పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టాండింగ్ కెప్టెన్, స్టార్ ఫాస్ట్ బౌలర్ నిప్పులు చేరుగుతున్నాడు. తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. అతడి ధాటికి కంగూరులు బెంబేలెత్తిపోయారు. తొలుత అరంగేట్ర ఆటగాడు నాథన్ మెక్‌స్వీనీని ఔట్ చేసి ఆసీస్‌ను ఆదిలోనే దెబ్బ కొట్టిన బుమ్రా.. ఆ తర్వాత స్మిత్, ఉస్మాన్ ఖావాజా, కమ్మిన్స్ ఔట్ చేసి ఆతిథ్య జట్టును కష్టాల్లో నెట్టేశాడు.
ఇప్పటివరకు మొదటి ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన జస్ప్రీత్.. కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్‌ను ఔట్ చేసిన బుమ్రా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
టెస్టు క్రికెట్‌లో స్టీవ్ స్మిత్‌ను గోల్డెన్ డకౌట్ చేసిన రెండో బౌలర్‌గా బుమ్రా రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్‌లో స్మిత్ తొలి బంతికే ఎల్బీ రూపంలో గోల్డెన్ డకౌటయ్యాడు. కాగా టెస్టుల్లో స్మిత్‌ను బుమ్రా కంటే ముందు దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం డేల్ స్టెయిన్ గోల్డెన్ డకౌట్ చేశాడు.
గెబెర్హా వేదికగా 2014లో ఆసీస్- సౌతాఫ్రికా మ్యాచ్‌లో స్మిత్‌ను స్టెయిన్ గోల్డెన్ డకౌట్ చేశాడు. మళ్లీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత స్మిత్ రెండో సారి గోల్డెన్ డకౌటయ్యాడు. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌటైంది.
చదవండి: IND vs AUS: వారెవ్వా పంత్.. ఆ షాట్ ఎలా కొట్టావు భయ్యా! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment