Steve Smith
-
అశ్విన్‌తో ఢీకి రెడీ!
మెల్బోర్న్: భారత వెటరన్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందని, ఈసారి అతడు మ్యాచ్‌పై పట్టు బిగించకుండా చేస్తానని ఆ్రస్టేలియన్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అన్నాడు. కంగారూ గడ్డపై అశ్విన్‌కు మంచి రికార్డు లేదు. స్వదేశంలో 21.57 సగటు నమోదు చేస్తే ఆసీస్‌లో అది 42.15 మాత్రమే. అయితే గత రెండు బోర్డర్–గావస్కర్ సిరీస్‌లలో ఫామ్‌లో ఉన్న స్మిత్‌ను అదే పనిగా అవుట్ చేసి పైచేయి సాధించాడు. ఈ రెండు సిరీస్‌లలో అశ్విన్ అతన్ని క్రీజులో పాతుకుపోనీయకుండా ఐదుసార్లు పెవిలియన్ చేర్చాడు. దీనిపై ఆసీస్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్మిత్ మాట్లాడుతూ ‘ఈసారి అలా జరగకుండా చూసుకోవాలి. అయితే అశ్విన్ మాత్రం ఉత్తమ స్పిన్నర్. తప్పకుండా తన ప్రణాళికలు తనకు ఉంటాయి. గతంలో అతని ఎత్తుగడలకు బలయ్యాను. నాపై అతనే ఆధిపత్యం కనబరిచాడు. ఇప్పుడలా జరగకుండా చూసుకోవాలంటే ఆరంభంలోనే అతను పట్టు బిగించకుండా దీటుగా ఎదుర్కోవాలి’ అని అన్నాడు. గత కొన్నేళ్లుగా తమ ఇద్దరి మధ్య ఆసక్తికర సమరమే జరుగుతోందన్నాడు. ఒకరు పైచేయి సాధిస్తే, మరొకరు డీలా పడటం జరుగుతుందని... ఐదు టెస్టుల్లో పది ఇన్నింగ్స్‌ల్లో ఇప్పుడు ఎవరూ ఆధిపత్యం కనబరుస్తారో చూడాలని స్మిత్ తెలిపాడు. అతన్ని బ్యాట్‌తో పాటు మానసికంగానూ దెబ్బకొట్టాలంటే ఆరంభంలోనే మంచి షాట్లతో ఎదురుదాడికి దిగాలని చెప్పాడు. 35 ఏళ్ల స్మిత్ టెస్టుల్లో 10 వేల పరుగుల మైలురాయికి 315 పరుగుల దూరంలో ఉన్నాడు. త్వరలో జరిగే ఐదు టెస్టుల బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో అతను తనకెంతో ఇష్టమైన, అచ్చొచి్చన నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఇటీవలి కాలంలో స్మిత్ తరచూ ఓపెనర్‌గా బరిలోకి దిగి పూర్తిగా విఫలమయ్యాడు. -
Aus Vs Pak: ఆస్ట్రేలియాకు ‘కొత్త’ కెప్టెన్.. ప్రకటించిన సీఏ! కారణం ఇదే
పాకిస్తాన్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టుకు కొత్త కెప్టెన్‌ను నియమించింది. వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్‌కు తొలిసారిగా సారథ్య బాధ్యతలు అప్పగించింది. అంతేకాదు.. పాక్‌తో మూడో వన్డేకు కూడా ఇంగ్లిస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది.కాగా ఆస్ట్రేలియా ప్రస్తుతం స్వదేశంలో పాకిస్తాన్‌తో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడుతోంది. ఇందులో భాగంగా నవంబరు 4- నవంబరు 18 వరకు ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో మెల్బోర్న్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా పాకిస్తాన్‌పై రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది.జోష్ ఇంగ్లిష్ తాత్కాలికంగా కెప్టెన్గాఇక శుక్రవారం(నవంబరు 8) అడిలైడ్ వేదికగా ఆసీస్- పాక్ మధ్య రెండో వన్డే జరుగనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం కీలక ప్రకటన చేసింది. పాక్‌తో ఆఖరి వన్డేతో పాటు.. టీ20 సిరీస్‌కు జోష్ ఇంగ్లిష్ తాత్కాలికంగా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది.ప్యాట్ కమిన్స్ అందుకే దూరంకాగా నవంబరు 22 నుంచి ఆస్ట్రేలియా టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరాలంటే.. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఇరుజట్లకు అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో పాక్‌తో రెండో వన్డే ముగిసిన తర్వాత కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ తదితరులు జట్టుకు దూరం కానున్నారు.వీరంతా భారత్‌తో టెస్టు సిరీస్‌కు సన్నద్ధం కానున్నారు. ఇక వీరి గైర్హాజరీ నేపథ్యంలో పేసర్లు స్పెన్సర్ జాన్సన్, జేవియర్ బార్ట్లెట్, వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఫిలిప్ వన్డే జట్టుతో చేరనున్నారు. ఇదిలా ఉంటే.. జోష్ ఇంగ్లిస్‌కు గతంలో ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుకు సారథ్యం వహించిన అనుభవం ఉంది.వన్డేల్లో 30వ సారథిగాఅయితే, సీనియర్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక కావడం మాత్రమ ఇదే మొదటిసారి. ఇక తాజా నియామకంతో ఆస్ట్రేలియా జట్టుకు వన్డేల్లో 30వ, టీ20లకు పద్నాలుగో కెప్టెన్‌గా ఇంగ్లిస్ చరిత్రకెక్కనున్నాడు. ఇంగ్లిస్ తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించగలడనే నమ్మకం తమకు ఉందని ఆసీస్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ పేర్కొన్నాడు. అదే విధంగా.. జట్టులోని సీనియర్లు ఆడం జంపా, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టొయినిస్ నుంచి ఇంగ్లిస్‌కు పూర్తి సహకారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే ఆసీస్ టీ20 రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ పాక్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.పాకిస్తాన్‌తో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టుప్యాట్ కమిన్స్ (కెప్టెన్ - మొదటి రెండు మ్యాచ్‌లకు), జోష్ ఇంగ్లిస్ (కెప్టెన్ - మూడవ మ్యాచ్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్ (మూడవ మ్యాచ్ మాత్రమే), కూపర్ కొన్నోలీ, జేక్ ఫ్రేజర్-మెగర్క్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్ (రెండవ మ్యాచ్ మాత్రమే), స్పెన్సర్ జాన్సన్ (మూడవ మ్యాచ్ మాత్రమే), మార్నస్ లబుషేన్ (మొదటి రెండు మ్యాచ్‌లు మాత్రమే), గ్లెన్ మాక్స్వెల్, లాన్స్ మోరిస్, జోష్ ఫిలిప్ (మూడవ మ్యాచ్ మాత్రమే), మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్ (మొదటి రెండు మ్యాచ్‌లు మాత్రమే మాత్రమే), మిచెల్ స్టార్క్ (తొలి రెండు మ్యాచ్‌లు మాత్రమే), మార్కస్ స్టొయినిస్, ఆడమ్ జంపా.పాకిస్తాన్‌తో టీ20లకు ఆస్ట్రేలియా జట్టుసీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెగర్క్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్ (కెప్టెన్), స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టొయినిస్, ఆడమ్ జంపా. -
Ind vs Aus: ఓపెనర్‌గా కాదు.. మిడిలార్డర్లోనే..
బోర్డర్ గావస్కర్ ట్రోఫీ-2024లో స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ స్థానంపై ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ చైర్మన్ జార్జ్ బెయిలీ స్పష్టతనిచ్చాడు. ఈ స్టార్ ప్లేయర్ మిడిలార్డర్లోనే వస్తాడని పేర్కొన్నాడు. కెప్టెన్, కోచ్‌లతో చర్చించిన తర్వాత స్మిత్ ఈ మేరకు తన నిర్ణయాన్ని వెల్లడించాడని తెలిపాడు.స్మిత్ బ్యాటింగ్ పొజిషన్‌ను మార్చాలికాగా డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ తర్వాత టెస్టుల్లో స్మిత్ ఓపెనర్‌గా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే, టాపార్డర్‌లో అతడు రాణించలేకపోయాడు. వెస్టిండీస్‌తో గాబాలో అర్ధ శతకం బాదడం మినహా ఓపెనర్‌గా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఎనిమిది ఇన్నింగ్స్‌లోనూ అతడి సగటు 28.50గా మాత్రమే నమోదైంది. ఈ నేపథ్యంలో స్మిత్ బ్యాటింగ్ పొజిషన్‌ను మార్చాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, స్మిత్ మాత్రం తాను ఓపెనర్‌గా వచ్చేందుకు సుముఖంగానే ఉన్నాననే సంకేతాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో జార్జ్ బెయిలీ మాట్లాడుతూ.. ‘‘ప్యాట్ కమిన్స్, ఆండ్రూ, స్టీవ్ స్మిత్.. ముగ్గురూ ఈ విషయంపై చర్చించారు. కామెరాన్ గ్రీన్ గాయం కారణంగా ఎంతకాలం జట్టుకు దూరంగా ఉంటాడో తెలియని పరిస్థితి.ఓపెనర్‌గా కాదు.. మిడిలార్డర్లోనే..ఇలాంటి సమయంలో.. తాను ఓపెనర్‌గా ఉండటం కంటే మిడిలార్డర్లో ఉండటమే మంచిదని స్మిత్ భావించాడు. అదే విషయాన్ని ప్యాట్, ఆండ్రూతో చెప్పాడు. వాళ్లిద్దరు కూడా స్మిత్ నిర్ణయంతో ఏకీభవించారు. రానున్న సిరీస్‌లలో స్మిత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు’’ అని స్పష్టం చేశాడు.కాగా దశాబ్దకాలానికి పైగా స్మిత్ ఆస్ట్రేలియా జట్టుకు వెన్నెముకలాగా ఉంటున్నాడు. నాలుగో నంబర్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన సగటు 61.51తో పరుగులు రాబట్టాడు. ముఖ్యంగా టీమిండియా బౌలింగ్ విభాగాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగల కంగారూ బ్యాటర్లలో స్మిత్ ముఖ్యుడు. ఈ నేపథ్యంలోనే నవంబరులో మొదలుకానున్న బోర్డర్- గావస్కర్ ట్రోఫీ నుంచి అతడు మళ్లీ మిడిలార్డర్లో ఆడనున్నాడు.కామెరాన్ గ్రీన్‌కు వెన్నునొప్పికాగా మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ ఆడాల్సి ఉండగా.. వెన్నునొప్పి కారణంగా అతడు జట్టుకు దూరమయ్యాడు. సర్జరీ చేయించుకునేందుకు సిద్ధమైన గ్రీన్ కోలుకోవడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టవచ్చు. ఇదిలా ఉంటే.. మాజీ కెప్టెన్లు అలెన్ బోర్డర్- సునీల్ గావస్కర్ పేర్ల మీదుగా సుదీర్ఘకాలంగా ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ జరుగుతుంది. ఇందులో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. చదవండి: ‘అతడినే తప్పిస్తారా?.. ఇంతకంటే పిచ్చి నిర్ణయం మరొకటి ఉండదు’ -
కోహ్లి కేవలం రెండు సెంచరీలు చేస్తే రూట్ ఏకంగా 18 సెంచరీలు బాదాడు..!
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ టెస్ట్ క్రికెట్లో తన డ్రీమ్ రన్‌ను కొనసాగిస్తున్నాడు. రూట్ గత మూడేళ్ల కాలంలో 16 హాఫ్ సెంచరీలు, 18 సెంచరీల సాయంతో 4600 పైచిలుకు పరుగులు చేశాడు. 2021 నుంచి టెస్ట్‌ల్లో ఇన్ని సెంచరీలు కాని, ఇన్ని పరుగులు కాని ఏ ఆటగాడూ చేయలేదు.ప్రస్తుత తరంలో అత్యుత్తమ ఆటగాళ్లుగా చెప్పుకునే కోహ్లి, విలియమ్సన్, స్టీవ్ స్మిత్ సైతం రూట్ చేసినన్ని సెంచరీలు కాని, పరుగులు కాని చేయలేకపోయారు. రూట్ తాజాగా పాక్‌పై సెంచరీ చేసి తన సెంచరీల సంఖ్యను 35కు పెంచుకున్నాడు.ఈ సెంచరీ అనంతరం సోషల్‌మీడియాలో ఓ ఆసక్తికర గణాంకం చక్కర్లు కొడుతుంది. 2021 ఆరంభంలో రూట్ కేవలం 17 సెంచరీలు మాత్రమే చేస్తే.. అప్పుడు కోహ్లి సెంచరీల సంఖ్య 27గా ఉండింది. అదే ఇప్పుడు (2024లో) టెస్ట్‌ల్లో కోహ్లి సెంచరీల సంఖ్య 29గా ఉంటే.. రూట్ సెంచరీల సంఖ్య ఏకంగా 35కు చేరుకుంది.ఈ ఫిగర్స్‌ను సగటు టీమిండియా అభిమాని జీర్ణించుకోలేనప్పటికీ ఇది నిజం. ఈ గణాంకాలను బట్టి చూస్తే రూట్ ఏ రేంజ్లో సెంచరీల మోత మోగిస్తున్నాడో ఇట్టే అర్దమవుతుంది. రూట్ ఈ మధ్యకాలంలో కోహ్లి ఒక్కడికే కాదు ఫాబ్లో మిగతా ఇద్దరికి (విలియమ్సన్, స్టీవ్ స్మిత్) కూడా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు.2021లో స్టీవ్ సెంచరీల సంఖ్య 26గా ఉంటే ప్రస్తుతం అతని సెంచరీల సంఖ్య 32గా ఉంది. 2021లో విలియమ్సన్ సెంచరీల సంఖ్య 24గా ఉంటే ఇప్పుడు అతని సెంచరీల సంఖ్య 32గా ఉంది. కోహ్లితో పోలిస్తే సెంచరీల విషయంలో విలియమ్సన్, స్టీవ్ స్మిత్ కాస్త మెగ్గానే కనిపిస్తున్నా, రూట్ ఈ ఇద్దరికి కూడా అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాడు.2021లో రూట్ సెంచరీలు-172024లో రూట్ సెంచరీలు-352021లో విలియమ్సన్ సెంచరీలు-242024లో విలియమ్సన్ సెంచరీలు-322021లో స్టీవ్ స్మిత్ సెంచరీలు-262024లో స్టీవ్ స్మిత్ సెంచరీలు-322021లో కోహ్లి సెంచరీలు-272024లో కోహ్లి సెంచరీలు-29చదవండి: PAK VS ENG 1st Test: అరివీర భయంకర ఫామ్‌లో జో రూట్.. మరో సెంచరీ -
Ind vs Aus: ప్రపంచంలోనే బెస్ట్ ఫాస్ట్ బౌలర్.. మాకు కష్టమే: స్మిత్
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ అని కొనియాడాడు. బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కోవడం కష్టమని.. అయితే, అతడి పోటీ మాత్రం మజానిస్తుందని పేర్కొన్నాడు. కాగా బంగ్లాదేశ్‌తో తాజా టెస్టు సిరీస్ బుమ్రా అదరగొడుతున్న విషయం తెలిసిందే.చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో బుమ్రా ఐదు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో 400 వికెట్ల క్లబ్లో చేరాడు. అంతకు ముందు టీ20 ప్రపంచకప్-2024లో 15 వికెట్లు కూల్చిన ఈ రైటార్మ్ పేసర్.. టీమిండియా చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.ప్రతిష్టాత్మక బోర్డర్-గావస్కర్ ట్రోఫీఇక బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల అనంతరం.. బుమ్రా సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఆడే అవకాశం ఉంది. అనంతరం భారత జట్టుతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నాడు. ఇరుజట్ల మధ్య ప్రతిష్టాత్మకమైన బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో బుమ్రా భాగం కానున్నాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ బ్యాటింగ్ స్టార్ స్టీవ్ స్మిత్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ బుమ్రా బౌలింగ్ నైపుణ్యాలను కొనియాడాడు.ప్రపంచంలోనే నంబర్ వన్ ఫాస్ట్ బౌలర్‘‘అతడొక అద్భుతమైన బౌలర్. కొత్త బంతి అయినా.. కాస్త పాతబడినా.. మొత్తంగా అలవాటుపడిన బంతికి అయినా.. అతడిని ఎదుర్కోవడం కష్టం. బుమ్రాకు అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నాయి. అతడు గొప్ప బౌలర్. మూడు ఫార్మాట్లలోనూ ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్ వన్ ఫాస్ట్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. బుమ్రాను ఎదుర్కోవడం అంటే సవాలుతో కూడుకున్న పని’’ అని స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు.బుమ్రా ఉంటే అంతేకాగా 2018-19, 2020-21లో ఆసీస్‌పై భారత్ గెలవడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. 2018-19లో నాలుగు టెస్టుల్లో 21, 2020-21లో మూడు టెస్టుల్లో 11 వికెట్లు కూల్చాడు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది నవంబరులో ఆస్ట్రేలియాకు వెళ్లనున్న రోహిత్ సేన ఐదు టెస్టులు ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ -2023-25 ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్ గెలవడం అత్యంత ముఖ్యం.చదవండి: Ind vs Ban: ఈ మ్యాచ్‌లో క్రెడిట్ మొత్తం వాళ్లకే: పాక్ మాజీ క్రికెటర్ -
Fab Four: ‘కోహ్లి కాదు.. అతడే నంబర్ వన్’
క్రికెట్ నవ యుగంలో తమదైన ముద్ర వేసిన ఆటగాళ్లలో టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లి, ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ జో రూట్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్ లెజండరీ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ముందు వరుసలో ఉంటారు. కోహ్లి ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో ఎనభై శతకాలతో సత్తా చాటగా.. టెస్టుల్లో రూట్ అత్యధిక పరుగుల జాబితాలో మున్ముందుకు దూసుకెళ్తున్నాడు.ఫ్యాబ్ ఫోర్లో బెస్ట్ ఎవరు?మరోవైపు స్మిత్, విలియమ్సన్ సైతం తమ మార్కును చూపిస్తూ తమ తమ జట్లను విజయపథంలో నిలుపుతున్నారు. అందుకే.. ఈ నలుగురిని కలిపి ‘ఫ్యాబ్ ఫోర్’గా పిలుచుకుంటారు క్రికెట్ ప్రేమికులు. అయితే, వీరిలో అత్యుత్తమ క్రికెటర్ ఎవరన్న ప్రశ్నకు మాత్రం ‘ఫ్యాబ్ ఫోర్’ అభిమానులు సైతం ఏకాభిప్రాయానికి రాలేరు.కోహ్లికి ఆఖరి ర్యాంకు ఇస్తాతాను కూడా అందుకు అతీతం కాదంటోంది ఆస్ట్రేలియా మహిళా స్టార్ క్రికెటర్ అలిసా హేలీ.‘ ఫ్యాబ్ ఫోర్’ గురించి ప్రస్తావన రాగా.. ‘‘వారంతా గొప్ప బ్యాటర్లు. అయితే, వారికి ర్యాంకు ఇవ్వాలంటే మాత్రం నేను కోహ్లిని నాలుగో స్థానానికే పరిమితం చేస్తా. ఇది నేను సరదాకి చెప్తున్న మాట కాదు.మిగతా వాళ్లతో పోలిస్తేఅన్ని రకాలుగా విశ్లేషించిన తర్వాతే ఇలా మాట్లాడుతున్నా. నిజానికి మిగతా ముగ్గురితో పోలిస్తే కోహ్లి చాలా ఎక్కువగా క్రికెట్ ఆడాడు. అందుకే అతడి గణాంకాలు కూడా ఉత్తమంగా ఉంటాయి. ఈ విషయాన్ని పక్కనపెట్టి చూస్తే మాత్రం కోహ్లికి నంబర్ 1 రేటింగ్ ఇవ్వాల్సిందే’’ అని అలిసా హేలీ ఓ పాడ్‌కాస్ట్‌లో ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.అతడే నంబర్ వన్తన అభిప్రాయం ప్రకారం ఈ నలుగురిలో కేన్ విలియమ్సన్కు అగ్రస్థానం ఉంటుందని.. ఆ తర్వాతి స్థానాల్లో స్మిత్, రూట్, కోహ్లి ఉంటారని తెలిపింది. విలియమ్సన్ కారణంగా కివీస్ జట్టు మొత్తానికి పేరు వచ్చిందని.. అయితే, కోహ్లి ప్రపంచంలోని అత్యుత్తమ ప్లేయర్ మాత్రమేనని హేలీ పేర్కొంది. ఎనిమిదిసార్లు ప్రపంచకప్‌ను ముద్దాడిందిఅదే విధంగా.. టీమిండియా తరఫున రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఆఖరికి రవీంద్ర జడేజా కూడా సెంచరీలు బాదగలరని.. అయితే.. జట్టు భారం మొత్తాన్ని మోయగల విలియమ్సన్ లాంటి ఆటగాళ్లు కొంతమందే ఉంటారని అభిప్రాయపడింది.కాగా ఆస్ట్రేలియా మేటి బ్యాటర్‌గా ఎదిగిన అలిసా హేలీ ఆరుసార్లు టీ20 ప్రపంచకప్, రెండుసార్లు వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్లలో సభ్యురాలు. అంతేకాదు.. ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్లలో ఒకడైన మిచెల్ స్టార్క్ భార్య కూడా! చదవండి: Musheer Khan: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన ముషీర్ ఖాన్! -
ఇప్పట్లో రిటైర్ అయ్యే ఆలోచనే లేదు.. ఒలింపిక్స్‌లోనూ: స్మిత్
అంతర్జాతీయ క్రికెట్‌కు ఇప్పట్లో వీడ్కోలు పలికే ఆలోచన తనకు లేదని ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్ స్పష్టం చేశాడు. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్-2028లో ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించాడు. తన బ్యాటింగ్ పవర్ ఇంకా తగ్గలేదని.. పొట్టి ఫార్మాట్లో రాణించగలననే విశ్వాసం వ్యక్తం చేశాడు.పరుగుల వీరుడుఆస్ట్రేలియా తరఫున 2010లో అరంగేట్రం చేసిన స్మిత్.. ఇప్పటి వరకు 109 టెస్టులు, 158 వన్డేలు, 67 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 32 సెంచరీలు, 4 డబుల్ సెంచరీల సాయంతో 9685 పరుగులు చేసిన ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. వన్డేల్లో 12 శతకాలు బాది.. 5446 రన్స్ స్కోరు చేశాడు. అయితే, టీ20లలో మాత్రం స్మిత్ సగుటన 24.86తో కేవలం 1094 పరుగులు మాత్రమే చేయగలిగాడు.యువ ఆటగాళ్ల నుంచి పోటీ నేపథ్యంలో గత కొంతకాలంగా ఆసీస్ టీ20 జట్టులో అరకొర అవకాశాలే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. స్మిత్ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, 35 ఏళ్ల స్మిత్ మాత్రం తన బ్యాటింగ్‌లో పస ఇంకా తగ్గలేదంటున్నాడు. బిగ్‌బాష్ లీగ్ ఫ్రాంఛైజీ సిడ్నీ సిక్సర్‌తో ఇటీవలే మూడేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకున్న ఈ సిడ్నీ క్రికెటర్... మరో నాలుగేళ్ల పాటు టీ20 క్రికెట్ ఆడగలనని తెలిపాడు.ఒలింపిక్స్‌లోనూ భాగమైతే.. ‘‘ప్రపంచంలోని ఫ్రాంఛైజీ క్రికెట్లో.. మిగతా ఆటగాళ్లతో పోలిస్తే నేనే ఎక్కువ లీగ్‌లలో భాగమయ్యాను. మరో నాలుగేళ్ల పాటు టీ20 క్రికెట్ ఆడగల సత్తా నాకుంది. కాబట్టి.. రిటైర్మెంట్ గురించి ఇప్పటి నుంచే ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం... ఆటకు వీడ్కోలు పలకాలనే ఆలోచనే లేదు. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లోనూ భాగమైతే ఇంకా బాగుంటుంది’’ అని స్టీవ్ స్మిత్ చెప్పుకొచ్చాడు.టీమిండియా పటిష్ట జట్టు ఇక భారత్‌తో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ గురించి మాట్లాడుతూ.. ‘‘టీమిండియాతో సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇండియా పటిష్టమైన జట్టు. ప్రపంచంలోని రెండు అత్యుత్తమ జట్ల మధ్య పోటీని అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అని స్మిత్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. రానున్న విశ్వ క్రీడల ఎడిషన్‌లో క్రికెట్‌ను తిరిగి ప్రవేశపెట్టేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఫలితంగా 128 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు క్రికెట్ ఒలింపిక్స్‌లో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఇందులో భాగంగా పొట్టి ఫార్మాట్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
స్టీవ్ స్మిత్ మెరుపు ఇన్నింగ్స్.. మేజర్ లీగ్ క్రికెట్ విజేత వాషింగ్టన్ ఫ్రీడం
మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్ టైటిల్‌ను వాషింగ్టన్ ఫ్రీడం కైవసం చేసుకుంది. ఇవాళ (జులై 29) జరిగిన ఫైనల్లో ఆ జట్టు శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌పై 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్.. స్టీవ్ స్మిత్ (52 బంతుల్లో 88; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (22 బంతుల్లో 40; ఫోర్, 4 సిక్సర్లు) ఆఖర్లో చెలరేగి ఆడాడు. సీజన్ ఆధ్యాంతం భీకర ఫామ్‌లో ఉండిన ట్రవిస్ హెడ్ ఈ మ్యాచ్‌లో 9 పరుగులకే ఔటయ్యాడు. ఆండ్రియస్ గౌస్ (14 బంతుల్లో 21; 3 ఫోర్లు, సిక్స్), ముక్తార్ అహ్మద్ (9 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించారు. యూనికార్న్స్ బౌలర్లలో కమిన్స్ 2, హసన్ ఖాన్, హరీస్ రౌఫ్, డ్రైస్డేల్ తలో వికెట్ పడగొట్టారు.నిప్పులు చెరిగిన జన్సెన్.. రచిన్ మాయాజాలం208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూనికార్న్స్ మార్కో జన్సెన్ (4-1-28-3), రచిన్ రవీంద్ర (4-0-23-3), ఆండ్రూ టై (2-0-12-2), సౌరభ్ నేత్రావల్కర్ (4-0-33-1), మ్యాక్స్‌వెల్ (2-0-14-1) ధాటికి 16 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. యూనికార్న్స్ ఇన్నింగ్స్‌లో పదో నంబర్ ఆటగాడు కార్మీ రౌక్స్ చేసిన 20 పరుగులే అత్యధికం. జన్సెన్, రచిన్ అద్భుతంగా బౌలింగ్ చేసి యూనికార్న్స్ పతనాన్ని శాశించారు. ఈ ఎడిషన్ ఆధ్యాంతం అద్భుత విజయాలు సాధించిన వాషింగ్టన్ ఫైనల్ మ్యాచ్‌లోనూ ఆశించిన ప్రదర్శన కనబర్చి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఈ ఎడిషన్‌లో వాషింగ్టన్ టీమ్‌ను స్టీవ్ స్మిత్ విజయవంతంగా ముందుండి నడిపించాడు. వాషింగ్టన్ టీమ్‌కు రికీ పాంటింగ్ హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. -
సిక్సర్ల వర్షం కురిపించిన జోస్ ఇంగ్లిస్.. స్మిత్ సేనకు తొలి ఓటమి
మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్‌లో స్టీవ్ స్మిత్ నేతృత్వలోని వాషింగ్టన్ ఫ్రీడం తొలి ఓటమి చవి చూసింది. శాన్‌ఫ్రాన్సిస్కోతో ఇవాళ (జులై 23) జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్దతి) పరాజయంపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ 15.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన యూనికార్న్స్‌కు టార్గెట్ నిర్దేశించారు. యూనికార్న్స్ టార్గెట్ 14 ఓవర్లలో 177 పరుగులుగా నిర్దారించబడింది. భారీ లక్ష్య ఛేదనలో ఆది నుంచే దూకుడుగా ఆడిన యూనికార్న్స్.. మరో రెండు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. జోస్ ఇంగ్లిస్ (17 బంతుల్లో 45; ఫోర్, 6 సిక్సర్లు), సంజయ్ కృష్ణమూర్తి (42 బంతుల్లో 79 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), హసన్ ఖాన్ (11 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సిక్సర్ల వర్షం కురిపించి తమ జట్టును గెలిపించారు. వాషింగ్టన్ బౌలర్లలో ఆండ్రూ టై 3 వికెట్లు పడగొట్టగా.. అకీల్ హొసేన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అంతకుముందు ట్రవిస్ హెడ్ (36 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), స్టీవ్ స్మిత్ (31 బంతుల్లో 56; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో వాషింగ్టన్ భారీ స్కోర్ చేసింది. ఆండ్రియస్ గౌస్ (29 నాటౌట్), రచిన్ రవీంద్ర (16) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆండర్సన్‌కు రెండు వికెట్లు దక్కాయి.కాగా, ప్లే ఆఫ్స్ బెర్తులు ఇదివరకే ఖరారు కావడంతో వాషింగ్టన్, యూనికార్న్స్ మ్యాచ్‌కు అంత ప్రాధాన్యత లేదు. పాయింట్ల పట్టికలో వాషింగ్టన్, యూనికార్న్స్ తొలి రెండు ప్లే ఆఫ్స్ బెర్త్‌లను ఖరారు చేసుకోగా.. టెక్సాస్ సూపర్‌కింగ్స్, ముంబై ఇండియన్స్ న్యూయార్క్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. -
స్టీవ్ స్మిత్ విధ్వంసం.. ట్రవిస్ హెడ్ మెరుపులు
మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్‌లో స్టీవ్ స్మిత్ మెరుపులు కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఎడిషన్‌లో శైలికి భిన్నంగా రెచ్చిపోయి ఆడుతున్న స్మిత్.. తాజాగా మరో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 23 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 31 బంతులు ఎదుర్కొన్న స్మిత్.. 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేశాడు. ప్రస్తుత ఎడిషన్‌లో స్మిత్‌కి ఇది వరసగా రెండో హాఫ్ సెంచరీ.Steven Smith on fire in the MLC. 😲🔥pic.twitter.com/rMFbQPRpM1— Mufaddal Vohra (@mufaddal_vohra) July 23, 2024మరో ఎండ్‌లో ట్రవిస్ హెడ్ సైతం మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగిపోతున్నాడు. వాషింగ్టన్ ఫ్రీడంకు ఓపెనర్లుగా వస్తున్న ఈ ఇద్దరు ఆకాశమే హద్దుగా ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. యూనికార్న్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హెడ్ కూడా మెరుపు హాఫ్ సెంచరీతో అలరించాడు. 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 56 పరుగుల చేసి ఔటయ్యాడు. ఈ సీజన్లో హెడ్‌కు ఇది మూడో హాఫ్ సెంచరీ.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడం.. 15.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించడంతో వాషింగ్టన్ ఇన్నింగ్స్‌ను అక్కడే ముగించారు. ఈ మ్యాచ్ 14 ఓవర్లకు కుదించి యూనికార్న్స్ లక్ష్యాన్ని 177 పరుగులుగా నిర్దారించారు. ఈ ఎడిషన్‌లో ప్లే ఆఫ్స్ బెర్తులు ఇదివరకే ఖరారు కావడంతో ఈ మ్యాచ్‌కు అంత ప్రాధాన్యత లేదు. వాషింగ్టన్, యూనికార్న్స్ తొలి రెండు ప్లే ఆఫ్స్ బెర్త్‌లను ఖరారు చేసుకోగా.. టెక్సాస్ సూపర్‌కింగ్స్, ముంబై ఇండియన్స్ న్యూయార్క్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ ఎడిషన్‌లో వాషింగ్టన్ జట్టు ఇంత వరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడలేదు. -
సిక్సర్ల వర్షం కురిపిస్తున్న స్టీవ్ స్మిత్
మేజర్ లీగ్ క్రికెట్లో (ఎంఎల్సీ) ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. ఈ ఎడిషన్‌లో వాషింగ్టన్ ఫ్రీడంకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న స్టీవ్.. తన శైలికి విరుద్దంగా భారీ షాట్లతో రెచ్చిపోతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన స్టీవ్.. 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 72 పరుగులు చేశాడు. స్టీవ్ ఆడిన రెండు ఇన్నింగ్స్‌ల్లో నాటౌట్‌గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ న్యూయార్క్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 46 పరుగులు చేసిన స్టీవ్.. టెక్సస్ సూపర్ కింగ్స్‌తో నిన్న (జులై 8) రద్దైన మ్యాచ్‌లో 13 బంతుల్లో బౌండరీ, 3 సిక్సర్ల సాయంతో 26 పరుగులు చేశాడు.Steven Smith loving the MLC. pic.twitter.com/k8CfprlXnQ— Mufaddal Vohra (@mufaddal_vohra) July 9, 2024ఇదిలా ఉంటే, అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ రెండో ఎడిషన్ గత సీజన్‌కు భిన్నంగా జోరుగా సాగుతుంది. ఈ ఎడిషన్‌లో ఇప్పటికే భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు కేవలం ఐదు మ్యాచ్‌లే జరగ్గా.. సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి.వాషింగ్టన్ ఫ్రీడం, టెక్సస్ సూపర్ కింగ్స్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకకుండా ముగిసింది. ఈ మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ కెప్టెన్ డుప్లెసిస్ సెంచరీతో (58 బంతుల్లో 100; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన వాషింగ్టన్ ఫ్రీడంకు వరుణుడు అడ్డుతగిలాడు. ఆ జట్టు తొలి నాలుగు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసిన తరుణంలో వర్షం మొదలైంది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చి మ్యాచ్‌ను రద్దు చేశారు. -
రోహిత్, బాబర్ కాదు.. అతడే వరల్డ్‌కప్ టాప్ రన్ స్కోరర్: స్మిత్
టీ20 వరల్డ్‌కప్-2024లో సత్తా చాటేందుకు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సిద్దమయ్యాడు. ఐపీఎల్ 2024లో కనబరిచిన జోరునే ఈ పొట్టి ప్రపంచకప్‌లోనూ కొనసాగించాలని కోహ్లి ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 15 మ్యాచ్‌లు ఆడిన కింగ్ కోహ్లి.. 741 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ మెగా ఈవెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో బుధవారం న్యూయర్క్ వేదికగా ఐర్లాండ్‌తో తలపడనుంది. తొలిపోరు కోసం రోహిత్ సేన అన్ని విధాల సిద్దమైంది. ఇక మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లిపై ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ టోర్నీలో కోహ్లి టాప్ రన్ స్కోరర్‌గా నిలుస్తాడని స్మిత్ జోస్యం చెప్పాడు. "ఈ మెగా ఈవెంట్లో లీడింగ్ రన్ స్కోరర్‌గా విరాట్ కోహ్లి నిలుస్తాడని నేను భావిస్తున్నాడు. అతడు ఐపీఎల్లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచి అమెరికాకు వచ్చాడు. విరాట్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆ జోరును ఇక్కడ కూడా కొనసాగిస్తాడని నేను ఆశిస్తున్నానని" ఐసీసీ షేర్ చేసిన వీడియోలో స్మిత్ పేర్కొన్నాడు. మరోవైపు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్ టాప్ రన్‌స్కోరర్‌గా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ లేదా విరాట్ కోహ్లి నిలుస్తాడని అంచనా వేశాడు.చదవండి: T20 WC: చరిత్ర సృష్టించిన నేపాల్ కెప్టెన్.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా -
T20: ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో కొత్తగా ఇద్దరు.. స్మిత్‌కు మరోసారి!
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టులో కొత్తగా ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కింది. ఐపీఎల్-2024లో దుమ్ములేపిన యువ సంచలనం జేక్ ఫ్రేజర్-మెగర్క్‌తో పాటు మరో క్రికెటర్ వరల్డ్‌కప్ జట్టుతో ప్రయాణించనున్నాడు.కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా పొట్టి ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్టును ప్రకటించింది.అయితే, ఐసీసీ నిబంధనల ప్రకారం మే 25 వరకు జట్టులో మార్పులు, చేర్పులకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా ట్రావెలింగ్ రిజర్వ్స్‌గా ఇద్దరు బ్యాటర్లను ఎంపిక చేసింది. జేక్ ఫ్రేజర్- మెగర్క్‌తో మాథ్యూ షార్ట్‌కు కూడా అవకాశం ఇచ్చింది.స్టీవ్ స్మిత్‌తో పాటు వాళ్లకు మొండిచేయిఈ క్రమంలో సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌తో పాటు జేసన్ బెహ్రాన్‌డార్ఫ్, తన్వీర్ సంగాల ఆశలకు గండిపడినట్లయింది. కాగా ఈసారి వరల్డ్‌కప్‌లో మిచెల్ మార్ష్ సారథ్యంలో ఆస్ట్రేలియా జూన్ 5న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. బార్బడోస్ వేదికగా ఒమన్‌తో తలపడనుంది.దుమ్ములేపిన మెగర్క్ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన జేక్ ఫ్రేజర్-మెగర్క్ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. లుంగి ఎంగిడి స్థానంలో జట్టులోకి వచ్చిన 22 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ తొమ్మిది మ్యాచ్‌లు ఆడి 330 పరుగులు సాధించాడు.ఈ ఓపెనింగ్ బ్యాటర్ స్ట్రైక్‌రేటు ఏకంగా 234.04 ఉండటం విశేషం. ఇక ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్న మెగర్క్.. 15 మంది సభ్యుల ప్రధాన జట్టులో కూడా స్థానం సంపాదించుకునే అర్హతలు కలిగి ఉన్నా సీనియర్లు ఉన్న కారణంగా సాధ్యం కాలేదు.అందుకే ఇలా జరిగిందిఆస్ట్రేలియా హెడ్‌కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్లో జేక్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. వరల్డ్‌కప్ జట్టు ఫైనల్ 15 కోసం అతడి పేరును పరిగణనలోకి తీసుకునేలా చేశాడు.ఇక మాథ్యూ షార్ట్ సైతం బిగ్‌బాష్ లీగ్‌లో అద్భుతంగా రాణించాడు. అయితే, వీరిద్దరు టాపార్డర్ బ్యాటర్లు కావడం వల్లే మొదటి 15 మంది సభ్యుల జాబితాలో వాళ్లకు చోటు దక్కలేదు’’ అని మెక్‌డొనాల్డ్ పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్-2024కు ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), ఆస్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.ట్రావెలింగ్ రిజర్వ్స్: జేక్ ఫ్రేజర్ మెగర్క్, మాథ్యూ షార్ట్.చదవండి: శివమ్ దూబేపై వేటు.. వరల్డ్‌కప్ జట్టులో ఫినిషర్‌కు చోటు! -
స్మిత్‌కు దక్కని చోటు
మెల్బోర్న్: కెరీర్లో ఐదో టి20 ప్రపంచకప్ ఆడాలని ఆశించిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్‌కు నిరాశ ఎదురైంది. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే ఆ్రస్టేలియా జట్టును బుధవారం ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన జట్టుకు ఆల్‌రౌండర్ మిచెల్ మార్‡్ష సారథ్యం వహిస్తాడు. గత 14 ఏళ్లలో ప్రపంచకప్ జట్టులో స్మిత్‌కు చోటు దక్కకపోవడం ఇదే తొలిసారి. 2021లో టి20 ప్రపంచకప్‌ను తొలిసారి సాధించిన ఆ్రస్టేలియా జట్టులో స్మిత్ సభ్యుడిగా ఉన్నాడు. 34 ఏళ్ల స్మిత్ ఇప్పటివరకు ఆసీస్ తరఫున 67 టి20 మ్యాచ్‌లు ఆడి 125.45 స్ట్రయిక్‌రేట్‌తో 1094 పరుగులు సాధించాడు. ఆ్రస్టేలియా జట్టు: మిచెల్ మార్‡్ష (కెప్టెన్), వార్నర్, ట్రావిస్ హెడ్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్, నాథన్ ఎలిస్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ వేడ్, కమిన్స్, హేజల్‌వుడ్, స్టార్క్, ఆష్టన్ అగర్, ఆడమ్ జంపా. -
టీ20 వరల్డ్‌కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడికి నో ఛాన్స్
వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా జూన్ 1 నుంచి ప్రారంభంకాబోయే టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును ఇవాళ (మే 1) ప్రకటించారు. విధ్వంసకర వీరులతో నిండిన ఈ జట్టుకు మిచెల్ మార్ష్ సారథ్యం వహించనున్నాడు. ముందుగా ప్రచారం జరిగినట్లుగా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. ఎలాగైనా జట్టులోకి వస్తాడనుకున్న ఐపీఎల్ విధ్వంసకర బ్యాటర్ జేక్ ఫ్రేసర్ మెక్‌గుర్క్‌ను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. మాట్ షార్ట్, జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, ఆరోన్ హార్డీ, స్పెన్సర్ జాన్సన్, జేవియర్ బార్ట్లెట్ లాంటి ఆశావహులకు కూడా మొండిచెయ్యే ఎదురైంది. చివరి వరల్డ్‌కప్ అని ముందుగానే ప్రకటించిన డేవిడ్ వార్నర్‌ను సెలెక్టర్లు కరుణించారు. ఎండ్ ఓవర్స్ స్పెషలిస్ట్ నాథన్ ఎల్లిస్ ఎట్టకేలకు జట్టులోకి వచ్చాడు. దాదాపు 18 నెలలుగా టీ20 జట్టుకు దూరంగా ఉన్న ఆస్టన్ అగర్, కెమరూన్ గ్రీన్‌లకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. జోష్ ఇంగ్లిస్‌కు ప్రత్యామ్నాయ వికెట్‌కీపర్‌గా మాథ్యూ వేడ్ జట్టులోకి వచ్చాడు. పేస్ బౌలింగ్ త్రయం పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ కొనసాగనున్నారు. మిచ్ మార్ష్‌తో పాటు ట్రవిస్ హెడ్, టిమ్ డేవిడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్ ఆల్రౌండర్లుగా ఎంపికయ్యారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటా ఆడమ్ జంపా జట్టులోకి వచ్చాడు. మెగా టోర్నీలో ఆస్ట్రేలియా ప్రయాణం జూన్ 5న మొదలవుతుంది. ఆసీస్ తమ తొలి మ్యాచ్‌లో పసికూన ఒమన్‌తో తలపడుతుంది. గ్రూప్-బిలో ఆసీస్.. ఇంగ్లండ్, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్‌లతో పోటీపడుతుంది.టీ20 వరల్డ్‌కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), అష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కెమెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా వరల్డ్‌కప్ విన్నర్లతో..క్రికెట్ ఆస్ట్రేలియా తమ వరల్డ్‌కప్ జట్టును వినూత్నంగా ప్రకటించింది. 2007 వన్డే వరల్డ్‌కప్ విన్నర్లు ఆసీస్ టీ20 వరల్డ్‌కప్ జట్టును అనౌన్స్ చేశారు. జట్టును ప్రకటించిన వారిలో దివంగత ఆండ్రూ సైమండ్స్ కొడుకు, కూతురు ఉండటం విశేషం. -
స్టీవ్ స్మిత్‌కు షాక్.. ఆసీస్ వరల్డ్‌కప్ జట్టులోకి విధ్వంసకర ఆటగాడు..!
ఆసీస్ సెలెక్టర్లు తమ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌కు భారీ షాకివ్వనున్నారని తెలుస్తుంది. వరల్డ్‌కప్ జట్టులో స్మిత్ స్థానం గల్లంతు కావడం ఖాయమని ఆసీస్ మీడియా కోడై కూస్తుంది. స్మిత్ స్థానంలో ఐపీఎల్ నయా సెన్సేషన్, ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసకర ఆటగాడు జేక్ ఫ్రేసర్ వరల్డ్‌కప్ జట్టులోకి వస్తాడని సమాచారం. జట్టు ప్రకటనకు మే 1 డెడ్‌లైన్ కావడంతో అన్ని జట్ల సెలెక్టర్లు తమతమ జట్లను ఫైనల్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలో ఆసీస్ సెలెక్టర్లు తమ జట్టుకు తుది రూపు తెచ్చినట్లు సమాచారం. నేడో రేపో 15 మంది సభ్యులతో కూడిన ఆసీస్ ప్రపంచకప్ జట్టును ప్రకటించే అవకాశం ఉంది. న్యూజిలాండ్ ఇవాళే తమ వరల్డ్‌కప్ జట్టును ప్రకటించగా.. టీమిండియాను ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈసారి టీమిండియా వరల్డ్‌కప్ జట్టుపై జనాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఒకరిద్దరి విషయంలో అభిమానులు చాలా పర్టికులర్‌గా ఉన్నారు. శివమ్ దూబే, రింకూ సింగ్ లాంటి ఆటగాళ్లను వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక చేయాలని పెద్ద ఎత్తును డిమాండ్లు వినిపిస్తున్నాయి. హార్దిక్, సంజూ శాంసన్, రిషబ్ పంత్ విషయంలో సెలెక్టర్ల నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.స్మిత్ విషయానికొస్తే.. ఈ ఆసీస్ స్టార్‌ను ఐపీఎల్ 2024 వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. స్మిత్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు. ఇటీవలే స్మిత్‌కు జాతీయ జట్టు ఓపెనర్‌గా ప్రమోషన్ లభించినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. నిదానంగా ఆడతాడన్న ముద్ర స్మిత్‌పై ఉండనే ఉంది. స్మిత్‌కు ప్రత్యామ్నాయాలు కూడా ఆసీస్‌కు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్ జట్టులో స్మిత్‌కు స్థానం దొరకకపోవడం ఆశ్చర్యకరమేమీ కాదు. -
మేజర్ లీగ్ క్రికెట్లో స్టీవ్ స్మిత్.. వాషింగ్టన్ ఫ్రీడంతో ఒప్పందం
ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ అమెరికాలో జరిగే మేజర్ లీగ్ క్రికెట్లో పాల్గొననున్నాడు. వాషింగ్టన్ ఫ్రీడం ఫ్రాంచైజీ స్టీవ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది జులై 4 నుంచి ప్రారంభంకాబోయే ఎంఎల్సీ రెండో సీజన్లో స్టీవ్ బరిలోకి దిగనున్నాడు. స్టీవ్ ఎంఎల్సీ అరంగేట్రం సీజన్లో ఇదే వాషింగ్టన్ ఫ్రీడంకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. 𝐒𝐦𝐮𝐝𝐠𝐞 x 𝐅𝐫𝐞𝐞𝐝𝐨𝐦 = 😍 Welcome the the family, 𝐒𝐭𝐞𝐯𝐞 𝐒𝐦𝐢𝐭𝐡 ❤️#WashingtonFreedom #MLC2024 #SteveSmith pic.twitter.com/bGrzxlsr61 — Washington Freedom (@WSHFreedom) April 11, 2024 వాషింగ్టన్ ఫ్రీడంకు ఆసీస్ ఆటగాడు మోసెస్ హెన్రిక్స్ కెప్టెన్సీ వహిస్తుండగా.. ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ జట్టులో హెన్రిక్స్‌తో పాటు మరో ముగ్గురు ఆసీస్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. తన్వీర్ సంగా, బెన్ డ్వార్షుయిస్, జోష్ ఫిలిప్ ఇదే ఫ్రాంచైజీకి ఆడుతున్నారు. వచ్చే సీజన్ నుంచి స్టీవ్ వీరితో జతకట్టనున్నాడు. ఎంఎల్సీ రెండో సీజన్ కోసం మరో ముగ్గురు ఆసీస్ ఆటగాళ్లు వేర్వేరు ఫ్రాంచైజీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్ లాస్ ఏంజెల్స్ నైట్‌రైడర్స్‌తో.. టిమ్ డేవిడ్ ముంబై ఇండియన్స్ న్యూయార్క్ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా, స్టీవ్ ఇటీవలికాలంలో పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అతను జాతీయ జట్టులో చోటు ఆశిస్తున్నప్పటికీ అవకాశాలు రావడం లేదు. లీగ్ క్రికెట్లో సైతం ఫ్రాంచైజీలు ఇతనికి ఆసక్తి చూపడం లేదు. ఐపీఎల్ 2024 సీజన్ వేలంలో స్టీవ్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. నిదానంగా బ్యాటింగ్ చేస్తాడనే కారణంగా ఏ ఫ్రాంచైజీ స్టీవ్‌ను సొంతం చేసుకోవడం లేదు. స్టీవ్ టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు ఆశిస్తున్నప్పటికీ అవకాశం లభించేలా లేదు. ఆసీస్ టాపార్డర్ బెర్తులు ట్రవిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్‌లతో భర్తీ అయ్యాయి. -
#Hardik Pandya: నచ్చినట్లు వాగుతుంటారు.. పట్టించుకుంటే..
‘‘నేను ఒక్క విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను.. అనవసర విషయాలను అస్సలు పట్టించుకోవద్దు. నీ మనసులో చెలరేగే అలజడి గురించి బయటివాళ్లకు ఎలా తెలుస్తుంది? వాళ్లు వచ్చి మన ఆవేదనను తీర్చలేరు కదా! వ్యక్తిగతంగా నన్నైతే ఇలాంటి విషయాలు అస్సలు ప్రభావితం చేయలేవు. ఎందుకంటే నేను వాటిని పట్టించుకోను. అసలు నా గురించి మాట్లాడేవారి వైపు చూడను కూడా చూడను. బయట చాలా మంది చాలా రకాలుగా వాగుతుంటారు. అవి చెవికి ఎక్కించుకుంటే.. మన భావోద్వేగాలను ప్రభావితం చేస్తాయి. బహుశా.. హార్దిక్ విషయంలో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు అతడు ఇలాంటి ఒక క్లిష్ట పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదు. కాబట్టి సహజంగానే అతడికి ఇదంతా కొత్తగా ఉంటుంది. టీమిండియా స్టార్ ప్లేయర్ అయి ఉండి ఇండియాలోనే ఇలా అభిమానులచే అవమానం ఎదుర్కోవడం హార్దిక్‌ను కచ్చితంగా ఉక్కిరిబిక్కిరి చేసి ఉంటుంది. గతంలో అతడికి ఇలాంటి అనుభవం లేదు కాబట్టి ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది’’ అని ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ అన్నాడు. కాగా ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ గూటికి చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జట్టును ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మపై వేటు వేసి పాండ్యాకు ముంబై పగ్గాలు అప్పగించారు. అయితే, రోహిత్ ఫ్యాన్స్ ఇప్పటికీ ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అదే విధంగా.. మైదానంలో రోహిత్‌తో హార్దిక్ పాండ్యా ప్రవర్తనను కూడా సహించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లోనూ పాండ్యాకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. పాండ్యా కనిపిస్తే చాలు రోహిత్ నామస్మరణ చేయడంతో పాటు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ అభ్యంతరకర భాషతో హార్దిక్‌ను ట్రోల్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే.. ఇప్పటి వరకు అతడి సారథ్యంలో ముంబై ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఓడిపోవడంతో కామెంట్లు మరింత శ్రుతిమించాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ కామెంటేటర్ స్టీవ్ స్మిత్ స్పందిస్తూ.. ఉద్దేశపూర్వకంగా అవమానించేవారిని పట్టించుకోకుండా.. ముందుకు సాగడమే ఉత్తమమని హార్దిక్ పాండ్యాకు సలహా ఇచ్చాడు. ఈ మేరకు ఈఎస్ఎపీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశాడు. కాగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న స్మిత్ కెప్టెన్సీ కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిషేధం ఎదుర్కొని రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా అతడిని చీటర్ అంటూ క్రికెట్ ఫ్యాన్స్ గేలి చేశారు. ఆ సమయంలో తాను అవేమీ పట్టించుకోకుండా కేవలం ఆటపై దృష్టి పెట్టి ముందుకు సాగిన విషయాన్ని స్మిత్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు. -
'రోహిత్, బాబర్ కాదు.. ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటర్ అతడే'
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఐపీఎల్-2024లో బీజీబీజీగా ఉన్నాడు. ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని స్టీవ్ స్మిత్.. ప్రస్తుతం అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ కామేంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్రీ మ్యాచ్ షోలో పాల్గోన్న స్టీవ్ స్మిత్‌కు ఓ ప్రశ్న ఎదురైంది. వరల్డ్‌క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్ ఎవరన్న ప్రశ్న స్మిత్‌కు ఎదురైంది. వెంటనే స్మిత్ ఏమీ ఆలోచించకుండా భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లినే ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్ అంటూ సమాధనమిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా విరాట్ కోహ్లి వరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. కింగ్ కోహ్లి ఎన్నో అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన ఘనత విరాట్ ది. కింగ్ కోహ్లి ప్రస్తుతం ఐపీఎల్-2024 సీజన్లోనూ దుమ్ములేపుతున్నాడు. ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న విరాట్.. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 77 పరుగులతో అదరగొట్టాడు. ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మార్చి 29న కేకేఆర్‌తో మ్యాచ్‌కు కోహ్లి సిద్దమవుతున్నాడు. -
రూ. 24.75 కోట్ల ఆటగాడు... ఎన్ని వికెట్లు తీస్తాడంటే?!
ఐపీఎల్-2024 సందడి మొదలైపోయింది. పొట్టి ఫార్మాట్లోని మజాను అందించేందుకు ఆటగాళ్లు.. ఆస్వాదించేందుకు అభిమానులూ సిద్ధమైపోయారు. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో శుక్రవారం (మార్చి 22) ఈవెంట్‌కు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, ఐపీఎల్ కామెంటేటర్ స్టీవ్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సహచర ఆటగాడు మిచెల్ స్టార్క్ ఐపీఎల్-2024లో కచ్చితంగా సత్తా చాటుతాడంటూ.. తాజా ఎడిషన్‌లో ఎన్ని వికెట్లు తీయగలడో అంచనా వేశాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో అదరగొట్టిన మిచెల్ స్టార్క్ దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత క్యాష్ రిచ్ లీగ్‌లో పునరాగమనం చేయనున్నాడు. వేలంలో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ అతడి కోసం పోటీ పడి ఏకంగా రూ. 24.75 కోట్లు ఖర్చు చేసింది. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా ఈ పేస్ బౌలర్ నిలిచాడు. దీంతో మిచెల్ స్టార్క్‌పై అంచనాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈఎస్ఎపీఎన్క్రిక్ఇన్ఫో షోలో మాట్లాడిన ఆసీస్ మాజీ సారథి స్టీవ్ స్మిత్‌కు స్టార్క్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘నాకు తెలిసి అతడు కొత్త బంతితో కచ్చితంగా మ్యాజిక్ చేయగలడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతడే బౌలింగ్ చేస్తాడు కాబట్టి వికెట్లు తీసే అవకాశం ఉంటుంది. ఈసారి స్టార్క్ 30 వికెట్లు తీస్తాడని అనుకుంటున్నా’’ అని స్మిత్ అంచనా వేశాడు. కాగా ఐపీఎల్లో ఒక ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా డ్వేన్ బ్రావో, హర్షల్ పటేల్ సంయుక్త రికార్డు సాధించారు. 2013లో సీఎస్కే తరఫున బ్రావో.. 2021లో ఆర్సీబీ తరఫున హర్షల్ పటేల్ 32 వికెట్లు తీశారు. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన సౌతాఫ్రికా స్టార్ కగిసో రబడ 30 వికెట్లతొ రెండోస్థానాన్ని ఆక్రమించాడు. ఇదిలా ఉంటే కేకేఆర్ తాజా సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మార్చి 23న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. -
రసవత్తరంగా కివీస్-ఆసీస్ రెండో టెస్టు..
క్రైస్ట్ చర్చ్ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా మారింది. ఆసీస్ తమ విజయానికి ఇంకా 202 పరుగుల దూరంలో నిలవగా.. కివీస్ విజయానికి ఇంకా 6 వికెట్లు మాత్రమే కావాలి. 279 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. క్రీజులో ప్రస్తుతం ట్రావిస్ హెడ్(17),మార్ష్(27) పరుగులతో ఉన్నారు. మాట్ హెన్రీ, సీర్స్ తలా రెండు వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ స్టార్ ఓపెనర్ స్టీవ్ స్మిత్(9) రెండో ఇన్నింగ్స్‌లోనూ నిరాశపరిచాడు. ఇక 134/2 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ 372 పరుగులకు రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. న్యూజిలాండ్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(82), టామ్ లాథమ్(73) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆసీస్ బౌలర్లలో కమ్మిన్స్ 4 వికెట్లు, లయోన్ 3 వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో ఆసీస్ ముందు 279 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అంతకుముందు కివీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 256 పరుగులు చేసింది. ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 94 పరుగుల ఆధిక్యం లభించింది. చదవండి: IPL 2024: 'చెన్నై, ముంబై, సన్‌రైజర్స్ కాదు.. ఈ సారి ఐపీఎల్ టైటిల్ ఆ జట్టుదే' -
భారత అంపైర్‌కు గొప్ప గౌరవం
భారత అంపైర్ నితిన్ మీనన్‌కు గొప్ప గౌరవం దక్కనుంది. ప్రపంచ క్రికెట్లో ఫాబ్ ఫోర్‌గా పిలువబడే నలుగురు స్టార్ క్రికెటర్ల వందో టెస్ట్ మ్యాచ్‌లో ఇతను అంపైర్‌గా వ్యవహరించనున్నాడు. ఇదివరకే విరాట్ కోహ్లి, జో రూట్, స్టీవ్ స్మిత్‌ల వందో టెస్ట్ మ్యాచ్‌కు అంపైర్‌గా పని చేసిన మీనన్.. ఫాబ్ ఫోర్‌లోని మరో ఆటగాడైన కేన్ విలియమ్సన్ వందో టెస్ట్‌లో కూడా అంపైర్‌గా వ్యవహరించే సువర్ణావకాశాన్ని దక్కించుకున్నాడు. ఓ తరంలో నలుగురు గొప్ప క్రికెటర్లకు చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్‌ల్లో అంపైర్‌గా వ్యవహరించే గొప్ప గౌరవం నితిన్ మీనన్ మాత్రమే దక్కనుంది. విలియమ్సన్ వందో టెస్ట్ మ్యాచ్ మార్చి 8న ప్రారంభమవుతుంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే ఈ మ్యాచ్ కేన్ మామతో పాటు న్యూజిలాండ్ ప్రస్తుత కెప్టెన్ టిమ్ సౌథీకి కూడా వందో టెస్ట్ మ్యాచ్ కానుంది. కేన్, సౌథీ వందో టెస్ట్ మ్యాచ్‌కు సరిగ్గా ఒక్క రోజు ముందు మరో ఇద్దరు స్టార్ క్రికెటర్లు తమ వందో టెస్ట్ మ్యాచ్ ఆడనున్నారు. భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ వికెట్‌కీపర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో రేపటి నుంచి ప్రారంభంకాబోయే భారత్-ఇంగ్లండ్ ఐదో టెస్ట్ మ్యాచ్‌తో వంద టెస్ట్‌ల మైలురాయిని తాకనున్నారు. ధర్మశాల వేదికగా రేపటి నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకోగా.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ 0-1తో వెనుకపడి ఉంది. -
NZ vs Aus: ఆసీస్ కెప్టెన్ కమిన్స్ షాకింగ్ కామెంట్స్
"I’d doubt that I’ll be captaining..’’...: న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా తమ తుదిజట్టును ప్రకటించింది. కివీస్‌తో సిరీస్‌లో స్టీవ్ స్మిత్ ఓపెనర్‌గా కొనసాగుతాడని స్పష్టం చేసింది. ఉస్మాన్ ఖవాజాతో కలిసి అతడు ఆసీస్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడని తెలిపింది. ఆల్‌రౌండర్లు కామెరాన్ గ్రీన్, మిచెల్ మార్ష్ ఇద్దరిని తుదిజట్టులో ఆడిస్తున్నట్లు వెల్లడించింది. ఇక తుదిజట్టును ప్రకటిస్తున్న సందర్భంగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను కెప్టెన్‌గా ఎన్నాళ్లు కొనసాగుతానో తెలియదన్నాడు. వాళ్ల కెప్టెన్సీలో ఆడటం ఆస్వాదిస్తున్నా ముప్పై ఏళ్ల వయసు దాటిన తర్వాత ఫామ్, ఆటకు శరీరం సహకరించే తీరుపైనే తన భవిష్యత్తు ఆధారపడి ఉందని కమిన్స్ పేర్కొన్నాడు. టీ20 ఫార్మాట్లో మాథ్యూ వేడ్, మిచెల్ మార్ష్ సారథ్యంలో ఆడటాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నానని.. వాళ్లిద్దరి కారణంగా తనకు కాస్త విశ్రాంతి లభించిందని హర్షం వ్యక్తం చేశాడు. మొదటి రెండు టెస్టుల మధ్య ఆరేళ్ల గ్యాప్ కాగా ఫాస్ట్ బౌలర్ అయిన ప్యాట్ కమిన్స్ 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసినా.. ఆ తర్వాత 2017 వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. వరుసగా గాయాల బారిన పడిన కారణంగా మొదటి రెండు టెస్టుల మధ్య దాదాపు ఆరేళ్ల గ్యాప్ వచ్చింది. అయితే, ఆ తర్వాత కమిన్స్ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్‌గా వరుస విజయాలు అందిస్తూ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ టైటిల్ సాధించాడు. భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023లో కంగారూలను చాంపియన్లుగా నిలిపి సత్తా చాటాడు. ఇక ప్రస్తుతం టెస్టుల్లో ప్యాట్ కమిన్స్ నంబర్‌వన్ బౌలర్ కావడం విశేషం. న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా ఎలెవన్: స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హాజిల్‌వుడ్. చదవండి: NZ Vs Aus: న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ.. స్టార్ బ్యాటర్ దూరం -
టీ20 వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా జట్టు ఎంపిక.. స్టార్ ఆటగాడికి నో ఛాన్స్!?
టీ20 వరల్డ్‌కప్-2024కు వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. జూన్ 1 నుంచి ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. అయితే ఈ క్రికెట్ మహా సంగ్రామానికి ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నప్పటికి మాజీ క్రికెటర్లు అంచనాలు, అభిప్రాయాలు ఇప్పటి నుంచే మొదలెట్టేశారు. తాజాగా ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ టీ20 వరల్డ్‌కప్‌కు తమ జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేశాడు. తాజాగా ఈఎస్పీఎన్ అరౌండ్ ది వికెట్ షోలో ఫించ్ పాల్గోనున్నాడు. ఈ క్రమంలో పొట్టి వరల్డ్‌కప్‌లో భాగమయ్యే ఆసీస్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఫించ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లగా డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్‌ను ఎంపిక చేసిన ఫించ్.. స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌కు తన తుది జట్టులో చోటు ఇవ్వలేదు. వరుసగా ఫస్ట్, సెకెండ్ డౌన్లో మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్‌కు చోటు కల్పించారు. అదే విధంగా పిచ్ పరిస్ధితులను బట్టి మార్కస్ స్టోయినిస్ లేదా మాథ్యూ షార్ట్‌లో ఒకరికి ఛాన్స్ ఇవ్వాలని ఫించ్ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా వికెట్ కీపర్‌గా జోష్ ఇంగ్లీష్‌ను ఆరోన్ ఎంపిక చేశాడు. పినిషర్గా యువ ఆటగాడు టిమ్ డేవిడ్‌కు చోటు ఇచ్చాడు. ఇక ఫాస్ట్ బౌలర్ల కోటాలో పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ చోటు దక్కింది. స్పెషలిస్ట్ స్పిన్నర్ల కోటాలో ఆడమ్ జంపా ఒక్కడికే చోటు దక్కింది. ఫించ్ ఎంపిక చేసిన ఆసీస్ ప్లేయింగ్ ఎలెవన్: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్ లేదా మాథ్యూ షార్ట్ (పరిస్థితులపై బట్టి), టిమ్ డేవిడ్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్ -
తగ్గుతూ వస్తున్న కోహ్లి ప్రభ.. గణనీయంగా పుంజుకుంటున్న విలియమ్సన్
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి 2021 నుంచి రెండేళ్ల పాటు కెరీర్ పరంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. 2022 చివర్లో కోహ్లి ఎట్టకేలకు ఫామ్‌ను దొరకబుచ్చుకుని పూర్వవైభవం సాధించగలిగాడు. అయితే కోహ్లి ఫామ్ కేవలం పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు మాత్రమే పరిమితమైంది. గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి. లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో గతం కంటే మరింత ప్రమాదకరంగా కనిపిస్తున్న కోహ్లి.. టెస్ట్‌ల్లో మాత్రం ఆశించినంతగా రాణించలేకపోతున్నాడు. తాజాగా సోషల్‌మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఓ పోస్ట్ ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తుంది. ఇంతకీ ఆ పోస్ట్ ఏం సూచిస్తుందంటే.. 2021లో కోహ్లి 27 టెస్ట్ సెంచరీలు చేసే నాటికి ఫాబ్ ఫోర్‌గా పిలువబడే వారిలో మిగతా ముగ్గురు కోహ్లి కంటే తక్కువ సెంచరీ కలిగి ఉన్నారు. స్టీవ్ స్మిత్ 26, కేన్ విలియమ్సన్ 23, జో రూట్ 17 సెంచరీలు చేశారు. అయితే నేటి దినం వచ్చేసరికి పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. అప్పట్లో సెంచరీల మీద సెంచరీలు చేస్తూ ఫాబ్ ఫోర్లో ప్రథముడిగా పరిగణించబడిన కోహ్లి.. ప్రస్తుతం చివరివాడిగా మారిపోయాడు. Kane Williamson is just one century away from equaling Steve Smith among the Fab 4 for the most Test centuries. pic.twitter.com/ZtFIV45lmE — CricTracker (@Cricketracker) February 6, 2024 టెస్ట్ సెంచరీల సంఖ్యలో కోహ్లి ఫాబ్ ఫోర్లో చివరి స్థానానికి పడిపోయాడు. నేటికి 32 సెంచరీలతో స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో ఉండగా.. వరుస సెంచరీలు చేస్తూ పరుగులు వరద పారిస్తున్న విలియమ్సన్ 31 సెంచరీలతో రెండో స్థానానికి దూసుకువచ్చాడు. అప్పట్లో 17 సెంచరీలు చేసిన రూట్.. ఈ మధ్యకాలంలో ఏకంగా 13 సెంచరీలు చేసి 30 సెంచరీలతో మూడో ప్లేస్‌లో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో కేవలం రెండు సెంచరీలు మాత్రమే చేసిన కోహ్లి ఫాబ్ ఫోర్లో చివరివాడిగా కొనసాగుతున్నాడు. ఓ పక్క టెస్ట్‌ల్లో తనకు పోటీదారులుగా పిలువబడే వారు సెంచరీల మీద సెంచరీలు చేస్తూ దూసుకుపోతుంటే కోహ్లి మాత్రం చల్లబడ్డాడు. కోహ్లికి ప్రధాన పోటీదారుడైన విలియమ్సన్ ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు చేయడంతో పాటు చివరి 10 ఇన్నింగ్స్‌ల్లో ఆరు శతకాలు బాది శతక వేటలో దూసుకుపోతుంటే కోహ్లి మాత్రం రేసులో వెనుకపడ్డాడు. కోహ్లి టెస్ట్ సెంచరీ సంఖ్య తగ్గడానికి ఓ ప్రధానమైన కారణంగా ఉంది. కోహ్లి ఫాబ్ ఫోర్‌లోని మిగతా సభ్యులతో పోల్చుకుంటే ఈ మధ్యకాలంలో టెస్ట్ మ్యాచ్‌లు చాలా తక్కువగా ఆడాడు. ఏదో టెస్ట్ క్రికెట్ అంటే ఆసక్తి లేనట్లు మ్యాచ్‌కు మ్యాచ్‌కు చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. ఓ పక్క స్టీవ్ స్మిత్, కేన్ మామ, రూట్ దాదాపుగా ప్రతి మ్యాచ్ ఆడుతుంటే కోహ్లి ఏ అమవాస్యకో పున్నానికో టెస్ట్‌ల్లో కనిపిస్తున్నాడు. కోహ్లి సెంచరీలు చేయకపోతేనేం పరుగులు సాధిస్తున్నాడు కదా అని అతని అభిమానులు వాదించవచ్చు. అయితే సహచరులతో పోలిస్తే కోహ్లి సాధించిన పరుగులు చాలా తక్కువ అన్న విషయాన్ని వారు మరువకూడదు. అభిమాన ఆటగాడు కదా అని మనం ఎంత సమర్ధించుకు వచ్చినా అంతిమంగా గణాంకాలు మాత్రమే మాట్లాడతాయని గుర్తించాలి. ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్ట్‌లకైనా కోహ్లి అందుబాటులోకి వస్తాడో లేదో వేచి చూడాలి.