హైదరాబాద్ 244/5
ఆంధ్రతో రంజీ మ్యాచ్
సాక్షి, హైదరాబాద్: ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (240 బంతుల్లో 124 బ్యాటింగ్; 10 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా ఉప్పల్ స్టేడియంలో ఆంధ్ర జట్టుతో మొదలైన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది.
హైదరాబాద్ మాజీ కెపె్టన్ తన్మయ్ రోజంతా బ్యాటింగ్ చేసి అజేయ శతకంతో అలరించాడు. అభిరత్ రెడ్డి (114 బంతుల్లో 35; 3 ఫోర్లు, ఒక సిక్సర్), హిమతేజ (36; 7 ఫోర్లు) మెరుగైన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. కెప్టెన్ రాహుల్ సింగ్ (1)తో పాటు రోహిత్ రాయుడు (0) విఫలం కాగా.. నితీశ్ రెడ్డి (22), వికెట్ కీపర్ రాహుల్ రాదేశ్ (22 బ్యాటింగ్) ఫర్వాలేదనిపించారు.
ఆంధ్ర బౌలర్లలో త్రిపురాణ విజయ్ 3 వికెట్లు పడగొట్టగా... లలిత్ మోహన్, యరా సందీప్ చెరో వికెట్ తీశారు. తాజా సీజన్‌లో హైదరాబాద్ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడింది. ఒక మ్యాచ్‌లో గెలిచింది. మరో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. మొత్తం 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. మరోవైపు ఆంధ్ర జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట ఓడి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది.
స్కోరు వివరాలు
హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (బ్యాటింగ్) 124; అభిరత్ రెడ్డి (సి) మోహన్ (బి) విజయ్ 35; రోహిత్ రాయుడు (సి) (సబ్) జ్ఞానేశ్వర్ (బి) విజయ్ 0; హిమతేజ (సి) భరత్ (బి) సందీప్ 36; రాహుల్ సింగ్ (సి అండ్ బి) విజయ్ 1; నితీశ్ రెడ్డి (స్టంప్డ్) భరత్ (బి) మోహన్ 22; రాహుల్ రాదేశ్ (బ్యాటింగ్) 22; ఎక్స్‌ట్రాలు 4, మొత్తం (90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి) 244. వికెట్ల పతనం: 1–91, 2–95, 3–151, 4–152, 5–200, బౌలింగ్: శశికాంత్ 15–3–32–0; రఫీ 17–3–41–0;
విజయ్ 27–4–85–3; లలిత్ మోహన్ 23–4–64–1; సందీప్ 8–0–18–1.
Comments
Please login to add a commentAdd a comment