IPL 2023, MI Vs KKR Updates & Highlights: కేకేఆర్‌పై ముంబై ఇండియన్స్‌ ఘన విజయం | Mumbai Indians Beat Kolkata Knight Riders By 5 Wickets - Sakshi
Sakshi News home page

IPL 2023 MI VS KKR: MI VS KKR: కేకేఆర్‌పై ముంబై ఇండియన్స్‌ ఘన విజయం

Published Sun, Apr 16 2023 3:16 PM | Last Updated on Mon, Apr 17 2023 11:04 AM

IPL 2023 MI VS KKR Match Updates, Highlights And Playing XI - Sakshi

కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ 17.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. ముంబై బ్యాటర్లలో ఇషాన్‌ కిషన్‌ 25 బంతుల్లో 58, సూర్యకుమార్‌ యాదవ్‌ 25 బంతుల్లో 43, తిలక్‌ వర్మ 25 బంతుల్లో 30 పరుగులు, టిమ్‌ డేవిడ్‌ 12 బంతుల్లో 23 పరుగులు నాటౌట్‌ సమిష్టిగా రాణించి ముంబై విజయంలో కీలకపాత్ర పోషించారు.

కేకేఆర్‌ బౌలర్లలో సుయాష్‌ శర్మ రెండు వికెట్లు తీయగా.. శార్దూల్‌ ఠాకూర్‌, వరుణ్‌ చక్రవర్తి, లోకీ ఫెర్గూసన్‌లు తలా ఒక వికెట్‌ తీశారు. సీజన్‌లో ముంబైకిది వరుసగా రెండో విజయం కాగా.. కేకేఆర్‌కు వరుసగా రెండో పరాజయం కావడం గమనార్హం.

విజయం దిశగా ముంబై ఇండియన్స్‌
కేకేఆర్‌తో మ్యాచ్‌లో ముంబై విజయానికి దగ్గరైంది. 17 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్‌ నాలుగు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ముంబై విజయానికి కేవలం ఆరు పరుగుల దూరంలో ఉంది.

తిలక్‌ వర్మ క్లీన్‌ బౌల్డ్‌.. మూడో వికెట్‌ కోల్పోయిన ముంబై ఇండియన్స్‌
సుయాశ్‌ శర్మ బౌలింగ్‌లో తిలక్‌ వర్మ (30) క్లీన్‌ బౌల్డయ్యాడు. 14 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 148/3. సూర్యకుమార్‌ యాదవ్‌ (30), టిమ్‌ డేవిడ్‌ క్రీజ్‌లో ఉన్నారు. 

ఇషాన్‌ కిషన్‌ (58) క్లీన్‌ బౌల్డ్‌
25 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు సాయంతో 58 పరుగులు చేసిన అనంతరం ఇషాన్‌ కిషన్‌ ఔటయ్యాడు. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో ఇషాన్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు. 

ఉమేశ్‌ సూపర్‌ క్యాచ్‌.. హిట్‌మ్యాన్‌ ఔట్‌
20 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద రోహిత్‌ శర్మ ఔటయ్యాడు. సుయాశ్‌ శర్మ బౌలింగ్‌లో మిడ్‌ ఆఫ్‌లో ఉమేశ్‌ అద్భుతమైన డైవింగ్‌ క్యాచ్‌ అందుకోవడంతో హిట్‌మ్యాన్‌ పెవిలియన్‌కు చేరాడు. క్రీజ్‌లో ఇషాన్‌ కిషన్‌ (43) జతగా సూర్యకుమార్‌ యాదవ్‌ ఉన్నాడు. 5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 65/1.

టార్గెట్‌ 186.. ధాటిగా ఆడుతున్న రోహిత్‌, ఇషాన్
186 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. 4 ఓవర్లలో ఆ జట్టు ఏకంగా 57 పరుగులు రాబట్టింది. ఇషాన్‌ కిషన్‌ (15 బంతుల్లో 42; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. అతనికి జతగా రోహిత్‌ శర్మ (9 బంతుల్లో 13; ఫోర్‌, సిక్స్‌) క్రీజ్‌లో ఉన్నాడు. 

వెంకటేశ్‌ అయ్యర్‌ సెంచరీ.. ముంబై టార్గెట్‌ ఎంతంటే..?
ఐపీఎల్‌-2023లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 16 మధ్యాహ్నం 3:30 గంటలకు) జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌.. వెంకటేశ్‌ అయ్యర్‌ (51 బంతుల్లో 104; 6 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. కేఆర్‌ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్భాజ్‌ (8), జగదీశన్‌ (0), నితీశ్‌ రాణా (5), శార్దూల్‌ ఠాకూర్‌ (13), రింకూ సింగ్‌ (18) తక్కువ స్కోర్లకే ఔట్‌ కాగా.. ఆఖర్లో రసెల్‌ (21 నాటౌట్‌) ధాటిగా ఆడాడు. ముంబై బౌలర్లలో హృతిక్‌ షోకీన్‌ 2 వికెట్లు పడగొట్టగా.. కెమరూన్‌ గ్రీన్‌, పియూష్‌ చావ్లా, జన్సెన్‌. మెరిడిత్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

రింకూ సింగ్‌ ఔట్‌.. ఆరో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌
జన్సెన్‌ బౌలింగ్‌లో నేహల్‌కు క్యాచ్‌ ఇచ్చి రింకూ సింగ్‌ (18) ఔటయ్యాడు. అయ్యర్‌  ఔటయ్యాక స్కోర్‌ ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. 

శతక్కొట్టి ఔటైన వెంకటేశ్‌ అయ్యర్‌
సెంచరీ తర్వాత కేవలం ఒకే ఒక ఫోర్‌ కొట్టిన అయ్యర్‌.. 104 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఔటయ్యాడు. మెరిడిత్‌ బౌలింగ్‌లో జన్సెన్‌కు క్యాచ్‌ ఇచ్చి అయ్యర్‌ పెవిలియన్‌కు చేరాడు.  

వెంకటేశ్‌ అయ్యర్‌ ఊచకోత.. 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో విధ్వంకర శతకం
ముంబైలోని వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 16) జరుగుతున్న మ్యాచ్‌లో (మధ్యాహ్నం 3:30 గంటలకు) కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బ్యాటర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ శివాలెత్తిపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలి బంతి నుంచి ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగిన అయ్యర్‌.. కేవలం 49 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో విధ్వంకర శతకం బాదాడు. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌లో  బ్యాటర్లంతా కలిపి కేవలం 2 ఫోర్లు కొడితే, ఒక్క వెంకటేశ్‌ అయ్యరే 5 బౌండరీలు, 9 సిక్సర్లు బాదడం విశేషం.

తిలక్‌ వర్మ సూపర్‌ క్యాచ్‌.. శార్దూల్‌ ఠాకూర్‌ ఔట్‌
తిలక్‌ వర్మ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో శార్దూల్‌ ఠాకూర్‌ (13) పెవిలియన్‌ బాట పట్టాడు. తద్వారా 123 పరుగుల వద్ద కేకేఆర్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. క్రీజ్‌లో ఉన్న వెంకటేశ్‌ అయ్యర్‌ (86) దుమ్మురేపుతున్నాడు.  

23 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన వెంకటేశ్‌ అయ్యర్‌
హార్ఢ్‌ హిట్టర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ 23 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం స్పీడ్‌ పెంచిన అయ్యర్‌.. ఇంకా ధాటిగా ఆడుతున్నాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 76 పరుగుల వద్ద క్రీజ్‌లో ఉన్నాడు. 11 ఓవర్ల తర్వాత కేకేఆర్‌ స్కోర్‌ 104/3. అయ్యర్‌, శార్దూల్‌ (4) క్రీజ్‌లో ఉన్నారు. 

నితీశ్‌ రాణా ఔట్‌
భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన నితీశ్‌ రాణా (5) హృతిక్‌ షోకీన్‌ బౌలింగ్‌లో రమన్‌దీప్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 8.1 ఓవర్ల తర్వాత కేకేఆర్‌ స్కోర్‌ 73/3. వెంకటేశ్‌ అయ్యర్‌ (49) క్రీజ్‌లో ఉన్నాడు. 

రెండో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌
57 పరుగుల వద్ద కేకేఆర్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. పియూష్‌ చావ్లా బౌలింగ్‌లో జన్సెన్‌కు క్యాచ్‌ ఇచ్చి గుర్భాజ్‌ (8) ఔటయ్యాడు. క్రీజ్‌లో ఉన్న వెంకటేశ్‌ అయ్యర్‌ (39) ధాటిగా ఆడుతున్నాడు. నితీశ్‌ రాణా క్రీజ్‌లోకి వచ్చాడు. 6 ఓవర్ల తర్వాత కేకేఆర్‌ స్కోర్‌ 57/2. 

తొలి వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌.. జగదీశన్‌ ఔట్‌
రెండో ఓవర్‌లోనే కేకేఆర్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. గ్రీన్‌ బౌలింగ్‌లో హృతిక్‌ షోకీన్‌ క్యాచ్‌ పట్టడంతో ఎన్‌ జగదీశన్‌ (0) ఔటయ్యాడు. 2 ఓవర్ల తర్వాత కేకేఆర్‌ స్కోర్‌ 12/1. రహ్మానుల్లా గుర్బాజ్‌ (5), వెంకటేశ్‌ అయ్యర్‌ క్రీజ్‌లో ఉన్నారు.  

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ముంబై.. రోహిత్‌ ఔట్‌, అర్జున్‌ టెండూల్కర్‌ అరంగేట్రం
ఐపీఎల్‌-2023లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 16) జరుగనున్న డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌ల్లో తొలుత (మధ్యాహ్నం 3:30 గంటలకు) ముంబై ఇండియన్స్‌- కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. కడుపు నొప్పి కారణంగా ఈ మ్యాచ్‌కు రోహిత్‌ శర్మ దూరం కాగా, అతని స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ ముంబై కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అలాగే ఈ మ్యాచ్‌ ద్వారా సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జన్‌ టెండూల్కర్‌ ఐపీఎల్‌ అరంగేట్రం చేయనున్నాడు.  

తుది జట్లు..
ముంబై ఇండియన్స్‌: ఇషాన్‌ కిషన్‌, కెమారూన్‌ గ్రీన్‌, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), టిమ్‌ డేవిడ్‌, నేహల్‌ వధేరా, అర్జున్‌ టెండూల్కర్‌, హృతిక్‌ షోకీన్‌, పియుశ్‌ చావ్లా, డ్యుయాన్‌ జన్సెన్‌, రిలే మెరిడిత్‌

కేకేఆర్‌: రహ్మానుల్లా గుర్భాజ్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, ఎన్‌ జగదీశన్‌, నితీశ్‌ రాణా (కెప్టెన్‌), రింకూ సింగ్‌, ఆండ్రీ రసెల్‌, సునీల్‌ నరైన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఉమేశ్‌ యాదవ్‌, లోకీ ఫెర్గూసన్‌, వరుణ్‌ చక్రవర్తి 


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement