Nitish Rana
-
కెప్టెన్‌గా రింకూ సింగ్
టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్‌కు సువర్ణావకాశం వచ్చింది. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2024లో అతడు ఉత్తరప్రదేశ్ జట్టుకు సారథిగా ఎంపికయ్యాడు. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన రింకూకు ఈ అవకాశం దక్కింది.టీ20 టోర్నీలో అదరగొట్టిన రింకూకాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో ఉత్తరప్రదేశ్ జట్టుకు భారత వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సారథ్యం వహించాడు. అతడి కెప్టెన్సీలో యూపీ క్వార్టర్ ఫైనల్స్ వరకు చేరుకుంది. ఇక ఈ టోర్నీలో రింకూ తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి 152కు పైగా స్ట్రైక్‌రేటుతో 277 పరుగులు చేశాడు.ఇక లిస్ట్-ఏ(వన్డే ఫార్మాట్) క్రికెట్లోనూ రింకూ సింగ్‌కు మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు 57 మ్యాచ్‌లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఖాతాలో 1899 పరుగులు ఉన్నాయి. ఇందులో ఒక సెంచరీతో పాటు 17 అర్ధ శతకాలు ఉన్నాయి.ఈసారి రింకూ కెప్టెన్సీలో భువీఈ నేపథ్యంలో విజయ్ హజారే ట్రోఫీ-2024కు ప్రకటించిన జట్టుకు రింకూ సింగ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సీనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించిన 19 మంది సభ్యులతో కూడిన జట్టులో సారథిగా ఛాన్స్ కొట్టేశాడు. అయితే, భువీ ఈసారి కేవలం బౌలర్‌గానే బరిలోకి దిగనున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కెప్టెన్సీ చేసిన భువనేశ్వర్.. ఆటగాడిగానూ రాణించాడు.ఈ టోర్నీలో తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి పదకొండు వికెట్లు తీశాడు. ఇందులో హ్యాట్రిక్ కూడా ఉండటం విశేషం. అయితే, విజయ్ హజారే ట్రోఫీలో మాత్రం రింకూ కెప్టెన్సీలో భువీ ఆడనున్నాడు. ఇక యూపీ జట్టులో రింకూ, భువీతో పాటు నితీశ్ రాణా, మొహ్సిన్ ఖాన్, శివం మావి వంటి ఐపీఎల్ స్టార్లు కూడా ఉన్నారు. ఇక ఈ దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ డిసెంబరు 21 నుంచి ఆరంభం కానుంది.విజయ్ హజారే ట్రోఫీ-2024కు ఉత్తరప్రదేశ్ జట్టురింకూ సింగ్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మాధవ్ కౌశిక్, కరణ్ శర్మ, ప్రియమ్ గార్గ్, నితీశ్ రాణా, అభిషేక్ గోస్వామి, అక్షదీప్ నాథ్, ఆర్యన్ జుయాల్, ఆరాధ్య యాదవ్, సౌరభ్ కుమార్, కృతజ్ కుమార్ సింగ్, విప్రాజ్ నిగమ్, మొహ్సిన్ ఖాన్, శివం మావి, అక్విబ్ ఖాన్, అటల్ బిహారీ రాయ్, కార్తికేయ జైస్వాల్, వినీత్ పన్వర్.చదవండి: ‘రోహిత్ శర్మ వెంటనే తప్పుకోవాలి.. అతడిని కెప్టెన్ చేయండి’ఇప్పటికైనా చోటిస్తారా?.. టీమిండియా సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్ -
రోహిత్ భయ్యా నన్ను మాట్లాడనివ్వలేదు: కేకేఆర్ మాజీ కెప్టెన్
‘‘గతేడాది నేను కెప్టెన్‌గా ఉన్న సమయంలో రోహిత్ భయ్యా దగ్గరకు వెళ్లి నా మనసులో చెలరేగుతున్న అలజడి గురించి పంచుకున్నాను. రెండు మ్యాచ్‌లు గెలిచాం.. రెండు మ్యాచ్‌లు ఓడిపోయాం.నాకేమీ అర్థం కావడం లేదు భయ్యా అన్నాను. అప్పుడు.. ‘నితీశ్.. ఇంతకీ కెప్టెన్సీ అంటే ఏమనుకుంటున్నావు? అని అడిగాడు.వెంటనే నా మనసులో ఉన్నదంతా కక్కేయాలని.. ఏదో చెప్పేందుకు ప్రయత్నించాను. కానీ.. రోహిత్ భయ్యా నన్ను మాట్లాడనివ్వలేదు.‘కెప్టెన్సీ అంటే అసలేమీ లేదు. బౌలర్లను మారుస్తూ.. ఫీల్డర్లనూ అక్కడి నుంచి ఇక్కడికి.. ఇక్కడి నుంచి అక్కడికి మార్చడం అంతే. ఫలితం నీకు అనుకూలంగా వచ్చిందనుకో.. నువ్వు బాగానే ఉంటావు.ఒకవేళ నువ్వు ఆశించినది జరగలేదనుకో.. నువ్వు ఎంత మంచిగా కెప్టెన్సీ చేసినా ఎవరూ నీ గురించి మాట్లాడుకోరు. కాబట్టి నిన్ను నువ్వు మెరుగుపరచుకుంటూ.. నీ ఆట, నైపుణ్యాలపై దృష్టి పెట్టి ముందుకు సాగాలంతే.ఏ విషయాన్నైనా క్లిష్టంగా భావించనంత వరకు అంతా బాగానే ఉంటుంది. నువ్వు తెలివైన, తేలికైన మార్గాన్నే ఎంచుకోవాలి’ అని భయ్యా నాతో అన్నాడు.ఆరోజు నన్ను నేను సమాధానపరచుకునేలా నాలో స్ఫూర్తి నింపాడు’’ అని కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ నితీశ్ రాణా గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.కాగా గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ గతేడాది ఐపీఎల్‌కు దూరం కాగా.. అతడి స్థానంలో నితీశ్ రాణా కేకేఆర్ సారథిగా బాధ్యతలు చేపట్టాడు. బ్యాటర్‌గా ఫర్వాలేదనిపించినా కెప్టెన్‌గా మాత్రం విఫలమయ్యాడు.కేకేఆర్ తరఫున 14 మ్యాచ్‌లు ఆడి 413 పరుగులు చేసిన నితీశ్ రాణా.. జట్టును ప్లే ఆఫ్స్ మాత్రం చేర్చలేకపోయాడు. ఈ క్రమంలో ఈ ఏడాది శ్రేయస్ అయ్యర్ తిరిగి రాగా.. కేకేఆర్ మేనేజ్మెంట్ అతడిని మళ్లీ కెప్టెన్‌గా నియమించింది.అయితే, తాను కేకేఆర్ సారథిగా ఉన్న సమయంలో వరుస వైఫల్యాల నేపథ్యంలో నాటి ముంబై ఇండియన్స్ కెప్టెన్, ప్రస్తుత టీమిండియా సారథి రోహిత్ శర్మ విలువైన సూచనలు , సలహాలు ఇచ్చాడని నితీశ్ రాణా చెప్పుకొచ్చాడు. టీఆర్ఎస్ పాడ్‌కాస్ట్‌లో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా ఐపీఎల్-2024లో కేవలం రెండు మ్యాచ్‌లు ఆడిన నితీశ్ 42 పరుగులు చేయగలిగాడు. అయితే, కేకేఆర్ ఈసారి చాంపియన్‌గా నిలవడంతో ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడిగా మధుర జ్ఞాపకాలు సొంతం చేసుకున్నాడు. -
శతక్కొట్టిన రాణా.. 5 వికెట్లతో చెలరేగిన భువీ! రహానే మళ్లీ..
Ranji Trophy 2023-24- Mumbai vs Uttar Pradesh: రంజీ ట్రోఫీ 2023-24లో ఉత్తరప్రదేశ్ ముంబై జట్టుపై గెలుపొందింది. నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్‌లో ఆఖరికి 2 వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది. ముంబైతో మ్యాచ్‌లో యూపీ కెప్టెన్ నితీశ్ రాణా శతక్కొట్టగా.. పేసర్ భువనేశ్వర్ కుమార్ మొత్తం ఐదు వికెట్లు పడగొట్టాడు. మరో యువ పేసర్ ఆకిబ్ ఖాన్ సైతం అద్భుతంగా రాణించి జట్టు విజయానికి తానూ కారణమయ్యాడు. కాగా ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ తొలుత బౌలింగ్ చేసింది. కొనసాగుతున్న రహానే వైఫల్యం ముంబై కెప్టెన్ అజింక్య రహానే వైఫల్యం కొనసాగగా.. వికెట్ కీపర్ ప్రసాద్ పవార్(36), షమ్స్ ములానీ చెప్పుకోదగ్గ(57)ప్రదర్శన చేశారు. మిగతా వాళ్లు నామమాత్రపు స్కోరుకే పరిమితం కావడంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే ఆలౌట్ అయింది. రాణా శతకం యూపీ బౌలర్లలో భువీ రెండు, అంకిత్ రాజ్‌పుత్ మూడు, ఆకిబ్ ఖాన్ మూడు, శివం శర్మ రెండు వికెట్లు తీశారు. ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన ఉత్తరప్రదేశ్‌కు ఓపెనర్ సమర్థ్ సింగ్(63) శుభారంభం అందించగా.. కెప్టెన్ నితీశ్ రాణా(106) శతక్కొట్టాడు. దూబే సెంచరీ కొట్టినా దీంతో 324 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించిన యూపీ 126 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ముంబై శివం దూబే(117) మెరుపు శతకం కారణంగా.. 320 పరుగులు చేయగలిగింది. కాగా ముంబై రెండో ఇన్నింగ్స్‌లో టాపార్డర్, మిడిలార్డర్‌ను ఆకిబ్ ఖాన్, భువీ కుప్పకూల్చారు. ఆకిబ్ టాప్-3 వికెట్లు పడగొట్టగా.. భువీ మొత్తం మూడు వికెట్లు తీశాడు. దూబే రూపంలో కరణ్ శర్మ కీలక వికెట్ దక్కించుకున్నాడు. రెండు వికెట్ల తేడాతో విజయం ఈ క్రమంలో ముంబై విధించిన 195 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ 8 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. యూపీ కెప్టెన్ నితీశ్ రాణాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ మ్యాచ్‌లోనూ ముంబై సారథి అజింక్య రహానే బ్యాటింగ్ వైఫల్యం కొనసాగింది. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 17 (8, 9) పరుగులు మాత్రమే చేశాడు. టీమిండియాలో రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న అతడు ఇప్పటి వరకు రంజీ-2024లో ఒక్కటైనా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. మరోవైపు టీమిండియా తరఫున రీ ఎంట్రీలో టీ20లలో సత్తా చాటిన శివం దూబే అద్భుత బ్యాటింగ్ తీరుతో టెస్టు రేసులోకి దూసుకురావడం విశేషం. చదవండి: Ind Vs Eng 2nd Test: విశాఖ టెస్టు.. విద్యార్థులతో పాటు వాళ్లకూ ఫ్రీ ఎంట్రీ -
IPL 2024: కేకేఆర్ కీలక ప్రకటన... కెప్టెన్‌గా మళ్లీ అతడే
IPL 2024- KKR Captain Announcement: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ కీలక ప్రకటన చేసింది. టీమిండియా మిడిలార్డర్ స్టార్ శ్రేయస్ అయ్యర్ తిరిగి కేకేఆర్ పగ్గాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. అయ్యర్ కెప్టెన్సీలో నితీశ్ రాణా వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేసింది. కాగా వెన్నునొప్పి కారణంగా శ్రేయస్ అయ్యర్ గతేడాది ఐపీఎల్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో నితీశ్ రాణా కేకేఆర్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. రాణా సారథ్యంలో కేకేఆర్ ఆడిన పద్నాలుగు మ్యాచ్‌లలో ఆరు మాత్రమే గెలిచింది. అయ్యర్ లేని లోటు పూడ్చేందుకు తద్వారా పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికే పరిమితమైంది. కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే నిష్క్రమించింది ఈ మాజీ చాంపియన్. అయితే, శ్రేయస్ అయ్యర్ లేని లోటును పూడ్చేందుకు నితీశ్ రాణా ప్రయత్నించిన తీరుపై మాత్రం ప్రశంసలు కురిశాయి. ఇక కేకేఆర్ సారథిగా పూర్తిస్థాయిలో సఫలం కాలేకపోయినా.. బ్యాటర్‌గా మాత్రం ఆకట్టుకున్నాడు నితీశ్ రాణా. ఐపీఎల్-2023లో పద్నాలుగు మ్యాచ్‌లలో కలిపి 413 పరుగులు సాధించాడు. కేకేఆర్ తరఫున రింకూ సింగ్(474) తర్వాత రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కేకేఆర్ కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టనున్న అయ్యర్ ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ పూర్తిగా కోలుకోవడం సహా వన్డే వరల్డ్‌కప్-2023లో వరుస సెంచరీలతో అదరగొట్టడంతో.. మరలా అతడిని కెప్టెన్‌గా నియమిస్తూ కేకేఆర్ తాజాగా నిర్ణయం తీసుకుంది. అదే విధంగా గత ఎడిషన్ కెప్టెన్ నితీశ్ రాణాను అతడికి డిప్యూటీగా నియమించింది. ఈ సందర్భంగా శ్రేయస్ అయ్యర్‌కు తిరిగి స్వాగతం పలుకుతూనే.. తమ అభ్యర్థన మేరకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన నితీశ్ రాణాకు ధన్యవాదాలు తెలిపింది. అదే విధంగా శ్రేయస్ సైతం.. తన గైర్హాజరీలో రాణా జట్టును ముందుకు నడిపించిన తీరు అద్భుతమంటూ ప్రశంసించడం విశేషం. చదవండి: రితిక జోలికి వస్తే ఊరుకోను.. నాడు రోహిత్‌కు యువీ వార్నింగ్! Quick Update 👇#IPL2024 @VenkyMysore @ShreyasIyer15 @NitishRana_27 pic.twitter.com/JRBJ5aEHRO — KolkataKnightRiders (@KKRiders) December 14, 2023 -
రాణించిన నితీశ్ రాణా.. చెలరేగిన భువనేశ్వర్ కుమార్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో టీమిండియా క్రికెటర్లు భువనేశ్వర్ కుమార్, నితీశ్ రాణా సత్తా చాటారు. నిన్న గుజరాత్‌తో జరిగిన ప్రీక్వార్టర్‌ఫైనల్-1లో ఈ ఇద్దరు ఉత్తర్‌ప్రదేశ్ ఆటగాళ్లు ఆయా విభాగాల్లో రాణించారు. తొలుత బౌలింగ్‌లో భువీ.. ఆతర్వాత బ్యాటింగ్‌లో రాణా చెలరేగారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్‌ను భువనేశ్వర్ కుమార్ (4-0-21-3) దారుణంగా దెబ్బకొట్టాడు. భువీతో పాటు మోహిసిన్ ఖాన్ (4-0-13-2), నితీశ్ రాణా (1-0-9-1), ధన్కర్ (3-0-21-1), కార్తీక్ త్యాగి (4-0-27-1) రాణించడంతో గుజరాత్ 127 పరుగులకు (20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) పరిమితమైంది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో సౌరవ్ చౌహాన్ (32) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూపీ.. రాణా (49 బంతుల్లో 71 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. రాణాతో పాటు సమీర్ రిజ్వి (30) రాణించాడు. గుజరాత్ బౌలర్లలో రవి బిష్ణోయ్ 2 వికెట్లు పడగొట్టగా.. చింతన్ గజా, హేమంగ్ పటేల్ తలో వికెట్ దక్కించుకున్నారు. నిన్ననే జరిగిన క్వార్టర్‌ఫైనల్-2లో బెంగాల్‌పై అస్సాం 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. నవంబర్ 2న మరో రెండు ప్రీ క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. -
కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా సంచలన నిర్ణయం
టీమిండియా క్రికెటర్, ఐపీఎల్-2023లో కేకేఆర్ ఫ్రాంచైజీ కెప్టెన్ (తాత్కాలిక), దేశవాలీ క్రికెట్లో ఢిల్లీ క్రికెట్ జట్టు కీలక సభ్యుడైన 29 ఏళ్ల నితీశ్ రాణా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన సొంత రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అయిన ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ అసోసియేషన్‌తో (DDCA) దశాబ్దకాలానికి పైగా ఉన్న అనుబంధాన్ని తెంచుకున్నాడు. తదుపరి దేశవాలీ సీజన్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (UPCA)తో జతకట్టేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు అతనికి ఇవాళ (ఆగస్ట్ 21) DDCA నుంచి NOC కూడా లభించింది. దీంతో రాణాకు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌తో అధికారికంగా అనుబంధం తెగిపోయినట్లైంది. త్వరలో ప్రారంభంకానున్న UPT20 Leagueతో రాణా యూపీ క్రికెట్ అసోసియేషన్‌తో జతకట్టనున్నాడు. ఈ లీగ్ ఇనాగురల్ సీజన్లో రాణా నోయిడా సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. Onto the next chapter. https://t.co/Zz1VyZKysA — Nitish Rana (@NitishRana_27) August 20, 2023 టీమిండియా తరఫున ఓ వన్డే, 2 టీ20లు ఆడిన రాణా.. 2011లో ఢిల్లీ తరఫున అరంగేట్రం చేసి 40కి పైగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 50కి పైగా లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 100కి పైగా టీ20లు ఆడాడు. రాణా తన దేశవాలీ కెరీర్లో మొత్తంగా 9 సెంచరీలు, 46 అర్ధసెంచరీలు సాధించాడు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌తో బంధం తెంచుకున్న తర్వాత రాణా ఉద్వేగంతో ఓ ట్వీట్ చేశాడు. ఆన్ టు ద నెక్స్ట్ చాప్టర్ అని క్యాప్షన్ జోడిండి DDCAతో ఉండిన అనుబంధాన్ని నెమరువేసుకున్నాడు. ఈ ట్వీట్లో అతను DDCAలో తనకు సహకరించిన ప్లేయర్స్, నాన్ ప్లేయర్స్ అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. కాగా, రాణా గత ఐపీఎల్ సీజన్లో శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీలో కేకేఆర్‌కు సారధిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. -
శివాలెత్తిన శివమ్ దూబే.. 3 ఫోర్లు, 5 సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్
దియోదర్ ట్రోఫీ-2023లో భాగంగా నార్త్ జోన్‌తో నిన్న (జులై 30) జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్‌లో వెస్ట్ జోన్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే శివాలెత్తిపోయాడు. 78 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన అర్ధశతకం (83) బాది, తన జట్టును గెలిపించాడు. నార్త్ జోన్ నిర్ధేశించిన 260 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలుత ఓపెనర్ హార్విక్ దేశాయి (56) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఆతర్వాత 5, 6 స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చిన శివమ్ దూబే, కథన్ పటేల్ (63) అజేయ అర్ధశతకాలతో వెస్ట్ జోన్‌ను విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ జోన్.. హర్షిత్ రాణా (54), నితీశ్ రాణా (54), రోహిల్లా (56 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (29), ప్రభ్‌సిమ్రన్ (26)లకు శుభారంభాలు లభించినా, భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. మన్దీప్ (13), నిషాంత్ సింధు (11) నిరాశపర్చగా.. రిషి ధవన్ (12) అజేయంగా నిలిచాడు. వెస్ట్ జోన్ బౌలర్లలో షమ్స్ ములానీ 3, సర్ఫరాజ్ ఖాన్, హంగార్గేకర్, త్రిపాఠి తలో వికెట్ పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన వెస్ట్ జోన్ హార్విక్ దేశాయి, శివమ్ దూబే, కథన్ పటేల్ అర్ధసెంచరీలతో రాణించడంతో 48.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కెప్టెన్ ప్రియాంక్ పంచల్ (14), రాహుల్ త్రిపాఠి (3) నిరాశపర్చగా.. సమర్థ్ వ్యాస్ (25) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. నార్త్ జోన్ బౌలర్లలో నితీశ్ రాణా, రిషి ధవన్, మయాంక్ యాదవ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
తృటిలో సెంచరీ చేజార్చుకున్న మయాంక్ అగర్వాల్.. నితీశ్ రాణా ఆల్‌రౌండర్ షో
దియోదర్ ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నీలో సౌత్ జోన్ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. వెస్ట్ జోన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సౌత్ జోన్ 12 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా సౌత్ జట్టు 46.4 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (115 బంతుల్లో 98; 9 ఫోర్లు) రెండు పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు. వెస్ట్ బౌలర్లలో పార్థ్ మూడు వికెట్లు తీయగా, రాజ్వర్ధన్, షమ్స్ ములానీలకు రెండు వికెట్ల చొప్పున లభించాయి. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగని వెస్ట్ జట్టు 36.2 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్ ఖాన్ (42; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), అతీత్ షేథ్ (40; 6 ఫోర్లు) రాణించారు. సౌత్ జోన్ స్పిన్నర్లు సాయికిశోర్ (3/44), వాషింగ్టన్ సుందర్ (2/34) వెస్ట్ జోన్ జట్టును దెబ్బ తీశారు. శతక్కొట్టిన ప్రభ్‌సిమ్రన్.. నితీశ్ రాణా ఆల్‌రౌండర్ షో ఇతర మ్యాచ్‌ల్లో నార్త్ జోన్ 48 పరుగులతో సెంట్రల్ జోన్‌పై, ఈస్ట్ జోన్ ఎనిమిది వికెట్లతో నార్త్ ఈస్ట్‌జోన్‌పై గెలిచాయి. సెంట్రల్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్త్ జోన్ ఆటగాడు ప్రభ్‌సిమ్రన్ సింగ్ 92 బంతుల్లో శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో 107 బంతులు ఎదుర్కొన్న ప్రభ్‌సిమ్రన్ .. 13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 121 పరుగులు చేశాడు. అతనికి కెప్టెన్ నితీశ్ రాణా (51), మన్దీప్ సింగ్ (43) తోడవ్వడంతో నార్త్ జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన సెంట్రల్ జోన్.. నితీశ్ రాణా (4/48), మయాంక్ యాదవ్ (3/47) బంతితో ఇరగదీయడంతో 47.4 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది.సెంట్రల్ జోన్ ఇన్నింగ్స్‌లో శివమ్ చౌదరీ (51), యశ్ దూబే (78), ఉపేంద్ర యాదవ్ (52) అర్ధసెంచరీలతో రాణించారు. సెంచరీతో కదంతొక్కిన అభిమన్యు ఈశ్వరన్.. నార్త్ఈస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (100) అజేయమైన సెంచరీతో మెరిశాడు. ఫలితంగా నార్త్ఈస్ట్ జోన్ నిర్ధేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని ఈస్ట్ జోన్ 31.3 ఓవర్లలోనే ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ఈస్ట్ జోన్‌ను రియాన్ పరాగ్ (10-2-30-4) దారుణంగా దెబ్బకొట్టాడు. నార్త్ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్‌లో రెక్స్ సేన్ (65 నాటౌట్) ఒక్కడే రాణించాడు. -
నితీష్ రాణాకు బంఫరాఫర్.. ఆ జట్టు కెప్టెన్‌గా ఎంపిక!
జూలై 24 నుంచి ప్రారంభం కానున్న దేవధర్ ట్రోఫీకి 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును నార్త్ జోన్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ జట్టుకు ఢిల్లీ ఆటగాడు, టీమిండియా క్రికెటర్ నితీష్ రాణా సారధ్యం వహించనున్నాడు. ఐపీఎల్-2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రాణా పర్వాలేదనపించాడు. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన అతడు 31.77 సగటుతో 413 పరుగులు చేశాడు. కొన్ని మ్యాచ్‌ల్లో తన అద్బుత ప్రదర్శరనతో కేకేఆర్‌ను విజయ తీరాలకు చేర్చాడు. అదే విధంగా అతడికి గతంలో దేశీవాళీ క్రికెట్లో ఢిల్లీ జట్టుగా కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి జట్టు కెప్టెన్సీ బాధ్యతలను నార్త్ జోన్ సెలక్షన్ కమిటీ అప్పగించింది. ఇక రాణా చివరగా 2021 జూలైలో భారత జట్టు తరపున ఆడాడు. రాణా ఇప్పటి వరకు టీమిండియా తరపున కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆ తర్వాత తనకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకోకపోవడంతో సెలక్టర్లు అతడిని పక్కన పెట్టారు. ఇక ఇది ఇలా ఉండగా.. దేవధర్ ట్రోఫీకు ఎంపిక చేసిన నార్త్ జోన్ జట్టులో యువ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్సిమ్రాన్ సింగ్, పేసర్ హర్షిత్ రాణా కూడా ఉన్నారు. దేవధర్ ట్రోఫీకి నార్త్ జోన్ జట్టు: నితీష్ రాణా (కెప్టెన్), అభిషేక్ శర్మ, ప్రభ్సిమ్రాన్ సింగ్, ఎస్జి రోహిల్లా, ఎస్ ఖజురియా, మన్దీప్ సింగ్, హిమాన్షు రాణా, వివ్రాంత్ శర్మ, నిశాంత్ సింధు, రిషి ధావన్, యుధ్వీర్ సింగ్, సందీప్ శర్మ, హర్షిత్ రాణా, వైభవ్క్ అరోరా మార్కండే చదవండి: MS Dhoni Reply To Yogi Babu: రాయుడు రిటైర్ అయ్యాడు.. మీకు తప్పకుండా జట్టులో చోటిస్తాం.. కానీ: ధోని -
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. టీమిండియాలోకి ఎవరూ ఊహించని ఆటగాడు!
వెస్టిండీస్ పర్యటన అనంతరం టీమిండియా మూడు టీ20ల సిరీస్ కోసం ఐర్లాండ్‌లో అడుగుపెట్టనుంది. ఆగస్టు 18న డబ్లిన్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఐర్లాండ్ టూర్‌కు కూడా భారత ద్వితీయ శ్రేణి జట్టును బీసీసీఐ పంపనున్నట్లు సమాచారం. ఎందుకంటే అదే నెలలో ఆసియాకప్ ప్రారంభం కానుండడంతో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, శుబ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా వంటి స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ చోటు ఆశించి భంగపాటు పడ్డ యువ ఆటగాళ్లకు ఐర్లాండ్ టూర్‌కు సెలక్ట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్లో అదరగొట్టిన రింకూ సింగ్, జితేష్ వర్మ వంటి ఆటగాళ్లకు చోటు దక్కే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. నితీష్ రాణా రీ ఎంట్రీ.. ఇక ఐర్లాండ్ సిరీస్‌కు జట్టు ఎంపిక విషయంలో ఎవరూ ఊహించని పేరు తెరపైకి వచ్చింది. గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న నితీష్ రాణా.. ఐర్లాండ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. రాణా చివరగా 2021 జూలైలో భారత జట్టు తరపున ఆడాడు. రాణా ఇప్పటి వరకు టీమిండియా తరపున కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. తనకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకోకపోవడంతో సెలక్టర్లు అతడిని పక్కన పెట్టారు. అయితే ఐపీఎల్-2023లో నితీష్ అద్బుతమైన ప్రదర్శన కనబరచడంతో.. సెలక్టర్లు అతడికి మళ్లీ పిలుపునివ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది సీజన్లో కేకేఆర్‌కు సారధ్యం వహించిన రాణా పర్వాలేదనపించాడు. 14 మ్యాచ్‌లు ఆడిన అతడు 31.77 సగటుతో 413 పరుగులు చేశాడు. చదవండి: IND Vs WI 2023: భారత జట్టులో నో ఛాన్స్.. ‘దేవుడు నా కోసం పెద్ద ప్లాన్‌తో ఉన్నాడు’ -
Ind Vs WI: గడ్డు కాలం.. మంచి రోజులు వస్తాయి! కేకేఆర్ స్టార్ ట్వీట్ వైరల్..
WI Vs Ind T20 Series: ఐపీఎల్-2023లో అదరగొట్టిన యువ బ్యాటర్లు యశస్వి జైశ్వాల్.. మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న తిలక్ వర్మ తొలిసారి భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్నారు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఆడనున్న టీమిండియాకు ఎంపికయ్యారు. క్యాష్ రిచ్ లీగ్ పదహారో ఎడిషన్‌లో యశస్వి రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. ఈ ముంబై బ్యాటర్ ఆడిన 14 మ్యాచ్‌లలో కలిపి మొత్తం 625 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉండటం విశేషం. ఇక హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ విషయానికొస్తే.. ముంబై ఇండియన్స్‌కు ఆడిన అతడు 11 మ్యాచ్‌లలో 343 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 84 నాటౌట్. ఆ ముగ్గురికి మొండిచేయి ఈ క్రమంలో వీరిద్దరు భారత జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. అయితే, టీ20 సిరీస్ జట్టులో స్థానం ఆశించిన టీమిండియా యువ ఓపెనర్, చెన్నై సూపర్‌కింగ్స్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫినిషర్ రింకూ సింగ్, పంజాబ్ కింగ్స్ వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మకు మాత్రం సెలక్టర్లు మొండిచేయి చూపారు. దీంతో అభిమానులు సెలక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రింకూ విషయంలో వివక్ష చూపిస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా సెలక్టర్ల తీరును తప్పుబడుతున్నారు. ఇదిలా ఉంటే.. కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా చేసిన పోస్టు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. భంగపాటు తప్పదు.. మనకెందుకు భయ్యా! గతంలో టీమిండియాకు ఆడిన నితీశ్ తాజా ట్వీట్ చూస్తుంటే.. తాను కూడా జట్టులో చోటు ఆశించినట్లు తెలుస్తోంది. ‘‘గడ్డు కాలమే మంచి రోజులకు పునాది వేస్తుంది’’ అన్న అర్థంలో ఉన్న కోట్‌ను అతడు పంచుకున్నాడు. ఇందుకు స్పందనగా కొంతమంది నితీశ్‌కు మద్దతుగా నిలుస్తుంటే.. మరికొందరు మాత్రం ట్రోలింగ్‌కు దిగారు. ‘‘రింకూ వంటి ప్రతిభ ఉన్న ఆటగాళ్లకే దిక్కులేదు భయ్యా! రుతురాజ్‌ను కూడా పక్కనపెట్టారు. ఇక నీ గురించి ఏం ఆలోచిస్తారు? బుద్ధిగా కేకేఆర్‌కు ఆడుకో! అనవసరంగా ఆశలు పెంచుకుంటే.. భంగపాటు తప్పదు’’ అని నితీశ్‌ను ఉద్దేశించి కామెంట్లు చేస్తున్నారు. టీమిండియా తరఫున కాగా కేకేఆర్ తరఫున ఐపీఎల్-2023లో రింకూ సింగ్ 14 మ్యాచ్‌లలో 474 పరుగులు చేయగా.. కోల్‌కతా సారథి నితీశ్ రాణా 413 పరుగులు సాధించాడు. ఇక ఢిల్లీకి చెందిన 29 ఏళ్ల రాణా.. 2021లో శ్రీలంకతో వన్డే మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది టీమిండియా తరఫున టీ20లలోనూ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ భారత్ తరఫున ఒక వన్డే, 2 టీ20 మ్యాచ్‌లు ఆడి వరుసగా 7, 15 పరుగులు మాత్రమే చేశాడు. విండీస్‌తో టి20 సిరీస్‌కు భారత జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. చదవండి: బౌండరీల వర్షం కురిపించిన రోహిత్, జైశ్వాల్.. వీడియో వైరల్ Ind Vs WI: విఫలమైన కోహ్లి.. 2 పరుగులకే అవుట్! వీడియో వైరల్ 🧘 pic.twitter.com/UzJDMQiSPh — Nitish Rana (@NitishRana_27) July 5, 2023 -
కేకేఆర్‌పై ఒక్క పరుగు తేడాతో విజయం.. ఫ్లేఆఫ్స్‌కు లక్నో
కేకేఆర్‌తో జరిగిన ఉత్కంఠపోరులో లక్నో సూపర్‌జెయింట్స్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. 177 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. రింకూ సింగ్ 33 బంతుల్లో 67 పరుగులు నాటౌట్ మరోసారి సంచలన ఇన్నింగ్స్‌తో మెరిసినప్పటికి కేకేఆర్‌ను గెలిపించలేకపోయాడు. జేసన్ రాయ్ 45 పరుగులు చేశాడు. యష్ ఠాకూర్, రవి బిష్ణోయి చెరో రెండు వికెట్లు తీయగా.. కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యాలు చెరొక వికెట్ తీశారు. టార్గెట్ 177..120 పరుగుల వద్ద ఐదో వికెట్ డౌన్ లక్నోతో మ్యాచ్‌లో కేకేఆర్ 120 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ఏడు పరుగులు చేసిన రసెల్ రవి బిష్ణోయి బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 11 ఓవర్లలో కేకేఆర్ 88/3 11 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. గుర్బాజ్ 6, రింకూ సింగ్ 3 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 8 పరుగులు చేసిన నితీశ్ రానా రవి బిష్ణోయి బౌలింగ్‌లో వెనుదిరగ్గా.. జేసన్‌రాయ్(45 పరుగులు) కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 6 ఓవర్లలో కేకేఆర్ 61/1 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. 24 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్ కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. జేసన్‌రాయ్ 36 పరుగులతో ఆడుతున్నాడు. రాణించిన పూరన్.. కేకేఆర్ టార్గెట్ 177 కేకేఆర్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఒక దశలో 73 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో నికోలస్ పూరన్(30 బంతుల్లో 58 పరుగులు), ఆయుష్ బదోని(21 బంతుల్లో 25 పరుగులు) ఆరో వికెట్‌కు 74 పరుగులు జోడించారు. కేకేఆర్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరాలు తలా రెండు వికెట్లు తీయా.. హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి చెరొక వికెట్ తీశారు. 17 ఓవర్లలో లక్నో 133/5 17 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌జెయింట్స్ ఐదు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 44, ఆయుష్ బదోని 14 పరుగులతో ఆడుతున్నారు. 73 పరుగులకే ఐదు వికెట్లు.. కష్టాల్లో లక్నో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ తడబడుతోంది. 73 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 28 పరుగులు చేసిన డికాక్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో రస్సెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మూడో వికెట్ కోల్పోయిన లక్నో.. 8 ఓవర్లలో 58/3 8 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌జెయింట్స్ మూడు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ 24, కృనాల్ పాండ్యా క్రీజులో ఉన్నారు. ఆరు ఓవర్లలో లక్నో 54/1 ఆరు ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. ప్రేరక్ మన్కడ్ 26, క్వింటన్ డికాక్ 20 పరుగులతో ఆడుతున్నారు. 4 ఓవర్లలో లక్నో సూపర్‌జెయింట్స్ 27/1 4 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌జెయింట్స్ వికెట్ నష్టానికి 27 పరుగుఉల చేసింది. క్వింటన్ డికాక్ 19, ప్రేరక్ మన్కడ్ 4 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు మూడు పరుగులు చేసిన కరణ్ శర్మ హర్షిత్ రానా బౌలింగ్‌లో క్యాచ్ఔట్గా వెనుదిరిగాడు, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్ ఐపీఎల్ 16వ సీజన్లో శనివారం డబుల్ హెడర్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా 68వ మ్యాచ్‌లో కేకేఆర్, లక్నో సూపర్‌జెయింట్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), కరణ్ శర్మ, ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా(కెప్టెన్), ఆయుష్ బదోని, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి ప్లేఆఫ్ చేరే అవకాశాలు కేకేఆర్‌కు తక్కువగా ఉన్నప్పటికి లక్నోను ఓడిస్తే రేసులో ఉంటుంది.. ఒకవేళ లక్నో గెలిస్తే మాత్రం 17 పాయింట్లతో ప్లేఆఫ్‌కు వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌ను గెలిచిన సీఎస్కే రెండో జట్టుగా ప్లేఆఫ్‌కు క్వాలిఫై అయింది. -
కేకేఆర్‌కు ఊహించని షాక్! ఇంపాక్ట్ ప్లేయర్ సహా వాళ్లందరికీ!
IPL 2023 CSK Vs KKR- Nitish Rana: గెలుపు జోష్‌లో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ నితీశ్ రాణాకు భారీ షాక్ తగిలింది. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న అతడికి 24 లక్షల రూపాయల భారీ జరిమానా పడింది. అదే విధంగా జట్టు మొత్తానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్-2023లో ఆదివారం నాటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడింది కేకేఆర్. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ నిర్ణీత సమయంలో బౌలింగ్ ఓవర్ల కోటా పూర్తిచేయలేకపోయింది. ఈ నేపథ్యంలో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా ఐపీఎల్ నిర్వాహకులు కేకేఆర్ సారథి నితీశ్ రాణాకు ఈ మేరకు ఫైన్ విధించారు. అప్పుడు 12 లక్షలు.. ఇప్పుడు 24 లక్షలు కాగా ఈ సీజన్లో కేకేఆర్ స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేయడం ఇది రెండోసారి. గత మ్యాచ్‌లో (మే 8)లో పంజాబ్ కింగ్స్‌తో తలపడిన సందర్భంలోనూ కోల్‌కతా ఈ తప్పిదం చేసింది. పదహారో ఎడిషన్‌లో ఇది మొదటి తప్పు కాబట్టి అప్పుడు నితీశ్‌కు 12 లక్షల జరిమానాతో సరిపెట్టారు. ఇంపాక్ట్ ప్లేయర్ సహా వాళ్లందరికీ కానీ.. మే 14 నాటి మ్యాచ్‌లోనూ మరోసారి ఇదే తప్పిదం పునరావృతం చేయడంతో నిబంధనల ప్రకారం అతడికి 24 లక్షల జరిమానా విధించారు. అదే విధంగా ఇంపాక్ట్ ప్లేయర్ సహా తుది జట్టులోని ప్రతి సభ్యుడికి ఆరు లక్షల ఫైన్ లేదంటే మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించనన్నుట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. కాగా చెపాక్‌లో టాస్ ఓడి తొలుత ఫీల్డింగ్ చేసిన కేకేఆర్.. ధోని సేనను 144 పరుగులకు కట్టడి చేసింది. లక్ష్య ఛేదనలో ఆరంభంలో తడబడ్డా నాలుగు, ఐదో స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన నితీశ్ రాణా(57), రింకూ సింగ్(54) జట్టును ఆదుకున్నారు. ఇద్దరు అర్థ శతకాలతో రాణించి జట్టుకు విజయం అందించారు. ఇక సీఎస్కే మీద గెలుపుతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసులో ఇంకా నిలిచే ఉంది. చదవండి: వాళ్ల తప్పేం లేదు..! అతడు అద్భుతం.. జట్టుకు దొరికిన విలువైన ఆస్తి: ధోని వాళ్లు మమ్మల్ని అవుట్ చేయలేదు.. మా అంతట మేమే! మరీ చెత్తగా.. -
పనిష్మెంట్.. అంపైర్లతో రాణా అలా.. వైరల్! ఎందుకో ప్రతిదానికీ ఇలా!
IPL 2023 CSK vs KKR- Nitish Rana: ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌పై గెలుపొందిన కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా నిలుపుకొంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సీఎస్కేపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పటిష్ట చెన్నై జట్టును వారి సొంతగడ్డపై ఓడించి సత్తా చాటింది. ఇదిలా ఉంటే.. ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న నితీశ్ రాణా.. సీఎస్కే ఇన్నింగ్స్ సమయంలో వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. సీఎస్కే బ్యాటింగ్ చేస్తున్నపుడు ఆఖరి ఓవర్ వేసేందుకు కేకేఆర్ అరోరా సమాయత్తమయ్యాడు. అంపైర్లతో రాణా గొడవ! అయితే, స్లో ఓవర్ రేటు మెయింట్ చేస్తున్న కారణంగా.. కొత్త నిబంధనల ప్రకారం మైదానంలోనే కేకేఆర్ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. 30 యార్డ్ సర్కిల్ బయట ఐదుగురికి బదులు నలుగురు ఫీల్డర్లనే ప్లేస్ చేయాలని అంపైర్లు సూచించారు. దీంతో కోపోద్రిక్తుడైన నితీశ్ రాణా.. అంపైర్ల వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగాడు. ఎందుకో ప్రతిదానికీ ఇలా ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో అంపైర్లు నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందేనని తేల్చిచెప్పడంతో రాణా అక్కడి నుంచి కదలినట్లు కనిపించింది. ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు.. ‘‘ఎవరైనా రూల్స్ పాటించాల్సిందే కదా! ఎందుకో ప్రతిదానికి గొడవపడటం’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. గెలిచి నిలిచిన కేకేఆర్ ఇక సీఎస్కే ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్ వేసిన వైభవ్ అరోరా.. 9 పరుగులు మాత్రమే ఇచ్చి రవీంద్ర జడేజా వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో సీఎస్కేను 144 పరుగులకే కట్టడి చేసిన కేకేఆర్.. నితీశ్ రాణా, రింకూ సింగ్ అర్ధ శతకాలతో రాణించడంతో జయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్‌లో రాణా 44 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 57 పరుగులతో అజేయంగా నిలవగా.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రింకూ సింగ్ 43 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 54 పరుగులు సాధించాడు. ఇక సీఎస్కేను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన కేకేఆర్ ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో ఆరు గెలిచి 12 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. చదవండి: వాళ్ల తప్పేం లేదు..! అతడు అద్భుతం.. జట్టుకు దొరికిన విలువైన ఆస్తి: ధోని మార్క్రమ్ చేసిన తప్పు.. ఆలస్యంగా వెలుగులోకి pic.twitter.com/DW2nun5NJs — Raju88 (@Raju88784482906) May 14, 2023 𝙔𝙚𝙡𝙡𝙤𝙫𝙚! 💛 A special lap of honour filled with memorable moments ft. @msdhoni & Co. and the ever-so-energetic Chepauk crowd 🤗#TATAIPL | #CSKvKKR | @ChennaiIPL pic.twitter.com/yHntEpuHNg — IndianPremierLeague (@IPL) May 14, 2023 -
రింకూ, నితీశ్ రానా అర్థసెంచరీలు.. కేకేఆర్ ఘన విజయం
IPL 2023: CSK Vs KKR Match Live Updates: రింకూ సింగ్ ఫిఫ్టీ.. 16 ఓవర్లలో 126/3 కేకేఆర్ సంచలనం రింకూ సింగ్ సూపర్ ఫిఫ్టీతో మెరిశాడు. 39 బంతుల్లో అర్థసెంచరీ సాధించిన రింకూ సింగ్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. సీఎస్కేతో మ్యాచ్‌లో 145 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కేకేఆర్ విజయానికి చేరువైంది. 16 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. కేకేఆర్ విజయానికి 24 బంతుల్లో 19 పరుగులు కావాలి. 11 ఓవర్లలో కేకేఆర్ 75/3 11 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. నితీశ్ రానా 20, రింకూ సింగ్ 29 పరుగులతో ఆడుతున్నారు. 6 ఓవర్లలో కేకేఆర్ 46/3 ఆరు ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. నితీశ్ రానా 9 పరుగులు, రింకూ సింగ్ 12 పరుగులతో ఆడుతున్నారు. 3 ఓవర్లలో కేకేఆర్ 22/2 మూడు ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 22 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 9, నితీశ్ రానా సున్నా పరుగులతో ఆడుతున్నారు. రాణించిన కేకేఆర్ బౌలర్లు.. సీఎస్కే 20 ఓవర్లలో 144/6 కేకేఆర్‌తో మ్యాచ్‌లో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. బౌలర్ల కట్టుదిట్టంగా బంతులు వేయడంతో సీఎస్కే బ్యాటర్లు పరుగులు చేయలేకపోయారు. దీంతో సాధారణ స్కోరుకే పరిమితమైంది. శివమ్ దూబే 34 బంతుల్లో 48 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. కాన్వే 30, జడేజా 20 పరుగులు చేశారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్‌లు చెరో రెండు వికెట్లు తీయగా.. వైభవ్ అరోరా, శార్దూల్ ఠాకూర్లు ఒక్కో వికెట్ తీశారు. 16 ఓవర్లలో సీఎస్కే 99/5 16 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే ఐదు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. శివమ్ దూబే 24, రవీంద్ర జడేజా ఏడు పరుగులతో ఆడుతున్నారు. 72 పరుగులకే ఐదు వికెట్లు.. కష్టాల్లో సీఎస్కే కేకేఆర్‌తో మ్యాచ్‌లో సీఎస్కే తడబడుతోంది. 72 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఒక్క పరుగు మాత్రమే చేసిన మొయిన్ అలీ నరైన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. రహానే(16)ఔట్.. 9 ఓవర్లలో సీఎస్కే 65/2 రహానే(16) రూపంలో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన రహానే జేసన్ రాయ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్కే 9 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. కాన్వే 30, అంబటి రాయుడు 2 పరుగులతో ఆడుతున్నారు. 6 ఓవరల్లో సీఎస్కే వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. కాన్వే 23, రహానే 12 పరుగులతో ఆడుతున్నారు. తొలి వికెట్ కోల్పోయిన సీఎస్కే.. 5 ఓవర్లలో 48/1 17 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో వైభవ్ అరోరాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఐదు ఓవర్లలో వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. రహానే 11, కాన్వే 22 పరుగులతో ఆడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్కే ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ఆదివారం చెన్నై వేదికగా సీఎస్కే, కేకేఆర్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన సీఎస్కే బ్యాటింగ్ ఎంచుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ఎంఎస్ ధోని(వికెట్ కీపర్/కెప్టెన్),రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్‌కీపర్), జాసన్ రాయ్, నితీష్ రాణా(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి Thala wins the toss & elects to bat first in #CSKvKKR!#IPLonJioCinema #TATAIPL #IPL2023 | @ChennaiIPL pic.twitter.com/CRRXnNPPIh — JioCinema (@JioCinema) May 14, 2023 వరుస విజయాలతో సీఎస్కే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. ఓటములతో డీలా పడిన కేకేఆర్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇరుజట్లు గతంలో 37 సార్లు తలపడగా సీఎస్కే 18 సార్లు, కేకేఆర్ 19 సార్లు మ్యాచ్‌లు నెగ్గాయి. -
తొలి ఓవర్లోనే 26 పరుగులు.. అంతమంది ఉన్నా! తప్పు చేశాను! మరేం పర్లేదు..
IPL 2023 KKR Vs RR- Yashasvi Jaiswal: 6.. 6.. 4.. 4.. 2.. 4.. తొలి ఓవర్లోనే 26 పరుగులు.. ఐపీఎల్-2023లో రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఘోర పరాభవం ఎదుర్కోబోతోందనడానికి సంకేతం.. మిస్టీరియస్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, స్పిన్‌తో మాయ చేయగల అనుభవజ్ఞుడైన సునిల్ నరైన్.. కొత్తవాడే అయినా తనదైన ముద్రవేయగలుగుతున్న సూయశ్ శర్మ.. అతడి తోడుగా అనుకూల్ రాయ్.. జట్టులో ఇంత మంది స్పిన్ బౌలర్లు ఉన్నా.. కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా మాత్రం చెత్త ప్రయోగంతో ముందుకు వచ్చాడు. సీజన్ ఆరంభం నుంచి దంచికొడుతున్న యశస్వి జైశ్వాల్ కోసం పార్ట్ టైమ్ స్పిన్నర్‌ను దింపితే బాగుంటుందంటూ తానే స్వయంగా రంగంలో దిగాడు. అందుకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు. దంచికొట్టిన యశస్వి.. అదే జోరులో నితీశ్ పుణ్యమా అని 6 బంతుల్లోనే 26 పరుగులు రాబట్టిన యశస్వి 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 47 బంతుల్లో 98 పరుగులతో చెలరేగి రాజస్తాన్‌కు భారీ విజయం అందించాడు. ఈ నేపథ్యంలో నితీశ్ రాణా నిర్ణయంపై కేకేఆర్ ఫ్యాన్స్ సైతం మండిపడుతున్నారు. తప్పు చేశాను! ఈ క్రమంలో ఓటమి అనంతరం కేకేఆర్ సారథి నితీశ్ స్పందిస్తూ.. ‘‘యశస్వి జైశ్వాల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈరోజు అతడిది. తను ఏం చేయాలని కోరుకున్నాడో ఆ పని పూర్తి చేశాడు. టోర్నీ ఆరంభం నుంచే అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న అతడిని కట్టడి చేయడానికి పార్ట్ స్పిన్నర్‌ను పంపితే బాగుంటుందని భావించా. కానీ నా ప్రణాళికలను పక్కాగా అమలు చేయలేకపోయా. ఏదేమైనా అతడి ఇన్నింగ్స్ అద్భుతం’’ అని మొదటి ఓవర్ తానే వేయాలన్న తన నిర్ణయానికి చింతించాడు. మరేం పర్లేదు.. దురదృష్టవశాత్తూ ఇలా అయితే, కేకేఆర్ స్టార్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ మాత్రం నితీశ్ రాణాకు మద్దతుగా నిలిచాడు. ‘‘నితీశ్ బంతితోనూ మాయ చేయగల సమర్థుడు. తన కెరీర్లో కొన్ని కీలకమైన వికెట్లు తీశాడు. లెఫ్టాండర్ క్రీజులో ఉన్నపుడు స్పిన్నర్‌తో బౌలింగ్ చేయించడం మంచి ఆప్షన్. కానీ దురదృష్టం మమ్మల్ని వెక్కిరించింది. ఒకవేళ నితీశ్ తొలి ఓవర్లోనే వికెట్ తీసి ఉంటే అది మాస్టర్‌స్ట్రోక్ అయ్యేది. అయినా ఆటలో ఇవన్నీ సహజం. ఒక్కోసారి ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి’’ అని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో వెంకటేశ్ 57 పరుగులతో కేకేఆర్ టాప్ స్కోరర్‌గా నిలవగా.. నితీశ్ 17 బంతుల్లో 22 పరుగులు సాధించాడు. కాగా లెఫ్టాండ్ బ్యాటర్ అయిన నితీశ్.. రైట్ ఆర్మ్బ్రేక్ స్పిన్నర్ కూడా! కేకేఆర్ వర్సెస్ రాజస్తాన్ వేదిక: ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా టాస్: రాజస్తాన్ - బౌలింగ్ కేకేఆర్ స్కోరు: 149/8 (20) రాజస్తాన్ స్కోరు: 151/1 (13.1) విజేత: రాజస్తాన్ రాయల్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: యశస్వి జైశ్వాల్. చదవండి: రనౌట్ విషయంలో సంజూ భాయ్ నాతో ఏమన్నాడంటే: యశస్వి జైశ్వాల్ గెలుపు జోష్‌లో ఉన్న రాజస్తాన్‌కు బిగ్ షాక్.. బట్లర్‌కు భారీ జరిమానా! The Yashasvi effect❤️🔥 - FASTEST 50 in #TATAIPL history!! 🤯💪#KKRvRR #IPL2023 #IPLonJioCinema | @rajasthanroyals @ybj_19 pic.twitter.com/WgNhYJQiUN — JioCinema (@JioCinema) May 11, 2023 150 runs chased down in just 13.1 overs. @rajasthanroyals have won this in a jiffy with Yashasvi Jaiswal smashing an incredible 98* from just 47 balls. Scorecard - https://t.co/jOscjlr121 #TATAIPL #KKRvRR #IPL2023 pic.twitter.com/2u0TiGPByI — IndianPremierLeague (@IPL) May 11, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నెం.1 బౌలర్ అనుకున్నావా.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు! చెత్త కెప్టెన్సీ
ఐపీఎల్-2023లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘోర ఓటమి చవిచూసింది. కోల్‌కతా బౌలర్లను రాజస్తాన్ యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ ఊచకోత కోశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్ది బౌలర్లపై బౌండరీల వర్షం కురిపించాడు. ముఖ్యంగా జైశ్వాల్ కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణాకు చుక్కలు చూపించాడు. కాగా జట్టులో శార్ధూల్ ఠాకూర్, రస్సెల్, వరుణ్ చక్రవర్తి వంటి స్టార్ బౌలర్లు ఉన్నప్పటికీ.. నితీష్ రాణా రాజస్తాన్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసేందుకు వచ్చాడు. అయితే నితీష్ రాణా ప్రయోగం బెడిసి కొట్టింది. రాణా వేసిన తొలి ఓవర్లో జైశ్వాల్ ఏకంగా 26 పరుగులు రాబట్టాడు. తొలి రెండు బంతులను సిక్సర్లగా మలిచిన జైశ్వాల్.. తరువాతి రెండు బంతులను ఫోర్లుగా, మళ్లీ ఆఖరి బంతికి ఫోరు బాదడంతో 26 పరుగులు వచ్చాయి. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 47 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్ 13 ఫోర్లు, 5 సిక్సర్లతో 98 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక తొలి ఓవర్ వేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన నితీష్ రాణాను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. నీవు ఏమైనా నెం1 బౌలర్ అనుకున్నావా, నీ చెత్త కెప్టెన్సీకు ఓ దండం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. చదవండి: IPL 2023: గెలుపు జోష్‌లో ఉన్న రాజస్తాన్‌కు బిగ్ షాక్.. బట్లర్‌కు భారీ జరిమానా! The Yashasvi effect❤️🔥 - FASTEST 50 in #TATAIPL history!! 🤯💪#KKRvRR #IPL2023 #IPLonJioCinema | @rajasthanroyals @ybj_19 pic.twitter.com/WgNhYJQiUN — JioCinema (@JioCinema) May 11, 2023 -
యశస్వి జైశ్వాల్ విధ్వంసం.. రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం
యశస్వి జైశ్వాల్ శివ తాండవం.. రాజస్తాన్ ఘన విజయం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 13.1 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. యశస్వి జైశ్వాల్(48 బంతుల్లో 98 నాటౌట్, 13 ఫోర్లు, 5 సిక్సర్లు) శివతాండవం ఆడగా.. సంజూ శాంసన్ 29 బంతుల్లో 48 నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్ చరిత్రలో రాజస్తాన్ రాయల్స్‌కు ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం. భారీ విజయం దిశగా రాజస్తాన్ రాయల్స్ ఐపీఎల్ 16వ సీజన్లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ భారీ విజయం దిశగా దూసుకెళుతుంది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 140 పరుగులు చేసింది. జైశ్వాల్ 89, శాంసన్ 48 పరుగలతో ఆడుతున్నారు. రాజస్తాన్ రాయల్స్ టార్గెట్ 150 రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. రాజస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. నితీశ్ రానా 22 పరుగులు చేశాడు. రాజస్తాన్ బౌలర్లలో చహల్ నాలుగు వికెట్లు తీయగా.. బౌల్ట్ రెండు, సందీప్ శర్మ, కెఎం ఆసిఫ్ చెరొక వికెట్ తీశారు. వెంకటేశ్ అయ్యర్(57)ఔట్.. ఐదో వికెట్ కోల్పోయిన కేకేఆర్ రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఫిఫ్టీతో రాణించిన వెంకటేశ్ అయ్యర్(57 పరుగులు) చహల్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో కేకేఆర్ 129 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. 14 ఓవర్లలో కేకేఆర్ 110/4 14 ఓవర్లలో కేకేఆర్ నాలుగు వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 45, రింకూ సింగ్ 2 పరుగులతో ఆడుతున్నారు. నితీశ్ రానా(22) ఔట్.. కేకేఆర్ 77/3 22 పరుగులు చేసిన నితీశ్ రానా చహల్ బౌలింగ్‌లో హెట్‌మైర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. 9 ఓవర్లలో కేకేఆర్ 58/2 9 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ రెండు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. నితీశ్ రానా 17, వెంకటేశ్ అయ్యర్ 11 పరుగులతో ఆడుతున్నారు. తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్ జేసన్ రాయ్(10) రూపంలో కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి హెట్‌మైర్ స్టన్నింగ్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్తాన్ ఐపీఎల్ 16వ సీజన్లో కోల్‌కతా వేదికగా గురువారం 57వ మ్యాచ్‌లో కేకేఆర్, రాజస్తాన్ రాయల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(వికెట్‌కీపర్/కెప్టెన్), జో రూట్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, KM ఆసిఫ్, యుజువేంద్ర చాహల్ సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో జోరు చూపిన రాజస్తాన్ ఆ తర్వాత వరుస పరాజయాలతో డీలా పడింది. మరోవైపు కేకేఆర్ మాత్రం విజయాలతో మళ్లీ ట్రాక్ ఎక్కినట్లే కనిపిస్తుంది. -
KKR VS PBKS: విజయానందంలో ఉన్న కేకేఆర్ కెప్టెన్ భారీ షాక్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో నిన్న (మే 8) జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఆఖరి బంతికి విజయం సాధించి, బతుకు జీవుడా అని బయటపడింది. రింకూ సింగ్ ఆఖరి బంతికి బౌండరీ బాదడంతో కేకేఆర్ విజయతీరాలకు చేరింది. ఆఖరి ఓవర్ అర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తుండటంతో తొలుత ఆందోళన చెందిన కేకేఆర్.. రింకూ సింగ్ బౌండరీ బాదడంతో ఊపిరి పీల్చుకుంది. ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచే విజయం దక్కడం, అలాగే చాలాకాలం తర్వాత తిరిగి ఫామ్‌లోకి రావడంతో సంబురాల్లో మునిగి తేలుతున్న కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణాకు ఐపీఎల్ నిబంధన నియమాల ఉల్లంఘన కమిటీ భారీ షాకిచ్చింది. స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గాను అతనికి రూ. 12 లక్షల జరిమానా విధించింది. తొలిసారి ఇలా జరిగినందుకు ఫైన్‌తో సరిపెట్టినట్లు పేర్కొంది. ఈ విషయానికి సంబంధించి ఐపీఎల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే, కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. శిఖర్ ధవన్ (47 బంతుల్లో 57; 9 ఫోర్లు,సిక్స్), ఆఖర్లో షారుక్ ఖాన్ (8 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగా.. ఛేదనలో జేసన్ రాయ్ (24 బంతుల్లో 38; 8 ఫోర్లు), నితీశ్ రాణా (38 బంతుల్లో 51; ఫోర్, సిక్స్), ఆండ్రీ రసెల్ (23 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రింకూ సింగ్ 10 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో కేకేఆర్ విజయం (20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి) సాధించింది. చదవండి: PBKS VS KKR: మొన్న ఫిలిప్స్.. నిన్న రసెల్ -
క్లిష్ట పరిస్థితుల్లో తానున్నాంటూ బాధ్యత తీసుకున్నాడు! అందరికీ సాధ్యం కాదు!
IPL 2023 KKR- Venkatesh Iyer: కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ నితీశ్ రాణాపై ఆ జట్టు ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ ప్రశంసలు కురిపించాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ తానున్నానంటూ సారథిగా బాధ్యతలు భుజాన వేసుకున్నాడని కొనియాడాడు. కెప్టెన్‌గా జట్టులోని ఆటగాళ్ల గౌరవం, అభిమానం పొందాడని.. అతడి విజయాల పట్ల సంతోషంగా ఉన్నానని పేర్కొన్నాడు. అయ్యర్ దూరం కావడంతో ఐపీఎల్-2023కు ముందు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్ సందర్భంగా వెన్ను నొప్పి తిరగబెట్టడంతో టీమిండియాకు దూరమైన అతడు.. ఐపీఎల్ తాజా ఎడిషన్ మొత్తానికీ అందుబాటులో లేకుండా పోయాడు. ఈ నేపథ్యంలో శ్రేయస్ స్థానంలో నితీశ్ రాణాకు కేకేఆర్ పగ్గాలు అప్పగిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటన చేసింది. అతడెందుకని విమర్శలు కెప్టెన్సీ రేసులో సీనియర్ సునిల్ నరైన్, శార్దూల్ ఠాకూర్ పేర్లు వినిపించినప్పటికీ.. మేనేజ్మెంట్ రాణా వైపు మొగ్గు చూపడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఈ క్రమంలో నరైన్, సౌథీ వంటి సీనియర్లను కాదని రాణాను సారథిగా నియమించడం సరికాదంటూ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే, దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ జట్టును ముందుండి నడిపిస్తున్న నితీశ్ రాణాకు అతడి అభిమానులు మద్దతుగా నిలిచారు. కౌంటర్ అటాక్‌తో అతడిని విమర్శిస్తున్న వాళ్లకు సమాధానమిచ్చారు. ఇలాంటి పరిస్థితుల నడుమ కేకేఆర్ పగ్గాలు చేపట్టాడు నితీశ్ రాణా. బ్యాటర్‌గా రాణిస్తున్నాడు బ్యాటర్‌గా రాణిస్తున్నప్పటికీ.. కెప్టెన్‌గా తనదైన ముద్ర వేయడంలో విఫలమవుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్‌లలో కేకేఆర్ కేవలం నాలుగింట మాత్రమే గెలుపొంది పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో తప్పక గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప కేకేఆర్ ప్లే ఆఫ్స్ చేరుకోలేదు. ఈ నేపథ్యంలో నితీశ్ రాణా గురించి ఆ జట్టు ఓపెనర్, సెంచరీ వీరుడు వెంకటేశ్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పంజాబ్ కింగ్స్‌తో మే 8 నాటి మ్యాచ్ నేపథ్యంలో ఇండియా టుడే ముచ్చటించాడు అయ్యర్. ఈ సందర్భంగా కెప్టెన్ నితీశ్ రాణా, కోచ్ చంద్రకాంత్ పండిట్ గురించి ప్రశ్న ఎదురైంది. చందూ సర్ కోచ్‌గా రావడం సంతోషం ఇందుకు బదులిస్తూ.. ‘‘గతంలో చందూ సర్‌తో మూడేళ్లపాటు కలిసి ప్రయాణం చేశాను. ఇప్పుడు ఆయనే ఐపీఎల్ కోచ్‌గానూ రావడం బాగుంది. ఈ విషయంలో నాకు సంతోషంగానూ.. గర్వంగానూ ఉంది. ఇక నితీశ్ రాణా విషయానికొస్తే.. శ్రేయస్ అయ్యర్ గాయపడిన సమయంలో జట్టును నడిపించేందుకు అతడు ముందుకు వచ్చాడు. శ్రేయస్ సేవలు కోల్పోయి జట్టు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న వేళ బాధ్యత తను తీసుకున్నాడు. అతడికి సాధ్యమైంది నా వరకు కెప్టెన్‌గా అతడు బాగానే రాణిస్తున్నాడు. డ్రెస్సింగ్ రూంలో ప్రతీ ఆటగాడితో మమేకం అవుతాడు. అందరూ అతడి పట్ల ఎంతో గౌరవంగా ఉంటారు. కెప్టెన్‌గా అందరితో కలిసిపోవడం కొంతమందికే సాధ్యమవుతుంది. రాణా కూడా వారిలో ఒకడు’’ అని మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సీజన్లో వెంకటేశ్ ఇప్పటి వరకు 303 పరుగులు చేయగా.. నితీశ్ రాణా 275 పరుగులు సాధించాడు. చదవండి: సన్‌రైజర్స్ విజయంపై డేవిడ్ వార్నర్ ట్వీట్! మెచ్చుకున్నాడా? లేదంటే.. -
స్మూత్‌గా డీల్ చేయండి.. వాళ్లు స్కూల్ పిల్లలు: కేకేఆర్ కెప్టెన్ భార్య
కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ నితీశ్ రాణా భార్య సాచి మర్వా రాణా.. తనను ఇబ్బంది పెట్టిన ఇద్దరు యువకుల పట్ల జాలి చూపించి, పెద్ద మనసు చాటుకుంది. కొద్ది రోజుల క్రితం సాచి మర్వాను దేశ రాజధాని ఢిల్లీలో ఇద్దరు యువకులు బైక్‌పై వెంబడించారు. ఆ ఇద్దరు యువకులు కారును వెంబడించడమే కాకుండా ఉద్దేశపూర్వకంగా పలు మార్లు బైక్‌తో సాచి ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టారు. యువకుల ప్రవర్తనతో భయాందోళనకు గురైన సాచీ.. విషయాన్ని ఫోన్ ద్వారా పోలీసులకు చేరవేసింది. అయితే పోలీసుల నుంచి ఆమెకు తగినంత రెస్పాన్స్ రాలేదు. దీంతో యువకులు కారును వెంబడిస్తున్నప్పుడు తీసిన వీడియోను, జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె తన ఇన్‌స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది. విషయం వైరల్ కావడంతో సదరు యువకులను ట్రేస్ చేసిన పోలీసులు, వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. #Watch: 2 men stalk & chase #KKR captain Nitish Rana's wife's car in #Delhi, she shares #video#NitishRana #SaachiMarwah #viral #news #Police Subscribe to our YouTube page: https://t.co/bP10gHsZuP pic.twitter.com/IxYAdGZyrv — UnMuteINDIA (@LetsUnMuteIndia) May 6, 2023 అయితే, విషయం గురించి సమాచారం అందుకున్న సాచి.. సదరు యువకుల బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలుసుకుని, వారిని కాస్త స్మూత్‌గా డీల్ చేయాలని పోలీసులను కోరింది. వారిరువురు స్కూల్ పిల్లలని తెలియడంతో ఆమె ఇలా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. తెలిసి తెలియక వారు అలా ప్రవర్తించి ఉండవచ్చు.. వారిని మందలించి వదిలేయండి.. కేసులు కట్టి వారి జీవితాలను పాడు చేయవద్దని ప్రాధేయపడినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ఐపీఎల్-2023లో సాచి భర్త నితీశ్ రాణా సారధ్యం వహిస్తున్న కేకేఆర్ 10 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. మే 8న జరగబోయే తమ తదుపరి మ్యాచ్‌లో కేకేఆర్.. పంజాబ్ కింగ్స్‌ను ఢీకొట్టనుంది. చదవండి: నిప్పు ఉప్పులా ఉండే కోహ్లి, గంగూలీ కలిసిపోయారు.. కోహ్లి ఇక ఢిల్లీకి వచ్చేయ్..! -
నితీశ్ రానా భార్యకు చేదు అనుభవం..
కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రానా భార్య సాచీ మార్వాకు చేదు అనుభవం ఎదురైంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇద్దరు యువకులు బైక్‌పై ఆమె కారును వెంబడించడం కలకలం రేపింది. కారును వెంబడించడమే గాక ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతో సాచీ మార్వా వారి ప్రవర్తనతో ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. తన కారును వెంబడిస్తున్న యువకులను ఫోటో తీసి వీడియో రూపంలో బయటపెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని పోలీసులకు చెబితే.. అంతగా పట్టించుకోలేదని.. విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని పేర్కొనడం ఆశ్చర్యం కలిగించిందని సాచీ మార్వా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. యువకుల ద్వారా తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె షేర్ చేసుకుంది. ''ఢిల్లీలో అది ఒక సాధారణ రోజు. నా పనులు పూర్తి చేసుకొని కారులో ఇంటికి వస్తున్నాను. వీళ్లు (ఫొటోలో ఉన్న యువకులు) యాదృచ్ఛికంగా నా కారును ఢీకొట్టడం మొదలుపెట్టారు.! కారణం లేకుండానే వెంబడించారు. నేను ఈ విషయంపై ఫోన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాను. దీంతో వారు నాకు 'ఇప్పుడు మీరు సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. ఇక దానిని వదిలేయండి! వచ్చేసారి ఆ బైక్ నెంబర్ నోట్ చేసుకోండి' అని అన్నారు. సరే కెప్టెన్. వచ్చేసారి వారి ఫోన్ నంబర్లు తప్పకుండా తీసుకుంటానని చెప్పా'' అని పేర్కొంది. #Watch: 2 men stalk & chase #KKR captain Nitish Rana's wife's car in #Delhi, she shares #video#NitishRana #SaachiMarwah #viral #news #Police Subscribe to our YouTube page: https://t.co/bP10gHsZuP pic.twitter.com/IxYAdGZyrv — UnMuteINDIA (@LetsUnMuteIndia) May 6, 2023 చదవండి: రోహిత్ డకౌట్ వెనుక ధోని మాస్టర్‌మైండ్! -
సంచలన క్యాచ్‌తో మెరిసిన ఎస్ఆర్హెచ్ కెప్టెన్
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో మార్క్రమ్ ఈ ఫీట్ సాధించాడు. విషయంలోకి వెళితే.. 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత కెప్టెన్ నితీశ్ రానా, రింకూ సింగ్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. నాలుగో వికెట్‌కు దాదాపు 60 పరుగులు జోడించారు. ఈ జోడి బలపడుతున్న సమయంలో ఇక లాభం లేదని మార్క్రమ్ తానే బౌలింగ్‌కు దిగాడు. తొలి బంతికి రింకూ సింగ్ సింగిల్ తీయగా.. రెండో బంతిని నితీశ్ రానా లాంగాన్ దిశగా గాల్లోకి లేపాడు. అయితే మార్క్రమ్ లాంగాన్ దిశగా దాదాపు 30 గజాల దూరం పరిగెత్తి డైవ్ చేస్తూ అద్బుతంగా క్యాచ్ తీసుకోవడంతో కేకేఆర్ కెప్టెన్ 42 పరుగుల ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఈ సీజన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాచెస్ జాబితాలో చోటు సంపాదించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Just something about Proteas and 👌🏻 fielding efforts... @AidzMarkram's 💥 catch sends the #KKR skipper packing 🔙#IPLonJioCinema #TATAIPL #IPL2023 pic.twitter.com/bAn65remH3 — JioCinema (@JioCinema) May 4, 2023 చదవండి: తీవ్ర గాయం.. ప్రమాదంలో పాక్ క్రికెటర్ భవితవ్యం! -
IPL 2023: ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అప్డేట్స్
IPL 2023: SRH Vs KKR Match Live Updates: మార్క్రమ్(41)ఔట్.. ఆరో వికెట్ డౌన్ 41 పరుగులు చేసిన మార్క్రమ్ వైభవ్ అరోరా బౌలింగ్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఎస్ఆర్హెచ్ 145 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. క్లాసెన్(36) ఔట్.. ఎస్ఆర్హెచ్ 134/5 హెన్రిచ్ క్లాసెన్(36) రూపంలో ఎస్ఆర్హెచ్ ఐదో వికెట్ నష్టపోయింది. మార్క్రమ్తో కలిసి ఐదో వికెట్‌కు 50కి పైగా పరుగులు జోడించిన క్లాసెన్ ఠాకూర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి రసెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ ఐదు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. మార్క్రమ్ 39, అబ్దుల్ సమద్ ఐదు పరుగులతో ఆడుతున్నారు. బ్రూక్ డకౌట్.. నాలుగు వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్ 172 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ కష్టాల్లో పడింది. హ్యారీ బ్రూక్ డకౌట్‌గా వెనుదిరగడంతో నాలుగో వికెట్ నష్టపోయింది. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 4 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. మార్క్రమ్ 2, క్లాసెన్ ఐదు పరుగులతో ఆడుతున్నారు. టార్గెట్ 172.. 38 పరుగులకు రెండు వికెట్లు డౌన్ 172 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ 5 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి 6, మార్క్రమ్ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు అభిషేక్ శర్మ 9, మయాంక్ అగర్వాల్ 18 పరుగులు చేసి ఔటయ్యారు. Photo Credit : IPL Website ఎస్ఆర్హెచ్ టార్గెట్ 172 ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. రింకూ సింగ్ 46 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ నితీశ్‌రానా 42 పరుగులు చేశాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో మార్కో జాన్సన్, టి. నటరాజన్‌లు చెరో రెండె వికెట్లు తీయగా.. భువనేశ్వర్, కార్తిక్ త్యాగి, మార్క్రమ్, మయాంక్ మార్కండేలు తలా ఒక వికెట్ తీశారు. Photo Credit : IPL Website 16 ఓవరల్లో కేకేఆర్ 137/6 16 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ ఆరు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. రింకూ సింగ్ 29, శార్దూల్ ఠాకూర్ ఆరు పరుగులతో ఆడుతున్నారు. Photo Credit : IPL Website నాలుగో వికెట్ కోల్పోయిన కేకేఆర్ 42 పరుగులు చేసిన నితీశ్ రానా మార్క్రమ్ స్టన్నింగ్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. అతని బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం కేకేఆర్ 12 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. రింకూ సింగ్ 22, రసెల్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website 9 ఓవర్లలో కేకేఆర్ స్కోరు 73/3 9 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. నితీశ్ రానా 24, రింకూ సింగ్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website 35 పరుగులకే మూడు వికెట్లు డౌన్ 35 పరుగుల వద్ద కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన జేసన్ రాయ్ కార్తిక్ త్యాగి బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. Photo Credit : IPL Website 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన కేకేఆర్ ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో కేకేఆర్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మార్కో జాన్సన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టడం విశేషం. Photo Credit : IPL Website టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్ ఐపీఎల్ 16వ సీజన్లో హైదరాబాద్ వేదికగా 47వ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్, కేకేఆర్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్ బ్యాటింగ్ ఎంచుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్, అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, కార్తీక్ త్యాగి, టి నటరాజన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి Nitish Rana calls right at the toss & @KKRiders choose to BAT FIRST tonight🏏 Watch #SRHvKKR, LIVE & FREE on #JioCinema, available on any sim card.#TATAIPL #IPLonJioCinema #IPL2023 pic.twitter.com/A6QyPUh2nt — JioCinema (@JioCinema) May 4, 2023 గత మ్యాచ్‌లో విజయంతో ఎస్ఆర్హెచ్ వరుస ఓటములకు బ్రేక్ వేసింది. ఇక కేకేఆర్ మాత్రం ఒక మ్యాచ్‌లో గెలుపు.. మరో మ్యాచ్‌లో ఓటమి అన్నట్లుగా సాగుతుంది. ఈ సీజన్లో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. హ్యారీ బ్రూక్ సెంచరీ సాధించింది ఈ మ్యాచ్‌లోనే. -
SRH Vs KKR: కేకేఆర్‌తో పోరుకు సన్‌రైజర్స్ సై! అతడికి నో ఛాన్స్!
IPL 2023 SRH Vs KKR: సొంతగడ్డపై.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పోరుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సిద్ధమైంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో గురువారం ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఐపీఎల్-2023లో గత మ్యాచ్‌లో కేకేఆర్‌ను ఓడించిన రైజర్స్.. కోల్‌కతాపై విజయపరంపరను కొనసాగించాలని పట్టుదలగా ఉంది. మరోవైపు ఈడెన్ గార్డెన్స్‌తో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని నితీశ్ రాణా సేన ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మ్యాచ్ మరింత రసవత్తరంగా మారనుంది. కాగా ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఒకే ఒక మార్పు.. ! రాయ్ వచ్చేస్తున్నాడు! దాదాపుగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ ఆడిన జట్టునే కొనసాగించనున్న రైజర్స్.. అకీల్ హొసేన్ స్థానంలో మార్కో జాన్సెన్ను తీసుకురావాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. ఇంగ్లంగ్ విధ్వంసకర వీరుడు జేసన్ రాయ్ పూర్తి ఫిట్‌గా ఉన్న నేపథ్యంలో కేకేఆర్ డేవిడ్ వీజ్ స్థానాన్ని అతడితో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. రాయ్ రాకతో కోల్‌కతా బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టం కానుంది. కాగా ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన జేసన్ రాయ్ 160 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్థ శతకం(61) ఉంది. ముఖాముఖి పోరులో ఐపీఎల్లో ఇప్పటి వరకు ఎస్ఆర్హెచ్- కేకేఆర్ మధ్య 24 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో హైదరాబాద్ కేవలం తొమ్మిదింట విజయాలు సాధించగా.. 15 సార్లు గెలుపు కేకేఆర్ననే వరించింది. అయితే, గత మ్యాచ్‌లో కేకేఆర్‌పై 23 పరుగులతో పైచేయి సాధించడం ద్వారా ఎస్ఆర్హెచ్ పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. పిచ్, వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉన్న నేపథ్యంలో వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. పిచ్‌పై పచ్చిక ఉన్న నేపథ్యంలో ఫాస్ట్‌బౌలర్లకు అనుకూలించే పరిస్థితి ఉంది. ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ తుది జట్లు(అంచనా) సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్కరమ్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్. కోల్‌కతా నైట్ రైడర్స్ జేసన్ రాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మ. చదవండి: నేను బాగా ఆడినపుడే.. నాకు క్రెడిట్ దక్కకుండా చేస్తాడు: ఇషాన్ కిషన్ చిన్నప్పటి నుంచే అశ్విన్‌కు నాపై క్రష్! స్కూల్ మొత్తం తెలుసు! ఓరోజు.. It's time for Physix practicals says Prof. Klaasen 🥼🔥 pic.twitter.com/CHNQ0LKF8P — SunRisers Hyderabad (@SunRisers) May 4, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చెత్త ఫీల్డింగ్‌తో మూడు లైఫ్‌లు.. సిక్సర్లతో రికార్డులకెక్కాడు
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ దారుణ ఫీల్డింగ్ కనబరిచింది. ముఖ్యంగా కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రానా ఆర్సీబీ చెత్త ఫీల్డింగ్ వల్ల మూడుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. తొలుత నితీష్ 12 పరుగుల వద్ద ఉన్నప్పుడు విజయ్‌కుమార్ బౌలింగ్‌లో లాంగాఫ్ దిశగా షాట్ ఆడగా.. సిరాజ్ చేతిలోకి వచ్చిన క్యాచ్‌ను వదిలేశాడు. ఇక రెండోసారి సిరాజ్ బౌలింగ్ఓ ఫైన్‌లెగ్ దిశగా ఆడగా.. అక్కడే ఉన్న ఫీల్డర్ మరోసారి క్యాచ్‌ను జారవిడిచాడు. ఇక ముచ్చటగా మూడోసారి మ్యాక్స్‌వెల్ వదిలేశాడు. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో రానా లాంగాన్ దిశగా ఆడగా.. మ్యాక్స్‌వెల్ కాస్త వేగంగా స్పందించి ఉంటే ఉంటే క్యాచ్ దొరికేది. ఇలా మూడుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న నితీశ్ రానా చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. Photo: IPL Twitter కేకేఆర్ తరపున అత్యధిక సిక్సర్ల రికార్డు సిక్సర్లతో చిన్నస్వామి స్టేడియాన్ని హోరెత్తించాడు. మొత్తంగా 21 బంతుల్లో 4 సిక్సర్లు, మూడు ఫోర్ల సాయంతో 48 పరుగులు చేసి హసరంగా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే నితీశ్ రానా ఒక రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో కేకేఆర్ తరపున అత్యధిక సిక్సర్లు బాదిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో నితీశ్ రానా కొట్టిన నాలుగు సిక్సర్లతో వంద సిక్సర్ల మార్క్‌ను అందుకున్నాడు. ఈ జాబితాలో ఆండ్రీ రసెల్ 180 సిక్సర్లతో తొలిస్థానంలో ఉండగా.. వంద సిక్సర్లతో నితీశ్ రానా రెండో స్థానంలో, 85 సిక్సర్లతో యూసఫ్ పఠాన్, రాబిన్ ఊతప్పలు సంయుక్తంగా మూడోస్థానంలో ఉన్నారు. Nitish is scoring Run Rana Run 😅@KKRiders' skipper goes 💥 back-to-back 💪#RCBvKKR #TATAIPL #IPLonJioCinema #IPL2023 pic.twitter.com/I3fNVedeSr — JioCinema (@JioCinema) April 26, 2023 చదవండి: #JasonRoy: 4 బంతుల్లో నాలుగు సిక్సర్లు.. షాబాజ్ అహ్మద్‌ను ఉతికారేశాడు -
జట్టు నిండా విధ్వంసకర వీరులే.. అయినా గెలుపు కోసం అష్టకష్టాలు..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో విధ్వంసకర వీరులతో నిండి, లోతైన బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్టు ఏది అంటే..? నిస్సంకోచంగా కేకేఆర్ పేరే చెప్పాలి. ఆ జట్టులో తొమ్మిదో నంబర్ ఆటగాడి వరకు అందరూ మెరుపులు మెరిపించగల సమర్ధులే. టాపార్డర్, మిడిలార్డర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి ఊచకోత ఏ రేంజ్లో ఉంటందో ఇదివరకే చూశాం. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ లక్ష్య ఛేదనలో (205) ఐదో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన రింకూ సింగ్.. చివరి 5 బంతుల్లో 5 సిక్సర్లు బాది తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించిన వైనాన్ని క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ మరచిపోలేదు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో (ఇంపాక్ట్ ప్లేయర్‌గా) బరిలోకి దిగిన వెంకటేశ్ అయ్యర్ (51 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 104).. సిక్సర్ల సునామీ సృష్టించి, 15 ఏళ్ల తర్వాత కేకేఆర్ తరఫున రెండో సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అంతకుముందు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఏడో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన శార్దూల్ ఠాకూర్.. పూనకం వచ్చినట్లు ఊగిపోగి ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రింకూ సింగ్ గురించి చెప్పాల్సి వస్తే.. ఈ యువ ఆటగాడు మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వచ్చి దాదాపు ప్రతి మ్యాచ్‌లో విలయం సృష్టిస్తున్నాడు. కెప్టెన్ నితీశ్ రాణా సైతం అప్పర్ మిడిలార్డర్లో అడపాదడపా మెరుపులు మెరిపిస్తున్నాడు. లేట్‌గా జట్టులో చేరిన జేసన్ రాయ్.. తాజాగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డాడు. సీఎస్కేతో మ్యాచ్‌లో ఐదో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన జేసన్.. కేవలం 26 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో మెరుపు అర్ధసెంచరీ చేశాడు. వీరు మాత్రమే కాక ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ లాంటి బిగ్ గన్స్ కేకేఆర్‌లో ఉండనే ఉన్నారు. వీరు ఈ సీజన్లో ఇప్పటివరకు పేలలేదు కాని, వీరిదైన రోజున వీరి ఆపడం దాదాపుగా అసంభవమని చెప్పాలి. అయితే, ఇంత పటిష్టమైన, విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ కలిగిన కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉండటం ఆ జట్టు అభిమానులను తీవ్రంగా కలిచి వేస్తుంది. లోపం ఒక్కడ ఉందో ఫ్యాన్స్ అంచనా వేయలేకపోతున్నారు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సత్తా చాటుతున్నప్పటికీ, గెలుపు వాకిట ఆగిపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. పలువురు సీనియర్ల విశ్లేషణ మేరకు.. కేకేఆర్ బ్యాటింగ్‌లో పటిష్టంగానే ఉన్నప్పటికీ, జట్టుగా ఒక్క మ్యాచ్‌లో కూడా వారు కలిసికట్టుగా ఆడింది లేదు. ఓ జట్టు గెలవాలంటే ప్రతి మ్యాచ్‌లో ఎవరో ఒకరు ఆడితే సరిపోదు. బ్యాటింగ్‌తో పాటు అన్ని విభాగాల్లో జట్టుగా రాణించాల్సి ఉంటుంది. ఈ సీజన్లో కేకేఆర్ బ్యాటర్లు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మ్యాచ్‌ల్లో అంతా వన్ మ్యాన్ షో నే సాగింది. కేకేఆర్ బౌలింగ్ విషయానికొస్తే.. ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, టిమ్ సౌథీ, ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, యువ స్పిన్నర్ సుయాష్లతో కూడిన ఆ జట్టు బౌలింగ్ సైతం పటిష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో వీరు కూడా కలిసికట్టుగా రాణించింది లేదు. ఇక టీ20ల్లో అత్యంత కీలకమైన ఫీల్డింగ్ విభాగంలోనూ కేకేఆర్ పటిష్టంగానే ఉంది. నితీశ్ రాణా, రింకూ సింగ్ లాంటి వరల్డ్‌క్లాస్ ఫీల్డర్లు ఆ జట్టులో ఉన్నారు. ఇన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు.. కేకేఆర్ దాదాపుగా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్నా, గెలుపు కోసం శ్రమిస్తుంది. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న కేకేఆర్.. కలిసికట్టుగా ఆడితే మాత్రం వీరిని ఆపడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
49 పరుగుల తేడాతో సీఎస్కే ఘన విజయం
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే వరుస విజయాలతో దూసుకెళుతుంది. తాజాగా ఆదివారం కేకేఆర్‌తో మ్యాచ్‌లో సీఎస్కే 49 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. 236 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. జేసన్ రాయ్ 26 బంతుల్లో 61 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రింకూ సింగ్ 33 బంతుల్లో 53 నాటౌట్ మినహా మిగతావారు విఫలమయ్యారు. సీఎస్కే బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే, మహీష్ తీక్షణలు చెరో రెండు వికెట్లు తీయగా.. మొయిన్ అలీ, జడేజా, పతిరాణా, ఆకాశ్ సింగ్‌లు తలా ఒక వికెట్ తీశారు. 180 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ డౌన్ 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఓటమి దిశగా పయనిస్తోంది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తోంది. తాజాగా 4 పరుగులు చేసిన ఉమేశ్ యాదవ్ తీక్షణ బౌలింగ్‌లో కాన్వేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ ఎనిమిది వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. టార్గెట్ 236.. 13 ఓవర్లలో కేకేఆర్ 119/4 13 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ నాలుగు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. రింకూ సింగ్ 20, జేసన్ రాయ్ 51 పరుగులతో ఆడుతున్నారు. 46 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన కేకేఆర్ 235 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 46 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. నితీశ్‌రానా 22, జేసన్ రాయ్ క్రీజులో ఉన్నారు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. అజింక్యా రహానే 29 బంతుల్లో 71 పరుగులతో విధ్వంసం సృష్టించగా.. శివమ్ దూబే 21 బంతుల్లో 50, డెవన్ కాన్వే 40 బంతుల్లో 56, గైక్వాడ్ 35 పరుగులు చేశారు. కెజ్రోలియా 2 వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి, సుయాశ్ శర్మ చెరొక వికెట్ తీశారు. 19 ఓవర్లలో సీఎస్కే 218/3 19 ఓవర్లలో సీఎస్కే మూడు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అజింక్యా రహానే 71 పరుగులతో ఆడుతున్నాడు. రహానే, దూబే ఫిఫ్టీ.. సీఎస్కే స్కోరు 194/3 సిక్సర్‌తో శివమ్ దూబే 20 బంతుల్లో ఫీఫ్టీ మార్క్ అందుకోగా.. అజింక్యా రహానే 24 బంతుల్లో ఫిఫ్టీ మార్క్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం సీఎస్కే మూడు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. సిక్సర్ల వర్షం కురిపిస్తున్న దూబే.. భారీ స్కోరు దిశగా సీఎస్కే కేకేఆర్‌తో మ్యాచ్‌లో సీఎస్కే బ్యాటర్ శివమ్ దూబే సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. 13 బంతుల్లోనే 38 పరుగులతో దాటిగా ఆడుతున్న దూబే ఖాతాలో నాలుగు సిక్సర్లు ఉన్నాయి. రహానే 37 పరుగులతో అతనికి సహకరిస్తున్నాడు. ప్రస్తుతం సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. 13 ఓవర్లలో సీఎస్కే 123/2 13 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. రహానే 19, శివమ్ దూబే 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు కాన్వే 56 పరుగులు చేసి ఔటయ్యాడు. గైక్వాడ్ (35) ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన సీఎస్కే 35 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్ సుయాశ్ శర్మ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం సీఎస్కే వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. 7 ఓవర్లలో సీఎస్కే 72/0 ఏడు ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. గైక్వాడ్ 35, కాన్వే 37 పరుగులు చేశాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కేకేఆర్ ఐపీఎల్ 16వ సీజన్ 33వమ్యాచ్లో కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఢీ కొంటున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. వరుస విజయాలతో జోరు మీదున్న ధోనీ సేన మరో విజయంపై కన్నేసింది. మరోవైపు కోల్‌కతా హ్యాట్రిక్ ఓటమి తప్పించుకోవాలని భావిస్తోంది. ఓపెనర్ డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, శివం దూబే సూపర్ ఫామ్‌లో ఉండడం చెన్నైకి కలిసొచ్చే అంశం. కోల్‌కతా విషయానికొస్తే.. వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రానా, రింకూ సింగ్‌పై ఎక్కువగా ఆధారపడుతోంది. ఆ జట్టుకు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, సుయాశ్ శర్మ రూపంలో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. దాంతో, ఇరుజట్ల మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది. -
సీజన్లో తొలి విజయం నమోదు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
ఐపీఎల్ 16వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 128 పరుగుల టార్గెట్‌ను 19.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి చేధించింది. డేవిడ్ వార్నర్ 57 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. మనీష్ పాండే 21 పరుగులు చేశాడు. ఆఖర్లో అక్షర్ పటేల్ 18 పరుగులు నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అంకుల్ రాయ్, నితీశ్ రానాలు తలా రెండు వికెట్లు తీశారు. విజయం దిశగా ఢిల్లీ క్యాపిటల్స్ కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం దిశగా పయనిస్తోంది. 15 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. మనీష్ పాండే 19, అక్షర్ పటేల్ ఐదు పరుగులతో ఆడుతున్నారు. ఢిల్లీ విజయానికి 30 బంతుల్లో 24 పరుగులు కావాలి. 7 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 62/1 ఏడు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది. వార్నర్ 25 బంతుల్లో 45 పరుగులతో ధాటిగా ఆడుతుండగా.. మిచెల్ మార్ష్ 2 పరుగులతో సహకరిస్తున్నాడు. పృథ్వీ షా ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ పృథ్వీ షా(13) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో పృథ్వీ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. ధాటిగా ఆడుతున్న వార్నర్.. 3 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 31/0 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మూడు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసింది. వార్నర్ 23, పృథ్వీ షా ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు. కేకేఆర్ 127 ఆలౌట్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ 127 పరుగులకు ఆలౌట్ అయింది. కేకేఆర్ బ్యాటర్లలో జేసన్ రాయ్ 43 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. చివర్లో రసెల్ 31 బంతుల్లో 4 సిక్సర్లు, ఒక ఫోర్ సాయంతో 38 పరుగులు చేయడంతో కేకేఆర్ 120 పరుగుల మార్క్‌ను అందుకోగలిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఇషాంత్ శర్మ, నోర్ట్జే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లు తలా రెండు వికెట్లు తీశారు. ఆలౌట్ దిశగా కేకేఆర్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ దారుణ ఆటతీరు కనబరుస్తోంది. 96 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. రసెల్ 13 పరుగులతో ఆడుతున్నాడు. 14 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ ఆరు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. జేసన్ రాయ్ 43, రస్సెల్ 12 పరుగులతో ఆడుతున్నారు. 10 ఓవర్లలో కేకేఆర్ స్కోరెంతంటే? 10 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ నాలుగు వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. జేసన్ రాయ్ 34, రింకూ సింగ్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు. 35కే మూడు వికెట్లు కోల్పోయిన కేకేఆర్ర 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన కేకేఆర్ కష్టాల్లో పడింది. జేసన్ రాయ్ 22, మణిదీప్ సింగ్ రెండు పరుగులతో ఆడుతున్నారు. వెంకటేశ్ అయ్యర్ డకౌట్.. రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. నోర్ట్జే బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన అయ్యర్ స్లిప్‌లో మార్ష్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ రెండు వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన లిటన్ దాస్ ముఖేశ్ కుమార్ బౌలింగ్‌లో లిలిత్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ వికెట్ నష్టానికి 15 పరుగులు చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 16వ సీజన్లో గురువారం 28వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.సీజన్లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైన ఢిల్లీ ఇంతవరకు బోణీ చేయలేకపోయింది. మరోవైపు కేకేఆర్ మాత్రం పడుతూ లేస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): జేసన్ రాయ్, లిట్టన్ దాస్(వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్), మన్దీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, కుల్వంత్ ఖేజ్రోలియా, ఉమేష్ యాదవ్, వరుణ్ చకరవర్తి ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్ The 🌧 stops, the 🪙 flips, and @DelhiCapitals opt to bowl first tonight! Watch #DCvKKR - LIVE & FREE on #JioCinema | available across all telecom operators.#IPL2023 #TATAIPL #IPLonJioCinema | @KKRiders pic.twitter.com/vuTjWy4dyM — JioCinema (@JioCinema) April 20, 2023 కేకేఆర్ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్, నితీష్ రానా, రింకూ సింగ్ మినహా మిగతావారెవరు రాణించడం లేదు. అటు ఢిల్లీ క్యాపిటల్స్‌లో వార్నర్, అక్షర్‌పటేల్ మినహా ఎవరు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడడం లేదు. సొంత గ్రౌండ్లో ఆడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి తొలి విజయాన్ని నమోదు చేస్తుందేమో చూడాలి. -
చెత్తగా ప్రవర్తించారు.. నితీశ్ రాణాకు బీసీసీఐ షాక్! సూర్యకు భారీ జరిమానా
BCCI Punishes Nitish Rana- Hrithik Shokeen- Suryakumar Fined: ముంబై ఇండియన్స్ తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందున ఈ టీమిండియా టీ20 స్టార్‌కు 12 లక్షల జరిమానా పడింది. కాగా ఐపీఎల్-2023లో భాగంగా ముంబై వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆదివారం ముంబై ఇండియన్స్ తలపడింది. రోహిత్ స్థానంలో సారథిగా ముంబై రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అస్వస్థతకు గురైన నేపథ్యంలో అతడి స్థానంలో సూర్య సారథిగా వ్యవహరించాడు. ఈ క్రమంలో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా ఐపీఎల్ నిర్వాహకులు ఈ మేర ఫైన్ విధించారు. ఇక సొంత మైదానంలో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. కేకేఆర్‌ను 186 పరుగులకు కట్టడి చేసింది. వెంకటేశ్ అయ్యర్ సెంచరీ(104)తో మెరవడంతో కోల్‌కతా ఈ మేరకు స్కోరు చేసింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఈ క్రమంలో లక్ష్య ఛేదనలో భాగంగా రోహిత్ శర్మ(20) ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఓ మోస్తరుగా రాణించగా.. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ(58)తో చెలరేగాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 43 పరుగులతో రాణించగా.. తిలక్ వర్మ 30, టిమ్ డేవిడ్ 24(నాటౌట్) పరుగులు చేశారు. దీంతో 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన ముంబై ఈ సీజన్లో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. నితీశ్ రాణా మ్యాచ్ ఫీజులో కోత.. ముంబై బౌలర్ హృతిక్ షోకీన్- కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా మధ్య వివాదం నేపథ్యంలో ఇద్దరికీ జరిమానా విధించారు ఐపీఎల్ నిర్వాహకులు. మైదానంలో పరస్పరం అనుచితంగా ప్రవర్తించినందుకు గానూ ఇరువురి మ్యాచ్ ఫీజులో కోత విధించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని 2.21 నిబంధనను అతిక్రమించినందుకు గానూ నితీశ్ రాణా ఫీజులో 25 శాతం కోత పెట్టారు. ముంబై బౌలర్‌కూ ఫైన్ అదే విధంగా.. హృతిక్ షోకీన్.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని 2.5 నిబంధనను ఉల్లంఘించినందుకు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా నితీశ్ రాణా, హృతిక్ షోకీన్ దేశవాళీ క్రికెట్లో ఒకే జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరిద్దరు ఢిల్లీ తరఫున ఆడుతూ సహచర ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. ఐపీఎల్లో వేర్వేరు జట్లకు ఆడుతున్న ఈ ఇద్దరు అనవసరపు గొడవతో చెత్తగా ప్రవర్తించి క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. తమ తప్పులు అంగీకరించి బీసీసీఐ విధించిన ఫైన్ రూపంలో మూల్యం కూడా చెల్లించుకున్నారు. చదవండి: వెంకీ శతకం.. 'కింగ్' ఖాన్ కూతురు ఏం చేసిందంటే? #venkateshIyer: నొప్పిని భరిస్తూనే.. 2⃣ wins in a row for @mipaltan! 👏 👏#MI beat #KKR by 5 wickets to bag two more points! 👍 👍 Scorecard ▶️ https://t.co/CcXVDhfzmi #TATAIPL | #MIvKKR pic.twitter.com/9oYgBrF0Fe — IndianPremierLeague (@IPL) April 16, 2023 -
గెలికి మరీ తిట్టించుకోవడం అంటే ఇదే!
క్రికెట్లో ఇద్దరి ఆటగాళ్ల మధ్య గొడవ జరగడం సహజం. ఒక్కోసారి ఆటగాళ్లు సహనం కోల్పోయి ప్రత్యర్థి ఆటగాడిపై దూషణకు దిగుతుంటారు. ఒక్కోసారి ఈ గొడవ తారాస్థాయికి చేరి కొట్టుకునే వరకు వెళ్తుంది. తాజాగా ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా కేకేఆర్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్‌లో ఇలాంటిదే చోటు చేసుకుంది. కేకేఆర్ కెప్టెన్ నితీష్ రానా, ముంబై బౌలర్ హృతిక్ షోకీన్‌ల మధ్య మాటల యుద్ధం కొట్టుకునే వరకు వెళ్లడం ఆసక్తి కలిగించింది. Photo: IPL Twitter అయితే ఇక్కడ తప్పు హృతిక్ షోకీన్దే అని క్లియర్‌గా తెలుస్తోంది. షోకీన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ రమణ్‌దీప్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చాడు. తాను ఔటయానన్న బాధలో కామ్‌గా పెవిలియన్ వెళ్తున్న నితీష్ రానాను చూస్తూ హృతిక్ షోకీన్ వెకిలిగా ప్రవర్తించాడు.. పెవిలియన్ వెళ్లు అన్నట్లుగా వేలు చూపించాడు. దీంతో నితీశ్ రానాకు కోపం నషాళానికెక్కింది. ఒక్కసారిగా హృతిక్ షోకిన్పై అసభ్య పదజాలంలో విరుచుకుపడ్డాడు. Photo: IPL Twitter ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. దీంతో ముంబై స్టాండిన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కల్పించుకొని నితీశ్ రానాను అక్కడినుంచి తీసుకెళ్లాడు. అయితే నితీశ్ పెవిలియన్ వెళ్తూ కూడా హృతిక్‌పై తన తిట్ల పురాణం ఆపలేదు. ఒక రకంగా కామ్‌గా వెళ్తున్న వ్యక్తిని గెలికి మరీ తిట్టుంచుకోవడం అంటే ఇదే కావొచ్చు. ఇక హృతిక్ చేసిన చిన్న తప్పిదానికే నితీశ్ ఇంతలా రియాక్ట్ అవడం ఏంటని అభిమానులు ఆరా తీస్తే అసలు కారణం బయటపడింది. నితీశ్ రియాక్షన్‌కు అసలు కారణం ఇదే.. నితీశ్ రానా, హృతిక్ షోకీన్‌లు ఇద్దరు దేశవాలీ క్రికెట్లో ఢిల్లీ తరపునే ఆడుతున్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. అప్పటినుంచి ఇద్దరు ఎక్కడ ఎదురుపడినా మాట్లాడుకోవడం లేదు. ఢిల్లీ జట్టు తరపున ఆడేటప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా ఇద్దరు మాట్లాడుకుందే లేదట. Photo: IPL Twitter ఇక రంజీ ట్రోఫీలో భాగంగా బ్యాటింగ్ చేసే సమయంలో ఇద్దరు క్రీజులో ఉన్నప్పటికి ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదని పలువురు అభిమానులు పేర్కొన్నారు. ''ఎంత గొడవ జరిగితే ఇద్దరి మధ్య ఇంత పంతం అవసరమా'' అని కొందరు అభిమానులు పేర్కొనగా.. ''ఎంతకాదన్నా నితీశ్ రానా సీనియర్ ప్లేయర్.. ఒక సీనియర్ ఆటగాడిపై అలా ప్రవర్తించడం మంచి పద్దతి కాదు.. నితీశ్ కరెక్టుగానే రియాక్ట్ అయ్యాడు'' అంటూ పేర్కొన్నారు. pic.twitter.com/zwPKyZIFzM — WPL MAHARASTRA (@WMaharastra) April 16, 2023 Not surprised to see this between Nitish Rana and Hrithik Shokeen. They have a history. Don’t talk in the dressing room. It all started in the Syed Mushtaq Ali Trophy. Both weren’t talking while batting in Ranji too. Rana is a senior player and Shokeen needs to ZIP UP! — Sahil Malhotra (@Sahil_Malhotra1) April 16, 2023 -
MI VS KKR: కేకేఆర్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం
కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 17.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. ముంబై బ్యాటర్లలో ఇషాన్ కిషన్ 25 బంతుల్లో 58, సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 43, తిలక్ వర్మ 25 బంతుల్లో 30 పరుగులు, టిమ్ డేవిడ్ 12 బంతుల్లో 23 పరుగులు నాటౌట్ సమిష్టిగా రాణించి ముంబై విజయంలో కీలకపాత్ర పోషించారు. కేకేఆర్ బౌలర్లలో సుయాష్ శర్మ రెండు వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, లోకీ ఫెర్గూసన్‌లు తలా ఒక వికెట్ తీశారు. సీజన్లో ముంబైకిది వరుసగా రెండో విజయం కాగా.. కేకేఆర్‌కు వరుసగా రెండో పరాజయం కావడం గమనార్హం. విజయం దిశగా ముంబై ఇండియన్స్ కేకేఆర్‌తో మ్యాచ్‌లో ముంబై విజయానికి దగ్గరైంది. 17 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ నాలుగు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ముంబై విజయానికి కేవలం ఆరు పరుగుల దూరంలో ఉంది. తిలక్ వర్మ క్లీన్ బౌల్డ్.. మూడో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్ సుయాశ్ శర్మ బౌలింగ్‌లో తిలక్ వర్మ (30) క్లీన్ బౌల్డయ్యాడు. 14 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 148/3. సూర్యకుమార్ యాదవ్ (30), టిమ్ డేవిడ్ క్రీజ్‌లో ఉన్నారు. ఇషాన్ కిషన్ (58) క్లీన్ బౌల్డ్ 25 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు సాయంతో 58 పరుగులు చేసిన అనంతరం ఇషాన్ కిషన్ ఔటయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఇషాన్ క్లీన్ బౌల్డయ్యాడు. ఉమేశ్ సూపర్ క్యాచ్.. హిట్‌మ్యాన్ ఔట్ 20 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ శర్మ ఔటయ్యాడు. సుయాశ్ శర్మ బౌలింగ్‌లో మిడ్ ఆఫ్‌లో ఉమేశ్ అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకోవడంతో హిట్‌మ్యాన్ పెవిలియన్‌కు చేరాడు. క్రీజ్‌లో ఇషాన్ కిషన్ (43) జతగా సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. 5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 65/1. టార్గెట్ 186.. ధాటిగా ఆడుతున్న రోహిత్, ఇషాన్ 186 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. 4 ఓవర్లలో ఆ జట్టు ఏకంగా 57 పరుగులు రాబట్టింది. ఇషాన్ కిషన్ (15 బంతుల్లో 42; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. అతనికి జతగా రోహిత్ శర్మ (9 బంతుల్లో 13; ఫోర్, సిక్స్) క్రీజ్‌లో ఉన్నాడు. వెంకటేశ్ అయ్యర్ సెంచరీ.. ముంబై టార్గెట్ ఎంతంటే..? ఐపీఎల్-2023లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 16 మధ్యాహ్నం 3:30 గంటలకు) జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్.. వెంకటేశ్ అయ్యర్ (51 బంతుల్లో 104; 6 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. కేఆర్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్భాజ్ (8), జగదీశన్ (0), నితీశ్ రాణా (5), శార్దూల్ ఠాకూర్ (13), రింకూ సింగ్ (18) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. ఆఖర్లో రసెల్ (21 నాటౌట్) ధాటిగా ఆడాడు. ముంబై బౌలర్లలో హృతిక్ షోకీన్ 2 వికెట్లు పడగొట్టగా.. కెమరూన్ గ్రీన్, పియూష్ చావ్లా, జన్సెన్. మెరిడిత్ తలో వికెట్ దక్కించుకున్నారు. రింకూ సింగ్ ఔట్.. ఆరో వికెట్ కోల్పోయిన కేకేఆర్ జన్సెన్ బౌలింగ్‌లో నేహల్‌కు క్యాచ్ ఇచ్చి రింకూ సింగ్ (18) ఔటయ్యాడు. అయ్యర్ ఔటయ్యాక స్కోర్ ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. శతక్కొట్టి ఔటైన వెంకటేశ్ అయ్యర్ సెంచరీ తర్వాత కేవలం ఒకే ఒక ఫోర్ కొట్టిన అయ్యర్.. 104 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. మెరిడిత్ బౌలింగ్‌లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి అయ్యర్ పెవిలియన్‌కు చేరాడు. వెంకటేశ్ అయ్యర్ ఊచకోత.. 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో విధ్వంకర శతకం ముంబైలోని వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 16) జరుగుతున్న మ్యాచ్‌లో (మధ్యాహ్నం 3:30 గంటలకు) కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ శివాలెత్తిపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలి బంతి నుంచి ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగిన అయ్యర్.. కేవలం 49 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో విధ్వంకర శతకం బాదాడు. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో బ్యాటర్లంతా కలిపి కేవలం 2 ఫోర్లు కొడితే, ఒక్క వెంకటేశ్ అయ్యరే 5 బౌండరీలు, 9 సిక్సర్లు బాదడం విశేషం. తిలక్ వర్మ సూపర్ క్యాచ్.. శార్దూల్ ఠాకూర్ ఔట్ తిలక్ వర్మ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో శార్దూల్ ఠాకూర్ (13) పెవిలియన్ బాట పట్టాడు. తద్వారా 123 పరుగుల వద్ద కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో ఉన్న వెంకటేశ్ అయ్యర్ (86) దుమ్మురేపుతున్నాడు. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వెంకటేశ్ అయ్యర్ హార్ఢ్ హిట్టర్ వెంకటేశ్ అయ్యర్ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం స్పీడ్ పెంచిన అయ్యర్.. ఇంకా ధాటిగా ఆడుతున్నాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 76 పరుగుల వద్ద క్రీజ్‌లో ఉన్నాడు. 11 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 104/3. అయ్యర్, శార్దూల్ (4) క్రీజ్‌లో ఉన్నారు. నితీశ్ రాణా ఔట్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన నితీశ్ రాణా (5) హృతిక్ షోకీన్ బౌలింగ్‌లో రమన్‌దీప్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 8.1 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 73/3. వెంకటేశ్ అయ్యర్ (49) క్రీజ్‌లో ఉన్నాడు. రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్ 57 పరుగుల వద్ద కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. పియూష్ చావ్లా బౌలింగ్‌లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి గుర్భాజ్ (8) ఔటయ్యాడు. క్రీజ్‌లో ఉన్న వెంకటేశ్ అయ్యర్ (39) ధాటిగా ఆడుతున్నాడు. నితీశ్ రాణా క్రీజ్‌లోకి వచ్చాడు. 6 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 57/2. తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్.. జగదీశన్ ఔట్ రెండో ఓవర్లోనే కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. గ్రీన్ బౌలింగ్‌లో హృతిక్ షోకీన్ క్యాచ్ పట్టడంతో ఎన్ జగదీశన్ (0) ఔటయ్యాడు. 2 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 12/1. రహ్మానుల్లా గుర్బాజ్ (5), వెంకటేశ్ అయ్యర్ క్రీజ్‌లో ఉన్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై.. రోహిత్ ఔట్, అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం ఐపీఎల్-2023లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 16) జరుగనున్న డబుల్ హెడర్ మ్యాచ్‌ల్లో తొలుత (మధ్యాహ్నం 3:30 గంటలకు) ముంబై ఇండియన్స్- కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కడుపు నొప్పి కారణంగా ఈ మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరం కాగా, అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ముంబై కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అలాగే ఈ మ్యాచ్ ద్వారా సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జన్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రం చేయనున్నాడు. తుది జట్లు.. ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్, కెమారూన్ గ్రీన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, నేహల్ వధేరా, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్, పియుశ్ చావ్లా, డ్యుయాన్ జన్సెన్, రిలే మెరిడిత్ కేకేఆర్: రహ్మానుల్లా గుర్భాజ్, వెంకటేశ్ అయ్యర్, ఎన్ జగదీశన్, నితీశ్ రాణా (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, లోకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి -
నితీష్ రాణా దెబ్బకు ఉమ్రాన్ మాలిక్‌కు చుక్కలు
-
కోల్‌కతా కెప్టెన్ విధ్వంసం.. 6 బంతుల్లో 6 బౌండరీలు! పాపం ఉమ్రాన్
ఈడెన్‌గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో కేకేఆర్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఓటమిపాలైనప్పటికీ.. ఆ జట్టు కెప్టెన్ నితీష్ రాణా మాత్ర తన అద్భుత ఇన్నింగ్స్‌తో అందరినీ అకట్టుకున్నాడు. 229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన నితీష్ రాణా ఎస్ఆర్హెచ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫోర్లు,సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్‌కు చుక్కలు చూపించాడు. 6 ఓవర్ వేసిన ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో రాణా వరుసగా ఆరు బౌండరీలు బాదాడు. అందులో రెండు సిక్స్‌లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. దీంతో ఈ ఓవర్లో ఏకంగా 28 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక ఓవర్ ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 41 బంతులు ఎదుర్కొన్న రాణా.. 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75 పరుగులు చేశాడు. అద్భుతంగా ఆడిన రాణా 17 ఓవర్లో నటరాజన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. చదవండి: IPL 2023: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. తొలి సన్‌రైజర్స్ ఆటగాడిగా Nitish Rana - Knight in shining armor 💪#IPL2023 #TATAIPL #KKRvSRH | @KKRiders @NitishRana_27 pic.twitter.com/6VSKV3Y9Bc — JioCinema (@JioCinema) April 14, 2023 -
హ్యారీ బ్రూక్ సెంచరీ.. 23 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ విజయం
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ రెండో విజయాన్ని నమోదు చేసింది. 229 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. నితీష్రానా(41 బంతుల్లో 75 పరుగులు), రింకూ సింగ్(31 బంతుల్లో 58 పరుగులు) మినహా మిగతావారు రాణించడంలో విఫలమయ్యారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో మార్కో జాన్సెన్, మయాంక్ మార్కండేలు తలా రెండు వికెట్లు తీయగా.. నటరాజన్, భువనేశ్వర్, ఉమ్రాన్ మాలిక్ తలా ఒక వికెట్ తీశారు. నితీష్ రానా ఔట్.. ఆరో వికెట్ కోల్పోయిన కేకేఆర్ ధాటిగా ఆడుతున్న నితీష్ రానా(41 బంతుల్లో 75 పరుగులు) నటరాజన్ బౌలింగ్‌లో సుందర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. విధ్వంసం సృష్టిస్తున్న నితీష్, రింకూ సింగ్.. 16 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ ఐదు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. నితీష్ రానా 38 బంతుల్లో 69 బ్యాటింగ్, రింకూ సింగ్ 18 బంతుల్లో 32 బ్యాటింగ్ విధ్వంసం సృష్టిస్తున్నారు. కేకేఆర్ గెలవాలంటే 24 బంతుల్లో 70 పరుగులు చేయాల్సి ఉంది. మరోసారి విఫలమైన రసెల్.. ఐదో వికెట్ కోల్పోయిన కేకేఆర్ కేకేఆర్ ఆల్‌రౌండర్ ఆండీ రసెల్ బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతుంది. తాజాగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో మూడు పరుగులు మాత్రమే చేసి మయాంక్ మార్కండే బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో కేకేఆర్ 96 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. నాలుగో వికెట్ కోల్పోయిన కేకేఆర్ భారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్ తడబడుతుంది. ఎన్ జగదీశన్(36) రూపంలో కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం కేకేఆర్ 4 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. నితీష్ రానా 35, రసెల్ ఒక్క పరుగుతో క్రీజులో ఉన్నారు. 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన కేకేఆర్ 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ కష్టాల్లో పడింది. 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. నితీష్ రాణా 2, ఎన్ జగదీషన్ 20 పరుగులతో ఆడుతున్నారు. Photo Credit : IPL Website హ్యారీ బ్రూక్ సెంచరీ.. కేకేఆర్ టార్గెట్ 229 కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ భారీ స్కోరు చేసింది. హ్యారీ బ్రూక్ 55 బంతుల్లో 100 నాటౌట్ సీజన్లో తొలి సెంచరీ నమోదు చేయడంతో ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. మార్క్రమ్ 50, అభిషేక్ శర్మ 35 పరుగులతో రాణించారు. Photo Credit : IPL Website మార్క్రమ్(50) ఔట్.. ఎస్ఆర్హెచ్ 129/3 ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ తొలిసారి దూకుడు ప్రదర్శిస్తోంది. కెప్టెన్ మార్క్రమ్ 25 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. అయితే ఫిఫ్టీ కొట్టిన మరుసటి బంతికే వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ మూడు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. బ్రూక్ 53 పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website 9 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 85/2 9 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. బ్రూక్ 45, మార్క్రమ్ 14 పరుగులతో ఆడుతున్నారు. Photo Credit : IPL Website తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్ మయాంక్ అగర్వాల్ మరోసారి విఫలమయ్యాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో 9 పరుగులు చేసిన మయాంక్ రసెల్ బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టానికి 46 పరుగులు చేసింది. Photo Credit : IPL Website 2 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 28/0 కేకేఆర్‌తో మ్యాచ్‌ను ఎస్ఆర్హెచ్ దూకుడుగా ఆరంభించింది. 2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ 18, మయాంక్ అగర్వాల్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website టాస్ గెలిచిన కేకేఆర్ ఐపీఎల్ 16వ సీజన్ 19వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఢీ కొంటున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుండడంతో మ్యాచ్ ఆసక్తికరంగా ఉండనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌కీపర్), మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్‌కీపర్), N జగదీసన్, నితీష్ రాణా(కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, సుయాష్ శర్మ, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి The 🪙 lands in favour of @KKRiders & they'll be BOWLING first in #KKRvSRH! Catch pulsating #TATAIPL action, LIVE & FREE, on JioCinema on all telecom operators!#IPLonJioCinema #IPL2023 | @SunRisers pic.twitter.com/8QeJTF05el — JioCinema (@JioCinema) April 14, 2023 ఇక వరుసగా రెండు మ్యాచుల్లో నెగ్గిన కోల్‌కతా హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉంది. మరోవైపు హోంగ్రౌండ్లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి బోణీ కొట్టిన ఎస్ఆర్హెచ్ రెండో విజయంపై కన్నేసింది. దాంతో, పై చేయి సాధించే జట్టు ఏది అనేది? మరికొన్ని గంటల్లో తెలియనుంది. ఇక ఇరుజట్లు ఇప్పటిరకు 23 మ్యాచ్‌లు జరగ్గా.. కేకేఆర్ 15 సార్లు గెలుపొందితే.. ఎస్ఆర్హెచ్ 8సార్లు మాత్రమే నెగ్గింది. -
KKR Vs RCB: ఆ షాట్ సెలక్షన్ ఏంటి? రాణా సంగా అవుదామనుకుని..
IPL 2023- Kolkata Knight Riders vs Royal Challengers Bangalore: కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ నితీశ్ రాణా ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మండిపడ్డాడు. చెత్త షాట్ సెలక్షన్‌తో వికెట్ సమర్పించుకున్నాడని విమర్శించాడు. జట్టు కష్టాల్లో ఉన్నపుడు రాణా సంగాలా మారుదామనుకున్నాడని.. కానీ, పూర్తిగా విఫలమయ్యాడని విమర్శలు చేశాడు. కాగా ఐపీఎల్-2023లో తమ రెండో మ్యాచ్‌లో కేకేఆర్ గురువారం ఆర్సీబీతో తలపడింది. ఈ మ్యాచ్ ఆరంభంలోనే వెంకటేశ్ అయ్యర్(3), వన్‌డౌన్ బ్యాటర్ మన్దీప్ సింగ్(0) అవుటయ్యారు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ నితీశ్ రాణా సైతం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రింకూ సింగ్(46), శార్దూల్ ఠాకూర్ (68) అద్భుత ఇన్నింగ్స్‌తో 204 పరుగులు చేసిన కేకేఆర్.. వరుణ్ చక్రవర్తి సహా మిగతా బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో 123 పరుగులకే ఆర్సీబీని కట్టడి చేసింది. ఈ క్రమంలో 81 పరుగుల తేడాతో కేకేఆర్ ఈ సీజన్లో తొలి గెలుపు నమోదు చేసింది. అసలు ఎలాంటి షాట్ ఆడుతున్నాడో?! ఈ నేపథ్యంలో కేకేఆర్ ఇన్నింగ్స్ సాగిన విధానం ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘కేకేఆర్ ఆరంభంలోనే తడబడింది. రీస్ టోప్లే స్థానంలో వచ్చిన డేవిడ్ విల్లే వరుస బంతుల్లో రెండు వికెట్లు కూల్చాడు. ఓపెనర్‌గా వచ్చిన వెంకటేష్ అయ్యర్ త్వరగానే అవుటయ్యాడు. ఇక మన్దీప్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. జట్టులో అతడు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడన్న విషయంపై మనకు సందేహాలు రాకమానవు. ఆ తర్వాత నితీశ్ రాణా. అసలు ఎలాంటి షాట్ ఆడుతున్నాడో తనకైనా అర్థమైందో లేదో?! రాణా సంగా అవుదామనుకున్నాడు. కానీ.. ఎక్కువసేపు నిలవలేక అవుటై పోయాడు. మైకేల్ బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. తర్వాత ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్, రింకూ సింగ్ మెరుగైన భాగస్వామ్యం నమోదు చేశారు. గుర్బాజ్ అద్భుతంగా ఆడాడు. రింకూ సూపర్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. రసెల్ పూర్తిగా నిరాశపరచగా.. శార్దూల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో కోల్‌కతా 204 పరుగుల మార్కును చేరుకోగలిగింది’’ అని పేర్కొన్నాడు. కాగా ఏడో ఓవర్ మొదటి బంతికి బ్రాస్‌వెల్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ షాట్ ఆడబోయిన నితీశ్ రాణా.. దినేశ్ కార్తిక్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. చదవండి: అస్సలు ఊహించలేదు.. అందరి అంచనాలు తలకిందులు చేశాడు: మాజీ ప్లేయర్ -
డుప్లెసిస్ అర్థం కాని యాసతో కేకేఆర్‌కు మేలు
ఐపీఎల్ 2023లో 9వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మధ్య జరిగింది. ఈ మ్యాచ్ కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమిచ్చింది. అయితే ఈ మ్యాచ్ టాస్ సందర్భంగా కాస్త గందరగోళం నెలకొంది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ యాస అర్థం కాక కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా అయోమయానికి గురయ్యాడు. అయితే దీనిపై తర్వాత డుప్లెసిస్ క్లారిటీ ఇచ్చాడు. విషయంలోకి వెళితే.. టాస్ సందర్భంగా కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా కాయిన్ గాల్లోకి ఎగరేశాడు. ఆ సమయంలో డుప్లెసిస్ హెడ్స్ అన్నాడు. కాయిన్ కూడా హెడ్స్ పడింది. అయితే మ్యాచ్ రిఫరీతోపాటు నితీష్ రానా కూడా డుప్లెసిస్ టెయిల్స్ అన్నాడనుకొని టాస్ కేకేఆర్ గెలిచినట్లు భావించారు. కానీ తాను హెడ్స్ అన్నట్లు డుప్లెసిస్ చెప్పాడు. ఆ సమయంలో టాస్ నిర్వహిస్తున్న సంజయ్ మంజ్రేకర్ కూడా ఫాఫ్.. హెడ్స్ అన్నాడని స్పష్టం చేశాడు. దీనిపై నితీష్ అసహనం వ్యక్తం చేస్తూ పక్కకెళ్లిపోయాడు. ఇది నీకు ఓకే కదా అని మంజ్రేకర్ అడిగినా అతడు పట్టించుకోలేదు. దీనిపై డుప్లెసిస్ వివరణ ఇచ్చాడు. "మొదట బౌలింగ్ చేస్తాం. నా యాస అర్థం కాక నితీష్ రాణా కాస్త తప్పుగా అర్థం చేసుకున్నట్లున్నాడు" అని డుప్లెసిస్ చెప్పాడు. ఈ నిర్ణయంపై నితీష్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశాడు. టాస్ గెలిచి ఉంటే తాను కూడా ఫీల్డింగ్ ఎంచుకునేవాడినని నితీష్ రాణా పేర్కొన్నాడు. అయితే డుప్లెపసిస్ అర్థం కాని యాస కేకేఆర్‌కు ఒక రకంగా మేలు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ మొదట్లో తడబడినా ఆఖర్లో శార్దూల్, రింకూ సింగ్‌లు మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో 204 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ దారుణ ఆటతీరును కనబరిచింది. 84 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఇక ఈ సీజన్లో రాత్రి పూట మంచు కారణంగా టాస్ గెలిచిన జట్లు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంటున్నాయి. .@RCBTweets win the toss at Eden Gardens and elect to bowl first 💪 Catch #KKRvRCB - LIVE & FREE on #JioCinema across all telecom operators 👈#IPL2023 #IPLonJioCinema #TATAIPL | @KKRiders pic.twitter.com/Z7jnwlEIsI — JioCinema (@JioCinema) April 6, 2023 -
స్నిన్నర్ల విజృంభణ.. ఆర్సీబీపై కేకేఆర్ ఘన విజయం
కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలైంది. 205 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 123 పరుగులకే ఆలౌటై 81 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. అయితే ఒక దశలో 95 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఈ దశలో ఆకాశ్ దీప్(8 బంతుల్లో 17), డేవిడ్ విల్లే(20 బంతుల్లో 20 నాటౌట్)లు మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో ఆర్సీబీ పరువు నిలబడింది. లేకుంటే వంద పరుగులలోపే ఆలౌటై ఘోర పరాజయాన్నే మూటగట్టుకునేదే. డుప్లెసిస్ 23 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి నాలుగు వికెట్లు తీయగా.. సుయాశ్‌శర్మ మూడు, సునీల్ నరైన్ రెండు వికెట్లు, శార్దూల్ ఒక వికెట్ పడగొట్టాడు. ఓటమి దిశగా ఆర్సీబీ.. 86 పరుగులకే 8 వికెట్లు డౌన్ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 86 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. టార్గెట్ 205.. 54కే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ 205 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీ కష్టాల్లో పడింది. 8 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. బ్రాస్‌వెల్ ఆరు, షాదాబ్ అహ్మద్ క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website శార్దూల్, రింకూ సింగ్ మెరుపులు.. ఆర్సీబీ టార్గెట్ 205 శార్దూల్ ఠాకూర్(29 బంతుల్లో 69,9 ఫోర్లు, 3 సిక్సర్లు), రింకూ సింగ్(33 బంతుల్లో 46 పరుగులు) విధ్వంసం సృష్టించడంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోరు చేసింది. అంతకముందు రహమనుల్లా గుర్బాజ్ 57 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆర్సీబీ బౌలర్లలో డేవిడ్ విల్లే, కర్ణ్ శర్మలు చెరో రెండు వికెట్లు తీయగా.. సిరాజ్, హర్షల్ పటేల్, ఆకాశ్‌దీప్‌లు తలా ఒక వికెట్ తీశారు. Photo Credit : IPL Website శార్దూల్ దూకుడు.. 16 ఓవర్లలో కేకేఆర్ 147/5 ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ మెరుపు ఇన్నింగ్స్‌తో దూకుడు ప్రదర్శిస్తుండడంతో కేకేఆర్ 16 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. శార్దూల్ 19 బంతుల్లో 47, రింకూ సింగ్ 21 పరుగులతో ఆడుతున్నారు. Photo Credit : IPL Website 94 పరుగులకే ఐదు వికెట్లు ఆర్సీబీతో మ్యాచ్‌లో కేకేఆర్ కష్టాల్లో పడింది. 94 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. కర్ణ్ శర్మ వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టాడు. Photo Credit : IPL Website 9 ఓవర్లలో కేకేఆర్ 71/3 9 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్ 47 పరుగులతో ఆడుతున్నాడు. Photo Credit : IPL Website వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయిన కేకేఆర్ ఆర్సీబీతో మ్యాచ్‌లో కేకేఆర్ వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. డేవిడ్ విల్లే ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో వరుస బంతుల్లో వెంకటేశ్ అయ్యర్(3), మణిదీప్(0) పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం కేకేఆర్ 4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. Photo Credit : IPL Website టాస్ గెలిచి ఫీల్డింగ్ ఏంచుకున్న ఆర్సీబీ ఐపీఎల్ 16వ సీజన్ 9వ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్తలపడుతున్నాయి. ఈడెన్స్ గార్డెన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కేకేఆర్ విజయంపై కన్నేసింది. టాస్ గెలిచిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఏంచుకుంది. .@RCBTweets win the toss at Eden Gardens and elect to bowl first 💪 Catch #KKRvRCB - LIVE & FREE on #JioCinema across all telecom operators 👈#IPL2023 #IPLonJioCinema #TATAIPL | @KKRiders pic.twitter.com/Z7jnwlEIsI — JioCinema (@JioCinema) April 6, 2023 కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): మన్దీప్ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), నితీష్ రాణా(కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, వరుణ్ చకరవర్తి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్వెల్, మైకేల్ బ్రేస్‌వెల్, షాబాజ్ అహ్మద్, డేవిడ్ విల్లీ, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసిన ఆర్సీబీ జోరు కొనసాగించాలని భావిస్తోంది. సొంత గడ్డపై గెలిచి, టోర్నమెంట్లో బోణీ కొట్టాలని నితీశ్ రానా సేన పట్టుదలతో ఉంది. ముంబైపై హాఫ్ సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ, కెప్టెన్ డూప్లెసిస్ ఈ మ్యాచ్‌లోనూ రాణిస్తే ఆర్సీబీకి తిరుగుండదు. సమిష్టిగా సత్తా చాటడంపై కేకేఆర్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. -
KKR పరిస్థితి ఏంటో...పరేషాన్ అవుతున్న ఫ్యాన్స్
-
కోల్‌కతా కొత్త కెప్టెన్‌గా నితీష్ రాణా.. కేకేఆర్ తప్పు చేసిందా?
ఐపీఎల్-2023 సీజన్‌కు గానూ కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ కెప్టెన్‌గా నితీష్ రానాను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. వెన్నుగాయంతో రెగ్యూలర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దూరం కావడంతో అతడి స్థానంలో కెప్టెన్‌గా నితీష్ రానాను కేకేఆర్ మేనెజ్మెంట్ నియమించింది. కెప్టెన్సీ రేసులో రాణాతో పాటు సునీల్ నరైన్,శార్ధూల్ ఠాకూర్ పేర్లు వినిపించినప్పటకీ.. కేకేఆర్ మేనెజ్మెంట్ మాత్రం నితీష్ వైపు మెగ్గు చూపింది. కాగా నితీశ్ రాణాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించడం పట్ల కేకేఆర్ ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. జట్టులో షకీబుల్ హసన్, టిమ్ సౌథీ, నరైన్ వంటి అనుభవం ఉన్న క్రికెటర్లను పక్కన పెట్టి నితీశ్ రాణాను నియమించడం సరికాదని అభిమానులు కామెంట్స్ చేస్తోన్నారు. కెప్టెన్‌గా జట్టును నడిపించే సామర్థ్యం, అనుభవం నితీష్ రానాకు లేదని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం రాణాకు మద్దతుగా నిలుస్తున్నారు. అతడికి కెప్టెన్సీ పరంగా అనుభవం ఉందంటూ సపోర్ట్ చేస్తున్నారు. కాగా రాణాకు కెప్టెన్సీ ఏం కొత్త కాదు. దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ జట్టుకు రాణా సారథ్యం వహించాడు. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ తర్వాత ఢిల్లీ జట్టుకు రాణానే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అదే విధంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 12 మ్యాచులకు కెప్టెన్సీ చేశాడు. అతడి సారథ్యంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఢిల్లీ 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. -
IPL 2023: కేకేఆర్ సంచలన ప్రకటన.. కెప్టెన్‌గా ఎవరూ ఊహించని కొత్త పేరు
ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ సంచలన ప్రకటన చేసింది. గాయపడిన రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్థానంలో కెప్టెన్‌గా ఎవరూ ఊహించని కొత్త వ్యక్తి పేరు తెరపైకి తెచ్చింది. కేకేఆర్ తమ తాత్కాలిక కెప్టెన్‌గా సీనియర్ ఆటగాడు నితీశ్ రాణా పేరును ప్రకటించింది. వెన్ను సమస్య కారణంగా అయ్యర్ 2023 సీజన్ తొలి అర్ధ భాగం మ్యాచ్‌లకు దూరం కానున్న నేపథ్యంలో కేకేఆర్ కెప్టెన్ ఎంపిక అనివార్యం కాగా, కేకేఆర్ యాజమాన్యం నితీశ్ రాణావైపు మొగ్గుచూపింది. Official statement. @NitishRana_27 #AmiKKR #KKR #Nitish #NitishRana pic.twitter.com/SeGP5tBoql — KolkataKnightRiders (@KKRiders) March 27, 2023 పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఢిల్లీ కెప్టెన్‌గా పని చేసిన అనుభవాన్ని, 2018 నుంచి కేకేఆర్‌తో ఉన్న అనుబంధాన్ని పరిగణలోకి తీసుకుని రాణాను ఎంపిక చేసినట్లు కేకేఆర్ యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ ఆధ్వర్యంలో కేకేఆర్ బృందమంతా నితీశ్‌కు సహరిస్తుందని మేనేజ్మెంట్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా నితీశ్ రాణాను ఆల్ ద బెస్ట్ చెప్పిన కేకేఆర్ యాజమాన్యం.. శ్రేయస్ అయ్యర్ త్వరగా గాయం నుంచి కోలుకోవాలని ఆకాంక్షించింది. కాగా, అయ్యర్ గాయం ప్రకటన వెలువడ్డాక కేకేఆర్ కెప్టెన్సీ రేసులో చాలా మంది పేర్లు వినిపించిన విషయం తెలిసిందే. కొందరు సునీల్ నరైన్ అంటే మరికొందరు సౌథీ, రసెల్, శార్దూల్ ఠాకూర్ పేర్లు తెరపైకి తెచ్చారు. అయితే మేనేజ్మెంట్ అనూహ్యంగా నితీశ్ పేరును కెప్టెన్‌గా ఓకే చేసి అందరి అంచనాలకు పటాపంచలు చేసింది. 2016లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన రాణా.. ఇప్పటివరకు 91 మ్యాచ్‌లు ఆడి 2181 పరుగులు చేశాడు. ఇందులో 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2016 నుంచి 2018 వరకు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన రాణా.. అప్పటి నుంచి వరుసగా 6 సీజన్ల పాటు (2023 కలుపుకుని) కేకేఆర్కే ఆడుతున్నాడు. గత సీజన్ వేలంలో రాణాను కేకేఆర్ 8 కోట్లకు సొంతం చేసుకుంది. -
ఐపీఎల్‌కు ముందు కేకేఆర్‌కు ఊహించని షాక్! ఇక అంతే సంగతి?
ఐపీఎల్-2023 సీజన్ ఆరంభానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గరువారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో ఆ జట్టు స్టార్ బ్యాటర్ నితీష్ రాణా యాంకిల్ (చీలమండ)కు గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో అతడు ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇక ఇప్పటికే ఈ ఏడాది ఐపీఎల్‌కు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు, స్టార్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ కూడా దూరమయ్యాడు. ఇప్పడు రాణా కూడా గాయపడడం కేకేఆర్‌ను మరింత కలవరపెడుతోంది. ఇక ఇది ఇలా ఉండగా.. కేకేఆర్ కొత్త కెప్టెన్‌ను రెండు మూడు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. కెప్టెన్సీ రేసులో విండీస్ స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్‌తో పాటు, న్యూజిలాండ్ టెస్టు కెప్టెన్ టిమ్ సౌథీ ఉన్నారు. ఇక ఐపీఎల్-16వ సీజన్ మార్చి31 నుంచి ప్రారంభం కానుంది. కేకేఆర్ తమ తొలి మ్యాచ్‌లో ఏప్రిల్1న పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. చదవండి: Ben Stokes: 'నేను వచ్చేశా'.. సీఎస్కే ఫ్యాన్స్‌లో జోష్ -
నెగెటివ్ ట్వీట్‌ను లైక్ చేసిన క్రికెటర్.. కోపాన్ని చెప్పకనే చెప్పాడు
టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ ఫేలవమైన ఫామ్ కనబరుస్తన్నాడు. గత నెలలో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న ఇషాన్ కిషన్ మళ్లీ అదే బ్యాటింగ్‌ను పునరావృతం చేయలేకపోతున్నాడు. లంకతో టి20 సిరీస్ ఆడిన ఇషాన్ కిషన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత కివీస్‌తో వన్డే సిరీస్‌లోనూ అదే చెత్త ప్రదర్శనను కంటిన్యూ చేసిన ఇషాన్ టి20 మ్యాచ్‌ల్లోనూ పరుగులు చేయలేకపోతున్నాడు. ముఖ్యంగా చివరి 13 టి20 కలిపి ఇషాన్ కిషన్ 15.30 సగటుతో 199 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క అర్థసెంచరీ కూడా లేదు. దీంతో ఇషాన్ కిషన్‌పై విమర్శల పర్వం మొదలైంది. జట్టు నుంచి అతన్ని పక్కకు తొలగించి ఆ స్థానంలో పృథ్వీ షాకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. న్యూజిలాండ్‌తో మూడో టి20లో ఇషాన్ కిషన్ స్థానంలో పృథ్వీ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌ను విమర్శిస్తూ ట్విటర్లో అభిమానులు ట్రోల్స్, మీమ్స్‌తో రెచ్చిపోయారు. తాజాగా టీమిండియా క్రికెటర్, కేకేఆర్ స్టార్ నితీశ్ రాణా.. ట్విటర్లో ఇషాన్ కిషన్ గత 13 మ్యాచ్‌ల్లో చేసిన స్కోర్లను విమర్శిస్తూ ఒక అభిమాని చేసిన ట్వీట్‌ను లైక్ చేయడం ఆసక్తి కలిగించింది. వరుసగా విఫలమవుతున్నా అవకాశాలు ఇవ్వడం ఏంటని ఇన్‌డైరెక్ట్‌గా నితీశ్ రాణా.. ట్వీట్ లైక్ చేయడం ద్వారా చెప్పకనే చెప్పాడు. ఇషాన్ కిషన్ లాగే నితీశ్ రాణా కూడా ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. అయితే ఇప్పుడున్న రాజకీయాల వల్ల అతనికి పెద్దగా అవకాశాలు రావడం లేదు. దీంతో సహనం కోల్పోతున్న క్రికెటర్లు సెలెక్టర్లపై తమకున్న కోపాన్ని ప్రస్టేషన్ రూపంలో బయటపెడుతున్నారు. తాజాగా నితీశ్ రాణా కూడా ఈ విధంగానే స్పందించడం వార్తల్లో నిలిచేలా చేసింది. టాపార్డర్ బ్యాటర్ అయిన నితీశ్ రాణా కేకేఆర్ తరపున కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఎన్నో మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించాడు. 2021 ఐపీఎల్ సీజన్లో 383 పరుగులు చేసిన అతనికి శ్రీలంక పర్యటనకు జట్టు నుంచి పిలుపు వచ్చింది. అలా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన నితీశ్ రాణా వన్డే, టీ20 అరంగేట్రం చేశాడు. ఆడిన ఒక వన్డేలో ఏడు పరుగులు చేసిన నితీశ్.. రెండు టి20 మ్యాచ్‌ల్లో 15 పరుగులు చేశాడు. ఈ వైఫల్యం తర్వాత మళ్లీ అతనికి అవకాశం రాలేదు. pic.twitter.com/S5COhdGo13 — Out Of Context Cricket (@GemsOfCricket) January 30, 2023 చదవండి: తొలి టెస్టుకు శ్రేయాస్ అయ్యర్ దూరం.. జడ్డూ రీఎంట్రీ పెళ్లి వేడుక ముగిసింది.. ప్రాక్టీస్ మొదలైంది -
బంతి కనిపించక ఇషాన్ కిషన్ ఉక్కిరిబిక్కిరి.. వీడియో వైరల్
ఐపీఎల్ 2022లో భాగంగా ముంబై ఇండియన్స్, కేకేఆర్ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బంతి కనిపించకపోవడంతో ఇషాన్ కిషన్ కాసేపు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. విషయంలోకి వెళితే.. కేకేఆర్ ఇన్నింగ్స్ 9వ ఓవర్ కుమార్ కార్తికేయ వేశాడు. ఓవర్ నాలుగో బంతిని నితీష్ రాణా రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బాటమ్ ఎడ్జ్ అవడంతో అక్కడే రోల్ అయింది. బంతి ఎక్కడ కనిపించకపోవడంతో కీపర్ ఇషాన్ అలాగే నిల్చుండిపోయాడు. అయితే బంతి అతని కింద నుంచి వెళ్లడం గమనించలేదు. ''అరె ఇషాన్.. బంతి నీ పక్కనే ఉంది'' అంటూ కుమార్ కార్తికేయ పేర్కొన్నాడు. అప్పటికే నితీష్ రాణా సింగిల్ పూర్తి చేశాడు. బంతిని అందుకున్న బుమ్రా ఇషాన్ చూస్తూ ఏమైంది అంటూ నవ్వాడు. ఇషాన్ కూడా ఏంటో ఏం అర్థం కాలేదు అన్నట్లుగా ఒక లుక్ ఇచ్చాడు. దీంతో మైదానంలో ఆటగాళ్ల మధ్య నవ్వులు విరపూశాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (24 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), నితీశ్ రాణా (26 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్ స్కోరర్లుగా నిలిచింది. ఐపీఎల్లో బుమ్రా తన అత్యుత్తమ ప్రదర్శన (5/10) నమోదు చేశాడు. అనంతరం ముంబై 17.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. ఇషాన్ కిషన్ (43 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. చదవండి: Venkatesh Iyer: 'అప్పటివరకు బాగానే.. ఇషాన్ చెప్పగానే ఔటయ్యాడు' Innocent Ishan Kishan 😹 pic.twitter.com/2Hrpjt2IQG — Boies Pilled Bell⁴⁵👊 (@Im_Perfect45) May 9, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కేకేఆర్ ఆటగాడి భారీ సిక్స్.. ప్రత్యర్థి జట్టు గ్లాస్ పగిలే!
ఐపీఎల్ 2022లో భాగంగా ఎస్ఆర్హెచ్, కేకేఆర్ మధ్య మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నితీష్ రాణా కొట్టిన ఒక భారీ సిక్స్ ఎస్ఆర్హెచ్ డగౌట్‌లోని ఫ్రిజ్ గ్లాస్‌ను పగులగొట్టింది. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఉమ్రాన్ మాలిక్ వేసిన ఆ ఓవర్ తొలి బంతిని నితీష్ థర్డ్‌మన్ దిశగా భారీ సిక్స్ బాదాడు. అయితే బంతి వేగంగా వెళ్లి ఎస్ఆర్హెచ్ డగౌట్లో ఉన్న ప్రిజ్ గ్లాస్‌ను బ్రేక్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నితీష్ రాణా భారీ సిక్సర్ కోసం క్లిక్ చేయండి చదవండి: IPL 2022: భలే గొప్ప ఎంట్రీ!.. ఆస్ట్రేలియా కెప్టెన్‌పై ఫ్యాన్స్ ట్రోల్ -
బుమ్రాకు అక్షింతలు.. నితీష్ రాణాకు జరిమానా!
ఐపీఎల్-2022లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు నితీష్ రాణాకు నిర్వాహకులు జరిమానా విధించారు. ఫలితంగా అతడి మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత పడింది. కేకేఆర్ ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన మురగన్ అశ్విన్ బౌలింగ్‌లో.. రాణా మిడ్ వికెట్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే బంతి నేరుగా ఫీల్డర్ డేనియల్ శామ్స్ చేతికి వెళ్లింది. దీంతో అసహానానికి గురైన రాణా.. పెవిలియన్‌కి వెళ్తూ బౌండరీ లైన్‌కి వెలుపల ఉన్న అడ్వర్టైజ్మెంట్ బోర్డుని బ్యాట్‌తో కొట్టాడు. అయితే రాణా లెవల్-1 నియమావళిని ఉల్లంఘించినందుకు మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు. మరోవైపు ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు మ్యాచ్ రిఫరీ మందలించాడు. బుమ్రా కూడా తన నేరాన్ని అంగీకరించాడు. అయితే బుమ్రా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఎక్కడ ఉల్లంఘించాడన్నది విషయంపై ఐపీఎల్ నిర్వాహకులు స్పష్టతనివ్వలేదు. ఇక ముంబై ఇండియన్స్‌పై కేకేఆర్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. ప్యాట్ కమిన్స్ చెలరేగడంతో 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. కమిన్స్ 15 బంతుల్లో 56 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. అతడితో పాటు ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ 50 పరుగులతో రాణించాడు. ముంబై బౌలర్లలో మురుగన్ అశ్విన్, టైమల్ మిల్స్ చెరో రెండు వికెట్లు తీయగా.. డేనియల్ సామ్స్ ఒక వికెట్ తీశాడు. కాగా అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (52), తిలక్ వర్మ (38) పరుగులతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో కమిన్స్ 2, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి చెరొక వికెట్ తీశారు. చదవండి: KKR vs MI: డేనియల్ సామ్స్ చెత్త రికార్డు.. రోహిత్‌కు ఆ అవకాశం ఇస్తే కదా! -
గతేడాది హీరోలు జీరోలవుతున్నారా.. ఏమైంది వీళ్లకు?!
ఐపీఎల్ పేరుకు క్యాష్ రిచ్ లీగ్ అయినా.. ఎంతో మంది ప్రతిభావంతమైన ఆటగాళ్లను వెలుగులోకి తెచ్చింది. ఐపీఎల్ 2021 సీజన్లో రుతురాజ్ గైక్వాడ్, వెంకటేశ్ అయ్యర్, పృథ్వీ షా, యశస్వి జైశ్వాల్, నితీష్ రాణాలు తమ జట్ల తరపున చాలా బాగా రాణించారు. అందుకే వీరిని మెగావేలంలో రిలీజ్ చేయకుండా తమతోనే అట్టిపెట్టుకుంది. మరి గతేడాది హీరోలుగా నిలిచిన వీళ్లు ఈసారి మాత్రం జీరోలుగా మిగిలిపోనున్నారా.. ఎందుకంటే ఇంతవరకు మనం ఆశించిన ఆటతీరు పైన చెప్పుకున్న ఐదుగురిలో ఒక్కసారి కూడా కనబడలేదు. ఒకవేళ లీగ్ ఇప్పుడే కదా ప్రారంభమైంది అనుకున్నా.. మరి రాబోయే మ్యాచ్‌ల్లోనైనా మెరుస్తారా అంటే అది చెప్పలేని పరిస్థితి. మరి వీళ్ల గురించి ఒకసారి తెలుసుకుందాం. -సాక్షి, వెబ్‌డెస్క్ రుతురాజ్ గైక్వాడ్(సీఎస్కే) Courtesy: IPL Twitter ఐపీఎల్ 2021 సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్. గత సీజన్లో విజేతగా నిలిచిన సీఎస్కే వెనుక రుతురాజ్ పాత్ర మరువలేనిది. 16 మ్యాచ్‌లాడిన రుతురాజ్ 635 పరుగులు సాధించి సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా పేరు పొందాడు. ఈ సీజన్లో మాత్రం ఇప్పటివరకు పూర్తిగా నిరాశపరిచాడు. సీఎస్కే ఆడిన మూడు మ్యాచ్‌లు కలిపి రుతురాజ్ రెండు పరుగులు మాత్రమే చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో రుతురాజ్ గోల్డెన్ డక్ అయ్యాడు. 25 ఏళ్ల రుతురాజ్ సరిగ్గా రాణించకపోవడంతో సీఎస్కే తొలి ఆరు ఓవర్లలో భారీ స్కోరు చేయడంలో విఫలమవుతుంది. ఇదే రుతురాజ్ గత సీజన్లో పవర్ ప్లేలో చెలరేగి ఆడడంతో సీఎస్కే ప్రతీ మ్యాచ్‌లోనూ మంచి స్కోరు లభించింది. అయితే రుతురాజ్ ఐపీఎల్ ప్రారంభానికి ముందు వరుసగా గాయాల బారీన పడ్డాడు. టీమిండియా ఆడిన పలు సిరీస్‌లు ఎంపికైనప్పటికి గాయాలతో దూరం కావడమో లేక బెంచ్‌కే పరిమితం అయ్యేవాడు. మరి రాబోయే మ్యాచ్‌ల్లోనైనా రుతురాజ్ రాణించాలని ఆశిద్దాం వెంకటేశ్ అయ్యర్(కేకేఆర్) Courtesy: IPL Twitter గతేడాది ఐపీఎల్ సీజన్లో వెంకటేశ్ అయ్యర్ పెను సంచలనం. సీజన్ ఆరంభంలో పెద్దగా రాణించని అయ్యర్.. రెండో అంచె పోటీల్లో కేకేఆర్‌కు వెన్నుముకగా మారాడు 10 మ్యాచ్‌ల్లో 370 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు. ఈ ప్రదర్శనతో టీమిండియాలోకి ఎంపికైన వెంకటేశ్ అయ్యర్ వెస్టిండీస్, శ్రీలంకతో జరిగిన సిరీస్‌ల్లో మోస్తరుగా రాణించాడు. అయితే ఐపీఎల్లో మరోసారి కీలకం అవుతాడనుకుంటే పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. ఇప్పటివరకు కేకేఆర్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా వచ్చిన వెంకటేశ్ అయ్యర్ వరుసగా 16,10,3 పరుగులు చేశాడు. యశస్వి జైశ్వాల్(రాజస్తాన్ రాయల్స్) Courtesy: IPL Twitter గతేడాది రాజస్తాన్ రాయల్స్ జట్టుగా విఫలమైనప్పటికి యశస్వి జైశ్వాల్ మాత్రం సక్సెస్ అయ్యాడు. అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకున్న యశస్వి జైశ్వాల్ 10 మ్యాచ్‌ల్లో 148 స్ట్రైక్‌రేట్‌తో 249 పరుగులు సాధించాడు. అయితే ఈ సీజన్లో మాత్రం జైశ్వాల్ అంతగా రాణించలేకపోతున్నాడు. మూడు మ్యాచ్‌లు కలిపి 25 పరుగులు మాత్రమే చేశాడు. అయితే రాజస్తాన్ రాయల్స్ ఈ సీజన్లో అంచనాలకు మించి రాణిస్తుండడం.. బట్లర్ లాంటి స్టార్ ఆటగాడు ఫామ్‌లో ఉండంతో పెద్దగా కనబడడం లేదు. కానీ యశస్వి జైశ్వాల్ ఓపెనర్‌గా తన మార్క్ చూపించాల్సిన అవసరం చాలా ఉంది పృథ్వీ షా(ఢిల్లీ క్యాపిటల్స్) Courtesy: IPL Twitter 2018 అండర్-19 ప్రపంచకప్ గెలిచిన టీమిండియా యంగ్ కెప్టెన్‌గా పృథ్వీ షా అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ నేపథ్యంలోనే 2018లో జరిగిన వేలంలో పృథ్వీని ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. 2021 సీజన్లో పృథ్వీ షా ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఘనమైన ఆరంభాలు ఇచ్చాడు. 15 మ్యాచ్‌ల్లో 479 పరుగులు చేసిన పృథ్వీ షా ఢిల్లీ క్యాపిటల్స్‌కు పవర్ ప్లేలో భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాటింగ్‌తో అలరించిన పృథ్వీ ఈసారి మాత్రం అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 38,10 పరుగులు చేసిన పృథ్వీ అనవసరంగా వికెట్ పారేసుకుంటున్నాడు. డేవిడ్ వార్నర్ జట్టులోకి వస్తే పృథ్వీ షా చోటు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. నితీష్ రాణా(కేకేఆర్) Courtesy: IPL Twitter టీమిండియాలో చోటు దక్కకపోయినా కొన్నేళ్ళుగా నితీష్ రాణా ఐపీఎల్లో మాత్రం కేకేఆర్‌కు కీలకంగా మారాడు. గత సీజన్లో 17 మ్యాచ్‌ల్లో 383 పరుగులు సాధించాడు. కానీ ఈసారి మాత్రం మూడు మ్యాచ్‌ల్లో 21,10,0 పరుగులు చేశాడు. రాణా ఫామ్‌లోకి రావాలని కేకేఆర్ బలంగా కోరుకుంటుంది. చదవండి: Shikar Dhawan: 'లవ్ ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసింది.. కోహినూర్ డైమండ్‌ను మిస్సయ్యావు!' IPL 2022: దుమ్మురేపుతున్న టీమిండియా అన్క్యాప్డ్ ఆటగాళ్లు.. భవిష్యత్తు వీళ్లదే -
మెగావేలంలో టాప్ లేపిన భారత కుర్రాళ్లు
IPL 2022 Auction: ఐపీఎల్ మెగావేలం 2022లో ఊహించనట్లుగానే టీమిండియా యువ ఆటగాళ్లు సత్తా చాటారు. అంచనాలకు మించి ఈ ఆటగాళ్లు మంచి ధరను సొంతం చేసుకున్నారు. నితీష్ రాణా, హర్షల్ పటేల్, ఆల్‌రౌండర్ దీపక్ హుడా, దేవదూత్ పడిక్కల్ ఈ జాబితాలో ఉన్నారు. హర్షల్ పటేల్: గత సీజన్లో అంచనాలకు మించి రాణించిన హర్షల్ పటేల్‌కు జాక్‌పాట్ తగిలింది. 32 వికెట్లతో పర్పుల్‌క్యాప్ అందుకున్న హర్షల్‌ను మరోసారి ఆర్సీబీ దక్కించుకుంది. రూ. 2 కోట్ల కనీస ధరతో బరిలోకి దిగిన హర్షల్‌ను రూ. 10.75 కోట్లకు ఆర్సీబీ మరోసారి దక్కించుకుంది. నవంబర్ 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన టి20 సిరీస్ ద్వారా టీమిండియా తరపున హర్షల్ పటేల్ అరంగేట్రం చేశాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే రెండు వికెట్లు తీసిన హర్షల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. దేవదూత్ పడిక్కల్: టీమిండియా అన్క్యాప్డ్ ప్లేయర్ దేవదూత్ పడిక్కల్ దశ తిరిగింది. ఐపీఎల్ 2020, 2021 సీజన్లలో ఆర్సీబీ తరపున దేవదూత్ పడిక్కల్ దుమ్మురేపాడు. ఐపీఎల్ 2020 సీజన్లో 473 పరుగులతో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు గెలుచుకున్న పడిక్కల్.. మరుసటి ఏడాది ఐపీఎల్ సీజన్లోనూ అదే జోరు చూపెట్టాడు. 411 పరుగులు చేసిన పడిక్కల్ సీజన్లో వేగవంతమైన సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. 51 బంతుల్లోనే సెంచరీ మార్క్ సాధించి ఔరా అనిపించాడు.తాజాగా ఐపీఎల్ మెగావేలంలో ఆర్సీబీ అతని కోసం పోటీపడినప్పటికి చివరికి రాజస్తాన్ రాయల్స్ రూ. 7.75 కోట్లకు దక్కించుకుంది. నితీష్ రాణా: గత సీజన్లో కేకేఆర్ తరపున నితీష్ రాణా మంచి ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతనిపై నమ్మకముంచిన కేకేఆర్ నితీష్ రాణాను రూ. 8 కోట్లతో దక్కించుకుంది. కాగా గత సీజన్లో కేకేఆర్ తరపున 17 మ్యాచ్‌ల్లో 383 పరుగులు చేసిన నితీష్ ఖాతాలో రెండు అర్థసెంచరీలు ఉన్నాయి. కాగా 2015లో తొలిసారి ఐపీఎల్లో అరంగేట్రం చేసిన నితీష్ రానా ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తొలి సీజన్లో ఒక్క మ్యాచ్ ఆడని నితీష్.. ఆ తర్వాతి సీజన్లో 4 మ్యాచ్‌ల్లో 104 పరుగులు చేశాడు. 2017 సీజన్లో 13 మ్యాచ్‌ల్లో 333 పరుగులతో ఆకట్టుకున్న నితీష్‌ను ముంబై రిలీజ్ చేయగా.. 2018 వేలంలో అతన్ని కేకేఆర్ దక్కించుకుంది. అప్పటినుంచి నితీష్ రాణా కేకేఆర్ రెగ్యులర్ ప్లేయర్‌గా మారిపోయాడు. దీపక్హుడా: టీమిండియా ఆల్‌రౌండర్ దీపక్ హుడాను రూ. 5.75 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. రూ. 75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన దీపక్ హుడాది మంచి ధరే అని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఐపీఎల్లో 80 మ్యాచ్‌లాడిన దీపక్ హుడా 785 పరుగులు చేశాడు. -
గోల్డెన్ డక్ విషయంలో నితీష్ రాణా చెత్త రికార్డు
Nitish Rana Golden Duck.. గోల్డెన్ డక్ విషయంలో కేకేఆర్ బ్యాటర్ నితీష్ రాణా చెత్త రికార్డు నమోదు చేశాడు. 2020 ఏడాది ఆరంభం మొదలైనప్పటి నుంచి నితీష్ రాణా ఐదుసార్లు గోల్డెన్‌డక్‌గా వెనుదిరగడం విశేషం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే సీఎస్కేతో జరుగుతున్న ఐపీఎల్ 2021 సీజన్ ఫైనల్లో కేకేఆర్ ఓటమి దిశగా పయనిస్తుంది. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసేసరికి ఏడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే కేకేఆర్‌కు 193 పరుగుల భారీ లక్ష్యం విధించింది. సీఎస్కే ఓపెనర్ డుప్లెసిస్ (59 బంతుల్లో 86;7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా.. రుతురాజ్ 32, ఊతప్ప 31 పరుగులు చేశారు. ఆఖర్లో మొయిన్ అలీ 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేయడంతో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ 2, శివమ్ మావి 1 వికెట్ తీశాడు. -
నితీష్ దెబ్బకు కెమెరా పగిలింది.. రషీద్ ఏం చేస్తున్నాడు
ఐపీఎల్ 2021లో భాగంగా ఆదివారం రాత్రి ఎస్ఆర్హెచ్, కేకేఆర్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా కేకేఆర్ ఇన్నింగ్స్ సమయంలో ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో నితీష్ రాణా బౌండరీ కొట్టాడు. అయితే బంతి బౌండరీ దాటి పక్కనే ఉన్న కెమెరాకు తాకి లెన్స్ పగిలిపోయాయి. అదే సమయంలో బంతిని అందుకోవడంలో విఫలమైన రషీద్ పగిలిన కెమెరాలో వేలు పెట్టి చూశాడు. ఆ తర్వాత ఏంటో ఇది.. అంటూ ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లను చూస్తూ నవ్వుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Glenn Maxwell: ఒకసారి అంటే సరే.. మళ్లీ అదేనా.. ఏంటి మ్యాక్సీ ఇక మ్యాచ్‌లో కేకేఆర్ విజయాన్ని అందుకుంది. 116 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 4 వికెట్లు కోల్పోయి చేధించింది. శుబ్‌మన్ గిల్ హాఫ్‌సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ విజయంతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపు ఖరారు చేసుకున్నట్లే. రాజస్తాన్ రాయల్స్‌తో జరగనున్న చివరి మ్యాచ్‌లో కేకేఆర్ విజయం అందుకుంటే ఎలాంటి సమీకరణాలు లేకుండానే నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్‌కు చేరనుంది. చదవండి: ఐపీఎల్ 2021 సీజన్లో అత్యంత ఫాస్ట్‌బాల్.. డెబ్యూ మ్యాచ్‌లోనే Nitish Rana breaks Camera lens😍#KKRvSRH #IPL2021 #NitishRana pic.twitter.com/7ItIPsK6rb — Subuhi S (@sportsgeek090) October 3, 2021 -
IPL 2021: కోల్‌కతా ఫటాఫట్.. ముంబైపై ఘన విజయం
అబుదాబి: యూఏఈ గడ్డపై గత రెండు రోజులు చప్పగా సాగిన మ్యాచ్‌లకు, బోర్ కొట్టిన ప్రేక్షకులకు చక్కటి మెరుపు విందు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇచ్చింది. సిక్సర్లు, ఫోర్లతో 150 పైచిలుకు లక్ష్యాన్ని 15.1 ఓవర్లలోనే ముగించేసింది. ఐపీఎల్లో గురువారం జరిగిన పోరులో కోల్‌కతా 7 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిరీ్ణత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ (42 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు. ఫెర్గూసన్, ప్రసిధ్ కృష్ణ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 15.1 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగులు చేసి గెలిచింది. రాహుల్ త్రిపాఠి (42 బంతుల్లో 74 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), వెంకటేశ్ అయ్యర్ (30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగారు. కోల్‌కతా కోల్పోయిన మూడు వికెట్లు బుమ్రాకే దక్కాయి. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠిలకు కాకుండా రోహిత్ శర్మ వికెట్ తీసిన స్పిన్నర్ సునీల్ నరైన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కడం గమనార్హం. ఓపెనింగ్ అదిరినా... కోల్‌కతా జట్టు పార్ట్‌టైమ్ ఆఫ్ స్పిన్నర్ నితీశ్ రాణాతో తొలి ఓవర్ వేయించి ఆశ్చర్యపరిచింది. ముంబైకి ఓపెనింగ్ జోడీ ఇచ్చిన శుభారంభం... వంద స్కోరు దాకా 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన వైనం చూస్తే... భారీ స్కోరు తథ్యమనిపించింది. కానీ 150 పరుగుల పైచిలుకు పరుగులతోనే సర్దుకుంది. ఓపెనర్లలో ముందుగా అదరగొట్టింది రోహిత్ శర్మే. బౌండరీలతో స్కోరు వేగాన్ని పెంచాడు. కాసేపటికే డికాక్ ఈ వేగానికి సిక్సర్లతో మెరుపుల్ని జతచేశాడు. ఫెర్గూసన్ బౌలింగ్‌లో ఒకటి, ప్రసిధ్ కృష్ణ ఓవర్లో రెండు సిక్సర్లు బాదేయడంతో పవర్ ప్లేలో ముంబై 56/0 స్కోరు చేసింది. తర్వాత రసెల్‌ను బౌలింగ్‌కు దించినా డికాక్ వరుస బౌండరీలతో తన జోరు చూపాడు. కానీ తర్వాతి పదో ఓవర్లో నరైన్... రోహిత్ శర్మ (30 బంతుల్లో 33; 4 ఫోర్లు)ను ఔట్ చేసి 78 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరదించాడు. సూర్యకుమార్ (5)ను ప్రసిధ్ కృష్ణ పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో డికాక్ క్రీజులో ఉన్నా... ఇషాన్ కిషన్ (14; 1 సిక్స్) లాంటి హిట్టర్ జతయినా ముంబై స్కోరు మందగించింది. డికాక్ 37 బంతుల్లో ఫిఫ్టీ (3 ఫోర్లు, 3 సిక్స్‌లు) పూర్తి చేసుకున్న కాసేపటికే పెవిలియన్ బాటపట్టాడు. పొలార్డ్ (15 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్), కృనాల్ (12) వారి శైలికి తగ్గట్లు ధాటిగా ఆడలేకపోయారు. సిక్సర్లతో షురూ... ఆట మొదలైందో లేదో చకచకా బాదేసే పనిలో పడ్డారు కోల్‌కతా ఓపెనర్లు. బౌల్ట్ లాంటి మేటి బౌలర్ వేసిన తొలి ఓవర్ రెండో బంతిని శుబ్‌మన్ గిల్ (13), నాలుగో బంతిని వెంకటేశ్ అయ్యర్ సిక్సర్లుగా బాదారు. తర్వాత మిల్నేకు 6, 4, 4లతో అయ్యర్ తన తడాఖా చూపెట్టాడు. 2 ఓవర్లకే నైట్‌రైడర్స్ స్కోరు 30/0. బుమ్రా వేసిన మూడో ఓవర్లో ఇద్దరు చెరో బౌండరీ కొట్టారు. కానీ బుమ్రా... గిల్‌ను బోల్తా కొట్టించాడు. తొలి 3 ఓవర్లలోనే 40 పరుగులు రావడంతో తర్వాత కాస్త నింపాదిగా ఆడినాసరే జట్టు రన్‌రేట్ లక్ష్యాన్ని కరిగించే వరకు పది పరుగులకు దిగనేలేదు. అయ్యర్ తన ధాటిని కొనసాగించాడు. రాహుల్ త్రిపాఠి ముందు జాగ్రత్త పడ్డాడు... తర్వాత ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో ఇన్నింగ్స్ పదో ఓవర్లో జట్టు స్కోరు 100 దాటింది. 11వ ఓవర్లో అయ్యర్ 25 బంతుల్లో (4 ఫోర్లు, 3 సిక్స్‌లు), 12వ ఓవర్లో త్రిపాఠి 29 బంతుల్లో (5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలను ధనాధన్‌గా అధిగమించారు. అయ్యర్ ఔటైనా త్రిపాఠి నిలబడి మిగతా లాంఛనాన్ని 15.1 ఓవర్లలోనే పూర్తి చేశాడు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) శుబ్‌మన్ గిల్ (బి) నరైన్ 33; డికాక్ (సి) నరైన్ (బి) ప్రసిధ్ కృష్ణ 55; సూర్యకుమార్ (సి) దినేశ్ కార్తీక్ (బి) ప్రసిధ్ కృష్న 5; ఇషాన్ కిషన్ (సి) రసెల్ (బి) ఫెర్గూసన్ 14; పొలార్డ్ (రనౌట్) 21; కృనాల్ (సి) వెంకటేశ్ (బి) ఫెర్గూసన్ 12; సౌరభ్ తివారీ (నాటౌట్) 5; మిల్నే (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–78, 2–89, 3–106, 4–119, 5–149, 6–149. బౌలింగ్: నితీశ్ రాణా 1–0–5–0, వరుణ్ చక్రవర్తి 4–0–22–0, సునీల్ నరైన్ 4–0–20–1, ఫెర్గూసన్ 4–0–27–2, ప్రసిధ్ కృష్ణ 4–0–43–2, రసెల్ 3–0–37–0. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: శుబ్‌మన్ గిల్ (బి) బుమ్రా 13; వెంకటేశ్ అయ్యర్ (బి) బుమ్రా 53; రాహుల్ త్రిపాఠి (నాటౌట్) 74; మోర్గాన్ (సి) బౌల్ట్ (బి) బుమ్రా 7; నితీశ్ రాణా (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (15.1 ఓవర్లలో 3 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–40, 2–128, 3–147. బౌలింగ్: బౌల్ట్ 2–0–23–0, మిల్నే 3–0–29–0, బుమ్రా 4–0–43–3, కృనాల్ 3–0–25–0, రాహుల్ చహర్ 3–0–34–0, రోహిత్ శర్మ 0.1–0–4–0. -
లంక కెప్టెన్ షనక స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్
కొలంబో: టీమిండియాతో జరిగిన మూడో టీ 20 మ్యాచ్‌లో లంక కెప్టెన్ దాసున్ షనక స్టన్నింగ్ క్యాచ్‌తో అదరగొట్టాడు. నితీష్ రాణా ఇచ్చిన క్యాచ్‌ను డైవ్ చేస్తూ ఒంటిచేత్తో అద్బుతంగా అందుకున్నాడు. ఇన్నింగ్స్ 9 ఓవర్ చివరి బంతికి ఇది చోటుచేసుకుంది. షనక వేసిన బంతిని షాట్ ఆడే ప్రయత్నంలో అతని బ్యాట్‌కు తగిలి షనక వైపు వచ్చింది. అయితే షనక వేగంగా పరిగెత్తుకొచ్చి ఒకవైపుగా డైవ్ చేస్తూ అందుకున్నాడు. ఇక షనక తానే బౌలింగ్ చేసి.. ఆ తర్వాత క్యాచ్‌ను అందుకోవడం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా దారుణ ప్రదర్శన కనబరిచింది. లంక బౌలర్ల దాటికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 81 పరుగులు మాత్రమే చేసింది.. భారత బ్యాటింగ్‌లో కుల్దీప్ యాదవ్ 23 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఏడుగురు బ్యాట్స్మెన్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అందులో ధావన్ గోల్డెన్ డక్‌గా వెనుదిరగ్గా.. మిగతా ఇద్దరు డకౌట్‌గా వెనుదిరగడం విశేషం. లంక బౌలర్ వినిందు హసరంగ 4 వికెట్లతో దుమ్మురేపగా.. దాసున్ షనక రెండు వికట్లు తీశాడు. ఆ తర్వాత స్వల్ప లక్ష్యఛేదనలో శ్రీలంక 14.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 82 పరుగులు చేసింది. ధనంజయ డిసిల్వా (20 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు), హసరంగ (9 బంతుల్లో 14 నాటౌట్; 1 ఫోర్) జట్టుకు విజయాన్ని కట్టబెట్టారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన హసరంగ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులను అందుకున్నాడు. ఈ ఫార్మాట్లో ఎనిమిది వరుస సిరీస్ విజయాలతో దూసుకెళ్తున్న భారత్‌కు శ్రీలంక రూపంలో బ్రేక్ పడింది. శ్రీలంకకు ఐదు వరుస టి20 సిరీస్ పరాజయాల తర్వాత దక్కిన తొలి సిరీస్ ఇదే కావడం విశేషం. అంతేకాకుండా 2008 తర్వాత భారత్‌పై ద్వైపాక్షిక సిరీస్‌లో విజేతగా నిలువడం శ్రీలంకకు ఇదే తొలిసారి. EXTRAORDINARY GRAB 🤯 Dasun Shanaka with a 🔥 return catch to get rid of Rana 💪 Tune into #SonyLIV now 👉 https://t.co/1qIy7cs7B6 📺📲#SLvsINDonSonyLIV #SLvIND #NitishRana #Wicket pic.twitter.com/fVhbmGFkXr — SonyLIV (@SonyLIV) July 29, 2021 -
Ind Vs Sl: ఐదుగురు భారత ప్లేయర్ల అరంగేట్రం
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో ఐదుగురు భారత క్రికెటర్లు అరంగేట్రం చేశారు. సంజూ శాంసన్, నితీశ్ రానా, చేతన్ సకారియా, కె.గౌతమ్, రాహుల్ చహర్ వన్డే క్రికెట్లో అడుగుపెట్టారు. బరోడా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా స్థానంలో గౌతం, ఇషాన్ కిషన్ స్థానంలో సంజూ శాంసన్, స్పిన్ ద్వయం కుల్దీప్-చహల్ స్థానంలో రాహుల్ చహర్- నితీశ్ రానా, నవదీప్ సైనీకి జంటగా మరో పేసర్‌గా చేతన్ సకారియాకు జట్టులో చోటు కల్పించారు ఇక భువనేశ్వర్ కుమార్‌కు విశ్రాంతినివ్వగా.. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ అతడి బాధ్యతలను నెరవేర్చనున్నాడు. కాగా టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా సిరీస్‌లో చివరిదైన వన్డేలో ఎలాగైనా క్లీన్‌స్వీప్ టీమిండియా భావిస్తుండగా.. నామమాత్రపు మ్యాచ్‌లోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని ఆతిథ్య శ్రీలంక జట్టు తహతహలాడుతోంది. భారత తుది జట్టు: పృథ్వీ షా, శిఖర్ ధావన్(కెప్టెన్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్, నితీశ్ రాణా, హార్దిక్ పాండ్యా, క్రిష్ణప్ప గౌతం, రాహుల్ చహర్, నవదీప్ సైనీ, చేతన్ సకారియా శ్రీలంక తుది జట్టు: అవిష్క ఫెర్నాండో, మినోద్ భనుక, భనుక రాజపక్స, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, దసున్ శనక(కెప్టెన్), రమేశ్ మెండిస్, చమిక కరుణరత్నే, అకిల ధనుంజయ, దుష్మంత చమీరా, ప్రవీన్ జయవిక్రామ. 🎥 🎥: That moment when the 5⃣ ODI debutants received their #TeamIndia cap!👏 👏 #SLvIND@IamSanjuSamson | @NitishRana_27 | @rdchahar1 | @Sakariya55 | @gowthamyadav88 pic.twitter.com/1GXkO13x5N — BCCI (@BCCI) July 23, 2021 -
నేను రెడీగా ఉన్నా, కాల్ రావడమే ఆలస్యం: నితీష్ రాణా
న్యూఢిల్లీ: గత కొంతకాలంగా ఐపీఎల్ సహా దేశవాళీ క్రికెట్లోనూ విశేషంగా రాణిస్తున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు నితీష్ రాణా.. తన ప్రదర్శనే తనకు జతీయ జట్టులో స్థానం సంపాదించి పెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు జులైలో శ్రీలంక పర్యటనకు బయలుదేరనున్న భారత జట్టులో స్థానాన్ని ఆశిస్తున్న ఈ కేకేఆర్ ఓపెనర్.. గత మూడేళ్లుగా తన అటతీరు చాలా మెరుగుపడిందని, అందుకు తన గణాంకాలే నిదర్శమని, ఇవే తన అంతర్జాతీయ అరంగేట్రానికి తోడ్పడతాయని ధీమా వ్యక్తం చేశాడు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ప్రతి ఒక్క ఆటగాడి కల అని, నేను కూడా భారత్ తరఫున రంగంలోకి దిగేందుకు రెడీగా ఉన్నానని, సెలెక్షన్ కమిటీ నుంచి కాల్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాని పేర్కొన్నాడు. భారత టెస్టు జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనున్న నేపథ్యంలో లంక పర్యటన తనకు లభించిన సువర్ణావకాశమని ఈ 27 ఏళ్ల డాషింగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ అభిప్రాయపడ్డాడు. ఆరేళ్ల ఐపీఎల్ కెరీర్లో ఢిల్లీ, కేకేఆర్ జట్ల తరఫున 67 మ్యాచ్‌ల్లో 13 హాఫ్ సెంచరీల సాయంతో 1638 పరుగులు సాధించిన రాణా..38 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 40కి పైగా సగటుతో 2266 పరుగులు సాధించాడు. కాగా, భారత టెస్టు జట్టు సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనలో బిజీగా గడపనున్న నేపథ్యంలో వైట్ బాల్ స్పెషెలిస్ట్‌లను లంక పర్యటనకు పంపాలని బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. కోహ్లి, రోహిత్, బుమ్రా లాంటి స్టార్ల గైర్హాజరీలో రాణా సహా చాలా మంది యువ క్రికెటర్లు అంతర్జాతీయ అరంగేట్రంపై ఆశలు పెంచుకున్నారు. చదవండి: భారత మహిళల బ్యాటింగ్ కోచ్‌గా శివ్ సుందర్ దాస్.. -
ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన మహేంద్రుడు..
ముంబై: టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో(ఐపీఎల్) చరిత్ర సృష్టించాడు. లీగ్ చరిత్రలో ఇంత వరకు ఏ వికెట్ కీపర్‌కు సాధ్యంకాని 150 డిస్మిసల్స్ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌లలో సమాంతరంగా రాణిస్తూ.. తన జట్టును మూడు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన మహేంద్రుడు.. లీగ్ చరిత్రలో 150 మందిని ఔట్ చేసిన తొలి వికెట్ కీపర్‌గా రికార్డు పుటల్లోకెక్కాడు. ముంబైలోని వాంఖడే వేదికగా బుధవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో నితీశ్ రాణా క్యాచ్ అందుకోవడం ద్వారా ధోని ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు 208 మ్యాచ్‌ల్లో113 క్యాచ్లందుకున్న ఈ మిస్టర్ కూల్ కెప్టెన్.. 39 స్టంపింగ్‌లు చేశాడు. వికెట్ కీపర్‌గా అత్యధిక డిస్మిసల్స్లో భాగస్వాములైన ఆటగాళ్ల జాబితాలో ధోని తర్వాతి స్థానంలో కేకేఆర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఉన్నాడు. డీకే ఇప్పటి వరకు 112 క్యాచ్‌లు, 31 స్టంపింగ్‌లు చేసి 143 డిస్మిసల్స్తో రెండో స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే, నిన్న కేకేఆర్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో చెన్నై 18 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో ధోని మూడు కీలకమైన క్యాచ్‌లందుకుని చెన్నై విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. చదవండి: భారీ టార్గెట్‌ను చూసి టాపార్డర్ జడుసుకుంది.. అందుకే అలా -
మూడుసార్లు గోల్డెన్ డక్.. మూడు సార్లు 80కి పైగా పరుగులు
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో కేకేఆర్ ఓపెనర్ నితీష్ రానా( 80, 56 బంతులు; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కేకేఆర్ 187 పరుగుల భారీ స్కోరు చేయడంలో నితీష్ కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే నితీష్ రానా ఒక అరుదైన రికార్డును సాధించాడు. ఐపీఎల్లో రానా చివరి ఆరు ఇన్నింగ్స్‌లు చూసుకుంటే వరుసగా 0, 81, 0,87,0,80 పరుగులు సాధించాడు. ఇందులో విశేషమేమిటంటే సరి, బేసి విధానంలో మూడు సార్లు గోల్డెన్ డక్.. మరో మూడు సార్లు 80కి పైగా పరుగులు సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. రానా 80 పరుగులు చేయగా.. అతనికి త్రిపాఠి( 54 పరుగులతో సహకరించాడు. చివర్లో కార్తీక్ 9 బంతుల్లోనే 22 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో కేకేఆర్ ఎస్ఆర్హెచ్ ముందు భారీ టార్గెట్‌ను ఉంచింది. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 10 పరుగులు చేసింది. చదవండి: సన్‌రైజర్స్‌తో ఆనాటి మ్యాచ్ గుర్తుకో తెచ్చుకో రసెల్..! 'పంత్ కూల్‌గా ఉండడం మాకు కలిసొచ్చింది' -
కేకేఆర్‌కు భారీ షాక్.. స్టార్ ఆటగాడికి కరోనా
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ నితీష్ రాణాకు గురువారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల ముగిసిన దేశవాళీ టోర్నీల్లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రాణా.. రెండు రోజుల కిందట గోవా ట్రిప్ నుంచి తిరిగి వచ్చాడు. బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు రిపోర్ట్ చేసే సమయంలో అతనికి కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతను ఓ ప్రైవేటు హోటల్లో క్వారెంటైన్లో ఉంటున్నాడు. అయితే అతనికి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని సమాచారం. కాగా, కోల్‌కతా ఈ సీజన్లో తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 11న సన్‌రైజర్స్‌తో ఆడనుంది. గత నాలుగు ఐపీఎల్ సీజన్లుగా కోల్‌కతా నైట్‌రైడర్స్ కీలక సభ్యుడిగా నిలకడగా రాణిస్తున్న రాణా.. దాదాపు ప్రతి సీజన్లో 300కుపైగా పరుగులు చేశాడు. యూఏఈలో జరిగిన గత ఐపీఎల్ సీజన్లో అతను 138.58 స్ట్రయిక్ రేట్‌తో 352 పరుగులు చేశాడు. రాణా తన ఓవరాల్ ఐపీఎల్ కెరీర్లో 60 మ్యాచ్‌ల్లో 135.56 స్ట్రయిక్ రేట్‌తో 1437 పరుగులు చేశాడు. ఇందులో 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: 2017లో పూణే ఫైనల్ చేరడానికి ధోనినే కారణం..స్మిత్ కాదు -
కోల్‌కతాకు చెన్నై దెబ్బ
చెన్నై సూపర్ కింగ్స్ పోతూ పోతూ కోల్‌కతానూ లీగ్ నుంచే తీసుకెళ్లనుంది. మిగిలున్న రెండు మ్యాచ్‌ల్ని తప్పనిసరిగా గెలిచినా... అంతంత మాత్రమే ప్లే ఆఫ్స్ అవకాశాలున్న నైట్‌రైడర్స్‌పై సూపర్‌కింగ్స్ దెబ్బ వేసింది. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ వీరోచితంగా పోరాడగా... జడేజా మెరుపు బ్యాటింగ్‌తో ఉత్కంఠను విజయం వైపు మార్చేశాడు. 30 పరుగులు చేయాల్సిన సమయంలో జడేజా ఒక్కడే 29 పరుగులు బాది గెలిపించాడు. దుబాయ్: ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నాక చెన్నై ఇప్పుడు వరుసగా గెలుస్తోంది. గత మ్యాచ్‌లో బెంగళూరును చిత్తు చేసిన సూపర్‌కింగ్స్... తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. నితీశ్ రాణా (61 బంతుల్లో 87; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించాడు. ఇన్‌గిడి 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రుతురాజ్ గైక్వాడ్ (53 బంతుల్లో 72; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెన్నై గెలిచేందుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడేయగా... జడేజా ఆఖర్లో సిక్సర్లతో జట్టును గెలిపించాడు. రాయుడు (20 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. రఫ్ఫాడించిన రాణా తొలి బంతి పడగానే శుబ్‌మన్ గిల్ బౌండరీతో కోల్‌కతాకు మంచి ఆరంభమిచ్చాడు. ఆ మరుసటి బంతి కూడా లైన్ దాటింది. నితీశ్ రాణా కూడా ఓ ఫోర్ కొట్టడంతో ఆ ఓవర్లో 13 పరుగులొచ్చాయి. అయితే సామ్ కరన్, ఇన్‌గిడి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తర్వాత 4 ఓవర్లలో 20 పరుగులే వచ్చాయి. ఇక ఆరో ఓవర్‌ను రాణా రఫ్ఫాడించాడు. సాన్‌ట్నర్ బౌలింగ్‌లో వరుసగా 4, 4, 6తో 15 పరుగులు పిండుకున్నాడు. తర్వాత స్వల్ప వ్యవధిలో గిల్ (17 బంతుల్లో 26; 4 ఫోర్లు), సునీల్ నరైన్ (7) అవుట్ కావడంతో రన్‌రేట్ మందగించింది. కాసేపు నితీశ్‌తో జతకలిసిన రింకూ సింగ్ (11 బంతుల్లో 11; 1 ఫోర్) కూడా ఎక్కువ సేపు నిలువకపోయినా... ఉన్నంతసేపయినా ధాటిగా ఆడలేకపోయాడు. దీంతో కాస్త చూసుకొని ఆడిన నితీశ్ రాణా 44 బంతుల్లో (7 ఫోర్లు, 1 సిక్స్) ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. భారీ సిక్సర్లతో... కోల్‌కతా చేతిలో వికెట్లున్న స్కోరు ఆశించినంత వేగం అందుకోలేకపోయింది. తొలి 50 పరుగుల్ని 6.2 ఓవర్లలో చేసిన కోల్‌కతా రెండో 50 (100) పరుగులు చేసేందుకు మరో 8 ఓవర్లు పట్టింది. ఇలా ఆలస్యంగా... 15వ ఓవర్లో మూడంకెల స్కోరును అధిగమించిది. అప్పటిదాకా నింపాదిగా ఆడుతున్న నితీశ్ తర్వాత ఒక్కసారిగా చెలరేగాడు. చెన్నై స్పిన్నర్ కరణ్ శర్మపై భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అతను వేసిన 16వ ఓవర్లో డీప్ మిడ్‌వికెట్, డీప్ స్క్వేర్‌లెగ్, లాంగాన్‌ల మీదుగా వరుసగా మూడు సిక్సర్లు బాదేశాడు. దీంతో ఆ ఓవర్లోనే కోల్‌కతా ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 19 పరుగులు వచ్చాయి. మరుసటి ఓవర్లోనూ రాణా దూకుడు కొనసాగింది. చెన్నై సారథి ధోని వెంటనే పేసర్ దీపక్ చహర్‌కు బంతిని అప్పగించగా... 17వ ఓవర్లో రాణా రెండు బౌండరీలు కొట్టాడు. ఇతని జోరుకు 18వ ఓవర్లో ఇన్‌గిడి బ్రేకువేయగా... ఆఖరి ఓవర్లలో మోర్గాన్ (15), దినేశ్ కార్తీక్ ( 10 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు) బౌండరీలతో స్కోరు పెంచారు. మొదటి 15 ఓవర్లు ఆడి 106/3 స్కోరు చేసిన నైట్‌రైడర్స్ చివరి 5 ఓవర్లలో 66 పరుగులు చేసింది. నడిపించిన రుతురాజ్ లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ తొలి ఓవర్లో పరుగులు చేసేందుకు ఇబ్బందిపడ్డా... రెండో ఓవర్ నుంచి సిక్స్, మూడో ఓవర్లో బౌండరీలతో జోరందుకుంది. వాట్సన్ స్క్వేర్‌లెగ్ మీదుగా సిక్సర్ బాదగా... తర్వాత ఓవర్లో రుతురాజ్, వాట్సన్ చెరో ఫోర్ కొట్టారు. వరుణ్ చక్రవర్తి వేసిన ఆరో ఓవర్లో రుతురాజ్ లాంగాఫ్‌లో భారీ సిక్సర్ బాదేశాడు. పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా చెన్నై 44 పరుగులు చేసింది. జట్టు స్కోరు 8వ ఓవర్లో 50 పరుగులకు చేరగా... అదే ఓవర్లో వాట్సన్ (14)ను చక్రవర్తి పెవిలియన్‌కు పంపాడు. రుతురాజ్‌కు రాయుడు జతయ్యాడు. నితీశ్ రాణా వేసిన పదో ఓవర్లో వరుసగా రాయుడు వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. 16 పరుగులు రావడంతో జోరు తగ్గిన చెన్నైలో జోష్ నింపాడు. ఆ తర్వాత ఓవర్‌ను రుతురాజ్ తన వంతుగా బాదేశాడు. ఫెర్గూసన్ బౌలింగ్‌లో 4, 6 కొట్టాడు. 37 బంతుల్లో (4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రుతురాజ్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 12వ ఓవర్లో రాయుడు కూడా కవర్స్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. చెన్నై 100 పరుగులకు చేరుకుంది. ఇలా మెరుపులతో సాగిపోతున్న చెన్నై స్వల్పవ్యవధిలో కష్టాలెదురయ్యాయి. మొదట రాయుడు, ఆరు బంతుల తేడాతో కెప్టెన్ ధోని ఔటయ్యారు. చెన్నై విజయానికి 32 బంతుల్లో ఇంకా 52 పరుగులు కావాలి. గెలిపించిన జడేజా ఓవర్‌కు పది పరుగులు చేయాల్సిన పరిస్థితి చెన్నైది. ఇలాంటి దశలో సూపర్‌కింగ్స్‌కు వెన్నెముకగా నిలిచిన రుతురాజ్ గైక్వాడ్ కూడా ఔట్ కావడంతో చెన్నై శిబిరంలో కలవరం మొదలైంది. రవీంద్ర జడేజా క్రీజులోకి రాగా ఆఖరి 12 బంతుల్లో 30 పరుగులు చేయాలి. 19వ ఓవర్ వేసిన ఫెర్గూసన్ లయతప్పాడు. దీన్ని అనువుగా మలచుకున్న జడేజా రెచ్చిపోయాడు. 4, 3, 6, 4 చకచకా పరుగులు జతచేశాడు. వైడ్, నోబాల్తోకలిపి ఫెర్గూసన్ 20 పరుగులిచ్చాడు. ఆట ఆఖరి ఓవర్‌కు చేరింది. చెన్నై 10 పరుగులు చేయాల్సివుండగా... కమలేశ్ నాగర్కోటి 0, 2, 1, 0 డాట్ బాల్స్‌తో ఒత్తిడి పెంచాడు. 2 బంతుల్లో 7 పరుగులు చేయాల్సిన దశలో కాస్త ఉత్కంఠ రేగినా... జడేజా డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్స్ బాదేశాడు. ఇక బంతి మిగలగా పరుగు చేస్తే సరిపోతుంది. కానీ దీన్ని కూడా జడేజా లాంగాన్ మీదుగా సిక్సర్ బాదేయడంతో చెన్నై గెలిచి కోల్‌కతాను ముంచింది. తాజా ఫలితంతో ఇప్పుడు అధికారికంగా ముంబై ఇండియన్స్ ‘ప్లే ఆఫ్స్’కు చేరింది. మరోవైపు కోల్‌కతా ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా కోల్పోయినట్లే! స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గిల్ (బి) కరణ్ శర్మ 26; నితీశ్ రాణా (సి) స్యామ్ కరన్ (బి) ఇన్‌గిడి 87; నరైన్ (సి) జడేజా (బి) సాన్‌ట్నర్ 7; రింకూ సింగ్ (సి) రాయుడు (బి) జడేజా 11; మోర్గాన్ (సి) రుతురాజ్ (బి) ఇన్‌గిడి 15; దినేశ్ కార్తీక్ (నాటౌట్) 21; రాహుల్ త్రిపాఠి (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–53, 2–60, 3–93, 4–137, 5–167. బౌలింగ్: దీపక్ చహర్ 3–0–31–0, స్యామ్ కరన్ 3–0–21–0, ఇన్‌గిడి 4–0–34–2, సాన్‌ట్నర్ 3–0–30–1, జడేజా 3–0–20–1, కరణ్ శర్మ 4–0–35–1. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: వాట్సన్ (సి) రింకూ (బి) వరుణ్ 14; రుతురాజ్ (బి) కమిన్స్ 72; రాయుడు (సి) నరైన్ (బి) కమిన్స్ 38; ధోని (బి) వరుణ్ 1; స్యామ్ కరన్ (నాటౌ ట్) 13; జడేజా (నాటౌట్) 31; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–50, 2–118, 3–121, 4–140. బౌలింగ్: కమిన్స్ 4–0–31–2, నాగర్కోటి 3–0–34–0, నరైన్ 4–0–23–0, ఫెర్గూసన్ 4–0–54–0, వరుణ్ 4–0–20–2, నితీశ్ రాణా 1–0–16–0. -
నితీష్ రాణా మెరుపులు... చెన్నై టార్గెట్ 173
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్లో చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఓపెనర్ నితీష్ రాణా 61 బంతుల్లో 87 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టాస్ గెలిచిన చెన్నై కేకేఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వనించింది. ఓపెనర్లు శుభమన్ గిల్, నితీష్ రాణాలు ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ఆరంభించారు. పవర్ ప్లే ముగిసే సమయానికి కేకేఆర్ 6ఓవర్లలో 48 పరుగులు చేసింది. 26 పరుగులు చేసిన గిల్ జట్టు స్కోరు 53 పరుగుల వద్ద ఉన్నప్పుడు కర్ణ్ శర్మ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. (చదవండి : కేకేఆర్ సంకట స్థితి.. గెలిస్తేనే ప్లేఆఫ్ అవకాశం) తర్వాత వచ్చిన సునీల్ నరైన్ వచ్చీ రాగానే భారీ సిక్స్ కొట్టినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. కాసేపటికే రింకూ సింగ్ కూడా వెనుదిరగడంతో కేకేఆర్ 99 పరుగులకే 3 వికెట్లు కోల్పయింది. ఈ దశలో మరో ఓపెనర్ నితీష్ రాణా 44 బంతుల్లో అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే కర్ణ్ శర్మ వేసిన 16వ ఓవర్లో నితీష్ రాణా హ్యాట్రిక్ సిక్సర్లతో మొత్తం 19 పరుగులు పిండుకోవడంతో కేకేఆర్ స్కోరు ఒక్కసారిగా మారిపోయింది. దీపక్ చాహర్ వేసిన 17వ ఓవర్లో రెండు ఫోర్లతో విరుచకుపడిన రాణా 87 పరుగుల వద్ద ఎన్గిడి బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఇక చివర్లో దినేష్ కార్తీక్ 10 బంతుల్లోనే 21 పరుగులు చేయడంతో కేకేఆర్ 172 పరుగుల గౌరవప్రదమైన స్కోరును సాధించింది. సీఎస్కే బౌలర్లలో ఎన్గిడి 2, సాంట్నర్, జడేజా, కర్ణ్ శర్మ తలా ఒక వికెట్ తీశారు.(చదవండి : ఇలాంటి కీపర్ ఉంటే అంతే సంగతులు) -
వరుణ్ పాంచ్ పటాకా.. కేకేఆర్ ‘సిక్సర్’
అబుదాబి: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌లో ఆకట్టుకున్న కేకేఆర్.. అటు తర్వాత బౌలింగ్‌లో కూడా రాణించి గెలుపును అందుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ 195 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించగా, ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి135 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దెబ్బకు ఢిల్లీ విలవిల్లాడింది. వరుణ్ ఐదు వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించాడు. అయర్య్, పంత్, హెట్మెయిర్, స్టోయినిస్, అక్షర్ పటేల్ వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో విజయంతో కేకేఆర్ ఆరో గెలుపును ఖాతాలో వేసుకుంది. ఇక తొలి అంచె మ్యాచ్‌లో ఢిల్లీపై ఎదురైన ఓటమికి కేకేఆర్ ఘనమైన ప్రతీకారం తీర్చుకుంది. ఇది ఢిల్లీకి నాల్గో ఓటమి. లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఆదిలోనే ఓపెనర్లు అజింక్యా రహానే(0), శిఖర్ ధావన్(6)లు నిరాశపరిచారు. వీరిద్దర్నీ కమిన్స్ తన వరుస ఓవర్లలో బోల్తా కొట్టించడంతో ఢిల్లీ 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్(47;38 బంతుల్లో 5ఫోర్లు), రిషభ్ పంత్(27; 33 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్)లు ఆకట్టుకునే యత్నం చేసినా కీలక భాగస్వామ్యాలను నమోదు చేయలేకపోయారు. ఈ జోడి 63 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించగా, ఆపై ఎవరూ కూడా రాణించకపోవడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. ఏడుగురు ఢిల్లీ ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ ఐదు వికెట్లకు తోడుగా కమిన్స్ మూడు వికెట్లు సాధించగా ఫెర్గ్యూసన్‌కు వికెట్ లభించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. నితీష్ రాణా(81; 53 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్), నరైన్(64; 32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) బ్యాట్ ఝుళిపించడంతో కేకేఆర్ భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ తీసుకోవడంతో కేకేఆర్ బ్యాటింగ్‌కు దిగింది. కేకేఆర్ ఇన్నింగ్స్‌ను శుబ్‌మన్ గిల్, నితీష్ రాణాలు ఆరంభించారు. అయితే నోర్జే వేసిన రెండో ఓవర్ ఐదో బంతికి గిల్(9; 8 బంతుల్లో 2 ఫోర్లు) ఔటయ్యాడు. అక్షర్ పటేల్ క్యాచ్ పట్టడంతో గిల్ ఇన్నింగ్స్ ముగిసింది. కాసేపటికి ఫస్ట్‌డౌన్ ఆటగాడు రాహుల్ త్రిపాఠి(13; 12 బంతుల్లో 1ఫోర్)ను కూడా నోర్జే ఔట్ చేశాడు. సుమారు 150 కి.మీ వేగంతో మిడిల్ స్టంప్‌ను టార్గెట్ చేస్తూ వేసిన బంతికి త్రిపాఠి వద్ద సమాధానం లేకుండా పోయింది. దాంతో 35 పరుగులకే కేకేఆర్ రెండో వికెట్‌ను నష్టపోయింది. మరో ఏడు పరుగుల వ్యవధిలో దినేశ్ కార్తీక్(3) నిరాశపరిచాడు. రబడా వేసిన ఎనిమిదో ఓవర్ రెండో బంతికి పంత్‌కు క్యాచ్ ఇచ్చి కార్తీక్ పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో ఓపెనర్ రాణాకు సునీల్ నరైన్ జత కలిశాడు. ఈ జోడి క్రీజ్‌లో కుదురుకున్నాక కేకేఆర్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. నువ్వా-నేనా అన్నట్లు వీరు బ్యాటింగ్ కొనసాగించారు. వీరు మెరుపులతో కేకేఆర్ 15 ఓవర్లలో 142 పరుగులు చేసింది. కాగా, నరైన్ 32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64 పరుగులు చేసి కేకేఆర్ విలువైన పరుగుల్ని అందించాడు. రాణాతో కలిసి 115 పరుగుల భాగస్వామ్యం జత చేసిన తర్వాత నరైన్ నాల్గో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. రబడా వేసిన 17 ఓవర్ నాల్గో బంతికి భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔటయ్యాడు. ఆ తరువాత రాణా-మోర్గాన్ ద్వయం చెలరేగి ఆడింది. మోర్గాన్ 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 17 పరుగులు చేశాడు. స్టోయినిస్ వేసిన ఆఖరి ఓవర్ చివరి రెండు బంతులకు రాణా, మోర్గాన్‌లు ఔట్ కావడంతో రెండొందల పరుగుల మార్కును కేకేఆర్ చేరలేకపోయింది. ఢిల్లీ బౌలర్లలో నోర్జే, రబడా, మార్కస్ స్టోయినిస్‌లు తలో రెండు వికెట్లు సాధించారు. -
హాఫ్ సెంచరీ తర్వాత రాణా ఇలా..
అబుదాబి: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓపెనర్ నితీష్ రాణా మెరిశాడు. 53 బంతుల్లో 13 ఫోర్లు 1 సిక్స్‌తో 81 పరుగులు సాధించి జట్టుకు భారీ స్కోరు అందించడంలో సాయపడ్డాడు. 35 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కును చేరిన తర్వాత దాన్ని తన మాయ్య సురీందర్ మార్వాకు అంకింత చేశాడు. నిన్న తన మావ సురిందర్ కన్నుమూయడంతో ఆ విషాదాన్ని కూడా దిగమింగుకుని బరిలోకి దిగాడు రాణా. ఓపెనర్‌గా తన పాత్రకు న్యాయం చేయడంతో హాఫ్ సెంచరీ తర్వాత సురిందర్ మార్వా పేరు మీద ఉన్న జెర్సీని గ్రౌండ్లో ప్రదర్శించాడు. తన హాఫ్ సెంచరీని మావ సురిందర్‌కు అంకితం ఇస్తున్నట్లు, ఇదే తన అతని మృతికి ఘనమైన నివాళిగా తన చేతల ద్వారా రాణా తెలిపాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఆరు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. రాణాకు జతగా నరైన్(64; 32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగడంతో ఢిల్లీ భారీ స్కోరును బోర్డుపై ఉంచింది. ణాతో కలిసి 115 పరుగుల భాగస్వామ్యం జత చేసిన తర్వాత నరైన్ నాల్గో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. చివర్లో మోర్గాన్ 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 17 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.(ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ కోల్పోతే..) -
నాన్‌స్ట్రైకర్ పరుగే పరుగు.. ఫన్నీ రనౌట్
అబుదాబి: కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ ఆదిలోనే రెండు వికెట్లను కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్ 14 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కింగ్స్ పంజాబ్ పేసర్ షమీ వేసిన మూడో ఓవర్ నాల్గో బంతికి కేకేఆర్ ఓపెనర్ రాహుల్ త్రిపాఠి(4) బౌల్డ్ కాగా, ఆపై కాసేపటికి నితీష్ రాణా(2) రనౌట్ అయ్యాడు. ఈ రనౌట్ అయ్యే క్రమంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అర్షదీప్ వేసిన నాల్గో ఓవర్ మూడో బంతిని శుబ్‌మన్ గిల్ షార్ట్ ఫైన్‌లెగ్‌లోకి ఆడాడు. అయితే ఆ సమయంలో ఫీల్డర్ ఉన్నాడు. కానీ దాన్ని గ్రహించని నాన్‌స్ట్రైకర్ నితీష్ రాణా స్టైకింగ్ ఎండ్ వైపు పరుగు తీశాడు. ఆ పరుగుకి గిల్ ఒకే చెప్పకపోయినా రాణా మాత్రం అసలు ఆలోచనే లేకుండా అవతలి ఎండ్‌లోకి పరుగే పరుగు అన్నట్లు వెళ్లిపోయాడు. ఇక్కడ ఇద్దరు బ్యాట్స్‌మెన్ తమకు తాము రనౌట్ కాకుండా కాపాడుకుందామనే ఆలోచనే తప్పా, ఎవరో వికెట్‌ను కోల్పోవాల్సి వస్తుందనే విషయాన్ని గ్రహించలేకపోయారు. నితీష్ రాణా తిరిగి నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లోకి తిరిగి చూసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మహ్మద్ షమీ డైరెక్ట్ హిట్ చేద్దామని చూడగా, అది మిస్సయ్యింది. ఆ సమయంలో పూరన్ బంతిని స్మార్ట్‌గా అందుకుని నాన్‌స్ట్రైకర్ ఎండ్ వికెట్లను గిరటేశాడు. దాంతో నితీష్ రాణా భారంగా పెవిలియన్‌కు వెళ్లాడు. -
కేకేఆర్ పరుగుల సునామీ..
కోల్‌కతా: విధ్వంసకర బ్యాటింగ్ అంటే ఏంటో కింగ్స్ పంజాబ్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్ చూపించారు. బౌండరీల ఖాతాను నరైన్ మొదలెట్టగా.. ఊతప్ప ముగించాడు. మధ్యలో నితీష్ రాణా, ఆండ్రీ రసెల్ పరుగుల సునామీ సృష్టించడంతో కేకేఆర్ భారీ స్కోర్ నమోదు చేసింది. కేకేఆర్ బ్యాట్స్‌మెన్ దాటికి బంతులెక్కడ వేయాలో పంజాబ్ బౌలర్లకు పాలుపోలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 219 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రాబిన్ ఊతప్ప(67 నాటౌట్; 50 బంతుల్లో 6ఫోర్లు, 2 సిక్సర్లు), నితీష్ రాణా(63; 34 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు)లు అర్దసెంచరీలతో రాణించగా.. చివర్లో రసెల్(48; 17 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు) ఉప్పెనలా విజృంభించాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కేకేఆర్‌కు శుభారంభం లభించలేదు. క్రిస్ లిన్(10) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. మరో ఓపెనర్ సునీల్ నరైన్(24) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించినా.. భారీ స్కోర్ చేయలేకపోయాడు. దీంతో 36 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో రాబిన్ ఊతప్ప, నితీష్ రాణాలు ఆచితూచి ఆడారు. క్రీజులో నిలదొక్కుకున్న అనంతరం గేర్ మార్చి దాటిగా ఆడటం ప్రారంభించారు. ముఖ్యంగా రాణా అశ్విన్ బౌలింగ్‌ను టార్గెట్ చేస్తూ బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో ఈ సీజన్లో రెండో అర్దసెంచరీ సాధించాడు. అనంతరం భారీ షాట్‌కు యత్నించి రాణా ఔటవుతాడు. భారీ మూల్యం చెల్లించుకున్నారు రసెల్ మూడు పరుగుల వ్యక్తి గత స్కోర్ వద్ద షమీ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. అయితే ఆ బంతి నోబాల్ కావడంతో.. పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకుంది. ఆతర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగడంతో పంజాబ్ బౌలర్లు నేలచూపులు చూశారు. బౌలర్ ఎవరు.. ఏబంతి వేశాడనేది చూడకుండా బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా రసెల్ ఆడాడు. దీంతో కేకేఆర్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. చివరి ఓవర్లో భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ ఔటయ్యాడు. లేకుంటే తన ఖాతాలో హాఫ్ సెంచరీ.. స్కోర్ బోర్డుపై మరో పది పరుగులు ఉండేవి. దీంతో కేకేఆర్ ఆటగాళ్ల వీరవిహారంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. -
పెళ్లిపీటలు ఎక్కనున్న మరో క్రికెటర్
సాక్షి, న్యూఢిల్లీ: క్రికెటర్లు ఒక్కొక్కరూ వివాహానికి సిద్ధమైపోతున్నారు. గత వారం ఐపీఎల్ 11 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున బరిలోకి దిగిన బౌలర్ సందీప్ శర్మ తన స్నేహితురాలిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. తాజాగా మరో ఆటగాడు పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమయ్యాడు. ఇదే ఐపీఎల్ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన నితిశ్ రాణా త్వరలో ఓ ఇంటి వాడుకాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు సాచి మర్వాతో ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో నితిశ్ రాణాకు తన స్నేహితురాలు సాచిన మార్వాకు నిశ్చితార్థం జరిగింది. అతి తక్కువమంది సన్నిహితులు, స్నేహితుల మధ్య ఇరు కుటుంబాలకు చెందిన వారు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోల్‌కతా నైట్ రైటర్స్ తన అధికారిక ట్విటర్ ద్వారా కొత్త జంట ఫొటోను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపింది. Congratulations to #Knight @NitishRana_27 & @saachimarwah7! 👫♥ The #KKR family wishes both of you a lifetime of joy & happiness on your engagement! 💍 pic.twitter.com/TbEpq9IQtf — KolkataKnightRiders (@KKRiders) June 11, 2018 -
‘అప్పుడే నేను మెరుగ్గా ఆడగలను’
కోల్‌కతా: ఒత్తిడి సమయంలో ఆడటం అంటే తనకు చాలా ఇష్టమని అంటున్నాడు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు నితీష్ రానా. అలా ఒత్తిడి సమయంలో ఆడినప్పుడే తనలోని మెరుగైన క్రీడాకారుడు బయటకు వస్తాడని పేర్కొన్నాడు. ఐపీఎల్లో భాగంగా సోమవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాణా 59 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ 71 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ తర్వాత మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న సమయంలో రానా మాట్లాడుతూ.. ‘ఒత్తిడిలో నేను మరింత మెరుగ్గా ఆడగలనని గతంలో చెప్పాను. ఒత్తిడిని జయిస్తూ ఆడటాన్ని నేను చాలా ఎంజాయ్ చేస్తా. ఒత్తిడిలో ఆడేటప్పుడు నాలోని మెరుగైన క్రికెటర్ బయటకొస్తాడు. 10 ఓవర్లకే మా జట్టు 3 వికెట్లు కోల్పోయి 89 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్ మాకెంతో కీలకం. గత రెండు మ్యాచ్‌ల్లో వరుసగా చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయాం. అందుకే ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలవాలనుకున్నాం. అందుకే జట్టులో అందరూ సమష్టిగా రాణించారు. కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, మ్యాక్స్‌వెల్ కూడా తమ వంతు ప్రయత్నం చేశారు. చివరి వరకూ పోరాడాలన్నది నా గేమ్ ప్లాన్. ఈ ఐపీఎల్ సీజన్లో నేను మొదటి మ్యాచ్ నుంచి ఇదే ఫాలో అవుతున్నా. నేను బ్యాటింగ్ బాగా చేయగలనన్న నమ్మకం నాకు ఉంది. స్పిన్నర్లు ఎప్పుడెప్పుడు బంతులేస్తారా అని ఎదురుచూస్తూ ఉంటాను. వారి బౌలింగ్‌లో నా పని మరింత సులువుగా మారుతుంది’ అని రానా తెలిపాడు. -
వావ్.. మనీష్ పాండే సూపర్ క్యాచ్.!
-
వావ్.. మనీష్ పాండే సూపర్ క్యాచ్.!
కోల్‌కతా : ఐపీఎల్-11 సీజన్లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు మనీష్ పాండే అద్భుత ఫీల్డింగ్‌తో ఔరా అనిపించాడు. తన మైమరిపించే ఫీల్డింగ్‌తో నితీష్ రాణా, ఆండ్రూ రస్సెల్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. వర్షంతో మ్యాచ్ ఆగిపోగా.. పునప్రారంభమైన నాలుగు బంతులకే కోల్‌కతా స్టార్ బ్యాట్స్‌మన్ నితీష్ రాణా స్టాన్ లేక్ బౌలింగ్‌లో ఆఫ్ వికెట్ మీదుగా వచ్చిన బంతిని గల్లీలో ఆడే ప్రయత్నం చేశాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న పాండే రెప్పపాటు సమయంలో గాల్లో డైవ్ చేసి అందుకున్నాడు. అయితే తొలుత పాండే చేతుల నుంచి బంతి జారినట్లే జారి చిక్కింది. దీంతో నితీష్ రాణా18(14 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సు) పెవిలియన్ చేరాడు. చేజారిన నరైన్ క్యాచ్.! షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో సునీల్ నరైన్ భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న పాండే మరో సారి అద్భుత ఫీల్డింగ్‌తో బంతిని సిక్సు వెళ్లకుండా అడ్డుకున్నాడు. అయితే ఈ ప్రయత్నంలో సమన్వయం కోల్పోయిన పాండే బంతిని గాల్లోకి విసిరేసి క్యాచ్‌కు ప్రయత్నించాడు. కానీ బంతి దూరంగా పడటంతో క్యాచ్ చేజారింది. సెకన్ల వ్యవధిలోనే పాండే అద్బుత ఫీల్డింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రస్సెల్ క్యాచ్ అందుకున్న పాండే.. ఆండ్రూరస్సెల్ (9)ను పాండే మరోసారి అద్భుత ఫీల్డింగ్‌తో పెవిలియన్‌కు చేర్చాడు. స్టాన్లేక్ వేసిన 14 ఓవర్ రెండో బంతికి రస్సెల్ షాట్‌కు ప్రయత్నించగా.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న పాండే ముందుకు పరుగెత్తి అద్భుత డైవ్‌తో క్యాచ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పాండే ఫీల్డింగ్‌తో జాంటీ రోడ్స్‌ను తలిపించాడు. -
నితీష్ రాణాపై కోహ్లి ఫ్యాన్స్ ఫైర్.!
కోల్‌కతా : కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మన్ నితీష్ రాణాపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్-11 సీజన్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పార్ట్‌టైం బౌలర్ అవతారమెత్తిన నితీష్ రాణా అనుహ్యంగా వరుస బంతుల్లో విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్, కోహ్లిలను పెవిలియన్‌కు చేర్చిన విషయం తెలిసిందే. అయితే కోహ్లి క్లీన్ బౌల్డ్ చేసిన రాణా అరుస్తూ అతన్ని అసభ్యంగా దూషించాడు. ఇది టీవీ రిప్లేలో స్పష్టం కావడం, దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్ నెట్టింట్లో వైరల్ కావడం కోహ్లి అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. దీంతో సోషల్ మీడియా వేదికగా రాణాను టార్గెట్ చేస్తూ పోస్టులతో మండిపడుతున్నారు. ఒక్కసారి అవుట్ చేసినందుకు అంతలా ఎగిరిపడాలా..అని ఒకరంటే.. అసభ్యంగా దూషించడం ఏంటని.. ఇంకోకరు.. జాగ్రత్తా కోహ్లి భారత కెప్టెన్..అతనికి నీవుచ్చే గౌరవం ఇదేనా అని కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై కోల్‌కతా 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. -
నితీష్ రాణా అరుదైన ఫీట్.!
కోల్‌కతా : ఐపీఎల్-11 సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు నితీష్ రాణా అరుదైన ఫీట్ అందుకున్నాడు. బ్యాట్స్‌మన్ అయిన నితీష్ రాణా ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా బంతిని అందుకొని రాణించాడు. వరుస బంతుల్లో ఏకంగా దూకుడు మీద ఉన్న బెంగళూరు స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లిలను పెవిలియన్‌కు చేర్చి భారీ స్కోర్‌కు అడ్డుకట్ట వేశాడు. ఇలా వరుస బంతుల్లో ఈ స్టార్ బ్యాట్స్మెన్ల వికెట్లు దక్కించుకున్న మూడో బౌలర్‌గా రికార్డుకెక్కాడు. ఈ స్టార్ బ్యాట్స్‌మన్ ఇలా 2012 సీజన్లో జాక్వస్ కల్లీస్ బౌలింగ్‌లో తొలిసారి అవుటవ్వగా.. తిసారా పెరీరా బౌలింగ్‌లో 2016లోనూ ఇలానే పెవిలియన్‌కు చేరారు. తాజాగా నితీష్ బౌలింగ్‌లో వరుస బంతుల్లో వెనుదిరిగారు. ఇక రాణా బంతి అందుకున్న సమయాన డివిలియర్స్, కోహ్లిలు దూకుడు మీద ఉన్నారు. ఈ సమయంలో రాణాకు బౌలింగ్ ఇవ్వడమేంటని అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అందరనుకున్నట్టే వేసిన తొలి బంతిని డివిలియర్స్ సిక్సుబాదాడు. ఆ మరుసటి బంతికే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అనంతరం స్ట్రైకింగ్ తీసుకున్న కోహ్లి అనూహ్యంగా క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో భారీ స్కోరు దిశగా పయనించిన బెంగళూరు ఒక్కసారి కుదేలైంది. చివర్లో మన్దీప్ సింగ్ రాణించడంతో గౌరవప్రదమైన స్కోరు చేసింది. బౌలింగ్ చేయమని దినేశ్ బాయ్ చెప్పాడు.. ఇక ఈ కీలక వికెట్ల చేజిక్కించుకోవడంపై మ్యాచ్ అనంతరం రాణా సంతోషం వ్యక్తం చేశాడు. ‘బాల్ గ్రిప్ బాగుండటంతో సరైన ప్రదేశంలో బంతిని వేస్తే వికెట్లు పడగొట్టచ్చని భావించా. అదృష్టవశాత్తు రెండు కీలక వికెట్లు దక్కాయి. ఆ సమయంలో ఇవి చాలా కీలకమైన వికెట్లు. దేశవాళి క్రికెట్లో ఢిల్లీ తరుఫున బౌలింగ్ చేసే వాడిని. ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా అద్భుతంగా బౌలింగ్ చేశా. దీంతో దినేశ్ బాయ్ మ్యాచ్‌కు ముందు ఏమ్యాచ్‌లోనైనా ఒకటి, రెండు ఓవర్లు వేసేందుకు సిద్దంగా ఉండని చెప్పాడు. లక్కీగా తొలి మ్యాచ్‌లోనే ఆ అవకాశం రావడంతో నేనెంటో రుజువైందని’ ఆనందం వ్యక్తం చేశాడు. ఇక బ్యాటింగ్లోను నితీశ్ రాణా (25 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. దీనిపై స్పందిస్తూ.. ‘పరుగులు చేయడమే నా బాధ్యత. ఒత్తిడి గురించి నేను ఆలోచించలేదు. గత సీజన్లో రాణించడంతో నాపై అంచనాలు పెట్టుకోవడం బాగుంది. ఒత్తిడిలో బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తానని’ పేర్కొన్నాడు. -
సమష్టి మంత్రమే ఆయుధంగా...
♦ ముంబై ఇండియన్స్ విజయ రహస్యం ♦ వ్యూహాత్మక ఆటతీరుతో అనుకున్న ఫలితం ♦ అన్ని విభాగాల్లో సమతూకం ‘వ్యక్తిగత ప్రదర్శన ఒక్కోసారి మ్యాచ్‌లను గెలిపిస్తుందేమో కానీ... ఆటగాళ్ల సమష్టి కృషితోనే చాంపియన్లుగా ఎదుగుతాం’ ఐపీఎల్ పదో సీజన్ టైటిల్‌ను గెలిచిన అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్య ఇది. నిజానికి ప్రారంభం నుంచి ముంబై ప్రదర్శన గమనిస్తే ఇది వాస్తవంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన టాప్–5 ఆటగాళ్లలో ఒక్కరు కూడా ముంబై బ్యాట్స్‌మన్ లేడు. అంతా కలిసికట్టుగా రాణించి తమ జట్టును విజేతగా నిలపగలిగారు. సాక్షి క్రీడా విభాగం : ముంబై ఇండియన్స్ ముచ్చటగా మూడోసారి ఐపీఎల్లో విజేతగా నిలిచింది. అయితే 2013, 2015లో సాధించిన టైటిళ్లకన్నా ఈసారి వీరి ప్రస్థానం ప్రత్యేకమైందిగా చెప్పుకోవచ్చు. ఏ ఒక్క ఆటగాడిపై ఆధారపడకుండా జట్టు అందరికన్నా మిన్నగా దూసుకెళ్లింది. కీలక సమయంలో తలా ఓ చేయి వేసి జట్టును సమున్నత స్థాయిలో నిలిపారు. దీనికి అన్ని విభాగాల్లో సమతూకంతో ఉన్న జట్టు బాగా ఉపయోగపడింది. చక్కటి కాంబినేషన్‌తో టోర్నీ ఆసాంతం ముంబై అదరగొట్టింది. ఆఖరికి రిజర్వ్ బలం కూడా తమకు అందిన అవకాశాన్ని సద్వినియోగపర్చుకోగలిగింది. ఇంతకుముందు సాధించిన రెండు టైటిళ్లలో కచ్చితంగా ఒక్క బ్యాట్స్‌మన్ అయినా టాప్–5 పరుగుల జాబితాలో ఉన్నాడు. ఈసారి మాత్రం వీరిలో ఎవరికీ చోటు దక్కలేదు. అయితేనేం జట్టుకు కావల్సిన విలువైన పరుగులు అందిస్తూ చాంపియన్‌గా నిలపగలిగారు. ఒక్కో సందర్భంలో ఒక్కో ఆటగాడు బాధ్యత తీసుకుని అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్ కావచ్చు ప్రత్యర్థిని మట్టికరిపించేందుకు ఉపయోగపడ్డారు. ఫైనల్ మ్యాచ్‌లో 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడం ఏ జట్టుకైనా చాలా కష్టం. ముఖ్యంగా ఇలాంటి మ్యాచ్‌లో బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ కూడా చాలా ముఖ్యం. ఓ రెండు క్యాచ్‌లు మిస్ అయినా చివరకు మేజిక్ ఆటతో పుణేను వణికించారు. ఓవరాల్‌గా బ్యాటింగ్‌లో నితీశ్ రాణా, పార్థివ్ పటేల్, పొలార్డ్, రోహిత్ శర్మ, జోస్ బట్లర్... బౌలింగ్‌లో బుమ్రా, మెక్లీనగన్, కరణ్ శర్మ, మలింగ ఆకట్టుకోగా... పాండ్యా బ్రదర్స్ హార్దిక్, కృనాల్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ముంబై విజయాల్లో ముఖ్యపాత్ర పోషించారు. మైదానంలో ఆటగాళ్లు కష్టపడగా... తెర వెనుక ఉన్న హెడ్ కోచ్ మహేల జయవర్ధనే, బ్యాటింగ్ కోచ్ రాబిన్ సింగ్, బౌలింగ్ కోచ్ షేన్ బాండ్, ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ ముంబై సక్సెస్‌లో తమవంతు పాత్ర పోషించారు. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మెంటార్ రూపంలో ముంబై ఇండియన్స్ శిబిరంలో ఉండటం మరింత ఉత్సాహాన్నిచ్చింది. రోహిత్ కెప్టెన్సీ అదుర్స్... ఓవరాల్‌గా జట్టును మూడోసారి చాంపియన్‌గా నిలపడంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఆటగాళ్లను ప్రేరేపించిన విధానం ప్రశంసనీయం. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో అతని చొరవ ఆటగాళ్లను ఉత్తేజపరిచింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఈ జట్టు కనీసం 160 పరుగులైనా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే మ్యాచ్ ఆరంభం నుంచే ముంబై టపటపా వికెట్లు కోల్పోయి కేవలం 129 పరుగులకే పరిమితం కావడంతో ఓరకమైన నిర్వేదం కనిపించింది. కచ్చితంగా ఓటమి ఖాయమే అనే అభిప్రాయం వారిలో వ్యక్తమైంది. అయితే సారథి రోహిత్ మాత్రం దీన్ని ఓ సవాల్‌గా స్వీకరించాడు. బరిలోకి దిగడానికి ముందే ఆటగాళ్లలో విశ్వాసం నింపాడు. ‘రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో భీకర ఫామ్‌లో ఉన్న కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ను కేవలం 107 పరుగులకే ఆలౌట్ చేసిన విషయం గుర్తుంచుకోండి. అదే ఇక్కడా ఎందుకు పునరావృతం కాకూడదు? ప్రత్యర్థిపై మనకు పేలవ రికార్డు ఉన్నప్పటికీ ఆ విషయం మరిచిపోండి’ అని వారికి ప్రేరణ ఇచ్చాడు. ఇక బరిలోకి దిగాక తన వ్యూహాలకు పదునుపెడుతూ ముందుగా పరుగులను నియంత్రించేందుకు స్పిన్నర్లు కరణ్ శర్మ, కృనాల్ పాండ్యాలతో బౌలింగ్ వేయించాడు. ఈ వ్యూహం ఫలితాన్నిచ్చి పుణే పరుగుల తీసేందుకు తెగ ఇబ్బంది పడింది. అటు బుమ్రా, మలింగ, జాన్సన్ కూడా జత కలవడంతో వారికి దిక్కు తోచలేదు. ముఖ్యంగా చివరి ఓవర్లో జాన్సన్ రెండు వికెట్లు పడగొట్టి పుణేకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. దీంతో సునాయాసంగా నెగ్గుతుందని భావించిన పుణే భంగపడగా.. ఆఖరి బంతి వరకు ముంబై బౌలర్లు పోరాడి చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నారు. -
మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నా!
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్-10లో తన ఆటతీరుతో స్టార్ ఆటగాళ్లను గుర్తుకుతెస్తున్నాడు ముంబై ఇండియన్స్ ప్లేయర్ నితీష్ రానా. సీజన్లో ఇప్పటివరకూ 266 పరుగులతో అత్యధిక పరుగుల వీరులలో నాలుగో స్థానంలో ఉన్నాడు. అయితే కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ చిట్కాలే తన ఆటకు ప్లస్ పాయింట్‌గా మారాయని చెప్పాడు. తొలి మ్యాచ్ నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్న రానా దూకుడే మంత్రంగా చెలరేగిపోతున్నాడు. మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నానని.. ఏదో ఒక రోజు టీమిండియా తరఫున ప్రాతినిధ్యం వహిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. 'లో స్టాన్స్ వల్ల బ్యాటింగ్‌లో లోపాలు తలెత్తి ఫామ్ కోల్పోయాను. దీంతో గంభీర్ నన్ను కలిసి తరచుగా చిట్కాలు చెప్పేవాడు. షోల్డర్ ను కాస్త అప్ చేస్తూ ఆడటం స్టాన్స్ మార్చుతూ ఆడటం వల్ల పరుగులు సాధించొచ్చని గంభీర్ సూచించాడు. ఐపీఎల్ మొదలయ్యాక సచిన్, జయవర్ధనేలతో చర్చించాను. వాళ్లు ఇచ్చిన సూచనలను నా బ్యాటింగ్‌కు అన్వయించుకున్నాను. దీంతో ఇప్పుడు స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపిస్తున్నాను' అని ముంబై కీలక ఆటగాడు నితీశ్ రాణా చెప్పుకొచ్చాడు. ఫస్ల్ క్లాస్ మ్యాచ్‌ల్లో ఢిల్లీకి ఆడే రానా గురించి కెప్టెన్ గౌతం గంభీర్‌కి బాగా తెలుసు. 2015-16లో దేశవాలీ సీజన్లో రాణించిన రానాను 2016 ఐపీఎల్ సీజన్లో కేకేఆర్‌కు తీసుకోవాలని గంభీర్ పట్టుబట్టాడు. యాజమాన్య మాత్రం ఆసక్తి చూపలేదు. దీంతో ఆసీజన్లో 10 లక్షలకు ముంబై రానాను తీసుకోవడం ఎంత ప్లస్ పాయింటో వారికి ఇప్పుడు తెలుస్తుంది. ముంబై డబుల్ హ్యాట్రిక్ విజయాలలో రానా ఇన్నింగ్స్‌లు కీలకమయ్యాయి. -
రయ్ రయ్ రానా
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 ఆరంభానికి ముందు అందరి కళ్లూ స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్లపైనే. ఈ సీజన్ లో వీరు మరోసారి సత్తా చాటి అభిమానుల్ని అలరిస్తారని అంతా ఎదురుచూస్తున్న తరుణంలోనే రయ్ రయ్ మంటూ దూసుకొచ్చాడు నితీష్ రానా. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న రానా తన సంచలన ఆట తీరుతో ఇప్పుడు ఒక్కసారిగా స్టార్ క్రికెటర్ల జాబితాలో చేరిపోయాడు. ఈ సీజన్ ఐపీఎల్లో ఇప్పటివరకూ ఐదు మ్యాచ్ లు ఆడి మూడు హాఫ్ సెంచరీల సాయంతో 255 పరుగులు సాధించి టాప్ లో ఉన్నాడు. తొలి మ్యాచ్ నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్న రానా దూకుడే మంత్రంగా చెలరేగిపోతున్నాడు. రైజింగ్ పుణెతో ముంబై తలపడిన తొలి మ్యాచ్ లో రానా 28 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 34 పరుగులతో ఆకట్టుకున్నాడు.ఇక కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన రెండో మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో దుమ్ము రేపాడు. 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు నమోదు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆపై సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో 36 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు సాధించాడు. అయితే రాయల్ చాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో రానా నిరాశ పరిచాడు. కేవలం ఆ మ్యాచ్ లో 11 పరుగులు మాత్రమే నమోదు చేశాడు రానా. అటు తరువాత గుజరాత్ లయన్స్ తో మ్యాచ్ రానా మరో హాఫ్ సెంచరీ సాధించాడు.36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. ఇక గురువారం కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో రానా సిక్సర్ల వర్షం కురిపించాడు.34 బంతుల్లో ఏడు సిక్సర్లతో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కేకేఆర్ వద్దనుకుందా? ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించే రానా గురించి ఆ జట్టు కెప్టెన్ గౌతం గంభీర్ కు బాగా తెలుసు.2015-16 దేశవాళీ సీజన్ లో భాగంగా సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో రానా విశేషంగా రాణించాడు. ఆ సీజన్ లో 299 పరుగులు సాధించి సహచర ఢిల్లీ ఆటగాళ్లు రిషబ్ పంత్, ఉన్ముక్ చంద్ల సరసన నిలిచాడు. దాంతో 2016 సీజన్ ఐపీఎల్లో కోల్ కతా నైట్ రైడర్స్ రానాను తీసుకోవాలని తొలుత భావించింది. అతని ఎంపికపై గౌతం గంభీర్ చాలా పట్టాడు కూడా. అయితే కోల్ కతా యాజమాన్యం రానా ఎంపికకు మొగ్గు చూపలేదు.విజయ్ హజారే ట్రోఫీలో రానా విఫలమయ్యాడనే కారణంతో అతన్ని కేకేఆర్ జట్టులోకి తీసుకోలేదు. దాంతో ముంబై ఇండియన్స్ గతేడాది సీజన్ లో రానా ను రూ.10 లక్షల పెట్టి జట్టులోకి తీసుకుంది. ఇప్పుడు ముంబై జట్టులోనే అతన్ని కొనసాగించడం ఆ జట్టుకు వరంలా మారింది. ముంబై ఇండియన్స్ వరుస విజయాల్లో రానా పాత్ర వెలకట్టలేనిది. ప్రధానంగా గంభీర్ నేతృత్వంలోని కోల్ కతాపై రానా అసలైన మజాను అందించాడు. ముంబై ఇండియన్స్ విజయానికి 23 బంతుల్లో 63 పరుగులు చేయాల్సిన తరుణంలో రానా మెరుపులు మెరిపించాడు. ఇక చివర్లో కృణాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యాలు బ్యాట్ ఝుళిపించడంతో ముంబై బంతి ఉండగానే విజయం సాధించి కోల్ కతాకు షాకిచ్చింది. 'సిక్సర్' పిడుగు ప్రస్తుతం రేసుగుర్రంలా దూసుకువస్తున్న రానా నిజంగానే 'సిక్సర్' పిడుగు అని నిరూపించుకున్నాడు. ఈ సీజన్ ఐపీఎల్లో రానా ఆడిన తొలి ఐదు మ్యాచ్ లు ఒక ఎత్తయితే కింగ్స్ పంజాబ్ తో ముంబై ఇండియన్స్ తలపడిన ఆరో మ్యాచ్ రానాను మరో స్టేజ్ కు తీసుకెళ్లిపోయింది. కింగ్స్ పంజాబ్ మ్యాచ్ లో ఒక ఫోర్ కూడా కొట్టని రానా.. సిక్సర్ల మోత మోగించాడు. ఆ మ్యాచ్ లో రానా ఏడు సిక్సర్లు కొట్టగా అందులో ఒక ఫోర్ లేకపోవడం గమనార్హం. కింగ్స్ విసిరిన 199 పరుగుల భారీ లక్ష్య ఛేదన సైతం రానా దెబ్బకు చిన్నబోయింది. తొలుత బట్లర్ విశ్వరూపం ప్రదర్శించగా, అటు తరువాత రానా విధ్వంసకర ఆట తీరుతో చెలరేగిపోయాడు ఈ ఢిల్లీ కుర్రాడు. దాంతో కింగ్స్ విసిరిన లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ ఉఫ్ అని ఊదేశారు. ప్రస్తుతం మూడు హాఫ్ సెంచరీలతో పరుగుల పరంగా టాప్ లో ఉన్న రానాపై అప్పుడే టీమిండియా సెలక్టర్లు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇక భారత జాతీయ క్రికెట్ జట్టులో రానాను ఎంపిక చేయడం ఖాయమేనంటూ పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా ఈ ఐపీఎల్ సీజన్ లో సగం మ్యాచ్ లకు పైగా ఉండటంతో రానా మరెన్ని అద్భుతాలు చేస్తాడో చూడాలి. -
ముంబై మెరిసె...
-
ముంబై మెరిసె...
⇒ వరుసగా నాలుగో విజయం ⇒ 6 వికెట్ల తేడాతో ఓడిన గుజరాత్ ముంబై: సొంతగడ్డపై ముంబై ఇండియన్స్ జట్టు అదరగొట్టింది. ఈ సీజన్లో వరుసగా నాలుగో విజయాన్ని సాధించి తనకు ఎదురులేదని నిరూపించుకుంది. ఆదివారం వాంఖెడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గుజరాత్ లయన్స్ జట్టును చిత్తుగా ఓడించింది. ముందుగా గుజరాత్ లయన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. బ్రెండన్ మెకల్లమ్ (44 బంతుల్లో 64; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా... దినేశ్ కార్తీక్ (26 బంతుల్లో 48 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. అనంతరం ముంబై ఇండియన్స్ జట్టు 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 177 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ నితీశ్ రాణా (36 బంతుల్లో 53; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (29 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), పొలార్డ్ (23 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. నిలబెట్టిన భాగస్వామ్యాలు గుజరాత్ లయన్స్‌కు ఆరంభంలోనే మెక్లీనగన్ షాకిచ్చాడు. ఇన్నింగ్స్ మూడో బంతికే డ్వేన్ స్మిత్ (0)ను పెవిలియన్‌కు పం పాడు. అయితే మలింగ వరుస ఓవర్లలో రైనా (29 బంతుల్లో 28; 2 ఫోర్లు) రెండు బౌండరీలు... మెకల్లమ్ రెండు సిక్సర్లు బాదడంతో పవర్‌ప్లేలో గుజరాత్ 46 పరుగుల్ని సాధించింది. ఈ దశలో ముంబై స్పిన్నర్లు హర్భజన్, కృనాల్ పాండ్యాలు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఈ జంటను నియంత్రించారు. స్పిన్ ఆడటంలో ఇబ్బంది పడిన రైనా చివరకు హర్భజన్ బౌలింగ్‌లోనే రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 65 బంతుల్లో 80 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ క్రమంలో 36 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న మెకల్లమ్ తర్వాత జోరు పెంచాడు. బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్‌తో పాటు, మలింగ వేసిన 14వ ఓవర్ మూడో బంతిని బౌండరీకి తరలించి, తర్వాతి బంతికే అవుటయ్యాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్, దినేశ్ కార్తీక్ 24 బంతుల్లో 54 పరుగుల్ని జోడించారు. చివర్లో జేసన్ రాయ్ (7 బంతుల్లో 14; 1 ఫోర్, 1 సిక్స్) వేగంగా ఆడటంతో గుజరాత్ మంచి స్కోరును సాధించింది. అలవోకగా ఛేదన... వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న ముంబై ఇండియన్స్ 177 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది. పరుగుల ఖాతా మొదలు పెట్టకుండానే ఓపెనర్ పార్థివ్ పటేల్ (0) వికెట్‌ను కోల్పోయిన ముంబై తర్వాత ఏ దశలోనూ ఇబ్బంది పడలేదు. రెండో ఓవర్లోనే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న నితీశ్ రాణా ఆ తర్వాత బట్లర్ (24 బంతుల్లో 26; 1 ఫోర్ , 2 సిక్సర్లు)తో కలిసి వేగంగా పరుగుల్ని జోడించాడు. 54 బంతుల్లో 85 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాక ఏడు పరుగుల వ్యవధిలో వీరిద్దరూ అవుటయ్యారు. ఈ దశలో కెప్టెన్ రోహిత్ శర్మ, పొలార్డ్ వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ ముంబైని లక్ష్యానికి చేరువ చేశారు. చివర్లో పొలార్డ్ అవుటైనా హార్దిక్ పాండ్యాతో కలిసి రోహిత్ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలిపించాడు. ‘కిట్’ లేక ఆటకు దూరం! గత మ్యాచ్‌లో రాణించిన గుజరాత్ ఆటగాడు ఆరోన్ ఫించ్ ఈసారి బరిలోకి దిగలేదు. అతను తన కిట్‌ను పోగొట్టుకోవడమే అందుకు కారణమని కెప్టెన్ రైనా చెప్పడం విశేషం. ప్రధాన బ్యాట్స్‌మన్ ఇలా కిట్ కోసం మ్యాచ్ వదిలేసుకోవడం కాస్త ఆశ్చర్యం కలిగించినా... వ్యక్తిగత స్పాన్సర్షిప్ ఒప్పందాల్లో ఉన్న నిబంధనలు ఫించ్‌ను మరో లేబుల్ ఉన్న బ్యాట్ వాడకుండా అడ్డుకొని ఉండవచ్చు. ఐపీఎల్లో నేడు ►ఢిల్లీ & కోల్‌కతా వేదిక: న్యూఢిల్లీ, సా.గం. 4.00 నుంచి ►హైదరాబాద్ & పంజాబ్ వేదిక: హైదరాబాద్, రాత్రి .గం. 8.00 నుంచి ►సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
‘ముంబై’కి తలవంచారు
⇒సన్‌రైజర్స్‌కు తొలి ఓటమి ⇒4 వికెట్లతో ముంబై ఇండియన్స్ గెలుపు ⇒రాణించిన బుమ్రా, రాణా సొంతగడ్డపై వరుసగా రెండు మ్యాచ్‌లు నెగ్గిన ఉత్సాహంతో కనిపించిన డిఫెండింగ్ చాంపియన్‌కు ప్రత్యర్థి వేదికపై పరాజయం పలకరించింది. బయటి మైదానంలో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే బ్యాటింగ్ వైఫల్యంతో హైదరాబాద్ ఓటమిని ఆహ్వానించింది. బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో సన్‌రైజర్స్ సాధారణ స్కోరుకే పరిమితమై, ఆ తర్వాత దానిని కాపాడుకోవడంలోనూ విఫలమైంది. వాంఖెడే గడ్డపై ముందుగా బుమ్రా, హర్భజన్ బౌలింగ్‌తో రైజర్స్పై పట్టు బిగించిన ముంబై ఇండియన్స్... పార్థివ్, రాణా, కృనాల్‌ల బ్యాటింగ్‌తో మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ముంబై: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శన కనబర్చిన ముంబై 4 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (34 బంతుల్లో 49; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), శిఖర్ ధావన్ (43 బంతుల్లో 48; 5 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఇతర బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. బుమ్రాకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ముంబై 18.4 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు చేసి విజయాన్నందుకుంది. నితీశ్ రాణా (36 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), పార్థివ్ పటేల్ (24 బంతుల్లో 39; 7 ఫోర్లు), కృనాల్ పాండ్యా (20 బంతుల్లో 37; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఒక దశలో తక్కువ వ్యవధిలో వరుసగా వికెట్లు తీసి హైదరాబాద్ పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. బుమ్రాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. కోల్‌కతాలో శనివారం జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు నైట్‌రైడర్స్‌తో తలపడుతుంది. ఓపెనింగ్ మినహా: సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ అంశం ఓపెనింగ్ భాగస్వామ్యం మాత్రమే. వార్నర్, ధావన్ తొలి వికెట్‌కు 62 బంతుల్లో 81 పరుగులు జోడించారు. తర్వాతి బ్యాట్స్‌మెన్ తడబడటంతో 50 పరుగుల తేడాతో 7 వికెట్లు కోల్పోయి రైజర్స్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఇన్నింగ్స్ తొలి రెండు ఓవర్లలో ఐదు పరుగులే రాగా, హర్భజన్ వేసిన మూడో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి వార్నర్ ధాటిని ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత మలింగ ఓవర్లోనూ వార్నర్ మరో రెండు ఫోర్లు బాదాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్ సన్‌కు కలిసొచ్చింది. మెక్లీనగన్ వేసిన ఈ ఓవర్లో ధావన్ చెలరేగి 2 ఫోర్లు, సిక్స్ కొట్టడంతో 15 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత ఒక దశలో వార్నర్ తాను ఎదుర్కొన్న మూడు వరుస బంతులను 4, 4, 6 గా మలిచాడు. అయితే భజ్జీ రైజర్స్ దూకుడును అడ్డుకున్నాడు. తొలి బంతిని స్విచ్ హిట్‌తో సిక్స్ కొట్టిన వార్నర్, తర్వాతి బంతిని రివర్స్ స్వీప్ ఆడబోయి అవుటయ్యాడు. హుడా (9) ఎక్కువసేపు నిలవలేకపోగా, ధావన్‌ను మెక్లీనగన్ బౌల్డ్ చేయడంతో రైజర్స్ పతనం వేగంగా సాగింది. యువరాజ్ (5) విఫలం కాగా, కటింగ్ (10 బంతుల్లో 20; 4 ఫోర్లు) జోరును బుమ్రా అడ్డుకున్నాడు. తొమ్మిది పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ చివరి ఐదు ఓవర్లలో 40 పరుగులే చేసింది. పార్థివ్ మెరుపులు...: లక్ష్య ఛేదనను ముంబై వేగంగా ప్రారంభించింది. నెహ్రా వేసిన రెండో ఓవర్లో ఆ జట్టు మూడు ఫోర్లతో 15 పరుగులు రాబట్టింది. అయితే నెహ్రా తన తర్వాతి ఓవర్లోనే బట్లర్ (14)ను అవుట్ చేసి రైజర్స్‌కు బ్రేక్ ఇవ్వగా, మరో ఎండ్‌లో పార్థివ్ దూకుడుగా ఆడాడు. రషీద్ ఖాన్ మరోసారి సత్తా చాటుతూ తొలి ఓవర్లోనే రోహిత్ (4)ను వెనక్కి పంపడంతో ముంబై రెండో వికెట్ కోల్పోయింది. అయితే ముస్తఫిజుర్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో 19 పరుగులు కొల్లగొట్టిన ముంబై దూసుకుపోయింది. పార్థివ్, రాణా కలిసి చకచకా పరుగులు జోడించి 29 బంతుల్లో 38 పరుగులు జత చేశారు. ఈ దశలో పార్థివ్‌ను హుడా అవుట్ చేయగా, పొలార్డ్ (11) కూడా విఫలమయ్యాడు. ఈ దశలో కృనాల్ చెలరేగిపోయాడు. రషీద్ బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టిన అతను, నెహ్రా వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ బాదాడు. కటింగ్ వేసిన తర్వాతి ఓవర్లో కూడా రెచ్చిపోయి రెండు ఫోర్లు, సిక్సర్ కొట్టడంతో 15 పరుగులు వచ్చాయి. మరుసటి ఓవర్లోనే భువనేశ్వర్ చక్కటి బౌలింగ్‌తో కృనాల్, రాణాలను అవుట్ చేసినా అప్పటికే ఆలస్యమైపోయింది. వార్నర్ బ్యాటింగ్ ఎలా?: సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ సమయంలో ఒక పెద్ద అంపైరింగ్ పొరపాటు చోటు చేసుకుంది. బుమ్రా వేసిన ఆరో ఓవర్ చివరి బంతిని వార్నర్ ఫోర్‌గా మలిచాడు. తర్వాతి ఓవర్ తొలి బంతిని వాస్తవంగా ధావన్ ఎదుర్కోవాలి. అయితే మెక్లీనగన్ వేసిన ఏడో ఓవర్ తొలి బంతిని కూడా వార్నరే ఆడాడు. అంపైర్ ఈ పొరపాటును గుర్తించకపోవడంతో ఆట సాగిపోయింది! ఐపీఎల్లో నేడు ►కోల్‌కతా నైట్‌రైడర్స్ & కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ►వేదిక: కోల్‌కతా, రాత్రి గం. 8.00 నుంచి ►సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఇది చాలా పెద్ద టార్గెట్