WTC Final 2021-2023
-
రెండు టెస్టుల్లో కలిపి 11 పరుగులు! ఇలా అయితే: డీకే
India tour of West Indies, 2023- Ajinkya Rahane Failure: అజింక్య రహానేకు ఇది అత్యంత సాదాసీదా సిరీస్. డబ్ల్యూటీసీ ఫైనల్లో మెరుగైన ప్రదర్శన తర్వాత ఏకంగా వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అతడికి ఇలాంటి అవకాశం ఎలా వచ్చిందని అందరూ ఆశ్చర్యపోవడం సహజం. అయితే, అజింక్య రహానేకు ఎవరు ఏమనుకుంటున్నారన్న అంశంతో పనిలేదు. అతడికి రెండు టెస్టుల్లోనూ ఆడే అవకాశం వచ్చింది. కానీ రెండుసార్లు విఫలమయ్యాడు. కొన్నిసార్లు కఠినమైన పిచ్‌ల కారణంగా బ్యాటర్లకు ఇబ్బందులు తప్పవు. మరికొంత మందికి ఇలా కొన్ని సిరీస్‌లు చేదు అనుభవాన్నిస్తాయి. అయితే, అజింక్య రహానే విషయంలో మాత్రం నిలకడలేని ఆట ప్రభావం చూపుతోంది. అందుకే గతంలో అతడు జట్టులో చోటు కోల్పోయాడు. అంతర్మథనం మొదలయ్యే ఉంటుంది ఈ విషయం అతడికి కూడా తెలిసే ఉంటుంది. అయితే, సౌతాఫ్రికా టూర్లో ఇలాంటి ఆటగాడికి కచ్చితంగా అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో అతడిలో అంతర్మథనం మొదలవడం ఖాయం’’ అని టీమిండియా వెటరన్ బ్యాటర్, కామెంటేటర్ దినేశ్ కార్తిక్ అన్నాడు. విండీస్‌తో టెస్టు సిరీస్‌లో విఫలమైన భారత జట్టు ఉప నాయకుడు అజింక్య రహానేను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడిని వైస్ కెప్టెన్‌గా ఎలా నియమించారో చాలా మందికి అర్థం కాలేదన్న డీకే.. వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడని పెదవి విరిచాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో అదుర్స్ కాగా ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్-2023లో రహానే ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సహా మిగిలిన ఆటగాళ్లంతా విఫలమైన వేళ అజ్జూ రాణించాడు. ఈ మెగా ఫైట్‌లో 135 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో విండీస్ టూర్లో భాగంగా టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్ అయ్యాడు. రెండు టెస్టుల్లో కలిపి 11 పరుగులు కానీ ఆడిన రెండు టెస్టుల్లో పూర్తిగా విఫలమయ్యాడు. మొత్తంగా కేవలం 11(3, 8) పరుగులు మాత్రమే చేసి ఉసూరుమనిపించాడు. ఈ నేపథ్యంలో క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ డీకే.. రహానేను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో 209 పరుగుల తేడాతో ఓడిపోయిన రోహిత్ సేన.. తాజా సైకిల్లో తొలి సిరీస్‌ను కైవసం చేసుకుంది. చదవండి: ఆసీస్ ఆల్‌రౌండర్ మాక్సీ భార్య సీమంతం.. ఫొటోలు వైరల్! ఆ విషాదం తర్వాత.. -
Ind Vs WI: మనం తప్పు చేశామా అని పశ్చాత్తాపపడేలా చేశాడు! తొలిరోజే
West Indies vs India, 1st Test Day 1: వెస్టిండీస్‌తో తొలి టెస్టులో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దుమ్ములేపుతున్నాడు. తొలి రోజు ఆటలో భాగంగా ఏకంగా 5 వికెట్లు కూల్చి విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. ముందుగా ఓపెనర్లు క్రెగ్ బ్రాత్‌వైట్(20), తగెనరైన్ చందర్‌పాల్(12)లను పెవిలియన్‌కు పంపిన అశూ.. నిలకడ ప్రదర్శించిన అరంగేట్ర బ్యాటర్ అలిక్ అథనాజ్(47)తో పాటు టెయిలెండర్లు అల్జారీ జోసెఫ్(4), వారికన్(1) వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ పాంచ్ పటాకాకు తోడు అశ్విన్ పాంచ్ పటాకాకు తోడు.. మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా మూడు వికెట్లతో రాణించగా.. పేసర్లు సిరాజ్, శార్దూల్ ఒక్కో వికెట్ తీశారు. దీంతో వెస్టిండీస్ 150 పరుగులకే కుప్పకూలింది. ఈ నేపథ్యంలో అశ్విన్ అద్భుత ప్రదర్శన(5/60)ను ఉద్దేశించి టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. మనం తప్పు చేశామా? ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023లో తనను ఆడించకుండా మేనేజ్మెంట్ ఎంత పెద్ద తప్పుచేసిందో తెలిసొచ్చేలా చేశాడన్నాడు ఆకాశ్ చోప్రా. భారత్- వెస్టిండీస్ తొలి రోజు ఆటను విశ్లేషిస్తూ తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జట్టు తొలిరోజే 150 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్ ఐదు వికెట్లతో చెలరేగాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో అశ్విన్ ఆడించకుండా మనం తప్పు చేశామా అనే ఫీలింగ్ కలిగించాడు. విండీస్ పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలంగానే ఉంటాయని, వెస్టిండీస్‌తో సిరీస్‌లో రవిచంద్రన్ అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలుస్తాడని నేను ముందుగానే అంచనా వేశాను." అన్నాడు ఆకాశ్ చోప్రా. అశూ మాదిరే వాళ్లు కూడా తొలిరోజు మాదిరే అశ్విన్ చెలరేగితే నా మాటలు నిజమవుతాయి’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. ఒకే చోట బంతిని విసురుతూ అశూ మంచి ఫలితాలు రాబడుతున్నాడన్న ఈ కామెంటేటర్.. నాథన్ లియోన్, జడేజా కూడా అతడి మాదిరే బౌలింగ్ చేసే సత్తా కలిగి ఉన్నారని పేర్కొన్నాడు. కాగా మొదటి రోజు ఆటలో విండీస్‌పై పైచేయి సాధించిన టీమిండియా ఆట ముగిసే సమయానికి 80 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ 40, రోహిత్ శర్మ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. నంబర్ 1 అశ్విన్ ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్-2023 సందర్భంగా తుది జట్టులో అశ్విన్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో అశూను కాదని.. జడ్డూకు అవకాశమిచ్చారు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి జడేజా 4 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో అజింక్య రహానే, శార్దూల్ ఠాకూర్ మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో రోహిత్ సేన 209 పరుగుల భారీ తేడాతో ఆసీస్ చేతిలో ఓడి ఘోర పరాభవం మూటగట్టుకుంది. ఇదిలా ఉంటే.. అశ్విన్ గత కొంతకాలంగా టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్1గా కొనసాగుతున్నాడు. చదవండి: కోహ్లిని టీజ్ చేసిన ఇషాన్ కిషన్.. వీడియో వైరల్ Ind Vs WI: చెలరేగిన అశ్విన్.. అనిల్ కుంబ్లే అరుదైన రికార్డు బద్దలు -
వాళ్లంతా అందుబాటులో ఉంటే కథ వేరేలా ఉంటది! ఒకవేళ: రోహిత్ శర్మ
Rohit Sharma's Counter On India's Successive WTC Final Failure: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023లో ఓటమి తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ద్వైపాక్షిక సిరీస్‌లలో రాణిస్తున్నప్పటికీ ఐసీసీ ఈవెంట్లలో విఫలమవుతున్న రోహిత్‌ను సారథిగా తొలగించాలనే డిమాండ్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చాడు హిట్‌మ్యాన్. కరేబియన్ దీవిలో కాగా డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో భాగంగా టీమిండియా వెస్టిండీస్‌తో తమ తొలి సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే కరేబియన్ గడ్డపై అడుగుపెట్టిన రోహిత్ సేన బుధవారం(జూలై 12) నుంచి ఆరంభం కానున్న తొలి టెస్టుకు సిద్ధమైంది. ఈ క్రమంలో మ్యాచ్ ఆరంభానికి ముందు మీడియాతో మాట్లాడిన రోహిత్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తనకు ఓపెనింగ్ జోడీగా యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ బరిలోకి దిగడం ఖాయమని తెలిపాడు. శుబ్‌మన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడని వెల్లడించాడు. ఇక ఐసీసీ ఈవెంట్లలో ముఖ్యంగా ఇటీవల ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ ఓటమికి ప్రధాన కారణం ఏంటనే ప్రశ్న రోహిత్‌కు ఎదురైంది. వాళ్లంతా అందుబాటులో ఉంటే ఇందుకు స్పందిస్తూ.. ‘‘ప్రతి ఒక్క ఆటగాడు సెలక్షన్‌కు అందుబాటులో ఉండాలని నేను కోరుకుంటాను. నా జట్టులోని కీలక ఆటగాళ్లంతా వందకు వంద శాతం టీమ్‌తోనే ఉండాలి. గాయాల బెడద అస్సలు ఉండకూడదు. అన్నింటికంటే ముఖ్యమైనది అదే’’ అని రోహిత్ బదులిచ్చాడు. అదే విధంగా.. గత కొన్నేళ్లుగా టీమిండియా అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తోందన్న ఈ ముంబైకర్.. ఒక్కోసారి అదృష్టం వెక్కిరిస్తే చేదు అనుభవాలు తప్పవని పేర్కొన్నాడు. గత ఐదారేళ్లుగా భారత జట్టు ప్రతిచోటా జయకేతనం ఎగురవేసిందన్న రోహిత్.. చాంపియన్‌షిప్స్ కూడా గెలవడం ముఖ్యమేనని.. అందుకు తాము తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలిపాడు. కాగా ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత ఓవల్ వేదికగా ఆసీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడిన రోహిత్ సేన 209 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, కీలక బ్యాటర్ రిషభ్ పంత్, మిడిలార్డర్ స్టార్లు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ గాయాల కారణంగా దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ ఈ మేరకు ఆటగాళ్లు అందుబాటులో ఉంటే బాగుంటుందని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: అర్జున్ టెండూల్కర్‌కు గోల్డెన్ చాన్స్ టీమిండియా నుంచి ఒకే ఒక్కడు! రోహిత్ ఇంకొకటి! కోహ్లి మాత్రం... -
Ind vs WI: అతడొక్కడే కాదు.. వాళ్లు కూడా విఫలం.. కానీ పాపం..
Ind Vs WI 2023 Test Series: ‘‘అన్ని రకాల గౌరవాలు పొందేందుకు అతడు నూటికి నూరు శాతం అర్హుడు. అలాంటిది తనను జట్టు నుంచి తప్పించడం నాకు ఆశ్చర్యంగా ఉంది. నిజానికి డబ్ల్యూటీసీ ఫైనల్లో అతనొక్కడే విఫలం కాలేదు కదా! అదే జట్టులో ఉన్న చాలా మంది కూడా కనీస స్థాయి ప్రదర్శన కనబరచలేదు. పుజారా మాదిరే వాళ్లు కూడా పరుగులు సాధించడంలో వైఫల్యం చెందారు. స్ట్రైక్‌రేటు అంతంత మాత్రంగా ఉండటానికి కారణమదే చాలా మంది టెస్టుల్లో పుజారా స్ట్రైక్‌రేటు గురించిన విమర్శలు చేయడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. వాస్తవానికి పుజారా స్ట్రైక్‌రేటు అంతంత మాత్రంగా ఉండటానికి కారణం.. సహచర ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టినపుడు వికెట్ పడకుండా చూసుకోవడం.. జట్టును ఆదుకునే వాళ్లకు సపోర్టు ఇవ్వడం వల్లే! ఎన్నో విజయాల్లో పుజారా కీలక పాత్ర పోషించాడు. కానీ అతడికి దక్కాల్సినంత గౌరవం దక్కలేదు. జట్టుకు ఇప్పుడు కూడా తన అవసరం ఎంతగానో ఉంది. కానీ అనూహ్య రీతిలో పక్కనపెట్టారు. ముఖ్యంగా SENA(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) గడ్డ మీద జట్టుకు ఇలాంటి ఆటగాడు అవసరం. వాళ్లను మాత్రం పక్కన పెట్టరు?! ఎవరైనా సరే ప్రతిసారి అద్భుతంగా ఆడలేరు కదా! పుజారా లాంటి టెస్టు క్రికెటర్‌ను వదులుకుంటే నష్టపోవాల్సి ఉంటుంది’’ అంటూ టీమిండియా మాజీ బౌలర్ హర్భజన్ సింగ్.. ఛతేశ్వర్ పుజారాకు అండగా నిలబడ్డాడు. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో పుజారాను తప్పించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023లో టీమిండియా ఘోర ఓటమిని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌లోని ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో 209 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. బ్యాటర్ల వైఫల్యమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఓపెనర్లు రోహిత్ శర్మ(15, 43), శుబ్‌మన్ గిల్(13, 18) ఆకట్టుకోలేకపోయారు. స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన కోహ్లి వన్‌డౌన్‌లో వచ్చిన పుజారా చేసిన పరుగులు 14, 27. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన విరాట్ కోహ్లి(14, 49) కూడా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. అజింక్య రహానే మొత్తంగా 138 పరుగులతో టీమిండియా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు అతడు వైస్ కెప్టెన్‌గా ఎంపిక కాగా.. అనూహ్యంగా పుజారాకు చోటే దక్కలేదు. ఈ నేపథ్యంలో మాజీ స్పిన్నర్ భజ్జీ స్పందిస్తూ పుజారాకు జట్టులో చోటు ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టాడు. ముఖ్యంగా కోహ్లి, ఇతర బ్యాటర్లను టార్గెట్ చేస్తూ.. పుజారాకు అండగా నిలిచాడు. కాగా జూలై 12 నుంచి టీమిండియా- విండీస్ మధ్య డొమినికా వేదికగా తొలి టెస్టు ఆరంభం కానుంది. చదవండి: రాయుడు రిటైర్ అయ్యాడు.. మీకు తప్పకుండా జట్టులో చోటిస్తాం.. కానీ: ధోని సిక్సర్ల రింకూ.. ఎక్కడా తగ్గేదేలే! వీడియోతో సెలక్టర్లకు దిమ్మతిరిగేలా! -
Test Captain: టీమిండియా టెస్టు కెప్టెన్‌గా మరోసారి విరాట్ కోహ్లి!?
Team India Test Captain: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023లో ఓటమి తర్వాత టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ ఎవరన్న అంశంపై క్రీడా వర్గాల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియా చేతిలో 209 పరుగుల తేడాతో ఘోర పరాజయం నేపథ్యంలో రోహిత్ శర్మపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లవెత్తాయి. 36 ఏళ్ల రోహిత్‌ను తప్పించి.. శుభ్‌మన్ గిల్ లేదంటే శ్రేయస్ అయ్యర్ వంటి యువ ఆటగాళ్లకు పగ్గాలు అప్పగించాలనే డిమాండ్లు వచ్చాయి. మరోవైపు.. ఇప్పుడిపుడే అంతర్జాతీయ స్థాయిలో ఎదుగుతున్న గిల్ వంటి ఆటగాళ్లపై భారం మోపే బదులు.. మాజీ సారథి విరాట్ కోహ్లినే మరోసారి కెప్టెన్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రాకు ప్రశ్న ఎదురైంది. కోహ్లి అంతటి సమర్థుడే.. యూబ్యూబ్ చానెల్ వేదికగా.. అభిమానులతో ముచ్చటిస్తున్న సందర్భంగా.. కోహ్లి తిరిగి టెస్టు కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అని ఓ నెటిజన్ అడిగాడు. ఇందుకు బదులిస్తూ.. ‘‘అవును.. కోహ్లి మరోసారి సారథిగా బాధ్యతలు చేపట్టగల సమర్థుడే.. కానీ.. అతడు ఆ పని చేయడు. ఎందుకంటే.. టెస్టు కెప్టెన్సీ వదులుకోమని ఎవరూ అతడిని ఒత్తిడి చేయలేదు. తనకు తానే ఆ నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి మళ్లీ తను కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టకపోవచ్చు. కోహ్లి ప్రకటన తర్వాతే బీసీసీఐ కొత్త కెప్టెన్‌ను నియమించింది. కాబట్టి మళ్లీ విరాట్ కోహ్లి.. నాయకుడిగా తిరిగి రావడం సాధ్యం కాకపోవచ్చు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. తనకు తానుగా తప్పుకొన్నాడు! కాగా టీ20 ప్రపంచకప్-2021 తర్వాత టీమిండియా పొట్టి ఫార్మాట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్న కోహ్లిని.. అనూహ్య రీతిలో వన్డే కెప్టెన్‌గా తప్పించారు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాలో టీమిండియా 2021-22 పర్యటన సమయంలో టెస్టులో ఓటమి తర్వాత కోహ్లి తాను కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఈ క్రమంలో అప్పటికే టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ టెస్టు జట్టు నాయకుడయ్యాడు. ఇదిలా ఉంటే.. కోహ్లి, రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు వరుసగా రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరినప్పటికీ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది. తొట్టతొలి ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో. 2021-23 ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడి.. రెండు సందర్భాల్లోనూ రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. ఇదిలా ఉంటే.. రోహిత్ సేన ప్రస్తుతం వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతోంది. జూలై 12- ఆగష్టు 13 వరకు కరేబియన్ పర్యటనలో బిజీ బిజీగా గడుపనుంది. చదవండి: జాక్‌పాట్ కొట్టిన అనంతపురం క్రికెటర్.. టీమిండియాకు ఎంపిక స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. బోర్డుపై అవినీతి ఆరోపణలు -
టీమిండియా కెప్టెన్‌గా ఊహించని పేరు! అసలు రహానే ఏం చేశాడని ఆ బాధ్యతలు?
‘‘రవీంద్ర జడేజా గురించి ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదో నాకైతే అర్థం కావడం లేదు. టీమిండియాకు మూడు ఫార్మాట్లలోనూ అతడు ప్రధాన ఆటగాడిగా సేవలు అందిస్తున్నాడు. టెస్టుల్లోనూ అతడి రికార్డులు మెరుగ్గా ఉన్నాయి. మరి తదుపరి నాయకుడు ఎవరన్న చర్చ వచ్చినపుడు జడేజా పేరు ఎందుకు పరిగణనలోకి తీసుకోరు? గిల్ కూడా ఉన్నాడుగా నిజానికి మూడు ఫార్మాట్లలోనూ అతడి స్థానాన్ని భర్తీ చేయగల సత్తా ఉన్న ఆటగాడు లేడు. టీమిండియాను ముందుకు నడిపించ గల సత్తా అతడిలో ఉంది. ఒకవేళ జడేజా పేరును పరిశీలనలోకి తీసుకోకపోతే.. శుబ్‌మన్ గిల్ ఉన్నాడు కదా! టీమిండియా భవిష్యత్ ఆశాకిరణమైన గిల్ పేరునైనా పరిగణనలోకి తీసుకోవాలి. నిజానికి యువకుడైన యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లకు చోటివ్వడం బాగుంది. మెల్లమెల్లగా యువ రక్తం ఎక్కిస్తున్నారు. కానీ అజింక్య రహానేను వైస్ కెప్టెన్ చేయడం వెనుక లాజిక్ ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. టెస్టు జట్టులో స్థానం కోల్పోయి మళ్లీ తిరిగి వచ్చిన తర్వాత అతడు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. రహానే ఏం చేశాడు? అందులో అద్భుతంగా రాణించిన మాట వాస్తవమే. అయితే, భవిష్యత్ టీమిండియా నిర్మిస్తున్నపుడు మళ్లీ అజింక్య రహానేనే వైస్ కెప్టెన్‌గా నియమించే బదులు కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వొచ్చు కదా? రోహిత్ శర్మ వారసుడిగా ఎదగగల లక్షణాలు ఉన్న ఆటగాడికి డిప్యూటీగా బాధ్యతలు అప్పగిస్తే బాగుండు’’ అని టీమిండియా మాజీ సెలక్టర్ సబా కరీం కీలక వ్యాఖ్యలు చేశాడు. కాగా వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో బీసీసీఐ ఇటీవల టెస్టు, వన్డే జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. డబ్ల్యూటీసీ ఫైనల్లో అదరగొట్టి ఇందులో భాగంగా టెస్టు జట్టులో స్థానం పొందిన అజింక్య రహానే తిరిగి వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అద్భుతంగా ఆడిన రహానే.. ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ జట్టుకు ఎంపికయ్యాడు. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయపడిన నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే అవకాశం దక్కించుకున్న రహానే దానిని సద్వినియోగం చేసుకున్నాడు. రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా 89, 46 పరుగులు చేశాడు. దీంతో సెలక్టర్లు అతడికి మరోసారి కెప్టెన్ డిప్యూటీగా అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో సబా కరీం ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా రవీంద్ర జడేజా 2021లో చెన్నై సూపర్ కింగ్స్ పగ్గాలు చేపట్టి మధ్యలోనే చేతులెత్తేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో జట్టును నడిపించలేని జడ్డూకు జాతీయ జట్టు బాధ్యతలు అప్పగించాలని సబా కరీం వ్యాఖ్యానించడంపై క్రికెట్ ప్రేమికుల్లో చర్చ మొదలైంది. వెస్టిండీస్ రెండు టెస్టులకు భారత జట్టు ఇదే: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. చదవండి: మాకు భుజాల నొప్పులు.. ధోనికి మెకాలి సమస్య.. అసలే సచిన్ బరువు! అందుకే.. ఈసారి హోరాహోరీ తప్పదు.. ట్రోఫీ ఆ జట్టుదే: భారత మాజీ కెప్టెన్ -
కొలీగ్స్ మాత్రమే అన్న అశ్విన్! రవిశాస్త్రి స్పందన మామూలుగా లేదు! నాకైతే..
Ravi Shastri- Ashwin: టీమిండియా డ్రెసింగ్ రూం వాతావరణం గురించి వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. కొలీగ్సే ఒక్కోసారి ప్రాణ స్నేహితుల్లా మారతారని.. అయినా ఒకరి జీవితంలో ఎంత మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారని ప్రశ్నించాడు. కాగా అనూహ్య రీతిలో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023 తుది జట్టులో అశూకు అవకాశం ఇవ్వలేదు మేనేజ్మెంట్. విదేశీ గడ్డ మీద అశూకు మంచి రికార్డు ఉన్నప్పటికీ.. మరో స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వైపే మొగ్గు చూపాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో 209 పరుగుల తేడాతో చిత్తుకావడంతో అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అప్పుడు స్నేహితులు.. ఇప్పుడు కొలీగ్స్ ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన అనంతరం అశ్విన్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకప్పుడు జట్టులోని ఆటగాళ్లంతా స్నేహితుల్లా మెదిలేవారని.. ఇప్పుడు మాత్రం కేవలం కొలీగ్స్‌లా ఉంటున్నారని వ్యాఖ్యానించాడు. సహచర ఆటగాళ్లతో మాట్లాడే తీరిక ఎవరికీ ఉండటం లేదని వాపోయాడు. ఈ నేపథ్యంలో ది వీక్‌తో మాట్లాడిన టీమిండియా మాజీ హెడ్‌కోచ్, అశ్విన్‌తో కలిసి పనిచేసిన రవిశాస్త్రిని అశ్విన్ వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా కోరారు. ఈ క్రమంలో.. ‘‘నాకైతే ఎల్లప్పుడూ కొలీగ్స్ మాత్రమే ఉండేవారు. నిజానికి మన స్నేహితులే కొలీగ్స్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. అయినా ఒక వ్యక్తికి ఎంత మంది బెస్టీస్ ఉంటారు? 4-5 మంది అంతేకదా! వాళ్లతో నేను సంతోషంగా ఉన్నా నాకైతే ఐదుగురు ప్రాణ స్నేహితులు ఉన్నారు. వాళ్లతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. అంతకు మించి నాకేమీ అవసరం లేదు. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే.. కొలీగ్స్ స్నేహితులు కావొచ్చు. కాకపోవనూవచ్చు. ప్రస్తుతం నాకైతే కామెంటరీ బాక్స్‌లో చాలా మంది కొలీగ్స్ ఉన్నారు’’ అంటూ సరదాగా బదులిచ్చాడు. కాగా 2021లో హెడ్‌కోచ్ పదవి నుంచి వైదొలిగిన రవిశాస్త్రి.. తిరిగి కామెంట్రీ మొదలుపెట్టాడు. ఇటీవల ఇంగ్లండ్‌లో టీమిండియా- ఆసీస్ మధ్య జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ కామెంటేటర్‌గా వ్యవహరించాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ తుది జట్టులో అశూకు అవకాశం ఇవ్వని మేనేజ్మెంట్.. జూలై 12 నుంచి మొదలుకానున్న వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ జట్టుకు ఎంపిక చేసింది. విండీస్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో అశ్విన్ భాగం కానున్నాడు. చదవండి: లెజండరీ ఓపెనర్ దిల్షాన్.. డీకే మాదిరే! ఉపుల్ తరంగతో భార్య ‘బంధం’.. అతడినే పెళ్లాడి! ధోని కెప్టెన్సీ అలా ఉంటుంది కాబట్టే! రోహిత్, ద్రవిడ్‌పై అశ్విన్ విసుర్లు! -
కౌంటీల్లో సెంచరీల మీద సెంచరీలు! అసలు పోరులో తుస్సు! అందుకే..
Cheteshwar Pujara- Ind Vs WI test Series: వెస్టిండీస్‌తో సిరీస్ నేపథ్యంలో టీమిండియా నయా వాల్ ఛతేశ్వర్ పుజారాకు మొండిచేయి ఎదురైంది. విండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో అతడికి చోటు దక్కలేదు. కాగా ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్ టెస్టుతో జట్టులోకి తిరిగి వచ్చిన పుజారా బంగ్లాదేశ్ సిరీస్‌లోనూ ఆడాడు. కౌంటీల్లో సెంచరీల మీద సెంచరీలు ఆ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో భాగమయ్యాడు. ఈ క్రమంలో ఆసీస్‌తో నాలుగు మ్యాచ్‌లలో కలిపి 140 పరుగులు చేయగలిగాడు. అనంతరం ఇంగ్లండ్‌లో కౌంటీల్లో ఆడిన పుజారా ససెక్స్ జట్టు నాయకుడిగా వ్యవహరించాడు. అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ 8 ఇన్నింగ్స్‌లో 3 సెంచరీల సాయంతో.. 545 పరుగులతో అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్లో ఛతేశ్వర్ అదరగొట్టడం ఖాయమని అభిమానులు సంబరపడిపోయారు. కానీ గుజరాత్ బ్యాటర్ వారి ఆశలపై నీళ్లు చల్లాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో తుస్సు ఆస్ట్రేలియాపై మెరుగైన రికార్డు కలిగి ఉన్న పుజారా.. ఓవల్ వేదికగా తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగులు మాత్రమే చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 27 పరుగులకు పరిమితమై వైఫల్యం కొనసాగించాడు. దీంతో అతడికి భారీ షాకిచ్చారు టీమిండియా సెలక్టర్లు. విండీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో అతడి పేరును పరిగణనలోకి తీసుకోలేదు. అదే సమయంలో.. మరో వెటరన్ బ్యాటర్, డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆకట్టుకున్న అజింక్య రహానేకు మాత్రం ఈ సిరీస్‌తో మరోసారి వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ దక్కింది. విండీస్‌తో రెండు టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. చదవండి: ఎన్నాళ్లో వేచిన ఉదయం! ఈసారి మా ఆశలు వమ్ము చేయొద్దు ప్లీజ్! అప్పుడు జట్టులో చోటే కరువు.. ఇప్పుడు వైస్ కెప్టెన్‌గా.. నువ్వు సూపర్ ‘హీరో’! ధోని కెప్టెన్సీ అలా ఉంటుంది కాబట్టే! రోహిత్, ద్రవిడ్‌పై అశ్విన్ విసుర్లు! -
ధోని కెప్టెన్సీ అలా ఉంటుంది కాబట్టే! రోహిత్, ద్రవిడ్‌పై అశ్విన్ విసుర్లు!
‘‘ముందుగా ఆస్ట్రేలియాకు కంగ్రాట్యులేషన్స్!! డబ్ల్యూటీసీ ఫైనల్ అద్భుతంగా సాగింది. విజయానికి వాళ్లు పూర్తిగా అర్హులు. మార్నస్ లబుషేన్ వంటి ఆటగాళ్లు కౌంటీల్లో ఆడటం వాళ్లకు కాస్త ప్రయోజనకరంగా మారిన మాట వాస్తవమే. నిజానికి టీమిండియాలాగే ఆసీస్ కూడా గత డబ్ల్యూటీసీ సైకిల్లో నిలకడైన ప్రదర్శన కనబరిచింది. కానీ ఫైనల్‌కు చేరలేకపోయింది. కానీ ఈసారి తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంది. వారికి గెలిచే అర్హత వందకు వందశాతం ఉంది’’ అని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. అశూకు మొండిచేయి ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్లో రోహిత్ సేనను ఓడించిన ఆసీస్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ తన యూట్యూబ్ చానెల్లో ఓ వీడియో విడుదల చేశాడు. కాగా డబ్ల్యూటీసీ 2021-23 సైకిల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన టీమిండియా బౌలర్ అశూకు ఫైనల్ ఆడే జట్టులో చోటు దక్కలేదు. అనుభవజ్ఞుడు, విదేశాల్లో మంచి రికార్డు ఉన్న అశ్విన్‌కు ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో మొండిచేయి చూపడం చర్చనీయాంశమైంది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా 209 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడంతో కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా అభిమానులు పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఈ విషయంపై తాజాగా స్పందించిన అశ్విన్.. ‘‘గత పదేళ్లుగా టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. కాబట్టి అభిమానులు ఆవేశపడటం సహజమే. వారి బాధను నేను సహానుభూతి చెందగలను. నేనూ ధోని కెప్టెన్సీలో ఆడినవాడినే అయితే, జట్టు నుంచి ఈ ఆటగాడిని తప్పిస్తే బాగుండు.. అతడికి అవకాశం ఇవ్వాల్సింది అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం సరికాదు. ఎందుకంటే రాత్రికి రాత్రే ఆటగాళ్ల నైపుణ్యాలు, శక్తిసామర్థ్యాల్లో మార్పులు రావు. మనలో చాలా మంది ధోని నాయకత్వ పటిమ గురించి చర్చించుకుంటాం. అతడి సీక్రెట్ ఏంటి? ఏ విషయాన్నైనా అతడు సరళతరం చేస్తాడు. నేను కూడా ధోని సారథ్యంలో ఆడిన వాడినే. అతడు తన జట్టులో తొలుత 15 మందిని ఎంపిక చేసుకుంటాడు. ఆ పదిహేను మంది నుంచే తుదిజట్టును ఎంపిక చేసుకుంటాడు. వారినే ఏడాది మొత్తం జట్టులో ఉండేలా చూసుకుంటాడు. ఆటగాడికి సెక్యూరిటీ ఉండాలి నిజానికి ఓ ఆటగాడు మెరుగైన ప్రదర్శన ఇవ్వాలంటే.. జట్టులో తన స్థానం పదిలమే అన్న నమ్మకం అతడికి కలగాలి’’ అని అన్నాడు. ధోని కెప్టెన్సీని ప్రశంసిస్తూ.. పరోక్షంగా రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్‌కు చురకలు అంటించాడు. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో అశూకు బదులు మరో స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు చోటిచ్చారు. అతడు ఈ మ్యాచ్‌లో మొత్తంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. చదవండి: 'మెక్కల్లమ్ కంటే ముందు నన్ను సంప్రదించారు.. తిరస్కరించా' టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మరోసారి భారత జట్టులోకి ధోని! -
'గిల్ క్యాచ్' పునరావృతం.. ఈసారి అన్యాయమే గెలిచింది!
ఇటీవలే ముగిసిన డబ్ల్యూటీసీ చాంపియన్‌షిప్‌లో టీమిండియా ఓపెనర్ శుబ్‌మన్ గిల్ క్యాచ్ ఎంత వివాదాస్పదమయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కామెరాన్ గ్రీన్ అందుకున్న బంతి నేలకు తాకినట్లు క్లియర్‌గా తెలుస్తున్నప్పటికి థర్డ్ అంపైర్ ఔట్ ఇవ్వడం విమర్శలకు దారి తీసింది. మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలయినప్పటికి గిల్ క్యాచ్ విషయంలో మాత్రం భారత్‌కు అన్యాయం జరిగిందనే చెప్పొచ్చు. తాజాగా మరోసారి గిల్ క్యాచ్ సీన్ తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో రీక్రియేట్ అయింది. యాదృశ్చికంగా జరిగినప్పటికి అచ్చం గిల్ క్యాచ్ వివాదమే ఇక్కడా చోటుచేసుకుంది. అయితే ఈసారి కూడా థర్డ్ అంపైర్ ఔట్ అని ప్రకటించడంతో మరోసారి అన్యాయమే గెలిచింది. టీఎన్‌పీఎల్ 2023లో భాగంగా బుధవారం నెల్లయ్ రాయల్ కింగ్స్, ఐడ్రీమ్ తిరుప్పూర్ మధ్య మ్యాచ్ జరిగింది. రాయల్ కింగ్స్ బ్యాటింగ్ సమయంలో నాలుగో ఓవర్ భువనేశ్వరన్ వేశాడు. ఆ ఓవర్ తొలి బంతిని ఎల్. సూర్యప్రకాశ్ ఆఫ్‌సైడ్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి ఔట్‌సైడ్ ఎడ్జ్ అయి స్లిప్‌లో ఉన్న ఎస్. రాధాకృష్ణన్ చేతిలోకి వెళ్లింది. అయితే క్యాచ్ అందుకునే క్రమంలో రాధాకృష్ణన్ బంతిని నేలకు తాకించాడు. కానీ ఫీల్డ్ అంపైర్ అనుమానంతో థర్డ్ అంపైర్‌కు పంపించాడు. క్యాచ్‌ను పరిశీలించిన థర్డ్ అంపైర్ ఔట్ అని ప్రకటించాడు. ఈ నిర్ణయంతో సూర్యప్రకాశ్ షాక్ తిన్నాడు. ఎందుకంటే రిప్లేలో బంతి నేలను తాకుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికి ఔట్ ఎలా ఇస్తారంటూ బాధపడిన సూర్య చేసేదేం లేక నిరాశగా పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. The third umpire thought this catch was clean. Does it bring back some recent memories? 🤔 #TNPLonFanCode pic.twitter.com/apAKHVn34v — FanCode (@FanCode) June 20, 2023 View this post on Instagram A post shared by ICC (@icc) ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఐడ్రీమ్ తిరుప్పూర్ ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన నెల్లయ్ రాయల్ కింగ్స్ 18.2 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌట్ అయింది. సోను యాదవ్ 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. భువనేశ్వరన్ ఐదు వికెట్లతో చెలరేగాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఐడ్రీమ్ తిరుప్పూర్ 18.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. తుషార్ రహేజా 49, ఎస్ రాధాకృష్ణన్ 34, రాజేంద్రన్ వివేక్ 21 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించారు. చదవండి: కనీస ధర 350 కోట్లేనా!.. బీసీసీఐ ఎందుకిలా? #NotOut: థర్డ్ అంపైర్ చీటింగ్.. గిల్ ఔట్ కాదు -
అప్పుడు నాన్న.. అమ్మతో వచ్చారు.. కానీ ఈసారి: కమిన్స్ భావోద్వేగం
England vs Australia, 1st Test: ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భావోద్వేగానికి లోనయ్యాడు. 2019లో తన తండ్రి.. తల్లితో పాటు మ్యాచ్ చూడటానికి వచ్చారని.. ఇప్పుడు లండన్‌లో ఆయన ఒక్కరే ఉన్నారని ఉద్వేగానికి గురయ్యాడు. కాగా టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023తో బిజీగా ఉన్న సమయంలో ప్యాట్ కమిన్స్ ఉన్నఫళంగా ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లిన విషయం తెలిసిందే. బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తల్లి బాగోగులు చూసుకునేందుకు టెస్టు సిరీస్ మధ్యలోనే ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే కమిన్స్ తల్లి కన్నుమూసింది. అయితే, తాను ఎంతగానో ప్రేమించే మాతృమూర్తిని కోల్పోయిన బాధ నుంచి కమిన్స్ ఇంకా బయటపడలేకపోతున్నాడు. ఇదిలా ఉంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్ తర్వాత ఆసీస్ నేరుగా టీమిండియాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడింది. ఇంగ్లండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో కమిన్స్.. మొత్తంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక కమిన్స్ సారథ్యంలోని ఆసీస్.. ఈ ప్రతిష్టాత్మక ఫైనల్లో 209 పరుగుల భారీ తేడాతో రోహిత్ సేనను ఓడించింది. తద్వారా సంప్రదాయ క్రికెట్లోనూ విశ్వవిజేతగా అవతరించింది. ఇక ఈ మ్యాచ్ ముగియగానే ఆసీస్.. ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు సిద్ధమైంది. ఈ క్రమంలో జూన్ 16-20 వరకు జరిగిన తొలి టెస్టులో 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో కమిన్స్ 4 వికెట్లు తీయడంతో పాటు.. కీలక సమయంలో 44 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. ఈ నేపథ్యంలో విజయానంతరం కమిన్స్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘వ్యక్తిగతంగా.. గత కొన్నిరోజులుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నా. అయితే, ఈ వారం మొత్తం నాన్న, నా సోదరుడు నాతో పాటే ఉన్నారు. 2019లో నాన్న అమ్మతో పాటు వచ్చారు. కానీ ఇప్పుడు ఇలా!.. మరేం పర్లేదు ఆయన నాతో ఉండటం స్పెషల్.. లక్కీగా ఫీలవుతున్నా’’ అని ఎమోషనల్ అయ్యాడు. చదవండి: Ravindra Jadeja: పాపం! జడేజా మనసు గాయపడి ఉంటుంది.. సీఎస్కే సీఈఓ కామెంట్స్ వైరల్ -
విరాట్ కోహ్లి తాజా పోస్ట్ వైరల్.. ఇంతకీ రన్‌మెషీన్ ఏమన్నాడంటే!
Virat Kohli posts another spiritual story: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇతర క్రికెటర్లెవరికీ సాధ్యం కాని రీతిలో 253 మిలియన్ ఫాలోవర్లను కలిగి ఉన్నాడు ఈ రన్‌మెషీన్. ట్విటర్లోనూ ఈ రికార్డుల కింగ్‌కు ఫాలోయింగ్ ఎక్కువే. ప్రస్తుతం కోహ్లి ట్విటర్ ఖాతాకు 56.4 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఎప్పటికప్పుడు వృత్తిగత, వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసే కోహ్లి గత రెండ్రోజులుగా ఫుల్ యాక్టివ్ అయిపోయాడు. వరుస పోస్టులతో ముందుకు వస్తున్నాడు. ఈగో నుంచి బయటపడేసేది అదే మొన్నటికి మొన్న జిమ్ వీడియో షేర్ చేసిన ఈ మాజీ సారథి.. తాజాగా క్రిప్టిక్ పోస్టు షేర్ చేశాడు. ‘‘మెదుడు అనుమానాలతో సతమతం అవుతుంది. అదే మనసులో ఎల్లప్పుడూ నమ్మకంతో ముందుకు సాగుతుంది. నిజానికి.. ఈగో మైండ్ నుంచి బయటపడేందుకు నమ్మకమే ఓ వారధిలా పనిచేస్తుంది’’ అన్న కోట్‌ను ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్నాడు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. స్థాయికి తగ్గట్లు రాణించలేదు కాగా కోహ్లి ఇటీవల ముగిసిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్లో ఆడాడు. ఇంగ్లండ్‌లోని ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడిన టీమిండియా ఈ మ్యాచ్‌లో 209 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఇక ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో కోహ్లి విఫలమయ్యాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 14 పరుగులే చేసిన విరాట్.. రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకానికి పరుగు దూరంలో నిలిచిపోయాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత టీమిండియా ఆటగాళ్లకు దాదాపు నెలరోజుల పాటు విశ్రాంతి లభించింది. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి సెలవులను ఆస్వాదిస్తున్నారు పలువురు క్రికెటర్లు. కాగా తదుపరి జూలై 12- ఆగష్టు 13 వరకు టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో బిజీ కానుంది. చదవండి: Ind Vs WI: విండీస్‌కు కష్టాలు! సందిగ్దంలో టీమిండియాతో టెస్టు సిరీస్! ధోనికి పిల్లనిచ్చిన అత్తగారు! ఆ కంపెనీ సీఈఓ.. రూ. 800 కోట్ల సామ్రాజ్యం! -
పంత్ లేకపోవడం తీరని లోటే.. కానీ భరత్‌ను బలిపశువును చేయొద్దు: మాజీ కెప్టెన్
KS Bharat: ఆంధ్ర క్రికెటర్, టీమిండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్‌కు భారత మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా అండగా నిలిచారు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023లో టీమిండియా ఓటమికి అతడిని కారణంగా చూపడం సరికాదంటూ మద్దతు ప్రకటించారు. దయచేసి అతడిని బలిపశువును చేయవద్దంటూ మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేశారు. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌తో కాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు కేఎస్ భరత్. స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ స్థానంలో వికెట్ కీపర్‌గా అవకాశం దక్కించుకున్న అతడు తన విధులను చక్కగా నిర్వర్తించాడు. కానీ కొంతమంది మాత్రం అతడు బ్యాటర్‌గా పంత్ స్థానాన్ని భర్తీ చేయలేకపోయాడంటూ విషం చిమ్మారు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023లో భరత్ బ్యాటింగ్ తీరుపై కూడా పెదవి విరిచారు. ఏడో స్థానంలో కాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన భరత్ తొలి ఇన్నింగ్స్‌లో 5 పరుగులకే అవుట్ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 23 పరుగులు చేయగలిగాడు. ఇక ఈ ప్రతిష్టాత్మక ఫైనల్లో టీమిండియా 209 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేఎస్ భరత్ బ్యాటింగ్ ప్రదర్శనపై అనవసరపు విమర్శల నేపథ్యంలో అంజుమ్ చోప్రా అతడికి మద్దతు ప్రకటించారు. జూలై 12న మొదలుకానున్న వెస్టిండీస్ పర్యటనకు భరత్ స్థానంలో ఇషాన్ కిషన్‌కు చోటు ఇవ్వనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంత్ లేకపోవడం తీరని లోటే.. కానీ ఈ మేరకు న్యూస్18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘రిషభ్ పంత్ అందుబాటులో లేకపోవడం టీమిండియాకు తీరని లోటే. కానీ అతడిని దృష్టిలో పెట్టుకుని కేఎస్ భరత్ పట్ల అనుచితంగా ప్రవర్తించడం సరికాదు. నిజానికి వికెట్ కీపర్‌గా అతడు తన బాధ్యతలను చక్కగా నెరవేరుస్తున్నాడు. తన ప్రైమరీ జాబ్ కూడా వికెట్ కీపింగే కదా! రిషభ్ పంత్ మాదిరే అతడు కూడా బ్యాటింగ్ అదరగొట్టాలని భావించడం పొరపాటే అవుతుంది. తన పని తాను చేస్తున్నాడు భరత్ లోయర్ ఆర్డర్లో ఆడుతున్నాడు. వాస్తవానికి.. టాపార్డర్ బ్యాటింగ్ బాధ్యతను నెత్తినవేసుకోవాలి.. మిడిలార్డర్ వాళ్లకు సపోర్టుగా ఉంటుంది.. ఇక లోయర్ ఆర్డర్ వీరందరికీ తమ వంతు సహకారం అందిస్తుందంతే!! ఈ విషయాలను మనం కచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. అంతేగానీ బ్యాటింగ్ సరిగా లేదంటూ అతడిని విమర్శించడం సరికాదు’’ అని అంజుమ్ చోప్రా చెప్పుకొచ్చారు. వికెట్ కీపర్‌గా కేఎస్ భరత్ రాణిస్తున్నాడని.. అతడిని అదే కోణంలో చూడాలని విజ్ఞప్తి చేశారు. కాగా జూలై 12- ఆగష్టు 13 వరకు టీమిండియా వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఇక కోన శ్రీకర్ భరత్ ఇప్పటి వరకు భారత్ తరఫున 5 టెస్టులాడి 129 పరుగులు సాధించాడు. చదవండి: 20 లక్షలు అనుకుంటే ఏకంగా కోటీశ్వరుడయ్యాడు! జూబ్లీహిల్స్‌లో బంగ్లా, కార్లు.. తగ్గేదేలే! టీమిండియా కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. ! శుబ్‌మన్ గిల్ సంచలన నిర్ణయం! వచ్చే సీజన్లో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా! -
ఇదేం ట్విస్టు భయ్యా! వదినమ్మను కాదని ఇలా..! జడ్డూ ట్వీట్ వైరల్
ప్రపంచంలోని ఉత్తమ ఆల్రౌండర్లలో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజాకు చోటు దక్కుతుంది. 34 ఏళ్ల ఈ గుజరాత్ ఆటగాడు ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా ఈ ఏడాది ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన జడ్డూ.. డబ్ల్యూటీసీ ఫైనల్-2023లో ఫర్వాలేదనిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 48 పరుగులు చేసిన ఈ స్పిన్ ఆల్‌రౌండర్.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగి పూర్తిగా నిరాశపరిచాడు. ఇక ఆసీస్‌తో ఫైనల్లో మొత్తంగా 4 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ వేదికగా ప్రఖ్యాత ఓవల్ వేదికగా జూన్ 7- 11 వరకు జరిగిన ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా ఆటగాళ్లకు దాదాపు నెలరోజుల విశ్రాంతి లభించింది. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ సహా మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక జడేజా సైతం తనకు ఇష్టమైన వ్యాపకాల్లో మునిగిపోయాడు. కాగా రవీంద్ర జడేజాకు అశ్వాలన్నా, గుర్రపు స్వారీ అన్నా ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో తాజాగా జడ్డూ షేర్ చేసిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. సుదీర్ఘ విరామం తర్వాత తనకు ఇష్టమైన అశ్వాన్ని కలిశానన్న జడ్డూ.. ‘‘ఫరెవర్ క్రష్’’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా గత అక్టోబరులోనూ మై క్రష్ అంటూ జడేజా ఇలాంటి ఫొటోను పంచుకున్నాడు. ఇక జడేజా డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్భంగా బిషన్ సింగ్ బేడీ పేరిట ఉన్న రికార్డును సవరించాడు. టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా నిలిచాడు. బిషన్ సింగ్ బేడి 67 మ్యాచ్‌లలో 266 వికెట్లు తీయగా.. జడ్డూ 65 మ్యాచ్‌లలో 268 వికెట్లతో అతడిని అధిగమించాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023లో విన్నింగ్ షాట్లో రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్‌ను చాంపియన్‌గా నిలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడి భార్య, ఎమ్మెల్యే రివాబా మైదానంలోకి వచ్చి జడ్డూ పాదాలకు నమస్కరించిన ఫొటోలు ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో జడ్డూ తాజా ట్వీట్‌పై అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇదేం ట్విస్టు భయ్యా! వదినమ్మ కాకుండా గుర్రాన్ని క్రష్ అంటున్నావు! ’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు చదవండి: శుబ్‌మన్ గిల్ సంచలన నిర్ణయం! వచ్చే సీజన్లో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా! రోహిత్ వద్దే వద్దు!.. నాడు బీసీసీఐ ధోనిని ఎందుకు కెప్టెన్‌ను చేసిందంటే.. Forever crush ❤️🐎 #meetingafterlongtime pic.twitter.com/NvrvZrqenV — Ravindrasinh jadeja (@imjadeja) June 18, 2023 -
రోహిత్ వద్దే వద్దు!.. నాడు బీసీసీఐ ధోనిని ఎందుకు కెప్టెన్‌ను చేసిందంటే..
Team India Captain: టీమిండియా విజయవంతమైన కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోని ముందు వరుసలో ఉంటాడనడంలో సందేహం లేదు. జట్టులోకి వచ్చిన దాదాపు మూడేళ్ల కాలంలోనే సారథిగా పగ్గాలు చేపట్టి అనేకానేక విజయాలు అందించాడు. ఏకంగా మూడు ఐసీసీ టైటిళ్లు గెలిచి మరే ఇతర కెప్టెన్లకు సాధ్యం కాని రికార్డులు నమోదు చేశాడు. ఇక ధోని తర్వాత అతడి వారసుడిగా విరాట్ కోహ్లి సారథ్య బాధ్యతలు స్వీకరించి తనదైన ముద్ర వేయగలిగాడు. ఐసీసీ మేజర్ టోర్నీల్లో టీమిండియాను చాంపియన్‌గా నిలపలేకపోయినప్పటికీ పలు చిరస్మరణీయ విజయాలు అందించాడు. ధోని వారసుడిగా కోహ్లి ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2021 తర్వాత కోహ్లి కెప్టెన్సీ నుంచి వైదొలగగా.. అనూహ్య రీతిలో వన్డే సారథిగా తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత టెస్టు కెప్టెన్సీకి కూడా గుడ్‌బై చెప్పగా... రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లలో సారథిగా నియమితుడయ్యాడు. రోహిత్ ఇలా ఇక హిట్‌మ్యాన్ ద్వైపాక్షిక సిరీస్‌లలో కెప్టెన్ అద్భుతంగా రాణించినప్పటికీ ఆసియా కప్-2022, టీ20 వరల్డ్‌కప్-2022 టోర్నీల్లో ప్రభావం చూపలేకపోయాడు. తాజాగా ముగిసిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్లోనూ రోహిత్ సేన ఓటమిపాలైంది. రోహిత్ వద్దే వద్దంటూ ఈ నేపథ్యంలో 36 ఏళ్ల రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్లో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించడం ఖాయమని వార్తలు వినిపిస్తుండగా.. టెస్టుల్లో రోహిత్‌కు సరైన వారసుడు ఎవరన్న అంశంపై చర్చలు నడుస్తున్నాయి. నాడు బీసీసీఐ ధోనిని కెప్టెన్ ఎందుకు చేసిందంటే ఈ క్రమంలో ఓ ఆటగాడిని సారథిగా నియమించే ముందు ఎలాంటి అంశాలు పరిగణనలోకి తీసుకుంటాం, ధోని తక్కువ కాలంలోనే ఎలా కెప్టెన్ అయ్యాడన్న విషయంపై మాజీ సెలక్టర్ భూపీందర్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘జట్టులోని సీనియర్లలో ఎవరో ఒకరిని ఆటోమేటిక్ ఆప్షన్‌గా తీసుకునే బదులు.. ఆట పట్ల సదరు క్రికెటర్‌కు ఉన్న అవగాహన, శక్తిసామర్థ్యాలు, చాతుర్యత, బాడీ లాంగ్వేజ్, జట్టును ముందుకు నడిపించగల సత్తా, మేనేజ్మెంట్ స్కిల్స్.. ఇవన్నీ గమనిస్తాం. నాడు ధోనిలో ఇవన్నీ చూసిన తర్వాతే అతడి విషయంలో ఓ నిర్ణయానికి వచ్చాం. ఆట పట్ల అతడి ఆలోచనా ధోరణి, ఇతరులతో మమేకమయ్యే విధానం.. వీటితో పాటు ధోని విషయంలో పాజిటివ్ ఫీడ్‌బ్యాక్.. అతడిని సారథిగా నియమించేందుకు దోహదం చేశాయి’’ అని భూపీందర్.. హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం టీమిండియా ఆటగాళ్లకు దాదాపు నెల రోజుల విశ్రాంతి లభించింది. ఈ క్రమంలో జూలై 12 నుంచి భారత జట్టు వెస్టిండీస్ పర్యటన మొదలుపెట్టనుంది. చదవండి: లబూషేన్ తొండాట.. చీటర్ అంటూ ఏకి పారేసిన నెటిజన్లు #MSKPrasad: 'క్రికెట్ కు సంబంధించి దేశానికి ఏపీ రోల్ మోడల్' -
జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్న కోహ్లి! క్షణాల్లోనే వీడియో వైరల్
Virat Kohli does weight training in gym: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి జిమ్‌లో చెమటోడుస్తున్నాడు. వర్కౌట్లు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘‘సాకులు వెదుక్కుంటారా? లేదంటే మరింత మెరుగవుతురా?’’ అన్న అర్థంలో క్యాప్షన్ జత చేసి మరోసారి ఫిట్నెస్ గోల్స్ సెట్ చేశాడు. కోహ్లి షేర్ చేసిన వీడియో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. కాగా అత్యంత ఫిట్‌గా ఉండే క్రికెటర్ అనగానే కోహ్లి పేరే గుర్తుకువస్తుందనడంలో సందేహం లేదు. ప్రపంచంలోని అథ్లెట్లందరిలో కూడా ఫిట్నెస్ విషయంలో కోహ్లి ముందుంటానడం అతిశయోక్తి కాదు. మైదానంలో పరుగుల వరద పారించే ఈ రన్ మెషీన్ ఫిట్నెస్ సమస్యల కారణంగా జట్టుకు దూరమైన సందర్భాలు అరుదు. కాగా కోహ్లి ఇటీవల జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో భాగమయ్యాడు. ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో అతడు స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 14 పరుగులు మాత్రమే చేసిన ఈ స్టార్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో 49 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. కానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రతిష్టాత్మక ఐసీసీ మెగా మ్యాచ్‌లో టీమిండియా ఆసీస్ చేతిలో ఏకంగా 209 పరుగుల తేడాతో చిత్తైంది. వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరినప్పటికీ ట్రోఫీ గెలవలేక విమర్శలు మూటగట్టుకుంది. కాగా జూన్ 7-11 వరకు జరిగిన ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా ఆటగాళ్లకు దాదాపు నెలరోజుల పాటు విశ్రాంతి లభించింది. ఇక జూలై 12- ఆగష్టు 13 వరకు వెస్టిండీస్ పర్యటనతో భారత జట్టు మళ్లీ బిజీ కానుంది. విండీస్‌తో రెండు టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి కేవలం టెస్టు సిరీస్ మాత్రమే ఆడి వెస్టిండీస్ నుంచి తిరుగు ప్రయాణం కానున్నట్లు సమాచారం. ఇక జూన్ 27న.. విండీస్ టూర్‌కు వెళ్లే జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: నువ్వెందుకు బౌలింగ్ చేస్తున్నావు? కావాలంటే మీకు కూడా.. అంతేగానీ! ధోని ఆ ఒక్క మాటతో 2011 ప్రపంచకప్ ఫైనల్ ఆడాడు.. ధోని సహచర ఆటగాడు! బస్ డ్రైవర్‌గా.. ఒక్కడే కాదు View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవనంత మాత్రాన.. కెప్టెన్సీ నుంచి తొలగిస్తారా? ఇలా చేస్తే..
Rohit Sharma Captaincy: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఆస్ట్రేలియా మాజీ సారథి మైకేల్ క్లార్క్ మద్దతుగా నిలిచాడు. కేవలం ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఓడినంత మాత్రాన అతడిని తొలగించాలనే డిమాండ్లు సరికావంటూ హిట్‌మ్యాన్‌ను సమర్థించాడు. కాగా డబ్ల్యూటీసీ సైకిల్ 2019-21లో విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు ఫైనల్ చేరుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌లో జరిగిన తుదిపోరులో న్యూజిలాండ్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టగా 2021-23 సీజన్లోనూ ఫైనల్‌కు అర్హత సాధించింది. కానీ ఈసారి కూడా గతం మాదిరే చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. దారుణ ఓటమి ప్రఖ్యాత ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో రోహిత్ సేన ఏకంగా 209 పరుగుల తేడాతో దారుణంగా ఓడిపోయింది. ఈ క్రమంలో ఆసీస్ సంప్రదాయ క్రికెట్లోనూ చాంపియన్‌గా అవతరించి సరికొత్త చరిత్ర సృష్టించగా.. టీమిండియా రిక్తహస్తాలతో తిరిగి వచ్చింది. ఈ నేపథ్యంలో 36 ఏళ్ల రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి. టాస్ విషయంలో, ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు తుదిజట్టులో చోటు కల్పించకపోవడంపై మాజీలు సైతం పెదవి విరిచారు. ఈ క్రమంలో అతడిని సారథ్య బాధ్యతల నుంచి తొలగించాలనే డిమాండ్లు వినిపించాయి. నాకు నమ్మకం ఉంది ఈ విషయంపై స్పందించిన మైకేల్ క్లార్క్ రోహిత్‌కు అండగా నిలిచాడు. ‘‘రోహిత్‌పై నాకు పూర్తి నమ్మకం ఉంది. తను గొప్ప కెప్టెన్. అతడి దూకుడైన ఆట తీరు, కెప్టెన్సీ నాకు నచ్చుతాయి. ఎల్లవేళలా అతడు సానుకూల దృక్పథంతోనే కనిపిస్తాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ రికార్డు అమోఘం. నాయకుడిగా తను విజయవంతమయ్యాడు. ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవలేదన్న ఒకే ఒక్క కారణంగా రోహిత్ కెప్టెన్‌గా పనికిరాడనడం సరికాదు. నిజానికి ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో టీమిండియా వరుసగా రెండుసార్లు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుంది. టెస్టు క్రికెట్లో వారి రికార్డు బాగుంది. టీమిండియా నిలకడైన ప్రదర్శనతో ముందుకు సాగుతోంది. ఇక వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్లో వారు ఎలా ఆడతారో చూడాల్సి ఉంది’’ అని క్లార్క్ చెప్పుకొచ్చాడు. రోహిత్‌ను కెప్టెన్‌గా కొనసాగించాలని టీమిండియా మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేశాడు. చదవండి: 2011 ప్రపంచకప్ ఫైనల్ ఆడాడు.. ధోని సహచర ఆటగాడు! బస్ డ్రైవర్‌గా.. ఒక్కడే కాదు! ‘మొదటి బంతి’కే రూట్ అలా! పంత్‌ను లాగిన ఫ్యాన్స్.. వీడియో వైరల్ -
ఇప్పుడలా లేదు.. ఎవరూ ఎవరికి సాయం చేయరు: అశ్విన్ షాకింగ్ కామెంట్స్
Ravichandran Ashwin Shocking Comments: ‘‘ఒకప్పుడు జట్టులోని ఆటగాళ్లంతా స్నేహితుల్లా మెలిగేవారు. కానీ.. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కేవలం సహచర ఆటగాడిగానే పరిగణింపబడతాడు. అప్పటికీ.. ఇప్పటికీ చాలా తేడా ఉంది. డ్రెసింగ్‌రూం వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతి ఒక్కరు అనుక్షణం పక్క వాళ్లతో పోటీ పడుతూ ముందుకు సాగాల్సిన పరిస్థితి. ‘‘హాయ్ బాస్.. ఏంటి సంగతులు?’’ అని పక్కవాళ్లతో సరదాగా మాట్లాడేందుకు ఎవరి దగ్గరా కాస్తైనా సమయం లేదు’’ అని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ప్రస్తుతం జట్టులోని ఆటగాళ్లంతా కేవలం కొలీగ్స్ మాదిరే ఉంటున్నారని, మునుపటిలా ఫ్రెండ్స్‌లా కొనసాగే పరిస్థితి లేదన్నాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ సైకిల్ 2021-23లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఈ టీమిండియా బౌలర్‌కు ఫైనల్లో ఆడే అవకాశం మాత్రం రాలేదు. అత్యుత్తమ బౌలర్‌కు మొండిచేయి ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో అశ్విన్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మేనేజ్మెంట్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక.. ఆసీస్‌తో ఫైనల్లో టీమిండియా ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. వరుసగా రెండోసారి తుదిపోరుకు అర్హత సాధించినప్పటికీ ట్రోఫీ గెలవలేక చతికిలపడింది. ఇదిలా ఉంటే.. అశ్విన్ తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డ్రెసింగ్‌రూం వాతావరణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎవరికి వారే యమునా తీరే.. ఒంటరి ప్రయాణం జట్టులోని ఇతర సభ్యుల నుంచి సహకారం ఎలా ఉంటుందన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్లు ఉంటారని అశూ పేర్కొన్నాడు. ‘‘నిజానికి.. ఎంత ఎక్కువగా ఆట గురించి చర్చిస్తే అంత ఎక్కువగా టెక్నిక్‌ను మెరుగుపరచుకునే అవకాశం ఉంటుంది. ఒకరి అనుభవాలు మరొకరికి పాఠాలుగా పనికివస్తాయి. కానీ ఇపుడు అలాంటి పరిస్థితి లేదు. మనకు ఏదైనా సాయం కావాలంటే ఎవరూ ముందుకురారు. పది మందితో కూడిన ఒంటరి ప్రయాణం లాంటిది ఇది’’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. అయితే, క్రికెట్లో ఒకరు చెప్పే పాఠాల కంటే సొంతంగా నేర్చుకోవాల్సిందే ఎక్కువగా ఉంటుందంటూ ముక్తాయింపు ఇచ్చాడు. మేటి బౌలర్‌గా ఎదిగిన అశూ కాగా రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్ అయిన ఈ తమిళనాడు బౌలర్.. తన అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటి వరకు 92 టెస్టులు, 113 వన్డేలు, 65 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మేటి బౌలర్‌గా ఎదిగిన అతడు టెస్టుల్లో 474, వన్డేల్లో 151, టీ20లలో 72 వికెట్లు పడగొట్టాడు. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన అశ్విన్ తాజా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చదవండి: 2011 ప్రపంచకప్ ఫైనల్ ఆడాడు.. ధోని సహచర ఆటగాడు! బస్ డ్రైవర్‌గా.. ఒక్కడే కాదు! సచిన్, ధోని, కోహ్లి, రోహిత్.. రుతురాజ్ కూడా వీళ్ల బ్యాచ్‌లో చేరిపోయాడు..! -
రోహిత్ మంచి కెప్టెన్.. మేటి టెస్ట్ బ్యాటర్ కూడా! కానీ.. ఇకపై..
Rohit Sharma Captaincy: ‘‘రోహిత్ మంచి కెప్టెన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం గొప్ప నాయకుడే కాదు.. మంచి టెస్ట్ బ్యాటర్ కూడా! ఈ మాట అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే, భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగుతుందా అంటే నేనైతే కచ్చితంగా చెప్పలేను. గత రెండు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ సైకిళ్లలో టీమిండియా ఫైనల్‌కు చేరింది. కానీ ఒక్కసారి కూడా గెలవలేదు. ప్రస్తుతం రోహిత్ శర్మ వయస్సే అతడికి పెద్ద సమస్యగా మారనుంది. ఇది నమ్మకతప్పని వాస్తవం. రానున్న రెండేళ్లలో డబ్ల్యూటీసీ సైకిల్-2025 షెడ్యూల్ ఉంటుంది. ఒకవేళ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్లో కొనసాగాలని భావిస్తే తప్పకుండా ఆడతాడు. నిజానికి ఒక డబ్ల్యూటీసీ సైకిల్లో దాదాపు ఆరు సిరీస్‌లు ఆడాల్సి ఉంటుంది. కానీ గత రెండేళ్లలో చాలా మంది క్రికెటర్లు(రోహిత్ శర్మ సహా) కీలక సిరీస్‌లు కూడా మిస్ చేశారు. టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లకు ఒక్కోసారి విశ్రాంతి దొరక్కపోవచ్చు. అలాంటపుడు మూడు ఫార్మాట్లు ఆడే అవకాశం కొంతమందికే దక్కుతుంది. సెలక్టర్లు అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకునే జట్టును ఎంపిక చేస్తారు. డబ్ల్యూటీసీ తదుపరి సైకిల్లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లు ఉంటాయి. తర్వాత ఆస్ట్రేలియా పర్యటన ఉండొచ్చు. రోహిత్ శర్మ కెప్టెన్‌గా తనను తాను నిరూపించుకున్నాడు. కానీ.. రానున్న రెండేళ్ల కాలంలో కెప్టెన్‌గా అతడికి ప్రత్యామ్నాయం వెతక్కతప్పదు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. 36 ఏళ్ల రోహిత్ శర్మ ఇకపై సారథిగా కొనసాగడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు. వరుస వైఫల్యాలు కాగా రోహిత్ శర్మ ఇటీవలి కాలంలో ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2023లో అంతంత మాత్రమే ఆడిన ‘హిట్‌మ్యాన్’.. ఇటీవల ముగిసిన ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 15 పరుగులే చేసిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో 43 పరుగులు సాధించగలిగాడు. ఇక కీలక మ్యాచ్‌లో టాస్, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను పక్కనపెట్టిన విషయంలో తీవ్ర విమర్శలపాలయ్యాడు రోహిత్. అతడిని కెప్టెన్‌గా తప్పించాల్సిందేనంటూ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: కోహ్లి సంపాదన ఎంతో తెలిస్తే షాక్!.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో! ఎలా సంపాదిస్తున్నాడంటే? -
ఆసీస్‌తో సిరీస్ నా చివరిదని భార్యకు చెప్పా.. చాలా కష్టంగా ఉండేది: అశ్విన్
లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ తుది జట్టులో టీమిండియా వెటరన్ పేసర్ రవిచంద్రనన్ అశ్విన్‌కు చోటు దక్కపోయిన సంగతి తెలిసిందే. డబ్ల్యూటీసీ సైకిల్ 2021-23 సైకిల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌ను పక్కన పెట్టడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఇదే విషయంపై ఇప్పటికీ పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది. అశ్విన్ జట్టులో ఉంటే టీమిండియా గెలిచి ఉండేదాని చాలా మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. ఇలాంటి సమయంలో అశ్విన్ ఓ షాకింగ్ విషయం వెల్లడించాడు. ఈ ఏడాది భారత్ వేదికగా జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత రిటైర్మెంట్ గురించి ఆలోచించినట్లు ఓ ఇంటర్వ్యూలో అశ్విన్ తెలిపాడు. కాగా అశ్విన్ తన మోకాలి గాయం కారణంగానే రిటైర్మెంట్ గురించి ఆలోచించాడు. అశ్విన్ చాలా కాలం నుంచి మోకాలి నొప్పితో బాధపడుతూనే ఉన్నాడు. దీని వల్ల అతని కెరీర్ కూడా చాలా దెబ్బతింది. "బంగ్లాదేశ్ సిరీస్ తర్వాత భారత్‌కు వచ్చాక తీవ్రమైన మోకాలి నొప్పితో బాధపడ్డాను. ఇదే విషయంపై నా భార్యతో కూడా మాట్లాడాను. ఆస్ట్రేలియా సిరీస్ నాకు చివరిదయ్యే అవకాశం ఉందని తనకు చెప్పేశాను. గాయం కారణంగా నా బౌలింగ్ యాక్షన్ మార్చుకోవాలి అనుకుంటున్నట్లు కూడా తనకు చెప్పా. బౌలింగ్ వేసే క్రమంలో నా మోకాలిపై చాలా ప్రభావం పడేది. దీంతో చాలా కష్టంగా ఉండేది. ముఖ్యంగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో నొప్పి మరి ఎక్కువైంది. అనంతరం బెంగుళూరు వచ్చి నొప్పికి ఇంజెక్షన్ తీసుకున్నాను. ఆ తర్వాత నా బౌలింగ్ యాక్షన్ మార్చుకోవడానికి చాలా కష్టపడ్డా. దాదాపు రోజుకు 3-4 గంటలు కొత్త బౌలింగ్ యాక్షన్ ప్రాక్టీస్ చేశా అని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్విన్ చెప్పుకొచ్చాడు. చదవండి: చరిత్ర సృష్టించిన 12 ఏళ్ల కుర్రాడు.. ఒకే ఓవర్లో 6 వికెట్లు -
భారత క్రికెట్‌కు అహంకారం ఎక్కువైంది.. అందుకే ఇలా: వెస్టిండీస్ లెజెండ్
ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓటమి పాలైన భారత జట్టుపై వెస్టిండీస్ లెజెండ్ సర్ ఆండీ రాబర్ట్స్ ఘూటు వాఖ్యలు చేశాడు. అహంకారం, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే భారత జట్టు ఓడిపోయిందని అతడు విమర్శించాడు. కాగా లండన్ వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఏకంగా 209 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసింది. 444 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 234 పరుగులకే ఆలౌటైంది. ఈ క్రమంలో భారత జట్టుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ జాబితాలో ఆండీ రాబర్ట్స్ కూడా చేరాడు. "భారత క్రికెట్‌కు అహంకారం ఎక్కవైంది. అందువల్ల ప్రపంచక్రికెట్లో మిగితా జట్లను తక్కువగా అంచనా వేస్తున్నారు. ఏదో ఒక్క కుప్పకూలిపోతారు అని నాకు తెలుసు. అందుకే భారత జట్టుపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. టెస్ట్ క్రికెట్, పరిమిత ఓవర్ల క్రికెట్లో తమ లోపాలపై దృష్టి పెట్టాలి. తమ తీరును మార్చుకుని ముందుకు వెళ్లాలి. టీ20 క్రికెట్‌ను నేను పెద్దగా లెక్కలోని తీసుకోను. అందులో బ్యాట్ కు, బంతికి మధ్య సరైన పోటీనే లేదు. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ తమ బ్యాటింగ్ బలాన్ని ప్రదర్శిస్తుందని నేను ఊహించాను. అజింక్య రహానే పోరాటం మినహా మిగితా అందరూ విఫలమయ్యారు. రహానే తన చేతికి గాయమైనప్పటికీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. శుబ్‌మన్ గిల్ కొన్ని షాట్లు మంచిగా ఆడాడు. కానీ అతడు లెగ్ స్టంప్‌పై నిలుచుని తన వికెట్‌ను కోల్పోయాడు. విరాట్ కోహ్లి కూడా అంతే. మిచెల్ స్టార్క్ వేసిన బంతికి కోహ్లి దగ్గర సమాధానమే లేకపోయింది. భారత జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ విదేశాల్లో మాత్రం రాణించలేకపోతున్నారు" అని మిడ్డే ఫ్రమ్ ఆంటిగ్వాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబర్ట్స్ పేర్కొన్నాడు. కాగా వచ్చె నెలలో వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా విండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. చదవండి: Ashes 2023: సరికొత్త వార్నర్‌ను చూస్తాం.. అతడికి చుక్కలు చూపిస్తాడు: ఆసీస్ కెప్టెన్ -
లిగసీ కంటిన్యూ చేస్తారనుకున్నాం.. మూకుమ్మడి విఫలం
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ రూపంలో చేతిదాకా వచ్చిన ఐసీసీ టైటిల్‌ను టీమిండియా చేజార్చుకుంది. ఒకసారి అంటే అనుకోవచ్చు.. కానీ వరుసగా రెండోసారి కూడా రన్నరప్‌గా నిలవడం అభిమానులకు రుచించడం లేదు. ఎందుకంటే పదేళ్లుగా టీమిండియా ఖాతాలో ఒక్క ఐసీసీ మేజర్ టైటిల్ లేకుండా పోయింది. ఇక క్రికెట్లో మిస్టర్ డిపెండబుల్, ది వాల్ అని పేర్లు కలిగిన రాహుల్ ద్రవిడ్ హెడ్‌కోచ్‌గా వచ్చినప్పటికి పెద్దగా ప్రభావం చూపడం లేదు. కోహ్లి-రవిశాస్త్రి లిగసీని కంటిన్యూ చేయడంలో రోహిత్- ద్రవిడ్‌లు విఫలమయ్యారు. అయితే కోహ్లి- రవిశాస్త్రి కూడా టీమిండియాకు కప్‌లు అందించింది లేదు కానీ వారిద్దరు ఉన్నప్పుడు జట్టులోకి ఎంతోమంది యువ ఆటగాళ్లు వచ్చారు. కానీ రోహిత్ హయాంలో అలా జరగడం లేదు. కేవలం అనుభవం ఉన్న ప్లేయర్లకు మాత్రమే అవకాశాలు వస్తున్నాయి తప్పితే కొత్త వాళ్లను ప్రోత్సహిస్తున్నట్లు కనిపించడం లేదు. ఇదే ఇప్పుడు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్.. కెప్టెన్‌గా రోహిత్ శర్మల పదవులకు ఎసరు పెట్టేలా ఉంది. సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా ఉన్న హయాంలో టీమిండియా దూకుడు మీద కనిపించేది. కెప్టెన్‌గా గంగూలీ ఖాతాలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీ మినహా మిగతా టైటిల్స్ లేకపోయినప్పటికి తన అగ్రెసివ్నెస్తో టీమిండియాకు విదేశాల్లో విజయాలు అందించిన మొదటి కెప్టెన్‌గా పేరు పొందాడు. ఎంతో మంది యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంతో పాటు 2003లో సౌతాఫ్రికా గడ్డపై జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియాను ఫైనల్ చేర్చాడు. ఆ తర్వాత కోచ్ చాపెల్‌తో వివాదం.. 2007 వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా ఘోర వైఫల్యం దాదాను కెప్టెన్సీ కోల్పోయేలా చేసింది. అయితేనేం సౌరవ్ గంగూలీ తన మార్క్‌ను సెట్ చేసి వెళ్లగా దానిని ధోని సక్సెస్‌ఫుల్‌గా నడిపించాడు. 2007లో జరిగిన టి20 వరల్డ్‌కప్‌లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన ధోని సేన విశ్వవిజేతగా నిలిచింది. ఆ తర్వాత ధోని కెప్టెన్సీలో మరింత రాటుదేలిన టీమిండియా 2011లో సొంతగడ్డపై జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో విజేతగా నిలిచి 28 సంవత్సరాల నిరీక్షణకు తెరదించింది. ఆ తర్వాత 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన టీమిండియా అప్పటినుంచి మరో ఐసీసీ టైటిల్ నెగ్గలేదు. అయితే ధోని కెప్టెన్‌గా ఉన్నంతకాలం టీమిండియా సక్సెస్ రేట్ ఎక్కడా తగ్గలేదు. ఇక ధోని కెప్టెన్‌గా తప్పుకున్న తర్వాత కోహ్లి- రవిశాస్త్రి లిగసీ ప్రారంభమయింది. వీరి హయాంలో టీమిండియా విదేశాల్లో సిరీస్ విజయాలు అందుకోవడం ప్రారంభించింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ లాంటి జట్లను వారి సొంతగడ్డపైనే ఓడించింది. అయితే కోహ్లి-రవిశాస్త్రి ఎరాలో టీమిండియా ఒక్క మేజర్ టైటిల్ సాధించలేదు. వీరి తర్వాత కెప్టెన్‌గా బాధ్యత చేపట్టిన రోహిత్.. కోచ్‌గా ద్రవిడ్ ఆ లిగసీని కంటిన్యూ చేయడంలో విఫలమయ్యారు. ధోని కెప్టెన్సీలో 2011లో వన్డే వరల్డ్‌కప్ సాధించిన టీమిండియా.. అదే ధోని సారధ్యంలో 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీ నెగ్గింది. అంతే అప్పటినుంచి ఇప్పటిదాకా పదేళ్లపాటు మరో ఐసీసీ టైటిల్ నెగ్గలేకపోయింది. అయితే ఘోరంగా ఓడిపోతే పర్లేదు.. కానీ 2013 తర్వాత జరిగిన 2014 టి20 వరల్డ్‌కప్‌లో ఫైనల్లో, 2015 వన్డే వరల్డ్‌కప్, 2019 వన్డే వరల్డ్‌కప్ సెమీస్‌ల్లో, 2016 టి20 వరల్డ్‌కప్‌లో మళ్లీ సెమీస్‌లో, 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీలో ఫైనల్లో, 2022 టి20 వరల్డ్‌కప్‌లో సెమీస్‌లో ఇంటిబాట పట్టింది. ఇక 2021, 2023లో జరిగిన డబ్ల్యూటీసీ ఛాంపియన్‌షిప్‌లోనూ ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది. అంటే దాదాపు ఎనిమిదిసార్లు కప్ కొట్టే అవకాశాన్ని చేజార్చుకున్నట్లే. చదవండి: విభిన్నంగా ఆడి వరల్డ్‌కప్ కొట్టబోతున్నాం: రోహిత్ -
#RAshwin: బాధ కలిగిన మాట నిజమే..
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా మరోసారి రన్నరప్‌కే పరిమితమైంది. డబ్ల్యూటీసీ 2021-23 విజేతగా ఆస్ట్రేలియా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో టీమిండియాపై 209 పరుగుల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా సగర్వంగా టైటిల్‌ను అందుకుంది. అయితే టెస్టుల్లో వరల్డ్ నెంబర్‌వన్ బౌలర్‌గా ఉన్న రవిచంద్రన్ అశ్విన్‌ను తుది జట్టులోకి ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అశ్విన్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ను అదనపు పేసర్‌గా తీసుకొచ్చారు. అయితే ఈ నిర్ణయంపై విమర్శలు వచ్చినప్పటికి మ్యాచ్ ముగిసేవరకు అశ్విన్ స్పందించలేదు. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన అనంతరం అశ్విన్ ఎట్టకేలకు నోరు విప్పాడు. ట్విటర్ ద్వారా స్పందించిన అశ్విన్ ముందుగా ఆస్ట్రేలియాకు శుభాకాంక్షలు తెలిపాడు. ''డబ్ల్యూటీసీ టైటిల్ సాధించిన పాట్ కమిన్స్ సేనకు కంగ్రాట్స్. ఈ విజయానికి వారు అర్హులు. నన్ను ఎంపిక చేయకపోవడంపై పెద్దగా బాధ లేదు. ఎంత కష్టపడినా జట్టులో 11 మందికి మాత్రమే చోటు ఉంటుంది. వికెట్ పేసర్లకు అనుకూలంగా ఉండడంతో ఒక స్పిన్నర్ చాలనుకొని జడేజాను ఆడించారు. అయితే టీమిండియా ఓటమి బాధ కలిగించింది నిజమే. మన జట్టులో కొన్ని లోపాలున్నప్పటికి గెలవడానికి ప్రయత్నించిన పోరాటం బాగుంది. రెండేళ్లు కష్టపడితే డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు వచ్చాం. ఇలా ఆఖరి మెట్టుపై బోల్తా పడడం బాధనే కలిగిస్తుంది కదా. ఇంకో విషయం ఏంటంటే.. ఈ రెండేళ్లలో నాతో పాటు ఎన్నో టెస్టు మ్యాచ్‌లు ఆడిన సభ్యులకు.. ముఖ్యంగా కోచింగ్, సపోర్ట్ స్టాఫ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. త్వరలోనే మీ ముందుకు వస్తా'' అంటూ తెలిపాడు. ఇక డబ్ల్యూటీసీ 2021-23 సైకిల్లో టీమిండియా తరపున అశ్విన్ అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. ఈ సైకిల్లో అశ్విన్ మొత్తంగా 61 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ అదే డబ్ల్యూటీసీ ఫైనల్లో మొత్తంగా ఐదు వికెట్లు(తొలి ఇన్నింగ్స్‌లో ఒకటి, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు) పడగొట్టాడు. ఒకవేళ అశ్విన్ ఫైనల్ ఆడి ఉంటే టీమిండియా పరిస్థితి వేరుగా ఉండేదేమో అని అభిమానులు భావిస్తున్నారు. Congratulations Australia on winning this #WTCFinal and closing out this cycle of test cricket. It is disappointing to end up on the wrong side of things, nevertheless it was a great effort over the last 2 years or so to get here in the first place. Amidst all the chaos and… — Ashwin 🇮🇳 (@ashwinravi99) June 11, 2023 చదవండి: అహ్మదాబాద్ స్టేడియం నిజంగా గొప్పదా!.. ఎందుకంత ప్రాముఖ్యత? -
కోహ్లి అలా చేస్తాడని అస్సలు ఊహించలేదు.. అది అతడికే తెలియాలి: గంగూలీ
లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. రోహిత్ టెస్టులకు కెప్టెన్‌గా పనికిరాడని, వెంటనే అతడిని ఆ భాధ్యతల నుంచి తప్పించాలని మాజీలు డిమాండ్ చేస్తున్నారు. మరి కొంత మంది కెప్టెన్‌గా రోహిత్ కంటే విరాట్ కోహ్లి ఎంతో బెటర్ అని, అతడి సారధ్యంలో భారత జట్టు అద్బుతంగా రాణించందని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లిని ఉద్దేశించి భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. కోహ్లిని టెస్టు క్రికెట్ కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పుకోవాలని ఎప్పుడూ తాము కోరుకోలేదని, అది అతడి వ్యక్తిగత నిర్ణయమని గంగూలీ తెలిపాడు. కాగా గతేడాది ఆరంభంలో ధక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం టీమిండియా టెస్టు కెప్టెన్సీ నుంచి కోహ్లి తప్పుకున్నాడు. అప్పటికే వన్డే, టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లి.. ఆ సిరీస్ అనంతరం టెస్టులకు కూడా గుడ్‌బై చెప్పేశాడు. అయితే అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉన్న సౌరవ్ గంగూలీతో విభేదాల కారణంగానే కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వినిపించాయి. ఇక కోహ్లి తప్పుకున్న అనంతరం రోహిత్ శర్మ భారత జట్టు పగ్గాలు చేపట్టాడు. ఇక ఇదే విషయంపై తాజాగా గంగూలీ ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. విరాట్ కోహ్లి టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని మేము అస్సలు ఊహించలేదు. అప్పటికే మేము దక్షిణాఫ్రికా సిరీస్ కోల్పోయి బాధలో ఉన్నాము. అంతలోనే కోహ్లి ఇటువంటి నిర్ణయం తీసుకుని మమ్మల్ని షాక్‌కు గురిచేశాడు. అయితే టెస్టు కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పుకున్నాడో కోహ్లికే తెలియాలి. అది అతడి వ్యక్తిగత నిర్ణయం. కోహ్లి తప్పుకున్న తర్వాత భారత జట్టుకు ఓ కెప్టెన్ అవసరం వచ్చింది. ఆ సమయంలో రోహిత్ బెస్ట్ అనిపించాడు. అందుకే సెలక్షన్ కమిటీ రోహిత్ పగ్గాలు అప్పజెప్పింది అని ఆజ్ తక్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ కారణంగానే టీమిండియా ఐసీసీ ఈవెంట్లో రాణించలేకపోతుంది అని పలువురు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై కూడా దాదా మాట్లాడుతూ.. ప్రపంచకప్ గెలవడం కంటే ఐపీఎల్ టైటిల్ గెలవడం చాలా కష్టం. 14 మ్యాచ్ ల తర్వాత ప్లేఆఫ్స్ చేరుకుంటారు. వరల్డ్ కప్‌లో నాలుగైదు మ్యాచ్ లలో గెలిస్తే సెమీస్ వెళ్తారు. ఐపీఎల్లో 17 మ్యాచ్ ల తర్వాత టైటిల్ గెలుస్తారు" అని గంగూలీ అన్నాడు. చదవండి: LPL 2023: లంక ప్రీమియర్ లీగ్ ఆడనున్న సురేష్ రైనా.. ధర ఎంతంటే? -
డబ్ల్యూటీసీ ఓటమి ఎఫెక్ట్.. పుజారా, ఉమేశ్ యాదవ్‌లపై వేటు..?
వరుసగా రెండో సీజన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోవడాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. చర్యల్లో భాగంగా గత కొంతకాలంగా పేలవ ప్రదర్శనలు చేస్తున్న ఆటగాళ్లపై వేటు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రముఖ వార్తా సంస్థ కథనం ప్రకారం.. త్వరలో ప్రారంభంకాబోయే విండీస్ టూర్ కోసం టీమిండియాలో సమూల మార్పుల చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. టెస్ట్‌ల్లో దారుణంగా విఫలమవుతున్న చతేశ్వర్ పుజారా, ఉమేశ్ యాదవ్‌లపై వేటుకు సర్వం సిద్ధమైనట్లు సమాచారం. వీరి స్థానంలో యశస్వి జైస్వాల్, ముకేశ్ కుమార్‌లను ఎంపిక చేసే అవకాశం ఉంది. అలాగే పరిమిత ఓవర్ల ఫార్మాట్లోనూ పలు మార్పులకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2023 ప్రదర్శనల ఆధారంగా పలు ఎంపికలు ఉండవచ్చని సమాచారం. టీ20ల్లో రింకూ సింగ్, యశస్వి జైస్వాల్, జితేశ్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, మోహిత్ శర్మలకు దాదాపుగా ఛాన్స్ దక్కవచ్చని తెలుస్తోంది. విండీస్ టూర్లో సీనియర్ల గైర్హాజరీలో వీరికి వీలైనన్ని అవకాశాలు ఇవ్వాలని బోర్డు యోచిస్తున్నట్లు వినికిడి. ఇదే విండీస్ టూర్లో వన్డేల కోసం పలువురు ఆటగాళ్లను ప్రత్యేకంగా ఎంపిక చేయవచ్చన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ లిస్ట్‌లో శిఖర్ ధవన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ధవన్‌కు వయసు పైబడుతుండటంతో వరల్డ్‌కప్‌కు ముందు వీలైనన్ని అవకాశాలు కల్పించాలన్నది బీసీసీఐ యోచనగా తెలుస్తోంది. కాగా, 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్ కోసం భారత జట్టు జులై 12 నుంచి వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్ తొలుత టెస్ట్‌లు, ఆతర్వాత వన్డేలు, టీ20లు ఆడుతుంది. విండీస్ పర్యటన వివరాలు.. తొలి టెస్ట్- జులై 12-16, డొమినికా రెండో టెస్ట్- జులై 20-24, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ జులై 27- తొలి వన్డే, బ్రిడ్జ్‌టౌన్ జులై 29- రెండో వన్డే, బ్రిడ్జ్‌టౌన్ ఆగస్ట్ 1- మూడో వన్డే, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఆగస్ట్ 4- తొలి టీ20, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఆగస్ట్ 6- రెండో టీ20, గయానా ఆగస్ట్ 8- మూడో టీ20, గయానా ఆగస్ట్ 12- నాలుగో టీ20, ఫ్లోరిడా ఆగస్ట్ 13- ఐదో టీ20, ఫ్లోరిడా చదవండి: WTC Final 2023: ఆల్ ఫార్మాట్ సూపర్ స్టార్స్‌గా ఈ ఐదుగురు క్రికెటర్లు