Australia vs New Zealand
-
T20 World Cup 2024: న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో ఆస్ట్రేలియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. న్యూజిలాండ్‌తో నిన్న (అక్టోబర్ 8) జరిగిన మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. బెత్ మూనీ (40), ఎల్లిస్ పెర్రీ (30), అలైసా హీలీ (26) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. కివీస్ బౌలర్లలో అమేలియా కెర్ నాలుగు వికెట్లతో సత్తా చాటింది. బ్రూక్ హ్యలీడే, రోస్‌మేరీ మెయిర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.అనంతరం 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. ఆసీస్ బౌలర్ల ధాటికి 19.2 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. మెగాన్ షట్, సదర్‌ల్యాండ్ తలో మూడు వికెట్లు తీసి కివీస్‌ను దెబ్బకొట్టారు. సోఫీ మోలినెక్స్ రెండు, జార్జియా వేర్హమ్, తహిళ మెక్‌గ్రాత్ తలో వికెట్ పడగొట్టారు. కివీస్ ఇన్నింగ్స్‌లో జార్జియా ప్లిమ్మర్ (29), సుజీ బేట్స్ (20), లియా తహుహు (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఈ గెలుపుతో ఆసీస్ గ్రూప్-ఏలో (పాయింట్ల పట్టిక) అగ్రస్థానానికి చేరింది. పాక్, న్యూజిలాండ్, భారత్, శ్రీలంక ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చదవండి: జో రూట్ సరికొత్త చరిత్ర.. తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా -
చరిత్ర సృష్టించిన ఆసీస్ వికెట్ కీపర్.. పంత్ రికార్డు బద్దలు
క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను 2-0 తేడాతో ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఆసీస్ విజయంలో ఆ జట్టు వికెట్ కీపర్ ఆలెక్స్ క్యారీ కీలక పాత్ర పోషించాడు. 98 పరుగులతో ఆజేయంగా నిలిచి తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. నాలుగో రోజు ఆటలో ఆసీస్ విజయానికి 202 పరుగులు అవసరమైన దశలో 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన క్యారీ కివీస్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. వీలు చిక్కినప్పుడుల్లా బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. తృటిలో సెంచరీతో చేసే అవకాశాన్ని క్యారీ కోల్పోయాడు. ఇక ఈమ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన క్యారీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో విజయవంతమైన ఛేజింగ్‌లో అత్యధిక స్కోర్ సాధించిన రెండో వికెట్ కీపర్‌గా క్యారీ(98*) నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ పేరిట ఉండేది. 2021లో బ్రిస్బేన్ వేదికగా ఆసీస్‌తో జరిగిన ఓ టెస్టులో పంత్ నాలుగో ఇన్నింగ్స్‌లో 89 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో ఆసీస్ క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 1999లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో గిల్ క్రిస్ట్ 149 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. -
న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా.. సిరీస్ క్లీన్ స్వీప్
టెస్టుల్లో ఆస్ట్రేలియా తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో3 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేసింది. 279 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ్రస్టేలియా 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్ విజయంలో ఆ జట్టు వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(98 నాటౌట్), మిచెల్ మార్ష్(80) కీలక పాత్ర పోషించారు. లక్ష్య ఛేదనలో 90 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఆసీస్ కష్టాల్లో పడింది. ఈ సమయంలో మార్ష్,క్యారీ జట్టును అందుకున్నారు. ఆచతూచి ఆడుతూ జట్టును విజయానికి చేరువ చేశారు. అయితే ఆఖరిలో మార్ష్ ఔట్ కావడంతో మ్యాచ్ కాస్త కివీస్ వైపు మలుపు తిరిగింది. కానీ క్రీజులో పాతుకుపోయిన క్యారీ, కెప్టెన్ కమ్మిన్స్‌తో కలిసి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో బెన్ సీర్స్ 4 వికెట్లు, మాట్ హెన్రీ రెండు, టిమ్ సౌథీ తలా వికెట్ సాధించారు. కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్లాక్ క్యాప్స్ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 162 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 256 పరుగులు చేసింది. ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 94 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 372 పరుగులు చేసిన కివీస్.. ఆసీస్ ముందు 279 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. చదవండి:IPL 2024: వారెవ్వా సంజూ.. బంతిని చూడకుండానే భారీ సిక్సర్! వీడియో వైరల్ -
రసవత్తరంగా కివీస్-ఆసీస్ రెండో టెస్టు..
క్రైస్ట్ చర్చ్ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా మారింది. ఆసీస్ తమ విజయానికి ఇంకా 202 పరుగుల దూరంలో నిలవగా.. కివీస్ విజయానికి ఇంకా 6 వికెట్లు మాత్రమే కావాలి. 279 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. క్రీజులో ప్రస్తుతం ట్రావిస్ హెడ్(17),మార్ష్(27) పరుగులతో ఉన్నారు. మాట్ హెన్రీ, సీర్స్ తలా రెండు వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ స్టార్ ఓపెనర్ స్టీవ్ స్మిత్(9) రెండో ఇన్నింగ్స్‌లోనూ నిరాశపరిచాడు. ఇక 134/2 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ 372 పరుగులకు రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. న్యూజిలాండ్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(82), టామ్ లాథమ్(73) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆసీస్ బౌలర్లలో కమ్మిన్స్ 4 వికెట్లు, లయోన్ 3 వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో ఆసీస్ ముందు 279 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అంతకుముందు కివీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 256 పరుగులు చేసింది. ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 94 పరుగుల ఆధిక్యం లభించింది. చదవండి: IPL 2024: 'చెన్నై, ముంబై, సన్‌రైజర్స్ కాదు.. ఈ సారి ఐపీఎల్ టైటిల్ ఆ జట్టుదే' -
NZ vs AUS: చెలరేగిన హాజిల్‌వుడ్.. కుప్పకూలిన కివీస్! కానీ..
ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. కంగారూ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ దెబ్బకు కివీస్ బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఒక్కరు కూడా కనీసం నలభై పరుగుల మార్కు అందుకోలేకపోయారు. కాగా న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో ఆస్ట్రేలియా 172 పరుగులతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండో టెస్టు గెలిచి సిరీస్‌ను సమం చేయాలనే ఉద్దేశంతో కివీస్ బరిలోకి దిగింది. అయితే, తొలిరోజే ఆసీస్ చేతిలో ఆతిథ్య జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. బ్యాటర్లంతా కలిసికట్టుగా విఫలం కావడంతో 162 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ టామ్ లాథమ్ 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. లోయర్ ఆర్డర్లో మ్యాట్ హెన్రీ 29 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మిగతా వాళ్లలో వికెట కీపర్ టామ్ బ్లండెల్(22), కెప్టెన్ టిమ్ సౌథీ(26) మాత్రమే 20 పరుగుల మార్కు దాటగలిగారు. ఆసీస్ పేసర్లు జోష్ హాజిల్‌వుడ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. మిచెల్ స్టార్క్ మూడు, ప్యాట్ కమిన్స్, కామెరాన్ గ్రీన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే షాకిచ్చాడు కివీస్ పేసర్ బెన్ సీర్స్. ఓపెనర్ స్టీవ్ స్మిత్(11)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని తొలి వికెట్ పడగొట్టాడు. అనంతరం మరో ఫాస్ట్‌బౌలర్ మ్యాట్ హెన్రీ ఉస్మాన్ ఖవాజా(16), కామెరాన్ గ్రీన్(25), ట్రవిస్ హెడ్(21)ల రూపంలో మూడు కీలక వికెట్లు తీశాడు. ఈ క్రమంలో తొలి రోజు ఆట ముగిసే సరికి ఆసీస్ నాలుగు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ 45, నాథన్ లియోన్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. కాగా ఈ మ్యాచ్ న్యూజిలాండ్ స్టార్లు కేన్ విలియమ్సన్, టిమ్ సౌతీలకు వందో టెస్టు కావడం విశేషం. -
భారత అంపైర్‌కు గొప్ప గౌరవం
భారత అంపైర్ నితిన్ మీనన్‌కు గొప్ప గౌరవం దక్కనుంది. ప్రపంచ క్రికెట్లో ఫాబ్ ఫోర్‌గా పిలువబడే నలుగురు స్టార్ క్రికెటర్ల వందో టెస్ట్ మ్యాచ్‌లో ఇతను అంపైర్‌గా వ్యవహరించనున్నాడు. ఇదివరకే విరాట్ కోహ్లి, జో రూట్, స్టీవ్ స్మిత్‌ల వందో టెస్ట్ మ్యాచ్‌కు అంపైర్‌గా పని చేసిన మీనన్.. ఫాబ్ ఫోర్‌లోని మరో ఆటగాడైన కేన్ విలియమ్సన్ వందో టెస్ట్‌లో కూడా అంపైర్‌గా వ్యవహరించే సువర్ణావకాశాన్ని దక్కించుకున్నాడు. ఓ తరంలో నలుగురు గొప్ప క్రికెటర్లకు చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్‌ల్లో అంపైర్‌గా వ్యవహరించే గొప్ప గౌరవం నితిన్ మీనన్ మాత్రమే దక్కనుంది. విలియమ్సన్ వందో టెస్ట్ మ్యాచ్ మార్చి 8న ప్రారంభమవుతుంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే ఈ మ్యాచ్ కేన్ మామతో పాటు న్యూజిలాండ్ ప్రస్తుత కెప్టెన్ టిమ్ సౌథీకి కూడా వందో టెస్ట్ మ్యాచ్ కానుంది. కేన్, సౌథీ వందో టెస్ట్ మ్యాచ్‌కు సరిగ్గా ఒక్క రోజు ముందు మరో ఇద్దరు స్టార్ క్రికెటర్లు తమ వందో టెస్ట్ మ్యాచ్ ఆడనున్నారు. భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ వికెట్‌కీపర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో రేపటి నుంచి ప్రారంభంకాబోయే భారత్-ఇంగ్లండ్ ఐదో టెస్ట్ మ్యాచ్‌తో వంద టెస్ట్‌ల మైలురాయిని తాకనున్నారు. ధర్మశాల వేదికగా రేపటి నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకోగా.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ 0-1తో వెనుకపడి ఉంది. -
చరిత్ర సృష్టించిన నాథన్ లియోన్.. ప్రపంచంలో తొలి క్రికెటర్‌గా!
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 172 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన స్పిన్ మయాజాలంతో కివీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టిన లియోన్.. కివీస్ పతనాన్ని శాసించాడు. అతడి స్పిన్ దాటికి న్యూజిలాండ్ కేవలం 196 పరుగులకే కుప్పకూలింది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 10 వికెట్లను లియోన్ సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో సంచలన ప్రదర్శన కనబరిచిన లియోన్ ఓ అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలోనే అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న తొలి బౌలర్‌గా నాథన్ నిలిచాడు. డబ్ల్యూటీసీలో ఇప్పటివరకు ఈ ఆసీస్ దిగ్గజం 10 సార్లు 5 వికెట్ల హాల్ సాధించాడు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉండేది. అశ్విన్ 9 సార్లు ఈ ఫీట్ సాధించాడు. తాజా మ్యాచ్‌తో అశ్విన్ రికార్డును లియోన్ బ్రేక్ చేశాడు. -
తిరుగులేని ఆసీస్.. ఏకంగా 172 పరుగుల తేడాతో ఘన విజయం
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 172 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 369 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ దాటికి 196 పరుగులకే కుప్పకూలింది. లియోన్ 6 వికెట్లతో చెలరేగాడు. 111/3 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన కివీస్.. అదనంగా 85 పరుగులు చేసి ఆలౌటైంది. న్యూజిలాండ్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(59) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో లియోన్‌తో పాటు హాజిల్‌వుడ్ రెండు, హెడ్, గ్రీన్ తలా వికెట్ పడగొట్టారు. అంతకుముందు ఆసీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే కుప్పకూలింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు 204 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో కివీస్ ముందు 369 పరుగులు భారీ టార్గెట్‌ను ఆస్ట్రేలియా ఉంచింది. కాగా మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌట్ అయింది. కామెరాన్ గ్రీన్ (174 నాటౌట్; 23 ఫోర్లు, 5 సిక్స్‌లు), హాజల్‌వుడ్ (22; 4 ఫోర్లు) పదో వికెట్‌కు 116 పరుగులు జోడించడం విశేషం. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 43.1 ఓవర్లలో 179 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా స్కోర్లు: ఆస్ట్రేలియా- 383 & 164 న్యూజిలాండ్- 179 & 196 ఫలితం: 172 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం -
చరిత్ర సృష్టించిన ఫిలిప్స్.. తొలి ఆటగాడిగా! 15 ఏళ్లలో
వెల్లింగ్టన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో పార్ట్ టైమ్ బౌలర్‌గా ఎటాక్‌లోకి వచ్చిన ఫిలిప్స్ తన స్పిన్ మయాజాలంతో ఆసీస్‌ను ముప్పుతిప్పులు పెట్టాడు. ఫిలిప్స్ ఏకంగా 5 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. 16 ఓవర్లు బౌలింగ్ చేసిన గ్లెన్.. కేవలం 45 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించాడు. అందులో 4 మెయిడిన్ ఓవర్లు కూడా ఉన్నాయి. ఫిలిప్స్ స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న ఆసీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో చెలరేగిన ఫిలిప్స్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. గత 15 ఏళ్లలో న్యూజిలాండ్ గడ్డపై 5 వికెట్ల ఘనత సాధించిన తొలి కివీ స్పిన్నర్‌గా ఫిలిప్స్ నిలిచాడు. ఆఖరిగా 2008లో బ్లాక్ క్యాప్స్ స్పిన్నర్ జీతన్ పటేల్ 5 వికెట్ల హాల్ సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆసీస్ కివీస్ ముందు 369 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 369 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు నష్టపోయి 111 పరుగులు చేసింది. చదవండి: ‘రాజు- రాణి వచ్చేశారు’.. అనంత్- రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలకు కోహ్లి?! నిజం ఇదే -
NZ vs Aus: 5 వికెట్లతో చెలరేగిన గ్లెన్ ఫిలిప్స్.. రచిన్ ఫిఫ్టీ!
న్యూజిలాండ్- ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. తద్వారా ఆతిథ్య కివీస్ ముందు 369 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ క్రమంలో ఆట పూర్తయ్యేసరికి కివీస్ మూడు వికెట్లు నష్టపోయి 111 పరుగులు చేసింది. కాగా న్యూజిలాండ్ పర్యటనలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది ఆస్ట్రేలియా. అనంతరం ఇరు జట్లు మధ్య వెల్లింగ్టన్ వేదికగా గురువారం నుంచి తొలి టెస్టు ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌట్ అయింది. కామెరాన్ గ్రీన్ (174 నాటౌట్; 23 ఫోర్లు, 5 సిక్స్‌లు), హాజల్‌వుడ్ (22; 4 ఫోర్లు) పదో వికెట్‌కు 116 పరుగులు జోడించడం విశేషం. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 43.1 ఓవర్లలో 179 పరుగులకే కుప్పకూలింది. గ్లెన్ ఫిలిప్స్ (71; 13 ఫోర్లు), హెన్రీ (34 బంతుల్లో 42; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మాత్రమే రాణించారు. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ 43 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో 204 పరుగుల భారీ ఆధిక్యం పొందిన ఆస్ట్రేలియా ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆట ముగిసే సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 13 పరుగులు సాధించింది. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఓవరాల్ ఆధిక్యం 217 పరుగులకు చేరింది. ఈ నేపథ్యంలో మూడో రోజు ఆటను 13/2తో మొదలుపెట్టిన ఆసీస్.. మరో 151 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ స్పిన్ మాయాజాలంతో ఏకంగా ఐదు వికెట్లు కూల్చి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. పేసర్లు కెప్టెన్ టిమ్ సౌతీ రెండు, మ్యాట్ హెన్రీ మూడు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు టామ్ లాథమ్ 8, విల్ యంగ్ 15 పరుగులకే పెవిలియన్ చేరారు. వన్‌డౌన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ 9 పరుగులకే అవుటయ్యాడు. ఇలా జట్టు కష్టాల్లో కూరుకుని ఉన్న వేళ రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్ పట్టుదలగా క్రీజులో నిలబడ్డారు. మూడో రోజు ఆట ముగిసే సరికి రచిన్ 94 బంతుల్లో 56, మిచెల్ 63 బంతుల్లో 12 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా 41 ఓవర్లలో న్యూజిలాండ్ మూడు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. ఆసీస్‌కు దీటుగా బదులిస్తూ మెరుగైన స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలవాలంటే ఇంకా 258 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆసీస్ విజయానికి ఏడు వికెట్లు కావాలి. న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సరికి స్కోర్లు: ఆస్ట్రేలియా- 383 & 164 న్యూజిలాండ్- 179 న్యూజిలాండ్ విజయ లక్ష్యం- 369.. మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి స్కోరు- 111/3 (41). న్యూజిలాండ్ గెలవాలంటే మరో 258 పరుగులు చేయాలి. చదవండి: Shreyas Iyer: సెమీస్ తుదిజట్టులో అయ్యర్.. రహానే కీలక వ్యాఖ్యలు -
చరిత్ర సృష్టించిన ఆసీస్ క్రికెటర్లు.. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలి సారి
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన గ్రీన్.. తన విరోచిత పోరాటంతో జట్టుకు 383 పరుగుల భారీ స్కోర్ అందించాడు. కాగా ఈ మ్యాచ్‌లో టెయిలాండర్ జోష్ హాజిల్‌వుడ్‌తో కలిసి కివీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. పదో వికెట్‌కు హాజిల్‌వుడ్‌తో కలిసి 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. టెస్టుల్లో ఆసీస్‌కు న్యూజిలాండ్ జట్టుపై పదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం ఇదే కావడం విశేషం. ఇంతకుముందు ఈ రికార్డు జాసన్ గిల్లెస్పీ , గ్లెన్ మెక్‌గ్రాత్ పేరిట ఉండేది. 2004 లో కివీస్‌తో జరిగిన ఓ టెస్టులో 10 వికెట్‌కు 114 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తాజాగా మ్యాచ్‌తో ఆల్‌టైమ్ రికార్డును గ్రీన్-హాజిల్‌వుడ్ జోడీ బ్రేక్ చేసింది. ఇక 279/9 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ అదనంగా మరో 104 పరుగులు చేసింది.ఓవరాల్‌గా ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 275 బంతులు ఎదుర్కొన్న గ్రీన్.. 23 ఫోర్లు, 5 సిక్స్‌లతో 174 పరుగులు చేశాడు. హాజిల్ వుడ్ 62 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ ఐదు వికెట్లు పడగొట్టగా.. విలియమ్ ఒరొర్కె, స్కాట్ చెరో రెండు వికెట్లు, రచిన్ రవీంద్ర ఒక వికెట్ సాధించారు. ఆ తర్వాత కివీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 179 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయోన్ 4 వికెట్లతో సత్తాచాటాడు. -
టెస్ట్ క్రికెట్లో కొనసాగుతున్న నాథన్ లయోన్ హవా.. వాల్ష్ రికార్డు బద్దలు
టెస్ట్ క్రికెట్లో ఆసీస్ వెటరన్ స్పిన్నర్ నాథన్ లయోన్ హవా కొనసాగుతుంది. తాజాగా అతను దిగ్గజ పేసర్, విండీస్ మాజీ బౌలర్ కోట్నీ వాల్ష్ రికార్డును బద్దలు కొట్టాడు. వాల్ష్ 1984-2001 మధ్యలో 128 టెస్ట్‌లు ఆడి 519 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన లయెన్.. తన టెస్ట్ వికెట్ల కౌంట్‌ను 521కి పెంచుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో లయోన్.. వాల్ష్‌ను అధిగమించి, ఏడో స్థానానికి ఎగబాకాడు. ఇటీవలే టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా టెస్ట్‌ల్లో 500 వికెట్ల మార్కును తాకాడు. ప్రస్తుతం అతను 507 వికెట్లతో అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో మురళీథరన్ (800) టాప్‌లో ఉండగా.. షేన్ వార్న్ (708), ఆండర్సన్ (698), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), మెక్‌గ్రాత్ (563) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఆసీస్-న్యూజిలాండ్ మ్యాచ్ విషయానికొస్తే.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 13 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 217 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఉస్మాన్ ఖ్వాజా (5), నాథన్ లయోన్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. కెమరూన్ గ్రీన్ (174 నాటౌట్) భారీ శతకంతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటైంది. మ్యాట్ హెన్రీ 5 వికెట్లతో రాణించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 179 పరుగులకే ఆలౌటైంది. లయోన్ 4, హాజిల్‌వుడ్ 2, స్టార్క్, కమిన్స్, మార్ష్ తలో వికెట్ పడగొట్టారు. కివీస్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్ (71) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
పాపం కేన్ మామ.. ఎలా ఔటయ్యాడో చూడండి.. 12 ఏళ్లలో..!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ (0) ఆసక్తికర రీతిలో రనౌటయ్యాడు. కేన్ పరుగు పూర్తి చేసే క్రమంలో మరో ఎండ్ నుంచి వస్తున్న సహచరుడు విల్ యంగ్‌ను గుద్దుకోవడంతో పరుగు పూర్తి చేయలేకపోయాడు. కేన్ క్రీజ్‌కు చేరకునే లోపు లబూషేన్ డైరెక్ట్ త్రోతో వికెట్లకు గిరాటు వేశాడు. కేన్ రనౌట్ కావడానికి ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ కూడా పరోక్ష కారకుడయ్యాడు. కేన్ పరుగు తీస్తుండగా.. స్టార్క్ కూడా అడ్డుతగిలాడు (ఉద్దేశపూర్వకంగా కాదు).12 ఏళ్లలో కేన్ రనౌట్ కావడం ఇదే తొలిసారి. చివరిసారిగా అతను 2012లో రనౌటయ్యాడు. కేన్ రనౌట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. KANE WILLIAMSON IS RUN OUT IN TEST CRICKET FOR THE FIRST TIME IN 12 YEARS...!!! 🤯pic.twitter.com/KRheTm61sg — Mufaddal Vohra (@mufaddal_vohra) March 1, 2024 కాగా, ఆసీస్ బౌలర్లు మూకుమ్మడగా రాణించడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 179 పరుగులకే కుప్పకూలింది. కేన్‌తో పాటు రచిన్ రవీంద్ర, కుగ్గెలిన్ డకౌట్లయ్యారు. టామ్ లాథమ్ (5), విల్ యంగ్ (9), సౌథీ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా.. 29 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ను గ్లెన్ ఫిలిప్స్ (71) మెరుపు అర్దసెంచరీతో గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. టామ్ బ్లండల్ (33), మ్యాట్ హెన్రీ (42) ఓ మోస్తరు స్కోర్లు చేయగా డారిల్ మిచెల్ 11 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్‌వుడ్ 2, స్టార్క్, కమిన్స్, మార్ష్ తలో వికెట్ పడగొట్టారు. దీనికి ముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటైంది. కెమరూన్ గ్రీన్ భారీ శతకం (174) సాధించి అజేయంగా నిలువగా.. స్టీవ్ స్మిత్ 31, ఉస్మాన్ ఖ్వాజా 33, లబూషేన్ 1, హెడ్ 1, మిచెల్ మార్ష్ 40, అలెక్స్ క్యారీ 10, స్టార్క్ 9, కమిన్స్ 16, లయోన్ 5, హాజిల్‌వుడ్ 22 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ ఐదు వికెట్ల ప్రదర్శనలతో రాణించగా.. విలియమ్ రూర్కీ, కుగ్గెలిన్ తలో 2 వికెట్లు, రచిన్ రవీంద్ర ఓ వికెట్ పడగొట్టాడు. 204 పరుగుల లీడ్‌తో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 13 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ డకౌట్ కాగా..లబూషేన్ 2 పరుగులు చేసి ఔటయ్యాడు. ఖ్వాజా (5), నైట్ వాచ్మెన్ లయెన్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 217 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. -
AUS vs NZ: కామెరాన్ గ్రీన్ విరోచిత శతకం..
వెల్లింగ్టన్ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు రసవత్తరంగా మొదలైంది. మొదటి రోజు ఆటలో కివీస్ బౌలర్లు ఆధిపత్యం చెలాయించినప్పటికి.. ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ మాత్రం అద్బుత సెంచరీతో అడ్డుగా నిలిచాడు. మొదటి రోజు ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. కివీస్ పేసర్ మాట్ హెన్రీ ఆసీస్‌ను 4 వికెట్లతో దెబ్బతీశాడు. అతడితో పాటు విలియం ఒరోర్కే, కుగ్గిలిజన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ఆసీస్‌ను గ్రీన్ అదుకున్నాడు. 155 బంతుల్లో 16 ఫోర్లు సాయంతో 103 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. గ్రీన్‌తో పాటు మిచెల్ మార్ష్(40) పరుగులతో రాణించాడు. చదవండి: #Shreyas Iyer: అదేనా అయ్యర్ చేసిన తప్పు? శ్రేయస్ మళ్లీ ఎంట్రీ ఇస్తాడా? -
రిటైర్మెంట్ ప్రకటించిన లెజెండరీ అంపైర్..
దక్షిణాఫ్రికా లెజండరీ అంపైర్ మరైస్ ఎరాస్మస్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. వెల్లింగ్టన్ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు అనంతరం 16 ఏళ్ల అంపైరింగ్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. 2006లో జోహన్స్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌తో ఎరాస్మస్ అంపైర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. తన కెరీర్లో 80 టెస్టులు, 124 వన్డేలు, 43 టీ20ల్లో ఆన్ ఫీల్డ్ అంపైర్‌గా ఎరాస్మస్ బాధ్యతలు నిర్వర్తించాడు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లోనూ అంపైర్‌గా ఎరాస్మస్ వ్యవహరించాడు.అదేవిధంగా మూడు సార్లు(2016, 2017, 2021) ఐసీసీ బెస్ట్ అంపైర్‌గా ఎరాస్మస్ నిలిచాడు. కాగా ఇప్పుడు ఎరాస్మస్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఐసీసీ ఎలైట్ ప్యానల్లో దక్షిణాఫ్రికా నుంచి అంపైర్‌గా అడ్రియన్ హోల్డ్‌స్టాక్ ఒక్కరే మిగలనున్నారు. -
NZ vs Aus: ఆసీస్ కెప్టెన్ కమిన్స్ షాకింగ్ కామెంట్స్
"I’d doubt that I’ll be captaining..’’...: న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా తమ తుదిజట్టును ప్రకటించింది. కివీస్‌తో సిరీస్‌లో స్టీవ్ స్మిత్ ఓపెనర్‌గా కొనసాగుతాడని స్పష్టం చేసింది. ఉస్మాన్ ఖవాజాతో కలిసి అతడు ఆసీస్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడని తెలిపింది. ఆల్‌రౌండర్లు కామెరాన్ గ్రీన్, మిచెల్ మార్ష్ ఇద్దరిని తుదిజట్టులో ఆడిస్తున్నట్లు వెల్లడించింది. ఇక తుదిజట్టును ప్రకటిస్తున్న సందర్భంగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను కెప్టెన్‌గా ఎన్నాళ్లు కొనసాగుతానో తెలియదన్నాడు. వాళ్ల కెప్టెన్సీలో ఆడటం ఆస్వాదిస్తున్నా ముప్పై ఏళ్ల వయసు దాటిన తర్వాత ఫామ్, ఆటకు శరీరం సహకరించే తీరుపైనే తన భవిష్యత్తు ఆధారపడి ఉందని కమిన్స్ పేర్కొన్నాడు. టీ20 ఫార్మాట్లో మాథ్యూ వేడ్, మిచెల్ మార్ష్ సారథ్యంలో ఆడటాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నానని.. వాళ్లిద్దరి కారణంగా తనకు కాస్త విశ్రాంతి లభించిందని హర్షం వ్యక్తం చేశాడు. మొదటి రెండు టెస్టుల మధ్య ఆరేళ్ల గ్యాప్ కాగా ఫాస్ట్ బౌలర్ అయిన ప్యాట్ కమిన్స్ 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసినా.. ఆ తర్వాత 2017 వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. వరుసగా గాయాల బారిన పడిన కారణంగా మొదటి రెండు టెస్టుల మధ్య దాదాపు ఆరేళ్ల గ్యాప్ వచ్చింది. అయితే, ఆ తర్వాత కమిన్స్ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్‌గా వరుస విజయాలు అందిస్తూ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ టైటిల్ సాధించాడు. భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023లో కంగారూలను చాంపియన్లుగా నిలిపి సత్తా చాటాడు. ఇక ప్రస్తుతం టెస్టుల్లో ప్యాట్ కమిన్స్ నంబర్‌వన్ బౌలర్ కావడం విశేషం. న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా ఎలెవన్: స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హాజిల్‌వుడ్. చదవండి: NZ Vs Aus: న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ.. స్టార్ బ్యాటర్ దూరం -
శుభవార్త చెప్పిన స్టార్ క్రికెటర్
న్యూజిలాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్, దిగ్గజ బ్యాటర్ కేన్ విలియమ్సన్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. తాను మూడోసారి తండ్రైనట్లు వెల్లడించాడు. తన జీవిత భాగస్వామి సారా రహీం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు విలియమ్సన్ తెలిపాడు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారంటూ.. చిన్నారిని ఎత్తుకుని ఉన్న ఫొటోను పంచుకున్నాడు. ‘‘ఇప్పుడిక ముగ్గురు.. ఈ ప్రపంచంలోకి వచ్చే క్రమంలో సురక్షితంగా నీ ప్రయాణం సాగినందుకు సంతోషం. అందమైన చిన్నారికి స్వాగతం’’ అని కేన్ విలియమ్సన్ కూతురి ఆగమనాన్ని తెలిపాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సహ సహచర క్రికెటర్ల నుంచి విలియమ్సన్- సారాలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా 2015 నుంచి ప్రేమలో ఉన్న కేన్ విలియమ్సన్- సారా రహీంలకు 2020లో కూతురు మ్యాగీ జన్మించింది. ఆ తర్వాత రెండేళ్లకు ఈ జంట కుమారుడికి జన్మనిచ్చారు. ఇక మూడో సంతానంగా వీరికి తాజాగా మరో కూతురు జన్మించింది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు దూరమైన కేన్ విలియమ్సన్ టెస్టు సిరీస్‌తో తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. గురువారం నుంచి ఆసీస్‌తో మొదలుకానున్న తొలి టెస్టుకు అతడు అందుబాటులోకి రానున్నాడు. చదవండి: NZ Vs Aus: న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ.. View this post on Instagram A post shared by Kane Williamson (@kane_s_w) -
NZ Vs Aus: న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ
Australia tour of New Zealand, 2024: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే జట్టుకు దూరమయ్యాడు. గాయం నుంచి ఇంకా కోలుకోని కారణంగా ఈ ఓపెనర్ తొలి టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. కాన్వే స్థానంలో అతడు జట్టులోకి ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ ధ్రువీకరించింది. ‘‘కీలక మ్యాచ్‌కు ముందు డెవాన్ జట్టుకు దూరం కావడం మమ్మల్ని నిరాశకు గురిచేసింది. టాపార్డర్‌లో ఇలాంటి క్లాస్ ప్లేయర్ సేవలను కోల్పోవడం కష్టంగా ఉంది. పూర్తిగా కోలుకుని అతడు తిరిగి జట్టుతో చేరతాడని నమ్మకం ఉంది’’ అని కివీస్ జట్టు హెడ్‌కోచ్ గ్యారీ స్టెడ్ పేర్కొన్నాడు. కాన్వే స్థానంలో హెన్రీ నికోల్స్‌ను ఎంపిక చేసినట్లు తెలిపాడు. కాగా మూడు టీ20లు, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడే నిమిత్తం ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన ఆసీస్.. తదుపరి టెస్టు సిరీస్‌పై కన్నేసింది. రచిన్, మిచెల్ వచ్చేస్తున్నారు మరోవైపు.. సొంతగడ్డపై పొట్టి ఫార్మాట్లో కంగారూ జట్టు చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని కివీస్ పట్టుదలగా ఉంది. ఇరు జట్ల మధ్య వెల్లింగ్టన్ వేదికగా గురువారం నుంచి తొలి టెస్టు మొదలుకానుంది. ఈ మ్యాచ్‌కు యువ సంచలనం రచిన్ రవీంద్ర, ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్ అందుబాటులోకి రానున్నారు. ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో రెండో టీ20 సందర్భంగా డెవాన్ కాన్వే ఎడమచేతి బొటనవేలికి గాయమైంది. దీంతో మూడో టీ20కి దూరంగా ఉన్న అతడు.. తొలి టెస్టుకు కూడా ఆడలేకపోతున్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు న్యూజిలాండ్ టెస్టు జట్టు: టిమ్ సౌథీ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), మ్యాట్ హెన్రీ, స్కాట్ కుగెలిజిన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, నీల్ వాగ్నర్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్, హెన్రీ నికోల్స్. చదవండి: Ind vs Eng: లండన్‌కు పయనమైన కేఎల్ రాహుల్.. కారణం ఇదే! -
న్యూజిలాండ్‌కు ఘోర పరాభవం.. మళ్లీ ఆస్ట్రేలియానే
స్వదేశంలో న్యూజిలాండ్‌కు ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాభవం ఎదురైంది. ఆక్లాండ్ వేదికగా ఆసీస్‌తో జరిగిన మూడో టీ20లోనూ కివీస్ ఓటమి పాలైంది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో 0-3 తేడాతో న్యూజిలాండ్ వైట్‌వాష్‌కు గురైంది. ఆఖరి టీ20 విషయానికి వస్తే.. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తొలుత ఆసీస్‌ను బ్యాటింగ్‌కు అహ్హనించాడు. ఈ క్రమంలో ఆసీస్ ఇన్నింగ్స్ 67-2(6.2 ఓవర్లు) వద్ద ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. అయితే కొద్దిసేపుటికే వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్ మళ్లీ ఆరంభమైంది. కానీ 8.3 ఓవర్ల వద్ద మళ్లీ వర్షం తిరుగుముఖం పట్టింది. అనంతరం వర్షం మళ్లీ తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు. అయితే ఆసీస్ ఇన్నింగ్స్ 118(10.4 ఓవర్లు) వద్ద వర్షం మళ్లీ ఆటకు బ్రేక్‌లు వేసింది. తర్వాత వర్షం తగ్గినప్పటికీ ఆసీస్ ఇన్నింగ్స్ మాత్రం 10. 4 ఓవర్లకే ముగిసిపోయింది. ఈ క్రమంలో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం కివీస్ టార్గెట్‌ను 10 ఓవర్లలో 126 పరుగులగా నిర్ణయించారు. 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 98 పరుగులకే పరిమితమైంది. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(40) ఆఖరివరకు పోరాడాడు. ఇక ఆసీస్ బౌలర్లలో జంపా, షార్ట్, జానెసన్ తలా ఒక్క వికెట్ సాధించారు. కాగా అంతకముందు ఆసీస్ ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్(33) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. షార్ట్(27), మాక్స్వెల్(20) పరుగులతో రాణించారు. చదవండి: Babar Azam: ఏయ్ దమ్ముంటే ఇక్కడకు రా.. కట్టలు తెంచుకున్న బాబర్ ఆగ్రహం -
వావ్.. క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! వీడియో వైరల్
ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో 72 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో ఆసీస్ సొంతం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్భుతమైన క్యాచ్‌తో కివీస్ ఓపెనర్ విల్ యంగ్‌ను వేడ్ పెవిలియన్‌కు పంపాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో తొలి బంతిని యంగ్ పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే షాట్ మిస్టైమ్ కావడంతో బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో వికెట్ కీపర్ వేడ్ పరిగెత్తుకుంటూ వెళ్లి బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్‌లో డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన యంగ్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 ఫిబ్రవరి 25న జరగనుంది. pic.twitter.com/Wkw2LZb1JX — Sitaraman (@Sitaraman112971) February 23, 2024 -
నిప్పులు చెరిగిన ఫెర్గూసన్.. అయినా చిత్తుగా ఓడిన న్యూజిలాండ్
ఆక్లాండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ చిత్తుగా ఓడింది. ఫెర్గూసన్ నిప్పులు చెరిగినప్పటికీ (3.5-0-12-4) న్యూజిలాండ్ ఓటమిపాలైంది. ఫెర్గూసన్ ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 19.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో చేతులెత్తేసిన న్యూజిలాండ్ 17 ఓవర్లలో 102 పరుగులకే చాపచుట్టేసి, 72 పరుగుల తేడాతో ఓడి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. నిప్పులు చెరిగిన ఫెర్గూసన్.. ఫెర్గూసన్‌తో పాటు ఆడమ్ మిల్నే (2/40), బెన్ సియర్స్ (2/29), మిచెల్ సాంట్నర్ (2/35) రాణించడంతో ఆస్ట్రేలియా ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ట్రవిడ్ హెడ్ (45) కాస్త పర్వాలేదనిపించాడు. కమిన్స్ (28), మార్ష్ (26), టిమ్ డేవిడ్ (17), స్టీవ్ స్మిత్ (11), నాథన్ ఇల్లిస్ (11 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. మ్యాక్స్‌వెల్ (6), ఇంగ్లిస్ (5), మాథ్యూ వేడ్ (1), జంపా (1), హాజిల్‌వుడ్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు. జంపా మాయాజాలం.. 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. ఆడమ్ జంపా (4-0-34-4) మాయాజాలం దెబ్బకు 102 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బౌలర్లలో ఇల్లిస్ (2/16), హాజిల్‌వుడ్ (1/12), కమిన్స్ (1/19), మార్ష్ (1/18) కూడా రాణించారు. కివీస్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్ ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ (42) చేశాడు. ఫిలిప్స్‌తో పాటు జోష్ క్లార్క్సన్ (10), బౌల్ట్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఫిన్ అలెన్ (6), విల్ యంగ్ (5), సాంట్నర్ (7), చాప్మన్ (2), మిల్నే (0), ఫెర్గూసన్ (4) దారుణంగా విఫలమయ్యారు. ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ డెవాన్ కాన్వే బ్యాటింగ్‌కు దిగలేదు. ఈ సిరీస్‌లోని నామమాత్రపు మూడో మ్యాచ్ ఫిబ్రవరి 25న ఇదే ఆక్లాండ్‌లో జరుగనుంది. -
చితక్కొట్టేశాడు.. బౌల్ట్‌కు చుక్కలు చూపించాడు!
న్యూజిలాండ్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌కు పునరాగమనంలో చేదు అనుభవం ఎదురైంది. దాదాపు ఏడాదిన్నర విరామం తర్వాత కివీస్ తరఫున పొట్టి ఫార్మాట్లో రీఎంట్రీ ఇచ్చిన ఈ లెఫ్టార్మ్ పేసర్ బౌలింగ్‌లో.. ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రవిస్ హెడ్ చితక్కొట్టాడు. కాగా కివీస్ పర్యటనలో భాగంగా ఆసీస్ ఆతిథ్య జట్టుతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య శుక్రవారం నాటి రెండో టీ20కి అక్లాండ్ వేదికైంది. ఈడెన్ పార్క్ మైదానంలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యంలో కివీస్ బౌలింగ్ అటాక్ మొదలుపెట్టిన ట్రెంట్ బౌల్ట్‌కు దిమ్మతిరిగే షాకిచ్చాడు ఆసీస్ ఓపెనర్ ట్రవిస్ హెడ్. మొదటి ఓవర్ తొలి బంతినే ఫోర్‌గా మలిచిన హెడ్.. ఆ తర్వాత పరుగు తీయలేకపోయినా.. మరుసటి బంతికి సిక్సర్ బాదాడు. అదే జోరును కొనసాగిస్తూ వరుసగా మరో సిక్స్, ఫోర్ కొట్టాడు. ఇలా బౌల్ట్ బౌలింగ్‌లో ఒక్క ఓవర్లోనే 20 పరుగులు పిండుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా 4 ఓవర్ల బౌలింగ్‌లో బౌల్ట్ ఏకంగా 49 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కాగా న్యూజిలాండ్‌తో రెండో టీ20లో ఆస్ట్రేలియా 19.5 ఓవర్లలో 174 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ ట్రవిస్ హెడ్ (22 బంతుల్లో 45), కెప్టెన్ మిచెల్ మార్ష్(26), ప్యాట్ కమిన్స్(28) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ అత్యధికంగా 4 వికెట్లు తీయగా.. ఆడం మిల్నే, బెన్ సియర్స్, మిచెల్ సాంట్నర్ తలా రెండు వికెట్లు తీశారు. ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా లీగ్ క్రికెట్ ఆడే క్రమంలో సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్న బౌల్ట్ కొన్నాళ్లుగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. 2022 నవంబరులో కివీస్ తరఫున ఆఖరి టీ20 ఆడిన బౌల్ట్.. 2023లో వన్డే ఆడాడు. ఈ క్రమంలో ఆసీస్‌తో రెండో టీ20 సందర్భంగా టిమ్ సౌతీ స్థానంలో జట్టులోకి వచ్చాడు. -
శివాలెత్తిన మిచెల్ మార్ష్, టిమ్ డేవిడ్.. భారీ స్కోర్‌ను ఊదేసిన ఆస్ట్రేలియా
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 21) జరిగిన తొలి టీ20లో పర్యాటక ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరింతగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ చివరి బంతికి గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేయగా.. మిచెల్ మార్ష్ (44 బంతుల్లో 72 నాటౌట్; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు. టిమ్ డేవిడ్ చివరి బంతికి బౌండరీ బాది ఆసీస్‌ను గెలిపించాడు. కాన్వే, రచిన్ మెరుపు అర్దశతకాలు.. ఓపెనర్ డెవాన్ కాన్వే (46 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), వన్ డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (35 బంతుల్లో 68; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఫిన్ అలెన్ (17 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడగా.. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (19 నాటౌట్), మార్క్ చాప్మన్ (18 నాటౌట్) వేగంగా పరుగులు సాధించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ తలో వికెట్ పడగొట్టారు. శివాలెత్తిన మార్ష్, డేవిడ్.. 216 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా.. మార్ష్, టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్‌లతో విధ్వంసం సృష్టించడంతో చివరి బంతికి (4 వికెట్ల నష్టానికి) విజయం సాధించింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మిగతా ఆటగాళ్లు కూడా ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ట్రవిస్ హెడ్ 24, డేవిడ్ వార్నర్ 32, మ్యాక్స్‌వెల్ 25, ఇంగ్లిస్ 20 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్ 2, ఆడమ్ మిల్నే, ఫెర్గూసన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లోని రెండో మ్యాచ్ ఆక్లాండ్ వేదికగా ఫిబ్రవరి 23న జరుగనుంది. బౌండరీ కొట్టి గెలిపించిన డేవిడ్.. చివరి మూడు బంతుల్లో (సౌథీ బౌలింగ్‌లో) 12 పరుగులు అవసరం కాగా.. టిమ్ డేవిడ్ వరసగా 6, 2, 4 పరుగులు స్కోర్ చేసి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ ఓవర్లో మార్ష్, డేవిడ్ కలిపి 16 పరుగులు సాధించారు. అంతకుముందు ఓవర్లో (19) కూడా టిమ్ డేవిడ్ వీర బాదుడు బాదాడు. మిల్నే వేసిన ఈ ఓవర్లో డేవిడ్ చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఈ ఓవర్లో మొత్తం 19 పరుగులు వచ్చాయి. -
NZ VS AUS 1st T20: టిమ్ సౌథీ రికార్డు
న్యూజిలాండ్ వెటరన్ బౌలర్ టిమ్ సౌథీ ఆ దేశం తరఫున అత్యధిక టీ20లు ఆడిన ఆటగాడిగా అవతరించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (ఫిబ్రవరి 21) జరిగిన మ్యాచ్‌లో ఆడటం ద్వారా సౌథీ ఈ ఘనతను సాధించాడు. సౌథీ ఈ రికార్డును సాధించే క్రమంలో మార్టిన్ గప్తిల్‌ను అధిగమించాడు. గప్తిల్ న్యూజిలాండ్ తరఫున 122 టీ20లు ఆడగా.. సౌథీ ఇవాల్టి మ్యాచ్‌తో కలుపుకుని 123 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. సౌథీ, గప్తిల్ తర్వాత న్యూజిలాండ్ తరఫున అత్యధిక టీ20లు ఆడిన రికార్డు ఐష్ సోధి పేరిట ఉంది. సోధి తన టీ20 కెరీర్లో 110 మ్యాచ్‌లు ఆడాడు. ఓవరాల్‌గా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉంది. హిట్‌మ్యాన్ టీమిండియా తరఫున ఇప్పటివరకు 151 మ్యాచ్‌లు ఆడాడు. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరింతగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ చివరి బంతికి గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేయగా.. టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చివరి బంతికి బౌండరీ బాది ఆసీస్‌ను గెలిపించాడు. ఆసీస్ గెలుపులో మిచెల్ మార్ష్ (44 బంతుల్లో 72 నాటౌట్; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) కీలకపాత్ర పోషించాడు. ఈ గెలుపుతో ఆసీస్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. -
NZ vs Aus: రచిన్ సుడిగాలి ఇన్నింగ్స్.. 19 బంతుల్లోనే!
New Zealand vs Australia, 1st T20I - Rachin Ravindra Maiden T20I fifty: ఆస్ట్రేలియాతో తొలి టీ20లో న్యూజిలాండ్ జట్టు అదరగొట్టింది. ఓపెనర్ డెవాన్ కాన్వే, ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర సుడిగాలి అర్ధ శతకాల కారణంగా భారీ స్కోరు నమోదు చేసింది. కాగా మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడేందుకు ఆసీస్.. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య వెల్లింగ్టన్ వేదికగా తొలి టీ20 బుధవారం మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే శుభారంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫిన్ అలెన్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 32 రన్స్‌తో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. కాన్వే(46 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 63) సూపర్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇక స్పిన్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర 35 బంతులు ఎదుర్కొని 68 పరుగులు సాధించాడు. 19 బంతుల్లోనే 54 రన్స్ రచిన్ ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, ఆరు సిక్స్‌లు ఉన్నాయి. కాగా రచిన్‌కు టీ20లలో ఇదే తొలి అర్థ శతకం కావడం విశేషం. 29 బంతుల్లో 50 పరుగుల మార్కు అందుకున్నాడు ఈ లెఫ్టాండ్ బ్యాటర్. ఇక తాను ఎదుర్కొన్న తొలి 16 బంతుల్లో కేవలం 14 పరుగులే చేసిన రచిన్.. మిగిలిన 19 బంతుల్లో 54 పరుగులతో సత్తా చాటాడు. రచిన్ సంగతి ఇలా ఉంటే.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన గ్లెన్ ఫిలిప్స్ 10 బంతుల్లో 19, ఐదో నంబర్ బ్యాటర్ మార్క్ చాప్మన్ 13 బంతుల్లో 18 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ కేవలం మూడు వికెట్లు నష్టపోయి 215 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాకు 216 పరుగుల విజయ లక్ష్యాన్ని విధించింది. ఇక ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ మిచెల్ మార్ష్, పేసర్లు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. Rachin Ravindra 🔥#nzvsaus pic.twitter.com/VgISIw95Ji — piyush (@piyushson17) February 21, 2024 చదవండి: IPL 2024: టెస్టులో ధనాధన్ ఇన్నింగ్స్.. సర్ఫరాజ్ రీఎంట్రీ! A chat with Wellington local Rachin Ravindra after his maiden T20I fifty 🏏 #NZvAUS pic.twitter.com/ON0wxbgQGA — BLACKCAPS (@BLACKCAPS) February 21, 2024