వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్ ప్రారంభానికి ముందు, ఈ మ్యాచ్‌లో గెలుపెవరిదో తెలుసుకునేందుకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI)ను ఆశ్రయించారు. ఏఐ నుంచి ఆసీస్‌కు అనుకూలమైన సమాధానం వచ్చింది. ఆసీస్ గెలుపు ఖాయమని ఏఐ కుండ బద్దలుకొట్టి చెప్పింది. అయితే ఏఐ సమాధానాన్ని వర్ణించిన తీరు మాత్రం తికమకపెట్టేదిగా ఉంది. ఏఐ చెప్పిన సమాధానాన్ని ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్ క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక వెబ్‌సైట్ ఇన్‌స్టా ఖాతా ద్వారా వివరించారు.
ఏఐ సమాధానం కమిన్స్ మాటల్లో.. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా నరాలు తెగే ఉత్కంఠ పోరులో తలపడ్డాయి. సవాళ్లతో కూడిన లక్ష్యాన్ని ఛేదించడంలో ఆసీస్ అసాధారణ వ్యూహాన్ని అమలు చేసింది. వారి బ్యాటింగ్ ఆర్డర్ తారుమారైంది.
ఏఐ సమాధానం హాజిల్‌వుడ్ మాటల్లో.. ఆసీస్ ఓపెనింగ్ జోడీ హాజిల్‌వుడ్, నాథన్ లయోన్ గార్డ్ తీసుకున్నారు. హాజిల్‌వుడ్.. తన అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించి సొగసైన బౌండరీలు బాది సాహసోపేతమైన ఛేజింగ్‌కు నాంది పలికాడు. ఆసీస్ సాంప్రదాయేతర విధానానికి అమలు చేయడంతో టీమిండియా విస్మయానికి గురై లయ కోల్పోయింది.
ఏఐ సమాధానం కమిన్స్ మాటల్లో.. కమిన్స్ మూడో స్థానంలో బరిలోకి దిగాడు. అతని నిర్భయ ఉద్దేశం ఆసీస్ శిబిరంలో నమ్మకాన్ని తీసుకువచ్చింది. కమిన్స్ ఆడిన ప్రతి షాట్ ఆసీస్‌ను విజయానికి చేరువ చేసింది. ఒక బంతికి రెండు పరుగులు చేయాల్సిన తరుణంలో లయోన్ సిక్సర్ బాది ఆసీస్‌ను గెలిపించాడు. అసాధారణ వ్యూహాన్ని అమలు చేసి ఆసీస్ టెస్ట్ ఛాంపియన్‌గా అవతరించింది.
కాగా, ఏఐ తలా తోక లేని సమాధాన్ని పక్కన పెడితే.. తొలి రోజు మాత్రం ఆసీస్‌దే పైచేయగా ఉంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (146 నాటౌట్), స్టీవ్ స్మిత్ (95 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు.
చదవండి: WTC Final: అంచనా తప్పింది.. అశ్విన్‌ను పక్కకు పెట్టి మూల్యం చెల్లించుకుంది..!
Comments
Please login to add a commentAdd a comment