న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో శ్రీలంక బ్యాటర్ కమిందు మెండిస్ అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు. టాపార్డర్ కుదేలైన తరుణంలో చిక్కుల్లో పడిన జట్టును తన సెంచరీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తొలి రోజు ఆటలో శ్రీలంకను మెరుగైన స్థితిలో నిలిపాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా న్యూజిలాండ్ రెండు మ్యాచ్‌లు ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వచ్చింది.
టాపార్డర్‌ను పడేసిన కివీస్ పేసర్లు
ఈ క్రమంలో గాలే వేదికగా ఇరుజట్ల మధ్య బుధవారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య శ్రీలంక తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అయితే, స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై తొలుత న్యూజిలాండ్ పేసర్లు చెలరేగడం విశేషం. కివీస్ యువ ఫాస్ట్‌బౌలర్ ఒ రూర్కీ దిముత్ కరుణరత్నె(2)ను పెవిలియన్‌కు పంపి తొలి వికెట్ తీశాడు.
అనంతరం మరో ఓపెనర్ పాతుమ్ నిసాంక(27)ను కూడా రూర్కీ అవుట్ చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ దినేశ్ చండిమాల్(30)ను కివీస్ కెప్టెన్ వెనక్కిపంపాడు. ఈ క్రమంలో ఏంజెలో మాథ్యూస్‌తో కలిసి కమిందు మెండిస్ లంక ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. స్కోరు 106-4 వద్ద ఉన్న వేళ ఈ ఇద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 72 పరుగులు జతచేశారు.
కమిందు- కుశాల్ జోడీ సెంచరీ భాగస్వామ్యం
అయితే, రూర్కీ మరోసారి ప్రభావం చూపాడు. మాథ్యూస్‌ను 36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ చేశాడు. ఆ తర్వాత కుశాల్ మెండిస్ కమిందుకు తోడయ్యాడు. ఈ క్రమంలో కమిందు సెంచరీ పూర్తి చేసుకోగా.. కుశాల్ కేవలం 68 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకుని జోరు కనబరిచాడు. కమిందుతో కలిసి 103 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే, గ్లెన్ ఫిలిప్స్ కుశాల్‌ను అవుట్‌చేసి.. ఈ జోడీని విడదీయడంతో లంక ఇన్నింగ్స్ నెమ్మదించింది.
మరోవైపు.. స్పిన్నర్ అజాజ్ పటేల్ కమిందు మెండిస్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలో తొలిరోజు ఆట ముగిసే సరికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేయగలిగింది. రమేశ్ మెండిస్ 14, ప్రభాత్ జయసూర్య 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.
కమిందు మెండిస్ సరికొత్త చరిత్ర
కివీస్‌తో తొలి టెస్టులో 173 బంతుల్లో కమిందు మెండిస్ 114 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు ఉన్నాయి. కాగా కమిందుకు ఇది టెస్టుల్లో సొంతగడ్డపై తొలి సెంచరీ కాగా.. ఓవరాల్‌గా నాలుగోది.
ఈ క్రమంలో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. శ్రీలంక తరఫున అత్యంత వేగంగా టెస్టుల్లో నాలుగు శతకాలు బాదిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. కేవలం ఏడు మ్యాచ్‌లలో కమిందు ఈ ఘనత సాధించగా.. మైకేల్ వాండార్ట్(21 మ్యాచ్‌లలో), ధనంజయ డి సిల్వ(23మ్యాచ్‌లలో) అతడి తర్వాతి స్థానంలో ఉన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న తరుణంలో కమిందు మరో రికార్డు సాధించాడు.
మరో అరుదైన ఘనత
వరుసగా ఏడు టెస్టు మ్యాచ్‌లలో హాఫ్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. కమిందు కంటే ముందు పాకిస్తాన్ బ్యాటర్ సౌద్ షకీల్ ఈ ఫీట్ నమోదు చేశాడు. కాగా ఇటీవల ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లోనూ కమిందు మెండిస్ అద్బుతంగా రాణించిన విషయం తెలిసిందే. మాంచెస్టర్ టెస్టులో శతకంతో అలరించాడు.
చదవండి: Ind vs Ban: తుదిజట్టులో వారికి చోటు లేదు.. కారణం చెప్పిన గంభీర్
A century at home, no less in your hometown, always special🙌🏽 #SLvNZ
🎥 SLC pic.twitter.com/eqwnFMPutm— Estelle Vasudevan (@Estelle_Vasude1) September 18, 2024
Comments
Please login to add a commentAdd a comment