CSK
-
పెళ్లి బంధంలో అడుగుపెట్టిన మహీశ్ తీక్షణ.. అమ్మాయి ఎవరంటే? (ఫొటోలు)
-
IPL 2025: ఆ యువ ఆటగాడి విషయంలో సీఎస్కే తప్పు చేసిందా..?
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ముంబై యువ ఆటగాడు ఆయుశ్ మాత్రే పేరు క్రికెట్ సర్కిల్స్‌లో బాగా నానింది. మాత్రే టాలెంట్‌కు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని ముగ్దుడయ్యాడని బాగా ప్రచారం జరిగింది. మెగా వేలానికి ముందు సీఎస్కే మాత్రేను ట్రయిల్స్‌కు కూడా పిలిచిందని సోషల్‌మీడియా కోడై కూసింది. అయితే చివరకు మాత్రేను మెగా వేలంలో సీఎస్కే కాని మరే ఇతర ఫ్రాంచైజీ కాని పట్టించుకోలేదు. ఈ 17 ఏళ్ల రైట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ వేలంలో అన్ సోల్డ్‌గా మిగిలిపోయాడు.ఇదంతా సరే, ఇప్పుడు మాత్రే ప్రస్తావన ఎందుకనుకుంటున్నారా..? సీఎస్కే ఆశ చూపించి పట్టించుకోకుండా వదిలిపెట్టిన మాత్రే, ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 ఆసియా కప్‌లో చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో మాత్రే ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు చేసి 3 వికెట్లు తీశాడు. తాజాగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో మాత్రే ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (67 నాటౌట్; 1/19) ఇరగదీశాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.మాత్రే తాజా ప్రదర్శనల నేపథ్యంలో ఇతన్ని ఎందుకు వదులుకున్నామా అని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తుండవచ్చు. మాత్రే వద్ద బంతిని బలంగా బాదే సామర్థ్యం ఉండటంతో పాటు మాంచి బ్యాటింగ్ టెక్నిక్ కూడా ఉంది. ఇతను సీఎస్కేలో ఉంటే ఓపెనర్‌గా అద్భుతాలు చేసే ఆస్కారం ఉండేది. ఏది ఏమైనా సీఎస్కే మాత్రేను దక్కించుకోలేకపోవడం అన్ లక్కీనే అని చెప్పాలి. మరోవైపు మాత్రే సహచరుడు, ఓపెనింగ్ పార్ట్నర్ వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ మెగా వేలంలో రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. సూర్యవంశీని ఆర్ఆర్ 1.1 కోట్లకు సొంతం చేసుకుంది.ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడిగా (13) సూర్యవంశీ రికార్డు నెలకొల్పాడు. మాత్రేలానే సూర్యవంశీ కూడా మంచి హిట్టర్. ఇంకా చెప్పాలంటే మాత్రే కంటే బలమైన హిట్టర్. తాజాగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో సూర్యవంశీ మాత్రేతో కలిసి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో సూర్యవంశీ 46 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 76 పరుగులు చేశాడు. సూర్యవంశీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్‌తో పాటు స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలింగ్ వేస్తాడు. -
హ్యాట్రిక్ తీసిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్.. డకౌటైన పాండ్యా బ్రదర్స్
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కర్ణాటక ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ శ్రేయస్ గోపాల్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. బరోడాతో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ గోపాల్ ఈ ఘనత సాధించాడు. గోపాల్ సాధించిన హ్యాట్రిక్‌లో టీమిండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా వికెట్లు ఉన్నాయి. పాండ్యా సోదరులను గోపాల్ ఖాతా తెరవనీయకుండానే పెవిలియన్‌కు పంపాడు. వరుస బంతుల్లో గోపాల్.. హార్దిక్, కృనాల్ వికెట్లతో పాటు శాశ్వత్ రావత్ వికెట్ కూడా తీశాడు. ఈ మ్యాచ్‌లో గోపాల్ మొత్తం నాలుగు వికెట్లు తీశాడు. గోపాల్ బంతితో చెలరేగినప్పటికీ ఈ మ్యాచ్‌లో కర్ణాటక ఓటమిపాలైంది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అభినవ్ మనోహర్ (34 బంతుల్లో 56; 6 సిక్సర్లు) అజేయమైన అర్ద సెంచరీతో రాణించాడు. స్మరన్ రవిచంద్రన్ (38), కృష్ణణ్ శ్రీజిత్ (22), శ్రేయస్ గోపాల్ (18), మనీశ్ పాండే (10) రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఒక్క పరుగు మాత్రమే చేసి విఫలమయ్యాడు. బరోడా బౌలర్లలో కృనాల్ పాండ్యా, అతీత్ సేథ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. లుక్మన్ మేరీవాలా, ఆకాశ్ మహారాజ్ సింగ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బరోడా.. శ్రేయస్ గోపాల్ (4-0-19-4) దెబ్బకు మధ్యలో ఇబ్బంది పడింది. 15 పరుగుల వ్యవధిలో గోపాల్ నాలుగు కీలకమైన వికెట్లు తీశాడు. అయితే శివాలిక్ శర్మ (22), విష్ణు సోలంకి (28 నాటౌట్), అతీత్ సేథ్ (6 నాటౌట్) కలిసి బరోడాను విజయతీరాలకు చేర్చారు. మరో ఏడు బంతులు మిగిలుండగానే బరోడా లక్ష్యాన్ని చేరుకుంది (6 వికెట్లు కోల్పోయి). బరోడా ఇన్నింగ్స్‌లో శాశ్వత్ రావత్ (63), భాను పూనియా (42) రాణించారు.కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో శ్రేయస్ గోపాల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 30 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గోపాల్ గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. గోపాల్‌కు ఐపీఎల్‌లోనూ హ్యాట్రిక్ తీసిన ఘనత ఉంది. -
CSK లెజెండ్ సురేష్ రైనా ఫ్యామిలీ ఫొటోస్..మీరు ఒక్క లుక్ వేయండి
-
నా భర్త ఎక్కుడున్నా!..నా హృదయం మాత్రం ఆ జట్టుతోనే: టీమిండియా స్టార్ భార్య(ఫొటోలు)
-
IPL 2025: సీఎస్కే కన్నేసిన చిన్నోడు శతక్కొట్టాడు..!
ఐపీఎల్ 2025 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ 17 ఏళ్ల ముంబై బ్యాటర్ ఆయుశ్ మాత్రేపై కన్నేసినట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. సీఎస్కే మేనేజ్మెంట్ అతి త్వరలోనే మాత్రేను సెలెక్షన్ ట్రయిల్ రమ్మని పిలిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే మాత్రే వచ్చే సీజన్లో సీఎస్కే తరఫున అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. మాత్రే బ్యాటింగ్ స్కిల్స్‌పై సీఎస్కే స్టార్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం. సీఎస్కే మేనేజ్మెంట్ వేలంలో మాత్రేను సొంతం చేసుకుని రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు ఓపెనర్‌గా పంపాలని భావిస్తుందట.సీఎస్కే దృష్టిలో పడ్డ తర్వాత మాత్రే రంజీ ట్రోఫీలో ఓ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. సర్వీసెస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మాత్రే అద్భుతమై సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో మాత్రే 127 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టీమిండియా బ్యాటర్లు అజింక్య రహానే (19), శ్రేయస్ అయ్యర్ (47) తక్కువ స్కోర్లకే ఔటైన వేళ మాత్రే మెరుపు సెంచరీతో అలరించాడు. రెండో రోజు టీ విరామం సమయానికి ముంబై 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. మాత్రేతో పాటు ఆకాశ్ ఆనంద్ (1) క్రీజ్‌లో ఉన్నాడు. సర్వీసెస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ముంబై ఇంకా 52 పరుగులు వెనుకపడి ఉంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్వీసెస్ 240 పరుగులకు ఆలౌటైంది. సర్వీసెస్ ఇన్నింగ్స్‌లో మోహిత్ అహ్లావత్ (76), రోహిల్లా (56) అర్ద సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మోహిత్ అవస్తి, షమ్స్ ములానీ తలో రెండు వికెట్లు, జునెద్ ఖాన్, హిమాన్షు సింగ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.ఇరానీ కప్‌తో అరంగేట్రం..17 ఏళ్ల మాత్రే ఈ ఏడాది అక్టోబర్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన ఇరానీ కప్ మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. మాత్రే ముంబై తరఫున ఇప్పటివరకు 10 ఇన్నింగ్స్‌లు ఆడి రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 400 పైచిలుకు పరుగులు చేశాడు. -
CSK స్టార్స్ ఒలింపిక్స్‌లో ఈ ఈవెంట్లలో పోటీపడితే?.. (ఫొటోలు)
-
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్
టీమిండియా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కేదార్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని కొద్ది సేపటి కిందట ట్విటర్ వేదికగా వెల్లడించాడు. 2014లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన కేదార్.. 2020లో చివరిసారిగా భారత జట్టుకు ఆడాడు. కేదార్ తన ఆరేళ్ల ఆంతర్జాతీయ కెరీర్లో 73 వన్డేలు, 9 టీ20లు ఆడి 2 సెంచరీలు (వన్డేల్లో), 7 అర్దసెంచరీల సాయంతో 1611 పరుగులు చేశాడు. కేదార్ ఖాతాలో 27 వన్డే వికెట్లు కూడా ఉన్నాయి. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ అయిన కేదార్‌కు వైవిధ్యభరితమైన బౌలర్‌గా గుర్తింపు ఉంది. 39 ఏళ్ల కేదార్‌కు ఐపీఎల్‌లోనూ ఓ మోస్తరు ట్రాక్ రికార్డు ఉంది. 2010 నుంచి 2023 సీజన్ వరకు వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించిన కేదార్.. ఐపీఎల్ కెరీర్లో 95 మ్యాచ్‌లు ఆడి 123.1 స్ట్రయిక్‌రేట్‌తో 4 అర్ద సెంచరీల సాయంతో 1208 పరుగులు చేశాడు. మిడిలార్డర్లో ధాటిగా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న కేదార్‌కు సీఎస్కే తరఫున ఆడినప్పుడు మంచి గుర్తింపు వచ్చింది. ధోని నాయకత్వంలో కేదార్ పలు మ్యాచ్‌ల్లో సీఎస్కే విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. దేశవాలీ క్రికెట్లో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహించే కేదార్.. ఆ జట్టు తరఫున 87 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 186 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 163 టీ20లు ఆడాడు. ఇందులో 27 సెంచరీలు, 56 అర్ద సెంచరీల సాయంతో 14 వేల పైచిలుకు పరుగులు సాధించి, 65 వికెట్లు పడగొట్టాడు. Thank you all For your love and support throughout my Career from 1500 hrs Consider me as retired from all forms of cricket— IamKedar (@JadhavKedar) June 3, 20242020 ఫిబ్రవరిలో (న్యూజిలాండ్ పర్యటనలో) జాతీయ జట్టు తరఫున చివరి మ్యాచ్ ఆడిన కేదార్ 2019 వన్డే ప్రపంచకప్ ఆడిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. కేదార్.. తన రిటైర్మెంట్ సందేశంలో ఇలా రాసుకొచ్చాడు. 1500 గంటల కెరీర్లో నాకు మద్దతు నిలిచి, నాపై ప్రేమ చూపిన వారందరికీ ధన్యవాదాలు. నన్ను అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్డ్‌గా పరిగణించండి అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. -
RCBని ధోని అవమానించాడా..? ధోనినే ఆర్సీబీ అవమానించిందా..?
-
Play Offs లోకి ఆర్సిబీ
-
RCB vs CSK: ప్లే ఆఫ్స్ బెర్తుకై చావో రేవో
-
చిన్నస్వామిలో కురిసేది సిక్సర్ల వర్షమే.. CSKకి ఇక కష్టమే..
-
CSK vs RR: గెలిచేదెవరు?
-
సీఎస్కేకు షాకిచ్చిన గుజరాత్.. ఘన విజయం
-
పంజాబ్‌కు బ్రేకులు వేసిన సీఎస్కే
-
CSK vs PBKS: గెలుపు ఎవరిదో?
-
ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
ఐపీఎల్లో ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్.. రాత్రి మ్యాచ్‌లో లక్నో, కేకేఆర్ తలపడనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌కు ధర్మశాల మైదానం వేదిక కానుండగా.. రాత్రి మ్యాచ్ లక్నో హోం గ్రౌండ్ అటల్ బిహారీ స్టేడియంలో జరుగనుంది.పంజాబ్, సీఎస్కే మ్యాచ్ విషయానికొస్తే.. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే సీఎస్కే ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. చెన్నై ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌తో కలిపి చెన్నై మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇతర జట్లతో పోటీ లేకుండా ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే చెన్నై ఇకపై ఆడబోయే అన్ని మ్యాచ్‌ల్లో గెలవాల్సి ఉంటుంది. చెన్నై మే 10న గుజరాత్, 12న రాజస్థాన్ రాయల్స్, 18న ఆర్సీబీతో తలపడాల్సి ఉంది.పంజాబ్ విషయానికొస్తే.. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పంజాబ్ ఈ మ్యాచ్‌తో పాటు తదుపరి ఆడబోయే మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుందని చెప్పలేని పరిస్థితి ఉంది. టెక్నికల్‌గా పంజాబ్ ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నప్పటికీ అనధికారికంగా కష్టమే అని చెప్పాలి. తదుపరి మ్యాచ్‌ల్లో పంజాబ్.. ఆర్సీబీ (మే 9), రాజస్థాన్ రాయల్స్ (మే 15), సన్‌రైజర్స్ (మే 19) జట్లను ఢీకొట్టాల్సి ఉంది.హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు 29 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. సీఎస్కే 15, పంజాబ్ 14 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ఇరు జట్లు ఇదే సీజన్లో చివరిసారిగా తలపడ్డాయి. మే 1న జరిగిన ఆ మ్యాచ్‌లో పంజాబ్ సీఎస్కే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.తుది జట్లు (అంచనా)..పంజాబ్: జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రన్ సింగ్, రిలీ రోసోవ్, సామ్ కర్రన్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్‌కీపర్), శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్. [ఇంపాక్ట్ ప్లేయర్: అర్ష్‌దీప్ సింగ్].సీఎస్కే: అజింక్య రహానే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, సమీర్ రిజ్వీ, శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లీసన్, తుషార్ దేశ్‌పాండే. [ఇంపాక్ట్ సబ్: మతీష పతిరణ]లక్నో-కేకేఆర్ మ్యాచ్ విషచయానికొస్తే.. ఇరు జట్లు ప్లే ఆఫ్స్ రేసులో దూసుకుపోతున్నాయి. కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఏడింట గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. లక్నో 10లో 6 మ్యాచ్‌లు గెలిచి మూడో స్థానంలో కొనసాగుతుంది. కేకేఆర్ తదుపరి ఆడబోయే నాలుగు మ్యాచ్‌ల్లో మరో రెండు మ్యాచ్‌లు గెలిచినా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించనుండగా.. లక్నో నాలుగులో కనీసం మూడు మ్యాచ్‌లైనా గెలిస్తే ఫ్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. లక్నో నాలుగులో మూడింట గెలిస్తే ఇతర జట్ల జయాపజయాలతో పని లేకుండా సేఫ్‌గా ఫైనల్ ఫోర్కు చేరుకుంటుంది.కేకేఆర్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్ (మే 11), గుజరాత్ (మే 13), రాజస్థాన్ రాయల్స్‌తో (మే 19) తలపడాల్సి ఉండగా.. లక్నో సన్‌రైజర్స్ (మే 8), ఢిల్లీ (మే 14), ముంబై ఇండియన్స్ (మే 17) జట్లను ఢీకొట్టాల్సి ఉంది. హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. లక్నోపై కేకేఆర్ స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించినట్లు తెలుస్తుంది. ఇరు జట్లు ఇప్పటివరకు 4 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. కేకేఆర్ 3, లక్నో ఒక మ్యాచ్‌లో గెలుపొందాయి. ఇరు జట్ల మధ్య చివరసారిగా జరిగిన మ్యాచ్‌లో కూడా కేకేఆరే పైచేయి సాధించింది. ఏప్రిల్ 14న జరిగిన ఆ మ్యాచ్‌లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో లక్నోను చిత్తు చేసింది.తుది జట్లు (అంచనా)..లక్నో: కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్‌కీపర్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్కేకేఆర్: ఫిలిప్ సాల్ట్ (వికెట్‌కీపర్), సునీల్ నరైన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి -
చెన్నైని ఢీకొట్టనున్న పంజాబ్
-
సన్‌రైజర్స్‌ను చిత్తు చేసిన సీఎస్కే
-
ఐపీఎల్లో ఇవాళ (Apr 28) రెండు మ్యాచ్‌లు.. రెండూ భారీ సమరాలే..!
ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 28) రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం (3:30 గంటలకు) మ్యాచ్‌లో గుజరాత్, ఆర్సీబీ.. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో సన్‌రైజర్స్, సీఎస్కే జట్లు తలపడనున్నాయి. ఆదివారం కావడంతో ఐపీఎల్ ఇవాళ రెండూ భారీ మ్యాచ్‌లనే షెడ్యూల్ చేసింది.మధ్యాహ్నం మ్యాచ్ విషయానికొస్తే..పేపర్‌పై పటిష్టంగా కనిపించే ఆర్సీబీ.. అడపాదడపా ప్రదర్శనలతో నెట్టుకొస్తున్న గుజరాత్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ గుజరాత్ హోం గ్రౌండ్ అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనుంది.పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండగా.. గుజరాత్ 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో ఏడో స్థానంలో నిలిచింది. గుజరాత్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలబడాలంటే గుజరాత్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. మరోవైపు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ఆర్సీబీకి ఈ మ్యాచ్ నామమాత్రం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా ఆర్సీబీకి పెద్ద ఫరక్ పడదు.హెడ్ టు హెడ్ ఫైట్స్ విషయానికొస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు మూడు సందర్భాల్లో ఎదురెదురుపడగా.. గుజరాత్ 2, ఆర్సీబీ ఒక మ్యాచ్‌లో గెలుపొందాయి. తుది జట్లు (అంచనా)..గుజరాత్: వృద్ధిమాన్ సాహా (వికెట్‌కీపర్), శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్‌ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్‌కీపర్), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, లోకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్రాత్రి మ్యాచ్ విషయానికొస్తే.. సీఎస్కే తమ సొంత మైదానమైన చెపాక్‌లో పటిష్టమైన సన్‌రైజర్స్‌ను ఢీకొట్టనుంది. ఈ సీజన్లోనే ఇది బిగ్ ఫైట్‌గా చెప్పవచ్చు. ఈ మ్యాచ్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ మూడో స్థానంలో.. సీఎస్కే ఆరో స్థానంలో ఉన్నాయి. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది.హెడ్ టు హెడ్ రికార్డ్ విషయానికొస్తే.. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 20 మ్యాచ్‌ల్లో తలపడగా.. సీఎస్కే 14, సన్‌రైజర్స్ 6 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.తుది జట్లు (అంచనా)..సన్‌రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్, ఎయిడెన్ మార్క్రమ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్ [ఇంపాక్ట్ సబ్: టి నటరాజన్]సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, ఎంఎస్ ధోని, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహ్మాన్, మతీషా పతిరణ [ఇంపాక్ట్ సబ్: శార్దూల్ ఠాకూర్] -
LSG VS CSK: గెలిచినప్పుడు ధోనిని పొగిడి, ఓడితే రుతురాజ్‌ను నిందిస్తారా..?
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా సీఎస్కేతో నిన్న (ఏప్రిల్ 23) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యాన్ని లక్నో మరో మూడు బంతులు మిగిలుండగానే ఛేదించింది. స్టోయినిస్ అజేయమైన మెరుపు శతకంతో (63 బంతుల్లో 124 నాటౌట్; 13 ఫోర్లు, 6 సిక్సర్లు) లక్నోను విజయతీరాలకు చేర్చాడు. స్టోయినిస్‌కు పూరన్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), దీపక్ హుడా (6 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) సహకరించారు. గెలిస్తే ధోని ఓడితే రుతురాజా..?మ్యాచ్ అనంతరం జరిగిన డిబేట్లో నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ, అంబటి రాయుడు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సీఎస్కే ఓటమికి రుతురాజ్ చెత్త కెప్టెన్సీ కారణమని రాయుడు అంటే.. గెలిచినప్పుడు ధోని పేరు చెప్పి ఓడినప్పుడు రుతురాజ్ నిందించడం సమంజసం కాదని సిద్దూ అభిప్రాయపడ్డాడు. Ambati Rayudu - Poor field placements in deaths overs by Ruturaj. We clearly saw lack of experience as captainN. Sidhu - If you credit Dhoni for CSK wins then blame him for the losses too. Dhoni is still the main think tank#LSGvsCSK #CSKvLSG #CSKvsLSG pic.twitter.com/R4VnEwWUKY— Richard Kettleborough (@RichKettle07) April 24, 2024 తొలుత రాయుడు మాట్లాడుతూ.. డెత్ ఓవర్లలో రుతురాజ్ ఫీల్డింగ్‌ను మొహరించడంలో విఫలమయ్యాడు. కెప్టెన్‌గా అతని అనుభవ రాహిత్యం స్పష్టంగా బయటపడింది. స్టోయినిస్ విధ్వంసకర మూడ్‌లో ఉన్నప్పుడు రుతురాజ్ సిల్లీ ఫీల్డ్ సెటప్ చేసి అతను మరింత రెచ్చిపోయేలా చేశాడని అన్నాడు.ఇందుకు సిద్దూ కౌంటరిస్తూ.. సీఎస్కే గెలిచినప్పుడు ధోనికి క్రెడిట్ ఇచ్చి, ఓడినప్పుడు రుతురాజ్‌ను నిందించడం సమంజసం కాదని అభిప్రాయపడ్డాడు. గెలిచినప్పుడు ధోనిని పొగిడిన నోళ్లు ఓడినప్పుడు కూడా అతన్నే నిందించాలని అన్నాడు. సీఎస్కే కెప్టెన్సీని ధోనినే ఇంకా మోస్తున్నాడన్న విషయం బహిరంగ సత్యమని తెలిపాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. రుతురాజ్ గైక్వాడ్ మెరుపు సెంచరీతో (60 బంతుల్లో 108 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. రుతురాజ్ మెరుపులకు శివమ్ దూబే (27 బంతుల్లో 66; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసం తోడు కావడంతో సీఎస్కే భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లక్నో.. తొలి ఓవర్లోనే డికాక్ వికెట్ కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది. అయితే స్టోయినిస్.. పూరన్, హుడా సహకారంతో లక్నోకు అపురూప విజయాన్ని అందించాడు. చివరి ఓవర్లో లక్నో గెలుపుకు 17 పరుగులు అవసరం కాగా.. మస్తాఫిజుర్ బౌలింగ్‌లో ప్టోయినిస్ వరుసగా 6, 4, 4, 4 పరగులు సాధించాడు. ఫలితంగా లక్నో ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. -
అదరగొట్టిన రాహుల్.. చెన్నైపై లక్నో పైచేయి
-
IPL 2024: ధోని బాగా ఆడాలి.. కానీ, మ్యాచ్ మాత్రం మేమే గెలవాలి..!
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రేపు (ఏప్రిల్ 19) లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. లక్నో హోం గ్రౌండ్ అయిన భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎఖానా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇదివరకే లక్నోకు చేరుకున్నాయి. ఇరు జట్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమై ఉన్నాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో నిన్నటి నుంచే లక్నోకు క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. నగరంలో ఎక్కడ చూసినా మ్యాచ్‌కు సంబంధించిన హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. ఓ హోర్డింగ్‌పై రాసిన కంటెంట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఇంతకీ ఆ హోర్డింగ్‌పై ఏముందంటే.. ధోని బాగా ఆడాలని కోరుకుంటున్నాం.. కానీ మ్యాచ్ మాత్రం ఎల్‌ఎస్‌జీనే గెలవాలని ఉంది. Lucknow welcomes MS Dhoni. - The Craze is unmatched 💥 pic.twitter.com/b7WUge2bQw — Johns. (@CricCrazyJohns) April 18, 2024 ఈ కంటెంట్ చూస్తే లక్నో అభిమానులకు సైతం ధోనిపై ఎంత అభిమానం ఉందో ఇట్టే అర్దమవుతుంది. ఐపీఎల్ కోసం ధోని ఎక్కడికి వెళ్లినా ఇలాంటి క్రేజే కనిపిస్తుంది. ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి చాలా కాలమైనా అభిమానులు ఇంకా అతన్ని నామాన్నే జపిస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఇంచుమించు ఒకటే తరహా ప్రదర్శనలతో ముందుకు పోతున్నాయి. లక్నోతో పోలిస్తే సీఎస్కే ఓ అడుగు ముందుంది. సీఎస్కే ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించగా.. లక్నో ఆరింట మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ప్రస్తుతం సీఎస్కే మూడు, లక్నో ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. -
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. సీజన్ మొత్తానికి దూరమైన స్టార్ ప్లేయర్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆ జట్టు స్టార్ ఓపెనర్, న్యూజిలాండ్ ఆటగాడు డెవాన్ కాన్వే సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. గాయం కారణంగా సీజన్ తొలి ఆరు మ్యాచ్‌లకు దూరమైన కాన్వే.. ఇప్పుడు సీజన్ మొత్తానికే దూరం కావడం ఆ జట్టుపై పెను ప్రభావం పడనుంది. కాన్వే గత రెండు సీజన్లుగా సీఎస్కేలో కీలక ఆటగాడిగా ఉన్నాడు. సీఎస్కే మరో టైటిల్ దిశగా అడుగులు వేసే క్రమంలో కాన్వే లాంటి ఆటగాడు అందుబాటు లేకపోవడం ఆ జట్టు విజయావకాశాలను బాగా దెబ్బతీస్తుంది. కాన్వే సీజన్ మొత్తానికి దూరమైన విషయాన్ని సీఎస్కే యాజమాన్యం ఇవాళ (ఏప్రిల్ 18) అధికారికంగా ప్రకటించింది. కాన్వేకు ప్రత్యామ్నాయంగా ఇంగ్లండ్ వెటరన్ పేసర్ రిచర్డ్ గ్లీసన్‌ను ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించింది. గ్లీసన్‌ను సీఎస్కే కనీస ధర 50 లక్షలకు సొంతం చేసుకుంది. కాగా, సీఎస్కే ప్రస్తుత సీజన్లో 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. కొత్త సారధి రుతురాజ్ సారధ్యంలో సీఎస్కే గత రెండు మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించింది. ఈ జట్టు రేపు (ఏప్రిల్ 19) జరుగబోయే తమ తదుపరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ సీజన్లో సీఎస్కే ఇంకా ఎనిమిది మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మరో నాలుగు మ్యాచ్‌లు గెలిస్తే సీఎస్కే ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది. Richard Gleeson - The new Super King🦁pic.twitter.com/ZPvNldEqLw — CricTracker (@Cricketracker) April 18, 2024 Welcome To CSK, RICHARD GLEESON 🦁💛 Dismissed Rohit Sharma, Virat Kohli and Rishabh Pant within his first eight balls on debut. 🔥pic.twitter.com/rF7FAnSskk — 🜲 (@balltamperrer) April 18, 2024 -
IPL 2024: 150 కొట్టిన సీఎస్కే.. ఇంకో రెండేస్తే ప్రపంచ రికార్డు
పొట్టి క్రికెట్లో చెన్నై సూపర్ కింగ్స్ అరుదైన ఘనత సాధించింది. ఈ ఫార్మాట్లో సీఎస్కే 150 విజయాల మైలురాయిని తాకింది. ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్ 14) జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా టీ20ల్లో 150 విజయాలను పూర్తి చేసుకుంది. పొట్టి క్రికెట్ చరిత్రలో సీఎస్కేకు ముందు సహచర ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ మాత్రమే 150 విజయాల మైలురాయిని తాకింది. టీ20 ఫార్మాట్లో ముంబై ఇండియన్స్ 273 మ్యాచ్‌ల్లో 151 విజయాలు సాధించగా.. సీఎస్కే 255 మ్యాచ్‌ల్లో 150 విజయాలు నమోదు చేసింది. ఆసక్తికర మరో విషయం ఏంటంటే.. ముంబై, సీఎస్కే జట్లు ఇప్పటివరకు చెరి ఐదేసి ఐపీఎల్ టైటిళ్లు సాధించాయి. టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో ముంబై, సీఎస్కే తర్వాత టీమిండియా ఉంది. ఈ ఫార్మాట్లో భారత క్రికెట్ జట్టు 219 మ్యాచ్‌ల్లో 140 విజయాలు సాధించింది. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. రుతురాజ్ (40 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), శివమ్ దూబే (38 బంతుల్లో 66 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో ధోని సుడిగాలి ఇన్నింగ్స్‌తో శివాలెత్తిపోయాడు. ఇన్నింగ్స్‌లో చివరి నాలుగు బంతుల్లో హ్యాట్రిక్ సిక్సర్లు సహా 20 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో సీఎస్కే మొత్తంగా 26 పరుగులు రాబట్టింది. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రోహిత్ శర్మ మెరుపు సెంచరీతో (63 బంతుల్లో 105 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) కదం తొక్కినప్పటికీ లక్ష్యానికి 21 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. 4 వికెట్లు తీసిన పతిరణ సీఎస్కే గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు.