Josh Hazlewood
-
గెలుపు జోష్‌లో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్..
టీమిండియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా.. ఇప్పుడు మరో రెడ్ బాల్ సిరీస్‌కు సిద్దమైంది. ఆసీస్ జట్టు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌లో విజయం సాధించి డబ్ల్యూటీసీ సైకిల్ 2024-25ను విజయంతో ముగించాలని కంగారులు భావిస్తున్నారు.అయితే ఈ టెస్టు సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదరుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌పేసర్ జోష్ హాజిల్‌వుడ్ గాయం కారణంగా లంక పర్యటనకు దూరమయ్యాడు. ఇటీవల భారత్‌తో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడిన హాజిల్‌వుడ్ ప్రస్తుతం.. ప్రక్కటెముకుల గాయంతో బాధపడుతున్నాడు.ఈ కారణంతోనే బీజీటీ మధ్యలో తప్పుకున్న హాజిల్‌వుడ్.. ఇప్పుడు శ్రీలంక సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండడని ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ తెలిపింది. ఈ సిరీస్‌కు ఆసీస్ రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా దూరం కానున్నాడు.అతడి భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనుండడంతో లంక టూర్‌కు దూరంగా ఉండాలని ప్యాట్ నిర్ణయించుకున్నాడు. హాజిల్‌వుడ్ స్ధానంలో జో రిచర్డ్సన్, కమ్మిన్స్ స్ధానంలో మైఖల్ నీసర్ జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది.కాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 3-1 తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే తమ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. జూన్ 11న లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఆసీస్ తలపడనుంది.కాగా ఈ నామమాత్రపు సిరీస్‌కు వీరిద్దరితో పాటు స్టార్ ప్లేయర్ మిచెల్ స్టార్క్‌కు విశ్రాంతి ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్ జనవరి 29 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టును ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది.అయితే శ్రీలంకను వారి సొంతగడ్డపై ఓడించడం అసీస్‌కు అంతసులువు కాదు. శ్రీలంకలో టర్నింగ్ వికెట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆసీస్‌తో పోలిస్తే లంక జట్టులోనే అద్బుతమైన స్పిన్నర్లు ఉన్నారు. ప్రభాత్ జయసూర్య వంటి స్పిన్నర్‌ను ఆసీస్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.చదవండి: BGT: ఆస్ట్రేలియా నిజంగానే గొప్పగా ఆడిందా?.. బుమ్రా వేరే గ్రహం నుంచి వచ్చాడా? -
అత్యుత్తమ టెస్టు జట్టు కెప్టెన్‌గా బుమ్రా.. భారత్ నుంచి మరొకరికి చోటు
క్రికెట్ ఆస్ట్రేలియా 2024 ఏడాదికి గానూ అత్యుత్తమ టెస్టు క్రికెట్ జట్టు( Cricket Australia's Test team of 2024)ను ప్రకటించింది. ఈ టీమ్‌కు టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)ను కెప్టెన్‌గా ఎంచుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ).. కేవలం ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు మాత్రమే చోటిచ్చింది.భారత్ నుంచి మరొకరికి చోటుకాగా 2024లో టెస్టుల్లో సూపర్ ఫామ్‌లో ఉన్న పదకొండు మంది ఆటగాళ్ల పేర్లతో సీఏ ఈ జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఈ జట్టుకు ఓపెనర్లుగా టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal)- ఇంగ్లండ్ స్టార్ బెన్ డకెట్ ఉండగా.. జో రూట్(Joe Root) వన్‌డౌన్ బ్యాటర్‌గా ఎంపికయ్యాడు.లంక ఆటగాడికి స్థానంఇక నాలుగో స్థానంలో న్యూజిలాండ్ స్టార్ రచిన్ రవీంద్ర.. వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్ యువ తార హ్యారీ బ్రూక్, శ్రీలంక క్రికెటర్ కమిందు మెండిస్ చోటు దక్కించుకున్నారు. ఇక వికెట్ కీపర్ కోటాలో ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ క్యారీ స్థానం సంపాదించగా.. ఫాస్ట్ బౌలర్ల విభాగంలో న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ, భారత స్టార్ బుమ్రా, ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ ఎంపికయ్యారు. ఏకైక స్పిన్నర్‌గా కేశవ్ మహరాజ్ ఈ జట్టులో స్థానం దక్కించుకున్నాడు.క్రికెట్ ఆస్ట్రేలియా 2024కు గానూ ఎంచుకున్న అత్యుత్తమ టెస్టు జట్టుయశస్వి జైస్వాల్(భారత్), బెన్ డకెట్(ఇంగ్లండ్), జో రూట్(ఇంగ్లండ్), రచిన్ రవీంద్ర(న్యూజిలాండ్), హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్), కమిందు మెండిస్(శ్రీలంక), అలెక్స్ క్యారీ(ఆస్ట్రేలియా), మ్యాచ్ హెన్రీ(న్యూజిలాండ్), జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్- భారత్), జోష్ హాజిల్‌వుడ్(ఆస్ట్రేలియా), కేశవ్ మహరాజ్(సౌతాఫ్రికా).2024లో ఈ ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉందంటే?యశస్వి జైస్వాల్ఈ ఏడాదిలో 15 టెస్టులాడి 1478 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు ఉనఆయి. అత్యధిక స్కోరు 214బెన్ డకెట్బెన్ డకెట్ 2024లో 17 టెస్టు మ్యాచ్‌లు ఆడి 1149 రన్స్ సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోరు 153.జో రూట్ఇంగ్లండ్ వెటరన్ స్టార్ జో రూట్ ఈ సంవత్సరం 17 టెస్టుల్లో ఆడి 1556 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా ఆరు శతకాలు, ఓ డబుల్ సెంచరీ ఉన్నాయి. హయ్యస్ట్ స్కోరు 262.రచిన్ రవీంద్రకివీస్ యువ సంచలనం రచిన్ రవీంద్ర ఈ ఏడాది 12 టెస్టు మ్యాచ్‌లలో కలిపి.. 984 రన్స్ చేశాడు. అత్యధిక స్కోరు: 249.హ్యారీ బ్రూక్ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 2024లో 12 టెస్టుల్లో కలిపి 1100 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు శతకాలతో పాటు.. ఓ ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది. అత్యధిక స్కోరు 317.కమిందు మెండిస్శ్రీలంక తరఫున ఈ ఏడాది అద్భుత ఫామ్ కనబరిచిన కమిందు మెండిస్ 9 టెస్టులు ఆడి.. 1049 రన్స్ చేశాడు. ఇందులో ఐదు శతకాలు ఉండగా.. హయ్యస్ట్ స్కోరు: 182.అలెక్స్ క్యారీఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ 2024లో తొమ్మిది టెస్టులు ఆడాడు. 42 డిస్మిసల్స్లో భాగం కావడంతో పాటు.. నాలుగు స్టంపౌట్లు చేశాడు. అదే విధంగా.. మూడు అర్ధ శతకాల సాయంతో 440 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 98.మ్యాట్ హెన్రీకివీస్ పేసర్ మ్యాచ్ హెన్రీ ఈ ఏడాది తొమ్మిది టెస్టులాడి 48 వికెట్లు కూల్చాడు. అత్యుత్తమ గణాంకాలు 7-67.జస్ప్రీత్ బుమ్రాటీమిండియా వైస్ కెప్టెన్ 2024లో పదమూడు టెస్టు మ్యాచ్‌లు ఆడి ఏకంగా 71 వికెట్లు కూల్చాడు. అత్యుత్తమ గణాంకాలు 6-45. భారత్ తరఫున అత్యంత వేగంగా 200 టెస్టు వికెట్ల క్లబ్లో చేరిన ఫాస్ట్‌బౌలర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆసీస్‌తో తొలి టెస్టుకు సారథ్యం వహించి.. భారత్‌ను 275 పరుగుల తేడాతో గెలిపించాడు. జోష్ హాజిల్వుడ్ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ ఈ సంవత్సరం 15 టెస్టు మ్యాచ్‌లలో కలిపి 35 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ గణాంకాలు 5-31.కేశవ్ మహరాజ్సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ఈ ఏడాది 15 టెస్టుల్లో పాల్గొని 35 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 5-59. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో సౌతాఫ్రికా ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.చదవండి: టెస్టులకు రోహిత్ శర్మ గుడ్‌బై!?.. ప్రకటనకు రంగం సిద్ధం! -
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ: ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ
టీమిండియాతో టెస్టు సిరీస్‌తో బిజీగా ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక పేస్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ గాయం తీవ్రమైంది. ఫలితంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో మిగిలిన రెండు టెస్టులకు అతడు పూర్తిగా దూరమయ్యాడు. క్రికెట్ ఆస్ట్రేలియా మంగళవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.కంగారు జట్టు సొంతగడ్డపై భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో భారీ తేడాతో ఓడిపోయిన కమిన్స్ బృందం.. అడిలైడ్ మ్యాచ్‌లో మాత్రం అద్భుత ప్రదర్శన కనబరిచింది. పింక్ బాల్ టెస్టులో రోహిత్ సేనను ఓడించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది.గతంలోనూ గాయంకాగా తొలి టెస్టు సందర్భంగా పక్కటెముకల నొప్పితో బాధపడ్డ హాజిల్‌వుడ్‌కు ఆస్ట్రేలియా మేనేజ్మెంట్.. అడిలైడ్ మ్యాచ్ నుంచి విశ్రాంతినిచ్చింది. హాజిల్‌వుడ్ స్థానంలో స్కాట్ బోలాండ్‌ను పిలిపించగా అతడు ఐదు వికెట్లతో రాణించాడు. అయితే, బ్రిస్బేన్‌లో భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టుకు క్రికెట్ ఆస్ట్రేలియా హాజిల్‌వుడ్‌ను వెనక్కి పిలిపించింది.కండరాలు పట్టుకోవడంతోగబ్బా మైదానంలో శనివారం మొదలైన ఈ మ్యాచ్‌లో హాజిల్‌వుడ్ మళ్లీ గాయపడ్డాడు. భారత్‌తో మంగళవారం నాటి నాలుగో రోజు ఆటలో డ్రింక్స్ బ్రేక్ సమయంలో అతడు మైదానాన్ని వీడాడు. ఈ 33 ఏళ్ల రైటార్మ్ పేసర్ కుడికాలి పిక్క కండరాలు పట్టుకోవడంతో వెంటనే స్కానింగ్‌కు పంపించారు.ఈ నేపథ్యంలో గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేలడంతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ మొత్తానికి హాజిల్‌వుడ్ దూరమైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే అతడి స్థానాన్ని భర్తీ చేస్తామని వెల్లడించింది. కాగా బ్రిస్బేన్ టెస్టులో ఆరు ఓవర్లపాటు బౌలింగ్ చేసిన హాజిల్‌వుడ్.. విరాట్ కోహ్లి(3) రూపంలో కీలక వికెట్ తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు.ఆస్ట్రేలియా జట్టుప్యాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), బ్రెండన్ డగెట్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్స్టర్టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.చదవండి: ‘రోహిత్ శర్మ వెంటనే తప్పుకోవాలి.. అతడిని కెప్టెన్ చేయండి’ -
భారత్‌తో మూడో టెస్టు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్
బ్రిస్బేన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ గాయం కారణంగా నాలుగో రోజు ఆటకు దూరమయ్యాడు. నాలుగో రోజు ఆట ఆరంభానికి ముందు వార్మప్‌లో హాజిల్‌వుడ్ కాలి పిక్క కండరాల నొప్పితో బాధపడ్డాడు.అయినప్పటికి నాలుగో రోజు ఆడేందుకు తన జట్టుతో కలిసి హాజిల్‌వుడ్ మైదానంలో అడుగుపెట్టాడు. ఒక్క ఓవర్ కూడా అతడు బౌలింగ్ చేశాడు. కానీ బౌలింగ్ చేసే క్రమంలో జోష్ ఇబ్బంది పడ్డాడు. దీంతో ఆ ఓవర్‌ను పూర్తి చేసి హాజిల్‌వుడ్ మైదానాన్ని వీడాడు.అనంతరం స్కానింగ్ తరలించగా ఎడమవైపు లో గ్రేడ్ గాయమైనట్లు తేలింది. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా సైతం ధ్రువీకరించింది. ఈ క్రమంలో మిగిలిన ఆట మొత్తానికి అతడు దూరమయ్యే ఛాన్స్ ఉంది. కాగా అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టుకు కూడా హాజిల్‌వుడ్ గాయం కారణంగానే దూరమయ్యాడు.ఇప్పుడు మళ్లీ గాయపడడంతో సిరీస్ నుంచి వైదొలిగే ఛాన్స్ ఉంది. అతడికి బ్యాకప్‌గా స్టార్ పేసర్ స్కాట్ బోలాండ్ ఉన్నాడు. ఇప్పటికే రెండో టెస్టులో జట్టులోకి వచ్చిన బోలాండ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. కానీ బ్రిస్బేన్ టెస్టుకు హాజిల్‌వుడ్ అందుబాటులోకి రావడంతో బోలాండ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.మళ్లీ హాజిల్‌వుడ్ గాయం పడడంతో బోలాండ్ తిరిగి జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. కాగా ఈ మ్యాచ్‌లో భారత్ తడబడతుంది. నాలుగో రోజు ఆట లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఫాల్ ఆన్ గండం దాటాలంటే భారత్ ఇంకా 79 పరుగులు వెనకబడి ఉంది. -
IND Vs AUS 3rd Test: తీరు మార్చుకోని విరాట్ కోహ్లి..!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 445 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. తమ ఇన్నింగ్స్ ప్రారంభించి పట్టుమని 10 ఓవర్లు కూడా ఆడకుండానే 3 కీలకమైన వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ తొలి బంతికే బౌండరీ బాది జోష్ మీద కనిపించిన యశస్వి జైస్వాల్ రెండో బంతికే స్టార్క్ పన్నిన పన్నాగానికి బలయ్యాడు. స్టార్క్ సంధించిన స్లో బాల్‌ను అంచనా వేయడంలో విఫలమైన యశస్వి షార్ట్ మిడ్వికెట్లో కాపు కాసిన మిచెల్ మార్ష్‌కు క్యాచ్ ఇచ్చి వచ్చిన దారిలోనే వెళ్లిపోయాడు.వన్‌డౌన్‌లో వచ్చిన శుభ్‌మన్ గిల్ కూడా అనవసరంగా వికెట్ పారేసుకున్నాడు. ఆఫ్ స్టంప్ ఆవల వెళ్తున్న బంతిని ఫ్లిక్ చేసి ఔటయ్యాడు. వాస్తవానికి ఈ బంతిని ఆడాల్సి అవసరం లేదు. వదిలేస్తే సరిపోయేది. కానీ గిల్ వెంటాడి మరీ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. స్టార్క్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ గల్లీలో అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. గిల్ ఇన్నింగ్స్ ఒక్క పరుగు వద్దే ముగిసింది. భారత్ ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తున్న విరాట్నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి చేసిన తప్పునే మరోసారి చేశాడు. ఆఫ్ స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడి మరీ ఫ్లిక్ చేసి ఔటయ్యాడు. ఇటీవలికాలంలో ఇలాంటి బంతులను ఎదుర్కోవడంలో విరాట్ తరుచూ విఫలమవుతున్నాడు. Virat Kohli and the delivery outside off stump 🥲Same story!pic.twitter.com/kuHQXBPLjY— CricTracker (@Cricketracker) December 16, 2024విరాట్ ప్రతిసారి ఒకే తరహాలో ఔట్ కావడం చూసి అభిమానులు విసుగెత్తిపోతున్నారు. చేసిన తప్పునే ఎన్ని సార్లు చేస్తావు. నేర్చుకోవా అంటూ చురకలంటిస్తున్నారు. శరీరానికి దూరంగా వెళ్తున్న బంతులను డ్రైవ్ చేయాల్సిన అవసరమేముందంటూ తలంటుతున్నారు. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి విరాట్ పెవిలియన్ బాటపట్టాడు.మొత్తానికి మూడో రోజు తొలి సెషన్లోనే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 423 పరుగులు వెనుకపడి ఉంది. కేఎల్ రాహుల్‌కు (13) జతగా రిషబ్ పంత్ క్రీజ్‌లోకి వచ్చాడు. విరాట్ ఔట్ కాగానే వర్షం మొదలైంది. అంపైర్లు లంచ్ విరామాన్ని ప్రకటించారు.అంతకుముందు ఆస్ట్రేలియా ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 40 పరుగులు జోడించి 445 పరుగుల వద్ద ఆలౌటైంది. అలెక్స్ క్యారీ 70 పరుగులు చేసి ఔటయ్యాడు. రెండో రోజు ఆటలో స్టీవ్ స్మిత్ (101), ట్రవిస్ హెడ్ (152) సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. భారత బౌలర్లలో బుమ్రా ఆరు వికెట్లతో చెలరేగగా.. మహ్మద్ సిరాజ్ రెండు, నితీశ్ కుమార్ రెడ్డి, ఆకాశ్‌దీప్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
Ind vs Aus 3rd Test: వదలని వర్షం.. ముగిసిపోయిన తొలిరోజు ఆట
Ind vs Aus 3rd Test Day 1 Updates: ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య శనివారం మూడో టెస్టు మొదలైంది. బ్రిస్బేన్లోన గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో తొలిరోజు ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఆసీస్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే, వర్షం కారణంగా 13.2 ఓవర్ల తర్వాత ఆట నిలిచిపోయింది. ఆ తర్వాత కూడా ఎడతెరిపి లేకుండా వాన పడటంతో అంపైర్లు తొలి రోజు ఆట ముగిసినట్లు ప్రకటించారుఆటకు వర్షం ఆటంకంబోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య మొదలైన తొలిరోజు ఆటకు వరణుడు మరోసారి ఆటంకం కలిగించాడు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను ప్రస్తుతానికి నిలిపివేశారు. ఆసీస్ స్కోరు: 28/0 (13.2). ఖవాజా 19, మెక్‌స్వీనీ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.పది ఓవర్లలో ఆసీస్ స్కోరు: 26-0ఖవాజా 18, మెక్‌స్వీనీ మూడు పరుగులతో ఆడుతున్నారు.ఆరు ఓవర్లలో ఆసీస్ స్కోరుభారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా భారత బౌలింగ్ అటాక్ ప్రారంభించాడు. ఇక రోహిత్ సేన ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఆరు ఓవర్లు ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా 23 పరుగులు చేసింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా 17, నాథన్ మెక్‌స్వీనీ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. వాళ్లిద్దరిపై వేటుటాస్ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. తమ తుదిజట్టులో రెండు మార్పులు చేసినట్లు వెల్లడించాడు. రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా స్థానంలో ఆకాశ్ దీప్‌ను తీసుకున్నట్లు తెలిపాడు. ఒక మార్పుతో ఆసీస్మరోవైపు.. ఆస్ట్రేలియా సైతం ప్లేయింగ్ ఎలెవన్‌లో ఒక మార్పు చేసింది. గాయం నుంచి కోలుకున్న పేసర్ జోష్ హాజిల్‌వుడ్ తిరిగి రావడంతో.. స్కాట్ బోలాండ్‌పై వేటు పడింది.తుదిజట్లుటీమిండియాయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.ఆస్ట్రేలియాఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ( వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, జోష్ హాజిల్‌వుడ్. -
మూడో టెస్టుకు ఆసీస్ తుది జట్టు ప్రకటన..
బ్రిస్బేన్ వేదికగా టీమిండియాతో జరగనున్న మూడో టెస్టు కోసం క్రికెట్ ఆస్ట్రేలియ తమ తుది జట్టును ప్రకటించింది. రెండో టెస్టుకు గాయం కారణంగా దూరమైన స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ తిరిగి జట్టులోకి వచ్చాడు.దీంతో స్కాట్ బోలాండ్ మళ్లీ బెంచ్‌కే పరిమితమవ్వాల్సి వచ్చింది. ఇదొక్కటి మినహా మిగిలిన జట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన స్టార్ ప్లేయర్లు మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా జట్టు మెనెజ్‌మెంట్ మరోసారి అవకాశమిచ్చింది.కాగా అడిలైడ్ టెస్టులో బోలాండ్ 5 వికెట్లు పడగొట్టి అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. కానీ హాజిల్‌వుడ్ పూర్తి ఫిట్నెస్ సాధించడంతో అతడిని పక్కన పెట్టక తప్పడం లేదని ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తెలిపాడు.ఇక శనివారం(డిసెంబర్14) ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు సత్తాచాటాలని భావిస్తున్నాయి. భారత జట్టులో కూడా ఒకట్రెండు మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది. హర్షిత్ రాణా, అశ్విన్ స్ధానాల్లో ప్రసిద్ద్ కృష్ణ, జడేజా తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది.కాగా తొలి టెస్టులో ఆసీస్‌ను 295 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేయగా.. రెండో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమంగా ఉంది.మూడో టెస్టుకు ఆస్ట్రేలియా తుది జట్టు: ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుస్చాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీప్) పాట్ కమిన్స్, మిచ్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హాజిల్‌వుడ్ -
సిరాజ్ మంచి వ్యక్తిత్వం కలవాడు: జోష్ హాజిల్‌వుడ్
అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టుతో ఆస్ట్రేలియా అభిమానులకు టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ విలన్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆసీస్ స్టార్ ట్రావిస్ హెడ్‌తో సిరాజ్ వాగ్వాదమే ఇందుకు కారణం.ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసిన అనంతరం సిరాజ్ చూపించిన అత్యుత్సాహం తీవ్ర విమర్శలకు గురిచేసింది. హెడ్ కంటే ముందు మార్నస్ లబుషేన్ పట్ల కూడా ఈ హైదరాబాదీ అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో ఆసీస్ ఆటగాళ్లతో పాటు ఫ్యాన్స్ సైతం సిరాజ్‌పై అగ్రహం వ్యక్తం చేశారు. మ్యాచ్ జరుగుతుండగానే అడిలైడ్ ప్రేక్షకులు సిరాజ్‌ను స్లెడ్జ్ చేశారు. సిరాజ్ తీరును సునీల్ గవాస్కర్ వంటి భారత దిగ్గజాలు కూడా తప్పుబట్టారు. ఆఖరికి ఐసీసీ కూడా అతడికి షాక్ ఇచ్చింది. సిరాజ్ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించింది. ఈ నేపథ్యంలో సిరాజ్‌ను ఆసీస్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జోషల్ హాజిల్‌వుడ్ ప్రశంసించడం గమనార్హం. అతడు మంచి వ్యక్తిత్వం కలవాడని కొనియాడాడు. కాగా సిరాజ్-హాజిల్‌వుడ్ ఇద్దరూ ఐపీఎల్లో ఆర్సీబీ తరపున కలిసి ఆడిన సంగతి తెలిసిందే."సిరాజ్ చాలా మంచివాడు. కానీ కొన్నిసార్లు దూకుడుగా కూడా వ్యవహరిస్తాడు. సిరాజ్‌తో కలిసి ఆర్సీబీలో గడిపిన సమయాన్ని బాగా ఎంజాయ్ చేశాను. విరాట్ కోహ్లిలా కూడా అతడిది దూకుడైన స్వభావం. చాలా ఉద్వేగభరితమైనవాడు.అతడు మైదానంలో ఉన్నంత సేపు తన స్వభావంతో అభిమానులను అలరిస్తాడు. సిరాజ్ గత కొన్ని ఐపీఎల్ సీజన్లలో అద్భతమైన బౌలింగ్ స్పెల్‌లు వేశాడు అని హాజిల్‌వుడ్ పేర్కొన్నాడు. కాగా హాజిల్‌వుడ్ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. -
భారత్‌తో రెండో టెస్టు.. ఆసీస్ తుదిజట్టు ప్రకటన.. డేంజరస్ బౌలర్ వచ్చేశాడు
టీమిండియాతో రెండో టెస్టుకు క్రికెట్ ఆస్ట్రేలియా తమ తుదిజట్టును ప్రకటించింది. స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ స్థానంలో స్కాట్ బోలాండ్కు అవకాశం ఇచ్చినట్లు తెలిపింది. ఇక పెర్త్ టెస్టుతో అరంగేట్రం చేసిన నాథన్ మెక్‌స్వీనీని కొనసాగించింది. ఉస్మాన్ ఖవాజాతో పాటు అతడు మరోసారి ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నట్లు వెల్లడించింది.అయితే, ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఫిట్‌గా ఉండటంతో అతడికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కగా.. బ్యూ వెబ్‌స్టర్‌కు మొండిచేయి ఎదురైంది. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.పింక్ బాల్తోఇరుజట్ల మధ్య పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో బుమ్రా సారథ్యంలోని భారత్.. ఆసీస్‌ను 295 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ క్రమంలో.. గెలుపు జోష్‌లో ఉన్న టీమిండియా అడిలైడ్‌లో ఆసీస్‌తో రెండో టెస్టు ఆడేందుకు సన్నద్ధమైంది. పింక్ బాల్‌తో నిర్వహించే ఈ డే అండ్ నైట్ మ్యాచ్‌కు టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు.. శుబ్‌మన్ గిల్ కూడా అందుబాటులోకి వచ్చాడు.మరోవైపు.. ఆస్ట్రేలియా మాత్రం జోష్ హాజిల్‌వుడ్ రూపంలో కీలక పేసర్ సేవలు కోల్పోయింది. తొలి టెస్టు అనంతరం అతడికి పక్కటెముకల నొప్పి తీవ్రం కావడంతో జట్టుకు దూరమయ్యాడు. మరోవైపు.. మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్ కూడా అందుబాటులో ఉంటారో లేదోనన్న అనుమానాలు నెలకొనగా.. క్రికెట్ ఆస్ట్రేలియా గురువారం స్పష్టతనిచ్చింది. 68 పరుగులకే టీమ్‌ను అవుట్ చేయడంలో కీలక పాత్రభారత్తో పింక్ బాల్ టెస్టులో వీరిద్దరు ఆడతారని పేర్కొంది. కాగా హాజిల్‌వుడ్ స్థానంలో ఆడబోయే స్కాట్ బోలాండ్ 2021-22 యాషెస్ సిరీస్‌లో మూడో టెస్టు సందర్భంగా అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్ జట్టుకు చుక్కలు చూపించి 6/7తో రాణించి.. 68 పరుగులకే టీమ్‌ను అవుట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇప్పటి వరకు ఈ రైటార్మ్ పేసర్ 10 టెస్టులాడి 35 వికెట్లు కూల్చాడు.వారికి సెకండ్ ఛాన్స్ఇదిలా ఉంటే.. రెండో టెస్టు సన్నాహకాల్లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో ఆడిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో 35 ఏళ్ల బోలాండ్ భాగమయ్యాడు. మరోవైపు.. టీమిండియాతో తొలి టెస్టులో విఫలమైనప్పటికీ నాథన్ మెక్‌స్వీనీ(10, 0)కి ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ మరో అవకాశం ఇచ్చింది. లబుషేన్(2, 3)ను కూడా కొనసాగించింది. ఇక భారత్- ఆసీస్ మధ్య శుక్రవారం నుంచి రెండో టెస్టు మొదలుకానుంది.టీమిండియాతో రెండో టెస్టుకు ఆస్ట్రేలియా తుదిజట్టుఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.చదవండి: వినోద్ కాంబ్లీని కలిసిన సచిన్.. చేయి వదలకుండా బిగించడంతో.. ఆఖరికి -
ఆసీస్ జట్టులో విభేదాలు?.. పింక్ బాల్ టెస్టు మాకూ సవాలేనన్న బ్యాటర్!
టీమిండియాతో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘోర ఓటమిని చవిచూసిన విషయం విదితమే. పెర్త్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బుమ్రా సారథ్యంలోని భారత జట్టు.. కంగారూలను 295 పరుగుల తేడాతో చిత్తు చిత్తు చేసింది. ముఖ్యంగా బ్యాటర్లంతా మూకుమ్మడిగా విఫలం కావడంతో కమిన్స్ బృందానికి ఈ మేర ఘోర పరాభవం తప్పలేదు. ఈ క్రమంలో మొదటి టెస్టు ఫలితం తర్వాత ఆస్ట్రేలియా జట్టులోని ఆటగాళ్ల మధ్య విభేదాలు వచ్చాయంటూ వార్తలు వినిపించాయి.పెర్త్‌లో పరాజయం తర్వాత బ్యాటర్లదే తప్పు అన్నట్లుగా ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రవిస్ హెడ్.. ఇవన్నీ వట్టి వదంతులేనని కొట్టిపారేశాడు. విభేదాలనే మాటకు తావు లేదు‘ఏ జట్టులోనైనా గెలుపోటముల్లో బ్యాటర్లు, బౌలర్లందరి సమాన బాధ్యత ఉంటుంది. ఏ ఆటగాడైనా విజయం కోసం తాను వ్యక్తిగతంగా కూడా కీలకపాత్ర పోషించేందుకు ప్రయత్నిస్తాడు.మేం భారీ స్కోరు చేస్తే బౌలర్ల పని సులువవుతుందని తెలుసు. కాబట్టి సమష్టిగా ఉండటం తప్ప విభేదాలనే మాటకు తావు లేదు. మేం 0–1తో వెనుకబడి ఉన్నామనేది వాస్తవం. కానీ మాకు ఇంకా చాలా అవకాశం ఉంది. ఎన్నో సార్లు ప్రతికూల పరిస్థితుల్లో కోలుకొని చెలరేగిన సత్తా మా సొంతం’ అని హెడ్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. బుమ్రా సూపర్.. ‘బుమ్రా బౌలింగ్ ఎంత అద్భుతంగా ఉందో ఇప్పుడు మాకు అనుభవంలోకి వస్తోంది. అతను విసిరే సవాల్‌ను ఎదుర్కొంటూ పోటీ పడటం ప్రత్యేకంగా అనిపిస్తోంది. కెరీర్ ముగిసిన తర్వాత నేనూ బుమ్రాను ఎదుర్కొన్నాను అని మా మనవలకు చెప్పుకోగలను. ఈ సిరీస్‌లో మరికొన్నిసార్లు అతడితో తలపడే అవకాశం ఎలాగూ వస్తుంది. నా దృష్టిలో క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా బుమ్రా నిలిచిపోయాడు’ అని హెడ్ వ్యాఖ్యానించాడు.పెర్త్ టెస్టులో హెడ్ ఒక్కడే కాస్త బుమ్రాను సమర్థంగా ఎదుర్కొని అర్ధ సెంచరీ సాధించగా... స్మిత్, లబుషేన్, ఖాజా పూర్తిగా విఫలమయ్యారు. ‘బుమ్రా ప్రత్యేకమైన బౌలర్. అయితే ఏ బౌలర్‌నైనా ఎదుర్కొనేందుకు ప్రతీ బ్యాటర్‌కు తనదైన శైలి ఉంటుంది. వారు ఎలా ఆడగలరనేది వారికి మాత్రమే తెలుసు. నేను కాస్త మెరుగ్గా ఆడినంత మాత్రాన నా సహచరులు సలహాలు, సూచనల కోసం నా వద్దకు రాలేదు కదా’ అని బుమ్రా బౌలింగ్ గురించి హెడ్ అభిప్రాయపడ్డాడు.‘పింక్ బాల్’ టెస్టు ఆడి చాలా కాలమైందినాలుగేళ్ల క్రితం ‘పింక్ బాల్’ టెస్టులో భారత్ 36 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తనకు గుర్తుందని, అయితే ఈసారి అలాంటిది జరగకపోవచ్చని అతను అన్నాడు. తాము కూడా ‘పింక్ బాల్’ టెస్టు ఆడి చాలా కాలమైందని... పరిస్థితులకు తగినట్లుగా మన ఆటను మార్చుకోవడమే ఇరు జట్లకు కీలకమని హెడ్ చెప్పాడు. కాగా భారత్- ఆసీస్ మధ్య అడిలైడ్ వేదికగా శుక్రవారం నుంచి రెండో టెస్టు(పింక్ బాల్) మొదలుకానుంది.చదవండి: ‘గిల్‌ను బెంచ్‌కే పరిమితం చేయండి.. అతడికి మరొక్క ఛాన్స్ ఇవ్వాలి’ -
టీమిండియాతో ‘పింక్ బాల్ టెస్టు’కు ముందు ఆసీస్‌కు మరో షాక్!
బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో బిజీగా ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే తొలి టెస్టులో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన కంగారూ జట్టు సిరీస్‌లో 0-1తో వెనుకబడింది. ఈ క్రమంలో అడిలైడ్ వేదికగా రెండో టెస్టులోనైనా రాణించాలని పట్టుదలగా ఉంది.అయితే, ఇప్పటికే స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయాల బారిన పడ్డారు. పక్కటెముకల నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండటంతో హాజిల్‌వుడ్ రెండో టెస్టుకు పూర్తిగా దూరమయ్యాడు. ఇక తాజాగా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కూడా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోపింక్ బాల్ టెస్టు కోసం అడిలైడ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో స్మిత్‌కు గాయమైనట్లు తెలుస్తోంది. మార్నస్ లబుషేన్ త్రోడౌన్స్ వేస్తుండగా బ్యాటింగ్ చేస్తున్న స్మిత్ కుడిచేతి బొటనవేలుకు గాయమైనట్లు సమాచారం. ఈ క్రమంలో అతడు నొప్పితో విలవిల్లాలాడగా.. ఆసీస్ జట్టు వైద్య బృందంలోని ఫిజియో నెట్స్‌లోకి వచ్చి స్మిత్ పరిస్థితిని పర్యవేక్షించాడు. అనంతరం స్మిత్ నెట్స్ వీడి వెళ్లి పోయాడు. కాసేపటి తర్వాత మళ్లీ తిరిగి వచ్చిన స్మిత్ బ్యాటింగ్ చేయగలిగినప్పటికీ.. కాస్త అసౌకర్యానికి లోనైనట్లు సమాచారం.తొలి టెస్టులో విఫలంఈ నేపథ్యంలో అడిలైడ్ టెస్టుకు స్మిత్ అందుబాటులో ఉంటాడా? లేడా? అన్న సందేహాలు నెలకొన్నాయి. కాగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో మాజీ కెప్టెన్ స్మిత్ పూర్తిగా విఫలమయ్యాడు. మొదటి ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన ఈ వెటరన్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులకే అవుటయ్యాడు. ఇక.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సైకిల్లో స్మిత్ ఇప్పటి వరకు 13 టెస్టులు ఆడి 755 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, నాలుగు అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 110.ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో ఆసీస్ బుమ్రా సేన చేతిలో 295 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. ఇక ఇరుజట్ల మధ్య అడిలైడ్‌లో శుక్రవారం(డిసెంబరు 6) నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. పూర్తి స్థాయిలో సన్నద్ధమైన టీమిండియాపింక్ బాల్‌తో జరుగనున్న ఈ టెస్టుకు ఇప్పటికే టీమిండియా పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ జట్టుతో గులాబీ బంతితో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడి ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ తిరిగి రావడంతో టీమిండియా మరింత పటిష్టంగా మారింది. కాగా రెండో టెస్టుకు హాజిల్‌వుడ్ దూరమైన నేపథ్యంలో ఆసీస్ మేనేజ్మెంట్ స్కాట్ బోలాండ్‌ను జట్టులోకి తీసుకువచ్చింది. అదే విధంగా.. మిచెల్ మార్ష్‌కు కవర్‌గా బ్యూ వెబ్‌స్టర్‌ను పిలిపించింది.ఇది కూడా చదవండి: పీవీ సింధు కాబోయే భర్త.. ఈ ఐపీఎల్ టీమ్‌తో రిలేషన్!.. బ్యాక్‌గ్రౌండ్ ఇదే!🚨 Another injury scare for Australia!Steve Smith in pain after being hit on his fingers by a throwdown from Marnus Labuschagne. After being attended by a physio, Smith left the nets. @debasissen reporting from Adelaide #INDvsAUS #BGT2024 pic.twitter.com/jgEQO0BTuz— RevSportz Global (@RevSportzGlobal) December 3, 2024 -
టీమిండియాతో రెండు టెస్టు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు డిసెంబర్ 6 నుంచి ఆడిలైడ్ వేదికగా జరగనుంది. ఈ పింక్‌బాల్ టెస్టులో గెలిచి తమ ఆధిక్యాన్ని పెంచుకోవాలని టీమిండియా భావిస్తుంటే.. ఆసీస్ మాత్రం తిరిగి కమ్‌బ్యాక్ ఇవ్వాలని తమ ఆస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఆసీస్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. హేజిల్‌వుడ్ ప్రస్తుతం పక్కటెముకుల గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఆసీస్ జట్టు మేనెజ్మెంట్ అతడికి విశ్రాంతి ఇచ్చింది.పెర్త్‌లో అదుర్స్..కాగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓటమి పాలైనప్పటికి.. హాజిల్ వుడ్ మాత్రం అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి టెస్టులో మొత్తంగా 5 వికెట్లు హాజిల్ వుడ్ పడగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 150 పరుగులకు ఆలౌట్ కావడంలో వుడ్ది కీలక పాత్ర.అబాట్, డాగెట్లకు పిలుపు..కాగా హాజిల్‌వుడ్ రీప్లేస్మెంట్స్ను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. పేసర్లు సీన్ అబాట్, బ్రెండన్ డాగెట్లకు జట్టులోకి తీసుకున్నారు. అయితే వీరిద్దరూ జట్టులోకి వచ్చినప్పటకి ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం స్కాట్ బోలాండ్కే చోటు దక్కే అవకాశముంది. కాగా మొదటి టెస్టులో అతడు బెంచకే పరిమితమయ్యాడు.చదవండి: SA vs SL 1st Test: స్టబ్స్, బవుమా సెంచరీలు.. గెలుపు దిశగా దక్షిణాఫ్రికా -
Ind vs Aus: నిద్రపోయిన దిగ్గజానికి మేలుకొలుపు: ఆసీస్ స్టార్ పేసర్
భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఘోరమైన ఓటమిని మూటగట్టుకున్న రోహిత్ సేనపై విమర్శల పర్వం కొనసాగుతోంది. క్రికెట్ దిగ్గజాలు సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, అనిల్ కుంబ్లే తదితరులు న్యూజిలాండ్ చేతిలో ఓటమిని తట్టుకోలేక.. టీమిండియా వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే, ఆస్ట్రేలియా స్టార్ జోష్ హాజిల్‌వుడ్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు.తొలిసారి -0-3తో వైట్వాష్కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన సిరీస్‌లో భారత జట్టు దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. స్వదేశంలో కివీస్‌తో జరిగిన మూడు టెస్టుల్లో ఓడి.. వైట్‌వాష్‌కు గురైంది. తద్వారా భారత క్రికెట్ చరిత్రలో ఈ చెత్త ఘనత సాధించిన తొలి జట్టుగా రోహిత్ సేన నిలిచింది.ఫలితంగా ఘోర అవమానం మూటగట్టుకోవడంతో పాటు.. డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలనూ సంక్లిష్టం చేసుకుంది. తదుపరి ఆస్ట్రేలియా పర్యటనలో నాలుగు టెస్టులు కచ్చితంగా గెలవాల్సిన స్థితికి చేరింది. ఈ నేపథ్యంలో గావస్కర్ వంటి విశ్లేషకులు ఇక మనం డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు వదిలేసుకోవడం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.నిద్రపోయిన దిగ్గజానికి ఇదో మేలుకొలుపుఈ నేపథ్యంలో ఆసీస్ పేసర్ హాజిల్‌వుడ్ స్పందించిన తీరు మాత్రం వైరల్‌గా మారింది. ‘‘నిద్రపోయిన దిగ్గజానికి ఇదో మేలుకొలుపు. అయితే, వారు దీని నుంచి ఎలా బయటపడతారో చూద్దాం’’ అని హాజిల్‌వుడ్ వ్యాఖ్యానించాడు. ఇక టీమిండియా 3-0తో గెలవడం కంటే.. 0-3తో ఓడిపోవడమే వారికి మంచిదని అతడు అభిప్రాయపడ్డాడు.కివీస్‌తో సిరీస్‌లో చాలా మంది బ్యాటర్లు విఫలమయ్యారని.. అయితే ఒకరిద్దరు మాత్రం అద్భుతంగా ఆడారని కొనియాడాడు. అయితే, ప్రస్తుతం టీమిండియాతో పోటీ ఎలా ఉండబోతుందో అంచనా వేయలేమని.. ఏదేమైనా ఫలితాలు మాత్రం తమకు అనుకూలంగా వస్తాయని హాజిల్‌వుడ్ ధీమా వ్యక్తం చేశాడు.టీమిండియా మరింత స్ట్రాంగ్‌గా ఇక ఇండియాలో ఒక్క టెస్టు గెలవడమే కష్టమని.. అలాంటిది క్లీన్‌స్వీప్‌తో కివీస్ ఆటగాళ్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని హాజిల్‌వుడ్ కొనియాడాడు. అయితే, భారత జట్టును తక్కువ అంచనా వేయబోమని.. న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత టీమిండియా మరింత స్ట్రాంగ్‌గా తిరిగివస్తుందని పేర్కొన్నాడు. కాగా నవంబరులో రోహిత్ సేన ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా కంగారూ జట్టుతో ఐదు టెస్టులు ఆడనుంది. ఇందులో నాలుగు గెలిస్తేనే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.చదవండి: 'బుమ్రా, గిల్ కాదు.. టీమిండియా నెక్ట్స్ కెప్టెన్ అతడే' -
Ind vs Ban: అశ్విన్ ఇంకో నాలుగు వికెట్లు తీశాడంటే..
టెస్టు కెరీర్లో అత్యుత్తమ దశలో ఉన్నాడు టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. ఇప్పటికే భారత్ తరఫున సంప్రదాయ క్రికెట్లో 522 వికెట్లు పూర్తి చేసుకున్న ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ బ్యాటింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా బంగ్లాదేశ్ ఇటీవల జరిగిన తొలి టెస్టులో అశూ అదరగొట్టాడు.ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్సొంతమైదానం చెన్నైలోని చెపాక్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి విలువైన శతకం(113) బాదడంతో పాటు.. ఆరు వికెట్లు పడగొట్టాడు. తద్వారా బంగ్లాపై టీమిండియా 280 పరుగుల తేడాతో గెలవడంలో కీలక పాత్ర పోషించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక భారత్- బంగ్లాదేశ్ మధ్య శుక్రవారం నుంచి ఆఖరిదైన రెండో టెస్టు(సెప్టెంబరు 27) కాన్పూర్‌లో మొదలుకానుంది.నాలుగు వికెట్లు తీస్తే..ఈ నేపథ్యంలో అశ్విన్ ఓ అరుదై రికార్డు ముంగిట నిలిచాడు. బంగ్లాతో రెండో టెస్టులో గనుక ఈ దిగ్గజ స్పిన్నర్ నాలుగు వికెట్లు తీస్తే.. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు సాధిస్తాడు. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్‌వుడ్‌ను అధిగమించి మొదటిస్థానానికి చేరుకుంటాడు. ఈ డబ్ట్యూటీసీ తాజా సీజన్లో హాజిల్‌వుడ్ ఇప్పటి వరకు 51 వికెట్లు తీయగా.. అశూ 48 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఫైనల్ చేరడమే లక్ష్యంగా వరుస విజయాలతో దూసుకుపోతోంది.డబ్ల్యూటీసీ 2023-25 సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు:జోష్ హాజిల్‌వుడ్(ఆస్ట్రేలియా)- 51రవిచంద్రన్ అశ్విన్ఇండియా)-48ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా)- 48మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా)-48క్రిస్ వోక్స్(ఇంగ్లండ్)-43నాథన్ లియోన్(ఆస్ట్రేలియా)-43.చదవండి: అతడిని కట్టడి చేస్తే టీమిండియాపై గెలుపు మాదే: కమిన్స్ -
Eng vs Aus: ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ!
ఇంగ్లండ్‌తో తొలి వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ!.. కంగారూ జట్టులోని ముగ్గురు స్టార్ క్రికెటర్లు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఫలితంగా ఈ ముగ్గురు నాటింగ్‌హామ్ వన్డేలో ఆడటంపై సందిగ్దం నెలకొంది. కాగా మూడు టీ20, ఐదు వన్డే మ్యాచ్‌లు ఆడేందుకు ఆస్ట్రేలియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది.ఆ ముగ్గురు దూరంఇందులో భాగంగా తొలి టీ20లో ఆసీస్ గెలవగా.. రెండో మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ విజయం సాధించింది. మూడో టీ20 వర్షం కారణంగా రద్దు కావడంతో సిరీస్ 1-1తో సమమైంది. ఈ క్రమంలో గురువారం నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది. అయితే, ఆసీస్ స్టార్లు ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్, పేసర్లు జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ తొలి వన్డేకు అందుబాటులో ఉండకపోవచ్చని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.గాయాల బెడదఈ ముగ్గురు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు పేర్కొంది. కాగా రెండో టీ20కి ముందు కూడా ఆసీస్‌కు ఇలాంటి సమస్యే ఎదురైన విషయం తెలిసిందే. కెప్టెన్ మిచెల్ మార్ష్ అనారోగ్యం కారణంగా జట్టుకు దూరం కాగా.. ట్రవిస్ హెడ్ సారథ్యం వహించాడు. ఇక వీరితో పాటు వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్, యువ బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెగర్క్ కూడా గాయాలతో బాధపడుతున్నట్లు సమాచారం.మాథ్యూ షార్ట్‌కు అవకాశం?ఇదిలా ఉంటే.. తొలి వన్డే నేపథ్యంలో హాజిల్‌వుడ్, స్టార్క్ దూరమైతే సీన్ అబాట్, డ్వార్షుయిస్ తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఇక మాక్సీ స్థానాన్ని మాథ్యూ షార్ట్ భర్తీ చేసే ఛాన్స్ ఉంది. ఇక మార్ష్ ప్రస్తుతం కోలుకున్నట్లు సమాచారం. టీ20 సిరీస్‌కు దూరమైన స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ సైతం వన్డేలతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో తొలి వన్డేకు ముందు కెప్టెన్ మిచెల్ మార్ష్ మాట్లాడుతూ.. తమ తుదిజట్టు కూర్పుపై ఇంకా నిర్ణయానికి రాలేదని తెలిపాడు. ఇక లెగ్ స్పిన్నర్ ఆడం జంపా తమ జట్టులో ఉండటం అదృష్టమని.. వందో వన్డే ఆడబోతున్న అతడికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.ఇంగ్లండ్‌తో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, సీన్ అబాట్, జోష్ హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్, మాథ్యూ షార్ట్, ఆరోన్ హార్డీ, జేక్ ఫ్రేజర్-మెగర్క్, అలెక్స్ క్యారీ, బెన్ డ్వార్షుయిస్, కూపర్ కనోలీ.చదవండి: IND vs BAN 1st Test: భారత కీలక వికెట్లుకూల్చిన యువ పేసర్ -
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. ఆస్ట్రేలియాకు భారీ షాక్
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సెప్టెంబర్‌లో యూకే టూర్‌కు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా స్కాట్లాండ్తో మూడు టీ20లు.. ఇంగ్లండ్‌తో మూడు టీ20లు, ఐదు వన్డేల సిరీస్‌లో ఆసీస్ తలపడనుంది. అయితే ఈ టూర్‌కు ముందు కంగారులకు మరో భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ కాలి పిక్క కండరాల గాయం కారణంగా స్కాట్లాండ్తో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్లో హాజిల్‌వుడ్‌కు గాయమైనట్లు తెలుస్తోంది. అతడికి నాలుగు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు కూడా హాజిల్‌వుడ్ దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. స్వదేశంలో భారత్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని హాజిల్‌వుడ్‌కు మరింత విశ్రాంతి ఇచ్చే ఆలోచనలో క్రికెట్ ఆస్ట్రేలియా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హాజిల్‌వుడ్ స్ధానాన్ని రీలే మెరిడిత్తో క్రికెట్ ఆస్ట్రేలియా భర్తీ చేసింది. అతడు చివరగా 2021లో ఆసీస్ తరపున ఆడాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ దేశీవాళీ క్రికెట్లో మెరిడిత్ అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే అతడికి సెలక్టర్లు మళ్లీ పిలుపునిచ్చారు.కాగా ఈ యూకే టూర్‌కు ఇప్పటికే యువ పేసర్ స్పెన్సర్ జాన్సన్ కూడా దూరమయ్యాడు. ఇక ఇక సెప్టెంబర్ 4న స్కాట్లాండ్తో జరగనున్న తొలి టీ20తో ఆసీస్ యూకే టార్ ప్రారంభం కానుంది.స్కాట్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లకు ఆసీస్ జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, మెరిడిత్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జాంపా -
WC: ఆస్ట్రేలియా గెలవాలని కోరుకుంటున్నాం: ఇంగ్లండ్ పేసర్
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. సూపర్-8కు అర్హత సాధించాలంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఆ జట్టు పేసర్ మార్క్‌వుడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.చిరకాల ప్రత్యర్థిగా భావించే ఆస్ట్రేలియా జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో స్కాట్లాండ్ను చిత్తుగా ఓడించాలని కోరుకున్నాడు. ఆదివారం నాటి మ్యాచ్‌లో తమ మద్దతు పూర్తిగా ఆస్ట్రేలియాకే ఉంటుందని పేర్కొన్నాడు.కాగా స్కాట్లాండ్తో మ్యాచ్ రద్దవడం, ఆస్ట్రేలియా చేతిలో ఓడటంతో గ్రూప్ ‘బి’లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ముందుకెళ్లే ఆశలు సన్నగిల్లిన విషయం తెలిసిందే. అయితే ఒకే ఒక్క విజయం... 3.1 ఓవర్లలో ముగించేయడం... 101 బంతులు మిగల్చడం... ఇంగ్లండ్‌ను ఒక్కసారిగా ఈ టి20 ప్రపంచకప్ రేసులోకి తీసుకొచ్చింది.అంటిగ్వా వేదికగా... శుక్రవారం జరిగిన పోరులో బట్లర్ బృందం 8 వికెట్ల తేడాతో ఒమన్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఒమన్ 13.2 ఓవర్లలో 47 పరుగులకే కుప్పకూలింది. షోయబ్ ఖాన్ (23 బంతుల్లో 11; 1 ఫోర్) ఇన్నింగ్స్ టాప్‌స్కోరర్‌గా నిలిచాడు.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆదిల్ రషీద్ 11 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా... జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ 12 పరుగుల చొప్పున ఇచ్చి చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత ఇంగ్లండ్ 3.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ జోస్ బట్లర్ (8 బంతుల్లో 24 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), సాల్ట్ (3 బంతుల్లో 12; 2 సిక్స్‌లు) దంచేశారు.ఈ నేపథ్యంలో సూపర్-8 రేసులోకి దూసుకువచ్చిన ఇంగ్లండ్.. శనివారం రాత్రి నమీబియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కచ్చితంగా గెలవాలి. భారీ తేడాతో విజయం సాధిస్తే ఇంకా మంచిది.అదే విధంగా జూన్ 16 నాటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా- స్కాట్లాండ్ను చిత్తు చిత్తుగా ఓడించాలి. ఈ రెండూ జరిగి.. నెట్ రన్‌రేటు పరంగా స్కాట్లాండ్ కంటే ఇంగ్లండ్ మెరుగ్గా ఉంటేనే తదుపరి దశకు అర్హత సాధిస్తుంది.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్- నమీబియా, ఆస్ట్రేలియా- స్కాట్లాండ్ మ్యాచ్‌లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్.. ఇంగ్లండ్‌ను టోర్నీ నుంచి పంపడమే తమ లక్ష్యమని పేర్కొనడం వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే.హాజిల్‌వుడ్ వ్యాఖ్యలను బట్టి స్కాట్లాండ్ చేతిలో ఆస్ట్రేలియా ఉద్దేశపూర్వకంగానే ఓడిపోవడానికి సిద్ధపడిందా అనే సందేహాలు తలెత్తాయి. అయితే, ఆ జట్టు స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. హాజిల్‌వుడ్ సరదాగానే ఆ వ్యాఖ్యలు చేశాడని పేర్కొన్నాడు.ఈ నేపథ్యంలో మార్క్‌వుడ్ స్పందిస్తూ.. హాజిల్‌వుడ్ చేసిన వ్యాఖ్యలు తమ జట్టు గౌరవాన్ని పెంచుతున్నాయంటూ కౌంటర్ వేశాడు. ఇంగ్లండ్ వంటి పటిష్ట జట్టు ఎలిమినేట్ అయితే బాగుంటుందని ప్రతి జట్టు కోరుకుంటుందని.. ఏదేమైనా స్కాట్లాండ్పై ఆస్ట్రేలియా గెలవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.కాగా గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా ఇప్పటికే సూపర్-8లో అడుగుపెట్టగా.. శనివారం నాటి మ్యాచ్ ఫలితంతో ఇంగ్లండ్ భవితవ్యం తేలనుంది. పాయింట్ల పట్టికలో ఆసీస్ ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. స్కాట్లాండ్ 5 పాయింట్లు(నెట్ రన్‌రేటు +2.164), ఇంగ్లండ్ మూడు పాయింట్ల(నెట్ రన్‌రేటు +3.081)తో ఉన్నాయి. -
హాజిల్‌వుడ్ వ్యాఖ్యలకు ఇంగ్లండ్ కోచ్ కౌంటర్
తమ జట్టు గురించి ఆస్ట్రేలియా ఆటగాడు జోష్ హాజిల్‌వుడ్ చేసిన వ్యాఖ్యలపై ఇంగ్లండ్ ప్రధాన కోచ్ మాథ్యూ మాట్ స్పందించాడు. జోష్ మాటలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. తమ దృష్టి ప్రస్తుతం మిగిలిన రెండు మ్యాచ్‌లపైనే ఉందని తెలిపాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024లో ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, నమీబియా, ఒమన్‌లతో పాటు ఇంగ్లండ్ గ్రూప్-బిలో ఉంది. వీటిలో వరుసగా మూడు విజయాలు సాధించిన ఆసీస్.. గ్రూప్ టాపర్‌గా సూపర్-8లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచింది.ఇక ఇంగ్లండ్ రెండు మ్యాచ్‌లు రెండింట భారీ తేడాతో ఓడి సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన రెండు మ్యాచ్‌లలో తాము గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలు తమకు అనుకూలంగా వస్తే తప్ప టోర్నీలో ముందడుగు వేయలేని దుస్థితిలో ఉంది డిఫెండింగ్ చాంపియన్.ఇక మూడింట రెండు విజయాలతో ఉన్న స్కాట్లాండ్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. తమకు ఆస్ట్రేలియాతో మిగిలిన మ్యాచ్‌లో గనుక గెలిస్తే నేరుగా సూపర్-8కు చేరుకుంటుంది. అయితే, ఆసీస్ మ్యాచ్ అంటే అంత తేలికాదన్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో నమీబియాపై గెలుపుతో సూపర్-8 చేరిన తర్వాత ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ మాట్లాడుతూ.. ఇంగ్లండ్‌ను టోర్నీ నుంచి బయటకు పంపాలని తాము భావిస్తున్నట్లు తెలిపాడు.ఈ క్రమంలో కావాలనే స్కాట్లాండ్ చేతిలో ఓడి ఇంగ్లండ్ సూపర్-8 ఆశలపై నీళ్లు చల్లాలని ఆసీస్ కుట్ర పన్నిందనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై స్పందించిన ఇంగ్లండ్ కోచ్ మాథ్యూ మాట్.. జోష్ హాజిల్‌వుడ్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు.అతడు కేవలం సరదాగా మాత్రమే ఈ వ్యాఖ్యలు చేశాడని.. జోష్ నిజాయితీ గురించి తనకు తెలుసునని పేర్కొన్నాడు. ఒమన్, నమీబియా జట్లపై విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మాథ్యూ మాట్ పేర్కొన్నాడు.నమీబియాను చిత్తు చేసిగ్రూప్-బిలో ఆద్యంతం పూర్తి ఆధిపత్యం కనబరిచిన ఆస్ట్రేలియా జట్టు టీ20 ప్రపంచకప్‌లో ‘సూపర్–8’ దశకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. నమీబియా జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో నెగ్గింది. నమీబియా నిర్దేశించిన 73 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 34 బంతుల్లోనే ఛేదించింది. వరుసగా మూడో విజయంతో ఆస్ట్రేలియా ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన నమీబియా 17 ఓవర్లలో 72 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా 4 ఓవర్లలో 12 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా... పేసర్లు హాజల్‌వుడ్, స్టొయినిస్ రెండు వికెట్ల చొప్పున తీశారు. కమిన్స్, ఎలిస్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.నమీబియా జట్టులో కెప్టెన్ గెరార్డ్ ఎరాస్మస్ (43 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్స్), మైకేల్ వాన్ లింగెన్ (10 బంతుల్లో 10; 2 ఫోర్లు) మినహా ఇతర బ్యాటర్లు రెండంకెల స్కోరు దాటలేకపోయారు.అనంతరం ఆస్ట్రేలియా జట్టు 5.4 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 74 పరుగులు చేసి గెలిచింది. డేవిడ్ వార్నర్ (8 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) అవుటవ్వగా... ట్రావిస్ హెడ్ (17 బంతుల్లో 34 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), మార్ష్ (9 బంతుల్లో 18 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడారు. జంపాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. జూన్ 16న జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో స్కాట్లాండ్తో ఆస్ట్రేలియా తలపడుతుంది. -
నమీబియాను చిత్తు చేసిన ఆసీస్.. సూపర్-8కు అర్హత
టీ20 ప్రపంచకప్-2024లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతోంది. గ్రూప్-బిలో ఉన్న కంగారూ జట్టు ఇప్పటికే రెండు విజయాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో ఒమన్‌ను ఓడించిన మార్ష్ బృందం.. మరుసటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 36 పరుగుల తేడాతో చిత్తు చేసింది.తాజాగా బుధవారం(భారత కాలమానం ప్రకారం) నాటి మ్యాచ్‌లో నమీబియాను మట్టికరిపించింది. తద్వారా గ్రూప్-బి టాపర్‌గా నిలిచి.. సూపర్-8కు అర్హత సాధించింది ఆస్ట్రేలియా.వెస్టిండీస్‌లోని ఆంటిగ్వా వేదికగా నమీబియా- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే, కంగారూ జట్టు బౌలర్ల ధాటికి నమీబియా బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది.జోష్ హాజిల్‌వుడ్ దెబ్బకు ఓపెనర్లు మైకేల్ వాన్ లింగెన్ 10, నికో డెవిన్ 2 పరుగులకే పెవిలియన్ చేరగా.. వన్‌డౌన్ బ్యాటర్ జాన్ ఫ్రిలింక్(1) ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.ఈ క్రమంలో గెర్హార్డ్ ఎరాస్మస్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. 43 బంతుల్లో 36 పరుగులతో ఉన్న అతడిని మార్కస్ స్టొయినిస్ అవుట్ చేయడంతో నమీబియా బ్యాటింగ్ ఆర్డర్ పతనం తారస్థాయికి చేరింది.తర్వాతి స్థానాల్లో వచ్చిన ఆటగాళ్లు వరుసగా 3, 1, 1, 7, 0, 2(నాటౌట్), 0 పరుగులు మాత్రమే చేశారు. ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా దెబ్బకు పెవిలియన్‌కు క్యూ కట్టేందుకు పోటీపడ్డారు. ఈ క్రమంలో 17 ఓవర్లలో కేవలం 72 పరుగులకే ఆలౌట్ అయింది నమీబియా.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా ఒక వికెట్ మాత్రమే కోల్పోయి పని పూర్తి చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 8 బంతుల్లోనే 20 పరుగులతో దుమ్ములేపాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 17 బంతుల్లో 34, కెప్టెన్ మిచెల్ మార్ష్ 9 బంతుల్లో 18 రన్స్ చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు.ఈ క్రమంలో 5.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన ఆసీస్.. నమీబియాను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసి.. నెట్ రన్‌రేటును భారీగా మెరుగుపరుచుకుంది. వరల్డ్‌కప్-2024 ఎడిషన్ గ్రూప్-డిలో ఉన్న సౌతాఫ్రికా తర్వాత.. సూపర్-8కు చేరిన రెండో జట్టుగా నిలిచింది. View this post on Instagram A post shared by ICC (@icc) -
పసికూనపై ప్రతాపం.. రెచ్చిపోయిన హాజిల్‌వుడ్, వార్నర్
టీ20 వరల్డ్‌కప్ 2024 వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా నమీబియాతో నిన్న (మే 28) జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా కేవలం 10 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ తరఫున తొలుత హాజిల్‌వుడ్.. ఆతర్వాత డేవిడ్ వార్నర్ రెచ్చిపోయారు. హాజిల్‌వుడ్ నాలుగు ఓవర్లు బౌల్ చేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టగా.. వార్నర్ 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 54 పరుగులు చేశాడు. హాజిల్‌వుడ్ తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో ఏకంగా మూడు మెయిడిన్ ఓవర్లు వేయడం విశేషం. హాజిల్‌వుడ్‌తో పాటు ఆడమ్ జంపా (4-0-25-3), నాథన్ ఇల్లిస్ (4-0-17-1), టిమ్ డేవిడ్ (4-0-39-1) కూడా సత్తా చాటడంతో పసికూన నమీబియా విలవిలలాడిపోయింది. నమీబియా ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ జేన్ గ్రీన్ (38) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. కెప్టెన్ మార్ష్ 18, ఇంగ్లిస్ 5, టిమ్ డేవిడ్ 23, వేడ్ 12 (నాటౌట్) పరుగులు చేశారు. నమీబియా బౌలర్లలో బెర్నల్డ్ స్కోల్జ్‌కు రెండు వికెట్లు దక్కగా.. మార్ష్ రనౌటయ్యాడు. బంగ్లాదేశ్, యూఎస్ఏ మధ్య నిన్ననే జరగాల్సిన మరో వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దైంది. -
NZ vs AUS: చెలరేగిన హాజిల్‌వుడ్.. కుప్పకూలిన కివీస్! కానీ..
ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. కంగారూ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ దెబ్బకు కివీస్ బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఒక్కరు కూడా కనీసం నలభై పరుగుల మార్కు అందుకోలేకపోయారు. కాగా న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో ఆస్ట్రేలియా 172 పరుగులతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండో టెస్టు గెలిచి సిరీస్‌ను సమం చేయాలనే ఉద్దేశంతో కివీస్ బరిలోకి దిగింది. అయితే, తొలిరోజే ఆసీస్ చేతిలో ఆతిథ్య జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. బ్యాటర్లంతా కలిసికట్టుగా విఫలం కావడంతో 162 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ టామ్ లాథమ్ 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. లోయర్ ఆర్డర్లో మ్యాట్ హెన్రీ 29 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మిగతా వాళ్లలో వికెట కీపర్ టామ్ బ్లండెల్(22), కెప్టెన్ టిమ్ సౌథీ(26) మాత్రమే 20 పరుగుల మార్కు దాటగలిగారు. ఆసీస్ పేసర్లు జోష్ హాజిల్‌వుడ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. మిచెల్ స్టార్క్ మూడు, ప్యాట్ కమిన్స్, కామెరాన్ గ్రీన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే షాకిచ్చాడు కివీస్ పేసర్ బెన్ సీర్స్. ఓపెనర్ స్టీవ్ స్మిత్(11)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని తొలి వికెట్ పడగొట్టాడు. అనంతరం మరో ఫాస్ట్‌బౌలర్ మ్యాట్ హెన్రీ ఉస్మాన్ ఖవాజా(16), కామెరాన్ గ్రీన్(25), ట్రవిస్ హెడ్(21)ల రూపంలో మూడు కీలక వికెట్లు తీశాడు. ఈ క్రమంలో తొలి రోజు ఆట ముగిసే సరికి ఆసీస్ నాలుగు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ 45, నాథన్ లియోన్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. కాగా ఈ మ్యాచ్ న్యూజిలాండ్ స్టార్లు కేన్ విలియమ్సన్, టిమ్ సౌతీలకు వందో టెస్టు కావడం విశేషం. -
చరిత్ర సృష్టించిన ఆసీస్ క్రికెటర్లు.. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలి సారి
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన గ్రీన్.. తన విరోచిత పోరాటంతో జట్టుకు 383 పరుగుల భారీ స్కోర్ అందించాడు. కాగా ఈ మ్యాచ్‌లో టెయిలాండర్ జోష్ హాజిల్‌వుడ్‌తో కలిసి కివీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. పదో వికెట్‌కు హాజిల్‌వుడ్‌తో కలిసి 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. టెస్టుల్లో ఆసీస్‌కు న్యూజిలాండ్ జట్టుపై పదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం ఇదే కావడం విశేషం. ఇంతకుముందు ఈ రికార్డు జాసన్ గిల్లెస్పీ , గ్లెన్ మెక్‌గ్రాత్ పేరిట ఉండేది. 2004 లో కివీస్‌తో జరిగిన ఓ టెస్టులో 10 వికెట్‌కు 114 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తాజాగా మ్యాచ్‌తో ఆల్‌టైమ్ రికార్డును గ్రీన్-హాజిల్‌వుడ్ జోడీ బ్రేక్ చేసింది. ఇక 279/9 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ అదనంగా మరో 104 పరుగులు చేసింది.ఓవరాల్‌గా ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 275 బంతులు ఎదుర్కొన్న గ్రీన్.. 23 ఫోర్లు, 5 సిక్స్‌లతో 174 పరుగులు చేశాడు. హాజిల్ వుడ్ 62 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ ఐదు వికెట్లు పడగొట్టగా.. విలియమ్ ఒరొర్కె, స్కాట్ చెరో రెండు వికెట్లు, రచిన్ రవీంద్ర ఒక వికెట్ సాధించారు. ఆ తర్వాత కివీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 179 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయోన్ 4 వికెట్లతో సత్తాచాటాడు. -
ఐసీసీ అవార్డు రేసులో పేస్ బౌలింగ్ సంచలనం
2024 జనవరి మాసం ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు నామినీస్ వివరాలను ఐసీసీ ప్రకటించింది. గత నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్ల పేర్లను ఐసీసీ వెల్లడించింది. పురుషుల క్రికెట్‌కు సంబంధించి ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజిల్‌వుడ్, ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్, విండీస్ సంచలన బౌలర్ షమార్ జోసఫ్ రేసులో ఉండగా.. మహిళల క్రికెట్లో అమీ హంటర్(ఐర్లాండ్), బెత్ మూనీ(ఆస్ట్రేలియా), అలీసా హేలీ(ఆస్ట్రేలియా) నామినేషన్ దక్కించుకున్నారు. ఓటింగ్ పద్దతిన విజేతను నిర్ణయిస్తారు. ఈ ప్రదర్శనల కారణంగానే నామినేషన్ దక్కింది.. షమార్ జోసఫ్: జనవరి నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన విండీస్ యువ పేసర్ షమార్, తన తొలి పర్యటనలోనే సంచలన ప్రదర్శనలు నమోదు చేసి అవార్డు రేసులో నిలిచాడు. ఈ పర్యటనలో ఆసీస్ బ్యాటర్లను గడగడలాడించిన షమార్ రెండు మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. ఇందులో రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. గబ్బా టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో షమార్ విశ్వరూపం (7-68) ప్రదర్శించడంతో పర్యాటక విండీస్ 30 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది. జోష్ హాజిల్‌వుడ్: జనవరి నెలలో విండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో హాజిల్‌వుడ్ సైతం విజృంభించాడు. ఈ సిరీస్‌లో అతను రెండు మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన ఉంది. ఈ ప్రదర్శనలతో పాటు హాజిల్‌వుడ్ జనవరిలో మొత్తం 19 వికెట్లు పడగొట్టాడు. ఓలీ పోప్: ఈ ఇంగ్లీష్ బ్యాటర్ జనవరిలో ఆడిన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ కారణంగా ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. గత నెలలో టీమిండియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో (హైదరాబాద్ టెస్ట్) పోప్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 196 పరుగులు చేసి ఇంగ్లండ్ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. -
AUS Vs WI: హాజిల్‌వుడ్ విజృంభణ.. విండీస్‌ను చిత్తు చేసిన ఆసీస్
టెస్ట్‌ల్లో వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా వరుసగా నాలుగో విజయం సాధించింది. ఇటీవలే స్వదేశంలో పాక్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన ఛాంపియన్ టీమ్.. తాజాగా అడిలైడ్‌లో జరిగిన టెస్ట్‌ల్లో (తొలి) విండీస్‌ను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసి, రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. హాజిల్‌వుడ్ (9/79), ట్రవిస్ హెడ్ (119) విజృంభించడంతో మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. కఠినమైన పిచ్‌పై అద్భుత సెంచరీ చేసిన ట్రవిస్ హెడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. హాజిల్‌వుడ్ (4/44), కమిన్స్ (4/41) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులకే చాపచుట్టేసింది. విండీస్ ఇన్నింగ్స్‌లో కిర్క్ మెక్కెంజీ (50), 11వ నంబర్ ఆటగాడు షమార్ జోసఫ్ (36) మాత్రమే ఓ మోస్తరుగా రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ సెంచరీతో కదంతొక్కడంతో 283 పరుగులకు ఆలౌటైంది. హెడ్ మినహా ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. విండీస్ ఆరంగేట్రం పేసర్ షమార్ జోసఫ్ (5/94) ఆసీస్‌ను దెబ్బతీశాడు. 95 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్‌ను హాజిల్‌వుడ్ మరోసారి దారుణంగా దెబ్బకొట్టాడు. హాజిల్‌వుడ్ ఈసారి ఐదు వికెట్ల ప్రదర్శనతో విజృంభించడంతో విండీస్ 120 పరుగులకే కుప్పకూలింది. విండీస్ ఇన్నింగ్స్‌లో కిర్క్ మెక్కెంజీ (26) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 26 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. ఆడుతూపాడుతూ వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. స్టీవ్ స్మిత్ 11, లబూషేన్ 1 పరుగుతో అజేయంగా నిలిచారు. ఉస్మాన్ ఖ్వాజా (9) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఈ సిరీస్‌లో రెండో టెస్ట్ జనవరి 25 నుంచి ప్రారంభమవుతుంది. -
నిప్పులు చెరిగిన కమిన్స్, హాజిల్‌వుడ్.. ఓపెనర్‌గా విఫలమైన స్టీవ్ స్మిత్
AUS VS WI 1st Test: రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా ఇవాళ (జనవరి 17) తొలి మ్యాచ్ ప్రారంభమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. ఓపెనర్‌గా కొత్త అవతారమెత్తిన స్టీవ్ స్మిత్ 12 పరుగులకే ఔటై నిరాశపర్చగా.. లబూషేన్ (10) కూడా తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు. ఉస్మాన్ ఖ్వాజా (30), కెమరూన్ గ్రీన్ (6) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్ అరంగేట్రం పేసర్ షమార్ జోసఫ్ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్.. ఆసీస్ పేసర్లు జోష్ హాజిల్‌వుడ్ (4/44), కెప్టెన్ పాట్ కమిన్స్ (4/41) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ స్టార్క్, నాథన్ లయోన్ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్‌లో వన్‌డౌన్ బ్యాటర్ కిర్క్ మెక్కెంజీ (50) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. ఓపెనర్లు బ్రాత్‌వైట్ (13), తేజ్‌నరైన్ చంద్రపాల్ (6), అలిక్ అథనాజ్ (13), కవెమ్ హాడ్జ్ (12), జస్టిన్ గ్రీవ్స్ (5), జాషువ డిసిల్వ (6), అల్జరీ జోసఫ్ (14), మోటీ (1) నిరాశపర్చగా.. 11వ నంబర్ ఆటగాడు షమార్ జోసఫ్ (35) ఎంతో ఉపయోగకరమైన ఇన్నింగ్స్ ఆడి విండీస్ పరువు కాపాడాడు. షమార్.. కీమర్ రోచ్‌తో (17 నాటౌట్) కలిసి చివరి వికెట్‌కు 55 పరుగులు జోడించాడు.