ది ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడిన సంగతి తెలిసిందే. తొలుత బౌలింగ్‌లో విఫలమైన భారత జట్టు.. అనంతరం బ్యాటింగ్‌లో కూడా అదే తీరును కనబరిచింది. రోహిత్ శర్మ(15), విరాట్ కోహ్లి(14), పుజారా(14), గిల్(13) వంటి స్టార్ ఆటగాళ్లు తమ ఆటతీరుతో తీవ్ర నిరాశపరిచారు.
ఈ క్రమంలో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులోఅజింక్య రహానే(29), కేఎస్ భరత్(5) పరుగులతో ఉన్నారు. దీంతో జట్టును అదుకునే బాధ్యత సీనియర్ ఆటగాడు రహానేపై పడింది.
అదృష్టం కలిసొచ్చి..
ఈ మ్యాచ్‌లో అజింక్య రహనేకు అదృష్టం కలిసొచ్చింది. ఈ రెండో రోజు మూడో సెషన్‌లో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వేసిన ఓ బంతికి రహనే వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ కూడా ఔట్ అని వేలు పైకెత్తడంతో రహానే రివ్యూ కోరాడు. ఇక్కడే అస్సలు ట్విస్టు చోటు చేసుకుంది. రిప్లేలో కమ్మిన్స్ నోబాల్ వేసినట్లు తేలింది.
అతడు బంతిని వేసే క్రమంలో ఫ్రంట్ లైట్ దాటేశాడు. దీంతో రహానే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఒక వేళ అది నోబాల్ కాకపోయింటే రహానే కచ్చితంగా పెవిలియన్‌కు చేరాల్సిందే. ఎందుకంటే బంతి స్టంప్స్‌ను హిట్టింగ్ చేస్తున్నట్లు రిప్లేలో కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: WTC Final: ఐపీఎల్‌లో దుమ్మురేపారు.. ఇక్కడ మాత్రం చేతులెత్తేశారు! అట్లుంటది మనవాళ్ల తోటి
— Sanju Here 🤞👻 (@me_sanjureddy) June 8, 2023
Comments
Please login to add a commentAdd a comment