world test championship
-
‘డబ్ల్యూటీసీ ఫైనల్లో విజయం మాదే’
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(World Test Championship- డబ్ల్యూటీసీ)లో తొలిసారి ఫైనల్‌కు చేరింది సౌతాఫ్రికా. సొంతగడ్డపై పాకిస్తాన్‌తో తొలి టెస్టులో గెలుపొంది మెగా టైటిల్ పోరుకు అర్హత సాధించిన ప్రొటిస్ జట్టు.. రెండో టెస్టులోనూ విజయం సాధించి పర్యాటక జట్టును 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. కాగా టెస్టుల్లో సౌతాఫ్రికాకు ఇది వరుసగా ఏడో గెలుపు కావడం విశేషం.కెప్టెన్ తెంబా బవుమా(Temba Bavuma) బ్యాటర్‌గా, సారథిగా రాణిస్తూ ఇలా జట్టును విజయపథంలో నడిపించి.. తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేర్చాడు. ఈ నేపథ్యంలో అతడపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్(Graeme Smith ) బవుమా నాయకత్వ లక్షణాలను కొనియాడాడు.బవుమా అలాంటి వాడు కాదు‘‘సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరడం మా అందరికీ గర్వకారణం. కెప్టెన్‌గా బవుమాకు కూడా ఇది ఉద్వేగ సమయం. గత రెండు, మూడేళ్లుగా అతడు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. అయితే, గతేడాది అతడి బ్యాటింగ్ సగటు 50గా నమోదైంది.నాయకుడిగా జట్టును ముందుండి నడిపిస్తూ ఈస్థాయికి చేర్చాడు. మైదానంలో ఆటగాళ్లపై అరుస్తూ.. పిచ్చిగా ప్రవర్తించే వ్యక్తిత్వం బవుమాకు లేదు. అతడు అసలు అలాంటి దుందుడుకు స్వభావం గల వ్యక్తి కానేకాదు. నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతాడు. ఆటతోనే అందరికీ సమాధానం చెప్తాడు.టెస్టుల్లో వరుసగా జట్టుకు ఏడు విజయాలు అందించిన కెప్టెన్. అంతకంటే అద్భుతమైన విషయం మరొకటి ఉండదు. ఇప్పుడు ఏకంగా డబ్ల్యూటీసీ ఫైనల్లో జట్టును నిలిపాడు. మేమంతా అతడికి అండగా ఉంటాం’’ అని గ్రేమ్ స్మిత్ పేర్కొన్నాడు.గెలుపు మాదేనని భావిస్తున్నాఇక ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడే అంశంపై స్పందిస్తూ.. ‘‘ఇలాంటి ప్రతిష్టాత్మక టెస్టు మ్యాచ్‌లో విజేత ఎవరన్నది అంచనా వేయడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ తటస్థ వేదికైన లార్డ్స్ మైదానంలో జరుగుతుంది. కాబట్టి ఏ జట్టుకూ హోం అడ్వాంటేజీ ఉండదు.ఆస్ట్రేలియా మీడియాను చూస్తుంటే మాత్రం.. లార్డ్స్‌లో కంగారూలను ఓడించి మేము కచ్చితంగా ట్రోఫీ గెలవాలనే సంకల్పం మరింత బలపడింది. ఫైనల్లో ఆసీస్‌ను ఓడిస్తే ఆ మజానే వేరు’’ అని గ్రేమ్ స్మిత్ హిందుస్తాన్ టైమ్స్‌తో వ్యాఖ్యానించాడు. కాగా ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక టెస్టు సిరీస్ విజయం సాధించిన ప్రొటిస్ కెప్టెన్‌గా గ్రేమ్ స్మిత్‌కు అరుదైన ఘనత ఉంది.ఆసీస్‌పై స్మిత్‌కు ఘనమైన రికార్డుస్మిత్ సారథ్యంలో 2006లో తొలుత ఆసీస్‌ను వన్డేలో ఓడించిన సౌతాఫ్రికా.. ఆ తర్వాత మూడేళ్ల అనంతరం అంటే 2009లో కంగారూ గడ్డపై పాంటింగ్ బృందాన్ని టెస్టుల్లో చిత్తు చేసింది. 2-1 తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి మొట్టమొదటి సారి టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. నాడు తన మణికట్టుకు దెబ్బతాకినా.. గ్రేమ్ స్మిత్ బ్యాటింగ్ చేసిన తీరు.. సౌతాఫ్రికా ఆటగాళ్ల పట్టుదలకు అద్దంగా నిలిచింది.ఇక ఇప్పుడు పదహారేళ్ల తర్వాత గ్రేమ్ స్మిత్‌లాగే ఆస్ట్రేలియాను ఓడించే సువర్ణావకాశం ముంగిట బవుమా నిలిచాడు. కాగా సారథిగా బవుమా గత 14 టెస్టుల్లో సౌతాఫ్రికాకు 10 విజయాలు అందించాడు. ఇక ఇప్పటి వరకు మొత్తంగా 63 టెస్టులు ఆడిన బవుమా నాలుగు శతకాల సాయంతో 3606 పరుగులు సాధించాడు.ఇదిలా ఉంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియాపై 3-1తో గెలిచిన ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూసుకువచ్చింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో సౌతాఫ్రికాతో తలపడనుంది. ఇరుజట్ల మధ్య ఇంగ్లండ్ వేదికగా జూన్ 11-15 వరకు ఈ మెగా టెస్టు మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: BCCI: గంభీర్‌పై వేటు?.. రోహిత్, కోహ్లిలు మాత్రం అప్పటిదాకా..! -
'అదొక చెత్త నిర్ణయం'.. ఐసీసీపై విండీస్ గ్రేట్ ఫైర్
టెస్టు క్రికెట్‌కు ఆదరణను మరింత పెంచే దిశగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) అడుగులు వేస్తోంది. సంప్రదాయ ఫార్మాట్‌ను రెండు శ్రేణుల్లో( 2- Tier Test cricket) నిర్వహించాలని ఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది.ఈ క్రమంలోనే అగ్ర శ్రేణి జట్లైనా భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మరిన్ని ఎక్కువ సిరీస్‌లను నిర్హహించాలని ఐసీసీ యోచిస్తోంది. ఇదే విషయంపై ఐసీసీ ఛైర్మన్ జై షా, బీసీసీఐ ప్రతినిధులు, క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు, ఈసీబీ చీఫ్ ఈ నెలాఖరులో సమావేశం కానున్నారని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.విండీస్ గ్రేట్ ఫైర్..కాగా టెస్టుల్లో ఈ రెండంచెల విధానం ప్రతిపాదనపై వెస్టిండీస్ గ్రేట్ క్లైవ్ లాయిడ్ మండిపడ్డాడు. "ఐసీసీ నిజంగా టెస్టుల్లో 2 టైర్ విధానాన్ని తీసుకురావాలని ఆలోచిస్తుంటే, అది కచ్చితంగా భయంకరమైన నిర్ణయమవుతోంది. టెస్టు క్రికెట్ హోదా పొందేందుకు కష్టపడుతున్న చిన్న జట్ల పట్ల శాపంగా మారనుంది. ఇకపై లోయర్ డివిజన్లో మిగతా జట్లు వాళ్లతో వాళ్లే ఆడుకుంటారు. దీంతో టెస్టు క్రికెట్‌కు ఆదరణ పెరగడం కాదు మరింత తగ్గుతోంది. చిన్న జట్లను అగ్ర జట్లతో ఎక్కువగా ఆడేలా చేయడంపై ఐసీసీ దృష్టి సారించాలి. అంతే తప్ప ఎటువంటి చెత్త నిర్ణయాలు తీసుకోకూడదు అని 80 ఏళ్ల క్లైవ్ లాయిడ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.వెస్టిండీస్ జట్టును రద్దు చేసి విడివిడిగా ఆడాలన్న ఐసీసీ మాజీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే సూచనపై కూడా లాయిడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. " వరల్డ్ క్రికెట్లో వెస్టిండీస్ జట్టుకు గొప్ప చరిత్ర ఉంది. అలాంటి జట్టును విడదీయాలని మాట్లాడుతున్నారు. అది సరైన పద్దతి కాదు. వెస్టిండీస్‌తో సహా ఇన్ని జట్లకు సమంగా డబ్బులిస్తే సౌకర్యాలను మెరుగుపరుచుకుంటారు. వారు తమ క్రికెట్‌ను మరింత మెరుగుపరచుకునేందుదు మెరుగైన వ్యవస్థలు ఏర్పాటు చేసుకుంటారు అని లాయిడ్ వ్యాఖ్యనించారు.చదవండి: 'రాహుల్ కోసం అతడిని పక్కన పెట్టేశారు.. ఒక్క ఛాన్స్ ఇవ్వాల్సింది' -
కమిన్స్ డబుల్ సెంచరీ.. చరిత్రలో తొలి ప్లేయర్
ఆస్ట్రేలియా సారధి పాట్ కమిన్స్ (Pat Cummins) ఎవరికీ సాధ్యం కానీ మైలురాయిని అందుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగిన ఐదో టెస్ట్‌లో కమిన్స్ ఈ ఫీట్‌ను సాధించాడు. వాషింగ్టన్ సుందర్ డబ్ల్యూటీసీలో కమిన్స్‌కు 200వ వికెట్.డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కమిన్స్ తర్వాతి స్థానాల్లో నాథన్ లియోన్ (196 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్ (195), మిచెల్ స్టార్క్ (165), జస్ప్రీత్ బుమ్రా (156) ఉన్నారు.కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25ను ఆస్ట్రేలియా 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిన ఆసీస్.. రెండు, నాలుగు, ఐదు మ్యాచ్‌ల్లో గెలిచింది. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది. తాజాగా ముగిసిన ఐదో టెస్ట్‌లో (సిడ్నీ) ఆసీస్ ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ సిరీస్ ఆధ్యాంతం అద్బుతంగా రాణించిన కమిన్స్ 25 వికెట్లు తీసి ఆసీస్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కమిన్స్ రెండో స్థానంలో ఉన్నాడు. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా 32 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. కమిన్స్ ఈ సిరీస్‌లో బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో 19.88 సగటున 159 పరుగులు చేశాడు.బ్యాటింగ్‌లో హెడ్ టాప్తాజాగా ముగిసిన బీజీటీలో ఆసీస్ చిచ్చరపిడుగు ట్రవిస్ హెడ్ అత్యధిక పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో 9 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన హెడ్ 56 సగటున 448 పరుగులు చేశాడు. భారత యువ కెరటం యశస్వి జైస్వాల్ 10 ఇన్నింగ్స్‌ల్లో 43.44 సగటున 391 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు.బీజీటీ 2024-25లో అత్యధిక పరుగులు చేసిన టాప్-10 ఆటగాళ్లు..ట్రవిస్ హెడ్-448యశస్వి జైస్వాల్-391స్టీవ్ స్మిత్-314నితీశ్ కుమార్ రెడ్డి-298కేఎల్ రాహుల్-276రిషబ్ పంత్-255మార్నస్ లబూషేన్-232అలెక్స్ క్యారీ-216విరాట్ కోహ్లి-190ఉస్మాన్ ఖ్వాజా-184బీజీటీ 2024-25లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 బౌలర్లు..బుమ్రా-32కమిన్స్-25బోలాండ్-21సిరాజ్-20స్టార్క్-18నాథన్ లియోన్-9జోష్ హాజిల్‌వుడ్-6ప్రసిద్ద్ కృష్ణ-6ఆకాశ్‌దీప్-5నితీశ్ కుమార్ రెడ్డి-5చెలరేగిన బోలాండ్ఐదో టెస్ట్‌లో ఆసీస్ స్పీడ్‌స్టర్ స్కాట్ బోలాండ్ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో బోలాండ్ 10 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన బోలాండ్, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు. 10 వికెట్ల ప్రదర్శనకు గానూ బోలాండ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్ ఆధ్యాంతం ఆసీస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన బుమ్రాను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు వరించింది.డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్భారత్పై ఐదో టెస్ట్ గెలుపుతో ఆసీస్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆసీస్ రెండో స్థానంలో నిలిచింది. సౌతాఫ్రికా.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది.లార్డ్స్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడతాయి. 2023-25 డబ్ల్యూటీసీ సైకిల్లో ఆస్ట్రేలియా మరో రెండు మ్యాచ్‌లు (శ్రీలంకతో) ఆడాల్సి ఉంది. -
డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా! తొలిసారి భారత్ మిస్
టీమిండియా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్-2025 ఫైనల్(WTC Final) ఆశలు ఆడియాశలు అయ్యాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి భారత్ నిష్క్రమించింది.టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆర్హత సాధించకపోవడం ఇదే తొలిసారి. 2019-21 సైకిల్లో టీమిండియా 70 విన్నింగ్ శాతంతో తొట్ట తొలి సీజన్లో భారత్ ఫైనల్‌కు ఆర్హత సాధించింది. కానీ విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు ఫైనల్లో కివీస్ చేతిలో ఓటమి చవిచూసింది.ఆ తర్వాత సైకిల్(2021-23)లో కూడా అద్బుత ప్రదర్శన కనబరిచిన టీమిండియా ఫైనల్‌కు క్వాలిఫై అయింది. కానీ డబ్ల్యూటీసీ సైకిల్ 2023-25లో మాత్రం తమ ఆధిపత్యాన్ని భారత్ కొనసాగించలేకపోయింది. ఈ సీజన్లో 19 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 9 విజయాలు, 8 ఓటములను చవిచూసింది. దీంతో పాయింట్ల పట్టికలో 50 విన్నింగ్ శాతంతో మూడో స్ధానానికే రోహిత్ సేన పరిమితమైంది.ఫైనల్లో దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియాఇక ఈ విజయంతో ఆస్ట్రేలియా వరుసగా రెండో సారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆర్హతసాధించింది. డబ్ల్యూటీసీ సైకిల్ 2023-25లో 17 మ్యాచ్‌లు ఆడిన ఆసీస్.. 11 విజయాలు, 4 ఓటములును నమోదు చేసింది. పాయింట్లపట్టికలో ఆస్ట్రేలియా 63.73 విన్నింగ్ శాతంతో రెండో స్ధానంలో నిలిచి ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది.మరోవైపు దక్షిణాఫ్రికా ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టింది. టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు ప్రోటీస్ ఆర్హత సాధించడం ఇదే తొలిసారి. ఇక జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా అమీతుమీ తెల్చుకోనున్నాయి.చదవండి: IND vs AUS: సిడ్నీ టెస్టులో ఓటమి.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి భారత్ ఔట్ -
సిడ్నీ టెస్టులో ఓటమి.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి భారత్ ఔట్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25ను టీమిండియా(Teamindia) ఓటమితో ముగించింది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో భారత్ కోల్పోయింది. పదేళ్ల తర్వాత ఆస్ట్రేలియా బీజీటీ ట్రోఫీని తిరిగి సొంతం చేసుకుంది.అంతేకాకుండా ఈ ఓటమితో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ నుంచి భారత్ నిష్క్రమించింది. జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరడం ఇది వరుసగా రెండోసారి.ఇక మ్యాచ్‌లో భారత్ విధించిన 162 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 27 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఆసీస్ విజయం సాధించింది. ఆసీస్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖావాజా(41) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ట్రావిస్ హెడ్(34), వెబ్‌స్టర్ ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ముగించారు.భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ ఒక్క వికెట్ సాధించాడు. కాగా సెకెండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఫీల్డింగ్‌కు రాలేదు. బుమ్రా లేని లోటు స్పష్టంగా కన్పించింది.నిప్పులు చెరిగిన బోలాండ్.. అంతకుముందు భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 157 పరుగులకు ఆలౌటైంది. 141/6 పరుగుల ఓవర్ నైట్‌స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. అదనంగా కేవలం 16 పరుగులు మాత్రమే చేసి తమ ఇన్నింగ్స్‌ను ముగించిం భారత్ బ్యాటర్లలో రిషబ్ పంత్(61) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఇక ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోలాండ్ నిప్పులు చెరిగాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి మొత్తంగా 10 వికెట్లు పడగొట్టి దెబ్బతీశాడు. దీంతో మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా బోలాండ్ నిలిచాడు. అదే విధంగా 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 32 వికెట్లు పడగొట్టి సత్తాచాటిన భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు దక్కింది. -
భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. అదొక్కటే దారి!
ఆస్ట్రేలియా(Australia) పర్యటనలో ఉన్న భారత జట్టుకు మరోసారి చుక్కెదురైంది. మెల్బోర్న్ వేదికగా ఆసీస్‌తో జరిగిన నాలుగో టెస్టులో 184 పరుగుల తేడాతో భారత్(India) ఓటమి పాలైంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-2 వెనకంజలోకి వెళ్లింది. మరోసారి బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఆసీస్ బౌలర్ల దాటికి 155 పరుగులకే కుప్పకూలింది.ఈ మ్యాచ్‌లో యశస్వి జైశ్వాల్, నితీశ్ కుమార్, వాషింగ్టన్ సుందర్ మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ జైశ్వాల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మరోవైపు బౌలర్లలో స్కాట్ బోలాండ్, కమ్మిన్స్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, హెడ్ చెరో వికెట్ సాధించారు. ఇక ఈ ఓటమితో భారత్ డబ్ల్యూటీసీ(WTC) ఫైనల్ అవకాశాలు మరింత సన్నగిల్లాయి.భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే..డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్ బెర్త్‌ను ఇప్పటికే దక్షిణాఫ్రికా ఖారారు చేసుకుంది. మరో బెర్త్ కోసం ఆస్ట్రేలియా, భారత్ మధ్య పోటీ నెలకొంది. మెల్బోర్న్ టెస్టు ఓటమితో భారత్ తమ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో భారత్ మూడో స్ధానంలో కొనసాగుతోంది. ఈ ఓటమితో టీమిండియా విన్నింగ్ శాతం 55.89 నుంచి 52.77కి పడిపోయింది.మరోవైపు ఆసీస్ మాత్రం ఈ విజయంతో తమ విన్నింగ్ శాతాన్ని 58.89 నుంచి 61.46కు మెరుగుపరుచుకుంది. ఈ క్రమంలో భారత్ ఫైనల్‌కు చేరడం కాస్త కష్టమనే చెప్పుకోవాలి. ప్రస్తుత సైకిల్లో భారత్‌కు ఇంకా కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. కానీ ఆసీస్ మాత్రం ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడనుంది. భారత్‌తో ఓ మ్యాచ్ శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కంగారులు తలపడనున్నారు. అయితే భారత్‌కు ఇంకా దారులు మూసుకుపోలేదు. రోహిత్ సేన డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే సిడ్నీ వేదికగా జరగనున్న ఆఖరి టెస్టులో కచ్చితంగా గెలవాల్సిందే. అదే సమయంలో శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్‌లో ఆసీస్ కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా ఓడిపోవాలి. అప్పుడే భారత్‌కు ఫైనల్‌కు చేరే అవకాశముంటుంది. లేదా రెండు మ్యాచ్‌ల 0-0 డ్రాగా ముగిసిన భారత్‌కు ఫైనల్ చేరే ఛాన్స్ ఉంటుంది.చదవండి: అద్భుతమైన టెస్టు.. ఆఖరికి మాదే పైచేయి.. వాళ్లిద్దరు సూపర్: కమిన్స్ -
చరిత్ర సృష్టించిన కగిసో రబాడ.. 108 ఏళ్ల రికార్డు బ్రేక్
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్లో దక్షిణాఫ్రికా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సెంచూరియన్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్టులో 2 వికెట్ల తేడాతో సంచలనం విజయం సాధించిన ప్రోటీస్.. తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆర్హత సాధించింది.ఈ విజయంలో సౌతాఫ్రికా స్పెషలిస్టు సీమ్ బౌలర్ కగిసో రబాడ (26 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు) కీలక పాత్ర పోషించాడు. 148 పరుగుల సులువైన లక్ష్య చేధనలో ప్రోటీస్ 99 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో రబాడ, మార్కో జానెసన్ విరోచిత పోరాటం కనబరిచారు.వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు 51 పరుగులు జోడించడంతో దక్షిణాఫ్రికా ఊహించని విధంగా మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్‌లో స్పెషలిస్టు బ్యాటర్ అవతరమెత్తిన రబాడ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.రబాడ అరుదైన ఘనత..విజయవంతమైన లక్ష్య చేధనలో పది లేదా అంతకంటే ఎక్కువ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోర్ చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడిగా రబాడ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సౌతాఫ్రికా దిగ్గజం పెర్సీ షెర్వాల్ పేరిట ఉండేది. అతడు 1906లో జోహన్నెస్‌బర్గ్‌లో ఇంగ్లండ్‌పై పదో వికెట్‌కు బ్యాటింగ్‌కు వచ్చి ఆజేయంగా 22 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో 108 ఏళ్ల షెర్వాల్ రికార్డును రబాడ బ్రేక్ చేశాడు.చదవండి: IND vs AUS: బెయిల్స్ మార్చిన స్టార్క్.. ఇచ్చిపడేసిన యశస్వి జైశ్వాల్! వీడియో వైరల్ -
సన్నగిల్లుతున్న భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు
భారత్, ఆస్ట్రేలియా ఆ మధ్య మెల్బోర్న్లో జరుగుతున్న నాలుగో టెస్ట్ నాలుగో రోజు ఆట నువ్వా నేనా అన్నట్టు సాగింది. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక దశలో కేవలం పదకొండు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టి భారత్ ని ఆధిపత్యాన్ని అందించాడు. లంచ్ విరామం తర్వాత బుమ్రా చెలరేగిపోయి మొదట ఆస్ట్రేలియా తరుఫున ఈ సిరీస్ లో అత్యధిక స్కోర్ సాధించిన ట్రావిస్ హెడ్ ని ఒక పరుగుకే పెవిలియన్ పట్టించాడు.దీంతో బుమ్రా తన టెస్ట్ కెరీర్ లో రెండు వికెట్ల రికార్డు ని పూర్తి చేసుకున్నాడు. బుమ్రా అతి తక్కువ సగటుతో ఈ రికార్డు ని నెలకొల్పడం విశేషం. బుమ్రా 20.29 సగటు తో కేవలం 44 టెస్టుల్లో ఈ ఘనత సాధించాడు. వెస్టిండీస్ బౌలింగ్ దిగ్గజం మాల్కం మార్షల్ 20.94 సగటు తో నెలకొల్పిన రెకార్డ్ ని అధిగమించి ఈ రికార్డ్ ని సాధించడం గమనార్హం. బుమ్రా నాలుగు బంతుల వ్యవధిలో ఆస్ట్రేలియా బ్యాటర్ మిచెల్ మార్షల్ ని డకౌట్ చేసాడు. బుమ్రా తన తర్వాత ఓవర్లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అలెక్స్ క్యారీని రెండు పరుగులకు అవుట్ చేసాడు. ఈ దశలో ఆస్ట్రేలియా 91 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ప్రమాదంలో పడింది.మూడు క్యాచ్ లు జారవిడిచిన జైస్వాల్ అయితే భారత్ యువ బ్యాట్స్‌మన్ యశస్వీ జైస్వాల్ ఈ దశలో రెండు కీలకమైన క్యాచ్ లు జారవిడవడం తో ఆస్ట్రేలియా కి అదృష్టం కలిసి వచ్చింది. ఇందులో అత్యంత కీలకమైన మార్నస్ లబుషేన్ క్యాచ్ కూడా ఉండడం గమనార్హం. అప్పటికి ఇంకా తన ఖత కూడా తెరవని లబుషేన్ ఆ తర్వాత ఏకంగా 70 పరుగులు సాధించి ఆస్ట్రేలియా తరఫున ఈ ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోర్ సాధించడమే గాక కెప్టెన్ పాట్ కమిన్స్ తో కలిసి ఏడో వికెట్ కి 59 పరుగులు జోడించడం విశేషం. జైస్వాల్ ఆ తరువాత స్పిన్నర్ అజయ్ జడేజా బౌలింగ్ లో కమిన్స్ ఇచ్చిన క్యాచ్ ని కూడా జారవిడిచాడు. ఈ మూడు క్యాచ్ లు భారత్ విజయావకాశాలను దెబ్బతీసాయనడంలో సందేహం లేదు. జైస్వాల్ క్యాచ్ లను జారవిడవడం పై కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేసాడు.అప్పటికి భారత్ ఈ టెస్ట్ మ్యాచ్ లో పట్టు బిగించే పరిస్థితి లో ఉంది. అయితే లబుషేన్, కమిన్స్ లు అవుటైన అనంతరం నాథన్ లియాన్ (41 నాటౌట్) మరియు స్కాట్ బోలాండ్ (10 పరుగులతో నాటౌట్) చివరి వికెట్ కి మరో 55 పరుగులు జోడించి అజేయంగా నిలిచారు.దీనితో ఆస్ట్రేలియా ఆధిక్యం ౩౩౩ పరుగులకి చేరుకొంది. ఆట చివరి రోజున ఇంత భారీ లక్ష్యాన్ని సాధించడం భారత్ బ్యాట్స్‌మెన్ కి అంత సులువు కాకపోవచ్చు. అసలే తడబడుతున్న భారత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ చివరి రోజున ఎలా రాణిస్తారో చూడాలి.గత వారం బ్రిస్బేన్‌లో జరిగిన డ్రా తర్వాత భారత్ యొక్క వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల శాతం 57.29 నుండి 55.88 కి పడిపోయింది. ప్రస్తుతం రోహిత్ శర్మ సారధ్యంలోని భారత్ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టిక లో మూడవ స్థానంలో ఉంది.ఆదివారం సెంచూరియన్‌లో పాకిస్థాన్‌ను ఓడించి దక్షిణాఫ్రికా (63.67) లార్డ్స్‌లో వచ్చే ఏడాది లో జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో తమ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా (58.89) మరియు దక్షిణాఫ్రికా (63.67) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు టెస్టుల్లో గెలవని పక్షంలో భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అవకాశాలు తక్కువనే చెప్పాలి. -
పాకిస్తాన్ ఓటమి.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సౌతాఫ్రికా
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2023-25 ఫైనల్‌కు ఆర్హత సాధించింది.సెంచూరియన్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్టులో 2 వికెట్ల తేడాతో విజయం సాధించిన సౌతాఫ్రికా.. తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టింది.ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో 11 మ్యాచ్‌లు ఆడిన ప్రోటీస్.. 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, మరో మూడింట ఓటమి, ఒకటి డ్రా చేసుకుంది. పాయింట్ల పట్టికలో 66.670 విన్నింగ్ శాతంతో దక్షిణాఫ్రికా అగ్రస్ధానంలో కొనసాగుతోంది. ఇక మిగిలిన ఒక స్ధానం కోసం ఆస్ట్రేలియా, భారత్ జట్లు పోటీపడుతున్నాయి.రబాడ, జాన్సెన్ విరోచిత పోరాటం..ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. 148 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు దక్షిణాఫ్రికా తీవ్రంగా శ్రమించింది. మార్కో జాన్సెన్, కగిసో రబడా విరోచిత పోరాటంతో తమ జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించారు. స్వల్ప లక్ష్య చేధనలో సౌతాఫ్రికా కేవలం 99 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పాక్ పేసర్ మహ్మద్ అబ్బాస్ 6 వికెట్లతో సఫారీలను దెబ్బకొట్టాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన జాన్సెన్(16), కగిసో రబాడ(31)లు అడ్డుగా నిలుచునున్నారు. అచితూచి ఆడుతూ లక్ష్యాన్ని చేధించారు. అంతకుముందు పాకిస్తాన్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 237 పరుగులకు ఆలౌటైంది.బాబర్ ఆజం (85 బంతుల్లో 50; 9 ఫోర్లు), సౌద్ షకీల్ (113 బంతుల్లో 84; 10 ఫోర్లు, 1 సిక్స్) ఇద్దరు అర్ధసెంచరీలతో రాణించారు. అదేవిధంగా సౌతాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 301 పరుగులు చేయగా.. పాకిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 211 పరుగులకే ఆలౌటైంది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు కేప్‌టౌన్ వేదికగా జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: IND vs IND: మెల్బోర్న్ టెస్టు.. భారత్ గెలిస్తే 96 ఏళ్ల రికార్డు బద్దలు! -
ఆసీస్‌తో మ్యాచ్: టీమిండియాకు ఆఖరి అవకాశం
ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న గవాస్కర్-బోర్డర్ ట్రోఫీ ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా మెల్బోర్న్లో గురువారం నుంచి జరగనున్న బాక్సింగ్ డే టెస్ట్(Boxing Day Test) కోసం రెండు దిగ్గజ జట్లు సంసిద్ధంగా ఉన్నాయి. ఈ సిరీస్ లో మూడు టెస్ట్ ల అనంతరం రెండు జట్లు చెరో టెస్ట్ మ్యాచ్ గెలిచి 1-1తో సమఉజ్జీలుగా ఉండగా, ఈ సిరీస్ ఫలితం పై రెండు జట్ల వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ భవితవ్యం కూడా ఆధారపడి ఉండటం ఈ సిరీస్ మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.ఆస్ట్రేలియా ఆశలన్నీ ఈ సిరీస్ పైనేరెండేళ్లకి ఒకమారు తొమ్మిది టెస్ట్ లు ఆడే దేశాల మధ్య జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(World Test Championship:) ఫైనల్ ఈ కాలంలో వివిధ జట్లు కనబరిచిన ప్రతిభ ఆధారంగా రెండు ఫైనల్ కి అర్హత సాధించే జట్లను నిర్ణయిస్తారు. ప్రస్తుత 2023-25 సీజన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పట్టిక లో దక్షిణాఫ్రికా ప్రధమ స్థానంలో ఉంది.శ్రీలంక తో సొంత గడ్డపై జరిగిన రెండు టెస్టుల సిరీస్ లో 2-౦ తేడాతో విజయం సాధించిన దక్షిణాఫ్రికా, పాయింట్ల పట్టిక లో 63.33 సగటు తో ప్రధమ స్థానానికి దూసుకుపోయింది. ఆస్ట్రేలియా ప్రస్తుతం 58.89 సగటు తో రెండో స్థానం లో ఉంది.అయితే ఆస్ట్రేలియా ప్రస్తుతం భారత్ తో జరుగుతున్న గవాస్కర్-బోర్డర్ ట్రోఫీ లోని మిగిలిన రెండు టెస్ట్ మ్యాచ్ ల తోపాటు శ్రీ లంక తో ఆ దేశంలో జరిగే మరో రెండు టెస్ట్ మ్యాచ్ ల్లో ఆడాల్సి ఉంది. అయితే ఆస్ట్రేలియా కి శ్రీ లంక ని స్పిన్ కి అనుకూలంగా ఉండే అక్కడ పిచ్ ల పై శ్రీ లంక ని ఓడించడం అంత సులువైన పని కాదు. అందుకే ఆస్ట్రేలియా కూడా ఈ రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించి తన అవకాశాలని సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది. అందుకే ప్రస్తుత సిరీస్‌పైనే ఆస్ట్రేలియా ఆశలు పెట్టుకుంది.టీమిండియాకు ఆఖరి అవకాశం ఈ సిరీస్ ఆరంభానికి ముందు న్యూజిలాండ్ తో సొంత గడ్డపై జరిగిన రెండు మ్యాచ్ ల సిరీస్ లో 0-2 తో ఘోర పరాభవం పొందిన భారత్(Team India) తొలిసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ స్థానాన్ని జారవిడుచుకునే ప్రమాదంలో పడింది. వరుసగా రెండు సార్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి అర్హత సాధించి, రెండింటిలో పరాభవాన్ని మూటగట్టుకున్న భారత్ కి ఈ రెండు టెస్టులలో విజయం సాధిస్తేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి అర్హత సాధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టిక లో భారత్ 55.88 సగటుతో మూడో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ సిరీస్ కి ముందు పాయింట్ల పట్టిక లో ప్రథమ స్థానంలో ఉన్న భారత్ కి ఇది ఎదురుదెబ్బే .రెండు సార్లు పరాభవం ఇంతకుముందు 2019-21 లో కరోనా అనంతరం ఇంగ్లాండ్ లోని సౌతాంఫ్టన్ లోని రైస్ బౌల్ స్టేడియంలో జరిగిన ప్రథమ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో భారత్ న్యూజిలాండ్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. తర్వాత 2021- 23 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి ఇంగ్లాండ్ లోన్ ఓవల్ స్టేడియం ఆతిధ్యాన్నిచ్చింది. ఈ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడిన భారత్ 209 పరుగుల తేడాతో వరుసగా రెండోసారి పరాజయంచవిచూసింది .ఈ నేపథ్యంలో ఈ సారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి అర్హత సాధించాలని భారత్ చాలా గట్టి పట్టుదలతో ఉంది. ఇందుకు ఈ రెండు టెస్ట్ ల లో విజయం సాధించడం ఒక్కటే భారత్ ముందున్న అవకాశం. లేని పక్షంలో వరుసగా రెండు టెస్ట్ ఛాంపియన్షియప్ ఫైనల్స్ లో పాల్గొన్న వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుత భారత జట్టు సారధి రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీలు కూడా అదే బాటలో పయనించి భారత్ టెస్ట్ జట్టు నుంచి తప్పుకున్నా ఆశ్చర్యం లేదు. -
పాక్‌తో టెస్టులు: సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. అన్క్యాప్డ్ ప్లేయర్లకు చోటు
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్‌కు అడుగుదూరంలో ఉంది సౌతాఫ్రికా. సొంతగడ్డపై పాకిస్తాన్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి.. టైటిల్ పోరుకు అర్హత సాధించాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో రిస్క్ తీసుకునేందుకు కూడా ప్రొటిస్ బోర్డు వెనుకాడటం లేదు.గాయం బారినపడ్డ కేశవ్ మహరాజ్, వియాన్ ముల్దర్లను కూడా టెస్టు జట్టుకు ఎంపిక చేయడం ఇందుకు నిదర్శనం. కాగా పాకిస్తాన్‌తో డిసెంబరు 26 నుంచి సౌతాఫ్రికా టెస్టు సిరీస్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి ప్రొటిస్ బోర్డు బుధవారం తమ జట్టును ప్రకటించింది.తొలి పిలుపుపదహారు మంది సభ్యులున్న ఈ టీమ్‌లో అన్క్యాప్డ్ ప్లేయర్‌కు చోటిచ్చింది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన కార్బిన్ బాష్‌కు తొలిసారి పిలుపునిచ్చింది. అదే విధంగా.. గజ్జల్లో గాయంతో బాధపడుతున్న స్పిన్నర్ కేశవ్ మహరాజ్, వేలి నొప్పి నుంచి కోలుకుంటున్న ఆల్‌రౌండర్ వియాన్ ముల్దర్‌ను కూడా ఈ జట్టులో చేర్చింది.కాగా తొలి వన్డే సందర్భంగా గాయపడ్డ కేశవ్ మహరాజ్ కోలుకోని పక్షంలో.. అతడి స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సెనూరన్ ముత్తుస్వామిని జట్టుకు ఎంపిక చేయనున్నారు. అదే విధంగా సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ముల్దర్ ఫిట్నెస్ సాధిస్తే.. బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కు ఉద్వాసన పలుకనున్నారు.క్వెనా మఫాకా కూడాఇక తెంబా సారథ్యంలో పాక్‌తో టెస్టులు ఆడనున్న సౌతాఫ్రికా జట్టులో స్థానం సంపాదించిన బాష్.. ఇప్పటి వరకు 34 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 40.46 సగటుతో పరుగులు రాబట్టడంతో పాటు.. 72 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. మరో పేసర్, పద్దెమినిదేళ్ల క్వెనా మఫాకా కూడా తొలిసారి టెస్టు జట్టులోకి వచ్చాడు.అయితే, పేస్ సూపర్స్టార్లు లుంగి ఎంగిడి, గెరాల్డ్ కొయెట్జిలతో పాటు నండ్రీ బర్గర్, లిజాడ్ విలియమ్స్ తదితరులు సెలక్షన్‌కు అందుబాటులో లేరు. మరోవైపు.. కగిసో రబడ, మార్కో జాన్సెన్ పాక్‌తో తొలి వన్డే ఆడినా.. ఆ తర్వాత నుంచి విశ్రాంతి తీసుకోనున్నారు. టెస్టుల నేపథ్యంలో బోర్డు వారికి రెస్ట్ ఇచ్చింది. కాగా పాక్‌తో ఒక్క టెస్టులో గెలిచినా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో సౌతాఫ్రికా ముందు వరుసలో ఉంటుంది. ఇక పాక్‌తో సౌతాఫ్రికా టెస్టులకు సెంచూరియన్, కేప్‌టౌన్ వేదికలు. పాకిస్తాన్‌తో టెస్టులకు సౌతాఫ్రికా జట్టుతెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హామ్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్, టోనీ డి జోర్జీ, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, క్వెనా మఫాకా, ఐడెన్ మార్క్రమ్, వియాన్ ముల్దర్, సెనురన్ ముత్తుస్వామి, డేన్ ప్యాటర్సన్, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరెయిన్ (వికెట్ కీపర్).చదవండి: WTC Final: టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతుందా? -
WTC Final: టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే?
ఆస్ట్రేలియాతో మూడో టెస్టు డ్రా కావడం టీమిండియాకు సానుకూలాంశంగా పరిణమించింది. ఈ మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసిపోవడం వల్ల ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ రేసులో రోహిత్ సేన నిలవగలిగింది. అయితే, మిగిలిన రెండు టెస్టుల్లో కచ్చితంగా గెలిస్తేనే భారత్‌కు మార్గం సుగమమవుతుంది.మూడో స్థానంలోనే టీమిండియాడబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో తమ చివరి టెస్టు సిరీస్ ఆడుతోంది. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కనీసం నాలుగు గెలిస్తేనే భారత్‌కు నేరుగా ఫైనల్లో అడుగుపెట్టే అవకాశం ఉండేది. ఈ క్రమంలో తొలి టెస్టులో భారీ తేడాతో గెలిచిన టీమిండియా.. రెండో టెస్టులో మాత్రం ఘోరంగా ఓడిపోయింది.అయితే, మూడో మ్యాచ్‌లో ఓటమి నుంచి తప్పించుకుని కనీసం డ్రా చేసుకోగలిగింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రోహిత్ సేన మూడో స్థానం నిలబెట్టుకోగలిగింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 114 పాయింట్లు ఉన్నాయి. ఇక విజయాల శాతం 55.88గా ఉంది.మరోవైపు.. అగ్రస్థానంలో ఉన్న సౌతాఫ్రికాకు 76 పాయింట్లే ఉన్నా.. గెలుపు శాతం 63.33. ఇక రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఖాతాలో 106 పాయింట్లు ఉండగా.. విన్నింగ్ పర్సెంటేజ్ 58.89. కాగా సౌతాఫ్రికా తదుపరి సొంతగడ్డ మీద పాకిస్తాన్‌తో రెండు టెస్టులు ఆడనుంది.ఇక ఆస్ట్రేలియా కూడా టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ముగిసిన తర్వాత శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ రెండు జట్లు తమ తదుపరి సిరీస్‌లలో సులువుగానే గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి... టీమిండియాకు పెద్ద సవాలే ముందుంది.రోహిత్ సేన తప్పక గెలవాల్సిందేఈ సీజన్లో టీమిండియాకు మిగిలినవి రెండే టెస్టులు. ఆసీస్‌తో మెల్బోర్న్, సిడ్నీ టెస్టులో కచ్చితంగా రోహిత్ సేన గెలవాల్సిందే. తద్వారా ఆస్ట్రేలియాపై 3-1తో విజయం సాధిస్తే.. భారత్ విజయాల శాతం 60.52కు పెరుగుతుంది. మరోవైపు.. ఆసీస్ విన్నింగ్ పర్సెంటేజ్ 57 శాతానికి పడిపోతుంది. దీంతో టీమిండియాకు ఫైనల్ లైన్ క్లియర్ అవుతుంది.లేని పక్షంలో.. ఒకవేళ ఈ సిరీస్ 2-2తో డ్రా అయితే.. రోహిత్ సేన గెలుపు శాతం 57.01 అవుతుంది. అదే గనుక జరిగితే ఆస్ట్రేలియాకు టైటిల్ పోరుకు అర్హత సాధించడం సులువవుతుంది. శ్రీలంక టూర్లో కంగారూలు 2-0తో గెలిస్తే నేరుగా ఫైనల్లో అడుగుపెడుతుంది.సౌతాఫ్రికాకు లైన్‌క్లియర్!ఇక సౌతాఫ్రికా పాకిస్తాన్‌ను గనుక 2-0తో క్లీన్‌స్వీప్ చేస్తే ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది. కాబట్టి అప్పుడు రెండోస్థానం కోసం రేసు ప్రధానంగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్యే ఉంది. ఒకవేళ పాకిస్తాన్ ఏదైనా అద్భుతం చేసి సౌతాఫ్రికాను నిలువరిస్తే అప్పుడు పరిస్థితి మరింత రసవత్తరంగా మారుతుంది. చదవండి: అదే జరిగితే కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్‌బై! -
WTC: బుమ్రా అరుదైన రికార్డు.. భారత తొలి బౌలర్‌గా
ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో మెరిశాడు. బ్రిస్బేన్‌లో పేస్ దళాన్ని ముందుకు నడిపించిన ఈ స్పీడ్‌స్టర్.. ఆదివారం నాటి ఆటలో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(21)ను అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ నాథన్ మెక్‌స్వీనీ(9)ని కూడా తానే పెవిలియన్‌కు పంపాడు.ఆ ఇద్దరి సెంచరీలుఈ క్రమంలో బుమ్రా స్ఫూర్తితో యువ పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మార్నస్ లబుషేన్(12) ఆట కట్టించాడు. ఫలితంగా 75 పరుగుల వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. దీంతో భారత శిబిరంలో ఉత్సాహం నెలకొంది. అయితే, ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు.నాలుగో నంబర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌కు తోడైన ట్రవిస్ హెడ్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 115 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. టెస్టుల్లో తన తొమ్మిదవ సెంచరీ నమోదు చేసిన అనంతరం హెడ్.. కొరకరాని కొయ్యగా మారాడు. ఈ క్రమంలో.. ఫామ్‌లోలేని స్మిత్ సైతం హెడ్ ఇచ్చిన జోష్‌లో శతక్కొట్టేశాడు.బుమ్రా విడగొట్టేశాడుఈ మిడిలార్డర్ బ్యాటర్లను విడదీసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. అయితే, మరోసారి బుమ్రానే తన అనుభవాన్ని ఉపయోగించి స్మిత్(101)ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత కాసేపటికే ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్(5) వికెట్‌ను కూడా బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు.అనంతరం.. శతకవీరుడు ట్రవిస్ హెడ్(152)ను కూడా అవుట్ చేశాడు బుమ్రా. దీంతో టీమిండియాలో తిరిగి ఉత్సాహం నిండింది. ఇక హెడ్ రూపంలో ఈ ఇన్నింగ్స్‌లో ఐదో వికెట్ దక్కించుకున్న బుమ్రా. తన కెరీర్లో ఓవరాల్‌గా పన్నెండోసారి(Five Wicket Haul) ఈ ఘనత సాధించాడు.Jasprit Bumrah gets Travis Head to bring up his fifth wicket! #AUSvIND | #MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/2QGUazarZP— cricket.com.au (@cricketcomau) December 15, 2024అదే విధంగా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)లో అతడికి ఇది తొమ్మిదో ఫైవ్ వికెట్ హాల్. అంతేకాదు.. ఆస్ట్రేలియా గడ్డ మీద నాలుగోసారి బుమ్రా ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ క్రమంలో బుమ్రా రెండు అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నాడు.కమిన్స్ సరసన.. భారత తొలి బౌలర్‌గా రికార్డుడబ్ల్యూటీసీలో అత్యధికసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన క్రికెటర్‌గా ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ కొనసాగుతున్నాడు. అతడు ఇప్పటికి తొమ్మిదిసార్లు ఈ ఘనత సాధించాడు. తాజా టెస్టుతో బుమ్రా కూడా కమిన్స్ సరసన చేరాడు. ఈ జాబితాలో సౌతాఫ్రికా పేసర్ కగిసో రబడ(7), ఆసీస్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్(6), న్యూజిలాండ్ ఫాస్ట్‌బౌలర్ టిమ్ సౌథీ(6) వీరి తర్వాతి స్థానాలో ఉన్నారు.కుంబ్లే రికార్డును సమం చేసిన బుమ్రాఇక ఆస్ట్రేలియా గడ్డపై నాలుగుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన భారత బౌలర్‌గా అనిల్ కుంబ్లే కొనసాగుతున్నాడు. బ్రిస్బేన్ టెస్టుతో బుమ్రా కూడా కుంబ్లే రికార్డును సమం చేశాడు. ఇదిలా ఉంటే.. ఓవరాల్‌గా 23సార్లు కపిల్ దేవ్ ఫైవ్ వికెట్ల హాల్ సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.ఆసీస్‌దే పైచేయిబ్రిస్బేన్లో గబ్బా మైదానంలో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా టీమిండియాపై పైచేయి సాధించింది. ఆదివారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యే సరికి ఏడు వికెట్ల నష్టానికి 405 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. హెడ్, స్మిత్ సెంచరీలకు తోడు వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(45 నాటౌట్) రాణించడం వల్ల ఇది సాధ్యమైంది. ఇక భారత బౌలర్లలో బుమ్రా ఐదు, నితీశ్ రెడ్డి, మహ్మద్ సిరాజ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో పెర్త్ టెస్టులో భారత్, అడిలైడ్ పింక్‌బాల్ టెస్టులో ఆసీస్ విజయం సాధించాయి. దీంతో ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది.చదవండి: భారత్‌తో మూడో టెస్టు: ట్రవిస్ హెడ్ వరల్డ్ రికార్డు.. సరికొత్త చరిత్ర -
ఆసీస్ చేతిలో ఘోర ఓటమి.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే?
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని విజయంతో ఆరంభించిన టీమిండియాకు రెండో టెస్టులో మాత్రం బిగ్ షాక్ తగిలింది. అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో 10 వికెట్ల తేడాతో భారత్ ఘోర పరాజయం పాలైంది. 19 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా చేధించింది.బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ముఖ్యంగా సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ దారుణ ప్రదర్శన కనబరిచింది. వీరితోపాటు తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన యశస్వి జైశ్వాల్ సైతం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. ఇక ఈ ఓటమితో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్ధానాన్ని కోల్పోయింది. భారత్ విన్నింగ్ శాతం 57.2తో ఏకంగా మూడో స్ధానానికి పడిపోయింది.దీంతో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే అవకాశాలు మరింత సన్నగిల్లాయి. ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా(60.71 విన్నింగ్ పర్సంటేజీ) టాప్ ప్లేస్‌కు చేరుకోగా.. దక్షిణాఫ్రికా(59.26 విన్నింగ్ పర్సంటేజీ) రెండో స్ధానానికి ఎగబాకింది.భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే?కాగా భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఆసీస్‌తో మిగిలిన మూడు టెస్టులు చాలా కీలకం. ఈ మూడు మ్యాచ్‌లలో భారత్ విజయం సాధిస్తే 4-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. అప్పుడు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా రోహిత్ సేన నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెడుతోంది.అయితే వరుస మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై ఓడించడం అంత సులభం కాదు. కాబట్టి భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ భవితవ్యం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడిందేనే చెప్పుకోవాలి. డబ్ల్యూటీసీ 2023- 25 సైకిల్లో భారత్‌కు ఇదే చివరి సిరీస్ కాగా.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఇంకా సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఆస్ట్రేలియా శ్రీలంకతో, సఫారీలు పాకిస్తాన్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడనునున్నాయి. ఆ సిరీస్ ఫలితాలు భారత్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేయనున్నాయి.👉బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ 3-1తో సొంతం చేసుకున్నా కానీ నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆర్హత సాధించదు. ఒకవేళ అలా జరగాలంటే రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో దక్షిణాఫ్రికాను పాకిస్తాన్ 2-0 తేడాతో ఓడించాలి. ప్రోటీస్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉంది. శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ దిశగా సఫారీలు దూసుకుపోతున్నారు. కాబట్టి స్వదేశంలో దక్షిణాఫ్రికాను ఓడించడం పాక్‌కు అంత ఈజీ కాదు.👉ఒకవేళ ఆసీస్‌తో సిరీస్‌ను భారత్ 3-2తో గెలిస్తే.. అప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్ భవితవ్యం శ్రీలంకపై ఆధారపడి ఉంటుంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో కనీసం ఒక మ్యాచ్‌లో విజయం లేదా డ్రా చేసినా చాలు భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెడుతోంది.చదవండి: ENG vs NZ: న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్.. 16 ఏళ్ల తర్వాత సిరీస్ కైవసం -
WTC: ఇవేం లెక్కలు.. ఇవేం శిక్షలు: ఐసీసీపై బెన్ స్టోక్స్ ఆగ్రహం
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తీరుపై ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ విమర్శలు గుప్పించాడు. ఓవర్ రేటు విషయంలో తమకు అన్యాయం జరిగిందనే అర్థం స్ఫురించేలా సోషల్ మీడియా వేదికగా వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు. ఆతిథ్య కివీస్ జట్టుపై గెలుపుకాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా మూడు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఇరుజట్ల మధ్య క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పర్యాటక ఇంగ్లండ్ ఆతిథ్య కివీస్ జట్టుపై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది.పెనాల్టీ వేసిన ఐసీసీఅయితే, ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు నమోదైందన్న కారణంగా ఐసీసీ ఇంగ్లండ్- న్యూజిలాండ్‌లకు పెనాల్టీ వేసింది. డబ్ల్యూటీసీ పాయింట్లలో మూడు పాయింట్ల మేర కోత పెట్టింది. ఈ నేపథ్యంలో స్టోక్స్ స్పందిస్తూ.. ‘చాలా మంచిది ఐసీసీ... మరో పది గంటల ఆట మిగిలి ఉండగానే టెస్టు ముగిసింది’... అని సెటైర్ వేశాడు.స్టోక్స్‌కు ఆగ్రహానికి కారణం?ఇదిలా ఉంటే.. 2021–23 డబ్ల్యూటీసీ ఎడిషన్‌లోనూ ఇంగ్లండ్ ఇదే కారణంగా ఏకంగా 22 పాయింట్లు కోల్పోయింది. గత ఏడాది యాషెస్ సిరీస్ ఫలితం తర్వాత ఇంగ్లండ్ ఖాతాలో 28 పాయింట్లు చేరగా... పెనాల్టీ రూపంలోనే 19 పాయింట్లు పోయాయి! సహజంగానే ఇది స్టోక్స్‌కు ఆగ్రహం తెప్పిస్తోంది. అసలు ఓవర్ రేట్ శిక్షలు అనేవే అత్యంత గందరగోళంగా ఉన్నాయని అతడు అన్నాడు.గతంలోనూ తాను ఈ అంశాన్ని లేవనెత్తిన విషయాన్ని స్టోక్స్ గుర్తు చేశాడు. టెస్టు మ్యాచ్ నిర్ణీత సమయంకంటే చాలా ముందే ముగిసిపోయినా... ఓవర్ రేట్ శిక్షలు వేయడం ఏమిటని అతను ప్రశ్నించాడు. ‘రెండు జట్ల కోణంలో ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే టెస్టు మ్యాచ్ చాలా ముందుగానే ముగిసింది. మ్యాచ్‌లో ఫలితం కూడా వచ్చింది. అసలు ఏమాత్రం అవగాహన లేకుండా వేస్తున్న పెనాల్టీలు తీవ్ర అసహనం కలిగిస్తున్నాయి.ఉపఖండంలో ఇలాంటి సమస్య రాదుప్రపంచంలో మనం ఎక్కడ క్రికెట్ ఆడుతున్నామనేది కూడా ముఖ్యం. ఉపఖండంలో జరిగే మ్యాచ్‌లలో ఎప్పుడూ ఈ సమస్య రాదు. ఎందుకంటే అక్కడ స్పిన్నర్లు ఎక్కువ ఓవర్లు బౌల్ చేస్తారు. మైదానంలో బౌలర్‌తో మళ్లీ మళ్లీ మాట్లాడటంతో పాటు ఓవర్ల తర్వాత ఫీల్డింగ్ మార్పులు, వ్యూహాల్లో మార్పులు వంటి చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.ఒక కెప్టెన్‌గా నేను ఇదే పని చేస్తాను. ఇవన్నీ పట్టించుకోకుండా తొందరపెడితే ఎలా?.. మేం అక్కడ ఉన్నది మ్యాచ్ ఆడటానికి అనే విషయం మరచిపోవద్దు. చాలా మంది ఆటగాళ్లది ఇదే అభిప్రాయం. ఐసీసీ ఈ విషయంలో మరింత స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉంది. ఐసీసీ నుంచి స్పందన రాలేదుఏడాది క్రితం కూడా నేను దీనిపై మాట్లాడాను. కానీ ఐసీసీ నుంచి స్పందన రాలేదు. అందుకే అప్పటి నుంచి ఓవర్ రేట్ పెనాల్టీ షీట్లపై సంతకం పెట్టలేదు. కానీ ఐసీసీ జరిమానా విధించి పాయింట్లతో కోత ఎలాగూ విధిస్తుంది’ అని స్టోక్స్ తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా వెల్లడించాడు. చదవండి: ‘ధోనితో నాకు మాటల్లేవు.. పదేళ్లకు పైగానే అయింది.. అయినా అలాంటి వాళ్లకు’ -
WTC: ఆస్ట్రేలియాకు భారీ షాక్!.. మరి టీమిండియా పరిస్థితి ఏంటి?
శ్రీలంకతో తొలి టెస్టులో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. డర్బన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 233 పరుగుల తేడాతో శనివారం జయభేరి మోగించింది. కాగా రెండు టెస్టులు ఆడే క్రమంలో శ్రీలంక సౌతాఫ్రికాలో పర్యటిస్తోంది.ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య బుధవారం తొలి టెస్టు మొదలుకాగా.. నాలుగో రోజుల్లోనే ముగిసిపోయింది. కింగ్స్‌మేడ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా.. తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ తెంబా బవుమా 70 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.స్టబ్స్, బవుమా శతకాలుఅనంతరం సౌతాఫ్రికా పేసర్లు విజృంభించడంతో శ్రీలంక 42 పరుగులకే కుప్పకూలింది. మార్కో జాన్సెన్ ఏడు వికెట్లతో చెలరేగగా.. గెరాల్డ్ కోయెట్జి రెండు, కగిసో రబడ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో 149 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా దుమ్ములేపింది.ట్రిస్టన్ స్టబ్స్(122), కెప్టెన్ బవుమా(113) శతకాలతో విరుచుకుపడటంతో భారీ ఆధిక్యం సంపాదించింది. ఐదు వికెట్ల నష్టానికి 366 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని 515 పరుగులు స్కోరు బోర్డు మీద ఉంచింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అతడేఈ క్రమంలో 516 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 282 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా సౌతాఫ్రికా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మార్కో జాన్సెన్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. రబడ, కోయెట్జి, కేశవ్ మహరాజ్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో పదకొండు వికెట్లు పడగొట్టి ప్రొటిస్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మార్కో జాన్సెన్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.ఆస్ట్రేలియాకు భారీ షాక్ఇదిలా ఉంటే.. లంకపై భారీ గెలుపుతో సౌతాఫ్రికా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25(డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో ముందుకు దూసుకువచ్చింది. ఐదో స్థానం నుంచి ఏకంగా రెండోస్థానానికి ఎగబాకి.. ఆస్ట్రేలియాను వెనక్కినెట్టింది. మరోవైపు.. ఆస్ట్రేలియాను పెర్త్ టెస్టులో ఓడించిన టీమిండియా మాత్రం అగ్రస్థానం నిలబెట్టుకుంది.PC: ICCఇక డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌లో సౌతాఫ్రికాకు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. శ్రీలంకతో ఒకటి, పాకిస్తాన్‌తో రెండు టెస్టులు ఆడనుంది. ఈ మూడూ సొంతగడ్డపైనే జరుగనుండటం సౌతాఫ్రికాకు సానుకూలాంశం. వీటన్నింటిలోనూ ప్రొటిస్ జట్టు గెలిచిందంటే.. ఫైనల్ రేసులో తానూ ముందు వరుసలో ఉంటుంది.టీమిండియా పరిస్థితి ఏంటి?ఎటువంటి సమీకరణలతో పనిలేకుండా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. ఆసీస్ గడ్డపై ఐదింటిలో కనీసం నాలుగు కచ్చితంగా గెలవాల్సిందే. ఇప్పటికే ఒక విజయం సాధించింది కాబట్టి.. ఇంకో మూడు గెలిస్తే చాలు నేరుగా తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. లేదంటే.. మిగతా జట్ల మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. రోహిత్ సేన తదుపరి ఆసీస్‌తో అడిలైడ్‌లో పింక్ బాల్ టెస్టులో తలపడనుంది.చదవండి: టీమిండియాతో రెండో టెస్టు.. అతడిపై వేటు వేయండి: ఆసీస్ మాజీ క్రికెటర్ -
BGT: ఈసారి టీమిండియా గెలవడం కష్టమే.. అతడు లేడు కాబట్టి..
టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఈసారి మరింత రసవత్తరంగా మారనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ చేరాలంటే ఇరుజట్లకు ఈ సిరీస్ అత్యంత కీలకం. ముఖ్యంగా రోహిత్ సేన ఇందులో భాగమైన ఐదు టెస్టుల్లో కనీసం నాలుగు గెలిస్తేనే టైటిల్ పోరుకు అర్హత సాధించే అవకాశం ఉంటుంది.మరోవైపు.. ఇటీవల స్వదేశంలో భారత జట్టు ఘోర ఓటమిని చవిచూసింది. న్యూజిలాండ్ చేతిలో 3-0తో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది. తద్వారా సొంతగడ్డపై ఇలాంటి పరాభవం పొందిన తొలి జట్టుగా రోహిత్ సేన అపఖ్యాతి మూటగట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా పర్యటన ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)లో టీమిండియా నెగ్గడం అంత సులువు కాదని.. ఈ దఫా కంగారూ జట్టు పైచేయి సాధించే అవకాశం ఉందని అంచనా వేశాడు. ప్రస్తుతం ఛతేశ్వర్ పుజారా లాంటి ఆటగాడి అవసరం జట్టుకు ఎంతగానో ఉందని.. అతడి లాంటి ఆటగాడు ఉంటేనే టీమిండియా మరోసారి ఆసీస్‌లో సిరీస్ నెగ్గగలదని పేర్కొన్నాడు.ఈసారి టీమిండియా గెలవడం కష్టమేఈ మేరకు వసీం జాఫర్ మాట్లాడుతూ.. ‘‘ఈసారి టీమిండియా గెలవడం కష్టమే. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించడం అత్యంత కష్టమైన పని. గత రెండు సందర్భాల్లో ఇండియా అద్భుతంగా ఆడి సిరీస్‌లు గెలిచింది.అయితే, అప్పటి కంటే ఇప్పుడు ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈసారి పుజారా జట్టుతో లేడు. అప్పటి పర్యటనలో అతడే ప్రధాన ఆటగాడు అని చెప్పవచ్చు. కొత్త బంతితో తొలుత ఫాస్ట్ బౌలర్లను ట్రై చేసి.. ఆ తర్వాత పిచ్ పరిస్థితికి అనుగుణంగా క్రీజులో పాతుకుపోయి.. పరుగులు రాబట్టడం అతడి స్టయిల్.అలా అయితే.. ఆస్ట్రేలియాదే పైచేయి అవుతుందిప్రస్తుతం టీమిండియాకు పుజారా లాంటి ఆటగాడి అవసరం ఎంతగానో ఉంది. వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధిస్తేనే ఈసారి భారత్ గెలిచే అవకాశం ఉంటుంది. లేదంటే.. ఆస్ట్రేలియాదే పైచేయి అవుతుంది’’ అని స్పోర్ట్స్‌తక్‌తో పేర్కొన్నాడు.కాగా చివరగా 2018-19 పర్యటనలో పుజారా.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి 74.42 సగటుతో 521 పరుగులు సాధించాడు. నాటి సిరీస్‌లో టీమిండియా 2-1తో గెలిచిన విషయం తెలిసిందే. అయితే, గత కొంతకాలంగా పుజారాకు జట్టులో చోటు కరువైంది. ఇక కివీస్‌తో సిరీస్‌లో ఈ నయా వాల్ లేని లోటు స్పష్టంగా కనిపించగా.. ఆసీస్ టూర్లో ఆ వెలితి మరింత ఎక్కువగా ఉంటుందని మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు.చదవండి: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్.. భారీ రికార్డులపై కన్నేసిన సూర్యకుమార్ -
'డబ్ల్యూటీసీ ఫైనల్‌పై ఆశలు వద్దు.. ఆసీస్‌ను భారత్ ఓడించలేదు'
సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్‌కు గురైనటీమిండియా ఇప్పుడు మరో కఠిన పరీక్షకు సిద్దమవుతోంది. మరో వారం రోజుల్లో ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఆస్ట్రేలియాకు పయనం కానుంది. నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆసీస్‌తో భారత్ అమీతుమీ తెల్చుకోనుంది.గత రెండు పర్యాయాలు కంగారులను వారి సొంతగడ్డపై చిత్తు చేసిన టీమిండియా ఈసారి కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. కానీ ప్రస్తుత భారత జట్టు ప్రదర్శను చూస్తుంటే హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.అంతేకాకుండా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే భారత్‌కు బీజీటీ ట్రోఫీ ఎంతో కీలకం. ఈ సిరీస్‌లో 4-0 తేడాతో గెలిస్తేనే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆర్హత సాధిస్తుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ గవాస్కర్ ఆప వ్యాఖ్యలు చేశాడు."భారత్ డబ్యూటీసీ ఫైనల్‌కు చేరుతుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై టీమిండియా 4-0తో ఓడించలేదు. ఒకవేళ ఆసీస్‌ను భారత్ ఓడిస్తే మాత్రం నేను గాల్లో తేలుతాను. అసలు డబ్ల్యూటీసీ ఫైనల్ గురించే నేను మాట్లాడుకోవడం లేదు.ఇప్పుడు కేవలం ఆస్ట్రేలియాలో సిరీస్ గెలుపైనే దృష్టిపెట్టిండి. 1-0, 2-0, 3-1, 2-1 తేడాతో సిరీస్ గెలిచినా పర్వాలేదు. సిరీస్ గెలవడం ముఖ్యం. ఎందుకంటే భారత క్రికెట్ అభిమానులందరూ ప్రస్తుతం తీవ్ర నిరాశలో ఉన్నారు. మీరు గెలిచి మళ్లీ ఫ్యాన్స్‌లో జోష్ నింపండి" అంటూ ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ పేర్కొన్నాడు.చదవండి: PAK Vs AUS 1st ODI: అదృష్టం వల్లే ఆస్ట్రేలియా గెలిచింది: పాక్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు -
ఆత్మపరిశీలన అవసరం!
సొంతగడ్డపై చిరకాలంగా భారత క్రికెట్ జట్టు అజేయమైనదనే రికార్డు కుప్పకూలింది. భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ చేతిలో మనవాళ్ళు మొత్తం 3 టెస్టుల్లోనూ ఓటమి పాలయ్యారు. స్వదేశంలో టెస్ట్సిరీస్ను ఇలా 0–3 తేడాతో చేజార్చుకోవడం భారత క్రికెట్చరిత్రలో ఇదే ప్రథమం. కాగా, ఈ సిరీస్ పరాభవంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ర్యాంకింగుల్లో భారత్ అగ్రస్థానం ఆస్ట్రేలియాకు కోల్పోయి, ద్వితీయ స్థానానికి పడిపోయింది. ఆటలో గెలుపోటములు సహజమైనా, ఈ స్థాయి పరాజయం భారత జట్టు అత్యవసరంగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. టీ20ల మోజులో పడి టెస్ట్ క్రికెట్‌కు అవసరమైన కనీసపాటి సన్నద్ధత అయినా లేకుండానే బరిలోకి దిగిన మన ఆటగాళ్ళ నిర్లక్ష్యాన్ని నిలదీస్తోంది. ఆఖరుసారిగా 2012లో ఇంగ్లండ్‌కు చెందిన అలస్టయిర్ కుక్ చేతిలో ధోనీ సేన 2–1 తేడాతో టెస్ట్ సిరీస్‌లో ఓటమి పాలైన తర్వాత గత పుష్కరకాలంగా భారత క్రికెట్ జట్టు స్వదేశంలో ఎన్నడూ మళ్ళీ సిరీస్‌ను కోల్పోలేదు. భారత జట్టు సారథులు మారుతూ వచ్చినా, 18 టెస్ట్ సిరీస్‌లలో విజయం మనదే. కివీస్‌పైనా ఆ ట్రాక్ రికార్డ్ కొనసాగుతుందని అందరూ భావించిన నేపథ్యంలో ఇది ఊహించని ఎదురుదెబ్బ. గత నెలలో బెంగుళూరులో 8 వికెట్ల తేడాతో తొలి టెస్ట్, ఆ వెంటనే పుణేలో 113 పరుగుల తేడాతో మలి టెస్ట్ ఓడిపోయినప్పుడే సిరీస్ చేజారింది. అయితే, ముంబయ్‌లో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లోనైనా గెలిచి, భారత జట్టు పరువు నిలుపుకొంటుందని ఆశించారు. చివరకు ఆ ఆశను కూడా వమ్ము చేసి, కివీస్ ముందు మన ఆటగాళ్ళు చేతులెత్తేయడం ఇప్పుడిప్పుడే మర్చిపోలేని ఘోర పరాభవం. ముంబయ్‌లో 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సైతం ఛేదించలేక ఆదివారం భారత జట్టు 121 పరుగులకే ఆలౌట్ అవడంతో, అవమానకరమైన రీతిలో 0–3 తేడాతో సిరీస్‌ను పోగొట్టుకోవాల్సి వచ్చింది. కచ్చితంగా ఇది భారత జట్టుకు మేలుకొలుపు. భారత జట్టు వ్యూహరచన లోపాలు కొల్లలు. కివీస్‌తో బెంగుళూరు టెస్ట్‌లో టాస్ గెలిచాక మన వాళ్ళు మొదట బ్యాటింగ్ ఎంచుకోవడం అలాంటిదే. బ్యాట్స్మన్ల ఆర్డర్లో అనూహ్య ప్రయోగాల సంగతీ అంతే. ఇక, అవసరం లేకున్నా పుణేలో బంతి సుడులు తిరిగేలా పిచ్ రూపొందించారు. అదీ ప్రత్యర్థి జట్టుకే లాభించింది. కాబట్టి, భారత జట్టులోని మేధాబృందం ఆగి, ఆలోచించాలి. సిరీస్‌కు ముందు దులీప్ ట్రోఫీలో ఆడాలని చెప్పినా, మరిన్ని వసతుల కోసం అనంతపురం నుంచి బెంగు ళూరుకు వేదిక మార్చినా అగ్రశ్రేణి ఆటగాళ్ళు ముందుకు రాకపోవడం ఘోరం. వారిని అందుకు అనుమతించడం ఒక రకంగా క్రికెట్ బోర్డ్ స్వయంకృతాపరాధమే. దాని పర్యవసానం, సిరీస్ భవిత తొలి టెస్ట్, తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల అత్యల్పస్కోర్కి భారత్ అవుటైనప్పుడే అర్థమైపోయింది. స్పిన్ ఆడడంలో భారత ఆటగాళ్ళు దిట్టలని ప్రతీతి. కానీ, అదంతా గతం. ఇప్పుడు పరిస్థితి మారింది. జట్టులో బెస్ట్ బ్యాట్స్‌మెన్ అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఇద్దరూ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌లో తరచూ ఔటవుతున్నారనీ, 2021 – 2024 మధ్య సొంత గడ్డపైన స్పిన్ బౌలింగ్‌లో సాధించిన సగటు పరుగులు 30 మాత్రమేననీ విశ్లేషకులు లెక్కలు తీశారు. అసాధారణ స్పిన్నర్లు కాకున్నా, కివీస్ బౌలర్ల చేతుల్లో భారత ఆటగాళ్ళు టకటకా ఔటవడం చూస్తే, స్పిన్‌లో మనం మాస్టర్లం కాదని తాజా సిరీస్ ఎత్తిచూపినట్టయింది. అలాగే, ఎర్ర బంతితో ఆడే టెస్ట్‌లకూ, తెల్ల బంతితో నడిచే టీ20 లకూ మధ్య చాలా తేడా ఉందని ఆటగాళ్ళు గ్రహించాలి. అన్ని బంతులూ ఆడి తీరాలి, పరుగులు చేయాలనే టీ20ల ధోరణితోనే టెస్ట్‌లు ఆడితే చిక్కులు తప్పవు. 2021లో టెస్ట్ ఓపెనర్‌గా ఇంగ్లండ్‌లో సక్సెస్ సాధించిన రోహిత్ మార్చుకున్న టీ20 ధోరణితోనే కివీస్‌పై ఆడడం వల్ల ఇబ్బంది పడ్డారు. కెప్టెన్‌గా ఆయనే పరుగులు చేయకపోతే, జట్టు పైన, ఆయన సారథ్యంపైన ఒత్తిడి తప్పదు. గతంలో 2011–12 ఆస్ట్రేలియా పర్యటన భారత జట్టు నుంచి ద్రావిడ్, లక్ష్మణ్‌ల రిటైర్మెంట్కు దారి తీసింది. చరిత్ర పునరావృతమై, ఇప్పుడు రానున్న టూర్ కోహ్లీ, రోహిత్‌లకు చివరిది అవుతుందా? చెప్పలేం. అనూహ్యంగా వారిద్దరూ విఫలమైన కివీస్ సిరీస్ పరిస్థితే ఆస్ట్రేలియా టూర్ లోనూ ఎదురైతే, సీనియర్లు రిటైర్ కావాలంటూ ఒత్తిడి పెరుగుతుంది. ఇక, వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపి యన్ షిప్ విషయానికొస్తే, కివీస్ సిరీస్ దెబ్బతో వరల్డ్ టెస్ట్ ర్యాకింగుల్లో మన స్థానం పడిపోయినందున భారత్ ఫైనల్‌కు చేరడం కష్టమే. ఇంకా చెప్పాలంటే, ఆస్ట్రేలియాను దాని సొంత గడ్డపై 4–0 తేడాతో ఓడిస్తే కానీ, మన ఫైనల్ ఆశ పండదు. ఏ రకంగా చూసినా అసాధ్యమే. ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియా టూర్‌లోనైనా మన జట్టు మితిమీరిన ఆలోచనలు, అంచనాలు పక్కనబెట్టి కేవలం ఆడు తున్న టెస్టులపై ఒకదాని వెంట మరొకటిగా దృష్టి పెడితే మేలు. పరిస్థితులు, పిచ్ స్వభావాన్ని బట్టి అప్పటికప్పుడు ఆట తీరును మలుచుకోవాలే తప్ప, ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చి దూకుడు చూపుదామనుకుంటే చిక్కే. మారకపోతే మళ్ళీ కివీస్‌తో సిరీస్‌లో లాగా బోర్లా పడక తప్పదు. నిజానికి, భారత్ ఇప్పటికీ మంచి జట్టే. ఆటగాళ్ళలో ప్రతిభకు కొదవ లేదు. అయితే, టాలెంట్ ఎంత ఉన్నా ఆటలో టెంపర్మెంట్ ముఖ్యం. వాటికి తోడు కింద పడినా మళ్ళీ పైకి లేచి సత్తా చాటే చేవ కీలకం. మన జట్టు ఇప్పుడు వీటిని ప్రదర్శించాలి. అందుకోసం తాజా సిరీస్ ఓటమికి కారణాలను ఆత్మపరిశీలన చేసుకోవాలి. భారత క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా 3–0 తేడాతో సిరీస్‌ను కోల్పోయి, ఈ అధఃపాతాళానికి ఎలా పడిపోయామో స్వీయ విశ్లేషణ జరుపుకోవాలి. టీ20 వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచిన ఆనందాన్ని మర్చిపోక ముందే ఈ పరాజయాన్ని ఎలా కోరి కొని తెచ్చుకున్నామో విశ్లేషించుకోవాలి. ఎంతైనా, పరాజయాలే విజయాలకు మొదటి మెట్టు కదా! -
గంభీర్‌కు బీసీసీఐ షాక్!.. సొంతగడ్డపైనే ఇంతటి ఘోర అవమానం.. ఇకపై..
దూకుడుకు మారుపేరు.. సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగల ఆటగాడు.. ప్రత్యర్థి ఎత్తులకు పైఎత్తులు వేయగల వ్యూహకర్త.. ఇలాంటి వ్యక్తి హెడ్‌కోచ్‌గా వస్తే జట్టు విజయపథంలో నడవడం ఖాయం.. గౌతం గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్‌గా నియమితుడు కాగానే అతడి అభిమానులతో పాటు విశ్లేషకులూ వ్యక్తపరిచిన అభిప్రాయాలు ఇవి.అందుకు తగ్గట్టుగానే శ్రీలంక పర్యటనలో భాగంగా కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో.. యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు టీ20 సిరీస్‌ను.. 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. దీంతో హెడ్‌కోచ్‌గా గంభీర్‌కు శుభారంభం లభించింది. కానీ.. ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది. సీనియర్ ఆటగాళ్లు జట్టుతో ఉన్నా వన్డే సిరీస్‌లో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత లంక చేతిలో వన్డే సిరీస్‌లో భారత్ ఓటమిని చవిచూసింది.సొంతగడ్డపై ఘోర అవమానంఆ తర్వాత స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను 2-0తో, టీ20 సిరీస్‌ను 3-0తో భారత్ క్లీన్‌స్వీప్ చేయడంతో గంభీర్ ఊపిరిపీల్చుకున్నాడు. కానీ.. న్యూజిలాండ్ రూపంలో ఎదురైన కఠిన సవాలును గౌతీ అధిగమించలేకపోయాడు. సీనియర్ ఆటగాళ్ల వైఫల్యం, బ్యాటర్ల పేలవ ప్రదర్శన కారణంగా సొంతగడ్డపై టీమిండియా కివీస్‌తో టెస్టుల్లో 0-3తో వైట్‌వాష్‌కు గురైంది.ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం!న్యూజిలాండ్‌తో బెంగళూరు టెస్టులో పిచ్‌ను తప్పుగా అంచనావేసి తొలుత బ్యాటింగ్ చేయడం, పుణెలో స్పిన్ పిచ్ రూపొందించి బొక్కబోర్లా పడటం.. ముంబై టెస్టులోనూ గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకోవడం..కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు గంభీర్‌పై విమర్శల కారణమైంది. ఇక కివీస్ చేతిలో ఈ ఘోర ఓటమి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ అవకాశాలనూ దెబ్బతీసింది.గంభీర్ చేసిన తప్పులు ఇవేఒకవేళ ఆస్ట్రేలియా పర్యటనలో గనుక జట్టు ప్రదర్శన ఇలాగే సాగితే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు గౌతమ్ గంభీర్‌పై తీవ్ర ఒత్తిడి పెరగడం ఖాయం. న్యూజిలాండ్ చేతిలో సిరీస్ పరాజయానికి తనదే పూర్తి బాధ్యత అని రోహిత్ ఎంత చెబుతున్నా... మేనేజ్మెంట్ వ్యూహాల లోపం స్పష్టంగా కనిపిస్తోంది. చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ప్రధాన ప్లేయర్లే తడబడుతున్న సమయంలో సిరాజ్‌ను నైట్ వాచ్‌మన్‌గా పంపిన మేనేజ్మెంట్... మిడిలార్డర్లో అనుభవమున్న ‘లోకల్ బాయ్’ సర్ఫరాజ్ ఖాన్‌ను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దింపింది.ఆ విషయంలో ద్రవిడ్ పర్ఫెక్ట్ఇవే కాకుండా గతంలో ద్రవిడ్ ప్రాక్టీస్ విషయంలో చాలా పకడ్బందీగా ఉండేవాడని పలువురు ప్లేయర్లు అభిప్రాయపడగా... గంభీర్లో ఆ తీవ్రత లోపించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తానికి రాబోయే ఆస్ట్రేలియా పర్యటన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతోపాటు హెడ్ కోచ్ గంభీర్‌లకు అగ్ని పరీక్షగా నిలువనుంది.రెక్కలు కత్తిరించేందుకు సిద్ధం!ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం తెరమీదకు వచ్చింది. గంభీర్ ‘ అధికారాల రెక్కలు’ కత్తిరించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సిద్ధమైనట్లు సమాచారం. ఇకపై అతడిని సెలక్షన్ కమిటీ సమావేశాలకు దూరంగా ఉంచనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్‌లకు లేని వెసలుబాటును బీసీసీఐ గౌతం గంభీర్‌కు కల్పించింది.నిజానికి బీసీసీఐ నిబంధనల ప్రకారం.. కోచ్‌లను సెలక్షన్ కమిటీ సమావేశాలకు అనుమతించరు. కానీ.. ఆస్ట్రేలియా పర్యటనకు పంపే జట్టు విషయంలో ఈ రూల్‌ను మినహాయించారు. హెడ్‌కోచ్‌ను మీటింగ్‌కు అనుమతించారు’’ అని పేర్కొన్నాయి. అయితే, స్వదేశంలోనే గంభీర్ అంచనాలు తప్పి.. ఘోర అవమానం ఎదురైంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ.. అతడిని ఇకపై సెలక్షన్ కమిటీ సమావేశాలకు దూరం పెట్టనున్నట్లు సమాచారం.చదవండి: IND vs NZ: టీమిండియాపై సచిన్ సీరియస్.. అసలు తప్పు ఎక్కడ జరిగింది? -
2027 వరకు హెడ్ కోచ్‌గా అతడే.. సీఏ ప్రకటన
ఆస్ట్రేలియా పురుషుల జట్టు హెడ్ కోచ్‌గా ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌కు పొడిగింపు ఇచ్చారు. 2027 సీజన్ ముగిసేదాకా మెక్డొనాల్డే హెడ్ కోచ్‌గా కొనసాగుతాడని క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) బుధవారం ప్రకటించింది. అంటే దక్షిణాఫ్రికాలో జరిగే వన్డే ప్రపంచకప్ దాకా మెక్‌డొనాల్డ్ ఆసీస్ జట్టుతో ఉంటాడు. జస్టిన్ లాంగర్ తప్పుకోవడంతో 2022లో మెక్‌డొనాల్డ్‌కు కోచింగ్ బాధ్యతలు అప్పగించారు.డబ్ల్యూటీసీతో పాటు వన్డే వరల్డ్ కప్మెక్డొనాల్డ్ కోచింగ్‌లోనే ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) సాధించింది. భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌లో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌నూ కైవసం చేసుకుంది. వన్డే ప్రపంచకప్‌ను నిలబెట్టుకునే లక్ష్యంతోనే ఆయన పదవీకాలాన్ని పొడిగించినట్లు తెలిసింది.అందుకే పొడిగించాంఈ లోపే వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ కూడా ఉండటంతో మెక్‌డొనాల్డ్‌పై సీఏ మరోసారి నమ్మకం ఉంచింది. హెడ్ కోచ్‌గా మెక్‌డొనాల్డ్ ఇప్పటికే నిరూపించుకున్నాడని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ నిక్ హాక్లీ అన్నారు. జట్టు నిలకడైన విజయాల్లో మెక్‌డొనాల్డ్ కీలకపాత్ర పోషిస్తున్నాడని, దీంతో కోచింగ్ బృందాన్ని మరింత పటిష్ట పరిచేందుకే పొడిగింపు ఇచ్చామని హాక్లీ తెలిపారు. ఇక.. తనకు లభించిన పొడిగింపుపై హర్షం వ్యక్తం చేసిన మెక్‌డొనాల్డ్.. తనపై ఉంచిన నమ్మకాన్ని నిబద్ధతతో పూర్తి చేస్తానని చెప్పారు. చదవండి: IPL 2025: రిషభ్ పంత్‌ను వదులుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ -
India vs New Zealand: జయమా... పరాభవమా!
పుష్కర కాలం తర్వాత సొంతగడ్డపై టెస్టు సిరీస్ కోల్పోయిన టీమిండియా... ఇప్పుడు క్లీన్‌స్వీప్ ప్రమాదం ముంగిట నిలిచింది. సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో స్వదేశంలో ఇప్పటి వరకు ఒక్క సిరీస్‌లోనూ క్లీన్‌స్వీప్ కాని భారత జట్టు... ఇప్పుడు న్యూజిలాండ్ తో అలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. మరోవైపు భారత్‌లో భారత్‌పై ఇప్పటి వరకు టెస్టు సిరీస్ నెగ్గని న్యూజిలాండ్... ఆ పని పూర్తి చేసి క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్త్ దక్కాలంటే ఈ మ్యాచ్‌లో విజయం అనివార్యం అయిన పరిస్థితుల్లో రోహిత్ బృందం ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందనేది ఆసక్తికరం! తొలి రెండు టెస్టుల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కలిసికట్టుగా కదంతొక్కాలని, భారత్‌ను గెలుపు బాట పట్టించాలని అభిమానులు ఆశిస్తున్నారు.ముంబై: అనూహ్య తడబాటుతో న్యూజిలాండ్ చేతిలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన భారత జట్టు శుక్రవారం నుంచి వాంఖడే మైదానం వేదికగా నామమాత్రమైన మూడో టెస్టు ఆడనుంది. ఇప్పటికే 0–2తో సిరీస్ కోల్పోయిన టీమిండియా ... కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తుంటే... తొలిసారి భారత్ లో సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్ దాన్ని క్లీన్‌స్వీప్‌గా మలచాలని భావిస్తోంది. ఈ సిరీస్‌కు ముందు స్వదేశంలో గత 12 సంవత్సరాలుగా భారత జట్టు టెస్టు సిరీస్ ఓడిపోలేదు. అంతేకాకుండా 1984 నుంచి స్వదేశంలో భారత జట్టు ఏ ద్వైపాక్షిక సిరీస్‌లోనూ మూడు టెస్టుల్లో ఓడిపోలేదు. బెంగళూరు వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో పేస్ పిచ్‌ను సిద్ధం చేసి... వాతావరణ మార్పుల మధ్య తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడంతో ఘోర పరాజయం మూటగట్టుకున్న రోహిత్ జట్టు... పుణేలో జరిగిన రెండో టెస్టులో స్పిన్ పిచ్‌పై కూడా తడబడింది. స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలరనే పేరున్న మన ఆటగాళ్లు పుణే టెస్టులో పార్ట్ టైమ్ స్పిన్నర్ లాంటి సాంట్నర్‌ను ఎదుర్కోలేక చేతులెత్తేయడం అభిమానులను కలవర పరిచింది. ఈ నేపథ్యంలో వాంఖడే పిచ్‌ను సహజసిద్ధంగా ఉంచామని... జట్టు కోసం పిచ్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని భారత సహాయక కోచ్ అభిషేక్ నాయర్ అన్నాడు. ఈ సిరీస్‌లో ఆకట్టుకోలేకపోయిన స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆఖరి మ్యాచ్‌లోనైనా రాణిస్తారా చూడాలి. వరుసగా రెండుసార్లు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఆడిన టీమిండియా... ముచ్చటగా మూడోసారి కూడా తుదిపోరుకు అర్హత సాధించాలంటే మిగిలిన ఆరు టెస్టుల్లో సత్తా చాటాల్సిన అవసరముంది. బ్యాటర్లపైనే భారం! కొట్టిన పిండి లాంటి స్వదేశీ పిచ్‌లపై పరుగులు రాబట్టేందుకు భారత ఆటగాళ్లు ఇబ్బంది పడుతుంటే... న్యూజిలాండ్ బ్యాటర్లు మాత్రం సులువుగా పరుగులు చేస్తున్నారు. 2, 52, 0, 8... ఈ సిరీస్‌లో టీమిండియా కెపె్టన్ రోహిత్ శర్మ స్కోర్లివి. టాపార్డర్‌లో ముందుండి ఇన్నింగ్స్‌ను నడిపించాల్సిన రోహిత్ ఇలాంటి ప్రదర్శన చేస్తుండగా... స్టార్ బ్యాటర్ కోహ్లి గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 0, 70, 1, 17 పరుగులు చేశాడు. చాన్నాళ్లుగా జట్టు బాధ్యతలు మోస్తున్న ఈ జంట స్థాయికి ఈ ప్రదర్శన తగినది కాకపోగా... మిగిలిన వాళ్లు కూడా నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నారు. యశస్వి జైస్వాల్ మంచి టచ్‌లో ఉండగా... శుబ్‌మన్ గిల్, సర్ఫరాజ్, పంత్ కలిసి కట్టుగా కదం తొక్కితేనే భారీ స్కోరు సాధ్యం. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అశి్వన్, వాషింగ్టన్ సుందర్ కేవలం బౌలింగ్‌పైనే కాకుండా బ్యాటింగ్‌లోనూ తమ వంతు పాత్ర పోషించాల్సిన అవసరముంది. ప్రధానంగా గత టెస్టులో టీమిండియా స్టార్ ఆటగాళ్లను న్యూజిలాండ్ స్పిన్నర్ సాంట్నర్ వణికించిన చోట... అశ్విన్–జడేజా జోడీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ లోపాలను అధిగమించకపోతే టీమిండియా మూడో టెస్టులోనూ పరాభవం మూటగట్టుకోవాల్సి ఉంటుంది. మరోవైపు కేన్ విలియమ్సన్ వంటి కీలక ఆటగాడు లేకుండానే భారత్‌పై సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ ఇదే జోరు చివరి మ్యాచ్‌లోనూ కొనసాగించాలని చూస్తోంది. కాన్వే, రచిన్ రవీంద్ర, కెపె్టన్ లాథమ్ నిలకడగా రాణిస్తుండగా... ఫిలిప్స్, మిచెల్ కూడా మెరుగైన ప్రదర్శన చేస్తే న్యూజిలాండ్‌కు ఈ టెస్టులోనూ తిరుగుండదు. బౌలింగ్ విభాగంలో సౌతీ, ఒరూర్కీ, హెన్రీ, సాంట్నర్ విజృంభిస్తే భారత జట్టుకు ఇబ్బందులు తప్పవు. జోరుగా సాధన తొలి రెండు టెస్టుల్లో ప్రభావం చూపలేకపోయిన టీమిండియా... కివీస్‌తో మూడో టెస్టుకు ముందు జోరుగా ప్రాక్టీస్ చేస్తోంది. వాంఖడే పిచ్ స్పిన్‌కు సహకరించే అవకాశం ఉండటంతో స్పిన్నర్లను ఎదుర్కోవడంపై మన ప్లేయర్లు దృష్టి సారించారు. రోహిత్ శర్మ, కోహ్లితో పాటు ప్లేయర్లందరూ సాధనలో పాల్గొన్నారు. -
Ind vs NZ: కివీస్‌తో మూడో టెస్టు.. ప్లాన్ ఛేంజ్.. ‘పిచ్’ మారింది!?
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఘోర పరాభవం పాలైన టీమిండియా.. ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలవాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం రోహిత్ సేన పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. మరోవైపు పిచ్ విషయంలోనూ మేనేజ్మెంట్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. వాంఖడే వికెట్ తొలిరోజు బ్యాటర్లకు పూర్తిగా అనుకూలించేలా రూపొందించారని వార్తలు వినిపిస్తున్నాయి.డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటేకాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భారత్‌కు ఇంకా ఆరు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఒకటి, ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టులు ఆడాల్సి ఉంది. వీటిలో కనీసం మూడు గెలిస్తేనే తప్ప టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేందుకు మార్గం సుగమం కాదు. కాబట్టి న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై మిగిలిన మ్యాచ్ గెలిస్తేనే.. ఆస్ట్రేలియాలో ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టగలదు.తొలిరోజు వారికే అనుకూలం!అందుకే ఏ రకంగా చూసినా న్యూజిలాండ్‌తో ఆడబోయే మూడో టెస్టు భారత్‌కు అత్యంత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో వాంఖడేలో స్పోర్టింగ్ ట్రాక్ తయారుచేయించినట్లు తెలుస్తోంది. ‘‘ప్రస్తుతం పిచ్ మీద కాస్త పచ్చిక ఉంది. తొలిరోజు బ్యాటింగ్‌కు అనుకూలించేలా కనిపిస్తోంది. రెండో రోజు నుంచి బంతి కాస్త టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. రెండో రోజు నుంచే స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనుంది’’ అని విశ్వసనీయవర్గాలు తెలిపినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. కాగా బెంగళూరు, పుణె టెస్టులో పిచ్ స్పిన్ బౌలింగ్‌కు బాగా అనుకూలించింది. ముఖ్యంగా రెండో టెస్టులో కివీస్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ ఏకంగా పదమూడు వికెట్లు కూల్చి భారత బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్ తమ స్పిన్‌తో ఆకట్టుకున్నప్పటికీ బ్యాటర్ల వైఫల్యం కారణంగా 113 పరుగుల తేడాతో ఓడి సిరీస్‌ను చేజార్చుకుంది. ఈ క్రమంలో నవంబరు 1 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగనున్న ఆఖరి టెస్టులో గెలిస్తేనే రోహిత్ సేన పరువు నిలుస్తుంది. చదవండి: IPL 2025: వాషింగ్టన్ సుందర్ కోసం ఎగబడుతున్న ఫ్రాంఛైజీలు -
టీమిండియా ఇంకొక్కటి ఓడినా ఖేల్ ఖతమే?!
సొంతగడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ విజయాలకు న్యూజిలాండ్ బ్రేక్‌లు వేసింది. పుణే వేదికగా కివీస్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ 113 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో టీమిండియా సమర్పించుకుంది. ఈ ఓటమితో 12 ఏళ్ల తర్వాత తొలిసారిగా స్వదేశంలో భారత్ కోల్పోయింది.ఈ మ్యాచ్‌లో 359 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 245 పరుగులకు ఆలౌటైంది. ఇక పుణే టెస్టులో ఓటమితో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 సీజన్ పాయింట్ల పట్టికలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పాయింట్ల పరంగా టీమిండియా(90) అగ్రస్ధానంలో ఉన్నప్పటకి.. విన్నింగ్ పర్సంటేజీలో తగ్గుదల కనిపించింది.భారత జట్టు 68.62 శాతం నుంచి 68.06 శాతానికి పడిపోయింది. మరోవైపు పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్(60) నాలుగో స్ధానంలో కొనసాగుతోంది. ఈ విజయంతో కివీస్ విన్నింగ్ పర్సంటేజీలో భారీగా పెరుగుదల కన్పిచింంది. బ్లాక్ క్యాప్స్ 44.40 శాతం నుంచి 50.00 శాతానికి పెరిగింది. ఇక పాయింట్ల పట్టికలో భారత్ తర్వాత స్ధానాల్లో ఆస్ట్రేలియా (62.50), శ్రీలంక (55.56) ఉన్నాయి.టీమిండియా ఫైనల్ చేరాలంటే?ఇక డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్ధానంలో ఉన్నప్పటికి ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకోవడం అంత సులభం కాదు. ప్రస్తుత సైకిల్లో ఇప్పటి వరకు ఆడిన 13 టెస్టుల్లో 8 విజయాలు సాధించిన భారత్ నాలుగింటిలో ఓడి ఒక దానిని డ్రా చేసుకుంది. ఈ సైకిల్లో భారత్ ఇంకా ఆరు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. న్యూజిలాండ్‌తో ఒక మ్యాచ్, ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. కాగా భారత్ ఫైనల్‌కు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే కనీసం నాలుగింటిలోనైనా విజయం సాధించాలి. అప్పుడే టీమిండియా పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా ఎలాంటి పాయింట్ల కోత లేకుండా చూసుకోవాలి.అయితే, న్యూజిలాండ్‌తో మిగిలిన ఇంకొక్క మ్యాచ్ ఓడినా టీమిండియాకు కష్టమే. ఎందుకంటే.. సొంతగడ్డపై ఈ మ్యాచ్ గనుక రోహిత్ సేన ఓడితే.. ఆసీస్ పర్యటనలో ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టలేదు. కాబట్టి ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది.చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన మిచెల్ సాంట్నర్.. -
ఇలా అయితే కష్టమే!
‘ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు’... అన్న చందంగా ఏరి కోరి సిద్ధం చేసుకున్న స్పిన్ పిచ్‌పై టీమిండియా బోల్తా కొట్టింది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో పిచ్ పేస్‌కు అనుకూలించడం వల్లే టీమిండియా తడబడింది అని సర్దిచెప్పుకున్న వాళ్లు సైతం... పుణే ప్రదర్శనతో బేజారవుతున్నారు. ప్రత్యర్థిని స్పిన్ వలలో వేసి ఉక్కిరి బిక్కిరి చేయాలనుకున్న రోహిత్ సేన చివరకు ఆ ఉచ్చులోనే చిక్కి విలవిల లాడింది. టెస్టు కెరీర్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నాలుగు కంటే ఎక్కువ వికెట్లు తీసిన అనుభవం లేని సాంట్నర్‌కు ఏకంగా మనవాళ్లు ఏడు వికెట్లు సమర్పించుకున్నారు. భారత ఆటగాళ్లు తడబడ్డ చోటే రెండో ఇన్నింగ్స్‌లోనూ న్యూజిలాండ్ ప్లేయర్లు స్వేచ్ఛగా పరుగులు రాబట్టడం పుండు మీద కారం చల్లినట్లయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసిన భారత స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ రెండో ఇన్నింగ్స్‌లోనూ నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నా... కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ మాత్రం చక్కటి ఇన్నింగ్స్‌తో అలరించాడు. స్పిన్నర్లను ఎదుర్కొనే క్రమంలో క్రీజు వదలి ఒక అడుగు ముందుకు వేసి బంతిని అందుకోవడంతో పాటు... కాళ్ల కదలికలో చురుకుదనం చూపిస్తూ ఖాళీల్లోకి బంతిని పోనిచ్చి పరుగులు పిండుకున్నాడు. మరో ఎండ్‌లో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతున్నా... ఏమాత్రం తడబడకుండా క్రీజులో నిలిచి కెపె్టన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా రెండో టెస్టులో న్యూజిలాండ్ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. 1955–56 నుంచి భారత్‌లో పర్యటిస్తున్న న్యూజిలాండ్... ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇక్కడ టెస్టు సిరీస్ గెలవలేకపోయింది. 36 ఏళ్ల తర్వాత తొలిసారి భారత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో టెస్టు మ్యాచ్ ఓడిన టీమిండియా... ఇప్పుడు టెస్టు క్రికెట్ చరిత్రలో మొదటిసారి సిరీస్ ఓటమి అంచున నిలిచింది. వరుసగా మూడోసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరాలనుకుంటున్న టీమిండియా... ఇదే ప్రదర్శన కొనసాగిస్తే మున్ముందు మరిన్ని కష్టాలు ఎదుర్కోక తప్పదు. 2023–25 ఎడిషన్‌లో భాగంగా భారత్ ఇంకా కేవలం ఆరు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. అందులో ఒకటి న్యూజిలాండ్‌తో కాగా... మిగిలిన ఐదు ఆ్రస్టేలియాలో ఆ్రస్టేలియాతో. ఇలాంటి దశలో స్వదేశంలో ఆడుతున్న సిరీస్‌లో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చి డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మెరుగైన స్థితితో ఆసీస్ గడ్డపై అడుగు పెడుతుంది అనుకుంటే... ఫలితాలు మాత్రం అందుకు విరుద్ధంగా వస్తున్నాయి. తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం తర్వాత భారత మాజీ కెప్టెన్ , హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే మాట్లాడుతూ... ‘జట్టులో పుజారా వంటి ప్లేయర్ ఎంతో అవసరం. ఎలాంటి పిచ్‌పైనైనా ఓపికగా నిలవడంతో పాటు సహచరులకు భరోసా ఇవ్వగల సామర్థ్యం అతడి సొంతం’ అని అన్నాడు. ఇప్పుడు వరుసగా రెండో టెస్టులోనూ మన బ్యాటర్ల ఆటతీరు చూస్తుంటే కుంబ్లే చెప్పింది నిజమే అనిపిస్తోంది. స్వదేశంలోనే పరిస్థితి ఇలా ఉంటే... ఆ్రస్టేలియా టూర్లో టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందనే అనుమానాలు రేకెత్తక మానవు! గత రెండు ఆసీస్ పర్యటనల్లోనూ పుజారా క్రీజులో పాతుకుపోయి జట్టుకు మూలస్తంభంలా నిలిచి మరపురాని విజయాలు అందించాడు. మరి బెంగళూరు, పుణే పిచ్‌పైనే పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడుతున్న మనవాళ్లు కంగారూ గడ్డపై ఏం చేస్తారో వేచి చూడాలి! –సాక్షి క్రీడావిభాగం