
పోర్ట్స్‌మౌత్: ఇటీవల ఐపీఎల్‌లో కొనసాగించిన దూకుడునే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లోనూ కనబరుస్తానని సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే అన్నాడు. కొన్నాళ్ల విరామం తర్వాత జట్టులోకి రావడం ఆనందంగా ఉందన్నాడు. ప్రాక్టీస్ సెషన్‌లో తలమునకలైన అతను మాట్లాడుతూ ‘18, 19 నెలల అనంతరం మళ్లీ జట్టులోకి వచ్చాను.
గతంలో ఏం జరిగింది. ఇప్పుడేం జరిగిందని అదే పనిగా ఆలోచిస్తూ కూర్చోను. టీమిండియా తరఫున తాజాగా ఆటను ఆరంభిస్తా. మైదానంలో నేనేం చేయగలనో అదే చేస్తాను’ అని రహానే తెలిపాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడటాన్ని చాలా బాగా ఆస్వాదించానన్నాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో చక్కగా బ్యాటింగ్ చేశానని, అంతకుముందు కూడా దేశవాళీ క్రికెట్‌లోనూ రాణించానని చెప్పుకొచ్చాడు.
‘ఇప్పుడు కూడా అదే మైండ్‌సెట్‌తో ఆడతాను. ఇది టెస్టా... టి20 మ్యాచా అన్నది ఆలోచించను. నా సహజశైలిలో నేను బ్యాటింగ్ చేస్తాను’ అని రహానే అన్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా పటిష్టంగా ఉందన్నాడు.
చదవండి: #Ruturaj Gaikwad: ప్రేయసిని పెళ్లాడిన టీమిండియా యువ ఓపెనర్.. ఫోటోలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment