Ranji Trophy
-
ముంబైపై ప్రతీకారం తీర్చుకున్న విదర్భ.. వరుసగా రెండో సీజన్లో ఫైనల్లోకి ఎంట్రీ
రంజీ ట్రోఫీ 2024-25 (Ranji Trophy) చివరి అంకానికి చేరింది. ఈ సీజన్లో తొలి ఫైనల్ బెర్త్ అధికారికంగా ఖరారైంది. రెండో సెమీఫైనల్లో ముంబైని (Mumbai) ఓడించి విదర్భ (Vidarbha) వరుసగా రెండో సీజన్లో ఫైనల్‌కు చేరింది. గత సీజన్ ఫైనల్లో ముంబై చేతిలో ఎదురైన పరాభవానికి విదర్భ ఈ సీజన్ సెమీస్‌లో ప్రతీకారం తీర్చుకుంది. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ మైదానంలో జరిగిన సెమీ ఫైనల్లో ముంబైపై విదర్భ 80 పరుగుల తేడాతో గెలుపొందింది. విదర్భ నిర్దేశించిన 406 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై 325 పరుగులకు ఆలౌటైంది. హర్ష్ దూబే 5, యశ్ ఠాకూర్, పార్థ్ రేఖడే తలో రెండు వికెట్లు తీసి ముంబైని దెబ్బకొట్టారు. ముంబై ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ భారీ స్కోర్లు చేయలేదు.ముంబై ఓటమి ఖరారైన తర్వాత శార్దూల్ ఠాకూర్ (66) అర్ద సెంచరీ సాధించాడు. షమ్స్ ములానీ (46) సాయంతో శార్దూల్ ముంబైని గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. స్టార్ బ్యాటర్లు అజింక్య రహానే (12), శివమ్ దూబే (12), సూర్యకుమార్ యాదవ్ (23) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో ఆకాశ్ ఆనంద్ 39 పరుగులకు ఔటయ్యాడు. యువ ఆటగాళ్లు ఆయుశ్ మాత్రే (18), సిద్దేశ్ లాడ్ (2) నిరాశపరిచారు. ఆఖర్లో తనుశ్ కోటియన్ (26), మోహిత్ అవస్తి (26), రాయ్స్టన్ డయాస్ (23) కంటితడుపు చర్చగా బ్యాట్‌ను ఝులిపించారు.ఈ మ్యాచ్‌లో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటైంది. దృవ్ షోరే (74), దినిశ్ మాలేవార్ (79), యశ్ రాథోడ్ (54) అర్ద సెంచరీలతో రాణించగా.. కరుణ్ నాయర్ (45), కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అథర్వ తైడే 4, పార్థ్ రేఖడే 23, హర్ష్ దూబే 18, భూటే 11, యశ్ ఠాకూర్ 3 పరుగులు చేసి ఔట్ కాగా.. దర్శన్ నల్కండే 12 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముంబై బౌలర్లలో శివమ్ దూబే ఐదు వికెట్లతో రాణించగా.. షమ్స్‌ములానీ, రాయ్స్టన్ డయాస్ తలో రెండు, శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ తీశారు.అనంతరం బరిలోకి దిగిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులకే ఆలౌటైంది. స్టార్ బ్యాటర్లు, టీమిండియా ప్లేయర్లు అజింక్య రహానే (18), సూర్యకుమార్ యాదవ్ (0), శివమ్ దూబే (0) దారుణంగా విఫలమయ్యారు. ఆకాశ్ ఆనంద్ (106) అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి సూపర్ సెంచరీతో ముంబై పరువు కాపాడాడు. ఆకాశ్ ఆనంద్‌కు సిద్దేశ్ లాడ్ (35), శార్దూల్ ఠాకూర్ (37), తనుశ్ కోటియన్ (33) కాసేపు సహకరించారు. విదర్భ బౌలర్లలో పార్థ్ రేఖడే 4, యశ్ ఠాకూర్, హర్ష్ దూబే తలో 2, దర్శన్ నల్కండే, భూటే చెరో వికెట్ పడగొట్టారు.113 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భ.. 292 పరుగులకు ఆలౌటై ముంబై ముందు కొండంత లక్షాన్ని ఉంచింది. యశ్ రాథోడ్ 151 పరుగులు చేసి విదర్భ ఇన్నింగ్స్‌కు జీవం పోశాడు. యశ్‌కు కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (52) సహకరించాడు. వీరిద్దరి నుంచి ఈ స్థాయి ఇన్నింగ్స్‌లు రాకపోయుంటే విదర్భ ముంబై ముందు ఇంత భారీ లక్ష్యాన్ని ఉంచలేకపోయేది. విదర్భను రెండో ఇన్నింగ్స్‌లో షమ్స్ ములానీ దెబ్బకొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో ములానీ ఆరు వికెట్లు తీశాడు. తనుశ్ కోటియన్ 3, శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టారు. గుజరాత్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్ డ్రా దిశగా సాగుతున్నప్పటికీ.. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన లీడ్ (2 పరుగులు) ఆధారంగా కేరళ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. రంజీల్లో కేరళ ఫైనల్‌కు చేరనుండటం ఇదే మొదటిసారి. ఈ సీజన్ ఫైనల్లో విదర్భ, కేరళ తలపడనున్నాయి. -
రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్లో హైడ్రామా
రంజీ ట్రోఫీ 2024-25 (Ranji Trophy) సెమీ ఫైనల్లో హైడ్రామా చోటు చేసుకుంది. గుజరాత్‌తో (Gujarat) జరుగుతున్న తొలి సెమీస్‌లో కేరళ (Kerala) 2 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించి, ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులు చేయగా.. గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 455 పరుగులకు ఆలౌటైంది. రంజీ రూల్స్ ప్రకారం.. మ్యాచ్‌లో ఫలితం తేలని పక్షంలో తొలి ఇన్నింగ్స్‌లో లీడ్ సాధించిన జట్టు విజేతగా నిలుస్తుంది. గుజరాత్, కేరళ మ్యాచ్‌లో ఫలితం తేలడం అసాధ్యం కాబట్టి, కేరళ విజేతగా నిలిచి ఫైనల్‌కు చేరుకుంటుంది.Drama in the Ranji Trophy semifinals🤯pic.twitter.com/o8Bykc8Q4P— CricTracker (@Cricketracker) February 21, 2025కాగా, ఈ మ్యాచ్‌లో గుజరాత్.. కేరళకు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, ఆ జట్టును దురదృష్టం వెంటాడింది. కేరళపై లీడ్ సాధించేందుకు కేవలం మూడు పరుగులు అవసరమైన తరుణంలో గుజరాత్ ఆఖరి ఆటగాడు సగస్వల్లా ఔటయ్యాడు. నగస్వల్లా బౌలర్ ప్రతిభ కారణంగా ఔటై ఉంటే గుజరాత్ అంత ఫీల్ అయ్యేది కాదు. నగస్వల్లా కొట్టిన షాట్ షార్ట్ లెగ్ ఫీల్డర్ సల్మాన్ నిజర్ హెల్మెట్‌కు తాకి స్లిప్స్‌లో ఉన్న సచిన్ బేబి చేతుల్లోకి వెళ్లింది. దీంతో నగస్వల్లా పెవిలియన్ ముఖం పట్టాడు. అప్పటివరకు బాగా ఆడిన నగస్వల్లా ఔట్ కావడంతో గుజరాత్ శిబిరంలో ఒక్కసారిగా నైరాశ్యం ఆవహించింది. తాము ఫైనల్‌కు చేరలేమన్న విషయం తెలుసుకుని గుజరాత్ ఆటగాళ్లు కృంగిపోయారు. తృటిలో గుజరాత్‌కు ఫైనల్ బెర్త్ మిస్ అయ్యింది. ఈ సీజన్లో కేరళను లక్కీ జట్టుగా చెప్పాలి. క్వార్టర్ ఫైనల్లోనూ ఆ జట్టు ఇలాగే స్వల్ప ఆధిక్యంతో (ఒక్క పరుగు) సెమీస్‌కు చేరుకుంది. 91 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో కేరళ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి.స్కోర్ల విషయానికొస్తే.. వికెట్‌కీపర్ బ్యాటర్ మహ్మద్ అజహరుద్దీన్ భారీ సెంచరీతో (177 నాటౌట్) కదంతొక్కడంతో కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులు చేసింది. కేరళ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సచిన్ బేబి (69), సల్మాన్ నిజర్ (52) అర్ద సెంచరీలతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో సగస్వల్లా 3, చింతన్ గజా 2, పి జడేజా, రవి బిష్ణోయ్, విశాల్ జేస్వాల్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ప్రియాంక్ పంచల్ (148) సెంచరీతో అదరగొట్టడంతో గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 455 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో ఆర్య దేశాయ్ (73), జయ్‌మీత్ పటేల్ (79) అర్ద సెంచరీలతో రాణించారు. కేరళ బౌలర్లలో సర్వటే, జలజ్ సక్సేనా తలో 4 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్లు సైతం బాగానే బ్యాటింగ్ చేసినప్పటికీ.. కేరళ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు రెండు పరుగుల దూరంలో నిలిచిపోయారు. చివరి రోజు లంచ్ సమయానికి కేరళ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. రోహన్ కన్నుమ్మల్ (15), అక్షయ్ చంద్రన్ (9) క్రీజ్‌లో ఉన్నారు. -
చరిత్ర సృష్టించనున్న కేరళ.. 91 ఏళ్ల రంజీ చరిత్రలో తొలిసారి..!
కేరళ క్రికెట్ జట్టు (Kerala Cricket Team) చరిత్ర సృష్టించనుంది. 91 ఏళ్ల రంజీ ట్రోఫీ (Ranji Trophy) చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించనుంది. గుజరాత్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో కేరళ 2 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. తద్వారా ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోనుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులు చేయగా.. గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 455 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం ఆట చివరి రోజు కొనసాగుతుంది. కేరళ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం అసాధ్యం. రంజీ రూల్స్ ప్రకారం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన జట్టు విజేత నిలుస్తుంది. తద్వారా కేరళ ఫైనల్‌కు చేరుతుంది.దీనికి ముందు కేరళ కార్టర్ ఫైనల్లోనూ ఇలాగే స్వల్ప ఆధిక్యం సాధించి సెమీస్‌కు అర్హత సాధించింది. క్వార్టర్ ఫైనల్లో కేరళ.. జమ్మూ అండ్ కశ్మీర్‌పై ఒక్క పరుగు లీడ్ సాధించింది. ఫలితంగా సెమీస్‌కు అర్హత సాధించింది.1957-58 సీజన్లో తొలిసారి రంజీ బరిలోకి దిగిన కేరళ.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫైనల్‌కు అర్హత సాధించలేదు. 2018-19 సీజన్లో సెమీస్‌కు చేరినా.. తుది పోరుకు అర్హత సాధించలేకపోయింది. 1957/58కి ముందు కేరళ ట్రావన్‌కోర్-కొచ్చిన్ టీమ్‌గా రంజీల్లో ఆడింది.మ్యాచ్ విషయానికొస్తే.. వికెట్‌కీపర్ బ్యాటర్ మహ్మద్ అజహరుద్దీన్ భారీ సెంచరీతో (177 నాటౌట్) కదంతొక్కడంతో కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులు చేసింది. కేరళ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సచిన్ బేబి (69), సల్మాన్ నిజర్ (52) అర్ద సెంచరీలతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో సగస్వల్లా 3, చింతన్ గజా 2, పి జడేజా, రవి బిష్ణోయ్, విశాల్ జేస్వాల్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ప్రియాంక్ పంచల్ (148) సెంచరీతో కదంతొక్కడంతో గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 455 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో ఆర్య దేశాయ్ (73), జయ్‌మీత్ పటేల్ (79) అర్ద సెంచరీలతో రాణించారు. కేరళ బౌలర్లలో సర్వటే, జలజ్ సక్సేనా తలో 4 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్లు సైతం బాగానే బ్యాటింగ్ చేసినప్పటికీ.. కేరళ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు రెండు పరుగుల దూరంలో నిలిచిపోయారు. చివరి రోజు లంచ్ సమయానికి కేరళ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. రోహన్ కన్నుమ్మల్ (15), అక్షయ్ చంద్రన్ (9) క్రీజ్‌లో ఉన్నారు.విదర్భతో జరుగుతున్న మరో సెమీఫైనల్లో ముంబై ఓటమి అంచుల్లో నిలిచింది. 406 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌లో ముంబై గెలవాలంటే మరో 226 పరుగులు సాధించాలి. స్టార్ బ్యాటర్లంతా పెవిలియన్‌కు చేరడంతో ఈ మ్యాచ్‌లో ముంబై గెలవడం అసాధ్యం. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా అయినా తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా విదర్భ ఫైనల్‌కు చేరుతుంది. విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులు చేయగా.. ముంబై 270 పరుగులకే పరిమితమైంది. కాగా, గత సీజన్ ఫైనల్లో ముంబై.. విదర్భను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. -
జైమీత్ పోరాటం
అహ్మదాబాద్: జైమీత్ పటేల్ (161 బంతుల్లో 74 బ్యాటింగ్; 2 ఫోర్లు), సిద్ధార్థ్ దేశాయ్ (134 బంతుల్లో 24 బ్యాటింగ్; 1 ఫోర్) మొండి పట్టుదలతో ఆడటంతో... గుజరాత్ జట్టు రంజీ ట్రోఫీ ఫైనల్‌కు చేరువైంది. కేరళతో జరుగుతున్న సెమీఫైనల్లో ఓవర్‌నైట్ స్కోరు 222/1తో గురువారం నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన గుజరాత్ జట్టు... ఆట ముగిసే సమయానికి 154 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 429 పరుగులు చేసింది. ఫలితం తేలడం కష్టమైన ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన జట్టే ఫైనల్‌కు చేరుకోవడం ఖాయమైంది. అంతకుముందు కేరళ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులు చేయగా... ప్రస్తుతం చేతిలో 3 వికెట్లు ఉన్న గుజరాత్ మరో 29 పరుగులు చేస్తే కేరళ స్కోరును దాటేస్తుంది. ప్రియాంక్ పాంచాల్ (237 బంతుల్లో 148; 18 ఫోర్లు, 1 సిక్స్) భారీ సెంచరీ ఖాతాలో వేసుకోగా... మనన్ హింగ్రాజియా (127 బంతుల్లో 33; 3 ఫోర్లు), ఉర్విల్ పటేల్ (43 బంతుల్లో 25; 3 ఫోర్లు), హేమంగ్ పటేల్ (41 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు. కెప్టెన్ చింతన్ గాజా (2), విశాల్ జైస్వాల్ (14) ఎక్కువసేపు నిలవలేకపోయారు. చివర్లో సిద్ధార్థ్ దేశాయ్‌తో కలిసి జైమీత్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓ పక్క పరుగులు సాధిస్తూనే... ఓవర్లు కరిగించాడు. ఈ జంట అబేధ్యమైన ఎనిమిదో వికెట్‌కు 220 బంతుల్లో 72 పరుగులు జోడించింది. ఓవరాల్‌గా గురువారం 83 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 207 పరుగులు చేసింది. కేరళ బౌలర్లలో జలజ్ సక్సేనా 4 వికెట్లు పడగొట్టాడు. స్కోరు వివరాలు కేరళ తొలి ఇన్నింగ్స్: 457; గుజరాత్ తొలి ఇన్నింగ్స్: ప్రియాంక్ (బి) జలజ్ సక్సేనా 148; ఆర్య దేశాయ్ (బి) బాసిల్ 73; మనన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జలజ్ సక్సేనా 33; ఉర్విల్ పటేల్ (స్టంప్డ్) అజహరుద్దీన్ (బి) జలజ్ సక్సేనా 25; హేమాంగ్ పటేల్ (సి) (సబ్) రోజర్ (బి) నిధీశ్ 27; జైమీత్ పటేల్ (బ్యాటింగ్) 74; చింతన్ గాజా (ఎల్బీడబ్ల్యూ) (బి) జలజ్ సక్సేనా 2; విశాల్ జైస్వాల్ (సి) బాసిల్ (బి) ఆదిత్య 14; సిద్ధార్థ్ దేశాయ్ (బ్యాటింగ్) 24; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (154 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 429. వికెట్ల పతనం: 1–131, 2–238, 3–277, 4–292, 5–320, 6–325, 7–357. బౌలింగ్: నిధీశ్ 23–4–86–1; జలజ్ సక్సేనా 61–12–137–4; బాసిల్ 22–1–59–1; ఆదిత్య సర్వతే 36–3–104–1; అక్షయ్ చంద్రన్ 11–0–31–0; ఇమ్రాన్ 1–0–3–0. -
Semi Final: కష్టాల్లో ముంబై.. పట్టు బిగించిన విదర్భ
దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ సెమీఫైన(Ranji Trophy Semi Final)ల్లో డిఫెండిగ్ చాంపియన్ ముంబై(Mumbai) జట్టు కష్టాల్లో పడింది. నాగ్‌పూర్ వేదికగా విదర్భ(Vidarbha)తో జరుగుతున్న పోరులో బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోగా... బౌలర్లు కూడా ప్రభావం చూపలేకపోయారు. ఆరంభంలో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచినప్పటికీ... దాన్ని చివరి వరకు కొనసాగించలేకపోయారు. దీంతో కోలుకున్న విదర్భ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 53 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.యశ్ రాథోడ్ (101 బంతుల్లో 59 బ్యాటింగ్; 4 ఫోర్లు) అర్ధశతకంతో రాణించగా... కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ (102 బంతుల్లో 31 బ్యాటింగ్; 2 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. అథర్వ తైడె (0), కరుణ్ నాయర్ (6), ధ్రువ్ షోరే (13), దానిశ్ (29) విఫలమవడంతో... ఒకదశలో 56 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన మాజీ చాంపియన్ విదర్భ జట్టును యశ్ రాథోడ్, అక్షయ్ ఆదుకున్నారు. వీరిద్దరూ అజేయమైన ఐదో వికెట్‌కు 91 పరుగులు జోడించారు.ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో 113 పరుగుల ఆధిక్యం దక్కించుకున్న విదర్భ జట్టు... ప్రస్తుతం ఓవరాల్‌గా 260 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ముంబై బౌలర్లలో షమ్స్ ములానీ 2... శార్దుల్ ఠాకూర్, తనుశ్ కొటియాన్ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 188/7తో బుధవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై జట్టు చివరకు 92 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఆకాశ్ ఆనంద్ (256 బంతుల్లో 106; 11 ఫోర్లు) విలువైన సెంచరీ చేశాడు. తనుశ్ కొటియాన్ (33; 4 ఫోర్లు, 1 సిక్స్) అతడికి సహకరించాడు. విదర్భ బౌలర్లలో పార్థ్ 4 వికెట్లు పడగొట్టాడు. స్కోరు వివరాలు విదర్భ తొలి ఇన్నింగ్స్: 383ముంబై తొలి ఇన్నింగ్స్: ఆయుశ్ (సి) దానిశ్ (బి) దర్శన్ 9; ఆకాశ్ ఆనంద్ (సి) అక్షయ్ (బి) నచికేత్ 106; సిద్ధేశ్ (బి) యశ్ ఠాకూర్ 35; రహానే (బి) పార్థ్ 18; సూర్యకుమార్ (సి) దానిశ్ (బి) పార్థ్ 0; శివమ్ దూబే (సి) అథర్వ (బి) పార్థ్ 0; షమ్స్ ములానీ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్‡్ష దూబే 4; శార్దుల్ (సి) దర్శన్ (బి) యశ్ ఠాకూర్ 37; తనుశ్ (బి) పార్థ్ 33; మోహిత్ (బి) హర్‡్ష దూబే 10; రాయ్స్టన్ డయస్ (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (92 ఓవర్లలో ఆలౌట్) 270. వికెట్ల పతనం: 1–18, 2–85, 3–113, 4–113, 5–113, 6–118, 7–178, 8–247, 9–261, 10–270, బౌలింగ్: దర్శన్ 12–1–46–1; యశ్ ఠాకూర్ 16–0–73–2; హర్ష్ దూబే 25–3–68–2; నచికేత్ 9–2–25–1; పార్థ్ 30–9–55–4. విదర్భ రెండో ఇన్నింగ్స్: అథర్వ (ఎల్బీడబ్ల్యూ) (బి) శార్దుల్ 0; ధ్రువ్ షోరే (ఎల్బీడబ్ల్యూ) (బి) తనుశ్ 13; దానిశ్ (సి అండ్ బి) ములానీ 29; కరుణ్ నాయర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ములానీ 6; యశ్ రాథోడ్ (బ్యాటింగ్) 59; అక్షయ్ వాడ్కర్ (బ్యాటింగ్) 31; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (53 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 147. వికెట్ల పతనం: 1–0, 2–40, 3–52, 4–56, బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 6–2–14–1; మోహిత్ 2–0–13–0; షమ్స్ ములానీ 20–3–50–2; రాయ్స్టన్ డయస్ 7–4–11–0; తనుశ్ కొటియాన్ 14–1–33–1; శివమ్ దూబే 3–0–17–0; ఆయుశ్ 1–0–3–0.ముంబై మాజీ కెప్టెన్ మిలింద్ కన్నుమూత ముంబై జట్టు మాజీ సారథి, మాజీ సెలెక్టర్ మిలింద్ రేగె (76) బుధవారం గుండెపోటుతో కన్నుమూశారు. దేశవాళీల్లో ఆల్‌రౌండర్‌గా రాణించిన మిలింద్ కెరీర్లో 52 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి 1532 పరుగులు చేయడంతో పాటు 126 వికెట్లు పడగొట్టారు. 26 ఏళ్ల వయసులోనే గుండెపోటుకు గురైన మిలింద్ ఆ తర్వాత తిరిగి కోలుకొని ముంబై రంజీ జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరించాడు. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. మిలింద్ మృతికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సంతాపం వ్యక్తం చేశాడు. మిలింద్ చిన్ననాటి మిత్రుడు సునీల్ గావస్కర్‌తో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) సంతాపం వ్యక్తం చేశాయి. మిలింద్ మృతికి సంతాపంగా విదర్భతో రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ముంబై ప్లేయర్లు నల్లరిబ్బన్లతో బరిలోకి దిగారు. -
ప్రియాంక్ ప్రతాపం
అహ్మదాబాద్: సీనియర్ ఓపెనర్ ప్రియాంక్ పాంచాల్ (200 బంతుల్లో 117 బ్యాటింగ్; 13 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకంతో అదరగొట్టడంతో... కేరళతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో మాజీ చాంపియన్ గుజరాత్ జట్టు దీటుగా బదులిస్తోంది. బ్యాటింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై మొదట కేరళ బ్యాటర్లు భారీ స్కోరు చేయగా... ఇప్పుడు గుజరాత్ కూడా అదే బాటలో నడుస్తోంది. బుధవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి గుజరాత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 71 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 222 పరుగులు చేసింది. ప్రియాంక్ సూపర్ సెంచరీకి ఆర్య దేశాయ్ (118 బంతుల్లో 73; 11 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకం తోడవడంతో గుజరాత్ ఇన్నింగ్స్ సజావుగా సాగింది. ఈ జంట కేరళ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొవడంతో పరుగుల రాక సులువైంది. ముఖ్యంగా ఆర్య దూకుడుగా ఆడాడు. తొలి వికెట్‌కు 131 పరుగులు జోడించిన అనంతరం అతడు అవుటయ్యాడు. ఆ తర్వాత మనన్ హింగ్రాజియా (108 బంతుల్లో 30 బ్యాటింగ్; 3 ఫోర్లు)తో కలిసి ప్రియాంక్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ క్రమంలో ప్రియాంక్ ఫస్ట్ క్లాస్ కెరీర్లో 29వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తాజా రంజీ సీజన్లో అతడికిది రెండో శతకం. మూడో రోజు 71 ఓవర్లు వేసిన కేరళ కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టింది. బాసిల్‌కు ఆ వికెట్ దక్కింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 418/7తో బుధవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కేరళ జట్టు చివరకు 187 ఓవర్లలో 457 పరుగులు చేసి ఆలౌటైంది. వికెట్ కీపర్ మొహమ్మద్ అజహరుద్దీన్ (341 బంతుల్లో 177 నాటౌట్; 20 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలిచాడు. మూడో రోజు 10 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన కేరళ జట్టు మరో 39 పరుగులు జోడించి మిగిలిన మూడు వికెట్లు కోల్పోయింది. చివరి వరుస బ్యాటర్లు ఎక్కువసేపు నిలవలేకపోయారు. గుజరాత్ బౌలర్లలో అర్జాన్ మూడు, చింతన్ గజా రెండు వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం చేతిలో 9 వికెట్లు ఉన్న గుజరాత్ జట్టు కేరళ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 235 పరుగులు వెనుకబడి ఉంది. స్కోరు వివరాలు కేరళ తొలి ఇన్నింగ్స్: అక్షయ్ (రనౌట్) 30; రోహన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రవి బిష్ణోయ్ 30; వరుణ్ (సి) ఉర్విల్ (బి) ప్రియజీత్సింగ్ 10; సచిన్ బేబీ (సి) ఆర్య దేశాయ్ (బి) అర్జాన్ 69; జలజ్ సక్సేనా (బి) అర్జాన్ 30; అజహరుద్దీన్ (నాటౌట్) 177; సల్మాన్ నిజర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) విశాల్ 52; ఇమ్రాన్ (సి) ఉర్విల్ (బి) అర్జాన్ 24; ఆదిత్య (బి) చింతన్ 11; నిదీశ్ (రనౌట్) 5; బాసిల్ (సి) ఆర్య (బి) చింతన్ 1; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (187 ఓవర్లలో ఆలౌట్) 457. వికెట్ల పతనం: 1–60, 2–63, 3–86, 4–157, 5–206, 6–355, 7–395, 8–428, 9–455, 10–457, బౌలింగ్: చింతన్ 33–9–75–2; అర్జాన్ 34–9–81–3; ప్రియజీత్ సింగ్ 21–2–58–1; జైమీత్ 13–1–46–0; రవి బిష్ణోయ్ 30–7–74–1; సిద్ధార్థ్ దేశాయ్ 33–13–49–0; విశాల్ జైస్వాల్ 22–5–57–1; ఆర్య దేశాయ్ 1–0–3–0. గుజరాత్ తొలి ఇన్నింగ్స్: ప్రియాంక్ (బ్యాటింగ్) 117; ఆర్య దేశాయ్ (బి) బాసిల్ 73; మనన్ (బ్యాటింగ్) 30; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం: (71 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి) 222. వికెట్ల పతనం: 1–131. బౌలింగ్: నిధీశ్ 10–1–40–0; జలజ్ 25–5–71–0; బాసిల్ 15–1–40–1; ఆదిత్య 17–2–55–0; అక్షయ్ చంద్రన్ 3–0–11–0; ఇమ్రాన్ 1–0–3–0. -
Ranji Semis-2: ముంబై ఎదురీత.. రెండో రోజూ విదర్భదే ఆధిపత్యం
నాగ్‌పూర్: రంజీ ట్రోఫీలో ముంబై మేటి చాంపియన్ జట్టు. దేశవాళీ టోర్నీలో ఏకంగా 48 సార్లు ఫైనల్ చేరి 42 సార్లు విజేతగా నిలిచిన ఈ జట్టుకు ఈసారి సెమీఫైనల్లో విదర్భ నుంచి కఠిన సవాళ్లు ఎదురవుతున్నాయి. తొలి రోజు బ్యాటింగ్‌లో సత్తా చాటుకున్న విదర్భ... రెండో రోజు బౌలింగ్‌తో ముంబైని ముప్పుతిప్పలు పెట్టింది. ఫలితంగా డిఫెండింగ్ చాంపియన్ ఎదురీదుతోంది. ముందుగా ఓవర్‌నైట్ స్కోరు 308/5తో రెండోరోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన విదర్భ 107.5 ఓవర్లలో 383 పరుగుల వద్ద ఆలౌటైంది. క్రితం రోజు బ్యాటర్లలో యశ్ రాథోడ్ (54; 7 ఫోర్లు) అర్ధసెంచరీ పూర్తిచేసుకొని వెనుదిరిగాడు. కెపె్టన్ అక్షయ్ వాడ్కర్ (34; 4 ఫోర్లు) కాసేపు కుదురుగా ఆడాడు. హర్ష్ దూబే (18; 3 ఫోర్లు), నచికేత్ (11; 2 ఫోర్లు), దర్శన్ నల్కండే (12; 2 ఫోర్లు) రెండంకెల స్కోర్లు చేశారు. రెండో రోజు 3 వికెట్లు పడగొట్టిన శివమ్ దూబేకు మొత్తం 5 వికెట్లు దక్కాయి. తర్వాత తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ముంబై ఆట ముగిసే సమయానికి 59 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 188 పరుగులు సాధించింది. ఓపెనర్ ఆకాశ్ ఆనంద్ (171 బంతుల్లో 67 బ్యాటింగ్; 6 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీతో రాణించాడు. శార్దుల్ ఠాకూర్ (37; 4 ఫోర్లు, 1 సిక్స్), సిద్దేశ్ లాడ్ (35; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. ఫాలోఆన్ గండాన్ని తప్పించుకున్న ముంబై జట్టు విదర్భ స్కోరుకు ఇంకా 195 పరుగులు వెనుకబడి ఉంది. ముంబై ఒక దశలో 113/2 స్కోరు వద్ద పటిష్టంగా ఉంది. కేవలం రెండో ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడుతున్న పార్థ్ రెఖాడే తన స్పిన్ మాయాజాలంతో ముంబైని కష్టాల్లోకి నెట్టాడు. అనుభవజ్ఞుడైన భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత ముంబై సారథి అజింక్య రహానే (18; 4 ఫోర్లు) సహా టీమిండియా హార్డ్‌హిట్టర్లు సూర్యకుమార్ యాదవ్ (0), శివమ్ దూబే (0)లను అసలు ఖాతానే తెరువనీయలేదు. ఒకే ఒక్క ఓవర్లో ఈ ముగ్గురినీ పార్థ్ అవుట్ చేశాడు. ఇన్నింగ్స్ 41వ ఓవర్ వేసిన పార్థ్ తొలి బంతికి రహానేను, మూడు, ఐదో బంతులకు సూర్య, దూబేలను బోల్తా కొట్టించాడు. ఇది చాలదన్నట్లు మరుసటి ఓవర్లోనే (42వ) హర్ష్ దూబే... షమ్స్ ములానీ (4) అవుట్ కావడంతో ముంబై 113/2 నుంచి 10 బంతుల వ్యవధిలోనే 118/6 స్కోరుతో కుదేలైంది. ఆనంద్, శార్దుల్ మెరుగ్గా ఆడటంతో ముంబై కోలుకుంది. ప్రస్తుతం ఆనంద్‌తో పాటు తనుశ్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. స్కోరు వివరాలు విదర్భ తొలి ఇన్నింగ్స్: అథర్వ (సి) ఆనంద్ (బి) రాయ్స్టన్ 4; ధ్రువ్ షోరే (సి) రహానే (బి) ములానీ 74; పార్థ్ రెఖాడే (సి) సూర్యకుమార్ (బి) దూబే 23; దానిశ్ (సి) ఆనంద్ (బి) ములానీ 79; కరుణ్ నాయర్ (సి) ఆనంద్ (బి) దూబే 45; యశ్ రాథోడ్ (సి అండ్ బి) శార్దుల్ 54; అక్షయ్ (సి) ఆనంద్ (బి) రాయ్స్టన్ 34; హర్‡్ష దూబే (సి) ఆనంద్ (బి) శివమ్ దూబే 18; నచికేత్ (సి) ములానీ (బి) శివమ్ దూబే 11; దర్శన్ (నాటౌట్) 12; యశ్ ఠాకూర్ (సి)అవస్థి (బి) శివమ్ దూబే 3; ఎక్స్‌ట్రాలు 26; మొత్తం (107.5 ఓవర్లలో ఆలౌట్) 383. వికెట్ల పతనం: 1–39, 2–93, 3–144, 4–222, 5–261, 6–324, 7–346, 8–364, 9–369, 10–383. బౌలింగ్: శార్దుల్ 19–0–78–1, మోహిత్ 14–2–61–0, రాయ్స్టన్ డయస్ 18–5–48–2, తనుశ్ 22–0–78–0, శివమ్ దూబే 11.5–1–49–5, షమ్స్ ములానీ 23–4–62–2. ముంబై తొలి ఇన్నింగ్స్: ఆయుశ్ (సి) దానిశ్ (బి) దర్శన్ 9; ఆకాశ్ ఆనంద్ (బ్యాటింగ్) 67; సిద్ధేశ్ (బి) యశ్ ఠాకూర్ 35; రహానే (బి) పార్థ్ 18; సూర్యకుమార్ (సి) దానిశ్ (బి) పార్థ్ 0; శివమ్ దూబే (సి) అథర్వ (బి) పార్థ్ 0; షమ్స్ ములానీ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్ష్ దూబే 4; శార్దుల్ (సి) దర్శన్ (బి) యశ్ ఠాకూర్ 37; తనుశ్ (బ్యాటింగ్) 5; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (59 బంతుల్లో 7 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–18, 2–85, 3–113, 4–113, 5–113, 6–118, 7–178. బౌలింగ్: దర్శన్ నల్కండే 10–1–40–1, యశ్ ఠాకూర్ 11–0–56–2, హర్‡్ష దూబే 15–1–51–1, నచికేత్ 7–1–22–0, పార్థ్ రెఖాడే 16–6–16–3. -
Ranji Semis-1: కేరళ భారీ స్కోర్.. అజేయ సెంచరీతో మెరిసిన అజహరుద్దీన్
అహ్మదాబాద్: పసలేని గుజరాత్ బౌలింగ్‌పై కేరళ బ్యాటర్లు ఆధిపత్యం కనబరుస్తున్నారు. రెండో రోజు ఆటలో ఓవర్‌నైట్ బ్యాటర్ మొహమ్మద్ అజహరుద్దీన్ (303 బంతుల్లో 149 బ్యాటింగ్; 17 ఫోర్లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. సల్మాన్ నిజర్ (202 బంతుల్లో 52; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. రెండు రోజుల్లో గుజరాత్ బౌలర్లలో ఏ ఒక్కరు కూడా ప్రభావం చూపలేకపోయారు. 177 ఓవర్లు వేసిన గుజరాత్ 7 వికెట్లనే పడగొట్టింది. మంగళవారం అజహరుద్దీన్, సల్మాన్ల జోడీ క్రీజులో పాతుకుపోవడంతో రోజంతా కష్టపడిన గుజరాత్ బౌలర్లకు మూడే వికెట్లు దక్కాయి. ఓవర్‌నైట్ స్కోరు 206/4తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన కేరళ అదే స్కోరు వద్ద కెప్టెన్ సచిన్ బేబీ (69; 8 ఫోర్లు) వికెట్‌ను కోల్పోయింది. కీలకమైన వికెట్‌ను తీశామన్న ఆనందం లేకుండా సల్మాన్... ఓవర్‌నైట్ బ్యాటర్ అజహరుద్దీన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఇద్దరు కూడా ఏమాత్రం అనవసర షాట్ల జోలికి వెళ్లకుండా నింపాదిగా పరుగులు జత చేశారు. దీంతో మొదటి సెషన్లో మరో వికెట్ పడకుండా కేరళ 293/5 స్కోరు వద్ద లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. తర్వాత జట్టు స్కోరు 300 పరుగులు దాటింది. ఇద్దరు జిడ్డుగా ఆడటంతో గుజరాత్ బౌలర్లకు ఆలసటే తప్ప వికెట్ల ఓదార్పు దక్కనే లేదు. ఈ క్రమంలో అజహరుద్దీన్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డ్రింక్స్ విరామం తర్వాత సల్మాన్ అర్ధశతకం సాధించాడు. ఈ రెండో సెషన్లోనూ వీళ్లిద్దరి ఆటే కొనసాగడంతో గుజరాత్ శిబిరానికి వికెట్ సంబరమే లేకుండాపోయింది. ఎట్టకేలకు ఆఖరి సెషన్ ఊరటనిచ్చింది. ఇందులో రెండు వికెట్లు పడగొట్టగలిగింది. సల్మాన్‌ను విశాల్ జైస్వాల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో ఆరో వికెట్‌కు 149 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కానీ తర్వాత వచి్చన అహమ్మద్ ఇమ్రాన్ (66 బంతుల్లో 24; 3 ఫోర్లు) కూడా గుజరాత్ బౌలర్లను ఇబ్బంది పెట్టాకే నిష్క్రమించాడు. ఆదిత్య సర్వతే (10 బ్యాటింగ్; 1 ఫోర్)తో వచ్చాక అజహరుద్దీన్ జట్టు స్కోరును 400 దాటించాడు. ఆటనిలిచే సమయానికి ఇద్దరు అజేయంగా నిలిచారు. అర్జాన్కు 3 వికెట్లు దక్కాయి. స్కోరు వివరాలు కేరళ తొలి ఇన్నింగ్స్: అక్షయ్ (రనౌట్) 30; రోహన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రవి బిష్ణోయ్ 30; వరుణ్ (సి) ఉర్విల్ (బి) ప్రియజీత్సింగ్ 10; సచిన్ (సి) ఆర్య దేశాయ్ (బి) అర్జాన్ 69; జలజ్ సక్సేనా (బి) అర్జాన్ 30; అజహరుద్దీన్ (బ్యాటింగ్) 149; సల్మాన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) విశాల్ 52; ఇమ్రాన్ (సి) ఉర్విల్ (బి) అర్జాన్ 24; ఆదిత్య (బ్యాటింగ్) 10; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (177 ఓవర్లలో 7 వికెట్లకు) 418. వికెట్ల పతనం: 1–60, 2–63, 3–86, 4–157, 5–206, 6–355, 7–395. బౌలింగ్: చింతన్ గజా 28–8–57–0, అర్జాన్ 29–8–64–3, ప్రియజీత్ సింగ్ 21–2–58–1, జైమీత్ 13–1–46–0, రవి బిష్ణోయ్ 30–7–74–1, సిద్ధార్థ్ దేశాయ్ 33–13–49–0, విశాల్ జైస్వాల్ 22–5–57–1, ఆర్య దేశాయ్ 1–0–3–0. -
చరిత్ర సృష్టించిన కేరళ క్రికెటర్
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్, కేరళ జట్ల మధ్య రంజీ ట్రోఫీ తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో కేరళ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. రెండో రోజు రెండో సెషన్ సమయానికి కేరళ 134.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. వికెట్‌కీపర్ మొహమ్మద్ అజహారుద్దీన్ (105 నాటౌట్), సల్మాన్ నిజర్ (40 నాటౌట్) బ్యాటింగ్ చేస్తున్నారు.కేరళ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సచిన్ బేబి (69) అర్ద సెంచరీతో రాణించగా.. అక్షయ్ చంద్రన్, రోహన్ కున్నుమ్మల్, జలజ్ సక్సేనా తలో 30 పరుగులు చేశారు. వరుణ్ నయనార్ 10 పరుగులకు ఔటయ్యాడు. గుజరాత్ బౌలర్లలో అర్జన్ నగస్వల్లా 2, పి జడేజా, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.చరిత్ర సృష్టించిన మొహమ్మద్ అజహారుద్దీన్ఈ మ్యాచ్‌లో సెంచరీతో కదంతొక్కిన మొహమ్మద్ అజహారుద్దీన్ రికార్డుబుక్కుల్లోకెక్కాడు. రంజీ సెమీఫైనల్లో సెంచరీ చేసిన తొలి కేరళ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. రంజీల్లో కేరళ గతంలో ఒకే ఒక సారి సెమీస్‌కు చేరుకుంది. 2018-19 సీజన్లో కేరళ ఫైనల్ ఫోర్కు అర్హత సాధించింది. అయితే ఆ సీజన్ సెమీస్‌లో ఏ కేరళ ఆటగాడు సెంచరీ చేయలేదు. అజహారుద్దీనే రంజీల్లో కేరళ తరఫున సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.ప్రస్తుత రంజీ సీజన్లో కేరళ అద్భుతమైన ప్రదర్శనలతో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఎలైట్ గ్రూప్-సిలో కేరళ 7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 4 డ్రాలతో గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచింది. క్వార్టర్ ఫైనల్లో కేరళ.. జమ్మూ అండ్ కశ్మీర్‌పై ఒక్క పరుగు ఆధిక్యం (తొలి ఇన్నింగ్స్‌లో) సాధించి సెమీస్ బెర్త్ దక్కించుకుంది.మరో సెమీఫైనల్ మ్యాచ్‌లో విదర్భ, ముంబై జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్ శివమ్ దూబే ఐదు వికెట్లతో రాణించాడు. షమ్స్‌ములానీ, రాయ్స్టన్ డయాస్ తలో రెండు, శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ తీశారు.విదర్భ ఇన్నింగ్స్‌లో దృవ్ షోరే (74), దినిశ్ మాలేవార్ (79), యశ్ రాథోడ్ (54) అర్ద సెంచరీలతో రాణించగా.. కరుణ్ నాయర్ (45), కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అథర్వ తైడే 4, పార్థ్ రేఖడే 23, హర్ష్ దూబే 18, భూటే 11, యశ్ ఠాకూర్ 3 పరుగులు చేసి ఔట్ కాగా.. దర్శన్ నల్కండే 12 పరుగులతో అజేయంగా నిలిచాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై.. 18 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. దర్శన్ నల్కండే బౌలింగ్‌లో దనిశ్ మలేవార్‌కు క్యాచ్ ఇచ్చి ఆయుశ్ మాత్రే (9) ఔటయ్యాడు. ప్రస్తుతం ఆకాశ్ ఆనంద్ (29), సిద్దేశ్ లాడ్ (19) క్రీజ్‌లో ఉన్నారు. 23 ఓవర్ల అనంతరం ముంబై తొలి ఇన్నింగ్స్ స్కోర్ 62/1గా ఉంది. విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ముంబై ఇంకా 321 పరుగులు వెనుకపడి ఉంది. -
శివమ్ దూబే విజృంభణ.. కీలక మ్యాచ్‌లో ఐదు వికెట్లు
భారత స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే (Shivam Dube) రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్లో (Ranji Semi Finals) చెలరేగిపోయాడు. విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో దూబే (ముంబై) ఐదు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు. తరుచూ బ్యాట్‌తో సత్తా చాటే దూబే ఈ మ్యాచ్‌లో బంతితో చెలరేగాడు. దూబే ధాటికి విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటైంది.ఓవర్‌నైట్ స్కోర్ 308/5 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన విదర్భ మరో 75 పరుగులు మాత్రమే జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. తొలి రోజు ఆటలో 2 వికెట్లు తీసిన దూబే.. రెండో రోజు చెలరేగిపోయి మరో 3 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో దూబే.. పార్థ్ రేఖడే, కీలకమైన కరుణ్ నాయర్, హర్ష్ దూబే, భూటే, యశ్ ఠాకూర్ వికెట్లు తీశాడు. ముంబై బౌలర్లలో షమ్స్‌ములానీ, రాయ్స్టన్ డయాస్ తలో రెండు, శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ తీశారు.విదర్భ ఇన్నింగ్స్‌లో దృవ్ షోరే (74), దినిశ్ మాలేవార్ (79), యశ్ రాథోడ్ (54) అర్ద సెంచరీలతో రాణించగా.. కరుణ్ నాయర్ (45), కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అథర్వ తైడే 4, పార్థ్ రేఖడే 23, హర్ష్ దూబే 18, భూటే 11, యశ్ ఠాకూర్ 3 పరుగులు చేసి ఔట్ కాగా.. దర్శన్ నల్కండే 12 పరుగులతో అజేయంగా నిలిచాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై.. 18 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. దర్శన్ నల్కండే బౌలింగ్‌లో దనిశ్ మలేవార్‌కు క్యాచ్ ఇచ్చి ఆయుశ్ మాత్రే (9) ఔటయ్యాడు. ప్రస్తుతం ఆకాశ్ ఆనంద్ (7), సిద్దేశ్ లాడ్ (0) క్రీజ్‌లో ఉన్నారు. 4.4 ఓవర్ల అనంతరం ముంబై తొలి ఇన్నింగ్స్ స్కోర్ 18/1గా ఉంది. విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ముంబై ఇంకా 365 పరుగులు వెనుకపడి ఉంది.మరో సెమీఫైనల్లో గుజరాత్, కేరళ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న కేరళ భారీ స్కోర్ దిశగా పయనిస్తుంది. రెండో రోజు తొలి సెషన్ సమయానికి ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది.మొహమ్మద్ అజహారుద్దీన్ (85), సల్మాన్ నిజర్ (28) క్రీజ్‌లో ఉన్నారు. కేరళ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సచిన్ బేబి (69) అర్ద సెంచరీతో రాణించగా.. అక్షయ్ చంద్రన్, రోహన్ కున్నుమ్మల్, జలజ్ సక్సేనా తలో 30 పరుగులు చేశారు. వరుణ్ నయనార్ 10 పరుగులకు ఔటయ్యాడు. గుజరాత్ బౌలర్లలో అర్జన్ నగస్వల్లా 2, పి జడేజా, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు. -
Ranji Trophy Semis-2 Day 1: రాణించిన విదర్భ బ్యాటర్లు
నాగ్‌పూర్: రంజీ ట్రోఫీ చరిత్రలోనే ఘనాపాఠి జట్టయిన ముంబైకి రెండో సెమీఫైనల్లో తొలిరోజే విదర్భ బ్యాటర్లు గట్టి సవాల్ విసిరారు. ముంబై బౌలర్లు సగం (5) వికెట్లు పడగొట్టినప్పటికీ ఒకే రోజు విదర్భ 300 పైచిలుకు స్కోరు చేసింది. టాపార్డర్‌లో ధ్రువ్ షోరే (109 బంతుల్లో 74; 9 ఫోర్లు), మిడిలార్డర్లో దానిశ్ మాలేవర్ (157 బంతుల్లో 79; 7 ఫోర్లు, 1 సిక్స్), కరుణ్ నాయర్ (70 బంతుల్లో 45; 6 ఫోర్లు), యశ్ రాథోడ్ (86 బంతుల్లో 47 బ్యాటింగ్; 6 ఫోర్లు) సమష్టిగా కదంతొక్కారు. టాస్ గెలవగానే బ్యాటింగ్ ఎంచుకొని బరిలోకి దిగిన విదర్భకు మంచి ఆరంభమైతే దక్కలేదు.అథర్వ (4) వికెట్ పారేసుకున్నాడు. మరో ఓపెనర్ ధ్రువ్ షోరే, పార్థ్ రేఖడే (23; 2 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచాడు. వన్డేలాగే ఆడిన ధ్రువ్ 67 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. రెండో వికెట్‌కు వీరిద్దరు 54 పరుగులు జోడించడంతో జట్టు స్కోరు వందకు సమీపించింది. ఈ దశలో 93 పరుగుల వద్ద పార్థ్‌ను శివమ్ దూబే అవుట్ చేశాడు. దానిష్ క్రీజులోకి రాగా... తొలి సెషన్లోనే జట్టుస్కోరు వంద దాటింది. ధ్రువ్, దానిశ్ విదర్భ ఇన్నింగ్స్‌లో మరో 50 పైచిలుకు భాగస్వామ్యాన్ని జోడించింది.జట్టు స్కోరు 144 పరుగుల వద్ద ధ్రువ్ షోరేను షమ్స్ ములానీ పెవిలియన్ చేర్చడంతో మూడో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత వచ్చి కరుణ్ నాయర్, యశ్ రాథోడ్‌లు కూడా ముంబై బౌలర్లను చక్కగా ఎదుర్కోవడంతో భారీస్కోరుకు బాట పడింది. ఆట నిలిచే సమయానికి యశ్, కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. వీళ్లిద్దరు కలిసి అబేధ్యమైన ఆరో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. ముంబై బౌలర్లలో శివమ్ దూబే, షమ్స్ ములానీ చెరో 2 వికెట్లు తీశారు.స్కోరు వివరాలు విదర్భ తొలి ఇన్నింగ్స్: అథర్వ (సి) ఆనంద్ (బి) రాయ్స్టన్ డయస్ 4; ధ్రువ్ షోరే (సి) రహానే (బి) ములానీ 74; పార్థ్ రేఖడే (సి) సూర్యకుమార్ (బి) దూబే 23; దానిశ్ (సి) ఆనంద్ (బి) ములానీ 79; కరుణ్ నాయర్ (సి) ఆనంద్ (బి) దూబే 45; యశ్ రాథోడ్ (బ్యాటింగ్) 47; అక్షయ్ వాడ్కర్ (బ్యాటింగ్) 13; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (88 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి) 308. వికెట్ల పతనం: 1–39, 2–93, 3–144, 4–222, 5–261. బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 14–0–57–0, మోహిత్ 14–2–61–0, రాయ్స్టన్ డయస్ 11–2–26–1, తనుశ్ కొటియాన్ 22–0–78–0, శివమ్ దూబే 9–1–35–2, షమ్స్ ములానీ 18–3–44–2. -
Ranji Trophy Semis-1: సచిన్ కెప్టెన్ ఇన్నింగ్స్
అహ్మదాబాద్: కేరళ, గుజరాత్ జట్ల మధ్య రంజీ ట్రోఫీ తొలి సెమీఫైనల్ మ్యాచ్ చప్పగా మొదలైంది. తొలిరోజు ఆటలో మొదట బ్యాటింగ్‌కు దిగిన కేరళ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సచిన్ బేబీ (193 బంతుల్లో 69 బ్యాటింగ్, 8 ఫోర్లు) జిడ్డుగా బ్యాటింగ్ చేశాడు. దీంతో సోమవారం ఆట ముగిసే సమయానికి కేరళ జట్టు 89 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. మొదట ఓపెనర్లు అక్షయ్ చంద్రన్ (30; 5 ఫోర్లు), రోహన్ (30; 5 ఫోర్లు) 20 ఓవర్ల వరకు వికెట్ పడిపోకుండా 60 పరుగులు జతచేశారు. 3 పరుగుల వ్యవధిలో వీరిద్దరూ అవుటయ్యారు. కాసేపయ్యాక వరుణ్ నాయనార్ (10) నిష్క్రమించగా... కెప్టెన్ సచిన్, జలజ్ సక్సేనా (30; 4 ఫోర్లు) గుజరాత్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టేలా బ్యాటింగ్ చేశారు.గుజరాత్ జట్టు ఏకంగా ఏడుగురు బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా... ప్రయోజనం లేకపోయింది. వీళ్లిద్దరు 27.5 ఓవర్ల పాటు క్రీజులో పాతుకుపోవడంతో ప్రత్యర్థి బౌలర్లు, ఫీల్డర్లు అలసిపోయారు. ఎట్టకేలకు మూడో సెషన్ మొదలయ్యాక సక్సేనాను అర్జాన్ నగ్వాస్వాలా బౌల్డ్ చేయడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. నాలుగో వికెట్‌కు ఈ జోడీ 71 పరుగులు జోడించింది. తర్వాత మొహమ్మద్ అజహరుద్దీన్ (30 బ్యాటింగ్; 3 ఫోర్లు) కూడా నాయకుడికి అండగా నిలవడంతో గుజరాత్ జట్టుకు కష్టాలు కొనసాగాయి.132 బంతుల్లో సచిన్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అబేధ్యమైన ఐదో వికెట్‌కు అజహరుద్దీన్, సచిన్ 49 పరుగులు జతచేశారు. టెస్టులు, దేశవాళీ టోర్నీలో సెషన్‌కు 30 ఓవర్లు వేస్తారు. అయితే సచిన్ 25వ ఓవర్లో క్రీజులోకి వచ్చి ఓ సెషన్ ఓవర్లను మించే క్రీజులో నిలిచాడు. 193 బంతులంటే 32 ఓవర్ల పైచిలుకు బంతుల్ని అతను ఎదుర్కొన్నాడు. అర్జాన్, ప్రియజీత్, రవి బిష్ణోయ్ తలా ఒక వికెట్ తీశారు. స్కోరు వివరాలు కేరళ తొలి ఇన్నింగ్స్: అక్షయ్ (రనౌట్) 30; రోహన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రవి బిష్ణోయ్ 30; వరుణ్ (సి) ఉర్విల్ (బి) ప్రియజీత్సింగ్ 10; సచిన్ బేబీ (బ్యాటింగ్) 69; జలజ్ సక్సేనా (బి) అర్జాన్ 30; అజహరుద్దీన్ (బ్యాటింగ్) 30; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (89 ఓవర్లలో 4 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–60, 2–63, 3–86, 4–157. బౌలింగ్: చింతన్ గజా 18–536–0, అర్జాన్ 16–4–39–1, ప్రియజీత్ సింగ్ 12–0–33–1, జైమీత్ 9–1–26–0, రవి బిష్ణోయ్ 15–2–33–1, సిద్ధార్థ్ దేశాయ్ 16–8–22–0, విశాల్ జైస్వాల్ 3–1–13–0. -
Ranji Trophy: ఫైనల్ బెర్త్ లక్ష్యంగా...
నాగ్‌పూర్: దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ కీలక ఘట్టానికి చేరింది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో మాజీ చాంపియన్ గుజరాత్‌తో కేరళ జట్టు... విదర్భతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టు తలపడుతున్నాయి. గత ఏడాది టైటిల్ కోసం తుదిపోరులో పోటీపడిన విదర్భ, ముంబై ఈసారి సెమీఫైనల్లోనే అమీతుమీ తేల్చుకోనున్నాయి. రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు 42 సార్లు రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన ముంబై మరోసారి ట్రోఫీ చేజిక్కించుకోవాలని చూస్తుంటే... ఈ సీజన్లో సూపర్ ఫామ్‌లో ఉన్న విదర్భ ముంబైకి చెక్ పెట్టాలని భావిస్తోంది. అజింక్య రహానే, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, శార్దుల్ ఠాకూర్ వంటి టీమిండియా ఆటగాళ్లు ఉన్న ముంబై ఫేవరెట్‌గా బరిలోకి దిగనుండగా... విదర్భ జట్టు సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్‌పై ఎక్కువ ఆధార పడుతోంది. ఈ సీజన్లో పరుగుల వరద పారిస్తున్న కరుణ్ నాయర్ సెమీఫైనల్లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడనేది కీలకం. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ‘నాన్ ట్రావెలింగ్ రిజర్వ్’గా ఎంపికైన యశస్వి జైస్వాల్ ముంబై జట్టు తరఫున బరిలోకి దిగుతాడనుకుంటే... గాయం కారణంగా అతడు ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. జైస్వాల్ ప్రస్తుతం బీసీసీఐ పర్యవేక్షణలో బెంగళూరులో ప్రత్యేక చికిత్స తీసుకుంటున్నాడు. జైస్వాల్ అందుబాటులో లేకపోయినా... ముంబై జట్టు బ్యాటింగ్ విభాగానికి వచి్చన ఇబ్బందేమీ లేదు. ఆయుశ్ మాత్రే, ఆకాశ్ ఆనంద్, సిద్ధేశ్ లాడ్, రహానే, సూర్యకుమార్, దూబే, షమ్స్ ములానీ, శార్దుల్, తనుశ్ రూపంలో ముంబై జట్టుకు తొమ్మిదో స్థానం వరకు బ్యాటింగ్ సామర్థ్యం ఉంది. తాజా సీజన్లో అత్యధిక మ్యాచ్‌ల్లో లోయర్ ఆర్డర్ బ్యాటర్లే ముంబై జట్టును ఆదుకున్నారు. హరియాణాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును షమ్స్ ములానీ, తనుశ్ కొటియాన్ ఎనిమిదో వికెట్‌కు 183 పరుగులు జోడించి పటిష్ట స్థితికి చేర్చారు. ఈ సీజన్లో వీరిద్దరితో పాటు శార్దుల్ బ్యాటింగ్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ నేపథ్యంలో టాపార్డర్ కూడా రాణిస్తే ముంబైకి తిరుగుండదు. జోరు మీదున్న కరుణ్ నాయర్.. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా మైదానంలో అడుగు పెడితే సెంచరీ చేయడమే తన కర్తవ్యం అన్నట్లు విదర్భ ఆటగాడు కరుణ్ నాయర్ దూసుకెళ్తున్నాడు. విజయ్ హజారే టోర్నీలో వరుస సెంచరీలతో హోరెత్తించిన ఈ సీనియర్ బ్యాటర్ రంజీ క్వార్టర్ ఫైనల్లో తమిళనాడుపై కూడా భారీ శతకం నమోదు చేశాడు. నాయర్ మినహా విదర్భ జట్టులో స్టార్లు లేకపోయినా... సమష్టి ప్రదర్శనతో ఆ జట్టు వరుస విజయాలు సాధిస్తోంది. అథర్వ తైడె, ధ్రువ్ షోరే, ఆదిత్య ఠాక్రె, యశ్ రాథోడ్, కెపె్టన్ అక్షయ్ వాడ్కర్‌తో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. ఈ సీజన్లో 728 పరుగులు చేసిన యశ్ రాథోడ్ విదర్భ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. కరుణ్ నాయర్ (591), అక్షయ్ వాడ్కర్ (588) కూడా భారీగా పరుగులు సాధించి మంచి ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో హర్ష్ దూబే, యశ్ ఠాకూర్, ఆదిత్య ఠాక్రె, నచికేత్ భట్ కీలకం కానున్నారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్ష్ దూబే తాజా సీజన్లో 59 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో ముంబై టాపార్డర్ నిలకడలేమిని సొమ్ము చేసుకుంటూ డిఫెండింగ్ చాంపియన్‌పై పైచేయి సాధించాలని విదర్భ యోచిస్తోంది.కేరళ నిరీక్షణ ముగిసేనా!అహ్మదాబాద్ వేదికగా ప్రారంభం కానున్న మరో సెమీఫైనల్లో గుజరాత్‌తో కేరళ తలపడనుంది. జమ్మూ కశీ్మర్‌తో క్వార్టర్ ఫైనల్లో ఒక్క పరుగు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ద్వారా కేరళ జట్టు ముందంజ వేయగా... సౌరాష్ట్రతో ఏకపక్షంగా సాగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో గెలిచి గుజరాత్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. 2016–17లో చాంపియన్‌గా నిలిచిన గుజరాత్ జట్టు ఆ తర్వాత 2019–20 సీజన్లో మాత్రమే సెమీస్‌కు చేరింది. మరోవైపు కేరళ జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రంజీ ట్రోఫీలో ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. గుజరాత్ జట్టు తరఫున కెపె్టన్ చింతన్ గాజా, ప్రియాంక్ పంచాల్, ఆర్య దేశాయ్, సిద్ధార్థ్ దేశాయ్, మనన్ హింగ్రాజియా, జైమీత్ పటేల్, ఉర్విల్ పటేల్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా మిడిలార్డర్లో జైమీత్, ఉర్విల్, మనన్ కీలక ఇన్నింగ్స్‌లతో గుజరాత్ జట్టు సునాయాసంగా సెమీస్‌కు చేరింది. ఈ సీజన్లో 582 పరుగులు చేసిన జైమీత్ గుజరాత్ తరఫున ‘టాప్’ స్కారర్‌గా కొనసాగుతున్నాడు. మనన్ 570 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో అర్జాన్ నాగ్వస్వల్లా, చింతన్ గాజా, రవి బిష్ణోయ్ కీలకం కానున్నారు. మరోవైపు సచిన్ బేబీ సారథ్యంలోని కేరళ జట్టు... క్వార్టర్స్‌లో జమ్మూకశ్మీర్‌పై చూపిన తెగింపే సెమీస్‌లోనూ కొనసాగించాలని భావిస్తోంది. బ్యాటింగ్‌లో సల్మాన్ నిజార్, మొహమ్మద్ అజహరుద్దీన్, జలజ్ సక్సేనా, సచిన్ బేబీ, రోహన్ కున్నుమ్మల్ కీలకం కానున్నారు. క్వార్టర్స్‌లో నిజార్, అజహరుద్దీన్ పోరాటం వల్లే కేరళ జట్టు సెమీస్‌కు చేరగలిగింది. ని«దీశ్, బాసిల్ థంపి, జలజ్, ఆదిత్య, అక్షయ్ బౌలింగ్ భారం మోయనున్నారు.48 తొమ్మిది దశాబ్దాల చరిత్ర కలిగిన రంజీ ట్రోఫీలో ముంబై జట్టు ఇప్పటి వరకు 48 సార్లు ఫైనల్లోకి ప్రవేశించింది. ఇందులో 42 సార్లు విజేతగా నిలువగా... 6 సార్లు రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. -
రంజీ సెమీఫైనల్ పోరుకు యశస్వి జైస్వాల్
ముంబై: భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ముంబై జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌పై అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్‌కు చాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగే భారత జట్టులో చోటు దక్కలేదు. ప్రాథమిక జట్టులో జైస్వాల్‌ను ఎంపిక చేసినా... అనంతరం స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కోసం 15 మందితో కూడిన జట్టు నుంచి అతడిని తప్పించారు.ప్రస్తుతానికి జైస్వాల్‌తో పాటు పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి నాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌లుగా ఉన్నారు. అత్యవసమైతేనే వీరు దుబాయ్‌కు వెళ్లనున్నారు. దీంతో రంజీ ట్రోఫీ సెమీఫైనల్ కోసం జైస్వాల్ ముంబై సెలెక్టర్లు ఎంపిక చేశారు. విదర్భతో ఈనెల 17 నుంచి జరగనున్న సెమీఫైనల్ పోరులో యశస్వి, సూర్యకుమార్, శివమ్ దూబే, అజింక్య రహానే, శార్దుల్ ఠాకూర్ వంటి భారత ఆటగాళ్లు ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సీజన్లో జమ్మూకశ్మీర్‌తో ఆడిన ఏకైక రంజీ మ్యాచ్‌లో జైస్వాల్ ఆకట్టుకోలేకపోయాడు. రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగినా... భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయాడు. గతేడాది రంజీ ట్రోఫీ ఫైనల్లో విదర్భను చిత్తు చేసిన ముంబై జట్టు 42వసారి టైటిల్ చేజిక్కించుకుంది. ముంబై జట్టు: అజింక్య రహానే (కెప్టెన్ ), ఆయుశ్ మాత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, అమోఘ్ భక్తల్, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, సిద్ధేశ్ లాడ్, శివమ్ దూబే, ఆకాశ్ ఆనంద్, హార్దిక్ తమోర్, సూర్యాన్ష్ షెడ్గే, శార్దుల్ ఠాకూర్, షమ్స్ ములానీ, తనుశ్ కొటియాన్, మోహిత్ అవస్థి, సెల్వెస్టర్ డిసౌజ, రోస్టన్ డియాస్, అథర్వ అంకొలేకర్, హర్ష్ తన్నా. -
Ranji Trophy: ఒక్క పరుగు జమ్మూ కశ్మీర్ కొంప ముంచింది.. సెమీస్‌కు కేరళ
పుణే: ఒక్క పరుగే కదా అని తేలిగ్గా తీసుకుంటే... ఆ ఒక్క పరుగే ఒక్కోసారి ఫలితాన్ని నిర్ణయిస్తుంది. దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో ఈ ఒక్క పరుగు విలువ ఎలాంటిదో అటు కేరళ జట్టుకు... ఇటు జమ్మూ కశ్మీర్ జట్టుకు తెలిసొచ్చింది. రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి సెమీఫైనల్ చేరుకోవాలని ఆశించిన జమ్మూ కశ్మీర్ జట్టుకు ఒక్క పరుగు నిరాశను మిగిల్చింది. మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో సంపాదించిన ఒక్క పరుగు ఆధిక్యం కేరళ జట్టుకు ఆరేళ్ల తర్వాత మళ్లీ రంజీ ట్రోఫీలో సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసింది. వివరాల్లోకి వెళితే... జమ్మూ కశ్మీర్ నిర్దేశించిన 399 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్‌నైట్ స్కోరు 100/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కేరళ జట్టు చివరి రోజు ఆట ముగిసేసరికి 126 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 295 పరుగులు సాధించి మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. సల్మాన్ నిజర్ (162 బంతుల్లో 44 నాటౌట్; 8 ఫోర్లు), మొహమ్మద్ అజహరుద్దీన్ (118 బంతుల్లో 67 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) 43 ఓవర్లు ఆడి ఏడో వికెట్‌కు అజేయంగా 115 పరుగులు జోడించి జమ్మూ కశ్మీర్ విజయాన్ని అడ్డుకున్నారు. భారత్‌లోని పిచ్‌లపై చివరిరోజు 299 పరుగులు చేయాలంటే ఏ స్థాయి టోర్నీలోనైనా కష్టమే. ఈ నేపథ్యంలో కేరళ బ్యాటర్లు ఆఖరి రోజు క్రీజులో నిలదొక్కుకొని సాధ్యమైనన్ని బంతులు ఆడాలని... జమ్మూ కశ్మీర్ బౌలర్లకు వికెట్లు సమర్పించుకోరాదని... మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకోవాలనే ఉద్దేశంతోనే పోరాడారు. చివరకు తమ ప్రయత్నంలో కేరళ బ్యాటర్లు విజయవంతమయ్యారు. వెరసి కేరళ, జమ్మూ కశ్మీర్ జట్ల మధ్య ఐదు రోజుల రంజీ ట్రోఫీ చివరి క్వార్టర్ ఫైనల్ ‘డ్రా’గా ముగిసింది. ఫలితం తేలకపోవడంతో నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన జట్టుకు సెమీఫైనల్ బెర్త్ లభిస్తుంది. జమ్మూ కశ్మీర్‌పై 1 పరుగు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కించుకున్న కేరళ జట్టుకు సెమీఫైనల్ బెర్త్ ఖాయమైంది. ఈనెల 17 నుంచి జరిగే సెమీఫైనల్లో మాజీ చాంపియన్ గుజరాత్ జట్టుతో కేరళ తలపడుతుంది. ఆ ఇద్దరు అడ్డుగోడలా... ఓవర్‌నైట్ స్కోరు 100/2తో ఇన్నింగ్స్ కొనసాగించిన కేరళ బుధవారం తొలి సెషన్లో నింపాదిగా ఆడి 46 పరుగులు జోడించి ఒక్క వికెట్ కోల్పోయింది. లంచ్ సమయానికి కేరళ 146/3తో ఉంది. రెండో సెషన్లోనూ కేరళ బ్యాటర్లు ఎలాంటి ప్రయోగాలకు పోలేదు. ఆచితూచి ఆడుతూ వికెట్లను కాపాడుకున్నారు. అయితే ఎనిమిది బంతుల వ్యవధిలో కేరళ సచిన్ బేబీ (162 బంతుల్లో 48; 7 ఫోర్లు), జలజ్ సక్సేనా (48 బంతుల్లో 18; 3 ఫోర్లు) వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత ఆదిత్య సర్వాతే (27 బంతుల్లో 8; 2 ఫోర్లు) కూడా అవుటయ్యాడు. దాంతో టీ విరామానికి కేరళ 216/6 స్కోరుతో వెళ్లింది. టీ బ్రేక్ తర్వాత ఆఖరి సెషన్లో మరో నాలుగు వికెట్లు తీస్తే జమ్మూ కశ్మీర్‌కు విజయంతోపాటు సెమీఫైనల్ బెర్త్ లభించేది. కానీ సల్మాన్ నిజర్, అజహరుద్దీన్ మొండి పట్టుదలతో ఆడి జమ్మూ కశ్మీర్ జట్టు ఆశలను వమ్ము చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీ సాధించడంతోపాటు రెండో ఇన్నింగ్స్‌లోనూ నాటౌట్‌గా నిలిచిన నిజర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. సంక్షిప్త స్కోర్లు జమ్మూ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్: 280; కేరళ తొలి ఇన్నింగ్స్: 281; జమ్మూ కశ్మీర్ రెండో ఇన్నింగ్స్: 399/9 డిక్లేర్డ్; కేరళ రెండో ఇన్నింగ్స్: 295/6 (126 ఓవర్లలో) (రోహన్ 36, అక్షయ్ 48, సచిన్ బేబీ 48, సల్మాన్ నిజర్ 44 నాటౌట్; అజహరుద్దీన్ 67 నాటౌట్, యు«ద్వీర్ 2/61, సాహిల్ 2/50). -
Ranji Trophy: పారస్ డోగ్రా సెంచరీ... విజయం దిశగా జమ్మూ కశ్మీర్
పుణే: రంజీ ట్రోఫీ (Ranji Trophy) తాజా సీజన్లో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్న జమ్మూ కశ్మీర్ (Jammu And Kashmir) జట్టు కేరళతో క్వార్టర్ ఫైనల్లో భారీ స్కోరు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 180/3తో మంగళవారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన జమ్మూ కశ్మీర్ జట్టు 100.2 ఓవర్లలో 399/9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కెప్టెన్ పారస్ డోగ్రా (Paras Dogra) (232 బంతుల్లో 132; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) చక్కటి సెంచరీతో చెలరేగగా... కన్హయ్య (64; 5 ఫోర్లు), సాహిల్ (59; 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్‌సెంచరీలతో రాణించారు. కేరళ బౌలర్లలో నిదీశ్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 399 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కేరళ జట్టు మంగళవారం ఆట ముగిసే సమయానికి 36 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. రోహన్ (36), ఆక్షయ్ చంద్రన్ (32 బ్యాటింగ్), కెప్టెన్ సచిన్ బేబీ (19 బ్యాటింగ్) తలా కొన్ని పరుగులు చేశారు. జమ్మూ కశ్మీర్ బౌలర్లలో యుధ్వీర్ సింగ్ 2 వికెట్లు పడగొట్టాడు. నేడు ఆటకు చివరి రోజు కాగా... చేతిలో 8 వికెట్లు ఉన్న కేరళ జట్టు విజయానికి ఇంకా 299 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో ఫలితం జమ్మూ కశ్మీర్‌కు అనుకూలంగా వస్తే చరిత్ర అవుతుంది. ఈ జట్టు తొలిసారి సెమీస్‌కు అర్హత సాధించినట్లవుతుంది. -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్
న్యూఢిల్లీ: సౌరాష్ట్ర సీనియర్ ఆటగాడు, దేశవాలీ స్టార్ బ్యాటర్ షెల్డన్ జాక్సన్ (Sheldon Jackson)... ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దేశవాళీ క్రికెట్లో సుదీర్ఘ కాలంగా రాణిస్తున్న 38 ఏళ్ల షెల్డన్ జాక్సన్... రంజీ ట్రోఫీలో గుజరాత్‌తో క్వార్టర్ ఫైనల్ పరాజయం అనంతరం తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 106 మ్యాచ్‌లాడిన షెల్డన్ 45.80 సగటుతో 7,283 పరుగులు చేశాడు. ఇందులో 21 శతకాలు, 39 అర్ధశతకాలు ఉన్నాయి. కేవలం బ్యాటర్‌గానే కాకుండా... మంచి ఫీల్డర్‌గా, వికెట్ కీపర్‌గానూ షెల్డన్ జాక్సన్ సౌరాష్ట్ర జట్టుకు సేవలందించాడు. 2011లో అరంగేట్రం చేసిన జాక్సన్... 2015–16 సీజన్లో సౌరాష్ట్ర జట్టు రంజీ ట్రోఫీ చేజిక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన షెల్డన్ భారత ‘ఎ’ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. జాక్సన్‌కు ఐపీఎల్‌లోనూ ప్రవేశముంది. 2017-22 ఎడిషన్ల మధ్యలో జాక్సన్ క్యాష్ రిచ్ లీగ్‌లో 9 మ్యాచ్‌లు ఆడాడు. -
కరుణ్ నాయర్ సెంచరీ, దూబే మెరుపులు.. సెమీ ఫైనల్లో విదర్భ
రంజీ ట్రోఫీ 2024-25(Ranji Trophy)లో విదర్భ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. క్వార్టర్ ఫైనల్-2లో తమిళనాడుతో తలపడ్డ విదర్భ భారీ విజయం సాధించింది. నాగ్‌పూర్‌లో మంగళవారం ముగిసిన మ్యాచ్‌లో ఏకంగా 198 పరుగుల తేడాతో గెలిచి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది.కరుణ్ నాయర్ శతకంకాగా సొంత మైదానం విదర్భ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్లో శనివారం టాస్ గెలిచిన అక్షయ్ వాడ్కర్ బృందం తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు అథర్వ టైడే(0), ధ్రువ్ షోరే(26)లతో పాటు వన్‌డౌన్ బ్యాటర్ ఆదిత్య ఠాక్రే(5) ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో మిడిలార్డర్లో డానిశ్ మాలేవర్(75) అర్ధ శతకంతో రాణించగా.. కరుణ్ నాయర్(Karun Nair) శతక్కొట్టాడు.హర్ష్ దూబే హాఫ్ సెంచరీమొత్తంగా 243 బంతులు ఎదుర్కొన్న కరుణ్ 122 పరుగులు సాధించాడు. వీరిద్దరికి తోడుగా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్ష్ దూబే(Harsh Dube) హాఫ్ సెంచరీ(69)తో మెరిశాడు. ఈ క్రమంలో విదర్భ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 353 పరుగులకు ఆలౌట్ అయింది. తమిళనాడు బౌలర్లలో సోనూ యాదవ్, విజయ్ శంకర్ మూడేసి వికెట్లు దక్కించుకోగా.. మొహమ్మద్ రెండు, అజిత్ రామ్, మొహమద్ అలీ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.తమిళనాడు బ్యాటర్లు విఫలంఅనంతరం బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడుకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు మొహమద్ అలీ(4), నారాయణ్ జగదీశన్(22)తో పాటు.. సాయి సుదర్శన్(7), బూపతి కుమార్(0) విఫలమయ్యారు. ఈ క్రమంలో ఆండ్రీ సిద్దార్థ్(65) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. హర్ష్ దూబే అతడిని పెవిలియన్‌కు పంపాడు.మిగతావాళ్లలో ప్రదోష్ పాల్(48), సోనూ యాదవ్(32) మాత్రం ఫర్వాలేదనిపించగా.. తమిళనాడు 225 పరుగులకు తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది. విదర్భ బౌలర్లలో ఆదిత్య ఠాక్రే ఐదు వికెట్లతో చెలరేగగా.. యశ్ ఠాకూర్, నచికేత్ భూటే రెండేసి వికెట్లు, హర్ష్ దూబే ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.కెప్టెన్ రాణించినా..ఈ క్రమంలో 128 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విదర్భ 272 పరుగులకు ఆలౌట్ అయింది. ఈసారి యశ్ రాథోడ్(112) శతకంతో చెలరేగగా.. హర్ష్ దూబే మరోసారి హాఫ్ సెంచరీ(64) సాధించాడు. ఇక తమిళనాడు బౌలర్లలో కెప్టెన్ సాయి కిషోర్ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.అనంతరం 401 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు.. మంగళవారం నాటి ఆటలో భాగంగా 202 పరుగులకే కుప్పకూలింది. ప్రదోష్ పాల్(53), సోనూ యాదవ్(57) అర్ధ శతకాలతో రాణించగా.. మిగతా వాళ్లంతా కనీసం ఇరవై పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయారు. విదర్భ బౌలర్లలో హర్ష్ దూబే, నచికేత్ భూటే మూడేసి వికెట్లతో చెలరేగి తమిళనాడు బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశారు. మరోవైపు ఆదిత్య ఠాక్రే, అక్షయ్ వాఖరే చెరో వికెట్ తీశారు.సెమీస్ పోరులో ముంబైతోఈ నేపథ్యంలో 198 పరుగులతో తమిళనాడును చిత్తుచేసిన విదర్భ సెమీస్ చేరుకుంది. శతక వీరుడు కరుణ్ నాయర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ఈ సీజన్లో విదర్భ ఇప్పటికి ఎనిమిదింట ఏడు విజయాలు సాధించడం విశేషం. ఇక విదర్భ ఫైనల్ బెర్తు కోసం ముంబైతో తలపడుతుంది. మరోవైపు.. సౌరాష్ట్రపై గెలుపొందిన గుజరాత్ కూడా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. జమ్మూ కశ్మీర్- కేరళ జట్ల మధ్య మ్యాచ్‌లో విజేతతో గుజరాత్ అమీతుమీ తేల్చుకుంటుంది.చదవండి: శతక్కొట్టిన రహానే, చెలరేగిన శార్దూల్.. సెమీస్‌లో ముంబై119 ఏళ్ల రికార్డు బద్దలు: ప్రపంచంలోనే తొలి టెస్టు జట్టుగా ఐర్లాండ్ ఘనత -
శతక్కొట్టిన రహానే, చెలరేగిన శార్దూల్.. సెమీస్‌లో ముంబై
రంజీ ట్రోఫీ(Ranji Trophy) 2024-25 సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై(Mumbai) సెమీస్‌కు దూసుకువెళ్లింది. క్వార్టర్ ఫైనల్-3 మ్యాచ్‌లో హర్యానా జట్టును మట్టికరిపించి టాప్-4కు అర్హత సాధించింది. కాగా రంజీ తాజా ఎడిషన్‌లో భాగంగా శనివారం క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లు మొదలయ్యాయి.తొలి ఇన్నింగ్స్‌లో రహానే విఫలంఈ క్రమంలో కోల్‌కతా వేదికగా ముంబై హర్యానాతో తలపడింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు ఆయుశ్ మాత్రే(0), ఆకాశ్ ఆనంద్(10)తో పాటు వన్‌డౌన్‌లో వచ్చిన సిద్ధేశ్ లాడ్(4) కూడా విఫలమయ్యాడు. కెప్టెన్ అజింక్య రహానే(Ajinkya Rahane) సైతం 31 పరుగులకే వెనుదిరగగా.. టీమిండియా టీ20 జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్(9), ఆల్‌రౌండర్ శివం దూబే(28) కూడా నిరాశపరిచారు.ఇలాంటి తరుణంలో ఆల్‌రౌండర్ షామ్స్ ములానీ 91 పరుగులతో రాణించగా.. మరో ఆల్‌రౌండర్ తనుశ్ కొటియాన్ 97 పరుగులతో చెలరేగాడు. ఫలితంగా ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 315 పరుగులు చేసింది.అంకిత్ కుమార్ శతకం కారణంగాఅనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన హర్యానా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 301 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ అంకిత్ కుమార్ శతకం(136)తో మెరవగా.. మిగతా వాళ్ల నుంచి అతడికి ఎక్కువగా సహకారం లభించలేదు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ దెబ్బకు హర్యానా బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు. అతడు 18.5 ఓవర్ల బౌలింగ్‌లో 58 పరుగులు ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు కూల్చాడు. మిగతా వాళ్లలో షామ్స్ ములానీ, తనుశ్ కొటియాన్ రెండు వికెట్లు దక్కించుకున్నారు.ఈ నేపథ్యంలో పద్నాలుగు పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ముంబై.. 339 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అజింక్య రహానే శతక్కొట్టగా(108).. సూర్యకుమార్ యాదవ్(70) చాన్నాళ్ల తర్వాత అర్ధ శతకం బాదాడు. మిగిలిన వాళ్లలో సిద్దేశ్ లాడ్ 43, శివం దూబే 48 పరుగులతో రాణించారు.అప్పుడు శార్దూల్.. ఇప్పుడు రాయ్స్టన్ఇక ముంబై విధించిన 353 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హర్యానా తడబడింది. ఓపెనర్ లక్ష్య దలాల్(64), సుమిత్ కుమార్(62) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా వాళ్లంతా విఫలమయ్యారు. దీంతో 201 పరుగులకే హర్యానా కుప్పకూలింది. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు సాధించగా.. రాయ్స్టన్ డయాస్ ఐదు వికెట్లతో చెలరేగాడు. తనుశ్ కొటియాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఇక హర్యానాపై ముంబై 152 పరుగుల తేడాతో గెలుపొందిన ముంబై వరుసగా రెండోసారి సెమీస్‌లో అడుగుపెట్టింది. శార్దూల్ ఠాకూర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ముంబై వర్సెస్ హర్యానా(క్వార్టర్ ఫైనల్-3) సంక్షిప్త స్కోర్లు👉ముంబై స్కోర్లు: 315 & 339👉హర్యానా స్కోర్లు: 301 & 201👉ఫలితం: 152 పరుగుల తేడాతో హర్యానాను ఓడించిన ముంబై👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శార్దూల్ ఠాకూర్(ముంబై)- మొత్తం తొమ్మిది వికెట్లు.చదవండి: IPL 2025: కొత్త యాజమాన్యం చేతిలోకి గుజరాత్ టైటాన్స్! -
రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫలమైన పుజారా.. రంజీ క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్ర ఓటమి
రంజీ ట్రోఫీ నాలుగో క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్రపై గుజరాత్ ఇన్నింగ్స్ 98 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా సెమీస్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్ర ప్లేయర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లో దారుణంగా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో చిరాగ్ జానీ (69), రెండో ఇన్నింగ్స్‌లో హార్విక్ దేశాయ్ (54) మాత్రమే అర్ద సెంచరీలతో పర్వాలేదనిపించారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారా రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగులు చేసిన పుజారా.. రెండో ఇన్నింగ్స్‌లో 2 పరుగులకే ఔటయ్యాడు.కలిసికట్టుగా రాణించిన గుజరాత్ బౌలర్లు ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర 216 పరుగులకే ఆలౌటైంది. చింతన్ గజా 4, జయ్‌మీత్ పటేల్, సిద్దార్థ్ దేశాయ్ తలో 2, నగస్వల్లా, రవి బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు. సౌరాష్ట్ర బ్యాటర్లలో చిరాగ్ జానీ హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించగా.. హార్విక్ దేశాయ్ (22), పుజారా, షెల్డన్ జాక్సన్ (14), వసవద (39 నాటౌట్), ధర్మేంద్ర జడేజా (22), ఉనద్కత్ (14) రెండంకెల స్కోర్లు చేశారు.జయ్‌మీత్, ఉర్విల్ సెంచరీలుఅనంతరం బరిలోకి దిగిన గుజరాత్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. జయ్‌మీత్ పటేల్ (103), ఉర్విల్ పటేల్ (140) సెంచరీలతో కదంతొక్కగా.. మనన్ హింగ్రజియా (81) భారీ అర్ద సెంచరీతో రాణించాడు. వీరికి తోడు రవి బిష్ణోయ్ (45), చింతన్ గజా (39), విశాల్ జేస్వాల్ (28), ప్రియాంక్ పంచల్ (25) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 511 పరుగుల భారీ స్కోర్ చేసింది. సౌరాష్ట్ర బౌలర్లలో ధర్మేంద్ర జడేజా ఐదు వికెట్లు తీయగా.. చిరాగ్ జానీ 4, జయదేశ్ ఉనద్కత్ ఓ వికెట్ పడగొట్టారు.295 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర.. ఈ ఇన్నింగ్స్‌లో ఇంకా దారుణమైన ప్రదర్శన చేసింది. గుజరాత్ బౌలర్లు పి జడేజా (4 వికెట్లు), నగస్వల్లా (3), బిష్ణోయ్ (2), చింతన్ గజా (1) ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో 197 పరుగులకే చాపచుట్టేసింది. ఫలితంగా గుజరాత్ ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించింది. సౌరాష్ట్ర సెకెండ్ ఇన్నింగ్స్‌లో హార్విక్ దేశాయ్ (54) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చిరాగ్ జానీ (26), షెల్డన్ జాక్సన్ (27), వసవద (11), డి జడేజా (19), ఉనద్కత్ (29) రెండంకెల స్కోర్లు చేశారు.మిగతా మూడు క్వార్టర్ ఫైనల్స్‌లో ముంబై, హర్యానా.. విదర్భ, తమిళనాడు.. జమ్మూ అండ్ కశ్మీర్, కేరళ జట్లు తలపడుతున్నాయి. ప్రస్తుతం నాలుగో రోజు రెండో సెషన్ ఆట కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌ల్లో రేపు ఫలితం తేలే అవకాశం ఉంది. -
41వ శతకంతో మెరిసిన రహానే
హర్యానాతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ (Ranji Trophy Quarter Final) మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ అజింక్య రహానే (Ajinkya Rahane) సూపర్ సెంచరీతో మెరిశాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్లో 200వ మ్యాచ్ ఆడుతున్న రహానేకు ఇది 41వ సెంచరీ. రహానే ఈ సెంచరీని 160 బంతుల్లో పూర్తి చేశాడు. ఇందులో 12 ఫోర్లు ఉన్నాయి. సెంచరీ తర్వాత కొద్ది సేపే క్రీజ్‌లో ఉన్న రహానే 108 పరుగుల వద్ద ఔటయ్యాడు. రహానే సూపర్ సెంచరీ కారణంగా ముంబై హర్యానా ముందు 354 పరుగుల భారీ లక్ష్యాన్ని (తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 14 పరుగుల లీడ్ కలుపుకుని) ఉంచింది. ముంబై సెకెండ్ ఇన్నింగ్స్‌లో 339 పరుగులకు ఆలౌటైంది. రహానే.. సూర్యకుమార్ యాదవ్‌తో (70) కలిసి నాలుగో వికెట్‌కు 129 పరుగులు.. శివమ్ దూబేతో (48) కలిసి ఐదో వికెట్‌కు 85 పరుగులు జోడించాడు. ముంబై ఇన్నింగ్స్‌లో ఆయుశ్ మాత్రే (31), సిద్దేశ్ లాడ్ (43) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. హర్యానా బౌలర్లలో అనూజ్ థక్రాల్ 4, సుమిత్ కుమార్, అన్షుల్ కంబోజ్, జయంత్ యాదవ్ తలో 2 వికెట్లు పడగొట్టారు.ఆరేసిన శార్దూల్అంతకుముందు హర్యానా తొలి ఇన్నింగ్స్‌లో 301 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ అంకిత్ కుమార్ (136) సెంచరీ చేసి హర్యానాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. అంకిత్ మినహా హర్యానా ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ముంబై బౌలర్ శార్దూల్ ఠాకూర్ 6 వికెట్లు తీసి హర్యానా పతనాన్ని శాశించాడు. షమ్స్ ములానీ, తనుశ్ కోటియన్ తలో రెండు వికెట్లు తీశారు.సెంచరీలు చేజార్చుకున్న ములానీ, కోటియన్ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 315 పరుగులకు ఆలౌటైంది. రహానే (310 మినహా ముంబై టాపార్డర్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఆయుశ్ మాత్రే 0, ఆకాశ్ ఆనంద్ 10, సిద్దేశ్ లాడ్ 4, సూర్యకుమార్ యాదవ్ 9, శివమ్ దూబే 28, శార్దూల్ ఠాకూర్ 15 పరుగులకు ఔటయ్యారు. ఏడు, తొమ్మిది స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన షమ్స్ ములానీ (91), తనుశ్ కోటియన్ (97) భారీ అర్ద సెంచరీలు సాధించి ముంబైకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. వీరిద్దరూ లేకపోయుంటే ముంబై 200 పరుగలలోపే ఆలౌటయ్యేది. హర్యానా బౌలరల్లో అన్షుల్ కంబోజ్, సుమిత్ కుమార్ చెరో 3 వికెట్లు.. అనూజ్ థాక్రాల్, అజిత్ చహల్, జయంత్ యాదవ్, నిషాంత్ సంధు తలో వికెట్ పడగొట్టారు. -
ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్
గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్న భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. రంజీ ట్రోఫీలో (Ranji Trophy) భాగంగా హర్యానాతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 9 పరుగులకే ఔటైన స్కై.. రెండో ఇన్నింగ్స్‌లో 86 బంతుల్లో 70 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో తన జట్టు (ముంబై) కష్టాల్లో ఉన్నప్పుడు (100/3) బరిలోకి దిగిన స్కై.. కెప్టెన్ ఆజింక్య రహానేతో కలిసి నాలుగో వికెట్‌కు 129 పరుగులు జోడించాడు. అనూజ్ థక్రాల్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదిన స్కై.. ఆతర్వాతి బంతికే ఔటయ్యాడు. మూడో రోజు మూడో సెషన్ సమయానికి ముంబై 4 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. రహానేకు (71) జతగా శివమ్ దూబే (7) క్రీజ్‌లో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 14 పరుగుల ఆధిక్యం కలుపుకుని ప్రస్తుతం ముంబై ఆధిక్యం 252 పరుగులుగా ఉంది. ముంబై సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆయుశ్ మాత్రే 31, ఆకాశ్ ఆనంద్ 10, సిద్దేశ్ లాడ్ 43 పరుగులు చేసి ఔటయ్యారు. హర్యానా బౌలర్లలో అన్షుల్ కంబోజ్, సుమిత్ కుమార్, అనూజ్ థక్రాల్, జయంత్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.ఆరేసిన శార్దూల్అంతకుముందు హర్యానా తొలి ఇన్నింగ్స్‌లో 301 పరుగులకు ఆలౌటైంది.కెప్టెన్ అంకిత్ కుమార్ (136) సెంచరీ చేసి హర్యానాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. అంకిత్ మినహా హర్యానా ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ముంబై బౌలర్ శార్దూల్ ఠాకూర్ 6 వికెట్లు తీసి హర్యానా పతనాన్ని శాశించాడు. షమ్స్ ములానీ, తనుశ్ కోటియన్ తలో రెండు వికెట్లు తీశారు.సెంచరీలు చేజార్చుకున్న ములానీ, కోటియన్ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 315 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రహానే సహా టాపార్డర్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఆయుశ్ మాత్రే 0, ఆకాశ్ ఆనంద్ 10, సిద్దేశ్ లాడ్ 4, రహానే 31, సూర్యకుమార్ యాదవ్ 9, శివమ్ దూబే 28, శార్దూల్ ఠాకూర్ 15 పరుగులకు ఔటయ్యారు. ఏడు, తొమ్మిది స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన షమ్స్ ములానీ (91), తనుశ్ కోటియన్ (97) భారీ అర్ద సెంచరీలు సాధించి ముంబైకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. వీరిద్దరూ లేకపోయుంటే ముంబై 200 పరుగలలోపే ఆలౌటయ్యేది.చాలాకాలం తర్వాత హాఫ్ సెంచరీతో మెరిసిన సూర్యకుమార్భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్‌యాదవ్ చాలాకాలం తర్వాత హాఫ్ సెంచరీతో మెరిశాడు. స్కై.. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో.. అంతకుముందు సౌతాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. టీ20ల్లో గత 9 ఇన్నింగ్స్‌ల్లో స్కై కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. గతేడాది అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20లో స్కై చివరిసారి హాఫ్ సెంచరీ మార్కును తాకాడు. వన్డేల్లో కూడా స్కై పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. 2023 వన్డే వరల్డ్‌కప్‌కు ముందు ఆసీస్‌తో జరిగిన రెండో వన్డేలో స్కై చివరిసారి హాఫ్ సెంచరీ చేశాడు. మూడు మ్యాచ్‌ల ఆ సిరీస్‌లో స్కై.. వరుసగా రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీలు చేశాడు. ఆ సిరీస్ అనంతరం జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో స్కై దారుణంగా విఫలమయ్యాడు. ఆ మెగా టోర్నీలో స్కై ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఆ టోర్నీలో ఇంగ్లండ్‌పై చేసిన 49 పరుగులే స్కైకు అత్యధికం. -
మళ్లీ శతక్కొట్టిన కరుణ్ నాయర్.. ఈసారి..!
దేశవాలీ క్రికెట్లో విదర్భ ఆటగాడు కరుణ్ నాయర్ (Karun Nair) పరుగుల ప్రవాహం కొనసాగుతుంది. ఇటీవల ముగిసిన విజయ్ హజారే వన్డే ట్రోఫీలో (VHT) ఆకాశమే హద్దుగా చెలరేగిన కరుణ్.. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలోనూ (Ranji Trophy) అదే స్థాయిలో రాణిస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో 7 ఇన్నింగ్స్‌ల్లో ఐదు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 779 పరుగులు చేసిన కరుణ్.. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో తమిళనాడుపై బాధ్యతాయుతమైన సెంచరీతో (122) మెరిశాడు.ఈ మ్యాచ్‌లో కరుణ్ శతక్కొట్టడంతో తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ 353 పరుగులకు ఆలౌటైంది. జట్టు కష్టాల్లో (44/3) ఉన్నప్పుడు బరిలోకి దిగిన కరుణ్.. దనిశ్ మలేవార్ (75), హర్ష్ దూబేతో (69) కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. విదర్భ ఇన్నింగ్స్‌లో ఈ ముగ్గురూ మినహా ఎవరూ రాణించలేదు. అథర్వ తైడే 0, ధృవ్ షోరే 26, ఆధిత్య థాకరే 5, యశ్ రాథోడ్ 13, అక్షయ్ వాద్కర్ 24, భూటే 2, యశ్ ఠాకూర్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. తమిళనాడు బౌలర్లలో సోనూ యాదవ్, విజయ్ శంకర్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. మొహమ్మద్ 2, అజిత్ రామ్, మొహమ్మద్ అలీ ఓ వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు మూడో రోజు తొలి సెషన్ సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ప్రదోశ్ రంజన్పాల్ (51), సోనూ యాదవ్ (24) క్రీజ్‌లో ఉన్నారు. తమిళనాడు ఇన్నింగ్స్‌లో మొహమ్మద్ అలీ 4, ఎన్ జగదీశన్ 22, సాయి సుదర్శన్ 7, భూపతి కుమార్ 0, విజయ్ శంకర్ 22, ఆండ్రీ సిద్దార్థ్ 65, సాయికిషోర్ 7, మొహమ్మద్ 1 పరుగు చేసి ఔటయ్యారు. విదర్భ బౌలర్లలో ఆధిత్య ఠాకరే 4 వికెట్లు పడగొట్టగా.. యశ్ ఠాకూర్ 2, నిచికేత్ భూటే, హర్ష్ దూబే తలో వికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం తమిళనాడు విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 133 పరుగులు వెనుకపడి ఉంది.గతేడాది మొత్తం కొనసాగిన కరుణ్ హవాకరుణ్ గతేడాది మొత్తం ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణించాడు. మహారాజా ట్రోఫీతో కరుణ్ పరుగుల ప్రవాహం మొదలైంది. టీ20 ఫార్మాట్లో జరిగిన ఆ టోర్నీలో కరుణ్ 10 మ్యాచ్‌ల్లో 188.4 స్ట్రయిక్‌రేట్‌తో, 70 సగటున 490 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ద శతకాలు, ఓ శతకం ఉంది.కరుణ్ గత సీజన్ రంజీ సీజన్లోనూ రెచ్చిపోయి ఆడాడు. 17 ఇన్నింగ్స్‌ల్లో 40.58 సగటున 690 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధ శతకాలు, 2 శతకాలు ఉన్నాయి.కరుణ్ గతేడాది కౌంటీ క్రికెట్లోనూ చెలరేగి ఆడాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 48.70 సగటున 487 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ సహా మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలోనూ కరుణ్ విధ్వంసం కొనసాగింది. ఈ టోర్నీలో కరుణ్ 6 ఇన్నింగ్స్‌ల్లో 177.08 స్ట్రయిక్‌రేట్‌తో 42.50 సగటున 255 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ద సెంచరీలు ఉన్నాయి.విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ ఫామ్ పతాకస్థాయికి చేరింది. ఈ టోర్నీలో కరుణ్ 7 ఇన్నింగ్స్‌ల్లో 389.50 సగటున, 124.04 స్ట్రయిక్‌రేట్‌తో ఐదు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 779 పరుగులు చేశాడు. -
Ranji Trophy QFs: అంకిత్ శతకం.. అఖీబ్ నబీ ‘పాంచ్’ పటాకా
కోల్‌కతా: కెప్టెన్ అంకిత్ కుమార్ (206 బంతుల్లో 136; 21 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కడంతో ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో హరియాణా జట్టు దీటుగా బదులిస్తోంది. సహచరుల నుంచి పెద్దగా సహకారం లభించకపోయినా... అంకిత్ కుమార్ ఒంటరి పోరాటం చేశాడు. ఫలితంగా ఆదివారం ఆట ముగిసే సమయానికి హరియాణా తొలి ఇన్నింగ్స్‌లో 72 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది.లక్షయ్ దలాల్ (34), యశ్వర్ధన్ దలాల్ (36) ఫర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లలో షమ్స్ ములానీ, తనుశ్ కొటియాన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 278/8తో ఆదివారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై చివరకు 88.2 ఓవర్లలో 315 పరుగులకు ఆలౌటైంది.తనుశ్ కొటియాన్ (173 బంతుల్లో 97; 13 ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. హరియాణా బౌలర్లలో అన్షుల్ కంబోజ్, సుమిత్ కుమార్ చెరో 3 వికెట్లు తీశారు. చేతిలో 5 వికెట్లు ఉన్న హరియాణా ప్రస్తుతం... ముంబై తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 52 పరుగులు వెనుకబడి ఉంది. రోహిత్ శర్మ (22 బ్యాటింగ్), అనూజ్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.రాణించిన హర్ష్ దూబే, ఆదిత్య విదర్భ పేసర్ ఆదిత్య థాకరే (4/18) సత్తా చాటడంతో తమిళనాడుతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో విదర్భ జట్టు మంచి స్థితిలో నిలిచింది. నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న ఈ పోరులో ఆదివారం ఆట ముగిసే సమయానికి తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 46 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 18 ఏళ్ల సిద్ధార్థ్ (89 బంతుల్లో 65; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకం సాధించగా... తక్కినవాళ్లు విఫలమయ్యారు.మొహమ్మద్ అలీ (4), నారాయణ్ జగదీశన్ (22), సాయి సుదర్శన్ (7), భూపతి కుమార్ (0), విజయ్ శంకర్ (22) విఫలమయ్యారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 264/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భ... చివరకు 121.1 ఓవర్లలో 353 పరుగులకు ఆలౌటైంది. సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ (243 బంతుల్లో 122; 18 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ అనంతరం అవుట్ కాగా... హర్ష్ దూబే (69; 9 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.తమిళనాడు బౌలర్లలో విజయ్ శంకర్, సోను యాదవ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. చేతిలో నాలుగు వికెట్లు ఉన్న తమిళనాడు జట్టు... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 194 పరుగులు వెనుకబడి ఉంది. కెపె్టన్ సాయి కిశోర్ (6 బ్యాటింగ్), ప్రదోశ్ రంజన్ పాల్ (18 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అఖీబ్ నబీ ‘పాంచ్’ పటాకా పేస్ బౌలర్ అఖీబ్ నబీ ఐదు వికెట్లతో మెరిపించడంతో... కేరళతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో జమ్మూ కశ్మీర్ జట్టు మెరుగైన స్థితిలో నిలిచింది. పుణే వేదికగా జరుగుతున్న పోరులో ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి కేరళ జట్టు 63 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. జలజ్ సక్సేనా (78 బంతుల్లో 67; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... సల్మాన్ నజీర్ (49 బ్యాటింగ్; 8 ఫోర్లు), నిదీశ్ (30) రాణించారు.ఇన్నింగ్స్ మూడో ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టిన అఖీబ్ను ఎదుర్కునేందుకు కేరళ బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 228/8తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన జమ్మూకశీ్మర్ జట్టు చివరకు 95.1 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటైంది. యుధ్వీర్ సింగ్ (26), అఖీబ్ నబీ (32) కీలక పరుగులు జోడించారు. కేరళ బౌలర్లలో ని«దీశ్ 6 వికెట్లతో అదరగొట్టాడు. ప్రస్తుతం చేతిలో ఒక వికెట్ మాత్రమే ఉన్న కేరళ జట్టు... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 80 పరుగులు వెనుకబడి ఉంది. సల్మాన్ నజీర్ క్రీజులో ఉన్నాడు.మెరిసిన మనన్, జైమీత్బ్యాటర్లు రాణించడంతో సౌరాష్ట్రతో జరుగుతున్న జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న పోరులో ఆదివారం ఆట ముగిసే సమయానికి గుజరాత్ 95 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. మనన్ హింగ్రాజియా (219 బంతుల్లో 83; 8 ఫోర్లు, 1 సిక్స్), జైమీత్ పటేల్ (147 బంతుల్లో 88 బ్యాటింగ్; 9 ఫోర్లు) అర్ధశతకాలతో మెరిశారు.అంతకుముందు సౌరాష్ట్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 216 పరుగులకు ఆలౌట్ కాగా... ప్రస్తుతం చేతిలో 6 వికెట్లు ఉన్న గుజరాత్ 44 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. జైమీత్తో పాటు వికెట్ కీపర్ ఉరి్వల్ పటేల్ (29 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. -
మెరిసిన షమ్స్, తనుశ్
కోల్‌కతా: దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టు చక్కటి పోరాట పటిమ కనబర్చింది. ఒక దశలో 113 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును ఆల్‌రౌండర్లు షమ్స్ ములానీ (178 బంతుల్లో 91; 10 ఫోర్లు), తనుశ్ కొటియాన్ (154 బంతుల్లో 85 బ్యాటింగ్) ఆదుకున్నారు. శనివారం హరియాణాతో ప్రారంభమైన క్వార్టర్ ఫైనల్ పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై జట్టు... తొలి రోజు ఆట ముగిసే సమయానికి 81 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. భారత ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్ (9), శివమ్ దూబే (28) భారీ ఇన్నింగ్స్‌లు ఆడటంలో విఫలమయ్యారు. ఆయుశ్ మాత్రే (0), ఆకాశ్ ఆనంద్ (10), సిద్ధేశ్ లాడ్ (4) ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్ (15) ఒకరి వెంట ఒకరు పెవలియన్కుచేరారు. కెప్టెన్ అజింక్య రహానే (31) మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయారు. అయితే చివర్లో షమ్స్ ములానీ, తనుశ్ కొటియాన్ జంట ఎనిమిదో వికెట్‌కు 165 పరుగులు జోడించి ముంబై జట్టును తిరిగి పోటీలోకి తెచ్చింది. హరియాణా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న వీరిద్దరూ ఇన్నింగ్స్‌కు స్థిరత్వం తీసుకొచ్చారు. మరికాసేపట్లో ఆట ముగుస్తుందనగా... షమ్స్ ములానీ అవుట్ కాగా... తనుశ్తోపాటు మోహిత్ అవస్థి (0 బ్యాటింగ్) క్రీజులోఉన్నాడు. హరియాణా బౌలర్లలో అన్షుల్ కంబోజ్ 3, సుమిత్ కుమార్ 2 వికెట్లు పడగొట్టారు. కరుణ్ నాయర్ మరో సెంచరీ నాగ్‌పూర్: సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ (180 బంతుల్లో 100 బ్యాటింగ్; 14 ఫోర్లు, 1 సిక్స్) మరో సెంచరీతో ఆకట్టుకున్నాడు. తాజా సీజన్లో ఫుల్ ఫామ్‌లో ఉన్న కరుణ్ నాయర్ అజేయ శతకంతో విజృంభించడంతో తమిళనాడుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో విదర్భ జట్టు మెరుగైన స్కోరు దిశగా సాగుతోంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన విదర్భ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 89 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. అథర్వ తైడె (0), ధ్రువ్ షోరె (26), ఆదిత్య ఠాక్రే (5) విఫలమవడంతో ఒక దశలో 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన విదర్భ జట్టును దానిశ్ మాలేవార్ (75; 13 ఫోర్లు)తో కలిసి కరుణ్ నాయర్ ఆదుకున్నాడు. ఇటీవల దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా నాలుగు శతకాలు బాది రికార్డు సృష్టించిన 33 ఏళ్ల కరుణ్ నాయర్... ఈ సెంచరీ ద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 22వ శతకం తన పేరిట లిఖించుకున్నాడు. యశ్ రాథోడ్ (13), కెపె్టన్ ఆకాశ్ వాడ్కర్ (24) ఎక్కువసేపు నిలవలేకపోయారు. ఆట ముగిసే సమయానికి కరుణ్ నాయర్‌తో పాటు హర్‡్ష దూబే (19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. తమిళనాడు బౌలర్లలో విజయ్ శంకర్ రెండు వికెట్లు పడగొట్టాడు. సౌరాష్ట్ర 216 ఆలౌట్ రాజ్‌కోట్: భారత సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా (26) విఫలమవడంతో గుజరాత్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్ర ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 72.1 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. చిరాగ్ జానీ (148 బంతుల్లో 69; 11 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకంతో రాణించగా, అర్పిత్ (39 నాటౌట్) ఫర్వాలేదనిపించాడు. పుజారా, హార్విక్ దేశాయ్ (22), షెల్డన్ జాక్సన్ (14), ప్రేరక్ మన్కడ్ (0), సమర్ గజ్జర్ (4) కెప్టెన్ జైదేవ్ ఉనాద్కట్ (14), ధర్మేంద్ర జడేజా (22) విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో కెపె్టన్ చింతన్ గాజా 4 వికెట్లు పడగొట్టగా... జైమీత్ పటేల్, సిద్ధార్థ్ దేశాయ్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన గుజరాత్... ఆట ముగిసే సమయానికి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. చేతిలో 10 వికెట్లు ఉన్న గుజరాత్ జట్టు ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 195 పరుగులు వెనుకబడి ఉంది. జమ్ము కశ్మీర్ 228/8 పుణే: కేరళతో జరుగుతున్న మరో క్వార్టర్స్‌లో జమ్ము కశ్మీర్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 86 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన జమ్ము కశ్మీర్ బ్యాటర్లు మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. గ్రూప్ దశలో చక్కటి ప్రదర్శన కనబర్చిన జమ్ము కశ్మీర్ టాపార్డర్... నాకౌట్లో దాన్ని కొనసాగించడంలో విఫలమైంది. నసీర్ (44), సాహిల్ (35), కన్హయ్య (48) కాస్త పోరాడారు. కేరళ బౌలర్లలో నిదీశ్ 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. -
మళ్లీ ఫెయిలైన సూర్యకుమార్.. ఇప్పట్లో రీఎంట్రీ కష్టమే!
భారత పురుషుల టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) బ్యాటింగ్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఫార్మాట్ మారినా అతడి ఆట తీరులో మాత్రం మార్పరాలేదు. ఇటీవల ఇంగ్లండ్(India vs England)తో స్వదేశంలో పొట్టి సిరీస్‌లో సారథిగా అదరగొట్టిన ఈ ముంబైకర్.. బ్యాటర్‌గా మాత్రం పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. తాజాగా రంజీ ట్రోఫీ(Ranji Trophy) మ్యాచ్‌లోనూ సూర్య నిరాశపరిచాడు.ఫోర్‌తో మొదలుపెట్టిహర్యానాతో మ్యాచ్‌లో క్రీజులోకి రాగానే ఫోర్ బాది దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన సూర్యకుమార్.. మరుసటి ఓవర్లోనే వెనుదిరిగాడు. కేవలం తొమ్మిది పరుగులు చేసి నిష్క్రమించాడు. కాగా సూర్య చివరగా ఈ రంజీ సీజన్లో భాగంగా మహారాష్ట్రతో మ్యాచ్ సందర్భంగా బరిలోకి దిగాడు. అయితే, ఆ మ్యాచ్‌లో కేవలం ఏడు పరుగులే చేసి అవుటయ్యాడు. ఈ నేపథ్యంలో టీ20 కెప్టెన్ ఇక టెస్టుల గురించి మర్చిపోవాల్సిందేనంటూ టీమిండియా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.కాగా దేశీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ రంజీ ట్రోఫీ(Ranji Trophy) క్వార్టర్ ఫైనల్స్ శనివారం ఆరంభమయ్యాయి. ఇందులో భాగంగా.. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై- హర్యానా మధ్య క్వార్టర్ ఫైనల్-3 మొదలైంది. ఇందులో టాస్ గెలిచిన ముంబై తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, హర్యానా పేసర్ల ధాటికి అజింక్య రహానే సేనకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి.సుమిత్ దెబ్బకు బౌల్డ్ఓపెనర్ ఆయుశ్ మాత్రే(0)ను అన్షుల్ కాంబోజ్ డకౌట్ చేయగా.. మరో ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్ ఆకాశ్ ఆనంద్‌ను పది పరుగుల వద్ద సుమిత్ కుమార్ బౌల్డ్ చేశాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన సిద్ధేశ్ లాడ్(4) అన్షుల్ వేసిన బంతికి బౌల్డ్‌కాగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన సూర్యకుమార్ యాదవ్ సుమిత్ దెబ్బకు క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.ముంబై ఇన్నింగ్స్ ఏడో ఓవర్ మొదటి బంతికి సిద్ధేశ్ అవుట్ కాగా.. సూర్య క్రీజులోకి వచ్చాడు. అన్షుల్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి ఘనంగా ఆరంభించాడు. ఎనిమిదో ఓవర్లో సుమిత్ బౌలింగ్‌లోనూ తొలి బంతినే బౌండరీకి తరలించిన సూర్య.. ఆ మరుసటి రెండో బంతికి పెవిలియన్ చేరాడు. మొత్తంగా ఐదు బంతులు ఎదుర్కొని రెండు ఫోర్ల సాయంతో తొమ్మిది పరుగులు చేసి ఈ కుడిచేతి వాటం బ్యాటర్ అవుటయ్యాడు.ఈ క్రమంలో 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాలో పడిన ముంబై జట్టును కెప్టెన్ అజింక్య రహానే, ఆల్‌రౌండర్ శివం దూబే ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో సూర్యకుమర్ యాదవ్ తొలి మ్యాచ్‌లోనే డకౌట్ అయిన విషయం తెలిసిందే.ఇప్పట్లో టీమిండియా రీఎంట్రీ కష్టమేఆ తర్వాత కూడా వరుస మ్యాచ్‌లలో సూర్య నిరాశపరిచాడు. రెండో టీ20లో 12, మూడో టీ20లో 14 పరుగులు చేసిన అతడు.. నాలుగో టీ20లో మళ్లీ సున్నా చుట్టాడు. ఆఖరిదైన ఐదో టీ20లోనూ రెండు పరుగులే చేసి వెనుదిరిగాడు. అయితే, కెప్టెన్‌గా మాత్రం ఈ ఐదు టీ20ల సిరీస్‌లో 4-1తో సూర్య ఘన విజయం అందుకున్నాడు. ఇక ఇప్పటికే ఫామ్‌లేమి కారణంగా వన్డే జట్టులో ఎప్పుడో స్థానం కోల్పోయిన సూర్య.. రంజీల్లో వరుస వైఫల్యాలతో ఇప్పట్లో టెస్టుల్లోకి వచ్చే అవకాశం కూడా లేకుండా చేసుకుంటున్నాడు. కాగా 2023లో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా నాగ్‌పూర్ వేదికగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన సూర్య.. దారుణంగా విఫలమయ్యాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో 8 పరుగులు మాత్రమే చేశాడు.చదవండి: Ind vs Eng: అద్భుతమైన ఆటగాడు.. అతడినే పక్కనపెడతారా?: ఆసీస్ దిగ్గజం -
ముంబైకు ఎదురుందా!
కోల్‌కతా: ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ(Ranji Trophy) క్వార్టర్ ఫైనల్స్ నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టు హరియాణాతో పోరుకు సిద్ధమైంది. శనివారం ప్రారంభం కానున్న క్వార్టర్ ఫైనల్లో అజింక్య రహానే సారథ్యంలోని ముంబై జట్టు తరఫున స్టార్ ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు. భారత టి20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav), పేస్ ఆల్‌రౌండర్లు శివమ్ దూబే, శార్దుల్ ఠాకూర్లపై అందరి దృష్టి నిలవనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ హరియాణాలోని లాహ్లీలో నిర్వహించాల్సింది. కానీ, అక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో బీసీసీఐ ఈ మ్యాచ్ వేదికను మార్చింది. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 42 సార్లు రంజీ ట్రోఫీ చేజిక్కించుకున్న ముంబై జట్టు మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా... పెద్దగా అనుభవం లేని హరియాణా జట్టు ముంబైకి ఏమాత్రం పోటీనిస్తుందనేది ఆసక్తికరం. ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా ముంబై 7 మ్యాచ్‌లాడి 4 విజయాలు, 2 పరాజయాలు, ఒక ‘డ్రా’తో 29 పాయింట్లు ఖాతాలో వేసుకొని నాకౌట్‌కు అర్హత సాధించింది. చివరి గ్రూప్ మ్యాచ్‌లో మేఘాలయపై ఇన్నింగ్స్ 456 పరుగుల తేడాతో గెలిచి క్వార్టర్స్‌లో అడుగు పెట్టింది. రహానే, సూర్యకుమార్, శివమ్ దూబే, సిద్ధేశ్ లాడ్, ఆకాశ్ ఆనంద్, షమ్స్ ములానీలతో ముంబై బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. ఆల్‌రౌండర్ శార్దుల్ జోరు మీదున్నాడు. అతడు గత మ్యాచ్‌లో 42 బంతుల్లోనే 84 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లోనూ విజృంభించి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు. బౌలింగ్‌లో శార్దుల్‌తో పాటు లెఫ్టార్మ్ స్పిన్నర్ షమ్స్ ములానీ, ఆఫ్ స్పిన్నర్ తనుశ్ కొటియాన్ కీలకం కానున్నారు. మరోవైపు ఎలైట్ గ్రూప్ ‘సి’లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 3 గెలిచి, 4 ‘డ్రా’ చేసుకున్న హరియాణా 29 పాయింట్లతో క్వార్టర్స్‌లో అడుగు పెట్టింది. ఆ జట్టులో అంతర్జాతీయ అనుభవం ఉన్న ఆటగాళ్లు లేకపోయినా... ప్రతిభకు కొదువలేదు. అంకిత్ కుమార్, నిశాంత్ సింధు, హిమాన్షు రాణా, యువరాజ్ సింగ్, అన్షుల్ కంబోజ్, అనూజ్ ఠక్రాల్, జయంత్ యాదవ్‌లపై ఆ జట్టు అధికంగా ఆధారపడుతోంది. కరుణ్ నాయర్‌పైనే దృష్టి తాజా రంజీ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విదర్భ జట్టు... క్వార్టర్స్‌లో తమిళనాడుతో తలపడనుంది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట గెలిచిన మరో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న విదర్భ 40 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నిలిచింది. ఫుల్ ఫామ్‌లో ఉన్న సీనియర్ ఆటగాడు కరుణ్ నాయర్ సెంచరీల మీద సెంచరీలతో జోష్‌లో ఉండగా... కెప్టెన్ అక్షయ్ వాడ్కర్, అథర్వ తైడె, హార్ష్ దూబేతో విదర్భ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లో ఉమేశ్ యాదవ్, ఆకాశ్, ఆదిత్య కీలకం కానున్నారు. మరోవైపు ఎలైట్ గ్రూప్ ‘డి’లో రెండో స్థానంతో క్వార్టర్స్ చేరిన తమిళనాడు జట్టు... విజయ్ శంకర్, జగదీశన్, బాబా ఇంద్రజీత్ ప్రదర్శనపై ఎక్కువ ఆధారపడుతోంది. పుణేలో జరిగే మరో క్వార్టర్ ఫైనల్ పోరులో ఎలైట్ గ్రూప్ ‘ఎ’ నుంచి 35 పాయింట్లు సాధించిన జమ్మూకశ్మీర్‌తో గ్రూప్ ‘సి’లో రెండో స్థానంలో నిలిచిన కేరళ జట్టు తలపడుతుంది. రాజ్‌కోట్ వేదికగా గుజరాత్, సౌరాష్ట్ర జట్ల మధ్య నాలుగో క్వార్టర్ ఫైనల్ జరుగుతుంది. -
రంజీ బాట పట్టిన టీమిండియా విధ్వంసకర వీరులు
హర్యానాతో జరిగే రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ (ఫిబ్రవరి 8-12) కోసం 18 మంది సభ్యుల ముంబై జట్టును ఇవాళ (ఫిబ్రవరి 3) ప్రకటించారు. వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మ్యాచ్ కోసం ముంబై సెలెక్టర్లు భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, టీమిండియా విధ్వంసకర బ్యాటర్ శివమ్ దూబేను ఎంపిక చేశారు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ పేర్లను ముంబై సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ఈ ముగ్గురు భారత వన్డే జట్టులో సభ్యులుగా ఉన్నారు. ముంబై జట్టులో యువ బ్యాటర్లు ఆయుశ్ మాత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, సిద్దేశ్ లాడ్ చోటు దక్కించుకున్నారు. ముంబై బౌలింగ్ అటాక్‌ను శార్దూల్ ఠాకూర్ లీడ్ చేస్తాడు. బౌలింగ్ విభాగంలో మోహిత్ అవస్తి, శివమ్ దూబే, తనుశ్ కోటియన్, షమ్స్ ములానీ సభ్యులుగా ఉన్నారు. ఆకాశ్ ఆనంద్, హార్దిక్ తామోర్ వికెట్ కీపర్లుగా ఎంపికయ్యారు.కాగా, ముంబై జట్టు గ్రూప్ దశలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మేఘాలయాపై ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో ముంబై భారీ తేడాతో గెలుపొందడంతో బోనస్ పాయింట్ కూడా సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై కేవలం ఒకే ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసి ఇన్నింగ్స్ 456 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మేఘాలయా 86 పరుగులకే కుప్పకూలింది. శార్దూల్ ఠాకూర్ హ్యాట్రిక్ సాధించాడు. మేఘాలయా ఇన్నింగ్స్‌లో మొదటి ఆరుగురు బ్యాటర్లలో ఐదుగురు డకౌట్లయ్యారు. అనంతరం ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 671 పరుగులు చేసింది. సిద్దేశ్ లాడ్ (145), ఆకాశ్ ఆనంద్ (103), షమ్స్ ములానీ (100 నాటౌట్) సెంచరీలు చేశారు. ఆజింక్య రహానే (96), శార్దూల్ ఠాకూర్ (84) సెంచరీలు మిస్ చేసుకున్నారు. అనంతరం మేఘాలయా రెండో ఇన్నింగ్స్‌లో 129 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.ముంబై జట్టు అజింక్య రహానే (కెప్టెన్), ఆయుష్ మాత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, అమోఘ్ భత్కల్, సూర్యకుమార్ యాదవ్, సిద్ధేష్ లాడ్, శివమ్ దూబే, ఆకాశ్ ఆనంద్ (వికెట్‌కీపర్), హార్దిక్ తమోర్ (వికెట్‌కీపర్), సూర్యాంశ్ షెడ్గే, శార్దూల్ ఠాకూర్, షమ్స్ ములానీ, తనుశ్ కోటియన్, మోహిత్ అవస్తి, సిల్వెస్టర్ డిసౌజా, రాయ్స్టన్ డయాస్, అథర్వ అంకోలేకర్, హర్ష్ తన్నా -
ఓటమితో హైదరాబాద్ ముగింపు
నాగ్‌పూర్: భారత జట్టు పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగినా... హైదరాబాద్ జట్టుకు నిరాశ తప్పలేదు. రంజీ ట్రోఫీ 2024–2025 దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్‌ను హైదరాబాద్ జట్టు పరాజయంతో ముగించింది. మాజీ చాంపియన్ విదర్భ జట్టుతో ఆదివారం ముగిసిన గ్రూప్ ‘బి’ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో చామా మిలింద్ నాయకత్వంలోని హైదరాబాద్ జట్టు 58 పరుగుల తేడాతో ఓడిపోయింది. విదర్భ నిర్దేశించిన 220 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో... ఓవర్‌నైట్ స్కోరు 23/1తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్ జట్టు 38.5 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటై పరాజయాన్ని చవిచూసింది. రాహుల్ రాదేశ్ (77 బంతుల్లో 48; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలువగా... చివర్లో మిలింద్ (32 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్), సిరాజ్ (14 బంతుల్లో 26; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాసేపు అలరించారు. ఎడంచేతి వాటం స్పిన్నర్ హర్‡్ష దూబే 57 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి విదర్భ జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. బ్యాటర్లు క్రీజులో నిలబడితే ఛేదించే లక్ష్యమైనా... చివరిరోజు హైదరాబాద్ బ్యాటర్లు తడబడి మూల్యం చెల్లించుకున్నారు. ఓవరాల్‌గా గ్రూప్ ‘బి’లో హైదరాబాద్ జట్టు 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఎనిమిది జట్లున్న ఈ గ్రూప్‌లో హైదరాబాద్ 2 మ్యాచ్‌ల్లో గెలిచి, 2 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని, 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. గ్రూప్ ‘బి’లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన విదర్భ, గుజరాత్ జట్లు నాకౌట్ దశకు అర్హత సాధించాయి. స్కోరు వివరాలు విదర్భ తొలి ఇన్నింగ్స్: 190; హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 326; విదర్భ రెండో ఇన్నింగ్స్: 355; హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (సి అండ్ బి) యశ్ ఠాకూర్ 6; అభిరత్ రెడ్డి (సి) దానిశ్ (బి) హర్ష్ దూబే 21; తనయ్ త్యాగరాజన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆదిత్య థాకరే 18; రాహుల్ రాదేశ్ (సి) అథర్వ తైడే (బి) పార్థ్ రేఖడే 48; హిమతేజ (సి) అథర్వ తైడే (బి) హర్ష్ దూబే 0; వరుణ్ గౌడ్ (సి) యశ్ రాథోడ్ (బి) హర్ష్ దూబే 5; రాహుల్ బుద్ది (సి) అక్షయ్ వాడ్కర్ (బి) పార్థ్ రేఖడే 9; చామా మిలింద్ (సి) దానిశ్ (బి) హర్‡్ష దూబే 20; రక్షణ్ రెడ్డి (బి) హర్ష్ దూబే 0; సిరాజ్ (సి) అథర్వ తైడే (బి) హర్‡్ష దూబే 26; అనికేత్ రెడ్డి (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (38.5 ఓవర్లలో ఆలౌట్) 161. వికెట్ల పతనం: 1–11, 2–36, 3–61, 4–67, 5–94, 6–107, 7–116, 8–123, 9–140, 10–161. బౌలింగ్: యశ్ ఠాకూర్ 5–1–26–1, ఆదిత్య థాకరే 7–0–27–1, హర్ దూబే 11.5–1–57–6, అక్షయ్ వఖారే 7–3–16–0, పార్థ్ రేఖాడే 8–0–33–2. -
వరల్డ్ రికార్డు.. వికెట్ కోల్పోకుండానే 376 కొట్టేశారు
భారత్‌లోని పిచ్‌లపై నాలుగో రోజు ఆటలో 200 పరుగుల లక్ష్యమైనా కొండంతలా అనిపిస్తుంది. ఆచితూచి ఆడితేనే దానిని ఛేదించే అవకాశం ఉంటుంది. అలాంటిది ఏకంగా 376 పరుగుల లక్ష్యం ముందుంటే... ఏ జట్టయినా విజయంపై ఆశలు వదులుకోవాల్సిందే. అయితే ఒడిశాతో జరిగిన రంజీ ట్రోఫీ దేశవాళీ క్రికెట్ టోర్నీ మ్యాచ్ సందర్భంగా సర్వీసెస్(Services) జట్టు బ్యాటర్లు మాత్రం అలా అనుకోలేదు. ప్రయత్నిస్తే పోయేదేమీ లేదు కదా అనే ఉద్దేశంతో బరిలోకి దిగారు. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. దాంతో చూస్తుండగానే స్కోరు బోర్డుపై 100, 200, 300 పరుగులు నమోదయ్యాయి. చివరకు 376 పరుగుల లక్ష్యం కూడా కరిగిపోయింది. వెరసి సరీ్వసెస్ జట్టు రంజీ ట్రోఫీ చరిత్రలోనే చిరస్మరణీయ విజయం అందుకుంది. 376 పరుగుల లక్ష్యంతో ఓవర్‌నైట్ స్కోరు 46/0తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సర్వీసెస్ జట్టు 85.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని అధిగమించింది. సర్వీసెస్ ఓపెనర్లలో శుభం రోహిల్లా (270 బంతుల్లో 209 నాటౌట్; 30 ఫోర్లు) డబుల్ సెంచరీ చేయగా... సూరజ్ వశిష్ట (246 బంతుల్లో 154 నాటౌట్; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో గెలిచినప్పటికీ సరీ్వసెస్ జట్టు నాకౌట్ దశకు చేరలేకపోయింది. ఆదివారంతో రంజీ ట్రోఫీలో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. ఈనెల 8 నుంచి 12వ తేదీ వరకు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో గుజరాత్‌తో సౌరాష్ట్ర; ముంబైతో హరియాణా; విదర్భతో తమిళనాడు; జమ్మూ కశ్మీర్‌తో కేరళ తలపడతాయి.సర్వీసెస్ వరల్డ్ రికార్డు..ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన సర్వీసెస్ జట్టు పలు అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. రంజీ ట్రోఫీ హిస్టరీలోనే వికెట్ కోల్పోకుండా అత్యధిక టార్గెట్‌ను ఛేదించిన జట్టుగా సర్వీసెస్ రికార్డులకెక్కింది. ఓవరాల్‌గా రంజీల్లో అత్యధిక టార్గెట్‌ను ఛేజ్ చేసిన రెండో జట్టుగా సర్వీసెస్ నిలిచింది. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో రైల్వేస్ అగ్రస్ధానంలో ఉంది. గతేడాది సీజన్లో అగర్తాల వేదికగా త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో 378 పరుగుల లక్ష్యాన్ని రైల్వేస్ జట్టు 5 వికెట్లు కోల్పోయి చేధించింది. తాజా మ్యాచ్‌తో సర్వీసెస్ రెండో స్ధానానికి చేరింది.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో నాల్గవ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా సర్వీసెస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్‌కు చెందిన సర్గోధా క్రికెట్ క్రికెట్ క్లబ్ పేరిట ఉండేది. 1998-99 దేశవాళీ సీజన్లో లహోర్ సిటీపై సర్గోధా వికెట్ నష్టపోకుండా 332 పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌తో సర్గోదా ఆల్‌టైమ్ రికార్డును సర్వీసెస్(376) బ్రేక్ చేసింది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అభిషేక్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
'వావ్ వాట్ ఎ బాల్'.. తనను ఔట్ చేసిన బౌలర్‌పై కోహ్లి ప్రశంసలు
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(Virat Kohli) 12 ఏళ్ల తర్వాత రంజీ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ తరపున కోహ్లి ఆడాడు. అతడిని చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో అరుణ్ జైట్లీ స్టేడియంకు తరలివచ్చారు.కానీ కింగ్ కోహ్లి మాత్రం అభిమానులను తీవ్ర నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. రైల్వేస్ బౌలర్ హిమాన్షు సాంగ్వాన్ అద్బుతమైన బంతితో కోహ్లిని క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. కోహ్లి ఔటయ్యాక స్టేడియం నుంచి అభిమానులు వెళ్లిపోయారు.సాంగ్వాన్‌ను మెచ్చుకున్న కోహ్లి..కాగా మ్యాచ్ ముగిసిన తర్వాత హిమాన్షును కింగ్ కోహ్లి ప్రశంసించినట్లు తెలుస్తోంది. దైనిక్ జాగరణ్ రిపోర్ట్ ప్రకారం.. సాంగ్వాన్ తాను వికెట్ తీసిన బంతిపై సంతకం చేయమని కోహ్లి వద్దకు వెళ్లి అడిగాడంట. అందుకు కోహ్లి.. వాట్ ఎ బాల్.. అద్బుతమైన డెలివరీ సంధించావు అని కొనియాడినట్లు సదరు పత్రిక తమ కథనంలో పేర్కొంది.గ్రౌండ్లోకి దూసుకొచ్చిన ఫ్యాన్స్..మ్యాచ్‌లో భాగంగా మూడో రోజు రక్షణ వలయాన్ని ఛేదించుకొని విరాట్ కోసం ముగ్గురు అభిమానులు మైదానంలోకి పరుగులు తీయడంతో కాస్త గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ మ్యాచ్ తొలి రోజు గ్రౌండ్లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి వద్దకు వచ్చిన అభిమాని అతడి కాళ్లు మొక్కగా... శనివారం ముగ్గురు అభిమానులు సెక్యూరిటీని దాటి మైదానంలోకి దూసుకొచ్చారు. దీంతో భద్రతా సిబ్బంది వారిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ‘గతంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ చూడలేదు. కోహ్లి భయ్యా క్రేజ్‌కు ఇది నిదర్శనం. మైదానంలో దూసుకొచి్చన వాళ్లను కొట్టకండి అని కోహ్లి సెక్యూరిటీ సిబ్బందితో చెప్పాడు’ అని ఢిల్లీ స్పిన్నర్ శివమ్ శర్మ తెలిపాడు. మ్యాచ్ అనంతరం సహచర ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్‌తో కోహ్లి ఫొటోలు దిగాడు.ఢిల్లీ ఘన విజయం..ఇక విరాట్ కోహ్లికి తన సహచరులు గెలుపు కానుక ఇచ్చారు. కోహ్లికి రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే అవకాశమే రాకుండానే ఢిల్లీ జట్టు ఘనవిజయం సాధించింది. ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా మూడు రోజుల్లో ముగిసిన పోరులో ఢిల్లీ జట్టు ఇన్నింగ్స్ 19 పరుగుల తేడాతో రైల్వేస్ జట్టును ఓడించింది. ఓవర్‌నైట్ స్కోరు 334/7తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఢిల్లీ జట్టు... చివరకు 106.4 ఓవర్లలో 374 పరుగులకు ఆలౌటైంది. సుమిత్ మాథుర్ (206 బంతుల్లో 86; 8 ఫోర్లు) మెరుగైన ప్రదర్శన చేశాడు. రైల్వేస్ బౌలర్లలో హిమాన్షు సాంగ్వాన్ 4, కునాల్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన రైల్వేస్ జట్టు 30.5 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్ సైఫ్ (31) టాప్ స్కోరర్. ఢిల్లీ బౌలర్లలో శివమ్ శర్మ 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అంతకుముందు రైల్వేస్ తొలి ఇన్నింగ్స్‌లో 241 పరుగులు చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన సుమిత్ మాథుర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’అవార్డు దక్కింది.చదవండి: Rohit Sharma: నా భార్య లైవ్ చూస్తోంది.. నేను ఆ విషయం చెప్పలేను -
AND Vs RJS: ఐదు వికెట్లతో మెరిసిన విజయ్.. రాజస్తాన్‌ను చిత్తు చేసిన ఆంధ్ర
ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ సీజన్‌ను ఆంధ్ర జట్టు విజయంతో ముగించింది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా జరిగిన పోరులో ఆంధ్ర జట్టు 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ జట్టును చిత్తు చేసింది. తాజా సీజన్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ఆంధ్ర జట్టుకు ఇదే తొలి విజయం కావడం గమనార్హం.ఏడు మ్యాచ్‌ల్లో ఒక విజయం, 3 పరాజయాలు, 3 ‘డ్రా’లతో 13 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఆంధ్ర జట్టు ఎలైట్ గ్రూప్ ‘బి’లో ఆరో స్థానంలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 95/7తో శనివారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన రాజస్తాన్ చివరకు 39.4 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది.అభిజిత్ తోమర్ (31), అజయ్ సింగ్ (30 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాస్త పోరాడారు. ఆంధ్ర జట్టు బౌలర్లలో త్రిపురాణ విజయ్ మరోసారి 5 వికెట్లతో విజృంభించగా... పృథ్వీరాజ్ 4 వికెట్లు తీశాడు. అనంతరం 153 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు 31 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసి గెలిచింది.రికీ భుయ్ (76 బంతుల్లో 62; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకంతో మెరవగా... శ్రీకర్ భరత్ (43; 5 ఫోర్లు), కరణ్ షిండే (35 నాటౌట్; 7 ఫోర్లు) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 258 పరుగులు చేయగా... ఆంధ్ర జట్టు 220 పరుగులు చేసింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు పడగొట్టిన ఆఫ్‌స్పిన్నర్ విజయ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఎలైట్ గ్రూప్ ‘బి’ నుంచి విదర్భ, గుజరాత్ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాయి. చదవండి: 28 ఏళ్ల సుదీర్ఘ కెరీర్.. రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్ -
సూపర్‌స్టార్ విఫలమైనా..
రంజీ ట్రోఫీ పునరాగమనంలో విరాట్ కోహ్లి(Virat Kohli) విఫలమైనా.. అతడి జట్టు ఢిల్లీ మాత్రం ఘన విజయం సాధించింది. రైల్వేస్(Railways Team)ను ఏకంగా ఇన్నింగ్స్ పందొమ్మిది పరుగుల తేడాతో ఓడించింది. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో వైఫల్యం తర్వాత టీమిండియా స్టార్ క్రికెటర్ కోహ్లి ఎట్టకేలకు దేశవాళీ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రైల్వేస్ జట్టుతో గురువారం మొదలైన మ్యాచ్ సందర్భంగా కోహ్లి ఢిల్లీ తరఫున సొంతమైదానంలో అడుగుపెట్టాడు. దీంతో కోహ్లి ఆటను చూసేందుకు తొలిరోజే వేలాది మంది అరుణ్ జైట్లీ స్టేడియానికి పోటెత్తారు. అయితే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకోవడంతో తొలిరోజు.. కోహ్లికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక శుక్రవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా బ్యాట్‌తో అతడు మైదానంలో అడుగుపెట్టాడు. కరతాళ ధ్వనులు, ఆర్సీబీ... ఆర్సీబీ... కోహ్లి... కోహ్లి... అనే అభిమానుల నినాదాల మధ్య ఉదయమే అతడు క్రీజులోకి వచ్చాడు.15 బంతుల్లోనే ముగిసిన ముచ్చటఅప్పటికే ఐదు వేల పైచిలుకు ప్రేక్షకులు మైదానంలోకి వచ్చేశారు. అయితే కోహ్లిని 6 పరుగుల వద్దే హిమాన్షు క్లీన్‌బౌల్డ్ చేయడంతో మరింత మంది అభిమానులు స్టేడియం లోపలికి వచ్చేందుకు ఆసక్తి కనబరచలేదు. కనీసం అతడిబ్యాట్ నుంచి ఫిఫ్టీ వచ్చినా వేలసంఖ్యతో తొలిరోజులాగే అరుణ్ జైట్లీ స్టేడియం నిండిపోయేది.కానీ.. పుష్కర కాలం తర్వాత రంజీ బరిలోకి దిగిన ఈ దిగ్గజ ఆటగాడి బ్యాటింగ్ ముచ్చట 15 బంతుల్లోనే ముగిసింది.ఇక మ్యాచ్ విషయానికొస్తే సూపర్‌స్టార్ కోహ్లి విఫలమైనప్పటికీ ఎలైట్ గ్రూప్ ‘డి’లో రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో రైల్వేస్‌ను 241 పరుగులకు ఆలౌట్ చేసిన బదోని సేన.. తమ మొదటి ఇన్నింగ్స్‌లో 374 రన్స్ స్కోరు చేసింది.బదోని కెప్టెన్ ఇన్నింగ్స్టాపార్డర్లో ఓపెనర్లు అర్పిత్ రాణా(10), సనత్ సంగ్వాన్(30).. వన్‌డౌన్ బ్యాటర్ యశ్ ధుల్(32) ఎక్కువ సేపు నిలవలేకపోయారు. మరోవైపు.. కోహ్లి ఆరు పరుగులకే అవుట్ కాగా.. ఆయుశ్ బదోని కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 77 బంతుల్లోనే 12 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేసి.. సెంచరీకి ఒక్క పరుగు దూరంలో అవుటయ్యాడు.మూడో రోజే ముగిసిన కథఇక బదోనికి తోడుగా సుమిత్ మాథుర్ 86 పరుగులతో రాణించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ ప్రణవ్ రాజువన్షీ 39 రన్స్‌తో ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో 374 పరుగుల మేర మెరుగైన స్కోరు సాధించిన ఢిల్లీ.. శనివారం నాటి మూడో రోజు ఆటలో రైల్వేస్ కథను ముగించింది.సూరజ్ అహుజా బృందాన్ని కేవలం 114 పరుగులకే ఆలౌట్ చేసి.. ఘన విజయం సాధించింది. ఢిల్లీ బౌలర్లలో స్పిన్నర్ శివం శర్మ ఐదు వికెట్లతో చెలరేగగా.. నవదీప్ సైనీ, సిద్ధాంత్ శర్మ, మోనీ గరేవాల్, ఆయుశ్ బదోని ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక ఢిల్లీ ఇన్నింగ్స్‌లో మెరుగైన స్కోరు చేయడంతో పాటు.. ఓవరాల్‌గా మూడు వికెట్లు పడగొట్టిన స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సుమిత్ మాథుర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. రోహిత్‌కు మాత్రం పరాభవంఏదేమైనా రంజీ రీఎంట్రీలో విరాట్ కోహ్లి బ్యాట్ ఝులిపించలేకపోయినప్పటికీ.. విజయంతో తిరిగి వెళ్లడం విశేషం. మరోవైపు.. రంజీ పునరాగమనం(జనవరి 23)లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రం ఘోర పరాభవం ఎదురైంది. బ్యాటర్(3, 28)గా అతడి వైఫల్యం ముంబై జట్టుపై ప్రభావం చూపింది. జమ్ము కశ్మీర్ చేతిలో ముంబై ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.విరాట్ కోహ్లికి సన్మానంఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) తమ స్టార్ క్రికెటర్ కోహ్లిని సత్కరించింది. అంతర్జాతీయ కెరీర్లో భారత్ తరఫున వంద టెస్టులు పూర్తి చేసుకున్న తమ ఆటగాడిని డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ శాలువకప్పి సన్మానించారు. ఈ సందర్భంగా మెమెంటోను బహూకరించారు. మూడేళ్ల క్రితమే 2022లోనే కింగ్ కోహ్లి వంద టెస్టుల మార్క్ దాటాడు. కానీ రంజీల బరిలోకి దిగకపోవడంతో ఆత్మీయ సత్కారం కోసం డీడీసీఏ ఇన్నేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది.చదవండి: అతడిని ఆడించడం అన్యాయం.. మాకు ఒక మాట కూడా చెప్పలేదు: బట్లర్ -
తన్మయ్ సూపర్ సెంచరీ
నాగ్‌పూర్: సహచరుల నుంచి పెద్దగా సహకారం లభించకపోయినా... ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (232 బంతుల్లో 136; 13 ఫోర్లు, 1 సిక్స్) సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. ఫలితంగా రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా విదర్భతో జరుగుతున్న మాŠయ్చ్లో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కించుకోగలిగింది. ఓవర్‌నైట్ స్కోరు 90/2తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ జట్టు చివరకు 91.4 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. తన్మయ్ ఒంటరి పోరాటం చేయగా... తక్కినవాళ్లు మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. హిమతేజ (64 బంతుల్లో 31; 3 ఫోర్లు), వరుణ్ గౌడ్ (55 బంతుల్లో 24; 2 ఫోర్లు), రాహుల్ బుద్ధి (43 బంతుల్లో 26; 3 ఫోర్లు), తనయ్ త్యాగరాజన్ (24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ చామా మిలింద్ (38; 8 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేశారు. వీరందరితోనూ తన్మయ్ భాగస్వామ్యాలు నమోదు చేశాడు. విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టగా... హర్‡్ష, ఆకాశ్, పార్థ్ తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భ శుక్రవారం ఆట ముగిసే సమయానికి 19.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. ధ్రువ్ షొరే (23), ఆదిత్య (5) ఔట్ కాగా... అథర్వ తైడె (20 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. హైదరాబాద్ బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్, రక్షణ్ రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు. చేతిలో 8 వికెట్లు ఉన్న విదర్భ... హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 80 పరుగులు వెనుకబడి ఉంది. మరోవైపు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావు... జట్టు ఆటతీరును ప్రశంసించారు. ఈ సీజన్లో 4 సెంచరీలు, 2 హాప్సెంచరీలు సాధించిన ఓపెనర్ తన్మయ్ అగర్వాల్‌కు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ రూ. 1 లక్షనగదు బహుమతిని ప్రకటించారు. ఈ సీజన్లో 33 వికెట్లు తీసిన తనయ్ త్యాగరాజన్, కెప్టెన్ చామా మిలింంద్, టీమిండియా ప్లేయర్ మొహమ్మద్ సిరాజ్‌ను జగన్మోహన్ రావు ప్రత్యేకంగా అభినందించారు. -
శార్దూల్ ఠాకూర్ ఊచకోత.. తొలుత హ్యాట్రిక్, ఇప్పుడు..?
రంజీ ట్రోఫీ (Ranji Trophy) రన్నింగ్ సీజన్లో ముంబై ఆల్‌రౌండర్, టీమిండియా ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) హవా కొనసాగుతుంది. ఈ సీజన్లో ఆది నుంచి తనదైన శైలిలో రెచ్చిపోతున్న శార్దూల్.. ప్రస్తుతం మేఘాలయాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలుత హ్యాట్రిక్ (Hat Trick) తీసిన శార్దూల్.. బ్యాటింగ్‌లో మెరుపు అర్ద శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ ఇన్నింగ్స్‌లో కేవలం 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన శార్దూల్.. ఓవరాల్‌గా 42 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. శార్దూల్‌తో పాటు మిగతా ఆటగాళ్లంతా తలో చేయి వేయడంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (671/7) చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.ముంబై బ్యాటర్లలో సిద్దేశ్ లాడ్ (145), వికెట్ కీపర్ ఆకాశ్ ఆనంద్ (103), షమ్స్ ములానీ (86 బంతుల్లో 100 నాటౌట్; 16 ఫోర్లు) సెంచరీలతో కదంతొక్కగా.. కెప్టెన్ అజింక్య రహానే (96) తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. సుయాంశ్ షేడ్గే (61) అర్ద సెంచరీతో రాణించాడు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయానికి ముంబై 585 పరుగుల ఆధిక్యంలో ఉంది.అంతకుముందు శార్దూల్ ఠాకూర్ బంతితో చెలరేగడంతో మేఘాలయా తొలి ఇన్నింగ్స్‌లో 86 పరుగులకే కుప్పకూలింది. శార్దూల్ హ్యాట్రిక్ సహా 4 వికెట్లు తీయగా.. మోహిత్ అవస్థి 3, సిల్డెస్టర్ డిసౌజా 2, షమ్స్ ములానీ ఓ వికెట్ పడగొట్టారు. మేఘాలయా ఇన్నింగ్స్‌లో 10వ నంబర్ ఆటగాడు హిమాన్ పుఖాన్ చేసిన 28 పరుగులే అత్యధికం. శార్దూల్ దెబ్బకు మేఘాలయా టాపార్డర్‌కు చెందిన ఐదుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. ఈ మ్యాచ్‌లో మేఘాలయా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. కేవలం 2 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి రంజీ చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రదర్శన నమోదు చేసింది. 90ల్లో ఔటైన ఐదుగురు ఆటగాళ్లు..ప్రస్తుతం జరుగుతున్న రంజీ మ్యాచ్‌ల్లో ఏకంగా ఐదు మంది ఆటగాళ్లు 90ల్లో ఔటయ్యారు. వీరిలో ఇద్దరు పరుగు తేడాతో సెంచరీ మిస్ అయ్యారు. సౌరాష్ట్ర ఆటగాడు చతేశ్వర్ పుజారా, ఢిల్లీ కెప్టెన్ ఆయుశ్ బదోని 99 పరుగుల వద్ద ఔట్ కాగా.. ముంబై కెప్టెన్ అజింక్య రహానే 96, రైల్వేస్ ఆటగాడు ఉపేంద్ర యాదవ్ 95, కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 91 పరుగుల వద్ద ఔటయ్యారు. -
రంజీల్లో కేరళ బౌలర్ ఆల్‌టైమ్ రికార్డు.. అత్యంత అరుదైన ఘనత
కేరళ స్పిన్నర్ జలజ్ సక్సేనా(Jalaj Saxena) సంచలన రికార్డు సాధించాడు. రంజీ చరిత్ర(Ranji Trophy)లో ఇంత వరకు ఏ బౌలర్‌కూ సాధ్యం కాని ఓ అరుదైన ఘనత సాధించాడు. అత్యధికంగా పందొమ్మిది వేర్వేరు జట్లపై ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన క్రికెటర్‌గా ఆల్‌టైమ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.కాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించిన జలజ్ సక్సేనా.. దేశవాళీ క్రికెట్లో కేరళ(Keral) జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో జనవరి 23న రంజీ ట్రోఫీ 2024-25 ఎడిషన్‌లో రెండో దశ పోటీలు ఆరంభం కాగా... కేరళ తరఫున మరోసారి బరిలోకి దిగాడు. సెకండ్ లెగ్‌లో కేరళ తొలుత మధ్యప్రదేశ్‌తో తలపడగా.. జలజ్ ఈ మ్యాచ్‌లో మొత్తంగా మూడు వికెట్లు మాత్రమే తీశాడు.సల్మాన్ నిజార్ భారీ శతకంఇక ఈ మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగియగా.. తాజాగా కేరళ బిహార్‌తో తలపడుతోంది. ఎలైట్ గ్రూప్- ‘సి’లో భాగంగా తిరువనంతపురంలో గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేరళ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 351 పరుగులకు ఆలౌట్ అయింది. సల్మాన్ నిజార్ భారీ శతకం(150) బాదడంతో కేరళ ఈ మేరకు స్కోరు చేయగలిగింది.జలజ్‌కు ఐదు వికెట్లుఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బిహార్ జట్టుకు జలజ్ సక్సేనా చుక్కలు చూపించాడు. 7.1 ఓవర్ల బౌలింగ్‌లో 19 పరుగులు ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు. ఓపెనర్ షర్మాన్ నిగ్రోథ్(6)తో పాటు.. సకీబుల్ గనీ(0), బిపిన్ సౌరభ్(4), కెప్టెన్ వీర్ ప్రతాప్ సింగ్(0), హర్ష్ సింగ్(5) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.జలజ్ సక్సేనాకు తోడుగా ఎండీ నిధీశ్ , వైశాఖ్ చంద్రన్, ఆదిత్య సర్వాటే రాణించారు. నిధీశ్ రెండు, వైశాఖ్, ఆదిత్య ఒక్కో వికెట్ తీశారు. ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్‌లో 64 పరుగులకే బిహార్ కుప్పకూలింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో కేరళకు ఏకంగా 287 పరుగుల ఆధిక్యం లభించింది.కాగా జలజ్ సక్సేనా రంజీల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ప్రత్యర్థి జట్లలో బిహార్ పందొమ్మిదవది కావడం విశేషం. ఇంతకుముందు పంకజ్ సింగ్ రంజీల్లో పద్దెనిమిది జట్లపై ఐదు వికెట్ల హాల్ సాధించగా.. తాజాగా జలజ్ అతడిని అధిగమించాడు.400కు పైగా వికెట్లురంజీ ట్రోఫీలో జలజ్ సక్సేనాకు గొప్ప రికార్డు ఉంది. ఇప్పటి వరకు అతడు 416కు పైగా వికెట్లు తీశాడు. తద్వారా టోర్నీ చరిత్రలో అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో టాప్-10లో నిలిచాడు. ఇక ఇటీవలే అతడు రంజీల్లో ఆరు వేల పరుగుల మైలురాయిని కూడా అధిగమించాడు.ఈ క్రమంలో రంజీల్లో ఈ మేర పరుగులు రాబట్టడంతో పాటు నాలుగు వందలకు పైగా వికెట్లు తీసిన తొలి ఆల్‌రౌండర్‌గా చరిత్రకెక్కాడు. ఇక 2005లో స్వరాష్ట్రం మధ్యప్రదేశ్ తరఫున తొలిసారి రంజీ బరిలో దిగిన జలజ్.. 2016-17 సీజన్ నుంచి కేరళ జట్టుకు ఆడుతున్నాడు.రంజీల్లో అత్యధిక జట్లపై ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ఆటగాళ్లు వీరే👉జలజ్ సక్సేనా- 19👉పంకజ్ సింగ్- 18👉సునిల్ జోషి- 16👉ఆర్. వినయ్ కుమార్- 16👉షాబాజ్ నదీం- 16👉ఆదిత్య సర్వాటే-16. చదవండి: చరిత్ర సృష్టించిన సౌరాష్ట్ర బ్యాటర్.. రంజీల్లో ఆల్‌టైమ్ రికార్డు -
Virat Kohli: పన్నెండేళ్ల తర్వాత రీఎంట్రీ.. క్లీన్‌బౌల్డ్! దారుణ వైఫల్యం
‘కింగ్’ రాకతో రంజీ(Ranji Match)లకు కూడా కళొచ్చింది. పుష్కర కాలం తర్వాత రికార్డుల రారాజు రంజీ బరిలో దిగగానే అభిమానం కట్టలు తెంచుకుని స్టేడియం కిక్కిరిసిపోయింది. అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుందా అన్న స్థాయిలో ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు దాదాపు ఇరవై ఏడు వేల మంది తరలివచ్చారు. సూపర్‌స్టార్ బ్యాటింగ్ చేస్తే చూడాలని ఆశగా రెండో రోజు వరకు వేచి చూశారు.కానీ వారి ఆశలపై ‘రన్‌మెషీన్’ నీళ్లు చల్లాడు. పట్టుమని పది పరుగులు కూడా చేయకుండానే క్రీజును వీడాడు. తన వైఫల్యాల పరపరంపర కొనసాగిస్తూ భారంగా నిష్క్రమించాడు. దీంతో స్టేడియమంతా ఒక్కసారిగా మూగబోయింది. తమ అభిమాన ఆటగాడు మైదానం వీడుతుంటే అంతా నిరాశగా అతడి వైపు చూస్తూ ఉండిపోయారు.ఆసీస్ గడ్డపై విఫలంగత కొంతకాలంగా టెస్టుల్లో విఫలమవుతున్న భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి(Virat Kohli).. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపించాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో శతకం బాది టచ్‌లోకి వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆ తర్వాత మాత్రం అదే జోరును కొనసాగించలేకపోయాడు.ముఖ్యంగా ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతిని ఆడబోయిన ప్రతిసారీ ఆసీస్ బౌలర్ల చేతికి ఇచ్చి వికెట్ సమర్పించుకున్నాడు కోహ్లి. ఈ క్రమంలో ‘కింగ్’ పనైపోయిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దేశవాళీ క్రికెట్ బరిలోకి దిగి మునుపటి లయను అందుకోవాలనే సూచనలు వచ్చాయి.తొలిరోజు ఫీల్డింగ్‌కే పరిమితమైన కోహ్లిఈ క్రమంలో సొంతజట్టు ఢిల్లీ తరఫున రైల్వేస్‌తో మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లి రంజీల్లో పునరాగమనం చేశాడు. సొంత మైదానం అరుణ్ జైట్లీ స్టేడియంలో గురువారం మొదలైన ఈ మ్యాచ్‌ను చూసేందుకు జనం పోటెత్తారు. వాళ్లంతా వచ్చింది కేవలం కోహ్లిని చూడటానికే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.Cameras 📸. Posters 🖼️ Chants 🗣️Cheers 👏A fantastic reception for @imVkohli as he walks out to bat 🔥#RanjiTrophy | @IDFCFIRSTBankScorecard ▶️ https://t.co/IhwXam37gl pic.twitter.com/FXnCSzmOfC— BCCI Domestic (@BCCIdomestic) January 31, 2025 అయితే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. తొలిరోజు కోహ్లి ఫీల్డింగ్‌కే పరిమితమయ్యాడు. తనదైన శైలిలో ప్రేక్షకులను ఉత్సాహపరుస్తూ సందడి చేశాడు. ఇక ఆయుశ్ బదోని సారథ్యంలోని ఢిల్లీ జట్టు.. రైల్వేస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 241 పరుగులకు ఆలౌట్ చేసింది. అనంతరం గురువారమే బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ.. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 41 పరుగులు చేసింది.ఒకే ఒక్క ఫోర్ఈ క్రమంలో రెండో రోజైన శుక్రవారం ఆట సందర్భంగా కోహ్లి క్రీజులోకి వచ్చాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు పదిహేను బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క ఫోర్ సాయంతో ఆరు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. రైల్వేస్ పేసర్ హిమాన్షు సంగ్వాన్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయి.. క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. బౌలర్ దెబ్బకు కోహ్లి ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది. దీంతో రైల్వేస్ జట్టు సంబరాలు అంబరాన్నంటగా.. ప్రేక్షకులంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఇక కోహ్లి రంజీ రీఎంట్రీలో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచి పెవిలియన్ బాట పట్టిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే.. 40 ఓవర్లు పూర్తయ్యేసరికి ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 163 పరుగులే చేసింది.చదవండి: చరిత్ర సృష్టించిన సౌరాష్ట్ర బ్యాటర్.. రంజీల్లో ఆల్‌టైమ్ రికార్డుHarish Sangwan Knocked Out Virat King Kohli , At The Score of 6 (Full Crowd Reaction + Celebration) #ViratKohli𓃵 | #ViratKohli pic.twitter.com/QBHLRfsLKb— 𝐒𝐑𝐈𝐉𝐀𝐍 🇮🇹 (@LegendDhonii) January 31, 2025 -
పాపం పుజారా.. ఒక్క పరుగు దూరంలో సెంచరీ మిస్
రంజీ ట్రోఫీ 2024-25లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర దిగ్గజం ఛతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara)ను దురదృష్టం వెంటాడింది. తొలి ఇన్నింగ్స్‌లో పుజారా ఒక్క పరుగు దూరంలో 67వ ఫస్ట్ క్లాస్ సెంచరీని మిస్ చేసుకున్నాడు.పుజారా 99 పరుగుల వద్ద ముక్తర్ హూస్సేన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఏ బ్యాటర్‌కైనా ఒక్క పరుగు దూరంలో ఔటైతే ఆ బాధ వర్ణనాతీతం. ఈ డూ ఆర్ డై మ్యాచ్‌లో తన అద్భుత ఇన్నింగ్స్‌తో సౌరాష్ట్రను పటిష్ట స్ధితిలో ఉంచాడు. 167 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 99 పరుగులు చేసి పుజారా పెవిలియన్‌కు చేరాడు.కాగా తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 109 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి సౌరాష్ట్ర 442 పరుగులు చేసింది. సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో హర్విక్ దేశాయ్(130), చిరాగ్ జానీ(80) రాణించారు.ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అదుర్స్..ఇక ఇప్పటివరకు 276 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన పుజారా.. 51.89 సగటుతో 21174 పరుగులు చేశాడు. అతడి ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 66 సెంచరీలు, 80 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు 103 మ్యాచ్‌లు ఆడిన ఛతేశ్వర్.. 43.60 సగటుతో 7195 పరుగులు చేశాడు.అతడి ఇన్నింగ్స్‌లలో 19 సెంచరీలు, 35 హాఫ్‌సెంచరీలు ఉన్నాయి. పుజారా చివరగా భారత్ తరపున 2023 ఏడాదిలో ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడాడు.పాపం రహానే..మరోవైపు మేఘాలయతో జరుగుతున్న ముంబై కెప్టెన్ అజింక్య రహానే(Ajinkya Rahane) కూడా తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో 96 పరుగుల వద్ద రహానే ఔటయ్యాడు. నఫీస్ సిద్ధిక్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రహానే తన వికెట్‌ను కోల్పోయాడు. ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 76 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. రహానే టీమ్ ప్రస్తుతం 172 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకముందు మేఘాలయ తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 86 పరుగులకే కుప్పకూలింది.చదవండి: దినేష్ కార్తీక్ విధ్వంసం.. హ్యాట్రిక్ సిక్స్‌లతో హాఫ్ సెంచరీ! వీడియో -
ఐదు వికెట్లతో చెలరేగిన శ్రీకాకుళం కుర్రాడు..
ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో ఆంధ్ర ఆఫ్‌స్పిన్నర్ త్రిపురణ విజయ్ (5/62) విజృంభించాడు. ఫలితంగా ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా రాజస్తాన్‌తో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు మెరుగైన ప్రదర్శన కనబరిచిందిటాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 79.5 ఓవర్లలో 258 పరుగుల వద్ద ఆలౌటైంది. అభిజీత్ తోమర్ (188 బంతుల్లో 94; 11 ఫోర్లు, 1 సిక్స్) శతకం చేజార్చుకోగా... మానవ్ సుతార్ (104 బంతుల్లో 54; 8 ఫోర్లు) హాఫ్‌సెంచరీతో ఆకట్టుకున్నాడు.కెప్టెన్ మహిపాల్ లోమ్రర్ (2)తో పాటు కార్తీక్ శర (13), సమర్పత్ జోషి (8) విఫలమయ్యారు. ఆంధ్ర బౌలర్లలో విజయ్ 5 వికెట్లు పడగొట్టగా... సత్యనారాయణ రాజు రెండు వికెట్లు తీశాడు. పృథ్వీ రాజ్, శశికాంత్, వినయ్ కుమార్ తలా ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 49 పరుగులు చేసింది. ఓపెనర్లు వంశీకృష్ణ (23 బంతుల్లో 18 బ్యాటింగ్; 3 ఫోర్లు), శ్రీకర్ భరత్ (23 బంతుల్లో 26 బ్యాటింగ్; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న ఆంధ్ర జట్టు... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 209 పరుగులు వెనుకబడి ఉంది.ఢిల్లీకి ఆడనన్న విజయ్..కాగా శ్రీకాకుళంకు చెందిన త్రిపురణ విజయ్(Tripurana Vijay) తొలిసారి ఐపీఎల్‌కు ఎంపికయ్యాడు. ఐపీఎల్-2025 మెగా వేలంలో విజయ్ను రూ.30 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగొలు చేసింది. విజయ్, 9 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 23 వికెట్లు తీసి, 166 పరుగులు సాధించాడు. రంజీ, కూచ్‌బెహర్ ట్రోఫీల్లోనూ రాణించాడు. ప్రస్తుతం ముస్తాక్ అలీ టోర్నీలోనూ మంచిగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఢిల్లీ అతడిని తమ జట్టులోకి తీసుకుంది.చదవండి: ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డు.. టీమిండియాను వెనక్కి నెట్టి టాప్‌లోకి! -
చరిత్ర సృష్టించిన సౌరాష్ట్ర బ్యాటర్.. రంజీల్లో ఆల్‌టైమ్ రికార్డు
సౌరాష్ట్ర వెటరన్ క్రికెటర్ షెల్డన్ జాక్సన్(Sheldon Jackson) సరికొత్త చరిత్ర సృష్టించాడు. రంజీ ట్రోఫీ(Ranji Trophy) టోర్నీలో అత్యధిక సిక్సర్లు(Highest Six Hitter) బాదిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. అసోంతో మ్యాచ్ సందర్భంగా షెల్డన్ జాక్సన్ ఈ ఘనత సాధించాడు. కాగా దేశవాళీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ తాజా ఎడిషన్ రెండో దశ పోటీలు జనవరి 23న మొదలయ్యాయి.ఇందులో భాగంగా ఎలైట్ గ్రూప్-డిలో ఉన్న సౌరాష్ట్ర.. తొలుత ఢిల్లీతో తలపడి పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో తమ రెండో మ్యాచ్‌లో గురువారం అసోంతో రాజ్‌కోట్ వేదికగా రెండో మ్యాచ్ మొదలుపెట్టింది. ఇందులో టాస్ గెలిచిన ఆతిథ్య సౌరాష్ట్ర తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.అదిరిపోయే ఆరంభంఈ క్రమంలో ఓపెనర్లు హర్విక్ దేశాయ్, చిరాగ్ జైనీ అదిరిపోయే ఆరంభం అందించారు. వికెట్ కీపర్ బ్యాటర్ హర్విక్ శతకంతో చెలరేగాడు. 181 బంతులు ఎదుర్కొని 17 ఫోర్లతో రాణించి.. 130 పరుగులు చేశాడు. మరోవైపు.. చిరాగ్ 78 బంతుల్లోనే 80 పరుగులతో సత్తా చాటాడు.144వ సిక్సర్ఇక వన్‌డౌన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా కూడా బ్యాట్ ఝులిపించగా.. నాలుగో స్థానంలో వచ్చిన షెల్డన్ జాక్సన్ కూడా కాసేపు అలరించాడు. మొత్తంగా 86 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 48 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లతో పాటు ఒక సిక్సర్ ఉంది. కాగా రంజీల్లో జాక్సన్‌కు ఇది 144వ సిక్సర్.ఆల్‌టైమ్ రికార్డుఈ క్రమంలోనే 38 ఏళ్ల షెల్డన్ జాక్సన్ రంజీల్లో ఆల్‌టైమ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. రంజీ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు బాదిన క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. అంతకు ముందు ఈ రికార్డు టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ నమన్ ఓజా పేరిట ఉండేది. అతడు రంజీల్లో 143 సిక్సర్లు కొట్టాడు. తాజాగా షెల్డన్ జాక్సన్ నమన్ ఓజాను అధిగమించాడు.పటిష్ట స్థితిలో సౌరాష్ట్రఇక సౌరాష్ట్ర- అసోం మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు ఆట ముగిసే సరికి సౌరాష్ట్ర 90 ఓవర్ల ఆట పూర్తి చేసుకుని.. కేవలం మూడు వికెట్ల నష్టానికి 361 పరుగులు సాధించింది. గురువారం ఆట పూర్తయ్యేసరికి ఛతేశ్వర్ పుజారా 95, అర్పిత్ వసవాడ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా అర్ధ శతకానికి రెండు పరుగుల దూరంలో ఉన్న వేళ షెల్డన్ జాక్సన్.. టీమిండియా యువ సంచలనం రియాన్ పరాగ్ బౌలింగ్‌లో బౌల్డ్ కావడం గమనార్హం.అద్బుతమైన రికార్డులు ఉన్నాఇదిలా ఉంటే.. రంజీల్లో షెల్డన్ జాక్సన్‌కు అద్బుతమైన రికార్డు ఉంది. సౌరాష్ట్ర తరఫున ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఇప్పటి వరకు 6600కు పైగా పరుగులు సాధించాడు. తద్వారా సితాన్షు కొటక్, ఛతేశ్వర్ పుజారా తర్వాత సౌరాష్ట్ర తరఫున ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు.ఇప్పటి వరకు షెల్డన్ జాక్సన్ ఖాతాలో 21 ఫస్ట్‌క్లాస్ సెంచరీలు ఉండటం విశేషం. 2019-20 సీజన్లో సౌరాష్ట్ర తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. నాటి టోర్నీలో 809 పరుగులతో రాణించి సౌరాష్ట్ర ట్రోఫీ సొంతం చేసుకోవడంలో జాక్సన్ కీలక పాత్ర పోషించాడు. సెమీ ఫైనల్‌తో కలిపి మొత్తంగా నాడు మూడు శతకాలు బాదాడు.ఇటీవలే గుడ్బైఅంతేకాదు.. 2022-23లో రెండోసారి సౌరాష్ట్ర రంజీ ట్రోఫీ గెలిచినపుడు కూడా.. జాక్సన్ 588 రన్స్ చేశాడు. సెమీస్ మ్యాచ్‌లో ఏకంగా 160 పరుగులతో చెలరేగడం విశేషం. అయితే, అతడికి ఒక్కసారి కూడా టీమిండియా తరఫున ఆడే అవకాశం రాలేదు. ఇక పరిమిత ఓవర్ల ఆటలోనూ మెరుగైన రికార్డు కలిగి ఉన్న షెల్డన్ జాక్సన్ ఇటీవలే వైట్‌బాల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. లిస్ట్-ఏ క్రికెట్లో 86 మ్యాచ్‌లు ఆడిన షెల్డన్ జాక్సన్ 2792 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది శతకాలు, 14 అర్ధ శతకాలు ఉన్నాయి.చదవండి: ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డు.. టీమిండియాను వెనక్కి నెట్టి టాప్‌లోకి! -
టీమిండియాలో చోటు గల్లంతు.. అయినా ఆకట్టుకోలేకపోయిన సిరాజ్
ఇటీవలికాలంలో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు ఇవ్వలేక ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన టీమిండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj).. ప్రస్తుతం జరుగుతున్న రంజీ మ్యాచ్‌లోనూ (Ranji Trophy) ఆకట్టుకోలేకపోయాడు. చాలాకాలం తర్వాత హైదరాబాద్ (Hyderabad) తరఫున రంజీ బరిలోకి దిగిన సిరాజ్.. విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో ఒకే ఒక వికెట్‌కు పరిమితమయ్యాడు. భారీ అంచనాలతో ఈ మ్యాచ్ బరిలోకి దిగిన సిరాజ్ అతి సాధారణ బౌలర్లా బౌలింగ్ చేశాడు. కొత్త బంతితో మ్యాజిక్ చేసే సిరాజ్ ఈ మ్యాచ్‌లో తన తొలి 15 ఓవరల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో అతనికి దక్కిన ఏకైక వికెట్ చివరి స్పెల్‌లో లభించింది. ఈ మ్యాచ్ జరుగుతున్న నాగ్‌పూర్ పిచ్ పేసర్లకు సహకరించలేదా అంటే అదేమీ లేదు. సిరాజ్ సహచర పేసర్లు చింట్ల రక్షన్ రెడ్డి, చామ మిలింద్ కలిపి ఐదు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ రాణించకపోయినా మిగతా బౌలర్లు రాణించి విదర్భను 190 పరుగులకే ఆలౌట్ చేశారు. రక్షన్ రెడ్డి, అనికేత్ రెడ్డి తలో మూడు వికెట్లు పడగొట్టగా.. చామ మిలింద్ రెండు, తనయ్ త్యాగరాజన్ ఓ వికెట్ దక్కించుకున్నారు. విదర్భ ఇన్నింగ్స్‌లో హర్ష్ దూబే (46 బంతుల్లో 65; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. మెరుపు అర్ద సెంచరీ చేసి జోష్ మీదున్న హర్ష్ దూబేను ఔట్ చేయడమే సిరాజ్‌కు ఊరట కలిగించే అంశం. విదర్భ ఇన్నింగ్స్‌లో హర్ష్‌తో పాటు అక్షయ్ వాద్కర్ (29), దనిష్ మలేవార్ (13), పార్థ్ రేఖడే (23), యశ్ రాథోడ్ (16), యశ్ ఠాకూర్ (17) రెండంకెల స్కోర్లు చేశారు. ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా పరుగుల వరద పారించిన కరుణ్ నాయర్ (3) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 1.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. అభిరథ్ రెడ్డి 5 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 12 పరుగులు చేసి బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. తన్మయ్ అగర్వాల్ ఒక్క పరుగుతో క్రీజ్‌లో ఉన్నాడు.బీజీటీలోనూ అంతంతమాత్రమే..!ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ప్రధాన బౌలర్‌గా చలామణి అయిన సిరాజ్.. ఆ సిరీస్‌లో పెద్దగా రాణించలేకపోయాడు. ఈ సిరీస్‌లో సిరాజ్ 5 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు తీసినప్పటికీ.. జట్టు విజయానికి అతని ప్రదర్శనలు ఏమాత్రం అక్కరకు రాలేదు. బీజీటీలో సిరాజ్ బుమ్రా కంటే ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేశాడు. అయినా అతని నుంచి ఆశించిన ఫలితాలు రాలేదు. 2023 ఆరంభంలో మంచి ఫామ్‌లో ఉండిన సిరాజ్ ఆతర్వాత కొంత కాలం పాటు తన ఫామ్‌ను కొనసాగించగలిగాడు. 2023 నుంచి ఇప్పటివరకు 57 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ 27.89 సగటున 104 వికెట్లు తీశాడు. ఈ మధ్యకాలంలో అతను మూడు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. 2023 నుంచి ఇప్పటివరకు 683.5 ఓవర్లు వేసిన సిరాజ్.. ఈ మధ్యకాలంలో అత్యధిక ఓవర్లు వేసిన భారత పేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. -
2 పరుగులే 6 వికెట్లు.. 152 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే
మేఘాలయ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన మేఘాలయ తమ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 86 పరుగులకే ఆలౌటైంది. ఆరంభంలోనే ముంబై స్టార్ ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్(Shardul Thakur) హ్యాట్రిక్ వికెట్లను పడగొట్టి దెబ్బతీశాడు. అతడి ధాటికి మేఘాలయ కేవలం 2 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో మేఘాలయ అత్యంత చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది.152 ఏళ్ల ఫస్ట్ క్లాస్ క్రికెట్ హిస్టరీలోనే తొలి ఆరు వికెట్లకు అత్యల్ప స్కోర్ చేసిన రెండో జట్టుగా మేఘాలయ నిలిచింది. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో ఎసీసీ క్రికెట్ క్లబ్ అగ్రస్ధానంలో ఉంది. 1872లో లార్డ్స్‌లో సర్రేతో జరిగిన మ్యాచ్‌లో ఎంసీసీ ఖాతా తెరవకుండానే తొలి 6 వికెట్లను కోల్పోయింది. ఈ లిస్ట్‌లో ఎంసీసీ, మేఘాలయ తర్వాతి స్ధానాల్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ (3-6), లీసెస్టర్‌షైర్(4-6), నార్తాంప్టన్‌షైర్(4-6) ఉన్నాయినాలుగేసిన శార్ధూల్..ఇక ఈ మ్యాచ్‌లో శార్థూల్ ఠాకూర్ హ్యాట్రిక్ వికెట్లతో మెరిశాడు. మేఘాలయ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన లార్డ్ శార్ధూల్.. బి అనిరుధ్, సుమిత్ కుమార్, జస్కిరత్లను వరుస బంతుల్లో ఔట్ చేశాడు. ఓవరాల్‌గా 11 ఓవర్లు బౌలింగ్ చేసిన ఠాకూర్.. 43 పరుగులిచ్చి 4 వికెట్లను పడగొట్టాడు.అతడితో పాటు మొహిత్ అవస్థి మూడు, సిల్వస్టర్ డిసౌజా రెండు , షామ్స్ ములానీ ఒక్క వికెట్ సాధించారు. మేఘాలయ బ్యాటర్లలో టెయిలాండర్ హీమ్యాన్(28) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.చదవండి: RT 2025: హ్యాట్రిక్‌తో చెలరేగిన శార్ధూల్.. టీమిండియాలోకి రీ ఎంట్రీకి సిద్దం -
నిరాశపరిచిన కేఎల్ రాహుల్.. మంచి ఆరంభం లభించినా సద్వినియోగం చేసుకోలేని వైనం
చాలాకాలం తర్వాత రంజీ (Ranji Trophy) బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ (KL Rahul) తొలి ఇన్నింగ్స్‌లోనే నిరాశపరిచాడు. హర్యానాతో ఇవాళ (జనవరి 30) మొదలైన మ్యాచ్‌లో రాహుల్ 26 పరుగులకే ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో రాహుల్‌కు మంచి ఆరంభం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రాహుల్ 37 బంతుల్లో 4 సొగసైన బౌండరీలు బాది మాంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించాడు. అయితే అన్షుల్ కంబోజ్ ఓ సాధారణ బంతితో రాహుల్‌ను బోల్తా కొట్టించాడు. వికెట్‌కీపర్ రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి రాహుల్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు.కాగా, ఈ మ్యాచ్‌లో రాహుల్ బరిలోకి దిగే సమయంలో అభిమానుల కేరింతలతో స్టేడియం దద్దరిల్లింది. ఈ మ్యాచ్ రాహుల్ సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో (బెంగళూరు) జరుగుతుంది. సొంత మైదానంలో రాహుల్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. రాహుల్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించి వచ్చిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ ఇన్నింగ్స్‌లో తొలుత రాహుల్‌ను చూసి అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు. వరుస పెట్టి బౌండరీలు బాదడంతో భారీ స్కోర్ చేయడం ఖాయమని అనుకున్నారు. అయితే వారి ఆశలు అడియాశలయ్యాయి. సూపర్ టచ్‌లో కనిపించిన రాహుల్ కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయకుండానే నిష్క్రమించాడు.ఈ మ్యాచ్‌లో హర్యానా టాస్ గెలిచి కర్ణాటకను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. 17 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కేవీ అవనీశ్ ఔట్ కావడంతో కర్ణాటక 45 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం బరిలోకి దిగిన రాహుల్.. మయాంక్ అగర్వాల్‌తో కలిసి రెండో వికెట్‌కు 54 పరుగులు జోడించాడు. రాహుల్ ఔటయ్యాక దేవ్‌దత్ పడిక్కల్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఈ లోగా మయాంక్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 40 ఓవర్ల అనంతరం కర్ణాటక స్కోర్ 121/2గా ఉంది. మయాంక్ 63, పడిక్కల్ 9 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రాహుల్‌ను ఔట్ చేసిన కంబోజ్ అనీశ్‌ను కూడా పెవిలియన్‌కు పంపాడు.బీజీటీలోనూ నిరాశపరిచిన రాహుల్రాహుల్ ఇటీవలికాలంలో వరుసగా విఫలమవుతున్నాడు. తాజాగా ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రాహుల్ 5 టెస్ట్‌ల్లో కేవలం 2 హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. గాయాలు, ఫామ్ లేమి కారణంగా రాహుల్ ఇటీవలికాలంలో తరుచూ జట్టులోకి వస్తూ పోతున్నాడు. రాహుల్ టీ20 జట్టులో చోటు కోల్పోయి చాలాకాలమైంది. వన్డేల్లోనూ రాహుల్ అడపాదడపా ప్రదర్శనలే చేస్తున్నాడు. రాహుల్‌కు బీజీటీ 2024-25లో ఐదు టెస్ట్‌లు ఆడే అవకాశం దక్కినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. తొలి టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో (77).. మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో (84) మాత్రమే రాహుల్ రాణించాడు. -
13 ఏళ్ల తర్వాత రంజీ బరిలో కోహ్లి.. పోటెత్తిన జనం.. తొక్కిసలాట
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రంజీ బరిలోకి దిగాడు. రైల్వేస్‌తో ఇవాళ (జనవరి 30) మొదలైన మ్యాచ్‌లో కోహ్లి ఢిల్లీ తరఫున ఆడుతున్నాడు. కోహ్లి సొంత మైదానమైన అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. 🚨 15,748 ATTENDANCE ON DAY 1 IN DELHI vs RAILWAYS MATCH AT ARUN JAITLEY STADIUM 🚨 (Vipul Kashyap).- The Craze of King Kohli..!!!! 🐐🔥 pic.twitter.com/5yMvhgbcKU— Tanuj Singh (@ImTanujSingh) January 30, 2025చాలాకాలం తర్వాత కోహ్లి సొంత మైదానంలో రంజీ మ్యాచ్ ఆడుతుండటంతో అతన్ని చూసేందుకు జనం పోటెత్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మ్యాచ్ చూసేందుకు 15 వేల పైచిలుకు జనం హాజరయ్యారు. సాధారణంగా రంజీ మ్యాచ్ చూసేందుకు ఈ స్థాయిలో జనం రారు. THE CRAZE & AURA OF VIRAT KOHLI. 🐐- The Scenes at Arun Jaitley stadium at the moment. 🔥 pic.twitter.com/Cym5H3EM8z— Tanuj Singh (@ImTanujSingh) January 30, 2025కోహ్లిని తమ సొంత మైదానంలో చూసేందుకు అభిమానులు ఇవాళ తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. మ్యాచ్ ప్రారంభం కాగానే స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయింది. కోహ్లి నామస్మరణతో అరుణ్ జైట్లీ స్టేడియం మార్మోగిపోయింది. స్టేడియంలోకి ప్రవేశం ఉచితం కావడంతో జనాలను అదుపు చేయడం పోలీసుల వల్ల కావడం లేదు. స్కూలు విద్యార్థులు సైతం భారీ సంఖ్యలో హాజరయ్యారు. KING KOHLI IS AN EMOTION..!!!! 🐐- The Moments fan entered the ground and touched Virat Kohli's feet. 🥹❤️ pic.twitter.com/RsSgFKeK2t— Tanuj Singh (@ImTanujSingh) January 30, 2025మైదానంలోకి ప్రవేశించిన అభిమాని.. కోహ్లికి పాదాభివందనంకోహ్లి ఫీల్డింగ్ చేస్తుండగా ఓ అభిమాని స్టేడియంలోకి జోరబడ్డాడు. సెక్యూరిటీని తప్పించుకుని కోహ్లికి పాదాభివందనం చేశాడు. అనంతరం సెక్యూరిటీ అతన్ని అదుపులోకి తీసుకుని దండించే ప్రయత్నం చేసింది. అయితే కోహ్లి వారిని వారించి సదరు అభిమానిని వదిలి పెట్టాలని కోరాడు. SCHOOL KIDS COMING & CRAZY FOR VIRAT KOHLI AT ARUN JAITLEY STADIUM. 🔥 (Vipul Kashyap).pic.twitter.com/gYH6eGXoHU— Tanuj Singh (@ImTanujSingh) January 30, 2025ఈ మ్యాచ్‌లో కోహ్లిని చూసేందుకు ఢిల్లీ నుంచే కాక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అభిమానులు వచ్చారు. ఓ అభిమాని ఆంధ్ర నుంచి వచ్చి కోహ్లిని చూస్తూ తరించాడు. కోహ్లిని చూసేందుకు ఇంకా జనాలు వస్తున్నారు. అభిమానులను కంట్రోల్ చేయడం కోహ్లి వల్ల కాకపోవడంతో పారా మిలిటరీ రంగంలోకి దిగింది. గతంలో ఓ రంజీ మ్యాచ్ చూసేందుకు ఈ స్థాయిలో ప్రేక్షకులు ఎప్పుడూ రాలేదని వ్యాఖ్యాతలు అంటున్నారు. తొక్కిసలాట.. పలువురికి గాయాలుఓ దశలో స్టేడియంలోకి వచ్చేందుకు పెద్ద సంఖ్యలో జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది. పలువురు గాయాలపాలయ్యారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. పోలీసులు, పారా మిలిటరీ ఒక్కొక్కరిని స్టేడియంలోకి పంపిస్తున్నారు. ఎంట్రీ ఉచితం కావడంతోనే అభిమానులు ఈ స్థాయిలో పోటెత్తారని పోలీసులు అంటున్నారు. ఈ మ్యాచ్‌ను జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.Fan Frenzy Gets Out of Control! 🚨 Heavy rush at Arun Jaitley Stadium leaves supporters injured during Kohli’s return!Click here to view: https://t.co/OYRAcmpXHN pic.twitter.com/07mrfIxr6T— CricTracker (@Cricketracker) January 30, 2025మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బౌలింగ్ చేస్తున్న ఢిల్లీ.. రైల్వేస్‌పై పట్టు సాధించింది. ఢిల్లీ బౌలర్లు మనీ గ్రేవాల్ (8-1-14-2), సిద్దాంత్ శర్మ (6-1-25-2), నవ్‌దీప్ సైనీ (10-1-31-1) చెలరేగడంతో రైల్వేస్ 27 ఓవర్లలో 87 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు కోల్పోయింది. వికెట్‌కీపర్ ఉపేంద్ర యాదవ్ (27), కర్ణ్ శర్మ (2) క్రీజ్‌లో ఉన్నారు.Fans started gathering at Arun Jaitley stadium from 3 AM night to see Virat Kohli's Ranji Match. 🥶 (RevSportz).- King Kohli, The Biggest Crowd Puller in this Sports. 🐐pic.twitter.com/y9j2JuxfBU— Tanuj Singh (@ImTanujSingh) January 30, 2025ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోనూ అదిరిపోయే ట్రాక్ రికార్డుఅంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన ట్రాక్ రికార్డు కలిగిన విరాట్ కోహ్లికి ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ అదిరిపోయే రికార్డు ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఢిల్లీకు ప్రాతినిథ్యం వహించే విరాట్.. ఆ జట్టు తరఫున 40 ఇన్నింగ్స్‌లు ఆడి 52.66 సగటున 1843 పరుగులు చేశాడు. ఇందులో 6 శతకాలు, 6 అర్ద శతకాలు ఉన్నాయి. కోహ్లి చిన్న వయసులోనే జాతీయ జట్టులోకి ప్రవేశించడంతో ఫస్ట్‌క్లాస్ క్రికెట్ పెద్దగా ఆడలేకపోయాడు. -
హ్యాట్రిక్‌తో చెలరేగిన శార్ధూల్.. టీమిండియాలోకి రీ ఎంట్రీకి సిద్దం
రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో ముంబై స్టార్ ఆల్‌రౌండర్, టీమిండియా వెటరన్ శార్దూల్ ఠాకూర్(Shardul Thakur) తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా శరద్ పవార్ క్రికెట్ అకాడమీ వేదికగా మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్‌లో శార్ధూల్ హ్యాట్రిక్ వికెట్లతో మెరిశాడు.ముంబై బౌలింగ్ ఎటాక్‌ను ప్రారంభించిన శార్దూల్ తొలి ఓవర్లోనే మేఘాలయ ఓపెనర్ నిశాంత చక్రవర్తిని డకౌట్ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత మళ్లీ మూడో ఓవర్ వేసిన లార్డ్ శార్ధూల్.. బి అనిరుధ్, సుమిత్ కుమార్, జస్కిరత్లను వరుస బంతుల్లో ఔట్ చేశాడు.దీంతో తొలి ఫస్ట్‌క్లాస్ క్రికెట్ హ్యాట్రిక్‌ను ఠాకూర్ తన ఖాతాలో వేసుకున్నాడు. అతడి దెబ్బకు మేఘాలయ కేవలం 2 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మేఘాలయ కెప్టెన్ ఆకాష్ చౌదరి(14), ప్రింగ్సాంగ్ సంగ్మా(18) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 15 ఓవర్లకు మేఘాలయ 6 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది.కాగా ఈ మ్యాచ్ కంటే ముందు జమ్మూ అండ్ కాశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో శార్ధూల్ ఠాకూర్ సెంచరీతో మెరిశాడు. ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శార్ధూల్ వన్డే తరహాలో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రోహిత్ శర్మ,జైశ్వాల్,రహానే, శ్రేయస్ అయ్యర్ విఫలమైన చోట, ఠాకూర్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. శార్దూల్ 119 బంతుల్లో 17 ఫోర్ల సాయంతో 113 పరుగులు చేశాడు. అంతకుముందు మ్యాచ్‌లో కూడా హాఫ్ సెంచరీతో ఈ ముంబై క్రికెటర్ రాణించాడు.టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇస్తాడా?లార్డ్ ఠాకూర్ గత 14 నెలలగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఠాకూర్ చివరగా భారత్ తరుపున 2023లో సౌతాఫ్రికాపై టెస్టు మ్యాచ్‌లో ఆడాడు. ఆ తర్వాత పేలవ ఫామ్‌తో జట్టులో చోటు కోల్పోయాడు. అయితే శార్ధూల్ తన రిథమ్‌ను తిరిగి పొందాడు. దేశవాళీ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ ఏడాది ఇంగ్లండ్ పర్యటనతో శార్ధూల్ తిరిగి జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అతడికి టెస్టుల్లో ఇంగ్లండ్ గడ్డపై అద్బుతమైన రికార్డు ఉంది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌తో టెస్టులకు అతడిని ఎంపిక చేసే అవకాశమున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.చదవండి: SA 20: వారెవ్వా.. క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! వీడియో వైరల్ -
అందరి చూపు కోహ్లి వైపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్లో టన్నులకొద్దీ పరుగులు చేసిన భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి 2012 తర్వాత దేశవాళీ బాట పట్టాడు. రంజీ ట్రోఫీ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆడేందుకు కోహ్లి సిద్ధమయ్యాడు. ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా రైల్వేస్‌తో గురువారం నుంచి ప్రారంభం కానున్న పోరులో కోహ్లి ఢిల్లీ జట్టు తరఫున బరిలోకి దిగుతున్నాడు.గ్రూప్ దశలో ఆడిన 6 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క దాంట్లోనే గెలిచిన ఢిల్లీ జట్టుకు నాకౌట్ చేరే అవకాశాలు పెద్దగా లేకపోయినా... కోహ్లి బరిలోకి దిగుతుండటంతో ఫలితంతో సంబంధం లేకుండా ... తమ ఆరాధ్య ఆటగాడిని చూసేందుకు భారీగా అభిమానులు మైదానానికి తరలి రానున్నారు. గత ఆరో రౌండ్ మ్యాచ్‌ల్లో ఆడిన భారత క్రికెటర్లు రిషభ్ పంత్, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ తదితరులు ఆకట్టుకోలేకపోగా... ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు కోహ్లి భారీ ఇన్నింగ్స్ ఆడితే చూడాలని అభిమానులు ఆశ పడుతున్నారు. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు పూర్తి కాగా... ఢిల్లీ జట్టుకు ఆయుశ్ బదోనీ సారథ్యం వహిస్తున్నాడు. ‘ఐపీఎల్లో కోహ్లీకి ప్రత్యర్థిగా ఆడాను. ఇప్పుడు నా నాయకత్వంలో వరుస మ్యాచ్‌ల్లో పంత్, కోహ్లి లాంటి దిగ్గజాలు ఆడటం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. కోహ్లి నాలుగో స్థానంలోనే బ్యాటింగ్ చేస్తాడు. అనవసర ఒత్తిడికి లోను కాకుండా స్వేచ్ఛగా ఆడమని కోహ్లి మాకు సూచించాడు’ అని బదోనీ అన్నాడు. కేఎల్ రాహుల్ కఠోర సాధన చాన్నాళ్ల తర్వాత రంజీ బరిలోకి దిగనున్న భారత ఆటగాడు కేఎల్ రాహుల్ బుధవారం ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నాడు. ఎలైట్ గ్రూప్ ‘సి’లో భాగంగా నేటి నుంచి బెంగళూరులో హరియాణా జట్టుతో తలపడనున్న కర్ణాటక జట్టులో రాహుల్ బరిలోకి దిగనున్నాడు. నెట్ సెషన్లో తీవ్రంగా శ్రమించిన రాహుల్... స్పిన్, పేస్ అనే తేడా లేకుండా అందరి బౌలింగ్‌లోనూ సుదీర్ఘంగా ప్రాక్టీస్ చేశాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో స్థానం దక్కించుకున్న రాహుల్... ఈ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేసి తన జట్టును రంజీ ట్రోఫీలో నాకౌట్ దశకు చేర్చాలని భావిస్తున్నాడు. సిరాజ్ పాత బంతితో ప్రాక్టీస్ గత మ్యాచ్‌లో స్టార్ ఆటగాళ్లతో బరిలోకి దిగి కూడా జమ్మూ కశ్మీర్ జట్టు చేతిలో ఓటమి పాలైన ముంబై జట్టు... ఎలైట్ గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో మేఘాలయాతో పోరుకు సిద్ధమైంది. రికార్డు స్థాయిలో 42 సార్లు రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన ముంబై నాకౌట్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో బోనస్ పాయింట్ విజయం సాధించడంతో పాటు ... ఇతర మ్యాచ్‌ల ఫలితాలు కూడా అనుకూలించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నేపథ్యంలో రోహిత్, యశస్వి, శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నారు. మరి రహానే సారథ్యంలోని ముంబై టీమ్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా విదర్భతో జరగనున్న మ్యాచ్‌లో హైదరాబాద్ తరఫున మొహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగనున్నాడు. ఈ గ్రూప్ నుంచి విదర్భ ఇప్పటికే నాకౌట్ బెర్త్ దక్కించు కోగా... హైదరాబాద్‌కు అవకాశాలు లేవు. అయితే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన హైదరాబాదీ సిరాజ్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడనేది కీలకం. పాత బంతితో సిరాజ్ పెద్దగా ప్రభావం చూపలేకపోతుండటంతోనే అతడిని ఎంపిక చేయలేదని రోహిత్ ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో... ప్రాక్టీస్‌లో ఈ హైదరాబాదీ మెరుపు తగ్గిన బంతితో సాధన చేశాడు. గ్రూప్ ‘బి’లోనే ఉన్న ఆంధ్ర జట్టు విజయనగరం వేదికగా రాజస్తాన్‌తో ఆడనుంది. -
కోహ్లితో కళకళ... ఓ బుడ్డోడి ఆసక్తికర ప్రశ్న!
న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి 2012 తర్వాత దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ బరిలోకి దిగనున్నాడు. ఇటీవలి కాలంలో ఫామ్‌లేమితో పాటు షాట్ సెలెక్షన్ విషయంలో పదే పదే పొరబాట్లు చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లి... ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు రంజీ మ్యాచ్ ద్వారా ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి రైల్వేస్‌తో ప్రారంభం కానున్న రంజీ మ్యాచ్‌లో కోహ్లి ఢిల్లీ తరఫున ఆడనున్నాడు. చివరిసారిగా 2012లో ఉత్తరాఖండ్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో ఆడిన కోహ్లి... ఆ తర్వాత అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా దేశవాళీ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలంటే దేశవాళీల్లో ఆడాల్సిందే అని ఇటీవల భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్లేయర్లను హెచ్చరించడంతో స్టార్ ఆటగాళ్లు కూడా రంజీ బాటపట్టారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్ ఆరో రౌండ్ రంజీ మ్యాచ్‌ల్లో ఆడగా... రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ సీజన్ చివరి లీగ్ మ్యాచ్‌ల్లో కోహ్లితో పాటు కర్ణాటక తరఫున కేఎల్ రాహుల్, హైదరాబాద్ తరఫున మొహమ్మద్ సిరాజ్ కూడా ఆడుతున్నారు. మంగళవారం ఢిల్లీ జట్టుతో కలిసి కోహ్లి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. ఆద్యంతం ఉత్సాహంగా కనిపించిన కోహ్లి ... కోచ్‌లతో చర్చిస్తూ కుర్రాళ్లలో ఉత్సాహం నింపుతూ సందడి చేశాడు. కోహ్లి... ‘కడీ చావల్’ కెరీర్ ఆరంభంలో ఢిల్లీ జట్టు తరఫున ఎన్నో మ్యాచ్‌లు ఆడిన విరాట్... తిరిగి 13 ఏళ్ల తర్వాత ఆ డ్రెస్సింగ్‌రూమ్‌లో అడుగు పెట్టాడు. ప్రస్తుతం ఢిల్లీ జట్టులో ఉన్న నవ్‌దీప్ సైనీ మినహా మిగిలిన 17 మంది ప్లేయర్లు కేవలం టీవీల్లో మాత్రమే చూసిన స్టార్ ఆటగాడితో కలిసి ప్రాక్టీస్ చేశారు. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ‘చీకూ’గా మొదలైన విరాట్ కోహ్లి ప్రస్థానం... దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ‘కింగ్’ వరకు చేరింది. ఢిల్లీ హెడ్ కోచ్ శరణ్‌దీప్ సింగ్, బ్యాటింగ్ కోచ్ బంటూ సింగ్ పర్యవేక్షణలో విరాట్ ప్రాక్టీస్ సాగించాడు. భారత అండర్–19 జట్టుకు కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరించిన సమయంలో కోచ్‌గా పనిచేసి, ప్రస్తుత జట్టుకు మేనేజర్‌గా పనిచేస్తున్న మహేశ్ భాటీ విరాట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ‘అతడేం మారలేదు. అప్పుడెలా ఉన్నాడో ఇప్పుడూ అలాగే ఉన్నాడు. విరాట్‌కు ‘ఛోళే పూరీ’ బాగా ఇష్టమని అతడి కోసం అవి తెప్పించాం. కానీ ఇప్పుడు తినడంలేదని విరాట్ చెప్పాడు’ అని మహేశ్ పేర్కొన్నాడు. ప్రాక్టీస్ అనంతరం ప్లేయర్లతో కలిసి ‘కడీ చావల్’ (పప్పన్నం) తిన్నాడని వెల్లడించాడు. మొదట ఈ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించకపోయినా... విరాట్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని జియో సినిమా లైవ్‌కు సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది. కుర్రాళ్లతో కలిసి... ఉదయం తొమ్మిది గంటలకు ఖరీదైన పోర్షే కారులో మైదానానికి చేరుకున్న విరాట్... ఒక్కసారి ప్రాక్టీస్ ప్రారంభించాక నిత్యవిద్యార్థిలా శ్రమించాడు. తొలుత 35 నిమిషాల పాటు ప్లేయర్లతో కలిసి వార్మప్ చేసిన కోహ్లి... ఆ తర్వాత 15 నిమిషాల పాటు ఫుట్‌బాల్ ఆడాడు. ఆ తర్వాత నెట్ సెషన్ ప్రారంభమైంది. ఆ సమయంలో ఢిల్లీ రంజీ జట్టు కెప్టెన్ ఆయుశ్ బదోనీ వద్దకు వెళ్లిన కోహ్లి... ‘ఆయుశ్ నువ్వు ముందు బ్యాటింగ్ చేయి. ఆ తర్వాత మనిద్దరం స్థానాలు మార్చుకుందాం’ అని చెప్పాడు. స్టార్ ఆటగాళ్లు రంజీల్లో ఆడనున్న నేపథ్యంలో ఢిల్లీ క్రికెట్ బోర్డు రిషబ్ పంత్‌తో పాటు విరాట్ కోహ్లికి కెపె్టన్సీ చేపట్టాలని కోరగా... ఈ ఇద్దరూ దాన్ని సున్నితంగా తిరస్కరించారు. దీంతో ఐపీఎల్ మెరుపులతో వెలుగులోకి వచ్చిన ఆయుశ్ బదోనీ ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. నెట్స్‌లో గంటకు పైగా ప్రాక్టీస్ చేసిన విరాట్... త్రోడౌన్స్ వేయించుకొని పుల్ షాట్లు సాధన చేశాడు. పేసర్లు నవ్‌దీప్ సైనీ, రాహుల్ గెహ్లాట్, సిద్ధాంత్ శర్మ, మోనీ గ్రెవాల్, స్పిన్నర్లు హర్‡్ష త్యాగి, సుమిత్ మాథుర్‌ను సునాయాసంగా ఎదుర్కొన్న కోహ్లి బ్యాక్‌ఫుట్‌పై ఎక్కువ షాట్లు ఆడే ప్రయత్నం చేశాడు. అలాగే ఆఫ్ వికెట్ లైన్ బంతులను ఎక్కువగా వదిలేశాడు. కోహ్లికి కబీర్ ఆసక్తికర ప్రశ్న! మంగళవారం విరాట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గ్రౌండ్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కోహ్లి సాధన ముగించుకొని వెళ్తున్న సమయంలో నాలుగో తరగతి చదువుతున్న ఓ కుర్రాడు... ‘విరాట్ అంకుల్’ అంటూ పిలవడంతో అటు వైపు వెళ్లిన కోహ్లి అతడితో సుదీర్ఘంగా ముచ్చటించి కీలక సూచనలు చేశాడు. ఆ కుర్రాడి పేరు కబీర్ కాగా... అతడి తండ్రి ఒకప్పుడు విరాట్ కోహ్లీతో కలిసి ఢిల్లీ అండర్–17, అండర్–19 జట్లకు ఆడిన షావేజ్. భారత జట్టుకు ఆడాలంటే ఏం చేయాలని కబీర్ ప్రశ్నించగా... ‘కఠోర సాధన చేయాలి. ప్రాక్టీస్ ఎప్పుడూ వదిలేయొద్దు. మీ నాన్న నిన్ను ప్రాక్టీస్‌కు వెళ్లు అని చెప్పకూడదు. నువ్వే నాన్నా నేను గ్రౌండ్‌కు వెళ్తున్నా అని చెప్పాలి’ అని కోహ్లి సూచించాడు. -
విరాట్ కోహ్లి మంచి మనసు.. కెప్టెన్సీ రిజక్ట్ చేసిన కింగ్
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(Virat Kohli) రంజీ ట్రోఫీ పునరాగమానికి సమయం అసన్నమైంది. రంజీ ట్రోఫీ 2024-25లో భాగంగా అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా గురువారం నుంచి రైల్వేస్‌తో ప్రారంభం కానున్న మ్యాచ్‌లో ఢిల్లీ తరపున కోహ్లి బరిలోకి దిగనున్నాడు.2012లో చివరగా ఢిల్లీ తరపున ఆడిన విరాట్.. మళ్లీ ఇప్పుడు పుష్కరకాలం తర్వాత తన రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఇందుకోసం ఇప్పటికే జట్టుతో కలిసిన కింగ్ కోహ్లి తన ప్రాక్టీస్‌ను షురూ చేశాడు. న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్లో కోహ్లి తన సహాచరలతో కలిసి తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు.Virat Kohli is playing a circle football game with the Delhi Ranji team pic.twitter.com/94Q5n0lNKg— Virat Kohli Fan Club (@Trend_VKohli) January 28, 2025 ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. రైల్వేస్‌తో మ్యాచ్‌కు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) ప్రకటించిన జట్టులో కోహ్లికి చోటు దక్కింది. దీంతో అతడు రైల్వేస్‌తో మ్యాచ్‌లో ఆడడం ఖాయమైంది. అంతకుముందు జట్టుతో పాటు తను శిక్షణ పొందేందుకు సిద్దంగా ఉన్నానని ఢిల్లీ హెడ్‌కోచ్ శరణ్‌దీప్ సింగ్‌కు కోహ్లి తెలిపినట్లు డీడీసీఎ అధికారి చెప్పుకొచ్చారు. కోహ్లి మంచి మనసు..కాగా సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌కు ఢిల్లీ జట్టు కెప్టెన్‌గా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ వ్యవహరించాడు. అయితే ఇప్పుడు రైల్వేస్‌తో మ్యాచ్‌కు పంత్‌కు డీడీసీఎ సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లిని కెప్టెన్‌గా వ్యవహరించమని సెలక్టర్లు అడిగినట్లు తెలుస్తోంది.#RanjiTrophyVirat Kohli training at the Arun Jaitley Stadium ahead of Delhi’s Ranji match against Railways. 12 years since he last played. pic.twitter.com/pqAhLStTSA— Samreen Razzaqui (@SamreenRazz) January 28, 2025 కానీ కోహ్లి మాత్రం అందుకు తిరష్కరించి అయూష్ బదోనిని కెప్టెన్‌గా కొనసాగించమని సూచించినట్లు సమాచారం. దీంతో సెలక్టర్లు రైల్వేస్‌తో మ్యాచ్‌కు ఆయూష్ బదోనిని ఢిల్లీ సారధిగా ఎంపిక చేశారు. బదోని సారథ్యంలో కోహ్లి ఆడనున్నాడు.గత కొంత కాలంగా ఢిల్లీ జట్టు సారథిగా బదోనినే వ్యవహరిస్తున్నాడు. అయితే పంత్ రీఎంట్రీ ఇవ్వడంతో కెప్టెన్సీ నుంచి బదోనిని తప్పించారు. ఇప్పడు రైల్వేస్‌తో మ్యాచ్‌కు పంత్ దూరం కావడంతో మళ్లీ బదోని కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. కాగా కోహ్లి తీసుకున్న నిర్ణయంపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. జూనియర్లు గౌరమివ్వడంలో కింగ్ ఎప్పుడు ముందుంటాడని ఫ్యాన్స్ కొనియాడుతున్నాడు.రంజీల్లో అదుర్స్..కాగా రంజీ ట్రోఫీలో విరాట్ కోహ్లి మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 23 రంజీ మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 50.77 సగటుతో 1574 పరుగులు చేశాడు. అతడి ఫస్ట్‌క్లాస్ కెరీర్లో ఇప్పటివరకు 5 సెంచరీలు ఉన్నాయి. ఇక 12 ఏళ్ల తర్వాత కోహ్లి రంజీల్లో ఆడుతుండడంతో మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులను ఢిల్లీ క్రికెట్ అసోషియేషన్ ఉచితంగా అనుమతించనుంది.ఢిల్లీ జట్టు: ఆయుష్ బడోని (కెప్టెన్), విరాట్ కోహ్లి, సనత్ సాంగ్వాన్, అర్పిత్ రాణా, యశ్ ధుల్, జాంటీ సిద్ధు, హిమ్మత్ సింగ్, నవదీప్ సైనీ, మనీ గ్రేవాల్, హర్ష్ త్యాగి, సిద్ధాంత్ శర్మ, శివం శర్మ, ప్రణవ్ రాజ్‌వంశీ, వైభవ్ కంద్పాల్, మయాంక్ గుసైన్, గగన్ వాట్స్ , ఆయుష్ దోసెజా, సుమిత్ మాథుర్, రాహుల్ గహ్లోట్, జితేష్ సింగ్, వంశ్ బేడీ.చదవండి: Rohit Sharma: కొంపదీసి అందుకోసమేనా ఇదంతా?: గావస్కర్ -
Rohit Sharma: కొంపదీసి అందుకోసమేనా ఇదంతా?: గావస్కర్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)పై భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్(Sunil Gavaskar) విమర్శలు గుప్పించాడు. ఈ ఇద్దరు ఏదో మొక్కుబడిగా రంజీలు ఆడుతున్నారే తప్ప.. జట్టును గెలిపించాలనే తపన కనిపించలేదన్నాడు. టెక్నిక్‌తో బ్యాటింగ్ చేయాల్సిన చోట.. దూకుడు ప్రదర్శించి వికెట్లు పారేసుకోవడం సరికాదని హితవు పలికాడు.కాగా ఇటీవల భారత టెస్టు జట్టు ఘోర పరాభవాలు చవిచూసిన విషయం తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్‌తో 3-0తో వైట్‌వాష్ కావడం సహా.. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది.కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలంఈ రెండు సిరీస్‌లలో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా ఆసీస్ గడ్డపై కనీసం ఒక్క అర్ధ శతకం కూడా సాధించలేకపోయాడు. ఈ నేపథ్యంలో టెస్టు క్రికెట్‌కు ఇక రిటైర్మెంట్ ప్రకటించాలంటూ రోహిత్‌కు మాజీ క్రికెటర్ల నుంచి సూచనలు వచ్చాయి.అయితే, ఇప్పట్లో తాను టెస్టు క్రికెట్ నుంచి వైదొలగబోనని రోహిత్ శర్మ కుండబద్దలు కొట్టాడు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిబంధనల ప్రకారం.. రంజీ ట్రోఫీ బరిలో దిగాడు. సొంతజట్టు ముంబై తరఫున రంజీ రెండో దశ పోటీల్లో భాగంగా జమ్మూ కశ్మీర్‌తో మ్యాచ్ ఆడాడు.రంజీల్లోనూ నిరాశేకానీ.. ఇక్కడ కూడా రోహిత్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో మూడు.. రెండో ఇన్నింగ్స్‌లో 28 పరుగులు చేశాడు. మరో టీమిండియా స్టార్, ఇప్పటికే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన శ్రేయస్ అయ్యర్ కూడా ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు.రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 11, 17 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్ చేతిలో.. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఐదు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. నిజానికి ముంబై కాస్తైనా పరువు నిలబెట్టుకుందంటే అందుకు లోయర్ ఆర్డర్ బ్యాటర్లే కారణం.చెలరేగిన శార్దూల్, తనుశ్తొలి ఇన్నింగ్స్‌లో మెరుపు అర్థ శతకం(57 బంతుల్లో 51) బాదిన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్.. రెండో ఇన్నింగ్స్‌లో శతకం(119)తో సత్తా చాటాడు,. ఇక స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ తనుశ్ కొటియాన్ సైతం 26, 62 పరుగులు చేశాడు. ఇక శార్దూల్ ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు కూడా తీశాడు.ఈ నేపథ్యంలో ముంబై మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ల ఆట తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘‘ ఈ ఇద్దరూ తమ స్థాయికి తగ్గట్లు ఆడలేదు. అసలు ఆడాలన్న కసి కూడా వారిలో కనిపించలేదు.కొంపదీసి అందుకోసమేనా ఇదంతా?వీళ్లు నిజంగానే రంజీలు ఆడాలనుకున్నారా. లేదంటే.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు కోల్పోకూడదు, వాటిపై ప్రభావం పడకూడదన్న ఏకైక కారణంతోనే బరిలోకి దిగారా? అనిపించింది. మరోవైపు.. శార్దూల్.. తనూశ్.. రెడ్‌బాల్ క్రికెట్లో జాగ్రత్తగా ఆడుతూనే.. దూకుడుగా ఎలా ఉండాలో చూపించారు’’ అని గావస్కర్ పేర్కొన్నాడు.ఏదేమైనా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ వంటి టీమిండియా స్టార్లు ఈ టోర్నీలో ఆడటం వల్ల యువ ఆటగాళ్లలో కొత్త ఉత్సాహం నింపిందని గావస్కర్ అన్నాడు. వీరి నుంచి ఆయుశ్ మాత్రే వంటి వాళ్లు సలహాలు, సూచనలు తీసుకునేందుకు వీలు కలిగిందని పేర్కొన్నాడు.కాగా వరుస సెంచరీలతో జోరు మీదున్న ఆయుశ్ మాత్రే.. రోహిత్ శర్మ కోసం జట్టులో తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. మరోవైపు.. యశస్వి జైస్వాల్(4, 26) కూడా రోహిత్‌కు ఓపెనింగ్ జోడీగా దిగి.. ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు.చదవండి: Ab De Villiers: సౌతాఫ్రికా కెప్టెన్‌గా డివిలియర్స్.. టీ20 టోర్నీతో రీఎంట్రీ -
రంజీల్లో ‘స్టార్స్’ వార్!
ఆహా... ఎన్నాళ్లకెన్నాళ్లకు... మనస్టార్లు దేశవాళీ బాటపట్టారు. కింగ్ కోహ్లి ఢిల్లీ తరఫున ఆడితే... హైదరాబాద్‌కు సిరాజ్ పేస్ తోడైతే... కేఎల్ రాహుల్ కర్ణాటకకు జై కొడితే... జడేజా ఆల్‌రౌండ్ ఆటతో సౌరాష్టకు ఆడితే అవి రంజీ మ్యాచ్‌లేనా? రసవత్తర మ్యాచ్‌లు కావా? కచ్చితంగా అవుతాయి. తదుపరి రంజీ దశ పోటీలు తారలతో కొత్త శోభ సంతరించుకుంటున్నాయి. అభిమానులకు నాలుగు రోజులూ ఇక క్రికెట్ పండగే! చూస్తుంటే గంభీర్ సిఫార్సులతో రూపొందించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త మార్గదర్శకాలు ఎంతటి స్టార్లయినా దేశవాళీ కోసం తగ్గాల్సిందేనని నిరూపించబోతున్నాయి. న్యూఢిల్లీ: దేశవాళీ రంజీ ట్రోఫీలోని చివరి రౌండ్ మ్యాచ్‌లూ పసందుగా సాగనున్నాయి. అభిమాన క్రికెటర్లు నాలుగు రోజుల ఆటకు అందుబాటులోకి రావడమే దేశవాళీ క్రికెట్‌కు సరికొత్త పండగ తెస్తోంది. ఇదివరకు చెప్పినట్టుగానే విరాట్ కోహ్లి ఢిల్లీ ఆడే తదుపరి మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. ఢిల్లీ డి్రస్టిక్ట్స్ క్రికెట్ సంఘం (డీడీసీఏ) సోమవారం ఈ విషయాన్ని వెల్లడించడమే కాదు... రైల్వేస్ జట్టుతో ఈ నెల 30 నుంచి జరిగే పోరుకోసం ఢిల్లీ జట్టును ప్రకటించింది. అందులో కింగ్ కోహ్లి ఉండటమే విశేషం. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఫిబ్రవరి 2వ తేదీ వరకు అతను తన అభిమానులను దేశవాళీ మ్యాచ్ ద్వారా అలరించేందుకు సిద్ధమయ్యాడు. కేవలం మ్యాచ్ రోజుల్లోనే కాదు... ఢిల్లీ సహచరులతో పాటు కలిసి కసరత్తు చేసేందుకు అతను మంగళవారం జట్టుతో చేరతాడని ఢిల్లీ కోచ్ శరణ్‌దీప్ సింగ్ ధ్రువీకరించారు. కొన్నిరోజులుగా టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ (ప్రస్తుత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కోచ్)తో కలిసి బ్యాటింగ్‌లో శ్రమిస్తున్నాడు. ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇప్పుడు రంజీతో అతను రియల్‌గా బ్యాటింగ్ చేయనున్నాడు. ఇదే జరిగితే 2012 తర్వాత కోహ్లి రంజీ మ్యాచ్ ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో డీడీసీఏ తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. సెక్యూరిటీ సిబ్బందిని పెంచింది. ఢిల్లీ పోలీసులకు సమాచారమిచ్చింది. సౌరాష్ట్రతో ఢిల్లీ ఆడిన గత మ్యాచ్‌లో బరిలోకి దిగిన రిషభ్ పంత్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడం కాస్త వెలతే! కానీ ‘రన్ మెషిన్’ కోహ్లి శతక్కొట్టే ఇన్నింగ్స్ ఆడితే మాత్రం ఆ వెలతి తీరుతుంది. హైదరాబాద్ పేస్‌కా బాస్... సిరాజ్ జస్ప్రీత్ బుమ్రా, షమీలాంటి అనుభవజ్ఞులతో పాటు భారత జట్టు పేస్ దళానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న సిరాజ్ ఇప్పుడు హైదరాబాద్ బలం అయ్యాడు. గురువారం నుంచి నాగ్‌పూర్‌లో విదర్భ జట్టుతో జరిగే ఎలైట్ గ్రూప్ ‘బి’ మ్యాచ్ బరిలోకి దిగుతున్నాడు. నాగ్‌పూర్ ట్రాక్ పేస్‌కు అవకాశమిచ్చే వికెట్. ఈ నేపథ్యంలో హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ చెలరేగే అవకాశముంది. అతను నిప్పులు చెరిగితే సొంతగడ్డపై విదర్భకు కష్టాలు తప్పవు! సరిగ్గా ఐదేళ్ల క్రితం 2020లో చివరి రంజీ మ్యాచ్ కూడా విదర్భతోనే ఆడిన సిరాజ్... మళ్లీ ఆ ప్రత్యర్థితోనే దేశవాళీ ఆట ఆడబోతున్నాడు. జడేజా వరుసగా రెండో మ్యాచ్ ఎలైట్ గ్రూప్ ‘డి’లో ఉన్న సౌరాష్ట్ర తరఫున ఈ నెల 23 నుంచి ఢిల్లీతో జరిగిన మ్యాచ్ ఆడిన స్టార్, సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఈ సీజన్లో వరుసగా రెండో మ్యాచ్ ఆడేందుకు సై అంటున్నాడు. గత మ్యాచ్‌లో అతని ఆల్‌రౌండ్ ‘షో’ వల్లే నాలుగు రోజుల మ్యాచ్ కాస్త రెండే రోజుల్లో ముగిసింది. రెండు ఇన్నింగ్స్ (5/66, 7/38)ల్లో కలిపి 12 వికెట్లు తీసిన జడేజా తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో 38 పరుగులు కూడా చేశాడు. సౌరాష్ట్ర 10 వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది. గురువారం నుంచి అస్సామ్‌తో జరిగే పోరులో మళ్లీ జోరు కనబరచాలనే లక్ష్యంతో రంజీ బరిలోకి దిగుతున్నాడు. అస్సామ్ను హిట్టర్ రియాన్ పరాగ్ నడిపిస్తున్నాడు. భుజం గాయం నుంచి కోలుకున్న పరాగ్ ఐపీఎల్ ద్వారానే అందరికంటా పడ్డాడు. ఫిట్నెస్తో రాహుల్ రెడీ కర్ణాటక తరఫున ఎలైట్ గ్రూప్ ‘సి’లో పంజాబ్‌తో జరిగిన గత మ్యాచ్‌లోనే కేఎల్ రాహుల్ ఆడాలనుకున్నాడు. కానీ మోచేతి గాయం కారణంగా ఆ రంజీ పోరు ఆడలేకపోయిన స్టార్ ఓపెనర్ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్తో హరియాణా జట్టుతో ఢీకొనేందుకు రెడీ అయ్యాడు. రాహుల్ చివరి సారిగా 2020లో బెంగాల్‌తో జరిగిన రంజీ సెమీఫైనల్స్ మ్యాచ్ ఆడాడు. మళ్లీ ఐదేళ్ల తర్వాత సొంతరాష్ట్రం తరఫున దేశవాళీ మ్యాచ్ ఆడనున్నాడు. అతని చేరికతో కర్ణాటక బ్యాటింగ్ విభాగం మరింత పటిష్టం అయ్యింది. అంతేకాదు. దేవదత్ పడిక్కల్, సీమర్ ప్రసిధ్ కృష్ణలు కూడా ఆడుతుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ ముగ్గురు ఇటీవల ఆ్రస్టేలియాలో పర్యటించిన భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. రోహిత్, జైస్వాల్, అయ్యర్ గైర్హాజరు ఈ రంజీ ట్రోఫీలో ముంబై ఆడాల్సిన చివరి లీగ్ మ్యాచ్‌లోనూ భారత కెపె్టన్ రోహిత్ శర్మ సహా యువ సంచలనం యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్లు ఆసక్తి కనబరిచారు. ఈ త్రయం జమ్మూకశ్మీర్‌తో జరిగిన గత మ్యాచ్‌లో బరిలోకి దిగింది. అయితే ఇంగ్లండ్‌తో వచ్చే నెల 6, 9, 12 తేదీల్లో జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం వీరంతా భారత జట్టులో చేరాల్సివుండటంతో ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరిగే పోరుకు అందుబాటులో ఉండటం లేదని ముంబై వర్గాలు వెల్లడించాయి. -
ఢిల్లీ జట్టు ప్రకటన.. విరాట్ కోహ్లికి చోటు! పంత్ దూరం
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి 12 ఏళ్ల తర్వాత రంజీల్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. రంజీ ట్రోఫీ 2024-25లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జనవరి 30 ప్రారంభం కానున్న మ్యాచ్‌లో రైల్వేస్‌తో ఢిల్లీ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) తమ జట్టును ప్రకటించింది.ఈ జట్టులో విరాట్ కోహ్లి డీడీసీఎ సెలక్టర్లు చోటిచ్చారు. జనవరి 28న కోహ్లి జట్టుతో చేరుతాడని ఢిల్లీ హెడ్‌కోచ్ శరణ్‌దీప్ సింగ్ ఇప్పటికే ధ్రువీకరించారు. ఇప్పుడు ఢిల్లీ తమ జట్టును ప్రకటించడంతో కోహ్లి రీఎంట్రీ ఖాయమైంది. యువ ఆటగాడు అయూష్ బడోని సారథ్యంలో కింగ్ కోహ్లి ఆడనున్నాడు. కోహ్లి చివరగా రంజీల్లో 2012-13 సీజన్లో ఢిల్లీ తరపున ఆడాడు.ఆ సీజన్లో కోహ్లి కేవల ఒకే ఒక మ్యాచ్ ఆడి 57 పరుగులు చేశాడు. అయితే అంతకుముందు సీజన్లలో మాత్రం విరాట్ అద్బుతంగా రాణించాడు. ఇప్పటివరకు 23 రంజీ మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 50.77 సగటుతో 1574 పరుగులు చేశాడు. అతడి ఫస్ట్‌క్లాస్ కెరీర్లో ఇప్పటివరకు 5 సెంచరీలు ఉన్నాయి.అయితే కోహ్లి కేవలం 19 ఏళ్ల వయస్సులోనే జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడంతో ఎక్కువగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిచించలేదు. ఇక 12 ఏళ్ల తర్వాత కోహ్లి రంజీల్లో ఆడుతుండడంతో మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులను ఢిల్లీ క్రికెట్ అసోషియేషన్ ఉచితంగా అనుమతించనుంది.రిషబ్ పంత్ దూరం..ఇక రైల్వేస్‌తో మ్యాచ్‌కు ఢిల్లీ స్టార్, భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. సౌరాష్ట్రపై ఆడిన పంత్ ఈ మ్యాచ్‌కు మాత్రం దూరంగా ఉన్నాడు. ఇంగ్లండ్‌తో వన్డేల,ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన పంత్.. వైట్ బాల్ క్రికెట్‌పై దృష్టిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. అతడు వైట్‌బాల్‌తో ప్రాక్టీస్ చేయనున్నట్లు తెలుస్తోంది. తన రంజీ రీ ఎంట్రీ మ్యాచ్‌లో పంత్ నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులు చేసి ఔటయ్యాడు. ఢిల్లీ జట్టు: ఆయుష్ బడోని (కెప్టెన్), విరాట్ కోహ్లి, సనత్ సాంగ్వాన్, అర్పిత్ రాణా, యశ్ ధుల్, జాంటీ సిద్ధు, హిమ్మత్ సింగ్, నవదీప్ సైనీ, మనీ గ్రేవాల్, హర్ష్ త్యాగి, సిద్ధాంత్ శర్మ, శివం శర్మ, ప్రణవ్ రాజ్‌వంశీ, వైభవ్ కంద్పాల్, మయాంక్ గుసైన్, గగన్ వాట్స్ , ఆయుష్ దోసెజా, సుమిత్ మాథుర్, రాహుల్ గహ్లోట్, జితేష్ సింగ్, వంశ్ బేడీ.చదవండి: అప్పట్లో ఒకడుండేవాడు.. ఇప్పుడు తిలక్ వర్మ!: భారత మాజీ క్రికెటర్ -
12 ఏళ్ల తర్వాత రంజీల్లో ఆడనున్న కోహ్లి.. రేపే జట్టులోకి ఎంట్రీ?
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(Virat Kohli) దాదాపు 12 ఏళ్ల తర్వాత తిరిగి రంజీల్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. జనవరి 30 నుంచి అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రైల్వేస్‌తో ప్రారంభం కానున్న మ్యాచ్‌లో ఢిల్లీ తరపున కింగ్ కోహ్లి బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ జట్టు హెడ్ కోచ్ శరణ్‌దీప్ సింగ్ ధ్రువీకరించాడు. విరాట్ మంగళవారం(జనవరి 28) ఢిల్లీ జట్టులో చేరి, ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనున్నట్లు ఆయన తెలిపారు.రెడ్ బాల్ క్రికెట్లో కోహ్లి గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో విరాట్ కోహ్లి నిరాశపరిచాడు. తొలి టెస్టులో సెంచరీ మినహా మిగితా మ్యాచ్‌ల్లో కోహ్లి దారుణంగా విఫలమయ్యాడు. కోహ్లితో పాటు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ వంటి ప్లేయర్లు కూడా నిరాశపరిచాడు.ఈ క్రమంలో సీనియర్ ఆటగాళ్లు సైతం దేశవాళీ క్రికెట్లో ఆడాలని భారత క్రికెట్ బోర్డు ఆదేశాలను జారీ చేసింది. దీంతో అగ్రశ్రేణి ఆటగాళ్లు ఒక్కొక్కరుగా రంజీ బాటపడుతున్నారు. ప్రస్తుత రంజీ సీజన్లో ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజాలు తమ రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహించగా.. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ సైతం ఆడేందుకు సిద్దమయ్యారు. స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా హైదరాబాద్ తరపున ఆడనున్నట్లు తెలుస్తోంది.కాగా కోహ్లికి రంజీల్లో అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 23 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 50.77 సగటుతో 1574 పరుగులు చేశాడు. అతడి ఫస్ట్‌క్లాస్ కెరీర్లో ఇప్పటివరకు 5 సెంచరీలు ఉన్నాయి. అయితే కోహ్లి కేవలం 19 ఏళ్ల వయస్సులోనే జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడంతో ఎక్కువగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిచించలేదు. ఇక 12 ఏళ్ల తర్వాత కోహ్లి రంజీల్లో ఆడుతుండడంతో మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులను ఢిల్లీ క్రికెట్ అసోషియేషన్ ఉచితంగా అనుమతించనుంది. కోహ్లి చివరగా రంజీల్లో 2012-13 సీజన్లో ఢిల్లీ తరపున ఆడాడు.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో మూడో టీ20.. భారత జట్టులోకి ఇద్దరు స్టార్ ప్లేయర్లు? -
శతక్కొట్టిన కరణ్ షిండే.. తేలని ఫలితం
పుదుచ్చేరి: రంజీ ట్రోఫీ దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు వరుసగా మూడో ‘డ్రా’ నమోదు చేసింది. పుదుచ్చేరి జట్టుతో ఆదివారం ముగిసిన ఎలైట్ గ్రూప్ ‘బి’ ఆరో రౌండ్ లీగ్ మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించినందుకు ఆంధ్ర జట్టుకు మూడు పాయింట్లు లభించాయి. ఓవర్‌నైట్ స్కోరు 248/5తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు 82.4 ఓవర్లలో 6 వికెట్లకు 319 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.ఓవర్‌నైట్ స్కోరు 86 పరుగులతో బ్యాటింగ్ కొనసాగించిన కరణ్ షిండే (171 బంతుల్లో 119 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శశికాంత్ (39; 4 ఫోర్లు) తన ఓవర్‌నైట్ స్కోరు వద్దే అవుటయ్యాడు. ఆ తర్వాత త్రిపురాణ విజయ్ (15; 2 ఫోర్లు), పృథ్వీరాజ్ (14 బంతుల్లో 12 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) సహకారంతో కరణ్ శతకం సాధించాడు. ఆంధ్ర నిర్దేశించిన 363 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పుదుచ్చేరి 46 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 152 పరుగులు చేసింది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో రెండు జట్లు ఆటను ముగించాయి. ఇక పుదుచ్చేరి ఓపెనర్లు గంగా శ్రీధర్ రాజు (148 బంతుల్లో 75 నాటౌట్; 9 ఫోర్లు), జై పాండే (131 బంతుల్లో 59 నాటౌట్; 5 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీలు చేశారు. ఎనిమిది జట్లున్న గ్రూప్ ‘బి’లో ఆంధ్ర జట్టు 6 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయి, 3 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. 7 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ఈనెల 30 నుంచి విజయనగరంలో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో రాజస్తాన్‌తో ఆంధ్ర తలపడుతుంది. -
తనయ్, అనికేత్ మాయాజాలం
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే నాకౌట్ దశకు అర్హత సాధించే అవకాశం కోల్పోయిన హైదరాబాద్ జట్టు రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో రెండో విజయాన్ని అందుకుంది. హిమాచల్ ప్రదేశ్ జట్టుతో ఆదివారం ఉప్పల్ స్టేడియంలో ముగిసిన గ్రూప్ ‘బి’ ఆరో రౌండ్ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు ఇన్నింగ్స్ 43 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి 7 పాయింట్లు సంపాదించింది. చామా మిలింద్ సారథ్యంలో ఈ మ్యాచ్ ఆడిన హైదరాబాద్ జట్టుకు ఇద్దరు స్పిన్నర్లు తనయ్ త్యాగరాజన్, అనికేత్ రెడ్డి తమ ప్రదర్శనతో విజయాన్ని కట్టబెట్టారు. ఫాలోఆన్ ఆడుతూ ఆఖరి రోజు ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 21/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హిమాచల్ జట్టు వన్డే తరహాలో ఆడి 45.4 ఓవర్లలో 247 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. హైదరాబాద్ ఎడంచేతి వాటం స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ 118 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టగా... నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో ఎడంచేతి వాటం స్పిన్నర్ గంగం అనికేత్ రెడ్డి 46 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. హిమాచల్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో శుభం అరోరా (72 బంతుల్లో 66; 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా... అంకిత్ కాల్సి (39 బంతుల్లో 44; 6 ఫోర్లు), వైభవ్ అరోరా (22 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. మ్యాచ్ మొత్తంలో తొమ్మిది వికెట్ల తీసిన అనికేత్ రెడ్డికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఎనిమిది జట్లున్న గ్రూప్ ‘బి’లో హైదరాబాద్ ఆరు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. రెండు మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్ విజయాలు సాధించి... రెండు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని, రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి 16 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. నాగ్‌పూర్‌లో ఈనెల 30 నుంచి జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో విదర్భ జట్టుతో హైదరాబాద్ ఆడుతుంది. -
బరోడాను చిత్తు చేసిన రుతురాజ్ టీమ్.. ఏకంగా 439 పరుగులతో
రంజీ ట్రోఫీ 2024-25లో భాగంగా నాసిక్ వేదికగా బరోడాతో జరిగిన మ్యాచ్‌లో 439 పరుగుల తేడాతో మహారాష్ట్ర ఘన విజయం సాధించింది. 617 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బరోడా కేవలం 177 పరుగులకే కుప్పకూలింది. మహారాష్ట్ర బౌలర్లలో ముఖేష్ చౌదరి 5 వికెట్లు పడగొట్టగా.. రజనీష్ గుర్బానీ మూడు వికెట్లు, రామక్రిష్ణ రెండు వికెట్లు సాధించారు.బరోడా బ్యాటర్లలో అతి సేథ్(51) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా..జ్యోత్స్నిల్ సింగ్(40) పరుగులతో రాణించారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో బరోడా కెప్టెన్ కృనాల్ పాండ్యా(12, 6) తీవ్ర నిరాశపరిచాడు. కాగా మహారాష్ట్ర జట్టు 464/7 వద్ద తమ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. మహారాష్ట్ర బ్యాటర్లలో సౌరభ్ నవలే(126) సెంచరీతో మెరవగా..రామక్రిష్ణ(99), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(89) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అయితే మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 152 పరుగుల ఆధిక్యాన్ని జోడించి బరోడా ముందు 617 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది. ఈ భారీ లక్ష్యాన్ని బరోడా చేధించడంలో చతకలపడింది. కాగా మహారాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులకు ఆలౌట్ కాగా..బరోడా 145 పరుగులకే తమ మొదటి ఇన్నింగ్స్‌లో కుప్పకూలింది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ కెప్టెన్.. ప్రపంచంలో తొలి ప్లేయర్‌గా -
అనికేత్ అదుర్స్
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్ అనికేత్ రెడ్డి (5/72) సత్తా చాటాడు. ఫలితంగా ఓవర్‌నైట్ స్కోరు 33/1తో శనివారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హిమాచల్ ప్రదేశ్ జట్టు 92 ఓవర్లలో 275 పరుగులకు ఆలౌటైంది. ఇనేశ్ మహజన్ (79 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ అర్ధశతకం సాధించగా... శుభమ్ అరోరా (53; 7 ఫోర్లు) హాఫ్‌సెంచరీ చేశాడు.అంకిత్ (31), అపూర్వ్ వాలియా (37), ఆకాశ్ వశిష్ట్ (46) తలా కొన్ని పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ రెండు వికెట్లు తీయగా... నిశాంత్, వరుణ్ గౌడ్లకు చెరో వికెట్ దక్కింది. దీంతో హైదరాబాద్‌కు 290 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించడంతో ప్రత్యర్థిని ఫాలోఆన్‌కు ఆహ్వానించింది. శనివారం ఆట ముగిసే సమయానికి హిమాచల్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. శుభమ్ అరోరా (16 బ్యాటింగ్), ప్రశాంత్ చోప్రా (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. నేడు ఆటకు చివరి రోజు కాగా... చేతిలో 10 వికెట్లు ఉన్న హిమాచల్ జట్టు... హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 269 పరుగులు వెనుకబడి ఉంది. స్కోరు వివరాలు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 565; హిమాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్: శుభమ్ అరోరా (ఎల్బీ) (బి) అనికేత్ రెడ్డి 53; ప్రశాంత్ చోప్రా (సి) రాహుల్ రాధేశ్ (బి) నిశాంత్ 1; అంకిత్ (సి) తన్మయ్ అగర్వాల్ (బి) తనయ్ త్యాగరాజన్ 31; అపూర్వ్ వాలియా (స్టంప్డ్) రాహుల్ రాధేశ్ (బి) అనికేత్ రెడ్డి 37; ఆకాశ్ వశిస్ట్ (సి) మిలింద్ (బి) అనికేత్ రెడ్డి 46; రిషి ధవన్ (ఎల్బీ) తనయ్ త్యాగరాజన్ 22; ఇనేశ్ మహజన్ (నాటౌట్) 68; ముకుల్ నేగీ (సి) హిమతేజ (బి) అనికేత్ రెడ్డి 0; మయాంక్ డాగర్ (సి) రక్షణ్ రెడ్డి (బి) వరుణ్ గౌడ్ 0; వైభవ్ అరోరా (సి) రక్షణ్ రెడ్డి (బి) అనికేత్ రెడ్డి 3; దివేశ్ శర్మ (రనౌట్/హిమతేజ) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (92 ఓవర్లలో ఆలౌట్) 275. వికెట్ల పతనం: 1–11, 2–78, 3–111, 4–144, 5–188, 6–217, 7–217, 8–218, 9–267, 10–275, బౌలింగ్: నిశాంత్ 12–3–52–1; చామా మిలింద్ 13–1–32–0; తనయ్ త్యాగరాజన్ 24–4–62–2; అనికేత్ రెడ్డి 25–5–72–5; రక్షణ్ రెడ్డి 13–1–29–0; వరుణ్ గౌడ్ 5–0–16–1. హిమాచల్ ప్రదేశ్ రెండో ఇన్నింగ్స్: శుభమ్ అరోరా (బ్యాటింగ్) 16; ప్రశాంత్ చోప్రా (బ్యాటింగ్) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 21. బౌలింగ్: తనయ్ త్యాగరాజన్ 3–0–13–0; రక్షణ్ రెడ్డి 2–1–4–0. -
మెరిసిన పృథ్వీరాజ్
పుదుచ్చేరి: రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా పుదుచ్చేరితో జరుగుతున్న పోరులో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 209/5తో శనివారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పుదుచ్చేరి జట్టు 79 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఆంధ్ర జట్టుకు 43 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. పుదుచ్చేరి బ్యాటర్ అమాన్ ఖాన్ (50) అర్ధశతకం సాధించాడు. ఆంధ్ర బౌలర్లలో పృథ్వీరాజ్ 5 వికెట్లు పడగొట్టగా... విజయ్ రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. మొహమ్మద్ రఫీ, శశికాంత్, లలిత్ మోహన్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 69 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. కరణ్ షిండే (136 బంతుల్లో 86 బ్యాటింగ్; 9 ఫోర్లు; 1 సిక్స్) అజేయ అర్ధశతకంతో సత్తా చాటగా... శ్రీకర్ భరత్ (41; 7 ఫోర్లు), షేక్ రషీద్ (26; 3 ఫోర్లు), రికీ భుయ్ (32; 5 ఫోర్లు, 1 సిక్స్), శశికాంత్ (39 బ్యాటింగ్; 4 ఫోర్లు) రాణించారు. పుదుచ్చేరి బౌలర్లలో అంకిత్ శర్మ 2 వికెట్లు తీశాడు. నేడు ఆటకు చివరి రోజు కాగా... చేతిలో 5 వికెట్లు ఉన్న ఆంధ్ర జట్టు ఓవరాల్‌గా 291 పరుగుల ఆధిక్యంలో ఉంది. స్కోరు వివరాలు ఆంధ్ర తొలి ఇన్నింగ్స్: 303; పుదుచ్చేరి తొలి ఇన్నింగ్స్: శ్రీధర్ రాజు (సి) శ్రీకర్ భరత్ (బి) పృథ్వీరాజ్ 0; జయ్ పాండే (బి) పృథ్వీరాజ్ 3; పారస్ (సి) శ్రీకర్ భరత్ (బి) పృథ్వీరాజ్ 39; ఆకాశ్ (సి) శ్రీకర్ భరత్ (బి) శశికాంత్ 7; మోహిత్ కాలె (సి) రషీద్ (బి) పృథ్వీరాజ్ 60; అరుణ్ కార్తీక్ (సి) రికీ భుయ్ (బి) పృథ్వీరాజ్ 59; అమాన్ ఖాన్ (సి) రికీ భుయ్ (బి) లలిత్ మోహన్ 50; అంకిత్ శర్మ (సి) శ్రీకర్ భరత్ (బి) విజయ్ 13; సాగర్ (సి) రషీద్ (బి) విజయ్ 0; అబిన్ మాథ్యూ (నాటౌట్) 4; గౌరవ్ యాదవ్ (సి) అభిషేక్ రెడ్డి (బి) రఫీ 16; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (79 ఓవర్లలో ఆలౌట్) 260. వికెట్ల పతనం: 1–0, 2–9, 3–20, 4–84, 5–148, 6–225, 7–237, 8–238, 9–241, 10–260, బౌలింగ్: పృథ్వీరాజ్ 23–5–64–5; మొహమ్మద్ రఫీ17–1–53–1; శశికాంత్ 15–0–57–1; లలిత్ మోహన్ 16–2–42–1; విజయ్ 8–0–36–2. ఆంధ్ర రెండో ఇన్నింగ్స్: అభిషేక్ రెడ్డి (ఎల్బీ) (బి) గౌరవ్ యాదవ్ 15; శ్రీకర్ భరత్ (ఎల్బీ) (బి) అంకిత్ శర్మ 41; షేక్ రషీద్ (రనౌట్) 26; కరణ్ షిండే (బ్యాటింగ్) 86; రికీ భుయ్ (సి) (సబ్) సీజీడీ శాస్త్రి (బి) అమన్ ఖాన్ 32; హనుమ విహారి (సి) శ్రీధర్ రాజు (బి) అంకిత్ శర్మ 0; శశికాంత్ (బ్యాటింగ్) 39; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (69 ఓవర్లలో 5 వికెట్లకు) 248. వికెట్ల పతనం: 1–24, 2–81, 3–82, 4–141, 5–142, బౌలింగ్: గౌరవ్ యాదవ్ 10–1–49–1; అబిన్ మాథ్యూ 11–3–34–0; సాగర్ 21–3–72–0; అంకిత్ శర్మ 22–3–56–2; అమాన్ ఖాన్ 3–0–25–1; ఆకాశ్ 2–1–11–0. -
ముంబైను చిత్తు చేసిన జమ్మూ కాశ్మీర్.. అంతా రోహిత్ వల్లే?
రంజీ ట్రోఫీ 2024-25లో ముంబై జట్టుకు జమ్మూ అండ్ కాశ్మీర్ ఊహించని షాక్ ఇచ్చింది. శరద్ పవార్ క్రికెట్ స్టేడియం వేదికగా ముంబై జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో జమ్మూ కాశ్మీర్ ఘన విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని కాశ్మీర్ జట్టు 5 వికెట్లు కోల్పోయి చేధించింది.జమ్మూ బ్యాటర్లలో ఓపెనర్ శుభమ్ ఖజురియా(45) టాప్ స్కోరర్‌గా నిలవగా.. వివ్రంత్ శర్మ(38), అబిద్ ముస్తాక్(32 నాటౌట్) రాణించారు. ముంబై బౌలర్లలో షామ్స్ ములానీ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత సీజన్లో జమ్మూకు ఇది నాలుగో విజయం కావడం గమనార్హం.కాగా అంతకుముందు 274/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ముంబై తమ రెండో ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైంది. ముంబై బ్యాటర్లలో శార్ధూల్ ఠాకూర్(119) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. తనీష్ కొటియన్(62) రాణిండు. మిగితా బ్యాటర్లంతా నిరాశపరిచారు. కాగా జమ్మూ కాశ్మీర్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 206 పరుగులకు ఆలౌట్ కాగా.. ముంబై తమ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 120 పరుగులకే కుప్పకూలింది.నిరాశపరిచిన రోహిత్ శర్మ..ఇక పదేళ్ల తర్వాత తొలిసారి రంజీ మ్యాచ్ ఆడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) తీవ్ర నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో ముంబైకి ప్రాతినిథ్యం వహించిన రోహిత్.. రెండు ఇన్నింగ్స్‌లలోనూ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 19 బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులు మాత్రమే చేసిన రోహిత్.. రెండో ఇన్నింగ్స్‌లో 28 పరుగులు మాత్రమే చేయగలిగాడు.అతడితో పాటు యశస్వి జైశ్వాల్, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్ సైతం తమ మార్క్‌ను చూపించలేకపోయారు. కాగా రోహిత్ వల్లే ముంబై ఓటమి పాలైందని నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోలు చేస్తున్నారు. రోహిత్ శర్మ కోసం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అయూష్ మాత్రేను పక్కన పెట్టి ముంబై సెలక్టర్లు తప్పు చేశారని మాజీలు అభిప్రాయపడుతున్నారు.17 అయూష్ మాత్రం ప్రస్తుత సీజన్లో దుమ్ములేపుతున్నాడు. కేవలం 5 మ్యాచ్‌ల్లో 441 పరుగులు చేశాడు. అటువంటి ఆటగాడిని ఎలా పక్కన పెడతారని ముంబై జట్టు మెనెజ్మెంట్పై ప్రశ్నల వర్షం కురుస్తోంది.చదవండి: Punjab Vs Karnataka: శతకంతో చెలరేగిన శుబ్‌మన్ గిల్.. కానీ.. -
శతకంతో చెలరేగిన శుబ్‌మన్ గిల్.. కానీ..
టీమిండియా స్టార్ క్రికెటర్, పంజాబ్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. రంజీ మ్యాచ్‌లో శతకంతో చెలరేగి తనను తాను నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో గిల్ విఫలమైన సంగతి తెలిసిందే. వరుస వైఫల్యాలుగాయం కారణంగా పెర్త్‌లో జరిగిన తొలి టెస్టుకు దూరమైన ఈ పంజాబీ బ్యాటర్.. రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చినా పెద్దగా రాణించలేకపోయాడు. అడిలైడ్‌లో జరిగిన ఈ పింక్ బాల్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 59(31, 28) పరుగులు చేశాడు. అయితే, గబ్బాలో జరిగిన మూడో టెస్టులో గిల్ తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అయితే, నాలుగో టెస్టు జట్టులో మాత్రం అతడికి చోటు దక్కలేదు. దీంతో బాక్సింగ్ డే టెస్టుకు దూరమైన గిల్.. ఆ తర్వాత సిడ్నీ టెస్టు ఆడినా అందులోనూ విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 20, 13 పరుగులు సాధించాడు.రంజీ బరిలో పంజాబ్ సారథిగాకాగా కంగారూ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్‌లో ఓవరాల్‌గా 93 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ నేపథ్యంలో శుబ్‌మన్ గిల్ ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో బోర్డు నిబంధనలకు అనుగుణంగా రంజీ ట్రోఫీ బరిలో దిగాడు. తాజా ఎడిషన్ రెండో దశ పోటీల్లో భాగంగా కర్ణాటకతో మ్యాచ్ సందర్భంగా ఈ పంజాబ్ ఓపెనర్ రంగంలోకి దిగాడు.మొదటి ప్రయత్నంలో విఫలంఅయితే, మొదటి ప్రయత్నంలో గిల్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఎనిమిది బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేసి.. అవుటయ్యాడు. కర్ణాటక పేసర్ అభిలాష్ శెట్టి బౌలింగ్‌లో క్రిష్ణన్ శ్రీజిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. గిల్‌తో పాటు పంజాబ్ మిగతా బ్యాటర్లు కూడా దారుణంగా విఫలం కావడంతో తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే ఆలౌట్ అయింది.స్మరణ్ డబుల్ సెంచరీఈ క్రమంలో కర్ణాటక స్టార్ రవిచంద్రన్ స్మరణ్ (277 బంతుల్లో 203; 25 ఫోర్లు, 3 సిక్స్‌లు) డబుల్ సెంచరీతో విజృంభించగా.. జట్టు భారీ స్కోరు సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఏకంగా 475 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (20), దేవదత్ పడిక్కల్ (27) ఎక్కువసేపు నిలవలేకపోయిన చోట స్మరణ్ చక్కటి ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ స్కోరు అందించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకు ఆలౌటైన పంజాబ్... శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (1), అన్మోల్ప్రీత్ సింగ్ (14) అవుట్ అయ్యారు.గిల్ సూపర్ ఇన్నింగ్స్.. కానీఈ నేపథ్యంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న శుబ్‌మన్ గిల్ మూడో రోజు ఆటలో భాగంగా సెంచరీతో చెలరేగాడు. చిన్నస్వామి స్టేడియంలో శనివారం 159 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో పద్నాలుగు ఫోర్లు, మూడు సిక్స్‌లు ఉన్నాయి. గిల్ ఓవరాల్‌గా 171 బంతుల్లో 102 పరుగులు సాధించగా.. మిగతా వాళ్ల నుంచి మాత్రం సహకారం అందలేదు. ఈ క్రమంలో 213 పరుగులకు ఆలౌట్ అయిన పంజాబ్.. కర్ణాటక చేతిలో ఇన్నింగ్స్ 207 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది.చదవండి: అతడిని తప్పించి మంచి పనిచేశారు.. ఇదొక విన్నింగ్ టీమ్: డివిలియర్స్Shubman Gill gets his century.. a fine & confident innings #RanjiTrophy #KarvsPun pic.twitter.com/iA1gm6I1Ib— Manuja (@manujaveerappa) January 25, 2025Shubman Gill Celebration after One of best Hundred under pressure in Ranji trophy match against Karnataka 💥📹📷 @Sebashiyun pic.twitter.com/7IMnWegWSy— JassPreet (@JassPreet96) January 25, 2025 -
ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్.. కట్‌చేస్తే! సూపర్ సెంచరీ
శరద్ పవార్ క్రికెట్ అకాడమీ వేదికగా జమ్మూ-కాశ్మీర్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ముంబై తిరిగి కమ్‌బ్యాక్ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో ముంబై స్టార్ ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్ సెంచరీతో మెరిశాడు. ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శార్ధూల్ వన్డే తరహాలో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రోహిత్ శర్మ, జైశ్వాల్, శ్రేయస్ అయ్యర్, రహానే వంటి స్టార్ ప్లేయర్లు విఫలమైన చోట.. లార్డ్ శార్థూల్ విరోచిత పోరాటంతో తన జట్టును అదుకున్నాడు. శార్దూల్ 119 బంతుల్లో 17 ఫోర్ల సాయంతో 113 పరుగులు చేసి తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై తమ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. దీంతో 188 పరుగుల ఆధిక్యంలో ముంబై కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో శార్థూల్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ తనీష్ కొటియన్(58 నాటౌట్) ఉన్నారు.జమ్మూ బౌలర్లలో ఔకిబ్ నబీ దార్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఉమర్ నజీర్ మీర్, యుధ్వీర్ సింగ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా పదేళ్ల తర్వాత రంజీ ఆడుతున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్స్‌లలోనూ తీవ్రనిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 19 బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులు మాత్రమే చేసిన రోహిత్.. రెండో ఇన్నింగ్స్‌లో 28 పరుగులు మాత్రమే చేయగలిగాడు.అతడితోపాటు జైశ్వాల్(4, 26), రహానే(12, 16) విఫలమయ్యారు. మొదటి ఇన్నింగ్స్‌లో ముంబై 120 పరుగులకు ఆలౌట్ కాగా.. జమ్మూ అండ్ కాశ్మీర్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 206 పరుగులు చేసింది. ఇక శార్దూల్ తొలి ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీతో మెరిశాడు. లార్డ్ ఠాకూర్ గత 14 నెలలగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు.దేశవాళీ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నప్పటికి భారత జట్టులోకి పునరాగమనం చేయలేకపోతున్నాడు. ఈ ఏడాది ఇంగ్లండ్ పర్యటనతో శార్ధూల్ తిరిగి జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అతడికి టెస్టుల్లో ఇంగ్లండ్ గడ్డపై అద్బుతమైన రికార్డు ఉంది. ఈ క్రమంలోనే ఠాకూర్‌కు సెలక్లర్లు రీకాల్ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.చదవండి: భారత్‌తో రెండో టీ20: ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. అతడిపై వేటు -
12 వికెట్లతో చెలరేగిన జడేజా.. పంత్ టీమ్ చిత్తు
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) తన రంజీ పునరాగమనంలో సత్తాచాటాడు. రంజీ ట్రోఫీ 2024-25లో సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న జడేజా.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 12 వికెట్లతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టిన జడ్డూ.. రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లతో మెరిశాడు. అతడి స్పిన్ మయాజాలానికి ప్రత్యర్ధి బ్యాటర్లు విల్లవిల్లాడారు. అటు బ్యాటింగ్‌లోనూ జడేజా అదరగొట్టాడు. 38 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.ఢిల్లీని చిత్తు చేసిన సౌరాష్ట్ర..ఇక ఈ మ్యాచ్‌లో ఢిల్లీపై సౌరాష్ట్ర 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లో మాత్రమే ముగిసిపోయింది. ఢిల్లీ విధించిన 15 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌరాష్ట్ర జట్టు వికెట్ నష్టపోకుండా చేధించింది. ఓపెనర్లు హర్విక్ దేశాయ్(6), అర్పిత్ రానా(4) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు.కాగా అంతకముందు 163/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన సౌరాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 271 పరుగులకు ఆలౌటైంది. దీంతో సౌరాష్ట్రకు తొలి ఇన్నింగ్స్‌లో 83 పరుగుల ఆధిక్యం లభించింది. సౌరాష్ట్ర బ్యాటర్లలో హర్విక్ దేశాయ్(93) టాప్ స్కోరర్‌గా నిలవగా.. వాస్వాద(62), జడేజా(38) పరుగులతో రాణించారు.ఢిల్లీ బౌలర్లలో హర్ష్ త్యాగీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అయూష్ బదోని మూడు వికెట్లు సాధించాడు. అనంతరం 83 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఢిల్లీ కేవలం 94 పరుగులకే ఆలౌటైంది. దీంతో సౌరాష్ట్రముందు ఢిల్లీ కేవలం 15 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగల్గింది.ఢిల్లీ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ అయూష్ బదోని(44) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఢిల్లీ స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్(Rishabh Pant) రెండు ఇన్నింగ్స్‌లలో తీవ్రనిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులు చేసి ఔటయ్యాడు. సౌరాష్ట్ర బౌలర్లలో జడేజా(7 వికెట్లు)తో పాటు దర్మేంద్ర జడేజా రెండు వికెట్లు సాధించారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో ఢిల్లీ 188 పరుగులకు ఆలౌటైంది.ఇక 12 వికెట్లతో మెరిసిన రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: రోహిత్, కోహ్లి పరుగుల వరద పారించడం ఖాయం: ఇర్ఫాన్ పఠాన్ -
తుస్సుమన్న టీమిండియా స్టార్లు.. శ్రేయస్, శివమ్ దూబే కూడా..!
రంజీ ట్రోఫీ 2024-25 ఎడిషన్‌లో భాగంగా జమ్మూ అండ్ కశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో స్టార్ ప్యాకప్ ఉన్న ముంబై టీమ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 120 పరుగులకే ఆలౌటైన ఈ మాజీ రంజీ ఛాంపియన్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ పేలవ ప్రదర్శన కొనసాగిస్తుంది. రెండో రోజు లంచ్ విరామం సమయానికి ముంబై 86 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆ జట్టు జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను సమం చేసింది. జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో 206 పరుగులు చేసింది.రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమైన స్టార్లు జమ్మూ అండ్ కశ్మీర్‌తో మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన టీమిండియా స్టార్లు రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 26 పరుగులకు (5 ఫోర్లు) ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగులే బిచానా ఎత్తిన రోహిత్ శర్మ.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో కాస్త పర్వాలేదన్నట్టుగా 35 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ 2 సొగసైన బౌండరీలు, 3 భారీ సిక్సర్లు బాది తన పాత రోజులను గుర్తు చేశాడు.శ్రేయస్ మరోసారి..!ఈ మ్యాచ్‌లో టీమిండియా వన్డే ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌కు రెండు ఇన్నింగ్స్‌ల్లో శుభారంభాలే లభించాయి. అయితే వాటిని పెద్ద స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో తొలి బంతికే సిక్సర్ బాది జోష్ మీదున్నట్లు కనిపించిన శ్రేయస్ 7 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ అదే జోష్‌ను ప్రదర్శించిన శ్రేయస్.. వచ్చీ రాగానే ఎడాపెడా నాలుగు బౌండరీలు (16 బంతుల్లో 17 పరుగులు) బాది ఔటయ్యాడు.రెండో ఇన్నింగ్స్‌లోనూ డకౌటైన శివమ్ దూబేఈ మ్యాచ్‌లో విధ్వంసకర ఆటగాడు శివమ్ దూబే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌటై నిరాశపరిచాడు. శ్రేయస్, శివమ్ దూబేల వికెట్లు ఒకే స్కోర్ వద్ద కోల్పోవడంతో ముంబై కష్టాల్లో పడింది. లంచ్ సమయానికి రహానే (12), షమ్స్ ములానీ (0) క్రీజ్‌లో ఉన్నారు.ముంబై పరువు కాపాడిన శార్దూల్ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ముంబై పరువు కాపాడాడు. 100లోపే ఆలౌటైయ్యేలా కనిపించిన ముంబైను శార్దూల్ తన హాఫ్ సెంచరీతో గట్టెక్కించాడు. తొలి ఇన్నింగ్స్‌లో మొత్తం 57 బంతులు ఎదుర్కొన్న శార్దూల్ 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేశాడు. శార్దూల్‌కు తనుశ్ కోటియన్ (26, 5 ఫోర్లు) కాసేపు సహకరించడంతో ముంబై 100 పరుగుల మార్కును దాటింది. -
రోహిత్ బాటలోనే జైస్వాల్.. ఊరించి ఊసూరుమనిపించారు..!
చాలాకాలం తర్వాత రంజీల్లో ఆడుగుపెట్టిన టీమిండియా బ్యాటింగ్ స్టార్లు ఘోరంగా విఫలమయ్యారు. రంజీ ట్రోఫీ 2024-25 సెకెండ్ లెగ్ మ్యాచ్‌లు నిన్న ప్రారంభం కాగా.. తొలి రోజు భారత టెస్ట్ జట్టు సభ్యులు రోహిత్ (3), జైస్వాల్ (4), శుభ్‌మన్ గిల్ (4), రిషబ్ పంత్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే ఔటయ్యారు. భారత వన్డే జట్టు సభ్యుడు శ్రేయస్ అయ్యర్ (11), టీమిండియా భవిష్యత్తు తార రుతురాజ్ గైక్వాడ్ (10) స్వల్ప స్కోర్లకే నిష్క్రమించారు. గతంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన భారత క్లాసికల్ బ్యాటర్లు రహానే (12), పుజారా (6), హనుమ విహారి (6) కూడా పూర్తిగా తేలిపోయారు. విధ్వంసకర ఆటగాళ్లు రజత్ పాటిదార్ (0), శివమ్ దూబేకు (0) ఖాతా కూడా తెరవలేదు.టీమిండియా స్టార్ బ్యాటర్ల ప్రదర్శన సెకెండ్ ఇన్నింగ్స్‌లోనైనా మారుతుందని అభిమానులు ఆశగా ఎదురు చూశారు. అయితే వారి ఆశలు ఆదిలోనే అడియాశలయ్యాయి. రెండో రోజు ఆట ప్రారంభమైన కొద్ది నిమిషాలకే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, భారత స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఔటయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమైన వీరు సెకెండ్ ఇన్నింగ్స్‌లో గుడి కంటే మెల్ల మేలన్నట్టుగా రెండంకెల స్కోర్లు చేశారు.రోహిత్ 35 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 28 పరుగులు చేయగా.. జైస్వాల్ 51 బంతుల్లో 4 బౌండరీల సాయంతో 26 పరుగులు చేసి ఔటయ్యాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో రోహిత్ క్రీజ్‌లో ఉండింది కొద్ది సేపే అయినా బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇదొక్కటే టీమిండియా అభిమానులకు ఊరట కలిగించే విషయం.మ్యాచ్ విషయానికొస్తే.. జమ్మూ అండ్ కశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 120 పరుగులకు ఆలౌటైన ముంబై, సెకెండ్ ఇన్నింగ్స్‌లో కూడా అదే పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. రెండో రోజు తొలి సెషన్లో ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. ముంబై టాప్ త్రీ బ్యాటర్లు రోహిత్ (28), యశస్వి (26), హార్దిక్ తామోర్ (1) ఔట్ కాగా.. అజింక్య రహానే (1), శ్రేయస్ అయ్యర్ (4) క్రీజ్‌లో ఉన్నారు. ముంబై.. జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 25 పరుగులు వెనుకపడి ఉంది. జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో 206 పరుగులు చేసింది. శుభమ్ ఖజూరియా (53), అబిద్ ముస్తాక్ (44) ఓ మోస్తరుగా రాణించారు. -
Rohit Sharma: వింటేజ్ ‘హిట్‌మ్యాన్’ను గుర్తు చేసి.. మరోసారి..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) బ్యాటింగ్ వైఫల్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో విఫలమైన ఈ ముంబై రాజా.. రంజీ ట్రోఫీ(Ranji Trophy) మ్యాచ్‌లోనూ పూర్తిగా నిరాశపరిచాడు. జమ్మూ కశ్మీర్‌తో పోరు(Mumbai Vs Jammu Kashmir)లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి కనీసం ఒక్క అర్ధ శతకం కూడా సాధించలేకపోయాడు.ఫలితంగా అతడిపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ శర్మ ఇకనైనా టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి.. యువ క్రికెటర్లకు మార్గం సుగమం చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా ఫెయిల్‌కాగా ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రోహిత్ విఫలమయ్యాడు. దీంతో కనీవినీ ఎరుగని రీతిలో తొలిసారి సొంతగడ్డపై భారత్ 3-0తో ప్రత్యర్థి చేతుల్లో వైట్‌వాష్‌కు గురైంది.అనంతరం.. ఆస్ట్రేలియా గడ్డ మీద ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కూడా రోహిత్ చేతులెత్తేశాడు. ఫలితంగా 3-1తో ఓడిన భారత్.. పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియాకు కోల్పోయింది. ఇక గత పదకొండు ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ నమోదు చేసిన స్కోర్లు వరుసగా 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10, 3, 9.రంజీల్లోనైనా రాణిస్తాడనిఈ నేపథ్యంలో రిటైర్మెంట్ అంశం తెరమీదకు రాగా.. తాను ఇప్పట్లో తప్పుకొనే ప్రసక్తి లేదని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిబంధనలకు అనుగుణంగా ముంబై తరఫున రంజీ ట్రోఫీ తాజా ఎడిషన్ రెండో దశ పోటీల బరిలో దిగాడు.ఇందులో భాగంగా గురువారం జమ్మూ కశ్మీర్‌తో మొదలైన మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్‌తో కలిసి రోహిత్ ముంబై ఇన్నింగ్స్ ఆరంభించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 19 బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులే చేసి నిష్క్రమించాడు. కనీసం రెండో ఇన్నింగ్స్‌లోనైనా రాణిస్తాడనుకుంటే.. శుక్రవారం కూడా రోహిత్ అభిమానులను మెప్పించలేకపోయాడు.వింటేజ్ హిట్‌మ్యాన్‌ను గుర్తుచేసి.. మరోసారి విఫలమైఆరంభంలో దూకుడుగా ఆడుతూ సిక్స్‌లు, బౌండరీలు బాదిన రోహిత్ శర్మ.. వింటేజ్ హిట్‌మ్యాన్‌ను గుర్తు చేశాడు. అయితే, అదే జోరును కొనసాగించలేకపోయాడు. మొత్తంగా 35 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 28 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతడి ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.VINTAGE ROHIT SHARMA IS BACK....🔥#RohitSharma#RanjiTrophy#Ranjitropy #RohitSharmapic.twitter.com/NQ3T9m52cu— HitMan (@HitMan_4545) January 24, 2025 జైసూ, గిల్, పంత్ కూడా అంతేఇక తొలి ఇన్నింగ్స్‌లో ఉమర్ నజీర్ బౌలింగ్‌లో పోరస్ డోగ్రాకు క్యాచ్ ఇచ్చి అవుటైన రోహిత్.. తాజాగా యుధ్వీర్ సింఘ్ బౌలింగ్‌లో అబిద్ ముస్తాక్ చేతికి ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా గడ్డ మీద భారీ శతకం(161- పెర్త్) యశస్వి జైస్వాల్ కూడా రంజీ ట్రోఫీలో నిరాశపరిచాడు. జమ్మూ కశ్మీర్‌తో తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగులు చేసిన ఈ లెఫ్టాండర్.. రెండో ఇన్నింగ్స్‌లో 51 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్ల సాయంతో 26 పరుగులు మాత్రమే చేశాడు. వీరిద్దరి వైఫల్యం కారణంగా ముంబై జట్టు కష్టాల్లో కూరుకుపోయింది. మరోవైపు.. శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్ కూడా రంజీ పునరాగమనంలో వైఫల్యం చెందారు. కర్ణాటకతో మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్‌గా బరిలోకి దిగిన గిల్ నాలుగు పరుగులకే పరిమితమయ్యాడు. ఇక ఢిల్లీ క్రికెటర్ రిషభ్ పంత్ సౌరాష్ట్రతో మ్యాచ్‌లో ఒక్క పరుగుకే పెవిలియన్ చేరడం గమనార్హం. చదవండి: Ind vs Engఅతడొక సూపర్‌స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్ What a Lofted drive - rohit sharma #INDvENG #INDvsENG #ChampionsTrophy #RanjiTrophy#RohitSharma pic.twitter.com/igEGrpYc1n— kuldeep singh (@kuldeep0745) January 24, 2025 -
గంగూలీ రికార్డు బద్దలు కొట్టిన పదో తరగతి కుర్రాడు
రంజీ ట్రోఫీ 2024-25 సెకెండ్ లెగ్ మ్యాచ్‌లు నిన్నటి నుంచి (జనవరి 23) ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఆటలో రవీంద్ర జడేజా (ఐదు వికెట్లు) మినహా టీమిండియా ఆటగాళ్లంతా తేలిపోయారు. పలువురు దేశీయ ఆటగాళ్లు (గుజరాత్ బౌలర్ సిద్దార్థ్ దేశాయ్ తొమ్మిది వికెట్ల ప్రదర్శన) సత్తా చాటారు. నిన్న మొదలైన మ్యాచ్‌ల్లో పదో తరగతి చదువుతున్న ఓ కుర్రాడు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును బద్దలు కొట్టాడు.15 ఏళ్ల అంకిత్ ఛటర్జీ హర్యానాతో నిన్న మొదలైన మ్యాచ్‌లో బెంగాల్ తరఫున అరంగేట్రం చేపి, బెంగాల్ తరఫున రంజీ అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ పేరిట ఉండేది. గంగూలీ 17 ఏళ్ల వయసులో రంజీల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అంకిత్ ప్రస్తుతం పదో క్లాస్ చదువుతున్నాడు. క్లబ్ లెవెల్ క్రికెట్లో అద్భుత ప్రదర్శన అంకిత్‌కు రంజీ జట్టులో చోటు దక్కేలా చేసింది.నిన్న హర్యానాతో మొదలైన మ్యాచ్‌లో అంకిత్ 20 బంతులు ఎదుర్కొని బౌండరీ సాయంతో 5 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి అంకిత్ ప్రాతినిథ్యం వహిస్తున్న బెంగాల్ వికెట్ నష్టానికి 6 పరుగులు చేసింది. అంతకుముందు హర్యానా తొలి ఇన్నింగ్స్‌లో 157 పరుగులకే ఆలౌటైంది. బెంగాల్ యువ బౌలర్ సూరజ్ సింధు జైస్వాల్ ఆరు వికెట్లు తీసి హర్యానాను దెబ్బేశాడు. టీమిండియాకు ప్రాతినిథ్యం వహించే ముకేశ్ కుమార్, టీమిండియా పేసర్ మహ్మద్ షమీ తమ్ముడు మహ్మద్ కైఫ్ తలో రెండు వికెట్లు తీశారు. హర్యానా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ అంకిత్ కుమార్ (57) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అతి పిన్న వయస్కుడు వైభవ్ సూర్యవంశీఅంకిత్ ఛటర్జీ బెంగాల్ తరఫున రంజీ అరంగ్రేటం చేసిన అతి పిన్న వయస్కుడైతే.. ఓవరాల్‌గా రంజీల్లో అరంగేట్రం చేసిన అతి చిన్న వయస్కుడి రికార్డు వైభవ్ సూర్యవంశీ పేరిట ఉంది. వైభవ్ 12 ఏళ్ల వయసులో బీహార్ తరఫున రంజీ అరంగేట్రం చేశాడు. వైభవ్ ముంబైతో జరిగిన తన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. వైభవ్ భారత్ తరఫున అండర్ 19 లెవెల్లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగానూ రికార్డు నెలకొల్పాడు. వైభవ్.. యూత్ టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత్ ఆటగాడిగానూ రికార్డు కలిగి ఉన్నాడు. -
రోహిత్, జైస్వాల్, గిల్, పంత్ మాత్రమే కాదు.. రహానే, పుజారా కూడా..!
రంజీ ట్రోఫీలో ఇవాళ (జనవరి 23) టీమిండియా స్టార్ బ్యాటర్లకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. రోహిత్ శర్మ మొదలుకుని.. వెటరన్లు రహానే, పుజారా, హనుమ విహారి వరకు అంతా దారుణంగా విఫలమయ్యారు. ప్రస్తుత భారత టెస్ట్ జట్టు సభ్యులు రోహిత్ (3), జైస్వాల్ (4), శుభ్‌మన్ గిల్ (4), రిషబ్ పంత్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే ఔట్ కాగా.. భారత వన్డే జట్టు సభ్యుడు శ్రేయస్ అయ్యర్ (11), టీమిండియా భవిష్యత్తు తార రుతురాజ్ గైక్వాడ్ (10) స్వల్ప స్కోర్లకే నిష్క్రమించారు. గతంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన భారత క్లాసికల్ బ్యాటర్లు రహానే (12), పుజారా (6), హనుమ విహారి (6) కూడా తక్కువ స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. విధ్వంసకర ఆటగాళ్లు రజత్ పాటిదార్ (0), శివమ్ దూబేకు (0) కూడా ఇవాళ బ్యాడ్ డేనే.టీమిండియా ఆటగాళ్లలో ఇవాళ ఎవరైనా సత్తా చాటారా అంటే అది రవీంద్ర జడేజా మాత్రమే. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో జడ్డూ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. జమ్మూ అండ్ కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ (51) మెరుపు అర్ద సెంచరీ చేసి తన జట్టు (ముంబై) పరువు నిలబెట్టాడు.ఇవాల్టి నుంచి ప్రారంభంరంజీ ట్రోఫీ 2024-25లో ఇవాల్టి నుంచి (జనవరి 23) సెకెండ్ లెగ్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. తొలి రోజు టీమిండియా ఆటగాళ్లంతా దాదాపుగా తేలిపోయారు. రవీంద్ర జడేజా మినహాయించి చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ లేవు.రంజీ ట్రోఫీలో ఇవాల్టి హైలైట్స్- ఢిల్లీపై రవీంద్ర జడేజా (సౌరాష్ట్ర) ఐదు వికెట్ల ప్రదర్శన- ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 9 వికెట్లు పడగొట్టిన గుజరాత్ బౌలర్ సిద్దార్థ్ దేశాయ్- మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో ఒడిషా బౌలర్ తపస్ దాస్ 6 వికెట్ల ప్రదర్శన- ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన బీహార్ ఆటగాడు ఆయుష్ లోహారుకా (101)- జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్న చత్తీస్ఘడ్ ఆటగాడు అనుజ్ తివారి- ఇదే మ్యాచ్‌లో 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన జార్ఖండ్ బౌలర్ ఉత్కర్ష్ సింగ్- హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన బెంగాల్ బౌలర్ సూరజ్ సింధు జైస్వాల్- చండీఘడ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన తమిళనాడు ఆటగాడు ఆండ్రీ సిద్దార్థ్ (106)- ఇదే మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన చండీఘడ్ బౌలర్ విషు కశ్యప్ - మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన కేరళ బౌలర్ నిధీశ్- హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ శతకం బాదిన హైదరాబాద్ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (137)- పుదుచ్ఛేరిపై సెంచరీ చేసిన ఆంధ్ర ఓపెనర్ షేక్ రషీద్ (105)- విదర్భపై 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన రాజస్థాన్ బౌలర్ ఖలీల్ అహ్మద్ -
రోహిత్ శర్మనే బోల్తా కొట్టించాడు.. ఎవరీ ఉమర్ నజీర్?
టీమిండియా స్టార్ల రాకతో రంజీ ట్రోఫీ(Ranji Trophy)కి కొత్త కళ వస్తుందనుకుంటే... దాదాపుగా అందరూ ఉసూరుమనిపించారు. భారత టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant), శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా(Ravindra Jadeja), యశస్వి జైస్వాల్ గురువారం మొదలైన రంజీ రెండో దశ బరిలో దిగిన విషయం తెలిసిందే.తొలిరోజు జడ్డూ ఒక్కడే హిట్ముంబై తరఫున ఓపెనింగ్ చేసిన టీమిండియా ఓపెనర్ల జోడీ రోహిత్ శర్మ(3)- జైస్వాల్(4) పూర్తిగా విఫలమయ్యారు. మిగతా వాళ్లలో ఢిల్లీ స్టార్ రిషభ్ పంత్(1), పంజాబ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్(4) కూడా నిరాశపరిచారు. అయితే, సౌరాష్ట్ర స్పిన్నర్ రవీంద్ర జడేజా మాత్రం ఐదు వికెట్లతో చెలరేగాడు.ఆరడుగుల బుల్లెట్.. ఎవరీ ఉమర్ నజీర్?అయితే, ఈ అందరు స్టార్ల నడుమ ఈనాటి మ్యాచ్‌లో ఓ ఆరడుగుల బౌలర్ హైలైట్‌గా నిలిచాడు. అతడి పేరు ఉమర్ నజీర్ మీర్. జమ్మూ కశ్మీర్ ఫాస్ట్ బౌలర్. ముంబై బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఈ స్పీడ్‌స్టర్ రోహిత్ శర్మ వికెట్ తీయడం ద్వారా క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాడు.ముంబైలోని శరద్ పవార్ క్రికెట అకాడమీ బీకేసీ మైదానంలో ముంబై- జమ్మూ కశ్మీర్ మధ్య గురువారం మొదలైన రంజీ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు టాస్ గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగి కశ్మీర్ జట్టును బౌలింగ్‌కు ఆహ్వానించింది. అయితే, ఊహించని రీతిలో పట్టుమని పది పరుగులు కూడా చేయకుండానే ఓపెనర్లు వెనుదిరిగారు.రోహిత్‌నే బోల్తా కొట్టించాడుజైస్వాల్ను ఆకిబ్ నబీ అవుట్ చేస్తే.. రోహిత్ శర్మ ఉమర్ నజీర్ బౌలింగ్‌లో కెప్టెన్ పారస్ డోగ్రాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక టీమిండియా కెప్టెన్‌ను అవుట్ చేయడం ద్వారా వికెట్ల వేట మొదలుపెట్టిన నజీర్.. హార్దిక్ తామోర్(40 బంతుల్లో 7), ముంబై సారథి అజింక్య రహానే(12), ఆల్‌రౌండర్ శివం దూబే(0) రూపంలో మరో మూడు కీలక వికెట్లు కూల్చాడు.అలా మొత్తంగా నాలుగు వికెట్లు కూల్చి ముంబై బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని నజీర్ శాసించాడు. దీంతో అతడి వివరాలపై టీమిండియా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా సమీపంలో ఉన్న మాలిక్పొరాలో నజీర్ జన్మించాడు. అతడి ఎత్తు ఆరడుగుల నాలుగు అంగుళాలకు పైమాటే. అదే అతడికి సానుకూలాంశం అయింది.ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో భేష్‌ఈ పొడగరి స్పీడ్‌స్టర్ తనదైన బౌలింగ్ శైలితో దేశవాళీ క్రికెట్లో ఎంతో మంది బ్యాటర్లకు పీడకలలు మిగిల్చాడు. 31 ఏళ్ల ఈ రైటార్మ్ పేసర్‌కు.. టీమిండియాకు ఆడాలనేది చిరకాల కోరిక. అయితే, ఇంత వరకు నజీర్‌కు ఆ అవకాశం రాలేదు.అయితే, ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మాత్రం నజీర్ గణాంకాలు మెరుగ్గానే ఉన్నాయి. మొత్తంగా 57 మ్యాచ్‌లలో అతడు 138 వికెట్లు పడగొట్టాడు. గతేడాది రంజీ ట్రోఫీ సందర్భంగా సర్వీసెస్ జట్టుపై అత్యుత్తమంగా 6/53తో రాణించాడు. తాజా రంజీ ఎడిషన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న నజీర్... గత మూడు మ్యాచ్‌లలో కలిపి పదకొండు వికెట్లు తీశాడు. అతడి ఎకానమీ రేటు 2.64గా నమోదు కావడం గమనార్హం.కుప్పకూలిన ముంబై టాప్, మిడిల్ ఆర్డర్ఇక మ్యాచ్ విషయానికొస్తే.. జైస్వాల్(4), రోహిత్ శర్మ(3), హార్దిక్ తామోర్(7), అజింక్య రహానే(12), శ్రేయస్ అయ్యర్(11), శివం దూబే(0), షామ్స్ ములానీ(0) వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో ముంబై కష్టాల్లో కూరుకుపోయింది.బ్యాట్ ఝులిపించిన శార్దూల్అయితే, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ బ్యాట్ ఝులిపించడంతో కాస్త ఊపిరి పీల్చుకుంది. 57 బంతుల్లో శార్దూల్ ఏకంగా 51 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా తనూష్ కొటియాన్(26) రాణించాడు. వీరిద్దరి కారణంగా ముంబై గౌరవప్రదమైన స్కోరు చేసింది. 33.2 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌట్ అయింది.జమ్మూ కశ్మీర్ బౌలర్లలో ఉమర్ నజీర్, యుధ్వీర్ సింగ్ నాలుగేసి వికెట్లు కూల్చగా... ఆకిబ్ నబీ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక గురువారం నాటి తొలిరోజు ఆట ముగిసే సరికి జమ్మూ కశ్మీర్ 42 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 174 పరుగులు చేసింది. ముంబై కంటే 54 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. చదవండి: అతడొక సూపర్‌స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్ -
రంజీ బాట పట్టిన మరో టీమిండియా స్టార్ ప్లేయర్
టీమిండియా స్టార్ ప్లేయర్లంతా ఒక్కొక్కరుగా రంజీ బాట పడుతున్నారు. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ (ముంబై), యశస్వి జైస్వాల్ (ముంబై), శుభ్‌మన్ గిల్ (పంజాబ్), రిషబ్ పంత్ (ఢిల్లీ), రవీంద్ర జడేజా (సౌరాష్ట్ర), శ్రేయస్ అయ్యర్ (ముంబై) తమతమ జట్ల తరఫున బరిలోకి దిగారు. జనవరి 30న ప్రారంభమయ్యే మ్యాచ్‌లో టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లి (ఢిల్లీ) కూడా బరిలోకి దిగుతానని ప్రకటించాడు. తాజాగా మరో స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ కూడా జనవరి 30న ప్రారంభమయ్యే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటానని వెల్లడించాడు. రాహుల్ కర్ణాటక తరఫున బరిలోకి దిగుతాడు. కర్ణాటక జట్టుకు మయాంక్ అగర్వాల్ సారథ్యం వహిస్తాడు. ఈనెల 30న ప్రారంభమయ్యే మ్యాచ్‌లో కర్ణాటక.. హర్యానాను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ కర్ణాటక హోం గ్రౌండ్ అయిన చిన్న స్వామి స్టేడియంలో జరుగుతుంది.కాగా, రాహుల్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడిన తన సహచరులు రోహిత్, యశస్వి, గిల్, పంత్, జడేజాలతో పాటు రంజీ బరిలో దిగాల్సి ఉండింది. అయితే మోచేతి గాయం కారణంగా అతను ఇవాళ (జనవరి 23) ప్రారంభమైన మ్యాచ్‌కు దూరమయ్యాడు. విరాట్ కోహ్లి సైతం గాయం కారణంగానే ఇవాళ మొదలైన మ్యాచ్‌కు అందుబాటులో లేడు.ఇదిలా ఉంటే, ఖాళీగా ఉన్న టీమిండియా ఆటగాళ్లంతా రంజీల్లో తప్పకుండా ఆడాలని బీసీసీఐ కండీషన్ పెట్టిన విషయం తెలిసిందే. రంజీల్లో ఆడటం తప్పనిసరి చేసిన నేపథ్యంలో గత్యంతరం లేక భారత ఆటగాళ్లంతా ఒక్కొక్కరుగా రంజీ బాట పడుతున్నారు. టీమిండియా స్టార్లంతా విఫలం.. ఒక్క జడేజా తప్ప..!రంజీ బరిలోకి దిగిన టీమిండియా స్టార్లంతా దారుణంగా విఫలమయ్యారు. వేర్వేరు జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. రంజీ బరిలోకి దిగిన టీమిండియా స్టార్ ఆటగాళ్లలో ఒక్క రవీంద్ర జడేజా మాత్రమే సత్తా చాటాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో జడ్డూ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.రంజీల మాట అటుంచితే, ప్రస్తుతం భారత టీ20 జట్టు ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌లో భాగంగా నిన్న (జనవరి 22) జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి 132 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ జోస్ బట్లర్ (68) ఒక్కడే రాణించాడు. భారత బౌలర్లు వరుణ్ చక్రవర్తి (4-0-23-3), అర్షదీప్ సింగ్ (4-0-17-2), అక్షర్ పటేల్ (4-1-22-2), హార్దిక్ పాండ్యా (4-0-42-2) అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పట్టారు.స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు ఓపెనర్లు సంజూ శాంసన్ (26), అభిషేక్ శర్మ (34 బంతుల్లో 79; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించారు. అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగి 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (0) నిరాశపరిచినా తిలక్ వర్మ (19), హార్దిక్ పాండ్యా (3) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. కేవలం 12.5 ఓవర్లలోనే (3 వికెట్లు) భారత్ గెలుపు తీరాలు తాకింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2, ఆదిల్ రషీద్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లో తదుపరి టీ20 జనవరి 25న చెన్నై వేదికగా జరుగనుంది. -
ఘోరంగా విఫలమైన రోహిత్, యశస్వి, గిల్, పంత్.. ఐదు వికెట్లతో సత్తా చాటిన జడేజా
రంజీ ట్రోఫీ 2024-25 సెకెండ్ లెగ్ మ్యాచ్‌లు ఇవాల్టి నుంచి (జనవరి 23) ప్రారంభమయ్యాయి. ఖాళీగా ఉన్న టీమిండియా ఆటగాళ్లంతా రంజీల్లో తప్పక ఆడాలని బీసీసీఐ కండీషన్ పెట్టిన నేపథ్యంలో హేమాహేమీలంతా బరిలోకి దిగారు. ముంబై తరఫున రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్.. పంజాబ్ తరఫున శుభ్‌మన్ గిల్.. ఢిల్లీ తరఫున రిషబ్ పంత్.. సౌరాష్ట్ర తరఫున రవీంద్ర జడేజా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.తేలిపోయిన పంత్.. ఐదేసిన జడేజాఎలైట్ గ్రూప్ డిలో భాగంగా ఇవాళ ఢిల్లీ, సౌరాష్ట్ర జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 188 పరుగులకే ఆలౌటైంది. ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన టీమిండియా స్టార్ రిషబ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. పంత్ 10 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఆయుశ్ బదోని (60), యశ్ ధుల్ (44), మయాంక్ గుసెయిన్ (38 నాటౌట్) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడటంతో ఢిల్లీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఢిల్లీ బ్యాటింగ్ లైనప్‌ను టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కకావికలం చేశాడు. జడ్డూ 17.4 ఓవర్లలో 66 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. జడేజాకు మరో జడేజా (ధర్మేంద్రసిన్హ్) తోడయ్యాడు. ఈ జడేజా 19 ఓవర్లలో 63 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్, యువరాజ్ సింగ్ దోడియా తలో వికెట్ దక్కించుకున్నారు. ఢిల్లీ ఇన్నింగ్స్ చివరి రెండు బంతులకు వికెట్లు తీసిన రవీంద్ర జడేజాకు సెకెండ్ ఇన్నింగ్స్‌లో హ్యాట్రిక్ తీసే అవకాశం ఉంటుంది. 36 ఏళ్ల జడ్డూకు ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఇది 35వ ఐదు వికెట్ల ఘనత.పేలవ ఫామ్‌ను కొనసాగించిన రోహిత్.. నిరాశపరిచిన జైస్వాల్, శ్రేయస్, దూబేఎలైట్ గ్రూప్-ఏలో భాగంగా రోహిత్ శర్మ, జైస్వాల్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై.. జమ్మూ అండ్ కశ్మీర్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబై.. జమ్మూ అండ్ కశ్మీర్ బౌలర్ల ధాటికి విలవిలలాడిపోయింది. ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 33.2 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన రంజీల్లోనూ కొనసాగింది. హిట్‌మ్యాన్ కేవలం 3 పరుగులకే వెనుదిరిగాడు. మరో టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్ 4 పరుగులకే ఔటయ్యాడు. టీమిండియా పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌లు శ్రేయస్ అయ్యర్ (11), శివమ్ దూబే (0) నిరాశపరిచారు. ముంబై కెప్టెన్, టీమిండియా ఆటగాడు అజింక్య రహానే (12) కూడా తేలిపోయాడు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న ముంబైను మరో టీమిండియా ఆటగాడు శార్దూల్ ఠాకూర్ (51) గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. శార్దూల్ హాఫ్ సెంచరీ పుణ్యమా అని ముంబై 100 పరుగుల మార్కును దాటగలిగింది. శార్దూల్‌కు తనుశ్ కోటియన్ (26) కాసేపు సహకరించాడు. జమ్మూ అండ్ కశ్మీర్ బౌలర్లు యుద్వీర్ సింగ్ చరక్ (8.2-2-31-4), ఉమర్ నజీర్ మిర్ (11-2-41-4), ఆకిబ్ నబీ దార్ (13-3-36-2) స్టార్లతో నిండిన ముంబై బ్యాటింగ్ లైనప్‌కు బెంబేలెత్తించారు.తీరు మార్చుకోని గిల్గిల్ వైఫల్యాల పరంపర రంజీల్లోనూ కొనసాగుతుంది. బీజీటీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయిన గిల్.. కర్ణాటకతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 55 పరుగులకే కుప్పకూలింది. కర్ణాటక బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పంజాబ్ ఇన్నింగ్స్‌ను మట్టుబెట్టారు. వి కౌశిక్ 4, అభిలాశ్ షెట్టి 3, ప్రసిద్ద్ కృష్ణ 2, యశోవర్దన్ పరంతాప్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ సారధిగా వ్యవహరిస్తున్న గిల్ కేవలం 4 పరుగులకే ఔటయ్యాడు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో రమన్‌దీప్‌సింగ్ (16), మార్కండే (12) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. -
పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ.. కట్ చేస్తే! 3 పరుగులకే ఔట్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. పదేళ్ల తర్వాత రంజీట్రోఫీలో ముంబై తరపున ఆడుతున్న రోహిత్ శర్మ.. అక్కడ కూడా తీవ్ర నిరాశపరిచాడు. శరద్ పవార్ క్రికెట్ అకాడమీ వేదికగా జమ్మూ కాశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ ఆరంభం నుంచే జమ్మూ బౌలర్లను ఎదుర్కొవడానికి ఇబ్బంది పడ్డాడు. ఆఖరికి 19 బంతులు ఆడి పేసర్ ఉమార్ నజీర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అతడితో పాటు మరో స్టార్ ప్లేయర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) సైతం విఫలమయ్యాడు. జైశ్వాల్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అకిబ్ నబీబ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై కేవలం 41 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రోహిత్, జైశ్వాల్‌తో పాటు కెప్టెన్ అజింక్య రహానే,హార్దిక్ తోమార్, శివమ్ దూబే వంటి స్టార్ ప్లేయర్లు పెవిలియన్‌కు చేరారు. జమ్మూ బౌలర్ ఉమార్ నజీర్ నాలుగు వికెట్లు పడగొట్టి ముంబైని దెబ్బతీశాడు.తీరు మారని రోహిత్..కాగా రోహిత్ శర్మ రెడ్‌బాల్ ఫార్మాట్లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. మొత్తం 5 ఇన్నింగ్స్‌లలో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు.అంతకముందు న్యూజిలాండ్ సిరీస్‌లోనూ హిట్‌మ్యాన్ అదే తీరును కనబరిచాడు. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో తన రిథమ్‌ను తిరిగి పొందేందుకు రంజీల్లో ఆడాలని రోహిత్ నిర్ణయించుకున్నాడు. కానీ అక్కడ కూడా తన మార్క్‌ను చూపించలేకపోయాడు. కనీసం సెకెండ్ ఇన్నింగ్స్‌లోనైనా హిట్‌మ్యాన్ తన బ్యాట్‌కు పనిచెబుతాడో లేదో చూడాలి.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అభిషేక్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా Rohit Sharma out for 3 in 19 😶Embarrass!ng #RohitSharmapic.twitter.com/UIoY5tCj6Z— Veena Jain (@DrJain21) January 23, 2025 -
Shubman Gill: అక్కడే కాదు.. ఇక్కడా ఫెయిల్!.. సింగిల్ డిజిట్ స్కోర్
దేశవాళీ క్రికెట్ పునరాగమనంలో టీమిండియా స్టార్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) పూర్తిగా నిరాశపరిచాడు. పంజాబ్(Punjab) తరఫున బరిలోకి దిగిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. కాగా గత కొంతకాలంగా భారత ప్రధాన ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శుబ్‌మన్ గిల్ తదితరులు టెస్టుల్లో విఫలమవుతున్న విషయం తెలిసిందే.తారలు దిగి వచ్చారుఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనపుడు ప్రతి ఒక్కరు దేశవాళీ క్రికెట్ ఆడాలన్న నిబంధనలు కఠినతరం చేసింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ముంబై తరఫున.. రిషభ్ పంత్ ఢిల్లీ తరఫున.. శుబ్‌మన్ గిల్ పంజాబ్ తరఫున రంజీ ట్రోఫీ(Ranji Trophy) సెకండ్ లెగ్ బరిలో దిగారు. కోహ్లి మాత్రం మెడనొప్పి వల్ల ఢిల్లీ జట్టుకు దూరంగా ఉన్నాడుపంజాబ్ ఓపెనర్‌గా గిల్ విఫలంఇక బెంగళూరు వేదికగా కర్ణాటక- పంజాబ్ మధ్య గురువారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన కర్ణాటక.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ప్రభ్‌సిమ్రన్ సింగ్‌తో కలిసి శుబ్‌మన్ గిల్ పంజాబ్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే, కర్ణాటక బౌలర్ అభిలాష్ శెట్టి వరుస ఓవర్లలో ఓపెనింగ్ జోడీని విడగొట్టాడు. ఈ లెఫ్టార్మ్ పేసర్ బౌలింగ్‌లో తొలి వికెట్‌గా గిల్ వెనుదిరిగాడు.కర్ణాటక పేసర్ల జోరుమొత్తంగా ఎనిమిది బంతులు ఎదుర్కొన్న గిల్.. ఒకే ఒక్క ఫోర్ కొట్టి నిష్క్రమించాడు. క్రిష్ణన్ శ్రీజిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరోవైపు.. ప్రభ్‌సిమ్రన్ సింగ్ 28 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో ఆరు పరుగులు చేసి.. అభిలాష్ శెట్టి బౌలింగ్‌లో అనీశ్ కేవీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇక మరో పేసర్ వాసుకి కౌశిక్ కూడాపంజాబ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.వన్‌డౌన్ బ్యాటర్ బ్యాటర్ ఫుఖ్రాజ్ మన్(1)తో పాటు.. నాలుగో స్థానంలో వచ్చిన అన్మోల్ప్రీత్ సింగ్(0)ను సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేర్చాడు. ఈ క్రమంలో ఆరంభంలోనే నాలుగు వికెట్లు కోల్పోయిన 10 ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే చేసి.. కష్టాల్లో కూరుకుపోయింది.బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో గిల్ ఫ్లాఫ్ షోకాగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో శుబ్‌మన్ గిల్ విఫలమైన విషయం తెలిసిందే. గాయం వల్ల తొలి టెస్టుకు దూరమైన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చాడు. అడిలైడ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో గిల్ రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 31, 28 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.అయితే, గబ్బా మైదానంలో జరిగిన మూడో టెస్టులో మాత్రం ఒక్క పరుగుకే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో మెల్బోర్న్ బాక్సింగ్ డే టెస్టుకు దూరంగా ఉన్న ఈ వన్‌డౌన్ బ్యాటర్.. ఆఖరిదైన సిడ్నీ టెస్టులో 20, 13 పరుగులు చేశాడు. మొత్తంగా ఆస్ట్రేలియాతో ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో శుబ్‌మన్ గిల్ కేవలం 93 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్- జైస్వాల్ కూడా ఫెయిల్ఇందులో ఒక్క అర్ధ శతకం కూడా లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో రంజీ బరిలో దిగి ఫామ్‌లోకి రావాలని ఆశించిన గిల్‌కు మొదటి ప్రయత్నంలోనే చుక్కెదురైంది. కర్ణాటకతో మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లోనైనా అతడు రాణిస్తాడేమో చూడాలి! మరోవైపు.. జమ్మూ- కశ్మీర్‌తో మ్యాచ్‌లో ముంబై ఓపెనర్లు యశస్వి జైస్వాల్- రోహిత్ శర్మ కూడా ఫెయిలయ్యారు. జైస్వాల్ నాలుగు, రోహిత్ మూడు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యారు. చదవండి: NADA: బుమ్రా, సూర్య, పంత్, సంజూ శాంసన్.. ఇంకా.. -
దేశవాళీ టోర్నీకి దిగ్గజాల కళ
ముంబై: దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో చాలా కాలం తర్వాత భారత స్టార్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలంటే... అందుబాటులో ఉన్న సమయంలో దేశవాళీ మ్యాచ్‌లు ఆడాల్సిందేనని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసిన నేపథ్యంలో స్టార్ ఆటగాళ్లు రంజీ బాట పట్టారు. నేటి నుంచి దేశవ్యాప్తంగా రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌లు ప్రారంభం కానుండగా... భారత టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్ వంటి స్టార్ ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు విరాట్ కోహ్లి అందుబాటులో ఉండనని ముందే వెల్లడించగా... ఢిల్లీ జట్టు ఆడే తదుపరి మ్యాచ్‌లో అతడు కూడా పాల్గొననున్నాడు. రోహిత్ శర్మ 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ బరిలో దిగనున్నాడు. ఇప్పటికే స్టార్లతో నిండి ఉన్న డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ రాకతో మరింత పటిష్టంగా మారింది. ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా జమ్మూ కశీ్మర్‌తో అజింక్య రహానే సారథ్యంలోని ముంబై జట్టు తలపడుతుంది. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 42 సార్లు రంజీ ట్రోఫీ కైవసం చేసుకున్న ముంబై జట్టు తాజా సీజన్లో 5 మ్యాచ్‌లాడి 3 విజయాలు, ఒక పరాజయం, ఒక ‘డ్రా’తో 22 పాయింట్లు ఖాతాలో వేసుకొని గ్రూప్‌లో మూడో స్థానంలో ఉంది. బరోడా (27 పాయింట్లు), జమ్మూ కశ్మీర్ (23 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. లీగ్ దశలో మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ముంబై జట్టు మెరుగైన ప్రదర్శన కనబర్చాలని చూస్తోంది. రోహిత్ రాకతో జట్టు మరింత బలోపేతమైందని ముంబై కెపె్టన్ రహానే పేర్కొన్నాడు. ‘రోహిత్ అంటే రోహితే. అతడికి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. అతడితో కలిసి ముంబై డ్రెస్సింగ్ రూమ్‌ను మరోసారి పంచుకోనుండటం ఆనందంగా ఉంది. రోహిత్ చాలా ప్రశాంతంగా ఉంటాడు. అంతర్జాతీయ స్థాయిలో అది ఎన్నోసార్లు చూశాం. ఎప్పుడు ఎలా ఆడాలో అతడికి బాగా తెలుసు. ఒక్కసారి లయ అందుకుంటే అతడిని ఆపడం కష్టం. ప్రతి ఆటగాడికి క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. వాటిని అధిగమించి పరుగుల కోసం తపించడం ముఖ్యం. యశస్వి జైస్వాల్ గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. జాతీయ జట్టు తరఫునే కాకుండా ముంబై తరఫున కూడా అతడు మెరుగైన ప్రదర్శన చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో అనుభవం ఉన్న వారి సాన్నిహిత్యంలో ముంబై ఆటగాళ్లు ఎంతో నేర్చుకుంటారు’ అని రహానే అన్నాడు. ఆ్రస్టేలియా పర్యటనలో పేలవ ఫామ్‌తో నిరాశ పరిచిన రోహిత్ శర్మ... ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు రంజీ ట్రోఫీ ద్వారా తిరిగి లయ అందుకుంటాడా చూడాలి. పంత్ X జడేజా రాజ్‌కోట్ వేదికగా జరగనున్న గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో సౌరాష్ట్ర జట్టుతో ఢిల్లీ టీమ్ ఆడుతుంది. సౌరాష్ట్ర తరఫున టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బరిలోకి దిగుతుండగా... రిషభ్ పంత్ ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చతేశ్వర్ పుజారా, జైదేవ్ ఉనాద్కట్‌లతో సౌరాష్ట్ర జట్టు బలంగా కనిపిస్తోంది. ఢిల్లీ జట్టులో ఆయుశ్ బదోనీ, యశ్ ధుల్ వంటి యువ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. క్వార్టర్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి కావడంతో హోరాహోరీ పోరు సాగడం ఖాయమే. చాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ పంజాబ్ జట్టు తరఫున రంజీ ట్రోఫీ ఆడనుండగా... కర్ణాటక జట్టుకు దేవదత్ పడిక్కల్, ప్రసిధ్ కృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల విజయ్ హజారే వన్డే టోర్నీలో సెంచరీల మీద సెంచరీలు బాదిన విదర్భ ప్లేయర్ కరుణ్ నాయర్‌పై అందరి దృష్టి నిలవనుంది. హిమాచల్‌తో హైదరాబాద్ పోరు ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా హైదరాబాద్ వేదికగా గురువారం నుంచి ప్రారంభం కానున్న మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్‌తో హైదరాబాద్ రంజీ జట్టు తలపడనుంది. మరోవైపు పుదుచ్చేరితో ఆంధ్ర జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ జాతీయ విధుల్లో ఉండగా... స్టార్ పేసర్ సిరాజ్ పనిభారం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. తాజా సీజన్లో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లాడిన హైదరాబాద్ జట్టు ఒక విజయం, 2 పరాజయాలు, 2 ‘డ్రా’లతో 9 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఆరో స్థానంలో ఉండగా... ఆంధ్ర జట్టు ఐదు మ్యాచ్‌ల్లో 3 పరాజయాలు, 2 ‘డ్రా’లతో 4 పాయింట్లు సాధించి ఏడో స్థానంలో కొనసాగుతోంది. -
రోహిత్‌కు అంతా తెలుసు.. రిలాక్స్డ్గా ఉంటాడు: రహానే
పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. భారత్ క్రికెట్ జట్టులోని హేమాహేమీలైన స్టార్ క్రికెటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ల పరిస్థితి చూస్తే ఈ విషయం అందరికీ అర్థమవుతుంది. గత కొంత కాలం వరకు భారత్ క్రికెట్‌ను శాసించిన ఈ ఇద్దరూ ప్రస్తుతం పేలవమైన ఫామ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనతో పాటు.. అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ జట్టు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చెప్పటింది. ఆటగాళ్లందరికీ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో భాగంగా భారత్ జట్టులోని క్రికెటర్లు అందరూ దేశవాళీ పోటీల్లో తప్పనిసరిగా ఆడాలి. ఏదైనా అత్యవసర పరిస్థితులు కారణంగా దేశవాళీ పోటీల్లో ఆడలేనప్పుడు బీసీసీఐ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. రోహిత్ దశాబ్దం తర్వాతగురువారం రంజీ ట్రోఫీ టోర్నమెంట్ రెండో దశ ప్రారంభమైనప్పుడు ఒక అరుదైన సంఘటన జరగనుంది. అంతర్జాతీయ పోటీల్లో ఎప్పుడూ బిజీగా ఉండే స్టార్ క్రికెటలందరు తమ రాష్ట్ర జట్ల తరఫున రంజీ ట్రోఫీ పోటీల్లో ఆడనున్నారు. ఇందులో రోహిత్ శర్మ, వైస్-కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్, అజయ్ జడేజా, హైదరాబాద్ పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ వంటి టాప్ స్టార్లు ఉండటం విశేషం.కెప్టెన్ రోహిత్ శర్మ అయితే దాదాపు ఒక దశాబ్దం తర్వాత రంజీ ట్రోఫీ పోటీల్లో ఛాంపియన్స్ ముంబై తరఫున ఆడనున్నాడు. రోహిత్ మాజీ భారత్ ఆటగాడు అజింక్య రహానే నాయకత్వంలో ముంబై తరపున బరిలో దిగనున్నాడు. జమ్మూ కాశ్మీర్ తో జరగనున్న మ్యాచ్ లో రోహిత్ భారత్ జట్టు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో కలిసి ముంబై బ్యాటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. ఎలైట్ గ్రూ-‘ఎ’ లో ముంబై 22 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్ 23 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. అయితే ఫిట్ నెస్ లేని కారణంగా విరాట్ కోహ్లీ ఈ రంజీ ట్రోఫీ పోటీల్లో ఆడకుండా బీసీసీఐ నుంచి మినహాయింపు పొందాడు. మెడ నొప్పి తో బాధపడుతున్న కోహ్లీ కోలుకోవడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చు.రహానే కితాబురోహిత్ మళ్ళీ జట్టులోకి రావడం ఆనందం కలిగిస్తోందని రహానే కితాబిచ్చాడు. "రోహిత్ తన ఫామ్ ని తిరిగి సాధించాలని ధృడ నిశ్చయంతో ఉన్నాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. నిన్న నెట్ ప్రాక్టీస్ లో రోహిత్ చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. ఫామ్ అనేది ఆటగాడి కెరీర్లో భాగం. రోహిత్ పై నాకు అపార నమ్మకముంది. రోహిత్ ఎప్పుడూ రిలాక్స్‌గా ఉంటాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నప్పుడు కూడా అతని వైఖరి అలాగే ఉంటుంది. అతనికి తన ఆట గురించి బాగా తెలుసు కాబట్టి, అతను ఏమి చేయాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు," అని రహానే కితాబిచ్చాడు. కాగా రాజ్‌కోట్‌లో జరగనున్న మరో మ్యాచ్ లో ఢిల్లీ రెండుసార్లు విజేతలైన సౌరాష్ట్రతో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ తన భారత సహచరులు రవీంద్ర జడేజా, మరియు చతేశ్వర్ పుజారాతో తలపడతాడు.ఆస్ట్రేలియా కూడా పాఠాలు నేర్చుకోవాలిఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ 1-3 తేడాతో ఓటమి చవిచూసిన నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ ఇయాన్ హీలీ బీసీసీఐ కొత్త విధానాన్ని సమర్థించాడు. పది పాయింట్ల మార్గదర్శకాలను అమలు చేయడంపై మాట్లాడుతూ.. జట్టులో పెరుగుతున్నసూపర్స్టార్ సంస్కృతిని అరికట్టడానికి ఈ కొత్త నిబంధనలు ఉపయోగపడతాయని వ్యాఖ్యానించాడు. భారత క్రికెటర్లలో క్రమశిక్షణ లేకుండా పోయింది.‘‘నిజానికి ఈ సమస్య చాలా కాలంగా ఉంది. ఇప్పుడు ఇది ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంది. బీసీసీఐ అధికారులు తీసుకున్న చర్యలు జట్టు క్రమశిక్షణను కాపాడుకోవడానికి దోహదం చేస్తుందని భావిస్తున్నాను. అయితే దీని నుంచి ఆస్ట్రేలియా, ఇతర ప్రధాన జట్లు కూడా పాఠం నేర్చుకోవాలి" అని హీలి అన్నాడు. చదవండి: జైస్వాల్‌కు చోటు.. తర్వాతి తరం ‘ఫ్యాబ్ ఫోర్’ వీరే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు -
విరాట్ కోహ్లి కీలక ప్రకటన
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కీలక ప్రకటన చేశాడు. ఈ నెల 30 నుంచి రైల్వేస్‌తో జరిగే రంజీ మ్యాచ్‌లో ఆడతానని స్పష్టం చేశాడు. విరాట్ దేశవాలీ క్రికెట్లో ఢిల్లీ తరఫున ఆడతాడు. విరాట్ రంజీల్లో ఆడటం 12 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. విరాట్ ఈ నెల 23న సౌరాష్ట్రతో జరుగబోయే మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. మెడ నొప్పి కారణంగా విరాట్ సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్‌లో ఆడటం లేదు. ఈ మ్యాచ్ కోసం ఎంపిక చేసిన ఢిల్లీ జట్టులో మరో టీమిండియా స్టార్ రిషబ్ పంత్ ఉన్నాడు.సౌరాష్ట్ర తరఫున టీమిండియా వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బరిలోకి దిగనున్నాడు. ఈ నెల 23 నుంచి జరిగే రంజీ మ్యాచ్‌ల్లో చాలా మంది భారత స్టార్ క్రికెటర్లు బరిలోకి దిగనున్నారు. ముంబై తరఫున రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్.. పంజాబ్ తరఫున శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగనున్నారు. టెస్ట్‌ల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతుల్లో ఘోర పరాజయాలు ఎదుర్కొన్న నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు తప్పక రంజీల్లో ఆడాలని బీసీసీఐ అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత ఆటగాళ్లంతా రంజీ బాట పట్టారు.రేపటి నుంచి (జనవరి 22) టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. విరాట్ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సిరీస్‌కు ఎంపిక కాలేదు. విరాట్‌తో పాటు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ టీమిండియా సారథిగా వ్యవహరిస్తాడు. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) హార్దిక్ పాండ్యాను కాదని అక్షర్ పటేల్‌ను ఎంపిక చేశారు.ఈ సిరీస్‌కు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా లాంటి కీలక ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చారు. ఇదే సిరీస్‌తో స్టార్ పేసర్ మహ్మద్ షమీ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ జనవరి 22న కోల్‌కతా వేదికగా జరుగనుంది. అనంతరం జనవరి 25 (చెన్నై), 28 (రాజ్‌కోట్), 31 (పూణే), ఫిబ్రవరి 2వ (ముంబై) తేదీల్లో మిగతా నాలుగు టీ20లు జరుగనున్నాయి.టీ20 సిరీస్ అనంతరం భారత్, ఇంగ్లండ్ జట్లు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తలపడతాయి. ఈ సిరీస్ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా ఉండనుంది. వన్డే సిరీస్‌లోని తొలి మ్యాచ్ ఫిబ్రవరి 6న నాగ్‌పూర్‌లో జరుగనుండగా.. ఫిబ్రవరి 9, 12 తేదీల్లో రెండు, మూడు మ్యాచ్‌లు కటక్, అహ్మదాబాద్ వేదికలుగా జరుగనున్నాయి.ఇంగ్లండ్‌తో టీ20ల కోసం ఎంపిక చేసిన భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్‌కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్)ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, హర్షిత్ రానాఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (విసి), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి -
ముంబై జట్టు ప్రకటన.. రోహిత్ శర్మకు చోటు! కెప్టెన్ ఎవరంటే?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) రంజీ ట్రోఫీ 2024-25లో ఆడేందుకు సిద్దమయ్యాడు. ఈ టోర్నీ సెకెండ్ రౌండ్లో భాగంగా జమ్మూ కాశ్మీర్‌తో జరగనున్న మ్యాచ్ కోసం 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ముంబై క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో రోహిత్ శర్మకు చోటు దక్కింది. 2015లో చివరిసారి రంజీలో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హిట్‌మ్యాన్.. మళ్లీ పదేళ్ల తర్వాత ఈ ప్రాతిష్టత్మక టోర్నీలో ఆడనున్నాడు.రెడ్ బాల్ ఫార్మాట్లో రోహిత్ శర్మ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో హిట్‌మ్యాన్ దారుణంగా నిరాశపరిచాడు. అంతకముందు న్యూజిలాండ్ సిరీస్‌లోనూ అదే తీరును కనబరిచాడు. ఈ క్రమంలో రోహిత్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలని పలువురు క్రికెటర్లు డిమాండ్ చేశారు. దీంతో రోహిత్ తన పూర్వ వైభావాన్ని ఎలాగైనా పొందాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే రంజీల్లో ఆడాలని నిశ్చయించుకున్నాడు. అంతేకాకుండా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలంటే.. సీనియర్ ఆటగాళ్లు సైతం దేశీవాళీ క్రికెట్లో ఆడాలని భారత క్రికెట్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకునే రోహిత్ రంజీ ట్రోఫీలో బరిలోకి దిగేందుకు సిద్దమయ్యాడు. ఇక జట్టులో విధ్వంసకర ఓపెనర్ యశస్వీ జైశ్వాల్‌ను కూడా ముంబై సెలక్టర్లు చేర్చారు. ఈ జట్టుకు వెటరన్ ఆటగాడు అజింక్య రహానే సారథ్యం వహించాడు. ఈ మ్యాచ్ జనవరి 23 నుంచి ముంబై వేదికగా ప్రారంభం కానుంది.పదేళ్ల తర్వాత..రోహిత్ శర్మ చివరగా 2015లో ముంబై తరపున రంజీల్లో ఆడాడు. ముంబై వాంఖడే స్టేడియంలో ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరిగా బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్‌లో నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్(114) సెంచరీతో మెరిశాడు. కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో రోహిత్‌కు అద్భుతమైన రికార్డు ఉంది.ఇప్పటివరకు 128 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఈ ముంబైకర్ 9287 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 29 సెంచరీలు, 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక జమ్మూ కాశ్మీర్‌తో మ్యాచ్ తర్వాత ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు సన్నద్దం కానున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సన్నాహాకాల్లో భాగంగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది.జమ్మూ కాశ్మీర్‌తో మ్యాచ్‌కు ముంబై జట్టు ఇదే..అజింక్య రహానే (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, ఆయుష్ మ్హత్రే, శ్రేయాస్ అయ్యర్, సిద్ధేష్ లాడ్, శివమ్ దూబే, హార్దిక్ తమోర్ (వికెట్ కీపర్), ఆకాష్ ఆనంద్ (వికెట్ కీపర్), తనుష్ కొటియన్, షమ్స్ ములానీ, హిమాన్షు సింగ్, శార్దూల్ ఠాకూర్, మోహిత్ ఠాకూర్ , సిల్వెస్టర్ డిసౌజా, రొయిస్టన్ ద్యాస్, కర్ష్ కొఠారిచదవండి: IPL 2025: లక్నో సూపర్ జెయింట్స్ కొత్త కెప్టెన్ ప్రకటన.. -
రంజీ బాటలో జడేజా
న్యూఢిల్లీ: జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలంటే... దేశవాళీల్లో తప్పక ఆడాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చేసిన హెచ్చరికలు ఫలితాన్నిస్తున్నాయి. గతంలో అంతర్జాతీయ షెడ్యూల్ లేని సమయంలో కూడా దేశవాళీ మ్యాచ్‌లకు దూరంగా ఉన్న టీమిండియా ఆటగాళ్లు ఇప్పుడు... రంజీ ట్రోఫీలో ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో పేలవ ప్రదర్శన చేసిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై జట్టు తరఫున బరిలోకి దిగనున్నట్లు స్పష్టం చేయగా... ఇప్పుడు ఆ జాబితాలో స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా చేరాడు. చివరిసారిగా రెండేళ్ల క్రితం సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగిన జడేజా... ఈ నెల 23 నుంచి ఢిల్లీతో జరగనున్న మ్యాచ్‌లో ఆడనున్నాడు. ఆదివారం రాజ్‌కోట్‌లో సౌరాష్ట్ర జట్టు సభ్యులతో కలిసి జడేజా ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. ‘జడేజా ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. ఢిల్లీతో జరగనున్న మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగుతాడు’ అని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జయ్‌దేవ్ షా తెలిపారు. గతేడాది టి20 ప్రపంచకప్ అనంతరం ఆ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన ఈ స్పిన్ ఆల్‌రౌండర్... చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయం కారణంగా రంజీ మ్యాచ్ ఆడలేనని వెల్లడించగా... రిషబ్ పంత్, శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ కూడా తమ తమ జట్ల తరఫున రంజీ మ్యాచ్‌లు ఆడనున్నారు. దీంతో ఢిల్లీ, సౌరాష్ట్ర మధ్య జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున రిషబ్ పంత్, సౌరాష్ట్ర తరఫున జడేజా ఆడనున్నారు. విదర్భతో పోరుకు సిరాజ్ భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ హైదరాబాద్ తరఫున రంజీ మ్యాచ్ ఆడనున్నాడు. ఆస్ట్రేలియాతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో ఐదు టెస్టు మ్యాచ్‌లాడిన సిరాజ్... పని భారం కారణంగా ఈ నెల 23 నుంచి హిమాచల్ ప్రదేశ్, హైదరాబాద్ మధ్య జరగనున్న మ్యాచ్‌కు ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. అయితే గ్రూప్ దశలో హైదరాబాద్ ఆడే చివరి మ్యాచ్‌లో సిరాజ్ బరిలోకి దిగనున్నట్లు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) వర్గాలు వెల్లడించాయి. ‘వర్క్‌లోడ్ కారణంగా హిమాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో సిరాజ్ ఆడటం లేదు. విదర్భతో పోరులో మాత్రం అతడు జట్టులో ఉంటాడు’ అని ఓ హెచ్‌సీఏ అధికారి తెలిపారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో సిరాజ్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. కొత్త బంతితో పాటు పాత బంతితోనూ మెరుగైన ప్రదర్శన చేయగలడనే నమ్మకంతో సెలెక్టర్లు సిరాజ్‌ను కాదని అర్‡్షదీప్ సింగ్‌ను ఎంపిక చేశారు. -
రంజీల్లో ఆడనున్న రోహిత్, పంత్.. కోహ్లి, రాహుల్ దూరం
టీమిండియా ఆటగాళ్లంతా దేశవాలీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ కండీషన్ పెట్టిన నేపథ్యంలో స్టార్ ఆటగాళ్లు రంజీ ట్రోఫీ బాట పట్టారు. భారత టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (పంజాబ్), స్టార్ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ (ముంబై), రిషబ్ పంత్ (ఢిల్లీ), రవీంద్ర జడేజా (సౌరాష్ట్ర) రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడేందుకు సిద్దమయ్యారు. ముంబై రంజీ జట్టు తరఫున తాను తర్వాతి మ్యాచ్ బరిలోకి దిగుతానని రోహిత్ శర్మ స్వయంగా వెల్లడించాడు. ఈ నెల 23నుంచి ముంబైలోనే జమ్ము కశ్మీర్‌తో జరిగే పోరులో అతను ఆడతాడు. గత 6–7 ఏళ్లలో తాము అంతర్జాతీయ క్రికెట్లో బిజీగా ఉండటం వల్ల దేశవాళీ మ్యాచ్‌లు ఆడలేకపోయామని, రంజీ ట్రోఫీ స్థాయిని తక్కువ చేయలేమని రోహిత్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ పదేళ్ల క్రితం తన చివరి రంజీ మ్యాచ్ ఆడాడు. 2015 సీజన్లో ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ 113 పరుగులు (తొలి ఇన్నింగ్స్) చేశాడు. గడిచిన 17 ఏళ్లలో రంజీ మ్యాచ్ ఆడనున్న తొలి భారత కెప్టెన్‌గా రోహిత్ రికార్డు సృష్టిస్తాడు.కోహ్లి, రాహుల్ దూరంమరో వైపు మెడ నొప్పితో బాధపడుతున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి... తాను ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్ ఆడలేనని స్పష్టం చేయగా... మోచేతి గాయంతో కేఎల్ రాహుల్ (కర్ణాటక) కూడా రంజీ పోరుకు దూరమయ్యాడు.ఢిల్లీ జట్టులో పంత్రంజీ ట్రోఫీ తదుపరి లీగ్ మ్యాచ్‌లు జనవరి 23 నుంచి ప్రారంభమవుతాయి. నెక్స్ట్ లెగ్ మ్యాచ్‌ల కోసం ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ 21 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టులో రిషబ్ పంత్ పేరుంది. ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్‌లో సౌరాష్ట్రను ఢీకొంటుంది. ఢిల్లీ జట్టుకు ఆయుశ్ బదోని కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.ఢిల్లీ రంజీ జట్టు: ఆయుశ్ బదోని (కెప్టెన్), సనత్ సాంగ్వాన్, అర్పిత్ రాణా, యశ్ ధుల్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), జాంటీ సిద్ధూ, హిమ్మత్ సింగ్, నవదీప్ సైనీ, మనీ గ్రేవాల్, హర్ష్ త్యాగి, సిద్ధాంత్ శర్మ, శివం శర్మ, ప్రణవ్ రాజ్‌వంశీ (వికెట్‌కీపర్), వైభవ్ కంద్పాల్, మయాంక్ గుస్సేన్ , గగన్ వాట్స్, ఆయుష్ దోసెజా, రౌనక్ వాఘేలా, సుమిత్ మాథుర్, రాహుల్ గహ్లోత్, జితేష్ సింగ్. -
ఢిల్లీ కెప్టెన్‌గా రిషభ్ పంత్!.. కోహ్లి ఆడుతున్నాడా?
దేశవాళీ క్రికెట్లో విరాట్ కోహ్లి ఆడతాడా? లేదా? ఢిల్లీ తరఫున అతడు రంజీ బరిలో దిగుతాడా? అన్న ప్రశ్నలకు తెరదించేందుకు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) సిద్దమైంది. రంజీ ట్రోఫీ 2024-25 సెకండ్ లెగ్‌లో భాగంగా జనవరి 23న మొదలుకానున్న మ్యాచ్‌కు శుక్రవారం తమ జట్టును ప్రకటించనుంది.కోహ్లి, పంత్‌లపై విమర్శలుకాగా రంజీ ట్రోఫీ తాజా సీజన్ కోసం డీడీసీఏ గతంలోనే 41 మందితో కూడి ప్రాబబుల్ జట్టును ప్రకటించింది. ఇందులో టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లితో పాటు రిషభ్ పంత్, హర్షిత్ రాణా పేర్లు ఉన్నాయి. అయితే, జాతీయ జట్టు విధుల దృష్ట్యా కోహ్లి, పంత్ ఢిల్లీ తరఫున ఆడలేకపోయారు. కానీ.. ఇటీవల ఆస్ట్రేలియా(India vs Australia)తో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా కోహ్లి(Virat Kohli), పంత్ విఫలమైన తీరు విమర్శలకు దారి తీసింది.ముఖ్యంగా ఈ ఇద్దరు ఢిల్లీ బ్యాటర్ల షాట్ సెలక్షన్, వికెట్ పారేసుకున్న విధానం చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో కోహ్లి, పంత్ రంజీ బరిలో దిగి.. తిరిగి మునుపటి లయను అందుకోవాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచించారు. ఈ క్రమంలో రంజీ సెకండ్ లెగ్ మ్యాచ్‌లకు రిషభ్ పంత్ అందుబాటులోకి రాగా.. కోహ్లి మాత్రం ఇంత వరకు తన నిర్ణయం చెప్పలేదు.ఈ విషయాన్ని డీడీసీఏ కార్యదర్శి అశోక్ శర్మ స్వయంగా వెల్లడించాడు. పంత్ సెలక్షన్‌కు అందుబాటులో ఉంటానని చెప్పాడని.. అయితే, కోహ్లి మాత్రం ఈ విషయంపై మౌనం వీడటం లేదని విమర్శించాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం అతడు కచ్చితంగా రంజీల్లో ఆడాల్సిందేనని పేర్కొన్నాడు. కెప్టెన్‌గా రిషభ్ పంత్అంతేకాదు.. ముంబై తరఫున టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) బరిలోకి దిగనున్నాడనే వార్తల నేపథ్యంలో.. ముంబై క్రికెటర్లును చూసి కోహ్లి నేర్చుకోవాల్సింది చాలా ఉందని హితవు పలికాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం తమ జట్టును ప్రకటించేందుకు డీడీసీఏ సిద్ధమైంది. ఈ విషయం గురించి డీడీసీఏ అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘శుక్రవారం మధ్యాహ్నం సెలక్షన్ మీటింగ్ జరుగుతుంది. సౌరాష్ట్రతో మ్యాచ్‌కు రిషభ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది’’ అని తెలిపారు. అయితే, కోహ్లి గురించి మాత్రం తమకు సమాచారం లేదని పేర్కొన్నారు. హర్షిత్ రాణా మాత్రం ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా రంజీలకు అందుబాటులో ఉండడని తెలిపారు.రంజీ ట్రోఫీ సెకండ్ లెగ్- ఢిల్లీ ప్రాబబుల్స్ జట్టువిరాట్ కోహ్లి(సమాచారం లేదు), రిషబ్ పంత్, హర్షిత్ రాణా (అందుబాటులో లేడు), ఆయుష్ బదోనీ, సనత్ సంగ్వాన్, గగన్ వాట్స్, యశ్ ధూల్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), జాంటీ సిద్ధూ, సిద్ధాంత్ శర్మ, హిమ్మత్ సింగ్, నవదీప్ సైనీ, ప్రణవ్ రాజ్‌వంశీ (వికెట్ కీపర్), సుమిత్ మాథుర్, మనీ గ్రేవాల్, శివమ్ శర్మ, మయాంక్ గుస్సేన్, వైభవ్ కండ్పాల్, హిమాన్షు చౌహాన్, హర్ష్ త్యాగి, శివాంక్ వశిష్ట్, ప్రిన్స్ యాదవ్, ఆయుష్ సింగ్, అఖిల్ చౌదరి, హృతిక్ షోకీన్, లక్షయ్ తరేజా (వికెట్ కీపర్), ఆయుష్ దోసేజా, అర్పిత్ రాణా, వికాస్ సోలంకి, సమర్థ్ సేథ్, రౌనక్ వాఘేలా, అనిరుధ్ చౌదరి, రాహుల్ గహ్లోత్, భగవాన్ సింగ్, మయాంక్ రావత్, తేజస్వి దహియా (వికెట్ కీపర్), పార్థీక్, రాహుల్ డాగర్, ఆర్యన్ రాణా, సలీల్ మల్హోత్రా, జితేష్ సింగ్. -
ముంబై రంజీ జట్టుతో రోహిత్ శర్మ, యశస్వి ప్రాక్టీస్
ముంబై: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్... ముంబై రంజీ జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేశారు. ఇటీవల ఆ్రస్టేలియాతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో రోహిత్ పేలవ ప్రదర్శన కనబర్చగా... యశస్వి టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఆసీస్‌తో ప్రతిష్టాత్మక సిరీస్‌లో భారత జట్టు పరాజయం పాలవగా... ప్లేయర్లందరూ దేశవాళీ టోర్నీ ల్లో ఆడాలనే డిమాండ్ పెరిగింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ‘అందుబాటులో ఉన్నవాళ్లందరూ రంజీ ట్రోఫీలో ఆడాలి’ అని ఆటగాళ్లకు చురకలు అంటించాడు. ఈ నేపథ్యంలో రోహిత్, యశస్వి ముంబై రంజీ జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మంగళవారం ముంబై రంజీ కెపె్టన్ రహానేతో కలిసి రోహిత్ సుదీర్ఘ సమయం నెట్స్‌లో గడపగా... బుధవారం జైస్వాల్ ప్రాక్టీస్ చేశాడు. రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌లు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుండగా... జమ్ముకశ్మీర్‌తో ముంబై తలపడనుంది. ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ ఆడటంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 20 వరకు జట్టును ప్రకటించే అవకాశం ఉందని... ఆ సమయంలో ఆటగాళ్లందరినీ అందుబాటులో ఉంటారా లేదా అని అడిగి ఎంపిక చేస్తామని ముంబై క్రికెట్ బోర్డు అధికారి తెలిపారు. ‘రోహిత్‌ను కూడా అడుగుతాం. అతడు అందుబాటులో ఉంటానంటే జట్టులోకి ఎంపిక చేస్తాం’ అని అన్నారు. -
విరాట్ కోహ్లిపై డీడీసీఏ ఆగ్రహం!.. వాళ్లను చూసి నేర్చుకో..
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తీరును ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) కార్యదర్శి అశోక్ శర్మ విమర్శించాడు. దేశవాళీ క్రికెట్ ఆడే విషయంలో.. ముంబై ఆటగాళ్లను ఆదర్శంగా తీసుకోవాలని కోహ్లికి సూచించాడు. అదే విధంగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) చెప్పిన తర్వాత కూడా రంజీల్లో ఆడే విషయమై అతడు ఇంకా మౌనం వహించడం సరికాదని అశోక్ శర్మ పేర్కొన్నాడు. కాగా విరాట్ కోహ్లి టెస్టు ఫార్మాట్లో గత కొంతకాలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లతో స్వదేశంలో సిరీస్‌లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ విఫలమయ్యాడు. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో శతకం బాదడం మినహా మిగతా వేదికల్లో తేలిపోయాడు.బీసీసీఐ చెప్పింది.. మౌనం వీడని కోహ్లిఅంతేకాదు.. ఆఫ్ స్టంప్ ఆవలగా వెళ్తున్న బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నించి.. కోహ్లి దాదాపు ప్రతిసారీ ఒకే రీతిలో అవుటయ్యాడు. దీంతో అతడి ఆట తీరుపై విమర్శల వర్షం కురిసింది. మునుపటి లయను అందుకునేందుకు కోహ్లి ఇకనైనా రంజీల్లో ఆడాలని మాజీ క్రికెటర్లు సూచించారు.ఇక బీసీసీఐ సైతం.. జాతీయ జట్టు విధుల్లో లేనపుడు సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లంతా దేశీ క్రికెట్ ఆడాలని నిబంధన విధించిన విషయం తెలిసిందే. అయితే, కోహ్లి ఇంత వరకు తాను రంజీ మ్యాచ్‌లో పాల్గొనే విషయమై డీడీసీఏకే సమాచారం ఇవ్వలేదు. మరోవైపు.. మరో ఢిల్లీ స్టార్, టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మాత్రం సెలక్షన్‌కు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. పంత్ క్లారిటీ ఇచ్చాడు... కానీ కోహ్లి మాత్రం ఇలాఈ పరిణామాల నేపథ్యంలో డీడీసీఏ కార్యదర్శి అశోక్ శర్మ స్పందించాడు. ‘‘సౌరాష్ట్రతో జనవరి 23 నుంచి రాజ్‌కోట్ మొదలయ్యే రంజీ మ్యాచ్‌కు ఢిల్లీ జట్టు తరఫున అందుబాటులో ఉంటానని రిషభ్ పంత్ చెప్పాడు. ఇక ప్రాబబుల్స్ జట్టులో విరాట్ కోహ్లి కూడా పేరు ఉంది. కానీ అతడి నుంచి ఎటువంటి సమాచారం లేదు. దేశవాళీ క్రికెట్‌కు ముంబై క్రికెటర్లు ప్రాధాన్యం ఇస్తారు. వాళ్ల నుంచి కోహ్లి స్ఫూర్తి పొందాలి. ఎప్పుడు వీలు దొరికినా దేశీ క్రికెట్ టోర్నీల్లో పాల్గొనేందుకు ముంబై క్రికెటర్లు అందుబాటులో ఉంటారు. వాళ్లలో ఇలాంటి గొప్ప సంస్కృతిని చూసి కోహ్లి నేర్చుకోవాలి.దురదృష్టవశాత్తూ ఉత్తరాదిన.. ముఖ్యంగా ఢిల్లీలో మాత్రం ఆటగాళ్లలో ఇలాంటి చొరవ కనిపించడం లేదు. అయినా.. బీసీసీఐ కూడా ఆటగాళ్లందరూ దేశవాళీ క్రికెట్లో ఆడాలని చెప్పింది. అయినప్పటికీ విరాట్ మాత్రం స్పందించడం లేదు. ఢిల్లీ తరఫున అతడు కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడితే బాగుంటుంది’’ అని అశోక్ శర్మ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పేర్కొన్నాడు.రోహన్ జైట్లీ స్పందన ఇదీఅయితే, డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ మాత్రం అశోక్ శర్మ వ్యాఖ్యలకు భిన్నంగా స్పందించాడు. ఫిట్నెస్, పనిభారం దృష్ట్యా కొంత మంది క్రికెటర్లు డొమెస్టిక్ క్రికెట్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపించకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. ‘‘విరాట్ కోహ్లి ఢిల్లీ తరఫున బరిలోకి దిగితే బాగుంటుంది. అతడు ఢిల్లీకి ఆడాలి కూడా!.. కానీ.. చాలా మంది ఫిట్నెస్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనపుడు తగినంత విశ్రాంతి తీసుకోవాలని భావిస్తారు. ఒక క్రికెటర్ దేశీ క్రికెట్ ఆడేందుకు అందుబాటులో ఉండటం అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ల ప్రాధాన్యం ఆధారంగానే ఆటగాళ్లు నిర్ణయాలు తీసుకుంటారు’’ అని రోహన్ జైట్లీ వ్యాఖ్యానించాడు. చదవండి: పాకిస్తాన్‌కు వెళ్లనున్న రోహిత్ శర్మ!.. కారణం?