IPL 2023, KKR Vs CSK: MS Dhoni Increased The Volume Due To The Cheer From The Crowd - Sakshi
Sakshi News home page

'అరె లొల్లి సల్లగుండ'..  ప్రశ్న అర్థంగాక ధోని ఇబ్బంది

Published Sun, May 14 2023 11:46 PM | Last Updated on Mon, May 15 2023 8:33 AM

MS Dhoni-Not-Clear-Question-Increased Volume Due To Crowd-Cheer Viral - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో సీఎస్‌కే మ్యాచ్‌ ఎక్కడా జరిగినా అభిమానులు పోటెత్తుతున్నారు. ధోని బ్యాటింగ్‌ కోసమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  కేవలం ధోని ఆట చూడడం కోసమే అయితే పర్వాలేదు.. కానీ అతను మాట్లాడేటప్పుడు కూడా అదే గోల వినిపిస్తే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. తాజాగా ధోనికి అభిమానుల వల్ల ఇదే ఇబ్బంది ఎదురైంది. 

ఆదివారం సొంతగ్రౌండ్‌ చెన్నే వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మ్యాచ్‌ ఓడిపోయినా సీఎస్‌కే అభిమానుల్లో జోష్‌ మాత్రం తగ్గలేదు. పోస్ట్‌ మ్యాచ్‌ అనంతరం ఓటమికి కారణాలు చెప్పడానికి ధోని వచ్చాడు. కానీ చెపాక్‌ స్టేడియం ధోని నామస్మరణతో మార్మోగిపోవడంతో కామెంటేటర్‌ అడిగిన ప్రశ్న ధోనికి అర్థం కాలేదు. రెండోసారి అడిగినా అదే పరిస్థితి. ఏం అడిగాడో అర్థం కాక ధోని వినిపించలేదు అని సైగ చేశాడు. మూడోసారి ప్రశ్న అడగబోతుండగా.. మరోసారి అభిమానులు గోల చేశారు.

అరె మీ లొల్లి సల్లగుండ అనుకున్నాడో ఏమో.. కిందకు వంగిన ధోని కుర్చీలో ఉన్న మానిటర్‌ దగ్గరికి వెళ్లి సౌండ్‌ పెంచుకొని ప్రశ్న వినాల్సి వచ్చింది. ఇక ధోని మాట్లాడుతూ.. ఈరోజు మ్యాచ్‌ మాకు కలిసిరాలేదు. బ్యాటింగ్‌లో విఫలమయ్యాం. పవర్‌ప్లేలో సరిగ్గా పరుగులు చేయలేకపోయాం. ఇక శివమ్‌ దూబే బ్యాటింగ్‌తో నేను చాలా సంతోషంగా ఉన్నా. అతని నుంచి మేం ఏం ఆశిస్తున్నామో అది చక్కగా నెరవేరుస్తున్నాడు. స్కోరు తక్కువగా ఉంది కాబట్టి బౌలర్లను తప్పుబట్టలేం. ప్లేఆఫ్‌కు వెళతామన్న నమ్మకం ఉంది. అంటూ చెప్పుకొచ్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement