Century
-
పుష్ప సాంగ్‌తో స్మృతి మంధాన సెంచరీ సెలబ్రేట్ చేసిన ప్రియుడు(ఫొటోలు)
-
పెర్త్ టెస్ట్ లో యశస్వి జైశ్వాల్ సెంచరీ
-
తన్మయ్ అజేయ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (240 బంతుల్లో 124 బ్యాటింగ్; 10 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా ఉప్పల్ స్టేడియంలో ఆంధ్ర జట్టుతో మొదలైన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. హైదరాబాద్ మాజీ కెపె్టన్ తన్మయ్ రోజంతా బ్యాటింగ్ చేసి అజేయ శతకంతో అలరించాడు. అభిరత్ రెడ్డి (114 బంతుల్లో 35; 3 ఫోర్లు, ఒక సిక్సర్), హిమతేజ (36; 7 ఫోర్లు) మెరుగైన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. కెప్టెన్ రాహుల్ సింగ్ (1)తో పాటు రోహిత్ రాయుడు (0) విఫలం కాగా.. నితీశ్ రెడ్డి (22), వికెట్ కీపర్ రాహుల్ రాదేశ్ (22 బ్యాటింగ్) ఫర్వాలేదనిపించారు. ఆంధ్ర బౌలర్లలో త్రిపురాణ విజయ్ 3 వికెట్లు పడగొట్టగా... లలిత్ మోహన్, యరా సందీప్ చెరో వికెట్ తీశారు. తాజా సీజన్లో హైదరాబాద్ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడింది. ఒక మ్యాచ్‌లో గెలిచింది. మరో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. మొత్తం 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. మరోవైపు ఆంధ్ర జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట ఓడి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. స్కోరు వివరాలు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (బ్యాటింగ్) 124; అభిరత్ రెడ్డి (సి) మోహన్ (బి) విజయ్ 35; రోహిత్ రాయుడు (సి) (సబ్) జ్ఞానేశ్వర్ (బి) విజయ్ 0; హిమతేజ (సి) భరత్ (బి) సందీప్ 36; రాహుల్ సింగ్ (సి అండ్ బి) విజయ్ 1; నితీశ్ రెడ్డి (స్టంప్డ్) భరత్ (బి) మోహన్ 22; రాహుల్ రాదేశ్ (బ్యాటింగ్) 22; ఎక్స్‌ట్రాలు 4, మొత్తం (90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి) 244. వికెట్ల పతనం: 1–91, 2–95, 3–151, 4–152, 5–200, బౌలింగ్: శశికాంత్ 15–3–32–0; రఫీ 17–3–41–0; విజయ్ 27–4–85–3; లలిత్ మోహన్ 23–4–64–1; సందీప్ 8–0–18–1. -
దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ విధ్వంసం.. 12 ఫోర్లు, 12 సిక్స్‌లతో ఊచకోత
మహిళల బిగ్ బాష్ లీగ్-2024లో హోబర్ట్ హరికేన్స్ మూడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. సిడ్నీ వేదికగా పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 72 పరుగులతో తేడాతో ఘన విజయాన్ని హోబర్ట్ అందుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ స్టార్ ఓపెనర్, దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ లిజెల్ లీ విధ్వంసకర సెంచరీతో మెరిసింది.సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విఫలమైన లీ.. ఈ మ్యాచ్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగింది. ప్రత్యర్ధి బౌలర్లను ఈ దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ ఊచకోత కోసింది. ఆమెను ఆపడం పెర్త్ స్కార్చర్స్ బౌలర్లు వంతు కాలేదు. ఆమె బౌండరీలు బాదుతుంటే ఫీల్డర్లు ప్రేక్షక పాత్ర పోషించారు.ఓవరాల్‌గా 75 బంతులు ఎదుర్కొన్న లీ..12 ఫోర్లు, 12 సిక్స్‌లతో 150 పరుగులు చేసి ఆజేయంగా నిలిచింది. ఆమెతో పాటు హీథర్ గ్రహమ్(23) రాణించింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో హోబర్ట్ హరికేన్స్ 3 వికెట్లు కోల్పోయి 203 పరుగుల భారీ స్కోర్ సాధించింది.అనంతరం లక్ష్య చేధనలో పెర్త్ జట్టు కేవలం 131 పరుగులకే కుప్పకూలింది. హోబర్ట్ బౌలర్లలో హీథర్ గ్రహమ్ మూడు వికెట్లు పడగొట్టగా, స్మిత్, స్ట్రానో తలా రెండు వికెట్లు సాధించారు. పెర్త్ బ్యాటర్లలో అనిస్వర్త్(41) ఒంటరి పోరాటం చేసింది.అరుదైన రికార్డు..ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన లీ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల బిగ్ బాష్ లీగ్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ప్లేయర్‌గా లీ రికార్డులకెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ స్టార్ ప్లేయర్ గ్రేస్ హ్యారీస్(136 నాటౌట్) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో హ్యారీస్ అల్‌టైమ్ రికార్డును లీ బ్రేక్ చేసింది.చదవండి: BAN vs AFG 2nd Odi: మెరిసిన షాంటో.. అఫ్గాన్‌పై బంగ్లాదేశ్ ఘన విజయం -
స్మతి మంధాన రికార్డు సెంచరీ.. ప్రియుడి పోస్ట్ వైరల్(ఫొటోలు)
-
సూర్యకుమార్ మళ్లీ ఫెయిల్.. రుతురాజ్ సూపర్ సెంచరీ
రంజీ ట్రోఫీ 2024-25 ఎడిషన్‌లో టీమిండియా క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ మెరుగ్గా రాణిస్తున్నాడు. తొలుత జమ్మూ కశ్మీర్‌తో మ్యాచ్‌లో 86 పరుగులతో రాణించిన ఈ మహారాష్ట్ర కెప్టెన్.. ముంబైతో మ్యాచ్‌లో శతకంతో చెలరేగాడు. తద్వారా తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కెరీర్లో ఏడో సెంచరీని నమోదు చేశాడు.కాగా రంజీ టోర్నీలో భాగంగా ముంబై- మహారాష్ట్ర మధ్య శుక్రవారం మ్యాచ్ మొదలైంది. ముంబైలోని శరద్ పవార్ క్రికెట్ అకాడమీ బీకేసీలో వేదికగా టాస్ గెలిచిన మహారాష్ట్ర తొలుత బ్యాటింగ్ చేసింది. బ్యాటర్ల వైఫల్యం కారణంగా.. తొలి ఇన్నింగ్స్‌లో 126 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ రుతురాజ్ సహా మరో ముగ్గురు ఆటగాళ్లు డకౌట్ కావడం ప్రభావం చూపింది.సూర్యకుమార్ మళ్లీ ఫెయిల్ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఆదిలోనే ఓపెనర్ పృథీ షా(1) వికెట్ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్ ఆయుశ్ మాత్రే సూపర్ సెంచరీ(176)తో రాణించాడు. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(142) కూడా శతక్కొట్టాడు. అయితే, టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం మరోసారి రెడ్‌బాల్ క్రికెట్లో విఫలమయ్యాడు. పద్నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం ఏడు పరుగులే చేసి అవుటయ్యాడు.రుతురాజ్ సూపర్ సెంచరీఅయితే, ఆయుశ్, శ్రేయస్‌ల భారీ సెంచరీల వల్ల ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 441 పరుగులు చేసింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మహారాష్ట్రకు ఓపెనర్ సచిన్ దాస్(98) శుభారంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో దుమ్ములేపాడు. మొత్తంగా 171 బంతులు ఎదుర్కొన్న అతడు 16 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 145 రన్స్ సాధించాడు.మూడో రోజు ఆటలో భాగంగా ఆదివారం రుతుతో పాటు అంకిత్ బావ్నే తన సూపర్ హాఫ్ సెంచరీని శతకం దిశగా మలిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో మహారాష్ట్ర ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో 102 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 377 రన్స్ స్కోరు చేసింది. కాగా ఇటీవల ఆస్ట్రేలియా టూర్‌కు ప్రకటించిన భారత్-‘ఎ’ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సూర్యకుమార్ యాదవ్ ఇటీవల దులిప్ ట్రోఫీ-2024 బరిలో దిగి కేవలం ఐదు పరుగులే చేసి పెవిలియన్ చేరాడు.మహారాష్ట్ర వర్సెస్ ముంబై తుదిజట్లుమహారాష్ట్రరుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, అంకిత్ బావ్నే, నిఖిల్ నాయక్ (వికెట్ కీపర్), సచిన్ దాస్, అజీమ్ కాజీ, సత్యజీత్ బచావ్, సిద్ధేష్ వీర్, ఆర్ఎస్ హంగర్గేకర్, ప్రదీప్ దధే, హితేష్ వాలుంజ్.ముంబైపృథ్వీ షా, ఆయుశ్ మాత్రే, హార్దిక్ తమోర్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, అజింక్య రహానే (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, షామ్స్ ములానీ, శార్దూల్ ఠాకూర్, తనుష్ కోటియన్, మోహిత్ అవస్థి, రాయిస్టన్ డైస్.చదవండి: సర్ఫరాజ్ కాదు!.. మిడిలార్డర్లో అతడిని ఆడించాలి: మాజీ క్రికెటర్Ruturaj Gaikwad reaches a brilliant hundred and is still going strong! 💯🔥 Leading Maharashtra’s charge against Mumbai with his classy batting, more runs to come!#RuturajGaikwad #CenturyInProgress #RanjiTrophy2024 #MaharashtraCricket pic.twitter.com/J6EwHQPZtC— Maharashtra Cricket Association (@MahaCricket) October 20, 2024 -
తమిళనాడు 674/6 డిక్లేర్డ్
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో భాగంగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో తమిళనాడు భారీ స్కోరు చేసింది. గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన పోరులో తమిళనాడు 674/6 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. టీమిండియా ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ (269 బంతుల్లో 152; 19 ఫోర్లు, ఒక సిక్సర్) భారీ సెంచరీతో కదం తొక్కగా... ప్రదోష్ రంజన్ పాల్ (117; 13 ఫోర్లు) శతకం చేశాడు. అంతకుముందు ఓపెనర్ సాయి సుదర్శన్ (213; 25 ఫోర్లు, ఒక సిక్సర్) కూడా ద్విశతకం నమోదు చేసుకోవడంతో తమిళనాడు భారీ స్కోరు చేయగలిగింది. నారాయన్ జగదీశన్ (65), సిద్ధార్థ్ (66 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో నవ్‌దీప్ సైనీ, హిమాన్షు చౌహాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఓవర్‌నైట్ స్కోరు 379/1తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన తమిళనాడు జట్టు ఆడుతూ పాడుతూ పరుగులు రాబట్టింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ... రెండో రోజు ఆట ముగిసే సమయానికి 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. సనత్ సాంగ్వాన్ (23 బ్యాటింగ్), హర్‡్ష త్యాగీ (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న ఢిల్లీ... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 631 పరుగులు వెనుకబడి ఉంది. -
మూడేళ్ల తర్వాత శతక్కొట్టిన శ్రేయస్ అయ్యర్.. నేను రెడీ!
శ్రేయస్ అయ్యర్ శతక్కొట్టాడు. మూడేళ్ల తర్వాత ఈ ముంబై బ్యాటర్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో తొలి సెంచరీ సాధించాడు. రంజీ ట్రోఫీ 2024-25 ఎడిషన్‌లో భాగంగా మహారాష్ట్రతో మ్యాచ్ సందర్భంగా వంద పరుగుల మార్కును దాటాడు.టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఈ మేర అద్భుత శతకం బాదిన శ్రేయస్ అయ్యర్.. రేసులో తానూ ఉన్నానంటూ సెలక్టర్లకు సందేశం పంపాడు. డిఫెండింగ్ చాంపియన్ ముంబై రంజీ తాజా ఎడిషన్‌లో తొలుత బరోడాతో తలపడి ఓడిపోయింది.ఈ క్రమంలో రహానే సేన అక్టోబరు 18న మహారాష్ట్రతో తమ రెండో మ్యాచ్ మొదలుపెట్టింది. సొంతమైదానంలో టాస్ ఓడిన ముంబై తొలుత బౌలింగ్ చేసింది. మహారాష్ట్రను తొలి ఇన్నింగ్స్‌లో 126 పరుగులకే ఆలౌట్ చేసింది. ముంబై బౌలర్లలో మోహిత్ అవస్థి, షామ్స్ ములానీ మూడేసి వికెట్లతో చెలరేగగా.. శార్దూల్ ఠాకూర్, రాయ్స్టన్ డైస్ చెరో రెండు వికెట్లు కూల్చారు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ పృథ్వీ షా కేవలం ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు. అయితే, మరో ఓపెనర్ ఆయుశ్ మాత్రే సూపర్ సెంచరీ(232 బంతుల్లో 176) పరుగులు చేయగా.. శ్రేయస్ అయ్యర్ అతడికి సహకారం అందించాడు. మొత్తంగా 190 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 142 పరుగులు సాధించాడు. శ్రేయస్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి.ఆయుశ్ మాత్రే, శ్రేయస్ అయ్యర్ శతక ఇన్నింగ్స్ కారణంగా ముంబై తమ మొదటి ఇన్నింగ్స్‌లో 441 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక శనివారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి మహారాష్ట్ర 31 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 142 పరుగులు చేసింది. ముంబై కంటే 173 పరుగులు వెనుకబడి ఉంది.ముంబై వర్సెస్ మహారాష్ట్ర తుదిజట్లుముంబైపృథ్వీ షా, ఆయుశ్ మాత్రే, హార్దిక్ తమోర్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, అజింక్య రహానే (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, షామ్స్ ములానీ, శార్దూల్ ఠాకూర్, తనుష్ కోటియన్, మోహిత్ అవస్థి, రాయిస్టన్ డైస్.మహారాష్ట్రరుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, అంకిత్ బావ్నే, నిఖిల్ నాయక్ (వికెట్ కీపర్), సచిన్ దాస్, అజీమ్ కాజీ, సత్యజీత్ బచావ్, సిద్ధేష్ వీర్, ఆర్ఎస్ హంగర్గేకర్, ప్రదీప్ దధే, హితేష్ వాలుంజ్. -
హెడ్ విధ్వంసకర సెంచరీ.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆసీస్
ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. 316 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. భారీ లక్ష్య చేధనలో కంగారుల ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసం సృష్టించాడు. తనదైన శైలిలో ఇంగ్లండ్ బౌలర్లను ఊతికారేశాడు. కేవలం 129 బంతుల్లో 20 ఫోర్లు, 5 సిక్స్‌లతో 154 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో మార్నస్ లబుషేన్(77) పరుగులతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో పొట్స్, బెతల్, లివింగ్‌స్టోన్ తలా వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.4 ఓవర్లలో 315 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (91 బంతుల్లో 95; 11 ఫోర్లు) త్రుటిలో శతకం చేజార్చుకోగా...విల్ జాక్స్ (56 బంతుల్లో 62; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. కెపె్టన్ హ్యారీ బ్రూక్ (31 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), జాకబ్ బెతెల్ (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా రాణించారు. ఆ్రస్టేలియా బౌలర్లలో లబుషేన్, జంపా చెరో 3 వికెట్లు పడగొట్టగా...ట్రవిస్ హెడ్‌కు 2 వికెట్లు దక్కాయి. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శనివారం లీడ్స్‌లో జరుగుతుంది. -
SL vs NZ: శతక్కొట్టిన కమిందు.. లంక తొలి ప్లేయర్‌గా..
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో శ్రీలంక బ్యాటర్ కమిందు మెండిస్ అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు. టాపార్డర్ కుదేలైన తరుణంలో చిక్కుల్లో పడిన జట్టును తన సెంచరీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తొలి రోజు ఆటలో శ్రీలంకను మెరుగైన స్థితిలో నిలిపాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా న్యూజిలాండ్ రెండు మ్యాచ్‌లు ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వచ్చింది.టాపార్డర్‌ను పడేసిన కివీస్ పేసర్లుఈ క్రమంలో గాలే వేదికగా ఇరుజట్ల మధ్య బుధవారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య శ్రీలంక తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అయితే, స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై తొలుత న్యూజిలాండ్ పేసర్లు చెలరేగడం విశేషం. కివీస్ యువ ఫాస్ట్‌బౌలర్ ఒ రూర్కీ దిముత్ కరుణరత్నె(2)ను పెవిలియన్‌కు పంపి తొలి వికెట్ తీశాడు.అనంతరం మరో ఓపెనర్ పాతుమ్ నిసాంక(27)ను కూడా రూర్కీ అవుట్ చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ దినేశ్ చండిమాల్(30)ను కివీస్ కెప్టెన్ వెనక్కిపంపాడు. ఈ క్రమంలో ఏంజెలో మాథ్యూస్‌తో కలిసి కమిందు మెండిస్ లంక ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. స్కోరు 106-4 వద్ద ఉన్న వేళ ఈ ఇద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 72 పరుగులు జతచేశారు.కమిందు- కుశాల్ జోడీ సెంచరీ భాగస్వామ్యంఅయితే, రూర్కీ మరోసారి ప్రభావం చూపాడు. మాథ్యూస్‌ను 36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ చేశాడు. ఆ తర్వాత కుశాల్ మెండిస్ కమిందుకు తోడయ్యాడు. ఈ క్రమంలో కమిందు సెంచరీ పూర్తి చేసుకోగా.. కుశాల్ కేవలం 68 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకుని జోరు కనబరిచాడు. కమిందుతో కలిసి 103 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే, గ్లెన్ ఫిలిప్స్ కుశాల్‌ను అవుట్‌చేసి.. ఈ జోడీని విడదీయడంతో లంక ఇన్నింగ్స్ నెమ్మదించింది.మరోవైపు.. స్పిన్నర్ అజాజ్ పటేల్ కమిందు మెండిస్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలో తొలిరోజు ఆట ముగిసే సరికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేయగలిగింది. రమేశ్ మెండిస్ 14, ప్రభాత్ జయసూర్య 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.కమిందు మెండిస్ సరికొత్త చరిత్రకివీస్తో తొలి టెస్టులో 173 బంతుల్లో కమిందు మెండిస్ 114 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు ఉన్నాయి. కాగా కమిందుకు ఇది టెస్టుల్లో సొంతగడ్డపై తొలి సెంచరీ కాగా.. ఓవరాల్‌గా నాలుగోది.ఈ క్రమంలో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. శ్రీలంక తరఫున అత్యంత వేగంగా టెస్టుల్లో నాలుగు శతకాలు బాదిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. కేవలం ఏడు మ్యాచ్‌లలో కమిందు ఈ ఘనత సాధించగా.. మైకేల్ వాండార్ట్(21 మ్యాచ్‌లలో), ధనంజయ డి సిల్వ(23మ్యాచ్‌లలో) అతడి తర్వాతి స్థానంలో ఉన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న తరుణంలో కమిందు మరో రికార్డు సాధించాడు.మరో అరుదైన ఘనతవరుసగా ఏడు టెస్టు మ్యాచ్‌లలో హాఫ్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. కమిందు కంటే ముందు పాకిస్తాన్ బ్యాటర్ సౌద్ షకీల్ ఈ ఫీట్ నమోదు చేశాడు. కాగా ఇటీవల ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లోనూ కమిందు మెండిస్ అద్బుతంగా రాణించిన విషయం తెలిసిందే. మాంచెస్టర్ టెస్టులో శతకంతో అలరించాడు.చదవండి: Ind vs Ban: తుదిజట్టులో వారికి చోటు లేదు.. కారణం చెప్పిన గంభీర్ View this post on Instagram A post shared by Sri Lanka Cricket (@officialslc)A century at home, no less in your hometown, always special🙌🏽 #SLvNZ 🎥 SLC pic.twitter.com/eqwnFMPutm— Estelle Vasudevan (@Estelle_Vasude1) September 18, 2024 -
ఇషాన్ కిషన్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా ఇండియా-సి టీమ్
సాక్షి, అనంతపురం: యువ ఆటగాడు ఇషాన్ కిషన్ (126 బంతుల్లో 111; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా అనంతపురంలో భారత్ ‘బి’ జట్టుతో గురువారం మొదలైన దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్‌లో భారత్ ‘సి’ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ‘సి’ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 79 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ పునరాగమనంలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఇషాన్ కిషన్ శతక్కొట్టగా... మిగతా బ్యాటర్లు కూడా విలువైన పరుగులు చేయడంతో భారత్ ‘సి’ జట్టు మెరుగైన స్కోరు చేయగలిగింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (50 బంతుల్లో 46 బ్యాటింగ్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సాయి సుదర్శన్ (75 బంతుల్లో 43; 8 ఫోర్లు), రజత్ పాటిదార్ (67 బంతుల్లో 40; 8 ఫోర్లు), బాబా ఇంద్రజిత్ (136 బంతుల్లో 78; 9 ఫోర్లు) రాణించారు. మ్యాచ్ ఆరంభంలో రెండు బంతులు ఎదుర్కోగానే మడమ నొప్పితో మైదానాన్ని వీడిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్... కోలుకొని తిరిగి క్రీజులో అడుగు పెట్టి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు మానవ్ సుతార్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. గాయం కారణంగా దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయిన ఇషాన్ కిషన్... రెండో రౌండ్ మ్యాచ్‌లో చక్కటి ఆటతీరు కనబర్చాడు. ఇంద్రజిత్తో కలిసి మూడో వికెట్‌కు 189 పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు. ఇటీవల బుచ్చిబాబు టోర్నమెంట్లో జార్ఖండ్ తరఫున సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్... ఇక్కడే అదే జోరు కొనసాగించాడు. భారత్ ‘బి’ బౌలర్లలో ముఖేశ్ కుమార్ 3 వికెట్లు పడగొట్టగా... నవ్‌దీప్ సైనీ, రాహుల్ చహర్ చెరో వికెట్ తీశారు. స్కోరు వివరాలు భారత్ ‘సి’ తొలి ఇన్నింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (బ్యాటింగ్) 46; సాయి సుదర్శన్ (సి) నవ్‌దీప్ సైనీ (బి) ముకేశ్ కుమార్ 43; రజత్ పాటిదార్ (బి) నవ్‌దీప్ సైనీ 40; ఇషాన్ కిషన్ (బి) ముకేశ్ కుమార్ 111; బాబా ఇంద్రజిత్ (బి) రాహుల్ చాహర్ 78; అభిషేక్ పొరేల్ (ఎల్బీడబ్ల్యూ) ముకేశ్ కుమార్ 12; మానవ్ సుతార్ (బ్యాటింగ్) 8; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (79 ఓవర్లలో 5 వికెట్లకు) 357. వికెట్ల పతనం: 1–96, 2–97, 3–286, 4–311, 5–345. బౌలింగ్: ముకేశ్ కుమార్ 21–3–76–3; నవ్‌దీప్ సైనీ 17–2–78–1; వాషింగ్టన్ సుందర్ 10–0–55–0; నితీశ్ కుమార్ రెడ్డి 14–2–58–0; సాయికిశోర్ 12–0–46–0; రాహుల్ చహర్ 5–0–35–1. -
నల్లమలలో 11వ శతాబ్దం నాటి శిలాశాసనాలు
ఆత్మకూరు రూరల్: గతం తెలియని వారికి భవిష్యత్తు ఉండదని పెద్దలు చెబుతుంటారు. అందుకే గతకాలంలో జరిగిన విషయాలను పరిశోధించి, ఫలితాలను గుదిగుచ్చి చరిత్రగా మన ముందు ఉంచుతుంటారు చరిత్రకారులు. అలాంటి వారి దృష్టికి రాకుండా కొన్ని గతకాలపు ఆనవాళ్లు మరుగున పడిపోతుంటాయి. అలాంటివి కృష్ణా తీరంలో, నల్లమల అడవుల్లో ఎన్నో గుప్తంగా ఉండిపోతున్నాయి. ఇక్కడ కనపడుతున్న రెండు శిలాశాసనాలు కూడా అలాంటివే.. ఇవి నాగార్జునసాగర్ – శ్రీశైలం పులుల అభయారణ్యం ఆత్మకూరు అటవీ డివిజన్లోని ఇందిరేశ్వరం బీట్‌లో పెద్ద గుమ్మితం వద్ద ఉన్నాయి. గుమ్మితం ఒక ప్రాచీన శైవ క్షేత్రం. కొండపైనుంచి దుమికే జలపాతాన్ని ఏర్పరచిన ఒక కొండ వాగు ఒడ్డున ఈ క్షేత్రం ఉంది. ఈ క్షేత్ర ఆవరణలో పురాతన లిపి ఉన్న రెండు శిలా శాసనాలు ఉన్నాయి. బాగా పాతకాలంనాడు అప్పటి వారు ఉపయోగించిన తెలుగు లిపితో ఈ శాసనాలు ఉన్నాయి. ఇవి కాకతీయ – విజయనగర పాలన మధ్య కాలంలోనివి(క్రీశ11–12 శతాబ్ధాలు) అయి ఉండొచ్చునని చరిత్రపై అవగాహన ఉన్న కొందరు చెబుతున్నారు. ఇవి ఎర్రయ్య అనే వ్యక్తి వేయించిన దాన శాసనాలుగా తెలుస్తోంది. మల్లికార్జున స్వామికి ఏదో బహుమానం రూపంలో సమర్పించినట్లు లిపిని కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే తెలుస్తోంది. అయితే ఈ శిలాశాసనాలను పూర్తిస్థాయిలో పరిశోధిస్తే చరిత్రలో మరుగున పడ్డ విషయాలు వెలుగులోకి వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
పాక్‌పై సూపర్ సెంచరీ.. బంగ్లా తొలి బ్యాటర్‌గా రికార్డు
పాకిస్తాన్‌తో తొలి టెస్టులో బంగ్లాదేశ్ వెటరన్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం అద్భుత శతకం(191)తో అలరించాడు. ఆతిథ్య జట్టు బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి పట్టుదలగా క్రీజులో నిలబడి సెంచరీతో కదం తొక్కాడు. టెస్టుల్లో అతడికి ఇది పదకొండో సెంచరీ. అయితే, దురదృష్టవశాత్తూ డబుల్ సెంచరీకి తొమ్మిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్.అయినప్పటికీ జట్టును మాత్రం పటిష్ట స్థితిలో నిలపగలిగాడు ముష్ఫికర్ రహీం. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. ఈ క్రమంలో రావల్పిండి వేదికగా బుధవారం తొలి టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన పర్యాటక బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.పాక్ బ్యాటర్ల శతకాలుబంగ్లా ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ ఆరు వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసిన అనంతరం ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ సయీమ్ అయూబ్(56) రాణించగా.. సౌద్ షకీల్(141), మహ్మద్ రిజ్వాన్(171 నాటౌట్) శతకాలతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్ షాద్మన్ ఇస్లాం(93) శుభారంభం అందించాడు.అయితే, మరో ఓపెనర్ జాకిర్ హసన్(12), వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ నజ్ముల్ షాంటో(16) పూర్తిగా నిరాశపరిచారు. వీరి తర్వాతి స్థానాల్లో వచ్చిన మొమినుల్ హక్(50) అర్ధ శతకం సాధించగా.. ముష్ఫికర్ రహీం విశ్వరూపం ప్రదర్శించాడు. మొత్తంగా 341 బంతులు ఎదుర్కొని 22 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 191 పరుగులు సాధించాడు.బంగ్లా తొలి బ్యాటర్‌గా రికార్డు ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో పదిహేను వేల పరుగుల మైలురాయిని దాటేశాడు ముష్ఫికర్ రహీం. అంతేకాదు టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బంగ్లా బ్యాటర్‌గానూ చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్ తరఫున 2005లో అరంగేట్రం చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇప్పటి వరకు 80 టెస్టుల్లో 11 శతకాలు, 3 ద్విశతకాల సాయంతో 5867, 271 వన్డేల్లో 9 సెంచరీల సాయంతో 7792 రన్స్, 102 టీ20లలో 1500 పరుగులు సాధించాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. పాక్- బంగ్లా తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో భాగంగా.. ముష్ఫికర్‌తో పాటు లిటన్ దాస్(56), మెహదీ హసన్ మిరాజ్(71 బ్యాటింగ్) రాణించడంతో బంగ్లాదేశ్ పటిష్ట స్థితికి చేరుకుంది. 167.3 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 565 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో 117 పరుగుల ఆధిక్యం సంపాదించింది.పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టు తుదిజట్లుపాకిస్తాన్అబ్దుల్లా షఫీక్, సయీమ్ అయూబ్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఆఘా సల్మాన్, షాహీన్ అఫ్రిది, నసీం షా, ఖుర్రం షెహజాద్, మహ్మద్ అలీ.బంగ్లాదేశ్నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), షాద్మన్ ఇస్లాం, జాకిర్ హసన్, మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, షోరిఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్, నహీద్ రాణా.Mushfiqur Rahim completes his 11th Test century, much to the delight of his teammates and fans 🇧🇩🏏#PAKvBAN | #TestOnHai pic.twitter.com/jWqAX7YVdR— Pakistan Cricket (@TheRealPCB) August 24, 2024 -
ఈ పోస్ట్‌కార్డు.. జీవితకాలం లేటు!
ఇప్పుడంటే వాట్సప్, మెసెంజర్ల కాలం. కానీ వందేళ్ల కిందట సమాచారం చేరవేతకు ఏకైక మార్గం పోస్టే. ఒక లెటర్ చేరడానికి మూడు నుంచి వారం రోజులు, ఒక్కోసారి పది రోజుల నుంచి నెల దాకా కూడా పట్టేది. కానీ ఒక పోస్ట్‌కార్డు చేరడానికి ఏకంగా 121 ఏళ్లు పట్టింది! 1903లో పోస్ట్ చేసిన ఆ లేఖ శతాబ్దం ఆలస్యంగా చేరుకుంది. బ్రిటన్‌లో స్వాన్సీ బిల్డింగ్ సొసైటీ అడ్రస్‌తో ఉన్న ఈ క్రిస్మస్ థీమ్ కార్డు క్రాడాక్ స్ట్రీట్ శాఖకు గతవారం చేరింది. ఆ చిరునామాలో గతంలో నివసించిన మిస్ లిడియా డేవిస్ బంధువులను కనిపెట్టి ఈ కార్డు ఎవరికి రాసిందో తెలుసుకుని వాళ్లకు చేర్చాలని సిబ్బంది భావిస్తున్నారు. ఈ పోస్టుకార్డును ఎవార్ట్ అనే వ్యక్తి లిడియాకు రాశారు.స్వాన్సీ బిల్డింగ్ సొసైటీలో 121 ఏళ్ల కిందట ఆండ్రూ డల్లీ తన భార్య మరియాతో కలిసి నివసించారు. వారి ఆరుగురు పిల్లల్లో పెద్ద కూతురు లిడియా. ఈ పోస్టు కార్డు పంపిన సమయంలో ఆమెకు 16 ఏళ్లు. వారి కుటుంబం గురించిన సమాచారం ఆన్లైన్లో చాలా తక్కువగా ఉందని స్వాన్సీ బిల్డింగ్ సొసైటీ వర్గాలన్నాయి. ఆమెతో సంబంధం ఉన్నవాళ్లు ఎవరైనా ఉన్నారేమో కనుగొని లేఖను అందజేస్తామని చెప్పుకొచ్చాయి.లేఖలో ఏముందంటే..‘డియర్ ‘ఎల్’.. నన్ను క్షమించండి. నేనా జత (ఏదో తెలియని వస్తువు) తీసుకోలేకపోయాను. నువ్వు ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నావని ఆశిస్తున్నా’ అని రాశారు. తన వద్ద 10 షిల్లింగ్లు ఉన్నాయని, రైలు చార్జీలను లెక్కించడం లేదని, తాను బాగానే ఉన్నానని పేర్కొన్నారు. ‘గిల్బర్ట్, జాన్‌లను కలవాలి.. గుర్తుంచుకోండి’ అంటూ ముగించారు. ‘అందరికీ ప్రేమతో’అంటూ సంతకం చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చరిత్రకు సజీవ సాక్ష్యం.. రేమండ్ కట్టడం
సైదాబాద్: నిజాం రాజు సైనికాధికారి, క్రైస్తవుడైన జనరల్ మాన్షియర్ రేమండ్‌ను అప్పటి స్థానికులైన ముస్లింలు మూసారహీంగా, హిందువులు రామ్‌గా పిలిచి తమ అభిమానాన్ని చాటుకునేవారు. అందుకే ఆయన పేరుగా ఆయన నివసించిన ఆ ప్రాంతం మూసారాంబాగ్గా ఏర్పడింది. అంతగా ప్రజల మన్ననలు పొందిన ఆయన స్మారకార్థం నిర్మించినవే రేమండ్ స్థూపం, సమాధులు. రెండో నిజాం రాజు నిజాం అలీ ఖాన్ పాలనలో ఫ్రెంచ్ దేశస్తుడైన రేమండ్ సైనికాధికారిగా రాజు సైన్యంలోని ఫిరంగి సేనలను పటిష్టంగా తీర్చిదిద్దారు. 1798లో ఆయన మరణానంతరం ఆయన మృతి చిహా్నలుగా అప్పటి మలక్‌పేటలోని ఎత్తైన కొండ ప్రాంతమైన ఆస్మాన్‌ఘడ్‌లో నిర్మాణాలు చేశారు. 18వ శతాబ్దంలో యూరోపియన్ రీతిలో నిర్మించిన ఈ కట్టడాలు ఇప్పటికీ చూపరులను అబ్బురపరుస్తున్నాయి. ఎత్తైన కొండపై... ఎత్తైన కొండ ప్రాంతంపై 180 అడుగుల పొడవు, 85 అడుగుల వెడల్పుతో గద్దెను నిర్మించారు. ఆ గద్దెపై 23 అడుగుల ఎత్తులో రేమాండ్ స్మారక స్థూపాన్ని నిర్మించారు. స్తూపం పక్కనే 28 స్తంభాలతో గ్రీకు శిల్పకళారీతిలో నిర్మించిన ఆయన సమాధి ఉంటుంది. ఆయన స్థూపానికి సమీపంలోనే వారి కుటుంబ సభ్యుల పెంపుడు జంతువులైన గుర్రం, శునకం సమాధులను సైతం నిర్మించారు. 18వ శతాబ్దపు నిర్మాణ శైలితో ఉండే ఈ కట్టడాలు చూపరులను ఆకట్టుకుంటాయి.పురావస్తు శాఖ చొరవతో..దశాబ్దం క్రితం వరకూ ఈ కట్టడాల ప్రాంతంపై అధికారుల పర్యవేక్షణ కొరవడి అపరిశుభ్రతకు నిలయంగా మారింది. ఆ తరువాత పురవాస్తుశాఖ అధికారుల చొరవతో కట్టడాల ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. పచ్చటి లాన్లతో, మెరుగైన సౌకర్యాలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఎత్తైన ప్రాంతంలో ఆహ్లాదకర వాతావరణంలో ఇటీవల సినిమాలు, సీరియళ్లు సైతం విరివిగా చిత్రీకరిస్తున్నారు. -
డుప్లెసిస్ విధ్వంసకర సెంచరీ.. 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో
మేజర్ లీగ్ క్రికెట్-2024లో టెక్సాస్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ మెరుపు సెంచరీతో చెలరేగాడు. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం చర్చ్ స్ట్రీట్ పార్క్ వేదికగా వాష్టింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో డుప్లెసిస్ విధ్వంసం సృష్టించాడు. ప్రత్యర్ధి బౌలర్లను డుప్లెసిస్ ఊచకోత కోశాడు. కేవలం 58 బంతుల్లోనే ఫాప్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. మేజర్ లీగ్ క్రికెట్లో డుప్లెసిస్‌కు ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం. ఇక అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా టెక్సాస్ సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ చేసింది. అతడితో పాటు మరో ఓపెనర్ డెవాన్ కాన్వే(39) పరుగులతో రాణించాడు. వాష్టింగ్టన్ బౌలర్లలో నేత్రవల్కర్ రెండు వికెట్లు పడగొట్టగా.. మార్కో జానెసన్, డిల్, హోస్సేన్ తలా వికెట్ సాధించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వాష్టింగ్టన్‌కు ఓపెనర్ స్మిత్(26), హెడ్(36) మంచి ఆరంభాన్ని ఆంచారు. వీరిద్దరూ ధాటికి వాషింగ్టన్ 4 ఓవర్లలో 62 పరుగులు చేసింది. అయితే ఈ సమయంలో వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. వర్షం ఎప్పటికి తగ్గుముఖం పట్టకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ వచ్చింది. -
సుడిగాలి శతకంతో విరుచుకుపడిన టీమిండియా సారధి
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో (మహిళలు) టీమిండియా బ్యాటర్లు పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా వైస్ కెప్టెన్ స్మృతి మంధన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఈ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో సెంచరీ (127 బంతుల్లో 117; 12 ఫోర్లు, సిక్స్) సాధించిన మంధన.. ఇవాళ (జూన్ 19) జరుగుతున్న రెండో వన్డేలోనూ శతక్కొట్టింది (120 బంతుల్లో 136; 18 ఫోర్లు, 2 సిక్సర్లు).సుడిగాలి శతకంతో విరుచుకుపడిన హర్మన్ఈ మ్యాచ్‌లో వైస్ కెప్టెన్ మంధన మెరుపు శతకంతో విరుచుకుపడితే.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సుడిగాలి సెంచరీతో (88 బంతుల్లో 103 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అలరించింది. కెప్టెన్, వైస్ కెప్టెన్లు ఇద్దరూ సెంచరీలతో కదం తొక్కడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత్ ఇన్నింగ్స్‌లో మంధన, హర్మన్ సెంచరీలతో విజృంభించగా.. షఫాలీ వర్మ (20), దయాలన్ హేమలత (24), రిచా ఘోష్ (25 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా 2, క్లాస్ ఓ వికెట్ పడగొట్టారు.CAPTAIN HARMANPREET KAUR COMPLETED HUNDRED WITH 4,6,4 🥶 pic.twitter.com/y26g5HRhDK— Johns. (@CricCrazyJohns) June 19, 2024చివరి ఓవర్లో సెంచరీ పూర్తి చేసుకున్న హర్మన్49వ ఓవర్ 2వ బంతి ఎదుర్కొనే సమయానికి 85 బంతుల్లో 88 పరుగులు చేసిన హర్మన్ ఆ తర్వాత మూడు బంతులను వరుసగా 4, 6, 4 బాది సెంచరీ పూర్తి చేసుకుంది. వన్డేల్లో హర్మన్‌కు ఇది 6వ సెంచరీ. టీమిండియా తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో హర్మన్ మూడో స్థానంలో నిలిచింది. ఇదే మ్యాచ్‌లో సెంచరీ చేసిన మంధన భారత్ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన మిథాలీ రాజ్ రికార్డును (7) సమం చేసింది. -
వరుసగా రెండో మ్యాచ్‌లో శతక్కొట్టిన మంధన.. మిథాలీ రాజ్ రికార్డు సమం
భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధన వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించి, పలు రికార్డులు బద్దలు కొట్టింది. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మంధన తొలి రెండు వన్డేల్లో శతక్కొట్టి, అరుదైన రికార్డులు నెలకొల్పింది.బెంగళూరు వేదికగా జరిగిన తొలి వన్డేలో సెంచరీ (127 బంతుల్లో 117; 12 ఫోర్లు, సిక్స్) సాధించిన మంధన.. తాజాగా అదే బెంగళూరు వేదికగా జరుగుతున్న రెండో వన్డేలోనూ మెరుపు సెంచరీతో (120 బంతుల్లో 136; 18 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిసింది.SMRITI MANDHANA - THE QUEEN. 👑 pic.twitter.com/jsadqWhYlr— Mufaddal Vohra (@mufaddal_vohra) June 19, 2024మంధన మెరుపు శతకంతో విజృంభించడంతో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతుంది. మంధనతో పాటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (87 నాటౌట్) కూడా చెలరేగి ఆడుతుండటంతో 48 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 3 వికెట్ల నష్టానికి 302గా ఉంది. భారత ఇన్నింగ్స్‌లో మంధన, షఫాలీ వర్మ (20), దయాలన్ హేమలత (24) ఔట్ కాగా.. హర్మన్‌కు జతగా రిచా ఘెష్ (18) క్రీజ్‌లో ఉంది.తొలి భారత క్రికెటర్‌గా రికార్డువరుసగా రెండు మ్యాచ్‌ల్లో సెంచరీలు చేయడంతో మంధన ఖాతాలో పలు రికార్డులు చేరాయి. మహిళల వన్డే క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా మంధన రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో మంధన మరో రికార్డును సమం చేసింది. భారత్ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ రికార్డును సమం చేసింది. మిథాలీ, మంధన ఇద్దరు వన్డేల్లో 7 సెంచరీలు చేశారు. మంధన 7 వన్డే సెంచరీలను కేవలం 84 ఇన్నింగ్స్‌ల్లో చేస్తే.. మిథాలీ రాజ్‌కు 7 సెంచరీలు సాధించేందుకు 211 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. -
CSK Vs MI: శెభాష్ హిట్‌మ్యాన్.. ఓడినా గానీ! రోహిత్ శర్మ సూపర్ సెంచరీ
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ నాలుగో ఓటమి చవిచూసింది. వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ముంబై పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఓటమి పాలైనప్పటికి ఆ జట్టు స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 207 పరుగుల లక్ష్య చేధనలో ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికి రోహిత్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఆఖరి వరకు అద్బుతమైన పోరాటం చేసినప్పటికి తన జట్టును మాత్రం హిట్‌మ్యాన్ గెలిపించలేకపోయాడు. రోహిత్‌కు మరో ఆటగాడి సపోర్ట్ ఉండి ముంబై కచ్చితంగా విజయం సాధించిండేది. రోహిత్ సెంచరీ చేసినప్పటికి ఎటువంటి సెలబ్రేషన్స్ కూడా జరుపుకోలేదు. రోహిత్ సెంచరీ వృథాగా మిగిలిపోయింది. 63 బంతుల్లో హిట్‌మ్యాన్.. 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 103 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రోహిత్‌కు ఇది రెండో ఐపీఎల్ సెంచరీ. రోహిత్ శర్మ చివరగా 2012 ఐపీఎల్ సీజన్లో సెంచరీ సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులకే పరిమితమైంది. సీఎస్కే బౌలర్లలో పతిరాన అద్బుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. తన 4 ఓవర్ల కోటాలో 28 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన పతిరానకు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. ROHIT SHARMA, A HUNDRED TO REMEMBER FOREVER. 🫡 What a fightback, Lone Warrior for MI. pic.twitter.com/neT5HwxiO7 — Johns. (@CricCrazyJohns) April 14, 2024 -
#Jos Buttler: ఇది కదా బట్లర్ అంటే.. సిక్స్‌తో సెంచరీ! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ ఎట్టకేలకు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా జైపూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఓపెనర్‌గా వచ్చిన బట్లర్ ఆఖరి వరకు క్రీజులో నిలబడి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. రాజస్తాన్ విజయానికి కేవలం ఒక్క పరుగు కావల్సిన నేపథ్యంలో బట్లర్ సిక్స్ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. ఇదే సిక్స్‌తో తన సెంచరీ మార్క్‌ను కూడా అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 58 బంతులు ఎదుర్కొన్న బట్లర్.. 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. బట్లర్‌కు ఇది ఆరో ఐపీఎల్ సెంచరీ కావడం గమనార్హం. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో బట్లర్ క్రిస్ గేల్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్ధానంలో కొనసాగతున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి సెంచరీతో మెరిశాడు. 72 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి.. 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 113 పరుగులు చేశాడు. అనంతరం 184 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి రాయల్స్ ఛేదించింది. రాజస్తాన్ బ్యాటర్లలో బట్లర్‌తో పాటు కెప్టెన్ సంజూ శాంసన్(69) పరుగులతో అదరగొట్టాడు. 4⃣ wins in 4⃣ matches for the @rajasthanroyals 🩷 And with that victory, the move to the 🔝 of the Points Table 😎💪 Scorecard ▶️ https://t.co/IqTifedScU#TATAIPL | #RRvRCB pic.twitter.com/cwrUr2vmJN — IndianPremierLeague (@IPL) April 6, 2024 -
ఉస్మాన్ ఖాన్ ఊచకోత.. 50 బంతుల్లోనే శతకం.. వరుసగా రెండవది
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో మరో భారీ స్కోర్ నమోదైంది. ఇస్లామాబాద్ యునైటెడ్‌తో ఇవాళ (మార్చి 10) జరుగుతున్న మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఈ సీజన్లో ఇదే అత్యధిక స్కోర్. ముల్తాన్ సుల్తాన్స్ భారీ స్కోర్ చేయడంలో ఉస్మాన్ ఖాన్ ప్రధానపాత్ర పోషించాడు. వన్‌డౌన్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన ఉస్మాన్ కేవలం 50 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ 15 బౌండరీలు, 3 సిక్సర్లు బాదాడు. ఉస్మాన్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ. మార్చి 3న కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉస్మాన్ 59 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేశాడు. ఉస్మాన్ సెంచరీలు చేసిన ఈ రెండు సందర్భాల్లో నాటౌట్‌గా మిగిలాడు. మ్యాచ్ విషయానికొస్తే.. ఉస్మాన్‌తో పాటు జాన్సన్ చార్లెస్ (18 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), యాసిర్ ఖాన్ (16 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మొహమ్మద్ రిజ్వాన్ (17 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్), ఇఫ్తికార్ అహ్మద్ (12 బంతుల్లో 13; 2 ఫోర్లు), క్రిస్ జోర్డన్ (7 బంతుల్లో 15 నాటౌట్; ఫోర్, సిక్స్) రాణించారు. ఇస్లామాబాద్ బౌలర్లలో ఫహీమ్ అష్రాఫ్ 2 వికెట్లు పడగొట్టగా.. నసీం షా, హునైన్ షా తలో వికెట్ దక్కించుకున్నారు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇస్లామాబాద్.. తొలి రెండు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. డేవిడ్ విల్లే భారీ హిట్టర్ అలెక్స్ హేల్స్‌ను డకౌట్ చేయగా.. అఘా సల్మాన్‌ను మొహమ్మద్ అలీ (2) పెవిలియన్‌కు పంపాడు. 4 ఓవర్ల తర్వాత ఇస్లామాబాద్ స్కోర్ 38/2గా ఉంది. షాదాబ్ ఖాన్ (8 బంతుల్లో 13; 2 ఫోర్లు), కొలిన్ మున్రో (10 బంతుల్లో 16; 2 ఫోర్లు, సిక్స్) క్రీజ్‌లో ఉన్నారు. -
బంగ్లాదేశ్ ఓపెనర్ మెరుపు శతకం.. ఫోర్లు, సిక్సర్లతో వీరవిహారం
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌లో చట్టోగ్రామ్ ఛాలెంజర్స్ బ్యాటర్, బంగ్లాదేశ్ జాతీయ జట్టు ఓపెనర్ తంజిద్ హసన్ మెరుపు సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఖుల్నా టైగర్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 20) జరుగుతున్న మ్యాచ్‌లో తంజిద్ 58 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 65 బంతులు ఎదుర్కొన్న తంజిద్ 8 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 116 పరుగులు చేశాడు. ప్రస్తుత బీపీఎల్ సీజన్లో తంజిద్ చేసిన సెంచరీ మూడవది. తంజిద్‌కు ముందు తౌహిద్ హ్రిదోయ్, విల్ జాక్స్ సెంచరీలు చేశారు. మ్యాచ్ విషయానికొస్తే.. ఛాలెంజర్స్ ఇన్నింగ్స్‌లో తంజిద్ మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. ఆఖర్లో టామ్ బ్రూస్ (23 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించగా.. ముహమ్మద్ వసీం (1), సైకత్ అలీ (18), రొమారియో షెపర్డ్ (10) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. టైగర్స్ బౌలర్లలో వేన్ పార్నెల్, నసుమ్ అహ్మద్, జేసన్ హోల్డర్, ముకిదుల్ ఇస్లాం తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టైగర్స్ నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆ జట్టు తొలి ఓవర్ ముగిసే సరికి కేవలం రెండు పరుగులు (వికెట్ నష్టపోకుండా) మాత్రమే చేయగలిగింది. -
‘జై’స్వాల్ కమాల్
రాజ్‌కోట్ టెస్టులో రెండో రోజు వెనుకబడినట్లు కనిపించిన భారత్ ఒక్కసారిగా మళ్లీ ఆధిపత్యం ప్రదర్శించింది... బజ్‌బాల్ మాయలో చేజేతులా వికెట్లు కోల్పోయి స్వీయాపరాధంతో ఇంగ్లండ్ తమ పతనానికి అవకాశం కల్పించగా... టీమిండియా చక్కటి బౌలింగ్‌తో పాటు దానిని అందిపుచ్చుకుంది. అశ్విన్ లేని లోటు కనిపించకుండా మన బౌలర్లు ప్రత్యర్థిని పడగొట్టారు. ఆపై యువ యశస్వి మరో దూకుడైన ఇన్నింగ్స్‌తో వరుసగా రెండో సెంచరీ సాధించగా, గిల్ అండగా నిలిచాడు. ఇప్పటికే భారీ ఆధిక్యం సాధించిన భారత్ మ్యాచ్‌ను శాసించే స్థితిలో నిలిచింది. దీంతో ఆదివారం మరిన్ని పరుగులతో అసాధ్యమైన లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందు ఉంచడం ఖాయం. రాజ్‌కోట్: ఇంగ్లండ్‌తో మూడో టెస్టును గెలిచి సిరీస్‌లో ఆధిక్యంపై భారత్ కన్నేసింది. మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (133 బంతుల్లో 104 రిటైర్డ్‌హర్ట్; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, శుబ్‌మన్ గిల్ (120 బంతుల్లో 65 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 155 పరుగులు జోడించారు. వెన్ను నొప్పితో బాధపడుతూ మైదానం వీడిన యశస్వి మళ్లీ ఆదివారం బ్యాటింగ్ కొనసాగించే అవకాశం ఉంది. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 207/2తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (41) ఫర్వాలేదనిపించగా... మొహమ్మద్ సిరాజ్ 4 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం భారత్ ఓవరాల్‌గా 322 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇటీవల కన్నుమూసిన మాజీ క్రికెటర్ దత్తాజీరావు గైక్వాడ్‌కు నివాళిగా భారత క్రికెటర్లు భుజాలకు నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. టపటపా... పటిష్ట స్థితిలో మూడో రోజు ఆటను మొదలు పెట్టిన ఇంగ్లండ్ శనివారం స్వయంకృతంతో మంచి అవకాశం చేజార్చుకుంది. ప్రధాన బ్యాటర్ జో రూట్ (18) చేసిన తప్పుతో జట్టు పతనం మొదలైంది. మూడో రోజు ఐదో ఓవర్లోనే బుమ్రా బౌలింగ్‌లో అత్యుత్సాహంతో ‘రివర్స్ స్కూప్’ ఆడిన రూట్ స్లిప్‌లో యశస్వి సూపర్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్లోనే చక్కటి బంతితో బెయిర్‌స్టో (0)ను కుల్దీప్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత 150 పరుగుల మార్క్‌ను అందుకున్న తర్వాత బెన్ డకెట్ (151 బంతుల్లో 153; 23 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ దశలో స్టోక్స్, బెన్ ఫోక్స్ (13) కలిసి క్రీజ్‌లో పట్టుదలగా నిలిచే ప్రయత్నం చేశారు. అయితే లంచ్ తర్వాత భారత బౌలర్లు మళ్లీ చెలరేగారు. వరుస బంతుల్లో స్టోక్స్, ఫోక్స్‌లను పెవిలియన్ పంపించారు. రేహన్ (6), హార్ట్లీ (9) కూడా ఒకే స్కోరు వద్ద అవుట్ కాగా...యార్కర్‌తో అండర్సన్ (1) పని పట్టి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను సిరాజ్ ముగించాడు. 20 పరుగుల వ్యవధిలో ఇంగ్లండ్ చివరి 5 వికెట్లు పడ్డాయి. భారీ భాగస్వామ్యం... అండర్సన్ తొలి ఓవర్లో రోహిత్ శర్మ (19) కొట్టిన రెండు ఫోర్లతో భారత్ ఇన్నింగ్స్ మొదలైంది. అయితే కొద్ది సేపటికే రోహిత్‌ను ఎల్బీగా అవుట్ చేసి రూట్ ఇంగ్లండ్‌లో కాస్త ఆనందం నింపాడు. కానీ అది ఆ కొద్ది సేపటికే పరిమితమైంది. గత టెస్టు సెంచరీ హీరోలు యశస్వి, గిల్ మరో భారీ భాగస్వామ్యంతో జట్టును ఆధిక్యంలో నిలిపారు. ఆరంభంలో వీరిద్దరు నిలదొక్కుకునేందుకు ప్రయత్నించినా...ఆ తర్వాత దూకుడు పెంచారు. ముఖ్యంగా ఒక దశలో 73 బంతుల్లో 35 పరుగులతో ఉన్న యశస్వి ఆ తర్వాత మెరుపు షాట్లతో దూసుకుపోయాడు. అండర్సన్ ఓవర్లో వరుస బంతుల్లో 6, 4, 4 బాదడంతో ఇది షురూ అయింది. హార్ట్లీ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా 6, 6 కొట్టిన అతను తొలి సిక్స్‌తో 80 బంతుల్లో అర్ధ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత సెంచరీని చేరేందుకు యశస్వికి మరో 42 బంతులే సరిపోయాయి. ఈ క్రమంలో అతను ఏ బౌలర్‌నూ వదలకుండా మరో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు బాదాడు. అప్పటి వరకు ప్రేక్షకుడిగా ఉన్న గిల్ కూడా చెలరేగి వుడ్ ఓవర్లో సిక్స్, ఫోర్‌తో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ 445; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) పటిదార్ (బి) అశ్విన్ 15; డకెట్ (సి) గిల్ (బి) కుల్దీప్ 153; పోప్ (ఎల్బీ) (బి) సిరాజ్ 39; రూట్ (సి) యశస్వి (బి) బుమ్రా 18; బెయిర్‌స్టో (ఎల్బీ) (బి) కుల్దీప్ 0; స్టోక్స్ (సి) బుమ్రా (బి) జడేజా 41; ఫోక్స్ (సి) రోహిత్ (బి) సిరాజ్ 13; రేహన్ (బి) సిరాజ్ 6; హార్ట్లీ (స్టంప్డ్) జురేల్ (బి) జడేజా 9; వుడ్ (నాటౌట్) 4; అండర్సన్ (బి) సిరాజ్ 1; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (71.1 ఓవర్లలో ఆలౌట్) 319. వికెట్ల పతనం: 1–89, 2–182, 3–224, 4–225, 5–260, 6–299, 7–299, 8–314, 9–314, 10–319. బౌలింగ్: బుమ్రా 15–1–54–1, సిరాజ్ 21.1–2–84–4, కుల్దీప్ 18–2–77–2, అశ్విన్ 7–0–37–1, జడేజా 10–0– 51–2. భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి (రిటైర్డ్‌హర్ట్) 104; రోహిత్ (ఎల్బీ) (బి) రూట్ 19; గిల్ (నాటౌట్) 65; పటిదార్ (సి) రేహన్ (బి) హార్ట్లీ 0; కుల్దీప్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (51 ఓవర్లలో 2 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–30, 2–191. బౌలింగ్: అండర్సన్ 6–1–32–0, రూట్ 14–2–48–1, హార్ట్లీ 15–2–42–1, వుడ్ 8–0–38–0, రేహన్ 8–0–31–0. -
మ్యాక్స్‌వెల్ మహోగ్రరూపం.. విధ్వంసకర శతకం
అడిలైడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఆసీస్ స్టార్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 50 బంతుల్లోనే 9 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో మెరుపు శతకం చేశాడు. ఫలితంగా ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోర్ సాధించింది. టీ20ల్లో మ్యాక్స్‌వెల్‌కు ఇది ఐదో శతకం. అంతర్జాతీయ టీ20ల్లో కేవలం రోహిత్ శర్మ మాత్రమే ఇన్ని శతకాలు చేశాడు. మ్యాక్సీ ఊచకోత ధాటికి విండీస్ బౌలర్లు విలవిలలాడిపోయారు. మ్యాక్స్‌వెల్ వచ్చిన బంతిని వచ్చినట్లు స్టాండ్స్‌లోకి తరలించాడు. ఈ మ్యాచ్‌లో మ్యాక్సీ 120 పరుగులు (55 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్లు) చేసి అజేయంగా నిలిచాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (14 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మ్యాక్సీకి జతయ్యాడు. వీరిద్దరూ విండీస్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. SWITCH HIT FOR SIX BY MAXWELL 🤯🔥pic.twitter.com/wZ73ZsmhBm — Johns. (@CricCrazyJohns) February 11, 2024 వార్నర్ (19 బంతుల్లో 22; 3 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ మిచెల్ మార్ష్ (12 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తమదైన శైలిలో మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడగా.. జోష్ ఇంగ్లిస్ (4) విఫలమయ్యాడు. స్టోయినిస్ 15 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 16 పరుగులు చేశాడు. మొత్తంగా ఆసీస్ బ్యాటర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో విండీస్ బౌలింగ్ లైనప్ కకావికలమైంది. ఆ జట్టు బౌలర్లలో జేసన్ హోల్డర్ 2, అల్జరీ జోసఫ్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు. అల్జరీ జోసఫ్ ఒక్కడే కాస్త పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో విండీస్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచింది. ఆ మ్యాచ్‌లో ఆసీస్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరిదైన మూడో టీ20 పెర్త్ వేదికగా ఫిబ్రవరి 13న జరుగనుంది. -
వరుస సెంచరీలతో దూసుకుపోతున్న విలియమ్సన్.. పలు రికార్డులు బద్దలు
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ టెస్ట్ క్రికెట్లో టాప్ రికార్డులన్నీ బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఇప్పటికే పలు రికార్డులు బద్దలు కొట్టిన కేన్.. తాజాగా మరిన్ని రికార్డులు నమోదు చేశాడు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు (118, 109) చేసిన కేన్.. ఈ ఘనత (ట్విన్ సెంచరీలు) సాధించిన ఐదో న్యూజిలాండ్ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. సెకెండ్ ఇన్నింగ్స్ సెంచరీతో టెస్ట్ సెంచరీల సంఖ్యను 31కి పెంచుకున్న కేన్.. అత్యధిక సెంచరీలు (అన్ని ఫార్మాట్లలో కలిపి 44 సెంచరీలు) చేసిన యాక్టివ్ ప్లేయర్స్ జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి (80 సెంచరీలు) టాప్‌లో ఉండగా.. డేవిడ్ వార్నర్ (49 సెంచరీలు), జో రూట్ (46), రోహిత్ శర్మ (46), స్టీవ్ స్మిత్ (44) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. కేన్ (44).. స్మిత్‌తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నాడు. తాజా సెంచరీతో కేన్ మరో రికార్డు కూడా సాధించాడు. టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా 31 సెంచరీలు (170 ఇన్నింగ్స్‌ల్లో) పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో సచిన్ అగ్రస్థానంలో (165 ఇన్నింగ్స్‌ల్లో) ఉండగా.. స్టీవ్ స్మిత్, విలియమ్సన్తో కలిసి సంయుక్తంగా రెండో స్థానాన్ని ఆక్రమించాడు. కేన్ గత 10 ఇన్నింగ్స్‌ల్లో స్కోర్లు ఇలా ఉన్నాయి. 132, 1, 121*, 215, 104, 11, 13, 11, 118, 109. ఈ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ ప్రస్తుతం టెస్ట్‌ల్లో నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. కాగా, మౌంట్ మాంగనూయ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్‌లో న్యూజిలాండ్ గెలుపు దిశగా పయనిస్తుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 528 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. మహా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో ప్రత్యర్ధి సౌతాఫ్రికా గెలవలేదు. కేన్ ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసి న్యూజిలాండ్ గెలుపుకు పునాది వేయగా.. యువ ఆటగాడు రచిన్ రవీంద్ర తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ (240) చేసి తనవంతు పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 511 పరుగులకు ఆలౌట్ కాగా.. సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే కుప్పకూలింది. భారీ లీడ్‌తో సెకెండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్న కివీస్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.