ఐపీఎల్ 2025 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ 17 ఏళ్ల ముంబై బ్యాటర్ ఆయుశ్ మాత్రేపై కన్నేసినట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. సీఎస్‌కే మేనేజ్‌మెంట్ అతి త్వరలోనే మాత్రేను సెలెక్షన్ ట్రయిల్ రమ్మని పిలిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే మాత్రే వచ్చే సీజన్‌లో సీఎస్‌కే తరఫున అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. మాత్రే బ్యాటింగ్ స్కిల్స్‌పై సీఎస్‌కే స్టార్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం. సీఎస్‌కే మేనేజ్‌మెంట్ వేలంలో మాత్రేను సొంతం చేసుకుని రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు ఓపెనర్‌గా పంపాలని భావిస్తుందట.
సీఎస్‌కే దృష్టిలో పడ్డ తర్వాత మాత్రే రంజీ ట్రోఫీలో ఓ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. సర్వీసెస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మాత్రే అద్భుతమై సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో మాత్రే 127 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టీమిండియా బ్యాటర్లు అజింక్య రహానే (19), శ్రేయస్ అయ్యర్ (47) తక్కువ స్కోర్లకే ఔటైన వేళ మాత్రే మెరుపు సెంచరీతో అలరించాడు. రెండో రోజు టీ విరామం సమయానికి ముంబై 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. మాత్రేతో పాటు ఆకాశ్ ఆనంద్ (1) క్రీజ్‌లో ఉన్నాడు. సర్వీసెస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ముంబై ఇంకా 52 పరుగులు వెనుకపడి ఉంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్వీసెస్ 240 పరుగులకు ఆలౌటైంది. సర్వీసెస్ ఇన్నింగ్స్‌లో మోహిత్ అహ్లావత్ (76), రోహిల్లా (56) అర్ద సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మోహిత్ అవస్తి, షమ్స్ ములానీ తలో రెండు వికెట్లు, జునెద్ ఖాన్, హిమాన్షు సింగ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
ఇరానీ కప్‌తో అరంగేట్రం..
17 ఏళ్ల మాత్రే ఈ ఏడాది అక్టోబర్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన ఇరానీ కప్ మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. మాత్రే ముంబై తరఫున ఇప్పటివరకు 10 ఇన్నింగ్స్‌లు ఆడి రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 400 పైచిలుకు పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment