వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 టైటిల్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఓవల్ వేదికగా టీమిండియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 209 పరుగుల భారీ తేడాతో ఆసీస్ విజయం సాధించింది.
తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల(వన్డే, టి20, టెస్టులు) ఐసీసీ ట్రోఫీలు అందుకున్న తొలి జట్టుగా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. ఇక చారిత్రత్మక విజయంపై మ్యాచ్ అనంతరం ఆసీస్ కెప్టెప్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో అదరగొట్టిన బోలాండ్‌పై కమ్మిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు.
"ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోవడమే మంచిదైంది. లేకపోతే మేమూ బౌలింగ్ తీసుకునేవాళ్లం. కొన్నిసార్లు భారత్ ప్రతిఘటించినా, ఎక్కువ భాగం మేమే ఆధిపత్యం ప్రదర్శించాం. మాకు సంబంధించి ఇదో మధుర క్షణం. ఈ విజయాన్ని కొన్ని రోజులు ఆస్వాదించిన తర్వాతే యాషెస్ గురించి ఆలోచిస్తాం. ఈ మ్యాచ్‌లో బోలాండ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.
బోలాండ్ నా ఫేవరేట్ ప్లేయర్. హెడ్, స్టీవ్ కూడా అత్యుత్తమ ప్రదర్శన చేశారు. ఇక ఫైనల్ ఒక్క మ్యాచ్ ఉండటమే మంచిది. అనుకంటే 50 మ్యాచ్‌ల సిరీస్ కూడా ఆడవచ్చు. ఒలింపిక్స్‌లో ఒక్క రేస్ గెలిస్తేనే స్వర్ణం దక్కుతుంది కదా అని" పోస్ట్ మ్యాచ్ కాన్పరెన్స్‌లో కమ్మిన్స్‌పేర్కొన్నాడు.
చదవండి: WTC Final: ఆస్ట్రేలియా చేతిలో ఘోర ఓటమి.. కోహ్లి క్రిప్టిక్ పోస్ట్! మౌనమే అంటూ
Comments
Please login to add a commentAdd a comment