఫల్యాలతో జట్టుకు భారంగా మారుతున్న అతడిని తప్పించాలంటూ అభిమానులు రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు సూచిస్తున్నారు. ఆట తక్కువ.. ఓవరాక్షన్ ఎక్కువ ఉన్న రియాన్‌ను పక్కనపెట్టాల్సిన సమయం వచ్చిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అల్లరి చేష్టలతో రాజస్తాన్ రాయల్స్ తరఫున 2019లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అరంగేట్రం చేశాడు అసోం కుర్రాడు రియాన్ పరాగ్. చెన్నై సూపర్ కింగ్స్‌తో తొలి మ్యాచ్ ఆడిన అతడు.. 16 పరుగులు చేశాడు. అదే విధంగా 3 ఓవర్ల బౌలింగ్‌లో 24 పరుగులు ఇచ్చాడు. అరంగేట్ర మ్యాచ్‌లో పర్వాలేదనిపించిన రియాన్ పరాగ్.. నాటి నుంచి నేటి దాకా ఆట కంటే కూడా మైదానంలో తన చేష్టలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. చెత్త ప్రదర్శన గత సీజన్లో కేవలం 183 పరుగులు చేసి ఒక్క వికెట్ మాత్రమే తీసిన రియాన్ పరాగ్.. ఐపీఎల్-2023లోనూ విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి అతడు చేసిన పరుగులు కేవలం 39. గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో అతడి ప్రదర్శన మరీ చెత్తగా ఉంది. జట్టు కష్టాల్లో ఉన్న వేళ క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్ 7 బంతులు ఎదుర్కొని కేవలం 5 పరుగులు చేశాడు. మేనేజ్మెంట్ వరుస అవకాశాలు ఇస్తున్నా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో నెటిజన్లు అతడి ఆట తీరు, మేనేజ్మెంట్పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఏం పొడిచాడని? ‘‘తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటి వరకు 51 మ్యాచ్‌లలో 41 ఇన్నింగ్స్ ఆడిన రియాన్ పరాగ్ చేసిన పరుగులు 561. సగటు 16.03. బౌలింగ్‌లోనూ పెద్దగా పొడిచిందేమీ లేదు! అయినా బంధుప్రీతి అంటే ఇదే కాబోలు. వరుసగా ఫెయిల్ అవుతున్నా అవకాశాలు మాత్రం వస్తూనే ఉంటాయి. బంధుప్రీతి అంటే ఇదేనేమో మైదానంలో తన చేష్టలు చూస్తుంటే ఆటకు స్వస్తి చెప్పి త్వరలోనే చీర్ లీడర్స్‌తో పాటు చేరతాడేమో అనిపిస్తోంది. ఆటపై దృష్టి పెట్టకుండా ప్రత్యర్థి బ్యాటర్లు అవుటైనపుడు వెకిలిగా వ్యవహరించడం.. తనను జట్టు నుంచి తీసివేసే దమ్ము ఎవరికీ లేదన్నట్లు ప్రవర్తించడం రియాన్‌కు చెల్లింది. రాజస్తాన్ ఓనర్లతో సంబంధాలు బాగున్నాయి(రియాన్ అంకుల్‌కు సెలక్షన్ మెంబర్‌తో దోస్తీ ఉందన్న ఉద్దేశంలో) గనుకే రియాన్ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాడు. అర్జున్ను చూడండి అదే అర్జున్ టెండుల్కర్ విషయంలో చూడండి. తన తండ్రి సచిన్ టెండుల్కర్‌కు ముంబై ఇండియన్స్‌తో సత్సంబంధాలు ఉన్నా 2-3ఏళ్ల పాటు బెంచ్ మీదే ఉన్నాడు. ఈరోజు అరంగేట్రం చేశాడు’’ అంటూ ఈ 21 ఏళ్ల బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌ను నెట్టింట కామెంట్లతో చెడుగుడు ఆడేసుకుంటున్నారు. కాగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ ఆఖరి ఓవర్ వరకు పోరాడి 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. చదవండి: చెత్తగా ప్రవర్తించారు.. నితీశ్ రాణా, హృతిక్‌కు బీసీసీఐ షాక్! సూర్యకు భారీ జరిమానా 2019- He is a Kid and he's learning. 2020- He is a Kid and he's learning. 2021- He is a Kid and he's learning. 2022- He is a Kid and he's learning. 2023- He is a Kid and he's learning 2040- He is a Kid and he's still learning. Lord Riyan Parag pic.twitter.com/WnunyQ0dpZ — StrawHat Luffy (@PirateKing200) April 16, 2023 Just Riyan Parag things✨#RRvsGT pic.twitter.com/opGLPOa0TI — Abisek (@mayyena) April 16, 2023 A guy who got Govt job in IPL#riyanparag #GTvRR #KKRvsMI pic.twitter.com/YtCeoZq6ZR — JimmyCarter (@ImJimmyCarter) April 16, 2023 WHAT. A. GAME! 👌 👌 A thrilling final-over finish and it's the @rajasthanroyals who edge out the spirited @gujarat_titans! 👍 👍 Scorecard 👉https://t.co/nvoo5Sl96y#TATAIPL | #GTvRR pic.twitter.com/z5kN0g409n — IndianPremierLeague (@IPL) April 16, 2023 -
అర్జున్ టెండూల్కర్‌ను చెడుగుడు ఆడుకున్న వెంకటేశ్ అయ్యర్
ముంబైలోని వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 16) జరుగుతున్న మ్యాచ్‌లో (మధ్యాహ్నం 3:30 గంటలకు) క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తొలి ఓవర్ బౌల్ చేసిన అర్జున్.. కాస్త మెరుగ్గానే బౌలింగ్ చేసినప్పటికీ, తన రెండో ఓవర్లో మాత్రం వెంకటేశ్ అయ్యర్ చేతికి చిక్కి బలయ్యాడు. Photo Credit : IPL Website ఈ ఓవర్లోనూ తొలి రెండు బంతులకు పరుగులేమీ ఇవ్వని అర్జున్.. ఆ తర్వాత బంతిని వైడ్ వేసి, ఆ వెంటనే వరుసగా 2 పరుగులు, 0, బౌండరీ, సిక్సర్ సమర్పించుకున్నాడు. ఈ ఓవర్లో అయ్యర్ ధాటికి మొత్తంగా 13 పరుగులు సమర్పించుకోవడంతో కెప్టెన్ సూర్యకుమార్ అర్జున్ను బౌలింగ్ నుంచి తప్పించి డ్యూయాన్ జన్సెన్కు బంతిని అప్పజెప్పాడు. కాగా, సుదీర్ఘకాలంగా (రెండేళ్లుగా) ఐపీఎల్ ఎంట్రీ కోసం ఎదురుచూసిన అర్జున్‌కు ఓ మోస్తరు ప్రారంభమైతే లభించింది. ఎన్నో అంచనాల నడుమ కుటుంబ సభ్యుల సమక్షంలో బరిలోకి దిగిన అర్జున్ తొలి ఓవర్లో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి పర్వాలేదనించాడు. అయితే రెండో ఓవర్లో మాత్రం అర్జున్ కాస్త తడబడ్డాడు. తన కోటా ఓవర్లు మొత్తం పూర్తయితే కాని అతను బౌలింగ్‌పై ఓ అంచనాకు రాలేని పరిస్థితి. ఇక్కడ ఓ గమనించదగ్గ విషయం ఏంటంటే.. అర్జున్ తొలి బంతి నుంచి రన్అప్తో ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు. అతని శైలి ఆశిష్ నెహ్రాను తలపించినప్పటికీ.. బౌలింగ్‌లో మాత్రం వేగం లోపించింది. అతను బౌల్ చేసిన 13 బంతులు 130కిమీ వేగం లోపే ఉన్నాయి. ఇదిలా ఉంటే, కేకేఆర్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్.. 8.1 ఓవర్ల తర్వాత 3 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది. రహ్మానుల్లా గుర్భాజ్ (8), జగదీశన్ (0), నితీశ్ రాణా (5) ఔట్ కాగా.. వెంకటేశ్ అయ్యర్ (22 బంతుల్లో 49 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. -
MI VS KKR: కేకేఆర్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం
కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 17.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. ముంబై బ్యాటర్లలో ఇషాన్ కిషన్ 25 బంతుల్లో 58, సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 43, తిలక్ వర్మ 25 బంతుల్లో 30 పరుగులు, టిమ్ డేవిడ్ 12 బంతుల్లో 23 పరుగులు నాటౌట్ సమిష్టిగా రాణించి ముంబై విజయంలో కీలకపాత్ర పోషించారు. కేకేఆర్ బౌలర్లలో సుయాష్ శర్మ రెండు వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, లోకీ ఫెర్గూసన్‌లు తలా ఒక వికెట్ తీశారు. సీజన్లో ముంబైకిది వరుసగా రెండో విజయం కాగా.. కేకేఆర్‌కు వరుసగా రెండో పరాజయం కావడం గమనార్హం. విజయం దిశగా ముంబై ఇండియన్స్ కేకేఆర్‌తో మ్యాచ్‌లో ముంబై విజయానికి దగ్గరైంది. 17 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ నాలుగు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ముంబై విజయానికి కేవలం ఆరు పరుగుల దూరంలో ఉంది. తిలక్ వర్మ క్లీన్ బౌల్డ్.. మూడో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్ సుయాశ్ శర్మ బౌలింగ్‌లో తిలక్ వర్మ (30) క్లీన్ బౌల్డయ్యాడు. 14 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 148/3. సూర్యకుమార్ యాదవ్ (30), టిమ్ డేవిడ్ క్రీజ్‌లో ఉన్నారు. ఇషాన్ కిషన్ (58) క్లీన్ బౌల్డ్ 25 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు సాయంతో 58 పరుగులు చేసిన అనంతరం ఇషాన్ కిషన్ ఔటయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఇషాన్ క్లీన్ బౌల్డయ్యాడు. ఉమేశ్ సూపర్ క్యాచ్.. హిట్‌మ్యాన్ ఔట్ 20 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ శర్మ ఔటయ్యాడు. సుయాశ్ శర్మ బౌలింగ్‌లో మిడ్ ఆఫ్‌లో ఉమేశ్ అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకోవడంతో హిట్‌మ్యాన్ పెవిలియన్‌కు చేరాడు. క్రీజ్‌లో ఇషాన్ కిషన్ (43) జతగా సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. 5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 65/1. టార్గెట్ 186.. ధాటిగా ఆడుతున్న రోహిత్, ఇషాన్ 186 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. 4 ఓవర్లలో ఆ జట్టు ఏకంగా 57 పరుగులు రాబట్టింది. ఇషాన్ కిషన్ (15 బంతుల్లో 42; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. అతనికి జతగా రోహిత్ శర్మ (9 బంతుల్లో 13; ఫోర్, సిక్స్) క్రీజ్‌లో ఉన్నాడు. వెంకటేశ్ అయ్యర్ సెంచరీ.. ముంబై టార్గెట్ ఎంతంటే..? ఐపీఎల్-2023లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 16 మధ్యాహ్నం 3:30 గంటలకు) జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్.. వెంకటేశ్ అయ్యర్ (51 బంతుల్లో 104; 6 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. కేఆర్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్భాజ్ (8), జగదీశన్ (0), నితీశ్ రాణా (5), శార్దూల్ ఠాకూర్ (13), రింకూ సింగ్ (18) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. ఆఖర్లో రసెల్ (21 నాటౌట్) ధాటిగా ఆడాడు. ముంబై బౌలర్లలో హృతిక్ షోకీన్ 2 వికెట్లు పడగొట్టగా.. కెమరూన్ గ్రీన్, పియూష్ చావ్లా, జన్సెన్. మెరిడిత్ తలో వికెట్ దక్కించుకున్నారు. రింకూ సింగ్ ఔట్.. ఆరో వికెట్ కోల్పోయిన కేకేఆర్ జన్సెన్ బౌలింగ్‌లో నేహల్‌కు క్యాచ్ ఇచ్చి రింకూ సింగ్ (18) ఔటయ్యాడు. అయ్యర్ ఔటయ్యాక స్కోర్ ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. శతక్కొట్టి ఔటైన వెంకటేశ్ అయ్యర్ సెంచరీ తర్వాత కేవలం ఒకే ఒక ఫోర్ కొట్టిన అయ్యర్.. 104 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. మెరిడిత్ బౌలింగ్‌లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి అయ్యర్ పెవిలియన్‌కు చేరాడు. వెంకటేశ్ అయ్యర్ ఊచకోత.. 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో విధ్వంకర శతకం ముంబైలోని వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 16) జరుగుతున్న మ్యాచ్‌లో (మధ్యాహ్నం 3:30 గంటలకు) కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ శివాలెత్తిపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలి బంతి నుంచి ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగిన అయ్యర్.. కేవలం 49 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో విధ్వంకర శతకం బాదాడు. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో బ్యాటర్లంతా కలిపి కేవలం 2 ఫోర్లు కొడితే, ఒక్క వెంకటేశ్ అయ్యరే 5 బౌండరీలు, 9 సిక్సర్లు బాదడం విశేషం. తిలక్ వర్మ సూపర్ క్యాచ్.. శార్దూల్ ఠాకూర్ ఔట్ తిలక్ వర్మ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో శార్దూల్ ఠాకూర్ (13) పెవిలియన్ బాట పట్టాడు. తద్వారా 123 పరుగుల వద్ద కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో ఉన్న వెంకటేశ్ అయ్యర్ (86) దుమ్మురేపుతున్నాడు. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వెంకటేశ్ అయ్యర్ హార్ఢ్ హిట్టర్ వెంకటేశ్ అయ్యర్ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం స్పీడ్ పెంచిన అయ్యర్.. ఇంకా ధాటిగా ఆడుతున్నాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 76 పరుగుల వద్ద క్రీజ్‌లో ఉన్నాడు. 11 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 104/3. అయ్యర్, శార్దూల్ (4) క్రీజ్‌లో ఉన్నారు. నితీశ్ రాణా ఔట్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన నితీశ్ రాణా (5) హృతిక్ షోకీన్ బౌలింగ్‌లో రమన్‌దీప్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 8.1 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 73/3. వెంకటేశ్ అయ్యర్ (49) క్రీజ్‌లో ఉన్నాడు. రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్ 57 పరుగుల వద్ద కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. పియూష్ చావ్లా బౌలింగ్‌లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి గుర్భాజ్ (8) ఔటయ్యాడు. క్రీజ్‌లో ఉన్న వెంకటేశ్ అయ్యర్ (39) ధాటిగా ఆడుతున్నాడు. నితీశ్ రాణా క్రీజ్‌లోకి వచ్చాడు. 6 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 57/2. తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్.. జగదీశన్ ఔట్ రెండో ఓవర్లోనే కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. గ్రీన్ బౌలింగ్‌లో హృతిక్ షోకీన్ క్యాచ్ పట్టడంతో ఎన్ జగదీశన్ (0) ఔటయ్యాడు. 2 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 12/1. రహ్మానుల్లా గుర్బాజ్ (5), వెంకటేశ్ అయ్యర్ క్రీజ్‌లో ఉన్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై.. రోహిత్ ఔట్, అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం ఐపీఎల్-2023లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 16) జరుగనున్న డబుల్ హెడర్ మ్యాచ్‌ల్లో తొలుత (మధ్యాహ్నం 3:30 గంటలకు) ముంబై ఇండియన్స్- కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కడుపు నొప్పి కారణంగా ఈ మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరం కాగా, అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ముంబై కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అలాగే ఈ మ్యాచ్ ద్వారా సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జన్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రం చేయనున్నాడు. తుది జట్లు.. ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్, కెమారూన్ గ్రీన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, నేహల్ వధేరా, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్, పియుశ్ చావ్లా, డ్యుయాన్ జన్సెన్, రిలే మెరిడిత్ కేకేఆర్: రహ్మానుల్లా గుర్భాజ్, వెంకటేశ్ అయ్యర్, ఎన్ జగదీశన్, నితీశ్ రాణా (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, లోకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి -
సీఎస్కేతో మ్యాచ్.. సచిన్ కొడుకు ఐపీఎల్ ఎంట్రీ!
ఐపీఎల్-2023లో తమ తొలి మ్యాచ్‌లోనే ఓటమిపాలైన ముంబై ఇండియన్స్.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. వాంఖడే వేదికగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో పలు మార్పులతో ముంబై బరిలోకి దిగనున్నట్లు సమాచారం. సీఎస్కేతో మ్యాచ్‌కు ముందు ముంబై పేసర్ జోఫ్రా అర్చర్ నెట్స్‌లో గాయపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వేళ మ్యాచ్‌కు అర్చర్ దూరమైతే అతడి స్థానంలో మెరిడిత్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా యువ స్పిన్నర్ హృతిక్ షోకిన్ స్థానంలో కుమార్ కార్తీకేయకు ఛాన్స్ ఇవ్వాలని ముంబై మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు వినికిడి. అర్జున్ టెండ్కూలర్ ఎంట్రీ.. మరోవైపు సచిన్ తనయుడు అర్జున్ టెండ్కూలర్ సీఎస్కే మ్యాచ్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. 2021లో ముంబయి ఇండియన్స్ జట్టులోచేరిన అర్జున్.. ఇప్పటివరకు ఒక మ్యాచ్‌లో కూడా ఆడలేదు. కాగా సీఎస్కేతో మ్యాచ్‌కు ముందు అర్జున్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విటర్లో షేర్ చేసింది. దీంతో అర్జున్ ఐపీఎల్ ఎంట్రీ ఖాయమని ముంబై అభిమానులు ఫిక్స్ అయిపోయారు. కాగా దేశావాళీ క్రికెట్లో గోవా తరపున అర్జున్ ఆడుతున్న సంగతి తెలిసిందే. రంజీ సీజన్ 2022-23లో అర్జున్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. తన మ్యాచ్‌లోనే సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు 7 లిస్ట్-ఏ(25 వికెట్లు) మ్యాచ్‌లు ఆడిన అతడు.. ఐదు ఫస్ట్ క్లాస్(9 వికెట్లు) మ్యాచులు, 9 టీ20లు(12 వికెట్లు) ఆడాడు. చదవండి: IPL 2023 SRH vs LSG: ఎవరు బాబు నీవు.. వెళ్లి టెస్టులు ఆడుకో పో! అక్కడ కూడా పనికి రాడు Arjun ko bas 🎯 dikhta hai 🤌🔥#OneFamily #MumbaiIndians #MumbaiMeriJaan #TATAIPL #IPL2023 pic.twitter.com/IYHgDpBPEs — Mumbai Indians (@mipaltan) April 7, 2023 -
అర్జున్ దగ్గర అన్నీ ఉన్నాయి.. నా దగ్గర నువ్వు ఉన్నావు, చాలు నాన్న: సర్ఫరాజ్ ఖాన్
Sarfaraz Khan: అభినవ బ్రాడ్‌మన్‌గా కీర్తించబడుతూ, దేశవాలీ టోర్నీల్లో సెంచరీల మీద సెంచరీలు బాదుతూ, పరుగుల వరద పారిస్తున్న ముంబై చిచ్చరపిడుగు సర్ఫరాజ్ ఖాన్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని అతని తండ్రి నౌషద్ ఖాన్ ఇటీవలే మీడియాతో షేర్ చేసుకున్నాడు. తన కొడుకు సర్ఫరాజ్ ఖాన్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌తో కూడిన ఓ యధార్థ సన్నివేశాన్ని నౌషద్ మీడియాకు వివరిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. హృదయాన్ని కదిలించే ఈ సన్నివేశంలో సర్ఫరాజ్ తనతో అన్న మాటలను గుర్తు చేసుకుంటూ నౌషద్ కన్నీరుమున్నీరయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే (నౌషద్ కథనం మేరకు).. సర్ఫరాజ్ ఖాన్, సచిన్ తనయుడు అర్జున్ జూనియర్ లెవెల్ నుంచి ముంబై తరఫున కలిసి క్రికెట్ ఆడేవారు. ఒక రోజు సర్ఫరాజ్ తన తండ్రి నౌషద్ దగ్గరకు వచ్చి.. నాన్న.. అర్జున్ ఎంత అదృష్టవంతుడు కదా.. అతని దగ్గర కార్లు, ఐపాడ్స్ అన్నీ ఉన్నాయి అని అన్నాడు. కొడుకు అన్న మాటలకు నౌషద్ నోటి వెంట మాట రాలేదు. నిస్సహాయ స్థితిలో అలాగే మిన్నకుండిపోయాడు. తమ ఆర్థిక స్థోమత గురించి కొడుకుకు తెలుసో లేదో అని మనసులో అనుకున్నాడు. కొద్దిసేపటికి సర్ఫరాజ్ తండ్రి దగ్గరికి తిరిగి వచ్చి అతన్ని గట్టిగా హత్తుకుని.. అర్జున్ కంటే నేనే అదృష్టవంతున్ని నాన్న.. ఎందుకంటే, నా తండ్రి నాతో పాటు రోజంతా గడుపుతాడు, అర్జున్ తండ్రి అతనితో ఎక్కువ సేపు గడపలేడు అంటూ చాలా మెచ్యూర్డ్‌గా మాట్లాడాడు. ఈ విషయాన్ని నౌషద్ ఓ ప్రముఖ దినపత్రికతో షేర్ చేసుకున్నాడు. చిన్నతనం నుంచి తన కొడుకుకు ఉన్న పరిపక్వత గురించి వివరిస్తూ నౌషద్ తెగ మురిసిపోయాడు. తన కొడుకు తిరిగి వచ్చి తనను కౌగిలించుకున్న క్షణంలో తనకు ఏమని మాట్లాడాలో అర్ధం కాలేదని భావోద్వేగానికి లోనయ్యాడు. దిగువ మధ్య తరగతికి చెందిన నౌషద్.. కొడుకు సర్ఫరాజ్ కోసం చాలా త్యాగాలు చేశాడు. వర్షం పడితే గ్రౌండ్‌ను వెళ్లడం కుదరదని, ఇంటినే గ్రౌండ్‌గా మార్చేశాడు. క్రికెట్‌కు సంబంధించి కొడుకుకు కావాల్సిన సలహాలు ఇస్తూ అన్నీ తానై వ్యవహరిస్తుంటాడు. ఇదిలా ఉంటే, గత కొంత కాలంగా దేశవాలీ టోర్నీల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న సర్ఫరాజ్ ఖాన్.. ప్రస్తుత రంజీ సీజన్లోనూ 6 మ్యాచ్‌ల్లో 3 సెంచరీల సాయంతో 556 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ తాజా ప్రదర్శన నేపథ్యంలో భారత టెస్ట్ జట్టులో (ఆసీస్ సిరీస్) చోటు గ్యారెంటీ అని అంతా ఊహించారు. అయితే ఈ ముంబై ఆటగాడికి మరోసారి మొండిచెయ్యే ఎదురైంది. గత 24 ఇన్నింగ్స్‌ల్లో 71*, 36, 301*, 226*, 25, 78, 177, 6, 275, 63, 48, 165, 153, 40, 59*, 134, 45, 5, 126*, 75, 20, 162, 125, 0 ఓ ట్రిపుల్ సెంచరీ, 2 డబుల్ సెంచరీలు, 7 సెంచరీలు, 5 అర్ధసెంచరీ బాది పరుగల వరద పారించిన సర్ఫరాజ్‌ను కాదని టీ20ల్లో సత్తా చాటాడన్న కారణంగా సూర్యకుమార్‌ను టెస్ట్ జట్టుకు ఎంపిక చేశారు సెలెక్టర్లు. అయితే సర్ఫరాజ్‌కు శ్రేయస్ అయ్యర్ రూపంలో అదృష్టం కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు అయ్యర్ గాయపడ్డాడు. ఆసీస్‌తో తొలి టెస్ట్‌లకు ఎంపిక చేసిన జట్టులో అయ్యర్ కూడా ఉన్నాడు. ఒకవేళ ఆసీస్‌తో టెస్ట్ సిరీస్ సమయానికి అయ్యర్ కోలుకోకపోతే సర్ఫరాజ్‌కు టీమిండియా నుంచి మెయిడిన్ కాల్ వచ్చే అవకాశం ఉంది. -
నేను అస్సలు ‘మన్కడింగ్’ చేయను.. ఎందుకంటే: అర్జున్ టెండుల్కర్
Arjun Tendulkar- Mankading: టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ తనయుడు, గోవా ఆల్‌రౌండర్ అర్జున్ టెండుల్కర్ ‘మన్కడింగ్’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మన్కడింగ్ తప్పు కాదని, అయితే తను మాత్రం ఈ విధంగా రనౌట్‌లో భాగమై సమయం వృథా చేసుకోనన్నాడు. రంజీ టోర్నీలో గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్.. సర్వీసెస్‌తో మ్యాచ్‌లో మొదటి రోజు ఆటలో రెండు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో మంగళవారం క్రిక్‌నెక్ట్స్ తో మాట్లాడిన అర్జున్ టెండుల్కర్ మన్కడింగ్ విషయంలో తన అభిప్రాయం పంచుకున్నాడు. ‘‘మన్కడింగ్‌ను నేను పూర్తిగా సమర్థిస్తా. నిబంధనల ప్రకారం అది సరైందే. ఇలా రనౌట్ చేయడం క్రీడాస్ఫూర్తికి విర్ధుమంటే నేను ఒప్పుకోను. టైమ్, ఎనర్జీ వేస్ట్ చేసుకోను అయితే, నేను మాత్రం నాన్ స్ట్రైకర్‌ను మన్కడింగ్ చేసి సమయం వృథా చేసుకోను. బెయిల్స్‌ను పడగొట్టడానికి నేను నా వేగాన్ని తగ్గించుకోలేను. మన్కడింగ్ చేయాలంటే చాలా వరకు ఎనర్జీ, ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. నేను అలా నా శక్తి, టైమ్ వేస్ట్ చేయను. అయితే, ఎవరైనా మన్కడింగ్ చేస్తే దానిని మాత్రం సమర్థిస్తా’’ అని చెప్పుకొచ్చాడు. కాగా, బౌలర్ బంతి విసరకముందే నాన్- స్ట్రైకర్ క్రీజును వీడితే రనౌట్ చేయడం నిబంధనల ప్రకారం సరైందేనన్న సంగతి తెలిసిందే. సచిన్ సైతం ఇక మన్కడింగ్ రవిచంద్రన్ అశ్విన్ వంటి బౌలర్ల విషయంలో విమర్శలు వచ్చిన తరుణంలో సచిన్ వారికి అండగా నిలబడ్డాడు. కాగా 23 ఏళ్ల అర్జున్ బౌలింగ్ ఆల్‌రౌండర్. ఎడమచేతి వాటం గల ఈ బ్యాటర్.. లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునే క్రమంలో.. మేటి క్రికెటర్‌గా ఎదగాలనే ఆశయం అడుగులు వేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఇటీవల శ్రీలంకతో తొలి వన్డే సందర్భంగా మహ్మద్ షమీ దసున్ షనకు మన్కడింగ్ చేయగా.. కెప్టెన్ రోహిత్ శర్మ ఆ రనౌట్ అప్పీలు వెనక్కి తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో అర్జున్ టెండుల్కర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి టీమిండియా కీలక పేసర్‌గా! ఆ ఒక్క లోటు తప్ప! కెప్టెన్ మాటలు వింటే.. Virat Kohli: ఓర్వలేనితనం అంటే ఇదే.. -
తొలి మ్యాచ్‌లోనే కొడుకు సెంచరీ.. సచిన్ టెండూల్కర్ ఏమన్నాడంటే?
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఫస్ట్ క్లాస్ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుత రంజీ సీజన్లో గోవాకు అర్జున్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో రాజస్తాన్‌పై తొలి ఇన్నింగ్స్‌లో అర్జున్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 207 బంతులు ఎదుర్కొన్న అర్జున్ 120 పరుగులు చేశాడు. ఇక తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన అర్జున్ టెండూల్కర్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. ఇక అర్జున్ ఇన్నింగ్స్‌పై అతడి తండ్రి సచిన్ టెండూల్కర్ తొలి సారి స్పందించాడు. ఇన్ఫోసిస్ స్థాపించి 40 ఏళ్లు గడిచిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన సచిన్ ఆసక్తిర వాఖ్యలు చేశాడు. "క్రికెట్లో రాణించడం అంత సులభమైన విషయం కాదు. అర్జున్‌కు కూడా ఇది చాలా కష్టమైన ప్రయాణం. అర్జున్ ఆట పరంగా నాకంటే ఎక్కువగా రోహన్ గవాస్కర్‌తో క్లోజ్‌గా ఉంటాడు. ఈ మ్యాచ్‌లో అర్జున్ను నైట్ వాచ్‌మెన్‌గా పంపారు. అతడు 4 పరుగులతో నాటౌట్‌గా ఉన్నప్పుడు సెంచరీ కోసం ప్రయత్నించమని నేను చెప్పాను. ఎన్ని పరుగులు చేస్తే అది మాకు మంచి స్కోర్ అవుతుందని అర్జున్ అడిగాడు. వారు అప్పటికే 5 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసి ఉన్నారు. కనీసం 375 పరుగులు అయినా సాధిస్తే మంచి ఫైటింగ్ స్కోర్ అవుతుందని నేను చెప్పాను. చివరికి అర్జున్ సెంచరీ సాధించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అర్జున్ అందరు పిల్లల్లాగా సాధారణ బాల్యాన్ని గడపలేదు. అతడు ఒక ప్రముఖ క్రికెటర్ కొడుకు కావడంతో అతడిపై తీవ్రమైన ఒత్తడి ఉండేది. నేను రిటైర్ అయ్యాక ముంబైలో మీడియా సమావేశంలో కూడా అదే చెప్పాను. అతడిపై అనవసర ఒత్తిడి పెంచవద్దు, ముందు అర్జున్ క్రికెట్‌పై మక్కువను పెంచుకోనివ్వండి అని చెప్పాను. అదే విధంగా అతడొక మంచి క్రికెటర్‌గా ఎదిగితే మీకు నచ్చిన ప్రకటనలను చేయవచ్చు అని కూడా నేను అన్నాను" అని సచిన్ పేర్కొన్నాడు. చదవండి: FIFA WC Final: ఫైనల్‌కు ముందు అర్జెంటీనాకు బిగ్ షాక్.. మెస్సీకి గాయం! -
తండ్రికి తగ్గ తనయుడు.. తొలి మ్యాచ్‌లోనే సెంచరీ, మరో రికార్డు కూడా..!
Arjun Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఎట్టకేలకు తండ్రి పేరు నిలబెట్టాడు. రంజీల్లో తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాది తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గోవా తరఫున బరిలోకి దిగిన అర్జున్.. 178 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసి సచిన్ వారసత్వాన్ని ఘనంగా చాటాడు. 15 ఏళ్ల వయసులో సచిన్ కూడా తన తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీ బాది క్రికెట్ ప్రపంచానికి పరిచమయ్యాడు. 34 ఏళ్ల కిందట.. 1988 రంజీ సీజన్లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేసిన సచిన్.. తన తొలి మ్యాచ్‌లోనే శతకం బాదాడు. తాజాగా అతని తనయుడు అర్జున్ కూడా తన తొలి రంజీ మ్యాచ్‌లోనే శతక్కొట్టి, తండ్రికి తానే మాత్రం తీసిపోనని క్రికెట్ ప్రపంచానికి చాటాడు. 23 ఏళ్ల అర్జున్ టెండూల్కర్.. తన దేశవాలీ కెరీర్ ముంబై తరఫున మొదలు పెట్టినప్పటికీ, అక్కడ పోటీ ఎక్కువగా ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో గోవాకు షిఫ్ట్ అయ్యాడు. లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన అర్జున్ ఇప్పటివరకు 7 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 9 టీ20లు ఆడాడు. ఐపీఎల్ 2022 సీజన్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అర్జున్.. ముంబై ఫ్రాంచైజీలో స్థానం దక్కించుకున్నప్పటికీ, ఐపీఎల్ అరంగేట్రం చేసే అవకాశం మాత్రం దొరకలేదు. ఇదిలా ఉంటే, రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ గ్రూప్-సిలో భాగంగా నిన్న (డిసెంబర్ 13) రాజస్థాన్‌తో మొదలైన మ్యాచ్‌తో 4 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు బరిలోకి దిగిన అర్జున్.. ఇవాళ సెంచరీ పూర్తి చేసుకుని 112 పరుగుల వద్ద అజేయంగా కొనసాగుతున్నాడు. మరో ఎండ్‌లో సుయాశ్ ప్రభుదేశాయ్ (172 నాటౌట్) ఇవాళే సెంచరీ పూర్తి చేసుకుని డబుల్ సెంచరీ దిశగా సాగుతున్నాడు. రెండో రోజు టీ విరామం సమయానికి గోవా 5 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. -
ఎట్టకేలకు ఛాన్స్ దొరకబట్టిన సచిన్ తనయుడు
Ranji Trophy 2022-23: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఎట్టకేలకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ముంబై తరఫున రంజీల్లో ఆడేందుకు సుదీర్ఘంగా నిరీక్షించిన అర్జున్.. అక్కడ పోటీ ఎక్కువగా ఉండటంతో గోవాకు షిష్ట్ అయి రంజీ ఛాన్స్ దొరకబట్టాడు. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా ఇవాళ (డిసెంబర్ 13) రాజస్థాన్‌తో మొదలైన మ్యాచ్‌తో అర్జున్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 7 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 9 టీ20లు ఆడిన అర్జున్‌కు ఇది తొలి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ కావడం విశేషం. బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన 23 ఏళ్ల అర్జున్.. గ్రూప్-సిలో భాగంగా ఇవాళ రాజస్తాన్‌తో మొదలైన మ్యాచ్‌లో బరిలోకి దిగి తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 పరుగులతో అజేయంగా క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గోవా.. సుయాశ్ ప్రభుదేశాయ్ (81 నాటౌట్), స్నేహల్ సుహాస్ ఖౌతాంకర్ (59) అర్ధసెంచరీలతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. సుయాశ్, అర్జన్ టెండూల్కర్ క్రీజ్‌లో ఉన్నారు. రాజస్తాన్ బౌలర్లలో అంకిత్ చౌధరీ 2 వికెట్లు పడగొట్టగా.. అరాఫత్ ఖాన్, కమలేశ్ నాగర్‌కోటీ, మానవ్ సుతార తలో వికెట్ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2022 సీజన్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అర్జున్ టెండూల్కర్.. ముంబై ఫ్రాంచైజీలో స్థానం దక్కించుకున్నప్పటికీ, ఐపీఎల్ అరంగేట్రం చేసే అవకాశం మాత్రం దొరకలేదు. ఎంత సచిన్ కుమారుడైనా టాలెంట్ ఉంటేనే తుది జట్టులో అవకాశం కల్పిస్తామని ముంబై కోచ్ జయవర్ధనే అప్పట్లో ప్రకటించాడు. ఎట్టకేలకు అర్జున్ తన స్వయంకృషితో గోవా రంజీ టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో అర్జున్ ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి. ఈ మ్యాచ్‌లో ఆటతీరుపై అతని భవితవ్యం ఆధారపడి ఉంది. -
సచిన్ టెండూల్కర్ కేరాఫ్ 'సింప్లిసిటీ'
టీమిండియా క్రికెట్ దిగ్గజం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆటలో ఎంత సింప్లిసిటీ చూపించాడో బయట కూడా అదే హుందాతనం ప్రదర్శిస్తాడు. మాస్టర్ ఏ ప్లేస్‌కు వెళ్లినా సరే అక్కడున్న వారితో సరదాగా గడుపుతూ వారిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తాడు. తాజాగా రోడ్ సైడ్ టీని ఎంజాయ్ చేశాడు సచిన్ టెండూల్కర్. తన కుమారుడు అర్జున్‌తో కలిసి బెళగాం-గోవా జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ మార్గం మధ్యలో ఒక చోట ఆగారు. అక్కడ రోడ్డు పక్కన ఓ చాయ్ వాలాతో ముచ్చటించారు. అక్కడున్న వారితో సెల్ఫీలు తీసుకుంటూ.. సందడి చేశారు. అనంతరం అక్కడ చాయ్తాగి ఆ రుచిని ఎంజాయ్ చేశారు.ఇందుకు సంబంధించిన వీడియోను సచిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ‘రోడ్ ట్రిప్‌లో చాయ్ బ్రేక్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఈ రంజీ సీజన్ లో ముంబయి జట్టును వీడి గోవా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గత సీజన్ లో రంజీ ట్రోఫీ గ్రూప్ దశలో అర్జున్‌కు ముంబై జట్టులో స్థానం దక్కింది. అయితే ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు. నాకౌట్ దశకు వచ్చేసరికి అర్జున్ను జట్టు నుంచి తప్పించారు. ఈ నేపథ్యంలో మాస్టర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ గోవాకు తరలి వెళ్లాడు. సచిన్‌పై క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసల జల్లు కురిపించారు.''ఆ టీ అమ్మే వ్యక్తి కచ్చితంగా ప్రత్యేకమైన వ్యక్తి. అతని దగ్గరికి దేవుడే టీ కోసం వచ్చాడు'' అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సచిన్‌కు 36 మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం సచిన్ తన వంట నైపుణ్యంతో నెటిజన్లను ఆకట్టుకున్నారు. విభన్నమైన వంటలు చేసి.. ఆ వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడం బాగా వైరల్ అయింది. View this post on Instagram A post shared by Sachin Tendulkar (@sachintendulkar) చదవండి: ప్రొటీస్ పరాజయం.. స్పష్టంగా కనిపించిన మిల్లర్ లోటు -
ముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తన సొంత జట్టు ముంబైకు గుడ్‌బై చెప్పనున్నాడు. దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్‌కు అంతగా అవకాశాలు లభించడం లేదు. దీంతో వచ్చే దేశేవాళీ సీజన్ నుంచి గోవా తరపున ఆడేందుకు అర్జున్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ముంబై క్రికెట్ అసోసియేషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. కాగా అర్జున్ ఇప్పటి వరకు ముంబై తరపున కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ--2021లో భాగంగా హర్యానా, పుదుచ్చేరి మ్యాచ్‌ల్లో అర్జున్ ముంబై జట్టులో భాగంగా ఉన్నాడు. అదే విధంగా ఐపీఎల్లో గత రెండు సీజన్ల నుంచి ముంబై జట్టులో అర్జున్ సభ్యునిగా ఉన్నప్పటికీ.. ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం దక్కలేదు. కాగా ఇటీవలే ముగిసిన రంజీ ట్రోఫీలో చోటుదక్కక పోవడంతోనే అర్జున్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే విషయంపై టెండూల్కర్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ స్పందిస్తూ.. "అర్జున్ తన కెరీర్ మెరుగుపరుచుకోవాలంటే ఎక్కువ సమయం గ్రౌండ్లో గడపడం చాలా ముఖ్యం. అర్జున్ గోవా జట్టు తరపున ఆడితే అతడికి ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. ఈ మార్పు అతడి క్రికెట్ కెరీర్లో కొత్త దశ" అని ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు ఇదే విషయంపై గోవా క్రికెట్ అసోసియేషన్ కూడా స్పందించింది. గోవా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సూరజ్ లోట్లికర్ మాట్లడుతూ.. "మేము ప్రస్తుతం లెఫ్ట్ ఆర్మ్ పేసర్ల కోసం ఎదురు చూస్తున్నాము. అర్జున్ టెండూల్కర్ గోవా జట్టులో చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రీ-సీజన్ ట్రయల్-మ్యాచ్‌లు ముందు మేము నిర్వహిస్తాం. అతడి ప్రదర్శన ఆధారంగా సెలెక్టర్లు జట్టుకు ఎంపిక చేస్తారు" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: WI vs NZ: హెట్‌మైర్ అద్భుత విన్యాసం.. క్యాచ్ ఆఫ్‌ది సీజన్! -
మహిళా క్రికెటర్‌తో సచిన్ తనయుడు.. వైరలవుతున్న ఫొటోలు
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు, ముంబై ఇండియన్స్ యువ క్రికెటర్ అర్జన్ టెండూల్కర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్‌తో అతను సన్నిహితంగా ఉన్న ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఈ ఫోటోల్లో అర్జున్.. వ్యాట్‌తో కాస్త చనువుగా ఉన్నట్లు కనిపించడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు.. సచిన్ తనయుడు ఇంగ్లీష్ పిల్ల బుట్టలో పడ్డాడా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో విషయం తెలీకుండా తప్పుగా కామెంట్లు చేస్తున్న వారికి చురకలంటిస్తున్నారు. మొత్తానికి ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ మహిళా జట్టు ఆల్‌రౌండర్ అయిన వ్యాట్ అర్జున్ తండ్రి సచిన్‌కు వీరాభిమాని. తండ్రి తనయులు ఎప్పుడు లార్డ్స్ మైదానానికి వచ్చినా ఆమె వారిని తప్పకుండా కలిసేది. 2009 నుంచి సచిన్, అర్జున్‌లతో తనకు పరిచయం ఉందని వ్యాట్ గతంలో పలు సందర్భాల్లో పేర్కొంది. 31 ఏళ్ల వ్యాట్ ఇంగ్లండ్ తరఫున 93 వన్డేలు, 124 టీ20 ఆడింది. వ్యాట్.. తన కెరీర్లో మొత్తం 4 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీల సాయంతో 3400కు పైగా పరుగులు సాధించింది. హాఫ్ స్పిన్ బౌలర్ అయిన వ్యాట్ రెండు ఫార్మాట్లలో కలిపి 73 వికెట్లు పడగొట్టింది. చదవండి: అతన్ని ఓపెనర్‌గా పంపండి.. సెహ్వాగ్‌లా సక్సెస్ అవుతాడు..! -
తండ్రి పేరు తొలగించుకుంటే మంచిది.. కనీసం 50 శాతమైనా!
అర్జున్ టెండూల్కర్.. భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు. తండ్రి పేరును తనలో జోడించుకొని అతని కంటే గొప్ప క్రికెటర్‌గా రాణిస్తాడని అంతా భావించారు. కానీ ప్రతీ ఇంట్లో అందరి జీవితాలు ఒకేలా ఉండవు. తండ్రి ఎంత పెద్ద క్రికెటర్ అయినా.. తనలో స్కిల్ ఉంటేనే ఎవరి కొడుకైనా గొప్ప క్రికెటర్ అవుతాడు. తాజాగా అర్జున్ టెండూల్కర్‌కు సంబంధించి ఒక విషయం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఐపీఎల్ 2022లో అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. రూ. 30 లక్షలతో కొనుగోలు చేసిన ముంబై అతనికి ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం కల్పించలేదు. కేవలం ఒక గొప్ప క్రికెటర్ తనయుడు కావడం.. ముంబై ఇండియన్స్‌తో తండ్రికున్న అనుబంధం అతన్ని జట్టులోకి తీసుకునేలా చేసింది. ఇది ఒక పరిది వరకు బాగానే ఉంటుంది.. అవకాశాలు ఇవ్వకుండా జట్టుతో అట్టిపెట్టుకొని తిరిగితే ఏంటి లాభమని క్రికెట్ ఫ్యాన్స్ విమర్శలు కురిపించారు. ఇక ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్.. ''అర్జున్ బౌలింగ్‌లో ఇంకా చాలా మెళుకువలు నేర్చుకోవాలి.. ఇప్పుడు అతనిలో ఉన్న స్కిల్స్ ఏ మాత్రం సరిపోవు.'' అని కామెంట్ చేశాడు. అర్జున్ టెండూల్కర్ విషయంలో నిజంగా దురదృష్టమే.. ఎందుకంటే తనతో సమానమైన.. తనకంటే తక్కువ వయసు ఉన్న ఆటగాళ్లు ఐపీఎల్లో ఇరగదీస్తున్నారు. ''ఎంతైనా అవకాశమిస్తేనే కదా అతనిలో లోపాలు ఉన్నాయా లేదా అనేది తెలిసేది'' అంటూ అభిమానులు కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా దిగ్గజం.. మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ అర్జున్ టెండూల్కర్ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''అర్జున్‌లో టెండూల్కర్ గురించి అంతా మాట్లాడుతున్నారు.. ఎందుకంటే అతను దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు కాబట్టి. అయితే అతన్ని అంతా సచిన్‌తో పోలుస్తున్నారు. అలా కాకుండా అర్జున్ను తన ఆటను ఆడనిస్తే మంచిది. అతనికి ఇంకా 22 ఏళ్లు మాత్రమే. ఒక క్రికెటర్‌గా రాణించడానికి ఇదే సరైన సమయం. తండ్రిలా అద్బుతాలు చేయకపోవచ్చు.. కానీ ఒక మంచి క్రికెటర్‌గా పేరు సంపాదించే అవకాశం ఉంటుంది. అర్జున్‌లో ఉన్న టెండూల్కర్.. పేరు చాలా ఇబ్బంది పెడుతుంది. నిజానికి టెండూల్కర్ అనే పేరు అర్జున్ను వెలుగులోకి రానీయడం లేదు.. అంతేకాదు ఆ పేరు అతన్ని ట్రోల్ చేయడంతో పాటు అవమానాలు ఎదుర్కొనేలా చేస్తుంది. అతని ఆట అతనే ఆడాలి. కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక లెజెండరీ ఆటగాడి కుమారుడిగా అతను కనీసం 50 శాతమైనా నిరూపించుకోవాలి. అలా జరగాలంటే అర్జున్.. ముందు తన పేరులో ఉన్న ''టెండూల్కర్'' పదాన్ని తొలగించుకోవాలి. దిగ్గజ ఆటగాడు సర్ డాన్ బ్రాడ్‌మన్ కుమారుడు.. బ్రాడ్‌మన్ అనే పదాన్ని తన పేరు నుంచి తొలగించుకున్నాడు. ఎందుకంటే ప్రతీ ఒక్కరు అతన్ని తండ్రితో పోల్చడమే ఇందుకు కారణమంట. అనవసరంగా అర్జున్‌పై ఒత్తిడి పెంచొద్దు.'' అని పేర్కొన్నాడు. చదవండి: Mitchell Marsh: 'భారత్‌లో నాకు శాపం తగిలింది'.. ఆసీస్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు IPL 2022: అర్జున్ టెండూల్కర్‌ను అందుకే ఆడించలేదు: షేన్ బాండ్ -
అర్జున్ టెండూల్కర్‌ను అందుకే ఆడించలేదు: షేన్ బాండ్
సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ గత రెండేళ్లుగా ఐపీఎల్ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నాడు. ఐపీఎల్-2021 మినీ వేలంలో ముంబై ఇండియన్స్ అర్జున్ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే గతేడాది సీజన్ మొత్తం బెంచ్‌కే అర్జున్ పరిమితమయ్యాడు. ఇక ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు ముంబై అతడిని విడిచిపెట్టింది. కాగా మెగా వేలంలో మళ్లీ అతడిని రూ.30 లక్షలకు ముంబై సొంతం చేసుకుంది. దీంతో ఈ ఏడాది సీజన్లోనైనా అర్జున్ టెండూల్కర్‌కు జట్టులో చోటు దక్కుతుందని క్రికెట్ ఫ్యాన్స్ భావించారు. అయితే మరోసారి క్రికెట్ అభిమానులకు నిరాశే ఎదురైంది. ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం అతడికి దక్కలేదు. అర్జున్ టెండూల్కర్‌కి ఐపీఎల్ 2022లో ఎందుకు అవకాశం ఇవ్వలేదో తాజాగా ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ వెల్లడించాడు. "అర్జున్ ఇంకా చాలా మెరుగుపడాలి. ఏ ఆటగాడైనా జట్టులోకి రావడం ఒకవంతు అయితే.. ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కాలంటే చాలా కష్టపడాలి. అతడు ఇంకా చాలా వర్కవుట్స్ చేయాల్సి ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో అతడు మరింత రాటుతేలాలి. అతడు బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో పురోగతి సాధించాడని జట్టు భావిస్తే ఖచ్చితంగా అతడికి అవకాశం ఇస్తాం" అని షేన్ బాండ్ పేర్కొన్నాడు. ఇక ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కనబరిచింది. ఆడిన 14 మ్యాచుల్లో 10 పరాజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. చదవండి: IPL 2022: ఐపీఎల్ 2023 ముందు.. ఆ ముగ్గురికి గుడ్‌బై చెప్పనున్న ఎస్ఆర్హెచ్..! -
సచిన్ తనయుడికి మరో అవమానం.. ముంబై రంజీ జట్టులోనూ నో ప్లేస్
ఐపీఎల్ 2022 సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా బెంచ్‌కే పరిమితమైన సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు మరో అవమానం జరిగింది. రంజీ నాకౌట్స్ కోసం ప్రకటించిన ముంబై జట్టులో అతని స్థానం గల్లంతైంది. ఈ ఏడాది ఆరంభంలో టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్య రహానేతో పాటు ముంబై జట్టులో చోటు దక్కించుకున్న అర్జున్ను.. కీలకమైన నాకౌట్ మ్యాచ్‌కు పక్కకు పెట్టారు. ముంబై తరఫున టీ20ల్లో మాత్రమే అరంగేట్రం చేసిన అర్జున్.. ఈ సీజన్ నాకౌట్ మ్యాచ్ ద్వారా ఎలాగైనా ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని భావించాడు. అయితే సెలెక్టర్లు అతని ఆశలను అడియాశలు చేశారు. ఐపీఎల్లో 30 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్ ఒక్క మ్యాచ్ కూడా ఆడించకుండా అవమానించగా.. తాజాగా ముంబై రంజీ టీమ్ కూడా అదే తరహాలో అర్జున్‌పై శీతకన్ను వేసింది. కాగా, జూన్‌లో జరిగే రంజీ ట్రోఫీ నాకౌట్ మ్యాచ్ కోసం ఇవాళ ముంబై జట్టును ప్రకటించారు. బెంగుళూరు వేదికగా ఉత్తరాఖండ్‌తో తలపడే ముంబై జట్టుకు పృథ్వీ షా నాయకత్వం వహించనున్నాడు. గాయం కారణంగా సీనియర్ ప్లేయర్ రహానే ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండగా.. యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, అర్మాన్ జాఫర్ (వసీం జాఫర్ మేనల్లుడు), ధావల్ కులకర్ణి, తుషార్ దేశ్‌పాండే తదితరులు జట్టులో చోటు దక్కించుకున్నారు. ముంబై రంజీ జట్టు: పృథ్వీ షా(కెప్టెన్), యశస్వి జైస్వాల్, భూపేన్ లాల్వానీ, అర్మాన్ జాఫర్, సర్ఫరాజ్ ఖాన్, సువేద్ పార్కర్, ఆకర్షిత్ గోమల్, ఆదిత్య తారే, హార్ధిక్ తమోర్, అమాన్ ఖాన్, సాయిరాజ్ పాటిల్, షమ్స్ ములానీ, దృమిల్ మట్కర్, తనుష్ కోటియాన్, శశాంక్ అతార్డే, ధవల్ కులకర్ణి, తుషార్ దేశ్‌పాండే, మోహిత్ అవస్తీ, రొస్తాన్ డయాస్, సిద్ధార్థ్ రౌత్, ముషీర్ ఖాన్. చదవండి: ధావన్ ఎంపికలో అన్యాయం.. కేఎల్ రాహుల్ జోక్యంలో నిజమెంత? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
యార్కర్లతో అదరగొట్టాడు.. చివరి మ్యాచ్‌లోనైనా అవకాశమివ్వండి!
ఐపీఎల్ 2022 సీజన్లో ముంబై ఇండియన్స్.. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తమ చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ సీజన్లో ప్లేఆఫ్స్ చేరకుండానే వైదొలిగిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది.13 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు.. 10 ఓటమలుతో ఉన్న ముంబై.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో గెలిచి సీజన్‌ను ముగించాలనుకుంటుంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తేనే ప్లే ఆఫ్ చేరుకుంటుంది.. లేదంటే ఆర్సీబీ వెళుతుంది. దీంతో ఢిల్లీకి ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ఈ విషయం పక్కనబెడితే.. రెండు సంవత్సరాలుగా ముంబై ఇండియన్స్ జట్టుతో పాటే ఉన్న దిగ్గజ క్రికెటర్ సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌కు ఇంతవరకు అవకాశం రాలేదు. ఈ సీజన్లోనూ అతనికి అదే పరిస్థితి ఎదురైంది. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ 13 మ్యాచ్‌లు ఆడగా.. ఒక్కదాంట్లోనూ అతనికి అవకాశం రాలేదు. తాజాగా అర్జున్ టెండూల్కర్ నెట్ ప్రాక్టీస్ సెషన్లో యార్కర్లతో విరుచుకుపడ్డాడు. ఒక ఓవర్ మొత్తం మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ వేశాడు. అందులో రెండు బంతులు వికెట్లను తాకుతూ వెళ్లగా.. మరో రెండు బంతులు వికెట్ల పై నుంచి వెళ్లాయి. ఇదంతా గమనించిన టీమిండియా స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా..'' అర్జున్.. బౌలింగ్‌లో మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది.. కంటిన్యూ చెయ్యు'' అని ఎంకరేజ్ చేశాడు. కాగా అర్జున్ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్ రూ.30 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది. గత మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ విధించిన బారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో కేవలం మూడు పరుగులతో ఓటమిని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 193 పరుగులు చేయగా.. చేధనకు దిగిన ముంబై 190 పరుగుల వద్ద ఆగిపోయింది. చదవండి: Chessable Masters: చెస్ వరల్డ్ చాంపియన్‌కు మరోసారి షాకిచ్చిన 16 ఏళ్ల భారత కుర్రాడు Yuzvendra Chahal: ఐపీఎల్ చరిత్రలో చహల్ అరుదైన ఫీట్ Arjun आणि 🎯 वर नेम 👉 Perfect since ages! 😉#OneFamily #DilKholKe #MumbaiIndians MI TV pic.twitter.com/lqhwtKvxmF — Mumbai Indians (@mipaltan) May 19, 2022 -
ప్లేఆఫ్ అవకాశాలు ఖేల్‌ఖతం.. ఇంతకుమించి ఏం చేస్తారులే!
ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్స్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2022 సీజన్లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికే ముంబై 11 మ్యాచ్‌ల్లో 9 ఓటములు చవిచూసి అధికారికంగా ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. ఇండియన్స్ కనీసం ఆఖరి మ్యాచ్‌ల్లో గెలిచైనా పరువు కాపాడుకోవాలనే ప్రయత్నం ముంబై ఇండియన్స్‌లో కనిపించడం లేదు. కేకేఆర్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 165 పరుగుల లక్ష్యాన్ని అందుకునే క్రమంలో 113 పరుగులకే కుప్పకూలి దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ముంబై ఆటతీరు చూస్తుంటే మిగిలిన మూడు మ్యాచ్‌లైనా గెలుస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మైదానంలో ఎలా ఉన్నా.. ముంబై డ్రెస్సింగ్ రూమ్ మాత్రం ఆహ్లదకర వాతావరణంలో ఉన్నట్లు కనిపిస్తుంది. తాజాగా ఆ జట్టు సీనియర్ బౌలర్ ధావల్ కులకర్ణి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో ముంబై ఆటగాళ్లు చెఫ్ అవతారంలో కనిపించారు. ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఈ వీడియోలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. గ్రిల్స్‌పై చికెన్‌ను రోస్ట్ చేస్తున్న అర్జున్ను మాస్టర్ చెఫ్ అంటూ ధావల్ కులకర్ణి క్యాప్షన్ ఇచ్చాడు. అర్జున్‌తో పాటు జూనియర్ ఏబీ డెవాల్డ్ బ్రెవిస్ కూడా కుకింగ్‌లో బిజీగా కనిపించాడు. పనిలో పనిగా ముంబై ఆటగాడు సంజయ్ యాదవ్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను జట్టు ఘనంగా నిర్వహించింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్..'' ఎలాగూ ప్లే ఆఫ్ అవకాశాలు లేవు.. ఇంతకుమించి ఏం చేస్తారులే'' అంటూ కామెంట్ చేశారు. ఇక గత సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ వెంటే ఉన్న అర్జున్ టెండూల్కర్ ఒక్కమ్యాచ్ ఆడలేకపోయాడు. కనీసం ఈ సీజన్లోనైనా అతనికి అవకాశం ఇస్తారేమో చూడాలి. దిగ్గజ ఆటగాడి కుమారుడిగా పేరున్నప్పటికి అర్జున్ టెండూల్కర్ పెద్దగా రాణించింది లేదు. 23 ఏళ్ల అర్జున్ ఇప్పటివరకు రెండు టి20 మ్యాచ్‌లాడి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక ముంబై ఇండియన్స్ తన తర్వాతి మ్యాచ్ మే12న సీఎస్కేతో ఆడనుంది. చదవండి: Rashid Khan: టి20 క్రికెట్లో రషీద్ ఖాన్ అరుదైన ఘనత Surya Kumar Yadav: 'ఈ సీజన్ మాకు కలిసిరాలేదు'.. సూర్యకుమార్ ఎమోషనల్ పోస్ట్ -
అర్జున్ టెండూల్కర్ అద్భుతమైన యార్కర్.. ఇషాన్ కిషన్ క్లీన్ బౌల్డ్
సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాడు. ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్‌కు అర్జున్ టెండూల్కర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో కూడా అతడికి ఆడే అవకాశం రాలేదు. కాగా గురువారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో ముంబై తరపున అర్జున్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో సీఎస్కేతో మ్యాచ్‌కు ముందు అర్జున్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోన్నాడు. ప్రాక్టీస్‌లో భాగంగా అర్జున్ అద్భుతమైన యార్కర్‌తో ఇషాన్ కిషన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలో అతడికి ముంబై తుది జట్టులో అవకాశం ఇవ్వాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఐపీఎల్-2021 సీజన్‌కు ముందు అర్జున్ టెండూల్కర్‌ను నెట్ బౌలర్‌గా ముంబై ఎంపిక చేసింది. అదే విధంగా ఐపీఎల్-2022 మెగా వేలంలో రూ.30 లక్షలకు అతడిని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. చదవండి: IPL 2022: లంక యువ పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఆడమ్ మిల్నే స్థానంలో సీఎస్కేలోకి ఎంట్రీ You ain't missing the 🎯 if your name is 𝔸ℝ𝕁𝕌ℕ! 😎#OneFamily #DilKholKe #MumbaiIndians MI TV pic.twitter.com/P5eTfp47mG — Mumbai Indians (@mipaltan) April 20, 2022 -
ఆ ఆటగాడు మాకే సొంతం.. మీరెలా తీసుకుంటారు!
ఐపీఎల్ మెగావేలంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ చివర్లో వేలంలోకి వచ్చాడు. సచిన్ మీద ఉన్న అభిమానంతో అర్జున్ను మళ్లీ ముంబై ఇండియన్స్ బేస్‌ప్రైస్‌కు కొనుగోలు చేస్తుందని అంతా భావించారు. అన్నట్లుగానే ముంబై అతన్ని రూ. 20 లక్షలకు తీసుకుందామని సిద్ధపడింది. చదవండి: IPL 2022 Auction: ఎవరు కొనరేమో అనుకున్నాం.. చివర్లో అదృష్టం ఇక్కడే ట్విస్టు ఎదురైంది. అర్జున్ను తీసుకోవాలని గుజరాత్ టైటాన్స్ ప్యాడ్ ఎత్తి రూ. 5 లక్షలు పెంచింది. దాంతో అంబానీ, జహీర్ ఇదేంటి... అన్నట్లుగా చిరునవ్వు చూపుతో ఆశిష్ నెహ్రా వైపు చూడటం... మరోసారి ప్యాడ్ ఎత్తి ముంబై రూ. 25 లక్షలకే తీసుకోవడం చకచగా జరిగిపోయాయి. గతేడాది తొలిసారి ముంబై ఇండియన్స్ టీమ్‌కు వచ్చిన అర్జున్ టెండూల్కర్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మరి ఈసారైనా ముంబై తరపున ఐపీఎల్లో అరంగేట్రం చేస్తాడేమో చూడాలి. చదవండి: IPL 2022 Auction: ‘మాకు అనామకులే కావాలి’.. సన్‌రైజర్స్ తీరే వేరు -
IPL 2022 Auction: మెగా వేలం బరిలో రాష్ట్ర మంత్రి
బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరగబోయే ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఓ రాజకీయ ప్రముఖుడు షార్ట్ లిస్ట్ కావడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి, మాజీ టీమిండియా ఆటగాడు మనోజ్ తివారి వేలంలో తన పేరును రిజిస్టర్ చేయించుకున్నాడు. 36 ఏళ్ల మనోజ్ తివారి రూ.50 లక్షల బేస్ ప్రైజ్ విభాగంలో వేలం బరిలోని నిలిచాడు. తివారి 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున శివ్పూర్ ఎమ్మెల్యేగా గెలిచి, ప్రస్తుతం ఆ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు. కుడి చేతి మిడిలార్డర్ బ్యాటర్, లెగ్ స్పిన్ బౌలర్ ఆయిన తివారి 2008-15 మధ్యలో టీమిండియా తరఫున 12 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 302 పరుగులు, 5 వికెట్లు సాధించాడు. తివారి వన్డేల్లో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాధించాడు. తివారికి టీమిండియా తరఫున పెద్దగా అవకాశాలు లభించనప్పటికీ ఐపీఎల్లో మాత్రం దాదాపు 10 ఏళ్ల రెగ్యులర్‌గా కొనసాగాడు. అతను 2008-18 మధ్యలో వివిధ ఫ్రాంచైజీల తరఫున 98 మ్యాచ్‌ల్లో 117 స్ట్రయిక్ రేట్లో 1695 పరుగులు చేసి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2022 మెగా వేలం బరిలో మొత్తం 1214 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, అందులో 590 మంది పేర్లు షార్ట్ లిస్ట్ అయ్యాయి. వీరిలో ప్రస్తుతం అండర్-19 వరల్డ్‌కప్ ఆడుతున్న భారత కుర్రాళ్లతో పాటు పలువురు దేశీయ, విదేశీ స్టార్లు ఉన్నారు. వేలంలో పాల్గొంటున్న వారిలో సౌతాఫ్రికా వెటరన్ ప్లేయర్ ఇమ్రాన్ తాహీర్(42) అతి పెద్ద వయస్కుడు కాగా, అఫ్ఘాన్ ప్లేయర్ నూర్ అహ్మద్(17) అతి పిన్న వయస్కుడిగా ఉన్నాడు. ఈసారి వేలంలో వీరితో పాటు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్(20 లక్షల బేస్ ప్రైజ్), సౌతాఫ్రికా యంగ్ సెన్సేషన్, ‘బేబీ ఏబీడీ’ డివాల్డ్ బ్రేవిస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలువనున్నారు. చదవండి: IPL 2022 Auction: మెగా వేలంలో పాల్గొనబోయేది వీళ్లే: బీసీసీఐ -
ముంబై జట్టు కెప్టెన్‌గా పృథ్వీ షా!
ముంబై: ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో పాల్గొనే 20 మంది సభ్యుల ముంబై జట్టును బుధవారం ప్రకటించారు. పృథ్వీ షా ఈ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, అర్మాన్ జాఫర్, ఆదిత్య తారే, శివమ్ దూబేవంటి ఆటగాళ్లతో జట్టు పటిష్టంగా ఉంది. దిగ్గజ క్రికెట్ సచిన్ టెండూల్కర్ కుమారుడు, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్‌కు కూడా ముంబై జట్టులో చోటు లభించింది. గత ఏడాది ముస్తాక్ అలీ టోర్నీలో ముంబై తరఫున రెండు టి20 మ్యాచ్ లు ఆడిన 22 ఏళ్ల అర్జున్ను ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ టీమ్ తీసుకున్నా...మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. జనవరి 13నుంచి జరిగే తమ తొలి పోరులో మహారాష్ట్రతో ముంబై తలపడుతుంది. చదవండి: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ క్రికెటర్.. -
Sara Tendulkar: అభిమానులను ఆశ్చర్యపరిచిన సారా.. వీడియో వైరల్
Sachin Tendulkar Daughter Sara Enters Into Modelling World Video Viral: టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తనయ సారా టెండుల్కర్ మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. ప్రముఖ క్లాతింగ్ బ్రాండ్‌కు ఆమె మోడల్‌గా వ్యవహరిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను సారా తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. ఇందులో.. నటి బనితా సంధు, తానియా ష్రాఫ్‌తో కలిసి సారా టెండుల్కర్ తళుక్కుమంది. ఈ క్రమంలో అభిమానులు ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. మోడలింగ్ కెరీర్లో విజయవంతంగా కొనసాగాలంటూ విష్ చేస్తున్నారు. కాగా సచిన్- అంజలి దంపతులకు సారా, అర్జున్ సంతానం అన్న సంగతి తెలిసిందే. అర్జున్ ఇప్పటికే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోగా.. సారా మోడల్‌గా తన ప్రయాణం ఆరంభించింది. ఇక అండర్-19 జట్టులో చోటు దక్కించుకున్న అర్జున్.. ఇటీవలే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా దేశవాళీ టీ20 క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇదిలా ఉంటే.. మినీ వేలంలో భాగంగా ఐపీఎల్ ఫ్రాంఛైజీ అర్జున్ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సారా.. టీమిండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో సరదాగా సంభాషించడంతో వీరిద్దరు రిలేషన్లో ఉన్నారంటూ వదంతులు వ్యాపించాయి. అయితే, ఇద్దరూ ఈ విషయంపై మౌనం వహించడం.. ఇటీవలే గిల్ బ్రేకప్‌నకు సంబంధించి కోట్స్ షేర్ చేయడంతో రూమర్స్‌కు చెక్ పడింది. మరోవైపు.. సింగర్ కనికా కపూర్‌తో సారా నైట్డేట్కు వెళ్లడం.. ఆ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేయడంతో మరోసారి వార్తల్లోకెక్కింది. ఇప్పుడేమో మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నట్లు చెప్పి అభిమానులను ఆశ్చర్యపరిచింది. మొత్తానికి ఏదో ఒక వార్తతో సారా పేరు నెటిజన్ల నోళ్లలో నానుతూ ఉంది. చదవండి: Ind Vs Nz 2nd Test: ఫోర్ కొట్టిన గిల్.. సచిన్ అంటూ అరిచిన అభిమానులు.. ఎందుకంటే! IPL 2022 Mega Auction: ఈ నలుగురు క్రికెటర్లు అమ్ముడుపోవడం కష్టమే! View this post on Instagram A post shared by Sara Tendulkar (@saratendulkar) -
అర్జున్ టెండూల్కర్‌కు గాయం.. ఒక్క మ్యాచ్ ఆడకుండానే
Arjun Tendulkar Injury Ruled Out IPL 2021.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ గాయంతో ఐపీఎల్ 2021లో మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గత డిసెంబర్లో జరిగిన వేలంలో అర్జున్ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్ కనీస ధర రూ. 20 లక్షలకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అర్జున్ ముంబై తరపున ఒక్క మ్యాచ్‌లో కూడా బరిలోకి దిగలేదు. అలా ఐపీఎల్ ఆడకుండానే గాయం కారణంగా అర్జున్ తప్పుకోవాల్సి వచ్చింది. ఇక అర్జున్ ముంబై తరపున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రెండో టి20 మ్యాచ్‌లు ఆడాడు. చదవండి: IPL 2021: ఫామ్‌లో లేకపోతే అంతే.. మూలకు కూర్చోవాల్సిందే కాగా గాయంతో దూరమైన అర్జున్ టెండూల్కర్ స్థానంలో రైట్ ఆర్మ్ మీడియం పేసర్ సిమర్జీత్ సింగ్‌ను తీసుకున్నట్లు ముంబై ఇండియన్స్ తన ట్విటర్లో ప్రకటించింది. కాగా 23 ఏళ్ల సిమర్జీత్ సింగ్ దేశవాలి క్రికెట్లో 10 ఫస్ట్‌క్లాస్, 19 లిస్ట్ ఏ మ్యాచ్‌లు.. 15 టి20లు ఆడి మొత్తంగా 74 వికెట్లు పడగొట్టాడు. అయితే సిమర్జీత్ సింగ్ గత జూలైలో శ్రీలంకలో పర్యటించిన టీమిండియా జట్టుకు నెట్ బౌలర్‌గా ఎంపికయ్యాడు. చదవండి: IPL 2021: ఔటవ్వాల్సింది బతికిపోయాడు.. కృనాల్, రోహిత్ క్రీడాస్పూర్తికి రాహుల్ ఫిదా Ashwin Vs Morgan: మోర్గాన్ తప్పు లేదు.. అశ్విన్‌ను అడ్డుకునే హక్కు ఉంది 🚨 Squad Update 🚨 Right-arm medium pacer Simarjeet Singh will be replacing Arjun Tendulkar for the remainder of #IPL2021 📰 Read all the details 👇#OneFamily #MumbaiIndians https://t.co/AcfBJsYf2w — Mumbai Indians (@mipaltan) September 29, 2021 -
తమ్ముడికి సారా టెండూల్కర్ అదిరిపోయే గిఫ్ట్
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఈరోజు(సెప్టెంబర్ 24న) 22వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సచిన్ కూతురు సారా టెండూల్కర్ తన తమ్ముడికి అదిరిపోయే బర్త్‌డే గిప్ట్ ఇచ్చింది. తన ఇన్స్టాగ్రామ్ వేదికగా చిన్ననాటి అర్జున్ వీడియోనూ షేర్ చేసింది. ఆ వీడియోలో చిన్ననాటి అర్జున్‌తో పాటు పక్కన సారా అతన్ని ఆడిస్తూ కనిపించింది. '' నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి.. ఈరోజుతో 22వ పడిలోకి అడుగుపెడతున్నాడు.. లవ్ యూ బ్రదర్'' అంటూ క్యాప్షన్ జత చేసింది. వీడియోకు లవ్ సింబల్స్‌ను ఎమోజీ రూపంలో పెట్టి తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. చదవండి: పొలార్డ్‌కే దంకీ ఇద్దామనుకున్నాడు.. తర్వాతి ఓవర్ చూసుకుంటా కాగా అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో పాల్గొంటున్నాడు. గతేడాది డిసెంబర్లో జరిగిన వేలంలో ముంబై ఇండియన్స్ కనీస మద్దతు ధర రూ. 20 లక్షలకు అర్జున్ను కొనుగోలు చేసింది. కాగా అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్లో ఆడడం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక ముంబై ఇండియన్స్ ఈ ఐపీఎల్ సీజన్లో అనుకున్నంత విధంగా రాణించడం లేదు. ఇప్పటికే 9 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ముంబై ఇండియన్స్ 4 విజయాలు.. ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ముంబై ఇండియన్స్ తన తర్వాతి మ్యాచ్‌ను సెప్టెంబర్ 26న ఆర్సీబీతో ఆడనుంది. చదవండి: టీమిండియా చరిత్ర సృష్టించి నేటికి 14 ఏళ్లు.. ❤❤ pic.twitter.com/Jgvsqj7VEQ — Simran (@CowCorner9) September 24, 2021 -
కుమారుడు చేసిన పనికి ఇబ్బందిపడ్డ సచిన్...!
ముంబై: ద గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ శనివారంతో 48 వసంతంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. సచిన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగి సుమారు ఎనిమిదేళ్లు అవుతోంది. ప్రస్తుతం అతని కుమారుడు అర్జున్ టెండూల్కర్ క్రికెట్లో రాణిస్తున్నాడు. అర్జున్ ప్రస్తుత ఐపీఎల్-2021 ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ జట్టులోకి రంగ ప్రవేశం చేశాడు. కుమారుడి గురించి సచిన్ మాట్లాడుతూ.. ఒక సందర్భంలో అర్జున్ టెండూల్కర్ చేసిన పనికి కాస్త ఇబ్బంది పడ్డానని మీడియాతో తెలిపాడు. అమితాబ్ బచ్చన్‌తో కలిసి సచిన్ ఒక కంపెనీ ప్రకటనలో నటించాడు. వీరు ఇరువురు ప్రకటన చేసిన సమయంలో అప్పుడు అర్జున్ వయసు ఒకటిన్నర ఏళ్లు మాత్రమే. షూటింగ్ బ్రేక్ సమయంలో ఇరువురు ఒక దగ్గర కుర్చోగా, అర్జున్ తన తండ్రి సచిన్ ఒళ్లో కూర్చున్నాడు. అర్జున్ ఆ సమయంలో ఆరెంజ్ పండును తిని చేతులను అమితా బచ్చన్ వేసుకున్న కుర్తాతో తుడ్చుకున్నాడు. ఆ సమయంలో సచిన్ నిర్ఘాంతపోయానని మీడియాతో తెలిపారు.అంతేకాకుండా అర్జున్ చేసిన పనితో కాస్త ఇబ్బందికి గురయ్యానని పేర్కొన్నాడు. ఈ సంఘటనను 2017లో అమితాబ్ బచ్చన్ 75 వ పుట్టినరోజు సందర్భంగా మీడియాతో పంచుకున్నాడు. చదవండి: గాడ్ ఆఫ్ క్రికెట్‌పై వైరల్ అవుతోన్న వీడియో! -
జాన్సెన్ ట్విన్స్‌తో అర్జున్ టెండూల్కర్
చెన్నై: దక్షిణాఫ్రికా బౌలింగ్ ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసిన మార్కో జాన్సెన్-అతని ట్విన్ బ్రదర్ డ్యుయాన్ జాన్సెన్ తో కలిసి దిగిన ఫోటోను అర్జున్ టెండూల్కర్ షేర్ చేశాడు. ఈ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అర్జున్ పోస్ట్ చేశాడు. ముంబై ఇండియన్స్ క్యాంప్‌లో ఉన్న వీరు ముగ్గురు ఫోటో దిగగా, దాన్ని అర్జున్ అభిమానులతో పంచుకున్నాడు. ఈ సీజన్లో అర్జున్ టెండూల్కర్‌ను ముంబై ఫ్రాంచైజీ తీసుకున్నా ఇంకా అరంగేట్రం చేయలేదు. ముంబై జట్టు సభ్యులతో కలిసి నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. లెఫ్టార్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన అర్జున్.. ముంబై బ్యాటర్స్‌కు బౌలింగ్ చేస్తూ బిజిబిజీగా ఉన్నాడు. సచిన్ మెంటార్‌గా వ్యవహరిస్తున్న అంబానీ గ్రూపు ఆధ్వర్యంలోని ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ అర్జున్ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రూ. 20 లక్షల కనీస ధరతో ఫిబ్రవరిలో జరిగిన వేలంలోకి వచ్చిన అతడిని అదే ధరకు సొంతం చేసుకుంది. ఇక ఈ సీజన్లో మార్కో జాన్సెన్ ముంబై తరఫున రెండు మ్యాచ్‌లు ఆడి రెండు వికెట్లు సాధించాడు. ఇక్కడ 7.50 ఎకానమీ నమోదు చేశాడు. -
‘ఇది నీ విజయం.. నీకు మాత్రమే సొంతం అర్జున్’
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండుల్కర్‌కు బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ అండగా నిలిచాడు. ఆట పట్ల అర్జున్‌కు అమిత శ్రద్ధ ఉందని, అతడి ఉత్సుకతను హత్య చేయవద్దంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. నెపోటిజం పేరిట తనను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని హితవు పలికాడు. కాగా సచిన్ మెంటార్‌గా వ్యవహరిస్తున్న అంబానీ గ్రూపు ఆధ్వర్యంలోని ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ అర్జున్ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని అదే ధరకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో బంధుప్రీతి కారణంగానే అర్జున్‌కు ఈ అవకాశం వచ్చిందంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అంతేగాక, నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు నిరసనల విషయంలో అంతర్జాతీయ సెలబ్రిటీలు చేసిన ట్వీట్లపై సచిన్ స్పందించిన విధానానికి, అర్జున్ ఐపీఎల్ అరంగేట్రాన్ని ముడిపెడుతూ విమర్శిస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన ఫర్హాన్ అక్తర్.. ‘‘అర్జున్ టెండుల్కర్ గురించి ఒక విషయం చెప్పదలచుకున్నాను. మేమిద్దరం ఒకే జిమ్‌లో తరచుగా కలుస్తూ ఉంటాం. ఫిట్నెస్ సాధించేందుకు అతడు ఎంతో కఠినంగా శ్రమిస్తాడు. మంచి క్రికెటర్‌గా ఎదిగే అంశాలపై దృష్టి పెడతాడు. కానీ వాటన్నింటినీ నెపోటిజం అనే ఒకే ఒక్క మాటతో నీరుగార్చడం సరికాదు. అంతకంటే క్రూరమైంది మరొకటి లేదు. అతడి ఉత్సాహాన్ని మర్డర్ చేయకండి. సరికొత్త ప్రయాణానికి ముందే తనపై విమర్శల భారం మోపకండి’’ అని ట్విటర్ వేదికగా అర్జున్‌కు మద్దతు ప్రకటించాడు. ఇక సచిన్ కుమార్తె, అర్జున్ అక్క సారా టెండుల్కర్ సైతం.. ‘‘ఈ విజయాన్ని నీ నుంచి ఎవరూ దూరం చేయలేరు. ఇది నీ విజయం’’ అంటూ తమ్ముడికి అండగా నిలిచారు. కాగా ప్రతిభ ఆధారంగానే అర్జున్ను తాము ఎంపిక చేసుకున్నట్లు ముంబై ఇండియన్స్ హెచ్‌కోచ్ మహేల జయవర్దనే తెలిపిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ఓ మ్యాచ్‌లో అర్జున్ టెండుల్కర్ ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టడం సహా, మూడు వికెట్లు తీసి ఆల్‌రౌండర్ ప్రతిభ కనబరిచాడు. చదవండి: అర్జున్ బ్యాటింగ్ మెరుపులు..సిక్సర్ల మోత లక్కీగా అర్జున్ బౌలర్ అయ్యాడు.. లేదంటే! -
లక్కీగా అర్జున్ బౌలర్ అయ్యాడు.. లేదంటే!
ముంబై: అర్జున్ టెండుల్కర్‌లో దాగున్న క్రీడా నైపుణ్యాల ఆధారంగానే అతడిని కొనుగోలు చేశామని ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేలా జయవర్ధనే అన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడటం ద్వారా ఎంతోమంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారని, తను కూడా ఈ లీగ్ ద్వారా తన సత్తా ఏమిటో నిరూపించుకునే అవకాశం ఉందన్నాడు. కాగా గురువారం జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో భాగంగా, అంబానీ కుటుంబానికి చెందిన ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ అర్జున్ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రూ. 20 లక్షల బేస్‌ప్రైస్‌కు వేలంలోకి రాగా, అదే ధరకు అతడిని సొంతం చేసుకుంది. కాగా ఈ జట్టుకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ మెంటార్‌గా వ్యవహరిన్నాడు. దీంతో అతడి కుమారుడిని జట్టులోకి తీసుకోవడంపై సహజంగానే విమర్శలు వినిపించాయి. ఇందుకుతోడు రైతు ఆందోళనల విషయంలో అంతర్జాతీయ సెలబ్రిటీలు చేసిన ట్వీట్లపై సచిన్ స్పందించిన తీరు, అర్జున్ ఐపీఎల్ అరంగేట్రాన్ని ముడిపెడుతూ కొంత మంది నెటిజన్లు ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో జయవర్ధనే మాట్లాడుతూ.. ‘‘అర్జున్ తలపై సచిన్ కుమారుడు అనే అతిపెద్ద ట్యాగ్ ఉండటం సహజం. అయితే అదృష్టవశాత్తూ అతడు బ్యాట్స్‌మెన్ కాకుండా, బౌలర్ అయ్యాడు. నిజానికి అర్జున్ బౌలింగ్ తీరు పట్ల సచిన్ ఎంతో గర్వపడతారు. అయితే మేం కేవలం బౌలింగ్ నైపుణ్యాల ఆధారంగానే అతడిని ఎంపిక చేసుకున్నాం. ఇంతవరకు ముంబై తరఫున ఆడిన అర్జున్, ఇప్పుడు ఎంఐకి ఆడబోతున్నాడు. ఆట పట్ల తనకున్న శ్రద్ధ అమోఘం. తనపై ఒత్తిడి పడకుండా చూసుకోవడమే మా బాధ్యత. మిగతాది తనే చూసుకుంటాడు’’ అని పేర్కొన్నాడు. ఇక ఆ జట్టు క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ జహీర్‌ఖాన్ సైతం అర్జున్ నెట్స్‌లో కఠినంగా శ్రమిస్తాడని, తనొక అంకిత భావం గల యువ ఆటగాడు అని కితాబిచ్చాడు. ఇదిలా ఉండగా.. తనకు ఐపీఎల్ ఆడే అవకాశం కల్పించినందుకు తమకు ధన్యవాదాలు చెబుతూ అర్జున్ మాట్లాడిన వీడియోను ముంబై షేర్ చేసింది. A ballboy at Wankhede before 🏟️ Support bowler last season 💪 First-team player now 💙 It's showtime, Arjun! 😎#OneFamily #MumbaiIndians #IPLAuction pic.twitter.com/OgU4MGTPe1 — Mumbai Indians (@mipaltan) February 18, 2021 చదవండి: ఒక్క హైదరాబాద్ ప్లేయర్‌కీ చోటులేదు: అజారుద్దీన్ వీళ్లిద్దరు చూడముచ్చటగా ఉన్నారు! -
అర్జున్ బ్యాటింగ్ మెరుపులు..సిక్సర్ల మోత
ముంబై: టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండుల్కర్ ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచాడు. బంతితోనూ, బ్యాట్‌తోనూ చెలరేగిపోయి తాను ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాది తన మార్కు చూపించాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) స్థానికంగా నిర్వహిస్తున్న టోర్నమెంట్లో అర్జున్ టెండుల్కర్ ఈ ఫీట్‌ను సాధించాడు. ఎమ్ఐజీ క్రికెట్ క్లబ్- ఇస్లాం జింఖానా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎమ్ఐజీ తరఫున మైదానంలో దిగిన అతడు.. తన అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. కాగా తొలుత బ్యాటింగ్ దిగిన ఎమ్ఐజీ క్రికెట్ క్లబ్ జట్టు.. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ప్రగ్నేశ్ కందీలెవార్ సెంచరీ చేయగా, మరో ఆటగాడు కెవిన్ 96 పరుగుల వద్ద నిలిచిపోయాడు. ఇక అర్జున్ టెండుల్కర్ 31 బంతుల్లోనే 77 పరుగులు చేసి వహ్వా అనిపించాడు. 5 ఫోర్లు, 8 సిక్సర్లతో చెలరేగి ఆడుతూ ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్ హషీర్ దఫేదార్ వేసిన ఓవర్లోనే ఐదు సిక్స్‌లు బాదాడు. ఈ ముగ్గురి భారీ ఇన్నింగ్స్‌తో ఎమ్ఐజీ జట్టు 45 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 385 పరుగులు చేసింది. (చదవండి: ఇప్పుడేమంటారు: అశ్విన్ భార్య) ఈ క్రమంలో బ్యాటింగ్ దిగిన జింఖానా జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. ఆ జట్టు 191 పరుగులకే ఆలౌట్ అయి 194 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసింది. అర్జున్ టెండుల్కర్, అంకుశ్ జైస్వాల్. శ్రేయస్ గౌరవ్ మూడేసి వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించారు. కాగా క్యాష్ రిచ్‌లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో భాగంగా అర్జున్ ఇటీవల తన పేరును నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. రూ. 20 లక్షల కనీస ధరతో రిజిస్టర్ చేసుకున్న అర్జున్, మరో మూడు రోజుల్లో ఆటగాళ్ల వేలం జరుగనున్న వేళ ఈ మేరకు పొట్టి ఫార్మాట్ తరహాలో అద్భుత ఇన్నింగ్స్ ఆడటం విశేషం. -
ఐపీఎల్ వేలం.. బరిలో అర్జున్ టెండూల్కర్
చెన్నై: వివాదాస్పద భారత క్రికెటర్ శ్రీశాంత్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్లో మళ్లీ ఆడేందుకు తహతహలాడుతున్నాడు. ఈ సీజన్ కోసం నిర్వహించే వేలంలో పాల్గొనేందుకు రూ. 75 లక్షల కనీస ధరతో తన పేరు నమోదు చేసుకున్నాడు. కానీ పోటీ తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఫిక్సింగ్ మరకలున్న అతనిపై ఏ ఫ్రాంచైజీ కన్నెత్తి చూస్తోందో వేచి చూడాలి. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కూడా ఈ వేలంలో తన పేరు నమోదు చేసుకున్నాడు. అర్జున్ రూ. 20 లక్షల కనీస ధరతో పేరును రిజిస్టర్ చేసుకున్నాడు. ఈ నెల 18న జరిగే ఆటగాళ్ల వేలానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రంగం సిద్ధం చేసింది. మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీల్లో కేవలం 61 ఖాళీలే ఉన్న ఈ సీజన్ కోసం 1,097 మంది ఆటగాళ్లు వేలంలో పోటీపడుతున్నారు. మిషెల్ స్టార్క్, ప్యాటిన్సన్ (ఆస్ట్రేలియా), జో రూట్ (ఇంగ్లండ్)లాంటి అంతర్జాతీయ స్టార్లు ఈ వేలంలో పాల్గొనడం లేదు. వేలం బరిలో 814 మంది భారత ఆటగాళ్లు (21 అంతర్జాతీయ క్రికెటర్లు, 793 అన్క్యాప్డ్ ప్లేయర్లు) ఉన్నారు. 283 మంది విదేశీ ఆటగాళ్లు ఫ్రాంచైజీల కంటపడేందుకు బోర్డు వద్ద తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆటగాళ్ల నమోదుకు గడువు గురువారంతో ముగియడంతో బీసీసీఐ వేలం జాబితాను శుక్రవారం విడుదల చేసింది. విదేశాల నుంచి అందుబాటులో ఉన్న క్రికెటర్లలో వెస్టిండీస్ ఆటగాళ్లే (56 మంది) ఎక్కువ ఉన్నారు. ఆ తర్వాత సంఖ్య ఆస్ట్రేలియా (42), దక్షిణాఫ్రికా (38) ఆటగాళ్లది. ప్రస్తుతమున్న 61 ఖాళీల్లో విదేశీ ఆటగాళ్లతోనే 22 స్థానాల్ని భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. రూ. 2 కోట్ల ధరలో... హర్భజన్ సింగ్, కేదార్ జాదవ్ (భారత్), స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్ (ఆస్ట్రేలియా), షకీబుల్ హసన్ (బంగ్లాదేశ్), మొయిన్ అలీ, బిల్లింగ్స్, ప్లంకెట్, జేసన్ రాయ్, మార్క్ వుడ్ (ఇంగ్లండ్), ఇంగ్రామ్ (దక్షిణాఫ్రికా). ఏ దేశం నుంచి ఎందరంటే... వెస్టిండీస్ (56), ఆస్ట్రేలియా (42), దక్షిణాఫ్రికా (38), శ్రీలంక (31), అఫ్గానిస్తాన్ (30), న్యూజిలాండ్ (29), ఇంగ్లండ్ (21), యూఏఈ (9), నేపాల్ (8), స్కాట్లాండ్ (7), బంగ్లాదేశ్ (5), ఐర్లాండ్ (2), అమెరికా (2), జింబాబ్వే (2), నెదర్లాండ్స్ (1). -
అర్జున్ టెండూల్కర్ మెయిడిన్ వికెట్..వైరల్
ముంబై : సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ‘ఇ’ గ్రూప్‌లో హరియాణాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై 8 వికెట్ల తేడాతో ఓడింది. తొలుత ముంబై 143 పరుగులకు ఆలౌటైంది. హరియాణా 17.4 ఓవర్లలో 2 వికెట్లకు 144 పరుగలు చేసి గెలిచింది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఈ మ్యాచ్‌తో సీనియర్ ముంబై జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. బ్యాటింగ్‌లో అర్జున్ (0 నాటౌట్) ఖాతా తెరవకపోయినా... బౌలింగ్‌లో 3 ఓవర్లు వేసి 34 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ తీశాడు. అర్జున్ టెండూల్కర్ తీసిన మెయిడిన్ వికెట్ వైరల్‌గా మారింది. హరియాణా ఓపెనర్ సీకే బిష్నోయ్‌ను ఔట్ చేసి సీనియర్ ముంబై జట్టు తరఫున మెయిడిన్ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అర్జున్ వేసిన రెండో ఓవర్ తొలి బంతికి బిష్నోయ్ వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.(లంచ్‌కు ముందే ఆసీస్ ఆలౌట్) అయ్యో... ఆంధ్ర ఆంధ్ర జట్టుకు వరుసగా మూడో పరాజయం ఎదురైంది. గ్రూప్ ‘ఇ’లోనే శుక్రవారం పుదుచ్చేరి జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌లో ఆంధ్ర 226 పరుగుల భారీ స్కోరు చేసినా ఓడిపోవడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర... శ్రీకర్ భరత్ (34 బంతుల్లో 62; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), కెప్టెన్ బటి రాయుడు (26 బంతుల్లో 62 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 226 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పుదుచ్చేరి జట్టును షెల్డన్ జాక్సన్ ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చాడు. షెల్డన్ జాక్సన్ 50 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో అజేయంగా 106 పరుగులు చేశాడు. దాంతో దుచ్చేరి 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసి గెలిచింది. ఆంధ్ర బౌలర్లలో హరిశంకర్ రెడ్డి 35 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. (36 బంతుల్లోనే శతకం...ఫాస్టెస్ట్ రికార్డు) Arjun Tendulkar getting his first Wicket on debut. !!! 👏👏 Cc: Vinesh Prabhu pic.twitter.com/gEiJmcdnbU — Sachin Tendulkar🇮🇳 Fan Club 🇮🇳 (@CrickeTendulkar) January 15, 2021 -
ముంబై సీనియర్ జట్టులో అర్జున్ టెండూల్కర్
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ తొలిసారి ముంబై సీనియర్ క్రికెట్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఈ నెల 10 నుంచి ఆరంభమయ్యే దేశవాళీ క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ కోసం 22 మంది సభ్యులతో ఎంపిక చేసిన జట్టులో అర్జున్‌కు ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) చోటు కల్పించింది. దాంతో ముంబై తరఫున ఇప్పటి వరకు అండర్–14, 16, 19 టోర్నీల్లో పాల్గొన్న అర్జున్... తొలిసారి సీనియర్లతో కలిసి ఆడనుండటం విశేషం. ఈ టోర్నీలో 21 ఏళ్ల అర్జున్ రాణిస్తే అతడి ఐపీఎల్ ఎంట్రీ ముంబై ఇండియన్స్ తరఫున ఈ ఏడాదే ఉండే అవకాశం ఉంది. ముంబై జట్టుకు సూర్యకుమార్ యాదవ్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. -
క్రికెట్లో నెపోటిజమ్ రచ్చ.. చోప్రా క్లారిటీ
ముంబై: సినీ పరిశ్రమలో ప్రస్తుతం నెపోటిజం అంటూ తీవ్రస్థాయిలో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నెపోటిజం సెగ భారత క్రికెట్‌ను కూడా తాకింది. బంధుప్రీతి కారణంగా నైపుణ్యం ఉన్న ఆటగాళ్లకు అన్యాయం జరుగుతుందనే వాదన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ముఖ్యంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వారసుడు అర్జున్ టెండూల్కర్‌ను టార్గెట్ చేస్తూ భారత క్రికెట్లో నెపోటిజం ఉందంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సచిన్ కుమారుడనే ఒకే ఒక కారణంతో అతడిని ఎంపిక చేస్తున్నారని ఆరోపిస్తూనే ప్రతిభ ఉన్నా జట్టులోకి తీసుకోని పలువురు ఆటగాళ్ల పేర్లను తెరపైకి తీసుకొస్తున్నారు. (‘టై’ అయితే సంయుక్త విజేతగా ప్రకటించండి) అయితే భారత క్రికెట్లో నెపోటిజమ్ అనే ప్రస్తావనే లేదని టీమిండియా మాజీ టెస్టు ఓపెనర్ ఆకాశ్ చోప్రా స్పష్టం చేశాడు. ‘అర్జున్ టెండూల్కర్ పేరును తెరపైకి తీసుకొచ్చి విమర్శించడం సరికాదు. సచిన్ కుమారుడైనంత మాత్రాన అతడికి టీమిండియాలో అవకాశాన్ని పువ్వుల్లో పెట్టివ్వరు. అన్ని విధాలుగా అర్హుడైతేనే జట్టులోకి వస్తాడు. ఇక అండర్-19 సెలక్షన్స్‌లో కూడా ఎలాంటి అవకతవకలు జరగవు. ప్రతిభ, బీసీసీఐ నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు ఉంటేనే అండర్-19 జట్టులోకి తీసుకుంటారు. (‘రైజర్స్’తోనే నేర్చుకున్నా...) సునీల్ గావస్కర్ తనయుడు రోహన్ గావస్కర్ కూడా బెంగాల్ రంజీ టీంలో మెరుగైన ప్రదర్శన చేశాడు కాబట్టే భారత జట్టులోకి వచ్చాడు. గావస్కర్ ఇంటి పేరు ఉన్నప్పటికీ రోహన్‌కు ముంబై రంజీ టీంలో చోటు దక్కని విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా టీమిండియా తరుపున అనేక మ్యాచ్‌లు ఆడి విజయాలను అందించినప్పటికీ తన కొడుకుకు కనీసం ముంబై టీంలో అవకాశం సునీల్ గావస్కర్ అవకాశం ఇప్పించలేదు. ఎందుకుంటే ప్రతిభ ఉంటే అవకాశం వస్తుంది. బంధుప్రీతితో కాదు’ అంటూ అకాశ్ చోప్రా పేర్కొన్నాడు. (‘నల్లవారిని’ నిరోధించేందుకే...) -
‘బౌలింగ్ చేయమంటే భయపెట్టేవాడు’
లండన్: యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌ను ఎదుర్కొవడం చాలా కష్టమని ఇంగ్లండ్ మహిళల క్రికెటర్ డానియల్ వ్యాట్ పేర్కొన్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వారసుడునై అర్జున్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఏడాదిలో ఎక్కువ నెలలు ఇంగ్లండ్‌లో గడుపుతూ ఆటలో నిష్ణాతుడు కావడానికి ప్రయత్నిస్తున్నాడు. దీంతో ఆదేశ క్రికెటర్లతో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ మెరుగవుతున్నాడు. అంతేకాకుండా ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టుతోనూ అర్జున్ ప్రాక్టీస్ చేసిన సందర్బాలు కూడా ఉన్నాయి. ఇక ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌వుమన్ డానియల్ వ్యాట్, అర్జున టెండూల్కర్లు మంచి స్నేహితులు అనే విషయం అందిరికీ తెలిసిందే. అయితే అర్జున్ బౌలింగ్ గురించి వ్యాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ('తండ్రిగా నా కోరికలు నెరవేర్చుకుంటున్నా') ‘అర్జున్, నేను మంచి స్నేహితులం. లార్డ్స్ మైదానానికి ప్రాక్టీస్ చేయడానికి అతడు వస్తుండేవాడు. అప్పుడు కొత్త బంతితో నాకు బౌలింగ్ చేయాలని అడిగితే అర్జున్ భయపెట్టేవాడు. నేను వేసే బౌన్సర్లు నీ తలకు తగులుతాయి అని హెచ్చరించేవాడు. దీంతో అతడి బౌలింగ్‌లో బ్యాటింగ్ చేసేందుకు ఇష్టపడను. అంతేకాకుండా అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం. ఆటగాడిగా మెరుగవుతున్నాడు. త్వరలోనే అంతర్జాతయ క్రికెట్లో అతడిని చూసే అవకాశం ఉంది. ఇక అర్జున్ వాళ్ల అమ్మ అంజలితో తరుచూ మాట్లాడతా. చాలా మంచి వ్యక్తి. సచిన్, అంజలిలు ఇంగ్లండ్‌కు వచ్చిన ప్రతీసారి వారిని కలుస్తాను’ అని డానియల్ వ్యాట్ వ్యాఖ్యానించారు. ఇక మహిళల ప్రపంచకప్ -2017 గెలిచిన ఇంగ్లండ్ జట్టలో వ్యాట్ కీలక ప్లేయర్ అన్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ తరుపును ఆమె ఇప్పటివరకు 74 వన్డేలు, 109 టీ20లకు ప్రాతినిథ్యం వహించారు. (‘అప్పుడు సుశాంత్‌కు ఎన్నో గాయాలయ్యాయి’) -
'తండ్రిగా నా కోరికలు నెరవేర్చుకుంటున్నా'
ముంబై : టీమిండియా దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్‌లో ఎంత నైపుణ్యతను ప్రదర్శించాడనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన బ్యాటింగ్ పవర్‌తోనే క్రికెట్ ప్రపంచంలో లెక్కలేనన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్న సచిన్ హెయిర్‌కట్ చేయడంలోనూ అంతే నైపుణ్యతను చూపిస్తున్నాడు. తాజాగా తన కొడుకు అర్జున్ టెండూల్కర్‌కు హెయిర్‌కట్ చేసిన వీడియోనూ ఇప్పుడు తెగ వైరల్‌గా మారింది. కొన్ని రోజుల క్రితం ఎవరి సహాయం లేకుండానే తనే సొంతంగా హెయిర్‌కట్ చేసుకున్న సచిన్ తాజాగా అర్జున్‌కు హెయిర్ ట్రిమ్ చేశాడు. సచిన్‌కు అతని కూతురు సారా టెండూల్కర్ అసిస్టెంట్‌గా వ్యవహరించడం ఇందులో మరో విశేషం.('కష్టపడి సంపాదించాలి.. డిమాండ్ చేయొద్దు') 'క్రికెటర్‌గా దేశం తరపున ఎన్నో మ్యాచ్‌లు ఆడి గెలిపించాను. ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత తండ్రిగా బాధ్యతలు నెరవేరుస్తున్నా. ఒక తండ్రిగా నా కోరికలు నెరవేర్చుకుంటున్నా.. పిల్లలతో కలిసి ఆడుకోవడం, తినడం, కుటుంబంతో కలిసి ఆనందంగా గడపడం లాంటివి చేస్తున్నా. తాజాగా నా కొడుకు అర్జున్‌కు హెయిర్‌కట్ చేయడం కూడా అందులో బాగమే. క్రికెట్ తర్వాత నేను బాగా సక్సెస్ అయింది హెయిర్‌కట్‌లో అని చెప్పాలి. అందులోనూ హెయిర్‌కట్ చేసిన తర్వాత వాడు( అర్జున్) చాలా అందంగా ఉన్నాడు. నాకు అసిస్టెంట్‌గా పని చేసినందుకు థ్యాంక్యూ ! సారా ' అంటూ క్యాప్షన్‌లో పేర్కొన్నాడు. ('సెంచరీ కంటే భార్య చేసే హెయిర్‌కట్ కష్టంగా ఉంది') లాక్డౌన్ 4వ దశలో దేశంలోని సెలూన్ షాపులకు కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చినా చాలా వరకు తెరుచుకోలేదనే చెప్పాలి. దీంతో యూట్యూబ్‌ను ఫాలో అవుతూ చాలా మంది తమ స్నేహితులు, ఇంట్లో వారితోనే హెయిర్ కట్ చేయించుకుంటున్నారు. ఇందులో సెలబ్రిటీలు కూడా చాలా మందే ఉన్నారు. లాక్డౌన్ మొదటి దశలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తన భార్య అనుష్క శర్మతో హెయిర్ ట్రిమ్ చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా సోమవారం టీమిండియా టెస్టు క్రికెటర్ చటేశ్వర్ పుజార తన భార్య పూజాతో హెయిర్ కట్ చేసుకుంటున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. -
ఆ అకౌంట్లపై చర్యలు తీసుకోండి: సచిన్
ముంబై: తన కుమారుడు అర్జున్ టెండూల్కర్, కూతురు సారా టెండూల్కర్ పేరు మీద ఉన్న ట్వీటర్ అకౌంట్లు ఫేక్ అని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పష్టం చేశాడు. వాటిపై చర్యలు తీసుకోవాలని మైక్రో బ్లాగింగ్ సైట్ ట్వీటర్‌ను కోరాడు. జూనియర్ టెండూల్కర్ పేర మీద ఉన్న ట్వీటర్ అకౌంట్ తన కుమారుడు అర్జున్‌ది కాదని పేర్కొన్నాడు. అలాగే తన కుమారుడు అర్జున్‌కు కానీ, కూతురు సారాకు కానీ ట్వీటర్ అకౌంట్ల లేవనే ఈ విషయాన్ని సచిన్ తెలియజేశాడు. జూనియర్ టెండూల్కర్ పేరుతో కొంతమంది ప్రముఖలపై వ్యతిరేకంగా ట్వీట్లు వస్తున్న నేపథ్యంలో సచిన్ స్పందించాడు. ‘ఆ అకౌంట్ అర్జున్ టెండూల్కర్‌ది కాదు. అసలు అర్జున్‌కు ట్వీటర్ అకౌంట్ లేదు. మా పిల్లలు ఇద్దరికీ ట్వీటర్ అకౌంట్లు లేవు. పలువురిపై జూనియర్ టెండూల్కర్ పేరుతో వస్తున్న ట్వీట్లు మా కుమారుడివి కావు. అది ఫేక్ అకౌంట్. దానిపై ట్వీటర్ ఇండియా సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలి’ అని సచిన్ విజ్ఞప్తి చేశాడు. మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు మద్దతు ఇస్తున్నానంటూ జూనియర్ టెండూల్కర్ పేరుతో ఒక ట్వీట్ వెలుగు చూసింది. ‘ ఐయామ్ విత్ ఫడ్నవీస్’ అనే హ్యాష్ ట్యాగ్‌తో జూనియర్ టెండూల్కర్ అకౌంట్లో దర్శనమిచ్చింది. ఇది సచిన్ కుమారుడు అర్జున్ చేసిందంటూ పెద్ద దుమారం లేచింది. దాంతో సచిన్ వివరణ ఇచ్చుకుంటూ తన కుమారుడుకు ట్వీటర్ అకౌంట్ లేదన్నాడు. అలానే కూతురు సారాకు కూడా ఎటువంటి అకౌంట్ లేదన్నాడు. లెఫ్టార్మ్ మీడియం పేసరైన అర్జున్.. అండర్ 16, అండర్-19 స్థాయిలో ముంబైకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ ఏడాది ఆరంభంలో ప్రి సీజన్ టోర్నమెంట్లో భాగంగా ముంబై సీనియర్ జట్టుకు కూడా సెలక్ట్ అయ్యాడు. మరొకవైపు అండర్-19 భారత జట్టుకు కూడా అర్జున్ ఆడాడు. గతేడాది శ్రీలంకతో జరిగిన అండర్-19 మ్యాచ్‌లకు భారత్ తరఫున అర్జున్ ప్రాతినిథ్యం వహించాడు. ఇక భారత్-ఇంగ్లండ్ సీనియర్ జట్లకు నెట్స్‌లో బౌలింగ్ వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. I wish to clarify that my son Arjun & daughter Sara are not on Twitter. The account @jr_tendulkar is wrongfully impersonating Arjun and posting malicious tweets against personalities & institutions. Requesting @TwitterIndia to act on this as soon as possible. — Sachin Tendulkar (@sachin_rt) November 27, 2019 -
కరువు సీమలో మరో టెండూల్కర్
సాక్షి, కడప స్పోర్ట్స్ : సాధారణ చేనేత కుటుంబానికి చెందిన అర్జున్ టెండూల్కర్ క్రికెట్లో యువకెరటంలా దూసుకువస్తున్నాడు.. కడపలో నిర్వహిస్తున్న ఏసీఏ అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల్లో అనంత జట్టు తరపున 252 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి త్రిశతకం చేసే దిశగా ముందుకు సాగుతున్న అర్జున్ టెండూల్కర్ వివరాలివి. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం పరిధిలోని గోట్లూరు గ్రామానికి చెందిన పిట్టా ఆదినారాయణ, పార్వతి (చేనేత కార్మికులు) దంపతులకు నలుగురు సంతానం. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. పెద్ద కుమార్తె లీలావతి గృహిణి కాగా, రెండో కూతురు పల్లవి మహిళా క్రికెటర్, పెద్ద కుమారుడు అర్జున్ టెండూల్కర్ అండర్–16 విభాగం క్రికెటర్. చిన్న కుమారుడు మణిదీప్ అండర్–14 క్రికెటర్‌గా రాణిస్తుండటం విశేషం. ఆ క్రికెట్ కుటుంబానికి సచిన్ అంటే ఎంతో ఇష్టం. దీంతో పెద్ద కుమారుడికి అర్జున్ టెండూల్కర్(సచిన్ కుమారుడు) పేరు పెటారు. 3వ తరగతి నుంచి క్రికెట్ ఆడటం ప్రారంభించిన అర్జున్ అనతికాలంలోనే క్రికెట్టో రాణించడం ప్రారంభించాడు. 6వ తరగతిలో కడపలోని సౌత్‌జోన్ అకాడమీకి ఎంపికయ్యాడు. ప్రస్తుతం అనంతపురంలోని రాధాకృష్ణ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఈ యువ కెరటం దేశానికి ప్రాతినిథ్యం వహించడమే ధ్యేయంగా ముందు కు సాగుతున్నాడు. అండర్–12, అండర్–14, అండర్–16, అండర్–19 విభాగాల్లో ఇప్పటి వరకు జిల్లా నుంచి 12 సార్లు ప్రాతినిథ్యం వహించాడు. గత సీజన్లో అండర్–16 అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నమెంట్లో 600 పరుగులు చేశాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ, 1 సెంచరీతో రాణించాడు. నాలుగు సంవత్సరాలుగా అండర్–14 విభాగంలోను, గతేడాది నుంచి అండర్–16 విభాగంలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటూ రాణిస్తున్నాడు. ప్రస్తుతం కడప నగరంలో నిర్వహిస్తున్న ఏసీఏ అంతర్ జిల్లాల అండర్–16 క్రికెట్ పోటీల్లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లలో మూడు ఇన్నింగ్స్‌లు ఆడిన అర్జున్ టెండూల్కర్ తొలి మ్యాచ్‌లో 82 పరుగులు, రెండో మ్యాచ్‌లో 49 పరుగులు చేయగా, మూడో(ప్రస్తుతం) మ్యాచ్‌లో 252 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సచిన్, రోహిత్ శర్మల ఆటతీరంటే ఇష్టమని.. ఇండియా జెర్సీని ధరించి దేశానికి ప్రాతినిథ్యం వహించాలన్నదే లక్ష్యమని యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ చెప్పాడు. శిక్షకులు యుగంధర్, తాహీర్, రంజీ క్రికెటర్ షాబుద్దీన్ సూచనలు, సలహాలు క్రికెట్లో రాణిం చేందుకు దోహదం చేస్తున్నాయంటున్నాడు. -
‘విజయానికి షార్ట్‌కట్స్ ఉండవు’
ముంబై: భారత క్రికెట్లో సచిన్ సమున్నత శిఖరం. ఈ దిగ్గజానికి తండ్రి సందేశమే మార్గనిర్దేశమైంది. సచిన్ తండ్రి రమేశ్ టెండూల్కర్.. ఎంచుకున్న రంగంలో విజయవంతమయ్యేందుకు కష్టపడాలి తప్ప దగ్గరిదారులు (షార్ట్‌కట్స్) అంటూ ఉండవని సందేశమిచ్చారు. ఇప్పుడిదే సందేశాన్ని సచిన్... తన తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు ఇచ్చినట్లు చెప్పాడు. లెఫ్టార్మ్ పేసర్ అయిన అర్జున్ ఇటీవలే ముగిసిన టీ20 ముంబై లీగ్‌లో ఆకాశ్ టైగర్స్ ముంబై వెస్టర్న్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. రూ.5 లక్షలకు టైగర్స్ ఫ్రాంచైజీ అతన్ని కొనుక్కుంది. ఈ జట్టు సెమీస్ దాకా పోరాడగా... అర్జున్ బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో ఆకట్టుకున్నాడు. దీనిపై సచిన్‌ను సంప్రదించగా ‘అర్జున్‌కు క్రికెట్‌ను బలవంతంగా రుద్దలేదు. స్వతహాగానే అతనికి ఆటంటే ఆమితాసక్తి. నిజానికి మావాడు ఫుట్‌బాల్ ఆడేవాడు. తర్వాత చెస్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. ఇప్పుడేమో శ్రద్దగా క్రికెట్ ఆడుతున్నాడు. అయితే నేను చెప్పిందొక్కటే... జీవితంలో ఏది ఎంచుకున్నా అందుల్లో షార్ట్‌కట్స్ వెతక్కూడదు. విజయం సాధించేందుకు కష్టపడటం ఒక్కటే మార్గం. ఈ విషయాన్ని నా తండ్రి నాకు చెప్పాడు. నేను మావాడికి చెప్పా’ అని అన్నాడు. అందరి తల్లిదండ్రుల్లాగే తను కూడా తన కుమారుడు బాగా ఆడాలని కోరుకున్నట్లు చెప్పాడు. ఆటలో అయినా ఇంకేదైనా మన ప్రయత్నం మనం చేయాలని, కఠోరంగా శ్రమించాలని ఫలితం దేవుడి చేతుల్లో ఉంటుందని ‘మాస్టర్ బ్లాస్టర్’ అన్నాడు. -
అర్జున్ టెండూల్కర్ ఆల్‌రౌండ్ షో
ముంబై: సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ మంగళవారం జరిగిన టీ20 ముంబై లీగ్ మ్యాచ్‌లో రాణించాడు. ఆల్‌రౌండ్ ప్రతిభ(23 పరుగులు, ఒక వికెట్)తో తమ జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఆరంభ మ్యాచ్‌లో ఆకాశ్ టైగర్స్ ముంబై వెస్ట్రన్, ట్రింఫ్ నైట్ ముంబై నార్త్ ఈస్ట్ జట్లు తలపడ్డాయి. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని ట్రింఫ్ నైట్ ముందుగా బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన జట్టును యాదవ్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. 56 బంతుల్లో 7 సిక్సర్లు, 4 ఫోర్లతో 90 పరుగులు సాధించాడు. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆకాశ్ టైగర్స్‌కు ఆకర్షిత్ గోమల్(41), కౌస్తుభ్ పవార్(34) శుభారంభాన్ని అందించారు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అర్జున్ 19 బంతుల్లో 23 పరుగులు చేశాడు. ఆకాశ్ టైగర్స్ 5 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేరుకుంది. ట్రింఫ్ నైట్ జట్టుపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్‌లోనూ రాణించిన అర్జున్ టెండూల్కర్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. -
అర్జున్ టెండూల్కర్‌కు రూ. 5 లక్షలు
ముంబై: భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ స్థానిక లీగ్‌లో ఆడేందుకు రూ. 5 లక్షలకు అమ్ముడుపోయాడు. ముంబై టి20 లీగ్‌లో ఆకాశ్ టైగర్స్ ముంబై వెస్టర్న్ సబర్బ్ జట్టు అతడిని రూ. 5 లక్షలకు కొనుగోలు చేసింది. ఆల్‌రౌండర్ల కేటగిరీలో ఉన్న అతని ప్రాథమిక ధర రూ. లక్ష కాగా... వేలంలో అతని కోసం అన్ని ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. గరిష్ట ధర అయిన రూ. 5 లక్షలకు చేరుకోవడంతో ‘ఆపర్చునిటీ టు మ్యాచ్’ (ఓటీఎమ్) కార్డు ద్వారా కొత్త జట్లయిన ఆకాశ్ టైగర్స్, ఈగల్ థానే స్ట్రయికర్స్‌లకు అవకాశం దక్కింది. చివరకు ‘డ్రా’ తీయగా టైగర్స్ పేరు వచ్చి ంది. అర్జున్ టెండూల్కర్ ఇదివరకే భారత్ అండర్–19 జట్టు తరఫున అనధికారిక టెస్టులు ఆడాడు. అన్నట్లు... ఈ లీగ్‌కు సచినే బ్రాండ్ అంబాసిడర్! -
ధోనిని తలపించిన అర్జున్!
లండన్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండుల్కర్ ఇంగ్లండ్ టూర్లో బిజీబిజీగా ఉన్నాడు. ఒకరోజు నెట్స్ లో భారత బ్యాట్స్మెన్లకు బౌలింగ్ వేస్తే.. రెండో టెస్టు రెండో రోజు స్టేడియం బయట రేడియోలు అమ్ముతూ కనిపించాడు. అయితే లార్డ్స్ టెస్ట్ మూడో రోజు ఆటలో అర్జున్ టెండూల్కర్ కాసేపు విరామం తీసుకున్నాడు. బౌండరీ లైన్ అవతల ఫీల్డ్ పై పడుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలోవైరల్ అవుతున్నాయి. ఇది టీమిండియా మాజీ కెప్టెన్ ధోనిని తలపించిందంటున్నారు నెటిజన్లు. 2017నాటి శ్రీలంక టూర్లో ఎంఎస్ ధోని కూడా ఇలాగే నేలపై కునుకు తీశాడు. ప్రేక్షకులు వాటర్ బాటిళ్లు విసిరి... అల్లరి చేస్తుంటే ఆటకు అంతరాయం కలిగింది. ఆ గ్యాప్‌లో ధోనీ నేలపై పడుకుని చిన్నపాటి కునుకు తీశాడు. ఆనాటి ఫొటోలను, వీడియోలను ట్వీట్ చేస్తూ.. ధోనికి, అర్జున్ టెండుల్కర్‌కు నెటిజన్లు ముడిపెడుతున్నారు. చదవండి: మైదానంలో నిద్రపోయిన ధోని! -
గ్రౌండ్‌మన్‌గా అర్జున్ టెండూల్కర్!
లండన్: సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ లార్డ్స్ మైదానంలో గ్రౌండ్‌మన్ అవతారం ఎత్తాడు. గ్రౌండ్ స్టాఫ్‌తో కలిసి మైదానంలో సేవలు అందించాడు. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య లార్డ్స్ మైదానంలో గురువారం ప్రారంభం కావాల్సిన రెండోటెస్టు తొలిరోజు ఆట వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అర్జున్ గ్రౌండ్ స్టాఫ్‌తో కలిసి మైదానంలో శ్రమించడం పలువురిని ఆకట్టుకుంది. గ్రౌండ్ స్టాఫ్‌తో కలిసి అర్జున్ టెండూల్కర్ సేవలందించడంతో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. గత నెలలో భారత అండర్-19 జట్టుతో కలిసి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన అర్జున్ అక్కడే ఉండి ఎంసీసీ యంగ్ క్రికెటర్లతో కలిసి సాధన చేస్తున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియా జట్టుకు నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ తన బౌలింగ్‌కు మరింత పదును పెట్టుకుంటున్నాడు. చదవండి: టీమిండియాను ఇబ్బంది పెట్టిన అర్జున్ -
టీమిండియాను ఇబ్బంది పెట్టిన అర్జున్
-
టీమిండియాను ఇబ్బంది పెట్టిన అర్జున్
లండన్ : టీమిండియా టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌ను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ కాస్త ఇబ్బంది పెట్టాడు. అర్జున్‌కు, భారత క్రికెటర్లకు సంబంధం ఏంటంటారా..! ఇక్కడి మార్చంట్ టేలర్ స్కూల్ గ్రౌండ్లో జరిగిన ప్రాక్టీస్ సెషన్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి లెఫ్టార్మ్ పేసర్ అర్జున్ బౌలింగ్ చేశాడు. కోహ్లితో పాటు కేఎల్ రాహుల్, మురళీ విజయ్, శిఖర్ ధావన్‌లు రెండో టెస్ట్‌కు ముందు బుధవారం నెట్స్‌లో అర్జున్ బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ సమయంలో ముంబైలోని వాంఖెడే స్టేడియంలోనూ భారత బ్యాట్స్‌మెన్ అర్జున్ బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేశారు. తొలి టెస్టులో ఇంగ్లండ్ యువ సంచలనం స్యామ్ కరన్‌కు అంతర్జాతీయ క్రికెట్లో ఏమాత్రం అనుభవం లేకున్నా భారత్ నుంచి మ్యాచ్‌ను ఇంగ్లండ్ వైపు తిప్పేశాడు. అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లోనూ చెలరేగిన కరన్నే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వరించిన విషయం తెలిసిందే. పేస్‌కు అనుకూలించే లార్డ్స్ టెస్టులో కరన్‌తో పాటు ఇంగ్లండ్ పేస్ దళాన్ని ఎదుర్కోవడంలో భాగంగా టీమిండియా మేనేజ్మెంట్ అర్జున్ బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేయించింది. భారత ఓపెనర్లు శిఖర్ ధావన్, మురళీ విజయ్‌లు ముఖ్యంగా ఇంగ్లండ్ పేసర్ కరన్ బౌలింగ్‌లో తడబాటుకు లోనవుతున్నారు. దీన్ని అధిగమించేందుకు కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు ఇతర టాపార్డర్ బ్యాట్స్‌మెన్ యువ బౌలర్ అర్జున్ బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేసినా.. అతడి బంతులను ఎదుర్కోవడంలో కాస్త ఇబ్బంది పడ్డట్లు సమాచారం. అయితే ప్రాక్టీస్ చేయడం మంచి యోచన అని మాజీలు అభిప్రాయపడ్డారు. మరోవైపు గాయంతో బాధపడుతోన్న పేసర్ జస్ప్రిత్ బుమ్రా రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు. బుమ్రా ఇంకా కోలుకోలేదని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ తెలిపాడు. దారుణంగా విఫలమవుతున్న ధావన్‌ను రెండో టెస్టులో ఆడిస్తారో లేదన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. వర్షం కారణంగా గురువారం రెండో టెస్టు కనీసం టాస్ కూడా వేయలేదన్న విషయం తెలిసిందే. -
కోహ్లికి ప్రపోజ్ చేసిన యువతితో అర్జున్
లండన్ : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. యూత్ వన్డే సిరీస్‌లో చోటు దక్కకపోవడంతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. లండన్‌లో స్నేహితులతో సరదాగా గడుపుతున్న అర్జున్ ఇంగ్లీష్ క్రికెటర్ డేనియల్ వ్యాట్‌ను అర్జున్ కలిశాడు. ఆమెతో లంచ్కూ వెళ్లాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను వ్యాట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కాగా, 2014లో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తనను వివాహం చేసుకోవాలని వ్యాట్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. -
అదరగొట్టిన ‘వాల్’ వారసుడు!
బెంగళూరు : టీమిండియా వాల్, దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ వారసుడు సమిత్ ద్రవిడ్ అదరగొట్టాడు. ఇప్పటి వరకు క్రికెటర్ల తనయుల పేర్లలో సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ పేరే వినిపించగా.. తాజాగా ద్రవిడ్ కొడుకు సైతం వార్తల్లో నిలిచాడు. బెంగళూరులో జరిగిన అండర్-14 టోర్నీలో ఈ 12 ఏళ్ల చిన్న ద్రవిడ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అధితి ఇంటర్నేషనల్ స్కూల్ తరపున బరిలోకి దిగిన సమిత్ అర్థ సెంచరీతో పాటు 4 వికెట్లు పడగొట్టి విజయం కీలక పాత్ర పోషించాడు. దీంతో కెంబ్రిడ్జి పబ్లిక్ స్కూల్‌పై సమిత్ జట్టు 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ద్రవిడ్ అండర్-19 కోచ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ అండర్ 19 కోచ్ పెద్దకొడుకైన సమిత్.. ఇలా ఆకట్టుకోవడం ఇదే తొలిసారేం కాదు. జనవరిలో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్స్ (కేఎస్‌సీఏ) నిర్వహించిన బీటీఆర్ కప్‌లో సమిత్ 150 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా అండర్-12 టోర్నీల్లో అత్యధిక పరుగుల సాధించిన క్రికెటర్‌గా గుర్తింపు కూడా పొందాడు. 2015లో అండర్-12 గోపాలన్ క్రికెట్ చాలెంజ్ పోటీల్లో బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇక సచిన్ కుమారుడు అర్జున్ శ్రీలంక పర్యటనలోని భారత అండర్-19 జట్టు తరపున ఆడుతున్న విషయం తెలిసిందే. చదవండి: ద్రవిడ్‌కు గొప్ప బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చిన కొడుకు -
అచ్చు నాన్నలాగే..!
కొలంబో: శ్రీలంక అండర్–19 జట్టుతో జరుగుతున్న యూత్ టెస్టులో భారత అండర్–19 జట్టు విజయం దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 589 పరుగుల భారీ స్కోరు వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ ఆయుష్ బదోని (205 బంతుల్లో 185 నాటౌట్; 19 ఫోర్లు, 4 సిక్స్‌లు) డబుల్ సెంచరీకి చేరువగా వచ్చి ఆగిపోయాడు. సహకారం అందించే బ్యాట్స్‌మెన్ లేకపోవడంతో 15 పరుగుల దూరంలో నిలిచాడు. మరో వైపు తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అర్జున్ టెండూల్కర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. 11 బంతులాడి దుల్షాన్ బౌలింగ్‌లో సూర్యబండారకు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. 1989లో పాకిస్తాన్‌తో గుజ్రన్‌వాలాలో ఆడిన తన తొలి వన్డేలో సచిన్ టెండూల్కర్ సున్నాకే ఔటైన ఘటనను ఇది గుర్తుకు తెచ్చింది. భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగుల ఆధిక్యం లభించగా... రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఆట నిలిచే సమయానికి 60 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఫెర్నాండో (118 బంతుల్లో 104; 17 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేశాడు. చేతిలో ఏడు వికెట్లున్న లంక ఇంకా 168 పరుగులు వెనుకబడి ఉంది. -
అరంగేట్రంలో సచిన్ వారసుడు డకౌట్
-
అరంగేట్రంలో సచిన్ వారసుడు డకౌట్
కొలంబో: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వారసుడు అర్జున్ టెండూల్కర్ అండర్-19 అరంగేట్రం మ్యాచ్‌లో నిరాశపరిచాడు. శ్రీలంకతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో భాగంగా అర్జున్ తొలి ఇన్నింగ్స్‌లో పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరాడు. 11 బంతులు ఆడిన అర్జున్ డకౌట్‌గా ఔటయ్యాడు. అంతకుముందు కమిల్ మిషారాను ఔట్ చేయడం ద్వారా తన తొలి అంతర్జాతీయ వికెట్‌ను ఖాతాలో వేసుకున్న అర్జున్.. బ్యాటింగ్‌లో మాత్రం కనీసం పరుగు చేయకుండానే నిష్క్రమించాడు. సచిన్ టెండూల్కర్ తన వన్డే అరంగేట్రంలో మ్యాచ్‌లో సైతం డకౌట్‌గా పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. 1989లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ పరుగులేమీ చేయకుండా ఔట్ కావడం గమనార్హం. చదవండి: అర్జున్ టెండూల్కర్ బోణీ కొట్టాడు.. -
అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం
కొలంబో: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ భారత అండర్–19 జట్టు తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. శ్రీలంక అండర్–19 జట్టుతో మంగళవారం ఇక్కడ ప్రారంభమైన నాలుగు రోజుల యూత్ టెస్టులో ఎడంచేతి పేసర్ అర్జున్ అరంగేట్రం చేశాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో శ్రీలంక ఓపెనర్ మిషారా (9)ను ఎల్బీగా ఔట్ చేసిన అతను జట్టుకు శుభారంభం ఇచ్చాడు. మొత్తం 11 ఓవర్లు వేసిన అర్జున్ 33 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఆయుష్ బదోని (4/24), హర్‡్ష త్యాగి (4/92) ధాటికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టానికి 92 పరుగులు చేసింది. -
అర్జున్ టెండూల్కర్ బోణీ కొట్టాడు..
కొలంబొ: టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వారసుడు అర్జున్ టెండూల్కర్ తన అంతర్జాతీయ తొలి వికెట్‌ను సాధించాడు. శ్రీలంకతో రెండు టెస్టులు ఆడనున్న భారత అండర్-19 జట్టులో అర్జున్ చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. మంగళవారం శ్రీలంకతో తొలి టెస్టులో భాగంగా భారత్ తరపున ఈ లెఫ్టార్మ్ పేసర్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక మొదట బ్యాటింగ్ చేపట్టింది. టీమిండియా అండర్-19 సారథి అనుజ్ రావత్ బౌలింగ్ దాడి అర్జున్‌తో ప్రారంభించాడు. తొలి ఓవర్లో ఒక ఫోర్‌తో సహా ఆరు పరుగులిచ్చిన ఈ పేసర్ తన తరువాతి ఓవర్లో లంక ఓపెనర్ ఆర్వీపీకే మిశ్రా (9) వికెట్ సాధించాడు. దీంతో అర్జున్ టెండూల్కర్ తన తొలి అంతర్జాతీయ వికెట్ సాధించాడు. ఇక మిగతా బౌలర్లు హర్ష్ త్యాగి (4/92), ఆయూష్ బడొని (4/24) చెలరేగడంతో లంక తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లు బౌలింగ్ చేసిన అర్జున్ 33 పరుగులిచ్చి ఒక్క వికెట్ సాధించాడు. వినోద్కాంబ్లి అనందభాష్పాలు అర్జున్ టెండూల్కర్ తొలి వికెట్ సాధించడం పట్ల టీమిండియా మాజీ ఆటగాడు, సచిన్ బాల్య స్నేహితుడు వినోద్ కాంబ్లీ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ యువ ఆటగాడికి శుభాకాంక్షలు తెలపుతూ భావోద్వేగంగా ట్వీటర్లో ట్వీట్ చేశాడు. ‘అర్జున్ వికెట్ తీయడం చూసి ఆనందభాష్పాలతో నా నోట మాట రావడం లేదు. నీ ఆట చూస్తుంటే నువ్వు పడిన కష్టం కనబడుతోంది. ఈ వికెట్‌తోనే సంతోషపడకు.. ఇది కేవలం ప్రారంభమాత్రమే. నువ్వు సాధించాల్సిన విజయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. తొలి వికెట్ ఆనందాన్ని ఆస్వాదించు’ అంటూ కాంబ్లీ ట్వీట్ చేశాడు. Tears of joy rolled down when I saw this, have seen him grow up and put in the hard work in his game. Could not be more happy for you, Arjun. This is just the beginning, I wish you tons and ton of success in the days to come. Cherish your first wicket and enjoy the moment.👌 pic.twitter.com/vB3OmbaTWM — VINOD KAMBLI (@vinodkambli349) July 17, 2018 -
అర్జున్‌కు రవిశాస్త్రి పాఠాలు
లండన్: దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ త్వరలో శ్రీలంకలో పర్యటించబోయే అండర్-19 భారత జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అర్జున్ టెండూల్కర్... టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రిని కలిసి కొన్ని విలువైన టిప్స్ తెలుసుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా జట్టుతో లండన్‌లో ఉన్న రవిశాస్త్రిని ట్రైనింగ్ సెషనల్లో అర్జున్ కలిశాడు. ఈ మేరకు సోమవారం అర్జున్‌కు రవిశాస్త్రి కొన్ని సలహాలు కూడా ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫొటోను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తన ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోకు రవిశాస్త్రి నుంచి అర్జున్ టెండూల్కర్ కొన్ని అమూల్యమైన సలహాలు తీసుకుంటున్నాడు’ అనే క్యాప్షన్ జోడించింది. త్వరలో ఐర్లాండ్‌తో జరిగే రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా టీమిండియా పరిమిత ఓవర్ల జట్టు శనివారం లండన్‌లో దిగింది. అక్కడ్నుంచి బయల్దేరి డబ్లిన్‌కు చేరుకోనుంది. జూన్ 27వ తేదీన తొలి టీ20, జూలై 29న రెండో టీ20 ఆడనుంది. ఈ రెండు టీ20 మ్యాచ్‌లు డబ్లిన్లోనే జరుగనున్నాయి. అనంతరం విరాట్ గ్యాంగ్.. ఇంగ్లండ్‌తో సుదీర్ఘ పర్యటనలో పాల్గొనుంది. -
‘అర్జున్ టెండూల్కర్ నాకేమీ స్పెషల్ కాదు’
న్యూఢిల్లీ: త్వరలో శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత అండర్-19 జట్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అందరి దృష్టి అర్జున్పైనే ఉంది. కాగా, అర్జున్ పట్ల తానేమీ ప్రత్యేక శ్రద్ధ చూపనని, జట్టులో మిగతా సభ్యుల్లాగానే అర్జున్ను చూస్తానని అంటున్నాడు అండర్-19 భారత జట్టు బౌలింగ్ కోచ్ సనత్ కుమార్. ‘జట్టులో అర్జున్ కూడా మిగతా క్రికెటర్ల మాదిరి ఆటగాడే. కోచ్‌గా నాకు జట్టులోని ఆటగాళ్లంతా ఒకటే. నా వరకు అర్జున్ ఏమీ స్పెషల్ కాదు. జట్టులోని ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన ఇచ్చేలా చూడటమే నా బాధ్యత. జట్టు ఓవరాల్ ప్రదర్శన ఎలా ఉందనేది దానికి ప్రాముఖ్యత. అంతేకానీ ఇక్కడ ప్రత్యేకించి ఆటగాళ్లను వేరు చేసి చూడటం ఉండదు. 2008లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత మహిళల జట్టుకు కోచ్‌గా పనిచేశాను. ఇప్పుడు అండర్-19 భారత పురుషుల జట్టుకు కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నా. ఈ ఏడాది అక్టోబరులో బంగ్లాదేశ్‌లో జరిగే అండర్-19 ఆసియా కప్ వరకు నేను కోచ్‌గా ఉంటాను’ అని సనత్ కుమార్ తెలిపాడు. జులై 12 నుంచి శ్రీలంకలో భారత్ అండర్-19 జట్టు పర్యటించనుంది. -
అర్జున్ ఎంపికపై గంగూలీ ఏమన్నాడంటే ?
ముంబై : క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ భారత అండర్-19 జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే. తనయుడి ఎంపికపట్ల ఇప్పటికే సచిన్ సంతోషం వ్యక్తం చేస్తూ పుత్రోత్సాహంతో పొంగిపోయాడు. కెరీర్లో తొలి మైలురైయిని అందుకున్న అర్జున్‌కు సర్వత్రా అభినందనలు వెల్లువెత్తాయి. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. ‘చాలా మంది అర్జున్‌కు విషెస్ తెలియజేస్తున్నారు. నేను అయితే ఇప్పటి వరకు అతని ఆట చూడలేదు. అతను అద్భుతంగా రాణిస్తాడని ఆశిస్తున్నాను.’ గంగూలీ పేర్కొన్నాడు. శ్రీలంకలో పర్యటించే భారత అండర్–19 జట్టులోకి అర్జున్ ఎంపికైన విషయం తెలిసిందే. వచ్చే నెల 11 నుంచి ఆగస్టు 11 వరకు ఈ జూనియర్ జట్టు లంకలో రెండు నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్‌ల్ని, ఐదు వన్డే మ్యాచ్‌ల్ని ఆడనుంది. అయితే నాలుగు రోజుల టోర్నీకే ఎంపికైన అర్జున్‌కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. అర్జున్ రంజీల్లో ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహించాలంటే ఈ టోర్నీలో తప్పక రాణించాల్సిందే. ఎందుకంటే అర్జున్ వచ్చే( 2020) అండర్-19 వరల్డ్‌కప్ ఆడలేడు. అప్పటికే అతని వయసు 19 ఏళ్లు దాటుతోంది. అర్జున్‌కు సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తాయి. ఐపీఎల్ చైర్మెన్ రాజీవ్ శుక్లా సైతం అర్జున్ బాగా రాణిస్తాడని ఆకాంక్షించారు. పాకిస్తానే గెలిచింది.. ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లి సేన రాణిస్తోందని గంగూలీ జోస్యం చెప్పాడు. ‘ ఇంగ్లండ్ పర్యటనలో భారత్ విజయం సాధిస్తుందని నేను భావిస్తున్నా. దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్ గెలవడానికి ఆడిన ఆట ఇక్కడ పునరావృతం అయితే భారత్ విజయం సులువు.’ అని అభిప్రాయపడ్డాడు. ఇక కోహ్లి సేన ఇంగ్లండ్ పర్యటనలో జూలై 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలు, ఐదు టెస్ట్‌లు ఆడనుంది. ఇటీవల పాక్‌తో ఇంగ్లండ్ తొలి టెస్ట్‌లో 9 వికెట్లతో ఓడి తరువాత సిరీస్ సమం చేసిన విషయం తెలిసిందే. ‘పాకిస్తానే గెలిచింది.. అలాంటప్పుడు భారత్ సులువుగా సీరీస్ గెలుస్తోంది. పాక్ కన్నా భారత్‌కు చాలా అవకాశాలున్నాయి.’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు. -
అర్జున్ ఎంపికపై సచిన్ సంతోషం
ముంబై: తన కుమారుడు భారత అండర్–19 జట్టులోకి ఎంపిక కావడం పట్ల క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆనందం వ్యక్తం చేశాడు. జులైలో శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల సిరీస్ కోసం గురువారం సెలక్టర్లు ప్రకటించిన జట్టులో అర్జున్ టెండూల్కర్‌కు చోటు దక్కింది. దీనిపై సచిన్ స్పందిస్తూ... ‘భారత అండర్–19 జట్టులోకి అర్జున్ ఎంపిక కావడం పట్ల మేమందరం సంతోషంగా ఉన్నాం. అతని క్రికెట్ కెరీర్లో ఇది కీలకమైన మైలురాయి. అతని ఇష్టాఇష్టాల్లో నాతో పాటు అంజలి మద్దతు ఎప్పుడూ ఉంటుంది. అర్జున్ విజయం సాధించాలని మేం ప్రార్థిస్తున్నాం’ అని పుత్రోత్సాహం ప్రదర్శించాడు. -
అర్జున్ ఎంపికపై సచిన్ ఏమన్నాడంటే ?
ముంబై : క్రికెట్లో రారాజుగా వెలిగిపోయిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇప్పుడు పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. తనయుడు అర్జున్ టెండూల్కర్ భారత అండర్-19 జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే. కుమారుడి ఎంపిక పట్ల సచిన్ ఆనందం వ్యక్తం చేశాడు. మీడియాతో మాట్లాడుతూ.. ‘అర్జున్ అండర్-19 జట్టుకు ఎంపికవ్వడం మాకు సంతోషాన్నిచ్చింది. అతని క్రికెట్ జీవితంలో ఇదొక గొప్ప మైలురాయి. నేను, అంజలి ఎప్పుడు అర్జున్ను ప్రోత్సహిస్తాం. అతను బాగా రాణించాలని కోరుకుంటాం’ అని సచిన్ సంతోషం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా సైతం అర్జున్ ఎంపిక పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ అతన్ని అభినందించారు. టోర్నీల్లో అద్భుతంగా రాణించాలని ఆకాక్షించారు. ఇక అర్జున్ కూడా సచిన్ పేరు నిలబెడుతాడని అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. Feeling happy for the selection of Arjun Tendulkar in India U-19 squad. My Best Wishes are with him @BCCI @sachin_rt — Rajeev Shukla (@ShuklaRajiv) June 7, 2018 వివిధ వయోవిభాగాల్లో నిలకడగా రాణించిన అర్జున్ తొలిసారి టీమిండియా ‘బ్లూ’ జెర్సీలో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. శ్రీలంకలో పర్యటించే భారత అండర్–19 జట్టులోకి అతను ఎంపికయ్యాడు. వచ్చే నెల 11 నుంచి ఆగస్టు 11 వరకు ఈ జూనియర్ జట్టు లంకలో 2 నాలుగు రోజుల మ్యాచ్‌ల్ని, ఐదు వన్డే మ్యాచ్‌ల్ని ఆడనుంది. అయితే నాలుగు రోజుల టోర్నీకే ఎంపికైన అర్జున్‌కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. ఈ లిటిల్ టెండూల్కర్ లెఫ్టార్మ్ పేస్ బౌలర్ జాతీయ అండర్–19 టోర్నీ కూచ్‌బెహర్ ట్రోఫీలో ముంబై తరఫున 18 వికెట్లతో రాణించిన అతని ప్రదర్శన భారత జట్టులోకి ఎంపికయ్యేలా చేసింది. -
వచ్చాడు మరో టెండూల్కర్
ముంబై: సరిగ్గా 29 ఏళ్ల క్రితం... 16 ఏళ్ల ముంబై కుర్రాడు పాకిస్తాన్లో జేగంట మోగించాడు. పిన్న వయస్సులో అరంగేట్రం చేసిన ఈ ఆటగాడు తర్వాత భారత క్రికెట్ చరిత్రనే మార్చేశాడు. అతనెవరో ఈపాటికే అర్థమైవుంటుంది... సచిన్ టెండూల్కర్ అని! 24 ఏళ్లపాటు భారత క్రికెట్‌ను నడిపించి, ఒక తరాన్ని అతను ఊపేశాడు. మళ్లీ ఇప్పుడు అతని గారాల తనయుడు అర్జున్ టెండూల్కర్ వంతు వచ్చినట్లుంది. వివిధ వయోవిభాగాల్లో నిలకడగా రాణిస్తూ వచ్చిన అర్జున్ తొలిసారి టీమిండియా ‘బ్లూ’ జెర్సీలో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. శ్రీలంకలో పర్యటించే భారత అండర్–19 జట్టులోకి అతను ఎంపికయ్యాడు. వచ్చే నెల 11 నుంచి ఆగస్టు 11 వరకు ఈ జూనియర్ జట్టు లంకలో 2 నాలుగు రోజుల మ్యాచ్‌ల్ని, ఐదు వన్డే మ్యాచ్‌ల్ని ఆడనుంది. అయితే నాలుగు రోజుల టోర్నీకే ఎంపికైన అర్జున్‌కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. ఈ లిటిల్ టెండూల్కర్ లెఫ్టార్మ్ పేస్ బౌలర్. జాతీయ అండర్–19 టోర్నీ కూచ్‌బెహర్ ట్రోఫీలో ముంబై తరఫున 18 వికెట్లతో రాణించిన అతని ప్రదర్శన భారత జట్టులోకి ఎంపికయ్యేలా చేసింది. ఇందులో అతను ఐదేసి వికెట్లను ఒకసారి, నాలుగేసి వికెట్లను రెండుసార్లు పడగొట్టాడు. 2017–18 సీజన్లో అర్జున్కంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లు చాలా మంది ఉన్నా... వారంతా స్పిన్నర్లే కావడం, అర్జున్ అసలైన పేస్ బౌలర్ కావడమే అతనికి ఎంపికకు కారణమని జూనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడొకరు వెల్లడించారు. తండ్రి మార్గనిర్దేశనంలో అర్జున్ గత కొంత కాలంగా ఎంతో మెరుగయ్యాడు. లార్డ్స్ మైదానంలో అతను తరచుగా ప్రాక్టీస్ చేస్తుంటాడు. గత ఏడాది ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు అతని బౌలింగ్ వేగానికి ప్రాక్టీస్ సెషన్లో బెయిర్‌స్టో గాయపడ్డాడు. అంతకు ముందు చాంపియన్స్ ట్రోఫీ నెట్స్‌కు హాజరైన అర్జున్... ఇటీవలే సిడ్నీలోని బ్రాడ్‌మన్ మైదానంలో టి20 లీగ్స్‌లో పాల్గొని బ్యాటింగ్‌లోనూ చెలరేగాడు. భారత్–న్యూజిలాండ్ సిరీస్ సమయంలోనూ భారత జట్టు సెషన్స్‌లో పాల్గొన్నాడు. ఏదేమైనా ఎన్నో అంచనాల మధ్య, సచిన్ అభిమానుల ఆశీస్సులతో అర్జున్ బంతితో రె‘ఢీ’ అంటున్నాడు. -
క్రికెట్ జట్టు: సచిన్ కొడుకుకు పిలుపు!
న్యూఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను భారత అండర్-19 క్రికెట్ జట్టులోకి తీసుకున్నారు. వచ్చేనెల శ్రీలంకతో జరగనున్న అండర్-19 సిరీస్‌లో అర్జున్ టెండూల్కర్ భారత జట్టు తరఫున ఆడనున్నాడు. జూలైలో శ్రీలంకలో జరగనున్న ఈ సిరీస్‌లో భాగంగా భారత అండర్-19 జట్టు రెండు ఫోర్ డే మ్యాచులు, ఐదు వన్డే మ్యాచులు ఆడనుంది. 18 ఏళ్ల అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. ఫోర్డే మ్యాచుల్లో భారత జట్టుకు అతను ప్రధాన ఆటగాడు కానున్నాడు. అయితే, ఐదు వన్డే మ్యాచులకు ప్రకటించిన జట్టులో మాత్రం అతన్ని తీసుకోలేదు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఉనాలోని జోనల్ క్రికెట్ అకాడమీ (జెడ్‌సీఏ)లో ఏర్పాటుచేసిన క్యాంపులోని ప్రధాన అండర్-19 ఆటగాళ్లలో ఒకడిగా అర్జున్ ప్రస్తుతం శిక్షణ పొందుతున్నాడు. -
ముంబై టి20 లీగ్ నుంచి తప్పుకొని...
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ముంబై టి20 లీగ్ నుంచి తప్పుకున్నాడు. తండ్రి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. అతుల్ గైక్వాడ్ శిక్షణలో బౌలింగ్ శైలికి తుది మెరుగులు దిద్దుకుంటున్న అర్జున్ టెండూల్కర్ ఇప్పుడప్పుడే పోటీ క్రికెట్లో అడుగుపెట్టొద్దని సచిన్ సూచించడంతో ఈ లీగ్ నుంచి తప్పుకున్నాడు. సచిన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఈ లీగ్‌లో ఆరుజట్లు పాల్గొంటాయి. వాంఖెడే వేదికగా ఈ నెల 11 నుంచి 21 వరకు ఈ లీగ్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. -
సచిన్ కూతురి పేరిట అసభ్య పోస్టులు.. టెకీ అరెస్ట్
సాక్షి, ముంబయి: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ పేరిట ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్ అని పోలీసులు తెలిపారు. నితిన్ షిశోడే అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ స్థానిక అంధేరీలో నివాసం ఉంటున్నాడు. అయితే ఈ టెకీ సెలట్రిటీలను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేయడం, వారి కూతుళ్ల పేరిట సోషల్ మీడియాలో అకౌంట్లు క్రియేట్ చేయడం లాంటి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. తన కూతురు సారా టెండూల్కర్, కుమారుడు అర్జున్ టెండూల్కర్ ల పేరిట ఉన్న ఫేస్బుక్, ట్వీటర్ ఖాతాలు నకిలీవని అసలు వారికి సోషల్ మీడియా అకౌంట్లు లేవని.. కొందరు అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ సంబంధిత సంస్థలకు సచిన్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు నితిన్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. సారా పేరిట ఫేక్ ట్వీటర్ అకౌంట్ క్రియేట్ చేసి ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌పై అభ్యంతరకరమైన పోస్ట్‌లు చేసినట్లు సైబర్ విభాగం పోలీసులు గుర్తించారు. సెలబ్రిటీలు, వారి కూతుళ్ల పేరిట ఫేక్ ఖాతాలు క్రియేట్ చేసి కొందరు ఇలాంటి పిచ్చి చేష్టలకు పాల్పడతారని.. చివరికి చేసిన తప్పులకుగానూ కటకటాలపాలు కావాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరించారు. గతంలో సచిన్ ఆందోళన తన కూతురు సారా టెండూల్కర్, కుమారుడు అర్జున్ టెండూల్కర్ ల పేరిట ఉన్న నకిలీ ట్విట్టర్ ఖాతాలను తొలగించాలని ట్విట్టర్ సంస్థను కోరుతూ గతంలో సచిన్ వరుస ట్వీట్లు చేశారు. తన కూతురు, కుమారుడికి ట్విట్టర్ లో అసలు ఖాతాలే లేవని.. వీలైనంత త్వరగా వారి పేర్లమీద ఉన్న అన్ని ఖాతాలను తొలగించాలని ట్వీట్ లో రాసుకొచ్చారు. అర్జున్, సారాల పేర్లతో ఉన్న నకిలీ ఖాతాల నుంచి లేనిపోని విషయాలు, తప్పుడు సమాచారం పోస్ట్ అయితే పరిస్థితి మరోలా ఉంటుందని సచిన్ అభిప్రాయపడ్డారు. 2014లో సచిన్ ఇదే విషయంపై ట్వీట్ చేశారు. సారా, అర్జున్ ట్విట్టర్ లో లేరని, వారి పేర్లతో ఉన్న ట్విట్టర్ అకౌంట్లను విశ్వసించవద్దని చేసిన పోస్టును స్క్రీన్ షాట్ తీసి షేర్ చేశారు. -
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆల్‌రౌండ్ షో
సిడ్నీ:ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టీ20 మ్యాచ్ ఆడిన సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ తనదైన మార్కును చూపించాడు. స్పిరిట్ ఆఫ్ క్రికెట్ గ్లోబల్ ఛాలెంజ్ లో భాగంగా హాంకాంగ్ క్రికెట్ క్లబ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో క్రికెట క్లబ్ ఆఫ్ ఇండియా తరపున బరిలోకి దిగిన అర్జున్ 27 బంతుల్లోనే 48 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగిన బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ మెరిసి నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు సాధించాడు. మ్యాచ్ తరువాత మాట్లాడిన ఈ ఎడమ చేతి వాటం ఆటగాడు.. తనకు చిన్నతనం నుంచే ఫాస్ట్ బౌలింగ్ అంటే చాలా ఇష్టమని పేర్కొన్నాడు. దాంతోనే పేస్ బౌలింగ్‌ను ఎంచుకున్నట్లు 18 ఏళ్ల అర్జున్ తెలిపాడు. అర్జున్ ప్రదర్శనపై ఆసీస్ మీడియా ప్రశంసల వర్షం కురిపిస్తోంది. క్రికెట్ దిగ్గజ ఆటగాడు సచిన్‌కు తగ్గ తనయుడు అంటూ కొనియాడుతోంది. -
అర్జున్‌కు ఐదు వికెట్లు
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ దేశవాళీ అండర్–19 కూచ్ బెహర్ ట్రోఫీలో సత్తాచాటాడు. రైల్వేస్‌తో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్‌లో ఎడంచేతి వాటం పేసర్ అర్జున్ రెండో ఇన్నింగ్స్‌లో 44 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. అర్జున్ ధాటికి రైల్వేస్ రెండో ఇన్నింగ్స్‌లో 136 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో గెలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీయలేకపోయిన అర్జున్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం హడలెత్తించాడు. అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 389 పరుగులు సాధించగా... రైల్వేస్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌటైంది. ఇదే టోర్నీలో మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జున్ మూడు వికెట్లు... అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. -
టీమిండియా ప్రాక్టీస్‌లో స్పెషల్ గెస్ట్
ముంబై: టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో ఆస్తకికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రత్యేక వ్యక్తి స్పెషల్ గెస్ట్‌గా వచ్చాడు. న్యూజిలాండ్‌తో ఆదివారం నుంచి వన్డే సిరీస్ ప్రారంభంకానున్న నేపథ్యంలో కోహ్లి సేన ముంబైలోని వాంఖడే స్టేడియంలో శుక్రవారం ముమ్మర సాధన చేసింది. టీమిండియా ఆటగాళ్లు అందరూ నెట్లో బాగా శ్రమించారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ ప్రాక్టీస్ సెషన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు ఇతర ఆటగాళ్లకు బౌలింగ్ చేశాడు. ప్రధాన కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ శిక్షకుడు భరత్ అరుణ్.. 18 ఏళ్ల అర్జున్ బౌలింగ్‌ను ఆసక్తిగా గమనించారు. ముందుగా శిఖర్ ధవన్‌ను అర్జున్ బౌలింగ్ చేశాడు. తర్వాత కోహ్లి, అజింక్య రహానే, కేదార్ జాదవ్‌కు బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. ఈ ఫొటోలను బీసీసీఐ ట్విటర్ పేజీలో పోస్ట్ చేసింది. రేపటి నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌కు ఆటగాళ్లు బాగా ప్రాక్టీస్ చేశారని బీసీసీఐ పేర్కొంది. -
టీమిండియాతో జూనియర్ సచిన్..
ముంబయి: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ టీం ఇండియా క్రికెటర్లతో చేరాడు. నెట్ ప్రాక్టీస్‌లో భాగంగా ఇండియా క్రికెటర్లకు బౌలింగ్ చేశాడు. టీమిండియా అక్టోబర్ 22వ తేదీన న్యూజిలాండ్‌తో వన్డే మ్యాచ్ వాంఖడే స్టేడియంలో ఆడనుంది. మ్యాచ్ కోసం ఇరుజట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. టీమిండియా కోచ్ రవిశాస్త్రి కెప్టెన్ కోహ్లితో పాటు మిగతా క్రికెటర్లంతా నెట్స్‌లో కసరత్తులు చేస్తున్నారు. ప్రాక్టీస్ సెషన్‌కు వచ్చిన అర్జున్ కోహ్లితో పాటు మిగతా బ్యాట్స్ మెన్లకు కూడా బౌలింగ్ చేశాడు. జూనియర్ సచిన్ బౌలింగ్ చేస్తున్న ఫోటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్లో పోస్టు చేసింది. అర్జున్ మొదట శిఖర్ దావన్కు బౌలింగ్ చేశాడు. ఆ తరువాత కోహ్లి, అజింకా రహనే, కేదర్ జాదవ్ లకు బౌలింగ్ చేశాడు. అర్జున్ బౌలింగ్ చేస్తున్న విధానాన్ని ఇండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కూడా పరిశీలించారు. అర్జున్ ఇండియా క్రికెటర్లకు బౌలింగ్ చేయడం ఇదేం మొదటిసారి కాదు. మహిళల ప్రపంచకప్ పైనల్‌కు ముందు అర్జున్ మహిళా క్రికెటర్లకు బౌలింగ్ చేసిన విషయం తెలిసిందే. -
సచిన్ ఆందోళన.. క్షణాల్లో ట్వీట్ వైరల్!
ముంబయి : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఓ విషయంలో ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియాలో తన కుటుంబసభ్యులకు చెందినవిగా కొన్ని ఖాతాలు క్రియేట్ చేసి వాటి నుంచి లేనిపోని విషయాలు పోస్టింగ్ కావడమే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలో క్రికెట్ లెజెండ్ సచిన్ సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విట్టర్ కు ఓ విజ్ఞప్తి చేశారు. తన కూతురు సారా టెండూల్కర్, కుమారుడు అర్జున్ టెండూల్కర్ ల పేరిట ఉన్న నకిలీ ట్విట్టర్ ఖాతాలను తొలగించాలని ట్విట్టర్ సంస్థను కోరుతూ సచిన్ వరుస ట్వీట్లు చేశారు. కామెంట్లు, రీట్వీట్లతో ఆ ట్వీట్లు కొన్ని నిమిషాల్లోనే వైరల్ గా మారింది. తన కూతురు, కుమారుడికి ట్విట్టర్ లో అసలు ఖాతాలే లేవని.. వీలైనంత త్వరగా వారి పేర్లమీద ఉన్న అన్ని ఖాతాలను తొలగించాలని ట్వీట్ లో రాసుకొచ్చారు. అర్జున్, సారాల పేర్లతో ఉన్న నకిలీ ఖాతాల నుంచి లేనిపోని విషయాలు, తప్పుడు సమాచారం పోస్ట్ అయితే పరిస్థితి మరోలా ఉంటుందని సచిన్ అభిప్రాయపడ్డారు. ఆ పోస్టుల కారణంగా తప్పుగా అర్థం చేసుకుని తమ కుటుంబాన్ని గాయపరిచే అవకాశం ఉందన్నారు. గతంలో 2014లో సచిన్ ఇదే విషయంపై ట్వీట్ చేశారు. సారా, అర్జున్ ట్విట్టర్ లో లేరని, వారి పేర్లతో ఉన్న ట్విట్టర్ అకౌంట్లను విశ్వసించవద్దని చేసిన పోస్టును స్క్రీన్ షాట్ తీసి షేర్ చేశారు. I reiterate the fact that my children Arjun & Sara are not on twitter. We request @Twitter to remove all such accounts at the earliest (1/2) pic.twitter.com/lbcdU546aS — sachin tendulkar (@sachin_rt) 16 October 2017 Impersonation wrecks havoc, creates misunderstanding & traumatises us. I appeal to the platforms to take corrective measures immediately 2/2 — sachin tendulkar (@sachin_rt) 16 October 2017 -
'అదే అర్జున్ టెండూల్కర్ ఎంపికకు కారణం'
ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ముంబయి అండర్ 19 జట్టులో ఆడేందుకు రంగం సిద్ధమైంది. తాజాగా ముంబై ఆడే తొలి రెండు మ్యాచ్ లకు గాను జట్టును రాజేశ్ పవార్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అందులో అర్జున్ టెండూల్కర్ పేరును ఖరారు చేస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ముంబై అండర్-19 జట్టుకు అగ్ని చోప్రాను కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇదిలా ఉంచితే, అర్జున్ టెండూల్కర్ జట్టులో చోటివ్వడంపై రాజేశ్ పవార్ స్పందించారు. గత కొంతకాలంగా అర్జున్ మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. ముంబైలో జరిగిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్ ల్లో అర్జున్ ఆకట్టుకున్నాడు. అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ అర్జున్ సత్తాచాటాడు. అతన్ని బౌలింగ్ ఆల్ రౌండర్ గా పరిగణించే అండర్ 19 జట్టులో ఎంపిక చేశాం'అని రాజేశ్ పవార్ తెలిపారు. 2015-16 సీజన్ లో ముంబై అండర్ 16 జట్టుకు అర్జున్ ప్రాతినిథ్యం వహించాడు. మరొకవైపు గతేడాది 'బి' డివిజన్ క్రికెట్ టోర్నీల్లో కూడా అర్జున్ పాల్గొన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్ కు వెళ్లిన అర్జున్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో శిక్షణ పొందాడు. -
అండర్ - 16 క్రికెట్ ఫైనల్స్‌లో అనంత
అనంతపురం సప్తగిరి సర్కిల్: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్ - 16 టెస్టు క్రికెట్ టోర్నీ ఫైనల్‌కు అనంత జట్టు చేరింది. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో తూర్పు గోదావరి జట్టుతో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ లీడ్‌తో ఫైనల్లో తన బెర్తును ఖరారు చేసుకుంది. మ్యాచ్ చివరిరోజైన ఆదివారం తూర్పుగోదావరి జట్టు 9 వికెట్లకు 111 పరుగులతో ఆట ప్రారంభించింది. రెండు పరుగులు చేస్తూనే వికెట్ పడిపోవడంతో 113 పరుగుల వద్ద ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో అనంత బౌలర్లు కామిల్ 5, మీరజ్‌కుమార్ 4, గణేష్‌రెడ్డి 1 వికెట్ సాధించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అనంత జట్టు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 279 పరుగులు చేసింది. జట్టులో యోగానంద 75, గురురాఘవేంద్ర 63, అర్జున్ టెండూల్కర్ 42, మహేంద్రరెడ్డి 39 పరుగులు చేశారు. ఈ నెల 5 నుంచి 7 వరకు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో విశాఖపట్టణం - అనంతపురం జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాయి. టోర్నీలో మెరిసిన యోగానంద, కామిల్, అర్జున్ టెండూల్కర్ ఈ టోర్నీలో అనంత జట్టు ఫైనల్‌కు చేరడంలో యోగానంద, కామిల్ల పాత్ర కీలకమైనది. యోగానంద మెరుగైన కెప్టెన్సీతోపాటు తన పదునైన ఆటతీరుతో జట్టును ఫైనల్‌కు చేర్చడంలో సఫలమయ్యాడు. ఈ మూడు రోజుల టెస్ట్ టోర్నీలో ఇప్పటివరకు 563 పరుగులు చేశాడు. కామిల్ తన ఆల్‌రౌండ్ ప్రతిభను నిరూపించుకున్నాడు. టోర్నీలో ఇప్పటివరకు 35 వికెట్లు తీశాడు. 292 పరుగులు సా«ధించాడు. టోర్నీలో యోగానందకు మంచి సపోర్ట్ అందించిన మరో బ్యాట్స్‌మెన్ అర్జున్ టెండూల్కర్ 349 పరుగులు సాధించడం కూడా జట్టుకు చాలా ఉపయోగపడింది. -
బెయిర్ స్టోకు గాయం చేసిన అర్జున్!
లండన్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ లో ఇంగ్లండ్ ప్రధాన ఆటగాడు బెయిర్ స్టో గాయపడ్డాడు. అర్జున్ వేసిన ఒక చక్కటి యార్కర్‌కు బెయిర్ స్టోకు గాయమైంది. అర్జున్ వేసిన బంతి స్టో కాలికి బలంగా తాకింది. దాంతో అతను మైదానాన్ని వదిలి డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిపోయాడు. భారత అండర్-19 జట్టుతో కలిసి అర్జున్ ఇంగ్లండ్ లో పర్యటిస్తున్నాడు. దానిలో భాగంగా లార్డ్స్ మైదానంలో ఆటగాళ్లు ప్రాక్టీస్ లో పాల్గొన్నారు. అయితే ఇక్కడ ఇంగ్లండ్ జాతీయ జట్టు సభ్యులు కూడా ప్రాక్టీస్ పాల్గొనడంతో వారికి అర్జున్ బౌలింగ్ చేశాడు. ఆ క్రమంలోనే బెయిర్ స్టోకు బౌలింగ్ చేసి అతన్ని గాయపరిచాడు అర్జున్. అయితే ఇదంతా గురువారం ప్రారంభమైన దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్‌ల తొలి టెస్టుకు ముందు కావడంతో బెయిర్ స్టో తుది జట్టులో ఉండటంపై అనుమానం వ్యక్తమైంది. అయితే అది చిన్నపాటి గాయమే అని తేలడంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు. -
సచిన్ కుమారుడు అర్జున్‌కు ఏమైంది..!
-
సచిన్ కుమారుడు అర్జున్‌కు ఏమైంది..!
ముంబయి: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెందూల్కర్‌కు ఏమైంది అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అందుకు కారణం.. ముంబైలో పాప్ సంచలనం జస్టిస్ బీబర్ షోకు అర్జున్ ఊతకర్రలతో నడస్తూ రావడమే. గాయాలు వేధిస్తున్నా అర్జున్ బీబర్ ఈవెంట్‌కు హాజరవడానికి కారణం లేకపోలేదు. భారతీయులు అర్జున్ను ముద్దుగా ఇండియన్ జస్టిన్ బీబర్‌గా పిలుచుకుంటారు. అర్జున్ ఎడమకాలుకు బ్యాండేజీతో కనిపించాడు. దీంతో బీబర్‌కు ఏమైందా అని కంగారుపడ్డారు. స్టేజీపై బీబర్‌ను చూసి ఇతడు అర్జున్ అని గుర్తించాక వారి ఆందోళన మరి ఎక్కువైంది. బయటకు రాకుండా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇండియన్ బీబర్ అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా అర్జున్ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో నేవీ ముంబైలోని డీవై పాటిల్ స్డేడియంలో ఏర్పాటుచేసిన బీబర్ ఈవెంట్‌కు అర్జున్ రావడంతో సచిన్ అభిమానులతో పాటు బీబర్ ఫ్యాన్స్ కూడా ఇద్దరు బీబర్స్ను ఒకేసారి చూసే అవకాశం దొరికింది. ఆపై ట్విట్టర్లో తమ కామెంట్ల వర్షం కురిపించారు. లిప్ సింక్ సరిగాకాలేదని నిరాశ చెందిన బీబర్ ఫ్యాన్స్.. అర్జున్ టెండూల్కర్ స్టేజీపై ఉన్నాడేమోనని కొందరు ట్వీట్ చేయగా.. అర్జున్ అయితే ఇంకా బాగా లిప్ సింగ్ చేసేవాడని ట్వీట్లు చేశారు. Arjun Tendulkar, #SachinTendulkar's son might just be India's craziest Belieber! He went for the concert on crutches pic.twitter.com/QygFLLyHUX — Jinnions (@jinnions) 11 May 2017 Desi Justin Bieber (Arjun Tendulkar) at Justin Bieber's #PurposeTourIndia concert. Apne pass Justin Tendulkar hai. -
సచిన్ కొడుకు ఎవరి పోలికో తెలుసా?
జస్టిన్ బీబర్ ముంబై ఎందుకొచ్చాడు? అతను సచిన్‌ను ఎందుకలా పట్టుకున్నాడు? ఈ ఫొటోను చూసి ఓ నెటిజన్ వ్యక్తం చేసిన సందేహం ఇది. నిజానికి ఆ నెటిజనే కాదు చాలామంది లెటెస్ట్ లుక్‌లో ఉన్న అర్జున్ టెండూల్కర్‌ను చూసి అతను జస్టిన్ బీబరేమోనని పొరపడ్డారు. అందుకు కారణం లేకపోలేదు. కెనడియన్ పాప్ మ్యూజిక్ సెన్సేషన్ జస్టిన్ బీబర్ పోలికలు అర్జున్‌లో కొన్ని ఉండటమే. క్రికెట్ లెంజడ్ సచిన్ టెండూల్కర్ కొడుకైన అర్జున్ టెండుల్కర్ ఇటీవలే 17వ వసంతంలో అడుగుపెట్టాడు. సెప్టెంబర్ 24న తన ఇంట్లో జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నాడు. ఈ సందర్భంగా తండ్రితో అర్జున్ దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తండ్రి బాటలోనే క్రికెట్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్న అర్జున్ ఫొటోను చూసిన చాలామంది నెటిజన్లు థ్రిల్ అయ్యారు. ఈ ఫొటో చూసిన చాలామంది మొదట బీబర్ అనుకున్నారంటే ఎంత అచ్చుగుద్దినట్టు పోలికలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇంకొంతమంది నెటిజన్లైతే.. బీబర్, అర్జున్ చిన్నప్పుడే తప్పిపోయిన సోదరులు అయి ఉంటారని, సినిమాలోలాగా వాళ్లు మళ్లీ కలుసుకోవచ్చంటూ చమత్కరించారు. ఇంకొందరు సురేశ్-రమేశ్ అంటూ ఫన్నీ కామెంట్లు చేశారు. -
సెలక్టర్లకు వెయ్యి పరుగులు సరిపోలేదా?
ముంబై:ఇటీవల ఇంటర్ స్కూల్ టోర్నమెంట్లో వెయ్యి పరుగులకు పైగా చేసి సరికొత్త రికార్డు నెలకొల్పిన ప్రణవ్ ధనావాడే గుర్తున్నాడు కదా! జనవరి నెలలో ఆర్య గురకుల్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో కేసీ గాంధీ స్కూల్ కు ప్రాతినిథ్యం వహించిన ప్రణవ్ 323 బంతుల్లో 59 సిక్సర్లు, 129 ఫోర్లతో 1009 (నాటౌట్) పరుగులు చేశాడు. దాంతో ఆటో డ్రైవర్ కొడుకైన ప్రణవ్.. ప్రపంచ క్రికెట్లో ఓ సంచలనంగా మారిపోయాడు. ఓ కొత్త హీరో వచ్చాడంటూ కితాబులూ ఇచ్చేశాం. ఆపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా తన క్రికెట్ బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చి ఆ కుర్రాడిని అభినందిండమూ చూశాం. మరి, ఇన్ని పరుగులు చేసిన ఆ ముంబై కుర్రాడి ప్రతిభ సెలక్టర్లు కనిపించలేనట్లే ఉంది. అండర్ -16 జట్టుకు సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ను ఎంపిక చేసిన సెలక్టర్లు, ప్రణవ్ను అసలు పరిగణలోకి తీసుకోలేదు. ఇంటర్ జోనల్ టోర్నమెంట్లో భాగంగా అండర్ -16 వెస్ట్ జోన్ జట్టుకు అర్జున్‌కు ఇటీవల చోటు దక్కిన సంగతి తెలిసిందే. ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిగ్ మారిపోయింది. ఒక ఆటో డ్రైవర్ కొడుకు కావడంతోనే ప్రణవ్ను ఎంపిక చేయలేదంటూ విమర్శల వర్షం కురుస్తోంది. వరల్డ్ రికార్డు సాధించిన ప్రణవ్ను ఎంపిక చేయకుండా, ఎటువంటి రికార్డులేని అర్జున్ ఎంపిక చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కేవలం సచిన్ కుమారుడు కావడం వల్లే అర్జున్ను ఎంపిక చేశారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే వెస్ట్ జోన్ అండర్-16 జట్టుకు ప్రణవ్ అర్హుడు కాదని, కేవలం ముంబై అండర్ -16 జట్టుకు మాత్రమే అర్హుడని సెలక్టర్లు వివరణ ఇచ్చినా, ఆన్ లైన్ దుమారం మాత్రం ఆగలేదు. -
వెస్ట్ జోన్ జట్టులో అర్జున్ టెండూల్కర్
వడోదర:ఇంటర్ జోనల్ టోర్నమెంట్లో భాగంగా అండర్ -16 వెస్ట్ జోన్ జట్టుకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఎంపికయ్యాడు. ఈ మేరకు సోమవారం ఆలిండియా జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ రాకేష్ పారిక్ నేతృత్వంలో సెలక్టర్లు అర్జున్ కు అవకాశం కల్పించారు. వెస్ట్ జోన్ జట్టుకు ఓఎమ్ భోసాలే కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అండర్-16 వెస్ట్ జోన్ జట్టు: ఓఎమ్ భోసాలే(కెప్టెన్), వాసుదేవ్ పాటిల్, సువేద్ పార్కర్, స్మిత్ పటేల్, సన్ ప్రీత్ బగ్గా, యస్వి జైశ్వాల్, దైవాంశ్ సక్సెనా, నీల్ జాదవ్, అర్జన్ టెండూల్కర్, యోగేష్ దోంగ్రే, అంకోల్కర్, సురజ్ సుర్యాల్, సిద్దార్త్ దేశాయ్, అకాశ్ పాండే, ముకుంద సర్దార్ -
సెంచరీతో చెలరేగిన జూనియర్ టెండూల్కర్
బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ క్రికెట్లో అదరగొడుతున్నాడు. అండర్ -16 క్రికెట్లో అర్జున్ సెంచరీతో కదంతొక్కి తండ్రి బాటలో నడుస్తున్నాడు. ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) అండర్-16 పయ్యాడె ట్రోఫీలో అర్జున్ (106) సెంచరీతో చెలరేగాడు. ఈ ట్రోఫీలో సునీల్ గవాస్కర్ లెవెన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అర్జున్.. రోహిత్ శర్మ లెవెన్ జట్టుపై 156 బంతుల్లో 2 సిక్సర్లు, 16 ఫోర్లతో 106 పరుగులు చేశాడు. అర్జున్ సెంచరీ సాయంతో గవాస్కర్ లెవెన్ జట్టు 218 పరుగులు చేసింది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ అయిన అర్జున్ బౌలింగ్ కూడా చేశాడు. గత ఐపీఎల్ సీజన్ సందర్భంగా పాకిస్థాన్ పేస్ దిగ్గజం వసీం అక్రమ్ నుంచి అర్జున్ బౌలింగ్ మెళకువలు నేర్చుకున్నాడు. -
మా అబ్బాయి ఎయిర్‌ఫోర్సులో చేరతాడట
తన కొడుకు వైమానిక దళంలో చేరేందుకు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నాడని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చెప్పాడు. అయితే, అతడు చేరతాడా లేదా అనే విషయం అప్పుడే మాత్రం చెప్పలేమన్నాడు. వైమానిక దళంలో గౌరవ గ్రూప్ కెప్టెన్‌గా ఉన్న సచిన్.. హిండన్ బేస్ వద్ద ఎయిర్ ఫోర్స్ డే పెరేడ్ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు. వాస్తవానికి తన కొడుకును కూడా ఇక్కడకు తీసుకొద్దామనుకున్నానని, అతడికి ఎయిర్ ఫోర్స్ అంటే చాలా ఇష్టమని అన్నాడు. అర్జున్ టెండూల్కర్ వయసు ఇప్పుడు 16 ఏళ్లు. సుఖోయ్ యుద్ధ విమానంలో వెళ్లాలని గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేయగా, అది ఇంతవరకు కుదరలేదని మాస్టర్ చెప్పాడు. -
ఇంగ్లండ్ జట్టుతో అర్జున్ టెండూల్కర్
లండన్: సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ ఇంగ్లండ్ జట్టుతో కలిసి లార్డ్స్ మైదానంలో ప్రాక్టీస్ చేశాడు. బుధవారం ఇంగ్లండ్ జట్టు ప్రాక్టీస్ సెషన్లో సుదీర్ఘంగా బౌలింగ్ చేశాడు. భారత జట్టు, ముంబై ఇండియన్స్ జట్టుతో పాటు గతంలో అనేకసార్లు ప్రాక్టీస్ చేసిన అర్జున్ ఈసారి ఇంగ్లండ్ జట్టు యాషెస్ సెషన్లో ప్రాక్టీస్ చేయడం విశేషమే. ప్రస్తుతం సచిన్ కుటుంబసమేతంగా లండన్‌లో ఉన్నాడు. -
ఆస్ట్రేలియాక్రికెట్ పతనమే అర్జున్టెండూల్కర్ లక్ష్యం
-
వాట్సన్‌పై వేటు
నేటి నుంచి ఆసీస్, ఇంగ్లండ్ రెండో టెస్టు లండన్ : బ్యాటింగ్‌లో నిలకడలేమితో యాషెస్ తొలి టెస్టులో అనూహ్యంగా ఓటమిపాలైన ఆస్ట్రేలియా రెండో మ్యాచ్ కోసం సిద్ధమైంది. నేడు (గురువారం) లార్డ్స్‌లో ప్రారంభం కానున్న రెండో టెస్టులో ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే సిరీస్‌లో 0-1తో వెనుకబడ్డ ఆసీస్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌పై వేటు పడింది. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో వాట్సన్ ఎల్బీగా అవుటయ్యాడు. దాంతో పాటు వికెట్లు తీయలేకపోయినా... క్లార్క్ ఎక్కువగా అతనికే బౌలింగ్ ఇవ్వడం విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో వాట్సన్ స్థానంలో మిచెల్ మార్ష్‌ను తీసుకునేందుకు మేనేజ్మెంట్ సిద్ధమైంది. కుటుంబ కారణాల వల్ల వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ కూడా ఈ మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఇతని స్థానంలో పీటర్ నివిల్ టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. మరోవైపు తొలి టెస్టు గెలుపుతో ఇంగ్లండ్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. బ్యాటింగ్‌లో రూట్, స్టోక్స్, బెల్ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో అందరూ సమష్టిగా తొలి టెస్టులో రాణించారు. అయితే ప్రధాన స్పిన్నర్ పాత్ర పోషిస్తున్న మొయిన్ అలీ ఈ మ్యాచ్‌కు గాయం కారణంగా అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఆదిల్ రషీద్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడు. ఇంగ్లండ్ జట్టుతో అర్జున్ టెండూల్కర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ ఇంగ్లండ్ జట్టుతో కలిసి లార్డ్స్ మైదానంలో ప్రాక్టీస్ చేశాడు. బుధవారం ఇంగ్లండ్ జట్టు ప్రాక్టీస్ సెషన్లో సుదీర్ఘంగా బౌలింగ్ చేశాడు. భారత జట్టు, ముంబై ఇండియన్స్ జట్టుతో పాటు గతంలో అనేకసార్లు ప్రాక్టీస్ చేసిన అర్జున్ ఈసారి ఇంగ్లండ్ జట్టు యాషెస్ సెషన్లో ప్రాక్టీస్ చేయడం విశేషమే. ప్రస్తుతం సచిన్ కుటుంబసమేతంగా లండన్‌లో ఉన్నాడు. -
అర్జున్ టెండూల్కర్‌కు అక్రమ్ పాఠాలు
ముంబై : సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్‌కు పాకిస్తాన్ పేస్ దిగ్గజం వసీం అక్రమ్ పాఠాలు చెప్పారు. కోల్‌కతా జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న అక్రమ్... ముంబైతో మ్యాచ్ సందర్భంగా బుధవారం వాంఖడే స్టేడియంకు వచ్చారు. అక్కడ అర్జున్‌కు కొన్ని మెళకువలు నేర్పించారు. ‘గత వేసవిలో ఇంగ్లండ్‌లో అర్జున్ కలిశాడు. మేం ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ కూడా ఆడాం. తను బౌలింగ్ చేస్తున్నప్పుడు నేను మిడాన్‌లో ఫీల్డింగ్ చేశా. ఆ మ్యాచ్ లో అర్జున్ లారాను అవుట్ చేశాడు’ అని అక్రమ్ చెప్పారు. 15 ఏళ్ల అర్జున్ ఎడమచేతి వాటం పేసర్. అక్రమ్ కూడా ఎడమచేతి వాటం బౌలర్. ‘తన యాక్షన్ గురించి, బంతిని స్వింగ్ చేసే విధానం గురించి మాట్లాడాను. అలాగే ఫిట్నెస్ ఎంత ముఖ్యమో వివరించాను. తనలో నేర్చుకోవాలనే తపన చాలా ఉంది’ అని అక్రమ్ చెప్పారు. -
అర్జున్ ఆమ్లెట్లు వేశాడట..
భోపాల్ : సెలబ్రెటీలు, వాళ్ల పిల్లలు ఏం చేసినా స్పెషలే... మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ భోపాల్‌లోని ఓ హోటల్లో ఆమ్లెట్లు వేసి అక్కడి సిబ్బందినీ, తన స్నేహితులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. తండ్రిలాగా క్రికెట్‌ను ప్రేమించే అర్జున్ వంట కూడా బాగా చేస్తాడట. ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న అర్జున్ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు రెండు రోజుల పర్యటనకు వెళ్లాడు. ఈ సందర్భంగా స్థానిక హెటల్ కిచెన్‌లో వెరైటీ ఆమ్లెట్లు వేసి హల్ చల్ చేశాడు. సచిన్ కొడుకు అయినా అర్జున్‌కు అసలు గర్వం లేదని తమతో చాలా బాగా కలిసిపోయాడని హోటల్ సిబ్బంది ప్రశంసించారు. కాగా సచిన్‌కు కూడా గరిటె తిప్పే అలవాటు ఉంది. ఖాళీ సమయం దొరికితే అతడు చికెన్ కర్రీ వండి ఇంట్లోవారికి వడ్డిస్తాడట. అంతేకాదండోయ్ సచిన్ ...చేతి వంటకు టీమిండియా సభ్యులు కూడా ఫిదా అయిపోయేవారట. అడిగి మరీ సచిన్‌తో చికెన్ కర్రీ చేయించుకొని లొట్టలేసుకుని తినేవారట. -
అర్జున్‌కు బౌలింగ్ కోచ్‌గా సుబ్రతో బెనర్జీ
ముంబై: బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్‌కు.... భారత మాజీ క్రికెటర్ సుబ్రతో బెనర్జీ బౌలింగ్‌లో శిక్షణ ఇస్తున్నాడు. మూడు నెలల కిందట మాస్టర్ ఈ ప్రతిపాదనను చేసినట్లు బెనర్జీ వెల్లడించాడు. బ్యాటింగ్‌కు అవసరమైన శిక్షణ సచినే ఇస్తాడని చెప్పిన బెనర్జీ తాను కేవలం బౌలింగ్‌కే పరిమితమన్నాడు. అర్జున్ బౌలింగ్ శైలి జహీర్‌ఖాన్‌ను పోలి ఉన్నట్లు బెనర్జీ చెప్పాడు. గత సీజన్లో అతను జార్ఖండ్ రంజీ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోనే అర్జున్‌కు శిక్షణ కార్యక్రమం జరుగుతోంది. -
సచిన్ ను తిట్టాడని.. చేయి చేసుకున్న అర్జున్!
తండ్రిని ఎవరైనా నిందిస్తే కొడుకుకు కోపం రావడం సహజం. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ లాంటి వ్యక్తిని నిందిస్తే అభిమానులకే కాకుండా ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్ కు కోపం రావడంలో వింతేమి లేదు. అందుకే సచిన్ ను నిందించిన వాళ్లను అర్జున్ వాయించి వదిలేశాడట. అర్జున్ ఏడేళ్ల వయసులో ఉన్నపుడు స్కూల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. 2007 సంవత్సరంలో జరిగిన ప్రపంచ కప్ లో భారత జట్టు లీగ్ రౌండ్ లోనే తిరుగుముఖం పట్టింది. కీలక మ్యాచ్ లో సచిన్ సున్నాకే అవుటవ్వడంతో అప్పట్లో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో స్కూల్ లో సచిన్ పై చెత్త కామెంట్స్ చేయడంతో కోపగించిన అర్జున్ వారిపై చేయి చేసుకున్నాడట. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సచిన్ స్వయంగా వెల్లడించారు. ఎవరైనా ఏమన్నా కామెంట్ చేస్తే.. వదిలేయాలని తాము చెప్పినట్టు సచిన్ తెలిపారు. అర్జున్ చేసింది తప్పేనని సచిన్ ఒప్పకున్నాడు. క్రికెట్ పైనే అర్జున్ దృష్టి ఉంది. తనతో అర్జున్ ను పోల్చి చూడకూడదు అని సచిన్ అభిప్రాయపడ్డారు. -
అమ్మానాన్నలకు ధీటుగా..!
పంచామృతం: ఆస్తి, పేరు ప్రఖ్యాతులు... ఇవి కేవలం సంపాదించుకునేవే కాదు, వారసత్వంగా కూడా వస్తాయి. ఇలాంటి వారసత్వం పుట్టుకతోనే పిల్లల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది, అందరిలోనూ ఆసక్తిని పెంపొందిస్తుంది. ప్రస్తుతం ఇలాంటి ఫేమ్‌తో ముద్దులొలుకుతున్న పిల్లలు కొందరున్నారు. వాళ్లు ఏం చేసినా సంచలనమే అవుతోంది. తల్లిదండ్రులకు ఉన్న పేరు ప్రఖ్యాతులే వీళ్లకున్న క్రేజ్‌కు ప్రధాన కారణం. అలా ఇంకా ఏమీ సాధించకుండానే అమ్మనాన్నలకు ధీటైన ప్రచారాన్ని, ఫేమ్‌ను పొందుతున్న కొందరు పిల్లలు వీళ్లు. ఆరాధ్య బచ్చన్ బహుశా మన దేశంలో ఏ సెలబ్రిటీల పిల్లలకూ రాని స్థాయిలో ప్రచారం పొందిన పాపాయి ఆరాధ్య. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ మనవరాలిగా, ఒకనాటి విశ్వసుందరి ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ల పుత్రికగా ఆరాధ్య పట్ల ఎనలేని క్రేజ్ మొదలైంది. అసలు ఐశ్వర్యరాయ్ ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచే ఈ పాపాయి పట్ల ఆసక్తి మొదలైంది. పుట్టిన కొత్తలో ఆరాధ్య ఫోటోలు ఎప్పుడెప్పుడు బయటకు వస్తాయా.. అని దేశంలో ఎంతో మంది ఎదురు చూశారు. ఇప్పటికీ అభిషేక్, ఐశ్వర్యల వెంట ఆరాధ్య కనిపించిందంటే వందల కెమెరాలు క్లిక్మంటాయి. అర్జున్ టెండూల్కర్ అర్జున్ టెండూల్కర్ అడుతున్న స్కూల్ మ్యాచ్‌లకు కూడా ప్రత్యేక గుర్తింపు దక్కుతోంది. స్కూల్‌స్థాయి మ్యాచ్‌లలో అర్జున్ఎలా ఆడుతున్నాడు, ఎంత స్కోర్ చేస్తున్నాడు, అతడి బ్యాటింగ్తీరు తెన్నులు ఎలా ఉన్నాయి.. అనే అంశాల గురించి అంతర్జాతీయ స్థాయి క్రికెట్ ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఇంత వరకూ అర్జున్ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు కూడా ఎక్కడా ఆడింది లేదు. అయినా అతడి ఆటతీరు గురించి ఇంతటి ప్రచారం అంటే దానికి తండ్రి సచిన్ టెండూల్కర్ నేపథ్యమే కారణం. జార్జ్ అలెక్స్ లూయిస్ బ్రిటన్ రాజవంశానికి చెందిన ప్రిన్స్ విలియమ్, క్యాథరీన్ల తనయుడు. ఇప్పుడు ప్రపంచంలోని క్రేజీయెస్ట్ చిల్డ్రన్స్‌లో జార్జ్ ఒకరు. ఇతడి జననం కూడా ప్రపంచం దృష్టిని బాగా ఆకట్టుకొన్న అంశమే అయ్యింది. క్యాథరీన్ యువరాజుకు జన్మనిచ్చిందనే విషయం తెలియగానే బ్రిటన్ మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. దాదాపు ఏడాది వయసున్న జార్జ్ మీడియాకు ఒక సూపర్ సెలబ్రిటీ. క్రూజ్, రోమియా బ్రిటన్ సాకర్ స్టార్ బెక్‌హమ్‌కు మొత్తం నలుగురు పిల్లలు. ముగ్గురు తనయులు, ఒక తనయ. వీరిలో చిన్న వాళ్లు రోమియో, క్రూజ్‌లు ఇప్పుడు చైల్డ్ సెలబ్రిటీలుగా చెలామణిలో ఉన్నారు. బెక్‌హమ్‌కు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నా... పిల్లల వల్ల మాత్రం మరింత గుర్తింపు లభిస్తోంది. మొన్నటి సాకర్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి ఎంతో మంది ప్రసిద్ధ వ్యక్తులు వచ్చినా వీక్షకుల గ్యాలరీలో అర్జెంటీనా జెర్సీలు ధరించి వచ్చిన బెక్‌హమ్ పిల్లలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అదీ వారికున్న క్రేజ్. సూరి క్రూజ్ టామ్ క్రూజ్, కేటీ హోమ్స్ల ఆరేళ్ల దాంపత్య బంధానికి ప్రతిరూపం సూరి. అమ్మనాన్నల గ్లామర్‌ను పుణికిపుచ్చుకున్న సూరి అంటే పాశ్చాత్య ప్రపంచానికి ఎనలేని క్రేజ్. నెలల వయసు నుంచే సూరికి గొప్ప ఫేమ్ వచ్చింది. ఇక కాస్తనడక నేర్చాక టామ్, కేటీల వెంట ఎక్కడైనా సూరి కనిపించిందంటే... ఫోటోగ్రాఫర్లకు పండగే! సూరి పక్కన ఉందంటే... టామ్‌ను, కేటీని పట్టించుకొనే వాళ్లు తక్కువ మంది అవుతారు. ఎందుకంటే అందరి కళ్లూ ఆ పాప మీదే ఉంటాయి. ఆన్లైన్లో సూరి ఫ్యాన్ కమ్యూనిటీలకు కొదవే లేదు! తల్లిదండ్రులకున్న ఫేమ్‌తో తనకున్న ఆకర్షణ శక్తితో ప్రపంచంలోనే అత్యంత క్రేజీయెస్ట్ చైల్డ్‌గా పేరు తెచ్చుకొంది సూరి. -
బాల్ బాయ్‌గా ఆకట్టుకున్నసచిన్ కుమారుడు
ముంబై: ముంబై వాంఖడే స్టేడియంలో శుక్రవారం ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. భారత బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ ఈ వేదికలో 26 ఏళ్ల క్రితం బాల్ బాయ్‌గా పనిచేయగా.. తాజాగా ఇదే వేదికలో జరుగుతున్న మాస్టర్ వీడ్కోలు టెస్టులో అతని కుమారుడు అర్జున్ టెండూల్కర్ బాల్ బాయ్‌గా వ్యవహరించాడు. ముంబై అండర్-14 జట్టుకు గతేడాది ప్రాతినిధ్యం వహించిన 14 ఏళ్ల అర్జున్.. సచిన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మైదానంలో కనిపించాడు. బౌండరీ లైన్‌కు అవతల కూర్చొన్నఅర్జున్ టెండూల్కర్ స్టేడియంలోని ఆటగాళ్లకు బాల్‌ను అందిస్తూ ఆకట్టుకున్నాడు. తండ్రి బాటలోనే పయనించాలని యోచిస్తున్నఅర్జున్ ఇది ఏమేరకు లాభిస్తుందో వేచిచూద్దాం. -
సచిన్ చివరి మ్యాచ్ కు ప్రముఖుల సందడి
కెరీర్ లో చివరి టెస్ట్ ఆడుతున్న సచిన్ ను చూసేందుకు ప్రముఖులు పెద్ద ఎత్తున్న వాంఖెడే స్టేడియానికి వచ్చారు. చివరి మ్యాచ్ లో సచిన్ ఆటను చూసేందుకు రాహుల్ గాంధీ, అమీర్ ఖాన్, యువరాజ్ సింగ్, అజిత్ వాడేకర్, హృతిక్ రోషన్, పూనమ్ పాండే, వెంగ్ సర్కార్, బిషన్ సింగ్ బేడి, శరద్ పవార్, మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ లతోపాటు మరికొంత మంది హాజరయ్యారు. సెక్సీ స్టార్ పూనమ్ పాండే తన చేతిపై సచిన్ టాటూ వేసుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. -
అర్జున్ టెండూల్కర్‌తో సచిన్ టెండూల్కర్
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సచిన్ చరిత్రాత్మక 200వ టెస్టు కోసం ఎదురు చూస్తున్నారు. గురువారం నుంచి ముంబై వాంఖడే స్టేడియంలో భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టెస్టుజరగనుంది. ఈ మ్యాచ్ అనంతరం ముంబైకర్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్నాడు. ముంబై టెస్టు మ్యాచ్‌కు ముందు సచిన్ తన తనయుడు అర్జున్‌తో కలసి ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. అన్నట్టు అర్జున్ పాఠశాల స్థాయిలో వివిధ టోర్నీల్లో పాల్గొంటున్నాడు. అభిమానుల కోసం అర్జున్, టీమిండియా కెప్టెన్ ధోనీ, కోచ్ ఫ్లెచర్లతో కూడిన సచిన్ ఫొటోలు.. -
సచిన్ కుమారుడ్ని స్వేచ్ఛగా వదిలేయండి: రోహన్ గవాస్కర్
లాహ్లీ (హర్యానా): ఓ స్టార్ క్రికెటర్ వారసుడి మీద ఒత్తిడి ఎలా ఉంటుందో అందరికంటే బాగా తెలిసిన వ్యక్తి రోహన్ గవాస్కర్. సునీల్ గవాస్కర్ కుమారుడిగా కెరీర్ ఆరంభం నుంచే అన్ని వైపుల నుంచి ఒత్తిడి ఎదుర్కొన్న రోహన్ అంతర్జాతీయ క్రికెటర్‌గా సక్సెస్ కాలేకపోయాడు. సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ కూడా ఇదే తరహా ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి అతడిని స్వేచ్ఛగా వదిలేయాలని రోహన్ కోరాడు. ‘స్కూల్ స్థాయి క్రికెట్లో అర్జున్ టెండూల్కర్ ఎలా ఆడుతున్నాడనే విషయంపై చర్చించే ఆసక్తి నాకు లేదు. అతడిని అలా స్వేచ్ఛగా వదిలేయండి. ఈ విషయంపై ఇప్పటికే నేను సచిన్, అంజలిలతోనూ మాట్లాడాను. అందరూ అతడిపై దృష్టి సారించాల్సిన అవసరం లేదు. తండ్రి ప్రభావం అర్జున్‌పై పడకూడదు. అప్పుడే మంచి క్రికెటర్‌గా ఎదుగుతాడు’ అని రోహన్ అన్నాడు. -
మా వాడిని ఒంటరిగా వదిలేయండి
ముంబై: భారత క్రికెట్‌కు దేవుడిగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను అభిమానులు భావిస్తుం టారు. మరి అలాంటి ఆటగాడి కుమారుడు కూడా బ్యాట్ చేతపటి ్ట మైదానంలో దిగితే... అందరి చూపుతో పాటు మీడియా దృష్టి కూడా అతడి మీదే ఉంటుంది. అయితే ఇదంతా ఆ టీనేజి కుర్రాడి ఏకాగ్రతను దెబ్బతీసినట్టవుతుందని మాస్టర్ భావిస్తున్నాడు. తన కుమారుడు అర్జున్ టెండూల్కర్‌ను ఒంటరిగా వదిలేయాలని, ఎక్కువ ఫోకస్‌తో అనవసరంగా అతడిపై ఒత్తిడి పెంచరాదని మీడియాకు సూచించాడు. ‘ఆదివారం మా అబ్బాయి ఓ మ్యాచ్ ఆడాడు. ఇది అతడికి తొలి అధికారిక క్లబ్ మ్యాచ్. ఇంతవరకు బాగానే ఉన్నా అర్జున్ ఎలా ఆడుతున్నాడు అనే అంశంతో పాటు అతడు ఎవరితో మాట్లాడుతున్నాడు లేక ఏం చదువుతున్నాడనే విషయాలు కూడా పట్టించుకుంటున్నారు. ఇలా కాకుండా అతడిని తనకు తానుగా వదిలేసి, సొంత గుర్తింపు తెచ్చుకునే వరకు వదిలేస్తే నేను ఎక్కువ సంతోషిస్తా. నేను అతడికి రక్షణగా ఉండాల్సిన తండ్రిని. నేను క్రికెట్ నేర్చుకుంటున్న దశలో ఎవరి నుంచీ ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కోలేదు. అర్జున్ ఇప్పుడిప్పుడే కెరీర్‌ను ప్రారంభిస్తున్నాడు. కాబట్టి 14 ఏళ్ల మామూలు కుర్రాడిలా క్రికెట్‌ను తప్ప మరేమీ ఆలోచించని వాడిలా తనను వదిలేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ముంబై స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న సచిన్ సూచించాడు.