ప్యాట్ కమిన్స్ (PC: CA)
"I’d doubt that I’ll be captaining..’’...: న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా తమ తుదిజట్టును ప్రకటించింది. కివీస్‌తో సిరీస్‌లో స్టీవ్ స్మిత్ ఓపెనర్‌గా కొనసాగుతాడని స్పష్టం చేసింది. ఉస్మాన్ ఖవాజాతో కలిసి అతడు ఆసీస్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడని తెలిపింది.
ఆల్‌రౌండర్లు కామెరాన్ గ్రీన్, మిచెల్ మార్ష్ ఇద్దరిని తుదిజట్టులో ఆడిస్తున్నట్లు వెల్లడించింది. ఇక తుదిజట్టును ప్రకటిస్తున్న సందర్భంగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను కెప్టెన్‌గా ఎన్నాళ్లు కొనసాగుతానో తెలియదన్నాడు.
వాళ్ల కెప్టెన్సీలో ఆడటం ఆస్వాదిస్తున్నా
ముప్పై ఏళ్ల వయసు దాటిన తర్వాత ఫామ్, ఆటకు శరీరం సహకరించే తీరుపైనే తన భవిష్యత్తు ఆధారపడి ఉందని కమిన్స్ పేర్కొన్నాడు. టీ20 ఫార్మాట్లో మాథ్యూ వేడ్, మిచెల్ మార్ష్ సారథ్యంలో ఆడటాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నానని.. వాళ్లిద్దరి కారణంగా తనకు కాస్త విశ్రాంతి లభించిందని హర్షం వ్యక్తం చేశాడు.
మొదటి రెండు టెస్టుల మధ్య ఆరేళ్ల గ్యాప్
కాగా ఫాస్ట్ బౌలర్ అయిన ప్యాట్ కమిన్స్ 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసినా.. ఆ తర్వాత 2017 వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. వరుసగా గాయాల బారిన పడిన కారణంగా మొదటి రెండు టెస్టుల మధ్య దాదాపు ఆరేళ్ల గ్యాప్ వచ్చింది. అయితే, ఆ తర్వాత కమిన్స్ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.
ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్‌గా వరుస విజయాలు అందిస్తూ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ టైటిల్ సాధించాడు. భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023లో కంగారూలను చాంపియన్లుగా నిలిపి సత్తా చాటాడు. ఇక ప్రస్తుతం టెస్టుల్లో ప్యాట్ కమిన్స్ నంబర్‌వన్ బౌలర్ కావడం విశేషం.
న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా ఎలెవన్:
స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హాజిల్‌వుడ్.
చదవండి: NZ Vs Aus: న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ.. స్టార్ బ్యాటర్ దూరం
Comments
Please login to add a commentAdd a comment