IPL 2023: CSK Vs KKR Match Live Updates:
రింకూ సింగ్ ఫిఫ్టీ.. 16 ఓవర్లలో 126/3
కేకేఆర్ సంచలనం రింకూ సింగ్ సూపర్ ఫిఫ్టీతో మెరిశాడు. 39 బంతుల్లో అర్థసెంచరీ సాధించిన రింకూ సింగ్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. సీఎస్‌కేతో మ్యాచ్‌లో 145 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కేకేఆర్ విజయానికి చేరువైంది. 16 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. కేకేఆర్ విజయానికి 24 బంతుల్లో 19 పరుగులు కావాలి.
11 ఓవర్లలో కేకేఆర్ 75/3
11 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. నితీశ్ రానా 20, రింకూ సింగ్ 29 పరుగులతో ఆడుతున్నారు.
6 ఓవర్లలో కేకేఆర్ 46/3
ఆరు ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. నితీశ్ రానా 9 పరుగులు, రింకూ సింగ్ 12 పరుగులతో ఆడుతున్నారు.
3 ఓవర్లలో కేకేఆర్ 22/2
మూడు ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 22 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 9, నితీశ్ రానా సున్నా పరుగులతో ఆడుతున్నారు.
రాణించిన కేకేఆర్ బౌలర్లు.. సీఎస్‌కే 20 ఓవర్లలో 144/6
కేకేఆర్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. బౌలర్ల కట్టుదిట్టంగా బంతులు వేయడంతో సీఎస్‌కే బ్యాటర్లు పరుగులు చేయలేకపోయారు. దీంతో సాధారణ స్కోరుకే పరిమితమైంది. శివమ్ దూబే 34 బంతుల్లో 48 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. కాన్వే 30, జడేజా 20 పరుగులు చేశారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్‌లు చెరో రెండు వికెట్లు తీయగా.. వైభవ్ అరోరా, శార్దూల్ ఠాకూర్‌లు ఒక్కో వికెట్ తీశారు.
16 ఓవర్లలో సీఎస్‌కే 99/5
16 ఓవర్లు ముగిసేసరికి సీఎస్‌కే ఐదు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. శివమ్ దూబే 24, రవీంద్ర జడేజా ఏడు పరుగులతో ఆడుతున్నారు.
72 పరుగులకే ఐదు వికెట్లు.. కష్టాల్లో సీఎస్‌కే
కేకేఆర్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే తడబడుతోంది. 72 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఒక్క పరుగు మాత్రమే చేసిన మొయిన్ అలీ నరైన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
రహానే(16)ఔట్.. 9 ఓవర్లలో సీఎస్‌కే 65/2
రహానే(16) రూపంలో సీఎస్‌కే రెండో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన రహానే జేసన్ రాయ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్‌కే 9 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. కాన్వే 30, అంబటి రాయుడు 2 పరుగులతో ఆడుతున్నారు.
6 ఓవరల్లో సీఎస్‌కే వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. కాన్వే 23, రహానే 12 పరుగులతో ఆడుతున్నారు.
తొలి వికెట్ కోల్పోయిన సీఎస్‌కే.. 5 ఓవర్లలో 48/1
17 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో వైభవ్ అరోరాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో సీఎస్‌కే తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఐదు ఓవర్లలో వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. రహానే 11, కాన్వే 22 పరుగులతో ఆడుతున్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్‌కే
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా ఆదివారం చెన్నై వేదికగా సీఎస్‌కే, కేకేఆర్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన సీఎస్‌కే బ్యాటింగ్ ఎంచుకుంది.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ఎంఎస్ ధోని(వికెట్ కీపర్/కెప్టెన్),రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్‌కీపర్), జాసన్ రాయ్, నితీష్ రాణా(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి
Thala wins the toss & elects to bat first in #CSKvKKR!#IPLonJioCinema #TATAIPL #IPL2023 | @ChennaiIPL pic.twitter.com/CRRXnNPPIh
— JioCinema (@JioCinema) May 14, 2023
వరుస విజయాలతో సీఎస్‌కే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. ఓటములతో డీలా పడిన కేకేఆర్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇరుజట్లు గతంలో 37 సార్లు తలపడగా సీఎస్‌కే 18 సార్లు, కేకేఆర్ 19 సార్లు మ్యాచ్‌లు నెగ్గాయి.
Comments
Please login to add a commentAdd a comment