వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన గ్రీన్.. తన విరోచిత పోరాటంతో జట్టుకు 383 పరుగుల భారీ స్కోర్ అందించాడు. కాగా ఈ మ్యాచ్‌లో టెయిలాండర్ జోష్ హాజిల్‌వుడ్‌తో కలిసి కివీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు.
పదో వికెట్‌కు హాజిల్‌వుడ్‌తో కలిసి 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. టెస్టుల్లో ఆసీస్‌కు న్యూజిలాండ్ జట్టుపై పదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం ఇదే కావడం విశేషం. ఇంతకుముందు ఈ రికార్డు జాసన్ గిల్లెస్పీ , గ్లెన్ మెక్‌గ్రాత్ పేరిట ఉండేది. 2004 లో కివీస్‌తో జరిగిన ఓ టెస్టులో 10 వికెట్‌కు 114 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తాజాగా మ్యాచ్‌తో ఆల్‌టైమ్ రికార్డును గ్రీన్-హాజిల్‌వుడ్ జోడీ బ్రేక్ చేసింది.
ఇక 279/9 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ అదనంగా మరో 104 పరుగులు చేసింది.ఓవరాల్‌గా ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 275 బంతులు ఎదుర్కొన్న గ్రీన్.. 23 ఫోర్లు, 5 సిక్స్‌లతో 174 పరుగులు చేశాడు. హాజిల్ వుడ్ 62 బంతుల్లో 22 పరుగులు చేశాడు.
ఇక న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ ఐదు వికెట్లు పడగొట్టగా.. విలియమ్ ఒరొర్కె, స్కాట్ చెరో రెండు వికెట్లు, రచిన్ రవీంద్ర ఒక వికెట్ సాధించారు. ఆ తర్వాత కివీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 179 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయోన్ 4 వికెట్లతో సత్తాచాటాడు.
Comments
Please login to add a commentAdd a comment